తెలుగు తెరపై ఎందరో నటీనటులు తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో సుస్థి ర స్థానాన్ని సంపాదించుకున్నారు. అయితే కొంతమంది మాత్రం సడెన్‌గా వెండితెరకు దూరం అయిపోతున్నారు.
వందల సినిమాలు చేసినా.. మళ్లీ తెరపై కనిపించడం లేదు. అలాంటి వాళ్లలు నవీన్ ఓలేటి ఒకరు.
పేరు చెబితే తెలియదు కానీ.. ప్రేమంటే ఇదేరా చిత్రంలో హీరో వెంకటేష్ ఫ్రెండ్.. విక్రమార్కుడులో పోలీసు.. తొలివలపు మూవీలో హీరో అన్నయ్య అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. నువ్వే నువ్వే, విక్రమార్కుడుతో పాటు దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించి మెప్పించాడు.
ఇలా వెండితెరపై ఆకట్టుకున్న నవీన్ ఓలేటి సడెన్‌గా ఇండస్ట్రీకి దూరమయ్యారు.
నవీన్ ఓలేటి పిల్లలతో కలిసి అమెరికాలో స్థిరపడ్డారు.
నవీన్ ఓలేటికి ముగ్గురు ప్లిలలు (ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి) ఉన్నారు.
పెద్ద కుమార్తె మనవి హీరోయిన్ గా రాణించేందుకు రెడీ అవుతుంది. ప్రస్తుతం ప్రైవేట్ సాంగ్స్, షార్ట్ ఫిల్మ్స్ చేస్తుంది.
Photo Credit : manavvivoleti (instagram)


