ఎలాంటి ఫలాప్రేక్ష లేకుండా నిస్వార్థంగా చేసేవాళ్లు ఎంతోమంది ఉన్నారు. ఒక్కొక్కరి ఒక్కో పద్ధతి. కొందరు దానధర్మాలు చేస్తే..ఇంకొందు సేవా మార్గం ఎంచుకుంటారు. అలాకాకుండా రోజువారీ సాదాసీదా విషయాల్లో తన వంతుగా సహాయ సహకారాలు అందించాలని భావించడమే గ్రేట్ అనుకుంటే..అందుకోసం సమయం కేటాయిస్తూ..నిస్వార్థంగా సేవ చేయడం అంటే మాటలు కాదుకదా..!. అలాంటి సేవతత్పతరతనే అందిస్తున్నాడు ఈ వ్యక్తి.
ఆ మహానుభావుడే ముంబైకి చెందిన నరేంద్ర పాటిల్. లోకల్‌రైళ్లుపై ఆధారపడే ముంబై వంటి నగరాల్లో రైల్వే స్టేషన్‌లో ఎలాంటి గందరగోళ పరిస్థితి ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. అలాంటి చోట గమ్యం తెలియక ఇబ్బంది పడుతున్నవాళ్లకు దారిచూపుతాడు ఆయన. చాలా ఓపిగ్గా నవ్వుతూ వాళ్లు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తూ..మార్గనిర్దేశం చేస్తుంటాడు. సింపుల్‌గా చెప్పాలంటే మానవ సూచికగా అభివర్ణించొచ్చు.
ఆయన ప్రతిరోజూ దాదర్ వంతెనపై రెండు గంటలు నిలబడి, గందరగోళానికి గురైన రైలు ప్రయాణికులను సరైన ప్లాట్‌ఫారమ్‌లకు మార్గనిర్దేశం చేస్తారు. ముఖ్యంగా ఎక్కడ ఎక్కాలో లేదా మారాలో తెలియని ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరేలా సాయం అందిస్తారు. అందుకోసం రోజు రెండు గంటలపాటు అక్కడ ఉంటారు. పాటిల్ ఉదయం 9:30 నుండి 11:30 గంటల మధ్య అక్కడ నిలబడి ప్రయాణికులకు గైడెన్స్ ఇస్తుంటారు.
ఉదయం రద్దీ తగ్గిన తర్వాత, పాటిల్ కూడా ఎవరినీ ఏమీ అడగకుండా తన పని ప్రదేశానికి వెళ్ళిపోతాడు. ఆయన ఏమి ఆశించకుండా నవ్వుతూ చేస్తారు ఈ పనిని. కొందరు ప్రయాణికులు ఆయన్ను గుర్తుపట్టి చేయి ఊపి వెళ్లిపోతుంటారు కూడా. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అలాంటి నిశ్శబ్ద వీరులకు పెద్ద సెల్యూట్ అంటూ ప్రశంసల జల్లు కురిపిస్తూ పోస్టులు పెట్టారు.
(చదవండి: హ్యాట్సాఫ్ మేడం..! ఆ ఐడియాకి మాటల్లేవ్ అంతే..)


