breaking news
australia
-
పైచేయి కోసం...
గోల్డ్‌కోస్ట్: సిరీస్‌లో కీలకమైన పైచేయి కోసం భారత్, ఆ్రస్టేలియా జట్లు సమరానికి సై అంటున్నాయి. తొలి మ్యాచ్ వర్షంతో రద్దవడం... తదుపరి రెండు మ్యాచ్‌ల్లో చెరోటి గెలవడంతో ఇరు జట్లు ప్రస్తుతం 1–1తో సమవుజ్జీగా నిలిచాయి. ఈ నేపథ్యంలో గురువారం ఇక్కడ జరిగే నాలుగో టి20లో గెలిచిన జట్టు ఇక సిరీస్‌లో ఓడిపోదు. 2–1తో ఆధిక్యంలోకి వెళ్లిన జట్టు ఆఖరిపోరులో ఓడినా సిరీస్ సమమవుతుందే కానీ చేజారనే చేజారదు. దీంతో భారత్, ఆ్రస్టేలియా జట్లు ఇక్కడే గెలిసి సిరీస్ పట్టు పట్టాలనే లక్ష్యంతో ఉన్నాయి. ఇదే జరిగితే మాత్రం టి20లో మెరుపుల హోరు ఖాయం! ఎందుకంటే పిచ్ కూడా బ్యాటింగ్‌కు స్వర్గధామం. అంతర్జాతీయ మ్యాచ్‌లు అరకొరగా జరిగినా... బిగ్‌బాష్ లీగ్‌లలో భారీస్కోర్లకు లోటే లేదు. దీంతో బౌలర్లకే కఠిన సవాళ్లు ఎదురవక తప్పదు. గిల్ బాకీ పడ్డాడు ఓపెనర్ శుబ్‌మన్ గిల్ ఈ టి20 సిరీస్‌లోనే కాదు... అంతకుముందు జరిగిన వన్డే సిరీస్‌లోనూ పెద్దగా ప్రభావమే చూపలేదు. పరుగుల పరంగా రెండు సిరీస్‌లకు బాకీ పడ్డాడు. బహుశా బ్యాటింగ్‌కు అచ్చొచ్చే ఈ మ్యాచ్‌లో ఆ బాకీ ఏదో తీర్చుకుంటే భారత్‌కు శుభారంభం లభిస్తుంది. టి20 స్పెషలిస్టు ఓపెనర్, ధనాధన్ హిట్టర్ అభిషేక్ వర్మ పవర్ ప్లేలో కావల్సినదానికంటే పెద్ద సంఖ్యలోనే పరుగులు కూడబెడతాడు. కెపె్టన్ సూర్యకుమార్, తిలక్ వర్మలు సైతం భారీ షాట్లకు తెగబడితే, బౌలింగ్ ఆల్‌రౌండర్లు ఆక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్‌లు అడపాదడపా దంచేస్తే మాత్రం 200 పైచిలుకు స్కోరు టీమిండియాకు ఏమంత కష్టమే కాదు. అప్పుడు బుమ్రా, అర్‡్షదీప్, వరుణ్, అక్షర్, సుందర్‌లతో కూడిన బౌలింగ్ దళం తమ పనిని చింత లేకుండా చక్కబెట్టే అవకాశం ఉంటుంది. కీలక ఆటగాళ్లు దూరం రెండో టి20తోనే హాజల్‌వుడ్, మూడో మ్యాచ్‌తో హెడ్, అబాట్‌లు జట్టు వీడారు. త్వరలోనే జరిగే ప్రతిష్టాత్మక యాషెస్ కోసం తుదిసన్నాహాల్లో ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడేందుకు కీలకమైన ఆటగాళ్లను విడుదల చేశారు. అయితే ఇది ఆసీస్ లాంటి అగ్రశ్రేణి జట్టుకు ప్రతికూలత కాదు... భారత్‌కు గొప్ప అనుకూలతగా భావించరాదు. ఎందుకంటే ఇది కంగారూ జట్టు. మేటి ఆటగాళ్లెంతో మంది ఉన్నారు. తొలి మూడు మ్యాచ్‌లు ఆడని విధ్వంసకర ఆల్‌రౌండర్ మ్యాక్స్‌వెల్ ఈ మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు. స్టొయినిస్, టిమ్ డేవిడ్, ఇన్గ్లిస్లాంటి హిట్టర్లూ ఉన్నారు. కాబటి ఒకరిద్దరు లేనంత మాత్రం ఆసీస్ బలహీనమనుకుంటే తప్పులో కాలేసినట్లే కెప్టెన్ మిచెల్ మార్‡్ష, టిమ్ డేవిడ్, స్టొయినిస్‌లు ఈ సిరీస్‌లో చక్కని ఫామ్‌లో ఉన్నారు. అనుభవజు్ఞలైన పేస్ బలగం లేకపోవడం కాస్త ఇబ్బందికరమైనప్పటికీ బార్ట్లెట్, ఎలిస్‌లు ఆ బాధ్యతను సమర్థవంతగా నిర్వర్తించగలరు. ఈ నేపథ్యంలో సొంత ప్రేక్షకుల మద్దతుతో ఆతిథ్య జట్టు దంచేయడం ఖాయం! తద్వారా ఇరుజట్ల బ్యాటింగ్ మెరుపులతో స్కోరు హోరెత్తడం కూడా ఖాయమే!పిచ్–వాతావరణం ఈ కరార వేదిక బిగ్‌బాష్ లీగ్‌కు ఫేమస్. మెరుపుల టి20లో భారీస్కోర్లకు చిరునామా దీంతో బ్యాటర్లకు పండగే. ఇక అంతర్జాతీయ మ్యాచ్‌ల విషయానికొస్తే ఇక్కడ కేవలం రెండే మ్యాచ్‌లు జరిగాయి. వర్ష సూచన లేదు.తుది జట్లు (అంచనా) భారత్: సూర్యకుమార్ (కెప్టెన్ ), అభిషేక్, శుబ్‌మన్, తిలక్‌వర్మ, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, జితేశ్, శివమ్ దూబే, అర్‡్షదీప్, వరుణ్, బుమ్రా. ఆస్ట్రేలియా: మార్ష్(కెప్టెన్ ), షార్ట్, ఇన్‌గ్లిస్, టిమ్ డేవిడ్, మిచ్ ఒవెన్, స్టొయినిస్, మ్యాక్స్‌వెల్, బార్ట్లెట్, డ్వార్షుయిస్, ఎలిస్, కునెమన్. -
యాషెస్ తొలి టెస్ట్‌కు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన
నవంబర్ 21 నుంచి పెర్త్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగే తొలి యాషెస్ (Ashes Series 2025-26) టెస్ట్ కోసం 15 మంది సభ్యుల ఆస్ట్రేలియా జట్టును (Australia) ఇవాళ (నవంబర్ 5) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్ వ్యవహరించనున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ముందుగానే ప్రకటించింది. రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో స్మిత్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పారు.ఈ జట్టులో ఎవరూ ఊహించని ఓ ఆటగాడికి (జేక్ వెదరాల్డ్, Jake Weatherald) చోటు దక్కింది. ఇటీవల దేశవాలీ క్రికెట్లో సెంచరీల మోత మోగించిన మార్నస్ లబూషేన్ (Marnus Labuschagne) తిరిగి జట్టులోకి వచ్చాడు. వెదరాల్డ్, లబూషేన్లలో ఎవరో ఒకరు ఉస్మాన్ ఖ్వాజాతో కలిసి ఓపెనింగ్ చేస్తారు.పేస్ బౌలింగ్ ఆల్రౌండర్లుగా కెమెరాన్ గ్రీన్, బ్యూ వెబ్‌స్టర్ చోటు దక్కించుకున్నారు. కమిన్స్ గైర్హాజరీలో సీన్ అబాట్, బ్రెండన్ డాగెట్ బ్యాకప్ బౌలర్లుగా జట్టులోకి వచ్చారు. అలెక్స్ క్యారీ రెగ్యులర్ వికెట్‌కీపర్‌గా, జోస్ ఇంగ్లిస్ రిజర్వ్ వికెట్‌కీపర్‌గా ఎంపికయ్యారు. పేలవ ఫామ్ కారణంగా యువ ఓపెనర్ సామ్ కొన్‌స్టాస్ జట్టులో స్థానంలో కోల్పోయాడు. మ్యాట్ రెన్షా పేరు పరిశీలనలో ఉన్నప్పటికీ అతనికి నిరాశే మిగిలింది.పేసర్లుగా జోష్ హాజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్, స్కాట్ బోలాండ్.. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా నాథన్ లియాన్ కొనసాగుతున్నారు.యాషెస్ సిరీస్ తొలి టెస్ట్‌కు ఆస్ట్రేలియా జట్టు: స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, బ్రెండన్ డాగెట్, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖ్వాజా, మార్నస్ లాబూషేన్, నాథన్ లియాన్, మిచెల్ స్టార్క్, జేక్ వెదరాల్డ్, బ్యూ వెబ్స్టర్మరోవైపు యాషెస్ సిరీస్ మొత్తానికి బెన్ స్టోక్స్ నేతృత్వంలోని 16 మంది సభ్యుల ఇంగ్లండ్ జట్టును ఇదివరకే ప్రకటించారు. యాషెస్ సిరీస్ 2025-26కి ఇంగ్లండ్ జట్టు: బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేకబ్ బేతెల్, బెన్ డకెట్, జాక్ క్రాలే, జో రూట్, హ్యారీ బ్రూక్, విల్ జాక్స్, గస్ అట్కిన్సన్, జేమీ స్మిత్, ఓలీ పోప్, జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్, షోయబ్ బషీర్, బ్రైడన్ కార్స్, జోష్ టంగ్, మాథ్యూ పాట్స్చదవండి: పాకిస్తాన్, సౌతాఫ్రికా తొలి వన్డేలో హైడ్రామా -
ఆస్ట్రేలియా కెప్టెన్‌గా ఎవరూ ఊహించని ప్లేయర్..
హాంగ్‌కాంగ్ క్రికెట్ సిక్సెస్-2025 టోర్నమెంట్ నవంబర్ 7 నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగా ఈవెంట్ కోసం ఏడుగురు సభ్యులతో కూడిన ఆస్ట్రేలియా జట్టును సెలక్టర్లు ప్రకటించారు. ఈ జట్టు కెప్టెన్‌గా బిగ్ బాష్ లెజెండ్ అలెక్స్ రాస్ ఎంపికయ్యాడు. ఈ జట్టులో బెన్ మెక్‌డెర్మాట్, ఆండ్రూ టై, క్రిస్ గ్రీన్ వంటి అంతర్జాతీయ స్టార్ క్రికెటర్లు సైతం ఉన్నారు.క్రిస్ గ్రీన్‌కు కెప్టెన్‌గా అపారమైన అనుభవం ఉనప్పటికి రాస్కే జట్టు పగ్గాలను సెలక్టర్లు కట్టబెట్టారు. గతేడాది ఆస్ట్రేలియా సెమీఫైనల్లో పాక్ చేతిలో ఓటమి పాలైంది. దీంతో ఈసారి ఎలాగైనా కప్ కొట్టాలని కంగారులు పట్టుదలతో ఉన్నారు. కాగా ఈవెంట్లో మొత్తం 12 జట్లు పాల్గొననున్నాయి. ఆస్ట్రేలియా, భారత్, పాకిస్తాన్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, హాంకాంగ్, నేపాల్, ఒమన్, యూఏఈ జట్లు భాగం కానున్నాయి. నవంబర్ 7 నుంచి 9 వరకు టిన్ క్వాంగ్ రోడ్ రిక్రియేషన్ గ్రౌండ్లో జరగనుంది. ఈ సిక్సెస్ టోర్నీ కోసం భారత జట్టును ఇప్పటికే ప్రకటించారు. టీమిండియా కెప్టెన్ దినేష్ కార్తీక్ వ్యవహరించనున్నాడు.హాంకాంగ్ క్రికెట్ సిక్సర్స్ కోసం ఆస్ట్రేలియా జట్టు:అలెక్స్ రాస్ (కెప్టెన్), బెన్ మెక్‌డెర్మాట్, జాక్ వుడ్, నిక్ హాబ్సన్, క్రిస్ గ్రీన్, విలియం బోసిస్టో , ఆండ్రూ టై.అసలేంటి హాంకాంగ్ సిక్సెస్?1992లో హాంకాంగ్ క్రికెట్ ఆధ్వర్యంలో మొదలైన హాంకాంగ్ సిక్సెస్ టోర్నీ.. చివరగా 2017 వరకు జరిగింది. ఆ తర్వాత కొన్ని కారణాలతో ఈ టోర్నీని నిర్వహించలేదు. అయితే ఈ ఈవెంట్‌కు మళ్లీ పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు హాంకాంగ్ క్రికెట్ ముందుకు వచ్చింది. ఈ క్రమంలో ఏడేళ్ల తర్వాత ఈ టోర్నీని మళ్లీ నిర్వహించారు. గత సీజన్ విజేతగా శ్రీలంక నిలిచింది.దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు అత్యధికంగా 5 సార్లు ఈ టోర్నమెంట్ విజేతలగా నిలవగా.. పాకిస్తాన్ 4 సార్లు, శ్రీలంక రెండు సార్లు ఈ హాంకాంగ్ సిక్సెస్ ట్రోఫీని ముద్దాడింది. భారత్, ఆస్ట్రేలియా, విండీస్ జట్లు చెరో ఒక్కసారి ఛాంపియన్స్‌గా నిలిచాయి. గతంలో ఈ టోర్నీలో సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ, అనిల్ కుంబ్లే వంటి దిగ్గజ క్రికెటర్లు సైతం ఆడారు.రూల్స్ ఇవే..ఒక మ్యాచ్‌లో ప్రతీ జట్టు 5 ఓవర్లు మాత్రమే ఆడుతోంది. మ్యాచ్ ఆడే రెండు జట్లలో ఆరుగురు ఆటగాళ్లు ఉండాలి. గ్రూప్ దశలో ఒక్కో ఓవర్‌కు ఆరు బంతులు ఉంటాయి. అదే ఫైనల్లో ఒక్కో ఓవర్లో ఎనిమిది బంతులు ఉంటాయి. . వికెట్ కీపర్ మినహా జట్టులోని ప్రతి ఒక్కరు ఒక్కో ఓవర్ వేయాల్సి ఉంటుంది. చదవండి: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. వణికి పోయిన బౌలర్లు -
8 ఇన్నింగ్స్‌ల్లో 5 సెంచరీలు.. ఆసీస్ బ్యాటర్ సూపర్ ఫామ్
టెస్ట్, వన్డే జట్ల నుంచి ఉద్వాసనకు గురైన ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ మార్నస్ లబూషేన్ (Marnus Labuschagne).. స్వదేశవాలీ సీజన్లో చెలరేగిపోతున్నాడు. 8 ఇన్నింగ్స్‌ల్లో 5 సెంచరీలు సహా 679 పరుగులు చేసి సూపర్ ఫామ్‌ను చాటుకున్నాడు.యాషెస్ జట్టులో స్థానమే లక్ష్యంగా జైత్రయాత్రను కొనసాగిస్తున్న లబూషేన్.. తాజాగా న్యూ సౌత్ వేల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో (వన్డే కప్-2025) 111 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్ సాయంతో 101 పరుగులు చేశాడు.ఈ మ్యాచ్‌లో లబూషేన్ బంతితోనూ సత్తా చాటాడు. జాతీయ జట్టు సహచరుడు క్రిస్ గ్రీన్ సహా 2 వికెట్లు తీశాడు. ఈ టోర్నీలో లబూషేన్ క్వీన్స్లాండ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. మొత్తంగా లబూషేన్‌కు లిస్ట్-ఏ క్రికెట్లో ఇది ఆరో శతకం. ప్రస్తుత వన్డే కప్‌లో నాలుగు ఇన్నింగ్స్‌ల్లో ఇది మూడవది.ప్రస్తుత స్వదేశవాలీ సీజన్లో లబూషేన్ లిస్ట్-ఏ ఫార్మాట్‌తో పాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్లోనూ చెలరేగిపోతున్నాడు. షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో టస్మానియా, సౌత్ ఆస్ట్రేలియాపై శతకాలు నమోదు చేశాడు.ఆగస్ట్‌లో సౌతాఫ్రికాతో జరిగిన స్వదేశీ వన్డే సిరీస్‌కు ముందు లబూషేన్‌పై వేటు పడింది. అప్పటి నుంచి వన్డే, టెస్ట్ ఫార్మాట్లలో జట్టులో చోటు కోల్పోయాడు. 31 లబూషేన్ ప్రస్తుత అరివీర భయంకరమైన ఫామ్‌కు ముందు గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నాడు. చాలాకాలం పాటు ఫామ్ కోల్పోయి తంటాలు పడ్డాడు.ప్రస్తుతం లబూషేన్ ఉన్న ఫామ్‌ను బట్టి చూస్తే యాషెస్ సిరీస్‌తో రీఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. యాషెస్ సిరీస్ 2025-26 నవంబర్ 21 నుంచి మొదలవుతుంది. తొలి టెస్ట్ పెర్త్ వేదికగా జరుగనుంది. ఈ సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టును ఇదివరకే ప్రకటించగా.. ఆసీస్ జట్టును ప్రకటించాల్సి ఉంది. రెగ్యులర్ కెప్టెన్ కమిన్స్ గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో తొలి టెస్ట్‌కు స్టీవ్ స్మిత్‌ను తాత్కాలిక కెప్టెన్‌గా ఎంపిక చేశారు. -
ఆస్ట్రేలియా సెలెక్టర్ల కీలక నిర్ణయం
నవంబర్ 6న గోల్డ్‌కోస్ట్ వేదికగా భారత్‌తో జరుగబోయే నాలుగో టీ20కి ముందు ఆస్ట్రేలియా సెలెక్టర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. విధ్వంసకర ఓపెనింగ్ బ్యాటర్ ట్రవిస్ హెడ్‌ను (Travis Head) జట్టు నుంచి విడుదల చేశారు. షెఫీల్డ్ షీల్డ్‌లో సౌత్ ఆస్ట్రేలియా తరఫున ఆడాలని ఆదేశించారు. ఆసీస్ సెలెక్టర్ల ఈ నిర్ణయం యాషెస్ సిరీస్ వ్యూహాల్లో భాగంగా తీసుకోబడింది. పని భారం తగ్గించే క్రమంలో హెడ్‌కు చివరి రెండు టీ20లకు విశ్రాంతి కల్పించారు. హెడ్ స్థానాన్ని ఎవరూ భర్తీ చేస్తారో సెలెక్టర్లు చెప్పలేదు.అంతకుముందు మరికొందరు సీనియర్లను కూడా భారత్‌ను ఎదుర్కొనే టీ20 జట్టు నుంచి రిలీజ్ చేశారు. స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్ షెఫీల్డ్ షీల్డ్‌లో న్యూసౌత్ వేల్స్ తరఫున ఆడతారు. కెమరూన్ గ్రీన్ వెస్ట్రన్ ఆస్ట్రేలియాకు ప్రాతినిథ్యం వహించనున్నాడు.హెడ్ భారత్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి మూడు మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో హెడ్ చెప్పుకోదగ్గ ప్రదర్శనలేమీ చేయలేదు. రెండో టీ20లో 28, మూడో మ్యాచ్‌లో 6 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచిన హెడ్.. అంతకుముందు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లోనూ దారుణంగా విఫలమయ్యాడు. వరుసగా 8, 28, 29 స్కోర్లు చేశాడు.కాగా, ప్రస్తుతం భారత్‌తో జరుగుతున్న సిరీస్‌లో ఆస్ట్రేలియా 1-1 సమంగా ఉంది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో టీ20లో ఆస్ట్రేలియా, మూడో మ్యాచ్‌లో భారత్ గెలుపొందాయి.భారత్‌తో నాలుగు, ఐదు టీ20లకు ఆస్ట్రేలియా జట్టు..మిచెల్ మార్ష్, టిమ్ డేవిడ్, మిచెల్ ఓవెన్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మహ్లి బియర్డ్‌మన్, జేవియర్ బార్ట్లెట్, నాథన్ ఇల్లిస్, జోష్ ఇంగ్లిస్, జోష్ ఫిలిప్, జేవియర్ బార్ట్లెట్, బెన్ డ్వార్షుయిస్, మాథ్యూ కుహ్నేమన్, ఆడమ్ జంపాచదవండి: విశ్వ విజేతల వెనుక త్యాగాల గాథ -
ఆసీస్‌పై టీమిండియా గెలుపు
హోబర్ట్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో భారత్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. సిరీస్‌లో తొలి మ్యాచ్ ఆడిన వాషింగ్టన్ సుందర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి ఒంటిచేత్తో టీమిండియాను గెలిపించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో6 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేయగా.. భారత్ 18.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో టిమ్ డేవిడ్ (74), స్టోయినిస్ (64) అర్ద సెంచరీలతో సత్తా చాటగా.. భారత్ తరఫున వాషింగ్టన్ సుందర్ చెలరేగాడు. సుందర్ 23 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 49 పరుగులు చేసి అజేయంగా నిలువగా.. జితేశ్ శర్మ (13 బంతుల్లో 22 నాటౌట్; 3 ఫోర్లు) సుందర్‌కు సహకరించాడు. భారత ఇన్నింగ్స్‌లో అభిషేక్ శర్మ 25, శుభ్‌మన్ గిల్ 15, సూర్యకుమార్ యాదవ్ 24, తిలక్ వర్మ 29, అక్షర్ పటేల్ 17 పరుగులు చేశారు.భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ 3, వరున్ చక్రవర్తి 2, శివమ్ దూబే ఓ వికెట్ పడగొట్టగా... ఆసీస్ బౌలర్లలో నాథన్ ఇల్లిస్ 3, బార్ట్లెట్, స్టోయినిస్ తలో వికెట్ తీశారు. నాలుగో టీ20 గోల్డ్ కోస్ట్ వేదికగా నవంబర్ 6న జరుగుతుంది.ఐదో వికెట్ కోల్పోయిన భారత్14.2వ ఓవర్- 145 పరుగుల వద్ద భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. బార్ట్లెట్ బౌలింగ్‌లో తిలక్ వర్మ (29) ఔటయ్యాడు.15 ఓవర్ద తర్వాత భారత్ స్కోర్ 152/5గా ఉంది. సుందర్ (30), జితేశ్ శర్మ (5) క్రీజ్‌లో ఉన్నారు. నాలుగో వికెట్ కోల్పోయిన భారత్11.1 ఓవర్- 111 పరుగుల వద్ద భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. ఇల్లిస్ బౌలింగ్‌లో అక్షర్ పటేల్ (17) ఔటయ్యాడు. 11.4 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 117/4గా ఉంది. వాషింగ్టన్ సుందర్ (6), తిలక్ వర్మ (24) క్రీజ్‌లో ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన భారత్7.3వ ఓవర్- 76 పరుగుల వద్ద భారత్ మూడో వికెట్ కోల్పోయింది. స్టోయినిస్ బౌలింగ్‌లో ఇల్లిస్‌కు క్యాచ్ ఇచ్చి సూర్యకుమార్ యాదవ్ (24) ఔటయ్యాడు. 8 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 82/3గా ఉంది. అక్షర్ పటేల్ (3), తిలక్ వర్మ (12) క్రీజ్‌లో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన భారత్5.3వ ఓవర్- 61 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్ కోల్పోయింది. నాథన్ ఇల్లిస్ బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్ (15) ఔటయ్యాడు.6 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 64/2గా ఉంది. తిలక్ వర్మ (2), సూర్యకుమార్ యాదవ్ (19) క్రీజ్‌లో ఉన్నారు. టీమిండియా రెండో వికెట్ డౌన్..శుభ్‌మన్ గిల్ రూపంలో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. కేవలం 15 పరుగులు మాత్రమే చేసిన శుభ్‌మన్ గిల్.. నాథన్ ఎల్లీస్ బౌలింగ్‌లో వికెట్లు ముందు దొరికిపోయాడు. 6 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 63/2గా ఉంది. తిలక్ వర్మ (2), సూర్యకుమార్ యాదవ్ (19) క్రీజ్‌లో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన భారత్3.3 ఓవర్- 187 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ధాటిగా ఆడుతున్న అభిషేక్ శర్మ 16 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 25 పరుగులు చేసి నాథన్ ఇల్లిస్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 4 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 41/1గా ఉంది. శుభ్‌మన్ గిల్ (7), సూర్యకుమార్ యాదవ్ (7) క్రీజ్‌లో ఉన్నారు. దూకుడుగా ఆడుతున్న అభిషేక్187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ దూకుడుగా ఆడుతోంది. 3 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 30 పరుగులు చేసింది. క్రీజులో అభిషేక్ శర్మ(24), శుభ్‌మన్ గిల్(5) ఉన్నారు.భారత్ ముందు భారీ టార్గెట్హోబర్ట్ వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో టీ20లో ఆస్ట్రేలియా బ్యాటర్లు అదరగొట్టారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. టిమ్ డేవిడ్(38 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 74), మార్కస్ స్టోయినిష్(39 బంతుల్లో 8 ఫోర్లు,2 సిక్స్‌లతో 64) విధ్వసంకర హాఫ్ సెంచరీలతో మెరిశారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి రెండు, శివమ్ దూబే ఒక్క వికెట్ సాధించారు.ఐదో వికెట్ కోల్పోయిన ఆసీస్12.6వ ఓవర్- 118 పరుగుల వద్ద ఆసీస్ ఐదో వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న టిమ్ డేవిడ్ (74) శివమ్ దూబే బౌలింగ్‌లో తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 16 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 143/5గా ఉంది.వరుణ్ మ్యాజిక్.. వరుస బంతుల్లో వికెట్లువరుణ్ చక్రవర్తి తన స్పిన్ మాయాజాలాన్ని ప్రదర్శించాడు. ఇన్నింగ్స్ 9వ ఓవర్లో వరుస బంతుల్లో మిచెల్ మార్ష్ (11), మిచెల్ ఓవెన్‌ను (0) ఔట్ చేశాడు. 9 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 75/4గా ఉంది. స్టోయినిస్ (1), టిమ్ డేవిడ్ (55) క్రీజ్‌లో ఉన్నారు. ఓ పక్క వికెట్లు పడుతున్నా డేవిడ్ మెరుపు హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. డేవిడ్ 23 బంతుల్లోనే ఈ మార్కును తాకాడు. రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్.. 5 ఓవర్ల తర్వాత స్కోర్ ఎంతంటే..?టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. అర్షదీప్ సింగ్ తొలి ఓవర్లో, మూడో ఓవర్లో వికెట్లు తీశాడు. తొలుత ట్రవిస్ హెడ్ (6), ఆతర్వాత జోస్ ఇంగ్లిస్‌ను (1) పెవిలియన్‌కు పంపాడు. 5 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 35/2గా ఉంది. టిమ్ డేవిడ్ (20), మిచ్ మార్ష్ (7) క్రీజ్‌లో ఉన్నారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్హోబర్ట్ వేదికగా ఇవాళ (నవంబర్ 2) భారత్, ఆస్ట్రేలియా తలపడుతున్నాయి. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ మూడు మార్పులు చేసింది. జితేశ్ శర్మ, అర్షదీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్ తుది జట్టులోకి వచ్చారు. ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌లో ఓ మార్పుతో బరిలోకి దిగింది. హాజిల్‌వుడ్ స్థానంలో సీన్ అబాట్ తుది జట్టులోకి వచ్చాడు.ఆస్ట్రేలియా: మిచెల్ మార్ష్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్‌కీపర్), టిమ్ డేవిడ్, మిచెల్ ఓవెన్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ షార్ట్, సీన్ అబాట్, జేవియర్ బార్ట్లెట్, నాథన్ ఎల్లిస్, మాథ్యూ కుహ్నెమాన్భారత్: శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, జితేష్ శర్మ (వికెట్‌కీపర్), శివం దుబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రాచదవండి: IND vs SA: వారెవ్వా అన్షుల్!.. ఉత్కంఠ పోరులో సౌతాఫ్రికాను చిత్తు చేసిన భారత్ -
IND vs AUS: సమం చేసేందుకు సమరం
హోబర్ట్: ఆతిథ్య ఆ్రస్టేలియా ఆధిక్యానికి ఆదిలోనే గండికొట్టాలని, ఈ మ్యాచ్‌తోనే సిరీస్‌ను సమం చేయాలనే పట్టుదలతో భారత జట్టు బరిలోకి దిగుతోంది. మరోవైపు వన్డే సిరీస్‌లాగే పొట్టి ఫార్మాట్లోనూ వరుస మ్యాచ్‌లు గెలవాలనే లక్ష్యంతో కంగారూ సేన ఉంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య ఆదివారం జరిగే మూడో టి20 మ్యాచ్ హోరాహోరీగా జరగడం ఖాయం. ప్రధానంగా భారత టీమ్ మేనేజ్మెంట్ బ్యాటింగ్ లోపాలపైనే దృష్టిపెట్టింది. ఈ పర్యటన ఆరంభం నుంచే టెస్టు, వన్డే కెప్టెన్ శుబ్‌మన్ గిల్ తన లయను ఇప్పటికీ అందుకోలేకపోతున్నాడు. రద్దయిన తొలి టి20లో 30 పైచిలుకు పరుగులైతే చేశాడు కానీ... ఫలితం తేలిన నాలుగు మ్యాచ్‌ల్లో (మూడు వన్డేలు, రెండో టి20 కలిపి) గిల్ ఆట తీవ్రంగా నిరాశపరిచింది. గత పోరుతో పరుగుల జోరును అందుకున్న అభిషేక్‌తో పాటు గిల్, సంజూ సామ్సన్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, తెలుగుతేజం ఠాకూర్ తిలక్‌వర్మ మూకుమ్మడిగా మెరుపులు మెరిపిస్తే ఆసీస్‌ను 20 ఓవర్ల మ్యాచ్‌లో ఓడించడం ఏమంత కష్టమేకాదు. వన్డే సిరీస్‌ను కోల్పోయిన టీమిండియా ఈ సిరీస్‌లో నిలవాలంటే ఈ మ్యాచ్ తప్పకుండా గెలవాల్సిందే. లేదంటే సూర్య సేన ఒత్తిడిలోకి కూరుకుపోతుంది. మరోవైపు ఆతిథ్య జట్టు వరుసగా ఈ మ్యాచ్ గెలవడం ద్వారా ఇక సిరీస్‌ను కోల్పోలేని పటిష్టస్థితిలో నిలవాలని చూస్తోంది. బ్యాటింగ్‌లో కెప్టెన్ మార్ష్, ట్రవిస్ హెడ్, ఇన్‌గ్లిస్ ఫామ్‌లో ఉన్నారు. బౌన్సీ పిచ్‌లపై నిప్పులు చెరిగే బార్ట్లెట్, ఎలిస్, స్టొయినిస్‌లు టీమిండియా ప్రధాన బ్యాటర్లను ఆదిలోనే పడేయాలని ఆశిస్తున్నారు. -
‘ఆస్ట్రేలియా స్కోరు చూసి భయపడలేదు’
ముంబై: ప్రపంచ కప్ సెమీఫైనల్ మ్యాచ్‌లో ఆ్రస్టేలియా నిర్దేశించిన లక్ష్యాన్ని చూసి తాము ఏ దశలోనూ భయపడలేదని, సాధించగలమనే నమ్మకంతోనే బరిలోకి దిగామని భారత బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ వెల్లడించింది. ఈ పోరులో 134 బంతుల్లో 127 పరుగుల అసాధారణ ఇన్నింగ్స్‌తో జెమీమా మన జట్టును గెలిపించింది. ‘ఆ్రస్టేలియా జట్టు ఇన్నింగ్స్ ప్రారంభమైన తీరు, చివరకు వారు సాధించిన స్కోరును చూస్తే కనీసం 30 పరుగులు తక్కువగా చేశారని చెప్పగలను. డీవై పాటిల్ స్టేడియం పిచ్‌పై ఎలాంటి లక్ష్యమైనా ఛేదించవచ్చని మాకు బాగా తెలుసు. కొద్ది సేపు క్రీజ్‌లో ఉండి నిలదొక్కుకుంటే పరుగులు వాటంతట అవే వస్తాయని కూడా మాకు ఇక్కడ ఉన్న అనుభవం చెబుతుంది. అందుకే ముందు పట్టుదలగా నిలబడటంపైనే దృష్టి పెట్టాను’ అని జెమీమా వ్యాఖ్యానించింది. తాను, హర్మన్ కలిసి మ్యాచ్‌ను ముగించాలని గట్టిగా అనుకున్నామని...అయితే హర్మన్ అవుట్‌తో తన బాధ్యత మరింత పెరిగిందని ఆమె పేర్కొంది. ‘ఒక దశలో నేను బాగా అలసిపోయి ఏకాగ్రత కోల్పోతూ వచ్చాను. అయితే హర్మన్ అవుట్ కావడంతో మళ్లీ పరిస్థితి మారిపోయింది. ఇది ఒక రకంగా నాకు మేలు చేసింది. ఆమె పరుగులు కూడా నేను చేయాల్సి ఉందని అనిపించింది. దాంతో మళ్లీ సరైన స్థితికి వచ్చి జాగ్రత్తగా బ్యాటింగ్ చేశాను’ అని జెమీమా చెప్పింది. -
పైచేయి ఎవరిదో!
మెల్బోర్న్: తొలి టి20 మ్యాచ్ వర్షంతో రద్దయిన తర్వాత భారత్, ఆ్రస్టేలియా తర్వాతి పోరుకు సిద్ధమయ్యాయి. నేడు ఎంసీజీలో జరిగే రెండో టి20లో ఇరు జట్లు తలపడతాయి. గత మ్యాచ్‌లో ఫలితం రాకపోయినా... ఆట ముగిసేసరికి టీమిండియా మెరుగైన స్థితిలో నిలిచింది. ఈ నేపథ్యంలో అదే జోరును కొనసాగించాలని భారత్ పట్టుదలగా ఉంది. మరోవైపు ఆసీస్ కూడా సొంతగడ్డపై విజయంతో ఆధిక్యంలో నిలవాలని భావిస్తోంది. భారత జట్టు ఎంసీజీలో తాము ఆడిన ఆరు టి20ల్లో నాలుగు గెలిచింది. మ్యాచ్‌కు వర్షసూచన ఉంది. మార్పుల్లేకుండా... కాన్బెర్రా మ్యాచ్‌లో ఇరు జట్లకు కూడా తమ ఆటగాళ్లను పెద్దగా పరీక్షించే అవకాశం రాలేదు. దాంతో తుది జట్టులో ఎలాంటి మార్పూ లేకుండా టీమ్‌లు బరిలోకి దిగడం ఖాయం. దూకుడుకు మారుపేరైన అభిõÙక్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇచ్చేందుకు ఇది మరో అవకాశం. గిల్, సూర్య కూడా చక్కటి షాట్లతో ఆకట్టుకున్నారు. తిలక్ వర్మ, సామ్సన్, దూబేలతో భారత బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. సీనియర్ బుమ్రాతో పాటు హర్షిత్ పేస్ బౌలింగ్ బాధ్యతలు తీసుకుంటాడు. కుల్దీప్, వరుణ్‌ల స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడం ఆసీస్ బ్యాటర్లకు అంత సులువు కాదు. మరోవైపు ఆసీస్ బృందంలోనూ హిట్టర్లకు కొదవ లేదు. కెప్టెన్ మార్ష్, హెడ్, టిమ్ డేవిడ్, స్టొయినిస్ ఒంటి చేత్తో మ్యాచ్‌ను శాసించగల బ్యాటర్లు. ఇన్‌గ్లిస్, ఒవెన్, ఫిలిప్ రూపంలో దూకుడుగా ఆడగల ఇతర ఆటగాళ్లూ ఉన్నారు. భారీ స్కోరు సాధించేందుకు, భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు కావాల్సిన బృందం ఆసీస్ వద్ద ఉంది. -
అదే జరిగితే టీమిండియా కొంప కొల్లేరే..!
మహిళల వన్డే ప్రపంచకప్‌లో (Women's CWC 2025) ఇవాళ (అక్టోబర్ 30) భారత్, ఆస్ట్రేలియా (India vs Australia) జట్ల మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరుగనుంది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరిగే ఈ నాకౌట్ సమరం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియాను వరుణుడు పరీక్షించబోతున్నాడు.ఈ మ్యాచ్‌కు వాతావరణం అడ్డంకిగా మారే అవకాశం ఉంది. AccuWeather నివేదిక ప్రకారం, DY పాటిల్ స్టేడియం పరిసరాల్లో ఇవాళ ఉదయం ఆకాశం 93 శాతం మేఘావృతంగా ఉంటుంది. 25 శాతం వర్షం కురిసే అవకాశం ఉంది.మ్యాచ్ సమయానికి పరిస్థితులు మెరుగవుతాయన్న అంచనా ఉన్నా, నవీ ముంబైలో వాతావరణ పరిస్థితులను నమ్మడానికి వీల్లేదు. ఈనెల 28న ఇక్కడ జరగాల్సిన భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్ భారీ వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేటి మ్యాచ్‌ను కూడా వర్షం ముంచేస్తుందేమోనని భారత క్రికెట్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.మ్యాచ్ పూర్తిగా రద్దైతే..?ఒకవేళ నేటి మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా రద్దైనా రిజర్వ్ డే (అక్టోబర్ 31) ఉంది. ఇవాళ కొంత మ్యాచ్ జరిగి ఆగిపోయినా, ఇదే స్థితి నుంచి రిజ్వర్ డేలో కొనసాగుతుంది. ఒకవేళ రిజర్వ్ డేలో కూడా మ్యాచ్ సాధ్యపడకపోతే మాత్రం టీమిండియా కొంప కొల్లేరవుతుంది. గ్రూప్ దశలో భారత్ కంటే ఎక్కువ పాయింట్లు ఉండటం చేత ఆస్ట్రేలియా ఫైనల్‌కు చేరుకుంటుంది. గ్రూప్ దశలో ఆసీస్ 7 మ్యాచ్‌ల్లో ఓటమెరుగని జట్టుగా 13 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో ఉంది. భారత్ 7 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో 7 పాయింట్లు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది.ఇదిలా ఉంటే, నిన్న (అక్టోబర్ 29) జరిగిన తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా ఇంగ్లండ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ (169) రికార్డు శతకంతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 319 పరుగుల భారీ స్కోర్ చేసింది.అనంతరం లక్ష్య ఛేదనలో మారిజన్ కాప్ (7-3-20-5) చెలరేగడంతో ఇంగ్లండ్ 42.3 ఓవర్లలో 194 పరుగులకే ఆలౌటై 125 పరుగుల భారీ తేడాతో పరాజయంపాలైంది.చదవండి: పెను విషాదం.. ఆస్ట్రేలియా యువ క్రికెటర్ మృతి -
పెను విషాదం.. ఆస్ట్రేలియా యువ క్రికెటర్ మృతి
క్రికెట్ మైదానంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బంతి తగిలి 17 ఏళ్ల ఆస్ట్రేలియా (Australia) యువ క్రికెటర్ బెన్ ఆస్టిన్ (Ben Austin) మృత్యువాత పడ్డాడు. ప్రీ మ్యాచ్ ప్రాక్టీస్ సందర్భంగా ఈ విషాదం చోటు చేసుకుంది.మెల్బోర్న్లోని ఫెర్న్ట్రీ గల్లీ క్రికెట్ క్లబ్‌కు ప్రాతినిథ్యం వహించే బెన్.. అక్టోబర్ 29న ఓ టీ20 మ్యాచ్ ఆడాల్సి ఉంది. బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా బౌలర్ సంధించిన ఓ బంతి బెన్ ఛాతీపై బలంగా తాకింది. దీంతో బెన్ స్పృహ తప్పి పడిపోయాడు.హుటాహుటిన సమీపంలోని అసుపత్రికి తరలించగా.. రెండు రోజుల చికిత్స అనంతరం బెన్ నిన్న తుదిశ్వాస విడిచాడు. అప్పటివరకు తమతో ప్రాక్టీస్ చేసిన బెన్ ఇక లేడని తెలిసి సహచరులు కన్నీరుమున్నీరయ్యారు. బెన్ తల్లిదండ్రులు గుండె పగిలేలా రోధించారు. బెన్ మరణవార్త యావత్ క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. క్రికెట్ ఆస్ట్రేలియా బెన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. పాపులర్, లవబుల్, గ్రేట్ యంగ్ పర్సన్‌ను కోల్పోయామని ఫెర్న్ట్రీ గల్లీ క్రికెట్ క్లబ్ శోకం వ్యక్తం చేసింది.బెన్ ఉదంతం ఆస్ట్రేలియా యువ క్రికెటర్ ఫిల్ హ్యూస్‌ను (Phil Hughes) గుర్తు చేసింది. హ్యూస్ కూడా 2014లో బెన్ తరహాలోనే మృత్యువాత పడ్డాడు. ఓ దేశవాలీ మ్యాచ్ ఆడుతుండగా ఓ రాకాసి బౌన్సర్ హ్యూస్ తల వెనుక భాగంలో బలంగా తాకింది. అక్కడిక్కడే కుప్పకూలిపోయిన హ్యూస్ రెండు రోజుల పాటు మృత్యువుతో పోరాడి తుదిశ్వాస విడిచాడు. ఈ విషాదం ప్రతిష్టాత్మక సిడ్నీ మైదానంలో జరిగింది. చదవండి: పంత్ రీఎంట్రీ.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్ -
World Cup 2025: భారత్ సత్తాకు పరీక్ష
నవీ ముంబై: సొంతగడ్డపై జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు కీలక సమరానికి సిద్ధమైంది. లీగ్ దశలో పడుతూ లేస్తూ సాగిన టీమిండియా... నేడు జరిగే రెండో సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ఆ్రస్టేలియాతో పోరుకు సిద్ధమైంది. ఇప్పటి వరకు నాలుగుసార్లు సెమీఫైనల్ ఆడిన టీమిండియా అందులో రెండుసార్లు గెలిచి ఫైనల్లో పరాజయం పాలైంది. చివరిసారిగా 2017లో ఆ్రస్టేలియాతో జరిగిన సెమీఫైనల్లో హర్మన్‌ప్రీత్ కౌర్ సుడిగాలి ఇన్నింగ్స్‌తో విజయం సాధించిన టీమిండియా... ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇటీవలి కాలంలో ఆ్రస్టేలియాకు గట్టి పోటీనిస్తున్న హర్మన్‌ప్రీత్ బృందం ఈ మ్యాచ్‌లోనూ సమష్టిగా సత్తా చాటి తొలి టైటిల్ కరువు తీర్చుకోవాలని భావిస్తోంది. స్మృతి, హర్మన్‌లపైనే భారం 2017 ప్రపంచకప్ సెమీఫైనల్లో టీమిండియా చేతిలో ఓడిన తర్వాత ఆ్రస్టేలియా జట్టుకు ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌ల్లో పరాజయం ఎదురవ్వలేదు. లీగ్ దశలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ భారీ స్కోరు చేసినా ... బౌలర్లు విఫలమవడంతో దాన్ని కాపాడుకోవడంలో విఫలమైంది. ఆసీస్‌తో ఆడిన గత ఐదు మ్యాచ్‌ల్లో స్మృతి మంధాన వరుసగా 105, 58, 117, 125, 80 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌కు కూడా ఆసీస్‌పై మంచి రికార్డే ఉంది. వీరిద్దరూ చెలరేగాలని అభిమానులు ఆశిస్తున్నారు. గాయం కారణంగా మరో ఓపెనర్ ప్రతీకా రావల్ వరల్డ్‌కప్‌నకు దూరం కావడంతో ఈ మ్యాచ్‌లో స్మృతితో కలిసి షఫాలీ వర్మ ఇన్నింగ్స్ ఆరంభించనుంది. హర్లీన్æ, జెమీమా, రిచా ఘోష్, దీప్తి శర్మ కూడా రాణిస్తే టీమిండియాకు తిరుగుండదు. బౌలింగ్‌లో రేణుక, శ్రీచరణి, క్రాంతి గౌడ్, స్నేహ్ రాణా కీలకం కానున్నారు. మరోవైపు అలీసా హీలీ, ఎలీస్ పెర్రీ, సదర్లాండ్, బెత్ మూనీ, యాష్లే గార్డ్‌నర్‌లతో ఆసీస్ బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. మేగన్ షుట్, అలానా కింగ్ బౌలింగ్ భారం మోయనున్నారు. సెమీఫైనల్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. వరుణుడి కారణంగా మ్యాచ్ సాగకపోతే శుక్రవారం ‘రిజర్వ్ డే’ ఉంది. అందులోనూ ఆట సాధ్యం కాకపోతే పాయింట్ల పట్టికలో మెరుగ్గా ఉన్న జట్టు (ఆస్ట్రేలియా) ఫైనల్‌కు చేరుతుంది. 11భారత్, ఆ్రస్టేలియా జట్ల మధ్య ఇప్పటి వరకు 60 మ్యాచ్‌లు జరిగాయి. 11 మ్యాచ్‌ల్లో భారత్ గెలిచి, 49 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఇక వన్డే ప్రపంచకప్‌లో ఈ రెండు జట్లు 14 సార్లు తలపడ్డాయి. 3 సార్లు భారత్ గెలిచి, 11 సార్లు పరాజయం పాలైంది. -
శతక్కొట్టిన స్టీవ్ స్మిత్
యాషెస్ సిరీస్‌కు (Ashes Series 2025-26) ముందు ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ (Steve Smith) సింహ గర్జన చేశాడు. షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో భాగంగా క్వీన్స్‌లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సెంచరీతో సత్తా చాటాడు. న్యూ సౌత్ వేల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న స్మిత్.. 158 బంతుల్లో 16 ఫోర్లు, సిక్సర్ సాయంతో మూడంకెల మార్కును చేరాడు.ఈ సెంచరీతో యాషెస్ తొలి టెస్ట్‌కు ముందు ప్రత్యర్ది ఇంగ్లండ్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ మెసేజ్ పంపాడు. ఐదు మ్యాచ్‌ల యాషెస్ సిరీస్‌లో తొలి టెస్ట్ పెర్త్ వేదికగా నవంబర్ 21 నుంచి ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో స్మిత్ ఆసీస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ ఫిట్‌గా లేకపోవడంతో క్రికెట్ ఆస్ట్రేలియా స్మిత్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పింది.తొలి టెస్ట్ కోసం ఆసీస్ జట్టును ప్రకటించాల్సి ఉంది. 2018లో సాండ్‌పేపర్ వివాదం తర్వాత స్మిత్ కెప్టెన్సీ కోల్పోయాడు. అప్పటి నుంచి వైస్ కెప్టెన్‌గా కొనసాగుతూ ఆరు టెస్టుల్లో తాత్కాలిక నాయకత్వం వహించాడు. సాధారణ ఆటగాడిగా కంటే కెప్టెన్‌గా స్మిత్ బ్యాటింగ్ రికార్డు అద్భుతంగా ఉంది. సాధారణ ఆటగాడిగా అతని సగటు 49.9గా ఉంటే, కెప్టెన్‌గా అది 68.98గా ఉంది.మ్యాచ్ విషయానికొస్తే.. క్వీన్స్‌లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న న్యూ సౌత్ వేల్స్ రెండో రోజు మూడో సెషన్ సమయానికి 2 వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్‌తో పాటు కర్టిస్ ప్యాటర్సన్ (112) సెంచరీ పూర్తి చేసుకొని బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నారు. న్యూ సౌత్ వేల్స్కే ఆడే ఆసీస్ యువ ఓపెనర్ సామ్ కొన్‌స్టాస్ 10 పరుగులకే ఔటై నిరాశపరిచాడు.చదవండి: బట్లర్ మరో ఆడుగు ముందుకు..! -
IND Vs AUS: బోణీ ఎవరిదో?
కాన్బెర్రా: వచ్చే ఏడాది జరగనున్న టి20 ప్రపంచకప్ సన్నాహాల్లో భాగంగా... భారత జట్టు కీలక సిరీస్‌కు సిద్ధమైంది. ఆ్రస్టేలియా పర్యటనలో భాగంగా వన్డే సిరీస్ కోల్పోయిన టీమిండియా... నేటి నుంచి ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్ ఆడనుంది. ఇటీవల టి20 ఫార్మాట్లో జరిగిన ఆసియా కప్‌లో అద్వితీయమైన ప్రదర్శన కనబర్చిన సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు... ఆసీస్‌పై కూడా అదే జోరు కనబర్చాలని చూస్తోంది. మరోవైపు సొంతగడ్డపై భారత హిట్టర్లను అడ్డుకునేందుకు బౌన్సీ పిచ్‌లతో ఆ్రస్టేలియా సిద్ధమైంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టి20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న టీమిండియా... రెండో ‘ప్లేస్’లో ఉన్న ఆ్రస్టేలియా మధ్య రసవత్తర పోరు ఖాయమే. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భారత్, శ్రీలంక వేదికగా టి20 వరల్డ్‌కప్ జరగనుండగా... దానికి ముందు టీమిండియా మరో 15 టి20లు మాత్రమే ఆడనుంది. దీంతో మెగా టోర్నీ సన్నాహాల్లో ఈ సిరీస్ కీలకం కానుంది.గతేడాది టి20 ప్రపంచకప్ సాధించాక టీమిండియా ఈ ఫార్మాట్లో కేవలం 3 మ్యాచ్‌ల్లోనే ఓడింది. బ్యాటింగ్ లైనప్ హిట్టర్లతో పటిష్టంగా ఉండగా... వన్డే సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్న స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా రాకతో బౌలింగ్ మరింత పదును పెరిగింది. మరోవైపు ఆస్ట్రేలియా గత 20 టి20ల్లో కేవలం రెండింట్లోనే ఓడింది. మరి సమ ఉజ్జీల సమరంలో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి! కెప్టెన్ సూర్యపైనే దృష్టి! ఆసియా కప్‌లో బ్యాటర్లు దంచికొట్టడం... స్పిన్నర్లు తిప్పేయడంతో ఏమాత్రం పోటీ లేకుండానే భారత జట్టు ట్రోఫీ చేజిక్కించుకుంది. ఆడిన అన్నీ మ్యాచ్‌ల్లోనూ పూర్తి ఆధిపత్యంతో విజయాలు సాధించింది. అయితే ఆ్రస్టేలియా పర్యటనలో మాత్రం తొలి మ్యాచ్ నుంచే గట్టి పోటీ తప్పకపోవచ్చు. ఆసియా కప్‌లో పరుగుల వరద పారించిన ఓపెనర్ అభిషేక్ శర్మపై జట్టు గంపెడాశలు పెట్టుకుంది. అభిషేక్‌తో కలిసి గిల్ ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, సంజూ సామ్సన్, రింకూ సింగ్‌తో మిడిలార్డర్ బలంగా ఉంది. అయితే గత కొంతకాలంగా సూర్యకుమార్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక పోతున్నాడు. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా అక్షర్‌కు చోటు ఖాయం కాగా... శివమ్ దూబే, హర్షిత్ రాణాలో ఒకరికి చోటు దక్కనుంది. బుమ్రాతో కలిసి అర్ష్ దీప్ పేస్ బాధ్యతలు పంచుకోనుండగా.. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా వరుణ్ చక్ర వర్తి, కుల్దీప్లలో ఒకరికి చోటు దక్కనుంది. సమతూకంగా... గత వరల్డ్‌కప్‌లో భారత్ చేతిలో పరాజయంతో టోర్నీ నుంచి వైదొలిగిన ఆ్రస్టేలియా ఇప్పుడు సొంతగడ్డపై టీమిండియాతో పోరులో సమష్టిగా మెరిపించాలని భావిస్తోంది. ఓపెనర్లు మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్ ఆ జట్టుకు ప్రధాన బలం. ఇన్‌గ్లిస్, టిమ్ డేవిడ్, జోష్ ఫిలిప్, మిచ్ ఓవెన్‌తో ఆ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగా ఉంది. పేస్ ఆల్‌రౌండర్ స్టొయినిస్ భారీ షాట్లు కొట్టడంలో సిద్ధహస్తుడు. ఇక బౌలింగ్‌లో హాజల్‌వుడ్ నుంచి టీమిండియాకు ప్రధాన ముప్పు పొంచి ఉంది. వచ్చే ఏడాది భారత్‌లో వరల్డ్‌కప్ జరగనున్న నేపథ్యంలో కునేమన్‌ను పరీక్షించేందుకు ఇంతకుమించిన సమయం రాకపోవచ్చు. ఇటీవల ముగిసిన వన్డే సిరీస్‌కు పెద్ద ఎత్తున ప్రేక్షకులు తరలిరాగా... ఇప్పుడు టి20 సిరీస్ కూడా ‘హౌస్ ఫుల్’ కావడం ఖాయమే. భారీ జనసందోహం ముందు ఆడటం బాగుంటుందని మార్ష్ అన్నాడు. పిచ్, వాతావరణం బిగ్‌బాష్ లీగ్‌లో భాగంగా ఇక్కడ జరిగిన మ్యాచ్‌ల్లో స్వల్ప స్కోర్లు నమోదయ్యాయి. బౌండరీ పెద్దది కాగా... స్పిన్నర్లు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. బుధవారం ఇక్కడ తేలికపాటి వర్ష సూచన ఉంది. అయితే అది మ్యాచ్‌కు పెద్దగా ఆటంకం కలిగించకపోవచ్చు. 7 ఆస్ట్రేలియా గడ్డపై ఆ్రస్టేలియాతో భారత్ ఇప్పటి వరకు 12 టి20లు ఆడింది. ఇందులో 7 మ్యాచ్‌ల్లో గెలిచి, 4 మ్యాచ్‌ల్లో ఓడింది. ఒక మ్యాచ్ రద్దయింది. 2 భారత్, ఆ్రస్టేలియా జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్ జరగనుండటం ఇది రెండోసారి. 2023లో భారత్ వేదికగా జరిగిన ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను టీమిండియా 4–1తో గెలిచింది. తుది జట్లు (అంచనా) భారత్: సూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్, గిల్, తిలక్, సామ్సన్, రింకూ సింగ్, అక్షర్, శివమ్ దూబే/హర్షిత్ రాణా, కుల్దీప్/వరుణ్, అర్ష్ దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా. ఆ్రస్టేలియా: మార్ష్ (కెప్టెన్), హెడ్, ఇన్‌గ్లిస్, టిమ్ డేవిడ్, ఫిలిప్, మిచ్ ఓవెన్, స్టొయినిస్, సీన్ అబాట్/జేవియర్, ఎలీస్, కునేమన్, హజల్‌వుడ్. -
కొత్త రూల్: 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా నిషేధం!
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, స్నాప్‌చాట్, టిక్‌టాక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు.. 16 ఏళ్లలోపు వినియోగదారులను తొలగించాలని ఆస్ట్రేలియా పార్లమెంట్ ఆమోదించింది. ఈ నిబంధనలను పాటించకపోయితే.. టెక్ కంపెనీలకు భారీ జరిమానా విధించనున్నట్లు స్పష్టం చేసింది. దీని కోసం 2025 డిసెంబర్ 10 వరకు గడువు ఇచ్చింది.ఆస్ట్రేలియా పార్లమెంట్ విధించిన.. అండర్-16 సోషల్ మీడియా నిషేధాన్ని పాటించడానికి తాము (మెటా, టిక్‌టాక్ & స్నాప్‌చాట్) సిద్ధమని ప్రకటించాయి.చట్టానికి మేము కట్టుబడి ఉన్నప్పటికీ.. దీనిని అమలు చేయడం కష్టమని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ దిగ్గజాలు వెల్లడించాయి. అయితే.. ఇలాంటి చట్టాన్ని విధించడం పట్ల ఆందోళన కూడా వ్యక్తం చేశాయి. డిసెంబర్ 10 నాటికి 16 ఏళ్లలోపు లక్షలాది మంది వినియోగదారులను గుర్తించడం.. వారిని తొలగించడం అనేది చాలా పెద్ద సవాలు. దీనిని పరిష్కరించడం అంత సులభం కాదని మెటా పాలసీ డైరెక్టర్ మియా గార్లిక్ అన్నారు.వయసుకు సంబంధించిన సోషల్ మీడియా నిషేధం అనేది తీవ్ర పరిణామాలకు దారితీసే అవకాశం ఉందని టిక్‌టాక్ ఆస్ట్రేలియా పాలసీ లీడ్ ఎల్లా వుడ్స్ జాయిస్ పేర్కొన్నారు. ఆస్ట్రేలియా పార్లమెంట్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని.. అస్పష్టం, సమస్యాత్మకం, తొందరపాటు చర్యగా టెక్ కంపెనీలు విమర్శించాయి. 16 ఏళ్లలోపు వారిపై సోషల్ మీడియా నిషేధం విధించడం అనేది.. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన నిషేధాలలో ఒకటిగా పరిగణించబడుతుందని అన్నాయి.ఇదీ చదవండి: ఇంటర్నేషనల్ నంబర్లతో యూపీఐ చెల్లింపులు -
Shreyas Iyer: ఐసీయూ నుంచి బయటకు!
సిడ్నీ: భారత క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ గాయం తీవ్రత ఊహించిన దానికంటే ఎక్కువగా తేలింది. ఆ్రస్టేలియాతో జరిగిన మూడో వన్డేలో అలెక్స్ కేరీ క్యాచ్ పట్టే ప్రయత్నంలో శ్రేయస్ పక్కటెముకలకు గాయమైంది. వెంటనే మైదానం వీడిన అతడికి ముందు జాగ్రత్తగా వైద్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షల అనంతరం అతడి పక్కటెముకల లోపలి భాగంలో రక్త స్రావం జరిగినట్లు నిర్ధారణ అయింది. వైద్య పరిభాషలో ‘స్పీన్ లేసరేషన్’గా వ్యవహరించే ఈ ప్రమాదంతో ప్రాణాలకే అపాయం కలిగే అవకాశం ఉంది. దాంతో వెంటనే శ్రేయస్‌ను స్థానిక ఆస్పత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో ఉంచి చికిత్స నిర్వహించారు. అతని ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. శ్రేయస్ చికిత్సను పర్యవేక్షిస్తూ స్థానిక వైద్యులకు సహకరించేందుకు భారత టీమ్ డాక్టర్ రిజ్వాన్ ఖాన్‌ను సిడ్నీలోనే ఉంచినట్లు బీసీసీఐ వెల్లడించింది. ఎప్పటికప్పుడు శ్రేయస్ ఆరోగ్యంపై సమీక్ష నిర్వహిస్తామని బోర్డు వెల్లడించింది. కనీసం వారం రోజుల పాటు అతను సిడ్నీలోనే ఉండే అవకాశం ఉంది. తమ కొడుకు వద్దకు వెళ్లేందుకు శ్రేయస్ తల్లిదండ్రులు అత్యవసర వీసా కోసం ప్రయతి్నస్తున్నట్లు తెలిసింది. మరోవైపు బోర్డు నుంచి అధికారిక ప్రకటన లేకపోయినా... శ్రేయస్ పరిస్థితి కాస్త మెరుగుపడటంతో ప్రస్తుతం ఐసీయూ నుంచి బయటకు తీసుకువచ్చినట్లు సమాచారం. -
Shreyas Iyer: పరిస్థితి సీరియస్?.. సిడ్నీకి పయనమైన తల్లిదండ్రులు!
టీమిండియా వన్డే వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) ఆరోగ్యం గురించి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆస్ట్రేలియాతో మూడో వన్డే సందర్భంగా గాయపడిన ఈ ముంబై బ్యాటర్ ప్రస్తుతం ఇంటెన్సిక్ కేర్ యూనిట్ (ICU)లో చికిత్స పొందుతున్నాడు.గాయం మూలంగా శ్రేయస్ అయ్యర్‌కు అంతర్గత రక్తస్రావం జరిగినట్లు గుర్తించిన వైద్యులు సిడ్నీ ఆస్పత్రిలో అతడికి చికిత్స అందిస్తున్నారు. టీమిండియా డాక్టర్ కూడా సిడ్నీలోనే ఉండి.. స్థానిక వైద్యులతో కలిసి ఎప్పటికప్పుడు శ్రేయస్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.వేగంగా కోలుకుంటున్నాడు!ఈ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్ ఆరోగ్య పరిస్థితిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) స్పందించింది. క్యాచ్ అందుకునే క్రమంలో అతడి పక్కటెముకల్లో (ఎడమ) గాయం అయిందని.. స్ల్పీన్ (ప్లీహం) ఇంజూరీ అయిందని తెలిపింది. ప్రస్తుతం శ్రేయస్ వేగంగా కోలుకుంటున్నాడని.. అతడి ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది.సిడ్నీకి పయనమైన తల్లిదండ్రులు!దీంతో, శ్రేయస్ అయ్యర్ అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే, తాజా సమాచారం మాత్రం వారిని మరోసారి ఆందోళనలోకి నెట్టింది. ఈ టీమిండియా స్టార్ కుటుంబ సన్నిహిత వర్గాలు ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. శ్రేయస్ గాయం తీవ్రత దృష్ట్యా అతడి తల్లిదండ్రులు వెంటనే సిడ్నీకి పయనం కానున్నట్లు తెలిపాయి. ఇందుకోసం అర్జెంట్ వీసా కోసం దరఖాస్తు చేసినట్లు వెల్లడించాయి. తమ కుమారుడి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా వెంటనే వీసా మంజూరు చేయాల్సిందిగా సంబంధిత అధికారులకు శ్రేయస్ తల్లిదండ్రులు విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నాయి.అభిమానుల్లో సందేహాలుఈ నేపథ్యంలో మరోసారి శ్రేయస్ అయ్యర్ ఆరోగ్య పరిస్థితిపై అభిమానుల్లో సందేహాలు నెలకొన్నాయి. కాగా మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియాకు వెళ్లింది. ఇందులో భాగంగా తొలుత వన్డే సిరీస్ జరుగగా.. తొలి రెండు మ్యాచ్‌లు గెలిచిన ఆస్ట్రేలియా సిరీస్ సొంతం చేసుకుంది.ఈ క్రమంలో భారత్- ఆస్ట్రేలియా మధ్య సిడ్నీలో శనివారం నామమాత్రపు మూడో వన్డే జరిగింది. ఇందులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేయగా.. 34వ ఓవర్లో హర్షిత్ రాణా బంతితో రంగంలోకి దిగాడు.అప్పటికి క్రీజులో ఉన్న ఆసీస్ వికెట్ కీపర్ బ్యాటర్ అలెక్స్ క్యారీ మిడాఫ్/ఎక్స్ట్రా కవర్ దిశగా బంతిని గాల్లోకి లేపగా.. బ్యాక్వర్డ్ పాయింట్ నుంచి పరిగెత్తుకు వచ్చిన శ్రేయస్ డైవ్ కొట్టి మరీ సంచలన క్యాచ్ అందుకున్నాడు.Shreyas SUPERMAN Iyer! 💪Puts his body on the line for #TeamIndia and gets the much needed wicket. 🙌💙#AUSvIND 👉 3rd ODI | LIVE NOW 👉 https://t.co/0evPIuAfKW pic.twitter.com/LCXriNqYFy— Star Sports (@StarSportsIndia) October 25, 2025ఐసీయూలో ఉంచి చికిత్సఈ క్రమంలో శ్రేయస్ గాయపడ్డాడు. ఎడమవైపు పక్కటెముకల్లో నొప్పితో విలవిల్లాడుతూ మైదానంలో కుప్పకూలిపోయాడు. సహచర ఆటగాళ్లు, ఫిజియో వచ్చి పరిశీలించారు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో స్కానింగ్ కోసం సిడ్నీలోని ఆస్పత్రికి పంపగా అంతర్గత రక్తస్రావాన్ని గుర్తించిన వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. మరో ఏడు రోజుల పాటు అయ్యర్‌ను ఐసీయూలోనే ఉంచనున్నట్లు తెలుస్తోంది.కాగా చాన్నాళ్ల క్రితమే టీమిండియా టీ20 జట్టుకు దూరమైన శ్రేయస్ అయ్యర్.. ఇటీవలే టెస్టు క్రికెట్‌కు విరామం ప్రకటించాడు. వన్డేల్లో మాత్రం మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో రాణిస్తున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌కు ఆసీస్ టూర్ సందర్భంగా వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్ ఇచ్చింది బీసీసీఐ. కానీ ఈ గాయం కారణంగా అతడు చాన్నాళ్లపాటు జట్టుకు దూరమయ్యే పరిస్థితుల తలెత్తాయి. ఇక మూడో వన్డేలో తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచిన టీమిండియా ఆసీస్ ఆధిక్యాన్ని 2-1కు తగ్గించింది. తద్వారా క్లీన్‌స్వీప్ గండం నుంచి గట్టెక్కింది.Update: Shreyas Iyer: ఐసీయూ నుంచి బయటకు! చదవండి: పృథ్వీ షా విధ్వంసకర శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ -
భారత్‌తో తొలి టీ20.. ఆస్ట్రేలియా జట్టులో కీలక మార్పు
టీమిండియాతో తొలి టీ20కి ముందు (India vs Australia) ఆస్ట్రేలియా జట్టులో కీలక మార్పు జరిగింది. వారి స్టార్ స్పిన్నర్, టీ20 లీడింగ్ వికెట్ టేకర్ ఆడమ్ జంపా (Adam Zampa) వ్యక్తిగత కారణాల చేత (రెండోసారి తండ్రి కాబోతున్నాడు) తొలి మ్యాచ్‌కు దూరమయ్యాడు. జంపా స్థానాన్ని మరో స్పిన్నర్ తన్వీర్ సంఘా (Tanveer Sangha) భర్తీ చేయనున్నాడు. సంఘా రెండేళ్ల తర్వాత టీ20 ఆడనున్నాడు. అతని చివరి మ్యాచ్ భారత్‌తోనే ఆడాడు. బెంగళూరు వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో తన కోటా 4 ఓవర్లలో 26 పరుగులిచ్చి రింకూ సింగ్ వికెట్ తీశాడు. సంఘా ఆస్ట్రేలియా తరఫున 4 వన్డేలు, 7 టీ20లు ఆడాడు. సంఘా జంపా స్థానంలో జట్టులోకి వచ్చినప్పటికీ.. ప్లేయింగ్ ఎలెవెన్‌లో ఉంటాడో లేదో చూడాలి. ఆసీస్‌కు ఇప్పటికే మాథ్యూ కుహ్నేమన్ రూపంలో మరో స్పిన్ బౌలింగ్ ఆప్షన్ ఉంది.ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా కాన్బెర్రా వేదికగా ఈ నెల 29న తొలి టీ20 జరుగనుంది. ఈ సిరీస్ కోసం ఆస్ట్రేలియా మూడు వేర్వేరు జట్లను ప్రకటించింది. తొలి రెండు మ్యాచ్‌లకు ఓ జట్టు.. మూడో టీ20కి ఓ జట్టు.. చివరి రెండు మ్యాచ్‌లకు మరో జట్టును ప్రకటించారు.తొలి రెండు టీ20లకు ఆస్ట్రేలియా జట్టు..మిచెల్ మార్ష్ (కెప్టెన్), టిమ్ డేవిడ్, మాథ్యూ షార్ట్, మిచెల్ ఓవెన్, ట్రవిస్ హెడ్, మార్కస్ స్టోయినిస్, జోష్ ఇంగ్లిస్, జోష్ ఫిలిప్, సీన్ అబాట్, జేవియర్ బార్ట్లెట్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఇల్లిస్, జోష్ హాజిల్‌వుడ్, మాథ్యూ కుహ్నేమన్, తన్వీర్ సంఘా (ఆడమ్ జంపా స్థానంలో తొలి టీ20కు మాత్రమే)మూడో టీ20కి ఆస్ట్రేలియా జట్టు..మిచెల్ మార్ష్ (కెప్టెన్), టిమ్ డేవిడ్, మాథ్యూ షార్ట్, మిచెల్ ఓవెన్, ట్రవిస్ హెడ్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మహ్లీ బియర్డ్‌మన్, జోష్ ఇంగ్లిస్, జోష్ ఫిలిప్, సీన్ అబాట్, జేవియర్ బార్ట్లెట్, నాథన్ ఇల్లిస్, మాథ్యూ కుహ్నేమన్, ఆడమ్ జంపాచివరి రెండు టీ20లకు ఆస్ట్రేలియా జట్టు..మిచెల్ మార్ష్ (కెప్టెన్), టిమ్ డేవిడ్, మాథ్యూ షార్ట్, మిచెల్ ఓవెన్, ట్రవిస్ హెడ్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మహ్లీ బియర్డ్‌మన్, జోష్ ఇంగ్లిస్, జోష్ ఫిలిప్, బెన్ డ్వార్షుయిస్, జేవియర్ బార్ట్లెట్, నాథన్ ఇల్లిస్, మాథ్యూ కుహ్నేమన్, ఆడమ్ జంపాభారత్ టీ20 జట్టు..సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, జితేశ్ శర్మ, సంజూ శాంసన్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణాటీ20 సిరీస్ షెడ్యూల్..తొలి టీ20- అక్టోబర్ 29 (కాన్బెర్రా)రెండో టీ20- అక్టోబర్ 31 (మెల్బోర్న్)మూడో టీ20- నవంబర్ 2 (హోబర్ట్)నాలుగో టీ20- నవంబర్ 6 (గోల్డ్ కోస్ట్)ఐదో టీ20- నవంబర్ 8 (బ్రిస్బేన్)చదవండి: పృథ్వీ షా విధ్వంసకర శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ -
IND vs AUS T20 Series: తొలి పంజా మనదే..!
టెస్ట్, వన్డే ఫార్మాట్లలో గుత్తాధిపత్యం చలాయించే ఆస్ట్రేలియా జట్టుకు పొట్టి క్రికెట్ బలహీనత ఉంది. ముఖ్యంగా టీమిండియా ఎదురైనప్పుడు ఆ బలహీనత మరింత ఎక్కువవుతుంది. 2007 నుంచి భారత్‌తో ఆడిన 32 మ్యాచ్‌ల్లో (India vs Australia) ఆసీస్ కేవలం 11 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయాలు సాధించింది.ద్వైపాక్షిక సిరీస్‌ల్లో అయితే ఆసీస్ ట్రాక్ రికార్డు మరింత చెత్తగా ఉంది. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 11 సిరీస్‌లు జరగ్గా, ఆసీస్ రెండింట మాత్రమే గెలుపొందింది. త్వరలో జరుగనున్న ఐదు మ్యాచ్‌ల సిరీస్ నేపథ్యంలో భారత్-ఆసీస్ మధ్య జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లపై ఓ లుక్కేద్దాం.తొలి పంజా మనదేభారత్, ఆసీస్ జట్ల మధ్య తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ 2007 అక్టోబర్ 20న జరిగింది. వన్ మ్యాచ్ సిరీస్‌లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, ఆసీస్‌పై తొలి పంజా విసిరింది. ముంబైలోని బ్రబోర్న్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ ఆల్‌రౌండ్ షోతో సత్తా చాటింది. బౌలింగ్‌లో ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్.. బ్యాటింగ్‌లో గౌతమ్ గంభీర్ (63), యువరాజ్ సింగ్ (31 నాటౌట్) రాణించారు.అనంతరం 2008 ఫిబ్రవరి 1న మెల్బోర్న్లో జరిగిన వన్ మ్యాచ్ సిరీస్‌లో (డే అండ్ నైట్) ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 74 పరుగులకే ఆలౌట్ కాగా.. ఆసీస్ మరో 52 బంతులు మిడిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది.గంభీర్ మరోసారి..!2012 ఫిబ్రవరిలో ఇరు జట్ల మధ్య తొలి మల్టీ మ్యాచ్ సిరీస్ జరిగింది. ఆస్ట్రేలియాలో జరిగిన ఈ సిరీస్ 1-1తో డ్రా అయ్యింది. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలుపొందగా.. రెండో మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. మెల్బోర్న్ వేదికగా జరిగిన రెండో టీ20లో గంభీర్ (56 నాటౌట్) టీమిండియాను గెలిపించాడు. యువీ విధ్వంసం2013 అక్టోబర్‌లో జరిగిన మరో వన్ మ్యాచ్ సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. రాజ్‌కోట్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఆసీస్‌ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. ఆరోన్ ఫించ్ (89) చెలరేగడంతో 201 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం యువరాజ్ సింగ్ (77 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి టీమిండియాను గెలిపించాడు.చెలరేగిన కోహ్లి.. వైట్వాష్మళ్లీ మూడేళ్ల తర్వాత (2016, జనవరి) భారత్, ఆసీస్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరిగింది. ఆస్ట్రేలియాలో జరిగిన ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 3-0తో వైట్‌వాష్ చేసింది. ఈ సిరీస్‌లో విరాట్ కోహ్లి చెలరేగిపోయాడు. మూడు మ్యాచ్‌ల్లో హాఫ్ సెంచరీలు (90 నాటౌట్, 59 నాటౌట్, 59) బాది టీమిండియా గెలుపులో ప్రధానపాత్ర పోషించాడు. రోహిత్ శర్మ కూడా రెండు అర్ద సెంచరీలతో రాణించాడు.రాణించిన శిఖర్అనంతరం 2017 అక్టోబర్‌లో జరిగిన 3 మ్యాచ్‌ల సిరీస్ (భారత్), 2018 నవంబర్‌లో జరిగిన 3 మ్యాచ్‌ల సిరీస్‌లు (ఆస్ట్రేలియా) 1-1తో డ్రా అయ్యాయి. ఆస్ట్రేలియాలో జరిగిన సిరీస్‌లో శిఖర్ ధవన్, విరాట్ కోహ్లి సత్తా చాటారు. ఈ సిరీస్‌లోని చివరి మ్యాచ్‌లో కృనాల్ పాండ్యా (4-0-36-4) అదరగొట్టాడు.తొలి పరాభవం2019లో ఆస్ట్రేలియా రెండు మ్యాచ్‌ల సిరీస్ కోసం భారత్‌లో పర్యటించింది. ఈ సిరీస్‌ను భారత్ 0-2 తేడాతో కోల్పోయింది. ఈ సిరీస్‌లో కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి సత్తా చాటారు.హ్యాట్రిక్ విక్టరీస్ఆతర్వాత భారత్ వరుసగా 2020 (ఆస్ట్రేలియాలో), 2022 (భారత్‌లో), 2023 (భారత్‌లో) సిరీస్‌ల్లో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించింది. 2020 సిరీస్‌లో రాహుల్, ధవన్, కోహ్లి, నటరాజన్, చహల్ సత్తా చాటడంతో భారత్ 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. 2022 సిరీస్‌లో అక్షర్ పటేల్, సూర్యకుమార్ యాదవ్ చెలరేగడంతో 2-1 తేడాతో గెలుపొందింది.యువ ఆటగాళ్ల హవా.. రుతురాజ్ విధ్వంసకర శతకం2023లో జరిగిన సిరీస్‌లో ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్, రింకూ సింగ్ లాంటి యువ ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఫలితంగా భారత్ 4-1 తేడాతో ఆసీస్‌ను ఖంగుతినిపించింది. ఈ సిరీస్‌లోని మూడో మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ విధ్వంసకర శతకం బాదాడు.చదవండి: రోహిత్, కోహ్లి మళ్లీ రంగంలోకి దిగేది అప్పుడే..! -
అద్వితీయ ప్రస్థానం.. చరిత్ర తిరగేస్తే అంతా వారే..!
మహిళల వన్డే ప్రపంచకప్‌లో (women's Cricket World Cup) ఆస్ట్రేలియా (Australia Women's Cricket Team) ప్రస్తానం అద్వితీయంగా సాగుతుంది. ఈ జట్టు ఇప్పటివరకు పూర్తైన 12 ఎడిషన్లలో ఏడు సార్లు ఛాంపియన్‌గా నిలిచింది. తద్వారా టోర్నీ చరిత్రలో అత్యధిక టైటిళ్లు సాధించిన జట్టుగా ప్రపంచ రికార్డు కలిగి ఉంది.ఘన చరిత్ర కలిగిన ఆసీస్.. ప్రస్తుతం ఎనిమిదో టైటిల్ దిశగా అడుగులు వేస్తుంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న 2025 ఎడిషన్‌లో ఓటమెరుగని ఏకైక జట్టుగా సెమీస్‌కు చేరింది. సెమీస్‌లో భారత్‌తో అమీతుమీకి సిద్దమైంది. ఈ మ్యాచ్ నవీ ముంబై వేదికగా అక్టోబర్ 30న జరుగనుంది. తొలి సెమీస్‌లో ఇంగ్లండ్, సౌతాఫ్రికా పోటీపడనున్నాయి. ఆసీస్ మరోసారి సెమీస్‌కు చేరిన నేపథ్యంలో ప్రపంచకప్‌లో ఆ జట్టు ప్రస్థానంపై ఓ లుక్కేద్దాం.తొట్ట తొలి ఛాంపియన్ ఇంగ్లండ్ఈ మెగా టోర్నీ 1973లో (ఇంగ్లండ్‌లో) తొలిసారి జరిగింది. ఈ ఎడిషన్‌లో ఇంగ్లండ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి తొట్ట తొలి జగజ్జేతగా ఆవిర్భవించింది. 7 జట్లు పాల్గొన్న ఆ ఎడిషన్‌లో ఆస్ట్రేలియా రెండో స్థానంలో నిలిచి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. తొలిసారి జగజ్జేతభారత్ వేదికగా జరిగిన రెండో ఎడిషన్‌లో (1978) ఆస్ట్రేలియా తొలిసారి ఛాంపియన్‌గా నిలిచింది. ఈ ఎడిషన్‌లో ఆసీస్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి విజేతగా అవతరించింది. కేవలం నాలుగు జట్లు పాల్గొన్న ఈ ఎడిషన్‌లో ఇంగ్లండ్ రెండో స్థానంలో నిలిచింది. ఆతిథ్య భారత్ చివరి స్థానంతో సరిపెట్టుకుంది. భారత్‌కు ఇదే తొలి ప్రపంచకప్. రెండోసారిన్యూజిలాండ్ వేదికగా జరిగిన మూడో ఎడిషన్‌లో (1982) ఆస్ట్రేలియా రెండో సారి ఛాంపియన్‌గా నిలిచింది. రౌండ్ రాబిన్ ఫార్మాట్లోనే జరిగిన ఈ ఎడిషన్‌లో ఆసీస్ అజేయగా జట్టుగా నిలిచి టైటిల్ ఎగరేసుకుపోయింది. ఈ ఎడిషన్‌లోనూ ఇంగ్లండ్ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. హ్యాట్రిక్స్వదేశంలో జరిగిన 1988లో ఎడిషన్‌లో ఆసీస్ మరోసారి ఛాంపియన్‌గా నిలిచి, హ్యాట్రిక్ సాధించింది. ఐదు జట్లుతో 60 ఓవర్ల ఫార్మాట్లో జరిగిన ఈ ఎడిషన్‌లోనూ ఇంగ్లండ్ రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో ఆసీస్ ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించి, ముచ్చటగా మూడో టైటిల్ ఎగరేసుకుపోయింది.తొలిసారి పరాభవం1993 ఎడిషన్‌లో ఆస్ట్రేలియా తొలిసారి ఫైనల్‌కు చేరలేకపోయింది. రౌండ్ రాబిన్ పద్దతిలో జరిగిన ఈ ఎడిషన్‌లో ఇంగ్లండ్ ఛాంపియన్‌గా, న్యూజిలాండ్ రన్నరప్‌గా నిలువగా.. ఆస్ట్రేలియా మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఇంగ్లండ్ వేదికగా జరిగిన ఈ ఎడిషన్‌లో 8 జట్లు పాల్గొనగా భారత్ నాలుగో స్థానంలో నిలిచింది.తిరిగి జగజ్జేతగా..1997లో భారత్ వేదికగా జరిగిన ఎడిషన్‌లో ఆస్ట్రేలియా తిరిగి జగజ్జేతగా ఆవిర్భవించింది. 11 జట్లు పాల్గొన్న ఈ ఎడిషన్‌లో న్యూజిలాండ్ రన్నరప్‌గా నిలువగా.. భారత్ సెమీస్ వరకు చేరుకుంది.మూడు సార్లు పరాభవం తర్వాత..!మూడు సార్లు ఫైనల్లో పరాభవం తర్వాత న్యూజిలాండ్ తొలిసారి 2000 ఎడిషన్‌లో ఛాంపియన్‌గా అవతరించింది. స్వదేశంలో జరిగిన ఈ ఎడిషన్‌లో న్యూజిలాండ్ తిరుగులేని ఆధిపత్యం చలాయించి టైటిల్‌ను సొంతం చేసుకుంది. 8 జట్లు పాల్గొన్న ఈ ఎడిషన్‌లో ఆస్ట్రేలియా రన్నరప్‌తో సరిపెట్టుకుంది.భారత్‌పై గెలిచి ఐదోసారిసౌతాఫ్రికా వేదికగా జరిగిన 2005 ఎడిషన్‌లో ఆస్ట్రేలియా ఐదోసారి జగజ్జేతగా ఆవతరించింది. ఫైనల్లో భారత్‌పై విజయం సాధించి, ఛాంపియన్‌గా అవతరించింది.ఊహించని పరాభవంస్వదేశంలో జరిగిన 2009 ఎడిషన్‌లో ఆసీస్‌కు ఊహించని పరాభవం ఎదురైంది. ఈ ఎడిషన్‌లో ఆ జట్టు సూపర్ సిక్స్ దశను అధిగమించలేకపోయింది. ఇంగ్లండ్, న్యూజిలాండ్ ఫైనల్‌కు చేరుకోగా.. ఇంగ్లండ్ తమ మూడో టైటిల్‌ను సొంతం చేసుకుంది.ఆరో టైటిల్భారత్ వేదికగా జరిగిన 2013 ఎడిషన్‌లో ఆస్ట్రేలియా తిరిగి పుంజుకొని ఛాంపియన్‌గా అవతరించింది. ఫైనల్లో వెస్టిండీస్‌పై విజయం సాధించి ఆరో టైటిల్‌ను ఖాతాలో వేసుకుంది. ఈ ఎడిషన్‌లో భారత్ సూపర్ సిక్స్‌కు కూడా చేరలేకపోయింది.ఇంగ్లండ్ నాలుగోసారి..స్వదేశంలో జరిగిన 2017 ఎడిషన్‌లో ఇంగ్లండ్ విజేతగా అవతరించింది. ఫైనల్లో భారత్‌పై విజయం సాధించి, నాలుగసారి జగజ్జేతగా నిలిచింది.ఏడోసారి జగజ్జేతగా..న్యూజిలాండ్ వేదికగా జరిగిన 2022 ఎడిషన్‌లో ఆస్ట్రేలియా ఏడో సారి ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. ఫైనల్లో ఇంగ్లండ్‌పై విజయం సాధించి టైటిల్ ఎగరేసుకుపోయింది. ఈ ఎడిషన్‌లో భారత్ నాకౌట్ దశకు చేరలేదు. ప్రస్తుతం జరుగుతున్న ఎడిషన్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆసీస్ ఎనిమిదో టైటిల్‌పై కన్నేసింది. చదవండి: కేకేఆర్ హెడ్ కోచ్‌గా రోహిత్ శర్మ ఫిట్నెస్ గురు -
భారత్ సెమీస్ ప్రత్యర్థి ఆస్ట్రేలియా
ఇండోర్: మహిళల వన్డే వరల్డ్ కప్ రెండో సెమీ ఫైనల్లో భారత జట్టు డిఫెండింగ్ చాంపియన్ ఆ్రస్టేలియాతో తలపడనుంది. ఆడిన 7 మ్యాచ్‌లలో 6 విజయాలతో (1 రద్దు) పాయింట్ల పట్టికలో ఆసీస్ అగ్రస్థానాన్ని అందుకుంది. నేడు బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా భారత్‌కు నాలుగో స్థానం ఖాయమైంది. భారత్, ఆ్రస్టేలియా సెమీస్ 30న ముంబైలో జరగనుండగా, గువాహటిలో 29న జరిగే తొలి సెమీస్‌లో దక్షిణాఫ్రికాతో ఇంగ్లండ్ తలపడనుంది. శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఆ్రస్టేలియా 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 24 ఓవర్లలో 97 పరుగులకే కుప్పకూలింది. లారా వోల్వర్ట్ (30), సినాలో జాఫ్తా (29) మినహా అంతా విఫలమయ్యారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అలానా కింగ్ (7/18) తన లెగ్ స్పిన్‌తో 7 వికెట్లు పడగొట్టి సత్తా చాటింది. మహిళల వన్డేల్లో ఇది నాలుగో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన కావడం విశేషం. అనంతరం ఆ్రస్టేలియా 16.5 ఓవర్లలో 3 వికెట్లకు 98 పరుగులు చేసి విజయాన్నందుకుంది. బెత్ మూనీ (42), జార్జియా వోల్ (38 నాటౌట్) కలిసి జట్టును గెలిపించారు. -
రోహిత్ – కోహ్లి సూపర్‌హిట్
‘సినిమా ఇంకా మిగిలే ఉంది’... ఆ్రస్టేలియాతో చివరి వన్డేలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఆట చూస్తే అభిమానులందరికీ ఇదే అనిపిస్తుంది. సిరీస్ ఆరంభానికి ముందు వారి బ్యాటింగ్‌పై సందేహాలు, జట్టులో చోటుపై చర్చ... తొలి మ్యాచ్‌లో వైఫల్యం తర్వాత రోహిత్‌పై ఒత్తిడి పెరగగా, వరుసగా రెండు డకౌట్లు కోహ్లి సత్తాపై సందేహాలు రేకెత్తించాయి. కానీ వన్డే క్రికెట్ దిగ్గజాలుగా తమ అసలు స్థాయి ఏమిటో వారు ఇప్పుడు చూపించారు.మరికొంత కాలం తమ స్థానం గురించి ఎవరూ మాట్లాడకుండా చేశారు... అలవోకగా పరుగులు సాధించి తమ బ్యాటింగ్‌లో పదును తగ్గలేదని నిరూపించారు. ఆస్ట్రేలియా గడ్డపై చివరి సారిగా ఆడిన రోహిత్, కోహ్లి సిడ్నీ మైదానంలోని 40,587 మంది ప్రేక్షకులను చక్కటి షాట్లతో అలరించారు. రోహిత్ శతకంతో చెలరేగగా, కోహ్లి దీటైన ఇన్నింగ్స్ ఆడాడు. వన్డేల్లో రికార్డు స్థాయిలో 5483 పరుగులు జోడించిన ఈ జంట తమ జుగల్బందీతో మరో మ్యాచ్‌ను గెలిపించి ఫ్యాన్స్‌కు జోష్‌ను అందించింది. సిడ్నీ: ఆ్రస్టేలియాతో వన్డే సిరీస్‌ను భారత్ విజయంతో ముగించింది. ఇప్పటికే సిరీస్ కోల్పోయినా... చివరి మ్యాచ్ టీమిండియాకు ఆనందాన్ని పంచింది. శనివారం జరిగిన మూడో వన్డేలో భారత్ 9 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 46.4 ఓవర్లలో 236 పరుగులకే ఆలౌటైంది. మాట్ రెన్షా (58 బంతుల్లో 56; 2 ఫోర్లు) అర్ధ సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా 4 వికెట్లు పడగొట్టారు. అనంతరం భారత్ 38.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 237 పరుగులు సాధించింది.‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రోహిత్ శర్మ (124 బంతుల్లో 121 నాటౌట్; 13 ఫోర్లు, 3 సిక్స్‌లు) కెరీర్లో 33వ సెంచరీ సాధించగా, విరాట్ కోహ్లి (81 బంతుల్లో 74; 7 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 170 బంతుల్లో అభేద్యంగా 168 పరుగులు జోడించడంతో మరో 11.3 ఓవర్లు ఉండగానే భారత్ విజయం ఖాయమైంది. తొలి రెండు వన్డేలు నెగ్గిన ఆసీస్ 2–1తో సిరీస్ సొంతం చేసుకోగా, మొత్తంగా 202 పరుగులు చేసిన రోహిత్‌కే ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య బుధవారం నుంచి ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్ మొదలవుతుంది. హర్షిత్ రాణాకు 4 వికెట్లు... ఆ్రస్టేలియా ఇన్నింగ్స్‌లో టాప్–6 బ్యాటర్లు మెరుగ్గా ఆరంభించినా, ఒక్కరూ కూడా దానిని భారీ స్కోరుగా మలచలేకపోయారు. ఓపెనర్లు మిచెల్ మార్ష్(50 బంతుల్లో 41; 5 ఫోర్లు, 1 సిక్స్), ట్రవిస్ హెడ్ (25 బంతుల్లో 29; 6 ఫోర్లు) తొలి వికెట్‌కు 56 బంతుల్లోనే 61 పరుగులు జోడించారు. ఆ తర్వాత మాథ్యూ షార్ట్ (41 బంతుల్లో 30; 2 ఫోర్లు), రెన్షా కూడా ఫర్వాలేదనిపించడంతో ఒక దశలో స్కోరు 183/3 వద్ద నిలిచింది. అయితే శ్రేయస్ అద్భుత క్యాచ్‌తో అలెక్స్ క్యారీ (24)ని అవుట్ చేయడంతో ఆసీస్ పతనం మొదలైంది. గత మ్యాచ్ గెలిపించిన కూపర్ కలోనీ (23)తో పాటు ఇతర బ్యాటర్లెవరూ క్రీజ్‌లో నిలబడలేకపోయారు. ఫలితంగా 53 పరుగుల వ్యవధిలో ఆసీస్ 7 వికెట్లు కోల్పోయింది. మరో 3.2 ఓవర్లు మిగిలి ఉండగానే జట్టు ఆలౌట్ అయింది. క్యారీ క్యాచ్ పట్టే క్రమంలో శ్రేయస్ పక్కటెముకలకు తీవ్ర గాయమైంది. దీంతో అతడు కనీసం మూడు వారాల పాటు ఆటకు దూరం అయ్యే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ కోసం భారత్ రెండు మార్పులు చేసింది. నితీశ్ రెడ్డి, అర్ష్ దీప్ స్థానాల్లో కుల్దీప్, ప్రసిధ్ కృష్ణలకు చోటు కల్పించింది. భారీ భాగస్వామ్యం... ఛేదనలో భారత్‌కు ఎలాంటి ఇబ్బందీ ఎదురు కాలేదు. రోహిత్, శుబ్‌మన్ గిల్ (24) చకచకా 62 బంతుల్లోనే 69 పరుగులు జత చేశారు. గిల్ వెనుదిరిగిన తర్వాత ప్రేక్షకుల హర్షధ్వానాల మధ్య కోహ్లి బరిలోకి దిగాడు. తన తొలి బంతికే సింగిల్ తీయడంతో స్టేడియం హోరెత్తిపోగా, కోహ్లి కూడా నవ్వుతూ వారికి అభివాదం చేయడం విశేషం! రోహిత్, కోహ్లి జోడి ఎదురు లేకుండా దూసుకుపోయింది. రోహిత్ దూకుడు ప్రదర్శించగా, కోహ్లి తనదైన శైలిలో చూడచక్కటి షాట్లు ఆడాడు. జంపా బౌలింగ్‌లో లాంగాఫ్ మీదుగా రోహిత్ కొట్టిన ‘ఇన్సైడ్ అవుట్’ సిక్స్ హైలైట్‌గా నిలిచింది. ముందుగా 63 బంతుల్లో రోహిత్, ఆ తర్వాత 56 బంతుల్లో కోహ్లి అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆసీస్ బౌలర్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా వికెట్ తీయడంలో విఫలమయ్యారు. జంపా బౌలింగ్‌లో సింగిల్‌తో సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్ ఎలాంటి సంబరాలు చేసుకోకపోగా, భారత్ స్కోరు 200 పరుగులకు చేరింది. ఆ తర్వాత మరో 33 బంతుల్లో జట్టు మ్యాచ్‌ను ముగించింది. 14,255 వన్డేల్లో కోహ్లి పరుగుల సంఖ్య. సంగక్కర (14,234)ను అధిగమించిన అతను సచిన్ (18,426) తర్వాత రెండో స్థానానికి చేరుకున్నాడు.9 ఆస్ట్రేలియాపై రోహిత్ సెంచరీల సంఖ్య. సచిన్ (9)తో అతను సమంగా నిలిచాడు.50 అన్ని ఫార్మాట్లు కలిపి రోహిత్ సెంచరీల సంఖ్య. మరో 9 మంది బ్యాటర్లు మాత్రమే ఈ ఘనత సాధించారు.స్కోరు వివరాలు ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: మార్ష్(బి) అక్షర్ 41; హెడ్ (సి) ప్రసిధ్ (బి) సిరాజ్ 29; షార్ట్ (సి) కోహ్లి (బి) సుందర్ 30; రెన్షా (ఎల్బీ) (బి) సుందర్ 56; క్యారీ (సి) అయ్యర్ (బి) రాణా 24; కనోలీ (సి) కోహ్లి (బి) రాణా 23; ఒవెన్ (సి) రోహిత్ (బి) రాణా 1; స్టార్క్ (బి) కుల్దీప్ 2; ఎలిస్ (సి) రోహిత్ (బి) ప్రసిధ్ 16; జంపా (నాటౌట్) 2; హాజల్‌వుడ్ (బి) రాణా 0; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (46.4 ఓవర్లలో ఆలౌట్) 236. వికెట్ల పతనం: 1–61, 2–88, 3–124, 4–183, 5–195, 6–198, 7–201, 8–223, 9–236, 10–236. బౌలింగ్: సిరాజ్ 5–1–24–1, రాణా 8.4–0–39–4, ప్రసిధ్ 7–0–52–1, కుల్దీప్ 10–0–50–1, అక్షర్ 6–0–18–1, సుందర్ 10–0–44–2. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (నాటౌట్) 121, గిల్ (సి) క్యారీ (బి) హాజల్‌వుడ్ 24; కోహ్లి (నాటౌట్) 74; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (38.3 ఓవర్లలో వికెట్ నష్టానికి) 237. వికెట్ల పతనం: 1–69. బౌలింగ్: స్టార్క్ 5–0–31–0, హాజల్‌వుడ్ 6–1–23–1, ఎలిస్ 7.3–0–60–0, కనోలీ 5–0–36–0, జంపా 10–0–50–0, ఒవెన్ 1–0–2–0, షార్ట్ 4–0–29–0. -
భారతీయ సినిమా వీరవిహారాలు..ఆస్ట్రేలియన్ సినిమా ఆర్తనాదాలు
ఇంగ్లీష్ మాట్లాడే ప్రపంచంలో తొలిసారిగా, స్థానిక బాక్సాఫీస్ వద్ద భారతీయ సినిమాలు ఆస్ట్రేలియన్ సినిమాల కలెక్షన్లను అధిగమించాయని ఒక కొత్త నివేదిక వెల్లడించింది. త్వరలో వచ్చే వారం జరగనున్న ఒక ప్రధాన సినిమా పరిశ్రమ సమావేశానికి ముందు ఈ నివేదికను విడుదల చేసిన చిత్ర పరిశ్రమ ఎగ్జిక్యూటివ్ నిక్ హేస్, హిందీ, తెలుగు, తమిళం. ఇతర భారతీయ భాషలలోని చిత్రాలు అమెరికన్ బ్రిటిష్ చిత్రాల తర్వాత ఆస్ట్రేలియాలో మూడవ అతిపెద్ద మార్కెట్‌గా మారాయని చెప్పారు.అవి 2021లో 32.5 మిలియన్ డాలర్లుగా ఉండగా, ఈ సంవత్సరం అంచనా వేసిన దాని కన్నా మిన్నగా 50 మిలియన్ డాలర్లకు పెరిగాయి. అదే కాలంలో, ఆస్ట్రేలియన్ చిత్రాలు ‘పేలవమైన‘ బాక్సాఫీస్ ప్రదర్శనతో 54.2 మిలియన్ డాలర్ల నుంచి ఈ సంవత్సరం 16.8 మిలియన్ డాలర్లకు పడిపోయాయని హేస్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఆంగ్లోఫోన్ మాట్లాడని చలనచిత్ర రంగం జాతీయ పరిశ్రమ కంటే ముందుకెళ్లిన మొదటి ప్రధాన ఆంగ్ల భాషా మార్కెట్ ఆస్ట్రేలియా ఇది యుకె. యుఎస్ లేదా కెనడాలో కనిపించని నిర్మాణాత్మక మైలురాయి‘ అని ఆయన అంటున్నారు. అంటే ఆంగ్లేతర చిత్రాలు ఆస్ట్రేలియాలో ఈ స్థాయి విజయం సాధించడం మరే దేశంలోనూ లేని వైచిత్రి అని ఆయన భావం.భారీ సంఖ్యలో ప్రేక్షకుల బలం, నమ్మకమైన చిత్రాల సరఫరా కమ్యూనిటీ ఆధారిత మార్కెటింగ్ భారతీయ విజయం వెనుక ఉన్నాయని డెండీ సినిమాస్, ఐకాన్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్, అంబ్రెల్లా ఎంటర్టైన్మెంట్లలో సీనియర్ పాత్రలు పోషించిన హేస్ అభిప్రాయపడుతున్నారు.గత ఐదు సంవత్సరాలలో అతిపెద్ద భారతీయ హిట్లుగా హిందీ సినిమా యానిమల్(Animal Movie) 5.2 మిలియన్ డాలర్లు వసూలు చేయగా మరో బాలీవుడ్ మూవీ పఠాన్(Pathaan) 4.7 మిలియన్లు రాబట్టింది. అదే బాటలో జవాన్(Jawan) కూడా 4.7 మిలియన్లతో 3వ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత టాలీవుడ్ అక్కడ సత్తా చాటింది. తెలుగు సినిమా పుష్ప: ది రూల్ – పార్ట్ 2 4.5 మిలియన్ డాలర్ల కలెక్షన్లతో ఆ తర్వాతి స్థానంలోనూ మరో తెలుగు సినిమా ఆర్ఆర్ఆర్ 3.6 మిలియన్లతో అంతర్జాతీయ స్థాయిలో దక్షిణ భారత సినిమా సత్తా చాటినట్టు న్యూమెరో బాక్స్ ఆఫీస్ డేటా వెల్లడిస్తోంది. ‘‘ఆడియన్స్ స్పీక్ – ఇట్స్ టైమ్ వుయ్ లిజెన్’’ అనే పేరుతో వెలువరించిన ఈ నివేదిక గోల్డ్ కోస్ట్‌లో ఆస్ట్రేలియన్ ఇంటర్నేషనల్ మూవీ కన్వెన్షన్‌కు ముందు బహుళ మార్గాల ద్వారా ప్రేక్షకులను పెంచుకోవడానికి సినిమాలకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచిస్తోంది.ఇదే పంథా కొనసాగితే... మరోఐదు సంవత్సరాలు ఈ ట్రెండ్ కొనసాగితే, న్యూజిలాండ్ సినిమాలు, బహుశా చైనీస్. ఫ్రెంచ్ సినిమాలు కూడా ఆస్ట్రేలియన్ సినిమాలను అధిగమించవచ్చని హేస్ విశ్వసిస్తున్నారు. ‘ఆస్ట్రేలియన్లలో ప్రతి ఐదుగురిలో ఒకరు ఇంట్లో ఇంగ్లీష్ కాకుండా వేరే భాష మాట్లాడుతుండగా, ప్రతి 10 సినిమా టిక్కెట్లలో ఒకటి కంటే తక్కువ ఇంగ్లీష్ కాని భాషా టైటిల్స్‌కు అమ్ముడవుతున్నాయి‘ అని నివేదిక చెబుతోంది. ‘శనివారం రాత్రి సిడ్నీ లేదా మెల్బోర్న్లోని ఏదైనా సినిమా థియేటర్లోకి నడిచి చూడండి, మీరు అరబిక్, తగలోగ్, హిందీ, వియత్నామీస్, మాండరిన్, గ్రీక్. లాబీలో తదితర డజను భాషలను వినవచ్చు కానీ లైట్లు మసకబారినప్పుడు, దాదాపు ప్రతి స్క్రీన్ ఇంగ్లీష్ మాట్లాడుతుంది.’’ఇంగ్లీష్ సినిమాలు ఇప్పటికీ అధికంగా ఆధిపత్యం చెలాయిస్తున్నప్పటికీ, వాటి మార్కెట్ వాటా 2021లో దాదాపు 95 శాతం నుంచి ఈ సంవత్సరం 91 శాతానికి పడిపోయిందని నివేదిక పేర్కొంది. ‘జనాభా స్క్రీన్ వాటా మధ్య దాదాపు సమానత్వాన్ని సాధించిన ఏకైక విదేశీ భాషా రంగం భారతీయ భాష మాత్రమే‘ అని అది పేర్కొంది. ‘మాండరిన్, అరబిక్ వియత్నామీస్ జనాభా వారి జనాభాతో పోలిస్తే గణనీయమైన రీతిలో వారి స్క్రీన్ వాటా తక్కువగా కనిపిస్తోందని తేల్చింది. -
విజయంతో ముగిస్తారా!
సిడ్నీ: ఐసీసీ వన్డే టోర్నీ చాంపియన్స్ ట్రోఫీ విజేత హోదాలో భారీ అంచనాలతో ఆ్రస్టేలియాకు వచ్చిన భారత జట్టు పేలవ ప్రదర్శనతో ఇప్పటికే 0–2తో సిరీస్‌ను కోల్పోయింది. మిగిలిన చివరి మ్యాచ్‌లోనైనా గెలిస్తే టీమిండియాకు ఊరట దక్కుతుంది. భారత జట్టు తమ వన్డే చరిత్రలో ఒక్కసారి కూడా ఆస్ట్రేలియా చేతిలో క్లీన్‌స్వీప్‌నకు గురి కాలేదు. వన్డే ఫార్మాట్లో టీమిండియా కొత్త కెపె్టన్ శుబ్‌మన్ గిల్ నాయకత్వంలో అలాంటి అవకాశం ఇవ్వరాదని జట్టు పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో నేడు భారత్, ఆ్రస్టేలియా మధ్య మూడో వన్డేకు రంగం సిద్ధమైంది. కోహ్లి ఈసారైనా... సిరీస్‌కు ముందు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల బ్యాటింగ్ గురించే పెద్ద ఎత్తున చర్చ జరిగింది. తొలి మ్యాచ్‌లో విఫలమైనా...అడిలైడ్‌లో అర్ధసెంచరీతో రోహిత్ కాస్త ఫర్వాలేదనిపించాడు. అయితే అతని ఆటలో సహజశైలి, దూకుడు కనిపించలేదు. కోహ్లి అయితే రెండు సార్లూ డకౌట్ అయి పూర్తిగా నిరాశపర్చాడు. ఈ మ్యాచ్‌లో కూడా సహజంగానే వారిద్దరి బ్యాటింగ్‌పైనే అందరి దృష్టీ నిలిచింది. గతేడాది అంతర్జాతీయ టి20లకు రిటైర్మెంట్ ప్రకటించిన ఈ ఇద్దరు ఆ్రస్టేలియా గడ్డపై ఆడటం ఇదే చివరిసారి కానుంది. అందుకే ఈ మ్యాచ్‌పై సిడ్నీ అభిమానులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపించడంతో టికెట్లన్నీ పూర్తిగా అమ్ముడుపోయి మైదానం హౌస్‌ఫుల్‌గా కనిపించనుంది. కోహ్లి తన స్థాయికి తగినట్లు ఆడి ఆకట్టుకోవాలని అంతా కోరుకుంటున్నారు. అయితే గిల్, కేఎల్ రాహుల్ కూడా విఫలమవుతుండటం భారత్ బృందానికి ఆందోళన కలిగించే అంశం. మరోసారి శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ కీలకం కానుండగా... ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డితో పాటు వాషింగ్టన్ సుందర్ కూడా బ్యాటింగ్‌లో ప్రభావం చూపించాల్సి ఉంది. బౌలింగ్‌లో ఈ మ్యాచ్‌లోనైనా కుల్దీప్ యాదవ్‌కు అవకాశం ఇస్తారా అనేది చూడాలి. వారిద్దరికి విశ్రాంతి... అగ్రశ్రేణి ఆటగాళ్లు దూరమైనా... ఆసీస్ యువ క్రికెటర్లు రెండో వన్డేను గెలిపించడం టీమ్ మేనేజ్మెంట్కు ఉత్సాహాన్ని ఇచి్చంది. షార్ట్, కనోలీ, ఒవెన్, రెన్షాలాంటి ఆటగాళ్లంతా ప్రభావం చూపించగలిగారు. బౌలింగ్‌లో బార్త్‌లెట్ ఆకట్టుకోగా, లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా తన విలువను ప్రదర్శించాడు. ఇప్పటికే సిరీస్ గెలిచిన నేపథ్యంలో టాప్ పేసర్లు స్టార్క్, హాజల్‌వుడ్‌లకు ఆసీస్ విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. వీరి స్థానాల్లో ఎలిస్, జాక్ ఎడ్వర్డ్స్ బరిలోకి దిగుతారు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం కాబట్టి భారీ స్కోరుకు అవకాశం ఉంది. ఆ్రస్టేలియా ఇక్కడ ఆడిన గత ఆరు వన్డేల్లో విజయం సాధించింది. మ్యాచ్ రోజు వర్షసూచన లేదు. 16 సిడ్నీలో భారత్, ఆస్ట్రేలియా మధ్య 19 వన్డేలు జరిగాయి. భారత్ రెండు మ్యాచ్‌ల్లో గెలిచి, 16 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఒక వన్డేలో ఫలితం రాలేదు. -
ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడంలో ఇంత కష్టం ఉంటుందా..?
ఎవరెస్టుని అధిరోహించిన ఎందరో సాహస వీరులు, నారీమణలు గురించి విన్నాం. అందుకోసం ఎంతో ట్రైనింగ్ కూడా తీసుకుంటారు. అంత కష్టపడ్డా తీర ఎవరెస్టుని అధిరోహిస్తుండగా వాతావరణం ప్రతికూలంగా ఉంటే మధ్యలోనే వెనుతిరగాల్సిందే..అంత కష్టమైనది ఎవరెస్టుని అధిరోహించడం. ఒకపక్క ఎముకలు కొరికే చలి, మరోవైపు ప్రమాదకరమైన డెత్ జోన్లు, అననూకూలమైన వాతావరణం వంటి సవాళ్లను ఓర్చుకుంటేనే..అధిరోహించడం సాధ్యమవుతుంది. ఇలానే ఓ అమ్మాయి ఎంతో ఉత్సాహంగా వెళ్లి ..అననూకూలమైన వాతావరణంతో పాపం వెనుదిరగక తప్పకలేదు. అందుక సంబంధించిన అనుభవాన్ని నెట్టింట షేర్ చేయడంతో ఇంత కష్టసాధ్యమైనదా ఎవరెస్టుని ఎక్కడం అని ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లుఆస్ట్రేలియాలోని మెల్బోర్న్కు చెందిన 17 ఏళ్ల బియాంకా అడ్లర్ ఈ ఏడాది మేలో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించడానికి ప్రయత్నించింది. ఆమె శిఖరానికి దాదాపు 400 మీటర్ల 8,450 మీటర్ల ఎత్తు వరకు చేరుకుంది. అయితే అక్కడకి చేరుకున్న తర్వాత క్లిష్టమైన వాతావరణం కారణంగా వెనుదిరగక తప్పలేదు బియాంకాకి. దాంతే బేస్ క్యాంప్‌కి చేరుకుంది. అక్కడకు చేరుకున్నాక..తాను ఎదుర్కొన్న అనుభవాన్ని రికార్డు చేసి మరి పోస్ట్ చేసింది. ఆ వీడియోలో తాను బేస్ క్యాంపులో ఉన్నానని, భయంగా ఉందంటూ మాట్లాడింది. తన మెడ, గొంతు, ఊపిరితిత్తులు చాలా నొప్పిగా ఉన్నాయని..ఊపిరి ఆడటం లేదంటూ ఆందోళనగా చెప్పుకొచ్చింది. క్యాంప్4, క్యాంప్2 సమావేశాల్లో అక్కడ వాతావరణ పరిస్థితుల బాగోక పోవడంతో మూడు రాత్రులు అనంతరం బేస్ క్యాంప్‌కి తిరిగి వచ్చింది. ఇక్కడ తనకు చాలా భయంకరంగా అనిపిస్తోందని బాధగా చెప్పింది. ఒకపక్క దగ్గుతూ, ముఖం మంతా ఎర్రగా కందిపోయి, అనారోగ్యంతో ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది వీడియోలో. అంతేగాదు ఆ వీడియోకి ఎవరెస్టులో మూడు రోజుల అనంతరం డెత్ జోన్ నుంచి తిరిగి వచ్చా అనే క్యాప్షన్ జోడించి మరి పోస్ట్ చేసింది. నెటిజన్లు సైతం ఎవరెస్టు ఎత్తులో శరీరం ఇంత తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటుందా అని ఆశ్చర్యపోతూ పోస్టులు పెట్టారు. అయినా పర్వతారోహణలో చేయగలిగిందంతా ఇప్పటి వరకు చేశారు అందుకు మీకు హ్యాట్సాఫ్ అని పోస్టులు పెట్టారు మరికొందరు. View this post on Instagram A post shared by Bianca Adler (@bianca_adler1) (చదవండి: అలా బంగారం దానం చేయడం ఇవాళ సాధ్యమేనా?) -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. ఆసీస్ వరల్డ్ రికార్డు బ్రేక్
ఐసీసీ మహిళల ప్రపంచకప్-2025లో భారత జట్టు సెమీఫైనల్లో అడుగుపెట్టింది. శుక్రవారం ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 53 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన టీమిండియా.. తమ సెమీస్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో హర్మన్ సేన ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టింది.వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 49 ఓవర్లకు కుదించారు. ఈ క్రమంలో తొలుత బ్యాటింగ్ చేసిన మన అమ్మాయిల జట్టు నిర్ణీత ఓవర్లలో 3 వికెట్లకు 340 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో స్మృతి మంధాన(109), ప్రతికా రావల్(122) అద్భుతమైన సెంచరీలతో సత్తాచాటగా.. జెమీమా రోడ్రిగ్స్ (76 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడింది.అనంతరం మళ్లీ వర్షం అంతరాయం కలిగించడంతో కివీస్ లక్ష్యాన్ని 44 ఓవర్లలో 325గా నిర్ణయించారు. కానీ న్యూజిలాండ్ లక్ష్య చేధనలో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 271 పరుగులు మాత్రమే చేయగల్గింది. ఈ ఓటమితో కివీస్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక ఈ మ్యాచ్‌లో అదరగొట్టిన భారత మహిళల జట్టు ఓ అరుదైన రికార్డును తమ పేరిట లిఖించుకుంది. ఆసీస్ రికార్డు బ్రేక్..మహిళల వన్డే వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌పై అత్యధిక స్కోర్ సాధించిన జట్టుగా భారత్ నిలిచింది. ఇంతకుముందు ఈ రికార్డు ఆసీస్ పేరిట ఉండేది. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్‌లోనే ఇండోర్ వేదికగా కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 326 పరుగులు చేసింది. తాజా మ్యాచ్‌లో 340 రన్స్ చేసిన టీమిండియా.. ఆసీస్ రికార్డును బ్రేక్ చేసింది.చదవండి: రోహిత్ నీకు ఇది ఫేర్వెల్ మ్యాచా? ఒక్క ఫోటో అయినా పెట్టు: గంభీర్ -
సిరీస్ కాపాడుకునేందుకు...
అడిలైడ్: శుబ్‌మన్ గిల్ నాయకత్వంలో తొలి వన్డే ఓడిన భారత జట్టు మరో పోరులో తమ సత్తా చాటేందుకు సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు జరిగే రెండో వన్డేలో ఆ్రస్టేలియాతో భారత్ తలపడుతుంది. ప్రస్తుతం 0–1తో వెనుకంజతో ఉన్న టీమిండియా ఈ మ్యాచ్‌లో ఓడితే సిరీస్‌ను చేజార్చుకుంటుంది. వర్షం కారణంగా 26 ఓవర్లకే కుదించిన గత మ్యాచ్‌లో బ్యాటింగ్ వైఫల్యంతో టీమిండియా పరాజయాన్ని ఎదుర్కొంది. ఆ్రస్టేలియా అలవోకగా లక్ష్యాన్ని ఛేదించడంలో సఫలమైంది. ఈ నేపథ్యంలో భారత్ ఎలాంటి వ్యూహంతో బరిలోకి దిగుతుందనేది ఆసక్తికరం. సహజంగానే మరోసారి అందరి దృష్టీ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలపైనే ఉంది. తొలి వన్డేలో వీరిద్దరు విఫలం కావడం కొత్త చర్చకు దారి తీసింది. ప్రతీ మ్యాచ్ వీరికి పరీక్ష కాదని చీఫ్ సెలక్టర్ అగార్కర్ చెబుతున్నా... కచి్చతంగా రాణించాల్సిన ఒత్తిడి వీరిపై ఉందనేది వాస్తవం. అరంగేట్ర మ్యాచ్‌లో ఆకట్టుకున్న ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి మరోసారి తన ప్రభావం చూపించాలని పట్టుదలగా ఉన్నాడు. భారత్ తుది జట్టు విషయంలో మార్పు ఉండకపోవచ్చు. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు అక్షర్, సుందర్‌లలో ఒకరిని తప్పించి రెగ్యులర్ స్పిన్నర్ కుల్దీప్కు అవకాశం ఇస్తారా అనేది సందేహమే. మరోవైపు ఆస్ట్రేలియా టీమ్‌లో ఫిలిప్స్, కునెమన్ స్థానాల్లో అలెక్స్ కేరీ, ఆడమ్ జంపా రావడం ఖాయమైంది. అడిలైడ్ మైదానం బ్యాటింగ్‌కు బాగా అనుకూలం కావడంతో భారీ స్కోరుకు అవకాశం ఉంది. మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదు. ఈ స్టేడియంలో ఆస్ట్రేలియాతో ఆడిన గత రెండు వన్డేల్లో (2012, 2019) భారత జట్టే గెలిచింది. -
రాణించిన ఆసీస్ బౌలర్లు.. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన ఇంగ్లండ్
మహిళల వన్డే ప్రపంచకప్‌లో (Women's CWC 2025) ఇవాళ (అక్టోబర్ 22) ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు (Australia vs England) తలపడుతున్నాయి. ఇండోర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. ఆసీస్ బౌలర్లు రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 244 పరుగులు మాత్రమే చేయగలిగింది. అన్నాబెల్ సదర్‌ల్యాండ్ (10-1-60-3), సోఫీ మోలినెక్స్ (10-0-52-2), ఆష్లే గార్డ్నర్ (9-0-39-2), అలానా కింగ్ (10-1-20-1), కిమ్ గార్త్ (7-2-43-0) ఇంగ్లండ్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు.ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ ట్యామీ బేమౌంట్ (78) మాత్రమే సత్తా చాటింది. అలైస్ క్యాప్సీ (38), ఛార్లోట్ డీన్ (26), సోఫీ డంక్లీ (22), హీథర్ నైట్ (20) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. యామీ జోన్స్ 18, కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ 7, ఎమ్మా ల్యాంబ్ 7, లిన్సే స్మిత్ 3 పరుగులు చేసి ఔటయ్యారు. సోఫీ ఎక్లెస్టోన్ 10, లారెన్ బెల్ 2 పరుగులతో అజేయంగా నిలిచారు.కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ఇదివరకే సెమీస్‌కు అర్హత సాధించాయి. దీంతో ఈ మ్యాచ్ నామమాత్రంగా సాగనుంది. ఈ రెండు జట్లతో పాటు సౌతాఫ్రికాకు ఫైనల్ ఫోర్కు అర్హత సాధించింది. నాలుగో బెర్త్ కోసం భారత్, న్యూజిలాండ్ జట్లు పోటీపడుతున్నాయి. ప్రస్తుతం సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ పాయింట్ల పట్టికలో తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. బంగ్లాదేశ్, పాకిస్తాన్ టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమించాయి. చదవండి: శ్రీలంక క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం -
తెలంగాణ-ఆర్ఎమ్ఐటీల మధ్య వ్యూహాత్మక ఒప్పందం
హైదరాబాద్: జీవవిజ్ఞాన (లైఫ్ సైన్సెస్) విద్య మరియు పరిశోధన రంగాల్లో గ్లోబల్ సహకారాన్ని బలోపేతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం మరియు ఆస్ట్రేలియాలోని RMIT University వ్యూహాత్మక భాగస్వామ్యానికి శ్రీకారం చుట్టాయి. ఈ క్రమంలో ఇరు సంస్థలు Letter of Intent (LoI) పై సంతకాలు చేశాయి.ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రీస్ & కామర్స్ శాఖల మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. RMIT విశ్వవిద్యాలయం డిప్యూటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కాథరిన్ ఇట్సియోపోలస్ (Catherine Itsiopoulos), తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఫౌండేషన్ సీఈఓ శక్తి నాగప్పన్ సంతకాలు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ అధికారులు, విద్యావేత్తలు హాజరయ్యారు.RMIT విశ్వవిద్యాలయం ఆస్ట్రేలియాలోని ప్రముఖ గ్లోబల్ విద్యాసంస్థల్లో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా 90,000 మందికి పైగా విద్యార్థులు చదువుతున్న ఈ విశ్వవిద్యాలయం ఇండస్ట్రీ-ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్, అప్లైడ్ రీసెర్చ్‌లో అగ్రగామిగా ఉంది. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్‌లో "ఇంటర్నేషనల్ అవుట్‌లుక్" విభాగంలో ప్రపంచవ్యాప్తంగా 75వ స్థానంలో నిలిచింది. RMIT విశ్వవిద్యాలయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధన భాగస్వామ్యాలు మరియు పరిశ్రమలతో ఉన్న బలమైన సంబంధాల వల్ల పేరుపొందింది. దాని సైన్స్ విభాగం బయోటెక్నాలజీ, బయోసైన్స్, మాలిక్యులర్ బయాలజీ రంగాల్లో ఆధునిక పరిశోధనలు చేస్తోంది. ఈ పరిశోధనలకు అత్యాధునిక ల్యాబ్‌లు మరియు సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.తాజాగా RMIT విశ్వవిద్యాలయం, బిట్స్ హైదరాబాద్‌తో కలిసి “BITS–RMIT హయ్యర్ ఎడ్యుకేషన్ అకాడమీను ప్రారంభించింది. ఆస్ట్రేలియా మరియు భారతదేశాల మధ్య అధునాతన పరిశోధన, విద్యా మార్పిడి, ఆవిష్కరణ ఆధారిత విద్యను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం లక్ష్యం. ఈ భాగస్వామ్యం ద్వారా తెలంగాణ నుండి పరిశోధకులు జాయింట్ పీహెచ్డీ ప్రోగ్రామ్‌లను కొనసాగించవచ్చు. విద్యార్థులు తమ విద్యా కాలంలో కొంత భాగాన్ని బిట్స్ హైదరాబాద్‌లో, మరికొంత భాగాన్ని RMIT మెల్బోర్న్లో పూర్తి చేసే అవకాశం ఉంటుంది. ఈ భాగస్వామ్యంతో విద్యార్థులు, అధ్యాపకులు రెండు దేశాల మధ్య మార్పిడి చేసుకునే అవకాశం ఉంటుంది. కలిసి పరిశోధనలు చేస్తారు. పరిశ్రమలకు ఉపయోగపడే విధంగా పాఠ్య ప్రణాళికను రూపొందించి, భారతదేశంలో పరిశోధన మరియు ఆవిష్కరణలను బలపరచడమే లక్ష్యం.ఈ సందర్భంగా మంత్రి డి. శ్రీధర్‌బాబు మాట్లాడుతూ - తెలంగాణ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రజలపై, వారి ఆలోచనలపై పెట్టుబడి పెట్టే దిశగా ఈ భాగస్వామ్యం ముందడుగు వేస్తోంది. తెలంగాణ స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ స్థాపన దిశగా సాగుతున్న సమయంలో, ఇలాంటి ఒప్పందాలు దేశంలోని బయోటెక్నాలజీ రంగాన్ని ముందుకు తీసుకెళ్లగల నైపుణ్యం గల యువతను తయారు చేయడమే మా లక్ష్యం అని పేర్కొన్నారు.RMIT డిప్యూటీ వైస్ ఛాన్సలర్, ప్రొఫెసర్ ఇట్సియోపోలస్ (Itsiopoulos) మాట్లాడుతూ - తెలంగాణతో కలిసి తదుపరి తరానికి చెందిన పరిశోధకులు, ఆవిష్కర్తలను తీర్చిదిద్దడం మాకు గర్వకారణం. ఇండస్ట్రీ ఆధారిత విద్య, సంయుక్త పరిశోధనతో మేము ప్రభావవంతమైన మార్పు తీసుకురావాలని తెలంగాణతో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉంది” అని చెప్పారు.తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఫౌండేషన్ సీఈఓ శక్తి నాగప్పన్ మాట్లాడుతూ ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం రేపటి జీనోమ్ వ్యాలీకి రూపకల్పన వంటిది. RMIT అందించే ప్రామాణిక విద్యను, హైదరాబాద్‌లో ఉన్న అత్యుత్తమ బయోటెక్ వేదికలతో మిళితం చేయడం ద్వారా నైపుణ్యాలను పెంపొందించటమే కాదు… మన పరిశోధన సామర్థ్యాన్ని బలోపేతం చేస్తూ, భారత్‌ను ప్రపంచ ఫార్మా ఆవిష్కరణల కేంద్రంగా తయారు చేయడానికి ప్రయత్నిస్త్తున్నారు. -
చైనాకు చెక్ పెట్టేందుకు అమెరికా, ఆస్ట్రేలియా డీల్
స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రిక్ వాహనాలు మొదలు రక్షణ, అంతరిక్ష రంగంలో కీలక ఉపకరణాల దాకా అన్నింటి తయారీకి అత్యావశ్యకమైన ఖనిజాల సరఫరాపై చైనా గుత్తాధిపత్యానికి గండి కొట్టేందుకు అమెరికా, ఆస్ట్రేలియా చేతులు కలిపాయి. విదేశాలకు తమ అరుదైన ఖనిజాలను ఎగుమతి చేయాలంటే కఠిన నిబంధనలు తప్పకుండా పాటించాల్సిందేనని చైనా మొండికేయడం తెల్సిందే.దీంతో చైనాకు చెక్ పెట్టడమే లక్ష్యంగా అమెరికా, ఆస్ట్రేలియా రూ.75,000 కోట్ల విలువైన చరిత్రాత్మకమైన ‘అరుదైన ఖనిజాల ఒప్పందం’కుదుర్చుకున్నాయి. అధ్యక్షభవనంలో డొనాల్డ్ ట్రంప్, ఆ్రస్టేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ ఈ కీలక ఒప్పందంపై సంతకాలు చేశారు. తర్వాత మీడియాతో ట్రంప్ మాట్లాడారు.‘‘గత కొన్ని నెలలుగా చర్చలు జరిపి ఎట్టకేలకు నేడు ఒప్పందం కుదుర్చుకున్నాం. మరో ఏడాదిలోగా మా రెండు దేశా లు భారీ ఎత్తున అరుదైన ఖనిజ నిల్వలను సాధించనున్నాయి. ఈ నిల్వలతో మేమేం చేస్తామో మీకు కూడా తెలీదు’’అని వ్యాఖ్యానించారు.తొలి ఆరు నెలల్లో ఇరు దేశాలు చెరో 3 బిలియన్ డాలర్ల మేర ఖనిజాల తవ్వకాల ప్రాజెక్ట్‌ల్లో పెట్టుబడులు పెడతాయి. ఉపగ్రహాలు, ఎంఆర్ఐ యంత్రాలు, గైడెన్స్ వ్యవస్థలు, లేజర్లు, జెట్ ఇంజిన్లదాకా అన్నింటి తయారీలోనూ అరుదైన భూ మూలకాలనే ఉపయోగిస్తారు. -
ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. కెప్టెన్ ఔట్
మహిళల వన్డే ప్రపంచకప్‌లో (Women's CWC 2025) టేబుల్ టాపర్‌గా కొనసాగుతున్న డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు (Australia) భారీ షాక్ తగిలింది. ఆ జట్టు ఇన్ ఫామ్ బ్యాటర్, కెప్టెన్ అయిన అలైస్సా హీలీ (Alyssa Healy) గాయం (కాలు వెనుక భాగంలో) కారణంగా ఇంగ్లండ్‌తో రేపు (అక్టోబర్ 23) జరుగబోయే మ్యాచ్‌కు దూరమైంది.ప్రస్తుత ప్రపంచకప్‌లో హీలీ అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉంది. భారత్, బంగ్లాదేశ్‌పై వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విధ్వంసకర శతకాలు బాదింది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ ముగిశాక ప్రాక్టీస్ సమయంలో హీలీ గాయపడినట్లు తెలుస్తుంది. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో హీలీ స్థానంలో బెత్ మూనీ వికెట్ కీపింగ్ చేస్తుందని ఆసీస్ మేనేజ్మెంట్ ప్రకటించింది. ఓపెనర్‌గా హీలీ స్థానాన్ని 22 ఏళ్ల జార్జియా వాల్ భర్తీ చేస్తుందని వెల్లడించింది.ఆసీస్ శిబిరంలో కలవరంహీలీ గాయం నేపథ్యంలో ఆసీస్ శిబిరం కలవరపడుతుంది. ఆమె గాయం తీవ్రతపై స్పష్టత లేకపోవడంతో ఆందోళన చెందుతుంది. ఆసీస్ ఇదివరకే సెమీస్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. ఒకవేళ హీలీ సెమీస్ మ్యాచ్‌కు కూడా దూరమైతే ఆసీస్ విజయావకాశాలను ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది. ఇంగ్లండ్‌తో తర్వాత ఆసీస్ లీగ్ దశలో మరో మ్యాచ్ (సౌతాఫ్రికా) ఆడుతుంది. ఆ మ్యాచ్ అక్టోబర్ 25న జరుగుతుంది. సెమీఫైనల్ మ్యాచ్‌లు అక్టోబర్ 29, 30 తేదీల్లో జరుగనున్నాయి. ఆ సమయానికి హీలీ కోలుకుంటుందని ఆసీస్ శిబిరం ఆశాభావం వ్యక్తం చేస్తుంది.కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో పాటు ఇంగ్లండ్, సౌతాఫ్రికా జట్లు కూడా ఇదివరకే సెమీస్‌కు అర్హత సాధించాయి. నాలుగో బెర్త్ కోసం భారత్, న్యూజిలాండ్ పోటీపడుతున్నాయి. అక్టోబర్ 23న ఇరు జట్ల మధ్య జరుగబోయే మ్యాచ్‌తో నాలుగో సెమీస్ బెర్త్ ఖరారవుతుంది. చదవండి: చరిత్ర సృష్టించిన శ్రీలంక కెప్టెన్.. తొలి ప్లేయర్‌గా రికార్డు -
కాంతార చాప్టర్-1 మరో రికార్డ్.. ఆ దేశంలోనూ ఘనత!
రిషబ్ శెట్టి కాంతార చాప్టర్-1 బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. గతంలో వచ్చిన బ్లాక్‌బస్టర్ మూవీకి ప్రీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం రూ.700 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. దీపావళి కలిసి రావడంతో కలెక్షన్స్ పరంగా సరికొత్త రికార్డులు తిరగరాసింది. ఇప్పటికే పలువురు స్టార్ హీరోల సినిమాలను అధిగమించింది.తాజాగా మరో రికార్డ్‌ను కాంతార చాప్టర్-1 తన ఖాతాలో వేసుకుంది. ఈ ఏడాది ఆస్ట్రేలియాలో అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన ఇండియన్ చిత్రంగా ఘనత దక్కించుకుంది. ఈ విషయాన్ని హోంబలే ఫిల్మ్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. అంతేకాకుండా కేరళలోనూ రూ.55 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో దూసుకెళ్తోంది. రిషబ్ శెట్టి స్వీయదర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.తెలుగులో రాష్ట్రాల్లోనూ రికార్డు..కాంతార చాప్టర్-1 తెలుగు రాష్ట్రాల్లో కేవలం రెండు వారాల్లోనే రూ.105 కోట్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.717.50 కోట్లు కలెక్ట్ చేసి వెయ్యి కోట్ల దిశగా పరుగులు తీస్తోంది. అలాగే హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన సౌత్ సినిమాల లిస్టులోనూ చేరిపోయింది. శాండల్‌వుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా ఘనత సాధించింది. ఈ మూవీలో రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరామ్ కీలక పాత్రలు పోషించారు. హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈసినిమాకు అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు.The divine roar echoes across oceans! 🌊#KantaraChapter1 emerges as 2025’s Highest-Grossing Indian Film in Australia 🇦🇺❤️🔥#BlockbusterKantara running successfully in cinemas near you ✨#KantaraInCinemasNow #DivineBlockbusterKantara #KantaraEverywhere#Kantara @hombalefilms… pic.twitter.com/658jFJTaQz— Hombale Films (@hombalefilms) October 20, 2025 -
బ్యాటర్ల వైఫల్యం.. ఆసీస్ చేతిలో చిత్తైన టీమిండియా
ఆస్ట్రేలియా పర్యటనను టీమిండియా (Team India) ఓటమితో ప్రారంభించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన తొలి వన్డేలో (India vs Australia) 7 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. వరుణుడి ఆటంకాల నడుమ సాగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా (Australia) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.వరుణుడి ఆటంకాలు.. 26 ఓవర్ల మ్యాచ్పలు అంతరాయాల తర్వాత మ్యాచ్‌ను 26 ఓవర్లకు కుదించారు. ఆసీస్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు మాత్రమే చేయగలిగింది.ఆదుకున్న రాహుల్, అక్షర్.. నితీశ్ మెరుపులువికెట్కీపర్ కేఎల్ (38), అక్షర్ పటేల్ (31) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఆఖరి ఓవర్లో అరంగేట్రం ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి (19 నాటౌట్) రెండు సిక్సర్లు బాది గౌరవప్రదమైన స్కోర్ అందించాడు.దారుణంగా విఫలమైన రోహిత్, కోహ్లినాలుగు నెలల విరామం తర్వాత (ఛాంపియన్స్ ట్రోఫీ) రీఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ (8), విరాట్ కోహ్లి (0) దారుణంగా విఫలమయ్యారు. ఫుల్‌టైమ్ వన్డే కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే శుభ్‌మన్ గిల్ (10) నిరాశపరిచాడు. శ్రేయస్ అయ్యర్ (11) పరుగులు చేసేందుకు చాలా ఇబ్బంది పడ్డాడు. వాషింగ్టన్ సుందర్ 10, హర్షిత్ రాణా 1, అర్షదీప్ సింగ్ డకౌటయ్యారు. సత్తా చాటిన ఆసీస్ బౌలర్లుఆసీస్ బౌలర్లలో జోష్ హాజిల్‌వుడ్, మిచెల్ ఓవెన్, కుహ్నేమన్ తలో 2 వికెట్లు తీయగా.. స్టార్క్, ఎల్లిస్ చెరో వికెట్ పడగొట్టారు.సునాయాసంగా ఛేదించిన ఆసీస్26 ఓవర్లలో భారత్ 136 పరుగులు చేసినప్పటికీ.. డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం ఆసీస్ లక్ష్యాన్ని అన్నే ఓవర్లలో 131 పరుగులకు కుదించారు. ఆసీస్ 21.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మిచెల్ మార్ష్ (46 నాటౌట్), రెన్షా (21 నాటౌట్) ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చారు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో ట్రవిస్ హెడ్ (8), మాథ్యూ షార్ట్ (8) విఫలం కాగా.. జోష్ ఫిలిప్ (37) పర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో అర్షదీప్, అక్షర్, సుందర్ తలో వికెట్ తీశారు.ఈ సిరీస్‌లో రెండో వన్డే అక్టోబర్ 23న అడిలైడ్ వేదికగా జరుగనుంది. కాగా, భారత జట్టు 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్, 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. చదవండి: Test Twenty: క్రికెట్లో సరికొత్త ఫార్మాట్.. వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం -
ఆస్ట్రేలియాతో భారత్ తొలి వన్డే మ్యాచ్
-
భారత్‌కు రజత పతకం
జొహోర్ బారు (మలేసియా): సుల్తాన్ ఆఫ్ జొహోర్ కప్ అండర్–21 అంతర్జాతీయ పురుషుల హాకీ టోర్నమెంట్లో భారత జట్టు రజత పతకం దక్కించుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో రోహిత్ సారథ్యంలోని మూడు సార్లు చాంపియన్ టీమిండియా 1–2 గోల్స్ తేడాతో ఆ్రస్టేలియా చేతిలో ఓడింది. చివరి నిమిషంలో ప్రత్యర్థికి గోల్ చేసే అవకాశం ఇవ్వడంతో పాటు... పెనాల్టీ కార్నర్ అవకాశాలను వృథా చేసుకొని పరాజయం వైపు నిలిచింది. భారత్ తరఫున అన్మోల్ ఎక్కా (17వ నిమిషంలో) ఏకైక గోల్ సాధించగా... ఆస్ట్రేలియా తరఫున ఇయాన్ గ్రాబెలార్ (13వ, 59వ నిమిషాల్లో) డబుల్ గోల్స్‌తో మెరిశాడు.తొలి క్వార్టర్లో ఆ్రస్టేలియా గోల్ చేసి ఆధిక్యం సాధించగా... రెండో క్వార్టర్లో అన్మోల్ గోల్‌తో భారత్ స్కోరు సమం చేసింది. ఆ తర్వాత ఇరు జట్లు ఎంత ప్రయత్నించినా మరో గోల్ చేయలేకపోయాయి. అయితే మ్యాచ్ మరో నిమిషంలో ముగుస్తుందనగా... వచ్చిన పెనాల్టీ కార్నర్ అవకాశాన్ని ఆ్రస్టేలియా సద్వినియోగం చేసుకొని ఆధిక్యం రెట్టింపు చేసుకుంది. గత మూడు ఫైనల్స్‌లో ఓడిన ఆ్రస్టేలియాకు ఇది నాలుగో ట్రోఫీ. భారత జట్టుకు చివరి నిమిషంలో ఏకంగా ఆరు పెనాల్టీ కార్నర్ అవకాశాలు దక్కగా... వాటిలో ఒక్కదాన్ని కూడా గోల్‌గా మలచలేకపోయింది. ఆస్ట్రేలియా గోల్ కీపర్ మాగ్నస్ మెక్కాస్లాండ్ చక్కటి ప్రదర్శన కనబర్చాడు. గత రెండు పర్యాయాలు కాంస్య పతకాలు సాధించిన భారత జట్టు... ఈసారి రజతం గెలుచుకుంది. -
భారత్ x ఆస్ట్రేలియా
ఆసియా కప్ టి20ల్లో అజేయంగా ట్రోఫీ గెలుపు, అంతకు ముందు ఇంగ్లండ్‌తో టెస్టుల్లో అద్భుత ప్రదర్శన...ఇప్పుడు కొంత విరామానంతరం భారత జట్టు మూడో ఫార్మాట్లో పెద్ద టీమ్‌తో సమరానికి సిద్ధమైంది. ఈ సారి ఎదురుగా ఉంది వన్డే ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియా. ఆసీస్ గడ్డపైనే జరిగే ఈ మూడు వన్డేల పోరులో పైచేయి సాధించాలని టీమిండియా పట్టుదలగా ఉంది. కొత్త కెప్టెన్ గిల్ నేతృత్వంలో ఈ సమరానికి భారత్ సిద్ధం కాగా... ఈ ఫార్మాట్లో ఆల్‌టైమ్ అత్యుత్తమ ఆటగాళ్లలో ఇద్దరైన విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల ఆటపైనే అందరి దృష్టీ నిలిచింది. మరో వైపు పలువురు కీలక ఆటగాళ్లు దూరమైనా...ఆసీస్ తమ స్వదేశంలో పటిష్టమైన బలగంతోనే బరిలోకి దిగుతోంది. పెర్త్: చాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచిన దాదాపు ఏడు నెలల తర్వాత భారత జట్టు వన్డేల్లో బరిలోకి దిగుతోంది. ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మధ్య నేడు (ఆదివారం) తొలి మ్యాచ్ జరుగుతుంది. ఇరు జట్లు చివరిసారిగా తలపడిన వన్డేలో (చాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్) భారత్ 4 వికెట్ల తేడాతో గెలిచింది. టీమిండియాకు సంబంధించి కెప్టెన్ గా శుబ్‌మన్ గిల్ రావడం ప్రధాన మార్పు కాగా...గాయంతో ప్యాట్ కమిన్స్ తప్పుకోవడంతో మిచెల్ మార్ష్ ఆసీస్ సారథిగా బాధ్యతలు చేపట్టాడు. ఆటగాళ్లంతా ఫామ్‌లో... చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ 2027 వరల్డ్ కప్ జట్టు విషయంలో ఎలాంటి స్పష్టత ఇవ్వకున్నా...దానికి చాలా సమయం ఉందని కోచ్ గంభీర్ చెబుతున్నా వాస్తవ పరిస్థితి ఏమిటో సగటు క్రికెట్ అభిమానులందరికీ తెలుసు. ఈ సిరీస్ గెలిచినా గెలవకపోయినా స్టార్ బ్యాటర్లు కోహ్లి, రోహిత్ ఎలా ఆడతారనేదే అన్నింటికంటే ముఖ్యం. ఈ ఇద్దరు ఆటగాళ్లు ఇంతకంటే ఎక్కువ ఒత్తిడిని ఎదుర్కొన్న సందర్భాలు గతంలో ఎన్నో ఉన్నా...ఇలాంటి అనుభవం పూర్తిగా భిన్నం. వీరిద్దరు పరస్పర కెప్టెన్సీలో కాకుండా మరో సారథి (ధోని) నాయకత్వంలో ఆడి తొమ్మిదేళ్లయింది. ఇప్పుడు ఎంతో జూనియర్ అయిన గిల్ కెప్టెన్సీలో ఆడటంతో పాటు కచ్చితంగా రాణించాల్సిన స్థితిలో వీరిద్దరు ఉన్నారు. ఆట, అనుభవం విషయంలో కొత్తగా చెప్పాల్సింది లేకపోయినా, ఇక్కడా బాగా ఆడాలని అంతా కోరుకుంటున్నారు. ఇతర బ్యాటర్లలో గిల్, శ్రేయస్, రాహుల్ కీలకం కానున్నారు. వన్డే టీమ్‌లోనూ జట్టులో పలువురు ఆల్‌రౌండర్లు జట్టుకు అందుబాటులో ఉన్నారు. అక్షర్, వాషింగ్టన్ సుందర్ రూపంలో ఇద్దరు స్పిన్ ఆల్‌రౌండర్లతో పాటు ఆంధ్ర ఆటగాడు నితీశ్ రెడ్డి బరిలోకి దిగడం కూడా ఖాయం. రెగ్యులర్ స్పిన్నర్‌గా కుల్దీప్ ఆడతాడు. బుమ్రా వన్డే సిరీస్‌కు లేకపోవడంతో ప్రధాన పేసర్‌గా సిరాజ్ బాధ్యతలు తీసుకోనుండగా, ఆసీస్ పరిస్థితులను బట్టి చూస్తే రెండో పేసర్‌గా ప్రసిధ్ లేదా అర్ష్ దీప్ లలో ఒకరికి చాన్స్ దక్కుతుంది. మొత్తంగా జట్టు అన్ని విధాలా పటిష్టంగా కనిపిస్తోంది. కొత్త ఆటగాళ్లతో... వేర్వేరు కారణాలతో పలువురు ఆస్ట్రేలియా రెగ్యులర్ వన్డే ఆటగాళ్లు ఈ మ్యాచ్‌కు దూరమయ్యారు. వారి స్థానాల్లో యువ ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. రెన్షా, ఒవెన్ వన్డేల్లో అరంగేట్రం చేయనున్నారు. ఆసీస్ టాప్ పేసర్లు స్టార్క్, హాజల్‌వుడ్‌తో పాటు కమిన్స్ గైర్హాజరు ఎలిస్‌కు అవకాశం ఇస్తోంది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్లు హెడ్, మార్ష్తమ దూకుడైన బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను ప్రభావితం చేయగలరు. మిగతా ప్రధాన బ్యాటర్లకు పెద్దగా అనుభవం లేకపోయినా సొంతగడ్డ అనుకూలత వారికి బలం కానుంది.పిచ్, వాతావరణం ఆప్టస్ స్టేడియం బ్యాటింగ్‌కు పెద్దగా అనుకూలించే మైదానం కాదు. బౌలర్లే ప్రభావం చూపిస్తారు. గత ఆరేళ్లలో మూడు వన్డేలే జరగ్గా, అన్నింటిలో తక్కువ స్కోర్లే నమోదయ్యాయి. ఆసీస్ ఇక్కడ ఆడిన మూడూ ఓడింది. మ్యాచ్‌కు స్వల్ప వర్ష సూచన ఉంది. తుది జట్లు (అంచనా) భారత్: గిల్ (కెప్టెన్), రోహిత్, కోహ్లి, శ్రేయస్, అక్షర్, రాహుల్, నితీశ్, సుందర్, కుల్దీప్, సిరాజ్,ప్రసిధ్/ అర్ష్ దీప్. ఆ్రస్టేలియా: మార్ష్(కెప్టెన్), హెడ్, షార్ట్, రెన్షా, ఫిలిప్, ఒవెన్, కనోలీ, స్టార్క్, ఎలిస్, కునెమన్,హాజల్‌వుడ్. -
‘రాబోయే కాలమంతా భారత్‌ది.. ఆ దేశ ప్రధానిది.. అటు తర్వాతే ఎవరైనా’
న్యూఢిల్లీ: రాబోయే కాలమంతా భారత్‌దే అంటున్నారు ఆస్ట్రేలియా మాజీ ప్రధాని టోనీ అబోట్. ఈ 21 శతాబ్దం అనేది కచ్చితంగా భారత్‌దేనని అందులో ఎటువంటి సందేహం లేదన్నారు. కనీసం నాలుగు నుంచి ఐదు దశాబ్దాల పాటు ప్రపంచాన్ని భారత్ శాసిస్తుందన్నారు. ఎన్డీటీవీ వరల్డ్ సమ్మిట్-2025లో పాల్గొనేందుకు భారత్‌కు వచ్చిన టోనీ అబాట్.. మాట్లాడుతూ.. భారత్‌పై, ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. స్వేచ్ఛా ప్రపంచం అనే మాటకు భారత్‌ను సరైన నిర్వవచనంగా మారుతుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదన్నారు. అమెరికా అధ్యక్షుడు నుంచి స్వేచ్ఛా ప్రపంచ నాయకుడు అనే బాధ్యతను భారత ప్రధాని తీసుకోవచ్చని అబోట్ అభిప్రాయపడ్డారు. ఈ 21వ శతాబ్దంలో చైనా ఎలాగైతే ఎదిగిందో అలాగే భారత్ కూడా ఎదుగుతుందన్నారు. కనీసం 40 ఏళ్ల నుంచి 50 ఏళ్ల పాటు ప్రపంచాన్ని భారత్ శాసిస్తుందన్నారు. భారత్ సూపర్‌పవర్‌గా ఆవిష్కృతం కావడానికి ఎంతో సమయం పట్టదన్నారు. ప్రపంచంలో భారత్ సరికొత్త సూపర్‌పవర్ కాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో చైనాకు బలమైన ప్రత్యర్థిగా, తమకు నమ్మకమైన భాగస్వామిగా భారత్ కీలక పాత్ర పోషించాలన్నారు. చైనాను ఆర్థికంగా, సైనిక పరంగా అధిగమించే క్రమంలో బారత్ మూడు అతిపెద్ద ప్రయోజాలను కల్గి ఉందన్నారు. అది భారతదేశంలో ప్రజాస్వామ్యం, చట్ట పాలన, ఇంగ్లిష్ అనే ఈ మూడు అంశాలు భారత్ వేగంగా ఎదగడానికి, చైనాను దాటిపోవడానికి కీలకం కాబోతున్నాయన్నారు.ఇదీ చదవండి:‘ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్ కాల్.. అంతా ఉత్తిదే’ -
జోరుగా టీమిండియా సాధన
పెర్త్: దాదాపు ఏడాది క్రితం పెర్త్‌లోని ఆప్టస్ మైదానంలో ఆ్రస్టేలియాతో జరిగిన తొలి టెస్టులో విరాట్ కోహ్లి అజేయ సెంచరీ సాధించాడు. అదే అతని టెస్టు కెరీర్లో చివరి సెంచరీ అయింది. ఇప్పుడు మళ్లీ అదే మైదానానికి వచ్చిన కోహ్లి కొత్త ఉత్సాహంతో కనిపించాడు. ఆసీస్‌తో వన్డే సిరీస్ కోసం సన్నద్ధతలో భాగంగా అతను గురువారం సుదీర్ఘ సమయం పాటు నెట్స్‌లో ప్రాక్టీస్ చేశాడు. ఐపీఎల్ తర్వాత మొదటిసారి బరిలోకి దిగుతున్న కోహ్లి సాధనలో బాగా చురుగ్గా పాల్గొన్నాడు. ముందుగా 20 నిమిషాల పాటు ఫీల్డింగ్ డ్రిల్స్ చేసిన అతను ఆ తర్వాత 40 నిమిషాలు బ్యాటింగ్‌పై దృష్టి పెట్టాడు. హర్షిత్ రాణా, అర్‡్షదీప్ సింగ్‌లతో పాటు స్థానిక ఆటగాళ్లు బౌలింగ్ చేయగా... ఎలాంటి తడబాటు లేకుండా చక్కటి షాట్లు ఆడాడు. అతని పక్క నెట్స్‌లోనే మరో స్టార్ రోహిత్ శర్మ కూడా సుదీర్ఘ సమయం పాటు ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. ఆరంభంలోనే కొద్దిసేపు రోహిత్ తన ఫుట్‌వర్క్, టైమింగ్ విషయంలో కాస్త ఇబ్బంది పడ్డాడు. అయితే కుదురుకున్న తర్వాత అతనూ సాధికారికంగా బ్యాటింగ్ చేశాడు. సెషన్ ముగిసిన తర్వాత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో రోహిత్ చాలాసేపు చర్చించడం కనిపించింది. గతంతో పోలిస్తే ఈసారి కోహ్లి, రోహిత్‌ల వ్యవహార శైలి చాలా ఆసక్తికరంగా కనిపించింది. నెట్స్ వద్దకు అనుమతించిన అభిమానులతో సరదాగా మాట్లాడుతూ వీరిద్దరు ఆటోగ్రాఫ్‌లు ఇస్తూ, సెల్ఫీలు దిగుతూ సమయం గడపడం విశేషం. ఈ ఇద్దరితో పాటు కేఎల్ రాహుల్ కూడా కొద్దిసేపు ప్రాక్టీస్ చేశాడు. గురువారం ఆప్షనల్ ప్రాక్టీస్ డే కాగా... భారత్ నుంచి రెండో బృందంలో వచ్చిన సిరాజ్, కుల్దీప్, అక్షర్ తదితరులు సాధనకు దూరంగా ఉన్నారు. పూర్తి స్థాయి జట్టుకు నేడు ప్రాక్టీస్ సెషన్ ఉంటుంది. అంతకుముందు ఆస్ట్రేలియా బౌలర్లు మిచెల్ స్టార్క్, జాయ్ రిచర్డ్సన్ కూడా నెట్స్‌లో సాధన చేశారు. -
సెమీఫైనల్లో ఆస్ట్రేలియా
సాక్షి, విశాఖపట్నం: నాలుగు రోజుల క్రితం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత సెంచరీతో చెలరేగిన ఆస్ట్రేలియా మహిళల జట్టు కెప్టెన్ అలీసా హీలీ ఇదే మైదానంలో మరో శతకంతో అదరగొట్టింది. ఆసీస్ బౌలర్ల ప్రదర్శనతో తోడు హీలీ, ఫోబీ లిచ్‌ఫీల్డ్ మెరుపు భాగస్వామ్యం డిఫెండింగ్ చాంపియన్‌కు ఘన విజయంతోపాటు సెమీఫైనల్ బెర్త్‌ను కూడా అందించింది. వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా గురువారం ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆ్రస్టేలియా 10 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. శోభన మొస్తరి (80 బంతుల్లో 66 నాటౌట్; 9 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించగా, రుబియా హైదర్ (59 బంతుల్లో 44; 8 ఫోర్లు) రాణించింది. ఆసీస్ ఆటగాళ్లు నాలుగు క్యాచ్‌లు వదిలిపెట్టడంతో బంగ్లా ఈమాత్రం స్కోరు చేయగలిగింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అలానా కింగ్ (2/18) ప్రత్యర్థిని కట్టడి చేయగా... వేర్హామ్, అనాబెల్ సదర్లాండ్, యాష్లే గార్డ్నర్ కూడా తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం ఆ్రస్టేలియా 24.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 202 పరుగులు సాధించి గెలిచింది. అలీసా హీలీ (77 బంతుల్లో 113 నాటౌట్; 20 ఫోర్లు) కెరీర్లో ఏడో సెంచరీ సాధించగా... లిచ్‌ఫీల్డ్ (72 బంతుల్లో 84 నాటౌట్; 12 ఫోర్లు, 1 సిక్స్) అండగా నిలిచింది. బంగ్లాదేశ్ ఎంత ప్రయత్నించినా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయింది. తాజా విజయంతో 5 మ్యాచ్‌ల తర్వాత 9 పాయింట్లతో ఆసీస్ తమ అగ్రస్థానాన్ని మరింత పటిష్టపర్చుకొని సెమీఫైనల్ చేరిన తొలి జట్టుగా నిలిచింది. బంగ్లాదేశ్‌కు ఇది నాలుగో పరాజయం. నేడు కొలంబోలో జరిగే మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో శ్రీలంక తలపడుతుంది. -
వరుసగా రెండో మ్యాచ్‌లో విధ్వంసకర శతకం బాదిన ఆసీస్ కెప్టెన్
భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న మహిళల వన్డే ప్రపంచకప్‌లో (Women's CWC 2025) ఆస్ట్రేలియా కెప్టెన్ అలైస్సా హీలీ (Alyssa Healy) అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉంది. ఈ టోర్నీలో ఆమె వరుసగా రెండో మ్యాచ్‌లో విధ్వంసకర శతకం బాదింది.కొద్ది రోజుల కిందట విశాఖ వేదికగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో 107 బంతుల్లో 21 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో మెరుపు శతకం చేసిన హీలీ.. ఇవాళ (అక్టోబర్ 16) అదే విశాఖ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో మరింత రెచ్చిపోయి 77 బంతుల్లో 20 ఫోర్ల సాయంతో అజేయమైన 113 పరుగులు చేసింది.రెండు మ్యాచ్‌ల్లో హీలీ లక్ష్య ఛేదనల్లోనే సెంచరీలు సాధించడం విశేషం. భారత్‌తో మ్యాచ్‌లో 331 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో శతక్కొట్టగా.. తాజాగా బంగ్లాదేశ్‌పై 199 పరుగుల స్వల్ప ఛేదనలో సెంచరీ చేసింది.నేటి మ్యాచ్‌లో హీలీ ఒంటిచేత్తో తన జట్టును గెలుపుతీరాలు దాటించింది. ఆమెకు మరో ఓపెనర్ ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (72 బంతుల్లో 84 నాటౌట్; 12 ఫోర్లు, సిక్స్) సహకరించింది. వీరిద్దరి ధాటికి ఆసీస్ సగం ఓవర్లు కూడా పూర్తి కాకుండానే (24.5 ఓవర్లు) లక్ష్యాన్ని ఛేదించింది. ఈ గెలుపుతో ఆసీస్ ఓటమెరుగని జట్టుగా పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరి, సెమీస్‌కు కూడా అర్హత సాధించింది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన ఆసీస్.. న్యూజిలాండ్, పాకిస్తాన్, భారత్‌పై విజయాలు సాధించింది. శ్రీలంకతో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది.అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. ఆసీస్ బౌలర్లు మూకుమ్మడిగా రెచ్చిపోవడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 198 పరుగులు మాత్రమే చేయగలిగింది. మిడిలార్డర్ బ్యాటర్ శోభన మోస్తరి (66 నాటౌట్), ఓపెనర్ రుబ్యా హైదర్ (44) మాత్రమే ఓ మోస్తరు స్కోర్లు చేశారు.ఆసీస్ బౌలర్లలో అలానా కింగ్ అద్భుతంగా బౌలింగ్ చేసింది. తన కోటా 10 ఓవర్లలో కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసింది. ఇందులో 4 మెయిడిన్లు ఉండటం విశేషం. మిగతా బౌలర్లలో ఆష్లే గార్డ్నర్, అన్నాబెల్ సదర్‌ల్యాండ్, జార్జియా వేర్హమ్ కూడా తలో 2 వికెట్లు తీశారు. మెగాన్ షట్‌కు ఓ వికెట్ దక్కింది.చదవండి: చివరి బెర్త్ కూడా ఖరారు.. టీ20 ప్రపంచకప్ ఆడబోయే జట్లు ఇవే..! -
తేలిపోయిన బంగ్లా బ్యాటర్లు.. ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే..?
మహిళల వన్డే ప్రపంచకప్‌లో (Women's CWC 2025) ఇవాళ (అక్టోబర్ 16) ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ (Australia vs Bangladesh) జరుగుతుంది. వైజాగ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. పటిష్టమైన ఆస్ట్రేలియా బౌలింగ్ ధాటికి నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 198 పరుగులు మాత్రమే చేయగలిగింది.ఆసీస్ బౌలర్ల అనుభవం ముందు బంగ్లా బ్యాటర్లు తేలిపోయారు. మిడిలార్డర్ బ్యాటర్ శోభన మోస్తరి (66 నాటౌట్), ఓపెనర్ రుబ్యా హైదర్ (44) మాత్రం కాస్త ప్రతిఘటించారు. మిగతా 9 మందిలో షర్మిన్ అక్తర్ (19), కెప్టెన్ నిగార్ సుల్తానా (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఫర్జానా హాక్ (8), షోర్నా అక్తర్ (7), రితూ మోనీ (2), ఫహీమా ఖాతూన్ (4), రబేయా ఖాన్ (6), నిషిత అక్తర్ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితమయ్యారు.ఆసీస్ బౌలర్లలో అలానా కింగ్ అద్భుతంగా బౌలింగ్ చేసింది. తన కోటా 10 ఓవర్లలో కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసింది. ఇందులో 4 మెయిడిన్లు ఉండటం విశేషం. మిగతా బౌలర్లలో ఆష్లే గార్డ్నర్, అన్నాబెల్ సదర్‌ల్యాండ్, జార్జియా వేర్హమ్ కూడా తలో 2 వికెట్లు తీశారు. మెగాన్ షట్‌కు ఓ వికెట్ దక్కింది.ప్రస్తుత ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన ఆసీస్ ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌ల్లో ఒక్క ఓటమి కూడా లేకుండా పాయింట్లు పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఇంగ్లండ్, సౌతాఫ్రికా, భారత్ ఒకటి, మూడు, నాలుగో స్థానాల్లో ఉన్నాయి. న్యూజిలాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్ వరుసగా ఐదు నుంచి ఎనిమిది స్థానాల్లో ఉన్నాయి.చదవండి: సూపర్ సెంచరీతో కదంతొక్కిన ఆర్సీబీ కెప్టెన్ -
ఎలా ఉన్నావు హీరో!
న్యూఢిల్లీ: దాదాపు ఏడు నెలల సుదీర్ఘ విరామం తర్వాత స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ భారత జట్టుతో చేరారు. చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత వీరిద్దరు అంతర్జాతీయ క్రికెట్ బరిలోకి దిగలేదు. టెస్టు లేదా టి20 జట్టు సభ్యులుగా ఉన్న ఇతర ప్లేయర్లు కలిసి ఆడుతూ బిజీగా ఉండగా వన్డేలకే పరిమితమైన రోహిత్, కోహ్లి మాత్రం టీమ్‌కు దూరంగా ఉన్నారు. వన్డే, టి20ల సిరీస్‌ల కోసం బుధవారం భారత జట్టు రెండు బృందాలుగా ఆ్రస్టేలియాకు బయల్దేరి వెళ్లింది. మొదటి బృందంలో రోహిత్, కోహ్లి, శ్రేయస్, కెపె్టన్ శుబ్‌మన్ గిల్ తదితరులు ఉన్నారు. ఎలా ఉన్నావు హీరో?ఈ సందర్భంగా రోహిత్, గిల్ భేటీ ఆసక్తిని సంతరించుకుంది. తన స్థానంలోనే గిల్‌ను సెలక్టర్లు వన్డే కెప్టెన్ గా నియమించగా... గిల్ నాయకత్వంలో రోహిత్ తొలిసారి ఆడనున్నాడు. టూర్‌కు వెళ్లేందుకు ఆటగాళ్లంతా ఒకే చోటికి చేరే క్రమంలో ఇందిరాగాంధీ విమానాశ్రయంలో రోహిత్‌ను చూసిన గిల్ దగ్గరకు వచ్చి ఆలింగనం చేసుకున్నాడు. వెంటనే రోహిత్ కూడా ‘ఎలా ఉన్నావు హీరో’ అంటూ ఆత్మీయంగా పలకరించాడు. టీమ్ బస్సులోకి వెళ్లాక మొదటి సీటులోనే కూర్చున్న కోహ్లికి కూడా గిల్ అభివాదం చేయగా... దానికి బదులిచ్చిన కోహ్లి కెపె్టన్ భుజం తట్టి అభినందించాడు. జట్టు సహచరుల్లో కనిపించిన చిరునవ్వులు అందరి మధ్య ఉన్న అనుబంధాన్ని చూపించాయి. ఆసీస్ పర్యటనలో భాగంగా భారత జట్టు 3 వన్డేలు, 5 టి20లు ఆడుతుంది. ఆదివారం ఇరు జట్ల మధ్య తొలి వన్డే జరుగుతుంది. 𝙀𝙣 𝙧𝙤𝙪𝙩𝙚 𝘿𝙤𝙬𝙣 𝙐𝙣𝙙𝙚𝙧 ✈️Of familiar faces and special reunions as #TeamIndia depart for the Australia challenge 😍#AUSvIND pic.twitter.com/ElV3OtV3Lj— BCCI (@BCCI) October 15, 2025 -
‘ప్రపంచకప్ టోర్నీకి చాలా సమయం ఉంది’
న్యూఢిల్లీ: భారత్, ఆ్రస్టేలియా మధ్య ఈ నెల 19 నుంచి మూడు వన్డేల సిరీస్ జరగనుంది. సిరీస్ ఫలితంకంటే విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల గురించే ఇప్పుడు చర్చ జరుగుతోంది. చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత మళ్లీ ఈ సిరీస్‌తోనే బరిలోకి దిగుతున్న వీరిద్దరు ఇప్పటికే రెండు ఫార్మాట్ల నుంచి రిటైర్ అయి ఒక్క వన్డేలే ఆడుతున్నారు. ఈ క్రమంలో రోహిత్‌ను వన్డే కెప్టెన్సీ నుంచి కూడా తప్పించారు. ఈనేపథ్యంలో తాజా చర్చపై భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఇప్పటికిప్పుడు వారిద్దరి భవిష్యత్తుపై తానేమీ చెప్పలేనని స్పష్టం చేశాడు. ‘వన్డే వరల్డ్‌కప్‌కు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉంది. కాబట్టి భవిష్యత్తుకంటే ప్రస్తుతంపైనే దృష్టి పెట్టడం ముఖ్యమని నేను భావిస్తా. వారిద్దరు అత్యుత్తమ ఆటగాళ్లు అనడంలో సందేహం లేదు. పునరాగమనం చేస్తున్న వారి అనుభవం ఆ్రస్టేలియాలో పనికొస్తుంది. వీరిద్దరు బాగా ఆడి సిరీస్ విజయంలో భాగమవుతారని ఆశిస్తున్నా’ అని గంభీర్ చెప్పాడు. గిల్‌కు కెప్టెన్సీ అర్హత ఉంది... భారత టెస్టు కెప్టెన్సీతో పాటు వన్డేలకు కూడా సారథ్యం వహించే సత్తా, అర్హత శుబ్‌మన్ గిల్‌కు ఉన్నాయని, ఈ హక్కును అతను సాధించుకున్నాడని గంభీర్ ప్రశంసించాడు. ‘కెప్టెన్‌గా గిల్‌ను నియమించి ఎవరూ ఔదార్యం చూపించలేదు. అతడికి ఆ అర్హత ఉంది. కోచ్‌గా కూడా నేను ఈ మాట చెప్పగలను. ప్రపంచ క్రికెట్లో అతి కఠినమైన పర్యటనల్లో ఇంగ్లండ్ ఒకటి. అలాంటి చోట ఐదు టెస్టులూ గట్టిగా నిలబడి సిరీస్‌ను సమం చేసుకోగలగడం చిన్న విషయం కాదు. బ్యాటింగ్‌లోనూ అదరగొట్టడంతో పాటు జట్టును సమర్థంగా నడిపి వన్డేల్లోనూ సారథి కాగల హక్కును అతను సాధించాడు’ అని గంభీర్ అన్నాడు. 2027 వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ గురించి ఇప్పుడే మాట్లాడటం అనవసరమని, వరుసగా విజయాలు సాధించడమే తమ లక్ష్యమని అతను స్పష్టం చేశాడు. భారత జట్టు నవంబర్ 9న ఆస్ట్రేలియాతో చివరి టెస్టు ఆడనుండగా... నవంబర్ 14 నుంచి కోల్‌కతాలో దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు జరుగుతుంది. అయితే ప్రొఫెషనల్ క్రికెటర్లు తక్కువ సమయంలో పరిస్థితులకు తగినట్లుగా మార్చుకోగలరని విశ్వాసం వ్యక్తం చేసిన గంభీర్... టెస్టు టీమ్‌లో మాత్రమే సభ్యులైన ఆటగాళ్లు రంజీ ట్రోఫీలో బరిలోకి దిగాలని సూచించాడు. వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ గెలవడం పట్ల కోచ్ సంతృప్తి వ్యక్తం చేశాడు. అయితే భారత్‌లో కూడా పేస్ బౌలర్లకు కూడా కాస్త అనుకూలించే విధంగా బౌన్సీ పిచ్‌లు ఉంటే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. హర్షిత్ రాణాపై అనవసర విమర్శలు... భారత జట్టు తరఫున మూడు ఫార్మాట్లలోనూ వరుసగా అవకాశాలు పొందుతున్న పేస్ బౌలర్ హర్షిత్ రాణాపై ఇటీవల సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రతిభావంతుడు కాకపోయినా... ఢిల్లీకి చెందినవాడు కావడంతో పాటు గంభీర్ ఐపీఎల్ టీమ్ కేకేఆర్‌కు మెంటార్‌గా ఉన్న సమయంలో సాన్నిహిత్యం వల్లే రాణాకు జట్టులో చోటు దక్కుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారత మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ కూడా ఇటీవల ఇదే మాట అన్నాడు. తాజా విమర్శలపై గంభీర్ తీవ్రంగా స్పందించాడు. ఈ వివాదంలో హర్షిత్‌కు అతను పూర్తి మద్దతు పలికాడు. ‘యూట్యూబ్‌లో వ్యూస్ కోసం కొందరు ఒక 23 ఏళ్ల యువ ఆటగాడిని లక్ష్యంగా చేసుకున్నందుకు సిగ్గుపడాలి. రాణా తండ్రి మాజీ క్రికెటర్ కాదు. సెలక్షన్ కమిటీ మాజీ చైర్మన్ కానీ ఎన్ఆర్ఐ కానీ కాదు. అతను తన ప్రతిభను నమ్ముకొనే క్రికెట్ ఆడుతున్నాడు. ఒక ఆటగాడి ప్రదర్శన బాగా లేకుండా విమర్శించవచ్చు కానీ ఇలా వ్యక్తిగత విమర్శలు చేస్తారా. కావాలంటే నన్ను విమర్శించండి. నేను దానిని భరించగలను. కానీ 23 ఏళ్ల ఆటగాడిపై ఇది మానసికంగా ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఆలోచించారా. భారత క్రికెట్ జట్టు ఎవరిదో సొంత ఆస్తి కాదు. మన జట్టు గెలవాలని భావించే అందరిది ఈ జట్టు అని మర్చిపోవద్దు’ అని గంభీర్ వ్యాఖ్యానించాడు. -
330 సరిపోలేదు.. భారత్‌పై ఆసీస్ గ్రాండ్ విక్టరీ
స్టార్ బ్యాటర్ స్మృతి ఫామ్‌లోకి వచ్చింది. ప్రతీక, జెమీమా కూడా రాణించారు. 330 పరుగుల భారీ స్కోరు నమోదైంది. పిచ్ బ్యాటింగ్‌కు కాస్త అనుకూలంగానే ఉన్నా... ఈ భారీ స్కోరును కాపాడుకోవచ్చని భారత మహిళలు భావించారు. కానీ అటువైపు ఉన్నది ఆస్ట్రేలియా... కెప్టెన్ అలీసా హీలీ నేతృత్వంలో డిఫెండింగ్ చాంపియన్ జట్టు ఎక్కడా తగ్గకుండా దూసుకుపోయింది. చివర్లో కొన్ని అవకాశాలు సృష్టించుకొని భారత్ పట్టు బిగించినట్లు కనిపించినా... ప్రత్యర్థి విజయాన్ని ఆపడానికి అవి సరిపోలేదు. దాంతో గత మ్యాచ్ తరహాలోనే గెలుపునకు చేరువైనట్లు కనిపించినా... మరో ఓటమితో టీమిండియాకు నిరాశ తప్పలేదు. సాక్షి క్రీడా ప్రతినిధి, విశాఖపట్నం: సొంతగడ్డపై మహిళల వన్డే వరల్డ్ కప్‌లో భారత్‌కు మరో నిరాశజనక ఫలితం ఎదురైంది. ఆదివారం ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో హోరాహోరీగా సాగిన పోరులో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా జట్టు 3 వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 48.5 ఓవర్లలో 330 పరుగులకు ఆలౌటైంది. అన్ని వరల్డ్‌కప్‌లలో కలిపి భారత్‌కు ఇదే అత్యధిక స్కోరు. ఓపెనర్లు స్మృతి మంధాన (66 బంతుల్లో 80; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు), ప్రతీక రావల్ (96 బంతుల్లో 75; 10 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు సాధించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 24.3 ఓవర్లలో 155 పరుగులు జోడించారు. ఆ్రస్టేలియా బౌలర్ అనాబెల్ సదర్లాండ్ 40 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టింది. అనంతరం ఆ్రస్టేలియా 49 ఓవర్లలో 7 వికెట్లకు 331 పరుగులు సాధించి గెలిచింది. మహిళల వన్డేల చరిత్రలో ఇదే అత్యధిక ఛేదన కావడం విశేషం. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అలీసా హీలీ (107 బంతుల్లో 142; 21 ఫోర్లు, 3 సిక్స్‌లు) అద్భుత సెంచరీతో చెలరేగింది. ఆంధ్రప్రదేశ్ స్పిన్నర్ నల్లపురెడ్డి శ్రీచరణి 41 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు తీసింది. భారత్ తమ తర్వాతి పోరులో ఈ నెల 19న ఇంగ్లండ్‌తో ఇండోర్‌లో తలపడుతుంది. నేడు విశాఖపట్నంలో జరిగే మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో దక్షిణాఫ్రికా తలపడుతుంది. భారత ఓపెనర్లు ప్రతీక, స్మృతి ఇన్నింగ్స్‌ను జాగ్రత్తగా మొదలు పెట్టారు. ఫలితంగా తొలి 7 ఓవర్లలో 26 పరుగులే వచ్చాయి. పవర్‌ప్లే తర్వాత 11–15 ఓవర్లలో భారత్ 15 పరుగులే చేసింది. ఓపెనర్లు ధాటిని పెంచడంతో 21–24 మధ్య 4 ఓవర్లలోనే 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46 పరుగులు రావడం విశేషం. ఎట్టకేలకు స్మృతిని అవుట్ చేసి మోలినే ఈ భాగస్వామ్యాన్ని విడదీసింది. ఆ తర్వాత హర్లీన్ డియోల్ (38; 3 ఫోర్లు, 1 సిక్స్) కూడా కొన్ని చక్కటి షాట్లతో ఆకట్టుకోగా, 30 ఓవర్లు ముగిసేసరికి జట్టు స్కోరు 192/1కు చేరింది. అయితే తర్వాతి బంతికే ప్రతీక వెనుదిరగ్గా, హర్మన్‌ప్రీత్ (22; 3 ఫోర్లు) ధాటిగా ఆడే ప్రయత్నంలో వెనుదిరిగింది. అయితే జెమీమా రోడ్రిగ్స్ (21 బంతుల్లో 33; 5 ఫోర్లు), రిచా ఘోష్ (22 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడు ప్రదర్శిస్తూ స్కోరును 300 దాటించారు.వీరిద్దరు ఐదో వికెట్‌కు 34 బంతుల్లో 54 పరుగులు జత చేశారు. అయితే ఆఖర్లో భారీ షాట్లకు యత్నించి భారత బ్యాటర్లు వరుసగా వెనుదిరిగారు. 36 పరుగుల వ్యవధిలో చివరి 6 వికెట్లు కోల్పోయిన జట్టు ఇన్నింగ్స్ మరో 7 బంతుల ముందే ముగిసింది. ఓపెనర్ల దూకుడు... భారీ ఛేదనలో ఆసీస్‌కు ఓపెనర్లు హీలీ, లిచ్‌ఫీల్డ్ ఘనమైన ఆరంభం అందించారు. క్రాంతి ఓవర్లో 3 ఫోర్లు, సిక్స్‌తో హీలీ దూకుడు కనబర్చగా, అమన్‌జోత్ ఓవర్లో లిచ్‌ఫీల్డ్ 4 ఫోర్లు బాదింది. తొలి వికెట్‌కు వీరిద్దరు 68 బంతుల్లోనే 85 పరుగులు జోడించారు. అయితే లిచ్‌ఫీల్డ్‌తో పాటు తక్కువ వ్యవధిలో బెత్ మూనీ (4), అనాబెల్ సదర్లాండ్ (0) అవుటయ్యారు. కానీ మరోవైపు హీలీ ఎక్కడా తగ్గకుండా ధాటిగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను నడిపించింది. ఈ క్రమంలోనే 84 బంతుల్లో ఆమె శతకం పూర్తి చేసుకుంది. ఆసీస్ విజయానికి చేరువవుతున్న దశలో ఒక్కసారిగా భారత బౌలర్లు పైచేయి సాధించారు. ఫలితంగా 38 పరుగుల వ్యవధిలో జట్టు 4 వికెట్లు చేజార్చుకోవడంతో ఉత్కంఠ పెరిగింది. అయితే ఒత్తిడిని అధిగమించి ఆసీస్ ఒక ఓవర్ ముందే గెలిచింది.112 స్మృతి 5 వేల పరుగులు పూర్తి చేసుకునేందుకు పట్టిన ఇన్నింగ్స్‌ల సంఖ్య. మహిళల వన్డేల్లో అందరికంటే వేగంగా ఆమె ఈ మైలురాయిని చేరుకుంది. ఇదే ఇన్నింగ్స్‌లో ఒకే ఏడాది 1000 పరుగులు చేసిన తొలి క్రికెటర్‌గా కూడా స్మృతి గుర్తింపు పొందింది.331 మహిళల వన్డేల్లో అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా ఆస్ట్రేలియా రికార్డు నెలకొల్పింది. శ్రీలంక జట్టు (302 దక్షిణాఫ్రికాపై 2024లో) పేరిట ఉన్న రికార్డును ఆస్ట్రేలియా అధిగమించింది.స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: ప్రతీక (సి) పెరీ (బి) సదర్లాండ్ 75; స్మృతి (సి) లిచ్‌ఫీల్డ్ (బి) మోలినే 80; హర్లీన్ (సి) సదర్లాండ్ (బి) మోలినే 38; హర్మన్‌ప్రీత్ (సి) మోలినే (బి) షుట్ 22; జెమీమా (సి) మూనీ (బి) సదర్లాండ్ 33; రిచా (సి) (సబ్) వేర్హమ్ (బి) సదర్లాండ్ 32; అమన్‌జోత్ (సి) మోలినే (బి) గార్డ్నర్ 16; దీప్తి (సి) మూనీ (బి) మోలినే 1; స్నేహ్ (నాటౌట్) 8; క్రాంతి (సి) (సబ్) వేర్హమ్ (బి) సదర్లాండ్ 1; శ్రీచరణి (బి) సదర్లాండ్ 0; ఎక్స్‌ట్రాలు 24; మొత్తం (48.5 ఓవర్లలో ఆలౌట్) 330. వికెట్ల పతనం: 1–155, 2–192, 3–234, 4–240, 5–294, 6–309, 7–320, 8–327, 9–330, 10–330. బౌలింగ్: గార్త్ 5–0–35–0, షుట్ 6.1–0–37–1, యాష్లే గార్డ్నర్ 7–0–40–1, మోలినే 10–1–75–3, సదర్లాండ్ 9.5–0–40–5, తాలియా మెక్‌గ్రాత్ 4.5–0–43–0, అలానా కింగ్ 6–0–49–0. ఆ్రస్టేలియా ఇన్నింగ్స్: హీలీ (సి) స్నేహ్ (బి) శ్రీచరణి 142; లిచ్‌ఫీల్డ్ (సి) స్నేహ్ (బి) శ్రీచరణి 40; ఎలీస్ పెరీ (నాటౌట్) 47; మూనీ (సి) రోడ్రిగ్స్ (బి) దీప్తి 4; సదర్లాండ్ (బి) శ్రీచరణి 0; యాష్లే గార్డ్నర్ (బి) అమన్‌జోత్ 45; తాలియా మెక్‌గ్రాత్ (ఎల్బీ) (బి) దీప్తి 12; మోలినే (ఎల్బీ) (బి) అమన్‌జోత్ 18; కిమ్ గార్త్ (నాటౌట్) 14; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (49 ఓవర్లలో 7 వికెట్లకు) 331. వికెట్ల పతనం: 1–85, 2–168, 3–170, 4–265, 5–279, 6–299, 7–303. బౌలింగ్: అమన్‌జోత్ 9–0–68–2, క్రాంతి 9–1–73–0, స్నేహ్ రాణా 10–0–85–0, శ్రీచరణి 10–1–41–3, దీప్తి 10–0–52–2, హర్మన్‌ప్రీత్ 1–0–10–0. -
CWC 2025: ఆస్ట్రేలియాతో సమరం.. టీమిండియా బ్యాటింగ్
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో (Women's Cricket World Cup 2025) ఇవాళ (అక్టోబర్ 12) ఆసక్తికర సమరం జరుగుతుంది. భారత్, ఆస్ట్రేలియా (India vs Australia) జట్లు వైజాగ్ వేదికగా అమీతుమీ తేల్చుకుంటాయి. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా (Australia) టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. భారత మహిళల జట్టు (Team India) వన్డేల్లో టాస్ కోల్పోవడం ఇది వరుసగా ఆరోసారి. తుది జట్లు..ఆస్ట్రేలియా: అలిస్సా హీలీ (కెప్టెన్/వికెట్‌కీపర్), ఫోబ్ లిచ్‌ఫీల్డ్, ఎల్లీస్ పెర్రీ, బెత్ మూనీ, అన్నాబెల్ సదర్లాండ్, ఆష్లీ గార్డనర్, తహ్లియా మెక్‌గ్రాత్, సోఫీ మోలినెక్స్, కిమ్ గార్త్, అలానా కింగ్, మెగాన్ షుట్భారత్: ప్రతికా రావల్, స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్‌కీపర్), అమంజోత్ కౌర్, స్నేహ్ రాణా, క్రాంతి గౌడ్, శ్రీ చరణికాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో భారత్ వరుసగా శ్రీలంక, పాకిస్తాన్‌పై విజయాలు సాధించి, మూడో మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో అనూహ్యంగా ఓడింది. వాస్తవానికి ఆ మ్యాచ్‌లోనూ భారత్‌కు గెలిచే అవకాశం ఉండినప్పటికీ.. నదినే డి క్లెర్క్ సంచలన ఇన్నింగ్స్‌తో భారత్ చేతుల్లో నుంచి మ్యాచ్‌ను లాగేసుకుంది. ప్రస్తుతం భారత్ 3 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది.ఆసీస్ విషయానికొస్తే.. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన ఈ జట్టు తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. ఆ తర్వాతి మ్యాచ్ (శ్రీలంక) వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోయింది (ఓ పాయింట్ లభించింది). మూడో మ్యాచ్‌లో ఆసీస్ పాక్‌పై ఘన విజయం సాధించింది. ప్రస్తుతం ఆసీస్ 3 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో 5 పాయింట్లు ఖాతాలో కలిగి ఉండి పట్టికలో రెండో స్థానంలో ఉంది. 3 మ్యాచ్‌ల్లో మూడు విజయాలు సాధించిన ఇంగ్లండ్ టాప్ ప్లేస్‌లో ఉంది. చదవండి: చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా.. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి జట్టు -
భారత్‌కు కాస్త 'కంగారు'
మహిళల క్రికెట్లో భారత జట్టు స్థాయిని చూపించే మ్యాచ్‌కు నేడు విశాఖ వేదిక అవుతోంది. దక్షిణాఫ్రికా చేతిలో అనూహ్య ఓటమి తర్వాత అత్యంత పటిష్టమైన ఆస్ట్రేలియాను ఎదుర్కొనేందుకు భారత్ సై అంటోంది. ఇటీవల ఇదే జట్టుతో జరిగిన వన్డే సిరీస్‌ను కోల్పోయినా... పోరు హోరాహోరీగా సాగింది. అయితే వరల్డ్ కప్‌కు ముందు అసాధారణంగా కనిపించిన హర్మన్ సేన మెగా టోర్నీలో ఒక్కసారిగా ఫామ్ కోల్పోయినట్లుగా అనిపిస్తోంది. ఇప్పటికే సఫారీల చేతిలో ఓడిన నేపథ్యంలో సెమీస్ రేసులో నిలవాలంటే పెద్ద జట్టుపై గెలుపు తప్పనిసరి. మరో వైపు అన్ని రంగాల్లో పటిష్టంగా ఉన్న ఆసీస్ తమ ఎనిమిదో టైటిల్ వేటలో భారీ విజయాన్ని ఆశిస్తోంది. విశాఖపట్నం, సాక్షి క్రీడా ప్రతినిధి: వన్డే వరల్డ్ కప్‌లో భారత జట్టు నేడు కీలక మ్యాచ్‌కు సన్నద్ధమైంది. వైజాగ్‌లోని ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో నేడు జరిగే లీగ్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో భారత మహిళల బృందం తలపడుతుంది. రెండు విజయాల తర్వాత దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఓటమి చవి చూడగా...రెండు మ్యాచ్‌లు గెలిచిన కంగారూలు శ్రీలంకతో మ్యాచ్ రద్దు కావడంతో కీలకమైన రెండు పాయింట్లు సాధించే అవకాశం కోల్పోయారు. ఈ నేపథ్యంలో మ్యాచ్ ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది. మ్యాచ్‌కు ముందు ఒక స్టాండ్‌కు మిథాలీ రాజ్ పేరు పెట్టే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ ముగ్గురు చెలరేగితేనే...వరల్డ్ కప్‌లో ఆడిన మూడు మ్యాచ్‌లలో స్మృతి చేసిన స్కోర్లు 8, 23, 23...హర్మన్ ప్రీత్ వరుసగా 21,19, 9 పరుగులు చేయగా...ఒక మ్యాచ్‌లో 32 పరుగులు చేసిన జెమీమా మరో రెండు సార్లు డకౌటైంది. మన జట్టులోని ముగ్గురు స్టార్ బ్యాటర్ల స్కోర్లను కలిపి చూస్తే 9 ఇన్నింగ్స్‌లలో ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదు కాలేదు. వరల్డ్ కప్ టైటిల్‌పై భారీ ఆశలు పెట్టుకున్న భారత జట్టుకు ఈ స్థితి ఆందోళనకరంగా మారింది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో పూర్తిగా తడబడ్డ హర్మన్ 9 పరుగుల కోసం 23 బంతులు ఆడగా, స్మృతి తొలి బౌండరీ కొట్టేందుకు 21 బంతులు తీసుకుంది. జెమీమా 3 సార్లూ లెఫ్టార్మ్ స్పిన్నర్ బౌలింగ్‌లోనే అవుట్ కావడం ఆమె బలహీనతను చూపిస్తోంది. ఈ ముగ్గురితో పాటు ప్రతీక, హర్లీన్ కూడా అంతంతమాత్రం ప్రదర్శనే చేశారు. ప్రతీసారి లోయర్ ఆర్డర్ జట్టును ఆదుకోవడం సాధ్యం కాకపోవచ్చు. దక్షిణాఫ్రికాతో ఇన్నింగ్స్ రిచాలో ఆత్మవిశ్వాసం పెంచగా... దీప్తి, అమన్‌జోత్ కూడా కీలకం కానున్నారు. గత మ్యాచ్ చివర్లో డి క్లెర్క్ చెలరేగే వరకు మన బౌలర్లంతా చక్కటి బౌలింగ్ చేశారు. ఐదుగురు రెగ్యులర్ బౌలర్లతో పాటు హర్మన్ కూడా నాలుగు ఓవర్లు వేసింది. అందుకే ప్రత్యా మ్నాయంగా ఆరో బౌలర్ అవసరం ఉండకపోవచ్చు. ఈ నేపథ్యంలో తుది జట్టులో మార్పులు లేకుండానే భారత్ బరిలోకి దిగే అవకాశం ఉంది. గత మ్యాచ్‌లో పొదుపుగా బౌలింగ్ చేసిన ఆంధ్ర బౌలర్ శ్రీచరణి నిరూపించుకునేందుకు ఇది మరో మంచి అవకాశం.ఒకరిని మించి మరొకరు...ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో అయినా మ్యాచ్‌ను మలుపు తిప్పే సామర్థ్యం ఆస్ట్రేలియాకు ఉంది. పాకిస్తాన్‌తో మ్యాచ్ అందుకు ఉదాహరణ. పాక్ బలహీన జట్టే అయినా 76 పరుగులకు 7 వికెట్లు కోల్పోయిన తర్వాత కూడా 200పైగా పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లో చెలరేగి భారీ విజయం సాధించడం ఆసీస్‌కే చెల్లింది. కివీస్‌పై 326 పరుగులు చేసిన ఆ జట్టు...అంతకు ముందు భారత్‌పై చివరి వన్డేలో ఏకంగా 412 పరుగులు నమోదు చేసిన విషయం మరచిపోవద్దు. టోర్నీలో ఇప్పటికే మూనీ, గార్డ్నర్ శతకాలు నమోదు చేశారు. మిగతా ప్రధాన బ్యాటర్లు ఇంకా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. హీలీ, పెరీ తమ స్థాయికి తగినట్లుగా చెలరేగితే భారత్‌కు కష్టాలు తప్పవు. సదర్లాండ్ రూపంలో చక్కటి ఆల్‌రౌండర్ జట్టులో ఉంది. పిచ్, వాతావరణంగత మ్యాచ్ తరహాలోనే బ్యాటింగ్‌కు అనుకూలం. మంచి బౌన్స్ కూడా ఉండటంతో షాట్లకు అవకాశం ఉంది. మ్యాచ్ రోజు వర్ష సూచన లేదు. ఆదివారం కూడా కావడంతో స్టేడియం పూర్తి సామర్థ్యం మేరకు నిండే అవకాశం ఉంది. తుది జట్లు (అంచనా)భారత్: హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), స్మృతి, ప్రతీక, హర్లీన్, జెమీమా, దీప్తి, అమన్‌జోత్, రిచా ఘోష్, స్నేహ్, క్రాంతి, శ్రీచరణి.ఆస్ట్రేలియా: అలీసా హీలీ (కెప్టెన్), లిచ్‌ఫీల్డ్, ఎలైస్ పెరీ, మూనీ, సదర్లాండ్, గార్డ్నర్, తాహిలా, వేర్హామ్, గార్త్, అలానా కింగ్, మెగాన్ షుట్. -
టీమిండియాకు షాక్ ఇవ్వనున్న మ్యాక్స్‌వెల్..!
త్వరలో భారత్‌తో జరుగబోయే టీ20 సిరీస్ కోసం ఎంపిక చేసిన ఆస్ట్రేలియా జట్టులో (తొలి రెండు మ్యాచ్‌లు) విధ్వంకర బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కు (Glenn Maxwell) చోటు దక్కని విషయం తెలిసిందే. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్ సందర్భంగా గాయపడటంతో మ్యాక్సీని ఎంపిక చేయలేదు. గాయం తీవ్రతగా అధికంగా ఉండటంతో మ్యాక్స్‌వెల్ ఈ సిరీస్ మొత్తానికే దూరమవుతాడనే ప్రచారం జరిగింది.మ్యాక్స్‌వెల్ లాంటి ప్రమాదకర ఆటగాడు లేకపోవడం ఈ సిరీస్‌లో తమ విజయావకాశాలను మెరుగుపరుస్తుందని టీమిండియా భావించింది. అయితే తాజాగా మ్యాక్సీ చేసిన ఓ ప్రకటన టీమిండియా ధీమాను దెబ్బతీసేలా కనిపిస్తుంది.చివరి మూడు మ్యాచ్‌లకు తాను సిద్దమంటూ మ్యాక్సీ సంకేతాలు పంపాడు. ఒకవేళ ఇదే జరిగితే టీమిండియా విజయావకాశాలు తప్పక ప్రభావితమవుతాయి. ఇటీవలే వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన మ్యాక్సీ పూర్తిగా పొట్టి ఫార్మాట్‌పైనే ఫోకస్ పెట్టాడు. భారత్‌తో సిరీస్‌లో అతను చెలరేగే అవకాశం ఉంది. చివరి మూడు మ్యాచ్‌లకు అందుబాటులోకి వస్తే చేయాల్సిన డ్యామేజ్ చేస్తాడు.ఈఎస్పీఎన్ కథనం ప్రకారం.. గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న మ్యాక్సీ భారత్‌తో మూడో వన్డే సమయానికి పూర్తిగా కోలుకుంటాడు. శస్త్ర చికిత్సకు ముందు డాక్టర్లు అతనికి రెండు ఆప్షన్లు ఇచ్చారు. ఒకటి.. సహజంగా కోలుకోవాలంటే భారత్‌తో సిరీస్ మొత్తానికే దూరం కావాలి. ఒకవేళ పాక్షికంగా అయినా ఆ సిరీస్‌లో పాల్గొనాలనుకుంటే శస్త్ర చికిత్సకు వెళ్లాలి. దీంట్లో మ్యాక్సీ రెండో ఆప్షన్‌ను చూస్ చేసుకొని శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. మరికొద్ది రోజుల్లో అతను పూర్తి ఫిట్‌గా ఉంటాడు. కాగా, న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు ముందు ప్రాక్టీస్ సమయంలో మిచెల్ ఓవెన్ కొట్టిన బలమైన షాట్ కారణంగా మ్యాక్స్‌వెల్ చేతికి తీవ్ర గాయమైంది. దీంతో అతను ఆ సిరీస్ మొత్తానికే దూరమయ్యాడు.ఇకపై అలాంటి వారికి బౌలింగ్ చేయను.. మ్యాక్సీమిచెల్ ఓవెన్ కొట్టిన బలమైన షాట్ కారణంగా తీవ్ర గాయానికి గురైన మ్యాక్స్‌వెల్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇకపై ప్రాక్టీస్ సమయంలో స్టోయినిస్, టిమ్ డేవిడ్, మిచెల్ ఓవెన్ లాంటి హిట్టర్లకు బౌలింగ్ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. భారత్‌తో తొలి రెండు టీ20లకు ఆస్ట్రేలియా జట్టు: మిచెల్ మార్ష్ (కెప్టెన్), సీన్ అబాట్, జేవియర్ బార్ట్లెట్, టిమ్ డేవిడ్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నేమన్, మిచెల్ ఓవెన్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, అడమ్ జాంపాటీ20 సిరీస్ షెడ్యూల్తొలి టీ20- అక్టోబర్ 29 (కాన్బెర్రా)రెండో టీ20- అక్టోబర్ 31 (మెల్బోర్న్)మూడో టీ20- నవంబర్ 2 (హోబర్ట్)నాలుగో టీ20- నవంబర్ 6 (గోల్డ్ కోస్ట్)ఐదో టీ20- నవంబర్ 8 (బ్రిస్బేన్)చదవండి: విండీస్‌తో రెండో టెస్ట్‌కు భారత తుది జట్టు ఇదే.. యువ ఆటగాడికి వార్నింగ్..! -
వరుసగా రెండో మ్యాచ్‌లో శతక్కొట్టిన ఆసీస్ ప్లేయర్
గత కొంతకాలంగా ఫామ్ లేమితో సతమతమవుతున్న ఆస్ట్రేలియా (Australia) మిడిలార్డర్ ఆటగాడు మార్నస్ లబూషేన్ (Marnus Labuschagne) ఎట్టకేలకు ఫామ్ దొరకబుచ్చుకున్నాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో సెంచరీలు చేశాడు. తొలుత షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో (రెడ్ బాల్) సెంచరీ చేసిన లబూషేన్.. తాజాగా ఆస్ట్రేలియా దేశవాలీ వన్డే కప్‌లో శతక్కొట్టాడు. వన్డే కప్‌లో లబూషేన్ కొద్ది రోజుల కిందట కూడా ఓ సెంచరీ చేశాడు. మొత్తంగా 20 రోజుల వ్యవధిలో లబూషేన్ మూడు సెంచరీలు చేసి, యాషెస్ సిరీస్‌కు ముందు ఆసీస్ సెలెక్టర్లకు సవాల్ విసిరాడు.లబూషేన్‌ను తాజాగా ఆసీస్ వన్డే జట్టు నుంచి తప్పించారు. త్వరలో భారత్‌తో జరుగబోయే సిరీస్‌ను ఎంపిక చేయలేదు. లబూషేన్ ఇటీవలికాలంలో వన్డే, టెస్ట్ ఫార్మాట్లలో దారుణంగా విఫలమవుతున్నాడు. మూడు నెలల కిందటే అతన్ని టెస్ట్ జట్టు నుంచి తప్పించారు. లబూషేన్ చివరిగా సౌతాఫ్రికాతో జరిగిన డబ్ల్యూటీసీ 2023-25 ఫైనల్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో ఓపెనర్ ప్రమోషన్ పొందినా, పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. గత డబ్ల్యూటీసీ సీజన్ మొత్తం లబూషేన్ ప్రదర్శన ఇలాగే ఉండింది. ఆ సైకిల్లో 20 మ్యాచ్‌ల్లో ఒకే ఒక సెంచరీ చేశాడు. అందులో కేవలం 27తో పరుగులు చేశాడు. ఇది అతని కెరీర్ తొలినాళ్లలో ప్రదర్శనలతో పోలిస్తే చాలా తక్కువ. లబూషేన్ కెరీర్ ఆరంభంలో 70కి పైగా సగటుతో పరుగులు చేశాడు.ఇప్పటివరకు 58 టెస్ట్‌లు ఆడిన లబూషేన్.. 46.2 సగటున 12 సెంచరీల సాయంతో 4435 పరుగులు చేశాడు.తాజా సెంచరీ విషయానికొస్తే.. వన్డే కప్‌లో క్వీన్స్‌లాండ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న లబూషేన్.. ఇవాళ (అక్టోబర్ 9) టస్మానియాతో జరుగుతున్న మ్యాచ్‌లో 91 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 105 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో లబూషేన్‌తో పాటు జాక్ క్లేటన్ (64) కూడా రాణించాడు. 44.4 ఓవర్ల తర్వాత క్వీన్స్లాండ్ స్కోర్ 8 వికెట్ల నష్టానికి 307 పరుగులుగా ఉంది. జేవియర్ బార్ట్లెట్ (11), జేమ్స్ బాజ్లీ (1) క్రీజ్‌లో ఉన్నారు. చదవండి: చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్.. తొలి బౌలర్ -
దేశం కోసం భారీ డీల్‌ను వదులుకున్న కమిన్స్, హెడ్..?
క్రికెట్‌కు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్‌మీడియాలో సంచలన టాపిక్‌గా మారింది. ఇద్దరు స్టార్ ఆస్ట్రేలియా ఆటగాళ్లు దేశం కోసం భారీ డీల్‌ను కాదనుకున్నారని ప్రచారం జరుగుతుంది. ఇందులో వాస్తవాస్తవాలు ఎంత వరకో తెలీదు కానీ, సదరు ఆటగాళ్లను మాత్రం వారి స్వదేశ మీడియా ఆకాశానికెత్తేస్తుంది. మా ఆటగాళ్లకు దేశం కంటే డబ్బు ఎప్పుడూ ముఖ్యం కాదంటూ డబ్బా కొట్టుకుంటుంది. ఇది కదా నిజమైన దేశభక్తి అంటే అంటూ గొప్పలకు పోతుంది.ఆస్ట్రేలియాకు చెందిన ద ఏజ్ (The Age) అనే వార్తా సంస్థ కధనం ప్రకారం.. వారి దేశ స్టార్ ఆటగాళ్లు పాట్ కమిన్స్ (Pat Cummins), ట్రవిస్ హెడ్‌కు (Travis Head) ఓ ప్రముఖ ఐపీఎల్ ఫ్రాంచైజీ ఏడాదికి 10 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 58.2 కోట్లు) చెల్లిస్తామని ఆఫర్ ఇచ్చింది. షరతేమిటంటే.. వారిద్దరు ఆస్ట్రేలియా తరఫున ఆడటం మానేసి, ఆ ఫ్రాంచైజీకి చెందిన గ్లోబల్ టీ20 లీగ్‌ల్లో మాత్రమే ఆడాలి. ఈ ఆఫర్‌ను కమిన్స్, హెడ్ ఇద్దరూ తిరస్కరించారు. దేశం కంటే తమకు డబ్బు ముఖ్యం కాదని సదరు ఫ్రాంచైజీ యాజమాన్యానికి తేల్చి చెప్పారు. ఈ విషయాన్ని ఆసీస్ మీడియా గత కొన్ని రోజులుగా హైలైట్ చేస్తుంది. సోషల్‌మీడియాలో సైతం పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటుంది. వాస్తవాస్తవాలు తెలియని క్రికెట్ అభిమానులు దేశం పట్ల కమిన్స్, హెడ్‌కు ఉన్న అంకితభావాన్ని కొనియాడుతున్నారు. సాధారణంగా ఆస్ట్రేలియా ఆటగాళ్లకు దేశం తరఫున ఆడితే ఏడాదికి 1.5 మిలియన్ డాలర్లకు మించి రావు. అలాంటిది కమిన్స్, హెడ్ ఇంత భారీ ఆఫర్‌ను ఎలా కాదనుకున్నారని కొందరనుకుంటున్నారు.ఇతర దేశాల ఆటగాళ్లు ఇలా లేరు..!కమిన్స్, హెడ్ విషయం పక్కన పెడితే.. ప్రస్తుతం భారత్ మినహా ప్రపంచవాప్తంగా ఉన్న క్రికెటర్లంతా లీగ్ క్రికెట్‌కే ప్రాధాన్యత ఇస్తున్నారు. జాతీయ జట్ల కెరీర్లను పూర్తి వదులుకొని లీగ్‌ల చుట్టూ తిరుగుతున్నారు. ఇటీవలే వెస్టిండీస్‌కు చెందిన నికోలస్ పూరన్, దక్షిణాఫ్రికాకు చెందిన హెన్రిచ్ క్లాసెన్ తమ అంతర్జాతీయ కెరీర్లు అర్దంతరంగా వదిలేసి లీగ్‌ల పంచన చేరారు. వీరే కాక చాలా మంది స్టార్ క్రికెటర్లు లీగ్‌ల్లో లభించే అధిక డబ్బు కోసం దేశానికి ప్రాతినిథ్యం వహించడాన్ని వద్దనుకుంటున్నారు. వాస్తవానికి ఇందులో ఆటగాళ్ల తప్పేమీ లేదు. ఫ్రాంచైజీలు అధిక డబ్బును ఆశగా చూపిస్తూ వారిని బుట్టలో వేసుకుంటున్నాయి.తిరిగి కమిన్స్, హెడ్ విషయానికొస్తే.. ప్రస్తుతం వీరు ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీతో ఒప్పందంలో ఉన్నారు. ఎస్ఆర్హెచ్ యాజమాన్యం 2025 సీజన్ వేలానికి ముందు కమిన్స్‌ను రూ. 18 కోట్లకు, హెడ్‌ను రూ. 14 కోట్లకు రిటైన్ చేసుకుంది. గత సీజన్లో ఈ ఇద్దరు చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేయలేదు. కెప్టెన్‌గా, ఆటగాడిగా కమిన్స్ దారుణంగా విఫలమయ్యాడు. అంతకుముందు సీజన్లో చెలరేగిపోయిన హెడ్ గత సీజన్లో తస్సుమన్నాడు.చదవండి: వైభవ్ విఫలమైనా, బౌలర్లు గెలిపించారు.. ఆసీస్ గడ్డపై టీమిండియా గర్జన -
రెండో ఇన్నింగ్స్‌లోనూ రెచ్చిపోయిన టీమిండియా బౌలర్లు
ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరుగుతున్న రెండో యూత్ టెస్ట్ మ్యాచ్‌లో భారత యువ బౌలర్లు రెండో ఇన్నింగ్స్‌లోనూ చెలరేగిపోయారు. హెనిల్ పటేల్ (8-3-23-3), నమన్ పుష్పక్ (7-1-19-3), ఉధవ్ మోహన్ (8-4-17-2), దీపేశ్ దేవేంద్రన్ (6-2-15-1), ఖిలన్ పటేల్ (11.1-2-36-1) ధాటికి ఆసీస్ 116 పరుగులకు చాపచుట్టేసింది. తద్వారా భారత్ ముందు 81 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది.ఆసీస్ ఇన్నింగ్స్‌లో 38 పరుగులు చేసిన అలెక్స్ లీ యంగ్ టాప్ స్కోరర్ కాగా.. మరో ముగ్గురు (కేసీ బార్టోన్ (19), జేడన్ డ్రేపర్ (15), అలెక్స్ టర్నర్ (10)) అతి కష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు. సైమన్ బడ్జ్, జెడ్ హోల్లిక్ డకౌట్లు కాగా.. కెప్టెన్ విల్ మలాజ్చుక్, యశ్ దేశ్‌ముఖ్ తలో 5, ఛార్లెస్ లచ్మండ్ 9, విల్ బైరోమ్ 8 పరుగులు చేశారు.అంతకుముందు ఆసీస్ బౌలర్లు భారత్‌ను 171 పరుగులకే ఆలౌట్ చేశారు. భారత ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా 30 పరుగుల మార్కును చేరలేదు. 28 పరుగులు చేసిన తొమ్మిదో నంబర్ ఆటగాడు దీపేశ్ దీపేంద్రన్ టాప్ స్కోరర్‌గా నిలువగా.. ఖిలన్ పటేల్, వేదాంత్ త్రివేది, హెనిల్ పటేల్, వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా వరుసగా 26, 25, 22, 20, 11 పరుగులు స్కోర్ చేశారు. కెప్టెన్ ఆయుశ్ మాత్రే వైఫల్యాల పరంపరను కొనసాగిస్తూ 4 పరుగులకే ఔట్ కాగా.. రాహుల్ కుమార్ 9, హర్వంశ్ పంగాలియా 1, నమన్ పుష్పక్ డకౌటయ్యారు. ఈ ఇన్నింగ్స్‌లో ఆసీస్ బౌలర్లు సైతం మూకుమ్మడిగా సత్తా చాటారు. కేసీ బార్టన్ 4, ఛార్లెస్ లిచ్మండ్, విల్ బైరోమ్, జూలియన్ ఓస్బర్న్ తలో 2 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 171 పరుగులకే ఆలౌటైనా 36 పరుగుల కీలక ఆధిక్యం లభించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. హెనిల్ పటేల్ (9-3-21-3), ఖిలన్ పటేల్ (12-5-23-3), ఉధవ్ మోహన్ (6-0-23-2), దీపేశ్ దేవేంద్రన్ (7.3-2-22-1) ధాటికి 135 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో వికెట్ కీపర్ లీ యంగ్ (66) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు.కాగా, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ల కోసం భారత అండర్ 19 జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. తొలుత జరిగిన వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత్.. టెస్ట్ సిరీస్‌లోనూ 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్ట్‌ను కూడా గెలిస్తే భారత్ ఆసీస్‌ను వారి సొంత ఇలాకాలో పూర్తిగా క్వీన్ స్వీప్ చేసినట్లవుతుంది.చదవండి: ఆస్ట్రేలియా జట్టుకు భారీ షాక్.. మళ్లీ కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్..? -
ఆస్ట్రేలియా జట్టుకు భారీ షాక్.. మళ్లీ కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్..?
ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ 2025-26కు (Ashes Series) ముందు ఆస్ట్రేలియా (Australia) జట్టుకు భారీ షాక్ తగిలినట్లు తెలుస్తుంది. గాయం కారణంగా కెప్టెన్ పాట్ కమిన్స్ (Pat Cummins) ఈ సిరీస్ మొత్తానికి దూరం కానున్నాడని సమాచారం. కమిన్స్ జులైలో వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్ సందర్భంగా వెన్ను సంబంధిత గాయానికి గురయ్యాడు. ఈ గాయమే అతన్ని యాషెస్ సిరీస్‌కు దూరం చేసేలా కనిపిస్తుంది.సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ నివేదిక ప్రకారం.. కమిన్స్ ఇటీవల గాయానికి సంబంధించి స్కానింగ్ చేయించుకున్నాడు. ఇందులో అతని గాయం తీవ్రత తగ్గలేదని తేలింది. దీంతో నవంబర్ 21న పెర్త్‌లో ప్రారంభమయ్యే తొలి టెస్ట్ సమయానికి కమిన్స్ అందుబాటులో ఉండలేడు. పరిస్థితి చూస్తుంటే కమిన్స్ యాషెస్ సిరీస్ మొత్తానికి దూరమయ్యేలా ఉన్నాడన్నది సదరు నివేదిక సారాంశం.వాస్తవానికి కమిన్స్ ఈ సిరీస్ కోసమే గతకొంతకాలంగా క్రికెట్ మొత్తానికే దూరంగా ఉన్నాడు. ఇటీవల ఆసీస్ ఆడిన ఏ ఫార్మాట్లోనూ అతను ఆడలేదు. త్వరలో భారత్‌తో జరుగబోయే పరిమిత ఓవర్ల సిరీస్‌లకు కూడా అతన్ని ఎంపిక చేయలేదు.యాషెస్ సమయానికి పూర్తిగా ఫిట్‌గా ఉండాలనే ఉద్దేశంతో కమిన్స్ ఈ మధ్యలో ఎలాంటి రిస్క్ తీసుకోలేదు. తీరా చూస్తే అతని గాయం పూర్తిగా మానలేదని తెలుస్తుంది.ఒకవేళ కమిన్స్ యాషెస్‌కు పూర్తిగా దూరమైతే ఆసీస్ క్రికెట్ బోర్డు ప్రత్యామ్నాయాలను సిద్దం చేసుకుంది. సీనియర్ ప్లేయర్ స్టీవ్ స్మిత్‌కు తిరిగి కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. కమిన్స్ స్థానాన్ని స్కాట్ బోలాండ్తో భర్తీ చేయనున్నట్లు సమాచారం. యాషెస్ సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టును త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ఈ సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టును ఇదివరకు ప్రకటించారు. నవంబర్ 21-25 వరకు పెర్త్ వేదికగా తొలి టెస్ట్ జరుగుతుంది. అనంతరం డిసెంబర్ 4న రెండో టెస్ట్ (బ్రిస్బేన్), డిసెంబర్ 17న మూడో టెస్ట్ (అడిలైడ్), డిసెంబర్ 26న నాలుగో టెస్ట్ (మెల్బోర్న్), వచ్చే ఏడాది జనవరి 4న ఐదో టెస్ట్ (సిడ్నీ) మొదలవుతాయి.చదవండి: CEAT అవార్డుల విజేతలు వీరే.. రోహిత్ శర్మకు ప్రత్యేక పురస్కారం -
స్టార్క్ పునరాగమనం
మెల్బోర్న్: ఆ్రస్టేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్... టీమిండియాతో జరిగే వన్డే సిరీస్ బరిలో దిగనున్నాడు. ఇటీవల అంతర్జాతీయ టి20లకు రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్క్... దాదాపు ఏడాది తర్వాత వన్డే మ్యాచ్ ఆడనున్నాడు. గతేడాది నవంబర్‌లో పాకిస్తాన్‌తో చివరిసారి వన్డే ఆడిన స్టార్క్... తిరిగి ఇప్పుడు టీమిండియాతో సిరీస్‌లో పాల్గొననున్నాడు. యాషెస్ సిరీస్‌కు ముందు వర్క్‌లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా స్టార్క్ పలు అప్ర«దాన్య మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. ఈ నెల 19 నుంచి భారత్, ఆ్రస్టేలియా మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభంకానుండగా... దీంతో పాటు టి20 సిరీస్‌లోని మొదటి రెండు మ్యాచ్‌ల కోసం మంగళవారం క్రికెట్ ఆ్రస్టేలియా (సీఏ) జట్లను ప్రకటించింది. గత పది ఇన్నింగ్స్‌లలో ఒక్క అర్ధ సెంచరీ కూడా చేయని లబుషేన్‌పై వేటు పడగా... అతని స్థానంలో రెన్షాకు తొలిసారి చోటు దక్కింది. 29 ఏళ్ల రెన్షా 14 టెస్టుల్లో ఆ్రస్టేలియాకు ప్రాతినిధ్యం వహించాడు. అన్ని కలిసొస్తే భారత్‌పై రెన్షా వన్డేల్లో అరంగేట్రం చేసే అవకాశముంది. మరోవైపు రెగ్యులర్ సారథి ప్యాట్ కమిన్స్ గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో అతడి స్థానంలో మిచెల్ మార్ష్ సారథిగా కొనసాగనున్నాడు. ఈ నెల 19న జరగనున్న తొలి వన్డేకు పెర్త్ ఆతిథ్యమిస్తుండగా... ఆ తర్వాత 23న అడిలైడ్‌లో, 25న సిడ్నీలో రెండో, మూడో మ్యాచ్‌లు జరగనున్నాయి. అనంతరం అక్టోబర్ 29 నుంచి నవంబర్ 8 మధ్య టి20 సిరీస్ జరుగుతుంది. ఆ్రస్టేలియా వన్డే జట్టు: మిచెల్ మార్ష్ (కెప్టెన్), బార్ట్లెట్, కేరీ, కొనొల్లీ, డ్వార్షుయ్, ఎలీస్, గ్రీన్, జోష్ హాజల్‌వుడ్, హెడ్, ఇన్‌గ్లిస్, ఓవెన్, రెన్షా, మాథ్యూ షార్ట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా. టి20 జట్టు (తొలి రెండు మ్యాచ్‌లకు): మిచెల్ మార్ష్ (కెప్టెన్), అబాట్, బార్ట్లెట్, టిమ్ డేవిడ్, డ్వార్షుయ్, ఎలీస్, హాజల్‌వుడ్, హెడ్, ఇన్‌గ్లిస్, కూనెమన్, ఓవెన్, షార్ట్, స్టొయినిస్, జంపా. -
భారత్‌తో వన్డే సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. నిప్పులు చెరిగే బౌలర్ వచ్చేశాడు..!
అక్టోబర్ 19 నుంచి స్వదేశంలో భారత్‌తో జరుగబోయే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం 15 మంది సభ్యుల ఆస్ట్రేలియా జట్టును (Australia) ఇవాళ (అక్టోబర్ 7) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా మిచెల్ మార్ష్ (Mitchell March) ఎంపిక కాగా.. పలువురు స్టార్ ఆటగాళ్లు ఈ సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చారు.ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్‌కు దూరంగా ఉన్న స్టార్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ (Mitchell Starc) ఈ సిరీస్‌లో బరిలోకి దిగనుండగా.. గాయాల నుంచి కోలుకొని మాథ్యూ షార్ట్, మిచెల్ ఓవెన్ రీఎంట్రీ ఇచ్చారు. ఓపెనింగ్ బ్యాటర్ మ్యాట్ రెన్షా 2022 తర్వాత తొలిసారి వన్డే జట్టుకు ఎంపికయ్యాడు.నవంబర్‌లో ప్రారంభమయ్యే యాషెస్ సిరీస్‌కు సన్నద్దమయ్యేందుకు పాట్ కమిన్స్ ఈ సిరీస్‌కు దూరంగా ఉండగా.. సౌతాఫ్రికాతో ఇటీవల ఆడిన సిరీస్‌లో భాగమైన లబూషేన్, కుహ్నేమన్, ఆరోన్ హార్డీ, సీన్ అబాట్‌పై వేటు పడింది. వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ దేశవాలీ కమిట్మెంట్స్ కారణంగా తొలి వన్డేకు దూరంగా ఉండి, చివరి రెండు వన్డేలకు అందుబాటులోకి వస్తాడు.భారత్‌తో సిరీస్‌కు ఆస్ట్రేలియా వన్డే జట్టు: మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్లెట్, అలెక్స్ క్యారీ, కూపర్ కన్నోల్లీ, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, కామెరూన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మిచెల్ ఓవెన్, మాథ్యూ రెన్షా, మాథ్యూ షార్ట్, మిచెల్ స్టార్క్, అడమ్ జాంపావన్డే సిరీస్ షెడ్యూల్..తొలి వన్డే- అక్టోబర్ 19 (పెర్త్)రెండో వన్డే- అక్టోబర్ 23 (అడిలైడ్)మూడో వన్డే- అక్టోబర్ 25 (సిడ్నీ)వన్డే సిరీస్‌తో పాటు 5 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్‌తో జరిగే తొలి రెండు టీ20లకు కూడా ఆసీస్ జట్టును ప్రకటించారు. ఈ జట్టుకు కూడా మిచెల్ మార్షే కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా.. గాయాల నుంచి కోలుకొని ఇంగ్లిస్, ఎల్లిస్ రీఎంట్రీ ఇచ్చారు. తాజాగా న్యూజిలాండ్ పర్యటనలో గాయపడిన మ్యాక్స్‌వెల్ ఈ జట్టుకు ఎంపిక కాలేదు.న్యూజిలాండ్ సిరీస్‌లో ఆడిన జోష్ ఫిలిప్, అలెక్స్ క్యారీకి ఈ జట్టులో చోటు దక్కలేదు. మిగతా జట్టంతా యధాతథంగా కొనసాగింది.భారత్‌తో తొలి రెండు టీ20లకు ఆస్ట్రేలియా జట్టు: మిచెల్ మార్ష్ (కెప్టెన్), సీన్ అబాట్, జేవియర్ బార్ట్లెట్, టిమ్ డేవిడ్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నేమన్, మిచెల్ ఓవెన్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, అడమ్ జాంపాటీ20 సిరీస్ షెడ్యూల్తొలి టీ20- అక్టోబర్ 29 (కాన్బెర్రా)రెండో టీ20- అక్టోబర్ 31 (మెల్బోర్న్)మూడో టీ20- నవంబర్ 2 (హోబర్ట్)నాలుగో టీ20- నవంబర్ 6 (గోల్డ్ కోస్ట్)ఐదో టీ20- నవంబర్ 8 (బ్రిస్బేన్)చదవండి: చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా బ్యాటర్.. ప్రపంచంలో తొలి ప్లేయర్ -
పాక్‌పై రికార్డు విజయం.. ఆసీస్ దిగ్గజాన్ని అధిగమించిన టీమిండియా కెప్టెన్
మహిళల వన్డే వరల్డ్‌కప్ 2025లో (Women's Cricket World Cup 2025) భాగంగా పాకిస్తాన్‌తో నిన్న (అక్టోబర్ 5) జరిగిన మ్యాచ్‌లో (India vs Pakistan) టీమిండియా 88 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి ఓ మోస్తరు స్కోర్‌కే (247) పరిమితమైనప్పటికీ.. ఆతర్వాత ఆ స్కోర్‌ను విజయవంతంగా కాపాడుకుంది. క్రాంతి గౌడ్ (10-3-20-3) అద్భుతమైన బౌలింగ్‌తో పాక్ పతనాన్ని శాశించింది. క్రాంతితో పాటు దీప్తి శర్మ (9-0-45-3), స్నేహ్ రాణా (8-0-38-2) కూడా సత్తా చాటడంతో పాక్ 43 ఓవర్లలో 159 పరుగులకే కుప్పకూలింది. పాక్ తరఫున సిద్రా అమీన్ (81) ఒంటరిపోరాటం చేసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. అంతకుముందు భారత ఇన్నింగ్స్ డయానా బేగ్ (10-1-69-4) ధాటికి తడబడింది. టాపార్డర్ మొత్తానికి మంచి ఆరంభాలు లభించినా, ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయారు. ఆఖర్లో రిచా ఘోష్ (20 బంతుల్లో 35 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడి టీమిండియాకు గౌరవప్రదమైన స్కోర్ అందించింది.ఈ గెలుపుతో భారత్ వన్డే ఫార్మాట్లో దాయాదిపై తమ రికార్డును (12-0) మరింత మెరుగుపర్చుకుంది. అలాగే వరల్డ్‌కప్ టోర్నీల్లోనూ పాక్‌పై ఆధిపత్యాన్ని (5-0) కొనసాగించింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత క్రికెట్ జట్లు పాక్‌ను వరుసగా నాలుగు ఆదివారాల్లో ఓడించాయి. దీనికి ముందు భారత పురుషుల జట్టు ఆసియా కప్‌లో పాక్‌ను వరుసగా మూడు ఆదివారాల్లో ఓడించి ఆసియా ఛాంపియన్‌గా అవతరించింది.ఇదిలా ఉంటే, నిన్నటి గెలుపుతో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet kaur) ఓ అరుదైన ఘనత సాధించింది. వన్డేల్లో ఆమె ప్లేయర్‌గా 90వ విజయాన్ని నమోదు చేసి, మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన ప్లేయర్ల జాబితాలో ఏడో స్థానానికి ఎగబాకింది. ఈ క్రమంలో ఆసీస్ దిగ్గజ ప్లేయర్, ఆ జట్టు మాజీ కెప్టెన్, రెండు సార్లు వన్డే ప్రపంచకప్ విన్నర్ మెగ్ లాన్నింగ్‌ను (Meg Lanning) అధిగమించింది. లాన్నింగ్ తన కెరీర్లో ప్లేయర్‌గా 89 విజయాలు సాధించగా.. హర్మన్ నిన్నటి మ్యాచ్‌తో ఆమెను దాటేసింది. ఈ జాబితాలో భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ అగ్రస్థానంలో ఉంది. మిథాలీ తన వన్డే కెరీర్లో 129 విజయాలు సాధించింది.మహిళల వన్డేల్లో అత్యధిక విజయాలు సాధించిన ప్లేయర్లుమిథాలీ రాజ్- 129ఎల్లిస్ పెర్రీ- 125అలైస్సా హీలీ- 103బెలిండ క్లార్క్- 94కేట్ సీవర్ బ్రంట్- 93కేట్ ఫిజ్‌ప్యాట్రిక్- 91హర్మన్‌ప్రీత్ కౌర్- 90మెగ్ లాన్నింగ్- 89 చదవండి: లంక ప్రీమియర్ లీగ్‌లో భారత ఆటగాళ్లు.. చరిత్రలో తొలిసారి..! -
భారీ శతకంతో కదంతొక్కిన ఆసీస్ ప్లేయర్
ఆస్ట్రేలియా దేశవాలీ టోర్నీ షెఫీల్డ్ షీల్డ్‌లో (Sheffield Shield-2025) ఆసీస్ జాతీయ జట్టు ఆటగాడు, క్వీన్స్‌ల్యాండ్ కెప్టెన్ మార్నస్ లబూషేన్ (Marnus Labuschagne) భారీ శతకంతో కదంతొక్కాడు. ఈ ఎడిషన్ తొలి మ్యాచ్‌లోనే అతను ఈ ఘనత సాధించాడు. టాస్మానియాతో జరుగుతున్న మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 206 బంతుల్లో 18 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 160 పరుగులు చేశాడు.గత కొంతకాలంగా ఫామ్‌లేమితో సతమతమవుతున్న లబూషేన్ ఈ సెంచరీతో తిరిగి ఫామ్‌ను అందుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌తో రెడ్ బాల్ క్రికెట్లో తన క్లాస్‌ను మరోసారి చాటుకున్నాడు. 14 నెలల తర్వాత ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో లబూషేన్ చేసిన తొలి సెంచరీ ఇది. అతను చివరిగా 2024 జులైలో ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో గ్లామోర్గన్‌పై మూడంకెల స్కోర్‌ను చేశాడు. ఓవరాల్‌గా లబూషేన్‌కు ఇది ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 33 శతకం.ఈ సెంచరీతో అతను యాషెస్ సిరీస్‌కు ముందు ఆసీస్ సెలెక్టర్లకు గట్టి సవాల్ విసిరాడు. ఈ సెంచరీ చేయకపోయుంటే యాషెస్ జట్టులో అతనికి స్థానం ఖచ్చితంగా దక్కేది కాదు. గత కొంతకాలంగా లబూషేన్ ఆసీస్ తరఫున దారుణంగా విఫలమవుతూ వస్తున్నాడు. గత డబ్ల్యూటీసీ సైకిల్లో (2023-25) అతని ప్రదర్శన మరీ తీసికట్టుగా ఉండింది. ఆ సైకిల్లో 20 మ్యాచ్‌ల్లో కేవలం 27 సగటున, ఒకే ఒక సెంచరీ సాయంతో పరుగులు చేశాడు. ఇది అతని కెరీర్ తొలినాళ్లలో ప్రదర్శనలతో పోలిస్తే చాలా తక్కువ. లబూషేన్ కెరీర్ ఆరంభంలో 70కి పైగా సగటుతో పరుగులు చేశాడు. ఇప్పటివరకు 58 టెస్ట్‌లు ఆడిన లబూషేన్.. 46.2 సగటున 12 సెంచరీల సాయంతో 4435 పరుగులు చేశాడు.తాజా సెంచరీతో లబూషేన్ ఓ అరుదైన మైలురాయిని కూడా తాకాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 12000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. కెరీర్లో 167 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 33 సెంచరీలు, 60 అర్ద సెంచరీల సాయంతో 12000 ప్లస్ పరుగులు చేశాడు. కాగా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య యాషెస్ సిరీస్ నవంబర్ 21 నుంచి ప్రారంభమవుతుంది. ప్రతిష్టాత్మకమైన ఈ సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టును ఇదివరకే ప్రకటించగా.. ఆసీస్ జట్టును మరికొద్ది రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. చదవండి: అష్టకష్టాలు పడుతున్న బాబర్ ఆజమ్ -
భారత్‌తో నిర్ణయాత్మక మూడో వన్డే.. ఆస్ట్రేలియా భారీ స్కోర్
కాన్పూర్ వేదికగా భారత్-ఏతో (India-A) ఇవాళ (అక్టోబర్ 5) జరుగుతున్న నిర్ణయాత్మక వన్డే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా-ఏ (Australia-A) భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసి 49.1 ఓవర్లలో 316 పరుగులకు ఆలౌటైంది. కూపర్ కన్నోలీ (64), లియామ్ స్కాట్ (73), కెప్టెన్ జాక్ ఎడ్వర్డ్స్ (89) అర్ద సెంచరీలతో సత్తా చాటి ఆసీస్ భారీ స్కోర్ చేసేందుకు దోహదపడ్డారు.44 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో కన్నోలీ.. లిచ్లన్ షా (32) సాయంతో ఇన్నింగ్స్‌కు జీవం పోశాడు. ఆతర్వాత లియామ్ స్కాట్, ఎడ్వర్డ్స్ సంచలన ఇన్నింగ్స్‌లతో భారీ స్కోర్ అందించారు. స్కాట్, ఎడ్వర్డ్స్ ఏడో వికెట్‌కు 152 పరుగులు జోడించి, భారత్‌కు కఠిన సవాల్ విసిరారు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో స్టార్ బ్యాటర్ జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ (5) వరుసగా మూడో మ్యాచ్‌లో నిరాశపరిచాడు.ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఏకంగా ఎనిమిది మంది బౌలర్లను ప్రయోగించాడు. వీరిలో అర్షదీప్ సింగ్ (10-2-38-3) ఒక్కడే సామర్థ్యం మేరకు రాణించగా.. హర్షిత్ రాణా (9.1-0-61-3) వికెట్లు తీసినప్పటికీ ధారళంగా పరుగులు సమర్పించుకున్నాడు. పార్ట్ టైమ్ బౌలర్ ఆయుశ్ బదోని 2 వికెట్లు తీయగా.. గుర్జప్నీత్ సింగ్, నిషాంత్ సంధు తలో వికెట్ దక్కించుకున్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్ విప్రాజ్ నిగమ్‌కు (6-0-60-0) ఆసీస్ ఆటగాళ్లు చుక్కలు చూపించారు. అభిషేక్ శర్మ (4-0-19-0) పర్వాలేదనిపించాడు.కాగా, ఈ మ్యాచ్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరుగుతుంది. ఈ సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌ల్లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచాయి. వన్డే సిరీస్‌కు ముందు ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్ట్ సిరీస్ కూడా జరిగింది. ఆ సిరీస్‌కు భారత్ 1-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌ల కోసం ఆస్ట్రేలియా-ఏ జట్టు భారత్‌లో పర్యటిస్తుంది. చదవండి: World Cup 2025: భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు ముందు టాస్ గందరగోళం -
మిచెల్ మార్ష్ మెరుపులు
మౌంట్ మాంగనీ (న్యూజిలాండ్): కెప్టెన్ మిచెల్ మార్ష్(43 బంతుల్లో 85; 9 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరిపించడంతో... న్యూజిలాండ్‌తో తొలి టి20 మ్యాచ్‌లో ఆ్రస్టేలియా ఆరు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల చాపెల్–హ్యాడ్లీ సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. టిమ్ రాబిన్సన్ (66 బంతుల్లో 106 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు)కెరీర్లో తొలి సెంచరీతో చెలరేగగా... డారిల్ మిచెల్ (23 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్), బెవాన్ జాకబ్స్ (20) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. టిమ్ సీఫెర్ట్ (4), డెవాన్ కాన్వే (1), మార్క్ చాప్మన్ (0) విఫలమవడంతో రెండు ఓవర్లు కూడా ముగియక ముందే న్యూజిలాండ్ జట్టు 6/3తో నిలిచింది. ఈ దశలో మిచెల్ అండగా... రాబిన్సన్ విజృంభించాడు. ఆసీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ పరుగులు రాబట్టాడు. ఆరంభంలో నెమ్మదిగా ఆడిన అతడు క్రీజులో కుదురుకున్నాక భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో రాబిన్సన్ 31 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. స్పిన్నర్ల రంగప్రవేశంతో స్కోరు వేగం మందగించగా... నాలుగో వికెట్‌కు మిచెల్‌తో కలిసి రాబిన్సన్ 55 బంతుల్లో 92 పరుగులు జోడించాడు. ఆ తర్వాత జాకబ్స్‌తో ఐదో వికెట్‌కు 47 బంతుల్లో 64 పరుగులు జతచేశాడు. చివరి ఓవర్లో సిక్స్‌తో రాబిన్సన్ తన కెరీర్లో తొలి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆసీస్ బౌలర్లలో బెన్ డ్వార్షుయ్ 2 వికెట్లు తీశాడు. అనంతరం లక్ష్యఛేదనలో ఆ్రస్టేలియా 16.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మార్ష్ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఇన్నింగ్స్ తొలి రెండు బంతులకు బౌండరీలు బాదిన అతడు... ఆఖరి వరకు అదే ఊపు కొనసాగించాడు. మరో ఎండ్ నుంచి ట్రావిస్ హెడ్ (18 బంతుల్లో 31; 6 ఫోర్లు) కూడా ఎడెపెడా బౌండరీలు బాదడు. ఈ జంట తొలి వికెట్‌కు 5.3 ఓవర్లలోనే 67 పరుగులు జోడించడంతో ఆసీస్‌కు శుభారంభం దక్కింది. హెడ్ అవుటైనా... మాథ్యూ షార్ట్ (18 బంతుల్లో 29, 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) దంచికొట్టడంతో ఆసీస్ వేగం కొనసాగింది. 23 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న మార్ష్రెండో వికెట్‌కు షార్ట్‌తో కలిసి 68 పరుగులు జోడించాడు. దీంతో ఛేదన సులువు కాగా... మొత్తంగా ఈ మ్యాచ్‌లో ఆసీస్ 20 ఫోర్లు, 9 సిక్స్‌లతో 21 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఇరు జట్ల మధ్య శుక్రవారం రెండో టి20 జరగనుంది. -
ఆస్ట్రేలియా జట్టుకు భారీ షాక్
న్యూజిలాండ్‌తో (New Zealand) రేపటి నుంచి (అక్టోబర్ 1) ప్రారంభం కాబోయే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా (Australia) జట్టుకు భారీ షాక్ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ (Glenn Maxwell) గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. నిన్న నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా మిచ్ ఓవెన్ కొట్టిన షాట్ మ్యాక్స్‌వెల్ చేతికి బలంగా తాకింది. స్కాన్‌లో ఫ్రాక్చర్ నిర్ధారణ కావడంతో మ్యాక్సీ సిరీస్ మొత్తానికే దూరమయ్యాడు. అతని స్థానంలో జోష్ ఫిలిప్ జట్టులోకి వచ్చాడు. మ్యాక్స్‌వెల్‌కు ఇలాంటి గాయాలు కొత్త కాదు. అతని కెరీర్ మొత్తం గాయలమయంగా ఉంది.కాగా, మౌంట్ మాంగనూయ్ వేదికగా రేపు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా (New Zealand vs Australia) జట్ల మధ్య తొలి టీ20 జరుగనుంది. ఇదే వేదికగా 3, 4 తేదీల్లో రెండు, మూడు మ్యాచ్‌లు కూడా జరుగనున్నాయి. మూడు మ్యాచ్‌లు భారతకాలమానం ప్రకారం ఉదయం 11:45 నిమిషాలకు ప్రారంభమవుతాయి.ఆస్ట్రేలియా: మిచెల్ మార్ష్ (కెప్టెన్), సీన్ అబాట్, జేవియర్ బార్ట్లెట్, అలెక్స్ క్యారీ, టిమ్ డేవిడ్, బెన్ డ్వార్షుయిస్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, మ్యాట్ కుహ్నెమన్, మిచ్ ఓవెన్, జోష్ ఫిలిప్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపాన్యూజిలాండ్: మార్క్ చాప్మన్, టిమ్ రాబిన్సన్, బెవాన్ జాకబ్స్, మైఖేల్ బ్రేస్‌వెల్ (కెప్టెన్), జకరీ ఫౌల్క్స్, డారిల్ మిచెల్, రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే, టిమ్ సీఫర్ట్, కైల్ జేమీసన్, జేకబ్ డఫీ, మ్యాట్ హెన్రీ, బెన్ సియర్స్, ఐష్ సోధిచదవండి: ప్రపంచ క్రికెట్లో పెను సంచలనం.. మాజీ ఛాంపియన్‌ను మట్టికరిపించిన పసికూన -
ఆస్ట్రేలియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ఆస్ట్రేలియా బ్రిస్బేన్ నగరంలోని గ్రేటర్ స్ప్రింగ్ ఫీల్డ్‌లో బతుకమ్మ సంబరాలను తెలుగు ప్రజలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సాంప్రదాయాలు ఉట్టిపడేలా బతుకమ్మలను పేర్చి అత్యంత భక్తి శ్రద్ధలతో గౌరీ మాత పూజను నిర్వహించారు. ‘బ్రిస్బేన్ తెలంగాణ అసోసియేషన్’ ఆధ్వర్యంలో స్థానిక స్ప్రింగ్ ఫీల్డ్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున ప్రవాస తెలంగాణ వాసులు, ప్రవాస భారతీయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలలో మహిళలు చిన్నపిల్లలు పాల్గొని తెలంగాణ సాంప్రదాయ నృత్యాలను కనుల విందుగా ప్రదర్శించారు.కాగా, దసరా నవరాత్రులతో పాటు తెలంగాణలో బతుకమ్మ వేడుకలు కూడా ఘనంగా జరుగుతాయి. ఈ వేడకలు భాద్రపద బహుళ అమావాస్య– అంటే మహాలయ అమావాస్య నుంచి మొదలవుతాయి. అంటే బతుకమ్మ వేడుకలు దుర్గాష్టమి నాటితో ముగుస్తాయి. అప్పుడే ఈ బతుకమ్మ వేడుకలు ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. ఇవాళ వెన్నముద్ద బతుకమ్మని ఆరాదిస్తారు. ఈ రోజున నువ్వులు, వెన్న, బెల్లం కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు.;(చదవండి: మలేషియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు) -
వరుసగా రెండో పరాజయం
కాన్బెర్రా: ఆ్రస్టేలియా పర్యటనలో భారత జూనియర్ మహిళల హాకీ జట్టు వరుసగా రెండో మ్యాచ్‌లో పరాజయం పాలైంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శనివారం జరిగిన రెండో పోరులో జ్యోతి సింగ్ సారథ్యంలోని భారత జట్టు 0–5 గోల్స్ తేడాతో ఆస్ట్రేలియా అండర్–21 జట్టు చేతిలో ఓడింది. గత మ్యాచ్‌లో గట్టి పోటీనిచ్చి పరాజయం పాలైన భారత అమ్మాయిలు... ఈ పోరులో ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారు. ప్రత్యర్థికి కనీసం పోటీనివ్వలేక వెనుకబడింది. భారత్ ఒక్క గోల్ కూడా చేయలేకపోగా... ఆ్రస్టేలియా జట్టు తరఫున మకేలా జోన్స్ (10వ, 11వ, 52వ నిమిషాల్లో) హ్యాట్రిక్ గోల్స్‌తో విజృంభించింది. సమీ లవ్ (38వ నిమిషంలో), మిగాలియా హవెల్ (50వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. గత మ్యాచ్‌లో కేవలం ఒక్క గోల్ తేడాతో ఓడిన భారత్... ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై దాడులు చేయడంలో విఫలమైంది. మ్యాచ్ ఆరంభం నుంచి అటాకింగ్ గేమ్ ఆడిన ఆ్రస్టేలియా అమ్మాయిలు... పదేపదే భారత గోల్‌పోస్ట్‌పై దాడులు చేస్తూ ఒత్తిడి కొనసాగించారు. ఈ ఏడాది డిసెంబర్లో చిలీ వేదికగా ఎఫ్ఐహెచ్ జూనియర్ మహిళల ప్రపంచకప్ జరగనుండగా... దానికి ముందు ఈ సిరీస్‌ను సన్నాహకంగా వినియోగించుకోవాలనుకున్న భారత్‌కు నిరాశ ఎదురవుతోంది. ఇరు జట్ల మధ్య సోమవారం ఇక్కడే మూడో మ్యాచ్ జరగనుంది. -
సూర్య వంశీ దెబ్బ.. వణికిన ఆస్ట్రేలియా.. సిరీస్ భారత్ కైవసం
-
ఆస్ట్రేలియాతో రెండో టెస్ట్.. చెలరేగిన టీమిండియా యువ ప్లేయర్
భారత్-ఏ, ఆస్ట్రేలియా-ఏ (India A vs Australia A) జట్ల మధ్య లక్నోలోని ఎకానా స్టేడియంలో ఇవాళ (సెప్టెంబర్ 23) నాలుగు రోజుల అనధికారిక టెస్ట్ మ్యాచ్ మొదలైంది. ఈ మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు భారత-ఏ కెప్టెన్సీ నుంచి శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) తప్పుకున్నాడు. ఆటగాడిగానూ పాల్గొనకూడదని నిర్ణయించుకున్నాడు. దీంతో భారత మేనేజ్మెంట్ వికెట్‌కీపర్ బ్యాటర్ ధృవ్ జురెల్‌ను (Dhruv Jurel) కెప్టెన్‌గా నియమించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జురెల్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.రాణించిన మెక్‌స్వీనీ, జాక్ ఎడ్వర్డ్స్తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్ల నష్టానికి 350 పరుగులు చేసింది. కెప్టెన్ నాథన్ మెక్‌స్వీనీ (74), జాక్ ఎడ్వర్డ్స్ (88) అర్ద సెంచరీలతో రాణించారు. స్టార్ ఓపెనర్ సామ్ కొన్‌స్టాస్ (49) తృటిలో హాఫ్ సెంచరీ మిస్ అయ్యాడు. వికెట్‌కీపర్ జోష్ ఫిలిప్ (39) పర్వాలేదనిపించాడు. ఆట ముగిసే సమయానికి టాడ్ మర్ఫీ (29), హెన్రీ థార్న్టన్ (10) క్రీజ్‌లో ఉన్నారు.ఐదేసిన యువ స్పిన్నర్భారత బౌలర్లలో యువ స్పిన్నర్ మానవ్ సుతార్ (Manav Suthar) అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 28 ఓవర్లలో 93 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. సుతార్‌తో పాటు గుర్నూర్ బ్రార్ (13-0-71-2), ప్రసిద్ద్ కృష్ణ (13-3-63-1), మొహమ్మద్ సిరాజ్ (13-1-73-1) వికెట్లు తీశారు. నితీశ్ కుమార్ రెడ్డి, ఆయుశ్ బదోనికి వికెట్లు దక్కలేదు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు కేఎల్ రాహుల్, మొహమ్మద్ సిరాజ్, నితీశ్ కుమార్ రెడ్డి భారత్-ఏ తరఫున బరిలోకి దిగారు.చదవండి: దిగ్గజ క్రికెట్ అంపైర్ హెరాల్డ్ డికీ బర్డ్ కన్నుమూత -
పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తిస్తున్నాం
లండన్: పరమకిరాతకంగా వందల కొద్దీ బాంబులేస్తూ, భూతల దాడులుచేస్తూ పాలస్తీనియన్ల మరణశాసన రాస్తున్న ఇజ్రాయెల్‌పై ధర్మాగ్రహంతో బ్రిటన్, కెనడా, ఆ్రస్టేలియాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. గాజావాసులున్న భూభాగాన్ని స్వతంత్ర పాలస్తీనా దేశంగా అధికారికంగా గుర్తిస్తున్నట్లు ఈ మూడు దేశాలు ఆదివారం ప్రకటించాయి. పాలస్తీనాను దేశంగా అధికారికంగా గుర్తించొద్దని అమెరికా, ఇజ్రాయెల్‌ల నుంచి తీవ్రస్థాయిలో ప్రతిఘటన ఎదురవుతున్నప్పటికీ బ్రిటన్ తన స్వీయనిర్ణయానికే కట్టుబడి ఉంటుందని బ్రిటిష్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ ఆదివారం వ్యాఖ్యానించారు. తామూ పాలస్తీనాను దేశంగా గుర్తిస్తున్నట్లు కెనడా ప్రధాని మార్క్ కార్నీ తన సామాజిక మాధ్యమ ‘ఎక్స్’ ఖాతాలో ఆదివారం ఒక పోస్ట్‌చేశారు. తాము సైతం పాలస్తీనాకే మద్దతు పలుకుతున్నట్లు ఆ్రస్టేలియా ఆదివారం ప్రకటించింది. కామన్వెల్త్ దేశాల మధ్య సమన్వయాన్ని పెంచే చర్యల్లో భాగంగా కెనడా, ఆ్రస్టేలియా, బ్రిటన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గాజాలో మరణమృదంగం మోగిస్తున్న ఇజ్రాయెల్ విషయంలో కఠిన నిర్ణయం తీసుకోవాలని సొంత లేబర్ పార్టీ నుంచి ఒత్తిళ్ల నేపథ్యంలో బ్రిటన్‌లో స్టార్మర్ సర్కార్ ఈ ప్రకటన వెలువరిచింది. కాల్పుల విరమణ, గాజాలో ఐరాస మానవతా సాయం అనుమతి, శాంతి స్థాపనకు ఇజ్రాయెల్ అడ్డు తగిలితే పాలస్తీనాను దేశంగా గుర్తిస్తామని జూలైలోనే స్టార్మర్ ప్రకటించారు. ద్విదేశ పరిష్కారం ఉత్తమం ఈ మేరకు లండన్‌లోని ప్రధాని కార్యాలయం నుంచి స్టార్మర్ పేరిట ఒక వీడియో సందేశం వెలువడింది. ‘‘ పాలస్తీనియన్లకు అనుకూలంగా మాత్రమే నిర్ణయం తీసుకున్నాం. ఇది హమాస్ సాయుధ సంస్థకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయం కాదు. భవిష్యత్తులో పాలస్తీనియన్ల ప్రభుత్వ పాలనలో బ్రిటన్ పాత్ర ఏమాత్రం ఉండదు. పాలస్తీనాలో శాంతియుత భవిత కోసం మనందరం కలసినడుద్దాం. హమాస్ చెరలోని బందీలను విడిపించుకుందాం. ఘర్షణలకు చరమగీతం పాడదాం. శాంతి, భద్రతలకు ద్విదేశ పరిష్కారం ఉత్తమం’’ అని స్టార్మర్ స్పష్టంచేశారు. 1917లో నాటి పాలస్తీనా భూభాగంపై ఏలిన బ్రిటన్ తదనంతరకాలంలో ఇజ్రాయెల్ ఆవిర్భావానికి పునాది రాయి వేసింది. అదే బ్రిటన్ ఇన్నాళ్ల తర్వాత పాలస్తానాను స్వతంత్ర దేశంగా ప్రకటించడం గమనార్హం. ఇప్పటికే భారత్ సహా 140కిపైగా దేశాలు పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించినప్పటికీ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో తీర్మానంచేసి ఐరాసతో స్వతంత్రదేశంగా ప్రకటన చేయించడంలో విఫలమయ్యాయి. అయితే ఈసారి ఆ దిశగా అడుగులుపడే అవకాశముందని తెలుస్తోంది. తప్పుబట్టిన నెతన్యాహూ ఆ్రస్టేలియా, యూకే, కెనడాల నిర్ణయాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ తప్పుబట్టారు. ‘‘మీరంతా పాలస్తీనాను దేశంగా గుర్తించినంతమాత్రాన సరిపోదు. దానిని వాస్తవరూపంలోకి తీసుకురావాలి. అది అసాధ్యం. పాలస్తీనాను గుర్తించడం అంటే 2023 అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్‌పై హమాస్ సాయుధుల మెరుపుదాడి, వందల మంది ఊచకోతను ఈ దేశాలన్నీ సమరి్థంచినట్లే. ఈ తాజా గుర్తింపు హమాస్‌కు మీరంతా ఇచ్చే బహుమతితో సమానం. జోర్డాన్ నదీ పశ్చిమాన పాలస్తీనా ఆవిర్భావాన్ని నేను సాధ్యంకానివ్వను. వచ్చే వారం అమెరికాలో పర్యటన, ట్రంప్‌తో భేటీ తర్వాత నా తదుపరి కార్యాచరణ వెల్లడిస్తా’’ అని నెతన్యాహూ అన్నారు. మొదటి ప్రపంచయుద్ధంలో ఓడిపోయాక ఓట్టొమన్ రాజ్యపతనం ఆరంభమైంది. అప్పటి నుంచి వందేళ్లపాటు పశ్చిమాసియా భౌగోళిక, రాజకీయాలపై ఫ్రాన్స్, బ్రిటన్ల ఆధిపత్యం కొనసాగింది. యూదుల కోసం ఒక దేశం అవసరమని చేసిన 1917లో చేసిన బాల్ఫోర్ తీర్మానాన్ని బ్రిటనే రచించింది. తీర్మానం మొదటిభాగాన్ని సవ్యంగా అమలుచేసిన బ్రిటన్ ఆ తర్వాత రెండో భాగాన్ని గాలికొదిలేసింది. పాలస్తీనియన్ల పౌర, మత హక్కులకు ఎలాంటి అవరోధాలు సృష్టించకూడదని రెండోభాగంలో తీర్మానించినా అది ఇజ్రాయెల్ కారణంగా అమలుకు నోచుకోలేదు. ఇన్నాళ్ల తర్వాత బ్రిటన్ పాలస్తీనాను గుర్తించి గతంలో తాను చేసిన చారిత్రక తప్పిదాన్ని సరిచేసిందని రాయల్ యునైటెడ్ సరీ్వసెస్ ఇన్స్టిట్యూట్లో పరిశోధకుడు బెర్కూ ఒజ్సేలిక్ వ్యాఖ్యానించారు. -
‘లక్ష డాలర్ల’ అమెరికా కన్నా లక్షణమైన దేశాలు
అమెరికా తన వర్క్ వీసా విధానంలో విప్లవాత్మక మార్పును ప్రకటించింది. సెప్టెంబర్ 21 నుండి కంపెనీలు ప్రతి హెచ్-1బి వీసా హోల్డర్‌కు వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ ఫీజు లక్ష డాలర్లు (రూ.88 లక్షలుపైగా) చెల్లించాల్సి ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అత్యధికం. మరి అమెరికా లాంటి వర్కింగ్‌కు అనువైన మరో ఐదు దేశాల్లో వర్కింగ్ వీసాల రిజిస్ట్రీషన్ ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం.. -
జ్యోతి సింగ్ సారథ్యంలో...
న్యూఢిల్లీ: భారత జూనియర్ మహళల హాకీ జట్టుకు జ్యోతి సింగ్ సారథిగా ఎంపికైంది. ఈ నెలాఖరులో ఐదు మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. కాన్బెర్రా జాతీయ హాకీ సెంటర్ వేదికగా జరిగే ఈ సిరీస్ కోసం హాకీ ఇండియా శనివారం 23 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఈ ఏడాది డిసెంబర్లో చిలీ వేదికగా ఎఫ్ఐహెచ్ జూనియర్ మహిళల ప్రపంచకప్ జరగనుండగా... దానికి ముందు ఈ సిరీస్ సన్నాహకంగా ఉపయోగించుకోవాలని భారత జట్టు భావిస్తోంది. ఎఫ్ఐహెచ్ హాకీ ప్రో లీగ్ సందర్భంగా భారత సీనియర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన డిఫెండర్ జ్యోతి సింగ్ జట్టుకు కెపె్టన్‌గా వ్యవహరించనుంది. నిధి, హర్ష రాణి గోల్ కీపింగ్ బాధ్యతలు మోయనుండగా... జ్యోతి, మనీషా, మమిత ఓరమ్, సాక్షి శుక్ల, పూజ సాహు, నందినితో డిఫెన్స్ బలంగా ఉంది. మిడ్‌ఫీల్డ్‌లో ప్రియాంక యాదవ్, సాక్షి రాణా, శైలిమా చాను, రజని, ఇషిక, సునేలితా టొప్పో, అనిషా సాహు కీలకం కానున్నారు. లాల్రిన్పుయి, నిషా మింజ్, పూర్ణిమ యాదవ్, సోనమ్, కనిక సివాచ్, సుఖ్వీర్ కౌర్ ఫార్వర్డ్‌లుగా వ్యవహరించనున్నారు. ‘ఇది మంచి బృందం. జట్టులో ప్రతి ఒక్కరూ శిక్షణ శిబిరంలో కఠోర సాధన చేశారు. అన్నీ విభాగాల్లో జట్టు సమతూకంగా ఉంది. పరిస్థితులను అర్థం చేసుకొని బాధ్యతలు నిర్వర్తించే ప్లేయర్లు చాలా మంది ఉన్నారు. ఆ్రస్టేలియా పర్యటన ద్వారా తగిన అనుభవం వస్తుంది. అది ఎఫ్ఐహెచ్ జూనియర్ మహిళల ప్రపంచకప్‌లో ఉపయోగపడుతుంది. వరల్డ్‌కప్‌నకు ముందు ప్రపంచ అత్యుత్తమ జట్టుతో తలపడే అవకాశం దక్కింది. ఈ సిరీస్ మన ప్లేయర్లకు చాలా ఉపయోగ పడుతుంది. ఈ మ్యాచ్‌ల ద్వారా మెరుగవ్వాల్సిన అంశాలను గుర్తిస్తాం. వాటి ఆధారంగా జూనియర్ ప్రపంచకప్ వరకు జట్టును మరింత బలంగా తీర్చిదిద్దుతాం’ అని భారత కోచ్ తుషార్ ఖండేకర్ అన్నాడు. -
IND VS AUS: మంధన వీరోచిత శతకం వృధా.. పోరాడి ఓడిన టీమిండియా
స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్ 1-2 తేడాతో కోల్పోయింది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో ఆసీస్ గెలువగా.. రెండో మ్యాచ్‌లో టీమిండియా గెలిచింది. ఇవాళ (సెప్టెంబర్ 20) జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో ఆసీస్ మరోసారి గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకుంది.న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ అతి భారీ స్కోర్ చేసింది. బెత్ మూనీ (75 బంతుల్లో 138; 23 ఫోర్లు, సిక్స్) విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో 47.5 ఓవర్లలో 412 పరుగులు చేసి ఆలౌటైంది. మూనీతో పాటు జార్జియా వాల్ (81), ఎల్లిస్ పెర్రీ (68) సత్తా చాటారు.అనంతరం కష్ట సాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ పోరాడి ఓడింది. స్మృతి మంధన (63 బంతుల్లో 125; 17 ఫోర్లు, 5 సిక్సర్లు) వీరోచిత శతకంతో విజృంభించినా, లక్ష్యానికి 44 పరుగుల దూరంలో నిలిచిపోయింది. మంధనతో పాటు హర్మన్‌ప్రీత్ కౌర్ (52), దీప్తి శర్మ (72) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడటంతో భారత్ 47 ఓవర్లలో 369 పరుగులు చేసి ఆలౌటైంది. మంధన, హర్మన్ క్రీజ్‌లో ఉన్నంత సేపు భారత్ లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించింది. వీరిద్దరూ ఔటైన తర్వాత కూడా దీప్తి శర్మ కాసేపు ఆశలు రేకెత్తించింది. అయితే భారత చివరి వరుస బ్యాటర్లు త్వరితగతిన ఔట్ కావడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. -
ఆసీస్ ప్లేయర్ ఊచకోత.. వన్డేల్లో సెకెండ్ ఫాస్టెస్ట్ సెంచరీ
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా భారత మహిళల జట్టుతో ఇవాళ (సెప్టెంబర్ 20) జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో ఆసీస్ బ్యాటర్ బెత్ మూనీ చెలరేగిపోయింది. కేవలం 57 బంతుల్లో శతకం పూర్తి చేసి, వన్డేల్లో రెండో వేగవంతమైన శతకాన్ని సమం చేసింది. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం 75 బంతులు ఎదుర్కొని 23 ఫోర్లు, సిక్స్ సాయంతో 138 పరుగులు చేసింది.మహిళల వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీలు (టాప-5)మెగ్ లాన్నింగ్ (ఆస్ట్రేలియా)- 2012లో న్యూజిలాండ్‌పై 45 బంతుల్లోబెత్ మూనీ (ఆస్ట్రేలియా)- 2025లో భారత్‌పై 57 బంతుల్లోకరెన్ రోల్టన్ (ఆస్ట్రేలియా)- 2000లో సౌతాఫ్రికాపై 57 బంతుల్లోసోఫీ డివైన్ (న్యూజిలాండ్)- 2018లో ఐర్లాండ్‌పై 59 బంతుల్లోస్మృతి మంధన (భారత్)- 2025లో ఐర్లాండ్‌పై 70 బంతుల్లోమూనీ విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ రికార్డు స్కోర్ చేసింది. 47.5 ఓవర్లలో ఆ జట్టు 412 పరుగులు చేసి ఆలౌటైంది. మూనీతో పాటు జార్జియా వాల్ (81), ఎల్లిస్ పెర్రీ (68) సత్తా చాటారు. ఈ మ్యాచ్‌లో ఆసీస్ చేసిన స్కోర్ మహిళల వన్డే క్రికెట్లో ఆరో అత్యధికం. అత్యధిక స్కోర్ రికార్డు న్యూజిలాండ్ (491/4) పేరిట ఉంది.ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పూర్తి ఓవర్లు (50) ఆడి ఉంటే మరింత భారీ స్కోర్ చేసేది. ఓ దశలో స్కోర్ ఈజీగా 450 పరుగులు దాటుతుందని అనిపించింది. అయితే భారత బౌలర్లు చివర్లో మేల్కోవడంతో అది కుదరలేదు. దీప్తి శర్మ వేసిన ఇన్నింగ్స్ 45వ ఓవర్లో ఆసీస్ 3 వికెట్లు కోల్పోయింది. ఆతర్వాత 47వ ఓవర్లో ఒకటి, 48వ ఓవర్లో రెండు వికెట్లు కోల్పోవడంతో ఆసీస్ కోటా ఓవర్లు ఆడకుండానే ఇన్నింగ్స్‌ను ముగించింది. ఈ మ్యాచ్‌లో భారత్ 413 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తే చరిత్రే అవుతుంది.కాగా, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు భారత్‌లో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్‌ల్లో ఇరు జట్లు చెరొకటి గెలిచాయి. ప్రస్తుతం జరుగుతున్నది నిర్ణయాత్మకమైన మూడో వన్డే. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సిరీస్ కైవసం చేసుకుంటుంది. -
తొలిసారి సిరీస్ సాధించే లక్ష్యంతో...
న్యూఢిల్లీ: మహిళల వన్డే క్రికెట్లో భారత జట్టు ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా ఆ్రస్టేలియా మహిళలపై సిరీస్ సాధించలేకపోయింది. అయితే ఇప్పుడు అలాంటి అవకాశం మన జట్టు ముందు నిలిచింది. ఆసీస్‌తో జరిగిన రెండో వన్డేలో చెలరేగి భారీ విజయాన్ని అందుకున్న హర్మన్‌ప్రీత్ బృందం అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. గత మ్యాచ్‌లాగే సత్తా చాటితే తొలిసారి టీమిండియా సిరీస్ మన ఖాతాలో పడుతుంది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఇరు జట్ల మధ్య నేడు నిర్ణయాత్మక మూడో వన్డేకు రంగం సిద్ధమైంది. వన్డే వరల్డ్ కప్‌కు సన్నాహకంగా ఈ సిరీస్‌లో ఆడిన ఇరు జట్లు విజయంతో ముగించి మెగా ఈవెంట్లో అడుగు పెట్టాలని భావిస్తున్నాయి. రెండో వన్డేలో స్మృతి మంధాన మెరుపు బ్యాటింగ్‌తో పాటు పదునైన బౌలింగ్‌తో ఆసీస్‌ను భారత్ కట్టడి చేసింది. ఫలితంగా ఆసీస్ వన్డే చరిత్రలో అతి పెద్ద పరాజయాన్ని చవిచూసింది. అయితే మన జట్టులో కూడా ఫీల్డింగ్ రూపంలో ప్రధాన లోపం కనిపిస్తోంది. రెండు వన్డేల్లో కలిపి మన ప్లేయర్లు ఏకంగా 10 క్యాచ్‌లు వదిలేశారు. దీనిని సరిదిద్దుకోవాల్సి ఉంది. భారత తమ తుది జట్టులో మార్పులు చేసే అవకాశం ఉంది. మరో వైపు గత మ్యాచ్‌లో ఓడినా...ఆ్రస్టేలియాను తక్కువగా అంచనా వేయడానికి వీలు లేదు. అలీసా హీలీ టీమ్ రెండో వన్డే పరాజయాన్ని మరచి తమ స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వాలని, సిరీస్ చేజార్చుకోరాదని పట్టుదలగా ఉంది. -
కమిన్స్, గ్రీన్.. తాజాగా మరో ఆటగాడు.. ఆసీస్‌కు వరుస ఎదురుదెబ్బలు
అక్టోబర్ 1 నుంచి న్యూజిలాండ్‌తో జరుగబోయే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పాట్ కమిన్స్, కెమరూన్ గ్రీన్, నాథన్ ఇల్లిస్ సేవలు కోల్పోయిన ఆ జట్టు.. తాజాగా వికెట్‌కీపర్ బ్యాటర్ జోష్ ఇంగ్లిస్ సేవలను కూడా మిస్ అయ్యింది. వీరంతా లేకుండానే ఆసీస్ న్యూజిలాండ్‌తో తలపడనుంది.ఈ వారం ప్రారంభంలో గాయపడ్డ ఇంగ్లిస్ న్యూజిలాండ్ సిరీస్ ప్రారంభమయ్యే సమయానికంతా కోలుకుంటాడని భావించారు. అయితే అతని గాయం తీవ్రత అధికంగా ఉండటం చేత సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఆసీస్ సెలెక్టర్లు ఇంగ్లిస్‌కు ప్రత్యామ్నాయంగా అలెక్స్ క్యారీ పేరును ప్రకటించారు.ఇంగ్లిస్ భారత్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్ సమయానికంతా పూర్తిగా కోలుకుంటాడని ఆసీస్ మేనేజ్మెంట్ ఆశాభావం వ్యక్తం చేసింది. భారత్‌తో సిరీస్ అక్టోబర్ 19 నుంచి ప్రారంభమవుతుంది. 3 వన్డేలు, 5 టీ20ల సిరీస్‌ల కోసం భారత జట్టు నవంబర్ 8 వరకు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది.ఇదిలా ఉంటే, న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టుకు మిచెల్ మార్ష్ నాయకత్వం వహిస్తాడు. ట్రవిస్ హెడ్, అలెక్స్ క్యారీ, మాథ్యూ షార్ట్, మిచెల్ ఓవెన్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, టిమ్ డేవిడ్, సీన్ అబాట్, బెన్ డ్వార్షుయిస్, జేవియర్ బార్ట్లెట్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్, మ్యాట్ కుహ్నేమన్ సభ్యులుగా ఉన్నారు. అక్టోబర్ 1, 3, 4 తేదీల్లో మౌంట్ మాంగనూయ్ వేదికగా మూడు మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టును కూడా ప్రకటించారు. ఈ జట్టుకు మైఖేల్ బ్రేస్‌వెల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.ఆసీస్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు..మైఖేల్ బ్రేస్‌వెల్ (కెప్టెన్), మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, జాక్ ఫౌల్క్స్, మాట్ హెన్రీ, బెవాన్ జాకబ్స్, కైల్ జామిసన్, డారిల్ మిచెల్, రాచిన్ రవీంద్ర, టిమ్ రాబిన్సన్, బెన్ సియర్స్, టిమ్ సీఫెర్ట్, ఇష్ సోధి. -
ఆస్ట్రేలియాకు మరో షాక్.. పుండు మీద కారం చల్లినట్లుగా..!
తాజాగా (సెప్టెంబర్ 17) భారత మహిళల జట్టుతో జరిగిన వన్డే మ్యాచ్‌లో (మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన రెండో వన్డే) చిత్తుగా ఓడిన ఆస్ట్రేలియా మహిళా జట్టుకు మరో షాక్ తగిలింది. పుండు మీద కారం చల్లినట్లుగా ఆ జట్టు మ్యాచ్ ఫీజ్‌లో 10 శాతం కోత విధించబడింది. స్లో ఓవర్ రేట్ కారణంగా ఆసీస్ జట్టు మొత్తానికి ఈ ఫైన్ వర్తిస్తుంది. ఆ మ్యాచ్‌లో ఆసీస్ బౌలర్లు నిర్దేశిత సమయంలోపు 2 ఓవర్లు వెనుకపడి ఉన్నారు.ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్‌లో ఆర్టికల్ 2.22 నిబంధన ప్రకారం నిర్దేశిత సమయంలోగా వెనుకపడిన ప్రతి ఓవర్‌కు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజ్‌లో 5 శాతం కోత విధిస్తారు. ఈ లెక్కన ఆసీస్ ప్లేయర్లకు రెండు ఓవర్లకు గానూ 10 శాతం జరిమానాగా విధించారు. మ్యాచ్ విషయానికొస్తే.. భారత్ ఆస్ట్రేలియాపై 102 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 49.5 ఓవర్లలో 292 పరుగులు చేసి ఆలౌటైంది. ఓపెనర్ స్మృతి మంధన (91 బంతుల్లో 117; 14 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడింది.అనంతరం 293 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్ ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేదు. క్రాంతి గౌడ్ (9.5-1-28-3), దీప్తి శర్మ (6-0-24-2), రేణుకా సింగ్ ఠాకూర్ (6.3-0-28-1), స్నేహ్ రాణా (6-0-35-1), అరుంధతి రెడ్డి (7.3-0-46-1), రాధా యాదవ్ (5-0-27-1) ధాటికి 40.5 ఓవర్లలో 190 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో సదర్‌ల్యాండ్ (45), ఎల్లిస్ పెర్రీ (44) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.ఈ గెలుపుతో భారత్ సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచింది. నిర్ణయాత్మక మూడో వన్డే న్యూఢిల్లీ వేదికగా సెప్టెంబర్ 20న జరుగనుంది. -
మంధన విధ్వంసకర శతకం.. ఆసీస్‌ను చిత్తుగా ఓడించిన టీమిండియా
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా మహిళల జట్టుతో ఇవాళ (సెప్టెంబర్ 17) జరిగిన రెండో వన్డేలో టీమిండియా 102 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 49.5 ఓవర్లలో 292 పరుగులు చేసి ఆలౌటైంది.ఓపెనర్ స్మృతి మంధన (91 బంతుల్లో 117; 14 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడింది. భారత ఇన్నింగ్స్‌లో మంధన మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. దీప్తి శర్మ (40), రిచా ఘోష్ (29), ప్రతిక రావల్ (25), స్నేహ్ రాణా (24) పర్వాలేదనిపించారు.హర్లీన్ డియోల్ (10), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (17), రాధా యాదవ్ (6), అరుంధతి రెడ్డి (4), క్రాంతి గౌడ్ (2) స్వల్ప స్కోర్లకే ఔటై నిరాశపరిచారు. ఆసీస్ బౌలర్లలో డార్సీ బ్రౌన్ 3, ఆష్లే గార్డ్నర్ 2, మెగాన్ షట్, అన్నాబెల్ సదర్‌ల్యాండ్, తహ్లియా మెక్‌గ్రాత్ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో ఆసీస్ కెప్టెన్ హీలీ ఏకంగా ఎనిమిది బౌలర్లను ప్రయోగించింది.అనంతరం 293 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్ ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేదు. క్రాంతి గౌడ్ (9.5-1-28-3), దీప్తి శర్మ (6-0-24-2), రేణుకా సింగ్ ఠాకూర్ (6.3-0-28-1), స్నేహ్ రాణా (6-0-35-1), అరుంధతి రెడ్డి (7.3-0-46-1), రాధా యాదవ్ (5-0-27-1) ధాటికి 40.5 ఓవర్లలో 190 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో సదర్‌ల్యాండ్ (45), ఎల్లిస్ పెర్రీ (44) మాత్రమే ఓ మోస్తరు స్కోర్లు చేశారు.ఈ గెలుపుతో భారత్ సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచింది. నిర్ణయాత్మక మూడో వన్డే న్యూఢిల్లీ వేదికగా సెప్టెంబర్ 20న జరుగనుంది. -
మ్యాక్స్‌వెల్ కీలక నిర్ణయం
ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఈ ఏడాది జూన్‌లో అంతర్జాతీయ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అంతకు చాలా ముందు నుంచే అతను దేశవాలీ వన్డేలు (లిస్ట్-ఏ, 50 ఓవర్ల ఫార్మాట్) కూడా ఆడటం లేదు. తాజాగా మ్యాక్సీ 50 ఓవర్ల ఫార్మాట్లో మరోసారి బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నాడు.దేశవాలీ వన్డే టోర్నీ డీన్ జోన్స్ ట్రోఫీ కోసం విక్టోరియా తరఫున బరిలోకి దిగనున్నాడు. మ్యాక్సీ 2022 తర్వాత ఒకే ఒక లిస్ట్-ఏ మ్యాచ్ ఆడాడు. త్వరలో న్యూజిలాండ్‌తో జరుగుబోయే టీ20 సిరీస్‌కు ముందు ఫిట్నెస్ సాధించేందుకు మ్యాక్సీ డీన్ జోన్స్ ట్రోఫీ ఆడనున్నాడు. ఈ టోర్నీలో మ్యాక్సీ సెప్టెంబర్ 17న క్వీన్స్‌ల్యాండ్‌తో, సెప్టెంబర్ 19న టస్మానియాతో జరుగబోయే మ్యాచ్‌ల్లో ఆడతాడు.మ్యాక్స్‌వెల్ జట్టులో (విక్టోరియా) మ్యాట్ షార్ట్, పీటర్ హ్యాండ్స్కోంబ్, మార్కస్ హ్యారిస్, విల్ సదర్‌ల్యాండ్ లాంటి పేరున్న ఆటగాళ్లు ఉన్నారు. విక్టోరియా ఈ టోర్నీ గత సీజన్లో ఫైనల్‌కు చేరినప్పటికీ టైటిల్ గెలవలేకపోయింది. మ్యాక్స్‌వెల్ లాంటి అనుభవజ్ఞుడు ఈ సీజన్లో విక్టోరియా తరఫున బరిలోకి దిగుతుండటం ఆ జట్టుకు మానసిక బలాన్ని చేకూరుస్తుంది.ఇదిలా ఉంటే, ఆస్ట్రేలియా ఇటీవలికాలంలో వెస్టిండీస్, సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లు ఆడింది. వీటిలో విండీస్ సిరీస్‌ను 5-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసిన ఆసీస్.. స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్‌ను 2-1 తేడాతో దక్కించుకుంది. సౌతాఫ్రికా సిరీస్‌లోని నిర్ణయాత్మక చివరి మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో (0/15 (2), 62* (36)) ఆకట్టుకుని, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా న్యూజిలాండ్ పర్యటన అక్టోబర్ 1 నుంచి మొదలవుతుంది. ఈ పర్యటనలో ఆసీస్ 3 టీ20లు ఆడుతుంది. అక్టోబర్ 1, 3, 4 తేదీల్లో మౌంట్ మాంగనూయ్ వేదికగా ఈ మూడు మ్యాచ్‌లు జరుగుతాయి. -
భారత గడ్డపై తొలి మ్యాచ్‌లోనే శతక్కొట్టిన ఆస్ట్రేలియా యువ సంచలనం
ఆస్ట్రేలియా యువ సంచలనం సామ్ కొన్‌స్టాస్ భారత గడ్డపై తన తొలి మ్యాచ్‌లోనే మెరుపు సెంచరీతో కదంతొక్కాడు. 19 ఏళ్ల ఈ ఆసీస్ యువ ఓపెనర్ ప్రస్తుతం ఆస్ట్రేలియా-ఏ జట్టులో భాగంగా భారత్‌లో పర్యటిస్తున్నాడు. లక్నోలోని ఎకానా స్టేడియంలో భారత-ఏ జట్టుతో జరుగుతున్న తొలి అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లో 122 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. తనుశ్ కోటియన్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాది మూడంకెల మార్కును తాకాడు. మొత్తంగా 126 బంతులు ఎదుర్కొని 10 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 101 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నాడు. కొన్‌స్టాస్‌కు జతగా మరో ఓపెనర్ క్యాంప్‌బెల్ కెల్లావే (88) కూడా సెంచరీని సమీపించాడు. కెల్లావే 73 పరుగుల వద్ద ఉండగా.. 56 పరుగుల వద్ద ఉండిన కొన్‌స్టాస్ వేగంగా సెంచరీ పూర్తి చేశాడు.ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా-ఏ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తుంది. తొలి రోజు టీ విరామం సమయానికి ఆసీస్-ఏ స్కోర్ 198/0గా ఉంది. భారత బౌలర్లు 37 ఓవర్ల పాటు బౌలింగ్ చేసినా ఒక్క వికెట్‌ను కూడా పడగొట్టలేకపోయారు. టీమిండియాకు ఆడిన అనుభవం ఉన్న బౌలర్లు ప్రసిద్ద్ కృష్ణ, ఖలీల్ అహ్మద్ కూడా ఈ మ్యాచ్‌లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. తనుశ్ కోటియన్, హర్ష్ దూబే భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఫాస్ట్ బౌలర్ గుర్నూర్ బ్రార్ ఒక్కడే ఆసీస్-ఏ ఓపెనర్లను కాస్త నిలువరించగలిగాడు.ఈ మ్యాచ్‌లో ఆసీస్-ఏ జట్టుకు నాథన్ మెక్‌స్వీని కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా.. కొన్‌స్టాస్, జోష్ ఫిలిప్, కూపర్ కన్నోలీ, జేవియర్ బార్ట్లెట్, టాడ్ మర్ఫీ లాంటి గుర్తించదగ్గ ఆటగాళ్లు తుది జట్టులో ఉన్నారు. భారత-ఏ జట్టు విషయానికొస్తే.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ వ్యవహరిస్తున్నాడు. అభిమన్యు ఈశ్వరన్, సాయి సుదర్శన్, ఎన్ జగదీషన్, దేవ్‌దత్ పడిక్కల్, ధృవ్ జురెల్, తనుశ్ కోటియన్, హర్ష్ దూబే, ప్రసిద్ద్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, గుర్నూర్ బ్రార్ తుది జట్టులో ఉన్నారు.ఆస్ట్రేలియా-ఏ జట్టు రెండు అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లు (నాలుగు రోజుల మ్యాచ్‌లు), మూడు అనధికారిక వన్డేల కోసం భారత్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా ఇవాళే తొలి టెస్ట్ మొదలైంది. రెండో టెస్ట్ కూడా ఎకానా స్టేడియంలోనే సెప్టెంబర్ 23-26 మధ్యలో జరుగతుంది. ఆతర్వాత సెప్టెంబర్ 30, అక్టోబర్ 3, 5 తేదీల్లో కాన్పూర్‌లో వన్డేలు జరుగుతాయి. ఈ సిరీస్‌ల కోసం భారత-ఏ జట్లను ఇదివరకే ప్రకటించారు. బుమ్రాతో గొడవతో హైలైటైన కొన్స్టాస్కొన్స్టాస్ గతేడాది భారత్‌తో జరిగిన మెల్బోర్న్ టెస్ట్‌తో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లోనే అర్ద సెంచరీతో సత్తా చాటిన కొన్‌స్టాస్.. తన రెండో టెస్ట్‌లోనే (సిడ్నీ) టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో గొడవపడి మరింత హైలైట్ అయ్యాడు. -
చరిత్ర సృష్టించిన టీమిండియా ఓపెనర్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌ను భారత మహిళల జట్టు ఓటమితో ప్రారంభించింది. ఆదివారం ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన తొలి వన్డేలో 8 వికెట్ల తేడాతో భారత్ పరాజయం చవిచూసింది. ఈ మ్యాచ్‌లో టాపార్డర్ బ్యాటర్లు అద్భుతంగా రాణించినప్పటికీ.. బౌలర్లు మాత్రం దారుణంగా విఫలమయ్యారు.ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది. టాపార్డర్ బ్యాటర్లు ప్రతీక రావల్ (96 బంతుల్లో 64; 6 ఫోర్లు), స్మృతి మంధాన (63 బంతుల్లో 58; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), హర్లీన్ డియోల్ (57 బంతుల్లో 54; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీలతో కదంతొక్కారు.ఆ్రస్టేలియా బౌలర్లలో మేగన్ షుట్ 2 వికెట్లు తీయగా, కిమ్ గార్త్, అనాబెల్, అలానా కింగ్, తాలియా తలా ఒక వికెట్ సాధించారు. అనంతరం ఈ భారీ లక్ష్యాన్ని ఆసీస్ 44.1 ఓవర్లలో కేవలం రెండే వికెట్లు కోల్పోయి ఛేదించింది. . ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (80 బంతుల్లో 88; 14 ఫోర్లు), బెత్ మూనీ (74 బంతుల్లో 77 నాటౌట్; 9 ఫోర్లు), అనాబెల్ సదర్లాండ్ (51 బంతుల్లో 54 నాటౌట్; 6 ఫోర్లు) ధాటిగా ఆడారు. భారత బౌలర్లలో క్రాంతి గౌడ్, స్నేహ్ రాణా చెరో వికెట్ తీశారు. 17న రెండో వన్డే కూడా ఇదే వేదికపై జరుగుతుంది.చరిత్ర సృష్టించిన ప్రతీక రావల్..ఇక ఈ మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైనప్పటికి స్టార్ ఓపెనర్ ప్రతీక రావల్ మాత్రం వరల్డ్ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. మహిళల వన్డే క్రికెట్‌తో తొలి 15 మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా ప్రతీక చరిత్ర సృష్టించింది. ఆమె ఇప్పటివరకు భారత తరపున 15 వన్డేలు ఆడి 767 పరుగులు చేసింది. ఇంతకుముందు ఈ రికార్డు ఆసీస్ మాజీ కెప్టెన్ మెగ్ లానింగ్ పేరిట ఉండేది. లానింగ్ తన వన్డే కెరీర్లో తొలి మ్యాచ్‌లలో 707 పరుగులలు చేసింది. తాజా మ్యాచ్‌తో లానింగ్ ఆల్‌టైమ్ రికార్డును రావల్ బ్రేక్ చేసింది. వీరిద్దరి తర్వాత స్ధానంలో ఇంగ్లండ్ మాజీ ప్లేయర్ షార్లెట్ ఎడ్వర్డ్స్(655) మూడో స్ధానంలో ఉంది.చదవండి: ఏడ్చేసిన షోయబ్ అక్తర్..! కాస్తైనా బుద్ధి లేదంటూ ఫ్యాన్స్ ఫైర్ -
టీమిండియా కెప్టెన్‌గా తిలక్ వర్మ.. బీసీసీఐ ప్రకటన
ఆస్ట్రేలియా-ఎతో జరగనున్న మూడు వన్డేల సిరీస్ కోసం భారత-ఎ జట్టును బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. అంత ఊహించనట్టుగానే ఆసీస్-ఎ సిరీస్‌లో టీమిండియా స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ ఆడడం లేదు. తొలుతు ఆసీస్ పర్యటనకు ముందు సన్నాహాల్లో భాగంగా ఈ అనాధికారిక సిరీస్‌లో రో-కో ద్వయం ఆడనున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ ఈ సిరీస్ కోసం సెలక్టర్లు ప్రకటించిన తాజా స్క్వాడ్‌లో వీరిద్దరి పేర్లు లేకపోవడంతో అవన్నీ వట్టి రూమర్సే అని రుజువైంది. ఈ సిరీస్ కోసం రెండు వెర్వేరు జట్లను బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. తొలి వన్డే కోసం 13 మంది సభ్యులతో కూడిన జట్టును మాత్రమే బీసీసీఐ సెలక్ట్ చేసింది.ఆస్ట్రేలియా-ఎతో జరిగే తొలి వన్డేలో భారత-ఎ జట్టు కెప్టెన్ రజత్ పాటిదార్ వ్యవహరించనున్నాడు. అతడితో పాటు ఈ జట్టులో ఐపీఎల్ స్టార్లు ప్రియాన్ష్ ఆర్య, ఆయూష్ బదోని, ప్రభుసిమ్రాన్ సింగ్, సిమర్జీత్ సింగ్, విప్రజ్ నిగమ్‌లకు చోటు దక్కింది.కెప్టెన్‌గా తిలక్ వర్మ..ఇక ఆఖరి రెండు మ్యాచ్‌లకు భారత-ఎ జట్టు కెప్టెన్‌గా హైదరాబాదీ తిలక్ వర్మను సెలక్టర్లు ఎంపిక చేశారు. తిలక్‌తో పాటు ఆసియాకప్ భారత జట్టులో భాగమైన అభిషేక్ శర్మ, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్‌లకు కూడా ఈ అనాధికరిక వన్డే సిరీస్‌లో ఆడనున్నారు. ఆసియాకప్ ముగిశాక వీరి నలుగురు నేరుగా ఇండియా-ఎ జట్టుతో కలవనున్నారు.తొలి వన్డే జట్టులో భాగంగా ఉన్న ప్రియాన్ష్ ఆర్య, సిమర్జీత్ సింగ్‌లకు ఆఖరి రెండు వన్డేలకు ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కించుకోలేకపోయారు. ఇండియా-ఎ వర్సెస్ ఆసీస్-ఎ మధ్య మూడు వన్డేల సిరీస్ సెప్టెంబర్ 30 నుంచి ఆక్టోబర్ 5 మధ్య జరగనుంది. మొత్తం మూడు మ్యాచ్‌లు కాన్పూర్ వేదికగానే జరగనున్నాయి.తొలి వన్డే కోసం భారత-ఎ జట్టురజత్ పాటిదార్ (కెప్టెన్), ప్రభ్సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్, ఆయుష్ బడోని, సూర్యాంశ్ షెడ్గే, విప్రజ్ నిగమ్, నిషాంత్ సింధు, గుర్జప్నీత్ సింగ్, యుధ్వీర్ సింగ్, రవి బిష్ణోయ్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), ప్రియాంష్ ఆర్య, సిమర్జీత్ సింగ్.రెండు, మూడు వన్డేల కోసం భారత- జట్టుతిలక్ వర్మ (కెప్టెన్), రజత్ పాటిదార్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, ప్రభ్సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్, ఆయుష్ బడోని, సూర్యాంశ్ షెడ్గే, విప్రజ్ నిగమ్, నిషాంత్ సింధు, గుర్జప్నీత్ సింగ్, యుధ్వీర్ సింగ్, రవి బిష్ణోయ్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా -
వరుసగా 5 సిక్సర్లు.. విధ్వంసకర శతరం.. చరిత్ర సృష్టించిన ఆసీస్ బ్యాటర్
టీ20 బ్లాస్ట్ 2025లో హ్యాంప్‌షైర్ ఆటగాడు (ఆసీస్) క్రిస్ లిన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ టోర్నీ ఫైనల్స్ డే (టీ20 బ్లాస్ట్‌లో సెమీస్, ఫైనల్స్ ఒకే రోజు జరుగుతాయి) చరిత్రలో శతకం బాదిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. నిన్న (సెప్టెంబర్ 13) నాటింగ్హమ్షైర్తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు.ఈ మ్యాచ్‌లో 50 బంతుల్లో శతకం పూర్తి చేసిన లిన్.. మొత్తంగా 51 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో అజేయమైన 108 పరుగులు చేశాడు. తద్వారా తన జట్టును ఒంటిచేత్తో ఫైనల్స్‌కు చేర్చాడు. 159 పరుగుల లక్ష్య ఛేదనలో లిన్ ఒక్కడే 90 శాతం పరుగులు చేశాడు. సెంచరీ పూర్తి చేసే క్రమంలో ఓ ఓవర్లో (లాయిడ్ పోప్) వరుసగా ఐదు సిక్సర్లు బాదాడు.లిన్ రికార్డు శతకంతో హ్యాంప్‌షైర్‌ను ఫైనల్స్‌కు చేర్చినా.. ఆ జట్టు తుది మెట్టుపై బోల్తా పడింది. తొలి సెమీఫైనల్ (ఇది కూడా నిన్ననే జరిగింది) విజేత సోమర్‌సెట్‌తో జరిగిన ఫైనల్లో హ్యాంప్‌షైర్ ఓటమిపాలైంది. సెమీస్‌లో విధ్వంసకర శతకంతో చెలరేగిన లిన్ ఫైనల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. 7 బంతుల్లో సిక్స్, ఫోర్ సాయంతో 12 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.ఫైనల్లో లిన్ విఫలమైనా హ్యాంప్‌షైర్ భారీ స్కోరే (194/6) చేసింది. అయితే దాన్ని కాపాడుకోవడంలో విఫలమైంది. విల్ స్మీడ్ (58 బంతుల్లో 94; 14 ఫోర్లు, 14 ఫోర్లు, సిక్స్) విధ్వంసం సృష్టించి సోమర్సెట్ను ఛాంపియన్‌గా నిలిపాడు. సోమర్సెట్కు ఇది మూడో టీ20 బ్లాస్ట్ టైటిల్. ఫైనల్లో స్మీడ్ చేసిన పరుగులు (94) టోర్నీ ఫైనల్స్ ఛేదనల చరిత్రలో అత్యధికం. -
భారత పర్యటనకు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్
సెప్టెంబర్ 16 నుంచి ఆస్ట్రేలియా-ఏ జట్టు భారత్‌లో పర్యటించాల్సి ఉంది. ఈ పర్యటనలో ఆసీస్ భారత-ఏ జట్టుతో రెండు నాలుగు రోజుల అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లు, మూడు అనధికారిక వన్డేలు ఆడనుంది. ఈ సిరీస్‌లకు ముందు ఆసీస్-ఏ టీమ్‌కు భారీ షాక్ తగిలింది.ఆల్‌రౌండర్ ఆరోన్ హార్డీ భుజం గాయం కారణంగా తప్పుకున్నాడు. హార్డీ స్థానాన్ని విల్ సదర్లాండ్ భర్తీ చేయనున్నాడు. ఇదివరకే వన్డే జట్టులో సభ్యుడైన సదర్లాండ్ రెండో టెస్ట్ సమయానికి జట్టుతో కలుస్తాడు. వన్డేల్లో హార్డీకి ప్రత్యామ్నాయాన్ని ప్రకటించలేదు.హార్డీ ఇటీవల వెస్టిండీస్, దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20, వన్డే సిరీస్‌ల్లో పాల్గొన్నాడు. అయితే, ఆ సిరీస్‌ల్లో పేలవ ప్రదర్శన కారణంగా త్వరలో జరుగనున్న న్యూజిలాండ్ పర్యటనకు ఎంపిక కాలేదు. హార్డీ తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు భారత్-ఏ సిరీస్‌తో అవకాశం కల్పించగా, గాయం బారిన పడ్డాడు. గాయం తీవ్రం కాకపోతే, వన్డే సిరీస్ ఆడవచ్చు.భారత్‌లో ఆస్ట్రేలియా ఏ జట్టు పర్యటన వివరాలు..సెప్టెంబర్ 16-23: తొలి టెస్ట్ (లక్నో)సెప్టెంబర్ 23-26: రెండో టెస్ట్ (లక్నో)సెప్టెంబర్ 30: తొలి వన్డే (కాన్పూర్)అక్టోబర్ 3: రెండో వన్డే (కాన్పూర్)అక్టోబర్ 5: మూడో వన్డే (కాన్పూర్)ఆస్ట్రేలియా-ఏ టెస్ట్ జట్టు..జేవియర్ బార్ట్లెట్, కూపర్ కొన్నోల్లీ, జాక్ ఎడ్వర్డ్స్, కాంప్‌బెల్ కెల్లావే, సామ్ కాన్స్టాస్, నాథన్ మెక్‌స్వీనీ, టాడ్ మర్ఫీ, ఫెర్గస్ ఓ'నీల్, ఆలివర్ పీక్, జోష్ ఫిలిప్, కోరీ రోచిసియోలి, లియామ్ స్కాట్, విల్ సదర్లాండ్, హెన్రీ థోర్న్టన్వన్డే జట్టు..కూపర్ కొన్నోల్లీ, హ్యారీ డిక్సన్, జాక్ ఎడ్వర్డ్స్, సామ్ ఎలియట్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, మెకెంజీ హార్వే, టాడ్ మర్ఫీ, తన్వీర్ సంఘ, లియామ్ స్కాట్, లాచీ షా, టామ్ స్ట్రాకర్, విల్ సదర్లాండ్, హెన్రీ థోర్న్టన్ఈ సిరీస్‌ల కోసం భారత-ఏ టెస్ట్ జట్టును కూడా ప్రకటించారు. ఈ జట్టుకు శ్రేయస్ అయ్యర్ నాయకత్వం వహిస్తాడు. అతనికి డిప్యూటీగా (వైస్ కెప్టెన్) అభిమన్యు ఈశ్వరన్ ఉంటాడు.శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), ధ్రువ్ జురెల్, అభిమన్యు ఈశ్వరన్ (వైస్ కెప్టెన్), ఎన్ జగదీశన్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, హర్ష్ దూబే, ఆయుష్ బడోని, నితీష్ కుమార్ రెడ్డి, తనుష్ కోటియన్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, ఖలీల్ అహ్మద్, మానవ్ సుతార్, యష్ ఠాకూర్ -
మూరెడు పూల మూల్యం లక్షకు పైగానే!
మీరు ఆస్ట్రేలియా వెళుతున్నారా? అయితే అక్కడి చట్టాలు, నియమ నిబంధనల గురించి కాస్తంత తెలుసుకుని ఆ తర్వాతే వెళ్లండి. ఎందుకంటే అక్కడ బ్యాగులో పూలు పెట్టుకోవడం కూడా తప్పే! మరీ ముఖ్యంగా బయటి నుంచి పూలు తీసుకువెళ్లామా... భారీ జరిమానా చెల్లించేందుకు సిద్ధపడాల్సిందే. ఇదెక్కడి చోద్యం... అంటారా? చోద్యం కాదు.. నిజం. ఎందుకంటే మలయాళ నటి నవ్యా నాయర్ విషయంలో అదే జరిగింది. ఓనమ్ పండుగ వేడుకలలో పాల్గొనేందుకు ఇటీవల ఆస్ట్రేలియా వెళ్లిన నవ్య నాయర్, తండ్రి ప్రేమతో ఇచ్చిన మల్లెచెండులో కొంత తలలో పెట్టుకుని మిగిలింది తర్వాత పెట్టుకుందాం లే అని బ్యాగ్‌లో పెట్టుకుందట. మెల్బోర్న్ విమానాశ్రయంలో ‘కష్టమ్స్’ అధికారులు ఆమె బ్యాగ్‌ను చెక్ చేసేటప్పుడు ఈ పూలమాల బయట పడిందట. అంతే! వారు ఆమె ఏదో ఘోర నేరం చేసినట్లు చూసింది చాలక, 1980 ఆస్ట్రేలియన్ డాలర్ల జరిమానా విధించారట. (మన రూపాయలలో అది దాదాపు లక్షా పద్నాలుగు వేలు) ఆస్ట్రేలియా చట్టాల ప్రకారం బయటి నుంచి పూలు, మొక్కలు, విత్తనాల వంటివి తీసుకు రావడం నేరమట. ఎందుకంటే బయటినుంచి వచ్చే ఇటువంటి వాటివల్ల అంటువ్యాధులు, వాతావరణ కాలుష్యం ప్రబలే ప్రమాదం ఉందట. అందుకే అలాంటి వాటి విషయంలో చాలా కఠినంగా ఉంటారట. ఈ విషయాన్ని నటి నవ్య సోషల్ మీడియా లో షేర్ చేస్తూ ‘‘మా నాన్న ఇచ్చిన మూరెడు పూల చెండు మూల్యం అక్షరాలా లక్షా పద్నాలుగు వేల పైమాటే’’ అని కామెంట్ చేసింది. ఆమె పోస్ట్ చేయడం మంచిదే అయింది.. లేకపోతే అది తెలియని మన వాళ్లు తలనిండా పూలు తురుముకుని బ్యాగులో మరికాసిని పెట్టుకుని ఆస్ట్రేలియా వెళితే మన కరెన్సీలో సంచెడు రూపాయలు చలానాగా కట్టాల్సి వస్తుంది! -
మూరెడు మల్లెపూలే కాదు.. వీటితోనూ తంటాలే!
మల్లెపూలు తీసుకెళ్లినందుకు.. మలయాళ నటి నవ్య నాయర్‌కి ఆస్ట్రేలియాలో రూ.1.14 లక్షల జరిమానా విధించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మూరెడు మల్లెపూలు.. అదీ బ్యాగులో ఉన్నందుకే ఆమెకు ఆ ఫైన్ పడింది. ఈ చేదు అనుభవంపై ఆమె సైటైర్లు వేసుకుంటోంది కూడా. అయితే.. ఆస్ట్రేలియా మెల్బోర్న్ ఎయిర్‌పోర్టుకు ప్రపంచంలోని అత్యంత కఠినమైన బయోసెక్యూరిటీ చట్టాలు ఉన్న విమానాశ్రయాంగా పేరుంది. కేవలం మల్లపూలే కాదు.. మరికొన్ని వస్తువులను కూడా అక్కడికి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరని మీకు తెలుసా?.. ఓనం ఈవెంట్‌కు హాజరయ్యేందుకు వెళ్లిన మల్లూ బ్యూటీ నవ్య నాయర్‌కు చేదు అనుభవం ఎదురైంది. తన తండ్రి తచ్చిన మల్లెపూల మూరను ఆమె బ్యాగులో ఉంచుకుని ఎయిర్‌పోర్టులో దిగారు. అయితే.. మెల్బోర్న్ ఎయిర్‌పోర్టులో వాటిని గుర్తించిన సిబ్బంది అధికారులకు సమాచారం ఇవ్వడంతో.. అక్కడి అధికారులు ఆమెకు రూ.1.14లక్షల జరిమానా వేశారు. 28 రోజుల్లో ఆ జరిమానా కట్టాలని ఆమెకు స్పష్టం చేశారు. మల్లెపూల తరహాలో మూరెడున్న వంద కేటగిరీల వస్తువులపై అక్కడ నిషేధం అమల్లో ఉంది. అందులో.. తాజా, ఎండిన పూలు, తాజా పండ్లు, కూరగాయలు, మూలికలు, మసాలా దినుసులు, గింజలు, పాల సంబంధిత ఉత్పత్తులు, బర్ఫీ.. రసగుల్లా, రసమలై, గులాజ్జామూన్, మైసూర్ పాక్, సోన్‌పాపిడి ఇలా.. స్వీట్లు, బియ్యం, టీ, ఇంటి భోజనం, తేనే, పెంపుడు జంతువుల ఆహారం.. ఈకలు, ఎముకలు, చర్మం (సంబంధిత వస్తువులు కూడా!), చెట్లు.. జంతువుల నుంచి తయారు చేసిన మందులు, చివరకు.. విమాన, నౌకల ప్రయాణాల నుంచి తెచ్చుకున్న ఆహారాన్ని కూడా అనుమతించరంతే. ప్రయాణికులు వీటిని తీసుకెళ్లడం అక్కడ నిషిద్ధం. వాటివల్ల ప్రయాణికులకు వివిధ రకాల వ్యాధులు, తెగుళ్లు సులభంగా వ్యాపించే అవకాశం ఉండడంతో ఈ నిబంధన పెట్టారు. పైగా వాటి వల్ల పర్యావరణానికి హాని అని భావిస్తున్నారు. చివరకు.. మన పండుగలు పబ్బాలు ఉన్నాయని విజ్ఞప్తులు చేసుకున్నా కూడా వాళ్లు వినరు. అయితే మాపుల్ చెట్ల నుంచి తయారు చేసిన షుగర్ సిరప్‌కు మాత్రం ఎందుకనో అనుమతిస్తారు!. నవ్య మెల్బోర్న్ విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం అక్కడి కస్టమ్స్ అధికారులు ఆమె బ్యాగ్‌లో మల్లెపూలును తీసుకువచ్చినందుకు జరిమానా విధించారు. అనంతరం మెల్బోర్న్లో జరిగిన ఓనం కార్యక్రమంలో మాట్లాడుతూ.. నటి నవ్య తనకు ఎదురైన అనుభవాన్ని చెప్పడంతో ఈ విషయం బయటకు వచ్చింది. తాను తీసుకువచ్చిన పూలు లక్ష రూపాయలు ఖరీదైనవని జరిమానా విధించేవరకు తనకు తెలియదని చమత్కరించింది. కానీ, ఆస్ట్రేలియా సరిహద్దుల్లో నిషేధిత వస్తువులపై కఠిన నియమాలు అమలవుతున్నాయి. ఆస్ట్రేలియా బయోసెక్యూరిటీ చట్టాల ప్రకారం.. నిషేధిత/ప్రకటించని వస్తువులు (ఆహారం, మొక్కలు, జంతు ఉత్పత్తులు, ఔషధాలు) సరిహద్దులో పట్టుబడితే.. వెంటనే వాటిని ధ్వంసం చేస్తారు. ప్రయాణికులకు తక్షణ జరిమానాలు విధిస్తారు. విషయం తీవ్రమైందిగా భావిస్తే.. వీసా రద్దు చేస్తారు. మరింత తీవ్రమైందిగా అనుకుంటే.. తీవ్ర ఉల్లంఘనల కింద పరిగణించి జైలు శిక్ష కూడా విధించవచ్చు. అందుకే ప్యాసింజర్ కార్డులో వాటి గురించి తప్పనిసరిగా పేర్కొనాలి. అప్పుడు.. అనుమతించని వస్తువులు తీసేసినా జరిమానా ఉండదు. లేకుంటే.. నవ్య నాయర్‌లా 15 సెం.మీ. మల్లెపూలకు లక్ష రూపాయల జరిమానా చెల్లించాల్సి వస్తుంది. నవ్యా నాయర్(ధన్య వీణ) 1985 అక్టోబర్ 14న కేరళలోని అలప్పుశా జిల్లాలో జన్మించారు. 2001లో ఇష్టం అనే చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు, ప్రధానంగా మలయాళ సినిమాల్లో.. ఆడపా దడపా తమిళ, కన్నడ చిత్రాల్లో కూడా నటించారు. పృథ్వీరాజ్ సుకుమారన్‌తో జంటగా నటించిన నందనం అనే సినిమాలో నటనకు కేరళ రాష్ట్ర ఉత్తమ నటి అవార్డు లభించింది. ఆమె క్లాసికల్ డాన్స్‌లో శిక్షణ పొందిన నర్తకి, పలు స్టేజ్ షోలు కూడా చేశారు. 2010లో వ్యాపారవేత్త సంతోష్ మెనన్ను వివాహం చేసుకున్నారు.. ఈ జంటకు ఓ కుమారుడు. యాక్టింగ్‌తో పాటు టీవీ షోలు, రచనల ద్వారా కూడా ప్రేక్షకులను ఆమె ఆకట్టుకుంటున్నారు. -
బంతితో చెలరేగిన లబూషేన్.. హ్యాట్రిక్ నమోదు
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ మార్నస్ లబూషేన్ దేశవాలీ టీ20 టోర్నీలో చెలరేగిపోయాడు. అతను చెలరేగింది బ్యాట్తోకాదు. నాణ్యమైన లెగ్ స్పిన్నర్ కూడా అయిన అతను..బ్రిస్బేన్‌లో జరిగిన కేఎఫ్‌సీ మ్యాక్స్ టీ20 టోర్నీలో బంతితో రఫ్ఫాడించాడు. ఫైనల్లో హ్యాట్రిక్ వికెట్లు తీసి తన జట్టు టైటిల్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు.Marnus Labuschagne took a a hattrick in the KFC T20 Max Final. 🤯pic.twitter.com/8ye7U7udVu— Mufaddal Vohra (@mufaddal_vohra) September 7, 2025ఈ టోర్నీలో రెడ్‌ల్యాండ్స్ టైగర్స్‌కు ప్రాతినిథ్యం వహించిన లబూషేన్.. వ్యాలీ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో లబూషేన్ బౌలర్‌గా మాత్రమే కాకుండా ఫీల్డర్‌గానూ సత్తా చాటాడు. 3 క్యాచ్‌లు పట్టుకుని రెడ్‌ల్యాండ్స్ గెలుపుకు మరో రకంగానూ దోహదపడ్డాడు. ఈ మ్యాచ్‌లో లబూషేన్ బ్యాటర్‌గా నిరాశపరిచాడు. 10 బంతుల్లో 16 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రెడ్‌ల్యాండ్స్.. జిమ్మీ పీర్సన్ (50 బంతుల్లో 102 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సులు) శతక్కొట్టడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో వ్యాలీ జట్టు 150 పరుగులకే ఆలౌటై 41 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. లబుషేన్ చివర్లో వరుసగా మూడు వికెట్లు తీసి రెడ్‌ల్యాండ్స్ విజయం ఖాయం చేశాడు. వ్యాలీ తరఫున మాక్స్ బ్రయంట్ 76 (38 బంతులు) పరుగులతో పోరాడినా, తన జట్టును గెలిపించలేకపోయాడు. ఈ టోర్నీ మహిళల విభాగంలో విన్నమ్-మాన్లీ జట్టు టైటిల్ గెలిచింది.కాగా, పేలవ ఫామ్ కారణంగా లబూషేన్ కొద్ది రోజుల కిందట ఆస్ట్రేలియా టెస్ట్ జట్టు నుంచి తప్పించబడ్డాడు. ప్రస్తుతం అతను యాషెస్ సిరీస్ కోసం జట్టులోకి తిరిగి రావాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. -
టార్గెట్ ఇండియా భారతీయులపై ఆస్ట్రేలియా విషం?
-
న్యూజిలాండ్ సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. విధ్వంసకర వీరుడి రీఎంట్రీ
అక్టోబర్ తొలి వారంలో న్యూజిలాండ్‌తో జరుగబోయే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం 14 మంది సభ్యుల ఆస్ట్రేలియా జట్టును ఇవాళ (సెప్టెంబర్ 2) ప్రకటించారు. దాదాపు ఏడాది కాలంగా అంతర్జాతీయ టీ20లకు దూరంగా ఉన్న విధ్వంసకర బ్యాటర్ మార్కస్ స్టోయినిస్ ఈ సిరీస్‌తో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. వచ్చే ఏడాది భారత్, శ్రీలంకలో జరుగనున్న వరల్డ్‌కప్ దృష్ట్యా స్టోయినిస్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. 36 ఏళ్ల స్టోయినిస్ గతకొంతకాలంగా జాతీయ జట్టు పరిధిలో లేడు. అతనికి సెంట్రల్ కానీ, స్టేట్ కాంట్రాక్ కానీ లేవు. అతడు చివరిగా 2024 నవంబర్‌లో ఆస్ట్రేలియా తరఫున ఆడాడు. ఈ ఏడాది ఫ్రిబవరిలో అతడు వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. అప్పటినుంచి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న టీ20 లీగ్‌లతో బిజీగా ఉన్నాడు. స్టోయినిస్ తాజా ఐపీఎల్ (పంజాబ్ కింగ్స్), హండ్రెడ్ లీగ్‌ల్లో (ట్రెంట్ రాకెట్స్) రన్నరప్ జట్లలో సభ్యుడిగా ఉన్నాడు.వరల్డ్‌కప్ దృష్ట్యా స్టోయినిస్‌ను తీసుకున్నట్లు తెలుస్తున్నా, ఆ జట్టుకు ఎంపిక కావడం అతనికి అంత ఈజీ కాదు. స్టోయినిస్ సిమిలర్ ప్రొఫైల్ (ఆల్‌రౌండర్) ఉన్న కెమరూన్ గ్రీన్, టిమ్ డేవిడ్, మిచెల్ ఓవెన్ నుంచి తీవ్రమైన పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది.స్టోయినిస్‌తో పాటు మిచెల్ ఓవెన్, మాథ్యూ షార్ట్, జేవియర్ బార్ట్లెట్ కూడా స్వల్ప విరామం తర్వాత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చారు. ఓవెన్ ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్ సందర్భంగా, షార్ట్ విండీస్ సిరీస్ సందర్భంగా గాయపడి కోలుకున్నారు. న్యూజిలాండ్ సిరీస్ నుంచి ఆల్‌రౌండర్ కెమరూన్ గ్రీన్ స్వచ్చందంగా తప్పుకున్నాడు. యాషెస్ ప్రిపరేషన్ దృష్ట్యా అతను షెఫీల్డ్ షీల్డ్ టోర్నీ ఆడేందుకు సిద్దమయ్యాడు. సౌతాఫ్రికా సిరీస్‌లో ఇంజ్యూరీ రీప్లేస్మెంట్లుగా వచ్చిన అలెక్స్ క్యారీ, ఆరోన్ హార్డీ ఈ సిరీస్‌కు ఎంపిక కాలేదు. పితృత్వ సెలవు కారణంగా నాథన్ ఎల్లిస్ కూడా ఈ సిరీస్ నుంచి తప్పుకున్నాడు.వెటరన్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఈ జట్టు ప్రకటనకు ముందే టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. టెస్ట్ జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ గాయం కారణంగా ఈ సిరీస్‌తో పాటు స్వదేశంలో భారత్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌లకు కూడా దూరమయ్యాడు. మిచెల్ మార్ష్ కెప్టెన్‌గా కొనసాగనున్నాడు. ఈ సిరీస్ అక్టోబర్ 1, 3, 4 తేదీల్లో మౌంట్ మాంగనూయ్ వేదికగా జరుగనుంది.న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టు: మిచెల్ మార్ష్ (కెప్టెన్), సీన్ అబాట్, జేవియర్ బార్ట్లెట్, టిమ్ డేవిడ్, బెన్ డ్వార్షుయిస్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాట్ కుహ్నెమాన్, గ్లెన్ మాక్స్వెల్, మిచ్ ఓవెన్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా. -
స్టార్క్ సంచలన ప్రకటన తర్వాత ఆస్ట్రేలియాకు మరో భారీ ఎదురుదెబ్బ
వచ్చే నెలలో న్యూజిలాండ్, భారత్‌తో జరుగబోయే పరిమిత ఓవర్ల సిరీస్‌లకు ముందు ఆస్ట్రేలియా జట్టుకు భారీ షాక్‌లు తగిలాయి. స్టార్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కొద్ది సేపట్లోనే టెస్ట్ జట్టు కెప్టెన్, పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో కీలక ప్లేయర్ అయిన పాట్ కమిన్స్ గాయం కారణంగా రెండు సిరీస్‌లకు దూరమైనట్లు ప్రకటన వెలువడింది. కమిన్స్ న్యూజిలాండ్, భారత్ సిరీస్‌లకు అందుబాటులో ఉండడని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అధికారిక ప్రకటన చేసింది.కమిన్స్‌కు వెన్నెముక కింది భాగంలో సమస్య ఉన్నట్లు వెల్లడించింది. దీంతో కమిన్స్‌ను ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ (నవంబర్ 21) వరకు ఆటకు దూరంగా ఉంచాలని భావిస్తున్నట్లు పేర్కొంది. ఈ మధ్యలో కమిన్స్ దేశవాలీ టోర్నీల్లో (వన్డే కప్, షెఫీల్డ్ షీల్డ్) కూడా పాల్గొనడని తెలిపింది.కాగా, ఆస్ట్రేలియా వచ్చే నెలలో తొలుత న్యూజిలాండ్ పర్యటనకు వెళ్తుంది. అక్టోబర్ 1, 3, 4 తేదీల్లో మౌంట్ మాంగనూయ్ వేదికగా మూడు టీ20లు ఆడుతుంది. ఆతర్వాత అదే నెల 19 నుంచి భారత్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో మూడు వన్డేలు (19, 23, 25), ఐదు టీ20లు (29, 31, నవంబర్ 2, 6, 8) జరుగుతాయి. దీని తర్వాత ఆస్ట్రేలియా స్వదేశంలో ఇంగ్లండ్‌తో యాషెస్ సిరీస్ ఆడుతుంది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్ నవంబర్ 21 నుంచి వచ్చే ఏడాది జనవరి 8 వరకు జరుగనుంది. యాషెస్ సిరీస్ కోసం ఫిట్‌గా ఉండడం కోసమే క్రికెట్ ఆస్ట్రేలియా కమిన్స్‌ను చాలాకాలం ఆటకు దూరంగా ఉంచనుంది. -
షాకింగ్ నిర్ణయం తీసుకున్న మిచెల్ స్టార్క్
ఆస్ట్రేలియా వెటరన్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఇకపై టెస్ట్‌లు, వన్డేల్లో మాత్రమే కొనసాగుతానని స్పష్టం చేశాడు. ఐపీఎల్ సహా దేశవాలీ టీ20 లీగ్‌లకు కూడా అందుబాటులో ఉంటానని తెలిపాడు.35 ఏళ్ల స్టార్క్ 2024 టీ20 వరల్డ్‌కప్ నుంచి పొట్టి ఫార్మాట్‌కు దూరంగా ఉంటున్నాడు. స్టార్క్ ఆస్ట్రేలియా తరఫున పేసర్లలో (టీ20లు) లీడింగ్ వికెట్ టేకర్‌గా (79) ఉన్నాడు. ఓవరాల్‌గా ఆడమ్ జంపా (130) తర్వాత ఆస్ట్రేలియా తరఫున రెండో లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు.అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో స్టార్క్ 2021 వరల్డ్‌కప్‌లో అత్యుత్తమ దశను అనుభవించాడు. ఆ టోర్నీలో ఆసీస్ విజేతగా నిలిచింది. టీ20ల్లో ఆసీస్‌కు అదే తొలి వరల్డ్‌కప్.టీ20 కెరీర్లో ప్రతి మ్యాచ్‌ను, ప్రతి క్షణాన్ని ఆస్వాదించానని స్టార్క్ తన రిటైర్మెంట్ సందేశంలో పేర్కొన్నాడు. ఇందులో 2021 వరల్డ్‌కప్ హైలైట్‌గా ఉంటుందని తెలిపాడు. ఆస్ట్రేలియా తరఫున పొట్టి ఫార్మాట్‌ను ఆడటాన్ని బాగా ఎంజాయ్ చేశానని చెబుతూనే, టెస్ట్‌లకే తన మొదటి ప్రాధాన్యత అని చెప్పుకొచ్చాడు.భారత పర్యటన, యాషెస్ సిరీస్, 2027 వన్డే వరల్డ్‌కప్ కోసం ఎదురుచూస్తున్నానని అన్నాడు. పై టోర్నీలకు ఫిట్‌గా, ఫ్రెష్‌గా ఉండేందుకు అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించక తప్పలేదని తెలిపాడు. 2012లో అంతర్జాతీయ టీ20 అరంగేట్రం చేసిన స్టార్క్ ఈ ఫార్మాట్లో 65 మ్యాచ్‌లు ఆడి 7.74 ఎకానమీతో పరుగులు సమర్పించుకుని 79 వికెట్లు తీశాడు.కాగా, ఈ ఏడాది పరిమిత ఓవర్ల ఫార్మాట్లకు సంబంధించి ఆస్ట్రేలియాకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. స్టీవ్ స్మిత్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించగా.. తాజాగా స్టార్క్ టీ20ల నుంచి తప్పుకున్నాడు. -
ఆస్ట్రేలియాలో నిరసనలు
కాన్బెర్రా: ఆ్రస్టేలియాలో వలసదారులపై వ్యతిరేకత పెరుగుతోంది. దేశవ్యాప్తంగా వేలాది మంది ఆ్రస్టేలియన్లు ఆదివారం వలసలకు వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించారు. ప్రత్యేకించి భారతీయుల వలసలపై నిరసన కారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మార్చ్ ఫర్ ఆస్ట్రేలియా’పేరుతో ర్యాలీలు నిర్వహించారు. వందేళ్లలో వచ్చిన గ్రీకులు, ఇటాలియన్ల కంటే ఐదేళ్లలో ఎక్కువ మంది భారతీయులు వచ్చారని, ఈ వలసలు తమ దేశంలోని సంస్కృతిపై ప్రభావం చూపిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2013 నుంచి 2023 వరకు 845,800 మంది భారతీయులు ఆస్ట్రేలియాకు వలస వచ్చారని వారు పంచిన కరపత్రాల్లో పేర్కొన్నారు. ఇది తాత్కాలిక సాంస్కృతిక మార్పు కాదని, ప్రత్యామ్నాయంగా ఏర్పడుతోందని వారు ఆరోపించారు. ఖండించిన ప్రభుత్వం.. ఈ ర్యాలీలను ఆ్రస్టేలియా ప్రభుత్వం ఖండించింది. జాత్యహంకారం, జాతికేంద్రీకరణపై ఆధారపడిన తీవ్రవాదానికి దేశంలో స్థానం లేదని పేర్కొంది. వారసత్వం ఏదైనా సరే, ఆ్రస్టేలియన్లందరూ సురక్షితంగా ఉండే హక్కును కలిగి ఉన్నారని పేర్కొంది. సామాజిక ఐక్యతను దెబ్బతీయాలని చూసే వ్యక్తులకు దేశంలో చోటు లేదని హోం వ్యవమారాల మంత్రి టోనీ బర్క్ అన్నారు. ద్వేషాన్ని వ్యాప్తి చేసే, సమాజాన్ని విభజించే ఇలాంటి ర్యాలీలకు తాము మద్దతు ఇవ్వబోమని ఫెడరల్ లేబర్ మంత్రి ముర్రే వాట్ స్పష్టం చేశారు. ఈ ర్యాలీలను ఆ్రస్టేలియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సరీ్వసెస్ కూడా ఖండించింది. వైవిధ్యమే ఆ్రస్టేలియాకు గొప్ప బలమని సంస్థ సీఈఓ కసాండ్రా గోల్డీ అన్నారు. ఫెడరల్ ప్రతిపక్ష నాయకుడు సుస్సాన్ లే సైతం ర్యాలీలపై స్పందించారు. ‘ప్రజల జాతీయత, మతం ఆధారంగా లక్ష్యంగా భావజాలానికి ఆ్రస్టేలియాలో స్థానం లేదు. హింస, జాత్యహంకారం లేదా బెదిరింపులకు ఇక్కడ చోటు లేదు. సామాజిక ఐక్యతను చీల్చే ద్వేషాన్ని, భయాన్ని అనుమతించలేం’అని స్పష్టం చేశారు. ప్రధాన నగరాల్లో ర్యాలీలు..సిడ్నీ, మెల్బోర్న్, కాన్బెర్రాతోపాటు ఇతర నగరాల్లో పెద్ద ర్యాలీలు జరిగాయి. సిడ్నీలో దాదాపు పదివేల మంది రోడ్డెక్కారు. నగర మారథాన్ కోర్సు దగ్గరకు చేరి జాతీయ జెండాలతో ప్రదర్శించారు. మెల్బోర్న్లో, నిరసనకారులు ఫ్లిండర్స్ స్ట్రీట్ స్టేషన్ వెలుపల ఆ్రస్టేలియన్ జెండాలు, వలస వ్యతిరేక ప్లకార్డులతో రాష్ట్ర పార్లమెంటుకు కవాతు చేశారు. ర్యాలీని ఉద్దేశించి నియో–నాజీ వ్యక్తి థామస్ సెవెల్ మాట్లాడుతూ వలసలను ఆపకపోతే, మన మరణం ఖాయమన్నారు. ఇక్కడ నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణ జరిగింది. ఆరుగురిని అరెస్టు చేశారు. కాన్బెర్రాలో, పార్లమెంట్ హౌస్‌కు ఎదురుగా ఉన్న సరస్సు వద్ద జరిగిన నిరసనలో వేలాది మంది పాల్గొన్నారు. క్వీన్స్‌ల్యాండ్‌లో, ఫెడరల్ ఎంపీ బాబ్ కట్టర్ టౌన్స్‌విల్లేలో జరిగిన ర్యాలీకి హాజరయ్యారు. -
విదేశాల్లో వైఎస్సార్‌కు ఘన నివాళి
సాక్షి, అమరావతి: సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలతో జనరంజక పాలన అందించిన గొప్ప వ్యక్తి దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అని ప్రవాసాంధ్రులు కొనియాడారు. సెప్టెంబర్ 2న ఆయన వర్ధంతి సందర్భంగా న్యూజిలాండ్, ఆ్రస్టేలియాలోని పలు నగరాల్లో ప్రవాసాంధ్రులు ఘన నివాళులర్పించారు. వైఎస్సార్సీపీ న్యూజిలాండ్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఆక్లాండ్‌లోని సాండ్రింగ్‌హామ్ కమ్యూనిటీ సెంటర్లో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలకు వైఎస్సార్ చేసిన సేవలను కొనియాడారు.సంక్షేమాభివృద్ధిలో వైఎస్సార్ ఒక అడుగు ముందుకేస్తే.. ఆయన కుమారుడు వైఎస్ జగన్ నాలుగు అడుగులు ముందుకేసి ప్రజలకు సుపరిపాలన అందించారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆనంద్ ఎద్దుల, సుమంత్ డేగపూడి, కృష్ణారెడ్డి, విజయ్ అల్లా, రాజారెడ్డి, బాలశౌర్య, గీతారెడ్డి, రమేష్ పానాటి, సంకీర్త్ రెడ్డి, రఘునాథ్‌రెడ్డి, సుస్మిత, రేఖ, గౌతమి, సింధు, ప్రియాంక, ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో వైఎస్సార్సీపీ విక్టోరియా విభాగం ఆధ్వర్యంలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమంఆ్రస్టేలియాలో రక్తదాన శిబిరం డాక్టర్ వైఎస్సార్ ఫౌండేషన్ ఆ్రస్టేలియా విభాగం ఆధ్వర్యంలో ఆడిలైడ్ నగరంలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో నాయకులు వంశీ బొంతు, రామ్మోహన్‌రెడ్డి మునగల తదితరులతో పాటు వైఎస్సార్, వైఎస్ జగన్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే మెల్బోర్న్ నగరంలో వైఎస్సార్సీపీ విక్టోరియా విభాగం ఆధ్వర్యంలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. నాగార్జున యలగాల, అనిల్ కుమార్ పెడగాడ, హరి చెన్నుపల్లి తదితరులు పాల్గొన్నారు. -
NRI News: వైఎస్సార్.. సంక్షేమం, ప్రజాసేవకు నిలువెత్తు సాక్ష్యం
సాక్షి, మెల్బోర్న్: దివంగత మహానేత, మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 16వ వర్ధంతి నేపథ్యంతో ఆస్ట్రేలియా మెల్బోర్న్లో వైఎస్సార్సీపీ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించింది. భారత కాలమానం ప్రకారం.. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. సంక్షేమం, ప్రజాసేవకు నిలువెత్తు సాక్ష్యం.. వైఎస్సార్ అని ఈ సందర్బంగా సభకు హాజరైన వాళ్లు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియా వైఎస్సార్సీపీ విక్టోరియా నాయకులు నాగార్జున యలగాల, అనిల్ కుమార్ పెడగాడ, హరి చెన్నుపల్లి, విష్ణు రెడ్డి వాకమల్ల తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వారికి వైవీ సుబ్బారెడ్డి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. -
సౌతాఫ్రికాతో మూడో వన్డే.. చరిత్ర సృష్టించిన యువ బౌలర్
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన చివరి వన్డేలో ఆస్ట్రేలియా యువ స్పిన్నర్ కూపర్ కన్నోలీ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన అతడు.. ఆసీస్ తరఫున ఐదు వికెట్ల ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. కన్నోలీ కేవలం 22 ఏళ్ల 2 రోజుల వయసులో ఈ ఘనత సాధించాడు. ఈ రికార్డు సాధించే క్రమంలో కన్నోలీ మాజీ ఫాస్ట్ బౌలర్ క్రెయిగ్ మెక్‌డెర్మాట్, ప్రస్తుత స్పీడ్‌స్టర్ మిచెల్ స్టార్క్‌లను వెనక్కు నెట్టాడు.మెక్‌డెర్మాట్ 22 ఏళ్ల 204 రోజుల వయసులో (1987) వన్డేల్లో ఐదు వికెట్ల ఘనత సాధించగా.. స్టార్క్ 22 ఏళ్ల 211 రోజుల వయసులో (2012) ఈ ఘనత సాధించాడు. ఈ ఐదు వికెట్ల ప్రదర్శనలతో కన్నోలీ మరో రికార్డు కూడా సాధించాడు. మైఖేల్ క్లార్క్ తర్వాత ఆసీస్ తరఫున వన్డేల్లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్‌గా రికార్డుల్లోకెక్కాడు. మైఖేల్ క్లార్క్ 2004లో శ్రీలంకతో జరిగిన వన్డేలో 35 పరుగులకు ఐదు వికెట్లు తీశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. కన్నోలీ ఐదు వికెట్ల ప్రదర్శనతో చెలరేగడంతో ఆసీస్ సౌతాఫ్రికాను 276 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసింది. 432 పరుగుల అతి భారీ లక్ష్య ఛేదనలో కన్నోలీతో పాటు (6-0-22-5), జేవియర్ బార్ట్లెట్ (6-0-45-2), సీన్ అబాట్ (4-0-27-2), ఆడమ్ జంపా (4.5-1-31-1) సత్తా చాటడంతో సౌతాఫ్రికా 155 పరుగులకే ఆలౌటై, ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో డెవాల్డ్ బ్రెవిస్ (49) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. ట్రవిస్ హెడ్ (142), మిచెల్ మార్ష్ (100), గ్రీన్ (118 నాటౌట్) సెంచరీలతో కదంతొక్కడంతో నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 431 పరుగులు చేసింది. అలెక్స్ క్యారీ (50 నాటౌట్) అర్ద సెంచరీతో రాణించాడు.ఈ గెలుపుతో ఆసీస్ ఇదివరకే కోల్పోయిన సిరీస్‌లో సౌతాఫ్రికా ఆధిక్యాన్ని 1-2కు తగ్గించింది. తొలి రెండు వన్డేల్లో సౌతాఫ్రికా గెలుపొందిన విషయం తెలిసిందే. కాగా, వన్డే సిరీస్‌కు ముందు ఇరు జట్ల మధ్య జరిగిన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆసీస్ 1-2 తేడాతో కైవసం చేసుకుంది. -
కుప్పకూలిన సౌతాఫ్రికా.. చరిత్రలో రెండో అతి భారీ విజయం సాధించిన ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియా జట్టు తమ వన్డే క్రికెట్ చరిత్రలో రెండో అతి భారీ విజయం సాధించింది. ఇవాళ (ఆగస్ట్ 24) సౌతాఫ్రికాతో జరిగిన నామమాత్రపు వన్డేలో 276 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. పరుగుల పరంగా ఆసీస్‌కు అతి భారీ విజయం నెదర్లాండ్స్‌పై (2023 వన్డే వరల్డ్‌కప్‌లో 309 పరుగుల తేడాతో) దక్కింది.యాదృచ్చికంగా ఈ మ్యాచ్‌లో ఆసీస్ చేసిన స్కోర్ కూడా వారి వన్డే క్రికెట్ చరిత్రలో రెండో అతి భారీ స్కోర్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 431 పరుగులు చేసింది. వన్డేల్లో ఆసీస్ తమ అతి భారీ స్కోర్‌ను కూడా సౌతాఫ్రికాపైనే చేసింది. 2006లో జోహనెస్బర్గ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ 4 వికెట్ల నష్టానికి 434 పరుగులు చేసింది.సౌతాఫ్రికా విషయానికొస్తే.. ఆ జట్టుకు పరుగుల పరంగా వన్డేల్లో ఇదే అతి భారీ పరాజయంగా నిలిచింది. దీనికి ముందు 2023 వరల్డ్‌కప్‌లో భారత్ చేతిలో ఎదురైన 243 పరుగుల పరాజయం వారికి వన్డేల్లో అతి భారీ పరాజయంగా ఉండింది. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా 432 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ 24.5 ఓవర్లలో 155 పరుగులకే కుప్పకూలింది. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కూపర్ కన్నోలీ (5/22) అద్బుత ప్రదర్శనతో చెలరేగి సౌతాఫ్రికా పతనాన్ని శాశించాడు.మ్యాచ్ పూర్తి వివరాల్లోకి వెళితే.. 3 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన చివరి వన్డేలో ఆసీస్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. ట్రవిస్ హెడ్ (142), మిచెల్ మార్ష్ (100), గ్రీన్ (118 నాటౌట్) సెంచరీలతో కదంతొక్కడంతో నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 431 పరుగులు చేసింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో అలెక్స్ క్యారీ (50 నాటౌట్) అర్ద సెంచరీతో రాణించాడు.అనంతరం కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. కూపర్ కన్నోలీ (6-0-22-5), జేవియర్ బార్ట్లెట్ (6-0-45-2), సీన్ అబాట్ (4-0-27-2), ఆడమ్ జంపా (4.5-1-31-1) ధాటికి 155 పరుగులకే ఆలౌటైంది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో డెవాల్డ్ బ్రెవిస్ (49) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ గెలుపుతో ఆసీస్ ఇదివరకే కోల్పోయిన సిరీస్‌లో సౌతాఫ్రికా ఆధిక్యాన్ని 1-2కు తగ్గించింది. తొలి రెండు వన్డేల్లో సౌతాఫ్రికా గెలుపొందిన విషయం తెలిసిందే. కాగా, వన్డే సిరీస్‌కు ముందు ఇరు జట్ల మధ్య జరిగిన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆసీస్ 1-2 తేడాతో కైవసం చేసుకుంది. -
ప్రభావం చూపని బౌలర్లు.. టీమిండియాపై ఆస్ట్రేలియా ఘన విజయం
బ్రిస్బేన్ వేదికగా భారత ఏ మహిళల జట్టుతో జరిగిన ఏకైక అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఏ మహిళల జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌ల్లో ఇరు జట్లు సమాంతంరంగా నిలిచినా, రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా పైచేయి సాధించి, గెలుపు సొంతం చేసుకుంది.భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 299 పరుగులకు ఆలౌట్ కాగా.. ఆస్ట్రేలియా 305 పరుగులు చేసింది. 6 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 286 పరుగులకు ఆలౌటై, ఆసీస్ ముందు 281 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఛేదనలో బ్యాటర్లంతా తలో చేయడంతో ఆసీస్ 85.3 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. రేచల్ ట్రెనామన్ (64), మ్యాడీ డ్రేక్ (68), అనిక లియారాయ్డ్ (72) అర్ద సెంచరీలతో సత్తా చాటగా.. కెప్టెన్ తహిల విల్సన్ (46) ఓ మోస్తరు స్కోర్ చేసింది. నికోల్ ఫాల్టుమ్ (16 నాటౌట్), ఎల్లా హేవర్డ్ (4) ఆసీస్‌కు విన్నింగ్స్ రన్స్ అందించారు.281 పరుగుల లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకోవడంలో భారత బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. కెప్టెన్ రాధా యాదవ్ 8 మంది బౌలర్లు మార్చిమార్చి ప్రయోగించినా ఎలాంటి సానుకూల ఫలితం రాలేదు. సైమా ఠాకోర్ 2, జోషిత, తనుశ్రీ తలో వికెట్ తీశారు.అంతకుముందు యామీ ఎడ్గర్ (19-6-57-5) ఐదు వికెట్ల ప్రదర్శనతో, ప్రెస్ట్‌విడ్జ్ (13.4-2-47-3) మూడు వికెట్ల ప్రదర్శనతో చెలరేగడంతో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 286 పరుగులకే పరిమితమైంది. రాఘ్వి బిస్త్ (86) రెండో ఇన్నింగ్స్‌లోనూ భారత్‌ను ఆదుకుంది. షఫాలీ వర్మ (52) అర్ద సెంచరీతో రాణించింది. తేజల్ (39), తనుశ్రీ (25), టైటాస్ సాధు (22 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.శతక్కొట్టిన జింజర్లోయర్ ఆర్డర్ బ్యాటర్ సియన్నా జింజర్ (103) సెంచరీతో రాణించడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ స్కోర్‌కు ధీటుగా బదులిచ్చింది. జింజర్‌కు నికోల్ ఫాల్టుమ్ (54), తహిల విల్సన్ (49) సహకరించారు. భారత బౌలర్లలో సైమా ఠాకోర్ 3, రాధా యాదవ్, మిన్నూ మణి తలో 2 వికెట్లు పడగొట్టారు.ఆదుకున్న రాఘ్వితొలి ఇన్నింగ్స్‌లో రాఘ్వి బిస్త్ (93), జోషిత (51) ఆదుకోవడంతో భారత్ 299 పరుగులు చేయగలిగింది. ఆసీస్ బౌలర్లలో బ్రౌన్, ప్రెస్ట్‌విడ్జ్ తలో 3 వికెట్లు తీశారుకాగా, భారత ఏ మహిళల జట్టు మల్టీ ఫార్మాట్ సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటించింది. ఈ సిరీస్‌లో తొలుత టీ20 సిరీస్ జరగగా.. ఆసీస్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. అనంతరం భారత్ వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. తాజాగా ఏకైక అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లో గెలిచి ఆసీస్ సిరీస్‌ను చేజిక్కించుకుంది. -
మెరిసిన రాఘ్వి, షఫాలీ
బ్రిస్బేన్: తొలి ఇన్నింగ్స్‌లో చక్కటి ప్రదర్శన కనబర్చిన రాఘ్వి బిస్త్ (119 బంతుల్లో 86; 13 ఫోర్లు) రెండో ఇన్నింగ్స్‌లోనూ రాణించడంతో ఆ్రస్టేలియా మహిళల ‘ఎ’ జట్టుతో ఏకైక అనధికారిక టెస్టులో భారత మహిళల ‘ఎ’ జట్టు మెరుగైన స్థితిలో నిలిచింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రాధా యాదవ్ సారథ్యంలోని భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 73 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. రాఘ్వి బిస్త్, షఫాలీ వర్మ (58 బంతుల్లో 52; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ శతకాలు సాధించగా... తేజల్ హస్నబిస్ (52 బంతుల్లో 39; 7 ఫోర్లు) రాణించింది. ఆస్ట్రేలియా మహిళల ‘ఎ’ జట్టు బౌలర్లలో అమీ ఎడ్గర్ 4 వికెట్లు పడగొట్టగా... జార్జియా 2 వికెట్లు తీసింది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 158/5తో శనివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆ్రస్టేలియా మహిళల ‘ఎ’ జట్టు... చివరకు 76.2 ఓవర్లలో 305 పరుగులకు ఆలౌటైంది. సియానా జింజర్ (138 బంతుల్లో 103; 12 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో కదం తొక్కగా... నికోల్ ఫాల్టుమ్ (91 బంతుల్లో 54; 6 ఫోర్లు) అర్ధ శతకంతో ఆకట్టుకుంది. భారత మహిళల ‘ఎ’ జట్టు బౌలర్లలో సైమా ఠాకూర్ 3 వికెట్లు పడగొట్టగా... రాధా యాదవ్, మిన్ను మణి చెరో రెండు వికెట్లు తీశారు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 299 పరుగులు చేసింది. ప్రస్తుతం చేతిలో రెండు వికెట్లు ఉన్న భారత జట్టు... ఓవరాల్‌గా 254 పరుగుల ఆధిక్యంలో ఉంది. జోషిత (9 బ్యాటింగ్), టిటాస్ సాధు (2 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. -
ఆమె బొమ్మలు గీస్తే డబ్బే డబ్బు.. ఒక్కోటి రూ. 40లక్షలకు పైమాటే..
ఖాళీ కాగితాలు కనిపిస్తే చిన్నపిల్లల వాటిపై బొమ్మలు గీస్తూ ఉంటారు. పెద్దలు వాటిని చూసి మురిసి΄ోతూ ఉంటారు. ఇదంతా చిన్నారులకు ఆనందం, పెద్దలకు మురిపెం. అయితే చిన్నారి గీసిన చిత్రాలకు రూ.కోట్లలో ధర పలికితే? అది సాధ్యమేనా? సాధ్యమే అని నిరూపించింది ఆస్ట్రేలియాకు చెందిన ఎలిటా ఆండ్రీ (Aelita Andre). రెండేళ్లకే చిత్రలేఖనం మొదలుపెట్టిన ఈ అమ్మాయి గీసిన చిత్రాలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అమ్ముడుపోతున్నాయి. ఎలిటా ఆండ్రీ 2007లో జన్మించింది. ఆమెది ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్. రెండేళ్ల వయస్సులోనే బొమ్మలు గీయడం మొదలుపెట్టింది. అందరు చిన్నారులు వేసేలాంటి చిత్రాలు కాకుండా కొత్త రకమైన చిత్రకళను సాధన చేసింది. అబ్స్‌స్ట్రాక్ట్ ఆర్ట్ (నైరూప్య కళ) ద్వారా తాను అనుకున్న భావాలను చిత్రాలుగా గీసేది. అందుకోసం తను ఎంచుకునే థీమ్స్, తీసుకునే రంగులు విభిన్నంగా ఉండేవి. దీంతో అతి చిన్నవయసులో అబ్స్‌స్ట్రాక్ట్ ఆర్ట్‌లో కృషి చేస్తున్న కళాకారిణిగా తన గురించి అందరికీ తెలిసింది. మెల్లగా తన చిత్రాలు అందరికీ పరిచయమయ్యాయి. ఎలిటా గీసే ఒక్కో చిత్రం సుమారు 50,000 యూఎస్ డాలర్ల (దాదాపు రూ.43 లక్షల) వరకు అమ్ముడవుతాయి. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని రష్యన్ అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ మ్యూజియం, మయామిలోని ఆర్ట్ బాసెల్‌తో సహా అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన అనేక మ్యూజియంలలో ఎలిటా తన చిత్రాలను ప్రదర్శించింది. ప్రస్తుతం ఎలిటాకు 18 ఏళ్లు. చిత్రకళను మరింత సాధన చేస్తూ, తన సొంత వెబ్సైట్ ద్వారా చిత్రాలను అమ్ముతోంది. చిత్రకారిణిగా మరింత పేరు తెచ్చుకోవడమే తన ధ్యేయం అని వివరిస్తోంది. View this post on Instagram A post shared by Aelita Andre (@aelitaandre) -
విజృంభించిన ఎంగిడి.. ప్రపంచ ఛాంపియన్లను మట్టికరిపించిన సౌతాఫ్రికా
వన్డేల్లో ప్రపంచ ఛాంపియన్ అయిన ఆస్ట్రేలియాకు సౌతాఫ్రికా భారీ షాకిచ్చింది. ఆసీస్‌ను వారి సొంత ఇలాకాలో చిత్తుగా ఓడించింది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియాపై సౌతాఫ్రికాకు ఇది వరుసగా ఐదో ద్వైపాక్షిక సిరీస్ విజయం. దీనికి ముందు 2016 (5-0), 2018 (2-1), 2019 (3-0), 2023 (3-2)లో కూడా సౌతాఫ్రికా ఆసీస్‌ను మట్టి కరిపించింది. ఆస్ట్రేలియాకు వరుసగా ఇది మూడో వన్డే సిరీస్ పరాజయం. సౌతాఫ్రికాకు ముందు ఆస్ట్రేలియా శ్రీలంక, పాకిస్తాన్ లాంటి చిన్న జట్ల చేతుల్లో కూడా సిరీస్ కోల్పోయింది.మెక్కే వేదికగా ఇవాళ (ఆగస్ట్ 22) జరిగిన రెండో వన్డేలో సౌతాఫ్రికా ఆస్ట్రేలియాపై 84 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 49.1 ఓవర్లలో 277 పరుగులకు ఆలౌటైంది. మాథ్యూ బ్రీట్జ్కే (88), ట్రిస్టన్ స్టబ్స్ (74) అర్ద సెంచరీలతో రాణించారు. టోనీ డి జోర్జి (38), వియాన్ ముల్దర్ (26), కేశవ్ మహారాజ్ (22 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. రికెల్టన్ (8), మార్క్రమ్ (0), బ్రెవిస్ (1), ముత్తుసామి (4), బర్గర్ (8), ఎంగిడి (1) నిరాశపరిచారు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా 3, బార్ట్లెట్, నాథన్ ఎల్లిస్, లబూషేన్ తలో 2, హాజిల్‌వుడ్ ఓ వికెట్ పడగొట్టారు.అనంతరం 278 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్.. లుంగి ఎంగిడి (8.4-1-42-5) ధాటికి 37.4 ఓవర్లలో 193 పరుగులకే ఆలౌటైంది. ఎంగిడికి బర్గర్ (6-0-23-2), ముత్తుసామి (8-0-30-2), ముల్దర్ (5-0-31-1) కూడా జత కలవడంతో ఆసీస్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. మధ్యలో జోష్ ఇంగ్లిస్ (87) ఆసీస్‌ను ఆదుకునే ప్రయత్నం చేశాడు. అయితే అతనికి ఒక్కరి నుంచి కూడా సహకారం లభించలేదు. ఇంగ్లిస్ మెరుపు ఇన్నింగ్స్‌తో అడ్డుతగలడంతో ఆసీస్ పతనం కాస్త లేట్ అయ్యింది. ఆ జట్టు తరఫున ఇంగ్లిస్‌తో పాటు కెమరూన్ గ్రీన్ (35) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోర్ చేశాడు. హెడ్ (6), మార్ష్ (18), లబూషేన్ (1), క్యారీ (13), హార్డీ (10), బార్ట్లెట్ (8), ఎల్లిస్ (3), జంపా (3) దారుణంగా నిరాశపరిచారు. ఈ సిరీస్‌లో తొలి వన్డేలో కూడా ఆసీస్ ఇలాగే ఘోర పరాజయాన్ని చవి చూసింది. మిగిలిన నామమాత్రపు వన్డేలో అయిన ఆసీస్ రాణిస్తుందేమో చూడాలి. ఈ మ్యాచ్ ఆగస్ట్ 24న ఇదే వేదికగా జరునుంది. కాగా, ఈ వన్డే సిరీస్‌కు ముందు జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆసీస్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. -
ఆల్ టైమ్ రికార్డు సమం చేసిన కెమరూన్ గ్రీన్
ఆస్ట్రేలియా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కెమరూన్ గ్రీన్ ఓ ఆల్‌టైమ్ రికార్డును సమం చేశాడు. ఆస్ట్రేలియా తరఫున ఓ వన్డేలో అత్యధిక ఔట్ ఫీల్డ్ క్యాచ్‌లు పట్టుకున్న ఆటగాడిగా మార్క్ టేలర్ (1992), మైఖేల్ క్లార్క్ (2004), ఆండ్రూ సైమండ్స్ (2006), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (2015), మిచెల్ మార్ష్ (2016), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (2017), లబూషేన్ (2024) సరసన చేరాడు. వీరంతా ఓ వన్డేలో తలో నాలుగు ఔట్ ఫీల్డ్ క్యాచ్‌లు పట్టారు.ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో గ్రీన్ ట్రిస్టన్ స్టబ్స్, డెవాల్డ్ బ్రెవిస్, వియాన్ ముల్దర్, నండ్రే బర్గర్ క్యాచ్‌లు పట్టాడు. గ్రీన్‌తో పాటు మిగతా ఆసీస్ ఆటగాళ్లు కూడా మైదానంలో పాదరసంలా కదలి సత్తా చాటడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 49.1 ఓవర్లలో 277 పరుగులకు ఆలౌటైంది. మాథ్యూ బ్రీట్జ్కే (88), ట్రిస్టన్ స్టబ్స్ (74) అర్ద సెంచరీలతో రాణించారు. టోనీ డి జోర్జి (38), వియాన్ ముల్దర్ (26), కేశవ్ మహారాజ్ (22 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. రికెల్టన్ (8), మార్క్రమ్ (0), బ్రెవిస్ (1), ముత్తుసామి (4), బర్గర్ (8), ఎంగిడి (1) నిరాశపరిచారు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా 3, బార్ట్లెట్, నాథన్ ఎల్లిస్, లబూషేన్ తలో 2, హాజిల్‌వుడ్ ఓ వికెట్ పడగొట్టారు.అనంతరం 278 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్ తడబడుతూ బ్యాటింగ్ కొనసాగిస్తుంది. ఆ జట్టు 31 ఓవర్లలో 163 పరుగులకు సగం వికెట్లు కోల్పోయింది. ట్రవిస్ హెడ్ (6), మిచెల్ మార్ష్ (18), లబూషేన్ (1), గ్రీన్ (35), క్యారీ (13) ఔట్ కాగా.. జోస్ ఇంగ్లిస్ (78), ఆరోన్ హార్డీ (6) క్రీజ్‌లో ఉన్నారు. సౌతాఫ్రికా బౌలర్లలో బర్గర్ 2, ఎంగిడి, ముల్దర్, ముత్తుసామి తలో వికెట్ తీశారు. కాగా, మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో పర్యాటక సౌతాఫ్రికా తొలి వన్డే గెలిచి 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. -
అల్బనీస్ బలహీనమైన నాయకుడు
జెరూసలేం: ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంతోనీ అల్బనీస్ ఇజ్రాయెల్‌కు ద్రోహం చేశారని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆరోపించారు. ఆ్రస్టేలియాలోని యూదు సమాజాన్ని ఆ దేశం వదిలేసిందన్నారు. బలహీనమైన రాజకీయ నాయకుడిగా ఆయనను చరిత్ర గుర్తుంచుకుంటుందని విమర్శించారు. ఆ్రస్టేలియన్ యూదు సంఘం (ఏజేఏ) నిర్వహించిన కార్యక్రమానికి హాజరవ్వాలన్సిన ఇజ్రాయెల్ నేత సిమ్చా రోత్మన్ వీసాను ఆస్ట్రేలియా రద్దు చేసింది.విభజన రాజకీయాలు చేస్తున్నవారిపై తమ ప్రభుత్వం కఠినమైన వైఖరి తీసుకుంటుందని ఆ దేశ ఇమ్మిగ్రేషన్ మంత్రి టోనీ బర్క్ ప్రకటించారు. ‘మీరు ద్వేషం, విభజన సందేశాన్ని వ్యాప్తి చేయడానికి ఆస్ట్రేలియాకు వస్తున్నట్లయితే.. మీరు ఇక్కడికి రావడం మాకు ఇష్టం లేదు’అని బర్క్ స్పష్టం చేశారు. దీంతో రోత్మన్ సమావేశంలో వర్చువల్‌గా పాల్గొని, ప్రసంగిస్తారని ఏజేఏ తెలిపింది. యూదు సమాజం టోనీ బర్క్‌కు, విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్‌కు తలవంచదని ప్రకటించింది. ఈ పరిణామాల పట్ల నెతన్యాహు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగతంగా తీసుకోనుఅయితే.. నెతన్యాహు వ్యాఖ్యలపై బర్క్ బుధవారం స్పందించారు. పాలస్తీనాను దేశంగా గుర్తిస్తున్నట్లు ఆ్రస్టేలియా ప్రకటించినందుకే ఆయనకు ఆగ్రహం వస్తోందన్నారు. ఇక.. బలమైన నాయకుడంటే.. ఇతర దేశాలపై దాడులు చేసేవారు, ఇతర దేశాల్లో ప్రజలను ఆకలితో చంపేవారు కాదని, దాడులు, హత్యలతో ఒక దేశాధ్యక్షుడి బలాన్ని అంచనా వేయలేమని ఎద్దేవా చేశారు. నెతన్యాహు వ్యాఖ్యలపై ప్రధాని అల్బనీస్ సైతం స్పందించారు. వాటిని వ్యక్తిగతంగా తీసుకోనన్నారు. తాను ఇతర దేశాల నాయకులను గౌరవంగా చూస్తానని, దౌత్యపరంగా వారితో సంభాíÙస్తానని హుందాగా చెప్పుకొచ్చారు. అయితే ఇజ్రాయెల్ మితవాద నేతల వీసాలను ఆ్రస్టేలియా రద్దు చేయడం ఇదే మొదటిసారి కాదు. 2022లో పార్లమెంటును విడిచిపెట్టిన నాయకురాలు, ఇజ్రాయెల్ మాజీ న్యాయ మంత్రి అయెలెట్ షేక్డ్కు కూడా వీసా నిరాకరించారు. నెతన్యాహుతో ఘర్షణ పడేవారే అసలైన నాయకుడు నెతన్యాహు వ్యాఖ్యలను ఇజ్రాయెల్ ప్రతిపక్ష నాయకుడు యైర్ లాపిడ్ విమర్శించారు. అంతేకాదు.. ఆయన వ్యాఖ్యలను ఆ్రస్టేలియా నాయకునికి బహుమతిగా అభివరి్ణంచారు. ‘రాజకీయంగా అత్యంత విషపూరిత నాయకుడైన నెతన్యాహుతో ఘర్షణ పడేవారే ప్రస్తుతం ప్రజాస్వామ్య ప్రపంచంలో అసలైన నాయకుడు. ఆ్రస్టేలియా ప్రధానమంత్రికి ఈ బహుమతిని ఇచ్చారు’అని ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.పాలస్తీనాకు మద్దతు ఇవ్వడంతో.. పాలస్తీనా దేశాన్ని యూఎన్‌లో ఉన్న 193 సభ్య దేశాల్లో 147 దేశాలు గుర్తించాయి. యూకే, ఫ్రాన్స్, కెనడాలు కూడా ఆ దేశాల జాబితాలో చేరాయి. ఆ తర్వాత ఆ్రస్టేలియా సైతం పాలస్తీనాకు మద్దతు ఇచి్చంది. ఆ సమయంలో ప్రధాని అల్బనీస్ మాట్లాడుతూ ‘అమాయక ప్రజలపై యుద్ధ చూపుతున్న ప్రభావాన్ని నెతన్యాహు పట్టించుకోవడం లేదు. సహాయ పంపిణీ కేంద్రాల చుట్టూ ప్రజలు ఆహారం, నీటి కోసం క్యూలో నిలబడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది ఆమోదయోగ్యం కాదు’అన్నారు. అప్పటినుంచి ఆయా దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు మొదలయ్యాయి. ప్రతిస్పందనగా, నెతన్యాహు మూడు దేశాల నాయకులపై దాడిని ప్రారంభించారు. కెయిర్ స్టార్మర్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, మార్క్ కారీ్నలు.. సామూహిక హంతకులు, రేపిస్టులు, శిశువుల హంతకులు, కిడ్నాపర్ల పక్షాన నిలుస్తున్నారని ఆరోపించారు. -
తొలి వన్డేలో ఆసీస్‌పై విజయం.. సౌతాఫ్రికా ఆటగాడిపై ఫిర్యాదు
తొలి వన్డేలో ఆస్ట్రేలియాపై అద్భుత విజయం సాధించి జోష్‌లో ఉన్న సౌతాఫ్రికాకు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు అరంగేట్రం స్పిన్నర్ ప్రేనేలన్ సుబ్రాయెన్ (Prenelan Subrayen) బౌలింగ్ యాక్షన్‌పై అనుమానాలు వ్యక్తమయ్యాయి. సుబ్రాయెన్ బౌలింగ్ శైలిపై మ్యాచ్ అఫీషియల్స్ ఐసీసీకి ఫిర్యాదు చేశారు. కుడి చేతి వాటం రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ అయిన సుబ్రాయెన్ బౌలింగ్ శైలి కాస్త భిన్నంగా ఉంది. అతడి యాక్షన్ ఐసీసీ నియమాలకు విరుద్దమేమో అని మ్యాచ్ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో సుబ్రాయెన్ ఐసీసీ పర్యవేక్షణలో ఓ పరీక్షను (బౌలింగ్ శైలి) ఎదుర్కోవాల్సి ఉంది.సుబ్రాయెన్ ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో పర్వాలేదనిపించాడు. తన కోటా 10 ఓవర్లలో 46 పరుగులిచ్చి అత్యంత కీలకమైన ట్రవిస్ హెడ్ వికెట్ తీశాడు. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఆసీస్‌ను 98 పరుగుల తేడాతో చిత్తు చేసింది.తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన ఆస్ట్రేలియా 40.5 ఓవర్లలో 198 పరుగులకే ఆలౌటైంది. సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ ఐదు వికెట్లు తీసి ఆసీస్ పతనాన్ని శాశించాడు. అతనికి నండ్రే బర్గర్ (2/54), లుంగి ఎంగిడి (2/28), సుబ్రాయెన్ (1/46) తోడయ్యారు.ఆసీస్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ మిచెల్ మార్ష్ (88) ఒక్కడే రాణించాడు. ట్రవిస్ హెడ్ (27), బెన్ డ్వార్షుయిస్ (33) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. అంతకుముందు మార్క్రమ్ (82), బవుమా (65), బ్రీట్జ్కే (57) అర్ద సెంచరీలతో రాణించడంతో సౌతాఫ్రికా భారీ స్కోర్ చేసింది. ఆసీస్ బౌలర్లలో హెడ్ 4 వికెట్లతో సత్తా చాటాడు. గత నెలలోనే టెస్ట్ అరంగేట్రం31 ఏళ్ల సుబ్రాయెన్ గత నెలలోనే టెస్ట్ అరంగేట్రం చేశాడు. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్లు (ఒకే ఇన్నింగ్స్‌లో) తీసి పర్వాలేదనిపించాడు. సుబ్రాయెన్ లోయర్ ఆర్డర్లో ఉపయోగకరమైన బ్యాటర్ కూడా. అతడికి ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మంచి బ్యాటింగ్ రికార్డు ఉంది. లేట్‌గా అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన సుబ్రాయెన్ రెండో మ్యాచ్‌తోనే వివాదంలో చిక్కుకున్నాడు. బౌలింగ్ శైలిపై ఐసీసీ క్లీన్ చిట్ ఇస్తేనే అతడు ఆసీస్‌తో రెండో వన్డే ఆడగలడు. రెండో వన్డే ఆగస్ట్ 22న జరుగనుంది. -
ఆసీస్ ప్లేయర్‌కు అక్షింతలు
ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపాకు ఐసీసీ అక్షింతలు వేసింది. సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డే సందర్భంగా అభ్యంతరకర భాష వాడినందుకు ఓ డీమెరిట్ పాయింట్ అతని ఖాతాలో చేర్చింది. ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్‌లో ఇది లెవెల్-1 ఉల్లంఘన కిందికి వస్తుంది. సాధారణంగా ఇలాంటి తప్పిదాలకు ఒకటి లేదా రెండు డీమెరిట్ పాయింట్లతో పాటు 50 శాతం వరకు మ్యాచ్ ఫీజ్‌లో కోత విధిస్తారు. అయితే గడిచిన 24 నెలల్లో జంపాకు ఇది మొదటి తప్పిదం కావడంతో కేవలం ఓ డీమెరిట్ పాయింట్‌తో సరిపెట్టారు.ఏం జరిగిందంటే..?సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 37వ ఓవర్ సందర్భంగా జంపా అభ్యంతరకర భాష వాడాడు. మిస్ ఫీల్డ్‌తో పాటు ఓవర్ త్రో చేయడంతో జంపా సహనం కోల్పోయి ఇలా ప్రవర్తించాడు. జంపా వాడిన భాష స్టంప్ మైక్‌ల్లో రికార్డైంది. దీని ఆధారంగా జంపాపై ఐసీసీ చర్యలు తీసుకుంది. ఈ శిక్షను స్వీకరించడంతో జంపాను తదుపరి విచారణ నుంచి మినహాయించారు.కాగా, సౌతాఫ్రికాతో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చిత్తుగా ఓడింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన ఆస్ట్రేలియా 40.5 ఓవర్లలో 198 పరుగులకే ఆలౌటైంది. సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ ఐదు వికెట్లు తీసి ఆసీస్ పతనాన్ని శాశించాడు. అతనికి నండ్రే బర్గర్ (2/54), లుంగి ఎంగిడి (2/28), సుబ్రాయన్ (1/46) తోడయ్యారు.ఆసీస్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ మిచెల్ మార్ష్ (88) ఒక్కడే రాణించాడు. ట్రవిస్ హెడ్ (27), బెన్ డ్వార్షుయిస్ (33) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. అంతకుముందు మార్క్రమ్ (82), బవుమా (65), బ్రీట్జ్కే (57) అర్ద సెంచరీలతో రాణించడంతో సౌతాఫ్రికా భారీ స్కోర్ చేసింది. ఆసీస్ బౌలర్లలో హెడ్ 4 వికెట్లతో సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌లో ఆడమ్ జంపా (10-0-58-1) పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో రెండో వన్డే ఆగస్ట్ 22న జరుగనుంది. -
కొనసాగుతున్న టిమ్ డేవిడ్ విధ్వంసకాండ.. పట్టపగ్గాల్లేకుండా దూసుకుపోతున్న ఆసీస్ స్టార్
ఇటీవలికాలంలో ఆస్ట్రేలియా టీ20 ఆటగాడు టిమ్ డేవిడ్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. పట్టపగ్గాల్లేకుండా సుడిగాలి ఇన్నింగ్స్‌లు ఆడుతూ విధ్వంసం సృష్టిస్తున్నాడు. కొద్ది రోజుల కిందట వెస్టిండీస్‌పై 37 బంతుల్లో శతక్కొట్టిన ఈ మెరుపు వీరుడు.. ఆతర్వాత సౌతాఫ్రికాపై వరుస అర్ద సెంచరీలతో (52 బంతుల్లో 83, 24 బంతుల్లో 50) విరుచుకుపడ్డాడు.టిమ్ ఇదే విధ్వంసాన్ని ప్రైవేట్ టీ20 లీగ్‌ల్లోనూ కొనసాగిస్తున్నాడు. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ తర్వాత కరీబియన్ ప్రీమియర్ లీగ్ ఆడేందుకు వచ్చిన టిమ్.. తొలి మ్యాచ్‌లోనే మెరుపు ప్రదర్శన చేశాడు. ఈ లీగ్‌లో సెయింట్ లూసియా కింగ్స్‌కు ఆడుతున్న అతను.. ఇవాళ (ఆగస్ట్ 20) సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 23 బంతుల్లో 5 సిక్సర్లు, బౌండరీ సాయంతో 4 పరుగులు చేశాడు.టిమ్ విధ్వంసం ధాటికి ఈ మ్యాచ్‌లో లూసియా కింగ్స్ తొలుత బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ (200/8) చేసింది. లూసియా కింగ్స్ ఇన్నింగ్స్‌లో టిమ్‌కు ముందు జాన్సన్ ఛార్లెస్ (28 బంతుల్లో 52), రోస్టన్ ఛేజ్ (38 బంతుల్లో 61) మెరుపు అర్ద శతకాలు బాదారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన పేట్రియాట్స్ను నేవియన్ బిదైసీ (50), జేసన్ హోల్డర్ (29 బంతుల్లో 63; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) గెలిపించే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ ధాటిగా ఆడినా పేట్రియాట్స్ లక్ష్యానికి 4 పరుగుల దూరంలో నిలిచిపోయింది. హోల్డర్ ఊహకందని షాట్లతో విరుచుకుపడినా పేట్రయాట్స్ను గెలిపించలేకపోయాడు. అతడి సుడిగాలి ఇన్నింగ్స్ వృధా అయ్యింది. పేట్రియాట్స్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 197 పరుగులే చేయగలిగింది. మెరుపు అర్ద శతకంతో పాటు రెండు వికెట్లు తీసిన లూసియా కింగ్స్ ఆటగాడు రోస్టన్ ఛేజ్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. -
వన్డే క్రికెట్లో సరికొత్త సంచలనం.. రికార్డు స్కోర్లతో దూసుకుపోతున్న సౌతాఫ్రికా బ్యాటర్
వన్డే క్రికెట్‌కు సరికొత్త స్టార్ పరిచమయ్యాడు. అతడి పేరు మాథ్యూ బ్రీట్జ్కే (26). సౌతాఫ్రికాకు చెందిన ఈ కుడి చేతి వాటం వికెట్‌కీపర్ బ్యాటర్.. తన తొలి మూడు మ్యాచ్‌ల్లో అదిరిపోయే ప్రదర్శనలు చేసి ఆల్‌టైమ్ రికార్డు సెట్ చేశాడు. అరంగేట్రం వన్డేలో న్యూజిలాండ్‌పై భారీ సెంచరీ (148 బంతుల్లో 150) చేసిన బ్రీట్జ్కే.. ఆతర్వాత వరుసగా రెండు వన్డేల్లో (పాకిస్తాన్, తాజాగా ఆస్ట్రేలియాపై) హాఫ్ సెంచరీలు (83, 57) బాదాడు. తద్వారా వన్డే క్రికెట్లో తొలి మూడు మ్యాచ్‌ల తర్వాత అత్యధిక స్కోర్ (290 పరుగులు) చేసిన బ్యాటర్‌గా సరికొత్త చరిత్ర సృష్టించాడు. గతంలో ఈ రికార్డు ఇంగ్లండ్ మాజీ ఓపెనర్ నిక్ నైట్ పేరిట ఉండేది. నైట్ తన తొలి మూడు వన్డేల్లో 264 పరుగులు చేశాడు. ఈ విభాగంలో నైట్ తర్వాత స్థానంలో సౌతాఫ్రికాకే చెందిన టెంబా బవుమా (259) ఉన్నాడు.తొలి మూడు వన్డేల్లో 50కి పైగా స్కోర్లు చేయడంతో బ్రీట్జ్కే మరో రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. నవ్‌జోత్ సింగ్ సిద్దూ, మ్యాక్స్ ఓడౌడ్ తర్వాత చరిత్రలో ఈ ఘనత సాధించిన మూడో బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు.బ్రీట్జ్కే ఇవాళ (ఆగస్ట్ 19) ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో 56 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్ సాయంతో 57 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఆస్ట్రేలియాను 98 పరుగుల తేడాతో చిత్తు చేసింది.తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. బ్రీట్జ్కేతో పాటు మార్క్రమ్ (82), బవుమా (65) అర్ద సెంచరీలతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. రికెల్టన్ (33), ముల్దర్ (31 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఆసీస్ బౌలర్లలో ట్రవిస్ హెడ్ 4 వికెట్లతో సత్తా చాటాడు. ఓ రనౌట్ కూడా చేశాడు.అనంతరం 297 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్.. కేశవ్ మహారాజ్ (10-1-33-5) ధాటికి 40.5 ఓవర్లలో 198 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ మిచెల్ మార్ష్ (88) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. హెడ్ (27), డ్వార్షుయిస్ (33) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్ ఐదేయగా.. నండ్రే బర్గర్, లుంగి ఎంగిడి తలో 2, సుబ్రాయన్ ఓ వికెట్ తీశారు. ఈ గెలుపుతో సౌతాఫ్రికా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో వన్డే ఆగస్ట్ 22న జరుగనుంది. -
అలీసా అదరహో
బ్రిస్బేన్: ఆ్రస్టేలియా గడ్డపై ఇప్పటికే వన్డే సిరీస్ చేజిక్కించుకున్న భారత మహిళల ‘ఎ’ జట్టు చివరి మ్యాచ్‌లో పరాజయం పాలైంది. ఆ్రస్టేలియా ‘ఎ’ జట్టుతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన మూడో వన్డేలో 9 వికెట్ల తేడాతో ఓడి 2–1తో సిరీస్ ఖాతాలో వేసుకుంది. స్టార్ బ్యాటర్ అలీసా హీలీ (85 బంతుల్లో 137 నాటౌట్; 23 ఫోర్లు, 3 సిక్స్‌లు) విజృంభించడంతో ఆ్రస్టేలియా ‘ఎ’ జట్టు అలవోకగా విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత ‘ఎ’ జట్టు 47.4 ఓవర్లలో 216 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ షఫాలీ వర్మ (59 బంతుల్లో 52; 7 ఫోర్లు) అర్ధశతకంతో మెరవగా... వికెట్ కీపర్ యస్తిక భాటియా (54 బంతుల్లో 42; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించింది. నందిని కశ్యప్ (53 బంతుల్లో 28; 2 ఫోర్లు), రాఘ్వీ బిస్త్ (32 బంతుల్లో 18; 2 ఫోర్లు), తనూశ్రీ సర్కార్ (22 బంతుల్లో 17), కెప్టెన్ రాధా యదవ్ (22 బంతుల్లో 18; 1 ఫోర్, 1 సిక్స్) మెరుగైన ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. తేజల్ హసబ్నిస్ (1) విఫలమైంది. ఆ్రస్టేలియా ‘ఎ’ జట్టు బౌలర్లలో తహిలా మెక్‌గ్రాత్ 40 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టింది. సియానా జింజర్ 50 పరుగులిచ్చి 2 వికెట్లు, ఎల్లా హేవార్డ్ 43 పరుగులిచ్చి 2 వికెట్లు, అనిక లెరాయిడ్ 16 పరుగులిచ్చి 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనలో ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టు 27.5 ఓవర్లలోనే ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 222 పరుగులు చేసింది. హీలీ అజేయ శతకంతో చెలరేగగా... తహీలా విల్సన్ (51 బంతుల్లో 59; 8 ఫోర్లు) అర్ధశతకం సాధించింది. భారత బౌలర్లలో రాధా యాదవ్ ఒక వికెట్ పడగొట్టింది. ఇరు జట్ల మధ్య గురువారం నుంచి ఇక్కడే ఏకైక అనధికారిక టెస్టు మ్యాచ్ జరగనుంది.దంచికొట్టిన హీలీ..గాయం నుంచి కోలుకొని వచ్చిన అలీసా హీలీ... భారత ‘ఎ’ జట్టుతో పరిమిత ఓవర్ల సిరీస్‌లను సంపూర్ణంగా వినియోగించుకుంది. మొదట టి20 సిరీస్‌తో లయ అందుకున్న హీలీ... వన్డే సిరీస్‌లో అదరగొట్టింది. గత మ్యాచ్‌లో త్రుటిలో సెంచరీ చేజార్చుకున్న అలీసా... ఈ మ్యాచ్‌లో అజేయ శతకంతో అదరగొట్టింది. 7 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హీలీ ఇచ్చిన క్యాచ్‌ను భారత ఫీల్డర్లు నేలపాలు చేయగా... దాన్ని వినియోగించుకున్న ఆస్ట్రేలియా సీనియర్ జట్టు రెగ్యులర్ కెప్టెన్ బౌండరీలతో చెలరేగింది. రెండో ఓవర్లో ఫోర్‌తో మోత ప్రారంభించిన హీలీ... భారీ సిక్స్‌తో లక్ష్యఛేదనను పూర్తి చేసేంతవరకు అదే జోరు కొనసాగించింది. ఆంధ్రప్రదేశ్ బౌలర్ షబ్నమ్ వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లు బాదిన హీలీ... మిన్ను మణి, తనూజ కన్వర్ ఓవర్లలో రెండేసి ఫోర్లు కొట్టింది. మరో ఎండ్ నుంచి తహిలా విల్సన్ కూడా ధాటిగా ఆడటంతో ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టు స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. షబ్నమ్ ఓవర్లో మరో రెండు ఫోర్లు కొట్టిన హీలీ 30 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకుంది. తొలి వికెట్‌కు 137 పరుగులు జోడించిన అనంతరం తహిలా వెనుదిరగగా... హీలీ మాత్రం అదే జోష్ కనబర్చింది. మిన్ను మణి వేసిన ఇన్నింగ్స్ 21వ ఓవర్లో 4, 4, 6 కొట్టి 64 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకుంది. మరో ఎండ్ నుంచి రాచెల్ (21 నాటౌట్) సహకారం లభించడంతో హీలీ జట్టును విజయతీరాలకు చేర్చింది -
చరిత్ర సృష్టించిన మ్యాక్స్‌వెల్
విధ్వంసకర ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ తన దేశం తరఫున టీ20ల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్న ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో మరో విధ్వంసకర ఆటగాడు డేవిడ్ వార్నర్ రికార్డును సమం చేశాడు. ఈ ఇద్దరు టీ20ల్లో చెరో 12 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్నారు. వార్నర్ 110 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించగా.. మ్యాక్స్‌వెల్ 124 మ్యాచ్‌లో వార్నర్ రికార్డును సమం చేశాడు.నిన్న (ఆగస్ట్ 16) సౌతాఫ్రికాతో జరిగిన నిర్ణయాత్మక మూడో టీ20లో మెరుపు అర్ద శతకం బాది, తన జట్టును గెలిపించిన మ్యాక్సీ.. తన టీ20 కెరీర్లో 12వ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఓడిపోవాల్సిన ఈ మ్యాచ్‌లో మ్యాక్సీ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి తన జట్టుకు అద్భుత విజయాన్నందించాడు. మ్యాక్సీ ఆడిన ఈ మెరుపు ఇన్నింగ్స్ కారణంగా ఆసీస్ మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను కూడా కైవసం చేసుకుంది.తీవ్ర ఒత్తిడిలో మ్యాక్సీ ఆడిన ఈ ఇన్నింగ్స్ అతడి టీ20 కెరీర్లో అత్యుత్తమైందిగా చెప్పుకోవచ్చు. 173 పరుగుల లక్ష్య ఛేదనలో ఆసీస్ 88 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండింది. ఈ దశలో బరిలోకి దిగిన మ్యాక్సీ కళ్లు మూసి తెరిచేలోపు హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని తన జట్టును సేఫ్ జోన్లో ఉంచాడు. అంతేకాకుండా చివరి 2 బంతుల్లో 4 పరుగులు అవసమైన తరుణంలో ఊహించని షాట్ ఆడి తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్నందించాడు.ఈ ఇన్నింగ్స్‌లో 36 బంతులు ఎదుర్కొన్న అతను 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అజేయమైన 62 పరుగులు చేసి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ గెలుపుతో ఆసీస్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఆసీస్, రెండో మ్యాచ్‌లో సౌతాఫ్రికా గెలుపొందాయి.బ్రెవిస్ విధ్వంసంఅంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో విధ్వంసకర శతకం బాదిన డెవాల్డ్ బ్రెవిస్ ఈ మ్యాచ్‌లోనూ చెలరేగి ఆడాడు. 26 బంతుల్లో 6 సిక్సర్లు, ఓ బౌండరీ సాయంతో 53 పరుగులు చేశాడు. బ్రెవిస్ విధ్వంసానికి డస్సెన్ (38 నాటౌట్) మెరుపులు కూడా తోడవ్వడంతో సౌతాఫ్రికా ఓ మోస్తరు స్కోర్ చేయగలిగింది. -
గ్లెన్ మ్యాక్స్‌వెల్‌పై భారత క్రికెట్ అభిమానుల ఆగ్రహం
ఆసీస్ విధ్వంసక బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ తీరు భారత క్రికెట్ అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తుంది. ఈ వెటరన్ మెరుపు వీరుడు ఐపీఎల్ మినహా అన్ని చోట్లా సత్తా చాటడమే ఇందుకు కారణం. తాజాగా మ్యాక్సీ తన జాతీయ జట్టుకు ఆడుతూ (సౌతాఫ్రికాతో నిర్ణయాత్మక మూడో టీ20) సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. ఓడిపోవాల్సిన మ్యాచ్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి తన జట్టును గెలిపించాడు. ఈ గెలుపుతో ఆసీస్ సిరీస్‌ను కూడా కైవసం చేసుకుంది. తీవ్ర ఒత్తిడిలో ఆడిన ఈ ఇన్నింగ్స్ మ్యాక్స్‌వెల్ టీ20 కెరీర్లో అత్యుత్తమైందిగా చెప్పుకోవచ్చు.173 పరుగుల లక్ష్య ఛేదనలో ఆసీస్ 88 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండింది. ఈ దశలో బరిలోకి దిగిన మ్యాక్సీ కళ్లు మూసి తెరిచేలోపు హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని తన జట్టును సేఫ్ జోన్లో ఉంచాడు. అంతేకాకుండా చివరి 2 బంతుల్లో 4 పరుగులు అవసమైన తరుణంలో ఊహించని షాట్ ఆడి తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్నందించాడు. ఈ ఇన్నింగ్స్‌లో 36 బంతులు ఎదుర్కొన్న అతను 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అజేయమైన 62 పరుగులు చేసి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు.ఈ ఇన్నింగ్స్ తర్వాత మ్యాక్సీపై అందరూ ప్రశంసలు కురిపిస్తుండగా.. భారత అభిమానులు మాత్రం గుర్రుగా ఉన్నారు. మ్యాక్స్‌వెల్ ఐపీఎల్లో ఆడడు కానీ, మిగతా చోట్లంతా సత్తా చాటుతాడంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి భారత క్రికెట్ అభిమానుల్లో బాధకు అర్దముంది. ఎన్నో ఆశలు పెట్టుకుని ఇతగాడికి ఐపీఎల్ అవకాశాలిస్తే.. దారుణంగా నిరుత్సాహపరిచాడు. గత రెండు మూడు సీజన్లుగా పరిస్థితి ఇదే. గత సీజన్లో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉండింది. 5 మ్యాచ్‌ల్లో కేవలం 48 పరుగులే చేసి మధ్యలో స్వదేశానికి చెక్కేశాడు. పంజాబ్ కింగ్స్ అతనిపై భారీ అంచనాలు పెట్టుకొని, మంచి మొత్తానికి కొనుగోలు చేసింది. వారి ఆశలపై మ్యాక్స్‌వెల్ నీళ్లు చల్లాడు.ఈ వైఫల్యాలు చూసి మ్యాక్స్‌వెల్ ఫామ్ కోల్పోయుంటాడనుకోవడానికి వీళ్లేదు. ఎందుకంటే ఐపీఎల్ తర్వాత జరిగిన మేజర్ లీగ్ క్రికెట్లో అతను అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించాడు. 12 మ్యాచ్‌ల్లో 175 స్ట్రయిక్‌రేట్‌తో 252 పరుగులు చేశాడు. తన జాతీయ జట్టుకు ఆడేప్పుడు మ్యాక్స్‌వెల్ మరింత అంకితభావంతో ఆడి చెలరేగుతాడు. ఈ ఏడాది టీ20ల్లో ప్రదర్శనలే ఇందుకు ఉదాహరణ. ఈ యేడు అతను ఆసీస్ తరఫున 8 టీ20 ఇన్నింగ్స్‌లు ఆడి 174.2 స్ట్రయిక్‌రేట్‌తో 169 పరుగులు చేశాడు.మ్యాక్స్‌వెల్ తన సొంత దేశం తరఫున ఎలా ఆడినా.. భారత అభిమానులకు పోయేదేమీ లేదు. అయితే దేశం తరఫున ఆడేప్పుడు చూపే అంకితభావాన్ని ఐపీఎల్‌ల్లోనూ కనబర్చాలని వారు ఆశిస్తున్నారు. ఏ ఫ్రాంచైజీ అయినా ఆటగాళ్లను భారీ అంచనాలు పెట్టుకునే కొనుగోలు చేస్తుంది. అలాంటప్పుడు ఆటగాళ్లు తమపై పెట్టిన పెట్టుబడికి న్యాయం చేసేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నించాలి.అయితే మ్యాక్సీ మాత్రం అలా చేస్తున్నట్లు కనిపిండం లేదు. ఏదో హాలిడే ఎంజాయ్ చేసేందుకు భారత్‌కు వస్తున్నాడా అనిపిస్తుంది. అతను పెళ్లి చేసుకుంది కూడా ఇక్కడే కాబట్టి, అత్తగారింటికి చుట్టపు చూపుకు వచ్చినట్లు వచ్చిపోతున్నాడు. ఐపీఎల్ ఆరంభంలో మ్యాక్సీలో కనిపించిన కమిట్మెంట్ ఇటీవలకాలంలో కనిపించడం లేదు. పంజాబ్‌కు ముందు ఆర్సీబీ తరఫున తరఫున కూడా వైఫల్యాల పరంపర కొనసాగించాడు. ఇది చూస్తే, చాలా మంది ఆసీస్ ఆటగాళ్ల లాగే మ్యాక్స్‌వెల్‌కు కూడా ఐపీఎల్ అంటే గిట్టదేమో అని అనిపిస్తుంది. -
ప్రాచీన కాలంలో బుల్లి తిమింగలం
వెల్లింగ్టన్: సముద్రాల్లో తిరుగాడే తిమింగలం పరిమాణం ఎంత ఉంటుందో మనకు తెలుసు. భారీ ఆకారంతో టన్నుల కొద్దీ బరువుండే తిమింగలాలు ఉన్నాయి. కానీ, ప్రాచీన కాలంలో బుల్లి తిమింగలాలు ఉండేవని పరిశోధకులు గుర్తించారు. 2.5 కోట్ల సంవత్సరాల క్రితం నాటి తిమింగలం శిలాజం ఆస్ట్రేలియా సముద్ర తీరంలో లభించింది. దీనికి జంజూసిటస్ డులార్డి అని పేరు పెట్టారు. ఇది చాలా అరుదైన తిమింగలం అని చెబుతున్నారు. తిమింగలాల పరిణామ క్రమాన్ని తెలుసుకోవడానికి తోడ్పడుతుందని అంచనా వేస్తున్నారు. ఇది ఎంత చిన్నది అంటే సింగిల్ బెడ్‌కు సరిగ్గా సరిపోతుంది. దాని కండ్లు టెన్నిస్ బంతుల సైజ్‌లో ఉన్నాయి. పదునైన దంతాలు కనిపిస్తున్నాయి. అంటే ఇవి ఆహారం కోసం సముద్రంలో ఇతర జీవులను వేటాడేవని తెలుస్తోంది. దీని ముఖం కార్టూన్ క్యారెక్టర్ ముఖాన్ని పోలి ఉంది. బుల్లి తిమింగలాలు ఎలా అంతరించిపోయాయన్నది తెలుసుకోవడానికి సైంటిస్టులు ప్రయత్నిస్తున్నారు. -
చివరి ఓవర్లో ఛేదించి...
బ్రిస్బేన్: ఆ్రస్టేలియా పర్యటనలో టి20 సిరీస్ కోల్పోయిన భారత మహిళల ‘ఎ’ జట్టు... వన్డే సిరీస్‌లో సత్తా చాటింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2–0తో కైవసం చేసుకుంది. శుక్రవారం హోరాహోరీగా సాగిన రెండో వన్డేలో భారత ‘ఎ’ జట్టు 2 వికెట్ల తేడాతో ఆ్రస్టేలియా మహిళల ‘ఎ’ జట్టుపై విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆ్రస్టేలియా ‘ఎ’ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. స్టార్ బ్యాటర్ అలీసా హీలీ (87 బంతుల్లో 91; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకోగా... కిమ్ గార్త్ (41 నాటౌట్; 4 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడింది. భారత బౌలర్లలో మిన్ను మణి 46 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా ... సైమా ఠాకూర్ 30 పరుగులిచ్చి 2 వికెట్లు తీసింది. టిటాస్ సాధు, రాధా యాదవ్, ప్రేమ రావత్, తనూజ కన్వర్‌లకు ఒక్కో వికెట్ లభించింది. అనంతరం లక్ష్యఛేదనలో భారత మహిళల ‘ఎ’ జట్టు 49.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 266 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ రాధ యాదవ్ (78 బంతుల్లో 60; 5 ఫోర్లు, 1 సిక్స్), యస్తిక భాటియా (71 బంతుల్లో 66; 9 ఫోర్లు), తనూజ కన్వర్ (57 బంతుల్లో 50; 3 ఫోర్లు) హాఫ్‌సెంచరీలతో కదంతొక్కారు. షఫాలీ వర్మ (4), ధారా గుజ్జర్ (0), తేజల్ హసబ్నిస్ (19), రాఘ్వీ బిస్త్ (14) విఫలమయ్యారు. సహచరుల నుంచి పెద్దగా సహకారం లభించకపోయినా... ఆరంభంలో యస్తిక ఇన్నింగ్స్‌ను నడిపించింది. ఆ తర్వాత ఆ బాధ్యతను రాధ యాదవ్ సక్రమంగా నిర్వర్తించగా... ఆఖర్లో తనూజ అదరగొట్టింది. అర్ధశతకం అనంతరం రాధా యాదవ్ అవుట్ కావడంతో భారత జట్టు 193/7తో నిలిచింది. ఇక ఛేదన కష్టమే అనుకుంటున్న తరుణంలో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ తనూజ కన్వర్ చక్కటి ఆటతీరుతో చెలరేగింది. ప్రేమ రావత్ (33 బంతుల్లో 32 నాటౌట్; 3 ఫోర్లు)తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 68 పరుగులు జోడించి జట్టును విజయం దిశగా నడిపించింది. చివరి ఓవర్ తొలి బంతికి తనూజ అవుట్ కావడంతో ఉత్కంఠ నెలకొన్నా... ప్రేమ రావత్ విజయానికి కావాల్సిన 5 పరుగులు చేసి మరో బంతి మిగిలుండగానే జట్టును గెలిపించింది. ఇదే వేదికపై బుధవారం జరిగిన తొలి వన్డేలో భారత ‘ఎ’ జట్టు 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక ఇరు జట్ల మధ్య నామమాత్రమైన మూడో వన్డే ఆదివారం ఇక్కడే జరగనుంది. -
సిరీస్ డిసైడర్‌కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు భారీ షాక్
స్వదేశంలో సౌతాఫ్రికాతో జరుగుతున్న పరిమిత ఓవర్ల సిరీస్‌లో, నిర్ణయాత్మక మూడో టీ20కి ముందు ఆస్ట్రేలియా జట్టుకు భారీ షాక్ తగిలింది. కంకషన్ (తలకు బలమైన దెబ్బ) కారణంగా విధ్వంసకర బ్యాటర్ మిచెల్ ఓవెన్ తదుపరి సిరీస్ మొత్తానికి (ఓ టీ20, మూడు వన్డేలు) దూరమయ్యాడు.రెండో టీ20 సందర్భంగా ఓవెన్‌కు గాయమైంది. బౌలర్ సంధించిన బంతి అతడి హెల్మెట్ గ్రిల్‌పై బలంగా తాకింది. వెంటనే జరిపిన కంకషన్ పరీక్షల్లో గాయం తాలుకా లక్షణాలు కనిపించనప్పటికీ.. నెమ్మదిగా దాని ప్రభావం బయటపడింది. మ్యాచ్ ముగిసిన తర్వాతి రోజు ఓవెన్ తీవ్ర అసౌకర్యానికి లోనయ్యాడు. డాక్టర్లను సంప్రదించగా.. మ్యాచ్ సందర్భంగా తగిలిన గాయం ఎఫెక్ట్ అని తేల్చారు. 12 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.ఈ మధ్యలో ఆసీస్ సౌతాఫ్రికాతో చివరి టీ20, ఆతర్వాత మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడేస్తుంది. వాస్తవానికి ఈ సిరీస్‌తో ఓవెన్ వన్డే అరంగేట్రం చేయాల్సి ఉండింది. అయితే ఈ గాయం ఓవెన్ వన్డే ఎంట్రీని పోస్ట్ పోన్ చేసింది.23 ఏళ్ల ఓవెన్ పొట్టి క్రికెట్లో నయా సంచలనంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. గత బిగ్‌బాష్ లీగ్ ఫైనల్లో విధ్వంసకర శతకం బాది వార్తల్లోకెక్కిన ఓవెన్.. ఆతర్వాత ఐపీఎల్, జాతీయ జట్టుకు ఆడే అవకాశాలు దక్కించుకున్నాడు. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ తరఫున ఒకే ఒక మ్యాచ్ ఆడిన ఓవెన్ అందులో విఫలమయ్యాడు.ఓవెన్ అంతర్జాతీయ అరంగేట్రం మాత్రం ఘనంగా జరిగింది. విండీస్‌తో మ్యాచ్‌లో అతను 27 బంతుల్లో 6 సిక్సర్ల సాయంతో 50 పరుగులు చేశాడు. మీడియం పేస్ బౌలర్ కూడా అయిన ఓవెన్ ఆ మ్యాచ్‌లో ఓ వికెట్ కూడా తీశాడు.తద్వారా అంతర్జాతీయ టీ20 అరంగేట్రంలో హాఫ్ సెంచరీతో పాటు వికెట్ తీసిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.కాగా, సౌతాఫ్రికాతో ప్రస్తుతం జరుగుతున్న సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టును గాయాల బెడద వేధిస్తుంది. ఓవెన్‌తో పాటు మరో ఇద్దరు కూడా ఈ సిరీస్‌కు దూరమయ్యారు. టీ20, వన్డే జట్లకు ఎంపికైన మ్యాట్ షార్ట్ విండీస్ సిరీస్ సందర్భంగా తగిలిన గాయం నుంచి పూర్తిగా కోలుకోలేక జట్టు నుంచి వైదొలిగాడు. వన్డే జట్టులో ఉన్న లాన్స్ మోరిస్ వెన్ను సమస్య కారణంగా జట్టుకు దూరమయ్యాడు. షార్ట్, మోరిస్ స్థానాల్లో ఆరోన్ హార్డీ, మాథ్యూ కుహ్నేమన్ వన్డే జట్టులోకి వచ్చారు. వీరిద్దరు ఇదివరకే టీ20 జట్టులో ఉన్నారు. మరోవైపు జ్వరం కారణంగా రెండో టీ20కి దూరమైన వికెట్‌కీపర్ బ్యాటర్ జోస్ ఇంగ్లిస్ మూడో టీ20కి సిద్దమయ్యాడు. మూడో టీ20 ఆగస్ట్ 16న జరుగనుంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్ ఆసీస్, రెండో మ్యాచ్ సౌతాఫ్రికా గెలిచాయి. టీ20 సిరీస్ తర్వాత ఆగస్ట్ 19, 22, 24 తేదీల్లో వన్డేలు జరుగనున్నాయి. ఈ పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం సౌతాఫ్రికా ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. -
గెలిపించిన రాధ, యస్తిక
బ్రిస్బేన్: ఆ్రస్టేలియా పర్యటనలో భారత మహిళల ‘ఎ’ జట్టు తొలి విజయం అందుకుంది. మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను 0–3తో కోల్పోయిన భారత మహిళల ‘ఎ’ జట్టు వన్డే సిరీస్‌లో మాత్రం శుభారంభం చేసింది. బుధవారం జరిగిన తొలి వన్డేలో భారత్ 3 వికెట్ల తేడాతో ఆ్రస్టేలియాపై విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ్రస్టేలియా 47.5 ఓవర్లలో 214 పరుగులకు ఆలౌటైంది. దూకుడుగా ఆడిన అనిక లియరాయిడ్ (90 బంతుల్లో 92 నాటౌట్; 8 ఫోర్లు, 1 సిక్స్) త్రుటిలో సెంచరీ చేజార్చుకోగా, రాచెల్ ట్రెనమన్ (62 బంతుల్లో 51; 6 ఫోర్లు) అర్ధ సెంచరీతో రాణించింది. భారత బౌలర్లలో కెపె్టన్ రాధ యాదవ్ 45 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా... టిటాస్ సాధు, మిన్ను మణి చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్ 42 ఓవర్లలో 7 వికెట్లకు 215 పరుగులు చేసి గెలిచింది. వికెట్ కీపర్ యస్తిక భాటియా (70 బంతుల్లో 59; 7 ఫోర్లు) హాఫ్ సెంచరీ చేయగా... షఫాలీ వర్మ (31 బంతుల్లో 36; 5 ఫోర్లు), ధారా గుజ్జర్ (53 బంతుల్లో 31; 2 ఫోర్లు), రాఘ్వీ బిష్త్ (25 నాటౌట్) ఫర్వాలేదనిపించారు. లూసీ హామిల్టన్, హేవార్డ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. సిరీస్‌లో భారత్ 1–0తో ఆధిక్యంలో నిలవగా, రెండో మ్యాచ్ రేపు జరుగుతుంది. -
పాలస్తీనాకు ఆస్ట్రేలియా గుర్తింపు.. అయితే ఈ షరతులు వర్తింపు..
కాన్బెర్రా: త్వరతో జరగబోయే యూఎన్ జనరల్ అసెంబ్లీలో ఇతర పాశ్చాత్య దేశాలతో పాటు ఆస్ట్రేలియా కూడా పాలస్తీనా దేశాన్ని అధికారికంగా గుర్తిస్తుందని ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ప్రకటించారు. దీంతో పాలస్తీనా దేశాన్ని గుర్తించే దేశాల జాబితాలో ఆస్ట్రేలియా ఫ్రాన్స్, యూకే, కెనడాలున్నాయి.ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ సోమవారం ఒక ప్రకటనలో సెప్టెంబర్‌లో జరిగే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో పాలస్తీనా దేశాన్ని అధికారికంగా ఆమోదించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇటీవల ఇదే అభిప్రాయాన్ని ఫ్రాన్స్, బ్రిటన్, కెనడాలు వ్యక్తం చేశాయి. ఇప్పుడు ఆస్ట్రేలియా ఆయా దేశాలకు మద్దతు పలికింది. అయితే ఆస్ట్రేలియా గుర్తింపు అనేది పాలస్తీనా అథారిటీ నుండి అందుకున్న నిర్దిష్ట హామీలపై ఆధారపడి ఉంటుందని అల్బనీస్ స్పష్టం చేశారు. వీటిలో హమాస్‌ను పాలస్తీనా ప్రభుత్వం నుండి తొలగించడం, గాజాను సైనికీకరణ నుంచి విముక్తి చేయడం, స్వేచ్ఛాయుతమైన, నిష్పాక్షికమైన ఎన్నికలు నిర్వహించడం మొదలైనవి ఉన్నాయి.గాజాలో మానవతా సంక్షోభంపై ఆస్ట్రేలియాలో పెరుగుతున్న ఆందోళనల మధ్య ఈ ప్రకటన వెలువడింది. ఆస్ట్రేలియా అధికారులు గాజాలో కొనసాగుతున్న ఆకలి మంటలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇటీవల గాజాలో పెద్ద ఎత్తున సైనిక దాడికి ప్రణాళికలు వేయడాన్ని ఆస్ట్రేలియా ఖండించింది. మధ్యప్రాచ్యంలో హింసాయుత ఘటనలను విచ్ఛిన్నం చేయడానికి, గాజాలో సంఘర్షణలు, ఆకలిని అంతం చేయడానికి పాలస్తీనా దేశపు గుర్తింపు అనేది పరిష్కారం మార్గం అవుతుందని ప్రధాని అల్బనీస్ అన్నారు. -
దిగ్గజ బౌలర్‌ను అధిగమించిన రబాడ
సౌతాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడ తమ దేశానికే చెందిన దిగ్గజ ఫాస్ట్ బౌలర్ అలెన్ డొనాల్డ్‌ను ఓ విషయంలో అధిగమించాడు. అన్ని ఫార్మాట్లలో (ఆస్ట్రేలియా వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్‌ల్లో) ఆస్ట్రేలియాపై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో డొనాల్డ్‌ను వెనక్కు నెట్టి నాలుగో స్థానానికి ఎగబాకాడు.ఈ జాబితాలో షేన్ వార్న్ అగ్రస్థానంలో ఉన్నాడు. వార్న్ సౌతాఫ్రికాపై 69 మ్యాచ్‌ల్లో 190 వికెట్లు తీశాడు. వార్న్ తర్వాత టాప్-5 స్థానాల్లో డేల్ స్టెయిన్ (ఆసీస్‌పై 49 మ్యాచ్‌ల్లో 127 వికెట్లు), గ్లెన్ మెక్‌గ్రాత్ (సౌతాఫ్రికాపై 58 మ్యాచ్‌ల్లో 115 వికెట్లు), రబాడ (38 మ్యాచ్‌ల్లో 99 వికెట్లు), డొనాల్డ్ (44 మ్యాచ్‌ల్లో 98 వికెట్లు) ఉన్నారు.రబాడ ఈ ఘనతను ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో సాధించాడు. ఈ మ్యాచ్‌లో అతను 4 ఓవర్లలో 29 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. రబాడతో పాటు క్వేనా మపాకా (4-0-20-4) కూడా రాణించడంతో ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 178 పరుగులకు ఆలౌటైంది.టిమ్ డేవిడ్ మెరుపు ఇన్నింగ్స్ (52 బంతుల్లో 83; 4 ఫోర్లు, 8 సిక్సర్లు) ఆడి ఆసీస్‌కు ఈ స్కోర్ అందించాడు. గ్రీన్ ఓ మోస్తరు ప్రదర్శన (13 బంతుల్లో 35; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) చేశాడు.అనంతరం సౌతాఫ్రికా లక్ష్య ఛేదనలో తడబడింది. హాజిల్‌వుడ్ (4-0-27-3), డ్వార్షుయిస్ (4-0-26-3), జంపా (4-0-33-2), మ్యాక్స్‌వెల్ (4-0-29-1) అద్భుతంగా బౌలింగ్ చేసి సౌతాఫ్రికాను 161 పరుగులకే కట్టడి చేశారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో ఓపెనర్ రికెల్టన్ (55 బంతుల్లో 71; 7 ఫోర్లు, సిక్స్) ఒక్కడే రాణించాడు. ఈ గెలుపుతో ఆసీస్ 3 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ సిరీస్‌లో రెండో టీ20 ఆగస్ట్ 12న జరుగనుంది. -
సౌతాఫ్రికాపై ఆస్ట్రేలియా.. చరిత్రలో తొలిసారి ఇలా..!
ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా నిన్న (ఆగస్ట్ 10) జరిగిన తొలి టీ20లో సౌతాఫ్రికా 17 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవరల్లో 178 పరుగులకు ఆలౌటైంది. పొట్టి క్రికెట్లో సౌతాఫ్రికా ఆస్ట్రేలియాను ఆలౌట్ చేయడం ఇదే తొలిసారి (26 టీ20ల్లో).ఈ మ్యాచ్‌లో మరిన్ని రికార్డులు కూడా నమోదయ్యాయి. ఈ గెలుపుతో ఆస్ట్రేలియా రికార్డు స్థాయిలో వరుసగా 9 టీ20 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. గతంలో ఆసీస్ వరుసగా ఇన్ని టీ20 మ్యాచ్‌ల్లో ఎప్పుడూ గెలవలేదు. ఈ సిరీస్‌కు ముందు ఆసీస్ వెస్టిండీస్‌ను వారి సొంతగడ్డపై 5-0 తేడాతో ఓడించింది.ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు 13 సిక్సర్లు బాదారు. టీ20ల్లో సౌతాఫ్రికాపై ఆస్ట్రేలియా (ఓ మ్యాచ్‌లో) బాదిన అత్యధిక సిక్సర్లు ఇవే. 2023లో డర్బన్‌లో జరిగిన టీ20లోనూ ఇన్నే సిక్సర్లు నమోదయ్యాయి.ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా యువ పేసర్ క్వేనా మపాకా ఓ ఆల్‌టైమ్ రికార్డును నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లలో 20 పరుగులిచ్చి 4 వికెట్లు తీసిన మపాకా టెస్ట్ హోదా కలిగిన దేశాల్లో నాలుగు వికెట్ల ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా (19 ఏళ్ల 318 రోజులు) రికార్డు సాధించాడు. అలాగే పొట్టి ఫార్మాట్లో ఆస్ట్రేలియాపై అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన సౌతాఫ్రికా బౌలర్‌గా నిలిచాడు.మ్యాచ్ విషయానికొస్తే.. మపాకా (4-0-20-4), రబాడ (4-0-29-2) అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ఆస్ట్రేలియా 178 పరుగులకు ఆలౌటైంది. వాస్తవానికి ఆసీస్ ఈ స్కోర్ కూడా సాధించలేకపోయేది. 75 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన దశలో టిమ్ డేవిడ్ మెరుపు ఇన్నింగ్స్ (52 బంతుల్లో 83; 4 ఫోర్లు, 8 సిక్సర్లు) ఆడి ఆసీస్‌కు ఈ స్కోర్ అందించాడు. గ్రీన్ ఓ మోస్తరు ప్రదర్శన (13 బంతుల్లో 35; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) చేశాడు. వీరు మినహా ఆసీస్ ఇన్నింగ్స్‌లో అంతా విఫలమయ్యారు. మిచెల్ మార్ష్ 13, ట్రవిస్ హెడ్ 2, జోస్ ఇంగ్లిస్ 0, మిచెల్ ఓవెన్ 2, మ్యాక్స్‌వెల్ 1, డ్వార్షుయిస్ 17, ఎల్లిస్ 12, జంపా ఒక్క పరుగు చేశారు. ప్రొటీస్ బౌలర్లలో మపాకా, రబాడతో పాటు ఎంగిడి, లిండే, ముత్తాసామి వికెట్లు తీశారు (తలో వికెట్).అనంతరం సౌతాఫ్రికా లక్ష్య ఛేదనలో తడబడింది. హాజిల్‌వుడ్ (4-0-27-3), డ్వార్షుయిస్ (4-0-26-3), జంపా (4-0-33-2), మ్యాక్స్‌వెల్ (4-0-29-1) అద్భుతంగా బౌలింగ్ చేసి సౌతాఫ్రికాను 161 పరుగులకే కట్టడి చేశారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో ఓపెనర్ రికెల్టన్ (55 బంతుల్లో 71; 7 ఫోర్లు, సిక్స్) ఒక్కడే రాణించాడు. ట్రిస్టన్ స్టబ్స్ (27 బంతుల్లో 37) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. మిగతా బ్యాటర్లలో మార్క్రమ్ 12, ప్రిటోరియస్ 14, బ్రెవిస్ 2, లిండే 0, బాష్ 2, ముత్తుసామి 0, రబాడ 10, మపాకా 3 (నాటౌట్) పరుగులు చేశారు. ఈ సిరీస్‌లో రెండో టీ20 ఆగస్ట్ 12న జరుగనుంది. -
మళ్లీ ఓడిన భారత మహిళల ‘ఎ’ జట్టు
మెక్కే: భారత ‘ఎ’ మహిళల జట్టు వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఓడింది. ఇదివరకే అనధికారిక టి20 సిరీస్‌ను చేజార్చుకున్న అమ్మాయిల జట్టు ఆఖరి పోరులో గెలుపు తీరానికి చేరువై చివరకు 4 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో అనధికారిక టి20 సిరీస్‌లో ఆ్రస్టేలియా ‘ఎ’ 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. స్పిన్ ద్వయం రాధా యాదవ్ (3/31), ప్రేమ రావత్ (3/24)ల మాయాజాలానికి ఆసీస్ ఇన్నింగ్స్ తడబడింది. మేడ్లైన్ (32 బంతుల్లో 39; 3 ఫోర్లు, 1 సిక్స్), అలీసా హీలీ (21 బంతుల్లో 27; 3 ఫోర్లు, 1 సిక్స్), అనిక (17 బంతుల్లో 22; 1 ఫోర్, 1 సిక్స్) ధాటిగా ఆడారు. అయితే వరుస విరామాల్లో రాధ, ప్రేమలిద్దరు వికెట్లు పడగొట్టడంతో ఆసీస్ జోరుకు అడ్డుకట్ట పడింది. తర్వాత ఛేదించదగిన లక్ష్యమే అయినా... టాపార్డర్, మిడిలార్డర్ బ్యాటర్ల నిర్లక్ష్యంతో భారత్ ‘ఎ’ అమ్మాయిలు ఓటమి పాలయ్యారు. 20 ఓవర్లలో 8 వికెట్లకు 140 పరుగులే చేశారు. ఓపెనర్ వృంద (4), ఉమా ఛెత్రి (3) నిరాశపరిచారు. షఫాలీ వర్మ (25 బంతుల్లో 41; 6 ఫోర్లు, 1 సిక్స్) మాత్రమే బాధ్యతగా ఆడింది. రాఘ్వి బిస్త్ (25 బంతుల్లో 25; 2 ఫోర్లు), మిన్ను మణి (29 బంతుల్లో 30; 4 ఫోర్లు)ల పోరాటంతో గెలుపు దారిలో పడిన భారత్‌ను 19వ ఓవర్ దెబ్బ కొట్టింది. 12 బంతుల్లో 18 పరుగుల సమీకరణం టి20ల్లో ఏమాత్రం కష్టం కాదు. కానీ 19వ ఓవర్ వేసిన సియానా జింజర్ (4/16) తొలి బంతికి సజన (3), ఐదో బంతికి రాధ (9)ను అవుట్ చేయడంతో భారత్ విజయానికి దూరమైంది. ఆఖరి ఓవర్లో ప్రేమ రావత్ (8 బంతుల్లో 12 నాటౌట్; 1 ఫోర్) ధాటిగా ఆడే ప్రయత్నం చేసినా... ఇంకా 4 పరుగుల దూరంలోనే ఉండిపోయింది. మూడు అనధికారిక వన్డేల సిరీస్ బ్రిస్బేన్‌లో 13న జరిగే తొలి మ్యాచ్‌తో మొదలవుతుంది. -
భారీ రికార్డుపై కన్నేసిన మ్యాక్స్‌వెల్
ఆసీస్ వెటరన్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఓ భారీ రికార్డుపై కన్నేశాడు. సౌతాఫ్రికాతో ఇవాల్టి నుంచి (ఆగస్ట్ 10) ప్రారంభమయ్యే 3 మ్యాచ్‌లో టీ20 సిరీస్‌లో మరో 4 వికెట్లు తీస్తే.. అంతర్జాతీయ టీ20ల్లో అరుదైన డబుల్‌ను (2500 పరుగులు, 50 వికెట్లు) సాధిస్తాడు. తద్వారా ఈ ఘనత సాధించిన నాలుగో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కుతాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్, పాక్ మాజీ మొహమ్మద్ హఫీజ్, మలేసియా ఆల్‌రౌండర్ విరన్‌దీప్ సింగ్ మాత్రమే ఈ ఘనత సాధించారు. వీరిలో షకీబ్ అత్యధికంగా 129 మ్యాచ్‌ల్లో 2551 పరుగులు చేసి, 149 వికెట్లు తీయగా.. హఫీజ్ 119 మ్యాచ్‌ల్లో 2514 పరుగులు చేసి, 61 వికెట్లు తీశాడు. విరన్‌దీప్ 102 మ్యాచ్‌ల్లో 3013 పరుగులు చేసి, 97 వికెట్లు తీశాడు.మ్యాక్స్‌వెల్ విషయానికొస్తే.. ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఇప్పటిదాకా 121 మ్యాచ్‌లు ఆడి 2754 పరుగులు చేసి, 46 వికెట్లు తీశాడు.కాగా, సౌతాఫ్రికాతో తొలి టీ20 ఇవాళ మధ్యాహ్నం 2:45 గంటలకు మొదలవుతుంది. ఈ మ్యాచ్ డార్విన్‌లో (ఆస్ట్రేలియా) జరుగనుంది. రెండో టీ20 ఆగస్ట్ 12న ఇదే డార్విన్‌లో జరుగనుండగా.. మూడో టీ20 ఆగస్ట్ 16న కెయిన్స్ వేదికగా జరుగనుంది. టీ20 సిరీస్ అనంతరం ఇరు జట్ల మధ్య 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ మొదలవుతుంది. ఈ మ్యాచ్‌లు ఆగస్ట్ 19, 22, 24 తేదీల్లో కెయిన్స్ (తొలి వన్డే), మెక్కే (మిగతా రెండు) వేదికలుగా జరుగనున్నాయి. -
దక్షిణాఫ్రికా X ఆ్రస్టేలియా
డార్విన్ (ఆ్రస్టేలియా): వచ్చే ఏడాది జరగనున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టి20 ప్రపంచకప్ కోసం ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికా జట్లు ఇప్పటి నుంచే అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. 2026 ఫిబ్రవరిలో భారత్, శ్రీలంక వేదికగా టి20 వరల్డ్ కప్ జరగనుండగా... దానికి ముందు సన్నాహకంగా ఈ రెండు జట్ల మధ్య నేటి నుంచి మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్ జరగనుంది. 2023 తర్వాత ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికా మధ్య అంతర్జాతీయ టి20 మ్యాచ్ జరగలేదు. గతేడాది టీమిండియా చాంపియన్‌గా నిలిచిన వరల్డ్‌కప్‌లో ఆ్రస్టేలియా ఆకట్టుకోలేకపోగా... దక్షిణాఫ్రికా ఫైనల్లో ఓడింది. ఇరు జట్ల మధ్య ఇటీవల ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ జరగగా... అందులో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. ఆ తర్వాత జింబాబ్వేలో పర్యటించిన సఫారీ జట్టు... ముక్కోణపు టి20 సిరీస్ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో పరాజయం పాలైంది. మరోవైపు ఆ్రస్టేలియా జట్టు వెస్టిండీస్ గడ్డపై 5–0తో టి20 సిరీస్ గెలుచుకుంది. ఆ సిరీస్‌కు అందుబాటులో లేని ట్రావిస్ హెడ్ తిరిగి ఆసీస్ జట్టులో చేరనుండగా... ఎయిడెన్ మార్క్రమ్, కగిసో రబాడ దక్షిణాఫ్రికా జట్టులో పునరాగమనం చేస్తున్నారు. ఆసీస్ ప్రధాన పేసర్లు మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ ఈ సిరీస్‌కు కూడా దూరంగా ఉండనుండగా... జోష్ హాజల్‌వుడ్ పేస్ భారాన్ని మోయనున్నాడు. 2008 తర్వాత డారి్వన్లో అంతర్జాతీయ మ్యాచ్ నిర్వహించనుండటం ఇదే తొలిసారి కాగా... మిచెల్ మార్ష్ ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు. ఇటీవల విండీస్‌తో సిరీస్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన మార్ష్.. హెడ్‌తో కలిసి వచ్చే ఏడాది వరల్డ్‌కప్‌లో ఇన్నింగ్స్ ప్రారంభించనున్నట్లు శనివారమే ప్రకటించాడు. ‘హెడ్‌తో కలిసి ఓపెనింగ్ చేస్తా. చాన్నాళ్లుగా మేం కలిసి ఆడుతున్నాం. మా మధ్య మంచి అనుబంధం ఉంది. టి20 వరల్డ్‌కప్‌లోనూ ఇదే కొనసాగుతుంది’అని మార్ష్ అన్నాడు. ఇన్‌గ్లిస్, కామెరూన్ గ్రీన్, టిమ్ డేవిడ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మిచెల్ ఓవెన్‌తో ఆసీస్ బలంగా ఉంది. యువ ఆటగాడు డెవాల్డ్ బ్రేవిస్పై దక్షిణాఫ్రికా భారీ ఆశలు పెట్టుకుంది. మార్క్రమ్, రికెల్టన్, డసెన్, బ్రేవిస్, స్టబ్స్, లిండె, బాష్‌తో దక్షిణాఫ్రికా బ్యాటింగ్ బలంగా ఉంది. రబాడ, బర్గర్, ఎంగిడి బౌలింగ్ బాధ్యతలు పంచుకోనున్నారు. -
మేటి జట్టుతో ఆడినపుడే...
బెంగళూరు: ఆసియా కప్ టోర్నమెంట్ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా వంటి మేటి జట్టుతో తలపడితే లోపాలు సవరించుకొని మరింత మెరుగయ్యే అవకాశం ఉంటుందని భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ అభిప్రాయపడ్డాడు. ఈ నెల 29 నుంచి రాజ్‌గిర్ వేదికగా పురుషుల ఆసియా కప్ హాకీ టోర్నమెంట్ ప్రారంభం కానుండగా... అంతకుముందు భారత జట్టు ఆ్రస్టేలియాలో పర్యటిస్తోంది. ఈ టూర్లో భాగంగా పెర్త్‌లోని హాకీ స్టేడియంలో ఆతిథ్య ఆ్రస్టేలియాతో హర్మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలోని టీమిండియా నాలుగు మ్యాచ్‌లు ఆడనుంది. దీని కోసం శుక్రవారం బెంగళూరు నుంచి జట్టు ఆ్రస్టేలియాకు పయనమైంది. ఈ సందర్భంగా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ మాట్లాడుతూ... ‘ఆ్రస్టేలియా వంటి బలమైన ప్రత్యర్థితో వారి సొంతగడ్డపై మ్యాచ్‌లు ఆడటం సవాలుతో కూడుకున్నది. ఆసియా కప్ ప్రారంభానికి ముందు ఇలాంటి క్లిష్టమైన సిరీస్ ఆడనుండటం జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మేమంతా ఇలాంటి సన్నద్ధతే కోరుకున్నాం. ఆసియా కప్ కోసం జట్టును సిద్ధం చేసుకునేందుకు ఈ సిరీస్ ఉపయోగపడనుంది. బలమైన ప్రత్యర్థితో తలపడినప్పుడే మన లోపాలు బయటపడతాయి. వాటిని ఎలా అధిగమించాలో మార్గాలు వెతికి మరింత మెరుగైన ప్రదర్శన చేయవచ్చు. జట్టు మొత్తం సమష్టిగా రాణించాలని భావిస్తున్నాం. ఈ సన్నద్ధత ఆసియా కప్‌లో తప్పక ఉపయోగపడుతుంది’ అని అన్నాడు. ఆగస్టు 15, 16, 19, 21న పెర్త్‌లో భారత్, ఆ్రస్టేలియా మధ్య హాకీ మ్యాచ్‌లు జరగనున్నాయి. ప్రదర్శన ఆధారంగా ఆసియాకప్ తుది జట్టు కూర్పు ఉండనుంది. మెరుగైన ఆటతీరు కనబర్చిన ప్లేయర్లనే ఆసియాకప్‌నకు ఎంపిక చేయనున్నారు. ప్రస్తుత జట్టులో అటు అనుభవజ్ఞు, ఇటు యువకులు ఉండటంతో... ఆ్రస్టేలియాపై వారి ఆటతీరును అంచనా వేసిన తర్వాతే ఆసియాకప్‌నకు జట్టును ఎంపిక చేయనున్నారు. ఈ టోర్నీలో సత్తా చాటిన జట్టు వరల్డ్‌కప్‌నకు నేరుగా అర్హత సాధించనుంది. -
ఆస్ట్రేలియా జట్టులో ఇద్దరు భారత మూలాలున్న క్రికెటర్లు
స్వదేశంలో భారత అండర్-19 జట్టుతో జరుగబోయే మల్టీ ఫార్మాట్ సిరీస్ కోసం సిరీస్ కోసం 15 మంది సభ్యుల ఆస్ట్రేలియా అండర్-19 జట్టును నిన్న (ఆగస్ట్ 7) ప్రకటించారు. ఈ జట్టులో ఇద్దరు భారతీయ మూలాలున్న ఆటగాళ్లకు చోటు దక్కింది. న్యూసౌత్ వేల్స్‌కు ప్రాతినిథ్యం వహించే యశ్ దేశ్‌ముఖ్, విక్టోరియాకు ఆడే ఆర్యన్ శర్మ ఈ జట్టుకు ఎంపికయ్యారు. వీరిలో దేశ్‌ముఖ్ స్పిన్నర్ కాగా.. ఆర్యన్ శర్మ వికెట్ కీపర్ బ్యాటర్. ఆర్యన్ శర్మ విక్టోరియా తరఫున 31 మ్యాచ్‌ల్లో సత్తా చాటి జట్టులోకి రాగా.. దేశ్‌ముఖ్ 2024/25 అండర్-17 నేషనల్ ఛాంపియన్స్ లీగ్‌లో చెలరేగి జట్టులో ఈ జట్టుకు ఎంపికయ్యాడు. ఆసీస్ అండర్-19 జట్టు ఆయుశ్ మాత్రే నేతృత్వంలోని భారత్ అండర్-19 జట్టుతో తలపడనుంది. ఈ సిరీస్ సెప్టెంబర్ 21 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో తొలుత మూడు 50 ఓవర్ల మ్యాచ్‌లు, ఆతర్వాత రెండు 4 రోజుల మ్యాచ్‌లు జరుగనున్నాయి.భారత అండర్-19 జట్టుతో మల్టీ ఫార్మాట్ సిరీస్ కోసం ఆస్ట్రేలియా అండర్-19 జట్టు..సైమన్ బడ్జ్, అలెక్స్ టర్నర్, స్టీవ్ హోగన్, విల్ మలాజ్చుక్, యశ్ దేశ్‌ముఖ్, టామ్ హోగన్, ఆర్యన్ శర్మ, జాన్ జేమ్స్, హేడెన్ స్కిల్లర్, చార్లెస్ లచ్మండ్, బెన్ గార్డన్, విల్ బైరోమ్, కేసీ బార్టన్, అలెక్స్ లీ యంగ్, జేడన్ డ్రేపర్రిజర్వ్ ఆటగాళ్లు: జెడ్ హోల్లిక్, టామ్ పాడింగ్టన్, జూలియన్ ఓస్బోర్న్షెడ్యూల్..సెప్టెంబర్ 21- తొలి వన్డే (బ్రిస్బేన్)సెప్టెంబర్ 24- రెండో వన్డే (బ్రిస్బేన్)సెప్టెంబర్ 26- మూడో వన్డే (బ్రిస్బేన్)సెప్టెంబర్ 20- అక్టోబర్ 3 వరకు- తొలి టెస్ట్ (బ్రిస్బేన్)అక్టోబర్ 7-10- రెండో టెస్ట్ (మెక్కే)ఈ సిరీస్ కోసం భారత అండర్-19 జట్టు..ఆయుష్ మాత్రే (కెప్టెన్), విహాన్ మల్హోత్రా (వైస్ కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, వేదాంత్ త్రివేది, రాహుల్ కుమార్, అభిజ్ఞాన్ కుందు (వికెట్‌కీపర్), హర్వాన్ష్ సింగ్ (వికెట్‌కీపర్), ఆర్ ఎస్ అంబరీష్, కనిష్క్ చౌహాన్, నమన్ పుష్పక్, హెనిల్ పటేల్, డి దీపేష్, కిషన్ కుమార్, అన్మోలన్జీత్, ఖిలన్ పటేల్, ఉద్దవ్ మోహన్, అమన్ చౌహాన్ -
భారత పర్యటన కోసం ఆస్ట్రేలియా జట్ల ప్రకటన.. హైలైట్‌గా నిలిచిన కొన్‌స్టాస్ ఎంపిక
ఆస్ట్రేలియా-ఏ జట్టు ఈ ఏడాది సెప్టెంబర్‌లో భారత పర్యటనకు రానుంది. ఈ పర్యటనలో భారత-ఏ జట్టుతో రెండు నాలుగు రోజుల అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లు, మూడు అనధికారిక వన్డేలు ఆడనుంది. ఈ పర్యటన సెప్టెంబర్ 16 నుంచి మొదలు కానుంది.ఈ పర్యటన కోసం రెండు వేర్వేరు ఆస్ట్రేలియా జట్లను (రెండు ఫార్మాట్ల కోసం) ఇవాళ (ఆగస్ట్ 7) ప్రకటించారు. టెస్ట్ జట్టులో సామ్ కొన్‌స్టాస్ ఎంపిక హైలైట్‌గా నిలిచింది. అతని టాలెంట్‌కు భారత్‌లోని స్పిన్ ఫ్రెండ్లీ పిచ్‌పై కఠినమైన సవాళ్లు ఎదురు కానున్నాయి.భారత్‌తో జరిగిన తన డెబ్యూ సిరీస్‌లో (బీజీటీ 2024-25) బుమ్రాతో గొడవపడి వార్తల్లోకెక్కిన కొన్‌స్టాస్.. ఆతర్వాత లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఇటీవల వెస్టిండీస్ పర్యటనలో దారుణంగా విఫలమయ్యాడు. ఆసీస్ మీడియా కొన్‌స్టాస్‌కు భారీ హైప్ ఇస్తుంటుంది. మరో రికీ పాంటింగ్‌తో పోలుస్తుంది.కొన్‌స్టాస్‌కు 2027 బీజీటీ కోసం సిద్దం చేసేందుకు ఆసీస్ సెలెక్టర్లు భారత్-ఏతో సిరీస్‌కు ఎంపిక చేశారు. ఈ జట్టులో కొన్‌స్టాస్‌తో పాటు ఆసీస్ టెస్ట్ ప్లేయర్లు కూపర్ కొన్నోలీ, టాడ్ మర్ఫీ, నాథన్ మెక్స్వీకి చోటు దక్కింది. వన్డే జట్టులో ఎక్కువగా యువ ఆటగాళ్లకు చోటు కల్పించారు. 26 ఏళ్ల ఆరోన్ హార్డీనే జట్టులో అతి పెద్ద వయస్కుడు. ఈ జట్టులో విధ్వంసకర బ్యాటర్ జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్‌కు కూడా చోటు లభించింది.షెడ్యూల్..సెప్టెంబర్ 16 నుండి 19- తొలి టెస్ట్ (లక్నో)సెప్టెంబర్ 23 నుంచి 26- రెండో టెస్ట్ (లక్నో)సెప్టెంబర్ 30- తొలి వన్డే (కాన్పూర్)ఆక్టోబర్ 3- రెండో వన్డే (కాన్పూర్)అక్టోబర్ 5- మూడో వన్డే (కాన్పూర్)భారత్-ఏతో నాలుగో రోజుల మ్యాచ్‌ల కోసం ఆస్ట్రేలియా-ఏ జట్టు: జేవియర్ బార్ట్లెట్, కూపర్ కొన్నోలీ, జాక్ ఎడ్వర్డ్స్, ఆరోన్ హార్డీ, కాంప్‌బెల్ కెల్లావే, సామ్ కొన్‌స్టాస్, నాథన్ మెక్‌స్వీనీ, లాన్స్ మోరిస్, టాడ్ మర్ఫీ, ఫెర్గస్ ఓ'నీల్, ఓలివర్ పీక్, జోష్ ఫిలిప్, కోరీ రోచిసియోలి, లియామ్ స్కాట్భారత్-ఏతో వన్డే సిరీస్ కోసం ఆస్ట్రేలియా-ఏ జట్టు: కూపర్ కొన్నోలీ, హ్యారీ డిక్సన్, జాక్ ఎడ్వర్డ్స్, సామ్ ఎలియట్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, ఆరోన్ హార్డీ, మెకెంజీ హార్వే, టాడ్ మర్ఫీ, తన్వీర్ సంఘ, లియామ్ స్కాట్, లాచీ షా, టామ్ స్ట్రాకర్, విల్ సదర్లాండ్, కల్లమ్ విడ్లర్ -
షఫాలీ, రాధా యాదవ్‌పై దృష్టి
మకాయ్ (క్వీన్స్లాండ్): అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల వన్డే ప్రపంచకప్ ప్రారంభానికి ముందు భారత యువ ప్లేయర్లు ఆ్రస్టేలియాలో పర్యటిస్తున్నారు. ఈ టూర్లో భాగంగా భారత మహిళ ‘ఎ’ జట్టు... ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టుతో మూడు టి20లు, మూడు వన్డేలు, ఓ నాలుగు రోజుల అనధికారిక టెస్టు మ్యాచ్ ఆడనుంది. టి20 సిరీస్‌లో భాగంగా గురువారం మకాయ్ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. ఇందులో భారత ‘ఎ’ జట్టుకు రాధా యాదవ్ సారథిగా వ్యవహరిస్తుండగా... చాన్నాళ్ల తర్వాత భారత టి20 జట్టులోకి వచ్చిన షఫాలీ వర్మ సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఇప్పటికే అంతర్జాతీయ అనుభవం ఉన్న పలువురు ప్లేయర్లతో పాటు కొత్త వాళ్లకు ఇందులో అవకాశం కల్పించారు. మిన్ను మణి, సజన, ఉమా ఛెత్రి, రాఘ్వి బిస్త్, తనూజ కన్వర్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన షబ్నమ్ షకీల్, సైమా ఠాకూర్, టిటాస్ సాధు భారత ‘ఎ’ జట్టు తరఫున బరిలోకి దిగనున్నారు. మరోవైపు గాయం కారణంగా గత కొన్ని మ్యాచ్‌లకు దూరమైన ఆ్రస్టేలియా రెగ్యులర్ కెప్టెన్ అలీసా హీలీ ఆసీస్ ‘ఎ’ జట్టు తరఫున బరిలోకి దిగనుంది. ఆ్రస్టేలియా ‘ఎ’ జట్టుకు నికోల్ ఫాల్టుమ్ కెప్టెన్ గా వ్యవహరిస్తుండగా... తహిలా విల్సన్, కిమ్ గార్త్ వంటి పలువురు స్టార్ ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో ఆడనున్నారు. ఈ పర్యటనలోని మూడు ఫార్మాట్లకూ భారత ‘ఎ’ జట్టుకు రాధ యాదవ్ కెపె్టన్‌గా వ్యవహరించనుంది. -
టిమ్ డేవిడ్‌కు షాక్
ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ టిమ్ డేవిడ్‌కు భారీ షాక్ తగిలింది. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన ఓ టీ20 (5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా జరిగిన చివరి మ్యాచ్, జులై 28) సందర్భంగా అతను అంపైర్‌తో దురుసుగా ప్రవర్తించాడు. ఇందుకు గానూ ఐసీసీ ఆగ్రహించి, అతని మ్యాచ్ ఫీజ్‌లో 10 శాతం కోత విధించింది.ఆ మ్యాచ్‌లో డేవిడ్ అంపైర్ నిర్ణయం (వైడ్ బాల్ విషయంలో) పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఐసీసీ రూల్స్‌కు విరుద్దంగా ప్రవర్తించాడు. అంపైర్ అతను వైడ్‌గా భావించిన బంతిని ఫెయిర్ బాల్‌గా ప్రకటించడంతో డేవిడ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.చేతులను చాచి చూపిస్తూ వైడ్‌గా ప్రకటించాలని అంపైర్‌ను ఆదేశించాడు. ఈ సందర్భంగా డేవిడ్ ప్రవర్తన దురుసుగా ఉందని ఐసీసీ భావించింది. డేవిడ్ క్రీడా స్పూర్తిని మరచి ప్రవర్తించాడని ఆరోపిస్తూ ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ లెవెల్-1 ఉల్లంఘన కింద అతనికి జరిమానా విధించింది. అలాగే ఓ డీమెరిట్ పాయింట్‌ను కూడా కేటాయించింది.డేవిడ్ తన తప్పిదాన్ని అంగీకరించడంతో అతనిని తదుపరి విచారణ నుంచి మినహాయించారు. ఆ మ్యాచ్‌లో డేవిడ్ 30 పరుగులు చేసి తన జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఆ మ్యాచ్‌లో ఆసీస్ 3 వికెట్ల తేడాతో గెలుపొంది, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 5-0తో క్లీన్ స్వీప్ చేసింది.ఆ సిరీస్‌లో డేవిడ్ చరిత్ర సృష్టించాడు. మూడో టీ20లో 37 బంతుల్లో శతక్కొట్టి ఆసీస్ తరఫున పొట్టి ఫార్మాట్లో వేగవంతమైన శతకాన్ని నమోదు చేశాడు. డేవిడ్ ఇటీవల ఐపీఎల్లో ఆర్సీబీకి ఆడుతూ కూడా సత్తా చాటాడు. పలు మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడాడు. -
చాహల్ గర్ల్‌ఫ్రెండ్ ఆర్జే మహ్వశ్.. వామ్మో క్రికెట్ టీమ్‌నే కొనేశారా?
ప్రముఖ ఆర్జే మహ్వశ్ పేరు కొన్ని నెలలుగా తెగ వినిపిస్తోంది. ఎందుకంటే ఈ ముద్దుగుమ్మ టీమిండియా క్రికెటర్ చాహల్‌తో సన్నిహితంగా కనిపించడమే. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత మహ్వశ్ పేరు మార్మోగిపోయింది. ఆ తర్వాత ఐపీఎల్ మ్యాచ్‌ల్లోనూ పంజాబ్‌కు మద్దతుగా మ్యాచ్‌ల్లో సందడి చేసింది. దీంతో చాహల్‌తో ఈ ముద్దుగుమ్మ ప్రేమాయణం నడుపుతున్నట్లు చాలాసార్లు వార్తలొచ్చాయి. ఇటీవల వీరిద్దరు లండన్‌లో జంటగా కనిపించారు. ఇవన్నీ చూస్తుంటే ఈ జంట డేటింగ్లో ఉన్నట్లు అర్థమవుతోంది. అయితే తమపై వస్తున్న రూమర్స్‌పై ఇప్పటివరకు ఎవరూ కూడా క్లారిటీ ఇవ్వలేదు.అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ క్రికెట్ మ్యాచ్‌లు వీక్షించడమే కాదు.. ఏకంగా క్రికెట్ టీమ్‌నే సొంతం చేసుకుంది. ఇవాళ జరిగిన సీఎల్టీ10 లీగ్‌లో ఆక్షన్‌లో తళుక్కున మెరిసిన మహ్వశ్..ఆస్ట్రేలియా క్రికెటర్ షాన్ మార్ష్‌ను కొనుగోలు చేసింది. తన టీమ్‌కు కెప్టెన్‌గా షాన్ మార్ష్‌ను ఎంపిక చేసినట్లు తెలిపింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఆర్జే మహ్వశ్ టీమ్ కెప్టెన్..షాన్ మార్ష్ క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇది కాస్తా నెట్టింట వైరల్ కావడంతో చాహల్‌ను కూడా మీ టీమ్‌లోకి తీసుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Mahvash (@rj.mahvash) -
భారత్‌కు క్లిష్టమైన ‘డ్రా’
సిడ్నీ: ఆసియా ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఎఫ్సీ) మహిళల ఆసియా కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో భారత జట్టుకు క్లిష్టమైన ‘డ్రా’ పడింది. వచ్చే ఏడాది ఆ్రస్టేలియాలో మార్చి 1 నుంచి 21 వరకు జరిగే ఈ టోర్నీలో ఆసియా ఘనాపాటి జపాన్ సహా మాజీ చాంపియన్లు చైనీస్ తైపీ, వియత్నాం జట్లున్న గ్రూప్ ‘సి’లో భారత అమ్మాయిల జట్టుకు చోటు దక్కింది. దీనికి సంబంధించిన ‘డ్రా’ వేడుక సిడ్నీ టౌన్ హాల్లో మంగళవారం అట్టహాసంగా జరిగింది. భారత స్టార్ మిడ్‌ఫీల్డర్ సంగీత బస్ఫొరె ప్రత్యేక ఆహ్వానితులుగా ‘డ్రా’ ఈవెంట్లో పాల్గొంది. మొత్తం 12 ఆసియా జట్లను మూడు గ్రూప్‌లుగా విభజించారు. ఒక్కో జట్టులో నాలుగేసి టీమ్‌లు తలపడతాయి. గ్రూప్ ‘సి’లో భారత అమ్మాయిల జట్టు తమ తొలి మ్యాచ్‌లో మార్చి 4న వియత్నాంతో... రెండో మ్యాచ్‌లో మార్చి 7న ప్రపంచ మాజీ చాంపియన్ జపాన్‌తో... మూడో మ్యాచ్‌లో మార్చి 10న చైనీస్ తైపీతో ఆడుతుంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో జపాన్ 7వ స్థానంలో, వియత్నాం 37వ స్థానంలో, చైనీస్ తైపీ 42వ స్థానంలో, భారత్ 70వ స్థానంలో ఉన్నాయి. సెమీస్ చేరితే ప్రపంచకప్ టోర్నీకి... ఆసియా కప్ గ్రూప్ ‘ఎ’లో ఆతిథ్య ఆ్రస్టేలియా, దక్షిణ కొరియా, ఇరాన్, ఫిలిప్పీన్స్... గ్రూప్ ‘బి’లో డిఫెండింగ్ చాంపియన్ చైనా, ఉత్తర కొరియా, బంగ్లాదేశ్, ఉజ్బెకిస్తాన్ జట్లున్నాయి. ఒక్కో గ్రూప్ నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. అలాగే ఈ మూడు గ్రూప్‌ల్లో మెరుగైన మూడో స్థానం పొందిన రెండు జట్లు కూడా నాకౌట్‌కు క్వాలిఫై అవుతాయి. ఈ 8 జట్ల మధ్య జరిగే క్వార్టర్ ఫైనల్స్ విజేతలు అంటే సెమీఫైనల్ చేరిన నాలుగు జట్లు 2027లో బ్రెజిల్లో జరిగే ప్రపంచకప్ టోర్నీకి నేరుగా అర్హత పొందుతాయి. క్వార్టర్స్‌లో ఓడిన జట్లు ప్లే ఆఫ్స్ ఆడాల్సి ఉంటుంది. ఆసియా నుంచి మరో రెండు జట్లకు ప్రపంచకప్ బెర్త్‌లు లభిస్తాయి. -
ఆసీస్ బౌలర్ చెత్త ప్రదర్శన.. ఓవర్లో ఏకంగా 18 బంతులు..!
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జాన్ హేస్టింగ్స్ చెత్త ప్రదర్శన నమోదు చేశాడు. పాకిస్తాన్ ఛాంపియన్స్‌తో ఇవాళ (జులై 29) జరిగిన మ్యాచ్‌లో ఓ ఓవర్లో ఏకంగా 18 బంతులు వేశాడు. పొట్టి క్రికెట్ చరిత్రలో ఏ బౌలర్ ఓ ఓవర్లో ఇన్ని బంతులు వేయలేదు. గతంలో ఈ రికార్డు విండీస్ లోకల్ ప్లేయర్ రోషన్ ప్రైమస్ పేరిట ఉండేది. ప్రైమస్ కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఓ మ్యాచ్‌లో ఓవర్లో 13 బంతులు వేశాడు. తాజాగా ప్రైమస్ రికార్డును హేస్టింగ్స్ బద్దలు కొట్టాడు.పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేసిన హేస్టింగ్స్ 12 వైడ్లు, ఓ నో బాల్ వేశాడు. ఈ ఓవర్లో కేవలం ఐదు బంతులు మాత్రమే వేసిన అతను మొత్తంగా 20 పరుగులు సమర్పించుకున్నాడు. ఆసీస్ 74 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో ఇది జరిగింది. హేస్టింగ్స్ గల్లీ బౌలర్ల కంటే అధ్వానంగా బౌలింగ్ చేసి అందరికీ విసుగు తెప్పించాడు. 39 ఏళ్ల హేస్టింగ్స్ ఆసీస్ తరఫున ఓ టెస్ట్, 29 వన్డేలు, 9 టీ20లు ఆడి ఉండటం కొసమెరుపు. ఇతగాడు ఐపీఎల్‌లోనూ 3 మ్యాచ్‌లు ఆడాడు. అంతర్జాతీయ స్థాయిలో ఆడిన ఆటగాడిని నుంచి ఇలాంటి ప్రదర్శన ఊహించింది కాదు.మ్యాచ్ విషయానికొస్తే.. ఆస్ట్రేలియాపై పాకిస్తాన్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న పాక్.. ఆస్ట్రేలియాను 11.5 ఓవర్లలో 74 పరుగులకే ఆలౌట్ చేసింది. సయీద్ అజ్మల్ 6 వికెట్ల ప్రదర్శన నమోదు చేసి ఆసీస్ ఇన్నింగ్స్ పేకమేడలా కూల్చాడు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో బెన్ డంక్ (26), కల్లమ్ ఫెర్గూసన్ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.అనంతరం 75 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన పాక్.. ఆడుతూపాడుతూ 7.5 ఓవర్లో వికెట్ కూడా కోల్పోకుండా విజయతీరాలకు చేరింది. ఓపెనర్లు షర్జీల్ ఖాన్ 23 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 32, సోహైబ్ మక్సూద్ 26 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 28 పరుగులు చేసి పాక్‌ను గెలుపు తీరాలు దాటించారు.కాగా, ఈ టోర్నీలో పాక్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా ఇదివరకే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకున్నాయి. నాలుగో బెర్త్ కోసం ఇంగ్లండ్, వెస్టిండీస్, భారత్ మధ్య పోటీ జరుగుతుంది. ఈ టోర్నీలో టీమిండియా ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో మూడింట ఓడి సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఇవాళ రాత్రి భారత్ తమ చివరి మ్యాచ్‌లో వెస్టిండీస్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా భారీ తేడాతో గెలిస్తే సెమీస్ బెర్త్ దక్కవచ్చు. భారత్ ఈ టోర్నీలో పాక్‌తో ఆడాల్సిన మ్యాచ్‌ను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. -
ఆరేసిన అజ్మల్.. ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించిన పాకిస్తాన్
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్‌లో పాకిస్తాన్ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఈ ఎడిషన్‌లో ఇప్పటికే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకున్న ఆ జట్టు.. ఇవాళ (జులై 29) ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించి టేబుల్ టాపర్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న పాక్.. ఆస్ట్రేలియాను 11.5 ఓవర్లలోనే ఆలౌట్ చేసింది.స్టార్ స్పిన్నర్ సయీద్ అజ్మల్ 6 వికెట్లతో చెలరేగడంతో ఆసీస్ 74 పరుగులకే కుప్పకూలింది. అజ్మల్ ధాటికి ఆసీస్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. ఆ జట్టులో బెన్ డంక్ (26), కల్లమ్ ఫెర్గూసన్ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. షాన్ మార్ష్ 7, క్రిస్ లిన్ 6, డి ఆర్చీ షార్ట్ 2, డేనియల్ క్రిస్టియన్ 0, బెన్ కటింగ్ 5, నాథన్ కౌల్టర్ నైల్ 0, పీటర్ సిడిల్ 5, స్టీవ్ ఓకీఫ్ 1, బ్రెట్ లీ 1 (నాటౌట్) పరుగులు చేశారు.పాక్ బౌలర్లలో అజ్మల్‌తో పాటు ఇమాద్ వసీం (3-0-11-2), సోహైల్ తన్వీర్ (2-0-8-1), సోహైల్ ఖాన్ (2-0-23-1) కూడా వికెట్లు తీశారు.అనంతరం 75 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన పాక్.. ఆడుతూపాడుతూ 7.5 ఓవర్లో వికెట్ కూడా కోల్పోకుండా విజయతీరాలకు చేరింది. ఓపెనర్లు షర్జీల్ ఖాన్ 23 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 32, సోహైబ్ మక్సూద్ 26 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 28 పరుగులు చేసి పాక్‌ను గెలుపు తీరాలు దాటించారు. ఆసీస్ కెప్టెన్ ఐదుగురు బౌలర్లను ప్రయోగించినా ఒక్క పాక్ వికెట్‌ను కూడా తీయలేకపోయారు.కాగా, ఈ టోర్నీలో పాక్‌తో పాటు సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా కూడా ఇదివరకే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకున్నాయి. నాలుగో బెర్త్ కోసం ఇంగ్లండ్, వెస్టిండీస్, భారత్ మధ్య పోటీ జరుగుతుంది. ఈ టోర్నీలో టీమిండియా ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో మూడింట ఓడి సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఇవాళ రాత్రి భారత్ తమ చివరి మ్యాచ్‌లో వెస్టిండీస్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా భారీ తేడాతో గెలిస్తే సెమీస్ బెర్త్ దక్కవచ్చు. భారత్ ఈ టోర్నీలో పాక్‌తో ఆడాల్సిన మ్యాచ్‌ను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. -
విజృంభించిన పాక్ బౌలర్.. 74 పరుగులకే కుప్పకూలిన ఆస్ట్రేలియా
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్‌లో పాకిస్తాన్ లెజెండ్స్ టీమ్ అదిరిపోయే ప్రదర్శనలతో దూసుకుపోతుంది. ఈ ఎడిషన్‌లో 4 మ్యాచ్‌ల్లో 3 విజయాలు సాధించి, ఇప్పటికే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకున్న పాక్.. ఇవాళ (జులై 29) ఆస్ట్రేలియా లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మరోసారి సత్తా చాటింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న పాక్.. ఆస్ట్రేలియాను 11.5 ఓవర్లలోనే ఆలౌట్ చేసింది.ఆ జట్టు స్టార్ స్పిన్నర్ సయీద్ అజ్మల్ 6 వికెట్లతో చెలరేగడంతో ఆసీస్ 74 పరుగులకే కుప్పకూలింది. అజ్మల్ ధాటికి ఆసీస్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. ఆ జట్టులో బెన్ డంక్ (26), కల్లమ్ ఫెర్గూసన్ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. షాన్ మార్ష్ 7, క్రిస్ లిన్ 6, డి ఆర్చీ షార్ట్ 2, డేనియల్ క్రిస్టియన్ 0, బెన్ కటింగ్ 5, నాథన్ కౌల్టర్ నైల్ 0, పీటర్ సిడిల్ 5, స్టీవ్ ఓకీఫ్ 1, బ్రెట్ లీ 1 (నాటౌట్) పరుగులు చేశారు.పాక్ బౌలర్లలో అజ్మల్‌తో (3.5-0-16-6) పాటు ఇమాద్ వసీం (3-0-11-2), సోహైల్ తన్వీర్ (2-0-8-1), సోహైల్ ఖాన్ (2-0-23-1) కూడా వికెట్లు తీశారు.కాగా, ఈ టోర్నీలో పాక్‌తో పాటు సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా ఇదివరకే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకున్నాయి. నాలుగో బెర్త్ కోసం ఇంగ్లండ్, వెస్టిండీస్, భారత్ మధ్య పోటీ జరుగుతుంది. ఈ టోర్నీలో టీమిండియా ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో మూడింట ఓడి సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఇవాళ రాత్రి భారత్ తమ చివరి లీగ్ మ్యాచ్‌లో వెస్టిండీస్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా భారీ తేడాతో గెలిస్తే సెమీస్ బెర్త్ దక్కవచ్చు. భారత్ ఈ టోర్నీలో పాక్‌తో ఆడాల్సిన మ్యాచ్‌ను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. -
సెంచరీ కొట్టిన ఆడమ్ జంపా.. నాలుగో ఆస్ట్రేలియన్ ప్లేయర్‌గా రికార్డు
ఆసీస్ లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా అంతర్జాతీయ టీ20ల్లో అరుదైన ఘనత సాధించాడు. 33 ఏళ్ల జంపా పొట్టి ఫార్మాట్లో ఆసీస్ తరఫున 100 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన నాలుగో ఆసీస్ ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కాడు. జంపాకు ముందు గ్లెన్ మ్యాక్స్‌వెల్ (121), డేవిడ్ వార్నర్ (110), ఆరోన్ ఫించ్ (103) మాత్రమే ఈ ఘనత సాధించారు.ఇవాళ (జులై 29) వెస్టిండీస్‌తో జరిగిన ఐదో టీ20 జంపా కెరీర్లో 100వ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో జంపా ఓ మోస్తరుగా (3-0-20-1) రాణించి ఆసీస్ విజయంలో తనవంతు పాత్రను పోషించాడు. ఈ మ్యాచ్‌లో ఆసీస్ 3 వికెట్ల తేడాతో గెలుపొంది, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 5-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్.. డ్వార్షుయిస్ (4-0-41-3), నాథన్ ఇల్లిస్ (3.4-0-32-2), ఆరోన్ హార్డీ (4-0-39-1), సీన్ అబాట్ (4-0-30-1), మ్యాక్స్‌వెల్ (1-0-6-1), జంపా (3-0-20-1) ధాటికి 19.4 ఓవరల్లో 170 పరుగులకు ఆలౌటైంది. విండీస్ ఇన్నింగ్స్‌లో షిమ్రోన్ హెట్‌మైర్ (52) అర్ద సెంచరీతో రాణించగా.. రూథర్‌ఫోర్డ్ (35) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్.. కెమరూన్ గ్రీన్ (32), టిమ్ డేవిడ్ (30), మిచెల్ ఓవెన్ (37), ఆరోన్ హార్డీ (28 నాటౌట్) తలో చేయి వేయడంతో 17 ఓవర్లలోనే విజయతీరాలకు చేరింది (7 వికెట్లు కోల్పోయి). విండీస్ బౌలర్లలో అకీల్ హోసేన్ 3, జేసన్ హోల్డర్, అల్జరీ జోసఫ్ తలో 2 వికెట్లు తీశారు.కాగా, ఈ సిరీస్‌కు ముందు విండీస్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను కూడా ఆసీస్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. తద్వారా భారత్ తర్వాత ఓ పర్యటనలో వరుసగా 8 మ్యాచ్‌లు (3 టెస్ట్‌లు, 5 టీ20లు) గెలిచిన జట్టుగా రికార్డుల్లోకెక్కింది. భారత్ 2017 శ్రీలంక పర్యటనలో వరుసగా 9 మ్యాచ్‌ల్లో గెలిచింది. విండీస్‌తో టీ20 సిరీస్‌ను వైట్ వాష్ చేయడంతో ఆసీస్ మరో రికార్డును కూడా ఖాతాలో వేసుకుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టెస్ట్ హోదా కలిగిన జట్టును క్లీన్ స్వీప్ చేసిన తొలి జట్టుగా చరిత్రకెక్కింది. -
39 బంతుల్లో శతక్కొట్టిన ఏబీడి.. ఆసీస్‌ను చిత్తు చేసిన సౌతాఫ్రికా
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్-2025లో (WCL) సౌతాఫ్రికా లెజెండ్స్ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఇవాళ (జులై 27) ఆస్ట్రేలియా లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 95 పరుగుల తేడాతో ఘన విజయం సాధించారు. తద్వారా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి సెమీస్‌కు అర్హత సాధించారు. ఈ మ్యాచ్ ఫలితంతో సౌతాఫ్రికాతో పాటు పాకిస్తాన్, ఆస్ట్రేలియా కూడా సెమీస్‌కు అర్హత సాధించాయి. నాలుగో బెర్త్ కోసం వెస్టిండీస్, ఇంగ్లండ్, భారత్ మధ్య పోటీ జరుగుతుంది. ఈ టోర్నీలో భారత్ ఆడిన 3 మ్యాచ్‌ల్లో రెండు ఓడి ప్రస్తుతం చివరి స్థానంలో ఉంది. పాకిస్తాన్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను భారత్ రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. ఇవాళ రాత్రి భారత్ ఇంగ్లండ్‌తో తలపడుతుంది.డివిలియర్స్ మహొగ్రరూపంఆసీస్తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. ఏబీ డివిలియర్స్ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో అతి భారీ స్కోర్ చేసింది. ఏబీడి కేవలం 39 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి విధ్వంసం సృష్టించాడు. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తంగా 46 బంతులు ఎదుర్కొని 15 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 123 పరుగులు చేశాడు.ఏబీడీతో పాటు మరో ఓపెనర్ జేజే స్మట్స్ కూడా సునామీ ఇన్నింగ్స్‌తో (53 బంతుల్లో 85; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) విరుచుకుపడటంతో సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 6 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా.. ఆరోన్ ఫాంగిసో (3.4-0-13-4), ఇమ్రాన్ తాహిర్ (4-0-27-3) చెలరేగడంతో 16.4 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో బెన్ కటింగ్ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కటింగ్ 29 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన 59 పరుగులు చేశాడు.అంతకుముందు 41 బంతుల్లో..!WCL 2025లో ఏబీడీ తొలి మ్యాచ్ నుంచే అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్నాడు. భారత్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 30 బంతుల్లో అజేయమైన 63 పరుగులు చేసిన అతను.. మూడు రోజుల కిందట ఇంగ్లండ్‌పై 41 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఆ మ్యాచ్‌లో మొత్తంగా 51 బంతులు ఎదుర్కొన్న ఏబీడీ అజేయమైన 116 పరుగులు చేశాడు. -
మరో భారత సంతతి వ్యక్తిపై అమానుషం : చేయి తెగి వేలాడింది, కానీ
ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లోని భారతసంతతికి చెందిన వ్యక్తిపై దుండగులు దాడి చేశాడు. సౌరభ్ ఆనంద్ (33) మందులు కొనుగోలు చేసి ఫార్మసీ నుండి ఇంటికి వెళుతుండగా, ఐదుగురు యువకులు కత్తితో దారుణంగా దాడి చేశారు. దీంతో అతనుతీవ్రంగా గాయపడ్డాడు.మెల్బోర్న్లో ఈ నెల(జూలై) 19న ఘటన చోటు చేసుకుంది. దీంతో భారతీయులపై వరుస జాత్యహంకార దాడులపై ఆందోళన వ్యక్తమవుతోంది.జూలై 19న రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ఆల్టోనా మెడోస్‌లోని సెంట్రల్ స్క్వేర్ షాపింగ్ సెంటర్లోని మందుల దుకాణంలో సౌరభ్ మందులు తీసుకున్నాడు. తన స్నేహితుడితో కాల్లో ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఐదుగురు యువకులు అతన్ని చుట్టుముట్టి, చితకబాదారు. మరొకరు అతని తలపై నేలపై పడే వరకు కొట్టారు. మూడవ యువకుడు ఒక కత్తితో గొంతుకు పట్టుకుని దాడిచేయబోతే వెంటనే తన చేతిని రక్షణ కోసం పైకి లేపాడు. దీంతో అతని ఎడమ చేయి దాదాపు వేరుపడి పోయింది. ఒక చిన్న నూలుపోగు లాంటి నరం సాయంతా వేలాడుతూ ఉండింది. అతని భుజంపై, వీపుపై కూడా పొడిచారు. దీంతో వెన్నెముక విరిగింది ఇతర ఎముకలు కూడా విరిగిపోయాయి. తనను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తుండగా, కత్తి నా మణికట్టుపై వేటు పడింది. రెండో కత్తిపోటు మరో చేతితి గుండా పోయింది. మూడవ దాడి ఎముక గుండా పోయిందనీ, నొప్పి మాత్రమే గుర్తుంది, నా చేయి దాదాపు వేరుపడిన స్థితిలో ఉంది అంటూ బాధితుడు ఆస్ట్రేలియన్ మీడియాతో తెలిపాడు. చదవండి: చదివింది పదో తరగతే... కట్ చేస్తే కోట్లలో సంపాదనతీవ్రగాయాలతో రక్తపు మడుగులతో పడి వున్న సౌరభ్ షాపింగ్ సెంటర్ బయటకొచ్చి సహాయాన్ని అర్థించాడు. దీంతో అతడిని సమీపంలోని రాయల్ మెల్బోర్న్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు మొదట అతని చేతిని తీసివేయాల్సి వస్తుందని భావించారు. కానీ అదృష్టవశాత్తూ చేతిని తిరిగి అటాచ్ చేయగలిగారు. మరోవైపు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల్లో ఐదుగురు యువకులలో నలుగురిని అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. మరొకరి కోసం గాలిస్తున్నారు. కాగా గత వారం ఆస్ట్రేలియాలో ఇలాంటి సంఘటనే జరిగింది. కారు పార్కింగ్ వివాదంలో గుర్తు తెలియని వ్యక్తులు చరణ్‌ప్రీత్ సింగ్ అనే భారతీయుడిపై దారుణంగా దాడి చేసి, జాతిపరంగా దుర్భాషలాడిన సంగతి తెలిసిందే. -
ఆస్ట్రేలియా పర్యటనకు సౌతాఫ్రికా జట్టు ప్రకటన.. డబ్ల్యూటీసీ హీరోల ఎంట్రీ
ఆగస్ట్‌లో ఆస్ట్రేలియాతో జరుగబోయే పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం సౌతాఫ్రికా జట్టును ఇవాళ (జులై 24) ప్రకటించారు. ఆస్ట్రేలియాలో జరిగే ఈ సిరీస్‌లతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 ఫైనల్స్ హీరోలు బవుమా, మార్క్రమ్ రీఎంట్రీ ఇవ్వనున్నారు. వన్డే జట్టుకు టెంబా బవుమా, టీ20 జట్టుకు ఎయిడెన్ మార్క్రమ్ సారథ్యం వహించనున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత బవుమా గాయం కారణంగా జట్టుకు దూరం కాగా.. మార్క్రమ్ మరికొందరు సీనియర్లతో పాటు విశ్రాంతి తీసుకున్నాడు. ఈ మధ్యలో సౌతాఫ్రికా జింబాబ్వేతో 2 టెస్ట్‌లు, ప్రస్తుతం ముక్కోణపు సిరీస్ (జింబాబ్వే, న్యూజిలాండ్) ఆడుతుంది.ఇటీవలే టెస్ట్ అరంగేట్రం చేసిన ఆఫ్ స్పిన్నర్ ప్రెనెలన్ సుబ్రాయెన్ సౌతాఫ్రికా పరిమిత ఓవర్ల జట్టులో తొలిసారి స్థానం సంపాదించాడు. అలాగే హార్డ్ హిట్టర్ లుహాన్ డ్రి ప్రిటోరియస్ కూడా తొలిసారి వన్డే జట్టులో చోటు సాధించాడు. జింబాబ్వే సిరీస్‌తో టెస్ట్ అరంగేట్రం చేసిన విధ్వంసకర ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్ టీ20, వన్డే జట్లలో చోటు దక్కించుకున్నాడు.సీనియర్లు మార్క్రమ్, ర్యాన్ రికెట్లన్, ట్రిస్టన్ స్టబ్స్, కార్బిన్ బాష్, నండ్రే బర్గర్, లుంగి ఎంగిడి, కగిసో రబాడ కూడా రెండు జట్లలో చోటు దక్కించుకున్నారు. ఆసీస్‌తో సిరీస్ ఆగస్ట్ 10న మొదలుకానుంది. 10, 12, 16 తేదీల్లో టీ20లు.. 19, 22, 24 తేదీల్లో వన్డేలు జరుగనున్నాయి.ఆస్ట్రేలియా సిరీస్‌కు దక్షిణాఫ్రికా టీ20 జట్టు: ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రెవిస్, నండ్రే బర్గర్, జార్జ్ లిండే, క్వేనా మఫాకా, సెనురాన్ ముత్తుసామి, లుంగి ఎంగిడి, న్కాబా పీటర్, లుహాన్ డ్రి ప్రిటోరియస్, కగిసో రబడా, ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, ప్రెనెలన్ సుబ్రాయెన్, రస్సీ వాన్‌డర్ డస్సెన్ఆస్ట్రేలియా సిరీస్‌కు దక్షిణాఫ్రికా వన్డే జట్టు: టెంబా బావుమా (కెప్టెన్), కార్బిన్ బాష్, మాథ్యూ బ్రీట్జ్కే, డెవాల్డ్ బ్రెవిస్, నండ్రే బర్గర్, టోనీ డి జోర్జి, ఎయిడెన్ మార్క్రమ్, సెనురన్ ముత్తుసామి, కేశవ్ మహరాజ్, వియాన్ ముల్డర్, లుంగి ఎంగిడి, లుహాన్ డ్రి ప్రిటోరియస్, కగిసో రబాడ, ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, ప్రెనెలన్ సుబ్రాయెన్ -
Australia: హిందూ ఆలయ గోడలపై జాత్యహంకార వ్యాఖ్యలు
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లోగల ఒక హిందూ దేవాలయం గోడలపై ద్వేషపూరిత జాత్యహంకార రాతలు కనిపించడంతో కలకలం చెలరేగింది. ఆస్ట్రేలియా హిందూ కౌన్సిల్ అధ్యక్షుడు, విక్టోరియా చాప్టర్, మకరంద్ భగవత్ ఈ సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమ ఆలయం శాంతి, భక్తి, ఐక్యతకు నిలయమని ఆయన పునరుద్ధాటించారు.ఆస్ట్రేలియాలోని వాధర్స్ట్ డ్రైవ్‌లో గల స్వామినారాయణ ఆలయం గోడపై దుండగులు ఎర్రటి పెయింట్ చల్లి, జాత్యహంకార దుర్భాషపూరిత వ్యాఖ్యలు రాశారు. స్థానిక దినపత్రిక తెలిపిన వివరాల ప్రకారం ఈ ఆలయానికి సమీపంలోని రెండు ఆసియా రెస్టారెంట్లలో కూడా ఇదే సందేశం కనిపించింది. హిందూ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు, విక్టోరియా చాప్టర్, మకరంద్ భగవత్ ఈ సంఘటనపై స్పందిస్తూ, స్వామి నారాయణ ఆలయం రోజువారీ ప్రార్థనలు, సామూహిక భోజనాలు, సాంస్కృతిక ఉత్సవాలను నిర్వహిస్తుందని భగవత్ తెలిపారు.అయినప్పటికీ ఇటువంటి ఘటనలు ఎదురవడం శోచనీయమన్నారు. హిందువులు ఇతర వర్గాలవారిపై ప్రేమను చూపించాలని, ద్వేషంపై ప్రేమ విజయం సాధిస్తుందని భగవత్ అన్నారు. ఆలయంలో జరిగిన ఘటన తీవ్రంగా కలత పెట్టే అంశమని, భయాన్ని వ్యాప్తి చేయడానికే విద్రోహులు ఇటువంటి చర్యకు పాల్పడ్దారని భగవత్ పేర్కొన్నారు. -
ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థిపై దాడి
-
ఓ పక్క స్టార్క్ మహోగ్రం.. మరో పక్క బోలాండ్ విశ్వరూపం
వెస్టిండీస్‌తో జరిగిన జమైకా టెస్ట్‌లో ఆసీస్ పేసర్లు చెలరేగిపోయారు. ఓ పక్క మిచెల్ స్టార్క్ మహోగ్రరూపం (7.3-4-9-6), మరో పక్క స్కాట్ బోలాండ్ హ్యాట్రిక్ ప్రదర్శన ధాటికి విండీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 27 పరుగులకే కుప్పకూలి, టెస్ట్ క్రికెట్ చరిత్రలో రెండో అత్యల్ప స్కోర్ నమోదు చేసింది. ఫలితంగా 176 పరుగుల భారీ తేడాతో పరాజయాన్ని మూటగట్టుకోవడంతో పాటు 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 0-3 తేడాతో కోల్పోయింది.ఈ మ్యాచ్‌లో 204 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెస్టిండీస్.. స్టార్క్‌తో పాటు స్కాట్ బోలాండ్ అటాక్ చేయడంతో కేవలం 14.3 ఓవర్లలోనే తమ పోరాటాన్ని ముగించింది. స్టార్క్ 15 బంతుల వ్యవధిలో (W 0 0 0 W W 0 0 0 0 0 0 W 2 W) 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేయగా.. బోలాండ్ తనవంతుగా హ్యాట్రిక్ వికెట్లతో విరుచుకుపడ్డాడు. ఇన్నింగ్స్ 14వ ఓవర్లో బోలాండ్ వరుసగా 1, 2, 3 బంతుల్లో జస్టిన్ గ్రీవ్స్, షమార్ జోసఫ్, జోమెల్ వార్రికన్ను పెవిలియన్‌కు పంపాడు. తద్వారా టెస్ట్‌ల్లో ఆసీస్ తరఫున 10వ హ్యాట్రిక్ నమోదు చేసిన ఆటగాడిగా, డే అండ్ నైట్ టెస్ట్‌ల్లో తొలి హ్యాట్రిక్ నమోదు చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ ఇన్నింగ్స్‌లో 2 ఓవర్లు వేసిన బోలాండ్ కేవలం 2 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు.టెస్ట్‌ల్లో ఆస్ట్రేలియా తరఫున హ్యాట్రిక్ తీసిన బౌలర్లు..ఫ్రెడ్రిక్ స్పోఫోర్త్హగ్ ట్రంబల్జిమ్మీ మాథ్యూస్లిండ్సే క్లైన్మెర్వ్ హ్యూస్డేమియన్ ఫ్లెమింగ్షేన్ వార్న్గ్లెన్ మెక్గ్రాత్పీటర్ సిడిల్స్కాట్ బోలాండ్చరిత్ర సృష్టించిన బోలాండ్జమైకా టెస్ట్‌లో స్కాట్ బోలాండ్ (Scott Boland) సరికొత్త చరిత్ర సృష్టించాడు. 1915 తర్వాత టెస్టు క్రికెట్లో కనీసం 2000 డెలివరీలు సంధించిన బౌలర్లలో అత్యుత్తమ సగటు కలిగిన ఆటగాడిగా నిలిచాడు. బోలాండ్ తన నాలుగేళ్ల కెరీర్లో 14 టెస్ట్‌ల్లో 16.53 సగటుతో 62 వికెట్లు తీశాడు. ఈ ఆల్‌టైమ్ రికార్డు ఇంగ్లండ్‌కు ఆడిన సిడ్నీ బార్న్స్ పేరిట ఉంది. బార్న్స్ 1901- 1914 మధ్యలో ఇంగ్లండ్ తరఫున16.43 సగటుతో వికెట్లు తీశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. మిచెల్ స్టార్క్ విలయతాండవం ధాటికి విండీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఏకంగా ఏడుగురు బ్యాటర్లు డకౌట్లయ్యారు. జాన్ క్యాంప్‌బెల్, కెవియోన్ ఆండర్సన్, బ్రాండన్ కింగ్, రోస్టన్ ఛేజ్, షమార్ జోసఫ్, జోమెల్ వార్రికన్, జేడన్ సీల్స్ ఖాతా కూడా తెరవలేకపోయారు. విండీస్ ఇన్నింగ్స్‌లో కేవలం జస్టిన్ గ్రీవ్స్ (11) మాత్రమే రెండంకెల స్కోర్ చేయగలిగాడు. స్టార్క్‌తో పాటు స్కాట్ బోలాండ్ (2-1-2-3), హాజిల్‌వుడ్ (5-3-10-1) కూడా విజృంభించడంతో విండీస్ టెస్ట్ క్రికెట్లో తమ అత్యల్ప స్కోర్‌ను నమోదు చేసింది.అంతకుముందు ఆసీస్ కూడా రెండో ఇన్నింగ్స్‌లో 121 పరుగులకే కుప్పకూలింది. అల్జరీ జోసఫ్ (12-2-27-5), షమార్ జోసఫ్ (13-4-34-4), జస్టిన్ గ్రీవ్స్ (4-0-19-1) చెలరేగారు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో కెమరూన్ గ్రీన్ (42) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోర్ చేశాడు.దీనికి ముందు విండీస్ తొలి ఇన్నింగ్స్‌లోనూ 143 పరుగులకే చాపచుట్టేసింది. ఆసీస్ బౌలర్లంతా మూకుమ్మడిగా చెలరేగారు. బోలాండ్ 3, హాజిల్‌వుడ్, కమిన్స్ తలో 2, స్టార్క్, వెబ్‌స్టర్ చెరో వికెట్ పడగొట్టారు. విండీస్ ఇన్నింగ్స్‌లో జాన్ క్యాంప్‌బెల్ (36) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 225 పరుగులకు ఆలౌటైంది. గ్రీన్ (46), స్టీవ్ స్మిత్ (48) చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. విండీస్ బౌలర్లలో షమార్ 4, సీల్స్, గ్రీవ్స్ తలో 3 వికెట్లు తీశారు. -
AUS Vs WI: రసవత్తరంగా సాగుతున్న విండీస్, ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్
జమైకా వేదికగా వెస్టిండీస్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు 181 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. కెమరూన్ గ్రీన్ (42), పాట్ కమిన్స్ (5) క్రీజ్‌లో ఉన్నారు. విండీస్ బౌలర్లలో అల్జరీ జోసఫ్ 3, షమార్ జోసఫ్ 2, జస్టిన్ గ్రీవ్స్ ఓ వికెట్ పడగొట్టారు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో ఉస్మాన్ ఖ్వాజా 14, సామ్ కొన్‌స్టాస్ 0, స్టీవ్ స్మిత్ 5, ట్రవిస్ హెడ్ 16, బ్యూ వెబ్‌స్టర్ 13, అలెక్స్ క్యారీ 0 పరుగులకు ఔటయ్యారు.అంతకుముందు విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 143 పరుగులకే కుప్పకూలింది. 36 పరుగులు చేసిన జాన్ క్యాంప్‌బెల్ విండీస్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా ఆటగాళ్లలో షాయ్ హోప్ (23), జస్టిన్ గ్రీవ్స్ (18), రోస్టన్ ఛేజ్ (18), బ్రాండన్ కింగ్ (14) రెండంకెల స్కోర్లు చేశారు. ఆసీస్ బౌలర్లలో స్కాట్ బోలాండ్ 3, హాజిల్‌వుడ్, కమిన్స్ తలో 2, స్టార్క్, వెబ్‌స్టర్ చెరో వికెట్ పడగొట్టారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 225 పరుగులకు ఆలౌటైంది. గ్రీన్ (46), స్టీవ్ స్మిత్ (48) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఖ్వాజా (23), హెడ్ (20), క్యారీ (21), కమిన్స్ (24) 20ల్లో ఔటయ్యారు. విండీస్ బౌలర్లలో షమార్ జోసఫ్ 4, గ్రీవ్స్, జేడన్ సీల్స్ తలో 3 వికెట్లు తీశారు. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఆసీస్ తొలి రెండు మ్యాచ్‌లు గెలిచి ఇదివరకే సిరీస్‌ను కైవసం చేసుకుంది. -
నిప్పులు చెరిగినపేసర్లు.. స్వల్ప స్కోర్‌కే ఆలౌటైన ఆస్ట్రేలియా
జమైకా వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న పింక్ బాల్ టెస్ట్‌లో ఆతిథ్య వెస్టిండీస్ జట్టు తొలి రోజు పైచేయి సాధించింది. ఆ జట్టు పేసర్లు నిప్పులు చెరిగే బంతులతో ఆసీస్ ఆటగాళ్లను బెంబేలెత్తించారు. ఫలితంగా ఆసీస్ 225 పరుగులకే ఆలౌటైంది. షమార్ జోసఫ్ 4, జేడన్ సీల్స్, జస్టిన్ గ్రీవ్స్ తలో 3 వికెట్లు తీసి ఆసీస్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. ఆసీస్ ఇన్నింగ్స్ ఆదిలో సజావుగానే సాగింది. 28 పరుగులకే తొలి వికెట్ (కొన్‌స్టాస్ (17), 68 పరుగులకే రెండో వికెట్ (ఖ్వాజా (23)) కోల్పోయినా.. గ్రీన్ (46), స్మిత్ (48) ఆసీస్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. అయితే గ్రీన్ ఔటైన తర్వాత ఆసీస్ 68 పరుగుల వ్యవధిలో చివరి 7 వికెట్లు కోల్పోయింది. మిడిలార్డర్ బ్యాటర్లు, టెయిలెండర్లు ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. హెడ్ (20) ప్రతిఘటించే ప్రయత్నం చేసినా సబ్‌స్టిట్యూట్ ఆటగాడు ఆండర్సన్ ఫిలిప్ కళ్లు చెదిరే క్యాచ్‌తో అతన్ని పెవిలియన్ బాట పట్టించాడు. వెబ్‌స్టర్ 1, అలెక్స్ క్యారీ 21, కమిన్స్ 24, స్టార్క్ 0, బోలాండ్ 5 (నాటౌట్), హాజిల్‌వుడ్ 4 పరుగులు చేశారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది. ఓపెనర్ కెవియన్ ఆండర్సన్‌ను (3) మిచెల్ స్టార్క్ క్లీన్ బౌల్డ్ చేశాడు. మరో ఓపెనర్ బ్రాండన్ కింగ్ (8), కెప్టెన్ రోస్టన్ ఛేజ్ (3) క్రీజ్‌లో ఉన్నారు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు విండీస్ ఇంకా 209 పరుగులు వెనకుపడి ఉంది.కాగా, మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను ఆసీస్ ఇదివరకే 2-0 తేడాతో గెలుచుకుంది. తొలి రెండు టెస్ట్‌ల్లో ఆసీస్ అద్భుత విజయాలు సాధించింది. నామమాత్రంగా సాగుతున్న చివరి మ్యాచ్‌లో తొలి రోజు విండీస్ పైచేయి సాధించడం విశేషం. -
హోరాహోరీగా సాగుతున్న ఆస్ట్రేలియా, వెస్టిండీస్ టెస్ట్ మ్యాచ్
వెస్టిండీస్, ఆస్ట్రేలియా మధ్య గ్రెనెడా వేదికగా జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ హెరాహోరీగా సాగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి పర్యాటక ఆసీస్ 254 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. అలెక్స్ క్యారీ (26), పాట్ కమిన్స్ (4) క్రీజ్‌లో ఉన్నారు. మూడో రోజు ఆటలో ఆసీస్ బ్యాటర్లు స్టీవ్ స్మిత్ (71), కెమరూన్ గ్రీన్ (52) అర్ద సెంచరీలతో రాణించారు. ట్రవిస్ హెడ్ 39 పరుగులతో పర్వాలేదనిపించాడు. ఆసీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో సామ్ కొన్‌స్టాస్ 0, ఉస్మాన్ ఖ్వాజా 2, నాథన్ లియోన్ 8, బ్యూ వెబ్‌స్టర్ 2 పరుగులకు ఔటయ్యారు. విండీస్ బౌలర్లలో జస్టిన్ గ్రీవ్స్, షమార్ జోసఫ్, జేడన్ సీల్స్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. అల్జరీ జోసఫ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.అంతకుముందు విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 253 పరుగులకు ఆలౌటైంది. బ్రాండన్ కింగ్ (75) అర్ద సెంచరీతో రాణించడంతో విండీస్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. విండీస్ బ్యాటర్లలో జాన్ క్యాంప్‌బెల్ (40), అల్జరీ జోసఫ్ (27), షమార్ జోసఫ్ (29), షాయ్ హెప్ (21) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. కెరీర్లో 100వ టెస్ట్ ఆడుతున్న క్రెయిగ్ బ్రాత్‌వైట్ 0, కీసీ కార్టీ 6, కెప్టెన్ రోస్టన్ ఛేజ్ 16, జస్టిన్ గ్రీవ్స్ 1, ఆండర్సన్ ఫిలిప్ 10 పరుగులకు ఔటయ్యారు. ఆసీస్ బౌలర్లలో లియోన్ 3, హాజిల్‌వుడ్, కమిన్స్ చెరో 2, స్టార్క్, వెబ్‌స్టర్, హెడ్ ఒక్కో వికెట్ తీశారు.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 286 పరుగులకు ఆలౌటైంది. వెబ్‌స్టర్ (60), క్యారీ (63) అర్ద సెంచరీలతో రాణించారు. కొన్‌స్టాస్ 25, ఖ్వాజా 16, గ్రీన్ 26, స్టీవ్ స్మిత్ 3, హెడ్ 29, కమిన్స్ 17, స్టార్క్ 6, లియోన్ 11, హాజిల్‌వుడ్ 10 (నాటౌట్) పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో అల్జరీ జోసఫ్ 4, సీల్స్ 2, షమార్ జోసఫ్, ఫిలిప్, గ్రీవ్స్ తలో వికెట్ తీశారు.కాగా, ఆస్ట్రేలియా జట్టు 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్, 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం వెస్టిండీస్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా జరుగుతున్న రెండో టెస్ట్ ఇది. తొలి టెస్ట్‌లో ఆసీస్ 159 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. -
ఆస్ట్రేలియాలో ఘనంగా వైఎస్సార్ జయంతి
ఆస్ట్రేలియాలో అన్ని ప్రధాన నగరాల్లో వైఎస్సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఎన్నారైలు మాట్లాడుతూ వైయస్సార్ ఒక మరణం లేని మహనీయుడని తెలుగు జాతికి ఆయన చేసిన సేవలు ఎప్పుడూ గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. తమలో చాలామంది వైయస్సార్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యామని తమ జీవితాల్లో వెలుగులు నింపిన దేవుడు వైఎస్సార్ అని కొనియాడారు.ఆస్ట్రేలియాలోని అన్ని ప్రధాన నగరాల్లో జరిగిన ఈ వేడుకల్లో కేక్ కటింగ్, పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. బ్రిస్ బేన్‌లో జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఆస్ట్రేలియా కన్వీనర్ చింతలచెరువు సూర్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ తెలుగు ప్రజలకు అందించిన సేవలు ఎన్నటికీ మరచిపోమని అలాగే తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్న వైఎస్ జగన్ బాటను విడవబోమని పునరుద్ఘాటించారు.ఈ కార్యక్రమాలలో పాల్గొన్న వారికి జూమ్ కాల్ ద్వారా వైఎస్సార్సీపీ నాయకులు, ఆలూరు సాంబశివారెడ్డి , సోషల్ మీడియా ఇన్‌ఛార్జి యశ్వంత్, చల్లా మధుసూదన్ రెడ్డి, అబ్బయ్య చౌదరి, అరే శ్యామల, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, కారుమూరి వెంకట్ రెడ్డి, కొట్టు సత్యనారాయణ, బియ్యపు మధుసూదన్ రెడ్డి, అభినందనలు తెలియజేశారు. -
AUS Vs WI: ఆస్ట్రేలియా తుది జట్టు ప్రకటన.. స్టార్ ప్లేయర్ వచ్చేశాడు
గ్రెనడా వేదికగా వెస్టిండీస్‌తో రెండో టెస్టులో తలపడేందుకు ఆస్ట్రేలియా సిద్దమైంది. గురువారం ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేయాలని కంగారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో రెండో టెస్టు కోసం ఆస్ట్రేలియా టీమ్‌మెనెజ్‌మెంట్ తమ ప్లేయింగ్ ఎలెవన్ ప్రకటించింది.చేతివేలి గాయం కారణంగా తొలి టెస్టుకు దూరమైన ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తిరిగి గ్రెనడా టెస్టుకు అందుబాటులోకి వచ్చాడు. స్మిత్ రాకతో వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఇంగ్లిష్‌పై వేటు పడింది. తొలి టెస్టులో అవకాశం లభించినప్పటికి ఇంగ్లిష్ ఉపయోగించుకోలేకపోయాడు.అదేవిధంగా బార్బడోస్ టెస్టు రెండు ఇన్నింగ్స్‌లలో విఫలమైన సామ్ కాన్స్టాస్, ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌లకు ఆసీస్ టీమ్‌మెనెజ్‌మెంట్ మరో అవకాశం కల్పించింది. ఆస్ట్రేలియా తమ బౌలింగ్ లైనప్‌లో ఎటువంటి మార్పులు చేయలేదు. స్టార్క్, హాజిల్‌వుడ్, కమ్మిన్స్ ఆసీస్ ఫ్రంట్‌లైన్ పేసర్లగా ఉన్నారు.వీరితో పాటు నాలుగో పేసర్‌గా ఆల్‌రౌండర్ బ్యూ వెబ్‌స్టర్ బంతిని పంచుకోనున్నాడు. ఆసీస్ ప్లేయింగ్ ఎలెవన్‌లో నాథన్ లియాన్ ఏకైక స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా ఉన్నాడు. తొలి టెస్టులో 159 పరుగుల తేడాతో విండీస్‌ను కమ్మిన్స్ సేన చిత్తు చేసింది. దీంతో వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ సైకిల్ 2025-27లో ఆసీస్ బోణీ కొట్టింది.విండీస్‌తో రెండో టెస్టుకు ఆసీస్ తుది జట్టుఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్స్టాస్, కామెరాన్ గ్రీన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, బ్యూ వెబ్‌స్టర్, అలెక్స్ క్యారీ, పాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, జోష్ హాజిల్వుడ్చదవండి: #Shubman Gill: చరిత్ర సృష్టించిన శుబ్‌మన్ గిల్.. తొలి భారత ప్లేయర్‌గా -
వామ్మో పాము.. విమానంలో కలకలం
ఆస్ట్రేలియాలోని విమానంలో ఓ పాము కలకలం సృష్టించింది. దీంతో ఆ విమానం రెండు గంటలు ఆలస్యంగా టేకాఫ్ అయింది. మెల్బోర్న్ ఎయిర్‌పోర్టు నుంచి బ్రిస్బేన్‌కు వెళ్లే విమానంలోకి పాము దూరింది.విమానంలో ప్రయాణికుల లగేజ్ భద్రపరిచే ప్రాంతంలోకి పాము వెళ్తుండగా సిబ్బంది గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు స్నేక్ క్యాచర్‌ను రంగంలోకి దించారు. సుమారు అరగంట పాటు శ్రమించి పామును పట్టుకున్నారు. అనంతరం విమానానికి తనిఖీలు నిర్వహించి టేకాఫ్ చేశారు.మొదట పాము విషపూరితమైనదిగా అనుమానించారు.. కానీ పట్టుకున్న తర్వాత అది విషపూరితం కాదని.. అది పసిరిక పాముగా గుర్తించినట్లు స్నేక్ క్యాచర్ తెలిపారు. అధికారుల నుంచి సమాచారం అందగానే అరగంటలో తాను ఎయిర్‌పోర్టుకు చేరుకున్నానని, సెక్యూరిటీ తనిఖీల వద్ద బాగా ఆలస్యం జరిగినట్లు స్నేక్ క్యాచర్ పెల్లీ వెల్లడించాడు. -
తొలి టెస్ట్‌లో ఆసీస్ చేతిలో ఘోర పరాజయం.. విండీస్ హెడ్ కోచ్‌కు భారీ షాక్
వెస్టిండీస్ హెడ్ కోచ్ డారెన్ సామీకి ఐసీసీ భారీ షాకిచ్చింది. అంపైర్ నిర్ణయాలను విమర్శించినందుకు గానూ డిమెరిట్ పాయింట్‌తో పాటు జరిమానా విధించింది. అంపైర్ నిర్ణయాలను విమర్శించడం లేదా వ్యతిరేకించడం ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ లెవెల్-1 ఉల్లంఘన కిందికి వస్తుంది. దీంతో ఐసీసీ సామీపై చర్యలు తీసుకుంది.అసలేం జరిగిందంటే.. మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా జూన్ 25 నుంచి 27 మధ్య తేదీల్లో బార్బడోస్ వేదికగా విండీస్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ రెండో రోజు థర్డ్ అంపైర్ అడ్రియన్ హోల్డ్‌స్టాక్ తీసుకున్న పలు నిర్ణయాలు వివాదాస్పదం అయ్యాయి. ఇందులో నాలుగు నిర్ణయాలు విండీస్‌కు వ్యతిరేకంగా వచ్చాయి. దీనిపై విలేకరుల సమావేశంలో విండీస్ హెడ్ కోచ్ డారెన్ సామీ మాట్లాడుతూ అసంతృప్తిని వ్యక్తం చేశాడు. థర్డ్ అంపైర్ అడ్రియన్ హోల్డ్‌స్టాక్ తప్పుడు నిర్ణయాల వల్ల మ్యాచ్ తమ నుంచి చేజారిందని చెప్పుకొచ్చాడు. హోల్డ్‌స్టాక్ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశాడు. నిర్ణయాలు తీసుకోవడంలో హోల్డ్‌స్టాక్ స్థిరత్వాన్ని ప్రశ్నించాడు. గతంలో కూడా హోల్డ్‌స్టాక్ ఇలాగే చేశాడని అన్నాడు. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లో అంపైర్ తీరును బహిరంగంగా విమర్శించడం ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఆర్టికల్ 2.7 ఉల్లంఘన కిందికి వస్తుంది.ఇందుకు గానూ సామీకి ఓ డిమెరిట్ పాయింట్‌తో పాటు మ్యాచ్ ఫీజ్‌లో 15 శాతం జరిమానా విధించారు. సామీ తన తప్పును ఒప్పుకోవడంతో అతనిని తదుపరి విచారణకు పిలువలేదు. సామీపై చర్యలు తీసుకున్న విషయాన్ని మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్ వెల్లడించాడు.విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో హోల్డ్‌స్టాక్ అప్పటికే క్రీజ్‌లో కుదురుకున్న షాయ్ హోప్, రోస్టన్ ఛేజ్ విషయంలో వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నాడు. టీవీ రీప్లేలు ఈ ఇద్దరు నాటౌట్ అని చూపించినా హోల్డ్‌స్టాక్ ఔట్‌గా ప్రకటించాడు. హోప్, ఛేజ్ ఔట్ కావడం ఈ మ్యాచ్‌లో విండీస్‌పై భారీ ప్రభావం చూపించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఈ ఇద్దరు రాణించినందుకు విండీస్‌కు స్వల్ప తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.అయితే ఈ ఆధిక్యాన్ని విండీస్ వెంటనే కోల్పోయింది. రెండో ఇన్నింగ్స్‌లో కుదురుగా ఆడిన ఆసీస్ బ్యాటర్లు భారీ స్కోర్ చేసి విండీస్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచారు. ఛేదనలో పూర్తిగా చేతులెత్తేసిన విండీస్ 141 పరుగులకే ఆలౌటై 159 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఇరు జట్లతో పేసర్లు చెలరేగిపోవడంతో ఈ మ్యాచ్ కేవలం మూడు రోజుల్లోనే ముగిసింది. -
అది ఆసీస్‌కు రిటర్న్ గిఫ్ట్
న్యూఢిల్లీ: సరిగ్గా ఏడాది క్రితం... జూన్ 29న భారత జట్టు రోహిత్ శర్మ నాయకత్వంలో టి20 వరల్డ్ కప్ గెలుచుకుంది. 2007లోనూ టి20 వరల్డ్ కప్ విజయంలో భాగంగా ఉన్న రోహిత్ నాయకుడిగా సాధించిన తొలి టి20 టోర్నీ ఇది. ఈ టోర్నమెంట్లో ఎప్పటిలాగే పాకిస్తాన్‌తో మ్యాచ్‌తో పాటు సెమీస్‌కు ముందు ఆ్రస్టేలియాతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ ఎప్పటికీ మర్చిపోలేనివి. ఈ నేపథ్యంలో ‘జియో–హాట్‌స్టార్’ రూపొందించిన ప్రత్యేక కార్యక్రమంలో మాజీ కెప్టెన్ రోహిత్ నాటి మ్యాచ్‌లకు సంబంధించి పలు విషయాలను గుర్తు చేసుకున్నాడు. ఆ్రస్టేలియాతో పోరులో భారత్ 24 పరుగులతో విజయం సాధించింది. 41 బంతుల్లోనే 92 పరుగులు చేసిన రోహిత్ శర్మ... స్టార్క్ వేసిన ఒక ఓవర్లో 4 సిక్స్‌లు, ఫోర్‌తో ఏకంగా 28 పరుగులు రాబట్టాడు. అంతకుముందు ఏడు నెలల క్రితం జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో ఫైనల్లో ఆసీస్ చేతిలో ఓడిన టీమిండియా తీవ్ర నిరాశకు లోనైంది. ఆ ఓటమి తమ మనసుల్లోనే ఉండటంతో ఆసీస్‌పై గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగామని రోహిత్ చెప్పాడు. ‘మేం ఈ మ్యాచ్ గెలిస్తే ఆసీస్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుందన్న మాట చాలు మాలో స్ఫూర్తి నింపడానికి. నవంబర్ 19న మాతో పాటు మన దేశ అభిమానులందరికీ ఆనందం దూరం చేశారనే విషయం మనసులో మెదులుతూనే ఉంది. కాబట్టి వారికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని భావించాం. అయితే అది అంత సులువు కాదని, మైదానంలోనే చూపించాలని భావించాం. అందుకే ఒక్కసారి బ్యాటింగ్‌కు దిగగానే నేను ఏం చేయగలనో అది చేశాను. స్టార్క్‌తో గతంలో చాలాసార్లు తలపడ్డా. ఈసారి అతడు నన్ను అవుట్ చేయడానికి కాకుండా పరుగులు ఇవ్వకుండా ఆపేందుకు మాత్రమే ప్రయత్నిస్తున్నట్లు అర్థమైంది. అక్కడే నేను సగం గెలిచాను. ఆపై విరుచుకుపడ్డాను. సెంచరీలు సాధించడం గొప్పే. కానీ మ్యాచ్ పరిస్థితి, దికను బట్టి చూస్తే ఈ ఇన్నింగ్స్ సెంచరీకంటే ఎంతో విలువైంది. నాకు సంబంధించి ఇది నా అత్యుత్తమ ప్రదర్శన’ అని రోహిత్ వ్యాఖ్యానించాడు. అంతకుముందు పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో కూడా 140 చేస్తే గెలుస్తామని భావించామని... 119 పరుగులు చేసిన తర్వాత కూడా 2–3 వికెట్లు తీస్తే పాక్‌ను ఓడించగలమని నమ్మకం ఉందని చెప్పాడు. నిజానికి మ్యాచ్ ఫలితంకంటే దానికి ముందు ఉండే హడావిడే ఎప్పుడూ ప్రత్యేకమని అతను అన్నాడు. ‘బయట మాకు ముప్పు ఉందని చెబుతూ మ్యాచ్‌కు రెండు రోజుల ముందు నుంచి కూడా హోటల్ బయటకు మమ్మల్ని వెళ్లనీయలేదు. మీడియా, అభిమానులతో నిండిపోయిన హోటల్ కనీసం నడవడానికి కూడా వీలు లేని విధంగా మారిపోయింది. అప్పుడు ఇది సాధారణ మ్యాచ్ కాదని మాకు అర్థమైంది. గ్రౌండ్‌కు వెళ్లిన తర్వాత కూడా ఇరు దేశాల అభిమానుల జోష్‌ను చూస్తే ఆశ్చర్యం వేసింది. పాకిస్తాన్‌పై నేను ఎన్నో మ్యాచ్‌లు ఆడాను. కానీ ఆటకు ముందు కనిపించే వాతావరణం ప్రత్యేకతే వేరు. దానికి ఏదీ సాటి రాదు’ అని రోహిత్ శర్మ వివరించాడు. -
భారత్ ఆడే సిడ్నీ మ్యాచ్ టికెట్లు ‘సోల్డ్ అవుట్’
మెల్బోర్న్: టీమిండియా ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో సంప్రదాయ టెస్టు ఫార్మాట్ ఆడుతోంది. ఇది ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్ కావడంతో ఇంగ్లండ్ పర్యటన ముగిసేందుకే చాలా సమయం పడుతోంది. ఆగస్టు 4 వరకు అఖరి టెస్టు జరుగుతుంది. అనంతరం బంగ్లాదేశ్ పర్యటన ఉంది. ఆ తర్వాతే ఆ్రస్టేలియాలో భారత్ పర్యటిస్తుంది. అక్టోబర్–నవంబర్లలో జరిగే ఈ పరిమిత ఓవర్ల సిరీస్‌లకు ఇంకా నాలుగు నెలల సమయం ఉంది. అయినా సరే భారత్ క్రికెట్ క్రేజ్‌ను ఆస్ట్రేలియా కూడా సొమ్ము చేసుకుంది. మూడు వన్డేలు, ఐదు టి20ల కోసం క్రికెట్ ఆ్రస్టేలియా (సీఏ) టికెట్ల విక్రయం చేపట్టగా ఏకంగా 90 వేల పైచిలుకు టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయినట్లు స్వయంగా సీఏ వర్గాలే వెల్లడించాయి. సిడ్నీలో జరిగే మూడో వన్డే, కాన్బెర్రాలో జరిగే తొలి టి20 టికెట్లయితే ఒక్కటి కూడా మిగలకుండా ‘సోల్డ్ అవుట్’ కావడం విశేషం. ‘భారత్, ఆసీస్‌ల మధ్య జరగబోయే పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ముఖ్యంగా ‘కంగారూ’ దేశంలో స్థిరపడిన భారత సంతతి ప్రేక్షకులు వేలంవెర్రిగా ఎగబడ్డారు’ అని సీఏ ఒక ప్రకటనలో తెలిపింది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (మూడో వన్డే వేదిక), మనుక ఓవల్ (కాన్బెర్రా–తొలి టి20 వేదిక)లలో జరిగే మ్యాచ్ టికెట్లకు అనూహ్య డిమాండ్ నెలకొనడంతో నాలుగు నెలల ముందే టికెట్లన్నీ అయిపోయాయని సీఏ పేర్కొంది. భారత సంతతి అభిమానులు కొందరు వందలు, వేల సంఖ్యలో టికెట్లు కొనుగోలు చేసినట్లు తెలిసింది. -
నిప్పులు చెరిగిన విండీస్ పేసర్లు.. స్వల్ప స్కోర్‌కే కుప్పకూలిన ఆస్ట్రేలియా
3 టెస్ట్‌లు, 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు వెస్టిండీస్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా నిన్న (జూన్ 25) తొలి టెస్ట్ మొదలైంది. బార్బడోస్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలి రోజు పేసర్ల హవా కొనసాగింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాను విండీస్ పేసర్లు జేడన్ సీల్స్ (15.5-1-60-5), షమార్ జోసఫ్ (16-3-46-4) వణికించారు. ఈ ఇద్దరి ధాటికి ఆస్ట్రేలియా 180 పరుగులకే కుప్పకూలింది. గడిచిన 30 ఏళ్లలో వెస్టిండీస్‌పై తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాకు ఇదే అత్యల్ప స్కోర్. సీల్స్, షమార్తో పాటు జస్టిన్ గ్రీవ్స్ కూడా ఓ వికెట్ తీయడంతో ఆసీస్ ఇన్నింగ్స్ పరిసమాప్తమైంది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో ట్రవిస్ హెడ్ (59) టాప్ స్కోరర్‌గా నిలువగా.. ఉస్మాన్ ఖ్వాజా 47 పరుగులతో పర్వాలేదనిపించాడు. వీరిద్దరు కాక కెప్టెన్ కమిన్స్ (28), వెబ్‌స్టర్ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా ఆటగాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. సామ్ కొన్‌స్టాస్ 3, కెమారూన్ గ్రీన్ 3, జోస్ ఇంగ్లిస్ 5, అలెక్స్ క్యారీ 8, మిచెల్ స్టార్క్ 0, హాజిల్‌వుడ్ 4 పరుగులకు ఔటయ్యారు. నాథన్ లియోన్ 9 పరుగులతో అజేయంగా నిలిచాడు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్ కూడా ఆసీస్ తరహాలోనే త్వరితగతిన వికెట్లు కోల్పోయింది. ఆసీస్ పేసర్లు స్టార్క్ (7-1-35-2), హాజిల్‌వుడ్ (7-1-13-1), కమిన్స్ (6-2-8-1) ధాటికి తొలి రోజు ఆట ముగిసే సమయానికి 57 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు విండీస్ ఇంకా 123 పరుగులు వెనుకపడి ఉంది. విండీస్ ఇన్నింగ్స్‌లో క్రెయిగ్ బ్రాత్‌వైట్ 4, జాన్ క్యాంప్‌బెల్ 7, కీసీ కార్టీ 20, జోమెల్ వార్రికన్ 0 పరుగులకు ఔట్ కాగా.. బ్రాండన్ కింగ్ (23), రోస్టన్ ఛేజ్ (1) క్రీజ్‌లో ఉన్నారు. బ్రాత్‌వైట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలిగిన తర్వాత రోస్టన్ ఛేజ్ విండీస్ టెస్ట్ జట్టు సారధిగా బాధ్యతలు చేపట్టాడు. కెప్టెన్‌గా ఇదే అతనికి తొలి మ్యాచ్.దిగ్గజాలు సరసన సీల్స్ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన విండీస్ రైట్ ఆర్మ్ సీమర్ జేడన్ సీల్స్ దిగ్గజాల సరసన చేరాడు. బార్బడోస్ మైదానంలో (కెన్నింగ్స్టన్ ఓవల్) ఆస్ట్రేలియాపై ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన నాలుగో విండీస్ బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. సీల్స్కు ముందు కోట్నీ వాల్ష్ (5-39), మాల్కమ్ మార్షల్ (5-42), డెనిస్ అట్కిన్సన్ (5-56) మాత్రమే బార్బడోస్‌లో ఆసీస్‌పై ఐదు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశారు. మైఖేల్ హోల్డింగ్ లాంటి దిగ్గజానికి కూడా ఈ ఘనత సాధ్యం కాలేదు. -
లబుషేన్‌కు ఉద్వాసన
బ్రిడ్జ్‌టౌన్: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో పేలవ ప్రదర్శన కనబర్చిన ఆ్రస్టేలియా ప్లేయర్ మార్నస్ లబుషేన్ జాతీయ జట్టులో చోటు కోల్పోయాడు. ఈ నెల 25 నుంచి ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మధ్య మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుండగా... తొలి టెస్టు కోసం క్రికెట్ ఆ్రస్టేలియా (సీఏ) శుక్రవారం జట్టును ప్రకటించింది. స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ గాయంతో ఇబ్బంది పడుతుండటంతో తొలి టెస్టుకు అతడిని ఎంపిక చేయలేదు. వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఇన్‌గ్లిస్, టీనేజ్ ఓపెనర్ సామ్ కొన్‌స్టాస్‌కు అవకాశం దక్కింది. ఇటీవల లార్డ్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో బ్యాటింగ్ వైఫల్యంతో ఆస్ట్రేలియా పరాజయం పాలవడంతో... సెలెక్టర్లు జట్టులో మార్పులు చేశారు. ‘డబ్ల్యూటీసీ ఫైనల్లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డ స్మిత్ కోలుకునేందుకు కాస్త సమయం పడుతుంది. రెండో టెస్టు వరకు అతడు జట్టులో చేరొచ్చు. లబుషేన్, స్మిత్ స్థానాలను కొన్‌స్టాస్, ఇన్‌గ్లిస్ భర్తీ చేస్తారు. టీమిండియాతో ‘బాక్సింగ్ డే’ టెస్టులో కొన్‌స్టాస్ అరంగేట్ర పోరులోనే హాఫ్‌సెంచరీతో ఆకట్టుకుంటే... శ్రీలంక పిచ్‌లపై టెస్టు అరంగేట్రం చేసిన ఇన్‌గ్లిస్ తొలి మ్యాచ్‌లో సెంచరీతో కదంతొక్కాడు. లబుషేన్ జట్టులో కీలక ఆటగాడే అయినా ... అతడి ప్రదర్శన స్థాయికి తగ్గట్లు లేకపోవడంతోనే జట్టు నుంచి తప్పించాం. అతడు తిరిగి సత్తా చాటుతాడనే నమ్మకముంది’అని చీఫ్ సెలెక్టర్ బెయిలీ అన్నాడు. -
వరుస వైఫల్యాలు.. స్టార్ ఆటగాడిపై వేటు వేసిన ఆస్ట్రేలియా
మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం వెస్టిండీస్‌లో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా.. జూన్ 25 నుంచి ప్రారంభం కాబోయే తొలి టెస్ట్‌కు ముందు కీలక నిర్ణయం తీసుకుంది. స్టార్ మిడిలార్డర్ ఆటగాడు మార్నస్ లబూషేన్‌పై వేటు వేసింది. లబూషేన్ గత కొంతకాలంగా పేలవ ఫామ్‌లో ఉన్నాడు. ఈ కారణంగా అతనికి తొలి టెస్ట్ తుది జట్టులో అవకాశం ఇవ్వలేదు. ఈ విషయాన్ని సెలెక్షన్ కమిటీ చైర్మన్ జార్జ్ బెయిలీ ఓ ప్రకటనలో తెలిపారు. లబూషేన్ తమ జట్టులో కీలక సభ్యుడని చెబుతూనే అతని రెండేళ్ల గణాంకాలను ప్రస్తావించాడు. 2023లో 34.91 సగటున పరుగులు చేసిన లబూషేన్.. గతేడాది (2024) తన సగటును (30.93) మరింత దిగజార్చుకున్నాడని అన్నాడు. ఈ ఏడాది సైతం లబూషేన్ ఫామ్‌ను దొరకబుచ్చుకోలేకపోయాడని తెలిపాడు (4 టెస్ట్‌ల్లో 16 సగటు). చివరి రెండు ఇన్నింగ్స్‌ల్లో (డబ్ల్యూటీసీ ఫైనల్) ఓపెనర్‌గా అవకాశమిచ్చినా దారుణంగా విఫలమయ్యాడని (17,22) అన్నాడు. తొలి టెస్ట్ జట్టు నుంచి తప్పించినా లబూషేన్ టాలెంట్‌ను గౌరవిస్తూ మున్ముందు పరిశీలిస్తామని తెలిపాడు.మరోవైపు మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు కూడా తొలి టెస్ట్ తుది జట్టులో అవకాశం ఇవ్వలేమని బెయిలీ చెప్పాడు. తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్ సందర్భంగా స్మిత్ గాయపడ్డ (చేతి వేలి) విషయాన్ని ధృవీకరించాడు. స్మిత్ సర్జరీని తప్పించుకున్నప్పటికీ.. ఎనిమిది వారాలు చేతికి కట్టుతో ఉండాలని డాక్టర్లు చెప్పినట్లు తెలిపాడు. బ్యాటింగ్‌కు ఇబ్బంది లేకపోతే రెండో టెస్ట్‌లో (జూన్ 3) స్మిత్‌ను ఆడించే అవకాశాలున్నాయని అన్నాడు. లబూషేన్, స్మిత్ స్థానాల్లో సామ్ కొన్‌స్టాస్, జోస్ ఇంగ్లిస్‌లను తుది జట్టులోకి తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. కొన్‌స్టాస్ గతేడాది భారత్‌తో జరిగిన బాక్సింగ్ డే టెస్ట్‌లో ఆకట్టుకున్నాడు. లబూషేన్ స్థానంలో తొలి టెస్ట్‌లో అతను ఉస్మాన్ ఖ్వాజాతో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తాడు. స్టీవ్ స్మిత్ స్థానాన్ని మిడిలార్డర్లో ఇంగ్లిస్ భర్తీ చేస్తాడు. ఇంగ్లిస్ ఈ ఏడాది ఆరంభంలో శ్రీలంకతో ఆడిన తన అరంగేట్రం మ్యాచ్‌లోనే సెంచరీతో ఇరగదీశాడు. ప్లేయింగ్ ఎలెవెన్‌లో మిగతా స్థానాలపై ఆసీస్ ఇంకా ప్రకటన చేయలేదు. జూన్ 25 నుంచి బార్బడోస్ వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది.వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), సీన్ అబాట్, స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్స్టాస్, మాట్ కుహ్నెమాన్, మార్నస్ లబూషేన్, నాథన్ లియాన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, బ్యూ వెబ్‌స్టర్. ఆసీస్‌తో తొలి టెస్ట్‌కు విండీస్ జట్టు: కెవ్లాన్ ఆండర్సన్, బ్రాండన్ కింగ్, క్రెయిగ్ బ్రాత్‌వైట్, మిఖైల్ లూయిస్, జాన్ క్యాంప్‌బెల్, కీసీ కార్టీ, జస్టిన్ గ్రీవ్స్, రోస్టన్ ఛేజ్, జోహన్ లేన్, షాయ్ హోప్, టెవిన్ ఇమ్లాచ్, జోమెల్ వార్రికన్, అల్జరీ జోసఫ్, షమార్ జోసఫ్, ఆండర్సన్ ఫిలిప్, జేడన్ సీల్స్ -
చెవిరెడ్డి అరెస్ట్ దారుణం: ఆస్ట్రేలియా ఎన్నారైలు
తన జీవితంలో ఏనాడు మద్యం వాసన కూడా తెలియనటువంటి నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని ఆ కేసులో ఇరికించటం అత్యంత హేయమైన చర్య అని ఆస్ట్రేలియా ఎన్నారైలు ఖండించారు.వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్నవారిని ఏదో ఒక కేసులో ఇరికించటం దారుణమన్నారు. ఈ పరిణామాలు అన్నిటికీ రిటర్న్ గిఫ్టులు కచ్చితంగా ఉంటాయని ఆస్ట్రేలియా ఎన్నారై సూర్యనారాయణ రెడ్డి అన్నారు -
గ్లెన్ మ్యాక్స్‌వెల్ విధ్వంసకర శతకం.. 13 సిక్సర్లతో ఊచకోత
ఆసీస్ విధ్వంసకర ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ చాన్నాళ్ల తర్వాత తన స్థాయికి తగ్గ ఇన్నింగ్స్ ఆడాడు. మేజర్ లీగ్ క్రికెట్-2025 ఎడిషన్‌లో వాషింగ్టన్ ఫ్రీడంకు ప్రాతినిథ్యం వహిస్తున్న అతను.. ఇవాళ (జూన్ 18) లాస్ ఏంజెలెస్ నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో విధ్వంసకర శతకంతో (48 బంతుల్లో) విరుచకుపడ్డాడు. ఈ మ్యాచ్‌లో మ్యాక్సీ రికార్డు స్థాయిలో 13 సిక్సర్లు బాదాడు. ALL THE 13 SIXES & 2 FOURS BY MAXWELL IN HIS 106*(49) KNOCK IN MLC 🤯 pic.twitter.com/ZjBVw4KKqh— Johns. (@CricCrazyJohns) June 18, 2025జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు (68/4) బరిలోకి దిగిన మ్యాక్సీ తొలుత నిదానంగా ఆడాడు. తొలి 15 బంతుల్లో కేవలం 11 పరుగులే చేశాడు. ఆతర్వాత మ్యాక్సీకి పూనకం వచ్చింది. 34 బంతుల్లో 13 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో 95 పరుగులు చేశాడు. మొత్తంగా మ్యాక్సీ ఈ ఇన్నింగ్స్‌లో 49 బంతులు ఎదుర్కొని 13 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో అజేయమైన 106 పరుగులు చేశాడు. ఫలితంగా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన అతని జట్టు (వాషింగ్టన్ ఫ్రీడం) నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. వాషింగ్టన్ ఇన్నింగ్స్‌లో మ్యాక్సీది వన్‌మ్యాన్ షో నడిచింది. అతను మినహా మిచెల్ ఓవెన్ ఒక్కడే (11 బంతుల్లో 32) కాస్త పర్వాలేదనిపించాడు. ఒబస్ పియెనార్‌ను (15 బంతుల్లో 11 నాటౌట్) మరో ఎండ్‌లో పెట్టుకొని మ్యాక్సీ తన విధ్వంసకాండను కొనసాగించాడు. వాషింగ్టన్ ఇన్నింగ్స్‌లో రచిన్ రవీంద్ర 8, ఆండ్రియస్ గౌస్ 12, మార్క్ చాప్మన్ 17, జాక్ ఎడ్వర్డ్స్ 11 పరుగులు చేశాడు. నైట్‌రైడర్స్ బౌలర్లలో కోర్నె డ్రై, తన్వీర్ సంఘా తలో 2 వికెట్లు పడగొట్టగా.. జేసన్ హోల్డర్ ఓ వికెట్ తీశాడు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన నైట్‌రైడర్స్ ఘోర పతనం దిశగా సాగుతుంది. ఆ జట్టు తొలి ముగ్గురు బ్యాటర్లు (అలెక్స్ హేల్స్, సునీల్ నరైన్, ఉన్ముక్త్ చంద్) డకౌట్ అయ్యారు. ఆతర్వాత వచ్చిన రోవ్‌మన్ పావెల్ (4), మాథ్యూ ట్రంప్ (2) కూడా సింగిల్ డిజిట్ స్కోర్లకే టపా కట్టేశాడు. ఫలితంగా నైట్‌రైడర్స్ 10 ఓవర్ల తర్వాత 5 వికెట్లు నష్టపోయి 61 పరుగులు మాత్రమే చేయగలిగింది. సైఫ్ బదార్ (32 నాటౌట్), జేసన్ హోల్డర్ (21 నాటౌట్) పోరాడుతున్నారు. వాషింగ్టన్ బౌలర్లలో జాక్ ఎడ్వర్డ్స్ 2, మిచెల్ ఓవెన్, మార్క్ అడైర్, సౌరభ్ నేత్రావల్కర్ తలో వికెట్ తీశారు. -
9వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసిన ఆసీస్ బౌలర్
ఆసీస్ యువ పేసర్ జేవియర్ బార్ట్లెట్ మేజర్ లీగ్ క్రికెట్లో ఓ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. ఎంఐ న్యూయార్క్‌తో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అతను.. ఓటమి అంచుల్లో ఉన్న తన జట్టును (శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్స్) నమ్మశక్యంకాని ఇన్నింగ్స్‌తో (25 బంతుల్లో 59 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) విజయతీరాలకు చేర్చాడు.ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ న్యూయార్క్.. క్వింటన్ డికాక్ (38 బంతుల్లో 63; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో సత్తా చాటడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఎంఐ ఇన్నింగ్స్‌లో మోనాంక్ పటేల్ (14 బంతుల్లో 20; ఫోర్, సిక్స్), కీరన్ పోలార్డ్ (16 బంతుల్లో 30; 4 సిక్సర్లు), సన్నీ పటేల్ (11 బంతుల్లో 20 నాటౌట్; 3 ఫోర్లు), మైఖేల్ బ్రేస్‌వెల్ (11 బంతుల్లో 17; 2 సిక్సర్లు) కూడా బ్యాట్లు ఝులిపించారు. కెప్టెన్ పూరన్ (7 బంతుల్లో 5) నిరాశపరిచాడు. యూనికార్న్స్ బౌలర్లలో హరీస్ రౌఫ్, కార్మీ లె రాక్స్, హసన్ ఖాన్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. జేవియర్ బార్ట్లెట్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.అనంతరం బరిలోకి దిగిన యూనికార్న్స్.. నవీన్ ఉల్ హక్ (4-0-28-2), ట్రెంట్ బౌల్ట్ (4-0-39-1) రెచ్చిపోవడంతో 42 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో టిమ్ సీఫర్ట్ (33), హసన్ ఖాన్ (43) యూనికార్న్స్‌ను ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే వీరిద్దరు కూడా జట్టు స్కోర్ 110 పరుగుల లోపే ఔట్ కావడంతో యూనికార్న్స్ మరోసారి కష్టాల్లో పడింది. ఈ దశలో యూనికార్న్స్‌ను లేవనెత్తే బాధ్యతను బార్ట్లెట్ తీసుకున్నాడు. బార్ట్లెట్ నమ్మశక్యంకాని రీతిలో షాట్లు ఆడుతూ ఓటమి కొరల్లో ఉన్న తన జట్టును విజయతీరాలకు చేర్చాడు.బార్ట్లెట్కు కెప్టెన్ కోరె ఆండర్సన్ (9), హరీస్ రౌఫ్ (10 నాటౌట్) సహకరించారు. వీరిద్దరు కేవలం స్ట్రయిక్ రొటేట్ చేస్తూ బార్ట్లెట్కు అవకాశం ఇవ్వగా, మిగతా పనినంతా అతనే చూసుకున్నాడు. బౌల్ట్ వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్లో వరుసగా సిక్సర్, రెండు ఫోర్లు బాదిన బార్ట్లెట్ మ్యాచ్‌ను యూనికార్న్స్వైపు మళ్లించాడు. ఆ మరుసటి ఓవర్లో బౌండరీ సహా 6 పరుగులు చేసిన బార్ట్లెట్ కేవలం 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం 19వ ఓవర్లో 11 పరుగులు పిండుకున్న బార్ట్లెట్.. చివరి ఓవర్ తొలి బంతికి సిక్సర్ బాది యూనికార్న్స్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో యూనికార్న్స్ గెలుస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. బార్ట్లెట్ నమ్మశక్యంకాని ఇన్నింగ్స్‌తో యూనికార్న్స్‌ను గెలిపించాడు. బార్ట్లెట్ ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్‌కు ఆడాడు. అయితే అతనికి బ్యాటర్‌గా పెద్ద అవకాశాలు రాలేదు. -
మోకాలితో గొంతు నొక్కిన ఉదంతంలో భారతీయుని విషాదాంతం
మెల్బోర్న్: భార్యాభర్తల నడుమ చిన్న వాగ్వాదంపై ఆ్రస్టేలియా పోలీసుల అతి స్పందన, మితిమీరిన జులుం, ఆటవికులను తలపించిన కర్కశత్వం చివరికి ఓ భారతీయుని ప్రాణాలు బలిగొన్నాయి. తలను నేలకేసి కొట్టడమే గాక మెడపై మోకాలితో తొక్కిపెట్టడంతో 42 ఏళ్ల గౌరవ్ కుందీ మెదడుకు తీవ్ర గాయమైంది. దాంతో కోమాలోకి వెళ్లి ఆస్పత్రిలో రెండు వారాలుగా మృత్యువుతో పోరాడి గురువారం తుదిశ్వాస విడిచాడు. ఐదేళ్ల క్రితం అమెరికాతో పాటు ప్రపంచమంతటినీ కుదిపేసిన ‘ఫ్లాయిడ్’ ఉదంతాన్ని తలపించిన ఈ క్రూరత్వంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ రోజు అసలేమైంది? గౌరవ్, అమృత్‌పాల్ కౌర్ దపంతులు అడిలైడ్‌లో నివసిస్తున్నారు. వారికిద్దరు పిల్లలు. జూన్ మొదటి వారంలో జరిగిన దారుణాన్ని భార్య మీడియాతో పంచుకున్నారు. ‘‘మేమిద్దరం మా ఇంటి సమీపంలో నడుస్తున్నాం. నా భర్త కాస్త తాగి ఉన్నారు. మా మధ్య చిన్న వాగ్వాదం జరిగింది. ఆయన నన్ను దూరంగా నెట్టేయడాన్ని పెట్రోలింగ్ పోలీసులు చూశారు. వెంటనే ఒక పోలీసు మా దగ్గరికొచ్చాడు. వస్తూనే నా భర్తను పోలీస్ కారుకేసి విసురుగా కొట్టాడు. తర్వాత కిందపడేసి తలను నేలకు గట్టిగా అదిమిపెట్టాడు.నా భార్యను హింసించడం లేదు అంటూ ఆయన మొత్తుకుంటున్నా వినిపించుకోలేదు. మేం కేవలం గట్టిగా మాట్లాడుకున్నామని, వదిలేయండని నేనూ అరిచినా పట్టించుకోలేదు. మెడపై చాలాసేపు మోకాలితో అదిమిపట్టడంతో ఊపిరాడక గౌరవ్ చివరకు స్పృహ తప్పారు. అయినా అరెస్ట్ చేయబోగా బతిమాలి ఆస్పత్రిలో చేరి్పంచా.మెడ, మెదడు నరాలు బాగా దెబ్బతిని కోమాలోకి వెళ్లాడు, స్పృహలోకి రావడం కష్టమని వైద్యులు చెప్పారు’’ అంటూ వాపోయారు. 2020 మే నెలలో జార్జ్ ఫ్లాయిడ్ అనే 46 ఏళ్ల నల్ల జాతీయున్ని శ్వేతజాతి పోలీసు ఏకంగా తొమ్మిది నిమిషాల పాటు నేలకేసి అదిమిపట్టి ఊపిరాడకుండా చేయడం తెలిసిందే. దాంతో ఆయన నిస్సహాయంగా ప్రాణాలు కోల్పోయారు. ‘ఐ కాంట్ బ్రీత్’ అంటూ ఫ్లాయిడ్ చేసిన ఆర్తనాదాలు అమెరికావ్యాప్తంగా నల్లతీయుల సమరనాదంగా మారాయి.పోలీసుల భిన్న వాదన పోలీసులు మాత్రం తాము క్రూరంగా వ్యవహరించలేదని చెబుతున్నారు. అయినా ఈ ఉదంతాన్ని పోలీస్ కస్టడీ మరణంగా భావిస్తామని శుక్రవారం ప్రకటించారు. అయితే, అప్పట్లో ఘటన తర్వాత సౌత్ ఆ్రస్టేలియన్ పోలీస్ కమిషనర్ స్పందిస్తూ మోకాలితో మెడపై అదిమిపెట్టడంనిజమేనని అంగీకరించడం విశేషం. -
వరుసగా ఆరో పరాజయం
ఆంట్వర్ప్ (బెల్జియం): అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) యూరోపియన్ అంచె ప్రొ లీగ్‌లో భారత పురుషుల జట్టు నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. హార్దిక్ సింగ్ నాయకత్వంలోని భారత జట్టు యూరోపియన్ అంచెలో వరుసగా ఆరో పరాజయాన్ని చవిచూసింది. ఆ్రస్టేలియా జట్టుతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 2–3 గోల్స్ తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌కు ముందు నెదర్లాండ్స్‌తో రెండు మ్యాచ్‌ల్లో, అర్జెంటీనాతో రెండు మ్యాచ్‌ల్లో, ఆ్రస్టేలియాతో ఒక మ్యాచ్‌లో భారత జట్టు ఓటమి పాలైంది. ఆ్రస్టేలియాతో జరిగిన రెండో మ్యాచ్‌లో భారత జట్టు మ్యాచ్ మొదలైన మూడో నిమిషంలోనే ఖాతా తెరిచింది. సంజయ్ చేసిన గోల్‌తో భారత్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే ఆధిక్యంలోకి వెళ్లామన్న ఆనందం భారత్‌కు మరుసటి నిమిషంలోనే ఆవిరైంది. రెండు నిమిషాల వ్యవధిలో ఆస్ట్రేలియా రెండు గోల్స్ చేసి భారత్‌కు షాక్ ఇచి్చంది. నాలుగో నిమిషంలో టిమ్ బ్రాండ్, ఐదో నిమిషంలో బ్లేక్ గోవర్స్ ఆస్ట్రేలియాకు ఒక్కో గోల్ అందించారు. రెండో క్వార్టర్లో భారత్ మూడో గోల్ సమర్పించుకుంది. 18వ నిమిషంలో కూపర్ బర్న్స్ గోల్‌తో ఆస్ట్రేలియా 3–1తో ముందంజ వేసింది. మూడో క్వార్టర్లో దిల్‌ప్రీత్ సింగ్ గోల్‌తో భారత్ ఈ ఆధిక్యాన్ని 2–3కు తగ్గించింది. అనంతరం భారత జట్టు స్కోరును సమం చేసేందుకు ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆ్రస్టేలియా చివరి పది నిమిషాల్లో మూడు పెనాల్టీ కార్నర్లు సంపాదించినా భారత గోల్‌కీపర్ కృషన్ బహదూర్ పాఠక్ నిర్వీర్యం చేశాడు. ఓవరాల్‌గా మ్యాచ్‌లో భారత జట్టుకు నాలుగు పెనాల్టీ కార్నర్లు రాగా ఒక్క దానిని సద్వినియోగం చేసుకుంది. మరోవైపు ఆ్రస్టేలియాకు ఎనిమిది పెనాల్టీ కార్నర్లు రాగా ఆ జట్టు కూడా ఒక్క దానిని లక్ష్యానికి చేర్చింది. ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగడం ద్వారా భారత మాజీ కెప్టెన్, మిడ్‌ఫీల్డర్ మన్‌ప్రీత్ సింగ్ కెరీర్లో 400 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు. మొత్తం తొమ్మిది జట్లు పోటీపడుతున్న 2024–2025 ప్రొ లీగ్‌లో భారత జట్టు 14 మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది. ఐదు మ్యాచ్‌ల్లో గెలిచి, తొమ్మిది మ్యాచ్‌ల్లో ఓడింది. 15 పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. భారత జట్టు తమ చివరి రెండు మ్యాచ్‌లను బెల్జియం జట్టుతో (జూన్ 21న, 22న) ఆడుతుంది. -
ఐపీఎల్లో అట్టర్ ప్లాప్.. కట్ చేస్తే! అక్కడ 11 సిక్స్‌లతో విధ్వంసం
మేజర్ లీగ్ క్రికెట్-2025 సీజన్లో శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం కాలిఫోర్నియా వేదికగా లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 32 పరుగుల తేడాతో శాన్ ఫ్రాన్సిస్కో గెలుపొందింది. 220 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్ 19.5 ఓవర్లలో 187 పరుగులకే ఆలౌటైంది.శాన్ ఫ్రాన్సిస్కో స్టార్ పేసర్లు బార్ట్లెట్, హ్యారీస్ రౌఫ్ తలా నాలుగు వికెట్లు పడగొట్టి నైట్‌రైడర్స్‌ను దెబ్బ తీశారు. నైట్‌రైడర్స్ బ్యాటర్లలో ఉన్ముక్త్ చంద్(53), మాథ్యూ ట్రంప్(41) మినహా మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు.మెక్‌గుర్క్ తుపాన్ ఇన్నింగ్స్..అంతకుముందు బ్యాటింగ్ చేసిన శాన్ ఫ్రాన్సిస్కో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోర్ సాధించింది. యునికార్న్స్ ఇన్నింగ్స్‌లో ఆసీస్ యువ సంచలనం జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్ విధ్వంసం సృష్టించాడు. ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్‌కు వచ్చిన మెక్‌గర్క్ ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు. క్రీజులో ఉన్నంత సేపు బౌండరీల వర్షం కురిపించాడు. మెక్‌గర్క్ కేవలం 38 బంతుల్లోనే 2 ఫోర్లు,11 సిక్స్‌లతో 88 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు ఫిన్ అలెన్(52)హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇక లాస్ ఏంజిల్స్ బౌలర్లలో వాన్ షాల్క్విక్ మూడు వికెట్లు పడగొట్టగా.. అలీఖాన్ రెండు, రస్సెల్, నరైన్ తలా వికెట్ సాధించారు.ఐపీఎల్లో ఫెయిల్..కాగా జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్ ఐపీఎల్-2025 సీజన్లో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున 6 మ్యాచ్‌లు ఆడిన మెక్‌గర్క్.. 9.17 సగటుతో కేవలం 55 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో మిగిలిన మ్యాచ్‌లకు అతడిని జట్టు నుంచి తప్పించారు.Jake Fraser-McGurk's 88 runs earned him the title of Stake Player of the Match today in Oakland. 🔥@stakenewsindia x @StakeIND pic.twitter.com/jP44Of6wrH— Cognizant Major League Cricket (@MLCricket) June 15, 2025 -
భారత్‌కు మళ్లీ పరాజయమే...
అంట్వర్ప్ (బెల్జియం): ప్రత్యర్థులు మారుతున్నా... భారత్ ఫలితాలే మారడం లేదు. అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ లీగ్ యూరోప్ అంచె పోటీల్లో భారత సీనియర్ పురుషుల జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. వరుసలో ఐదో ఓటమిని చవిచూసిన భారత్... మూడో ప్రత్యర్థి చేతిలోనూ చిత్తయ్యింది. నెదర్లాండ్స్, అర్జెంటీనాల చేతిల్లో కంగుతిన్న భారత్... తాజాగా ఆస్ట్రేలియా ధాటికి తలవంచింది. శనివారం ఆసీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 2–3 స్కోరు తేడాతో ఐరోపాలో అలవాటైన అపజయాన్ని మూటగట్టుకుంది. భారత్ తరఫున అభిషేక్ 8, 35వ నిమిషాల్లో రెండు గోల్స్ సాధించాడు. కంగారూ జట్టులో నాథన్ ఎఫ్రామస్ (42వ ని.), జోయెల్ రింటాల (56వ ని.), టామ్ క్రెయిగ్ (60వ ని.) తలా ఒక గోల్ చేశారు.నిజానికి ఈ ప్రొ లీగ్ హాకీలో మెరుగైన స్థానంతోనే నేరుగా వచ్చే ప్రపంచకప్‌కు అర్హత సాధించాలనుకున్న భారత్‌కు వరుస పరాభవ ఫలితాలు శరాఘాతమయ్యాయి. యూరోప్ లెగ్‌లో మొదట నెదర్లాండ్స్‌తో... తర్వాత అర్జెంటీనాతో ఆడిన రెండేసి చొప్పున ఆడిన మ్యాచ్‌ల్లో భారత్ ఓడింది. రెండు క్వార్టర్లు ఆధిక్యంలో ఉన్నా... ఆరంభంలో భారత్ దూకుడు కనబరిచింది. పది నిమిషాల్లోనే ప్రత్యర్థిపై ఆధిక్యత సాధించింది. ఆటగాళ్ల సమన్వయం, డిఫెండర్ల పట్టు... ఇలా ఇన్ని అనుకూలతలున్నప్పటికీ అన్నీ ఆరంభశూరత్వంగానే ఆవిరయ్యాయి. తొలి క్వార్టర్ 8వ నిమిషంలోనే అభిషేక్ గోల్‌తో భారత్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో క్వార్టర్లో మరో గోల్ సాధించలేకపోయినప్పటికీ ఆధిక్యాన్ని కాపాడుకోవడంలో డిఫెండర్లు, స్ట్రయికర్లు సమష్టిగా శ్రమించారు. మూడో క్వార్టర్ మొదలైన ఐదు నిమిషాలకే అభిషేక్ మరో గోల్ భారత్ ఆధిక్యం కాస్తా 2–0కు పెరిగింది. ఇలా దాదాపు 41 నిమిషం దాకా కొనసాగిన భారత ఆధిపత్యానికి ఆ మరుసటి నిమిషంలోనే నాథన్ ఎఫ్రామస్ గండి కొట్టాడు. 2–1తో అప్పటికి మంచిస్థితిలోనే ఉంది. అయితే ఆఖరి క్వార్టర్ కూడా ముగిసే దశలో ఆసీస్‌కు లభించిన రెండు పెనాల్టీ కార్నర్లు భారత్‌ను నిండా ముంచేశాయి. 4 నిమిషాల వ్యవధిలో రింటాల (56వ ని.), క్రెయిగ్ (60వ ని.) పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మలచడంతో భారత్‌కు మరో పరాజయం తప్పలేదు. నేడు ఇదే వేదికపై భారత్... ఆసీస్‌తో రెండో మ్యాచ్ ఆడుతుంది. -
చోకర్స్ కాదు... విన్నర్స్
దాదాపు ఏడాది క్రితం దక్షిణాఫ్రికా జట్టు భారత్‌తో టి20 వరల్డ్ కప్ ఫైనల్లో తలపడింది. 177 పరుగుల లక్ష్య ఛేదనలో ఒక దశలో చేతిలో 6 వికెట్లతో 30 బంతుల్లో 30 పరుగులు చేయాల్సిన స్థితిలో నిలిచింది. ఇక విజయం లాంఛనమే అనిపించగా...చివరకు 7 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. డగౌట్లో కూర్చుకున్న కెప్టెన్ మార్క్రమ్ కన్నీళ్లపర్యంతమైన దృశ్యం దక్షిణాఫ్రికా అభిమానులకు కలచివేసింది. ఇప్పుడు సంవత్సరం తిరగక ముందే అతను సఫారీ ఫ్యాన్స్ దృష్టిలో హీరోగా మారిపోయాడు. ఆస్ట్రేలియా ‘బౌలింగ్ చతుష్టయం’ను ఎదుర్కొని దక్షిణాఫ్రికా 282 పరుగులు సాధించగలదా అనే సందేహాల మధ్య అతను అసాధారణ బ్యాటింగ్‌ను ప్రదర్శించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ‘డకౌట్’ అయినా రెండో ఇన్నింగ్స్‌లో ఎలాంటి అవకాశం ఇవ్వకుండా పట్టుదలగా తన కెరీర్లో అత్యంత విలువైన ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాడు. కెపె్టన్ తెంబా బవుమా విజయగాథ కూడా ఇలాంటిదే. 64 టెస్టుల కెరీర్లో కేవలం 4 సెంచరీలే సాధించిన అతను ప్రతీసారి తీవ్ర విమర్శలే ఎదుర్కొన్నాడు. ‘బ్లాక్ ఆఫ్రికన్’ కాబట్టి టీమ్‌లో చోటు దక్కిందని, రిజర్వేషన్ కారణంగానే కొనసాగుతున్నాడని వ్యాఖ్యలు వినిపిస్తూ వచ్చాయి. తాజా ఘనతతో బవుమా నాయకుడిగా ఆకాశమంత ఎత్తున నిలిచాడు. ఫైనల్‌కు ముందు తన కెపె్టన్సీలో ఆడిన 9 టెస్టుల్లో 8 మ్యాచ్‌లు గెలిపించి ఓటమి ఎరుగని అతను...ఇప్పుడు టీమ్‌ను వరల్డ్ చాంపియన్‌గా నిలిచి పొట్టివాడు అయినా గట్టివాడే అని నిరూపించాడు. మార్క్రమ్, బవుమా 147 పరుగుల భాగస్వామ్యం ఆ్రస్టేలియా ఆట కట్టించేలా చేసింది. డ్రగ్స్ వివాదం నుంచి బయటపడిన రబాడ 9 వికెట్లతో సఫారీ విజయానికి పునాది వేయగా, రెండో ఇన్నింగ్స్‌లో ఇన్‌గిడి తన విలువ చాటాడు. విమర్శలను అధిగమించి... దక్షిణాఫ్రికా జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించినా...ఆ జట్టుపై పెద్దగా అంచనాలు లేవు. ఎదురుగా బలమైన ఆస్ట్రేలియాలాంటి ప్రత్యర్థి ఉండటంతో పాటు టీమ్‌లో అనుభవలేమి స్పష్టంగా కనిపించింది. టాప్–7 బ్యాటర్లతో పాటు ఆల్‌రౌండర్ యాన్సెన్ మొత్తం టెస్టు పరుగులు కలిపినా... ఒక్క స్టీవ్ స్మిత్ సాధించిన పరుగులకంటే తక్కువగా ఉన్నాయి! పైగా స్టార్క్, కమిన్స్, హాజల్‌వుడ్, లయన్ కలిసి ఆసీస్‌కు ఎన్నో అద్భుత విజయాలు అందించారు. అలాంటి బౌలింగ్‌ను ఎదుర్కొని గెలవడం దాదాపు అసాధ్యమని అనిపించింది. అన్నింటికి మించి సఫారీ టీమ్ ఫైనల్‌కు చేరిన క్రమంపై విమర్శలు ఉన్నాయి. 2023–25 డబ్ల్యూటీసీ సైకిల్లో అగ్రశ్రేణి టీమ్‌లైన ఇంగ్లండ్, ఆ్రస్టేలియాలను ఒక్క టెస్టులోనూ ఎదుర్కోని టీమ్... సొంతగడ్డపై భారత్ చేతిలో 55కు ఆలౌటై చిత్తుగా ఓడింది. వెస్టిండీస్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్‌లాంటి బలహీన ప్రత్యర్థులపై (వరుసగా 7 టెస్టులు) గెలిచి ఫైనల్ చేరిందని వ్యాఖ్యలు వచ్చాయి. అయితే ఫైనల్‌కు ముందు ‘అదంతా మా చేతుల్లో లేదు. ఈ ఒక్క మ్యాచ్ గెలిస్తే దానిని ఎవరూ పట్టించుకోరు’ అంటూ స్పష్టంగా చెప్పిన బవుమా దానిని చేసి చూపించాడు. ఆ్రస్టేలియాను ఓడిస్తేనే వరల్డ్ చాంపియన్‌గా భావిస్తాం అనేవారికి సమాధానం ఇచ్చాడు. స్వదేశంలో టి20 లీగ్ కోసం ప్రధాన ఆటగాళ్లతో కాకుండా ద్వితీయ శ్రేణి జట్టును న్యూజిలాండ్ పంపగా 0–2తో టీమ్ చిత్తయింది. అయినా సరే చివరకు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు జట్టు అర్హత సాధించడం విశేషం. ఆనందం దక్కింది... అంతర్జాతీయ క్రికెట్లోకి 1991లో దక్షిణాఫ్రికా పునరాగమనం చేసింది. ఆ తర్వాత 1992 వరల్డ్ కప్ సెమీస్‌లో వర్షం నిబంధనతో ఓడిన జట్టు, 1996లో అన్ని లీగ్‌లు గెలిచి క్వార్టర్స్‌లో అనూహ్యంగా ఓడింది. 1998తో క్రానే, కలిస్, రోడ్స్, బౌచర్‌లతో కూడిన జట్టు తొలి చాంపియన్స్ ట్రోఫీని గెలిచి ఆనందం పంచింది. అయితే ఆ తర్వాతే జట్టు రాత పూర్తిగా మారిపోయింది. గత ఏడాది టి20 వరల్డ్ కప్‌కు ముందు వరకు ఒక్క ఐసీసీ టోర్నీలోనూ ఫైనల్ చేరలేకపోయింది. 1999 సెమీస్‌లో ‘టై’తో గుండె పగలగా, సొంతగడ్డపై 2003లో మళ్లీ వర్షంతో లెక్క తప్పడంతో సెమీస్ కూడా చేరలేకపోయింది. ఆ తర్వాత మూడు సార్లు సెమీస్ వరకు చేరడంలో సఫలమైంది. స్వదేశంలో 2007 టి20 వరల్డ్ కప్‌లో సెమీస్ చేరని జట్టు తర్వాత రెండు సార్లు సెమీస్‌లోనే ఓడింది. చాంపియన్స్ ట్రోఫీలో ఐదు సార్లు సెమీస్‌కే పరిమితమైంది. వేర్వేరు కారణాలతో వచ్చిన ఈ ఓటములతో టీమ్‌లో నైరాశ్యం నెలకొంది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా బోర్డులో రాజకీయాలు, ఆర్థిక సంక్షోభం తదితర కారణాలతో జట్టు ఆటపై కూడా ప్రభావం పడింది. వరుస ఓటములతో టీమ్ వెనుకబడిపోవడంతో ఇతర టీమ్‌ల దృష్టిలో అది ద్వితీయ శ్రేణి జట్టుగా మారిపోయింది. అయితే తాజా విజయం సఫారీ టీమ్‌లో కొత్త ఉత్సాహం తీసుకు రానుంది. 2027 వన్డే వరల్డ్ కప్ కూడా అక్కడే జరగనున్న నేపథ్యంలో ఈ విజయం వారిలో జోష్ నింపడం ఖాయం. -
సూపర్ ‘సఫారీ’
దక్షిణాఫ్రికా సుదీర్ఘ స్వప్నం నెరవేరింది...ఐసీసీ ట్రోఫీ కోసం దాదాపు మూడు దశాబ్దాలుగా పోరాడిన టీమ్ ఎట్టకేలకు ఆ లక్ష్యాన్ని చేరుకుంది...1998లో ఐసీసీ నాకౌట్ కప్ సాధించిన తర్వాత 7 వన్డే వరల్డ్ కప్‌లు, 9 టి20 వరల్డ్ కప్‌లు, 9 చాంపియన్స్ ట్రోఫీలు, 2 వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లు జరగ్గా... ఒక్క సారి కూడా టైటిల్ అందుకునే అవకాశమే రాలేదు... అద్భుతంగా ఆడుతూ వచ్చి అసలు సమయంలో చేతులెత్తేసిన సందర్భాలు కొన్నయితే, అవసరమైన చోట అదృష్టం మొహం చాటేసిన సందర్భాలు మరికొన్ని... ఇప్పుడు ఆ ‘చోకర్స్’ ముద్రను వెనక్కి తోస్తూ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌తో సఫారీ టీమ్ సంబరాలు చేసుకుంది. ఆసక్తికరంగా సాగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆ్రస్టేలియాను చిత్తు చేసి బవుమా సేన సగర్వంగా సత్తా చాటింది. ఐసీసీ టోర్నీ ఫైనల్ అంటే చెలరేగిపోయే ఆసీస్ ఈ సారి మాత్రం బ్యాటింగ్ వైఫల్యంతో తలవంచి నిరాశగా వెనుదిరిగింది.లండన్: వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)లో దక్షిణాఫ్రికా చాంపియన్‌గా నిలిచింది. శనివారం ముగిసిన ఫైనల్లో దక్షిణాఫ్రికా 5 వికెట్ల తేడాతో ఆ్రస్టేలియాపై ఘన విజయం సాధించింది. 282 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓవర్‌నైట్ స్కోరు 213/2తో నాలుగో రోజు ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా 83.4 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఎయిడెన్ మార్క్రమ్ (207 బంతుల్లో 136; 14 ఫోర్లు) దాదాపు చివరి వరకు నిలబడి జట్టును గెలిపించాడు. న్యూజిలాండ్ (2021), ఆ్రస్టేలియా (2023) తర్వాత డబ్ల్యూటీసీ గెలుచుకున్న మూడో టీమ్‌గా దక్షిణాఫ్రికా నిలిచింది. విజేత దక్షిణాఫ్రికాకు రూ. 30.76 కోట్లు ప్రైజ్‌మనీ దక్కింది.27.4 ఓవర్లలో 69 పరుగులు... ఆట ఆరంభంలోనే తెంబా బవుమా (134 బంతుల్లో 66; 5 ఫోర్లు)ను కమిన్స్ అవుట్ చేయగా, కొద్ది సేపటికే స్టబ్స్ (8)ను స్టార్క్ బౌల్డ్ చేశాడు. ఆ సమయంలో దక్షిణాఫ్రికా మరో 41 పరుగులు చేయాల్సి ఉండటంతో కొంత ఉత్కంఠ పెరిగింది. అయితే మరో వైపు మార్క్రమ్ మూడో రోజు తరహాలోనే పట్టుదలగా ఆడుతూ జట్టును గెలుపు దిశగా నడిపించాడు. అతనికి బెడింగ్హామ్ (21 నాటౌట్) అండగా నిలిచాడు. ఎట్టకేలకు కొత్త బంతిని తీసుకున్న వెంటనే తొలి ఓవర్లోనే మార్క్రమ్ను హాజల్‌వుడ్ వెనక్కి పంపించినా...అప్పటికే ఆలస్యమైపోయింది. విజయానికి మరో 5 పరుగులు మాత్రమే కావాల్సి ఉండగా, స్టార్క్ వేసిన బంతిని వెరీన్ కవర్ పాయింట్ దిశగా ఆడి సింగిల్ తీయడంతో సఫారీ శిబిరంలో వేడుక మొదలైంది. స్కోరు వివరాలు: ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 212; దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 138; ఆ్రస్టేలియా రెండో ఇన్నింగ్స్ 207; దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: మార్క్రమ్ (సి) హెడ్ (బి) హాజల్‌వుడ్ 136; రికెల్టన్ (సి) క్యారీ (బి) స్టార్క్ 6; ముల్డర్ (సి) లబుషేన్ (బి) స్టార్క్ 27; బవుమా (సి) క్యారీ (బి) కమిన్స్ 66; స్టబ్స్ (బి) స్టార్క్ 8; బెడింగ్హామ్ (నాటౌట్) 21; వెరీన్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (83.4 ఓవర్లలో 5 వికెట్లకు) 282. వికెట్ల పతనం: 1–9, 2–70, 3–217, 4–241, 5–276. బౌలింగ్: స్టార్క్ 14.4–1–66–3, హాజల్‌వుడ్ 19–2–58–1, కమిన్స్ 17–0–59–1, లయన్ 26–4–66–0, వెబ్‌స్టర్ 5–0–13–0, హెడ్ 2–0–8–0.


