అండర్-19 ప్రపంచకప్ టోర్నీ-2026లో భారత జట్టు చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ జోరు కొనసాగిస్తున్నాడు. తొలి మ్యాచ్‌లో భాగంగా యూఏఈపై రెండు పరుగులే చేసి విఫలమైన ఈ లెఫ్టాండర్.. ఆ తర్వాత బంగ్లాదేశ్‌తో మ్యాచ్ (72)తో ఫామ్‌లోకి వచ్చాడు.
తొలుత బ్యాటింగ్
చివరగా న్యూజిలాండ్‌పై 23 బంతుల్లో 40 పరుగులు చేసిన వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi).. తాజాగా జింబాబ్వేపై ప్రతాపం చూపాడు. బులవాయో వేదికగా మంగళవారం నాటి వన్డేలో టాస్ ఓడిన భారత్... ఆతిథ్య జింబాబ్వే ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగింది.
వైభవ్ ధనాధన్
ఈ క్రమంలో భారత ఓపెనర్లు ఆరోన్ జార్జ్, వైభవ్ సూర్యవంశీ దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించారు. అయితే, ఆరోన్ 16 బంతుల్లో 23 పరుగులు చేసి జోరు మీదున్న వేళ జింబాబ్వే పేసర్ పనాషే మజాయ్ షాకిచ్చాడు. అతడి బౌలింగ్‌లో షాట్ బాదే క్రమంలో ఆరోన్.. సింబరెషెకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
దీంతో వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ ఆయుశ్ మాత్రేతో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యతను వైభవ్ సూర్యవంశీ తీసుకున్నాడు. ఈ క్రమంలో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో.. కేవలం 24 బంతుల్లోనే యాభై పరుగులు పూర్తి చేసుకున్నాడు ఈ పద్నాలుగేళ్ల బ్యాటర్.
52 పరుగులు చేసి
మొత్తంగా 30 బంతులు ఎదుర్కొన్న వైభవ్ సూర్యవంశీ.. 52 పరుగులు చేసి నిష్క్రమించాడు. టటెండ చిముగొరొ బౌలింగ్‌లో సింబరెషెకు క్యాచ్ ఇచ్చి మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. కాగా ఆయుశ్ మాత్రే (21) రూపంలో జింబాబ్వే రెండో వికెట్ దక్కించుకుంది. కాగా ఇప్పటికే ఆడిన మూడు మ్యాచ్‌లలో విజయాలు సాధించిన భారత్‌కు.. సూపర్ సిక్స్ దశలో ఇదే తొలి మ్యాచ్.
తుదిజట్లు
భారత్
ఆరోన్ జార్జ్, వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రే (కెప్టెన్), విహాన్ మల్హోత్రా, అభిజ్ఞాన్ కుందు (వికెట్ కీపర్), వేదాంత్ త్రివేది, కనిష్క్ చౌహాన్, ఆర్ఎస్ అంబరీష్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, ఉద్ధవ్ మోహన్.
జింబాబ్వే
నథానియల్ హ్లబంగానా (వికెట్ కీపర్), టకుడ్జ్వా మకోని, కియాన్ బ్లిగ్నాట్, వెబ్‌స్టర్ మధిధి, ధ్రువ్ పటేల్, లీరోయ్ చివౌలా, సింబరెషె మడ్జెంగెరెరే (కెప్టెన్), బ్రాండన్ సెంజెర్, మైఖేల్ బ్లిగ్నాట్, టాటెండ చిముగోరో, పనాషే మజాయ్.
చదవండి: ICC: ఇదేం ట్విస్టు!.. పాక్ అవుట్.. బంగ్లాదేశ్‌కు ఛాన్స్!
𝙒𝙞𝙙𝙩𝙝 𝙤𝙣 𝙤𝙛𝙛𝙚𝙧, & Vaibhav Sooryavanshi accepted it with interest! 🤌
Team India are off to a flying start💥#ICCMensU19WC | #INDvZIM 👉 LIVE NOW ➡️ https://t.co/ty11gF03Wh pic.twitter.com/tEXWCDWeuA— Star Sports (@StarSportsIndia) January 27, 2026


