బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె.. కల్కి 2898 ఏడీ సీక్వెల్, స్పిరిట్ సినిమాల నుంచి తప్పుకొంది. గత కొన్నాళ్ల నుంచి ఈ విషయమై ఎప్పటికప్పుడు చర్చ జరుగుతూనే ఉంది. కొన్నిరోజుల క్రితమే 'స్పిరిట్' నిర్మాత, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సోదరుడు ప్రణయ్ రెడ్డి మాట్లాడుతూ.. దీపికని తప్పించడానికి గల కారణాలు చెప్పాడు. మరోవైపు దీపిక సంచలన కామెంట్స్ చేసిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా)
'ఈ మధ్యే నేను ఓ సినిమా నుంచి తప్పుకొన్నాను. అందులో హీరో, ఆయన రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటున్నానారో నాకు తెలుసు. నా దృష్టిలో ఆ హీరో కంటే నా సక్సెస్ రేటే ఎక్కువ. దీంతో నా పారితోషికం ఇంత అని చెప్పగానే మా దగ్గర అంత బడ్జెట్ లేదని నిర్మాతలు చెప్పారు. దీంతో ఆ చిత్రాన్ని నేను వదులుకున్నాను' అని సదరు వీడియోలో దీపికా చెబుతోంది.
ఈ వీడియో చూసిన చాలామంది ప్రభాస్, స్పిరిట్ సినిమాని ఉద్దేశించి దీపికా పదుకొణె ఇలా మాట్లాడిందని అంతా అనుకుంటున్నారు. కానీ అసలు నిజం ఇది కాదు. ఆరేడేళ్ల క్రితం అంటే 2019లో ఓ పుస్తకావిష్కరణ సందర్భంగా దీపిక ఈ కామెంట్స్ చేసింది. అప్పటికి కల్కి, స్పిరిట్ చిత్రాలు గానీ ఒప్పుకోలేదు. అయితే ఇది తెలియని చాలామంది నెటిజన్లు.. ప్రభాస్, స్పిరిట్ గురించి ఇలా అంటోందా అని మాట్లాడుకుంటున్నారు.
(ఇదీ చదవండి: కొత్త సీన్లతో మళ్లీ అర్జున్‌రెడ్డి.. ఈసారి ఎలా ఉంటుందంటే?)
I recently walked out of a #film , where the male star was already locked.
I know how much he is getting paid, and I believe I am more successful than him,
When I said, ‘This is my #price , they told me they didn’t have the budget, so I walked out.
- #DeepikaPadukone pic.twitter.com/8iFSHQjlG3— Filmyscoops (@Filmyscoopss) August 28, 2026


