ఒక్కొక్కరికీ రూ. 5 వేలు పెట్రోలు మాత్రమే! ఎక్కడ? | Report says Rs 5000 cap on petrol 200 litre diesel limit in this state | Sakshi
Sakshi News home page

ఒక్కొక్కరికీ రూ. 5 వేలు పెట్రోలు మాత్రమే! ఎక్కడ?

May 13 2026 7:02 PM | Updated on May 13 2026 7:02 PM

Report says Rs 5000 cap on petrol 200 litre diesel limit in this state

కొత్త అంక్షలు : ఒక్కొక్కరికీ రూ. 5వేలు పెట్రోలు

200 లీటర్ల డీజిల్‌ మాత్రమే!

కేరళలో ఒక వైపు ముఖ్యమంత్రి ఎంపికపై సంక్షోభం  నడుస్తుండగానే మరో సంచలన వార్త  దావాలనంలా వ్యాపించింది. ఇంధన విక్రయాలపై ఆంక్షలు విధిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పెట్రోల్ బంకుల్లో నిల్వలు అకస్మాత్తుగా అయిపోకుండా చూడటానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పలు నివేదికల ప్రకారం, కేరళలోని ఇంధన కేంద్రాలు బల్క్ ఇంధన అమ్మకాలపై ఆంక్షలు విధించినట్లు సమాచారం ఒక్కో వ్యక్తికి గరిష్టంగా రూ. 5,000 విలువైన పెట్రోల్‌ను , డీజిల్‌ను 200 లీటర్లను  విక్రయించనున్నాయి.

ఎందుకీ నిర్ణయం?
రిటైల్ అవుట్‌లెట్లలో ఇంధనం నిరంతరం అందుబాటులో ఉండేలా చూడటం, అధిక డిమాండ్ ఉన్న సమయంలో నిల్వలు పూర్తిగా ఖాళీ అవ్వకుండా నిరోధించడం దీని ప్రధాన ఉద్దేశ్యం. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రస్తుతం బంకులకు కేవలం కొన్ని రోజులకు సరిపడా స్టాక్‌ను మాత్రమే సరఫరా చేస్తున్నాయి. దీనివల్ల బంకు యజమానులు జాగ్రత్తగా ఇంధనాన్ని విక్రయించాల్సి వస్తోంది. ముందస్తు చెల్లింపులు (Advance payments) చేయాల్సి రావడం  క్రెడిట్ సౌకర్యాలు రద్దు కావడంతో పెట్రోల్ బంకుల నిర్వహణ కష్టతరంగా మారింది.

ఇదీ చదవండి: ప్రసాదంగా నాణేలు : ఎక్కడుందీ గుడి? వీడియో వైరల్‌

పంపిణీదారుల  స్పందన
కేరళ స్టేట్ పెట్రోలియం ట్రేడర్స్ అసోసియేషన్ మరియు ఇంధన పంపిణీదారులు  దీనిపై వివరణ ఇచ్చారు. దేశవ్యాప్తంగా ఇంధన కొరత ఏమీ లేదు. కేవలం రవాణా పరమైన జాప్యాలు , పంపిణీని క్రమబద్ధీకరించడానికి మాత్రమే ఈ పరిమితులు విధించారు. మరోవైపు దేశంలో ప్రస్తుతం సుమారు రెండు నెలలకు సరిపడా ముడి చమురు, సహజ వాయువు నిల్వలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

ఈ ఆంక్షల వల్ల సాధారణ వినియోగదారుల కంటే భారీగా ఇంధనం కొనేవారు (Bulk buyers) , లాజిస్టిక్స్ ఆపరేటర్లపై ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరగడం వల్ల ఆయిల్ కంపెనీలు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని, అందుకే పంపిణీలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారని నివేదికలు పేర్కొన్నాయి.

ఇదీ చదవండి: ప్రతీక్‌ యాదవ్‌కు యోగి నివాళులు : కీలకంగా పోస్ట్‌మార్టం నివేదిక

Advertisement
 
Advertisement
Advertisement