ఫిట్‌నెస్‌ అంటే సిక్స్‌ ప్యాక్‌ కాదు..ఆ సామర్థ్యం పొందడమే! | Fitness is not about six-pack abs: Milind Soman | Sakshi
Sakshi News home page

ఫిట్‌నెస్‌ అంటే సిక్స్‌ ప్యాక్‌ కాదు..ఆ సామర్థ్యం పొందడమే!: మిలింద్‌ సోమన్‌

Mar 11 2026 1:12 PM | Updated on Mar 11 2026 1:26 PM

Fitness is not about six-pack abs: Milind Soman

భారతదేశంలో గ్లామర్‌ రంగంలో ఉంటూ ఫిట్‌నెస్‌లో గట్టి ప్రభావం చూపిన కొద్దిమంది వ్యక్తులలో మిలింద్‌ సోమన్‌ ఒకరు. సాధారణంగా ప్రతీ ఒక్కరూ రిటైర్‌ మెంట్‌ తీసుకునే 60 సంవత్సరాల వయస్సులో ఆయన  యువ తరానికి గొప్ప ప్రేరణగా మారాడు. కానీ, సోమన్‌ తనను తాను ప్రేరణగా భావించుకోడు, అది మన చుట్టూ ఎప్పటి నుంచో ఉన్నదని గమనించడంలోనే తేడా ఉందని అంటాడు. తాను ఎవరినీ ఉద్దేశపూర్వకంగా ప్రేరేపించలేదని ఆయన అంటున్నాడు. అయితే కొందరైనా ప్రేరణ పొందినందుకు తనకు సంతోషంగా ఉందన్నాడు.  

మిళింద్‌ సోమన్‌ 1990లలో సూపర్‌ మోడల్‌గా నిలిచాడు. ఆ తర్వాత జుర్మ్, ఫోర్‌ మోర్‌ షాట్స్‌ ప్లీజ్,, డిసెంబర్‌ 16, ఎమర్జెన్సీ వంటి  చిత్రాలు  సిరీస్‌లలో నటించడం ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. వీటికి అదనంగా, అతను రన్నింగ్‌ ట్రాక్‌పై తనకు సాటిలేని స్థానాన్ని కూడా సుస్థిరం చేసుకున్నాడు  సుదూర ప్రాంతాలు, కఠినమైన భూభాగాలు  అసాధ్యమైన పరిస్థితులను పరుగుతో కవర్‌ చేశాడు.

మనం మహిళలకు మాత్రమే ఒక ప్రత్యేక ఫిట్‌నెస్‌ ఈవెంట్‌ను సృష్టిస్తే? ఈ ప్రశ్నకు సమాధానంగా గత 2012లో, సోమన్‌  ఆయన భార్య అంకితా కోన్వర్‌లు కలిసి పింక్‌థాన్‌ను స్థాపించారు ఇప్పుడు ఆ ఈవెంట్‌  భారతదేశంలోనే అతిపెద్ద మహిళల పరుగు కార్యక్రమంగా అవతరించింది. ఈ సందర్భంగా ఆయన ఇటీవల మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలు అనుభవాలు పంచుకున్నారు.

చాలా మంది కండలు తిరిగిన శరీరం అనుకుంటారని అయితే తన దృష్టిలో ఫిట్‌నెస్‌ అంటే అది ఒత్తిడిని ఎదుర్కోగల సామర్థ్యం అని ఆయన పేర్కొంటాడు.  శారీరక ఒత్తిడి, మానసిక ఒత్తిడి, భావోద్వేగ ఒత్తిడి... వీటిని ఎంత బాగా ఎదుర్కోగలిగితే, జీవితం అంత మెరుగ్గా ఉంటుందని ఆయన స్పష్టం చేస్తున్నాడు.  ఇది సిక్స్‌ ప్యాక్స్‌ లేదా బైసెప్స్‌ గురించి అవి అందించే  లుక్స్‌ గురించి కాదు. ఇది మన శరీరపు పనితీరు గురించి అని విశ్లేషిస్తున్నాడు.

తాను దాదాపు 25 సంవత్సరాల క్రితమే పరుగు ప్రారంభించానని,  కొంత కాలం తర్వాత చాలా మంది పరుగు ప్రారంభించారని, అలాగే కేవలం ముంబైలో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా పరుగు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని గమనించానన్నాడు. అయితే  మహిళల భాగస్వామ్యం 4–5 శాతం మించి ఉండడం లేని పరిస్థితిలో.. మనం మహిళలకు మాత్రమే ఒక ఈవెంట్‌ను సృష్టించాలని ఆలోచించానన్నాడు. అయితే వారు స్పందిస్తారా?అని తొలిదశలో సందేహించానన్నాడు.  ఎందుకంటే చాలా మంది మహిళలు ఇప్పటికీ వ్యాయామం  క్రీడలు అంటే పురుషుల కోసమే అని భావిస్తున్నారని..అయితే మేం ధైర్యంగా ముందడుగు వేశామన్నాడు.  

చీర ధరించి పరుగులు తీయడం, చీర ధరించి సైక్లింగ్‌ చేయడం, యోగా నడక...వంటివన్నీమేళవించి.. ఈ కార్యక్రమం తన కోసం కాదని ఏ మహిళా భావించకుండా దీనిలో భాగం చేశామని వివరించాడు. మహిళలు  ఎవరికోసమో లేదా బయటి దానికోసమో కాదు, తమ కోసం తాము పరుగు తీయడమే ఈ కార్యక్రమ లక్ష్యమన్నాడు.

(చదవండి: ఆపిల్ వాచ్ ధరిస్తున్నారా..? పోషకాహార నిపుణుల స్ట్రాంగ్‌ వార్నింగ్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement