కేరళలో హైడ్రామా.. శశిథరూర్‌ కాన్వాయ్‌ అడ్డగింత, దాడి | MP Shashi Tharoor Convoy Blocked In Kerala | Sakshi
Sakshi News home page

కేరళలో హైడ్రామా.. శశిథరూర్‌ కాన్వాయ్‌ అడ్డగింత, దాడి

Apr 4 2026 9:25 AM | Updated on Apr 4 2026 9:59 AM

MP Shashi Tharoor Convoy Blocked In Kerala

తిరువనంతపురం: అసెంబ్లీ ఎన్నికల వేళ కేరళలో షాకింగ్‌ ఘటన వెలుగు చేసింది. కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ కాన్వాయ్‌ను అడ్డుకున్న కొందరు దుండగులు ఆయన గన్‌మెన్‌పై దాడి చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఎన్నికల వేళ ఈ ఘటన రాజకీయంగా దుమారం రేపుతోంది.

వివరాల మేరకు.. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం నాడు కేరళలోని మలప్పురం జిల్లాలో పర్యటించారు. అక్కడ ప్రచారం ముగిసిన తర్వాత వాండూర్‌లో జరగనున్న ఎన్నికల ప్రచార కార్యక్రమానికి వెళ్తుండగా, తిరువల్లి చెల్లితోడు వంతెన సమీపంలో ఎంపీ కాన్వాయ్‌ని కొందరు దుండగులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో వారితో వాగ్వాదానికి దిగారు. ఆయన భద్రతా సిబ్బందిలో ఒకరిపై దాడి చేశారని ఆరోపణలు వచ్చాయి. దీంతో, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు.

భద్రతా సిబ్బంది ఫిర్యాదు ఆధారంగా వాండూర్ పోలీసులు.. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.కలికావుకు చెందిన ఉమ్మారా అనే నిందితుడిపై నాన్‌బెయిలాబుల్‌ కేసు నమోదైనట్టు పోలీసు అధికారులు చెబుతున్నారు. కాగా, కేరళలో ఏప్రిల్ 9న ఒకే దశలో పోలింగ్ జరగనుంది. మే 4న ఓట్ల లెక్కింపు చేపడతారు.

Advertisement
 
Advertisement
Advertisement