మేఘాలయ ‘అహింసా పట్టు’ చీరలో కంగనా రనౌత్‌..! ప్రత్యేకత ఇదే | Kangana Ranauts Handcrafted Meghalayan Ahimsa Silk Saree | Sakshi
Sakshi News home page

Kangana Ranaut: మేఘాలయ ‘అహింసా పట్టు’ చీరలో కంగనా రనౌత్‌..! ప్రత్యేకత ఇదే

Aug 27 2026 2:01 PM | Updated on Aug 27 2026 2:28 PM

Kangana Ranauts Handcrafted Meghalayan Ahimsa Silk Saree

బాలీవుడ్‌ బ్యూటీ, బీజేపి ఎంపీ..కంనా రనౌత్‌ రాజీకీయాల్లోకి వచ్చినప్పటికీ అందమైన చీరలతో తన ఫ్యాషన్‌ శైలి ఏంటో చెప్పకనే చెబుతుంటుందామె. పార్లమెంటరీ సమావేశాల్లో పాల్గొన్నా లేదా బహిరంగ కార్యక్రమానికి హాజరవుతున్నా..సదా చేనేత చీరలతో తళుక్కుమంటూ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటుందామె. అలానే ఈసారి కూడా సరికొత్త విలక్షణమైన చీరతో అందర్నీ ఆకట్టుకున్నారామె. 

ఆ చీర అలాంటి ఇలాంటి శారీ కాదు. అత్యంత విభిన్నమైన పట్టుచీర అది. అందుకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఆ పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చారు. ఇది నా మొదటి మేఘాలయ చీర అంటూ తారా వేదా బ్రాండ్‌ను ట్యాగ్‌ చేస్తూ రాశారు. తారా వేదా బ్రాండ్‌ కూడా కంగనా రనౌతా ధరించిన పట్టుచీరకు సంబంధించిన వీడియోని షేర్‌చేస్తూ పోస్ట​్‌లో ఆ చీర పత్యేకతను వివరించింది. 

 

అహింసాయుతమైన పట్టు చీర..
"ఇది సహసిద్ధమైన ఊదారంగు చీర . దీన్ని నేయడానికే దాదాపు రెండున్నర నెలలపైనే పట్టిందట. ఇనుపపొడి, దానిమ్మపండు నుంచి తీసిన రంగు ఈ చీర రంగు అట. దీన్ని ఎరిసిల్క్‌(అహింసా సిల్క్‌) అని కూడా పిలుస్తారు. ఈ వస్త్రం అత్యంత మన్నికైనది. 

ఇది ఈశాన్య భారతదేశంలో కనిపించే 'ఫిలోసామియా రిసినీ' అనే చిమ్మట నుంచి లభిస్తుందట. ఇతర రకాల పట్టు చీరలా కాకుండా చిమ్మటాలు(ఒక రకమైన పట్టుపురుగుల్లాంటివి) గూళ్ల నుంచి బయటకు వచ్చాక దాన్నుంచి పొందిన పట్టుదారాలతో దీన్ని తయారు చేస్తారు. పత్తి లాంటి ఆకృతికి చెందిన వస్త్రం ఇది. 

ఇది వేసవిలో చల్లగా, శీతాకాలంలో వెచ్చదనాన్ని అందిస్తుంది." అని పేర్కొది. అంతేగాదు ఆ  పోస్ట్‌లో కంగనా ఎందుకు ఈ చీను ఎంచుకుందో కూడా తెలిపింది. "ఇది స్వచ్చంగా గర్వించే క్షణం. అందంగా ఉండే కంగనా రనౌతా తన ప్రత్యేక కార్యక్రమాల కోసం చేతితో తయారు చేసి ప్రీమియం మేఘాలయ ఎరిసిల్క్‌ చీరును ధరించారు. ఎరిసిల్క్‌లోని ప్రతి దారం ఓర్పు, శాంతితో కూడిన విలాసాన్ని ప్రదర్శిస్తుంది. 

 

ఈ చీర అందానికి ప్రతిరూపం అని క్యాప్షన్‌ ఇచ్చి మరి నటి కంగనా వీడియోని పంచుకుంది తారా వేద బ్రాండ్‌. సరిగా కృతి సనన్‌ కంగనా రనౌత్‌ల మధ్య తీవ్రమైన మాటల యుద్ధం జరిగిన కొద్ది రోజులకే ఆమె ఈ చీరతో దిగిన ఫోటోలను సోషల్‌ మీడియాలో పంచుకోవడం విశేషం.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement