బల్కంపేట ఎల్లమ్మ తల్లి కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ( Balkampet Yellamma Kalyanotsavam 2026 )
అమ్మవారికి మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్.. ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు.
కల్యాణ మహోత్సవం అనంతరం రేపు అమ్మవారి ‘రథోత్సవం’ జరగనుంది.
ఆలయ పరిసర ప్రాంతాలు మరియు వీధుల గుండా సాగే ఈ రథోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకోనున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి సతీమణి గీతారెడ్డి, కుమార్తె నైమిషారెడ్డి అమ్మవారి కల్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు.


