breaking news
floods
-
సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలు సంభవిస్తున్నా ముందస్తు ప్రణాళికలు, సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫల మైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు విమర్శించారు. సహాయక చర్యల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొనాలని.. బాధితులకు అండగా నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన గురువా రం పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వ హించి జిల్లాలవారీగా వరద నష్టంపై ఆరా తీశారు. జనజీవనం అస్తవ్యస్తంపై కేసీఆర్ ఆందోళన భారీ వర్షాలు, వరదలతో రాష్ట్ర ప్రజలకు ఇబ్బందులు కలగడం, జనజీవనం అస్తవ్యస్తం కావడంపై మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. వరదలతో ఇళ్లు నీట మునిగి, రోడ్లు తెగిపోయి రవాణా వ్యవస్థ అతలాకుతలం కావడంపై దిగ్బ్రాంతి చెందారు. వరద ప్రభావిత ప్రాంతాలకు చెందిన పార్టీ నేతలతో గురువారం ఫోన్లో మాట్లాడారు. తమ వంతుగా పార్టీ శ్రేణులు సహాయక చర్యలు చేపట్టేలా చూడాలని కేటీఆర్‌ను ఆదేశించారు. -
జల విలయం
సాక్షి, నెట్వర్క్: ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా కురిసిన కుంభవృష్టి కామారెడ్డి జిల్లాలో బీభత్సం సృష్టించింది. జల ప్రళయాన్ని తలపిస్తూ.. బుధవారం కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం అర్గొండలో 24 గంటల్లో 43.35 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. 2023 జూలైలో ములుగు జిల్లా వెంకటాపూర్‌లో కురిసిన 64.9 సెంటీమీటర్ల తర్వాత ఇదే అత్యధిక వర్షపాతం కావడం గమనార్హం. అటు మెదక్, నిర్మల్ జిల్లాలను కూడా వాన ముంచెత్తింది. సిద్దిపేట, సిరిసిల్ల, ములుగు, యాదాద్రి భువనగిరి, నల్లగొండ జిల్లాలను సైతం భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. దీంతో జన జీవనం స్తంభించిపోయింది. కన్యాకుమారి – కశ్మీర్ నేషనల్ హైవే 44 సహా పలుచోట్ల ప్రధాన రహదారులు కోతకు గురికావడం, అనేకచోట్ల వంతెనలు, కాజ్వే లు కొట్టుకు పోవడంతో పట్టణాలు, గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. వందేళ్ల చరిత్ర కలిగిన పోచారం ప్రాజెక్టును వరద ముంచెత్తగా డ్యామ్‌కు ఒకవైపు గుంత పడటంతో ఒకదశలో ప్రాజెక్టు తెగిపోతుందేమోనన్న భయాందోళనలు వ్యక్తం అయ్యాయి. ముందుజాగ్రత్తగా మూడు గ్రామాలను ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించారు. మరోవైపు ఎన్నడూ లేనివిధంగా ఎగువ మానేరు ఉగ్రరూపం దాల్చింది. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు అలుగు పారుతున్నాయి. రైల్వే ట్రాక్‌లు సైతం కోతకు గురి కావడంతో పట్టాలు వరదలో తేలుతున్నట్టుగా కన్పించాయి. వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా ముగ్గురు మరణించగా, ఆరుగురు గల్లంతయ్యారు. రాష్ట్రంలో వర్షాలు వరదల పరిస్థితిని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, జిల్లాల అధికారులతో సమీక్షించారు. ఏరియల్ సర్వే ద్వారా ముంపు ప్రాంతాలను పరిశీలించారు. కామారెడ్డి కకావికలం కుండపోతగా కురిసిన వర్షంతో కామారెడ్డి జిల్లా అతలాకుతలమైంది. కామారెడ్డి పట్టణం చిగురుటాకులా వణికిపోయింది. కాలనీల్లో ఇళ్లు నీట మునిగాయి. బుధవారం ఉదయం 8.30 గంటల నుంచి గురువారం ఉదయం 8.30 గంటల వరకు 24 గంటల్లో జిల్లాలోని 11 మండలాల్లో 30 సెం.మీ. నుంచి 43 సెం.మీ. దాకా వర్షపాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు. వేలాది మంది వరద ముంపుబారిన పడ్డారు. జాతీయ రహదారులతో పాటు జిల్లా రహదారులు, గ్రామీణ రహదారులు, వంతెనలు కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాలు, వరదలు సృష్టించిన బీభత్సంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, ఒకరు గల్లంతయ్యారు. రాజంపేట మండల కేంద్రంలోని బీసీ కాలనీలో గోడ కూలి ఇప్పకాయల పల్లె దవాఖాన వైద్యుడు వినయ్ (28) ప్రాణాలు కోల్పోయాడు. బుధవారం పొలం వద్దకు వెళ్లిన బీబీపేట మండలం జనగామకు చెందిన రైతు రాజిరెడ్డి (63) ఎడ్లకట్టవాగులో గల్లంతయ్యాడు. గురువారం ఆయన మృతదేహాన్ని గుర్తించారు. బీబీ పేట మండలం సంగమేశ్వర్ గ్రామానికి చెందిన బాలరాజు వరదలో గల్లంతవగా ఆయన ఆచూకీ దొరకలేదు. జిల్లాలోని బీబీ పేట చెరువుకు గండిపడింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో రెండు ఎన్డీఆర్ఎఫ్, ఆరు ఎస్డీఆర్ఎస్ బృందాలు 25 చోట్ల రెస్క్యూ చేసి 775 మందిని కాపాడారు. నీట మునిగిన సిద్దిపేట నగరం మెతుకుసీమ అతలాకుతలం రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మెతుకుసీమ కకావికలమైంది. జిల్లా చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా అతిభారీ వర్షాలు నమోదయ్యాయి. ముఖ్యంగా హవేళీ ఘన్పూర్ మండలంలో వర్షం బీభత్సం సృష్టించింది. మెదక్ నుంచి రాజుపేట వైపు వెళ్తున్న ఓ ఆటో గంగమ్మ వాగులో కొట్టుకుపోవడంతో ఇందులో ప్రయాణిస్తున్న రాజుపేటకు చెందిన బెస్త సత్యనారాయణ మృతి చెందాడు. ఇదే గ్రామానికి చెందిన యాదగౌడ్ ఆచూకీ ఇంకా లభించలేదు. వాస్తవానికి వీరిద్దరు వాగులో ఉన్న ఓ చెట్టుపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు. అయితే వరద ఉధృతికి వీరు కొట్టుకుపోయారు. మరోవైపు ఇదే మండలంలోని నక్కవాగులో ఓ కారు కొట్టుకుపోయింది. అందులో ఉన్న నరేందర్‌గౌడ్ ఓ పొదను పట్టుకుని 100కు ఫోన్ ద్వారా లొకేషన్ పంపడంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కాపాడారు. గంగమ్మ వాగుపై రాజుపేట బ్రిడ్జిపై 8 మంది చిక్కుకుపోగా, వీరిని కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి. దూప్‌సింగ్ తండాను వరద నీరు ముంచెత్తింది. నిజాంపేట మండలం చల్మెడలోని సోమయ్య చెరువు, బ్రాహ్మణ చెరువు నిండిపోయి గ్రామాలను ముంచెత్తే ప్రమాదం ఉండటంతో చెరువు కట్టకు గండి పెట్టి నీటిని దిగువకు వదిలేశారు. కొల్చారం మండలంలోని తుక్కాపూర్‌లో కాలకృత్యాలు తీర్చుకునేందుకు బయటకు వెళ్లిన టేక్మాల్ మల్లప్ప భార్య ప్రమీల మంజీర నదిలో గల్లంతయ్యింది. గురువారం మధ్యాహ్నం వరకు అందిన వివరాల ప్రకారం..జిల్లాలో 49 రోడ్లు తెగిపోయాయి. 24 కాజ్‌వేలు, కల్వర్టులు కూలిపోయాయి. 21 బ్రిడ్జిలు దెబ్బతిన్నాయి. 22 చెరువులకు గండ్లు పడ్డాయి. మెదక్, రామాయంపేట పట్టణాలతో పాటు, పలు గ్రామాల్లో 20 కాలనీల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. 6,341 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. జలదిగ్బంధంలో రామాయంపేట రామాయంపేటలో రెండురోజుల్లో 20 సెం.మీ వరకు వర్షం కురిసింది. పట్టణంలోని శ్రీనగర్‌కాలనీ, అక్కలగల్లి, బీసీ కాలనీ ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రామాయంపేట – కామారెడ్డి– సిద్దిపేట మార్గంలో వరద నీరు చేరడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ఎస్సీ మహిళా డిగ్రీ కాలేజీ హాస్టల్లో నీరు చేరడంతో 50 మంది విద్యార్థినులను తాళ్ల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు వివేక్, దామోదర రాజనర్సింహ పర్యటించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు. రైతులు, ఇటుక బట్టీ కార్మీకుల రెస్క్యూ మెదక్, కామారెడ్డి జిల్లాల్లో కురుస్తున్న భారీవర్షాలతో రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టుకు బుధవారం వరద పోటెత్తింది. రికార్డు స్థాయిలో వచ్చిన నీటితో మానేరు పరవళ్లు తొక్కుతోంది. దిగువన ఉన్న పరీవాహక వాగులో ఒక రైతు గల్లంతు కాగా.. ఐదుగురు రైతులు, ఇద్దరు ఇటుక బట్టీ కార్మీకులు ప్రవాహంలో చిక్కుకున్నారు. గురువారం భారత వైమానిక దళ హెలికాప్టర్ సాయంతో రైతులను, కార్మీకులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. గేదెల కోసం వెళ్లిన గంభీరావుపేట మండలం నర్మాల గ్రామానికి చెందిన పంపుకాడి నాగయ్య అనే రైతు వరదలో గల్లంతయ్యాడు. నర్మాలకు చెందిన పలువురు రైతులు పశువులను తోలుకెళ్లి వాగులో చిక్కుకుపోయారు. అదే ప్రాంతంలో ఉన్న ఇటుకబట్టీలో పనిచేస్తున్న మహారాష్ట్రకు చెందిన ఇద్దరు కార్మీకులు అక్కడే ఉండిపోయారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేశ్ బీ గీతే వరదలో చిక్కుకుపోయిన వారికి డ్రోన్ల ద్వారా ఆహార పదార్థాలు పంపించారు. బండి సంజయ్ చొరవ కేంద్ర మంత్రి బండి సంజయ్ చొరవతో భారత వైమానిక దళానికి చెందిన హెలీకాప్టర్ సాయంతో రైతులను, కార్మీకులను ఒడ్డుకు చేర్చారు. గురువారం సంఘటన స్థలానికి చేరుకున్న సంజయ్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌తో కలిసి రైతులతో మాట్లాడారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ఎగువ మానేరుకు వచ్చి వరద ఉధృతిని పరిశీలించారు. మధ్యాహ్నం ఆర్మీ హెలీకాప్టర్లు బాధితులను రక్షించేంతవరకు ఆయన ఘటనాస్థలంలోనే ఉండటం గమనార్హం. కాగా వరదలో గల్లంతైన నర్మాలకు చెందిన పంపుకాడి నాగయ్య నివాసానికి సంజయ్ వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించారు. నాగం కుమారుడు సాయికి రూ.లక్ష ఆర్థిక సాయం అందించారు. నీటమునిగిన నిర్మల్ నిర్మల్ జిల్లాలో బుధవారం మధ్యాహ్నం నుంచి గురువారం ఉదయం వరకు భారీ నుంచి అతిభారీ వర్షం కురిసింది. నిర్మల్ పట్టణంలో పలు కాలనీలు నీటమునిగాయి. జిల్లాలోని లక్ష్మణచాంద మండలంలో మునిపల్లి శివారులోని గోదావరి కుర్రులో చిక్కుకుపోయిన పశువుల కాపరి శంకర్‌ను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రాణాలకు తెగించి కాపాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి గ్రామం వద్ద రోడ్డు మీదుగా ఉధృతంగా వరద నీరు ప్రవహించడంతో సుమారు 24 గంటల పాటు వాహనాల రాకపోకలను నిలిపివేశారు. తెగిన ఎన్‌హెచ్– 44.. కశ్మీర్ టూ కన్యాకుమారి ఎన్‌హెచ్–44 పై పలుచోట్ల రోడ్డు, వంతెనలు తెగిపోవడంతో జాతీయ రహదారిపై బుధ, గురువారాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. మెదక్ జిల్లా నార్సింగి వద్ద వరద 44వ నంబర్ జాతీయ రహదారిని వరద ముంచెత్తింది. దీంతో హైదరాబాద్ – నిజామాబాద్ మార్గంలో పలుచోట్ల వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మెదక్ – సిద్దిపేట రహదారిపై నిజాంపేట వద్ద ఉన్న బ్రిడ్జి కొట్టుకుపోయింది. దీంతో ఈ రూట్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మెదక్ నుంచి ఎల్లారెడ్డి, బాన్సువాడ రహదారిపై పోచారం ప్రాజెక్టు పొంగి ప్రవహించడంతో వంతెన దెబ్బతిని రాకపోకలు నిలిచిపోయాయి. కామారెడ్డి జిల్లా భిక్కనూరు టోల్‌ప్లాజా వద్ద జాతీయ రహదారిపై భారీగా వరద నీరు పారడంతో రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు కామారెడ్డి–భిక్కనూరు మండలాల సరిహద్దులో జంగంపల్లి వద్ద జాతీయ రహదారిపైకి భారీగా వచ్చిన వరద నీటితో రోడ్డు కోతకు గురైంది. సదాశివనగర్ మండలం కల్వరాల వద్ద కూడా ఎన్‌హెచ్ 44 కోతకు గురైంది. టేక్రియల్ వంతెన కోతకు గురైంది. హైదరాబాద్–నిజామాబాద్ ఆర్టీసీ సరీ్వసులు నిలిచిపోయాయి. కామారెడ్డి జాతీయ రహదారిలోని జీఆర్ కాలనీలో కల్వర్టు కింద నుంచి ప్రవాహంలో కొట్టు కొచ్చిన కార్లు కొట్టుకుపోయిన రైల్వే లైన్లు సికింద్రాబాద్–నిజామాబాద్ రైల్వే లైనుపై పలు చోట్ల మట్టికొట్టుకుపోయి ట్రాక్‌లు గాలిలో వేలాడడంతో రైళ్లను రద్దు చేశారు. మెదక్ జిల్లా శమ్నాపూర్ దేవుని చెరువు నీళ్ల ధాటికి రైల్వే ట్రాక్ కోతకు గురైంది. దీంతో అక్కన్నపేట – మెదక్ మార్గంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. కామారెడ్డి జిల్లా తలమడ్ల సమీపంలో కూడా ట్రాక్ కోతకు గురికావడంతో సికింద్రాబాద్– మన్మార్డ్ మా ర్గంలో రైళ్లు నిలిచిపోయాయి. ఈ రూట్లో రైళ్లు పునరుద్ధరించాలంటే రెండు రోజులైనా పట్టే అవకాశాలున్నాయని అంటున్నారు.మెదక్ జిల్లాలో నీట మునిగిన దూప్‌సింగ్ తండా భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో..భూపాలపల్లి జిల్లా ఎగువనుంచి వరద నీరు వస్తుందటంతో మోరంచ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. మహాముత్తారం మండలంలోని పెగడపల్లి, కేశవపూర్ మధ్య గల పెద్దవాగు ఉప్పొంగి ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. బ మల్హర్ మండలంలోని తాడిచర్ల ఓపెన్‌కాస్ట్‌లో 6 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోగా, భూపాలపల్లి ఏరియాలో మంగళవారం, బుధవారం కురిసిన వర్షానికి ఓపెన్‌కాస్ట్ 2,3 ప్రాజెక్టుల్లో 20 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం వాటిల్లినట్లు సింగరేణి అధికారులు వెల్లడించారు. ములుగు జిల్లా మొండ్యాల తోగు వద్ద జాతీయ రహదారి వరద తాకిడికి భారీగా కోతకు గురైంది. ఊరట్టం తూ ముల వాగు వరద తాకిడికి బ్రిడ్జి సమీపంలో రోడ్యాం వద్ద సీసీ రోడ్డు కోతకు గురైంది. రంగాపూర్ పెద్ద చెరువు కట్ట తెగిపోయింది. జల దిగ్బంధంలో సిద్దిపేట రెండు రోజులుగా ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో సిద్దిపేట జిల్లా కేంద్రం జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. ఎగువ నుంచి కోమటి చెరువుకు వరద నీరు చేరడంతో పొంగి పొర్లుతోంది. దీంతో పట్టణంలోని శ్రీనగర్ కాలనీ, హరిప్రియానగర్, శ్రీనివాసనగర్, సీతారామంజనేయ థియేటర్ జలమయంగా మారాయి. హరిప్రియానగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వరద నీరు చేరడంతో..వరద ప్రవాహంలోనే రోగులను స్ట్రెచర్‌పై మరో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. గజ్వేల్‌లోని లక్ష్మీప్రసన్న కాలనీ, ఎలైట్ ప్రజ్వల్ కాలనీ కూడా నీట మునిగాయి. కూడవెల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. గజ్వేల్–దుబ్బాక మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గజ్వేల్ పట్టణంలోని ఎర్రకుంట పొంగి పొర్లుతుండటంతో వరద నీరంతా తూప్రాన్ రోడ్డు వై జంక్షన్ వద్ద నిలిచి 33/11 కేవీ సబ్ స్టేషన్ జలమయంగా మారింది. వరద ముంపులో చిక్కుకున్న సిద్దిపేట జిల్లా అక్బర్పేట–భూంపల్లి మండలం చిన్ననిజాంపేట గ్రామానికి చెందిన ముగ్గురు రైతులు 22 గంటల పాటు బిక్కుబిక్కుమంటూ గడిపారు. అనంతరం ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది పడవ ద్వారా వారిని ఒడ్డుకు చేర్చారు. పోచారం ప్రాజెక్టుకు తప్పిన ముప్పు కామారెడ్డి జిల్లాలోని పోచారం ప్రాజెక్టుకు భారీ ముప్పు తప్పింది. భారీ వర్షాలతో ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. దీంతో ప్రాజెక్టు పైభాగం నుంచి నీరు పడడంతో స్ట్రక్చర్‌కు ఒకచోట గొయ్యి ఏర్పడింది. ప్రాజెక్టు తెగిపోయినట్టేనని అందరూ భావించారు. కానీ వరద తీవ్రత తగ్గడంతో పెద్ద ప్రమాదం తప్పింది. రైలుకు ఎదురెళ్లి నిలిపేసిన గ్యాంగ్మన్ గ్యాంగ్మన్ అప్రమత్తతతో పెద్ద రైలు ప్రమాదం తప్పింది. కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో బుధవారం కురిసిన భారీ వర్షాలకు వరద పోటెత్తడంతో కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలంలోని రామేశ్వర్‌పల్లి–తిప్పాపూర్ మధ్య 528 మైలురాయి వద్ద రైల్వే ట్రాక్ కింద ఉన్న మట్టికట్ట 50 గజాల మేర కొట్టుకుపోయింది. దీంతో రైలు పట్టాలు గాల్లో వేలాడుతున్నాయి. గ్యాంగ్మన్ రమేష్ దీన్ని గమనించి అప్రమత్తమయ్యాడు. భిక్కనూరు నుంచి వస్తున్న కాచిగూడ–పెద్దపల్లి ప్యాసింజర్ రైలుకు ఎదురుగా వెళ్లి అది ఆగిపోయేలా చూశాడు. ట్రాక్ కొట్టుకుపోయిన విషయాన్ని లోకో పైలట్‌కు తెలియజేయడంతో ఆయన స్టేషన్ మాస్టర్ భానుశేఖర్కు సమాచారం అందించారు. ఆయన ఉన్నతాధికారులకు సమాచారం చేరవేయడంతో వారు వెంటనే సికింద్రాబాద్–నిజామాబాద్ మార్గంలో ప్రయాణించే పలు రైళ్లను రద్దు చేసి, కొన్ని రైళ్లను వేరే మార్గంలోకి మళ్లించారు. కాచిగూడ–పెద్దపల్లి ప్యాసింజర్ రైలులో 167 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం జరగకుండా వీరిని కాపాడిన గ్యాంగ్మన్ రమేష్‌ను డివిజనల్ రైల్వే మేనేజర్ సంతోష్ కుమార్, ప్రయాణికులు అభినందించారు. -
కూలిన స్తంభాలు... నీళ్లలో సబ్స్టేషన్లు
సాక్షి, హైదరాబాద్/మిరుదొడ్డి (దుబ్బాక)/తొగుట (దుబ్బాక): వరద ప్రభావిత ప్రాంతాల్లోని చాలా గ్రామాల్లో అంధకారం అలముకుంది. సబ్ స్టేషన్లలోకి నీళ్లు చేరడం, విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో విద్యుత్ శాఖకు భారీ నష్టం వాటిల్లింది. వరదల నేపథ్యంలో విద్యుత్ సరఫరాను నిలిపివేసిన అధికారులు సరఫరా పునరుద్ధరణకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. అయినా మరో 3–4 రోజుల వరకు విద్యుత్ పునరుద్ధరణ సాధ్యం కాకపోవచ్చని అధికార వర్గాలు అంటున్నాయి. మరోవైపు ఉత్తర, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీలు ముషారఫ్ ఫారూఖీ, కర్నాటి వరుణ్‌రెడ్డి తాజా పరిస్థితిని గురువారం మీడియాకు వెల్లడించారు. కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్ ప్రాంతాల్లో వరుణ్‌రెడ్డి పర్యటించారు. కరీంనగర్ సర్కిల్ ఆఫీ సులో లోడ్ మానిటరింగ్ సెల్‌ను పరిశీలించి విద్యుత్ సరఫరా, సబ్స్టేషన్ల పనితీరు, స్తంభాలు, లైన్ల పనితీరును పర్యవేక్షించారు. కాగా, క్షేత్రస్థాయి నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు. పలు జిల్లాల్లో ‘విద్యుత్’ నష్టం ఇలా.. » మెదక్ జిల్లాలో వరద ప్రభావానికి కొన్నిచోట్ల సబ్‌స్టేషన్లలోకి నీళ్లు చేరాయి. 33 కేవీ ఫీడర్లు 11, 11 కేవీ ఫీడర్లు 175, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు 262 సహా 971 విద్యుత్ స్తంభాలకు నష్టం వాటిల్లింది. వందల కి.మీ. మేర విద్యుత్ లైన్లు దెబ్బతిన్నాయి. » నల్లగొండ, గద్వాల్, యాదాద్రి, సంగారెడ్డి, నారాయణపేట జిల్లాల పరిధిలో వరదల ప్రభావానికి 33 కేవీ ఫీడర్లు 39, 11 కేవీ ఫీడర్లు 296, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు 280, 1,357 విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. మరోవైపు ఉత్తర ప్రాంత విద్యుత్ సంస్థ పరిధిలోని కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ సర్కిల్ పరిధిలో 108 విద్యుత్ స్తంభాలు నేలకూలగా వాటిల్లో 87 స్తంభాలను అధికారులు పునరుద్ధరించారు. అలాగే 21 ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతినగా అన్నింటినీ బాగుచేశారు. అయితే 86 ట్రాన్స్ఫార్మర్లు నీటమునగగా వాటిలో ఆరింటిని పునరుద్ధరించారు. ప్రాణాలకు తెగించి వాగులోకి వెళ్లి..9 గ్రామాలకు ఉద్యోగుల వెలుగులు భారీ వర్షాల వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడంతో విద్యుత్‌ఉద్యోగులు ప్రాణాలకు తెగించి సర ఫరా పునరుద్ధరించారు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట– భూంపల్లి మండలం ఖాజీపూర్ పరిధిలోని 33/11 కేవీ ఫీడర్ లైన్‌కు సంబంధించిన విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో కాసులాబాద్, రుద్రారం, మల్లుపల్లి, జంగపల్లి, వీరారెడ్డిపల్లి, మదన్నపేట, బేగంపేట, అల్మాస్పూర్, ఖాజీపూర్, గుర్రాలపల్లి గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న ఎస్సీ చంద్రమోహన్, డీఈ రామచంద్రయ్య, ఏడీ గంగాధర్, ఏఈ కనకయ్యలు తమ సిబ్బందితో కలిసి వాగులోకి వెళ్లి విద్యుత్ స్తంభాన్ని ఏర్పాటు చేశారు. దీంతో తొమ్మిది గ్రామాలకు సరఫరాను పురుద్ధరించారు. మరోవైపు తొగుట మండలం వెంకట్రావుపేట వనం చెరువు మధ్యలో ఉన్న ఓ విద్యుత్ స్తంభానికి పిన్ ఇన్సులేటర్ ఊడి పడిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో జేఎల్ఎం మల్లేశం చెరువులోకి ఈదుకుంటూ వెళ్లి స్తంభంపైకి చేరుకొని.. పిన్ ఇన్సులేటర్‌ను బిగించాడు. దీంతో సరఫరా పునరుద్ధరణ అయింది. జేఎల్ఎం మల్లేశంను అధికారులు అభినందించారు. -
యుద్ధప్రాతిపదికన మరమ్మతులు
సాక్షి, హైదరాబాద్/పెద్దపల్లి/మెదక్‌జోన్: భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న చెరువులు, కాల్వలు, రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. తక్షణ మే అంచనాలు తయారు చేసి అత్యవసర నిధులతో పనులు చేపట్టాలని సూచించారు. వరదల్లో మృతిచెందిన వారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌తో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి గురువారం వరదలతో అతలాకుతలమైన కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించారు. భారీ వర్షాలతో బుధ, గురువారాల్లో పోటెత్తిన వరదలతో కామారెడ్డి, మెదక్ జిల్లాలో అపార నష్టం వాటిల్లిందని సీఎంకు రెండు జిల్లాల కలెక్టర్లు నివేదించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద హెలికాప్టర్ దిగి వరదల పరిస్థితిపై సమీక్షించారు. అనంతరం నిజాంసాగర్, పోచారం ప్రాజెక్టులను ఏరియల్ సర్వే నిర్వహించారు. కామారెడ్డిలో హెలికాప్టర్ దిగి జిల్లా కలెక్టర్‌తో సమీక్షించాల్సి ఉండగా, వాతావరణం అనుకూలించకపోవటంతో సాధ్యం కాలేదు. దీంతో మెదక్ జిల్లా చేరుకుని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం హెలికాప్టర్‌ను మెదక్ ఎస్పీ కార్యాలయంలో దించి జిల్లాలో వరదల పరిస్థితిపై అక్కడే సమీక్ష నిర్వహించారు. జిల్లాలో వరద పరిస్థితిని కలెక్టర్ సీఎంకు నివేదించారు. వరద సహాయక చర్యల్లో అధికార యంత్రాంగం బాగా పని చేసిందని సీఎం కితాబిచ్చారు. సమీక్షలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, ఎంపీ రఘునందన్ రావు తదితరులు పాల్గొన్నారు. మెదక్ నుంచే సీఎం కామారెడ్డి జిల్లా కలెక్టర్‌కు ఫోన్ చేసి వరద పరిస్థితులపై ఆరా తీశారు. సత్వరం సహాయక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వరద నష్టంపై అత్యవసరంగా కేంద్రానికి ప్రాథమిక నివేదిక సమర్పిస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. అప్రమత్తంగా ఉండాలిభారీ వర్షాల నేపథ్యలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవా లని సీఎం ఆదేశించారు. గురువారం ఉదయం తన నివాసంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, మంత్రులు శ్రీధర్‌బాబు, సీతక్కతో కలిసి వరద పరిస్థితిపై సమీక్షించారు. హైదరాబాద్ నగరంతోపాటు అన్నిచోట్లా శిథిలావస్థకు చేరిన ఇళ్లలో ఉన్న వారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. వినాయక మండపాల వద్ద విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లతో భక్తులకు ప్రమాదం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. హైదరాబాద్‌లో హైడ్రా, జీహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, పోలీసు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. చెరువులు, కుంటలకు గండ్లు పడే ప్రమాదం ఉన్నందున నీటి పారుదల శాఖ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. అంటువ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. వైద్యారోగ్య శాఖ సిబ్బంది ఆస్పత్రుల్లో సరిపడా మందులు అందుబాటులో ఉంచుకోవడంతోపాటు అవసరమైన చోట వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్‌బృందాల సాయం తీసుకోవాలని సీఎస్‌ను ఆదేశించారు. మామ స్వాతిముత్యం.. అల్లుడు ఆణిముత్యంమామ స్వాతిముత్యం.. అల్లుడు ఆణిముత్యంలా రూ.లక్షల కోట్లు వెచ్చించి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో ఎన్నో లోపాలు ఉన్నాయని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. గురువారం పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ఆయన మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బరాజ్ కుంగిపోయిందని, ఏనాడో నిర్మించిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టే ప్రస్తుతం తెలంగాణకు వరప్రదాయినిగా మారిందని అన్నారు. మామ, అల్లుడు కాళేశ్వరం ప్రాజెక్టును గొప్పగా నిర్మించామని చెప్పుకుంటున్నారని, వాళ్లలా తాము 80 వేల పుస్తకాలు చదవలేదని మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుపై సెటైర్ వేశారు. యూరియాపై ఎప్పటికప్పుడు బఫర్ స్టాక్ డిస్ప్లే చేస్తున్నామని సీఎం తెలిపారు. తదుపరి పంటలకు సైతం కొందరు రైతులు యూరియాను నిల్వ చేసుకోవడంతో కొరత ఏర్పడిందని చెప్పారు. సీఎం వెంట మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్ ఉన్నారు. -
గోదావరి మళ్లీ ఉగ్రరూపం
సాక్షి, హైదరాబాద్: గోదావరి నది మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. పరీవాహక ప్రాంతాల్లో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రధాన ఉపనదులైన మంజీర, మానేరు, పెన్‌గంగా, వార్ధా, వెయిన్‌గంగా, ప్రాణహిత, ఇంద్రావతి, శబరితోపాటు గోదావరి నది ఎగువ, మధ్య, దిగువ పాయలు భీకరంగా ప్రవహిస్తున్నాయి. దీంతో పరీవాహకంలోని అన్ని ప్రాజెక్టులకు గంటగంటకూ భీకర వరద పోటెత్తడంతో అప్రమత్తత ప్రకటించారు. మహారాష్ట్రలోని జైక్వాడ్ ప్రాజెక్టు నుంచి ఏపీలోని ధవళేశ్వరం బరాజ్ వరకు పరీవాహకంలోని అన్ని ప్రాజెక్టుల గేట్లు పైకి ఎత్తారు. » భదాచలం వద్ద గోదావరిలో 7.45 లక్షల క్యూసెక్కుల వరద పోటెత్తడంతో నీటిమట్టం 38.6 అడుగులకు చేరుకుంది. ప్ర వాహం 9.32 లక్షల క్యూసెక్కులకు చేరితే తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. » మంజీరపై ఉన్న సింగూరు ప్రాజెక్టుకు 44,650 క్యూసెక్కుల వరద వస్తుండగా, 18.32 టీఎంసీల నిల్వను కొనసాగిస్తూ వచ్చిన నీటిని వచ్చినట్టే దిగువకు విడుదల చేస్తున్నారు. దిగువన ఉన్న నిజాంసాగర్ గరిష్ట సామర్థ్యం 17.8 టీఎంసీలు కాగా, 1.81లక్షల క్యూసెక్కుల వరద వస్తుండడంతో 16.14 టీఎంసీల నిల్వను కొనసాగిస్తూ 27 గేట్లు పైకెత్తి 2.2 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. » శ్రీరాంసాగర్ గరిష్ట నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా, ప్రాజెక్టుకు 3.2 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండడంతో 67.05 టీఎంసీల నిల్వలను కొనసాగిస్తూ 39 గేట్లు పైకెత్తి 3.55 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నెల 30న శ్రీరాంసాగర్‌కు గరిష్టంగా 3.7లక్షల క్యూసెక్కుల వరద పోటెత్తనుందని అంచనా వేశారు.» కడెం ప్రాజెక్టు సామర్థ్యం 4.7 టీఎంసీలు కాగా, 66,605 క్యూసెక్కుల వరద వస్తుండడంతో 3.78 టీఎంసీల నిల్వ కొనసాగిస్తూ, 62,407 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. స్వర్ణ ప్రాజెక్టులోకి 5,700 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండటంతో అదేస్థాయిలో రెండుగేట్ల ద్వారా నీటిని వదులుతున్నారు. భైంసాలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టులోకి 17,500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుండటంతో మూడుగేట్ల ద్వారా 18,500 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. » దిగువన ఉన్న ఎల్లంపల్లి నిల్వ సామర్థ్యం 20.18 టీఎంసీలు కాగా 5.14 లక్షల క్యూసెక్కుల వరద పోటెత్తడంతో 14.63 టీఎంసీల నిల్వను కొనసాగిస్తూ 38 గేట్లు పైకెత్తి 5.9 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సోమవారం రాత్రి నాటికి 9 లక్షల క్యూసెక్కులకు వరద పెరుగుతుందని అంచనా వేశారు. » కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన సుందిళ్ల బరాజ్‌కు 8.36 లక్షలు, అన్నారం బరాజ్‌కు 6.19 లక్షలు, మేడిగడ్డ బరాజ్‌కు 5.52 లక్షల క్యూసెక్కులతోపాటు సమ్మక్క బరాజ్‌కు 5.13 లక్షలు, సీతమ్మసాగర్ బరాజ్‌కు 7.02 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, వచ్చిన వరదను వచ్చినట్టు కిందకు విడుదల చేస్తున్నారు. మేడిగడ్డ బరాజ్‌కు శనివారం నాటికి గరిష్టంగా 9.48 లక్షల క్యూసెక్కుల వరద రానుందని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో భద్రాచలం వద్ద గోదావరిలో నీటిమట్టం మంగళ, బుధవారాల్లో అత్యంత ప్రమాదకర స్థాయికి పెరగనున్నట్టు అంచనా వేస్తున్నారు. మిడ్‌మానేరు గేట్లు ఎత్తివేత.. భారీ వర్షాలతో మానేరు నది పోటెత్తింది. దీంతో మిడ్‌మానేరు రిజర్వాయర్‌కు మానేరు నుంచి 45,565 క్యూసెక్కులు, శ్రీరాంసాగర్ నుంచి ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా మరో 12,000 క్యూసెక్కులు కలిపి మొత్తం 57,566 క్యూసెక్కులు వచ్చి మిడ్‌మానేరులో కలుస్తుండడంతో జలాశయ 17 గేట్లను పైకెత్తి 47,850 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో దిగువ మానేరు జలాశయానికి వరద ప్రవాహం 56,944 క్యూసెక్కులకు పెరిగింది. జలాశయం నిల్వ సామర్థ్యం 24.07 టీఎంసీలు కాగా ప్రస్తుతం 16.97 టీఎంసీలకు నిల్వలు చేరాయి. మంగళవారం ఉదయం నాటికి జలాశయం పూర్తిగా నిండొచ్చు.సాగర్‌కు పెరిగిన వరద 26 గేట్ల ద్వారా కృష్ణమ్మ పరవళ్లు నాగార్జునసాగర్/డిండి: సాగర్ జలాశయానికి 3,18,791 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా, 26 క్రస్ట్ గేట్లు, విద్యుదుత్పాదనతో దిగువ కృష్ణానదిలోకి 2,35,058 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. వర్షాలు కురుస్తుండడంతో ఆయకట్టుకు నీటి అవసరాలు తగ్గాయి. దీంతో నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు నీటి విడుదలను నిలిపివేశారు. అవసరమైన సమయంలో మళ్లీ నీటిని విడుదల చేయనున్నట్టు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. అలుగు పారుతున్న డిండి ప్రాజెక్టుడిండి మండల కేంద్రంలోని డిండి ప్రాజెక్టులోకి వరద మరింత పెరిగింది. ఈ నెల 14 నుంచి ప్రాజెక్టు అలుగుపోస్తున్న విషయం తెలిసిందే. అయితే గురువారం నుంచి ప్రాజెక్టులోకి 10,202 క్యూసెక్కుల నీరు వస్తుండడంతో అలుగు నుంచి నీటి విడుదల కూడా పెరిగింది. డిండి ప్రాజెక్టు అందాలను చూడటానికి పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తున్నారు. -
కామారెడ్డిలో మళ్లీ దంచికొడుతున్న వర్షం
-
అలర్ట్‌గా ఉన్నాం.. 1,200 మందిని రక్షించాం: తెలంగాణ డీజీపీ
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో కుండపోత వానలు, వరదల నేపథ్యంలో కొనసాగుతున్న సహాయక చర్యలపై రాష్ట్ర డీజీపీ జితేందర్ స్పందించారు. వర్షాలు, వరదలపై పోలీస్ వ్యవస్థ అప్రమత్తంగానే ఉందని.. 24 గంటలుగా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయని తెలిపారు.గురువారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. వర్షాలు, వరదలపై అన్నిప్రాంతాల్లో పోలీస్ వ్యవస్థ అలర్ట్‌గా ఉంది. ఇప్పటివరకు 1,200మందిని కాపాడాం. కామారెడ్డి, రామయంపేట్, నిర్మల్, మెదక్ జిల్లాలో వరద ఉధృతి తగ్గింది. అయినా రెస్క్యూ చేస్తూనే ఉన్నాం. పోలీసులు 24గంటలు రెస్క్యూ టీమ్‌తో కలిసి సహాయక చర్యల్లో పాల్గొంటూనే ఉన్నారు.ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బందితో కలిసి పోలీసులు పని చేస్తున్నారు. సకాలంలో ఎస్డీఆర్ఎఫ్ బృందాలు స్పాట్‌కు చేరుకోవడంతో భారీ ముప్పు తప్పింది. కామారెడ్డిలో చాలా మందిని రక్షించాం. బోట్స్, లైఫ్ జాకెట్లతో రక్షించి సురక్షిత ప్రాంతాలకు చేర్చాం. వరదలపై కంట్రోల్ రూం నుంచి 24 గంటలు మానిటరింగ్ చేస్తూనే ఉన్నాం అని డీజీపీ జితేందర్ వెల్లడించారు.చిత్రాల కోసం క్లిక్ చేయండి👉 సముద్రం కాదహే.. కామారెడ్డి రోడ్లు!! -
రోడ్లను ముంచెత్తిన వరద.. వాహనదారులకు గండం
-
ఏపీలో కుండపోత.. హెచ్చరికలు జారీ చేసిన విపత్తుల నిర్వహణ సంస్థ
విజయవాడ, సాక్షి: అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ పలు జిల్లాల్లో భారీ వర్షాలు, మిగతా చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు పొంగిపొర్లి ఒడిశాతో ఏపీకి రాకపోకలు బంద్ అయ్యాయి. కోస్తా తీరం అతలాకుతలం అవుతోంది. మరో నాలుగు రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ అంటోంది.ఈ తరుణంలో ఏపీకి విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక జారీ చేసింది. కృష్ణా,గోదావరి,తుంగభద్ర నదిపరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. పొంగిపొర్లే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ పేరిట ఒక ప్రకటన వెలువడింది. భారీ వర్షాలతో ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కృష్ణా నదికి మళ్లీ వరద ప్రవాహం పోటెత్తుతోంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం బ్యారేజ్ వద్ద ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 4.05 లక్షల క్యూసెక్కులుగా ఉంది. -
భారీ వర్షాలకు కామారెడ్డి అతలాకుతలం
-
జేసీబీ, ట్రాక్టర్ సహాయంతో అంత్యక్రియలు
సాక్షి, మెదక్: కనీవినీ ఎరుగని రీతిలో మెతుకుసీమ చరిత్రలో లేనంతగా వరుణుడు వణికించేస్తున్నాడు. ఇప్పటికే పలు గ్రామాలు, తండాలు జలదిగ్బంధంలో ఉండిపోయాయి. మరో రెండు రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. ఫ్లాష్‌ఫ్లడ్స్ హెచ్చరికల నేపథ్యంలో నీటి ఉపద్రవం తమను ముంచెత్తుతుందో అని జనాలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. భారీ వర్షాలతో మెదక్ ప్రజల జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. రేగోడ్ (మం) మర్పల్లి గ్రామంలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. అంత్యక్రియల కోసం ఓ కుటుంబం, గ్రామస్తులు తీవ్ర అవస్థలు పడ్డారు. గొల్ల వాగు వరద నీటి ప్రవాహా ఉదృతితో జేసీబీ, ట్రాక్టర్ సహాయంతో అంత్యక్రియలు నిర్వహించారు. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.గత రెండు రోజులుగా మెదక్ జిల్లాలో తీవ్రమైన వర్షాలు నమోదయ్యాయి. గజ్వేల్, నారాయణఖేడ్, సిద్దిపేట ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. రోడ్లు దెబ్బ తినడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వరి, మక్క, కందుల పంటలు నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు. కొన్ని మండలాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఇప్పటికే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు.. రెవెన్యూ అధికారులు గ్రామాల్లో పర్యటించి నష్టం అంచనా వేస్తున్నారు. రాగల 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని జాగ్రత్తలు చెబుతోంది. -
కామారెడ్డి జిల్లాను ముంచెత్తిన వరదలు
-
తెలంగాణపై వరుణుడి ఉగ్రరూపం
-
వరదల్లో చిక్కుకున్న బాధితులు.. రాజ్‌నాథ్ సింగ్‌కు బండి సంజయ్ ఫోన్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో వర్షం బీభత్సం నేపథ్యంలో సహాయక చర్యల్ని ముమ్మరం చేసేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నడుం బిగించారు. కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాలో వరదల్లో 30 మంది చిక్కుకున్న బాధితుల్ని రక్షించేలా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో ఫోన్లో సంప్రదింపులు జరిపారు. కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాలో వరదల్లో 30 మంది చిక్కుకున్నారని, బాధితులను కాపాడేందుకు ప్రత్యేక వైమానిక దళ హెలికాప్టర్‌ను పంపించాలని బండి సంజయ్ రాజ్ నాథ్ సింగ్‌ను కోరారు. అందుకు రాజ్‌నాథ్ సింగ్ సానుకూలంగా స్పందించారు. బాధితులను కాపాడేందుకు ప్రత్యేక వైమానిక దళ హెలికాప్టర్‌ను పంపాలని హకీంపేటలోని డిఫెన్స్ అధికారులను కేంద్ర రక్షణ మంత్రి కార్యాలయం ఆదేశించింది. వరద సహాయక చర్యల విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఎన్డీఆర్ఎఫ్ దళాలు సిద్ధంగా ఉన్నాయని బండి సంజయ్ వెల్లడించారు. -
తెలంగాణలో వర్ష బీభత్సం.. బీహార్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్
సాక్షి,తెలంగాణ: ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షం హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో బీభత్స సృష్టిస్తోంది. వర్షం కారణంగా వాగులు,వంకలు,లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. భారీ ఎత్తున ఆస్తినష్టం సంభవించింది. వరద ధాటికి వరదనీరు పొంగిపొర్లుతుంది. వరద ప్రవాహాతో పలు ప్రాంతాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పలు ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలు బిక్కుబిక్కుమంటూ ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకుని గడుపతున్నారు ఈ క్రమంలో రాష్ట్రంలో వర్ష బీభత్సంపై మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. భారీ వర్షాలతో తెలంగాణ నీట మునుగుతున్నది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రజలు సాయం కోసం అర్థిస్తున్నారు. సీఎం మాత్రం తీరిగ్గా బీహార్‌లో ఎన్నికల యాత్ర చేస్తున్నారు. ఎప్పుడొస్తాయో తెలియని బీహార్ ఎన్నికల కోసం..తెలంగాణకు సంబంధమే లేని బీహార్ ఎన్నికల కోసం తెలంగాణ సీఎం, మంత్రివర్గం కాంగ్రెస్ అధిష్ఠానం ముందు మోకరిల్లిందిఅధిష్ఠానం ఆశీస్సులతో.. పదవులు కాపాడుకుని ఖజానా కొల్లగొట్టే ధ్యాస తప్పితే ఆరు గ్యారంటీలు..420 హామీల అమలు గురించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి సోయి లేదు. వరదలతో ప్రజలు..యూరియా దొరక్క రైతులు.. ఉద్యోగ నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారుచాలా చోట్ల వరదనీటిలో మునిగి ప్రజలు హెలికాప్టర్ సాయం కోసం ఎదురుచూస్తున్నారు.తెలంగాణ ప్రజల సొమ్ముతో ప్రైవేట్ జెట్లలో ఊరేగుతున్న కాంగ్రెస్ సీఎం, మంత్రులకు ఓలా, ఊబర్, ర్యాపిడో క్యాబ్‌ల కన్నా అధ్వాన్నంగా 100 కిలోమీటర్ల లోపు ప్రభుత్వ కార్యక్రమాలకు హెలికాప్టర్‌ను వినియోగిస్తున్న ఈ నేతలకు ఇప్పుడైనా హెలికాప్టర్ పంపి ప్రజల ప్రాణాలు రక్షించే తీరిక ఉందో,లేదో ?కాంగ్రెస్ నేతలారా.ఓట్లు కాదు..ప్రజల పాట్లు చూడండి..ఎన్నికలు కాదు..ఎరువుల కోసం రైతుల వెతలు చూడండి. వరదల్లో చిక్కుకుపోయిన ప్రజలను రక్షించేందుకు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నది’అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. భారీ వర్షాలతో తెలంగాణ నీట మునుగుతున్నదిప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రజలు సాయం కోసం అర్థిస్తున్నారుసీఎం మాత్రం తీరిగ్గా బీహార్ లో ఎన్నికల యాత్ర చేస్తున్నాడుఎప్పుడొస్తాయో తెలియని బీహార్ ఎన్నికల కోసంతెలంగాణకు సంబంధమే లేని బీహార్ ఎన్నికల కోసం తెలంగాణ సీఎం, మంత్రివర్గం… pic.twitter.com/AuZrpbwjN7— KTR (@KTRBRS) August 27, 2025 -
Bandi Sanjay: బాధితులెవరూ భయపడొద్దని పూర్తిగా అండగా ఉంటామని భరోసా
-
చైనా-భారత్-పాక్.. కనివినీ ఎరుగని రీతిలో విధ్వంసం!
దక్షిణాసియా దేశాలైన భారత్, పాకిస్తాన్, చైనాలను ఈ మధ్యకాలంలో తీవ్రమైన ప్రకృతి విపత్తులు కుదిపేస్తున్నాయి. మునుపెన్నడూలేని విధంగా క్లౌడ్ బరస్ట్, మెరుపు వరదలు మూడు దేశాల్లోనూ తీవ్ర నష్టం కలిగించాయి. ఈ సీజన్లో వర్షాలు మామూలే అయినా.. ఈ ఏడాది మాత్రం అసాధారణంగా నమోదు అవుతోంది. అందుకు కారణాలను పరిశీలిస్తే.. భారీ వర్షాలు భారత్, పాకిస్తాన్, చైనా దేశాలను పెను విపత్తులుగా ముంచెత్తాయి. క్లౌడ్ బరస్ట్, మెరుపు/ఆకస్మిక వరద(Flash Floods) ఎక్కువగా వినాల్సి వస్తోంది. ఇవే ఈ మూడు దేశాల్లో విపరీతమైన ఆస్తి, ప్రాణ నష్టాల్ని కలిగించాయి. జమ్ము కశ్మీర్ ఈ ప్రభావంతో ఈ మధ్యకాలంలో ఎంతో మంది మరణించడం చూస్తున్నదే. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో రహదారులు దారుణంగా దెబ్బ తిన్నాయి. దక్షిణ రాష్ట్రాల్లోనూ ఇప్పుడు ఇదే పరిస్థితి.ఇక.. పాకిస్తాన్లో ఖైబర్ పఖ్తూన్ఖ్వా, గిల్గిట్-బాల్టిస్తాన్, పంజాబ్ ప్రాంతాలు వర్షాలు, వరదలతో తీవ్రంగా ప్రభావితమయ్యాయి. రెండు నెలల కాలంలో వర్షాలు, వరదలతో పాక్‌లో 700 మంది మరణించినట్లు పలు గణాంకాలు చెబుతున్నాయి. వీళ్లలో చిన్నారులే అధికంగా ఉన్నారు. చైనాలో రెండు నెలల వర్షాల వల్ల ₹1.84 లక్షల కోట్ల మేర ఆర్థిక నష్టం వాటిల్లింది. ప్రాణ నష్టాన్ని చైనా అధికారికంగా ప్రకటించలేదు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల మాన్సూన్ ట్రఫ్ దక్షిణ దిశగా కదిలిపోతోంది. ఈ ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షపాతం.. దానికి వ్యతిరేకంగా ఇంకొన్ని చోట్ల తగ్గుదల కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో వర్షపాతం తగ్గుముఖం పట్టింది. మాన్సూన్ ట్రఫ్ అంటే..మాన్సూన్ ట్రఫ్ అనేది దక్షిణాసియా దేశాల్లో వర్షాకాలంలో వర్షాల పంపిణీకి దిశానిర్దేశం చేసే వాతావరణ రేఖ. ఇది సాధారణంగా పాకిస్తాన్ నుంచి బెంగాల్ ఖాతీ వరకు విస్తరించి ఉంటుంది. ఈ ట్రఫ్ చుట్టూ తక్కువ ఒత్తిడి ఏర్పడిన ప్రాంతాల(Low Pressure Formation) వల్ల వర్షాలు కురుస్తుంటాయి. చైనా, పాక్, భారత్‌లో ఈ సీజన్లో వర్షాలకు కారణం ఇదే. (తక్కువ ఒత్తడి ప్రాంతాల్లోకి చుట్టుపక్కల నుంచి గాలి ప్రవహిస్తుంది. ఆ గాలి ఆవిరితో నిండిన మేఘాలను తీసుకువస్తుంది. ఇది వర్షాలు కురవడానికి అనుకూల పరిస్థితిని కలిగిస్తుంది. అందుకే మాన్సూన్ కాలంలో తక్కువ ఒత్తడి ప్రాంతాలు భారీ వర్షాలకు కారణమవుతాయి). అయితే..వాతావరణ మార్పు, నగరీకరణ, అటవీ నాశనం వంటి మానవ చర్యలు ఈ ట్రఫ్ మార్గాన్ని అస్థిరంగా మార్చి వర్షాల తీవ్రతను పెంచుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల కొండ ప్రాంతాలు, నదుల నుంచి నీటి ఆవిరి ఎక్కువగా ఉంటోంది. ఈ ఆవిరి మేఘాల్లో చేరి, ఒక స్థాయికి చేరుకున్న తర్వాత తక్కువ సమయంలో భారీ వర్షంగా కురుస్తుంది. ఇది వర్షపాతం తీవ్రతను పెంచుతూ, ఆకస్మిక వరదలకు దారితీస్తోంది. పైపెచ్చు ఉదయం వేళల్లో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఆవిరి పెరిగి, తక్కువ సమయంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ✅ పరిష్కార మార్గాలు• ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు: ప్రజలకు సమయానికి సమాచారం అందించాలి. అయితే అది కష్టతరంగా మారుతోంది• వరద మైదానాల పునరుద్ధరణ: సహజ జల ప్రవాహ మార్గాలను తిరిగి స్థాపించాలి.• స్థిరమైన నగరీకరణ ప్రణాళికలు: పర్యావరణాన్ని దెబ్బతీయకుండా అభివృద్ధి.• అటవీ విస్తరణ: వర్షపు నీటిని శోషించే వనరుల పెంపు.• ప్రజల అవగాహన: వాతావరణ మార్పు, ప్రకృతి విపత్తులపై ప్రజలలో చైతన్యం కలిగించాలి.దక్షిణాసియాలో వర్ష విపత్తులు మామూలు ప్రకృతి ధోరణుల కంటే ఎక్కువగా మానవ చర్యల ప్రభావంతో ఏర్పడుతున్నాయి. వాతావరణ మార్పును అర్థం చేసుకుని, దీన్ని ఎదుర్కొనే విధానాలను అభివృద్ధి చేయడం అత్యవసరమనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. -
హవేలి ఘన్‌పూర్‌లో విషాదం.. వరదలో కొట్టుకుపోయిన కారు
సాక్షి, మెదక్: జిల్లాలో వరద బీభత్సం సృష్టిస్తోంది. వరద ప్రవాహంలో కారు కొట్టుకుపోయింది. హవేలి ఘన్పూర్ మండలం నక్కవాగులో ఘటన జరిగింది. భారీ వర్షాలు కారణంగా నక్కవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వద్దని స్థానికులు వారించినా పట్టించుకోని కారు డ్రైవర్.. అత్యుత్సాహంతో వరద ప్రవాహంలో కారు నడిపారు. దీంతో వాగులో కారు కొట్టుకుపోయింది. కారులో ఉన్నవారి వివరాల కోసం అధికారులు ఆరా తీస్తున్నారు.కాగా, హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా జిల్లాలోని ధూప్‌సింగ్ తండా జలమయమైంది. తండాను వరద నీరు ముంచెత్తడంతో ఇళ్లలోకి నీరు చేరుకుంది. జల దిగ్భంధంలో తండా ఉండటంతో తమ కాపాడాలంటూ స్థానికులు బిల్డింగ్‌పైకి ఆర్తనాదాలు చేస్తున్నారు.మరోవైపు.. అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. రాబోయే 2 గంటల్లో 8 జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తాయని తెలిపింది. -
భారీ వర్షాలకు ఛండీగఢ్ ఉప్పొంగిన జయంతి దేవి నది... కొట్టుకుపోయిన జీప్
-
‘నేటికీ విజయవాడ ప్రజలు కోలుకోలేదు’
విజయవాడ: గతేడాది వచ్చిన బుడమేరు వరదతో విజయవాడ ప్రజలు నేటికీ కోలుకోలేదన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి సీహెచ్ బాబూరావు. బుడమేరుకు వరద వచ్చి ఏడాది పూర్తి అవుతుందని, ఇప్పటికీ ఎన్టీఆర్, కృష్ణా జిల్లా వాసులను రక్షించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఆ సమయంలో వేల కోట్ల ఆస్తి నష్టం జరిగిందని, నేటికీ విజయవాడ ప్రజలు ఇంకా తిరిగి కోలుకోలేదని విమర్శించారు. విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో సీపీఎం పాదయాత్రలో భాగంగా ఈరోజు(ఆదివారం, ఆగస్టు 24) మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. ‘వర్షానికే నీరు రోడ్ల మీద నిలిస్తేనే ప్రజలు భయపడుతున్నారు..బుడమేరు వల్ల ప్రమాదం లేదనే భరోసా ప్రభుత్వం ఇవ్వలేకపోయింది. ఆపరేషన్ బుడమేరు అమలు కాలేదు. కేంద్రం నుండి ఒక్క రూపాయి కూడా నిధులు తీసుకొని రాలేకపోయింది. రూ. 700కోట్లు దాతలు విరాళాలు ఇస్తే కొవ్వొత్తులు, బిస్కెట్స్, వాటర్ బాటిల్స్‌కి ఖర్చు చేశారు. శాశ్వత నివారణ చర్యలకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. ప్రాజెక్టు రిపోర్ట్ లేదు, ఒక్క ఇటుక పడలేదు. కేవలం గండి పడిన చోట రూ. 30కోట్లతో పని చేశారు.. మిగిలిన చోట అసలు పని జరగలేదు. ఆపరేషన్ బుడమేరు కోసం పోరాటానికి సిద్ధం అవుతున్నాం. రూ. 10వేల కోట్లు శాశ్వత పనులు చేయాలి. సమాంతరంగా మరో కాలువ తవ్వాలి. బుడమేరుకు కూడా రిటనింగ్ వాల్ నిర్మించాలి. దిగువకు నీరు పోయే ప్రదేశాన్ని పెంచాలి. కలెక్టరేట్లో ఉండి హడావిడి చేసిన చంద్రబాబు ఇప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదు. అమరావతి ముంపుపై మాట్లాడుతున్న చంద్రబాబు బుడమేరుపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. జిల్లాలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు మొద్దు నిద్రలో ఉన్నారు. గతంలో నష్టపోయిన వారికి నేటికి నష్ట పరిహారం అందలేదు. దాతలు ఇచ్చిన డబ్బును కూడా బాధితులకు ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు రాలేదు. బుడమేరు పరివాహక ప్రాంతంలో పాదయాత్ర. 30వ తేదీన బారి సభ నిర్వహిస్తున్నాం. ఎంత నిధులు ఖర్చు చేశారు.. ఎమ్ చర్యలు తీసుకున్నారో శ్వేతా పత్రం విడుదల చేయాలి.బుడమేరు డైవర్షన్ చానల్ లోతు, వెడల్పు పెంచారా?, బుడమేరు కనీసం పూడిక కూడా తీయించలేదు. తూటుకాడే తీయించలేని ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చేసిందంటే ఎలా నమ్మాలి. ఎమ్మెల్యే అవివేకంతో మాట్లాడుతున్నారు.ప్రచార ఆర్బాటం తో కాకుండా శాశ్వత పనులు చేయాలి’ అని డిమాండ్ చేశారు.ఇక సీపీఎం రాష్ట్ర కమిటీ సభయులు కాశీనాథ్ మాట్లాడుతూ.. ‘ బుడమేరు వద్ద తూటు కదా పేరుకుపోయింది. నిమ్మల రామానాయుడు నిర్మించమని చెప్పిన పని కూడా బీట్ల బారుతుంది. సింగినగర్ వాసులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. నేటి నుంచి 29వ తేదీ వరకు బుడమేరు నివారణ చర్యలు తీసుకోవాలని పాదయాత్ర చేస్తున్నాం. 10వేలు కేంద్రాన్ని బుడమేరు కోసం అడగాలి...అప్పుడు కేంద్రం అప్పు ఇస్తుందో.. ముష్టి వేస్తారో తెలుస్తుంది. బుడమేరు కోసం మాట్లాడమంటే కొండవీటి వాగు కోసం మాట్లాడుతున్నారు’ అని మండిపడ్డారు. -
కోనసీమలో వరద ఉధృతి
సాక్షి, అమలాపురం: గోదావరి ఉగ్రరూపం దాల్చింది. వరదనీరు చొచ్చుకురావడంతో లంకవాసుల కష్టాలు రెట్టింపయ్యాయి. భద్రాచలం, ధవళేళ్వరం వద్ద శుక్రవారం మధ్యాహ్నం నుంచి వరద తగ్గుతుండగా డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో వరద ముంపు పెరుగుతోంది. వరద లంకగ్రామాలను చుట్టుముట్టింది. రోడ్లు, కాజ్‌వేలు మునగడంతో పలుచోట్ల పడవల మీదే రాకపోకలు సాగుతున్నాయి. పి.గన్నవరం, మామిడికుదురు, అయినవిల్లి, ముమ్మిడివరం, ఐ.పోలవరం, కాట్రేనికోన, అల్లవరం, సఖినేటిపల్లి మండలాల్లోని పలు లంకగ్రామాల్లోకి వరద చేరింది. లోతట్టు ప్రాంతాల్లోని మత్స్యకారుల ఇళ్లు నీటమునిగాయి. విద్యార్థులు పడవల మీద పాఠశాలలు, కళాశాలలకు వెళ్లాల్సి వస్తోంది.ప్రజలు నిత్యావసర సరుకులకు, తాగునీటికి అవస్థలు పడుతున్నారు. పంటలన్నీ మునిగిపోయాయి. కూరగాయ పంటలు, బొప్పాయి, ఎర్ర చక్రకేళి, కంద వంటి వాణిజ్యపంటలు దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది. మామిడికుదురు మండలం అప్పనపల్లి కాజ్వే, అయినవిల్లి మండలం ముక్తేశ్వరం ఎదురుబిడియం కాజ్‌వేలు నీటమునిగాయి. పునరావాస కేంద్రం లేదు అల్లవరం మండలం బోడసకుర్రు మత్స్యకార కాలనీలో 80 ఇళ్లు నీట మునిగినా అధికారులు పునరావాస కేంద్రం ఏర్పాటు చేయలేదు. వరద బాధితులకు భోజనం, నీళ్లు అందించడం లేదు. గోదావరి ఉగ్రరూపం దాలుస్తుందని కోనసీమ జిల్లా లంకవాసులు ఆందోళన చెందుతున్న సమయంలో ఎగువన శాంతిస్తుండడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఇంకా రెండోప్రమాద హెచ్చరిక కొనసాగుతుండడంతో వారు ఆందోళనలో ఉన్నారు. -
వరద తగ్గుముఖం.. కొనసాగుతున్న ప్రవాహం
సాక్షి, అమరావతి, పోలవరం రూరల్, ధవళేశ్వరం, విజయపురిసౌత్: వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కృష్ణా, గోదావరి నదుల్లో వరద ఉధృతి క్రమేణా తగ్గుతోంది. ప్రకాశం బ్యారేజీలోకి 4,33,398 క్యూసెక్కులు చేరుతుండగా కృష్ణా డెల్టా కాలువలకు 16,776 క్యూసెక్కులు వదలుతూ మిగులుగా ఉన్న 4,16,622 క్యూసెక్కులను అధికారులు సముద్రంలోకి వదిలేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజీలోకి 13,54,996 క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండగా.. గోదావరి డెల్టా కాలువలకు 12,600 క్యూసెక్కులను విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 13,42,396 క్యూసెక్కుల గోదావరి జలాలను సముద్రంలోకి వదిలేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి 5,26,876 క్యూసెక్కులు కృష్ణాజలాలు చేరుతుండగా.. 4,86,493 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి 4,32,217 క్యూసెక్కులు చేరుతుండగా.. 4,05,532 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టులోకి 3,82,121 క్యూసెక్కులు చేరుతుండగా 3,58,902 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టులోకి 11,75,859 క్యూసెక్కులు చేరుతుండగా అంతే పరిమాణంలో దిగువకు వదిలేస్తున్నారు. -
ముంబై చేస్తున్న హెచ్చరిక!
ప్రణాళికాబద్ధంగా లేని పట్టణీకరణను పరిహసిస్తూ తరచు ప్రకృతి వైపరీత్యాలు విరుచుకు పడుతున్నా పాలకులు మేల్కొనటం లేదనటానికి మళ్లీ నీట మునిగిన ముంబై మహానగరమే సాక్ష్యం. ముంబై దక్షిణ ప్రాంతంలో గురువారం ఉదయానికి 24 గంటల వ్యవధిలో ఏకధాటిగా 300 మి.మీ., పశ్చిమ శివారు ప్రాంతంలో 200 మి.మీ. వర్షం కురిసిందంటే కుంభవృష్టి ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. నిన్నంతా దాదాపు ప్రశాంతంగానే ఉన్నట్టు కనబడిన ఆ మహానగరం, మళ్లీ భారీ వర్షాలుంటాయన్న హెచ్చ రికలతో బెంబేలెత్తుతోంది. ఏటా వర్షాకాలంలో కనీసం ఒక్కసారైనా వరదలు ముంబైని పలకరించటం ఆనవాయితీ. ఈసారి మే నెలలోనే ఒక రోజు నడుంలోతు వరదల్లో నగరం నానా యాతనలూ పడింది. ఆ నెలలో కొత్తగా ప్రారంభమైన వొర్లి మెట్రో స్టేషన్ భారీ వరదతో వణికిపోయింది. రెండు నెలలు గడిచాయో లేదో మళ్లీ నగరానికి కుంభవృష్టి తప్పలేదు. నిరుడు 21 దఫాలు 100 మి.మీ. వర్షం పడిందని గణాంకాలు చెబుతు న్నాయి. వాతావరణంలో పెనుమార్పులు విపత్తుల తీవ్రతను పెంచాయి. అస్తవ్యస్థ పట్టణీకరణ ఈ సమస్యను వందల రెట్లు పెంచింది. ఈసారి వర్షాలవల్ల సంపన్నులు, సినీతారలు నివసించే ప్రాంతాలు సైతం వరద నీటన మునిగాయి. ఇటీవలే ఆర్భాటంగా ప్రారంభించిన మోనోరైల్ సైతం భారీ వర్షాలతో విద్యుత్ సరఫరా అందక గంటసేపు నిలిచిపోయింది. చివరకు అద్దాలు బద్దలుకొట్టి వందమంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకురావాల్సి వచ్చింది. ముంబై తూర్పు శివారులోని మీథి నది ఆ మహానగరంపై విరుచుకుపడింది. అయిదు రోజులపాటు వరసగా కురిసిన వర్షాలతో ఆ నది కట్టు తెంచుకుని అటువైపుగల రైల్వే ట్రాక్లన్నిటినీ ముంచెత్తింది. అరేబియా సముద్రం భారీ కెరటాలతో అల్లకల్లోలంగా ఉండటంతో దానిలో కలవాల్సిన మీథి వరద నీరు కాస్తా వెనక్కొచ్చి నగరంలోని అనేక ప్రాంతాలను జలమయం చేసింది. హైదరాబాద్ నగరంలో మూసీ మాదిరిగా ముంబైలో మీథి నదిని కూడా మురికిమయం చేశారు. అందులో 70 శాతం మురికినీరు కాగా, 30 శాతం చెత్తాచెదారం, 10 శాతం పారిశ్రామిక వ్యర్థాలు కలుస్తున్నాయి. ప్రకృతి వైపరీత్యా లుగా కనబడు తున్నవన్నీ సారాంశంలో మానవ తప్పిదాల పర్యవసానం. గత యేభైయ్యే ళ్లుగా నగరాన్ని విస్తరించుకుంటూ పోవటమే తప్ప అందుకు తగిన మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టినవారు లేరు. అలాగని మీథి నది ప్రక్షాళనకు ప్రయత్నాలు జరగ లేదని కాదు. 2013–23 మధ్య బృహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) రూ. 2,000 కోట్లు వ్యయం చేసింది. కానీ చివరకు తాజా వర్షాల ధాటికి మురికి నీటితో, ప్లాస్టిక్ వ్యర్థాలతో నివాస ప్రాంతాలన్నీ నిండిపోయాయి. 70వ దశకం వరకూ పరిశుభ్రంగా ఉండే ఆ నది మురికి కూపంగా మారిందంటే పాలకులు, అధికార యంత్రాంగం నిర్లక్ష్యమే కారణం.భౌగోళికంగా ముంబై తీరం పశ్చిమ కనుమలకు దగ్గరలో ఉంది. వాటివల్ల నైరుతి రుతుపవనాల్లో గాలుల తీవ్రత హెచ్చుగా ఉంటుంది. అందుకే ఏటా భారీవర్షాలు, వరదలు తప్పవు. దేశ ఆర్థిక రాజధానిగా, ఢిల్లీ తర్వాత అత్యధిక జనసాంద్రత గల నగరంగా ముంబై మన దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రాణప్రదమైనది. దేశ జీడీపీలో ఆ నగరం వాటా దాదాపు 7 శాతం. కానీ వరదలు ముంచుకొచ్చిన ప్రతిసారీ మౌలిక సదుపాయాలు దెబ్బతినటం, ఉత్పాదకత పడకేయటం రివాజైంది. పునర్నిర్మాణానికి ఏటా రూ. 550 కోట్ల వ్యయమవుతోంది. నిజానికి ఈ సంక్షోభం అక్కడే కాదు... దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల పాలకులనూ పునరాలోచనకు పురిగొల్పాలి. నగర నిర్మాణాల్లో ఎలాంటి మెలకువలు తీసుకోవాలో, పెద్ద నగరాల నిర్మాణంపై మోజువల్ల చివరకు జరిగేదేమిటో గ్రహించేలా చేయాలి. కానీ అదెక్కడా కనబడదు. ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని అమరావతి తాజా వర్షాలకు ఎంత దయనీయ స్థితిలో పడిందో కనబడుతూనే ఉంది. పెద్ద నగరాల నిర్మాణంవల్ల జనసాంద్రత పెరిగి మౌలిక సదుపాయాల కల్పన అసాధ్యమవుతుందనీ, పైగా అభివృద్ధి మొత్తం ఒకే చోట కేంద్రీకరించటం వల్ల ఇతర ప్రాంతాలు ఎప్పటికీ ఎదుగూబొదుగూ లేకుండా ఉండిపోతాయనీ నిపుణులు హెచ్చరిస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు తలకెక్కటం లేదు. మన కోసం ప్రకృతి మారదు. మనమే దానికి అనుగుణంగా మారాలన్న స్పృహ పాలకులకు కలగాలి. మళ్లీ మళ్లీ మునుగుతున్న ముంబై మహానగరాన్ని చూసైనా గుణపాఠం నేర్వకపోతే భవిష్యత్తు క్షమించదు. -
కడలి వైపు నదుల పరుగులు
సాక్షి, అమరావతి/విజయపురి సౌత్/సత్రశాల/అచ్చంపేట/గాందీనగర్ (విజయవాడ సెంట్రల్): కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి నదుల్లో వరద ఉధృతి బుధవారం మరింత పెరిగింది. కడలి వైపు నదులు పరుగులు తీస్తున్నాయి. కృష్ణా ప్రధాన పాయతోపాటు ఉప నదులు తుంగభద్ర, భీమా వరదెత్తి ప్రవహిస్తున్నాయి. తుంగభద్ర డ్యాంలోకి 1.30 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా 1.21 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. మంత్రాలయం వద్ద తుంగభద్ర వరద నీటిమట్టం 311.32 మీటర్లకు చేరుకోవడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బుధవారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 4,78,032 క్యూసెక్కులు చేరుతోంది. దీంతో 4,85,397 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి 4,87,037 క్యూసెక్కులు చేరుతుండగా 4,48,761 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టులోకి 4,45,187 క్యూసెక్కులు చేరుతుండగా 4,81,102 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీలోకి 4,64,064 క్యూసెక్కులు చేరుతుండగా.. 4,59,786 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. కృష్ణా వరద ఉధృతి పెరగడంతో ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. గోదావరి ఉగ్రరూపం గోదావరి ఉగ్రరూపం దాల్చింది. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఒడిశాలలో కురిసిన వర్షాల ప్రభావం వల్ల గోదావరి ప్రధాన పాయతోపాటు ప్రాణహిత, ఇంద్రావతి, మానేరు, శబరి ఉప నదులు, వంకలు, వాగులు పరవళ్లు తొక్కుతుండటంతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం గంట గంటకూ పెరుగుతోంది. బుధవారం ఉదయం 9 గంటలకు వరద నీటి మట్టం 43.2 అడుగులకు చేరుకోవడంతో భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. బుధవారం అర్ధరాత్రి దాటాక భద్రాచలం వద్ద వరద మట్టం 48 అడుగులను దాటే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ధవళేశ్వరం బ్యారేజీలోకి 8,25,477 క్యూసెక్కులు చేరుతుండగా.. గోదావరి డెల్టాకు 4,800 క్యూసెక్కులను విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 8,20,677 క్యూసెక్కులను 175 గేట్ల ద్వారా సముద్రంలోకి వదిలేస్తున్నారు. వంశధార, నాగావళి పోటాపోటీగా ప్రవహిస్తున్నాయి. వంశధార నుంచి గొట్టా బ్యారేజీలోకి 17 వేల క్యూసెక్కులు చేరుతుండగా.. 15,661 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. -
గుంటూరు ఛానెల్లోకి వచ్చిన నీరు కొండవీటి వాగుదే: Ambati Murali
-
అమరావతి రాజధాని వరద ముంపునకు గురైంది: దొంతిరెడ్డి వేమారెడ్డి
-
అమరావతి మునిగింది.. నిజం చెప్పిన మంత్రి నారాయణ.. ఎల్లో మీడియా పరువు పాయే..
-
అమరావతి ముంపుపై నిజాన్ని ఒప్పుకున్న మంత్రి నారాయణ
-
అమరావతి మునిగిపోయిందా?.. మంత్రి పర్యటనతో క్లారిటీ
సాక్షి, విజయవాడ: వరద నీళ్లలో మునిగిపోతే.. ‘అబ్బే అదేం లేదూ.. అవన్నీ ఫేక్ కథనాలే’ అంటూ కూటమి ప్రభుత్వ అనుకూల మీడియా చానెల్స్‌లో, సోషల్ మీడియా పేజీల ద్వారా ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పైగా కళ్లెదుట నీరు చేరిన దృశ్యాలు కనిపిస్తున్నా.. ప్రశ్నించినందుకు కేసులు పెడుతోంది కూటమి ప్రభుత్వం. అయితే రాజధాని అమరావతి ముంపునకు గురైందన్న విషయాన్ని రాష్ట్ర మంత్రి నారాయణే స్వయంగా ఒప్పుకున్న వైనం ఇప్పుడు చర్చనీయాంశమైంది!!.ఎగువ ప్రాంతాల్లో వరద పెరుగుతున్న నేపథ్యంతో చంద్రబాబు ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో అమరావతిలో పురపాలక శాఖ మంత్రి నారాయణ పర్యటించారు. కొండవీటి వాగు ప్రవాహానికి అడ్డంగా ఉన్న మట్టి తొలగింపు పనులు పరిశీలించారు. సీఆర్డీఏ ఇంజినీర్ల ఆధ్వర్యంలో 20 ప్రొక్లయిన్లతో నిరంతరాయంగా ఈ పనులు కొనసాగుతున్నాయి. ఆ సమయంలో.. ‘‘కొండవాటి వాగు నీరు వెనక్కి తన్నింది. వెస్ట్ బైపాస్‌రోడ్డు నిర్మాణ పనుల వల్ల నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడింది. ఆ నిలిచిన నీరుపోవడానికి బైపాస్కు గండ్లు పెడుతున్నాం’’ అని అన్నారాయన.అదే సమయంలో.. అమరావతికి వరద ముప్పు లేకుండా నెదర్లాండ్స్ నిపుణులతో కాలువలు, రిజర్వాయర్లు, అత్యాధునిక డిజైన్ అంటూ మళ్లీ పాత పాటే వినిపించారు. మంత్రి ప్రకటన ప్రకారం.. నీరుకొండ సమీపంలో వెస్ట్ బైపాస్ రోడ్ పై బ్రిడ్జ్ నిర్మాణంతో కొండవీటి వాగు ప్రవాహానికి ఆటంకం అని అర్థం. అంటే ఓవైపు ముంపు లేదని ఎల్లో బ్యాచ్ చెబుతుంటే.. మరోవైపు నీరు వెనక్కు తన్నిందని స్వయానా మంత్రే అంటున్నారు. ఈ లెక్కన అమరావతి ముంపునకు గురైందని ఒప్పుకున్నట్లే కదా!. -
కేసులకు భయపడను.. అమరావతిని ముంచింది కొండవీటి వాగే..
-
కృష్ణమ్మ ఉగ్రరూపం : ప్రకాశం బ్యారేజ్ వద్ద పర్యాటకుల సందడి (ఫొటోలు)
-
నదుల్లో వరద పరవళ్లు
సాక్షి, అమరావతి: అల్పపీడన ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి నదుల్లో వరద ప్రవాహం ఉరకలెత్తుతోంది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు ప్రకాశం బ్యారేజీ నుంచి 4.73 లక్షల క్యూసెక్కుల కృష్ణా జలాలు.. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 7.63 లక్షల క్యూసెక్కుల గోదావరి జలాలు, గొట్టా బ్యారేజీ నుంచి 20,651 క్యూసెక్కుల వంశధార జలాలు, నారాయణపురం ఆనకట్ట మీదుగా 16,300 క్యూసెక్కుల నాగావళి వరద జలాలు బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. ఎగువన విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా, ప్రధాన ఉప నది తుంగభద్రల్లో వరద ఉధృతి పెరిగింది. ఆల్మట్టి డ్యామ్, నారాయణ్‌పూర్ డ్యామ్ నుంచి వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తున్నారు. తుంగభద్ర డ్యామ్‌లోకి 1,25,164 క్యూసెక్కులు చేరుతుండగా.. స్పిల్ వే గేట్లు ఎత్తి 1,21,448 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. దాని దిగువన సుంకేశుల బ్యారేజీలోకి 1.40 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 1,27,840 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి జూరాల నుంచి 2,71,763, సుంకేశుల నుంచి 1,25,660, హంద్రీ నుంచి 2 వేలు వెరసి 3,90,135 క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. దాంతో శ్రీశైలంలో 881.9 అడుగుల్లో 198.36 టీఎంసీలను నిల్వ చేస్తూ స్పిల్ వే 10 గేట్లను 14 అడుగుల మేర ఎత్తి 3,44,750, విద్యుదుత్పత్తి చేస్తూ 65,436 క్యూసెక్కులు కలిపి 4,10,186 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. నాగార్జునసాగర్‌లోకి 4,10,186 క్యూసెక్కులు చేరుతుండగా.. 584.6 అడుగుల్లో 296.28 టీఎంసీలను నిల్వ చేస్తూ 26 గేట్లను ఎత్తి 4.09 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టులోకి 3,97,807 క్యూసెక్కులు చేరుతుండగా.. 166.47 అడుగుల్లో 33.54 టీఎంసీలను నిల్వ చేస్తూ 4,13,395 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. వాటికి మున్నేరు, వాగులు, వంకల వరద తోడవుతుండటంతో ప్రకాశం బ్యారేజీలోకి 4,73,065 క్యూసెక్కులు చేరుతుండగా.. అంతే పరిమాణంలో సముద్రంలోకి వదిలేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి పెరగడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బుధవారం ప్రకాశం బ్యారేజీలోకి వరద ప్రవాహం 5 లక్షల క్యూసెక్కులను దాటే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. గోదావరిలోనూ పెరుగుతున్న వరద ఎగువన విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరిలో వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. బుధవారం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. మంగళవారం పోలవరం ప్రాజెక్టులోకి 8,29,424 క్యూసెక్కులు చేరుతుండగా.. అంతే పరిమాణంలో 48 గేట్ల ద్వారా దిగువకు వదిలేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజీలోకి 7,63,310 క్యూసెక్కులు చేరుతుండగా.. అంతే పరిమాణంలో సముద్రంలోకి వదిలేస్తున్నారు. పోటెత్తిన నాగావళి, వంశధార ఒడిశా, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో నాగావళి, వంశధార నదుల్లో వరద పోటెత్తుతోంది. నారాయణపురం ఆనకట్ట మీదుగా 16,300 క్యూసెక్కుల నాగావళి వరద జలాలు సముద్రంలో కలుస్తున్నాయి. వంశధార నుంచి గొట్టా బ్యారేజీలోకి 22 వేల క్యూసెక్కులు చేరుతుండగా.. ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తూ.. 20,651 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. వర్షాల నేపథ్యంలో సెలవులు తీసుకోవద్దు భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉన్నందున పరిస్థితులు సాధారణ స్థితికి చేరే వరకూ లైన్మెన్ నుంచి అధికారుల వరకు ఎవరూ సెలవులు తీసుకోవద్దని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఆదేశించారు. పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసినందున విద్యుత్‌సంస్థల అధికారులతో మంగళవారం టెలికాన్ఫరెన్స్ ద్వారా సీఎస్ సమీక్ష నిర్వహించారు. అలాగే, భారీ వర్షాల నేపథ్యంలో 16 జిల్లాలకు కలిపి అత్యవసర వరద సహాయ చర్యల కోసం ప్రభుత్వం రూ.16 కోట్లు విడుదల చేస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. జిల్లాకో రూ.కోటి చొప్పున కేటాయించింది. విలీన మండలాల్లో 80 గ్రామాలకు రెండో రోజూ నిలిచిన రాకపోకలు చింతూరు: గోదావరి, శబరి నదులకు వరద ఉధృతి మంగళవారం సాయంత్రం నుంచి క్రమేపీ పెరుగుతోంది. మరోవైపు శబరి నదిలోనూ మంగళవారం మధ్యాహ్నం నుంచి వరద పెరుగుతోంది. విలీన మండలాలైన చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, ఎటపాక మండలాల్లో వరుసగా రెండోరోజు కూడా 80 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు మండలంలో కుయిగూరు వాగు వరద తగ్గకపోవడంతో ఆంధ్రా–ఒడిశా జాతీయ రహదారి–326పై రాకపోకలు సాగక వాహనాలు చింతూరులో నిలిచిపోయాయి. చింతూరు మండలంలో సోకిలేరు, కుయిగూరు, జల్లివారిగూడెం, చంద్రవంక, చీకటివాగుల వద్ద వరద ఇంకా రహదారులపైనే నిలిచి ఉంది. కూనవరం మండలం కొండ్రాజుపేట వద్ద కాజ్‌వేపై వరదనీరు ఇంకా తొలగలేదు. -
గోదావరి ఉగ్రరూపం !
సాక్షి, హైదరాబాద్: గోదావరి ఉగ్రరూపం దాల్చింది. రాష్ట్రంలోని సింగూరు నుంచి ఏపీలోని ధవళేశ్వరం బరాజ్ వరకు పరీవాహకంలోని అన్ని ప్రాజెక్టులకు వరద ఉధృతి పెరుగుతోంది. మంగళవారం రాత్రి 7 గంటలకి భద్రాచలం వద్ద 6.87 లక్షల క్యూసెక్కుల వరద పోటెత్తడంతో నీటిమట్టం 36.5 అడుగులకు చేరుకుంది. ప్రవాహం 9.32 లక్షల క్యూసెక్కులు, నీటి మట్టం 43 అడుగులకు చేరితే తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. పెన్‌గంగా, ఎగువ గోదావరి, ప్రాణహిత, ఇంద్రావతి నదుల్లో ఉధృతి పెరుగుతుండటంతో మరో 24 గంటల్లో తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. మంజీరపై ఉన్న సింగూరు ప్రాజెక్టుకి 37,499 క్యూసెక్కుల వరద వస్తుండగా, 19.39 టీఎంసీల నిల్వను కొనసాగిస్తూ 43,1501 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. దిగువన ఉన్న నిజాంసాగర్ గరిష్ట సామర్థ్యం 17.8 టీఎంసీలు కాగా, 80వేల క్యూసెక్కుల వరద వస్తుండడంతో 17.8 టీఎంసీల నిల్వను కొనసాగిస్తూ 88వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. శ్రీరామ్‌సాగర్ నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా, 2.75 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండడంతో 72.99 టీఎంసీల నిల్వలను కొనసాగిస్తూ 39 గేట్లను పైకెత్తి 3.75 లక్షల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ఎల్లంపల్లి నిల్వ సామర్థ్యం 20.18 టీఎంసీలు కాగా 3.74లక్షల క్యూసెక్కుల వరద పోటెత్తడంతో 16.06 టీఎంసీల నిల్వను కొనసాగిస్తూ 3.74 లక్షల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన సుందిళ్ల బరాజ్‌కి 2.63 లక్షలు, అన్నారం బరాజ్‌కి 1.21 లక్షలు, మేడిగడ్డ బరాజ్‌కి 6.65 లక్షల క్యూసెక్కులతోపాటు సమ్మక్కబరాజ్కి 7.65 లక్షలు, సీతమ్మసాగర్ బరాజ్‌కి 6.27 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, వచ్చి న వరదను వచ్చి నట్టు కిందికి విడుదల చేస్తున్నారు. కాళేశ్వరం లింక్–1, 2 ద్వారా పంపింగ్ షురూ మిడ్‌మానేరు జలాశయం నుంచి అన్నపూర్ణ పంప్‌హౌజ్ ద్వారా గోదావరి జలాల తరలింపునకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు లింక్–2లో భాగమైన నంది పంప్‌హౌజ్‌లోని ఒక పంప్ ద్వారా 3150 క్యూసెక్కులను మేడారం రిజర్వాయర్‌లోకి వేసి అక్కడి నుంచి గ్రావిటీ కాల్వ ద్వారా రామడుగు రిజర్వాయర్‌కు తరలిస్తున్నారు. రామడుగు నుంచి 3150 క్యూసెక్కులను గాయత్రి పంప్‌హౌజ్‌లోని ఒక పంప్ ద్వారా మిడ్‌మానేరు రిజర్వాయర్‌లోకి ఎత్తిపోస్తున్నారు. శ్రీరామ్‌సాగర్ నుంచి ఫ్లడ్‌ఫ్లో కెనాల్ ద్వారా గ్రావిటీతో మరో 12,600 క్యూసెక్కులు మిడ్‌మానేరులోకి వచ్చి చేరుతుండడంతో జలాశయంలో నిల్వలు 13.78 టీఎంసీలకు చేరాయి. దీంతో మిడ్‌మానేరు నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు లింక్–4లో భాగమైన అన్నపూర్ణ పంప్‌హౌజ్‌లోని ఒక పంపు ద్వారా 3200 క్యూసెక్కులను అనంతగిరి రిజర్వాయర్‌లోకి వేస్తుండటంతో రిజర్వాయర్‌లో నిల్వలు 3.5 టీఎంసీలకు గాను 1.06 టీఎంసీలకు చేరాయి. మిడ్‌మానేరు నిల్వ సామర్థ్యం 27.5 టీఎంసీలు కాగా నిల్వలు 25.77 టీఎంసీలకు చేరితే 4 పంపులను ఆన్‌చేసి రోజుకు కనీసం ఒక టీఎంసీ జలాలను తరలించుకునే అవకాశం కలగనుంది. రంగనాయకసాగర్ నుంచి రెండు పంపుల ద్వారా 2534 క్యూసెక్కుల నీళ్లను మల్లన్నసాగర్‌లోకి ఎత్తిపోస్తుండటంతో రిజర్వాయర్‌లో నిల్వలు 50 టీఎంసీలకు గాను 10.38 టీఎంసీలకు చేరాయి. శ్రీశైలం, సాగర్‌లో ఇలా.. దోమలపెంట/నాగార్జునసాగర్: కృష్ణాపరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం, నాగార్జునసాగర్‌కు వరద పోటెత్తుతోంది. ఎగువన గల శ్రీశైలం జలాశయానికి 3,61,654 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా.. దిగువకు స్పిల్‌వే మీదుగా 3,44,750 క్యూసెక్కులు, కుడి, ఎడమ విద్యుదుత్పాదన కేంద్రాల ద్వారా 65,436 క్యూసెక్కులు మొత్తం సాగర్ జలాశయంలోకి 4,10,186 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. సాగర్‌నుంచి 3,94,573 క్యూసెక్కులు వదులుతున్నారు. -
కృష్ణమ్మ ఉగ్రరూపం.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
సాక్షి, విశాఖపట్నం/విజయవాడ: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఈ ఉదయానికి తీరం దాటింది. గోపాల్పూర్ వద్ద తీరం దాటినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలో.. ఏపీలో కొన్నిచోట్ల వర్షాలు పడుతున్నాయి. అదే సమయంలో.. గడిచిన 24 గంటల్లో కురిసిన వర్షాలతో కృష్ణా నదికి వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది.కృష్ణానదికి ప్రవాహం పెరగడంతో.. ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉధృతంగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుత ఇన్ ఫ్లో , అవుట్ ఫ్లో 4,01,087 క్యూసెక్కులుగా ఉంది. మొత్తం 70 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చే అవకాశం ఉండడంతో.. ప్రభావిత జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ‘‘కృష్ణానది పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వాగులు.. కాలువలు దాటే ప్రయత్నం చేయరాదు’’ అని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో ప్రజలను హెచ్చరించారు. వాయుగుండం ప్రభావంతో గడచిన 24 గంటల్లో.. పాడేరులో 16 సెంమీ వర్షపాతం నమోదైంది. రాష్ట్రమంతటా ఇవాళ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు, అలాగే కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ భారీ వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. తీరం వెంబడి ఈదురు గాలులు కొనసాగుతాయని పేర్కొంది.చేపల వేటకు వెళ్ళి.. భారీ వర్షంలో.. చేపల వేటకు వెళ్లిన ఓ యువకుడు సముద్రంలో గల్లంతయ్యాడు. పెద్ద అల ఒక్కసారిగా రావడంతో యువకుడు తమ కళ్ల ముందే కొట్టుకుపోయాడని, రక్షించే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని కొందరు మత్స్యకారులు తెలిపారు. సదరు యువకుడిని ఎంవీపీ కాలనీకి చెందిన సతీష్‌గా గుర్తించారు. విషయం తెలిసిన వెంటనే అతని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కుండపోత వాన..
సాక్షి, నెట్వర్క్: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిశాయి. సంగారెడ్డి, సిద్దిపేట, ఆసిఫాబాద్, కామారెడ్డి, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, ములుగు, మంచిర్యాల, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల్లో కుండపోతగా వర్షాలు కురిశాయి. హైదరాబాద్ నగరంలో ఆదివారం రాత్రి 8 గంటలకు మొదలైన వాన సోమవారం తెల్లవారుజాము వరకు కొనసాగింది. జిల్లాల్లో అనేకచోట్ల 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు కాగా, అత్యధికంగా సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గౌరారంలో 23.6 సెం.మీ వర్షం కురిసింది. ఏకధాటిగా కురిసిన వర్షాలతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పలుచోట్ల జనావాసాల్లోకి సైతం వరద నీరు చేరింది. కొన్నిచోట్ల జాతీయ రహదారులపై వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. రాజీవ్ రహదారిపై వరద కుంభవృష్టితో సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గౌరారం వద్ద రాజీవ్ రహదారిపై వరదనీరు చేరడంతో కరీంనగర్–హైదరాబాద్ మార్గంలో వాహనాల రాకపోకలకు ఒకింత అంతరాయం ఏర్పడింది. పంటపొలాలు నీట మునిగి చెరువులను తలపిస్తున్నాయి. హల్దీవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. అంబర్‌పేట–శాకారం మార్గంలో రవాణా స్తంభించి పోయింది. గుండాల మండలంలో 16 సెం.మీ వర్షం యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలో 16 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. దీంతో నిన్నటి వరకు చుక్కనీరు లేని శామీర్‌పేట, చిన్నేరు వాగులు పరవళ్లు తొక్కుతున్నాయి. బిక్కేరు, మూసీ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కాజ్‌వేల పైనుంచి నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిపివేశారు. జిల్లాలోనే అతి పెద్దదైన తుర్కపల్లి మండలంలోని గంధమల్ల చెరువు అలుగుపోస్తోంది. సూర్యాపేట జిల్లా అర్వపల్లిలో జెడ్పీహెచ్ఎస్, కేజీబీవీ మళ్లీ జలమయమయ్యాయి. కేజీబీవీకి సోమవారం కూడా సెలవు ఇచ్చారు. చెరువుల్లా పంట పొలాలు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లాలో వరి, పత్తి, మొక్కజొన్న తదితర పంటలకు నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాలోని దుందుభీ నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దాదాపు 1000 చెరువులు అలుగు పారుతున్నాయి. కొట్టుకుపోయిన కోళ్లు..కారు సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలో 16.6 సెం.మీ వర్షపాతం నమోదైంది. హత్నూర మండలం ఎల్లమ్మగూడ శివారులోని కాలువ కట్ట కొట్టుకుపోయి సమీపంలో ఉన్న ఫౌల్ట్రీఫాంను వరద ముంచెత్తడంతో కొన్ని కోళ్లు కొట్టుకుపోయాయి. 3 వేల కోళ్లు మృత్యువాత పడ్డాయి. సిర్గాపూర్ మండలం వాసర్ గ్రామ శివారులో పొంగి ప్రవహిస్తున్న వాగులో పవన్ అనే వ్యక్తికి చెందిన కారు కొట్టుకు పోయింది. పవన్ ప్రమాదం నుంచి బయట పడ్డాడు. వరద తగ్గిన తర్వాత పోలీసులు కారును బయటకు తీశారు. మంజీరా నది మహోగ్ర రూపం దాల్చింది. మెదక్ జిల్లాలోని ప్రసిద్ధి చెందిన వనదుర్గమ్మ ఆలయం జల దిగ్బంధంలోనే కొనసాగుతోంది. కల్యాణి , పోచారం ప్రాజెక్టులు ఉధృతంగా అలుగు పోస్తున్నాయి. వందలాది చెరువులు నిండాయి. బాన్సువాడ నుంచి కామారెడ్డికి వచ్చే రహదారిపై సర్వాపూర్ వాగు పొంగి ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలంలో 16.2 సెం.మీ వర్షం కురిసింది. మహారాష్ట్రకు నిలిచిన రాకపోకలు మంచిర్యాల జిల్లా కేంద్రంలో కురిసిన భారీ వర్షానికి పలు కాలనీలు జలమయం అయ్యాయి. ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. ప్రాణహిత, పెన్‌గంగ, వార్దా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సిర్పూర్(టి) నుంచి మహారాష్ట్రకు అంతర్రాష్ట్ర రహదారి గుండా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆదిలాబాద్ జిల్లాలో పలు వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ములుగులో పోటెత్తుతున్న వాగులు ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం ముళ్లకట్ట వద్ద జాతీయ రహదారిపై ఉన్న 163 హైలెవల్ వంతెన వద్ద రెండు కిలోమీటర్ల పొడువునా గోదావరి వరద నీరు ప్రవహిస్తోంది. కొండాయి వద్ద జంపన్నవాగు, ఎలిశెట్టిపల్లి వద్ద జంపన్నవాగు, గోగుపల్లివాగు, ఏటూరునాగారం–భద్రాచలం రహదారి మధ్యలోని జీడివాగు, మంగపేట మండలంలోని కమలాపురం వద్ద ఎర్రవాగు, కన్నాయిగూడెం మండలంలోని హనుమంతుల వాగు, ముళ్లకట్ట వద్ద మేడివాగు పొంగిపొర్లుతున్నాయి. ఏటూరునాగారం–బూర్గంపాడు ప్రధాన రోడ్డుపై నుంచి రెండు మీటర్ల ఎత్తులో వరదనీరు ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. కాగా ఆయా జిల్లాల్లో కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులు వరద పరిస్థితిని సమీక్షించారు. గొర్రెల కాపరులు, రైతును రక్షించిన ఎన్డీఆర్ఎఫ్ కామారెడ్డి జిల్లాలో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచి పోయాయి. జిల్లాలో అత్యధికంగా పిట్లంలో 17.5 సెం.మీ. వర్షపాతం నమోదైంది. నిజాంసాగర్, మహహ్మద్నగర్, నస్రుల్లాబాద్, మండలాల్లో 12 సెం.మీ నుంచి 16 సె.మీ. వర్షం కురిసింది. ఆదివారం అర్ధరాత్రి నిజాంసాగర్ గేట్లు ఎత్తడంతో మంజీరలో ప్రవాహం పెరిగి బిచ్కుంద మండలం శెట్లూర్ వద్ద ప్రవాహంలో ముగ్గురు గొర్రెల కాపరులు, ఒక రైతు చిక్కుకున్నారు. 656 గొర్రెలు కూడా నీటి మధ్యలో ఉండిపోయాయి. అధికారులు సోమవారం తెల్లవారుజామున ఎన్డీఆర్ఎఫ్ బృ«ందాల సాయంతో గొర్రెల కాపరులు, రైతును రక్షించారు. అలాగే గొర్రెలను బయటకు తీసుకువచ్చారు. మహారాష్ట్ర వరదల్లో ముగ్గురు మహిళల గల్లంతు – జగిత్యాలలోని టీఆర్‌నగర్‌లో విషాదం జగిత్యాల క్రైం: మహారాష్ట్రలో జరిగిన ఓ వివాహ వేడుకల్లో పాల్గొని కారులో తిరుగు ప్రయాణమైన ముగ్గురు మహిళలు అక్కడి వరదల్లో గల్లంతు కావడంతో జగిత్యాల జిల్లా కేంద్రంలోని టీఆర్‌నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. టీఆర్‌నగర్‌కు చెందిన షేక్ అఫ్రిన (30), సమీన (50), హసీన (28)తో పాటు వారి బంధువు, ఆర్మూర్‌కు చెందిన సోహెబ్ ఆదివారం మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ముక్హేడ్ తాలూకా దెగ్లూర్‌కు వెళ్లారు. ఆదివారం రాత్రి జగిత్యాల వైపు ఖాళీగా వస్తున్న ఓ కారు డ్రైవర్ వీరిని ఎక్కించుకుని టీఆర్‌నగర్‌కు బయల్దేరాడు. 30 కిలోమీటర్ల దూరం రాగానే ఓ వాగు ఉప్పొంగి ప్రవహించడంతో కారు అందులో చిక్కుకుంది. సోహెబ్, డ్రైవర్ ఎలాగో బయటపడి ఒడ్డుకు చేరారు. ముగ్గురు మహిళలు మాత్రం గల్లంతయ్యారు. అంతకుముందు సమీన తన కోడలుకు ఫోన్ చేసి ‘పిల్లలు జాగ్రత్త.. మేం వరదల్లో కొట్టుకుపోతున్నాం..’ అని సమాచారం ఇచ్చింది. ఆ తర్వాత కుటుంబ సభ్యులు ఎంత ప్రయతి్నంచినా సమీన ఫోన్ పనిచేయలేదు. సోమవారం రాత్రి వరకూ వారి ఆచూకీ లభించలేదు. చేపల వేటకు వెళ్లి ఒకరు మృతి, మరొకరి గల్లంతు కామారెడ్డి జిల్లాలో చేపల వేటకు వెళ్లిన ఒకరు నీట మునిగి చనిపోయారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వెల్వర్తి గ్రామ శివారులో చెరువు అలుగు వరదలో సోమవారం సాయంత్రం చేపల వేటకు వెళ్లిన మోత్కూరు మండలం పాలడుగు గ్రామానికి చెందిన శివరాత్రి నవీన్ (25) గల్లంతైనట్లు గ్రామస్తులు తెలిపారు. -
Ambati: అమరావతిలో కొన్ని వేల ఎకరాలు చెరువుల మారిపోయాయి..
-
ఎత్తిపోతలు ఎప్పుడు?
సాక్షి, హైదరాబాద్: వర్షాకాలం ప్రారంభమై రెండున్నర నెలల తర్వాత ఎట్టకేలకు ఎగువ గోదావరి వరదెత్తింది. నదీ పరీవాహకంలో కురుస్తున్న భారీ వర్షాలతో సింగూరు ప్రాజెక్టు నుంచి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వరకు గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. పరీవాహకంలోని జలాశయాలన్నీ అడుగంటిపోయి ఉండగా, ఎప్పటికప్పుడు పంపుల ద్వారా ఎత్తిపోసి నిల్వ చేసుకోకపోవడంతో వరద జలాలన్నీ వృథాగా సముద్రంలో కలిసిపోతున్నాయి. జలాల ఎత్తిపోతలో మీనమేషాలు లెక్కిస్తున్న అధికార యంత్రాంగం.. ఎల్లంపల్లి జలాశయం నుంచి మేడారం, అక్కడి నుంచి మిడ్‌మానేరు జలాశయానికి పంపింగ్‌ను మాత్రమే ప్రారంభించడం గమనార్హం. మిడ్ మానేరుకు తరలింపులో తీవ్ర ఆలస్యం మిడ్‌మానేరు నుంచి ఎగువన ఉన్న అనంతగిరి, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ జలాశయాల్లోకి నీళ్లను ఎత్తిపోసే ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. వాస్తవానికి శ్రీరామ్‌సాగర్‌కు గత మూడు రోజులుగా భారీ వరద వస్తున్నా ఫ్లడ్ ఫ్లో కెనాల్ (ఎఫ్ఎఫ్సీ) ద్వారా గ్రావిటీతో మిడ్‌మానేరు జలాశయానికి నీళ్లను తరలించడంలో తీవ్ర ఆలస్యం జరిగింది. ఆదివారం సాయంత్రం ఎల్ఎఫ్సీ ద్వారా 10,000 క్యూసెక్కులను విడుదల చేయగా, ఇంకా ఆ నీళ్లు మిడ్‌మానేరుకు చేరుకోలేదు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నంది పంప్‌హౌస్ ద్వారా 12,600 క్యూసెక్కులను మేడారం రిజర్వాయర్‌లోకి, అక్కడి నుంచి గాయత్రి పంప్‌హౌస్‌ల ద్వారా అంతే నీళ్లను మిడ్‌మానేరు జలాశయంలోకి ఎత్తిపోస్తున్నారు. నంది, గాయత్రి పంప్‌హౌస్‌లలో చెరో ఏడు చొప్పున మొత్తం 14 పంపులుండగా, చెరో 4 పంపులతో నీళ్లను పంపింగ్ చేస్తున్నారు. దీంతో మిడ్‌మానేరు జలాశయం నిల్వ సామర్థ్యం 27.5 టీఎంసీలకు గాను 11.13 టీఎంసీలకు చేరింది. మిడ్ మానేరు నుంచి ఎప్పుడు? మిడ్‌మానేరు నుంచి నీళ్లను ఏకకాలంలో సమాంతరంగా అనంతగిరి, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్‌తో పాటు మరో లింక్ ద్వారా మలకపేట, అప్పర్ మానేరుకు ఎత్తిపోసేందుకు వీలుండగా, ఇంకా ఆ ప్రక్రియను ప్రారంభించలేదు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన ఈ ఆన్లైన్ రిజర్వాయర్లలో ప్రస్తుతం నిల్వలు అడుగంటిపోయి ఉన్నా పంపింగ్ ప్రారంభించకపోవడం గమనార్హం. ప్రాజెక్టులకు వరద ఇలా.. రాష్ట్రంలో మంజీరపై ఉన్న సింగూరు ప్రాజెక్టుకు శనివారం సాయంత్రం 6 గంటలకు 31,412 క్యూసెక్కుల వరద రాగా, ఆదివారం సాయంత్రం 6 గంటల సమయానికి 28,357 క్యూసెక్కులకు తగ్గిపోయింది. జలాశయం నిల్వ సామర్థ్యం 29.91 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 20.37 టీఎంసీల నిల్వను కొనసాగిస్తూ 43,244 క్యూసెక్కులను కిందికి విడుదల చేస్తున్నారు. దిగువన ఉన్న నిజాంసాగర్ గరిష్ట నిల్వ సామర్థ్యం 17.8 టీఎంసీలు కాగా, 49,000 క్యూసెక్కుల వరద వస్తుండడంతో ప్రస్తుతం నిల్వలు 12.88 టీఎంసీలకు చేరాయి. ఇక గోదావరి ప్రధాన పాయపై ఉన్న శ్రీరామ్‌సాగర్ గరిష్ట నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా, ప్రాజెక్టుకు 1.51 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండడంతో నిల్వలు 66.23 టీఎంసీలకు పెరిగాయి. మరో రెండురోజుల్లో శ్రీరామ్‌సాగర్ గేట్లు ఎత్తే అవకాశం ఉంది. అప్పుడే కడెం, ఎల్లంపల్లి గేట్లు కిందకి.. కడెం నదిపై ఉన్న కడెం ప్రాజెక్టుకు వస్తున్న వరద ప్రవాహం శనివారంతో పోల్చితే ఆదివారానికి 1.33 లక్షల క్యూసెక్కుల నుంచి 4,632 క్యూసెక్కులకు తగ్గిపోవడంతో గేట్లను కిందికి దించేశారు. జలాశయం గరిష్ట నిల్వ సామర్థ్యం 4.7 టీఎంసీలు కాగా ప్రస్తుతం 3.17 టీఎంసీల నిల్వలను కొనసాస్తూ 299 క్యూసెక్కులను కాల్వకు విడుదల చేస్తున్నారు. శ్రీరామ్‌సాగర్, కడెంకి దిగువన గోదావరి ప్రధాన పాయపై ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వచ్చే వరద సైతం 2.15 లక్షల క్యూసెక్కుల నుంచి 28,460 క్యూసెక్కులకు పడిపోవడంతో గేట్లను మూసివేశారు. జలాశయం నిల్వ సామర్థ్యం 20.18 టీఎంసీలు కాగా 18.31 టీఎంసీల నిల్వలను కొనసాగిస్తూ 12,600 క్యూసెక్కులను మేడారం రిజర్వాయర్‌కు పంపింగ్ చేస్తున్నారు. అక్కడి నుంచి గాయత్రి పంప్‌హౌస్ ద్వారా 9,390 క్యూసెక్కులను మిడ్‌మానేరు రిజర్వాయర్‌లోకి తరలిస్తున్నారు. మిడ్‌మానేరు నుంచి నీళ్లను ఎత్తిపోస్తే అనంతగిరి రిజర్వాయర్ కింద 40వేల ఎకరాలు, రంగానాయకసాగర్ కింద 1.10 లక్షల ఎకరాలు, మల్లన్నసాగర్ కింద 2.96 లక్షల ఎకరాలు, కొండపోచమ్మసాగర్ కింద 2.85 లక్షల ఎకరాలు, అప్పర్ మానేరు కింద 16,085 ఎకరాలకు ప్రస్తుత ఖరీఫ్‌లో సాగునీరు అందే అవకాశం ఉంది. కృష్ణా జలాశయాలు కళ కళ కృష్ణా పరీవాహకంలో రాష్ట్రంలో మొత్తం 649.53 టీఎంసీల సామర్థ్యంతో 30 రిజర్వాయర్లుండగా, 584.65 టీఎంసీల నిల్వలతో అన్నీ జలకళను సంతరించుకున్నాయి. కానీ గోదావరి పరీవాహకంలో మొత్తం 419.81 టీఎంసీల సామర్థ్యంతో 57 జలాశయాలుండగా, కేవలం 191.69 టీఎంసీల నిల్వలతో వెలవెలబోతుండటం గమనార్హం. నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ (ఎన్డీఎస్ఏ) సూచనల మేరకు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో నీళ్లను నిల్వ చేసుకునే అవకాశం లేకపోవడంతో 33.18 టీఎంసీల నిల్వ సామర్థ్యాన్ని రాష్ట్రం తాత్కాలికంగా కోల్పోయింది. సింగూరు జలాశయానికి ఏ క్షణంలోనైనా గండిపడవచ్చనే హెచ్చరికలున్న నేపథ్యంలో 21 టీఎంసీలకు మించి నీళ్లను నిల్వ చేయడం లేదు. కాగా నీటి నిల్వలకు అవకాశం ఉన్న జలాశయాలూ ఖాళీగా ఉండడం గమనార్హం. -
క్లౌడ్ బరస్ట్‌తో మరోసారి ఆకస్మిక వరదలు.. ఏడుగురు మృతి
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో ఇటీవల క్లౌడ్ బరస్ట్ విషాద ఘటన మరువక ముందే మరోసారి ప్రకృతి ప్రకోపించింది. తాజాగా కథువా జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో క్లౌడ్ బరస్ట్ సంభవించింది. దీంతో వచ్చిన ఆకస్మిక వరదల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. వరద ఉధృతికి ఇళ్లు నేలమట్టం అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.వివరాల ప్రకారం.. జమ్ము కశ్మీర్‌లోని కథువా జిల్లాలోని ఘటీ ప్రాంతంలో శనివారం అర్థరాత్రి, ఆదివారం తెల్లవారుజామున క్లౌడ్ బరస్ట్ సంభవించింది. దీంతో, ఒక్కసారిగా ఆకస్మిక వరదలు వచ్చాయి. ఈ కారణంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోగా మరికొందరు గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఆకస్మిక వరదల ధాటికి రైల్వే ట్రాక్‌లు, జాతీయ రహదారులు దెబ్బతిన్నాయి. భారీ వరదలకు కథువా పోలీసు స్టేషన్ నీట మునిగింది. దీంతో, కేంద్ర బలగాలు, స్థానిక యంత్రాంగం సహాయక చర్యల్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు బయటకు వచ్చాయి.A heart wrenching video from Jod village near Janglot where people were stuck in mudslide after #cloudburst in #Kathua #JammuAndKashmir pic.twitter.com/OaSZt5S5iC— Ajay Jandyal (@ajayjandyal) August 17, 2025 మరోవైపు.. కథువా పోలీస్ స్టేషన్ పరిధిలోని బగార్డ్, చాంగ్డా గ్రామాలు.. లఖన్‌పూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని దిల్వాన్-హుట్లీలలో కొండచరియలు విరిగిపడ్డాయి. అయితే, పెద్దగా నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. భారీ వర్షాల కారణంగా ఉజ్ నది ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. నీటి మట్టం గణనీయంగా పెరిగిందని అధికారులు తెలిపారు. దీంతో, స్థానికులను అక్కడి నుంచి తరలిస్తున్నారు.#Breaking Machail Yatra ke Badh ab Kathua main aaya Cloud Brust#CloudBrust in #Kathua District Ghati, Janglote. Railway track effected, NHW also effected Police station Kathua submerged in waterEvacuation is going on. pic.twitter.com/IS3kEB6M2y— Ashish Kohli ॐ🇮🇳 (@dograjournalist) August 17, 2025ఇదిలా ఉండగా.. ఇటీవల జమ్ము కశ్మీర్‌లోని కిష్ట్వార్ జిల్లాలోని చషోటి గ్రామంలో కుండపోత వర్షం కారణంగా ఆకస్మిక వరదలు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రకృతి విపత్తులో మరో 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వరద ఉద్ధృతికి గ్రామంలోని పలు ఇళ్లు కొట్టుకుపోయాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కిష్ట్వార్ పోలీసు కంట్రోల్ రూమ్ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.Extremely Heavy Rainfall in Kathua District : Railway Track , Highway affected , Police station #Kathua submerged in Water pic.twitter.com/C3t67Wt2V3— Cross Town News (@CrossTownNews) August 17, 20254 dead, many injured after a cloudburst cut off a remote village in Kathua district of Jammu and Kashmir.The cloudburst hit Jod Ghati in Rajbagh area of the district during the intervening night of Saturday and Sunday.#Kathua #JammuKashmir pic.twitter.com/8uod9zI0rN— Vani Mehrotra (@vani_mehrotra) August 17, 2025 -
ఇంకా చిక్కని 82 మంది ఆచూకీ
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లోని కిష్తవాడ్ జిల్లాలో క్లౌడ్ బరస్ట్ వల్ల విధ్వంసానికి గురైన చోసితీ గ్రామంలో సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. గురువారం సంభవించిన ఆకస్మిక వర్షాలు, వరదల ధాటికి ముగ్గురు సీఐఎస్ఎఫ్ జవాన్లు, ఒక స్పెషల్ పోలీసు ఆఫీసర్ సహా 60 మంది దుర్మరణం పాలయ్యారు. 167 మందిని అధికారులు రక్షించారు. మరో 82 మంది జాడ గల్లంతయ్యింది. వారి కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి. సహాయక చర్యలకు అడ్డంకిగా మారిన భారీ బండరాళ్లను పేలుడు పదార్థాలతో పేల్చేస్తున్నారు. జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా శనివారం ఉదయం చిసోతీని సందర్శించారు. బాధిత కుటుంబాలకు సీఎం సహాయ నిధి నుంచి పరిహారం అందజేస్తామని వెల్లడించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.లక్ష చొప్పున, స్వల్పంగా గాయపడినవారికి రూ.50 వేలు చొప్పున ఇస్తామన్నారు. ధ్వంసమైన ఇళ్లకు సైతం పరిహారం ప్రకటించారు. వరదల్లో ఆప్తులను కోల్పోయిన గ్రామస్థులను ఒమర్ అబ్దుల్లా ఓదార్చారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, జమ్మూకశ్మీర్ డీజీపీ నళిన్ ప్రభాత్ శుక్రవారం అర్ధరాత్రి చోసితీ గ్రామానికి చేరుకున్నారు. సహాయక చర్యలను సమీక్షించారు. శనివారం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను జితేంద్ర సింగ్ పరామర్శించారు. సహాయ పునరావాస చర్యలను ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారని ఆయన తెలిపారు. అధికారులు ఇప్పటిదాకా 50 మృతదేహాలను గుర్తించి, సంబంధిత కుటుంబాలకు అప్పగించారు. క్లౌడ్ బరస్ట్‌లో కనీసం 16 నివాస గృహాలతోపాటు పలు ప్రభుత్వ భవనాలు, మూడు ఆలయాలు, 30 మీటర్ల వంతెన ధ్వంసమయ్యాయి. పదుల సంఖ్యలో వాహనాలో వరదలో కొట్టుకుపోయాయి. మరోవైపు మచైల్ మాత యాత్రను వరుసగా మూడోరోజు శనివారం సైతం రద్దు చేశారు. -
పోటెత్తిన గోదావరి
సాక్షి, హైదరాబాద్/బాల్కొండ/నిర్మల్/రామగుండం: నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించిన రెండున్నర నెలల తర్వాత ఎట్టకేలకు ఎగువ గోదావరి నది పోటెత్తింది. పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో సింగూరు ప్రాజెక్టు నుంచి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వరకు గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువన మహారాష్ట్రలో ఉన్న జైక్వాడ్ ప్రాజెక్టు గరిష్ట నిల్వ సామర్థ్యం 102.73 టీఎంసీలు కాగా, శనివారం సాయంత్రం 6 గంటల సమయానికి 6,738 క్యూసెక్కుల వరద వస్తుండడంతో 97.29 టీఎంసీలకు చేరింది. రెండు మూడు రోజుల్లో జైక్వాడ్ నిండితే గోదావరి ప్రధాన పాయ ద్వారా తెలంగాణలోకి వచ్చే వరద ప్రవాహం మరింత పెరగనుంది. రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లకు వరద రాష్ట్రంలో మంజీర నదిపై నిర్మించిన సింగూరు ప్రాజెక్టుకు 31,412 క్యూసెక్కుల వరద వస్తుండగా, 21.34 టీఎంసీల నిల్వను కొనసాగిస్తూ 43,634 క్యూసెక్కులను కిందికి విడుదల చేస్తున్నారు. సింగూరు ప్రాజెక్టు గరిష్ట నిల్వ సామర్థ్యం 29.91 టీఎంసీలు అయినప్పటికీ డ్యామ్ భద్రతపై డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్ (డీఎస్ఆర్పీ) హెచ్చరికల నేపథ్యంలో నిల్వను 21 టీఎంసీలకు మించకుండా చర్యలు తీసుకుంటున్నారు. దిగువన ఉన్న నిజాంసాగర్ గరిష్ట నిల్వ సామర్థ్యం 17.8 టీఎంసీలు కాగా, 31,500 క్యూసెక్కుల వరద వస్తుండడంతో నిల్వలు 9.22 టీఎంసీలకు చేరాయి. గోదావరి ప్రధాన పాయపై ఉన్న శ్రీరాంసాగర్ గరిష్ట నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా, ప్రాజెక్టుకు 1.04 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండడంతో నిల్వలు 54.63 టీఎంసీలకు పెరిగాయి. కడెం నదిపై నిర్మించిన కడెం ప్రాజెక్టు సామర్థ్యం 4.7 టీఎంసీలు కాగా, 1.33 లక్షల క్యూసెక్కుల వరద పోటెత్తడంతో 3.06 టీఎంసీల నిల్వలను కొనసాగిస్తూ, 2.04 లక్షల క్యూసెక్కులను కిందికి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు మొత్తం 18 గేట్లను ఎత్తివేశారు. ప్రాజెక్టు దిగువన చేపల వేటకు వెళ్లిన కన్నాపూర్ గ్రామానికి చెందిన గంగాధర్ (41) నీటి ప్రవాహంలో గల్లంతయ్యాడు. సారంగాపూర్ మండలంలోని స్వర్ణ ప్రాజెక్టుకు 15వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావడంతో ఐదు గేట్లు ఎత్తి 25,400 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. భైంసా పట్టణంలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టులోకి 10,500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, ఐదు గేట్లు ఎత్తి 20 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీరాంసాగర్, కడెం నుంచి వస్తున్న వరద తోడుకావడంతో దిగువన గోదావరి ప్రధాన పాయపై ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 2.15 లక్షల క్యూసెక్కుల వరద పోటెత్తింది. జలాశయం నిల్వ సామర్థ్యం 20.18 టీఎంసీలు కాగా, 18.23 టీఎంసీల నిల్వలను కొనసాగిస్తూ 20 గేట్లను ఎత్తి 53,800 క్యూసెక్కులను కిందికి విడుదల చేస్తున్నారు. నంది పంప్‌హౌస్ ద్వారా మరో 12,600 క్యూసెక్కులను మేడారం రిజర్వాయర్‌కు తరలించి అక్కడి నుంచి గాయత్రి పంప్‌హౌస్ ద్వారా 11,000 క్యూసెక్కులను మిడ్‌మానేరు రిజర్వాయర్‌లోకి తరలిస్తున్నారు. అక్కడి నుంచి త్వరలో రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్‌లోకి నీటి పంపింగ్ ప్రారంభించే అవకాశం ఉంది. దీంతో సాగు, తాగునీటికి ఇబ్బందులు తొలగిపోనున్నాయి. దిగువ గోదావరిలో కొనసాగుతున్న ఉధృతి ఎల్లంపల్లి నుంచి విడుదల చేసిన వరద ఇంకా చేరకపోవడంతో దిగువన ఉన్న సుందిళ్ల బరాజ్‌కి 6,142, అన్నారం బరాజ్‌కి 7,825 క్యూసెక్కుల వరద మాత్రమే వస్తోంది. అయితే, వచ్చిన వరదను వచ్చినట్టు కిందికి విడుదల చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో నీళ్లు నింపరాదని ఎన్డీఎస్ఏ సూచించిన విషయం తెలిసిందే. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లోని దిగువ పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో ఉపనదులైన ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, వాగులు, వంకల్లో వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో దిగువ గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. గోదావరిలో ప్రాణహిత కలిసే కాళేశ్వరం వద్ద నిర్మించిన మేడిగడ్డ బరాజ్ నుంచి ధవళేశ్వరం బరాజ్‌కు దిగువన సముద్రంలో కలిసే వరకూ గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రాణహిత నది వచ్చి కలవడంతో మేడిగడ్డ బరాజ్‌కి 3.73 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, దాన్ని మొత్తం కిందికి విడుదల చేస్తున్నారు. దానికి ఛత్తీస్‌గఢ్ నుంచి వస్తున్న ఇంద్రావతి వరద తోడవుతుండటంతో తుపాకులగూడెం (సమ్మక్క సాగర్) బరాజ్‌లోకి 4.60 లక్షల క్యూసెక్కుల వరద చేరుతుండగా అంతే స్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నారు. సీతమ్మసాగర్ (దుమ్ముగూడెం బరాజ్)లోకి చేరుతున్న 3.56 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తుండడంతో ఏపీలోని పోలవరం ప్రాజెక్టు గుండా ప్రవహించి ధవళేశ్వరం బరాజ్ మీదుగా సముద్రంలోకి వరద చేరుతోంది. వాగులు వంకలు ఏకంరాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు పలు జిల్లాల్లో పొంగుతున్న వాగులు సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో వర్షాలు దంచి కొడుతున్నాయి. పలు జిల్లాల్లో భారీ వర్షాలకు వరద పోటెత్తడంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. కొన్నిచోట్ల రోడ్లు, వంతెనలు దెబ్బతినటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాగులు, వంకలు పొంగుతున్నాయి. జలాశయాలు నిండు కుండలను తలపిస్తున్నాయి. మరో రెండుమూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించటంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. దెబ్బతిన్న రోడ్లను యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీస్, రెవెన్యూ, అగ్నిమాపక విభాగాలు సిద్ధమయ్యాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా: ఉమ్మడి జిల్లా పరిధిలోని మహబూబాబాద్, ములుగు, వరంగల్, భూపాలపల్లి జిల్లాల్లో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని పాకాల వాగు బ్రిడ్జి పైనుంచి వరద పొంగిపొర్లుతోంది. దీంతో ఏటి అవతలి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొత్తగూడ మండలంలోని గుంజేడువాగు, గాదెవాగు, రాళ్లతెట్టెవాగు, ముస్మివాగు, మొండ్రాయిగూడెం వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. బయ్యారం మండలం ఇల్లెందు– మహబూబాబాద్ రహదారి పైనుంచి జిన్నెలవర్రె వాగు పొంగి ప్రవహిస్తోంది. ములుగు జిల్లా మేడారంలోని జంపన్నవాగులో మేడారం బ్రిడ్జిని ఆనుకుని వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు నగర్– వెంగ్లాపూర్ మధ్య ఉన్న యాసంగి తోగు వరద రోడ్డును కమ్మేయడంతో పస్రా నుంచి మేడారానికి శనివారం ఉదయం నుంచి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మేడారం, రెడ్డిగూడెం, కన్నెపల్లి, ఊరట్టం, ఎల్బాక, పడిగాపూర్, నార్లాపూర్ గ్రామాల్లోని వరి పొలాలు నీట మునిగాయి. ఎల్బాక, పడిగాపూర్ గ్రామా లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గోవిందరావుపేట మండలంలోని లక్నవరం సరస్సు సామర్థ్యం 33 ఫీట్ల 6 ఇంచులు కాగా, శనివారం సాయంత్రం వరకు చెరువు పూర్తిగా నిండి అలుగు పోస్తోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపసముద్రం, భీంఘనపురం రిజర్వాయర్లలోకి 18 అడుగుల మేర నీరు చేరింది. మోరంచవాగు ఉప్పొంగి ప్రవహించింది. చిట్యాల, మొగుళ్లపల్లి, టేకుమట్ల చలివాగుకు వరద పెరిగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా: ఖమ్మం, పాలేరు, వైరా, పినపాక, ఇల్లెందు నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు భారీ వర్షం కురిసింది. వైరా, కారేపల్లి మండలాల్లో పలుచోట్ల లోతట్టు ప్రాంతాల కాలనీలను వరద ముంచెత్తగా ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని మున్నేటికి వరద నెమ్మదిగా పెరుగుతుండడంతో నీటిమట్టం శనివారం రాత్రి 15 అడుగులకు చేరింది. దీంతో మున్నేటికి ఇరువైపులా పరిస్థితులను ఖమ్మం కలెక్టర్ అనుదీప్, మున్సిపల్ కమిషనర్లు పరిశీలించి స్థానికులను అప్రమత్తం చేశారు. భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో పత్తి, పెసర పంటలు దెబ్బతిన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా: జిల్లాలో శనివారం కుండపోతగా వర్షం కురిసింది. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో అత్యధికంగా 98.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, లక్సెట్టిపేట, చెన్నూరు, కాగజ్‌నగర్ పట్టణాల్లో లోతట్టు కాలనీల్లోకి వరద నీరు చేరింది. ఆదిలాబాద్ తరుణం వాగులో రెండు లారీలు వరదలో చిక్కుకుపోగా, డ్రైవర్లను పోలీసులు రక్షించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సుభాష్ నగర్, భాగ్యనగర్, కృష్ణానగర్ కాలనీల్లోకి నీరు చేరడంతో స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బజార్హత్నూర్, కన్నెపల్లి, భీమిని, వేమనపల్లి తదితర మండలాల్లో పత్తి, సోయా, వరి పంటలు దెబ్బ తిన్నాయి. ఇంద్రవెల్లి మండలం ముట్నూరు వద్ద ఆదిలాబాద్–మంచిర్యాల రహదారి తెగిపోయింది. సిరికొండలోని చిక్మాన్ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. సాత్నాల ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం రాత్రి నుంచి శనివారం మధ్యాహ్నం వరకు ఏకధాటిగా వర్షం కురిసింది. పంట పొలాలు నీట మునిగాయి. బోధన్ డివిజన్ పరిధిలో అత్యధికంగా వర్షపాతం నమోదైంది. జలాల్పూర్–బడాపహాడ్ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. ఇందల్వాయి మండలం సిర్నాపల్లి వాగు ఉధృతంగా ప్రవహించడంతో గ్రామానికి రాకపోకలు నిలిచాయి. కామారెడ్డి జిల్లా: కామారెడ్డి జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి భారీ వర్షం కురిసింది. అత్యధికంగా రామారెడ్డి మండలంలో 12.3 సెం.మీ. వర్షపాతం నమోదైంది. పోచారం ప్రాజెక్టు నిండి అలుగులు పోస్తూ మంజీరలోకి ప్రవహిస్తోంది. ఎగువన సింగూరు, గణపురం ఆనకట్టల ద్వారా కూడా దిగువకు నీటిని వదులుతుండడంతో మంజీర ద్వారా నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 31 వేల క్యూసెక్కుల నీరు వస్తోంది. భారీ వర్షాలతో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఒక ఇల్లు పూర్తిగా, 11 ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. -
కృష్ణమ్మ ఉగ్రరూపం
దోమలపెంట/నాగార్జునసాగర్: శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల నుంచి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం ఆనకట్ట వద్ద శనివారం ఐదు గేట్లను ఎత్తి నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాలలో ఆనకట్ట స్పిల్ వే ద్వారా 41,112 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా 38,879 క్యూసెక్కులు, సుంకేçశుల నుంచి 30,653 క్యూసెక్కులు కలిపి మొత్తం 1,10,644 క్యూసెక్కుల నీటి ప్రవాహం శ్రీశైలం జలాశయంలోకి వస్తోంది. దీంతో 5 గేట్లు ఒక్కొక్కటి పది అడుగుల మేరకు ఎత్తి 1,33,720 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు.మరోవైపు ఎడమగట్టు భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 35,315 క్యూసెక్కులు, ఏపీ జెన్కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 30,509 క్యూసెక్కులు కలిపి 65,824 క్యూసెక్కుల నీళ్లు అదనంగా సాగర్‌కు విడుదలవుతున్నాయి. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 882.1 అడుగుల నీటిమట్టం వద్ద 199.7354 టీఎంసీల నీటి నిల్వ ఉంది. గడిచిన 24 గంటల్లో పోతిరెడ్డిపాడు ద్వారా 25,333, హెచ్ఎన్ఎస్ఎస్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 2,426 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎడమగట్టు కేంద్రంలో 16.956 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేశారు. కుడిగట్టు కేంద్రంలో 15.357 మి.యూనిట్లు ఉత్పత్తి చేశారు. పై నుంచి భారీగా వరద వస్తుండటంతో నాగార్జునసాగర్ 20 గేట్లు ఎత్తి 1,56,540 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తి ద్వారా 29,516 క్యూసెక్కులు నదిలోకి వదులుతున్నారు. నాగార్జునసాగర్ జలాశ యం గరిష్ట నీటిమట్టం 590 అడుగులు (312.0450 టీఎంసీలు). ప్రస్తుత నీటిమట్టం 587.40 అడుగులు(305.7464టీఎంసీలు) ఉంది. -
ఒక్క వానకే మునిగిన బాబు విజన్ అమరావతి
-
బుడమేరులో బోగస్ ఆపరేషన్!
సాక్షి ప్రతినిధి, విజయవాడ: వర్షం కురిసిందంటే చాలు బెజవాడ వాసులు బెంబేలెత్తుతున్నారు. ప్రధానంగా బుడమేరు ప్రాంత నివాసులు గతేడాది విలయం తలుచుకుని గజగజ వణికిపోతున్నారు. బుడమేరును ప్రక్షాళన చేస్తామన్న ప్రభుత్వ పెద్దల మాటలు ఏడాదిగా ఉత్త మాటలుగానే మిగిలిపోయాయి. మంగళవారం రాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు స్థానికంగా కురిసిన వర్షాలకే బుడమేరుకు 5,000 క్యూసెక్కులపైగా వరద వచ్చింది. ఏలూరు కాలువకు వెయ్యి క్యూసెక్కులు, మిగిలిన నీటిని బుడమేరు కాలువ ద్వారా బయటికి పంపే యత్నం చేస్తున్నారు. బుడమేరు పరిధిలో ఆక్రమణల మాట దేవుడెరుగు కనీసం పూడికతీత కూడా సక్రమంగా చేయలేదు. గుణదల, నిడమానూరు, రామవరప్పాడు, గూడవల్లి ప్రాంతాల్లో బుడమేరు వంతెనలను వెడల్పు చేయకపోవడంతో పైనుంచి నీరు ప్రవహిస్తోంది. నీళ్లు నిలువ ఉండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయి ఇళ్లలోకి ప్రవహిస్తోంది. రోడ్లు కోతకు గురి అవుతున్నాయి. బుడమేరు కాలువ సామర్థ్యం ఐదు వేల క్యూసెక్కులని చెబుతున్నా ఆక్రమణలు, పూడికతో కాలువ కుంచించుకుపోయింది. మూడు వేల క్యూసెక్కులకే కాలువ పొంగి లోతట్టు ప్రాంతాల్లోకి ప్రవేశించే పరిస్థితి నెలకొంది. ఎగువ ప్రాంతాల్లో పెద్దగా వర్షాలు కురవకపోవటం, బుధవారం వరకు వెలగలేరు వద్ద వరద లేకపోవడంతో బెజవాడ ఊపిరి పీల్చుకుంది. గురువారం ఉదయం వెలగలేరు వద్దకు 3 వేల క్యూసెక్కుల వరద రాగా డైవర్షన్ కెనాల్ ద్వారా కృష్ణా నదిలోకి పంపారు. 10,500 క్యూసెక్కుల వరకు డైవర్షన్ కెనాల్ ద్వారా కృష్ణాలోకి పంపే అవకాశం ఉంది. అయితే ఇదే వర్షం కొనసాగి ఉంటే బుడమేరు వరదతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యేవి. మాయ మాటలతో సరి..! బెజవాడ దుఃఖదాయినిగా మారిన బుడమేరు ఆధునికీకరణపై కూటమి సర్కారు మాయ మాటలతో మభ్యపెట్టింది. గతేడాది విరుచుకుపడ్డ వరదకు 32 డివిజన్ల పరిధిలో అధికారిక లెక్కల ప్రకారమే 2.62 లక్షల కుటుంబాలు సర్వం కోల్పోయాయి. తాగేందుకు గుక్కెడు నీరు కూడా దొరకక వారం రోజులపాటు వరద నీటిలోనే విలవిల్లాడాయి. పెద్దఎత్తున ప్రాణ నష్టం, ఆస్తి, నష్టం జరిగింది. ముంపు నివారణకు రూ.500 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేశామని ప్రకటించిన సీఎం చంద్రబాబు చివరకు రూ.39.47 కోట్లతో సరిపెట్టారు. ఆ పనులకు టెండర్ల ప్రక్రియ పూర్తి కాలేదు. విజయవాడను ముంపు రహిత నగరంగా మార్చేలా ఆపరేషన్ బుడమేరు యాక్షన్ ప్లాన్ అంటూ మంత్రులు కొద్ది రోజులు హడావుడి చేశారు. తొలిదశలో బుడమేరు సామర్థ్యం 10 వేల క్యూసెక్కులకు పెంచాలని ప్రతిపాదించారు. 13.25 కిలోమీటర్లు మేర బుడమేరు ఆక్రమణలకు గురైంది. విద్యాధరపురం నుంచి గుణదల వరకు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 70 ఎకరాలు ఆక్రమణకు గురికాగా వీటిలో 3,051 ఇళ్ల నిర్మాణాలు జరిగినట్లు గుర్తించారు. బుడమేరుకు వచ్చే వరద నీటికి సమాంతరంగా కాలువ తవ్వి మళ్లించే ప్రణాళికలు కాగితాలకే పరిమితమయ్యాయి. చీమలవాగు, కేసరపల్లి, ఎనికేపాడు, యూటీల సామర్థ్యం పెంపు ప్రతిపాదన బుట్టదాఖలైంది. ఎనికేపాడు నుంచి కొల్లేరు వరకు 50.6 కిలో మీటర్ల మేర కాలువ గట్ల పటిష్టానికి చర్యలు తీసుకోలేదు. దీంతో ప్రస్తుతం కొద్దిపాటి వర్షాలకే బుడమేరు ముంపు ప్రాంతాల్లో 45 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన స్థితి ఉంది. 660 మందిని ఆ కేంద్రాలకు తరలించారు. గతంలో కృష్ణలంకలో నెలకొన్న పరిస్థితులు ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నాయని నగర వాసులు వాపోతున్నారు.పుట్టగుంట వంతెన వద్ద ఉధృతి.. పుట్టగుంట వంతెన వద్ద బుడమేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ నుంచి ఐదు వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా వంతెన వద్ద 17.5 అడుగుల మేర వరద ఉంది. 20.5 అడుగులకు చేరితే మచిలీపట్నం–నూజివీడు–కల్లూరు జాతీయ రహదారిపై రాకపోకలను నిలిపివేసే అవకాశం ఉంది. నందివాడ మండలంలో ఇప్పటికే 6 వేల ఎకరాల్లో వరి నాట్లు వేశారు. బుడమేరు ప్రవాహం మరింత పెరిగితే పరీవాహక గ్రామాలు గతేడాది మాదిరిగా ముంపు బారిన పడే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. వంతెన వద్ద ఎంఎన్‌కె రహదారి కోతకు గురవడంతో సగం మేర ధ్వంసమైంది. దీనివల్ల ప్రమాదాలు చోటు చేసుకునే ఆస్కారం ఉన్నా పునరుద్ధరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టలేదు.వర్షం పడితే వణుకే.. బుడమేరు వరద విలయానికి ఏడాది అవుతున్నా ఆ బీభత్సం ఇంకా కళ్లెదుట మెదులుతూనే ఉంది. సర్వం కోల్పోయి రోడ్డున పడ్డాం. వర్షం పడుతుంటే మా కాలనీ వాసులకు వణుకొస్తోంది. సంవత్సరం గడిచినా వరద నీరు మళ్లీ మా ఇళ్లల్లోకి రాదనే భరోసాను ప్రభుత్వం కల్పించలేకపోయింది. బుడమేరులో ఆక్రమణలు, పూడికలు తొలగించాలి. ప్రజలను అప్రమత్తం చేయడం, పునరావాస కేంద్రాలు ఏర్పాటుపై సమాచారం సరిగా లేదు. – టి.బాల, అరుణోదయనగర్, 57వ డివిజన్, విజయవాడ కొద్దిపాటి వానకే ఇళ్లల్లోకి నీళ్లు.. సింగ్‌నగర్, నందమూరినగర్‌లో డ్రెయినేజీ వ్యవస్థ సక్రమంగా లేదు. దీంతో కొద్దిపాటి వర్షానికే డ్రెయినేజీ నీళ్లు.. వర్షపు నీరు ఇళ్లల్లోకి చేరుతోంది. గతేడాది వచ్చిన వరదలను మా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఇల్లు మునిగిపోయి సర్వస్వం కోల్పోయాం. ఇప్పుడు రెండు రోజుల వర్షానికే 68 ఇళ్లకుగానూ 30 ఇళ్లల్లోకి నీళ్లు వచ్చేశాయి. రోడ్లన్నీ మునిగిపోవడంతో మోటార్లు పెట్టి తోడుతున్నారు. తాత్కాలిక చర్యలు కాకుండా డ్రెయినేజీ నీరు సక్రమంగా పారేలా, వర్షపునీరు నిలవకుండా శాశ్వత చర్యలు చేపట్టాలి. ప్రభుత్వ పెద్దలు నందమూరినగర్పై దృష్టిపెట్టి ముంపు ముప్పును తొలగించాలి. – వై.ప్రసాదరావు, నందమూరినగర్, 58వ డివిజన్, విజయవాడ -
కృష్ణమ్మ దూకుడు
సాక్షి, అమరావతి/విజయపురిసౌత్/సత్రశాల(రెంటచింతల)/తాడేపల్లిరూరల్/శ్రీశైలం ప్రాజెక్ట్ : ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి వస్తున్న వరదకు మూసీ, మున్నేరు, కట్టలేరు, బుడమేరు, కొండవీటివాగు ప్రవాహం తోడవడంతో కృష్ణా నదిలో వరద ఉధృతి మరింత పెరిగింది. గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రకాశం బ్యారేజీలోకి 5,59,185 క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజీ 70 గేట్లు ఎత్తి 5,59,185 క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు. కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలో ఎగువన వర్షాలు కురస్తుండటంతో ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌లలోకి వరద కొనసాగుతోంది. ఆ రెండు జలాశయాలు నిండుకుండల్లా మారడంతో వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తున్నారు. ఉప నది భీమాపై మహారాష్ట్రలోని ఉజ్జయిని డ్యామ్ కూడా నిండింది. దాంతో కృష్ణా, భీమా వరద జూరాల మీదుగా శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరుతోంది. ప్రధాన ఉప నది తుంగభద్ర డ్యాం కూడా నిండిపోయి సుంకేశుల బ్యారేజీ మీదుగా శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద చేరుతోంది. దీంతో గురువారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 1,72,234 క్యూసెక్కులు చేరుతుండగా.. నాలుగు గేట్లను పది అడుగుల మేర ఎత్తి 1,06,608 క్యూసెక్కులు, కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 65,982 క్యూసెక్కులు.. వెరసి 1,72,590 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్‌లోకి 1,72,774 క్యూసెక్కులు చేరుతుండగా.. స్పిలే వే గేట్లు ఎత్తి, విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా 2,36,958 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. దీనికి మూసీ వరద తోడవుతుండటంతో పులిచింతల ప్రాజెక్టులోకి 2,73,900 క్యూసెక్కుల వరద చేరుతోంది. స్పిల్ వే గేట్ల ద్వారా 1,84,692 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ కృష్ణాలో వర్షాలు తగ్గిన నేపథ్యంలో శుక్రవారం ప్రకాశం బ్యారేజీ వద్ద వరద తగ్గుముఖం పడుతుందని అధికార వర్గాలు తెలిపాయి. -
లోకేష్ ఇదేనా నువ్వు చేసిన మార్పు.. కన్నీళ్లు పెట్టుకున్న వరద బాధితులు
-
పూర్తిగా నీట మునిగిన అమరావతి
-
వాన జోరు.. వరద హోరు
సాక్షి, నెట్వర్క్: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం, ఉపరితల ఆవర్తనం, రుతుపవనాలు చురుకుగా మారడంతో రాష్ట్రంలో వానలు ఊపందుకున్నాయి. రెండు, మూడ్రోజులుగా హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే పలు రిజర్వాయర్లు నిండిపోయాయి. ప్రాజెక్టుల గేట్లు ఎత్తారు. మరోవైపు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు అలుగు పారుతున్నాయి. పలు ప్రాంతాల్లో రోడ్లు, వంతెనలపై వరద ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం వాటిల్లింది. పంట చేలు ముంపునకు గురయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌లో భారీ వర్షం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంగళ, బుధవారాల్లో కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పొంగాయి. మంచిర్యాల జిల్లా భీమిని మండలంలో బుధవారం ఉదయం వరకు భారీ వర్షాలు కురిసాయి. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు రెండు గేట్లు, స్వర్ణ ప్రాజెక్టు ఒక గేటు, కుమురంభీం ప్రాజెక్టు ఏడు, వట్టివాగు ప్రాజెక్టు ఆరు గేట్లు ఎత్తి దిగువకు అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం మత్తడివాగు గేటు ఎత్తారు. ఆసిఫాబాద్ మండలం తూంపెల్లి వాగు, నంబాల వాగు పొంగడంతో 13 గ్రామాలకు రాకపోకల్లో అంతరాయం కలిగింది. అలాగే కెరమెరి మండలం అనార్పల్లి వాగు, బూరుగూడ పెంచికల్‌పేట ఎర్రవాగు లోలెవల్ వంతెనపై వరద నీరు ప్రవహించడంతో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. నెన్నెల మండలం లంబాడి తండా ఎర్రవాగుపై ఉన్న తాత్కాలిక వంతెన తెగిపోయింది. భీమిని మండలం రాజారాం, కర్జీ భీంపూర్‌లో రోడ్డు కొట్టుకుపోయింది. కోటపల్లి మండలాల్లో వరద నీరు పంట చేన్లకు చేరింది. మంచిర్యాల, బెల్లంపల్లి పట్టణాల్లో రోడ్లపై వరద చేరింది. కలెక్టరుŠల్ ముంపు ప్రాంతాలను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. మంచిర్యాల జిల్లాలో భారీ వర్షానికి మూడు వేల ఎకరాల్లో వరి, పత్తి పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఉమ్మడి రంగారెడ్డి, మహబూబూబ్‌నగర్ జిల్లాల్లో.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బుధవారం పలుచోట్ల భారీ వర్షం కురిసింది. పరిగి, వికారాబాద్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారిపై వాహనదారులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. బుధవారం రాత్రి వనపర్తి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కుండపోతగా వర్షం కురిసింది. సరళాసాగర్, రామన్‌పాడు, పోపల్దిన్నె రిజర్వాయర్లకు భారీగా వరద కొనసాగింది. ఉమ్మడి జిల్లాలో 350 చెరువులు అలుగు పారుతున్నాయి. వనపర్తి జిల్లా ఊకచెట్టు వాగులో నీటి ఉధృతి పెరిగి ఆత్మకూర్–మదనాపురం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. సంగారెడ్డి అతలా కుతలం సంగారెడ్డి జిల్లాలో మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. న్యాల్కల్ మండల పరిధిలోని రేజింతల్ గ్రామ శివారులో వరద బ్రిడ్జిపై నుంచి ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. పంట పొలాలు వరదనీటితో నిండిపోయాయి. ప్రధానంగా పత్తి పంటతోపాటు చెరుకు, మినుము, సోయా, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. సూర్యాపేట జిల్లాలో.. సూర్యాపేట జిల్లాలోనూ భారీ వర్షపాతం నమోదైంది. పలుచోట్ల వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మునగాల మండలంలోని మొద్దులచెరువు, కలకోవ ఊరచెరువు, రేపాల, నర్సింహులగూడెం, ముకుందాపురం తిప్పాయికుంట, ఆకుపాముల నాగులకుంట చెరువులు అలుగు పోస్తున్నాయి. పాలేరు రిజర్వాయర్ నిండు కుండలా మారింది. ఆయకట్టు పరిధిలో భారీ వర్షాలు కురుస్తుండటంతో సాగర్ ఎడమ కాల్వకు బుధవారం నీటి విడుదలను నిలిపివేశారు. కోదాడలో బుధవారం సాయంత్రం నుంచి కురుస్తున్న వర్షానికి పట్టణ ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. బుధవారం రాత్రి గుడిబండ రోడ్డులో ఉన్న తులసీనగర్ టౌన్íÙప్లోకి వర్షపునీరు చేరడంతో ఇళ్లలోని వారిని మున్సిపాలిటీ సిబ్బంది జేసీబీతో బయటకు తీసుకొచ్చారు. షిర్డీసాయినగర్‌కు వరద ముప్పు దృష్ట్యా అక్కడ ఉన్న ముస్లిం మైనార్టీ బాలికల పాఠశాల విద్యార్థులను మధ్యాహ్నమే ఖాళీ చేయించి ఇంటికి పంపారు. పలు కాలనీల్లో ఇళ్లు, లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. మూసీ వంతెనలు పరిశీలించిన అధికారులు హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాలకు యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో మూసీ పరవళ్లు తొక్కుతోంది. వలిగొండ మండలం బీమలింగం, భూదాన్ పోచంపల్లి మండలం జూలరు–రుద్రవెల్లి వద్ద లో లెవల్ బ్రిడ్జిల పైనుంచి వరద ప్రవహిస్తోంది. దీంతో అధికారులు రాకపోకలను నిలిపివేశారు. రాచకొండ సీపీ సుధీర్‌బాబు, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్‌రెడ్డి ఇతర అధికారులు మూసీ వంతెనలను పరిశీలించారు. భూదాన్‌పోచంపల్లి, వలిగొండ, బీబీనగర్ మండలాల్లో మూసీ ఆధారిత చెరువులు అలుగులు పోస్తున్నాయి. వరంగల్ లోతట్టు కాలనీల్లో వరద వరంగల్ నగరంలో మంగళవారం ఉదయం నుంచే వర్షం తగ్గుముఖం పట్టినా పలు లోతట్టు కాలనీల్లో ప్రవహిస్తున్న వరదనీరు ఉధృతి బుధవారం కూడా తగ్గలేదు. ఎస్ఆర్ఆర్ తోట, శివనగర్, మైసయ్య నగర్, శాకరాశికుంట, నాగేంద్రనగర్, కాశికుంట కాలనీలు నీటిలో ఉన్నాయి. 12 మెరీల నుంచి బొందివాగు వరకు రహదారిపై నీళ్లు ప్రవహిస్తున్నాయి. శివనగర్‌లో బల్దియా ఏర్పాటు పునరావాస కేంద్రంలో నిర్వాసితులు తలదాచుకుంటున్నారు. -
వరద ముంపులో అమరావతి
సాక్షి ప్రతినిధి, గుంటూరు/తాడికొండ : రాజధాని అమరావతి మళ్లీ వరద ముంపులో చిక్కుకుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లడంతో గుంటూరు వైపు నుంచి రాజధాని అమరావతికి రాకపోకలు నిలిచిపోయాయి. మంగళవారం రాత్రి పది గంటల నుంచి బుధవారం ఉదయంలోపు జిల్లాలో సగటున 145 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవడంతో తాడికొండ మండలం లాం వద్ద కొండవీటి వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దాదాపు ఆరు గంటల పాటు వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. పెదపరిమి వద్ద కోటేళ్లవాగు, కంతేరు వద్ద ఎర్రవాగు, అయ్యన్నవాగు, పాలవాగులు పొంగడంతో రహదారులపైకి నీరు చేరింది.రాజధాని నిర్మాణాలతో స్వరూపం కోల్పోయిన వాగులు..రాజధాని ప్రాంతంలో వివిధ నిర్మాణాల కారణంగా పాలవాగు, అయ్యన్నవాగులు వాటి స్వరూపాన్ని కోల్పోయాయి. కొండవీటి వాగు నీరు దిగువకు వెళ్లే పరిస్థితి లేకుండాపోయింది. నిర్మాణాలతో వాగులు మూసుకుపోవడంతో పాటు రోడ్ల ఎత్తును పెంచడంతో వాగు నుంచి వచ్చే వేల క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్లే పరిస్థితి లేక వేలాది ఎకరాల్లో పంటలు పూర్తిగా నీటమునిగాయి. ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రభుత్వం దృష్టిసారించకుండా కొండవీటి వాగు వరదను గాలికొదిలేయడంతో పరిస్థితి అధ్వానంగా తయారైంది. మరోవైపు.. తాడికొండ, తుళ్ళూరు, మేడికొండూరు, మంగళగిరి రూరల్ మండలాల్లోని సుమారు 40 వేల ఎకరాల్లో పంటలు కొండవీటి వాగు వరద ఉధృతికి ముంపుబారిన పడి సముద్రాన్ని తలపిస్తున్నాయి. ఎక్కడ చూసినా వరద నీరే ఉండటంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ప్రత్యామ్నాయ చర్యలు నిల్..ఇక మంగళవారం రాత్రి తాడికొండ మండలంలో 225 మిల్లీమీటర్లు, తుళ్ళూరు మండలంలో 180.2 మి.మీ., మేడికొండూరు 140.2, ఫిరంగిపురం 111.2, మంగళగిరి 194.8 మి.మీ., వర్షం కురిసింది. ఈ వర్షం నీరు అంతా కొండవీడు కొండల మీదుగా మేడికొండూరు, తాడికొండ, తుళ్ళూరు, తాడేపల్లి మండలాల మీదుగా ప్రకాశం బ్యారేజ్‌కు చేరాల్సి ఉంది. కానీ, కొండవీటి వాగు ప్రక్షాళనకు రూ.234 కోట్లతో టీడీపీ కూటమి ప్రభుత్వం తలపెట్టిన ఎత్తిపోతల పథకంలో ఎక్కడా ఎగువ నుంచి దిగువకు వరద నీరు పూర్తిగా వచ్చేలా ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోలేదు. నిజానికి.. వందల ఏళ్లుగా కొండవీటి వాగు పల్లపు ప్రాంతమైన రాజధాని ప్రాంతం నుంచే ప్రవహించేది. అయితే, ప్రస్తుతం దానిని మూసేసి ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లుచేయకపోవడంవల్లే రాజధాని ప్రాంతం ముంపునకు గురైందని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. మరోవైపు.. కాసుల కక్కుర్తి కోసం రాజధానిలో రిజర్వాయర్ల పేరుతో ఇతర నిర్మాణాలను చేపట్టడం కూడా వరద ముంపునకు కారణమైంది. దీంతో.. గత 25 ఏళ్లలో ఎప్పుడూ జరగని నష్టం ఇప్పుడీ ప్రాంతానికి వచ్చింది. ఇటు పంటలు మునగడంతో పాటు గ్రామాల్లో కూడా నీరు కదిలే పరిస్థితి లేక రాజధానితో పాటు పరిసర ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం..ఇదిలా ఉంటే.. గుంటూరు నుంచి రాజధానికి వెళ్లేందుకు ప్రధాన రహదారి అమరావతి–గుంటూరు రోడ్డే. అయితే, ఈ మార్గంలో లాం వద్ద కొండవీటి వాగు ఏటా ఉప్పొంగి ప్రవహిస్తుంది. ఇక్కడ వంతెన నిర్మాణం హామీ ఇప్పటివరకు ఆచరణకు నోచుకోలేదు. » మరో మార్గం.. జాతీయ రహదారి మీదుగా కంతేరు–తాడికొండ మధ్యలో ఎర్రవాగు వద్ద కూడా వరద పొంగి ప్రవహిస్తుంది. ఇక్కడ కూడా వంతెన నిర్మాణం చేయాల్సి ఉంది. ఆ దిశగా కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. » మంగళగిరి మీదుగా రాజధానికి ప్రవేశించాలన్నా నీరుకొండ–పెదపరిమి రహదారి వద్ద భారీ వర్షం కురిస్తే వారం పాటు రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఐనవోలు మీదుగా కూడా రహదారి పూర్తిగా దిగ్బంధం అవుతుంది. » ఒక్క చంద్రబాబు నివాసం మీదుగా వచ్చే కరకట్ట రహదారి మినహా రాజధానికి రావాలంటే ఏ ఒక్క రోడ్డు అందుబాటులో లేకపోవడంతో రాష్ట్ర సచివాలయానికి ఉద్యోగులు వెళ్లలేక నానా ఇబ్బందులు పడ్డారు. -
కృష్ణవేణి.. ఉగ్రరూపిణి
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు తోడు ఉప నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. ప్రకాశం బ్యారేజీలోకి బుధవారం రాత్రి 9 గంటలకు వరద 3,97,250 క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండగా.. అంతే పరిమాణంలో 70 గేట్ల ద్వారా అధికారులు సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువ నుంచి గురువారం ఉదయానికి ప్రకాశం బ్యారేజీలోకి వచ్చే వరద ప్రవాహం 4 నుంచి 4.50 లక్షల క్యూసెక్కులకు చేరుతుందని అంచనా. ఈ నేపథ్యంలో.. కృష్ణా నదీ తీర ప్రాంతంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మూడ్రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా, ప్రధాన ఉప నది తుంగభద్ర పరవళ్లు తొక్కుతున్నాయి. బుడమేరు పరీవాహక ప్రాంతంలో కూడా విస్తారంగా వర్షాలు కురవడంతో బుధవారం రాత్రికి 10–15 వేల క్యూసెక్కుల వరద వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మున్నేరు, కొండవీటి వాగు తదితర వాగుల ద్వారా ప్రకాశం బ్యారేజీలోకి భారీగా వరద వస్తోంది. విజయవాడలో పలు ప్రాంతాలు జలమయం భారీ వర్షాలకు విజయవాడతోపాటు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో డ్రెయిన్లు పొంగడంతో రోడ్ల మీద 4 అడుగుల మేర నీరు నిలిచింది. వందల సంఖ్యలో ఇళ్లలోకి నీరుచేరింది. బుడమేరు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. హంసలదీవి వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది. పమిడిముక్కల మండలం ఐనంపూడిలో పిడుగుపడి పశువులపాక దగ్ధం కావటంతో రెండు గేదెలు, ఒక ఎద్దు మృతిచెందాయి. కాజ టోల్‌గేటు వద్ద నిలిచిన ట్రాఫిక్ మంగళగిరి నగర పరిధిలోని కాజ టోల్‌గేటు వద్ద జాతీయ రహదారిపై భారీగా నీరు నిలిచిపోవడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. టోల్‌ప్లాజా వద్ద మూడడుగుల నీరు ఉండడంతో గుంటూరు నుంచి విజయవాడ వైపు పలు లైన్లలో రాకపోకలు నిలిపివేశారు. మంగళగిరి టిడ్కో గృహ సముదాయంలో నీరు నిలిచిపోయింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని వివిధ గ్రామాల్లో ప్రధాన రహదారులపై వాగులు పొంగి పొర్లడంతో రాకపోకలు నిలిపోయాయి. గుంటూరు రోడ్లు, డ్రెయిన్లు, మార్కెట్లు, జలమయమయ్యాయి. పిడుగురాళ్ల మండలం జూలకల్లు, గుత్తికొండ, దాచేపల్లి, కారంపూడి మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. అక్కడక్కడ బ్రిడ్జిలు, చప్టాలు కూలిపోయాయి. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండల పరిధిలోని దొంగలవాగు ఉధృతంగా ప్రవహించటంతో కర్నూలు రహదారిలో కొత్తూరు వద్ద ఉన్న వెలుగొండ ప్రాజెక్టు సొరంగ నిర్మాణ ప్రాంతం వద్ద బుధవారం ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ‘పశ్చిమ’లోనూ భారీ వర్షం పశి్చమ గోదావరి జిల్లా భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పెనుగొండ, ఉండి నియోజకవర్గాల్లో కుండపోత వర్షంతో పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్ర«దాన రహదారులపై సైతం వర్షం నీరు నిలిచిపోవడంతో వాహన చోదకులు ఇక్కట్లకు గురయ్యారు. ఏలూరు జిల్లాలోనూ కుండపోత వర్షం కురిసింది. కాకినాడ, జిల్లాలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రహదారులు కనిపించని విధంగా జలమయమయ్యాయి. మూడు జిల్లాల్లో పంటలకు నష్టం వర్షాల వల్ల ఖరీఫ్ పంటలు నీటమునుగుతున్నాయి. గుంటూరు, ఎన్టీఆర్, బాపట్ల జిల్లాల్లో పంటలు ముంపునకు గురయ్యాయి. ప్రాథమిక అంచనా ప్రకారం.. ఈ మూడు జిల్లాల పరిధిలో 161 గ్రామాల్లో 1.12 లక్షల ఎకరాల్లోని పంటలు ముంపుబారిన పడ్డాయి. 52,924 మంది రైతులకు చెందిన పంటలు దెబ్బతిన్నాయి. అత్యధికంగా 1.02 లక్షల ఎకరాల్లో వరి, 8,550 ఎకరాల్లో పత్తి, వెయ్యి ఎకరాల్లో మినుము, 300 ఎకరాల్లో వేరుశనగ పంటలు ముంపునకు గురయ్యాయి. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోనూ వందల ఎకరాల్లో వరి పైర్లు నేలకొరిగాయి. ఉమ్మడి గోదావరి జిల్లాల్లోనూ అక్కడక్కడ వరి పంటలు నీట మునిగాయి. కర్నూలు జిల్లాలో పత్తి, ఉల్లి, మొక్కజొన్న, కంది, టమాట పంటలు నీటమునిగి కుళ్లిపోతుండడంతో రైతులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. నంద్యాల జిల్లాలోనూ వరి పైరు నీట మునిగింది. మినుము, మొక్కజొన్న పంటలకు తీవ్రనష్టం వాటిల్లుతోంది. అప్రమత్తంగా ఉండండి: సీఎంరాష్ట్రంలో వచ్చే రెండు, మూడ్రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. కృష్ణా పరివాహక ప్రాంతంలో వాగులు, వంకల నుంచి వచ్చే ఆకస్మిక వరద ప్రవాహాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ దిగువ ప్రాంతాలకు సమాచారం ఇవ్వాలని సూచించారు.సీఎం చంద్రబాబు బుధవారం తన క్యాంపు కార్యాలయంలో మంత్రులు, అధికారులతో రాష్ట్రంలో వర్షాల పరిస్థితిపై సమీక్షించారు. ప్రకాశం బ్యారేజీకి దిగువ ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేయాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. జిల్లాల్లో వర్షాల పరిస్థితిపై కలెక్టర్లు ఎప్పటికప్పుడు రైతులకు సమాచారం ఇవ్వాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీటిని తొలగించాలని చెప్పారు. బెజవాడలో ముగ్గురు దుర్మరణం భారీ వర్షాలకు విజయవాడలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. పాతబస్తీ గులాం మొహిద్దీన్ వీధిలో భూగర్భ డ్రైనేజీ మరమ్మతుల నిమిత్తం నగరపాలక సంస్థ సిబ్బంది తీసిన గోతిలోపడి కృష్ణా జిల్లా హోల్‌సేల్ డ్రగ్ ట్రేడ్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు టీవీ మధుసూదనరావు మరణించాడు. మరో ఘటనలో.. పాతబస్తీ సుబ్బరామయ్య వీధిలోని జెండా చెట్టు వద్ద ప్రధాన అవుట్‌ఫాల్ డ్రెయిన్ సమీపంలో ముర్తుజా అనే వ్యక్తి వర్షపు నీటిలో పడి కొట్టుకుపోయాడు. లయోలా కాలేజీ సమీపంలో చెట్టు పడటంతో ఓ వ్యక్తిపై ప్రాణాలు విడిచాడు. కాగా.. కృష్ణా నదిలో తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెం వద్ద ఇసుకను తోడే బుల్డోజర్ స్థానం మార్చేందుకు దిగిన కామేశ్వరరావు (19), వీర ఉపేంద్ర (22) గల్లంతు కాగా.. మరో యువకుడు సురక్షితంగా బయటపడ్డాడు. -
వరంగల్‌ను ముంచెత్తిన వరద
సాక్షి, వరంగల్/ఖమ్మం/నల్లగొండ నెట్వర్క్: వరంగల్ నగరాన్ని వరద ముంచెత్తింది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు వాన దంచికొట్టింది. పలు కాలనీలు జలమయమయ్యాయి. వరంగల్ రైల్వేస్టేషన్లో ఉన్న మూడు పట్టా లైన్లు నీట మునిగి రైళ్ల రాకపోకలకు కొంతసేపు అంతరాయం కలిగింది. రైల్వే సిబ్బంది నీటిని బయటకు పంపడంతో రైళ్ల రాకపోకలు సాగాయి. హంటర్ బ్రిడ్జ్ రోడ్డులోకి భారీగా వరద నీరు చేరడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాశీకుంట వాంబేకాలనీలోని ఇంట్లోకి నీరు వచ్చి మంచం మునగడంతో దానిపై పడుకున్న వృద్ధురాలు పసునూటి బుచ్చమ్మ చనిపోయింది. కొన్ని ప్రాంతాల్లో వరద నీటిలో చిక్కుకున్న వారిని పోలీసులు రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఖిలా వరంగల్ కోట నీటిలో మునిగింది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం నారాయణపురం గ్రామంలో గేదెలను బయటకు తోలేందుకు ఆకేరు వాగులో దిగిన పశువుల కాపరి కందికగ్ల ఉప్పలయ్య వరదనీటిలో గల్లంతయ్యారు. ∙గొల్లబుద్దారం ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలకు వరద ప్రవా హం ఒక్కసారిగా పెరిగిపోవడంతో పాఠశాల ప్రాంగణం ఒక చిన్న చెరువును తలపించింది. దాదాపు 400 మంది విద్యార్థులు పాఠశాల లోపలే చిక్కుకుపోయి విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఖమ్మం జిల్లాలో....ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. పాలేరు రిజర్వాయర్ సామర్థ్యం 23 అడుగులు కాగా 23.15 అడుగులు, వైరా రిజర్వాయర్ 18.03 అడుగులకుగాను 18.08 అడుగుల మేర ప్రవాహంతో పోటెత్తుతున్నాయి. ఇక తిరుమలాయపాలెం మండలం రాకాసితండాను గతేడాది ఆ కేరు వరద ముంచెత్తగా ఈసారి మంగళవారం సాయంత్రాని కి ఆకేరు వరద పెరిగి సీతారామ ఆక్వాటెక్ట్కు తాకి ప్రవహి స్తుండడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.ఉమ్మడి నల్లగొండ జిల్లాలో....ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. తిరుమలగిరి మండలంలోని తొండ గ్రామం వద్ద వలిగొండ– తొర్రూరు ప్రధాన రహదారిపై బ్రిడ్జి పనులు సాగుతుండగా, తాత్కాలికంగా మట్టి రోడ్డు వేశారు. వరద నీరు దిగువకు వెళ్లక అక్కడే చేరి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. వెలిశాలలో ఎస్ఆర్ఎస్పీ కాల్వ లైనింగ్ దెబ్బతిన్నది. భూదాన్‌పోచంపల్లి మండలం జూలూరు, రుద్రవెల్లి గ్రామాల మధ్య గల లోలెవల్ బ్రిడ్జి పై నుంచి మూసీనది ఉధృతి కొనసాగింది. దీంతో పోచంపల్లి నుంచి బీబీనగర్‌కు రాకపోకలు నిలిచిపోయాయి.సంగారెడ్డి జిల్లాలో....రాయికోడ్(అందోల్): సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం యూసుఫ్పూర్ గ్రామానికి చెందిన ఎం. శ్రీనివాస్(35) మంగళవారం రాయికోడ్ నుంచి స్వగ్రామానికి పయనమ య్యాడు. గ్రామ సమీపానికి చేరుకోగానే వాగులో వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. శ్రీనివాస్ వరద నీటిలో నుంచి గ్రామం వైపు దాటేందుకు ప్రయత్నించాడు. వరద ఉధృతికి ఒక్కసారిగా వరద నీటిలో కొట్టుకుపోయి మరణించాడు. నీళ్లు నిలిచి.. ఒండ్రు చేరి..సంగారెడ్డి జిల్లాలో పత్తి చేలన్నీ నీట మునిగాయి. కొన్ని చోట్ల మొక్కలు ఎర్రగా, మరికొన్నిచోట్ల నల్లగా మారి మురిగిపోయాయి. భారీ వర్షం పడినప్పుడు పొలాల్లో నీళ్లు పారుతుండటంతో ఒండ్రుమట్టి వచ్చి చేరుతోంది. -
కృష్ణాకు పోటెత్తుతున్న వరద
నాగార్జునసాగర్/దోమలపెంట/నల్లగొండ: ఎగువ నుంచి కృష్ణానదికి వరద పోటెత్తుతోంది. మంగళవారం జూరాల, సుంకేశుల నుంచి 1,57,373 క్యూసెక్కుల నీటి ప్రవాహం శ్రీశైలం ప్రాజెక్టుకు వస్తోంది. దీంతో విద్యుదుత్పత్తి, ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తి 1,74,608 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 883 అడుగుల నీటిమట్టం వద్ద 204 టీఎంసీల నిల్వ ఉంది. శ్రీశైలం జలాశయం నుంచి వస్తున్న వరదకు తోడు, స్థానికంగా కురిసే వర్షాలతో సాగర్ జలాశయానికి 1,86,258 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. సాగర్ జలాశయ గరిష్ట నీటిమట్టం 590 అడుగులు (312,0450టీఎంసీలు)కాగా.. ప్రస్తుతం 589.50 అడుగులు (310.5510టీఎంసీలుగా) ఉంది. సాగర్ జలాశయం 18 గేట్లు 5 అడుగులు ఎత్తి 1,44,864 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నిండుకుండలా ఉదయ సముద్రం పానగల్లు ఉదయసముద్రం చెరువు నిండుకుండలా ఉంది. ఈ రిజర్వాయర్‌కు ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోత ల ప్రాజెక్టు కాలువ ద్వారా నీరు వస్తోంది. ఈ చెరువు నుంచి పలు గ్రామాలకు తాగునీరు అందుతోంది. -
వరదను కట్టడి చేద్దాం.. 'ట్రంక్ లైన్' గీద్దాం
సాక్షి, హైదరాబాద్/అమీర్‌పేట: భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న హైదరాబాద్‌లోని అమీర్‌పేట, ఎస్సార్‌నగర్‌ల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం ఆకస్మికంగా పర్యటించారు. ఆయా ప్రాంతాలను వరద, ముంపు ముప్పు నుంచి తప్పించడానికి ప్రత్యేకంగా ట్రంక్ లైన్ ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించారు. ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. బౌద్ధనగర్, గంగుబాయి బస్తీ, రిలయన్స్ లైన్లలో ఉన్న డ్రైనేజీ నాలాలను పరిశీలించారు. మైత్రి వనం వద్ద నీరు నిలిచిపోవడానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఎస్ఆర్ నగర్ నుంచి బౌద్ధనగర్ వరకు ఉన్న మురుగునీటి కాలువను చూసిన ఆయన ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాలనీ రోడ్డు కంటే డ్రైనేజీ ఎక్కువ ఎత్తులో ఉండటంపై ఆరా తీశారు. ఈ కారణంగానే రోడ్డు ఇరుకుగా మారడంతో పాటు వరద బౌద్ధనగర్ను ముంచుతోందని గుర్తించారు. తక్షణమే డ్రైనేజీ వ్యవస్థ మార్పు చేర్పులపై జీహెచ్ఎంసీ అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. కాగా గంగూబాయి కుంట ప్రాంతంలో 25 ఏళ్ల క్రితం చెరువు ఉండేదని, అక్కడ బతుకమ్మ ఆడేవారమని స్థానికులు ముఖ్యమంత్రికి వివరించారు. ఆ కుంటను కొంతమంది పూడ్చేసి ప్రైమ్ ఆసుపత్రికి వచ్చే వాహనాల పార్కింగ్ కోసం వినియోగిస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి ఆ కుంట పూర్వాపరాలను పరిశీలించి చర్యలు చేపట్టాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు సూచించారు. బాలుడి భుజంపై చేయి వేసి నడుస్తూ.. బౌద్ధనగర్‌లో పర్యటించిన సీఎం రేవంత్‌రెడ్డికి ఏడో తరగతి బాలుడు జశ్వంత్ వరద సమస్యను వివరించాడు. బస్తీలో మహిళలతో కలిసి నిలబడి ఉన్న జశ్వంత్‌ను పిలిచిన రేవంత్‌రెడ్డి వరద పరిస్థితిపై ఆరా తీశారు. ఆ బాలుడి భుజంపై చేయి వేసి కాలనీలో నడుచుకుంటూ వివరాలను తెలుసుకున్నారు. తాను ఏడో తరగతి చదువుతున్నానని, వర్షాకాలంలో చదువులకు దూరం అవుతున్నానని బాలుడు సీఎంకు తెలిపాడు. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వరద నీరు ఇంట్లోకి వచ్చి పుస్తకాలు తడిసిపోయాయని చెప్పాడు. దీంతో భవిష్యత్తులో వరద పరిస్థితులు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపిస్తామని బాలుడికి సీఎం హామీ ఇచ్చారు. మరోవైపు వరద నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని అమీర్‌పేట కార్పొరేటర్ కేతినేని సరళ.. సీఎంను కోరారు. స్థానిక డ్రైనేజీ వ్యవస్థ వివరాలను ఆమె వెల్లడించారు. ఎర్రగడ్డ, యూసుఫ్‌గూడ ప్రాంతం నుంచి వరద నీరు పెద్ద ఎత్తున వస్తోందని, లెవలింగ్ సరిగా లేకపోవడంతో వరద నీరు నాలాల్లోకి వెళ్లక కొన్ని బస్తీలు ముంపునకు గురవుతున్నాయని వివరించారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, జీహెచ్ఎంసీ, జల మండలి అధికారులు సీఎం వెంట ఉన్నారు. ట్రంక్ లైన్ అంటే ఏమిటి? హైదరాబాద్ మహానగర మురుగునీటి వ్యవస్థలో సుమారు 612 కిలోమీటర్ల మేర ప్రధాన సీవరేజీ ట్రంక్ లైన్ ఉండగా వాటికి అనుబంధంగా సుమారు 9,769 కిలోమీటర్ల వరకు మురుగు నీటి పైప్‌లైన్ విస్తరించి ఉంది. ఈ మొత్తం వ్యవస్థలో ట్రంక్ లైన్ కీలకం. చిన్న చిన్న పైపుల ద్వారా వచ్చే మురుగునీటిని భారీ పైపుల్లోకి మళ్ళించి వ్యర్థ జలాల శుద్ధి కేంద్రానికి లేదా మురుగు నీటిని వదిలే ప్రదేశానికి పంపించడాన్ని ట్రంక్ లైన్ వ్యవస్ధగా పిలుస్తున్నారు. ట్రంక్ లైన్లు సాధారణంగా పెద్ద వ్యాసం (600 డయా (2.5 మీటర్లు)తో కూడిన పైపులను కలిగి ఉంటాయి. పెద్ద మొత్తంలో మురుగునీటిని ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి తరలించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మంచిగా చదువుకో అన్నారు..! జస్వంత్‌తో కలిసి కాలనీలో తిరుగుతున్న సీఎం రేవంత్ మా కాలనీలో నన్ను చూసిన ముఖ్యమంత్రి..‘బాబు ఇక్కడ రా’ అని పిలిచారు. ‘నిన్న మీ ఇంటి దగ్గరకు వాటర్ వచ్చాయి కదా? ఎంత వచ్చాయి?’ అని అడిగారు. నేను మునిగిపోయేంత వచ్చాయని చెప్పా. మీకు ఇంటికి ఏమైనా మరమ్మతులు కావాలా? అని అడిగితే..అవును సార్..గేట్లు పెట్టియ్యాలె సార్ అని అన్నా. పెట్టిస్తానన్న సీఎం..పుస్తకాలు తడిచాయా? అంటూ ఆరా తీశారు. ‘మంచిగా చదువుకో.. మళ్లీ వాటర్ వస్తే నాకు ఫిర్యాదు చెయ్యి కవర్ చేసేస్తా..’ అని హామీ ఇచ్చారు. – జశ్వంత్, ఏడో తరగతి విద్యార్థి, బౌద్ధనగర్ -
ఉత్తరకాశీ ఉపద్రవం.. పాండవుల శివాలయం మాయం!
నిజానికి ధరాలి ఎప్పుడూ పేరొందిన పర్యాటక ప్రదేశం కాదు. అయితే అటువైపుగా రాకపోకలు సాగించే యాత్రికులకు మాత్రం బాగానే తెలుసు. గౌముఖ్–తపోవన్ లేదా లామా టాప్కు వెళ్లే మార్గంలో ట్రెక్కర్లు దాని గుండానే వెళతారు. అయితే ఇప్పుడు ధరాలి అనే పేరు దేశమంతా మారుమోగడానికి ఓ దురదృష్టకర ఉపద్రవం కారణమైంది.అప్పుడెప్పుడో 19వ శతాబ్దం మధ్యలో, ఉత్తరకాశీకి సమీపంలోని హర్సిల్‌లో స్థిరపడిన బ్రిటిషర్ ఫ్రెడరిక్ ‘‘పహాడి’’ విల్సన్, ఆపిల్ తోటలు ఎర్ర రాజ్మా వ్యాపారాన్ని ఈ ప్రాంతానికి పరిచయం చేశాడు. అది స్థానిక ఆర్థిక వ్యవస్థను సమూలంగా మార్చింది. అలా నేడు, ధరాలి ఆపిల్ పండ్లు ఉత్తర భారతదేశం అంతటా సరఫరా అవుతున్నాయి. కానీ గత వారం, ఈ తోటలను పోషించిన టెర్రస్‌లు విరిగిపోయాయి. వాటి రవాణాకు వాడిన ఫుట్‌బ్రిడ్జిలు మాయమయ్యాయి. అనేక అందమైన ఇళ్లు అర్ధభాగాలే మిగిలాయి. కుటుంబాలు తమ భూమి అడవిలో కలిసిపోవడాన్ని కన్నీళ్లతో చూశాయి. హర్సిల్ నుంచి కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉత్తరాఖండ్ కొండలలోని ప్రశాంతమైన పర్వత గ్రామాన్ని ఖీర్ గడ్ నది అకస్మాత్తుగా ఉప్పొంగి ముంచేసింది. ఇళ్ళు, తోటలు సహా మరెన్నో జ్ఞాపకాలను తుడిచేసింది. అందులో కల్ప కేదార్ ఆలయం కూడా ఉంది. దీనిని పాండవులు నిర్మించారని స్థల పురాణం చెబుతోంది. కాలభైరవుని ముఖంతో చెక్కబడిన ఈ నిర్మాణం, 1900ల ప్రారంభంలో ఈ మందిరాన్ని హిమనీ నదుల మార్పు పూడ్చిపెట్టింది. అయినప్పటికీ కల్ప కేదార్ ఆలయ గోపురం స్పష్టంగా కనిపించేది తాజా వరదతో ఆ గోపురం కూడా అదృశ్యమైంది. ఇది ఆ ప్రాంత వాసుల్ని కలచివేసింది. ధరాలి మాజీ గ్రామ ప్రధాన్ మనోజ్ రాణా మాట్లాడుతూ ‘ఇది కేవలం వరద కాదు. ఇది మా గ్రామ హృదయాన్ని చీల్చేసింది’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.#WATCH | Uttarkashi, Uttarakhand | A lake has been formed in Harsil following the flash floods due to the cloudburst that occurred on August 5 pic.twitter.com/xjardbbKzd— ANI (@ANI) August 9, 2025స్థానికులకు, కల్ప కేదార్ కేవలం ఒక శిల కాదు. ఇది దైవిక రహస్యాన్ని కలిగి ఉంది. ఈ ఆలయం వెలికితీత కోసం 1980లలో అనేక ప్రయత్నాలు చేసినా భూమి నీటి పొరల క్రింద తరతరాలుగా దాగి ఉన్న శివలింగం పూర్తిగా వెలుగు చూడలేదు. పురాణాల ప్రకారం, శివుడు పాండవుల పాపాలను వదిలించుకోవడానికి నిరాకరించి హిమాలయాలలో చెల్లాచెదురుగా విస్తరించాడు. అందుకే కేదార్నాథ్ లాగానే కల్ప కేదార్ కూడా ఆ శకలాలలో ఒకటిగా భావిస్తారు.Kheer Gad river surged and tore thru village Dharali. Flash flood buried what little remained of its oldest monument: Kalp Kedar temple, that's a shrine dedicated to Shiva/Kalbhairava.Bhim Shila boulder stopped Kedarnath's destruction in 2013. Dharali is near-demolished in 2025. pic.twitter.com/DZF7V0RzBR— Souvik Mukherjee (@svmke1) August 8, 2025ధరాలి అధికారికంగా పంచ కేదార్ తీర్థ మార్గంలో లేకపోయినా, గ్రామస్తులు కల్ప కేదార్‌ను వాటితో ఆధ్యాత్మికంగా ముడిపడి ఉందని విశ్వసిస్తారు. ‘కల్ప కేదార్ ఈ ప్రాంతానికి అపారమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. దీనిని ఆది శంకరాచార్య పునరుద్ధరించారు. శివుని పురాతన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా పూజించారు’ అని చార్ ధామ్ తీర్థ పురోహిత్ మహాపంచాయతీ ప్రధాన కార్యదర్శి బ్రిజేష్ సతి వివరిస్తారు. కనపడినంత మేరకు మాత్రమే భక్తి శ్రద్ధలతో తాము కొలుస్తున్న దైవం.. ఇప్పుడు లేశ మాత్రం కూడా కనపడకుండా మాయం అవడం ధరాలి గ్రామవాసుల ఆవేదనను అంతులేకుండా చేస్తోంది. అయితే గతంలోనూ ఇలాంటి ప్రకృతి ఉత్పాతాలు ఆలయాన్ని ముంచేసినా, మళ్లీ తిరిగి కల్పకేదార్ ఎప్పటిలా వెలుగులోకి వచ్చి పూజలు అందుకుందని ఈసారి కూడా అదే జరుగుతుందని నమ్మతున్న గ్రామస్తులూ పెద్ద సంఖ్యలోనే ఉన్నారు.Kalp Kedar temples at Dharali, Uttarakhandc Oct 20, 1865 pic.twitter.com/HrmR9WxiN6— Christopher (@gazwa_e_bhindi) June 15, 2025 -
ఉరిమిన వరుణుడు
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరాన్ని మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. శనివారం రాత్రి 8:30 గంటల నుంచి సుమారు రెండు గంటలపాటు ఏకధాటిగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం దంచికొట్టింది. దీంతో ప్రధాన రహదారులన్నీ చెరువులను తలపించగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఫలితంగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించింది. పలు అపార్ట్మెంట్లలోకి వరదనీరు వచ్చి చేరింది. ముఖ్యంగా నగర శివారు ప్రాంతాలు వర్ష బీభత్సానికి వణికిపోయాయి. రాత్రి 11 గంటల వరకు నగర శివారులోని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తొర్రూర్ గ్రామ పంచాయతీ పరిధిలో అత్యధికంగా 13.5 సెం.మీ. వర్షం కురిసింది. హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, వనస్థలిపురం, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షానికి హైదరాబాద్–విజయవాడ హైవేపై పెద్దఅంబర్‌పేట్ వద్ద రోడ్డుపై భారీగా ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. ఫలితంగా వాహనదారులు, ఊళ్లకు పయనమైన ప్రయాణికులు నరకయాతన అనుభవించారు. మరోవైపు నగరంలోని ప్రధాన ప్రాంతాలైన బేగంబజార్, ఖైరతాబాద్, హిమాయత్‌నగర్, శ్రీనగర్ కాలనీ తదితర ప్రాంతాల్లోనూ భారీ వర్షానికి వాహనదారులు ఇక్కట్లు పడ్డారు. ప్రధాన రహదారులపై నీళ్లు నిలిచిన చోట్ల హైడ్రా అధికారులు మోటార్లతో వరద నీటిని తోడారు. ట్రాఫిక్ పోలీసులు సైతం ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు శ్రమించారు. కాగా, ఈ నెల 15 వరకు నగరంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. -
ప్రతీ వరద నీటి బొట్టు మూసీలోకి చేరేలా ప్రణాళిక సిద్ధం చేయండి: సీఎం రేవంత్
హైదరాబాద్: నగరంలో వర్షాలతో తలెత్తే ఇబ్బందులకు, వరర సమస్య పరిష్కారంపై ఈరోజు(శుక్రవారం, ఆగస్టు 8వ తేదీ) సీఎం రేవంత్‌రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇందుకు సంబంధించిన అన్ని విభాగాల అధికారుల అభిప్రాయాలను సీఎం రేవంత్ తీసుకున్నారు. నిన్న (గురువారం, ఆగస్టు 7వ తేదీ) రాత్ర కురిసిన వర్షానికి హైదరాబాద్ నగరం అతలాకుతలమైన పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వరదనీటి ప్రవాహానికి అడ్డంకులు ఉండటమే నగరంలో ఈ దుస్థితి తలెత్తుతోందన్న అధికారులు స్పష్టం చేశారు.దీనిలో భాగంగా అధికారులకు పలు సూచనలు చేశారు సీఎం రేవంత్.. ‘ ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్ లోని వరదనీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలి. హైదరాబాద్ నగరంలోని వరదనీరు మూసీని చేరేలా ప్రణాళికలు సిద్ధం చేయండి. ప్రతీ చెరువు, నాలాలు, ఇతర కాలువలను మూసీకి అనుసంధానం చేయండి. చెరువులను పునరుద్ధరణ, నాలాలను వెడల్పు ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయండి. ఎక్కడ వర్షం పడినా నీరు చెరువుల్లోకి, నాలాల్లోకి, అటునుంచి మూసీలోకి చేరేలా చర్యలు చేపట్టండి. భవిష్యత్ లో నగరంలో ఇలాంటి సమస్య పునరావృతం కాకుండా ఉండాలంటే మూసీ పునరుజ్జీవనం అవసరం. మూసీ పునరుజ్జీవనమే వరద సమస్యకు శాశ్వత పరిష్కారమని ఆ దిశగా ప్రణాళికలు రూపొందించండి. మూసీ పునరుజ్జీవనంతో వర్షాకాలంలో నీటి ప్రవాహం, ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టొచ్చు. ఆ దిశగా హైదరాబాద్ నగర అభివృద్ధికి ప్రణాళికలు సిద్దం చేయండి’ అని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. -
కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్‌లో కాలనీలు అతలాకుతలం
-
వర్షాలు, వరదలపై అప్రమత్తంగా ఉండండి
సాక్షి, హైదరాబాద్: వర్షాలు, వరదలతో ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, ప్రజలు, రైతులకు ఎలాంటి సాయమైనా అందించేందుకు అందుబాటులో ఉండాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై రెండు రోజులపాటు ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి.. హైదరాబాద్‌లో గురువారం భారీగా కురిసిన వర్షాలపై ఉన్నతాధికారులను అప్రమత్తం చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ జితేందర్‌తో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్, హైడ్రా కమిషనర్, విద్యుత్ విభాగం అధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు. విపత్తు నిర్వహణ బృందాలను సంసిద్ధంగా ఉంచాలని సూచించారు. కాగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి సీఎస్ గురువారం సాయంత్రం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. -
హిమాచల్‌లో భారీ వరదలు
షిమ్లా: ఉత్తరాఖండ్‌తోపాటు పొరుగున ఉన్న హిమాచల్‌ప్రదేశ్‌నూ వరదలు ముంచెత్తి యాత్రికులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. తాజాగా హిమాచల్‌లోని కినౌర్ కైలాస్ యాత్రా మార్గంలో కుండపోత వానల కారణంగా ట్రెక్కింగ్ మార్గాల్లో వందలాది మంది యాత్రికులు చిక్కుకుపోయారు. వెంటనే విషయం తెల్సుకున్న ఇండో టిబెటన్ బోర్డర్‌పోలీస్(ఐటీబీపీ), జాతీయ విపత్తు స్పందన(ఎన్డీఆర్ఎఫ్) బలగాలు హుటాహుటిన రంగంలోకి దికి 413 మంది యాత్రికులను కాపాడాయి. పర్వతసానువుల గుండా వర్షపు నీటి ప్రవాహం భీకరంగా దూసుకొస్తోంది. దీంతో ట్రెక్కింగ్ మార్గమధ్యంలోని తాత్కాలిక తాంగ్లిప్పి, కాంగరాంగ్ వంతెనలు ప్రవాహ ఉధృతికి కొట్టుకుపోవడంతో యాత్రికులు అక్కడ చిక్కుకుపోయారు. ట్రెక్కింగ్ మార్గం యాత్రకు అనువుగా లేకపోవడంతో కినౌర్ కైలాస్‌యాత్రను తాత్కాలికంగా నిలుపుదలచేస్తున్నట్లు కినౌర్ జిల్లా యంత్రాంగం బుధవారం ప్రకటించింది. టెక్కింగ్ చేస్తూ వెళ్లాల్సిన చాలా చోట్ల బురదపేరుకుపోయి జారే ప్రమాదం పెరిగింది. మిల్లింగ్ ఖాటా, గుఫా ప్రాంతాల్లో కొందరు యాత్రికులు సేదతీరుతున్నారు. వాళ్లకు కనీస సదుపాయాలను ఆర్మీ కల్పిస్తోంది. సముద్ర మట్టానికి 19,850 అడుగుల ఎత్తులో ఉండే కినౌర్ కైలాస్ ప్రాంతాన్ని శివునికి శీతాకాల విడిదిగా చెబుతారు. జూలై 15న ప్రారంభమైన ఈ యాత్ర ఈనెల 30వ తేదీన ముగుస్తుంది. కినౌర్ జిల్లాతోపాటు హిమాచల్‌లోని చాలా ప్రాంతాలు బుధవారం భారీ వర్షాలు కురిశాయి. దీంతో నాలుగు జాతీయరహదారులు సహా 617 రోడ్లను మూసేశారు. విద్యాసంస్థలకు ఒకరోజు సెలవు ప్రకటించారు. -
ఉత్తరాఖండ్ వరదలపై YS జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి
-
ఉత్తరాఖండ్‌లో జల ప్రళయం.. ప్రకృతి విధ్వంసం ఎలా ఉందో చూశారా (ఫొటోలు)
-
‘మీరంతా స్వర్గానికే’.. వరద బాధితులతో మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
లక్నో: అనూహ్యంగా సంభవించే వరదల కారణంగా ప్రజలు సర్వస్వం కోల్పోతుంటారు. తాజాగా, అలా సర్వం కోల్పోయిన వరద బాధితుల్ని పరామర్శించేందుకు వచ్చిన ఓ మంత్రి చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. ఉత్తరప్రదేశ్‌ను వరదలు ముంచెత్తాయి. రాష్ట్రంలో మొత్తం 402 గ్రామాలు నీట మునిగాయి. ఈ క్రమంలో కాన్పూర్ దెహాత్ జిల్లాలో వరద బాధితుల్ని మంత్రి సంజయ్ నిషాద్ పరామర్శించారు. ఓ ప్రాంతానికి వెళ్లిన ఆయనకు వరద బాధితులు తమ బాధల్ని చెప్పుకున్నారు. వరదల కారణంగా తాము కట్టు బట్టలతో సహా అన్నీ కోల్పోయామని వాపోయారు.అయితే అందుకు మంత్రి సంజయ్ నిషాద్ స్పందించిన తీరు వివాదాస్పదంగా మారింది. ‘గంగమ్మతల్లి తన బిడ్డల పాదాలు కడగడానికి వస్తుంది. ఆ దర్శనంతో వారు స్వర్గానికి వెళతారు. విపక్షాలు మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి’ అని అన్నారు.ఈ వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. వరద బాధితులు మంత్రి వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేశారు. సదరు మంత్రి వరద బాధితుల్ని పరామర్శించేందుకు ఏ ప్రాంతానికి వచ్చామనే సోయిలేకుండా పోయిందని మండిపడుతున్నారు. ఎందుకంటే ఆయన సందర్శించిన గ్రామాలు గంగా నది వద్ద కాకుండా యమునా నది ఒడ్డున ఉన్నాయని చెబుతూ విస్తుపోతున్నారు. కాగా రాష్ట్రంలో 402 గ్రామాలకు వరద ముంపుకు గురయ్యారు. గంగా, యమునా వంటి ప్రధాన నదులు ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. దీంతో నదుల పరివాహక ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కు మంటూ గడుపుతున్నారు. कानपुर देहात------वाह मंत्री जी गजब तरीका निकालेव हो भोले भाले ग्रामीणों को चुप कराने का,,,,बाढ़ ने गांवों में इस कदर तबाही मचाई है गांव वालो चैन सुकून सब खत्म हो गया तो माननीय जी कह रहे ""गंगा मैया गंगा पुत्रो का पैर धुलने आती है""आदमी सीधा स्वर्ग जाता""मंत्री जी यहाँ गांव… pic.twitter.com/oqIasyyikX— राम दीक्षित/Ram Dixit (@RamDixi72228341) August 4, 2025 -
విజయవాడ : ప్రకాశం బ్యారేజ్ వద్ద పర్యాటకుల సందడి (ఫొటోలు)
-
కడలి వైపు కృష్ణమ్మ పరుగులు
సాక్షి, అమరావతి/విజయపురిసౌత్/శ్రీశైలం ప్రాజెక్ట్/సాక్షి, నరసరావుపేట: కృష్ణా నదీ పరివాహక ప్రాంతం(బేసిన్)లో ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణమ్మ వరదెత్తింది. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులు నిండుకుండల్లా మారడంతో.. ఆ ప్రాజెక్టుల గేట్లు ఎత్తి వచ్చిన వరదను వచ్చినట్లుగా దిగువకు వదిలేస్తున్నారు. గురువారం సాయంత్రం 6 గంటలకు ప్రకాశం బ్యారేజీలోకి 2,65,909 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. కృష్ణా డెల్టా కాలువలకు 14 వేల క్యూసెక్కులు వదులుతూ మిగులుగా ఉన్న 2,51,909 క్యూసెక్కులను 70 గేట్లు ఎత్తి సముద్రంలోకి వదిలేస్తున్నారు. శుక్రవారం ప్రకాశం బ్యారేజీలోకి సుమారు 3 నుంచి 3.10 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం ఉందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. కృష్ణాకు భారీ వరద వస్తున్న నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీ దిగువన నదీ తీర ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. మహారాష్ట్ర, కర్ణాటకల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణా, ప్రధాన ఉప నది తుంగభద్ర వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల నుంచి కృష్ణ, సుంకేశుల బ్యారేజీ నుంచి తుంగభద్రల ద్వారా శ్రీశైలం ప్రాజెక్టులోకి 3,17,910 క్యూసెక్కులు చేరుతుండగా.. కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 66,079, స్పిల్ వే 8 గేట్లను పది అడుగుల మేర ఎత్తి 2,16,152 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో 882.8 అడుగుల్లో 203.43 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌లోకి 2,82,609 క్యూసెక్కులు చేరుతుండగా.. స్పిల్ వే గేట్ల ద్వారా 2,43,829 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రస్తుతం సాగర్‌లో 585.1 అడుగుల్లో 297.72 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. సాగర్ నుంచి పులిచింతల ప్రాజెక్టులోకి 2,14,653 క్యూసెక్కులు చేరుతుండగా.. గేట్లు ఎత్తి 2,04,904 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రస్తుతం పులిచింతలలో 171.29 అడుగుల్లో 40.21 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఇక మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావం వల్ల ప్రాణహిత, ఇంద్రావతి, శబరి ఉరకలెత్తుతుండటంతో గోదావరిలో వరద స్థిరంగా కొనసాగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీలోకి 4,86,237 క్యూసెక్కులు చేరుతుండగా గోదావరి డెల్టాకు 12,900 క్యూసెక్కులను వదలుతూ మిగులుగా ఉన్న 4,73,337 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. -
చైనాలో గోల్డ్ రష్..!
బీజింగ్: ఒకటీరెండూ కాదు..ఏకంగా 20 కిలోల బంగారం, వెండి నగలు...బంగారం, డబ్బు నిండుగా ఉన్న ఇనుప బీరువా..! చైనాలోని ఓ ఊళ్లో జనం వీటిని సొంతం చేసుకునేందుకు తెగ వెతుకుతున్నారు. కొందరు బురద మట్టిని తవ్వి మరీ చూస్తున్నారు. మరికొందరైతే ఏకంగా మెటల్ డిటెక్టర్లను పట్టుకుని తిరుగుతున్నారు. ఇదంతా నిధీ నిక్షేపాల కోసం మాత్రం కాదు..వరదల్లో కొట్టుకుపోయిన సొత్తు కోసం సాగుతున్న ఎడతెగని అన్వేషణ..! ఏం జరిగిందంటే..జూలై 25వ తేదీన షాంగ్జి ప్రావిన్స్‌లోని వుక్వి కౌంటీలో భారీ వర్షాలతో అనూహ్యంగా వరదలు వచ్చాయి. కొన్ని నిమిషాల వ్యవధిలోనే మీటరు ఎత్తున వరద ఉప్పొంగి పట్టణాన్ని ముంచెత్తింది. ఆ వరద లావోఫెంగ్ జియాంగ్ దుకాణంలోకి కూడా ప్రవేశించింది. అధికార యంత్రాంగం వరద హెచ్చరికలతో ఆ రాత్రంగా జాగారం చేసిన దుకాణం సిబ్బంది, ఉదయం పూట యథా ప్రకారం దుకాణం తెరిచేందుకు ఉద్యుక్తులవుతున్నారు. బంగారం, ఇతర విలువైన సామగ్రిని సురక్షితంగా భద్రపర్చడం మర్చిపోయారు. సరిగ్గా ఆ సమయంలో ఎవరూ ఊహించని విధంగా ఒక్కసారిగా వేగంగా వరద ప్రవాహం దుకాణంలోకి చేరింది. తేరుకునేలోపే నగలున్న ట్రేలు, కాబిన్లను ఊడ్చిపెట్టుకుపోయింది. నగదు, నగలతోపాటు ఒక ఐరన్ సేఫ్ సైతం వరదతో పాటు మాయమైంది. బంగారం గొలుసులు, ఉంగరాలు, గాజులు, బ్రాస్లెట్లు, వజ్రపు ఉంగరాలు, వెండి ఆభరణాలు, పచ్చలు పోయిన వాటిల్లో ఉన్నాయి. ఐరన్ సేఫ్‌లో పెద్ద మొత్తంలో నగదుతోపాటు, కరిగించిన బంగారం, కొత్త బంగారు వస్తువులు ఉన్నాయి. వెరసి దుకాణదారుకు వాటిల్లిన నష్టం మార్కెట్ ధర ప్రకారం రూ.12 కోట్లని అంచనా. ఈ సొత్తు కోసం దుకాణం యజమాని కుటుంబంతోపాటు సిబ్బంది రెండు రోజులుగా కాళ్లకు బలపం కట్టుకుని మరీ ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. పోయిన వాటిలో సుమారు కిలో బంగారు ఆభరణాలు దొరికినట్లు అధికారులు చెబుతున్నారు. వరదల కారణంగా పట్టణంలో కరెంటు సరఫరా నిలిచిపోయింది. దీంతో, సీసీటీవీ ఫుటేజీ వ్యవస్థ దెబ్బతింది. దీనివల్ల వరద సమయంలో దుకాణంలో ఏం జరిగిందో తెలుసుకునేందుకు సరైన ఆధారమంటూ లేకుండా పోయింది. ఎవరైనా ఈ వస్తువులను తీసుకెళ్లారా? లేక వరదలోనే కొట్టుకుపోయాయా అనేది నిర్థారించడం సైతం కష్టంగా మారింది. తమ నగల దుకాణానికి సంబంధించిన విలువైన వస్తువులను ఎవరైనా ఉద్దేశ పూర్వకంగా తీసుకున్నట్లు తెలిస్తే చట్టపరమైన చర్యలకు ఉపక్రమిస్తామని యజమాని హెచ్చరిస్తున్నారు. దుకాణంలోని వస్తువులు వరదల్లో కొట్టుకుపోయినట్లు సమాచారం తెలుసుకున్న స్థానికులు సైతం గాలింపు మొదలుపెట్టారు. వరదలకు కొట్టుకు పోయి న బురద, మట్టిని తవ్వి మరీ చూస్తున్నారు. కొందరు మెటల్ డిటెక్టర్లతోనూ వెదుకుతున్నారు. ఈ గోల్డ్ రష్కు సంబంధించిన వీడియోలు ఆన్లైన్లో ప్రత్యక్షమవుతున్నాయి. అయితే, స్థానికులెవరూ దొరికిన వస్తువులను తమకివ్వలేదని దుకాణం యజమాని చెబుతున్నారు. అలా ఎవరైనా తీసుకుపోయినట్లు తెలిస్తే సమాచారమివ్వాలని స్థానికులను కోరుతున్నారు. తెచ్చిన వారికి ఆ వస్తువు విలువను బట్టి బహుమతులను సైతం ఇస్తామని ఆశచూపుతున్నారు.బీజింగ్‌లో వర్షాలు, వరదల్లో 44 మంది మృతి చైనా రాజధాని బీజింగ్‌ను భారీ వర్షాలు, వరదలు కకావికలం చేశాయి. శనివారం కురిసిన కుండపోత వానలు, వరదల్లో కనీసం 44 మంది చనిపోగా, 9 మంది గల్లంతయ్యారు. గత నాలుగు రోజులుగా బీజింగ్ సహాయక, రక్షణ కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో మరోసారి భీకరంగా వాన కురియడంతో రహదారులు తెగిపోవడంతోపాటు, విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వరద ప్రభావిత ప్రాంతాల్లోని జనాన్ని సురక్షిత ప్రాంతాలకు యంత్రాంగం తరలిస్తోంది. బీజింగ్‌లో ఉత్తరాన ఉన్న పర్వతప్రాంత మియున్, యాంగ్వింగ్ జిల్లాల్లో అత్యధిక నష్టం వాటిల్లిందని అధికార వార్తా సంస్థ జిన్హువా తెలిపింది. -
భారీ వర్షాలతో ఉగ్రరూపం దాల్చుతున్న కృష్ణమ్మ
-
వరద బీభత్సం..చైనా అతలాకుతలం (ఫొటోలు)
-
సాగర్‌కు పెరిగిన వరద
విజయపురిసౌత్, శ్రీశైలం ప్రాజెక్ట్, ఏలూరు, హోళగుంద: ఈ ఏడాది కృష్ణా పరీవాహక ప్రాంతాలైన మహారాష్ట, కర్ణాటకలలో కురిసిన భారీ వర్షాలకు ముందస్తుగానే జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. ఆల్మట్టి నుంచి శ్రీశైలం జలాశయం వరకు గల జలాశయాలు గత వారంలోనే గరిష్ట స్థాయి మట్టాలకు చేరాయి. అదనంగా వచ్చే వరదనంతటినీ శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలానికి 1,98,920 క్యూసెక్కుల మేర వరద పెరగడంతో సోమవారం నాలుగు గేట్లు 10 అడుగుల మేర ఎత్తి 1,08,260 క్యూసెక్కుల వరదనీటిని దిగువకు వదులుతున్నారు.కుడి, ఎడమ విద్యుదుత్పాదన కేంద్రాల ద్వారా 66,896 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయం గరిష్ట స్థాయి నీటిమట్టం 312 టీఎంసీలు కాగా, వరద పోటెత్తడంతో ప్రస్తుతం 297 టీఎంసీలకు చేరింది. అలాగే, తుంగభద్రకు సోమవారం వరద పోటెత్తడంతో జలాశయంలోని నీరు 1,07,500 క్యూసెక్కులకు చేరుకుంది.పోలవరానికి గోదావరి ఉధృతి కొనసాగడంతో స్పిల్‌వే 31 మీటర్ల ఎత్తు నుంచి 6,60,977 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ముంపు మండలమైన వేలేరుపాడులో ఎద్దులవాగు వంతెన నీట మునగడంతో 18 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. -
China Floods 2025: చైనాపై ప్రకృతి కన్నెర్ర లక్ష మంది..
-
నిండుకుండలా సాగర్
సాక్షి, నరసరావుపేట: కృష్ణానదికి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వస్తుండటంతో శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు వరదప్రవాహం కొనసాగుతోంది. నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, 312.045 టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యం ఉంది. ఆదివారం సాయంత్రానికి నీటిమట్టం 582.90 అడుగులు వద్ద ఉండగా, నీటి నిల్వ 291.3795 టీఎంసీలకు చేరింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు 93,115 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. ఇందులో శ్రీశైలం ప్రాజెక్టు కుడి, ఎడమ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా 66,417 క్యూసెక్కులు, స్పిల్ వే ద్వారా మరో 26,698 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. కాలువల ద్వారా 35,749 క్యూసెక్కులు కిందకు వదలుతున్నారు. మరో 20 టీఎంసీల నీరు వస్తే నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుతుంది. మరోవైపు పులిచింతల ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా ఆదివారం సాయంత్రానికి ప్రాజెక్టు నీటిమట్టం 24.08 టీఎంసీలకు చేరింది. ఎగువనుంచి పులిచింతలకు 26,430 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. రేపు క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదల కృష్ణానదిలో ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండటం, ప్రాజెక్టు నీటి మట్టం ఇప్పటికే 583 అడుగులకు చేరింది. దీంతో మంగళవారం నాగార్జునసాగర్ క్రస్ట్ గేట్లను ఎత్తి వరదనీటిని దిగువకు విడుదల చేసే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. పోటెత్తిన తుంగభద్రనీట మునిగిన పంట పొలాలుకౌతాళం/హొసపేటె : కర్నూలు జిల్లాలో తుంగభద్ర నది ఆదివారం పోటెత్తింది. నదితీరంలో అర కిలోమీటర్ మేర పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి. కర్ణాటకలోని హోస్పేట్ టీబీ డ్యాం నుంచి శనివారం రాత్రి తుంగభద్ర నదికి 92వేలు క్యూసెక్కులు నీరు వదలగా అవి ఆదివారం తెల్లవారుజామున కర్నూలు జిల్లా సరిహద్దుకు చేరాయి. అప్పటికే రైతులు అప్రమత్తమై తమ వ్యవసాయ విద్యుత్ మోటార్లు, పైపు లైన్లను సురక్షిత ప్రాంతానికి తరలించుకున్నారు. నీటి ప్రవాహం మరింతగా పెరిగే అవకాశం ఉండడంతో తీర గ్రామాల రైతులతో పాటు ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు. కౌతాళం మండలం కుంబళనూరు వద్ద వరి పైర్లు వేసి పక్షం రోజులు అవుతుండడంతో తమ పంటలపై ఎక్కడ ఇసుక మేట వేస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. నిలిచిపోయిన రాకపోకలు తుంగభద్ర నదిలో ప్రవాహం పెరగడంతో కర్నూలు జిల్లా, కర్ణాటక రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. చెళ్లేకుడ్లూరు–మేళిగనూరు మధ్య రవాణా సౌకర్యం నిలిచిపోయింది. దీనితో పాటు కుంబళనూరు వద్ద కూడా వంకకు నీటి ప్రవాహం పెరగడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. మండ్య జిల్లాలో కావేరి నది కూడా ఉప్పొంగుతోంది. కేఆర్ఎస్ డ్యాం నుంచి భారీగా నీటిని విడుదల చేశారు. -
ఇటు ప్రకృతి విధ్వంసం.. అటు పాలకుల నిర్లక్ష్యం
-
ఉధృతంగా ప్రవహిస్తున్న మున్నేరు వాగు
-
రాష్ట్రమంతా కుండపోత
సాక్షి,నెట్వర్క్: రాష్ట్రాన్ని కుండపోత వాన ముంచెత్తింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో కురిసిన ఏకధాటి వానతో దారులన్నీ ఏరులయ్యాయి. వాగులు వంకలు పొంగిపొర్లాయి. బుధవారం ఉదయం నుంచి కుండపోత వానతో కరీంనగర్ తీవ్రంగా ప్రభావితమైంది. ఆకాశానికి చిల్లులు పడినట్టు ఉదయం 6 గంటల నుంచే వాన విరుచుకుపడటంతో నగర వీధులన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ముఖ్యంగా కరీంనగర్ స్మార్ట్ సిటీ వరదతో అతలాకుతలమైంది. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో కలెక్టరేట్, పోలీసు కమిషనరేట్ ప్రాంగణాలు, ప్రధాన జంక్షన్లు, రహదారులు నీటమునిగాయి. కరీంనగర్ పట్టణంలో 9.3, మానకొండూరులో 7.5 సెం.మీ, గంగిపెల్లి 7.5 సెం.మీ, చింతకుంట 6.3 సెం.మీ, జగిత్యాల జిల్లా ధర్మపురి (నేరెళ్ల) 9.1 సెం.మీ, బీర్పూర్ 5.4 సెం,మీ, ఎండపల్లి 7.3 సెం.మీ, గుళ్లకోట 7.3 సెం.మీ, చొప్పున వర్షం కురిసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జోరువాన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలతో పలుచోట్ల వాగుల ప్రవాహం, లో లెవల్ చప్టాలపైకి నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భద్రాచలంలో గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతుండగా, దుమ్ముగూడెం మండలం పర్ణశాలలో సీతమ్మ నారచీరల ప్రాంతం, సీతమ్మ విగ్రహం నీట మునిగాయి. కిన్నెరసాని, వైరా రిజర్వాయర్లలో సైతం నీటి మట్టం పెరిగి వైరా రిజర్వాయర్ అలుగు పోస్తోంది. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు ప్రవాహం పెరగడంతో 15 గేట్లు ఎత్తి 33వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బూర్గంపాడు మండలం పినపాక పట్టీనగర్లోని సీతారామ కాలువ వద్ద నలుగురు బాలురు ఈతకు వెళ్లగా ప్రవాహంలో బొర్రా శివ(16) గల్లంతయ్యాడు. కారేపల్లి మండల వ్యవసాయ అధికారి గాదెపాడు రైల్వేఅండర్ బ్రిడ్జి వద్ద నిలిచిన వరదలో కారు చిక్కుకుపోయింది. దీంతో స్థానికులు గుర్తించి తాళ్ల సాయంతో గంటపాటు శ్రమించి బయటకు తీశారు. ⇒ కుమురంభీం జిల్లావ్యాప్తంగా బుధవారం వర్షం దంచికొట్టింది. భారీ వరదతో చింతలమానెపల్లి, అహేరి మధ్య రవాణా నిలిచిపోయింది. ఆర్టీసీ బస్సులు రద్దు చేశారు. ⇒ మంచిర్యాల జిల్లాలో ఎర్రవాగు ఉప్పొంగింది. కన్నెపల్లి మండలం జంగంపల్లి గ్రామానికి చెందిన రైతు బోరుకుంట రాజం తన భార్య, మరో ఇద్దరు కూలీలతో కలిసి మంగళవారం తిమ్మాపూర్‌లోని పత్తి చేనుకు వెళ్లాడు. పని ముగించుకుని వస్తుండగా అప్పటికే కురిసిన భారీ వర్షానికి ఎర్రవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ట్రాక్టర్‌పై వాగు దాటుతుండగా ప్రవాహం పెరిగింది. ట్రాక్టర్‌పై ఉన్న వారంతా దూకి ప్రాణాలతో బయటపడ్డారు. ఏజెన్సీలో ఉప్పొంగిన వాగులు ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని జంపన్నవాగు ఉప్పొంగింది. కొండాయి వద్ద తాత్కాలికంగా పోసిన మట్టి రోడ్డు కొట్టుకుపోయింది. ఎస్‌ఎస్‌తాడ్వాయి మండలం పస్రా– తాడ్వాయి మధ్యలోని జలగలంచ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క బుధవారం పరిశీలించారు. మంగపేట మండల కేంద్రంలోని గిరిజన పెట్రోల్ బంక వద్ద ప్రధాన రోడ్డుపై నిర్మించిన కల్వర్టు సగం వరకు కోతకు గురై కొట్టుకు పోవడంతో ప్రమాదకరంగా మారింది. గార్ల సమీపంలోని పాకాల ఏరు బుధవారం చెక్‌డ్యాం పైనుంచి ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో మండల కేంద్రమైన గార్ల నుండి రాంపురం, మద్దివంచ పంచాయతీలకు చెందిన 12 గ్రామాలు, తండాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ⇒ ఎస్ఎస్ తాడ్వాయి మండల పరిధి అల్లిగూడెం గ్రామానికి చెందిన గర్భిణి గుమ్మడి కృష్ణవేణికి పురిటినొప్పులు రావడంతో నర్సాపూర్ వాగు వరదలో నుంచి వైద్య సిబ్బంది గ్రామస్తుల సహాయంలో బుధవారం వాగు దాటించారు. ⇒ ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని పేరూరు గ్రామానికి చెందిన తోటపల్లి వేణు(20) భద్రాచలంలో ఉంటున్న తమ్ముడికి బైక్ ఇవ్వడానికి వెళుతుండగా, మార్గమధ్యలో పెద్ద గొళ్లగూడెం వద్ద పిడుగు పడి చనిపోయాడు. ⇒ మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలకేంద్రానికి చెందిన ఆగబోయిన నరేష్(30) రాళ్ల ఒర్రెవాగులో బుధవారం చేపలు పట్టేందుకు వెళ్లి గల్లంతయ్యాడు. రానున్న రెండ్రోజులు వానలేవానలు రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం వరకు ఏడు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. 20 సెంటీమీటర్లకు పైబడి వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఈ జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు, కొన్ని చోట్ల అతిభారీ, ఒకట్రెండు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వివరించింది. ⇒ నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ మహబుబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలకు భారీ వర్షాలు కురుస్తాయని సూచిస్తూ... ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ⇒ నైరుతి సీజన్లో ఇప్పటివరకు 29.78 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా... బుధవారం నాటికి 26.79 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సాధారణం కంటే 10 శాతం లోటు వర్షపాతం ఉంది. నెలాఖరు కల్లా వర్షపాతం నమోదు గణాంకాలు మరింత మెరుగుపడతాయని అధికారులు చెబుతున్నారు. బుధవారం రాష్ట్రంలో సగటు వర్షపాతం 2.83 సెం.మీ.గా నమోదైంది. -
కృష్ణాలో జలకళ
సాక్షి, నెట్వర్క్: జూరాల, సుంకేశుల నుంచి శ్రీశైలం వస్తున్న నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టినా...ప్రస్తుత వర్షాలతో వాటర్ క్యాచ్మెంట్ ఏర్పడటంతో శ్రీశైలం ప్రాజెక్టు మరో గేట్‌ను ఎత్తారు. జూరాల నుంచి 39,746, సుంకేశుల నుంచి 36,975 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. శ్రీశైలం ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తి స్పిల్‌వే ద్వా రా 54,956 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న సాగర్‌కు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 883.7 అడుగుల నీటిమట్టం వద్ద 208.2841 టీఎంసీల నీటి నిల్వ ఉంది. నాగార్జునసాగర్‌కు పెరిగిన వరద: ఎగువన కృష్ణానది నుంచి నాగార్జునసాగర్ జలాశయానికి వరద పెరిగింది. మొత్తంగా 1,21,967 క్యూసెక్కుల నీరు సాగర్‌కు వస్తోంది. నాగార్జునసాగర్ గరిష్ట నీటిమట్టం 590 అడుగులు (312 టీఎంసీలు) కాగా.. బుధవారం సాయంత్రానికి 573 అడుగులకు (264 టీఎంసీలు) చేరింది. దుందుబి జోరు.. డిండిలోకి నీరు నల్లగొండ జిల్లాలోని డిండి ప్రాజెక్టులోకి ఎగువ నుంచి వరద భారీగా వస్తోంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కురుస్తున్న వర్షానికి తోడు కల్వకుర్తి లిఫ్ట్ ద్వారా వస్తున్న నీటితో దుందుబి వాగు దిగువకు పరవళ్లు తొక్కుతోంది. కడెం ప్రాజెక్టు గేటు ఎత్తివేత నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు గేటు బుధవారం రాత్రి ఎత్తారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 700 అడుగులుగా, ప్రస్తుతం 695.100 అడుగుల మేర నీరు ఉంది. -
సాగర్‌లోకి కృష్ణమ్మ పరవళ్లు
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్‌లోకి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు నాగార్జునసాగర్‌లోకి 67,800 క్యూసెక్కులు చేరడంతో నీటి నిల్వ 564.4 అడుగుల్లో 242.72 టీఎంసీలకు చేరుకుంది. సాగర్ నిండాలంటే ఇంకా 69 టీఎంసీలు అవసరం. ఎగువన ఉన్న జలాశయాల నుంచి భారీగా వరద విడుదల చేస్తున్న నేపథ్యంలో మరో మూడు నాలుగు రోజుల్లో నాగార్జునసాగర్ నిండుతుందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. జూరాల, సుంకేశుల బ్యారేజ్‌ల నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి 1,56,327 క్యూసెక్కులు చేరుతుండగా.. విద్యుదుత్పత్తి ద్వారా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు 68 వేల క్యూసెక్కులను దిగువన సాగర్‌కు విడుదల చేస్తున్నాయి. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా 20వేల క్యూసెక్కులు, హంద్రీ నీవా కోసం 1,013 క్యూసెక్కులను ఏపీ తీసుకుంటుండగా, కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 1,600 క్యూసెక్కులను తెలంగాణ తీసుకుంటోంది. మహారాష్ట్ర, కర్ణాటకల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కృష్ణా ప్రధాన పాయతోపాటు మలప్రభ, ఘటప్రభలు వరదెత్తుతున్నాయి. దాంతో ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌లలోకి వరద ఉధృతి పెరిగింది. ఆల్మట్టి డ్యామ్‌లోకి 94వేల క్యూసెక్కులు చేరుతుండగా.. 90 వేల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. నారాయణపూర్ డ్యామ్‌లోకి 1.15 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 1.01 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టులోకి 1.15 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 1.22 లక్షల క్యూసెక్కులను దిగు వకు వదిలేస్తున్నారు. తుంగభద్ర డ్యామ్‌కి వస్తున్న 39,339 క్యూసెక్కుల వరదను వచ్చిందొచ్చినట్టుగా దిగువన శ్రీశైలంకు విడుదల చేస్తున్నారు. -
పీకల లోతు వరద నీటిలో రిపోర్టింగ్, చివరకు..
పనిలో డెడికేషన్ అనాలో.. టీఆర్పీ కోసం పాకులాట అనాలో.. వ్యూస్ కోసం స్టంట్లు అనాలో.. ఈ ఘటన గురించి చదివాక మీ స్పందన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. పాకిస్తాన్లో కురుస్తున్న భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో వరదలు పోటెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఒక జర్నలిస్ట్ లైవ్ రిపోర్టింగ్ చేస్తూ నీటిలో కొట్టుకుపోయాడంటూ ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటన రావల్పిండిలోని చాహన్ డ్యామ్ వద్ద చోటుచేసుకుంది. రిపోర్టర్ పీకల లోతు వరద నీటిలో నిలబడి అక్కడి పరిస్థితి వివరిస్తున్నాడు. ఆ సమయంలో వరద ఉధృతికి ఆకస్మికంగా ప్రవాహం అతన్ని లోపలికి లాక్కెళ్లిపోయింది.A Pakistani reporter is swept away by strong currents during a live broadcast while covering the floods in neck-deep water.#Pakistan #Floods pic.twitter.com/0raCbYaoer— Al Arabiya English (@AlArabiya_Eng) July 17, 2025అయితే ఈ వీడియో అక్కడికి మాత్రమే కట్ అయ్యింది. అతను కొట్టుకుపోయాడని, ఇప్పటిదాకా అతని ఆచూకీ తెలీయకుండా పోయిందనేది సదరు వార్త కథనాల సారాంశం. దీంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అతనిది మూర్ఖపు చర్య అని కొందరు, విధి నిర్వహణలో తప్పేం కాదని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. కెమెరామ్యాన్నెవర్డైస్ అంటూ మరికొందరు సరదా కామెంట్లు పెడుతున్నారు. అయితే.. మరికొందరు మాత్రం అతను అసలు రిపోర్టర్ కాదని, టిక్‌టాక్ లాంటి షార్ట్వీడియోస్ యాప్‌లలో వ్యూస్ కోసం ఇలాంటి స్టంట్లు చేస్తుంటాడని పలువురు కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం అతను సురక్షితంగానే ఉండి ఉంటాడన్నది ఆ కామెంట్ల సారాంశం. అయితే.. ఫ్యాక్ట్ చెక్‌లో అతని పేరు అలీ ముసా రాజా(Ali Musa Raza)గా తేలింది. రూహీ అనే చానెల్లో అతను చాలా కాలంగా రిపోర్టర్‌గా పని చేస్తున్నాడు. అతను క్షేమంగానే ఉన్నాడా? అనే దానిపై ఆ చానెల్ ఎలాంటి ప్రకటన చేయలేదు. తాజా ఘటన నేపథ్యంలో పలువురు జర్నలిస్టులు సైతం అతనికి సంఘీభావం తెలుపుతున్నారు. అతను క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నట్లు కామెంట్లు పెడుతున్నారు. చీప్ గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ కంటే ఇలాంటి ధైర్యమైన రిపోర్టర్లు సమాజానికి అవసరమని, అదే సమయంలో ఇలాంటివాళ్లు సురక్షితంగా కూడా ఉంటాలంటూ కామెంట్లు పెడుతున్నారు. రిపోర్టర్ అలీ ముసా రాజాకు ఇలాంటి స్టంట్లు కొత్తేం కాదు. కిందటి ఏడాది.. పంజాబ్ ప్రావిన్స్ సఖి సర్వర్ ఏరియాలో వరదలను నడుం లోతు నీళ్లలో కవర్ చేస్తూ వైరల్ అయ్యాడు కూడా. View this post on Instagram A post shared by NDTV WORLD (@ndtvworld)పాకిస్తాన్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇది గత సంవత్సరం కంటే 124% ఎక్కువ వర్షపాతం అని అక్కడి వాతావరణ శాఖ చెబుతోంది. తాజా వరదల ధాటికి ఆ దేశంలో ఇప్పటికే 180 మంది మరణించారు. అయితే.. ఒక్క పంజాబ్ ప్రావిన్స్‌లో 54 మంది ఒకే రోజులో మరణించడం గమనార్హం. -
అమెరికాను ముంచెత్తిన వరదలు
వాషింగ్టన్: న్యూయార్క్ నగరంతో సహా అమెరికాలోని ఈశాన్య ప్రాంతంలో కుండపోత వర్షం కురిసింది. అనేక నగరాలను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. దీంతో రవాణా వ్యవస్థకు అంతరాయం ఏర్పడింది. గ్యాస్ స్టేషన్లు, సబ్‌వేలు మునిగిపోయాయి. విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. విమాన రాకపోకలు ఆలస్యమయ్యాయి. సోమవారం సాయంత్రానికే న్యూయార్క్, వాషింగ్టన్, బాల్టీమోర్, నెవార్క్, న్యూజెర్సీ, వర్జీనియా వంటి అనేక ప్రాంతాలలో వరద హెచ్చరికలు జారీ చేశారు.సాయంత్రమే స్టేటెన్ ఐలాండ్, మాన్‌హట్టన్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. న్యూయార్క్‌లో వాహనాలు వరదనీటిలో చిక్కుకున్నాయి. డ్రైవర్లకు రెస్క్యూ సిబ్బంది సహాయం చేశారు. న్యూజెర్సీలో వరదల కారణంగా బస్సులు, రైళ్లు ఆలస్యంగా నడిచాయి. ఆకస్మిక వరదలు, భారీ వర్షాల కారణంగా న్యూజెర్సీ గవర్నర్ ఫిల్ మర్ఫీ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. పౌరులు ఇళ్లలోనే ఉండాలని, అనవసరమైన ప్రయాణాలను నివారించాలని సూచించారు. న్యూజెర్సీలోని కొన్ని ప్రాంతాల్లో 5 అంగుళాల వరకు వర్షం కురిసింది.టెక్సాస్‌లో 131కి చేరిన మృతులు.. మరోవైపు టెక్సాస్‌లో వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 131కి పెరిగింది. గ్రేటర్ కెర్విల్లే ప్రాంతంలో 97 మంది ఆచూకీ తెలియలేదు. కెర్ కౌంటీ మరణాల్లో దాదాపు మూడింట ఒక వంతు మంది పిల్లలే కావడం గమనార్హం. విమాన కార్యకలాపాలకు అంతరాయం.. తుఫాను కారణంగా సోమవారం ఒక్క రోజే అమెరికా అంతటా విమాన కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాదాపు 10,000 విమానాలు ఆలస్యమయ్యాయి. 1,600 కంటే ఎక్కువ రద్దయ్యాయి. ఫ్లోరిడాను భారీ వర్షాలు ముంచెత్తే అవకావం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఇది విమాన రాకపోకలను మరింత ప్రభావితం చేయనుంది. -
ఎగువ గోదారి వెలవెల!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించి నెలన్నర గడిచిపోయినా వరద ప్రవాహం లేక ఎగువ గోదావరి వెలవెలబోతోంది. మరోవైపు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లోని దిగువ పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో ఉప నదులైన ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, వాగులు, వంకల్లో వరద ఉధృతి పెరిగి దిగువ గోదావరి పోటెత్తింది. గోదావరిలో ప్రాణహిత కలిసే కాళేశ్వరం వద్ద నిర్మించిన మేడిగడ్డ బరాజ్ నుంచి ధవళేశ్వరం బరాజ్‌కి దిగువన సముద్రంలో కలిసే వరకూ గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రాణహితలో వరద పెరగడంతో కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బరాజ్‌లోకి 2.21 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, వచ్చిన వరదను వచ్చినట్టు కిందికి విడుదల చేస్తున్నారు. దానికి ఛత్తీస్‌గఢ్ నుంచి వస్తున్న ఇంద్రావతి వరద తోడవుతుండటంతో తుపాకులగూడెం (సమ్మక్క సాగర్) బరాజ్‌లోకి 2.69 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా అంతే స్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నారు. సీతమ్మసాగర్ (దుమ్ముగూడెం బరాజ్)లోకి చేరుతున్న 5.92 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ఏపీలోని ధవళేశ్వరం బరాజ్ గేట్లను ఎత్తివేయడంతో ఇప్పటికే ఈ ఏడాది 175 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలోకి కలిసిపోయాయి.ఎగువన అన్ని రిజర్వాయర్లూ వెలవెలనే..గోదావరిపై మహారాష్ట్రంలో ఉన్న జైక్వాడ్ ప్రాజెక్టు గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 102.73 టీఎంసీలు కాగా, ప్రస్తుతం జలాశయానికి 15 వేల క్యూసెక్కుల వరద వస్తుండడంతో 83.48 టీఎంసీలకు నిల్వలు చేరాయి. జైక్వాడ్ ప్రాజెక్టు నిండితేనే గోదావరి ప్రధాన పాయ ద్వారా తెలంగాణలోకి వరద ప్రవాహం ప్రారంభమవుతుంది. మంజీరపై నిర్మించిన నిజాంసాగర్ ప్రాజెక్టు గరిష్ట నిల్వ సామర్థ్యం 17.8 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ఎలాంటి ఇన్‌ఫ్లో లేకపోవడంతో నిల్వలు 4.71 టీఎంసీలకు పడిపోయాయి. గోదావరి ప్రధాన పాయపై ఉన్న శ్రీరామ్‌సాగర్ గరిష్ట నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా, కేవలం 2,100 క్యూసెక్కుల వరద వస్తుండగా, జలాశయంలో 20.77 టీఎంసీల నీరే ఉంది. కడెం నదిపై నిర్మించిన కడెం ప్రాజెక్టు సామర్థ్యం 4.7 టీఎంసీలు కాగా, 602 క్యూసెక్కుల వరద వస్తుండడంతో నిల్వలు 3.47 టీఎంసీలకు చేరాయి. గోదావరి ప్రధాన పాయపై ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టు సామర్థ్యం 20.18 టీఎంసీలు కాగా, 431 క్యూసెక్కుల వరద మాత్రమే వస్తుండడంతో నిల్వలు 8.9 టీఎంసీలకు పరిమితమయ్యాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా గోదావరి ప్రధాన పాయపై నిర్మించిన సుందిళ్ల, అన్నారం బరాజ్‌లకు సైతం నామమాత్రంగా 293 క్యూసెక్కులు, 450 క్యూసెక్కుల వరద మాత్రమే వస్తోంది. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో నీళ్లు నింపరాదని ఎన్డీఎస్ఏ సూచించింది. దీంతో మేడిగడ్డ బరాజ్‌కి భారీ వరద వస్తున్నా నీటిని ఎత్తిపోసే అవకాశం లేకుండా పోయింది.నాగార్జున సాగర్‌లో 551 అడుగులకు నీటి మట్టంనాగార్జునసాగర్: శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి వస్తున్న వరద తగ్గుముఖం పట్టడంతో ఒక గేటు ద్వారా దిగువన నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల ద్వారా 69,382 క్యూసెక్కులు, ఒక గేటు ద్వారా 27,295 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతోంది. సాగర్ జలాశయ గరిష్ట నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 551.10 అడుగుల మేర నీటి మట్టం ఉంది. సాగర్ జలాశయానికి గడిచిన 24 గంటల్లో 70,320 క్యూసెక్కుల నీరు రాగా, 9,552 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. -
1.6 లక్షల మంది నిరాశ్రయులు
న్యూఢిల్లీ: దేశంలో ప్రకృతి విపత్తులు పంజా విసురుతూనే ఉన్నాయి. భారీ వర్షాలు, భీకరమైన వరదల కారణంగా పెద్ద సంఖ్యలో జనం నష్టపోతున్నారు. శాశ్వత లేదా తాత్కాలిక ఇళ్లు, ఆవాసాలు కోల్పోయి నిరాశ్రయులుగా మారుతున్నారు. 2024లో దేశంలో 400కుపైగా ప్రకృతి విపత్తులు చోటుచేసుకున్నాయి. గత రెండు దశాబ్దాల కాలంలో చూస్తే ఇదే అత్యధిక కావడం గమనార్హం. గత ఏడాది విపత్తుల వల్ల 1.18 లక్షల మందికిపైగా జనం నిరాశ్రయులయ్యారని ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్ మానిటరింగ్ సెంటర్ వెల్లడించింది. 2023 కంటే 2024లో నిరాశ్రయుల సంఖ్య 30 శాతం అధికం అని తెలియజేసింది. 2021లో 22,000 మంది, 2022లో 32,000 మంది ఇళ్లు కోల్పోయి రోడ్డున పడ్డారని పేర్కొంది. ప్రకృతి విపత్తులు ప్రతిఏటా పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. 2019 నుంచి 2023 మధ్య 281 విపత్తుల ఘటనలు చోటుచేసుకున్నాయి. 2024లో మాత్రం ఏకంగా 400కు పైగా విపత్తులు సంభవించాయి. గత ఆరేళ్లలో జనం నిరాశ్రయులు కావడానికి వరదలు 55 శాతం, తుఫాన్లు 44 శాతం కారణమని తేలింది. కొండ చరియలు విరిగిపడడం, భూకంపాలు, కరువుల వల్ల కూడా జనం ఆశ్రయం కోల్పోతున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లోనే అధికం 2024లో 1.18 లక్షల మంది నిరాశ్రయులు కాగా, 2025లో మొదటి ఆరు నెలల్లోనే ఏకంగా 1.6 లక్షల మంది బాధితులుగా మారిపోయినట్లు ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్ మానిటరింగ్ సెంటర్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గతేడాది కంటే ఈ ఏడాది పరిస్థితి మరింత దారుణంగా ఉన్నట్లు తేటతెల్లమవుతోంది. పశ్చిమ బెంగాల్‌తోపాలు ఈశాన్య రాష్ట్రాల ప్రజలే అధికంగా ప్రకృతి విపత్తుల బారినపడుతున్నారు. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో అత్యధికంగా పశ్చిమ బెంగాల్లో 80,000 మంది నిరాశ్రయులయ్యారు. -
గోదావరికి పెరుగుతున్న వరద
సాక్షి ప్రతినిధి, ఏలూరు: గోదావరికి వరద క్రమేపీ పెరుగుతోంది. వారం రోజులుగా సగటున 2 లక్షల క్యూసెక్కుల నీరు ఎగువ ప్రాంతాల నుంచి పోలవరం ప్రాజెక్టుకు చేరుతోంది. మహారాష్ట్ర, తెలంగాణలో వర్షాలు ఎక్కువగా పడుతుండటంతో గోదావరి, శబరి నదులు వరద నీటితో పోటెత్తుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు నుంచి గురువారం 2,86,205 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. శుక్రవారం వరద తీవ్రత ఎక్కువైంది. భద్రాచలంలో నీటి మట్టం 37.20 అడుగులకు చేరింది. పోలవరం ప్రాజెక్టు నుంచి 5,02,478 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. శని, ఆదివారాల్లో కూడా వరద తీవ్రత ఎక్కువగా ఉంటుందని, శనివారం సాయంత్రానికి 7.50 లక్షల క్యూసెక్కులు దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ముంపు మండలమైన వేలేరుపాడు, కోయిదా రహదారిపై ఉన్న ఎద్దుల వాగు వంతెన పైకి వరద నీరు చేరింది. రాకపోకలు నిలిచిపోయాయి. అర్ధరాత్రికి వంతెన పూర్తిగా మునిగే పరిస్థితి ఉంది. దీంతో 18 గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోనున్నాయి. -
ఉప్పొంగిన ‘ప్రాణహిత’
చింతలమానెపల్లి/కాళేశ్వరం/ ఆసిఫాబాద్/ములకలపల్లి: ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలు, ఉప నదుల వరదల కారణంగా ప్రాణహిత నదిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. చింతలమానెపల్లి మండలం గూడెం వద్ద అంతర్రాష్ట్ర బ్రిడ్జిని తాకేలా ప్రాణహిత ప్రవహిస్తోంది. నదిలో చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు అప్రమత్తం చేశారు. మండలంలోని దిందా వాగులో పడి కేతిని గ్రామానికి చెందిన సెడ్మెక సుమన్(18) గల్లంతయ్యాడు. స్నేహితులతో కలిసి వాగు అవతలి వైపు ఉన్న వ్యవసాయ భూముల వద్దకు వెళ్లి వచ్చే క్రమంలో నది దాటేందుకు ప్రయత్నించి పట్టు తప్పాడు. ఈ క్రమంలో గట్టుపై ఉన్న చెట్టును పట్టుకోగా కొమ్మ విరిగి వరద ఉధృతిలో కొట్టుకుపోయాడు. సిర్పూర్(టి) మండలంలో వెంకట్రావుపేట్–పోడ్సా అంతర్రాష్ట్ర హైలెవల్ వంతెనను ఆనుకొని పెన్‌గంగ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద ఇలాగే కొనసాగితే తెలంగాణ–మహారాష్ట్రకు రాకపోకలు నిలిచిపోయే అవకాశముంది. వరద నీరు గంట గంటకూ పెరుగుతుండడంతో తీర ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆయా మండలాల్లో వందలాది ఎకరాల్లో పత్తి పంట నీట మునిగింది. మంచిర్యాల జిల్లా వేమనపల్లి, కోటపల్లి మండలాల్లో ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పరీవాహక ప్రాంతాల్లో వందలాది ఎకరాల్లో పత్తి పంటలు నీట మునిగాయి. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద... భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద 10.690 మీటర్ల ఎత్తులో నీటిమట్టం దిగువకు ప్రవహిస్తోంది. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు పరి«ధిలోని మేడిగడ్డ(లక్ష్మీ) బరాజ్‌కు వరద ప్రవా హం 6.36 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రూపంలో వస్తోంది. బరాజ్ 85 గేట్లు ఎత్తి అదే స్థాయిలో 6.36 లక్షల క్యూసె క్కుల నీటిని ఔట్‌ఫ్లోగా దిగువకు విడుదల చేస్తున్నారు. కుమురంభీం ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తివేత కుమురంభీం ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు వచ్చి చేరింది. దీంతో అధికారులు గురువారం ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తారు. ఇన్‌ఫ్లో 850 క్యూసెక్కులు ఉండగా.. రెండు గేట్లు ఎత్తి 880 దిగువకు వదులుతున్నారు. ‘సీతారామ’ప్ర«దానకాల్వ కట్టకు కోత సీతారామ ఎత్తిపోతల పథకం (ఎస్ఆర్ఎల్ఐ) ప్రధాన కాల్వ కట్టకు ప్రమాదం పొంచి ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం వీకే.రామవరంలోని సీతారామ పంప్‌హౌస్–2 నుంచి కమలాపురం వద్ద గల పంప్‌హౌస్–3 వరకు వెళ్లే ప్రధాన కాల్వకు భారీ గొయ్యి ఏర్పడింది. వర్షాల «నేపథ్యంలో వరద ఉ«ధృతికి క్రమేపీ కోత పెరుగుతోంది. -
నాగార్జునసాగర్ డ్యాంకు కొనసాగుతున్న భారీ వరద
-
వరద 'గోదావరి'
సాక్షి ప్రతినిధి, ఏలూరు: వరద గోదావరి మళ్లీ పోటెత్తుతుంది. ఎగువ రాష్ట్రాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు గోదావరిలో జలకళ మొదలైంది. గత వారం రోజులుగా రోజుకు సగటున 2 లక్షల క్యూసెక్కుల నీరు పోలవరం ప్రాజెక్టు నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు. మరో నాలుగు రోజుల్లో తీవ్రత మరింత పెరుగుతుందని దానికనుగుణంగా 9.32 లక్షల క్యూసెక్కుల నీరు 15 కల్లా వస్తుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు వరద ప్రవాహంతో ముంపు మండలాల్లో అలజడి మొదలైంది. గోదావరికి వరదల సీజన్ ప్రారంభమైంది. వాస్తవానికి జూలై మొదటి వారం నుంచి వరద హడావుడి ప్రారంభమై ఆగస్టు వరకు రెండు సార్లు ముంపు మండలాల్ని అతలాకుతలం చేస్తోంది. ఈ ఏడాది వర్షాలు కొంత ఆలస్యం కావడం, ఇతర కారణాలతో వరద ఉధృతి గతంతో పోల్చితే తక్కువగానే ఉంది. ఈ నెల 2 నుంచి ప్రారంభమైన వరద నీరు క్రమేపీ పెరుగుతూ వచ్చింది. మహారాష్ట్ర ఎగువ ప్రాంతాల్లో వారం రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురవడంతో గోదావరి ఉపనది శబరి పోటెత్తుతుంది. ఈ క్రమంలో ఈనెల 2న 1.06 లక్షల క్యూసెక్కుల నీరు పోలవరం స్పిల్‌వే నుంచి దిగువకు విడుదల చేశారు. 5వ తేదీ నాటికి 2.09 లక్షల క్యూసెక్కులు, 9 నాటికి 2.27 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు. వరద పోటెత్తే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ అధికారులు అంచనా వేశారు. ఈ నెల 15 కల్లా 9,32,288 క్యూసెక్కుల నీరు పోలవరానికి చేరుతుందని, అదే విధంగా భద్రాచలం వద్ద 43 అడుగుల నీటిమట్టంతో మొదటి ప్రమాదహెచ్చరిక జారీ చేయవచ్చని చెబుతున్నారు. ఈ నేనపథ్యంలో ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. దిగువకు విడుదలవుతున్న నీటిని పోలవరం నుంచి పూర్తి స్థాయిలో డిశ్చార్జ్ చేస్తున్నారు. ముంపు మండలాల్లో భయం.. భయం పోలవరం ముంపు మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడుకు వరద ప్రమాదం పొంచి ఉంది. ఈ క్రమంలో 9.32 లక్షల క్యూసెక్కులు దాటితే మొదటి ప్రమాద హెచ్చరికకు రహదారులపైకి నీరు చేరడం, 11.44 లక్షల క్యూసెక్కులు దాటితే రెండవ ప్రమాద హెచ్చరికకు రహదారులు నీటముగి రాకపోకలు నిలిచిపోయి పదుల సంఖ్యలో గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాల్లో ఇళ్ళలోకి నీరు చేరుతుంది. 14.26 లక్షల క్యూసెక్కులు దాటితే మూడో ప్రమాద హెచ్చరికతో రెండు మండలాల్లో 18 గ్రామాలు పూర్తిగా జలదిగ్భందంలోకి వెళ్తాయి. ఈ క్రమంలో అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కే.వెట్రిసెల్వి ఆదేశించారు. కొనసాగనున్న ఉధృతి బుధవారం మధ్యాహా్ననికి భద్రాచలంలో 22.40 అడుగుల మేర నీటిమట్టం ఉంది. ఎగువ నుంచి ఇన్‌ఫ్లో ఎక్కువగా ఉండటంతో గురువారానికి 3 నుంచి 4 అడుగులు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 1986లో 75.60 అడుగుల మేర నీటి మట్టం ఉండటంతో 27 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలైంది. ఇంతవరకు అత్యధికంగా వచ్చిన వరద ఇదే. వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో అత్యధిక గ్రామాలు భారీగా నష్టపోయాయి. ఆ తరువాత 2022లో 71.30 అడుగుల నీటిమట్టంతో 21.78 లక్షల క్యూసెక్కుల నీరు పోలవరానికి ఒకేసారి విడుదలైంది. ఈ క్రమంలో ముంపు మండలాలతో పాటు పశ్చిమలోని లంక గ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి. 2022లో జూలై 6న, 2023లో జూలై 20న 2024 జూలై 19న వరదలు ప్రారంభమై సుమారు వారం రోజులు పాటు ఇన్‌ఫ్లో కొనసాగింది. -
67 మంది ప్రాణాలు కాపాడిన శునకం
మండి: విపత్తులు జంతువులకు ముందే తెలుస్తాయంటారు. అది నిజమని మరోసారి నిరూపించిందో శునకం. హిమాచల్‌లో వరదలను ముందుగా హెచ్చరించి 67 మంది ప్రాణాలను కాపాడింది. హిమాచల్‌ప్రదేశ్‌లో కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు ప్రజలను అతలాకుతలం చేస్తున్నది తెలిసిందే. జూన్ 20న రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్రంలో కనీసం 78 మంది మరణించారు. 50 మంది కొండచరియలు విరిగిపడటంతో మృత్యువాత పడగా.. 28 మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు.అయితే.. మండిలోని ధరంపూర్ ప్రాంతంలోని సియాతి గ్రామంలో 67 మంది త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. సియాతి నివాసి నరేంద్ర ఇంట్లో ఓ శునకం ఉంది. ప్రమాదం సంభవించిన జూన్ 30న అది ఇంట్లోని రెండో అంతస్తులో పడుకుంది. బయట బోరున వర్షం. ఉన్నట్టుండి కుక్క మొరగడం ప్రారంభించింది. అది విని.. నరేంద్ర నిద్ర నుంచి లేచాడు. రెండో అంతస్తుకు వెళ్లాడు. అప్పటికే ఇంటి గోడలో పెద్ద పగుళ్లు కనిపించాయి. నీరు లోపలికి రావడం ప్రారంభమైంది. వెంటనే కుక్కతో పాటు కిందకు పరిగెత్తి అందరినీ నిద్రలేపాడు. ఇళ్లనుంచి సురక్షిత ప్రాంతాలకు పారిపోవాలని అందరినీ కోరాడు.వాళ్లు అలా వెళ్లిన కొద్దిసేపటికే, గ్రామంలో కొండచరియలు విరిగిపడ్డాయి. పదికి పైగా ఇళ్ళు నేలమట్టమయ్యాయి. ఆ గ్రామంలో ఇప్పుడు నాలుగైదు ఇళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి. మిగిలినవి కొండచరియల శిథిలాల కింద ఉన్నాయి. ప్రాణాలతో బయటపడిన వారు ఏడు రోజులుగా త్రియంబాల గ్రామంలో నిర్మించిన నైనా దేవి ఆలయంలో ఆశ్రయం పొందుతున్నారు. శునకం అప్రమత్తం చేయకుండా ఉంటే.. అంతమంది ప్రాణాలు నిద్రలోనే పోయేవని గ్రామస్తులు చెబుతున్నారు. -
ఇవాళ శ్రీశైలం ప్రాజెక్ట్ గేట్లు ఎత్తే అవకాశం
-
అమెరికా మునిగిపోనుందా?
-
‘నిధుల్లేవ్.. నేనేమి మంత్రినీ కాను’.. వరద సాయంపై ఎంపీ కంగనా
నా దగ్గర నిధులు లేవు, నేనేం కేంద్రంలో మంత్రినీ కాను.. అయినా సరే కేంద్రం నుంచి వరద బాధిత ప్రాంతాలకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రయత్నిస్తున్నాను’ అంటూ ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్.. తన మండీ నియోజకవర్గంలో వ్యాఖ్యలు చేశారు.హిమాచల్ ప్రదేశ్‌లో కుంభవృష్టి కారణంగా వరదలు సంభవించి 14 మంది మృతిచెందారు. మరో 31 మంది గల్లంతయ్యారు. ఈ నేపధ్యంలో మండీ ఎంపీ కంగనా రనౌత్ ఆ ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు క్యాబినెట్ పదవి లేదని, విపత్తు సహాయానికి తన దగ్గర నిధులు లేవని, అయినా కేంద్రం నుండి ఆర్థిక సహాయం అందించేందుకు తాను అన్ని ప్రయత్నాలు చేస్తున్నానని అన్నారు. ఇంతటి వరదలకు బాధ్యులైనవారు తమ ముఖాలను దాచుకుంటున్నారని, వారు అవినీతికి పాల్పడ్డారని కాంగ్రెస్‌పై కంగనా విమర్శలు గుప్పించారు. విధాన రూపకల్పనలో తనకు సామర్థ్యం ఉందని, అయితే రాష్ట్ర స్థాయిలో లేదా పంచాయతీ స్థాయిలో అది చాలా తక్కువని కంగనా పేర్కొన్నారు. #WATCH | Himachal Pradesh: BJP MP from Mandi, Kangana Ranaut says, "The central government provided immediate relief operations by sending in the forces. At the local level, we provided relief material to the affected families... Even though the Prime Minister is on a foreign… https://t.co/VoW4I4Uh4X pic.twitter.com/G9BeCHHTjF— ANI (@ANI) July 6, 2025హిమాచల్ ప్రదేశ్‌కు రక్షణ దళాలను పంపడం ద్వారా కేంద్రం తక్షణ సహాయ కార్యకలాపాలను ప్రారంభించిందన్నారు. ఐదు దేశాల పర్యటనలో ఉన్న ప్రధాని మోదీకి ఇక్కడి పరిస్థితి గురించి తెలుసునని ఎంపీ పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు తాము సహాయ సామగ్రిని అందించామని, ఒక ఎంపీగా నిధులు తీసుకురావడం, ప్రభుత్వానికి గ్రౌండ్ రియాలిటీని తెలియజేయడం తన పని అని ఆమె స్పష్టం చేశారు. హిమాచల్ ప్రదేశ్‌లో రాబోయే 20 ఏళ్లలో కాంగ్రెస్ అధికారంలోకి రాదని రనౌత్ వ్యాఖ్యానించారు. కాగా కంగనా.. విపత్తుల సమయంలో మండీ ప్రజలకు అందుబాటులో లేరంటూ కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పించిన అనంతరం ఆమె ఈ ప్రాంతంలో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే.. ఒక ఎంపీగా ఆమె ఇటువంటి మాటలు మాట్లాడటం ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తోంది. స్థానికంగా సాయం అందించేందుకు ఒక ఎంపీకి అవకాశమే ఉండదా? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.ఇది కూడా చదవండి: భారత్-పాక్‌లను ఒకేలా తూచలేం: ‘బ్రిక్స్’లో ప్రధాని మోదీ -
టెక్సాస్ అతలాకుతలం.. చిన్నారులు సహా 51 మంది మృతి
కెర్విల్లె: అమెరికాలోని టెక్సాస్‌లో కుండపోత వర్షం కురుస్తోంది. భారీ వర్షాల కారణంగా ఇప్పటికి వరకు 51 మృతి చెందగా.. పలువురు గల్లంతు అయ్యారు. తాజాగా సమ్మర్ క్యాంప్‌పైకి వరద దూసుకెళ్లిన ఘటనలో 23 మంది బాలికలు గల్లంతయ్యారు. కనిపించకుండా పోయిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.కొన్ని నెలలపాటు కురవాల్సిన వాన గురువారం రాత్రి సమయంలో అనూహ్యంగా కేవలం కొన్ని గంటల్లోనే కురిసిందని అధికారులు తెలిపారు. గ్వాడలుపె నది సమీపంలోని హంట్ అనే చిన్న పట్టణం వద్ద ‘క్యాంప్ మిస్టిక్’పేరుతో నిర్వహించే సమ్మర్ క్యాంప్‌లో 750 మంది బాలికలు పాల్గొన్నారు. వరద ప్రమాదం ముంచుకు రావడంతో అధికారులు కొందరు బాలికలను హెలికాప్టర్ ద్వారా తరలించారు. మిగతా వారిని వంతెన మీదుగా సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లారు. పలు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా మృతుల సంఖ్య పెరుగుతోంది. పలుచోట్ల వరద నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంత మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. Good morning. Please keep Texas in your prayers—especially the flood victims, the missing, their families, and the first responders searching for them.Tragedy in Texas: Flash floods along the Guadalupe River have taken 13 lives. 23 young Christian girls from Camp Mystic are… pic.twitter.com/nH5QJz9Mc6— ꜱǫʏʟᴀʀᴋ (@Kralyqs) July 5, 2025 Texas flood in 50 minutes time. pic.twitter.com/ynRpULEgHI— 0HOUR (@0HOUR1__) July 6, 2025This video of the Guadalupe was shot in Kerrville, Tx from the Center Bridge. Watch how fast these flood waters were traveling & washing everything in front of it out.It goes from low & barley flowing to over the top of the bridge in around 35 minutes.I sped the video up to… pic.twitter.com/NcQe4UAQBa— Clyp Keeper (@DGrayTexas45) July 6, 2025This is a nightmare this lady and her bed ridden husband are in a flooded home in Texas and nobody is coming to help them! 😡 pic.twitter.com/Xp2WmiuCDl— Suzie rizzio (@Suzierizzo1) July 5, 2025 -
అమెరికాలోని టెక్సాస్ లో వరదల బీభత్సం.. 24 మంది చిన్నారులు మృతి
-
హిమాచల్ వరదల్లో నలుగురి మృతి
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో సంభవించిన ఆకస్మిక వరదల్లో నలుగురు చనిపోగా సుమారు 20 మంది గల్లంతయ్యారు. కంగ్రా, కులూ జిల్లాల్లో బుధవారం సాయంత్రం కురిసిన కుంభవృష్టి కారణంగా ఒక్కసారిగా వరదలు వచ్చాయి. ఇందిరా ప్రియదర్శిని జల విద్యుత్ ప్రాజెక్టు పనులు చేస్తున్న కార్మికుల కోసం ఆ సమీపంలోనే తాత్కాలిక శిబిరాలను ఏర్పాటు చేశారు. ఆకస్మిక వరదల్లో కార్మికుల శిబిరాలు కొట్టుకుపోయాయి. నలుగురు చనిపోగా మరో 15 మందికిపైగా గల్లంతై ఉంటారని స్థానిక అధికారులు తెలిపారు. గల్లంతైన వారిలో హిమాచల్ ప్రదేశ్‌తోపాటు యూపీకి చెందిన వారున్నారు. కొందరిని రక్షించామని అధికారులు చెబుతున్నప్పటికీ ఎందరనే విషయంలో స్పష్టత లేదు. -
వరద విలయం.. 80000 మంది..
-
ముందస్తు నివారణ చర్యలే మేలు
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలతో తీవ్ర నష్టం జరిగిన తరువాత స్పందించడం కంటే.. నష్టం జరగకముందే నివారణ చర్యలపై ఎక్కువ దృష్టి పెట్టాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గోదావరి, కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ ఏడాది రాష్ట్రంలో సాధారణం కంటే అధిక వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ (ఐఎండీ) చెపుతున్న నేపథ్యంలో మంత్రి పొంగులేటి గురువారం సచివాలయంలో ప్రకృతి విప త్తుల నిర్వహణ ఉన్నతాధికారులు, రెవెన్యూ అధి కారులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ హైదరాబాద్ తరహాలోనే జిల్లాల్లో వరదల ముప్పును ఎదుర్కొనేందుకు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. విపత్తుల నిర్వహణ విభాగం బలోపేతానికి హైడ్రా కమిషనర్, అగి్నమాపక డీజీ, విపత్తుల నిర్వహణ కమిషనర్, కమాండ్ కంట్రోల్ సెంటర్ డైరెక్టర్, నీటిపారుదల, ఆర్అండ్బీ, ఆరోగ్య శాఖల కమిషనర్లతో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశామని, ఈ కమిటీ వారం రోజుల్లో నివేదిక ఇస్తుందని వివరించారు. తర్వాత కమిటీ నివేదిక ప్రకారం చర్యలు చేపడ్తామని తెలిపారు. వర్షాకాలం ముందుస్తుగానే వచ్చిందని, దీనిని దృష్టిలో పెట్టుకుని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, అన్ని విభాగాల అధికారులతో సమన్వయం చేసుకుని వైపరీత్యాల ప్రభావాన్ని వీలైనంత వరకు తగ్గించాలని మంత్రి ఆదేశించారు. గోదావరి, కృష్ణా నదుల పరీవాహక ప్రాంతాల్లో జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వచ్చే భారీ వర్షాల వల్ల ఊహించని వరదలు వస్తున్నాయని, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా పరీవాహక ప్రాంతాల్లోని నివాసితులను గుర్తించి వారిని అక్కడి నుంచి శాశ్వతంగా తరలించి, వారికి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. మూసపద్ధతికి స్వస్తి చెప్పండి.. విపత్తుల నిర్వహణ విభాగం మూసపద్ధతికి స్వస్తి చెప్పి, మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక సాంకేతిక పద్ధతులను, పరిజ్ఞానాన్ని అలవర్చుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సంబంధిత అధికారులను కోరారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఆయా జిల్లాల్లో పరిస్థితులను బట్టి వరదల కార్యాచరణ ప్రణాళికలను ఈనెల 30వ తేదీలోగా తయారు చేసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అలాగే వరద నియంత్రణ కట్టలు, చిన్న–మధ్య తరహా కాల్వలు, వర్షపు నీటి డ్రెయిన్లు.. మొదలైన వాటిని పరిశీలించి మరమ్మతులు చేపట్టాలన్నారు. బోట్లు, లైఫ్ జాకెట్లు, అత్యవసర ఆహార కిట్లను ముందే సిద్ధం చేసుకోవాలని చెప్పారు. ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్, ఆరోగ్య శాఖలు సమన్వయంతో పనిచేయాలని, స్థానిక సహాయక బృందాలను ఏర్పాటు చేసి, వారికి బాధితులను తరలించడం, తక్షణ స్పందన చర్యలపై శిక్షణ ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి నవీన్ మిత్తల్, విపత్తుల నిర్వహణ కమిషనర్, అగ్నిమాపక విభాగం డైరెక్టర్ జనరల్ నాగిరెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, పంచాయితీరాజ్ కమిషనర్ సృజన, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
అసోంలో తగ్గని వరద తీవ్రత
గువాహటి: అసోంలో వరదల తీవ్రత గురువారం కూడా కొనసాగింది. మొత్తం ఏడు లక్షలమంది వరదలతో ప్రభావితులు కాగా, 21 జిల్లాల పరిధిలోని ప్రధాన నదుల్లో నీటి మట్టం అంతకంతకూ పెరుగుతోంది. వరదలు, కొండచరియలు విరిగి పడిన ఘటనల్లో మృతుల సంఖ్య 19కి చేరింది. బ్రహ్మపుత్ర సహా మొత్తం తొమ్మిది ప్రధాన నదులు ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. బరాక్, ఉపనదులు చచార్ జిల్లాలో ఉగ్రరూపాన్ని చూపుతున్నాయి. శ్రీభూమి జిల్లాలో అత్యధికంగా 339 గ్రామాల్లోని 2.60 లక్షల మందిపై వరద ప్రభావం పడింది. రాష్ట్రంలో వరదలతో మొత్తం 15 వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. కజిరంగా నేషనల్ పార్క్ జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఇలా ఉండగా, సిక్కింలోని చటెన్లో వరదల్లో చిక్కుకున్న 63 మంది హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వీరిలో ఎక్కువ మంది పర్యాటకులే కావడం గమనార్హం. చెటెన్లో చిక్కుకున్న మరో 64 మందిని బయటకు తీసుకువచ్చేందుకు ఆర్మీ, స్థానిక యంత్రాంగం ప్రయత్నాలు సాగిస్తున్నాయి. వాతావరణం అనుకూలించకపోవడంతో ఆలస్యమవుతోందని అధికారులు అంటున్నారు. -
సిక్కిం వరదల్లో చిక్కుకున్న విజయనగరం తహశీల్దార్ కుటుంబం
సాక్షి, న్యూఢిల్లీ/విజయనగరం అర్బన్ : సిక్కిం వరదల్లో విజయగరం తహసీల్దార్ ఎన్. కూర్మనాథరావు (42) ఆయన కుటుంబ సభ్యులు చిక్కుకుపోయారు. కుటుంబంతో కలిసి ఆయన 5 రోజుల క్రితం గ్యాంగ్‌టక్ విహారయాత్రకు వెళ్లారు. ప్రస్తుతం అక్కడికి 18 కిలోమీటర్లు దూరంలోని నార్త్ సిక్కిం ప్రాంతం మంగన్ జిల్లాలోని లుచూంగ్‌లో ఉన్నారు. అక్కడ కురిసిన భారీ వర్షాలకు వారు వెళ్లిన మార్గం ఆదివారం కొట్టుకుపోయింది.చుట్టుపక్కల వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వారు హోటల్‌కే పరిమితమయ్యారు. పర్యటనలో తహసీల్దార్‌తో పాటు ఆయన భార్య ఎం. ఉమ (38) (డిప్యూటీ తహసీల్దార్, ల్యాండ్ ఎక్విజేషన్ విభాగం బొబ్బిలి యూనిట్లో పనిచేస్తున్నారు), కుమార్తె దీక్షిత (15), కుమారుడు జయాన్‡్ష నారాయణ (6) ఉన్నారు.బెంగళూరులో పనిచేస్తున్న ఏడుగురు సాఫ్ట్వేర్ ఉద్యోగులు అభిషేక్‌రాజు (కర్నూలు), ఆదిత్యకిరణ్ (శ్రీకాకుళం), ఆదేష్ శ్రీవాస్తవ (బెంగళూరు), శ్రీజ సంతోష్ (బెంగళూరు), చందన్‌గౌడ (మైసూరు), సిరిన్ థామస్ (బెంగళూరు), సమృధి భాస్కర్ (బెంగళూరు) కూడా వరదలతో అక్కడే చిక్కుకుపోయారు. వీరంతా తహసీల్దార్ కుటుంబం బసచేసిన హోటల్‌కు సమీపంలోనే మరో హోటల్లో బసచేశారు.సురక్షితంగా తరలించేందుకు ఏర్పాట్లు.. కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు వరదల్లో చిక్కుకున్న కూర్మనాథరావు కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారిని సురక్షితంగా తీసుకురావాలని అక్కడి ఎయిర్‌పోర్టు అధికారులను ఆదేశించారు. తహసీల్దార్ కుటుంబ సమాచారాన్ని విజయనగరం జిల్లా కలెక్టర్ అంబేడ్కర్ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. తహశీల్దార్ కుటుంబాన్ని అక్కడనుంచి సురక్షితంగా తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఢిల్లీలోని ఏపీ భవన్ కూడా తెలిపింది. ఏపీ సీఎం ప్రిన్సిపల్ కార్యదర్శి రవిచంద్ర ఆదేశాల మేరకు.. ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు అక్కడి జిల్లా కలెక్టర్ అనంత్, ఎస్పీ చుంగ్టన్ అరుణ్ తటాల్ సహా స్థానిక అధికారులతో మాట్లాడుతున్నారు. అవసరమైన సహాయాన్ని అందించడంలో సిక్కిం డీజీపీ శ్రీధర్‌రావు కీలకపాత్ర పోషిస్తున్నారని ఏపీ భవన్ అధికారులు తెలిపారు.. పర్యాటకుల ఆందోళన.. తహసీల్దార్ కూర్మనాథరావు కుటుంబం ఉన్న మంగన్ జిల్లా లుచూంగ్‌లో రోడ్లన్నీ కొట్టుకుపోయి రవాణా పూర్తిగా స్తంభించిపోవడంతో అక్కడికి హెలికాప్టర్ వెళ్తేనే వారంతా సురక్షితంగా బయటకొచ్చే అవకాశముంది. వారు బసచేసిన ప్రాంతం చుట్టుపక్కల వరద నీరు చేరడంతో పర్యాటకులంతా ఆందోళన చెందుతున్నారు. -
ఈశాన్య రాష్ట్రాల్లో వరద బీభత్సం.. కొండచరియలు విరిగిపడి 30 మంది మృతి
గౌహతి: దేశంలోని ఈశాన్య రాష్ట్రాలను ఆకస్మిక వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. ఇదే తరుణంలో గత రెండు రోజుల్లో కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో 30 మంది మృతి చెందారు. అస్సాం, అరుణాచల్, మేఘాలయ, మణిపూర్, మిజోరం(Assam, Arunachal, Meghalaya, Manipur, Mizoram) రాష్ట్రాలు ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడుతున్న ఘటనలతో అతలాకుతలమవుతున్నాయి. అస్సాంలోని 12 జిల్లాల్లోని 60 వేల మంది ప్రజలు వరదలకు ప్రభావితమయ్యారు.అరుణాచల్ ప్రదేశ్‌లో సంభవించిన ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో తొమ్మిది మంది మృతిచెందారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని తూర్పు కామెంగ్ జిల్లాలో ఒక కారులపై కొండచరియలు విరిగిపడటంతో రెండు కుటుంబాలకు చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. అస్సాంలో గత 24 గంటల్లో కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో ఐదుగురు మృతిచెందారు. ఆరు జిల్లాల్లో వరదలు సంభవించాయి. 10 వేలకుపైగా జనం వరదలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.గౌహతి శివార్లలోని బోండా ప్రాంతంలో కొండచరియలు(Landslides) విరిగిపడి, ముగ్గురు మహిళలు మరణించారని పట్టణ వ్యవహారాల మంత్రి జయంత మల్లా బారువా తెలిపారు. గౌహతిలో 111 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇది 67 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టింది. బ్రహ్మపుత్రతో సహా ఈశాన్యంలోని పలు నదులలోని నీటి మట్టం పెరిగింది. శనివారం రాత్రి జిరోలోని పైన్ గ్రోవ్ సమీపంలోని ఒక రెస్టారెంట్‌పై కొండచరియలు విరిగిపడటంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్డీఆర్ఎఫ్), ఇండో-టిబెటన్ సరిహద్దు పోలీసులు (ఐటీబీపీ) సహాయక చర్యలు చేపడుతున్నారు.ఇది కూడా చదవండి: మావోయిజం అంతం? గణాంకాలివే.. -
నైజీరియా: ముంచెత్తిన వరదలు.. కూలిన డ్యామ్.. 111 మంది మృతి
అబుజా: నైజీరియాలో విషాదం చోటుచేసుకుంది. కుండపోత వర్షాల కారణంగా సెంట్రల్ నైజీరియాలో మోక్వా మార్కెట్ పట్టణాన్ని వరదలు ముంచెత్తాయి. వరదలు కారణంగా 111 మంది మరణించినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. గురువారం నుంచి ఏకధాటిగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు సమీపంలోని డ్యామ్ కూలిపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు వెల్లడించారు.వరదలు కారణంగా అధిక సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం వరకు కూడా మృతదేహాలను వెలికితీస్తూనే ఉన్నారు. 88 మంది మరణించగా.. 23 మృతదేహాలను వెలికితీశారు. దీంతో మృతుల సంఖ్య 111కి చేరుకుంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.At least 30 killed after torrential rains triggered flooding chaos in Niger, Mokwa #Nigeria#Africa #Flood #Mokwa #Flashflood #Rain #Climate #Weather #Viral pic.twitter.com/x2dI0JsoE8— Earth42morrow (@Earth42morrow) May 30, 2025 -
హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం
-
ఢిల్లీలో కుండపోత వర్షం.. నీటి మునిగిన కార్లు, బస్సులు
సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షం కురిసింది. కుండపోత వర్షం కారణంగా రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. దీంతో, వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. మరోవైపు.. ప్రతికూల వాతావరణం కారణంగా ఢిల్లీలో ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు విమాన సర్వీసులను దారి మళ్లించారు అధికారులు.వివరాల ప్రకారం.. ఢిల్లీలో ఆదివారం తెల్లవారుజామున ఈదురుగాలులతో కూడిన కుండపోత వర్షం కురిసింది. పలు కాలనీల్లో చెట్లు విరిగిపోయి పడిపోవడంతో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. వర్షం కారణంగా చాలా రోడ్లు, అండర్‌పాస్‌లు నీటితో నిండిపోయాయి. ఇక, వాతావరణం అనుకూలంగా లేని కారణంగా ఢిల్లీ ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాదాపు 200 విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా మరో 49 విమానాలను దారి మళ్లించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఎయిర్‌పోర్టు ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేసింది. విమానాల సమయాలను సంబంధిత వెబ్సైట్లలో చెక్ చేసుకోవాలని సూచించింది. ఎయిర్ ఇండియా, ఇండిగో కూడా ప్రయాణికులకు అలర్ట్‌లు పంపించాయి.VIDEO | Delhi rains: The road leading Terminal 3 of IGI Airport is still waterlogged causing inconvenience to travellers. #Delhi #DelhiWeather #Delhirains pic.twitter.com/01O0Q018Dv— Press Trust of India (@PTI_News) May 25, 2025ఇదిలా ఉండగా.. శనివారం అర్థరాత్రి కురిసిన వర్షానికి ఢిల్లీ నగరాన్ని విమానాశ్రయానికి కలిపే అండర్ పాస్ రోడ్డుపై భారీగా వరద నీరు చేరుకుంది. దీంతో, డజన్ల కొద్దీ కార్లు, బస్సులు నీటమునిగాయి. రానున్న కొన్ని గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. భారీ వర్షం కారణంగా ఇప్పటికే ఢిల్లీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. Bengaluru, Mumbai, Delhi, divided by language, united by turning into river rafting spots within 15 minutes of rain.This is an underpass in Delhi Cantt. Doesn’t seem like an old construction. Wonder why we don’t focus much on drainage and stormwater management. pic.twitter.com/NJ6wqfXJnx— THE SKIN DOCTOR (@theskindoctor13) May 25, 2025 Congratulations delhi This is the condition of Modi's Triple Engine project. Delhi drainage were choked.... in the first rain.@AtishiAAP @Saurabh_MLAgk @AamAadmiParty pic.twitter.com/KapywCZEwc— Himanshu Chauhan (@Himanshu_Aap_) May 24, 2025DELHI IN A DEPLORABLE CONDITION AFRET HEAVY RAINS⚡️⛈️Roads waterlogged even the highways, underpass blocked, even the lamp posts broken & fallen, blocking the roads; are common scenarios.#Delhi #DelhiWeather #DelhiNCR #delhirain pic.twitter.com/6me4kpSbMn— Barbarik (@Sunny_000S) May 25, 2025रात को आए तूफान में सफदरजंग एयरपोर्ट पर अधिकतम 82 किलोमीटर प्रति घंटे तक की रफ्तार वाली हवाएं चलीं।#DelhiRains pic.twitter.com/eex2EgTNmh— Hemant Rajaura (@hemantrajora_) May 25, 2025 -
పాక్ ఆక్రమిత కశ్మీర్లోకి వరదలోచ్చిస్తున్నాయ్స్సార్.. ఎవరైనా కాపాడండి!
పాక్ ఆక్రమిత కశ్మీర్లోకి వరదలోచ్చిస్తున్నాయ్స్సార్.. ఎవరైనా కాపాడండి! -
ప్రకృతి ప్రకోపం: ‘ఒక్కరాత్రిలోనే సర్వస్వం కోల్పోయాం’
న్యూఢిల్లీ: ప్రకృతి ప్రకోపానికి జమ్మూ కశ్మీర్ లోని రాంబాన్ కు చెందిన చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. భారీ స్థాయిలో కొండచరియలు విరిగిపడటంతో పాటు భారీ వరద నీటికి ఒక్క రాత్రిలోనే తమ జీవితం తల్లకిందులైందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ఆస్తులు, ఇళ్లులు అన్నీ కూడా ఆ ఘటనతో కోల్పోయమని పలువురు కన్నీటి పర్యంతమయ్యారు. ఇందులో ఓం సింగ్ అనే దుకాణదారుడు తన షాపు ఎలా నీటిలో కొట్టుకుపోయిందో ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. నేను అవతలి వైపు ఉంటున్నాను. కానీ అక్కడ నీటి ప్రవాహం చాలా అధికంగా ఉంది. మేము ఇక్కడకి సకాలంలో చేరుకోలేక పోయాం. నేను ఇక్కడికి చేరుకునే సరికి నా షాపు సహా మొత్తం మార్కెట్ అంతా అదృశ్యమైంది. దీనిని నేను కళ్లారా చూశాను. ఇలాంటింది చూడటం ఇదే తొలిసారి’ అని రాంబన్ నివాసి ఓమ్ సింగ్ తెలిపాడు.ఇది ఒక్క రాంబన్ పరిస్థితే కాదు. చాలా మంది పరిస్థితి ఇలానే ఉంది. తమ సర్వస్వం కోల్పోయామని వారు విలపిస్తున్నారు. వరద నీటి ప్రవాహానికి కొండచరియలు విరిగిపడటమే కాదు తాము సర్వస్వం కోల్పోయామని అంటున్నారు. కొండచరియలు విరిగిపడిన కారణంగా చాలా ఇళ్లు పూర్తిగా ధ్వంసమైనట్లు కొందరు పేర్కొన్నారు.#WATCH | Ramban, J&K: Om Singh, a local, says, "I live on the other side, but even there, the flow of water was very strong, we could not make it here in time. When I reached here, I saw the whole market, including my shop, had vanished... This is the first time I am seeing… https://t.co/aPfmXKXGjZ pic.twitter.com/VjIFqY4ySd— ANI (@ANI) April 20, 2025 #WATCH | Jammu and Kashmir: Several buildings have been damaged due to a landslide following heavy rains and hailstorm in Ramban district pic.twitter.com/jx3MGycq4s— ANI (@ANI) April 20, 2025 -
జమ్మూ కశ్మీర్ అతలాకుతలం.. ప్రకృతి విలయ తాండవం (ఫొటోలు)
-
వరద రాజధానిలో ప్రజాధనం వృథా
సాక్షి, అమరావతి: ఎంత మంది నిపుణులు కాదన్నా, ఆ ప్రాంతం రాజధానికి పనికి రాదని పర్యావరణ వేత్తలు చెప్పినా.. రాజకీయ పంతంతో చెవికెక్కించుకోని చంద్రబాబు తీరు వల్ల రాష్ట్ర ప్రజలపై తీవ్ర భారం పడుతోంది. రాజధానిలో వరద ముంపు తగ్గించేందుకు ఏకంగా 1995 ఎకరాల్లో వరద మౌలిక సదుపాయాల పనులు, పునరావాస ప్రణాళిక అమలు చేయాలని ప్రపంచ బ్యాంకు షరతు విధించింది. ఇందుకు అనుగుణంగా ఏపీ సీఆర్డీఏ వరద మౌలిక సదుపాయాల పనుల కోసం పునరావాస కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది.వరద ముంపు ఉన్న చోటే రాజధాని నిర్మాణం చేపట్టడం, చేయడమే చంద్రబాబు విజనా అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. వరద ముంపు నివారణ, పునరావాసం కోసమే వేల కోట్ల రూపాయలు వ్యయం చేయాల్సి వస్తోంది. వరద ప్రమాద తగ్గింపు పనులు చేపట్టేందుకు రూ.2,750.79 కోట్లు వ్యయం చేయనున్నట్లు సీఆర్డీఏ పునరావాస కార్యాచరణ ప్రణాళికలో స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను సీఆర్డీఏ ప్రపంచ బ్యాంకుకు అందజేసింది.వరద తగ్గింపు పనులతో సీఆర్డీఏ పరిధిలోని 21 గ్రామాల్లోని 5,288 మందిని తరలించాల్సి ఉందని అందులో స్పష్టం చేసింది. వరద నివారణకు కొండవీటి వాగు, పాల వాగు లోతు పెంచడంతో పాటు వెడల్పు చేయనున్నారు. మూడు జలాశయాలను నిర్మించనున్నారు. వాగులకు గ్రీన్ బఫర్‌తో ఉండవల్లి వద్ద వరద పంపింగ్ స్టేషన్‌ను, నీటి శుద్ధి కర్మాగారం నిర్మించడంతోపాటు 15 నీటి పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ పనులన్నీ పూర్తయితేనే అమరావతిలో వరద ముప్పు తగ్గుతుంది.ప్రపంచ బ్యాంకు విధానాల మేరకే పనులుప్రపంచ బ్యాంకు, ఏడీబీ విధానాలకు అనుగుణంగా వరద తగ్గింపు పనులకు టెండర్లు, భూ సేకరణ ఉంటుందని సీఆర్డీఏ పేర్కొంది. ఈ పనుల వల్ల గ్రామాల్లోని వారిని ఇతర చోట్లకు తరలించాల్సి ఉందని, వారికి పునరావాస ప్లాట్ల కోసం స్థలాలు గుర్తించడమే కాకుండా పునరావాస లే అవుట్ల అభివృద్ధి, రహదారులు, విద్యుత్ కనెక్షన్లు, తాగునీరు, డ్రైనేజీ తదితర సౌకర్యాలను కల్పించాల్సి ఉందని తెలిపింది.వరద తగ్గింపు పనుల వల్ల గ్రామాల ఉమ్మడి ఆస్తులైన ఏడు శ్మశాన వాటికలు, ఒక ఆలయ భూమి ప్రభావితం అవుతాయని, వీటి స్థానంలో రాజధాని నగర గ్రామాల అవసరాలను తీర్చడానికి తుళ్లూరు, నవులూరు, మందడంలో మూడు బహుళ–మత అంత్యక్రియల ప్రాంగణాలను నిర్మించాలని సీఆర్డీఏ ప్రతిపాదించింది. ఇళ్లు కోల్పోతున్న వారికి, అదే గ్రామాల్లో లేదా ఒకటి నుంచి రెండు కిలోమీటర్ల పరిధిలో పునరావాసం కల్పించనున్నారు. వరద తగ్గింపు పనులు చేపట్టేందుకు పెనుమాక, ఉండవల్లి, వెలగపూడిలో 12.09 ఎకరాలను 165 మందితో సంప్రదింపులు జరపడం ద్వారా సేకరిస్తున్నారు.ఈ గ్రామాల్లో 70 గృహాలు, రెండు వాణిజ్య సముదాయాలు, 16 ఇతర నిర్మాణాలకు పరిహారం చెల్లించనున్నారు. మరో 100.67 ఎకరాలను 342 మంది రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ స్కీము ద్వారా సేకరిస్తారని సీఆర్డీఏ తెలిపింది. ఈ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని పేర్కొంది. కాగా, వరద తగ్గింపు పనుల కోసం ప్రపంచ బ్యాంకు ఇప్పటికే రూ.1,742 కోట్లు విడుదల చేసింది. -
సాయం పేరుతో స్వాహా!
సాక్షి ప్రతినిధి, ఏలూరు : విజయవాడ వరద బాధితులను ఆదుకోవడానికి అందరూ బియ్యం ఇవ్వాలంటూ జనసేన శ్రేణులు గత ఏడాది ఊరూరా తిరిగి సేకరించారు. ఇలా దాతలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యా సంస్థల నుంచి భారీగా సేకరించారు. చివరికి అనుకున్న స్థాయిలో బియ్యం సేకరించాక ఆ మొత్తాన్ని జనసేన నియోజకవర్గ ఇన్చార్జి ఒకరు అమ్మేసి సొమ్ము చేసుకున్నారు. ఇప్పుడిది బయటకు పొక్కింది. దీంతో.. ఆ మొత్తం డబ్బును పార్టీకి విరాళంగా ఇస్తానని.. ఇదంతా మంత్రి కందుల దుర్గేష్‌కు చెప్పేచేశానని ఆయన తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయినా వివాదం ముదరడంతో రెండ్రోజుల క్రితం జంగారెడ్డిగూడెంలో దీనిపై పంచాయితీ జరిగింది. అయినా సెటిల్ కాకపోవడంతో జిల్లా ఇన్చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ దృష్టికి వ్యవహారం తీసుకెళ్లారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో ఇప్పుడీ వ్యవహారం కలకలం రేపుతోంది. ఆ వివరాలు..అసలేం జరిగిందంటే.. విజయవాడ వరద బాధితులను ఆదుకోవడానికంటూ జనసేన పార్టీ గోపాలపురం నియోజకవర్గ ఇన్చార్జి దొడ్డిగర్ల సువర్ణరాజు నేతృత్వంలో గతేడాది నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో భారీగా బియ్యం సేకరించారు. కానీ, ఇలా సేకరించిన బియ్యాన్ని విజయవాడలో బాధితులకు పంచకుండా ఆయన విక్రయించేశారు. ఈ సొమ్మును నియోజకవర్గ ఇన్చార్జే స్వాహా చేశాడని ఒక వర్గం దుమ్మెత్తిపోస్తుండగా.. ఇన్చార్జి వర్గం మాత్రం సొమ్ము తమవద్దే ఉందని, పార్టీకి విరాళం ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటే కుదరడంలేదని, మంత్రి కందుల దుర్గేష్‌కు విషయం చెప్పామని, ఆయన విరాళం ఇవ్వడానికి పవన్‌కళ్యాణ్ వద్దకు తీసుకువెళ్తారంటూ చెబుతున్నారు. అయితే, నాలుగు నెలల క్రితం జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ ద్వారకాతిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం వచ్చినప్పడు కూడా ఆయనకు చెక్కు ఇవ్వడం కుదరలేదా అని ప్రత్యర్థి వర్గం నిలదీస్తోంది.రూ.10 లక్షలు కాదు.. 16 లక్షలకు అమ్ముకున్నారు..జనసేన నియోజకవర్గ ఇన్చార్జి సువర్ణరాజు, ఆయన వ్యతిరేక వర్గం మధ్య ఈ విషయంలో కొద్దిరోజులుగా తారాస్థాయిలో వివాదం నడుస్తోంది. సేకరించిన బియ్యాన్ని రూ.10.27 లక్షలకు విక్రయించానని సువర్ణరాజు చెబుతుంటే.. రూ.16 లక్షలకు అమ్ముకున్నారని వ్యతిరేక వర్గం చెబుతోంది. దీనిపై పార్టీ జిల్లా నేతల వద్ద పంచాయితీ నిర్వహించారు. ఈ నేపథ్యంలో.. రెండ్రోజుల క్రితం జంగారెడ్డిగూడెంలో జనసేన నాయకుడు కరాటం సాయి పార్టీ ఆదేశాలతో గోపాలపురం నియోజకవర్గ నేతలతో సమావేశం నిర్వహించారు. సువర్ణరాజు అనుకూల, వ్యతిరేక వర్గాలు ఘర్షణకు దిగడంతో సమావేశం రసాభాసగా మారింది. దీంతో కరాటం సాయి చేతులెత్తేసి జిల్లా ఇన్చార్జి నాదెండ్ల మనోహర్ దృష్టికి వ్యవహారం తీసుకెళ్తున్నట్లు చెప్పి సమావేశం ముగించారు. -
విపత్తులను మించిన ప్రభుత్వ నిర్లక్ష్యం
సాక్షి, అమరావతి: కరువు ఉరిమినా.. తుఫాన్లు తుడిచిపెట్టినా.. వరదలు, వర్షాలు ముంచెత్తినా.. అన్నదాతపై చంద్రబాబు ప్రభుత్వానికి కనికరం లేదు. కష్టాల్లో ఉన్న రైతులను ఉదారంగా ఆదుకోవాల్సిందిపోయి వారిని అన్ని విధాలుగా మోసం చేస్తోంది. ఖరీఫ్ సీజన్ ముగిసి, రబీ కూడా చివరి దశకు చేరుకుంది. అయినా, ఖరీఫ్ ప్రారంభంలో దెబ్బతిన్న పంటలకూ పరిహారం ఇవ్వాలన్న ధ్యాసే లేదు. ఉచిత పంటల బీమా పథకాన్ని కూడా అటకెక్కించి ఆ పరిహారమూ అందకుండా చేసింది. సూపర్ సిక్స్‌లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి రైతుకు చెల్లించాల్సిన రూ.26 వేల ( పీఎం కిసాన్ సాయంతో కలిపి)పెట్టుబడి సాయమూ ఇవ్వకుండా మోసం చేసింది. ఇంకొక వైపు సీజన్ ముగియకుండానే అందించాల్సిన పంట నష్ట పరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) చెల్లింపులోనూ కావాలనే కాలయాపన చేస్తోంది. పంటలకు మద్దతు ధర లభించేలా చూడటంలోనూ చంద్రబాబు సర్కారుది మొండి వైఖరే. ఎరువులు, పురుగు మందులు, నాణ్యౖమెన విత్తనాలు లేక రైతులు అల్లాడుతున్నా పట్టించుకోవడంలేదు. వ్యాపారులు, దళారుల చేతిలో అన్యాయానికి గురవుతున్న అన్నదాతను ఆదుకోవాలన్న ఆలోచనే లేదు. మొత్తం మీద ప్రకృతి విపత్తులకంటే అన్నదాతకు కూటమి సర్కారు నిర్లక్ష్యమే పెద్ద విపత్తుగా మారిందన్న విమర్శలు వస్తున్నాయి.అడ్డగోలు కోతలతో.. కూటమి ప్రభుత్వం గద్దెనెక్కింది మొదలు నెలకొక వైపరీత్యం రైతులను వెంటాడుతూనే ఉంది. ఖరీఫ్ మొదట్లోనే జూలైలో అకాల వర్షాలు రైతులను దెబ్బతీశాయి. 16 జిల్లాల 1.65 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ప్రభుత్వం మాత్రం 44 వేల ఎకరాల్లోనే పంటలు దెబ్బతిన్నాయని, 31 వేల మందికి రూ.31.53 కోట్లు చెల్లించాలని లెక్కతేల్చింది. ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో కృష్ణా, వంశధార, నాగావళి నదులతో పాటు బుడమేరు, ఏలేరు వరదలు పంట పొలాలను ముంచెత్తాయి. 10 లక్షల ఎకరాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. తొలుత 5.93 లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయిన 4 లక్షల మందికి రూ.557.63 కోట్ల పరిహారం ఇవ్వాలని అంచనావేశారు. ప్రభుత్వం ఇందులో అడ్డగోలుగా కోతలు వేసి దెబ్బతిన్న పంటల విస్తీర్ణం 3.11 లక్షల ఎకరాలకు కుదించింది. కేవలం 2 లక్షల మందికి రూ.319.08 కోట్లు ఇవ్వాలని చెప్పింది. పోనీ అదైనా ఇచ్చిందా అంటే అదీ లేదు.వైఎస్ జగన్ హయాంలో..⇒ విపత్తులకు పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకొనేందుకు ప్రత్యేకంగా రూ.2 వేల కోట్లతో ప్రకృతి విపత్తుల నిధి ఏర్పాటు ⇒ ఏ సీజన్ పంట నష్ట పరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) అదే సీజన్ ముగిసేలోగా జమ. ఇలా ఐదేళ్లలో 34.41 లక్షల మందికి రూ.3,261.60 కోట్లు చెల్లించి అండగా నిలిచారు. ⇒ రైతులపై పైసా భారం పడకుండా ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేశారు. ఈ పథకం ద్వారా ఐదేళ్లలో 54.48 లక్షల మంది రైతులకు రూ.7,802.05 కోట్లు అందజేశారు. ⇒ వైఎస్సార్ రైతు భరోసా కింద ఐదేళ్లలో 53.58 లక్షల మందికి రూ.34,288.17 కోట్లు లబ్ధి చేకూర్చారు.చంద్రబాబు హయాంలో.. ⇒ బీమా ప్రీమియం బకాయిలు రూ.1,280 కోట్లు చెల్లించకపోవడం వల్ల రైతులకు దాదాపు రూ.2వేల కోట్లకు పైగా పరిహారం అందకుండా మోకాలడ్డారు. ⇒ 2024–25 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ఈ పాటికే రూ.833 కోట్లు బీమా ప్రీమియం చెల్లించాల్సి ఉంది. ఇందులో పైసా కూడా చెల్లించకపోవడంతో రైతులకు రూ.1200 కోట్లకుపైగా బీమా పరిహారం అందే పరిస్థితి లేకుండా పోయింది. ⇒ కూటమి పాలనలో పంటల బీమా పథకం ఉందో లేదో కూడా తెలియని అయోమయ స్థితి నెలకొంది. ⇒ సూపర్ సిక్స్‌లో ఇచ్చిన హామీ మేరకు కేంద్రమిచ్చే పీఎం కిసాన్ సాయంతో సంబంధం లేకుండానే ఒకే విడతలో ప్రతి రైతుకు రూ.20 వేల చొప్పున 2024–25లో చెల్లించాల్సిన రూ.10,717 కోట్లు కూడా చంద్రబాబు ఎగ్గొట్టారు.సగం మండలాల్లోనే కరువంటూ..లోటు వర్షపాతంతో రాయలసీమ జిల్లాల్లో 100 మండలాలకు పైగా కరువు కోరల్లో చిక్కుకున్నాయి. 60 రోజులకు పైగా చినుకు జాడ లేదు. 10 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ప్రభుత్వం మాత్రం మొక్కుబడిగా 54 మండలాలనే కరువు ప్రభావితంగా ప్రకటించింది. వీటికీ పైసా పరిహారం విదల్చలేదు. నవంబరులో విరుచుకుపడిన ఫెంగల్ తుఫాను కోతకొచ్చిన పంటలను తుడిచిపెట్టింది. దిగుబడులు గణనీయంగా పడిపోయాయి. అయినా రైతులను ఆదుకున్న పాపాన పోలేదు. ఇలా కూటమి ప్రభుత్వం వచ్చాక గత ఏడాది జూలై మొదలుకొని డిసెంబర్ వరకు వివిధ వైపరీత్యాలకు 20 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిని, రూ.2 వేల కోట్లకు పంట నష్టం జరిగినట్టు ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ధారించింది. ఇందులోనూ కోతలేసి చివరికి 6.65 లక్షల ఎకరాల్లోనే పంటలు దెబ్బతిన్నట్లు, రూ.527.18 కోట్లు చెల్లించాలంటూ లెక్కగట్టింది.దీంతోపాటు ఆధార్ సీడింగ్ కాకపోవడం, సరైన బ్యాంక్ ఖాతా నంబర్లు ఇవ్వక పోవడం వంటి సాంకేతిక కారణాలతో నిలిచిన 2023, 24 సీజన్ల కరువు సాయం బకాయిలు రూ.311.39 కోట్లు విడుదల చేయకుండా మోకాలడ్డింది. ఇలా మొత్తం రూ.838.57 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇందులో కేవలంæ 1.85 లక్షల మందికి రూ.284.56 కోట్లు చెల్లించి చేతులు దులిపేసుకుంది. అదీ కూడా ప్రజలు, వివిధ సంస్థలు ఇచ్చిన వరద విరాళాల పుణ్యమే. -
అసలు సమస్య ముంపే!
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిని ముంపు ముప్పు నుంచి తప్పించడానికి తొలి దశలో ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) నిధులతో కొండవీటి వాగుపై ఉండవల్లి వద్ద మరో 7,500 క్యూసెక్కులు ఎత్తిపోసేలా ఎత్తిపోతలను నిర్మించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. దీంతోపాటు కొండవీటి వాగు వరదను కృష్ణా నదికి మళ్లించేలా నెక్కళ్లు నుంచి పిచ్చుకలపాలెం వరకు 7.83 కిలోమీటర్ల పొడవున తవ్వే గ్రావిటీ కెనాల్‌పై నాలుగు చోట్ల పది క్యూసెక్కులను ఎత్తిపోసేలా ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తంగా ఈ ఐదు ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి వీలుగా సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీ కోసం అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏడీసీఎల్) టెండర్ నోటిఫికేషన్ (ఆసక్తి వ్యక్తీకరణ) జారీ చేసింది. షెడ్యూళ్ల దాఖలుకు ఫిబ్రవరి 14ను తుది గడువుగా నిర్దేశించింది. రాజధానిని ముంపు ముప్పు నుంచి తప్పించేందుకు 2018లో ఉండవల్లి వద్ద కొండవీటి వాగుపై 5 వేల క్యూసెక్కులను ఎత్తిపోసేలా రూ.260.48 కోట్లతో ఎత్తిపోతలను పూర్తి చేసింది. దీంతో పాటు ఇప్పుడు శాఖమూరు వద్ద 0.03, కృష్ణాయపాలెం వద్ద 0.10, నీరుకొండ వద్ద 0.4 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ల నిర్మాణం.. కొండవీటి వాగు, పాల వాగు ప్రవాహ సామర్థ్యాన్ని పెంచేలా వెడల్పు చేయడం, కొండవీటి వాగు వరదను కృష్ణా నదికి మళ్లించడానికి నెక్కళ్లు నుంచి పిచ్చుకలపాలెం వరకూ 7.83 కిలోమీటర్ల పొడవున గ్రావిటీ కెనాల్ తవ్వే పనులకు రూ.1,404.14 కోట్ల వ్యయంతో టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. రెండో దశలో లాం నుంచి వైకుంఠపురం వరకు గ్రావిటీ కెనాల్ తవ్వి.. దానికి అనుబంధంగా లాం, పెదపరిమి, వైకుంఠపురం వద్ద మూడు రిజర్వాయర్లు, వైకుంఠపురం వద్ద మరో ఎత్తిపోతలను నిర్మించాలని ప్రపంచ బ్యాంకు–ఏడీబీ ప్రతినిధులు సూచించారని ప్రభుత్వం చెబుతోంది. వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. రాజధాని అమరావతిని ముంపు ముప్పు నుంచి తప్పించే పనుల వ్యయమే తడిసి మోపేడయ్యేలా ఉందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.222 మి.మీ వర్షం కురిసినా ముప్పు ఉండకూడదురాజధాని అమరావతి ప్రాంతంలో వందేళ్లలో నమోదైన వర్షపాతం గణాంకాలను ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధుల బృందం విశ్లేషించింది. వందేళ్లలో ఒకసారి అమరావతి ప్రాంతంలో గరిష్టంగా 222 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆ స్థాయిలో వర్షం కురిసినా రాజధాని అమరావతిని వరద ముప్పు నుంచి తప్పించేలా ముంపు నివారణ పనులు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించింది. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధుల ప్రణాళిక మేరకు రాజధాని ముంపు నివారణ ప్రణాళికను ప్రభుత్వం ఖరారు చేసింది. ఆ ప్రణాళికలో ప్రధానాంశాలిలా ఉన్నాయి.» రాజధాని ప్రాంతంలో ప్రవహించే వాగుల్లో ప్రధానమైనవి కొండవీటి వాగు, పాలవాగు. కొండవీటి కొండల్లో పేరిచెర్ల వద్ద జన్మించే కొండవీటి వాగు అచ్చంపేట, తాడికొండ, అమరావతి, మంగళగిరి మండలాల మీదుగా ప్రవహించి ప్రకాశం బ్యారేజ్ ఎగువన ఉండవల్లి వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. కొండవీటి వాగు పరివాహక ప్రాంతం 421 చదరపు కిలోమీటర్లు. కొండవీటి కొండల నుంచి ప్రవాహించే ఈ వాగు 31.15 కిలోమీటర్ల ప్రయాణం తరువాత నీరుకొండ వద్ద రాజధానిలోకి ప్రవేశిస్తుంది. » రాజధాని ప్రాంతంలో కొండవీటి వాగు 23.85 కిలోమీటర్ల పొడవున ప్రవహిస్తుంది. ప్రస్తుతం ఈ వాగు కనిష్టంగా 6 మీటర్ల నుంచి గరిష్టంగా 20 మీటర్ల వెడల్పుతో ప్రవహిస్తోంది. కృష్ణా నది, కొండవీటి వాగుకు ఒకేసారి వరదలు వస్తే.. కృష్ణా వరద కొండవీటి వాగులోకి 23.85 కిలోమీటర్ల పొడవున ఎగదన్నే ప్రమాదం ఉంది. ఇది రాజధాని ముంపునకు దారితీస్తుంది. » రాజధానికి కొండవీటి వాగు ముంపు ముప్పు నివారించడానికి ఆ వాగు ప్రవాహ సామర్థ్యాన్ని అనంతవరం నుంచి శాఖమూరు మీదుగా నీరుకొండ వరకు (11.6 కి.మీ నుంచి 23.6 కి.మీ వరకు) 2,120 క్యూసెక్కులకు పెంచేలా వెడల్పు, లోతు పెంచాలి. కృష్ణాయపాలెం నుంచి నీరుకొండ వరకు(4.6 కి.మీ నుంచి 11.6 కి.మీ) కొండవీటి వాగు ప్రవాహ సామర్థ్యాన్ని 8,120 క్యూసెక్కులకు పెంచేలా లోతు, వెడల్పు చేయాలి. కృష్ణాయపాలెం నుంచి ఉండవల్లి వరకు (4.6 కి.మీ నుంచి 0 కి.మీ) కొండవీటి వాగు ప్రవాహ సామర్థ్యాన్ని 8,120 క్యూసెక్కులకు పెంచేలా వెడల్పు, లోతు పెంచాలి. » నీరుకొండ వద్ద 0.4, కృష్ణాయపాలెం వద్ద 0.1, శాఖమూరు వద్ద 0.03 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్లు నిర్మించాలి. » ఉండవల్లి వద్ద కొండవీటి వాగు నుంచి 5 వేల క్యూసెక్కులను ప్రకాశం బ్యారేజ్‌లోకి.. కృష్ణా పశ్చిమ డెల్టా కాలువలోకి ఎత్తిపోసేలా ఇప్పటికే ఎత్తిపోతలను నిర్మించారు. దానికి అనుబంధంగా 7,500 క్యూసెక్కుల సామర్థ్యంతో మరో ఎత్తిపోతల నిర్మించాలి. » పాల వాగు సామర్థ్యాన్ని కృష్ణాయపాలెం నుంచి దొండపాడు వరకు 16.7 కి.మీల పొడవున 8,830 క్యూసెక్కులకు పెంచేలా వెడల్పు, లోతు పెంచాలి.» నెక్కళ్లు నుంచి పిచ్చుకలపాలెం వరకు 7.843 కి.మీల పొడవున 10,500 క్యూసెక్కుల సామర్థ్యంతో గ్రావిటీ కెనాల్ తవ్వాలి. ఈ కెనాల్‌పై నాలుగు చోట్ల పది క్యూసెక్కుల సామర్థ్యంతో ఎత్తిపోతల పథకాలు నిర్మించాలి. ఈ పనులన్నీ తొలి దశలో పూర్తి చేయాలి.» రెండో దశలో రాజధాని అమరావతి ఆవల ప్రాంతం నుంచి కొండవీటి వాగు వరద ప్రవాహం 12,500 క్యూసెక్కులకు మళ్లించేలా లాం నుంచి వైకుంఠపురం వరకు గ్రావిటీ కెనాల్ తవ్వాలి. దానికి అనుబంధంగా లాం, పెదపరిమి, వైకుంఠపురం వద్ద రిజర్వాయర్లు నిర్మించాలి. కొండవీటి వాగు వరద ప్రవాహం 5,650 క్యూసెక్కులు కృష్ణా నదిలోకి ఎత్తిపోసేలా ఎత్తిపోతల నిర్మించాలి. » రాజధాని ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన వెంటనే రిజర్వాయర్లను ఖాళీ చేయాలి. వరద నియంత్రణను పర్యవేక్షించడానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. -
కంటతడి ఆరలేదు..
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఆగస్టు 31, 2024.. ఆకేరు వాగు నడిరాత్రి వేళ రైతు కంట వరద పారించింది. బువ్వపెట్టే భూమిని బీడుపెట్టింది. నాడు ఆకేరు సృష్టించిన విలయంతో పచ్చని పొలాల్లో ఇసుక, రాళ్లురప్పలు మేటవేశాయి. ఇళ్లు నేలకూలాయి. గొడ్డూగోదా, సామగ్రి.. సర్వం కొట్టుకుపోయాయి. ఎటుచూసినా ఐదారు మీటర్ల మేర పేరుకుపోయిన రాళ్లదిబ్బలు.. ఎకరాకు రూ.2 లక్షలు వెచ్చించి వీటిని తొలగిస్తే తప్ప సాగులోకి వచ్చే పరిస్థితి లేని భూములు.. ఏటా రెండు పంటలు పండించి.. ఇప్పుడు చేతిలో చిల్లిగవ్వ లేక చేష్టలుడిగి కూలీలుగా మారిపోయిన రైతన్న.. నాడు అతలాకుతలమైన వీరి జీవితాలు ఇప్పుడెలా ఉన్నాయి?.. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం రాకాసితండాలోని పరిస్థితులపై ‘సాక్షి’ పరిశీలన..ఆరు నెలలుగా అదే దైన్యం.. పోతుగంటి సహదేవ్ రెక్కలు ముక్కలు చేసుకుని 90 బస్తాల ధాన్యాన్ని నిల్వ చేశాడు. రేపోమాపో మిల్లుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నంతలోనే వరద ముంచెత్తింది. 40 బస్తాలు నీళ్లపాలయ్యాయి. తడిసిన 50 బస్తాల ధాన్యా న్ని కొని ఆదుకుంటామన్న అధికారులు ఇప్పుడు చేతులెత్తేశారు. 6 నెలలుగా ఆ ధాన్యం అలాగే పడి ఉంది.సాయం చేస్తేనే సాగుపోతుగంటి బ్ర హ్మం ఐదెకరాల ఆసామి. 2.20 ఎకరాల్లో వరి, ఎకరంన్నరలో మిర్చి, ఎకరంలో పత్తి వేశాడు. పంటపండి చేతికొస్తుందనుకున్న దశలో ఆకేరు వరదతో పొలమంతా ఇసుక మేటలు వేసింది. ప్రభుత్వం ఎకరానికి రూ.10 వేల చొప్పున ఐదెకరాలకు ఇచ్చనా రూ.50 వేలకు తోడు మరో లక్ష వెచ్చించి పొలాన్ని బాగు చేసుకున్నాడు. మిగతా భూమి పరిస్థితేమిటో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు.చి‘వరి’కిలా మిగిలా..పోతుగంటి వెంకన్న నాలుగెకరాల్లో వరి సాగు చేశాడు. వరద దెబ్బకు పంట మొత్తం రాళ్లురప్పల పాలైంది. రూ.2 లక్షలు ఖర్చుచేసి 200 ట్రిప్పుల మట్టి తోలించి పొలాన్ని సాగు యోగ్యం చేసుకుని ప్రస్తుతం వరి సాగుచేస్తున్న ఆయన.. బావులు పూడుకుపోవడంతో ఏటిలోని నీటిని మోటార్ల ద్వారా తరలిస్తూ తలకుమించిన భారాన్ని మోస్తున్నానని వాపోతున్నాడు. -
అమరావతి ‘ముంపు టెండర్ల’లో అక్రమాల వరద
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిని కొండవీటి వాగు, పాల వాగు వరద ముంపు ముప్పు నుంచి తప్పించేందుకు చేపట్టే పనుల టెండర్లలో అక్రమాలు వరదెత్తాయి. పనుల అంచనా వ్యయాన్ని 100 నుంచి 250 శాతం పెంచేసి.. మూడు ప్యాకేజీలుగా విభజించి.. ముందుగా ఎంపిక చేసిన కాంట్రాక్ట్ సంస్థలకే పనులు దక్కేలా నిబంధనలతో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏడీసీఎల్) అధికారుల ద్వారా ముఖ్యనేతలు మూడు టెండర్ నోటిఫికేషన్లు జారీ చేయించారు. వీటి కాంట్రాక్ట్ విలువ (అన్ని పన్నులతో కలిపి) రూ.1,404.13 కోట్లుగా నిర్దేశించారు. పనుల విలువ కంటే అధిక ధరలకు కాంట్రాక్ట్ సంస్థలకు పనులు అప్పగించి.. పెంచిన అంచనా వ్యయం రూ.702.33 కోట్లను కమీషన్ల రూపంలో రాబట్టుకోవడానికి ప్రణాళిక రచించారు. మూడు ప్యాకేజీల పనులు ఇవీ ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) రుణంగా ఇస్తున్న నిధులతో మూడు ప్యాకేజీల కింద ఏడీసీఎల్ చేపట్టింది. ఒకటో ప్యాకేజీ కింద కొండవీటి వాగు ప్రవాహ సామర్థ్యాన్ని పెంచేలా 23.6 కి.మీ. పొడవున వెడల్పు చేసి లోతు పెంచడం, పాల వాగు ప్రవాహ సామర్థ్యాన్ని పెంచేలా 16.75 కి.మీ. పొడవున వెడల్పు చేసి, లోతు పెంచడం, శాఖమూరు వద్ద 0.03 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణ పనులను ఎల్ఎస్ (లంప్సమ్) విధానంలో 24 నెలల్లో పూర్తి చేయడంతోపాటు మరో రెండేళ్లు నిర్వహించాలని నిబంధనతో ఈ నెల 9న టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పనుల కాంట్రాక్ట్ విలువను రూ.462.26 కోట్లుగా నిర్దేశించింది. దీనికి అదనంగా రూ.60.53 కోట్లను జీఎస్టీ, ఎన్ఏసీ (నేషనల్ కన్స్ట్రక్షన్ అకాడమీ), సీనరేజీ వంటి పన్నుల రూపంలో రీయింబర్స్ చేస్తామని పేర్కొంది. అంటే.. ఈ ప్యాకేజీ పనుల అంచనా వ్యయం రూ.522.79 కోట్లు. రెండో ప్యాకేజీ ఇదీ రెండో ప్యాకేజీ కింద నెక్కళ్లు నుంచి పిచ్చుకలపాలెం వరకూ 7.843 కి.మీ. పొడవున గ్రావిటీ కెనాల్ తవ్వడం.. కృష్ణాయపాలెం వద్ద 0.1 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణ పనులకు ఎల్ఎస్ పద్ధతిలో రెండేళ్లలో పూర్తి చేసి, మరో రెండేళ్లు నిర్వహించాలనే షరతుతో ఈ నెల 9న టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పనుల కాంట్రాక్ట్ విలువను రూ.303.73 కోట్లుగా నిర్దేశించింది.దీనికి అదనంగా రూ.38.57 కోట్లను జీఎస్టీ, ఎన్ఏసీ, సీనరేజీ వంటి పన్నుల రూపంలో రీయింబర్స్ చేస్తామని పేర్కొంది. అంటే.. ఈ పనుల మొత్తం అంచనా విలువ రూ.342.3 కోట్లు. ఒకటో, రెండో ప్యాకేజీ పనులకు షెడ్యూళ్లు దాఖలు చేయడానికి ఈనెల 31 తుది గడువు. అదే రోజున టెక్నికల్ బిడ్ తెరిచి.. అర్హత ఉన్న కాంట్రాక్ట్ సంస్థలు దాఖలు చేసిన ఆరి్థక బిడ్లను ఫిబ్రవరి 5న తెరుస్తారు. తక్కువ ధరకు కోట్ చేసి ఎల్–1గా నిలిచిన సంస్థకు పనులు అప్పగించనున్నారు. మూడో ప్యాకేజీ కింద.. మూడో ప్యాకేజీ కింద మంగళగిరి మండలం నీరుకొండ వద్ద 0.4 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణ పనులకు ఎల్ఎస్ పద్ధతిలో ఈ నెల 1న టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పనుల కాంట్రాక్ట్ విలువను రూ.470.74 కోట్లుగా నిర్దేశించింది. దీనికి అదనంగా జీఎస్టీ, ఎన్ఏసీ, సీనరేజీ వంటి పన్నుల రూపంలో రూ.68.30 కోట్లను రీయింబర్స్ చేస్తామని పేర్కొంది. అంటే.. ఈ పనుల మొత్తం అంచనా వ్యయం రూ.539.04 కోట్లు. ఈ పనుల టెండర్లలో షెడ్యూళ్ల దాఖలుకు ఈ నెల 22 తుది గడువు. అదే రోజున టెక్నికల్ బిడ్, ఈనెల 25న ఆర్థిక బిడ్ తెరిచి ఎల్–1గా నిలిచిన కాంట్రాక్ట్ సంస్థకు పనులు కట్టబెట్టనున్నారు. అంచనాల్లో పొంగిపొర్లిన అక్రమాలు రాజధాని ప్రాంతం నల్లరేగడి భూమితో కూడుకున్నది. పెద్దగా రాళ్లు, రప్పలు ఉండవు. పొక్లెయిన్లు వంటి యంత్రాలతో సులువుగా కాలువ తవ్వవచ్చు. పైగా ఇవేమీ కొత్తగా తవ్వే కాలువలు కాదు. కొండవీటి వాగు, పాల వాగులను విస్తరించడమే.. కొత్తగా 7.843 కిమీల పొడవున మాత్రమే కాలువ తవ్వాలి. ప్రస్తుత ఎస్ఎస్ఆర్ (స్టాండర్డ్ షెడ్యూల్డ్ రేట్స్) ప్రకారం క్యూబిక్ మీటర్ మట్టి తవ్వడానికి ప్రస్తుతం గరిష్టంగా రూ.100 చెల్లిస్తున్నారు.ఈ లెక్కన 8 నుంచి 9 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో కి.మీ. పొడవున కాలువ తవ్వకం పనుల అంచనా వ్యయం రూ.4.50 కోట్ల నుంచి రూ.5 కోట్లకు మించదని, 10 నుంచి 11 వేల క్యూసెక్కుల కాలువ తవ్వకం పనులకు కి.మీ. రూ.5.5 కోట్ల నుంచి రూ.6 కోట్ల (జీఎస్టీ, సీనరేజీ, ఎన్ఏసీ వంటి పన్నులతో కలిపి)కు మించదని జలవనరుల శాఖలో అనేక ప్రాజెక్టుల్లో చీఫ్ ఇంజినీర్‌గా పనిచేసి పదవీ విరమణ చేసిన ఒక అధికారి తేల్చిచెప్పారు.ప్రస్తుత ఎస్ఎస్ఆర్ ధరల ప్రకారం ఒక టీఎంసీ సామర్థ్యంతో కొత్తగా రిజర్వాయర్ నిర్మించడానికి అంచనా వ్యయం జీఎస్టీ, ఎన్ఏసీ, సీనరేజీ వంటి పన్నులతో కలిపి రూ.250 కోట్ల నుంచి రూ.300 కోట్లకు మించదని రిజర్వాయర్ల నిర్మాణంలో అపార అనుభవం ఉన్న మరో రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ఒకరు స్పష్టం చేస్తున్నారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. ఒకటో ప్యాకేజీ కింద చేపట్టిన పనుల అంచనా వ్యయం రూ.301.75 కోట్లకు మించదు. కానీ.. ఈ ప్యాకేజీ కాంట్రాక్ట్ విలువను జీఎస్టీ వంటి పన్నులతో కలిపి రూ.522.79 కోట్లుగా ఏడీసీఎల్ నిర్దేశించింది. అంటే.. అంచనా వ్యయాన్ని రూ.221.04 కోట్లు పెంచేసినట్టు స్పష్టమవుతోంది. కొండవీటి వాగు, పాల వాగు లోతు, వెడల్పు పెంచే పనులకు కి.మీ. రూ.5 కోట్లు చొప్పున వేసుకున్నా రూ.201.75 కోట్లు అవుతుంది. శాఖమూరు వద్ద 0.03 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణానికి రూ.వంద కోట్లు లోపే అవుతుంది.జ్యుడీషియల్ ప్రివ్యూ ఉండి ఉంటే..జ్యుడీషియల్ ప్రివ్యూ వ్యవస్థ ఉండి ఉంటే టెండర్ ముసాయిదా షెడ్యూల్ దశలోనే ఈ అక్రమాలు బహిర్గతమయ్యేవని.. అందుకే ఆ వ్యవస్థను కూటమి ప్రభుత్వం రద్దు చేసిందని రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ ఒకరు స్పష్టం చేశారు. జాయింట్ వెంచర్‌గా ఏర్పడి టెండర్ షెడ్యూల్ దాఖలు చేయడానికి వీల్లేదని నిబంధన పెట్టడం ద్వారా ముందే ఎంపిక చేసిన బడా కాంట్రాక్ట్ సంస్థకే పనులు అప్పగించేందుకు ముఖ్యనేతలు ఎత్తుగడ వేసినట్టు స్పష్టమవుతోంది. అదే టెండర్ నోటిఫికేషన్లో 50 శాతం పనులను సబ్ కాంట్రాక్ట్ కింద ఇచ్చే వెసులుబాటును కల్పించడాన్ని బట్టి చూస్తే ముఖ్యనేతల దోపిడీ పన్నాగం బట్టబయలవుతుందని రిటైర్డ్ ఎస్ఈ ఒకరు స్పష్టం చేశారు.రాష్ట్రంలో 2014–19 మధ్య టెండర్ల వ్యవస్థను నీరుగార్చి, ప్రతిపాదన దశలోనే పనుల అంచనా వ్యయాన్ని భారీగా పెంచేసి.. అస్మదీయ కాంట్రాక్టర్లకు అధిక ధరలకు కట్టబెట్టడం ద్వారా ప్రభుత్వ ఖజానాను దోచిపెట్టి.. మొబిలైజేషన్ అడ్వాన్సులు ముట్టజెప్పి.. వాటిని కమీషన్ల రూపంలో వసూలు చేసుకుని జేబులో వేసుకోవడానికి ముఖ్య నేతలు మరిగారు. 2019 మే 30న వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించాక జ్యుడీషియల్ ప్రివ్యూ చట్టాన్ని చేసి.. టెండర్ల వ్యవస్థకు జవసత్వాలు చేకూర్చారు. మొబిలైజేషన్ అడ్వాన్సు విధానాన్ని రద్దు చేశారు. రూ.100 కోట్లు.. అంతకంటే వ్యయం ఎక్కువగా ఉన్న పనులకు సంబంధించి టెండర్ ముసాయిదా షెడ్యూల్‌ను జ్యుడీషియల్ ప్రివ్యూకు పంపాలి.దీన్ని వెబ్సైట్లో అప్లోడ్ చేసి.. ఇంజనీర్లు, మేధావులు, ప్రజలు, కాంట్రాక్ట్ సంస్థల నుంచి ఆన్లైన్లో జ్యుడీషియల్ ప్రివ్యూ జడ్జి అభిప్రాయాలను తీసుకుంటారు. వాటి ఆధారంగా ముసాయిదా షెడ్యూల్లో మార్పులు చేర్పులు సూచిస్తారు. ఆ మేరకు మార్పులు చేర్పులు చేసిన ముసాయిదా షెడ్యూల్‌ను జ్యుడిషియల్ ప్రివ్యూ జడ్జి ఆమోదిస్తారు. దాంతోనే సంబంధిత శాఖ అధికారులు టెండర్ నోటిఫికేషన్ జారీ చేయాలి. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం జ్యుడీషియల్ ప్రివ్యూను రద్దు చేసింది. మొబిలైజేషన్ అడ్వాన్స్ విధానాన్ని పునరుద్ధరించింది. ఇది జరిగాకే రూ.వంద కోట్లు అంతకంటే ఎక్కువ వ్యయం ఉన్న పనులకు టెండర్లు పిలుస్తున్నారు. మిగిలిన రెండు ప్యాకేజీల్లోనూ ఇదే తీరురెండో ప్యాకేజీ కింద చేపట్టిన పనుల అంచనా వ్యయం అన్ని పన్నులతో కలిపి రూ.197.05 కోట్లకు మించదని రిటైర్డ్ సీఈ ఒకరు స్పష్టం చేశారు. కానీ.. ఆ పనుల అంచనా వ్యయం పన్నులతో కలిపి రూ.342.3 కోట్లుగా ఏడీసీఎల్ నిర్దేశించింది. అంటే అంచనా వ్యయం రూ.145.25 కోట్ల మేర పెంచేసినట్టు స్పష్టమవుతోంది. 10,500 క్యూసెక్కుల సామర్థ్యంతో 7.843 కి.మీ. పొడవున గ్రావిటీ కెనాల్ తవ్వడానికి.. కిలోమీటర్‌కు రూ.6 కోట్ల చొప్పున రూ.47.05 కోట్లు అవుతుంది.కృష్ణాయపాలెం వద్ద 0.1 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణ వ్యయం రూ.150 కోట్లకు మించదు. మూడో ప్యాకేజీ కింద నీరుకొండ వద్ద 0.4 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణ వ్యయం అన్ని పన్నులతో కలిపి రూ.200 కోట్లకు మించదని రిటైర్డ్ సీఈ ఒకరు స్పష్టం చేశారు. కానీ.. ఆ పనుల అంచనా వ్యయం అన్ని పన్నులతో కలిపి రూ.339.04 కోట్లు పెంచేసినట్టు స్పష్టమవుతోంది. మొత్తమ్మీద ముంపు ముప్పు నివారించడానికి చేపట్టిన మూడు ప్యాకేజీల పనుల్లో అంచనా వ్యయాన్ని రూ.702.33 కోట్లు పెంచేసినట్టు తేటతెల్లమవుతోంది. -
ఆ అమ్మ సునామీకి జన్మనిచ్చింది!
ఎప్పుడూ చూసే సముద్రమే ఆ రోజు కొత్తగా ఉంది. భయంగా ఉంది. ఎప్పుడూ నవ్వుతూ పలకరించే సముద్రం విలయ విధ్వంసానికి సిద్ధంగా ఉంది. ఆరోజు... ఏ రోజూ మరచిపోలేని రోజు. సునామీ విశ్వరూపాన్ని చూపిన రోజు. ఇరవై సంవత్సరాల తరువాత కూడా... నిన్ననే జరిగినట్లు వెన్నులో చలిపుట్టించే రోజు...అండమాన్ నికోబార్‌లోని హట్ బే దీవిలో భీకర అలల ధాటికి నమిత రాయ్ ఇల్లు పూర్తిగా దెబ్బతిన్నది. అప్పుడు నమిత వయసు పాతిక సంవత్సరాలు. దిక్కుతోచని పరిస్థితుల్లో పాములకు ప్రసిద్ధి చెందిన అడవిలో ఆశ్రయం పొందారు. ఎటు నుంచి ఏ విషసర్పం వచ్చి ప్రాణం తీస్తుందో తెలియని భయానక పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లోనే ఆ పాముల అడవిలోనే పండంటి పిల్లాడికి జన్మనిచ్చింది నమిత.ఆ పిల్లాడికి ‘సునామీ’ అని పేరు పెట్టారు. రెండు దశాబ్దాల తరువాత మళ్లీ ఆ రోజుల్లోకి వెళ్లింది నమిత రాయ్...‘ఆ చీకటి రోజును గుర్తు చేసుకుంటే ఇప్పటికీ ఒంట్లో వణుకు పుడుతుంది. అప్పుడు నేను గర్భవతిని. రోజువారీ పనులతో బిజీగా ఉన్నాను. ఉన్నట్టుండి భయంకరమైన నిశ్శబ్దం ఆవరించింది. మా తీరం నుండి మైళ్ళ దూరంలో సముద్రం తగ్గుముఖం పట్టడం చూసి షాక్ అయ్యాను. కొన్ని సెకనుల తరువాత మా దీవి వైపు భారీ సముద్రపు అలలు దూసుకొస్తున్నాయి, ఆ తర్వాత బలమైన ప్రకంపనలు వచ్చాయి. ప్రజలు కేకలు వేస్తూ గుట్ట వైపు పరుగెత్తడం చూశాను. పానిక్ ఎటాక్ వచ్చి స్పృహ తప్పి పడిపోయాను.కొన్ని గంటల తరువాత స్పృహలోకి వచ్చాను. కొండ అడవిలో వేలాది మంది స్థానికుల మధ్య నేను ఉన్నాను. నా భర్త, పెద్ద కొడుకును చూడగానే ప్రాణం లేచి వచ్చింది. మా ద్వీపంలోని చాలాప్రాంతాలు రాక్షస అలల తాకిడికి నాశనం అయ్యాయి. ఆస్తి అనేది లేకుండా పోయింది.ఒకరోజు రాత్రి పదకొండు గంటల తరువాత నాకు పురిటినొప్పులు వచ్చాయి. కానీ చుట్టుపక్కల డాక్టర్లు ఎవరూ లేరు. నేను ఒక బండరాయిపై పడుకొని సహాయం కోసం ఏడ్చాను. నా భర్త ఎంత ప్రయత్నించినా వైద్యసహాయం అందలేదు. అడవిలో ఆశ్రయం పొందిన కొందరు మహిళలను నా భర్త వేడుకున్నాడు. వారి సాయంతో అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో సునామీకి జన్మనిచ్చాను.తిండి లేదు. సముద్రానికి భయపడి అడవి నుండి బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో నా బిడ్డ బతుకుతాడా అనే బాధ మొదలైంది. కొబ్బరి నీళ్లే ఆహారమయ్యాయి. లాల్ టిక్రీ హిల్స్‌లో నాలుగు రాత్రులు గడిపిన మమ్మల్ని రక్షణ సిబ్బంది కాపాడారు. చికిత్స కోసం నన్ను పోర్ట్ బ్లెయిర్‌లోని జీబీ పంత్ ఆసుపత్రికి ఓడలో తీసుకువెళ్లారు. హట్ బే నుంచి పోర్ట్ బ్లెయిర్‌కు 117 కిలోమీటర్ల దూరం. సుమారు ఎనిమిది గంటల సమయం పట్టింది’ అంటూ గతాన్ని గుర్తు చేసుకుంది నమిత.కోవిడ్ మహమ్మారి సమయంలో భర్త లక్ష్మీ నారాయణ మరణించడంతో ఇద్దరు కుమారులు సౌరభ్, సునామీలతో కలిసి పశ్చిమబెంగాల్లోని హుగ్లీలో నివసిస్తుంది నమితా రాయ్.నమిత పెద్ద కుమారుడు సౌరభ్ ఒక ప్రైవేట్ షిప్పింగ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. చిన్న కుమారుడు సునామీ ‘ఓషనోగ్రాఫర్’ కావాలనుకుంటున్నాడు.‘మా అమ్మే నాకు సర్వస్వం. ఆమె ధైర్యశాలి. నాన్న చనిపోయాక మమ్మల్ని పోషించడానికి చాలా కష్టపడింది. ఫుడ్ డెలివరీ సర్వీసును నిర్వహించింది. దానికి సునామీ కిచెన్ అని సగర్వంగా పేరు పెట్టింది’ అంటున్నాడు సునామీ రాయ్.‘2004లో సమర్థవంతమైన హెచ్చరిక వ్యవస్థ లేకపోవడంతో పెద్ద ఎత్తున విధ్వంసం,ప్రాణ నష్టం జరిగింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 1.400కు పైగా హెచ్చరిక కేంద్రాలు(వార్నింగ్ స్టేషన్స్) ఉన్నాయి. సునామీ నాటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు మేము సర్వసన్నద్ధంగా ఉన్నాం’ అంటున్నారు అండామన్ నికోబార్ దీవుల అడ్మినిస్ట్రేషన్ సీనియర్ అధికారులు. -
గ్లోబల్ ‘వార్నింగ్’ ఇటు వరద... అటు కరువు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘గ్లోబల్ వార్మింగ్’ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రానున్న కొన్నేళ్లలో దేశవ్యాప్తంగా భూ ఉపరితల ఉష్ణోగ్రతల కారణంగా ప్రాంతాల వారీగా తీవ్రతను బట్టి వరదలు, కరువు వంటి పరిస్థితులు ఎదురు కానున్నాయి. ముఖ్యంగా కొన్ని రాష్ట్రాలు తీవ్ర కరువును, మరికొన్ని తీవ్ర వరద ముప్పును ఎదుర్కోనున్నాయి. ఈమేరకు ఐఐటీ గువహటి, ఐఐటీ మండీ, బెంగళూరుకు చెందిన సీఎస్‌టీఈపీ (సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ పాలసీ) సంస్థలు తాజాగా చేసిన సంయుక్త అధ్యయనంలో పేర్కొన్నాయి.దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ వాతావరణంలో మార్పులు, వరదలొచ్చే అవకాశాలు, కరువులు వంటివాటిపై అధ్యయనం చేశారు. దీని ప్రకారం ఏపీలోని మూడు జిల్లాలు తీవ్ర వరద ముప్పును ఎదుర్కోనున్నట్టు వెల్లడించారు. కరువు కోరల్లో విశాఖ, కర్నూలు రాష్ట్రంలోనే ప్రధాన నగరంగా ఉన్న విశాఖపట్నం జిల్లాలో కరువు సమస్య పొంచివున్నట్టు అధ్యయనంలో తేలింది. దీంతోపాటు కర్నూలు, ప్రకాశం జిల్లాలు కూడా తీవ్ర కరువును ఎదుర్కొనే అవకాశం ఉందని ఐఐటీ నిపుణులు తేల్చారు. గతంతో పోలిస్తే ఇక్కడ గ్లోబల్ వార్మింగ్ (భూ ఉపరితల ఉష్ణోగ్రత) 1 డిగ్రీ సెల్సియస్ నుంచి 1.5 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉందని తేల్చారు. ఎక్కువ ఉష్ణోగ్రతల ఒత్తిడి కారణంగా కొండచరియలు విరిగి పడటం వంటి ప్రమాదాలూ ఉండవచ్చునని పేర్కొన్నారు. వరదల కారణంగా వ్యవసాయ ఉత్పత్తుల మీద తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని అధ్యయనం తేల్చింది. ఇదిలా ఉండగా.. వరద ముప్పుతో పాటు గుంటూరుకు కరువు ప్రమాదం కూడా ఉందని తేల్చారు.శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, ప్రకాశం, కర్నూలు, నెల్లూరు, అనంతపురం జిల్లాలకు వరద ముప్పు చాలా తక్కువగా ఉందని వెల్లడించారు. దేశవ్యాప్తంగా 51 జిల్లాలు అత్యధిక వరద ప్రమాదాన్ని, 118 జిల్లాలు అధిక వరద ముప్పును ఎదుర్కోనున్నట్టు తేలింది. మరో 91 జిల్లాలు అత్యధిక కరువు ప్రమాదం, 188 జిల్లాలు అధిక కరువు ప్రమాదం ఉన్న కేటగిరీలో చేర్చారు. వరద ముప్పులో ‘ఆ మూడు’ రాష్ట్రంలో రానున్న సంవత్సరాల్లో కృష్ణా, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాలు తీవ్ర వరద ముప్పును ఎదుర్కోనున్నట్లు అధ్యయనంలో తేల్చారు. వాతావరణంలో మార్పులు, తుపానులు, ఉష్ణోగ్రతల కారణంగా ఈ మూడు జిల్లాల్లో తీవ్ర వరదలు సంభవించే అవకాశం ఉందని తెలిపారు. ఇటీవల వరదల కారణంగా విజయవాడ నీట మునిగిన విషయం తెలిసిందే. -
రాష్ట్ర ప్రజలపై యూజర్ పిడుగు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు వరుసగా షాక్‌ల మీద షాక్‌లు ఇస్తోంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు సంగతి దేవుడెరుగు.. రోజుకో రీతిన ప్రజలను బాదేస్తోంది. మొన్న కరెంట్ చార్జీల రూపంలో రెండుసార్లు భారీ షాక్‌లు ఇవ్వగా, నిన్న రిజిస్ట్రేషన్ చార్టీలను ఇదివరకెన్నడూ లేని రీతిలో పూరి గుడిసెలను సైతం వదలకుండా పెంచేసింది. క్లాసిఫికేషన్ల పేరుతో దండుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇవన్నీ చాలవన్నట్లు తాజాగా యూజర్ చార్జీల పేరుతో నగర, పట్టణ వాసులను భారీగా బాదేయడానికి సిద్ధమైంది. మరో వైపు ఏరు దాటేశామని ప్రజలందరినీ బోడి మల్లన్నలు చేస్తూ.. రాష్ట్రంలో వసూలు చేసే వస్తు సేవల పన్ను (జీఎస్టీ)పై ప్రత్యేకంగా వరదల సెస్ విధించడానికి అనుమతివ్వాలంటూ జీఎస్టీ కౌన్సిల్‌ను కోరింది. ప్రజలేమనుకుంటే మాకేంటని నిస్సిగ్గుగా ప్రజలను అన్ని రకాలుగా వాయించేస్తూ.. ‘బాబు అంటే బాదుడే బాదుడు’ అని నిరూపించుకుంటోంది. ఉమ్మడి రాష్ట్రంలో యూజర్ చార్జీలు అనే పదం వింటే తెలుగు రాష్ల్రాల ప్రజలందరికీ గుర్తుకు వచ్చేది నారా చంద్రబాబునాయుడే. ఇప్పుడు ఆయన విభజిత ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉంటూ మరోసారి ‘యూజర్ చార్జీలు’ అంటూ ప్రజల మీద భారం వేయడానికి సిద్ధమయ్యారు. ప్రధానంగా పట్టణ ప్రజలపై యూజర్ చార్జీల మోత మోగించాలని వికసిత్ ఆంధ్రా–2029 కార్యాచరణ ప్రణాళికలో స్పష్టం చేశారు. ఈ విషయాన్ని సామాజిక, ఆర్థిక సర్వేలోనూ చంద్రబాబు ప్రభుత్వం స్పష్టం చేసింది. నీటి సరఫరాకు సంబంధించి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ఆపరేషన్, మురుగునీటి శుద్ది ప్లాంట్ల ఆపరేషన్.. నిర్వహణ, నీటి సరఫరా, పంపిణీ నెట్ వర్క్, యంత్రాల నిర్వహణ, ఆపరేషన్‌కు అయ్యే వ్యయాన్ని పట్టణ ప్రజల నుంచి యూజర్ చార్జీల రూపంలో వసూలు చేయడానికి అడుగులు ముందుకు వేస్తోంది. ఇందుకోసం వినియోగదారుల చార్జీల పేరుతో పట్టణ స్థానిక సంస్థలు సంస్కరణలు చేపట్టాలని దిశా నిర్దేశం చేస్తోంది. ఎప్పటికప్పుడు యూజర్ చార్జీల నిర్వహణ, ఆపరేషన్ వ్యయానికి తగినట్లుగా రుసుము పెంచాల్సి ఉందని కూడా నొక్కి చెప్పింది. ఇలా ప్రజలను ఎప్పటికప్పుడు, ఎక్కడికక్కడ బాదేస్తున్న కూటమి ప్రభుత్వం.. తమది సిటిజన్ ప్రెండ్లీ వ్యవస్థ అంటూ గొప్పలు చెప్పుకోవడం గమనార్హం.ఆస్తి పన్ను పెంచేలా అడుగులుపట్టణాల్లో ఆస్తి పన్ను సంస్కరణల ద్వారా మరింత ఆదాయం సమకూర్చుకోవాలని కూటమి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే వార్డు సచివాలయాల ఉద్యోగుల ద్వారా ఇంటింటికి వెళ్లి ఇంటి నిర్మాణ వైశాల్యం, ఖాళీ స్థలం కొలతలను వేయించింది. పట్టణాల్లో ఆస్తులన్నీ రియల్ టైమ్ మదింపు చేయాలని నిర్ణయించింది. అందుకు అనుగుణంగా ఆస్తి పన్ను వసూలు చేయనున్నారు. అన్ని మున్సిపాలిటీల్లో సింగిల్ డిజిట్ ఉపయోగించి బిల్డింగ్ ప్లాన్ ఆమోదంతో సహా ఆస్తుల డేటా సేకరిస్తున్నారు. ఇంటిగ్రేటెట్ డిజిటలైజ్డ్ బిల్లింగ్ ద్వారా ఆస్తి పన్నుకు సంబంధించి ఆటోమెటిక్ డిజిటల్ బిల్లు జనరేట్ చేయనున్నారు. ఎస్ఎంఎస్తో పాటు వివిధ మార్గాల ద్వారా ఆస్తి పన్ను చెల్లింపును యజమానులకు గుర్తు చేయనున్నారు. బౌగోళిక సమాచార వ్యవస్థ (జీఐఎస్) ఆధారంగా ఆస్తుల వివరాలను మ్యాపింగ్ చేయనున్నారు. చాలా కాలంగా ఆస్తుల కిందకు రాని ఆస్తులన్నీ ఈ మ్యాపింగ్‌లోకి తీసుకురావడంతో పన్నుల పరిధిలో మరిన్ని ఆస్తులు రాబట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. డ్రోన్స్ ద్వారా కూడా ఇప్పటికే మ్యాపింగ్‌లో ఉన్న ఆస్తులకు అదనంగా ఉన్న ఆస్తులను జత చేస్తోంది. ఆస్తి పన్ను రిజిస్టర్‌ను రాష్ట్ర స్టాంప్ డ్యూటీతో పాటు రిజిస్ట్రేషన్ శాఖ, రెవెన్యూ విభాగాలకు అనుసంధానం చేయనున్నారు. తద్వారా ఆస్తులలో మార్పులు చేసినట్టయితే అందుకు అనుగుణంగా ఆస్తి పన్ను వసూలు చేయడానికి వీలు కలుగుతుంది.వరదలనూ వాడుకుంటాం..రాష్ట్రంలో వసూలు చేసే వస్తు సేవల పన్ను (జీఎస్టీ)పై ప్రత్యేకంగా సెస్ విధించడానికి అనుమతివ్వాలంటూ కూటమి సర్కారు జీఎస్టీ కౌన్సిల్‌ను కోరింది. శనివారం రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో జరిగిన 55వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఈ ప్రతిపాదన చేశారు. 5 శాతం జీఎస్టీ దాటిన అన్ని వస్తువులపై అదనంగా ఒక శాతం ఏపీ ఫ్లడ్ సెస్ విధించడానికి అనుమతివ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారమన్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ సెస్ ద్వారా వచ్చే నిధులతో రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంత్రాల్లో సహాయ, పునరావాస చర్యలు చేపడతామన్నారు. 2018లో కేరళలో వరదలు వచ్చినప్పుడు ఇదే తరహాలో సెస్ విధించారని తెలిపారు. 5 శాతానికి మించిన జీఎస్టీ శ్లాబులపై ఈ సెస్ విధిస్తుండటంతో పేదలు, మధ్యతరగతి ప్రజలపై ఎలాంటి భారం ఉండదంటూ సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ఇన్నోవేషన్లకు ప్రొత్సహమిచ్చేలా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు నిర్వహించే రీసెర్చ్ సర్వీసెస్‌కు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఫోర్టిఫైడ్ బియ్యంపై జీఎస్టీ సుంకాన్ని తగ్గించాలని, ఐజీఎస్టీ సెటిల్మెంట్ వ్యవస్థను మరింత పారదర్శకంగా చేపట్టాలని, ఈ డేటా రాష్ట్రాలకూ అందుబాటులో ఉంచాలన్నారు. చిన్న వ్యాపారులు, కాంపోజిషన్ జీఎస్టీ చెల్లింపుదారులకు అద్దెల విషయంలో విధించే రివర్స్ ఛార్జ్ మెకానిజం (ఆర్సీఎం) నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన సూచనలను పరిశీలించేందుకు జీఎస్టీ కౌన్సిల్ మంత్రివర్గ ఉప సంఘాన్ని వేసింది. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, కమర్షియల్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్ అహ్మద్ బాబు కూడా పాల్గొన్నారు. -
వరదలు.. పెనుగాలులు.. భూకంపం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: రాష్ట్రంలోని గోదావరి తీర ప్రాంతాలు ప్రకృతి విపత్తులకు నిలయంగా మారుతున్నాయి. కొన్నేళ్ల నుంచి జరిగిన ఘటనలను పరిశీలిస్తే.. ఏటా ఏదో ఒక విపత్తు ఎదురవుతోంది. ముఖ్యంగా ములుగు జిల్లా పరిసర ప్రాంతాల్లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు కలకలం రేపుతున్నాయి. వరుసగా అతి భారీ వర్షాలు, వరదలు, పెనుగాలులు టోర్నడోలు, ఇప్పుడు భూకంపం వంటివి తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి.అతి భారీ వర్షాలతో..2022 జూలై 14 నుంచి 16 వరకు ఈ ప్రాంతాల్లో కురిసిన కుంభవృష్టి కారణంగా గోదావరికి భారీగా వరదలు వచ్చాయి. ఏ క్షణమైనా కరకట్ట కొట్టుకుపోయి భద్రాచలం మునిగిపోతుందనే పరిస్థితి ఏర్పడింది. 2023 జూలై 27న భూపాలపల్లి, ములుగు జిల్లాల పరిధిలో అత్యంత భారీ వర్షం కురిసింది. ములుగు జిల్లా లక్ష్మీదేవిపేటలో ఏకంగా ఒక్కరోజే 64.9 సెంటీమీటర్ల వాన పడింది. అందులో కేవలం మూడు గంటల్లోనే 46.4 సెంటీమీటర్ల అతి భారీ వాన పడింది. అదేరోజు జయశంకర్ జిల్లా చిట్యాలలో 61.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వాగులు ఉప్పొంగి గ్రామాలు నీట మునిగి పన్నెండు మంది మృత్యువాత పడ్డారు. ఈ ఏడాది ఆగస్టు 31న నర్సంపేట, పాలకుర్తి, మహబూబాబాద్ నియోజకవర్గాల పరిధిలో భారీ వర్షంపడి మున్నేరు, ఆకేరు, పాలేరు వాగులకు కనీవినీ ఎరుగని రీతిలో వరద వచ్చింది. ఖమ్మం పట్టణం, పరిసర గ్రామాలు చిగురుటాకులా వణికిపోయాయి.లక్ష చెట్లను కూల్చేసిన పెనుగాలులుఈ ఏడాది ఆగస్టు 31, సెప్టెంబర్ ఒకటో తేదీల మధ్య ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో తీవ్ర పెను సుడిగాలులు వీచాయి. ఏటూరునాగారం అభయారణ్యంలో ఏకంగా 334 హెక్టార్ల పరిధిలో లక్ష వరకు చెట్లు కూలిపోయాయి. ఇది దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఆ వాయు విధ్వంసానికి కారణాలను ఇప్పటికీ స్పష్టంగా తేల్చలేదు. ఇక్కడే భూకంప కేంద్రాలురాష్ట్రంలోని సిర్పూర్, జైనూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, మంథని, భూపాలపల్లి, వరంగల్, ములుగు, నర్సంపేట, మహబూబాబాద్, ఖమ్మం, మణుగూరు, కొత్తగూడెం, భద్రాచలం ప్రాంతాలు భూకంప సీస్మిక్ జోన్–3 పరిధిలో ఉన్నాయి. బొగ్గు గనులు విస్తృతంగా ఉన్న ఈ ప్రాంతాల్లో తరచూ భూమి నుంచి భారీ శబ్దాలు రావడం సాధారణంగా మారిపోయింది. ఇదే ప్రాంతంలోని భద్రాచలంలో 1969లో 5.7 తీవ్రతతో భూకంపం రాగా.. ఇప్పుడు 5.3 తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయి. గత ఆరేళ్లలో మణుగూరులో స్వల్ప స్థాయిలో మూడు సార్లు ప్రకంపనలు వచ్చాయి కూడా. భారీగా నీటి ప్రాజెక్టుల నిర్మాణం, బొగ్గు తవ్వకాలు, గోదావరిలో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు వంటివి విపత్తులకు దారితీస్తున్నాయని పర్యావరణవేత్తలు పేర్కొంటున్నారు. వేడి నీటిబుగ్గలకూ కేంద్రంములుగు జిల్లాలోని రామన్నగూడెం ప్రాంతంలో వేడి నీటిబుగ్గలు ఉన్నాయి. 1954లో ఇక్కడ చమురు నిక్షేపాల అన్వేషణ కోసం తవ్వకాలు జరిపి వదిలేసిన బోరులోనుంచి ఇప్పటికీ వేడి నీళ్లు వెలువడుతూ ఉన్నాయి. భూమి పొరల్లో పగుళ్ల వల్ల నీళ్లు మరింత లోతుకు వెళ్లి... అక్కడి అధిక ఉష్ణోగ్రతల వల్ల వేడై పైకి ఉబికివస్తాయని నిపుణులు చెబుతున్నారు.మానవ తప్పిదాలపై ప్రకృతి హెచ్చరికలివి!మానవ తప్పిదాలపై ప్రకృతి చేసిన హెచ్చరికలను మనం పట్టించుకోలేదు. మూడు నెలల క్రితం తాడ్వాయి అడవుల్లో టోర్నడోల తీవ్రత కారణంగా లక్ష చెట్లు నేలకొరిగినప్పుడే భూకంపాలపై హెచ్చరికలు జారీ అయ్యాయి. ఆ ఘటన జరిగాక కారణాలేమిటన్న దానిపై ప్రభుత్వం, వర్సిటీలు, ఎన్జీఆర్ వంటి సంస్థలు ఎలాంటి పరిశోధనలు చేయలేదు. మనం గోదావరి బెల్ట్‌ను నాశనం చేశాం. ప్రాజెక్టుల కోసం అడవులు నరికేశాం. భూమి లోపల పొరలు ఎలా ఉన్నాయి? డ్యామ్‌ల వల్ల వాటికి ఏ మేరకు నష్టం అన్నది సాంకేతికంగా పరిశీలించలేదు. అది భూకంపాలకు కారణమవుతోంది.– పాకనాటి దామోదర్‌రెడ్డి, పర్యావరణవేత్త -
హైదరాబాద్ లో 40 ఏళ్ళలో 45 శాతం చెరువులు ఆక్రమణలకు గురయ్యాయి: రంగనాథ్
-
ఫెంగల్ తుఫాన్ బీభత్సం.. సీఎం స్టాలిన్‌కు ప్రధాని ఫోన్
చెన్నై: ఫెంగల్ తుఫాన్ తమిళనాడులో అపార నష్టాన్ని మిగిల్చింది. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి, తమిళనాడులోని విల్లుపురం, సేలం, కడలూరు, కళ్లకురిచ్చి, తిరువణ్ణామలై జిల్లాలో పెను విలయాన్ని మిగిల్చింది. కుండపోతగా వర్షంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. ఈ వరదలకు ఊర్లకు ఊర్లో మునిగిపోయాయి.తాజాగా వరదలపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు ప్రధానమత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఫోన్ చేసి మాట్లాడారు. రాష్ట్రంలోని వర్షాలు, వరద పరిస్థితిపై ప్రధాని ఆరా తీశారు.కేంద్రం నుంచి అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్రానికి సహాయ, సహకారాలు అందిస్తామని తెలిపారు.ఇక ఉత్తర తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో భారీ వర్షాల కారణంగా వరదలు పోతెత్తాయి. వంతెనలు, రోడ్లు నీట మునిగాయి. భారీ విస్తీర్ణంలో పంట పొలాలు ధ్వంసమయ్యాయి. అనేక గ్రామాలు నీట మునిగి ఉన్నాయి. సాయం కోసం గ్రామీణ జనం ఎదురుచూస్తున్నారు. మరోవైపు సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌తోపాటుగా మంతరులు బాధిత ప్రాంతాలలో పర్యటిస్తున్నారు.తిరువణ్ణామలై మహా దీపం కొండపై నుంచి మట్టి చరియలు, బండరాళ్లు కొట్టుకు వచ్చి ఆదివారం రాత్రి ఇళ్లపై పడిన విషయం తెలిసిందే. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ఈ శిథిలాల కింద చిక్కుకున్నారు. వీరిని ప్రాణాలతో రక్షించేందుకు ప్రయత్నిచినా.. ఫలితం లేదు. సోమవారం రాత్రి మృతదేహాలుగా వారంతా బయట పడ్డారు.మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాన్ పుదుచ్చేరి వద్ద బలహీనపడి వాయుగుండంగా మారిందని వాతావరణశాఖ ప్రకటించింది. మంగళవారం అరేబియన్ సముద్రంలో ప్రవేశించే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. -
‘బుడమేరు వరద సాయం ఇదేనా బాబూ?’
విజయవాడ, సాక్షి: ఏపీలో చంద్రబాబు పాలన ఎంత అధ్వానంగా ఉందో చెప్పే పరిస్థితి ఇది. విజయవాడ ఎంపీతో పాటు కూటమి ఎమ్మెల్యేలు బహిరంగంగా ప్రభుత్వంపై తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. బుడమేరు వరద సాయం ఇంకా పూర్తి స్థాయిలో అందలేదంటూ బహిరంగంగానే పెదవి విరిచారు. ఈ క్రమంలో.. ఇవాళ జరిగిన తొలి డీఆర్సీ సమావేశంలో సమస్యలను ఏకరువు పెట్టారు వాళ్లు.బుడమేరు వరద సాయం ఇంకా చాలామందికి అందలేదంటూ డీఆర్సీలో ఎంపీ కేశినేని శివనాధ్(చిన్ని),ఎమ్మెల్యేలు నిజాలు ఒప్పుకున్నారు. బుడమేరు వరద ముంపు బాధితుల్లో బాధితులకు ఇంకా నష్టపరిహారం అందలేదు. మరోమారు ఎన్యుమరేషన్ చేయాలి అని ఎంపీ కేశినేని శివనాధ్(చిన్ని) అన్నారు. కొండచరియలు విరిగిపడి చనిపోయిన వారికి పరిహారం ఇవ్వలేదు. కొండ ప్రాంత ప్రజలను ఆదుకోవాలి అని ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు.వరద బాధితులను ఇంకా కొంత మందికి నగదు అందలేదు. మేము బయటకు వస్తుంటే ప్రజలు అడుగుతున్నారు. అన్ని ప్రాంతాల్లో వాటర్ డ్యామేజ్ జరిగింది. బుడమేరు డైవర్షన్ చర్యలు తీసుకోవాలి. పట్టి సీమ నీళ్లు వదిలినప్పుడు బుడమేరులోకి వస్తున్నాయి. బుడమేరు వల్ల మైలవరం నియోజకవర్గం పూర్తిగా దెబ్బతింది. జి.కొండూరులో 13,800 ఎకరాల రైతులు ఇబ్బది పడుతున్నారు. 1 కోటి 20 లక్షల మోటార్లు రిపేర్లు ఉన్నాయి అని మైలవరం ఎమ్మెల్యే,వసంత కృష్ణప్రసాద్ అన్నారు.నందిగామ ఎమ్మెల్యే,తంగిరాల సౌమ్య మాట్లాడుతూ.. నందిగామలో పంట పూర్తిగా దెబ్బతింది. రైతులకు నష్ట పరిహారం అందించాలని అన్నారు.గన్నవరం ఎమ్మెల్యే,యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ.. విజయవాడ, అంబాపురం , గన్నవరంలో 200 కోట్లు అభివృద్ధి పనులు చేయాలి. అభివృద్ధి పనులకు నిధులు కేటాయంచాలి. విజయవాడ రూరల్ మండలంలో అభివృద్ధి చేయాలి అని అన్నారు.ఇక జగ్గయ్యపేట ఎమ్మెల్యే,శ్రీరామ్ రాజగోపాల్ మాట్లాడుతూ.. త్రాగునీరు విషయంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆ సమస్యను తక్షణమే పరిష్కరించాలని అన్నారు.ధాన్యం కనుగోలు విషయంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తిరువూరు,ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఆలోచన చేయాలి. తిరువూరులో పత్తి పంట కొనేవారు లేదు. పత్తి పండుతున్నా ఇక్కడ కొనుగోలు కేంద్రం లేదు..గుంటూరులో ఉంది అని గుర్త చేశారాయన.ఇక.. పీడీఎఫ్ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు మాట్లాడుతూ.. కండ్రిక, జక్కంపూడి ప్రాంతంలో ఇంకా ఆటో డ్రైవర్లకు పరిహారం అందలేదన్నారు. అలాగే.. ప్రభుత్వ పాఠశాలలు పూర్తిగా దెబ్బతిన్నాయని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. -
రాజధాని అమరావతికి ముంపు తప్పదు
సాక్షి, అమరావతి: రాష్ట్ర రాజధాని అమరావతికి ముంపు ముప్పు తప్పదని ప్రపంచ బ్యాంకు స్పష్టం చేసింది. భారీ వర్షాలు, వరదలతో ఆ ప్రాంతమంతా ముంపునకు గురవుతుందని పేర్కొంది. వరద నియంత్రణకు కచ్చితమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఆ ప్రాంతంలో కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం ఉన్నప్పటికీ.. కొండవీటి వాగుతోపాటు, పాలవాగు నుంచి వచ్చే వరద నియంత్రణకు మరిన్ని చర్యలు తీసుకోవాల్సిందేనని తేల్చింది. ఈ నేపథ్యంలో ముంపు నివారణకు భారీ వ్యయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.వరద నివారణ పనులు, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ఏకంగా రూ.8,014.61 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేసినట్టు ప్రపంచ బ్యాంకు రుణ డాక్యుమెంట్లో స్పష్టం చేసింది. గతంలోనే చంద్రబాబు ప్రభుత్వం వరద నియంత్రణ పేరుతో కొండవీటి వాగు పంపింగ్ స్టేషన్‌ను రూ.450 కోట్లతో నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు దానికి అదనంగా మొత్తం 20 ప్యాకేజీలలో వరద నియంత్రణ, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులకు టెండర్లు ఆహ్వానించనున్నట్టు ప్రపంచ బ్యాంకు డాక్యుమెంట్లో స్పష్టం చేసింది. విస్తుపోతున్న అధికారులు, నిపుణులువరద నివారణకు రూ.8,014.61 కోట్లు ఖర్చవుతుందని తెలిసి.. ఆ పనులు ప్రతిపాదించడం పట్ల అధికార యంత్రాంగం విస్తుపోతోంది. వరద ప్రాంతాల్లో రాజధాని నిర్మాణం చేపట్టాలనే ప్రభుత్వ ఆలోచనే లోపభూయిష్టంగా ఉందని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. వరద నియంత్రణకు వెచ్చించే నిధుల్లో సగం ఖర్చుతోనే వరద ముంపులేని ప్రాంతంలో పరిపాలన భవనాలను నిర్మించవచ్చని అధికారులు, నిపుణులు పేర్కొంటున్నారు. రాజధాని పేరుతో అమరావతిలోనే రూ.వేల కోట్లు వెచ్చించేందుకు ప్రభుత్వం నిర్ణయించడం చూస్తుంటే.. మిగతా ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోవనే విషయం స్పష్టమవుతోందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.వరద నివారణ ప్రతిపాదనలు ఇలా..ప్రపంచ బ్యాంకు సూచనల మేరకు అమరావతి ప్రాంతంలో వరద ముంపును నివారించేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఆ ప్రతిపాదనల్లో ముఖ్యాంశాలు ఇవీ.⇒ కొండవీటి వాగును (23.60 కి.మీ.) వెడల్పు, లోతు చేయాలి.⇒పాల వాగు (16.70 కి.మీ.) వెడల్పు, లోతు చేయాలి.⇒ శాఖమూరు వద్ద 0.03 టీఎంసీ సామర్థ్యంతో 50 ఎకరాల్లో రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలి.⇒ కొండవీటి వాగు వరద నీటిని గ్రావిటీ కెనాల్ (7.82 కి.మీ,) నిర్మాణం ద్వారా కృష్ణా నదికి మళ్లించాలి.⇒ వర్షాకాలంలో అదనపు నీటిని డ్రెయినేజీలకు మళ్లించేందుకు కరకట్ట వద్ద పంపింగ్ స్టేషన్ నిర్మాణం చేపట్టాలి. ⇒ ఉండవల్లి వద్ద 7,500 క్యూసెక్యుల సామర్థ్యంతో వరద పంపింగ్ స్టేషన్ నిర్మాణం చేపట్టాలి.⇒ వరద నీటిని నిలుపుదల చేసేందుకు కృష్ణాయపాలెంలో 1.7 మీటర్ల ఎత్తు కట్టతో 90 ఎకరాల్లో 0.1 టీఎంసీ నిల్వ సామర్థ్యంతో రిటెన్షన్ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలి.⇒ శాఖమూరు వద్ద 50 ఎకరాల్లో 0.03 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలి.⇒ నీరుకొండలో 400 ఎకరాల్లో 0.4 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించాలి. -
మేటల తొలగింపు మాటల వరకే
వరద బారినపడి పొట్టదశకు వచ్చిన వరి పంట నాశనమైపోయింది. పొలాల్లో వేసిన ఇసుకమేటలు నెలలు గడుస్తున్నా అలాగే ఉన్నాయి. ఇంతవరకూ అధికారులుగానీ, నాయకులుగానీ పట్టించుకోలేదు. కనీసం అంచనాలు కూడా వేయలేదు. ఒకపక్క పంట పోయింది. వేరేపంట వేద్దామంటే పొలం నిండా ఇసుక, మట్టి మేటలు వేసి ఉంది. దాన్ని తొలగించాలంటే ఎకరానికి రూ.30 వేల నుంచి రూ. 40 వేలు ఖర్చవుతుంది. కాలువలకు పడిన గండ్లు కూడా ఇంకా పూడ్చలేదు. పలుమార్లు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోవడంలేదు. ఏంచేయాలో దిక్కుతోచడంలేదు. – ముప్పిడి శ్రీనివాసరెడ్డి, కౌలురైతు, రాపర్తి, పిఠాపురం మండలంపిఠాపురం: ఏటా మూడు పంటలు పండే మాగాణి ఇసుక దిబ్బలా కనిపిస్తోంది. వరద సమయంలో వచ్చి మేమున్నామని హామీ ఇచ్చిన నాయకులు, అధికారులు పత్తాలేకుండా పోయారు. నెలలు గడిచిపోతున్నాయి. పొలానికి వెళ్తే కాలువకు పడిన గండ్లు వెక్కిరిస్తున్నాయి. పంట పోయి, పొలం నాశనమై ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతులు ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తుంటే.. సర్కారు నాలుక మడతెట్టింది. ఇసుకమేటలు తొలగించేందుకు పరిహారం ఇచ్చేది లేదని, ఉపాధి హామీ ద్వారా పనులు చేయిస్తామంటూ చేతులెత్తేయడంతో రైతులు నిరాశలో కూరుకుపోయారు.సెప్టెంబర్ నెలలో కురిసిన భారీవర్షాల కారణంగా ఏలేరు కాలువ ముంచెత్తడంతో కాకినాడ జిల్లాలో పిఠాపురం, గొల్లప్రోలు, కొత్తపల్లి, పెద్దాపురం, కిర్లంపూడి తదితర మండలాల్లో సుమారు 80 వేల ఎకరాల్లో వరి, వాణిజ్య పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఏలేరు కాలువకు గండ్లుపడి సుమారు 500 ఎకరాల్లో ఇసుక, మట్టి భారీఎత్తున మేటలు వేశాయి. పిఠాపురం మండలం రాపర్తి ఏరియాలోని వరి పొలాల్లో సుమారు 2 అడుగుల మేర ఇసుక మేటలు వేసింది. దీంతో ఇసుక తొలగిస్తే తప్ప తరువాతి పంట వేయలేమని రైతులు వాపోతున్నారు. హెక్టారుకు రూ. 17 వేలు ఇస్తామన్నారు.. వరద ప్రభావం వల్ల పంటలు నాశనమైన పొలాలకు ఎకరానికి రూ.10వేలు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామని, ఇసుక మేటలు వేసిన పొలాలకు హెక్టారుకు రూ.17 వేలు ఇస్తామని అప్పట్లో జిల్లా వ్యవసాయశాఖ అధికారి ప్రకటించారు. 3 అంగుళాల మేర ఇసుక మేట ఉంటే పరిహారానికి అర్హులుగా పరిగణిస్తామన్నారు. అయితే పొలాల్లో 8 నుంచి 10 అంగుళాల మేర ఇసుక మేటలు ఉన్నట్లు గుర్తించామన్నారు. జిల్లాలో 75 వేల ఎకరాల్లో వరి, ఇతర పంటలు నీట మునిగాయని, 33 శాతం కంటే ఎక్కువ పంట నష్టం జరిగితేనే ఇన్పుట్ సబ్సిడీ వస్తుందని తెలిపారు. ప్రత్యేక బృందాలతో పంటనష్టం అంచనాలు తయారు చేసేందుకు ఏర్పాట్లు చేశామని వివరించారు. రైతులు ప్రభుత్వం నుంచి పరిహారం వస్తుందని ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఇసుకమేటలకు పరిహారం రాదనడంతో ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.పొట్టదశలో పంట తుడిచిపెట్టుకుపోయింది సకాలంలో వర్షాలు కురవడంతో ఈ ఏడాది పంటలు బాగా పండుతాయన్న ఆశతో అప్పులు చేసి పెట్టుబడి పెట్టి సాగు చేశాను. అంతా బాగుంది, పంట పొట్టదశకు చేరుకుంటుందన్న సమయంలో వరద ఒక్కసారిగా పంటను తుడిచిపెట్టేసింది. పెట్టుబడి అంతా నీటి పాలయ్యి అప్పులు మిగిలాయి. ప్రభుత్వం చూస్తే ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఇస్తారో ఇవ్వరోకూడా తెలియదు. పంట పోతే పోయింది. పొలాల్లో వేసిన ఇసుక మేటలు మాపై మరింత భారాన్ని వేశాయి. నిబంధనల పేరుతో ఇసుకమేటలు తొలగింపుకు పరిహారం ఇవ్వమని అధికారులు చెబుతున్నారు. గతంలో హెక్టారుకు రూ. 17 వేలు ఇస్తామన్నారు. ఇప్పుడు లేదంటున్నారు. పొలాల్లో వేసిన ఇసుకమేటలు తొలగించాలంటే ఎకరాకి రూ. 40 వేలకు పైనే ఖర్చవుతుంది. – చింతపల్లి నీలారెడ్డి, రైతు, రాపర్తి, పిఠాపురం మండలం మట్టి, ఇసుక మేటలకు పరిహారం రాదు వరద వల్ల పంట పొలాల్లో ఇసుక మేటలు వేసిన రైతులకు పరిహారం వచ్చే అవకాశం లేదు. ఉపాధి హామీ పథకంలో భాగంగా పంట పొలాల్లో ఇసుక, మట్టి మేటలు తొలగించడానికి చర్యలు తీసుకుంటారు. అది ఎప్పుడనేది ఇంకా నిర్ణయించలేదు. – ఎ.అచ్యుతరావు, వ్యవసాయశాఖ అధికారి, పిఠాపురం మండలం -
శ్రీశైలం 4 క్రస్ట్ గేట్లు ఎత్తి సాగర్‌కు నీటి విడుదల
శ్రీశైలంప్రాజెక్ట్/విజయపురిసౌత్/తాడేపల్లిరూరల్: శ్రీశైలం జలాశయంలోకి వరదనీరు పెరుగుతుండటంతో గురువారం 4 రేడియల్ క్రస్ట్‌గేట్లను తెరచి 1,12,300 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు వదులుతున్నారు. గురువారం సాయంత్రానికి జూరాల, సుంకేసుల నుంచి 1,89,328 క్యూసెక్కుల వరద శ్రీశైలంకు వచ్చి చేరుతోంది. బుధవారం నుండి గురువారం వరకు బుధవారం నుండి గురువారం వరకు ఎగువ ప్రాజెక్ట్‌ల నుంచి శ్రీశైలంకు 1,27,093 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరింది. కుడిగట్టు కేంద్రంలో 15.213 మిలియన్ యూనిట్లు, ఎడమగట్టు కేంద్రంలో 16.744 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం జలాశయంలో 215.8070 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాం నీటిమట్టం పూర్తిస్థాయి 885 అడుగులకు చేరుకుంది. సాగర్ వద్ద కృష్ణమ్మ పరవళ్లు ఎగువ నుంచి వరద ప్రవాహం పెరగటంతో నాగార్జున సాగర్ జలాశయం నుంచి గురువారం 20 రేడియల్ క్రస్ట్‌గేట్లు 5 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయానికి శ్రీశైలం నుంచి 2,10,149 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా అంతే నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్‌లో 20 క్రస్ట్‌గేట్ల ద్వారా స్పిల్‌వే మీదుగా 1,62,000 క్యూసెక్కులు, విద్యుదుత్పాదన ద్వారా 28,826 క్యూసెక్కులు మొత్తం 1,90,826 క్యూసెక్కులు దిగువకి విడుదల చేస్తున్నారు. కుడి,ఎడమ కాలువలు, ఎస్ఎల్బీసీ, వరద కాలువల ద్వారా 19,323క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. కాగా ఎగువ ప్రాంతాల నుంచి ప్రకాశం బ్యారేజ్ వద్దకు భారీగా వరద నీరు రావడంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో బ్యారేజి రిజర్వాయర్‌లో 12 అడుగుల నీటిమట్టం కొనసాగిస్తూ 30 గేట్లను 1 అడుగు మేర ఎత్తి దిగువకు 21 వేల 750 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
భారీ వర్షానికి బెంగళూరు అస్తవ్యస్తం
బెంగళూరు: భారతదేశపు సిలికాన్ వ్యాలీగా పేరుగాంచిన కర్నాటకలోని బెంగళూరు నగరం భారీ వర్షానికి అతలాకుతలమైంది. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నగరమంతా జలదిగ్బంధంలో చిక్కుకుంది.నీటి ప్రవాహం కారణంగా పలు రహదారులును అధికారులు మూసివేశారు. బాధితులను రక్షించేందుకు అధికారులు పడవలను వినియోగిస్తున్నారు. మరోవైపు పలువురు బెంగళూరువాసులు సోషల్ మీడియాలో అధికారులపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరులోని పలు రహదారుల్లో మోకాళ్ల లోతు మేరకు నీరు నిలిచిపోయింది. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. #WATCH | Karnataka | Residents of an Apartment in Yelahanka are being rescued through boats.Due to incessant heavy rain, waterlogging can be seen at several places in Bengaluru causing problems for the residents in Allalasandra, Yelahanka pic.twitter.com/AekmTVOAlW— ANI (@ANI) October 22, 2024మీడియాకు అందిన వివరాల ప్రకారం మంగళవారం ఉదయం వరకు బెంగళూరు రూరల్ పరిధిలో 176 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. బెంగళూరు అర్బన్ ప్రాంతంలో 157 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగా పలు విమాన సర్వీసులు దెబ్బతిన్నాయి. సోమవారం రాత్రి 20కి పైగా విమాన సర్వీసులు ఆలస్యమయ్యాయి. నాలుగు ఇండిగో విమానాలను చెన్నైకి మళ్లించారు. నగరంలోని పాఠశాలలకు మంగళవారం సెలవు ప్రకటించారు.ఇది కూడా చదవండి: మరోమారు 30 విమానాలకు బాంబు బెదిరింపులు -
అనంత అతలాకుతలం.. ముంచేసిన పండమేరు (ఫొటోలు)
-
బాధితులకు భరోసా .. గుంటూరు, వైఎస్సార్ జిల్లాల్లో వైఎస్ జగన్ పర్యటన
-
కృష్ణాలో పెరుగుతున్న వరద ప్రవాహం
శ్రీశైలం ప్రాజెక్ట్/విజయపురి సౌత్/తాడేపల్లి రూరల్: కృష్ణా నదిలో వరద ప్రవాహం పెరుగుతోంది. శ్రీశైలం జలాశయానికి వచ్చే ప్రవాహం గంటగంటకూ పోటెత్తుతోంది. ఆదివారం సాయంత్రానికి జూరాల, సుంకేశుల, హంద్రీ నుంచి 1,95,929 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో డ్యామ్ వద్ద ఆరు రేడియల్ క్రస్ట్‌గేట్లను 10 అడుగుల మేర ఎత్తి స్పిల్‌వే ద్వారా నాగార్జున సాగర్‌కు 1,67,898 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఆదివారం వరకు ఎగువ ప్రాజెక్ట్‌ల నుంచి 1,75,782 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుండగా.. 1,59,070 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కాగా.. ఎగువ నుంచి వరద ప్రవాహం పెరగడంతో నాగార్జునసాగర్ జలాశయం వద్ద 20 రేడియల్ క్రస్ట్‌గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ జలాశయానికి 2,32,110 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా.. ఇక్కడి నుంచి 2,45,943 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. దీంతో ప్రకాశం బ్యారేజీలోకి వరద నీరు చేరుతోంది. జేఈ రాజేష్ మాట్లాడుతూ.. పులిచింతల ప్రాజెక్ట్, ఇతర వాగుల నుంచి 1,62,689 క్యూసెక్కుల వరద నీరు ప్రకాశం బ్యారేజీకి రానుందన్నారు. ఈ దృష్ట్యా బ్యారేజీ వద్ద 20 గేట్లు 4 అడుగులు, 50 గేట్లను 3 అడుగుల మేర ఎత్తి దిగువకు 1,57,250 క్యూసెక్కులు విడుదల చేస్తున్నామని తెలిపారు. -
శ్రీశైలంలో 4, సాగర్‌లో 16
నాగార్జునసాగర్, దోమలపెంట: వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరిగింది. దీంతో నాలుగు గేట్లు పైకెత్తి స్పిల్‌వే ద్వారా 1,11,932 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శనివారం రాత్రి 7 గంటల సమయంలో జూరాల నుంచి స్పిల్‌వే ద్వారా 82,940 క్యూసెక్కులు, విద్యుదు త్పత్తి చేస్తూ 35,524, సుంకేసుల నుంచి 72,114, హంద్రీ నుంచి 250 మొత్తం 1,90,828 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. ఎడమగట్టు భూగర్భ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 36,900 క్యూసెక్కులు, ఏపీ జెన్కో పరిధిలోని కుడిగట్టు కేంద్రంలో ఉత్పత్తి చేస్తూ 31,139 మొత్తం 68,039 క్యూసెక్కుల నీరు అదనంగా సాగర్‌కు విడుదలవుతున్నాయి. ప్రస్తు తం శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 884.7 అడుగుల వద్ద 213.8824 టీఎంసీల నీటి నిల్వ ఉంది. పోతిరెడ్డిపాడు ద్వారా 8,000 క్యూసెక్కులు, ముచ్చుమర్రి, మల్యాల ఎత్తిపోతల నుంచి హెచ్ఎన్ ఎస్ఎస్కు 1,561, రేగుమాన్గడ్డ నుంచి ఎంజీకేఎల్‌ఐకు 2,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎగువ నుంచి ప్రవాహం పెరగడంతో శనివారం అధికారులు నాగార్జునసాగర్ ప్రాజెక్టు 16 రేడియల్ క్రస్ట్‌గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 16 గేట్లను ఐదడుగులు పైకి ఎత్తి స్పిల్‌వే మీదుగా 1,29,600 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయం 590 అడుగుల గరిష్ట నీటిమట్టంతో ఉంది. ప్రస్తుతం సాగర్ జలాశయానికి 1,74,120 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. సాగర్ ప్రధాన విద్యుదుత్పా దన కేంద్రం ద్వారా 29,435 క్యూసెక్కులు, క్రస్ట్‌గేట్ల నుంచి 1,29,600 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వ లకు, ఏఎమ్మార్పీ, వరద కాల్వలకు 15,085 క్యూసె క్కుల నీరు వదులుతున్నారు. మొత్తం సాగర్ నుంచి 1,74,120 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. -
అర్జీలన్నీ అంతే సంగతులా!?
విజయవాడ కండ్రికలోని ఈమె ఇల్లు ఇటీవల బుడమేరు వరదల్లో పూర్తిగా మునిగింది. 12 రోజులు బిక్కుబిక్కుమంటూ గడిపింది. సర్వే సిబ్బంది వివరాలు రాసుకుని వెళ్లారు. అయితే, పరిహారానికి సంబంధించిన జాబితాలో మాత్రం ఈమె పేరులేదు. సచివాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఫలితంలేదు. కలెక్టరేట్లో కూడా మరోసారి దరఖాస్తు చేసుకుంది. చివరికి.. ఎవరిని అడిగినా లాభంలేక సాయం కోసం వేయికళ్లతో ఎదురుచూస్తోంది. సాక్షి ప్రతినిధి, విజయవాడ : బుడమేరు వరదతో విజయవాడలో నిండా మునిగిన బాధితులకు నష్టపరిహారం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. వరదలు వచ్చి 45 రోజులకు పైగా గడిచినప్పటికీ, సాయం కోసం ఇంకా వేలాది మంది బాధితులు నిరీక్షిస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్క బాధితుడికి సహాయం అందిస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలు నీటి మూటలుగానే మిగిలాయి. రకరకాల సాకులతో బాధితుల జాబితాకు కోతేసి గతనెల 17న సచివాలయాల్లో ప్రదర్శించారు. కానీ, సర్వే అంతా తప్పుల తడకగా ఉందని, గ్రౌండ్‌ఫ్లోర్ అయితే, ఫçస్ట్ ఫ్లోర్ అని.. వాహనాలు నమోదు కాలేదని బాధితులు ఆగ్రహం వ్యక్తంచేశారు. మరికొందరైతే తమ పేర్లు నమోదు చేయలేదంటూ రోడ్డెక్కి ధర్నా చేశారు. దీంతో బాధితుల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు సచివాలయాల పరిధిలో దరఖాస్తులు తీసుకున్నారు. ఆ సమయంలో 18వేల దరఖాస్తులు వచ్చాయి. వాటిలో కొన్నింటిని పరిష్కరించి, వరద బాధితుల ఖాతాల్లో నగదు జమచేశారు. అయినా ఇంకా తమకు పరిహారం అందలేదంటూ చాలామంది సెపె్టంబరు 27 వరకు సచివాలయాల చుట్టూ తిరిగారు. తామేమీ చేయలేమని అక్కడి సిబ్బంది చెతులేత్తేయడంతో సెప్టెంబరు 28 నుంచి బాధితులు దరఖాస్తులతో విజయవాడలోని కలెక్టరేట్ బాటపట్టారు. ఇలా వచ్చిన దరఖాస్తులు 21వేలకు పైగా ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. సాయం కోసం ఎదురుచూపులు.. సీన్ కట్‌చేస్తే.. ఇప్పుడీ దరఖాస్తుల గురించి సమా«ధానం చెప్పేవారే కరువయ్యారు. వీటిని అధికారులు పరిశీలించి, అర్హులైన జాబితాలు సచివాలయాల్లో ఉంచితే బాధితుల్లో గందరగోళం ఉండేది కాదు. అయితే, దరఖాస్తులు కంటితుడుపుగా తీసుకున్నారా లేక కాలయాపన చేసి వీటిని కోల్డ్‌స్టోరేజిలోకి నెడతారా అని బాధితులు అనుమానిస్తున్నారు. ఎవరి దగ్గర నుంచి సరైన సమాధానం రాకపోవడంతో, బాధితుల అర్జీలన్నీ బుట్టదాఖలు అయినట్లేనని వారు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ప్రభుత్వం స్పందించి ఆదుకోకపోతే ఆందోళన తప్పదని హెచ్చరిస్తున్నారు. అంచనా బృందాల అరాచకం.. ఇక నష్టం అంచనా జాబితాలోనే ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించిందంటూ బాధితులు మండిపడుతున్నారు. అంచనా బృందాలు వచ్చినప్పుడు ఇంట్లోనే ఉన్నా డోర్‌లాక్ అని నమోదు చేశారని, గ్రౌండ్ ఫ్లోర్‌లోనే ఉంటే నాలుగో అంతస్తు అని నమోదు చేశారని.. ఇల్లంతా బురదమయంగా కనిపిస్తున్నా.. నష్టం జరగలేదని నమోదు చేశారని, వాహనాలు పూర్తిగా పాడైనా.. ఎలాంటి నష్టం జరగలేదని నమోదు చేశారని, ఆధార్, బ్యాంకు ఖాతాలన్నీ సక్రమంగానే ఉన్నా నాట్ ట్రేస్డ్ అని నమోదు చేశారని బాధితులు దుమ్మెత్తిపోస్తున్నారు. సాయం చేసింది గోరంతే.. ఇదిలా ఉంటే.. వరద నష్టం అంచనా పూర్తయిన తరువాత ముంపు ప్రాంతాల్లో 2.68 లక్షల కుటుంబాలకు నష్టం జరిగిందని ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఇందులో 2.32 లక్షల కుటుంబాలకు సంబంధించి 1,700 సర్వే బృందాలతో సర్వే చేయించారు. ఇందులో ఇప్పటివరకు 89,616 ఇళ్లు నీట మునిగినందున రూ.188.80 కోట్ల పరిహారం అందించారు. ఎంఎస్ఎంఈలు, వాహనాలు, వ్యవసాయరంగం, పశువులు, మత్స్యశాఖ, చేనేత, ఉద్యానవనం అన్ని శాఖలకు కలిపి రూ.97.66 కోట్ల సాయం మాత్రమే అందించారు. ఇందులో వ్యవసాయ రంగానికి సంబంధించే రూ.55.60 కోట్ల పరిహారం ఉంది. అంటే.. వరదకు సంబంధించి జిల్లాలో అన్ని రకాల సాయం కింద అందించింది కేవలం రూ.286.46 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. ఇక బాధితులకు ఇచ్చిన పరిహారం కంటే అగ్గిపెట్టెలు, భోజనాలు ఇతర ఖర్చుల కింద ఎక్కువగా ఖర్చుచేయడం విశేషం. అతీగతీలేని సాయం.. మేం రాజీవ్‌నగర్ ప్లాట్ నెంబరు 26లో ఉంటున్నాం. బుడమేరు వరదలో ఇల్లు పూర్తిగా మునిగింది. సర్వే సిబ్బంది వచ్చి వివరాలు నమోదు చేసుకున్నారు. నష్టపరిహారానికి సంబంధించిన జాబితాలో పేరున్నా డబ్బు మాత్రం పడలేదు. ఎవర్ని అడిగినా సమా«ధానం కరువైంది. చివరికి కలెక్టరేట్లో దరఖాస్తు చేసుకున్నా ఇప్పటివరకు అతీగతీలేదు. – వెంగల సాయితేజ, రాజీవ్‌నగర్ -
ప్రశ్నించే స్వరం వినిపించకూడదా?
విజయవాడలో బుడమేరు వరద ముంపునకు గురైన కోటి మందికి భోజనం ఖర్చు రూ.368 కోట్లుగా తేల్చారు. అసలు పునరావాస కేంద్రాలు ఎక్కడ పెట్టారు? అందులోకి ఎంత మందిని తరలించారు? ఎవరికి భోజనం పెట్టారు? అందరూ నీళ్లలో మునిగి ఉంటే మొబైల్ జనరేటర్లు పెట్టారంటా! నీళ్లలో ఉన్నోళ్లు తమను చంద్రబాబు బయటకు తీసుకురావట్లేదని మొత్తుకున్నారు. వీళ్లేమో కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు, మొబైల్ జనరేటర్లకు రూ.23 కోట్లు ఖర్చు రాశారు. – వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ‘ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై నిలదీయకూడదా? మీరు చేసే అవినీతిపై ప్రశ్నించకూడదా? ప్రశ్నిస్తే కేసులు పెడతారా? ఇదెక్కడి అరాచక పాలన..?’ అంటూ సీఎం చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రశ్నించే స్వరమే వినిపించకూడదని ఆరాటపడుతూ తప్పుడు కేసులు పెట్టి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. దీనికి ‘సాక్షి’ ఎడిటర్‌పై పెట్టిన కేసే తార్కాణమని చెప్పారు. ‘ఇలాగైతే ప్రజలు మీకు సింగిల్ డిజిట్ కూడా దక్కకుండా చేస్తారు...’ అంటూ చంద్రబాబును హెచ్చరించారు. మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..చేసిన తప్పును నిజాయితీగా ఒప్పుకో..చంద్రబాబు అధికారంలో ఉన్నంత మాత్రానా ఏం చేసినా చెల్లుతుందనుకుంటే ప్రజలు తిరగబడతారు. అప్పుడు చంద్రబాబుకు, ఆయన పార్టీకి సింగిల్ డిజిట్ కూడా రాదు. మా నాయకులు, కార్యకర్తలను ఇబ్బంది పెడితే సహించేది లేదు. బంతిని నేలకేసి ఎంత గట్టిగా కొడితే అంతపైకి లేస్తుంది. ఎప్పటికైనా చేసిన తప్పును నిజాయతీగా ఒప్పుకుంటే.. ఆ వ్యక్తిలో పరివర్తన వస్తే కొద్దో గొప్పో సానుకూలత పెరుగుతుంది. అంతేగానీ తప్పు కనిపించకూడదు... దాని గురించి ఎవరూ మాట్లాడకూడదంటే ఎవరూ హర్షించరు. రాష్ట్రంలో ప్రజల పక్షాన పోరాడేందుకు మా పార్టీ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. మద్యం విషయంలో మహిళలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. మా హయాంలో ప్రైవేటు మద్యం దుకాణాలు లేవు. ప్రభుత్వమే పారదర్శకంగా నిర్వహించింది. డిజిటల్ పేమెంట్లతోపాటు క్యాష్ పేమెంట్లను అందుబాటులో ఉంచాం. ప్రతి దుకాణంలో పీవోఎస్‌లు పెట్టాం. ఇప్పుడు మొత్తం ప్రైవేటు పరం అయ్యాయి. టీడీపీకి చెందిన వాళ్లే నడుపుతున్నారు. స్ట్రైక్ రేటు చూసుకుని స్కాములు చేస్తామంటే ఈసారి దెబ్బ గట్టిగా తగులుతుంది. జమిలి ఎన్నికలు మన చేతుల్లో లేవు. ఏం జరిగినా పార్టీని సన్నద్ధంగా పెట్టడానికి రెడీగా ఉన్నాం. గ్రామ స్థాయిలో పార్టీకి బూత్ కమిటీలు నియమించి మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేగంగా వేస్తున్నాం. వరదల్లోనూ స్కామ్లేనా?చంద్రబాబు స్కామ్‌లు ఏ స్థాయిలో ఉన్నాయో విజయవాడలో వరదల సమయంలో చూశాం. బుడమేరు వరద ముంపునకు గురైన కోటి మందికి భోజనం ఖర్చు రూ.368 కోట్లుగా తేల్చారు. అసలు పునరావాస కేంద్రాలు ఎక్కడ పెట్టారు? అందులోకి ఎంత మందిని తరలించారు? ఎవరికి భోజనం పెట్టారు? అందరూ నీళ్లలో మునిగి ఉంటే మొబైల్ జనరేటర్లు పెట్టారంటా! నీళ్లలో ఉన్నోళ్లు తమను చంద్రబాబు బయటకు తీసుకురావట్లేదని మొత్తుకున్నారు. వీళ్లేమో కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు, మొబైల్ జనరేటర్లకు రూ.23 కోట్లు ఖర్చు రాశారు. ఇంత దారుణంగా స్కాముల మీద స్కాములు చేస్తున్నారు. పైగా ఇవే ప్రశ్నలు అడిగినందుకు ‘సాక్షి’ ఎడిటర్‌పై కేసు పెట్టారు. ఇంత దారుణంగా ప్రభుత్వ పాలన చేస్తుంటే ప్రశ్నించకూడదా? వీళ్లు ఏం చేసినా ఎవరూ మాట్లాడకూడదా? అసలు వీళ్లు పరిపాలన చేయడానికి యోగ్యులేనా? ప్రజలందరూ ఆలోచించాలి. -
వరద బాధితులకు న్యాయం జరిగే వరకు మా దీక్ష ఆగదు : వైఎస్సార్సీపీ నేతలు
విజయవాడ: వరద బాధితులకు తక్షణమే నష్ట పరిహారం ఇవ్వాలని వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దీక్ష కొనసాగుతుంది. నిరాహార దీక్షలో వరద బాధితులు, వైఎస్సార్సీపీ నేతలు పాల్గొన్నారు. దీనిలో భాగంగా పలువురు వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. వరద బాధితులకు మద్దతుగా వైఎస్సార్సీపీ కదిలింది: దేవినేని అవినాష్వరద బాధితులకు అన్ని విధాల తోడుగా ఉండడానికి నిరాహార దీక్ష చేస్తున్నాంవరద బాధితులకు మద్దతుగా వైఎస్సార్సీపీ కదిలిందిచంద్రబాబు వల్లనే వరదలు వచ్చాయిమైలవరం, జగ్గయ్యపేట, విజయవాడ సింగినగర్, ఇతర ప్రాంతాలు వరదల్లో ప్రజలు ఉన్నారువరదల్లో నష్టపోయిన వారికి ఒక్కరికి నష్ట పరిహారం అందించలేదురోజు కలెక్టరేట్ వద్ద వరద బాధితులు పడిగాపులు పడుతున్నారువరద బాధితులకు నష్ట పరిహారం అడుగుతుంటే వైఎస్సార్సీపీపై బురద జల్లుతున్నారుఫోటోలకు పోజులు ఇవ్వడం తప్ప కూటమి నేతలు చేసింది ఏమీ లేదురూ. 500 కోట్ల విరాళాలు కూటమి ప్రభుత్వం ఏం చేసిందిఅబద్ధపు మాటలు, అబద్ధపు తీరు తప్ప ఎమీ చేయడం లేదుకూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పోరాటమిది.. కూటమి ప్రభుత్వం పడిపోవడానికి ఇదే నాందివైఎస్సార్సీపీ కోటి కాదు.. రూ. కోటి 50 లక్షలు ఖర్చు పెట్టింది50వేల కుటుంబాలను సరుకులు పంపిణీ చేసిందిమా లెక్కలు మేము ఇస్తాం.మీరు ఖర్చు పెట్టిన దానికి లెక్కలు ఇవ్వగలరా? వరదలను చూపెట్టి వందల కోట్లు వసూళ్లు చేశారు: వెల్లంపల్లి శ్రీనివాస్ప్రజల ఆర్భాటాలు కోసమే చంద్రబాబు ప్రయత్నం చేశాడుసంక్షోభంలో చంద్రబాబు అవకాశాలు వెతుక్కుంటాడు.. ఇప్పుడు అవినీతి చేస్తున్నారుఎంత ఖర్చు పెట్టారో మంత్రులు చెప్పలేకపోతున్నారు..ఆర్టీఏ అప్లయి చేసుకోమంటున్నారువిజయవాడ ఇమేజీని డ్యామేజ్ చేసింది కూటమి ప్రభుత్వంకుమ్మరి పాలెం, ఊర్మిళ నగర్, హౌసింగ్ బోర్డ్ ఏరియాలో ఒకరికి నష్ట పరిహారం అందలేదుచెప్పిన మాట ప్రకారం వైఎస్ జగన్ కోటి కాదు.. కోటిన్నర ఖర్చు చేశారువైఎస్ జగన్‌ని చూసి కూటమి నేతలు సిగ్గు తెచ్చు కోవాలికలెక్టరేట్లో అప్లికేషన్లు అమ్ముకుంటున్న చరిత్ర కూటమి ప్రభుత్వంది వరద బాధితులకు చివరి వ్యక్తి వరకు పరిహారం అందేవరకు పోరాటం చేస్తాం కూటమి ప్రభుత్వానికి మానవత్వం లేదు: మల్లాది విష్ణురూ. 534 కోట్ల రూపాయిలు వరద బాధితులకు నష్ట పరిహారం అందించినట్లు అధికారులు లెక్కలు చెప్పారుప్రతి దేవస్థానం నుండి ఫుడ్ తీసుకొచ్చి బయట పడేసి వెళ్లిపోయేవాళ్ళు డీబీటి ద్వారా ఒక్క పైసా కూడా అవినీతి లేకుండా ఇచ్చిన ఘనత వైఎస్ జగన్దేఈ రోజు నష్ట పరిహారం కోసం బాధితులు రోడ్ల మీద ఆందోళన చేస్తాన్నారువరద బాధితులకు నష్ట పరిహారం అందేవరకు పోరాటం చేస్తాంపావలాది రూపాయిన్నారకి కొన్నారుకూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అయితే కలెక్టరేట్ వద్ద బాధితులు ఎందుకు ఆందోళన చేస్తారు.కేంద్రం దగ్గర నుండి ఏం తెచ్చారు.. మరింత సహకారం కావాలని ఏమైనా అడిగారా?రీ ఎన్యుమరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాంమంత్రులకు అధికారులకు సమన్యాయం లేదు.. దోచుకునే అమౌంట్లో లెక్కలు తేలడం లేదు -
వరదలు చూసి వసూలు చేసిన చందాలు పేద వారికి పంచకుండానే మింగేశారు
-
అమెరికాను భయపెడుతోన్న మరో తుఫాను: భయం గుప్పిట్లో ఫ్లోరిడా
ఫ్లోరిడా : హెలెన్ తుఫాను సృష్టించిన బీభత్సం నుంచి బయటపడకముందే అమెరికాను మరో తుఫాను భయపెడుతోంది. ఫ్లోరిడా తీరం వైపు మిల్టన్ హరికేన్ దూసుకొస్తోంది. మిల్టన్ ఐదో కేటగిరీ హరికేన్‌గా బలపడిందని, అత్యంత శక్తిమంతమైన ఈ తుఫాను వల్ల ప్రాణహాని ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫ్లోరిడా పశి్చమ తీరం వైపు కదులుతున్న మిల్టన్.. బుధవారం తీరం దాటే అవకాశం ఉంది. తుఫాను ఉధృతితో బుధవారం తెల్లవారుజామునుంచే తీవ్రమైన గాలులు వీస్తాయని ఎన్‌హెచ్‌సీ హెచ్చరించింది. మిల్టన్ ఐదో కేటగిరీ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలను సురక్షిత స్థానాలకు తరలిస్తున్నారు. ఈ అతిపెద్ద తరలింపు ప్రయత్నానికి సిద్ధం కావాలని గవర్నర్ రాన్ డిసాంటిస్ ప్రజలను కోరారు. మిల్టన్ మార్గంలోని విమానాశ్రయాలు మూసివేశారు. తుఫాను హెచ్చరికలతో ప్రజలు తమ ఇళ్ల నుంచి ఒకేసారి బయటకు రావడంతో రోడ్లన్నీ వాహనాలతో నిండిపోయాయి. మిల్టన్ తుఫాను.. హరికేన్లను వర్గీకరించడానికి ఉపయోగించే సాఫిర్–సింప్సన్ స్కేలుపై మిల్టన్ ఐదో కేటగిరీగా నమోదైనది. ఈ తుఫాను సమయంలో గాలులు గంటకు 285 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని నేషనల్ హరికేన్ సెంటర్ (ఎన్‌హెచ్‌సీ) తెలిపింది. మొదట రెండో కేటగిరీలో ఉన్న తుఫాను కొన్ని గంటల్లోనే 5వ కేటగిరీకి మారింది. ఇంత వేగంగా తుఫాను బలపడటం నమ్మశక్యంగా లేదని ఫ్లోరిడా వాతావరణ నిపుణులు చెబుతున్నారు. చరిత్రలో ఎన్నడూ లేనంతా ఈ హరికేన్ బలపడిందంటున్నారు. ఒక శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని తాకిన అత్యంత తీవ్రమైన తుఫాను ఇదే కావచ్చని చెబుతున్నారు. హరికేన్లు మూడో కేటగిరీ దాటితేనే తీవ్రమైన ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతుంది. గత నెలలో ఫ్లోరిడాను తాకిన హెలెన్ తుఫాను నాలుగో కేటగిరీకి చెందింది. గంటకు 225 కి.మీ. వేగంతో గాలులు వీయడంతో ఆస్తి నష్టం జరిగింది. దీని ధాటికి నార్త్ కరోలినా, సౌత్ కరోలినా, జార్జియా, ఫ్లోరిడా, టేనస్సీ, వర్జీనియాలో దాదాపు 230 మంది మరణించారు. ఇంకా మృతదేహాలను వెలికి తీస్తూనే ఉన్నారు. సాధారణం కంటే 2024 హరికేన్ సీజన్ తీవ్రంగా ఉందని నేషనల్ ఓషియానిక్ అటా్మస్ఫియరిక్ అసోసియేషన్ (ఎన్ఓఏఏ) అంచనా వేసింది. మానవుల వల్ల ఏర్పడిన వాతావరణ మార్పుల కారణంగా సముద్ర మట్ట ఉష్ణోగ్రతలు పెరగడమే ఇందుకు కారణమని తెలిపింది. -
అమరావతి మునగలేదన్నారు..! మరి వరద సాయమేంటి బాబూ?
సాక్షి, అమరావతి: ‘ప్రపంచంలో అద్భుతమైన రాజధాని అమరావతి వరదల్లో మునగలేదు. ఒక్క ఇల్లూ దెబ్బతినలేదు. గిట్టనివారు దు్రష్పచారం చేస్తున్నారు. రాజధాని మునిగిందని ఎవరైనా ప్రచారం చేస్తే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటాం’ అని ఇటీవల ఓ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేసిన బహిరంగ ప్రకటన. కానీ, ఇదే చంద్రబాబు ప్రభుత్వం రాజధాని ప్రాంతమైన తుళ్లూరు మండలంలో ఏకంగా 1,039 మందికి రూ. 80.88 లక్షల పరిహారం అందించింది. మరి ఇదేమిటి? రాజధాని మునగలేదన్న చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వమే ఆ ప్రాంతంలోని వారికి సాయం చేయడమంటే మునిగిందనేది సుస్పష్టం. దాచుకున్నా దాగని పచ్చి నిజం. రాజధాని ప్రాంతమైన తుళ్లూరు మండలంలోని 11 గ్రామాల్లో ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కురిసిన వర్షాలకు ఇళ్లు రెండు రోజులకు పైగా నీట మునిగాయని, ప్రజలు దుస్తులు, గృహోపకరణాలు కోల్పోయారని చెబుతూ ఈ ప్రాంత ప్రజలకు ఇటీవల ప్రభుత్వం పరిహారం అందించింది. వరద పరిహారం అందుకున్న గ్రామాల్లో ప్రస్తుతం శాసన సభ, సచివాలయం ఉన్న వెలగపూడి, కొత్త రాజధాని నిర్మాణం కోసం ప్రకటించిన రాయపూడి కూడా ఉన్నాయి. తుళ్లూరు మండలంలో వరద నష్టాన్ని బట్టి ఒకొక్కరి ఖాతాలో రూ.5 వేల నుంచి రూ.19 వేల వరకు జమచేశారు. దాంతోపాటు బియ్యం, నిత్యావసరాలను కూడా అందించారు. వెలగపూడి, రాయపూడిల్లో తీవ్ర వరద నష్టం ఆగస్టు నెల చివరి వారం, సెపె్టంబర్లో కురిసిన వరుస వర్షాలు రాష్టంలోని పలు ప్రాంతాలను అతలాకుతలం చేశాయి. ముఖ్యంగా బుడమేరు గేట్లు ఎత్తేయడంతో వరద అంతా విజయవాడ నగరంపై పడింది. దాదాపు 5 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. పది రోజులకు పైగా ఇళ్లు నీటిలోనే ఉండిపోవడంతో ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. దీంతోపాటు రాజధానిగా ప్రకటించిన తుళ్లూరు మండలంలోని 11 గ్రామాలు కూడా మునిగిపోయినట్టు అధికారులు గుర్తించారు.ప్రస్తుతం అసెంబ్లీ ఉన్న వెలగపూడి, కొత్త రాజధాని నిర్మిస్తామని ప్రకటించిన రాయపూడి గ్రామాలు సైతం ఉన్నాయి. అమరావతిలో కీలకమైన ప్రాంతాలైన వెలగపూడి, రాయపూడి గ్రామాల్లో తీవ్ర నష్టం జరిగిందని, 219 మంది నిరాశ్రయులయ్యారని అధికారులే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. వీటితోపాటు మందడం, పెదపరిమి, తుళ్లూరు, మల్కాపురం, వెంకటాయపాలెం, రాయపూడి, బోరుపాలెం, అబ్బరాజుపాలెం, హరిశ్చంద్రపురం, ఉద్దరాయనిపాలెం తదితర 11 గ్రామాలూ ఉన్నాయని చెప్పారు. ఆ గ్రామాల్లో పక్కా ఇళ్లు, కచ్చా ఇళ్లు దెబ్బతిన్నాయని, గ్రౌండ్ ఫ్లోర్లు రెండు రోజులకు మించి నీటిలోనే మునిగిపోయాయని నివేదికలో పేర్కొన్నారు. చుట్టూ నీరు చేరడంతో ప్రజల జీవనోపాధి సైతం కోల్పోయారని నివేదికలో వివరించారు. కానీ, సీఎం చంద్రబాబు మాత్రం రాజధానికి అసలు వరదే రాలేదని చెప్పారు. లంక ప్రజలకు అందని వరద సాయం తుళ్లూరు మండలంలో బుడమేరు, కృష్ణానదిని ఆనుకుని కొన్ని లంక గ్రామాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉద్దండరాయునిపాలెం లంక, రాయపూడి పెదలంక, హరిశ్చంద్రాపురం, బోరుపాలెంలోని కొన్ని నివాసాలు, లింగాయపాలెం, తాళ్లాయపాలెంలోనూ లంక గ్రామాలు ఉన్నాయి. వరద ఎక్కువగా రావడంతో ఈ లంకల ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. కానీ పరిహారం మాత్రం చాలా తక్కువ మందికి ఇచ్చారు. అమరావతికి మధ్యలో ఉన్న వెలగపూడి, తుళ్లూరు, రాయపూడి, మందడం, మల్కాపురం, వెంకటాయపాలెం పూర్తిగా దెబ్బతిన్నాయని, ఇక్కడి ప్రజల వార్షిక ఆదాయం రూ.10 వేలు, అంతకంటే తక్కువని అధికారులు నివేదికలో పేర్కొన్నారు. ప్రభుత్వం లంక గ్రామాలను పక్కనపెట్టి, రాజధాని ప్రాంతం మధ్యలో ఉన్న గ్రామాల్లోని ప్రజల ఖాతాల్లో వరద నష్ట పరిహారం సొమ్ము జమ చేసింది. దుస్తులు, ఇంట్లో సామగ్రి పాడైపోయినందుకు రూ.5 వేలు, 10 రోజులు ఉపాధి కోల్పోయినందుకు రోజుకు రూ.300 చొప్పున ఇంట్లో ఇద్దరికి కలిపి రూ.6 వేలు, ఇల్లు నీటిలో మునిగిపోయినందుకు నష్ట తీవ్రతను బట్టి రూ.4 వేల నుంచి రూ.10 వేల వరకు చెల్లించారు. విడ్డూరం ఏంటంటే పరిహారం పొందిన వారిలో ఏడేళ్ల పిల్లలు, దశాబ్దం క్రితం గ్రామం వదిలి వెళ్లిపోయినవారు, బహుళ అంతస్తుల భవనాలు ఉన్నవారు సైతం ఉన్నారు. -
‘అక్షయపాత్ర’ రోజూ పంపిన లక్ష భోజనాలు ఏమయ్యాయి?
సాక్షి, అమరావతి: వరద బాధితుల భోజనాలపై కూటమి ప్రభుత్వం రూ.368 కోట్లు ఖర్చు చేస్తే.. అక్షయపాత్ర ఫౌండేషన్ రోజూ లక్ష మందికి అందించిన భోజనాలు ఏమయ్యాయని, ఇతర స్వచ్ఛంద సంస్థలు చేసిన సాయం మాటేమిటని ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి నిలదీశారు. సోమవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. వరద బాధితులను ఆదుకోవాల్సింది పోయి తప్పుడు లెక్కలతో రూ.534 కోట్లను కూటమి నేతలు దోచేశారని ధ్వజమెత్తారు. ఒక్క పునరావాస కేంద్రం కూడా ఏర్పాటు చేయకుండా రూ.1.39 కోట్లు,మంచినీళ్ల బాటిళ్లకు రూ.26 కోట్లు, కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలకు రూ.23 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం లెక్కలు చూపిందన్నారు. ఏ కాంట్రాక్టర్ ద్వారా ఆ ఏర్పాట్లు చేశారో ప్రభుత్వంవివరాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు.బాధితులు ఎందుకు గగ్గోలు పెడుతున్నారు? ప్రభుత్వం నిజంగా బాధితులకు సాయం చేసి ఉంటే.. ఇప్పుడు కలెక్టరేట్ వద్దకు వేలా దిమంది ఎందుకు పోటెత్తుతున్నా రని అవినాష్, భాగ్యలక్ష్మి ప్రశ్నించారు. పారిశుధ్య కార్మికులకు రూ.51 కోట్లు ఇచ్చామంటున్న ప్రభుత్వం ఎవరి ద్వారా అవి చెల్లించారో చెప్పాలన్నారు. ఆహారం పంపిణీ కోసం 412 డ్రోన్లు ఉపయోగించి, అందుకోసం రూ.2 కోట్లు చెల్లించినట్లు చెబుతున్నారని, నిజానికి అప్పుడు కనీసం 10 డ్రోన్లు కూడా కనపడలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం రూ.534 కోట్లకు సరైన లెక్కలు చెప్పే వరకు ఊరుకోబోమని, వరద బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని వారు ప్రకటించారు. -
బాబు జమానా.. అవినీతి ఖజానా ముంపులోనూ మేసేశారు
బుడమేరు గేట్లెత్తి బెజవాడను నిండా ముంచిన చంద్రబాబు సర్కారు.. ఆదుకోండి మహాప్రభో అని వేడుకునేందుకు వచ్చిన వరద బాధితులను కలెక్టరేట్ గేట్లు మూసి నిర్దయగా గాలికొదిలేసింది. కానీ.. అదే వరద పేరు చెప్పి పాలకులు రూ.వందల కోట్లు కొల్లగొట్టేశారు. సహాయక చర్యలు చేపట్టి బాధితుల్ని ఆదుకున్నట్టు ఇప్పటికీ గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు.. ఆ ముసుగులో ఏ పనీ చేయకుండానే ఖర్చుల పేరిట ఖజానా నుంచి భారీఎత్తున నిధులను పక్కదారి పట్టించారు.సాక్షి, అమరావతి: వరద సహాయక చర్యల కోసం ప్రభుత్వం చేసిన ఖర్చుల లెక్కలు ప్రజల్ని నివ్వెరపరుస్తున్నాయి. బుడమేరు, కృష్ణా వరదలో పేరుకుపోయిన అవినీతి బురదను చూసి జనం అసహ్యించుకుంటున్నారు. సహాయ, పునరావాస చర్యల్లో ఘోరంగా విఫలమైన టీడీపీ సర్కారు.. ఖర్చులు మాత్రం దిమ్మతిరిగేలా చూపడంతో ఇంత ఖర్చు ఎక్కడ పెట్టారోనని ముక్కున వేలేసుకుంటున్నారు.అసలు సహాయక చర్యలే చేపట్టక జనం అల్లాడిపోతే ప్రభుత్వం ఏకంగా రూ.534 కోట్లను రిలీఫ్ క్యాంప్‌ల కోసం ఖర్చు చేసినట్టు చెబుతుండటం విస్తుగొలుపుతోంది. గత నెలలో ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలను వరదలు అతలాకుతలం చేసినా ప్రభుత్వం ఎక్కడా పునరావాస కేంద్రాలు తెరవలేదు. విజయవాడలోని సగం ప్రాంతం మునిగిపోయినా పునరావాస కేంద్రాలు లేకపోవడంతో జనం డాబాలపైన, అపార్ట్మెంట్స్లోని పై అంతస్తుల్లోనే వారం రోజులపాటు గడిపారు. కాగితాల్లో పునరావాస కేంద్రాలు తెరిచినట్టు చూపించినా రెండు, మూడు మినహా అవి ఎక్కడా లేవు. భోజనం ఖర్చు రూ.376 అన్ని ఖర్చుల్లోనూ భోజనాల ఖర్చే రూ.368.18 కోట్లు చూపించడంతో వరద బాధితులు నోరెళ్లబెడుతున్నారు. బాధితులకు స్వచ్ఛంద సంస్థలు, దాతలు పెద్దఎత్తున ఆహారం సమకూర్చారు. వరద ఎక్కువగా ఉండటంతో ముంపు ప్రాంతాల్లో శివారు ప్రాంతాలకు వాటిని తీసుకెళ్లడం సాధ్యం కాలేదు. కానీ.. చంద్రబాబు మాత్రం ప్రభుత్వం తరఫున 97 లక్షల మందికి ఆహారం అందించినట్టు లెక్క రాసేశారు. 3.97 లక్షల మందికి టిఫిన్, 4.33 లక్షల మందికి మధ్యాహ్న భోజనం, 4.26 లక్షల మందికి రాత్రి భోజనం ఇచ్చినట్టు ఆయనే స్వయంగా పలుమార్లు వెల్లడించారు.97.70 లక్షల మందికి టిఫిన్, లంచ్, డిన్నర్‌కి రూ.368.18 కోట్లు ఖర్చు చేసినట్టు లెక్కల్లో చూపారు. అంటే ఒక్కో బాధితుడికి రోజుకు రూ.376 చొప్పున ఆహారం కోసం ఖర్చు చేసినట్టు రాసుకుని ఆ మొత్తాన్ని కొల్లగొట్టారు. ఆహారం అందక జనం అష్టకష్టాలు పడితే.. వారికి స్టార్ హోటల్ భోజనం పెట్టినట్టు చెప్పడాన్ని బట్టి అవినీతి ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. మంచినీళ్లలోనూ అదే తీరు వరద బాధితులకు 94 లక్షల మంచినీళ్ల బాటిళ్లు ఇచ్చినట్టు లెక్క రాసుకుని రూ.26.80 కోట్లను పాలకులు బొక్కేశారు. 94 లక్షల బాటిళ్లలో పావు వంతు కూడా జనానికి అందలేదు. నిత్యావసర సరుకులు కూడా అందరికీ అందకపోయినా లక్షలాది మందికి ఇచ్చేసినట్లు.. అందుకోసం రూ.61 కోట్లకు పైగా ఖర్చయినట్టు లెక్కల్లో చూపించారు. విజయవాడ సింగ్‌నగర్ పరిసరాల్లో ఇప్పటికీ కొన్నిచోట్ల వరద కంపు కొడుతున్నా, చెత్త కనిపిస్తున్నా పారిశుధ్యం మాత్రం సూపర్‌గా ఉందని.. ఇలా చేయడానికి రూ.51 కోట్లు ఖర్చయ్యిందని లెక్కల్లో రాసేసుకున్నారు. అగ్గిపెట్టెలు, కొవ్వొత్తుల కోటా రూ.23 కోట్లు అన్నిటికంటే విచిత్రమైన విషయం కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలకు రూ.23.07 కోట్లు ఖర్చవడం. అసలు జనానికి ఇవి ఎక్కడ ఇచ్చారో అధికారులు కూడా చెప్పలేకపోతున్నారు. ఏ ప్రాంతంలో వరద బాధితుల్ని అడిగినా కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు ఎక్కడ ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో మొబైల్ జనరేటర్ల ఖర్చు కూడా అందులో ఉందని కవర్ చేసుకుంటున్నారు. కానీ.. అవి ఎక్కడ, ఎన్ని పెట్టారో కూడా అధికారులకు తెలియదు. అవినీతి వరదలో వీటి ఖర్చే వింతల్లోకెల్లా వింతగా కనిపిస్తోంది. డ్రోన్ల ఖర్చు రూ.2 కోట్లువరద ఖర్చుల వింతల్లో డ్రోన్ల ఖర్చు సరికొత్తగా ఉంది. కేవలం డ్రోన్ల కోసం రూ.2 కోట్లు ఖర్చు చేసినట్టు చూపించారు. డ్రోన్లతో ఆహారం సరఫరా చేసినట్టు ఏఐ సాయంతో ఫొటోలు తయారు చేసి.. ఇప్పుడు వాటి కోసం కోట్లు ఖర్చయినట్టు లెక్కలు రాశారు. చెత్త తరలింపు, వరద నీరు తోడటం వంటి ఖర్చులే రూ.7 కోట్లు దాటిపోయాయి. వరద బాధితుల తరలింపు, చెత్త ఎత్తడం, పారిశుధ్యం ఈ లెక్క వేరేగా ఉంది. అవన్నీ కలుపుకుంటే ఖర్చులే రూ.557 కోట్లు దాటిపోయింది.అంత ఖర్చు ఎక్కడ పెట్టారు?ఇంత భారీ ఎత్తున సహాయ, పునరావాస చర్యల కోసం ఖర్చు పెట్టినట్టు ప్రభుత్వం చెబుతుండటంతో అంత ఖర్చు ఎక్కడ పెట్టారని బాధితులు ప్రశ్నిస్తున్నారు. చేయని ఖర్చుకు భారీగా లెక్కలు చూసి సర్కారు పెద్దలు దండుకున్నట్టు ఏ లెక్క చూసినా స్పష్టమవుతోంది. ఈ సొమ్ములో చాలా వరకూ విడతల వారీగా ఇప్పటికే విడుదలైంది. కలెక్టర్లు, వివిధ శాఖల ద్వారా ఆ సొమ్మును డ్రా చేసి బిల్లులు కూడా చాలా వరకూ చెల్లించేశారు. వరద ఖర్చుల్లో ఒక్కో అంశంపైనా అవినీతి కేసులు పెట్టవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వరద బాధితులను ఆదుకోకపోగా వారి పేరుతో రూ.వందల కోట్లు దోచేయడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. రూ.500 కోట్ల విరాళాలు హుష్ కాకే! వరద బాధితులను ఆదుకోవడానికి చంద్రబాబు భారీగా విరాళాలు సేకరించారు. ఇప్పటివరకు రూ.500 కోట్లకుపైగా నిధులు దాతల నుంచి అందినట్టు ప్రకటించారు. విరాళాలు బాగా వచ్చాయనుకుంటే.. వాటికి మించి రూ.557 కోట్ల ఖర్చుల లెక్కలు చూపించడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రాన్ని కుంగదీసిన వరద చంద్రబాబు సర్కారుకు కాసులు కురిపించినట్టు స్పష్టమవుతోంది. బాధితులకు రూ.602 కోట్ల నష్టపరిహారం ఇచ్చినట్టు ప్రకటించినా.. ఇంకా చాలా మందికి అందలేదు. నిత్యం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ ఎదుట బాధితులు చేస్తున్న ఆందోళనలే ఇందుకు నిదర్శనం. -
‘ఆటో’ బతుకులు అస్తవ్యస్థం
సాక్షి, అమరావతి: ‘అటో డ్రైవర్ కె.శివారెడ్డి ఊర్మిళనగర్ రెండో లైనులో అద్దె ఇంటిలో నివసిస్తున్నాడు. ఇటీవల వచ్చిన బుడమేరు వరదలకు ఆ ఇల్లు మునిగిపోయింది. జీవనాధారమైన ఆటోతో పాటు ద్విచక్రవాహనం పూర్తిగా పాడైపోయాయి. సచివాలయ సిబ్బంది వచ్చి వివరాలు నమోదు చేసుకుని వెళ్లారు. కానీ ఇంత వరకూ ఒక్క రూపాయి కూడా పరిహారం రాలేదు. అప్పు చేసి ఆటోకు మరమ్మతులు చేయించుకుంటే రూ.45 వేలు ఖర్చయింది. ఇంటికిగానీ, వాహనాలకు గానీ పరిహారం ఇప్పించాలంటూ కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నాడు.పదహారేళ్లుగా ఇదే ప్రాంతంలో ఆటో నడుపుతున్న నా పేరు ఎందుకు జాబితాలో లేదని ఎవరిని అడిగినా సమాధానం చెప్పడంలేదని వాపోతున్నాడు.’’...ఇది బుడమేరు వరదల్లో ఆటోలను కోల్పోయిన వేలాది మంది డ్రైవర్ల ఆవేదన. నగరంలో తిరిగే ఆటోలలో అతకధికం సింగ్ నగర్, ఇందిరానాయక్ నగర్, పాయకాపురం, కండ్రిగ, వాంబేకాలనీ, మిల్క్ ప్రాజెక్ట్, డాబా కోట్లు సెంటర్, రాజరాజేశ్వరిపేట, నందమూరి కాలనీ, భరతమాత కాలనీ, ఊరి్మళనగర్ల నుంచే వస్తున్నాయి. అక్కడి నిరుద్యోగులు డ్రైవర్లుగా మారి జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు వారందరి జీవితాలు అస్తవ్యస్ధంగా మారాయి. ఈ నేపధ్యంలో ఆ ప్రాంతాల్లో పర్యటించి బాధితుల బతుకు చిత్రంపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్ ఇది.మరమ్మతులకు కొత్త అప్పులురోజుల తరబడి ముంపులోనే ఉండటంతో ఆటోలు పూర్తిగా దెబ్బతిన్నాయి. బయట మెకానిక్ దగ్గర నుంచి కంపెనీ షోరూమ్ వరకూ ఒక్కో దాని మరమ్మతులకే రూ.12 వేల నుంచి రూ.75 వేల వరకూ వ్యయం అవుతోంది. రేడియేటర్, ఇంజిన్, బ్యాటరీతో పాటు బీఎస్ 6 వాహనాల్లో సెన్సార్లు పాడవ్వడంతో ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఇన్ని వాహనాలకు మరమ్మతులు చేసేందుకు మెకానిక్‌ల కొరత ఉండటంతో రోజుల తరబడి మోటార్ షెడ్ల వద్దే ఆటోలు పడి ఉంటున్నాయి. ఒకసారి మరమ్మతు చేసినా మళ్లీ మళ్లీ కొత్త లోపాలు బయటపడుతున్నాయి. దీంతో కొత్త అప్పులు చేసి మరమ్మతులకు వెచి్చస్తున్నారు. ఉపాధి లేక, కుటుంబాలను పోషించుకోలేక, వాయిదాలు కట్టలేక అవస్థలు పడుతున్నామని డ్రైవర్లు నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారు. ఓట్లేయించుకున్న రాష్ట్ర ప్రభుత్వంగానీ, స్థానిక ప్రజాప్రతినిధులుగానీ తమను అసలు పట్టించుకోవడం లేదని కన్నీరుమున్నీరవుతున్నారు.బీమా సంస్థల కొర్రీలువరద నీటిలో మునిగిన ఆటోలకు క్లెయిమ్‌లు ఎగవేసేందుకు బీమా సంస్థలు ఉన్న అన్ని అవకాశాలనూ వాడుకుంటున్నాయి. బీమా చేసే సమయంలో డ్రైవర్ల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వారికి తెలియని షరతులను పొందుపరిచి వాటిని ఇప్పుడు సాకుగా చూపిస్తున్నాయి. ఒక ఆటోకి బీమా రావాలంటే సుమారు రెండు నెలలు సమయం పడుతుందని తప్పించుకుంటున్నాయి. అదికూడా వరద వచి్చనప్పటి నుంచి ప్రతి దశలోనూ తీసిన ఫొటోలు, వీడియోలు ఉంటేనే బీమా వర్తిస్తుందని మెలికపెడుతున్నాయి.ప్రాణాలే కాపాడుకుంటామా, ఫొటోలు తీస్తామా అంటూ బాధితులు అడుగుతుంటే బీమా సంస్థలు సమాధానం చెప్పడం లేదు. రెండు వారాల్లోనే క్లెయిమ్‌లు పూర్తి చేసేలా బీమా సంస్థలతో మాట్లాడామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది. ఆచరణలో మాత్రం అది శూన్యం. బీమా సంస్థలు కనీసం 45 రోజుల పాటు ఆటోను ఉన్న చోటు నుంచి కదపకుండా ఉంచాలని చెప్పాయి. అప్పటి వరకూ మరమ్మతు చేయకపోతే మొత్తానికే పనికిరాదని, ప్రభుత్వం ఈ విషయంలో పట్టించుకోవడం లేదని డ్రైవర్లు ఆవేదన చెందుతున్నారు.పరిహారం లేదురాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా సెప్టెంబర్ 1న విజయవాడలో వదర విలయం సృష్టించింది. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వారి జీవనాధారాలైన ఆటోలు, మోటార్ సైకిళ్లు వరద నీటిలో పూర్తిగా మునిపోయాయి. రోజుల తరబడి బురద నీటిలోనే నానిపోవడంతో ఇంజిన్, సెన్సార్లు,కార్బొరేటర్ వంటి ముఖ్యమైన భాగాలు దెబ్బతిన్నాయి. ఆటోకి రూ.10 వేలు, ద్విచక్ర వాహనానికి రూ.3 వేలు చొప్పున పరిహారం ఇస్తామన్న ప్రభుత్వం రకరకాల కొర్రీలతో మూడొంతుల మందిని మోసం చేసింది. ఆటో నడిపితేగానీ పూటగడవని నిరుపేదలు వాటిని బాగు చేసుకోలేక, కుటుంబాన్ని పోషించుకోలేక ప్రభుత్వ కార్యాలయాలు,అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. బుడమేరు వరదల వల్ల దాదాపు 15 వేలకుపైగా అటోలు నీట మునిగితే ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం కేవలం 6,515 మాత్రమే ఉన్నట్టు రవాణా శాఖ అధికారులు వెల్లడించారు. వీటిలో 4,348 ఆటోలకు పరిహారం అందించినట్లు ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేశారు. కానీ వాస్తవానికి మొత్తం బాధితుల్లో దాదాపు 80 శాతం మంది ఆటోవాలాలకు నష్టం పరిహారం అందలేదని బాధితులు చెబుతున్నారు. చాలా మంది పేర్లు బాధితుల జాబితాలోనే లేవు..కొందరి పేర్లు ఉన్నా వారికి డబ్బులు పడలేదు.ఎవరూ పట్టించుకోవట్లేదు‘‘వరదల్లో ఇల్లు మునిగిపోయింది. ఆటో బాగా బెబ్బతింది. ప్రస్తుతానికి నడిచేలా చేయడానికి రూ.8 వేలు ఖర్చయ్యింది. ప్రభుత్వం రూ.10 వేల ఇస్తామని చెప్పింది. కానీ మా వివరాలను నమోదు చేయడానికి కూడా ఎవరూ రాలేదు. సచివాలయంలో అడిగితే కలెక్టరేట్‌కు వెళ్లమని చెప్పారు. అక్కడికి వెళితే ఎవరూ పట్టించుకోవడం లేదు.’’ –లింగయ్య, ఆటో డ్రైవర్, రాజీవ్‌నగర్ కాలనీజీవనాధారం పోతే పరిహారం రాదా?‘‘ఆటో నడిపితేగానీ మా కుటుంబం నడవదు. వరదల వల్ల ఆటో మునిగిపోయి జీవనాధారాన్ని కోల్పోయాం. బీమా రావాలంటే 45 రోజులు ఆటోను వాడకూడదంటున్నారు. బాగు చేయించుకునే స్తోమత కూడా లేదు. అయినా జాబితాలో మా పేరు లేదంటున్నారు. సచివాలయానికి వెళ్లి అడిగితే తమకేమీ తెలియని చెబుతున్నారు. మా గోడును ఎవరికి చెప్పుకోవాలి. మమ్మల్ని ఆదుకునేవారెవరు.’’ –బాబ్జి, ఆటో డ్రైవర్, రాజరాజేశ్వరిపేటఅద్దె ఆటోనే ఆధారం‘‘నేను ఆటోను అద్దెకు తీసుకుని నడుపుతున్నాను. వరదకు ఆటో మునిగిపోయింది. ఎలాంటి పరిహారం రాలేదు. ఎవరిని అడిగినా ఎలాంటి ఉపయోగం లేదు.ఏం చేయాలో తెలియడం లేదు.’’ –దుర్గారావు, ఆటో డ్రైవర్, వాంబేకాలనీ.చాలా ఖర్చవుతోంది‘ఇంటర్ చదివి ఆటో నడుపుతున్నాను. మా నాన్న కూడా ఆటో డ్రైవరే. రెండు ఆటోలూ వరదలో మునిగిపోయాయి.ఒక సారి రిపేరుకి రూ.12 వేలు ఖర్చయ్యింది. కానీ మళ్లీ రేడియేటర్ పాడయ్యింది. నాలుగు రోజులుగా మెకానిక్ దగ్గరే పెట్టి బాగుచేయిస్తున్నాం.’’ –వై.సాయి, ఆటో డ్రైవర్, పాయకాపురం. -
అందని పరిహారం.. ఆగని దరఖాస్తులు
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): బుడమేరు వరద బాధితులు నెల రోజులుగా పడుతున్న కష్టాలు వర్ణనాతీతం. వరదకు సర్వం కోల్పోయి, కట్టుబట్టలతో మిగిలిన తమకు ప్రభుత్వం సహాయం చేస్తుందేమోనన్న ఆశతో వేలాది బాధితులు నిత్యం విజయవాడలోని కలెక్టర్ కార్యాలయానికి వస్తున్నారు. కార్యాలయం గేట్లు మూసేసి పోలీసులు దూరంగా తోసేస్తున్నా, అధికారులు ఛీత్కరించుకుంటున్నా ‘వరదకు బలైపోయాం.. సాయం చేయండయ్యా’ అని వేడుకొంటున్న తీరు అందరినీ కదిలిస్తోంది తప్ప చంద్రబాబు ప్రభుత్వంలో మాత్రం చలనం రావడంలేదు. బాధితులకు ఏదో చేసేశామంటూ సీఎం చంద్రబాబు చేస్తున్న ప్రకటనలే తప్ప.. వాస్తవంగా ఒరిగిందేమీ లేదు. ఈ విషయాన్ని కలెక్టరేట్ వద్దకు వస్తున్న బాధితుల సంఖ్యే చెబుతోంది. నిత్యం వందలాది బాధితులు న్యాయం చేయాలంటూ కలెక్టరేట్‌కు క్యూ కడుతూనే ఉన్నారు. బాధితుల నుంచి గుట్టలుగుట్టలుగా దరఖాస్తులు వస్తూనే ఉన్నాయి. శనివారం నాడు కూడా కండ్రిక, వైఎస్సార్ కాలనీ, ఉడా కాలనీ, భవానీపురం ప్రాంతాల నుంచి బాధితులు పెద్ద సంఖ్యలో వచ్చారు. వారిని కలెక్టర్ కార్యాలయం లోపలికి అనుమతించకపోవడంతో బందరు రోడ్డుపై ఎండలోనే చంటి పిల్లలతో సహా పడిగాపులుకాశారు. చాలా సేపటి తర్వాత అధికారులు వచ్చి దరఖాస్తులు స్వీకరించారు. అయితే, దరఖాస్తులో సచివాలయ నంబర్ తప్పనిసరిగా రాయాల్సి రావడంతో బాధితులు ఇబ్బందులు పడ్డారు. తమ ప్రాంత సచివాలయ కోడ్ తెలియక ఒకటికి రెండు సార్లు ఇంటికి, కలెక్టరేట్‌కు తిరిగారు. నెల రోజులుగా పరిహారం కోసం ఎదురు చూస్తున్నామని, ఇప్పటికీ రూపాయి సాయం అందలేదని బాధితులు వాపోతున్నారు. పరిహారం ఎందుకు జమ కాలేదో ఏ ఒక్కరూ చెప్పడంలేదని మండిపడుతున్నారు. వరదల్లో అన్నీ కోల్పోయిన తమకు పరిహారం ఇవ్వకుండా కార్యాలయాల చుట్టూ తిప్పడం సరికాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సచివాలయ సిబ్బంది, స్థానిక వీఆర్వోలు కలెక్టరేట్‌కు వెళ్లమని చెబుతున్నారే తప్ప సరైన కారణాలు చెప్పడం లేదని మండిపడుతున్నారు. రీ సర్వే చేయాలి ఎఫ్‌సీఐలో క్వాలిటీ కంట్రోల్ విభాగంలో పనిచేసి రిటైర్ అయ్యాను. హెచ్ఐజీ–2లో 235 ఫ్లాట్‌లో ఉంటున్నా. వరదలకు ఇల్లు మునిగిపోయింది. ఫ్రిజ్, వాషింగ్ మెషీన్, మోటార్, కారు, స్కూటర్ మొత్తం దెబ్బతిన్నాయి. రూ. 2 లక్షలకు పైగా నష్టం వచి్చంది. సర్వే టీం రెండు మూడు సార్లు వచ్చి రాసుకున్నారు. వాళ్లేమి రాశారో తెలీదు. ఈ రోజుకు కూడా నాకు పరిహారం అందలేదు. స్థానిక ఎమ్మెల్యేను కలిసి విన్నవించాను. కలెక్టర్‌ను కలిసేందుకు వస్తే అందుబాటులో లేరు. మా ప్రాంతంలో రీ సర్వే చేసి నష్టం వివరాలు సమగ్రంగా నమోదు చేయాలి. – వీవీ సూర్యనారాయణ రావు, హౌసింగ్ బోర్డు కాలనీ, భవానీపురం -
ధర దడ
తెనాలి: రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు నింగినంటుతున్నాయి. దసరా పండుగ సమీపిస్తున్న కొద్దీ ఈ జోరు మరింత ఎక్కువగా ఉంది. శరన్నవరాత్రుల సంబరాల హోరులో టమాటా, ఉల్లి సహా అనేక నిత్యావసర సరుకుల ధరలు సామాన్య, మధ్య తరగతి ప్రజలు ‘కొనబోతే కొరివి..’ అన్నట్లుగా ఉన్నాయి. ముందుముందు ఇవి ఇంకెంత భారమవుతాయోనని బెంబేలెత్తిపోతున్నారు. ఉదా.. బియ్యం, కందిపప్పు, ఉల్లిపాయలు, వంట నూనెలు, నిమ్మకాయ, పూల ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. రైతుబజారులో టమాటా కిలో ధర గురువారం రూ.64 ఉంటే, శుక్రవారానికి రూ.73కు చేరుకుంది. బహిరంగ మార్కెట్లో రూ.80లకు విక్రయిస్తున్నారు. పది రోజుల క్రితం వరకూ రూ.40–45 పలికిన టమాటా ఇప్పుడు రెట్టింపు కావడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. మిగిలిన కూరగాయల పరిస్థితి కూడా కొంచెం అటూఇటుగా అదే పరిస్థితి. ఘాటెక్కిన ఉల్లి..వెల్లుల్లి ధరలు..ఉల్లిపాయలైతే కర్నూలువి రూ.45 పైమాటే. మహారాష్ట్ర నుంచి వచ్చే ఆరుదల పాయ కిలో రూ.70 పైమాటగానే ఉంది. వెల్లుల్లి ధర చుక్కలనంటింది. నాణ్యత ప్రకారం కిలో రూ.250 నుంచి రూ.450 వరకు అమ్ముతున్నారు. ఇక అన్ని రకాల నూనెలూ లీటరుకు రూ.20 పెరిగాయి. అయిదు లీటర్ల డబ్బాలు దాదాపు అన్నీ కొంచెం అటూఇటుగా రూ.680లకు అమ్ముతున్నారు.బియ్యం ధరలూ పైపైకి..బియ్యం ధరలు కూడా పెరిగిపోతున్నాయి. 25 కిలోల బియ్యం బస్తా రూ.1,450–1,600లకు అమ్ముతున్నారు. ఎగుమతులకు అనుమతివ్వడంతో బియ్యం ధరలకు రెక్కలొచ్చాయని చెబుతున్నారు. స్థానిక నిమ్మ మార్కెట్లో నిమ్మకాయలు కిలో రూ.70 ఉంటే రిటైల్ మార్కెట్లో డజను రూ.70కి తక్కువకు దొరకటంలేదు. అలాగే, పూల ధరలు ఠారెత్తిస్తున్నాయి. హోల్‌సేల్‌లో మల్లెపూలు కిలో రూ.1,500 కాగా, గతంలో ఎన్నడూ లేనివిధంగా రిటైల్‌లో మూర రూ.100లకు అమ్ముతున్నారు. సన్నజాజులు కిలో రూ.1,000, కనకాంబరాలు కిలో రూ.2,000గా ఉంది. ఇతర రకాలైనా కనీసం రూ.50–60 పెట్టనిదే మూర పూలు లభించడంలేదు. దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలతో ఏర్పడిన డిమాండ్‌తో వ్యాపారులు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. వరదలే కారణమట..మరోవైపు.. ధరల పెరుగుదలకు ఇటీవల వచ్చిన వరదలను కారణంగా చెబుతున్నారు. ధరలను నియంత్రించే యంత్రాంగమేదీ రాష్ట్రంలో ఉన్నట్లుగా కనిపించటంలేదు. పండుగ రోజుల్లో ఈ విధంగా నిత్యావసర వస్తువుల ధరలు అమాంతంగా పెరగడంతో సామాన్య ప్రజలు పండగ గట్టెక్కేదెలా అని మథనపడుతున్నారు. -
విజయవాడ వరదలు : జనం కన్నీళ్లకు జవాబు ఇదేనా? (ఫొటోలు)
-
అడిగింది రూ.10,320 కోట్లు.. ఇచ్చింది 416 కోట్లే
సాక్షి, హైదరాబాద్/సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో ఇటీవలి భారీ వర్షాలు, వరదల వల్ల రూ. 10,320.72 కోట్ల భారీ నష్టం జరగ్గా కేంద్రం మాత్రం జాతీయ విపత్తుల సహాయ నిధి (ఎన్డీఆర్ఎఫ్) నుంచి కేవలం రూ. 416.8 కోట్ల అత్తెసరు నిధులనే విడుదల చేసింది. కేంద్రం కేటాయించిన నిధులు ఏమాత్రం సరిపోవని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్ర చరిత్రలో ఈ స్థాయిలో భీకర వరదలు ఎన్నడూ రాలేదని, తగిన రీతిలో నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా కేంద్రం నామమాత్రంగా నిధుల కేటాయింపులు జరిపిందని విమర్శిస్తున్నాయి. ఇటీవల వరదల బారిన పడిన 14 రాష్ట్రాలకు సంబంధించిన రాష్ట్ర విపత్తుల సహాయ నిధి (ఎస్డీఆర్ఎఫ్)లో కేంద్రం వాటా కింద మొత్తం రూ. 5,858.6 కోట్లను ఎన్డీఆర్ఎఫ్ నుంచి కేంద్ర హోంశాఖ మంగళవారం విడుదల చేసింది. బీజేపీ, ఎన్డీయేపాలిత రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఏపీ, అస్సాం, బిహార్, గుజరాత్‌కు అధిక నిధులు అందించింది. విపక్షాల పాలనలో ఉన్న తెలంగాణ, కేరళ, హిమాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాలకు కేంద్రం మొండిచేయి చూపిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
AP: పరిహారం.. పంపిణీ అస్తవ్యస్తం
సాక్షి ప్రతినిధి, విజయవాడ/సాక్షి, అమరావతి: బుడమేరు వరదల్లో దారుణంగా దెబ్బతిన్న విజయవాడ నగరంలోని కుటుంబాలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. అప్రమత్తంగా లేక వారిని వరద నీటిలో నిలువునా ముంచి ఘోర తప్పిదం చేయడమే కాకుండా ఇప్పుడు పరిహారం పంపిణీలోనూ తీవ్రమైన తప్పులు చేస్తోంది. ఉద్దేశ పూర్వకంగా చాలా మంది బాధితులకు సాయం ఎగ్గొడుతోంది. సాయం అందించడంలోనూ వివక్ష చూపుతూ సరికొత్త రాజకీయం చేస్తోంది. గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉంటూ నష్టపోయిన వారికి రూ.25 వేలు, పై అంతస్థుల్లో ఉండే వారికి రూ.10 వేలు నష్టపరిహారం ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పై అంతస్థుల్లో ఉండే కూటమి నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులకు మాత్రం ఇప్పటికే పరిహారం జమ అయింది. వారంతా గ్రౌండ్ ఫ్లోర్‌లోనే ఉంటున్నట్లు నమోదు చేసుకుని ఎక్కువ పరిహారం పొందారు. వాస్తవంగా గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉండే వారిలో చాలా మందికి ఇప్పటికీ పరిహారం అందలేదు. నష్టం అంచనాలను గుర్తించడం దగ్గర నుంచి బాధితులకు ప్రకటించిన సాయాన్ని అందించడం వరకూ అన్నింటా ప్రభుత్వం ముందుచూపు లేకుండా వ్యవహరిస్తోంది. జరిగిన నష్టంతో పోల్చితే ప్రకటించిన పరిహారం ఏ మూలకూ సరిపోదని బాధితులు చెబుతున్నారు. చివరికి ఇస్తామని చెప్పిన పరిహారాన్ని కూడా అందరికీ సక్రమంగా ఇవ్వకపోవడంతో బాధితుల ఆందోళన వర్ణనాతీతం. తమను పట్టించుకునే నాథుడు లేడని, తమ గోడు ఎవరూ వినడంలేదని, తమకు సాయం అందడంలేదంటూ విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌కి వేలాది మంది బాధితులు పోటెత్తడమే ఇందుకు నిదర్శనం. తమకు పరిహారం ఎందుకు ఇవ్వలేదంటూ వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక అధికారులు నీళ్లు నమిలారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కడ చూసినా సమస్యలే. వరద వచ్చిన నెల రోజుల తర్వాత కూడా ఆ ప్రాంతాలు ఇంకా కోలుకోలేదు. ప్రభుత్వం ఇచ్చే సాయం అరకొరగా ఉండడం, అదీ అందరికీ అందకపోవడంతో అన్నిచోట్లా ఆందోళన వెల్లువెత్తుతోంది. విజయవాడ సింగ్‌నగర్ తదితర ప్రాంతాల్లో ‘సాక్షి’ బృందం పరిశీలించినప్పుడు అడుగడుగునా బాధితుల కష్టాలే కనిపించాయి. అంతా షో చేశారు..⇒ ‘పది రోజులుగా వరద నీటిలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమని కాలం గడిపాం. తీరా వరద తగ్గాక సాయం కోసం 20 రోజులుగా కుస్తీ పడుతున్నా పట్టించుకొనే నాథుడే లేరు. ఇంటి వద్దకు సర్వే బృందాలు వచ్చి, ఫొటోలు, వివరాలు తీసుకున్నారు. తీరా జాబితాలో చూస్తే మాత్రం పేర్లు కనిపించలేదు. సచివాలయాల చుట్టూ తిరిగి మళ్లీ దరఖాస్తు చేసుకున్నాం. అయినా జాబితాలోకి పేర్లు ఎక్కలేదు. కలెక్టరేట్ వద్దకు వెళ్లి కూడా మా గోడు చెప్పుకున్నాం. కనికరం, జాలి లేదు’ అని బాధితులు కన్నీటిపర్యంతం అవుతున్నారు. ⇒ విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాలకు బయట ప్రాంతాల నుంచి సచివాలయ ఉద్యోగులను తీసుకువచ్చి నష్టాన్ని అంచనా వేయించారు. ఒక యాప్‌లో వివరాలు నమోదు చేయాలని చెప్పినా అందుకు సరైన సమయం ఇవ్వలేదు. దీంతో వారికి అన్ని ఇళ్ల గురించి తెలియకపోవడంతో ఎన్యుమరేషన్ అస్తవ్యస్తంగా సాగింది. పది రోజులపాటు నీళ్లు నిలవడంతో ఇళ్లు, ఇళ్లలోని సామాన్లు, వాహనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అంత నష్టం జరిగినా ఎన్యుమరేషన్లో మాత్రం చాలా తక్కువ నష్టం జరిగినట్లు నమోదు చేశారు. ⇒ వాస్తవానికి 2.68 లక్షల కుటుంబాలకు నష్టం జరిగిందని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో 2.32 కుటుంబాలకు సంబంధించి 1700 సర్వే బృందాలతో సర్వే చేయించింది. 78,558 ఇళ్లు మాత్రమే మునిగాయని, అందులోనూ పూర్తిగా మునిగిన గ్రౌండ్ ఫ్లోర్ ఇళ్లు 64,799 మాత్రమేనని ప్రభుత్వం ప్రకటించింది. కానీ లక్షకుపైగా ఇళ్లు మునిగిపోయినట్లు స్థానిక బృందాల ద్వారా తెలుస్తోంది. ⇒ మునిగాయని గుర్తించిన ఇళ్లకు సైతం సరిగా పరిహారం ఇవ్వలేదు. గ్రౌండ్ ఫ్లోర్ మునిగిపోయినా ఆ ఇల్లు దెబ్బతినలేదని రాశారు. ఒకే ప్రాంతంలో రెండు, మూడు కుటుంబాలు ఉంటే ఒకరికే నష్టం జరిగినట్లు నమోదు చేశారు. ఇల్లు, వస్తువులు, వాహనాలు మునిగిపోయి ఎందుకూ పనికిరాకుండా పోతే ఏదో ఒక దానికే పరిహారం ఇచ్చారు. రెండు వాహనాలు ఉంటే ఒక దానికే ఇచ్చారు. వాహనానికి పరిహారం ఇస్తే ఇంటికి ఇవ్వలేదు. ఎన్యుమరేషన్లో అంతా కోతలే⇒ కొన్ని చోట్ల పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లను కూడా పాక్షికంగా దెబ్బతిన్నట్లు రాశారు. కొంతమంది ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నా నష్టాల జాబితాలో రాయలేదు. ముఠా కార్మికులకు నాలుగు చక్రాల ట్రక్కులు ఉంటే వాటిని పట్టించుకోలేదు. ఎన్యుమరేషన్ బృందాలు నష్టాన్ని అంచనా వేసినప్పుడు చాలా మంది ఇతర ప్రాంతాలకు వెళ్లి తల దాచుకోవడంతో ఆ కుటుంబాల వివరాలు నమోదు కాలేదు. దీంతో వారికి పరిహారం అందలేదు.⇒ 25 వేలకుపైగా ఆటోలు దెబ్బతింటే కేవలం 4348 ఆటోలకు మాత్రమే పరిహారం ప్రకటించింది. లక్షన్నరకుపైగా ద్విచక్ర వాహనాలు ఎందుకూ పనికిరాకుండా పోతే 44,402 వాహనాలు మాత్రమే దెబ్బతిన్నట్లు గుర్తించారు. తోపుడు బండ్లు, కిరాణా షాపులు, చిన్న పరిశ్రమలు, మధ్యతరహా, పెద్ద పరిశ్రమలు వేలాదిగా నీట మునిగినా వాటి సంఖ్య తగ్గించి చూపించారు. ట్రేడ్ లైసెన్సులు ఉంటేనే చిన్నపరిశ్రమలకు పరిహారం ఇస్తామని చెప్పడంతో వేలాది బీరువా పరిశ్రమలకు ఒక్క పైసా పరిహారం అందలేదు. ⇒ ఎన్యుమరేషన్ బృందాలకు ప్రభుత్వం ముందే పరిమితులు పెట్టడంతో ఎక్కడికక్కడ కోతలు పెట్టేశారు. జరిగిన నష్టానికి, అంచనా వేసిన నష్టానికి సంబంధం లేకుండా పోయింది. చాలా మంది బ్యాంకు ఖాతాలకు ఫోన్ నెంబర్, ఆధార్ నెంబర్ లింకవకపోవడంతో పరిహారం జమ కాలేదు. డబ్బులు ఎకౌంట్లో పడని వారికి మళ్లీ ఎన్యుమరేషన్ చేస్తామని ప్రకటించినా, ఇంతవరకు అధికారులు బాధిత ప్రాంతాల వైపు కన్నెత్తి చూడలేదు. కేవలం బ్యాంకు సమస్యలతో 20 వేల కుటుంబాలకు పరిహారం అందలేదు.జాబితాలోనే కుట్ర⇒ జాబితాలో పేర్లు లేవని బాధితులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో, మళ్లీ దరఖాస్తులు తీసుకున్నారు. అప్పుడు 18 వేల దరఖాస్తులు రాగా, 13,700 దరఖాస్తులు అర్హమైనవిగా గుర్తించారు. గత నెల 30వ తేదీ అందరికి పరిహారం అందుతుందని సీఎం ప్రకటించినా అందలేదు. దీంతో కలెక్టరేట్‌కు బాధితులు పోటెత్తారు. ⇒ అర్జీలు సమర్పించిన వారిలో 90 శాతం మంది గ్రౌండ్ ఫ్లోర్లో నివసించే వారే ఉండటం గమనార్హం. నష్టం అంచనా జాబితా తయారీలోనే ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరించిందంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్‌లోనే ఉంటున్నా.. ఫోర్త్ ఫ్లోర్ అని నమోదు చేశారని, ఇల్లంతా బురదమయం అయి కనిపిస్తున్నా.. నష్టం జరగలేదని నమోదు చేశారని.. ఆధార్, బ్యాంక్ ఖాతాలు అన్నీ సక్రమంగానే ఉన్నా.. నాట్ ట్రేస్డ్ అని నమోదు చేశారని కలెక్టరేట్‌కు వచ్చిన బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ⇒ నిరుపేదలు ఎక్కవగా ఉండే వాంబేకాలనీ, వడ్డెరకాలనీ, శాంతినగర్, పైపులరోడ్డు, సింగ్‌నగర్, న్యూఆర్‌ఆర్‌పేట, కండ్రిక, రాజీవ్‌నగర్, జక్కంపూడి, అంబాపురం, భవానిపురం, అంబాపురం, కెల్రావు నగర్, పాయకాపురం, రామలింగేశ్వరనగర్ కట్ట, మధ్యకట్ట, రామకృష్ణాపురం, దేవీనగర్ ప్రాంతాల ప్రజలు అర్జీలు ఇచ్చేందుకు ఎక్కువగా వచ్చారు. ⇒ కాగా, సీఎం సహాయ నిధికి దాతలు రూ.400 కోట్లు అందజేశారు. ఇందులో బాధితులకు అందించిన సాయం రూ.202 కోట్లు మాత్రమే. ఈ ప్రభుత్వానికి కనికరం లేదుఈ ప్రభుత్వానికి పేదలంటే అలుసు. కాస్త అయినా కనికరం లేదు. ఇల్లు మొత్తం మునిగిపోవడంతో పీకల్లోతు నీళ్లలో నుంచి బయటపడ్డాం. వరద తగ్గిన తర్వాత ఇంటికి వచ్చి రాసుకున్నారు. కానీ డబ్బులు పడలేదు. సచివాలయం చుట్టూ పది సార్లు తిరిగాం. ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు కలెక్టరేట్‌కు వచ్చి అర్జీలు ఇస్తున్నాం. కూలీ పనులు చేసుకుని బతికేవాళ్లం. మమ్మల్ని ఇలా ఇబ్బందులు పెట్టడం సరికాదు. – జమ్ము సన్యాసమ్మ, న్యూ రాజరాజేశ్వరిపేట -
వరద నష్టపరిహారంపై గందరగోళం
వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ): విజయవాడ బుడమేరు వరద నష్టపరిహారంపై గందరగోళ పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. బాధితులకు వారి బ్యాంకు ఖాతాల్లో నష్టపరిహారాన్ని జమచేస్తామని ప్రకటించినప్పటికీ అలా కాకపోవడంతో వారు రోడ్డెక్కి లబోదిబోమంటున్నారు. ఇస్తామన్న కొద్దిపాటి పరిహారంలోనూ కోతలు, దానికితోడు సాంకేతిక కారణాలను చూపి నిలిపివేస్తున్నారని వారు మండిపడుతున్నారు. కేవైసీ కాలేదని.. నీ ఖాతా వాడుకలో లేదనే బ్యాంకు సిబ్బంది సమాధానాలతో వరద బాధితులకు దిక్కుతోచడంలేదు.ప్రభుత్వం నష్టపరిహారాన్ని ఎగ్గొట్టడానికే ఈ విధమైన ఎత్తుగడలను అనుసరిస్తోందంటున్నారు. తమకు జరిగిన అన్యాయం.. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని నిరసిస్తూ నగరంలోని పలు సచివాలయాల వద్ద వరద బాధితులు సోమవారం ధర్నాలు నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయానికి కూడా అనేకమంది తరలివెళ్లారు.బ్యాంకుల్లో బారులుతీరిన బాధితులు.. నిజానికి.. వరద నష్టపరిహారాన్ని ఈనెల 30 నాటికి బాధితుల ఖాతాల్లో జమచేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో బాధితులు బ్యాంకులకు పోటెత్తారు. అయితే, మీ ఖాతా వాడుకలో లేదని.. కేవైసీ చేయించుకోవాలని బ్యాంకు సిబ్బంది సూచించటంతో ఇళ్లకు వెళ్లి ఆధార్, పాన్‌కార్డుల జిరాక్స్‌లను తీసుకుని మళ్లీ వచ్చారు. ఆ తర్వాత క్యూలైన్లలో గంటల తరబడి నిరీక్షించినప్పటికీ మళ్లీ ఎన్పీసీఐ (నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) లింక్ అంటూ మెలికపెట్టారు. ప్రభుత్వ పథకాల నగదు బ్యాంకు ఖాతాల్లో పడాలంటే ఎన్పీసీఐతో ఖాతాలు లింక్ అయి ఉండాలని అధికారులు చెప్పడంతో బాధితులు అయోమయానికి గురవుతున్నారు. ఇదిలా ఉంటే.. చాలా కుటుంబాల్లో నాలుగైదు ఏళ్ల క్రితం చనిపోయిన వారి ఖాతాల్లో నగదు జమకావడంతో వారేమి చేయాలో దిక్కుతోచక కొట్టుమిట్టాడుతున్నారు. -
USA: హెలెన్ విధ్వంసం
ఫ్లోరిడా: అమెరికాను తాకిన భీకర హెలెన్ తుపాను ఫ్లోరిడాతో పాటు ఆగ్నేయ అమెరికాలో అపారమైన విధ్వంసం సృష్టించింది. జార్జియా, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా, వర్జీనియాల్లో వరదలు, ఇళ్లు కూలిన ఘటనల్లో 72 మంది చనిపోయారు. మృతుల సంఖ్య పెరిగేలా ఉంది. వరద నష్టం 15 నుంచి 26 బిలియన్ డాలర్ల దాకా ఉంటుందని మూడీస్ అంచనా వేసింది. టెన్నెసీలోని యునికోయ్ కౌంటీ హాస్పిటల్లోకి వరద చేరడంతో మొత్తం 54 మంది భవనంపైకి చేరారు. వారిని హెలికాప్టర్ ద్వారా కాపాడారు. న్యూపోర్టు సమీపంలో జలాశయం పొంగిపొర్లుతుండటంతో 7 వేల మందిని తరలించారు. నార్త్ కరోలినాలో వందేళ్లలోనే రికార్డు స్థాయిలో వరదలు సంభవించాయని అధికారులు వెల్లడించారు. అట్లాంటాలో 48 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో 28.24 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. ఇక్కడ 1878 తర్వాత ఈ స్థాయి వర్షం ఇదే మొదటిసారని జార్జియా వాతావరణ విభాగం ప్రకటించింది. వరదల ధాటికి పార్కు చేసిన కార్లన్నీ మునిగిపోయాయి. ఈ ప్రాంతాన్ని ముంచెత్తాయి. ఫ్లోరిడాలో పలు ప్రాంతాలకు చేరేందుకు పడవలే దిక్కయ్యాయి. ఫ్లోరిడా, జార్జియా, కరోలినాల్లో 30 లక్షల ఇళ్లు, వ్యాపారసంస్థలకు కరెంటు నిలిచిపోయింది. ఇటీవలి ఇడాలియా, డెబ్బీ తుపాన్లను మించిన నష్టం కలిగిందని ఫ్లోరిడా గవర్నర్ రాన్ డీ శాంటిస్ తెలిపారు. తుపాను తీవ్రత తగ్గినా కుండపోత కొనసాగుతుందని వాతావరణ విభాగం హెచ్చరించింది. -
ఎన్టీఆర్ కలెక్టరేట్ వద్ద వరద బాధితుల ఆందోళన
గాందీనగర్ (విజయవాడ సెంట్రల్): బుడమేరు వరదల్లో సర్వం కోల్పోయి, కట్టుబట్టలతో మిగిలిన తమ పేర్లు ప్రభుత్వం సహాయం ప్రకటించిన జాబితాల్లో లేవంటూ వరద బాధితులు శనివారం పెద్ద సంఖ్యలో విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. ఎవరికి వారు స్వచ్ఛందంగా కలెక్టరేట్‌కు చేరుకున్న బాధితులంతా తమ గోడు పట్టించుకోండంటూ నిరసనకు దిగారు. పూర్తిగా నష్టపోయిన తమ పేర్లు నమోదు చేయలేదని, సచివాలయాలకు వెళితే సమాధానం చెప్పే వాళ్లే లేరని వాపోయారు.గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటే ఫస్ట్ ఫ్లోర్ ఉన్నట్లు నమోదు చేశారని ఇంకొందరు తెలిపారు. బైక్‌కు మాత్రమే పరిహారం వచ్చి0దని, ఇంటికి ఇవ్వలేదని మరికొందరు తెలిపారు. నెల రోజులుగా ఇబ్బందులు పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వరదల్లో మునిగిపోయి నెల రోజులవుతోందని, అసలు తమకు పరిహారం ఇస్తారో లేదో తెలియడంలేదని మహిళలు ఆగ్రహం వ్యక్తంచేశారు. సర్వే టీం వచ్చి వివరాలు తీసుకున్నారని, జాబితాలో మాత్రం తమ పేర్లు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకుందామని వచ్చామని తెలిపారు. పోలీసులు బాధితులను గేటు వద్దే నిలిపివేయడంతో వారంతా ఆగ్రహానికి గురయ్యారు. తమను లోపలికి అనుమతించాలని, అధికారులకు తమ ఆవేదన చెప్పుకొంటామంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. బాధితుల ఆగ్రహం తీవ్రం కావడంతో చివరికి బాధితులను లోపలికి అనుమతించారు. కలెక్టరేట్ సిబ్బంది వారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు.జాబితాలో పేరు ఉంది.. పరిహారం రాలేదు ‘పన్నెండు రోజుల పాటు మా ఇల్లు వరద నీటిలోనే ఉంది. ఇంట్లోని వస్తువులన్నీ పూర్తిగా పాడైపోయాయి. బండి మునిగిపోయింది. సర్వే వాళ్లు వచ్చి పేర్లు రాసుకున్నారు. సచివాలయానికి వెళ్లి చూస్తే పేరయితే ఉంది.. కానీ ఇంత వరకు మాకు ప్రభుత్వ సాయం అందలేదు’ అని న్యూ రాజరాజేశ్వరిపేటకు చెందిన సులోచన ఆవేదన వ్యక్తం చేసింది.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి: సీపీఎం కలెక్టరేట్ వద్దకు వరద బాధితులు వచ్చారన్న సమాచారంతో సీపీఎం నేతలు సీహెచ్ బాబూరావు, డి.వి.కృష్ణ అక్కడికి చేరుకున్నారు. ఇప్పటికైనా బాధితుల ఇబ్బందులపై ప్రభుత్వం స్పందించాలని కోరారు. ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని ఎన్యూమరేషన్లో లోపాలు సరిదిద్దాలని డిమాండ్ చేశారు. సచివాలయాల ద్వారా తిరిగి బాధితుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, అందరికీ న్యాయం చేయాలని వారు కోరారు. -
నేపాల్‌లో పోటెత్తిన వరదలు..50 మంది మృతి
కఠ్మాండు:నేపాల్‌లో వరదలు పోటెత్తాయి. గతకొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఎనిమిది జిల్లాల్లో దాదాపు 50మంది మరణించారు.సుమారు 11మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. వరదల కారణంగా దేశంలోని అనేక ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. వరదలు మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.వరద బాధిత ప్రాంతాల్లో దాదాపు 3 వేల మంది భద్రతా సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.నేపాల్ సాయుధ పోలీసు దళానికి చెందిన భద్రతా సిబ్బంది సహాయక చర్యల్లో భాగస్వాములయ్యారు.వరద ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను తరలించేందుకు 23 రాఫ్టింగ్ బోట్లు రంగంలోకి దిగాయి. వరదల బారిన చిక్కుకున్నవారిలో ఇప్పటి వరకు 760 మందిని కాపాడినట్లు అధికారులు వెల్లడించారు. -
ఏపీకి రిలయన్స్ ఫౌండేషన్ రూ.20 కోట్ల విరాళం
ఆంధ్రప్రదేశ్ వరద బాధితులను ఆదుకునేందుకు రిలయన్స్ ఫౌండేషన్ రూ.20 కోట్ల భారీ విరాళం అందించింది. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం సీఎం చంద్రబాబు నాయుడును రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, బోర్డు సభ్యుడు పీఎంఎస్ ప్రసాద్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మెంటార్ పీవీఎల్ మాధవరావులు కలిసి రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ నీతా అంబానీ తరపున రూ.20 కోట్ల చెక్‌ను అందజేశారు.ఇటీవల సంభవించిన భారీ వర్షాలు, వరదలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. ప్రధానంగా విజయవాడ నగరం పూర్తిగా మునిగిపోయింది. భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. వరద బాధితులను ఆదుకునేందుకు పలు కార్పొరేట్ సంస్థలు ముందుకు వస్తున్నాయి. అందులో భాగంగా రిలయన్స్ ఫౌండేషన్ కూడా ముందుకు వచ్చి భారీ సాయం అందించింది. -
మూసీకి వరద..జీహెచ్ఎంసీ హైఅలర్ట్
సాక్షి,హైదరాబాద్: భాగ్యనగరానికి తాగునీరందించే జంట జలాశయాల్లో ఒకటైన ఉస్మాన్‌సాగర్‌లో నీరు ఫుల్‌ట్యాంక్‌లెవెల్ (ఎఫ్టీఎల్) స్థాయికి చేరింది. ఎగువ నుంచి ఉస్మాన్‌సాగర్‌కు వరద నీరురావడంతో నీటి మట్టం పెరిగింది. జలాశయానికి ఇన్‌ఫ్లో 500 క్యూసెక్కులు అధికారులు తెలిపారు.జలాశయం నిండడంతో పాటు ఇన్‌ఫ్లో ఉండడంతో రెండు గేట్లు ఎత్తి ఉస్మాన్‌సాగర్ నుంచి దిగువకు నీటిని విడుదల చేశారు. నీటి విడుదలతో పాటు మూసీకి వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో జీహెచ్ఎంసీ సిబ్బందిని కమిషనర్ అమ్రపాలి అప్రమత్తం చేశారు.ఇదీ చదవండి: హైడ్రా ఎఫెక్ట్..మూసీ పరివాహక ప్రాంతంలో ఉద్రిక్తత -
వరద సాయం విడుదల
సాక్షి ప్రతినిధి, విజయవాడ: బుడమేరు వరదలు, భారీ వర్షాల బాధితులకు పరిహారాన్ని సీఎం చంద్రబాబునాయుడు బుధవారం విడుదల చేశారు. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బ్యాంకింగ్, బీమా, అర్బన్ క్లాప్ యాప్, ఎల్రక్టానిక్ ఉపకరణాల మరమ్మతులపై తొలుత సమీక్షించారు. వరద నష్ట పరిహారం లేఖలను లబ్దిదారులకు లాంఛనంగా అందజేశారు. ఈ సందర్భంగా సీఎం మీడియాతో మాట్లాడుతూ.. వరదల వల్ల రాష్ట్రంలో మొత్తం రూ.7,600 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు. తీవ్రంగా నష్టపోయిన బాధితులకు రూ.602 కోట్ల మేర పరిహారాన్ని వారి ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. ఇంకా ఎవరైనా అర్హులుంటే ఈ నెల 30 కల్లా పరిష్కరించి సాయం అందిస్తామని చెప్పారు. అత్యంత పారదర్శకంగా లబ్దిదారులను ఎంపిక చేసి, ఆ జాబితాలను సచివాలయాల్లో ప్రదర్శించి, బాధితులకు ఆర్థిక సాయం అందిస్తున్నామని వివరించారు. రాష్ట్రం మొత్తం మీద 74 మంది మరణించారని చెప్పారు. వీరి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున సాయం అందిస్తున్నట్లు తెలిపారు. విజయవాడలో ముంపు ప్రభావిత ప్రాంతాల్లో గ్రౌండ్ ఫ్లోర్లో నీళ్లు వచ్చిన వారికి రూ.25 వేలు, మొదటి, ఆపై అంతస్తుల్లో ఉన్నవారికి రూ.10 వేల చొప్పున అందించినట్లు తెలిపారు. రుణాలు రీషెడ్యూల్ చేయమని చెప్పామన్నారు. డ్రైవింగ్ లైసెన్సు, ఆర్సీలు, ఆధార్ కార్డులు, జనన, మరణ ధ్రువీకరణపత్రాలు ఇలా ఏ సర్టిఫికెట్ పోయినా వెంటనే ఉచితంగా ఇవ్వాలని అధికారులకు ఆదేశాలిచ్చినట్లు చెప్పారు. పాడైపోయిన పాఠ్యపుస్తకాల స్థానంలో పిల్లలందరికీ కొత్త పుస్తకాలు ఉచితంగా ఇవ్వమని చెప్పామన్నారు. ఆర్థిక సాయానికి సంబంధించి గత రెండు రోజుల్లో 17 వేల అర్జీలు వచ్చినట్లు తెలిపారు. వాటిలో 4 వేలు డూప్లికేషన్స్ పోగా 13 వేల దరఖాస్తులను రెండు రోజుల్లో పరిశీలించి, అర్హులైన వారికి సాయమందిస్తామని చెప్పారు. సహాయ కార్యక్రమాలను ఈ నెల 30కి పూర్తిచేసి ఆరోజు సాయంత్రం థ్యాంక్స్ గివింగ్ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.400 కోట్ల విరాళాలు వచ్చాయని చంద్రబాబు చెప్పారు. ఈ రోజు విడుదల చేసిన రూ.602 కోట్లలో రూ.400 కోట్లు దాతలిచ్చినవేనని తెలిపారు. విధ్వంసాలు చేయడం, వాటిని వేరేవారిపై నెట్టడం కొందరికి అలవాటుగా మారిందని వ్యాఖ్యానించారు. ప్రజల ప్రాణాలు, శాంతిభద్రతలు కాపాడటం వంటివి తమ బాధ్యత అని, వీటికి ఎవరు విఘాతం కలిగించినా, తప్పులు చేసినా సహించబోమని చెప్పారు. -
Video: గంగా నది ఉగ్రరూపం.. కొట్టుకుపోయిన ఇళ్లు
బిహార్ భారీ వర్షాలు ముంచెత్తాయి. వరదలతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పాఠశాలలు మూతపడ్డాయి. అనేక రైళ్లు రద్దయ్యాయి. పలు యూనివర్సిటీ పరీక్షలు వాయిదా పడ్డాయి. వర్షాల కారణంగా బిహార్‌లో ఇప్పటి వరకు 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక రాష్ట్రంలోని దాదాపు 12 జిల్లాలోని నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సాధారణ నీటిమట్టాన్ని దాటి అధికంగా పారుతున్నాయి. చాలా చోట్ల గంగా నది ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తుంది.మమ్లాఖా జిల్లాలో గంగా నదీ ఉగ్రరూపానికి దాదాపు 10 ఇళ్లు కొట్టుకుపోయాయి. రెండు, మూడు అంతస్థుల నిర్మాణాలు సైతం నదిలోకి జారుకొని కొన్ని సెకన్లలో అవి అదృశ్యమయ్యాయి. భాగల్పూర్ జిల్లాలోని అనేక ఇళ్లు కేవలం 10 నిమిషాల్లో గంగానదిలో మునిగిపోయాయి. దీంతో వేలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. ఇళ్లు నీళ్లలో కొట్టుకుపోతుండగా పలువురు వీడియోలు తీయడంతో అవి కాస్తా వైరల్‌గా మారాయి.#WATCH : These Videos from Bhagalpur, district of Bihar.. where a terrible flood was seen not in the Ganga, but in just 10 minutes many houses got washed away in the Ganga, thousands of families became homeless.#bhagalpur #BiharNews #Flood #flooding #Ganga pic.twitter.com/tNkBNbv1WL— Ravi Pandey🇮🇳 (@ravipandey2643) September 24, 2024 -
ఇంకా అందని సాయం..
-
వరద బాధితులపై సర్కార్ దమనకాండ
భవానీపురం (విజయవాడ పశ్చిమ): బుడమేరు వరదలో సర్వం కోల్పోయి సాయం అందించాలని కోరిన భవానీపురం కరకట్టవాసులపై చంద్రబాబు ప్రభుత్వం దమనకాండకు దిగింది. పోలీసులతో లాఠీచార్జి చేయించి, అణచివేసేందుకు ప్రయత్నించింది. అయినా బాధితులు వెనక్కి తగ్గకపోవడంతో దిగివచ్చిన అధికారులు ఎన్యూమరేషన్ చేస్తామని చెప్పారు. ఇందుకు రేషన్ కార్డులు కావాలని చెప్పడంతో వరదలో పోయిన కార్డులను ఎక్కడ తెమ్మంటారంటూ బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవలి బుడమేరు వరదకు భవానీపురం కరకట్ట ప్రాంతం మునిగిపోయింది. అయినా ఇప్పటివరకు ఈ ప్రాంతంలోని బాధితులకు ప్రభుత్వం ఎటువంటి సాయం అందించలేదు. వరద బాధితులకు పరిహారమిచ్చేందుకు ఎన్యూమరేషన్ కూడా చేయడంలేదు. అదేమంటే ఈ ప్రాంతం రెడ్ జోన్లో లేదని అధికారులు చెబుతున్నారు. 15 రోజుల క్రితం ఈ బాధితులు పెద్ద ఎత్తున రాస్తారోకో చేయగా తహసిల్దార్ వారికి రేషన్ మాత్రం అందించారు. ఎన్యూమరేషన్ చేయించలేదు. దీంతో బాధితులంతా రోడ్డెక్కారు. బుడమేరు వరద కారణంగా మా ఇళ్లు మునగ లేదా.. మేం బాధితులం కాదా అంటూ సోమవారం సాయంత్రం దాదాపు 500 మంది బాధితులు విద్యాధరపురం కుమ్మరిపాలెం సెంటర్లో జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. రోజువారీ పనులు చేసుకుంటూ జీవించే తాము ఎన్యూమరేషన్ అధికారులు వస్తారేమోననని పనులకి కూడా వెళ్లకుండా ఇళ్ల దగ్గరే ఉంటున్నామని, అయినా ఇంతవరకు ఎవరూ తమ గోడు వినలేదంటూ కన్నీటి పర్యంతమయ్యారు. అదేమంటే తమ ప్రాంతం రెడ్ జోన్ కాదంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు రోడ్డు మీద బైఠాయించారు. రెండు గంటలపాటు సాగిన ఈ ఆందోళనతో కుమ్మరిపాలెం సెంటర్లో ఉద్రిక్తత నెలకొంది. వెస్ట్ ఏసీపీ దుర్గారావు, భవానీపురం సీఐ ఉమామహేశ్వరరావు ఇతర పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయినా బాధితులు వెనక్కి తగ్గలేదు. ఇంతలో ఏడీసీపీ గుణ్ణం రామకృష్ణ వచ్చారు. ఆయన ఆదేశాలో ఏమిటో తెలియదుగానీ వెంటనే పోలీసులు రెచ్చిపోయి బాధితులపై లాఠీచార్జ్ చేశారు. అయినా బాధితులు వెరవకుండా పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోప్ పార్టీ వచ్చి వారిని వెనక్కి నెట్టేసేందుకు ప్రయత్నించినా బాధితులు లెక్క చేయకుండా ఆందోళన కొనసాగించారు. పశ్చిమ తహసిల్దార్‌ను పిలిపించి మాట్లాడిస్తానని ఏడీసీపీ రామకృష్ణ బాధితులకు చెప్పి రోడ్డు మీదున్న వారందరినీ ఒక పక్కకు మళ్లించారు. చివరకు వెస్ట్ తహసిల్దార్ ఇంతియాజ్ పాషా వచ్చి బాధితులతో మాట్లాడారు. కలెక్టర్‌కు విషయం తెలిసి తనను పంపించారని, మంగళవారం ప్రత్యేక బృందాలతో ఎన్యూమరేషన్ చేయిస్తానని చెప్పారు. రేషన్ కార్డ్ తదితర ధృవపత్రాలను తీసుకురావల్సి ఉంటుందని చెప్పారు. ఇళ్లన్నీ మునిగిపోతే అవన్నీ ఎక్కడ నుంచి వస్తాయని బాధితులు ప్రశ్నించారు. చివరకు అధికారుల హామీతో ఆందోళన విరమించారు. -
AP:వరదబాధితులపై పోలీసుల దౌర్జన్యం
సాక్షి,విజయవాడ:వరద బాధితులపై పోలీసుల దౌర్జన్యం కొనసాగుతోంది. పరిహారం కోసం వరద బాధితులు రోడ్డెక్కారు.పరిహారం లెక్కల్లో అధికారులు గోల్మాల్ చేయడంతో సోమవారం(సెప్టెంబర్23) సాయంత్రం విజయవాడ కుమ్మరిపాలెంలో ఉద్రిక్తత నెలకొంది.పెద్ద ఎత్తున వరద బాధితులు ఆందోళనకు దిగారు.ఉదయం ఆర్ఆర్పేటలోనూ వరద బాధితులు సాయం కోసం ఆందోళన చేశారు.సాయంత్రం కుమ్మరిపాలెంలో వరద బాధితులు ఆందోళనకు దిగారు.ఆందోళన చేస్తున్నవారిపై పోలీసులు దౌర్జన్యం చేశారు.ఆందోళన చేస్తున్న మహిళలను తోసేశారు.ఆందోళన చేస్తే కేసులు పెడతామని వరద బాధితులను బెదిరించారు.దీంతో వరద బాధితులు,పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు డౌన్ డౌన్ అంటూ వరద బాధితులు నినాదాలు చేశారు.పోలీసులు,వరద బాధితులకు మధ్య పెనుగులాట చోటు చేసుకుంది.అర్హులైన వరద బాధితుల పేర్లను ప్రభుత్వం జాబితాలో చేర్చకపోవడం వల్లే ఘర్షణలు ఏర్పడ్డాయి. -
రేవంత్ రెడ్డిని కలిసిన మహేశ్ బాబు, నమ్రత.
-
మూసీలో చిక్కుకున్న పశువుల కాపరులు
కేతేపల్లి: ఎలాంటి ముందస్తు హెచ్చరికలు జారీ చేయకుండా అధికారులు మూసీ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ఇద్దరు పశువుల కాపరులు వరద నీటిలో చిక్కుకుపోయారు. అయితే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది బాధితులను కాపాడి సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలోని భీమారం గ్రామంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. భీమారం గ్రామానికి చెందిన పశువుల కాపరులు సురుగు బాలస్వామి, బయ్య గంగయ్య రోజుమాదిరిగానే ఆదివారం పశువులను మేపేందుకు గ్రామ శివారులో ఉన్న మూసీ వాగు ప్రాంతంలోకి తీసుకెళ్లారు. కాగా, హైదరాబాద్ నగరంతో పాటు మూసీ ఎగువన ఉన్న ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలతో మూసీ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో పెరిగింది. ప్రాజెక్టులో నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరటంతో అధికారులు ఎలాంటి ముందస్తు హెచ్చరికలు జారీ చేయకుండా ప్రాజెక్టు మూడు క్రస్టు గేట్లను పైకెత్తి నీటిని విడుదల చేశారు. దీంతో మూసీ ప్రాజెక్టు దిగువనున్న భీమారం వద్ద మూసీ వాగులో ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడంతో బాలయ్య, గంగయ్య వెంటనే తేరుకుని పశువులతో సహా వాగు మధ్యలో ఉన్న పెద్ద రాతిబండపైకి చేరుకున్నారు. అదే సమయంలో వాగు వద్ద ట్రాక్టర్లోకి ఇసుక ఎత్తుతున్న కూలీలు వరద ఉధృతి పెరగటం గమనించి వెంటనే దూరంగా వెళ్లి ప్రాణాలు కాపాడుకున్నారు. ట్రాక్టర్ మాత్రం వాగులోని నీటిలో మునిగిపోయింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదేశాల మేరకు శాలిగౌరారం సీఐ కొండల్‌రెడ్డి, కేతేపల్లి ఎస్ఐ శివతేజ, తహసీల్దార్ ఎన్. మధుసూదన్‌రెడ్డి హుటాహుటిన ఘటనా స్థలం వద్దకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మూసీ ప్రాజెక్టు అధికారులతో ఫోన్లో మాట్లాడి గేట్లు మూసివేయించారు. ఒక వైపు సహాయక చర్యలు కొనసాగుతుండగానే ప«శువులు నీటిలో ఈదుకుంటూ సురక్షితంగా ఒడ్డుకు చేరాయి. పోలీసులు జేసీబీని వాగులోకి దింపి పశువుల కాపరులను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో వీలు కాలేదు. సూర్యాపేట ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని తాళ్లు, సేఫ్టీ జాకెట్ల సహాయంతో వాగులోకి వెళ్లి పశువుల కాపరులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. -
ప్రధానికి మమత మరో లేఖ.. కేంద్రంపై ఆరోపణలు
కోల్‌కతా:పశ్చిమబెంగాల్ వరదలపై సీఎం మమతా బెనర్జీ ప్రధాని మోదీకి మరో లేఖ రాశారు. వరదల కారణంగా రాష్ర్టంలో 50లక్షల మంది ప్రజలు తీవ్రంగా నష్టపోయారని లేఖలో తెలిపారు.వారిని ఆదుకునేందుకుగాను కేంద్రం వెంటనే నిధులివ్వాలని లేఖలో కోరారు.తమ అనుమతి లేకుండా దామోదర్ వ్యాలీ కార్పొరేషన్(డీవీసీ) రిజర్వాయర్ల నుంచి నీటిని విడుదల చేయడంతో అనేక జిల్లాలు నీట మునిగాయన్నారు. ఈ విషయమై ప్రధానికి మమత రాసిన తొలి లేఖపై కేంద్ర జలశక్తి మంత్రి సి ఆర్ పాటిల్ స్పందించారు. డీవీసీ రిజర్వాయర్ల నుంచి నీటి విడుదలపై ప్రతి దశలోనూ రాష్ట్ర అధికారులకు సమాచారం ఇచ్చామని వివరణ ఇచ్చారు.దీనిపై బెనర్జీ స్పందిస్తూ డ్యామ్‌ల నుంచి నీటి విడుదల దామోదర్ వ్యాలీ రిజర్వాయర్ రెగ్యులేషన్ కమిటీ అనుమతి, సహకారంతో జరుగుతుంది. నీటి విడుదలపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రతినిధులతో కూడా సంప్రదించాలి కానీ వారు అలా చేయలేదు. అన్ని కీలక నిర్ణయాలను కేంద్రం ఆధ్వర్యంలోని శాఖలు ఏకపక్షంగా తీసుకున్నాయి. రాష్ట్రప్రభుత్వానికి ఎటువంటి నోటీసులు లేకుండా నీరు విడుదల చేశారని తప్పుపట్టారు.నీటి విడుదలకు కొద్ది గంటల ముందు సమాచారం ఇవ్వడంతో రక్షణ చర్యలు చేపట్టడం కుదరలేదని విమర్శించారు. -
సీఎం మమత కీలక నిర్ణయం.. జార్ఖండ్ సరిహద్దు మూసివేత
కోల్‌కతా: సీఎం హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జార్ఖండ్ ప్రభుత్వంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బెంగాల్లో వరదలకు దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ కారణమని ఆమె ఆరోపించారు. ఈ క్రమంలో బెంగాల్-జార్ఖండ్ భూ సరిహద్దును మూడు రోజులపాటు మూసివేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.అయితే జార్ఖండ్‌ను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని డీవీసీ ద్వారా నీటిని విడుదల చేశారని మమత ఆరోపించారు. దీనివల్ల రాష్ట్రంలోని పలు జిల్లాలను వరద నీరు ముంచెత్తినట్లు తెలిపారు. ఇది కేవలం మనవ తప్పదమని ఆమె పేర్కొన్నారు. డీవీసీ.. డ్యామ్‌ల వద్ద పూడిక తీయడంలో దారుణంగా విఫలమయిందని విమర్శించారు. పశ్చిమ బెంగాల్లో వరద నీరు చుట్టు ముట్టిన హౌరా, మిడ్నాపూర్ జిల్లాల్లోని పలు వరద నీటి ప్రభావిత ప్రాంతాల్లో సీఎం మమత పర్యటించారు.ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో వరదలకు దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ (డీవీసీ) కారణమని ఆరోపించారు. ఇష్టమున్నట్టు నీటిని దిగువకు విడుదల చేశారన్నారు. ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆరోపించారు. కేంద్రం ఆడుతున్న నాటకంలో ఇదొక కుట్రగా ఆమె పేర్కొన్నారు. దీనిపై తాము ఉద్యమిస్తామని హెచ్చరించారు. మానవ ప్రమేయంతో వచ్చిన ఈ వరదలకు డీవీసీనే బాధ్యత వహించాలని దీదీ డిమాండ్ చేశారు.