ఆస్ట్రేలియాకు చెందిన 34 ఏళ్ల జెనిటార్ సా నా’అమోవానా ఒక ఆశ్చర్యకరమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఈమె ఇటీవల నలుగురు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. నలుగురూ ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. అప్పటికే నలుగురు చిన్న పిల్లలను పెంచుతున్న ఆ దంపతుల ఇల్లు ఈ నలుగురు పాపల రాకతో మొత్తం ఎనిమిది మంది సభ్యుల కుటుంబంగా మారింది. కానీ ఈ సంతోషకరమైన పరిణామం రాత్రికి రాత్రే వారికి సరికొత్త సవాళ్లను తెచ్చిపెట్టింది.
నలుగురు ఆడపిల్లలు పుట్టడం తల్లిదండ్రులు తాము మర్చిపోలేని ఆశీర్వాదంగా అభివర్ణించారు. కానీ వారిని సంరక్షించేందుకు ఆర్థిక వనరులు అవసరమం. ముఖ్యంగా డైపర్లు, ఫార్ములా పాలు, బట్టలు లాంటి రోజువారీ ఖర్చులు ఊహించని భారమే. అయితే ఒకేసారి నలుగురు నవజాత శిశువులను పోషించేందుకు స్నేహితులు, అభిమానులు మొదట్లో చాలా సాయంగా నిలిచారు. మరికొంతమంది ఆ దంపతుల పట్ల ప్రశంసలు కురిపిస్తూ ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. ఇంత పెద్ద కుటుంబాన్ని నిర్వహించే క్రమంలో సమాజం నుండి లభిస్తున్న ఈ మద్దతు వారికి ఎంతో విలువైందిగా మారింది.

అయితే వీరికి ఇంకో సమస్య వచ్చి పడింది. వీళ్లందరితో ప్రయాణించేందుకు ప్రస్తుతం ఉన్న కారులో అందరూ సురక్షితంగా కూర్చోవడానికి సరిపడా సీట్లు లేవు. ఆసుపత్రి పర్యటనలు, స్కూల్ డ్రాప్‌లు, ఇతర ప్రయాణాలు సులభంగా సాగేందుకు 10 సీట్ల వ్యాన్ (10-seater van)అవసరం ఉంటుందని ఆ కుటుంబం భావిస్తోంది. అలాంటి వ్యాన్‌ను కొనుగోలు చేయడానికి ఆ తల్లి ఆన్‌లైన్‌లో విరాళాల సేకరణను (fundraising) ప్రారంభించడం విశేషంగా నిలిచింది. తమ ఏడుగురు పిల్లలందరికీ సౌకర్యవంతమైన, సురక్షితమైన వాతావరణాన్ని అందించడానికి సరైన వాహనం, వనరులు ఉన్నాయని నిర్ధారించుకోవడమే ఆ కుటుంబం తక్షణ లక్ష్యంగాపెట్టుకుంది.
డాక్టర్ అలెక్సా బెండాల్ ఏమన్నారంటే
మోనోజైగోటిక్ క్వాడ్రప్లెట్స్ (ఒకే ఫలదీకరణం చెందిన అండం నుండి ఏర్పడిన ఒకేలా ఉండే నలుగురు శిశువులు) ప్రపంచంలోనే అత్యంత అరుదైన గర్భధారణ రకాల్లో ఒకటి. నామోనా విషయంలో విశేషం ఏమిటంటే, ఆమెకు పుట్టిన ఈ నలుగురు శిశువులకు ఒకే మాయ (placenta) అని నామెనాకు వైద్యం చేసిన డాక్టర్, రాయల్ బ్రిస్బేన్ అండ్ ఉమెన్స్ హాస్పిటల్‌కు చెందిన ఫీటల్ మెడిసిన్,ప్రసూతి వైద్యురాలు డాక్టర్ అలెక్సా బెండాల్ తెలిపారు. 1.5 కోట్ల కేసుల్లో ఒకరికి మాత్రమే జరుగుతుందని భావిస్తున్నామన్నారు. ప్రపంచంలో ఇతర ప్రాంతాల్లో ఒకటి రెండు కేసులు ఉండి ఉండవచ్చు కానీ ఆస్ట్రేలియాలో తమకు తెలిసినంత వరకు ఇదే ఏకైక కేసు అని చెప్పారు.
ఇదీ చదవండి: ఉద్యోగిని పెర్‌ఫామెన్స్ బాలేదని పెయిడ్ లీవ్ : కంపెనీకి భారీ క్రేజ్
.


