breaking news
Hyderabad
-
సైబర్ క్రైమ్ నియంత్రణలో తెలంగాణకు జాతీయ గుర్తింపు
హైదరాబాద్: సైబర్ క్రైమ్ నియంత్రణ, కేసుల సమర్థవంతమైన నిర్వహణలో తెలంగాణ దేశంలోనే నంబర్-1 స్థానంలో నిలిచిందని రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) వెల్లడించింది. ప్రధానమంత్రి కార్యాలయం (PMO) నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో తెలంగాణ సైబర్ క్రైమ్ పనితీరుపై సమీక్ష నిర్వహించగా, రాష్ట్రం సాధించిన పురోగతిపై అధికారులు వివరించారు.ఈ సమావేశంలో తెలంగాణ సీఎస్ సంజయ్ జాజు, డీజీపీతో కలిసి సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధిపతి షికా గోయల్ పాల్గొన్నారు. సైబర్ నేరాల నియంత్రణ, కేసుల పరిష్కారం, నేరాలపై వేగవంతమైన చర్యల్లో తెలంగాణ పోలీసుల పనితీరుకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని షికా గోయల్ తెలిపారు.తెలంగాణ పోలీసుల సమిష్టి కృషి, సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రత్యేక చర్యల ఫలితంగానే ఈ గుర్తింపు సాధ్యమైందని ఆమె పేర్కొన్నారు. సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణ మరో మైలురాయిని చేరుకుందని, దేశానికి ఆదర్శంగా నిలిచే విధంగా సైబర్ క్రైమ్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని తెలిపారు.సీఎస్ సంజయ్ జాజు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం నేరాల పట్ల జీరో టాలరెన్స్ విధానాన్ని అమలు చేస్తోందన్నారు. TGCSB ద్వారా ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేసి సైబర్ నేరాలపై పోరాటాన్ని మరింత బలోపేతం చేస్తున్నామని చెప్పారు. సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవగాహన కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. తెలంగాణ పోలీసులకు, సైబర్ సెక్యూరిటీ బ్యూరో బృందానికి అభినందనలు తెలిపారు. -
భద్రాచలం ఎమ్మెల్యే కారును ఢీ కొట్టిన లారీ
తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. అయితే, హైదరాబాద్‌కు వెళ్తున్న సమయంలో పతంగి టోల్గేట్ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.టోల్గేట్ వద్ద ఆగి ఉన్న ఎమ్మెల్యే వెంకట్రావు కారును వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకట్రావు సురక్షితంగా బయటపడ్డారు. దీంతో ఒక్కసారిగా ఈ ప్రమాదం సంభవించడంతో ఎమ్మెల్యే కొంత అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అత్యంత విలువైన భూముల్లో ఇందిరమ్మ ఇళ్లు..!
హైదరాబాద్ మహానగర పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. నోటిఫికేషన్ వెలువడిన మొదట్లో పెద్దగా ఆసక్తి చూపని ప్రజలు ఇటీవలి కాలంలో ఇందిరమ్మ ఇళ్లకు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకుంటున్నారు. ఆగస్టు 10న దరఖాస్తు గడువు ముగియనుండటంతో మిగిలిన ఐదు రోజుల్లో పెద్ద సంఖ్యలో దరఖాస్తులు అందవచ్చునని అధికారులు భావిస్తున్నారు. క్యూర్ పరిధిలోని 19 నియోజకవర్గాల్లో చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్లకు ఇప్పటికే 26 వేల వరకు దరఖాస్తులు రాగా అందులో అత్యధికంగా కూకట్పల్లి నియోజకవర్గం నుంచి 5 వేల దరఖాస్తులు అందినట్లు అధికారులు పేర్కొంటున్నారు. అత్యంత విలువైన భూముల్లో..కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ 9వ ఫేజ్ సమీపంలోని హౌసింగ్ బోర్డు భూముల్లో ఇందిరమ్మ ఇళ్లు నిరి్మంచేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. పరిసర కాలనీల్లో చదరపు గజం భూమి విలువ కనీసం రూ.1.50 లక్షలకు పైగా ఉంది. అలాంటి విలువైన భూమిలో ఇళ్లను నిర్మిస్తుండటం, కేవలం రూ. లక్షలకే ఇస్తుండటంతో స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో ఆసక్తి చూపుతున్నారు. బహుళ అంతస్తుల భవనాల రూపంలో 400 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాతో 480 ఇళ్లను నిరి్మస్తున్నారు. బెడ్రూమ్, హాలు, కిచెన్ కలిగిన ఇందిరమ్మ ఇళ్లకు ఇప్పటికే ఐదు వేలకు పైగా దరఖాస్తులు అందాయి. మిగిలిన ఐదు రోజుల్లో మరో నాలుగు వేలకు పైగా దరఖాస్తులు అందవచ్చునని అధికారుల అంచనా.నిబంధనలతో అయోమయం..ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు ప్రభుత్వం విధించిన నిబంధనలు దరఖాస్తుదారుల ఆశలపై నీళ్లు చల్లేలా ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. దరఖాస్తుదారులు, వారి తల్లిదండ్రులు కూడా ఎలాంటి ఇళ్లు, ఫ్లాట్, ఇంటి స్థలం కలిగి ఉండరాదు. తమ నివాసం ధృవీకరణకు ఆధార్ కార్డును ప్రామాణికంగా చూపాల్సి ఉంటుంది. ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ ఆధారంగా ఆయా నియోజకవర్గంలో నిర్మించే ఇళ్లకు మాత్రమే దరఖాస్తులను పరిశీలిస్తారు. దీంతో చాలా మందికి నివాసం ధృవీకరణ అంశంలో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు సమాచారం. అదే విధంగా కుటుంబ ఆదాయం ఏడాదికి రూ. 6 లక్షలకు మించకూడదు. కుటుంబాన్ని ప్రామాణికంగా తీసుకోవడంతో వార్షిక ఆదాయం విషయంలోను, గతంలో ప్రభుత్వ పథకాల లబ్దిదారులుగా ఉండకూడదు అనే నిబంధనల్లో కొంత సందిగ్ధత నెలకొందని స్థానికులు చెబుతున్నారు. ఈ నిబంధనల మేరకు తీరా దరఖాస్తు చేసుకున్న తర్వాత పరిశీలనలో తిరస్కరణకు గురైతే కట్టిన రూ.10 వేలు వెనక్కి వస్తాయో రావా అనే అనుమానంతో కొందరు ఆసక్తి చూపడం లేదు. ఏదేమైనా ఆసియాలోనే అతి పెద్ద కాలనీగా గుర్తింపు పొందిన కూకట్పల్లి హౌసింగ్ కాలనీలో రూ.6 లక్షలకే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తుండటంతో వాటిని దక్కించుకునేందుకు స్థానికులు ఆసక్తి చూపుతున్నారు. -
నాలుగేళ్ల కొడుకుపై కన్న తండ్రి ఘాతుకం
హైదరాబాద్: మద్యం మత్తులో ఓ వ్యక్తి కన్న కొడుకునే చంపడానికి ప్రయత్నించాడు. రోడ్డుపై వెళుతున్న డీసీఎం కింద తోసినా చనిపోకపోవడంతో ఫ్లై ఓవర్ పిల్లర్కేసి బాదాడు. అదృష్టవశాత్తు స్థానికులు అడ్డుకోవడంతో బాలుడు మృత్యువాత నుంచి తప్పించుకున్నాడు. ఈ సంఘటన బుధవారం గుడిమల్కాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ రామయ్య తెలిపిన వివరాల ప్రకారం గోల్కొండ ఫతేదర్వాజాకు చెందిన సల్మాన్ (25) సెంట్రింగ్ పనిచేస్తూ జీవనం సాగిస్తుంటాడు. ఇతడికి ముగ్గురు పిల్లలు. కొంతకాలంగా మద్యానికి బానిసగా మారిన సల్మాన్ భార్యతో నిత్యం గొడవపడుతూ ఉండేవాడు. మంగళవారం రాత్రి కూడా తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. బుధవారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో సల్మాన్ తన కుమారుడు అర్మాన్(4)ను గోల్కొండ నుంచి పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్ నెంబర్ 104 వద్దకు తెచ్చాడు. మద్యం మత్తులో కుమారుడిని డీసీఎం ముందుకు తోశాడు. అదృష్టవశాత్తు డీసీఎం వాహనం బాలుడిపై వెళ్లలేదు. అయితే కుమారుడు చనిపోలేదన్న కోపంతో కసాయి తండ్రి చిన్నారి జుట్టును పట్టుకుని పిల్లర్‌కు కొట్టడం ప్రారంభించాడు. దీంతో స్థానికులు సల్మాన్‌ను అడ్డుకొని బాలుడిని కాపాడారు. పోలీసులు సల్మాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. తీవ్ర గాయాలతో ఉన్న బాలుడిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. -
హైదరాబాద్‌లో పది లక్షల మంది ఓటర్లు గల్లంతు!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లాలో దాదాపు పది లక్షల మంది ఓటర్లు గల్లంతయ్యారు. జిల్లాలోని మొత్తం ఓటర్లు 47,36,669 మందిలో 9,95,315 మంది ఓటర్లు ఏమైపోయారో అధికారులకు అంతు చిక్కలేదు. మొత్తం ఓటర్లలో ఇది 21 శాతం. వీరిలో కొందరు మరణించిన వారున్నప్పటికీ మిగతా వారు ఎక్కడ ఉన్నారో, ఏమయ్యారో వివరాలు లభించలేదు. వీరు ఇతర ప్రాంతాలకు వెళ్లి ఉండవచ్చునని, లేదా ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వలస వచ్చిన ..ప్రస్తుతం వెళ్లిపోయి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ఓటరు ఎన్యూమరేషన్ ఫారాల సమర్పణకు ఈ నెల పదో తేదీ వరకు గడువుండటంతో ఇందులో స్వల్ప మార్పులకు అవకాశం ఉంది. ఈ సంఖ్య ఇంకా పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. వీరిలో మృతులు పోను మిగతావారిని అధికారులు ఆచూకీ తెలియని జాబితాలో చేర్చారు. వీరిలో అత్యధికంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 88,933 మంది ఉండగా, అత్యల్పంగా అంబర్‌పేట నియోజకవర్గంలో 38,208 మంది ఉన్నారు. డిజిటలైజేషన్ అంతంతే.. అధికారులు ఎంతగా ప్రయత్నిస్తున్నా, ఇళ్లన్నీ తిరుగుతున్నా, రాజకీయ పార్టీలను అభ్యర్థిస్తున్నా, పార్టీల ఏజెంట్లను కోరుతున్నా ఎన్యూమరేషన్ ఫారాలు భర్తీ చేసి తిరిగి ఇచ్చిన వారు 27,26,655 మంది మాత్రమే. వీరి వివరాలు డిజిటలైజ్ చేశారు. ఇది 57.56 శాతం. మిగిలిన కొద్ది రోజుల్లో ఇంకెంతమంది ఫారాలు తిరిగి ఇస్తారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఫారాల సమర్పణ గడువును ఇప్పటికే రెండు పర్యాయాలు పొడిగించడం తెలిసిందే. దీంతో, ఇవ్వాల్సిన వారి సంఖ్య స్వల్పంగా మాత్రమే ఉండే అవకాశం ఉంది. ఇక జిల్లాలోని ఓటర్లలో 4,91,236 మంది ఆన్లైన్ ద్వారా తమ ఎన్యూమరేషన్ ఫారా లు భర్తీచేశారు. వీరు 10.37 శాతంగా ఉన్నారు. 94 భవనాల నుంచి పోలింగ్ కేంద్రాల మార్పు రాజకీయనేతల ఇళ్లు, మతపరమైన ప్రదేశాలు, ఇతరత్రా సున్నిత ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలు ఉండరాదన్న ఈసీఐ సెక్రటరీ ఆదేశాల నేపథ్యంలో 94 భవనాల్లోని పోలింగ్ కేంద్రాలను మార్చేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. ఈ మేరకు వివరాలను రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో వివరించారు. ‘నామెన్‌క్లేచర్’లు మార్చాల్సిన పోలింగ్ కేంద్రాలు 39 ఉన్నట్లు గుర్తించారు. పోలింగ్ కేంద్రాల క్రమబద్ధీకరణలో భాగంగా ఓటర్ల సంఖ్య తక్కువగా ఉన్న 71 పోలింగ్ కేంద్రాలను ఇతర కేంద్రాల్లో విలీనం లేదా రద్దు చేసేందుకు ప్రతిపాదించారు. ఓటర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కొత్తగా నాలుగు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ క్రమబదీ్ధకరణతో జిల్లాలో ప్రస్తుతం ఉన్న 4062 పోలింగ్ కేంద్రాల్లో 67 తగ్గి, 3995 పోలింగ్ కేంద్రాలు మిగలనున్నాయి. -
హైడ్రా రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలపై పోలీసు కేసులు
-
గర్భం కోల్పోయిన మహిళ చేసిన పని.. అందరూ షాక్!
హైదరాబాద్: గర్భం దాల్చి..శిశువును కోల్పోయిన పనిమనిషి ఇంటి యజమాని కుమారుడిని కిడ్నాప్ చేసింది. ఈ ఘటన మేడిపల్లి పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. గర్భం కోల్పోవడంతో తీవ్ర మానసిక ఆవేదనకు గురై ఈ చర్యకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో ఆమె అంగీకరించింది. మేడిపల్లి పోలీసులు అప్రమత్తత..వేగవంతమైన దర్యాప్తుతో కిడ్నాప్‌కి గురైన 8 నెలల బాలుడిని కేవలం 3 గంటల్లోనే సురక్షితంగా రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ ఘటనలో బాలుడిని అపహరించిన మహిళను అదుపులోకి తీసుకున్నారు.ఉప్పల్ జోన్ డీసీపీ సురేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడుప్పల్ ఎన్ఐఎన్ కాలనీలో నివసించే కొట్టె శివరామ్, స్పందన దంపతుల 8 నెలల కుమారుడు వైష్ణవ్ రుద్రాంశ్ బుధవారం మధ్యాహ్నం కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పనిమనిషిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే మేడిపల్లి పోలీసులు ప్రత్యే క బృందాలు ఏ ర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలించడంతో పాటు సాంకేతిక ఆధారాలు, ప్రత్యక్ష సాక్షుల సమాచారాన్ని విశ్లేషించుకొని, దర్యాప్తులో భాగంగా పనిమనిషి నల్లా దుర్గా భవాని అనే మహిళ బాలుడిని తీసుకెళ్లినట్లు గుర్తించారు.వెంటనే అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిని వైద్య పరీక్షల అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు. కేసు దర్యాప్తులో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ జలేందర్ రెడ్డి, ఎస్ఐ నర్సింగ్‌రావు తదితరులకు మేడిపల్లి ఏసీపీ మోహన్ కుమార్ రివార్డులు అందజేశారు. కాగా గర్భస్రావమై శిశువు ను కోల్పోయిన ఒత్తిడిలో దుర్గాభవానీ..తన కుటుంబ సభ్యులను నమ్మించేందుకు కిడ్నాప్ చేసినట్లుగా అనుమానిస్తున్నారు. దీనిపై విచారణలో ఆమె పొంతనలేని సమాధానాలు చెప్పినట్లుగా తెలుస్తోంది. -
‘కాంగ్రెస్ పాలనలో ఫేక్ ఎన్వోసీలు’
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ సొంత శాఖలో అవినీతి జరిగి, ఫోర్జరీ చేసి అక్రమంగా అనుమతులు తీసుకున్నా అధికారులు కనిపెట్టడం లేదని, ముఖ్యమంత్రి 18 గంటల రివ్యూ ఏమైందని బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు.ముఖ్యమంత్రి సొంత విద్యా శాఖలోనే జూనియర్ కాలేజి యాజమాన్యాలు ఫైర్ ఎన్ఓసి సర్టిఫికేట్ల కోసం హైడ్రా కమీషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసి,అక్రమంగా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారుల నుండి అనుమతులు పొందారని, పోలీసులు, విద్యాశాఖ అధికారులు మరియు హైడ్రా అధికారులు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఫిబ్రవరిలో ఫైర్ ఎన్ఓసి కోసం దరఖాస్తు చేసుకున్న జూనియర్ కాలేజీలు హైడ్రా కమీషనర్ సంతకం ఫోర్జరీ చేసి, ఇంటర్మీడియట్ బోర్డు నుండి అనుమతులు పొందితే అధికారులెవరూ కనిపెట్టలేకపోవడం దారుణమన్నారు. హైడ్రా అధికారులు లేక్ వ్యూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటికీ పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు.కాంగ్రెస్ పాలనలో అధికారులు మరియు కాలేజీ యాజమాన్యాలు అవినీతి అక్రమాలను పెంచి పోసిస్తున్నారని ధ్వజమెత్తారు. విద్యాశాఖ, హోం శాఖ, మరియు మున్సిపల్ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి ఆయా శాఖల్లో జరిగే అవినీతిని, ఫోర్జరీలను కంట్రోల్ చేయడంలో విఫలమయ్యారన్నారు.క్షుద్రపూజలు,తాంత్రిక పూజల గురించి స్క్రిప్ట్ రాసిచ్చే బదులు ఫోర్జరీ,అవినీతికి పాల్పడే వారిని దొరకబట్టమని స్క్రిప్ట్ ఇవ్వాలని సూచించారు. ఎంతసేపు పోలీసులు కేసిఆర్ కేటి ఆర్ హరీష్ రావు ఇతర బిఆర్ఎస్ నాయకులపై ఎన్ని కేసులు పెట్టారని ఆరా తీయడం కాకుండా,అవినీతి అక్రమ అనుమతులపై చర్యలు తీసుకోమని ఆదేశించాలని హితవు పలికారు.ఎక్స్ వేదికగా విడుదల చేసిన వీడియోలో మాట్లాడుతూ, సరైన అనుమతులు లేకుండా, కాలేజీలు నిర్వహిస్తే, ఏదైనా ప్రమాదం జరిగి విద్యార్థులకు ఇబ్బందులు కలిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు,హైడ్రా, పోలీసులు మరియు ఫోర్జరీ మరియు అవినీతి అక్రమాల్లో ప్రమేయం ఉన్న అందరు అధికారులపై చర్యలు తీసుకోవాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశంపై ఏం చేస్తారో అయన విఙ్ఞతకే వదిలేస్తున్నానని తెలిపారు. -
హైదరాబాద్‌లో సుప్రీంకోర్టు అదనపు బెంచ్?..ఎంపీ
సాక్షి, ఢిల్లీ:హైదరాబాద్‌లో సుప్రీంకోర్టు అదనపు బెంచ్ ఏర్పాటు చేయాలని వైఎస్సార్సీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి అన్నారు. ఈ రోజు (బుధవారం) రాజ్యసభలో జరిగిన చర్చలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతి సుప్రీంకోర్టు న్యాయమూర్తి 2,218 కేసులు విచారణ చేయాల్సి వస్తుందన్నారు. హైకోర్టులో అప్పిలేట్ కోర్టులు ఏర్పాటు చేయాలని సీనియర్ మోస్ట్ హైకోర్టు జడ్జితో అప్పిలేట్ కోర్టులు ఏర్పాటు చేయాలన్నారు. హైకోర్టులో క్రిమినల్ కేసులు సింగిల్ బెంచ్ తర్వాత డివిజన్ బెంచ్ విచారించేలా సీఆర్పీసీలో సవరణ తీసుకురావాలని దీనివల్ల 15శాతం భారం సుప్రీంకోర్టుపై తగ్గుతుందని తెలిపారు. తప్పుడు కేసులు విచారిస్తే భారీగా జరిమానాలు విధించాలని రాబోయే పదేళ్ళను దృష్టిలో ఉంచుకొని వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని నిరంజన్ రెడ్డి రాజ్యసభలో మాట్లాడారు. -
ఈరోజు రాత్రి భారీ వర్షం.. ప్రజలకు అలర్ట్!
-
డయల్ 100కు గుడ్‌బై.. ఎమర్జెన్సీకి కొత్త నంబర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అత్యవసర సేవల కోసం ఇకపై డయల్ 100 స్థానంలో 112 నంబర్ అందుబాటులోకి వచ్చింది. పోలీస్ సహాయం, అంబులెన్స్, అగ్నిమాపక సేవలు వంటి అన్ని ఎమర్జెన్సీ సేవలకు ఇక ఒకే నంబర్‌ను వినియోగించుకోవచ్చు. బుధవారం డీజీపీ సీవీ ఆనంద్ అధికారికంగా 112 సేవలను ప్రారంభించారు.ఇప్పటివరకు పోలీస్ సహాయం కోసం డయల్ 100కు కాల్ చేసే విధానం ఉండగా.. తాజాగా దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ (112)ను తెలంగాణలోనూ అందుబాటులోకి తీసుకొచ్చారు. అత్యవసర సమయంలో ప్రజలు 112కు కాల్ చేస్తే.. అవసరమైన సేవలను(పోలీస్, ఆంబులెన్స్, అగ్నిమాపక సేవలు) వెంటనే సమన్వయం చేసేలా వ్యవస్థను రూపొందించారు. -
హైడ్రా రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలపై కేసు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో నకిలీ పత్రాల వ్యవహారం కలకలం రేపుతోంది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ ఫైర్ ఎన్వోసీలు (NOCలు) సృష్టించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎనిమిది ప్రైవేట్ కాలేజీలపై కేసు నమోదైంది. దీంతో, ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.అయితే, ఈ నకిలీ ఎన్వోసీలను ఇంటర్ బోర్డుకు సమర్పించి గుర్తింపు పొందేందుకు ప్రయత్నించినట్లు అధికారులు గుర్తించారు. హైడ్రా పేరుతో తయారు చేసిన నకిలీ పత్రాల వ్యవహారం వెలుగులోకి రావడంతో, సంబంధిత కాలేజీల గుర్తింపును రద్దు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై హైదరాబాద్‌లోని లేక్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. నకిలీ పత్రాల తయారీ, ఫోర్జరీ, మోసం తదితర అభియోగాల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు నమోదు చేసిన కేసులో భారత న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 337, 336(3), 340(2), 318(4), 3(5) కింద చర్యలు తీసుకుంటున్నారు.కాగా, పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తెల్లాపూర్, చిక్కడపల్లి, ఎస్ఆర్ నగర్, మెహిదీపట్నం, బర్కత్‌పుర ప్రాంతాల్లో ఉన్న కొన్ని కాలేజీల యాజమాన్యాలు ఈ ఫోర్జరీ వ్యవహారంలో భాగస్వాములుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఇదే తరహాలో మరిన్ని అక్రమాలు జరిగాయా? అన్న కోణంలో అధికారులు విచారణను ముమ్మరం చేశారు. మరో 60 కాలేజీలకు సంబంధించిన ఎన్వోసీలను కూడా స్క్రూటినీ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు.. హైడ్రా పేరును ఉపయోగించి, ప్రభుత్వ అధికారుల సంతకాలను ఫోర్జరీ చేయడం తీవ్ర నేరమని అధికారులు చెబుతున్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత మరిన్ని కాలేజీలపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.ఎనిమిది కాలేజీలు ఇవే..మెహిదిపట్నంలోని ప్రియాంకా జూనియర్ కాలేజ్విద్యానగర్లోని మదర్స్ గర్ల్స్ జూనియర్ కాలేజ్చాంద్రాయణ గుట్టలోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్చిక్కడపల్లిలోని న్యూఎరా జూనియర్ కాలేజ్శివరాంపల్లిలోని షాహిర్ జూనియర్ కాలేజ్తెల్లాపూర్లోని వశిష్ట జూనియర్ కాలేజ్బర్కత్పురలోని హైందవి జూనియర్ కాలేజ్ఎస్ఆర్ నగర్‌లోని రెసిడెన్స్ జూనియర్ కాలేజ్ -
హైదరాబాద్ లో భారీగా నకిలీ మసాలా దినుసులు పట్టివేత...(ఫొటోలు)
-
చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి బంగారు బోనం (ఫొటోలు)
-
హైదరాబాద్‌లో లిఫ్ట్ బీభత్సం.. మహిళ విషాదం!
హైదరాబాద్, చందానగర్: నగరంలో విషాదం చోటు చేసుకుంది. లిఫ్ట్ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. ఎలాంటి సూచిక బోర్డు లేకుండా లిఫ్ట్ ఆపరేటర్ మరమ్మతు చేస్తుండటం, లిఫ్ట్ ఎక్కిన మహిళకు ఆ విషయం తెలియకపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. వికారాబాద్ జిల్లా కుల్కచర్లకు చెందిన దాడి శ్రీనివాస్ నల్లగండ్లలోని అపర్ణ జినిత్లో సెక్యూరిటీ గార్డు. తన భార్య అనసూయ(43)తో కలిసి చందానగర్ అన్నపూర్ణ ఎన్‌క్లేవ్‌లోని చాట్వాజ్ మాన్షన్ అపార్ట్మెంట్లో ఉండే బంధువుల వద్దకు వచ్చారు. రెండో అంతస్తుకు వెళ్లడానికి లిఫ్ట్ ఎక్కారు. ఆమె లోపల అడుగు పెట్టిన వెంటనే తలుపులు వేయకుండానే లిఫ్ట్ కదిలిపోయింది. దీంతో ఆమె కాళ్లు అందులో ఇరుక్కుపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి.వెంటనే ఆమె భర్త కేకలు వేయడంతో వెంటనే వచ్చిన అపార్ట్మెంట్ వాసులు లిఫ్టు తలుపులు తెరిచి ఆమెను బయటకు తీశారు. తీవ్ర గాయాలైన ఆమెను ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించగా, అప్పటికే మృతి చెందిందని వైద్యులు చెప్పారు. కేసు దర్యాప్తులో ఉంది. కాగా, సూచిక బోర్డులు పెట్టకుండా, విద్యుత్ సరఫరా నిలిపివేయకుండా లిఫ్ట్‌కు మరమ్మతులు చేపట్టడంతోనే నిండు ప్రాణం బలి అయిందని కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
హైదరాబాద్ ట్రావెలర్స్ కొత్త ట్రెండ్.. కల్చర్ ఫస్ట్!
హైదరాబాద్ నగరానికి చెందిన ప్రయాణికులు ఇప్పుడు సాధారణ పర్యాటక ప్రాంతాల సందర్శనకే పరిమితం కాకుండా సంస్కృతి, సంప్రదాయాలు, స్థానిక వంటకాలు, ఆధ్యాత్మిక అనుభవాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు స్కైస్కానర్ విడుదల చేసిన ఇండియా కల్చర్ ట్రావెల్ ఇండెక్స్ వెల్లడించింది.నివేదిక ప్రకారం 56 శాతం మంది ప్రాంతీయ వంటకాలను ఆస్వాదించేందుకు, 54 శాతం మంది పండుగలు, ఉత్సవాల కోసం, 51 శాతం మంది ఆధ్యాత్మిక యాత్రల కోసం ప్రయాణాలను ఎంచుకుంటున్నారు. అలాగే 51 శాతం మంది పూర్తిగా సాంస్కృతిక అనుభవాల కోసమే సెలవులను ప్లాన్ చేస్తుండగా, 36 శాతం మంది సంస్కృతి తమ ప్రయాణాన్ని మరింత అర్థవంతంగా మారుస్తుందని భావిస్తున్నారు.అయితే, ఇప్పటికే 95 శాతం మంది హైదరాబాద్ ప్రయాణికులు ఇతర రాష్ట్రాలు, దేశాల్లోని సాంస్కృతిక ప్రదేశాలను సందర్శించగా, 87 శాతం మంది అసలైన సంప్రదాయాలు, వారసత్వాన్ని తెలుసుకునేందుకు స్థానిక ప్రాంతాలను కూడా అన్వేషించేందుకు ఆసక్తి చూపుతున్నారు. దుర్గాపూజ, దీపావళి, కుంభమేళా, పొంగల్, బతుకమ్మ, బోనాలు వంటి పండుగలను ప్రత్యక్షంగా వీక్షించాలనే ఆసక్తి కూడా ఎక్కువగా ఉన్నట్లు సర్వే తెలిపింది.విదేశీ సాంస్కృతిక పర్యటనలపై కూడా ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే 25 శాతం మంది ఇటువంటి పర్యటనలు చేయగా, మరో 65 శాతం మంది వెళ్లాలని వెళ్లాలనే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే, జపాన్ అత్యంత ఇష్టమైన గమ్యస్థానంగా నిలవగా, థాయ్‌లాండ్, వియత్నాం, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. తెలంగాణలో చార్మినార్, యాదాద్రి, భద్రాచలం, చిలుకూరు బాలాజీ ఆలయం, బోనాలు, బతుకమ్మ, మేడారం జాతర, వరంగల్ వారసత్వ కట్టడాలు రాష్ట్ర సాంస్కృతిక గుర్తింపుగా ప్రయాణికులు పేర్కొన్నారు.అయితే భద్రత, వాతావరణ మార్పులు, అధిక రద్దీ, వసతి లభ్యత, పెరుగుతున్న ప్రయాణ ఖర్చులు ప్రధాన సవాళ్లుగా ఉన్నాయని నివేదిక తెలిపింది. సంస్కృతి ఆధారిత పర్యాటకానికి పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని స్కైస్కానర్ ఎక్స్ప్లోర్ విత్ ఏఐ, ప్రైస్ అలర్ట్స్, హోల్ మంత్ సెర్చ్, ఫ్లైట్ ట్రాకర్ వంటి డిజిటల్ సాధనాలను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. -
ఇంటి నుంచే లొకేషన్‌కి...
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం సినిమాల చిత్రీకరణలు భలే జోరుగా జరుగుతున్నాయి. కొన్ని చిత్రాల షూటింగ్స్ స్వదేశంలో జరుగుతుంటే మరికొన్ని చిత్రీకరణలు విదేశాల్లోనూ జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో పలు సినిమా చిత్రీకరణలతో ఆయా సెట్స్‌లో సందడి నెలకొంది. లోకల్లోనే షూటింగ్ కాబట్టి ఇంటి నుంచే షూటింగ్‌కి వెళ్లి సందడి సందడిగా షూటింగ్ చేస్తున్నారు స్టార్స్. ఇలా ‘కేరాఫ్ హైదరాబాద్’ అంటూ చిరంజీవి, వెంకటేష్, ప్రభాస్, మహేశ్‌బాబు, గోపీచంద్, నాని, విజయ్ దేవరకొండ, శ్రీవిష్ణు, సాయిదుర్గా తేజ్... తదితర హీరోలు తమ మూవీ షూటింగ్లో హుషారుగా పాల్గొంటున్నారు. ఆ విశేషాలేంటో చూద్దాం... ఆర్ఎఫ్సీలో... చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘చిరుబాబీ 2’ (వర్కింగ్ టైటిల్). చిరంజీవి నటిస్తున్న 158వ సినిమా ఇది. బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ (2023) వంటి హిట్ మూవీ తర్వాత చిరంజీవి–బాబీ కొల్లి కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రమిది. ఈ సినిమాలో నివేత పేతురాజ్, అనశ్వరా రాజన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కేవీఎన్ ప్రోడక్షన్స్ పతాకంపై కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ శివారులోని ఆర్ఎఫ్సీలో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో చిరంజీవితో పాటు ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారట బాబీ.‘‘మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్స్‌ను గ్రాండ్‌గా తెరకెక్కించడంలో ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న బాబీ కొల్లి ‘మెగా 158’లో చిరంజీవిని పవర్‌ఫుల్‌గా చూపించబోతున్నారు. చిరంజీవిని ఇప్పటివరకు చూడని అత్యంత ఫెరోషియస్ లుక్‌లో ప్రజెంట్ చేయడానికి ఆయన కృషి చేస్తున్నారు. ఈ సినిమా కోసం 12 గంటల పాటు వర్షంలో తెరకెక్కించిన ఓ ఫైట్ చిరంజీవి కెరీర్లో అత్యంత భారీ యాక్షన్ సన్నివేశాల్లో ఒకటిగా నిలవనుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ మూవీ 2027 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది. అజీజ్ నగర్లో... ‘సంక్రాంతికి వస్తున్నాం’ (2025) వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత హీరో వెంకటేష్–డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో కల్యాణ్ రామ్ మరో హీరోగా నటిస్తున్నారు. వెంకటేశ్–కల్యాణ్ రామ్–అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందుతోన్న ఈ క్రేజీ మల్టీస్టారర్ మూవీకి ‘వెంకీఅనిల్ 5, ఎన్‌కేఆర్‌ఏఆర్2’ అన్నది వర్కింగ్ టైటిల్. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన కీర్తీ సురేష్, కల్యాణ్ రామ్ సరసన కృతీ శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సురేష్ ప్రోడక్షన్స్, జీ స్టూడియోస్, అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు.ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ సమీపంలోని అజీజ్ నగర్లో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో వెంకటేష్, కల్యాణ్ రామ్‌తో పాటు హీరోయిన్లు, అలాగే చిత్రంలోని నటీనటులు పాల్గొంటుండగా కీలక సీన్స్ తీస్తున్నారట అనిల్. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ చిత్రం 2027 సంక్రాంతికి విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే... వెంకటేష్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47’. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో శ్రీనిధీ శెట్టి హీరోయిన్ గా నటించారు. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ (చినబాబు) నిర్మించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రం అక్టోబరు 2న విడుదల కానుంది. కోకాపేటలో... ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా పాన్ ఇండియన్ మూవీ ‘ఫౌజి’. ‘సీతారామం’ మూవీ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ఇమాన్వీ హీరోయిన్గా నటిస్తున్నారు. సీనియర్ నటీనటులు జయప్రద, అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, భాను చందర్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. టి–సిరీస్ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ‘ఫౌజి’ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని కోకాపేటలో జరుగుతోంది. ప్రభాస్‌తో పాటు ఇతర నటీనటులపై ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట హను రాఘవపూడి.‘‘పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న చిత్రం ‘ఫౌజి’. ఈ సినిమాలో ఇప్పటివరకు ఎప్పుడూ కనిపించని రగ్డ్, ఎమోషనల్ లుక్‌లో ప్రభాస్ కనిపించనున్నారు. 2026లో అత్యంత భారీ పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ‘ఫౌజి’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఇదిలా ఉంటే... ఈ మూవీని ఈ డిసెంబరు 3న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ప్రభాస్ హీరోగా నటిస్తున్న మరో చిత్రం ‘స్పిరిట్’. సందీప్ రెడ్డి వంగా ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. శంషాబాద్‌లో... మహేశ్ బాబు హీరోగా అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతోన్న చిత్రం ‘వారణాసి’. ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రియాంకా చో్రపా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్‌లో జరుగుతోంది. ఈ మూవీ కోసం అక్కడ ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సెట్లో మహేశ్ బాబుతో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు రాజమౌళి.ఈ సినిమా కోసం మహేశ్ బాబు ΄÷డవాటి హెయిర్ స్టైల్, గెడ్డంతో ప్రత్యేకంగా మేకోవర్ అయిన సంగతి తెలిసిందే. ఈ మూవీ నుంచి విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకుల్లో అంచనాల్ని తారాస్థాయికి పెంచేసింది. ఈ విజువల్ వండర్‌ను చూడటానికి అంతర్జాతీయ స్థాయిలో సగటు సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘వారణాసి’ని అంతర్జాతీయ స్థాయిలో 120 దేశాల్లో విడుదల చేయనున్నట్లు రాజమౌళి పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మహేశ్ బాబు శ్రీరాముడిగా, రుద్రుడిగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. 2027 ఏప్రిల్ 7న ‘వారణాసి’ సినిమా విడుదల కానుంది. అల్యూమినియం ఫ్యాక్టరీలో... గోపీచంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సింగ’. ఈ సినిమా ద్వారా ప్రముఖ ఫైట్ మాస్టర్ వి. వెంకట్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మలయాళ నటి అనార్కలి నజర్ హీరోయిన్గా తెలుగులో అడుగుపెడుతున్నారు. 70ఎంఎం ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది.హీరో హీరోయిన్లతో పాటు ఇతర తారాగణంపై ఇంపార్టెంట్ సీన్స్ తీస్తున్నారట వెంకట్. జూన్ 12న గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా ‘సింగ’ టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో పాటు ఆయన లుక్‌ను రివీల్ చేసింది యూనిట్. ‘‘యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రం ‘సింగ’. ఫైట్ మాస్టర్‌గా సక్సెస్ అందుకున్న వెంకట్‌కి దర్శకుడిగా ఇది తొలి చిత్రం అయినప్పటికీ ఒక బలమైన స్క్రిప్ట్‌ను తయారు చేశారు. గోపీచంద్‌ను పూర్తి యాక్షన్, ఎమోషన్స్ కూడిన పాత్రలో చూపించనున్నారాయన. అత్యున్నత నిర్మాణ విలువలు, సాంకేతిక నైపుణ్యంతో కూడిన ‘సింగ’ సరికొత్త కథాంశాన్ని ప్రేక్షకులకు అందించనుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ముచ్చింతల్‌లో... నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో కయాదు లోహర్ హీరోయిన్గా నటిస్తున్నారు. మంచు మోహన్ బాబు, రాఘవ్ జుయల్, సంపూర్ణేశ్ బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్ఎల్వీ సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ‘దసరా’ వంటి హిట్ మూవీ తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల, సుధాకర్ చెరుకూరి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ది ప్యారడైజ్’. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో శరవేగంగా జరుగుతోంది. ఈ షెడ్యూల్లో నానితో పాటు ముఖ్యమైన నటీనటులపై కీలకమైన సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారట శ్రీకాంత్ ఓదెల. పీరియాడిక్ యాక్షన్ డ్రామా, యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ‘ది ప్యారడైజ్’లో జడల్ అనే శక్తిమంతమైన పాత్రలో నాని కనిపించనున్నారు. ఈ క్యారెక్టర్ ఆయన కెరీర్లో ప్రత్యేకమైనదిగా నిలుస్తుందని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో ఈ నెల 21న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. అయితే ఆ తేదీకి విడుదల కాక పోవచ్చని, సెప్టెంబరు 24న రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయని ఫిల్మ్‌నగర్ టాక్. గండిపేటలో... విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రణబాలి’. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. ‘టాక్సీవాలా’ (2018) వంటి హిట్ మూవీ తర్వాత విజయ్ దేవరకొండ–రాహుల్ సంకృత్యాన్ కాంబినేషన్లో రూపొందుతోన్న ద్వితీయ చిత్రం ‘రణబాలి’. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని గండిపేటలో జరుగుతోంది. విజయ్ దేవరకొండతో పాటు ఇతర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట దర్శకుడు. ‘‘19వ సెంచరీ నేపథ్యం కథతో రూపొందుతోన్న చిత్రం ‘రణబాలి’. 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక సంఘటనల ఆధారంగా ఈ కథ సాగుతుంది. ఈ మూవీలోని విజయ్ దేవరకొండ యాక్షన్ సీక్వెన్సులు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి’’ అని మేకర్స్ పేర్కొన్నారు. సెప్టెంబరు 11న ఈ సినిమా రిలీజ్ కానుంది. శంకరపల్లిలో... వైవిధ్యమైన చిత్రాలు, పాత్రలతో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నారు హీరో శ్రీ విష్ణు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న మరో వైవిధ్యమైన చిత్రానికి రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘సామజవరగమన’ (2023) చిత్రం ఘన విజయం సాధించింది. ఆ హిట్ మూవీ తర్వాత శ్రీ విష్ణు–రామ్ అబ్బరాజు కాంబోలో ద్వితీయ చిత్రం రూపొందుతోంది. ‘వెన్నెల’ కిశోర్, సుదర్శన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని శంకర్‌పల్లిలో జరుగుతోంది. శ్రీ విష్ణుతో పాటు ఇతర నటీనటులపై కీలకమైన సీన్స్ తీస్తున్నారు రామ్ అబ్బరాజు. తొలి చిత్రంతో కడుపుబ్బా నవ్వించిన శ్రీ విష్ణు–రామ్ అబ్బరాజు కాంబినేషన్ రెండో సినిమాతో ఏ మేర నవ్వులు పంచనున్నారో వేచి చూడాలి. శంకరపల్లిలో... సాయి దుర్గాతేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎస్వైజీ’ (సంబరాల ఏటిగట్టు). రోహిత్ కేపీ దర్శకునిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్గా నటిస్తున్నారు. జగపతి బాబు, సాయి కుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్టైన్ మెంట్‌పై ‘హను–మాన్’ (2024) వంటి విజయవంతమైన సినిమా తీసిన కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ సమీపంలోని శంకరపల్లిలో జరుగుతోంది. ‘‘తన కెరీర్లోనే అత్యంత పవర్ఫుల్, ఇంటెన్స్ పాత్రలో కనిపించబోతున్నారు సాయి దుర్గాతేజ్. ఈ చిత్రాన్ని పవర్ఫుల్ కథనం, ఉత్కంఠ భరితమైన విజువల్స్, హై యాక్షన్ సన్నివేశాల మేళవింపుతో గ్రాండ్ యాక్షన్ డ్రామాగా రూపొందిస్తున్నారు రోహిత్. చివరి షెడ్యూల్ జరుగుతోంది. ఇది పూర్తయిన వెంటనే పోస్ట్ ప్రోడక్షన్ పనులను ప్రారంభిస్తాం. ఈ సినిమాని డిసెంబరులో విడుదల చేయనున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. పైన పేర్కొన్న చిత్రాలే కాదు.. మరికొన్ని సినిమాల షూటింగ్స్ కూడా హైదరాబాద్‌తో పాటు పరిసర ్రపాంతాల్లో జరుగుతున్నాయి. – డేరంగుల జగన్ మోహన్ -
మహేష్‌గౌడ్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి: హరీష్‌రావు
తెలంగాణ: టీపీసీసీ (తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ) అధ్యక్షుడు మహేష్‌గౌడ్.. మాజీ మంత్రి హరీష్‌రావు క్షుద్రపూజలు చేస్తున్నారని ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై స్పందించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే టీ.హరీష్‌రావు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌గౌడ్‌కు లీగల్ నోటీసులు పంపారు. తనపై చేసిన క్షుద్రపూజల ఆరోపణలు పూర్తిగా అసత్యమని పేర్కొంటూ, వాటిని వెంటనే వెనక్కి తీసుకోవాలని నోటీసుల్లో డిమాండ్ చేశారు.అంతేకాకుండా బహిరంగంగా క్షమాపణ చెప్పాలని మహేష్గౌడ్ను హరీష్‌రావు కోరారు. తన ప్రతిష్ఠను దెబ్బతీసేలా తప్పుడు వ్యాఖ్యలు చేశారని ఆరోపించిన హరీష్‌రావు.. నిర్ణీత గడువులోగా వివరణ ఇవ్వకపోతే పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. -
Hyd: ప్రజల ప్రాణాలతో చెలగాలం.. ఏకంగా 25 టన్నులు దొరికాయ్
హైదరాబాద్: నగర కమిషనరేట్ పరిధిలో భారీగా నకిలీ సుగంధ ద్రవ్యాలు పట్టుబడ్డాయి. పలు నకిలీ సుగంధ ద్రవ్యాల (మసాలాల) వ్యాపార, ప్రాసెసింగ్ సంస్థలపై కమిషనర్ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలోని హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ సర్వైలెన్స్ టీమ్ (H-FAST), జీహెచ్ఎంసీ (GHMC) ఫుడ్ సేఫ్టీ విభాగంతో కలిసి సంయుక్తంగా తనిఖీలు నిర్వహించింది. ఆహార పదార్థాలలో హానికరమైన రసాయనాల వాడకాన్ని అరికట్టడం, కల్తీని అడ్డుకోవడం, ఆహార భద్రతా ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయడం, ప్రజారోగ్యాన్ని పరిరక్షించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టారు.ప్రజల నుంచి వచ్చిన విశ్వసనీయమైన సమాచారం ఆధారంగా ఈ ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా, సుగంధ ద్రవ్యాల సేకరణ, ప్రాసెసింగ్, హోల్‌సేల్ లేదా రిటైల్ విక్రయాలు జరుపుతూ మానవ ఆరోగ్యానికి హాని కలిగిస్తున్న 13 వ్యాపార సంస్థలు, ప్రాసెసింగ్ యూనిట్లలో అధికారులు సోదాలు నిర్వహించారు.ఈ దాడుల్లో హానికరమైన రసాయనాలు, ప్రమాదకర పదార్థాలు కలిపిన సుమారు 25 టన్నుల వివిధ రకాల సుగంధ ద్రవ్యాలను సీజ్ చేశారు. దీనికి సంబంధించి మూడు పోలీసు స్టేషన్లలో మూడు క్రిమినల్ కేసులు నమోదు చేసి, బాధ్యులైన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు.నమోదు చేసిన కేసుల వివరాలు:1. మైలార్‌దేవ్‌పల్లి పి.ఎస్. పరిధిలో — 2 కేసులు2. బాలాపూర్ పి.ఎస్. పరిధిలో — 1 కేసుఅరెస్ట్ అయిన నిందితులు:1. రాహుల్ భాటి (నివాసం: కాటేదాన్, హైదరాబాద్)2. విశాల్ పన్వార్ (నివాసం: బేగంబజార్, హైదరాబాద్)3. దులీచంద్ కచ్చవా (నివాసం: బేగంబజార్, హైదరాబాద్)తనిఖీల్లో వెలుగుచూసిన నిజాలు:ఈ తనిఖీల్లో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్, 2006 నిబంధనల ఉల్లంఘనలతో పాటు అనుచిత లేబులింగ్, మోసపూరిత ప్రాసెసింగ్ పద్ధతులు వెలుగుచూశాయి. ఎక్కువ లాభాలు ఆర్జించడమే ధ్యేయంగా సుగంధ ద్రవ్యాలలో అత్యంత ప్రమాదకరమైన, విషపూరితమైన పదార్థాలను కలుపుతున్నట్లు గుర్తించారు.ఆహారంలో ఉపయోగించే బుష్ సింథటిక్ ఆరెంజ్ రెడ్, గ్రీన్ ఫుడ్ కలర్స్‌తో పాటు గుడ్డల రంగులు (Cloth dyes), పారిశ్రామిక శాశ్వత రంగులు (Industrial permanent colors), షైనింగ్ పౌడర్ (Normal talcum powder), రైస్ బ్రాన్ ఆయిల్ వంటి విషపూరిత రసాయనాలను ఉపయోగిస్తున్నట్లు అధికారులు కనుగొన్నారు. ఒక తయారీ కేంద్రంలో, నాసిరకం, తిరస్కరించబడిన ఆవాల స్టాక్‌కు ఫ్యాబ్రిక్ డై, టా Local పౌడర్, నూనెను కలిపి ఉత్పత్తులకు కృత్రిమమైన మెరుపు, బరువు, పరిమాణాన్ని పెంచుతున్నట్లు తేలింది. ఇతర యూనిట్లలో లవంగాలు, షాజీరా వంటి సుగంధ ద్రవ్యాలకు ఆకర్షణీయమైన రంగు రావడం కోసం సింథటిక్ రంగులను పూస్తున్నట్లు, అలాగే షాజీరా, వాము (అజ్వైన్), ఇతర ముఖ్యమైన మసాలాలలో పారిశ్రామిక రంగులను కలుపుతున్నట్లు గుర్తించారు.క్రమ సంఖ్యసుగంధ ద్రవ్యాలు (Spices)కల్తీ చేసిన సరుకుముడి సరుకు1వాము (Ajwain)7,920 కిలోలు--2జీలకర్ర (Jeera)6,700 కిలోలు100 కిలోలు3లవంగాలు (Lavanga)550 కిలోలు--4షాజీరా (Shajeera)2,280 కిలోలు500 కిలోలు5సోంప్ (Saunf)540 కిలోలు--6ఆవాలు (Mustard)4,960 కిలోలు65,000 కిలోలు7జీలకర్ర పొడి / డస్ట్ (Jeera Dust)2,350 కిలోలు--8మెంతులు (Fenugreek Seeds)--13,460 కిలోలు9తెల్ల నువ్వులు (Sesame Seeds)--10,000 కిలోలు10షైనింగ్ పౌడర్ (Shining Powder)--90 కిలోలు (సుమారు)11రైస్ బ్రాన్ ఆయిల్ (Rice Bran Oil)--12 లీటర్లు (సుమారు)12సింథటిక్ & ఫ్యాబ్రిక్ డై (Synthetic & Fabric Dye)--1.5 కిలోలు (సుమారు)13రోలింగ్ మెషిన్లు (Rolling Machines)--3 యంత్రాలుమొత్తం నిల్వలు25,300 కిలోలు89,150 కిలోలు + 12 లీటర్ల నూనె ఇత్యాదిఈ అక్రమాలు వెలుగులోకి వచ్చిన తర్వాత, H-FAST బృందం ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లతో కలిసి ఆయా ప్రాసెసింగ్ కేంద్రాల నుండి అనుమానాస్పద శాంపిళ్లను ల్యాబోరేటరీ పరీక్షల కోసం సేకరించింది. నిబంధనలను ఉల్లంఘించిన యజమానులపై ఆహార భద్రత, ప్రమాణాల చట్టం, 2006 ఇతర చట్టపరమైన నిబంధనల ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. కల్తీ నెట్‌వర్క్‌లను అంతం చేయడానికి, వినియోగదారులకు సురక్షితమైన ఆహార ఉత్పత్తులు మాత్రమే అందేలా చూసేందుకు ఇటువంటి ఉమ్మడి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.ఆరోగ్య ప్రమాదాలు:ఆహార పదార్థాలలో పారిశ్రామిక రంగులు, సింథటిక్ రంగులు టా ప్రశస్తమైన టాల్కమ్ పౌడర్ వంటి తినకూడని పదార్థాలను ఉపయోగించడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి:• కాలేయం, మూత్రపిండాలు దెబ్బతినడం (Toxicity).• క్యాన్సర్ కారక రసాయనాల వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరగడం.• కడుపునొప్పి, అల్సర్లు వంటి జీర్ణకోశ వ్యాధులు.• అలెర్జీలు చర్మ వ్యాధులు.• నరాల వ్యవస్థ శరీర రోగనిరోధక శక్తిపై దీర్ఘకాలిక ప్రభావం.ఇటువంటి కల్తీ వ్యాపారాలు వినియోగదారులను మోసం చేయడమే కాకుండా, పెద్ద ఎత్తున ప్రజారోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తాయి. 140 రోజుల్లో 246 టన్నుల కల్తీ ఆహారాన్ని సీజ్ చేసిన 'H-FAST'H-FAST బృందం, జిహెచ్ఎంసి ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి నగరం నలుమూలలా విసృతంగా తనిఖీలు నిర్వహిస్తోంది. ఈ విభాగం ప్రారంభమైన 140 రోజుల్లోనే 659 దాడులు నిర్వహించి, 202 ఎఫ్ఐఆర్లు (FIRs) నమోదు చేసింది. దాదాపు 246 టన్నుల కల్తీ ఆహారాన్ని స్వాధీనం చేసుకుంది. అంతేకాకుండా, తదుపరి చర్యల కోసం 232 కేసులను జిహెచ్ఎంసి ఫుడ్ సేఫ్టీ అధికారులకు అప్పగించగా, 46 పనీర్, 83 నెయ్యి విక్రయ కేంద్రాలలో తనిఖీలు చేపట్టింది. ప్రజల నుండి వచ్చిన అనేక ఫిర్యాదులను వెంటనే పరిష్కరించింది.ఈ తనిఖీల్లో షాకింగ్ నిజాలు వెలుగుచూసాయి. అల్లం-వెల్లుల్లి పేస్ట్ తెల్లగా, చిక్కగా కనిపించడానికి పెయింట్లలో వాడే 'టైటానియం ఆక్సైడ్' ప్రమాదకరమైన 'ఎసిటిక్ యాసిడ్' ఉపయోగిస్తున్నట్లు కనుగొన్నారు. 32 కేంద్రాలలో పొట్టు తీయని, కుళ్ళిన అల్లం, వెల్లుల్లితో ఈ పేస్ట్‌ను తయారు చేస్తున్నట్లు గుర్తించి దాడులు చేయగా, 27 టన్నులకు పైగా (27,024 కిలోలు) కల్తీ పేస్ట్ సీజ్ చేయబడింది. అలాగే 12 టన్నులకు పైగా కుళ్ళిన కోడి, మేక మాంసంతో పాటు, హోటళ్లకు సరఫరా చేసేందుకు అపరిశుభ్రమైన వాతావరణంలో నిల్వ ఉంచిన 60 టన్నుల కోడి వ్యర్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ తయారీ కేంద్రాలలో ఈగలు, బొద్దింకల మధ్య, మురుగు దొడ్ల పక్కనే ఆహారాన్ని తయారు చేస్తున్న తీవ్రమైన అపరిశుభ్ర పరిస్థితులు వెలుగుచూశాయి.అలాగే, రసాయనాలతో పండ్లను కృత్రిమంగా మగ్గబెడుతున్న 16 కేంద్రాలపై దాడులు చేసి 25.8 టన్నుల పండ్లు, 9.2 టన్నుల కల్తీ ఊరగాయలు, 3.8 టన్నుల కల్తీ టీ పొడిని స్వాధీనం చేసుకున్నారు. బొట్టు పాలు కూడా లేకుండా యూరియా, డిటర్జెంట్లు, పామ్ ఆయిల్, ప్రమాదకర రసాయనాలతో తయారు చేస్తున్న సింథటిక్ పనీర్ వ్యవహారాన్ని బృందం గుట్టురట్టు చేసి, 1.5 టన్నుల సింథటిక్ పనీర్, 2.5 టన్నుల కల్తీ పెరుగూ, 3.2 టన్నుల క్రీమ్, నెయ్యి, నూనెలను స్వాధీనం చేసుకుంది. ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్న 23.7 టన్నుల నిల్వలు గల RO వాటర్ ప్లాంట్లతో పాటు ఐస్ క్రీములు, సమోసాలు, బిస్కెట్లు తయారు చేసే యూనిట్లపై కూడా చర్యలు తీసుకున్నారు.ప్రజలకు పోలీసుల సూచనలుఆహార కల్తీపై జరుగుతున్న పోరాటంలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని, ప్రజారోగ్యాన్ని పరిరక్షించడానికి పౌరులు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సిటీ పోలీస్, H-FAST కోరుతున్నాయి.• సుగంధ ద్రవ్యాలు, ఆహార ఉత్పత్తులను కేవలం గుర్తింపు పొందిన, లైసెన్స్ ఉన్న విక్రేతల నుండి మాత్రమే కొనుగోలు చేయాలి.• ప్యాకేజింగ్, లేబులింగ్, సరైన FSSAI లైసెన్స్ వివరాలను ఖచ్చితంగా సరిచూసుకోవాలి.• అత్యంత ఆకర్షణీయమైన, ప్రకాశవంతమైన రంగుల్లో ఉండే మసాలాలను కొనకూడదు; అవి రసాయన కల్తీకి సంకేతం కావచ్చు.• రోడ్డు పక్కన లభించే బ్రాండ్ లేని ఆహార పదార్థాలు లేదా లూజ్ మసాలాలను తక్కువ ధరకు వస్తున్నాయని కొనవద్దు.• ప్రాథమిక నాణ్యతా ప్రమాణాలు లేని బయటి ఆహారానికి దూరంగా ఉండాలని, సాధ్యమైనంత వరకు బయటి ఆహార వినియోగాన్ని తగ్గించుకోవాలి.ఫిర్యాదులు లేదా సమాచారాన్ని ఆపద సమయాల నెంబర్ 'డయల్ 100' ద్వారా గానీ, లేదా H-FAST హెల్ప్‌లైన్ నంబర్ 8712661212 (కాల్ లేదా వాట్సాప్) ద్వారా గానీ అందించవచ్చు. సమాచారం అందించిన వారి వివరాలను పూర్తి రహస్యంగా ఉంచుతారు.ఆహార కల్తీకి పాల్పడే వారిపై కఠిన చర్యలు నిరంతరం కొనసాగుతాయి. ఈ ప్రత్యేక తనిఖీ డ్రైవ్‌ను టాస్క్ ఫోర్స్ డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ నాయకత్వంలో ఇన్స్పెక్టర్లు రంజిత్, అంజయ్య, సబ్ ఇన్స్పెక్టర్లు శంకర్, కృష్ణ, అఖిల్ సిబ్బందితో కూడిన H-FAST బృందం నిర్వహించింది. -
రేషన్ షాపుల వద్ద జనం పోటెత్తారు!
బంజారాహిల్స్: కేంద్ర ప్రభుత్వం పేద, బలహీన వర్గాలు ఇబ్బందులు పడకుండా గతంలో అత్యధిక వర్షాలు, తీవ్ర వేసవి పరిస్థితుల దృష్ట్యా మూడు నెలల రేషన్‌ను ఒకేసారి పంపిణీ చేసింది. తాజాగా ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మాసాలకు సంబంధించి రేషన్‌ను లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నది. వేసవి కాలంలో ఏప్రిల్, మే, జూన్ నెలకు సంబంధించిన రేషన్‌ను ఒకేసారి పంపిణీ చేశారు. జూలై 1 నుంచి నెల వారి రేషన్ పంపిణీ ప్రారంభించారు. కరువు పరిస్థితులు నెలకొన్న క్రమంలో మరోసారి మూడు నెలల రేషన్ బియ్యాన్ని కార్డుదారులకు పంపిణీ చేస్తున్నారు. 22 రోజులు షాపులు ఓపెన్.. ఖైరతాబాద్ రేషనింగ్ సర్కిల్–7 పరిధిలోకి వచ్చే జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, సనత్‌నగర్ నియోజక వర్గాల పరిధిలో ఉన్న సోమాజిగూడ, ఖైరతాబాద్, ఎర్రమంజిల్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ, ఫిలింనగర్, శ్రీనగర్ కాలనీ, కృష్ణానగర్, రహ్మత్‌నగర్, యూసుఫ్‌గూడ, కారి్మకనగర్, వెంగల్రావునగర్, రాజీవ్‌నగర్, ఎర్రగడ్డ, బోరబండ, అమీర్‌పేట, సనత్‌నగర్, బల్కంపేట డివిజన్ల పరిధిలో ఉన్న 81 రేషన్ దుకాణాల పరిధిలో మూడు నెలల కోటా పంపిణీ చేస్తున్నారు. ప్రతినెలా 1 నుంచి 15వ తేదీ వరకు రేషన్ దుకాణాలు తెరిచి ఉంచి బియ్యం పంపిణీ చేసేవారు. అయితే మూడు నెలల కోటా పంపిణీ సందర్భంగా ఆగస్టులో 22 రోజులు షాపులు తెరిచి ఉంచాలని పౌర సరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే సరిపడా బియ్యాన్ని షాపుల్లో సిద్ధంగా ఉంచారు. రేషన్ బియ్యం పంపిణీ సక్రమంగా జరిగే విధంగా అధికారులు ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. ప్రతిరోజూ ఆయా రేషన్ షాపులను సంబంధిత అధికారులు పరిశీలిస్తున్నారు. -
ఆర్టీసీ బస్సులో మహిళ తీసిన వీడియో.. క్షణాల్లో వైరల్!
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ(TSRTC)బస్సులో ఓ మహిళ చిత్రీకరించిన చిన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, నెటిజన్ల మధ్య తీవ్ర చర్చకు దారితీసింది.ఆ మహిళ బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో సీట్ల పైన ఉన్న ఒక సూచన బోర్డును గమనించారు. దానిపై ‘పురుషులను గౌరవించటం మన సంప్రదాయం. వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దాం‘ అని స్పష్టంగా రాసి ఉంది. సాధారణంగా బస్సుల్లో మహిళలకు కేటాయించిన సీట్ల గురించి లేదా మహిళల భద్రతకు సంబంధించిన బోర్డులను ఎక్కువగా చూస్తుంటాం. కానీ, పురుషుల సీట్ల కేటాయింపు మరియు వారికి ఇవ్వాల్సిన గౌరవం గురించి ఆర్టీసీ బస్సులో ఇలాంటి సందేశం కనిపించడంతో ఆమె దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో నెట్టింట ప్రత్యక్షమవ్వడమే ఆలస్యం.. నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయిఓ మహిళ TGSRTC బస్సులో ఉన్న ఓ సందేశాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు."పురుషులను గౌరవించటం మన సంప్రదాయం. వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దాం."ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ సందేశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.#Men… pic.twitter.com/rKP8nAiYK1— Orugallu Adda (@OrugalluAdda) August 3, 2026 ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. ‘ఉచిత బస్సు ప్రయాణం (మహాలక్ష్మి పథకం) అమలులోకి వచ్చిన తర్వాత బస్సుల్లో పురుషులకు సీట్లు దొరకడం గగనంగా మారింది. సాధారణ సీట్లలో కూడా మహిళలు కూర్చోవడం వల్ల పురుషులు నిలబడి ప్రయాణించాల్సి వస్తోంది. పురుషుల హక్కులను, వారి శ్రమను గుర్తించి ఆర్టీసీ ఇలాంటి బోర్డులు పెట్టడం అభినందనీయం‘ అని చాలామంది కామెంట్లు చేస్తున్నారు.ప్రయాణంలో స్త్రీ, పురుషులనే తేడా లేకుండా పెద్దవారు, గర్భిణులు, చిన్న పిల్లలతో ఉన్నవారికి సీటు ఇవ్వడమే అసలైన సంప్రదాయమని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. సీట్ల కేటాయింపు కంటే పరస్పర అవగాహన, గౌరవం ముఖ్యమని పేర్కొంటున్నారు.మొత్తానికి ఆర్టీసీ బస్సులోని ఆ ఒక్క సందేశం ఇప్పుడు సోషల్ మీడియాలో ’పురుషుల సీట్ల కేటాయింపు ప్రయాణికుల బాధ్యత’పై పెద్ద చర్చకే తెరలేపింది. -
హైదరాబాద్ ను ముంచెత్తిన భారీ వర్షం
-
హైదరాబాద్‌లో పలుచోట్ల కుండపోత వాన (ఫొటోలు)
-
టీచర్ ప్రాణం తీసిన మైనర్ డ్రైవింగ్
గౌలిపురా: నడుచుకుంటూ వెళ్తున్న టీచర్‌ను వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొనడంతో చికిత్స పొందుతూ మృతి చెందింది. భవానీనగర్ ఇన్స్పెక్టర్ ఎ.కరుణాకర్ తెలిపిన మేరకు...న్యూ నల్లకుంట తిలక్‌నగర్ ప్రాంతానికి చెందిన స్వరూపరాణి (50) మొఘల్‌పురాలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో కాంట్రాక్ట్ పద్ధతిలో టీచర్‌గా పనిచేస్తోంది. రోజూ ఎంఎంటీఎస్‌లో కాచిగూడ నుంచి యాకుత్‌పురా వచ్చి..అక్కడినుంచి నడుచుకుంటూ పాఠశాలకు వెళ్తుంది. సోమవారం ఉదయం పాఠశాలకు వెళ్తుండగా వేగంగా వచ్చిన కారు ఢీకొంది.అంతటితో ఆగకుండా కారు ఆటో, స్కూటీ, ఇతర వాహనాలను ఢీకొట్టుకుంటూ వెళ్లింది. స్వరూపరాణిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. స్వరూపరాణి భర్త బాల్‌రాజ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా కారును ఓ మైనర్ బాలుడు (17) నడుపుతున్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో బాలుడితోపాటు కుటుంబసభ్యులను పోలీసులు విచారిస్తున్నారు. -
‘18 గంటల సీఎం’ ఏం సాధించారు?
సాక్షి,హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోమవారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ ‘18 గంటలు పని చేశానని చెప్పుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రానికి సాధించింది ఏముంది? కేవలం సర్వే నంబర్లు చూస్తూ, ప్రజలను ఇబ్బంది పెట్టడం తప్ప ఆయన చేసిందేమీ లేదు’అని ఎద్దేవా చేశారు.రేవంత్ రెడ్డి పాలనలో కేవలం మద్యం ఆదాయంలో వృద్ధి తప్ప, మిగిలిన అన్ని రంగాలు వెనక్కి వెళ్ళిపోయాయని విమర్శించారు. కేసీఆర్ హయాంలో జరిగిన అద్భుతమైన అభివృద్ధి గురించి మాజీ ఆర్బీఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు సైతం తన పుస్తకంలో స్పష్టంగా ప్రస్తావించారని గుర్తుచేశారు. ఇదే సమయంలో పోక్సో కేసు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ అరెస్ట్ వ్యవహారంపై కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ‘పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్‌ను అరెస్ట్ చేయకుండా తప్పించేందుకు, సీఎం రేవంత్ రెడ్డి బంధువు అయిన శరత్ రెడ్డికి వాటాలు ఉన్న మెడికవర్ ఆసుపత్రిలో ఆశ్రయం కల్పించారు’ అని ఆరోపించారు.‘మాక్స్ బీన్’ కంపెనీ నుంచి మెడికవర్ ఆసుపత్రికి నిధులు మళ్లించారని, బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గట్టిగా పోరాడటం వల్లే పోలీసులు భగీరథ్‌ను అరెస్ట్ చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. లేకపోతే అతనికి బెయిల్ వచ్చేంత వరకు మెడికవర్ ఆసుపత్రిలోనే దాచిపెట్టేవారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని తాము గమనిస్తున్నామని, మళ్లీ అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కరి లెక్కలు బయటకు తీస్తామని కేటీఆర్ హెచ్చరించారు. -
హైదరాబాద్ వాసులారా అప్రమత్తం!
హైదరాబాద్: నగరంలో ఈ రోజు రాత్రి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని సీపీ వీసీ సజ్జనార్ సూచించారు. ‘అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప అనవసర ప్రయాణాలు చేయవద్దు. ఇళ్ల నుంచి బయటకు రావద్దు. బయట ఉన్నవారు వర్ష తీవ్రత పెరిగే లోపే పనులను త్వరగా ముగించుకుని క్షేమంగా ఇళ్లకు చేరుకోవాలి. ముఖ్యంగా నీరు నిలిచిన రహదారులు, ముంపునకు గురయ్యే లోతట్టు ప్రాంతాల గుండా ప్రయాణాలు చేయడం అస్సలు సురక్షితం కాదు. వాహనదారులు డ్రైవింగ్ చేసేటప్పుడు వేగం తగ్గించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అత్యవసర సమయాల్లో అప్రమత్తంగా ఉంటూ అందరూ సురక్షితంగా ఇళ్లకు చేరుకోవాలి’ అని తన సోషల్ మీడియా ఖాతా ’ఎక్స్’లో ట్వీట్ చేశారు. హైదరాబాద్ వాసులారా అప్రమత్తం!నగరంలో ఈ రోజు రాత్రి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలి. అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప అనవసర ప్రయాణాలు చేయవద్దు. ఇళ్ల నుంచి బయటకు రావద్దు. బయట ఉన్నవారు వర్ష తీవ్రత పెరిగే… https://t.co/X9moh2KVx3— V.C. Sajjanar, IPS (@SajjanarVC_IPS) August 3, 2026 -
హైదరాబాద్‌లో మళ్లీ భారీ వాన
సాక్షి, హైదరాబాద్: నగరంలో పలు చోట్ల మళ్లీ భారీ వర్షం పడుతోంది. ఈ రోజు(సోమవారం, ఆగస్టు 3వ తేదీ) మధ్యాహ్నం రెండు గంటల సమయంలో భారీ వర్షం పడగా, రాత్రి తొమ్మిదిన్నర దాటిన తర్వాత తిరిగి భారీ వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, సనత్ నగర్, ఎర్రగడ్డ ప్రాంతాలలో కుండపోతగా వాన కురుస్తోంది. శేర్లింగంపల్లి, సికింద్రాబాద్, బేగంపేట, తదితర ప్రాంతాల్లో కుండపోతగా వాన కురుస్తోంది. పెద్దఎత్తున వరదనీరు రోడ్లమీదకి చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో సహాయక బృందాలు కూడా రంగంలోకి దిగాయి. -
దోమలు, నల్లులు.. హైదరాబాద్ ఐఐటీలో చేదు అనుభవం!
భారతదేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఒకటైన ఐఐటీ హైదరాబాద్‌లో చేరిన ఓ జపాన్ విద్యార్థిని అనుభవాలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. భారత్‌కు వచ్చిన ఆనందంతో పాటు.. హాస్టల్ వసతిలో ఎదురైన సమస్యలను కూడా ఆమె ఇన్స్టాగ్రామ్ వీడియో ద్వారా పంచుకోవడంతో ఈ అంశం వైరల్‌గా మారింది.ఐఐటీ హైదరాబాద్‌లో తాను తొలి జపాన్ విద్యార్థినినని చెప్పుకున్న హిరో(Japan Student Hiro).. భారత్‌లో తన మొదటి వారం అనుభవాలను వీడియో రూపంలో పంచుకుంది. విమాన ప్రయాణం నుంచి క్యాంపస్ చేరుకునే వరకు జరిగిన విషయాలను వివరించిన ఆమె.. ఐఐటీ హైదరాబాద్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ సెల్ నుంచి లభించిన స్వాగతంపై ప్రశంసలు కురిపించింది. భారత్‌కు రావడం ఎంతో ఉత్సాహంగా అనిపించిందని చెప్పిన హిరో.. క్యాంపస్‌లో తనకు మంచి స్వాగతం లభించిందని పేర్కొంది. కొత్త స్నేహాలు, కొత్త వాతావరణం తనకు ప్రత్యేక అనుభూతిని ఇచ్చాయని తెలిపింది.అయితే ఈ ఆనందంతో పాటు కొన్ని ఇబ్బందులు కూడా ఎదురయ్యాయని ఆమె వెల్లడించింది. హాస్టల్ గదిలో సమస్యలు ఉన్నాయని, మంచంపై చనిపోయిన పురుగులు కనిపించాయని చెప్పింది. అంతేకాకుండా దోమకాట్ల కారణంగా తీవ్ర ఇబ్బంది పడ్డానని, నల్లులతో అలర్జీ రావడంతో భారత్‌లో తొలిసారి ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చిందని వివరించింది.తన హాస్టల్ గది పరిస్థితులను చూపిస్తూ ఆమె చేసిన వీడియోలో వసతి సమస్యలను ప్రస్తావించింది. అయితే ఐఐటీ హైదరాబాద్ మొత్తం అనుభవాన్ని ప్రతికూలంగా చూపించకుండా.. ఒకవైపు సంస్థ నుంచి లభించిన సహకారాన్ని, మరోవైపు ఎదురైన సవాళ్లను సమతుల్యంగా వివరించింది. హిరో ఈ వీడియోతో పాటు తన అనుభవానికి సంబంధించిన రెండో భాగాన్ని కూడా త్వరలో పంచుకుంటానని తెలిపింది. ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.హిరో వీడియో వైరల్ కావడంతో పలువురు నెటిజన్లు ఆమెకు పలు సూచనలు చేశారు. కొత్త దేశంలో చదువుకునేందుకు వచ్చినప్పుడు ఎదురయ్యే చిన్న చిన్న ఇబ్బందులను ఓపికగా ఎదుర్కోవాలని, ఏదైనా సమస్య ఉంటే నేరుగా ఐఐటీ హైదరాబాద్ యాజమాన్యం, అంతర్జాతీయ విద్యార్థుల విభాగం దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. పరువు లాంటి సదుపాయాలు విద్యార్థులే ఏర్పాటు చేసుకుంటారని.. ఆమె కొన్న పరుపు సరైంది ఉండకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు. మరికొందరు.. హాస్టల్ పరిశుభ్రత, వసతి సమస్యలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో పాటు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తే త్వరగా పరిష్కారం లభిస్తుందని తెలిపారు. అలాగే భారతీయ సంస్కృతి, వాతావరణానికి అలవాటు పడేందుకు కొంత సమయం పడుతుందని, సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని హిరోకు సూచించారు. అదే సమయంలో ఇంకొందరు నెటిజన్లు మాత్రం విదేశీ విద్యార్థులు ఎదుర్కొనే ఇలాంటి సమస్యలపై విద్యాసంస్థలు మరింత శ్రద్ధ పెట్టాలని అభిప్రాయపడ్డారు.ఐఐటీ హైదరాబాద్ స్వాగతానికి ఫిదా అయిన జపాన్ విద్యార్థిని.. హాస్టల్లో ఎదురైన దోమలు, పురుగుల సమస్యలను బయటపెట్టడంతో ఆమె అనుభవం ఇప్పుడు వైరల్‌గా మారింది. దీనిపై నిర్వాహకులు ఏమైనా స్పందిస్తారేమో చూడాలి. -
అంగరంగ వైభవంగా పాతబస్తీలో ఘనంగా ఘటాల ఊరేగింపు (ఫొటోలు)
-
‘ఆపిల్ డేస్' గ్రాండ్ లాంచ్‌లో నటి నందితా శ్వేత సందడి (ఫొటోలు)
-
4న రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల ఛలో బస్సు భవన్
హైదరాబాద్: దీర్ఘ కాలిక సమస్యల సాధన కోసం ఈ నెల 4వ తేదీన చలో బస్ భవన్ కు పిలుపునిస్తున్నట్టు ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బుచ్చి రెడ్డి వెల్లడించారు. ఇప్పటికీ రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులకు మూడు పీఆర్సీల ఎరియర్స్ రావాల్సి ఉందని తెలిపారు. రిటైర్డ్ బెనిఫిట్స్ బకాయిలు వెంటనే విడుదల చేయడంతో పాటు తార్నాక ఆర్టీసీ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య చికిత్సలు జరపాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఈ నెల 4వ తేదీన ఉదయం 10 గంటలకు బస్ భవన్ వద్ద నిర్వహించే ఛలో బస్సు భవన్ కు పెద్ద ఎత్తున తరలి రావాలని రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. అదే విధంగా సూపర్ లగ్జరీ బస్ లోనూ రిటైర్డ్ ఉద్యోగులను అనుమతించాలని ప్రధాన కార్యదర్శి ఒక ప్రకటనలో కోరారు. ఈ విషయంలో ఎండీకి విజ్జాపన పత్రం సమర్పిస్తున్నట్టు బుచ్చిరెడ్డి తెలిపారు. -
హైదరాబాద్‌లో భారీ వర్షం
సాక్షి,హైదరాబాద్: నగరంలో పలుచోట్ల భారీగా వర్షం పడుతోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్, అమీర్‌పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్ ప్రాంతాలలో జోరుగా వాన కురుస్తోంది. పలు ప్రాంతాలలో ఆకస్మిక వర్షంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. -
హైదరాబాద్‌లో కారు నడిపి బీభత్సం సృష్టించిన మైనర్ బాలుడు
హైదరాబాద్: బోరబండలో కారు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి వాహనాలపైకి దూసుకెళ్లింది. ఆ కారును మైనర్ బాలుడు నడపడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అతడి పేరును అలీ అహ్మద్(17)గా గుర్తించారు. అతడు కారుతో సృష్టించిన బీభత్సానికి ఏడు బైకులు ధ్వంసమయ్యాయి. ఇద్దరు అన్నాదమ్ముళ్లకు గాయాలయ్యాయి. వారి పేర్లు రాజ్‌కుమార్ (60), ప్రభాకర్ (55). ఓ ఇంటిముందే ఈ ప్రమాదం జరిగింది. మైనర్ బాలుడు కారుపై అదుపుకోల్పోవడం, అతడికి డ్రైవింగ్‌లో ఏ మాత్రం అనుభవం లేకపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. కారు అదుపుతప్పి వేగంగా ఇంటి గేటును ఢీకొట్టే దిశగా వెళ్లింది. త్రుటిలో ఆ ఇంటి ముందు ఆగిపోయింది. లేదంటే ఇంటి ముందు గోడ కూడా ధ్వంసమయ్యేది. -
ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సీపీ సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఆదివారం కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఆషాఢ మాస బోనాల ఉత్సవాల సందర్భంగా ఆలయానికి విచ్చేసిన ఆయన.. అమ్మవారికి పట్టు వస్త్రాలు, బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడ హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో చేపట్టిన భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.ఈ సందర్భంగా సజ్జనార్ మీడియాతో మాట్లాడుతూ.. భాగ్యనగరంలో ఆషాఢ బోనాల పండుగకు ఘనమైన చారిత్రక నేపథ్యం ఉందన్నారు. ప్రస్తుతం నగరవ్యాప్తంగా ఉత్సవాలు అత్యంత ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో సాగుతున్నాయని తెలిపారు. ఇప్పటికే గోల్కొండ, బల్కంపేట బోనాల జాతరలు ప్రశాంతంగా ముగియగా.. ప్రస్తుతం ఉజ్జయిని మహంకాళి, లాల్‌దర్వాజా అమ్మవార్ల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయని వివరించారు. భక్తుల భద్రత, రక్షణే ధ్యేయంగా హైదరాబాద్ సిటీ పోలీస్ శాఖ పటిష్టమైన ముందస్తు ఏర్పాట్లు చేసిందని వెల్లడించారు.ఉజ్జయిని మహంకాళి బోనాల వేడుకలకు దాదాపు 2,500 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉత్సవాల్లో ఏటా పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని తొలిసారిగా ఏఐ ఆధారిత క్రౌడ్ మేనేజ్మెంట్, నిఘా వ్యవస్థను మహంకాళి ఆలయం వద్ద ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఈ అత్యాధునిక ఏఐ వ్యవస్థ ద్వారా ఆలయ పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాలతో ముఖాలను విశ్లేషించే 'ఫేషియల్ రికగ్నిషన్' సాంకేతికతను ఉపయోగిస్తున్నామన్నారు. దీనివల్ల పాత నేరస్థులు, గొలుసు దొంగలు, జేబుదొంగలను తక్షణమే గుర్తించి అప్రమత్తమయ్యే వెసులుబాటు కలుగుతుందని తెలిపారు. అలాగే ఆలయంలోకి వచ్చే, వెళ్లే భక్తుల సంఖ్యను క్యూ మేనేజ్మెంట్ ద్వారా కచ్చితంగా లెక్కిస్తామని పేర్కొన్నారు. ఆలయం లోపల వివిధ విభాగాలు, క్యూలైన్లలో భక్తుల రద్దీ సాంద్రతను 'థ్రెషోల్డ్ మ్యాపింగ్' ద్వారా నిరంతరం విశ్లేషిస్తూ, పరిమితికి మించి రద్దీ పెరిగితే ముందస్తు చర్యల ద్వారా తొక్కిసలాటలు జరగకుండా నివారిస్తామని స్పష్టం చేశారు.బోనాల ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా దేవాదాయ శాఖ, జీహెచ్ఎంసీ, తదితర ప్రభుత్వ విభాగాలతో సమన్వయం చేసుకుంటున్నామని వివరించారు. భక్తులందరూ ప్రశాంత వాతావరణంలో అమ్మవారిని దర్శించుకోవాలని, జాతర విజయవంతంగా పూర్తయ్యేలా పోలీసు శాఖకు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. క్రౌడ్ మేనేజ్మెంట్ సిస్టమ్‌ను పరిశీలించిన సజ్జనార్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల బందోబస్తు చర్యల్లో భాగంగా మహంకాళి పోలీస్‌స్టేషన్‌లో తొలిసారిగా ఏర్పాటు చేసిన ఏఐ ఆధారిత ‘క్రౌడ్ మేనేజ్మెంట్ సిస్టమ్‌ను సజ్జనార్ పరిశీలించారు. ఈ సందర్భంగా వ్యవస్థ పనితీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి, ఐపీఎస్, ట్రాఫిక్-1 డీసీపీ శ్రీ అవినాశ్ కుమార్, ఐపీఎస్, అదనపు డీసీపీ నర్సయ్య, ఏసీపీ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
బోనం వెలుగు (ఫోటోలు)
-
ఫ్రెండ్‌ట్రిప్.. స్నేహ వారధులుగా ప్రయాణాలు..!
ఒకప్పుడు స్నేహం అంటే స్కూల్, కాలేజీ, ఆఫీస్.. లేదా పక్కింటి పరిచయాలు.. అంతే. కానీ ఇప్పుడు స్నేహానికి కొత్త చిరునామాలు పుట్టుకొస్తున్నాయి. ట్రెక్కింగ్, క్యాంపింగ్, సైక్లింగ్, రోడ్ ట్రిప్స్, అడ్వెంచర్ టూర్లు కొత్త స్నేహాల అల్లికకు కేరాఫ్‌గా మారుతున్నాయి. అపరిచితులుగా కలిసిన వారు టూర్ ముగిసే కొన్ని రోజుల వ్యవధిలోనే మంచి మిత్రులుగా మారుతుండడం ఈ స్నేహాల పట్ల నగర వాసుల్లో ఆసక్తిని పెంచుతోంది.‘విభిన్న ఉద్యోగాల రీత్యా నగరానికి వచ్చి స్నేహాల కోసం సాహస యాత్రల్ని ఎంచుకుంటున్నారు’ అని నగరానికి చెందిన ట్రెక్ ఇట్ సంస్థ నిర్వాహకులు వెంకట్ తెలిపారు. ఈ ఆసక్తిని గమనించిన టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ కమ్యూనిటీలు ఇప్పుడు కేవలం ‘కొత్త ప్రదేశాలు చూడండి.. కొత్త స్నేహాలను ఏర్పరచుకోండి’ అంటూ ప్రచారాలు హోరెత్తిస్తున్నాయి. సోలోమంటూ.. స్నేహాలకు చలో.. ఈ తరహా యాత్రలు కనీసం 20 మంది నుంచి 50 మంది దాకా బృందంతో నిర్వహిస్తారు. అందరూ కలిసి ఒకే వాహనంలో ప్రయాణించడం, కలిసి భోజనం చేయడం, ఒకే క్యాంప్‌లో బస చేయడం, ప్రయాణంలో ఒకరి గురించి మరొకరు తెలుసుకోవడం, ఫొటోలు దిగడం.. ఇలా మొదలవుతున్న పరిచయం శరవేగంగా స్నేహంగా మారుతోంది. ట్రెక్కింగ్, రాక్ క్లైంబింగ్ వంటి సందర్భాల్లో ఒకరు అలసిపోతే మరొకరు చేయి అందిస్తారు. వాటర్ బాటిల్ ఖాళీ అయితే ఇంకొకరు తమ నీటిని పంచుకుంటారు. ఒకరి బ్యాగ్‌ను మరొకరు కొద్దిసేపు మోస్తారు. ఇదే ‘ట్రిప్ ఫ్రెండ్’ను ‘లైఫ్ ఫ్రెండ్’గా మార్చేస్తోంది.యాత్ర సమాప్తం.. ఆగని స్నేహం.. అడ్వెంచర్ ట్రిప్ పూర్తయిన తర్వాత కూడా వాట్సాప్, ఇన్‌స్టా, ఫేస్‌బుక్స్ సంబంధాలు, తదుపరి ట్రిప్స్ ప్లాన్ చేయడం ద్వారా స్నేహాలు బలోపేతమవుతున్నాయి. సాహస యాత్రలు చేసే అభిరుచి ఎక్కువగా యువతదే అయినప్పటికీ మొత్తం బృందంలో ముగ్గురు నలుగురే మధ్య వయసు్కలు ఉంటారు. సహజంగానే వీరు సమవయసు్కలు కావడంతో స్నేహితులుగా మారుతున్నారు. ఉద్యోగ, కుటుంబ బాధ్యతల మధ్య స్నేహితుల తో బంధాలు తగ్గిపోయిన 40+, 50+ వయసు వారిలోనూ గ్రూప్ ట్రావెల్, ద్వారా కొత్త స్నేహాలు ఏర్పడుతున్నాయి. ఊర్లు వేరు.. దార్లు ఒకటే...‘మాది తిరుపతి, అన్నాడు సునీల్ మాది పీలేరు అన్నాడు రెడ్డి శంకర్. మాది ఒంటిమిట్ట అని చెప్పాడు సంపత్. ఆ ముగ్గురు యువకులు. నగరం నుంచి ప్రారంభం అయే ప్రయాణాల్లో మేము సైతం అంటూ తమ బైక్‌ని కలుపుతారు. లేదా వీరు ముగ్గురూ కలిసి తరచుగా బైక్ ట్రిప్స్ వేస్తుంటారు ‘ఇటీవలే వాయనాడ్, కూర్గ్.. చుట్టు పక్కల ప్రాంతాలకు బైక్స్ మీద వెళ్లి వచ్చాం. ఎవరు ఎక్కడ ఎంత బిజీగా ఉన్నా ట్రిప్ ప్లాన్ చేసుకుంటే మాత్రం బైక్ కిక్ కొట్టాల్సిందే’ అంటోందీ స్నేహ త్రయం. ప్రయాణ అభిరుచే కలిపింది.. కడప నివాసి మహ్మద్ వాసిమ్, నగరవాసి రాజ్ కుమార్ వశిష్టలను ఓ సాహస యాత్ర మంచి స్నేహితులుగా మార్చింది. ఇటీవలే దేవ్‌కుండ్ వాటర్ ఫాల్ తదితర ప్రాంతాల్లో ట్రెక్కింగ్ ముగించుకుని వచ్చిన వీరు తమ తదుపరి మాన్సూన్ ట్రెక్కు సిద్ధమవుతున్నారు.‘తొలుత నేను ట్రిప్ ప్లాన్ చేస్తాను. వాసిమ్ ని సంప్రదించి తను ఓకే అన్నాక ఫైనల్ చేస్తాను’ అంటూ చెప్పారు రాజ్. కుల,మత నేపథ్యాలతో పాటు వృత్తి వ్యాపకాలు కూడా వేర్వేరు. (వాసిమ్ వ్యాపారి కాగా రాజ్ ఐటీ ఉద్యోగి ) అయినా అవేవీ వీరి స్నేహ ప్రయాణానికి అడ్డంకి కాకపోవడం గమనార్హం. -
చెరువుకు మళ్లీ జీవం!
ఆక్రమణల తొలగింపు.. కాలువల నిర్మాణం.. సమగ్ర అభివృద్ధి కారణంగా ఉప్పల్ నల్లచెరువు మళ్లీ జీవం పోసుకుంది. చెరువుల పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా హైడ్రా చేపట్టిన చర్యలు ఫలించాయి.గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో చెరువుకు భారీగా నీరు చేరి కళకళలాడుతోంది. 10 ఎకరాలకుపైగా ఆక్రమణలు, భారీ మొత్తంలో చేరిన ప్లాస్టిక్ వ్యర్థాలను, పూడికను తొలగించిన హైడ్రా చెరువును 70 ఎకరాలకు విస్తరించింది. రూ.20 కోట్ల వ్యయంతో సమగ్రంగా అభివృద్ధి చేస్తోంది. వరద నీరు పారేల కాలువలు నిర్మించింది.ఫలితంగా ఈ ఏడాది చెరువు ఎగువన ఉన్న ప్రాంతాలు నీట మునగకుండా వర్షపు నీరు నేరుగా చెరువులోకి చేరింది. నీటి నిల్వకే పరిమితం కాకుండా, ప్రజలకు విశ్రాంతి, ఆరోగ్యం, వినోదం కల్పించేలా చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్, పటిష్టమైన మెయిన్ బండ్, పిల్లల కోసం ప్లే ఏరియా, ఓపెన్ జిమ్ వంటి సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై స్థానికులు, చెరువు సమీప కాలనీల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. - సాక్షి, హైదరాబాద్ -
ఉజ్జయిని అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం..
-
తెలంగాణ రైజింగ్-2047లో భాగస్వామ్యం అవ్వండి: మంత్రి శ్రీధర్‌బాబు
కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్ఆర్) ద్వారా ‘తెలంగాణ రైజింగ్-2047’ లక్ష్యసాధనలో భాగస్వామ్యం కావాలని కార్పొరేట్ సంస్థలకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. ప్రభుత్వం, పరిశ్రమలు, సమాజం సమష్ఠిగా కృషి చేస్తేనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ది ఇన్సిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా(ఐసీఎస్ఐ), హైదరాబాద్ ఛాప్టర్ ఆధ్వర్యంలో కొండాపూర్ లోని తెలంగాణ కాంట్రాక్టర్స్ కల్చరల్ క్లబ్లో రెండ్రోజుల పాటు నిర్వహించనున్న ‘50వ సదరన్ ఇండియా రీజినల్ కాన్ఫరెన్స్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్’ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... 'తెలంగాణ రైజింగ్-2047' అనేది కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాదని, సమాజంలోని అన్ని వర్గాల భాగస్వామ్యంతో సాకారమయ్యే అభివృద్ధి విజన్ అని వివరించారు. ఆర్థిక వృద్ధితో పాటు సామాజిక పురోగతి సమాంతరంగా సాగేలా... ఆవిష్కరణల ద్వారా ఉపాధి అవకాశాలు సృష్టించేలా... అభివృద్ధి ప్రతి నియోజకవర్గానికి, దాని ఫలాలు సమాజంలోని ప్రతి వర్గానికి చేరేలా ఈ బృహత్తర ప్రణాళికను రూపొందించామన్నారు. ఈ లక్ష్య సాధనలో ప్రభుత్వం... పరిశ్రమలు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ రంగం భాగస్వామ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తోందన్నారు.సీఎస్ఆర్ ద్వారా సమాజంలో మార్పు తెచ్చే కార్యక్రమాల అమలుకు, పరిశ్రమల స్థాపనకు సంబంధించి ప్రతి దశలోనూ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు భాగస్వామిగా, సహాయకారిగా ఉంటుందని మంత్రి శ్రీధర్ బాబు భరోసానిచ్చారు. ఏఐ, డేటా గవర్నెన్స్, సైబర్ భద్రత వంటి అంశాలు కార్పొరేట్ ప్రపంచంలో కొత్త సవాళ్లుగా మారుతున్న నేపథ్యంలో కంపెనీ సెక్రటరీలు... కేవలం కంప్లయన్స్ నిపుణులుగా కాకుండా స్ట్రాటజిక్ బోర్డ్ అడ్వైజర్లుగా మారాల్సినఅవసరం ఉందన్నారు.ప్రస్తుత పరిస్థితుల్లో కంపెనీలు కేవలం లాభార్జనే కాకుండా... సస్టైనబుల్, ఎథికల్ వ్యాపార వృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన కాన్స్టిట్యూయెన్సీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్( సీడీఎక్స్)కు నాలెడ్జ్ పార్ట్నర్గా ఉండేందుకు ముందుకొచ్చిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా ప్రతినిధులను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని కార్పోరేట్ కంపెనీలు, సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో ఐసీఎస్ఐ ప్రతినిధులు మహదేవ్ తిరునగరి, ఎం.దామోదరన్, శిల్పా, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్‌లో ట్రాఫిక్ జామ్.. చిక్కుకున్న అంబులెన్సులు
సాక్షి, హైదరాబాద్: ముంబై హైవే రుద్రారం వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అందులో పలు అంబులెన్సులు చిక్కుకోవడంతో ట్రాఫిక్ సిబ్బంది అక్కడికి చేరుకొని వాహనాలను తరలించే యత్నం చేస్తున్నారు. గంట సేపటికిపైగా వాహనాలు కదలకపోవడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. -
యాపిల్ యాప్ స్టోర్ ఇండియా హెడ్‌పై కేసు
సాక్షి, హైదరాబాద్: ట్రేడింగ్ స్కామ్‌లో రూ. 12.7 లక్షలు కోల్పోయిన ఓ రిటైర్డ్ ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు యాపిల్ యాప్ స్టోర్స్ ఇండియా హెడ్‌ను నిందితుడిగా చేర్చారు. సోమాజీగూడకు చెందిన బాధితుడు ఇన్‌స్ట్రాగామ్ ద్వారా జే–బారా మొబైల్ ట్రేడింగ్ యాప్ ప్రకటనకు ఆకర్షితుడై యాప్ ప్రతినిధిగా చెప్పుకున్న సోనల్ జగన్నాథ్ నాయక్‌ను ఫోన్లో సంప్రదించాడు. యాప్ స్టోర్‌కు సంబంధించిన ఓ లింకును వాట్సాప్ ద్వారా పంపిన నాయక్.. ఆ యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలని బాధితుడికి సూచించాడు.అలాగే జూలియస్ బేర్ దలాల్ వ్యూ పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూపులోనూ బాధితుడిని చేర్చాడు. దాని అడ్మిన్‌గా ఉన్న కునాల్ సుమయ అనే మహిళ బాధితుడికి పెట్టుబడులపై సలహాలు ఇచ్చింది. దీంతో బాధితుడు దశలవారీగా మొత్తం రూ. 12.7 లక్షలు పెట్టుబడి పెట్టగా యాప్‌లో ఆయన పెట్టుబడి విలువ రూ. 25.42 లక్షలకు పెరిగినట్లు చూపింది. కానీ పెట్టుబడి లక్ష్యాన్ని చేరుకోలేదంటూ ఆ ట్రేడింగ్ ఖాతాను నిందితులు బ్లాక్ చేశారు. ఆ తర్వాత కునాల్ సుమయ సహాయకురాలినని చెప్పుకున్న సోనాల్ జగన్నాథ్ నాయక్ అనే వ్యక్తి.. తాము డిమాండ్ చేసిన మొత్తం చెల్లించాలని డిమాండ్ చేయడంతో తాను మోసపోయినట్లు బాధితుడు గుర్తించాడు.వెంటనే సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. ఇందులో యాపిల్ ప్లే స్టోర్ పైనా ఆరోపణలు చేశారు. సదరు ట్రేడింగ్ యాప్ అందులో ఉన్నందునే తాను నమ్మానని పేర్కొన్నాడు. దీంతో యాపిల్ స్టోర్ హెడ్‌ను సైతం పోలీసులు నిందితుడిగా చేర్చారు. మరోవైపు రూ. 29.,25 లక్షలు కోల్పోయి ఖైరతాబాద్‌కు చెందిన ఓ సేల్స్‌మన్ ఇచ్చిన ఫిర్యాదుతో నమోదైన మరో కేసులోనూ జగన్నాథ్ నాయక్, కునాల్ నిందితులుగా ఉన్నారు. -
మూసీ బ్రిడ్జిపై తప్పిన విషాదం!
హైదారాబాద్: భర్తపై కోపంతో ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి మూసీలో దూకి ఆత్మహత్యకు యత్నించగా సకాలంలో స్పందించిన చైతన్యపురి పోలీసు సిబ్బంది కాపాడారు.వివరాలలోకి వెళ్లితే.....గురువారం సాయంత్రం ఉప్పల్ మూసీ బ్రిడ్జి సమీపంలో ఓ మహిళ, పిల్లలు ఆవేదనగా..అనుమానాస్పదంగా కని్పంచడంతో స్థానికులు వెంటనే డయల్ 100కు కాల్ చేశారు. దీనిపై సమాచారం అందుకున్న చైతన్యపురి మహిళా కానిస్టేబుల్ చంద్రకళ, హోంగార్డు బాలరాజు, హైడ్రా బృందం నాలుగు నిమిషాల్లో అక్కడకు చేరుకుని మహిళతో పాటు ఆమె ఇద్దరు కూతుళ్లు, కుమారుడిని కాపాడారు. భర్తపై కోపంతో మహిళ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుసుకున్నారు.అనంతరం కౌన్సలింగ్ నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా డయల్ 100కు కాల్ వచి్చన కేవలం నాలుగు నిమిషాల్లో స్పందించిన పోలీసు సిబ్బందిని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి.సుమతి అభినందించారు. శుక్రవారం ఈ మేరకు వారికి నగదు బహుమతి, రివార్డు అందజేశారు. -
HYD: జూ పార్క్ టికెట్ రేట్లు పెరిగాయ్..
హైదరాబాద్: నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో ప్రవేశ రుసుమును శనివారం నుంచి పెంచుతునట్టు జూపార్క్ క్యురేటర్ జె.వసంత శుక్రవారం తెలిపారు. ప్రవేశ రుసుము పెద్దలకు రూ.120, చిన్నారులకు రూ.60 గా నిర్ణయించామన్నారు. గతంలో పెద్దలకు రూ.100 చిన్నారులకు 50గా ఉండేది. విదేశీయులలో పెద్దలకు రూ.1000 చిన్నారులకు రూ.500గా ఉంటుంది. సఫారీ చార్జి ఏసీ బస్సులలో ఒక్కరికి రూ.165, ఈ సఫారీ బస్సులలో ఒక్కరికి రూ.110, కాలుష్య రహిత బ్యాటరీ వాహనం రైడ్ పెద్దలకు రూ.135, చిన్నారులకు 75, చిట్టి రైలు పెద్దలకు రూ.90 చిన్నారులకు రూ.45, కాలుష్య రహిత బ్యాటరీ 11 సీట్ల వాహనం రూ.3300, 14 సీట్ల వాహనం రూ.4400 రూపాయలుగా రుసుము తీసుకోనున్నారు. చేపల అక్వేరియంకు ఒకరికి రూ.25, నిశాచర జంతుశాలలో పెద్దలకు రూ.25, చిన్నారులకు రూ.15, సరిసృపాల జగత్తు పెద్దలకు రూ.35, చిన్నారులకు రూ.15, కెమెరాలకు 500 రూపాయలు, కెమెరా విత్ లెన్స్ సెటప్‌కు 700 రూపాయలు తీసుకోనున్నారు. -
ఎయిర్‌పోర్టును తలపించేలా.. కొత్త హంగుల్లో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ (ఫొటోలు)
-
విశ్రాంత ఐపీఎస్ అధికారి కూతురికి వరకట్న వేధింపులు
హైదరాబాద్: ఆ్రస్టేలియాలో ఎంఎస్ పూర్తి చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నట్లు తప్పుడు వివరాలు చెప్పి విశ్రాంత ఐపీఎస్ అధికారి కుమార్తెను వివాహం చేసుకుని, అనంతరం కట్నం కోసం వేధింపులకు పాల్పడిన భర్తతో పాటు అత్తింటి కుటుంబసభ్యులపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వివాహ మధ్యవర్తి ద్వారా కార్తీక్ అనే యువకుడితో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఎస్జే జనార్దన్ కుమార్తె ఎస్.మోక్షకు 2024, అక్టోబర్ 26న పెళ్లి చేశారు. వివాహ సమయంలో రూ.30 లక్షల కట్నం కోరుతూ పలు షరతులు విధించారు. వివాహం అనంతరం భర్తతో పాటు అత్తింటి వారు శారీరిక, మానసిక, భావోద్వేగ, లైంగిక వేధింపులకు గురిచేశారు. బంగారు నగలను తీసుకుని తనఖా పెట్టేందుకు ప్రయత్నించారు. ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేయాలని, లేదంటే జీతాన్ని వారికే అప్పగించాలని మోక్షపై ఒత్తిడి తేవడంతోపాటు పలు విధాలుగా బెదిరించారు.కార్తీక్ విద్యార్హతలు, ఉద్యోగానికి సంబంధించిన పత్రాలు పలుమార్లు తాము అడిగినా చూపలేదని, పెద్దల సమక్షంలో జరిగిన పంచాయతీలో తాను ఎంఎస్ పూర్తి చేయలేదని, తమ కుటుంబాన్ని మోసం చేశానని కార్తీక్ ఒప్పుకున్నట్లు మోక్ష తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మోసం, కట్న వేధింపులు, క్రూరత్వం, బెదిరింపులు తదితర ఆరోపణలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జనార్దన్ ఇచి్చన ఫిర్యాదు మేరకు కార్తీక్‌తో పాటు తండ్రి రాజేందర్, తల్లి జ్యోతి, చైతన్య, శరణ్యలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
తొలి రిజర్వ్ కాఫీహౌస్ హైదరాబాద్‌లో ప్రారంభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వచ్చే రెండు, మూడు సంవత్సరాల్లో ఏటా సుమారు 50–100 స్టోర్స్ ప్రారంభించనున్నట్లు టాటా స్టార్‌బక్స్ సీఈవో సుశాంత్ దాస్ వెల్లడించారు. ప్రస్తుతం సుమారు 80 పైచిలుకు నగరాల్లో 500 పైగా స్టోర్స్ ఉన్నట్లు ఆయన వివరించారు. పెరుగుతున్న ఆదాయాలు, మారుతున్న వినియోగదారుల అల వాట్లు మొదలైన అంశాలు దేశీయంగా కాఫీ వినియోగం పెరగడానికి తోడ్పడనున్నాయని సుశాంత్ పేర్కొన్నారు.మెట్రో నగరాలు, వ్యాపార వృద్ధికి అధిక అవకాశాలు ఉన్న పట్టణాల్లో విస్తరణపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు చెప్పారు. గురువారం హైదరాబాద్‌లో ప్రీమియం శ్రేణికి చెందిన ’రిజర్వ్’ కాఫీహౌస్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. దేశీయంగా ఇది ఆరో రిజర్వ్ కాఫీహౌస్ కాగా, దక్షిణాదిలో మొట్టమొదటిదని సుశాంత్ వివరించారు. ఇది ఆగస్టు 1 నుంచి కస్టమర్లకు అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం ముంబై, ఢిల్లీ, కోల్‌కతా నగరాల్లో ఇవి ఉన్నాయి.టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్ ఇటీవలి క్యూ1 నివేదిక ప్రకారం టాటా స్టార్‌బక్స్ ఆదాయం 11 శాతం వృద్ధి చెందిందని సుశాంత్ చెప్పారు. కంపెనీలో దేశీయంగా దాదాపు 4,000 మంది పైగా ఉద్యోగులు ఉన్నట్లు వివరించారు. టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్, స్టార్‌బక్స్ కాఫీ కంపెనీకి చెరి సగం వాటాలతో జాయింట్ వెంచర్ సంస్థగా టాటా స్టార్‌బక్స్ కార్యకలాపాలు సాగిస్తోంది. -
పాత నాణేలు కొనేస్తామంటూ.. మహిళా ఎన్నారైకి బిగ్ షాక్!
సాక్షి, హైదరాబాద్: పాత నాణేలను భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేస్తామంటూ ఇన్‌స్ట్రాగామ్ ద్వారా ప్రచారం చేసిన ఓ ముఠా నగరానికి చెందిన ప్రవాస భారతీయురాలి నుంచి రూ.71.8 లక్షలు కాజేసింది.అమెరికాలో నివసిస్తున్న ఓ మహిళ (73) జనవరిలో ఇన్‌స్టాలో.. పురాతన నాణేలు కొంటామనే ప్రకటన చూశారు. 1947 జార్జ్–6 కింగ్ ఎంపరర్ నాణెం ఫొటో, ఓ ఫోన్ నంబర్‌ను కేటుగాళ్లు పోస్టు చేశారు. నాణెం విలువ రూ.27 లక్షలుగా పేర్కొన్నారు. దీంతో ఎన్నారై మహిళ తన వద్ద ఉన్న మూడు 1947 జార్జ్–6 నాణేలు, రెండు 20 పైసల ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‘ నాణేల ఫొటోలు పంపారు.మోసగాళ్లు ఒక్కో 1947 నాణెం విలువ రూ.27 లక్షలుగా, ఒక్కో 20 పైసల నాణెం విలువ రూ.12 లక్షలుగా ఖరారు చేస్తున్నట్లు సమాచారం ఇచ్చారు. రకరకాల పేర్లతో పలు దఫాలుగా రూ.71,80,950 వసూలు చేసినా వేధింపులు ఆపలేదు. దీంతో ఆమె నగరానికి చెందిన వ్యక్తికి జీపీఏ ఇచ్చి సైబర్ ఠాణాలో ఫిర్యాదు చేయించడంతో కేసు నమోదైంది. -
నగరంలో 10వేలకు పైగా స్టార్టప్స్..
సాక్షి, హైదరాబాద్: దేశంలోని స్టార్టప్‌లకు అత్యంత అనుకూలమైన నగరంగా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటోంది మన హైదరాబాద్. నైపుణ్యం కలిగిన మానవ వనరులు, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, తక్కువ నిర్వహణ వ్యయం, సంస్థాగత సహకారం వంటి అంశాలు నగరాన్ని స్టార్టప్‌లకు ప్రధాన కేంద్రంగా నిలబెట్టాయని ఎండియా పార్ట్నర్స్ విడుదల చేసిన ‘హైదరాబాద్ స్టార్టప్ రెడీనెస్ ఇండెక్స్–2026’ వెల్లడించింది.ఆవిష్కరణలకు, యువ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు నెలవైన స్టార్టప్స్‌తో దేశంలోనే అగ్రగామి స్టార్టప్ హబ్‌గా సిటీ రూపుదిద్దుకుంటోంది. హైదరాబాద్ స్టార్టప్ ఇండెక్స్‌లోని ఇన్నొవేషన్ రిపోర్ట్ స్టార్టప్ రంగంలో నగర పురోగతికి అద్దం పట్టింది. మొత్తంగా 216 మంది వ్యవస్థాపకులు, పెట్టుబడిదారులు, కార్పొరేట్ సంస్థలు పర్యావరణ వ్యవస్థ (ఎకో సిస్టమ్) భాగస్వాముల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు.పన్నెండేళ్లలో 384కుపైగా ఒప్పందాలు..నగరంలో ఏర్పాటైన స్టార్టప్స్ సంఖ్య 10వేలు దాటిందని నివేదిక పేర్కొంది. గత 2014 నుంచి చూస్తే ఈ పన్నెండేళ్లలో 384కు పైగా ఒప్పందాలను ఈ రంగం కుదుర్చుకుందని తద్వారా 3 బిలియన్ డాలర్లకు పైగా వెంచర్ ఫండింగ్‌ను ఆకర్షించిందని నివేదిక తేలి్చంది. దేశంలోని మొత్తం ’గ్లోబల్ కెపబిలిటీ సెంటర్స్’ (జీసీసీ)ల్లో దాదాపు 20 శాతం అంటే 355కుపైగా కేంద్రాలకు నగరం వేదికగా నిలుస్తోందని నివేదిక వివరించింది.వృద్ధి పథంలో..- స్టార్టప్‌లు: 10,000కు పైగా- 2014 నుంచి వెంచర్ పెట్టుబడులు: 3 బిలియన్ డాలర్లకు పైగా- పెట్టుబడి ఒప్పందాలు: 384కుపైగా- గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లు (జీసీసీ): 355కుపైగా- దేశంలోని మొత్తం జీసీసీల్లో హైదరాబాద్ వాటా: దాదాపు 20%నగర బలాబలాలివే..సర్వేలో పాల్గొన్నవారిలో 43 శాతం మంది మౌలిక వసతులు, కనెక్టివిటీనే హైదరాబాద్‌కు అతిపెద్ద బలంగా పేర్కొన్నారు. అదే విధంగా 38 శాతం మంది నైపుణ్యం కలిగిన ప్రతిభ అందుబాటులో ఉండటం నగర ఘనతగా భావించగా, 36 శాతం మంది తక్కువ వ్యయంతో వ్యాపారం నిర్వహించగలగడం నగరానికి ప్రధాన పోటీ ప్రయోజనాలని అందిస్తోందని అభిప్రాయపడ్డారు. అయితే, 33 శాతం మంది పెట్టుబడుల లభ్యత, 29 శాతం మంది మార్కెట్ అవకాశాల విస్తరణపై మరింతగా దృష్టి సారించాలని సూచించారు. -
క్రికెట్ జట్టులోంచి తీసేస్తే.. కోపంతో సివిల్స్ వైపు వెళ్లా!
హైదరాబాద్: ‘‘నాకు చిన్నప్పటి నుంచి క్రీడలంటే ఇష్టం. క్రికెట్లో రాష్ట్ర జట్టుకు ఆడా. అయితే, టీమ్ నుంచి నన్ను తొలగించారు. ఆ కోపంతో సివిల్స్ వైపు వెళ్లా. మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించి ఐపీఎస్ అయ్యా. ఎంతో ఆలోచించి పోలీస్ ఉద్యోగంలో చేరా’’ అని డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు.పని ఒత్తిడిలో ఉండే పోలీసులకు క్రీడలు చాలా ముఖ్యమని పేర్కొన్నారు. గురువారం గచి్చబౌలి ఇండోర్ స్టేడియంలో సీఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన 11వ ఆలిండియా జూడో క్లస్టర్ చాంపియన్íÙప్ ముగింపు కార్యక్రమానికి ఆనంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తాను సీఐఎస్ఎఫ్లో ఉండగా టెన్నిస్‌లో మెడల్ సాధించానని అన్నారు. యువత డ్రగ్స్‌కు బందీ కాకుండా క్రీడల వైపు మళ్లించాలని పిలుపునిచ్చారు.150 కోట్ల జనాభా ఉన్న దేశంలో అంతర్జాతీయ స్థాయిలో రాణించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. జూడో, వుషు, తైక్వాండో, కరాటే, పినాక్ సిలేట్ క్రీడల్లో రాణించిన క్రీడాకారులను అభినందించారు. ఐబీ డైరెక్టర్ ఎస్.సంబంధన్ మాట్లాడుతూ పారిస్ ఒలింపిక్స్‌లో 11 మంది పోలీసు సిబ్బంది భారత్‌కు ప్రాతినిధ్యం వహించారని తెలిపారు. ఓవరాల్ చాంపియన్‌గా ఎస్ఎస్బీ, రెండో స్థానంలో సీఐఎస్ఎఫ్, మూడో స్థానంలో ఐటీబీపీ జట్లు నిలిచాయి. సీఐఎస్ఎఫ్ ఏడీజీ విజయ్ప్రకా‹Ù, ఎన్ఐఎస్ఏ హైదరాబాద్ డైరెక్టర్ హర్‌ప్రీత్ కౌర్, సైబరాబాద్ సీపీ డాక్టర్ రమేష్ పాల్గొన్నారు. -
భర్త ప్రేమకథ.. భార్య విషాదాంతం!
హైదరాబాద్, మీర్‌పేట: సాఫ్ట్వేర్ ఉద్యోగిని అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ శోభన్, మృతురాలి బంధువుల కథనం ప్రకారం. కూకట్పల్లి అల్విన్కాలనీకి చెందిన నర్సింహస్వామి, పద్మల కుమార్తె హేమ (28) సాఫ్ట్వేర్ ఉద్యోగి. అల్మాస్గూడ వినాయకహిల్స్కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి రాజ్‌కుమార్‌తో పదిహేను నెలల క్రితం ఈమెకు వివాహమైంది.ఈ క్రమంలో హేమ గురువారం సాయంత్రం ఆత్మహత్య చేసుకుంది. వివాహమైన కొద్ది రోజులకే తాను మరో యువతితో ప్రేమలో ఉన్నానని, పెద్దల ప్రోద్బలంతోనే వివాహం చేసుకున్నానని భర్త రాజ్‌కుమార్ తరచూ భార్యతో గొడవపడేవాడని మృతురాలి బంధువులు తెలిపారు.హేమ వేతనంతోనే ఈఎంఐలు, ఇంటి అవసరాలు తీరుస్తుండగా, రాజ్‌కుమార్ మాత్రం తన వేతనం గురించి చెప్పేవాడుకాదని, అదే విధంగా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఇంటికి రావాలన్నా తన అనుమతి ఉండాల్సిందేనని హేమను ఇబ్బందులకు గురిచేసేవాడని ఆరోపించారు. వివాహమైన రోజు నుంచి తరచూ గొడవ పడేవాడని, దీంతో రెండు నెలలుగా హేమ పుట్టింటి వద్దే ఉంటోందని, నెల రోజుల క్రితం పెద్దమనుషులు నచ్చజెప్పడంతో మంచిగా ఉంటానని రాజ్‌కుమార్ హామీ ఇవ్వడంతో అత్తవారింటికి పంపామని కుటుంబ సభ్యులు చెప్పారు.రాజ్‌కుమార్ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతోనే హేమ మానసికంగా కుంగిపోయిందన్నారు. ఆమె ఆత్మహత్య చేసుకునేంత బలహీనమైనది కాదని, హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని, తన బిడ్డ మృతిపై అనుమానాలు ఉన్నాయని తండ్రి నర్సింహస్వామి ఆరోపించాడు. పోస్టుమార్టం నివేదిక వస్తేనే పూర్తి వివరాలు తెలుస్తాయని, బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ తెలిపారు. -
హైదరాబాద్ : హైటెక్స్‌లో ఆకట్టుకున్న ఎగ్జిబిషన్ (ఫొటోలు)
-
తెలంగాణలో భారీ వర్షాల బీభత్సం.. IMD హెచ్చరిక!
-
హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణపై కొనసాగుతున్న అల్పపీడన ప్రభావంతో రానున్న కొన్ని గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో డిప్రెషన్ ప్రభావం తీవ్రంగా ఉండనుందని అంచనా వేస్తోంది. గురువారం రాత్రి వరకు ప్రభావం గరిష్ట స్థాయిలో ఉంటుందని, పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని చెబుతోంది.అదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, కామారెడ్డి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో రానున్న 12 నుంచి 18 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు, లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వలు ఏర్పడే పరిస్థితులు ఉండొచ్చని సూచించారు.ఇక సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, సిరిసిల్ల, సిద్ధిపేట, కరీంనగర్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నిరంతరాయంగా కొనసాగుతాయని అంచనా వేశారు. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.హైదరాబాద్‌లో కుండపోత?..గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గురువారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఒక్కసారిగా భారీ వర్షం పడే అవకాశం ఉండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వర్షం సమయంలో ప్రయాణికులు జాగ్రత్తలు పాటించాలని, అవసరమైతే ప్రయాణాలను కొంత సమయం వాయిదా వేసుకోవాలని సూచించారు.ఐటీ కంపెనీలకు ట్రాఫిక్ అడ్వైజరీవర్షాల కారణంగా రోడ్లపై రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో ఐటీ కారిడార్ పరిధిలోని సంస్థలకు ట్రాఫిక్ పోలీసులు ముందస్తు సూచనలు జారీ చేస్తున్నారు. ఉద్యోగుల రాకపోకల సమయంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా వీలైనంత వరకు వర్క్ ఫ్రమ్ హోమ్, ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ వంటి ఏర్పాట్లు చేసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆఫీసుల్లో ఉద్యోగులకు ఉన్నవాళ్లకు ఎర్లీ లాగౌట్ ఇవ్వాలని కంపెనీలకు తెలిపింది.హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ ప్రాంతాల్లో వర్షం ప్రభావంతో ట్రాఫిక్ అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వాహనదారులు ట్రాఫిక్ పోలీసుల సూచనలు పాటించాలని కోరారు.ప్రజలకు అధికారుల సూచనలుభారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. చెరువులు, వాగులు, లోతట్టు ప్రాంతాల వద్దకు వెళ్లొద్దని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని కోరుతున్నారు. మ్యాన్‌హోల్స్, విద్యుత్ స్తంభాలు, తెగిపోయిన వైర్లు, నీరు నిలిచిన రోడ్ల వద్ద జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. -
జలమండలి సేవల్లో మరో డిజిటల్ అడుగు..
సాక్షి, హైదరాబాద్: మహా నగరంలో నీటి సరఫరా వ్యవస్థలో పారదర్శకమైన బిల్లింగ్ విధానం అమలుకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. జలమండలి వాణిజ్య, బల్క్ కనెక్షన్లకు అత్యాధునిక ’ఆటోమేటిక్ రీడింగ్’ మీటర్లను అమర్చే రూ.31.70 కోట్ల ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు బుధవారం ప్రాజెక్టుకు ముందస్తు అనుమతులు మంజూరు చేస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ పరిపాలనా ఉత్తర్వులు జారీ చేశారు. 2,984 కనెక్షన్లకు ప్రాధాన్యం.. తొలిదశలో మల్కాజిగిరి, హైదరాబాద్, సైబరాబాద్ ప్రాంతాల్లోని సుమారు 2,984 కనెక్షన్లకు ఐదేళ్ల నిర్వహణ కాల పరిమితితో ఆటోమేటిక్ మీటర్ రీడింగ్’ మీటర్లను అమలు చేయనున్నారు. తొలి విడతలో వాణిజ్య, పారిశ్రామిక కనెక్షన్ల పరిధిలో కొత్త మీటర్లు అమర్చాలని జలమండలి నిర్ణయించింది.అత్యాధునిక అ్రల్టాసోనిక్, జీఎస్ఎం సాంకేతికతకొత్తగా ఏర్పాటు చేసే ఏఎంఆర్ మీటర్లు అ్రల్టాసోనిక్ (ట్రాన్సిట్ టైమ్) సాంకేతికతతో పాటు జీఎస్ఎం కమ్యూనికేషన్ మాడ్యూల్స్‌తో పని చేస్తాయి. దీని ద్వారా సిబ్బంది నేరుగా వెళ్లి రీడింగ్ తీయాల్సిన అవసరం లేకుండా, రీడింగ్ వివరాలు సెంట్రల్ సర్వర్‌కు ఎప్పటికప్పుడు చేరుతాయి. -
ఉదయ్ కృష్ణారెడ్డి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు..
సాక్షి, హైదరాబాద్: ట్రైనీ మహిళా ఐపీఎస్ అధికారిపై లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో నిందితుడు ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను ప్రస్తావించినట్లు సమాచారం.పోలీసుల రిమాండ్ రిపోర్టు ప్రకారం.. ఉదయ్ కృష్ణారెడ్డి, బాధితురాలైన ట్రైనీ ఐపీఎస్ అధికారికి సోషల్ మీడియా వేదిక ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడినట్లు పేర్కొన్నారు. ఉదయ్ జీవిత చరిత్రను తెలుసుకుని పరిచయం చేసుకున్నట్టు తెలిసింది. అనంతరం జాతీయ పోలీసు అకాడమీ (ఎన్పీఏ)లో శిక్షణ సమయంలో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగినట్లు పోలీసులు వెల్లడించారు. అలాగే, కొంతకాలం పాటు ఇద్దరి మధ్య సంబంధాలు కొనసాగినట్లు పోలీసులు పేర్కొన్నారు.అయితే, మహిళా ఐపీఎస్ అధికారికి మే నెలలో వివాహం జరిగిన తర్వాత కూడా ఉదయ్ నుంచి వేధింపులు కొనసాగినట్లు ఆమె ఫిర్యాదులో ఆరోపించినట్లు సమాచారం. బాధితురాలు ఇతరులతో మాట్లాడటం, సన్నిహితంగా ఉండటంపై ఉదయ్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ వేధించేవాడని ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. ఎన్పీఏలో శిక్షణ పొందుతున్న సమయంలో మరికొందరు మహిళా ఐపీఎస్ అధికారులను కూడా ఉదయ్ ఇబ్బందులకు గురిచేసినట్లు ఆరోపణలు ఉన్నాయని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నట్లు సమాచారం. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి పూర్తి వాస్తవాలు దర్యాప్తు అనంతరం స్పష్టమయ్యే అవకాశం ఉంది.డిజిటల్ ఆధారాలపై పోలీసుల దృష్టిఈ కేసులో పోలీసులు దర్యాప్తును విస్తృతం చేశారు. హైదరాబాద్‌తో పాటు ఉదయ్ కృష్ణారెడ్డి స్వస్థలంలోనూ విచారణ కొనసాగిస్తున్నారు. సోషల్ మీడియా వివరాలు, డిజిటల్ ఆధారాలు, ఇతర సంబంధిత అంశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉదయ్ కృష్ణారెడ్డి న్యాయస్థానం ఆదేశాల మేరకు చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. దర్యాప్తు పూర్తయ్యే కొద్దీ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. -
ట్రాఫిక్ ఫ్రీ టార్గెట్..
సాక్షి, హైదరాబాద్: నగరంలో అత్యంత రద్దీగా ఉండే బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3 కారిడార్‌లో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్ఎఫ్సీఎల్ జంక్షన్, టీవీ9 జంక్షన్ల వద్ద రూ.368 కోట్ల అంచనా వ్యయంతో రెండు ఫ్లైఓవర్లు, ఒక అండర్‌పాస్ నిర్మాణానికి పరిపాలనా ఆమోదం తెలిపింది. గతంలో ఈ జంక్షన్ల వద్ద రూ.210 కోట్ల పనులకు ఇచ్చిన అనుమతులు సవరించి, ట్రాఫిక్ అవసరాలకనుగుణంగా కొత్త ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్లు పేర్కొంది. ఈ మేరకు స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్ జీఓ జారీ చేశారు.హెచ్ఎండీఏ నిర్వహించిన సమగ్ర ట్రాఫిక్ అధ్యయనం మేరకు, నగరంలో గత దశాబ్ద కాలంలో వాణిజ్య కార్యకలాపాలు విస్తరించడంతో బంజారాహిల్స్–జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతోందని జీహెచ్ఎంసీ ప్రభుత్వానికి నివేదించింది. ఈ నేపథ్యంలో ఎన్ఎఫ్సీఎల్ జంక్షన్ నుంచి ఆల్వీన్ క్రాస్ రోడ్స్ వరకు అంతరాయం లేని ట్రాఫిక్ కారిడార్ అభివృద్ధి కోసం,సాంకేతిక నిపుణులతో సమీక్ష నిర్వహించి సవరించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపింది.మారిన ప్రణాళిక..సవరించిన ప్రణాళిక ప్రకారం.. ఎన్ఎఫ్సీఎల్ జంక్షన్ వద్ద బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3 నుంచి జీవీకే మాల్ వైపు రెండు లేన్ల ఫ్లైఓవర్‌ను రూ.147 కోట్లతో నిర్మించనున్నారు. టీవీ9 జంక్షన్ వద్ద ముగ్ధ జంక్షన్ నుంచి ఎన్ఎఫ్సీఎల్ జంక్షన్ వైపు మూడు లేన్ల ఫ్లైఓవర్‌ను రూ.62 కోట్లతో, ఎన్ఎఫ్సీఎల్ జంక్షన్ నుంచి శ్రీనగర్ కాలనీ వైపు రెండు లేన్ల అండర్‌పాస్‌ను రూ.159 కోట్లతో నిర్మించనున్నారు. ఈ మూడు పనుల వ్యయం రూ.368 కోట్లకు చేరింది.గతంలో మంజూరైన ప్లాన్‌లో ఎన్ఎఫ్సీఎల్ జంక్షన్ వద్ద ఒక ఫ్లైఓవర్, టీవీ9 జంక్షన్ వద్ద ఒక అండర్‌పాస్ మాత్రమే ఉండగా, తాజా ట్రాఫిక్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని అదనంగా ఫ్లైఓవర్‌ను చేర్చడం, అండర్‌పాస్ దిశను మార్చడం వంటి మార్పులు చేశారు. దీంతో ప్రాజెక్టు వ్యయం రూ.158 కోట్ల మేర పెరిగింది. ఈ అదనపు వ్యయాన్ని భరించేందుకు హెచ్–సిటీ ప్యాకేజీ–2లో ప్రతిపాదించిన విప్రో జంక్షన్ మల్టీలెవల్ గ్రేడ్ సెపరేటర్ పనులను ప్రస్తుతానికి నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ పనులకు కేటాయించిన రూ.158 కోట్లను బంజారాహిల్స్ కారిడార్ పనులకు మళ్లిస్తూ అనుమతి ఇచ్చింది. దీంతో హెచ్–సిటీకి మంజూరైన రూ.5,942 కోట్ల మొత్తంనిధుల్లో పెంపుదల లేకుండా చేసింది. స్టీల్ ఫ్లైఓవర్లుపనులను సంప్రదాయ కాంక్రీట్ నిర్మాణాల బదులుగా స్ట్రక్చరల్ స్టీల్‌తో నిర్మించేందుకు ప్రభుత్వం ప్రత్యేక అనుమతి ఇచ్చింది. దీనివల్ల నిర్మాణ సమయం తగ్గడంతో పాటు ట్రాఫిక్‌కు అంతరాయం కూడా పరిమితమయ్యే అవకాశం ఉంది.ఇక బంజారాహిల్స్ కారిడార్‌గా...ఇప్పటివరకు ఈ పనులను ’జూబ్లీహిల్స్’ పేరుతో పేర్కొనగా, వాస్తవ ప్రాంతానికి అనుగుణంగా ఇకపై ’బంజారాహిల్స్’గా పేర్కొనాల్సిందిగా ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్ర బడ్జెట్లో హెచ్–సిటీ కార్యక్రమం కింద జీహెచ్ఎంసీకి కేటాయించే నిధుల నుంచే ఈ వ్యయం భరించనున్నారు. -
ఓడలో బంగారం వస్తుందన్నాడు.. చివరికి
సాక్షి, హైదరాబాద్: విదేశీ బంగారం వ్యాపారాలతో తనకు ఉన్న పరిచయాలను వినియోగించుకుని, తక్కువ ధరకు బంగారాన్ని ఓడల్లో తెప్పిస్తానంటూ చెప్పి నగరానికి చెందిన వ్యక్తి నుంచి రూ.2 కోట్లు కాజేసిన నిందితుడిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. ఇదే పంథాలో మరికొందరిని మోసం చేసినట్లు, గతంలో ఆరు కేసులు ఉన్నట్లు తేలడంతో వ్యవస్థీకృత నేరగాడిగా పరిగణిస్తున్నట్లు డీసీపీ ఎస్.చైతన్యకుమార్ బు«ధవారం ప్రకటించారు.సనత్‌నగర్‌కు చెందిన రాకేష్ బలరాం గౌడ్‌కు లక్ష్మీకాంత్ రెడ్డితో పరిచయం ఉంది. తనకు విదేశీ బంగారం వ్యాపారులతో సంబంధాలు ఉన్నాయని, వారి నుంచి తక్కువ ధరకు పసిడి ఖరీదు చేస్తుంటానని చెప్పాడు. 2024 జూన్ 14న రాకేష్ ఇంటికి వెళ్లిన లక్ష్మీకాంత్ దుబాయ్ నుంచి శ్రీలంక మీదుగా ముంబైకి ఓడలో బంగారం దిగుమతి చేస్తున్నానని చెప్పాడు. మొబైల్లో బంగారు బిస్కెట్ల వీడియోలు చూపించి, అతి తక్కువ ధరకు 24 క్యారెట్ల బంగారం మూడు కిలోలు ఇప్పిస్తానని హామీ ఇచ్చాడు. 20 రోజుల్లో బంగారం అందజేస్తానని నమ్మించి మొత్తం రూ.2 కోట్లను తీసుకున్నాడు. ఇందులో రూ.1.86 కోట్లు అప్పుగా తెచ్చిన రాకేష్ ఇతడికి చెల్లించాడు. నెల రోజుల తర్వాత సంప్రదించిన లక్ష్మీకాంత్ శ్రీలంకలో 10 కిలోల బంగారంతో పోలీసులకు చిక్కానని చెప్పి పసిడి ఇవ్వలేనన్నాడు. అనంతరం మరో 500 గ్రాముల బంగారం రూ.25 లక్షలకు ఇప్పిస్తానని చెప్పి, 2024 డిసెంబర్ 15న రూ.5 లక్షలు, డిసెంబర్ 17న రూ.16 లక్షలు తీసుకున్నాడు. అనుమానం రావడంతో నగదు ఇస్తున్న సమయంలో బాధితుడు వీడియో రికార్డింగ్ చేశాడు.ఆ తర్వాత లక్ష్మీకాంత్ రెడ్డి తన ఫోన్ కాల్స్, సందేశాలకు స్పందించకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న ఏసీపీ మల్లికార్జున చౌదరి ఎస్సై గోపికిరణ్ రెడ్డి దర్యాప్తు చేశారు. పరారీలో ఉన్న నిందితుడి ఆచూకీని అతడి స్వగ్రామం మహబూబ్‌నగర్ జిల్లా అయ్యవారిపల్లిలో గుర్తించారు. అక్కడే అతడిని పట్టుకున్న సీసీఎస్ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. నిందితుడిపై గతంలో మహంకాళి, రాయదుర్గం, కేపీహెచ్‌బీ, మాదాపూర్‌లతో పాటు కోయిల్‌కొండ, ఏపీలోని పెందుర్తి ఠాణాల్లో కేసులు ఉన్నట్లు గుర్తించారు. -
చిన్నారులకు, వృద్ధులకు సమస్యగా మారిన ఈ-కేవైసీ
సాక్షి, హైదరాబాద్: రేషన్ ఈ–కేవైసీ నమోదులో చిన్నారులు, వయోవృద్ధులకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. వయసు పైబడటంతో వృద్ధుల వేలిముద్రలు అరిగిపోవడం, పిల్లల్లో ముద్రలు సరిగా రాకపోవడంతో ఈ–పాస్ యంత్రాలు స్పందించడం లేదు. దీనికి తోడు ఆధార్ అప్డేషన్ లేకపోవడం, రేషన్ దుకాణాల్లో ఐరిస్ (కంటిపాప) స్కానర్లు అందుబాటులో లేకపోవడంతో బయోమెట్రిక్ నమోదు కాక లబ్ధిదారులు కేంద్రాల చుట్టూ అలుపెరగక తిరగాల్సి వస్తోంది.వాస్తవంగా గత రెండేళ్లుగా సాగుతున్న రేషన్ కార్డుల ఈ–కేవైసీ ప్రక్రియ ముగింపునకు వచ్చింది. ఈ నెల 31వ తేదీతో గడువు ముగియనుండటంతో లబ్ధిదారుల్లో ఆందోళన తీవ్రమవుతోంది. తుది గడువు సమీపిస్తుండటంతో ఇంకా ఈ–కేవైసీ పూర్తి చేసుకోని వారు రేషన్ దుకాణాల వద్ద గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది.ఇప్పటికీ 20 శాతం పెండింగ్..మహా నగర పరిధిలోని పాత, కొత్త రేషన్ కార్డుదారులు, యూనిట్ల (సభ్యుల) ఈ–కేవైసీ ప్రక్రియ ఇంకా కొలిక్కి రాలేదు. బయోమెట్రిక్ సాంకేతిక సమస్యల కారణంగా అధికారుల అంచనా ప్రకారం ఇప్పటికీ సుమారు 20 శాతం మంది లబ్ధిదారుల ఈ–కేవైసీ ప్రక్రియ పెండింగ్‌లోనే ఉండిపోయింది.గడువులోగా ఈ–కేవైసీ పూర్తి కాకపోతే వచ్చే నెల నుంచి ఉచిత రేషన్ బియ్యం అందుతాయో లేదో అనే గందరగోళం పేద కుటుంబాల్లో నెలకొంది. ఈ–కేవైసీ లేని సభ్యుల పేర్లను రేషన్ కోటా నుంచి తొలగిస్తారనే ప్రచారంతో లబ్ధిదారులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఈ–కేవైసీ సమయాన్ని మరికొంత కాలం పొడిగించాలని, వృద్ధులు, చిన్నారులకు ప్రత్యేక సడలింపులు ఇచ్చి రేషన్ నిలిచిపోకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్
-
యోనిలో కణితి..
హైదరాబాద్: యోనిలో రక్తనాళాల కణితి కారణంగా తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న మహిళ (41)కు మెడికవర్ ఆస్పత్రి వైద్యులు అత్యాధునిక ఇమేజ్ గైడెడ్ ఎంబోలైజేషన్ చికిత్సతో ప్రాణాలను కాపాడారు. ఈ మేరకు బుధవారం విలేకరుల సమావేశంలో డాక్టర్ టి.రఘుతేజస్వీ మాట్లాడుతూ... వజైనల్ హీమాంజియోమో చాలా అరుదుగా కనిపించే సమస్య అని తెలిపారు. ఒకసారి తీవ్ర రక్తస్రావం ప్రారంభమైతే అది ప్రాణాపాయ స్థితికి దారితీస్తుందన్నారు. ముందుగా రోగి ఆరోగ్యాన్ని కుదుట పరిచి.. అత్యాధునిక ఇమేజింగ్ సాంకేతికతతో సూక్ష్మ క్యాథెటర్ ద్వారా కణితికి రక్తాన్ని సరఫరా చేస్తున్న నాళాలను మూసివేశామన్నారు. దీంతో రక్తస్రావం వెంటనే అదుపులోకి వచ్చిందన్నారు. పెద్దగా చికిత్స అవసరం లేకుండా రోగి కోలుకుని ఆరోగ్యంగా ఉందన్నారు. కార్యక్రమంలో డాక్టర్లు జె.శాలిని నారాయణ్, సాయితేజ నమాల తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్ : రవీంద్రభారతిలో ఇది.. అందెల రవళి (ఫొటోలు)
-
తెలంగాణలో కుండపోత.. కాసేపట్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గత రెండు రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.అల్పపీడనానికి తోడు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో రాష్ట్రంలో విస్తృతంగా వర్షాలు కురిసే పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గత రెండు రోజులుగా అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. తాజా వాతావరణ పరిస్థితుల ప్రకారం ఆదిలాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో నేడు, రేపు విస్తృతంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.PEAK DEPRESSION RAINS HAPPENING IN NORTH TELANGANA - 6.25 AM ⚠️🌧️WIDESPREAD HEAVY - VERY HEAVY RAINS to continue in Adilabad, Asifabad, Nirmal, Nizamabad, Mancherial, Peddapalli, Jagitial, Bhupalapally for next several hours ⚠️⚠️🌧️WIDESPREAD MODERATE - HEAVY RAINS ahead in…— Telangana Weatherman (@balaji25_t) July 30, 2026అలాగే.. కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ములుగు జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరోవైపు, హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని మిగిలిన జిల్లాల్లో ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉండటంతో పాటు రాబోయే మూడు గంటల పాటు చిరుజల్లులు లేదా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు. వాగులు, వంకలు, చెరువులు, నదుల పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, నీటి ప్రవాహాలను దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ అధికారుల సూచనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు.CORE DEPRESSION HEAVY DOWNPOURS STARTING - 12 AM ⚠️🌧️ Time frame - Next 5hrs - The MASSIVE CORE DEPRESSION BANDS are entering Telangana into Asifabad, Adilabad will further cover Mancherial, Peddapalli, Bhupalapally, Mulugu, Jagitial, Nirmal, NON STOP HEAVY RAINS expected next… https://t.co/kIeP4Wsben— Telangana Weatherman (@balaji25_t) July 29, 2026 -
హైదరాబాద్ : అంతర్జాతీయ పులుల దినోత్సవం...అదిగో పులి (ఫొటోలు)
-
తెలంగాణలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన
హైదరాబాద్: తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు భారీ వర్ష సూచన చేశారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. హైదరాబాద్, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.మరోవైపు, ములుగు జిల్లా, వాజేడు మండలంలో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా వాజేడు మండలంలోని పలు కుటుంబాల ఇళ్లలోకి వరదనీరు చేరింది. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.సమాచారం అందుకున్న అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఇళ్లలో నిల్వ ఉన్న నీరు బయటకు వెళ్లేలా ప్రత్యామ్నాయ మార్గంగా కాలువలు తవ్వించి నీటి పారుదలకు చర్యలు చేపట్టారు. ఇంటి పరిసరాల్లో నిలిచిపోయిన నీటిని బయటకు పంపించేందుకు అధికారులు, స్థానిక సిబ్బంది కలిసి ప్రయత్నాలు నిర్వహించారు. భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులు సూచించారు.పెద్దపల్లి జిల్లా రామగుండం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు చేరుతోంది..శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ సామర్థ్యం 20 టీఎంసీ లకు గాను 11.1105 టీఎంసీలునీటిమట్టం 148 మీటర్లకు గాను 144.22 మీటర్లుప్రాజెక్టు ఇన్ ఫ్లో: 75,328 క్యూసెక్కులుఅవుట్ ఫ్లో: 12,875 క్యూసెక్కులు -
చంచల్‌గూడ జైలుకు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి
సాక్షి,హైదరాబాద్: తోటి మహిళా ట్రైనీ అధికారిణిపై లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో అరెస్టయిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. ఉప్పర్‌పల్లి కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి ఆగస్టు 11 వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కోర్టు ఆదేశాల అనంతరం పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిని భారీ భద్రత నడుమ చంచల్‌గూడ జైలుకు తరలిస్తున్నారు.తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణిని వేధించిన కేసులో అరెస్టయిన సస్పెండెడ్ ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్, కేసు దర్యాప్తుకు సంబంధించిన కీలక వివరాలను రాజేంద్రనగర్ డీసీపీ వెల్లడించారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించినట్లు తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక బృందాలతో ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.పోలీసుల దర్యాప్తులో తేలిన వివరాల ప్రకారం.. ఉదయ్ కృష్ణారెడ్డికి, బాధితురాలికి మొదట ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అయితే, ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఉదయ్ కృష్ణారెడ్డి క్రిమినల్ వేధింపులకు దిగాడు. బాధితురాలికి సంబంధించిన ప్రైవేట్ చాట్స్, ఫొటోలను సోషల్ మీడియాలో బయటపెడతానంటూ తీవ్రంగా బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించాడు. నకిలీ అకౌంట్లతో కుటుంబసభ్యులు, సహచరులకు వేధింపులుబాధితురాలిని మానసికంగా వేధించడమే కాకుండా, ఉదయ్ కృష్ణారెడ్డి నకిలీ (ఫేక్) సోషల్ మీడియా అకౌంట్లను సృష్టించినట్లు దర్యాప్తులో తేలింది.ఈ నకిలీ ఖాతాల ద్వారా బాధితురాలి కుటుంబసభ్యులకు, ఆమెతో పాటు శిక్షణ పొందుతున్న సహచర అధికారులకు (బ్యాచ్‌మేట్స్) మెసేజ్‌లు పంపుతూ, తప్పుడు ప్రచారం చేస్తూ వేధించాడని డీసీపీ తెలిపారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదైన తర్వాత దర్యాప్తు నుంచి తప్పించుకునేందుకు ఉదయ్ కృష్ణారెడ్డి తీవ్రంగా ప్రయత్నించాడు. పోలీసులు తన కోసం గాలిస్తున్నారని తెలిసి పరారయ్యాడు. అయితే, నిందితుడి కదలికలపై నిఘా ఉంచిన పోలీసులు.. చివరకు ఆయనను ఆరంఘర్ చౌరస్తా వద్ద పక్కా ప్లాన్‌తో అదుపులోకి తీసుకున్నారు.ఉదయ్ కృష్ణారెడ్డిపై నమోదైన ఆత్మహత్య బెదిరింపులు, తీవ్ర మానసిక వేధింపుల కేసును షీటీమ్స్ డీసీపీ డాక్టర్ లావణ్య నాయక్ జాదవ్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. సాంకేతిక ఆధారాలు, డిజిటల్ సాక్ష్యాలను సేకరించేందుకు హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తును వేగవంతం చేశారు. కోర్టు ఆదేశాల అనంతరం ఉదయ్ కృష్ణారెడ్డిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. -
హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. ట్రాఫిక్ స్తంభించింది!
-
అత్యంత వైభవంగా ఇండియా కౌచర్ వీక్ ..! ఫ్యాషన్ చరిత్రలోనే తొలిసారిగా..(ఫొటోలు)
-
హైదరాబాద్ లో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం
-
ఇంకా దొరకని బాలయ్య ఆచూకీ!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని మియాపూర్ వైశాలి నగర్లో విషాద ఘటన చోటుచేసుకుంది. మ్యాన్‌హోల్‌లో ప్రమాదవశాత్తు పడి బాలయ్య అనే వ్యక్తి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న వెంటనే హైడ్రా (HYDRAA), ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే గంటల తరబడి గాలించినా.. ఇంకా బాలయ్య ఆచూకీ చిక్కలేదని తెలుస్తోంది.స్థానికుల సమాచారం ప్రకారం.. వైశాలి నగర్ ప్రాంతంలో బాలయ్య మంగళవారం అండర్‌పాస్ వద్ద తెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌లో ప్రమాదవశాత్తు పడిపోయాడు. కూతురి ఇంటికి వెళ్లే క్రమంలో ఈ ఘటన జరిగింది. గమనించిన కొందరు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. దీంతో సహాయక బృందాలు అక్కడికి చేరుకున్నాయి. హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్ రంగప్రవేశంబాలయ్య ఆచూకీ కోసం హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టారు. మ్యాన్‌హోల్ పరిసరాల్లో, డ్రైనేజీ మార్గాల్లో గాలింపు కొనసాగిస్తున్నారు. లోపల పరిస్థితులను పరిశీలిస్తూ సురక్షితంగా బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.స్థానికుల్లో ఆందోళనఈ ఘటనతో వైశాలి నగర్లో ఆందోళన నెలకొంది. వర్షాకాలంలో నాల పనులు చేపట్టడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు బాలయ్య కుటుంబ సభ్యులు ఆ పెద్దాయన కోసం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సహాయక బృందాలు అతడి కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. బాలయ్య ఆచూకీ లభించే వరకు గాలింపు కొనసాగిస్తామని అధికారులు తెలిపారు. -
హైదరాబాద్ యూసుఫ్‌గూడలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ మీట్ (ఫొటోలు)
-
హైదరాబాద్‌లో భారీ ఉరుములు..దంచికొట్టిన వర్షం రోడ్లన్నీ జలమయం (ఫొటోలు)
-
శభాష్.. బాలికను కాపాడిన టీజీఎస్ ఆర్టీసీ ‘అన్నలు’!
హైదరాబాద్: ఈ రోజుల్లో పక్కవారు ఏమైపోతే మనకెందుకులే అనే స్వభావం చాలామందిలో ఉంటుంది. కానీ మిధాని డిపోకు చెందిన ఆర్టీసీ కండక్టర్ శేఖర్, డ్రైవర్ జె.ఎస్.కుమార్‌లు అలా అనుకోలేదు. బస్సు ఎక్కిన విద్యార్థిని ఆందోళనలో ఉన్న విషయాన్ని గ్రహించి ఆమెపై నిఘా ఉంచారు. వారు అనుకున్నదే జరిగింది. ఆ మైనర్ బాలిక వేగంగా వెళుతున్న బస్సులోంచి దిగిపోవడానికి యత్నించింది. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన వారు ప్రయాణికుల సాయంతో సదరు బాలికను రక్షించారు. అసలేం జరిగిందంటే.. పటాన్ చెరువులో తెలంగాణ మైనారిటీ గురుకులం విద్యార్థిని అనూహ్యంగా పటాన్ చెరువు వద్ద ఆర్టీసీ బస్సు (నెం.218) ఎక్కింది. కానీ ఆమె ఏదో ఆందోళనలో ఉంది.. అదే సమయంలో ఆమె చేతిలో పది రూపాయలు తప్ప కాళ్లకు చెప్పులు కూడా లేవు. కండక్టర్ టికెట్ అడిగినప్పుడు దీనంగా అదో రీతిలో చూసింది. ఆ విద్యార్థిని పట్ల కండక్టర్ శేఖర్‌కు అనుమానం వచ్చింది. అదే విషయాన్ని డ్రైవర్ కుమార్‌తో చెప్పాడు. వారిద్దరూ ఆ విద్యార్థిని తీరు పట్ల నిఘా ఉంచారు. ఈలోపు ఆమె పక్కనే ఉన్న ప్యాసింజర్ వద్ద ఫోన్ తీసుకుని ఎవరితోనూ మాట్లాడటాన్ని గమనించారు.ఆ నంబర్ ఆధారంగా ఆఅమ్మాయి మైనారిటీ గురుకులం విద్యార్థిగా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని పక్కనే ఉన్న ప్రయాణికులకు చెప్పి వారిని కూడా అప్రమత్తం చేశాడు కండక్టర్. ఆ విద్యార్థిని మానసిక ఆందోళనలో ఉందని, కాస్త గమనించమని చెప్పాడు. దాంతో ప్రయాణికుల కూడా అప్రమత్తంగానే ఉన్నారు. కండక్టర్ ఊహించింది నిజమైంది. ఆ అమ్మాయి కదులుతున్న బస్సు నుంచి దిగిపోవడానికి ప్రయత్నించింది. దాంతో ఆ అమ్మాయిని విషయం తెలిసిన తోటి ప్రయాణికులు ఆమెను వెనక్కి లాగారు. ఆమెకు నచ్చచెప్పి చివరకు సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో అప్పగించడం జరిగింది. ఈఉదంతంలో తెలంగాణ ఆర్టీసీ అన్నలు చూపిన చొరవ అభినందనీయమని ప్రశంసలు వస్తున్నాయి. ఈ విషయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా తన్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by PonnamPrabhakar (@ponnamprabhakar) -
Hyd: భారీ వర్షం.. ట్రాఫిక్ పోలీసుల కీలక సూచనలు
హైదరాబాద్: భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో నగర ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు చేశారు. హైదరాబాద్ నగరంలోని అన్ని జోన్లలో భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. దీంతో పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయిందని, ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతోందని చెప్పారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్లకుండా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ‘‘మీ భద్రతే మా ప్రాధాన్యం. సాధ్యమైనంత వరకు ఇళ్లలోనే ఉండండి. సురక్షితంగా ఉండండి’’ అని అన్నారు.ప్రయాణం తప్పనిసరి అయితే..నెమ్మదిగా, జాగ్రత్తగా వాహనం నడపండి.ట్రాఫిక్ పోలీసుల సూచనలు పాటించండి.నీరు నిలిచిన రహదారుల గుండా వాహనాలు నడిపే ప్రయత్నం చేయవద్దు.ప్రయాణానికి అదనపు సమయం కేటాయించి, ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకోండి.సోషల్ మీడియా వేదికల్లో అధికారిక ట్రాఫిక్ సూచనలను ఎప్పటికప్పుడు తెలుసుకోండి.హైదరాబాద్ సీపీ సజ్జనార్ కూడా ఎక్స్‌లో పలు సూచనలు చేశారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు.హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తున్నందున నగర ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాం. వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోయి, ట్రాఫిక్ నెమ్మదిగా సాగుతోంది. ఈ నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు ఇళ్లలోనే… pic.twitter.com/DOU8sj4fq8— V.C. Sajjanar, IPS (@SajjanarVC_IPS) July 28, 2026 -
హైదరాబాద్‌లో దంచి కొడుతున్న వర్షం
సాక్షి,హైదరాబాద్: నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. మంగళవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం దంచికొడుతోంది. నగరంలోని ప్రధాన ఐటీ హబ్‌లైన రాయదుర్గం, గచ్చిబౌలి, మణికొండ పరిసర ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. దీనివల్ల రోడ్లపైకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మరోవైపు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట వంటి ప్రముఖ వ్యాపార, నివాస ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షం పడుతోంది. అలాగే నాంపల్లి, మెహిదీపట్నం, టోలిచౌకి, గోల్కొండ సహా నగరంలోని అన్ని ప్రాంతాలు వాన జల్లులతో తడిసిపోతున్నాయి.అకస్మాత్తుగా కురిసిన ఈ భారీ వర్షం కారణంగా పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలు నెమ్మదించాయి. సాయంత్రం వేళ ఆఫీసుల నుంచి ఇళ్లకు తిరుగు ప్రయాణమయ్యే ఐటీ ఉద్యోగులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, ప్రయాణాల్లో జాగ్రత్తలు వహించాలని అధికారులు సూచిస్తున్నారు. -
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్
సాక్షి,మిర్యాలగూడ: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్ అయ్యారు. మిర్యాలగూడలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అత్తాపూర్‌లో నమోదైన కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. తోటి ట్రైనీ ఐపీఎస్ అధికారిని శారీరకంగా మానసికంగా వేధించాడని అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మంగళవారం మిర్యాలగూడలో అదుపులోకి తీసు హైదరాబాద్‌కు తీసుకువస్తున్నారు. అనంతరం, అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులపై పోలీసులు విచారణ చేపట్టనున్నారు. -
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ మహిళ మృతి
వాషింగ్టన్: అమెరికా న్యూజెర్సీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రంగారెడ్డి జిల్లాకు చెందిన శ్రీపాతి దీప (42) మృతి చెందారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లి గ్రామానికి చెందిన ఈమె న్యూజెర్సీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. న్యూజెర్సీలో కారులో ప్రయాణిస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో సంభవించిన ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.మృతురాలు ఆమనగల్లు మాజీ జెడ్పీటీసీ సభ్యుడు శ్రీపాతి శ్రీనివాసరెడ్డి సోదరుడైన శ్రీపాతి పుల్లారెడ్డి చిన్న కోడలు. స్థానిక వివరాల ప్రకారం.. దీప ఐటీ ఉద్యోగిని అమెరికాలోని న్యూజెర్సీలో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో తన భర్తతో కారులో వెళ్తూ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగిన సమయంలో, మరొక కారు వేగంగా వచ్చి బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘోర ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం అందింది. శ్రీపాతి దీప మరణవార్త విన్న హైదరాబాద్‌లోని ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. దీప మరణంతో ఆకుతోటపల్లి గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు ఆమె మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. -
ఇందిరమ్మ ఇళ్లపై.. ప్రజావాణిలో పోటెత్తుతున్న దరఖాస్తులు!
సాక్షి, హైదరాబాద్: గవర్నమెంటుఇళ్లు అంటే సాధారణంగా.. ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో.. శివారులో.. నిర్మానుష్య ప్రదేశాల్లో ఇస్తారనే అపవాదు ఉంది. ఇవి ఉపాధి కేంద్రాలకు దూరంగా.. సౌకర్యాలకు నోచుకోక లబ్ధిదారులు నివాసానికి ఆసక్తి చూపడం లేదు. దీనికి చెక్ పెట్టేందుకు తాజాగా ప్రభుత్వం స్థానిక ప్రాంతాల్లోనే అనువైన చోట ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇవ్వాలని నిర్ణయించింది. ఈమేరకు నివాసిత ప్రాంతాల్లోనే చాలా చోట్ల స్థలాలను ఎంపిక చేశారు. దీంతో ఈసారి ఇందిరమ్మ ఇళ్లపై జనంలో ఆసక్తి పెరిగింది. దీంతో ఒక వైపు ఉచిత ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజా భవన్, కలెక్టరేట్ ప్రజావాణిలకు, మరోవైపు ఎల్ఐజీ ఇందిరమ్మ ఇళ్ల కోసం ఆన్లైన్ దరఖాస్తు కేంద్రాలకు పోటెత్తుతున్నారు.గతంలో ఏం జరిగిందంటే...వాస్తవంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల కోసం లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిరి్మస్తామని ప్రకటించింది. ఐదేళ్లలో సుమారు 111 ప్రాంతాల్లో 68,176 ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు అందించగా, మిగిలిన మరో 31,824 ఇళ్లు వివిధ నిర్మాణ దశల్లో నిలిచిపోయాయి. అయితే, ఈ ఇళ్లు చాలావరకు నగరం వెలుపల, జీవనోపాధి లభించే ప్రాంతాలకు అత్యంత దూరంలో ఉండటం సమస్యగా తయారైంది. రోజువారి కూలిపనులు, చిన్నచిన్న ఉద్యోగాలు చేసుకునే లబ్ధిదారులు నిత్యం రాకపోకలు సాగించలేక అక్కడ నివాసం ఉండడం లేదు. వాటిని అద్దెకు ఇవ్వడమో..తాళాలు వేయడమో చేస్తున్నారు.ఇప్పుడు ఇందిరమ్మ మోడల్ కాలనీలురెండున్నరేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర సామాజిక, ఆరి్థక సర్వే ద్వారా ఇందిరమ్మ ఇళ్ల కోసం లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి లబ్ధిదారులకు వారు నివసిస్తున్న ప్రాంతానికి గరిష్టంగా 5 కిలోమీటర్ల సమీపంలోనే ‘ఇందిరమ్మ మోడల్ కాలనీలు’ నిర్మించి ఇళ్లు అందజేస్తామని ప్రకటించింది. జీహెచ్ఎంసీ పరిధిలో స్ధలాలను సైతం గుర్తించింది. ఈ పథకం పర్యవేక్షణ బాధ్యతను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ప్రత్యేకంగా హౌసింగ్ డిపార్ట్మెంట్కు బదిలీ చేసింది. స్థానికంగానే సొంత గూడు దక్కుతుందనే నమ్మకంతో నిరుపేదలు ఇందిరమ్మ ఇళ్ల కోసం భారీగా దరఖాస్తు చేస్తున్నారు.రాయితీతో ఎల్ఐజీ ఇందిరమ్మ ఇళ్లు మరోవైపు, హౌసింగ్ శాఖ పరిధిలోని ‘క్యూర్’ ఎల్ఐజీ, ఎంఐజీ లక్ష ఇళ్ల లక్ష్యంతో పేద, దిగువ, మధ్యతరగతి వర్గాల కోసం స్థానికంగా జీ+10 నివాస గృహాల నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఇటీవల మొదటి విడత పైలెట్ ప్రాజెక్టుగా 16 ప్రాంతాల్లో సుమారు 7680 ఎల్ఐజీ గృహాల కోసం గృహ నిర్మాణశాఖ నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఆన్లైన్లో దరఖాస్తుల వరద పారుతోంది.కలల గూడు కోసం..నగరంలో ఇళ్లు లేని పేదలు తమ గోడు వెళ్లబోసుకునేందుకు కలెక్టరేట్‌కు తరలివస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలంటూ ప్రజావాణిలో దరఖాస్తు చేసుకుంటున్నారు. సోమవారం ప్రజావాణికి మొత్తం 2433 దరఖాస్తులు రాగా..వాటిలో 2254 ఇళ్లకు సంబంధించినవే ఉన్నాయి. గత వారం కూడా ఇళ్లకోసం 1462 మంది అర్జీ పెట్టుకున్నారు. -
నాటు తుపాకీతో యువకుడు హల్చల్!
హైదరాబాద్: సరూర్‌నగర్ పరిధి భగత్‌సింగ్‌నగర్ బస్తీలో కంట్రీమేడ్ తుపాకీతో హల్చల్ చేస్తున్న ఇమ్రాన్ అలియాస్ ఇబ్బు అనే పాతనేరస్తుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు మల్కాజిగిరి ఎస్ఓటీ, సరూర్‌నగర్ పోలీసులు దాడి చేయగా ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్న ఇమ్రాన్ వద్ద నాటు తుపాకీ, ఒక లైవ్ రౌండ్ లభించాయి.అదుపులోకి తీసుకుని విచారించగా.. ఇతడి స్వస్థలం వరంగల్ జిల్లా గీసుకొండ మండలం జంపాక గ్రామం అని తేలింది. నగరానికి వచ్చి చెడు అలవాట్లకు బానిసై నేరాల బాటపట్టాడని తెలిసింది. రాజేంద్రనగర్‌లోని ఓ స్క్రాప్ దుకాణంలో పని చేసిన సమయంలో బిహార్‌కు చెందిన షకీర్ వద్ద కంట్రీమేడ్ తుపాకి, ఒక లైవ్రౌండ్ రూ.40 వేలకు కొనుగోలు చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. ఇమ్రాన్‌పై ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లలో 17 కేసులు ఉన్నట్లు గుర్తించారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. -
హాయ్.. నా పేరు డా. సూరి శ్రీమతి.. విషయం ఏంటంటే?
హైదరాబాద్: హాయ్.. నా పేరు డా.సూరి శ్రీమతి. నా వయసు 92 ఏళ్లు. నేను ఓటేసేందుకు ఆసక్తిగా ఉంటాను. అందుకే ఈ వయసులోనూ ఎన్యూమరేషన్ ఫారం నింపి అందజేశాను. అందరూ నాలాగే ‘సర్’లో పాల్గొనండి. ఓటు మీ హక్కుగా గుర్తించండి’ అంటూ సందేశమిచ్చారు సీనియర్ గైనకాలజిస్ట్ సూరి శ్రీమతి. ఆమె సోమవారం సీతాఫల్‌మండిలోని తన నివాసంలో ఎన్యూమరేషన్ ఫారం నింపి 141వ బూత్ బీఎల్ఓ లీలావతి, బీఎల్ఏ నాగమణికి అందచేశారు. ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకున్నందుకు ఆనందంగా ఉందని, అందరూ ఓటును పరిరక్షించుకోండని చెప్పారు. -
చాక్లెట్ కొనిస్తానని చెప్పి నాలుగేళ్ల చిన్నారిని..
హైదారాబాద్, మల్కాజిగిరి: నాలుగేళ్ల బాలికకు చాక్లెట్ కొనిస్తానని తీసుకెళ్లిన ఓ వ్యక్తి లైంగికదాడికి పాల్పడ్డాడు. మల్కాజిగిరి ఇన్స్పెక్టర్ విజయ్‌కుమార్ తెలిపిన మేరకు.. మల్లికార్జునగర్‌కు చెందిన రవికుమార్(35) అదే ప్రాంతంలోని టెంట్‌హౌస్ దుకాణంలో పనిచేస్తున్నాడు. ఆదివారం టెంట్హస్ సమీపంలో అపార్ట్మెంట్ వద్ద ఆడుకుంటున్న బాలిక (4)కు చాక్లెట్ కొనిస్తానని చెప్పి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఏడ్చుకుంటూ వచ్చిన బాలికను తల్లి ఆరా తీయగా రవికుమార్ తీసుకెళ్లిన విషయం చెప్పింది. ఈ ఘటన పై సోమవారం తల్లి పోలీసులకు ఫిర్యాదుచేసింది. దీంతో నిందితున్ని అదుపులోకి తీసుకొని పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
హీటర్ ప్రాణం తీసింది..
హైదరాబాద్: మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ వాటర్ హీటర్ ఉపయోగిస్తుండగా షాక్‌కు గురై మృతి చెందింది. పోలీసులు తెలిపిన మేరకు.. భువనగిరికి చెందిన స్వాతి (40), భర్త శ్రీనివాస్, ముగ్గురు పిల్లలతో కలిసి మల్లికార్జున నగరంలో నివాసముంటోంది. శ్రీనివాస్ చర్లపల్లిలో ఓ ప్రింటింగ్ ప్రెస్‌లో పనిచేస్తున్నాడు.సోమవారం ఉదయం భర్త డ్యూటీకి, పిల్లలు స్కూల్‌కి వెళ్లిన తరువాత డోర్ వేసుకున్న స్వాతి వేడినీటి కోసం బకెట్లో ఎలక్ట్రిక్ వాటర్‌హీటర్ వేసిన సమయంలో ప్రమాదవశాత్తు చెయ్యి వాటర్‌హీటర్ ఉన్న నీటిని తాకింది. దీంతో తీవ్ర కరెంట్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. ఇంటి నుండి పొగలు వస్తుండడాన్ని గమనించిన పై పోర్షన్ వారు భర్తకు సమాచారం అందించడంతో అతను వచ్చి లోపలకు వెళ్లి చూడగా కాలిన గాయాలతో మృతి చెంది ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మేడిపల్లి పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. -
ఇప్పుడు ఎవరు తప్పించుకోలేరు..! హైదరాబాద్ లో కొత్త AI కెమెరాలు
-
ఉత్కంఠ రేపుతున్న కార్పొరేషన్ల ఎన్నికలు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ పరిధి పెరిగింది. ‘క్యూర్’లో మూడు కార్పొరేషన్లు ఏర్పాటయ్యాయి. గతంలో 150గా ఉన్న కార్పొరేటర్ల సీట్లు 300కు పెరిగాయి. ఆ సీట్లలో కూర్చునేందుకు పలువురు లీడర్లు ఉవ్విళ్లూరుతున్నారు. పూర్వ జీహెచ్ఎంసీ పాలకమండలి గడువు ముగిసినప్పటి నుంచీ, కొత్తగా ఏర్పాటైన మూడు కార్పొరేషన్లలో స్పెషలాఫీసర్ పాలన నడుస్తోంది. చట్టం మేరకు రద్దయిన పాలకమండళ్లకు ఆర్నెళ్లలోగా ఎన్నికలు జరగాల్సి ఉంది. వచ్చేనెల పదో తేదీతో ఆ గడువు ముగియనుంది. కానీ, ఇంతవరకు ఎన్నికల అలికిడి లేదు.ఈ సంవత్సరం చివర్లో ఈ ఎన్నికలు జరగనున్నట్లు ఎప్పటినుంచో ప్రచారం జరుగుతుండగా, దానిపై కూడా సందేహాలు నెలకొన్నాయి. అందుకు కారణం కొత్తగా క్యూర్ చట్టం రానుండటం, డీలిమిటేషన్‌పై కోర్టు కేసులుండటం, తదితరమైనవిగా చెబుతున్నారు. దాదాపు 70 ఏళ్లనాటి జీహెచ్ఎంసీ స్థానే క్యూర్ వరకు కొత్త చట్టం తెచ్చేందుకు సిద్ధమైన ప్రభుత్వం ఆమేరకు ముసాయిదా బిల్లు విడుదల చేసింది. ప్రజల సూచనలు, అభ్యంతరాలకు ఈ నెల 24 వరకు గడువుంది. అనంతరం బిల్లు.. చట్టరూపం దాల్చేందుకు సమయం పట్టనుంది. వార్డుల విభజన వివాదం గత డీలిమిటేషన్‌పై హైకోర్టులో కేసులున్నాయి. వార్డుల విభజనలో లోపాలున్నాయనే ఫిర్యాదులున్నాయి. ఈ నేపథ్యంలో ఆ అభ్యంతరాలు ముగిసేంత వరకు ఎన్నికలు జరిగే అవకాశం ఉండదని సంబంధిత నిపుణులు చెబుతున్నారు. మరోవైపు వార్డుల సంఖ్య పెంచే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సైబరాబాద్ కార్పొరేషన్లో 76 వార్డులు, మల్కాజిగిరి కార్పొరేషన్లో 74 వార్డులున్నాయి. ఒక్కో కార్పొరేషన్లో వంద చేస్తారనే ప్రచారం కొనసాగుతోంది. జీహెచ్ఎంసీలో ఇప్పటికే 150 వార్డులున్నాయి. ఏ కార్పొరేషన్‌లోని వార్డుల్ని పెంచినా, వార్డులు, సరిహద్దులు మారతాయి. మరోవైపు మల్కాజిగిరి కార్పొరేషన్ (Malkajgiri Corporation) పరిధి చాలా ఎక్కువగా ఉండటంతో అక్కడ అధికారులకు సమస్యలు తలెత్తుతున్నాయి. తెర వెనుక వ్యూహం ప్రస్తుతం ఓటరు జాబితా ప్రక్షాళనకు సంబంధించిన ‘సర్’ కార్యక్రమం నడుస్తోంది. ఓటరు జాబితా అక్టోబర్ 10వ తేదీన వెలువడనుంది. ఆ తర్వాతే ప్రభుత్వం స్థానిక ఎన్నికల వైపు దృష్టి సారించే అకాశం ఉంది. అయినప్పటికీ, ఎన్నికల చూపుతోనే ప్రభుత్వం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసింది. ముఖ్యంగా, కొత్తగా ఏర్పడిన సీఎంసీ (CMC), ఎంఎంసీల్లో (MMC) వేల కోట్ల పనులు ప్రారంభించింది. ఆ పనుల పురోగతి కనిపించాక ఎన్నికలు నిర్వహించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలోని రెండు భారీ ఫ్లై ఓవర్లు వచ్చేనెల ప్రారంభానికి సిద్ధమవుతున్నాయి. ఇంకోవైపు ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. ఇవన్నీ ఎన్నికల చూపుతోనే అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేల బలం లేదు. ఈ పరిధిలోని 26 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాగా వేయాలంటే, అందుకు కార్పొరేషన్ల ఎన్నికలే పరీక్షగా భావిస్తున్నారు. చదవండి: జై జవాన్.. జై కిసాన్.. జై 'యువ'ప్రతిపక్షాలు సైతం.. మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ (BJP) గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటాయి. తిరిగి వాటిని నిలబెట్టుకోవడమే కాక, సీట్లు పెరిగినందున మరిన్ని ఎక్కువ సీట్లు పొందే యోచనలో ఇప్పటికే పరోక్షంగా ప్రచారం నిర్వహిస్తూ, ప్రభుత్వంపై విమర్శల బాణాలు విసురుతున్నాయి. ఈ నేపథ్యంలో కార్పొరేటర్ల ఎన్నికలెప్పుడు అన్నది వివిధ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. కోర్టు కేసులు, కొత్త చట్టం పూర్తయ్యాకే అయినా..త్వరితంగానా లేక జాప్యంతోనా అన్నదే ఇప్పుడు అందర్ని తొలుస్తున్న ప్రశ్న. ఏది ఏమైనా ట్రిపుల్ కార్పొరేషన్ల ఎన్నికలే రాబోయే రోజుల్లో ఆయా పార్టీలకు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల భవితవ్యాన్ని తెలుపనున్నాయి. -
అమ్మా నాన్నలపై అలిగి.. పారిపోయిన ముగ్గురు బాలికలు
హైదరాబాద్: నిత్యం తల్లిదండ్రుల మధ్య గొడవలు జరుగుతున్నాయి.. వారి కూతుళ్లు విసిగి వేసారిపోయారు.. సొంతూరికి వెళ్లి ఏదైనా పని చేసుకుని బతుకుదామని భావించి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా రైలెక్కారు. పిల్లలు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు దోమలగూడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి కేసును ఛేదించారు. ఆదివారం గాందీనగర్ ఏసీపీ కార్యాలయంలో సికింద్రాబాద్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి, అడిషనల్ డీసీపీ నరసయ్య, ఏసీపీ యాదగిరి, దోమలగూడ సీఐ అంజద్ అలీతో కలిసి వివరాలు వెల్లడించారు.ఛత్తీస్‌గఢ్‌కు చెందిన తోటరాం, రాంధులారి దంపతులు 2 నెలల క్రితం నగరానికి వలస వచ్చి దోమలగూడ ఫరీద్ బస్తీలో నివసిస్తున్నారు. హిమాయత్‌నగర్‌లోని ఓ హోటల్లో పనిచేస్తున్నారు. ఆ దంపతుల మధ్య నిత్యం గొడవలు జరుగుతుండటంతో భరించలేక వారి కుమార్తెలు సహిత కుమారి(17), స్నేహ కుమారి(16)తోపాటు సమీప బంధువైన లత(15) గత ఆదివారం ఉదయం తెల్లవారు జామున ఇంట్లోంచి పారిపోయారు. పోలీసులు 5 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దాదాపు 262 సీసీ కెమెరాల ఫుటేజీని జల్లెడ పట్టారు.రైలెక్కి.. ఛత్తీస్‌గఢ్ చేరి..హిమాయత్‌నగర్ మెయిన్ రోడ్లో ఆటో ఎక్కిన బాలికలు కాచిగూడ రైల్వేస్టేషన్‌కు, అక్కడ నుంచి మరో ఆటోలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి ఘన్పూర్ ఎక్స్‌ప్రెస్‌లో నాగ్‌పూర్ చేరుకోగా ఓ వ్యక్తి చేరదీసి ఫాంహౌస్‌లో పనులు చేసేందుకు గడ్చిరోలి మీదుగా ఛత్తీస్‌గఢ్‌లోని పతంజూరుకు చెందిన బిశ్వజిత్ అనే వ్యక్తి దగ్గరికి తీసుకెళ్లాడు. ఇంట్లో నుంచి పారిపోయి వచ్చినట్లు గుర్తించిన బిశ్వజిత్ దోమలగూడ పోలీసులకు సమాచారమిచ్చారు. ఛత్తీస్‌గఢ్‌లోని కాంకర్ పోలీసుల సహకారంతో బాలికలను తీసుకొచ్చి సఖీ సెంటర్‌కు అప్పగించారు. తల్లిదండ్రులు స్నేహపూర్వక వాతావరణంలో పిల్లల్ని పెంచాలని డీసీపీ సూచించారు. -
ట్రైనీ ఐపీఎస్ కృష్ణారెడ్డి ఎపిసోడ్లో మరో ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో కృష్ణారెడ్డికి నోటీసులు జారీ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో కృష్ణా రెడ్డి ఆచూకీ లభించకపోవడంతో ఆయన పరారీలో ఉన్నట్టుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.వివరాల మేరకు.. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి వ్యవహారంలో చట్టపరమైన చర్యలు చేపట్టేందుకు సిద్ధమైన హైదరాబాద్ పోలీసులు, ఆయనకు నోటీసులు జారీ చేసేందుకు గత రెండు రోజులుగా తీవ్రంగా యత్నిస్తున్నారు. అయితే పోలీసుల విచారణకు సహకరించకుండా ఉదయ్ కృష్ణారెడ్డి అందుబాటులో లేకుండా పోయారు. ఆయన రికార్డుల్లో పేర్కొన్న రెండు నివాస చిరునామాలను పోలీసులు పరిశీలించినప్పటికీ అక్కడ ఆయన ఆచూకీ లభించలేదు. అంతేకాకుండా తన వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ను కూడా స్విచ్ ఆఫ్ చేసుకోవడంతో ఆయన పరారీలో ఉన్నట్లు స్పష్టమవుతోంది.ఒకవైపు పోలీసుల గాలింపు తీవ్రతరం కాగా, మరోవైపు తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ ఉదయ్ కృష్ణారెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు తీవ్రత, నమోదు చేసిన సెక్షన్లు, ఆయన సమర్పించిన వాదనలపై హైకోర్టులో ఈరోజు మరోసారి కీలక విచారణ జరగనుంది. కానీ, ప్రస్తుతం ఆయన కనిపించకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. -
అబిడ్స్‌లో యువకుడి వీరంగం! కారుతో నేరుగా పోలీసుల పైకే..
హైదరాబాద్: గత కొన్నిరోజులనుంచి డ్రగ్స్ డీల్ సమాచారంతో అబిడ్స్‌లో పోలీసులు నిఘా పెడ్తున్నారు. అయితే, ఈరోజు సోమవారం ఉదయం తెల్లవారుజామున, ఓ యువకుడు బలెనో కార్లో డ్రగ్స్ తీసుకుంటుండగా పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆ యువకుడు కారుతో నేరుగా పోలీసులపైకి దూసుకెళ్లాడు. ప్రమాదంనుంచి తప్పుకునేలోపు నిందితుడు కారును రివర్స్‌లో తీసి పోలీసులపైకి ఎక్కించాడు. ఈ ప్రమాదంలో ఇన్స్పెక్టర్ శ్రీకాంత్, కానిస్టేబుల్ వంశీధర్‌కు గాయాలు కాగా, హెచ్-న్యూ కానిస్టేబుల్ మహేందర్ యాదవ్‌కు కాలు ఫ్రాక్చర్ అయ్యింది. అయినాసరే వారి గాయాలను లెక్కచేయకుండా పారిపోతున్న నిందితుడు సైఫ్‌ను పోలీసులు ఛేజ్‌చేసి పట్టుకుని అరెస్ట్ చేశారు. అనంతరం దగ్గరలో ఉన్నటువంటి యశోధ ఆస్పత్రిలో పోలీసులు చికిత్స పొందుతున్నారు. అయితే, హెచ్-న్యూ కానిస్టేబుల్ మహేందర్ ఫిర్యాదుతో నిందితుడిపై అటెంప్ట్ మర్డర్ కేసు నమోదైంది. హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ విభాగం నిందితుడిని విచారిస్తున్నట్లుగా తెలిసింది. -
డాక్టర్ సతీశ్‌రెడ్డికి 'ఛేంజ్ మేకర్' పురస్కారం అందజేసిన చిరంజీవి (ఫొటోలు)
-
చాయ్ కోసం వెళ్తూ అనంతలోకాలకు!
సాక్షి, హైదరాబాద్/మూసాపేట: ఆదివారం కావడంతో ఆటవిడుపు కోసం క్రికెట్ ఆడేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చిన ఇద్దరు మైనర్లను మృత్యువు కబళించింది. ఈ ఉదంతంతో మరో బాలుడు గాయపడ్డాడు. యూసుఫ్‌గూడలోని బ్రహ్మశంకర్ నగర్‌కు చెందిన బేగరి మహేశ్, మన్నే లక్ష్మీతేజ, పులి కిరణ్‌కుమార్ స్నేహితులు. 17 ఏళ్ల వయసున్న ముగ్గురూ అమీర్‌పేట్‌లోని వేర్వేరు కాలేజీల్లో ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. సెలవు రోజుల్లో వీళ్లు యూసుఫ్‌గూడలోని కృష్ణకాంత్ పార్క్ వద్ద క్రికెట్ ఆడుతుంటారు.ఆదివారం కూడా తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో తన ఇంటి నుంచి బయటకు వచ్చిన మహేశ్ మిగిలిన ఇద్దరినీ కలిశాడు. ముగ్గురూ కలిసి కిరణ్‌కుమార్‌కు చెందిన ద్విచక్ర వాహనంపై కృష్ణకాంత్ పార్క్‌కు బయలుదేరారు. అయితే ఆట ప్రారంభించడానికి ముందు తరచూ వెళ్లినట్లే కూకట్‌పల్లిలోని మహాలక్ష్మి కేఫ్‌కు వెళ్లి చాయ్ తాగాలని భావించారు. కిరణ్ వాహనం నడుపుతుండగా వెనుక మహేశ్, లక్ష్మీతేజ కూర్చున్నారు. 4:55 గంటల సమయంలో కూకట్‌పల్లిలోని మెట్రో పిల్లర్ నం.796 వద్ద వెనుక నుంచి మితిమీరిన వేగంతో వచ్చిన టిప్పర్ వీరి వాహనాన్ని గుద్దింది.దీంతో మహేశ్, లక్ష్మీతేజ ఎగిరి ఎడమవైపునకు పడిపోయారు. వాహనం నడుపుతున్న కిరణ్ కుడివైపు పడ్డాడు. మహేశ్, లక్ష్మీ తేజలపై టిప్పర్ టైరు ఎక్కడంతో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే చనిపోయారు. గాయాల పాలైన కిరణ్ మహేశ్ తండ్రి సంగప్పకు ఫోన్ చేసి విషయం చెప్పడంతో ఆయన హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. అప్పటికే ఈ ప్రమాదంపై సమాచారం అందుకుని ఘటనాస్థలికి వచ్చిన కూకట్పల్లి పోలీసులు మృతదేహాలను గాంధీ ఆస్పత్రి మార్చురీకి, కిరణ్‌ను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
హైదరాబాద్‌లో మందాకిని
‘వారణాసి’ సినిమా కోసం మరోసారి హైదరాబాద్‌లో అడుగుపెట్టారు ప్రియాంక చోప్రా. గతంలో ఈ చిత్రం షూటింగ్ కోసం ఎక్కువసార్లు సోలోగా వచ్చిన ప్రియాంక ఈసారి మాత్రం భర్త నిక్ జోనస్, కుమార్తె మాల్తీతో కలిసి వచ్చారు. దీంతో ‘వారణాసి’ సినిమాకు సంబంధించిన ఓ లాంగ్ షెడ్యూల్ హైదరాబాద్‌లో జరగనుందని, ఇందుకోసమే ఫ్యామిలీతో సహా ప్రియాంక హైదరాబాద్‌కు వచ్చి ఉంటారని టాక్.మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న అడ్వెంచరస్ సైన్స్ ఫిక్షన్ అండ్ మైథలాజికల్ సినిమా ‘వారణాసి’. ఈ చిత్రంలో రుద్ర, శ్రీరాముడు... ఇలా రెండు డిఫరెంట్ గెటప్స్‌లో మహేశ్‌బాబు కనిపిస్తారు. మందాకిని పాత్రలో ప్రియాంక చోప్రా, కుంభ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో మొదలైంది. కొంత టాకీ పార్ట్ చిత్రీకరణ జరిగింది. తాజాగా ఓ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణకు సన్నాహాలు చేస్తున్నారట. ఈ యాక్షన్ ఎపిసోడ్లో మహేశ్‌బాబు, ప్రియాంక ల్గొంటారని తెలిసింది. ఎస్ఎస్ కార్తికేయ, కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం 2027 ఏప్రిల్ 7న విడుదల కానుంది. -
సీఎం రేవంత్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తరఫున తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్‌రావు. ఓటు హక్కు వయస్సు, ఎన్నికల నిబంధనలు వంటి అంశాలను నిర్ణయించే అధికారం భారత ఎన్నికల సంఘం (Election Commission of India) మరియు కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుంది. ఇటువంటి అంశాలపై ప్రజలను, ముఖ్యంగా యువతను తప్పుదారి పట్టించే విధంగా వ్యాఖ్యలు చేయడం బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధికి తగదన్నారు. అదేవిధంగా, రాష్ట్రంలోని సుమారు 20 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. పేద మరియు మధ్యతరగతి కుటుంబాలు తమ పిల్లల చదువుల కోసం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని,. ఫీజు రీయింబర్స్మెంట్ ఆలస్యం కావడంతో విద్యార్థులు తమ విద్యను కొనసాగించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చశారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించకుండా ఇతర అంశాలపై దృష్టి మళ్లించడం సరైంది కాదన్నారు. విద్యార్థుల సంక్షేమాన్ని ప్రాధాన్యంగా తీసుకుని ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరుతున్నామన్నారు. -
హైదరాబాద్ మలక్ పెట్ సీఐ కె.నరసింహ సస్పెండ్
-
త్వరపడండి.. ఈ లోగో క్రియేట్కి బహుమతి రూ.20 వేలు!
సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) అధికారిక లోగో రూపకల్పనకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ (ఎన్ఐయూఎం) సహకారంతో ప్రత్యేక డిజైన్ పోటీ ప్రకటించింది. విద్యార్థులు, ఆర్కిటెక్ట్‌లు, గ్రాఫిక్ డిజైనర్లు, విజువల్ ఆర్టిస్టులు, సృజనాత్మక రంగ నిపుణులు పాల్గొనవచ్చని తెలిపింది. ప్రథమ బహుమతిగా రూ.20 వేలు, ద్వితీయ రూ.15వేలు, తృతీయ రూ.10 వేలు అందజేయనున్నారు.ఎంట్రీల సమర్పణకు ఆగస్టు 5 చివరి తేదీ. ఆగస్టు 10న విజేతలను ప్రకటిస్తారు. ఎంపికైన లోగోను స్వాతంత్య్ర దినోత్సనాన ఆవిష్కరించనున్నారు. ఆసక్తి ఉన్నవారు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆన్లైన్లో ఎంట్రీలు సమర్పించాలి. సైబరాబాద్‌కు శాశ్వత గుర్తుగా నిలిచే లోగో రూపకల్పనలో భాగం కావడానికి ఇదో అరుదైన అవకాశమని కమిషనర్ సృజన పేర్కొన్నారు. సుపరిపాలన, సుస్థిర, అభివృద్ధి చెందుతున్న నగర దృక్పథాన్ని ఆవిష్కరించాలని సూచించారు.లోగో పూర్తిగా ఒరిజినల్ సృష్టి అయి ఉండాలని స్పష్టం చేశారు. ఏఐ, ఈపీఎస్ లేదా ఎస్వీజీ వెక్టర్ ఫార్మాట్లో రూపొందించిన డిజైన్లకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. కాగా, అధిక నాణ్యత గల పీఎన్జీ లేదా జేపీఈజీ ఫైల్‌తో పాటు, గరిష్ఠంగా 250 పదాల్లో డిజైన్ వెనుక ఉన్న భావనను సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థికి ఒక ఎంట్రీ మాత్రమే. కాపీరైట్ ఉల్లంఘన లేదా కృత్రిమ మేధ (ఏఐ) ద్వారా నకలు చేసిన డిజైన్లను పరిగణనలోకి తీసుకోరు. డిజిటల్, ప్రింట్ వినియోగానికి అనువుగా ఉండేవాటినే పరిశీలిస్తారు. -
పనిమనుషుల నియామకంలో నిర్లక్ష్యం తగదు.. సజ్జనార్
పనిమనుషుల దొంగతనాలు పెరుగుతుండటంతో హైదరాబాద్ సిటీ పోలీస్ యంత్రాంగం ప్రజలను తీవ్రంగా అప్రమత్తం చేస్తోంది. పనిమనుషులను చేర్చుకునేటప్పుడు యజమానులు చూపే నిర్లక్ష్యమే ఈ దొంగతనాలకు ప్రధాన కారణమని చెబుతోంది. తగిన విచారణ లేకుండా పనిలో కుదుర్చుకుంటే విలువైన సొత్తును పోగొట్టుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తోంది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో పనుల ఒత్తిడిలో ఉండే ఐటీ ఉద్యోగులు, ఒంటరిగా నివాసముండే విద్యార్థులు, వృద్ధులే ఈ చోరీలకు ప్రధాన బాధితులుగా మారుతున్నారు.ఇళ్లు, ఆఫీసులు, దుకాణాల్లో బంగారం, నగదు, అత్యంత విలువైన వస్తువులను నిర్లక్ష్యంగా బయట పడేసి వెళ్లడాన్ని గమనిస్తున్న కొందరు పనిమనుషులు సమయం చూసి చేతివాటం ప్రదర్శిస్తున్నారు. యజమానులు చూపే ఈ చిన్నపాటి అలసత్వమే నేరగాళ్లకు వరంగా మారుతోందని పోలీసులు విశ్లేషిస్తున్నారు. అయితే దొంగతనం జరిగిన తర్వాత దర్యాప్తు చేసి పట్టుకోవడం కంటే, అసలు నేరమే జరగకుండా ఆపడమే అత్యంత ముఖ్యమని భావిస్తున్నారు. ఇందులో భాగంగా స్వయంగా కాలనీలు, అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, ఆఫీస్‌లు, దుకాణాలకు వెళ్లి యజమానులను నేరుగా కలిసి అవగాహన కల్పిస్తున్నారు. గత రెండేళ్లలో నగరంలో నమోదైన 565 పనిమనుషుల దొంగతనం కేసులను (65 గ్రేవ్ కేసులు, 500 నాన్ గ్రేవ్ కేసులు) విశ్లేషించిన పోలీసులు... ప్రతి యజమాని తక్షణమే భద్రతా నియమాలు పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.జోన్ల వారీగా పరిణామాలు పరిశీలిస్తే ఐటీ సంస్థలు, వ్యాపార వర్గాలు, ఉన్నత నివాస ప్రాంగణాలు, ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని ఆఫీసుల్లో, దుకాణాల్లో, ఇళ్లలో యజమానులు బిజీ జీవనశైలి కారణంగా తగిన ముందస్తు తనిఖీలు లేకుండా పనిమనుషులను చేర్చుకుంటున్నట్లు తేలింది. మొత్తం 565 కేసుల్లో.. జూబ్లీహిల్స్ జోన్లో అత్యధికంగా 173 కేసులు నమోదు కాగా, సికింద్రాబాద్ జోన్లో 88, ఖైరతాబాద్ జోన్లో 77, గొల్కొండ జోన్లో 70, రాజేంద్రనగర్ జోన్లో 63, శంషాబాద్ జోన్లో 49, చార్మినార్ జోన్లో 45 కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా ఇటీవల ఇతర దేశాలు, రాష్ట్రాల మూలాలున్న ముఠాలు పనిమనుషుల అవతారంలో ఇళ్లలోకి ప్రవేశించి పథకం ప్రకారం దొంగతనాలకు, నేరాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో తగిన గుర్తింపు, పోలీస్ వెరిఫికేషన్ పత్రాలు లేని అపరిచిత వ్యక్తులను పనిలో చేర్చుకోవద్దని పోలీసు యంత్రాంగం స్పష్టంగా సూచిస్తోంది. నమ్మకంగా పనిలో చేరిన కొత్తలో యజమానుల అలవాట్లు, తాళాలు ఉంచే ప్రదేశాలు, సీసీ కెమెరాల కదలికలు, నగదు-నగల వివరాలను గమనించి నేరాలకు పాల్పడుతున్నందున, పూర్వాపరాలు తెలియని వారిని ఇళ్లు, ఆఫీసులు, దుకాణాలకు రానివ్వకపోవడమే శ్రేయస్కరమని స్పష్టం చేస్తున్నారు. ఇళ్లు, ఆఫీస్, దుకాణాల్లోని లోపలి సమాచారం సురక్షితంగా ఉన్నంత వరకు నేరాలకు తావుండదనే ప్రాథమిక సూత్రాన్ని ప్రతి నగరవాసి గుర్తించి అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు.పాటించాల్సిన భద్రతా మార్గదర్శకాలుప్రజా భద్రతను పటిష్ఠం చేసే క్రమంలో సిటీ పోలీస్ యంత్రాంగం పలు ముఖ్యమైన సూచనలను ప్రజల ముందుకు తెచ్చింది. ఎవరినైనా ఇంట్లో, ఆఫీసుల్లో, దుకాణాల్లో పనికి కుదుర్చుకునే ముందే వారి ఆధార్ కార్డు లేదా చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు నకలు, తాజా ఫోటో, శాశ్వత చిరునామా, స్వగ్రామం వివరాలు, ఫోన్ నంబర్లు సేకరించాలని సూచిస్తోంది. ప్రైవేట్ ఏజెన్సీలు లేదా మధ్యవర్తుల ద్వారా నియామకాలు చేసుకునేటప్పుడు, సదరు ఏజెన్సీకి ప్రభుత్వ గుర్తింపు ఉందో లేదో సరిచూసుకోవాలని, గతంలో వారు ఎక్కడ పనిచేశారో ఆ యజమానులను సంప్రదించి వివరాలు ధ్రువీకరించుకోవాలని పేర్కొంటోంది. నియామకానికి ముందే స్థానిక పోలీస్ స్టేషన్లో ఉచితంగా లభించే 'పోలీస్ వెరిఫికేషన్' చేయించుకోవడం భద్రతా పరంగా శ్రేయస్కరమని, పనిచేసే వ్యక్తులు తమ వెంట గుర్తింపు కార్డు లేదా వెరిఫికేషన్ పత్రాన్ని ఉంచుకునేలా యజమానులే చొరవ తీసుకోవాలని కోరుతోంది. పనిలో చేరిన మొదటి 30 రోజుల పాటు వారి అలవాట్లు, కదలికలను నిశితంగా గమనించడం ద్వారా ఎలాంటి అనుమానాస్పద చర్యలనైనా ముందే గుర్తించవచ్చని స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా ఒంటరిగా ఉండే వృద్ధులు, తరచుగా ప్రయాణాలు చేసే కుటుంబాలు మరింత అప్రమత్తంగా ఉంటూ, ఇంట్లోని నగలు, డబ్బు, ప్రయాణ ప్రణాళికల గురించి పనిమనుషుల ముందు చర్చించకుండా జాగ్రత్త పడాలని కోరుతోంది. గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్ రెసిడెంట్ వెల్పేర్ అసోసియేషన్ ప్రతినిధులు సైతం తమ ప్రాంగణాల్లో ఇళ్లలో పనిచేసే పనిమనుషులకు ఎంట్రీ రిజిస్టర్లు నిర్వహిస్తూ ప్రవేశ పాస్‌లు ఇవ్వాలని, సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా పర్యవేక్షించాలని సూచిస్తోంది.నగర ప్రజల భద్రతపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్, ఐపీఎస్ స్పందిస్తూ... "నేర రహిత, సురక్షిత హైదరాబాద్ నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యమే అత్యంత కీలకం. నేరస్థుడికి బలవంతంగా లోపలికి వచ్చే ప్రవేశం ఉండదు... మనం ఇచ్చే అవకాశమే నేరానికి దారితీస్తుంది. పనిమనుషుల నియామకం విషయంలో ప్రతీ ఒక్కరూ సమగ్ర వివరాలు సేకరించి పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరిగా చేయించుకోవాలి. పని మనుషుల దొంగతనాలు పెరుగుతున్న దృష్ట్యా, ముందస్తు పోలీస్ తనిఖీలు లేని వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ పనిలో చేర్చుకోవద్దు. వారి పూర్వాపరాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే ఏ నిర్ణయమైనా తీసుకోవాలి." అని స్పష్టం చేశారు. నివాసాలు, ఆఫీస్‌లు, దుఖాణాల్లో ఏమాత్రం అనుమానాస్పదంగా అనిపించినా, తాళం చెవులు పోయినా లేదా పనిమనిషి చెప్పకుండా మాయమైనా ఏమాత్రం అశ్రద్ధ చేయొద్దన్నారు. అనుమానం వస్తే వెంటనే డయల్ 100కి గానీ, లేదా హైదరాబాద్ సిటీ పోలీస్ వాట్సాప్ హెల్ప్‌లైన్ నంబర్ 94906 16555 కు గానీ సమాచారం అందించాలని, పోలీసులు ఎల్లప్పుడూ ప్రజల రక్షణ కోసం అందుబాటులో ఉంటారని స్పష్టం చేశారు. -
TGPSC : రోడ్లపై ఓఎంఆర్ షీట్లు కలకలం
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ఆవరణలో రోడ్డుపై ఓఎంఆర్ షీట్లు కనిపించడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై అభ్యర్థులు, నిరుద్యోగుల నుంచి ఆందోళనలు వ్యక్తమవడంతో టీజీపీఎస్సీ తక్షణమే స్పందించి పూర్తి వివరణ ఇచ్చింది. రోడ్డుపై దర్శనమిచ్చిన ఓఎంఆర్ షీట్లు ప్రస్తుత పరీక్షలకు సంబంధించినవి కావని, అవి 2018 నాటి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగ నియామకాలకు చెందినవని కమిషన్ స్పష్టం చేసింది. ఆ రిక్రూట్మెంట్ ప్రక్రియ ఎప్పుడో విజయవంతంగా పూర్తయిందని వెల్లడించింది. సాధారణంగా పరీక్షలు ముగిసి మూడేళ్లు దాటిన ఓఎంఆర్ షీట్లను నిబంధనల ప్రకారం ష్రెడ్డింగ్ (ముక్కలుగా కత్తిరించడం) చేస్తామని, ఈ క్రమంలోనే పాత షీట్లు బయటకు వచ్చి ఉంటాయని పేర్కొంది.అయినప్పటికీ, భద్రతా వలయాన్ని దాటి పబ్లిక్ ప్లేస్‌లోకి ఈ పాత ఓఎంఆర్ షీట్లు ఎలా వచ్చాయనే అంశంపై అంతర్గత విచారణకు ఆదేశించినట్లు కమిషన్ అధికారులు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా కఠిన జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
భూమిపై అందాలు.. ఫోటోలు
-
ఆకాశంలో వెలుగులు.. ఫోటోలు
-
హైదరాబాద్: నెక్లెస్ రోడ్డులో కాంగ్రెస్ క్యాండిల్ ర్యాలీ
సాక్షి, హైదరాబాద్: నెక్లెస్ రోడ్డులో కాంగ్రెస్ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన దాడిని నిరసిస్తూ సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. యువత సాధించిన విజయాన్ని మా ఖాతాలో వేసుకోవడం లేదని.. ఇది యువత సాధించిన విజయంగా పేర్కొన్నారు.’’రాజకీయ పార్టీలు కేవలం మద్దతు మాత్రమే ఇచ్చాయి. ఓటు హక్కు ను 18 ఏళ్లకే కల్పించి యువతను రాజకీయాల్లో రాజీవ్ గాంధీ ప్రోత్సహించారు. ప్రపంచంలో చాలా దేశాల్లో 18 ఏళ్ల యువతకు చట్టసభల్లో అవకాశం ఇచ్చారు. ఆగస్టు మొదటి వారంలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తాం. 21 ఏళ్లకే చట్టసభల్లోకి వచ్చేలా యువతకు అవకాశం ఇవ్వాలని సభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తాం’’ అని రేవంత్ చెప్పారు.మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా ర్యాలీ నిర్వహించామని.. సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు వేలాది మంది విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారన్నారు. ఏకచ్ఛత్రాధిపత్యానికి వ్యతిరేకంగా యావత్ విద్యార్థి లోకం ఏకమైంది. నీట్ పరీక్ష సక్రమంగా నిర్వహించలేని దుస్థితి. చైనా చొచ్చుకొస్తుంటే అడ్డుకోలేని దుస్థితి. విద్యార్థి లోకానికి తలొగ్గి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు’’ అని ఆయన పేర్కొన్నారు. -
హైదరాబాద్ కూకట్‌పల్లిలో సందడి చేసిన హీరోయిన్ లావణ్య త్రిపాఠి (ఫోటోలు)
-
మోడల్ మెట్రో స్టేషన్లు!
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికులకు మరింత మెరుగైన, నాణ్యమైన సదుపాయాలను కల్పించేందుకు హెచ్ఎంఆర్ఎల్ కసరత్తు చేపట్టింది. మెడల్ మెట్రోస్టేషన్ల ఏర్పాటుపై అధికారులు దృష్టి సారించారు. ప్రయాణికుల అవసరాలకనుగుణంగా అమలు చేయాల్సిన ప్రణాళికలపై త్వరలో సమగ్ర నివేదిక రూపొందించను న్నారు. మొదట ప్రయాణికుల రద్దీ, డిమాండ్ ఎక్కువగా ఉన్న కొన్ని మెట్రోస్టేషన్లను ప్రయోగాత్మకంగా ఎంపిక చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. 57 స్టేషన్ల నుంచి..ప్రస్తుతం నాగోల్–రాయదుర్గం, ఎల్బీనగర్–మియాపూర్, జేబీఎస్–ఎంజీబీఎస్ కారిడార్లలో 57 స్టేషన్ల నుంచి మెట్రోరైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రతి రోజు 4.80 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. నాగోల్–రాయదుర్గం కారిడార్‌లో ఉదయం, సాయంత్రం ప్రయాణికుల రద్దీ, డిమాండ్ ఎక్కువ. మియాపూర్– ఎల్బీనగర్ కారిడార్‌లో మాత్రం ఉదయం నుంచి రాత్రి వరకు ప్రయాణికుల రాకపోకలతో స్టేషన్లు సందడిగా ఉంటాయి. ఈ రెండు కారిడార్లలోనే నిత్యం 4.20 లక్షల మందికి పైగా రాకపోకలు సాగిస్తున్నట్లు అంచనా.జేబీఎస్–ఎంజీబీఎస్ మార్గంలో ప్రయాణికుల రద్దీ తక్కువ. మియాపూర్, ఎల్బీనగర్, ఉప్పల్, నాగోల్, అమీర్‌పేట్, రాయదుర్గం స్టేషన్ల చుట్టుపక్కల కాలనీల నుంచి రాకపోకలు అత్యధికం. ఈ మేరకు లాస్ట్‌మైల్ కనెక్టివిటీ సదుపాయం లేదు. కొన్ని స్టేషన్లలో ప్రవేశ ద్వారాల నిర్వహణ, రద్దీ నియంత్రణ, మౌలిక సదుపాయాల సమస్యలున్నాయి. ఒక్కో స్టేషన్లో ప్రత్యే క సమస్యలను గుర్తించి అందుకనుగుణంగా కా ర్యాచరణ ప్రణాళికలు రూపొందించనున్నారు.వివిధ విభాగాలతో సమన్వయం..ఆర్టీసీ, రవాణా, రైల్వే, జీహెచ్ఎంసీ, పోలీస్, తదితర విభాగాల సమస్వయంతో ప్రయాణికులకు లాస్ట్‌మైల్ కనెక్టివిటీ సదుపాయాన్ని విస్తరించనున్నారు. ఆయా విభాగాలతో ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నారు. వారం రోజుల్లో నివేదిక.. ఇప్పటికే క్షేత్రస్థాయిలో గుర్తించిన సమస్యలపై అధ్యయనం చేసి స్థానిక ప్రణాళికలను వారం రోజుల్లో సిద్ధం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా కొన్ని స్టేషన్లను ఎంపిక చేసి ‘మెట్రో మోడల్ స్టేషన్’లుగా అభివృద్ధి చేయనున్నారు. దశలవారీగా ఈ ప్రణాళికలు విస్తరించనున్నారు. -
టైముందికదా.. చూద్దాం లే!.. సర్ ఫారాల జాప్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని కేంద్రమైన హైదరాబాద్ జిల్లాలో సర్ ప్రక్రియకు సంబంధించిన ఓటరు జాబితా ఎన్యూమరేషన్ ఫారాలను (ఈఎఫ్) తిరిగి ఇవ్వడంలో ఓటర్లు మీన మేషాలు లెక్కిస్తున్నారు. గడువు పొడిగించారు కదా..సెలవురోజైన ఆదివారం ఇవ్వవచ్చులే అనే తలంపుతో చాలామంది తమకు అందిన ఫారాలను భర్తీ చేయకుండా తాత్సారం చేస్తున్నారు. ఇంకొందరు ఎంతైనా సొంత ఊర్లో ఓటుంటేనే మంచిది.. ఇక్కడ వద్దులే అనే ఆలోచనతో సంశయిస్తున్నారు. ఎక్కడ ఓటున్నా ఇబ్బందేమీ ఉండదని, పల్లెలోని పథకాల లబ్ధి ఆగదని అధికారులు చెబుతున్నా స్పందించలేకపోతున్నారు. మీమాంసతో వారినీ, వీరినీ అడుగుతూ, ఫారాలివ్వడానికి టైముందికదా ‘చూద్దాం’లే అనే ధోరణితో ఉన్నారు. అందుకే మిగతా జిల్లాలో ఫారాలు తిరిగొచ్చిన వారి డిజిటలైజేషన్ కూడా వేగంగా జరుగుతుండగా, నగరంలో మాత్రం నత్త నడకన సాగుతోంది. 49.15 శాతమే .. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో 70 శాతం, 80 శాతాలకు పైగా డిజిటలైజేషన్ జరగ్గా, హైదరాబాద్ జిల్లాలో మాత్రం శుక్రవారం వరకు 49.15 శాతం మాత్రమే జరిగింది. నగరంలోనే ఉన్న రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 50 శాతం మార్కును మాత్రం దాటింది. మేడ్చల్ జిల్లాలో 52.54 శాతం, రంగారెడ్డి జిల్లాలో 58.02 శాతం డిజిటలైజేషన్ జరిగింది. ఇతర జిల్లాల్లో యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 92.35 శాతం డిజిటలైజేషన్ జరగ్గా, మెదక్‌లో 88.14 శాతం, జనగామలో 88.62 శాతం డిజిటలైజేషన్ జరిగింది. సనత్‌నగర్‌లో అత్యల్పం హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సనత్‌నగర్‌లో డిజిటలైజేషన్ అత్యంత దారుణంగా ఉంది. ఫారాల పంపిణీ నూరు శాతం జరిగినప్పటికీ, భర్తీచేసి తిరిగివ్వకపోవడమే అందుకు కారణం. అక్కడ 42.96 శాతం మాత్రమే డిజిటలైజేషన్ జరిగింది. పాతబస్తీలోని బహదూర్‌పురాలో అత్యధికంగా 54.27 శాతం డిజిటలైజేషన్ జరిగింది. ముషీరాబాద్(43.16), మలక్‌పేట(43.93), జూబ్లీహిల్స్(44.63), సనత్‌నగర్ (42.96) నియోజకవర్గాల్లో 45 శాతం కూడా జరగకపోవడం గమనార్హం. -
5వ అంతస్తు నుంచి దూకి వైద్య విద్యార్థిని ఆత్మహత్య
హైదరాబాద్: ఓ వైద్య విద్యార్థిని 5వ అంతస్తు నుంచి దూకి మృతిచెందిన సంఘటన కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం మైలారం గ్రామానికి చెందిన వడ్లకొండ ఆనందచారి, తన భార్య అరుణ, పిల్లలతో కలిసి నాగారం వెస్ట్ గాం«దీనగర్ భవానీ ప్యారడైజ్ అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. వారి కుమార్తె దీక్షిత (28) ఎంబీబీఎస్ పూర్తి చేసుకొని పైచదువుల నిమిత్తం ఆరు నెలల కిందట కర్ణాటకలోని సిద్ధార్థ వైద్య కళాశాలలో చేరి పీజీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈనెల 17న నాగారంలోని ఇంటికి వచి్చంది. శుక్రవారం మధ్యాహ్నం అపార్ట్మెంట్ 5వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. వెంటనే కుటుంబసభ్యులు ఆమెను స్థానికంగా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఇంట్లో ఎలాంటి గొడవలు లేవని, ఎలాంటి అనుమానాలు లేవని తల్లిదండ్రులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
క్యూర్ జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) పరిధిలో నిర్మించే ఎల్ఐజీ (ఇందిరమ్మ ఇళ్లు) ఇళ్లు జనావాసాల పరిధిలోనే ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల వివిధ శాఖలకు సంబంధించి నిరుపయోగంగా ఉన్న స్థలాలను గుర్తించి వాటిని ఈ ఇళ్ల నిర్మాణానికి కేటాయించాలని, ప్రతిగా ఆయా శాఖలకు వేరే చోట స్థలాలు ఇవ్వాలని సూచించారు. జనావాసాలకు దూరంగా ఇళ్లను కేటాయిస్తే, ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఇబ్బందులు తలెత్తడంతో పాటు అవి నిరుపయోగంగా మారే అవకాశం ఉందని సీఎం పేర్కొన్నారు.అలా కాకుండా పని ప్రదేశాలకు దగ్గరగా, జనావాసాల పరిధిలోనే ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తే నిరుపేదలు జీవనోపాధి కోల్పోకుండా ఉంటారని స్పష్టం చేశారు. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై శుక్రవారం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇళ్ల నిర్మాణానికి చేపట్టిన చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో గుర్తించిన స్థలాల వివరాలను అధికారులు సీఎం దృష్టికి తేగా.. పోలీస్, రెవెన్యూ, రవాణా శాఖలకు సంబంధించి ఇప్పటికే గుర్తించిన నిరుపయోగ స్థలాలను తీసుకుని, సంబంధిత శాఖలకు వేరేచోట స్థలాన్ని కేటాయించాలని సీఎం ఆదేశించారు.సంబంధిత నియోజకవర్గాల పరిధిలో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తించే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, డీజీపీ సీవీ ఆనంద్, ఆర్ అండ్ బీ స్పెషల్ సీఎస్ వికాస్‌రాజ్, సీఎం ముఖ్య కార్యదర్శులు ఎన్.శ్రీధర్, వి.శేషాద్రి, రెవెన్యూ కార్యదర్శి లోకేష్ కుమార్, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, హౌసింగ్ ప్రత్యేక కార్యదర్శి వీపీ గౌతమ్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆల, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
హైదరాబాద్ : శిల్పకళా వేదికలో ధన్య ప్రసాద్ కూచిపూడి (ఫొటోలు)
-
హైదరాబాద్‌లో హైటెన్షన్.. బీఆర్ఎస్ Vs యూత్ కాంగ్రెస్..
బీఆర్ఎస్ నిరసనలు అప్డేట్స్..ఇందిరా పార్క్ చేరుకున్న కేటీఆర్నల్ల చొక్కా ధరించి నిరసనలో పాల్గొన్న కేటీఆర్భారీగా చేరుకున్న విద్యార్థులు, బీఆర్ఎస్ విద్యార్థి విభాగంనీట్ పేపర్ లీక్ వ్యవహారంతో ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థులకు సంఘీభావంగా మౌనం పాటించిన కేటీఆర్మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కామెంట్స్..ఆదర్శనగర్ ఎమ్మెల్యే క్వాటర్స్బీజేపీ-బీఆర్ఎస్ రెండు ఒక్కటే..గత బీఆర్ఎస్ హయాంలో జరిగిన పేపర్ లీక్స్ వల్ల అనేక మంది విద్యార్థులు చనిపోయారు.కేటీఆర్‌ని అడ్డుకొని తీరుతాము.అరెస్ట్ చేసినా మళ్ళీ వచ్చి అడ్డుకుంటాము.బీజేపీ హయంలోనూ పేపర్ లీకులే జరుగుతున్నాయి.సెంట్రల్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. నల్ల చొక్కాతో నిరసనల్లో కేటీఆర్..నల్లచొక్కా ధరించి నిరసనలో పాల్గొననున్న కేటీఆర్ఇందిరా పార్క్ వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసనఢిల్లీలో విద్యార్థులు, యువత పోరాటానికి బీఆర్ఎస్ సంఘీభావంపోలీసుల మోహరింపు..గాంధీ భవన్ బయట భారీగా మోహరించిన పోలీసులు...నిరుద్యోగ జేఏసీ గాంధీ భవన్ ముట్టడి నేపథ్యంలో బందోబస్తు ఏర్పాటు..అడ్డుకున్న పోలీసులు..ఆదర్శ్ నగర్ నుంచి ఇందిరాపార్కు వెళ్లేందుకు ర్యాలీగా బయలుదేరిన యూత్ కాంగ్రెస్ నేతలు..భారీగా మోహరించిన పోలీసులుఎమ్మెల్యే క్వార్టర్స్ గేటు దాటకుండా అడ్డగిస్తున్న పోలీసులుపలువురు నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులునగరంలో మరోసారి హైటెన్షన్ నెలకొంది. ఇందిరా పార్క్ వద్ద బీఆర్ఎస్ చేపట్టనున్న నిరసన దీక్షను అడ్డుకుంటామని యూత్ కాంగ్రెస్ తాజాగా ఓ ప్రకటనలో పేర్కొంది. గతంలో పేపర్ లీక్‌లకు కారణం అయిన బీఆర్ఎస్ ఇప్పుడు నిరసన పేరుతో నాటకం ఆడుతుందని యూత్ కాంగ్రెస్ ఆరోపించింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను అడ్డుకుంటామని యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అరవింద్ హెచ్చరించారు.ఇందిరా పార్క్ వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసనఢిల్లీలో విద్యార్థులు, యువత పోరాటానికి బీఆర్ఎస్ సంఘీభావంనిరసనలో పాల్గొననున్న విద్యార్థులు, కేటీఆర్, బీఆర్ఎస్ నేతలుకాసేపట్లో ఇందిరా పార్క్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్మరోవైపు ఇందిరాపార్క్ వద్ద పోలీసుల బందోబస్త్బీఆర్ఎస్ నిరసనను అడ్డుకుంటామన్న కాంగ్రెస్దీంతో బీఆర్ఎస్ నిరసన కార్యక్రమం వద్ద పోలీస్ బందోబస్త్బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనకు మధ్యాహ్నం 2 గంటల వరకు అనుమతిపోలీసుల భారీ బందోబస్తు..ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు భారీ గా చేరుకుంటున్న యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు..బీఆర్ఎస్ హయాంలో పేపర్ లీక్‌లకు కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్..నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్..మరికాసేపట్లో ర్యాలీగా ఇందిరా పార్క్ వరకు వెళ్లనున్న యూత్ కాంగ్రెస్ నేతలు..కేటీఆర్‌ను అడ్డుకుంటామని యూత్ కాంగ్రెస్ హెచ్చరించిన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు.నిరసనలకు కేటీఆర్..మరోవైపు.. ఉదయం పది గంటల నుంచి ఇందిరాపార్క్ వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసనఢిల్లీలో విద్యార్థులు, యువత పోరాటానికి బీఆర్ఎస్ సంఘీభావంనిరసనలో పాల్గొననున్న కేటీఆర్, ఇతర బీఆర్ఎస్ నేతలుఆంక్షలు ఇలా..కేటీఆర్ ధర్నాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆంక్షలతో కూడిన అనుమతి1000 మందికి మించి ధర్నా చేయరాదుమధ్యాహ్నం 2 గంటల లోపే ధర్నా ముగించాలిసచివాలయం, అసెంబ్లీ వైపు వెళ్ళరాదుమైక్ సౌండ్లు కూడా పరిమితిలో వినియోగించాలి. -
నా భర్తకు తెలిస్తే నా జీవితం నాశనమవుతుంది..!
హైదరాబాద్: ఓ మహిళ నగ్న ఫొటోలను ఆమె భర్తకు చూపిస్తానని బెదిరించిన వ్యక్తిపై పోచారం ఐటీ కారిడార్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన మేరకు.. ఇన్ఫోసిస్ పోచారం క్యాంపస్‌లో సె క్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న మహిళ (34)కు హెడ్ సెక్యూరిటీ గార్డు బి.రమేషతో పరిచయం ఏర్పడి సన్నిహతంగా మెలిగారు. ఈ క్రమంలో ఆమెకు తెలికుండా తీసిన నగ్న ఫొటోలను రమేష్ ఆమెకే చూపించాడు. ఈ విషయం గురించి భర్తకు చెబితే తన కు టుంబ జీవితమే నాశనమవుతుందని భయపడి చెప్పలేదు. ఇదిలా ఉండగా, సోమవారం రమేష్ బాధితు రాలికి ఫోన్ చేసి బెదిరించి తనకు సహకరించకపోతే రహస్య ఫొటోలను భర్తకు చూపిస్తానని బెదిరించాడు. దీంతో ఆమె గురువారం ఫిర్యాదు చేసింది. -
క్యాబ్ ఎక్కాలంటేనే భయం!
శంషాబాద్ విమానాశ్రయం నుంచి రెండురోజుల క్రితం క్యాబ్‌లో నగరానికి వస్తున్న ఓ ఎయిర్‌లైన్స్‌కు చెందిన మహిళా ఉద్యోగిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.6 నెలల క్రితం ఈసీఐఎల్ నుంచి ఎయిర్‌పోర్టుకు వెళ్తున్న ప్రయాణికురాలి పట్ల అనుచితంగా ప్రవర్తించిన క్యాబ్ డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.సాక్షి, హైదరాబాద్: నగరంలో తరచూ ఎక్కడో ఒకచోట ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. క్యాబ్‌లు, ఆటోలు తదితర ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. ఒంటరిగా ప్రయాణం చేసే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, లైంగిక వేధింపులకు పాల్పడడం వంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి సందర్భాల్లో బాధితులు పోలీసులను ఆశ్రయించినప్పుడే కేసులు నమోదవుతున్నాయి. కానీ నిశి్చంతగా, నిర్భయంగా ప్రయాణం చేసే సదుపాయం మాత్రం అందుబాటులోకి రావడం లేదు. అభయ, దిశ ఉదంతాల తర్వాత ప్రతి వాహనానికీ ట్రాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని రవాణాశాఖ నిర్ణయించినా అది అమలులోకి రాకపోవడం దురదృష్టకరం.రహదారి భద్రతా చట్టంపై నిర్లక్ష్యం..కేంద్రం రూపొందించిన రహదారి భద్రతా చట్టం ప్రకారం అన్ని రకాల రవాణా వాహనాల్లో వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైజ్ (వీఎల్టీడీ) తప్పనిసరిగా ఉండాలి. ఈ వ్యవస్థను కలిగిన వాహనాలకే రవాణాశాఖ ఫిట్నెస్ ధ్రువీకరించాలి. ప్రస్తుతం ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో దీన్ని పటిష్టంగా అమలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో మాత్రం ఇప్పటి వరకూ అమలులోకి రాలేదు. మహిళా ప్రయాణికుల భద్రతతో పాటు అన్ని వర్గాల ప్రయాణికుల భద్రత దృష్ట్యా వీఎల్టీడీ ఎంతో అవసరం. దీంతో జీపీఎస్ ట్రాకర్ ద్వారా వాహనం రియల్‌టైమ్ లొకేషన్ నమోదవుతుంది. వాహనం వేగం, రూట్ చరిత్ర వంటివి నిక్షిప్తమవుతాయి. ప్రమాదాలు జరిగినప్పుడు రెస్క్యూ సిబ్బంది త్వరతిగతిన అక్కడికి చేరుకోవచ్చు. ఆర్టీసీ, ప్రైవేట్, స్కూల్ బస్సులు, క్యాబ్‌లు, ఆటోలు, మ్యాక్సీ క్యాబ్‌లతో పాటు వస్తు రవాణా వాహనాలకు కూడా వీఎల్టీడీ తప్పనిసరి అని చట్టంలో ఉంది.వాహన్‌తో అనుసంధానం..వీఎల్టీడీ కలిగిన వాహనాలకు మాత్రమే ఫిట్నెస్ సర్టిఫికెట్లు అందజేసేలా వాహన్ పోర్టల్‌లో మార్పులు చేశారు. అన్ని మెట్రో నగరాల్లో ఇది అమల్లో ఉంది. హైదరాబాద్‌లో మాత్రం ఇంకా అమల్లోకి రాలేదు. వీఎల్టీడీ లేకపోయినా ఆర్టీఏ అధికారులు ఫిట్నెస్ సర్టిఫికెట్లు అందజేస్తున్నారు. ఆ దిశగా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. గతంలో స్కూల్ బస్సులకు ట్రాకింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అప్పట్లో పాలెం బస్సు దగ్ధం నేపథ్యంలోనూ ఈ ప్రతిపాదన ముందుకొచి్చనా ఇప్పటివరకూ కార్యరూపం దాల్చలేదు. -
చెక్కుపై రూ.55 కోట్లు.. దిమ్మతిరిగే ప్లాన్! కానీ..
హైదరాబాద్, పంజగుట్ట: ఓ ఔషధ సంస్థకు చెందిన చెక్కుపై రూ.55 కోట్లు రాసుకుని బ్యాంకును, ఔషధ సంస్థను మోసం చేసేందుకు యత్నించిన వ్యక్తిపై పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన మేరకు.. బెంగళూరుకు చెందిన మైక్రోల్యాబ్స్ అనే ఔషధ సంస్థకు బెంగళూరు కెనరాబ్యాంకులో అకౌంట్ ఉంది.2024లో వీరి చెక్ బుక్ నిండిపోవడంతో కొత్త చెక్ బుక్ కోసం దరఖాస్తు చేస్తూ పాత చెక్‌బుక్ లోని ఆఖరు చెక్కును సంతకం చేసి ఎలాంటి నగదు వివరాలు రాయకుండా దరఖాస్తుతో పాటు పొందుపర్చి బ్యాంకులో దరఖాస్తు చేసుకున్నారు. కాగా ఆ చెక్కును యూపీకి చెందిన జగత్సింగ్ అనే వ్యక్తి సేకరించి అందులో రూ.55 కోట్లు రాసుకుని సోమాజిగూడలోని కెనరాబ్యాంకులో ఉన్న తన ఖాతాకు బదిలీ చెసుకునేందుకు ప్రయత్నించాడు.బ్యాంకు అధికారులకు అనుమానం వచ్చి సదరు ఔషధ సంస్థను సంప్రదించడంతో వారు ఈ చెక్కును తాము కొత్త చెక్కుబుక్ కోసం దరఖాస్తు చేస్తూ బ్యాంకులో ఇచ్చామని చెప్పడంతో నగదు బదిలీ ఆపారు. ఔషధ సంస్థ నిర్వాహకులు నగరానికి చేరుకుని గురువారం అసలు బ్యాంకులో సమర్పించిన తమ చెక్కు బయటకు ఎలా వచ్చిందో తెలుసుకోవడంతో పాటు.. దాన్ని డ్రా చేసుకునేందుకు యత్నించిన జగత్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
బాత్ రూమ్‌కి వెళ్ళాలంటే అడిగి వెళ్ళాలి..!
హైదరాబాద్: దుండిగల్ సర్కిల్ పరిధిలోని బహదూర్‌పల్లి టెక్ మహీంద్రా కార్యాలయం ఎదుట ఓ మహిళా సాఫ్ట్వేర్ ఉద్యోగి ధర్నాకు దిగింది. అకారణంగా తనను ఉద్యోగం నుంచి తొలగించారని ఆరోపిస్తూ న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. గుంటూరు జిల్లాకు చెందిన రాజుపాలెం భావన ఈసీఐఎల్ లో నివాసము అంటూ బహదూర్ పల్లి లోని టెక్ మహీంద్రా లో ప్రాసెస్ అసోసియేట్ పనిచేస్తుంది. మూడు రోజులుగా సెలవు తీసుకున్నందున తనను ఉద్యోగం నుంచా అకారణంగా తీసి వేశారు అంటూ బుధవారం దుండిగల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఎలాంటి న్యాయం దొరకకపోవడంతో గురువారం టెక్ మహేంద్ర ముందు కూర్చొని నిరసనకు దిగింది. విషయం తెలుసుకున్న దుండిగల్ పోలీసులు అక్కడికి చేరుకొని యాజమాన్యంతో మాట్లాడగా తనకు ఎలాంటి న్యాయం చేయలేదంటూ బాధితురాలు భావన ఆరోపించింది. ఈ సందర్భంగా భావన మాట్లాడుతూ తన కుమార్తె అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఈనెల 17, 18 20 మూడు రోజులు సెలవు కావాలని యాజమాన్యానికి ముందుగానే సమాచారం ఇచ్చి అనుమతి కోరినట్లు వెల్లడించింది. సెలవు కోరిన అనంతరం తనను ఉద్దేశపూర్వకంగా వేధిస్తూ ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ఈ మెయిల్ ద్వారా సమాచారం అందిందని ఆరోపించింది. యాజమాన్యం తమపై అనవసర ఒత్తిడి తెస్తోందని, వాష్‌రూమ్‌కు వెళ్లాలన్నా అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని భావన పేర్కొంది. అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ విధులకు హాజరు కావాలని ఈ మెయిల్ ద్వారా ఆదేశించారని, సిక్ లీవ్‌కు వేతనం చెల్లించకపోయినా పనికి రావాలని ఒత్తిడి చేశారని ఆరోపించింది. దుండిగల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తనకు న్యాయం జరగలేదని, నాకు న్యాయం జరిగే వరకూ కంపెనీ ముందు నిరసన కొనసాగుతుందని సాయంత్రం వరకు అలాగే బైఠాయించింది. మేడ్చల్‌లోని టెక్ మహీంద్రా కంపెనీ ముందు ధర్నాకు దిగిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని భావనతనను అకారణంగా జాబ్‌లో నుంచి తీసివేశారని, పాపకు ఆరోగ్యం బాగాలేదని 3 రోజులు సెలవు కావాలని కోరితే ఉద్యోగం నుంచి తీసేశారని భావన ఆవేదనఆరోగ్యం బాగాలేక కంపెనీలో పడిపోతే కనీసం పట్టించుకోలేదని, 14 రోజులు… https://t.co/9iimUJ6vu4 pic.twitter.com/J6pHXZQlew— Telugu Scribe (@TeluguScribe) July 23, 2026 -
10వ అంతస్తునుంచి దూకిన సాఫ్ట్వేర్ ఇంజనీర్..
హైదరాబాద్, మణికొండ: అపార్ట్మెంట్ 10వ అంతస్తునుంచి దూకి ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఫైనాన్షియల్ జిల్లా పుప్పాలగూడలో జరిగింది. నార్సింగి పోలీసులు, స్థానికులు తెలిపిన మేరకు.. జేపీ మోర్గాన్ చేజ్ అనే ఐటీ సంస్థలో మబ్బు విష్ణువర్దన్‌రెడ్డి(27) సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. బుధవారం రాత్రి విధులు ముగించుకుని ఏఎస్బీఎల్ స్పెక్ట్రా అపార్ట్మెంట్ 10వ అంతస్తులోని తన ఫ్లాట్‌కు వచ్చి పడుకున్నాడు. అయితే గురువారం తెల్లవారు జామున గ్రౌండ్ ఫ్లోర్లో అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. పోలీసులు వెళ్లి చూడగా అప్పటికే మరణించినట్టు నిర్ధారించారు. పోస్టుమార్టం, దర్యాప్తు అనంతరం వివరాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు తెలిపారు. -
హైదరాబాద్ హెడ్ కోచ్‌గా అనిరుధ్ సింగ్
సాక్షి, హైదరాబాద్: దేశవాళీ కొత్త సీజన్ (2026–27)లో పాల్గొనే వేర్వేరు హైదరాబాద్ జట్లకు కోచ్ బృందాలను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ప్రకటించింది. సీనియర్ టీమ్ హెడ్ కోచ్‌గా మాజీ క్రికెటర్ అనిరుధ్ సింగ్‌ను ఎంపిక చేశారు. 46 ఏళ్ల అనిరుధ్ 2000–2010 మధ్య 47 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. ఆ తర్వాత శిక్షణ వైపు వెళ్లిన అతను ఛత్తీస్‌గఢ్ రంజీ టీమ్‌కు కూడా కోచ్‌గా వ్యవహరించాడు. సీనియర్ టీమ్‌కు అసిస్టెంట్ కోచ్‌గా మరో మాజీ బ్యాటర్ బావనక సందీప్‌ను హెచ్‌సీఏ ఎంపిక చేసింది. సందీప్‌కు కూడా 58 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల అనుభవం ఉంది. సీనియర్ టీమ్‌కు మాజీ పేసర్ ఆల్ఫ్రెడ్ అబ్సలమ్ బౌలింగ్ కోచ్‌గా, అభినవ్ కుమార్ ఫీల్డింగ్ కోచ్‌గా వ్యవహరిస్తారు. మరోవైపు గత సీజన్లో సీనియర్ టీమ్‌కు కోచ్‌గా పని చేసిన డీబీ రవితేజకు ఈసారి హైదరాబాద్ అండర్–23 టీమ్ హెడ్ కోచ్ బాధ్యతలు అప్పగించారు. ఈ టీమ్‌కు బెన్ జాన్సన్ బౌలింగ్, రొనాల్డ్ రోడ్రిగ్స్ ఫీల్డింగ్ కోచ్‌లుగా పని చేయనున్నారు. హైదరాబాద్ అండర్–19 టీమ్ కోసం కోచ్‌లనూ హెచ్‌సీఏ ప్రకటించింది. అభిజిత్ ఛటర్జీ హెడ్ కోచ్‌గా, పి.శశాంక్ నాగ్ బ్యాటింగ్, అబ్దుల్ ఖాదర్ ఫీల్డింగ్ కోచ్‌లుగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. హైదరాబాద్ అండర్–16 జట్టుకు ఎస్.కిరణ్ కుమార్ హెడ్ కోచ్‌గా, మొహమ్మద్ ముషారఫ్ ఖాన్ బౌలింగ్ కోచ్‌గా, నితిన్ ఆంథోనీ ఫీల్డింగ్ కోచ్‌గా వ్యవహరిస్తారు. -
గంటల వ్యవధిలో.. భారీగా తగ్గిన బంగారం రేటు!
బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు ఊహకందని మార్పులు జరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు (గురువారం) ఉదయం రూ.770 పెరిగి రూ.1,47,280 వద్ద ఉన్న 24 క్యారెట్ల గోల్డ్ రేటు, సాయంత్రానికి భారీగా తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి రేట్లలో స్వల్ప మార్పు జరిగాయి. ఈ కథనంలో కొత్త ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు క్షుణ్ణంగా తెలుసుకుందాం.గురువారం (జులై 23) ఉదయం రూ.1,47,280 (తులం 24 క్యారెట్స్ గోల్డ్), రూ.1,35,000 (తులం 22 క్యారెట్స్ గోల్డ్) వద్ద బంగారం రేటు, సాయంత్రానికే రూ.1,46,180.. రూ.1,34,000 వద్దకు చేరింది. అంటే గంటల వ్యవధిలో రూ.1100, రూ.1000 తగ్గింది. దీన్నిబట్టి చూస్తే.. గోల్డ్ రేటు ఎంత మారిందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.ఢిల్లీలో కూడా బంగారం ధరలో గణనీయమైన మార్పు ఏర్పడింది. దీంతో ఉదయం, సాయంత్రం ధరలకు చాలా వ్యత్యాసం కనిపించింది. ఇక్కడ ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.146330 వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ.1,34,150 వద్ద ఉంది. అయితే.. చెన్నైలో మాత్రం ఈ రోజు సాయంత్రానికి ధరల్లో మార్పు కనిపించలేదు. -
రుద్రమదేవిలా హైదరాబాద్ నుంచి జంతర్ మంతర్‌కు అమ్మాయి
న్యూఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. చాలా మంది యువతులు ఒంటరిగానే జంతర్ మంతర్‌కు వస్తున్నారు. ఓ అమ్మాయి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఒంటరిగా వెళ్లి వీడియో తీసి పోస్ట్ చేసింది. ‘‘అందరికీ హాయ్. నేను ఇప్పుడు నిరసనలో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్తున్నాను. నేను ఏం చేస్తున్నానో కూడా నాకు పూర్తిగా తెలియడం లేదు. ఇది ఎలా చేస్తానో కూడా తెలియదు. నేను ఎక్కడికి వెళ్తున్నానో మా తల్లిదండ్రులకు చెప్పలేదు. బయటకు వెళ్తున్నానని మాత్రమే చెప్పాను. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి విమానంలో వెళ్తున్నాను. నేను ఒంటరిగానే వెళ్తుండటంతో చాలా భయంగా ఉంది. ఢిల్లీలో నాకు ఎవరూ తెలియరు. అయినా సరే... ఎలాగోలా ధైర్యం చేసి బయల్దేరాను. నాకు తెలుసు...’’ అని ఆమె వ్యాఖ్యానించింది.Many girls are coming solo to Jantar Mantar.She is from Hyderabad.@Cockroachisback pic.twitter.com/MvK7CWd4XE— 🪳Against Corruption (@akashuchani08) July 22, 2026ఒకరు ఎక్స్‌లో ఇదే వీడియోను పోస్ట్ చేస్తూ... ‘‘ఈమె హైదరాబాద్‌కు చెందిన యువతి. ఈమె పేరు తెలిసింది. హైదరాబాద్‌కు చెందిన దిశ. దిశ ఢిల్లీ చేరుకుంది. విమానాశ్రయం నుంచి ర్యాపిడో బైక్‌లో నేరుగా నిరసన ప్రదేశానికి వెళ్లింది. అక్కడ విద్యార్థులతో కలిసి నిరసనలో పాల్గొంటోంది.తాను క్షేమంగా ఉన్నానని, ఎలాంటి ఇబ్బంది లేదని దిశ తెలిపింది. ఢిల్లీ చేరిన వెంటనే తన తల్లికి ఫోన్ చేసి జరిగిన విషయం అంతా చెప్పింది. ముందుగానే చెప్పి ఉంటే తల్లిదండ్రులు ఒప్పుకునే వారు కాదనే ఉద్దేశంతో ముందస్తుగా చెప్పలేదని తెలిపింది. అయితే తనకు నమ్మకమైన ఓ స్నేహితుడికి ప్రతి విషయం చెబుతూ, ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చింది. దారిలో కలిసిన మంచి మనసున్న వారు ఆమెకు నీరు, డ్రై ఫ్రూట్స్ ఇచ్చారు. దిశ రుద్రమదేవి, సమ్మక్క–సారలమ్మ, చాకలి ఐలమ్మ నేలపై పుట్టిన యువతి. తెలంగాణ మహిళలు ఒకప్పుడు తుపాకీ చేతబట్టి రైతాంగ పోరాటంలో పాల్గొన్నారు. అలాంటి ధైర్యసాహసాల సంప్రదాయం నుంచి వచ్చిన వారే వారు. దిశపై ఎంతో గర్వంగా ఉంది. మనందరి గొంతును ఆమె బలంగా వినిపిస్తుందనే నమ్మకం ఉంది. ముందుకు సాగు దిశ. ఇంక్విలాబ్ జిందాబాద్’’ అని అందులో పేర్కొన్నారు.దేశ వ్యాప్తంగా ఆందోళనలునీట్ యూజీ పరీక్షలో అక్రమాలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో జూలై 24న దేశవ్యాప్త నిరసనలకు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) పిలుపునిచ్చింది. ప్రశ్నపత్రం లీక్ అంశంపై ప్రభుత్వం పలుమార్లు హామీ ఇచ్చినా, చర్చలకు ఆహ్వానించినా సీజేపీ తన ఆందోళన కొనసాగిస్తోంది.దేశవ్యాప్తంగా పోలీసుల దౌర్జన్యానికి గురైన బాధితులకు సంఘీభావంగా ఈ నిరసన చేపడుతున్నామని సీజేపీ తెలిపింది. అనుమతులు, ఇతర ఏర్పాట్ల విషయంలో విద్యార్థి సంఘాలు, ఇతర సంస్థలు కలిసి పనిచేయాలని సూచించింది. "సమావేశాల ముందు విద్యార్థుల డిమాండ్లను గట్టిగా చదవాలి. పోలీసుల దౌర్జన్యానికి గురైన వారికి సంఘీభావం ప్రకటించాలి. ఇంక్విలాబ్ జిందాబాద్, భారత్ మాతా కీ జై" అని ప్రకటనలో పేర్కొంది. "జై హింద్, భారత్ మాతా కీ జై, ఇంక్విలాబ్ జిందాబాద్, జై భీమ్" వంటి సానుకూల నినాదాలే ఇవ్వాలని, జరిగిన ప్రతిదాన్ని రికార్డు చేయాలని ఆందోళనకారులకు సూచించింది.ఏ పరిస్థితి ఎదురైనా శాంతియుతంగా, అహింసా మార్గంలోనే నిరసన కొనసాగించాలని సీజేపీ తెలిపింది. అనుమతి ఇచ్చిన ప్రాంతంలోనే ఉండాలని, అనుమతి పొందిన మార్గాల్లోనే వెళ్లాలని, రెచ్చగొట్టే, పరువునష్టం కలిగించే, మత విద్వేషం రెచ్చగొట్టే లేదా ద్వేషపూరిత వ్యాఖ్యలు చేయవద్దని సూచించింది. Found her name. She is Disha from Hyderabad. She reached Delhi. From the airport took a rapido and directly and reached the protest site. She is there with the protesting students.She says she is safe and absolutely fine. The moment she landed in Delhi, she called her… pic.twitter.com/R4FHNa8311— Revathi (@revathitweets) July 23, 2026 -
డీజీపీ ఆఫీసులో కానిస్టేబుల్ ఆత్మహత్య.. గన్‌తో కాల్చుకుని..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ స్వామి తన సర్వీస్ తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వాష్‌రూమ్‌లో గన్‌తో కాల్చుకుని మృతి చెందాడు. కాగా, స్వామి.. గ్రేహౌండ్స్‌లో విధులు నిర్వహిస్తున్నట్టు తెలిసింది. కాగా, కానిస్టేబుల్ స్వామి సూసైడ్ నోట్ రాసి పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ క్రమంలో తన లెటర్లో..‘నా భర్య పిల్లలను ఏమీ అనవద్దు. దెయ్యం అయినా కూడా వాళ్లను చూసుకుంటాను’ అని సూసైడ్ నోట్లో రాసుకొచ్చాడు. అయితే, స్వామి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న వెంటనే డీజీపీ ఆఫీసుకు చేరుకుని ఆత్మహత్య స్థలాన్ని ఫొరెన్సిక్, క్లూస్ టీం అధికారులు పరిశీలించారు. స్వామి ఆత్మహత్యకు గల పూర్తి కారణాలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. కాసేపట్లో ఉస్మానియా మార్చురీకి స్వామి మృతదేహాన్ని తరలించనున్నారు. -
నార్సింగి పరిధిలో వాటర్ ట్యాంకర్ బీభత్సం...
హైదరాబాద్, మణికొండ: విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఓ కార్పెంటర్‌ను వాటర్ ట్యాంకర్ వెనకనుంచి ఢీకొనడంతో అక్కడికకకడే మృతి చెందాడు. నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఎస్ఐ మునీందర్ తెలిపిన మేరకు.. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన సుశీల్‌కుమార్(28), సురేష్‌లు కాటేదాన్‌లోని లక్ష్మీగూడలో నివాసముంటున్నారు.హఫీజ్‌పేట్‌లోని ఓ అపార్ట్మెంట్లో పని ముగించుకుని రాత్రి తమ ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళుతుండగా పుప్పాలగూడ టోల్గేట్ వద్ద అతివేగంగా వచ్చిన నీటి ట్యాంకర్ వీరిని ఢీకొట్టింది. వెనుక కూర్చున్న సుశీల్‌కుమార్ అక్కడికక్కడే మృతి చెందగా సురేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతనిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లారు. మరో కారు, మరొక స్కూటీలను కూడా ట్యాంకర్‌ఢీకొట్టింది. అయితే వారికి ఎవరికీ గాయాలు కాలేదు. ఖానాపూర్ గ్రామానికి చెందిన డ్రైవర్ రంజిత్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. -
ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డి కేసు పూటకో మలుపు
-
ఫలమా.. ఫలహారమా?
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగర సంస్కృతికి ప్రతీకగా నిలిచే చారిత్రాత్మక బోనాల ఉత్సవాలను అత్యంత వైభవంగా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తల్తెత్తకుండా నిర్వహించేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సిద్ధమైంది. ఆరు జోన్లలో వివిధ సర్కిళ్ల పరిధిలో రోడ్ల మరమ్మతులు, విద్యుద్దీపాలు, పారిశుద్ధ్యం తదితర మౌలిక వసతుల కల్పనకు రూ.26 కోట్లు కేటాయిస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 444 పనులను గుర్తించి నిధులు మంజూరు చేశారు.జోన్ల వారీగా ఇలా.. కేటాయింపుల్లో రాజేంద్రనగర్, చార్మినార్ జోన్లకు సింహభాగం నిధులు దక్కాయి. రాజేంద్రనగర్ జోన్ పరిధిలో అత్యధికంగా 160 పనుల కోసం రూ.8.79 కోట్లు కేటాయించారు. ఇందులో ముఖ్యంగా జంగమ్మెట్ సర్కిల్లో 96 పనులకు రూ.5.63 కోట్లు ఖర్చు చేయనున్నారు. చార్మినార్ జోన్లో 137 పనులకు రూ.8.65 కోట్లు మంజూరయ్యాయి. చార్మినార్ సర్కిల్లోనే రూ.3.98 కోట్లతో పనులు చేపట్టనున్నారు. గోల్కొండ జోన్లో 89 పనులకు రూ.5.95 కోట్లు, గోల్కొండ సర్కిల్లో రూ.2.54 కోట్లతో 27 పనులు చేపట్టనున్నారు. ఉజ్జయినీ మహంకాళి బోనాలకు కేంద్రమైన సికింద్రాబాద్ పరిధి లో 32 పనులకు రూ.1.35 కోట్లు మంజూరు చేశారు. శంషాబాద్ జోన్లో 20 పనులకు రూ.93.40 లక్షలు కేటాయించారు. ఖైరతాబాద్ ఈ జోన్లో కేవలం 6 పనులు గుర్తించి అత్యల్పంగా రూ.30.55 లక్షలు మంజూరు చేశారు. బిల్లులకు చిల్లు.. బోనాల ఏర్పాట్లకు నిధుల మంజూరు హర్షణీయమే.. కానీ.. ఈ సారైనా పనులు సక్రమంగా చేస్తారా? లేక గతంలో మాదిరిగానే బిల్లులతోనే ఫలహారంలా పంచుకుంటారా? అని నగర వాసులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో అనుభవాలను పరిశీలిస్తే.. బోనాల ఉత్సవాల వేళ జీహెచ్ఎంసీ చేసే ఖర్చులపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సగం పనులు కూడా పూర్తి చేయకుండానే, ఉత్సవాలు ముగిసిన వెంటనే 'పనులు పూర్తయ్యాయి’ అంటూ దొంగ బిల్లులు సృష్టించి ఖజానాను గుల్ల చేయడం పరిపాటిగా మారింది. చాలా ప్రాంతాల్లో పాత రంగులపైనే మళ్లీ నాసిరకం సున్నాలు చల్లడం, గుంతల రోడ్లకు మొక్కుబడిగా మట్టి కొట్టడం మినహా శాశ్వత పనులు చేసిన దాఖలాలు లేవు. -
పావురాల ఆహార నియంత్రణపై ఏం చర్యలు తీసుకున్నారు?
సాక్షి, హైదరాబాద్: జంట నగరాల్లో పావురాలకు విచ్చలవిడిగా ఆహారం వేయడంతో ప్రజారోగ్యం, పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడుతోందన్న అంశంపై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు తీసుకున్న చర్యలను అఫిడవిట్ రూపంలో సమరి్పంచాలని రాష్ట్ర ప్రభుత్వం, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) తదితర ప్రతివాద అధికారులను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఆగస్టు 25కు వాయిదా వేసింది.పావురాల కారణంగా ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోందంటూ ముషీరాబాద్‌కు చెందిన డాక్టర్ రాధేశ్యామ్ తపాడియా హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యాన్ని (పిల్) దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది.పిటిషనర్ న్యాయవాది దీపక్ మిశ్రా వాదనలు వినిపిస్తూ.. హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లోని నివాస కాలనీలు, ఆసుపత్రులు, ప్రజా ప్రదేశాలు, చారిత్రక కట్టడాల వద్ద పావురాలకు నిర్బంధం లేకుండా ఆహారం వేయడంతో ఆరోగ్య సమస్యలు, పర్యావరణ కాలుష్యం పెరుగుతున్నాయన్నారు. అనుమతి లేకుండా ఆహారం వేస్తున్న వారిపై జరిమానాలు విధించేలా, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన సుప్రీంకోర్టు తీర్పులను అమలు చేసేలా ఉత్తర్వులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న ధర్మాసనం.. పావురాలకు ఆహారం వేయడాన్ని నియంత్రించేందుకు ఇప్పటివరకు తీసుకున్న చర్యలను తెలియజేయాలని ప్రతివాదులను ఆదేశించింది. -
'ఆహా'ర హైదరాబాదీ జంతర్ మంతర్!
సాక్షి, హైదరాబాద్: నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి నిరసనగా, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా నిరసనకు దిగిన ఆందోళనకారులకు హైదరాబాదీలు ఫుడ్ సపోర్ట్ అందిస్తున్నారు. తమ దాతృత్వంతో సంఘీభావం చాటుతున్నారు. ముంబై, బెంగళూరు, చెన్నై, పుణె, కోల్‌కతా తదితర నగరాల యువత బాటలోనే హైదరాబాదీలు కూడా ఇక్కడినుంచే స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ యాప్‌ల ద్వారా ఢిల్లీలోని జంతర్ మంతర్ సమీప రెస్టారెంట్లకు ఆర్డర్లు ఇస్తున్నారు.ఆ పదార్థాలు అక్కడి నిరసనకారులకు అందేలా చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అనేక స్క్రీన్ షాట్లలో ‘ప్లీజ్ డి్రస్టిబ్యూట్ దిస్ ఫుడ్ టు ఎనీ వన్ హంగ్రీ ఎట్ జంతర్ మంతర్’ వంటి సందేశంతో ఆర్డర్లు ఇవ్వడం కనిపిస్తోంది. ఇలాంటివారిలో ముఖ్యంగా హైదరాబాద్‌కు చెందిన వినియోగదారులు ఉన్నట్లు పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. ఆన్లైన్ సేవలను వేగంగా స్వీకరించే నగరంగా పేరొందిన హైదరాబాద్ నుంచి కూడా ఈ తరహా సంఘీభావం వ్యక్తమవడం చర్చనీయాంశమైంది. మున్ముందు నగరంలోనూ...! ‘‘డిజిటల్ యుగంలో నిరసనలకు మద్దతు తెలిపే విధానం కూడా మారిపోతోంది. ఒక ఉద్యమానికి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యక్తి కేవలం మొబైల్ ఫోన్‌తో కొన్ని నిమిషాల్లో భోజనం పంపగలగడం సాంకేతికత తీసుకొచి్చన సామాజిక అనుసంధానత’’ అని సామాజిక విశ్లేషకులు అభివరి్ణస్తున్నారు. డబ్బు విరాళం ఇవ్వకుండా, నేరుగా అవసరమైన సమయంలో ఆహారం అందించడం అంటే నిరసనకారులకు ప్రత్యక్ష సహకారం అందజేసినట్లేనని పేర్కొంటున్నారు. మున్ముందు... మన నగరంలో ఏదైనా భారీ ఆందోళన కొన్ని రోజుల పాటు సాగితే ఇదే విధానం (ఆన్లైన్లో ఆందోళనకారులకు ఫుడ్ డెలివరీ ఆర్డర్) అవలంబించే అవకాశం లేకపోలేదని వివరిస్తున్నారు. -
మాల్.. క్యాపిటల్
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా వ్యవస్థీకృత రిటైల్ రంగం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రధాన నగరాల్లో ఈ విస్తరణను భారీ షాపింగ్ మాల్స్ శాసిస్తున్నాయి. దేశంలో అత్యధిక మాల్ విస్తీర్ణం, అత్యధిక మాల్స్గల నగరాల జాబితాలో ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై, బెంగళూరు తర్వాతి స్థానంలో హైదరాబాద్ నిలిచింది. ఈ విషయంలో చెన్నై, పుణే, కొచ్చి, కోల్‌కతా తదితర నగరాలు హైదరాబాద్‌కన్నా దిగువన ఉన్నాయి. ఈ నగరాల్లో అంతర్జాతీయ బ్రాండ్లు, లగ్జరీ స్టోర్లు, ఫుడ్–ఎంటర్టైన్మెంట్ జోన్లు పెద్ద ఎత్తున ఏర్పడటంతో ఇవి షాపింగ్ టూరిజానికి కేంద్రాలుగా కూడా మారుతున్నాయి. అతిపెద్ద షాపింగ్ మాల్ అక్కడే... ప్రస్తుతం విస్తీర్ణంపరంగా దేశంలోనే అతిపెద్ద షాపింగ్ మాల్గా కేరళలోని కొచ్చిలో ఉన్న లులు మాల్ గుర్తింపు పొందింది. దీని మొత్తం నిర్మాణ విస్తీర్ణం సుమారు 25 లక్షల చదరపు అడుగులు. ఇందులో 300కుపైగా బ్రాండ్లు, మల్టీప్లెక్స్, హైపర్ మార్కెట్, ఫుడ్ కోర్టులు, వినోద సదుపాయాలు భాగంగా ఉన్నాయి. దీంతో పోటీపడుతూ నగరంలోని శరత్ సిటీ క్యాపిటల్ మాల్ కూడా దేశంలోని అతిపెద్ద మాల్స్‌లో ఒకటిగా నిలిచింది.హైదరాబాద్ ప్రత్యేకత అదే మొత్తం మాల్ విస్తీర్ణంలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల తర్వాతి స్థానంలో హైదరాబాద్ ఉన్నప్పటికీ వేగవంతమైన మాల్ కల్చర్ వృద్ధిలో హైదరాబాద్ ముందుంది. భాగ్యనగరంలోని మాల్స్‌లో సగానికిపైగా ‘గ్రేడ్ ఎ’ మాల్స్ కావడం విశేషం. నాణ్యతపరంగా హైదరాబాద్ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని ఇటీవల నైట్ ఫ్రాంక్ నివేదిక వెల్లడించింది. ఐటీ ఉద్యోగులు, అధిక కొనుగోలు శక్తి, కొత్త నివాస ప్రాంతాల అభివృద్ధి కారణంగా గచ్చిబౌలి, కొండాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కూకట్పల్లి ప్రాంతాల్లో భారీ మాల్స్ వేగంగా పెరుగుతున్నాయి. భవిష్యత్తు నగరానిదే... రిటైల్ కన్సల్టెన్సీ సంస్థల నివేదికల ప్రకారం కొత్త మాల్స్ ప్రారంభం, అంతర్జాతీయ బ్రాండ్ల ప్రవేశం, ఐటీ కారిడార్ విస్తరణతో హైదరాబాద్‌లో రిటైల్ రంగం మిగిలిన నగరాలకన్నా వేగంగా అభివృద్ధి చెందుతోంది. 2025 ద్వితీయార్ధంలో దేశంలో రిటైల్ లీజింగ్‌లోనూ హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. రాబోయే కొన్నేళ్లలో హైదరాబాద్ షాపింగ్ రంగం అనూహ్యమైన వేగంతో అభివృద్ధి చెందనుంది. దీనికి నగరవ్యాప్తంగా ప్రస్తుతం నిర్మాణంలో అనేక మాల్స్, రిటైల్ కేంద్రాలు ఊతం ఇవ్వనున్నాయి. అభివృద్ధి చెందుతున్న నివాస, వాణిజ్య కేంద్రాల్లో రాబోయే ప్రాజెక్టులు, నగర విస్తరణకు తోడ్పడుతూ నివాసితులకు షాపింగ్, వినోదం, భోజన సౌకర్యాలను మరింత చేరువ చేయనున్నాయి. లైఫ్ స్టైల్ చిరునామాలుగా... కోకాపేట్, నార్సింగి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, రాజేంద్రనగర్, శంషాబాద్, మణికొండ వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో మరికొన్ని ప్రాజెక్టులు రానున్నాయి. పలు ప్రాజెక్టుల్లో మల్టీప్లెక్స్‌లు కూడా భాగం కావడంతో ఇవి కేవలం షాపింగ్ కేంద్రాలుగా కాకుండా జీవనశైలి కేంద్రాలుగా మారనున్నాయి. వాటిలో దేశంలోనే అతిపెద్ద మాల్గా చెబుతున్న నార్సింగిలోని లులు మాల్ కూడా ఉంది. దాదాపుగా 40 లక్షల చదరపు అడుగులకుపైగా కొత్త షాపింగ్ ఏరియా వస్తుండటంతో కోటిన్నర చదరపు అడుగులకు నగరం చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. -
హైదరాబాద్ వీరుడికి ఆస్ట్రేలియా శాశ్వత పౌరసత్వం
సాక్షి, హైదరాబాద్: ఆ్రస్టేలియాలోని బాండీ బీచ్‌లో గతేడాది డిసెంబర్ 14న యూదులు లక్ష్యంగా ఐసిస్ సానుభూతిపరులైన సాజిద్ అక్రమ్, నవీద్ అక్రమ్ మారణహోమానికి తెగబడ్డ వేళ 20 మందిని కాపాడిన హైదరాబాదీ వీరుడు రెహ్మత్ పాషాకు ఆ దేశ ప్రభుత్వం అరుదైన గౌరవం అందించింది. క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్న రెహ్మత్ పాషా ప్రదర్శించిన తెగువను పరిగణనలోకి తీసుకొని అతనికి శాశ్వత పౌరసత్వం కల్పించింది. అలాగే అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించే వారికి అందించే ఓజెడ్ బ్రేవరీ అవార్డుకు సైతం నామినేట్ చేసింది. ప్రజలను కాపాడే సమయంలో పాషా వినియోగించిన టోపీని మ్యూజియంలో పెట్టింది. వీలున్నంత వరకు సహకరించాలని... బాండీ బీచ్‌లో హనుక్కా వేడుకలు జరుపుకుంటున్న స్థానిక యూదులు లక్ష్యంగా ఇద్దరు దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరుపుతుండటంతో అప్రమత్తమైన రెహ్మత్ పాషా క్షతగాత్రులను కాపాడాలని నిర్ణయించుకున్నారు. క్షతగాత్రులను చెట్లు, బెంచీలు, స్టీల్ కిచెన్ నిర్మాణాల వెనుకకు ఈడ్చుకెళ్లారు. బాధితులను అంబులెన్సుల వరకు తరలించడంలోనూ కీలకపాత్ర పోషించారు. కానీ ఆ తర్వాత పాషా పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (పీడీఎస్డీ) బారినపడ్డారు. దీంతో తాత్కాలికంగా క్యాబ్ డ్రైవర్ ఉద్యోగానికి సైతం దూరమయ్యారు.దీనిపై స్పందించిన ఆ్రస్టేలియా ప్రభుత్వం.. పాషాకు ఆర్థిక సాయం, వైద్య చికిత్స, కౌన్సెలింగ్ అందించింది. తాజాగా ఆ్రస్టేలియా మంత్రి టోనీ బర్క్ స్వయంగా పాషాకు ఫోన్ చేసి పర్మనెంట్ రెసిడెన్సీ మంజూరు చేస్తున్నట్లు, ‘ఓజెడ్ బ్రేవరీ అవార్డు కోసం సిఫార్సు చేసినట్లు తెలిపారు. కాగా, ఈ మారణహోమానికి పాల్పడ్డ సాజిద్, నవీద్‌లు సైతం హైదరాబాదీలే కావడం గమనార్హం. పోలీసుల ఎదురుకాల్పుల్లో సాజిద్ మృతిచెందగా నవీద్ జైల్లో ఉన్నాడు. -
ట్రాన్స్‌కో డీఈ ముత్యం వెంకటరమణ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: ఏసీబీ వలకు భారీ అవినీతి తిమింగలం చిక్కింది. ట్రాన్స్‌కో డీఈ ముత్యం వెంకటరమణను ఏసీబీ అదుపులోకి తీసుకుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయన్ని అరెస్ట్ చేసింది. భారీ స్థిర, చర ఆస్తులు కూడబెట్టినట్లు తేలింది. రూ.400 కోట్ల అక్రమాస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు.10 అపార్ట్మెంట్లలో రూ.20 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు ఏసీబీ గుర్తించింది. శేరిలింగంపల్లి, కూకట్‌పల్లిలో పాట్లను గుర్తించారు. ఆంజనేయనగరంలో జీప్లస్ త్రీ కమర్షియల్ భవనం, బేగంపేటలో జీప్లస్ 5 కమర్షియల్ భవనాన్ని అధికారులు గుర్తించారు. రియల్ ఎస్టేట్ కంపెనీల్లో భార్య పేరుతో పెట్టుబడులు పెట్టినట్లు కూడా గుర్తించారు. 2 కిలోల బంగారం, బ్యాంక్ ఖాతాల్లో రూ.52 లక్షలు ఫ్రీజ్ చేశారు. మొత్తం తొమ్మిది చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. -
హైదరాబాద్‌లో భారీ వర్షం
సాక్షి, హైదరాబాద్: నగరంలో పలు చోట్ల వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, బంజారాహిల్స్, రాయదుర్గం, హైటెక్ సిటీ, కొండాపూర్, పంజాగుట్ట, మాదాపూర్, గచ్చిబౌలి, అమీర్‌పేట్, బేగంపేట, సోమాజిగూడ భారీ వర్షం కురిసింది. భారీ వర్షంతో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. ప్రధాన రోడ్లపై వరద నీరు చేరడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. -
ఖేలో ఇండియా 2026.. హైదరాబాద్‌లో మైదానాల పరిశీలన
ఖేలో ఇండియా గేమ్స్ 8వ ఎడిషన్‌కు ఆతిథ్యమిచ్చేందుకు తెలంగాణ సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా( (SAI) ఉన్నతాధికారుల బృందం మంగళవారం హైదరాబాద్‌లోని వివిధ క్రీడా ప్రాంగణాలను క్షేత్రస్థాయిలో సందర్శించి సమీక్షించింది. ఈ బ్యాచ్‌లో సాయి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమర్ జ్యోతితో పాటు అసిస్టెంట్ డైరెక్టర్లు మధు హర్ష, గోపాల్ కందపాల్, మోహిత్‌లు ఉన్నారు. ఈ బృందం గచ్చిబౌలి జీఎంసీబీ స్పోర్ట్స్ కాంప్లెక్స్, షూటింగ్ రేంజ్, కేవీబీఆర్ ఇండోర్ స్టేడియం, హుస్సేన్ సాగర్ వాటర్ స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్, సైక్లింగ్ వేలోడ్రోమ్, ఎల్బీ స్టేడియంలను పరిశీలించింది. హైదరాబాద్‌లోని క్రీడా వసతుల పట్ల అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఖేలో ఇండియా గేమ్స్ నిర్వహణకు అనుగుణంగా అవసరమైన చోట మరమ్మతులు, మౌలిక సదుపాయాల మెరుగుదల చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. -
హైదరాబాద్ : అత్యంత వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ రథోత్సవం (ఫొటోలు)
-
కాంగ్రెస్ VS బీజేపీ..హైదరాబాద్ లో హై టెన్షన్
-
ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్
-
పోలీసుల అత్యుత్సాహం
హైదరాబాద్: అమ్మవారి కల్యాణోత్సవంలో అడుగడుగునా పోలీసుల అత్యుత్సాహం కనిపించింది. వీవీఐపీలు, వీఐపీల సేవలోనే తరించి దర్శనానికి వచ్చిన సామాన్య భక్తజనంపై ఏకంగా లాఠీలను ఝుళిపించడం విస్మయానికి గురిచేసింది. వివిధ రకాల పాస్‌లతో వచ్చిన భక్తులను అనుమతించకపోవడంతో వాగి్వవాదానికి దిగారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టే క్రమంలో లాఠీలకు పని చెప్పారు. కల్యాణోత్సవం మొత్తం పోలీసుల చేతులమీదుగానే జరిగిందని చెప్పాలి. దేవాదాయ శాఖ కేవలం ప్రేక్షక పాత్రకే పరిమితమైంది. డోనర్స్నూ గ్యాలరీలోకి అనుమతించలేదు. ఆలయానికి సుదూర ప్రాంతంలోనే రోడ్లు బ్లాక్ చేయడంతో భక్తులు చాలా దూరం నడవాల్సి వచ్చింది. -
చిన్నబాబు కట్టుబట్టల కథ.. వీకెండ్ వస్తే గచ్చిబౌలి ఫ్లైట్
-
రౌడీ షీటర్ సూరి హత్య కలకలం.. చంపింది నేనే..!
-
గళమెత్తిన విద్యార్థి, మేధోవర్గం
-
ట్రైనీ IPS ఉదయ్ కేసులో కీలక మలుపు
-
హైదరాబాద్ : అంగరంగ వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం (ఫొటోలు)
-
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు హైదరాబాద్ వాసులు మృతి
సాక్షి,హైదరాబాద్: అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఈ విషాద ఘటనలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడిన ఈ కుటుంబం ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైనట్లు ప్రాథమిక సమాచారం.కాలిఫోర్నియాలోని ఓ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు హైదరాబాద్ వాసులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, వారిని స్థానిక అత్యవసర సేవల సిబ్బంది సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది.ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అతివేగం కారణమా? లేక మరో వాహనం ఢీకొట్టిందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న కాలిఫోర్నియా పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు విచారణ చేపట్టారు. ఈ ఘటనపై హైదరాబాద్‌లోని బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం అందడంతో వారి ఇళ్లలో తీవ్ర విషాదం నెలకొంది. -
హైదరాబాద్‌ను తాకిన ఢిల్లీ సెగ
సాక్షి,హైదరాబాద్: ఢిల్లీ కాక్రోచ్ జనతా పార్టీ సెగ హైదరాబాద్‌కు తగిలింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు ఛలో లోక్ భవన్‌కు పిలుపునిచ్చాయి. దీంతో విద్యార్థులు ప్రెస్‌క్లబ్ నుంచి లోక్ భవన్‌కు బయల్దేరారు. మరోవైపు రాహుల్‌గాంధీ చర్చలపై కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ట్వీట్ చేశారు. పార్లమెంట్లో చర్చిస్తామంటే రాహుల్ గాంధీ ధర్నా విరమిస్తామని అన్నారు. పార్లమెంట్లో చర్చించేందుకు సిద్ధమని చెప్పా.ఐతే ఆయన వెంటనే డిమాండ్ మార్చారు. పార్లమెంట్లో చర్చ జరపడమే కాదు.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చర్చించాలని మాత్రమే అన్నారు కదా అని ప్రశ్నిస్తే.. మా డిమాండ్లు మారాయని రాహుల్ సమాధానం ఇచ్చారు. ప్రతిపక్ష నేత వెంటవెంటనే మాట మార్చడం సరికాదు’ ట్వీట్లో పేర్కొన్నారు. -
Hyd: ఎన్నడూలేని విధంగా డ్రోన్ల ద్వారా ట్రాఫిక్ కంట్రోల్
హైదరాబాద్: నగరంలోని గోల్కొండ ట్రాఫిక్ జోన్ పరిధిలో శ్రీ జగదాంబికా అమ్మవారి బోనాల మహోత్సవాలు (జులై 16 నుంచి ఆగస్టు 13 వరకు) వైభవంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఉత్తర్వుల మేరకు.. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు విస్తృత స్థాయి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఈ బందోబస్తును జాయింట్ సీపీ (ట్రాఫిక్) జోయెల్ డేవిస్ ప్రత్యక్ష పర్యవేక్షణలో, డీసీపీ (ట్రాఫిక్) కాజల్, ఏసీపీ (ట్రాఫిక్, గోల్కొండ జోన్) ధనలక్ష్మి నిరంతరం సమీక్షిస్తున్నారు.భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, గోల్కొండ కోట పరిసర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ శాఖ మొదటిసారిగా డ్రోన్ సర్వేలెన్స్ (డ్రోన్ల నిఘా) వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. డ్రోన్ల సహాయంతో పార్కింగ్ స్థలాలు, ప్రధాన ట్రాఫిక్ మళ్లింపు పాయింట్లను ఎప్పటికప్పుడు ఆకాశ మార్గం ద్వారా పర్యవేక్షిస్తూ, ట్రాఫిక్ జామ్‌లను తక్షణమే నివారించి వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరిస్తున్నారు.డ్రోన్ సర్వేలెన్స్ ప్రాముఖ్యతట్రాఫిక్ మళ్లింపు పాయింట్ల పర్యవేక్షణ: ముందస్తుగా ప్రకటించిన రూట్ డైవర్షన్ల ప్రకారం వాహనాలు సజావుగా సాగేలా అన్ని ప్రధాన మళ్లింపు పాయింట్లను డ్రోన్ల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.పార్కింగ్ నిర్వహణ: గోల్కొండ కోటకు సమీపంలో కేటాయించిన పార్కింగ్ స్థలాలలో వాహనాల రద్దీని అంచనా వేయడానికి, అనధికార పార్కింగ్‌ను నిరోధించడానికి, భక్తులకు ఖాళీగా ఉన్న పార్కింగ్ స్థలాలను సూచించడానికి డ్రోన్లను ఉపయోగిస్తున్నారు.రద్దీ నివారణ చర్యలు: కోటకు వెళ్లే ప్రధాన రహదారులు, అంతర్గత మార్గాలు, భక్తులు పెద్ద సంఖ్యలో ఉండే ప్రాంతాలలో ట్రాఫిక్ ఆటంకాలను తక్షణమే గుర్తించి, వెంటనే క్షేత్రస్థాయి సిబ్బంది ద్వారా నియంత్రణ చర్యలు చేపడుతున్నారు.ఈ ఆధునిక డ్రోన్ సాంకేతికత వినియోగం వల్ల క్షేత్రస్థాయి ట్రాఫిక్ పరిస్థితిపై సమగ్ర అవగాహన ఏర్పడి, బోనాల ఉత్సవాల సందర్భంగా భక్తులకు, సాధారణ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సురక్షితమైన, వేగవంతమైన ప్రయాణాన్ని అందించడానికి ఎంతగానో తోడ్పడుతోంది. -
హైదరాబాద్‌లో శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి దేవాలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)
-
ఉదయ్ కృష్ణారెడ్డికి సీబీఐ మాజీ అధికారి అండ
హైదరాబాద్ పోలీస్ అకాడమీలో ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి వ్యవహారం ఇప్పుడు పోలీస్ శాఖలో హాట్ టాపిక్‌గా మారింది. మహిళా ఐపీఎస్ ప్రొబేషనర్ లైంగిక వేధింపుల ఆరోపణలు, కేసు నమోదు.. మనస్తాపం చెందిన ఉదయ్ అత్మహత్యాయత్నం చేయడం.. ఆపై సంచలన ఆరోపణలతో ఈ వ్యవహారం పూటకో మలుపు తిరుగుతోంది. ఈ తరుణంలో ఈ వ్యవహారంపై మాజీ సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ మన్నెం నాగేశ్వరరావు స్పందించారు.ఉదయ్ కృష్ణారెడ్డికి న్యాయం జరగాలని కోరుతూ మన్నెం నాగేశ్వరరావు సోషల్ మీడియా వేదికగా సుదీర్ఘ పోస్టు చేశారు. ఆరోపణలపై పూర్తి స్థాయి విచారణ జరగకముందే ఒక అధికారి కెరీర్‌పై తీవ్ర ప్రభావం పడకూడదని, నిష్పక్షపాత దర్యాప్తు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాదు.. తాత్కాలిక సస్పెన్షన్‌ను కూడా ఆయన తప్పుబట్టారు.కష్టాల నుంచి ఐపీఎస్ వరకు..ఉదయ్ కృష్ణారెడ్డి ప్రయాణాన్ని ప్రస్తావించిన మన్నెం నాగేశ్వరరావు.. అతని ఎదుగుదల ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన ఉదయ్ చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయారని, తీవ్ర ఆర్థిక ఇబ్బందుల మధ్య అమ్మమ్మ సంరక్షణలో పెరిగారని తెలిపారు. తెలుగు మీడియం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న ఆయన.. జీవితంలో ఎదురైన సవాళ్లను అధిగమిస్తూ ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో కానిస్టేబుల్‌గా చేరారు. అయితే ఉన్నత లక్ష్యాన్ని వదులుకోకుండా విధులు నిర్వహిస్తూనే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధమయ్యారని పేర్కొన్నారు.కఠిన పరిస్థితుల్లోనూ పట్టుదలతో చదివి ఐపీఎస్‌కు ఎంపిక కావడం అసాధారణ విజయమని, గ్రామీణ యువతకు ఆయన ప్రయాణం స్ఫూర్తిగా నిలుస్తుందని మన్నెం నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు.రెండు వాదనలు.. ఆధారాలే కీలకంప్రస్తుత వ్యవహారంలో రెండు భిన్నమైన వాదనలు ఉన్నాయని మాజీ ఐపీఎస్ అధికారి పేర్కొన్నారు. మహిళా ప్రొబేషనర్ తనపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారని, మరోవైపు ఉదయ్ కృష్ణారెడ్డి మాత్రం తమ మధ్య సంబంధం పరస్పర అంగీకారంతో కొనసాగిందని, తనపై తప్పుడు ఆరోపణలు చేశారని చెబుతున్నారని వివరించారు. వ్యక్తిగత సంబంధం విఫలమైన తర్వాత ఏర్పడిన వివాదాలను పూర్తిగా నేరపరమైన కోణంలోకి తీసుకెళ్లే ముందు.. వాస్తవాలు, ఆధారాలను పరిశీలించడం చాలా ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.సస్పెన్షన్‌పై ప్రశ్నలుఎఫ్ఐఆర్ నమోదైన వెంటనే ఉదయ్ కృష్ణారెడ్డిపై తీసుకున్న పరిపాలనా చర్యలపై కూడా మన్నెం నాగేశ్వరరావు ప్రశ్నలు లేవనెత్తారు. విచారణ పూర్తికాకముందే ఒక యువ అధికారి భవిష్యత్తు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఒకే ఘటనలో ఇద్దరు వ్యక్తులు భాగస్వాములైతే.. పరిపాలనా చర్యలు కూడా సమానంగా ఉండాలనే సూత్రాన్ని పాటించాలని పేర్కొన్నారు. ఏకపక్ష నిర్ణయాలు సంస్థలపై నమ్మకాన్ని దెబ్బతీస్తాయని వ్యాఖ్యానించారు.శిక్షణ సంస్థల బాధ్యతఐపీఎస్ అధికారులను తీర్చిదిద్దే ఎస్వీపీఎన్పీఏ కేవలం క్రమశిక్షణ అమలు చేసే సంస్థ మాత్రమే కాకుండా.. యువ అధికారులకు మార్గదర్శకత్వం, మానసిక సహకారం అందించే వేదికగా ఉండాలని మన్నెం నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఒక ఆరోపణ లేదంటే వివాదం కారణంగా ఒక అధికారి కష్టపడి సాధించిన కెరీర్ నాశనం కాకూడదని, విచారణ పూర్తయ్యే వరకు న్యాయ ప్రక్రియకు అవకాశం ఇవ్వాలని కోరారు.‘నిష్పక్షపాత విచారణ జరగాలి’ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో చట్టం తన పని తాను చేసుకోవాలని, అదే సమయంలో న్యాయం, సమానత్వ సూత్రాలు పాటించాలని మన్నెం నాగేశ్వరరావు కోరారు. కానిస్టేబుల్ స్థాయి నుంచి ఐపీఎస్ వరకు ఎదిగిన యువ అధికారి విషయంలో తొందరపాటు నిర్ణయాలు కాకుండా.. ఆధారాల ఆధారంగా విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.మన్నెం నాగేశ్వరరావు నేపథ్యం..మన్నెం నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి. 1986 బ్యాచ్‌కు చెందిన ఆయన ఒడిశా క్యాడర్లో సేవలందించారు. సీబీఐలో జాయింట్ డైరెక్టర్‌గా పనిచేసిన ఆయన.. 2018లో సంస్థలో పరిణామాల సమయంలో తాత్కాలిక డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. కృష్ణా జిల్లా ప్రాంతానికి చెందిన నాగేశ్వరరావు.. పోలీస్, దర్యాప్తు విభాగాల్లో కీలక అనుభవం ఉన్న అధికారిగా గుర్తింపు పొందారు. తాజాగా ఉదయ్ కృష్ణారెడ్డి కేసుపై చేసిన వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు.Justice for Uday Krishna Reddy: A Case for FairnessThe allegations levelled by lady IPS probationer Suma H.K. against her co-trainee Uday Krishna Reddy at the Sardar Vallabhbhai Patel National Police Academy (SVPNPA), Hyderabad, have ignited intense public debate.Currently,… pic.twitter.com/YSm2pb0pRS— M. Nageswara Rao IPS (Retired) (@MNageswarRaoIPS) July 21, 2026 -
మల్లారెడ్డి యూనివర్సిటీ లో ఆకస్మిక తనిఖీలు
-
ట్రైనీ IPS ఉదయ కృష్ణ కేసులో సంచలన ట్విస్ట్.
-
ఉదయ్.. హైదరాబాద్ విద్యార్థే!
అమెరికాకు చెందిన ప్రఖ్యాత కృత్రిమ మేధ సంస్థ ఓపెన్ ఏఐ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (సీటీవో)గా నియమితులైన తెలుగు తేజం ఉదయ్ రుద్దర్రాజు మన హైదరాబాద్, మణికొండ విద్యార్థే కావడం విశేషం. ప్రపంచ స్థాయి ఏఐ నమూనాలకు అవసరమైన అత్యాధునిక కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలు, భారీ కంప్యూటింగ్ వ్యవస్థల అభివృద్ధి, నిర్వహణకు నాయకత్వం వహించేందుకు సిద్ధమవుతున్న ఉదయ్... గండిపేటలోని చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (సీబీఐటీ) పూర్వ విద్యార్థి. 2011లో ఆయన కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ పట్టా పొందారు. అనంతరం కంప్యూటింగ్, కృతిమ మేధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచి అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ సాంకేతిక నిపుణుడిగా ఎదిగారు. తాజాగా భవిష్యత్ కృత్రిమ మేధస్సు సాంకేతికత అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే అత్యంత కీలక అవకాశం అందుకున్నారు. ఉదయ్ సాధించిన ఘనత ఎంతో గర్వకారణమని ప్రిన్సిపాల్ సీవీ నరసింహులు అన్నారు. -
కోకాపేట్.. మరో జాక్‌పాట్!
సాక్షి, హైదరాబాద్: సర్కార్‌కు పెద్ద ఎత్తున కాసుల వర్షం కురిపిస్తున్న కోకాపేట్లో మరో భారీ వెంచర్ కోసం హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ మేరకు గతంలో ఐటీ సెజ్ కోసం కేటాయించిన భూములను తిరిగి వెనక్కి తీసుకొనేందుకు (సెజ్ డీనోటిఫై) చర్యలు చేపట్టింది. అప్పట్లో సుమారు 117 ఎకరాలను ఐటీ సెజ్ కోసం కేటాయించారు. కానీ కొన్ని సంస్థలు మాత్రమే ఇక్కడ భూమిని కొనుగోలు చేశాయి. ప్రస్తుతం 90 ఎకరాలకు పైగా అందుబాటులో ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఈ భూములనే విక్రయించాలని ప్రభుత్వం భావిస్తోంది. కొంతకాలంగా కోకాపేట్ భూములు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. నగరానికి పడమటి వైపున ఐటీ తదితర వ్యాపార సంస్థలు కొలువుదీరి కోకాపేట్ భూములు వ్యాపార, రియల్ దిగ్గజ సంస్థలకు కొంగుబంగారంగా మారాయి. ఎకరం రూ.వంద కోట్లపైనే అమ్ముడవుతుంది. ఇటీవల నిర్వహించిన ఆన్లైన్ బిడ్డింగ్‌లోనూ ఎకరం గరిష్టంగా రూ.151 కోట్లకు అమ్ముడైంది. సగటున రూ.142 కోట్లకు ఎకరం చొప్పున విక్రయించారు. ఈ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొనే భూముల అమ్మకం ద్వారా ఆదాయాన్ని ఆర్జించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. సెజ్ హోదాను డీ నోటిఫై చేయడం ద్వారా భూముల విక్రయానికి మార్గం సుగమం కానుంది. ఎకరం సగటున రూ.వంద కోట్ల చొప్పున అమ్ముడైనా ఈ భూముల ద్వారా సుమారు రూ.9 వేల కోట్లకు పైగా ఆదాయం లభించవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు. గతంలో కోకాపేట్ నియోపొలిస్, గోల్డ్‌మైల్ తదితర లే అవుట్లలో నిర్వహించిన ఆన్లైన్ బిడ్డింగ్‌కు అనూహ్య స్పందన లభించింది.మౌలిక సదుపాయాలతో వెంచర్... కేంద్రం ఐటీ సెజ్ హోదాను రద్దు చేసిన వెంటనే అన్ని మౌలిక సదుపాయాలతో వెంచర్‌ను సిద్ధం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. గతంలో నియోపోలిస్ వెంచర్‌ను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేశారు. కొత్త వెంచర్‌ను సైతం ఇలాగే అభివృద్ధి చేయనున్నారు. -
‘ఎల్ నినోను ఎదుర్కొంటాం’
సాక్షి,హైదరాబాద్: ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని, రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. నల్లగొండ జిల్లా కలెక్టరేట్ లోని ఉద్యాదిత్య భవన్ లో నల్లగొండ, సూర్యపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల అధికారులతో ఎల్ నినో సంసిద్ధత, ప్రత్యామ్నాయ పంటల ప్రోత్సాహంపై సోమవారం (జూలై 20) ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది.ఎల్ నినో ప్రభావం వల్ల రాబోయే రోజుల్లో ప్రజలకు ఎలాంటి తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. నీటి లభ్యతను బట్టి రైతులు కేవలం వరి పంటపైనే ఆధారపడకుండా, లాభదాయకమైన ప్రత్యామ్నాయ పంటలు వేసేలా అధికారులు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు.జిల్లాకు సాగునీరు అందించే అత్యంత ప్రతిష్టాత్మకమైన శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గం పనులను 2028 ఆగస్టు నాటికి పూర్తి చేస్తామని మంత్రి ప్రకటించారు. దీని ద్వారా ఉమ్మడి జిల్లాలోని 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని వెల్లడించారు. ఈ సొరంగం పనులను వేగవంతం చేయడానికి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని ఆయన కొనియాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ఎలాంటి ప్రకృతి విపత్తులనైనా సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజలను ఆదుకుంటామని మంత్రులు ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు రాష్ట్ర ఇరిగేషన్, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్, నల్లగొండ నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
Hyd: జూబ్లీహిల్స్ కార్పిడియం పబ్ వద్ద ఉద్రిక్తత
హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్ కార్పిడియం పబ్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. సోమవారం(జూలై 20వ తేదీ) రాత్రి సమయంలో కార్పిడియం పబ్‌లో మహిళలపై ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. తనపై దాడి చేయవద్దని సదరు మహిళ వేడుకున్నా వినకుండా విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు. ఈ ఘటనలో గాయపడ్డ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితుడి కోసం గాలిస్తున్నారు. అక్కడ ఉన్న సీసీ టీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. -
హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం
హైదరాబాద్:నగరంలో పలుచోట్ల వర్షం పడుతోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్,పంజాగుట్ట, అమీర్‌పేట్, ఎస్ఆర్ నగర్, కొండాపూర్, మాదాపూర్, రాయదుర్గం, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, కూకట్పల్లి తదితర చోట్ల వర్షం పడుతోంది. ఎల్‌నినో ప్రభావంతో ఇంకా వేసవి ఛాయలే కనిపిస్తూ ఉండటంతో వర్షాల కోసం జనం ఎదురుచూస్తున్నారు. వర్షాకాలం వచ్చింది కానీ ఇంకా సరైన వర్షాలు పడకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఇటు నగరంలో ఉండే వారు వర్షాలు కురిస్తే వేసవిలో ఆగిపోయిన నీటి బోర్లు.. తిరిగి గాడిన పడతాయని ఆశిస్తున్నారు. హైదరాబాద్‌లో అత్యధిక శాతం వాటర్ టాంకర్లపై ఆధాపడుతూ ఉన్న నేపథ్యంలో వర్షం పడితే అంతా సెట్ అవుతుందని అనుకుంటున్నారు. ఈ తరుణంలో కొన్ని రోజులుగా చెదురుమదురు జల్లులు నగర వాసులకు ఊరటనిస్తున్నాయి. మరొకవైపు జూలైలో కొంత మందగించిన నైరుతి రుతుపవనాలు మళ్లీ పుంజుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఇస్రో ఉపగ్రహ చిత్రాల్లో దేశంలోని దాదాపు మూడింట రెండొంతుల ప్రాంతాన్ని మేఘాలు కమ్ముకున్న దృశ్యాలు కనిపిస్తూ ఉండటం ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. -
బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్.. తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా బహదూర్‌గూడ భూముల వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు సోమవారం (జూలై 20) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ భూములకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోకూడదని స్పష్టం చేస్తూ అభ్యంతరాలపై స్టే విధించింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బహదూర్‌గూడ పరిసర ప్రాంతాల్లో భూసేకరణ ప్రక్రియ ప్రారంభించింది. అయితే, సదరు భూసేకరణ పరిధిలోని సర్వే నంబర్ 3, 4లలో ఉన్న 28 ఎకరాల భూమి తమదేనంటూ నలుగురు స్థానిక రైతులు హైకోర్టును ఆశ్రయించారు.తాతముత్తాతల కాలం నుంచి ఆ భూములు తమ సాగులోనే ఉన్నాయని, సరైన పరిహారం, చట్టపరమైన నోటీసులు ఇవ్వకుండా భూసేకరణ చేయడం చెల్లదంటూ వారు పిటిషన్ దాఖలు చేశారు. రైతుల తరఫు న్యాయవాది వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం.. వివాదంలో ఉన్న 28 ఎకరాల భూమిపై ప్రస్తుతానికి యథాతథంగా ఉంచాలని ప్రభుత్వానికి స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చింది. కోర్టు తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు అక్కడ ఎలాంటి పనులు లేదా భూసేకరణ చర్యలు చేపట్టవద్దని ఆదేశించింది. కేసు తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. -
Hyd: వాహనదారులకు అలర్ట్.. 2 రోజులు ట్రాఫిక్ మళ్లింపులు
హైదరాబాద్: బల్కంపేట ఎల్లమ్మ దేవస్థానంలో మంగళవారం (జులై 21), బుధవారం (జులై 22) నిర్వహించనున్న అమ్మవారి కల్యాణం, రథోత్సవం సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపులు అమలులో ఉంటాయి. ఈ కల్యాణోత్సవం, రథోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారని భావిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలు పెరిగే అవకాశం ఉండడంతో, బల్కంపేట పరిసర ప్రాంతాలలో మోస్తరు ట్రాఫిక్ నిలిచిపోయే (జామ్ అయ్యే) అవకాశం ఉంది. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు, బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి వెళ్లే రహదారులను నియంత్రించాలని, ప్రత్యామ్నాయ మార్గాలు, ట్రాఫిక్ మళ్లింపులను ఉపయోగించాలని పోలీసులు సూచించారు.జులై 21-22 తేదీల్లో ట్రాఫిక్ మళ్లింపు పాయింట్లు గ్రీన్ ల్యాండ్స్, మాతా టెంపుల్, సత్యం థియేటర్ వైపు నుంచి బల్కంపేట ఎల్లమ్మ ఆలయం, ఫతేనగర్ ఫ్లైఓవర్, ఫతేనగర్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను ఎస్సార్ నగర్ ‘T’ జంక్షన్ వద్ద ఎస్సార్‌నగర్ కమ్యూనిటీ హాల్ - అభిలాష టవర్స్ – బి.కె గూడ ఎక్స్ రోడ్ - శ్రీరామ్ నగర్ ఎక్స్ రోడ్ నుంచి సనత్‌నగర్ / ఫతేనగర్ రోడ్ వైపు మళ్లిస్తారు.ఫతేనగర్ ఫ్లై ఓవర్ నుంచి బల్కంపేట ఆలయం వైపు వచ్చే ట్రాఫిక్‌ను అనుమతించరు. ఈ వాహనాలను న్యూ బ్రిడ్జి (హైదరాబాద్ కిచెన్ మార్ట్) వద్ద RUB ద్వారా కట్టమైసమ్మ ఆలయం - బేగంపేట వైపు మళ్లిస్తారు.గ్రీన్ ల్యాండ్స్ - బకుల్ అపార్ట్మెంట్స్ - ఫుడ్ వరల్డ్ నుంచి బల్కంపేట వైపు వచ్చే ట్రాఫిక్‌ను అనుమతించరు. వీటిని ఫుడ్ వరల్డ్ ఎక్స్ రోడ్స్ వద్ద సోనాబాయి టెంపుల్ - సత్యం థియేటర్ - మైత్రీవనం / ఎస్సార్ నగర్ ‘T’ జంక్షన్ వైపు మళ్లిస్తారు.బేగంపేట, కట్టమైసమ్మ ఆలయం వైపు నుంచి బల్కంపేట ఆలయానికి వెళ్లే ట్రాఫిక్‌ను అనుమతించరు. వీటిని బేగంపేట ఫ్లైఓవర్ - మాతా టెంపుల్ – సత్యం థియేటర్ – మైత్రీవనం ద్వారా గ్రీన్ ల్యాండ్స్ వైపు అనుమతిస్తారు.ఎస్సార్ నగర్ ‘T’ జంక్షన్ నుంచి ఫతేనగర్ వరకు ఉన్న బై-లేన్స్, లింక్ రోడ్లను మూసివేస్తారు.భక్తుల పార్కింగ్ స్థలాలు1. R & B ఆఫీస్2. GHMC గ్రౌండ్3. పద్మశ్రీ అపార్ట్మెంట్స్, డీకే రోడ్ నుండి నేచర్ క్యూర్ హాస్పిటల్ రోడ్డు వైపు పార్కింగ్4. ఫతేనగర్ అండర్ బ్రిడ్జి5. నేచర్ క్యూర్ హాస్పిటల్6. GHMC ప్లే గ్రౌండ్, సనత్నగర్ప్రయాణంలో ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే, ప్రయాణ సాయం కోసం ట్రాఫిక్ హెల్ప్‌లైన్ 9010203626 నంబర్‌కు ఫోన్ చేయొచ్చు. -
హైదరాబాద్ : మురిపించిన మెరుపు తీగలు (ఫొటోలు)
-
ప్రభుత్వ ఉద్యోగం రావడంతో.. భార్యకు చిత్రహింసలు..!
ఖమ్మం: అదనపు కట్నం కోసం భర్త, ఆడపడుచులు పెట్టిన శారీరక, మానసిక వేధింపులు భరించలేక ఓ వివాహిత పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్ప డిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. శంభునిగూడెం గ్రామానికి చెందిన భట్టు భద్రయ్య తన కుమార్తె సుమ (25)ను 2023 మే 16న లక్ష్మీదేవిపల్లి మండలానికి చెందిన వజ్జా వెంకటేశ్వర్లుకు ఇచ్చి వివాహం చేశారు. పెళ్లి సమయంలో రూ.లక్ష కట్నంగా ఇచ్చారు. వివాహం అనంతరం కొద్దిరోజుల పాటు ఈ దంపతులు హైదరాబాద్‌లో ఉన్నారు. ఏడాది గడిచిన తర్వాత భర్త ప్రవర్తనలో మార్పు వచ్చింది. భార్యను అనుమానించడం, బంధువులతో ఫోన్ మాట్లాడినా అవమానించడం, ఎవరితోనూ మాట్లాడకూడదని ఆంక్షలు పెట్టడం ప్రారంభించాడు. కాగా, తొమ్మిది నెలల క్రితం వెంకటేశ్వర్లుకు ప్రభుత్వ ఉద్యోగం రావడంతో వీరిద్దరూ నాగార్జునసాగర్‌కు కాపురం మార్చారు. సుమకు పిల్లలు కలగకపోవడం, మరోవైపు వెంకటేశ్వర్లుకు ప్రభుత్వ ఉద్యోగం రావడంతో అతడి కుటుంబంలో మార్పులు వచ్చాయి. భర్త వెంకటేశ్వర్లుతో పాటు అతని అక్కలు అదనంగా కట్నం తీసుకురావాలంటూ సుమను శారీరకంగా, మానసికంగా తీవ్ర వేధింపులకు గురిచేశారు. పది రోజుల క్రితం భర్త వెంకటేశ్వర్లు సుమను చిత్రహింసలకు గురిచేసి ఇంటి నుంచి వెళ్లగొట్టాడు. దీంతో సుమ శంభునిగూడెంలోని పుట్టింటికి వచ్చింది. శనివారం భర్త వెంకటేశ్వర్లు, అతని అక్కలు కలిసి శంభునిగూడెంలోని సుమ పుట్టింటికి వచ్చిన, అక్రమ సంబంధం అంటకట్టి, దూషించి, విపరీతంగా కొట్టి వెళ్లిపోయారు. ఈ అవమానాన్ని తట్టుకోలేక సుమ ఇంట్లో ఉన్న గడ్డిమందు తాగింది. కుటుంబ సభ్యులు కొత్తగూడెం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. మృతురాలి తండ్రి బట్టు భద్రయ్య ఫిర్యాదు మేరకు భర్త వెంకటేశ్వర్లు, ఆడ బిడ్డలు విజయ, రజిత, సుజాతలపై కేసు నమోదు చేశామని ఎస్ఐ తిరుపతి వెల్లడించారు. -
హైదరాబాద్ లో కలకలం.. ఇంటి నుంచి వెళ్లిన ముగ్గురు బాలికలు..
-
న్యాయం గెలుస్తుంది.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం


