breaking news
Mahabubnagar
-
జూరాల నీటి విడుదల.. స్పందించిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రైతుల ఆందోళనతో తెలంగాణ ప్రభుత్వం దిగి వచ్చింది. ఎట్టకేలకు జూరాల ప్రాజెక్ట్ నుంచి అధికారులు బుధవారం ఉదయం నీటిని విడుదల చేశారు. ప్రధాన ఎడమ, కుడి కాలువలకు నీటిని వదిలారు. ఈ నేపథ్యంలో నీటి విడుదలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ స్పందించి.. రైతులు వాళ్ల హక్కుల కోసం చేసిన పోరాటం చాలా స్ఫూర్తిదాయకం అంటూ ప్రశంసలు కురిపించారు.మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ..‘పోరాడితే పోయేదేమీలేదు.. బానిస సంకెళ్లు తప్పా!!. జూరాల ప్రాజెక్టు నుండి నీరు అందక, పొలాలు పూర్తిగా ఎండిపోతున్న తరుణంలో రైతులు వాళ్ల హక్కుల కోసం చేసిన పోరాటం చాలా స్ఫూర్తిదాయకం!. ఈ కుంభకర్ణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముల్లుగర్రతో తట్టి, పరుగులు పెట్టించిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు!ఈ రైతు పోరాటంలో కలిసి నడిచిన బీఆర్ఎస్ నాయకులు అందరికీ నా కృతజ్ఞతలు. ఈ కుంభకర్ణ ప్రభుత్వాన్ని, తెలంగాణా ప్రజల కనీస అవసరాలు తీర్చే విధంగా పోరాడటమే మన మిగిలిన రెండేళ్ల కర్తవ్యం!. ప్రశ్నించడం, పోరాడటం, మన తెలంగాణా హక్కుల కోసం అవసరం అయితే ఎవరితోనైనా కొట్లాడటం.. ఇదే మన ముందున్న లక్ష్యం’ అని పోస్టు చేశారు. పోరాడితే పోయేదేమీలేదు…బానిస సంకెళ్లు తప్పా!!!జూరాల ప్రాజెక్టు నుండి నీరు అందక, పొలాలు పూర్తిగా ఎండిపోతున్న తరుణంలో…రైతులు, వాళ్ల హక్కుల కోసం చేసిన పోరాటం చాలా స్ఫూర్తిదాయకం! ఈ కుంభకర్ణ ప్రభుత్వన్ని, ముల్లుగర్రతో తట్టి, పరుగులు పెట్టించిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు! ఈ… pic.twitter.com/SsMPwmZ4ZZ— KTR (@KTRBRS) September 23, 2026 ఇదీ చదవండి: తెలంగాణకు బిగ్ అలర్ట్.. నేడు ఈ జిల్లాలో భారీ వర్షాలు.. -
భూ సేకరణ పనుల్లో వేగం పెంచాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జిల్లాలో వివిధ సాగునీటి ప్రాజెక్టులు, భారత్ మాల జాతీయ రహదారి, రైల్వే లైన్ డబ్లింగ్, పారిశ్రామిక ప్రాజెక్టులకు సంబంధించిన భూ సేకరణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో నిర్వహించిన సమీక్షలో భూ సేకరణ, పునరావాస కార్యక్రమాల పురోగతిని పరిశీలించారు. భారత్‌మాల, జాతీయ రహదారులు, రైల్వే లైన్ డబ్లింగ్, బ్రహ్మోస్ క్షిపణి తయారీ కర్మాగారం, కురుమూర్తి దేవాలయ అభివృద్ధి, ఎంజీకేఎల్ఐ, లక్ష్మీదేవిపల్లి, అజిలాపూర్ ఎత్తిపోతల ప్రాజెక్టులతోపాటు ఇతర అభివృద్ధి పనుల భూ సేకరణపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మహబూబ్‌నగర్ రూరల్, భూత్పూర్, దేవరకద్ర మండలాల్లో రైల్వే భూ సేకరణకు సంబంధించిన అవార్డులు, పరిహారం చెల్లింపులు, ఖాతా ధ్రువీకరణ, కోర్టు కేసులు, వివాదాస్పద భూముల వివరాలను సమీక్షించారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించి, కోర్టు కేసులు, ఇతర వివాదాలను స్పష్టంగా వర్గీకరించి నివేదికలు సమర్పించాలని సూచించారు. భూత్పూర్ మండలంలో భారత్‌మాల భూ సేకరణకు సంబంధించి భూ యజమానులతో సమావేశం నిర్వహించి వారి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను పరిష్కరించాలన్నారు. బ్రహ్మోస్ కర్మాగారానికి సంబంధించిన ప్రైవేట్ భూముల సర్వేను అదనపు సర్వేయర్లను నియమించి పది రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. కురుమూర్తి దేవాలయ అభివృద్ధి, అమర్‌రాజా పరిశ్రమ రహదారి, లక్ష్మీదేవిపల్లి, అజిలాపూర్ ప్రాజెక్టుల భూ సేకరణ, పరిహారం చెల్లింపులను వేగవంతం చేయాలని సూచించారు. భూ సేకరణలో ఎక్కడా జాప్యం లేకుండా శాఖల మధ్య సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు మధుసూదన్ నాయక్, జేఎల్బీ హరిప్రియ, ట్రెయినీ కలెక్టర్ సాయి శివాని, భూ సేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ రామిరెడ్డి, ఆర్డీఓ నవీన్, వివిధ శాఖల అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు. -
గొల్లపల్లి వద్ద ఉద్రిక్తం
జడ్చర్ల టౌన్: జూరాల ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావును పోలీసులు మంగళవారం జడ్చర్ల సమీపంలోని గొల్లపల్లి వద్ద అరెస్టు చేశారు. 44వ నంబర్ జాతీయ రహదారిపై ఉన్న మినర్వ హోటల్ వద్ద ఉదయం 8.30 గంటల సమయంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం జడ్చర్ల సమీపంలోని పోలీసు శిక్షణ కేంద్రం (డీటీసీ)కి తరలించి, మధ్యాహ్నం తర్వాత విడుదల చేశారు. ఈ సందర్భంగా బీజేపీ శ్రేణులు పోలీసులను అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. జూరాల నీటిని విడుదల చేయాలని కోరుతూ ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతు తెలిపేందుకు రాంచందర్‌రావు హైదరాబాద్ నుంచి జూరాలకు బయలుదేరారు. మార్గమధ్యంలో గొల్లపల్లి వద్ద హోటల్లో అల్పాహారానికి ఆగగా, బీజేపీ రాష్ట్ర నాయకుడు శాంతికుమార్ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ కమలాకర్ ఆయనను జూరాలకు వెళ్లకుండా అదుపులోకి తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్తున్న తనను ఎందుకు అడ్డుకుంటున్నారని రాంచందర్‌రావు ప్రశ్నించినప్పటికీ పోలీసులు అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. దీంతో బీజేపీ కార్యకర్తలు పోలీసు వాహనాన్ని అడ్డుకుని, దాని ముందు బైఠాయించారు. పోలీసుల తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. పోలీసులు వాహనాన్ని ముందుకు తీసుకెళ్లడంతో కార్యకర్తలు జాతీయ రహదారిపైకి వచ్చి రాస్తారోకో చేపట్టారు. దీంతో హైదరాబాద్ నుంచి జడ్చర్ల వైపు వచ్చే వాహనాలు కొద్దిసేపు భారీగా నిలిచిపోయాయి. పోలీసులు బీజేపీ శ్రేణులను రహదారిపై నుంచి తప్పించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. అరెస్టు అప్రజాస్వామికం: ఆచారి రైతులకు మద్దతుగా వెళ్తున్న తమ రాష్ట్ర అధ్యక్షుడిని అరెస్టు చేయడం అప్రజాస్వామికమని బీజేపీ సీనియర్ నాయకుడు ఆచారి విమర్శించారు. వెంటనే ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఆందోళనలను అణచివేసిందని, ప్రస్తుతం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కూడా అదే విధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రాంచందర్‌రావును డీటీసీకి తరలించిన సమయంలో వనపర్తి, గద్వాల ప్రాంతాలకు చెందిన కొందరు రైతులతో ఆయన అక్కడే మాట్లాడారు. శాంతికుమార్, బాలత్రిపుర సుందరి, బాలకృష్ణ, మురళి, ముచ్చర్ల జనార్దన్‌రెడ్డి, ముచ్చర్ల కృష్ణయ్య, డోకూరి పవన్‌కుమార్, శ్రీవర్ధన్‌రెడ్డి, బాలవర్ధన్‌గౌడ్, అమర్నాథ్గౌడ్, సాహితీరెడ్డి, వెంకట్, శ్రీనాథ్, బుక్క నవీన్, రామకృష్ణ, తిరుపతి పాల్గొన్నారు. జడ్చర్లలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు అరెస్టు డీటీసీకి తరలింపు, మధ్యాహ్నం తర్వాత విడుదల జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టిన కమలం శ్రేణులు -
రైతులకు నీరందించకపోతే పోరాటాలు ఉధృతం
భూత్పూర్: జూరాల కుడి, ఎడమ కాల్వల ద్వారా రైతులకు నీరందించకపోతే రైతుల పక్షా న పోరాటాలను ఉధృతం చేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ హెచ్చరించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి జూరాల ప్రాజె క్టు వైపు వెళ్తున్న ఆయనను భూత్పూర్ పోలీసులు అరెస్టు చేసి, సొంత పూచీకత్తుపై విడుద ల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ఎల్‌నినో, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు పంటలు సాగు చేయరాదని ముందుగానే వ్యవసాయశాఖ గ్రామాల వారీగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉందన్నారు. అయితే రైతులు పంటలు సాగు చేసి ఎకరాకు సుమారు రూ.30 వేల వరకు ఖర్చు చేసిన తర్వాత ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేయకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నారని ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. ఆయన వెంట సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు టి.సాగర్, ఆర్.వెంకట్రాములు, విజయ్‌కుమార్, కిల్లె గోపాల్, నల్లవెల్లి కురుమూర్తి, వి.కురుమూర్తి, దీప్లా నాయక్, చంద్రకాంత్, ప్రశాంత్, రాజ్‌కుమార్ ఉన్నారు. పాలమూరులో అమెరికా స్థాయి విజ్ఞాన కేంద్రం స్టేషన్ మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్‌లో నిర్మిస్తున్న పూలే–అంబేద్కర్ విజ్ఞాన కేంద్రాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. అమెరికా పర్యటనలో భాగంగా జార్జియాలోని గ్విన్నెట్, పుల్టన్ కౌంటీ పబ్లిక్ లైబ్రరీలను సందర్శించి అక్కడి డిజిటల్ లెర్నింగ్, కంప్యూటర్ ల్యాబ్‌లు, పఠన విభాగాలను పరిశీలించారు. వాటి తరహాలోనే విజ్ఞాన కేంద్రంలో అత్యాధునిక విద్యా సౌకర్యా లు, పోటీ పరీక్షల స్టడీ మెటీరియల్, హైస్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులోకి తెచ్చి తెలంగాణకే ఆదర్శంగా నిలుపుతామని పేర్కొన్నారు. అంతరాయం లేకుండా తాగునీటి సరఫరా చేయాలి జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ప్రజలకు తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి వెబెక్స్ ద్వారా మిషన్ భగీరథ గ్రిడ్, ఇంట్రా విభాగాల ఈఈలు, డీఈలు, ఏఈలతో సమీక్షించారు. తాగునీటి సరఫరా, పైపులైన్ల నిర్వహణ, లీకేజీల పరిస్థితిపై అధికారులతో సమీక్షించారు. తాగునీటి సరఫరాకు సంబంధించిన అన్ని పైపులైన్లను క్షేత్రస్థాయిలో క్రమం తప్పకుండా పరిశీలించాలని సూచించారు. ఎక్కడైనా పైపులైన్లలో లీకేజీలు గుర్తించిన వెంటనే మరమ్మతులు చేపట్టి, నీటి వృథాను అరికట్టాలని ఆదేశించారు.తాగునీటి సరఫరాలో సమస్యలు తలెత్తిన ప్రాంతాలను గుర్తించి, వాటిని వెంటనే పరిష్కరించాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలి: ఎస్పీ జడ్చర్ల: శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టడంతో పాటు ప్రజలతో మమే కం కావాలని ఎస్పీ జానకి పోలీసు సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం జడ్చర్ల పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆమె.. స్టేషన్ పనితీరు, పెండింగ్ కేసులు, దర్యాప్తు, సిబ్బంది పనితీరును సమీక్షించారు. పెండింగ్ కేసులను వేగంగా పరిష్కరించి నిర్ణీత సమయంలో చార్జ్షీట్లు దాఖలు చేయాలని సూచించారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చూడా లని ఆదేశించారు. శోభాయాత్ర మార్గాలను ముందుగానే పరిశీలించి ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని, నిమజ్జన ప్రదేశాల్లో లైటింగ్, బారికేడ్లు, క్రేన్ వంటి సౌకర్యాలను పరిశీలించాలన్నారు. డీజేలకు అనుమతి లేదని, బీట్ పెట్రోలింగ్, వాహన తనిఖీలు ముమ్మరం చేయాలని సూచించారు. సీసీ కెమెరాలను నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. సీఐ కమలాకర్, సిబ్బంది పాల్గొన్నారు. -
ఉమ్మడి జిల్లాలో ఎస్జీఎఫ్ జోష్
● రాష్ట్రస్థాయి టోర్నీలకు ఐదు జిల్లాలకు కేటాయింపులు ● అండర్–14, 17, 19 విభాగాల్లో పోటీలు ● సెలక్షన్స్ అనంతరం టోర్నీల నిర్వహణ మహబూబ్‌నగర్ క్రీడలు: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) క్రీడా సందడి మొదలుకానుంది. ఇప్పటికే మండలస్థాయి పోటీలు ముగింపు దశకు చేరుకోగా.. త్వరలో జిల్లాస్థాయి, ఉమ్మడి జిల్లా సెలక్షన్స్ నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలోని మహబూబ్‌నగర్, వనపర్తి, నారాయణపేట, నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల జిల్లాలకు వివిధ క్రీడల్లో రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ టోర్నీలు కేటాయించారు. గత నెలలో జిల్లా ఎస్జీఎఫ్ కార్యదర్శులు పంపిన ప్రతిపాదనల ఆధారంగా మంగళవారం టోర్నీలను కేటాయించారు. ఉమ్మడి జిల్లా సెలక్షన్స్ అనంతరం ఆయా పోటీలు నిర్వహించనున్నారు. ● మహబూబ్‌నగర్ జిల్లాలో అండర్–19 బాల, బాలికల వాలీబాల్, అండర్–17 బాల, బాలికల హ్యాండ్‌బాల్, అండర్–19 బాలుర క్రికెట్, అండర్–19 బాల, బాలికల నెట్‌బాల్ పోటీలు జరగనున్నాయి. ● వనపర్తి జిల్లాలో అండర్–19 బాలికల హాకీ, అండర్–19 బాల, బాలికల హ్యాండ్‌బాల్ టోర్నీలు కేటాయించారు. ● నారాయణపేట జిల్లాలో అండర్–14 బాల, బాలికల రెజ్లింగ్ (ఫ్రీస్టైల్), అండర్–14, 17 బాల, బాలికల బీచ్‌వాలీబాల్ పోటీలు నిర్వహించనున్నారు. ● నాగర్‌కర్నూల్ జిల్లాలో అండర్–17 బాల, బాలికల చెస్, అండర్–17 బాల, బాలికల కబడ్డీతో పాటు అండర్–14, 17, 19 బాల, బాలికల మల్కంబ్ పోటీలు జరగనున్నాయి. ● జోగుళాంబ గద్వాల జిల్లాలో అండర్–14 బాల, బాలికల చెస్, అండర్–17 బాలుర క్రికెట్, అండర్–17 బాల, బాలికల సెపక్తక్రా, అండర్–17 బాలుర హాకీ, అండర్–14 బాల, బాలికల తైక్వాండో పోటీలు కేటాయించారు.విజయవంతంగా నిర్వహిస్తాం.. జిల్లాకు ఈ ఏడాది నాలుగు రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ టోర్నీలు కేటాయించడం సంతోషంగా ఉంది. పీడీలు, పీఈటీలు, క్రీడాసంఘాల సహకారంతో రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ టోర్నీలను విజయవంతంగా నిర్వహిస్తాం. టోర్నీల్లో పాల్గొనే క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విధాల సౌకర్యాలు సమకూరుస్తాం. – వేణుగోపాల్, ఎస్జీఎఫ్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి, మహబూబ్‌నగర్ 24 నుంచి జిల్లాస్థాయి ఎస్జీఎఫ్ క్రీడలు మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశాల మేరకు జిల్లాకేంద్రంలో ఈనెల 24 నుంచి 30 వరకు అండర్–14, అండర్–17 బాలబాలికలకు జిల్లాస్థాయి కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ టోర్నమెంట్ కమ్ సెలక్షన్స్ నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి వేణుగోపాల్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. పోటీల్లో పాల్గొనే విద్యార్థులకు భోజన సదుపాయం కల్పిస్తామని తెలిపారు. మండలాల విద్యార్థులు షెడ్యూల్ ప్రకారం ఆయా తేదీల్లో సకాలంలో పోటీల్లో పాల్గొనాలని ఆయన కోరారు. -
శోభాయాత్రకు సర్వం సిద్ధం
మహబూబ్‌నగర్ క్రైం: తొమ్మిది రోజులుగా ప్రత్యేక పూజలందుకున్న గణనాథులు నేడు గంగమ్మ ఒడికి చేరనున్నారు. నగరంలో బుధవారం మధ్యాహ్నం నుంచి శోభాయాత్ర ప్రారంభం కానుంది. వివిధ ప్రాంతాల్లోని వినాయక విగ్రహాలు ఊరేగింపుగా క్లాక్‌టవర్ చౌరస్తాకు చేరుకోనున్నాయి. అక్కడ పాలమూరు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో చివరి పూజలు నిర్వహించి నిమజ్జనానికి తరలించనున్నారు. ఇందుకోసం క్లాక్‌టవర్ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పటిష్ట భద్రత హన్వాడ, దేవరకద్ర పెద్ద చెరువు, నగరంలోని పాలకొండ, మయూరి పార్క్ సమీపంలోని గంగుసాయి కృత్రిమ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లు పూర్తిచేశారు. విగ్రహాల తరలింపు మార్గాల్లో ట్రాఫిక్ నియంత్రణ, లైటింగ్, బారికేడింగ్ ఏర్పాటు చేశారు. రెస్క్యూ బృందాలను అందుబాటులో ఉంచడంతో పాటు నిమజ్జన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. షెడ్యూల్ ప్రకారం పోలీసు సిబ్బందికి విధులు కేటాయించారు. 503 మందితో బందోబస్తు శోభాయాత్ర, నిమజ్జనం సందర్భంగా జిల్లా పోలీసు శాఖ 503 మందితో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసింది. ఒక ఎస్పీ, ఇద్దరు అదనపు ఎస్పీలు, ముగ్గురు డీఎస్పీలు, 10 మంది సీఐలు, 35 మంది ఎస్ఐలు, ఏఎస్ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు 145 మంది, కానిస్టేబుళ్లు 212 మంది, హోంగార్డులు 98 మందికి విధులు కేటాయించారు. ప్రధాన కూడళ్లు, మసీదులు, ఇతర ప్రార్థనా మందిరాల వద్ద అదనపు బలగాలను మోహరించారు. మొబైల్, పెట్రోలింగ్ బృందాలు నిరంతరం గస్తీ నిర్వహించనున్నాయి. వాహనాల దారిమళ్లింపు శోభాయాత్ర నేపథ్యంలో నగరంలో ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని ఎస్పీ డి.జానకి తెలిపారు. హైదరాబాద్ నుంచి రాయచూర్ వైపు వెళ్లే వాహనాలు పిస్తాహౌస్ చౌరస్తా వద్ద బైపాస్ మీదుగా చించోళి బైపాస్–పీయూ–దేవరకద్ర వైపు వెళ్లాలి. కర్నూలు, భూత్పూర్, రాయచూర్ వైపు నుంచి కొడంగల్ వెళ్లే వాహనాలు చించోళి బైపాస్ మీదుగా వెళ్లాలని సూచించారు. క్లాక్‌టవర్ కూడలి వద్ద అన్ని వైపుల నుంచి సాధారణ వాహనాల రాకపోకలను నిలిపివేస్తారు. గణేష్ నిమజ్జన వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని, ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు. నగరంలో నేటి మధ్యాహ్నం నుంచి శోభాయాత్ర 503 మందితో పటిష్ట పోలీసు బందోబస్తు క్లాక్‌టవర్ వద్ద ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు బైపాస్‌ల మీదుగా వాహనాల దారి మళ్లింపు -
జూరాల నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలి
● బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి సి.లక్ష్మారెడ్డి జడ్చర్ల: జూరాల ప్రాజెక్టు నుంచి సాగునీటిని విడుదల చేసి రైతుల పంటలను కాపాడాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. జూరాల ముట్టడికి తిరుమల హిల్స్‌లోని తన నివాసం నుంచి బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి బయలుదేరిన ఆయనను పోలీసులు అడ్డుకుని హౌస్ అరెస్టు చేశారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మీడియాతో మాట్లాడారు. జూరాలలో 8.5 టీఎంసీల నీరు అందుబాటులో ఉన్నప్పటికీ తాగునీటి పేరుతో పంటలకు నీరు విడుదల చేయడం లేదని ఆరోపించారు. జూరాల నుంచి తాగునీటికి ఒక టీఎంసీ సరిపోతుందని, ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఇతర ప్రాంతాల తాగునీటి అవసరాలు శ్రీశైలం బ్యాక్‌వాటర్‌పై ఆధారపడి ఉన్నాయని పేర్కొన్నారు. జూరాల నీటిని విడుదల చేసి సుమారు లక్ష ఎకరాల్లో సాగు చేసిన పంటలను కాపాడాలని కోరారు.ఎల్‌నినో ప్రభావాన్ని ముందుగా అంచనా వేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టారని, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయడం లేదని ఆరోపించారు. రైతులు సాగుకు వెళ్లకముందే నీటి లభ్యతపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చి ఉంటే పరిస్థితి ఇంత తీవ్రంగా ఉండేది కాదన్నారు. కేసీఆర్ ముందుచూపుతో కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకే రిజర్వాయర్లను నిర్మించారని, 70 టీఎంసీల సామర్థ్యంతో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును డిజైన్ చేశారని తెలిపారు. కరివెన వరకు రిజర్వాయర్లను నింపి ఉంటే ప్రస్తుత పరిస్థితుల్లో తాగునీటి అవసరాలకు ఉపయోగపడేవని పేర్కొన్నారు. కేఎల్ఐ పంప్ మోటర్లను నిరంతరాయంగా నడపాల్సి ఉండగా వాటిని నిలిపివేయ డం వల్ల మోటర్లు దెబ్బతినే ప్రమాదం ఉందన్నా రు. సీఎం రేవంత్‌రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెంటనే అధికారులతో సమీక్షించి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, నర్సిములు, శ్రీనివాస్‌యాదవ్, మురళి పాల్గొన్నారు. -
ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి
● ప్రతి వారం ఓ గ్రామ పంచాయతీని సందర్శించాలి ● సమస్యల పరిష్కారంపై ఫాలోఅప్ చేయాలి: కలెక్టర్ ఖుష్బూగుప్తా జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): మండలాలు, నియోజకవర్గాలకు కేటాయించిన ప్రత్యేక అధికారులు ప్రతి వారం క్షేత్రస్థాయిలో పర్యటించి ఒక గ్రామ పంచాయతీని తప్పనిసరిగా సందర్శించాలని కలెక్టర్ ఖుష్బూగుప్తా ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ వ్యవస్థ ప్రస్తుతం లేనందున ప్రత్యేక అధికారుల బాధ్యతలు మరింత కీలకమయ్యాయని తెలిపారు. ప్రతి సోమవారం ఒక్కో అధికారికి గ్రామ పంచాయతీని కేటాయిస్తామని, ఆ వారంలో బుధవారం లేదా అనుకూలమైన రోజున తప్పనిసరిగా సందర్శించాలని సూచించారు. గ్రామ పర్యటనలో సర్పంచ్, పంచాయతీ సిబ్బంది, ప్రజలతో మాట్లాడి సమస్యలను గుర్తించి, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. పంచాయతీ కార్యదర్శి, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, తాగునీరు, పారిశుద్ధ్య తదితర అంశాలను పరిశీలించాలన్నారు. ప్రతి అధికారి కనీసం రెండు పాఠశాలలను సందర్శించాలని, అందులో ఒకటి రెసిడెన్షియల్ పాఠశాల ఉండేలా చూడాలని సూచించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి ఆహార నాణ్యత, వసతి, తాగునీరు, మరుగుదొడ్ల పరిస్థితిని పరిశీలించాలన్నారు. అలాగే పీహెచ్సీ, హెల్త్ సెంటర్ లేదా సబ్‌సెంటర్‌ను సందర్శించి మందుల లభ్యత, సిబ్బంది హాజరు, వైద్యసేవలను పరిశీలించాలని ఆదేశించారు. క్షేత్ర పర్యటనలను సాధ్యమైనంత వరకు ముందస్తు సమాచారం లేకుండా నిర్వహించాలని, గుర్తించిన సమస్యలపై వారం, పది లేదా పదిహేను రోజుల తర్వాత ఫాలోఅప్ చేయాలని కలెక్టర్ సూచించారు. అక్టోబర్ 6న జరిగే దిశ సమావేశానికి కేంద్ర పథకాలు, ఎంపీ ల్యాడ్స్ పనులు, పెండింగ్ అంశాలపై నివేదికలు, గత సమావేశానికి సంబంధించిన యాక్షన్ టేకెన్ రిపోర్టును వెంటనే అందించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ హరిప్రియ, అసిస్టెంట్ కలెక్టర్ సాయి శివాని, డీఆర్ఓ నిర్మల, జెడ్పీ సీఈఓ, ఇన్చార్జి డీపీఓ వెంకటరెడ్డి, డీఆర్డీఓ నరసింహులు, హౌసింగ్ పీడీ ఉపేందర్‌రెడ్డి పాల్గొన్నారు. భూసేకరణ వేగవంతం చేయాలి రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ, అటవీ భూముల పరిహారం, ఆర్అండ్ఆర్ పనులను వేగవంతం చేయాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. 2026–27లో భూసేకరణకు రూ.6 వేల కోట్ల వరకు నిధులు విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే రూ.2,550 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. -
శోభాయాత్రకు పటిష్ట బందోబస్తు
● క్లాక్‌టవర్ కూడలి వైపు వాహనాల అనుమతి ఉండదు ● ఈనెల 25వరకు ట్రాఫిక్ మళ్లింపు: ఎస్పీ డి.జానకి మహబూబ్‌నగర్ క్రైం: గణేష్ నిమజ్జన శోభాయాత్రకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ డి.జానకి తెలిపారు. ఈ నెల 23న నిర్వహించనున్న శోభాయాత్ర నేపథ్యంలో సోమవారం క్లాక్‌టవర్, బైపాస్ రోడ్డు, మూడు తాత్కాలిక కృత్రిమ చెరువులు, నిమజ్జన రూట్లను పోలీసు అధికారులతో కలిసి ఆమె పరిశీలించారు. శోభాయాత్ర సందర్భంగా ప్రధాన రోడ్లు, కూడళ్లలో ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉన్నందున వాహనదారులు ముందుగానే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. సోమవారం సాయంత్రం నుంచి ఈ నెల 25 ఉదయం 6 గంటల వరకు క్లాక్‌టవర్ కూడలి వైపు అన్ని రకాల వాహనాలకు అనుమతి ఉండదని తెలిపారు. హైదరాబాద్, భూత్పూర్, రాయచూర్, కోయిలకొండ, చించోళి తదితర ప్రాంతాల నుంచి మహబూబ్‌నగర్‌లోకి వచ్చే భారీ వాహనాలు తప్పనిసరిగా బైపాస్ రోడ్డునే వినియోగించాలని సూచించారు. నగరంలోని ఇతర వాహనదారులు క్లాక్‌టవర్ వైపు రాకుండా ట్రాఫిక్ పోలీసులు సూచించే ప్రత్యామ్నాయ మార్గాల్లో గమ్యస్థానాలకు చేరుకోవాలన్నారు. శోభాయాత్రకు సంబంధించి సోషల్ మీడియాలో వచ్చే సమాచారాన్ని నిర్ధారించుకోకుండా ఇతరులకు షేర్ చేయవద్దని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐలు అప్పయ్య, రాజేందర్‌రెడ్డి, క్రిష్ణ పాల్గొన్నారు. -
రణరంగం..!
అమరచింత/ గద్వాల క్రైం/ధరూరు: రోజురోజుకూ జూరాల ప్రాజెక్టు వద్ద జల వివాదం ముదురుతోంది. ఆయకట్టుకు సాగునీరు విడుదల చేయాలని రైతులు రెండు, మూడు రోజులుగా నిరసనలు, ధర్నాలు చేస్తుండగా.. వీరికి వివిధ పార్టీల నాయకులు తోడు కావడంతో ఆందోళనలు తీవ్రరూపం దాలుస్తున్నాయి. ఈ క్రమంలో సోమవారం బీఆర్ఎస్ ఇచ్చిన పిలుపుమేరకు ఆయకట్టు రైతులు, వివిధ ప్రాంతాల నాయకులు పెద్దఎత్తున జూరాల ప్రాజెక్టుకు చేరుకున్నారు. బీఆర్ఎస్ మాజీమంత్రులు లక్ష్మారెడ్డి, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌లను హౌస్ అరెస్టు చేయగా.. పోలీసుల నుంచి తప్పించుకుని జూరాల ప్రాజెక్టుకు చేరుకున్న మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డిని నందిమళ్ల క్యాంపు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆందోళనకు వచ్చిన రైతులు ఒక్కసారిగా పోలీసులపై విరుచుకుపడటంతో తోపులాటలు చోటుచేసుకొని రణరంగాన్ని తలపించింది. పోలీసులు మాజీ ఎమ్మెల్యేను జీపులో ఎక్కించుకుని వెళ్తుండగా రైతులు, బీఆర్ఎస్ నాయకులు రహదారికి అడ్డంగా రాళ్లు, ముళ్లకంచె వేయడంతో పోలీసులు స్వల్ప లాఠీచార్జి చేసి.. చిట్టెంను కొత్తకోట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీసులతో రైతుల వాగ్వాదం.. ఆత్మకూర్, అమరచింత మండలాల నుంచి వచ్చిన రైతులతో నందిమళ్ల క్యాంపు కాలనీ కిక్కిరిసిపోయింది. పంటలకు సాగునీరు ఇస్తే ఇక్కడికి ఎందుకు వస్తామని, మీతో గొడవెందుకు పెట్టుకుంటామంటూ జూరాల ఆయకట్టు రైతులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో నాలుగు గంటల పాటు రైతులు, పోలీసు మధ్య తీవ్రస్థాయిలో వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో పోలీసుల కళ్లుగప్పి జూరాల సమాంతర కాల్వ వరకు రైతులు చేరుకోవడంతో అక్కడే ఉన్న మరికొందరు పోలీసు బలగాలు వారిని అడ్డుకోగా తోపులాటలు జరిగాయి. ఉదయం 6 గంటల నుంచే ప్రాజెక్టుపై ట్రాఫిక్ ఆంక్షలను పెట్టడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 10 కి.మీ., మేర ట్రాఫిక్ జాం మరోవైపు గద్వాల– ఎర్రవల్లి రహదారి మార్గంలోని జమ్మిచేడ్ వద్ద జూరాల కుడి కాల్వ నుంచి నీటిని విడుదల చేయాలని రైతులు పెద్దఎత్తున రోడ్డుపై ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బైఠాయించి ధర్నా చేశారు. దీంతో ఆ మార్గంలో సుమారు 10 కి.మీ. మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. రైతుల ధర్నాకు వివిధ పార్టీల నాయకులు స్నిగ్ధారెడ్డి, బాసు శ్యామల తదితరులు మద్దతు ప్రకటించి మాట్లాడారు. అలాగే రైతుల వద్దకు అదనపు కలెక్టర్ మధన్మోహన్, ఎస్ఈ కేశవరావు వచ్చి సమస్య పరిష్కారం కోసం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని రైతులకు చెప్పారు. ఈ క్రమంలో మహిళా రైతులు కంటతడి పెడుతూ అదనపు కలెక్టర్ కాళ్లు మొక్కి నీటిని విడుదల చేయాలని కోరారు. 24 గంటల్లోగా నీటిని విడుదల చేయకపోవడంతో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం పోలీసులు తీవ్రంగా శ్రమించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ● రేవులపల్లి, భీంపురం, పెద్దచింతరేవుల గ్రామాల రైతులు కుడి కాల్వ వద్ద ధర్నా చేసందుకు సిద్ధపడగా.. పోలీసులు వారిని మిషన్ భగీరథ హెడ్ వర్క్స్ గట్టు సమీపంలోని జీరో పాయింట్ వద్ద అడుక్డకున్నారు. దీంతో రైతులు అక్కడే కూర్చొని ధర్నా చేశారు. వీరికి వివిధ పార్టీల నాయకులు పద్మ, హన్మంతు, గోపాల్‌రెడ్డి తదితరులు మద్దతు తెలిపి ధర్నాలో కూర్చున్నారు. జూరాల సమాంతర కాల్వలో రైతుల నిరసన భారీగా పోలీసుల మోహరింపు జూరాల ప్రాజెక్టుకు చేరుకొనే ప్రధాన రహదారులపై పోలీసులు బారీకేడ్లు ఏర్పాటు చేశారు. అమరచింత మండలం మస్తీపురం, కిష్టంపల్లి, నందిమళ్ల ఎక్స్రోడ్లతోపాటు ఆత్మకూర్ మండలం మూలమళ్ల శివారు వద్ద బారీకేడ్లు ఏర్పాటు చేసి భారీగా పోలీసులను మోహరింపజేశారు. దీంతో ప్రాజెక్టు రహదారిపై నుంచి ఇతర గ్రామాలకు వెళ్లే వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. డీఎస్పీ పర్యవేక్షణలో ఇద్దరు సీఐలు, 10 మంది ఎస్ఐలు పోలీసులు, స్పెషల్ బెటాలియన్‌తో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. పరిస్థితులను సమీక్షించడానికి వనపర్తి ఎస్పీ సునీతరెడ్డి జూరాల ఎడమ కాల్వ వద్దకు చేరుకున్నారు. సీఐ శివకుమార్‌ను అడిగి ఎస్పీ వివరాలు తెలుసుకున్నారు. జూరాల వద్ద ముదురుతున్న సాగునీటి వివాదం బీఆర్ఎస్ పిలుపుతో తరలివచ్చిన అన్నదాతలు ఎక్కడికక్కడే నాయకుల అరెస్టు రైతులు, పోలీసుల మధ్య తోపులాట.. ఉద్రిక్తం ప్రాజెక్టు వెళ్లే దారుల చుట్టూ భారీగా పోలీసుల పహారా -
పొలంలోకి డిజిటల్ లెక్క
మహబూబ్‌నగర్ (వ్యవసాయం): ఇక ‘ఎన్ని ఎకరాల్లో ఏ పంట?’ అన్న లెక్కలు కాగితాలకే పరిమితం కావు. రైతు పొలంలో ఏ పంట సాగు చేస్తున్నాడు.. ఎంత విస్తీర్ణంలో సాగు చేశాడు.. అన్నది క్షేత్రస్థాయిలోనే డిజిటల్‌గా నమోదవుతోంది. దీంతో జిల్లాలో వాస్తవ సాగు విస్తీర్ణం, పంటల వివరాలపై పక్కా లెక్కలు అందుబాటులోకి రానున్నాయి. వానాకాలం సాగు వివరాల నమోదుకు చేపట్టిన డిజిటల్ క్రాప్ సర్వే–2026లో మహబూబ్‌నగర్ జిల్లా ముందుకు సాగుతోంది. ఇప్పటివరకు 41.8 శాతం క్షేత్రాల సర్వే పూర్తిచేసి రాష్ట్రంలో 18వ స్థానంలో నిలిచింది. జిల్లాలో సర్వే చేయాల్సిన 7,36,776 క్షేత్రాల్లో 3,07,744 క్షేత్రాలను పరిశీలించి వివరాలను యాప్‌లో నమోదు చేశారు. ఈనెల 19న ఒక్కరోజే 13,388 క్షేత్రాల సర్వే పూర్తిచేయడం గమనార్హం. పొలంలోకి వలంటీర్ గతంలో పంటల సాగు వివరాలను వ్యవసాయ విస్తరణ అధికారులు క్షేత్రస్థాయిలో సేకరించి నమోదు చేసేవారు. అయితే పొలాలను ప్రత్యక్షంగా పరిశీలించకుండానే వివరాలు నమోదయ్యే సందర్భాలు ఉండటంతో కచ్చితత్వంపై సందేహాలు తలెత్తేవి. దీనికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం డిజిటల్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. జిల్లాలోని 306 రెవెన్యూ గ్రామాల్లో 305 గ్రామాలను సర్వేకు కేటాయించారు. 7,06,284 ఫార్మ్ ప్లాట్లు సర్వే జాబితాలో ఉన్నాయి. ప్రతి గ్రామానికి ఒకరు చొప్పున 305 మంది వలంటీర్లను నియమించారు. వీరిలో 292 మంది యాప్ ఇన్స్టాల్ చేసుకుని సర్వే ప్రారంభించారు. 2.64 లక్షల ఎకరాల్లో సాగు జిల్లాలో ఈ వానాకాలం సీజన్లో ఇప్పటివరకు 2,64,235 ఎకరాల్లో పంటలు సాగులోకి వచ్చినట్లు వ్యవసాయశాఖ ప్రాథమిక లెక్కల్లో నమోదైంది. డిజిటల్ క్రాప్ సర్వే ద్వారా ఈ వివరాలను మరింత కచ్చితంగా నిర్ధారించనున్నారు. సర్వే పూర్తయితే మండలం, గ్రామం, రైతు, పంట, విస్తీర్ణం వారీగా వాస్తవ సాగు పరిస్థితిపై స్పష్టత రానుంది. కొనుగోళ్లలోనూ ఉపయోగకరం పంట కొనుగోళ్ల సమయంలో సాగు వివరాలపై తలెత్తే వివాదాలకు డిజిటల్ సర్వే పరిష్కారంగా మారనుంది. రైతు పొలంలో ఉన్న పంటను ఫొటోతో సహా నమోదు చేయడంతో సాగుకు సంబంధించిన డిజిటల్ ఆధారం అందుబాటులో ఉంటుంది. భవిష్యత్‌లో రైతు సంక్షేమ పథకాలు, పంటల బీమా, పరిహారం, పంట రుణాలు, ప్రకృతి వైపరీత్యాల నష్టం అంచనా వంటి అంశాల్లో ఈ సమాచారం ఉపయోగపడనుంది. ఏ ప్రాంతంలో ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగవుతోంది? ఎంత విత్తనం, ఎరువు అవసరం? అనే దానిపై ప్రభుత్వానికి వాస్తవిక సమాచారం లభించనుంది. రోజువారీగా పర్యవేక్షణ వలంటీర్లు యాప్‌లో అప్లోడ్ చేసే ప్రతి చిత్రానికి రూ.7 చొప్పున పారితోషికం ఇవ్వనున్నారు. సర్వే పురోగతిని వ్యవసాయశాఖ అధికారులు రోజువారీగా సమీక్షిస్తున్నారు. గ్రామాల వారీగా లక్ష్యాలను నిర్దేశించి పూర్తయిన క్షేత్రాల వివరాలను పరిశీలిస్తున్నారు. నిర్ణీత గడువులోగా సర్వేను పూర్తి చేసి జిల్లాలో వాస్తవ సాగు, పంటలపై సమగ్ర డిజిటల్ డేటాను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఏ పంటో.. అక్కడే నమోదు వలంటీర్ నేరుగా పొలాన్ని సందర్శించి రైతు సాగు చేస్తున్న పంట వివరాలను యాప్‌లో న మోదు చేస్తారు. పంట రకం, విస్తీర్ణంతో పాటు పొలం ఫొటోను కూడా అప్లోడ్ చేస్తారు. ఒకే భూమిలో వేర్వేరు పంటలు సాగు చేసినా వాటి ని గుర్తించే అవకాశం ఉంటుంది. దీంతో కాగితాలపై ఉన్న లెక్కలకు, క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులకు మధ్య వ్యత్యాసాలు తగ్గనున్నాయి. రాష్ట్రంలో 18వ స్థానం.. 41.8 శాతం క్షేత్రాల సర్వే పూర్తి ఇకపై జిల్లాలో పక్కాగా సాగు లెక్క 305 రెవెన్యూ గ్రామాల్లో కొనసాగుతున్న సర్వే ప్రతి గ్రామానికి ఒక వలంటీర్.. యాప్‌లో పంట వివరాల నమోదు జిల్లాలో ఇప్పటివరకు 2,64,235 ఎకరాల్లో సాగు -
రైతులకు నీళ్లడిగితే అరెస్టులా?
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): జూరాల ఆయకట్టు కింద పంటలు ఎండుతున్నందున సాగునీరు విడుదల చేయాలని కోరిన బీఆర్ఎస్ నాయకులు, రైతులను అరెస్టు చేసి నిర్బంధించడాన్ని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సోమవారం ఖండించారు. రైతుల పక్షాన నిలబడితే అరెస్టులు చేస్తారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శ్రీశైలం నుంచి 660 కిలోమీటర్ల దూరంలో పెన్నా బేసిన్లో ఉన్న కుప్పానికి కృష్ణా జలాలను తరలిస్తుంటే.. పక్కనే ఉన్న పాలమూరు రైతులకు మాత్రం అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. పోతిరెడ్డిపాడు, వెలిగొండ, మాల్యా ల, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాల ద్వారా 100 టీఎంసీలకు పైగా నీటిని ఏపీకి తరలిస్తూ తెలంగాణ రైతుల ప్రయోజనాలను దెబ్బతీశారని విమర్శించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. జూరాల ప్రాజెక్టు వద్ద భారీగా పోలీసులను మోహరించి, నాయకులు, రైతులను అదుపులోకి తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం జూరాలలో 8.8 టీఎంసీల నీరు ఉందని, తాగునీటికి 2 టీఎంసీలు కేటాయించినా వారబందీ విధానంలో సాగునీరు విడుదల చేసి లక్ష ఎకరాల పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉన్నందున పాలమూరు రైతుల కోసం కనీసం 5 టీఎంసీల నీటిని తీసుకురాలేరా అని ప్రశ్నించారు. జూరాల ఆయకట్టు రైతులకు వెంటనే సాగునీరు విడుదల చేయడంతో పాటు అదుపులోకి తీసుకున్న బీఆర్ఎస్ నాయకులు, రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
ఎంపీ డీకే అరుణను అడ్డుకున్న బీఆర్ఎస్ నాయకులు
మరికల్: కోయిల్‌సాగర్ నీటి విడుదల చేయాలని బీఆర్ఎస్ నాయకులు సోమవారం నారాయణపేట జిల్లా మరికల్లో జాతీయ రహదారిపై ధర్నా చేస్తుండగా మహబూబ్‌నగర్ నుంచి మక్తల్ వెళ్తున్న ఎంపీ డీకే అరుణ కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. రైతులకు మద్దతుగా ఉండి కోయిల్‌సాగర్ నీటి విడుదలకు సహకరించాలని ఎంపీ కారును బీఆర్ఎస్ శ్రేణులు చుట్టుముట్టారు. వరి పంటలు పొట్ట దశలో ఉన్నాయని, ఈ సమయంలో నీళ్లు వదాలకుంటే రైతులు తీవ్రంగా నష్టపోతారని వారు ఆమెకు వివరించారు. ఎంపీ రైతులకు సర్ది చెప్పే ప్రయత్నం చేయగా.. బీఆర్ఎస్ నాయకులు ఆమె కారును ముందుకు పోనివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసులు జ్యోకం చేసుకొని పరిస్థితి చేయి దాటిపోకుండా ఆందోళనకారులను పక్కకు తోసివేసి ఎంపీ కాన్వాయ్ ముందుకు కదిలింది. -
ఆర్ఎంపీతో వాగ్వాదం.. యువకుడి ఆత్మహత్య
మరికల్: ఆర్ఎంపీతో జరిగిన వాగ్వాదం నేపథ్యంలో మరొక ఆర్ఎంపీ కింద అసిస్టెంట్‌గా పనిచేస్తున్న యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మరికల్ మండలంలోని చిత్తనూర్ లో జరిగింది. పూర్తి వివరాలు.. మాగనూర్‌కు చెందిన కమ్మరి వెంకటేశ్(19) చిన్నచింతకుంట మండలం దమగ్నాపూర్‌లో ఉంటున్న పిన్నితో కలిసి ఉంటూ.. చిత్తనూర్, దమగ్నాపూర్‌లో ప్రాథమిక వైద్య సేవలందిస్తున్న నర్వ మండలం కుమార్లింగంపల్లికి చెందిన గంగాధర్ అనే ఆర్ఎంపీ వద్ద అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. అయితే ఇటీవల దమగ్నాపూర్‌లో ఉన్న మరో ఆర్ఎంపీ తమ గ్రామంలో వైద్య సేవలు చేస్తే ఊరుకోమని వెంకటేశ్‌ను హెచ్చ రించాడు. దీంతో మనస్తాపానికి గురైన వెంకటేశ్ ఇరువురి సంభాషణను రికార్డు చేసి తన తల్లికి శనివా రం ఫోన్లో పంపించాడు. అనంతరం చిత్తనూర్‌లో అద్దెకు ఉంటున్న గదిలో చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఆర్ఎంపీ గంగాధర్ ఫోన్ చేసినా ఎంతకూ లిఫ్ట్చేయకపోవడంతో స్థానికులకు సమాచారం ఇచ్చాడు. వారు ఇంటికి వెళ్లి చూడగా వెంకటేశ్ ఉరివేసుకొని విగతజీవిగా కనిపించాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పంచానామా నిర్వహించారు. మృతుడి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ రామ్‌లాల్‌నాయక్ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి పెద్దకొత్తపల్లి: మండలంలో ని గంట్రావుపల్లి స్టేజీ సమీపంలో శనివారం రాత్రి గుర్తు తెలి యని వాహనం ఢీకొన్న ఘటనలో వ్యక్తి మృతిచెందినట్లు ఎస్ఐ సతీష్ తెలిపారు. ఎస్ఐ కథనం ప్రకారం.. వనపర్తి జిల్లా పాన్‌గల్ మండలం శాగాపూర్రకు చెందిన కానమోని జయన్న(55) శనివారం గ్రామం నుంచి టీవీఎస్ ఎక్స్‌ఎల్‌పై సాతాపూర్కు వెళ్తుండగా.. గంట్రావుపల్లి స్టేజీ దగ్గర గుర్తు తెలియని వాహనం టీవీఎస్ ఎక్స్ఎల్ను ఢీ కొట్టడంతో జయన్న తలకు బలమైన గాయాలయ్యాయి. వెంటనే గాయపడిన వ్యక్తి ని 108 అంబులెన్స్‌లో కొల్లాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి జయన్న మృతిచెందినట్లు నిర్ధారించినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. ఇట్టి ఘటనపై మృతుడి భార్య జయమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టం అనంతరం ఆదివారం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి కుమారుడు, కూతురు ఉన్నారు. హైదరాబాద్‌లో అంకమోనికుంట వాసి మృతి వెల్దండ: మండలంలోని అంకమోనికుంట గ్రామానికి చెందిన గోలి గోపాల్‌రెడ్డి(55) ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని బీఎన్‌రెడ్డి సాగర్ కాంప్లెక్స్ వద్ద గోపాల్‌రెడ్డి రోడ్డు దాటుతుండగా బొలెరో వాహనం ఢీకొట్టగా.. తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. గోపాల్‌రెడ్డి మృతితో స్వగ్రామమైన అంకమోనికుంటలో విషాధం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాలిక మృతి అమ్రాబాద్: మహబూబ్‌నగర్ షాషాబ్‌గుట్టకు చెందిన వజిహాజబిన్(16) అనే బాలిక ఆగస్టు 20న మండలంలోని మన్ననూర్‌కు బంధువుల ఇంటికి వచ్చి స్కూటీ నడుపుతుండగా సమీపంలో నిరంజన్షావలి దర్గా వద్ద ప్రమాదవవాత్తు కిందపడి తీవ్రంగా గాయపడింది. చికిత్స నిమిత్తం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం మృతి చెందింది. వజిహాజబిన్ తల్లి సాజిదాబేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ హన్మంత్‌రెడ్డి తెలిపారు. చికిత్స పొందుతూ మృతి.. కేసు నమోదు వనపర్తి రూరల్: చిక్సిత పొందుతూ వ్యక్తి మృతి చెందిన ఘటన వనపర్తి పట్టణంలో చోటు చేసుకుంది. రూరల్ ఎస్ఐ హృషికేశ్ తెలిపిన వివరాలు.. స్థానిక మరికుంట కాలనీకి చెందిన మారోజు భాస్కర్‌చారి (58) ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో తాగుడుకు బానిసై ఈ నెల 18న మధ్యాహ్నం గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం వనపర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మెరుగైన చికిత్స కోసం మహబుబ్‌నగర్‌కు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా శనివారం మృతి చెందారు. మృతుడి కుమారుడు శివమణి ఆదివారం రూరల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. గోపాల్‌రెడ్డి (ఫైల్) -
దూసుకొచ్చిన మృత్యువు
● కారు ఢీకొని చిన్నారి మృతి.. నానమ్మకు తీవ్రగాయాలు కడ్తాల్: రోడ్డు ప్రమాదంలో మనవరాలు మృతిచెందగా, నానమ్మ తీవ్రంగా గాయపడిన సంఘటన కడ్తాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలంలోని తిరుమలగిరి గ్రామానికి చెందిన పొలం భాగ్యమ్మ తన మనవరాలు కనిష్క(5)తో కలిసి ఆదివారం మైసిగండిలో బంధువులు ఏర్పాటు చేసిన విందుకు హాజరయ్యారు. అమ్మవారి దర్శనం అనంతరం సాయంత్రం తిరిగి స్వగ్రామానికి వెళ్లేందుకు శ్రీశైలం– హైదరాబాద్ జాతీయ రహదారిపై బస్టాండ్ వద్ద రోడ్డు దాటుతున్నారు. అదే సమయంలో హైదరాబాద్ నుంచి కల్వకుర్తి వైపు అతి వేగంగా వెళ్తున్న కారు వారిని ఢఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే కనిష్క మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సైదిరెడ్డి తెలిపారు. -
పోరాటాల పురిటిగడ్డ అమరచింత
● సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అమరచింత: కమ్యూనిజంపై అవాకులు చవాకులు పేలే బూర్జువా పెట్టుబడి సిద్ధాంత రాజకీయ రంపులో మునిగి తేలుతున్న వారికి ఎర్రజెండా గొప్పతనం గురించి ఏం తెలుసని, బాధలు లేని సమాజ నిర్మాణమే ఎర్రజెండా లక్ష్యమని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్తగూడేం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. అమరచింత పట్టణంలో ఆదివారం నిర్వహించిన జ్యోతి సంస్మరణ సభ కార్యక్రమంలో ఆయన ముఖ్య వక్తగా పాల్గొని మాట్లాడారు. కమ్యూనిజానికి మరణమే లేదని, ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటాలు నిర్వహించిన విజయరాములు జీవిత సహచరి జ్యోతి మరణం అత్యంత బాధాకరమన్నారు. కమ్యూనిస్టులు త్యాగాలకు చిరస్మరణీయులన్నారు. దోపిడీ రహిత సమాజ నిర్మాణం కోసం రాజీలేని పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న మాట్లాడుతూ.. కమ్యూనిజం అజయమైందని, కమ్యూనిస్టుగా జీవించాలంటే ధైర్యం కావాలన్నారు. కమ్యూనిస్టులు దోపిడీ వర్గాలపై కవాతు నిర్వహించాలని కోరారు. అమరచింతతో తనకు ఎంతో అనుబంధం ఉందని ఇక్కడి విప్లవ చైతన్యం మరువలేనిదన్నారు. కల్తీ ఆహార పదార్థాలను తినడం ద్వారా జరిగే రోగాల గురించి తనదైన ఆటపాటల ద్వార ప్రజలకు వివరించారు. ఉత్తమ విలువల జీవితం కమ్యూనిస్టులకే సాధ్యమవుతుందని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఖాసీం అన్నారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాల నరసింహ, సైకాలజిస్ట్ డాక్టర్ లక్ష్మణ్, సీపీఐ రాష్ట్ర నాయకులు బోస్, ఎండీ యూసుఫ్, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి నరసింహ, వెంకటయ్య, పయాజ్, బాలకిషన్, పరమేష్, పాలమూరు అధ్యయన వేదిక నేత రాఘవచారి, సీపీఎం జిల్లా కార్యదర్శి పుట్ట. ఆంజనేయులు, ఖలీల్, జనజ్వాల, కౌన్సిలర్ తిరుమలేష్ తదితరులు పాల్గొన్నారు. -
కుడికాల్వ వద్ద పోలీస్ పికెటింగ్
ధరూరు: జూరాల ప్రాజెక్టు వద్ద పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. వానకాలంలో పంటలుసాగు చేసుకున్న రైతులు తమ పంట పొలాలకు నీళ్లు వదలకుండా చేయడంతో పంటలు ఎండుముఖం పడుతుండడంతో కడుపు మండిన రైతులు రెండు రోజులుగా కుడి, ఎడమ కాల్వల వద్ద ధర్నాలు చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. శనివారం అర్ధరాత్రి కుడికాల్వ వద్ద నీళ్లు వదులుకునే ప్రయత్నం చేయడంతో అది గమనించిన పీజేపీ అధికారులు ఆదివారం పోలీసులకు సమాచారం అందించడంతో ధరూరు ఎస్ఐ నందికర్ నేతృత్వంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ప్రధాన కుడి కాల్వ హెడ్ రెగ్యులేటరీ వద్ద రాత్రి వరకు పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. కాల్వలకు నీటివిడుదల నిలిపివేయడంతో ప్రాజెక్టు వద్ద గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పీజేపీ ఉన్నతాధికారులు శుక్రవారం సాగునీటి విడుదలపై స్పష్టత ఇవ్వలేదు. 24గంటల తర్వాత ఉన్నతాధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటామని చెప్పిన విషయం తెలిసిందే. ఆదివారం సెలవు దినం కావడంతో రైతులు సోమవారం అధికారుల నుంచి వచ్చే సమాధానంపై ఎలాంటి స్పష్టత వస్తుందనే దానిపై ఆసక్తి నెలకొంది. -
బతుకుకు ‘బ్లాక్’ స్పాట్..!
మహబూబ్‌నగర్ క్రైం: జిల్లాలో వాహనదారులు చే స్తున్న చిన్నపాటి తప్పిదాలతో రహదారులు రక్తసిక్తం అవుతున్నాయి. కొద్దిసేపట్లో గమ్య స్థానానికి చేరుకోవాల్సిన వాహనదారులు అక్కడికక్కడే మృత్యు ఒడికి చేరడం.. కొందరు క్షతగాత్రులుగా మారి ఆస్పత్రికి వెళ్తున్నారు. జిల్లాలో జాతీయ రహదారి–44 సుమారుగా 80 కిలోమీటర్లు ఉండగా.. ఈ మార్గంలో 15 మేజర్ బ్లాక్ స్పాట్లను పోలీసులు గుర్తించారు. ప్రధానంగా జడ్చర్ల నుంచి మూసా పేట మధ్య ఇటీవల అధికంగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దివిటిపల్లి నుంచి భూత్పూర్ మధ్య జాతీయ రహదారి పూర్తిగా ఏటావాలుగా ఉండటం, బ్రిడ్జిల నిర్మాణ పనుల వల్ల రాత్రి వేళ సరైన లైటింగ్, రేడియం స్టిక్కర్స్ లేక ముందు వెళ్తున్న వాహనాలు సడెన్‌గా బ్రేక్‌లు వేస్తుండడంతో వెనుక వచ్చే వాహనాలు అదుపు తప్పి ఢీకొంటున్నాయి. ● జిల్లాలో జనవరి నుంచి ఇప్పటి వరకు రో డ్డు ప్రమాద మరణాల కేసులు 165 నమోదు కాగా.. 177 మంది దుర్మరణం పాలయ్యారు. అదేవిధంగా రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కేసులు 216 నమోదు కాగా.. 361మంది క్షతగాత్రులయ్యారు. మిగిలినవి 59 కేసులు నమోదు కాగా వీటిలో 440 మంది వాహనదారులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అత్యధికంగా మహబూబ్‌నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 33 మంది మరణించగా.. జడ్చర్లలో 29, భూత్పూర్లో 28, రాజాపూర్ పరిధిలో 11మంది మృతి చెందారు. ప్రమాదకరమైన బ్లాక్ స్పాట్ ఇవే.. బాలానగర్ హిల్‌పార్క్, బాలానగర్, పెద్దాయిపల్లి, కేతిరెడ్డిపల్లి, రాజాపూర్, గొల్లపల్లి, మాచారం, బూ రెడ్డిపల్లి, చిట్టిబోయిన్పల్లి, తాటిపర్తి, పోతుల మడుగు, శేరిపల్లి, తాటికొండ స్టేజీ, మూసాపేట, వేముల–సంకలమద్దిఎక్స్రోడ్లలో అధికంగా ప్రమాదాలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ● జాతీయ రహదారి 167పై 13 చోట్ల బ్లాక్‌స్పాట్స్ గుర్తించారు. దీంట్లో మిడ్జిల్, గంగాపూర్, సిగ్నల్ గడ్డ, మయూరీ పార్క్ మలుపు, హౌజింగ్‌బోర్డు, హనుమాన్‌పుర ఎక్స్‌రోడ్, ఆర్టీఏ కార్యాలయం మలుపు, ఆల్మదీన కళాశాల, ధర్మపూర్ టర్నింగ్, చౌదర్పల్లి స్టేజీ, కోడూర్ స్టేజీ, కోటకదిర స్టేజీ, మణ్యంకొండ స్టేజీ దగ్గర తరచూ ప్రమాదాలు జరుగుతున్నట్లు పోలీసులు తేల్చారు. జాతీయ, రాష్ట్ర రహదారులు సుమారు 500 మీటర్ల పొడవు ఉన్న ప్రాంతం. మూడేళ్ల కాలంలో కలిపి అయిదు రోడ్డు ప్రమాదాలు జరిగినా లేదా మూడేళ్లలో పది మంది మరణించినా ఆ ప్రాంతాన్ని(మరణాలు, తీవ్ర గాయాలతో కూడినవి) బ్లాక్‌స్పాట్‌గా గుర్తిస్తారు. జిల్లా ఎన్‌హెచ్ 44పై పోలీసులు గుర్తించిన 15బ్లాక్ స్పాట్స్‌లో మూడేళ్ల కాలంలో 220 ప్రమాదాలు జరిగితే.. 180 మంది మృతి చెందారు. ఆగస్టు 8న శేరిపల్లి సమీపంలో బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతుండగా.. ఆరు వాహనాలు వెనుక నుంచి ఒకదానికి ఒకటి బలంగా ఢీకొన్నాయి. ఆగస్టు 14న భూత్పూర్ పోలీస్‌స్టేషన్ వద్ద ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తాపడటంతో 15మందికి గాయాలు కాగా.. ఇద్దరు యువతులకు చేతులు తెగిపోయాయి. ఆగస్టు 26న భూత్పూర్ బ్రిడ్జి రోడ్డుపై నిలిపి ఉన్న లారీని వెనుక నుంచి బైక్ ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. సెప్టెంబర్ 7న భూత్పూర్ బ్రిడ్జిపై డీసీఎంను వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. ఈనెల 10న జడ్చర్ల నుంచి కర్నూల్‌కు మేకల లోడుతో వెళ్తున్న డీసీఎం డ్రైవర్ నిద్రమత్తులో సూచిక బోర్డు దిమ్మెను ఢీకొట్టడంతో బోల్తాపడి అగ్నిప్రమాదం చోటుచేసుకుని ఒక వ్యక్తితో పాటు 250 మేకలు సజీవ దహనం అయ్యాయి. ఎన్‌హెచ్–44పై పెరిగిన ప్రమాదాల తీవ్రత దివిటిపల్లి నుంచి మూసాపేట మధ్య అధికం బ్రిడ్జిల నిర్మాణాలు, సూచిక బోర్డులు, రేడియం స్టిక్కర్స్ కరువు 9 నెలల కాలంలో 177 మంది మృతి బాలానగర్ నుంచి వెల్టూర్ స్టేజీ వరకు 80 కిలోమీటర్ల దూరంలో 15 ప్రమాద స్థలాలు -
భారీ వర్షం
● కొల్లాపూర్‌లో 14.46 సెం.మీ. వర్షపాతం నమోదు ● పొంగిపొర్లిన వాగులు, వంకలు నార్లాపూర్ సమీపంలో ముక్కిడిగుండం వెళ్లే రహదారిలో పారుతున్న చిన్న వాగు కొల్లాపూర్: జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం మధ్యరాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. రాష్ట్రంలోనే అత్యధికంగా కొల్లాపూర్ మండలంలో 14.46 సెం.మీ. వర్షపాతం నమోదైంది. పెద్దకొత్తపల్లి మండలంలో 6.8 సెం.మీ. వర్షం, కోడేరులో 8.22 సెం.మీ. వర్షం కురిసింది. ఈ వానాకాలంలో భారీ వర్షం కురవడం కొల్లాపూర్ నియోజకవర్గంలో ఇదే తొలిసారి. ఎడతెరిపి లేని వర్షంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. పలుచోట్ల చెరువుల్లోకి నీరు చేరాయి. పంటపొలాల్లో వర్షపునీరు నిలిచాయి. కొల్లాపూర్‌లోని మల్లపురాజుకుంట వద్ద చెరువు నీరు రోడ్డుగుండా పారాయి. దీంతో ప్రజలు అటువైపు వెళ్లేందుకు ఇబ్బంది పడ్డారు. కొల్లాపూర్ నుంచి పెంట్లవెల్లికి వెళ్లే దారిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కుడికిళ్ల, చుక్కాయపల్లి వాగులు పొంగిపొర్లాయి. నార్లాపూర్ సమీపంలో ప్రధాన రహదారిపై ఉన్న చిన్న వాగు ప్రవహించడంతో ముక్కిడిగుండం గ్రామానికి వెళ్లే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
బీరం హర్షవర్ధన్‌రెడ్డికి పరామర్శ
కొల్లాపూర్:పితృవియోగంతో బాధపడుతున్న కొల్లా పూర్ మాజీ ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్‌రెడ్డిని ఆదివారం పలువురు ప్రముఖులు పరామర్శించారు. అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్.వంశీకృష్ణ, ఎమ్మెల్సీ లు చల్లా వెంకట్రామిరెడ్డి, గోరటి వెంకన్న, ఆందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్, తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాల్‌నర్సింహ సింగోటం వ్యవసా య క్షేత్రంలో వారు హర్షవర్ధన్‌రెడ్డిని కలిసి సాను భూతి తెలిపారు.ఆయన తండ్రి భీరం లక్ష్మారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారివెంట పలువురు కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. -
పాలమూరుకు తప్పని సాగునీటి గోస
● కోస్గి పాంచజన్య సంకల్పసభలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత కోస్గి: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లయి రెండు ప్రభుత్వాలు ఏర్పడినా.. ఉమ్మడి పాలమూర్ జిల్లాలో నేటికీ సాగునీటి గోస తప్పలేదని తెలంగాణ రక్షణసేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. రాష్ట్ర ప్రజలకు ఉచిత విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయం, సామాజిక న్యాయం అందించడమే ప్రధాన లక్ష్యమనే నినాదంతో ఆదివారం కోస్గిలో నిర్వహించిన పాంచజన్య సంకల్ప సభలో ఆమె మాట్లాడారు. బిడ్డల గోస తల్లికే తెలుస్తుందని.. ఓ తల్లిగా రాజకీయ పార్టీ పెట్టి మీ ముందుకొచ్చానని, పార్టీ పెట్టడం గిట్టని కొందరు బీఆర్ఎస్ వదిలిన బాణం అని, మరికొందరు రేవంత్ వదిలిన బాణమని, తలకాయలేని మరికొందరు బీజేపీ వదిలిన బాణమంటూ విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను ఎవరు వదిలిన బాణం కాదని.. నేటికీ విద్య, వైద్యానికి నోచుకోని బహుజనులు వదిలిన బాణన్నని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా సీఎం రేవంత్‌రెడ్డి తప్పించుకు తిరుగుతున్నారని.. సీఎం సొంత నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్లకు కమీషన్లు వసూలు చేస్తున్నారని, ఉమ్మడి పాలమూర్ జిల్లా నుంచి గెలిచిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇసుక, మట్టి దందాల్లో బిజీగా ఉన్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలైన నిరుద్యోగ భృతి, మహిళలకు రూ.2,500, రైతు భరోసా, రైతుబీమా, పింఛన్లు ఏమయ్యాయో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ముస్లింలకు ఏడాదికి రూ.4 వేల కోట్ల నిధులని చెప్పి అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో కేవలం రూ.1,500 కోట్లు ఇచ్చారని, ఈ విషయం మంత్రి అజారుద్దీన్ అసెంబ్లీలో చెప్పడం కాంగ్రెస్ పాలనకు నిదర్శనమన్నారు. సీఎం బంధువులు పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు లగచర్ల రైతులపై దాడులు చేసి భూములు లాక్కున్నారని.. హోంశాఖ నిర్వహిస్తున్న సీఎం ఈ విషయంలో పేదలకు సామాజిక న్యాయం ఎక్కడ చేశారని ప్రశ్నించారు. వ్యవసాయానికి విద్యుత్, యూరియా లేదని, కోస్గికి ఇచ్చిన ఇంజినీరింగ్ కళాశాలను తరలించారని, ఏ పాఠశాల, కళాశాలలో పూర్తిస్థాయి బోధకులు లేరని, సీఎం సొంత ఇలాఖాలో 47 ఏకోపాధ్యాయ పాఠశాలలున్నాయని, విద్యాశాఖ నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి ఆ శాఖకు న్యాయం చేయలేకపోయారన్నారు. రాష్ట్రంలో అక్షరాస్యతలో వెనుకబడ్డ గట్టు, కేటీదొడ్డి మండలాలు సీఎం సొంత జిల్లాలో ఉండటం శోచనీయమని.. విద్య, శాంతిభద్రతల పరిరక్షణలో పూర్తిగా విఫలమయ్యారని తెలిపారు. కేబినెట్లో నేటికీ గిరిజనులకు అవకాశం ఇవ్వలేదని.. మొన్నటి వరకు ముస్లింలకు సైతం లేదని నిలదీస్తే అజారుద్దీన్‌కు అవకాశం ఇచ్చారన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం లేదని తెలిపారు. అందరూ ఆశీర్వదిస్తే తెలంగాణలో సైతం మాతృస్వామ్య పాలన చేపడతామని చెప్పారు. -
నిమజ్జనం ప్రశాంతంగా జరుపుకోవాలి : ఎస్పీ
మహబూబ్‌నగర్ క్రైం: జిల్లాలో గణేశ్ నిమజ్జనం సందర్భంగా డీజే సౌండ్ సిస్టంలు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి లేదని ఎస్పీ జానకి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. శాంతిభద్రతలు, ప్రజల ఆరోగ్యం దృష్ట్యా డీజేలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ఆదేశాల ప్రకారం శబ్ద కాలుష్య నియంత్రణపై ప్రతిఒక్కరికి బాధ్యత ఉందన్నారు. జిల్లాలో ఉన్న డీజే ఆపరేటర్లు పోలీసుల సూచనలు తప్పక పాటించాలన్నారు. అనుమతి లేకుండా డీజే వినియోగించడం, అధిక శబ్దంతో ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే డీజే ఆపరేటర్లపై చట్ట ప్రకారం కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఊరేగింపుల్లో ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నిర్వాహకులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, విద్యుత్ వైర్లు, ట్రాఫిక్ సమస్య లేకుండా చూడాలన్నారు. మద్యం తాగి ఊరేగింపుల్లో పాల్గొనడం, ఇతరులకు ఇబ్బందులు కలిగించడం, పోలీసులతో వాగ్వాదానికి దిగడం వంటి చర్యలకు దూరంగా ఉండాలన్నారు. జిల్లాలో ఎవరైనా అనుమతి లేకుండా డీజేలు ఏర్పాటు చేసిన పరిస్థితులు ఏర్పడితే సెల్ నం.87126 59360, లేదా 112కి సమాచారం ఇవ్వాలని కోరారు. నీటి లీకేజీలను వెంటనే అరికట్టాలి జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): నీటి లీకేజీ సమస్యను వెంటనే అరికట్టాలని అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్ అన్నారు. ఆదివారం ఆయన నగరంలోని పోలీస్ లైన్ స్కూల్ సమీపంలో, షాసాబ్‌గుట్ట ప్రాంతంలో నీటి లీకేజీ సమస్యను పరిశీలించారు. ఇటీవల నిర్వహించిన తనిఖీల సందర్భంగా ఆయా ప్రాంతాల్లో నీటి లీకేజీని గుర్తించిన ఆయన సమస్యను వెంటనే పరిష్కరించాలని సంబంధిత ఏఈని ఆదేశించారు. లీకేజీకి గల కారణాలను గుర్తించి, తక్షణమే మరమ్మతు చేపట్టి సమస్య పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నీటి సరఫరా వ్యవస్థపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. -
భవిత అంధకారం
కళ్లపై భారం.. –8లో u‘జిల్లా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలోని ఆర్బీఎస్కే వైద్య బృందాలు నాలుగు రోజులుగా (మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో) 31 ప్రభుత్వ పాఠశాలల్లో 5,236 మంది విద్యార్థులకు దూరపు చూపు, దగ్గర చూపు సమస్యలతోపాటు ఇతర కంటి సమస్యలపై పరీక్షలు నిర్వహించారు. కాగా.. ఇందులో 270 మంది విద్యార్థులకు సమస్యలు ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది.’ జిల్లాలో నాలుగో విడత కింద 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు కంటి పరీక్షలు చేస్తున్నాం. మొత్తం 7 బృందాలు రోజుకు ఒకటి లేదా రెండు పాఠశాలల్లో పరీక్షలు చేయడం జరుగుతుంది. గతంలో స్క్రీనింగ్ చేసిన విద్యార్థులకు ఇప్పుడు అద్దాలు పంపిణీ చేస్తున్నాం. కంటి సమస్య తీవ్రంగా ఉంటే జనరల్ ఆస్పత్రికి రెఫర్ చేస్తున్నాం. డిసెంబర్ నాటికి లక్ష్యం పూర్తిచేసి అందరికీ పరీక్షలు చేస్తాం. – డాక్టర్ ప్రవీణ్, ఆర్బీఎస్కే నోడల్ ఆఫీసర్ చిన్న వయసులో కంటిచూపు సమస్య వస్తే మెదడు ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రస్తుత పిల్లల్లో ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు ఉంటే చదువు లేకపోతే స్మార్ట్‌ఫోన్ లేదా టీవీలు చూస్తున్నారు. ఫోన్లో ఒక రీల్‌ను కనీసం ఒక నిమిషం కూడా చూడకుండా నచ్చకుంటే సెకన్ల వ్యవధిలో స్క్రోల్ చేస్తున్నారు. దీంతో ఇదే పద్ధతిని వారి సబ్జెక్టుల్లో కూడా చూపుతారు. సబ్జెక్టు నచ్చకపోతే దానిని పట్టించుకోరు. ఓపిక తగ్గిపోయి గట్టిగా అరవడం, గదుల్లో భయంగా గడుపుతుంటారు. చిన్నారులు అన్నిరకాల స్క్రీనింగ్ సమయం పూర్తిగా తగ్గించాలి. పెద్ద టీవీలను తక్కువ లైటింగ్‌లో అస్సలు చూడరాదు. ప్రధానంగా చీకటిలో దుప్పటి కప్పుకొని ఫోన్ చూస్తే దాని ప్రభావం రెండింతలు ఉంటుంది. – కిషోర్‌కుమార్, ఎంఎస్ ఆప్తమాలజిస్ట్ పాలమూరు: లోకజ్ఞానం కూడా తెలియని చిన్నారులు పలువురు వివిధ కారణాలతో చూపు మందగించి ఇబ్బందులు పడుతున్నారు. పిన్న వయసులోనే కళ్లద్దాలు ధరించాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నెల 15 నుంచి ఆర్బీఎస్కే (రాష్ట్రీయ బాల స్వస్థ్ కార్యక్రమం) వైద్య బృందాలు జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు కంటి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించగా ఈ విషయం వెలుగుచూసింది. దృష్టిలోపాలకు గురైన వారికి అవసరమైన చికిత్స అందించడంతోపాటు అద్దాలు అవసరమైన వారిని గుర్తిస్తున్నారు. ఇక సమస్య తీవ్రంగా ఉంటే జనరల్ ఆస్పత్రికి రెఫర్ చేస్తున్నారు. నాలుగో దశ పరీక్షలు.. జిల్లాలో గతేడాది కాలంలో మూడు దశలుగా విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. మొదటి దశలో 12,674 మంది విద్యార్థులకు పరీక్షలు చేయగా 786 మందికి కంటి సమస్య ఉన్నట్లు గుర్తించి అద్దాలు పంపిణీ చేశారు. ఇక రెండో దశలో 46,415 మందికి పరీక్షలు చేయగా 1,486 మంది విద్యార్థులు రెండు రకాల సమస్యలతో ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించి.. అద్దాలు అందిస్తున్నారు. మూడో దశలో 53,274 మందికి పరీక్షలు చేయగా 2,305 మందికి సమస్య ఉన్నట్లు గుర్తించి ప్రస్తుత ప్రక్రియలో అద్దాలు పంపిణీ చేస్తున్నారు. మూడు దశల్లో కలిపి మొత్తం 1,12,362 మందికి పరీక్షలు చేయగా 4,577 మంది కంటి సమస్యలు ఉన్నట్లు నిర్ధారించారు. ప్రస్తుతం నాలుగో దశలో భాగంగా కంటి పరీక్షల ప్రక్రియ ప్రారంభం కాగా.. 251 పాఠశాలల్లో 42,280 మంది విద్యార్థులకు ఈ డిసెంబర్ నాటికి పరీక్షలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఇప్పటి వరకు మూడు దశల్లో 1,12,363 మందికి పరీక్షలు 4,577 విద్యార్థులకు కంటి సమస్య ఉన్నట్లు గుర్తింపు ఈ నెల 15 నుంచి మొదలైన నాలుగో దశ ప్రక్రియ స్మార్ట్ఫోన్లు, టీవీ స్క్రీన్‌తో కంటిచూపుపై ప్రభావం -
కురుమూర్తి ఘాట్ రోడ్డు పూర్తిచేస్తాం
● ఉదండాపూర్ ప్రాజెక్ట్ భూ సేకరణకు రూ.560 కోట్లు మంజూరు ● బ్రహ్మోస్ భూ సేకరణలో రైతులకు న్యాయమైన పరిహారం ● ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దేవరకద్ర/ చిన్నచింతకుంట: కురుమూర్తిస్వామి ఆలయం వద్ద చేపట్టిన ఎలివేటెడ్ కారిడార్ ఘాట్ రోడ్డు నిర్మాణం త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామని రాష్ట్ర ఆర్అండ్బీ, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఆదివారం దేవరకద్ర మండలం మీనుగోనిపల్లి వద్ద నియోజకవర్గంలో రూ.153 కోట్లతో చేపడుతున్న పలు రహదారులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితోపాటు రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, కలెక్టర్ ఖుష్బూగుప్తా, ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి, ఎస్పీ జానకితో కలిసి భూమిపూజ చేశారు. అనంతరం కురుమూర్తిస్వామి ఆలయం వద్ద కొనసాగుతున్న ఘాట్ రోడ్డు నిర్మాణం పనుల రోడ్డు మ్యాపును పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ కురుమూర్తిస్వామి ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం రూ.110 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్ ఘాట్ రోడ్డు నిర్మాణం చేపట్టామని, ఈ పనులను త్వరితగతిన పూర్తి చేసి 2027 జూలై నాటికి అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. అలాగే పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఉదండాపూర్, కర్వెన ప్రాజెక్టుల పనులను పూర్తిచేసి.. త్వరలోనే కృష్ణానీటితో నింపుతామన్నారు. ఉదండాపూర్ భూ సేకరణకు ప్రభుత్వం రూ.560 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక ప్రాజెక్టులు నిండలేదని, నదులన్నీ నీరు లేక వెలవెలబోతున్నాయని పేర్కొన్నారు. తాగడానికి ప్రాధాన్యత ఇచ్చే విధంగా ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని నిల్వ చేస్తున్నామని, ఇందుకు రైతులు సహకరించాలని కోరారు. ప్రతిష్టాత్మక ప్రాజెక్టు బ్రహ్మోస్ కోసం సేకరిస్తున్న భూములకు తగిన నష్టపరిహారం ఇవ్వడంతోపాటు రైతులకు న్యాయం చేస్తామన్నారు. ● ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తుందన్నారు. దేవరకద్ర నియోజకవర్గంలో రోడ్లు, పాఠశాలలు, ఆస్పత్రి, వివిధ కార్యాలయాల భవనాలు నిర్మిస్తున్నామని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించిందని, పదేళ్లుగా ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని మండిపడ్డారు. ఆయా కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట ఆర్గనైజింగ్ సెక్రెటరీ అరవింద్‌కుమార్‌రెడ్డి, అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్, మున్సిపల్ చైర్పర్సన్ దమయంతి, కురుమూర్తి స్వామి ఆలయ కమిటీ చైర్మన్ బాలరాజు, మాజీ చైర్మన్ గోవర్ధన్‌రెడ్డి, ముచ్చింతల సర్పంచ్ వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాకు సాగు, తాగునీరు అందించే జూరాల ప్రాజెక్టు పాలమూరు గుండెకాయ లాంటిదని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాజెక్టు నీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. రాబోయే వేసవిలో పాలమూరు ప్రజలకు తాగునీటికి ఇబ్బందులు ఏర్పడే పరిస్థితులు నెలకొన్నాయనే ఉద్దేశంతోనే పంటలకు నీటిని వదలడం లేదన్నారు. అయితే రైతులు ఇబ్బంది పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఇదే సందర్భంలో ఎల్‌నినో ప్రభావంపై రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. రైతులు ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకుంటారని అభిప్రాయపడ్డారు. అయితే వాతావరణ పరిస్థితులను ఆసరాగా చేసుకొని రాజకీయ లబ్ధి కోసం బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు రైతులను రెచ్చగొట్టి జూరాల ప్రాజెక్టుపై ధర్నా చేయిస్తున్నారని ఆరోపించారు. ప్రాజెక్టు గేట్లను పగులగొట్టి నీటిని వృథా చేసే ప్రయత్నం చేస్తున్నారని, ఇలాంటి చర్యలు సరికాదని హితవు పలికారు. -
కృష్ణా.. తోడేస్తుండ్రు
● ప్రస్తుతం జలాశయంలో 861.10 అడుగుల వద్ద 109.5400 టీఎంసీల నీరు ● డేంజర్ బెల్స్.. ఎండీడీఎల్‌కు కేవలం 79.5400 టీఎంసీలే ● ఇలాగే కొనసాగితే సాగు, తాగునీటిపై తీవ్ర ప్రభావం ● వచ్చే జూన్ వరకు తాగునీటికే ప్రాధాన్యం అంటున్న ప్రభుత్వం అచ్చంపేట: ఇటు తెలంగాణ, అటు ఏపీ రాష్ట్రాల్లో లక్షలాది ఎకరాలకు సాగునీరు, కోట్లాది మందికి తాగునీటిని అందించడంతో నిరంతర విద్యుత్ సరఫరాకు దోహదపడే శ్రీశైలం జలాశయంలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఈ ఏడాది ఎల్‌నివో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడమే ఇందుకు కారణం. ఎగువ నుంచి ఆశించిన స్థాయిలో వరద ప్రవాహం లేకపోవడంతోపాటు.. వచ్చిన కొద్దిపాటి నీటిని రెండు తెలుగు రాష్ట్రాలు విచ్చలవిడిగా తోడేస్తుండటంతో నీటి నిల్వలు డెడ్ స్టోరేజ్ దశకు చేరుకుంటున్నాయి. ప్రస్తుతం నిండా నీటితో కళకళలాడిన జలాశయం.. నీటిమట్టం వేగంగా క్షీణించి 861.10 అడుగులకు చేరింది. ప్రస్తుతం ఎగువనున్న ఆల్మటి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టుల నుంచి వరద ప్రవాహం లేకపోవడంతో శ్రీశైలంలో ఎండీడీఎల్ 834 అడుగుల చేరువలోకి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో తాగునీటికే ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. 2002– 03 సంవత్సరం నుంచి కృష్ణానదికి అతి తక్కువ నీటి ప్రవాహాలు వచ్చిన నాలుగో సందర్భం ఇప్పుడు మళ్లీ వచ్చింది. సంవత్సరం వచ్చిన వరద (టీఎంసీలు) 2002– 03 221.781 2003– 04 157.047 2012– 13 243.852 2015– 16 73.600 2023– 24 140.840 2026– 27 215.11 (సెప్టెంబరు 17 వరకు) కృష్ణానది పరివాహకంలో కురిసిన వర్షాలతో మహారాష్ట్రలోని ఉజ్జయిని, కర్ణాటకలోని ఆల్మటి, నారాయణపూర్ జలాశయాలు నిండిన తర్వాత విడుదల చేసిన నీళ్లు గత జూలై చివరి నాటికి జూరాల మీదుగా శ్రీశైలానికి చేరుకున్నాయి. దీంతో వానాకాలం ప్రారంభానికి ముందు శ్రీశైలంలో 39 టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. ఆగస్టు 12 నాటికి ఎగువ నుంచి 185.5 టీఎంసీల నీరు వచ్చింది. దీంతో శ్రీశైలంలో 215.11 టీఎంసీల నీరు చేరగా.. తెలంగాణ కేఎల్ఐ, ఏపీ పోతిరెడ్డిపాడు, మల్యాల నుంచి హంద్రీనీవా సుజల స్రవంతి (హెచ్ఎన్ఎస్), వెలుగోడు, ముచ్చుమర్రి పథకాలకు వాడుకుంటోంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలు శ్రీశైలం నుంచి ఇప్పటి వరకు 145 టీఎంసీల నీటిని వాడుకున్నట్లు శ్రీశైలం గేజింగ్ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. మరోవైపు రెండు రాష్ట్రాలు పోటాపోటీగా విద్యుదుత్పత్తి ద్వారా పెద్దఎత్తున నీటిని దిగువనున్న నాగార్జునసాగర్‌కు విడుదల చేశాయి. తెలంగాణ శ్రీశైలం ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రం ద్వారా తెలంగాణ జెన్కో 446.13 మి.యూ., ఏపీ 72.62 మి.యూ., విద్యుదుత్పత్తి చేసింది. నీటి కేటాయింపులు లేకుండానే రెండు రాష్ట్రాలు నీళ్లు వాడుకుంటున్నాయి. ప్రస్తుతానికి వచ్చిన వరదలతో కాస్త ఉపశమనం పొందినా భవిష్యత్ పరిస్థితులపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో ప్రస్తుత వానాకాలంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఈ ఏడాది సాగునీటికి కష్టాలు తప్పేలా లేవు. శ్రీశైలం జలాశయం గరిష్ట నిల్వ మట్టం 885 అడుగులు కాగా.. పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు. అయితే గురువారం నాటికి 861.1 అడుగుల వద్ద 109.5400 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇందులో 834 అడుగులు, 30 టీఎంసీలు డెడ్ స్టోరేజ్ కాగా వినియోగానికి వీలుండేది కేవలం 27.1 అడుగులు, 79.5400 టీఎంసీలు మాత్రమే. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల వాటా ఉంటుంది. మనకు తాగునీటికే నెలకు కనీసం ఒక టీఎంసీ అవసరం ఉండగా.. ఇందులో సాగునీటి గురించి ఆలోచించడం సాహసమే. నాగర్‌కర్నూల్, వనపర్తి, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలకు కృష్ణా జలాలనే కేఎల్ఐ పంపుల ద్వారా ఎత్తిపోసి తాగునీటి కోసం మిషన్ భగీరథ పథకానికి తరలిస్తారు. ఏడాదికి సుమారు 10– 12 టీఎంసీలు అవసరం అవుతాయి. వరదల సమయంలో ఏటా 35 నుంచి 45 టీఎంసీల నీటిని కేఎల్ఐ పంపుల ద్వారా ఎత్తిపోసేవారు. ఇందులో దాదాపు సాగునీటికి 35 టీఎంసీల వరకు వినియోగించేవారు. ఈసారి కేఎల్ఐ పంపుహౌస్‌ల్లో ఐదు మోటార్లకు గాను మూడింటితోనే ఎల్లూరు, జొన్నలబొగుడ, గుడిపల్లి రిజర్వాయర్లకు తాగు, సాగునీటి అవసరాల కోసం 10 టీఎంసీల నీటిని మాత్రమే వాడుకున్నారు. శ్రీశైలం బ్యాక్‌వాటర్ నుంచి కేఎల్ఐ ద్వారా నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్, వనపర్తి, దేవరకద్ర, జడ్చర్ల నియోజకవర్గాలతోపాటు ఇతర ప్రాంతాల్లో 3.65 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంటుంది. ఈ ఏడాది వర్షాకాలంలో నాగర్‌కర్నూల్ జిల్లాలో 1.25 లక్షల ఎకరాల్లో రైతులు వరిపంట సాగు చేశారు. శ్రీశైలంలో ఆశించిన స్థాయిలో నీరు లేకపోవడంతో పంటలకు సాగునీరు అందడం ప్రశ్నార్థకంగా మారింది. శ్రీశైలం జలాశయానికి వరదలు వచ్చిన సమయంలో ఈ ఏడాది ఇప్పటి వరకు తాగు, సాగునీటి అవసరాల కోసం 10 టీఎంసీల నీటిని ఎత్తిపోశాం. మూడు మోటార్ల ద్వారా రోజుకు 800 నుంచి 2,400 క్యూసెక్కుల నీటిని ఎల్లూరు, జొన్నలబొగుడ, గుడిపల్లి రిజర్వాయర్లకు తరలించాం. రిజర్వాయర్లతోపాటు డిస్ట్రిబ్యూటరీ కాల్వల ద్వారా నీటిని విడుదల చేస్తున్నాం. – అమర్‌సింగ్, ఈఈ, సాగునీటి పారుదలశాఖ -
గొప్ప నాయకులందరూ న్యాయవాదులే..
● పీయూలో లా విద్యార్థులకు ఓరియంటేషన్ కార్యక్రమంలో జిల్లా జడ్జి ప్రేమలత ● సదుపాయాల కల్పనకు కృషి: వీసీ శ్రీనివాస్మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: దేశ స్వాతంత్య్రోద్యమంలో పోరాడిన గొప్ప నాయకులంతా న్యాయవాదులే అని జిల్లా జడ్జి ప్రేమలత గుర్తుచేశారు. పీయూలో లా కళాశాల విద్యార్థులకు ఏర్పాటు చేసిన ఓరియంటేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ.. న్యాయ విద్యకు అధిక ప్రధాన్యత ఉందని, విద్యార్థులు సబ్జెక్టులపై పట్టు సాధిచాలన్నారు. లీగల్ ఎయిడ్ క్లీనిక్‌ల ద్వారా పేద, పీడిత వర్గాలకు న్యాయ సహాయం అందించాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీలు, మహిళలు, వలస కార్మికులు, సీనియర్ సిటిజన్లు ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన పెంచుకోవాలన్నారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించేందుకు ఆస్కారం ఉందని తెలిపారు. విద్యార్థులు సివిల్, క్రిమినల్, ప్రమాద కేసులపై అవగాహన పెంచుకోవాలన్నారు. కేసుల డ్రాఫ్టింట్, వాదనలు, భాషా విధానంపై పట్టు సాధించే విధంగా సాధన చేయాలని, సుప్రీం కోర్టు తీర్పులను ప్రతి రోజు చదవడం వల్ల న్యాయ విద్య సులువుగా అర్థం అవుతుందన్నారు. వాస్తవాలను అర్థం చేసుకునేలా.. న్యాయ విద్య కేవలం పుస్తకాలు, చట్టాలకే పరిమితం కాకుండా సమాజంలో వాస్తవాలను అర్థం చేసుకునేలా ఉండాలని పీయూ వీసీ శ్రీనివాస్ పేర్కొన్నారు. లా కళాశాలలో అనుభవజ్ఞులైన అధ్యాపకులు ఉన్నారని, కళాశాలలో ఉన్న వసతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా విద్యార్థులు ప్రాక్టికల్ అంశాలను దృష్టిలో ఉంచుకుని మాక్ కోర్టులు, లీగల్ ఏయిడ్లు, సెమినార్లు, కాన్ఫరెన్స్‌లు, వర్క్‌షాప్‌లలో చురుకుగా పాల్గొనాలని సూచించారు. కార్యక్రమంలో ఆడిట్‌సెల్ డైరెక్టర్ చంద్రకిరణ్, లా డీన్ వెంకటేశ్వర్లు, బీఓఎస్ చైర్మన్ రాంప్రసాద్, ప్రిన్సిపాల్ భూమయ్య, కరుణాకర్‌రెడ్డి, న్యాయవాదులు రవికుమార్, సాయిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో బైక్ మెకానిక్ దుర్మరణం
భూత్పూర్: కారు, మోటార్ సైకిల్ ఢీకొన్న ఘటనలో యువకుడు మృతి చెందిన ఘటన మండలంలోని కొత్త మొల్గర వద్ద శనివారం చోటుచేసుకుంది. మద్దిగట్ల సర్పంచ్ సురేష్, గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గుండుమాల త్రినాథ్ (20)మహబూబ్‌నగర్‌లో బైక్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. శనివారం స్వగ్రామం నుంచి బైక్‌పై మహబూబ్‌నగర్ వెళ్తుండగా కొత్త మొల్గర సమీపంలోని తుల్జాభవాని తండా వద్ద ఎదురుగా భూత్పూర్ నుంచి నాగర్‌కర్నూల్ వైపు వెళ్తున్న కారు ఢీకొంది. దీంతో త్రినాథ్ తీవ్రంగా గాయపడి, అక్కడికక్కడే మృతిచెందాడు. భూత్పూర్ పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తల్లి గతంలోనే మరణించగా.. తండ్రి గుండుమాల శంకర్, సోదరుడు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రంజీకి పాలమూరు ఆల్‌రౌండర్
● హైదరాబాద్ జట్టులో చోటు దక్కించుకున్న రుత్విక్ యాదవ్ ● ఆఫ్‌స్పిన్‌తో వికెట్ల వేట.. ఎడమచేతి బ్యాటింగ్‌లోనూ మెరుపులు ● సూపర్ సీనియర్ లీగ్‌లో మూడు మ్యాచ్‌ల్లో 17 వికెట్లు భారత జట్టుకు ఎంపిక కావడమే లక్ష్యం రంజీ ట్రోఫీకి ఎంపికకావడం చాలా సంతోషంగా ఉంది. నన్ను చిన్నప్పటి నుంచి క్రికెట్లో తల్లిదండ్రులు ఎంతో ప్రోత్పహిస్తున్నారు. నేను హైదరాబాద్‌లోని క్రికెట్ స్కూల్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్న. కోచ్‌లు మాజీ భారత జట్టు ప్లేయర్ దినేష్ మోంగియా, అద్నాన్ బఫ్పాన్, గౌరవ్‌కుమార్ నాకు కోచింగ్ ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువగా వికెట్లు తీసి, పరుగులు చేసి భారతజట్టుకు ఎంపికకావడమే లక్ష్యంగా పెట్టుకున్న. – రుతిక్ యాదవ్, క్రికెటర్ మహబూబ్‌నగర్ క్రీడలు: పాలమూరు యువ క్రికెటర్ మెండె రుత్విక్ యాదవ్ రంజీ ట్రోఫీకి ఎంపికయ్యాడు. 2026–27 సీజన్లో తొలి రెండు మ్యాచ్‌లకు ప్రకటించిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) జట్టులో చోటు దక్కించుకున్నాడు. కుడిచేతి ఆఫ్‌స్పిన్నర్‌గా, ఎడమచేతి బ్యాట్స్‌మెన్‌గా రాణిస్తున్న రుత్విక్.. ఇటీవలి ప్రదర్శనలతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. సూపర్ సీనియర్ లీగ్‌లో మూడు మ్యాచ్‌ల్లోనే 17 వికెట్లు పడగొట్టి తన సత్తా చాటాడు. చిన్ననాటి నుంచే ఆసక్తి మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బండమీదిపల్లికి చెందిన రుత్విక్ యాదవ్‌కు చిన్ననాటి నుంచే క్రికెట్‌పై మక్కువ. పట్టుదల, క్రమశిక్షణతో పాటు నిరంతర సాధనతో ఆటలో రాణిస్తున్నాడు. హైదరాబాద్‌లోని క్రికెట్ స్కూల్ అకాడమీలో అన్న రాకేష్ యాదవ్‌తో కలిసి శిక్షణ పొందుతున్నాడు. హైదరాబాద్‌లో ఏఆర్ఏఎస్ఐగా పనిచేస్తున్న తండ్రి రమేష్ యాదవ్ అతడిని ప్రోత్సహిస్తున్నారు. బంతితో పదునైన ప్రదర్శన 2024, 2025లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జట్టు తరఫున హెచ్‌సీఏ లీగ్‌లలో ఆడిన రుత్విక్.. హెచ్‌సీఏ అండర్–19 లీగ్‌లోనూ సత్తా చాటాడు. తిలక్‌వర్మ సారథ్యంలో అహ్మదాబాద్‌లో జరిగిన మ్యాచ్‌ల్లో పాల్గొన్నాడు. 2024 మెన్స్ అండర్–23 వన్డే ట్రోఫీ, కోల్ సీకే నాయుడు ట్రోఫీలోనూ ఆడాడు. గత ఏడాది కోల్ సీకే నాయుడు అండర్–23 ప్రాబబుల్స్‌లో మూడు మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీశాడు. అండర్–23 స్టేట్ మ్యాచ్‌లో విదర్భపై 68 పరుగులు చేశాడు. ఈ ఏడాది మరింత దూకుడు 2026 సీజన్లో హెచ్‌సీఏ ఏ–డివిజన్ లీగ్‌లో హైదరాబాద్ బ్యాటింగ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన రుత్విక్.. ఐదు మ్యాచ్‌ల్లో 11 వికెట్లు తీయడంతో పాటు రెండు అర్ధసెంచరీలు సాధించాడు. ఇటీవల జరిగిన హెచ్‌సీఏ సీనియర్ మెన్స్ సూపర్ లీగ్‌లో టీమ్–ఈ తరఫున మూడు మ్యాచ్‌ల్లో 17 వికెట్లు తీసి టాప్–3 బౌలర్లలో నిలిచాడు. రెండు మ్యాచ్‌ల్లో ఐదేసి వికెట్లు పడగొట్టడం విశేషం. బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్న రుతిక్ యాదవ్ అక్టోబర్ 11 నుంచి రంజీ ట్రోఫీ 2026–27 రంజీ ట్రోఫీ అక్టోబర్ 11 నుంచి ప్రారంభం కానుంది. హైదరాబాద్ జట్టుకు టీమిండియా బౌలర్ మహ్మద్ సిరాజ్ సారథ్యం వహించనున్నాడు. రంజీ జట్టులో రుత్విక్కు చోటు దక్కడంతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా క్రీడాభిమానుల్లో హర్షం వ్యక్తమవుతోంది. -
కూలిన వందేళ్లనాటి పాఠశాల భవనం
● పాఠశాల సమయం కాకపోవడంతో తప్పిన ప్రమాదం ● ఇదే నమూనాతో కొత్తది నిర్మించాలని, గ్రామస్తులు, పూర్వవిద్యార్థులు విన్నపం లింగాల: మండల కేంద్రంలో వందేళ్ల క్రితం నిర్మించిన జెడ్పీ ఉన్నత పాఠశాల కార్యాలయ సముదాయ భవనంలోని నైరుతి భాగం శనివారం తెల్లవారుజామున అకస్మాత్తుగా కూలిపోయింది. షెటిల్‌మెంట్ కాలంలో 1927 కన్న ముందు ఈ భవనాన్ని నిర్మించారు. అప్పట్లో దీనిని ఎస్పీ కార్యాలయంగా వాడుకలో ఉండేది. కాలక్రమేణా షెటిల్‌మెంట్ రద్దు కావడంతో ఈ భవనాన్ని ఉన్నత పాఠశాలగా మార్పు చేశారు. కాగా ఈ భవనం శిథిలావస్థకు చేరడంతో కొన్నేళ్ల నుంచి వాడుకలో లేకపోవడంతో నిర్వహణ లేక అలాగే వదిలేశారు. దీనిని మమ్మతు చేయించాలని స్థానికులు కోరినప్పటికీ పరిశీలించిన ఇంజినీరింగ్ అధికారులు ఇది పూర్తిగా పనికిరాదని, కూల్చి వేయాలని సూచించారు. ఎలాంటి నిర్ణయం తీసుకోకముందే భవనం అకస్మాత్తుగా కూలి పోయింది. కాగా.. పాఠశాల సమయం కాకపోవడంతో ఎలాంటి నష్టం జరుగలేదని చెప్పవచ్చు. ఇప్పటివరకు ఉదయం నిర్వహించే ప్రార్థనను ఈ భవనం ఎదుటే నిర్వహించేవారు. ఇకనుంచి వెనుక భాగంలో ఉన్న భవనం ఎదుట ప్రార్థన నిర్వహిస్తామని ఎంఈఓ తెలిపారు. భవనాన్ని తహసీల్దార్ వెంకటేష్, ఎంఈఓ బషీర్ అహ్మద్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు బుడ్డయ్య, పాఠశాల కమిటీ చైర్మన్ మంగమ్మ పరిశీలించారు. భవనం కూలిన విషయాన్ని డీఈఓ దృష్టికి తీసుకెళ్లినట్లు ఎంఈఓ తెలిపారు. భవనాన్ని పూర్తిగా కూల్చి వేసి ఇలాంటి నమూనాతో కొత్త భవనాన్ని నిర్మించాలని, గ్రామస్తులు, పాఠశాల పూర్వవిద్యార్థులు కోరుతున్నారు. -
క్షణికావేశం.. తీరని శోకం
● డ్రమ్స్ వివాదంలో తలకు గాయం ● చికిత్స పొందుతూ యువకుడి మృతి ● చివరికి అవయవదానం చేసి దాతృత్వం చాటుకున్న కుటుంబం ● నిమిషం కోపం.. రెండు కుటుంబాల్లో విషాదం మదనాపురం: క్షణికావేశం.. ఆలోచించే వ్యవధి ఇవ్వని క్షణికమైన కోపం ఓ పండుగ వేళ రెండు కుటుంబాల్లో తీరని శోకం నింపింది. వినాయక మండపం వద్ద పాటలకు డ్రమ్స్ వాయించే విషయంలో మొదలైన ఒక చిన్నపాటి తగవు, విచక్షణ మరచి ప్రవర్తించిన తీరుతో ఆ ఇంట్లో దీపం ఆరిపోయేలా చేసింది. కోపంలో తీసుకున్న నిర్ణయాలు, తోసివేతలు జీవితాలను ఎలా కూల్చివేస్తాయనడానికి మదనాపురం మండలం నెల్విడి తండాలో చోటు చేసుకున్న ఈ విషాదఘటనే నిదర్శనంగా నిలిచింది. అసలేం జరిగింది? స్థానిక పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. ఈనెల 17వ తేదీ రాత్రి 8:45 గంటల ప్రాంతంలో నెల్విడి తండాలో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహం వద్ద డ్రమ్స్ వాయించే విషయంలో తండాకు చెందిన నినావత్ తిరుపతినాయక్, బలరాం నాయక్ అన్నదమ్ములతో అదే తండాకు చెందిన మన్నెంనాయక్, సురేష్‌నాయక్, సోమ్లానాయక్, శివానాయక్ చిన్న గొడవకు దిగారు. పండుగ వాతావరణంలో సర్దుకుపోవాల్సిన గొడవ కాస్తా ఆవేశం పెరగడంతో పెద్దదైంది. ఈ క్రమంలో జరిగిన నెట్టివేత, దాడిలో బలరాం నాయక్ కిందపడిపోవడంతో తలకు తీవ్ర గాయమైంది. మృత్యువుతో పోరాడి.. రక్తగాయాలైన బలరాం నాయక్‌ను కుటుంబ సభ్యులు వెంటనే కొత్తకోట, ఆపై వనపర్తి ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో వైద్యుల సూచన మేరకు కర్నూలులోని కిమ్స్‌కు తరలించారు. అక్కడ కోమాలోకి వెళ్లి మృత్యువుతో పోరాడుతూ, మెద డు పనిచేయక శనివారం ఉదయం తుదిశ్వాస విడిచాడు. కంటిపాప పోయినా.. మరొకరికి వెలుగు క్షణికావేశంలో జరిగిన దాడితో తమ ఆత్మీయుడు తిరిగి రాని లోకాలకు వెళ్లాడనే తీవ్ర దుఃఖంలోనూ ఆ కుటుంబం మహోన్నత దృక్పథాన్ని చాటుకుంది. కోమాలో ఉన్న బలరాం నాయక్ అవయవాలను దానం చేసేందుకు భార్య సువర్ణ, కుటుంబ సభ్యులు అంగీకరించారు. అవయవ దాన ప్రక్రియ పూర్తిచేసిన అనంతరం మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చారు. ఆవేశం వద్దు.. ఆలోచించండి చిన్నచిన్న విషయాలకే క్షణికావేశానికి లోనై గొడవలకు దిగితే చివరకు అనుభవించేది తీరని వేదనే. ఒక్క నిమిషం కోపం ఒకరి ప్రాణాన్ని తీస్తే, మరోవైపు దాడిచేసిన వారి జీవితాలను జైలుపాలు చేస్తుంది. ప్రతిఒక్కరూ సహనంతో, ఆలోచనతో ప్రవర్తించాలని పోలీసులు సూచిస్తున్నారు. బాధితుడి భార్య సువర్ణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, ఎస్ఐ జగదీశ్వర్ దర్యాప్తు జరుపుతున్నారు. -
తల్లడిల్లిన.. తండా
నవాబుపేట: రాత్రి డప్పుల మోత.. గణనాథుడి నిమజ్జనం.. తండావాసులతో కలిసి ఆనందంగా చిందులు.. ఆ సంబురాలు తెల్లవారకముందే విషాదంగా మారాయి. వినాయక నిమజ్జనం ముగించుకుని శంషాబాద్‌కు తిరిగి వెళ్తున్న నలుగురు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో మెట్టుగడ్డ, నాగులదిన్నె తండాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. మృతుల్లో మాజీ సర్పంచ్ దంపతులు కెతావత్ జమునాబాయి (50), లింభ్యానాయక్ (55)తో పాటు మెట్టుగడ్డతండాకు చెందిన మాన్సింగ్నాయక్ (49), వసురాంనాయక్ (47) ఉన్నారు. అదే తండాకు చెందిన డ్రైవర్ ఆశోక్ (29) తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిమజ్జనం ముగించుకుని వెళ్తుండగా.. మెట్టుగడ్డతండా పంచాయతీ పరిధిలోని నాగులదిన్నె, మెట్టుగడ్డ తండాలకు చెందిన నలుగురు శంషాబాద్‌లో నివాసం ఉంటున్నారు. వినాయక నిమజ్జనం కోసం స్వగ్రామానికి వచ్చిన వారు శనివారం తెల్లవారుజామున నిమజ్జనం ముగించుకుని శంషాబాద్‌కు బయలుదేరారు. నిమజ్జనంలో అలసిపోవడంతో వాహనంలో నిద్రలోకి జారుకున్న సమయంలో శంషాబాద్ సమీపంలో ప్రమాదం చోటుచేసుకుంది. నలుగురు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన మజీ సర్పంచ్ జమునాబాయి, ఆమె భర్త లింబ్యానాయక్తో పాటు లింబ్యానాయక్ సోదరుడు మాన్సింగ్నాయక్ ప్రాణాలు కోల్పోయారు. జమునాబాయి–లింభ్యానాయక్ దంపతులకు ఇద్దరు కుమారులు వినోద్, సతీష్, కుమార్తె శాంతి ఉన్నారు. మాన్సింగ్నాయక్కు ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. మరోమృతుడు వసురాంనాయక్‌కు ముగ్గురు కుమారులు ఉన్నారు. ముగ్గురు పిల్లలు తల్లిదండ్రులిద్దరినీ కోల్పోగా.. మరో ఏడుగురు పిల్లలు తండ్రులను కోల్పోయారు. 35 ఏళ్ల క్రితం శంషాబాద్‌కు.. లింభ్యానాయక్ సుమారు 35 ఏళ్ల క్రితం చదువుల కోసం కాకుండా ఉపాధి కోసం శంషాబాద్‌కు వెళ్లారు. అక్కడ ఇటుకల తయారీ కేంద్రంలో కూలీగా జీవితం ప్రారంభించి క్రమంగా ఆర్థికంగా ఎదిగారు. రాజకీయంగా బీఆర్ఎస్లో కొనసాగిన ఆయన సేవాలాల్ జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షుడిగా, బంజారాభవన్ నిర్మాణ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. నిమజ్జనం సంబురాల నుంచి తిరిగి వెళుతుండగా.. నలుగురి దుర్మరణం మృతుల్లో మాజీ సర్పంచ్ దంపతులు ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి.. మరో కుటుంబంలో విషాదం మెట్టుగడ్డ, నాగులదిన్నె తండాల్లో విషాదం రాత్రి ఉత్సాహంగా చిందులు.. నిమజ్జనం సందర్భంగా రాత్రి వరకు తండావాసులతో కలిసి ఉత్సాహంగా గడిపిన లింభ్యానాయక్ మరుసటి రోజే విగతజీవిగా మారడం స్థానికులను కలచివేసింది. రెండు తండాల్లో మృతదేహాలను అంత్యక్రియలకు తరలించిన సమయంలో కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్తుల రోదనలు మిన్నంటాయి. సంబురాలతో కళకళలాడిన తండాలు ఒక్క రాత్రిలోనే కన్నీటి సంద్రంగా మారాయి. -
రికార్డు స్థాయిల్లో లడ్డూ వేలాలు
రూ.4లక్షలకు లడ్డు దక్కించుకున్న దంపతులు జడ్చర్ల టౌన్/తిమ్మాజిపేట: మున్సిపాలిటీలోని అశోక్‌నగర్‌లో శనివారం రాత్రి వినాయక లడ్డూ వేలం రికార్డు స్థాయిలో ధర పలికింది. రిటైర్డ్ ఎంపీడీఓ వేదవతి, రిటైర్డ్ ఉపాధ్యాయుడు గోపాల్ దంపతులు రూ.4లక్షలకు వేలం పాడారు. శ్రీవేంకటేశ్వర కాలనీలో అధికార పార్టీ నాయకుడు అనంతకిషన్ రూ.2.25లక్షలకు, పద్మావతికాలనీలో కోట్ల ప్రశాంత్‌రెడ్డి రూ.1.85లక్షలకు, తిమ్మాజిపేట మండలం నేరెళ్లపల్లిలో లడ్డూను రూ.1.12లక్షలకు కృష్ణారెడ్డి దంపతులు వేలం పాడి దక్కించుకున్నారు. -
బస్సు–టిప్పర్ ఢీ : డ్రైవర్‌కు గాయాలు
కందనూలు: జిల్లా కేంద్రంలోని బస్సు డిపో సమీపంలో శనివారం తాండూర్ నుంచి శ్రీశైలం వెళ్తున్న ఆర్టీసీ బస్సు, నాగర్ కర్నూల్ వస్తున్న ఇసుక టిప్పర్ ఎదురెదురుగా ఢీకొట్టుకున్నాయి. ప్రమాదంలో బస్సు డ్రైవర్ వెంకటయ్య కాలు విరిగి తీవ్రగాయాలు కాగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే బస్సులో 40 మంది ప్రయాణికులు ఉండగా ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపీరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో అటుగా వెళ్తున్న కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ ప్రమాద స్థలాన్ని పరిశీలించి సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుల పరిస్థితిపై ఆరా తీసి ప్రయాణికుల్లో ఎవరికై నా గాయాలయ్యాయా అనే వివరాలను అక్కడున్న అధికారులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రమాదం కారణంగా రహదారిపై ఏర్పడిన పరిస్థితులను కలెక్టర్ పరిశీలించి, వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలుగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. -
నెరవేరిన ఎన్నో ఏళ్ల రైతుల కల
● ఎమ్మెల్యేలు మధుసూదన్‌రెడ్డి, రాజేష్‌రెడ్డి ● మంగనూరు–కమాలోద్దీన్‌పూర్ 9ఆర్ కాల్వ పనులకు శంకుస్థాపన భూత్పూర్/తిమ్మాజిపేట: కేఎల్ఐ నుంచి మండలంలోని ఎల్కిచర్ల, మద్దిగట్ల, పాతమొల్గర, కప్పెటతోపాటు తిమ్మాజిపేట మండలం చేగుంట రైతుల పొలాలకు సాగునీరందించే లక్ష్యంతో చేపట్టిన కాల్వ ఎన్నో ఏళ్ల రైతుల కల నెరవేరే దిశగా కీలక అడుగు పడిందని ఎమ్మెల్యేలు మధుసూదన్‌రెడ్డి, రాజేష్‌రెడ్డి పేర్కొన్నారు. దేవరకద్ర, నాగర్‌కర్నూల్ నియోజకవర్గాలకు శివారు గ్రామమైన చేగుంట గేట్ వద్ద మంగనూరు నుంచి కమాలోద్దీన్‌పూర్ 9ఆర్ మైనర్ కాల్వ పనులకు ఎమ్మెల్యేలు శంకుస్థాపన చేశారు. భవిష్యత్ తరాలకు మేలు జరగాలనే ఆలోచనలతో భూములు ఇవ్వడానికి ముందుకొచ్చిన రైతుల సహకారం అభినందనీయమని, మరువకుండా ఎల్లప్పుడు గుర్తుంచుకుటామని ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం ద్వారా పబ్లిక్ నోటిఫికెషన్ జారీ చేసి, సంబంధిత ప్రక్రియ పూర్తయిన అనంతరమే కాల్వ పనులకు శంకుస్థాపన చేశామని పేర్కొన్నారు. కాలువ నిర్మాణం కోసం భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వ నిబంధన ప్రకారం రావాల్సిన పరిహారం రెండు నెలల్లోగా అందేలా చర్యలు తీసుకున్నామని తెలియజేశారు. దేవరకద్ర నియోజకవర్గానికి సాగునీరందించేందుకు కృషిచేసిన నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్‌రెడ్డి, మహబూబ్‌నగర్ డిప్యూటీ మేయర్ సురేందర్‌రెడ్డిని అభినందించారు. కార్యక్రమంలో మహబూబ్‌నగర్ నగర డిఫ్యూటీ మేయర్ సురేందర్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, కదిరె శేఖర్‌రెడ్డి, ఎల్కిచర్ల సర్పంచ్ రమేష్, నాయకులు సుదర్శన్‌రెడ్డి, ఎల్కిచర్ల, చేగుంట రైతులు ఉన్నారు. -
నేతల పరామర్శ
మృతుల కుటుంబాలను బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఇతర మండల నాయకులు పరామర్శించారు. మాజీ సర్పంచ్ జమునాబాయి, ఆమె భర్త లింభ్యానాయక్ అంత్యక్రియల్లో పాల్గొని నివాళులర్పించారు. మాజీ జడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, కాంగ్రెస్ నాయకులు దుశ్యంత్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, నర్సింహులు, ప్రతాప్ తదితరులు కుటుంబాలను పరామర్శించి సంతాపం తెలిపారు. నివాళులర్పిస్తున్న అర్పిస్తున్న బీఆర్ఎస్ నాయకులు -
మా నీళ్లు మాకే..
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉమ్మడి జిల్లాకు అన్యాయం చేస్తే.. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పాలమూరు రైతుల పట్ల వివక్ష చూపుతోంది. నల్లగొండ లీడర్లు చెప్పిన మాటలు విని ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారు. డిండి లిఫ్ట్ ఇరిగేషన్‌ను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోం.. పాలమూరు నీటిని తరలించే కుట్రను ఇక సహించేది లేదు.. మా నీళ్లు మాకే కావాలి. ఈ మేరకు తెలంగాణ మలిదశ ఉద్యమ స్ఫూర్తితో పోరాడుతాం.’ అని ఉమ్మడి జిల్లా పెండింగ్ ప్రాజెక్ట్‌ల సాధన జేఏసీ చైర్మన్ రాజేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. యూఎంపీపీఎస్ జేఏసీ ప్రతినిధులు శనివారం మీడియాతో కలిసి డిండి లిఫ్ట్ ఇరిగేషన్లో భాగమైన ఉల్పర నుంచి గొట్టిముక్కల రిజర్వాయర్ వరకు జరుగుతున్న పనులను సందర్శించారు. అనంతరం చారకొండ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజేందర్‌రెడ్డి మాట్లాడారు.జూరాల ప్రాజెక్ట్ నుంచి పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు నీటిని తీసుకొని ఉంటే సమస్య ఉండేది కాదన్నారు. శ్రీశైలం సోర్స్ ఆధారంగా కేసీఆర్ డిజైన్ మార్పు చేయడంతోనే సమస్య ఉత్పన్నమైందన్నారు. తొమ్మిదన్నరేళ్లు అధికారంలో ఉండి ప్రాజెక్ట్ పూర్తి చేయలేదని.. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్ట్ పట్ల నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. అంతేకాదు ఈ జిల్లాలో ఒక్క పెండింగ్ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయకుండా.. డిండి ప్రాజెక్ట్ పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టడం అన్యాయమని.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా రైతాంగానికి నష్టం వాటిల్లే డిండి లిఫ్ట్ ఇరిగేషన్‌ను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకొనేది లేదన్నారు. సొంత జిల్లాకు చెందిన సీఎం రేవంత్‌రెడ్డి దీనిపై స్పందించాలన్నారు. మంత్రి జూపల్లి స్పందించాలి: రాఘవాచారి ఏపీలోని రాయలసీమలో చేపట్టిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నిర్మాణంతో పాలమూరుకు ఎంత అన్యాయం జరిగిందో.. నల్లగొండ జిల్లా కోసం చేపడుతున్న డిండి లిఫ్ట్ వల్ల కూడా జిల్లాకు అంతే అన్యాయం జరుగుతుందని పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి తెలిపారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు సాగు నీటి రంగంలో అన్యాయం చేశారని 2023 ఎన్నికల్లో ఇక్కడి ప్రజలు బీఆర్ఎస్ను ఓడించి.. ఉమ్మడి జిల్లా నుంచి 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించారన్నారు. కానీ ఈ ఎమ్మెల్యేలు డిండిపై, పాలమూరు రైతాంగానికి కృష్ణా జలాలను అందించే విషయంలో పట్టింపులేని ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో డిండికి నీటి తరలింపుపై అడ్డుకున్నామని వివరించారు. అప్పటి నాయకుడు, ఇప్పటి మంత్రి జూపల్లి, కాంగ్రెస్ నేతలు డిండిని వ్యతిరేకిస్తూ లేఖ రాశారని గుర్తు చేశారు. ఇప్పుడు వారే నల్లగొండ లీడర్ల చేతిలో దాసోహమయ్యారని.. మీరు రాజీనామా చేస్తే ప్రభుత్వం కూలిపోతుందని.. ఈ బలం ఉన్నా ఇక్కడి రైతుల పక్షాన ఎందుకు పోరాటం చేయడం లేదని ప్రశ్నించారు. మంత్రి జూపల్లి ఇప్పటికై నా డిండి ప్రాజెక్ట్‌పై ఆయన వైఖరిని తెలియజేయాలన్నారు. 27న ఉల్పర నుంచి కల్వకుర్తికి పాదయాత్ర.. డిండి లిఫ్ట్ పనులను ఆపే వరకు తమ పోరాటం కొనసాగుతుందని.. ఈ నెల 27న యూఎంపీపీఎస్ జేఏసీ ఆధ్వర్యంలో నాగర్‌కర్నూల్ జిల్లా ఉల్పర నుంచి కల్వకుర్తికి పాదయాత్ర చేపట్టనున్నట్లు రాజేందర్‌రెడ్డి, రాఘవాచారి పిలుపునిచ్చారు. ఉదయం ఆరు గంటలకు ఉల్పరలో పాలమూరు అధ్యయన వేదిక రాష్ట్ర కన్వీనర్ హరగోపాల్ ప్రారంభిస్తారని, ఎమ్మెల్సీ కోదంరాం కూడా హాజరుకానున్నట్లు వెల్లడించారు. అదే రోజు కల్వకుర్తిలో సాయంత్రం బహిరంగసభ ఉంటుందని.. రైతులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జేఏసీ ప్రతినిధులు వీరబ్రహ్మచారి, బెక్కెం జనార్దన్, చెన్న కిష్టయ్య, బండెల రాంచంద్రారెడ్డి, సదానందంగౌడ్, లక్ష్మారెడ్డి, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పీఆర్ఎల్ఐ నుంచి డిండికి నీరు తరలించొద్దు.. ఈ లిఫ్ట్‌ను ఒప్పుకొనేది లేదు.. మలి దశ తెలంగాణ ఉద్యమస్ఫూర్తితో పోరాటం ఉమ్మడి జిల్లా పెండింగ్ ప్రాజెక్ట్‌ల సాధన జేఏసీ చైర్మన్ రాజేందర్‌రెడ్డి జేఏసీ ఆధ్వర్యంలో ఉల్పర నుంచి గొట్టిముక్కల వరకు రిజర్వాయర్ల సందర్శన -
బ్రహ్మోస్‌తో దేవరకద్ర అభివృద్ధి
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): బ్రహ్మోస్ క్షిపణి ప్రాజెక్ట్ దేవరకద్ర నియోజకవర్గానికి రావడం ఈ ప్రాంత అభివృద్ధికి కీలక మలుపు కానుందని ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి అన్నారు. శనివారం కలెక్టరేట్లో కలెక్టర్ ఖుష్బూగుప్తాతో కలిసి బసవాయిపల్లి, చౌదర్పల్లి, జినుగురాళ్ల గ్రామాల రైతులతో భూసేకరణ నెగోషియేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రాజెక్ట్‌తో పారిశ్రామిక అభివృద్ధి వేగం పుంజుకోవడంతో పాటు స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. భూములు కోల్పోతున్న రైతుల కుటుంబాలకు, ముఖ్యంగా స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధిలో ప్రాధాన్యత కల్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు. భూసేకరణకు ఎకరాకు రూ.20 లక్షల వరకు పరిహారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రైతులతో మాట్లాడి పరిహారం, భూములకు వారు ఆశిస్తున్న ధర, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, సమస్యలు, సందేహాలు, సూచనలను తెలుసుకున్నారు. ప్రాజెక్ట్ తమ ప్రాంతానికి రావడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తూ భూములు ఇచ్చేందుకు సుముఖత తెలిపారు. అయితే న్యాయమైన పరిహారం అందించాలని కోరారు. భూముల్లోని బోర్లు, చెట్లు, షెడ్లు, కాంపౌండ్ గోడలు, ఇతర నిర్మాణాలకు నిబంధనల ప్రకారం అదనపు పరిహారం అందిస్తామన్నారు. అన్ని అంశాలను పరిశీలిస్తాం: కలెక్టర్ ఖుష్బూ గుప్తా రైతులకు అన్ని విధాలా న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఖుష్బూగుప్తా తెలిపారు. మార్కెట్ విలువకు అదనంగా పరిహారం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఇప్పటికే 75 శాతం మంది రైతులు సమ్మతి తెలిపారని చెప్పారు. ప్రభుత్వం ప్రతిపాదించిన పరిహారం, భూసేకరణ చట్టం ప్రకారం లభించే పరిహారం, ఇతర ప్రాంతాల్లో అమలైన పరిహారాలను పరిశీలించి రైతులు నిర్ణయం తీసుకోవాలని సూచించారు. న్యాయపరమైన ప్రక్రియకు వెళితే సమయం పట్టే అవకాశం ఉన్నందున అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని భూసేకరణకు సహకరించాలని కోరారు. ప్రాజెక్ట్‌తో పారిశ్రామిక, ఆర్థిక అభివృద్ధితోపాటు స్థానికంగా ఉద్యోగ, ఉపాధి, విద్యా అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు.రెవెన్యూ అదనపు కలెక్టర్ జేఎల్బీ హరిప్రియ, ఆర్డీఓ నవీన్, ఇతర అధికారులు, సర్పంచులు, రైతులు పాల్గొన్నారు. భూములిచ్చే రైతులందరికీ న్యాయమైన పరిహారం ఎకరాకు రూ.20 లక్షల వరకు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధం 75 శాతం మంది రైతుల సమ్మతి.. మిగిలినవారితో చర్చలు -
కబడ్డీ.. కబడ్డీ..
ఇండోర్ స్టేడియంలోని కబడ్డీ అకాడమీలో మ్యాట్‌పై ప్రాక్టీస్ చేస్తున్న క్రీడాకారులు రైడింగ్.. డిఫెండింగ్పై ఫోకస్ కబడ్డీలో కీలకమైన రైడింగ్, డిఫెండింగ్తోపాటు లెఫ్ట్ కార్నర్, రైట్ కార్నర్ విభాగాల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. మ్యాచ్ పరిస్థితులను అంచనా వేసి నిర్ణయాలు తీసుకోవడం, ప్రత్యర్థి వ్యూహాలను ఎదుర్కోవడం, వేగం–సమన్వయాన్ని పెంచేలా సాధన చేయిస్తున్నారు. శారీరక దారుఢ్యంతోపాటు ఆటలో మెళకువలను మెరుగుపర్చేలా శిక్షణ సాగుతోంది. -
ఏషియన్ గేమ్స్‌లో ఆడాలన్నదే టార్గెట్
మూడేళ్లుగా కబడ్డీ ఆడుతున్నా. సబ్ జూనియర్ రాష్ట్రస్థాయి టోర్నీలో పాల్గొన్నా. మా జిల్లా కబడ్డీ సంఘం కార్యదర్శి సూచనతో అకాడమీ ఎంపికలకు హాజరయ్యా. ఇక్కడికి ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. జాతీయస్థాయి పోటీల్లో రాణించడంతోపాటు తెలంగాణ తరఫున ఏషియన్ గేమ్స్‌లో ఆడాలన్నదే నా లక్ష్యం. – ఉమేష్కుమార్రెడ్డి, ఖమ్మంఆల్రౌండర్గా మెరుగవ్వాలి అకాడమీలో డిఫెండర్, ఆల్‌రౌండర్‌గా శిక్షణ తీసుకుంటున్నా. గతేడాది హర్యానాలోని సోనిపట్‌లో జరిగిన సబ్ జూనియర్ జాతీయస్థాయి కబడ్డీ పోటీల్లో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించా. మూడు సబ్ జూనియర్, ఒక జూనియర్, ఒక సీనియర్ అంతర్జిల్లా రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లాకు ప్రాతినిధ్యం వహించా. భవిష్యత్తులో భారత జట్టులో చోటు దక్కించుకోవడమే నా లక్ష్యం. – గౌతమ్, మహబూబ్‌నగర్ టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తా ఏడేళ్లుగా కబడ్డీ ఆడుతున్నా. సబ్ జూనియర్ రెండు, జూనియర్ ఒకటి, సీనియర్ అంతర్జిల్లా రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నా. ప్రస్తుతం రైడర్‌గా శిక్షణ తీసుకుంటున్నా. భవిష్యత్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడమే నా లక్ష్యం. – లోకేష్, ఆదిలాబాద్ ● -
నిమజ్జనం సందడి
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ/జడ్చర్ల: జిల్లాలో పలు ప్రాంతాల్లో గణపతి నిమజ్జనాలు ప్రారంభమయ్యాయి. శనివారం నగరంలోని భూత్పూర్ రోడ్‌లోని ముడా కార్యాలయం సమీపంలో ఉన్న బేబీ పాండ్, అప్పన్నపల్లిలోని గంగోస్కుంట వద్ద ఉన్న రెండు బేబీ పాండ్లలో చిన్నచిన్న విగ్రహాలను నిమజ్జనం చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవపై జడ్చర్లలో నాగసాల చెరువులో పలు గణనాథులను నిమజ్జనం చేశారు. భక్తుల కోలాటాలు, భజనలు, టపాకుల మోతతో శోభాయాత్ర కొనసాగింది. జడ్చర్ల నాగసాల చెరువులో గణనాథుడి నిమజ్జనం -
రాష్ట్ర.. జాతీయస్థాయే లక్ష్యం
అకాడమీలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులను భవిష్యత్‌లో జూనియర్, సీనియర్ విభాగాల పోటీలతోపాటు ఎస్జీఎఫ్ రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలకు సన్నద్ధం చేయనున్నారు. ప్రతిభ ఉన్న క్రీడాకారులను గుర్తించి వారికి నిరంతర శిక్షణ అందించడం ద్వారా రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణించేలా తీర్చిదిద్దడమే అకాడమీ లక్ష్యంగా ఉంది. దీంతో పాలమూరు క్రీడా రంగంలో కబడ్డీకి కొత్త ఊపు వస్తుందని క్రీడాభిమానులు ఆశిస్తున్నారు. ●అకాడమీ ప్రత్యేకతలు రాష్ట్రంలో తొలి బాలుర కబడ్డీ అకాడమీ ప్రస్తుతం 20 మంది క్రీడాకారులు ఉమ్మడి జిల్లా నుంచి ఆరుగురు రోజుకు రెండు పూటలా శిక్షణ మ్యాట్, క్లే కోర్టుల్లో సాధన రైడింగ్, డిఫెండింగ్పై ప్రత్యేక దృష్టి ఎస్జీఎఫ్ రాష్ట్ర, జాతీయ పోటీలే లక్ష్యం -
లెఫ్ట్ కార్నర్‌గా రాణించాలి
రెండేళ్లుగా కబడ్డీ ఆడుతున్నా. గతంలో సీఎం కప్ పోటీల్లో పాల్గొన్నా. ప్రస్తుతం లెఫ్ట్ కార్నర్, రైట్ రైడర్‌గా శిక్షణ తీసుకుంటున్నా. అకాడమీలో శిక్షణ బాగుంది. ఆటలోని మెళకువలు నేర్చుకుంటున్నా. నిరంతరం సాధన చేసి భవిష్యత్తులో భా రత జట్టుకు ఆడాలనుకుంటున్నా. – వి.సచిన్, మహబూబ్‌నగర్ పీకేఎల్ స్థాయికి ఎదగాలని ఉంది చిన్నప్పటి నుంచే కబడ్డీ అంటే ఇష్టం. మూడేళ్లుగా ఆడుతున్నా. రెండుసార్లు అంతర్జిల్లా రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో జిల్లాకు ప్రాతినిధ్యం వహించా. అకాడమీకి ఎంపిక కావడం ఆనందంగా ఉంది. భవిష్యత్తులో ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో ఆడటంతోపాటు భారత జట్టుకు ఎంపిక కావాలన్నదే నా లక్ష్యం. – శివశంకర్, మహబూబ్‌నగర్ -
బీరం హర్షవర్ధన్‌రెడ్డి పితృవియోగం
● అనారోగ్యంతో కన్నుమూసిన తండ్రి లక్ష్మారెడ్డి ● దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్‌కు సన్నిహితుడిగా గుర్తింపు ● పరామర్శించిన మంత్రి జూపల్లి, మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ● పాడెమోసిన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు కొల్లాపూర్: కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డికి పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి బీరం లక్ష్మారెడ్డి(79) గురువారం రాత్రి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. లక్ష్మారెడ్డికి కుమారుడు హర్షవర్ధన్‌రెడ్డి, ఇద్దరు కుమార్తెలు. లక్ష్మారెడ్డికి సుధీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ఆయన సింగోటం గ్రామానికి రెండుసార్లు సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. మాచినేనిపల్లి సింగిల్‌విండో చైర్మన్‌గా ఎన్నికై డీసీసీబీ డైరెక్టర్‌గా పనిచేశారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కు సన్నిహితుడిగా పేరుంది. 1983లో కొల్లాపూర్ అసెంబ్లీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా లక్ష్మారెడ్డి పేరును ఎన్టీఆర్ ఖరారు చేశారు. అయితే పలు కారణాలతో పోటీ చేయలేకపోయారు. తాను ఎమ్మెల్యే కాలేకపోయానని, తన కుమారుడినైనా ఎమ్మెల్యేగా చూడాలని ఆయన పరితపించేవారు. హర్షవర్ధన్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలవడంతో లక్ష్మారెడ్డి క్రియాశీలకంగా వ్యవహరించారు. స్వగ్రామంలో అంత్యక్రియలు హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచిన లక్ష్మారెడ్డి మృతదేహాన్ని శుక్రవారం ఉదయం కొల్లాపూర్‌లోని ఆయన నివాసానికి తీసుకొచ్చారు. సంప్రదాయబద్ధంగా అంతిమ సంస్కార కార్యక్రమాలు నిర్వహించాక ఊరేగింపుగా ఆయన మృతదేహాన్ని సింగోటం గ్రామానికి తీసుకెళ్లారు. అక్కడ కూడా గ్రామంలోని ప్రధాన వీధులగుండా ఊరేగించాక ఆయన సొంతతోటలో దహన సంస్కారాలు చేశారు. హర్షవర్ధన్‌రెడ్డి తలకొరివి పెట్టారు. అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు పాడెను మోశారు. నేతల పరామార్శ లక్ష్మారెడ్డి మృతదేహానికి రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్ధన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పూలమాలలు వేసి సంతాపం ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే బీరంను పరామర్శించారు. అదేవిధంగా రంగినేని అభిలాష్ రావు, వాల్యానాయక్, శ్రీనివాస్‌యాదవ్, విజయ్, ఆంజనేయులుగౌడ్, కాంగ్రెస్ నాయకులు డాక్టర్.పగిడాల శ్రీనివాసరెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి ఫయాజ్, సీపీఎం నాయకులు జబ్బార్,శివవర్మ, బీజేపీ నాయకులు శ్రీనివాస్‌యాదవ్, కేతూరి నారాయణ తోపాటు పలువురు బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు లక్ష్మారెడ్డి మృతదేహానికి పూలమాల వేసి సంతాపం తెలిపారు. నేడు సింగోటంకు కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం సింగోటం రానున్నారు. కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి తండ్రి అంత్యక్రియలకు శుక్రవారం కేటీఆర్ రావాలని భావించారు. హైదరాబాద్‌లో ఓ కోర్టు కేసు కారణంగా హాజరుకాలేకపోయారు. శనివారం హర్షవర్ధన్‌రెడ్డిని పరామర్శించేందుకు వస్తారని నాయకులు వెల్లడించారు. లక్ష్మారెడ్డి (ఫైల్) -
టీసీఏకు బీసీసీఐ గుర్తింపు ఇవ్వాలి
మహబూబ్‌నగర్ క్రీడలు: తెలంగాణ క్రికెట్ అసోసియేషన్‌కు బీసీసీఐ గుర్తింపు ఇవ్వాలని జిల్లాకు చెందిన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ మాజీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి ముంబైలోని ప్రధాన కార్యాలయంలో శుక్రవారం బోర్డు అధ్యక్షుడు మిథున్ మన్హాస్, కార్యదర్శి దేవాజిత్ సైకియా, ఉపాధ్యక్షులు రాజీవ్ శుక్లాను కలిసి వినతిపత్రాలు అందజేశారు. గుర్తింపు అంశంపై బీసీసీఐ ఏజీఎంలో చర్చించి తగు నిర్ణయం తీసుకోవాలని విన్నవించారు. పది లక్షలలోపు జనాభా ఉన్న పుదుచ్చేరి, అండమాన్లకు సైతం బీసీసీఐ అసోసియేట్ గుర్తింపు ఇచ్చి దేశవాళి టోర్నీల్లో పాల్గొనే అవకాశం కల్పించినట్లు తెలిపారు. 2.5 కోట్ల జనాభా ఉన్న గ్రామీణ తెలంగాణకు అదే తరహాలో గుర్తింపు అందించి ప్రతిభావంతులైన తెలంగాణ క్రికెటర్లు దేశవాళీ తద్వారా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లాకు చెందిన సయ్యద్ నవాజ్‌షా, ఎండి.రియాజుద్దీన్, శ్రీనివాస్‌రెడ్డి, జగన్నాథ్‌రెడ్డి ఉన్నారు. -
బీసీ హక్కుల సాధనకు ఐక్యపోరాటం
● ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు గద్వాల: బీసీ హక్కుల సాధన కోసం ప్రతిఒక్కరు కలిసివచ్చి ఐక్యపోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతురావు అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలో బీసీ సింహగర్జన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. బీసీ సమాజాన్ని చైతన్యపర్చి హక్కుల సాధన దిశగా ముందుకు నడిపించే ఉద్యమానికి ఈ వేదికగా నిలిచిందన్నారు. దేశంలో బీసీల జనాభా గణనీయంగా ఉన్నప్పటికీ జనాభా నిష్పత్తికి అనుగుణంగా అవకాశాలు అందాలనే డిమాండ్‌ను ప్రజాస్వామ్య పద్ధతిలో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. 42 శాతం రిజర్వేషన్ల డిమాండ్ సహా బీసీల హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలన్నారు. చైతన్యమే బీసీల బలం అని, బీసీ సమాజం హక్కుల గురించి ప్రశ్నించే స్థాయి నుంచి వాటి సాధన కోసం సంఘటితంగా కృషి చేసే దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. డీసీసీ అధ్యక్షుడు రాజీవ్‌రెడ్డి మాట్లాడుతూ పిల్లలకు నాణ్యమైన విద్య, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మహిళలకు ఆర్థిక సాధికారత బీసీ వృత్తులకు ప్రోత్సాహం జనాభా నిష్పత్తికి అనుగుణంగా రాజకీయ ప్రాతినిథ్యం ఇవన్నీ సాధించాలంటే బీసీలలో ఐక్యత అవసరమన్నారు. అనంతరం పాతబస్టాండు నుంచి కృష్ణవేణి చౌరస్తా మీదుగా అంబేడ్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ పూలే, అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్‌కు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో ఏఐసీసీ ఓబీసీ రుద్రసంతోష్, టీపీసీసీ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్‌గౌడ్, మహబూబ్‌నగర్ డీసీసీ అధ్యక్షుడు సంజీవ్, నాయకులు రాజేంద్రప్రసాద్‌యాదవ్, గట్టు తిమ్మప్ప, మల్లయ్య, ధనలక్ష్మి, జయలక్ష్మి, శ్రీనివాస్, శంకర్, హనుమంతు, శ్రీనివాసులు, రామేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. -
పంపింగ్ పనులు వేగవంతం చేయాలి
● సున్నపుతండా వద్ద ‘మిషన్ భగీరథ’పనులను పరిశీలించిన మంత్రి జూపల్లి కొల్లాపూర్ రూరల్: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులోని నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి మిషన్ భగీరథకు తాగునీటిని తరలించేందుకు కొల్లాపూర్ మండలం సున్నపుతండా సమీపంలో చేపడుతున్న పంపింగ్ పనులను మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం పరిశీలించారు. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం కేఎల్ఐ రిజర్వాయర్ నుంచి మిషన్ భగీరథకు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. అయితే నీటి ప్రవాహం తగ్గడంతో రిజర్వాయర్లలో నీటి లభ్యత తగ్గుతున్న నేపథ్యంలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులోని రిజర్వాయర్ నుంచి మిషన్ భగీరథకు నీటిని తరలించేందుకు సున్నపుతండా సమీపంలోని పాలమూరు ప్రధాన కాలువ వద్ద సుమారు రూ.200 కోట్లతో పంపింగ్ పనులు చేపడుతున్నారు. పనుల పురోగతిని మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. తాగునీరు, సాగునీటికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పనులు పూర్తిచేయాలని సూచించారు. ఎక్కడైనా పనులకు అడ్డంకులు ఉంటే వాటిని వెంటనే పరిష్కరించాలని ఇరిగేషన్, మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఈఈ అమర్‌సింగ్, అధికారులు పాల్గొన్నారు. -
బొట్టుపెట్టి పురుగును నివారిద్దాం
● తక్కువ ఖర్చుతో పత్తిలో రసం పీల్చే పురుగు నియంత్రణ ● అలంపూర్ మండల వ్యవసాయ శాఖ అధికారి నాగార్జునరెడ్డి అలంపూర్: బీటీ పత్తి పంటలో రసం పీల్చే పురుగులు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తాయి. అన్నీ ప్రైవేటు కంపెనీలు విత్తన శుద్ధి చేస్తారు. విత్తన శుద్ధి వల్ల మొదటి 20రోజుల వరకు పత్తి మొక్కలకు రసం పీల్చే పురుగులను తట్టుకోనే శక్తి ఉంటుంది. ఆ తర్వాత వాటికి వివిధ ఖరీదైన మందులు పిచికారీ చేసే బదులు తక్కువ ఖర్చుతో కాండానికి మందు పూసి లేదా బొట్టు పెట్టి పురుగులను నియంత్రించవచ్చునని మండల వ్యవసాయ శాఖ అధికారి నాగార్జునరెడ్డి తెలిపారు. బొట్టు పద్ధతి వల్ల లాభాలు పెట్టుబడి తగ్గుతుంది. మిత్ర పురుగులు చనిపోకుండా ఉంటాయి. పర్యావరణ కాలుష్య తగ్గుతుంది. రసం పీల్చే పురుగులను బాగా నియంత్రించవచ్చు. పెట్టుబడిలో పురుగు మందుల ఖర్చు తక్కువగా ఉంటుంది. బొట్టు పద్ధతి విధానం ఒకవంతు మోనోక్రోటోపాస్ మందు తీసుకోని దానికి నాలుగు వంతుల నీరు కలుపుకోవాలి. ఉదాహరణకు 100 మి.లీ మోనోక్రోటోపాస్ మందు తీసుకుంటే 400 మి.లీ నీరు కలపాలి. ఈ మందు మిశ్రమాన్ని వేపపుల్లతో లేదా కాండానికి మందు పెట్టే బ్రష్‌తో (మార్కెట్లో లభిస్తోంది) మొక్క కాండంపై ఎరుపు రంగుపైన లేత ఆకుపచ్చగా ఉన్న కాండంపై పూతగా బొట్టు పెట్టాలి. ఇలా 20రోజుల వ్యవధిలో రెండుసార్లు చేస్తే పత్తి పంటను 60రోజుల వరకు ఎలాంటి పురుగు మందులు పిచికారీ చేయకుండానే కాపాడుకోవచ్చు. నాటిన 20, 40, 60రోజులకు ఒకసారి ఈ పద్ధతి పాటించాలి. అవసరాన్ని బట్టి వేప కషాయం 5శాతం లేదా వేపనూనె (1500పీపీఎం) మందును లీటర్ నీటికి 5మిల్లీ లీటర్లు కలిపి సాయంత్రం సమయాల్లో పంటపై పిచికారీ చేస్తే రసం పీల్చే పురుగులను ఆరికట్టవచ్చు. ఈ రెండు విధానాలను పాటించడం వల్ల కీడు చేసే పురుగులు నశించి మేలు చేసే మిత్ర పురుగులు బతికి ఉంటాయి. తక్కువ పెట్టుబడితో నాణ్యమైన పంట చేతికి వస్తోంది. పాడి–పంట -
‘ఖిల్లా’ విద్యార్థికి బంగారు పతకం
ఖిల్లాఘనపురం: జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ఖిల్లాఘనపు రం మండలంలోని ప ర్వతాపురం గ్రామాని కి చెందిన కదిరె ఉద య్‌కిరణ్ బంగారు పతకం సాధించాడు. పాండిచ్చేరిలో శుక్రవారం నిర్వహించిన 37వ సౌత్‌జోన్ జూనియర్ చాంపియన్‌షిప్–2026 అండర్–18 విభాగంలో తెలంగాణ రాష్ట్రం నుంచి పాల్గొన్న ఉదయ్‌కిరణ్ లాంగ్‌జంప్‌లో 6.86 మీటర్ల దూరం జంప్‌చేసి బంగారు పతకాన్ని సాధించాడు. బీచుపల్లి హుండీ ఆదాయం రూ.39 లక్షలు ఇటిక్యాల: ఉమ్మడి ఇటిక్యాల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బీచుపల్లి ఆంజనేయస్వామి దేవస్థానం 205 రోజుల హుండీని శుక్రవారం విజయరాయ కల్యాణ మండపంలో దేవాదాయశాఖ డివిజన్ పరిశీలకురాలు వెంకటేశ్వరి, ఆలయ ఈఓ పురేందర్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గద్వాల శాఖ సిబ్బంది, మహిళా సేవా సమితి సభ్యుల సమక్షంలో చెల్లించారు. ఇందులో భాగంగా నోట్ల రూపంలో రూ.37,19,705, నాణేల రూపంలో రూ.2,65,461 కలిపి మొత్తం రూ.39,85,166 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. అదే విధంగా 1.680 కిలోల మిశ్రమ వెండి సమకూరిందన్నారు. కుమార్తెను చూసేందుకు వెళ్తూ తండ్రి దుర్మరణం వెల్దండ: గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన కొట్రగేట్ వద్ద ఉన్న పెట్రోల్‌బంక్ సమీపంలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దకొత్తపల్లి మండలంలోని దేవల్‌తిర్మలాపూర్ గ్రామానికి చెందిన మిద్దె చిన్న నరసింహ (58) గురువారం రంగారెడ్డి జిల్లా కందుకూర్లో ఉన్న కుమార్తె వద్దకు వెళ్తున్నానని ఇంటి నుంచి బయలుదేరాడు. కల్వకుర్తిలో బస్సుదిగిన ఆయన దారి మరిచిపోవడంతో కాలినడకను హైదరాబాద్ రోడ్డులో నడుచుకుంటూ వెళ్లి ఉండవచ్చన్నారు. కొట్రగేట్ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు మృతదేహాన్ని కల్వకుర్తి ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం వారి వద్ద ఉన్న ఆధారాలతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడి కుమారుడు కురుమయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ యుగంధర్‌రెడ్డి తెలిపారు. విద్యుదాఘాతంతో యువకుడి మృతి కల్వకుర్తి టౌన్: విద్యుదాఘాతంతో యువకుడు మృతిచెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు, ప్రత్యక్షసాక్షులు తెలిపిన వివరాలా ప్రకారం మండలంలోని తర్నికల్ గ్రామానికి చెందిన అరవింద్(25) పట్టణంలోని గచ్చుబావి రోడ్డులో హెయిర్ కటింగ్ షాప్ నిర్వహిస్తున్నాడు. దుకాణాన్ని మూసివేసి పట్టణంలోని గాంధీనగర్ కాలనీలో స్నేహితులు ప్రతిష్టించిన వినాయక మండపం వద్దకు వచ్చాడు. మండపం పక్కనే ఉన్న మైసమ్మ దేవాలయం వద్ద విద్యుత్ తీగలు రోడ్డుపై పడి ఉండటాన్ని గుర్తించి, వాటిని పక్కకు తీసేందుకు పట్టుకోగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. గమనించిన అతని స్నేహితులు, స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అతనిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందాడని నిర్ధారించారు. మరికొన్ని రోజులలో తన సోదరి వివాహం నిశ్చయం కావటం, కుటుంబానికి తోడుగా ఉంటాడని అనుకున్న కొడుకు మృతిచెందటంతో ఆ కుటుంబంలో విషాద ఛాయ లు అలుముకున్నాయి. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కల్వకుర్తి ప్రభుత్వాసుపత్రి మార్చురీలో ఉంచారు. ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. యువకుడికి తీవ్రగాయాలు మదనాపురం: ఇరువర్గాల ఘర్షణలో యువకుడికి తీవ్రగాయాలైన ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్ఐ జగదీశ్వర్ తెలిపిన వివరల ప్రకారం మండలంలోని నెల్విడి తండాలో ఏర్పాటు చేసిన వినాయక మండపం ఎదుట గురువారం డ్రమ్స్ కొట్టే విషయంలో తండాకు చెందిన నినావత్ తిరుపతి నాయక్, బలరాం నాయక్ అన్నదమ్ములతో అదే తండాకు చెందిన మన్నెం నాయక్, సురేష్ నాయక్, సోమ్లా నాయక్, శివా నాయక్, గొడవకు దిగారు. ఇరు వర్గాల మధ్య మాటమాట పెరిగి బలరాం నాయక్‌ను బలంగా తోసేయడం తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం కొత్తకోట తరలించగా అక్రడి నుంచి వనపర్తి ఆస్పత్రికి తరలించారు. పరిస్థి తి విషమించడంతో వైద్యుల సూచన మేరకు కర్నూలులోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. బాధితుడి భార్య సువర్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు తెలిపారు. -
కృష్ణమ్మ ఒడిలోకి గణనాథులు
● బీచుపల్లికి భారీగా తరలివచ్చిన విగ్రహాలు ఇటిక్యాల: గణేశ్ ఉత్సవాల్లో భాగంగా ఐదురోజులపాటు విశిష్ట పూజలు అందుకున్న గణనాథులను శోభాయాత్రగా తరలించి బీచుపల్లి వద్ద కృష్ణానదిలో నిమజ్జనం చేశారు. శుక్రవారం ఐదోరోజు కావడంతో నిమజ్జనం కోసం వివిధ ప్రాంతాల నుంచి గణనాథులను బీచుపల్లి వద్దకు తీసుకువచ్చారు. ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్రేన్ల సహాయంతో అర్ధరాత్రి నుంచి శనివారం ఉదయం వరకు దాదాపు 100 గణనాథులను కృష్ణానదిలో నిమజ్జనం చేశారు. నిమజ్జనం ప్రాంతాన్ని సీఐ ప్రదీప్‌కుమార్ సందర్శించి పలు సూచనలు చేశారు. బీచుపల్లి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌జాం కాకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సిబ్బందితో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని ఇటిక్యాల ఎస్ఐ రవినాయక్‌కు గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు సూచించారు. -
విద్యార్థుల్లో సామాజిక బాధ్యత పెరుగుతుంది
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ (పీయూ) ముందు హైవేపై ఏర్పడిన గుంతలను ఎంఎస్‌డబ్ల్యూ విద్యార్థులు శ్రమదానంతో పూడ్చారు. గత కొన్ని రోజులుగా గుంతల కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడుతుండటంతో సమీపంలోని మట్టిని గంపలతో తీసుకొచ్చి గుంతల్లో పోశారు. ఈ సందర్భంగా అధ్యాపకులు గాలెన్న మాట్లాడుతూ విద్యార్థులు సామాజిక సేవలో భాగస్వాములు కావడం ద్వారా సామాజిక బాధ్యత, రోడ్డు భద్రతపై అవగాహన పెరుగుతుందని తెలిపారు. శ్రమదానంలో విద్యార్థులు భరత్‌బాబు, బుగ్గేష్, ఆంజనేయులు, పవన్, యాదగిరి, ఉదయ్, మహే ష్, రాణాప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. పీయూలో ప్రజాపాలన వేడుకలు పాలమూరు యూనివర్సిటీలో ప్రజాపాలన వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం వీసీ శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ సాధన కోసం ఎందరో చేసిన త్యాగాలను నేటితరం యువత గుర్తుంచుకోవాలన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో యువత, విద్యావేత్తలు తమవంతు పాత్ర పోషించాలని సూచించారు. పీయూ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్‌బాబు, ఆడిట్‌సెల్ డైరెక్టర్ చంద్రకిరణ్, ఓఎస్డీ మధుసూదన్‌రెడ్డి, కంట్రోలర్ ప్రవీణ, ప్రిన్సిపాళ్లు కరుణాకర్‌రెడ్డి, భూమయ్య, ఈశ్వర్‌కుమార్, పీడీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి స్టేషన్ మహబూబ్‌నగర్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో ప్రపంచంలో అభివృద్ధిలో భారతదేశం ముందుకు పోతున్నదని అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సీమ నరేందర్ అన్నారు. నరేంద్రమోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని, ఆయన 25 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం విజయవంతంగా కొనసాగుతున్న సందర్భంగా గురువారం జిల్లా కేంద్రంలోని అమావాస్య అన్నదాన మండపం వద్ద జ్యోతి వెలిగించారు. రాష్ట్ర అధ్యక్షుడు సీమ నరేందర్ మాట్లాడుతూ నరేంద్రమోదీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించి దేశాన్ని మరింత అభివృద్ధి చేయాలని కోరుతూ జ్యోతి వెలిగించి ఆ దేవుడిని ప్రార్థించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో నగర అధ్యక్షులు నర్సింహరావు, అన్నదాన కమిటీ అధ్యక్షులు రఘురాంగౌడ్, మహిళా అధ్యక్షురాలు గీత, బాలప్రసాద్, శ్రీను, దశరథ్, కొండల్ పాల్గొన్నారు. అనుమానాస్పద స్థితిలో వృద్ధుడు మృతి అచ్చంపేట రూరల్: అనుమానస్పదంగా ఓ వృద్ధుడు మృతి చెందిన ఘటన గురువారం మండలంలోని సింగారంలో చోటు చేసుకుంది. సిద్దాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన బొడ్డుపల్లి బాల్నారి(63) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సా గిస్తున్నాడు. బాల్నారికి ఇద్దరు భార్యలు ఉన్నా రని పేర్కొన్నారు. మొదటి భార్య సాయిలమ్మ, కుమారుడు వెంకటయ్య, కోడలు, కుమార్తెలు బాలమ్మ, సైదమ్మ ఉన్నారు. రెండో భార్య కృష్ణమ్మ ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. కొన్నేళ్ల నుంచి ఆస్తి విషయంలో కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి. రెండో భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిద్దాపూర్ పోలీస్‌స్టేషన్ హెచ్‌సీ గౌతమ్ తెలిపారు. -
జింక్ బియ్యంతో పోషకాహార రక్షణ
● అంగన్వాడీ టీచర్లకు అవగాహన కార్యక్రమం మదనాపురం: చిన్నారుల్లో సూక్ష్మపోషకాల లోపాన్ని నివారించి, వారిలో రోగ నిరోధక శక్తిని పెంచేందుకు బయోఫోర్టిఫైడ్ (జీవ రసాయన పోషకాలు పెంచిన) వరి రకాలు ఎంతగానో దోహదపడతా యని వ్యవసాయ శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. పోష ణ్ మాహ్ (పోషకాహార మాసం)ను పురస్కరించుకొని కృషి విజ్ఞాన కేంద్రం మదనాపురం, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ హైదరాబాద్ సంయుక్త నిర్వహణలో జింక్ సమృద్ధిగా ఉండే డీఆర్ఆర్, డీహెచ్ఏఎన్ 48, డీఆర్ఆర్, డీహెచ్ఏఎన్ 63 వరి రకాలపై అవగాహన, బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఫామ్ టు ఫుడ్ విధానమే మార్గం.. సీనీయర్ శాస్త్రవేత్త రాజేంద్రకుమార్ మాట్లాడుతూ.. రైతుస్థాయిలో నాణ్యమైన పోషకాలు కలిగిన పంటలను పండించి, వాటిని నేరుగా ఆహారంలో భాగంగా మార్చే విధానం అత్యంత ప్రాధాన్యమైందని తెలిపారు. వ్యవసాయం, ఆహారం, పోషకాహార భద్రతల మధ్య బలమైన అనుసంధానం ఏర్పడినప్పుడే వికసిత భారత్ సాధ్యమవుతుందని, అంగన్వాడీ కేంద్రాల ద్వారా తల్లుల్లో పోషకాహార చైతన్యాన్ని పెంచాలని కోరారు. 90 రోజుల పైలెట్ ప్రాజెక్ట్.. హోమ్ సైన్‌న్స్ నిపుణురాలు డాక్టర్ అనిత మాట్లాడుతూ.. జిల్లాలోని 18 ఎంపిక చేసిన అంగన్వాడీ కేంద్రాల ద్వారా దాదాపు 200 మంది ప్రీ స్కూల్ చిన్నారులకు 90 రోజుల పాటు రోజువారీ ఆహారంలో జింక్ బియ్యాన్ని అందించనున్నట్లు వెల్లడించారు. దీని వల్ల పిల్లల్లో సూక్ష్మ పోషకాహార లోపాలు తొలగి, శారీరక పెరుగుదల మెరుగుపడుతుందన్నారు. శాస్త్రవేత్తల బృందం (డా.సాయిప్రసాద్, డా. నీరజ, డా.అమ్తుల్వారిస్, డా.అరవింద్ కుమార్, డా.జ్యోతిబద్రి) మా ట్లాడుతూ.. శరీరంలో సాధారణ ఎదుగుదల, మానసిక వికాసం, వ్యాధి నిరోఽ దక శక్తి పెంపొందడానికి జింక్ అత్యంత కీలకమైన సూక్ష్మపోషకమని వివరించారు. సాధా రణ బియ్యంలో కంటే బయోఫోర్టిఫైడ్ రకాల్లో జింక్ శాతాన్ని శాసీ్త్రయంగా పెంచామని, రోజు వారీ సమతుల్య ఆహారంతో వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన సమాజం తయారవుతుందని పేర్కొన్నారు. అనంతరం 18 అంగన్వాడీ కేంద్రాలకు ఉచితంగా జింక్ బియ్యం బస్తాలను అధికారులకు అందజేశారు. కార్యక్రమంలో వన పర్తి జిల్లా సంక్షేమ అధికారిణి సుధారాణి, సీడీపీఓలు షేక్ సన్హేరా, రాజ్యలక్ష్మి, అమృతమ్మ, కేవీకే విస్తరణ అధికారులు, నిపుణురాలు డా. భవాని, అంగన్వాడీ టీచర్లు, తల్లులు పాల్గొన్నారు. -
అత్యవసరమైతే అవస్థలే!
జనరల్ ఆస్పత్రిలో సరిపడా పడకలు లేక వైద్యం కోసం ఎదురుచూస్తున్న రోగులు ‘గద్వాల జిల్లాకు చెందిన బుడ్డమ్మ తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో అక్కడి నుంచి ప్రైవేట్ అంబులెన్స్‌లో గురువారం జిల్లా జనరల్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. కానీ మెరుగైన చికిత్స పేరుతో స్థానిక వైద్యులు గాంధీ ఆస్పత్రికి రెఫర్ చేశారు. నిరుపేదలు అయిన బాధితులు గద్వాల నుంచి మహబూబ్‌నగర్‌కు రావడానికి రూ.3 వేలు, ఇక్కడి నుంచి హైదరాబాద్ చేరుకోవడానికి మరో రూ.3,500 అంబులెన్స్ కోసం ఖర్చు చేయాల్సి వచ్చింది.దేవరకద్ర మండల కేంద్రానికి చెందిన ఒక రైతుకు ఇటీవల పాముకాటుకు గురై చికిత్స కోసం జనరల్ ఆస్పత్రికి వచ్చారు. పరిస్థితి విష మంగా ఉండటంతో అత్యవసర సేవలు అందించాల్సి వచ్చింది. ఐసీయూ విభాగానికి తరలించడానికి కుటుంబ సభ్యులు ప్రయత్నం చేయగా అక్కడ బెడ్లు ఖాళీ లేకపోవడంతో తప్పని పరిస్థితిలో ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లారు. ప్రస్తుతం ఐసీయూలో ఉన్న 30 పడకలకు 30 వెంటిలేటర్స్ అమర్చాం. అత్యవసర వైద్యానికి రోగుల సంఖ్య అధికంగా పెరిగింది. పడకలు ఏర్పాటు చేయడానికి ఉన్న వెంటిలేటర్స్ అందుబాటులో లేవు. కరోనా సమయంలో వచ్చిన వెంటిలేటర్స్ పని చేయడం లేదు. కొత్త భవనంలో 100 పడకల ఐసీయూ విభాగం ఏర్పాటు చేశాం. ఈ ఏడాది నవంబర్ నాటికి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. – డాక్టర్ రంగా ఆజ్మీరా, సూపరింటెండెంట్ -
జూరాల ఆయకట్టుకు నీటిగండం
జూరాల ప్రధాన కాల్వకు నిలిచిన నీటి సరఫరా అమరచింత: జూరాల ప్రాజెక్టుకు పూర్తిగా ఇన్‌ఫ్లో నిలిచిపోవడంతో ఆయకట్టు రైతులకు సాగునీటి గండం ఏర్పడింది. ఎగువన నుంచి వరద పూర్తిగా నిలిచిపోవడం, వర్షాలు కురవకపోవడంతో ప్రాజెక్టు ప్రధానం కుడి, ఎడమ కాల్వలకు గత ఐదు రోజులుగా నీటి సరఫరా నిలిపివేశారు. గతంలో కాల్వకు 4 రోజుల పాటు నీటిని వదిలి మిగిలిన 3 రోజులు నిలిపేస్తూ వారబందీ ద్వారా సాగునీటిని ఆయకట్టుకు ఇస్తారని అనుకున్న రైతన్న ఆశలు అడియాశలవుతున్నాయి. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చే వరకు చుక్కనీటిని కాల్వలకు వదలమని అధికారులు తేల్చి చెప్పడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. 5 టీఎంసీలు మాత్రమే.. ప్రస్తుతం ప్రాజెక్టులో 5.222 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉండటంతో కేవలం తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని కాల్వలకు, ఎత్తిపోతలకు నీటి సరఫరా పూర్తిస్థాయిలో నిలిపివేశారు. జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి కేవలం 200 క్యూసెక్కుల వరద మాత్రమే చేరుకుంటుందని అధికారులు తెలిపారు. జూరాల ప్రధాన ఎడమ, కుడి కాల్వలతో పాటు సమాంతర కాల్వ, భీమా లిఫ్ట్, కోయిల్‌సాగర్, నెట్టెంపాడ్, పవర్హౌజ్లకు నీటిని నిలిపివేశారు. దీంతో జూరాల ఆయకట్టులో ఈసారి కుడి, ఎడమ కాల్వ పరిధిలో 1.10 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేసుకుంటున్న రైతుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. వరి రైతుల ఆందోళన.. జూరాల ప్రాజెక్టుపై ఆధారపడిన రిజర్వాయర్లు, ఎత్తిపోతల పథకాలతో ఈసారి 5 లక్షల ఎకరాల మేరకు వరి పంట సాగు చేపట్టారు. ప్రతి ఏడాది వేసవిలో మాత్రమే సాగునీటి కష్టాలను ఎదుర్కొనే ఆయకట్టు రైతులకు వారబందీతో అతికష్టం మీద సాగునీటిని అందించే యత్నం చేసేవారు. వర్షాలు కురవడం లేదని ఎల్‌నినో ప్రభావం ఉందని ఆయకట్టులో వరి పంటను సాగుచేసుకోవద్దని అధికారులు రైతులకు ముందస్తు సమాచారం అందించారు. అయినా రైతులు మాత్రం జూరాలకు ఎగువ నుంచి వరద వచ్చి ముందుకు వెళ్తోందని తమ పంట పొలాలకు సాగునీరు ఇవ్వాలంటూ వరి పంటలను సాగుచేయడంతో అసలు సమస్య మొదలైంది. అసలు వారబందీ ఉందా లేదా అనే విషయాన్ని ప్రాజెక్టు ఎస్ఈ చంద్రశేఖర్‌ను వివరణ అడగ్గా.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కాల్వలకు నీటి విడుదలను నిలిపేసినట్లు తెలియజేశారు. ఇంకా వారబందీపై ఎలాంటి స్పష్టత రాలేదన్నారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని, ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న నీరు తాగునీటి అవసరాల మేరకు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. కుడి, ఎడమ కాల్వలకు నిలిపేసిన సాగునీరు వరదలొస్తేనే విడుదలంటున్న అధికారులు ఆందోళనలో అన్నదాతలు -
మూడు నెలల్లో ఐసీయూలో చేరిన రోగుల సంఖ్య
పాలమూరు: ఉమ్మడి జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రిలో ఐసీయూ విభాగంలో సరిపడా పడకలు లేకపోవడంతో నిత్యం రోగులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా జనరల్ ఆస్పత్రి టీచింగ్ ఆస్పత్రి స్థాయికి ఎదిగినా పరిస్థితిలో మార్పు రాలేదు. నిత్యం ఓపీ, ఐపీ క్రమంగా పెరుగుతున్నా.. ఐసీయూలో పడకలు పెంచకపోవడంతో ప్రతి రోజు ఐదు నుంచి పది మంది రోగులు పడకల కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఘటనలు స్థానికంగా కన్పిస్తున్నాయి. ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం 900 పడకలు ఉన్న జనరల్ ఆస్పత్రిలో 650 పడకల్లో రోగులు అడ్మిట్ అవుతున్నారు. దీంట్లో 30 పడకలతో ఐసీయూ విభాగం ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఉమ్మడి జిల్లా నుంచి పాముకాటు, రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులు, పక్షవాతం, ఇలా పరిస్థితి విషమంగా ఉన్న రోగులను వెంటిలేటర్ సహాయం కోసం ఐసీయూలో అడ్మిట్ చేయాల్సి వస్తుంది. ప్రస్తుతం ఉన్న 30 పడకలు ఏమాత్రం సరిపోవడం లేదు. బెడ్ ఎప్పుడు ఖాళీ అవుతుందని నిత్యం ఇతర రోగులు ఎదురుచూడాల్సి వస్తోంది. రోగులపై ఆర్థిక భారం ప్రస్తుతం రోగుల తాకిడి దృష్ట్యా కనీసం 60 పడకలతో ఐసీయూలో సేవలందిస్తే రోగులకు లబ్ధి జరగనుంది. నిత్యం ఐసీయూ విభాగానికి 10 నుంచి 20 కేసులు వస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలోని నారాయణపేట, వనపర్తి, గద్వాల, కొత్తకోట, కోస్గి, ఇతర ప్రాంతాల నుంచి రోగులు వస్తుండగా.. అత్యవసరంగా వైద్య సేవలు అందించాల్సిన వారికి ఐసీయూ విభాగానికి సిఫారసు చేస్తుంటారు. చాలా సందర్భాల్లో అక్కడ సరిపడా బెడ్లు లేక రోగులు ప్రైవేట్ ఆస్పత్రులకు, హైదరాబాద్‌కు పరుగులు తీయాల్సి వస్తోంది. దీంతో పేద రోగులకు ఆర్థిక భారం పడుతుంది. అత్యవసరంగా మహబూబ్‌నగర్ నుంచి హైదరాబాద్ వెళ్లడానికి ప్రైవేట్ అంబులెన్స్ నిర్వహకులు రూ.3,500నుంచి రూ.5వేల వరకు వసూలు చేస్తున్నారు. కరోనా సమయంలో.. జిల్లా జనరల్ ఆస్పత్రికి కరోనా సమయంలో దాదాపు 30 వెంటిలేటర్ మిషన్లు వచ్చాయి. దీంట్లో కొన్నింటిని ప్రస్తుత ఐసీయూ విభాగంలోని పడకలకు అమర్చారు. మిగిలిన 15 వెంటిలేటర్లను మూలకు పడేశారు. దీంతో దాదాపు నాలుగేళ్ల నుంచి అవి నిరుపయోగం ఉండటంతో మిషన్లు మరమ్మతుకు గురయ్యాయి. దీంతో రూ.లక్షలు ఖర్చు చేసిన కొనుగోలు చేసిన మిషన్లు పేదలకు పనికిరాకుండా పోయాయి. నెల రోగులు జూన్ 350 జూలై 361 ఆగస్టు 391 30 ఐసీయూ పడకలతోనే నెట్లుకొస్తున్న వైనం రోజూ 10 నుంచి 20 అత్యవసర కేసులు వెంటిలేటర్ మిషన్లు ఉన్న పడకలు పెంచని అధికారులు -
గణపతి కోసం బంకమట్టి తెచ్చేందుకు వెళ్లి..
మిడ్జిల్: వినాయక విగ్రహం తయారు చేసేందుకు బంకమట్టి తెచ్చుకుందామని అన్నతో కలిసి చెరువుకు వెళ్లిన 11 ఏళ్ల బాలుడు ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. త మ్ముడు నీటిలో మునగడాన్ని గమనించిన అన్న వెంటనే అతడిని కాపాడేందుకు చెరువులోకి దిగి బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈ విషాద ఘటన గురువారం సాయంత్రం మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలం కొత్తపల్లిలో చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. కొత్తపల్లికి చెందిన కావలి లక్ష్మయ్య, కళావతి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు నరేందర్, చిన్న కుమారుడు సాయితేజ (11). వినాయక చవితి సందర్భంగా విగ్రహం తయారు చేసేందుకు బంకమట్టి తెచ్చుకోవాలని ఇద్దరూ కలిసి గ్రామ సమీపంలోని చెరువుకు వెళ్లారు. ముందుగా సాయితేజ నీటిలోకి దిగి మట్టి తీస్తుండగా ప్రమాదవశాత్తు లోతులోకి జారిపోయి నీట మునిగాడు. తమ్ముడిని కాపాడేందుకు నరేందర్ వెంటనే నీటిలోకి దిగి రక్షించే ప్రయత్నం చేశాడు. అయితే ఎంత ప్రయత్నించినా సాయితేజను రక్షించలేకపోయాడు. చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో నరేందర్ గ్రామంలోకి పరుగెత్తుకెళ్లి విషయాన్ని చెప్పి, ఇతరులను వెంటబెట్టుకుని చెరువు వద్దకు వచ్చేలోపే సాయితేజ మృతి చెందాడు. విగ్రహం తయారు చేయాలన్న చిన్నారి ఆశ.. ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది. పండుగ వేళ కొడుకును కోల్పోయిన తల్లిదండ్రుల రోదన గ్రామ స్తులను కంటతడి పెట్టించింది. సమాచారం అందుకున్న ఎస్ఐ శ్రీనివాసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల ఆస్పత్రికి తరలించారు. సాయితేజ గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. చెరువులో మునిగి బాలుడి మృత్యువాత తమ్ముడిని కాపాడేందుకు అన్న విశ్వప్రయత్నం.. అయినా దక్కని ఫలితం వినాయక చవితి వేళ కొత్తపల్లిలో విషాదం -
ప్రాణం కోసం అరగంట పోరాటం
కల్వకుర్తి రూరల్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు కారులోనే అరగంట పాటు ప్రాణాలతో పోరాడి.. బయటకు తీసే సమయానికే తుది శ్వాస విడిచారు. ప్రమాద స్థలంలో కళ్లుతెరిచి చూస్తున్న ఆమెను బయటకు తీసేందుకు స్థానికులు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో బంధువులు, స్థానికులు తీవ్ర విషాదానికి గురయ్యారు. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటకు చెందిన అరుణ(57), ఆమె భర్త రాజేందర్‌రెడ్డి హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి కారులో బయలుదేరారు. కోదాడ–రాయచూరు హైవేపై కల్వకుర్తి మండలం తాండ్ర సమీపంలోని పెట్రోల్ పంపు వద్దకు చేరుకోగానే కారు టిప్పర్‌ను ఢీకొంది. ప్రమాదంలో అరుణ తీవ్రంగా గాయపడి కారులో ఇరుక్కుపోయారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. అరుణ కళ్లుతెరిచి చూస్తుండటంతో ఆమెను బయటకు తీసేందుకు ప్రయత్నించినా.. కారు ధ్వంసమై ఉండటంతో సాధ్యం కాలేదు. దీంతో స్థానికులు, బంధువులు జేసీబీని తీసుకొచ్చారు. కారులో నుంచి బయటకు తీసుకొచ్చే సమయంలోనే అరుణ తుది శ్వాస విడిచారు. కాగా..అచ్చంపేటలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న అరుణ శుక్రవారం పాఠశాలకు వెళ్లాల్సి ఉండటంతో రాత్రి భర్తతో కలిసి హైదరాబాద్ నుంచి బయలుదేరినట్లు బంధువులు తెలిపారు. ప్రమాదంలో రాజేందర్‌రెడ్డికి కాలికి గాయాలు కావడంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఘటనపై పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు. ● కారులో చిక్కుకుని విలవిల్లాడిన ఉపాధ్యాయురాలు.. ● బయటకు తీసేలోపే తుదిశ్వాస ● కల్వకుర్తి మండలం తాండ్ర సమీపంలో రోడ్డు ప్రమాదం -
‘అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్‌కు భూములు ఇవ్వం’
● అదనపు కలెక్టర్, ఆర్డీఓలకు రైతుల వినతి గట్టు : ఏళ్లుగా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, తమ భూములను అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ ఇచ్చేందుకు సిద్ధంగా లేమని రాయాపురం రైతులు తెలిపారు. ఈ మేరకు గురువారం గద్వాలలో అదనపు కలెక్టర్ మదుమోహన్, ఆర్డీఓ శ్రీనివాసరావును కలసి వినతిపత్రం అందజేశారు. బుధవారం గిర్దారర్, జీపీఓలు రాయాపురం గ్రామానికి చేరుకుని సర్వే నెంబర్ 83లో గట్టు నుంచి గద్వాలకు వెళ్లే మార్గంలో దేవరగట్టు దగ్గర రోడ్డుకు ఇరువైపులా ఉన్న 50 ఎకరాలకు సంబంధించిన భూములను పరిశీలించినట్లు రైతులు తెలిపారు. 60 ఏళ్లుగా ఈ భూముల్లోనే వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, ఇప్పుడు అగ్రికలర్చ్ రీసెర్చ్ సెంటర్ కోసమంటూ భూములను తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు రైతులు వాపోయారు. తాము సాగు చేసుకుంటున్న భూములను ఇవ్వడానికి సిద్ధంగా లేమని తేల్చి చెప్పారు. తమ భూములను లాక్కొని రోడ్డున పడేయొద్దని అదనపు కలెక్టర్, ఆర్డీఓలకు విన్నంచారు. కార్యక్రమంలో రైతులు సాలెకర్రెప్ప, నర్సింహులు, పరుశరాముడు, గొవిందు, పాగుంటప్ప, తిమ్మప్ప,మారెప్ప, వీరేష్, బస్వరాజు పాల్గొన్నారు. -
ఎస్సీ, ఎస్టీల సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ఎస్సీ, ఎస్టీల భూ సమస్యలు, అట్రాసిటీ కేసులు, సంక్షేమ పథకాలు, సబ్‌ప్లాన్ నిధుల వినియోగం, ఉద్యోగ నియామకాలు, పదోన్నతుల్లో రోస్టర్, రిజర్వేషన్ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్, కొంకటి లక్ష్మీనారాయణతో కలిసి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. సబ్‌ప్లాన్ నిధులను ఇతర అవసరాలకు మళ్లించకుండా ఎస్సీ, ఎస్టీల ఆవాస ప్రాంతాల్లో వారి సంక్షేమం, అభివృద్ధికే వినియోగించాలని సూచించారు. అంగన్వాడీ భవనాల నిర్మాణంతో పాటు తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, ఫ్యాన్లు, లైట్లు వంటి మౌలిక వసతులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం అమలు చేస్తున్న విదేశీ విద్య, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, అంతర్ కుల వివాహ ప్రోత్సాహకం, భూమి కొనుగోలు తదితర పథకాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, దళిత సంఘాల నాయకులు అర్హులకు అవగాహన కల్పించాలన్నారు. మూఢనమ్మకాలను వీడి విద్య, ప్రభుత్వ పథకాలతో అభివృద్ధి సాధించేలా చైతన్యం కల్పించాలని సూచించారు. ప్రతి శాఖలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల రోస్టర్ రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించి రిజర్వేషన్లు అమలు చేయాలని ఆదేశించారు. ప్రధానమంత్రి అనుసూచిత్ అభ్యుదయ యోజన కింద భూమి పొందిన లబ్ధిదారులకు బోర్లు, పంపుసెట్లు, విద్యుత్ కనెక్షన్ల కోసం ప్రతిపాదనలు వెంటనే పంపాలని సూచించారు. సివిల్ రైట్స్ డే కార్యక్రమాలను అందరికీ అందుబాటులో ఉండే ప్రదేశాల్లో నిర్వహించి హక్కులు, చట్టపరమైన రక్షణపై అవగాహన కల్పించాలన్నారు. పోలీస్స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించి, వారి సమస్యలను ఓపికగా విని చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు. మెప్మా, మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న ఎస్సీ, ఎస్టీ కార్మికులకు అమలవుతున్న బీమా సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ కార్మికులకు వేతనాలను సకాలంలో చెల్లించాలని ఆదేశించారు.పెండింగ్ అంశాలపై నివేదికలు పంపితే సెప్టెంబర్ 22న సీఎంతో జరిగే సమావేశంలో ప్రస్తావిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ ఖుష్బూగుప్తా, ఎస్పీ డి.జానకి, అదనపు కలెక్టర్లు మధుసూదన్‌నాయక్, హరిప్రియ, డీఆర్వో నిర్మల, జిల్లా ఎస్సీ సంక్షేమ అభివృద్ధి శాఖ అధికారి సునీత, జిల్లా అధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎస్సీ, ఎస్టీ సంఘాల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. సబ్‌ప్లాన్ నిధులు దారి మళ్లించొద్దు సంక్షేమ పథకాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలి రోస్టర్, రిజర్వేషన్ల అమలులో నిర్లక్ష్యం వద్దు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య -
విఘ్నేశ్వరా.. నిమజ్జనమెలా?
పాలమూరు: వర్షాభావ పరిస్థితులతో జిల్లాలో చెరువులు, కుంటలు ఎండిపోవడంతో గణనాథుల నిమజ్జనానికి ఇబ్బందులు తప్పేలా లేవు. ఈనెల 23న జిల్లావ్యాప్తంగా నిర్వహించనున్న నిమజ్జనానికి అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. మహబూబ్‌నగర్ చుట్టుపక్కల చెరువుల్లో నీటి లభ్యత తక్కువగా ఉండటంతో భారీ విగ్రహాల నిమజ్జనంపై ఆందోళన నెలకొంది. దీంతో కార్పొరేషన్‌తో పాటు మూడు మున్సిపాలిటీల పరిధిలో చిన్న విగ్రహాల కోసం కృత్రిమ చెరువులు (బేబీ పాండ్స్) ఏర్పాటు చేస్తున్నారు. పదేళ్ల కిందట ఇదే తరహాలో ఎదురైన సమస్య మళ్లీ తలెత్తింది. 1,945 విగ్రహాలకు అధికారిక అనుమతులు జిల్లాలోని 16 పోలీస్స్టేషన్ల పరిధిలో గణనాథుల ఏర్పాటుకు 2,067 దరఖాస్తులు రాగా.. 1,945 విగ్రహాలకు పోలీసులు అనుమతులు ఇచ్చారు. మరోవైపు అనుమతులు అవసరం లేని మూడు అడుగుల లోపు విగ్రహాలు సుమారు 15 వేల వరకు ఉన్నట్లు అంచనా. వీటన్నింటికీ నిమజ్జనానికి సరిపడా నీరు అందుబాటులో లేకపోవడం సమస్యగా మారింది. జడ్చర్ల, దేవరకద్ర, భూత్పూర్, హన్వాడ మండలాల్లో కొన్ని ప్రాంతాల్లో నిమజ్జనానికి నీటి లభ్యత కొంత మెరుగ్గా ఉండగా.. మహబూబ్‌నగర్ నగరంలో ఏర్పాటు చేసిన భారీ విగ్రహాల నిమజ్జనమే ప్రధాన సమస్యగా మారనుంది. బీచుపల్లికి బదులు స్థానికంగా.. మహబూబ్‌నగర్ నగరంలోని భారీ గణనాథులను ప్రతిసారీ బీచుపల్లికి తరలించి నిమజ్జనం చేసేవారు. అయితే ఈసారి కృష్ణానదిలో నీటి లభ్యత తక్కువగా ఉండటంతో స్థానికంగా ఉన్న చెరువుల్లోనే నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. హన్వాడ, పెద్దదర్పల్లి చెరువుల్లో కొంత నీరు ఉండటంతో అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీనివాస కాలనీ, పాలకొండ చెరువుల్లోనూ నీరు అందుబాటులో ఉండటంతో కొన్ని విగ్రహాలను అక్కడ నిమజ్జనం చేసేలా అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. దేవరకద్రలోని పెద్ద చెరువులోనూ నిమజ్జన ఏర్పాట్లు సాగుతున్నాయి. జడ్చర్లలో దుందుబీ వాగు పరిధిలోని క్వారీల్లో నిలిచిన నీటితో పాటు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కాల్వలను వినియోగించే అవకాశాలను పరిశీలిస్తున్నారు. బేబీ పాండ్స్ ఏర్పాటు చిన్న విగ్రహాల నిమజ్జనం కోసం మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌తో పాటు జడ్చర్ల, దేవరకద్ర, భూత్పూ ర్ మున్సిపాలిటీల్లో కృత్రిమ చెరువులను ఏర్పాటు చేస్తున్నారు. మహబూబ్‌నగర్‌లో పంచవటి పాఠశాల సమీపంలో మున్సిపల్ సాధారణ నిధులు రూ.5 లక్షలతో బేబీ పాండ్ నిర్మించారు. 38 అడుగు ల పొడవు, 28 అడుగుల వెడల్పుతో ఏర్పాటు చేసిన ఇందులో సుమారు లక్ష లీటర్ల నీటిని నిల్వ చేయనున్నారు. మూడు అడుగుల లోపు విగ్రహాలను ఇందులో నిమజ్జనం చేయనున్నారు. ● అప్పన్నపల్లి శివారులోని గంగోస్కుంట ఆవరణలో మరో రెండు బేబీ పాండ్స్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. సుమారు రూ.8.50 లక్షలతో ఒక్కొక్కటి 60 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పుతో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం సుమారు రెండు లక్షల లీటర్ల నీటిని అందుబాటులో ఉంచనున్నారు. నాలుగు అడుగుల లోపు విగ్రహాలను ఇక్కడ నిమజ్జనం చేయనున్నారు. ● జడ్చర్ల మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో ఒకటి, హౌసింగ్‌బోర్డు కాలనీలో ఒకటి, బీసీ వసతిగృహం సమీపంలో మరొకటి బేబీ పాండ్ ఏర్పాటు చేస్తున్నారు. – దేవరకద్ర మున్సిపాలిటీలో స్టేషన్ రోడ్‌లోని చర్చి సమీపంలో, భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని రాందాస్ తండాలోనూ ఒక బేబీ పాండ్ నిర్మిస్తున్నారు. జూరాల నుంచి నీరు విడుదల చేయాలి భారీ విగ్రహాల నిమజ్జనానికి ఇబ్బందులు లేకుండా జూరాల ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని ఉత్సవ కమిటీ ప్రతినిధులు అధికారులను కోరుతున్నారు. నిమజ్జనానికి సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో నీటి లభ్యతపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన పరిస్థితి నెలకొంది. కృత్రిమ కుంటల్లోనే వినాయక నిమజ్జనం: కలెక్టర్ జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం ప్రజలు సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా తమకు సమీపంలో ఏర్పాటు చేసిన కృత్రిమ బేబీ కుంటలను వినియోగించుకోవాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా సూచించారు. చిన్న, మధ్య తరహా విగ్రహాలను ఆయా కుంటల్లోనే నిమజ్జనం చేయాలని కోరారు. జిల్లాలో వర్షాభావ పరిస్థితుల కారణంగా పలు చెరువులు, కుంటలు ఎండిపోవడంతో మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌తో పాటు జడ్చర్ల, దేవరకద్ర, భూత్పూర్ మున్సిపాలిటీల పరిధిలో కృత్రిమ కుంటలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ప్రజలు నిబంధనలు పాటిస్తూ వీటిని వినియోగించుకోవాలని, తద్వారా నీటి కాలుష్యాన్ని నివారించి పర్యావరణాన్ని కాపాడాలని కలెక్టర్ కోరారు. 23న జిల్లాలో గణపతి నిమజ్జనం మహబూబ్‌నగర్ చుట్టుపక్కల చెరువులు, కుంటలు ఎండిపోవడంతో ఇబ్బందులు కార్పొరేషన్‌తో పాటు మూడు మున్సిపాలిటీల్లో కృత్రిమ చెరువులు 5 అడుగుల లోపు విగ్రహాలకు స్థానికంగానే నిమజ్జన ఏర్పాట్లు జూరాల నుంచి నీటిని విడుదల చేయాలని ఉత్సవ కమిటీ విజ్ఞప్తి -
ప్రజాపాలనలో ప్రగతిబాట
నిజాం పాలన నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి అడుగుపెట్టిన చారిత్రక రోజు సెప్టెంబర్ 17 ● జిల్లాలో రైతుభరోసా కింద 2.12 లక్షల మందికి రూ.818.22 కోట్లు జమ ● ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తున్నాం ● సంక్షేమం, అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇస్తున్నాం. ● ప్రజాపాలన దినోత్సవంలో రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): నిజాం రాచరిక పాలన నుంచి తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్య పాలనా వ్యవస్థలోకి అడుగుపెట్టిన చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 17ను ప్రజా పాలన దినోత్సవంగా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఈ సందర్భంగా గురువారం కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ప్రజాపాలనలో పారదర్శకత, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తూ సంక్షేమం, అభివృద్ధికి సమాన ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. గ్యారంటీల అమలు.. మహాలక్ష్మి పథకం కింద జిల్లాలో ఇప్పటి వరకు 3.81 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకోగా రూ.185.60 కోట్ల మేర లబ్ధి చేకూరిందన్నారు. రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకం కింద 1,27,056 మంది వినియోగదారులకు 4.13లక్షల సిలిండర్లు అందించగా రూ. 11.35 కోట్ల సబ్సిడీ ఇచ్చినట్లు తెలిపారు. గృహ జ్యోతి కింద 1,37,046 జీరో విద్యుత్ బిల్లులు జారీ చేసి రూ.107.77కోట్ల సబ్సిడీ అందించినట్లు చెప్పా రు. ఆరోగ్యశ్రీ కింద 50,314 మంది లబ్ధి పొందగా రూ.145.79 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ● జిల్లాలో 10,232 ఇళ్లకు రూ.511.60 కోట్ల అంచనా వ్యయంతో మంజూరు చేయగా 9,208 ఇళ్ల పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. వీటిలో 3,302 ఇళ్లు పూర్తయ్యాయి. పూర్తయిన ఇళ్లకు రూ.240.97 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. రెండో విడతలో ప్రతి నియోజకవర్గానికి మరో 1,500 ఇళ్లు, 500 ఇళ్ల పైకప్పుల మార్పునకు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. రైతుకు భరోసా.. రైతుభరోసా కింద 2,12,153 మంది రైతులకు రూ.818.22 కోట్లు జమ చేసినట్లు మంత్రి తెలిపారు. 2024 పంట రుణమాఫీలో 76,385 మంది రైతులకు రూ.597.05 కోట్ల రు ణమాఫీ చేసినట్లు చెప్పా రు. రైతుబీమా కింద 1,855 మంది రైతుల నామినీలకు రూ.92.75 కోట్లు అందించామన్నా రు. వానాకాలం 2026–27లో 2,97,203 ఎకరాల్లో సాగు జరిగిందన్నారు. ఆయిల్‌పామ్ విస్తరణకు 1,302ఎకరాలకు, సూక్ష్మ సేద్యానికి 769.75 ఎకరా లకు అనుమతులు మంజూరు చేసినట్లు తెలిపారు. ● భూ భారతి ద్వారా రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు, ఆస్తుల బదిలీల్లో పారదర్శక సేవలు అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. రెవెన్యూ సదస్సుల్లో 6,545 అర్జీలు, 3,840 సాదాబైనామా దరఖాస్తులు పరిష్కరించినట్లు చెప్పారు. కలెక్టర్ ప్రజావాణికి వచ్చిన 2,006 దరఖాస్తుల్లో 1,747 పరిష్కరించగా 259 పెండింగ్‌లో ఉన్నాయని, ముఖ్యమంత్రి ప్రజావాణిలో వచ్చిన 742 దరఖాస్తుల్లో 666 పరిష్కరించామని తెలిపారు. ఆరోగ్యం, రహదారులు.. జిల్లాలో 17 పీహెచ్‌సీలు, 5 అర్బన్ హెల్త్ సెంటర్లు, ఒక సివిల్ ఆస్పత్రి, 129 ఆరోగ్య ఉపకేంద్రాలు పనిచేస్తున్నాయని మంత్రి తెలిపారు. ఆరోగ్య మహిళా కార్యక్రమంలో 46,950 మందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. రంగారెడ్డిగూడ–రాజాపూర్ రహదారి విస్తరణకు రూ.30 కోట్లు, నవాబ్‌పేట–తిరుమలాపూర్ రహదారికి రూ.20 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. కురుమూర్తి స్వామి ఆలయం, చిన్నచింతకుంట ఘాట్ రోడ్డు, ఎలివేటెడ్ కారిడార్‌కు రూ.110 కోట్లతో పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. పర్యాటకం, తాగునీరు.. వన మహోత్సవంలో 50.82 లక్షల లక్ష్యానికి 37.99 లక్షల మొక్కలు నాటినట్లు తెలిపారు. పిల్లలమర్రిని టూరిజం హబ్‌గా అభివృద్ధి చేసేందుకు రూ.5 కోట్లు మంజూరు చేశామన్నారు. కోయిల్‌సాగర్ అభివృద్ధికి రూ.9.5 కోట్లు, పిల్లలమర్రికి రూ.2.5 కోట్లతో పనులు కొనసాగుతున్నట్లు తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా 1,697 కి.మీ. పైప్‌లైన్ నెట్‌వర్క్‌తో 1,50,056 ఇళ్లకు నల్లా కనెక్షన్ల ద్వారా తాగునీరు అందిస్తున్నట్లు చెప్పారు. 423 గ్రామ పంచాయతీలు, 109 మున్సిపల్ వార్డుల్లో గ్రామ, వార్డు సభలు నిర్వహించాం. ఉద్యోగ మేళాలో 78 కంపెనీలు పాల్గొని 3,126 మందికి ఇంటర్వ్యూలు నిర్వహించగా 828 మందిని ఎంపిక చేసి నియామక పత్రాలు అందించాయి. 15వ ఆర్థిక సంఘం కింద గ్రామ పంచాయతీ ఖాతాల్లో రూ.57.89 కోట్లు జమ చేశాం. కోయిల్‌సాగర్, కేఎల్ఐ, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలకు అవసరమైన 12,370 ఎకరాల్లో 11,150 ఎకరాల భూసేకరణ పూర్తి చేశాం. – మంత్రి జూపల్లి కృష్ణారావుజాతీయజెండాను ఆవిష్కరించిన అనంతరం సెల్యూట్ చేస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు, కలెక్టర్ ఖుష్బూగుప్తా, ఎస్పీ జానకి, మేయర్ మమత, కార్పొరేషన్‌చైర్మన్ కొత్వాల్, తదితరులువిద్యకు ప్రాధాన్యం.. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు చేశామని జూపల్లి తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాలల్లో 642 పాఠశాలల్లో పనులు ప్రారంభించి 585 చోట్ల పూర్తి చేసినట్లు చెప్పారు. 76 పాఠశాలల్లో ఏఐ ల్యాబ్‌లు ప్రారంభించామని, పెద్దయిపల్లిలో నవోదయ విద్యాలయం మంజూరైందని తెలిపారు. పాలమూరు విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్, న్యాయ కళాశాలలు మంజూరైనట్లు చెప్పారు. -
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు..
ప్రజా పాలన దినోత్సవంలో పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. జిల్లా అభివృద్ధికి ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలీసు, వైద్య, పారిశుద్ధ్య సిబ్బంది, మీడియా సహకారం అవసరమని మంత్రి కోరారు. కార్యక్రమంలో కలెక్టర్ ఖుష్బూగుప్తా, ఎస్పీ జానకి, నగర మేయర్ మమత, రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, అడిషనల్ కలెక్టర్లు మధుసూదన్‌నాయక్, హరిప్రియ, డీఆర్ఓ నిర్మల, ఏఓ సువర్ణరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
నిధులను సక్రమంగా వినియోగించాలి
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: జిల్లాలోని పాఠశాలలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అందుతున్న పీఎంశ్రీ నిధులను సక్రమంగా, పారదర్శకంగా వినియోగించి, నిర్దేశించిన లక్ష్యాన్ని సకాలంలో పూర్తి చేయాలని స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ మధుసూదన్‌నాయక్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో పీఎంశ్రీ పాఠశాలల హెచ్ఎంలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నిధులతో ఆయా పాఠశాలల్లో అవసరమైన మౌలిక వసతులు, విద్యా సంబంధిత కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. ప్రశస్త్కు సంబంధించిన వీడియోలను ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులందరూ వీక్షించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే స్వచ్ఛ విద్యాలయ రేటింగ్స్ వివరాలను యాప్‌లో క్రమం తప్పకుండా నమోదు చేయాలన్నారు. ప్రతి విద్యార్థికి ఆధార్ సీడింగ్ పూర్తితో పాటు అపార్ ఐడీలను జనరేట్ చేయాలన్నారు. ప్రతి పాఠశాలను డ్రగ్ ఫ్రీ క్యాంపస్‌గా ప్రకటించేలా చర్యలు చేపట్టాలన్నారు. -
క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలి
స్టేషన్ మహబూబ్‌నగర్: క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ అన్నారు. జిల్లాకేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో గురువారం జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. పార్టీ బలోపేతం, గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం పెంపొందించడం వంటి అంశాలపై చర్చించారు. పార్టీ కార్యక్రమాలు, సంస్థాగత వ్యవహారాలు, నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం, గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసే అంశాలపై చర్చించారు. పార్టీని బూత్‌స్థాయి నుంచి గ్రామ, మండల, అసెంబ్లీ స్థాయి వరకు బలోపేతం చేయడానికి కార్యాచరణ రూపొందించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయాలని నిర్ణయించారు. బీజేపీ వస్తే అధికారికంగా విమోచన దినం పాలమూరు: తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా గురువారం జిల్లా బీజేపీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి జాతీయజెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ మొదటి నుంచి తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చిన 1948 సెప్టెంబర్ 17ను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని అనేక పోరాటాలు చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, ఆ వెంటనే విమోచన దినం అధికారికంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. పద్మజారెడ్డి, అంజయ్య, వీర బ్రహ్మచారి, బాలరాజు, కృష్ణారెడ్డి, కార్పొరేటర్లు రమేష్, పాండురంగారెడ్డి, మర్రిజ్యోతి, రాజు, హరికృష్ణ పాల్గొన్నారు. ● ప్రధాని నరేంద్రమోదీ పుట్టినరోజు సందర్భంగా యువ మోర్చా ఆధ్వర్యంలో గురు వారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు. రాత్రి 7 గంటలకు ఆశీస్సుల దీపం కార్యక్రమం సందర్భంగా ఇళ్లపై దీపాలు వెలిగించారు. 24 నుంచి జిల్లాస్థాయి ఎస్జీఎఫ్ పోటీలు మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో అండర్–14, అండర్–17 విభాగాలకు సంబంధించి ఈనెల 24వ తేదీన వాలీబాల్, 25వ తేదీన కబడ్డీ బాలబాలికల, 26న ఖోఖో బాలబాలికల మహబూబ్‌నగర్ జిల్లాస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ టోర్నమెంట్ కమ్ సెలక్షన్స్ ఉంటాయని జిల్లా ఎస్జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి వేణుగోపాల్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. మండలాల జట్లు ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటలకు రిపోర్టు చేయాలని కోరారు. మిగతా వివరాల కోసం 9948787711 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. -
‘పాలమూరు’ మొదటి పంపు నుంచి నీటి విడుదల
కొల్లాపూర్ రూరల్: మండలంలోని ఎల్లూరు గ్రామ శివారు పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు మొదటి లిఫ్టు మొదటి పంపు ద్వారా గురువారం అధికారులు నార్లాపూర్ రిజర్వాయర్‌లోకి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఈఈ లోకిలాల్ మాట్లాడుతూ ప్యారామీటర్ చెక్ చేసుకోవడంలో భాగంగా 2 గంటలపాటు నీటిని విడుదల చేసి.. మరోసారి మోటార్‌ను చెక్ చేసుకున్నామని చెప్పారు. వచ్చే వారం నుంచి రిజర్వాయర్‌లోకి నీటిని నిరంతరాయంగా విడుదల చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రాజెక్టు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
మన్యంకొండలో ముగిసిన శ్రావణ మాస వేడుకలు
మహబూబ్‌నగర్ రూరల్: మన్యంకొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో శ్రావణమాసం సందర్భంగా 35 రోజులుగా నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు బుధవారం పూర్ణాహుతితో ముగిశాయి. శ్రావణమాసం ప్రారంభం నుంచి ప్రతిరోజూ స్వామివారికి నిత్యపూజలు, ప్రత్యేక అలంకరణలు, అఖండ భజనలు, హోమాలు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో సాగిన వేడుకలకు బుధవారం సమారాధనతో ముగింపు పలికారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక హోమం నిర్వహించి శాస్త్రోక్తంగా పూర్ణాహుతి కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అళహరి మధుసూదన్‌కుమార్, అళహరి రామకృష్ణ, ఈఓ శ్రీనివాసరాజుతో పాటు పాలక మండలి సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు. -
పీయూ పీజీ కళాశాల తనిఖీ
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పీజీ కళాశాలలోని పలు డిపార్ట్మెంట్లను వీసీ శ్రీనివాస్ బుధవారం ఉదయం తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరుశాతం, అటెండెన్స్ రిజిస్ట్రర్లు, అకాడమిక్ రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులు, అధ్యాపకులు సమయపాలన పాటించాలని, అటెండెన్స్ రిజిస్ట్రర్లను అప్డేట్ చేయాలని సూచించారు. అనంతరంతో ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థులకు కొద్దిసేపు తరగతులు బోధించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మధుసూదన్‌రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. ఆడిటోరియం నిర్మాణానికి రూ.కోటి మంజూరు పీయూలో ఆడిటోరియం నిర్మించేందుకు రూ. 10 కోట్లు ఇస్తామని కాన్వకేషన్ సందర్భంగా ఎంఎస్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు మొదటి దశ రూ.కోటి మంజూరు చేసినట్లు అధికారులు పేర్కన్నారు. ఈ మేరకు ఈ నిధులతో పనులు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. వ్యక్తి రిమాండ్ నవాబుపేట: బాలికను ప్రేమపేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్న వ్యక్తిని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ నరేందర్ తెలిపారు. బుధవారం మండలంలో ఒక గ్రామానికి చెందిన మైనర్‌ను అదే గ్రామానికి చెందిన నర్సింహులు ప్రేమ పేరుతో వెంటపడి వేధిస్తున్నట్లు బాధితురాలు తండ్రి ఫిర్యాదుతో కేసునమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. -
ఉల్లి ధర మండుతోంది
దేవరకద్ర: దేవరకద్ర మార్కెట్ యార్డులో బుధవారం నిర్వహించిన ఉల్లి వేలంలో ధరలు గత వారంతో పోలిస్తే స్వల్పంగా అటూ ఇటుగా నమోదయ్యాయి. అయితే నాలుగు వారాలుగా ఉల్లి ధరలు పెరుగుతూనే ఉండటంతో తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. రైతులు ఊహించని స్థాయిలో కనిష్ట ధరలు సైతం పలుకుతున్నాయి. బుధవారం క్వింటాల్ ఉల్లి గరిష్టంగా రూ.5,300, కనిష్టంగా రూ.4,100 ధర పలికింది. మార్కెట్‌కు కేవలం 200 బస్తాల ఉల్లి మాత్రమే విక్రయానికి వచ్చింది. తూకం అనంతరం 50 కిలోల బస్తా గరిష్టంగా రూ.2,700, కనిష్టంగా రూ.2,100 చొప్పున అమ్ముడైంది. మార్కెట్‌కు ఉల్లి దిగుబడి తక్కువగా రావడంతో చిరు వ్యాపారులు ఎక్కువగా కొనుగోలు చేశారు. దీంతో వినియోగదారులకు ఉల్లి లభ్యత తగ్గింది. దేవరకద్ర సంతలో కిలో ఉల్లి రూ.50 నుంచి రూ.60 వరకు విక్రయించారు. -
విష జ్వరాలు, శ్వాసకోశ ఇబ్బందులు
కంపెనీల నుంచి వచ్చే పొగ, వాసన మూలంగా మా గ్రామంలోని వృద్ధులకు, చిన్నపిల్లలకు విష జ్వరాలు, శ్వాసకోశ ఇబ్బందులు వస్తున్నాయి. చాలామంది దగ్గు, ఆస్తామ వంటి వ్యాధులకు గురవుతున్నారు. తక్షణమే అధికారులు ఆ కంపెనీలపై చర్యలు తీసుకోవాలి. – మాలింగప్ప, రైతు, చేగుంట మండలంలోని పలు గ్రా మాల ప్రజలు ఈ కంపెనీ ల మూలంగా ఇబ్బందుల కు గురవుతున్నారు. అఖిలపక్షాల ఆధ్వర్యంలో త్వరలోనే అన్ని గ్రామాల ప్రజలతో ఆందోళనలు చేపట్టబోతున్నాం. జిల్లా అధికారులకు ఫిర్యాదు చేస్తాం. న్యాయం జరగకపోతే ఉద్యమం చేపడుతాం. – బస్లింగప్ప, యువకుడు, చేగుంట మండలంలోని గుడెబల్లూర్, వాసునగర్, చేగుంట, ఐనాపూర్ తదితర గ్రామాల ప్రజలతోపాటు కర్ణాటకలోని కెమికల్ ఫ్యాక్టరీల మూలంగా దుర్వాసన వస్తున్నట్లు తమ దృష్టికి వచ్చింది. తమకు ఆయా గ్రామాల ప్రజలు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తాం. – శ్రీనివాస్, తహసీల్దార్, కృష్ణా మండలం ● -
ప్రతి ఒక్కరూ సొంతంగా ఆలోచించాలి
జడ్చర్ల టౌన్: ప్రతిఒక్కరూ స్వబుద్ధితో ఆలోచించాలని, బుద్ధి పక్కదారి పడితే దానిని ఆలోచన అనే అంకుశంతో అణిచివేయాలని పద్మశ్రీ గరికపాటి నర్సింహారావు ప్రవచించారు. జడ్చర్ల మున్సిపాలిటీలోని గౌరీశంకర్ కాలనీలోని వినాయక మండపం వద్ద శ్రీనాథ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో ఆధునిక జీవితంలో భగవద్గీత ప్రాధాన్యంపై ఆయన ప్రవచించారు. మాటల్ని బట్టి మనిషిని గౌరవించటం అలవర్చుకోవాలని, మనిషిని బట్టి మాటల్ని విశ్వసించరాదన్నారు. మనందరి అంతిమ లక్ష్యం మరో జన్మ ఉండకూడదని, జన్మరాహిత్యం కోసం ప్రయత్నించాలన్నారు. మానవ జన్మ ఎంతో అదృష్టమని, అందుకే ఇలా వినాయక వ్రతం, పూజ చేసుకోగలుగుతున్నామని, ప్రవచనాలు వినగలుగుతున్నామన్నారు. అందుకే ఏది ధర్మమో అది చేయాలన్నారు. మనపనిమనం చేయాలని, లాభనష్టాలు ఆశించకూడదన్నారు. లాభం మాత్రం ఆశిస్తామని నష్టం భరించలేమంటే ఎలా అన్నారు. అలాగే సుఖం కోరుకుంటామని, దుంఖః భరించనంటే ఎలా అని ఆలోచించాలన్నారు. లాభం రావాలంటే కొంత నష్టం తప్పదని, సుఖం దక్కాలంటే కొంత దుంఖం తప్పదన్నారు. మనవాడు దుర్మార్గుడైన సమర్దిస్తామని, మిగిలిన వారిని ద్వేషిస్తామని, అలాకాకుండా మంచి చెడులు ఆలోచించి దుర్మార్గుడైన మనవాడిని సన్మార్గంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించాలన్నారు. అంతకుముందు ఆయనకు శ్రీనాథ్ ఆధ్వర్యంలోని భక్తబృందం ఘన స్వాగతం పలికారు. -
విపత్తు సమయంలో బాధితులకు సాయం చేయాలి
ఎర్రవల్లి: యువ ఆపద మిత్రులుగా శిక్షణ పొందుతున్న విద్యార్థులు బాధ్యతాయుతంగా వ్యవహరించి సమాజంలో ప్రాణ రక్షణ చర్యలకు సహకరించాలని పదవ పటాలం ఇన్చార్జి కమాండెంట్ ఆదినారాయణ సూచించారు. బుధవారం బీచుపల్లి పదవ బెటాలియన్‌లో స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్డిఆర్ఎఫ్), తెలంగాణ స్పెషల్ పోలీస్ ఆధ్వర్యంలో యువ ఆపద మిత్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి మహబూబ్‌నగర్ జిల్లా రెవెన్యూ అధికారి నిర్మలతో కలిసి హాజరై శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ శిక్షణలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా లోని ఐదు జిల్లాల నుండి ఎన్ఎస్ఎస్ నుండి 43మంది, బిఎస్జి నుండి 17మంది, ఎన్‌వైకెఎస్ నుండి 31మంది చొప్పున ఎంపికై న మొత్తం 91మంది బాల బాలికలకు ఏడు రోజుల పాటు విద్యార్థులు విపత్తుల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బాదితులను సురక్షితంగా తరలించే విధానాల గురించి అవగాహన కల్పించారు. ప్రకృతి వైపరీత్యాలు లేదా ఇతర విపత్తులు సంభవించినప్పుడు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునేలోపు, సమీపంలో ఉన్న యువత తమకు అందుబాటులో ఉన్న వసరులతో బాధితులకు ప్రాథమికసాయం అందించడం, ప్రాణాలను రక్షించడం, సురక్షిత ప్రాంతాలకు తరలించడం వంటి చర్యలు చేపట్టేలా యువతను సిద్ధం చేయడమే యువ ఆపదమిత్ర కార్యక్రమం ముఖ్యఉద్దేశ్యమన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్లు పార్థసారదిరెడ్డి, వెంకటరమణ, ఆర్ఐ శ్రీనివాస్, వెల్ఫేర్ అధికారి లక్ష్మణ్, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
నిన్న సన్మానం.. నేడు అనంత విషాదం!
● ఉత్తమ ఉపాధ్యాయురాలిగా సన్మానం అందుకున్న కొన్ని గంటల్లోనే మృతి ● ‘మా టీచర్ ఎక్కడా..?’ అంటూ కన్నీరుమున్నీరైన విద్యార్థులు అమరచింత: నిన్నటి వరకు ఆమె ముఖంలో చిరునవ్వు.. చేతుల్లో ఉత్తమ ఉపాధ్యాయురాలి పురస్కారం.. తోటి ఉపాధ్యాయుల అభినందనలు.. విద్యార్థుల ప్రేమాభిమానాలు. అంతలోనే విధి ఆమెను దూరం చేసింది. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా సత్కారం అందుకున్న మరుసటి రోజే గుండెపోటుతో మృతి చెందడంతో అమరచింతలో విషాదం నెలకొంది. అమరచింత మండల కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆనందలక్ష్మి (48) మంగళవారం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికై న సందర్భంగా నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. తనతో పాటు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై న వారితో కలిసి ఫొటోలు దిగుతూ, సంతోషాన్ని పంచుకున్నారు. సన్మానం అనంతరం ఆనందంగా ఇంటికి చేరుకున్నారు. అయితే అర్ధరాత్రి ఆమెకు ఛాతిలో నొప్పి రావడంతో భర్త రాము వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. సమీపంలోని డీఎంఆర్ఎం ఆస్పత్రిలో రాత్రివేళ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఆత్మకూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. -
వేరుశనగ సాగు.. జాగ్రత్తలతో లాభాలు
మిడ్జిల్: రాష్ట్రంలో అధికంగా సాగు చేసే పంటలలో వేరుశనగ ఒకటి. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో అత్యధిక శాతం సాగు చేస్తుంటారు. అ యితే వేరుశెనగలో అధిక దిగుబడులు సాధించాల ంటే అధికారుల సూచనలు తప్పకండా పాటించా లని మండల వ్యవసాయ అధికారి సిద్దార్థ తెలిపారు. నేలల ఎంపిక–తయారీ.. వేరుశనగ పంటకు ఎర్ర ఇసుక నేలలు, నీరు ఇంకే తేలికపాటి నేలలు అనుకూలం. దుక్కిని 2–3 సార్లు బాగా దున్ని చివరి దుక్కిలో ఎకరాకు 8–10 టన్నుల పశువుల ఎరువు వేయాలి. దుక్కిలోతు 20సెం.మీటర్ల వరకు ఉండేలా చూసుకోవాలి. విత్తనాల ఎంపిక.. విత్తనాల ఎంపికలోనే రైతులు ఎక్కువగా మోసపోతుంటారు. మార్కెట్లో దొరికే ప్రతి విత్తనం మంచిది కాదు. ● కె–6 (కదిరి): 100–110 రోజులలో పంట చేతికి వచ్చి దిగుబడి ఎకరానికి 12–14 క్వింటాళ్లు వస్తుంది. ● కదిరి–9: కరువును తట్టుకుంటుంది. నూనే శాతం ఎక్కువ. 110 నుంచి 120 రోజుల్లో పంట చేతికి వస్తుంది. దిగుబడి 10–12 క్వింటాళ్లు. ● కదిరి హరితాంధ్ర: పంట కాలం వంద రోజులు. ఎకరానికి 10 –12 క్వింటాల దిగుబడి వస్తుంది. బెట్ట పరిస్థితులను, ఆకుపచ్చ, తామర తెగులును తట్టుకుంటుంది. ● ధరణి: పంట కాలం 100 – 105 రోజులు. దిగుబడి 9–10 క్వింటాళ్లు. నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. ● టిఏజి–24 రకం: పంట కాలం 95 – 100 రోజులు. దిగుబడి 8–10 క్వింటాళ్లు. ● జెఎల్–24 రకం: పంట కాలం 105 – 110 రోజు లు దిగుబడి 10–12 క్వింటాళ్లు. గింజలు పద్దెగా ఉంటాయి. ఒకే సారి కాయలు గట్టి పడుతాయి. విత్తనాల ఎంపికలో జాగ్రత్తలు తప్పనిసరి విత్తనం బరువుగా నిండుగా ఉండాలి. పుచ్చిన పగిలిన గింజలను తీసివేయాలి. గింజపై పొట్టు ఎరుపు మెరుస్తూ ఉండాలి. గతేడాది పొలంలో పండిన దాన్నే వాడుతుంటే 9 నెలలు లోపు విత్తనం అయి ఉండాలి. పాత విత్తనం మొలక శాతం తగ్గుతుంది. ఎరువుల యాజమాన్యం.. వేరుశనగ పంటకు ఎక్కువ యూరియా అవసరం లేదు. ఎకరానికి డీఏపీ 60 కిలోలు, ఎంఓపి 30 కిలోలు, జిప్సం 200 కిలోలు వేసుకోవాలి. జిప్సం చాలా ముఖ్యం. పూత దశలో (విత్తిన 35–40 రోజులకు) జిప్సం వేయడం వలన కాయలో గింజ బీటగా నిండుతుంది. పొల్ల కాయలు రావు. సూక్ష్మదాతువులు, బోరాన్ లోపం వలన కాయలు లోపల గింజ నల్లబడుతుంది. దీనికి 0.5 శాతం బోరాన్ ను పూత సమయంలో పిచికారీ చేయాలి. చీడ పురుగుల సమగ్ర నివారణ.. ● పొగాకు లద్దె పురుగు, ఎర్ర గొంగలి పురుగు నివారణకు వేపనూనేను పిచికారీ చేసుకోవాలి. ● వేరు పురుగు–సి ఆకారంలో ఉండి భూమి లోపల వేర్లను కత్తిరిస్తుంది. ఈపురుగు ఆశించిన మొక్కలు వాడి ఎండి చనిపోతాయి. నివారణకు క్లోరిపైరిఫాస్ ఫోరేట్ 10 శాతం గుళికలు, ఎకరానికి 6 కిలోల చొప్పున ఇసుకలో కలిపి చల్లుకోవాలి. ● ఆకు ముడత పురుగు: ఈపురుగు విత్తిన 15 రోజుల నుంచి ఆశిస్తుంది. ఆకులపైన గోధుమ రంగుమచ్చలు ఉంటాయి. ఈ పురుగు 2–3 ఆకులను కలిపి గూడు చేసి పచ్చదనాన్ని తినడం వలన ఆకులన్నీ ఎండి కాలిపోయినట్లు కనబడుతాయి. నివారణకు క్లోరిఫైరిపాస్, 500 మి.లీటర్లు లేదా ఎసిఫేట్ 300 గ్రాములు, 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ● శనగపచ్చ పురుగు: ఈ పురుగులు లేత ఆకులపైన మొగ్గలు, పువ్వులపై చేరి రంధ్రాలను ఏర్పరుస్తాయి. నివారణకు ఎకరానికి 4–5 లింగాకర్చక బుట్టలు ఏర్పాటు చేసుకోవాలి. ఒక కిలో బి.టి ఫార్కులేషన్ లేదా 5శాతం వేపనూనె పిచికారీ చేసుకుంటే ఫలితం ఉంటుంది. పాడి–పంట -
జాతీయ ఉత్తమ పోలీస్‌స్టేషన్ రేసులో కోయిలకొండ
మహబూబ్‌నగర్ క్రైం: దేశవ్యాప్తంగా అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న పోలీస్స్టేషన్లను గుర్తించేందుకు కేంద్ర స్థాయిలో నిర్వహించే వార్షిక సర్వేకు మహబూబ్‌నగర్ జిల్లాలోని కోయిలకొండ పోలీస్‌స్టేషన్ షార్ట్‌లిస్ట్ అయింది. ఇందులో భాగంగా ట్రాన్సురురల్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన సర్వే అధికారి సయ్యద్ మహ్మద్ హసన్ బుధవారం కోయిలకొండ పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు. స్టేషన్‌లోని మౌలిక వసతులు, కేసుల దర్యాప్తు, నేర నియంత్రణ, ఫిర్యాదుల పరిష్కారం, పోలీసుల పనితీరు తదితర అంశాలను పరిశీలించి సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్ రూరల్ సర్కిల్ సీఐ బి.గాంధీనాయక్, కోయిలకొండ ఎస్ఐ ఎ.నాగరాజు సర్వే అధికారికి స్వాగతం పలికారు. కాల్వలో పడి మత్స్యకారుడు మృతి కొల్లాపూర్ రూరల్: చేపల వేటకు వెళ్లిన మత్స్యకారు డు ప్రమాదవశాత్తు మృతి చెందిన ఘటన జవాయిపల్లి చెరువుకు సాగునీరు వెళ్లే ప్రధాన కాల్వలో చో టుచేసుకుంది. సర్పంచ్ తెలుగు యాదన్నగౌడ్, బాధిత కుటుంబ సభ్యు లు తెలిపిన వివరాల ప్రకారం.. కొల్లాపూర్ మండలంలోని సింగోటం గ్రామానికి చెందిన మత్స్యకారుడు తెలుగు కృష్ణయ్య (39) బుధవారం తెల్లవారుజామున సింగోటం శ్రీవారి సముద్రం రిజర్వాయర్ నుంచి జవాయిపల్లి గ్రామ చెరువుకు నీరు వెళ్లే ప్రధాన కాల్వలో చేపలు పట్టేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదశాత్తు కాల్వలో పడి మృతి చెందాడు. మృతుడికి భార్య కృష్ణవేణి, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఇటీవల ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్థానిక ఇరిగేషన్ అధికారులు ఎక్కువ సాగునీరు విడుదల చేయడం వల్ల ఆ తాకిడికి ఈ ప్రమాదం జరిగుండొచ్చని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న బాధిత కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని సర్పంచ్ యాదన్నగౌడ్ విజ్ఞప్తి చేశారు. జొన్న మిషన్‌లో ఇరుక్కుని తెగిన రైతు కాలు మహబూబ్‌నగర్ క్రైం: జొన్నలు పట్టే మిషన్‌లో కంకులు వేస్తున్న క్రమంలో రైతు కాలు ప్రమాదవశాత్తు మిషన్‌లో తెగిపడిన ఘటన చోటు కుంది. వివరాలు.. కోయిలకొండ మండలంలోని కళ్యాన్నగర్తండాకు చెందిన రైతు ఉమ్లానాయక్ బుధవారం పొలంలో జొన్న కంకులు మిషన్‌లో వేస్తుండగా.. అతడి కాలు మిషన్‌లో ఇరుక్కుంది. ఈ ప్రమాదంలో అతడి మోకాలు వరకు తెగిపోయింది. స్థానికులు క్షతగాత్రుడిని 108లో జనరల్ ఆస్పత్రికి తరలించగా.. అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. అనుమానాస్పద మృతి.. కేసు నమోదు వెల్దండ: మండల పరిధిలోని తిమ్మినోనిపల్లికి చెందిన కడమంచి అలివేలు (30) అనే వివాహిత అనుమానాస్పద మృతిపై తల్లి రాములమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ యుగందర్‌రెడ్డి తెలిపారు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన శ్రీశైలంకు కల్వకుర్తి తిమ్మరాశిపల్లికి చెందిన అలివేలుకు 12 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. సదరు మహిళ మంగళవారం రాత్రి గ్రామంలోని వినాయకుడి వద్దకు వెళ్లి రాత్రి తిరిగి ఇంటికి వస్తుండగా ఇంటి సమీపంలో పడిపోయింది. గమనించిన గ్రామస్తులు భర్తకు సమాచారం అందించడంతో చికిత్స నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. పోలీసులు పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతురాలికి భర్త శ్రీశైలంతో పాటు కుమారుడు ఉన్నారు. బాధిత కుటుంబానికి సర్పంచ్ శారదా హరికిషన్ రూ.5వేలు అలాగే బీఆర్ఎస్ నాయకులు గండికోట రాజు రూ.2వేలు, ఉప్పట ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.3వేల చొప్పున ఆర్థికసాయం అందజేశారు. -
‘మా టీచర్ ఎక్కడా..?’
ఆనందలక్ష్మి మృతి వార్తతో డీఎంఆర్ఎం పాఠశాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆమెకు నివాళి గా పాఠశాలకు సెలవు ప్రకటించారు. తమకు ఎంతో ఆప్యాయంగా బోధించిన టీచర్ ఇక లేరన్న విషయం తెలియక కొందరు విద్యార్థులు ‘మా టీచర్ ఎక్కడా?’ అంటూ ఆమె మృతదేహం వద్ద కన్నీరు పెట్టుకున్నారు. తోటి ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు నివాళులర్పించారు. ఆనందలక్ష్మి భర్త రాము కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుడే. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆమె నర్వ మండలం బెక్కర్‌పల్లి, అమరచింత మండలం పాంరెడ్డిపల్లిలో సుమారు తొమ్మిదేళ్లు సేవలందించారు. ప్రస్తుతం అమరచింతలోని డీఎంఆర్ఎం పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. ఉత్తమ ఉపాధ్యాయురాలిగా సన్మానం అందుకున్న ఆనందం 24 గంటలు గడవకముందే విషాదంగా మారడం స్థానికులను కలచివేసింది. -
కెమికల్ కంపెనీలతో కాలుష్యం
కృష్ణా: మండల సరిహద్దులోని కర్ణాటక ప్రాంతంలో వెలిసిన కెమికల్ ఫ్యాక్టరీల మూలంగా ప్రతినిత్యం దుర్వాసనతో పలు గ్రామాల ప్రజలు శ్వాసకోశ ఇబ్బందులకు గురవుతున్నారు. దాంతోపాటు ఆ ఫ్యాక్టరీల్లో నిల్వ ఉంచుతున్న వ్యర్థాల మూలంగా ముక్కులు పగిలిపోయే విధంగా దుర్వాసన వస్తుండడంతో ప్రజలు ఆ వాసన భరించలేకున్నారు. ప్రతిరోజు సాయంత్రం అయిందంటే చాలు చల్లగాలికి వచ్చే వాసనకు తట్టుకోలేక పలువురు అనారోగ్యం బారిన పడుతున్నారు. అలాగే మండలంలోని స్నేహ చికెన్, ఇథనా ల్ ఫ్యాక్టరీల నుంచి కూడా భరించలేని దుర్వాసన వస్తున్నట్లు మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. ● కర్ణాటకలోని కడెచూర్ శివారులో ఏర్పాటు చేసిన కెమికల్ ఫ్యాక్టరీల వ్యర్థాలను ప్రతినిత్యం అండర్ గ్రౌండ్ పైప్‌లైన్ ద్వారా తెలంగాణ సరిహద్దులోని గ్రామాలకు అతి సమీపంలో ఉన్న కాల్వకు వదులుతుండడంతో మన ప్రాంతానికి భరించలేని దుర్వాసన వస్తున్నట్లు ప్రజలు వాపోతున్నారు. ఈ విషపూరిత పదార్థాల మూలంగా భవిష్యత్‌లో ఈ ప్రాంతంలో గ్రౌండ్ వాటర్ కలుషితం అవడంతోపాటు భూసారం కూడా దెబ్బతిని, పంటలు పండించలేని దుస్థితి ఏర్పడుతుందని రైతులు ఆరోపిస్తున్నారు. పది గ్రామాలకు ఇబ్బంది రాష్ట్ర సరిహద్దులో కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే పదుల సంఖ్యలో కెమికల్ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసింది. దాంతోపాటు తెలంగాణ, కర్ణాటకలోని ఇతర ప్రాంతాల్లోని ఫ్యాక్టరీల వ్యర్థాలను కూడా ఇక్కడకు తీసుకొచ్చి వాటిని భూమిలోకి వదులుతున్నారు. మన రాష్ట్రంలోని చేగుంట, ఐనాపూర్, కున్సీ, ఆలంపల్లి, మాగనూర్ మండలంలోని కొత్తపల్లి, మాగనూర్, గుర్రావ్లింగంపల్లి, కర్ణాటకలోని బాడియాల్, సైదాపూర్, గూడూర్తోపాటు మరో పది గ్రామాలకు ఈ ఫ్యాక్టరీల నుంచి వెలువడే వాసనకు ప్రజలు శ్వాసకోశ ఇబ్బందులకు గురవుతున్నారు. అఖండ సినిమాలో మాదిరిగ హైదరాబాద్, బెంగళూర్ సుదూర ప్రాంతాల్లోని కంపెనీలు వదిలే అ భయంకరమైన వ్యర్థాలను ఇక్కడకు తీసుకొచ్చి డంపు చేస్తున్నారని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆ విధంగా డంపు చేసిన వ్యర్థాలు భూమిలో కలిసిపోయి గ్రౌండ్ వాటర్ దెబ్బతినే అవకాశం ఉందంటున్నారు. ఏదీఏమైనా ఈ ఫ్యాక్టరీల మూలంగా వల్ల తమ భూములకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఈ విషయంపై జిల్లా అధికారులు చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుతున్నారు. పరిశ్రమల వల్ల ప్రజలకు అనారోగ్యం సాయంత్రం అయిందంటే ముక్కుపుటాలదిరే దుర్వాసన వాసన భరించలేక తలెత్తుతున్న శ్వాసకోశ ఇబ్బందులు కర్ణాటక సరిహద్దులోని కంపెనీలు వదులుతున్న కాలుష్యమే కారణం ఎక్కడెక్కడినుంచో కెమికల్ వ్యర్థాలను తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్న వైనం అటు కర్ణాటకలోని గ్రామాలతోపాటు తెలంగాణ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు -
ఆరు నెలల గర్భిణిని కడతేర్చిన భర్త
లింగాల: కడుపులో బిడ్డను మోస్తున్న ఆ ఇల్లాలు భర్త చేతి లోనే బలైంది. ఆరు నెలల గర్భిణి అయిన గాడ్డుల శివాని(26)ను ఆమె భర్త పరుశరాముడు హత్య చేసి నట్లు పోలీసుల విచారణలో అంగీకరించినట్లు తెలిసింది. తొలుత ఆమె బాత్రూంలో కాలుజారి పడిపోయి స్పృహ కోల్పోయినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి.. ఘటనను ప్రమాదంగా చిత్రించే ప్రయత్నం చేసినట్లు సమాచారం. ఈ ఘటనతో నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం దారారం గ్రామంలో విషాదం అలుముకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. దారారం గ్రామానికి చెందిన గాడ్డుల పరుశరాముడికి వంగూరు మండలం మిట్టసదగోడు గ్రామానికి చెందిన శివానితో ఏడాదిన్నర క్రితం వివాహమైంది. ప్రస్తుతం ఆమె ఆరు నెలల గర్భిణి. కొంతకాలం మండల కేంద్రంలోని ఓ బేకరిలో పనిచేసిన పరుశరాముడు రెండు నెలల క్రితం ఉపాధి కోసం హైదరాబాద్ వెళ్లి అల్వాల్‌లో ఉంటూ ర్యాపిడ్ వాహనం నడుపుతున్నాడు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని, భార్యపై అనుమానం పెంచుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సోమవారం తెల్లవారుజామున మద్యం మత్తులో ఉన్న పరుశరాముడు శివానిని హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం ఆమె బాత్రూంలో కాలుజారి పడిపోయి స్పృహ కోల్పోయిందని మామ వెంకటేష్ ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు తెలిసింది. వారు అక్కడికి చేరుకునేలోపే శివాని మృతిచెందింది. అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఘటనపై విచారణ చేపట్టారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని మంగళవారం దారారం తీసుకొచ్చారు. శివాని మృతదేహాన్ని అత్తింటి ముందు ఉంచి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. ఆమెను హత్య చేసిన భర్తను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పెళ్లి సమయంలో ఇచ్చిన కట్నకానుకలను తిరిగి ఇవ్వాలని పెద్దల సమక్షంలో ఇరు కుటుంబాల మధ్య ఒప్పందం కుదరడంతో ఆందోళన తాత్కాలికంగా విరమించారు. గర్భిణి అయిన శివాని మృతితో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఘటన నేపథ్యంలో అచ్చంపేట సీఐ నాగరాజు ఆధ్వర్యంలో ఎస్ఐలు చంద్రకాంత్, జయన్నతో పాటు లింగాల, బల్మూర్, ఉప్పునుంతల పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ప్రమాదంగా చిత్రీకరించే యత్నం.. పోలీసుల ఎదుట నేరం అంగీకారం మృతదేహంతో అత్తింటి ముందుబంధువుల ఆందోళన.. లింగాల మండలం దారారంలో ఉద్రిక్తత -
విభిన్న రూపాల్లో.. వినాయకుడి వైభవం
పాలమూరులో అనంత పద్మనాభుడి సెట్టింగ్‌లో..జడ్చర్లలో పసుపు కొమ్ముల గణపతి జడ్చర్ల గంజ్ ఏరియాలో మంచు గణపతి ఎర్రవల్లిలో దినపత్రికల గణపయ్యపాలమూరులో బంగారు ఆభరణాలతో విగ్రహం ఉమ్మడి పాలమూరులోని పలు ప్రాంతాల్లో వినాయక చవితి వేళ గణనాథులు విభిన్న రూపాల్లో కొలువుదీరారు. అమర్నాథ్ శివలింగం ఆకృతిలో పసుపు కొమ్ములతో రూపొందించిన వినాయకుడితో పాటు పూలు, పేపర్లు, బంగారంతో ప్రత్యేకంగా తయారు చేసిన గణనాథులను మండపాల్లో ప్రతిష్టించారు. రంగురంగుల అలంకరణల నడుమ కొలువైన ఈ విగ్రహాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తమ సృజనాత్మకతకు పదునుపెట్టి రూపొందించిన గణనాథులను భక్తిశ్రద్ధలతో పూజిస్తూ వేడుకలు నిర్వహించారు. – సాక్షి నెట్వర్క్ -
కేఎల్ఐ కాల్వ నుంచి సాగునీరు విడుదల చేయాలి
● ప్రాజెక్టు ఈఈ వాహనాన్ని అడ్డుకున్న రైతులు కొల్లాపూర్ రూరల్: కొల్లాపూర్ మండలం సున్నపు తండా సమీపంలోని కేఎల్ఐ ప్రాజెక్టు డీ–5 పంటకాల్వ నుంచి సాగునీరు విడుదల చేయాలని మంగళవారం కుడికిల్ల, నార్లాపూర్, సున్నపుతండా తదితర గ్రామాల రైతులు డీ–5 కాల్వ దగ్గర నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. మిషన్ భగీరథ ప్రాజెక్టు పనుల నిమిత్తం పంటకాల్వ లింకును అధికారులు కట్ చేయడంతో మూడురోజుల నుంచి కాల్వకు సాగునీరు రావడం లేదన్నారు. దాదాపు వెయ్యి ఎకరాలలో పంట కాల్వ కింద పంటలు చేశామన్నారు. ఆ పంటలు మూడురోజులుగా సాగునీరు రాకవపోడంతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి పంట కాల్వకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దాదాపు మూడు గంటలుపాటు నిరసన తెలపడంతో ప్రాజెక్టు ఈఈ అమర్‌సింగ్‌తోపాటు అధికారులు రైతుల వద్దకు చేరుకోగా.. అధికారులను రైతులు చుట్టుముట్టి ఆయన వాహనాన్ని అడ్డంగించారు. ఈ సందర్భంగా ఈఈ అమర్‌సింగ్ మాట్లాడుతూ.. భగీరథ పనులు జరుగుతుందున కాల్వ లింకును కట్ చేయడం జరిగిందని తాత్కాలికంగా రిజర్వాయర్ నుంచి కాల్వలకు 50 హెచ్‌పీ మోటార్లతో మూడు పంపుల నుంచి సాగునీరు విడుదల చేస్తున్నామన్నారు. అవసరమైతే హెచ్‌పీని పెంచి ఎక్కువ మోటార్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామన్నారు. రైతులు ఆందోళన చెందవద్దన్నారు. రైతుల పంటలు కాపాడుతామని హామీ ఇవ్వడంతో రైతులు నిరసన విరమించారు. కార్యక్రమంలో రైతులతోపాటు సున్నపుతండా మాజీ ఎంపీటీసీ శంకర్‌నాయక్, బీఆర్ఎస్ మండల సమన్వ కమిటీ సభ్యులు భాస్కర్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
రూ.24.18 లక్షల అల్ఫాజోలం పట్టివేత
● ఆరుగురిపై కేసు.. నలుగురి అరెస్టు మణికొండ: కల్లు తయారీలో ఉపయోగించే అల్ఫాజోలంను అక్రమంగా విక్రయిస్తున్న నలుగురిని సైబరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.24.18 లక్షల విలువైన 1.931 కిలోల అల్ఫాజోలంను స్వాధీనం చేసుకున్నారు. సహాయ కమిషనర్ జి.శ్రీనివాస్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన లింగరాజుగౌడ్, టి.ఆంజనేయులు, ఆర్.రమేష్, కాటమయ్యలు మరో ఇద్దరి నుంచి అల్ఫాజోలం కొనుగోలు చేసి అధిక ధరకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. మంచిరేవులలో నిఘా పెట్టిన అధికారులు వ్యాగనార్ కారులో తరలిస్తున్న ఇద్దరి నుంచి 751 గ్రాములు, ద్విచక్రవాహనంపై వెళ్తున్న మరో ఇద్దరి నుంచి 1.18 కిలోల అల్ఫాజోలంను స్వాధీనం చేసుకున్నారు. సీఐ సేఊర కృష్ణ, ఎస్ఐ రమేష్, ట్రైనీ ఎస్ఐలు రమణ, రమేష్, గిరిలు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన నలుగురితో పాటు కారును, ద్విచక్రవాహనాన్ని గండిపేట ఎకై ్సజ్ స్టేషన్లో అప్పగించారు. ఈ ఘటనపై ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. పెద్ద మొత్తంలో అల్ఫాజోలం పట్టుకున్న ఎన్ఫోర్స్మెంట్ బృందాన్ని డైరెక్టర్ అవినాష్ మహంతి, జాయింట్ కమిషనర్ అంజన్‌రావు, డిప్యూటీ కమిషనర్ జై హరికిషన్ అభినందించారు. బైక్‌ను ఢీకొన్న డీసీఎం.. మహిళ దుర్మరణం శంషాబాద్: అతివేగం.. నిర్లక్ష్యంతో ఓ డీసీఎం వాహనం బైక్‌పై వెళుతున్న వారిని ఢీ కొనడంతో మహిళ దుర్మరణం చెందిన సంఘటన శంషాబాద్ సిద్దాంతిలో చోటు చేసుకుంది. ఆర్జీఐఏ సీఐ సంజీవులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లా ఊరుకొండ గ్రామానికి చెందిన శ్యాంసుందర్ తన భార్య సోని(35) కుమార్తె శాన్వితో కలిసి హైదరాబాద్ నుంచి సొంత గ్రామానికి వెళుతున్నాడు. సోమవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో సిద్దాంతి రైల్వేగేటు సమీపంలో వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని వెనక నుంచి ఐచర్ డీసీఎం వాహనం వేగంగా ఢీ కొనడంతో వెనకాల కూర్చున్న సోని కిందపడిపోయింది. డీసీఎం వెనకభాగం టైరు కూడా ఆమె మీది నుంచి పోవడంతో అక్కడికక్కడే మృతిచెందింది. భర్త శ్యాంసుందర్‌తో పాటు కుమార్తెకు కూడా గాయాలు కావడంతో వారికి వెంటనే ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసిన డీసీఎం డ్రైవర్ కర్ణాటక రాయచూర్‌కు చెందిన బస్వరాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సమీక్షించిన మంత్రి అదె సమయంలో అటుగా వెళుతున్న మంత్రి వాకిటి శ్రీహరి రోడ్డు ప్రమాదాన్ని పరిశీలించి కారులోంచి దిగారు. సంఘటన స్థలం చేరుకున్న పోలీసులతో పరిస్థితిని సమీక్షించి గాయాలపాలైన వారిని ఆస్పత్రికి తరలించి, మృతదేహాన్ని అక్కడి నుంచి తీసుకెళ్లే వరకు ఉన్నారు. సిద్దాంతి వద్ద తరచు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా అధికారుల ఎలాంటిచర్యలు తీసుకోవడం లేదని ఈ సందర్భంగా స్థానికులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. -
అంబులెన్స్ ఢీ కొట్టడంతో.. ఒకరు మృతి
● తాగునీటి కోసం వాహనాన్ని ఆపిన సమయంలో ప్రమాదం చిన్నచింతకుంట: ఆగి ఉన్న టీవీఎస్ ఎక్సల్ వాహనాన్ని అంబులెన్స్ వెనుక నుంచి ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మండలంలోని లాల్కోట ఎక్స్‌రోడ్డు చౌరస్తా వద్ద రైచూర్–హైదరాబాద్ జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఏఎస్ఐ వెంకటస్వామి తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీలేరు గ్రామానికి చెందిన చాకలి మొగిలయ్య(53) తన భార్య చెన్నమ్మతో కలిసి టీవీఎస్ ఎక్సల్‌పై తీలేరు నుంచి దేవరకద్రకు బయలుదేరారు. లాల్కోట చౌరస్తా వద్ద మంచినీటి కోసం వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపారు. చెన్నమ్మ నీటి కోసం సమీపంలోని హోటల్‌కు వెళ్లగా.. మక్తల్ నుంచి మహబూబ్‌నగర్ వైపు వెళ్తున్న మినీ అంబులెన్స్ ఆగి ఉన్న టీవీఎస్ ఎక్సల్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో వాహనంపై కూర్చున్న మొగిలయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుమారుడు యాదయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో యువకుడు.. జడ్చర్ల: బాదేపల్లి నిమ్మబాయిగడ్డ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందినట్లు సీఐ కమలాకర్ తెలిపారు. సీఐ కథనం మేరకు.. మండలంలోని పెద్దపల్లికి చెందిన కోళ్ల రాజశేఖర్‌రెడ్డి(27) ఆదివారం రాత్రి మోటర్ బైక్‌పై ఇంటికి వస్తున్న క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టగా తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే వైద్య చికిత్స కోసం అంబులెన్స్‌లో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడ పరిస్థితి విశమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. మృతుడి తండ్రి భగవంత్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. అనుమానాస్పదంగా కూలీ మృతి మరికల్: అనుమానాస్పద స్థితిలో ఓ కూలీ మృతిచెందిన ఘటన సోమవారం ఎక్లాస్‌పూర్‌లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఎక్లాస్పూర్కు చెందిన చాంద్‌పాషా(48)అదే గ్రామానికి చెందిన ఓ రైతు వరిపంటకు ఫర్టిలైజర్ మందును చల్లేందుకు కూలీగా వెళ్లాడు. అయితే పొలంలో కరెంట్ తీగలు కూడా కిందకు ఉండడంతో విద్యుత్ షాక్ తగిలి మృతిచెందాడా, లేక యూరియా గుళికలతో కూడిన మందు విషప్రభావం వల్ల మృతిచెందాడా అన్న విషయం తెలియాల్సి ఉందని ఎస్ఐ రామ్‌లాల్‌నాయక్ తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నడుము నొప్పి భరించలేక వృద్ధురాలి బలవన్మరణం మానవపాడు: నడుము, మోకాళ్ల నొప్పితో బాధపడుతున్న 86 ఏళ్ల వృద్ధురాలు పురుగు మందు తాగి మృతి చెందిన ఘటన మానవపాడులో చోటుచేసుకుంది. ఎస్ఐ స్వాతి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గోవిందమ్మ కొంతకాలంగా నడుము, మోకాళ్ల నొప్పులతో బాధపడుతోంది. సోమవారం కుమార్తె, అల్లుడు పొలానికి వెళ్లడంతో ఇంట్లో 12 ఏళ్ల మనవరాలితో ఉంది. నొప్పి తీవ్రతతో ఇంట్లో ఉన్న పురుగు మందు తాగింది. గమనించిన మనవరాలు వెంటనే తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు గోవిందమ్మను మానవపాడు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇథనాల్ కంపెనీలో వలస కార్మికుడు.. మరికల్: చిత్తనూర్ ఇథనాల్ కంపెనీలో ఓ వలస కార్మికుడు గదిలో ఉరేసుకొని మృతిచెందిన ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన తుఫాన్ మండల్(19) వలస కార్మికుడు ఆదివారం గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. సోమవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనారోగ్యం కారణంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు తోటి కార్మికుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రామ్‌లాల్‌నాయక్ తెలిపారు. -
జూరాల కాల్వలకు నీటి సరఫరా నిలిపివేత
● ఆందోళనలో అన్నదాతలు..వారబందీపై ఇంకా స్పష్టత కరువు అమరచింత: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి కేవలం 300 క్యూసెక్కుల వరద నీరు మాత్రమే వస్తుండటంతో దిగువకు నీటిని తరలించే కాల్వలకు అధికారులు నీటి సరఫరాను నిలిపివేశారు. జూరాల ప్రధాన ఎడమ, కుడి కాల్వలతో పాటు సమాంతర కాల్వ, భీమా లిఫ్ట్, కోయిల్‌సాగర్, నెట్టెంపాడు, పవర్‌హౌస్‌లకు నీటి విడుదల పూర్తిగా నిలిచిపోయింది. ప్రస్తుతం ప్రాజెక్టులో 5.242 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. వర్షాభావ పరిస్థితులు, వేసవిలో తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని నీటిని రిజర్వు చేయాలనే ఉద్దేశంతో కాల్వలకు సరఫరా నిలిపివేసినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో జూరాల ఆయకట్టులో సాగు చేస్తున్న రైతుల్లో ఆందోళన నెలకొంది. కుడి, ఎడమ కాల్వల పరిధిలో ఈసారి సుమారు 1.10 లక్షల ఎకరాల్లో పంటలు సాగులో ఉన్నాయి. కాల్వలకు నీటి విడుదల నిలిచిపోవడంతో పంటలకు నీరందుతుందా లేదా అన్న సందిగ్ధంలో రైతులు ఉన్నారు. ముఖ్యంగా ప్రస్తుత పంటల దశలో నీటి సరఫరా నిలిచిపోవడం తమకు ఇబ్బందికరంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై జూరాల ప్రాజెక్టు నందిమళ్ల డివిజన్ ఈఈ ప్రవీణ్‌కుమార్‌ను వివరణ కోరగా.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే కాల్వలకు నీటి సరఫరా నిలిపివేసినట్లు తెలిపారు. వారబందీపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదని, అధికారులతో చర్చల అనంతరం ప్రభుత్వ ఆదేశాల మేరకు సాగునీటి విడుదలపై నిర్ణయం వెలువడుతుందని పేర్కొన్నారు. -
నల్లగుట్టపై చిరుత..
● కొండాపూర్ గ్రామస్తుల్లో భయాందోళన ధన్వాడ: మండలంలోని కొండాపూర్ గ్రామ శివారులో నల్లగుట్టపై సోమవారం ఉదయం చిరుత కనిపించడంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. కోయిల్‌కొండ వైపు వెళ్తున్న కొందరు గ్రామస్తులకు చిరుత కనిపించడంతో వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించారు. రెండు రోజుల క్రితం గ్రామ శివారులో పంట పొలాల వద్ద ఓ మేకను చిరుత చంపి తిన్నట్లు స్థానికులు తెలిపారు. దీంతో చిరుతను వెంటనే పట్టుకుని గ్రామాల వైపు రాకుండా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
దాబాలే టార్గెట్.. రాత్రికి రాత్రే మద్యం మాయం
ఖిల్లాఘనపురం: వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలంలోని ప్రధాన రహదారిపై మూసి ఉన్న దాబాల్లో సోమవారం తెల్లవారుజామున దొంగతనాలు జరిగినట్లు నిర్వాహకులు, స్థానికులు తెలిపారు. దొంతికుంట తండా, సోళీపురం గ్రామాల సమీపంలోని దాబాల్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడినట్లు చెప్పారు. సోళీపురం సమీపంలో అంజనేయులు నిర్వహిస్తున్న దాబా వెనుక ఉన్న రేకులను తొలగించి లోపలికి ప్రవేశించిన దుండగులు ఐదు కాటన్ల బీర్లు, 144 క్వార్టర్ బాటిళ్లు, 20 ఆఫ్ బాటిళ్ల విస్కీ, 50 కిలోల బియ్యం, సుమారు రూ.10 వేల విలువైన కిరాణా సామగ్రిని ఎత్తుకెళ్లినట్లు నిర్వాహకుడు తెలిపాడు. దొంతికుంట తండా స్టేజీ సమీపంలోని గన్యానాయక్ దాబాలో రెండు కాటన్ల బీర్లు, ఒక కాటన్ విస్కీ చోరీ అయినట్లు చెప్పారు. కొత్తపల్లి తండా సమీపంలోని విష్ణు దాబా, సోళీపురానికి చెందిన గొల్ల కాశయ్య దాబాల్లోనూ దొంగతనానికి యత్నించినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితులు పేర్కొన్నారు. అయితే దాబాల్లో చోరీపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ వెంకటేష్ తెలిపారు. -
కేఎల్‌ఐకి ‘పాలమూరు’ నీరు
నాగర్‌కర్నూల్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (పీఆర్ఎల్ఐ) నీటిని కేఎల్ఐ ఆయకట్టుకు అనుసంధానించే మరో మార్గం అందుబాటులో ఉంది. నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి కేఎల్ఐ పరిధిలోని ఎల్లూరు రిజర్వాయర్‌కు నీటిని మళ్లించేలా గతంలోనే ఏర్పాటు చేసిన ఇంటర్‌లింక్ స్లూయిస్ ఇందుకు ఉపయోగపడనుంది. నార్లాపూర్–ఎల్లూరు రిజర్వాయర్లను జంట జలాశయాలుగా పరిగణించేలా ఈ అనుసంధానం ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం దీన్ని వినియోగంలోకి తీసుకొస్తే పీఆర్ఎల్ఐ ద్వారా నార్లాపూర్లోకి వచ్చే నీటిని ఎల్లూరుకు మళ్లించి.. అక్కడి నుంచి కేఎల్ఐ పరిధిలోని ఇతర రిజర్వాయర్లకు ఎత్తిపోసే అవకాశం ఉంది. పీఆర్ఎల్ఐ నీటితో కొత్త వెసులుబాటు శ్రీశైలం నుంచి ప్రస్తుతం కేఎల్ఐ ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నారు. ఒక పంపు పనిచేస్తే సుమారు 800 క్యూసెక్కులు, రెండు పంపులు పనిచేస్తే 1,600 క్యూసెక్కుల వరకు నీటిని తరలించే సామర్థ్యం ఉంది. అయితే విద్యుత్ సమస్యలు, పంపుల నిర్వహణ, మరమ్మతుల కారణంగా నిరంతరాయంగా పంపింగ్ చేయడం కష్టంగా మారుతోంది. దీంతో కేఎల్ఐ కాల్వలకు ఆశించిన స్థాయిలో నీరు చేరడం లేదని తెలుస్తోంది. ఈ పరిస్థితిలో పీఆర్ఎల్ఐ ద్వారా శ్రీశైలం నుంచి నీటిని నార్లాపూర్ రిజర్వాయర్‌లోకి ఎత్తిపోసి.. అక్కడి నుంచి ఎల్లూరుకు మళ్లించే అవకాశం ఉందని సంబంధిత ఇంజినీర్లు చెబుతున్నారు. రోజుకు 0.3 టీఎంసీ ఎత్తిపోత పీఆర్ఎల్ఐలో ఒక పంపును రోజంతా నడిపితే సుమారు 0.3 టీఎంసీ నీటిని నార్లాపూర్ రిజర్వాయర్‌లోకి ఎత్తిపోసే అవకాశం ఉంది. నార్లాపూర్ రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 6.4 టీఎంసీలు. ప్రస్తుతం ఇందులో సుమారు 4 టీఎంసీల నీరు ఉన్నట్లు అంచనా. రిజర్వాయర్‌లోకి మరింత నీటిని తీసుకొచ్చే అవకాశం ఉండటంతో.. అవసరమైనప్పుడు ఇంటర్‌లింక్ ద్వారా ఎల్లూరుకు తరలించవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. ఎల్లూరు రిజర్వాయర్ సామర్థ్యం 0.35 టీఎంసీలు. నార్లాపూర్ నుంచి స్లూయిస్ ద్వారా నీటిని ఎల్లూరులోకి విడుదల చేసి.. అక్కడి నుంచి సింగోటం, జొన్నలబొగడ, గుడిపల్లి రిజర్వాయర్లకు ఎత్తిపోసే అవకాశం ఉంది. గుడిపల్లి నుంచి కేఎల్ఐ కాల్వల ద్వారా ఆయకట్టుకు నీటిని విడుదల చేయవచ్చు. అటు నుంచి నీటి తరలింపు.. ఇటు వినియోగంపై ఆందోళన శ్రీశైలం ప్రాజెక్టులో నీటి లభ్యత ఉన్నప్పటికీ.. కృష్ణా జలాల వినియోగంపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య పోటీ కొనసాగుతోంది. ఏపీ ప్రభుత్వం శ్రీశైలం నుంచి వివిధ ఎత్తిపోతల పథకాల ద్వారా నీటిని తరలిస్తున్నదని తెలంగాణకు చెందిన నీటిపారుదల వర్గాలు చెబుతున్నాయి. పోతిరెడ్డిపాడు ద్వారా 8 వేల క్యూసెక్కులు, వెలిగొండ ద్వారా 3,500 క్యూసెక్కులు, హంద్రీ–నీవా, ముచ్చుమర్రి తదితర మార్గాల ద్వారా మరో 3,500 క్యూసెక్కుల వరకు నీటిని తరలించే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి. మొత్తం మీద సుమారు 15 వేల క్యూసెక్కుల వరకు నీరు తరలిపోతే శ్రీశైలం నిల్వలు వేగంగా తగ్గే ప్రమాదం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ తనకు అందుబాటులో ఉన్న నీటిని సమర్థంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని నీటిపారుదల నిపుణులు చెబుతున్నారు. పీఆర్ఎల్ఐ పంపులను అందుబాటులోకి తెచ్చి, నార్లాపూర్–ఎల్లూరు అనుసంధానాన్ని వినియోగిస్తే కేఎల్‌ఐకి నీటి లభ్యత పెంచేందుకు అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. ఆ అవకాశం ఉంది నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి ఎల్లూరు రిజర్వాయర్‌కు నీటిని పంపించే అవకాశం ఉంది. రెండు రిజర్వాయర్ల మధ్య ఇంటర్‌లింక్ నిర్మించారు. పాలమూరు–రంగారెడ్డి నీటిని స్లూయిస్ ద్వారా కేఎల్‌ఐకి సంబంధించిన ఎల్లూరు రిజర్వాయర్‌కు పంపించడానికి వీలుంది. – లోకిలాల్ నాయక్, కేఎల్ఐ డీఈఈ నార్లాపూర్ నుంచి ఎల్లూరు రిజర్వాయర్‌కు మళ్లించే అవకాశం ఇంటర్‌లింక్ స్లూయిస్‌తో రోజూ 800 క్యూసెక్కుల వరకు తరలింపునకు వీలు కేఎల్ఐ పరిధిలో పెరగనున్న నీటి లభ్యత.. ఆయకట్టుకు ప్రయోజనం -
తొలిరోజు 1,311 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు
పాలమూరు: ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, ఇతర ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించే కార్యక్రమాన్ని జిల్లా వైద్యారోగ్యశాఖ ప్రారంభించింది. తొలిరోజు ఏనుగొండ కేజీబీవీ అర్బన్ పాఠశాలలో డీఎంహెచ్‌వో డాక్టర్ శ్రీనివాస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ సెక్టార్లో చదువుతున్న విద్యార్థులకు దశలవారీగా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్‌వో తెలిపారు. గతంలో పరీక్షల్లో కంటి సమస్యలు గుర్తించిన విద్యార్థులకు అద్దాలు పంపిణీ చేయడంతోపాటు, ప్రస్తుతం కొత్తగా కూడా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆర్బీఎస్కేకు చెందిన ఆరు బృందాలు తొలిరోజు మొత్తం 1,311 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించాయి. వీరిలో 124 మందికి కంటి సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. సంబంధిత విద్యార్థులకు అవసరమైన అద్దాలు పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లా అంధత్వ నివారణ అధికారి డాక్టర్ సునీత, కేజీబీవీ ప్రిన్సిపాల్ నర్సమ్మ, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ శశికాంత్, వైద్యులు పులి విద్య, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
గిరిజన సంక్షేమానికి కేసీఆర్ పెద్దపీట
● 17న తండాల్లో కార్యక్రమాలు: లక్ష్మారెడ్డి జడ్చర్ల: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి కేసీఆర్ పెద్దపీట వేశారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి సి.లక్ష్మారెడ్డి అన్నారు. కేసీఆర్ చేపట్టిన కార్యక్రమాలను గుర్తు చేసుకుంటూ ఈనెల 17న జిల్లాలోని అన్ని తండాల్లో కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. మంగళవారం జడ్చర్లలోని అంబేద్కర్ కళాభవన్‌లో ఆయన మాట్లాడుతూ తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడంతో పాటు గిరిజన రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచామని తెలిపారు. తాగునీరు, రహదారుల కల్పనతో తండాల రూపురేఖలు మార్చామని, గిరిజన విద్యార్థుల కోసం గురుకులాలు ఏర్పాటు చేసి ఉన్నత విద్యకు అవకాశాలు కల్పించామని పేర్కొన్నారు. రైతుబంధు, రైతు బీమా, 24 గంటల విద్యుత్ వంటి పథకాలతో రైతులకు అండగా నిలిచామని అన్నారు. ఎమ్మెల్యేపై విమర్శలు స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి తనపై, తన కుటుంబంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని లక్ష్మారెడ్డి విమర్శించారు. భూ కబ్జాలకు సంబంధించి ఒక్క గజం అక్రమాన్ని కూడా నిరూపించలేదన్నారు. రంగారెడ్డిగూడ దేవాదాయ భూములు, జడ్చర్ల భూదాన్ భూమి, బాదేపల్లి నల్లకుంట ఎఫ్టీఎల్ ఆక్రమణలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి విషయంలో తాము సహకరిస్తామని, అర్థం లేని ఆరోపణలు మానుకోవాలని ఎమ్మెల్యేకు సూచించారు. సమావేశంలో మాజీ ఎంపీపీ లక్ష్మినాయక్, నాయకులు నందకిషోర్, రామ్మోహన్, మురళి, లత, ప్రణీల్ ,శ్రీనివాస్‌యాదవ్, తదితరులు పాల్గొన్నారు. -
సీహెచ్‌సీలో మందుల స్టాక్ ఉండాలి
● ఇన్సులిన్ లేకపోవడంపై వైద్యాధికారులపై కలెక్టర్ ఆగ్రహం పాలమూరు: కోయిలకొండ మండలంలో మంగళవారం పర్యటించిన కలెక్టర్ ఖుష్బూ గుప్తా పలు ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలను తనిఖీ చేశారు. ఎంపీడీఓ కార్యాలయంలో సిబ్బంది హాజరు, పిటిషన్లను పరిశీలించి పెండింగ్ సమస్యలపై ఆరా తీశారు. అనంతరం సీహెచ్‌సీని సందర్శించి వైద్య సేవలు, మందుల నిల్వలను పరిశీలించారు. రోగులతో మాట్లాడగా ఐరన్ మాత్రలు, ఇన్సులిన్ అందుబాటులో లేవని వారు తెలిపారు. దీంతో ఇన్సులిన్ స్టాక్ వెంటనే తెప్పించాలని డీఎంహెచ్ఓను ఆదేశించగా.. మహబూబ్‌నగర్ నుంచి మందులు పంపించారు. ఆస్పత్రిలో అవసరమైన మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని వైద్యులను ఆదేశించారు. అనంతరం బీసీ బాలుర వసతిగృహాన్ని తనిఖీ చేసి ఆహార సరుకులు, విద్యార్థులకు అందుతున్న అల్పాహారం, భోజనంపై ఆరా తీశారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి దోమల నివారణకు ఫాగింగ్ చేయాలని, పనిచేయని ఫ్యాన్లను వెంటనే మరమ్మతు చేయాలని ఆదేశించారు. బూర్గుపల్లి సర్పంచ్ ప్రస్తావించిన చెక్కుల సమస్యను పరిష్కరించాలని ఎంపీడీవోకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో ధనుంజరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ధనుంజరావు ఇతర అధికారులుపాల్గొన్నారు. -
ఆరుగురు ప్రొఫెసర్లలో ఒక్కరికే..
పాలమూరు యూనివర్సిటీలో అకడమిక్, అడ్మినిస్ట్రేషన్ పరంగా ఆరుగురు ప్రొఫెసర్లు పిండి పవన్‌కుమార్, కిషోర్‌కుమార్, నూర్జహాన్, జైపాల్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, చంద్రకిరణ్‌కు అనుభవం ఉంది. వీరిలో ప్రొఫెసర్ చంద్రకిరణ్‌కు తప్ప.. మిగతా ఐదుగురు సీనియర్లకు ఏ రకమైన కీలక బాధ్యతలు ఇవ్వకుండా మొండిచేయి చూపడం చర్చనీయాంశంగా మారింది. గతంలో రిజిస్ట్రార్‌గా సుదీర్ఘ అనుభవం ఉన్న ప్రొఫెసర్ మధుసూదన్‌రెడ్డికి పీజీ కళాశాల ప్రిన్సిపాల్‌తో పాటు వీసీ ఓఎస్డీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఒక్కరికి 2, 3 బాధ్యతలు.. యూనివర్సిటీ పరిధిలోని ఎనిమిది ప్రిన్సిపాల్ పోస్టుల్లో ఏకంగా ఐదింటిని కాంట్రాక్ట్ అధ్యాపకులతో భర్తీ చేయడం.. ఒక్కరికి రెండు, మూడు పోస్టుల చొప్పున ఇవ్వడం.. ప్రొఫెసర్ హోదాలో ఉన్న సీనియర్లను కీలక బాధ్యతల నుంచి తప్పించడం, నామమాత్రపు పోస్టుల్లో నియమించడం విమర్శలకు తావిస్తోంది. రెగ్యులర్ పోస్టుల్లో పనిచేస్తున్న వారిని కాదని.. కాంట్రాక్ట్ అధ్యాపకులకు ప్రాధాన్యమివ్వడంపై విద్యార్థుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
17న ఆశీస్సుల దీపం కార్యక్రమం
పాలమూరు: ఈనెల 17న దేశ ప్రధాని మోదీ పుట్టిన రోజు సందర్భంగా అదేరోజు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు ఆశీస్సుల దీపం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎంపీ డీకే అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. మోదీ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని దేశానికి మరింత సేవ చేయాలనే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల ఎదుట ఆశీస్సుల దీపం వెలిగించాలని కోరారు. బ్రహ్మోస్ భూసేకరణపై రైతులతో సమావేశం దేవరకద్ర: బ్రహ్మోస్ యూనిట్ ఏర్పాటు కోసం చేపడుతున్న భూసేకరణ పక్రియలో భాగంగా మంగళవారం ఆర్డీఓ నవీన్ ఆధ్వర్యంలో అధికారుల బృందం రైతులతో సమావేశం నిర్వహించి చర్చించారు. భూసేకరణకు సంబంధించిన అంశాలపై రైతుల అభిప్రాయాలను, అభ్యంతరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వివిధ అంశాలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. రైతుల వారీగా చెప్పిన అభిప్రాయాలను నమోదు చేసుకుని ప్రభుత్వ నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు చేపడతామని అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో తహసీల్దార్ హర్షద్, ఆర్ఐ శరత్, సర్పంచ్ శివకుమార్, సర్వేయర్, రైతులు పాల్గొన్నారు. ఖేలో ఇండియాకు ‘యోగా’ సెలక్షన్ ట్రయల్స్ మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో మంగళవారం ఖేలో ఇండియా యూత్ గేమ్స్ జిల్లాస్థాయి యోగా సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించారు. జిల్లాస్థాయిలో ఎంపికై న క్రీడాకారులు హైదరాబాద్ యూసుఫ్‌గూడలోని కేవీబీఆర్ ఇండర్ స్టేడియంలో ఈనెల 17న (బాలుర), 18న (బాలికల) రాష్ట్రస్థాయి ఖేలో ఇండియా యోగా సెలక్షన్ ట్రయల్స్‌లో పాల్గొంటారని జిల్లా యువజన, క్రీడల అధికారి జె.రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు ఆయా తేదీల్లో ఉదయం 8.30 గంటలకు పోటీ ప్రాంగణంలో రిపోర్టు చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడాశాఖ కార్యాలయ సూపరింటెండెంట్ కె.ఆనందం, సీనియర్ అసిస్టెంట్ పి.రవీందర్‌రెడ్డి, డీఎస్ఏ యోగా కోచ్ కె.సాయికుమార్, తదితరులు పాల్గొన్నారు. -
నచ్చితే నజరానా.. ప్రశ్నిస్తే పనిష్మెంట్!
పాలన సూపర్ అంటే చాలు.. నజరానాగా కీలక పోస్టుల్లో నియామకం.. మీ వెనుకే ఉంటాం అంటే అందలం.. ప్రశ్నిస్తే మాత్రం పనిష్మెంట్.. ..పాలమూరు యూనివర్సిటీలో బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థుల్లో ఇటీవల జరుగుతున్న చర్చ ఇది. విశ్వవిద్యాలయ పరిపాలనలో ముఖ్య భూమిక వహిస్తున్న వారు సీనియర్లు, రెగ్యులర్ అధ్యాపకులపై వివక్ష ప్రదర్శిస్తూ.. అనుభవం లేకున్నా తమ అనుకూల వర్గానికి కీలక పోస్టులు కట్టబెట్టడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఫలితంగా అధ్యాపకులు, సిబ్బంది రెండు (రెగ్యులర్, కాంట్రాక్ట్) గ్రూప్‌లుగా చీలిపోగా.. అంతర్గత వార్ ముదిరినట్లు సమాచారం. పాలకుల ఏకపక్ష వైఖరి, అసమర్థ నిర్ణయాలతో పీయూలో పాలనగాడి తప్పిందనే విమర్శల నేపథ్యంలో ప్రత్యేక కథనం.. – సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ పాలమూరు యూనివర్సిటీలో ఇష్టారాజ్యంగా పాలన సీనియర్లు, రెగ్యులర్ అధ్యాపకులపై వివక్ష 8 ప్రిన్సిపాల్ పోస్టుల్లో ఐదింట కాంట్రాక్ట్ లెక్చరర్లే.. ఆరుగురు ప్రొఫెసర్లలో ఒక్కరికే కీలక బాధ్యతలు అనుభవం ఉన్నా.. మిగతా వారికి మొండిచేయి -
బోనస్ కావాలంటే.. నమోదు తప్పనిసరి
● ఈ నెల 17వ తేదీ వరకు అవకాశం మహబూబ్‌నగర్ (వ్యవసాయం): రాష్ట్ర ప్రభుత్వం వానాకాలం సీజన్లో సన్న వరి సాగు చేస్తున్న రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. సన్న రకం ధాన్యం పండించే ప్రతి రైతుకు క్వింటాలుకు అదనంగా రూ. 500 చొప్పున బోనస్ అందజేయనున్నట్లు ప్రకటించింది. ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునే రైతులు నిర్ధేశిత నిబంధనలను పాటించి సకాలంలో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వానాకాలం–2026లో జిల్లాలో సుమారు 1.70 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందులో సన్న, దొడ్డు రకాల వరిని రైతులు సాగు చేస్తున్నారు. ప్రభుత్వం సన్న రకాలకు బోనస్ ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో అర్హులైన రైతులు తమ పేర్లను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ సూచించింది. ఈనెల 17వ తేదీ వరకు నమోదు చేసుకునేందుకు అవకాశం ఉందని తెలిపింది. ప్రభుత్వం బోనస్‌కు నిర్దేశించిన సన్న రకాలలో తెలంగాణ సోనా (ఆర్ఎన్ఆర్ 15048), బీపీటీ 5204, జై శ్రీరామ్, హెచ్ఎంటీ సోనా, కేఎన్ఎం 1638, కేఎన్ఎం 8715, డబ్ల్యూజీఎల్–44 ఉన్నాయి. ఈ ఏడు రకాల్లో ఏదైనా సాగు చేసిన రైతులు మాత్రమే తమ పంట వివరాలను నమోదు చేసుకోవాలని అధికారులు తెలిపారు. విత్తన దుకాణంలోనే నమోదు రైతులు సన్న రకం వరి విత్తనాలను కొనుగోలు చేసినప్పుడు సంబంధిత విత్తన దుకాణంలోనే తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు. రైతుల వద్ద సొంతంగా ఉన్న సన్న రకం విత్తనాలను సాగు చేసినట్లయితే సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించి వివరాలను నమోదు చేయించుకోవాలి. విత్తన దుకాణంలో అప్పట్లో నమోదు చేసుకోని రైతులు విత్తనం కొనుగోలు చేసిన రశీదును చూపించి అదే దుకాణంలో తమ పేర్లు నమోదు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. నమోదైన వివరాలు డిజిటల్‌గా భద్రపరుచబడతాయని, భవిష్యత్తులో బోనస్ చెల్లింపుల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా రైతులు సకాలంలో నమోదు చేసుకోవాలని కోరారు. డిజిటల్ క్రాప్ సర్వేలోనూ వివరాలు ప్రస్తుతం జిల్లాలో డిజిటల్ క్రాప్ సర్వే కొనసాగుతున్న నేపథ్యంలో రైతులు తమ పొలం వద్దకు వచ్చే సర్వే సిబ్బందికి పంట వివరాలను సరైన రీతిలో నమోదు చేయించుకోవాలి. బోనస్ పొందేందుకు అవసరమైన వివరాల నమోదులో రైతులు సహకరించాలి – గోవింద్‌నాయక్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి -
విమోచన దినోత్సవాన్ని కాంగ్రెస్ విస్మరిస్తోంది
● బీఆర్ఎస్ బాటలోనే కొనసాగుతోంది:ఎంపీ డీకే అరుణ చిన్నచింతకుంట: తెలంగాణ విమోచన దినోత్సవా న్ని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తోందని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ విమోచన దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా శనివారం కౌకుంట్ల మండలం అప్పంపల్లిలోని అమరవీరుల స్థూపం వద్ద ఆమె నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులైన వారి త్యాగాలు చిరస్మరణీయమన్నారు. సెప్టెంబర్ 17ను పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో విమోచన వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ నేతలు ఎన్నో హామీలు ఇచ్చినా.. అధికారంలోకి వచ్చిన తర్వాత విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించలేదని అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో కొనసాగుతోందని ఆరోపించారు. తెలంగాణ అమరవీరులపై ఏమాత్రం గౌరవం ఉన్నా.. వెంటనే సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. రజాకార్ల నిరంకుశత్వానికి అప్పంపల్లి రావిచెట్టు సాక్ష్యంగా నిలిచిందన్నారు. అమరుల రక్తంతో తడిసిన ఈ నేల ఎంతో పవిత్రమైనదని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు రతంగ్ పాండురెడ్డి, పడాకుల శ్రీనివాస్, డోకూర్ పవన్‌కుమార్‌రెడ్డి, నంబిరాజు, యజ్ఞభూపాల్రెడ్డి, కుర్వరమేష్, ప్రశాంత్‌రెడ్డి, బలరాం రెడ్డి, దశరథ్, లక్ష్మి, వీరబ్రహ్మచారి, రఘురామయ్య, తిరుపతిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. అప్పంపల్లి గ్రామంలో అమరవీరుల స్థూపం వద్ద నివాళ్లు అర్పిస్తున్న ఎంపీ డీకే అరుణ -
ప్రసాదాల విక్రయ వేలం రూ.61 లక్షలు
చిన్నచింతకుంట: కురుమూర్తి స్వామి ఆలయంలో లడ్డు, పులిహోర ప్రసాదాల విక్రయ హక్కులు రూ.61.01 లక్షలకు వేలం పలికింది. స్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శనివారం ఆలయ ప్రాంగణంలో ప్రసాదాల విక్రయానికి బహిరంగ, సీల్డ్ కవర్ వేలం నిర్వహించారు. ఈ వేలంలో హన్వాడ మండలం కాకర్లపాడుకు చెందిన వెంకటయ్య రూ.61,00,111కు లడ్డు, పులిహోర విక్రయ హక్కులను దక్కించుకున్నారు. అదేవిధంగా విద్యుత్ అలంకరణ పనులను అమరచింతకు చెందిన ప్రవీణ్ రూ.3,49,999కు, రంగులు వేసే పనులను తిర్మలాపురానికి చెందిన ప్రవీణ్ రూ.3.65 లక్షలకు దక్కించుకున్నారు. ఉప సర్పంచ్ చెక్ పవర్ రద్దు చేయాలి జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ఉప సర్పంచ్‌లకు ఉన్న చెక్ పవర్‌ను రద్దు చేయాలని సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి డిమాండ్ చేశారు. శనివారం పీఆర్ శాఖ మంత్రి సీతక్కను కలిసి సంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు. పెండింగ్ గౌరవ వేతనాలు, పంచాయతీ నిధులు విడుదల చేయాలని, విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే చెల్లించాలని కోరారు. 15వ ఆర్థిక సంఘం నిధులు, మ్యాచింగ్ గ్రాంట్లు విడుదల చేయాలని, ఇందిరమ్మ కమిటీలతో సర్పంచ్ల అధికారాలను తగ్గించే జీఓను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బత్తుల వెంకట్రాములుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పతకాలు సాధించాలి మహబూబ్‌నగర్ క్రీడలు: రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభచాటి పతకాలు సాధించాలని జిల్లా అథ్లెటిక్స్ సంఘం ప్రధాన కార్యదర్శి జి.శరత్చంద్ర అన్నారు. హనుమకొండలో ఈనెల 26, 27 తేదీల్లో జరిగే జూనియర్ అండర్–14, అండర్–16, అండర్–18, అండర్–20 ఏళ్లలోపు బాలబాలికలు, పురుషుల, మహిళా రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనే జిల్లా క్రీడాకారుల ఎంపికలను శనివారం జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో నిర్వహించారు. ఈ సందర్భంగా శరత్చంద్ర జెండాఊపి ఎంపికలను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ అథ్లెట్లు రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు సాధించి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఎంపికల్లో దాదాపు 150 మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు తెలిపారు. ఎంపికై న తుది జట్టును త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. కోచ్‌లు ఆనంద్‌కుమార్, సునీల్‌కుమార్, శ్రీనివాస్, పీడీలు సి.శ్రీనివాసులు, రమేష్‌బాబు, ఎ.శ్రీనివాస్, రాజు, వినోద్‌కుమార్, శ్రీనివాసులు, రాజు, పి.శ్రీనివాస్ పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో 4 పతకాలు మహబూబ్‌నగర్ క్రీడలు: కరీంనగర్లో శనివారం జరిగిన రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో ఉమ్మడి జిల్లా క్రీడాకారులు నాలుగు కాంస్య పతకాలు సాధించారు. 8–10 ఏళ్ల విభాగంలో రిత్విక్‌రెడ్డి, 10–12 ఏళ్ల విభాగంలో దౌసిక్ శ్రీప్రసాద్, 14–16 ఏళ్ల విభాగంలో ఎం.శివతేజ, 16–18 ఏళ్ల విభాగంలో సీహెచ్.అఖిల్ మూడోస్థానంలో నిలిచి కాంస్య పతకాలు గెలిచారు. అదే విధంగా 12–14 ఏళ్ల బాలుర విభాగంలో జయచంద్ర నాలుగోస్థానం, బాలికల విభాగంలో ఎం.రూప ఐదోస్థానం, 16–8 ఏళ్ల బాలుర విభాగంలో ఎన్.మధు ఆరో స్థానంలో నిలిచారు. పతకాలు సాధించిన విద్యార్థులను ఉమ్మడి జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఆనంద్‌కుమార్‌గౌడ్, టి.చంద్రశేఖర్, చైర్మన్ శాంతికుమార్, కార్యనిర్వాహక కార్యనిర్వాహక చైర్మన్ కె.రాములు అభినందించారు. -
మచ్చలే మకుటంగా.. నల్లమల రాజసం
అచ్చంపేట: నల్లమల గిత్తగా పేరొందిన తూర్పు పొడ జాతి పశువులకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఒంగోలు గిత్తకు ప్రత్యేక గుర్తింపు ఉండగా.. తెలంగాణలో నల్లమల ప్రాంతంలోని మన్ననూర్ గిత్తకు ప్రత్యేక హోదాకు నోచుకోలేకపోతోంది. రాష్ట్రానికి గర్వకారణమైన ఈ జాతికి అరుదైన గౌరవం ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ ప్రాంత పశువుకు గౌరవం కల్పించేందుకు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ 2025 మే నెలలో అమ్రాబాద్ మండలం మాచారం వచ్చిన సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి సైతం తీసుకెళ్లారు. లోతట్టు అభయారణ్యంలో.. నల్లమల లోతట్టు అటవీ ప్రాంతంలోని చెంచుపెంటల్లో ఉండే మేలుజాతి పశువులకు వందేళ్లకుపైగా చరిత్ర ఉంది. అమ్రాబాద్, పదర మండలాల పరిధిలోని మద్దిమడుగు, ఇప్పలపల్లి, మారడుగు, ఉడిమిళ్ల, చిట్లంకుంట, వంకేశ్వరం, పదర, లక్ష్మాపూర్, తిర్మలాపూర్, ఉప్పునుంతల, మాధవానిపల్లి, అమ్రాబాద్, మన్ననూర్, వటువర్లపల్లి, దోమలపెంట గ్రామాలతో పాటు మల్లాపూర్, అప్పాపూర్, ఈర్లపెంట, మేడిమొల్కల, ఆగర్లపెంట, పుల్లాయిపల్లి, సంగండిగుండాలు చెంచుపెంటల్లో ఈ పశుజాతి ఉంది. ఈ గ్రామాల రైతులు వ్యవసాయంతోపాటు పశుపోషణ ప్రధాన వృత్తిగా ఎంచుకుని పనిచేస్తున్నారు. కోడె దూడలకు డిమాండ్ వ్యవసాయ అనుబంధమైన పశు పోషణలో ఈ ప్రాంత రైతులు ప్రగతి సాధిస్తున్నారు. నల్లమల తూర్పు పశు సంపదకు తెలంగాణతోపాటు ఆంధ్ర, రాయలసీమ, కర్ణాటక రాష్ట్రంలో మంచి డిమాండ్ ఉంది. కర్నూలు, గుంటూరు, నెల్లూరు, అనంతపూర్, రాయచూర్‌తోపాటు కోస్గి, కొడంగల్ రైతులు దశాబ్దాల కాలంగా మేలుజాతి కోడెలను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. వ్యాపారులు ఈ ప్రాంతంలో ఉంటూ పశువులను పరిశీలించి నచ్చిన వాటిని కొనుగోలు చేసేవారు. ప్రతిఏటా దీపావళి తర్వాత జరిగే కురుమూర్తి జాతరలోనూ నల్లమల పశువులను అమ్ముతారు. అటవీ ప్రాంతంలో రాళ్లు, రప్పలు, ఎత్తైన గుట్టలు, లోయ ప్రాంతంలోనూ నడిచే శక్తి ఉంటుంది. కాళ్ల గిట్టలు గుర్రం గిట్టలను పోలి బలంగా ఉండటంతో బాగా నడుస్తాయి. అటవీ మేతతో దృఢంగా ఉండడం, 20– 25 ఏళ్లపాటు వ్యవసాయ పనులు చేసే సామర్థ్యం కలిగి ఉండటం వల్ల వీటిపై ఆసక్తి చూపుతారు. రోగ నిరోధక శక్తి కలిగి ఉండి పాలు సైతం బాగా ఇస్తాయి. తెలంగాణ బ్రాండ్‌గా తూర్పు పొడ జాతి పశువులు లోతట్టు ప్రాంతంలో మేలురకం పశు సంపద అమ్రాబాద్ గిత్తకు వందేళ్లకుపైగా చరిత్ర 500 మంది రైతులు.. 20 వేల పశువుల పెంపకం 2020లో ప్రత్యేక పశువుగా గుర్తింపు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అరుదైన గౌరవం కోసం ఎదురుచూపు -
ప్రతి నెలా ఇతరులను అడగాల్సిందే..
పెళ్లయి 15 ఏళ్లు అవుతోంది. అప్పటి నుంచి హెచ్‌పీ గ్యాస్‌నే వినియోగిస్తున్నాం. ఉమ్మడి కుటుంబంగా ఉన్నప్పుడు ఒకే గ్యాస్ కుండతో పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. ప్రస్తుతం కుటుంబం విడిపోయి వేరుగా ఉంటున్నాం. దీంతో వంటకు గ్యాస్ అవసరం పెరిగింది. అదనంగా మరో గ్యాస్ కుండ ఇవ్వాలని సంబంధిత ఏజెన్సీని అడిగినా స్పందించడం లేదు. ఒకే కుండ ఉండటంతో అది ఖాళీ అయిన ప్రతిసారీ కొత్త కుండ వచ్చేవరకు వంట చేసుకోవడం ఇబ్బందిగా మారుతోంది. వంట ఆగిపోకుండా ఉండేందుకు ప్రతి నెలా బంధువులు, పరిచయస్తుల వద్ద గ్యాస్ కుండ కోసం అడగాల్సి వస్తోంది. – పి.నారాయణమ్మ, మహబూబ్‌నగర్ -
గ్యాస్.. గోస
మహబూబ్‌నగర్ రూరల్: ఇంట్లో పొయ్యి వెలగాలంటే గ్యాస్ ఉండాలి.. సిలిండర్ ఖాళీ అయితే వెంటనే మరో సిలిండర్ రావాలి. కానీ, ప్రస్తుతం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. గ్యాస్ బుకింగ్ చేసినా సరైన సమయంలో సిలిండర్ అందకపోవడం, కొత్త కనెక్షన్ కోసం నెలల తరబడి ఎదురుచూడాల్సి రావడం, అదనపు సిలిండర్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం లేకపోవడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా కొత్తగా రేషన్‌కార్డులు పొందిన కుటుంబాలు, కొత్తగా పెళ్లయిన జంటలు గ్యాస్ కనెక్షన్ కోసం ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నారు. గృహ అవసరాలకు కొత్త ఎల్పీజీ కనెక్షన్లు, అదనపు సిలిండర్ల కేటాయింపుపై స్పష్టత లేకపోవడం సమస్యను మరింత జటిలం చేస్తోంది. కొత్త జంటలకు.. గ్యాస్ గండం వంట గ్యాస్ కోసం వినియోగదారులు అల్లాడిపోతున్నారు. కొత్తగా రేషన్‌కార్డులు పొందిన వారు, కొత్తగా పెళ్లయిన జంటలు గ్యాస్ కనెక్షన్ కోసం నెలల తరబడి ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే గతంలో దరఖాస్తు చేసుకున్న అనేక మంది దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉన్నాయి. మరికొందరు దరఖాస్తులు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. కేంద్రం ఆదేశాలతో హెచ్‌పీసీఎల్, ఐఓసీ, బీపీసీఎల్ కంపెనీలు కొత్త గ్యాస్ కనెక్షన్ల జారీని నిలిపివేశాయి. యుద్ధం ప్రారంభం కావడానికి ముందు కొత్త గ్యాస్ కనెక్షన్ అడిగిన వెంటనే లభించేది. ప్రస్తుతం గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు ఉన్నందున కొత్త కనెక్షన్ల జారీకి ఇంకా ఎంతకాలం పడుతుందో తెలియడం లేదు. చమురు సంస్థలు ప్రస్తుతం ఉన్న వినియోగదారుల అవసరాలకే ప్రాధాన్యత ఇస్తున్నాయి. దీంతో గృహ అవసరాలకు సంబంధించి కొత్త ఎల్పీజీ కనెక్షన్లు, అదనపు సిలిండర్ల కేటాయింపులు ఇవ్వడం లేదు. హోటళ్లు, రెస్టారెంట్లు, వ్యాపార సంస్థల కార్యకలాపాలు నిలిచిపోకుండా ఉండేందుకు వాణిజ్య అవసరాలకు ప్రాధాన్యత ఇస్తోంది. అయితే గృహ అవసరాలకు కొత్త కనెక్షన్లు ఇవ్వకపోవడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుత పరిస్థితులు కొత్తగా పెళ్లయిన జంటలకు శాపంగా మారాయి. కొందరు కొత్త గ్యాస్ సిలిండర్ బాధ్యత అత్తామామలపై పెడుతుండగా.. డబుల్ సిలిండర్లు ఉన్నవారు ఒక సిలిండర్ కొత్త జంటలకు ఇచ్చి పంపుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు డబుల్ సిలిండర్లు ఉన్నవారి నుంచి అధిక ధర చెల్లించి సిలిండర్లు కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు ప్రత్యామ్నాయ మార్గంగా ఇండక్షన్ స్టౌలు కొందామంటే మార్కెట్లో ఇవి వెంటనే దొరకడం లేదు. కొత్త కనెక్షన్లు మళ్లీ ప్రారంభించే తేదీని చమురు సంస్థలు అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తాయా..? అని అందరూ ఎదురుచూడాల్సి వస్తుంది. నగర శివార్లలోనే ఎక్కువ మంది కొత్త గ్యాస్ కనెక్షన్ల కోసం ఎదురుచూస్తున్నారు. డీలర్ల చుట్టూ ప్రదక్షిణలు కొత్త గ్యాస్ కనెక్షన్ల కోసం ఎల్పీజీ డీలర్ల చుట్టూ ప్రజలు ప్రదక్షిణలు చేస్తున్నారు. కొత్త కనెక్షన్లు కాకుండా చిరునామా మారిన వారు, ఎల్పీజీ కనెక్షన్లకు సంబంధించిన పత్రాల్లో మార్పులు, చేర్పుల కోసం కూడా నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కొత్త కనెక్షన్లు ఇచ్చేటప్పుడే పత్రాల్లో మార్పులు చేస్తామని చెబుతున్నారు. మరోవైపు ఓటర్ల జాబితా సవరణ (సర్) నోటీసులు అందుకున్న వారు చిరునామా ధ్రువీకరణ కోసం, అలాగే ఆధార్‌లో మార్పుల కోసం ఎల్పీజీ కనెక్షన్ పత్రాలను ఆధారంగా చూపించేందుకు అవకాశం ఉంది. అయితే గ్యాస్ బుక్‌లో చిన్నపాటి మార్పులు గతంలో వెంటనే చేసేవారు. ఇప్పుడు వీటిని సవరించుకునే అవకాశం లేదంటున్నారు. కొత్త గ్యాస్ కనెక్షన్లు ఇచ్చేటప్పుడే వీటిని కూడా సవరిస్తామంటున్నారు. దీంతో ఆధార్‌లో సవరణలు, సర్ కోసం ధృవీకరణ పత్రాలు సమర్పించాల్సిన అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. బుకింగ్ గడువులో తీవ్ర ఇబ్బందులు కొత్త ఎల్పీజీ కనెక్షన్లకు నిరీక్షణ డబుల్ సిలిండర్ దొరకక తిప్పలు స్పష్టత ఇవ్వని గ్యాస్ ఏజెన్సీలు జిల్లాలో 3.92 లక్షల కనెక్షన్లు -
కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ రాజమార్గం
పాలమూరు: కేసులను రాజీ మార్గంలో పరిష్కరించుకోవడం ద్వారా కక్షిదారులకు సమయం, డబ్బు ఆదా కావడంతో పాటు ప్రశాంతమైన జీవనం సాగించే అవకాశం ఉంటుందని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.ప్రేమలత అన్నారు. ఒకసారి కేసును రాజీ చేసుకుంటే జీవితకాలంలో తిరిగి అదే వివాదంతో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉండదన్నారు. జిల్లా ప్రధాన కోర్టు ఆవరణలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌ను ఆమె ప్రారంభించారు. కక్షిదారుల మధ్య స్నేహపూర్వక వాతావరణంలో వివాదాలకు పరిష్కారం చూపేందుకు లోక్ అదాలత్ దోహదపడుతుందని తెలిపారు. ఈ ఏడాది నిర్వహించిన మూడో జాతీయ లోక్ అదాలత్‌లో భాగంగా దేవరకద్ర కోర్టులోనూ ప్రత్యేక బెంచీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సివిల్, క్రిమినల్, డ్రంకన్ డ్రైవ్, చెక్‌బౌన్స్, ఇన్సూరెన్స్, రోడ్డు ప్రమాద తదితర కేసులను పరిష్కరించినట్లు వివరించారు. మూడు కోర్టుల్లో 7,075 కేసులు రాజీ మహబూబ్‌నగర్ కోర్టులో ఐదు, జడ్చర్లలో ఒకటి, దేవరకద్రలో ఒక బెంచీ చొప్పున మొత్తం ఏడు బెంచీలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా 7,075 కేసులను రాజీ పరిష్కారం చేశారు. ఈ సందర్భంగా ఓ ఇన్సూరెన్స్ కేసులో బాధితులకు రూ.21.50 లక్షల చెక్కును న్యాయమూర్తి అందజేశారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు ఆంజనేయులు, ఆఫ్రోజ్ అక్తర్, ఇందిర, ఈశ్వరయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి, డీసీఆర్బీ డీఎస్పీ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పోలీస్‌శాఖ పరిధిలో 3, 200 కేసులు రాజీ జిల్లాలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో పోలీస్ శాఖకు సంబంధించి మొత్తం 3,200 కేసులు పరిష్కరించారు. రాజీ అయిన కేసుల్లో 432ఎఫ్ఐఆర్లు, 752 డ్రంకన్‌డ్రైవ్ కేసులు, ఈ–పెట్టీ కేసులు 1988, అదేవిధంగా 57సైబర్ నేరాలకు సంబంధించిన కేసులు పరిష్కరించారు. ప్రధానంగా మూడు కోర్టుల్లో కలిపి సైబర్ నేరాల్లో మొత్తం 57 కేసుల్లో కలిపి రూ.56.65లక్షల నగదు తిరిగి బాధితులకు ఇప్పించారు. ఈ కేసుల పరిష్కార ప్రక్రియలో కోర్టు డ్యూటీ అధికారులతో పాటు పోలీస్ అధికారులు, కోర్టు సిబ్బంది విశేషంగా కృషి చేశారని ఎస్పీ డి.జానకి అభినందించారు. ఒక్కసారి రాజీ చేసుకుంటే జీవితకాలం సమస్య ఉండదు మూడు కోర్టుల్లో 7,075 కేసుల పరిష్కారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్.ప్రేమలత -
కాంగ్రెస్‌ను క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలి
జడ్చర్ల: క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని సీడబ్ల్యూసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం జడ్చర్లలో డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. బూత్ స్థాయి నుంచి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ప్రజల ను భాగస్వామ్యం చేస్తూ.. వాటిని వారికి వివరించాలన్నారు. నాయకులు నిత్యం ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని సూచించారు. సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో పాటు సంబంధిత అధికారులను కలిసి పరిష్కారానికి కృషి చేయడం ద్వారా ప్రజల్లో మరింత విశ్వాసం పొందాలన్నారు. భవిష్యత్‌లో రాహుల్‌గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ మాట్లాడుతూ.. జిల్లా నుంచి గ్రామస్థాయి వరకు పార్టీ చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు బాధ్యతగా పనిచేయాలని అన్నారు. మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, మిథున్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నర్సింహారెడ్డి, మాజీ జెడ్పీటీసీ రబ్బానీ, అశోక్‌యాదవ్, వంశీచారి పాల్గొన్నారు. -
నైపుణ్యం కలిగిన పశువులు..
మన్ననూర్ గిత్తగా గుర్తింపు రావడం సంతోషంగా ఉంది. వ్యవసాయ పనుల్లో ఈ పశువులు మంచి నైపుణ్యం ప్రదర్శిస్తాయి. ఎంత కష్టమైన పనులైనా చేస్తాయి. 35 ఏళ్లుగా పశువుల వ్యాపారం చేస్తున్నా. ఈ ప్రాంత రైతుల నుంచి దూడలు కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి అమ్ముతా. వివిధ కారణాలతో పశుజాతి తగ్గడంతో వ్యాపారం కూడా తగ్గింది. నల్లమల పశువులకు నాటు పశువులుగా గుర్తింపు ఉంది. – హన్మంతు, పశువుల వ్యాపారి, తూర్పు పొడజాతి గోవు సంఘం అధ్యక్షుడు ప్రభుత్వ ప్రోత్సాహం అవసరం.. నాకు 50 వరకు పశువులు ఉన్నాయి. వాటిలో చాలా వరకు పొడ జాతి పశువులు ఉన్నాయి. ఈ పశు సంతతిని పెంచేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. నల్లమల రైతులకు పశుపోషణ భారంగా మారింది. పశుగ్రాసం, నీటి కొరత ప్రధాన కారణంగా మారాయి. రాష్ట్ర ప్రభుత్వం పశు జాతిని సంరక్షించేందుకు పునరావాస, పశుగ్రాసం పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఈ పశువుల వల్ల నల్లమల అడవికి ఎలాంటి నష్టం ఉండదు. అడవిలో మేపుకొనేందుకు అనుమతి ఇవ్వాలి. – శివాజీ గెలువయ్య, మన్ననూర్, అమ్రాబాద్ మండలంప్రత్యేక హోదా కల్పిస్తాం.. నల్లమల పొడజాతి మన్ననూర్ గిత్తకు ప్రత్యేక హోదా కల్పిస్తాం. ప్రత్యేకమైన మచ్చలపై పరిశోధన చేయిస్తాం. ఇక్కడ సంతానోత్పత్తి కేంద్రం ఏర్పాటు చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లాం. నల్లమల పశువులకు మంచి డిమాండ్ ఉంది. ఈ జాతి పశువులను సంరక్షించేందుకు ప్రభుత్వ పరంగా చొరవ తీసుకుని నల్లమలకు గుర్తింపు తెస్తాం. – వంశీకృష్ణ, ఎమ్మెల్యే, అచ్చంపేట -
ఫిన్లాండ్కు 8 మంది టీచర్లు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: టీచర్ ఎక్స్పోజర్ విజిట్ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్–ఫిన్లాండ్ (బ్యాచ్–2)లో భాగంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి ఎనిమిది మంది ఉపాధ్యాయులు ఫిన్లాండ్కు వెళ్లనున్నారు. ఈ నెల 26 నుంచి అక్టోబర్ 10 వరకు అక్కడ పర్యటించి విద్యా విధానాలు, బోధనా పద్ధతులను అధ్యయనం చేయనున్నారు. ఉపాధ్యాయుడు హోదా పాఠశాల వరద సురేందర్‌రెడ్డి జీహెచ్ఎం జెడ్పీహెచ్ఎస్ ధర్మవరం, గద్వాల బాలుయాదవ్ బైకాని జీహెచ్ఎం జెడ్పీహెచ్ఎస్ తాటికొండ, మహబూబ్‌నగర్ మల్లికార్జునుడు జీహెచ్ఎం జెడ్పీహెచ్ఎస్ శాఖాపూర్, వనపర్తి సంధ్య ఎస్ఏ జెడ్పీహెచ్ఎస్ చంద్రకల్, నాగర్‌కర్నూల్ సాయిచందర్‌రెడ్డి ఎస్ఏ జెడ్పీహెచ్ఎస్ పెద్దమందడి, వనపర్తి శ్రీకాంత్ ఎస్జీటీ ఎంపీపీఎస్ గొల్లపల్లి, నారాయణపేట మసుంబి ఎస్జీటీ ఎంపీపీఎస్ ఉండవల్లి, గద్వాల సబా సుల్తానా ఎస్ఏ జెడ్పీహెచ్ఎస్ ఊట్కూర్, నారాయణపేట 26 నుంచి అక్టోబర్ 10 వరకు విద్యా పర్యటన -
నల్లమలలో ఆయుధాల కలకలం
నాగర్‌కర్నూల్: మావోయిస్టుల ప్రభావంతో ఒకప్పుడు నిత్యం అలజడిగా ఉండే నల్లమల అటవీ ప్రాంతంలో మళ్లీ ఆయుధాల వ్యవహారం కలకలం రేపుతోంది. సికింద్రాబాద్ బొల్లారం మద్రాస్ ఆర్మీ రెజిమెంట్ నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి అపహరణ కేసులో నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట ప్రాంతానికి చెందిన ఆర్మీ జవాన్ రాజు అలియాస్ మల్లేష్ పాత్ర ఉన్నట్లు పోలీసులు, దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. . కాగా..ఇళ్లలోనే దాచి ఉంచిన ఆయుధాలన్నింటినీ స్వాధీనం చేసుకుని మల్లేశ్‌ను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఉడిమిళ్లతో అనుబంధం రాజు స్వస్థలం నల్లమలలోని ఉడిమిళ్ల గ్రామం. కొన్నేళ్ల క్రితం అతని కుటుంబం అక్కడి నుంచి మున్ననూరుకు, అనంతరం అచ్చంపేటకు వచ్చి స్థిరపడినట్లు స్థానికులు చెబుతున్నారు. అచ్చంపేటలో రాజు సొంత ఇల్లు నిర్మించుకున్నాడు. ఆయన తండ్రి నారాయణ వసతిగృహాల్లో పనిచేసేవాడని సమాచారం. రాజుకు నాగర్‌కర్నూల్ మండలం సిరిపురం గ్రామానికి చెందిన అనూషతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం నాగర్‌కర్నూల్ పట్టణంలో కొత్త ఇంటి నిర్మాణం చేపడుతున్నట్లు తెలిసింది. గడ్డివాములో ఆయుధాలు.. పోలీసులు గురువారం సాయంత్రం రాజును అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అంతకుముందు ఆయనకు ఫోన్ చేసి వివరాలు అడిగినట్లు తెలుస్తోంది. అనంతరం రాజును అచ్చంపేటకు తీసుకెళ్లి అక్కడ తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం. ఇంటి సమీపంలోని గడ్డివాములో ఆయుధాలు దాచినట్లు చెప్పడంతో అక్కడ తనిఖీలు చేసి వాటిని స్వాధీనం చేసుకున్నారు. అపహరించిన ఆయుధాలను తొలుత అచ్చంపేటలో దాచిన అనంతరం ఉడిమిళ్లలోని పాత ఇంటికి తరలించి, మళ్లీ అచ్చంపేటకు తీసుకొచ్చి గడ్డివాములో ఉంచినట్లు దర్యాప్తులో తేలినట్లు సమాచారం. రాజును అదుపులోకి తీసుకునే ముందే ఇంటెలిజెన్స్ వర్గాలు ఉడిమిళ్ల, అచ్చంపేట, నాగర్‌కర్నూల్‌లో వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. అచ్చంపేటలో ఆర్మీజవాన్ మల్లేష్ ఇల్లు బొల్లారం ఆయుధాల అపహరణ కేసులో నాగర్‌కర్నూల్ జిల్లా వాసి ఉడిమిళ్లకు చెందిన ఆర్మీ జవాన్ రాజు అలియాస్ మల్లేష్‌గా గుర్తింపు అచ్చంపేట ఇంటి సమీపంలో గడ్డివాములో దాచిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు మూడు ప్రాంతాల్లో కలకలం రాజు పేరు ఆయుధాల అపహరణ కేసులో వెలుగులోకి రావడంతో ఉడిమిళ్ల, అచ్చంపేట, నాగర్‌కర్నూల్‌తో పాటు ఆయన అత్తగారి గ్రామమైన సిరిపురంలోనూ చర్చనీయాంశమైంది. అచ్చంపేటలోని రాజు ఇంటికి తాళం వేసి ఉండగా.. అద్దెకు ఉంటున్న వారు తమకు ఎలాంటి సమాచారం లేదని చెబుతున్నారు. నాగర్‌కర్నూల్‌లో నిర్మాణంలో ఉన్న కొత్త ఇంటి వద్ద పనిచేసే వారు కూడా గురువారం సాయంత్రం నుంచి రావడం లేదని స్థానికులు పేర్కొంటున్నారు -
బెట్టతో పంటకు బెంగ
● పత్తిలో రసం పీల్చే పురుగుల ఉధృతి ● వరికి పోషక లోపాలు.. కందిలో ఎదుగుదల మందగింపు ● నివారణకు శాస్త్రవేత్తల సూచనలు మహబూబ్‌నగర్ (వ్యవసాయం): వర్షాభావ పరిస్థితులతో పంటలు దెబ్బతింటున్న నేపథ్యంలో శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి రైతులకు పలు సూచనలు చేశారు. ప్రొఫసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు డాక్టర్ కె.కల్యాణి, డాక్టర్ జి.మాధురి శుక్రవారం చిన్నచింతకుంట మండలంలోని నెల్లికొండి, వడ్డేమాన్, ఎదులాపూర్ గ్రామాల్లో పర్యటించారు. వరి, పత్తి, కంది, మిరప, చెరకు, ఆయిల్‌పామ్ పంటలను పరిశీలించి.. ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా చేపట్టాల్సిన చర్యలను రైతులకు వివరించారు. పత్తిలో పురుగుల ఉధృతి అధిక ఉష్ణోగ్రతలు, వర్షాభావంతో పత్తిలో రసం పీల్చే పురుగుల ఉధృతి పెరిగినట్లు గుర్తించారు. తామర పురుగు, పచ్చదోమ నివారణకు ఫ్లోనికామిడ్ 0.3 మి.లీ. మీటరు నీటికి చొప్పున పిచికారీ చేయాలని సూచించారు. వరిలో ఎర్ర ఆకులు వర్షాభావం, చౌడు ప్రభావంతో వరి ఆకులు ఎర్రబడటం వంటి పోషక లోపాలను గుర్తించారు. పంట పరిస్థితిని బట్టి తగిన పోషక యాజమాన్యం పాటించాలని సూచించారు. కంది ‘ట్రిపుల్–19’ ఎదుగుదల మందగించిన కంది పొలాల్లో 19 :19:19 (టిపుల్–19) లీటరు నీటికి 5 గ్రాముల చొప్పున పిచికారీ చేయాలని తెలిపారు. మిరపలో తామర పురుగు నివారణకు పంట పరిస్థితిని బట్టి ఫిప్రోనిల్–2 మి.లీ. లేదా థయోమెథాకామ్స్ 0.5 గ్రాముల లీటరు నీటికి కలిపి పిచికారీ చేస్తే ఫలితం ఉంటుందన్నారు. మిరపలో తామర పురుగు మిరపలో తామర పురుగుల ఉధృతి అధికంగా ఉన్నట్లు గుర్తించారు. నివారణకు పంట పరిస్థితిని బట్టి ఫిప్రోనిల్ 2 మి.లీ. లేదా థయోమెథాక్సామ్ 0.5 గ్రాములను లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలని సూచించారు. నీటి పొదుపే కీలకం అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థంగా వినియోగించుకోవాలని వివరించారు. డ్రిప్, తుంపర సేద్య పద్ధతులను అవలంబించాలని, పంట అవశేషాలను వరుసల మధ్య పరచి నేలలో తేమను కాపాడుకోవాలని తెలిపారు. భవిష్యత్తులో బెట్ట పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఫార్మ్ పాండ్లు, నీటి కుంటలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. -
నవజాత శిశువు ఘటనలో ముగ్గురు అరెస్ట్
● మైనర్ బాలికకుప్రేమ పేరుతో వేధింపులు మహబూబ్‌నగర్ క్రైం: అర్ధరాత్రి నడిరోడ్డుపై నవజాత శిశువును వదిలివేసిన ఘటనలో బాలిక తల్లి, తండ్రి, బాబాయిని టూటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. కేసు వివరాలను శుక్రవారం సీఐ ఇజాజుద్దీన్ వెల్లడించారు. కోయిలకొండ మండలానికి చెందిన మైనర్ బాలిక ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. 8వ తరగతి నుంచే గార్లపాడ్కు చెందిన సెట్రింగ్ కూలీ ఆనంద్‌తో పరిచయం ఏర్పడింది. ప్రేమ పేరుతో అతడు బాలికను మోసం చేయడంతో గర్భం దాల్చింది. ఈ విషయాన్ని బాలిక 9 నెలల పాటు తల్లిదండ్రులకు చెప్పకుండా దాచింది. సెప్టెంబర్ 4న అర్ధరాత్రి కడుపునొప్పి రావడంతో కుటుంబసభ్యులు ఆటోలో జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్తుండగా అంబేద్కర్ చౌరస్తా–న్యూటౌన్ మధ్యలో ప్రసవమై మగ శిశువుకు జన్మనిచ్చింది. విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందనే ఉద్దేశంతో తల్లి, తండ్రి, బాబాయి కలిసి శిశువును హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఎదుట రోడ్డుపై వదిలేసి బాలికను గ్రామానికి తీసుకెళ్లారు. సీసీ కెమెరాల ఆధారంగా ఆటోను గుర్తించిన పోలీసులు నిందితులను గుర్తించారు. బాలిక తల్లి, తండ్రి, బాబాయిను అరెస్టు చేశారు. ఆనంద్ పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు. కేసును భరోసా కేంద్రానికి బదిలీ చేస్తున్నట్లు వెల్లడించారు. మైనర్ బాలికలు ప్రేమ పేరుతో మోసపోయి వారి భవిష్యత్‌ను నాశనం చేసుకోరాదని సూచించారు. సమావేశంలో ఎస్ఐ శివనాగేశ్వర్నాయుడు, ఏఎస్ఐ సాయి నిర్మల దేవి, సిబ్బంది శేఖర్, అశోక్, కురుమూర్తి పాల్గొన్నారు. -
బెట్టింగ్ ఉచ్చులో యువకుడి బలి
● ఆర్థికంగా నష్టపోయి.. అప్పులు తీర్చలేక ఆత్మహత్య మహబూబ్‌నగర్ క్రైం: క్రికెట్, ఆన్లైన్ బెట్టింగ్ ఓ యువకుడి ప్రాణం తీసింది. బెట్టింగ్‌లో ఆర్థికంగా నష్టపోయి.. చేసిన అప్పులు తీర్చలేక మనస్తాపానికి గురైన నగరానికి చెందిన యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. టూటౌన్ సీఐ ఇజాజుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్‌లోని సంజయ్‌నగర్‌కు చెందిన ఎండీ అజారుద్దీన్ (27) డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలంగా క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న అతడు ఆర్థికంగా నష్టపోయాడు. దీంతో అప్పులు పెరిగిపోవడంతో పాటు బెట్టింగ్‌లో డబ్బులు రావాల్సిన వారు ఒత్తిడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన అజారుద్దీన్ ఈనెల 9న రాత్రి పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. మృతుడి తండ్రి బుర్రానుద్దీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఇజాజుద్దీన్ తెలిపారు. పాముకాటుతో కార్మికుడు మృతి ఊట్కూర్: మండలంలోని పగిడిమారిలో శుక్రవారం పాముకాటుతో బాలరాజు (36) అనే వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు.. బాలరాజు ఉదయం పనికి వెళ్తుండగా మార్గమధ్యలో పాము కాటు వేయడంతో అపస్మారక స్థితిలో కిందపడిపోయాడు. స్థానికులు గమనించి వెంటనే నారాయణపేట జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతునికి భార్య కిష్టమ్మ, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రమేష్ తెలిపారు. రైలు ఢీకొని దుర్మరణం దేవరకద్ర: రైలు ఢీకొనడంతో గుర్తు తెలియయని వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం వెలుగు చూసింది. కౌకుంట్ల–కురుమూర్తి రైల్వే స్టేషన్ల మధ్య ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆత్మహత్య చేసుకోవాలని పట్టాలపైకి వెళ్లాడా లేదా అకస్మాత్తుగా రైలు రావడంతో ఘటన జరిగిందో తెలియరాలేదు. మృతుడు బూడిద కలర్ జీన్స్‌ప్యాంటు వేసుకుని షర్టు లేకుండా ఉన్నాడని రైల్వే పోలీసులు తెలిపారు. చామన ఛాయ ముఖం, గుండ్రటి మొహం కలిగి ఉన్నాడని, వయసు 35 నుంచి 40 మధ్య ఉండొచ్చన్నారు. ఎవరికై న వివరాలు తెలిస్తే మహబూబ్‌నగర్ రైల్వే ఎస్ఐకు సమాచారం ఇవ్వాలని సూచించారు. పిచ్చికుక్క దాడిలో ముగ్గురికి గాయాలు చారకొండ: మండలంలోని జూపల్లిలో శుక్రవారం పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. గ్రామంలోని జనావాసాల్లో చొరబడి మంతోజు జయమ్మ, అక్కి కృష్ణయ్య ,విద్యుత్ సబ్‌స్టేషన్ ఆపరేటర్ శేఖర్‌పై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి బాధితులను కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. జయమ్మ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. అనంతరం స్థానికులు పిచ్చికుక్కను చంపేశారు. గ్రామంలో కుక్కల బెడదను నివారించాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
కురుమూర్తి గుట్టలో భక్తుల రద్దీ
● మార్మోగిన గోవింద నామస్మరణ ● అమావాస్యను పురస్కరించుకొని ప్రత్యేక పూజలు స్వామి దర్శనానికి క్యూలైన్లో నిల్చున్న భక్తులు చిన్నచింతకుంట: పేదల తిరుపతిగా పేరుగాంచిన అమ్మాపురం కురుమూర్తిస్వామి ఆలయానికి శ్రావణమాసం అమావాస్యను పురష్కరించుకొని శుక్రవారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుంచి ఉమ్మడి పాలమూరు జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చి స్వామివారి దర్శనానికి క్యూలైన్లో గంటల తరబడి నిల్చున్నారు. సుప్రభాత సేవ అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు. భక్తులు కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి దాసంగాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కొండపైన స్వామివారితో పాటు అలివేలు మంగమ్మ, చెన్నేకేశవస్వామి, ఆంజనేయస్వామి ఉద్దాల మండపం, స్వామివారి పాదుకలను దర్శించుకొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఈఓ మదనేశ్వరెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ భత్తుల బాల్‌రాజు, కమిటీ సభ్యులు అర్జున్ ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో అర్చకులు, ఉత్సవ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. -
బతుకుదెరువు కోసం వలస.. పసిపాప బలి
మదనాపురం: బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వలస వెళ్లిన ఆ కుటుంబానికి ఊహించని విషాదం ఎదురైంది. ఇంట్లో జరిగిన ప్రమాదంలో ఐదేళ్ల చిన్నారి జూలీ మృతిచెందడంతో స్వగ్రామమైన దుప్పల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. వనపర్తి జిల్లా మదనాపురం మండలం దుప్పల్లి గ్రామానికి చెందిన రాము, సుధ దంపతులకు ముగ్గురు పిల్లలు. గ్రామంలో ఉపాధి అవకాశాలు లేకపోవడంతో ఏడాది క్రితం హైదరాబాద్‌కు వెళ్లారు. రాము హిటాచీ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా.. సుధ పిల్లల సంరక్షణ చూసుకుంటోంది. గురువారం రాత్రి ఇంట్లో స్నానానికి నీటిని వేడి చేస్తుండగా.. ఆగుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు ఐదేళ్ల జూలీ వేడినీటి బకెట్లో పడింది. తీవ్రంగా గాయపడిన చిన్నారిని తల్లిదండ్రులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినప్పటికీ.. పరిస్థితి విషమించడంతో చిన్నారి మృతిచెందింది. చిన్నారి మృతదేహంతో తల్లిదండ్రులు దుప్పల్లికి చేరుకోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది. అల్లారుముద్దుగా పెంచుకున్న చిన్నారిని కోల్పోయిన తల్లిదండ్రుల రోదనలు బంధువులను, గ్రామస్థులను కలచివేశాయి. బతుకుదెరువు కోసం ఊరు విడిచిన ఆ కుటుంబానికి.. చివరికి పసిపాపను కోల్పోయిన కడుపుకోత మిగిలింది. ● వేడి నీళ్ల బకెట్లో పడి ఐదేళ్ల చిన్నారి మృతి ● దుప్పల్లిలో మిన్నంటిన తల్లిదండ్రులు, బంధువుల రోదనలు -
ఐదురోజుల పనివిధానం అమలు చేయాలి
స్టేషన్ మహబూబ్‌నగర్: ప్రభుత్వం ఐదు రోజుల బ్యాంకింగ్ విధానాన్ని అమలు చేయాలని పలు బ్యాంక్ ఉద్యోగ సంఘాల నాయకులు కోరారు. ఐదు రోజుల బ్యాంకింగ్ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపుమేరకు మహబూబ్‌నగర్‌లోని టీటీడీ కల్యాణ మండపం ఎదుట శుక్రవారం అఖిల భారత బ్యాంకు సమ్మె నిర్వహించారు. ఈ సమ్మెలో ఆయా బ్యాంకుల ఉద్యోగులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గతంలో ఐదు రోజుల బ్యాంకింగ్ పనివిధానం అమలు చేస్తామని అంగీకారం తెలిపినప్పటికీ ఇప్పటికీ అమలు చేయడం లేదన్నారు. వెంటనే ఐదు రోజుల పనివిధానాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. న్యాయమైన, సముచితమైన పీఎల్ఐ విధానాన్ని అమలు చేయాలని కోరారు. అనంతరం అక్కడి నుంచి మల్లికార్జున చౌరస్తా, ఆర్టీసీ బస్టాండ్, అంబేడ్కర్ చౌరస్తా మీదుగా తెలంగాణ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. సమ్మెలో ఆయా బ్యాంక్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తిరుమల్‌రెడ్డి, రాజేష్, జయకర్, సోంభూపాల్, రాంభూపాల్‌రెడ్డి, సూర్యప్రకాశ్‌రెడ్డి, నరేష్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. బ్యాంక్ ఉద్యోగులు చేపట్టిన సమ్మెకు సీఐటీయూ నాయకులు కిల్లె గోపాల్, సీపీఎం నాయకులు రాములు, ఎల్ఐసీ ఉద్యోగ సంఘం నాయకులు రాజేశ్వర్, టీపీసీసీ అధికార ప్రతినిధి జహీర్ అఖ్తర్ తదితరులు సంఘీభావం తెలిపారు. -
రేపల్లెలో పోలీస్ పికెటింగ్
గద్వాల క్రైం: గద్వాల మండలం రేపల్లెకు చెందిన దళిత రంగముని, బోయ మహేశ్వరి ఇద్దరు మేజర్లు కావడంతో కులాంతర వివాహ చేసుకున్న ఘటనపై అమ్మాయి కుటుంబ సభ్యులు గురువారం అబ్బాయి కుటుంబ సభ్యులు ఇళ్లను కూల్చివేసిన ఘటన విధితమే.. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచనలం సృస్టించింది. ఈ మేరకు జిల్లా పోలీసుశాఖ రేపల్లెలో శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా పోలీసు పికెటింగ్‌ను ఏర్పాటు చేసి ఎలాంటి అవాంచనీయ ఘటనలు తలెత్తకుండా పట్టిష్టమైన బదోబస్తు నిర్వహించారు. గ్రామంలో అనుమానిత వ్యక్తుల వివరాలను తెలుసుకున్నారు. రెండు సామాజిక వర్గాలకు చెందిన నివాస గృహాల్లోని బంధువుల వివరాలను ఆరా తీశారు. ఇళ్లు కూల్చివేత సమయంలో ఎంతమంది వచ్చారు. కూల్చివేతకు ఉపయోగించిన వాహనాలు, వాటిని గ్రామంలోకి తీసుకొచ్చిన వ్యక్తులేవరు..? ప్రస్తుతం వాహనాలు ఎక్కడున్నాయి.? తదితర అంశాలపై బృందాలుగా వీడిపోయి కూపీ లాగారు. బాధిత కుటుంబ సభ్యులపై దాడులు, బెదిరింపులు, భయభ్రాంతులకు గురి చేసిన వ్యక్తుల వివరాలను సేకరించారు. కూల్చివేతకు వచ్చిన క్రమంలో మారణాయుధాల వంటివి ఉపయోగించారనే విషయాలపై గ్రామస్తులను అడిగి తెలుసున్నారు. ఆగ్రహం వ్యక్తం కులాంతర వివాహాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహించి ఆర్థిక వెసులుబాటును కల్పిస్తుందని ఎమ్మార్పీస్, సీపీఎం జిల్లా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజంలో అసమానతలను నివారించి మతం, జాతీ భేదం లేకుండా ఉంటున్న గ్రామాల్లో ఎస్సీ కులానికి చెందిన అబ్బాయి బీసీ కులానికి చెందిన యువతిని పెళ్లి చేసుకోవడం చట్ట వీరద్దమైన ఘటనగా మారిందన్నారు. ఇలాంటి ఉన్మాద చర్యలకు పాల్పడిన నిందితులు, ఘటనకు కారకుడైన సర్పంచ్‌ను కూడా అరెస్టు చేయాలన్నారు. బాధిత కుటుంబానికి రూ.50లక్షల నష్ట పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. జిల్లా ఉన్నతధికారులు గ్రామాన్ని సందర్శించి దళితులకు ఆత్మస్థైర్యాన్ని కల్పించి, రక్షణ ఇవ్వలన్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ఎస్పీ శ్రీనివాసరావుకు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వెంకటస్వామి, కుర్మన్న, రాజు, పరుశరాము, కన్నా, శ్రీనివాసులు, ఇమ్మానియేలు, ఆశన్న, పరంజ్యోతి తదితరులు ఉన్నారు. ఇళ్లు కూల్చిన నిందితులపై ఎస్సీ, ఎస్టీ కేసులు పోలీసుల అదుపులో నిందితులు ఆగ్రహ వక్తం చేసిన ఎస్సీ, ఎస్టీ, సీపీఎం సంఘాల నాయకులు -
వెంకటాపూర్ కల్లు డిపోలో హైడ్రామా
● తారాస్థాయికి చేరిన భాగాల పంచాయితీ ● ఆదాయంలో వాటా కావాలని ఇరువర్గాల ఘర్షణ ● రూరల్ పోలీస్ స్టేషన్లో పలువురిపై కేసులు నమోదు మహబూబ్‌నగర్ క్రైం: ఒక సొసైటీలోని రెండు వర్గాల మధ్యలో ఉన్న అంతర్గత భేదాలు భగ్గుమన్నాయి. దీంతో గత 48 గంటల నుంచి వెంకటాపూర్ కల్లు డిపో దగ్గర హైడ్రామా సాగుతుంది. కల్లు డిపో పరిధిలో ఉన్న 15 దుకాణాల ద్వారా వచ్చే ఆదాయంపై తమకంటే.. తమకు భాగాలు (వాటా) కావాలంటూ రెండు రోజుల నుంచి రెండు వర్గాల మధ్య ఘర్షణ తీవ్రరూపం దాల్చింది. శుక్రవారం ఉదయం పాతవర్గం అంటూ చెప్పుకొనే వారిలో దాదాపు వందమంది వరకు డిపో ఎదుట ఆందోళనకు దిగారు. కొద్దిసేపటి తర్వాత నూతనంగా ఎంపికై న సొసైటీ వాళ్లు అక్కడికి చేరుకోగా.. ఎవరికి వారు అనుకూలంగా నినాదాలు చేసుకున్నారు. ఘటనా స్థలానికి రూరల్ పోలీసులు చేరుకోగా ఎస్ఐ విజయ్‌కుమార్‌కు రెండు వర్గాలు రాత పూర్వకంగా ఫిర్యాదులు చేసుకున్నారు. ఆ తర్వాత పోలీసులు ఆందోళన చేస్తున్న వారిలో 14 మందిని అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్రమంగా కల్లు డిపో లోపలికి ప్రవేశించి, దాడులు చేయడానికి ప్రయత్నించారనే అంశంపై సొసైటీ అధ్యక్షుడు శరత్‌బాబుగౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మురళీధర్గౌడ్తోపాటు ఇతరులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. మరోవైపు మురళీధర్‌గౌడ్ సైతం కల్లు డిపోలో కల్లు తయారీ చేయకుండా విచారణ చేయాలనే దానిపై వినతిపత్రం ఇచ్చినట్లు ఎస్ఐ తెలిపారు. ఎకై ్సజ్ శాఖ ఏం చేస్తోంది.. సొసైటీ ఎన్నికల నిర్వహణతోపాటు కల్లు దుకాణాల పనితీరుపై పర్యవేక్షణ చేయాల్సిన ఎకై ్సజ్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. రెండు రోజుల నుంచి రెండువర్గాల మధ్య గొడవ జరుగుతుంటే తమకేం సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు ఈఎస్ సంతకం ఫోర్జరీ చేశారనే విషయాన్ని మహబూబ్‌నగర్ ఈఎస్ సుధాకర్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా మా సంతకాలు ఎవరూ ఫోర్జరీ చేయలేదని, కల్లు డిపో వ్యవహారం పూర్తిగా వారి అంతర్గత విషయం అని చెప్పడం గమనార్హం. రెండు నెలల కిందట ఎన్నికలు వెంకటాపూర్ కల్లు డిపో నూతన సొసైటీ కోసం జూలై 4న టీఎన్జీఓ భవనంలో ఎన్నికలు నిర్వహించారు. ఇందులో శరత్‌బాబుగౌడ్ ప్యానెల్ గెలుపొందింది. ఇందులో అప్పటి వరకు 23మంది సభ్యులు ఉండగా మరో 13 మందిని కూడా కలిపే వరకు ఎన్నికలు నిర్వహించరాదని కోర్టు నుంచి స్టే ఆర్డర్ తీసుకువస్తే వాటిని పట్టించుకోకుండా ఎకై ్సజ్ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి ఎన్నికలు జరిపారని మరోవర్గం ఆరోపిస్తోంది. ట్యాపింగ్ టెస్ట్ అడ్డుకొని వారికి నచ్చినట్లు ఎన్నికలు నిర్వహించారని చెప్పుకొచ్చారు. రాజకీయ నేతల ప్రమేయంతో పాత వర్గానికి వాటా రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. మాజీమంత్రితోపాటు మున్సిపల్ మాజీ చైర్మన్ ప్రోద్బలంతోనే సొసైటీలో కల్లు తయారీ అడ్డుకొని దాడి చేయడానికి వచ్చారని ప్రతాప్‌గౌడ్ ఆరోపించారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన తనపై గిట్టక మాజీ మంత్రి ఇంట్లో సమావేశం ఏర్పాటు చేసి అడ్డుకోవడానికి పంపించారని చెప్పారు. ఎకై ్సజ్ శాఖ ఈఎస్ సంతకంతోపాటు స్టాంపులు ఫోర్జరీ చేశారని దీనికి సంబంధించి 13 మందిపై ఫోర్జరీ కేసులు నమోదవుతున్న క్రమంలో ఆ అంశాన్ని డైవర్ట్ చేయడానికి వెంకటాపూర్ డిపో మీదకు దాడికి వచ్చారని ఆరోపించారు. సొసైటీ ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత రెండు నెలలపాటు వారికే సమయం ఇచ్చి.. ఆ తర్వాత తమ ఆధీనంలోకి డిపోను తీసుకుని కల్లు తయారీ ప్రారంభించిన మొదటిరోజే దాడికి రావడం సరికాదన్నారు. కుల పెద్దలతో కూర్చొని మాట్లాడి ఉంటే బాగుండేదని అలా కాకుండా కల్లు తయారీ అడ్డుకొని దాడి చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. -
మరో ఏడాది ఆగాల్సిందే!
‘పాలమూరు–రంగారెడ్డి’ నీటికోసం తప్పని నిరీక్షణ ● నార్లాపూర్– ఏదుల మధ్య పూర్తి కాని కాల్వ పనులు ● దాదాపు 8 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తొలగింపునకు చర్యలు ● డిసెంబర్ నాటికి లక్ష్యం నిర్దేశం.. మార్చి వరకు కొనసాగే అవకాశం ● ఆ మట్టి తొలిగిస్తేనే ఏదుల రిజర్వాయర్‌కు సాఫీగా నీరు నార్లాపూర్– ఏదుల రిజర్వాయర్ మధ్య ఓపెన్ కాల్వలో కుడికిళ్ల, తిర్నాంపల్లి వద్ద ఉన్న రాయిని తొలిగింపు పనులు వేగవంతం చేశాం. డిసెంబర్ చివరిలోగా తొలిగింపు పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించాం. రాయి బ్లాస్టింగ్ చేసి లోతు నుంచి బయటకు రాళ్లు తీసుకెళ్లడం కొంత ఇబ్బందిగా ఉంది. కాల్వలో హార్డ్ రాక్ తొలిగిస్తే నార్లాపూర్ నుంచి ఏదుల రిజర్వాయర్‌కు నీళ్లు తరలించవచ్చు. ఏదుల నుంచి వట్టెం రిజర్వాయర్‌కు అక్కడి నుంచి కర్వెనకు ఎత్తిపోయడానికి పంపుసెట్లు బిగింపు సైతం పూర్తి అయ్యింది. అన్ని పనులు పూర్తయ్యి.. శ్రీశైలం ప్రాజెక్ట్‌లో నీళ్లు ఉంటే రిజర్వాయర్‌లోకి తరలించవచ్చు. – పార్థసారధి, ఇరిగేషన్ ఎస్ఈ నాగర్‌కర్నూల్: బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పనులు కొనసా..గుతూనే ఉన్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు వేగవంతం చేయడంలో నిర్లక్ష్యం చేసిందనే విమర్శలున్నాయి. గతేడాది మే నెలలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పర్యటించి 2025 డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశించినా.. ఇంకా చాలా వరకు పనులు పెండింగ్‌లోనే ఉన్నాయి. దీంతో ఈ ఏడాది రెండు పంపుసెట్లు ప్రారంభించినా.. కేవలం నార్లాపూర్ రిజర్వాయర్‌లోకి రెండు టీఎంసీలు ఎత్తిపోసి నిలిపివేశారు. ఏదుల రిజర్వాయర్‌కు నీటిని సరఫరా చేయడానికి ఓపెన్ కాల్వ పనులు అసంపూర్తిగా ఉండటమే ఇందుకు కారణం. కుడికిళ్ల, తిర్నాంపల్లి వద్ద దాదాపు 8 లక్షల క్యూబిక్ మీటర్ల గట్టి రాయి ఉండటంతో నీరు వదలడానికి వీలు కాలేదని, ప్రస్తుతం రాయి తొలగింపు పనులు కొనసాగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. -
చిన్న విగ్రహాల నిమజ్జనానికి బేబీ పాండ్స్
● భారీ గణనాథులు బీచుపల్లికి తరలించేలా ఏర్పాట్లు ● చెరువులు పరిశీలించిన కలెక్టర్ ఖుష్బూగుప్తా, ఎస్పీ జానకి పాలమూరు: వర్షాభావ పరిస్థితుల కారణంగా జిల్లాలోని చెరువుల్లో నీటి లభ్యత తక్కువగా ఉన్న నేపథ్యంలో చిన్న, మధ్యతరహా విగ్రహాలు నిమజ్జనం కోసం బేబీ పాండ్స్ ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ ఖుష్బూ గుప్తా వెల్లడించారు. పంచవటి పాఠశాల సమీపంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్మించిన కృత్రిమ బేబీ పాండ్‌తోపాటు పాలకొండ చెరువు, శ్రీనివాసకాలనీ, అప్పన్నపల్లి, చిన్నదర్పల్లి చెరువులను శుక్రవారం కలెక్టర్ ఎస్పీ జానకితో కలిసి పరిశీలించారు. అప్పన్నపల్లి చెరువు వద్ద ఎక్కువ వినాయక విగ్రహాలు వచ్చే అవకాశం ఉన్నందున రెండు పెద్ద బేబీ పాండ్లు నిర్మించాలన్నారు. నిమజ్జన కేంద్రాల దగ్గర విద్యుద్దీపాలు, బారీకేడ్లు, పారిశుద్ధ్య చర్యలు, తాగునీరు తదితర మౌళిక వసతులు ఏర్పాటు చేయాలన్నారు. నిమజ్జనం అనంతరం విగ్రహాల అవవేషాలు, పూజా సామగ్రి, ప్లాస్టిక్ తదితర వ్యర్థాలను వెంటనే తొలగించి పరిసరాలను శుభ్రం చేయాలన్నారు. ప్రతి బేబీ పాండ్ దగ్గర నిరంతరం పారిశుద్ధ్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని చెప్పారు. నగరం నుంచి వెళ్లే భారీ గణనాథులను బీచుపల్లిలో నిమజ్జనం చేసేలా గద్వాల కలెక్టర్‌ను కోరగా సానుకూలంగా స్పందించినట్లు కలెక్టర్ చెప్పారు. నిమజ్జనంలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటుచోసుకోకుండా పోలీస్, మున్సిపల్, రెవెన్యూ ఇతర శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ సాయిశివాని, డిప్యూటీ మేయర్ సురేందర్‌రెడ్డి, కమిషనర్ రామాంజులరెడ్డి, డీఆర్డీఓ నర్సింహులు, వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు యాదిరెడ్డి పాల్గొన్నారు. ● మండపాల వివరాలను https://policeportal .tspolice.gov.in వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని, నిబంధనలకు లోబడి వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్పీ జానకి ఒక ప్రకటనలో తెలిపారు. విగ్రహం ఏర్పాటు చేసే ప్రదేశం, సంబంధిత పోలీస్‌స్టేషన్, నిమజ్జనం చేసే తేదీ, ప్రదేశం నిమజ్జనానికి వినియోగించే వాహనం తదితర సమాచారాన్ని నమోదు చేయాలని సూచించారు. -
కార్పొరేషన్లో కలకలం
● ‘ఎవరు చెబితే.. హైమాస్ట్‌లు’ కథనంపై తీవ్ర చర్చ ● విచారణ జరిపిస్తామన్న కమిషనర్ రామాంజులారెడ్డి మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: కార్పొరేషన్ పరిధిలో పెద్దఎత్తున ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్ల బాగోతంపై తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. ఎక్కడపడితే అక్కడ.. అవసరం లేనిచోట్ల కూడా వాటిని ఏర్పాటు చేశారని శుక్రవారం ‘సాక్షి’లో ‘ఎవరు చెబితే హైమాస్ట్‌లు’ కథనం కార్పొరేషన్లో ఒకింత కలకలం సృష్టించింది. కార్పొరేషన్ పరిధిలోని అన్ని డివిజన్లలో వీధిలైట్లు ఉండగా అవి కాకుండా అనవసరంగా హైమాస్ట్ లైట్లు ఎందుకు ఏర్పాటు చేశారని, ఎవరు చెబితే ఏర్పాటు చేశారనే విషయంపై అటు కార్పొరేటర్లు, అధికారుల మధ్య తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. దీనిపై కార్పొరేషన్ మున్సిపల్ కమిషనర్ రామాంజులారెడ్డి స్పందిస్తూ కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లలో ఎక్కడెక్కడ హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేశారు.. ఎక్కడ అవసరం మేరకు వినిగిస్తున్నారు.. అనవసరంగా ఏవైనా ఉన్నాయా.. అనే దానిపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తామన్నారు. నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. సాక్షిలో ప్రచురితమైన కథనం -
హాస్టల్ డిపాజిట్ ఫీజును తగ్గించాలి
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో హాస్టల్ డిపాజిట్ ఫీజు (మెస్) ను తగ్గించాలని బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు తాయప్ప డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం పీయూ రిజిస్ట్రార్ పి.రమేష్‌బాబును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఏడాది బీసీలు బాలురకు రూ.12,100, బాలికలకు రూ.19,100, ఎస్సీ, ఎస్టీలు బాలురకు రూ.11,100, బాలికలకు రూ.9,100, ఓసీలు బాలురకు రూ.18,100, బాలికలకు రూ.16,109 ఉండేదన్నారు. ఈ ఏడాది నుంచి రిజర్వేషన్లతో సంబంధం లేకుండా బాలురకు రూ.18,000, బాలికలకు రూ.16,100 చొప్పున చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేశారన్నారు. ఇంత మొత్తం చెల్లించలేరని రూ.12 వేలకు తగ్గించాలన్నారు. నేడు జిల్లా కోర్టులలో జాతీయ లోక్ అదాలత్ పాలమూరు: జిల్లాలోని మూడు కోర్టులలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.ప్రేమలత శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మహబూబ్‌నగర్, జడ్చర్ల, దేవరకద్ర కోర్టుల్లో కలిపి ఏడు బెంచీల్లో ఉదయం 10 గంటల నుంచి కేసుల పరిష్కారం ఉంటుందన్నారు. లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకొని వారి కేసులు రాజీ చేసుకోవాలని సూచించారు. తగ్గిన లడ్డు పరిణామం.. కేసు నమోదు చిన్నచింతకుంట: మండలంలోని అమ్మాపురం కురుమూర్తిస్వామి ఆలయంలో భక్తులకు అందించే లడ్డు ప్రసాదం తయారీ కేంద్రంలో శుక్రవారం తూనికల అధికారులు తనిఖీలు నిర్వహించారు. లడ్డు పరిమాణం తక్కువగా ఉందని నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా తూనికల జిల్లా అధికారి రవీందర్ మాట్లాడుతూ లడ్డూల తయారీలో అవకతవకలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. కురుమూర్తిస్వామి ఆలయం వద్ద భక్తులకు అందించే లడ్డు పరిమాణం 100 గ్రాములకు గాను 80 గ్రాములు మాత్రమే ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ మేరకు నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు. -
ఉద్యమకారులకు కాంగ్రెస్ పాలనలో గుర్తింపు
● 24న పీయూలో ఉద్యమకారుల సమ్మేళనం జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): తెలంగాణ ఉద్యమకారుల కాంగ్రెస్ ప్రభుత్వంలోనే గుర్తింపు వస్తుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఈనెల 24న జరుగనున్న తెలంగాణ ఉద్యమకారుల సమ్మేళనం పోస్టర్‌ను శుక్రవారం హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. ఎన్నికల్లో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటామన్నారు. ప్రతి ఉద్యమకారుడికి 250 గజాల ఇంటి స్థలం ఇస్తామన్నారు. అనంతరం తెలంగాణ ఉద్యమకారుల సంఘం జిల్లా కోకన్వీనర్ నాచా శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతు ఉద్యమకారుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఓ కమిటీని వేసినట్లు తెలిపారు. ఈ కమిటీ సమావేశం ఈనెల 24న పాలమూరుయూనివర్సిటీలో జరుగనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పశుసంవర్థక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, గౌరవ అతిథులుగా కే.కేశవరావు, కమిటీ సభ్యులు ఎమ్మెల్సీలు ప్రొఫెసర్ కోదండరాం, రాములునాయక్, అద్దంకి దయాకర్, శోభన్‌రెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర ఉద్యమకారుల కమిటీ చైర్మన్ పిడమర్తి రవి హాజరు కానున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రహీం ఓయూ జేఏసీ అధ్యక్షులు, రాములు, అన్వర్, గడ్డమీది గోపాల్, బ్రహ్మం, కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. -
గడువులోగా రీసర్వే పూర్తి చేయాలి
అడ్డాకుల: మూసాపేట మండలం కొమిరెడ్డిపల్లి గ్రామంలో జరుగుతున్న రీసర్వే పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ హరిప్రియ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కొమిరెడ్డిపల్లిలో జరుగుతున్న రీసర్వే పనులను ఆమె పరిశీలించారు. రీసర్వే పనుల పురోగతిపై అధికారులతో వివరాలను తెలుసుకున్నారు. నిర్ధేశిత నిబంధనలు, మార్గదర్శకాల మేరకు పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. రీసర్వేలో భూ వివరాల నమోదును క్షుణ్ణంగా పరిశీలించి ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. రీసర్వే పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సిబ్బందికి ఎదురవుతున్న సమస్యలపై ఆరా తీశారు. కార్యక్రమంలో ఆర్డీఓ నవీన్, తహసీల్దార్ రాజునాయక్, ఎంపీడీఓ కృష్ణయ్య, స్థానిక సర్పంచ్ బగ్గి కమలమ్మ, మాజీ ఎంపీపీ బగ్గి కృష్ణయ్య, రెవెన్యూ సిబ్బంది తదితరులు ఉన్నారు. -
దైవ దర్శనానికి వస్తూ అనంత లోకాలకు..
● లారీని ఢీకొన్న కారు.. ఇద్దరి దుర్మరణం, మరో ఇద్దరికి గాయాలు ● నలుగురు మిత్రులు జోగుళాంబ ఆలయాలకు వెళ్తుండగా ప్రమాదం ● గద్వాల జిల్లా ఎర్రవల్లిలో ఘటన ఎర్రవల్లి: జోగుళాంబ ఆలయాలకు దర్శనానికి వె ళ్తూ జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మిత్రులు మృతి చెందిన ఘటన గద్వాల జిల్లాలో ఆదివారం చోటు చేసుకుంది. ఇటిక్యాల ఎస్ఐ రవిరాథోడ్, స్థా నికులు తెలిపిన కథనం మేరకు.. హైదరాబాద్‌లోని మేడ్చల్– మల్కాజ్‌గిరికి చెందిన ముఖేష్ తన మి త్రులు సాయిరాం(37), మహబూబాబాద్ జిల్లా తొర్రూరుకు చెందిన మౌనిక (25), గద్వాలకు చెందిన రాఘవతో కలిసి జోగుళాంబ దర్శనం కోసం హైదరాబాద్ నుంచి కారులో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల సమయంలో బయలుదేరారు. తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఈ క్రమంలో 44వ నంబర్ జాతీయ రహదారిపై ఎర్రవల్లి మండలంలోని బీచుపల్లి పదో బెటాలి యన్ పెట్రోల్ బంక్ సమీపంలో కారు అదుపుతప్పి ఒక్కసారిగా ముందు వెళ్తున్న లారీని వేగంగా ఢీకొట్టింది. ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసం కావడంతో అందులో ఉన్న సాయిరాం, మౌనిక అక్కడికక్కడే మృతి చెందగా ముఖేష్, రాఘవ తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను హుటాహుటిన 108 వాహనంలో గద్వాలకు తరలించగా మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తీసుకెళ్లినట్లు తెలిపారు. రాఘవ పరిస్థితి విషమంగా ఉంది, మృతుడు సాయిరామ్‌కు భార్య మాధురితో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు సంఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. మృతదేహాలకు గద్వాల ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా అతివేగమే ప్రమాదానికి పూర్తి కారణమని స్థానికులు చర్చించుకుంటున్నారు. -
దళితులను తక్కువ అంచనా వేయొద్దు
● రోడ్లపైకి వస్తే ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తాం ● ధర్మసమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ విశారదన్ మహారాజ్ వనపర్తి టౌన్: వనపర్తిలో ఆధిపత్య రాజకీయాలకు ముగింపు పలికేందుకు దళిత, బహుజన, గిరిజనులు ఏకమై ఉద్యమించాలని ధర్మసమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ విశారదన్ మహారాజ్ పిలుపునిచ్చారు. ఆదివారం రాత్రి కర్మగుడి వద్ద నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. అగ్రవర్ణాలు పార్టీలకు అతీతంగా ఏకమవుతున్నప్పుడు దళితులు, బడుగు బహుజనులు, గిరిజనులు ఎందుకు ఏకం కాకూడదని ప్రశ్నించారు. రాజ్యాధికారంలో ప్రతి సామాజిక వర్గానికి సమాన హక్కు, భాగస్వామ్యం ఉండాలని అన్నారు. రాష్ట్రంలో 12 శాతం ఉన్న దళితులు ఐక్యంగా ఉద్యమిస్తే ప్రభుత్వం స్తంభించిపోతుందని పేర్కొన్నారు. ప్రతి కులానికీ గొప్ప చారిత్రక నేపథ్యం ఉందని, ముదిరాజులు, పద్మశాలీలు, విశ్వబ్రాహ్మణులు, గిరిజనులు, దళితులు తమ చరిత్రపై గర్వపడాలని సూచించారు. దళితులు పార్టీలకు అతీతంగా ఏకతాటిపైకి వచ్చి రాజ్యాధికారం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వాడల కురుమన్న, అనంతరాజు, పులిభీముడు, గట్టయ్య, రామకృష్ణ, సూర్యప్రకాశ్, ఆంజనేయులు, రవి తదితరులు పాల్గొన్నారు. -
ముకుందా.. ముకుందా..
● మన్యంకొండలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు ● వైభవంగా శేషవాహన సేవ.. తరలివచ్చిన వేలాది భక్తులు మహబూబ్‌నగర్ రూరల్: మన్యంకొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శనివారం అర్ధరా త్రి ఉట్ల మహోత్సవం వైభవంగా జరిగింది. ఓబ్లాయపల్లి భక్తులు పాల్గొని ఉత్సవాన్ని ముగించా రు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు, అ భిషేకాలు నిర్వహించారు. శ్రావణమాసం సంద ర్భంగా ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి వేలా ది మంది భక్తులు తరలిరావడంతో మన్యంకొండ భక్తజన సంద్రంగా మా రింది. శ్రావణమాసం సందర్భంగా ప్రతి శనివారం నిర్వహిస్తున్న శేషవాహన సేవలో భాగంగా శనివా రం రాత్రి స్వామివారిని శేషవాహనంపై కొలు వుదీర్చి మ ంటపం వరకు ఊరేగించారు. సన్నాయి వాయిద్యాలు, వేదమంత్రాల నడు మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. బంగారు ఆభరణాలు, పూల అలంకరణలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అళహ రి మధుసూదన్‌కుమార్,ఈఓ శ్రీనివాసరాజు, పా లకమండలి సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు. -
కబడ్డీ ‘అకాడమీ’కి కూత
మహబూబ్‌నగర్ క్రీడలు: పాలమూరు జిల్లా కేంద్రంలోని మెయిన్ స్టేడియం క్రీడలకు అడ్డాగా మా రుతోంది. ఇప్పటికే బాల, బాలికల వాలీబాల్ అకాడమీలు కొనసాగుతుండగా.. తాజాగా రాష్ట్రంలోనే తొలి బాలుర కబడ్డీ అకాడమీ ఇక్కడ అందు బాటులోకి వచ్చింది. ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించి అత్యుత్తమ శిక్షణ అందించాలనే లక్ష్యంతో డీఎస్ఏ వాలీబాల్ అకాడమీలో అదనపు విభాగంగా దీనిని ఏర్పాటు చేశారు. ఈనెల 7వ తేదీ (సోమవారం) నుంచి శిక్షణ ప్రారంభం కానుంది. 20 మంది బాలురకు ప్రవేశాలు డీఎస్ఏ వాలీబాల్ అకాడమీలో 20 మంది బాలుర సామర్థ్యంతో కబడ్డీ అకాడమీని అదనపు విభాగంగా ఏర్పాటు చేశారు. కబడ్డీ అకాడమీలో బాలురకు ప్రవేశాల కోసం గత నెల 25, 26 తేదీల్లో జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో రాష్ట్రస్థాయి ఎంపికలు నిర్వహించారు. అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారులతో కూడిన సెలక్షన్ కమిటీ సమక్షంలో ఎంపికలు జరిగాయని డీవైఎస్ఓ తెలిపారు. ఈ మేరకు కబడ్డీ అకాడమీలో ప్రవేశాలు పొందిన 20 మంది బాలుర పేర్ల వివరాలను మహబూబ్‌నగర్ జిల్లా యువజన, క్రీడల అధికారి జె.రాజశేఖర్‌రెడ్డి ప్రకటించారు. అకాడమీకి ఎంపికై న క్రీడాకారులు: బి.కౌషిక్, పి.లక్ష్మిగణేష్ (ఖమ్మం), ఎం.నందకిషోర్ (వనపర్తి), సీహెచ్ రాహుల్ (నిజామాబాద్), వి.గౌతమ్ (మహబూబ్‌నగర్), బి.అజయ్ (నిజామాబాద్), ఎ.లింగు (ఆదిలాబాద్), ఎస్కే.రేహాన్ బాబా (నల్గొండ), బి.అర్జున్ (కామారెడ్డి), ఎ.భానుప్రకాశ్ (నల్గొండ), చరణ్ (మహబూబాబాద్), జి.లోకేష్ (ఆదిలాబాద్), ఖాజా అజీమ్ ఖాద్రీ (కరీంనగర్), ఎం.రోహిత్ (వరంగల్), కె.నీలకంఠ, ఎంకె జయక్రిష్ణ (మహబూబ్‌నగర్), డి.శివకుమార్ (వనపర్తి), ఎం.శివ శంకర్ (మహబూబ్‌నగర్), వి.సచిన్ (వికారాబాద్), జె.ఉమేష్‌కుమార్ రెడ్డి (ఖమ్మం). రాష్ట్రంలోనే తొలి బాలుర కబడ్డీ అకాడమీ 20 మంది క్రీడాకారులకు ప్రవేశాలు.. పాలమూరులో నేటి నుంచి ప్రారంభం సబ్‌జూనియర్ నుంచి జాతీయ స్థాయి పోటీలే లక్ష్యం -
అర్హులైన వారు ఓటుహక్కుకు నమోదు చేసుకోవాలి
రాజాపూర్: 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ హరిప్రియ సూచించారు. ఓటరు నమోదు ప్రత్యేక క్యాంపెయిన్‌లో భాగంగా ఆదివారం రాజాపూర్ మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాలను ఆమె పరిశీలించారు. ఫారం–6, 7, 8 ద్వారా వచ్చిన దరఖాస్తులు, సవరణల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఎస్ఐఆర్లో నోటీసులు అందుకున్న వారికి ఈనెల 19న హియరింగ్ నిర్వహించనున్నట్లు డిప్యూటీ తహసీల్దార్ భారతి తెలిపారు. అర్హులైన ఏ ఒక్కరూ ఓటుహక్కు కోల్పోకుండా చూడాలని అదనపు కలెక్టర్ సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్ఐ మంజుల, జీపీఓ కృష్ణయ్య, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు. -
ఆటో కార్మికులకు ఏడాదికి రూ.12 వేలు ఇవ్వాలి
● బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ఎన్నికల హామీ మేరకు ఆటో కార్మికులకు ఏడాదికి రూ.12 వేల ఆర్థిక సాయం అందించాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. ‘వెయ్యి రోజుల పాలన.. వెయ్యి మోసాలు’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం బీఆర్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటో ర్యాలీ అనంతరం తెలంగాణ చౌరస్తాలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. రూ.12 వేల సాయం కోసం ఆశపడి కాంగ్రెస్‌కు ఓట్లు వేసిన ఆటో కార్మికులు ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో కార్మికుల జీవనం దుర్భరంగా మారిందని, పిల్లల ఫీజులు, ఆటోల కిస్తీలు చెల్లించలేని పరిస్థితి నెలకొందన్నారు. ఆటో కార్పొరేషన్, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్న హామీలను ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. రైతులకు కరెంటు, యూరియా అందక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఆటో నడిపిన శ్రీనివాస్‌గౌడ్ బీఆర్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్వయంగా ఆటో నడిపి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. ఆయనను అనుసరిస్తూ పెద్ద సంఖ్యలో ఆటోలు ర్యాలీగా కదిలాయి. బీఆర్ఎస్ నాయకులు వెంకన్న, శివరాజు, బీఆర్టీయు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు రాజు, పట్టణ అధ్యక్షుడు బాబుమియా, నగేష్, వీరేష్, తదితరులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా యోగా జట్టు ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో ఆదివారం ఉమ్మడి జిల్లా యోగా క్రీడాకారుల ఎంపికలు నిర్వహించారు. ఎంపికల్లో ఉమ్మడి జిల్లా నుంచి 86 మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తెలిపారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి కురుమూర్తిగౌడ్, జిల్లా యోగా సంఘం వర్కింగ్ చైర్మన్ రాములు, సలహాదారులు చెన్న వీరయ్య తదితరులు క్రీడాకారులను అభినందించారు. రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో పతకాలు సాధించి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఎంపికల సందర్బంగా క్రీడాకారుల యోగా విన్యాసాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సంఘం సభ్యులు ఆర్.బాలరాజయ్య, షంషేర్అలీ, వెంకటేశ్, రజనీ, మణికంఠ, నాగరాజు, బాలమణి, సాగర్, స్వప్న, శ్వేత తదితరులు పాల్గొన్నారు. -
రింగ్‌లో పంచ్.. మెడలో మెడల్స్!
● పంచ్ పవర్‌తో పతకాలు సాధిస్తున్న నలుగురు బాక్సర్లు ● బాక్సింగ్‌లో సత్తా చాటుతున్న ఉమ్మడి జిల్లా క్రీడాకారులు బాక్సింగ్ రింగ్‌లో ఉమ్మడి పాలమూరు జిల్లా క్రీడాకారులు పంచ్ పవర్ చూపించారు. హైదరాబాద్‌లో శనివారం జరిగిన రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో నలుగురు క్రీడాకారులు సత్తాచాటి పతకాలు సాధించారు. పెబ్బేర్ మండలం శాగాపూర్‌కు చెందిన శ్రీలేఖ స్వర్ణ పతకం సాధించి దక్షిణ భారత చాంపియన్‌షిప్‌కు ఎంపిక కాగా.. మహబూబ్‌నగర్‌కు చెందిన ఎం.రాజు, నాగర్‌కర్నూల్ జిల్లా శశికాంత్ రజత పతకాలు, గండేడ్‌కు చెందిన జె.రాకేష్ కాంస్య పతకం సాధించారు. వరుస విజయాలతో జిల్లాలో బాక్సింగ్‌పై ఆసక్తి పెరుగుతోంది. శ్రీలేఖ.. స్వర్ణ పంచ్ వనపర్తి జిల్లా పెబ్బేర్ మండలం శాగాపూర్‌కు చెందిన శ్రీలేఖ ఏడేళ్లుగా బాక్సింగ్‌లో శిక్షణ పొందుతూ అంచెలంచెలుగా ఎదుగుతోంది. ఇప్పటికే ఐదుసార్లు జాతీయస్థాయి పోటీల్లో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించింది. తొమ్మిదిసార్లు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని ఏడు స్వర్ణాలు, రెండు కాంస్య పతకాలు సాధించింది. జిల్లాస్థాయిలో మూడు స్వర్ణాలు, ఒక రజతం ఆమె ఖాతాలో ఉన్నాయి. హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో 48–51 కిలోల విభాగంలో స్వర్ణ పతకం సాధించిన శ్రీలేఖ.. ఈనెల 16 నుంచి 19 వరకు బెంగళూరులో జరిగే ఎలైట్ పురుషుల, మహిళల సౌత్ ఇండియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌కు ఎంపికై ంది. భవిష్యత్‌లో ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించడమే తన లక్ష్యమని చెబుతోంది. – మహబూబ్‌నగర్ క్రీడలు -
పల్లె ప్రగతికి ‘పక్కా’ ప్లాన్!
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): పల్లెల రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. గ్రామాల్లో ప్రస్తుతం ఉన్న మౌలిక వసతులు, ప్రజల అవసరాలు, భవిష్యత్ అభివృద్ధి అవసరాలను సమగ్రంగా గుర్తించి వచ్చే మూడేళ్లకు కార్యాచరణ రూపొందిస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక (జీపీసీడీపీ)కు శ్రీకారం చుట్టింది. ప్రతి గ్రామానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి విలేజ్ ప్రొఫైల్‌ను సిద్ధం చేస్తున్నారు. రోడ్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, డ్రెయినేజీలు మొదలు సామాజిక భద్రత, మహిళా సంఘాలు, రైతులు, విద్య వంటి వందకుపైగా అంశాలను ఇందులో పొందుపరుస్తున్నారు. అవసరమేంటి.. పనులేంటి? గ్రామంలో ఏ సౌకర్యం ఉంది? ఏది లేదు? ఇంకా ఏం కావాలి? అనే వివరాలను క్షేత్రస్థాయిలో నమోదు చేస్తున్నారు. మరుగుదొడ్లు లేని కుటుంబాలు, నల్లా కనెక్షన్లు లేని ఇళ్లు, తాగునీటి సమస్య ఉన్న ప్రాంతాలు, పాత చేతిపంపులు, మోటార్ల మరమ్మతులు, సీసీ రోడ్లు, లింక్ రోడ్లు, డ్రెయినేజీలు, వీధి దీపాలు తదితర అవసరాలను గుర్తిస్తున్నారు. వీటితోపాటు ఉపాధి హామీ కింద చేపట్టాల్సిన అవెన్యూ ప్లాంటేషన్, ఇంకుడు గుంతల నిర్మాణం వంటి పనులపైనా వివరాలు సేకరిస్తున్నారు. డిజిటల్ గ్రామ ప్రొఫైల్ గ్రామ పంచాయతీకి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఆన్లైన్లో నమోదు చేయనున్నారు. దీంతో గ్రామానికి సంబంధించిన వివరాలను ప్రజలు సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేక యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. పల్లెల ప్రగతికి ఇదే దిక్సూచి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి గ్రామ పంచాయతీలో మూడేళ్ల అభివద్ధి ప్రణాళిక కోసం వివరాల సేకరణ వేగంగా జరుగుతోంది. ప్రతి అంశాన్ని పక్కాగా నమోదు చేయాలని గ్రామ కార్యదర్శులకు ఆదేశాలిచ్చాం. ఇతర శాఖల ఉద్యోగులు, సర్పంచుల సహకారంతో దీనిని పూర్తి చేయాలని చెప్పాం. ఈ నివేదిక పల్లెల ప్రగతికి దిక్సూచిలా పని చేస్తుంది. – వెంకట్‌రెడ్డి, ఇన్చార్జి డీపీఓ మూడేళ్లకు గ్రామాల సమగ్ర అభివృద్ధి ప్రణాళిక 2026–29 లక్ష్యంగా జీపీసీడీపీ రూపకల్పన వందకుపైగా అంశాలపై క్షేత్రస్థాయి వివరాల సేకరణ అవసరాల గుర్తింపు.. ప్రాధాన్యతల వారీగా అభివృద్ధి పనులు ప్రతి గ్రామానికి ప్రత్యేక ప్రొఫైల్.. ఒక్క క్లిక్‌తో పూర్తి సమాచారం -
మహిళా సంఘాలకు మౌలిక వసతులు కల్పిస్తాం
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: నగరంలోని ఎంప్లాయీస్‌కాలనీలో కొత్తగా నిర్మించిన మహిళా సంఘ భవనాన్ని ఆదివారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల సభ్యులతో మాట్లాడుతూ త్వరలోనే ఈ భవనాన్ని ప్రారంభిస్తామన్నారు. ఇక్కడి ఆవరణలోనే ఆర్ఓ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశామని, దీని నిర్వహణ బాధ్యతలు తమకే అప్పగిస్తామన్నారు. మహిళా సంఘాల సభ్యులకు అవసరమైన మౌలిక వసతులను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో ముడా చైర్మన్ కె.లక్ష్మణ్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పాలకులవి కార్మిక వ్యతిరేక విధానాలు మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో ఏళ్లుగా ప్రజా, కార్మిక, కర్షక, ఉద్యోగ వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ.రాములు ఆరోపించారు. స్థానిక అంబేడ్కర్‌నగర్‌లోని సీపీఎం జిల్లా కార్యాలయంలో ఆదివారం రాజకీయ శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్లకు పాలకులు యథేచ్ఛగా దేశ సంపద, వనరులు దోచిపెడుతున్నారని విమర్శించారు. దీంతో అసమానతలు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం తదితర సామాజిక సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. ముఖ్యంగా కనీస వేతనాలు పెరగనందున కొనుగోలు శక్తి పడిపోయి కార్మికులు, కర్షకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.పార్టీ నాయకులు వి.కురుమూర్తి, కిల్లె గోపాల్, లక్ష్మయ్య, వి.పద్మ, బొల్లె చంద్రకాంత్, రాజ్‌కుమార్, ప్రశాంత్ పాల్గొన్నారు. తండా సమస్యలపై అదనపు కలెక్టర్ ఆరా భూత్పూర్: మండలంలోని హస్నాపూర్ గ్రామపంచాయతీ అనుబంధ గ్రామమైన పోతుగుట్టతండాలో అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్ ఆదివారం పర్యటించి తండావాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తండాలో ప్రభుత్వ భవనాలు, అంగన్వాడీ కేంద్రం, ఓటర్ల జాబితాలోని తప్పులపై వివరాలు సేకరించారు. అంగన్వాడీ భవన నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలని తహసీల్దార్ కిషన్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్ఐ వెంకటేశ్, జీపీఓ ప్రణీత్, తండావాసులు పాల్గొన్నారు. పోలింగ్‌కేంద్రాల పరిశీలన భూత్పూర్ (అడ్డాకుల): అడ్డాకుల మండలం శాఖాపూర్ 103,104 పోలింగ్ కేంద్రాలను, మూసాపేట మండలం జానంపేటలో అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో చేపట్టిన ఏర్పాట్ల, ఎన్నికల సంబంధిత కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తిగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. 24న పీయూలో ఉద్యమకారుల సమ్మేళనం మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: పాలమూరు యూనివర్సిటీలో ఈనెల 24న తెలంగాణ ఉద్యమకారుల సమ్మేళనం ఉంటుందని పీయూ ఉద్యమకారుల కమిటీ సభ్యులు అన్వర్, రాము తెలిపారు. ఈ మేరకు ఆదివారం పీయూ ఆవరణలో సమ్మేళనం వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని కళాశాలల ఉద్యమకారులు ఆ రోజు జరిగే సమ్మేళనంలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. దీనికి ముఖ్య అతిథులుగా మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి తదితరులు హాజరవుతారన్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు బ్రహ్మం, శివ, కొండా గణేష్, చంద్రకాంత్‌గౌడ్, ప్రొఫెసర్ భూమయ్య, గోపాల్, సుగుణాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
21 క్వింటాళ్ల నల్లబెల్లం, పటిక పట్టివేత
ఉప్పునుంతల: నాటుసారా తయారీకి ఉపయోగించే నిషేధిత నల్లబెల్లం, పటికను అక్రమంగా తరలిస్తున్న మినీలారీని పోలీసులు పట్టుకున్నారు. నాగర్కరూన్ల్ జిల్లా ఉప్పునుంతల మండలంలోని శ్రీశైలం–హైదరాబాద్ ప్రధాన రహదారిపై వెల్టూరు స్టేజీ సమీపంలో ఆదివారం వాహన తనిఖీలు చేపట్టగా ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులను గమనించిన డ్రైవర్ వాహనాన్ని పొలాల్లోకి మళ్లించి చెట్ల పొదల్లోకి దూసుకెళ్లాడు. పోలీసులు వెంబడించడంతో వాహనాన్ని అక్కడే వదిలి పరారయ్యాడు. పోలీసులు మినీలారీని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా 21 క్వింటాళ్ల నల్లబెల్లం, రెండు కిలోల పటిక లభించింది. పరారైన డ్రైవర్‌ను నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి బాపూజీనగర్‌కు చెందిన అల్లకుంట శంకర్‌గా గుర్తించినట్లు ఎస్ఐ పుట్ట మహేష్‌గౌడ్ తెలిపారు. వాహన యజమాని అదే గ్రామానికి చెందిన పిట్ల రాజాపై కూడా కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఉప్పునుంతల మండలంలోని తండాలు, గ్రామాల్లో విక్రయించేందుకు వీటిని తరలిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని ఎస్ఐ తెలిపారు. ● పోలీసులను చూసి మినీలారీని పొలాల్లోకి తీసుకెళ్లిన వైనం ● డ్రైవర్ పరారీ.. వాహనం యజమానిపైనా కేసు -
కేఎల్ఐ కాల్వలో వృద్ధురాలి గల్లంతు
కల్వకుర్తి టౌన్: మున్సిపాలిటీ పరిధిలోని సిలార్పల్లి వార్డులో ఉన్న కేఎల్ఐ కాల్వలో వృద్ధురాలు గల్లంతైన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఎస్ఐ కురుమూర్తి, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సిలార్‌పల్లికి చెందిన అంజనమ్మ (70) ఆదివారం ఉదయం కొడుకు ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఎంత సేపటికి వృద్ధురాలు తిరిగి రాకపోవటంతో కొడుకు పర్వతాలు మిత్రులు, బంధువులతో కలిసి గాలించారు. అయితే అదే గ్రామానికి చెందిన చిన్నారి రాధిక తనకు అవ్వ కేఎల్ఐ కాల్వ వద్ద కనిపించిందని చెప్పడంతో కాల్వ వద్దకు వెళ్లి చూడగా అంజనమ్మ చెప్పులు, చేతికర్ర కనిపించాయి. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఫైర్ సిబ్బంది సహకారంతో గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి వరకు గాలించినా ఆచూకీ లభించకపోవడంతో కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని గాలింపు కొనసాగిస్తామని ఎస్ఐ కురుమూర్తి తెలిపారు. పిచ్చికుక్క కాటుకు ఒకరు బలి తెలకపల్లి: పిచ్చికుక్క కా టు వేయడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన మండల కేంద్రంలో ఆదివారం చో టు చేసుకుంది. గ్రామస్తు లు తెలిపిన వివరాల మేరకు.. మండల పరిధిలోని వ ట్టిపల్లికి చెందిన జలాల శ్రీనివాస్‌యాదవ్ (40) గత నెలలో పని నిమి త్తం తెలకపల్లికి వెళ్లాడు. అక్కడ ఓ పిచ్చి కుక్క కాటు వేసింది. వెంటనే స్థానిక ఆస్పత్రిలో చికి త్స అనంతరం ఇంటికి వచ్చాడు. కొద్దిరోజులకే మళ్లీ అనారోగ్యానికి గురి కావడంతో హైదరా బాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం మృతి చెందాడు.మృతునికి భార్య, ఇద్దరు పిల్ల లు ఉన్నారు. శ్రీనివాస్‌యాదవ్ మృతితో గ్రా మంలో విషాధచాయలు అలుముకున్నాయి. తల్లి మందలింపు.. కుమారుడి బలవన్మరణం కొత్తకోట రూరల్: వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని సత్యహళ్లి గ్రామానికి చెందిన ఎం.కుమార్ (27) మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ ఎం.విక్రమ్ తెలిపిన వివరాల ప్రకారం.. వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు కుమార్. అయితే కొంతకాలంలో పనులు చేయకుండా తిరుగుతుండడంతో మూడు రోజుల క్రితం తల్లి పార్వతమ్మ మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన ఆయన ఈ నెల 4న ఇంటి నుంచి వెళ్లిపోయాడు. శనివారం అప్పరాల శివారులోని చెప్పరోని గుట్టపై మృతదేహాన్ని గుర్తించిన గొర్రెల కాపరులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడు కుమార్‌గా గుర్తించిన పోలీసులు.. ఆయన అన్న శివ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చెరువులో మృతదేహం లభ్యం వనపర్తి రూరల్: పెబ్బేరు పట్టణంలోని మహభూపాల్ చెరువులో ఆదివారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు ఎస్ఐ వెంకటేష్ గౌడ్ తెలిపారు. పురుషుడి (40) మృతదేహం తేలాడుతూ ఉందని తమకు సమాచారం రావడంతో ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీసి పరిశీలించగా బ్లూకలర్ జీన్స్ పాయింట్ ధరించి, కుడి చేతికి వెండి కడెం ధరించి ఉన్నాడన్నాడు. మృతదేహాన్ని వనపర్తి ప్రభుత్వ ఆస్పత్రిలో మార్చురికి తరలించామన్నారు. మృతుడి వివరాలు ఎవరికై నా తెలిస్తే పెబ్బేరు పోలీసులను సంప్రదించాలని ఎస్ఐ సూచించారు. -
జీనియస్ బుక్ ఆఫ్ రికార్డులో మాస్టర్ కేశవ్
జడ్చర్ల టౌన్: గంగాపురం వాసి, జడ్చర్ల కేంద్రంగా అమెచ్యూర్ స్పోర్ట్స్ కల్చరల్ అసోసియేషన్ లో శిక్షణ పొందుతున్న మాస్టర్ కేశవ్గౌడ్కు ఇంటర్నేషనల్ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కింది. హైదరాబాద్ రామకోటిలోని తెలంగా ణ సారస్వత పరిషత్ ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన ‘గ్లోబల్ ఎక్స్‌లెన్స్ ఐకాన్ అవార్డ్స్–2026’ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన 400 మందిని ఒకే వేదికపై సత్కరించారు. ఈ కార్యక్రమాన్ని అసాధారణ విజయంగా గుర్తిస్తూ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డులో నమోదు చేశారు. ఈ సందర్భంగా కేశవ్గౌడ్ను జీనియస్ బుక్ సౌత్ ఇండియా కోఆర్డినేటర్ రవీందర్, ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇండియా చీఫ్ కోఆర్డినేటర్ నరేందర్‌గౌడ్ తదితరులు సత్కరించారు. కేశవ్గౌడ్కు రికార్డులో చోటు దక్కడంపై గంగాపురం వాసులు, జడ్చర్లలోని కరాటే సంఘాల ప్రతినిధులు అభినందనలు తెలిపారు. -
రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
చిన్నచింతకుంట: రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే జి. మధుసూదన్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద రైతులకు ట్రాన్స్ఫార్మర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. నియోజకవర్గంలో 13 విద్యుత్ సబ్స్టేషన్ల ఏర్పాటుకు భూమిపూజలు చేశామని, ఇప్పటికే 550 ట్రాన్స్ఫార్మర్లు రైతులకు అందించామని తెలిపారు. తాజాగా మరో 800 ట్రాన్స్ఫార్మర్లు వచ్చాయని, వాటిని మండలాల వారీగా రైతులకు పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, విద్యుత్ అధికారులు, రైతులు పాల్గొన్నారు.● ఎమ్మెల్యే జి. మధుసూదన్‌రెడ్డి ● 800 ట్రాన్స్ఫార్మర్లు.. మండలాల వారీగా పంపిణీ -
రోడ్డు ప్రమాదంలో ఉద్యమకారుడు మృతి
● గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో పల్లె రవి మృత్యువాతమహబూబ్నగర్ క్రైం: మలిదశ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన ఉద్యమకారుడు పల్లె రవి మృతి చెందారు. బైక్‌పై రోడ్డు క్రాస్ చేస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మహబూబ్‌నగర్ రూరల్ ఎస్ఐ విజయ్‌కుమార్ కథనం ప్రకారం.. నగరంలోని క్రిస్టియన్‌పల్లికి చెందిన పల్లె రవి(48) భార్య వరలక్ష్మితో కలిసి బైక్‌పై శనివారం రాత్రి 9 గంటల సమయంలో క్రిస్టియన్‌పల్లి చౌరస్తాలో రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం వేగంగా ఢీకొట్టింది. ప్రమాదంలో రవి తీవ్రంగా గాయపడగా, భార్య వరలక్ష్మి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. రవిని చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, మెరుగైన వైద్యం కోసం ఎస్వీఎస్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. పల్లెరవిని కోల్పోవడం బాధాకరం.. జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): పల్లె రవి లాంటి నిబద్ధత కలిగిన తెలంగాణ ఉద్యమకారుడిని కోల్పోవడం బాధాకరమని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం పల్లె రవి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ చౌరస్తాలో పల్లె రవి చిత్రపటానికి పూలమాల వేశారు. రవి మృతి పార్టీకి తీరని లోటన్నారు. ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు శివరాజ్, కార్పొరేటర్ నరేందర్, గిరిధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రవిని కోల్పోవడం దురదృష్టకరం.. ఉద్యమకారుడు పల్లె రవి మృతదేహానికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో రవితో కలిసి పనిచేసిన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రవిని కోల్పోవడం అత్యంత దురదృష్టకరమని, ఆయన మృతి ఎంతో బాధించిందని వాపోయారు. విప్‌తో ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్, కాంగ్రెస్ నాయకులు సిరాజ్‌ఖాద్రీ, నాయకులు మైత్రియాదయ్య నివాళి అర్పించారు. -
కొడుక్కు అంత్యక్రియలు చేసిన తల్లి
● నీటికుంటలో పడి పెద్ద కుమారుడు మృతి ● గతంలో రోడ్డు ప్రమాదంలో చిన్న కుమారుడు దుర్మరణం ● రెండు నెలల వ్యవధిలో ఇద్దరిని కోల్పోయిన వైనం మిడ్జిల్: చస్తే కాశీలో చావాలి.. లేదా కన్న కొడుకు ఒడిలో మృతి చెందాలి అనుకుంటారు తల్లిదండ్రులు. అలాంటిది కన్న కొడుకులకు ఆ తల్లి తలకొరివి పెట్టాల్సిన దురదృష్టం ఆమెను వెంటాడుతుంది. గతంలో భర్తను కోల్పోయిన ఆ తల్లి రెండు నెలల వ్యవధిలో ఇద్దరు కొడుకులకు అంత్యక్రియలు చేసిన మండలంలోని మసిగొండ్లపల్లిలో జరిగింది. పూర్తి వివరాలు.. గ్రామానికి చెందిన మణెమ్మకు ఇద్దరు కుమారులు వడ్ల శ్రీనివాసులు(43), రాజేందర్(40) ఉన్నారు. ఈ ఏడాది జూన్ 28న మండల కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజేందర్ మృతి చెందగా అదే ప్రమాదంలో శ్రీనివాసులు ఆస్సత్రిలో చికిత్స పొందుతుండగా మణేమ్మ చిన్న కుమారుడు రాజేందర్‌కు అంత్యక్రియలు పూర్తి చేసేంది. తాజాగా ఆదివారం పెద్ద కుమారుడు శ్రీనివాసులు గ్రామ సమీపంలోని పొలంలో ఏర్పాటు చేసిన నీటి కుంటలో స్నానానికి దిగి ప్రమాదశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. ఇద్దరు కుమారులకు మూడు, మూడు పెళ్లిళ్లు చేసినా వారి భార్యలు గతంలోనే వదిలి వెళ్లడంతో ఆదివారం పెద్ద కుమారుడు శ్రీను మృతి చెందగా ఆమెనే తలకొరివి పెట్టాల్సి వచ్చింది. ఇద్దరు కొడుకులు తనకు ఆసరాగా ఉంటారు అనుకుంటే 65 రోజుల వ్యవధిలో ఇద్దరిని కోల్పోయి మణెమ్మ అనాథగా మిగిలింది. -
మూగజీవిపై.. అమానుషం!
తిమ్మాజిపేట: చేను మేసిందనే కారణంతో ఓ వ్యక్తి నాలుగు నెలల లేగదూడను ట్రాక్టర్‌కు కట్టి ఈడ్చుకెళ్లిన ఘటన మండలంలోని లక్ష్మణ్నాయక్తండాలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటకు చెందిన అర్షద్ పొలంలో పాండునాయక్‌కు చెందిన లేగదూడ చేను మేసింది. దీంతో ఆగ్రహించిన అర్షద్ దూడను ట్రాక్టర్‌కు కట్టి కొంతదూరం ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటనను గమనించిన తండావాసులు వెంటనే దూడ యజమాని పాండునాయక్‌కు సమా చారం అందించారు. అక్కడికి చేరుకున్న ఆయ న తీవ్రంగా గాయపడిన దూడను చూసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించిన పోలీసు లు అర్షద్‌పై కేసు నమోదు చేశారు. గాయపడిన లేగదూడ పరిస్థితి విషమంగా ఉందని యజమాని తెలిపారు. ● చేను మేసిందని లేగ దూడను ట్రాక్టర్‌కు కట్టి ఈడ్చుకెళ్లిన వైనం ● నిందితుడిపై కేసు నమోదు -
పీయూలో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పీయూలో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్‌టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఏబీవీపీ పీయూ శాఖ కార్యదర్శి కావలి కిషోర్ డిమాండ్ చేశారు. గురువారం ఏబీవీపీ నాయకులు పీయూ రిజిస్ట్రార్ రమేష్‌బాబుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడుతూ సిబ్బంది కొరత కారణంగా పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రక్రియ, విద్యార్థుల సర్టిఫికెట్ల జారీ, పరిపాలన సేవల్లో తీవ్ర అంతరాయం కలుగుతుందన్నారు. శివమార్తండ్, యువకుమార్, తదితరులు పాల్గొన్నారు. పెంచిన ఫీజులను తగ్గించాలి గర్ల్స్ హాస్టల్లో చదువుతున్న పేద విద్యార్థులకు అధికారులు హాస్టల్ ఫీజులను ఒకే సారి పెంచడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే తగ్గించాలని కోరుతూ ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. బాలికల హాస్టల్ నుంచి అడ్మినిస్ట్రేషన్ వరకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రిజిస్ట్రార్‌కు వినతిపత్రం అందజేశారు. ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్గ సభ్యులు మహేశ్వరి మాట్లాడుతూ ఫీజులు పెంచి ఆర్థిక భారం మోపడం సరికాదన్నారు. మౌలిక వసతులు కల్పించాలన్నారు. కార్యక్రమంలో కలామంచ్ కన్వీనర్ శైలజ, క్రితిక, చైతన్య, ప్రియ విద్యార్థులు పాల్గొన్నారు. -
బ్రహ్మోస్ భూసేకరణలో రైతుల ప్రయోజనాలకే ప్రాధాన్యం
● సాధ్యమైనంత మెరుగైనపరిహారం అందిస్తాం: కలెక్టర్ జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): బ్రహ్మోస్ ప్రాజెక్టుతో జిల్లాకు పారిశ్రామికంగా కొత్త ఊపు రానున్న నేపథ్యంలో.. భూములు కోల్పోయే రైతుల ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యమిస్తామని కలెక్టర్ ఖుష్బూగుప్తా స్పష్టం చేశారు. చట్ట నిబంధనల మేరకు సాధ్యమైనంత మెరుగైన పరిహారం అందించేలా భూసేకరణ చేపడతామని తెలిపారు. దేవరకద్ర మండలం బస్వాయిపల్లిలో బ్రహ్మోస్ ప్రాజెక్టు కోసం చేపట్టనున్న భూసేకరణపై గురువారం కలెక్టరేట్లో నెగోషియేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. రైతులు, సర్పంచ్, ప్రజాప్రతినిధులతో కలెక్టర్ చర్చించారు. భూముల ప్రస్తుత మార్కెట్ విలువ, పరిహారం, రైతుల జీవనోపాధి, భవిష్యత్ ప్రయోజనాలపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ‘‘మీ భూములకు ఎంత పరిహారం ఆశిస్తున్నారు? మీ అభిప్రాయాలు, అభ్యంతరాలను స్పష్టంగా తెలియజేయండి’’ అని రైతులను కోరారు. ప్రస్తుత మార్కెట్ విలువను పరిగణనలోకి తీసుకుని మెరుగైన పరిహారం ఇవ్వాలని రైతులు కోరారు. భూమికి బదులుగా భూమి కేటాయించడంతోపాటు తగిన పరిహారం అందించాలని, భూములు కోల్పోయిన తర్వాత జీవనోపాధికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బ్రహ్మోస్ వంటి ప్రతిష్టాత్మక పరిశ్రమ జిల్లాకు రావడం గర్వకారణమని సర్పంచ్ శివకుమార్ అన్నారు. ప్రాజెక్టుపై గ్రామస్తులు సంతోషంగా ఉన్నప్పటికీ.. భూములు కోల్పోయే రైతుల విషయంలో ఆందోళన ఉందని గ్రామ ప్రతినిధి శ్రీనివాస్ తెలిపారు. సర్వే వివరాలు పక్కాగా ఉండాలి భూసేకరణ సర్వేలో భూమి విస్తీర్ణం, సర్వే నంబర్లు, పట్టా భూములు, కబ్జా వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు. వివరాలపై రైతులకు అభ్యంతరాలుంటే క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని సూచించారు. రైతులు, ప్రజాప్రతినిధులు మరోసారి గ్రామస్థాయిలో సమావేశమై భూముల ప్రస్తుత ధరలు, వాస్తవ పరిస్థితులు, రైతుల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని ఆచరణాత్మక ప్రతిపాదనలు రూపొందించాలని కోరారు. ప్రాజెక్టు అభివృద్ధి, రైతుల ప్రయోజనాలను సమన్వయం చేస్తూ భూసేకరణను పారదర్శకంగా, న్యాయబద్ధంగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జేఎల్బీ హరిప్రియ, ఆర్డీఓ నవీన్, సర్పంచులు, రైతులు, పాల్గొన్నారు. -
దొంగతనం కేసుల్లో రివకరీ వేగవంతం కావాలి
● పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలి ● గణపతి ఉత్సవాల్లో కట్టుదిట్టంగా బందోబస్తు: ఎస్పీ మహబూబ్‌నగర్ క్రైం: పోలీస్‌స్టేషన్ వారీగా పెండింగ్‌లో ఉన్న కేసులకు అధిక ప్రాధన్యత ఇచ్చి దర్యాప్తు వేగవంతం చేసి బాధితులకు సత్వర న్యాయం చేయాలని ఎస్పీ డి.జానకి అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలోని సమావేశం మందిరంలో గురువారం నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. సీసీటీఎన్ఎస్లో కేసుల వివరాలు, రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలన్నారు. మాదకద్రవ్యాలు, సైబర్‌నేరాలు, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక కార్యచరణ అమలు చేయాలన్నారు. రికార్డుల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండరాదన్నారు. సైబర్ నేరాల కట్టడిలో భాగంగా నిరంతరం అవగహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఫిర్యాదులపై వేగంగా స్పందించాలన్నారు. ప్రధానంగా దొంగతనం కేసుల్లో నేరస్తులను సకాలంలో గుర్తించి సొమ్ము రికవరీ చేయాలని సూచించారు.మహిళలు, అమ్మాయిలు, చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధన్యత ఇవ్వాలని ఆదేశించారు. ప్రతి గ్రామంతో పాటు పట్టణం, మండలకేంద్రాల్లో ఉండే ప్రధాన కూడళ్లు, వీధులలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా చైతన్యం చేయాలన్నారు. ఈ నెల 14 నుంచి వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా జిల్లాలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు భద్రత చర్యలు చేపట్టాలన్నారు. ఆయా స్టేషన్ పరిధిలో ఉన్న అన్ని మండపాలపై నిఘా పెట్టాలని, రాత్రి వేళ గస్తీ పెంచాలన్నారు. సమావేశంలో డీఎస్పీలు వెంకటేశ్వర్లు, రమణారెడ్డి, బాలాజీ, సీఐలు అప్పయ్య, గాంధీనాయక్, కమలాకర్, రాజేందర్‌రెడ్డి, క్రిష్ణ, మోతీరాం, రామకృష్ణ, రవిబాబు, మహేష్, నర్సింహులు, ఎస్హెచ్ఓలు, ఐటీ సెల్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఎవరి ఆదేశాలతో.. ఇన్ని హైమాస్ట్‌లు?
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలో హైమాస్ట్ లైట్ల ఏర్పాటు, నిర్వహణపై తీవ్ర చర్చ జరుగుతోంది. గతంలో ప్రధాన కూడళ్లు, జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాలకే పరిమితమైన హైమాస్ట్ లైట్లు.. ప్రస్తుతం పలు డివిజన్లలో అవసరం ఉన్నా లేకున్నా ఏర్పాటు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణ విద్యుత్ స్తంభాలకు లైట్లు ఉన్నప్పటికీ అదనంగా హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేయడంతో కార్పొరేషన్‌పై నిర్వహణ భారం పెరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కార్పొరేషన్ విద్యుత్ విభాగానికి చెల్లించాల్సిన బకాయిలు సుమారు రూ.13 కోట్లకు చేరినట్లు సమాచారం. మరోవైపు హైమాస్ట్ లైట్లు, బోర్ల నిర్వహణకు నెలకు సుమారు రూ.40 లక్షల వరకు ఖర్చవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో నిర్వహణ, విద్యుత్ బిల్లులు కార్పొరేషన్‌కు భారంగా మారాయి. బోర్లూ.. భారమే మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా జరుగుతున్నప్పటికీ పలు డివిజన్లలో అదనంగా బోర్లు, పంప్సెట్లు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. వీటిలో నెలకు 20 నుంచి 30 వరకు బోర్లు పాడవుతుండటంతో మరమ్మతుల కోసం ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. బోర్ల నిర్వహణ, మరమ్మతులు, విద్యుత్ బిల్లులకు కలిపి నెలకు రూ.15–20 లక్షల వరకు ఖర్చవుతున్నట్లు సమాచారం. ఎవరు చెప్పారు.. ఎందుకు వేశారు? అవసరం ఉన్నా లేకున్నా హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో పూర్తి వివరాలతో నివేదిక రూపొందించేందుకు కార్పొరేషన్ అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా 60 డివిజన్లలోని ప్రతి హైమాస్ట్ లైట్ వివరాలను సేకరించనున్నారు. ఎవరి సూచనతో ఏర్పాటు చేశారు? ఎందుకు ఏర్పాటు చేశారు? ఎక్కడి నుంచి ప్రతిపాదన వచ్చింది? అనే అంశాలను పరిశీలించనున్నారు. వార్డు అధికారుల ఆధ్వర్యంలో శుక్రవారం (నేడు) నుంచి లైట్ల వద్ద సోషల్ సర్వే నిర్వహించి, సమీపంలోని ఇళ్ల యజమానుల నుంచి వివరాలు సేకరించనున్నట్లు సమాచారం. సర్వే పూర్తయితే హైమాస్ట్ లైట్ల ఏర్పాటు వెనుక అసలు పరిస్థితులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కాగా.. ఈ విషయం మాట్లాడేందుకు కార్పొరేషన్ కమిషనర్ రామాంజులారెడ్డి సంప్రదించగా.. ఆయన స్పందించలేదు. 2 వేలకుపైగా హైమాస్ట్‌లు కార్పొరేషన్‌లోని 60 డివిజన్ల పరిధిలో 2 వేలకుపైగా హైమాస్ట్ లైట్లు ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో ప్రతి నెలా సుమారు 100 నుంచి 150 వరకు బల్బులు, హెచ్‌క్యూలు, వైర్లు తదితర పరికరాలు పాడవుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. గత రెండు, మూడేళ్లలోనే పెద్ద సంఖ్యలో హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇటీవల ఏర్పాటు చేసిన కొన్ని లైట్లు సైతం పనిచేయడం లేదని, వాటికి వారంటీ, గ్యారంటీ ఉందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అవసరం లేకున్నా.. ఇష్టానుసారంగా ఏర్పాటు కార్పొరేషన్ పరిధిలో 2 వేలకుపైగా లైట్లు రూ.13 కోట్ల కరెంట్ బకాయిలు.. నెలకు రూ.40 లక్షల ఖర్చు ‘హైమాస్ట్’లు ఎందుకు ఏర్పాటు చేశారనే దానిపై నేటి నుంచి సోషల్ సర్వే -
డీఎఫ్ఓగా బాధ్యతలు స్వీకరించిన నవీన్‌రెడ్డి
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: సుమారు రెండు నెలల తర్వాత ఎట్టకేలకు కొత్త రెగ్యులర్ డీఎఫ్ఓగా మందాడి నవీన్‌రెడ్డి నియమితులయ్యారు. గురువారం జిల్లా అటవీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం కలెక్టర్ ఖుష్బూగుప్తాను ఆయన మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం అటవీశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అటవీ భూములను ఆక్రమించి, అక్రమ చెట్ల నరికివేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో పెట్రోలింగ్‌ను ముమ్మరం చేయడంతో పాటు జిల్లావ్యాప్తంగా పచ్చదనాన్ని పెంచేందుకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని వేగవంతం చేస్తామన్నారు. కాగా, ఈయన యూపీఎస్సీ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) 2019 బ్యాచ్‌లో అఖిల భారత స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించారు. గతంలో నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్) లో విధులు నిర్వహించిన సమయంలో వేసవి తీవ్రతలో వన్యప్రాణులకు తాగునీటి కొరత లేకుండా అటవీ ప్రాంతంలో సోలార్ బోర్లను ఏర్పాటు చేయించారు. వాటి ద్వారా నీటి తొట్టె (సాసర్ పిట్స్)లను ఎప్పటికప్పుడు నింపేలా చర్యలు తీసుకున్నారు. రేపు ఉమ్మడి జిల్లా ఖోఖో క్రీడాకారులు ఎంపికలు మహబూబ్‌నగర్ క్రీడలు: జడ్చర్ల మండలంలోని పెద్ద ఆదిరాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈనెల 12వ తేదీన ఉదయం 10 గంటలకు రాష్ట్రస్థాయి ఖేలో ఇండియాలో పాల్గొనే ఉమ్మడి జిల్లా ఖోఖో క్రీడాకారుల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా ఖోఖో సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఉబేదుల్లా కొత్వాల్, జీఏ విలియం గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపికల్లో పాల్గొనే క్రీడాకారులు 01.01.2008 తర్వాత జన్మించిన వారై ఉండాలని పేర్కొన్నారు. క్రీడాకారులు జనన ధ్రువీకరణ పత్రం, పదోతరగతి మెమో, ఆధార్‌కార్డుతో ఎంపికలకు హాజరుకావాలని, మిగతా వివరాల కోసం 99853 75737 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. ఎంపికయ్యే క్రీడాకారులు సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ఈనెల 16న (బాలురు), 17న (బాలికలు) జరిగే రాష్ట్రస్థాయి సెలక్షన్స్‌లో పాల్గొనాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 13న ‘కబడ్డీ’ జట్టు ఎంపిక మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో ఈనెల 13వ తేదీన ఉదయం 9.30 గంటలకు జిల్లాస్థాయి జూనియర్ బాలు ర, సబ్ జూనియర్ బాలికల జట్ల ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు బి.శాంతికుమార్, ప్రధాన కార్యదర్శి కురుమూర్తిగౌడ్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపికలకు వచ్చే జూనియర్ బాలురు 05.11.2006 తర్వాత పుట్టినవారై 75 కేజీల లోపు బరువు ఉండాలని, సబ్ జూనియర్ బాలికలు 13.12.2010 తర్వాత పుట్టిన వారై 55కేజీల లోపు బరువు ఉండాలని పేర్కొ న్నారు. క్రీడాకారులు ఆధార్‌కార్డు, ఎస్ఎస్సీ ఒరిజనల్ మెమో, జనన ధ్రువీకరణ, బోనఫైడ్ సర్టిఫికెట్లతో ఎంపికలకు హాజరుకావాలని కోరారు. రాజన్నసిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో ఈనెల 26 నుంచి 29 వరకు జూనియర్ బాలురు, సబ్ జూనియర్ బాలికల రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు ఉంటాయని తెలిపారు. గిరిజన నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలి మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: గిరిజన నిరుద్యోగ యువత కోసం బ్యాక్లాగ్ పోస్టుల్లో ఉన్న ఖాళీలన్నీ వెంటనే భర్తీ చేయాలని గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ధర్మనాయక్ కో రారు. గురువారం జిల్లా గిరిజన సంఘం కార్యాలయంలో జరిగిన మహాసభలో ఆయన మాట్లాడారు. ఏటా విద్యార్థులు విద్యను ము గించుకుని బయటకు వస్తున్నా ఉపాధి అవకాశాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రన్నారు. చివరకు ఉపాధిహామీ పథకంలో తల్లిదండ్రులతో కాలిసి పనికి వెళ్లాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. అనేక ప్రైవేట్ కంపెనీలు వెలుస్తున్నా రిజర్వేషన్లు లేకపోవడంతో స్థానికంగా ఉపాధి దొరకక ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లాల్సి వస్తోందన్నారు. ప్రైవేట్ రంగంలోనూ స్థానికంగా రిజర్వేషన్లు వర్తింపజేయాలన్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడు భీమ్లా, నాయకులు మెగావత్ దీప్లానాయక్, చందర్‌నాయక్, ముడావత్ మణికంఠ, కుమార్, పవన్, మోహన్, ఈశ్వర్, చందర్ పాల్గొన్నారు. -
ఎత్తిపోతలకు విఘాతం
నాగర్‌కర్నూల్: కరెంట్ కష్టాలు రైతులకే కాదు.. ఏకంగా సాగునీరు అందించే కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి సైతం మొదలయ్యాయి. రాత్రివేళ మూడు రిజర్వాయర్ల వద్ద నీటిని ఎత్తిపోసే పంపుసెట్లు ఆపేయాలని.. ఉదయం వేళ నడపాలని ఎస్ఎల్డీసీ (స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్) నుంచి ఎప్పటికప్పుడు సూచనలు వస్తున్నాయి. ఈ మేరకు తప్పని పరిస్థితుల్లో కొన్ని రిజర్వాయర్ల వద్ద రాత్రివేళ పంపులను ఆపేసి.. మరికొన్ని చోట్ల ఒక పంపుసెట్ నడుపుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే సాగు, తాగునీటి సరఫరాపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఫలితంగా కాల్వల నీటిని నమ్ముకొని పంటలు సాగు చేసిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారనుంది. మూడు రిజర్వాయర్లు.. కేఎల్ఐ పరిధిలో నాలుగు రిజర్వాయర్లు ఉన్నాయి. ముందుగా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రేగుమాన్గడ్డ వద్ద ఎల్లూరు రిజర్వాయర్‌కు నీరు ఎత్తిపోస్తారు. అక్కడ ఐదు పంపుసెట్లకు గాను ప్రస్తుతం రెండు మరమ్మతుకు గురవగా మూడు నడుస్తున్నాయి. ఎల్లూరు నుంచి సింగోటం గ్రావిటీ మీదుగా జొన్నలబొగుడకు ఎత్తిపోయాల్సి ఉంటుంది. ఇక్కడ ఐదు పంపులు ఉండగా మూడే నడుపుతున్నారు. గుడిపల్లి రిజర్వాయర్ నుంచి కేఎల్ఐ కాల్వలకు వదులుతారు. గ్రావిటీ మీద నీరు పారుతుండగా ప్రధాన కాల్వ 160 కి.మీ., కల్వకుర్తి మండలం జంగారెడ్డిపల్లి నుంచి మరో 60 కి.మీ., మాడ్గుల మండలం నాగిళ్ల వరకు టెలెండ్ కాల్వ వెళ్తుంది. 13 గంటలకు కుదింపు.. ప్రస్తుతం విద్యుత్ సమస్య తీవ్రమైంది. ఇప్పటికే వ్యవసాయ రంగానికి 18 నుంచి 13 గంటలకు కుదించారు. అయితే వాస్తవ పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది. పది గంటలే సరఫరా అవుతుందని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరెంట్ సమస్య కేఎల్ఐ పంపుసెట్లకు తాకడం ఆందోళనకరం. ఎస్ఎల్డీసీ (లోడ్ డిస్పాచ్ సెంటర్) విద్యుత్ వాడకంపై నియంత్రణ విధిస్తున్నారు. మూడు రోజుల నుంచి కేఎల్ఐ పంపుసెట్ల విద్యుత్ వాడకంపై నియంత్రణ చేయాలని, రాత్రివేళ నిలిపివేయాలని సూచిస్తున్నారు. సాయంత్రం 7 నుంచి ఉదయం 8 గంటల వరకు నిలిపివేస్తే లోడ్ కంట్రోల్ చేయవచ్చని ట్రాన్స్‌కో అధికారులు చెబుతున్నారు. కాగా.. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో లోటు వర్షపాతం నమోదైంది. వరిసాగు వద్దని, ఆరుతడి పంటలు వేసుకోవాలని అధికారులు విస్తృత ప్రచారం చేసినా.. కేఎల్ఐ సాగునీరు విడుదలతో రైతులు వరిసాగుకే మొగ్గుచూపారు. ప్రస్తుతం కేఎల్ఐ కాల్వలో పూర్తిస్థాయిలో నీరు రావడం లేదు. అది కూడా ఎప్పుడు ఆగిపోతాయోనని, చివరికి పంటలు చేతికి వస్తాయో.. లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. తీవ్రమైన విద్యుత్ కోతలతో కేఎల్ఐ పంపింగ్‌కు ఆటంకాలు జొన్నలబొగుడ, గుడిపల్లి రిజర్వాయర్ల వద్ద మోటార్ల నిలిపివేత ఎస్ఎల్డీసీ సూచన మేరకు రాత్రివేళ నిలుపుదల సాగు, తాగునీటి సరఫరాపై ప్రభావం చూపే అవకాశం -
చాకలి ఐలమ్మ ఆశయాలు స్ఫూర్తిదాయకం
చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద నివాళులు అర్పిస్తున్న ఎంపీ డీకే అరుణ, కలెక్టర్ ఖుష్బూగుప్తా, మేయర్ మమత, తదితరులు జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): చాకలి ఐలమ్మ ఆశయాలు స్ఫూర్తిదాయకం కలెక్టర్ ఖుష్బూగుప్తా, ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని పద్మావతి కాలనీలో గురువారం చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా వారు నగర మేయర్ మమతతో కలిసి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఐలమ్మ చేసిన పోరాటాన్ని వారు స్మరించుకున్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ధైర్యసాహసాలతో పోరాడి, పేదలు, అణగారిన వర్గాల హక్కుల కోసం చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఐలమ్మ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. -
ప్రస్తుత రాజకీయ పరిణామాలకు సీఎందే బాధ్యత
● ఎమ్మెల్యేలను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదు: మాజీ మంత్రి లక్ష్మారెడ్డి జడ్చర్ల టౌన్: రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలకు సీఎం రేవంత్‌రెడ్డి పూర్తి బాధ్యత వహించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి డా.లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం జడ్చర్లలో ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీకి వెళ్తున్న ఎమ్మెల్యేలను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను సమావేశాలు ముగిసే వరకు అసెంబ్లీలోకి రాకుండా చేయాలనే కుట్రతోనే గేటు వద్ద పోలీసులు రాద్ధాంతం సృష్టించారని ఆరోపించారు. మహిళా ఎమ్మెల్యేలతో పోలీసులు దురుసుగా వ్యవహరించిన ఘటనపై కేసులు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. ఫేక్ ఫొటోల ఆధారంగా కేసులు పెడుతున్నారని, తమ ఎమ్మెల్యేల తప్పేమీ లేదని స్పష్టం చేశారు. అసెంబ్లీలో తప్పుడు సమాచారం ఇచ్చిన సీఎం, మంత్రులపైనా కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. -
పెండింగ్ కేసులు రాజీ చేసుకోవాలి
● జిల్లాలో 12న మూడు కోర్టుల్లోజాతీయ లోక్ అదాలత్ ● 4 వేల కేసుల పరిష్కారానికి చర్యలు పాలమూరు: జిల్లాలో ఈనెల 12న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌లో భాగంగా మహబూబ్‌నగర్ కోర్టులో ఐదు, దేవరకద్ర ఒకటి, జడ్చర్లలో ఒక బెంచీ ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.ప్రేమలత వెల్లడించారు. జిల్లా కోర్టులోని న్యాయమూర్తి చాంబర్లో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో న్యాయమూర్తి మాట్లాడారు. ఈ ఏడాదిలో ఈ జాతీ య లోక్ అదాలత్ మూడోదని, జిల్లావ్యాప్తంగా 4 వేలు కేసులు రాజీ కోసం గుర్తించినట్లు తెలిపారు. ఇందులో ఇప్పటికే 200 కేసులు రాజీ చేశామని, మిగిలిన కేసులు ఈ నెల 12న ఉదయం 10గంటల నుంచి రాత్రి వరకు జరగనున్న లోక్ అదాలత్‌లో పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. దీంట్లో రాజీ చేసుకోవడానికి వీలు కలిగిన అన్ని రకాల కేసులు పరిష్కారం చేసుకోవచ్చునని, ప్రధానంగా సివిల్, క్రిమినల్, డ్రంకన్ డ్రైవ్, చెక్‌బౌన్స్, ప్రమాద, బీమా, బ్యాంకు ఫ్రీలిటిగేషన్ వంటి కేసులు రాజీ చేసుకోవచ్చునని వివరించారు. భూమి చారిటబుల్ ట్రస్ట్ ఫిర్యాదు మేరకు వనపర్తి జిల్లాలో 12 మంది వెట్టి చాకిరి పనిచేస్తున్న గిరిజనులను తమ ప్రత్యేక టీం రక్షించినట్లు న్యాయమూర్తి తెలిపారు. న్యాయమూర్తి ఇందిర పాల్గొన్నారు. -
సూచిక బోర్డును ఢీకొన్న డీసీఎం
● మంటలు చెలరేగి క్లీనర్ సజీవ దహనం.. 270 మేకలు మృతి ● భూత్పూర్ సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం భూత్పూర్: అతివేగం, డ్రైవర్ నిద్రమత్తు కారణంగా మేకల లోడ్ వెళ్తున్న లారీ హైవేపై సూచికల బోర్డును ఢీకొట్టిన ఘటన భూత్పూర్ సమీపంలో చోటుచేసుకుంది. ఎస్ఐ కథనం మేరకు.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ నుంచి డ్రైవర్ రషీద్ క్లీనర్ అమిత్‌కుమార్, ఇద్దరు కూలీలు అబ్దుల్ బారి, ఇస్తికర్తో కలిసి 270 మేకలను బెంగుళూరుకు డీసీఎంలో తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున 4:40 గంటల ప్రాంతంలో డీసీఎం భూత్పూర్ సమీపంలోని జాతీయ రహదారిపై రాష్ట్రాలు, కిలోమీటర్ల దూరాన్ని సూచించే సూచికల బోర్డు దిమ్మెను వేగంగా ఢీకొట్టడంతో బోల్తాపడింది. వెంటనే మంటలు చెలరేగాయి. డీసీఎంపైన ఉన్న క్లీనర్ అమిత్‌కుమార్ (32)తో పాటు 270 గొర్రెలు అక్కడికక్కడే మృతిచెందాయి. డ్రైవర్ రశీద్, అబ్ధుల్ బారి, ఇస్తికర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, హైవే పెట్రోలింగ్ సిబ్బంది సహయక చర్యలు చేపట్టగా.. రెండు ఫైర్ ఇంజిన్లు మంటలను పూర్తి నియంత్రించాయి. మృతుడు అమిత్‌కుమార్ చిన్నాన్న దయాశంకర్ ఫిర్యాదు మేరకు డీసీఎం డ్రైవర్ రషీద్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నాగయ్య తెలిపారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ జానకి భూత్పూర్ సమీపంలో జాతీయ రహదారి–44పై జరిగిన ప్రమాద ఘటన స్ధలాన్ని ఎస్పీ జానకీ పరిశీలించారు. ప్రమాద పరిస్థితులను, సహాయక చర్యలను సమీక్షించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎస్పీ వెంట డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ రామకృష్ణ, టూటౌన్ ఇన్స్పెక్టర్ ఇజాజ్ఉద్దీన్, భూత్పూర్ ఎస్ఐ నాగన్న, మూసాపేట ఎస్ఐ వేణు, అగ్నిమాపక సిబ్బంది, స్ధానిక పోలీసులు ఉన్నారు. -
అబార్షన్ మాత్రలు వికటించి మహిళ మృతి
లింగాల: వైద్యుల సూచనలు, సలహాలు తీసుకోకుండా అబార్షన్ కోసం మాత్రలు మింగడంతో అవి వికటించి మూడావత్ జ్యోతి (26) అనే మహిళ మృతి చెందిన ఘటన పద్మన్నపల్లిలో గురువారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మూడావత్ చందూ, జ్యోతి దంపతులు ఆరేళ్ల క్రితం జీవనోపాధికై హైదరాబాద్ వెళ్లి చెత్తసేకరణ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు, కుమారుడు ఉన్నారు. అయితే ఇటీవల మళ్లీ గర్భం దాల్చడంతో అది ఇష్టం లేని జ్యోతి అబార్షన్ కావాలనే ఉద్దేశంతో రెండు రోజుల క్రితం డాక్టర్ సలహ తీసుకోకుండా ఓ మెడికల్ షాపులో సొంతంగా మందులు కొనుగోలు చేసి వేసుకుంది. దీంతో తీవ్ర రక్తస్రావం కావడంతో కుటుంబసభ్యలు ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో గురువారం మృతి చెందింది. గర్భిణి మృతితో గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి. నాగర్‌కర్నూల్‌లో దారుణ హత్య కందనూలు: జిల్లా కేంద్రంలోని రాంనగర్‌కాలనీలో వ్యక్తి అనుమానస్పదంగా మృతి చెందిన ఘటన కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గురువారం పట్టణంలోని రాంనగర్ కాలనీలోని ఓ ఇంట్లో కరీంపాషా(40)ను గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి, కళ్లలో పొడిచి హత్య చేసినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. కరీం భార్య బంధువులతో కలిసి సోమవారం ఊరికి వెళ్లగా భర్త ఒక్కడే ఉంటున్నాడు. అతని భార్య సలీమా కరీంకు ఫోన్ చేయగా ఎంతకీ లిఫ్ట్ చేయలేదు. ఇంటిపక్కల అద్దెకున్న వారికి ఫోన్ చేసి తన భర్తకు ఫోన్ ఇవ్వాలని కోరగా ఆమె భర్తకు ఫోన్ ఇచ్చేందుకు వెళ్లగా ఇంట్లో కరీం హత్యకు గురై కన్పించాడు. వెంటనే సలీమాకు ఈ విషయం చెప్పగా పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ అశోక్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. క్లూస్‌టీం, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీ చేశారు. కరీం సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపడుతునట్లు సీఐ తెలిపారు. మృతుడికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. భార్యాభర్తలపై దాడి.. లైంగిక దాడి ఆరోపణలు మక్తల్: నారాయణపేట జిల్లా మక్తల్ మండల పరిధిలోని దత్తాత్రేయస్వామి ఆలయం సమీపంలో మంగళవారం రాత్రి భార్యాభర్తలపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడినట్లు సమాచారం. ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి వెళ్తున్న సమయంలో వారిని అడ్డుకుని, భర్తను చెట్టుకు కట్టేసి భార్యపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. విషయం బయటకు చెబితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరించినట్లు తెలిసింది. ఘటనపై సమాచారం అందడంతో పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించినట్లు సమాచారం. బ్రిడ్జి నిర్మాణ పనుల్లో పనిచేస్తున్న వారితో పాటు ఇతరుల ప్రమేయంపైనా ఆరా తీస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని మక్తల్ ఎస్ఐ రాజు తెలిపారు. -
స్థాయికి మించి వైద్యం!
● మహమ్మదాబాద్‌లో ఏడు క్లినిక్‌ల సీజ్ ● ఇద్దరు ఆయూష్, ఐదుగురు ఆర్ఎంపీలపై చర్యలు ● జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారుల తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి పాలమూరు/మహమ్మదాబాద్: వారు ఎంబీబీఎస్ కాదు.. ఎండీలు కాదు.. కానీ వారికి ఏమాత్రం తక్కువ కాదంటూ అర్హత లేకపోయినా వైద్యంచేస్తూ, అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆర్ఎంపీలపై జిల్లా వైద్యారోగ్యశాఖ కొరడా ఝుళిపించింది. గురువారం డీఎంహెచ్ఓ డా.శ్రీనివాసులు ఆధ్వర్యంలో మహ్మదాబాద్‌లోని ఆర్ఎంపీల క్లినిక్‌లలో చేపట్టిన తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. ఇద్దరు వ్యక్తులు హోమియో, యునాని వైద్యవిద్యం అభ్యసించి ఆయూష్‌లో క్లినిక్ రిజిస్ట్రేషన్ చేసినట్లు చూపించి.. ఏకంగా అల్లోపతి వైద్యంతో ప్రసవాలు, సర్జరీలు చేసే విధానాలు చూసి డీఎంహెచ్ఓ బృందం ఆశ్చర్యానికి లోనయ్యారు. మరో ఐదుగురు ఆర్ఎంపీలు ఎలాంటి అనుమతి లేకపోయినా ప్రత్యేకంగా క్లిని క్లు ఏర్పాటు చేసుకొని వాటిలో మూడు, ఐదు ఇలా పడకలు ఏర్పాటుచేసి వైద్యం చేస్తున్నారు. వారు వైద్యుల మాదిరిగా యాంటీబాయాటిక్స్ డ్రగ్స్, పలు రకాల ఇంజక్షన్లు, అధిక డోస్ ట్యాబ్లెట్స్ వాడుతున్నట్లు తనిఖీల్లో వెలుగులోకి వచ్చింది. కొన్నింటిలో స్టెరాయిడ్స్ ఇంజక్షన్లు, ఫ్లూయిడ్స్ గుర్తించారు. ఏడు క్లినిక్‌లను సీజ్ చేయడంతో పాటు నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్ఓ వెల్లడించారు. ఇటీవల ఒకరి ప్రాణం బలి.. మహమ్మదాబాద్‌కు చెందిన రుకుంపల్లి కిష్టయ్యకు స్వల్పంగా అనారోగ్యానికి గురికావడంతో స్థానిక ఆర్ఎంపీ బాల్‌రెడ్డి వద్దకు వెళ్లాడు. క్లినిక్‌లో ఉన్న బాల్‌రెడ్డి కుమారుడు నిఖిల్‌రెడ్డి (గాధిర్యాల్ ప్రాథమిక ఉపకేంద్రం డాక్టర్) కిష్టయ్యకు ఇంజక్షన్ చేయడంతో పాటు మాత్రలు ఇచ్చి పంపించాడు. సందరు పేషెంటు అక్కడి నుండి ఇంటికి వెళ్లి మాత్రలు వేసుకున్న కొద్దిసేపటికే నురగలు కక్కుతూ మృతిచెందాడు. అయితే రూ. 15లక్షలకు ప్రాణం ఖరీదు కట్టడంతో పాటు అధికారులు, ఇతర ఫిర్యాదుదారులకు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉంటే, గతంలో ఓ ఆర్ఎంపీ వైద్యం వికటించి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. మరో ఆర్ఎంపీ వద్ద వైద్యం చేయించుకున్న మంగంపేట తండావాసి ప్రాణాల మీదకు తెచ్చుకుని రూ.లక్షలు ఖర్చుచేసుకున్నారు. ఇలా ప్రజల ప్రాణాలతో ఆర్ఎంపీలు చెలగాటమాడుతున్నారు. అలాంటి వారిపై సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
ముమ్మరంగా రైల్వే బ్రిడ్జి గడ్డర్ల ఏర్పాటు
జడ్చర్ల టౌన్: మున్సిపాలిటీ పరిధిలో 167వ నెంబరు జాతీయరహదారిపై ఎల్ఐసీ కార్యాలయం నుంచి డిగ్రి కళాశాల హాస్టల్ భవనం వరకు మొత్తం 750 మీటర్ల మేర రోడ్డు విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా సిగ్నల్‌గడ్డ వద్ద రైల్వే బ్రిడ్జి నిర్మిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో హైస్కూల్ వైపు బ్రిడ్జి కోసం 5 గడ్డర్లు ఏర్పాటు చేశారు. బ్రిడ్జిపై మే నెలలో వాహనాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. రెండో వైపు ఉన్న పాత బ్రిడ్జి తొలగించి దాని స్థానంలో నూతన బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. ఇందులో భాగంగానే గురువారం గడ్డర్ల ఏర్పాటు పనులు ప్రారంభించారు. ఉదయం నుంచే రెండు భారీ క్రేన్లు, 1 హైడ్రాలికల్ క్రేన్, పదిమంది నిపుణుల పర్యవేక్షణలో పనులు కొనసాగుతున్నాయి. దీంతో మరో బ్రిడ్జిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఓ దశలో పెద్ద ఎత్తున బ్రిడ్జికు ఇరువైపులా పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోవటంతో పోలీసులు క్రమబద్ధీకరించేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఐదు గడ్డర్లకు గానూ మొదటిరోజున మూడింటిని అమర్చారు. మరో రెండు శుక్రవారం అమర్చనున్నారు. రైల్వేలైన్‌పై గడ్డర్ల బిగింపు తరువాత వాటిపై స్లాబ్ వేయనున్నారు. లైన్‌కు రెండు వైపులా ఆర్యూబీల నిర్మాణం పూర్తిచేసి మరో మూడు నెలల్లో రాకపోకలు సాగించేలా కసరత్తు చేస్తున్నారు. -
రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో ప్రతిభ చాటాలి
మహబూబ్‌నగర్ క్రీడలు: రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో క్రీడాకారులు ప్రతిభచాటాలని ఉమ్మడి జిల్లా యోగా సంఘం అధ్యక్షులు ఆనంద్‌కుమార్‌గౌడ్ అన్నారు. కరీంనగర్లో శుక్ర, శనివారం జరిగే రాష్ట్రస్థాయి సబ్ జూనియర్, జూనియర్ యోగా పోటీల్లో పాల్గొనే ఉమ్మడి జిల్లా క్రీడాకారులను ఇండోర్ స్టేడియంలో ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఆనంద్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ యోగా క్రీడను ఎంచుకున్నందుకు మీరెంతో అదృష్టవంతులని అన్నారు. యోగా చేయడం వల్ల మెరుగైన ఆరోగ్యాన్ని పొందవచ్చని అన్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు సాధించి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా యోగా సంఘం ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, కార్యనిర్వాహక చైర్మన్ కె.రాములు, సభ్యులు బాలరాజయ్య, పాండురంగం, శరణ్య, పవన్‌కుమార్, స్వరూపారాణి పాల్గొన్నారు. -
అబ్దుల్ రాఫే సెంచరీ
మహబూబ్‌నగర్ క్రీడలు: హెచ్‌సీఏ అండర్–23 మెన్స్ ఎమర్జింగ్ ప్లేయర్స్ 4–డే టోర్నమెంట్లో జిల్లా క్రికెటర్ అబ్దుల్ రాఫే బిన్ అబ్దుల్లా ప్రతిభచాటాడు. టోర్నీలో టీమ్–బీకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అబ్దుల్ రాఫే అద్భుతమైన సెంచరీతో రాణించాడు. గురువారం టీమ్–సీ జట్టుతో ప్రారంభమైన మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో అబ్దుల్ రాఫే సెంచరీతో రాణించాడు. 220 బంతుల్లో 19 ఫోర్లు కొట్టి 129 పరుగులు చేసి సత్తాచాటాడు. టీమ్–బీ జట్టు 89 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 297 పరుగులు చేసింది. జిల్లా క్రికెటర్ అబ్దుల్ రాఫే సెంచరీ సాధించడంపై ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ హర్షం వ్యక్తం చేశారు. రానున్న మ్యాచుల్లో మరింతగా రాణించాలని ఆకాంక్షించారు. మార్కెట్లోకి న్యూ బాలెనో పాలమూరు: వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా మారుతీ కంపెనీ మరో కొత్త మోడల్ న్యూ బాలెనో కారును మార్కెట్లోకి తీసుకొచ్చింది. నగరంలోని మారుతీ నెక్సా షోరూంలో గురువారం శ్రీరామ జయరామ సంస్థల అధినేత బెక్కరి రాంరెడ్డి న్యూ బాలెనో కారును మారె్క్ట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ న్యూ బాలెనో కారు 1200 సీసీ ఇంజిన్, క్రోమ్ గ్రిల్, లెదర్ సీట్స్, లెవెల్ 2 అడాస్, రియర్ ఏసీవెంట్స్, ఆరు ఎయిర్‌బ్యాగ్స్, ఫ్రంట్ వెంటిలేటర్ సీట్లు, వైర్లెస్ ఛార్జర్ అందుబాటులో ఉంటాయని తెలిపారు. 360 వ్యూ కెమెరా, స్పేసియస్ క్యాబిన్, పెట్రోల్ వెర్షన్లో 24.77 కి.మీ. మైలేజ్ ఇస్తుందన్నారు. ఆరు రంగుల్లో అందుబాటులో ఉందని.. ఎక్స్ షోరూం ధర రూ. 6.09లక్షల నుంచి రూ. 9.99లక్షలకు లభిస్తుందన్నా రు. కార్యక్రమంలో సీఈవో విక్రమ్, జనరల్ మేనేజర్ తుకారాం, వేణుగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు. -
రోలర్ స్కేటింగ్‌లో భరత్ ప్రతిభ
● ప్రపంచ రోలర్ స్కేటింగ్ పోటీలకు ఎంపికై న పాలమూరు క్రీడాకారుడు మహబూబ్‌నగర్ క్రీడలు/జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): రోలర్ స్కేటింగ్ క్రీడలో పాలమూరు నగరంలోని కిద్వాయిపేటకు చెందిన కోడుగంటి భరత్‌చంద్ర విశేష ప్రతిభ కనబరుస్తున్నా డు. ఐదేళ్ల నుంచి రోలర్ స్కేటింగ్‌లో శిక్షణ తీసుకుంటూ అనతికాలంలోనే సత్తా చాటాడు. భరత్‌చంద్ర ఇప్పటివరకు పలుసార్లు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. అదేవిధంగా ఐదుసార్లు జాతీయ స్థాయి రోలర్ స్కేటింగ్ పోటీల్లో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించాడు. 2021, 2022, 2023 సంవత్సరాల్లో చండీఘర్‌లో జరిగిన జాతీయస్థాయి జూనియర్ రోలర్ స్కేటింగ్‌లో పాల్గొన్నాడు. 2024లో తమిళనాడు కోయంబత్తూర్‌లో, 2025 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో జరిగిన ( 20 ఏళ్లకు పైబడి) సీనియర్ జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. ఇటీవల చంఢీఘర్‌లో జరిగిన పోటీల్లో మెరుగైన ప్రదర్శనతో భరత్‌చంద్ర ప్రపంచ రోలర్ స్కేటింగ్ పోటీలకు ఎంపికయ్యాడు. పరాగ్వే దేశం అసున్సియోస్లో అక్టోబర్ 2 నుంచి 18 వరకు వరల్డ్ స్కేట్స్ గేమ్స్ పాల్గొనే భారతజట్టుకు ఎంపిక చేశారు. కలెక్టర్‌కు అభ్యర్థన.. రూ.2.52 లక్షల ఆర్థిక సాయం అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు అవసరమైన ఖర్చులను భరించే ఆర్థిక స్థోమత తనకు లేదని, సాయం అందించాలని భరత్‌చంద్ర మహబూబ్‌నగర్ కలెక్టర్ ఖుష్బూగుప్తాను అభ్యర్థించాడు. పరాగ్వే వెళ్లి ప్రపంచ స్కేటింగ్ పోటీల్లో పాల్గొనేందుకు సుమారు రూ.5,05,000 ఖర్చవుతుందని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా... స్పందించిన కలెక్టర్ జిల్లా కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల నుంచి మొత్తం ఖర్చుల్లో 50 శాతం ఆర్థికసాయం చేసేందుకు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా గురువారం కలెక్టర్ రూ.2,52,250 ఆర్థికసాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలకు ఎంపికై న జిల్లా క్రీడాకారులను ప్రోత్సహించేందుకు యువతకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. భరత్ చంద్ర ప్రపంచ స్కేటింగ్ పోటీల్లో ప్రతిభ కనబరిచి విజేతగా నిలిచి దేశానికి, రాష్ట్రానికి, మహబూబ్‌నగర్ జిల్లాకు గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు. మరిన్ని పోటీల్లో ఆడడమే లక్ష్యం రోలర్ స్కేటింగ్‌లో తొలిసారిగా అంతర్జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎల్బీ స్టేడియంలో కోచ్ జితేందర్గుప్త వద్ద ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నా. రాబోయే రోజుల్లో దేశం తరఫున మరిన్ని అంతర్జాతీయ పోటీల్లో ఆడాలన్నదే లక్ష్యం. అందుకోసం నిరంతరం ప్రాక్టీస్ చేస్తున్నా. – భరత్‌చంద్ర -
జాతీయ గోగేమ్లో ఐదు పతకాలు
మహబూబ్‌నగర్ క్రీడలు: మహారాష్ట్రలోని షిరీడీలో ఈనెల 7 నుంచి 10 వరకు జరిగిన జాతీయస్థాయి గోగేమ్ పోటీల్లో ఉమ్మడి జిల్లా క్రీడాకారులు ప్రతిభ చాటి పతకాలు సాధించారు. ఈ పోటీల్లో క్రీడాకారులు మూడు బంగారు, ఒక రజతం, ఒక కాంస్య పతకాన్ని సాధించి సత్తాచాటారు. సింగిల్ విభాగం సబ్ జూనియర్లో సిటి.లలితేష్ బంగారు పతకం, జె.అభిజిత్ కాంస్య పతకం, జూనియర్లో సబావత్ వర్షిత్ బంగారు పతకం, పి.రాహుల్ రజత పతకం, సీనియర్లో పి.రాజేష్ బంగారు పతకం సాధించారు. పతకాలు సాధించిన క్రీడాకారులను గోగేమ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఉపాధ్యక్షులు షకీల్ అహ్మద్, ప్రధాన కార్యదర్శి గులాం అఫ్రోజ్ తదితరులు అభినందించారు. -
హాస్టల్ విద్యార్థికి పాముకాటు
● ఆస్పత్రిలో చికిత్స.. నిలకడగా ఆరోగ్యం ● హాస్టల్‌ను తనిఖీ చేసిన డిప్యూటీ డీఎంహెచ్ఓ కల్వకుర్తి టౌన్: మంచినీరు తాగేందుకు రాత్రివేళ బయటకు వచ్చిన ఓ విద్యార్థి పాముకాటుకు గురయ్యాడు. ఈ ఘటన కల్వకుర్తి పట్టణంలోని ఎస్సీ బాలుర వసతిగృహంలో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. హాస్టల్ వార్డెన్ రవికుమార్ వివరాల మేరకు.. 9వ తరగతి విద్యార్థి శివ మంచినీరు తాగేందుకు హాస్టల్ నుంచి బయటకు వెళ్లాడు. అదే సమయంలో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. ఈ క్రమంలో విద్యార్థి పాముకాటుకు గురయ్యాడు. విషయం తెలుసుకున్న హాస్టల్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై.. సదరు విద్యార్థిని కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థికి ఎలాంటి ప్రాణాపాయం లేదని వార్డెన్ రవికుమార్ తెలిపారు. ● హాస్టల్ విద్యార్థి పాముకాటుకు గురైన విషయం తెలుసుకున్న డిప్యూటీ డీఎంహెచ్ఓ భీమా నాయక్ సిబ్బందితో కలిసి హాస్టల్‌ను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. హాస్టల్ పరిసరాల పరిశీలన సందర్భంగా ప్రాంగణంలో చెత్త పెద్దఎత్తున పేరుకుపోయి కనిపించడం గమనార్హం. ఉదయం 10 గంటల తర్వాత అక్కడి సిబ్బంది చెత్తను తొలగించారు. చెత్తాచెదారం, అపరిశుభ్ర వాతావరణంతో విషపురుగులు సంచరిస్తున్నాయని.. హాస్టల్ పరిసరాల శుభ్రతపై అధికారులు ప్రత్యేక దృష్టిసారించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.


