కారు, బైక్ ఢీకొన్న ఘటనలో..
దోమలపెంట: బ్రహ్మగిరి అటవీ చెక్‌పోస్ట్ పరిధిలోని ఆక్టోపస్ ప్రాంతం వద్ద ఆదివారం కారు, బైక్ ఢీకొన్న ఘటనలో బైక్‌పై ఉన్న కృష్ణ(35) అనే వ్యక్తి మృతి చెందాడు. ఈగలపెంట ఎస్‌ఐ జయన్న తెలిపిన వివరాలు.. శ్రీశైలం నుంచి ఆమన్‌గల్‌కు వెళ్తున్న కారు సంగారెడ్డి నుంచి శ్రీశైలం వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో బైక్‌పై ఉన్న కృష్ణకు తీవ్రగాయాలు కాగా అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు ఎస్‌ఐ తెలిపారు. బైక్‌పై వెనుక కూర్చన్న మరో వ్యక్తి స్వల్పంగా గాయపడ్డాడు. కారు అతివేగం, నిర్లక్ష్యంగా నడపడమే ప్రమాద కారణమని స్థానికులు పేర్కొన్నారు.


