సోదరుడి ఆకస్మిక మృతి, అఖిలేష్‌ యాదవ్‌ స్పందన | SP chief Akhilesh Yadav first reaction on Prateek Yadav demise | Sakshi
Sakshi News home page

సోదరుడి ఆకస్మిక మృతి, అఖిలేష్‌ యాదవ్‌ స్పందన

May 13 2026 1:05 PM | Updated on May 13 2026 2:35 PM

SP chief Akhilesh Yadav first reaction  on Prateek Yadav demise

లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాపకుడు  ఉత్తర ప్రదేశ్‌ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ కుమారుడు 38 ఏళ్ల ప్రతీక్‌ యాదవ్‌ హఠాన్మారణం దిగ్బ్రాంతి రేపింది. తన సోదరుడు (సవతి తమ్ముడు) ప్రతీక్ యాదవ్ఘాకమృతి పట్ల   ఎస్‌పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

అఖిలేష్ యాదవ్  ఎక్స్‌లో సంతాప సందేశాన్ని పోస్ట్‌ చేశారు.ప్రతీక్ యాదవ్‌ మరణం అత్యంత బాధాకరం! భగవంతుడు  ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరు కుంటున్నా అంటూ హిందీలో వినమ్ర నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తన సోదరుడితో తనుకున్న అనుంబంధం, చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.  ‘‘అతను నాకు చిన్నప్పటి నుండి తెలుసు. అతను ఇప్పుడు మన మధ్య లేకపోవడం చాలా పెద్ద దుఃఖం. చిన్నప్పటి నుంచి తన ఆరోగ్యం, శారీరక దృఢత్వం పట్ల ప్రతీక్ చాలా స్పృహతో ఉండేవాడు. జీవితంలో ముందుకు సాగాలని, మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఆకాంక్షించేవాడు." అన్నారు.

 సుమారు రెండు నెలల క్రితం తాను ప్రతీక్‌ను కలిశానని, అప్పుడు అతనికి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని, వ్యాపారాన్ని విస్తరించుకోవాలని సూచించినట్లు అఖిలేష్ తెలిపారు. "కొన్నిసార్లు వ్యాపారంలో వచ్చే నష్టాలు మనుషులను తీవ్రంగా కలచివేస్తాయి. చట్టపరమైన నిబంధనల ప్రకారం  కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు మేము తదుపరి చర్యలు తీసుకుంటాం," అని  చెప్పారు.

 

 సమాజవాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ రెండో భార్య సాధనా గుప్తా కుమారుడు. రాజకీయాలకు దూరంగా ఉంటూ, లక్నోలో వ్యాపారం, ఫిట్‌నెస్ రంగాలపై దృష్టి సారించారు. 'ఐరన్ కోర్ ఫిట్' (Iron Core Fit) అనే జిమ్‌ను నిర్వహించేవారు. అలాగే జంతు హక్కుల కోసం 'జీవాశ్రయ ఫౌండేషన్' ద్వారా పనిచేశారు.

ప్రతీక్ యాదవ్ మరణంపై సివిల్ ఆసుపత్రి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ దేవేష్ చంద్ర పాండే  ప్రకారం బుధవారం ఉదయం అతని కుటుంబ సభ్యులు అతడిని ఆసుపత్రికి తీసుకువచ్చారు కానీ అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు  ప్రకటించారు. పోలీసులకు సమాచారం అందించిన తర్వాత, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపించారు. ముగ్గురు లేదా నలుగురు వైద్యుల బృందంతో వీడియో రికార్డింగ్ ద్వారా పోస్టుమార్టం నిర్వహించాలని నిర్ణయించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement