
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని రంబన్ జిల్లాలో క్లౌడ్ బరస్ట్ సంభవించింది. ఫలితంగా ఆకస్మిక వరదలు తలెత్తాయి. అనేక ఇళ్లు జల సమాధి అయ్యాయి. ఈ ప్రకృతి వైపరీత్యంలో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. నలుగురు గల్లంతయ్యారు. స్థానిక అధికారులు, విపత్తు నిర్వహణ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి.
రంబన్‌లో క్లౌడ్ బరస్ట్ కారణంగా స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. భారీ వర్షాలు సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగిస్తున్నాయి. అయినప్పటికీ రెస్క్యూ సిబ్బంది బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. క్లౌడ్ బరస్ట్ కారణంగా అకస్మాత్తుగా వచ్చిన వరదలతో పలు ఇళ్లు జలమయమయ్యాయి. కల్వర్టులు, రోడ్లు ధ్వంసమయ్యాయి. వాతావరణ శాఖ భారీ వర్ష సూచనకు సంబంధించిన హెచ్చరిక జారీ చేసింది.
ఆగస్టు 14న చిసోటిలో క్లౌడ్ బరస్ట్ కారణంగా సంభవించిన విపత్తులకు 65 మంది మృతిచెందారు. వీరిలో అధిక సంఖ్యలో పర్యాటకులున్నారు. ఈ ఘటనల్లో 100 మందికి పైగా ప్రజలు గాయపడ్డారు. ఇదేవిధంగా కథువా జిల్లాలో ఆకస్మిక వరదకు ఐదుగురు పిల్లలతో సహా ఏడుగురు మృతి చెందారు. మంగళవారం రియాసి జిల్లాలోని వైష్ణో దేవి మార్గంలో కొండచరియలు విరిగిపడి, 34 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోగా, 20 మంది గాయపడ్డారు. ఆకస్మిక వరదల తరువాత పరిస్థితిని సమీక్షించేందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆగస్టు 24న జమ్మూను సందర్శించారు.
J&K| Cloudburst in Rajgarh area of Ramban district.
3 bodies recovered, 2 more reportedly missing⁰Rescue operation underway#Ramban #Cloudburst #JammuAndKashmir pic.twitter.com/oACzmLMy7B— Saahil Suhail (@SaahilSuhail) August 30, 2025