రెండో పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి | Telugu Serial Actress Sirisha Marriage With Mahendra | Sakshi
Sakshi News home page

Serial Actress Sirisha: రూమర్స్ నిజమే.. సింపుల్‌గా పెళ్లి.. పోస్ట్ వైరల్

Aug 28 2026 4:29 PM | Updated on Aug 28 2026 4:37 PM

Telugu Serial Actress Sirisha Marriage With Mahendra

తెలుగులో 'మొగలిరేకులు' సీరియల్‌తో నటిగా పరిచయమై గుర్తింపు తెచ్చుకున్న శిరీష.. మళ్లీ పెళ్లి చేసుకుంది. యాంకర్ కమ్ నటుడు మహేంద్రతో కొత్త జీవితం ప్రారంభించింది. ఈ శుభవార్తని సోషల్ మీడియాలో పంచుకుంది. గత కొన్నిరోజుల నుంచి వీళ్ల వివాహం గురించి రూమర్స్ వచ్చాయి. ఇవి నిజమా కాదా అని అంతా అనుకునేలోపు వీళ్లిద్దరూ ఒక్కటై అందరికీ షాకిచ్చారు.

(ఇదీ చదవండి: దీపిక సంచలన వ్యాఖ్యలు.. ప్రభాస్ 'స్పిరిట్'ని ఉద్దేశించా?)

శిరీష అచ్చ తెలుగమ్మాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పుట్టిపెరిగిన ఈమెకు ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఉండగా వీరు కూడా సీరియల్స్‌లో చేశారు. కానీ శిరీష అక్కలను మించి క్రేజ్‌ అందుకుంది. మొగలిరేకులు చేసిన తర్వాత రాములమ్మ, స్వాతి చినుకులు, మనసు మమత, చెల్లెలి కాపురం, కలవారి కోడలు కనకమహాలక్ష్మి, త్రిశూలం తదితర సీరియల్స్‌లోనూ నటించింది.

గతంలో ఈమె నవీన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోగా వీళ్లకు కొడుకు పుట్టాడు. కానీ రెండేళ్ల క్రితం అంటే 2024లో తన భర్త నుంచి విడిపోతున్నట్లు శిరీష ప్రకటించింది. 'నేను, నవీన్‌ భార్యాభర్తల బంధాన్ని తెంచేసుకున్నాం. మా నియంత్రణలో లేని కొన్ని పరిస్థితుల వల్ల ఇద్దరం విడిపోయాం. ఈ క్లిష్ట పరిస్థితుల్లో మమ్మల్ని అర్థం చేసుకుని మా నిర్ణయాన్ని గౌరవిస్తారని ఆశిస్తున్నాం. నవీన్‌పై నాకు ఇప్పటికీ గౌరవం ఉంది. నేను ఓ సెలబ్రిటీ అయినందున ఈ విషయం మీతో చెప్పడం అవసరమనిపించి దీన్ని షేర్‌ చేస్తున్నాను. అర్థం చేసుకున్నందుకు థాంక్యూ' అని అప్పట్లో పోస్ట్ పెట్టింది. ఇప్పుడు మళ్లీ పెళ్లి చేసుకుంది.

శిరీష పెళ్లి చేసుకున్న మహేంద్ర విషయానికొస్తే ఆర్జేగా కెరీర్ ప్రారంభించాడు. తర్వాత 'ఇంటింటి రామాయణం', 'మగువ ఓ మగువ' సీరియల్స్‌లో సహాయ పాత్రలు చేశాడు. ప్రస్తుతం నటుడిగా కొనసాగుతూనే మరోవైపు మూవీ ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కూడా చేస్తుంటాడు. మరి ఎప్పుడు ఎలా ఎక్కడ పరిచయమయ్యారో గానీ శిరీష-మహేంద్ర.. పెద్దల్ని ఒప్పించి శుక్రవారం సింపుల్‌గా ఏడడుగులు వేశారు. ఈ క్రమంలోనే కొత్త జంటలకు పలువురు నెటిజన్లు, సహ నటీనటులు శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే శిరీష కంటే మహేంద్ర.. వయసులో చిన్నవాడే అని తెలుస్తోంది!

(ఇదీ చదవండి: న్యూజిలాండ్‌లో పెళ్లి చేసుకున్న తెలుగు హీరో)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement