ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మాజీ చైర్మన్ లలిత్ మోడీ 63వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. లండన్‌లో హై-ఎనర్జీ పార్టీతో తన 63వ పుట్టినరోజును జరుపుకున్నారు. ప్రధానంగా వేలకోట్లు ఎగవేసి లండన్‌కు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. మేఫెయిర్‌లోని మాడాక్స్ క్లబ్‌లో పుట్టినరోజు కేక్ కట్ చేయడం, డ్యాన్స్ చేయడం మరియు అతిథులతో కలిసి ఆడిపాడిన వీడియోలను మోడీ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.ఇక్కడ ఒక్కో టేబుల్‌కు కనీసం 1,000 పౌండ్లు (సుమారు రూ. 1.18 లక్షలు) ఖర్చు అవుతుందని అంచనా.
అంతేకాదు ప్రత్యేకంగా రూపొందించిన పుట్టినరోజు పాట నేపథ్యంలో "హ్యాపీ బర్త్‌డే, లలిత్. కింగ్ ఆఫ్ స్మైల్స్" అనేది మరో హైలైట్‌గా నిలిచింది. అలాగే తన భాగస్వామి రీమా బౌరీకి ధన్యవాదాలు తెలుపుతూ, "ఈ పుట్టినరోజు కుటుంబం, స్నేహితులతో ఎంతో అందంగా గడిచింది. రీమా, నువ్వు అద్భుతమైన పార్టీ ఇచ్చావు" అని లలిత్ మోదీ పోస్ట్ చేయడం విశేషం.
ఇదీ చదవండి: పరువు పేరుతో ప్రేమకు సమాధి, తప్పెవరిది?
310 మందికి పైగా దేశ, విదేశీ అతిథులు హాజరయ్యారు. హాజరైన వారిలో క్రికెటర్ క్రిస్ గేల్ కూడా ఒకరు. మోడీ ,మాల్యా ఇద్దరితో ఒక ఫోటోను పోస్ట్ చేశారు. మోడీ తన పోస్ట్‌లో, బ్యూటిఫుల్ ఈవినింగ్... ఈ వీడియో "ఇంటర్నెట్‌ను బద్దలు కొట్టవచ్చు" అని చమత్కరించాడు. కరోకే సెటప్ కోసం సంగీతకారుడు కార్ల్టన్ బ్రాగాంజాకు ధన్యవాదాలు తెలిపాడు.
ఇదీ చదవండి: జడ్జి‘మెంటల్స్’కు ఇచ్చిపడేసిన ప్రేమ జంట
కాగా మనీలాండరింగ్ మరియు FEMA ఉల్లంఘనలకు సంబంధించిన అనేక ED కేసుల్లో నిందితుడిగా ఉన్న మోడీ 2010లో లండన్‌కు పారిపోయాడు. అలాగే భారతీయ బ్యాంకులకు వేలకోట్ల రూపాయలు ఎగవేసి, లండన్‌కు చెక్కేశాడు మాల్యా.


