చైనాలో ‘డాల్ఫిన్‌’ బీభత్సం.. 1,300 విమానాలు రద్దు! | Typhoon Dolphin Nears China’s East Coast, Over 1,300 Flights Cancelled As Authorities Go On High Alert | Sakshi
Sakshi News home page

చైనాలో ‘డాల్ఫిన్‌’ బీభత్సం.. 1,300 విమానాలు రద్దు!

Aug 9 2026 12:31 PM | Updated on Aug 9 2026 2:06 PM

Typhoon Dolphin Threatens China Shanghai Cancels 1300 Flights

బీజింగ్‌: తైవాన్‌లో బీభత్సం సృష్టించిన ‘డాల్ఫిన్’ తుఫాను ఇప్పుడు చైనా తూర్పు తీరాన్ని వేగంగా సమీపిస్తోంది. ఈ తుఫాను ముప్పు కారణంగా షాంఘైలోని రెండు ప్రధాన విమానాశ్రయాలు ఆదివారం 1,300కు పైగా విమానాలను రద్దు చేశాయి. తైపీతో సహా ఉత్తర తైవాన్‌ను తాకిన ఈ తుఫాను, అక్కడ భారీ వర్షాలు కురిపించడంతో పాటు చైనా తీర ప్రాంతాలలో వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదానికి దారి తీసింది.

ఆదివారం ఉదయం నాటికి డాల్ఫిన్ తుఫాను గరిష్టంగా గంటకు 162 కిలోమీటర్ల వేగంతో గాలులను కలిగి ఉందని నివేదికలు వెల్లడించాయి. ఆదివారం సాయంత్రానికి ఇది చైనాలోని జెజియాంగ్, ఫుజియాన్ ప్రావిన్సులను తాకే అవకాశం ఉంది. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం, రాబోయే రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో 200 నుంచి 400 మిల్లీమీటర్ల వర్షం కురిసే ప్రమాదం ఉంది. దీనివల్ల తీవ్రమైన వరదలు ముంచెత్తే అవకాశం ఉండటంతో, జెజియాంగ్,  ఫుజియాన్ ప్రావిన్సులలో అధికారులు హై-అలర్ట్ జారీ చేశారు.

షాంఘైలోని హాంగ్‌కియావో, పుడాంగ్ విమానాశ్రయాలు తమ షెడ్యూల్డ్ విమానాల్లో దాదాపు 60 శాతాన్ని రద్దు చేశాయి. అలాగే జెజియాంగ్ ప్రావిన్స్‌లో ఫెర్రీ, క్రూయిజ్ సర్వీసులతో సహా అన్ని జల కార్యకలాపాలను నిలిపివేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా ప్రమాదకర ప్రాంతాల నుంచి నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తైజౌ నగరంలో దాదాపు 3,90,000 మందిని, షాంఘైలోని అధిక ప్రమాదకర ప్రాంతాల నుంచి 30,000 మందికి పైగా ప్రజలను అధికారులు తరలించి సహాయక చర్యలను ముమ్మరం చేశారు.

ఇది కూడా చదవండి: కుమార్తె ప్రేమ కోసం.. బండ రాయితో మోది భర్త హత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement