ఏఐ కాదురా అబ్బీ.. ఈ బామ్మ డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా | 75 Years Indian Saree Woman Mind Blowing Dance Viral | Sakshi
Sakshi News home page

ఏఐ కాదురా అబ్బీ.. ఈ బామ్మ డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా

Nov 29 2025 7:41 PM | Updated on Nov 29 2025 8:05 PM

75 Years Indian Saree Woman Mind Blowing Dance Viral

అరేయ్‌.. అది ఏఐ ఎడిటింగ్‌ ఏమో రా!. కావాలంటే జాగ్రత్తగా చూడు.. అంటూ ఫలనా వీడియోను, ఫొటోను ఉద్దేశిస్తూ కామెంట్లు పెరిగిపోతున్న రోజులివి. చివరికి ఫ్యాక్ట్‌చెక్‌ సైట్లు సైతం వాటిని నిర్ధారించడంలో తడబడుతున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో నెట్టింట వైరల్‌ అవుతున్న ఓ బామ్మ వీడియో హాట్‌ టాపిక్‌గా మారింది. 

ఆ పెద్దావిడ వయసు 75 ఏళ్ల దాకా ఉంటుంది. కానీ, డ్యాన్స్‌లో మాత్రం దుమ్మురేపేసింది. దీంతో అది ఏఐనేమో అని పలువురు భ్రమ పడ్డారు. అయితే నెటిజన్ల పుణ్యమాని అది ఏఐ వీడియో కాదని.. ఆమె నిజంగానే చితక్కొట్టేసిందని తెలుస్తోంది(Viral Didi). 

ప్రముఖ సంగీత దర్శకుడు బప్పీలహరి ఆల్‌టైం హిట్స్‌లో ఒకటైన దో ఘూంట్‌ పిలా దే సఖియా(Do Ghoont pila de saqiya) పాటకు ఆమె వేసిన స్టెప్పులకు అక్కడున్నవాళ్లే కాదు.. నెటిజన్స్‌ కూడా ఫిదా అవుతున్నారు. అందునా ఉల్టాఫల్టా వేసిన స్టెప్పుకు కచ్చితంగా ఓ.. వేసుకోవాల్సిందే. ఆమెకు ఇంకా వయసు అయిపోలేదని.. ఏ మాత్రం జోష్‌ తగ్గకుండా వేసిన స్టెప్పులను మెచ్చుకుంటున్నారు. 

భక్తి గీతాల స్పెషలిస్ట్‌ నరేంద్ర చంచల్‌ పాడిన ఈ పాట కాలా సూరజ్‌(1985) చిత్రంలోనిది. దేశ్‌ గౌతమ్‌ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రంలో శత్రుఘ్న సిన్హా, సులక్షణ పండిట్‌, రాకేష్‌ రోషన్‌, అంజాద్‌ ఖాన్‌, అరుణా ఇరానీ.. తదితరులు ప్రధాన తారాగణం. 

Advertisement
 
Advertisement
Advertisement