దేశమంత రాఖీ పండుగ వేడుకలతో సందడిగా ఉంది. ఈ పండుగను ప్రమఖులు సైతం తమదైన శైలిలో సెలబ్రేట్ చేసుకున్నారు. అంబానీ కుటుంబం కూడా ఈ వేడుకును అత్యంత ఘనంగా జరుపుకుంది. ఎప్పటిలో తమ ఇంటిలో కాకుండా న్యూయార్క్‌లో జరుపుకున్నారు. అనంత్ రాధికలు తమ కుటుంబంతో కలిసి న్యూయార్క్‌లోని చెఫ్ వికాస్ ఖన్నా రెస్టారెంట్ బంగళాకు వెళ్లారు. అంతేగాదు చెఫ్ వికాశ్ ఖన్నా అంబానీ కుటుంబానికి సాదర స్వాగతం పలికారు.
పైగా వారి కోసం ఆ ప్రాంతాన్ని అందమైన పూలతో అలంకరించారు. గాజు బంగళా రెస్టారెంట్ పైకప్పుని చక్కగా శుభ్రం చేసి అనంత్ అంబానీ జంతు సంక్షేమ ప్రాజెక్టు అయిన "వంతార" (Vantara) పేరు వచ్చేలా పూల రేకులను అమర్చి మరి స్వాగతం పలికారు. ఆ తర్వాత రాధిక చెఫ్ వికాస్‌కి జిలేబీ ఆకారపు రాఖీని కట్టారు. ఒక్కసారిగా ఆ చర్యకు చెఫ్ వికాస్ ఖన్నా భావోద్వేగానికి గురయ్యారు. ఇది ఎన్నటికి మర్చిపోలేని అపురూపమైన క్షణంగా పేర్కొన్నారు. అందుకు సంబంధించిన వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ..పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చారు.
రాధిక అనే పేరుకు అర్థం ఏంటో ప్రపంచం మొత్తానికి తెలుసు. ఆమె నాకు జిలేబీ ఆకరాపు రాఖీని కట్టినప్పుడు నాలో ఏదో మార్పు కలిగింది. ఒక్క క్షణం పాటు నాలోని ఒక భాగం స్వస్థత పొదిన అనుభూతి కలిగిందన్నారు. అలాగే వంతారలో అనంత్ అంబానీ చేస్తున్న అసాధారణమైన కృషిని మెచ్చుకుంటూ..ఆయనకు జంతువుల పట్ల ఉన్న ఆపారమైన ప్రేమ, వాత్సల్యానికి తాను సదా దాసోహం అన్నారు. అనంత్‌ని అత్యంత దయగల వ్యక్తిగా పేర్కొన్నారు. అలాంటి వాళ్లకు తన బంగళా రెస్టారెంట్‌లో తాను ఆతిథ్యం ఇవ్వడం తనకెంతో గొప్ప విషయమని రాసుకొచ్చారు వికాస్ ఖన్నా పోస్ట్‌లో.
అంతేగాదు పోస్ట్‌లో ప్రతిరోజూ ఎంతో మంది అతిథులు ఈ రాఖీ పండుగ నేపథ్యంలో తనకు రాఖీలు కడుతుంటారని, గానీ మనం ఎంతో అభిమానించే, ప్రేమించే వ్యక్తులు మనల్ని ఆశ్చర్యపర్చేలా ఇలా చేస్తారని ఊహించం. ప్రస్తుతం రాధిక చేసిన పని అలానే ఉందని, దీన్ని ఎన్నటికీ మర్చిపోలేనని అన్నారు. కొన్ని క్షణాలు ముందుగా ప్లాన్ చేసుకోలేం, కానీ అవి ఆకస్మికంగా జరిగినప్పుడు కలిగే ఆనందం మాటల్లో చెప్పలేం అన్నారు. రాధిక తనకెంతో గొప్ప అర్థాన్ని ఇచ్చేలా ఈ రాఖీని కట్టినందుకు ధన్యవాదాలు అంటూ తన పోస్ట్‌ని ముగించారు వికాస్ ఖన్నా.
(చదవండి: రక్షాబంధన్‌కి అంత మహత్తు ఉందా? ఆ పండుగ కోసమే ఆ దేవత..)


