సడెన్‌గా నా కార్‌వ్యాన్‌లోకి వచ్చి బట్టలిప్పేసాడు.! | Kajal Aggarwal Reveals Shocking Incident| | Sakshi
Sakshi News home page

సడెన్‌గా నా కార్‌వ్యాన్‌లోకి వచ్చి బట్టలిప్పేసాడు.!

Jul 27 2026 7:51 AM | Updated on Jul 27 2026 8:22 AM

Kajal Aggarwal Reveals Shocking Incident|

సినీ రంగంలో కథానాయకిల జీవితం అద్దాల మేడ వంటిది అంటారు. అది చూడ్డానికి అందంగా ఉంటుంది లోనికి దిగు చూస్తే భయాలు ,ఆవేదనలు, ఆటంకాలు, అవరోధాలు, ఆరోపణలు వంటి పలు మానసిక ఘటనలను కథానాయకులు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఇది వర్ధమాన నటిమణీలే  కాకుండా ప్రముఖ నటీమానులు కూడా ఎదుర్కొంటున్న సమస్యే. పాన్‌ ఇండియా కథానాయకగా రాణిస్తున్న నటి కాజల్‌ అగర్వాల్‌ కూడా ఇలాంటి పరిస్థితినే  ఎదుర్కొన్నారు. 

తెలుగు తమిళం హిందీ భాషల్లో అగ్ర కథానాయక రాణించిన ఈమె ఆ మధ్య పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు తల్లి కూడా అయ్యారు. కాగా ఇటీవల తన రెండవ ఇన్నింగ్‌ ను ప్రారంభించి బిజీగా నటిస్తున్నారు. కాగా ఇటీవల ఆమె ఎదుర్కొన్న ఒక దిగ్భ్రాంతి సంఘటన గురించి ఒక భేటీలో పేర్కొంటూ. ‘‘  షూటింగ్‌ స్పాట్‌ లో మహిళలకు సరైన రక్షణ లేదనడానికి నేను ఎదుర్కొన్న ఒక ఘటన చిన్న ఉదాహరణ. నిజం చెప్పాలంటే షూటింగ్‌ ప్రాంతం అనేది కళాకారులకు రెండవ ఇల్లు మాదిరి అందులో కేరవాన్‌ అనేది వారికి ప్రత్యేక నివాసం. 

ఆమధ్య షూటింగ్లో పాల్గొన్న నేను విరామ సమయంలో కేరవాన్‌ కు విశ్రాంతి తీసుకుంటున్నాను. అప్పుడు ఆ చిత్ర సహాయ దర్శకుడు నా అనుమతి లేకుండా కేరవాన్‌ లోకి చొరపడ్డాడు. నేను ఒంటరిగా ఉండటం చూసి ఆనుచితంగా ప్రవర్తించాడు. ఒకసారిగా కంగారు పడ్డాను. కాళ్ల లోంచి వణుకు పుట్టింది. అతను వచ్చిన వెంటనే చొక్కా  విప్పేశాడు . 

దీంతో నేను ఇంకా భయపడ్డాను అయితే అతని తన గుండెపై పొడిపించుకున్న ట్యాటూ చూపించారు. అందులో ఉన్నది ఎవరిదో కాదు నా ప్రతి రూపమే. తన బొమ్మను ట్యూటూగా పొడిని ఉంచుకోవడం సంతోషమే అనిపించింది. అతను నా అభిమాని అని చెప్పాడు. ఎంత అభిమాని అయిన అలా ప్రవర్తించటం సరికాదు. అది క్రిమినల్‌ చర్యే అవుతుంది అని అతని హెచ్చరించి పంపించేశాను‘‘  అని నటి కాజల్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు.  

Red 🔥❤️ Like Actress Kajal agarwal

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement