ఆస్ట్రేలియా స్టార్ ఫాస్ట్ బౌలర్ కేన్ రిచర్డ్సన్ 34 ఏళ్ల వయసులోనే ప్రొఫెషనల్ క్రికెట్‌కి వీడ్కోలు పలికాడు. 2008-09 సీజన్‌లో లిస్ట్-ఏ మ్యాచ్‌తో తన ప్రయాణాన్ని ప్రారంభించిన రిచర్డ్సన్, 2013లో శ్రీలంకతో జరిగిన వన్డేతో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.
అప్పటి నుండి 25 వన్డేలు, 36 టీ20లు ఆడి మొత్తంగా 84 వికెట్లు పడగొట్టాడు. 2021లో ఆస్ట్రేలియా తమ తొలి టీ20 వరల్డ్‌కప్ టైటిల్ సాధించడంతో రిచర్డ్సన్ భాగస్వామ్యం ప్రత్యేకంగా గుర్తించదగ్గది.
అంతర్జాతీయ క్రికెట్‌తో పోలిస్తే రిచర్డ్సన్‌కు బిగ్‌బాష్ లీగ్‌లో ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. ఈ లీగ్ ప్రతి ఎడిషన్‌లోనూ ఆడిన అతి తక్కువ మంది (అరుగురు) ఆటగాళ్లలో రిచర్డ్సన్ ఒకరు.

మొదట ఆడిలైడ్ స్ట్రైకర్స్ తరఫున ఆరు సీజన్లు ఆడిన ఆయన, 2017-18లో మెల్‌బోర్న్ రెనెగేడ్స్‌కి మారి ఎనిమిది సీజన్లు ఆ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.
చివరిగా 2025-26 సీజన్‌లో సిడ్నీ సిక్సర్స్ తరఫున ఆడాడు. బీబీఎల్ కెరీర్‌లో 142 వికెట్లు తీసిన రిచర్డ్సన్.. లీగ్ చరిత్రలో ఐదో అత్యధిక వికెట్ టేకర్‌గా నిలిచాడు.
రిచర్డ్సన్ ఆస్ట్రేలియా జాతీయ జట్టు, బిగ్‌బాష్ లీగ్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక ఫ్రాంచైజీ లీగ్‌ల్లో ఆడాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లోనూ ఆయన తన ప్రతిభను (15 మ్యాచ్‌ల్లో 19 వికెట్లు) చూపించాడు. డెత్ ఓవర్లలో తన వేరియేషన్స్‌తో ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టే బౌలర్‌గా రిచర్డ్సన్‌కు మంచి గుర్తింపు ఉంది.


