ఓట్లు రీకౌంటింగ్‌కు సమయం
● అంతలోపే కారణాలు చూపి లెటర్ అందించాలి
● ఫలితం ప్రకటిస్తే రిటర్నింగ్ అధికారి చేసేదేమీ ఉండదు
కబడ్డీ ఆడుతున్న క్రీడాకారులు
కల్వకుర్తి టౌన్: బ్యాలెట్ బాక్సులో ఒకసారి లెక్కించిన ఓట్లను మళ్లీ లెక్కించటం అంటూ ఉండదు. నమోదైన ప్రతిఓటు చెల్లుబాటు ఓటే, అది చెల్లదనే విషయానికి, వివాదానికి తావులేదు. పోలింగ్ స్టేషన్ ఓటింగ్ ఫలితాన్ని కొంతమంది అభ్యర్థులు, వారి ఏజెంట్లు రాసి పెట్టుకొని ఉండాలి. ఏజెంట్లతోపాటు అభ్యర్థులకు ఏదైనా సందేహం వచ్చి, లెక్కింపులో ఏదైనా తేడా కనిపిస్తే వెంటనే రీకౌంటిగ్ చేయాలని రిటర్నింగ్ అధికారికి లిఖితపూర్వక అభ్యర్థనను ఇవ్వాల్సి ఉంటుంది.
● ఓట్లు మొత్తం లెక్కించిన తర్వాత రిటర్నింగ్ అధికారి తుది ఫలితం షీటులో నమోదైనట్లు, ప్రతి అభ్యర్థి పొందిన మొత్తం ఓట్ల సంఖ్యను ప్రకటిస్తాడు. అలా ప్రకటన జరిగాక అభ్యర్థి, ఏజెంట్, కౌంటింగ్ ఏజెంట్లలో ఏ ఒక్కరైనా పోలింగ్ స్టేషన్‌లో నమోదైన ఓట్లను మళ్లీ లెక్కించాలని లిఖితపూర్వకంగా అందుకు కారణాలను వివరిస్తూ అభ్యర్థన ఇవ్వాలి.
● ఎన్నికల సంఘం జారీచేసిన మార్గదర్శక సూత్రాలు ఆధారంగా ఎన్నికల నిర్వహణ నియామవళి ప్రకారం రిటర్నింగ్ అధికారి మళ్లీ ఓట్ల లెక్కింపునకు నిర్ణయం తీసుకుంటారు.
● రిటర్నింగ్ అధికారి ఓట్ల రీకౌంటింగ్, లిఖిత అభ్యర్థన ఇచ్చేందుకు కచ్చితంగా సమయం, నిమిషాలను ప్రకటిస్తారు. అంతలోపు ఏదైనా అభ్యర్థన వస్తే పరిశీలించి సహేతుకమైతే నిర్ణయం తీసుకుంటారు.
● రిటర్నింగ్ అధికారి ఫైనల్ ఫలితం షీట్‌ను పూర్తిచేసి సంతకం చేశాక ఎలాంటి అభ్యర్థనకు హక్కు ఉండదు.


