నేపాల్‌ భీకర వరదలు.. ఏరియల్‌ వ్యూలో.. | Nepal Floods Aerial Views Reveal | Sakshi
Sakshi News home page

నేపాల్‌ భీకర వరదలు.. ఏరియల్‌ వ్యూలో..

Aug 27 2026 12:18 PM | Updated on Aug 27 2026 12:34 PM

Nepal Floods Aerial Views Reveal

ఖాట్మండు: నేపాల్‌లో మంచు, బురద, భారీ రాళ్లతో విరుచుకుపడిన ఆకస్మిక వరదలు సృష్టించిన భయానక విధ్వంసం ఏరియల్ దృశ్యాల్లో స్పష్టంగా కనిపించింది. బుధవారం సంభవించిన ఈ జల ప్రళయానికి ఇప్పటివరకు 165 మంది ప్రాణాలు కోల్పోగా, 1,300 మందికి పైగా గల్లంతయ్యారు. పైనుంచి చూసిన దృశ్యాల ప్రకారం చైనా-నేపాల్ సరిహద్దుల్లోని రసువా జిల్లాతో పాటు సమీప ప్రాంతాల్లో గ్రామాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయి, రహదారులు ధ్వంసమై మానవ నివాసాల ఆనవాళ్లే లేకుండా పోయాయి. టిబెట్‌లో పుట్టిన భోటే కోశి నది పెను ఉధృతితో ముంచుకొచ్చి ఈ భారీ నష్టాన్ని మిగిల్చింది. రసువాకు దాదాపు 50 కిలోమీటర్ల దూరంలోని నువాకోట్‌లో నది తన మార్గాన్ని మార్చుకోవడంతో నివాస ప్రాంతాలన్నీ బురద దిబ్బలుగా మారిన దృశ్యాలు ఏరియల్ వీక్షణలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement