మార్కెట్లు ఢమాల్‌, టైం వేస్ట్‌ బడ్జెట్ :అష్నీర్ గ్రోవర్ | Union Budget 2026: Entrepreneur Ashneer Grover slams as time waste | Sakshi
Sakshi News home page

మార్కెట్లు ఢమాల్‌, టైం వేస్ట్‌ బడ్జెట్ :అష్నీర్ గ్రోవర్

Feb 1 2026 4:25 PM | Updated on Feb 1 2026 4:48 PM

Union Budget 2026: Entrepreneur Ashneer Grover slams as time waste

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2026పై  వ్యాపారవేత్త, మాజీ షార్క్ ట్యాంక్ ఇండియా జడ్జ్‌ అష్నీర్ గ్రోవర్ స్పందించారు. టైమ్‌ వేస్ట్‌ తప్ప ఏమీలేదంటూ ఘాటుగా స్పందించారు. ఈ మేరకు తన తన స్పందనను ఎలాంటి మొహమాటం లేకుండా ట్విటర్‌ ద్వారా ప్రకటించారు. అంతేకాదు తాను ఒకప్పుడు రియాలిటీ షోలో తిరస్కరించిన ఒక పిచ్‌తో తాజా కేంద్ర బడ్జెట్‌ను పోల్చారు.

ఈ ఏడాది బడ్జెట్‌పై భారీ అంచాలను పెట్టుకున్న వ్యాపారవేత్తలతోపాటు, సామాన్యులు కూడా  నిర్మలమ్మ తాజా పద్దుపై పెదవి విరిచారు.  ముఖ్యంగా వ్యక్తిగత ఆదాయం సంపాదించేవారికి పన్నుల ఉపశమనం ఉంటుందని భావించిన వేతన  జీవులకు నిరాశే ఎదురు  కావడం విమర్శలకు తావిచ్చింది.  అటు స్టాక్‌మార్కెట్‌ను ప్రతికూలంగానే స్పందించింది. బడ్జెట్ ప్రసంగానికి ముందు దూసుకుపోయిన సెన్సెక్స్, నిఫ్టీ  భారీ నష్టాలతోముగిసాయి. గ్రోవర్ పోస్ట్ చేసిన సమయంలోనే ఈక్విటీ మార్కెట్లు  భారీ పతనాన్ని నమోదు చేశాయి. సెన్సెక్స్ 80,931 వద్ద, నిఫ్టీ 24,826వద్ద భారీ నష్టాలను చవిచూశాయి.

ఇదీ చదవండి: దురంధర్‌ రంభ హో ఫీవర్‌ 70 ఏళ్ల వయసులో స్టన్నింగ్‌ డ్యాన్స్‌ వైరల్‌ వీడియో

గ్రోవర్ విమర్శలపై నెటిజన్లు కూడా స్పందించారు. షార్క్ ట్యాంక్ పిచ్‌లు  కనీసం 10 నిమిషాల్లో ముగుస్తాయి. ఇది నిజంగా టైం వేస్ట్‌ బడ్జెట్ అని ఒకరు వ్యాఖ్యానించారు. దీని వల్ల మనకు ఒక సంవత్సరం నష్టం జరిగిందని మరో యూజర్‌ నిరాశను వ్యక్తం చేయగా,   బడ్జెట్‌లో సారం లేదనడానికి మార్కెట్ పతనమే రుజువు అని మరొకరు వ్యాఖ్యానించారు.  

ఇదీ చదవండి: దిశా నిర్దేశంలేని కేంద్ర బడ్జెట్‌ : ధ్వజమెత్తిన మమతా బెనర్జీ

Advertisement
 
Advertisement
Advertisement