శ్రీశైలం : జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. బుధవారం శ్రీభ్రమరాంబాదేవి మహాసరస్వతి అలంకారంలో భక్తులకు కటాక్షించారు.
శ్రీభ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి నందివాహనంపై అధిష్టించి భక్తులకు దర్శనమిచ్చారు. స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు నిర్వహించిన ప్రభోత్సవం నేత్రానందభరితంగా సాగింది. రాత్రి సంప్రదాయబద్ధంగా వీరశైవులు వీరాచార విన్యాసాలు చేశారు.


