ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవన విధానంలో వ్యాయామలు, స్ట్రిక్ట్ డైట్‌ని అనుసరించడం అతి పెద్ద సవాలు చాలామందికి. పైగా కొన్ని రోజులు చేసి, ఆ తర్వాత స్కిప్ చేసేస్తుంటారు. నిలకడగా చేయాలంటే సమయం ఉండక ఇబ్బంది పడుతుంటారు. అదీగాక ప్రస్తుతం చాలామటుకు ఉద్యోగాలు గంటలు గంటలు పనిచేసే డెస్క్ ఉద్యోగాలే. బాగా తినకపోయినా..లావుగానే ఉండటం, పోనీ వర్కౌట్లు చేద్దామా అంటే సమయం కుదరక చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వాళ్ల కోసం సులభంగా ఎంజాయ్ చేస్తూ చేసే వ్యాయామాలు నెట్టింట ట్రెండ్‌గా మారాయి. వాటిని వర్కౌట్లు అనేకంటే అందమైన డ్యాన్స్ అనొచ్చు. చూడటానికే కాదు, చేయడానికి కూడా చాలా అనువైనవి, సులువైనవి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీటికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఏంటా వర్కౌట్లు అంటే..
జస్ట్ నాలుగు నిమిషాల నిడివి గల ఈ వీడియోలో కనిపిస్తున్న వర్కౌట్లు చేస్తే ఒక్క వారంలో ఐదు కిలోలు తగ్గడం ఖాయం అట. ప్రస్తుతం ఈ వ్యాయామాలు జపాన్‌లో బాగా ట్రెండ్‌గా మారింది. డంబెల్క్ కూడ పక్కనే పడేసి ఇవి ప్రయత్నించండి అని పిలుపునిస్తున్నారు. పైగా ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. అలాగే శరీరానికి మంచి కదలిక, కొలస్ట్రాల్‌ని కరిగించి ఫిట్‌గా ఉండేందుకు బెస్ట్ వర్కౌట్లు కూడా అని అంటున్నారు.
చాలామంది నెటిజన్లు దీన్ని కొట్టిపారేస్తున్నా..జస్ట్ నాలుగు నిమిషాలు ఎంజాయ్‌చేస్తూ వేగంగా చేసేవి ప్రయత్నిస్తే నష్టమేమి ఉండదు కదా అని అడుగుతున్నారు. పైగా ఏ వ్యాయామమైనా..ఆరోగ్యకరమైనదే తప్ప హానికరం అంటూ ఉండదు. పైగా ఇవి కష్టతరమైనవి కాదు ఎవ్వరైనా సులభంగా ఆడుతూ పాడుతూ చేసేవే కదా ట్రై చేస్తే పోలే అని సపోర్టు చేస్తూ మాట్లాడటం విశేషం. ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోని చూసి..చకచక నాలుగే నాలుగు నిమిషాల్లో చేసి స్లిమ్‌గా మారిపోండి మరి..!.
영상은 길이는 고작 4분.
일주일동안 매일 루틴으로 하면
-5kg이 빠진다는 일본 다이어트 영상.
지금 일본에서 엄청난 유행임.
마운자로 집어 던지고 이거하자.
부작용 따위 없다. pic.twitter.com/J5ewOHbnui— rrace🇰🇷 (@junssi1982) August 31, 2026
(చదవండి: శ్వాసకోశ ఆరోగ్యం కోసం ఆయుర్వేద ధూమపానం..!)


