prateek yadav
-
ప్రతీక్ యాదవ్ మరణానికి కారణమైన ‘డీప్ వీన్ థ్రాంబోసిస్’ అంటే?
ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సమాజ్‌వాదీ ర్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ చిన్న భార్య కుమారుడు ప్రతీక్ యాదవ్ ఓ ఫిట్నెస్ ఫ్రీక్. నిత్యం జిమ్ చేస్తూ ఉండటంతోపాటు లక్నోలో అనేక హై ఎండ్ వ్యాయామశాలలను ప్రారంభించాడు. కండలు తిరిగి, కమ్మెచ్చులు తేలి అత్యంత ఫిట్‌గా ఉండే తన దేహంతో రాష్ట్రవ్యాప్తంగా జిమ్ కల్చర్ ప్రమోషన్‌కు కారణమయ్యాడు. ఈనెల 13న ప్రతీక్ యాదవ్ ఆకస్మికంగా మృతి చెందడం చాలామందిని విషాదంతో పాటు ఆశ్చర్యంలో ముంచెత్తింది. మరణించే నాటికి అతడి వయసు కేవలం 38 ఏళ్లు మాత్రమే. అటాప్సీ రిపోర్టులో అతడి దేహ స్వభావంలో రక్తపు ఉండలు ఏర్పడే స్వభావం ఉందనీ... దాంతో ‘డీప్ వీన్ థ్రాంబోసిస్’ అనే ఆరోగ్య సమస్య కారణంగా పల్మునరీ ఎంబాలిజమ్ అనే కండిషన్ ఏర్పడి... అది అతడికి మరణం సంభవించిందనే నివేదిక వచ్చింది. డీవీటీ అంటే... దేహంలోని రక్తనాళాల్లో... ప్రధానంగా చెడు రక్తాన్ని తీసుకెళ్లే సిరల్లో రక్తం గడ్డకట్టడాన్ని ‘డీప్ వీన్ థ్రాంబోసిస్’ (డీవీటీ)గా చెబుతారు. డీప్ వీన్ థ్రాంబోసిస్ అనేది చాలా ప్రమాదకమైన పరిస్థితి. దేహంలోని రక్తనాళాలన్నింటిలోనూ ఇది కనిపించే అవకాశం ఉన్నప్పటికీ కాలి సిరల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ప్రతి 20 మందిలో ఒకరికి... తమ జీవితకాలంలో డీప్ వీన్ థ్రాంబోసిస్ బాధపెడుతుంది. పల్మునరీ థ్రాంబో ఎంబోలిజమ్లో ఏం జరుగుతుందంటే... రక్తనాళంలో ఏర్పడ్డ గడ్డ (క్లాట్) లేదా రక్తపు ఉండ... కొన్నిసార్లు అలా రక్తప్రవాహంలో కొట్టుకుపోతూ... పంపింగ్ కోసం గుండెలోని కుడి భాగానికి చేరుతుంది. అక్కడి నుంచి ఆక్సిజన్‌ను నింపుకోడానికి పల్మునరీ ఆర్టరీ ద్వారా ఊపిరితిత్తులకు రక్తం వెళ్లాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో పల్మునరీ ఆర్టరీలో రక్తపు ఉండ ఇరుక్కుపోవడం జరిగితే... బ్లడ్ సర్క్యులేషన్ ప్రక్రియకు విఘాతం కలుగుతుంది. దీన్ని పల్మునరీ ఎంబోలిజమ్ అంటారు. ఇలా జరగడం వల్ల కొన్నిసార్లు తక్షణం మరణం కూడా సంభవించవచ్చు. డీవీటీ లక్షణాలు... డీప్ వీన్ థ్రాంబోసిస్‌తో రకరకాల లక్షణాలు కనిపిస్తాయి. అయితే ప్రతి ఒక్కరిలోనూ అవే లక్షణాలు కనిపించక΄ోవచ్చు. పైగా లక్షణాల తీవ్రతలోనూ (మరీ ముఖ్యంగా డీవీటీ తొలి దశల్లో) మార్పులుంటాయి. రక్తపుగడ్డ చాలా చిన్నదిగా ఉంటే కొందరిలో అసలు ఎలాంటి లక్షణాలూ కనిపించక΄ోవచ్చు. కొందరిలో సమస్య దానంతట అదే సమసి΄ోవచ్చు కూడా. అయితే కొందరిలో కనిపించే లక్షణాలివి... రక్తం గడ్డ కట్టిన చోట చర్మం వాపు (ముఖ్యంగా కాలు, పాదం వంటివి) చర్మం ఎర్రబారడం, అక్కడ వేడిగా ఉన్నట్లు అనిపించడం ఒక్కోసారి చర్మంలోంచి రక్తనాళాలు కనిపించడం డీవీటీ కాల్లో ఏర్పడినప్పుడు కాలు బలహీనంగా ఉన్నట్లు అనిపించడం రక్తనాళాలు గట్టిబారడం నివారణ: ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం. అంటే మంచి సమతులాహారం తీసుకోవడం అంటే పొట్టుతీయని కాయధాన్యాలూ (హోల్‌గ్రెయిన్స్), ఆకుకూరలు, కాయగూరలు, తాజా పండ్లు తీసుకుంటూ బరువు పెరగకుండా చూసుకోవడం. క్రమ తప్పకుండా వ్యాయామం చేయడం. (రోజుకు కనీసం 30 – 45 నిమిషాల వ్యాయామం చేయడం వల్ల రక్తప్రవాహం సాఫీగా మారి రక్తపు గడ్డలు ఏర్పడటం తగ్గుతుంది). తగినన్ని నీళ్లు, ద్రవాహారాలు తీసుకుంటూ దేహాన్ని ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉండటం. దీంతో రక్తం పలుచబారి ఉండలు అడ్డుపడకుండా సాఫీగా సాగి΄ోయే అవకాశాలు ఎక్కువ. ఒకేచోట కుదురుగా కూర్చుని ఉండకుండా, చురుగ్గా కదులుతుండటం. ఇలా కదులుతున్నప్పుడు కాసేపు నడక, స్ట్రెచ్చింగ్ వంటివి చేస్తూ ఉండటం. దూరప్రయాణాలు చేస్తున్నప్పుడు అదేపనిగా వాహనంలో కూర్చుని ఉండకుండా తరచూ బ్రేక్ తీసుకుంటూ ఉండటం. ∙రక్తనాళాల్లో రక్తప్రవాహం సాఫీగా సాగేందుకు కంప్రెషన్ స్టాకింగ్ వంటివి వాడటం. చికిత్స : డీప్ వీన్ థ్రాంబోసిస్ చికిత్సలో... దాంతో పాటు నివారణ చర్యలూ తప్పనిసరి. ఈ చికిత్స తీవ్రతను బట్టి ఉంటుంది. డీవీటీ వచ్చే అవకాశాలున్నవారు తొలిదశల్లో సపోర్ట్ స్టాకింగ్స్ / కంప్రెషన్ స్టాకింగ్స్ వాడటం.బ్లడ్ థిన్నర్స్ వాడటం : యాంటీ కోయాగ్యులెంట్స్ అని పిలిచే రక్తాన్ని పలచబార్చే మందులు వాడటం. క్లాట్ బస్టర్స్ / థ్రాంబోలైటిక్స్ చికిత్స : చిన్న పైప్ (క్యాథెటర్) ద్వారా రక్తం గడ్డకట్టిన చోటికి థ్రాంబోలైటిక్స్ అని పిలిచే మందును పంపి, రక్తపుగడ్డను చెదరగొట్టే ఈ ఔషధాల్ని వాడటం.ఇప్పుడు తాజాగా సక్షన్ ను ఉపయోగించి రక్తపు గడ్డను బయటకు లాగేసి, రక్తపు ఉండను తొలగించడం ద్వారా కూడా చికిత్స అందిస్తున్నారు. ఈ డీవీటీ ముప్పు ఉన్నప్పుడు రక్తపు ఉండలు ఏర్పడే స్వభావం ఉన్నవారు నిరంతరం డాక్టర్ పర్యవేక్షణలో ఉంటూ వైద్యులు చెప్పిన విధంగా ఫాలో అప్‌లో ఉండటం చాలా ముఖ్యం. – యాసీన్ (చదవండి: ఒత్తిడి లేకుండా వందేళ్లు బతకాలంటే..! అక్కడికి వెళ్లాల్సిందే) -
అఖిలేష్ సోదరుడి మృతిపై మరిన్ని అనుమానాలు
ములాయం సింగ్ యాదవ్ చిన్న కొడుకు ప్రతీక్ యాదవ్ ఆకస్మిక మరణం ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తోంది. ఫిట్నెస్ గురుగా పేరున్న ప్రతీక్ కేవలం 38 ఏళ్ల వయసులోనే ఆరోగ్యం క్షీణించి చనిపోవడం అనుమానాలకు తావివ్వగా.. ఇప్పుడు ఆటాప్సీ నివేదిక సంచలనంగా మారింది. దీంతో ఈ కేసులో ఏ ట్విస్టులు బయటపడతాయో అనే ఉత్కంఠ నెలకొంది.లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ హాస్పిటల్ ప్రతీక్ యాదవ్ మృతిపై ఒక నివేదిక విడుదల చేసింది. అందులో ‘‘మాసివ్ పల్మనరీ థ్రాంబోఎంబోలిజం’’తో మరణించారని ప్రకటించింది. అంటే.. ఊపిరితిత్తుల్లో రక్తం పెద్దగా గడ్డ కట్టడం వల్ల రక్తప్రసరణ ఆగిపోవడం. దీనినే కార్డియోరెస్పిరేటరీ కొల్పాప్స్ అంటారు. ఈ స్థితిలో శ్వాస, గుండె పనితీరు రెండూ అకస్మాత్తుగా ఆగిపోతాయి.పోస్టుమార్టం నివేదిక ప్రకారం.. మాసివ్ పల్మనరీ థ్రాంబోఎంబోలిజం ప్రతీక్ యాదవ్ మరణానికి ప్రధాన కారణం. ఆయనకు ఇదివరకే లంగ్స్, లివర్ సమస్యలున్నాయ్. గతంలో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు కూడా. కానీ, ఇప్పుడు ఒంటిపై గాయాలు కూడా ఉన్నట్లు వైద్యులు ప్రకటించడం అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది.శవపరీక్షలో ఆయన శరీరంపై మొత్తం ఆరు గాయాలు గుర్తించారు. వీటిలో మూడు గాయాలు.. వారం కిందటే అయ్యాయి. మిగతా మూడు చనిపోవడానికి ఒక్కరోజు ముందు వచ్చాయి. ఛాతి భాగంతో పాటు మోచేయి, కుడి చేయి, మణికట్టు, మోచేతి వద్ద ఈ గాయాలు ఉన్నాయని తెలుస్తోంది. రాజకీయ దుమారం!ప్రతీక్ యాదవ్ కుటుంబ నేపథ్యం కూడా ఈ మరణానికి రాజకీయ రంగు అద్దింది. ఆయన తండ్రి ములాయం సింగ్ యాదవ్ ఎస్పీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి. ములాయం సూచన మేరకు ప్రతీక్ రాజకీయాలకు మొదటి నుంచి దూరంగా ఉన్నారు. రియల్ఎస్టేట్, జిమ్ సెంటర్లు.. తన వ్యాపారాలేవో చేసుకుంటున్నాడు. సవతి సోదరుడు కావడంతో ఇటు అఖిలేష్ యాదవ్‌తోనూ ఎక్కడా సన్నిహితంగా మెలిగినట్లు సమాచారం లేదు. అయితే ఇద్దరి మధ్య వ్యక్తిగతంగా మంచి సంబంధాలు ఉండేవని ఎస్పీ శ్రేణులు చెబుతున్నాయి. అనారోగ్యంతో ప్రతీక్ ఆస్పత్రి పాలైనప్పుడు అఖిలేష్ వెళ్లి పరామర్శించిన విషయాన్ని ప్రస్తావిస్తున్నాయి. ఈ క్రమంలో..ప్రతీక్ యాదవ్ వ్యక్తిగత జీవితం తెర మీదకు వచ్చింది. ప్రతీక్ భార్య అపర్ణా యాదవ్ 2022లో బీజేపీలో చేరారు. ఆ సమయంలో భార్యాభర్తలకు గొడవ జరిగినట్లు కథనాలు వచ్చాయి. తన కుటుంబానిది ఎస్పీ నేపథ్యం కావడంతో ఆ చేరికను ప్రతీక్ విబేధించారని.. అయినా ఆమె మొండిగా ముందుకు వెళ్లారని ఆ కథనాల సారాంశం. ఈ క్రమంలో..ఈ ఏడాది జనవరిలో విడిపోతున్నట్లు ఈ జంట ప్రకటించింది. కుటుంబ కలహాల నేపథ్యంలోనే విడాకులు తీసుకోవాలనుకుంటున్నానని ప్రతీక్ ప్రకటించారు. అయితే కొన్నిరోజులకే ఆయన మనసు మార్చుకున్నాడు. ఫిట్నెస్ మీద శ్రద్ధ కనబరిచే ప్రతీక్‌కు ఈ మధ్యకాలంలో ఆరోగ్యం ఎందుకనో క్షీణిస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే బుధవారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురి కావడం.. ఆస్పత్రికి తీసుకెళ్లిన వెంటనే చనిపోయారని ప్రకటించడం జరిగిపోయాయి. ప్రతీక్ యాదవ్ మృతిపై అనుమానాల నేపథ్యంలో.. ఆయన అంతర్గత అవయవాలను పరీక్షలకు పంపారు. ఇటు రాజకీయ వర్గాల్లో ఈ మరణం చర్చనీయాంశంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ప్రతీక్ యాదవ్ ఆకస్మిక మరణంపై యోగి ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. డీసీపీ సెంట్రల్ విక్రాంత్ వీర్ నేతృత్వంలోని బృందం ఈ కేసును విచారిస్తోంది. పోలీసులు ఇప్పటికే లక్నోలోని ప్రతీక్ యాదవ్ నివాసాన్ని సీజ్ చేసి, మొబైల్, ల్యాప్‌టాప్, డైరీ వంటి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. పలువురు నేతలు కూడా ఈ ఘటనపై విచారణ అవసరమని డిమాండ్ చేస్తున్నారు. సమాజ్‌వాదీ ఎమ్మెల్యే రవిదాస్ మెహ్రోత్రా మీడియాతో మాట్లాడుతూ.. ప్రతీక్ మరణం సాధారణం కాదు, జడ్జి పర్యవేక్షణలో విచారణ జరగాలి అని డిమాండ్ చేశారు. -
ప్రతీక్ యాదవ్ ఆకస్మిక మృతి : షాకింగ్ ఆరోపణలు
లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మరణంపై ఎస్పీ నేత రవిదాస్ మెహ్రోత్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతీక్‌ది సహజ మరణం కాదని, దీనిపై విచారణ జరిపించాలని కోరడం కలకలం రేపుతోంది. ప్రతీక్ యాదవ్ ఆకస్మికంగా, అకాలంగా మరణించడంతో తాము తీవ్ర దిగ్భ్రాంతికి, బాధకు గురయ్యామంటూ విచారాన్ని ప్రకటించారు. అయితే ఈ సందర్బంగా ఆయన కొన్ని సంచలన ఆరోపణలు చేశారు. ప్రతీక్ యాదవ్‌ను ఆసుపత్రికి తీసుకువచ్చే లోపే ఆయన మరణించారు. ఆసుపత్రి వైద్యులు ఆయనను చూడగానే అప్పటికే మరణించినట్లు నిర్ధారించారని పేర్కొన్నారు..ఆయన మరణం సహజమైనది కాదని అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారన్నారు. ఆయన శరీరంపై గాయాల గుర్తులు ఉన్నాయి. శరీరంలో నీలంగా మారిపోయింది, విషం ఆనవాళ్లు న్నాయని ఆరోపించారు. #WATCH | Lucknow, UP: On Prateek Yadav's death, SP leader Ravidas Mehrotra says, "...We are deeply saddened and hurt by his untimely and sudden demise. Prateek Yadav died before he was brought to the hospital. Doctors at the hospital had declared him dead as soon as they saw him.… pic.twitter.com/yfceCPOI9z— ANI (@ANI) May 13, 2026 > ఇదీ చదవండి: ఒక్కొక్కరికీ రూ. 5 వేలు పెట్రోలు మాత్రమే! ఎక్కడ? సహజ మరణాలకు సాధారణంగా పోస్ట్‌మార్టం నిర్వహించరు. ఆయన మరణానికి గల కారణాలపై విచారణ జరపాలని తాము డిమాండ్ చేయడంతోనే ఆయనకు పోస్ట్‌మార్టం నిర్వహించారన్నారు. పోస్ట్‌మార్టం పూర్తయ్యాక, ఆయన శరీరంపై గాయాల గుర్తులున్నాయని, శరీరం నీలి రంగులోకి మారిపోయిందని,దీనివల్ల ఆయనకు విషప్రయోగం జరిగినట్లు అనిపిస్తోందని, వైద్యులు కూడా పేర్కొన్నారు. ఇది ఆయన మరణం సహజమైనది కాదనే విషయాన్ని మరింత స్పష్టం చేస్తోందని రవిదాస్ అన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతీక్ యాదవ్ మరణంపై హైకోర్టుకు చెందిన ఒక పదవీ విరమణ పొందిన న్యాయమూర్తితో విచారణ జరిపించాలని రవిదాస్ డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: ప్రతీక్ యాదవ్‌కు యోగి నివాళులు : కీలకంగా పోస్ట్‌మార్టం నివేదిక -
ప్రతీక్ యాదవ్‌కు యోగి నివాళులు : కీలకంగా పోస్ట్‌మార్టం నివేదిక
సమాజవాదీ పార్టీ వ్యవస్థాపకుడు దివంగత ములాయం సింగ్ యాదవ్ కుమారుడు, బీజేపీ నాయకురాలు అపర్ణ యాదవ్ భర్త ప్రతీక్ యాదవ్ (38) మరణానికి గల కారణాలను పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. అలాగే ఆయన శరీరంపై ఉన్న గాయాలు 'యాంటీమార్టం' (మరణానికి ముందే జరిగినవి) అని నివేదిక పేర్కొంది.ప్రతీక్ యాదవ్ "మాసివ్ పల్మనరీ థ్రోంబోఎంబోలిజం" (Massive Pulmonary Thromboembolism) కారణంగా సంభవించిన "కార్డియో రెస్పిరేటరీ కొలాప్స్" వల్ల చనిపోయారని పోస్టుమార్టం నివేదిక ప్రకారం, తేల్చి చెప్పింది. అయితే ప్రతీక్ మృతదేహంపై గాయాలున్నాయనీ, గోళ్లు, శరీరంలోని కొన్ని భాగాలు నీలంగా మారిపోయాయనే వార్తల నేపథ్యంలో పోస్ట్‌మార్టం రిపోర్ట్ కీలకంగా మారింది.కార్డియోరెస్పిరేటరీ కొలాప్స్ అంటేఊపిరితిత్తులలోని ధమనులలో (లంగ్స్‌లో బ్లడ్ క్లాట్ )రక్తపు గడ్డలు అడ్డుపడటం వల్ల శ్వాసక్రియ మరియు రక్త ప్రసరణ ఆగిపోయి, గుండె ఊపిరితిత్తులు ఒక్కసారిగా విఫలమయ్యాయి. తదుపరి విశ్లేషణ కోసం గుండె , ఇతర అంతర్గత అవయవాలను (విసెరా) భద్రపరిచారు. మరోవైపు ప్రతీక్ ఊపిరితిత్తులలో రక్తం గడ్డకట్టడం వల్ల కలిగే సమస్యలతో బాధపడుతూ మెదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారనీ, ఆయన పరిస్థితి చాలా కాలంగా విషమంగానే ఉందని సమాచారం. 38 ఏళ్ల ప్రతీక్ యాదవ్, బుధవారం ఉదయం లక్నోలోని తన నివాసంలో ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించిందని సమాచారం అందగానే మెడికల్ టీమ్ ఆయన నివాసానికి చేరుకుంది. అప్పటికే ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో లక్నోలోని సివిల్ ఆసుపత్రికి తరలించారు. ఆయన ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు శ్రమించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఉదయం 5:55 గంటలకు ఆయన మరణించారని సివిల్ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ జి.పి. గుప్తా వెల్లడించారు.ప్రతీక్ యాదవ్ ములాయం సింగ్ యాదవ్ రెండో భార్య సాధనా గుప్తా కుమారుడు. అఖిలేష్ యాదవ్‌కు సోదరుడు (సవతి తమ్ముడు). ప్రతీక్ ఊపిరితిత్తులలో రక్తం గడ్డకట్టడం వల్ల కలిగే సమస్యలతో బాధపడుతూ మెదాంత ఆసుపత్రిలో చికిత్స పొందేవారనీ సమాచారం. ప్రతీక్ ఆకస్మిక మరణం కుటుంబ సభ్యులను, రాజకీయ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. రాష్ట్రవ్యాప్తంగా సంతాప సందేశాలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ ప్రతీక్ మృతదేహానికి నివాళర్పించారు. ఆయన భార్య అపర్ణయాదవ్‌ను ఓదార్చారు.#WATCH | Lucknow, UP | UP CM Yogi Adityanath pays his last respects to Prateek Yadav at his wife, BJP leader Aparna Yadav's residence. Samajwadi Party Founder Mulayam Singh Yadav's son, Prateek Yadav, passed away this morning. pic.twitter.com/sLY1VEmVFg— ANI (@ANI) May 13, 2026 -
సోదరుడి ఆకస్మిక మృతి, అఖిలేష్ యాదవ్ స్పందన
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాపకుడు ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ కుమారుడు 38 ఏళ్ల ప్రతీక్ యాదవ్ హఠాన్మారణం దిగ్బ్రాంతి రేపింది. తన సోదరుడు (సవతి తమ్ముడు) ప్రతీక్ యాదవ్ఘాకమృతి పట్ల ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.అఖిలేష్ యాదవ్ ఎక్స్‌లో సంతాప సందేశాన్ని పోస్ట్ చేశారు.ప్రతీక్ యాదవ్ మరణం అత్యంత బాధాకరం! భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరు కుంటున్నా అంటూ హిందీలో వినమ్ర నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తన సోదరుడితో తనుకున్న అనుంబంధం, చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ‘‘అతను నాకు చిన్నప్పటి నుండి తెలుసు. అతను ఇప్పుడు మన మధ్య లేకపోవడం చాలా పెద్ద దుఃఖం. చిన్నప్పటి నుంచి తన ఆరోగ్యం, శారీరక దృఢత్వం పట్ల ప్రతీక్ చాలా స్పృహతో ఉండేవాడు. జీవితంలో ముందుకు సాగాలని, మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఆకాంక్షించేవాడు." అన్నారు.श्री प्रतीक यादव जी का निधन, अत्यंत दुखद!ईश्वर दिवंगत आत्मा को शांति प्रदान करे।विनम्र श्रद्धांजलि! pic.twitter.com/weadva9hi4— Akhilesh Yadav (@yadavakhilesh) May 13, 2026 సుమారు రెండు నెలల క్రితం తాను ప్రతీక్‌ను కలిశానని, అప్పుడు అతనికి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని, వ్యాపారాన్ని విస్తరించుకోవాలని సూచించినట్లు అఖిలేష్ తెలిపారు. "కొన్నిసార్లు వ్యాపారంలో వచ్చే నష్టాలు మనుషులను తీవ్రంగా కలచివేస్తాయి. చట్టపరమైన నిబంధనల ప్రకారం కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు మేము తదుపరి చర్యలు తీసుకుంటాం," అని చెప్పారు. #WATCH | Lucknow | On the demise of his younger brother Prateek Yadav, Samajwadi Party President Akhilesh Yadav says, "I have known him since childhood. He is no longer amongst us; it is a matter of great sorrow. Right from his childhood, he was very conscious of his health, his… https://t.co/WJwldY1eEl pic.twitter.com/be9xGDPdyK— ANI (@ANI) May 13, 2026 సమాజవాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ రెండో భార్య సాధనా గుప్తా కుమారుడు. రాజకీయాలకు దూరంగా ఉంటూ, లక్నోలో వ్యాపారం, ఫిట్నెస్ రంగాలపై దృష్టి సారించారు. 'ఐరన్ కోర్ ఫిట్' (Iron Core Fit) అనే జిమ్‌ను నిర్వహించేవారు. అలాగే జంతు హక్కుల కోసం 'జీవాశ్రయ ఫౌండేషన్' ద్వారా పనిచేశారు.ప్రతీక్ యాదవ్ మరణంపై సివిల్ ఆసుపత్రి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ దేవేష్ చంద్ర పాండే ప్రకారం బుధవారం ఉదయం అతని కుటుంబ సభ్యులు అతడిని ఆసుపత్రికి తీసుకువచ్చారు కానీ అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. పోలీసులకు సమాచారం అందించిన తర్వాత, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపించారు. ముగ్గురు లేదా నలుగురు వైద్యుల బృందంతో వీడియో రికార్డింగ్ ద్వారా పోస్టుమార్టం నిర్వహించాలని నిర్ణయించారు. -
ప్రతీక్ యాదవ్: ‘సయోధ్య’ కుదిరిన వేళ.. సాగనంపిన కాలం!
లక్నో: ఉత్తరప్రదేశ్ రాజకీయ దిగ్గజం, దివంగత ములాయం సింగ్ యాదవ్ ద్వితీయ కుమారుడు ప్రతీక్ యాదవ్ (38) బుధవారం తెల్లవారుజామున లక్నోలో కన్నుమూశారు. అఖిలేష్ యాదవ్ సోదరుడైన ప్రతీక్, మే 13న అస్వస్థతకు గురికావడంతో లక్నోలోని సివిల్ ఆస్పత్రికి తరలించారు. ఉదయం 5:55 గంటల ప్రాంతంలో ఆయన తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు. ప్రతీక్ మృతిపై సందేహాలు వెల్లువెత్తున్న నేపథ్యంలో పోస్ట్‌మార్టం నిర్వహించి, విష ప్రయోగం లాంటి కోణాల్లో కూడా దర్యాప్తు చేయాలని అధికారులు భావిస్తున్నారు.వార్తల్లో వైవాహిక జీవితంప్రతీక్ మరణం యూపీలో కలకలం రేపగా, ఆయన వైవాహిక జీవితం గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తోంది. 2011లో అపర్ణ యాదవ్‌ను వివాహం చేసుకున్న ప్రతీక్, ఈ ఏడాది జనవరిలో సోషల్ మీడియా వేదికగా చేసిన సంచలన వ్యాఖ్యలు అప్పట్లో రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. తన భార్య అపర్ణ ఒక ‘స్వార్థపరురాలు’ అని, కేవలం కీర్తి ప్రతిష్టల కోసమే పాకులాడుతూ తన కుటుంబ బంధాలను నాశనం చేసిందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. తన తల్లిదండ్రులు, సోదరునితో కూడా దూరం పెరగడానికి ఆమెనే కారణమని ఆవేదన వ్యక్తం చేశారు.‘ఆమె అతిపెద్ద అబద్ధాలకోరు’అప్పట్లో తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. అపర్ణకు వీలైనంత త్వరగా విడాకులు ఇవ్వబోతున్నట్లు ప్రతీక్ ప్రకటించారు. ఆమె ప్రవర్తన కారణంగా తన మానసిక ఆరోగ్యం దెబ్బతిన్నదని, తన జీవితంలో చూసిన అతిపెద్ద అబద్ధాలకోరు ఆమె అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నాయకురాలిగా, ప్రస్తుతం రాష్ట్ర మహిళా కమిషన్ వైస్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న అపర్ణపై భర్త చేసిన ఈ వ్యాఖ్యలు ములాయం కుటుంబంలో పెద్ద దుమారాన్నే రేపాయి. అయితే, ఈ ఆరోపణలపై అపర్ణ గానీ, రాజకీయ పార్టీలు గానీ బహిరంగంగా ఎప్పుడూ స్పందించలేదు.భార్యతో కలిసి సంతోషంగా..విచిత్రమేమిటంటే, ఆ తీవ్రమైన ఆరోపణల తర్వాత కొద్దిరోజులకే వారి మధ్య సయోధ్య కుదిరినట్లు కనిపించింది. ప్రతీక్ తన విడాకుల పోస్టులను తొలగించడమే కాకుండా, భార్యతో కలిసి సంతోషంగా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ క్రమంలోనే వారిద్దరి బంధం మళ్లీ గాడిలో పడిందని అంతా భావిస్తుండగా, అంతలోనే ఈ విషాదం చోటుచేసుకుంది.ఇది కూడా చదవండి: అమెరికా కొలువుల స్కామ్.. భారత్‌లో మూలాలు? -
ములాయం సింగ్ యాదవ్ కుమారుడు ప్రతీక్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ మాజీ సీఎం, దివంగత ములాయం సింగ్ యాదవ్ చిన్న కుమారుడు ప్రతీక్ యాదవ్ సంచలన ప్రకటన చేశారు. తన భార్య అపర్ణ యాదవ్‌తో వేగలేక ఆమె నుంచి విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఇన్‌స్టాలో పోస్టు పెట్టారు. ప్రతీక్ ఇన్‌స్టాగ్రామ్‌లో అపర్ణ చిత్రాన్ని పోస్ట్ చేసి.. ఆమెను ఫ్యామిలీ డిస్ట్రాయర్గా అభివర్ణించారు. ‘నా భార్య అపర్ణ యాదవ్ (బీజేపీ నేత)కు విడాకులు ఇస్తున్నాను. అపర్ణ యాదవ్ నా కుటుంబంలో చిచ్చు పెట్టింది. నా కుటుంబాన్ని నాశనం చేసింది. ఇలా స్వార్థంగా ఆలోచించే మహిళ నుంచి వీలైనంత త్వరగా విడాకులు తీసుకుంటాను. ఆమె నా కుటుంబ సంబంధాలను నాశనం చేసింది. ఆమె ఫేమస్ అవ్వాలని, ఇతరులను ఇన్ఫ్లయిన్స్ చేయాలని కోరుకుంటుంది. నాకు నా మానసిక స్థితిపై ఆందోళనగా ఉంది. అలా అని ఆమె నాకోసం బాధపడదు. తన కోసం తాను మాత్రమే బాధపడుతుంది. ఇలాంటి వ్యక్తిని నేను ఇంత వరకు చూడలేదు. ఆమెను వివాహం చేసుకోవడం నా దురదృష్టం’ అని ప్రతీక్ అన్నారు. ప్రతీక్, అపర్ణ 2011లో వివాహం చేసుకున్నారు వారికి ఒక కుమార్తె ఉంది. అయితే, అపర్ణ సోదరుడు అమన్ బిష్ట్ .. ప్రతీక్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురైనట్లు చెప్పారు. ప్రారంభంలో సమాజ్‌వాదీ పార్టీలో ఉన్న అపర్ణ 2017 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో లక్నో కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి రీటా బహుగుణ జోషి చేతిలో ఓడిపోయారు. 2022లో ఆమె జాతీయ వాదం కారణం చూపుతూ బీజేపీలో చేరారు. ఆమె ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఉపాధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు.అపర్ణ యాదవ్, ములాయం సింగ్ యాదవ్‌కు కోడలుగా రాజకీయాల్లో కూడా చురుకుగా వ్యవహరించారు. అయితే, ఆమె బీజేపీలో చేరిన తర్వాత యాదవ్ కుటుంబంలో అసంతృప్తి పెరిగింది. ఇప్పుడు విడాకుల కేసు దాఖలు కావడంతో ఆ విభేదాలు మరింత స్పష్టమయ్యాయి. ఈ కేసు రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. యాదవ్ కుటుంబం ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు ఈ విడాకుల కేసు ఆ కుటుంబ ప్రతిష్టపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
ములాయం కొడుకు గోశాలకు సీఎం యోగి
-
ములాయం కొడుకు గోశాలకు సీఎం యోగి
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ చిన్నకుమారుడు ప్రతీక్ యాదవ్ ఇంటికి వెళ్లనున్నారు. ప్రతీక్ యాదవ్ నిర్వహిస్తున్న కన్హా ఉపవాన్(గోశాల)ను సందర్శించనున్నారు. ఇందులో ప్రతీశ్ చాలా గోవులను సాకుతూ పెద్ద గోశాలగా మార్చారు. సహజంగానే సన్యాసి అయిన యోగి ఆదిత్యానాథ్‌కు గోవులంటే అమితమైన ప్రేమ. వాటిని హింసించేవారంటే ఆయనకు ఏ మాత్రం నచ్చదు. గోవును మాతగా ఆయన భావిస్తుంటారు. ఈ నేపథ్యంలో గొప్ప గోశాల అయిన కన్హా ఉపవాన్‌ను యోగి సందర్శించనున్నారు. ఈ సందర్భంగా ప్రతీక్, ఆయన భార్య అపర్ణా యాదవ్‌తోపాటు ములాయం సింగ్ సింగ్ ఆయన భార్య సాధనా యాదవ్ కూడా అక్కడికి వెళ్లి ముఖ్యమంత్రి యోగిని కలిసి శుభాభినందనలు తెలియజేయనున్నారు. శుక్రవారం పదిగంటల ప్రాంతంలో కన్హా ఉపవాన్‌ను యోగి సందర్శించే అవకాశం ఉంది. గోశాలను సందర్శించిన తర్వాత ప్రభుత్వ అతిథి గృహంలో ఆయన 20 నిమిషాలపాటు ప్రతీక్ దంపతులు తదితరులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. -
యూపీ రాజకీయాల్లో ఇంట్రస్టింగ్ సీన్
లక్నో: ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. సమాజ్ వాదీ పార్టీ అధినేత చిన్న కుమారుడు ప్రతీక్ యాదవ్, ఆయన భార్య అపర్ణా యాదవ్ శుక్రవారం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో భేటీ అయ్యారు. ఈ ఉదయం వీవీఐపీ అతిథి గృహానికి వచ్చిన ప్రతీక్, అపర్ణ దంపతులు సీఎం యోగితో మంతనాలు జరిపారు. వీరు ఏం చర్చించారన్నది వెల్లడి కాలేదు. తాజాగా ముగిసిన యూపీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ-కాంగ్రెస్ కూటమి ఘోర పరాజయం పాలైంది. బీజేపీ ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. లక్నో కంటోన్మెంట్ స్థానం నుంచి పోటీ చేసిన అపర్ణా యాదవ్.. బీజేపీ అభ్యర్థి రీటా బహుగుణ చేతిలో 33,796 ఓట్లతో ఓడిపోయారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారానికి హాజరైన ప్రధాని మోదీతో ములాయం, అఖిలేశ్ మంతనాలు జరిపారు. ఈ నేపథ్యంలో సీఎం యోగితో ప్రతీక్, అపర్ణ దంపతుల భేటీకి రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. -
అఖిలేష్, ప్రతీక్.. నాకు రెండు కళ్లు
లక్నో: ఉత్తరప్రదేశ్ మూడో దశ ఎన్నికల్లో ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ కుటుంబ సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ములాయం, ఆయన భార్య సాధన గుప్తా.. కుమారులు అఖిలేష్ యాదవ్, ప్రతీక్ యాదవ్.. కోడళ్లు డింపుల్ యాదవ్, అపర్ణా యాదవ్ ఓటు వేశారు. సాధారణంగా మీడియాకు దూరంగా ఉండే సాధనా గుప్తా.. ఓటు వేసిన అనంతరం కాసేపు విలేకరులతో మాట్లాడారు. అఖిలేష్, ప్రతీక్ ఇద్దరూ తనకు రెండు కళ్లలాంటివారని అన్నారు. తమ కుటుంబమంతా ఒక్కటేనని చెప్పారు. అఖిలేష్.. ములాయం మొదటి భార్య కొడుకు కాగా, ప్రతీక్.. ములాయం రెండో భార్య సాధన కొడుకు. అఖిలేష్ భార్య డింపుల్ కనౌజ్ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తుండగా, ప్రతీక్ భార్య అపర్ణ లక్నో కంటోన్నెంట్ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. ఆ మధ్య ములాయం ఇంట్లో, ఎస్పీలో ఆధిపత్య పోరు సాగినపుడు ఆయన కుటుంబం రెండు వర్గాలుగా విడిపోయినట్టు వార్తలు వచ్చాయి. సాధన, అపర్ణ, ములాయం సోదరుడు శివపాల్ ఒకవైపు.. అఖిలేష్, ములాయం మరో సోదరుడు రాంగోపాల్ యాదవ్ మరో వైపు ఉన్నట్టు కథనాలు వినిపించాయి. విభేదాలను పక్కనపెట్టి ఏకతాటిపైకి వచ్చిన ములాయం కుటుంబ సభ్యులు పలు సందర్భాల్లో తామంతే ఒక్కటేనని చెబుతున్నారు. -
నా 5 కోట్ల కారుపై వివాదమెందుకు?
సమాజ్‌వాద్ పార్టీలో ప్రస్తుతం తండ్రికొడుకులు బాగానే ఉన్నప్పటికీ, గత కొన్ని రోజుల క్రితం వరకు తండ్రి ములాయం, పెద్ద కొడుకు అఖిలేష్ మధ్య రాజుకున్న వివాదం అంతాఇంతా కాదు. సైకిల్ గుర్తు కోసం ఆ ఇద్దరి పోరు ఒక్కసారిగా ఉత్తరప్రదేశ్‌లో కలవరం సృష్టించింది. అదే సమయంలో ములాయం చిన్న కొడుకు ప్రతీక్ యాదవ్ లంబోర్గిని కార్లో లక్నో రోడ్లపై చక్కర్లు కొట్టడం పేపర్లలో హెడ్‌లైన్స్‌గా నిలిచింది. ఇది కాస్తా ఇంటర్నెట్లో వైరల్ అయింది. తన రూ. 5 కోట్ల లంబోర్గిని కారుపై సోషల్ మీడియాలో తలెత్తిన వివాదంపై ప్రతీక్ యాదవ్ తొలిసారి స్పందించారు. ఆ లంబోర్గిని హురాకాన్ కారును రుణం తీసుకుని మరీ కొనుకున్నానని ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారి చెప్పారు. రాజకీయాలంటే పెద్దగా ఇష్టంలేని ప్రతీక్ యాదవ్ రియల్ ఎస్టేట్, జిమ్స్ వంటి బిజినెస్‌లను కలిగి ఉన్నారు. ఈ కారుకు సంబంధించిన అన్ని పేపర్లు తన దగ్గరున్నాయని, ఇన్కమ్ ట్యాక్స్ కూడా చెల్లిస్తున్నట్టు ప్రతీక్ తెలిపారు. ఆదాయపు పన్ను చెల్లిస్తున్నా దీనిపై ఎందుకంత రాద్ధాంతమని ప్రశ్నించారు. ఒకవేళ ఈ రూ.5 కోట్లను ప్రాపర్టీలో పెట్టుబడి పెట్టుంటే ఎవరూ ఏమి అనేవారు కాదుకదా? అని ప్రశ్నించారు. సమాజ్ వాద్ పార్టీలో చిచ్చు రేగడానికి ఓ వంతు కారణమైన ప్రతీక్ యాదవ్ భార్య అపర్ణ యాదవ్ ఈ సారి ఎన్నికల్లో లక్నో నుంచి పోటీకి దిగబోతున్నారు. తన భార్య అపర్ణ యాదవ్ కచ్చితంగా గెలుస్తారని ప్రతీక్ ధీమా వ్యక్తంచేశారు. తను పోటీకి దిగబోతున్న ప్రాంతంలో అపర్ణ చాలా చేశారని ప్రతీక్ తెలిపారు. ఎస్పీ-కాంగ్రెస్ పొత్తులో 250 సీట్ల నుంచి 300 సీట్ల వరకు గెలుస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. తనకు రాజకీయాలంటే ఇష్టంలేదని, ఒకవేళ ఆ ఇష్టమే ఉంటే ఎప్పుడో రాజకీయాల్లోకి ప్రవేశించే వాడినని చెప్పారు. ఎక్కువగా తన బిజినెస్‌ల వైపే దృష్టిసారిస్తానని ప్రతీక్ పునరుద్ఘాటించారు.


