ఫీఫా ట్రోఫీ నెత్తుకున్న యువరాణి, ఎవరీ మనోహరి : ఇంట్రస్టింగ్‌ ఫ్యాక్ట్స్‌ | Set to Be First Queen in 150 Years Princess Leonor of Spain Doing Military Service | Sakshi
Sakshi News home page

ఫీఫా ట్రోఫీ నెత్తుకున్న యువరాణి, ఎవరీ మనోహరి : ఇంట్రస్టింగ్‌ ఫ్యాక్ట్స్‌

Jul 22 2026 3:48 PM | Updated on Jul 22 2026 4:54 PM

Set to Be  First Queen in 150 Years Princess Leonor of Spain Doing Military Service

స్పెయిన్ చరిత్రలో  ఆసక్తికర పరిణామం కొత్త చరితను లిఖించనుంది. దాదాపు 150 సంవత్సరాల విరామం తర్వాత  అరుదైన ఘట్టం ఆవిష్కృతం కానుంది. 20 ఏళ్ల లియోనోర్ డి టోడోస్ లాస్ శాంటోస్ డి బోర్బోన్ వై ఓర్టిజ్‌ ఆ దేశ సింహాసనాన్ని  అధిష్టించనున్న  తొలి మహిళగా చరిత్ర సృష్టించనున్నారు. 150 ఏళ్లకు పైగా కాలంలో స్పెయిన్‌ను పాలించబోతున్న తొలి మహారాణి ఈమే కావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోన్న  ఈ పరిణామం గురించి తెలుసుకుందామా. 

2026 ఫీఫా ప్రపంచ కప్ పోరులో  అర్జెంటీనాతో జరిగిన ఫైనల్ ఫుట్‌బాల్‌ తర్వాత స్పెయిన్‌కు చెందిన లామిన్ యమాల్‌తో కలిసి స్పెయిన్ యువరాణి లియోనోర్ , యువరాణి సోఫియా ఫీఫా ప్రపంచ కప్ ట్రోఫీని ఎత్తుకున్నారు. దీంతో యువరాణిపై మరింత ఆసక్తి పెరిగింది. స్పెయిన్ అస్టూరియాస్ రాజకుమారి (Princess of Asturias)  ఓర్తిజ్  వేల్స్‌లోని యూడబ్ల్యూసీ అట్లాంటిక్ కాలేజ్ నుండి ఇంటర్నేషనల్ బాకలారియేట్ పట్టా పొందారు. స్పెయిన్ సాయుధ దళాలలోని మూడు విభాగాలలోనూ మూడేళ్ల సైనిక శిక్షణను ఆమె ఇప్పుడే పూర్తి చేశారు.  ఇటీవల స్పెయిన్‌కు చెందిన మూడు రక్షణ దళాలలో (ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్) మూడేళ్ల సైనిక శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు.  ఎనిమిది భాషల్లో ఆమెమాట్లాడగలదు.

వారసత్వ చట్టం, రాజకుమారి
స్పెయిన్ 1978 రాజ్యాంగంలోని ఆర్టికల్ 57 ప్రకారం, వారసత్వంలో మగపిల్లలకు ప్రాధాన్యం ఉంటుంది.  దీని ప్రకారం పెద్ద సంతానం వారసత్వంగా పొందుతారు. అలా ప్రస్తుత రాజు ఫెలిపే VI, తన కంటే పెద్దవారైన ఇద్దరు అక్కలను కాదని రాజు అయ్యారు.

2005లో లియోనోర్, 2007లో ఇన్ఫాంటా సోఫియా జన్మించారు. అయితే వారసత్వ చట్టం ప్రకారం ఒకవేళ లియోనోర్‌కు తమ్ముడు పుట్టి ఉంటే, ఈమె స్థానాన్ని ఆ తమ్ముడు ఆక్రమించేవాడు.  ఈ నేపథ్యంలోనే  లియోనోర్ వారసత్వ స్థానాన్ని కాపాడటానికే రాజు దంపతులు మూడో సంతానం వైపు వెళ్ళలేదని అంచనాలు కూడా ఉన్నాయి.

ప్రస్తుతం రాజు ఫెలిపే VI, రాణి లెటిజియా దంపతుల పెద్ద కుమార్తె యువరాణి లియోనోర్ భవిష్యత్ రాణిగా సిద్ధమవుతోంది. ఆమె సింహాస నారోహణతో, స్పానిష్ రాజవంశంలో కొత్త అధ్యాయం మొదలుకానుంది. 

అరుదైన సైనిక శిక్షణ
2023 అక్టోబర్‌లో తన 18వ పుట్టినరోజున పార్లమెంట్  ఎదుట రాజ్యాంగానికి విధేయురాలిగా ఉంటానని ప్రమాణం చేశారు. తండ్రి బాటలోనే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ విభాగాల్లో కఠిన శిక్షణ పొందారు. యుద్ధ విమానాలు నడపడం నేర్చుకున్నారు. అంతేకాదు పారాచ్యూట్ కోర్సు పూర్తి చేసిన ఏకైక రాజకుటుంబ సభ్యురాలిగా నిలిచారు. 2026 జూలై  నాటికి ఈ శిక్షణను పూర్తి చేసుకుని 'గ్రాండ్ క్రాస్ ఆఫ్ ఏరోనాటికల్ మెరిట్' పురస్కారాన్ని పొందారు.

సెప్టెంబర్ నుండిమాడ్రిడ్‌లోని 'కార్లోస్ III విశ్వవిద్యాలయం'లో నాలుగేళ్ల పొలిటికల్ సైన్స్ డిగ్రీని ప్రారంభించ నున్నారు. రాజవంశ బాధ్యతలు నిర్వహిస్తూనే ఈమె చదువును కొనసాగించనున్నారు. ఇదే కోర్సును ఆమె సోదరి సోఫియా కూడా అభ్యసిస్తోంది. 

ఇక స్పెయిన్‌ను చివరిగా పాలించిన మహిళ రాణి ఇసాబెల్లా II. ఆమె పాలన 1868లో ముగిసింది. ఆమె తర్వాత మళ్లీ స్పెయిన్ సింహాసనాన్ని అధిష్టించబోతున్న మహిళా పాలకురాలు రాజకుమారి లియోనోర్ కావడం విశేషం.

ఇదీ చదవండి: ఒకే కాన్పులో నలుగురు అమ్మాయిలు : 10 సీటర్‌ కారు కావాలి

యువరాణి లియోనోర్  సైనిక శిక్షణలో ఇప్పటికే పలు చారిత్రక మైలురాళ్లను అధిగమించారు. నావికా శిక్షణలో భాగంగా జువాన్ సెబాస్టియన్ డి ఎల్కానో నౌక సిబ్బందితో కలిసి అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా సుమారు 17 వేల మైళ్ళ ప్రయాణం చేశారు. అంతేకాదు, బ్లాస్ డిలెజో అనే యుద్ధనౌకపై కూడా సేవలందించారు. ఇక విమానయాన శిక్షణలోనూ ప్రత్యేక రికార్డులు ఆమె సొంతం. 2025లో  పిలాటస్ PC-21 విమానాన్ని ఒంటరిగా నడిపిన తొలి స్పానిష్ యువరాణిగా చరిత్రలో నిలిచారు. అలాగే రాబోయే కొన్నేళ్లలో రాజ్యాంగపరమైన బాధ్యతలను స్వీకరిస్తుందని భావిస్తున్నారు. దీంతో స్పెయిన్‌కు శక్తివంతమైన రాణిగా, సింహాసనారోహణ కోసం ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.

ఇదీ చదవండి: రూ. 5 లక్షల వెండి పాత్ర పొరపాటున చెత్తలో.. చివరికి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement