తక్కువ ధరలో ఎక్కువ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్ కోరుకునే వినియోగదారులకు జియో ప్రీపెయిడ్‌లో రూ.199 రీచార్జ్ ప్లాన్ అందుబాటులో ఉంది. ఈ ప్లాన్‌లో 18 రోజుల వ్యాలిడిటీతో పాటు రోజుకు 1.5GB హైస్పీడ్ డేటా లభిస్తుంది. అంటే మొత్తం 27GB డేటాను వినియోగించుకోవచ్చు.
ఈ రూ.199 ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు కూడా ఉన్నాయి. అలాగే జియో యాప్స్‌కు సంబంధించిన జియోటీవీ, జియో ఏఐ క్లౌడ్‌ప్రయోజనాలు లభిస్తాయి. అయితే అన్‌లిమిటెడ్ 5G డేటా కావాలంటే ప్రత్యేక 5G యాడ్‌ఆన్ ద్వారా పొందవచ్చు.
దీంతోపాటు జియో ప్రస్తుతం రోజుకు 1.5GB డేటాతో నెలవారీ ప్లాన్లను కూడా అందిస్తోంది. రూ.319 ప్లాన్‌లో 1.5GB రోజువారీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMSలు, జియో యాప్ ప్రయోజనాలు, ఒక నెల వ్యాలిడిటీ ఉన్నాయి. మైజియో యాప్ లేదా జియో అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ప్రీపెయిడ్ ప్లాన్లను రీచార్జ్ చేసుకోవచ్చు.


