breaking news
Health Tips
-
ఊపిరితిత్తుల కేన్సర్‌కి విలన్..జస్ట్ స్మోకింగ్ మాత్రమే కాదు..!
ఊపిరితిత్తుల కేన్సర్ ఎందువల్ల వస్తుదంటే...అందరూ చెప్పేది బీడి,చుట్ట సిగరెట్ల వల్ల అనే ఠక్కున చెప్పేస్తారు. కానీ అదొక్కటే కారణం కాదని శాస్త్రవేత్తలు నొక్కి చెబుతున్నారు. మనచుట్టూ ఉన్న పరిసరాలే ప్రధాన ముప్పుగా పరిణమిస్తునన్నాయిని హెచ్చరిస్తున్నారు. మరి అదెలాగో సవివరింగా తెలుసుకుందాం. నిజానికి ఇటీవల కాలంలో పట్టణ ప్రాంతాల్లో ధూమపానం చేయని వారి సంఖ్య పెరుగుతున్నప్పటికీ చాలామంది ఈ మహమ్మారిని బాధపడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. కనీసం సిగరెట్ వాసన కూడా చూడని వారిలో కూడా పీఎం2.5గా పిలిచే కణాలు ఊపిరితిత్తుల్లోనూ, రక్తప్రవాహంలో ప్రవహించి కణాలను దెబ్బతీసి, ఊపిరితిత్తుల కేన్సర్‌కు దారితీసే ఉత్పరివర్తనాలను ప్రేరేపిస్తాయని చెబుతున్నారు. ఇది కేవలం నగరాల్లోనూ కాదు గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితని చెబుతున్నారు. ఎందుకంటే..డీజిల్, పంట అవశేషాలను కాల్చడం వల్ల ఈ మహమ్మారి బారిన పడుతున్నట్లు అధ్యయనాల్లో తేలింది. అదీగాక గ్రామీణ ప్రాంతాల్లో కట్టెల పొయ్యిమీద వంట చేస్తారు. దాన్నుంచి వచ్చే పొగ, ఒకవేళ కిచెన్‌లో సరైన వెంటిలేషన్ లేకపోతే.. ఆ పొగాకు ఎక్కువసేపు గురవ్వాల్సి వస్తుంది. ఫలితంగా ఊపిరితిత్తుల కేన్సర్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు నిపుణులు. అలాగే రాడాన్ వాయువు, సహజంగా సంభవించే రేడియో ధార్మిక వాయువుకి ఎక్కువ ఎక్స్పోజ్ అయినా..ఈ వ్యాధి బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు. అలాగే మైనింగ్, సిలికా దుమ్మ లేదా డీజిల్‌తో నడిచే కర్మాగారాల్లో వర్క్‌చేసే వ్యక్తులు ఈ వ్యాధి బారిన పడుతుంటారని చెప్పుకొచ్చారు. ధూమపానం చేయనివారు ఎందుకు సేఫ్‌గా లేరు...ధూమపానం చేయనివారిలో, ముఖ్యంగా యువకులు, మహిళల్లో ఊపిరితిత్తుల కేన్సర్ ఉపరకం అయినా అడెనోకార్సినోమా పెరుగుదల ఉన్నట్లు గుర్తించారు. అలాగే పర్యావరణం తోపాటు జన్యుపరమైన కారకాలు కూడా పెద్దపాత్ర పోషిస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా వాయకాలుష్యం, జీవనశైలి, ఆహారపు అలవాట్లు ఈ ప్రమాదాన్ని మరింత పెంచుతాయని చెబుతున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు..రోజువారీ AQI (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్) స్థాయిలను పర్యవేక్షించడంకాలుష్యం ఎక్కువగా ఉన్న రోజుల్లో, బహిరంగ కార్యకలాపాలను పరిమితం చేయడంట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో కిటికీలు మూసి ఉంచడం.ఎగ్జాస్ట్ ఫ్యాన్లు, ఎయిర్ ప్యూరిఫైయర్లు లేదా సహజంగా గాలిని ఫిల్టర్ చేసే పీస్ లిల్లీస్, స్పైడర్ ప్లాంట్లు వంటి మొక్కలను ఉపయోగించండి.పొగ రహిత గృహాలు, కార్యాలయాల ఉండేలా మెయింటైన్ చేయడంవర్కింగ్లో దుమ్ము లేదా రసాయనాలకు గురికాకుండా ఉండటం. చెట్ల పెంపకానికి ప్రాధాన్యత ఇవ్వడం.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. మెరుగైన ఫలితాల కోసం వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: బెడ్‌షీట్స్ మార్చి ఎంత కాలమైంది?) -
హెల్త్ మాట 'వింటరు' కదా..?
చలికాలంలో కొన్ని ఆరోగ్య సమస్యలు సాధారణంగా కాస్తంత ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఉదాహరణకు ఈ సీజన్లో కీళ్లకు సంబంధించిన నొప్పులు పెరుగుతుంటాయి. కండరాల నొప్పులు కనిపిస్తుంటాయి. ఇక ఒళ్లంతా పగుళ్లతో, ముఖం, పెదవులూ, మడమలపై పగుళ్లు కనిపిస్తూ బాధిస్తుంటాయి. ఇలా చర్మసంబంధిత సమస్యలూ వస్తాయి. ఇక వైరస్ల వ్యాప్తికి అనువైన కాలం కావడంతో జలుబుతో ముక్కుకారడం, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు పెరగడమూ కనిపిస్తుంది. ఈ చలికాలంలో కనిపించే సాధారణసమస్యలూ, వాటి పరిష్కారాలకుఅనుసరించాల్సిన సూచనలేమిటో చూద్దాం...చలికాలంలో అన్నిటికంటే ఎక్కువగా బాధించే సమస్య కండరాలూ, కీళ్లనొప్పులు. పైగామామూలుగానే ఈ సమస్యతో బాధపడేవాళ్లలో ఈ సీజన్లో ఆ బాధలు కాస్తంత ఎక్కువగా బాధిస్తూ వేధిస్తాయి. అందుకు కారణాలేమిటో తెలుసుకుందాం.చలికాలంలో కండరాలూ, కీళ్లనొప్పులు పెరగడం ఎందుకంటే... ఈ సీజన్లో చలివల్ల చర్మం చాలా త్వరగా తన వేడిని కోల్పోతుంది. దాంతో చర్మం పైభాగంలో ఉండే రక్తనాళాలు కొద్దిగా కుంచించుకు΄ోతాయి. ఇలా కుంచించుకుపోవడాన్ని ‘వాసో కన్‌స్ట్రిక్షన్’ అంటారు. ఇలా కుంచించుకు΄ోవడంతో ఆ ప్రాంతాలకు రక్తప్రసరణ కూడా కాస్త తగ్గుతుంది. దాంతో చర్మంలోని నొప్పిని గ్రహించే భాగాలైన ‘పెయిన్ సెన్సార్స్’ మరింత ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది. ఈ పెయిన్ సెన్సర్స్ ఈ సీజన్లో ఇంకాస్త చురుగ్గా పనిచేయాల్సిరావడంతో చిన్న దెబ్బకే ఎక్కువ నొప్పి తెలుస్తుంటుంది. అందుకే చలికాలంలో ఒంటికి గాయాలైతే... దెబ్బ చిన్నదే అయినా, నొప్పి తీవ్రత మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఈ సీజన్లో కండరాలూ, కీళ్ల నొప్పులు పెరగడానికి దోహదం చేసే ఒక అంశం. ఇక మరో అంశమేమిటంటే... చాలామందిలో ఈ సీజన్లో నొప్పిని భరించే సామర్థ్యం (పెయిన్ టాలరెన్స్) తగ్గుతుంది. అందుకే బాధితులు మామూలు రోజుల్లోని నొప్పులూ కూడా ఈ కాలంలో మరింత పెరిగినట్లుగా అనిపిస్తాయి. ఈ సీజన్లో చలికి కీళ్లు బిగుసుకు΄ోతుంటాయి. దాంతో వాటిలో మామూలుగా ఉండాల్సిన కదలికలు కూడా బాగా తగ్గిపోతాయి. కీళ్లలో ఈ కదలికల తగ్గుదల కారణంగా మన రోజువారీ కార్యకలాపాల్లో భాగంగా చేసే ఒళ్లు కదల్చడం, నడక వంటివి తగ్గిపోవడంతో దేహానికి ఒనగూరే వ్యాయామమూ, శారీరక శ్రమ కూడా తగ్గుతాయి. ఈ కారణం చేత కూడా కీళ్ల నొప్పులు బాగా పెరిగిపోతాయి. సాధారణంగా ఎముకలకు అందాల్సిన పోషకాలు దేహపు కదలికల వల్లనే వాటికి అందుతుంటాయి. ఈ కదలికలు తగినంతగా లేక΄ోవడంతో కీళ్లూ, ఎముకలకు అందాల్సిన పోషకాలూ సరిగా అందవు. మామూలుగా ఇతర సీజన్లలో కంటే... వింటర్ సీజన్లో సూర్యుడు చాలా తక్కువ సేపు మాత్రమే ప్రకాశిస్తూ ఉంటాడు. అందుకే చలికాలంలో పగటి నిడివి బాగా తక్కువగా ఉండటం మనందరికీ తెలిసిన విషయమే. ఫలితంగా మన దేహాలు, చర్మం సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అయ్యే వ్యవధి కూడా తగ్గుతుంది. అందుకే ఈ సీజన్లో మన ఎముకలకు అవసరమైన విటమిన్–డి పాళ్లూ తగ్గుతాయి. అంతేకాదు... ఈ కారణం వల్ల మరో అనర్థమూ పొంచి ఉంటుంది. అదేమిటంటే... ఏవైనా కారణాలతో ఈ సీజన్లో ఎముకలు ఫ్రాక్చర్ అయితే అవి అతుక్కోడానికి పట్టే వ్యవధి మిగతా కాలాలలో ΄ోలిస్తే ఈ సీజన్లో మరింత ఎక్కువగా ఉంటుంది.ఒళ్లూ, కండరాల నొప్పులు తగ్గుదల కోసం ఇవీ కొన్ని పరిష్కారాలూ, సూచనలుఈ సీజన్లో వీలైనంత మేరకు గాయాల΄ాలు కాకుండా అలాగే వాహనాలు నడిపేటప్పుడు లేదా వ్యాయామాల సమయంలో దెబ్బలు తగలకుండా తమను తాము జాగ్రత్తగా రక్షించుకోవాలి. ఆరుబయట నడుస్తున్నప్పుడు తాకుడురాళ్లు / ఎదుర్రాళ్లు తగలకుండా పాదం అంతా కప్పి ఉంచేలా మంచి షూస్ ధరించాలి. వేళ్లు బయటకు కనపడేలా ఉండే పూర్తిగా కవర్ చేయని చెప్పులూ, స్లిప్పర్స్ ధరించినప్పుడు కాలివేళ్లకు ఎదుర్రాయి తగిలి, చిన్న దెబ్బ తగిలినా, జివ్వుమనడం, చాలా బాధగా అనిపించడం, నొప్పి బాగా తెలుస్తుండటం జరుగుతుంది. షూస్ వల్ల కాళ్ల నుంచి వేడిమి కోల్పోకుండా ఉండటంతోపాటు, పాదాలకూ, కాలివేళ్ల చివరలకు పూర్తి రక్షణ కలుగుతుంది. అలాగే... వ్యాయామం చేస్తున్నప్పుడు మోకాళ్లకు ధరించే నీ–ప్యాడ్స్, నీ క్యాప్స్ వంటివి ధరించడం వల్ల గాయాలను / దెబ్బలను వీలైనంతగా నివారించుకోవచ్చు. ఆరుబయట చలిగా ఉన్నప్పుడు దేహానికి తగినంత వేడిని ఇచ్చేలా ఫుల్ స్లీవ్స్ ఉండే దుస్తులూ, ఊలు దుస్తులూ, ఉన్ని దుస్తుల వంటివి ధరించాలి. ఇవి దేహం నుంచి ఉష్ణోగ్రత బయటకు వెళ్లనివ్వకుండా దేహం వెచ్చగా ఉండేలా చూస్తాయి. అలాగే చేతులకు గ్లౌవ్స్ వేసుకోవడం, కాళ్లకు సాక్స్ ధరించడం వంటి జాగ్రత్తలూ మేలు చేస్తాయి. ఆర్థరైటిస్ నొప్పులతో బాధపడేవారు మోకాళ్లు, మోచేతుల వద్ద మరింత మందంగా ఉండే దుస్తులు వేసుకోవడం మంచిది. ఈ సీజన్లో ఆరుబయట కాకుండా వీలైనంత మేరకు ఇన్డోర్ ఎక్సర్సైజ్లు చేయాలి. ఈ వ్యాయామాల ఫలితంగా ఈ సీజన్లో మామూలుగానే కాస్తంత మందకొడిగా జరిగే రక్త సరఫరా ఉత్తేజితమై నార్మల్ స్థాయికి వస్తుంది. దాంతో నొప్పిని తెలిపే సెన్సర్స్ కూడా మామూలుగానే పనిచేస్తాయి. ఫలితంగా నొప్పి తగ్గుతుంది. చాలామంది చలి కారణంగా నీళ్లు తక్కువగా తాగుతుంటారు. కాఫీ, టీ వంటి పానియాలను ఎక్కువగా తాగుతారు. దళసరిగా ఉండే మందపాటి దుస్తులు, స్వెటర్లు ధరిస్తారు. దాంతో మనకు తెలియకుండానే చెమట రూపంలో నీటిని కోల్పోతాం. వాటిని భర్తీ చేసేంతగా నీళ్లు తాగం. ఇలా నీరు తక్కువ తాగడం, చెమట కారణంగా మనకు తెలియకుండానే దేహం డీహైడ్రేషన్‌కు లోనయ్యే ముప్పు పొంచి ఉంటుంది. ఈ కారణాలన్నింటి వల్ల శరీరంలో నీళ్లు, లవణాల మోతాదులు బాగా తగ్గి΄ోతాయి. అందుకే ఈ సీజన్లో తరచూ నీళ్లు తాగుతూ డీహైడ్రేషన్‌కు లోనుకాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. డాక్టర్లు విటమిన్–డి సప్లిమెంట్స్ వాడాలని సూచించినవారు ఆ మేరకు వాటిని వాడాలి. సాధారణంగా ఆస్టియో ఆర్థరైటిస్ బాధితులకు ఈ సీజన్లో వారి నొప్పుల బాధలు మరింత పెరుగుతాయి. అందుకే ఆస్టియో ఆర్థరైటిస్ బాధితులు ఈ సీజన్లో తమ డాక్టర్ సలహా మేరకు విటమిన్–డి సప్లిమెంట్లు తప్పక వాడాల్సిందే. చలికాలంలో ఈ సూచనలూ, జాగ్రత్తలతో కీళ్ల, కండరాల నొప్పులను చాలావరకు నివారించుకోవచ్చు. తమ ఒళ్లునొప్పుల వంటి బాధల నుంచి చాలావరకు రక్షణ పొందవచ్చు. ఈ సూచనలు పాటించాక కూడా కండరాల నొప్పులూ, కీళ్ల నొప్పులూ, ఒళ్లునొప్పులూ తగ్గకపోతే ఒకసారి డాక్టర్‌ను కలిసి తగిన పరీక్షలు, వాటి ఫలితాలను బట్టి తగిన చికిత్స తీసుకోవడం చాలా అవసరం.జలుబులూ... ఇతర వైరల్ జ్వరాలు మనలో జలుబు రావడానికి రెండువందల రకాలకు వైరస్లు కారణమవుతాయి. ఈ రెండు వందలకు పైగా వైరస్‌లనూ, వాటిలో కనిపించే కొన్ని సమాన లక్షణాలను బట్టి గ్రూపులుగా విభజిస్తే... అందులో ఆరు రకాల గ్రూపులతో జలుబు వస్తుంటుందన్నది వైద్య నిపుణుల మాట. ఆ వైరస్లు ఏమిటంటే... 1) ఇన్ఫ్లుయెంజా, 2) పారాఇన్‌ఫ్లుయెంజా, 3) రైనోవైరస్, 4) ఎడినో వైరస్, 5) హ్యూమన్ రెస్పిరేటరీ నిన్సీషియల్ వైరస్ 6) బీఎఫ్–7 వేరియెంట్ అనేవి. గత కొన్నేళ్ల కిందట ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరినీ బాధించిన కరోనా వైరస్ కూడా ఈ బీఎఫ్ వేరియెంట్ కిందకే వస్తుంది. కాక΄ోతే ఇప్పుడు కరోనా వైరస్ మునపటి తీవ్రత కోల్పోయిన కారణంగా అప్పుడప్పుడు అక్కడక్కడా కనిపిస్తున్నప్పటికీ జలుబులో ఉండే మామూలు లక్షణాలనే ప్రదర్శిస్తోంది. లక్షణాలు... జలుబు వచ్చినప్పుడు కొద్దిపాటి జ్వరం, ఒళ్లునొప్పులు, తలనొప్పి, గొంతునొప్పి, గొంతులో గరగర, ముక్కు నుంచి లేదా ముక్కుతోపాటు కళ్ల నుంచి నీరు కారుతుండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా వైరస్ సోకిన 5 నుంచి 7 రోజుల్లో ఈ లక్షణాలన్నీ తగ్గి΄ోతాయి. అయితే అరుదుగా కొన్ని సార్లు మాత్రం ఈ వైరస్లు ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించి నిమోనియా అనే ప్రమాకరమైన కండిషన్‌కు కారణమవుతాయి. మామూలు నిమోనియాతో పోలిస్తే... ఇలా ఒక వైరస్ కారణంగా వచ్చే సెకండరీ నిమోనియా మరింత ప్రమాదకారిగా పరిణమిస్తుంది. జలుబుగానీ లేదా ఇతరత్రా వైరస్ల వల్లగానీ సమస్య శ్వాసవ్యవస్థలోని పైభాగంలో అంటే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్‌లో ఉంటే... అది చాలావరకు దానంతట అదే తగ్గిపోతుంది. కానీ ఒకవేళ పైన పేర్కొన్న వైరస్లు శ్వాస వ్యవస్థలో మరికాస్త లోతుకు వెళ్లి... అక్కడి కింది భాగాలకు అంటే... లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ వరకు వ్యాపిస్తే అది నిమోనియాకు దారితీస్తుంది. అప్పుడు సమస్య ఇంకాస్త తీవ్రమవుతుంది. కొన్నిసార్లు ముక్కు, శ్వాసకోశ వ్యవస్థల్లోని సన్నని ఎపిథీలియల్ పొర దెబ్బతినడం వల్ల అక్కడికి బ్యాక్టీరియా చేరి సైనుసైటిస్, ఫ్యారింజైటిస్ వంటి ఇతర సమస్యలూ వచ్చే అవకాశాలూ ఉంటాయి. నివారణ... మంచి పుష్టికరమైన సమతుల ఆహారం తీసుకుంటూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఈ సీజన్లో ద్రవాహారాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఈ జాగ్రత్తల వల్ల వ్యాధి నిరోధకశక్తి పెరిగి ఇమ్యూన్ వ్యవస్థ మరింత బలోపేతమవుతుంది. దీనివల్ల జలుబుతోపాటు... ఇతరత్రా జబ్బులనుంచీ దేహానికి మంచి రక్షణ దొరుకుతుంది జలుబు వచ్చినవారు నేరుగా ఇతర వ్యక్తులపై తుమ్మడం, దగ్గడం చేయకూడదు. తుమ్మే సమయంలో లేదా దగ్గేటప్పుడు చేతిరుమాళ్లు, టిష్యుపేపర్లు వంటివాటిని అడ్డు పెట్టుకోవడం అవసరం. అవి లేనప్పుడు కనీసం మోచేతి మడతలో తుమ్మడం, దగ్గడం చేయాలి. ఇక తరచూ చేతులు కడుక్కోవడం లేదా శానిటైజ్ చేసుకోవడం, ఇతరులనుంచి భౌతిక దూరాన్ని పాటించడం, గుంపుల్లోకి (క్రౌడ్స్‌లోకి) వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవడం వంటి జాగ్రత్తలతో ఈ సీజన్లో జలుబు మాత్రమే కాకుండా అనేక ఇతర వైరస్ల కారణంగా వచ్చే వైరస్ జబ్బులను నివారించుకోవచ్చు. ఆస్తమా వంటి సీజనల్ సమస్యలు...ఇక ఈ సీజన్‌లోని చలి వాతావరణంలో ఆస్తమా వంటి సీజనల్ సమస్యలూ పెచ్చరిల్లుతాయి. మందకొడి వాతావరణంలోని అలర్జెన్స్ వల్ల ఊపిరితిత్తుల్లోకి గాలి తీసుకుపోయే గాలిగొట్టాలు కుంచించుకుపోవడం వల్ల ఈ సమస్య కనిపిస్తుంది. అందుకే ఈ సీజన్లో మనకు సరిపడని అలర్జెన్స్నుంచి దూరంగా ఉంటూ ఆస్తమా వంటి ఊపిరితిత్తుల సమస్యను నివారించుకోవాలి. తమకు ఈ సమస్య ఉందని తెలిసినవారు ఇన్హేలర్స్ వంటి ఫస్ట్‌లైన్ చికిత్సలతో సమస్య తీవ్రతరం కాకుండా నివారించుకోవాలి. అప్పటికీ తగ్గక΄ోతే డాక్టర్‌ను సంప్రదించి... ఊపిరితిత్తుల్లోని గాలిగొట్టాలను వెడల్పు చేసే బ్రాంకోడయలేటర్ల వంటి మందులు, ఇన్హేలర్లు వాడటం మంచిది.చికిత్స:జలుబు లేదా జలుబు వంటి వైరస్‌లతో వచ్చే సమస్యలన్నీ తమంతట తామే (సెల్ఫ్ లిమిటింగ్) సమస్యలు. వీటికి చికిత్స అందుబాటులో లేదు. కేవలం ఉపశమనం కోసమే లక్షణాలను బట్టి (సింప్టమ్యాటిక్ ట్రీట్మెంట్గా) కొన్ని మందులు ఇస్తుంటారు. లక్షణాలను తగ్గించడం కోసం జ్వరానికి పారాసిటమాల్, ముక్కులు పట్టేసినప్పుడు నాసల్ డీ–కంజెస్టెంట్స్ వంటి వాటిని డాక్టర్లు సూచిస్తారు. వాటితో తగినంత ఉపశమనం కలుగుతుంది.గొంతునొప్పి, గొంతులో గరగర ఉన్నవారు లోజెంజెస్ వాడవచ్చు. అలాగే గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి గరగరా పుక్కిలించడం (థ్రోట్ గార్గలింగ్) చేయవచ్చు.జలుబు, దాని వల్ల వచ్చే జ్వరం తగ్గిపోయాక కూడా చాలామందిలో నీరసం, నిస్సత్తువ, అలసట వంటివి కనిపిస్తూ ఉంటాయి. దాన్నే పోస్ట్ పైరెక్సియల్ డెబిలిటీ’ అంటారు. ఇది తగ్గడానికి అన్ని రకాల పోషకాలు పుష్కలంగా ఉండే పుష్టికరమైన సమతులాహారం; జింక్ వంటి న్యూట్రియెంట్స్‌తోపాటు విటమిన్–సి పుష్కలంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి.చల్లగా ఉండే వాతావరణం కారణంగా చాలామంది చలికాలంలో ఎక్కువగా నీళ్లు తాగరు. జలుబు చేసినప్పుడు నీళ్లు, ద్రవాహారాలు ఎక్కువగా తీసుకోవాలి. దాంతో వ్యాధినిరోధక శక్తి పెరిగి... దేహానికి జలుబును ఎదుర్కొనే సామర్థ్యం కలుగుతుంది.డాక్టర్ వెంకట్ నాని కుమార్ .బి, సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్నల్ మెడిసిన్ (చదవండి: పెళ్లిపై నటి జయ బచ్చన్ సంచలన వ్యాఖ్యలు..! అది పాతబడిన వ్యవస్థ) -
చలికాలంలో వేధించే గొంతు గరగర, దగ్గు తగ్గాలంటే..!
-
వణికించే చలి...వేడినీటితో స్నానం... ఎవరు చేయవచ్చు? ఎవరు చేయకూడదు?
శీతాకాలంలో, చాలా మంది వెచ్చని నీటితో స్నానం చేయడానికి ఇష్టపడతారు,ఎందుకంటే ఇది వెచ్చగా హాయిగా అనిపిస్తుంది. కానీ వేడి నీటితో స్నానం చేయడం ఆరోగ్యానికి హానికరం అని వారికి తెలీదు. నీటి ఉష్ణోగ్రత ఆరోగ్యంలో పాత్ర పోషిస్తుంది. కొన్ని లాభాలు ఉన్నప్పటికీ... నష్టాలు మరింత ఎక్కువ ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైద్యులు చెబుతున్న ప్రకారం... వేడి నీటి స్నానం వల్ల కలిగే లాభాలు, నష్టాలను ఒకసారి పరిశీలిద్దాం...ప్రయోజనాలున్నాయి...వేడీ నీటి స్నానం వల్ల నష్టాలు అనేకం ఉన్నప్పటికీ... కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా వేడి నీరు బిగుతుగా ఉన్న కండరాలు విశ్రాంతి తీసుకోవడానికి వాటికి ఉపశమనం అందించేందుకు ఉపకరిస్తుంది. అంతేకాకుండా అది రక్తనాళాలను విస్తరించి తద్వారా శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. రోజు మొత్తం ఏర్పడిన పని ఒత్తిడిని తగ్గించడానికి ఒక మార్గంగా కూడా పనిచేస్తుంది. సీజనల్ సమస్యలు ఎదుర్కునే వారు, శీతాకాలపు నొప్పులు లేదా అలసటను అనుభవించే వ్యక్తులకు అవి దూరం చేసేందుకు అనువైనది అలాగే శ్వాసకోశ ఆరోగ్యం సరిగా లేని లేదా తక్కువ ఉష్ణోగ్రతలను తట్టుకోలేని వారికి మేలు చేస్తుంది. వేడి నీటి నుంచి వచ్చే ఆవిరి నాసికా భాగాలను క్లియర్ చేయడంలో, స్రవించే ముక్కును నియంత్రించడంలో సహాయపడుతుందిదుష్ప్రభావాలెన్నో...చాలా మందికి ఈ సీజన్లో అసౌకర్యంగా ఉండవచ్చు గానీ నిజానికి చల్లటి నీటి స్నానం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వేడి నీరు అలవాటు అయితే ఆ లాభాన్ని కోల్పోతాం. అంతేకాదు వేడి నీటికి ఎక్కువసేపు గురికావడం వల్ల చర్మం నుంచి సహజ నూనెలు కోల్పోతుంది. ఇది శీతాకాలంలో చర్మం పొడిబారడాన్ని మరింత తీవ్రతరం చేసి దురదకు దారితీస్తుంది. వేడి నీరు చర్మం బయటి పొరను కూడా దెబ్బతీస్తుంది తేమను నిలుపుకునే సామర్ధ్యాన్ని, పర్యావరణ సమస్యల నుంచి కాపాడుకునే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. అలాగే తామర లేదా సోరియాసిస్ వంటి కొన్ని పరిస్థితులను మరింత దిగజార్చవచ్చు రక్తపోటు పెరిగేకొద్దీ వెచ్చని నీటితో స్నానం చేయడం గుండెపై ఒత్తిడి పెంచుతుంది. వెచ్చని నీటితో స్నానం వల్ల్ల ఊపిరితిత్తులలో వాపు వచ్చే అవకాశం ఉంది. తద్వారా శ్వాస తీసుకోవడం కష్టమై అది తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. వేడి నీటితో స్నానం తలపై కేశాల మూలాలను బలహీనపరుస్తుంది, జుట్టు విరిగిపోవడానికి రాలడానికి దారితీస్తుంది.అంతేకాదు గుండె జబ్బులు, ఆర్థరైటిస్ లేదా కండరాల సంబంధిత సమస్యలు ఉండే వారికి మంచిది కాదు. నష్టాలు ఉన్నప్పటికీ.. కఠినమైన చలిని నివారించడానికి ప్రతిరోజూ వెచ్చని నీటితో స్నానం చేయకుండా ఉండడం అంత సులభం కాదు.. మరి ఈ పరిస్థితుల్లో ఎలాంటి జాగ్రత్తలు అవసరం?ఏం చేయాలి?నీటి ఉష్ణోగ్రత వీలైనంత తక్కువగా ఉంచడం. అలాగే వేడినీటిలో ఎక్కువ సేపు ఉండకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.శీతాకాలంలో వెచ్చని నీటిలో స్నానం గోరువెచ్చని నీటితో మాత్రమే చేయాలి. జుట్టు రాలడాన్ని నివారించడానికి మాయిశ్చరైజింగ్ హెయిర్ కండిషనర్ను అప్లై చేయాలి.పనిని బట్టి చేసే శారీరక శ్రమని బట్టి 2 పూటలా కాకుండా ఒక్క పూటకు పరిమితం చేయడాలి. -
ఇష్టారాజ్యంగా యాంటీబయాటిక్స్ వాడొద్దు !
యాంటీబయాటిక్ మందులు వేసినా కూడా సూక్ష్మజీవులు చనిపోవడానికి బదులు ఇంకా పెరుగుతూనే ఉండే పరిస్థితిని యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) అంటారు. దీని గురించి ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రికి చెందిన ఇన్ఫెక్షన్ నియంత్రణ నిపుణురాలు, కన్సల్టెంట్ మైక్రోబయాలజిస్ట్ డాక్టర్ ఆర్సీ బిలోరియా కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. వరల్డ్ ఏఎంఆర్ అవగాహన వారోత్సవాన్ని (వావ్) ప్రపంచవ్యాప్తంగా ప్రతిఏటా నవంబర్ 18 నుంచి 24 వరకు జరుపుకుంటారు. ఈ ఏడాది థీమ్ “ఇప్పుడే స్పందించండి: మన వర్తమానాన్ని రక్షించి, భవిష్యత్తును కాపాడుకోండి’’. ఈ థీమ్ ఏఎంఆర్‌ను ఎదుర్కొనేందుకు ధైర్యవంతమైన, సమన్వయపూర్వక, విభాగాల వ్యాప్తంగా చర్యల అవసరాన్ని చెబుతోంది. ఏఎంఆర్ అనేది ఇప్పటికే మన ఆరోగ్యం, ఆహార వ్యవస్థలు, పరిసరాలు, ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపుతున్న ఒక ప్రపంచవ్యాప్త ముప్పు.యాంటీబయాటిక్స్ అనేవి ప్రాణాధార మందులు. కానీ, అవి ఇన్ఫెక్షన్ కలగజేసే సూక్ష్మజీవుల మీద పనిచేస్తేనే ప్రాణాలను కాపాడతాయి. యాంటీబయాటిక్స్ మందులు సమర్థంగా ఇన్ఫెక్షన్లను నియంత్రించలేకపోతే ప్రాణాధార చికిత్సలైన కేన్సర్ చికిత్స, అవయవ మార్పిడి లాంటి వాటిపై ఏఎంఆర్ ప్రభావం చూపుతుంది. యాంటీబయాటిక్స్ మందులను చెప్పిన డోస్ కంటే తక్కువ కాలం వాడడం, లేదా తగిన డోసేజిలో వాడకపోవడం, ఒక వ్యాధికి సరిపడని మందు వాడడం లాంటివే వాటిని సరిగా వాడకపోవడం అవుతుంది. వైద్యులు చెప్పినట్లే వీటిని వాడాలి. మన సమస్యకు వైద్యులు యాంటీబయాటిక్స్ రాయకపోతే, అవి కావాలని వారిపై ఒత్తిడి చేయకూడదు . వేరేవారికి రాసిన మందులు వాడితే నయమైపోతుందని అనుకోకూడదు. ఆయా వ్యక్తులు ఆరోగ్యరీత్యా తగిన మందులను సరైన డోసులోనే తీసుకోవాలి. మన దేశంలో నేరుగా దుకాణాలకు వెళ్లి ఏదిపడితే ఆ యాంటీబయాటిక్ కొనుక్కునే అవకాశం ఉండడం కూడా వీటి దుర్వినియోగానికి కారణం అవుతోంది. కొత్త యాంటీబయాటిక్స్ తయారీ చాలా సమస్యాత్మకం, ఖర్చుతో కూడుకున్నది. మార్కెట్లోకి రావడానికి చాలా సమయం పడుతుంది. దీనివల్ల కొత్త యాంటీబయాటిక్స్ తగ్గుతున్నాయి. అందుకని ఉన్నవాటినే జాగ్రత్తగా కాపాడుకోవాలి. చాలావరకు టీకాలు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను నిరోధిస్తాయి కాబట్టి ఏఎంఆర్ సమస్య పరిష్కారానికి పిల్లలు, పెద్దలు, వృద్ధులందరూ టీకాలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఎవరికైనా ఇన్ఫెక్షన్ రాకపోతే యాంటీబయాటిక్స్ వాడాల్సిన అవసరమే ఉండదు. ఏఎంఆర్ నిరోధానికి ప్రతి ఒక్కరూ కృషిచేయగలరు. ఈ కింది పద్ధతుల ద్వారా మీ వంతు ప్రయత్నించండి.వైద్యులు సూచించకపోతే యాంటీబయాటిక్స్ కావాలని ఒత్తిడిచేయకండి.మందుల దుకాణం నుంచి యాంటీబయాటిక్స్ కొనాలంటే వైద్యుల ప్రిస్క్రిప్షన్‌తోనే వెళ్లండి. నేరుగా వెళ్లి కొనొద్దు. యాంటీబయాటిక్స్ వాడడానికి ఎప్పుడూ వైద్యుల సలహా పాటించండి. వాడాల్సినంత కాలం వాడాలి తప్ప మధ్యలో ఆపకూడదు.మిగిలిపోయిన యాంటీబయాటిక్స్ వాడద్దు, ఎవరికీ ఇవ్వద్దు.రోజూ చేతులు కడుక్కోవడం, ఆహారాన్ని శుభ్రంగా వండడం, అనారోగ్య బాధితులకు దగ్గరగా ఉండకపోవడం, దగ్గువచ్చినప్పుడు నోరు చేత్తో మూసుకోవడం, ఎప్పటికప్పుడు టీకాలు వేసుకోవడం ద్వారా ఇన్ఫెక్షన్లను నియంత్రించండి. చదవండి: లోపం ఐరన్.. అదే సైరన్..వైద్యులు సరైన యాంటీబయాటిక్, సరైన డోసులో, సరైన కాలం పాటు, సరైన సమయంలో ఇవ్వాలి. వీలైనంత తక్కువకాలం పాటు యాంటీబయాటిక్స్ వాడడమే సరైన వ్యూహం. ఇన్ఫెక్షన్లకు సరైన చికిత్స చేయడం వల్ల యాంటీబయాటిక్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలు తగ్గుతాయి, యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ రాదు.- డాక్టర్ ఆర్సీ బిలోరియా -
లోపం ఐరన్.. అదే సైరన్..
నగరవాసుల్లో ప్రతి ఇద్దరు మహిళల్లో ఒకరు ఐరన్ లోపంతో బాధపడుతున్నారని అధ్యాయనాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో పుష్కలంగా ఐరన్ అందించే ఉత్పత్తులు అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందని ప్రాక్టర్ అండ్ గాంబుల్ (పీ అండ్ జీ) హెల్త్ లిమిటెడ్ ఇండియా మార్కెటింగ్ డైరెక్టర్ విజయ్ కుమార్ పాపన అన్నారు. ఐరన్ లోపానికి పరిష్కారం అందించే లివోజెన్ ఐరన్ గమ్మీస్ నగర మార్కెట్లోకి విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఐరన్ తక్కువగా ఉండడం వల్ల అలసట, వెంట్రుకలు రాలడం వంటి సమస్యలు భారీగా పెరిగాయని, వీటి నివారణకు వీలుగా మహిళల రోజువారీ ఐరన్ అవసరాలు తీర్చే విధంగా ఈ గమ్మీస్ రూపొందించినట్లు వివరించారు. (చదవండి: Smriti Mandhanas Father: ఆ లక్షణాలు గుండెపోటుకి సంకేతమా..? యాంజియోప్లాస్టీ ఎందుకు?) -
ప్రెషర్..టెన్షన్! మానసిక భాషలో భాగమైన ఒత్తిడి
హైదరాబాద్ మహా నగరం.. టెక్ సిటీ, ఫుడ్ హబ్, కల్చర్ సెంటర్ మాత్రమే కాదు ఈ జనరేషన్ మెంటల్ హెల్త్‌ను అత్యంత సీరియస్‌గా తీసుకుంటున్న నగరం కూడా. వేగంగా మారుతున్న లైఫ్‌స్టైల్, టార్గెట్స్, హడావిడిగా నడిచే టైమ్‌లైన్.. ఇవన్నీ ప్రస్తుత రోజుల్లో ఒత్తిడిని అందరికీ దగ్గర చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆందోళన, నిరాశ, కోపం వంటి భావోద్వేగాలు నేటి ఆధునికుల్లో సర్వసాధారణం అవుతున్నాయి. ఇది మానసిక, శారీరక ఒత్తిడిని సూచించే మానసిక భాషల్లో ఒక భాగం. అయితే ఇది మోతాదుకు మించి ఉంటే ప్రతికూల ప్రభావాలను కలిగించే ప్రమాదం ఉంది. అయితే ప్రస్తుతం హైటెక్ సిటీ వంటి ప్రాంతాల్లో తరచూ వినిపించే ‘డెడ్‌లైన్’, ‘రోలౌట్’, ‘క్లయింట్ ప్రెషర్’ వంటి మాటలు ఈ తరానికి అలవాటైపోతున్నాయి. దీంతో అనేక మానసిక, శారీరక రుగ్మతలకు లోనవుతున్నారు. ఆయా సమస్యల నుంచి బయటపడేందుకు అనేక మార్గాలను అన్వేషిస్తున్నారు. ప్రస్తుత తరంలో ఉరుకుల పరుగుల జీవితం మామూలే. మరీ ముఖ్యంగా నిమిషాలను, సెకన్లను లెక్కబెట్టుకుంటూ.. డెడ్‌లైన్ పేరుతో ఒత్తిడికి గురవుతున్నారు. ఈ తరం ఒత్తిడిని అర్థం చేసుకోడానికి, వారికి బాసటగా నిలవడానికి, సరైన క్రమంలో గైడ్ చేయడానికి వ్యక్తులు లేదా వ్వవస్థలు వంటి సాంకేతిక వేదికల కోసం వెతుకుతున్నారు. ఇలాంటి తరుణంలో మెంటల్ హెల్త్ కోసం సపోర్ట్ సిస్టమ్‌లు వినూత్న సాంకేతిక వేదికలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో గివ్ మీ ఫైవ్ (జీఎం–5) అనే టెక్నికల్ ప్లాట్‌ఫాం అందరినీ ఆకర్షిస్తోంది. ఇటీవల ఇంటర్నేషనల్ స్ట్రెస్ అవేర్నెస్ వీక్ నేపథ్యంలో సంస్థ ఆధ్వర్యంలో ఐదువేల మంది యువత, విద్యార్థులపై ఒత్తిడి ప్రభావంపై సర్వే నిర్వహించింది. ఈ ఒత్తిడి సమస్యల పరిష్కారానికి జీఎం–5 టెక్నాలజీ ఆధారిత సేవలను అందుబాటులోకి తీసుకురానుంది.పలు నగరాల్లో అధ్యయనం.. హైదరాబాద్ వంటి నగరాల్లో యువతలో ఒత్తిడి విపరీతంగా పెరుగుతోందని పలు అధ్యయనాలు ఇప్పటికే వెల్లడించాయి. ఈ నేపథ్యంలో గివ్ మీ ఫైవ్ (జీఎం–5) బృందం తెలంగాణ, కర్ణాటకలోని ఐదువేల మంది యువత, విద్యార్థులపై ప్రత్యేక సర్వే చేపట్టింది. ఈ సర్వేలో భాగంగా ప్రతి నలుగురు పిల్లల్లో ఒకరు ఏదో ఒక మెంటల్ హెల్త్ సమస్యతో బాధపడుతున్నారని తేలింది. ఇలాంటి వారిలో నిద్రలేమి, పరీక్షల ఒత్తిడి, తల్లిదండ్రుల ఎక్స్పెక్టేషన్స్ వంటి కారణాలతో చదువులపై ఇతర అంశాలపై దృష్టి సారించలేకపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్‌తో పాటు దేశంలోని ప్రతి నగరంలోనూ యువతలో ఇలాంటి ఒత్తిడి సమస్యల సర్వసాధారణం అయిపోయింది. థెరపీల కోసం విదేశాలకు.. ప్రస్తుత తరం, మరీ ముఖ్యంగా నగరవాసుల్లో ఒత్తిడికి లోనయ్యేవారు బ్రెజిల్ వంటి కొన్ని విదేశాల్లో థెరపీలకు వెళ్లడం సాధారణ విషయం. అంతేకాకుండా వ్యక్తిగత స్పేస్‌కు ప్రాధాన్యం ఎక్కువ. కానీ దేశంలో మానసిక ఆరోగ్యంలో కుటుంబం, సమాజం, అంచనాలు, బాధ్యతలు వంటి పలు అంశాలు భాగమేనని ఈ బృందం చెబుతోంది. ఇది మనల్ని బలంగా నిలబెట్టినా, కొన్నిసార్లు ఒత్తిడిని తెచ్చిపెడుతుంది. ఈ మిక్స్డ్ ఎకోసిస్టమ్‌లో టెక్నాలజీ ఆధారిత ఫ్యామిలీ–ఇన్‌క్లూజివ్ సొల్యూషన్ చాలా అవసరమని వారు పేర్కొన్నారు. అదే సమయంలో ఒత్తిడి ఉన్నప్పటికీ ప్రోగ్రెసివ్ దారి ఎంచుకుంటున్న నగరం హైదరాబాద్. కాస్తో కూస్తో వెల్నెస్ మీద శ్రద్ధ పెరుగుతుంది. సైకిల్ ట్రాక్స్, మారి్నంగ్ వాక్స్, హెల్దీ కెఫేలు, మెంటల్ హెల్త్ ఔట్రీచ్ ప్రోగ్రామ్‌లు వంటివి ప్రస్తుతం యువతలో ట్రెండ్ అవుతున్నాయి. కానీ పూర్తిస్థాయిలో ఫలితాలను అందించట్లేదనేది వాస్తవ సత్యం. భావోద్వేగాలను ట్రాక్ చేస్తుంది.. టెక్నాలజీ – వెల్నెస్ కలిసిన అద్భుత స్థలం భాగ్యనగరం. ఇందులో భాగంగానే గివ్ మీ ఫైవ్ యాప్ భారత బీటా లాంచ్ కోసం హైదరాబాద్‌ను ఎంచుకుంది. ఇక్కడి కుటుంబ బంధాలు, ఆతీ్మయత బాగుంటాయి. ఇదే మెంటల్ హెల్త్‌కు పెద్ద సపోర్ట్ సిస్టమ్. నర్వేలో భాగంగా రూపొందించిన ఈ యాప్ వచ్చే యేడాది జనవరి–ఫిబ్రవరిలో యూజర్లకు అందుబాటులోకి రానుంది. 10 నుంచి 50 ఏళ్ల వరకూం అందుబాటులో ఉంటుంది. రోజూ ఐదు సులభమైన ప్రశ్నలకు సమాధానాలిచ్చి వారి సోషల్ గ్రాఫ్‌ను అర్థం చేసుకోవచ్చు. ప్రత్యేకమైన ఫీచర్‌గా కుటుంబ సభ్యులు లేదా ఫ్రెండ్ ‘కంపానియన్’లో జాయిన్ అవ్వచ్చు. ఇది ఇంట్లో, ఆఫీసులో, ఫ్రెండ్స్ మధ్య ఒక సెన్స్ ఆఫ్ కేర్, రెగ్యులర్ చెక్కిన్కు దోహదపడుతుంది. సమాధానాల ఆధారంగా భావోద్వేగాలను అర్థం చేసుకుని పరిష్కారాలను సూచిస్తుంది. ఏఐ ఆధారిత సూచనలు, ఫ్యామిలీ–ఫ్రెండ్స్‌తో కమ్యూనిటీ సపోర్ట్ ఇస్తుంది. – డాక్టర్.లీసా ఫాహే, సైకాలజిస్ట్ ఆస్ట్రేలియా పర్సనల్ స్పేస్ తప్పనిసరి.. ఒత్తిడిని జయించాలంటే ప్రతిఒక్కరికీ పర్సనల్ స్పేస్ తప్పనిసరి అని, ఇది మానసకి, శారీరక ఒత్తిడిని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో యువత చాట్ జీపీటీ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో తమ భావాలను పంచుకుంటున్న తరుణంలో మెంటల్ హెల్త్‌కు ఒక సేఫ్ డిజిటల్ స్పేస్ ఉండటం ఎంతో అవసరమని నిపుణులు అంటున్నారు. ఈ తరుణంలో ఓఏఎమ్ (ఓమ్) రూపొందించిన గివ్ మీ ఫైవ్ (జీఎం–5) యాప్ ఒత్తిడి నియంత్రణకు దోహదపడనుందని భావిస్తున్నారు. భావోద్వేగాలు వ్యక్తం చేయలేనివారు, గిల్టీ ఫీల్ ఉన్నవారు.. బిజీగా ఉండి వ్యక్తిగత, మానసిక స్థిరత్వంపై చొరవ చూపని వారికి ఈ యాప్ కొత్త సపోరి్టవ్ స్పేస్ అందించనుందని భావిస్తున్నారు. (చదవండి: హై రిస్క్ ప్రెగ్నెన్సీస్..ఇవీ జాగ్రత్తలు..!) -
వెయిట్ లాస్ జర్నీ కోసం ఫరా ఖాన్ పాట్లు..! ఏకంగా సర్జరీ, జుట్టు కోసం..
బరువు తగ్గడం సాధారణ వ్యక్తులుకే కాదు సెలబ్రిటీలకు సైతం కష్టమే. బాగా లగ్జరీ ఉంటారు కాబట్టి ఏవేవో షార్ట్‌కట్‌లతో అమాంతం బరువు తగ్గిపోతారని అనుకుంటుంటారు, కానీ అది అపోహే అని బాలీవుడ్ చిత్రనిర్మాత, కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ని చూస్తే ఇట్టే అర్థమవుతుంది. సోహా అలీఖాన్‌తో జరిగిన సంభాషణలో చాలా ఓపెన్‌గా నిజాయితీగా తన వెయిట్ లాస్ జర్నీ గురించి చెప్పిన విధానం వింటే..అబ్బా బరువు తగ్గడానికి ఇంత కష్టపడిందా అనిపిస్తుంది. ఇంతకీ ఆమెకు స్లిమ్ మారడానికి ఎంత టైం పట్టిందంటే..ఫరాఖాన్ సోహా అలీఖాన్‌తో జరిగిన పాడ్‌కాస్ట్ ఆల్ అబౌట్ హర్ సంభాషణలో 60 ఏళ్ల వయసులో తన బరువు తగ్గే జర్నీ గురించి మాట్లాడింది. అంతేగాదు ఆ క్రమంలో తాను ఎదుర్కొన్న చర్మం, జుట్టు సమస్యల గురించి కూడా చెప్పుకొచ్చింది. ఆ సంభాషణలో సోహా అలీ ఖాన్ ..మీరు ఎంతో అద్భుతంగా కనిపిస్తునన్నారని ఫరాని ప్రశంసిస్తుంది. అయితే ఎల్లప్పుడూ ఇలానే ఉండిపోలేం అని నవ్వుతూ కౌంటర్ ఇచ్చేసింది ఫరా. తాను పిల్లలు పుట్టే వరకు చాలా సన్నగా ఉండేదాన్ని అని, అయితే చర్మం చాలా భయంకరంగా ఉండేదని తెలిపింది. అందులోనూ తాను డే అండ్ నైట్ షిప్ట్‌లో నిరంతరం పనిచేస్తూ ఉండటంతో మరిన్ని ఆరోగ్య సమస్యలు ఫేస్ చేసినట్లు వెల్లడించింది. ఒకసారి తన భర్త, పిల్లలను తీసుకుని వెకేషన్‌కి వెళ్లామని, అప్పుడు తాను చాలా అధిక బరువుతో ఉన్నట్లు గుర్తు చేసుకున్నారామె. అయితే తాము అక్కడ ఒక రూమ్ తీసుకుని ఉన్నప్పుడూ ఒక మహిళా క్లీనర్ వచ్చి..తన భర్తను చూసి మీ అబ్బాయిని బయటకు వెళ్లమనిండి ఇల్లు తుడుస్తాను అంటుంది. దాంతో ఫరా కంగుతింటుంది. ఆ ఘటన తనను చాలా కలవరపాటుకు గురి చేసిందని తెలిపింది. అలా తాను 60 ఏళ్ల వయసులో బరువు తగ్గే జర్నీని ప్రారంభించానని, అదనపు బరువు కోల్పోవడానికి తనకు ఏడేళ్లే పైనే పట్టిందని తెలిపింది.తనకు పుట్టుకతో అదనపు చర్మం ఉండటం వల్ల బరువు తగ్గడంలో మార్పులు సత్వరం కనిపించలేదని, అందుకోసం టమ్మీ టక్ సర్జరీ చేయించుకోవాల్సి వచ్చిందని పేర్కొంది. అంతేగాదు 50 ఏళ్ల వయసులో చర్మ వ్యాధి నిపుణుడిని క్రమం తప్పకుండా సంప్రదించడం, దాంతోపాటు వెల్నెస్ స్పాలో విటమిన్ డ్రిప్స్, లింఫాటిక్ మసాజ్‌లు వంటివి తీసుకున్నట్లు వివరించింది. ఇక తన జుట్టు కోసం కూడా క్రమం తప్పకుండా విటమిన్లు తీసుకుంటున్నట్లు తెలిపింది. అంతలా కేర్ తీసుకుంటే గానీ ఫరా అంతలా స్లిమ్‌గా మారలేదన్నమాట. (చదవండి: కిరీటం గెలుపొందితే సరిపోదు..ఆ బాధ్యతలు కూడా చేపట్టాలి!) -
పిల్లల్లోనూ డిప్రెషన్? అందుకు అనేక రీజన్లు..
‘పిల్లలకు ఎలాంటి కష్టాలు ఉంటాయి? వారు రోజంతా ఆడుకుంటూ సంతోషంగా ఉంటారు’’ అని చాలామంది అనుకుంటారు. కానీ ఇది సరైన అభిప్రాయం కాదు. డిప్రెషన్ అనేది పెద్దవారికే కాదు... అది చిన్న పిల్లల్లో కూడా కనిపించే ఓ భావోద్వేగ సమస్య. అనేక పరిశోధనలు క్లినికల్ అనుభవాలు చిన్నపిల్లల్లో కూడా డిప్రెషన్ కనిపిస్తుందని నిర్ధారణ చేస్తున్నాయి. చిన్నపిల్లల్లో డిప్రెషన్ రావడానికి అనేక అంశాలు కారణమవుతాయి. అవి... పిల్లల్లో డిప్రెషన్ ఎందుకు వస్తుందంటే... 1. బయోలాజికల్ / శారీరక కారణాలుకుటుంబంలో డిప్రెషన్ లేదా యాంగై్జటీలతో కూడిన మెడికల్ హిస్టరీ ఉండటం మెదడులోని రసాయనాల (కెమికల్స్) అసమతుల్యత కారణంగా నిద్ర–ఆహార శైలిలో గందరగోళం 2. సైకాలజికల్ / భావోద్వేగ కారణాలు పిల్లల సున్నితమైన స్వభావం భయం, ఆత్మవిశ్వాసం లేకపోవడం చదువులో ఒత్తిడి 3. సామాజిక కారణాలు ఇంట్లో కలహాలు స్కూల్లో బుల్లీయింగ్‌కు గురికావడం స్నేహితుల లేమి, ఒంటరితనం ఎక్కువ సమయం టీవీ లేదా మొబైల్ స్క్రీన్కు అంటిపెట్టుకుని ఉండటం డిప్రెషన్ పిల్లల్లో ఎలా బయటపడుతుందంటే... చిరాకు, చిన్న విషయానికే ఏడవడం ఒంటరిగా ఉండాలనిపించడం స్కూల్‌కు వెళ్లడంలో నిరాసక్తత ఆటల్లో ఆసక్తి తగ్గిపోవడం ఆకలి తగ్గడం లేదా ఎక్కువగా తినడం నిద్రలో మార్పులు (ఎక్కువ నిద్ర / నిద్రలేమి) అలసట, నీరసం, నిస్సత్తువ ఆత్మవిశ్వాసం తగ్గుదల ∙తరచూ ‘‘పొత్తికడుపు నొప్పి, తలనొప్పి’’ వంటి ఫిర్యాదులుఈ లక్షణాలు 2–3 వారాలు కొనసాగితే నిపుణుడిని సంప్రదించడం మంచిది.ప్రతి బాధ డిప్రెషన్ కాకపోవచ్చు కానీ పిల్లల విషయంలో జాగ్రత్త అవసరం. ఎందుకంటే చిన్న పిల్లలు తమ భావాలను మాటల్లో చెప్పలేరు. వారు తమ ప్రవర్తన ద్వారానే తమ బాధల్ని వ్యక్తం చేస్తారు. అందుకే పిల్లల్లో ఆకస్మికంగా వచ్చిన మార్పులను తల్లిదండ్రులు, టీచర్లు గమనించాలి.తల్లిదండ్రులకు కొన్ని ముఖ్యమైన సూచనలు1. పెద్దలు తీర్పులు ఇవ్వకుండా పిల్లల మాట వినాలి (నాన్ జడ్జిమెంటల్ ఆటిట్యూడ్) ∙‘‘ఇంత చిన్న విషయానికే ఎందుకు బాధపడుతున్నావు?’’ వంటి మాటలను అనకూడదు. ∙పిల్లల అభిప్రాయాలనూ, భావాలనూ తగ్గించే మాటలు అనకుండా, ఠక్కున ఓ అభిప్రాయానికి వచ్చి దాన్ని వెల్లడించకుండా వారు చెప్పే మాటల్ని శ్రద్ధగా వినాలి. ఇది పిల్లల్లో భద్రతా భావాన్ని, నమ్మకాన్ని పెంచుతుంది.2. పిల్లలతో ఎక్కువ సమయం గడపడం (స్పెండింగ్ మోర్ అండ్ క్వాలిటీ టైమ్) ప్రతిరోజూ కొంత సమయం పూర్తిగా పిల్లలకోసమే కేటాయించాలి.∙కథలు చెప్పడం, బయట ఆటలు, కలిసి చేసే చిన్న పనులే అయినప్పటికీ ఇవన్నీ పిల్లల్లో వాళ్ల భావోద్వేగ బలాన్ని పెంచుతాయి. ∙నాణ్యమైన సమయం ఇవ్వడమన్నది పిల్లలను డిప్రెషన్‌కు గురికాకుండా చేసే ఒక సహజ రక్షణలాంటిది. చికిత్స ఇలా... కౌన్సిలింగ్ / ప్లే థెరపీ బిహేవియర్ థెరపీ అవసరమైనప్పుడు మాత్రమే అది కూడా సైకియాట్రిస్ట్ పర్యవేక్షణలోనే మందులు వాడటం. ఎంత త్వరగా చికిత్స చేస్తే ఫలితాలు అంతగా బాగుంటాయి. చివరగా... డిప్రెషన్ చిన్న పిల్లల్లోనూ కనిపించేందుకు అవకాశమున్న ఒక భావోద్వేగ సమస్య. దీన్ని వైద్య నిపుణుల సహాయంతో నయం చేయవచ్చు. సమయానికి గుర్తించడం, వారి ప్రవర్తనపై తీర్పులు ఇవ్వకుండా ప్రేమ, ఆప్యాయతలతో వారితో పెద్దలు ఎక్కువ సమయం గడపడం ద్వారా, అలాగే నిపుణుల సహాయం తీసుకుంటే వారిని డిప్రెషన్‌ను నుంచి దూరం చేయగలిగితే చిన్నారులు పూర్తిగా ఆరోగ్యంగా కోలుకుని, ఆనందంగా ఎదుగుతారు. డాక్టర్ గౌతమి నాగభైరవ, సీనియర్ సైకియాట్రిస్ట్ (చదవండి: ఎకాంథోసిస్ నైగ్రికాన్స్! చక్కెర చారలు..!) -
ఎకాంథోసిస్ నైగ్రికాన్స్! చక్కెర చారలు..!
కొంతమంది నుదుటి మీద, మరికొందరి మెడ మీద చర్మం కాస్తంత ఉబ్బినట్టుగా, దళసరిగా మారినట్టుగా కనిపించడం మామూలే. ఆ నల్లబారిన ఉబ్బు మధ్య మధ్యన ప్యాచ్‌లు ప్యాచ్‌లుగా కొద్దిగా ముడుతలు ముడుతలుగా కనిపిస్తుండటమూ సాధారణమే. పైకి కనిపించే ప్రదేశాల్లో మాత్రమే కాదు... కొందరికి దుస్తులు కప్పి ఉంచే ప్రదేశాలైన బాహుమూలాల్లో కూడా ఇలా కనిపిస్తుంది. ఇలా చర్మం నల్లగా, ఉబ్బుగా, దళసరిగా ఓ పొరలాగా కనిపించే కండిషన్‌ను వైద్యపరిభాషలో ‘ఎకాంథోసిస్ నైగ్రికాన్స్’ అంటారు. సాధారణంగా ఇలా రావడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ దీన్ని ప్రీ– డయాబెటిస్‌కు సూచనగా భావించి ముందస్తుగానే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, కొన్ని సూచనలు పాటిస్తూ చాలాకాలం పాటు డయాబెటిస్ దరిచేరకుండా చూసుకోవాలంటూ వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ అంశంపై అవగాహన కోసమే ఈ కథనం.ఎకాంథోసిస్ నైగ్రికాన్స్ ఎందుకు వస్తుందన్నది ఇంకా తెలియదు. అది రావడానికి నిర్దిష్టంగా ఫలానా అంశమే కారణం అని చెప్పడానికి లేదు. అయితే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నవాళ్లకు అది వస్తుందన్నది పరిశోధకుల మాట. ఇన్సులిన్ అనే హార్మోన్ చక్కెరను కణంలోకి సాఫీగా వెళ్లేలా చేయడం ద్వారా రక్తంలో చక్కెరను రెగ్యులేట్ చేస్తుంది. అంటే కణం తాలూకు జీవక్రియలకు అవసరమయ్యేలా చక్కెరను కణంలోకి ప్రవేశించేలా చేయడం వల్ల రక్తంలో తగినంత చక్కెర కనిపించదు. ఏదైనా కారణాల వల్ల కణంలోకి చక్కెర ప్రవేశించకపోతే అది రక్తంలోనే ఉండిపోతుంది. అంటే కణం ఇన్సులిన్‌ను రెసిస్ట్ చేయడం వల్ల ఇలా జరుగుతుంది. కాబట్టి ఇలా జరిగే కండిషన్‌ను ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. దాంతో రక్తంలో చక్కెర ఎక్కువగా ఉండటం వల్ల ప్రాంక్రియాస్ ఎక్కువ మొత్తంలో ఇన్సులిన్ ఉత్పత్తి చేయాల్సి వస్తుంది. దీనివల్ల ప్రాంక్రియాస్‌పై ఎక్కువ భారం పడటంతో తొలుత ప్రీ–డయాబెటిస్‌కీ, తర్వాత డయాబెటిస్‌కూ దారితీయవచ్చు. ప్రీ–డయాబెటిక్ కండిషన్ అనేది చక్కెర వ్యాధికి (డయాబెటిస్‌కి) తొలి దశ లేదా తొలి సూచనగా భావిస్తారు. లక్షణాలు... నుదుటి మీద, మెడ వెనక భాగంలో అలాగే చంకల్లో చర్మం దళసరిగా మారడంతో పాటు చర్మం ముడతలు పడుతూ ఉండే భాగాల్లో అంటే ప్రైవేటుపార్ట్స్ దగ్గర, మోకాళ్ల వెనక కూడా చర్మం దళసరిగా మారడం; మందంగా మారిన చోట కాస్తంత దురదగా అనిపించడం కొందరిలో అక్కడ పులిపిరులు (స్కిన్ ట్యాగ్స్) రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.ఎకాంథోసిస్ నైగ్రికాన్స్కు కారణాలు... ఇన్సులిన్ రెసిస్టెన్స్‌తో పాటు ఎకాంథోసిస్ నైగ్రికాన్స్కు మరికొన్ని అంశాలూ కారణమవుతాయని నిపుణులు చెబుతుంటారు. అవి... కొందరిలో టైప్–2 డయాబెటిస్‌కు ముందర (సాధారణంగా స్థూలకాయం ఉన్నవారిలో ఇలా నల్లబారి, దళసరిగా మారడం కాస్తంత ఎక్కువ)చాలా అరుదుగా వచ్చే ఈ కండిషన్స్ ఉన్నవారిలో... చాలా అరుదుగా చర్మ క్యాన్సర్ ఉన్నవారిలో. (దీన్ని మెలిగ్నెంట్ ఎకాంథోసిస్ నైగ్రికాన్స్ అంటారుగానీ ఇది చాలా చాలా అరుదు). కొందరిలో కొన్ని మందులు వాడటం వల్ల. కొందరిలో లూపస్ (ఎస్‌ఎల్‌ఈ) అనే ఆటోఇమ్యూన్ వ్యాధి కారణంగా. కొందరిలో జోగ్రెన్స్ సిండ్రోమ్, స్కీ›్లరోడెర్మా, హషిమోటో థైరాయిడైటిస్ అనే కారణాల వల్ల. ఇతరత్రా పరిణామాలు చూడటానికి ఇబ్బందిగా ఉండి అంత బాగా కనిపించకపోవడం. ఈ నలుపు కారణంగా నలుగురిలోకి రాలేక మానసికంగా ఇబ్బందిపడటం. నిర్ధారణ... బయటకు చూడటానికి నల్లగా, దళసరిగా కనిపించే చర్మంతో దీన్ని క్లినికల్‌గా గుర్తించవచ్చు. అవసరాన్ని బట్టి కొందరిలో బయాప్సీ చేయాల్సి రావచ్చు. అవసరాన్ని బట్టి (లేదా కారణాలను తెలుసుకునేందుకు) రక్తంలో చక్కెర మోతాదులూ, ఇన్సులిన్ స్థాయులు, లిపిడ్ ప్రొఫైల్ వంటి పరీక్షలూ చేయించే అవకాశాలుంటాయి. చికిత్స... ఎకాంథోసిస్ నైగ్రికాన్స్లో చర్మం నలుపునూ, దళసరిగా/మందంగా మారడాన్ని తగ్గించడానికి డాక్టర్లు కొన్ని రకాల క్రీములు, జెంటిల్ క్లెన్సర్స్, యాంటీబ్యాక్టీరియల్ సబ్బులు సూచించవచ్చు. దాంతో΄ాటు కొన్ని సందర్భాల్లో లేజర్ థెరపీ వంటి చికిత్సలు అవసరం కావచ్చు. కొందరికి కెమికల్ పీల్స్ చికిత్సలు కూడా బాగానే ఉపయోగపడతాయి. అయితే మరీ ముఖ్యంగా చెప్పాల్సిందేమిటంటే... ఇలా చర్మం దళసరిగా మారి, నలుపు రంగులోకి తిరుగుతుంటే... ఎకాంథోసిస్ నైగ్రికాన్స్కు కాకుండా లోపల మరేదైనా ఆరోగ్య సమస్య (అండర్లైయింగ్ డిసీజ్) కారణంగా ఇలా జరుగుతుందేమో పరిశీలించడం అవసరం. అంటే స్థూలకాయం (ఒబేసిటీ), ప్రీ డయాబెటిస్ లేదా డయాబెటిస్ వంటివి కారణాలు కావచ్చని అనుమానించాలి. ఇలా అనుమానించడం ద్వారా కారణాలను విశ్లేషించి వాటికి అవసరమైన చికిత్స తీసుకోవడం మరీ ముఖ్యం. తద్వారా ప్రీ–డయాబెటిస్ కండిషన్ గనక బయటపడితే డాక్టర్లు పాటించమని చెప్పే కొన్ని ఆరోగ్య సూచనలతో డయాబెటిస్‌ను చాలాకాలం పాటు నివారించవచ్చు. ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే వాటికి చికిత్స అందించడం ద్వారా సమస్య మరింత ముదరకుండా జాగ్రత్తపడటంతో పాటు అండర్లైయింగ్ డిసీజ్ తగ్గిపోవడం వల్ల ఎకాంథోసిస్ నైగ్రికాన్స్ కూడా నయమవుతుంది. డాక్టర్ బి. విజయశ్రీ సీనియర్ కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్, కాస్మటాలజిస్ట్. (చదవండి: Exercise During Period: పీరియడ్స్ సమయంలో వ్యాయామం చేయొచ్చా?) -
పీరియడ్స్ సమయంలో వ్యాయామం చేయొచ్చా?
స్త్రీలు తమ పీరియడ్స్ సమయంలో వ్యాయామాలు చేయకూడదని కొందరు అభిప్రాయపడుతుంటారుగానీ... నిజానికి మహిళలు తమ రుతు సమయంలో ఎలాంటి సంకోచాలూ లేకుండా వ్యాయామాలు చేయవచ్చు. ఆ టైమ్‌లో చేయకూడదన్నది కేవలం అపోహ మాత్రమే. చాలామంది క్రీడాకారిణులు తమ రెగ్యులర్ ప్రాక్టీస్‌లో భాగంగా రుతుసమయంలోనూ వ్యాయామం చేస్తుంటారు. దాంతో ఎలాంటి నష్టమూ జరగదు. అయితే మహిళలు తమ రుతు సమయంలో ఒక విషయంలో కొంత అప్రమత్తతతో ఉండాలి. అదేమిటంటే... రుతు సమయంలో వాళ్లు రక్తం కోల్పోతూ ఉండటం వల్ల వాళ్ల దేహంలో ఐరన్ మోతాదులు తగ్గే అవకాశం ఉన్నందున... ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటూ ఉండటం చాలా మేలు చేస్తుంది. ఐరన్ మోతాదులు ఎక్కువగా ఉండే ఆహారాలు... మాంసాహారాల్లో వేటవూంసం, చికెన్, చేపలు, లివర్, శాకాహారులైతే తాజా ఆకుకూరలు (పాలకూర వంటివి), ఎండుఖర్జూరం, గసగసాలు, చిక్కీ వంటి పదార్థాల్లో ఐరన్ మోతాదులు ఎక్కువ. ఇవి కేవలం పీరియడ్స్ సమయంలోనే కాకుండా మామూలు టైమ్‌లోనూ తీసుకుంటుంటే వారిలో ఐరన్ ఎప్పటికప్పుడు భర్తీ అవుతుంది.దూరంగా ఉండాల్సిన పదార్థాలివే... రుతు సవుయంలో వారు నువ్వులు, ఉప్పు, కొవ్వులు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటే దేహం కాస్తంత మందకొడిగా మారడంతో వ్యాయామాలు చురుగ్గా చేయలేక΄ోవచ్చు. కేవలం రుతు సమయంలోనే కాకుండా మిగతా టైమ్‌లో కూడా వీటితో చురుకుదనం తగ్గవచ్చు. కాబట్టి చురుగ్గా ఉండాలంటే... మహిళలు తమ ఆహారంలో ఉప్పు, కొవ్వులు తగ్గించాలి. రుతు సవుయంలో సాధారణ రోజుల కంటే నీళ్లు, పండ్లరసాల వంటి ద్రవాహారాలు ఎక్కువగా తీసుకోవడం మేలు చేస్తుంది. అంతేకాదు... వేళకు పడుకుని, కంటినిండా నిద్రపోవడం వల్ల పూర్తి ఆరోగ్యమూ బాగుంటుంది. వ్యాధినిరోధక వ్యవస్థ (ఇమ్యూనిటీ) మెరుగుపడుతుంది. (చదవండి: పార్కిన్సన్ రోగులకు హెల్ప్ అయ్యే 'ఆన్‌క్యూ') -
జరగబోయేవన్నీ చెప్పగలనంటాడు!
నమస్తే డాక్టర్ గారు! నాకు 3 నెలల క్రితమే వివాహం అయింది. నా భర్త ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేస్తాడు. ఆయన ప్రవర్తన, మాటలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఎవరితోనూ పెద్దగా మాట్లాడడు. ఎప్పుడూ తన ఆలోచనల్లోనే మునిగిపోయి ఉంటాడు. ఎవరినీ నమ్మకూడదు అంటాడు. బయటకు వెళ్ళడానికి ఇష్టపడడు, ఇంట్లో కూడా వింతగా మాట్లాడుతుంటాడు. మొక్కలు, జంతువులు, పక్షుల భాషలు తనకు తెలుసని వాటితో ఏవేవో శబ్దాలతో మాట్లాడుతుంటాడు. ఇంటికి ఎవరైనా వస్తే వారి మొహం చూసి, కళ్ళు మూసుకొని, మీకిలా జరుగుతుంది అని అందరికీ భవిష్యత్తు గురించి చెబుతున్నాడు. నన్ను బాగానే చూసుకుంటాడు. డాక్టర్ దగ్గరికి వెళదామంటే ‘నీకేమైనా పిచ్చా’ అని అందరినీ దబాయిస్తున్నాడు. మాకేం చేయాలో అర్థం కావడం లేదు. మీరే ఏదైనా మంచి సలహా ఇస్తారని ఆశిస్తున్నాను! మీరు వివరించిన లక్షణాల ప్రకారం మీ భర్తకు కనిపిస్తున్న ప్రవర్తన ‘స్కిజో టైపల్ పర్సనాలిటీ డిజార్డర్ ‘ అనే ఒక మానసిక భ్రాంతికి దగ్గరగా ఉంది. ఈ సమస్యతో బాధపడే వ్యక్తుల ఆలోచనలు, నమ్మకాలు, ప్రవర్తన ఇతరులకు చాలా విచిత్రంగా, అసాధారణంగా కనిపిస్తాయి. ఉదాహరణకు, విపరీతమైన మూఢనమ్మకాలు, వాళ్ళకి ప్రత్యేక శక్తులు ఉన్నాయనుకోవడం, అందరిపై అనుమానం, మీరు చెప్పినట్లు, జంతువులు, మొక్కలతో మాట్లాడటం లాంటివి చేస్తుంటారు. మిగిలిన వారికి సాధారణంగా అనిపించే విషయాలలో కూడా వీళ్ళు నిగూఢ అర్థాలు వెతుకుతారు. వీరు ప్రపంచాన్ని చూసే విధానమే వేరుగా ఉంటుంది. ఎక్కువగా ఊహా ప్రపంచంలో బ్రతుకుతారు. అయితే వీరు తమ పనిని చేసుకోగలరు. లిమిటెడ్‌గా కుటుంబం వరకు బాగానే ఉన్నా బయట సామాజిక సంబంధాలు మాత్రం కలిగి ఉండలేరు. తమకి ఉన్నది ఒక సమస్య అని వారు గుర్తించలేరు. ఇది స్కిజోఫ్రీనియా అనే తీవ్రమైన మానసిక జబ్బు కాదు, కానీ దాని తేలికపాటి రూపం ఇది అని చెప్పవచ్చు. అనేక పరిశోధనల ప్రకారం స్కిజోఫ్రీనియా ఉన్న వారి కుటుంబ సభ్యులలో ఈ సమస్య ఎక్కువగా కనపడినట్లు నిరూపణలు ఉన్నాయి. కొన్నిసార్లు ఈ సమస్య తరువాతి కాలంలో పూర్తిస్థాయి ‘స్కిజోఫ్రేనియా’ లేదా ‘ఓసీడీ’ జబ్బు లాగా రూపాంతరం చెందవచ్చు కూడా. ఇదొక అరుదైన సమస్య కాబట్టి పూర్తిగా మార్చడం కూడా కష్టం, అయినా, సహనంతో, ప్రేమతో, మానసిక నిపుణుల సహాయంతో అతని ప్రవర్తనను చాలా వరకు మెరుగు పరచవచ్చు. మీరు మీకు దగ్గర్లో ఉన్న సైకియాట్రిస్ట్‌ని సంప్రదించండి. కొన్ని లక్షణాలు మందులతో తగ్గించవచ్చు, అతని ఆలోచనలు మార్చడం కోసం, సామాజిక వైపుణ్యాల అభివృద్ధి కోసం ‘సైకో థెరపీ’ చాలావరకు ఉపయోగపడుతుంది. అన్నింటికీ మించి కుటుంబ సభ్యులు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్(విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com)(చదవండి: PM Narendra Modi's Watch: రూపాయి నాణెంతో కూడిన ప్రధాని మోదీ వాచ్..! ధర ఎంత ఉంటుందంటే..) -
జస్ట్ నాలుగు నెలల్లో..24 కిలోల బరువు..! ఈ సింపుల్ డైట్ ప్లాన్‌తో..
వెయిట్‌లాస్ జర్నీలో కొందరు అద్భుతాలు సృష్టిస్తుంటారు. ఎంతలా అంటే.. ఎలాంటి క్రాష్ డైట్లు పాటించకుండా ఆరోగ్యకరమైన రీతీలో ఏదో మాయ చేసినట్లుగా అమాంతం స్లిమ్‌గా మారిపోయి అందర్నీ ఆశ్చర్యపరుస్తారు. ఇక్కడ అలానే జాహ్నవి అనే మహిళ ఎంత అద్భుతంగా బరువు తగ్గిందంటే..చాలా తక్కువ సమయంలోనే అధిక బరువుని కోల్పోయింది. అదికూడా ఆరోగ్యకరమైన పద్ధతిలోనే తగ్గడం విశేషం. అదెలాగో ఆమె మాటల్లోనూ సవివరంగా తెలుసుకుందామా..!.జాహ్నవి అనే మహిళ వెయిట్ లాస్ జర్నీలో అందరికీ స్ఫూర్తి అంటూ ఫిట్నెస్ నిపుణుడు మాక్ సింగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో అందుకు సంబంధించిన వీడియోని షేర్ చేశారు. అంతేగాదు త్వరిగతిన ఫలితాలు పొందాలనుకునేవారికి ఆమె ప్రేరణ అని పోస్ట్‌లో పేర్కొన్నారు. బరువు తగ్గడం అనేది కాస్త కఠినమైన టాస్క్ అయినా..క్రమశిక్షణ, డెడికేషన్ ఉంటే..ఈజీగా బరువు తగ్గిపోవచ్చట. ముందుగా ఈ వెయిట్‌లాస్ జర్నీలో ప్రతిఒక్కరికి స్థిరత్వంతో కూడిన అంకితభావం ప్రధానమని..నొక్కి చెబుతోంది జాహ్నవి. తాను 94 కిలోల మేర అధిక బరువు ఉండేదాన్ని..జస్ట్ నాలుగు నెలల్లోనే 24 కిలోలు వరకు తగ్గిపోయానని పేర్కొంది. పైగా తన డైట్ ఎలా ప్లాన్ ఎలా ఉండేదో కూడా వివరించింది. ఉదయం నిద్ర లేచిన వెంటనే ఉసిరి కాయ రసం, ఐదు బాదం పప్పులు, అజ్వైన్(క్యారమ్ గింజలు), దాల్చిన చెక్క నీరు, నానబెట్టిన వాల్నెట్స్, మెంతినీరు తప్పనిసరిగా తీసుకుంటానని అంటోంది. బ్రేక్‌ఫాస్ట్ రొటీన్ (ఉదయం 8)అల్పాహారం కోసం, జాహ్నవి మిల్లెట్ దోస, చియా సీడ్ స్మూతీ, పెసరపప్పుతో చేసే ఇడ్లీ తింటానంటోంది.మిడ్-మార్నింగ్ రొటీన్ (ఉదయం 11)ఈ సమయంలో, ఫిట్నెస్ ప్రియురాలు సీజనల్ పండ్లు, ఫ్రూట్ స్మూతీ, రాగి (ఫింగర్ మిల్లెట్) మాల్ట్‌ను ఆశ్రయించింది.లంచ్ రొటీన్ (మధ్యాహ్నం 2)ఆమె లంచ్ మెనూలో బియ్యం, కూరగాయల కూర, పెరుగు, లేదా మిల్లెట్ పులావ్, మిశ్రమ కూరగాయలు, రైతా వంటి సరళమైన వంటకాలు ఉన్నాయి.స్నాక్ రొటీన్ (సాయంత్రం 4)స్నాక్స్ కోసం, జాహ్నవి తనకు తానుగా ఉడికించిన గుడ్డు, భెల్(మరమరాలు), నల్ల చన్నా (సెనగలు) చాట్ తీసుకున్నట్లు తెలిపింది.డిన్నర్ రొటీన్ (రాత్రి 7)ఆమె తన విందును ముందుగానే ముగించేదాన్ని అంటోంది. ఆమె ఆహారంలో కూరగాయలతో ఉడికించిన చికెన్, గుడ్డు ఆమ్లెట్, కూరగాయల కూరతో మిల్లెట్ రోటీ ఉన్నాయి.పడుకునే ముందు (రాత్రి 9)పడుకునే ముందు, జాహ్నవి హెర్బల్ టీ లేదా పుదీనా, కొత్తిమీర నీరు వంటి ఆరోగ్యకరమైన పానీయాలను తీసుకున్నట్లు తెలిపింది. ఇలా కేర్‌ఫుల్‌గా తీసుకునే డైట్‌పై ఫోకస్ పెడితే.. హెల్దీగా బరువు తగ్గడం ఏమంత కష్టం కాదని అంటోంది జాహ్నవి. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం(చదవండి: అత్యుత్తమ చికెన్ రెసిపీ జాబితాలో బటర్ చికెన్‌కి చోటు..! ఎన్నో స్థానంలో ఉందంటే..) View this post on Instagram A post shared by Fitelo | Customised Diet Plans (@fitelo_tamil) -
కేన్సర్‌కు ఆహారం ఆన్సర్..!
ఇంగ్లిష్‌లోనూ తెలుగులోనూ కామన్‌గా ఓ సామెత ఉంది. అదే... ప్రివెన్షన్ ఈజ్ బెటర్ ద్యాన్ క్యూర్. అంటే చికిత్స కంటే నివారణ మేలు అని అర్థం. నిజమే... రోజూ ఆహారం తీసుకోక తప్పదు. అదే గనక ఆరోగ్యకరమైనది కావడంతోపాటు కేన్సర్‌ను నివారించేదైతే... అది కేవలం కేన్సర్‌నే కాదు... ఎంతో ఆత్మక్షోభనూ, మరెంతో వేదననూ నివారిస్తుంది. అంతేకాదు... భవిష్యత్తులో మందులకు పెట్టే బోలెడంత డబ్బునూ ఆదా చేస్తుంది. అన్నిటికంటే ముందుగా శారీరక బాధల నివారణతోపాటు మానసికమైన శాంతినీకాపాడుతుంది. అందుకే రోజూ ఎలాగూ తినే అవే ఆకుకూరలనూ, కాయగూరలనూ, పండ్లనూ మార్చి మార్చి తింటూ ఉంటే పై ప్రయోజనాలన్నీ కలుగుతాయి. ఏయే ఆహారపదార్థాలు ఏయే కేన్సర్లను నివారిస్తాయో, అలా నివారించడానికి వాటిల్లోని ఏ పోషకాలు తోడ్పడతాయో తెలుసుకుందాం. ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. తద్వారా కేన్సర్‌ను నివారించుకుందాం...పండ్లు... ఆకుకూరలు... ఆహారపదార్థాలు... ఇలా మనం రోజూ తినే పదార్థాలతోనే కేన్సర్లను నివారించుకోవడం సాధ్యమనే అనడం కాకుండా వాటిల్లోని ఏయే పోషక విలువలు అలా జరిగిందేందుకు దోహదపడతాయో తెలుపుతున్నారు కేన్సర్‌పై పరిశోధనలు సాగిస్తున్న శాస్త్రవేత్తలూ, ఆహారనిపుణులు. పైగా ఏయే ఆహారపదార్థాల్లోని ఏ నిర్దిష్టమైన పోషకం కేన్సర్‌ను ఎలా నివారిస్తుందో తెలుసుకునేందుకు యూకేకు చెందిన ‘వరల్డ్ క్యాన్సర్ రీసెర్చ్ ఫండ్’ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఆ అధ్యయనాల ద్వారా కేవలం ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు తినడం ద్వారానే చాలా సులువుగా కేన్సర్‌ను ఎలా నివారించగలమో తెలుసుకుందాం.పెదవులు, నోరు, ఫ్యారింగ్స్ కేన్సర్ నివారణకు... బాగా ముదురురంగులో ఉండే అన్ని రకాల పండ్లతోపాటు బాగా ముదురు ఆకుపచ్చరంగులో ఉండే ఆకుకూరలు పెదవులు, నోరు, ఫ్యారింగ్ కేన్సర్లను నివారిస్తాయి. అంతేకాదు... విటమిన్ ఏ ఎక్కువగా ఉండే పండ్లు కూడా నోరు, ఫ్యారింగ్స్ కేన్సర్లను నివారిస్తాయి. ఉదాహరణకు విటమిన్–ఏ ఎక్కువగా ఉండే బొప్పాయి, క్యారట్, మామిడి వంటి తాజా పండ్లు నోరు, ఫ్యారింగ్స్, క్యాన్సర్లను నివారణకు తోడ్పడతాయి. టొమాటోలోని లైకోపిన్ కూడా ఈ తరహా క్యాన్సర్ల నివారణకు ఉపయోగపడుతుంది. అంతేకాదు... ఈ లైకోపిన్‌తో మరో ఉపయోగం కూడా ఉంది. ఇందులో యాంటీ క్యాన్సర్ గుణాలతోపాటు గుండెజబ్బులను నివారించే గుణం కూడా ఉంది.కంటి కేన్సర్ నివారణకు... ఒమెగా 3–ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువగా ఉండే సాల్మన్ చేపలు, వాల్‌నట్‌లతోపాటు గ్రీన్–టీ, బెర్రీ పండ్లు, పసుపు, విటమిన్–ఇ, విటమిన్–సి, విటమిన్–ఏ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలతో కంటి కేన్సర్లను సమర్థంగా నివారించవచ్చు. సెలీనియమ్, పీచుపదార్థాలు ఫైటోకెమికల్స్ ఎక్కువగా ఉండే బ్రెజిల్–నట్స్ కూడా కంటి క్యాన్సర్ నివారణకు తోడ్పతాయి.రొమ్ము కేన్సర్ నివారణకు... దానిమ్మ పండులోని ఎలాజిక్ యాసిడ్ అనే పోషకంలోని పాలీఫినాల్స్ రొమ్ముక్యాన్సర్‌ను సమర్థంగా నివారిస్తాయి. అలాగే కెరొటినాయిడ్ అనే పోషకం ఎక్కువగా ఉండే పాలకూర, క్యారట్, బ్రాకలీలు కూడా రొమ్ముక్యాన్సర్ నివారణకు గణనీయంగా తోడ్పడతాయి. ప్రైమరీ యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉండే గ్రీన్–టీ కూడా రొమ్ము క్యాన్సర్ నివారణకు చాలావరకు తోడ్పడుతుంది.గాల్‌బ్లాడర్ కేన్సర్ నివారణకు... ఊబకాయం / స్థూలకాయం రాకుండా ఆరోగ్యకరమైన పరిమితిలో బరువును నియంత్రించుకోవడమన్నది గాల్‌బ్లాడర్ క్యాన్సర్ నివారణకు బాగా తోడ్పడే అంశం. ఇలా బరువును నియంత్రించుకోవడం అన్నది కేవలం ఒక్క గాల్‌బ్లాడర్ కేన్సర్ నివారణకు మాత్రమే కాకుండా పెద్దపేగు, ప్రోస్టేట్, ఎండోమెట్రియమ్, మూత్రపిండాలు, రొమ్ము కేన్సర్ల నివారణకూ తోడ్పడుతుంది. ఇందుకోసం ఆరోగ్యకరంగా ఉండే కొవ్వులు తక్కువగా తీసుకుంటూ ఆకుకూరలు మాత్రం ఎక్కువ మోతాదులో తీసుకుంటూ ఉండాలి.మూత్రాశయ (బ్లాడర్) కేన్సర్ల నివారణకు... క్రూసిఫెరస్ వెజిటబుల్స్ జాతిగా పేరుపడ్డ క్యాబేజీ, బ్రాకలీ వంటి ఆహారాలతో మూత్రాశయ (బ్లాడర్) క్యాన్సర్‌ను సమర్థంగా నివారించవచ్చు. యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్‌లోని యాండర్సన్ కేన్సర్ సెంటర్లో తేలిన అంశాలను బట్టి విటమిన్–ఇ లోని ఆల్ఫా టోకోఫెరాల్ అనే జీవరసాయనం బ్లాడర్ కేన్సర్ నివారణకు బాగా ఉపయోగపడుతుంది. పాలకూర, బాదాంలతోపాటు పొద్దుతిరుగుడునూనె, కుసుమ నూనెలోనూ విటమిన్–ఇ మోతాదులు ఎక్కువ. ఇక మిరియాలలో ఉండే పోషకాలు కూడా బ్లాడర్ క్యాన్సర్ నివారణకు ఉపయోగపడతాయి. మూత్రపిండాల (కిడ్నీ) కేన్సర్ నివారణకు... నారింజ రంగులో ఉండే కూరగాయలు (ఉదాహరణ క్యారట్)తో పాటు టొమాటో, అల్లం, ఆప్రికాట్ వంటివి... మూత్రపిండాల (కిడ్నీ) క్యాన్సర్ నివారణకు బాగా తోడ్పడతాయి. కిడ్నీల ఇన్ఫ్లమేషన్ను బెర్రీ పండ్లు గణనీయంగా తగ్గిస్తాయి. ఫలితంగా కిడ్నీ జబ్బుల ముప్పు కూడా బాగా తగ్గిపోతుంది. ఇక పొట్టు తీయని ధాన్యాలు, నట్స్, బఠాణీ, చిక్కుళ్ల వంటి ఫైటేట్ అనే పోషకం ఉన్న ఆహారాలు మూత్రపిండాల క్యాన్సర్ నివారణకు సమర్థంగా తోడ్పడతాయి.గర్భాశయ ముఖద్వార (సర్విక్స్) కేన్సర్ నివారణకు... ఆహారంలో విటమిన్–ఇ, విటమిన్–సి ఎక్కువగా ఉండేలా చూసుకోవడం అని చర్య సర్విక్స్ క్యాన్సర్ నివారణకు బాగా ఉపకరిస్తుంది. ఉదాహరణకు క్యారట్, చిలగడదుంప, గుమ్మడి వంటి ఆహారాలతో దీన్ని చాలాబాగా నివారించవచ్చు. ఎలాజిక్ ఆసిడ్స్ అనేవి క్యాన్సర్ పెరుగుదలను అరికడతాయి. ఈ పోషకం స్ట్రాబెర్రీ, రాస్ప్బెర్రీ, వాల్నట్, దానిమ్మ, ద్రాక్ష, ఆపిల్, కివీ పండ్లలో పుష్కలంగా ఉంటుంది కాబట్టి వాటిని తీసుకోవడం ద్వారా గర్భాశయ ముఖద్వారా (సర్విక్స్) కేన్సర్‌ను సమర్థంగా నివారించవచ్చు. అయితే ఇక్కడ ఓ చిన్న జాగ్రత్త పాటించడం మేలు చేస్తుంది. అదేమిటంటే... చక్కెర మోతాదులు తక్కువగా ఉండే (లో–గ్లైసీమిక్) పండ్లైన దానిమ్మ, ఆపిల్ వంటి పండ్లతో ఈ క్యాన్సర్ నివారణ మరింత తేలిక.తల, మెడ (హెడ్ అండ్ నెక్) క్యాన్సర్ల నివారణకు... పసుపు, నారింజ, ఎరుపు, ఆకుపచ్చ, తెల్లటి తొక్క కలిగి ఉండే పండ్లు తల, మెడ క్యాన్సర్లను నివారిస్తాయి. ఇందులో ఉండే ఫైటో కెమికల్స్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ల నివారణకు తోడ్పడతాయి. అలాగే ఈ పండ్లలోనే మెరుపు కలిగి ఉండే (కొద్దిపాటి మెరుపుతో బ్రైట్‌గా ఉండే) తొక్కతో ఉండే పండ్లు ఈ హెడ్ అండ్ నెక్ కేన్సర్లను మరింత సమర్థంగా నివారిస్తాయి. ఉదాహరణకు... నారింజ, కివీ, జామ, పైనాపిల్ పండ్లు తల, మెడ క్యాన్సర్లను నివారణకు సమర్థంగా తోడ్పడతాయి.బ్రెయిన్ కేన్సర్ కణుతుల నివారణకు... ఉల్లి, వెల్లుల్లి జాతికి చెందిన రెబ్బలలో మెదడు (బ్రెయిన్) కేన్సర్‌ను నివారించే గుణం ఎక్కువ. (అన్నట్టు వీటిలోని యాంటీ క్యాన్సర్ ΄ోషకాలు కేవలం బ్రెయిన్ కేన్సర్‌నే కాదు... ఇతరత్రా చాలా రకాల క్యాన్సర్ల నివారణకూ ఉపయోగపడతాయి). ఇక ఒమెగా 3–ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువగా ఉండే వాల్నట్, లిన్సీడ్ ఆయిల్‌తో మెదడు కేన్సర్లు తేలిగ్గా, సమర్థంగా నివారితమవుతాయి. ఇవి కేన్సర్ నివారణతోపాటు వ్యక్తుల్లో వ్యాధి నివారణ వ్యవస్థను (ఇమ్యూనిటీని) పటిష్టం చేసేందుకూ ఉపయోడపడతాయి.ఒవేరియన్ కేన్సర్ నివారణకు... క్యారట్ల వంటి వాటితో పాటు పసుపురంగూ, నారింజరంగుల్లో ఉండే వెజిటబుల్స్‌తో (ఉదాహరణకు బెల్‌పెప్పర్ వంటివాటితో) ఒవేరియన్ క్యాన్సర్‌ను సమర్థంగా నివారించవచ్చు. కెరటినాయిడ్స్ ఎక్కువగా ఉండే క్యారట్ వంటివి రోజూ అరకప్పు మోతాదులో రెండు సార్లు తీసుకోవడం వల్ల ఒవేరియన్ క్యాన్సర్‌ను సమర్థంగా నివారించవచ్చని అమెరికన్ కేన్సర్ సొసైటీ వంటి ప్రజోపయోగ, పరిశోధనల సంస్థల అధ్యయానాల్లో తేలింది.జీర్ణాశయ (స్టమక్) క్యాన్సర్ నివారణకు... జీర్ణాశయ (స్టమక్) కేన్సర్ నివారణకు కాప్సికమ్ (కూరగా వండటానికి ఉపయోగించే బెంగళూరు మిరప లేదా బెల్‌పెప్పర్)లో ఉండే ఫైటోకెమికల్స్ బాగా ఉపయోగపడతాయి. పరిమితంగా తీసుకునే మిరపకాయలు ’ మిర్చీ వంటి వాటితోపాటు మిరియాల పరిమిత వాడకం కూడా స్టమక్ క్యాన్సర్‌ను నివారిస్తాయి. ఆకుకూరలు, పొట్టుతో ఉండే ధాన్యాలు, తాజా పండ్లు అనేక కేన్సర్ల నివారణతో పాటు జీర్ణాశయ కేన్సర్ రిస్క్‌ను తగ్గిస్తాయి. జీర్ణాశయ క్యాన్సర్ నివారణకు ఉప్పు వాడకాన్ని గణనీయంగా తగ్గించడమూ అవసరమే.కాలేయ కేన్సర్ నివారణకు... పాలీఫీనాల్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే బ్లూబెర్రీ పండ్లు, విటమిన్–ఇ పుష్కలంగా ఉండే బెల్‌పెప్పర్, పాలకూర, బాదం వంటి ఆహార పదార్థాలు కాలేయ క్యాన్సర్ నివారణకు తోడ్పడతాయి. ఇక నూనెల్లో పొద్దుతిరుగుడు నూనె, కుసుమ నూనెలు కూడా కాలేయ కేన్సర్ నివారణకు దోహదపడతాయి. అయితే ఈ నూనెలను పరిమితంగా మాత్రమే తీసుకోవాలని గుర్తుంచుకోవాలి.ఎముక కేన్సర్ నివారణకు... యాంటీ ఆక్సిడెంట్స్ అనే పోషకాలు ఆక్సిడేషన్ ప్రక్రియతో వెలువడే విషయాలను (టాక్సిక్ మెటీరియల్స్‌ను) విరిచేస్తాయి. ఇలాంటి యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే పండ్లు, ఆకుకూరలు... ఉదాహరణకు బెర్రీలు, చెర్రీలు, టొమాటో, బ్రాకలీ వంటివి ఎముక కేన్సర్‌ను సమర్థంగా నివారిస్తాయి. అలాగే ఒమెగా 3–ఫ్యాటీ ఆసిడ్స్ అనేక పోషకాలు పుష్కలంగా ఉండే సాల్మన్ చేపలు, వాల్నట్లతోనూ ఎముక క్యాన్సర్లు బాగానే నివారితమవుతాయి. ఇక ప్రోటీన్లు ఎక్కువగా ఉండే మాంసాహారం, చేపలు, గుడ్లతోనూ ఎముక క్యాన్సర్ త్వరితంగా నివారితమవుతుంది.చివరగా... ఆహారం తీసుకోవడం అన్నది మన జీవక్రియల కోసం మనం రోజూ తప్పక చేసే పని అయినందున... ఆ ఆహారాన్నే తాజా ఆకుకూరలు, కూరగాయలు, తాజా పండ్ల రూపంలో మరింత ఆరోగ్యకరంగా తీసుకోవడం వల్ల ఒకే సమయంలో రెండు సౌకర్యాలు సమకూరతాయి. అవి ఆరోగ్యంగా ఉండటం, అలా ఆరోగ్యంగా ఉండటం వల్ల వ్యాధి నిరోధకత మన సొంతం కావడంతో ఈ ఇమ్యూనిటీ కూడా క్యాన్సర్ల నివారణకు తోడ్పడుతుందని గుర్తుంచుకోవాలి. ఇలా తీసుకున్న ఆహారం వల్ల ఒళ్లు పెరగకుండా తగినంత వ్యాయామమూ చేయడం వల్ల ఈ మార్గంలో క్యాన్సర్ నివారణ మరింత సమర్థంగా చేయడం సాధ్యమవుతుంది. డాక్టర్ రాజేష్ బొల్లం, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్నిర్వహణ యాసీన్ -
కాలు మీద కాలు దర్జా కాదు ... అమర్యాద...అనారోగ్యకరం కూడానా?
‘‘ఇది నా కాలు ఈ కాలు కూడా నాదే. నా కాలు మీద నా కాలు వేసుకుంటే నీకేంటి?’’అని అడుగుతాడు పుష్ప సినిమాలో హీరో. ఈ డైలాగ్ ఎంత పాప్యులరో.. కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం అనే అంశం కూడా ఇప్పుడు అంతకు మించి పాప్యులర్‌గా మారింది. ఆ మధ్య టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ దగ్గర నుంచి తాజాగా ప్రధానితో మహిళా క్రికెటర్ల సమావేశం దాకా...అనేక సందర్భాల్లో కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం అనేది చర్చనీయాంశంగా మారుతోంది. మన సంప్రదాయాల ప్రకారం... ఎవరి ముందైనా మనం కాళ్ల మీద కాలు వేసుకుని కూర్చోవడం అంటే అవతలి వ్యక్తికి మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదని మనం భావిస్తున్నట్టు. తరాల నుంచీ కొనసాగుతున్న ఈ నమ్మకమే ఆధునిక సమాజంలో తరచుగా వివాదస్పదం అవుతోంది. ఆ వివాదాలు అలా ఉంచితే... అసలు కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం అనేది అనారోగ్యకరం కూడా అంటున్నాయి అధ్యయనాలు కొన్ని అభిప్రాయాలు. చాలా మందికి ఒక కాలు మీద మరొక కాలు వేసుకుని కూర్చోవడం చాలా సౌకర్యంగా ఉంటుంది. పాదం అప్పుడప్పుడు తిమ్మిరిగా అనిపించడం ఉన్నా అది సౌకర్యవంతంగా ఉంటుంది అని అదే ఫాలో అవుతారు. కానీ అది మీకు మంచి చేస్తుందా? హాని చేస్తుందా? చేస్తే ఎవరికి? ఎలా? ఎందుకు?గర్భిణీలకు...గర్భధారణ సమయంలో, శరీరం వివిధ రకాల మార్పులకు లోనవుతుంది. గర్భాశయం విస్తరించినప్పుడు, గురుత్వాకర్షణ కేంద్రం ముందుకు మారుతుంది. తద్వారా సాధారణానికి భిన్నంగా నడుస్తున్నట్లు, నిలబడి, కూర్చోవడం జరుగుతుంది. గర్భధారణ సమయంలో కండరాల ఒత్తిడి, వెన్నునొప్పి తిమ్మిర్లు అన్నీ సాధారణం. కాళ్ళు క్రాస్ చేసి కూర్చోవడం వల్ల బిడ్డకు ఎటువంటి హాని జరగకున్నా గర్భిణికి చీలమండ వాపు లేదా కాళ్ళ తిమ్మిరి కలిగేందుకు ఇది దోహదం చేస్తుంది.రక్తపోటు...ఎవరికైనా రక్తపోటును పరీక్షించే సమయంలో సాధారణంగా రెండు పాదాలను నేలపై ఉంచమని అడుగుతారు. ఎందుకంటే కాళ్లు ఒకదానిపై మరొకటి వేయడం వల్ల రక్తపోటు పెరుగుతుంది కాబట్టి. జర్నల్ ఆఫ్ క్లినికల్ నర్సింగ్ ట్రస్టెడ్ సోర్స్‌లో ప్రచురించిన ఒక అధ్యయనంలో కాళ్లను ఒకదానిపై ఒకటి వేసి కూర్చోవడం వల్ల రక్తపోటులో కలిగే మార్పులను స్పష్టంగా గమనించారు. అదే విధంగా జర్నల్ ఆఫ్ హైపర్‌టెన్షన్ లో ప్రచురించిన మరొక అధ్యయనంలో, తమ చీలమండను మోకాలిపై ఉంచడం ద్వారా రక్తపోటు పెరిగినట్లు కనుగొన్నారు.వెరికోస్‌వెయిన్స్...కాళ్ళ నుంచి బయటకు వచ్చే ఉబ్బిన, మెలితిరిగిన, త్రాడు లాంటి సిరలు యవెరికోస్ వెయిన్్స. సాధారణంగా తొడల వెనుక లోపలి కాలుపై ఎక్కువగా కనిపిస్తాయి. సిరల్లోని కవాటాల సమస్య కారణంగా వెరికోస్ వెయిన్ ్స ఏర్పడతాయి, ఇవి గుండె వైపు రక్తాన్ని పంప్ చేయడానికి చాలా కష్టపడి పనిచేస్తాయి. రక్తం పైకి కదులుతున్నప్పుడు, వన్–వే వాల్వ్‌లు తెరుచుకుంటాయి, మూసుకుపోతాయి, రక్తం తిరిగి క్రిందికి లీక్ అవ్వకుండా నిరోధిస్తాయి. అయితే, ఈ కవాటాలు బలహీనమైనప్పుడు లేదా దెబ్బతిన్నప్పుడు, గురుత్వాకర్షణ శక్తి రక్తాన్ని వెనక్కి లాగుతుంది. దీనిని సిరల లోపం అంటారు. ఆ రక్తం వెనక్కి వచ్చి, సేకరించి, ఉబ్బినప్పుడు సిరలు వెరికోస్ వెయిన్స్‌గా మారతాయి. చాలా సేపు నిలబడటం కూర్చోవడం వల్ల వెరికోస్ వెయిన్ ్స ప్రమాదం పెరుగుతుంది,అయితే కాలు మీద కాలు వేసుకోవడం వల్ల ఈ ప్రభావం ఉంటుందని ఒక అభిప్రాయం ఉన్నప్పటికీ శాస్త్రీయంగా నిర్ధారించే ఆధారాలు లేవు.భంగిమలో మార్పు...కాలు మోకాలిపై ఎక్కువసేపు ఉంచడం వల్ల కటి తిప్పడానికి వంగడానికి కారణమవుతుంది. ఇది దిగువ వీపులో నొప్పిని కలిగిస్తుంది. ఇది కాలక్రమేణా వెన్నెముక తప్పు అమరికకు కూడా దారితీస్తుంది. కూర్చోవడంలో సరైన భంగిమ లేనప్పుడు, ఆ పరిస్థితిని కండరాలు సరి చేయవలసి వస్తుంది. దీని అర్థం అవి అవసరమైన దానికంటే ఎక్కువగా పనిచేస్తాయి, ఇది నొప్పికి దారితీస్తుంది. అయితే కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం అనేది పూర్తిగా మానేయాలని దీని అర్థం కాదు. కొన్ని సమస్యలైతే ఉన్నాయి.. కాబట్టి వీలైనంత వరకూ ఎక్కువసేపు అదే భంగిమలో కూర్చోవడాన్ని నివారించడం మంచిది.(చదవండి: భారతీయుల వివాహ వేడుకను చూసి..కొరియన్ కోడియా ఫిదా!) -
మంచి కొలెస్ట్రాల్‌తో తగ్గే అల్జైమర్స్ ముప్పు!
కొలెస్ట్రాల్ అనగానే అది చెడ్డదనే భావన చాలామందిలో ఉంటుంది. అయితే ఇటీవల వైద్యవిజ్ఞానంపట్ల పెరిగిన అవగాహనతో కొలెస్ట్రాల్‌లో మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ ఉంటాయన్న విషయాలు చాలామందికి తెలుసు. ఇందులో మంచి కొలెస్ట్రాల్ గుండెజబ్బులను నివారించడమే కాకుండా, యౌవనంలో మంచి కొలెస్ట్రాల్ తీసుకునేవారిలో వృద్ధాప్యంలో కొందరిలో వచ్చే అల్జైమర్స్నూ నివారిస్తుందంటున్నారు ఫ్రాన్స్, ఇంగ్లాండ్‌కు చెందిన పరిశోధకులు. హై డెన్సిటీ లైపో ప్రోటీన్ (హెచ్‌డీఎల్) అని పిలిచే మంచి కొలెస్ట్రాల్ గుండె రక్తనాళాల్లో పేరుకుపోయే ప్లాక్ అనే ఒకరకం అడ్డంకిని తొలగించడంతోపాటు మెదడులో అభివృద్ధి చెందే ప్లాక్ (గార)ను పూర్తిగా తొలగించకపోయినప్పటికీ చాలావరకు నిరోధిస్తుందంటున్నారు కొలెస్ట్రాల్‌పై పరిశోధనలు సాగిస్తున్న పరిశోధకులు. అలా అది గుండెపోటు, బ్రెయిన్‌స్ట్రోక్ ముప్పులను తప్పిస్తుంది. ఇంకా ఆ పరిశోధకులు చెబుతున్న అంశాలను బట్టి... మన శరీరానికి అందాల్సిన మంచి కొలెస్ట్రాల్ తగినంతగా అందనివారిలో 60 ఏళ్లు దాటాక చాలామందికి మతిమరపు వచ్చే అవకాశాలు ఎక్కువ. మంచి కొలెస్ట్రాల్ తగ్గిన వారి మెదడుల్లో జ్ఞాపకశక్తిని బ్లాక్ చేసేలా ఒకరకం గార (΄్లాక్) అభివృద్ధి చెందుతుంది. అది మెదడులోని నాడీ కణాల మధ్య సాగే ఎలక్ట్రిక్ తరంగాల మధ్య ఒక అడ్డంకిగా మారి జ్ఞాపకశక్తిని తగ్గి స్తుంది. దీన్ని బట్టి తెలిసేదేమిటంటే... యుక్తవయసులో తగినంత మంచి కొలెస్ట్రాల్ తీసుకోనివాళ్లలో వారి వృద్ధాప్యంలో అల్జైమర్స్ డిసీజ్ వచ్చే అవకాశాలు ఎక్కువని చెబుతున్నారా పరిశోధకులు. ఈ విధంగా మనకు మంచి కొలెస్ట్రాల్ మేలు చేస్తుందని మరోమారు తేటతెల్లమైంది. అందుకే ఆరోగ్యం కోసం మనం తీసుకునే ఆహారంలో మంచి కొలెస్ట్రాల్ మోతాదులు తగ్గకుండా చూసుకోవడం మేలు చేస్తుంది. ఇందులోని అంశాలన్నీ ‘జర్నల్ ఆఫ్ అమెరికన్ హార్ట్ అసోసియేషన్’ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఇటీవల కొలెస్ట్రాల్ అంటే చెడుదనే భావన పెంచుకున్న కొందరు కొలెస్ట్రాల్‌పై అపోహలు పెంచుకుని చెడు కొలెస్ట్రాల్‌తోపాటు మంచి కొలెస్ట్రాల్‌ను కూడా తీసుకోవడం లేదని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిశోధనల నేపథ్యంలో మంచి కొలెస్ట్రాల్ మోతాదులు ఎక్కువగా ఉండే చేపలు, కోడిగుడ్లలోని తెల్లసొన (ఎగ్ వైట్), నట్స్, కాయధాన్యాల వంటి ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలని ఈ అధ్యయనంలో పాలుపంచుకున్న పరిశోధకులు, న్యూట్రిషనిస్టులు సూచిస్తున్నారు. (చదవండి: ఆందోళన నుంచి వచ్చింది ఒక ఐడియా!) -
చక్కెర బాధితులు తినదగ్గ దుంప... చిలగడదుంప!
భూమిలో పండే దుంపలు షుగర్ బాధితులకు మంచివి కావనీ, ఎందుకంటే అందులో కార్బోహైడ్రేట్లు ఎక్కువ కాబట్టి డయాబెటిస్ బాధితుల్లో చక్కెర మోతాదులను పెంచేస్తాయని నిపుణులు చెబుతుంటారు. అందుకే చాలామంది షుగర్ బాధితులు ఆలుగడ్డలు (బంగాళదుంపలు) తినడానికి వెనకాడుతుంటారు. అయితే మిగతా దుంపల విషయం ఎలా ఉన్నా... చిలగడదుంపలతో మాత్రం ఆ ప్రమాదం లేదంటున్నారు ఆహార నిపుణులు. దీని నుంచి విడుదల అయ్యే చక్కెర మోతాదులు చాలా తక్కువ. అంటే ఇవి తిన్నప్పుడు వీటిలోంచి వెలువడే చక్కెర తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ (లో– గ్లైసిమిక్ ఇండెక్స్) ఉండటం వల్ల దీనితో అంతగా ప్రమాదం ఉండదనీ, పైగా ఇందులో విటమిన్–ఏ కూడా ఎక్కువగా ఉన్నందున చక్కెర వ్యాధి ఉన్నవారు ఈ దుంపను తినవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే దాన్ని పరిమితంగా తీసుకోవడమే మంచిది. (చదవండి: ‘బ్యాటర్డ్ ఉమన్ సిండ్రోమ్’: ఇంటి హింస ఇంతింతై..) -
‘బ్యాటర్డ్ ఉమన్ సిండ్రోమ్’: ఇంటి హింస ఇంతింతై..
బ్యాటర్డ్ ఉమన్ సిండ్రోమ్ అనేది మహిళలు తమ గృహహింస కారణంగా ఎదుర్కొనే మనోవేదన. ఒకరకంగా చూస్తే తీవ్రమైన వేదన కారణంగా అంటే రేప్‌కు గురైనవాళ్లూ, యుద్ధాల్లో సర్వం పోగొట్టుకున్నవాళ్లూ అనుభవించే అత్యంత వేదనాభరితమైన కండిషన్‌తో వచ్చే పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (పీటీఎస్డీ)లో ఇదో రకం అని చెప్పవచ్చు. మహిళలు తమ పార్ట్నర్ చేతుల్లో అనుభవించిన గృహహింస కారణంగా ఇది తమ ఖర్మ అంటూ సమాధానపడుతూ నిత్యం అనుభవించే రంపపుకోత కారణంగా వాళ్లు అనుభవించే మానసిక సమస్యే ఈ ‘బ్యాటర్డ్ ఉమన్ సిండ్రోమ్’. ఈ మానసిక సమస్యపై అవగాహన కోసమే ఈ కథనం...పెళ్లి తర్వాత భర్త లేదా జీవిత భాగస్వామి పెట్టే వేదనలను అనుభవించే భార్యల్లో కొందరికి ఇది తమ ఖర్మ అనే ఫీలింగ్ తప్ప... దీన్ని ఎదుర్కోవాలనిపించడం, పోలీసులకు ఫిర్యాదు చేయాలనిపించడం కూడా ఉండదు. అలా మొదలయ్యే ‘బ్యాటర్డ్ ఉమన్ సిండ్రోమ్’లో ఆ మహిళ... తన భర్త అలా హింసిస్తుండటాన్ని కూడా తన తప్పుగానే అనుకుంటూ ‘అపరాధభావన’తో బాధపడుతుంటుంది.సిండ్రోమ్ తాలూకు నాలుగు దశలివి... బ్యాటర్డ్ ఉమన్ సిండ్రోమ్‌కు దారితీసే వాళ్ల వాళ్ల ఇంటి పరిస్థితులు ప్రతి మహిళకూ వేర్వేరుగా ఉన్నప్పటికీ... వారు అనుభవించే కొన్ని కామన్ దశలను బట్టి చూసినప్పుడు వారి మానసిక స్థితి ఈ కింద పేర్కొన్న నాలుగు దశల్లో కొనసాగుతుంది. మొదటి రెండు దశల్లో మహిళలు నిశ్శబ్దంగా తమ వేదనలు అనుభవించినప్పటికీ... ఈ వేదనల నుంచి బయటకు వచ్చేందుకు తాము చేసే ప్రయత్నాలు ఈ చివరి రెండు దశల్లో కొంతమేర జరుగుతాయి. 1. డీనియల్ : తాము వేదన అనుభవిస్తున్న సంగతి తెలియని పరిస్థితి ఇది. భర్త తమను వేధిస్తున్నారని కూడా వాళ్లు అంగీకరించరు. అదేదో ఈసారికి అలా జరిగింది తప్ప భర్త తమను హింసిస్తున్నట్టు గుర్తించడానికి నిరాకరించే దశే ఈ ‘డీనియల్’. 2. గిల్టీ (అపరాధభావన) : భర్త తనను హింసించడానికి లేదా కొట్టడానికి ఒక రకంగా తాను చేసిన తప్పే అని సర్దిచెప్పుకునే ధోరణే ఈ అపరాధభావనకు కారణం. 3. ఎన్‌లైట్‌మెంట్ : భర్త చేతుల్లో ఇలా తరచూ హింసకు గురికావడం తమకు తగదనీ, దాన్నుంచి బయటకు రావాలనే భావన కలగడం ఈ ఎన్‌లైట్‌మెంట్ దశలో జరుగుతుంది. 4. రెస్పాన్సిబిలిటీ : ఈ దశలో వారు తామీ హింస నుంచి బయటపడటం అన్నది తమ చేతుల్లోనే ఉందనీ, అది తమ బాధ్యత అని గ్రహిస్తారు. అవసరమైతే బంధం నుంచి బయటపడైనా ఈ హింసనుంచి విముక్తి పొందవచ్చని అనుకునే దశ ఇది. బ్యాటర్డ్ ఉమన్ సిండ్రోమ్ మొదలయ్యేదిలా... మొదట్లో ఏదో మనస్పర్థల కారణంగా భర్త ఆగ్రహానికి గురైనప్పుడు మహిళ అంతగా ప్రతిఘటించక΄ోవచ్చు. ఇది పెళ్లయిన కొత్తలో ఇలా జరగడానికి అవకాశముంది. భర్త తొలుత శారీరకంగానో లేదా మానసికంగానో బాధపెట్టాక ఎందుకో అలా జరిగి΄ోయిందనీ, ఇకపై అలా జరగదంటూ ఎమోషనల్‌గా మాట్లాడతాడు. ఆమె ఆమోదం పొందడం కోసం అవసరమైనదానికంటే ఎక్కువ రొమాంటిక్‌గా వ్యవహరిస్తూ ఆమెను నార్మల్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఈ హింస అక్కడితో ఆగకుండా అదేపనిగా మాటిమాటికీ కొనసాగుతూ ఉంటుంది. దాంతో తొలుత అతడు చెప్పే (కన్వీన్స్ చేసే) అంశాలకు లొంగి΄ోయిన మహిళ ఆ తర్వాత అదో రొటీన్ తంతు అని గ్రహించి, పెద్దగా స్పందించడమూ మానేస్తుంది. అలా గృహహింస వేదనలకు గురవుతూనే ఉంటుంది. ఇలా జరగడానికి ఆర్థిక సమస్యలూ, విడి΄ోతామేమోనన్న భయం, తనను తాను సముదాయించుకునే సర్దుబాటు ధోరణీ... ఇలాంటి కారణాలు చాలానే ఉండవచ్చు.నిర్వహణ: యాసీన్ప్రభావాలు... స్వల్పకాలిక ప్రభావాలివి... జీవితం వృథా అనుకోవడం, తీవ్రమైన కుంగుబాటు (డిప్రెషన్) ఆత్మవిశ్వాసం లోపించడం (లో సెల్ఫ్ ఎస్టీమ్) తీవ్రమైన ఉద్విగ్నత (సివియర్ యాంగ్జైటీ).దీర్ఘకాలిక ప్రభావాలివి... తరచూ గతకాలపు జ్ఞాపకాల్లోకి వెళ్లడం, తానేమిటో మరచి΄ోయి వేరేగా ప్రవర్తించడం (డిసోసియేటివ్ స్టేట్), తీవ్రంగా ప్రతిస్పందించడం (వయొలెంట్ ఔట్‌బరస్ట్... ఇది సుదీర్ఘకాలం తర్వాత వచ్చే పరిణామం) హైబీపీ, గుండెజబ్బుల వంటివి కనిపించడం, కీళ్లనొప్పులు, ఆర్థరైటిస్ దీర్ఘకాలికం (క్రానిక్)గా వచ్చే వెన్నునొప్పి, తలనొప్పి.బ్యాటర్డ్ ఉమన్ సిండ్రోమ్‌కు ఇవే గుర్తులు... హింసించే తన భర్తకు అన్నీ తెలుసు... తనకేమీ తెలియనందువల్ల తనవల్లనే తప్పు జరిగిందేమోననే అపరాధభావన ∙జరిగిందానికి తామే బాధ్యురాలినేమో అనే భావనతో కలిగే వేదన ∙జరిగిందీ, తాను అనుభవించిన వేదనను తమ ఇంటివాళ్లకూ, ఫ్రెండ్స్‌కూ చెప్పక΄ోవడం ∙పిల్లల జీవితం ఏమై΄ోతుందోనన్న తీవ్రమైన ఆందోళన. -
మీ టూత్ బ్రష్ మార్చి ఎంత కాలమైంది?
చాలా మంది ఎన్నో ఖర్చులు పెడతారు. ఎన్నో వస్తువులు వెంట వెంటనే మార్చి కొత్తవి కొంటూ ఉంటారు కానీ నెలల తరబడి ఒకే టూత్ బ్రష్‌ను ఉపయోగిస్తుంటారు. ఇది ప్రమాదకరమంటున్నారు దంతవైద్యులు. ఒకేటూత్ బ్రష్‌ను దీర్ఘకాలం పాటు ఉపయోగించడం వల్ల నోటి ఆరోగ్యం క్షీణించి, బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతుంది. ఇంతకీ ఎంతకాలానికి ఒకసారి టూత్ బ్రష్‌ను మార్చాలి, బ్రష్‌ను ఎప్పుడెప్పుడు మార్చుతుండాలో తెలుసుకుందాం. దంతవైద్యులు ప్రతి 2 నుండి 3 నెలలకు ఒకసారి టూత్ బ్రష్ మార్చాలంటారు. ఎందుకంటే టూత్ బ్రష్ పాతదైతే, దాని బ్రిజిల్స్ దెబ్బతింటాయి. ఇది బ్రష్ చేసేటప్పుడు చిగుళ్ళకు హాని కలిగిస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే మొత్తం ఆరోగ్యం కూడా మీ దంతాల ఆరోగ్యానికి సంబంధించినది. అందువల్ల, దంతాలను సరిగ్గా శుభ్రం చేయడం చాలా ముఖ్యం.చాలా మృదువుగా లేదా విప్పి ఉన్న బ్రిస్టల్స్ దంతాలను సరిగ్గా శుభ్రం చేయలేవు. దాంతో దంతాలపైన పాచి పేరుకుపోతుంది ఇది దంత క్షయం, చిగురువాపు ఇతర నోటి ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. నోటి ఆరోగ్యం బాగుండక΄ోతే అది క్రమేణా హృద్రోగానికి, నోటి క్యాన్సర్‌కు తలుపులు తెరుస్తుంది. దాంతోపాటు నోటి ఆరోగ్యం బాగుండకపోతే మొత్తం జీర్ణవ్యవస్థపైనే దాని ప్రభావం పడుతుందని, కాబట్టి కనీసం మూడు నెలలకోసారి అయినా బ్రష్ మార్చడం మంచిదని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. అదేవిధంగా వైరల్ ఫీవర్, తీవ్రమైన జలుబు, దగ్గుతో బాధపడినప్పుడు, టైఫాయిడ్ వంటి వాటి నుంచి కోలుకున్న వెంటనే కూడా బ్రష్ మార్చడం మంచిదని నిపుణుల సలహా. (చదవండి: బాల స్టార్టప్... బ్రహ్మాండం!) -
మందు పెట్టడం, కక్కించడం... రెండూ అపోహలే!
మా పెళ్లయి ఆరు సంవత్సరాలయింది. ఇద్దరు పిల్లలు. మాది అన్యోన్య దాంపత్యమే. అయితే. ఇటీవలే ఆయనకు ఒకావిడతో పరిచయం అయింది. అప్పటినుంచి నన్నూ, పిల్లలనీ పట్టించుకోవడం లేదు. ఇష్టం వచ్చినప్పుడు ఇంటికి రావడం, వెళ్లడం.... అదేమని అడిగితే, నా ఇష్టం అని సమాధానం చెబుతారు. నామీద ఎంతో ఇష్టంతో నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుని చాలా సంతోషంగా నాతో ఉన్నాయన ఈ మధ్య నాకు క్రమేపీ దూరమై మరో మహిళకు దగ్గరవుతున్నారు. మా బంధువులు ఇది తెలుసుకుని ఆయనకు ఆమె మందుపెట్టి తనవైపు తిప్పుకున్నదని, అందుకే ఆమె వ్యామోహంలో పడిపోయి ఉంటాడని చెబితే రెండుసార్లు మందు కూడా కక్కించాం. అయినా ఆయనలో ఎలాంటి మార్పూ రాలేదు. మళ్లీ ఇంకోసారి మందు కక్కించమంటున్నారు. అసలు నిజంగా ఒక వ్యక్తిని మందుపెట్టి ఇలా లోబరచుకోవడం జరుగుతుందా? మేము ఎన్నిసార్లు కక్కించాలి?– స్వరాజ్యలక్ష్మి, తణుకుమందుపెట్టడం, మందు కక్కించడం రెండూ ఫార్సే! అనాదిగా మనలో నాటుకు΄ోయిన మూఢనమ్మకాలకు ఇది నిదర్శనం తప్ప వీటిలో ఏమాత్రం నిజం లేదు. విషప్రయోగం చే సి, ఒక వ్యక్తిని హత్య చేయవచ్చేమోగాని, ఒక వ్యక్తిని లొంగదీసుకోవడానికి మనసు మార్చి మరొకరివైపు మళ్లించడానికి మందులంటూ ఏమీ లేవు. ఉండవు. మనకున్న కొన్ని నమ్మకాల వల్ల మందు పెట్టడం, మంత్రం వేయడం, చేతబడి చేయించడం లాంటివి ఉన్నాయని మన పూర్వీకులు మనకు నూరి΄ోశారు. ఈ మూఢనమ్మకాలను ఆధారం చేసుకుని మందు పెట్టే వారు కొందరు, ఆ పెట్టిన మందును కక్కించే స్పెషలిస్టులు కొందరూ తయారయ్యారు. ఎప్పుడో కొన్ని రోజుల కిందట పెట్టిన మందులు మాకులూ ఇన్నాళ్లు కడుపులో ఉందే అవకాశమే లేదు. అది జీర్ణమైనా అవాలి లేదా విరేచనం ద్వారా రెండు రోజుల్లో బయటపడాలే తప్ప అన్నేసి రోజులు అలాగే లోపల అంటిపెట్టుకుని΄ోయే అవకాశమే లేదు. శాస్త్రీయమైన ఇలాంటి నిజాలు తెలియక చాలామంది అవన్నీ నిజమని మీలాగా అ΄ోహపడుతుంటారు. ఇప్పటికయినా మీరు ఆ పెట్టని మందును కక్కించే ప్రయత్నాలు విరమించి, మీ ఆయన ఎందుకలా మూడోవ్యక్తి వైపు ఆకర్షితులవుతున్నారో ఆలోచించండి. మీలో నచ్చనిది, ఆవిడలో నచ్చినది ఏదైనా ఉందేమో మీకు మీరుగా ఆలోచించండి లేదా ఓర్పుగా నేర్పుగా ఆయన నుంచి తెలుసుకుని నిదానంగా ఆయనను మళ్లీ మీవైపు తిప్పుకునే ప్రయత్నం చేయండి. కొన్నిసార్లు మీలో ఎలాంటి నెగటివ్స్ లేకపోయినా, కొందరు మగవారు మనస్తత్వరీత్యా ఇలా ఇతరులవైపు ఆకర్షితులవుతారు. అదే నిజమైతే, మీరు ఇద్దరూ కలిసి మానసిక నిపుణులను సంప్రదిస్తే, వారు మరింత లోతుగా పరిశీలించి ఇరువురికీ కౌన్సెలింగ్ చేసి మీ సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తారు. ఆల్ ది బెస్ట్!డా. ఇండ్ల విశాల్ రెడ్డి,సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ.( మీ సమస్యలు,సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com)(చదవండి: -
అందువల్లే టీనేజర్లలో పాప్‌కార్న్ బ్రెయిన్ సిండ్రోమ్..!
భారతీయ టీనేజర్లలో ఎక్కువ మంది "పాప్‌కార్న్ బ్రెయిన్ సిండ్రోమ్" బారినపడుతున్నారని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల కాలంలో చిన్నపిల్లల నుంచి యువకుల వరకు చాలామంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. అసలేంటి పాప్‌కార్న్ బ్రెయిన్ సిండ్రోమ్? ఎందువల్ల వస్తుందంటే..అధిక స్క్రీన్ సమయం, డిజిటల్ స్టిమ్యులేషన్‌తో ముడిపడి ఉన్న పరిస్థితినే పాప్‌కార్న్ బ్రెయిన్ సిండ్రోమ్‌గా వ్యవహరిస్తారు. సోషల్ మీడియాలో, ఆన్లైన్ కార్యకలాపాల్లో ఎక్కువ సేపు గడిపితే ఇలా వచ్చేస్తుందా అంటే..ఔనని చెబుతున్నారు వైద్యులు. దీనివల్ల శ్రద్ధ అనేది లోపిస్తుందట. ఒక పనిపై ఫోకస్ అనేది భారంగా మారిపోతుందట. ఇటీవల కాలంలో యువకులు, పెద్దలు స్కీన్ సమయాన్ని పెంచేస్తున్నారు. ముఖ్యంగా యాప్‌లు, గేమ్‌లు, వీడియోలు అంటూ తదేకంగా డిజిటల్ కార్యకలాపాల్లోనే టైం స్పెండ్ చేస్తున్నారు. దాంతో ఈ బ్రెయిన్ సిండ్రోమ్ బారినడుతున్నట్లు తెలిపారు. ఏదైన అతి అయితే ప్రమాదమే అన్నది జగమెరిగిన సత్యం. అలానే డిజిటల్ ఓవర్‌లోడ్ శారీరకంగానే కాకుండా మానసికంగా హాని అని, దీనివల్ల దృష్టి లోపం, జ్ఞాపకశక్తి సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. పాప్‌కార్న్ బ్రెయిన్ సిండ్రోమ్ అంటే..2011లో వాషింగ్టన్ విశ్వవిద్యాలయ పరిశోధకుడు డేవిడ్ లెవీ ఈ పేరుని సూచించారు. ఏ విషయంపైన శ్రద్ధ, ఫోకస్ లేకపోవడాన్ని పాప్‌కార్న్ గింజలు మాదిరిగా మెదడు తన అటెన్షన్ కోల్పోయింది అనే సూచగా పరిశోధకుడు లెవీ ఇలా వ్యవహరించారు. ఈ డిజిటల్ మీడియా వల్ల ఒక వ్యక్తి ఆలోచనలు ఒకదాని నుంచి మరొకదానికి వేగంగా మారిపోతుంటాయి. దాంతో శ్రద్ధ అనేది కరువవుతుంది. అంటే ఒకే కార్యచరణపై దృష్టి పెట్టడంలో ఇబ్బంది ఎదురవుతుంది. మానసికంగా అస్థిరత ఏర్పడుతుంది. ఇలాంటి స్థితినే పాప్‌కార్న్ బ్రెయిన్ సిండ్రోమ్ అంటారు. అధికారికంగా వైద్య నిర్థారణ కానప్పటికీ..ఈ పరిస్థితి చాలా తీవ్రమైనదని చెబుతున్నారు నిపుణులు. ఎందువల్ల వస్తుందంటే..? తరుచుగా మల్టీటాస్కింగ్, సోషల్ మీడియా, డిజిటల్ నోటిపికేషన్ తదితరాలే ఈ పరిస్థితికి కారణమని చెబుతున్నారు నిపుణులు.వాటిలో కొన్ని కారణాలు..అధిక స్క్రీన్ సమయంమొబైల్లో ఎక్కువ సమయంల గడపడం వల్ల డిజిటల్ కాని కార్యకలాపాలపై దృష్టి పెట్టడం కష్టమవుతుంతక్షణ సంతృప్తిఇంటర్నెట్, సోషల్ మీడియా త్వరిత రివార్డులను అందిస్తాయి. అది మెదడులో డోపమైన్‌ను పెంచి రోజువారీ పనులను నిస్తేజంగా, ఆసక్తికరంగా కానివిగా చేస్తుంది.నిరంతర నోటిఫికేషన్లుతరచుగా వచ్చే నోటిఫికేషన్లు మన దృష్టిని విచ్ఛిన్నం చేస్తాయి. ఇది చాలా మానసిక అంతరాయాలను కలిగిస్తుందట. ఒకే పనిపై దృష్టి పెట్టడం కష్టతరం అవుతుందట.మల్టీ టాస్కింగ్వేర్వేరు యాప్‌లు లేదా పనుల మధ్య త్వరితగతిన మారడం వల్ల శ్రద్ధ తగ్గిపోతుందటఎవరిని ఎక్కువగా ప్రభావితం చేస్తుందంటే?వైద్యుల అభిప్రాయం ప్రకారం, పాప్‌కార్న్ మెదడు ఎక్కువగా టీనేజర్లు, యువకులలో కనిపిస్తున్నప్పటికీ, ఈ పరిస్థితి ఇప్పుడు 30 నుంచి 45 సంవత్సరాల వయస్సు గల వారిలో కూడా సాధారణంగా కనిపిస్తోందని చెబుతున్నారు వైద్యులు. అయితే, ఇది ఇంటర్నెట్ వ్యసనం లాంటిది కాకపోయినా.. రోజువారీ జీవితంలో పని సంబంధంల మధ్య అంతరాయం కలిగించి, సోమరిగా నిలబెట్టేంత చెడ్డదిని చెబుతున్నారు నిపుణులు. కలిగించడంలో సమానంగా చెడ్డది. ఈ పాప్‌కార్న్ బ్రెయిన్ శ్రద్ధ, భావోద్వేగ శ్రేయస్సును ప్రభావితం చేస్తుంది. ఈ పరిస్థితి లక్షణాలు..చిరాకు, ఆందోళన పెరగడంనిద్రలేమి దృష్టిని కేంద్రీకరించడంలో లేదా శ్రద్ధ వహించడంలో ఇబ్బందిఅతిగా అప్రమత్తంగా లేదా ఒత్తిడికి లోనవుతున్నట్లు అనిపించడంఆఫ్లైన్ జీవితం నీరసంగా లేదా ఆసక్తిలేనిదిగా అనిపిస్తుంది.అధిక ఒత్తిడికి గురవ్వ్వడంఈ పరిస్థితిని అధిగమించాలంటే..శ్వాస వ్యాయామాలుప్రతిరోజూ కనీసం 10 నిమిషాలు ధ్యానం చేయండిఒకేసారి ఒక పనిపై దృష్టి పెట్టడం అనేది ప్రాక్టీస్ చేయడం అంటే సింగిల్ టాస్కింగ్‌కి ప్రాధాన్యత ఇవ్వడం లాంటిది. జ్ఞాపకశక్తిని పెంపొందించేలా యోగా ఆసనాలుస్క్రీన్ సమయాన్ని సర్దుబాటు చేయడంటెక్-ఫ్రీ జోన్‌ను నియమించుకోవడంస్వయంగా ఎవరికి వారుగా డిజిటల్ డిటాక్స్‌కు ప్రాధాన్యత ఇవ్వడంస్కీన్న సమయం, ఎలక్ట్రిక్ పరికరాలతో గడపడంలో సరిహద్దును ఏర్పాటు చేసుకోవడం వంటి వాటితో ఈ సమస్యను అధిగమించగలుగుతారనా చెబుతున్నారు నిపుణులు. లేదంటే అచ్చం పాప్‌కార్న్ మాదిరిగా బ్రెయిన్ ఏపని మీద ఫోకస్, శ్రద్ధని కనబర్చడంలో విఫలమై మానసికంగా స్ట్రగులవుతారని హెచ్చరిస్తున్నారు. ఆదిలోనే ఈ పరిస్థితిని గుర్తించి రికవరీ అయ్యే ప్రయత్నాలు చేయడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: రుతుస్రావ బాధలు మరింత సుదీర్ఘంగా!) -
బరువుని నిర్వహించడానికి ఐదు వాక్‌లు..! జిమ్‌తో పనిలేదు..
వాకింగ్ చేయడాన్ని రోటీన్ పనిగా, తేలిగ్గా చూస్తాం. కానీ ఇది అద్భుతమైన ఫలితాలనిస్తుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉండటంలో కీలకపాత్ర పోషిస్తుంది. అయితే చేసే తీరులో సరైన విధానం ఉంటే వాకింగ్‌కి మించిన వర్కౌట్ లేదంటున్నారు ఆరోగ్య నిపుణులు. దాంతో బరువుని సులభంగా నిర్వహించొచ్చు, అధిక బరువు అనే సమస్య రాదు అని నమ్మకంగా చెబుతున్నారు. అంతేగాదు భోపాల్‌కు చెందిన పోషకాహార నిపుణురాలు, ఆరోగ్యకోచ్ రేణు రఖేజా ఈజీగా చేసే ఐదు రకాల వాక్‌లను సోషల్ మీడియా వేదికగా పరిచయం చేశారు. ఇవి మొత్తం ఆరోగ్యాన్ని శరీర తీరుని మార్చగలవని చెబుతోందామె. పైగా జిమ్‌కి వెళ్లాల్సిన పని ఉండదు అని అంటున్నారు. మరి ఆ ఐదు వాక్లేంటో చూద్దామా..!.నడకకు మించిన అద్భుతమైన వ్యాయామం మరొకటి లేదని అంటోంది రేణు రఖేజా. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుందని అంటున్నారు. జిమ్‌కి వెళ్లలేం. ఎక్కువ సమయం వ్యాయమాలకు కేటాయించలేం అనుకునేవాళ్లు సింపుల్‌గా ఈజీగా చేసే ఈ ఐదు వాక్‌లు చేస్తే చాలట. అద్భుతంగా బరువుని నిర్వహించడమే గాక హెల్దీగా ఉంటారని అంటోంది.కాలి నడక (తడసానా) - 1 నిమిషంఇది నడక భంగిమను మెరుగుపరుస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచడంలో సహాయపడుతుంది. చేతులు నిటారు తలపైకి చాచి కాళ్ల మీద నడవండి.మడమ నడక - 1 నిమిషంమడమ నడకలు చీలమండలను బలోపేతం చేస్తాయి. మెరుగైన రక్త ప్రసరణ/ప్రసరణను నిర్ధారిస్తాయి, వాపును తగ్గిస్తాయి. ఈ వ్యాయామం చేస్తున్నప్పుడూ.. ఫోజ్ నిటారుగా ఉంచాలి.హిప్ రొటేషన్ నడక - 1 నిమిషంహిప్ రొటేషన్ నడక బిగుతుగా ఉన్న తుంటిని వదులు చేయడం ద్వారా హిప్ కదలికను మెరుగుపరుస్తుంది. ఇది వీపు దృఢత్వాన్ని తగ్గిస్తుంది, పునరుత్పత్తి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ వ్యాయామం చేయడానికి, కాలును పైకి లేపి మీ పాదాన్ని నేలపై ఉంచే ముందు తిప్పండి. మరొక కాలుతో కూడా ఇలానే రిపీట్ చేయండిసైడ్ బై సైబ్ వాక్..1 నిమిషంఈ వ్యాయామం టోన్డ్ తొడలను సాధించడానికి, తుంటి కండరాలను నిర్మించడానికి, సమతుల్యతను ప్రోత్సహించడానికి ఉపయోగపడుతుంది. ముందుగా చేతులను ముందు పట్టుకుని, మోకాళ్లను వంచి పక్కకు నడవండి. View this post on Instagram A post shared by Renu Rakheja | Nutritionist & Health Coach (@consciouslivingtips) రివర్స్ వాక్ (వెనుకకు నడవడం) - 2 నుంచి5 నిమిషాలురివర్స్ లేదా బ్యాక్ వాక్స్ మోకాలి నొప్పిని తగ్గిస్తాయి, స్థిరత్వాన్ని పెంచుతాయి, కీళ్ల నొప్పిని నివారిస్తాయి. ఇది చాలా సులభం కూడా. చేయాల్సిందల్లా వెనుకకు నడవడమే, దాదాపు చంద్రుని నడక లాగా కానీ నెమ్మదిగా.చివరిగా శరీరం చెప్పేది వినండి, కొత్త వ్యాయామం లేదా వర్కౌట్లను ప్రారంభించే ముందు సంబంధిత ఆరోగ్య నిపుణులు లేదా వ్యక్తిగత వైద్యులను సంప్రదించండి. అలాగే మీకు కీళ్ల నొప్పులు, లేదా ఇతర వైద్య పరిస్థితులు ఉంటే..నిపుణులు సలహాలు సూచనలతో ప్రారంభిస్తేనే చాలామటుకు మంచిది అని సూచించింది రేణు రఖేజా.గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: అలా ఉంటే..డయాబెటిస్ బోర్డర్లోకి వచ్చినట్లే..?) -
అలా ఉంటే..డయాబెటిస్ బోర్డర్లోకి వచ్చినట్లే..?
డయాబెటిస్ నిర్ధారణ కోసం పొద్దున్నే పరగడుపున (ఫాస్టింగ్) ఒకసారి రక్తపరీక్షా, అలాగే ఏదైనా తిన్నాక దాదాపు రెండు గంటల తర్వాత మరోసారి రక్తపరీక్ష చేస్తారు. ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ అని పిలిచే ఆ పరీక్షల్లో... ఫాస్టింగ్‌లో 100 పోస్ట్ లంచ్‌లో 140 ఉంటే అది నార్మల్‌గా పరిగణిస్తారు. ఒకవేళ ఫాస్టింగ్‌లో 126 వరకు వచ్చినా... అప్పుడే మందులు మొదలు పెట్టరు. కానీ... అలా వచ్చినవారికి వారు ‘బార్డర్‌లైన్’ కండిషన్లో ఉన్నారనీ... అంటే భవిష్యత్తులో డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ అని, డయాబెటిస్ చాలాకాలం వరకు రాకూడదంటే ఆ టైమ్‌లో ఆరోగ్యకరమైన జీవనశైలి మార్పులు చేసుకోవలంటూ డాక్టర్లు సూచిస్తారు. మరి... ఫాస్టింగ్ విలువలు ఎక్కువగానూ... పోస్ట్ లంచ్ మరీ తక్కువగానూ ఉంటే...? కొందరిలో ఫాస్టింగ్ విలువలు నూరుకు బదులుగా 115 నుంచి 124 వరకు కనిపించవచ్చు. కానీ భోజనం తర్వాత చేసే పోస్ట్ లంచ్‌లో విలువలు మరీ తక్కువగా అంటే... 130, 135 రావచ్చు. ఇలా ఫాస్టింగ్‌లో ఉండాల్సిన దానికంటే ఎక్కువ, పోస్ట్ లంచ్‌లో మరీ తక్కువగా రావడాన్ని కూడా బార్డర్‌లైన్‌గానే పరిగణించాలి. అంతేతప్ప... పోస్ట్ లంచ్‌లో విలువలు మరీ తక్కువగా రావడాన్ని అంతా బాగున్నట్లుగా అనుకోడానికి వీల్లేదు. ఇలా జరగడానికి కారణాలేమిటంటే... రక్తంలో ఉన్న చక్కెర మోతాదును అదుపులో పెట్టేందుకు ఎంత అవసరమో తెలుసుకుని, దానికి తగ్గట్టుగా ప్యాంక్రియాస్ గ్రంథి తగినంత ఇన్సులిన్ని విడుదల చేస్తుంది. కానీ రక్తంలో ఎంత చక్కెర ఉందన్న అంచనా ఒక్కోసారి ప్యాంక్రియాస్‌కు తెలియదు. అలాంటి సందర్భాల్లో అది ఒక్కసారిగా ఎక్కువ మొత్తంలో ఇన్సులిన్‌ను స్రవిస్తుంది. దాంతో రక్తంలోని చక్కెర మోతాదులు బాగా పడిపోతాయి. ఇలా జరిగినప్పుడు పోస్ట్ లంచ్ విలువలు మరీ తక్కువగా వస్తుంటాయి. ఇదీ ఓ ముందస్తు హెచ్చరికే... డయాబెటిస్ వచ్చే ముందు ఇలా జరిగే అవకాశం ఉంది కాబట్టి... కాబట్టి దీన్ని కూడా డయాబెటిస్‌కు ముందు దశగా అంటే ‘బార్డర్‌లైన్’గా పరిగణించాలి. డయాబెటిస్‌ను సాధ్యమైనంత ఆలస్యం చేసేందుకు లేదా చాలాకాలం పాటు నివారించేందుకు ఆహారంలో అన్నం (పిండిపదార్థాలు) తగ్గించి, అన్ని రకాల ΄ోషకాలు అందేలా కూరలు ఎక్కువగా కలుపుకుని తింటుండాలి. వీలైనంతవరకు ఎక్కువగా ఆకుకూరలు ఉపయోగించడం మంచిది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఒత్తిళ్లకు దూరంగా ఉంటూ, బరువును అదుపులో పెట్టుకోవాలి. ఈ నియమాలు కేవలం బార్డర్‌లైన్ వారికి మాత్రమే కాకుండా డయాబెటిస్‌ను నివారించాలని కోరుకునే ఆరోగ్యవంతులకూ మేలు చేసేవే. (చదవండి: గుండె రంధ్రాలా..? గుబులొద్దు!) -
లాంగ్ కోవిడ్‌తో బాధపడ్డ మహిళల్లో..!
అప్పట్లో కోవిడ్ బారినపడటంతో పాటు దాని లక్షణాలు చాలాకాలంపాటు కొనసాగిన లాంగ్ కోవిడ్‌తోనూ బాధపడ్డ మహిళల్లో రుతుస్రావకాలం మరింత సుదీర్ఘంగా ఉంటోందంటూ ఓ అధ్యయనంలో తేలింది. ఈ పరిశోధన అంశాలను సైన్స్ / మెడికల్ జర్నల్ అయిన ‘నేచర్’లో ప్రచురితమయ్యాయి. కోవిడ్ అంటే ఏమిటో అందరికీ తెలిసిందే. ఇక లాంగ్ కోవిడ్ కూడా చాలామందికి గుర్తుండే ఉంటుంది. దాని గురించి పెద్దగా తెలియనివాళ్ల కోసం ‘లాంగ్ కోవిడ్’ అంటే ఏమిటో చూద్దాం.లాంగ్ కోవిడ్ అంటే...అప్పట్లో కోవిడ్ పాజిటివ్ సమయంలో బాధితుల్లో కొన్ని లక్షణాలు కనిపించేవి. ఉదాహరణకు జ్వరం వచ్చి తగ్గాక విపరీతమైన నీరసం, నిస్సత్తువలతో పాటు రుచి, వాసనలు తెలియకపోవడం వంటి లక్షణాలు కనిపించేవి. ఇక కొంతకాలం తర్వాత కరోనా వైరస్ తాలూకు చురుకుదనం దేహంలో బాగా తగ్గి΄ోయాక కోవిడ్–19 పరీక్షలు చేయిస్తే... వాటిల్లో నెగెటివ్ వచ్చిన తర్వాత కూడా కొందరిలో కోవిడ్ తాలూకు లక్షణాలు కొనసాగుతూ ఉండేవి. అలా కొనసాగుతున్న లక్షణాలను డాక్టర్లు ‘లాంగ్ కోవిడ్’గా చెప్పేవారు. కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిపోయిన తర్వాత కొందరిలో చాలా కాలం వరకు కొన్ని రకాల సమస్యలు బాధితులను వేధిస్తూ ఉండేవి. ఒక ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గాక ఆ తర్వాత కూడా కొన్ని సమస్యలు కనిపిస్తూనే ఉంటాయనీ, అవన్నీ చాలా సాధారణమంటూ మొదట్లో వైద్యులు కొట్టి΄ారేసినా, తర్వాత్తర్వాత మాత్రం ఇవి ఒక కొత్త రకమైన జబ్బుని సూచిస్తున్నట్లు కనిపించాయంటూ డాక్టర్లలో చాలామంది పేర్కొన్నారు. అలా నెగెటివ్ ఫలితాలు వచ్చాక కూడా అనేక జబ్బుల తాలూకు లక్షణాలు కనిపించడాన్ని ‘లాంగ్ కోవిడ్’గా వ్యవహరించారు.లాంగ్కోవిడ్కు ఉన్న మరికొన్ని పేర్లు...అమెరికన్ హెల్త్ సంస్థ అయిన ఎన్ఐహెచ్ వారు దీనికి ‘పీఏఎస్సీ’ అని పేరు పెట్టారు. అంటే ‘పీఏఎస్సీ’ అనే సంక్షిప్త నామానికి విస్తరణే పోస్ట్ అక్యూట్ సీక్వెల్ ఆఫ్ కోవిడ్ 19’. ఈ లక్షణాలతో బాధపడే వారిని ‘లాంగ్ హాలర్స్’ అని కూడా కొందరు పిలిచారు. మరి కొంతమంది దీన్ని ‘ఆన్ గోయింగ్ సింప్టమాటిక్ కోవిడ్ 19’ అనీ లేదా ‘క్రానిక్ కోవిడ్–19 సిండ్రోమ్’ అని కూడా పేర్కొన్నారు.పేషెంట్లే కనిపెట్టిన జబ్బు... సాధారణంగా ప్రపంచంలో అత్యధికమైన జబ్బులను డాక్టర్లు కనిపెడతారు. అయితే ఈ లాంగ్ కోవిడ్ మాత్రం పేషెంట్లు కనిపెట్టి వాళ్లు డాక్టర్లను అప్రమత్తం చేశారు. మొదట్లో చాలా మంది డాక్టర్లు ఈ విషయం చెప్పిన పేషెంట్ల వాదనను కొట్టిపడేశారు. వాస్తవానికి లాంగ్ కోవిడ్ అనే పేరుని ‘ఎలీసా పెరెగో’ అనే ఇటలీకి చెందిన బాధిత పేషెంట్ మొట్టమొదటిసారిగా వాడారు. లాంగ్ కోవిడ్ అనేది ఒక ప్రత్యేకమైన జబ్బు అనీ, దాన్ని అర్థం చేసుకోవడానికీ, చికిత్స చేయటానికి ప్రత్యేకమైన శ్రద్ధ అవసరమవుతోందని ప్రపంచవ్యాప్తంగా చాలామంది డాక్టర్లు గుర్తించారు. డాక్టర్ మాధురి మొవ్వ, సీనియర్ ఆబ్స్టిట్రీషియన్, గైనకాలజిస్ట్ – లాపరోస్కోపిక్ సర్జన్ (చదవండి: గుండె రంధ్రాలా..? గుబులొద్దు!) -
గుండె రంధ్రాలా..? గుబులొద్దు!
కొంతమంది చిన్నపిల్లల్లో వారి పసివయసులో కనిపించే గుండె రంధ్రాలు తల్లిదండ్రులను చాలా ఆందోళనలో ముంచెత్తుతాయి. ఇలా పిల్లల గుండెల్లో రంధ్రాలు కనిపించడానికి కారణముంది. మహిళ గర్భవతిగా ఉన్నప్పుడే ఒక పొడవాటి పైప్ వంటి నిర్మాణం నుంచి శిశువు గుండె రూపుదిద్దుకుంటుంది. ఈ క్రమంలో ఆ పైప్ లాంటి నిర్మాణం నుంచే గుండె తాలూకు వివిధ భాగాలు అభివృద్ధి చెందుతాయి. ఇలా అభివృద్ధి చెందే క్రమంలో కొన్ని రంధ్రాలు ఉండిపోతాయి. గుండెలో రంధ్రాలకు కారణాలు... దాదాపు పిల్లలందరిలోనూ గుండె అభివృద్ధి చెందే సమయంలో ముందుగా ఏర్పడ్డ రంధ్రాలు ఆ తర్వాతి కాలంలో పూర్తిగా పూడుకుంటాయి. అయితే కేవలం కొద్దిమంది చిన్నారుల్లో మాత్రం గుండె రూపొందే క్రమంలో ఏర్పడ్డ రంధ్రాలు వాటంతట అవే పూడుకుపోవు. కొన్ని సందర్భాల్లో జన్యుపరమైన అంశాలూ ఈ రంధ్రాలకు కారణమవుతాయి.అప్పుడేమవుతుందంటే... ఏట్రియల్ లేదా వెంట్రికల్ గదుల గోడల మధ్య పుట్టుకతో ఏర్పడే ఇలాంటి రంధ్రాల కారణంగా... రక్తం ఒక గది నుంచి మరొక గదిలోకి ప్రవహించి, తిరిగి ఆక్సిజన్ కోసం మళ్లీ మళ్లీ ఊపిరితిత్తుల్లోకి చేరుతుంటుంది. దాంతో ఊపిరితిత్తులపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుంది. చాలావరకు వాటంతట అవే పూడుకునేలా... గుండెలో రంధ్రాలు కనిపించిన వెంటనే వాటికి సర్జరీ చేయాల్సిన అవసరం లేదు. మరీ ప్రమాదకరమని భావించిన కేసుల్లో తప్ప... చాలా సందర్భాల్లో డాక్టర్లు కొన్ని రకాల మందులు వాడుతూ కొంతకాలం వేచిచూస్తారు. పుట్టుకతో గుండెలో రంధ్రాలతో జన్మించేవారిలో 25 – 30 శాతం మంది వీఎస్డీ లోపం అనే సమస్యతో బాధపడుతుంటారు. ఇలాంటి రంధ్రాలు పూడ్చటానికి మొదట్లో సర్జరీ మాత్రమే అందుబాటులో ఉండేది. ఇలా సర్జరీ చేయాల్సి వచ్చినప్పుడు ఆ పిల్లల్ని సర్జరీ తాలూకు గాయం బాధించడంతో పాటు శస్త్రచికిత్స తాలూకు మచ్చలు కూడా శాశ్వతంగా మిగిలి΄ోయేవి. కానీ ఇప్పుడు వైద్యశాస్త్రంలో వచ్చిన అత్యాధునిక పురోగతి వల్ల ఇలాంటి పిల్లలకు అలాంటి అసౌకర్యం, నొప్పి లేకుండా గుండెలోని రంధ్రాలను పూడ్చటం చాలా సాధారణమైన వైద్యప్రక్రియగా మారి΄ోయింది. ఇందుకోసం అప్పుడు సర్జరీ అవసరమే లేదు. మొదట గజ్జల్లో ఉండే రక్తనాళాల ద్వారా కార్డియాక్ కేథటర్‌ను సూది ద్వారా పంపి గుండె పనితీరును తెలుసుకుంటారు. అలాగే గుండె రంధ్రం పరిమాణంతో పాటు దాని తీరును రేడియోకాంట్రాస్ట్ను ఇంజెక్ట్ చేసి తెలుసుకుంటారు. ఆ తర్వాత రంధ్రాన్ని మూసివేసే ప్రక్రియను చేపడతారు. ఈ చికిత్స పూర్తయ్యాక గుండెలోకి పంపిన కేథటర్స్ అన్నింటినీ బయటకు తొలగిస్తారు. ఆ తర్వాత ఎకోకార్డియోగ్రామ్ పరీక్ష చేసి రంధ్రం పూడుకుందా లేదా అన్నది డాక్టర్లు నిర్ధారణ చేస్తారు. కాబట్టి ఇప్పుడు చిన్నప్లిల్లలో కనిపించే ఇలాంటి గుండెరంధ్రాల విషయంలో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే ఏఎస్డీ, వీఎసీడీ మాత్రమే కాకుండా ఇంకా అనేక రకాలైన గుండెకు సంబంధించిన పుట్టుకతో వచ్చే సమస్యలు ఉంటాయి. వాటిలో కొన్నివాటికి (టీఏపీవీసీ, టీజీఏ వంటి వాటికి) చిన్నవయసులోనే ఆపరేషన్ అవసరం పడవచ్చు. ఎం.ఎస్.ఎస్. ముఖర్జీ, సీనియర్ కార్డియాలజిస్ట్ (చదవండి: వాసా ప్రీవియా ఉంటే సాధారణ ప్రసవం అవ్వడం కష్టమా..?) -
వాసా ప్రీవియా ఉంటే సాధారణ ప్రసవం అవ్వడం కష్టమా..?
నేను ఎనిమిది నెలల గర్భవతిని. స్కాన్‌లో నాకు వాసా ప్రీవియా ఉందని తేలింది. సాధారణ ప్రసవం కాకుండా సిజేరియన్ చేసే అవకాశం ఎక్కువ ఉందని డాక్టర్ చెప్పారు. అయితే, సాధారణ ప్రసవం అయ్యే అవకాశం ఏమైనా ఉందా? చెప్పండి? – రమ్య, నెల్లూరు. వాసా ప్రీవియా అనేది గర్భధారణలో అరుదుగా వచ్చే ఒక పరిస్థితి. ఈ సమయంలో బొడ్డు తాడు లేదా మాయ, శిశువు రక్తనాళాలు రక్షణ లేకుండా గర్భాశయం ముఖద్వారం పైన లేదా దాని దగ్గరగా ఉంటాయి. ప్రసవ సమయంలో ఇవి పగిలితే, తీవ్రమైన రక్తస్రావం జరగవచ్చు, ఇది చాలా ప్రమాదకరం. ఈ రక్తనాళాలు పగిలితే తీవ్ర రక్తస్రావం జరిగి, శిశువు ప్రాణానికి ప్రమాదం ఏర్పడవచ్చు. వాసా ప్రీవియాకు కచ్చితమైన కారణం తెలియదు. కాని, కొన్ని పరిస్థితులు ఈ సమస్య వచ్చే అవకాశాన్ని పెంచుతాయి. మాయ తాడు గర్భాశయం దిగువలో ఉండటం, బొడ్డు తాడు మధ్యలో కాకుండా పక్కకు మాయ తాకడం, చిన్న అనుబంధ మాయ ఉండటం లేదా కృత్రిమ గర్భధారణ పద్ధతులు ఉపయోగించడం వలన వాసా ప్రీవియా వచ్చే ప్రమాదం కొంచెం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, వాసా ప్రీవియాను సకాలంలో గుర్తించడం చాలా అవసరం. సాధారణంగా దీనిని త్రైమాసికంలో స్కాన్లోనే గుర్తించవచ్చు. ఈ సమయంలో ప్రత్యేక లక్షణాలు కనిపించవు. కాని, ఈ పరిస్థితిని గుర్తించకపోతే, ప్రసవానికి ముందు లేదా ప్రసవ సమయంలో రక్తనాళాలు పగిలి శిశువు వేగంగా రక్తాన్ని కోల్పోవచ్చు. తీవ్రమైన రక్తస్రావం వల్ల శిశువుకు ఆక్సిజన్ తగలకపోవడం, మెదడు దెబ్బతినడం లేదా గర్భంలోనే శిశువు మరణించడం కూడా సంభవించవచ్చు. గర్భధారణ సమయంలో వాసా ప్రీవియా ఉన్నట్లు గుర్తించిన వెంటనే పనులు తగ్గించుకోవాలి. లైంగిక సంబంధానికి దూరంగా ఉండాలి, కొన్ని సందర్భాల్లో ఆసుపత్రిలో చేరి, నిశితంగా పర్యవేక్షణలో ఉండటం అవసరం. వాసా ప్రీవియా ఉన్న చాలా సందర్భాల్లో, శిశువుకు రక్తస్రావ ప్రమాదం తగ్గే విధంగా 34 నుంచి 36 వారాల మధ్య నిర్ణీత సిజేరియన్ ప్రసవం చేస్తారు. అవసరమైతే శిశువు ఊపిరి తిత్తులు పూర్తిగా పెరగడానికి స్టెరాయిడ్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ప్రసవ సమయంలో కూడా వాసా ప్రీవియా ఉన్నట్లు అనుమానం ఉంటే, శిశువు భద్రత కోసం అత్యవసర సిజేరియన్ చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో బిడ్డకు రక్త మార్పిడి అవసరమవుతుంది. వాసా ప్రీవియాను పూర్తిగా నివారించలేరు కాని, నిరంతర చెకప్ ద్వారా దీన్ని ముందుగానే గుర్తించి, ప్రమాదాలను తగ్గించవచ్చు. ఇలా చేయడం ద్వారా శిశువుకు హాని లేకుండా, సురక్షితంగా జన్మించే అవకాశం ఎక్కువ అవుతుంది. కాబట్టి, సాధారణ ప్రసవం లేదా సిజేరియన్ అనే తేడా లేకుండా, ముందే సిజేరియన్‌కు మానసికంగా సిద్ధంగా ఉండటమే మంచిది. ఆ వ్యాధులు మహిళల్లోనే ఎక్కువశాశ్వత పరిష్కారం లేని వ్యాధుల్లో ఆటో ఇమ్యూన్ వ్యాధులనే ముందు వరుసలో చెప్పుకోవాలి. శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ పొరబడి ఆరోగ్యవంతమైన కణాల మీద దాడి చేయడం వల్ల రకరకాల ఆటో ఇమ్యూన్ వ్యాధులు తలెత్తుతుంటాయి. రుమాటాయిడ్ ఆర్థరైటిస్, టైప్–1 డయాబెటిస్, లూపస్, గ్రేవ్స్ డిసీజ్, మల్టిపుల్ స్లె్కరోసిస్, సొరియాసిస్, సొరియాటిక్ ఆర్థరైటిస్ వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులకు లోనైన వారు జీవితాంతం వాటికి మందులు వాడుతూ, చికిత్స కొనసాగించాల్సిందే! ఆటో ఇమ్యూన్ వ్యాధులతో బాధపడేవారిలో పురుషుల కంటే మహిళల సంఖ్యే ఎక్కువని తాజా పరిశోధనల్లో తేలింది. ఆటో ఇమ్యూన్ వ్యాధులతో బాధపడేవారిలో దాదాపు 70 శాతం మహిళలేనని ఇండియన్ రుమాటాలజీ అసోసియేషన్ 40వ వార్షికోత్సవ నివేదిక ఇటీవల వెల్లడించింది. వీరిలో 20–50 సంవత్సరాల లోపు వయసులో ఉన్నవారి సంఖ్య ఎక్కువగా ఉంటోందని తెలిపింది. పురుషులతో పోలిస్తే మహిళల్లో ఆటో ఇమ్యూన్ వ్యాధులు చాలా సర్వసాధారణంగా కనిపిస్తున్నట్లు ఇటీవల స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధన కూడా వెల్లడించింది. జన్యు కారణాలు, పునరుత్పాదక వయసులో ఉన్న మహిళల్లో సంభవించే హార్మోన్ మార్పులు, గర్భధారణ, ప్రసవం వల్ల కలిగే మానసిక ఒత్తిడి, పోషకాహార లోపాలు, స్థూలకాయం వంటివి మహిళల్లో ఆటో ఇమ్యూన్ వ్యాధులకు కారణం కావచ్చని భావిస్తున్నట్లు ఢిల్లీ ‘ఎయిమ్స్’లోని రుమాటాలజీ విభాగాధిపతి డాక్టర్ ఉమా కుమార్ అభిప్రాయపడ్డారు. ఈ అంశమై కారణాలను కచ్చితంగా గుర్తించడానికి మరింతగా పరిశోధనలు జరగాల్సి ఉందని ఆమె అన్నారు.డాక్టర్ ప్రమత శిరీష, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: ‘చుక్క’బీరు.. చుక్కల్లో ధర..) -
వర్షాలు, వణికించే చలిగాలులు : ఈ హెల్త్ టిప్స్ పాటించండి!
మోంథా తుఫాను ప్రభావం బాగా కనిపిస్తోంది. వర్షం, చల్లటి గాలులు కూడా వణికిస్తున్నాయి. మరోవైపు చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. వర్షంలో తడవడం వల్ల జలువు, జ్వరం గొంతు నొప్పి లాంటి వ్యాధులు ముసిరే అవకాశం ఉంది. వ్యాధి నిరోధకశక్తి తగ్గుతుంది. అందుకే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవాల్టీ టిప్ ఆఫ్ ది డేలో భాగంగా అలాంటి జాగ్రత్తలు కొన్ని చూద్దాం.చలికాలంలో ఫ్లూ, సైనసైటిస్, ఊపిరితిత్తుల్లో వైరల్ ఇన్ఫెక్షన్, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి(సీవోపీడీ), ఆస్తమా వంటి సమస్యలు తలెత్తుతాయి. హైపోథెర్మియా, చర్మం లోపలి కణజాలం గడ్డ కట్టి గాయాలు కావటం, పెర్నియో, ఇమ్మర్షన్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.చలిగాలులు అనేక రకాల వ్యాధులను మోసుకొస్తాయి. వైరస్లు వృద్ధి చెందే ప్రమాదం ఉంది. దగ్గు, జలుబు, గొంతునొప్పి, తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి ఆయాసం, న్యూమోనియా వంటి లక్షణాలు కనిపిస్తాయి. గొంతు ఇన్ఫెక్షన్స్, గతంలో కీళ్ల నొప్పులు ఉన్నవారిలో కీళ్ల నొప్పులు పెరుగుతాయి. కొందరిలో తలనొప్పి వస్తుంది. గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కనీస జాగ్రత్తలువర్షంలో తడవకుండా జాగ్రత్త పడాలి. పూర్తిగా కప్పి ఉంచేలా వస్త్రాలను ధరించాలి. రెయిన్ కోట్లు, గొడుగులు, చలికి తట్టుకునేలా స్వెట్లర్లు, చెవులు కవర్ అయ్యేలా టోపీలు తప్పనిసరిగా వాడాలి. ఒకవేళ వర్షంలో తడిచినా, వెంటనే వేడినీటితో స్నానం చేయడం, జుట్టు తడిలేకుండా పూర్తిగా ఆరబెట్టుకోవడం తప్పనిగా పాటించాలి.చలి ఎక్కువగా ఉన్న సమయాల్లో మాస్కులు ధరించాలి. దీంతో వైరస్ సోకదు. వేరేవారికి సోకకుండా ఉంటుంది. చలితీవ్రత అధికంగా ఉంటే బయటకు రాకుండా ఉంటే మంచిది. ముఖ్యంగా శ్వాసకోశ సంబంధ వ్యాధులతో బాధపడేవారు బయటకు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వారు ఇన్హేలర్లను అందుబాటులోఉంచుకోవాలి. ఫ్రిజ్‌లో పెట్టిన చల్లటి ఆహారం కాకుండా, అప్పటికప్పుడు వండుకున్నది వేడి, వేడిగా భుజించాలి.చల్లని డ్రింక్స్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీంలకు పిల్లల్ని ఎంత దూరంగా పెడితే అంత మంచిది.నిల్వ పదార్థాలను జోలికి వెళ్లవద్దు. పిల్లలు, వృద్ధుల ఆరోగ్యం పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలి.వ్యాధి నిరోధకశక్తి పెంచుకునేలా చలికాలంలో వ్యాధి నిరోధకతను పెంచుకోవాలి పౌష్టికాహారం తీసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా సిట్రస్ జాతికి చెందిన ఉసిరి, నిమ్మకాయల రసం తీసుకోవాలి. ఎక్కువగా నీటిని తాగాలి. కాచి చల్లార్చిన నీటిని తాగడం మరింత మంచిది. శరీరంలో వేడి ఉత్పత్తి అయ్యేలా జీర్ణవ్యవస్థ నిరంతరం పనిచేస్తుండాలి. ప్రోటిన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. గుడ్లు, పనీర్ లాంటివి తీసుకోవాలి. అలాగే ఈ చలిగాలులు చర్మాన్ని, జుట్టును కూడా ఇబ్బంది పెడతాయి. వాతావరణం చల్లగా ఉన్నా గాలిలో తేమశాతం తక్కువగా ఉంటుంది. శరీరంలోని తేమ బయటికి పోవడంతో చర్మం పొడిబారుతుంది. అందుకే వాటర్ ఎక్కువగా తీసుకుంటూ, చర్మంపైన ఉండే నూనె పొరను కాపాడుకునేలా మంచి మాయిశ్చరైజర్‌ను వాడాలి. ఇదీ చదవండి: గర్ల్ ఫ్రెండ్‌తో బ్రేకప్ సార్... లీవ్ ప్లీజ్! వైరల్ మెయిల్ -
ప్రెగ్నెంట్ అనగానే.. రెస్ట్..మస్ట్ కాదు..!?
ప్రెగ్నెన్సీ సమయంలో గర్భిణులకు రెస్ట్ మస్ట్ కాదంటున్నారు..అయితే చాలా మంది తెలియక అదే పనిగా రెస్ట్ తీసుకుంటున్నారని, తద్వారా నగరంలో 60.7 శాతం సీ–సెక్షన్లు జరుగుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. రోజువారీ పనులు చేసుకుంటే తల్లీ, బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని, 98 శాతం మందికి అసలు బెడ్ రెస్ట్ అవసరం ఉండదని, పూర్తిగా రెస్ట్తోనే సీ సెక్షన్లు పెరుగుతున్నాయని వైద్యులు అంటున్నారు. నగరంలో సీ–సెక్షన్లు పెరుగుతున్నాయని ఇటీవల నిర్వహించిన ఓ హెల్త్ సర్వేలో తేలింది. ఈ నేపథ్యంలో దీనిపై పలు సూచనలు.. అల్లారు ముద్దుగా పెరిగిన అమ్మాయి మొదటిసారి తల్లికాబోతోందని తెలియగానే విపరీతమైన ముద్దుచేస్తారు. చిన్నపనికూడా చేయనీయరు. అయితే అలాంటి పరిస్థితులు మానసికంగా, శారీరకంగా గర్భిణిపై ప్రభావం చూపిస్తాయని, ఇది సీ–సెక్షన్ల సంఖ్య పెరగడానికి దారితీస్తోందని నిపుణులు చెబుతున్నారు. సర్వే చెబుతోందేంటి? నగరంలోని ప్రసవాల్లో సుమారు 60.7 శాతం సీ–సెక్షన్లు ఉంటున్నాయని నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే చెబుతోంది. ఇది దేశంలోనే అత్యధిక రేటుగా పేర్కొంటోంది. గర్భనిర్ధారణ అయిన వెంటనే అధిక శాతం మంది వైద్యులు బెడ్ రెస్ట్ అవసరం అంటున్నారు. అయితే ప్రస్తుత జనరేషన్లో సుమారు 98 శాతం మంది గర్భిణులకు బెడ్ రెస్ట్ అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. సర్వైకల్ ఇన్‌కాంపిటెన్స్ బర్త్ కెనాల్ వీక్‌గా ఉన్నప్పుడు లేదా కుట్లు వేయాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రమే బెడ్ రెస్ట్ సూచిస్తారని, మిగతా సమయంలో అవసరం లేదని అంటున్నారు. ఫార్మేషన్లో తేడాలుంటే ఎంత జాగ్రత్తగా ఉన్నా మిస్ క్యారీ అవుతుంది తప్ప, దినచర్య వల్ల ప్రమాదమనేది అపోహ మాత్రమే అంటున్నారు. గర్భిణులు నేను మెట్లు ఎక్కొచ్చా? నేల మీద కూర్చోవచ్చా? పనులు చేసుకోవచ్చా? అని ప్రశి్నస్తుంటారని, గర్భందాల్చడం జబ్బు కాదని, ఫిజియోలాజికల్ మార్పు మాత్రమేనని పేర్కొంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సాధారణ ప్రసవాలు జరగడానికి శారీరక వ్యాయామం ఒక కారణమని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. బెడ్ రెస్ట్‌తో కొత్త సమస్యలు.. గర్భిణులు తొమ్మిదో నెల వరకూ అన్ని పనులూ చేసుకోవచ్చు. కొన్ని అరుదైన సందర్భాల్లో మాత్రమే బెడ్ రెస్ట్ అవసరపడుతుంది. సుమారు 98 శాతం మందికి బెడ్ రెస్ట్ అవసరం ఉండదు. ఒక్కసారిగా పనులన్నీ పక్కన పెట్టి బెడ్ రెస్ట్ అంటే సైడ్ ఎఫెక్ట్స్ మొదలవుతాయి. మూడు నెల్లలోపు పిండం సుమారు 80 గ్రాములు మాత్రమే ఉంటుంది. కవలలు, ఐవీఎఫ్, ఏఆర్ ఇతర సందర్భాల్లో మాత్రమే జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా గర్భిణి ఒంటరితనం, స్ట్రెస్ ఫీలవకుండా చూసుకోవాలి. – పి.శృతిరెడ్డి, గైనకాలజిస్టు, ల్యాప్రోస్కోపిక్ సర్జన్ (చదవండి: World Stroke Day 2025: లైఫ్‌స్టైల్ మార్పులే..స్ట్రోక్ కారకాలు..!) -
లైఫ్‌స్టైల్ మార్పులే.. స్ట్రోక్ కారకాలు..!
గతంలో 60 ఏళ్లు పైబడిన వారిలో స్ట్రోక్‌కు గురయ్యేవారు. అయితే దీనికి భిన్నంగా ప్రస్తుతం బ్రెయిన్ స్ట్రోక్ రోగుల్లో 15 నుంచి 20 శాతం మంది 45 సంవత్సరాల కంటే తక్కువ వయసు గలవారు ఉంటున్నారని నిపుణులు అంటున్నారు. దేశంలో ఏటా 1.5 నుండి 1.8 మిలియన్ల స్ట్రోక్ కేసులు నమోదవుతుంటే, తెలుగు రాష్ట్రాలలో 1,00,000 జనాభాకు 275 మందిలో స్ట్రోక్ కేసులు నమోదవుతున్నట్లు అంచనా. మారుతున్న జీవనశైలి,దీనికి ప్రధాన కారణంగా వైద్యులు అంటున్నారు. దీర్ఘకాలిక ఒత్తిడికి గురవుతున్న ఐటీ, వృత్తి నిపుణులు నిద్రలేమితో బాధపడుతున్నారు. నగర వాసుల్లో పెరిగిన స్క్రీన్ సమయం కూడా నిద్రకు ఆటంకం కలిగిస్తోందని, క్రమరహిత నిద్ర విధానాలు వాసు్కలర్ ఆరోగ్యాన్ని ప్రభావితం చేసి స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఆహారపు అలవాట్లతో మధుమేహం, ప్రాసెస్డ్ ఫుడ్ రక్తపోటు తదితర వ్యాధుల పెరుగుదలకు దారి తీస్తున్నాయి. మహిళలతో పోలిస్తే మగవారిలో స్ట్రోక్ ఎక్కువ సంభవించే అవకాశం ఉందని ఇటీవల గుర్తించారు. దేశంలో మరణానికి రెండో ప్రధాన కారణం, వైకల్యానికి మూడో ప్రధాన కారణంగా కూడా గణాంకాలు చెబుతున్నాయి. సమయమే కీలకం.. ఈ స్ట్రోక్‌కు గురైన సందర్భంలో మెదడును కాపాడటానికి సమయం చాలా ముఖ్యం. ఆస్పత్రి చేరుకోవడంలో ఆలస్యం అతిపెద్ద సవాలు. ‘స్ట్రోక్, వైకల్యాలకు మధ్య అతిపెద్ద వ్యత్యాసం సమయం. స్ట్రోక్ తర్వాత ప్రతి నిమిషం, రెండు మిలియన్ల మెదడు కణాలు చనిపోతాయి’ అని వైద్యులు వివరిస్తున్నారు. ‘మూడు గంటల్లోపు ఆస్పత్రికి చేరుకోవడం వల్ల పూర్తిగా కోలుకునే అవకాశాలు మూడు రెట్లు పెరుగుతాయని చెబుతున్నారు. దీనిని ఎదుర్కోడానికి, ఈ సంవత్సరం ప్రపంచ స్ట్రోక్ డే థీమ్ ‘ప్రతి నిమిషం లెక్కించబడుతుంది’ అని ఎంచుకున్నారు. ‘రిహాబ్’తో సాధారణ జీవితం.. వంశపారంపర్య సమస్యలతో అత్యంత పిన్న వయసు్కలు కూడా స్ట్రోక్ బాధితులుగా మారడం ఇటీవల గమనిస్తున్నాం. జీవనశైలి మార్పుల వల్ల యుక్త వయసు్కలు దీని బారిన పడుతున్నారు. స్ట్రోక్ చికిత్స తర్వాత రికవరీ కీలక అంశం. అది సవ్యంగా అందితేనే రోగి తిరిగి సాధారణ జీవితం గడపగలుగుతాడు. స్ట్రోక్ బాధితుల కోసం దశాబ్ధం క్రితమే ‘రిహాబ్’ కేంద్రాలు ప్రారంభించాం. దేశవ్యాప్తంగా 7 సెంటర్స్ నిర్వహిస్తున్నాం. అడ్వాన్స్డ్ టెక్నాలజీ, రోబోటిక్ పరిజ్ఞానంతో శరవేగంగా రోగుల్ని సాధారణ స్థితికి తీసుకురావచ్చు. – డాక్టర్.గౌరవ్ తుక్రాల్, హెల్త్– డాక్టర్.గౌరవ్ తుక్రాల్, హెల్త్ కేర్ ఎట్ హోమ్ కేర్ ఎట్ హోమ్లక్షణాలు ముందుగా గుర్తిస్తే మేలు.. ఇటీవల కాలంలో స్ట్రోక్ సాధారణ న్యూరోలాజికల్ వ్యాధిగా మారింది. ముఖ్యంగా ముఖం వంకరపోవడం, చేతి బలం తగ్గడం, ఒక చేతిని పైకి లేపడానికి కష్టపడటం. మాటల్లోనూ తడబాటు, అకస్మాత్తుగా కళ్లు మసకబారడం, తీవ్ర తలనొప్పి, శరీర సమతుల్యం కోల్పోవడం వంటివి స్ట్రోక్ లక్షణాలు. వీటిపై మరింత అవగాహన అవసరం. – డాక్టర్ వంశీకృష్ణ, న్యూరోసర్జన్, నిమ్స్ ఆస్పత్రి -
Shreyas Iyer: పక్కటెముక గాయం అంటే..? వామ్మో.. మరీ అంత డేంజరా?
టీమిండియా వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పక్కటెముక గాయంతో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. తొలుత చిన్నగాయంలా అనిపించినా.. డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిన తర్వాత పరిస్థితి విషమంగా మారింది. ప్రస్తుతం శ్రేయస్ సిడ్నీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు బీసీసీఐ పేర్కొంది. సాధారణంగా ఆటగాళ్లు మైదానంలో గాయపడటం సహజమే. కానీ కొన్ని గాయాలు మాత్రం ఆటగాళ్లను చాలా ఇబ్బంది పెడుతుంటాయి. మరి ఇక్కడ శ్రేయస్ ఎదుర్కొంటున్న పక్కటెముక గాయం అంత తీవ్రతరమైనదా..? అసలేంటి గాయం వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా.!.పక్కటెముక గాయం అంటే..ఈ గాయం ఎక్కువగా కారు ప్రమాదాలు, క్రీడల్లోనూ జరుగుతుంటాయని చెబుతున్నారు నిపుణులు. మరికొన్ని ఇతర గాయాల వల్ల కూడా ఈ పక్కటెముకల గాయం సంభవిస్తుందట. ఒక్కోసారి ఎలాంటి గాయం అవ్వకుండానే పక్కటెముకలు విరిగే అవకాశం కూడా ఉంటుందని చెబుతున్నారు వైద్యులు. అంతర్గత అవయవాలు దెబ్బతీస్తే తప్ప పక్కటెముక గాయం సివియర్ అవ్వదని చెబుతున్నారు. దీనికి ఆపరేషన్ చేయడం అనేది కూడా అరుదు అని. చెబుతున్నారు. పక్కెటెముకల మధ్య పగుళ్లు వస్తే..తగిన విశ్రాంతి, శ్వాస వ్యాయామాలు, చికిత్స అవసరం అవుతాయని, కోలుకోవడానికి కనీసం ఒక నెల పడుతుందటని చెబుతున్నారు వైద్యులు. పక్కటెముక విరిగితే..పక్కటెముక విరగడాన్ని వైద్య పరిభాషలో సాధారణంగా ఎముక తప్పిందని(స్థానభ్రంశం) చెబుతుంటారు. ఇలా ఎముక విరిగినప్పుడూ చుట్టు పగులు, ఖాళీ ఏర్పుడుతుంది. అలాంటప్పుడు విశ్రాంతి ఒక్కటే సరిపోదట. దాన్ని సరిచేసేందుకు శస్త్ర చికిత్స అవసరం అవుతుందని చెబుతున్నారు. అలాగే ఇవి విరగడం అనేది కూడా అత్యంత అరుదేనట. ఎందుకంటే పెద్దపెద్ద యాక్సిడెంట్లు, లేదా ఆటల్లోనే ఇలాంటి గాయాల బారినపడే అవకాశం ఉంటుందట. ఇవి మన శరీరంలోని బలమైన ఎముకల్లో ఒకటి కావడంతో అంత సులభంగా గాయలవ్వడం అత్యంత అరుదని చెబుతున్నారు నిపుణులు. లక్షణాలు..శ్వాస తీసుకున్న, దగ్గినా, ఛాతీ పైభాగాన్ని కదిలించిన త్రీమైన నొప్పిముట్టుకున్న తట్టుకోలేనంత నొప్పి, వాపుగాయం లేదా రంగు మారడంవామ్మో.. మరీ అంత డేంజరా? అంటే..పక్కటెముకలు గాయం ఒక్కోసారి ప్రాణాంతకంగా మారతాయట. అప్పుడు ఇతర అంతర్గత అవయవాలైనా.. గుండె, కాలేయం, కడుపు, మూత్రపిండాలు, ప్లీహాన్ని కూడా ప్రభావితం చేస్తుందట. దీనివలన రక్తస్రావం కూడా జరుగుతుందని చెబుతున్నారు.ఒక్కోసారి ఊపిరి ఆడకపోవడం, శ్వాస తీసుకోలేక ఇబ్బంది పడటం వంటి సమస్యలు ఉత్ఫన్నమవుతాయట. ఫలితంగా న్యుమోనియా వచ్చే ప్రమాదం కూడా లేకపోలేదని, ప్రత్యేక పరిస్థితుల్లో ఊపిరితిత్తులు వైఫల్యం చెందే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: Weight Loss Tips: సన్నజాజిలా స్లిమ్‌గా అవ్వాలంటే..సిమర్ టెక్నిక్స్ ఫాలో అవ్వాల్సిందే!) -
సన్నజాజిలా స్లిమ్‌గా అవ్వాలంటే..!
బరువు తగ్గే టాస్క్‌ని చాలా సింపుల్‌గా స్మార్ట్‌గా చేయాలంటే నిపుణులు లేదా అనుభవజ్ఞుల సలహాలు సూచనలు పాటించాల్సిందే. ఏదో భారంగా కాకుండా చాలా తెలివిగా తింటూ..వేగంగా బరువు తగ్గితే ఆ ఫీలే వేరు. మన సన్నిహితులు, స్నేహితులు హేయ్..! అంతలా ఎలా సన్నగా మారిపోయావు అంటే..పట్టరాని ఆనందం వచ్చేస్తుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. మరి అందుకోసం ఈ ఫిట్నెస్ ఔత్సాహికురాలు సిమర్ టెక్నిక్స్ పాలో అయితే సరి..ఫిట్నెస్ ఔత్సాహికురాలు సిమర్ ఎంతలా బొద్దుగా ఉండేదో తెలిస్తే ఆశ్చర్యపోతారు. అలాంటి అమ్మాయి చాలా సన్నగా నాజుగ్గా అయిపోయింది. మాములు మార్పు కాదు..నమ్మశక్యం కానంత సన్నగా మారింది. అలాగని ఆమె ఏమి షార్ట్‌కట్స్ ఫాలో అవ్వలేదు. పైగా ఎలాంటి కఠినమైన డైట్, బరువు తగ్గిపోయే మందలు ఉపయోగించలేదు. కాస్త తెలివిగా స్మార్ట్‌గా తిని జస్ట్ ఆరు నెలల్లో 27 కిలోలు పైనే బరువు తగ్గిందామె. అందుకోసం డెడికేషన్‌తో దినచర్యను అనుసరిస్తే చాలంటోంది. దాంతోపాటు జంక్ఫుడ్ని పూర్తిగా మానేయకపోయినా..పరిమితం చేస్తే సరిపోతుందంటోంది. పోషకాహారాన్నితీసుకునేలా ప్లాన్ చేస్తే చాలట. అందుకోసం తాను ఎలాంటి టిప్స్‌ని ఫాలో అయ్యిందో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది సిమర్. నేచురల్‌గా సన్నగా మారడం కోసం..సంపూర్ణ ఆహారాలు: ఆహారాలలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ మరియు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, నట్స్, చేపలు, గుడ్లు వంటి లీన్ ప్రోటీన్లు తీసుకోవాలట. ఇవి కడుపు నిండిన అనుభూతినిచ్చే అధికంగా తినాలనే కోరికను నివారిస్తాయట. మంచి నిద్ర: శరీరం బరువు తగ్గడంలో ప్రధాన పాత్ర పోషించేది ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర అని నొక్కి చెప్పిందామె. భోజనం తర్వాత వాకింగ్: మెరుగైన జీర్ణక్రియ కోసం ప్రతి భోజనం తర్వాత కనీసం పదినిమిషాలు నడవాలని సూచించిందామె. చీట్ మీల్స్: ఆరోగ్యకరమైన ఆహారాన్ని పాటిస్తున్నప్పటికీ..వారాంతాల్లో చీట్మీల్స్ కూడా ఉంటాయని చెప్పింది సిమర్. అయితే దాన్ని సర్దుబాటు చేసుకునే భోజనాన్ని సిద్ధం చేసుకుంటానని అంటోంది. అన్నింట్లకంటే ఏర్పరుచుకున్న టార్గెట్‌ని బ్రేక్ చేయకుండా..స్థిరంగా సాగితే..సత్వరమే మంచి ఫలితాలు అందుకుంటారని చెబుతోంది. అలాగే కార్బో హైడ్రేట్స్ కోసం మైదా, బ్రెడ్, ఉడికించిన బియ్యానికి దూరంగా ఉండేదట. అలాగే బయటకు వెళ్తే..కేలరీలు ఉండే పానీయాలను తీసుకుంటుందట. ఎందుకంటే అవి కడుపు నిండిన అనుభూతిని అందిస్తాయట. అంతేగాదు బరువు తగ్గడంలో బాగా ఉపయోగపడే మరో నాలుగు టెక్నిక్ కూడా చెప్పారామె. View this post on Instagram A post shared by Simar 🍜 (@_lifeofsimar) అవేంటంటే..అధిక ప్రోటీన్, తక్కువ కార్బోహైడ్రేట్కృత్రిమ చక్కెరవారానికి మూడు నుంచి నాలుగుసార్లు కోర్ శిక్షణప్రతి రోజు 8 వేలకు పైగా అడుగులు తప్పనిసరి అంటోంది. ఇంకెందుకు ఆలస్యం ఇలాంటి స్మార్ట్ టెక్నిక్స్‌తో బరువు తగ్గించే జర్నీని తక్షణమే ప్రారంభించండి అంటోంది సిమర్. View this post on Instagram A post shared by Simar 🍜 (@_lifeofsimar) గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: ఆకుపచ్చని చీరలో ఇషా స్టన్నింగ్ లుక్:! హైలెట్‌గా రూబీ డైమండ్ నెక్లెస్..) -
అమ్మో.. మలుగు బెన్
మలుగు బెన్ చేప.. ఇది అచ్చం పామును పోలి ఉంటుంది. కేవలం చిన్న వెన్నెముక మాత్రమే ఉండి శరీరం మొత్తం మాంసంతో ఉండే ఈ చేపకు మార్కెట్లో గిరాకీ ఉంది. ఓమెగా–3, ప్రొటీన్ ఉండే ఈ చేప రుచిగా ఉంటుంది. అరుదుగా కనిపించే ఈ చేపలు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం కాజీపేట మార్కెట్లో లభిస్తున్నాయి. ఈ చేపల వినియోగంతో ఆయుర్వేద పరంగా సత్ఫలితాలు ఉంటాయనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో వీటి కొనుగోళ్లకు అనేక మంది పోటీ పడుతుంటారు. గోదావరి నది జలాల నుంచి వచ్చిన ఈ చేపలు ధర్మసాగర్ దేవాదుల రిజర్వాయర్‌లో కలిశాయి. దీంతో ప్రతీరోజు వ్యాపారులు వీటిని మార్కెట్‌కు తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. కిలోకు రూ.450కు పైగా ధర పలుకుతుంది. కాగా, పాతతరానికి ఈ చేపలంటే చాలా ప్రీతి. కొత్తతరం మాత్రం అమ్మో పాములు తింటారా అంటారు.(చదవండి: -
కిడ్నీ మార్పిడి సురక్షితమేనా? అందువల్లే నటుడు సతీష్ షా కూడా..
ప్రముఖ బాలీవుడ్ నటుడు, టీవీ కళాకారుడు సతీశ్ షా అనారోగ్యంతో చనిపోయిన సంగతి తెలిసిందే. 76 ఏళ్ల సతీశ్ అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న భార్యను చూసుకునేందుకు ఇటీవలే కిడ్నీ మార్పిడి సర్జరీ చేయించుకున్నారని ఆయన సన్నిహితుడొకరు మీడియాకి వెల్లడించారు. అంతేగాదు ఆయన చాలా రోజుల నుంచి మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారని, డయాలసిస్ చేయించుకునేవారని, భార్య బాగోగులు నిమిత్తం మూడు నెలల క్రితం ఈ కిడ్నీ మార్పిడి సర్జరీ చేయించుకున్నట్లు తెలిపారు. ఆయన అనుకున్నట్లుగా ఆయన ఆరోగ్యం మెరగవ్వకపోక..త్వరితగతిన కానరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ ఘటన కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సపై పలు అనుమానాలు రేకెత్తించింది. అసలు మూత్రపిండాల వైఫల్యంతో బాధపడేవారికి ఈసర్జరీ? వరమా? లేక శాపమా అనే ఆందోళన కలిగించి. నిజానికి ఈ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్ సురక్షితమైనదైనా..? దానికంటే డయాలసిస్ మంచిదా అంటే..నెఫ్రాలజిస్ట్‌లు ఏమంటున్నారంటే..డయాలసిస్ అనేది మూత్రపిండాలు పనిచేయలేనప్పుడూ..రక్తం నుంచి వ్యర్థాలను, అదనపు ద్రవాన్ని తొలగించే పనిని చేపడతాయట. ఈ డయాలసిస్ అనేది రెండు రకాలుగా ఉంటుందని వివరించారు. ఒకటి హిమోడయాలసిస్ ఈ పద్ధతిలో శరీరం వెలుప యంత్రం ఉంచి..రక్తం శుద్ధి చేయడం జరుగుతుంది. అలా కాకుండా ఉదర లైనింగ్ ఫిల్టర్‌గా ద్రవ మార్పిడి మానవీయంగా లేదా యంత్ర ఆధారితంగా జరుగుతుందట. నిజానికి మూత్రపిండాల వైఫల్యంతో బాధపడే వారికి ఈ కిడ్నీ మార్పిడి చికిత్స వరమే. వారికి ఈ శస్త్ర చికిత్స మెరుగైన ఫలితాలను అందిస్తుందని చెబుతున్నారు నిపుణులు. కిడ్నీ మార్పిడి వల్ల కలిగే లాభాలు..మెరుగైన జీవన నాణ్యత: తరుచుగా డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి నుంచి విముక్తిట్రాన్స్ప్టాంట్ చేయించుకున్న పేషెంట్లు డయాలసిస్ చేయించుకునే రోగులకంటే ఎక్కువ కాలం జీవిస్తారట.డయాలసిస్‌తో పోలిస్తే..తక్కువ ఆహార పరిమితులు ఉంటాయిమునపటి మీదు ఎక్కువ ఎనర్జిటిక్, తక్కువ సమస్యలు ఎదుర్కొంటారటనష్టాలు..అందరూ ఈ సర్జరీకీ అర్హులు కారట. ఎందుకంటే..కిడ్నీని తీసుకునే వ్యక్తి ఆరోగ్యం, ఇచ్చే దాత ఆరోగ్య అనుకూలత అత్యంత ప్రధానమట. అలాగే కిడ్నీ మార్పిడి సర్జరీ చేయించుకున్నాక..జీవితాంతం రోగనిరోధక శక్తిని తగ్గించే మందులు వాడాల్సిందేనట.కొందరిలో ఇన్ఫెక్షన్, రక్తస్రావం, కొత్త కిడ్నీని తిరస్కరించే అవకాశం వంటివి ఎక్కువగా ఉంటాయట. ఫలితంగా వారికి ఈ సర్జరీ ప్రాణాంతకంగా మారుతుందట. రెండిటిలో ఏది మంచిదంటే..డయాలసిస్‌లో పెద్ద శస్త్ర చికిత్స అంటూ ఏం ఉండదు. స్వల్పకాలంలో సురక్షితమైనది అంతే. అర్హత కలిగిన రోగులకు మూత్రపిండ మార్పిడి చికిత్స అనేది సరైన ఎంపిక, పైగా వారి జీవన నాణ్యత, దీర్ఘకాలిక మనుగడను ప్రసాదిస్తుంది. ఇలా ట్రాన్స్‌ప్లాంట్ సరిపడని రోగులకు డయాలసిస్ ప్రభావవంతమైన ప్రత్యామ్నాయమని వైద్యలు చెబుతున్నారు. దీంతో పాటు ప్రధానమైన అంశం, దాత లభ్యత, ఆరోగ్య అనుకూలత అనేవాటిని బట్టి ఏది బెస్ట్ అనేది ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. సకాలంలో నెఫ్రాలజిస్ట్‌లను సంప్రదించి తగిన సలహాలు సూచనలు తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. (చదవండి: రూ 20 సమోసాతో రూ. 3 లక్షల యాంజియోప్లాస్టీ: వైద్యుల స్ట్రాంగ్ వార్నింగ్) -
'కలిసి చేస్తే కలదు ఆరోగ్యం'..! క్రేజీగా పార్ట్నర్ యోగా
కలిసి చేస్తే కలదు ఆరోగ్యం అంటున్నారు యోగా శిక్షకులు. ఆసనాలు సాధన చేసేటప్పుడు మరొకరితో కలిసి చేసే పార్ట్నర్ యోగా వల్ల అదనపు ప్రయోజనాలు దక్కుతాయని చెబుతున్నారు. దీంతో ఇటీవల కాలంలో నగరంలో ఈ పార్ట్నర్ యోగా క్రేజీగా మారుతోంది. మరీ ముఖ్యంగా భాగస్వామితో కలిసి ఆసనాల సాధనపై ఆసక్తికనబరుస్తున్నారు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటూ నిపుణులు సూచిస్తున్నారు. దీంతో ఇటీవలి కాలంలో ఈ తరహా పార్ట్నర్ యోగా సాధన చేసే ఔత్సాహికులు హైదరాబాద్ సిటీలోని ఫిట్నెస్ స్టూడియోల్లో, యోగా సెంటర్లలో బాగా కనిపిస్తున్నారు. దీనిని కపుల్ యోగా అనే పేరుతో ప్రత్యేకంగా జంటల కోసం కూడా సాధన చేసే అవకాశం కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరానికి చెందిన ప్రముఖ యోగా శిక్షకురాలు రీనా హిందోచా దీని గురించిన విశేషాలను ‘సాక్షి’తో ప్రత్యేకంగా పంచుకున్నారు. యోగా భంగిమలను సాధన చేసేటప్పుడు ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు మద్దతు అందించే శైలినే పార్ట్నర్ యోగా అని పేర్కొంటున్నారు. యోగాసనాలు వేసే సమయంలో పరస్పరం సహకరించుకునే క్రమంలో.. సమతుల్యతను కాపాడుకోవడం, శరీరం మరింత బాగా సాగేందుకు, భంగిమను సరిగ్గా అనుసరించేందుకు వీలు కలుగుతుంది. తద్వారా ఆసనాలు వేయడం సులభం అవుతుంది. ఇది ఫిట్నెస్తో పాటు నమ్మకం, పరస్పర విశ్వాసం కల్పించడంతో పాటు.. అనుబంధాలను బలోపేతం చేస్తుంది. భాగస్వామితో సాధన చేయడం వల్ల యోగా మరింత ఆహ్లాదకరంగా ప్రేరణ కలిగించేదిగా మారుతుంది. ప్రత్యేకించి కొన్ని భంగిమలు ఒంటరిగా కష్టంగా భావించే వ్యక్తులు కూడా భాగస్వామితో చేసినప్పుడు వాటిని సులభంగా వేయగలుగుతారు. తమ జీవిత భాగస్వామి, సహోద్యోగి లేదా అప్పుడే పరిచయం అయిన యోగా స్నేహితులతో కలిసి భాగస్వామి సాధన చేయవచ్చు. ఇది యోగాను కలిసి ఆస్వాదించడానికి ఒక అందమైన మార్గం. ప్రయోజనాలెన్నో.. ఈ తరహాలో యోగా సాధన శరీరంలోని ఫ్లెక్సిబులిటీని, అదే విధంగా బలాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఆసనాలను సరైన విధంగా సాధన చేసేందుకు సహాయపడుతుంది. ఆసనాలు వేసే సమయంలో ఉండే ఒత్తిడిని తగ్గిస్తుంది. అంతేకాకుండా దృష్టిని కూడా మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా కమ్యూనికేషన్ నైపుణ్యంతో పాటు భావోద్వేగ బంధాన్ని కూడా పెంచుతుంది.ఆరోగ్యకరం..‘భాగ’స్వామ్యం.. ఒకరు బాగా అనుభవజ్ఞులై మరొకరు కొత్తగా యోగసాధన చేస్తున్నవారైతే.. ఆ వ్యత్యాసానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవాలి. ‘భాగస్వామి యోగా భంగిమలు శారీరక శ్రేయస్సును పెంచడమే కాకుండా నమ్మకాన్ని, కమ్యూనికేషన్‌ని కూడా పెంపొందిస్తాయి. ఇవి ఆయా వ్యక్తులు తమ భాగస్వామితో పరస్పర అవగాహన కలిగి ఉండడానికి, ఆ సమయంలో ఏకాగ్రతతో ఉండటానికి ప్రోత్సహిస్తాయి అని అక్షర యోగా కేంద్ర వ్యవస్థాపకురాలు హిమాలయన్ సిద్ధా అక్షర్ అంటున్నారు. నగరవాసులకు క్రేజీగా మారిన పార్ట్నర్ యోగా ఏ వ్యాయామం అయినా ప్రారంభించే ముందు తప్పనిసరిగా వార్మప్ వ్యాయామాలు చేయాలి. మీ భాగస్వామితో అనువుగా ఉండేలా జాగ్రత్తపడాలి. జీవిత భాగస్వామి లేదా సన్నిహిత మిత్రులనో ఎంచుకోవడం మంచిది. వ్యక్తుల శారీరక సామర్థ్యాలు, శరీర కదలికలు ఎవరికి వారికే ప్రత్యేకంగా ఉంటాయి. వీటిని అర్థం చేసుకుని పార్ట్నర్ని ఎంచుకోవాలి. అలాగే ఆసనాల సమయంలో కదలికలు నిదానంగా ఉండాలి. భాగస్వామి బలంతో పాటు పరిమితులను కూడా సరిగా అర్థం చేసుకోవాలి. అయితే ఎప్పుడూ బలవంతంగా లేదా అతిగా సాగదీయకూడదు. ఇద్దరికీ సౌకర్యవంతంగా ఉండాలని గుర్తుంచుకోవాలి. శ్వాస క్రియ కూడా ఒకే క్రమంలో ఉండేలా చూసుకోవాలి. (చదవండి: రూ 20 సమోసాతో రూ. 3 లక్షల యాంజియోప్లాస్టీ: వైద్యుల స్ట్రాంగ్ వార్నింగ్) -
రూ 20 సమోసాతో రూ. 3 లక్షల యాంజియోప్లాస్టీ: వైద్యుల స్ట్రాంగ్ వార్నింగ్
మనం సరదాగా తినే కొన్ని రకాల స్నాక్స్ అనారోగ్యం బారినపడేందుకు కారణమవుతుంటాయి. అలాంటి వాటిల్లో ఒకటి అందరూ ఇష్టంగా లాగించే సమోసా. నోరూరించే ఈ సమోసా కోసం ఆఫీసులకి వెళ్లేవాళ్ల దగ్గర నుంచి రోడ్డు మీద కూరగాయలు అమ్ముకునే చిన్న చితక వ్యాపారుల వరకు టీ టైంలో స్నాక్ ఐటెంగా తినే వంటకమే ఈ సమోసా. రూ.10 లేదా 20 వెచ్చించి కొనుక్కుని తినే దాంతో ఆస్పత్రిపాలై రూ. 3లక్షల అప్పు కొని తెచ్చుకుంటున్నామని హెచ్చరిస్తున్న గుండె వైద్యుడి పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఢిల్లీ కార్డియాలజిస్ట్ "అనారోగ్యకరమైన ఆఫీస్ స్నాక్స్ సమోసాతో సవంత్సరాలుగా ఎంత ఖర్చు పెడుతున్నాం. ఆ తర్వాత దాని కారణంగా ఎలాంటి అనారోగ్య సమస్య కొని తెచ్చుకుని ఎంత అప్పులపాలవ్వుతున్నాం. " కళ్లకు కట్టినట్లుగా వివరించారు. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు తెచ్చే చేటు అంత ఇంత కాదంటూ మండిపడుతున్నారు వైద్యులు. ప్రతి సాయంత్రం చాలామంది తీసుకుని సమోసా ధర మహా అయితే రూ. 20 ఉంటుందనుకుంటే..క్రమం తప్పకుండా తినేవాడికి 15 ఏళ్లకు 300 సార్లు తింటాడనుకుంటే..మొత్తం ఖర్చు రూ. 90,000 అవుతుంది. అంటే అనారోగ్యకరమైన ఆహారం కోసం అంతమొత్తంలో డబ్బు ఖర్చు చేస్తున్నామే కానీ ఆదా చేయడం లేదు. ఇలా తినడం వల్ల గుండెల్లో కరోనరీ ధమనుల్లో సమస్య ఏర్పడి.. యాంజియోప్లాస్టీ చేయించుకునే పరిస్థితికి కొని తెచ్చుకుంటాం. అదేనండి స్టంట్ వేయించుకున్నాం అంటుంటారు కదా హార్ట్ పేషెంట్లు. అంటే సమోసాలు తిన్న ఫలితం హార్ట్ సర్జరీకి దారితీస్తుంది. దాని ఖర్చు రూ. 3 లక్షలు. అంటే అనారోగ్య ఆహారానికి ఖర్చు చేసే డబ్బుని ఆదా చేసినా ఆరోగ్యంగా ఉంటాం గానీ..తిని మరి యాంజియోప్లాస్టీ చికిత్స రూపంలో రూ. 3లక్షల అప్పుని కొని తెచ్చుకుంటున్నాం అంటూ ఆలోచింప చేసేలా..చాలా చక్కగా లెక్కలు వేసి వివిరించారు ఢిల్లీ కార్డియాలజిస్ట్. అంతేగాదు దాని ఫలితం ఎన్నో రోజులు భూమ్మీద ఉండే అవకాశం లేదనేలా పలు రకాల అనారోగ్య సమస్యల రూపంలో వార్నింగ్ ఇస్తుందట. సాధ్యమైనంత వరకు ఎంత తొందరగా ఇలాంటి ఆహారపు అలవాట్లను దూరం చేసుకుంటేనే మంచిదని సూచిస్తున్నారు. అలాగే ఆరోగ్యంగా ఉండేలి అంటూ ప్రణాళికల దగ్గర ఆగిపోతే.. జీవితం మన కోసం ఆగిపోదు అనేది గ్రహించండి అని నొక్కి చెబుతున్నారు గుండె వైద్యులు. Office canteen samosa: ₹20Angioplasty: ₹3 lakhsSamosas per year: 300Years of eating: 15Total samosa cost: ₹90,000You're not saving money on unhealthy food.You're taking a loan against your arteries at 400% interest.— Dr Shailesh Singh (@drShaileshSingh) October 23, 2025 వ్యాయామం చేయాల్సిన ప్రాధాన్యత..అనారోగ్యకరమైన అలవాట్లకు దూరంగా ఉంటూ..వ్యాయామం వంటి అలవాట్లను కష్టంగా అనిపించినా..అవి దైనందిన లైఫ్‌లో రోటీన్‌గా ఎలా మారుతాయో వివరించారు వైద్యులు. ఒక వారం వ్యాయమాల వల్ల శారీర కష్టాలు అనుభవించి ఉండొచ్చు. కానీ కంటిన్యూగా చేస్తూ ఉంటే..నెలాఖరికిగా అదొక అలవాటుగా మారిపోవడమే గాక, చేయకపోవడమే తప్పుగా లేదా లోటుగా అనేలా మారుతుందని అన్నారు. (చదవండి: నీటికి బదులు బీర్! స్పెషల్ హైడ్రేషన్ స్టయిల్..) -
ప్రసవ వేదన తర్వాత అంతటి వేదన..!
ముద్దుమురిపాలతో మురిపించే ఓ చిన్నారి కొత్త సభ్యుడిగా / సభ్యురాలిలా ఇంట్లోకి రావడం ఎంతో సంతోషదాయకమైన విషయం. అయితే అప్పటివరకూ ప్రసవవేదన అనుభవించిన ఆ తొలిచూలు తల్లుల్లో కొందరికి మాత్రం అదో భయానకమైన అనుభవం. ప్రసవం అయ్యాక కొంతమంది తల్లుల్లో ఆ అనుభవం కొంత కుంగుబాటు (డిప్రెషన్) రూపంలో కనిపిస్తుంది. కొత్తగా అమ్మ అయిన చాలామందిలో కనిపించే ఆ డిప్రెషన్ ప్రభావాలు చాలామందిలో తక్కువగానే ఉన్నా మరికొందరిలో మాత్రం... చిన్నారి పట్ల తల్లి చూపాల్సిన కేర్‌కు అడ్డంకిగా మారేంత పెద్దవిగానూ ఉండవచ్చు. ఇలా ప్రసవం తర్వాత వచ్చే డిప్రెషన్‌ను పోస్ట్ పార్టమ్ డిప్రెషన్’ (పీపీడీ) అంటారు. ఒక అంచనా ప్రకారం ప్రసవం తర్వాత తల్లికి డిప్రెషన్ వచ్చే కేసులు చాలావరకు గుర్తింపునకు కూడా నోచుకోకపోవడంతో ఆ తల్లులు తమ వేదనను నిశ్శబ్దంగా అనుభవిస్తూ తీవ్రమైన మనోవేదనకు లోనవుతున్నారు. ఈ నేపథ్యంలో పోస్ట్ పార్టమ్ డిప్రెషన్’ అంటే ఏమిటి, దాని లక్షణాలూ, పర్యవసానాలూ, చికిత్స వంటి అనేక అంశాలపై అవగాహన కోసం ఈ కథనం. బిడ్డపైనా ప్రభావం... తల్లి తన బిడ్డను దగ్గరికి తీసుకోకపోవడం, తన పాలు పట్టించడానికి సుముఖంగా లేకపోవడం, బిడ్డ పట్ల విముఖతతో సమయానికి పీడియాట్రీషియన్ దగ్గరికి తీసుకెళ్లకపోవడం వంటి అంశాలతో తల్లి తాలూకు డిప్రెషన్ ప్రభావం బిడ్డపైనా పడేందుకు అవకాశం లేకపోలేదు.కొత్తగా పాపాయి పుట్టిన సంతోషం కూడా ఆ తల్లుల్లో కనిపించకుండా చేసే ఈ పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్‌కు చాలా కారణాలు ఉంటాయి. ఉదాహరణకు గర్భధారణ ప్రక్రియలో అప్పటివరకు వారు శారీరకంగా, మానసికంగా ఎదుర్కొన్న సవాళ్లూ, ప్రసవం తర్వాతి ఉద్వేగపూరితమైన వెల్లువ, హార్మోన్లపరంగా దేహంలో వేగంగా జరుగుతున్న మార్పులు, కొన్నిసార్లు వాళ్ల సామాజిక, ఆర్థిక అంశాలూ ఇవన్నీ ‘పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్’కు కారణాలవుతాయి. అయితే అది తమ తప్పు కాదనీ, తమకు తెలియని కారణాల వల్ల అలా జరుగుతోందోని తెలియని తల్లులు అపరాధభావనకు లోనవుతూ మరింతగా కుంగి΄ోతుంటారు.కారణాలు... హార్మోన్ల తగ్గుదల : గర్భధారణ సమయంలో మునపటి కంటే దాదాపు పదింతలు పెరిగిన ఈస్ట్రోజెన్, పప్రొజెస్టెరాన్ హార్మోన్లు ప్రసవం కాగానే ఒకేసారి తగ్గి΄ోవడం. ప్రసవం జరిగిన మూడోరోజుకే అవి పదింతలు (ప్రీ–ప్రెగ్నెన్సీ స్థాయులకు) తగ్గి΄ోవడం ∙ప్రసవం సమయంలోని శారీరక శ్రమ, నిద్రలేమి, భవిష్యత్తులో పేరెంటింగ్ గురించి బెంగ... ఈ అంశాలన్నీ ΄ోస్ట్΄ార్టమ్ డిప్రెషన్‌కు కారణమవుతాయి.పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్లో రకాలు... తల్లులుఎదుర్కొనే భావోద్వేగాల తీవ్రతలను బట్టి వీటిని ప్రధానంగా మూడు రకాలుగా చెప్పవచ్చు. 1) పోస్ట్‌పార్టమ్ బ్లూస్ / బేబీ బ్లూస్ : పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్లో 50% నుంచి 75% వరకు ఈ రకమైనవే ఎక్కువ. ఈ రకం డిప్రెషన్ సాధారణంగా ప్రసవం తర్వాత మొదటివారంలో (మరీ ముఖ్యంగా మొదటిరోజు నుంచి మొదలుకొని నాలుగు రోజుల్లో) కనిపిస్తుంది. మొదట్లో కొత్త తల్లిని బాధించే లక్షణాలు చికిత్స తీసుకోకపోయినప్పటికీ రెండువారాల్లో తగ్గిపోతాయి. తల్లిలో ఈ డిప్రెషన్ కనిపించినప్పుడు భర్త, కుటుంబసభ్యులు సపోర్ట్ ఇస్తే చాలు. 2) పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ : ఇది మొదటిదానికంటే కాస్త ఎక్కువ తీవ్రతతో కనిపిస్తుంది. మొదటిసారి పోస్ట్‌పార్టమ్ బ్లూస్ కనిపించిన తల్లికి అటు తర్వాతి ప్రసవాల్లోనూ (దాదాపు 30% కేసుల్లో) ఇది రావచ్చు. సాధారణంగా కొన్ని నెలలు మొదలుకొని, ఏడాది వరకూ లక్షణాలు కనిపిస్తూ ఉండవచ్చు. కొద్దిపాటి సైకోథెరపీ అవసరమవుతుంది. 3) పోస్ట్‌పార్టమ్ సైకోసిస్ : పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్లో అత్యంత తీవ్రమైన దశ ఇది. ప్రతి వెయ్యి ప్రసవాల్లో ఒకరిలో కనిపిస్తుంది. ఇది కూడా కొన్ని నెలలు మొదలుకొని ఏడాది వరకూ తల్లిలో దీని తాలూకు తీవ్రమైన లక్షణాలు కనిపిస్తుంటాయి. నిద్రలేమి, విపరీతమైన కోపం, అయోమయం లాంటివి అత్యంత తీవ్రంగా ఉంటాయి.చివరగా... కేవలం ప్రసవం తర్వాతనే కాకుండా కొంతమంది మహిళల్లో ప్రసవం ముందు... అంటే గర్భధారణ సమయంలోనూ డిప్రెషన్ లక్షణాలు కనిపిస్తుంటాయి. వీటిని గమనించిన కుటుంబ సభ్యులు ఫాలో అప్ సమయంలో ఆ విషయాన్ని డాక్టర్‌కు తెలపాలి. లేదా ఒక్కోసారి పేషెంట్ మాటలను బట్టి డాక్టర్లే ఆ విషయాన్ని పసిగడతారు. అలాంటప్పుడపు అవసరాన్ని బట్టి ఆ పేషెంట్‌కు సైకియాట్రీ చికిత్స లేదా కౌన్సెలింగ్‌ను డాక్టర్లు సూచిస్తారు. లక్షణాలు... పై మూడు రకాల డిప్రెషన్లలోనూ కొత్త తల్లి కనబరిచే లక్షణాలు స్వల్పమైనవిగా మొదలుకొని, రకాన్ని బట్టి ఓ మోస్తరు నుంచి చాలా తీవ్రంగా కూడా ఉండవచ్చు. అవి... కారణం లేకుండానే తీవ్రమైన దుఃఖం, చాలా ఎక్కువగా ఏడ్వటం పాపాయి మీద ఏమాత్రం ఆసక్తికరబరచకపోవడం. (కొన్ని సందర్భాల్లో చిన్నారిపైనా ఉద్రిక్తంగా వ్యవహరించడం, డిప్రెషన్ తీవ్రత చాలా ఎక్కువగా ఉన్న సందర్భాల్లో కొందరు పాపాయిపై దాడి చేయడం, గాయపరచడానికి ప్రయత్నించడం) ∙చాలా విచారంగా ఉండటం దేనిపైనా ఆసక్తి లేక΄ోవడం, గతంలో తనకు సంతోషాన్ని ఇచ్చిన వ్యాపకాలపైనా ఆసక్తి ఉండక΄ోవడంఅతి చురుకుగా లేదా అతిగా ఉండే ప్రవర్తన ఆకలి తగ్గడం నిద్రపట్టడంలో ఇబ్బంది / నిద్రలేమి (కొద్దిగా మొదలుకొని తీవ్రంగా) మూడ్స్ త్వరత్వరగా మారిపోవడం ఎప్పుడూ నిస్పృహతోనూ విచారంగా ఉండటం, అపరాధభావన (గిల్ట్) దేనిమీదా దృష్టి కేంద్రీకరించలేకపోవడం, ఏకాగ్రత లోపించడం పరిస్థితి చాలా తీవ్రంగా ఉన్న కొందరు ఆత్మహత్యకూ యత్నించడం. నిర్ధారణ... ఈ సమస్య నిర్ధారణకు నిర్దిష్టంగా ఏ వైద్యపరీక్షా లేదు. అయితే బాధితురాలిని క్షుణ్ణంగా పరిశీలించడం, లక్షణాల గురించి బాధితురాలి భర్త, కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకోవడం ద్వారా ఈ సమస్యను నిర్ధారణ చేస్తారు.చికిత్స... బాధితురాలి సమస్య తీవ్రతను బట్టి చికిత్స ఉంటుంది. ప్రధానంగా కౌన్సెలింగ్ ద్వారా చికిత్స అందిస్తారు. ఇలాంటి చికిత్సలో కుటుంబసభ్యులు, ఫ్రెండ్స్ లాంటి వారి భూమిక చాలా కీలకం. తీవ్రత మరీ ఎక్కువగా ఉన్నవారికి తప్పనిసరి అయితే యాంటీ యాంగ్జైటీ మందులు లేదా యాంటీ డిప్రెసెంట్స్ వంటి మందులను సూచిస్తారు. ఎంతకీ తగ్గనంత తీవ్రత ఉన్నప్పుడు కొందరికి ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ (ఈసీటీ) అని పిలిచే షాక్ ట్రీట్మెంట్ కూడా ఇస్తారు. అయితే కొందరు సాధారణ ప్రజల్లో దీని పట్ల అ΄ోహలు ఉన్నప్పటికీ ఇది ఏమాత్రం హాని కలిగించనిదీ, చాలా సురక్షితమైనదని అందరూ అవగాహన కల్పించుకోవాల్సిన అవసరముంది. (చదవండి: నవ్విస్తూ కొనేలా చేశాడు!'యాడ్ గురు'..) -
ఆపరేషన్ మధ్యలో క్లారినెట్ వాయించిన మహిళ..! ఆశ్చర్యపోయిన వైద్యులు
ఇటీవల బ్రెయిన్‌కి సర్జరీ మెలుకువగా ఉండగా చేసిన ఘటనలు చూశాం. కొందరూ పాటలు, సినిమాలు చూస్తూ చేయించుకున్నారు. అదంతా ఒక ఎత్తైతే. బ్రెయిన్ సర్జరీ చేస్తుండగా..మధ్యలో ఓ సంగీత వాయిద్యాన్ని వాయించింది ఒక మహిళ . వైద్యులు సైతం విస్తుపోయారు. దీని కారణంగా తమ సర్జరీ సక్సెస్ అనేది తక్షణమే నిర్థారించుకోగలిగామని ఆనందంగా చెబుతున్నారు వైద్యులు. మరి ఆ ఆసక్తికర కథేంటో చకచక చదివేద్దామా..!.లండన్‌లో చోటుచేసుకుంది ఈ అద్భుత ఘటన. లండన్‌లో క్రౌబేర్కు చెందిన 65 ఏళ్ల డెనిస్ బెకన్(Denise Bacon) గత కొన్నేళ్లుగా పార్కిన్సన్స్తో(Parkinsons disease) బాధపడుతోంది. రిటైర్డ్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ థెరపిస్ట్ అయినా ఆమె పార్కిన్సన్స్ నుంచి ఉపశమనం పొందేందుకు కింగ్స్ కాలేజ్ హాస్పిటల్లో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ ఆపరేషన్ చేయించుకోవాలనుకున్నారు. ఆమెకు ఈ వ్యాధి 2014లో నిర్థారణ అయ్యింది. ఫలితంగా నడవడం, ఈత కొట్టడం, డ్యాన్స్ చేయడం వంటివి ఏమి చేయలేకపోయింది. ఐదేళ్ల నుంచి తను ఎంతో ఇష్టపడే గ్రిన్స్టెడ్ కచేరీ బ్యాండ్ ప్రదర్శనలో సైతం పాల్గొనడం మానేసిందామె. ఆ నేపథ్యంలో ఇలా బ్రెయిన్‌కి ఆపరేషన్ చేయించుకోవాలనుకుంది బేకన్. ఇది సుమారు నాలుగు గంటల ఆపరేషన్. అందులో భాగంగా ఆమె పుర్రెకి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి శస్త్ర చికిత్స చేస్తున్నారు వైద్యులు. అంతలో మధ్యలో ఆమె చేతి వేళ్లను సునాయాసంగా కదిలించగలగడేమ కాదు, ఆపరేషన్ చేస్తుండగా మధ్యలోనే క్లారినెట్ను అద్భుతంగా వాయించింది. దాన్ని చూసి వైద్యుల సైతం విస్తుపోయారు. బ్రెయిన్ సర్జరీలో భాగంగా ఎలక్ట్రోడ్లు సక్రియం చేస్తుండగా చేతులు కదులుతున్నట్లు గమనించి.. ఇలా వాయిద్యాని వాయించాలని భావించానంటోంది. దీని కారణంగా తమ సర్జరీ విజయవంతమని, ఆమె సమస్య నుంచి బయటపడి మెరుగ్గా ఉందని తక్షణమే నిర్థారించగలిగామని ఆనందంగా చెబుతున్నారు వైద్యులు. అంతేగాదు ఆమె ఆ సాహసం చేయాలనుకోవడం చాలా ప్రశంసించదగ్గ విషయమని అన్నారు. అందుకు సంబంధించిన వీడియోని నెట్టింట షేర్ చేశారు వైద్యులు. నెటిజన్లు సైతం శస్త్రచికిత్స మధ్యలో క్లారినెట్ వాయించడం అంటే.. అది మాములు ధైర్యం కాదంటూ బెకాన్ని కొనియాడుతూ పోస్టులు పెట్టారు. Patient with Parkinson's disease plays clarinet during brain procedure at London hospital pic.twitter.com/en2vpRRfaA— The Associated Press (@AP) October 23, 2025 (చదవండి: కూతురి డ్రీమ్, తండ్రి సంకల్పం..! ఆ నాణేల సంచి వెనుక ఇంత భావోద్వేగ కథనా..) -
హీరో ప్రభాస్ అన్ని గుడ్లు తినేవాడా? బాహుబలి డైట్ అలా ఉండేదా..?
రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అత్యధిక బడ్జెట్ సినిమాలు, బాక్సాఫీస్ రికార్డులు, అంతర్జాతీయ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ప్రముఖ నటుడు. ప్రతి సినిమా కోసం తన ఆకృతిని చాల సునాయాసంగా మార్చుకుంటాడు. ఆ పాత్రలో ఒదిగిపోయేలా నిబద్ధతను చూపిస్తారు. అయితే ప్రబాస్ ఇలా సినిమా కోసం ఇంతలా తన బాడీలో వేరియేషన్ చూపించాలంటే డైట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ముఖ్యంగా బాహుబలిలో రాజులా ఆ పాత్రలో లీనమైపోయేలా కనిపించిన అతడి ఆహార్యం.. ఆ తర్వాత సాహో సినిమాకు చాలా స్లిమ్‌గా మారిపోయింది. ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా ఎలా డైట్‌ని బ్యాలెన్స్ చేసుకుంటూ రూపురేఖల్ని మార్చుకుంటుంటారు వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా. బాహుబలి మూవీలో కండలు తిరిగిన దేహంతో కనిపించాలి కాబట్టి ప్రతి ఉదయం చాలా గుడ్లు తినేవారట. ఆ విషయమై ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్‌ని అడగగా..ఆయన అవునని చెప్పారు. ఎందుకంటే కండలు తిరిగిన దేహంతో రాజసం ఉట్టిపడేలా కనిపించాలి కాబట్టి తప్పలేదన్నారు. అయితే అన్ని గుడ్లు తినడం చాల కష్టమని అన్నారు. చెప్పాలంటే ఒక రోజులో 20 నుంచి 30 గుడ్లు దాక తిని ఉంటానని అన్నారు. అయితే ఉడకబెట్టినవి తినడం కష్టమని అందుకని వాటిని ప్రోటీన్‌తో మిక్స్ చేసి ఒక జ్యూస్ మాదిరిగా తాగాల్సి ఉంటుందట. అలా అయితేనే.. గుడ్డు పచ్చి వాసన అంతగా ఉండదు కాబట్టి, అన్ని తినగలమని చెప్పారు. ఆ తర్వాత 2019లో సాహో మూవీని ప్రమోట్ చేశారు. అప్పుడాయన ఇదివరకటి ప్రభాస్‌లా చాలా స్లిమ్‌గా కనిపించారు. అప్పడు కూడా ప్రభాస్ బాహుబలి మాదిరిగానే అలాంటి ట్రిక్ ఏదైనా ఫాలో అయ్యారా అని మీడియా అడగగా..అదేం లేదన్నారు. అయినా బహుబలి పూర్తి అయ్యిన వెంటనే సన్నబడాలని అనుకున్నానని, అందుకోసం స్ట్రిక్ట్‌గా శాకాహారం తీసుకున్నట్లు వివరించారు. శాకాహారంలో కూడా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి అది బరువు తగ్గడానికి సహయపడుతుందని చెప్పుకొచ్చాడు ప్రభాస్. బాహుబలి మూవీ టైంలో నెలల తరబడి కండరాలు పెంచేందుకు చాలా ఎక్కువగా తినాల్సి వచ్చింది, కాబట్టి దాన్ని తగ్గించాలంటే ప్యూర్ వెజిటేరియన్‌గా మారక తప్పదని అన్నారు ప్రభాస్. ఏ డైట్‌ని అనుసరించినా.. నిపుణులు పర్యవేక్షణలో ఆరోగ్యంగానే అమలు చేస్తానని అన్నారు. చివరగా ఏ డైట్ అయినా హెల్దీగా సరైన పద్ధతిలో అనుసరిస్తే మంచిగా బరువు తగ్గుతారని, అదేమంతా కష్టం కాదని అన్నారు ప్రభాస్.అంతలా గుడ్లు తీసుకోవచ్చా అంటే..గుడ్లు ఎప్పడు అద్భుతమైన ప్రోటీన మూలం. అని దాన్ని పలు రూపాల్లో తీసుకోవడం మంచిదేనని అన్నారు. అలాగే మరి అంతలా అంటే.. జీర్ణక్రియపై ప్రభావం చూపే ప్రమాదం ఉందన్నారు. అచ్చం గుడ్డులో లభించే ప్రోటీన్ మన శాకాహారంలో 20 రకాల ఆహారాల్లో కనిపిస్తుందని చెప్పారు. వాటిని తీసుకున్నా.. సమృద్ధిగా ప్రోటీన్ లభిస్తుందిన చెప్పారు. View this post on Instagram A post shared by Prabhas cults (@prabhascults_) గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: సమంత హైప్రోటీన్ డైట్..ఆ మూడింటితో ఫుల్‌ఫిల్..!) -
ప్రాజెక్టులు వస్తాయి కానీ... పోయిన ఆరోగ్యం తిరిగి రాదు!
నాకు 36 ఏళ్లు. నేను ఇటీ ఉద్యోగిని. ఒంగోలులో మా తల్లిదండ్రుల దగ్గర ఉంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను. ఈ మధ్య కాలంలో బయట లే– ఆఫ్ లు బాగా అవుతున్నాయి. మా కంపెనీలో కూడా కొంతమందిని తీసివేసి ఉన్న వాళ్ళతోనే పని నడిపిస్తున్నారు. దీనివల్ల ఆఫీసులో ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటోంది. లాప్టాప్ ముందు 12–14 గంటలు కూచోవాల్సి వస్తోంది. ఒక్కోసారి అర్ధరాత్రి వరకు పని చేయాల్సి ఉంటుంది. దీని ఫలితంగా నిద్ర పట్టడం లేదు. తలనొప్పితోపాటు. చికాగ్గా ఉంటోంది. ఇంట్లో భార్య పిల్లల మీద కూడా సహనం కోల్పోతున్నాను. జాబ్ వదిలేయాలనిపిస్తుంది. కానీ నాకున్న కమిట్మెంట్స్ వల్ల అది సాధ్యం కాదు. నేను ఏ నిర్ణయమూ తీసుకోలేకపోతున్నాను. ఈ పరిస్థితుల్లో నేను ఏం చేయాలో సలహా చెప్పగలరు. – అశోక్, ఓంగోలు అశోక్ గారు! మీరు చెప్పిన పరిస్థితి ఈరోజుల్లో చాలా మంది ఉద్యోగులు ఎదుర్కొంటున్నదే. ‘వర్క్ ప్లేస్ స్ట్రెస్‘కు మీరే ఒక ఉదాహరణ. ఉద్యోగుల తీసివేత, టార్గెట్స్. డెడ్‌లైన్స్ వల్ల ఒత్తిడి పెరగడం సహజం, కానీ దీని ప్రభావం మీ ఆరోగ్యం పైనే కాకుండా, కుటుంబ సంబంధాలపైనా పడుతోందన్న విషయాన్ని గమనించి దిద్దుబాటు కోసం ‘సాక్షి’ని సంప్రదించడం అభినందనీయం. మొదటగా, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఉద్యోగం మానెయ్యాలని ఎవరికైనా అనిపించడం సహజం. కానీ తమకున్న కమిట్మెంట్స్, బాధ్యతల వల్ల అలా మానివేయడం చాలా సందర్భాల్లో కుదరదు. కనుక ఉద్యోగం చేస్తూనే ఒత్తిడిని ఎదుర్కొనేలా సన్నద్ధం అవడం ఉత్తమం. పని, ఆరోగ్యం, కుటుంబం–ఈ మూడిటి మధ్య సమతౌల్యం పాటించాలి. పని సమయంలో చిన్న చిన్న విరామాలు తప్పనిసరిగా తీసుకోండి. ప్రతి 1–2 గంటలకు, ఐదు ఏమిషాలు నడవండి. లోతుగా శ్వాస తీసుకొని వదిలే ’డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి. ఇది ఏకాగ్రతని మెరుగుపరుస్తుంది. అర్ధరాత్రి వరకు లాప్టాప్ ముందు కూర్చోవడం శరీరానికి, నిద్రకి తీవ్ర నష్టం చేస్తుంది. కాబట్టి. మీ మేనేజర్‌తో మాట్లాడి రాత్రిపూట ఒక కటాఫ్ టైమ్ పెట్టుకోండి. ఇంటి వాతావరణం, కుటుంబ సభ్యులతో గడిపే సమయం ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. వారాంతాల్లో వారితో బయటకు వెళ్ళి సరదాగా గడపండి. ఇంట్లో ఉన్నప్పుడు కూడా కుటుంబంతో గడపడానికి ఫిక్స్డ్ టైమింగ్స్ పెట్టుకోండి. ఉదాహరణకు డిన్నర్ సమయంలో ఫోన్, లాప్టాప్ దూరంగా పెట్టేయండి. ఇది మీకు రిలీఫ్ ఇస్తుంది. మీ కుటుంబానికి కూడా మీరు ఎమోషనల్‌గా అందుబాటులో ఉన్నారు అన్న భరోసా ఇస్తుంది. అలాగే వ్యాయామం ధ్యానం, యోగా లాంటి పద్దతులు మీ రోజు వారీ షెడ్యుల్‌లో చేరిస్తే ‘స్ట్రెస్ హర్మోన్లు’ తగ్గుతాయి. దీనివల్ల నిద్ర మెరుగుపడుతుంది. చిరాకు తగ్గుతుంది. ఇవన్నీ చేసినా కూడా మీరు ఇంకా ఒత్తిడిగా ఫీల్ అవుతున్నట్లయితే, ఒక మానసిక వైద్య నిపుణుడిని కలిసి స్ట్రెస్ మేనేజ్ చేసే టెక్నిక్స్ నేర్చుకోవడం చాలా ఉపయోగపడుతుంది. ఒక్క విషయం గుర్తుంచుకోండి.. టార్గెట్స్, ప్రాజెక్ట్ మళ్ళీ వస్తాయి, కానీ పోయిన ఆరోగ్యం తిరిగి రాదు. కాబట్టి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే మీకు మీ కుటుంబానికి, మీ కెరీర్‌కి కూడా దీర్ఘకాలికంగా మేలు చేస్తుంది. ఆల్ ది బెస్ట్!డా. ఇండ్ల విశాల్ రెడ్డి,సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. (మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com)(చదవండి: ఎంబిఏ చేసిన 80 ఏళ్ల సీఈవో..! ఏకంగా రెండుసార్లు కేన్సర్ బారినపడ్డప్పటికీ..) -
15 నెలల్లో 40 కిలోలు బరువు..! శిల్పంలాంటి శరీరాకృతి కోసం..
అధిక బరువు తగ్గడం అతిపెద్ద సమస్య కాదు అని నిరూపిస్తున్నారు పలువురు. మెరుగైన ఫలితాలు రావాలంటే సరైన విధంగా, మంచి నిపుణుల సలహాల సూచనలు పాటించాలి. ఈ అధిక బరువుకి చెక్‌పెట్టడంలో ప్రధాన పాత్ర పోషించేది కేవలం డైట్ మాత్రమే కాదు, వర్కౌట్లుదే అగ్రస్థానం. ఎందుకంటే శారీరక శ్రమతో ఫ్యాట్‌ని కరిగించడమే గాక బరువులో మార్పులు కూడా సంభవిస్తాయి. కొందరికి చేతులు, కాళ్లు, పిరుదులు బాగా లావుగా కనిపిస్తాయి. ఆ ప్రదేశాల్లోని కొలెస్ట్రాల్ తగ్గి..ఫ్లాట్‌గా అవ్వడమేగాక చెక్కిన శిల్పంలా ఆకృతి మారాలంటే ఈ వ్యాయామాలు తప్పనిసరి అంటోంది ఫిట్నెస్ కోచ్ సాచి పాయ్. అదెలాగో ఆమె మాటల్లోనే సవివరంగా చూద్దామా..!. టొరంటోకు చెందిన ఈ ఫిట్నెస్ కోచ్ సాచి పాయ్(Saachi Pai) జస్ట్ 15 నెలల్లో 40కిలోలు పైనే బరువు తగ్గింది. అంతలా బరువు తగ్గడంలో తనకు హెల్ప్ అయిన వ్యాయామాలు, ఆహారాలు గురించి సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. బరువు తగ్గడంలో మార్పులు బాహ్యంగా కనిపించాలంటే..కాళ్లు, చేతులు, పిరుదుల సైజ్ తగ్గితేనే..బరువు తగ్గినట్లు తెలుస్తుంది. అందుకోసం ఈ ఐదు వ్యాయామాలు క్రమం తప్పకుండా చేయలంటోంది సాచి పాయ్. సైడ్ రైజెస్ఈ వ్యాయామం కోసం నిటారుగా నిలబడి ప్రారంభించాలి. ఒక కాలును పక్కకు ఎత్తి, దానిని నిటారుగా ఉంచండి. కాలును నెమ్మదిగా క్రిందికి తీసుకురండి ..ఇలా పునరావృతం చేయాలి.ముందు, వెనుక కిక్స్ఎత్తుగా నిలబడి, ఒక కాలును ముందుకు తన్నండి, ప్రారంభానికి తిరిగి వెళ్లి, ఆపై దానిని వెనుకకు తన్నండి. ఆ తర్వాత యథాస్థానానికి వచ్చి..కదలికలను నియంత్రించాలి. ఇలా కొన్నిసార్లు రిపీట్ చేయండి. సింగిల్ ఇన్నర్ లెగ్ రైజెస్మీ దిగువ కాలును నిటారుగా ఉంచి, పై కాలును దానిపై వంచి సైడ్‌కు పడుకోండి. ఇది, లోపలి తొడలపై ఒత్తిడి కలుగుజేసేలా దిగువ కాలును పైకి ఎత్తండి. ఇలా మీ కాలును నెమ్మదిగా తగ్గించి.. పునరావృతం చేయండి. నిర్దిష్ట సంఖ్యలో ప్రాక్టీస్ అయ్యాక..మరోవైపకి తిరిగి ఇలానే పునరావృతం చేయాలి..ఫైర్ హైడ్రాంట్స్నాలుగు కాళ్లపై ప్రారంభించండి, ఒక మోకాలిని పక్కకు ఎత్తండి, దానిని వంచి ఉంచండి. వ్యాయామం చేస్తున్నప్పుడు మీ తుంటిని తిప్పవద్దు. ఇప్పుడు, వీపును క్రిందికి తగ్గించి రెండో కాలికి ఇలానే వ్యాయామం రిపీట్ చేయండి.డాంకీ కిక్స్నాలుగు కాళ్లపై నిలబడి, ఒక మోకాలిని వంచి, మడమను పైకప్పు వైపుకు ఎత్తాలి. ఈ వ్యాయామాలు కొవ్వును కాల్చడానికి, టోన్ చేయడానికి హెల్ప్ అవుతాయి. పలితంగా శిల్పంలా శరీరాకృతి మారేందుకు దోహదపడుతుంది. ఈ వ్యాయామాలు నిపుణుల పర్యవేక్షణలో సరిగా చేస్తే మంచి ఫలితాలు అందుకుంటారని, అదే తప్పుగా చేస్తే లేనిపోని శారీరక సమస్యలు తప్పవని చెప్పుకొచ్చారు. సాధ్యమైనంతవరకు నిపుణుడైన ఫిట్నోస్ పర్వవేక్షకుడి సమక్షంలో నేర్చుకోవడమే మంచిదని సూచిస్తున్నారు సాచిపాయ్. View this post on Instagram A post shared by Saachi | Pilates. Fat Loss. Real Talk. (@saachi.pai) (చదవండి: 44 కిలోల బరువు తగ్గిన ఫిట్నెస్ కోచ్..! సరికొత్తగా వెయిట్‌లాస్ పాఠాలు..) -
మధుమేహ వ్యాధిగ్రస్తులకు దీపావళి ‘స్వీట్’ వార్నింగ్..!
దీపావళి అనగానే నోరూరించే వివిధ రకాల మిఠాయిలు గురొస్తాయి. టపాసులు ఎంత ఫేమస్సో.. అంతే రీతిలో స్వీట్లు ఫేమస్.. పండగ శుభాకాంక్షలతో పరిశ్రమలు, ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలు, వ్యాపార వేత్తలు ప్రత్యేంగా ఆర్డర్ ఇచ్చి స్వీట్స్ తయారు చేయిస్తున్నారు. ఆది, సోమవారాల్లో నేరుగా వచ్చే వినియోగదారుల కోసం స్వీట్ దుకాణాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ సమయంలో వినియోగదారులు జాగ్రత్తగా వ్యవహరించాలి. సందట్లో సడేమియా అన్నట్లు డిమాండ్ ఉన్నప్పుడే నాసిరకం ఉత్పత్తులు తయారు చేసి, ఎక్కువ రోజులు నిల్వ ఉంచుతారు. రుచి, వాసన, జిగేల్ మని మెరిసే రంగుల కోసం వివిధ రకాల రసాయనాలు వినియోగించే అవకాశం ఉందంటున్నారు వైద్యులు. ఫలితంగా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దీనికి ప్రత్యామ్నాయంగా ఇంట్లోనే తయారు చేసుకోవడం ఉత్తమమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో మిఠాయిలకు ఫుల్ డిమాండ్ కనిపిస్తోంది. పండగ రెండు రోజులు ఎగబడి మరీ కొంటారు. అయితే వీటిని తయారు చేసే సమయంలో ఎలాంటి పదార్థాలు వినియోగిస్తున్నారనేది తెలియదు. ఆహార భద్రత అధికారులు సైతం దీనిపై దృష్టిసారించే పరిస్థితి లేదు. దీంతో కల్తీ జరిగే అవకాశాలు ఎక్కువ. ఇటువంటి సమయంలో మితంగా తింటే సరే.. అతిగా తిన్నామా ఆరోగ్య సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పిల్లలు, వృద్ధులు, గర్భిణులు మరింత అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. స్వీట్స్‌లో చక్కెర, కొవ్వు పదార్థాలు అధికంగా వినియోగిస్తారు. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. కొవ్వు పదార్థాలు గుండె జబ్బులకు దారితీయవచ్చు. పిల్లల్లో అవయవాల పనితీరు దెబ్బతినే అవకాశం ఉంది. వీటన్నింటికీ మించి అవసరాలకు సరిపడా పిండి వంటలను ఇంట్లోనే తయారు చేసుకుంటే మేలు. తద్వారా కల్తీ ఆహార పదార్థాలు, కలుషిత, నిల్వ ఉంచిన వాటి నుంచి జాగ్రత్తపడే అవకాశం ఉంటుంది.దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం.. పిండి వంటల తయారీ ప్రక్రియలో నూనె, చక్కెర, రంగులు, డ్రైఫ్రూట్స్ ఎలాంటివి వినియోగిస్తున్నారో గుర్తించడం కష్టం. రుచి, వాసన, రంగు కోసం కెమికల్స్ వినియోగించే అవకాశం లేకపోలేదు. ఇవి పిల్లలు, గర్భిణులు, వృద్ధులుపై దీర్ఘకాలిక ప్రభావం చూపిస్తాయి. కెమికల్స్, కల్తీ పదార్థాలు తినడం వల్ల ఫుడ్ పాయిజన్ కావచ్చు. దీర్ఘకాలంలో కేన్సర్, లివర్, కిడ్నీపై ప్రభావం చూపిస్తాయి. ఇటువంటి వాటిపై ప్రభుత్వ శాఖాపరమైన పర్యవేక్షణ ఉండాలి. తయారు చేసిన వంటకాల ప్యాక్‌పై వినియోగించిన పదార్థాలు, ఫ్యాట్, ఇతర వివరాలు ముద్రించాలి. – కిరణ్ కుమార్ మాదాల, ఐఎంఏ తెలంగాణ మీడియా కో–కన్వీనర్ -
44 కిలోల బరువు తగ్గిన ఫిట్నెస్ కోచ్..! సరికొత్తగా వెయిట్‌లాస్ పాఠాలు..
ఆరోగ్యకరమైన జీవినశైలి బరువు తగ్గడానికి సంబంధించి..తప్పుదారి పట్టించే ఇన్ఫర్మేషన్ కారణంగానే చాలామంది వెయిట్‌లాస్ కాలేకపోతుంటారని చెబుతున్నాడు ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ యష్ వర్ధన్ స్వామి. కొందరు విఫల ప్రయత్నం చేసి విసిగిపోయినవాళ్లు కూడా ఉన్నారని అంటున్నాడు. తాను ఒకప్పుడు అధిక బరువు ఉండేవాడనని, ఇప్పుడు వెయిట్‌లాస్ అయ్యి ఆరోగ్యకరమైన బరువుకి చేరుకున్నాని కూడా చెప్పారు.ఆ మార్పు కొన్ని పాఠాలను నేర్పించిందని, అవి శ్రేయోభిలాషులకు తప్పక ఉపయోగపడతాయాంటూ..తన అనుభవాలను షేర్ చేసుకున్నారు. అంతేగాదు బరువు తగ్గడం అనేది క్రమ శిక్షణ, మనసును కంట్రోల్ చేయడం వంటి అంశాలను తప్పక నేర్పిస్తుందని అంటన్నారు. వాటి కారణంగా బరువు తగడ్డం అనేది ఆధారపడి ఉంటుందట. మరి అదెలా అనేది ఆయన మాటల్లోనే సవివరంగా తెలుసుకుందామా.!.ఫిట్నెస్ ట్రైనర్(Fitness coach) యష్ వర్ధన్ స్వామి(Yash Vardhan Swami) 13ళ్ల క్రితం వరకు అధిక బరువుతో ఉండేవాడనని చెప్పారు. ఆ తర్వాత 44 కిలోలు మేర బరువు తగ్గి విజయవంతమయ్యాక..కొన్ని విషయాలు ప్రస్ఫుటంగా అర్థమయ్యాయన్నారు. తను క్రమంగా బరువు తగ్గుతున్నప్పుడూ సంతరించుకున్న మార్పుని గమనిస్తూ..నేర్చుకున్న వెయిట్‌లాస్ పాఠాలను గురించి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. బరువు తగ్గడం అనే శారీరక సవాలు.. మానసిక భావోద్వేగాలను సంబంధించిన అంశమని నొక్కి చెప్పారు. ఇక్కడ ఊబకాయం(Obesity) అనేది కేవలం శరీర సమస్య కాదు, జీవిత సమస్య అని అన్నారు. దీని కారణంగా అన్ని సంబంధాలు కోల్పోతామట. ముఖ్యంగా ఆరోగ్యం, సంపద, సంబధాలపై ప్రభావం చూపి..పూర్తిగా సత్సంబంధాలు దెబ్బతింటాయని చెబుతున్నారు. అలాగే వెయిట్‌లాస్ జర్నీలో అతి ముఖ్యమైన సవాలు మనసుతో యుద్ధం చేయడమేనని అన్నారు. కొలస్ట్రాల్ తగ్గించుకుంటే బరువు తగ్గుతామని అందరికీ తెలుసు. అది కార్యరూపంలోకి రావాలంటే..మనసు కంట్రోల్లో ఉండాలన్నారు. అప్పుడే మనం వేసుకునే వెయిట్‌లాస్ ప్లాన్ సక్సెస్ అవ్వగలదు. అది నియమానుసారంగా సాగితే..క్రమశిక్షణ, నిబద్ధత అలవడుతుందట. ఎప్పుడైతే మనలో ఇలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో అప్పుడూ కుటుంబసభ్యులు, స్నేహితుల నుంచి ఆటోమేటిగ్గా మద్దతు లభించడమే కాదు..మనకో ప్రాముఖ్యత ఏర్పడేలా మన రూపురేఖల్లో మార్పులు సంతరించుకుంటాయని చెప్పుకొచ్చారు. అలాగే ఇంకొక విషయం తప్పక గుర్తించుకోండి అంటూ..ఊబకాయం ఏమి రాత్రికి రాత్రికి మన జీవితాన్ని నాశనం చేయదని చెప్పారు. మన ఆహారపు అలవాట్లతో రోజువారిగా నెమ్మదిగా మన సౌందర్యాన్ని దెబ్బతీసేలా బరువు పెరుగుతుంటామని అన్నారు. అందుకే ఎదుట వ్యక్తులకు శారీరక పరంగా మనపట్ల ఉన్న అభిప్రాయాన్ని లైట్ తీసుకోవద్దని అని సూచిస్తున్నారు. అప్పుడే లోపాన్ని సరిచేసుకునే యత్నం చేసి..బరువు తగ్గేందుకు ట్రై చేస్తామని అన్నారు. అందుకు మనసు తోపాటు డెడికేషన్ అనేది అత్యంత ప్రధానమని గ్రహించమని సూచించారు ఫిట్నెస్ కోచ్ యష్ వర్ధన్ స్వామి. View this post on Instagram A post shared by Yash Vardhan Swami (@trainedbyyvs) (చదవండి: పేదరికాన్ని జయించేశా.. ఎట్టకేలకు అమ్మ కోసం ఇల్లు కట్టేశా..!) -
ప్రెగ్నెన్సీ టైంలో నడుము నొప్పి సాధారణమా? తగ్గాలంటే..
నేను ఆరునెలల గర్భవతిని. కొన్నిరోజులుగా నడుమునొప్పి ఎక్కువగా వస్తోంది. ఎక్కువసేపు నడిచినా, కూర్చున్నా నొప్పి పెరుగుతోంది. ఇది గర్భధారణలో సాధారణమా? లేక ఏమైనా సమస్య ఉందా? దీన్ని తగ్గించడానికి ఏం చేయవచ్చు?– మాలిని, గుంటూరు. గర్భధారణలో నడుమునొప్పి చాలా సాధారణం. ఎక్కువమంది గర్భిణులు ఏదో ఒక దశలో దీనిని అనుభవిస్తారు. బరువు పెరగడం, గర్భాశయం పరిమాణం పెరగడం, హార్మోన్ల ప్రభావం, శరీర ధారణలో మార్పులు, లిగమెంట్లు సడలడం వంటివి దీనికి ప్రధాన కారణాలు. చాలాసేపు ఒకే స్థితిలో కూర్చోవడం లేదా నిలబడడం, వెన్నుకు సరైన ఊతం లేని కుర్చీలో కూర్చోవడం వల్ల నొప్పి మరింత పెరుగుతుంది. గర్భధారణ మొదటి నెలల నుంచే ఈ సమస్య రావచ్చు, అయితే గర్భధారణ కొనసాగుతున్న కొద్దీ ఇది మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. నడుమునొప్పి తగ్గించుకోవడానికి కొన్ని సాధారణ జాగ్రత్తలు పాటించడం మంచిది. ఎక్కువసేపు కూర్చోవడం లేదా నిలబడడం తగ్గించుకోవాలి. వెన్నుకు ఊతం ఇచ్చే కుర్చీని ఉపయోగించడం, పక్కకు తిరిగి పడుకోవడం, మోకాళ్ల మధ్య దిండు పెట్టుకుని నిద్రించడం ఉపశమనాన్ని ఇస్తాయి. హీల్స్ వాడకూడదు, సౌకర్యవంతమైన షూలు ధరించాలి. ఎక్కువ నీరు తాగడం, శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవడం, పాల ఉత్పత్తులు తీసుకోవడం, వైద్యులు సూచించిన కాల్షియం, విటమిన్ సప్లిమెంట్స్ వాడటం అవసరం. ఆకస్మిక నొప్పి ఉన్నప్పుడు వేడి నీటి బ్యాగ్‌తో మసాజ్ చేయడం, వేడినీటితో స్నానం చేయడం లేదా మృదువుగా తైలమర్దన చేయించుకోవడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. పెయిన్ కిల్లర్ వైద్యుల సూచన లేకుండా వాడకూడదు. తగినంత విశ్రాంతితో పాటు నడక, వ్యాయామం, స్ట్రెచింగ్, ప్రెగ్నెన్సీ యోగా వంటి పద్ధతులు కూడా నడుమునొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. కొన్ని సందర్భాల్లో ఫిజియోథెరపిస్ట్ సలహా తీసుకోవడం కూడా మంచిది. ఈ విధంగా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల నడుమునొప్పి తగ్గడమే కాకుండా, ప్రసవానికి శరీరం సిద్ధమవుతుంది, ప్రసవానంతర రికవరీ సులభతరం అవుతుంది, అలాగే గర్భిణికి మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది.నేను ఆరు నెలల గర్భిణిని. గర్భధారణ ప్రారంభంలో నా హీమోగ్లోబిన్ 12 గ్రాములు ఉండగా, ఇప్పుడు అది 8 గ్రాములకు పడిపోయింది. నేను ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నప్పటికీ హీమోగ్లోబిన్ తగ్గిపోయింది. డాక్టర్ మరిన్ని పరీక్షలు చేయమని సూచించారు, అలాగే హీమోగ్లోబిన్ సరిచేయడానికి ఇంజెక్షన్లు అవసరం కావచ్చని చెప్పారు. నా బంధువులు చెబుతున్నది ఏమిటంటే, హీమోగ్లోబిన్ తక్కువగా ఉండటంవల్ల బిడ్డ పెరుగుదలపై ప్రభావం చూపవచ్చని, అలాగే డెలివరీ తర్వాత కోలుకోవడం కష్టమవుతుందని. ఇది నిజమేనా? – సుగుణ, మిరియాలగూడ. గర్భిణులు, ముఖ్యంగా భారతీయ మహిళల్లో రక్తహీనత లేదా హీమోగ్లోబిన్ తక్కువగా ఉండటం చాలా సాధారణమైన సమస్య. గర్భధారణ సమయంలో రక్తపరిమాణం పెరగడం వలన శరీరానికి ఐరన్ అవసరం ఎక్కువ అవుతుంది, కాని, ఆహారంతో మాత్రమే ఆ అవసరం తీరడం కష్టం. అందువల్ల హీమోగ్లోబిన్ స్థాయులు తగ్గిపోతాయి. కొందరిలో గర్భధారణకు ముందే రక్తహీనత ఉండి, అది గర్భధారణలో మరింత ఎక్కువ అవుతుంది. ఇది సాధారణంగా ఐరన్ లోపం వల్ల జరుగుతుంది, కానీ కొన్నిసార్లు విటమిన్ బీ12 లేదా ఫోలిక్ యాసిడ్ లోపం వల్ల కూడా రావచ్చు. అరుదుగా జన్యు సంబంధిత వ్యాధులు, ఉదాహరణకు థలసీమియా, సికిల్ సెల్ వ్యాధులు వంటి కారణాలు కూడా ఉండవచ్చు. హీమోగ్లోబిన్ తక్కువగా ఉండటం తల్లి, బిడ్డ ఇద్దరికీ సమస్యలు కలిగించే అవకాశం ఉంది. తల్లిలో అలసట, తలతిరగటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం వలన ఇన్ఫెక్షన్లు రావడం, ప్రసవ సమయంలో అధిక రక్తస్రావం జరగడం, రక్త మార్పిడి అవసరం కావడం, అలాగే ప్రసవానంతరం రికవరీ ఆలస్యమవడం వంటి సమస్యలు కనిపించవచ్చు. బిడ్డలో పెరుగుదలలో ఆలస్యం, తక్కువ బరువుతో పుట్టడం, కొన్ని సందర్భాల్లో ఐసీయూ అవసరం కావడం వంటి సమస్యలు రావచ్చు. అందువల్ల రక్తహీనతను త్వరగా గుర్తించి చికిత్స చేయడం అత్యంత ముఖ్యం. సాధారణంగా గర్భిణులకు ఐరన్ సప్లిమెంట్లు రెండవ త్రైమాసికం నుంచే ఇవ్వడం ప్రారంభిస్తారు, ఎందుకంటే మొదటి నెలల్లో వాంతులు, మలబద్ధకం వంటి సమస్యలు మరింత పెరగకుండా ఉండటానికి. మాత్రలను విటమిన్ సీ ఎక్కువగా ఉన్న ఆహారాలతో ఉదాహరణకు నిమ్మరసం, నారింజ లాంటివి ఖాళీ కడుపుతో తీసుకుంటే జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. మాత్రలు సరిగా పనిచేయకపోతే లేదా తట్టుకోలేకపోతే, ఐరన్ ఇంజెక్షన్లు అవసరం కావచ్చు. ఆహారంలో ఆకుకూరలు, శనగలు, బీన్స్, పప్పులు, కిస్మిస్, ఆప్రికాట్ వంటి డ్రై ఫ్రూట్స్, అలాగే గుడ్లు, చేపలు, కాలేయం, మాంసం వంటి నాన్వెజిటేరియన్ ఆహార పదార్థాలు ఉన్నాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా గర్భధారణలో ఐరన్ లోపాన్ని చక్కదిద్దుకోవచ్చు. సమయానికి పరీక్షలు చేయించుకోవడం, వైద్యులు సూచించిన జాగ్రత్తలను తీసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. డెలివరీకి ముందే హీమోగ్లోబిన్ స్థాయులు మెరుగుపడితే, మీకూ, మీ బిడ్డకూ ఆరోగ్యకరమైన ఫలితాలు వస్తాయి. (చదవండి: సరైన ప్రశంసలతోనే... జీనియస్ మైండ్ సెట్!) -
చిన్నారులకు ఆస్తమా..! ఇన్హేలర్స్..నో వర్రీస్..
పిల్లల్లో ఆస్తమా వచ్చి వాళ్లు బాధపడుతుంటే చూసేవాళ్లకు ఆ దృశ్యం చాలా హృదయవిదారకంగా ఉంటుంది. అలా ఆయాసపడుతూ ఊపిరి అందని చిన్నారులను చూస్తే చాలా బాధగా ఉంటుంది. అయితే చిన్నవయసులో ఆస్తమా వచ్చిన చిన్నారుల విషయంలో అంతగా ఆందోళన పడాల్సిన అవసరం లేదంటూ డాక్టర్లు భరోసా ఇస్తున్నారు. నిజానికి పిల్లల్లో వచ్చే ఈ ఆరోగ్య సమస్యను ‘రియాక్టివ్ ఎయిర్ వే డిసీజ్’ అంటారు. కానీ సామాన్య జనవాడుకలో దీన్ని ఆస్తమాగా చెబుతుంటారు. చిన్నారుల ఆస్తమా చికిత్సలో అవసరాన్ని బట్టి కొన్ని మందులు నెబ్యులైజేషన్ తర్వాత వారిలో మున్ముందు ఆస్తమా రాకుండా చూసేందుకు డాక్టర్లు రెండు రకాల ఇన్హేలర్స్ సూచిస్తుంటారు. ఇందులో మొదటి రకం ఇన్హేలర్స్ను ‘రిలీవర్స్’ అంటారు. ఇవి తక్షణం ఊపిరి అందేందుకు మొట్టమొదటి చికిత్స (ఫస్ట్ లైన్ ట్రీటెమెంట్) కోసం వాడేవి. ఇవి అటాక్నుంచి రిలీవ్ చేస్తాయి కాబట్టి వీటిని ‘రిలీవర్స్’ అంటారు. ఇవి ఊపిరితిత్తుల్లోకి వెళ్లే గాలిగొట్టాలను వెడల్పుగా విప్పారేలా చేసి పిల్లలు హాయిగా గాలితీసుకునేందుకు ఉపయోగపడతాయి. ఇక ఆస్తమా అటాక్ వచ్చినప్పుడు ఊపిరితిత్తుల్లో కొన్ని ఇన్ఫ్లమేటరీ సెల్స్ పుడతాయి. వీటిని తొలగించడం రిలీవర్స్కు సాధ్యం కాదు. అలాంటి వాటిని తొలగిస్తూ మున్ముందుకు అటాక్ రాకుండా నివారించే ఇన్హేలర్స్ను ‘ప్రివెంటర్స్’ అంటారు. అవి నివారణకు ఉపయోగపడతాయి కాబట్టి వాటిని ప్రివెంటార్స్గా అభివర్ణిస్తారు. ఇలా ఈ రెండు రకాల ఇన్‌హేలర్స్‌తో చిన్నారుల ఊపిరితిత్తుల కార్యకలాపాలు వీలైనంత నార్మల్‌గా పనిచేసేలా డాక్టర్లు చూస్తారు. ఇవి వాడుతూపోతుంటే క్రమంగా ‘రిలీవర్స్’ వాడాల్సిన అవసరం దాదాపుగా పూర్తిగా తగ్గిపోతుంది. పిల్లల్లో వ్యాధి తీవ్రత ఎంతగా ఉందో, దాన్ని అదుపులో ఉంచేందుకు మందుల డోస్‌లు ఎంతెంత మార్చాలో తెలుసుకోవడం కోసం అవసరమైనప్పుడు డాక్టర్లు ‘పల్మునరీ ఫంక్షన్ టెస్ట్ – పీఎఫ్‌టీ’ అనే పరీక్ష చేస్తారు. పిల్లలు పెరుగుతున్నకొద్దీ చాలామందిలో అటాక్స్ దాదాపు పూర్తిగా తగ్గిపోవడానికి అవకాశాలు చాలా ఎక్కువ. చాలామంది పిల్లల్లో ఆర్నెల్లలోనే ఆస్తమా పూర్తిగా అదుపులోకి వచ్చేసే అవకాశాలుంటాయి. ఒకసారి ఆస్తమా అదుపులోకి వచ్చాక ఇన్హేలర్స్ దాదాపు నిలిపివేయవచ్చు కూడా. అయితే ఈ ఇన్‌హేలర్స్‌కు పిల్లలు అలవాటు పడిపోతారేమోనని కొంతమంది తల్లిదండ్రులు ఆందోళన పడుతుంటారు. ఇది కేవలం అ΄ోహ మాత్రమే. పైగా ఇన్హేలర్స్ ఎంత సురక్షితమంటే నోటి నుంచి తీసుకునే మందులతో పోలిస్తే వాటిలోంచి దేహంలోకి వెళ్లే మందు కేవలం సమస్య ఉన్న చోటికే పరిమితమవుతుంది. దేహమంతటా తన దుష్ప్రభావాలు చూపదు. అందుకే అవి పూర్తిగా సురక్షితమని పేరెంట్స్ నమ్మవచ్చు. (చదవండి: Dental Health: ఓపెన్ యువర్ మౌత్..! నోటి ఆరోగ్యాన్ని కాపాడుకుందాం ఇలా..) -
డెలీ'వర్రీ' వద్దు..! మెడిటేషన్ మస్ట్..
మహానగరంలో సగటు గర్భిణి డిప్రెషన్‌కు గురవుతోంది. గర్భందాల్చిన విషయం తెలిసిన నాటి నుంచి ప్రసవం అయ్యే వరకూ యాంగ్జైటీకి గురవుతున్నారని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. ప్రసవ సమయంలో 15 నుంచి 20 శాతం మంది గర్భిణులు, ప్రసవానంతరం 25 శాతం మంది ఈ రకమైన డిప్రెషన్‌కు గురవుతున్నారని యూకే మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ప్రసవానంతర మానసిక ఆరోగ్య సమస్యలపై చేపట్టిన సర్వే నివేదిక స్పష్టం చేస్తోంది. ప్రసవానంతరం మూడు నెలల పాటు నెగిటివ్ థాట్స్ వేధిస్తున్నాయట. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాల్లోనూ లింగ వివక్ష కనిపిస్తోందని పేర్కొన్నారు. గత రెండు దశాబ్దాల్లో మాతృ మరణాల సంఖ్య 50 శాతానికి పైగా తగ్గినప్పటికీ ఆత్మహత్యల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దీనికి ప్రధానంగా పేదరికం, ఆర్థిక అసమానతలు, గృహ హింస, సూటిపోటి మాటలు, కుటుంబ సభ్యుల మద్ధతు లేకపోవడం వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. సామాజిక మాధ్యమాలే కారణం.. నగర జీవితంలో ఆలస్యంగా వివాహాలు చేసుకోవడం, దంపతులిద్దరూ ఉద్యోగాలు చేయడం సర్వసాధారణం. గర్భిణిగా ఉన్నప్పుడు విధి నిర్వహణలో ఒత్తిడి, ఇంట్లో ఒంటరి తనం వేధిస్తున్నాయి. ఉమ్మడి కుటుంబాల్లో ఎక్కువ సలహాలు, సూచనలతోనూ గర్భిణులు ఇబ్బందిపడుతున్నారట. పట్టణ జీవితంలో సోషల్ మీడియాకు ఆకర్షితులవుతున్నారు. ప్రతి చిన్న విషయాన్నీ అంతర్జాలంలో చూసి ఆందోళనకు గురవుతున్నారు. కొంత మంది గర్భిణుల్లో నాకు అన్నీ తెలుసు అనే ధోరణి కనిపిస్తోందని వైద్యులు పేర్కొంటున్నారు. లైఫ్ స్టైల్ ప్రభావం.. సుమారు 60 శాతం మంది గర్భిణులు సూర్యుడిని చూడటంలేదట. ఫలితంగా విటమిన్–డి లోపం కనిపిస్తోంది. కుటుంబం, ఉద్యోగాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆహారపు అలవాట్లు, లైఫ్ స్టైయిల్లో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మెడిటేషన్ మస్ట్..గర్భిణుల్లో వ్యాయామం, డెలివరీ కాన్సెప్ట్ తీసుకురావాలి. ఇంట్లో రోజువారీ పనులు చేసుకుంటూనే.. మెడిటేషన్‌కు సమయం కేటాయించాలి. రెండు నుంచి మూడు శాతం మందికి మాత్రమే బెడ్ రెస్ట్ అవసరం ఉంటుంది. మిగతావారు పనులు చేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో గర్భిణిగా గుర్తించిన తొలి రోజుల నుంచి యాంగ్జైటీ మొదలై చివరి వరకు కొనసాగుతోంది. సోషల్ మీడియాకు ప్రభావితం కావొద్దు. పోస్ట్ డెలివరీలో హార్మోన్ ఛేంజెస్ ఉంటాయి. తగినంత రెస్ట్ అవసరం. క్యాల్షియం డెఫిషియన్సీ, రోగ నిరోధక శక్తి సమస్యలు వేధిస్తున్నాయి. రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట మధ్య కనీసం అర గంట ఎండలో ఉంటే డి–విటమిన్ లోపాన్ని అధిగమించొచ్చు. – డాక్టర్ పి.శృతిరెడ్డి, గైనకాలజిస్టు, ల్యాప్రోస్కోపిక్ సర్జన్ (చదవండి: Benefits of Barefoot: ఫుట్ వేర్కి బై.. 'బేర్‌ఫుట్ వాక్'కి సై..! అధ్యయనాలు సైతం..) -
ఫుట్ వేర్కి బై.. 'బేర్‌ఫుట్ వాక్'కి సై..! అధ్యయనాలు సైతం..
అప్పులేకుండా తన కాళ్ల మీద తాను నిలబడడం అంటే ఆర్థికంగా స్థిరపడినట్టే అనేవారు పెద్దలు. కానీ చెప్పుల్లేకుండా తన కాళ్లపై తాను నడవడం అంటే ఆరోగ్యం లభించినట్లే అంటున్నారు నేటి వైద్య నిపుణులు. ప్రస్తుతం గ్రౌండింగ్/ఎర్తింగ్ పేర్లతో మెట్రో నగరాల్లో పాదరక్ష రహిత నడక ఆరోగ్య సాధనంగా మారింది. దీనివల్ల ఆరోగ్యపరమైన లాభాలున్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే జాగ్రత్తలు మాత్రం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. ఇప్పటికే వెల్నెస్ చికిత్సా కేంద్రాల్లో ఆదరణ పొందుతున్న ఈ బేర్‌ఫుట్ వాక్‌పై నగరవాసుల్లో క్రమంగా ఆకస్తి పెరుగుతోంది. ఆరోగ్య రక్షణపై పెరుగుతున్న అవగాహనే దీనికి కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాలికి చెప్పుల్లేకుండా మైళ్ల దూరం నడిచేవాళ్లం అంటూ మొన్నటి తరం గొప్పగా చెప్పుకోవడం విన్నాం. అప్పట్లో చెప్పులూ లేవు.. ప్రయాణించడానికి సరైన రవాన సౌకర్యాలూ లేవు.. కాబట్టి వారి ఆరోగ్యానికి అవన్నీ దోహదం చేశాయని చెప్పొచ్చు. ఎటువంటి పాదరక్షలూ లేకుండా నడిచినప్పుడు కాళ్లకి మరింతగా స్టిమ్యులేషన్ జరుగుతుందని వైద్యులు అంటున్నారు. ప్రయోజనాలివే.. పాదాలకు చెప్పులు లేకుండా నడవడం వల్ల శరీరానికి, కాళ్లకూ మధ్య మెరుగైన సమన్వయం, రక్త ప్రసరణ వంటి ప్రయోజనాలు లభిస్తాయి. పాదరక్షలు లేకుండా నడవడం స్వేచ్ఛగా, కొంత సంతృప్తిగా కూడా అనిపిస్తుంది. ఇది బాల్యపు జ్ఞాపకాలను తిరిగి తీసుకువస్తుంది. ఈ నడక వల్ల నేలతో మరింత సమన్వయం ఏర్పడుతుంది. ఇది ప్రొప్రియోసెప్షన్ (శరీర కదలికల–అవగాహన)ను మెరుగుపరుస్తుంది. శరీరం కదలిక స్థానాన్ని గ్రహించే సామర్థ్యాన్ని పెంచి పాదాలపై పట్టు జారిపోకుండా ఉండటానికి సహాయపడుతుంది. మెరుగైన ప్రొప్రియోసెప్షన్తో మెరుగైన భంగిమ వస్తుంది. కొంతకాలం పాటు చెప్పులు లేకుండా నడవడం వల్ల వెన్నెముక, కీళ్లు బలోపేతమై మరింత స్థిరత్వంతో తక్కువ వంగి నడవడానికి కూడా సహాయపడుతుంది. పాదాలకు అసంఖ్యాక నరాలు, రక్త నాళాలు ఉంటాయి. చెప్పులు లేకుండా నడవడం వాటిని చురుకుగా మారుస్తుంది. రక్త ప్రసరణ పెంచుతుంది. ప్రసరణ సమస్యలు ఉన్నవారికి, చల్లని పాదాలకు లేదా రోజంతా కూర్చొని గడిపే వారికి ఇది చాలా మేలుచేస్తుంది. అంతేకాదు ఇది నాడీ వ్యవస్థను కూడా మేల్కొలుపుతుంది. భూ ఉపరితలంతో ప్రత్యక్ష సంబంధం ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరించడానికి, వాపును తగ్గించడానికి సహాయపడుతుంది. పాదాలు నేలను నేరుగా తాకినప్పుడు చర్మంలో సంభవించే మార్పుల కారణంగా మెదడు చురుకుగా మారుతుందని స్పర్శాజ్ఞానం అత్యుత్తమం అవుతుందని, సెన్సరీ స్టిమ్యులేషన్, మోటార్ స్కిల్స్.. బాడీ బ్యాలెన్సింగ్ నైపుణ్యం వంటివి పెరుగుతాయని చెబుతున్నారు. షూస్, సాక్స్లలో చేరుకునే బాక్టీరియా, ఫంగస్ నుంచి తప్పించుకోవచ్చు. చెప్పులు లేకుండా నడవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎక్కడ? దేనిపై అడుగు పెడుతున్నారు? పాదాలు ఏ స్థితిలో ఉన్నాయి అనే దానిపై ఆధారపడి ఉంటుంది. చదునైన పాదాలు, ప్లాంటార్ ఫాసిటిస్ లేదా పాదాల నొప్పి ఉన్నవారు దీన్ని ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఫ్లాట్ ఆర్చ్‌లు, ప్లాంటార్ ఫాసిటిస్, లేదా దీర్ఘకాలిక నొప్పి వంటి కొన్ని ప్రత్యేక తరహా పాదాలు ఉంటే చెప్పులు లేకుండా నడవడం మరింత దిగజార్చుతుంది. అందరికీ కాదు.. అన్ని చోట్లా కాదు.. పాదరక్షలను వదిలే ముందు, పాడియాట్రిస్ట్ లేదా ఫిజియోథెరపిస్ట్‌ను ముందస్తుగా సంప్రదించడం అవసరం ఇది అందరికీ లేదా ప్రతి వాతావరణానికి తగినది కాదు. పట్టణ ప్రాంతాలు, విపరీతమైన ఉష్ణోగ్రతలు వంటి కొన్ని పరిస్థితులు ప్రమాదాన్ని కలిగిస్తాయి. గడ్డి, ఇసుక లేదా నేల వంటి సహజ ఉపరితలాలపై సహజమైన ప్రకృతిలో మాత్రమే పాదరక్ష రహితంగా నడవవచ్చు. పరిశుభ్రమైన పరిసరాలు కూడా తప్పనిసరి. వృద్ధులకు లేదా ఆర్థరైటిస్ ఉన్నవారికి ఇది సరైన ఎంపిక కాదు. ఫంగల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తెస్తుంది. పట్టణ ప్రాంతాల్లోని కఠిన ఉపరితలాలు, తీవ్రమైన ఉష్ణోగ్రతలు కొన్ని ఆరోగ్య పరిస్థితులు చెప్పులు లేకుండా నడవడాన్ని ప్రమాదకరంగా మారుస్తాయి. బేర్ ఫుట్ వాక్ పూర్తయ్యాక వైద్యులు సూచించిన యాంటిబయాటిక్ సోప్స్ లేదా లోషన్స్ ఉపయోగించి పాదాలను శుభ్రపరుచుకోవడం మంచిది. పచ్చని గడ్డి మీద, పరిశుభ్రంగా ఉండే కార్పెట్స్ మీద నడవవచ్చు. సముద్రపు ఇసుక మీద నగక కూడా మంచిదే. ఆరోగ్యకరం.. తగిన జాగ్రత్తలు తీసుకుని బేర్‌ఫుట్ వాక్ చేయడం ఆరోగ్యానికి మంచిదే. ముఖ్యంగా దీనివల్ల ఫుట్ పొజిషన్ (అడుగు పడే స్థితి) మీద నియంత్రణ వస్తుంది. నడకలో బ్యాలెన్స్ పెరగడానికి, నొప్పి నివారణ వేగంగా జరగడానికి ఉపయోగపడుతుంది. పిరుదులు, కీళ్లు, కోర్ మజిల్స్ మధ్య సమన్వయం మెరుగుపడుతుంది. సరిగా నప్పని పాదరక్షలు ధరించడం వల్ల వచ్చే ఇబ్బందులకు చెక్ పడుతుంది. లోయర్ బ్యాక్ ప్రాంతపు కండరాలను శక్తివంతం చేస్తుంది. – డా.కల్పన, ఫ్యామిలీ ఫిజీషియన్ (చదవండి: భారత్ పిలిచింది..! కష్టం అంటే కామ్ అయిపోమని కాదు..) -
'వాకింగ్' తినక ముందా? తిన్నతర్వాతా?
ప్రస్తుతం ఆరోగ్యం కోసం అత్యధికులకు అందుబాటులో ఉన్న మంచి వ్యాయామం వాకింగ్. ఏ సమయంలో అయినా ఎక్కడైనా చేయగలిగిన వ్యాయామం కావడంతో దీనిని అనేకమంది ఎంచుకుంటున్నారు. అయితే వాకింగ్‌కు సంబంధించి పూర్తి ప్రయోజనాలు లభించాలంటే ఎప్పుడు ఎలా వాక్ చేయాలి అనేదానిపై అవగాహణ ఉండాలి అంటున్నారు వైద్యులు. ముఖ్యంగా రోజూ మూడు లేదా నాలుగు పూటలా తినే అలవాటున్నవారు ఈ విషయంలో మరింత అవగాహన పెంచుకోవాలని సూచిస్తున్నారు. వైద్యులు చెబుతున్న ప్రకారం...భోజనం ముందు...అప్పటికి ఖాళీ కడుపుతో ఉన్నా లేదా తక్కువ కార్బోహైడ్రేట్స్, అధిక ప్రోటీన్ ఆహారం తీసుకుని ఉన్న స్థితిలో నడవడం వల్ల కొవ్వు ఆక్సీకరణ పెరుగుతుంది. అంటే ఫ్యాట్ కరుగుతుందన్నమాట. నడకకు ముందు అధిక కార్బోహైడ్రేట్స్ కలిగిన భోజనంతో పోలిస్తే ఇది ఎక్కువ సంతృప్తిని ఇస్తుంది, నడకకు అవసరమైన శక్తి ఖర్చు తగ్గుతుంది. అల్పాహారం లేదా భోజనానికి ముందు చిన్నపాటి నడక భోజన కాంక్షను పెంచేందుకు సహాయపడుతుంది. శరీరంపై గ్లూకోజ్ లోడ్ పడకుండా చురుకుదనాన్ని పెంచుతుంది. ఉదయం లేదా మధ్యాహ్న భోజనానికి ముందు ముందు 10–20 నిమిషాలు, తేలికపాటి నడక మేలు.భోజనం తర్వాత...భోజనం తర్వాత కూర్చోవడం కంటే 2–10 నిమిషాలు తేలికగా నడవడం వల్ల భోజనం తర్వాత రక్తంలో చోటు చేసుకునే చక్కెర స్థాయి తగ్గుతుందని అనేక అధ్యయనాలు నిర్ధారించాయి. భోజనం తర్వాత వెంటనే 10 నిమిషాల నడక కలిగించే లాభాలు మిగిలిన సమయాల్లో చేసే సుదీర్ఘ నడకతో ధీటుగా ఉంటాయని అవి తేల్చాయి. నడక జీర్ణవ్యవస్థకు రక్త ప్రవాహాన్ని ప్రోత్సహిస్తుంది, గ్లైసెమిక్ నియంత్రణ కోసం ప్రతి భోజనం తర్వాత చిన్న నడక అవసరం. భోజనం తర్వాత తేలికపాటి నడక గ్యాస్ట్రిక్ సమస్య నివారణకు సహాయపడుతుంది, కడుపు ఉబ్బరం లక్షణాలను తగ్గిస్తుంది యాసిడ్ ఎక్స్పోజర్ను తగ్గిస్తుంది; అయితే భోజనం తర్వాత తీవ్రమైన లేదా వేగవంతమైన నడక మాత్రం మంచిది కాదు. అలాగే భోజనం తర్వాత వెంటనే కాకుండా కనీసం 10–20 నిమిషాల వ్యవధిలో ప్రారంభించి 5–15 నిమిషాలు కొనసాగిస్తే జీర్ణ ప్రయోజనాలకు ఉపయుక్తం.లక్ష్యాన్ని బట్టి సమయ పాలన...ప్రాథమిక లక్ష్యం కొవ్వు తగ్గడం అయితే, ఖాళీ కడుపుతో నడవడం వల్ల తగిన ప్రయోజనం చేకూరుతుంది. ఏమీ తినకుండా శ్రమించినప్పుడు శరీరం గతంలో పేరుకున్న కొవ్వు నిల్వలను శక్తి కోసం ఉపయోగించుకునే అవకాశం ఉంది, ఈ ప్రక్రియను కొవ్వు ఆక్సీకరణం అంటారు. సరైన ఆహారం తీసుకుంటూ ఇలా చేస్తే ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. అయితే కొందరికి తినడానికి ముందు నడవడం వల్ల తల తిరుగుతుంది లేదా అలసట రావచ్చు, అలాంటి వారు నడకకు ముందు ఒక చిన్న బలవర్ధకమైన చిరుతిండి (ఉదాహరణకు బాదం వంటి నట్స్‌తో చేసినవి)తీసుకోవడం మంచి ఆలోచన.డయాబెటిస్ తగ్గాలంటే...రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించాలని లక్ష్యంగా పెట్టుకున్న వారికి, భోజనం తర్వాత నడవడం మంచిది. తిన్న 30 నిమిషాలలోపు 10–15 నిమిషాలు తేలికపాటి నడక ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరచడం ద్వారా గ్లూకోజ్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది టైప్ 2 డయాబెటిస్ లేదా ప్రీడయాబెటిస్ ఉన్నవారికి ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది.మనసు మాట వినాలి...కొంతమందికి ఖాళీ కడుపుతో నడవడం వల్ల బాగా శక్తివంతంగా అనిపిస్తుంది, ముఖ్యంగా ఉదయం. ఉపవాసం సమయంలో హార్మోన్ల మార్పుల కారణంగా వారు మానసికంగా పదునుగా మారి పనిపై మరింత ఎక్కువ దృష్టి కేంద్రీకరించినట్లు ఫీలవుతారు. మరికొందరికి భోజనం తర్వాత నడవడం వల్ల చురుకుగా అనిపించవచ్చు. అంతిమంగా, వ్యక్తిగత ప్రాధాన్యత ముఖ్యం, శరీరం ఎలా స్పందిస్తుంది అనేది కూడా గమనించాలి. ఉదయాన్నే నడుస్తున్నా లేదా రాత్రి భోజనం తర్వాత అయినా, క్రమం తప్పకుండా నడవడం మాత్రం చాలా అవసరం. గుండె, మెదడు, మానసిక స్థితి జీవక్రియకు దీర్ఘకాలిక ప్రయోజనాలను అందిస్తుంది.(చదవండి: మచ్చలేని చర్మం, నిగనిగలాడే జుట్టు కోసం డీఎన్ఏ డీకోడ్..!) -
నలభై ఏళ్ల తల్లి వెయిట్‌లాస్ స్టోరీ..! 136 కిలోలు నుంచి 68 కిలోలకు..
అందరు బరువు తగ్గడంపై ఫోకస్ పెడుతున్నారు. రకరకాల మార్గాల్లో తగ్గడంపై దృష్టిపెట్టి మరి ఆరోగ్య స్ప్రుహ పెంచుకుంటున్నారు. అయితే హాయిగా ఉన్నప్పుడే మన బాడీ మీద ఫోకస్ పెట్టడం, ఆరోగ్యంపై ధ్యాస వంటివి చేయగలం. కానీ ఈ తల్లికి కూతురు అనారోగ్యమే బరువు తగ్గేందుకు దారితీసింది. డైట్‌పై ఉన్న దృక్పథాన్ని పూర్తిగా మర్చేసింది. అలాంటి కష్ట సమయాల్లో ఎవ్వరైనా..తమ ఉనికిని కోల్పోయేంతగా బాధలో ఉండిపోతారు..కానీ అదే ఆమెకు ఆరోగ్యంపై అటెన్షన్ పెట్టేలా చేసింది. పైగా కిలోల కొద్ది బరువు తగ్గి, స్ఫూర్తిగా నిలిచింది. మరి ఆమె వెయిట్‌లాస్ స్టోరీ గురించి తన మాటల్లోనే సవివరంగా తెలుసుకుందామా..!.ఆ అమ్మే 40 ఏళ్ల కింబర్లీ పావెల్. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన ఆమె పీసీఓఎస్‌తో ఇబ్బంది పడుతుండేది. బిజీ జీవితం, వ్యక్తిగత సవాళ్లను సమతుల్యం చేసుకుంటూ సూమారు 68 కిలోలు మేర బరువు తగ్గింది. వాస్తవానికి కింబర్లీ దాదాపు 136 కిలోల అధిక బరువుతో బాధపడుతుండేది. తన సోషల్ మీడియా ఫాలోవర్లను ప్రేరేపించేలా బరువు తగ్గేందుకు శ్రీకారం చుట్టింది. అంతలో అనుహ్యంగా ఆరేళ్ల కూతురు కేన్సర్ బారిన పడటంతో డైట్‌పై ఉన్న దృక్పథం పూర్తిగా మారిపోయింది కింబర్లీకి. తాను ఆరోగ్య విషయంలో చేసిన తప్పిదాలను విశ్లేషించుకుని..సరైన మార్గంలో బరువు తగ్గాలని భావించింది. ఆ నేపథ్యంలో ఎక్కువగా చేసే సాధారణ తప్పిదాలపై ఫోకస్ పెట్టింది. అంతేగాదు ఆహారాన్ని ఆరోగ్యకరంగా తీసుకోకపోతే ఎలా విషంగా మారుతుందో అర్థం చేసుకుంది. తనకెదురైన సవాళ్లే పూర్తిగా ఆరోగ్యంపై ధ్యాస పెట్టేలా చేశాయని చెబుతోంది. అయితే తాను 68 కిలోల మేర బరువు తగ్గేందుకు కఠిన ఆహార నియమాలేమి పాటించలేదని, సింపుల్ చిట్కాలనే అనుసరించానని చెప్పుకొచ్చింది. బరువు తగ్గిన విధానం..నిలకడగా ఉండాలి...బరువు తగ్గాలనే ఫోకస్‌ని మధ్యలో వదిలేయకుండా స్ట్రాంగ్ ఉండే మనస్సుని డెవలప్ చేసుకోవడం. ఈ రోజు కంటే మరింతగా భిన్నంగా కనిపించాలనే లక్ష్యం ఏర్పరచుకోవడం వంటివి చేయాలి.పోషకాహారంపై ఫోకస్..ప్రోటీన్, ఫైబర్ ఉండేవి తీసుకుంటున్నామో లేదో కేర్ తీసుకోవాలి. రోజువారీగా 130 నుంచి 150 గ్రాముల ప్రోటీన్, ఫైబర్ ఉంటుందో లేదో చూసుకోవాలి. చురుకుగా ఉండటం..ప్రతి రోజు వర్కౌట్లపై దృష్టి పెట్టడం. కనీసం 40 నిమిషాలు వాకింగ్, వ్యాయమాలు చేసేలా చూసుకోవడం. అవి భారంగా కాకుండా ఎంజాయ్ చేస్తూ చేయడం అలవాటు చేసుకోవాలి.అతి ఆకలిని నివారించటంఎక్కువ ఆకలి వేసేంత వరకు కాకుండా..బ్యాలెన్స్‌గా తినేలా చూసుకోవాలి. బాగా ఆకలి వేసేంత వరకు ఉంటే అతిగా తినే ప్రమాదం ఉంది. ఆకలి అనిపించిన వెంటనే..సంతృప్తి కలిగేలా మంచి ఆహారం తీసుకోవాలి. చక్కెరకు దూరం..స్వీట్స్ తినాలనిపించినప్పుడూ తెలివిగా తినాలి. ఎలాగంటే ఈ రోజు స్వీట్స్ ఎక్కువ తింటే మిగతా సమయంలో తీసుకునే ఫుడ్ ఐటెమ్స్ తగ్గించి, వర్కౌట్ల సమయం పెంచాలి. ఫైబర్, కార్బోహైడ్రేట్లను మిస్ చేయొద్దు..ప్రోటీన్‌తోపాటు ఫైబర్, కార్బోహైడ్రేట్లను మిస్ చేయొద్దు. ఇన్సులిన్ నిరోధకతను నిర్వహించడానికి, ఎక్కువసే కడుపు నిండిన అనుభూతిని అందివ్వడాని ఇది ఎంతగానో హెల్ప్ అవుతుంది. సమతుల్యంగా తినేందుకు ప్రాముఖ్యత నివ్వడం.కాఫీ అలవాట్లను మానుకోవడం..కాఫీ తాగే అలవాటుని తగ్గించుకునేలా..ప్రత్యామ్నాయంగా ప్రోటీన్ షేక్‌లకు ప్రాధాన్యత ఇవ్వడం వంటివి చేయాలి.మైండ్‌ఫుల్‌గా తినటం..మైండ్‌ఫుల్‌గా తినేలా చూసుకోవాలి. తగిన కేలరీలు, ప్రోటీన్లు శరీరానిక అందేలా చూసుకోవాలి. చివరగా మితిమీరిన వ్యాయామాలు, అతి కఠినమైన ఆహార నియమాలు మొదటికే ప్రమాదం తెచ్చిపెడతాయని, నిధానంగా ఆరోగ్యకరమైన విధానంలో బరువు తగ్గడమే అన్ని విధాల శ్రేయస్కరమని చెప్పుకొచ్చింది కింబర్లీ పావెల్. View this post on Instagram A post shared by Kimberly Powell (@loving_lessofme_more) గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: ఆమె ఆస్తికి అత్తింటి వారే మొదటి హక్కుదారులు) -
క్యూట్ క్యాట్..ఒత్తిడి సెట్..!
ఫిజియోథెరపీ.. లాఫింగ్ థెరపీ.. ఫిష్ థెరపీ గురించి వినే ఉంటారు.. కానీ ‘క్యాట్ థెరపీ’ గురించి ఎప్పుడైనా విన్నారా..!? ఔను ప్రస్తుతం హైదరాబాద్ నగరవాసులు వినడమే కాదు ప్రత్యక్షంగా చూడబోతున్నారు. ఆ క్యాట్ థెరపీని ఆస్వాదించనున్నారు. ఉరుకులు పరుగుల నగర జీవితం.. తీవ్ర ఒత్తిళ్లతో అలసిపోయిన మనసుకు కాసేపు మానసిక ప్రశాంతత కోరుకోని వారెవరూ ఉండరంటే అతశయోక్తి కాదేమో? అయితే మానసిక ప్రశాంతతకు పెంపుడు జంతువుల మధ్య గడపడం ఓ చక్కని పరిష్కారమని, ఎటువంటి మందులూ నయం చేయలేని నిరాశ నిస్పృహలు, ఒత్తిడి, ఆందోళన, మానసిక సమస్యలను జంతువులు దూరం చేస్తాయని చెబుతున్నారు నిపుణులు. క్యాట్ థెరపీ మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సులభమైన మార్గమని, దీనికోసం యజమానులు తమ పిల్లులకు శిక్షణ ఇచ్చి, పెట్ పార్ట్నర్స్ వంటి సంస్థల ద్వారా సేవలను అందిస్తారు. ఎన్నో జీవన వైవిధ్యాలకు వేదికైన మన నగరంలో క్యాట్ థెరపీలు సైతం హాయ్ చెప్పడం ఇక్కడి జీవనశైలికి నిదర్శనంగా నిలుస్తోంది. హైదరాబాద్‌లో రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇదే ఏడాది ప్రాయణీకుల ఒత్తిడిని తగ్గించేందుకు డాగ్ థెరపీ పేరుతో ప్యాసింజర్స్ లాంజ్‌లో క్యూట్ క్యూట్ పప్పీస్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇదే తరహాలో ప్రస్తుతం నగరంలో క్యాట్ థెరపీని అందుబాటులోకి తెస్తున్నారు క్యాట్స్ కంట్రీ నిర్వాహకులు. మానసిక సమస్యలకు జంతువుల థెరపీ చక్కని పరిష్కారమని పలు అధ్యయనాలు సైతం వెల్లడించాయి. ఈ నేపథ్యంలోనే వివిధ దేశాల్లో వినూత్నంగా క్యాట్ థెరపీ కేంద్రాలు ప్రారంభమవుతున్నాయి. మానసిక ప్రశాంతతకు దోహదం చేసే ఈ క్యాట్ థెరపీ కేంద్రాలు దేశంలో మొట్టమొదటి సెంటర్ హైదరాబాద్‌లో ఆవిష్కృతం కావడం విశేషం. క్యాట్స్ కంట్రీ.. దేశంలో ప్రథమం.. ఇప్పటివరకూ యుఎస్, జపాన్, కెనడా, థాయిలాండ్, ఇండోనేషియాలకే పరిమితమైన క్యాట్ థెరపీ సేవలు దేశంలో మొట్టమొదటిసారి హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చాయి. కుతుబ్‌షాహీ 7 టూమ్స్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ఇటీవల్లే అంతర్జాతీయ పిల్లుల దినోత్సవం (ఇంటర్నేషనల్ క్యాట్స్ డే–ఆగస్టు–8) రోజున ప్రారంభమైంది. కుక్కలు, పిల్లులు లాంటి పెంపుడు జంతువుల మధ్య గడపడం, వాటితో ఆడుకోవడం ఎంతో సంతోషాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. తీవ్ర ఒత్తిడి, మానసిక సమస్యలతో బాధపడే వారికి ఇది ఉపశమనం కలిగిస్తుంది. అంతర్జాతీయంగా ప్రముఖ అధ్యయన సంస్థలు సైతం ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. 50 రకాలకుపైగా పిల్లులు.. ప్రస్తుతం ఉరుకులు పరుగులతో కూడిన నగర జీవితంలో.. తమతో పాటు పెంపుడు జంతువులను పెంచుకునే వెసులుబాటు తక్కువే. అలాంటి వారు ఈ కేంద్రంలో సేవలు పొందవచ్చు. ఇక్కడ 50కి పైగా పర్షియన్ జాతికి చెందిన పిల్లులు ఉన్నాయి. ఇవన్నీ మానవులతో స్నేహంగా మెలుగుతాయి. మీతో ఆడుకుంటాయి.. గారాబం చేస్తాయి. వీటి మధ్య గడిపి నూతనోత్తేజాన్ని పొందవచ్చు. దీనినే క్యాట్ థెరపీ అంటారు. ఇవన్నీ వ్యాక్సినేషన్ చేసిన ఆరోగ్యవంతమైన పిల్లలు. కాబట్టి వీటితో ఎలాంటి ప్రమాదం ఉండదని నిర్వాహకులు చెబుతున్నారు. ఒక గంటకు అత్యధికంగా ఐదుగురికి మాత్రమే ప్రవేశం ఉండే ఈ సెంటర్లోకి వెళ్లాలంటే అధికారిక వెబ్సైట్లో ముందుగా.. స్లాట్ బుక్ చేసుకోవాలి. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు.. స్లాట్ బుక్ చేసి ఈ కేంద్రాన్ని ఎప్పుడైనా సందర్శించవచ్చు. వృత్తిలో సంతృప్తితో.. వినూత్నంగా.. స్వార్థపరుల ప్రపంచంలో నుంచి.. నిస్వార్థ జంతువుల ప్రపంచంలోకి రండి. కాసేపు మా ఆత్మీయమైన పిల్లులతో గడపండి. వయసును మర్చిపోయి కాసేపు బాల్యంలోకి వెళ్లండి. మిమ్మల్ని నిస్వార్థంగా ప్రేమించేందుకు, అలసిపోయిన మనసుకు కాస్త ప్రశాంతత కలిగించేందుకు, ఆటలు ఆడుకునేందుకు మా పిల్లులు సిద్ధంగా ఉన్నాయి. 35 సంవత్సరాల పాటు పశు సంవర్ధక శాఖలో వైద్యుడిగా పని చేసిన అనుభవంతో.. ఉద్యోగ విరమణ అనంతరం దీనిని ప్రారంభించాను. జంతువులతో మమేకమైన మనసు వాటితోనే సహవాసం, ఆతీ్మయతను కోరుకుంటోంది అనడానికి నా ప్రయాణం ఒక ఉదాహరణ. మా వెబ్సైట్ www. CatsCountry. in లో దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు. – ముహమ్మద్ యాకుబ్ షరీఫ్, క్యాట్స్ కంట్రీ వ్యవస్థాపకులు (చదవండి: ఇదేం పేరెంటింగ్..! వామ్మో ఈ రేంజ్లో డేరింగ్ పాఠాలా..? తిట్టిపోస్తున్న నెటిజన్లు) -
రుచికరమైన వంట కోసం '3-3-2-2 రూల్.'.!
వంటను రుచికరంగా వండటం కూడా ఓ ఆర్ట్. అయితే పోషకాలు కోల్పోకుండా, రుచికరంగా వండటం అంటే.. అది అందరికి సాధ్యం కాకపోవచ్చు. ఒకవేళ విటమిన్లు పోకూడదన్న ఆత్రుతలో తక్కువగా ఉడకిస్తే..టేస్ట్ లేదనిపిస్తుంది. అలా కాకుండా అన్ని సరిపడేలా టేస్ట్ ఏ మాత్రం తగ్గకుండా వండాలంటే ఈ టెక్నీక్ ఫాలో అవ్వాల్సిందే. ఇలా ఈ రూల్‌లో వంట చేస్తే..రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం కూడాను. మరి ఇంకెందుకు ఆలస్యం ఎలా చేయలా చూసేద్దామా మరి..!.రుచికంగా రెస్టారెంట్లో కనిపించినట్లుగా కలర్ఫుల్గా వండాలంటే ఈ పద్ధతే మేలంటున్నారు నిపుణులు కూడా. పైగా ఈ విధానం ఎక్కువసేపు ఉడకించడాన్ని నివారించడం తోపాటు, విటమిన్లు కూడా పోవని చెబుతున్నారు. అందుకోసం వండేటప్పుడూ 3-3-2-2 రూల్‌ని అనుసరించడం మేలని చెబుతున్నారు నిపుణులు. ఆహార ప్రియులు రుచికరమైన భోజనంతోపాటు, పోషకాలని కూడా కోల్పోరట. మరి ఈ రూల్‌లో ఎలా వండాలంటే..ఆ రూల్‌లోని మ్యాజిక్..ఒక గిన్నెలో రెండు స్పూన్ల నూనెని పోసి వండాల్సిన కూరగాయలు లేదా నాన్‌వెజ్‌ని వేయాలి. ఆ తర్వాత ఒక వైపు మూడు నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత ఒకసారి గరిటతో తిప్పి మరో మూడు నిమిషాలు ఉడికించాలి. ఇంకోసారి తిప్పి ఓ నిమిషాలు ఉడికించాలి. చివరగా ఇంకొక్కసారి తిప్పి మరో రెండు నిమిషాలు ఉడికిస్తే చాలట, రుచి కోల్పోకుండా పోషకవంతంగా ఉంటుందంట. అతిగా ఉడికించడాన్ని నిరోధించడం అనే సమస్య ఈ పద్ధతితో నివారించగలుగుతామట. ఇలా గ్రిల్ చేసేవాటికి, మంటపై గిన్ని పెట్టి కూర వండే వాటికి చాలా బాగా ఉపయోగపడుతుందట. పైగా రెస్టారెంట్లో కనిపించినట్లు ముక్కలనేవి వడలిపోవు, చూసేందుకు అందంగానూ, రుచికరంగానూ ఉంటుందట. ఇది మంచిదేనా..?ఈ పద్ధతిలో తక్కువ సమయంలోనే వంట పూర్తి అయిపోవడమే కాకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా సునాయాసంగా వండేయొచ్చట. అలాగే ముక్కలు లేదా మాంసం ముక్కల్లోని మృదుత్వం పోకుండా రుచికరంగా ఉంటుందట. పైగా కొత్తగా వంట చేసేవారికి మరింత హెల్ప్ అవుతుందట. అదీగాక ఇలా వండితే సమయానికి సమయం, ఆరోగ్యానికి ఆరోగ్యం రెండు సొంతం చేసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు.(చదవండి: ఫస్ట్ డే డ్యూటీ హైరానా..! వైరల్‌గా బస్సు కండక్టర్ స్టోరీ.. -
జంక్ ఫుడ్ మానేసి.. వ్యాయామం చేయండి..
జంక్ ఫుడ్ మానేయడంతో పాటు ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం కోసం వ్యాయామం చేయాలని అర్జున అవార్డు గ్రహీత, పద్మభూషణ్, పద్మశ్రీ పుల్లెల గోపీచంద్ అన్నారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా కార్డియలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కేబీఆర్ పార్కు వద్ద ఆదివారం వాకథాన్ నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన గోపీచంద్ ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం ప్రతి ఒక్కరూ నడకకు సమయం కేటాయించాలని సూచించారు. శరీరానికి అవసరమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని, అవసరం లేని ఆహారం ఆరోగ్యానికి చేటు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు గోకల్రెడ్డి, రామకృష్ణ జనపాటి, సందీప్ పాల్గొన్నారు. రెయిన్ బో ఆస్పత్రిలో.. బంజారాహిల్స్ రెయిన్ బో ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన అథ్లెటిక్ హార్ట్ క్లినిక్‌ను పుల్లెల గోపీచంద్ ఆదివారం ప్రారంభించారు. ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దీన్ని నిర్వహిస్తామని ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ దినేష్ చిర్ల తెలిపారు. అత్యాధునిక ప్రమాణాలతో, అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సెంటర్ కొనసాగుతుందని వారు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని, అప్పుడే శరీరంలో ఏం జరుగుతుందనేది తెలుస్తుందని గోపీచంద్ అన్నారు. జాతీయ ఉత్తమ బాల పురస్కార గ్రహీత సుకృతి వేణి బండ్రెడ్డి పాల్గొన్నారు. -
ప్రెగ్నెంట్ టైంలో సైనసైటిస్ మందులు వాడితే ప్రమాదమా..?
నేను మూడు నెలల గర్భవతిని. నాకు ఎప్పటినుంచో డస్ట్ అలెర్జీ, సైనసైటిస్ సమస్యలు ఉన్నాయి. గర్భం వచ్చిన తర్వాత తరచూ జలుబు, తుమ్ములు వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని మందులు వాడాను. ఈ మందులు నా బిడ్డకు ఎలాంటి ప్రభావం చూపుతాయోనని ఆందోళనగా ఉంది. గర్భధారణ తొలి నెలల్లో మందులు వాడటం సురక్షితమా? నేను ఏవైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా?– సుశీల, నాగర్కర్నూల్సుశీల గారు, గర్భధారణ తొలి నెలల్లో శరీరంలో రక్షణశక్తి, హార్మోన్లలో మార్పులు ఎక్కువగా జరుగుతాయి. అందుకే ఈ సమయంలో జలుబు, తుమ్ములు, ముక్కు దిబ్బడ వంటి సమస్యలు రావడం సాధారణం. కొన్నిసార్లు ఫ్లూ కూడా రావచ్చు. ఈ లక్షణాలు ఎప్పుడు వస్తే, వాటి కారణం ఏమిటో ముందుగా గుర్తించడం చాలా ముఖ్యం. ఎందుకంటే చికిత్స కారణాన్ని బట్టి మారుతుంది. ఇలాంటి సమయంలో ముందుజాగ్రత్తలు చాలా సహాయపడతాయి. ముఖ్యంగా ఫ్లూ సీజన్లో ఎక్కువ జనసమూహాలు ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండడం, అలెర్జీ కలిగించే పదార్థాలను తీసుకోకపోవటం, అవసరమైతే మాస్క్ ధరించడం మంచిది. ఫ్లూ వ్యాక్సిన్ గర్భధారణలో ఎప్పుడైనా సురక్షితంగా తీసుకోవచ్చు. ఇది తల్లికి, బిడ్డకు రక్షణ ఇస్తుంది. తేలికపాటి జలుబు, సైనసైటిస్ ఉన్నప్పుడు ఎక్కువగా నీరు తాగడం, వేడి సూపులు తాగడం, ఇంట్లో ఆవిరి పీల్చడం లాంటి చిట్కాలు ఉపశమనాన్ని ఇస్తాయి. మీ శరీర ఉష్ణోగ్రత, పల్స్, ఆక్సిజన్ స్థాయిలను ఇంట్లోనే ఉంటూ గమనించడం మంచిది. లక్షణాలు ఎక్కువైనా లేదా ఏదైనా అసాధారణంగా అనిపించినా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. మొదటి మూడు నెలల్లో మందులు వాడడంపై మీరు ఆందోళన పడుతున్నా, నిపుణుల సూచనలో ఇచ్చే తేలికపాటి చికిత్సలు సాధారణంగా సురక్షితమే. ఇవి బిడ్డ అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపవు. సమయానికి వైద్య పర్యవేక్షణ, జాగ్రత్తలు పాటిస్తే గర్భధారణలో జలుబు, తుమ్ములు, ఫ్లూ వంటి సమస్యలు సులభంగా నియంత్రించుకోవచ్చు.నాకు ఈ మధ్యనే రెండవ ప్రెగ్నెన్సీ నిర్ధారణ అయింది. అయితే, నా మొదటి గర్భధారణలో నాకు తీవ్రమైన వాంతులు అయ్యాయి. పలుసార్లు ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. శారీరకంగా, భావోద్వేగపరంగా చాలా ఇబ్బంది పడ్డాను. అందుకే, ఇప్పుడు ఈ గర్భధారణను కొనసాగించడానికి భయం వేస్తోంది. ఈ గర్భధారణలో కూడా నాకు మళ్లీ అలాంటి వాంతులు వస్తాయా? వాంతులు తగ్గించుకోవడానికి నేను ఏమి చేయగలను?– కీర్తి, వరంగల్గర్భధారణ సమయంలో వాంతులు, వికారం సాధారణంగా కనిపించే సమస్య. దీనిని ‘మార్నింగ్ సిక్నెస్’ అంటారు. ఇది ఎక్కువగా మొదటి త్రైమాసికంలో కనిపిస్తుంది. సాధారణంగా ఆరు నుంచి ఏడవ వారంలో ప్రారంభమై, పదనాలుగు నుంచి పదహారు వారాల మధ్య తగ్గిపోతుంది. అయితే ఈ లక్షణాల తీవ్రత వ్యక్తికి వ్యక్తికి వేరుగా ఉంటుంది. కొందరికి స్వల్పంగా మాత్రమే ఉండగా, మరికొందరికి చాలా తీవ్రమైన, రోజువారీ జీవితాన్ని ఇబ్బందిపెట్టేంతగా వాంతులు రావచ్చు. మీరు చెప్పినట్టుగా కొన్ని సందర్భాల్లో ఆసుపత్రిలో చేరడం, ఇంజెక్షన్స్, మెడిసిన్స్ తీసుకోవడం కూడా అవసరమవుతుంది. ఒకే మహిళకు వేర్వేరు గర్భధారణల్లో వాంతుల తీవ్రత వేరుగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ సమస్యకు ప్రధాన కారణం గర్భధారణ హార్మోన్ అయిన బీటా హెచ్‌సీజీ స్థాయి అకస్మాత్తుగా పెరగడం. అందుకే కవలలు గర్భంలో ఉన్నప్పుడు వాంతులు మరింతగా వస్తాయి. వాంతులు తగ్గించుకోవడానికి మీరు పాటించగల కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి. రోజంతా కొద్దికొద్దిగా నీరు తాగుతూ ఉండాలి, ప్రతి రెండు నుంచి మూడు గంటలకు తక్కువ మోతాదులో అయినా తరచు ఆహారం తీసుకోవాలి. మృదువైన, సులభంగా జీర్ణమయ్యే పదార్థాలను తినడం మంచిది. మసాలా వంటకాలకు, బయట ఆహారానికి వీలైనంత దూరంగా ఉండాలి. ఎక్కువసేపు ఆకలితో ఉండకూడదు. వాంతులు ఎక్కువగా వస్తున్నప్పుడు తగినంత విశ్రాంతి తీసుకోవాలి. కొన్ని వాసనల వల్ల వాంతులు పెరిగే అవకాశం ఉన్నందువలన అలాంటి వాసనల నుంచి దూరంగా ఉండాలి. అల్లం, నిమ్మరసం వంటి పదార్థాలను ఆహారంలో చేర్చడం కూడా కొంత ఉపశమనం ఇస్తుంది. వాంతులు తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు కొన్ని మందులు సురక్షితంగా వాడవచ్చు. ఇవి మీ డాక్టర్ సూచనతో మాత్రమే తీసుకోవాలి. మీరు ఏమీ తినలేకపోతున్నా లేదా తాగలేకపోతున్నా, బరువు తగ్గడం లేదా డీహైడ్రేషన్ లక్షణాలు కనిపిస్తున్నా వెంటనే మీ వైద్యుడిని సంప్రదించాలి. సమయానికి చికిత్స తీసుకోవడం వల్ల మీకు, శిశువుకు కలిగే సంక్లిష్టతలను తగ్గించవచ్చు. డా. కడియాల రమ్య, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: కంటి ఆరోగ్యం కోసం 20:20:20 రూల్ వెబ్సైట్..!) -
కంటి ఆరోగ్యం కోసం 20:20:20 రూల్ వెబ్సైట్..!
ఇప్పుడంతా డిజిటల్ ప్రపంచంలో బతుకుతున్నాం. ప్రతిదీ ఆన్లైన్ మయం. ఫోన్‌స్క్రీన్ లేదా కంప్యూటర్ స్క్రీన్ చూడకుండా పనులు అవ్వని కాలం ఇది. ఇలాంటి పరిస్థితుల్లో..చాలామంది వెన్నునొప్పి, కాలునొప్పి వంటి సమస్యల కంటే కంటి సమస్యల బారినపడే వారి సంఖ్య అధికంగా ఉంది. అందుకు చిన్న, పెద్ద అనే భేధం లేదు. ఇక్కడ అనన్య దేశాయ్ అనే టీనేజర్ టెక్కీ కూడా ఇలానే బాధపడుతోంది. నిద్ర లేవడంతోనే నేరుగా వేటిని చూడలేదు. చాలాసేపు వరకు చూపు స్పష్టంగా కనిపించదామెకు. ఆమె తీవ్రమైన మయోఫియాతో బాధపడుతోంది. ఆమె అమ్మమ్మ గ్లాకోమాతో ఇబ్బందిపడటం దగ్గర నుంచి చూసిన ఆమె తన సమస్యను మరి ఆ స్థాయిలోకి రానివ్వకూడదనుకుంది. అలా పుట్టుకొచ్చిందే కంటి ఆరోగ్యాన్ని ప్రోత్సహించే వెబ్సైట్. ఏంటిది..? ఇది మన కళ్లను ఎలా సంరక్షిస్తుందంటే..అనన్య ఆన్లైన్ తరగతులు, ఇంటర్లో నోట్స్, కోడింగ్ అసైన్మెంట్లు వంటి అన్నింటి కోసం గంటల తరబడి స్క్రీన్లపై ఆధారపడాల్సి వచ్చింది. దాంతో తలనొప్పి, కంటి ఒత్తిడి వంటి పరిస్థితులను ఎదుర్కొని మెరుగైన చూపుని ఎంతమేర కోల్పోయిందో తెలుసుకుంది అనన్య. దాంతో తీవ్రమైన మయోపియా బారిన పడింది. దీని కారణంగా అనన్య కంటి లెన్స్ లేదా కళ్ల జోడులు లేకుండా బయటకు వెళ్లలేని పరిస్థితి. అందుకామె కంటి చూపుని తేలిగ్గా చూడొద్దని హెచ్చరిస్తోంది. కరోనా మహమ్మారి వల్లే తనకు స్క్రీన్ వాడకం ఎక్కువైందని అది మొత్తం జీవితాలనే మార్చేసిందని అంటోంది. తనకున్న కోడింగ్ అభిరుచితో ఈ సమస్యకు చెక్పెట్టగలనా అని ఆలోచించడం ప్రారంభించింది. అలా పుట్టుకొచ్చిందే ఈ విజువల్ ఐస్ వెబ్సైట్. ఏంటి వెబ్సైట్..ఇది డిజిటల్ కంటి ఒత్తిడిని అధిగమించడంలో హెల్ప్ అవుదుంది. ఇది 20-20-20 రూల్‌తో రూపొందించింది. ఏఐ ఆధారిత ఆరోగ్య చిట్కాల్లో ఈ 20 రూల్ కంటి ఆరోగ్యానికి హెల్ప్ అవుతుందని తెలుసుకుంది అనన్య. అదే ఆమెకు కంటి ఆరోగ్యాన్ని కాపాడే వెబ్‌సైట్‌ని రూపొందించేందుకు ప్రేరణ ఇచ్చింది. అలా అనన్య కంప్యూటర్ విజన్ సిండ్రోమ్(CVS)గా పిలిచే ఈ డిజిటల్ కంటి ఒత్తిడిని నివారించడానికి ఈ ఐస్ వెబ్‌సైట్‌ని రూపొందించింది అనన్య. తనకున్న కోడింగ్ సామర్థ్యంతో ఈ వెబ్‌సైట్‌ని క్రియేట్ చేసింది. ఇంతకీ ఎలా పనిచేస్తుందంటే..ప్రతి 20 నిమిషాలకు స్క్రీన్ల నుంచి విరామం తీసుకుని 20 సెకన్ల పాటు 20 అడుగుల దూరంలో ఉన్నదాన్ని చూడటం. అదే ఈ వెబ్సైట్లో ఉంటుంది.ఎందుకు మంచిదంటే..ఇది కంటి ఫోకసింగ్ వ్యవస్థను రీసెట్ చేస్తుంది. కార్నియల్ ఉపరితలాన్ని రీహైడ్రేట్ చేయడానికి, రెప్పవేయడాన్ని ప్రోత్సహిస్తుంది. ముఖ్యంగా ఇంటెన్సివ్ స్క్రీన్ పనిలో నిమగ్నమైన వ్యక్తులకు దృశ్య అలసట, కంటి ఒత్తిడిని తగ్గించడంలో ప్రభావవంతంగా ఉయోగపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అంటే ఈ వెబ్సైట్ మన కంప్యూటర్ స్క్రీన్‌పై ఫోకస్ టైమర్ ద్వారా 20 నిమిషాల రిమైండర్ ప్రతిసారి దీన్ని గుర్తు చేస్తుందని చెబుతున్నారు. కాగా, అనన్య ఇలాంటి కంటి ఆరోగ్యానికి సంబంధించిన 20-20-20 రూల్ తోపాటు, ఆకుకూరలు, నట్స్, కంటి వ్యాయమాలతో తన దృష్టిని మరింతగా మెరుగుపరుచుకున్నట్లు వెల్లడించింది. ఇక్కడ తన కంటి పరిస్థితి కారణంగా ఎదురైన సవాళ్లు ఆవిష్కరణకు నాందిపలికింది. ఇక్కడ అనన్య స్టోరీ ప్రతి ఒక్కరూ తమకెదురైనా కష్టాన్ని లేదా సమస్యను మరో దృక్పథంలో చూడండి తప్ప నిరాస నిస్ప్రుహలకు లోనవ్వకూడదని తెలుపుతోంది. (చదవండి: Dussehra 2025: ప్రపంచంలోనే అతి పురాతనమైన రాంలీలా ఇది..! ఎక్కడంటే..) -
దాండియా, గర్భా నృత్యాలలో ఎలాంటి ప్రమాదం వాటిల్లకూడదంటే..
దసరా అంటేనే తొమ్మిది రోజుల పండుగ. రోజుకో విధంగా అమ్మవారిని అలంకరించుకుని.. జగన్మాత శరణు అంటూ ఉపవాసాలతో కొలుచుకుంటారు భక్తులు. కొన్ని ప్రాంతాల్లో నవరాత్రుల్లో రాత్రి సమయంలో దాండియా, గర్భా, కోలాటం వంటి డ్యాన్స్‌లతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అయితే ఇలా మంచి మ్యూజిక్ లయబద్ధంగా డ్యాన్స్‌లు చేస్తూ చాలామంది ప్రాణాలను కోల్పోయారు. మరికొందరూ కాలి గాయాల బారినడ్డారు. ఇలాంటి ప్రమాదాల బారిన పడకుండా ఉత్సాహంగా..హెల్దీగా పండుగను జరుపుకోవాలంటే ఈ సింపుల్ టిప్స్ ఫాలోకండి అని చెబుతున్నారు వైద్య నిపుణులు.దసరా సరదా పదిలంగా ఉండాలంటే..సాయం సమయంలో చేసే నృత్యాల విషయంలో కాస్త కేర్‌ఫుల్‌గా ఉండమని చెబుతున్నారు సూరత్‌కి చెందిన ఆర్థోపెడిక్. రాత్రుళ్లు భక్తితో అమ్మవారి అనుగ్రహం పొందేలా గంటలతరబడి డ్యాన్స్‌లు చేస్తుంటారు. దాంతో కాలి గాయాలు బారిన పడటం లేదా, చీలమండలం, మోకాలు వంటి సమస్యలు తలెత్తేందుకు దారితీస్తాయి. మరికొందరికి..జనం సముహం ఎక్కువగా ఉండి శ్వాసకు అంతరాయం లేదా, స్ట్రోక్ వంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. అలా జరగకుండా సంతోషభరితంగా, ఆరోగ్యప్రదంగా పండుగ వాతావరణం ఉండాలంటే..ఈ చిట్కాలను ఫాలోకండి అని చెబుతున్నారు వైద్యులు. హెల్దీగా ఉండేలా..హైడ్రేటెడ్‌గా ఉండేలా కేర్ తీసుకోవాలి. మనతోపాటు ప్రోటీన్ బార్లు కూడా తీసుకెళ్లాలి. అలాగే ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్ర ఉండేలా కేర్ తీసుకోండి. జిమ్‌కి వెళ్లడం, స్ట్రెచింగ్, ఫ్లెక్సిబిలిటీ వ్యాయామాలు, యోగా, బల శిక్షణకు సంబంధించిన వర్కౌట్లు వంటివి ప్రాక్టీస్ చేయండి. దీంతోపాటు పోషకాహారం కూడా చాలా ముఖ్యం అని సూచించారు. పెయిన్ కిల్లర్స్‌కి దూరం..ఇప్పటికే ఏదైనా గాయం లేదా కాలి సమస్య ఉంటే..నొప్పి నివారణ మంందులు తీసుకోవద్దని చెబుతున్నారు వైద్యులు. అన్ని నొప్పి నివారణ మందులు మూత్రపిండాలను ప్రభావితం చేస్తాయని అంటున్నారు. సుమారు 4 నుంచి 5 గంటలు గర్భా నృత్యం చేస్తున్నప్పుడూ డీ హైడ్రేషన్‌కి గురవ్వతారు ఫలితంగా మూత్రపిండాలు దెబ్బతింటాయని హెచ్చరిస్తున్నారు. అందువల్ల పెయిన్ కిల్లర్స్ తీసుకోకపోవడమే మేలు అని చెబుతున్నారు. శరీరం మాట వినండి..గర్భా సమయంలో శరీరంలో ఏ భాగం నుంచి అయినా నొప్పి వస్తే..ఆగిపోండి. కాస్త ఇబ్బందికరంగా ఉన్నా..డ్యాన్స్ చేసే సాహసం చెయ్యొద్దు అని సూచిస్తున్నారు. తక్షణమే సమీప వైద్యలును సంప్రదిస్తే..సురక్షితంగా ఉంటారని అన్నారు. View this post on Instagram A post shared by Krunal Shah (@dr.krunal_shah_) గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: Navratri celebrations : 'డిజిటల్ గర్భా': పండుగను మిస్ అవ్వకుండా ఇలా..!) -
లిపోప్రొటీన్(ఎ)తో గుండెకు ప్రమాదం..!
గుండె జబ్బులకు ప్రధానంగా కారణమయ్యే జన్యు ఆధారిత సమస్య లిపోప్రొటీన్(ఎ) పై అవగాహన లోపం శాపమవుతోందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రముఖ ఔషధ సంస్థ నవార్టిస్ బుధవారం నిర్వహించిన అంతర్జాతీయ వెబినార్‌లో నగరానికి చెందిన పలువురు వైద్యులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా 1.8 కోట్ల మంది గుండె జబ్బులతో మరణిస్తుంటే అందులో 5వ వంతు భారతీయులే ఉండటానికి కారణం లిపోప్రొటీన్(ఎ) అని వీరు స్పష్టం చేశారు. మన దేశీయుల్లో 34% మందికి లిపోప్రొటీన్(ఎ) స్థాయి అధికం కాబట్టి ముందస్తు రక్తపరీక్షల ద్వారా దీన్ని గుర్తించడం కీలకమని అపోలో ఆస్పత్రి కార్డియాలజీ డైరెక్టర్ డాక్టర్ ఏ.శ్రీనివాస్ కుమార్ స్పష్టం చేశారు. ఈ లిపోప్రోటీన్ రక్త నాళాల గోడలలో పేరుకుపోయి, LDL కొలెస్ట్రాల్ మాదిరిగానే ఫలకాలను ఏర్పరుస్తుంది. ఈ ఫలకాలు గుండె, మెదడు, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు శరీరంలోని ఇతర భాగాల వంటి ముఖ్యమైన అవయవాలకు రక్త ప్రవాహాన్ని నిరోధిస్తాయి. ఫలితంగా గుండెపోటు, స్ట్రోకులు, ఇతర హృదయ సంబంధ వ్యాధులు వస్తాయి.కేవలం రక్తపరీక్షతో పెను ప్రమాదాన్ని నివారించవచ్చనే విషయం చాలా మందికి తెలీదని హార్ట్ హెల్త్ ఇండియా ఫౌండేషన్ వ్యవస్థాపకులు రామ్ ఖండేల్వాల్ అన్నారు. ఈ సందర్భంగా సాధారణ ఆరోగ్య కార్యక్రమాల్లో లిపోప్రొటీన్(ఎ) పరీక్షను భాగం చేయాలని ప్రభుత్వాలను వైద్యులు కోరారు. (చదవండి: పేదల కళ్యాణ వేదిక..! 150 మంది దాక..) -
వెయిట్ లాస్లో ఇవే మెయిన్ సీక్రెట్స్
బరువు తగ్గడం అనేది చాలామందికి అనుకున్నంత ఈజీకాదు. వెయిట్ లాస్ ప్లాన్లు, చిట్కాలు, టిప్స్, వ్యాయామాలు, ఆహార నియమాలు సోషల్‌మీడియాలో ఎన్నో విషయాలు గందరగోళంగా ఉంటాయి. ఎన్ని ఉన్నా.. మన శరీరం, దాని తీరు, ఆరోగ్యాన్ని బట్టి మనం ఉత్తమ మార్గాన్ని ఎంచుకోవాలి. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో సమతుల్య ఆహారం తీసుకోవడాన్ని మించింది లేదు. దీంతో పాటు కనీసం వ్యాయామం, కంటినిద్రా ఉంటే చాలు. మరి ఇవాల్టీ టిప్ ఆఫ్ ది డేలో భాగంగా వెయిట్ పెరగకుండా ఉండాలంటే ఎలాంటి ఆహారానికి దూరంగా ఉండాలి? ఎలాంటి ఆహారాలను తీసుకోవాలో చూద్దాం. ఇవి బరువును తగ్గించడంలో సహాయపడటమే కాదు మొత్తం ఆరోగ్యాన్ని కాపాడతాయి.శుద్ధి చేసిన పిండి పదార్థాలుఅల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తినే వారి కంటే తక్కువ ప్రాసెస్ చేసిన ఆహారాలు ఉన్న వ్యక్తులు ఎక్కువ బరువు కోల్పోయారని ఇటీవలి అధ్యయనం నిర్ధారించింది. వేగంగా బరువు తగ్గాలంటే చక్కెర, పిండి పదార్థాలకు దూరంగా ఉండాలి. అలాగే తక్కువ కార్బ్ ఆహారం తీసుకోవడం ద్వారా లేదా శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లను తృణధాన్యాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. తద్వారా ఆకలి తగ్గుతుంది, తక్కువ ఆక కేలరీలు తినగలుగుతారు. తక్కువ కార్బ్ ఆహారం శరీరం శక్తి కోసం నిల్వ చేసిన కొవ్వును కరిగించడానికి సాయపడుతుంది. ఫైబర్ పుష్కలంగా లభించి జీర్ణక్రిను మెరుగుపర్చి బరువును తగ్గిస్తుంది.చదవండి: నో టికెట్.. నో మనీ : విమానం ల్యాండింగ్ గేర్ పట్టుకుని ఢిల్లీకి వచ్చిన ఆఫ్ఘన్ బాలుడుహై ప్రోటీన్ ఫుడ్ బరువు తగ్గించే ప్రయాణంలో తగినంత ప్రోటీన్లు తినడం వల్ల కండర ద్రవ్యరాశిని కాపాడుకోవచ్చు. కార్డియోమెటబాలిక్ ప్రమాద కారకాలు, శరీర బరువు ,ఆకలిపై ప్రోటీన్ సానుకూల ప్రభావాన్ని చూపుతుందని అధ్యయనాలు చూపిస్తున్నాయి. తగినంత ప్రోటీన్ ఉన్న ఆహారం కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది, కోరికలను తగ్గిస్తుంది. చికెన్, లాంబ్, పంది మాంసం, సాల్మన్, సార్డినెస్, ట్రౌట్, గుడ్లు, రొయ్యలు, బీన్స్, టోఫు, టెంపే, క్వినోవా మరియు చిక్కుళ్ళు వంటి ఆరోగ్యకరమైన ప్రోటీన్ వనరులతో మీరు మీ ఆహారాన్ని మెరుగుపరచుకోవచ్చు. బరువు తగ్గించే ఆహారంలో ఆకుకూరలు మరొక గొప్ప సోర్స్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. కేలరీలు చాలా తక్కువగా పోషకాలు, కార్బోహైడ్రేట్లు మెండుగా లభిస్తాయి. బరువు తగ్గించే ఆహారంలో తప్పనిసరిగా చేర్చాల్సిన కూరగాయల్లో టమోటాలు, దోస, బీర, సొరతోపాటు, బ్రోకలీ, పాలకూర, కాలీఫ్లవర్,క్యాబేజీ, బ్రస్సెల్స్ తీసుకోవచ్చు. మొలకలు, లెట్యూస్, స్విస్ చార్డ్, మిరియాలు లాంటివి మన ఆహారంలో చేర్చు కోవచ్చు. అయితే చిలగడదుంపలు, బంగాళాదుంపలు, మొక్కజొన్న లాంటి వాటిల్లో సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు ఎక్కువ. వీటివలన ఎటువంటి హాని లేనప్పటికీ, పోర్షన్ కంట్రోల్ పాటించడం మంచిది.ఆరోగ్యకరమైన కొవ్వులు అస్సలు మిస్ కాకూడదుఅవకాడో నూనె, ఆలివ్ నూనె, పొద్దుతిరుగుడు నూనె, కనోలా నూనె లాంటి ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉండే ఆయిల్. పొద్దుతిరుగుడు, గుమ్మడికాయ, చియా, మఅవిసె గింజలు గింజలు , బాదం వాల్నట్లు వీటిని మితంగా తీసుకోవచ్చు. వీటితోపాటు రుచికరమైన కూరగాయలు, గింజలకలిపి సలాడ్‌ను తినవచ్చు.ఇదీ చదవండి: గోంగూర పువ్వులతో వంటలు, అద్భుత ప్రయోజనాలుగుర్తుంచుకోవాల్సిన అంశాలు.ఏదైనా డైట్ ఎంచుకునే ముందు అది మనకు సరిపడుతందో లేదో నిర్ధారించుకోవాలి. అవసరమైతే వైద్యుల సలహా తీసుకోవాలి. ఎంచుకునే ఆహారం మరీ నిర్బంధంగా ఉండకుండా చూసుకోండి. లేదంటే నియంత్రణ కోల్పోతే అతిగా తినేసే అవకాశం ఉంది. పోషకాలు అందుతున్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. బరువు తగ్గడంలో పట్టుదల చాలా కీలకం. పట్టుదలగా ఆహార నియమాలనుపాటించాలి. జీవనశైలికి అనుగుణంగా శక్తినిచ్చే ఆహరాన్ని ఎంచుకోవడంతో పాటు, క్రమం తప్పని వ్యాయామం తప్పనిసరి. రోజుకు కనీనం 3-4 లీటర్లు నీళ్లు తాగడం, 8 గంటల నిద్ర, ఒత్తిడి లేని జీవితం వెయిట్ లాస్ జర్నీలో కీలక పాత్ర పోషిస్తాయి. నోట్ : పైన పేర్కొన్న అంశాలు కేవలం అవగాహనకోసం అందించినవి మాత్రమే. ముఖ్యమైన నిర్ణయాలు, సందేహాల నివృత్తికోసం వైద్యులను సంప్రదించండి. -
సర్.. నా భార్య చిలిపి దొంగతనాలు చేస్తోంది!
నా భార్య వయసు 45 ఏళ్ళు. మాకు ఒక సొంత సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. మంచి ఉన్నతమైన కుటుంబం. మా ఆవిడకు మొదటి నుంచి ఒక వింత అలవాటు ఉంది. షాపింగ్‌కు వెళ్లినపుడు అవసరం లేకపోయినా, కొనగలిగిన స్థోమత ఉన్నా, ఏదో ఒక వస్తువు దొంగిలిస్తుంది. ఆమె దొంగిలించే వాటిలో కాస్మెటిక్స్ లాంటి చిన్న వస్తువుల నుంచి, ఒక్కోసారి చీరలు, చిన్న బంగారు వస్తువులు కూడా ఉన్నాయి. అలా దొంగిలించినవి కొన్ని ఇంట్లో దాచిపెడుతుంది. కొన్నేమో ఇతరులకు తాను గొప్ప అనిపించుకోవడానికి అన్నట్లు పంచిపెడుతుంది. ఆమెకు 300లకు పైగా చీరలు,కోట్లు విలువ చేసే బంగారు నగలు ఉన్నాయి. ఒక్కోసారి నా జేబులోంచి కూడా, నాకు చెప్పకుండా డబ్బులు తీసి దాస్తుంది. ఇన్ని చేసినా ఏమి తెలియనట్లు ఉంటుంది. ఏమాత్రం గిల్టీగా ఫీలవదు. ఇన్ని ఆస్తిపాస్తులుండి కూడా, ఆమె ఎందుకు ఇలా చీప్‌గా దొంగతనాలు చేస్తుందో అర్థం కావడం లేదు. ఇలా చేసి కొన్నిసార్లు షాప్స్‌లో పట్టుబడితే, పొరపాటయిందని సారీ చెప్పింది. ఆమె ప్రవర్తన వల్ల నాకు ఇబ్బందిగా ఉంది. బయట ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి నాది. సాక్షిలో మీ కాలమ్ చూసి, మీరే ఏదైనా మంచి పరిష్కారం చూపిస్తారనే ఆశతో ఉన్నాను!– కామేశ్వరరావు, హైదరాబాద్రావుగారూ! మీరెంతో ఆవేదనతో మీ సమస్యను సాక్షి ద్వారా తెలియజేసినందుకు ధన్యవాదాలు. మీరన్నట్లుగా ఇది బయటకు చెప్పుకోలేని పరిస్థితి. అన్నీ ఉన్నా, అవసరం లేకున్నా ఇలా దొంగతనాలు చేయడాన్ని ‘క్లెప్టోమెనియా’ అంటారు. ఇది చాలా అరుదైన ఒక వింత మానసిక సమస్య. ఈ సమస్య ఉన్న వారికి, ఎలాగైనా ఏదో ఒకటి దొంగిలించాలనే ‘తహ తహ’ ఉంటుంది. వాస్తవానికి ఆ దొంగిలించిన వస్తువు వల్ల వారికి ఎలాంటి అవసరం ఉండదు. ఆ వస్తువు విలువ కూడా చాలా స్వల్పమై ఉండవచ్చు. మామూలు దొంగతనాల లాగా వీరు ఏదీ ప్లాన్ చేసుకుని, దొంగతనాలు చేయరు. ఏదైనా షాపింగ్‌కి అని వెళ్లినపుడు అలా సడన్‌గా చేతికందిన ఏదో ఒక వస్తువును వారికవసరం లేకపోయినా ఎత్తేస్తుంటారు. బాగా స్థోమత కలిగి, డబ్బులు పెట్టి కొనగలిగిన వారిలోనే ఈ అలవాటు ఎక్కువ. బహిష్టు సమయంలో ఇలాంటి కోరిక, కొందరిలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆ సమయంలో కనబడిన వస్తువు ఎత్తేయకుంటే విపరీతమైన టెన్షన్‌కు గురయి, తీసిన తర్వాత చాలా మానసిక ప్రశాంతతకు లోనవుతారు. దీనిని ‘ఇంపల్స్ కంట్రోల్ డిజార్డర్’ అని కూడా అంటారు. ఈ అలవాటు యుక్తవయసులో మొదలై పెద్దయ్యే కొద్ది తగ్గిపోయే అవకాశం ఉంది. కానీ కొందరిలో మాత్రం శాశ్వతంగా ఉండి΄ోతుంది. ఈ సమస్య నుంచి బయటపడేయాలంటే ఆ వ్యక్తి సహకరించాలి. కొన్నిరకాల మందులతో పాటు ‘కాగ్నిటివ్ బిహేవియర్ మాడిఫికేషన్’ లాంటి ప్రత్యేక మానసిక చికిత్స పద్ధతుల ద్వారా ఇలాంటి వారిని ఈ అలవాటు నుండి బయటపడేసే అవకాశముంది. మొదట్లోనే ఈ అలవాటు గుర్తించి మానసిక వైద్యుడిని కలిస్తే ఫలితాలు మంచిగా ఉంటాయి. ఇప్పటికైనా మీ భార్యను మంచి నిపుణులైన సైకియాట్రిస్ట్ క్లినికల్ సైకాలజిస్టుల పర్యవేక్షణలో తగిన థెరపీ చేయించండి. ఆల్‌దిబెస్ట్!డాక్టర్ ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ.(మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com) -
రుచికరంగా..ఆరోగ్యంగా తిందాం ఇలా..!
ఆరోగ్యంగా తినాలంటే ఉప్పు , గ్లూకోజ్ తక్కువగా ఉన్న ఆహారాన్ని ఎంపిక చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. కానీ మన నాలుక టేస్ట్ కావాలంటూ..పోషకాలు లేని ఆహారంవైపే పరుగులు తీస్తుంది. ముఖ్యంగా నూనెలో డీప్ ఫ్రై చేసి, అధికం సోడియంతో ఉండే వాటినే మనసు కోరుకుంటుంది. ఊబకాయం, డయాబెటిస్, రక్తపోటు వంటి దీర్ఘకాలిక సమస్యల బారిన పడకూడదంటే చక్కెర, ఉప్పు తగ్గించడం తప్పనిసరి. మరి ఇలా నాలుకను కట్టేసేలా టేస్ట్ లెస్‌గా తినడం అందరి వల్ల కాదు. అలాంటప్పుడు ఇలా తెలివిగా రుచిని మిస్ కాకుంకా, పోషకాలు పోకుండా ఆరోగ్యంగా తినాంటే ఇలా ట్రై చేయండని చెబుతున్నారు ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ మాజీ ప్రొఫెసర్ డాక్టర్ జమునా. మరి అదెలాగో తెలుసుకుందామా..!.రుచిని కోల్పోకుండా సంతృప్తికరంగా తినాలనకుంటే ఉమామి రుచి బెస్ట్ అంటున్నారామె. అదేం రుచి అంటే..ఉమామి' అంటే జపనీస్ భాషలో "ఆహ్లాదకరమైన రుచి". 1980లలో అధికారికంగా ప్రత్యేక రుచిగా ఈ పేరు పెట్టడం జరిగింది. ఉమామి అనేది ఒక డిష్‌ని ఎలివేట్ చేసేలా రిచ్‌నెస్, ఫుల్నెస్ కూడిన ఒక విధమైన రుచి. అంటే ఉప్పు తక్కువగా ఉన్న మంచి టేస్ట్‌గా ఉంటుంది. అలాగే చప్పిడి భోజనం తిన్నామనే ఫీల్ రాదట. మాంసం, చేపలు, పుట్టగొడుగుల కూరల్లోని గ్రేవీకి తీపి, పులుపుతో కూడిన రుచినే ఈ ఉమామి. ఇది మనసుకు ఓదార్పుని, ఊరటనిచ్చే ఆహ్లాదకరమైన రుచి అని చెప్పొచ్చు. అనేక ఆహారాల్లో ఉండే గ్లూటామేట్, అమైనో ఆమ్లం మన నాలుకపై ఉండే రుచి గ్రాహకాలను ప్రేరేపిస్తుంది. ఇదే ఉమామి రుచి. ఎక్కువగా మాంసం, సముద్రపు ఆహారంలో ఈ ఉమామి టేస్ట్ అనుభవానికి వస్తుందని చెబుతున్నారు ఆహార నిపుణులు. అందుకే తక్కువ సోడియం ఉన్న ఆహారాలకు ఉమామి రుచిని పెంచే పదార్థాలను జోడిస్తే..ఆహారం రుచికరంగా మారుతుంది, ఆరోగ్యకరంగా తినే అవకాశం ఉంటుందని జపన్ పరిశోధనల్లో వెల్లడైంది. ఇందులో అధికంగా ఉండే గ్లూటామేట్ సంతృప్తిని అందించి, స్నాక్స్ అవసరాన్ని తగ్గిస్తుందట. అందుకోసం..ఉమామి రుచి కోసం మోనోసిడియం గ్లూటామేజ్(ఎంఎస్‌జీ)ని ఉపయోగిస్తారట. ఇది సహజ పదార్థాల నుంచే తయారవతుంది. పెరుగు లేదా వెనిగర్ తయారీకి ఉపయోగించే పద్ధతిలో తయారు చేయడం లేదా చెరుకు లేదా టాపియోకా కిణ్వ ప్రక్రియ ద్వారా తయారు చేస్తారట. ఇందులో ఉప్పులోని సోడియం కంటెంట్ కంటే తక్కువగా, పైగా ఉప్పుకి ప్రత్యామ్నాయంగా ఉంటుందట. పైగా ఇది భోజనాన్ని మితంగా తినేలా చేస్తుంది. అదీగాక ఇంద్రియాలతో రుచిని అనుభవించే మనకు జిహ్వ చాపల్యం శాపంగా మారకుండా ఉమామి రుచి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుందట. ఫలితంగా రుచిని కోల్పోకుండా పోషకాహారాలను కచ్చితంగా తీసుకోగలుగుతారు.చివరగా ఉమామి రుచి కోసం గ్లూటామేట్ అధికంగా ఉండే కూరగాయలు ప్రతిసారి జోడించడం కుదరనప్పుడూ పైన చెప్పిన కృత్రిమ ఈ ఎంఎస్‌జీ రుచితో కూడిన మసాలా ఉప్పు ఉయోగపడుతుంది. పోషకాహరం పేరుతో పాక రుచిని కోల్పోకుండా తెలివిగా తినే విధానమే ఇది అని చెబుతున్నారు మాజీ ప్రోఫెసర్ జమునా.డాక్టర్ జమునా ప్రకాష్ ఫుడ్ కన్సల్టెంట్, మాజీ ప్రొఫెసర్, మైసూర్ విశ్వవిద్యాలయం(చదవండి: ఆంజినాని అర్థం చేసుకుంటే..అతివల గుండె పదిలం..!) -
ఇంటిని నడిపే ఆమెకు నడుము నొప్పి..!
ఈ రోజుల్లో నడుమునొప్పి సాధారణంగా కనిపించే సమస్య.అయితే మహిళల్లో రోజువారీ పనుల వల్ల నడుమునొప్పివచ్చే అవకాశాలు మరింత ఎక్కువ.ఉదాహరణకు వాళ్లు రోజంతా నిలబడి వంట చేయడం లేదా బట్టలు ఉతకడం లేదా రొట్టెల కర్ర (బేలన్)తో రోటీలు తయారు చేయడం నడుమును చాలాసేపు అదేపనిగా ముందుకు వంచి ఆ పనులు చేయాల్సి రావడం వంటి కారణాలతో వారిలో నడుమునొప్పి ముప్పు మరింత ఎక్కువ. దీనికితోడు మహిళల్లో ప్రతి నెలా రుతుస్రావం నొప్పి వారి నడుము నొప్పిని మరింతప్రభావితం చేస్తుంది. ఇలాంటి అనేక కారణాలతో పురుషులతో పోలిస్తే మహిళల్లో కాస్త ఎక్కువగానే కనిపించే నడుము నొప్పులు, వాటికి కారణాలూ, వాటి పరిష్కారాలేమిటో తెలుసుకుందాం...పురుషులతో పోలిస్తే మహిళల్లో స్రవించే హార్మోన్లు కాస్త ప్రత్యేకంగానూ, సంక్లిష్టంగానూ ఉంటాయి. ఈ హార్మోన్లు సైతం వాళ్లలో నొప్పిని మరింత తీవ్రతరం చేస్తుంటాయని కొన్ని అధ్యయనాల్లో తేలింది. పురుషుల్లో కంటే మహిళల్లో ఇన్ఫ్లమేషన్ (నొప్పి, వాపు, మంట)కు స్పందించడం కాస్తంత తీవ్రంగా ఉంటుందనే అంశం కూడా ఇందుకు మరో కారణం. ఈ కారణం వల్లనే... పురుషుల్లో మహిళల్లో ఒకేలాంటి నొప్పి వస్తున్నప్పటికీ... మహిళల్లో ఆ నొప్పి తాలూకు తీవ్రత కాస్తంత ఎక్కువగానే ఉంటుందని ఇటీవలి కొన్ని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఇలా మహిళల్లో హార్మోన్లు, వారికే ప్రత్యేకమైన కొన్ని జన్యువులు, వారి మనస్తత్వం, నొప్పిని తెలిపే వ్యవస్థ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు మహిళల్లో నడుమునొప్పి తీవ్రత పురుషుల్లో కంటే ఎక్కువే.వైద్యపరమైన కారణాలతో నడుము నొప్పుల్లో కొన్ని...టెయిల్‌బోన్ పెయిన్ : మనం కుదురుగా కూర్చున్నప్పుడు సరిగ్గా మన నడుము కింద... పిరుదుల మధ్యగా కాస్తంత పైభాగంలో నొప్పి వస్తుంటే దాన్ని ‘టెయిల్‌బోన్ పెయిన్’గా చెప్పవచ్చు. అంటే ఇది సరిగ్గా వెన్నుపూసల్లోని చివరి ఎముక దగ్గర వచ్చే నొప్పి. వైద్యపరిభాషలో దీన్ని ‘కాక్సిడైనియా’ అంటారు. పురుషులతో ΄ోలిస్తే ఇది మహిళల్లో ఐదు రెట్లు ఎక్కువగా కనిపిస్తుంటుంది. దాంతో΄ాటు మహిళల్లో గర్భధారణ అంశం కాక్సిడైనియా ముప్పును మరింత పెంచుతుంది. అందుకే పురుషల కంటే మహిళల్లో ఇది ఎక్కువ.ఆస్టియోఆర్థరైటిస్ : ఇది కీళ్ల అరుగుదలతో వచ్చే నొప్పి. రెండు ఎముకలు కలిసే జాయింట్లలోని ఎముక అరిగినప్పుడు వచ్చే నొప్పి ఇది. నడుముభాగంలోని ఎముకల అరుగుదల కారణంగా ఈ తరహా నడుమునొప్పి వస్తుంది. ఇదే తరహాలో మోకాలు, తుంటి భాగంలో కీళ్లు (జాయింట్లు) అరిగినప్పుడు వచ్చే నొప్పిలాగే నడుము ప్రాంతంలోని ఈ నొప్పి వస్తుంటుంది.శాక్రో ఇలియాక్ జాయింట్ సమస్యలు : శాక్రమ్, ఇలియాక్ అనే ఎముకలు వెన్నెముక చివరి భాగంలో ఉంటాయి. శాక్రమ్ అనే వెన్నెముక చిట్టచివరి ఎముక (టెయిల్‌బోన్)ను తుంటితో కలుపుతూ... ఈ ఎముకలు పిరుదులకు ఇరువైపులా కొద్దిగా విస్తరించినట్లుగా ఉంటాయి. ఈ భాగంలో ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు నడుము కింద భాగంతో పాటు కాళ్లలోకి సైతం పాకుతున్నట్లుగా నొప్పి వస్తుంటుంది. మహిళల్లో గర్భధారణ అంశం ఈ నొప్పిని మరింత ప్రభావితం చేస్తుంది. దాంతో ఈ తరహా నొప్పి మహిళల్లో మరింత ఎక్కువగా కనిపిస్తుంటుంది.కంప్రెషర్ ఫ్రాక్చర్ : ఇది వెన్నెముకల్లోని వెన్నుపూసల్లో ఏదైనా ఎముక విరిగినప్పుడు వచ్చే నొప్పి. అనేక వెన్నుపూసలు (అంటే వెన్నులోని చిన్న చిన్న ఎముకలు) కలుస్తూ చక్కగా అమరి΄ోతూ... ‘ఎస్’ ఆకృతిలో ఒకే ఎముకలా కనిపించే వెన్నెముక ఏర్పడుతుందన్న విషయం తెలిసిందే. ఆస్టియో΄ోరోసిస్గా లేదా ఇతరత్రా ఏదైనా కారణం వల్ల ఈ వెన్నపూసల్లోని ఏదైనా ఎముక విరిగినప్పుడు తీవ్రమైన నడుమునొప్పి వస్తుంది. ఇలా జరగడాన్ని కంప్రెషర్ ఫ్రాక్చర్ అంటారు. ఈ కంప్రెషన్ ఫ్రాక్చర్స్‌కు స్త్రీ, పురుషులిరువురిలోనూ అవకాశమున్నప్పటికీ... పురుషుల్లో కంటే మహిళల్లో ఇవి రెండు రెట్లు ఎక్కువ.ఫైబ్రోమయాల్జియా : కండరాల్లో నొప్పుల కారణంగా వచ్చే ఈ తరహా నొప్పి వెన్ను కింది భాగంతో ΄ాటు పైభాగంలో కూడా కనిపించవచ్చు లేదా నడుము భాగంలో ఎక్కడైనా రావచ్చు. ఇది కూడా మహిళ్లోనే ఎక్కువ. పురుషులతో ΄ోలిస్తే మహిళల్లో కనిపించే యాంగై్జటీ ఈ నొప్పులకు కారణమవుతుంటుంది.నివారణ / చికిత్స...నడుమునొప్పితో బాధపడుతున్న మహిళలు ముందుగా అది ఏ కారణంగా వస్తున్నదో తెలుసుకోవాలి. ఆ నిర్దిష్టమైన కారణాన్ని బట్టి, దానికి అవసరమైన నిర్దిష్టమైన చికిత్స అందించడం లేదా తొలిదశల్లో నివారణ మార్గాలను అనుసరించడం ద్వారా నడుమునొప్పి నుంచి దూరం కావచ్చు. అవి... ఫిజియోథెరపిస్ట్ సహాయంతో అవసరమైన వ్యాయామాలు చేయడం తొలిదశల్లో (ఇంటర్‌ఫెరెన్షియల్ థెరపీ) ఐఎఫ్‌టీ వంటి ప్రక్రియలతో చేసే చికిత్సలూ ఉపశమనాన్ని కలిగిస్తాయి. టెన్స్ అనే చికిత్స కూడా ఇలాంటిదే. ట్రాన్స్క్యుటేనియస్ ఎలక్ట్రికల్ నర్వ్ స్టిమ్యులేషన్ అనే మాటలకు సంక్షిప్త రూపమే ఈ ‘టెన్స్’. ఈ చికిత్స ప్రక్రియలో ఎలక్ట్రోడ్ల సహాయంతో చిన్న చిన్న విద్యుత్ ప్రకంపనలను చర్మం కిందికి పంపుతారు. దాంతో తగిన ఉపశమనం కలుగుతుంది. (అయితే గర్భవతులు, మూర్ఛతో బాధపడే రోగులు, గుండెజబ్బులు ఉన్నవారు లేదా గుండె సమస్యను చక్కదిద్దడానికి పేస్‌మేకర్ అమర్చిన వాళ్లకు టెన్స్ చికిత్స ఎంతమాత్రమూ సరికాదు. అందుకే ఇలాంటి చికిత్సలు పూర్తిగా వైద్యనిపుణుల పర్యవేక్షణలోనే సాగాలి). తక్షణ నొప్పి నివారణ కోసం : నొప్పిని తాత్కాలికంగా తగ్గించడం కోసం నొప్పి నివారణ మందులు (పెయిన్ కిల్లర్స్) అందుబాటులో ఉన్నా... ఇవి కేవలం తక్షణ నొప్పి నివారణ కోసమే పనికి వస్తాయి. నడుమునొప్పి లేదా వెన్ను నొప్పి లేదా మెడనొప్పి లాంటి సమస్య ఏదైనా ఉన్నప్పుడు దాని శాశ్వత నివారణ కోసం నొప్పి నివారణ మందులను వాడటాన్ని పూర్తిస్థాయి చికిత్సగా పరిగణించకూడదు. పైగా నొప్పి నివారణ మందులను దీర్ఘకాలం వాడటం వల్ల జీర్ణవ్యవస్థపై దుష్ప్రభావం చూపవచ్చు. అందునా మరీ ముఖ్యంగా కాలేయంతో పాటు మూత్రపిండాల వంటి కీలకమైన అవయవాలు దెబ్బతినవచ్చు. అందుకే నడుమునొప్పి లాంటివి వస్తున్నప్పుడు రెండు వారాలకు మించి నొప్పి నివారణ మందులు తీసుకోవడం సరికాదు. దీనికి బదులు ఉపశమనం కోసం పైపూత మందులు (టాపికల్ మెడిసిన్స్) వాడటం మేలు. అయితే ఇందుకోసం కొన్ని ఆయిల్స్‌తో మసాజ్ చేస్తుంటారు. తొలుత నొప్పిని ఉపశమింపజేసే నూనెలతో మసాజ్‌లు చేయడం మంచిదే. మసాజ్‌లో భాగంగా నిపుణులు రుద్దడం, నొక్కడం, కొన్ని నిర్దిష్టమైన చోట్ల ఒత్తిడి కల్పించడం... అంటే రోలింగ్, నీడింగ్, అప్లయింగ్ ప్రెషర్ వంటివి చేస్తుంటారు. అలా నొప్పి ఉన్న భాగాల్లో రక్తప్రసరణ బాగా అయ్యేలా చేస్తారు. ఫలితంగా అక్కడి కండరాల్లో ఒత్తిడి తగ్గడం లేదా పట్టివేసిన కండరం వదులు కావడం వల్ల నొప్పి ఉపశమిస్తుంది. అయితే... ఇలా ఆరు వారాల కంటే ఎక్కువగా చేసినప్పటికీ నొప్పి కొనసాగుతూ ఉంటే మాత్రం ఒకసారి డాక్టర్‌ను సంప్రదించడం అవసరం. అలాగే 20 ఏళ్ల లోపు వాళ్లలో నడుము నొప్పి కనిపిస్తే తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించాలి.పై మార్గాలతో అంతగా గుణం కనిపించనప్పుడు ఎముకల వైద్య నిపుణులు లేదా న్యూరోసర్జన్లు లేదా స్పైన్ సర్జన్ల సహాయంతో అవసరమైన శస్త్రచికిత్స చేసి సమస్యను పరిష్కరించే అవకాశముంది.పోష్చర్ పరంగా... పక్కలకు అకస్మాత్తుగా ఒంగడం లేదా ఒక పక్క బరువును అపసవ్యంగా మోయడం వల్ల : మహిళలు తమ రోజువారీ పనుల్లో భాగంగా బిందెల వంటి బరువులు ఎత్తే సమయంలో, లేదా పిల్లలను అలాగే బిందెలను కూడా ఒకవైపున చంకలో మోసే సమయంలో నడుముఒంపు మీద బరువు ఆనించి చాలాసేపు అదేపనిగా నడవడం, బరువు మోస్తుండటం వంటి పనులు చేస్తుంటారు. ఇలా చాలాసేపు అవసవ్య భంగిమలో, అందునా బరువు మోస్తూ ఉండటం వంటి అంశాలు కూడా నడుమునొప్పికి కారణమవుతాయి. అలాగే ఇల్లు తుడిచే సమయంలో కొందరు కింద కూర్చొని తడిగుడ్డతో ఫ్లోర్ తుడుస్తుంటారు. దీనివల్ల తరచూ కూర్చోవడం, లేవడం వంటి పనులతోనూ అలాగే కొన్నిసార్లు అదేపనిగా నడుము ఒంచి ఒకేభంగిమలో చాలాసేపు ఉండటం వంటివి చేస్తుంటారు. ఫలితంగా నడుము నొప్పి రావచ్చు. ఇలాంటి సమయాల్లో లాంగ్ హ్యాండిల్ మాప్లు వాడుతూ నిటారుగా నిలబడే వాటిని వాడుతూ ఫ్లోర్లు తుడవటం లాంటి జాగ్రత్తలతో నడుమునొప్పిని నివారించుకోవచ్చు. ఇక వారు అనేక పనుల్లో భాగంగా అకస్మాత్తుగా ముందుకు వంగాల్సిరావడం లేదా పక్కలకు తిరగాల్సిరావడం, ఏవైనా బరువులు ఎత్తేందుకు గబుక్కున ముందుకు ఒంగడం లాంటివి చేస్తుంటారు. ఈ అంశాలు కూడా నడుము నొప్పికి కారణం కావచ్చు. వారు ఏదైనా బరువును (అంటే... బిందె, కుండ లేదా బస్తాల వంటి బరువులు) ఎత్తే సమయంలో ముందుకు ఒంగి కాకుండా...మెల్లగా కూర్చొని నెమ్మదిగా ఎత్తుకోవడం మేలు. ఇక ఆఫీసుల్లో పనిచేసే చోట్ల మహిళల్లో ముందుకు వంగి కంప్యూటర్లోకి చూస్తుండటం వల్ల కూడా నడుము నొప్పి రావచ్చు. అందుకే కంప్యూటర్ వంటివి చూస్తున్నప్పుడు నడుమును వీలైనంత నిటారుగా ఉంచడం మంచిది.చాలాసేపు నిలబడి ఉండే వాళ్లలో నడుము నొప్పి... కొన్ని వృత్తుల్లో ఉండేవారు ఉదాహరణకు ట్రాఫిక్ విభాగంలో పనిచేసే మహిళా పోలీసులు, బస్ కండక్టర్లు, షాపుల్లో పనిచేసే సేల్స్ గర్ల్స్ అదేపనిగా చాలాసేపు నిలబడే ఉంటారు. ఒక్కోసారి దాదాపు ఐదారు గంటల పాటు కూడా వారు నిలబడే ఉండాల్సి రావచ్చు. ఇలాంటి వాళ్లలో నడుమునొప్పి రావడంతోపాటు కాళ్లలోని ఎముకలు, కండరాలు దెబ్బతిని ‘మస్క్యులో స్కెలెటల్ డిజార్డర్స్’ వంటివి వచ్చే అవకాశాలెక్కువ. అలాగే చాలాసేపు నిలబడి ఉండటం వల్ల వచ్చే స్వల్పకాలిక సమస్యలైన కాళ్లలో తిమ్మిర్లు (క్రాంప్స్) వంటివీ రావచ్చు. ఒక్కోసారి నడుమునొప్పితోపాటు ఈ క్రాంప్స్ వంటివి వచ్చినప్పుడు వాళ్ల పరిస్థితి మరింత దుర్భరమవుతుంది. అందుకే చాలాసేపు నిలబడే ఉండే వృత్తుల్లో ఉండేవారు తరచూ కాస్తంత సేపు బ్రేక్ తీసుకోవడం వంటివి చేస్తూ ఉండాలి. కొంతసేపు కూర్చొని వచ్చి మళ్లీ నిలబడి తమ వృత్తిని / పనులను కొనసాగించాలి. నిలబడి ఉన్నప్పుడు కూడా అదేపనిగా చాలాసేపు నిటారుగా ఉండకుండా తరచూ పోష్చర్‌లో తరచూ కాస్తంత మార్పులు చేస్తూ ఉండాలి. ఒక వంట వండుతూ ఉండే సమయాల్లో కూడా మహిళలు వంట ప్లాట్‌ఫారమ్ దగ్గర చాలాసేపు నిలబడే ఉండాల్సి వస్తుంటుంది. ఇలాంటి సమయాల్లో వారు తమ ఎత్తునకు అనుగుణంగా ప్లాట్‌ఫారమ్ అమర్చుకోవడం, అప్పుడప్పుడూ కూర్చోడానికి ఎత్తైన లాంగ్ స్టూల్‌ను వేసుకోవడం మంచిది. దాని కాళ్ల దగ్గర ఫుట్‌రెస్ట్ చేసుకోవడానికి అనుగుణంగా అడ్డుపట్టీలు ఉండేలా చూసుకుంటూ, కూర్చున్నప్పుడు మీ కాళ్లు ఆ అడ్డుపట్టీలపైన ఉండేలా చూసుకుంటే నడుముపై భారం తగ్గి నడుమునొప్పి నివారించడానికి ఆ అంశాలు తోడ్పడుతుంటాయి. నడుమునొప్పిని నివారించే ఆహారం... చాలామందికి తెలియని విషయం, ఆశ్చర్యం కలిగించే సంగతేమిటంటే... వెన్ను ఆరోగ్యానికి తగినంత వ్యాయామంతోపాటు పోషకాహారం కూడా అవసరమే. ఆ ఆహారం ఎన్నో గాయాలను త్వరగా మాన్పి... వెన్నునొప్పులను నివారిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఎముక సాంద్రత తగ్గకుండా చేయడం ద్వారా నడుమునొప్పి రాకుండా చేస్తుంది. ఇందుకు మీ ఆహారంలో ఉండాల్సిన పోషకాలు ఏమిటంటే... కాల్షియమ్: కాల్షియమ్ సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల ఎముకల ఆరోగ్యం బాగుంటుంది. పాలు, పాల ఉత్పాదనలైన పెరుగు, వెన్నతోపాటు ముదురు ఆకుపచ్చగా ఉండే ఆకుకూరలు, చేపలలో క్యాల్షియమ్ ఎక్కువ. విటమిన్ డి3 : మన ఒంట్లోకి వచ్చే క్యాల్షియమ్ ఎముకల్లోకి ఇంకేలా చేసి, వాటి ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో విటమిన్–డి బాగా సహాయపడుతుంది. స్వాభావికమైన ఎండ (నేచురల్ సన్‌లైట్)తోపాటు సాల్మన్ వంటి చేపలు, కాలేయం, గుడ్డు వంటి ఆహారాల్లో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది.విటమిన్–సి : చిగురు ఎముకలో ఉండే కొలాజెన్ వంటివి ఏర్పరచడంలోనూ, ఎముకలు, కండరాలు, చర్మం, టెండన్ల ఆరోగ్యాన్ని కా΄ాడటంలో విటమిన్–సి ప్రధాన పాత్ర పోషిస్తుంది. అన్ని రకాల నిమ్మజాతి పండ్లతోపాటు టొమాటో, కాప్పికమ్ వంటి కూరల్లో ఇది ఎక్కువ. అలాగే గాయాలను మాన్పడం, ఏవైనా గాయాలైనప్పుడు దెబ్బతినే భాగాలను సత్వరం రిపేర్ చేయడానికి ప్రోటీన్లు చాలా అవసరం. మాంసాహారం, పప్పులలో ప్రోటీన్లు ఎక్కువ. విటమిన్–బి12 : మన శరీరంలోని ఎముకలను నిర్మించే కణాల రూపకల్పనకు విటమిన్ బి12 చాలా అవసరం. అన్ని రకాల చేపలు, మాంసంతోపాటు తాజా పండ్లు, ఆకుకూరలు, పౌల్ట్రీ ఉత్పాదనల్లో బిటమిన్–బి 12 ΄ాళ్లు ఎక్కువ.డ్రైవింగ్ – నడుమునొప్పి...వాహనాలు నడపడానికీ, నడుమునొప్పికీ చాలా దగ్గరి సంబంధం ఉంటుంది. వాహనాన్ని నడిపే చాలామందిలో కొంతకాలం తర్వాత నడుము నొప్పి రావడం చాలా సాధారణంగా కనిపించే అంశం. చాలాకాలం పాటు వాహనం నడిపేవారిలో వెన్నెముక కారు సీటుకు అనుగుణంగా అలా నిర్దిష్టమై ఒంపులా ఒంగి ఉండటంతో వెన్నెముకలోని వెన్నుపూసలు ప్రభావితమవుతాయి. అదీగాక వాహనం నడిపే సమయంలో కలిగే కుదుపుల వల్ల ఈ వెన్నుపూసలు ప్రభావితమవుతాయి. దాంతో చాలాకాలంపాటు వాహనాలు నడిపేవారిలో నడుమునొప్పి వచ్చే అవకాశాలెక్కువ. కార్స్ లేదా ఇతరత్రా ఫోర్‌వీలర్స్ విషయంలో నడుమునొప్పికి కారణమయ్యే కొన్ని అంశాలను చూద్దాం. ఇటీవల కొన్ని కార్లలోని పైకప్పు (రూఫ్) చాలా కిందికి ఉంటోంది. అలాగే డ్రైవింగ్ సీట్లో కూర్చునేవారి సౌకర్యం కోసం సీట్‌ను వెనకవైపునకు బాగా కిందికి దిగి ఉంచేలా చేస్తారు. డ్రైవింగ్ చేసేవారు తమ కాళ్లను తగినంతగా చాపి ఉంచేలా చూసుకోవడం కోసం సీట్‌ను వెనక్కి వాలేలా చూస్తారు. దాంతో డ్రైవింగ్ సీటులో నిటారుగా కూర్చోవడమన్నది దాదాపుగా జరగదు. ఫలితంగా వెన్ను మీద ప్రత్యేకంగా నడుము మీద ఒత్తిడి చాలా ఎక్కువ. ఇలా సీట్‌ను వెనక్కు వంచినప్పుడు మళ్లీ కారు ముందరిభాగంలో స్పష్టంగా చూడటం కోసం మెడను ముందుకు వంచడంతో మెడ 20 డిగ్రీలు ముందుకు వస్తుంది. దాంతో నడుము అంతా ఒక భంగిమలోనూ, మెడ మరో భంగిమలో ఒంగుతాయి. ఈ అపసవ్యతల కారణంగా డ్రైవింగ్ చేసేవారిలో చాలా తరచుగా వెన్ను నొప్పి / నడుమునొప్పి వస్తుంటాయి. కార్ డ్రైవింగ్‌తో వచ్చే నడుము నొప్పి నివారణకు సూచనలు:మీ తొడలకు సీట్ సపోర్ట్ వీలైనంత ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. అంటే తొడల నిడివిలో అవి ఎక్కువ భాగం సీట్‌పైనే ఉండేలా చూసుకోవాలి బ్రేక్, క్లచ్ వంటివి మీ కాళ్లు ఆనే చోటికి మరీ దూరంగా ఉండేలా కూర్చోవడం సరికాదు. అవి సరిగ్గా కాళ్ల చివరలో అందుబాటులో ఉండాలి మీ కాళ్ల పోడవుకు అనుగుణంగా సీట్‌ను మీకు సౌకర్యంగా ఉండేలా చూసుకోవాలి మీ ఎత్తుకు అనుగుణంగా సీట్ ఎత్తును అడ్జెస్ట్ చేసుకోవాలి ∙మీ సీట్‌ను వీలైనంత మేరకు నిటారుగా ఉంచేలా చూసుకోవాలి లేదా అది మీకు మరీ ఇబ్బందిగా ఉంటే కేవలం కొద్దిగా మాత్రమే వెనక్కు వాలేలా సీట్ వంచాలి. ఆ సీట్ ఒంపు ఎంత అవసరం అంటే... ఆ ఒంపు మీ నడుము మీదగానీ మీ మోకాళ్ల మీద గానీ ఒత్తిడి పడనివ్వని విధంగా సౌకర్యంగా ఉండాలి మీ నడుము దగ్గర ఉండే ఒంపు (లంబార్) భాగంలో ఒక కుషన్ ఉంచుకోవాలి. ఆ లంబార్ సపోర్ట్ వల్ల నడుమునొప్పి చాలావరకు తగ్గుతుంది ∙మెడ మీద ఒత్తిడి పడని విధంగా మీ హెడ్రెస్ట్ ఉండాలి.సీట్లో చాలాసేపు ఒకే భంగిమలో కూర్చొని ఉండకూడదు. అప్పుడప్పుడూ మీ పొజిషన్ కాస్త మారుస్తూ ఉండాలి ∙అదేపనిగా డ్రైవ్ చేయకుండా మధ్య మధ్య కాస్త బ్రేక్ తీసుకుంటూ ఉండాలి ∙ఇక డ్రైవ్ చేస్తున్నప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవడమన్నది అన్ని విధాలా మేలు చేస్తుందని గుర్తుంచుకోవాలి. మోటార్ సైకిల్ విషయంలో... ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు బైక్‌లు నడిపే అమ్మాయిల సంఖ్య చాలా ఎక్కువ. సాధారణంగా బైక్‌ల తయారీదారులు హ్యాండిల్‌బార్స్, ఫుట్‌రెస్ట్ వంటి అంశాల్లో కొన్ని ప్రమాణాలను పాటిస్తుంటారు. మీ బైక్ ఆ ప్రమాణాలకు అనుగుణంగా తయారైనదైతే మంచిదే. వాటిని అనుసరించడం వల్ల కొన్ని అవయవ సమస్యలుగానీ నొప్పులుగానీ రావు. ఒకవేళ మీ బైక్‌లోని వివిధ అంశాలు సరైన ప్రమాణాలు లేక΄ోతే వాటివల్లనే మీకు నడుము నొప్పి వస్తోందని భావించాలి. మీరు మీ బైక్ విషయంలో ఈ కింద పేర్కొన్న అంశాల విషయంలో జాగ్రత్తలు పాటించండి. బైక్‌ల హ్యాండిల్స్ సాధారణంగా తగినంత విశాలంగా, రెండు చేతులతో సౌకర్యంగా పట్టుకోవడానికి వీలైనంత నిడివితో ఉండాలి. పొట్టిగా ఉండే షార్ట్‌హ్యాండిల్స్ వల్ల ఒంటిపై భారం పడి శరీరభాగాల్లో ముఖ్యంగా నడుమునొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ మనం కాళ్లు పెట్టుకునే ఫుట్‌రెస్ట్ మన శరీరానికి మరీ దూరంగా ఉండకూడదు. దీనివల్ల కాళ్లు సాగినట్లుగా అయి΄ోయి నడుముపై భారం ఎక్కువగా పడుతుంది. దాంతో నడుమునొప్పి రావచ్చు బైక్‌పై కూర్చొనే సమయంలో వీపు భాగమంతా నిటారుగా ఉండి, మన వెన్ను ఒంగకుండా ఉండాలి. సాధారణ బైక్‌ల నిర్మాణం ఇలాగే ఉంటుంది. కానీ కొన్ని స్పోర్ట్స్ బైక్‌లలో సీట్లు ఏటవాలుగా ఉండి, మనం కూర్చొనే భంగిమ ముందుకు వాలినట్టుగా ఉండేలా అమరి ఉంటాయి. దాంతో బాగా ముందుకు వాలిపోతునట్లుగా కూర్చోవాల్సి వస్తుంది. ఇలా రూపొందించిన ఫ్యాషన్ బైక్స్ వల్ల మన వెన్ను నిటారుగా నిలపలేకపోవడంతో వెన్ను నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ బైక్‌లపై వెళ్లేవారు వీపుపై ఉండే బ్యాగ్స్ (బ్యాక్‌ప్యాక్స్ / ల్యాప్‌టప్ బ్యాగ్స్) పెట్టుకొని వెళ్తుండటం సాధారణం. ఈ భారం నడుంపైనా భారం పడటం వల్ల కూడా నొప్పి రావచ్చు. అందువల్ల ఆ బ్యాగ్ భారం వీపుపై కాకుండా సీట్‌పై పడేలా చూసుకోవాలి. మీ బైక్‌లో పైన పేర్కొన్న భాగాల అమరిక, మీరు కూర్చొనే భంగిమ ఎలా ఉందో పరీక్షించుకొని, లోపాలు ఉన్నట్లయితే సరిచేసుకోవాలి. దాంతో నొప్పి దూరం కావచ్చు. అప్పటికీ నడుం నొప్పి వస్తుంటే డాక్టర్‌ను సంప్రదించాలి. డాక్టర్ సుధీర్ రెడ్డి, సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ (చదవండి: Shubhanshu Shukla: స్పేస్‌లో వ్యోమగాములు ఫిట్నెస్ను ఎలా నిర్వహిస్తారంటే..! ) -
మధుమేహంతో బాధపడేవాళ్లు పాదాల సంరక్షణ కోసం..!
డయాబెటిస్ పేషెంట్లలో కాలికి దెబ్బతగిలి, అది సెప్టిక్ కావడంతో కాలు తొలగించాల్సి వచ్చిందని వింటుండటం మామూలే. ఇలా కాలు సెప్టిక్ కావడాన్ని వైద్య పరిభాషలో గ్యాంగ్రీన్ అంటారు. డయాబెటిస్ ఉన్నవారికి కాళ్లకూ, వేళ్లకూ చివర్లలో ఉన్న నరాలు మొద్దుబారుతుండటం సాధారణం. దాంతో వాళ్లకు చిన్న చిన్న దెబ్బలు తగిలినా నొప్పి తెలియదు. కొందరిలోనైతే చిన్న చిన్న గులకరాళ్లు గుచ్చుకున్నా కాలికి గ్యాంగ్రీన్ వచ్చే వరకు విషయం తెలియదు. తీరా పరిస్థితి విషమించాక వారు తమ ఫిజీషియన్ దగ్గరకు రావడం, వాళ్లు వ్యాస్క్యులార్ సర్జన్ దగ్గరికి పంపితే కాలు తొలగించాల్సిన పరిస్థితి అని చెప్పడం చాలామందికి ఎదురయ్యే పరిస్థితే! ఈ పరిస్థితి నివారించడానికి ఏం చేయాలో తెలిపే కథనమిది.డయాబెటిస్తో బాధపడే వ్యక్తుల్లో కాలికి ఏదైనా దెబ్బతగిలి అది గ్యాంగ్రీన్గా మారిన దాదాపు 80% మందిలో కాలు తొలగించాల్సిన పరిస్థితి తలెత్తవచ్చు. ఇలా కాలు తొలగించడాన్ని వైద్యపరిభాషలో ‘నాన్ట్రామాటిక్ లోయర్ లింబ్ యాంపుటేషన్’గా చెబుతారు. పల్లె వాసుల్లో కాలు తొలగింపు ముప్పు... నిజానికి పట్టణవాసులతో పోలిస్తే డయాబెటిస్ కారణంగా కాలు తొలగింపు ముప్పు పల్లెప్రజల్లోనే ఎక్కువగా ఉంటుంది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. అవి... పల్లెల్లోని రక్కిస పొదలతో నిండి ఉండే డొంకదారుల్లో నడుస్తున్నప్పుడు కాలికి ముళ్లు గుచ్చుకోవడం లేదా ముళ్ల కంచెకు కాలు తగిలి చీరుకుపోవడంతో గాయాలు కావడం పట్టణ ప్రజలతో పోలిస్తే చెప్పుల్లేకుండా ఖాళీ పాదాలతో నడిచేవారు పల్లెల్లోనే ఎక్కువగా ఉండటం. దాంతో పాదం కింద చిన్న చిన్న గులకరాళ్లు గుచ్చుకోవడం లేదా కాలివేళ్లకు తాకుడు రాయి తలగడం ఎక్కువ పశువులను మేతకు విడుస్తున్నప్పుడు అవి పొరబాటున కాలు తొక్కడంతో గాయం కావడం వ్యవసాయ పనుల్లో కొడవలి వంటి పదునైన పనిముట్లు తగిలి గాయం కావడం ∙డొంకదారులను పశువులు నడవడానికి వీలుగా కంప కొడుతున్నప్పుడు... అది గీరుకుపోవడం... పత్తి పంట కోశాక... ఎండిన మొదళ్లపైన పొరబాటున కాలు పడ్డప్పుడు... అవి పాదాల్లో గుచ్చుకుపోవడం.ఇప్పుడు పట్టణ / నగరా ప్రాంతాల్లోనూ... ఇలాంటి ప్రమాదాలకు పల్లెల్లో అవకాశాలు ఎక్కువ. అయితే ఇటీవల పట్టణ ప్రాంతాల్లోనూ ఈ తరహా కేసులు పెరుగుతున్నాయి. డిజైనర్ వేర్ పాదరక్షలు ధరించేవారిలో, ఎప్పుడూ కదలకుండా పనిచేస్తూ ఉండే ఐటీ రంగాలకు చెందిన ఉద్యోగుల్లో, ఏదైనా ప్రత్యేక సందర్భాల్లో ఆరుబయట నిర్వహించే ప్రత్యేక పూజలూ / ప్రార్థనల్లో భాగంగా చెప్పులు లేకుండా నడవటం వంటి సందర్భాల్లో పాదాలకు గాయాలు కావడంతో ఇప్పుడు పట్టణ, నగరవాసుల్లో కూడా ఈ తరహా గాయాలు అవుతున్నాయి. అవి పల్లెవాసులకైనా లేదా పట్టణ ప్రాంతాలవారికైనా వాళ్ల కాళ్లకు అయ్యే గాయాలు ‘ఫుట్ అల్సర్’ అని పిలిచే పుండ్లుగా మారి కాలు దాదాపుగా గ్యాంగ్రీన్గా మారినప్పుడు కొందరిలో కాలిని తొలగించాల్సి వచ్చే ‘యాంపుటేషన్’ తప్పకపోవచ్చు. కాలు తొలగించాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందంటే..? సాధారణంగా కాలికి గానీ ఇతరత్రా ఏ అవయవానికైనా గాయమైతే వెంటనే నొప్పి వస్తుంది. గాయమైనప్పుడు ఆ భాగం పూర్తిగా కోలుకోవడానికి వీలుగా మనలోని రక్షణ వ్యవస్థ ఆ భాగంలో ‘నొప్పి’ని కలిగిస్తుంది. దాంతో మనం కాలిని కదిలించకుండా దానికి తగినంత విశ్రాంతినిస్తాం. అయితే డయాబెటిస్తో బాధపడే వ్యక్తుల్లో నొప్పిని తెలిపే ‘నరాలు’ మొద్దుబారి ఉండటంతో నొప్పి పెద్దగా తెలియదు. దాంతో అదే కాలిని ఉపయోగిస్తున్నప్పుడు తగిలిన చోటే మళ్లీ మళ్లీ దెబ్బ తగులుతూ గాయం మాటిమాటికీ రేగుతుంది. అప్పుడా ఇన్ఫెక్షన్ దెబ్బతగిలిన చోటి నుంచి పైపైకి ΄ాకవచ్చు. ఇలా జరగడాన్ని వాడుక భాషలో మనం సెప్టిక్ కావడం అంటుంటాం.గాయం ఒక ముప్పు అయితే గ్యాంగ్రీన్ మరో ముప్పు... మన దేహంలోని ప్రతి అవయవానికీ, అందులోని ప్రతి కణానికీ నిత్యం రక్తసరఫరా జరుగుతూ ఉంటుంది. అలాగే దేహంలోని ప్రతి భాగానికీ స్పర్శ తెలిపే నరాలూ ఆవరించుకుని ఉంటాయి. వాటి వల్ల మనకు స్పర్శజ్ఞానంతో ΄ాటు దెబ్బతగిలినప్పుడు నొప్పి, బాధ తెలుస్తుంటాయి. కాలక్రమంలో డయాబెటిస్ వ్యాధి నరాల చివరలను మొద్దుబారేలా చేయడం వల్ల దేహంలోని కొన్ని భాగాలు... మరీ ముఖ్యంగా కాలివేలి చివర్లలో స్పర్శజ్ఞానం అంతగా తెలియదు. పైగా దేహంలోని చివరి భాగాలకు రక్తం సరఫరా చేసే అతి సన్నటి రక్తనాళాల్లో (క్యాపిల్లరీస్) అడ్డంకులు ఏర్పడటం వల్ల అక్కడికి అందాల్సిన షకాలు, ఆక్సిజన్ అందక΄ోవడంతో ఆ భాగం కుళ్లి΄ోవడం మొదలవుతుంది. ఇలా జరగడాన్ని ‘గ్యాంగ్రీన్’గా చెబుతారు. స్పర్శజ్ఞానం, నొప్పి తెలియక΄ోవడంతో గ్యాంగ్రీన్ మొదలైనప్పటికీ ఆ విషయమే డయాబెటిస్ బాధితులకు వెంటనే తెలియదు. అలా ఇన్ఫెక్షన్ పైపైకి పాకుతూ పోతుంటే మొత్తం ప్రాణానికే ప్రాణాపాయం జరిగే అవకాశముంటుంది కాబట్టి గ్యాంగ్రీన్ ఎంతవరకు పాకిందో అక్కడి వరకు ఆ కుళ్లిన భాగాన్ని తొలగించాలంటూ (యాంపూట్ చేయాలంటూ) డాక్టర్లు చె΄్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.ప్రమాదం కేవలం కాళ్లకేనా..? ఇలా యాంపూటేషన్ చేయాల్సిన పరిస్థితి కేవలం కాళ్లకు మాత్రమే కాకుండా చేతులకూ వచ్చే ప్రమాదముంది అయితే కాళ్లతో ΄ోలిస్తే చేతులూ, చేతి వేళ్లతో మనం ప్రతినిత్యం పనిచేస్తుంటాం కాబట్టి... చేతులకు అలాంటి కండిషన్ వస్తే కాళ్లతో ΄ోలిస్తే త్వరగా తెలిసి΄ోతుంది. అందుకే చేతులతో ΄ోలిస్తే కాళ్లు, కాలివేళ్లకే గ్యాంగ్రీన్ ముప్పు మరింత ఎక్కువ.మరో జాగ్రత్త ‘యాంకిల్ బ్రేకిల్ ఇండెక్స్’ పరీక్ష...ఏడాదికోసారి లేదా డాక్టర్లు చెప్పిన విధంగా పాదాల విషయంలో వైద్యులను కలిసి పాదాలకు పల్స్ చెక్ చేయించుకుంటూ ఉండాలి. చేతుల మణికట్టు దగ్గర చూసినట్టే... డాక్టర్లు కాలి దగ్గర కూడా పల్స్ చెక్ చేసి చూస్తారు. అక్కడ నాడీస్పందనలు ఎలా ఉన్నాయో పరిశీలిస్తారు. అలాగే యాంకిల్ బ్రేకిల్ ఇండెక్స్ అని మరో పరీక్ష ఉంటుంది. ఇందులో బీపీ పరిశీలించేటప్పుడు చేతికి చుట్టినట్టే కాలి దగ్గర కూడా బీపీ పరిశీలించేప్పుడు చుట్టే పట్టాచుట్టి ఈ పరీక్ష చేసి, కాలిలో బీపీ కొలత చూస్తారు. కొలత విలువ ‘ఒకటి (1)’ ఉంటే అంతగా ఆందోళన పడాల్సిందేమీ ఉండదు. కానీ ఈ కొలత 0.5 కంటే తగ్గుతూ ΄ోతూ ఉంటే (అంటే ఆ విలువలో సగానికంటే తక్కువగా ఉంటే... చేతితో ΄ోలిస్తే అందులో సగం కంటే తక్కువగా ఉంటే) కాలిలో రక్త ప్రసరణ తగ్గుతూ ఉందని అర్థం. ఇలాంటప్పుడు ‘సూపర్వైజ్డ్ ఎక్సర్సైజ్ థెరపీ’లాంటి వ్యాయామాల చికిత్స తప్పక అవసరమని గుర్తించాలి. చివరగా... డయాబెటిక్ ఫుట్ సమస్యలో సాదానికి పుండ్లు పడ్డప్పుడు అది కేవలం వాస్క్యులార్ సర్జన్ మాత్రమే కాకుండా ఒక సమగ్రమైన కార్యాచరణతో పలువురు నిపుణులు ఓ బృందంగా ఏర్పడి చికిత్స అందించాల్సి అవసరం ఉంటుంది. ఇందులో వాస్క్యులార్ సర్జన్లు, ΄ప్లాస్టిక్ సర్జన్లు, డయాబెటాలజిస్టులు, ఫుట్ యాంకిల్ సర్జన్లు, పాడియాట్రిక్ నిపుణులు, ఇంటర్నల్ మెడిసిన్ చికిత్సకులు, ఫిజియోథెరపిస్టులు ఇలా టీమ్‌వర్క్‌తో డయాబెటిక్ లింబ్ సాల్వేజ్ టీమ్‌గా ఏర్పడి పాదాన్ని రక్షించడానికి ప్రయత్నిస్తారు. ఆ తర్వాత ఆహారంలో చక్కెర మోతాదులను తగ్గించే విధంగా న్యూట్రిషనిస్టులు, రక్తంలో చక్కెరను అదుపు చేయడానికీ, రక్తంలో కొవ్వులు తగ్గించే మందులిచ్చే జనరల్ ఫిజీషియన్లు... ఇలా డాక్టర్ల బృందమంతా సమగ్రంగా పనిచేయాల్సి ఉంటుంది.ఎవరికి వారు కాళ్లను స్వయంగా పరీక్షించుకుంటూ ఉండాలి. ఇందుకోసం పాదాల కింద అద్దంపెట్టుకుని, పాదాల అడుగుభాగం ఎలా ఉందో చూసుకుంటూ ఉండాలి. అలాగే కాలి పైభాగాన్ని కూడా శ్రద్ధగా పరిశీంచుకోవాలి. కాలి వేళ్ల మధ్య భాగాలనూ జాగ్రత్తగా చూస్తూ... అక్కడ చిన్న పోక్కుల్లాంటివి ఏవైనా ఉన్నాయేమో చూడాలి. అలాంటివి ఉంటే వెంటనే డాక్టర్‌కు తెల΄ాలి. లేదంటే అవి పుండ్లుగా మారే ప్రమాదం ఉండవచ్చు.కాలిగోళ్లను ప్రతివారమూ కట్ చేసుకోవాలి. ఈ సమయంలో గోళ్లను మరీ లోపలికి కట్ చేసుకోకూడదు. అలాంటప్పుడు ఒక్కోసారి గోరు మూలల్లో రక్తం వచ్చేంతగా గోరు కట్ కావచ్చు. ఇది జరిగినప్పుడు కొందరిలో గోరు లోపలి వైపునకు పెరగవచ్చు. డయాబెటిస్ బాధితుల్లో ఇది చాలా ప్రమాదకరం.వేడి వస్తువులనుంచి కాళ్లను దూరంగా ఉంచుకోవాలి.పాదాలను మృదువుగా ఉంచుకోవాలి. ఇందుకోసం కాళ్లు కడుక్కున్న తర్వాత పొడిగా తుడుచుకొని, ఆ తర్వాత వాజిలైన్ రుద్దుకొని, మళ్లీ ఆ తర్వాత పొడిగా మారేంతవరకు తుడుచుకోవాలి.పాదాలను ప్రతినిత్యం పొడిగా ఉంచుకోవాలి. కాళ్లు కడుక్కున్న వెంటనే అవి పొడిబారే వరకు తుడుచుకోవాలి. కాలి వేళ్ల మధ్య పొడిగా ఉండటం కోసం పౌడర్ రాసుకోవాలి.కాలికి చెప్పులు, బూట్లు లేకుండా నడవకూడదు. అయితే ఈ చెప్పులు, బూట్లు కాలికి సౌకర్యంగా ఉండాలి. ఏమాత్రం అసౌకర్యం ఉన్నా అలాంటివి తొడగడం సరికాదు.కాళ్ల మీద పులిపిరి కాయల్లాంటివి ఏవైనా ఏర్పడితే డాక్టర్‌ను సంప్రదించి, వారి పర్యవేక్షణలోనే వాటిని తొలగించుకోవాలి. లేదంటే అవే భవిష్యత్తులో పుండ్లుగా మారే అవకాశం లేకపోలేదు.ఇంట్లో కూడా పాదరక్షలు లేకుండా నడవకూడదు. ప్రత్యేకంగా తడి, తేమలో పనిచేసే మహిళలు (పురుషులు కూడా) స్లిప్పర్స్ వంటివి తొడుక్కునే పనిచేసుకోవాలి.మానని పుండ్లకు చికిత్స ఇలా... కాలిపైన పుండుగానీ లేదా చాలాకాలం వరకు మానని గాయం గానీ ఉంటే వెంటనే డాక్టర్‌కు చూపించుకోవాలి. ఇలా ఎంత త్వరగా డాక్టర్‌కు చూపిస్తే కాలిని కాపాడుకునే అవకాశాలు అంత ఎక్కువని గుర్తుంచుకోవాలి. యాంకిల్ బ్రేకిల్ ఇండెక్స్ పరీక్షలో కాలి నాడీ స్పందనల కొలత 0.5 కు లేదా అంతకంటే తగ్గుతున్నప్పుడు ‘సూపర్వైజ్డ్ ఎక్సర్సైజ్ థెరపీ’ కింది రోజుకు అరగంటకు తగ్గకుండా, అది కూడా వారంలో ఐదు రోజులకు తగ్గకుండా బ్రిస్క్‌వాకింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. దీనివల్ల యాంజియోగ్రామ్‌కు మించిన ఫలితం ఉంటుందని చాలా పరిశోధనల్లో నిర్ధారణ అయ్యింది ఇలా యాంకిల్ బ్రేకిల్ ఇండెక్స్ పరీక్షలో కొలత 0.5 కంటే తగ్గుతున్నవారిలో ప్రోటీన్‌తో కూడిన ఆహారాలూ, ద్రవాహారాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. దీనివల్ల రక్తప్రసరణ వేగం పెరగడం వల్ల కాలికి జరగాల్సిన నష్టం నివారితమవుతుంది కాలిలో రక్తప్రసరణ వేగాలు తగ్గుతున్నాయని గుర్తించిన తొలి దశల్లో రక్తాన్ని పలచబార్చేవీ, కాలిలో రక్తప్రసరణవేగాన్ని మెరుగుపరిచేవి కొన్ని రకాల మందులతో మున్ముందు రాబోయే కాలి తొలగింపు ముప్పును నివారించవచ్చు అత్యాధునిక టీసీపీఓటూ (క్యూటేనియస్ ఆక్సిజన్ మెజర్మెంట్) పరీక్షతో అతి సన్నటి రక్తనాళాల (క్యాపిల్లరీస్) ద్వారా కాలి కొనగోరు చివరల వరకూ ఆక్సిజన్ అందుతున్న తీరును పరిశీలించి ఒకవేళ అందక΄ోతే ఇవ్వాల్సిన చికిత్సను డాక్టర్లు నిర్ణయిస్తారు. ఇలాంటి కొన్ని సందర్భాల్లో రక్తం అందడం లేదు / పుండు పడి మానడం లేదని తెలిస్తే మొదట ‘యాంజియోగ్రామ్’ ప్రక్రియ ద్వారా రక్తప్రసరణను మెరుగుపరచవచ్చు. అప్పటికీ రక్తప్రసరణ మెరుగుపడటక΄ోతే ‘బైపాస్’ వంటి కొన్ని ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి. అదీ కుదరకపోతే ‘వీనస్ ఆర్టీరియలైజేషన్’ ప్రక్రియ అనే మరో ప్రత్యామ్నాయం అందుబాటులో ఉంది. అంటే ఇందులో సిరలూ, ధమనులను కలిపి... కొనగోరు చివరి వరకూ రక్తప్రసరణ సరిగా జరిగేలా చూస్తారు ∙గాయానికి చికిత్సను ఎంత త్వరగా అందిస్తే అది అంత త్వరగా మానుతుంది. పుండు మానకుండా మరింత ఆలస్యమయ్యేకొద్దీ అది గ్యాంగ్రీన్గా మారే అవకాశాలెక్కువ. ఇలా డాక్టరుకు గాయాన్ని చూపించడం ఆలస్యమైనవాళ్లలో డాక్టర్లు ‘స్టెమ్ సెల్ థెరపీ’ వంటి అత్యాధునిక ప్రక్రియలతో కాలిని కాపాడే అవకాశం ఉంది.డాక్టర్ కార్తీక్ మిక్కినేని, సీనియర్ వాస్క్యులార్ సర్జన్ (చదవండి: ప్రెగ్నెన్సీ టైంలో ఆస్పిరన్ మందులు వాడొచ్చా..? బిడ్డకు సురక్షితమేనా?) -
ప్రెగ్నెన్సీ టైంలో ఆస్పిరిన్ మందులు వాడొచ్చా..? బిడ్డకు సురక్షితమేనా?
నేను ఐదు నెలల గర్భవతిని, వయసు ముప్పైఏడు. డాక్టర్ రక్తాన్ని పలుచగా చేసే మందులు ఆస్పిరిన్ టాబ్లెట్లు వాడమన్నారు. ఇవి బిడ్డకు సురక్షితమేనా? అలాగే ఈ వయస్సులో గర్భధారణలో సమస్యలు రాకుండా ఉండేందుకు నేను ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?– సుజాత, విజయవాడమీ ఆందోళన సహజమే. ముప్పై ఐదు ఏళ్లకు పైబడిన గర్భిణులను మేము అధిక ప్రమాద గర్భిణులుగా పరిగణిస్తాం. ఎందుకంటే వయస్సు పెరిగేకొద్దీ తల్లి, శిశువుకు కొన్ని ప్రత్యేక సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ. మీరు అడిగిన మందుల విషయం మొదట చెబుతాను. తక్కువ మోతాదులో ఇచ్చే ఆస్పిరిన్ టాబ్లెట్ చాలా సురక్షితం. ఇది రక్తం గడ్డకట్టకుండా కాపాడుతుంది. అలాగే గర్భధారణలో వచ్చే కొన్ని సమస్యలను తగ్గిస్తుంది. డాక్టర్ సూచించిన విధంగా తీసుకుంటే ఇది తల్లి, బిడ్డ ఇద్దరికీ మేలు చేస్తుంది. ఈ వయస్సులో గర్భధారణలో కొన్ని సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. మొదటి మూడు నెలల్లో గర్భస్రావం వచ్చే అవకాశం పెరుగుతుంది. శిశువులో జన్యు సంబంధిత లోపాలు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. గర్భధారణ సమయంలో రక్తపోటు, షుగర్ వంటి సమస్యలు తల్లికి రావచ్చు. కొన్నిసార్లు సిజేరియన్ డెలివరీ అవసరం అవుతుంది. తల్లిలో ఉన్న ఆరోగ్య సమస్యల వలన శిశువు పెరుగుదలలో లోపం రావచ్చు, ముందుగా పుట్టే అవకాశం కూడా ఉంటుంది. అలా పుడితే ప్రత్యేక శిశు సంరక్షణ అవసరం అవుతుంది. ఈ సమస్యలను తగ్గించుకోవడం మీ చేతిలోనే ఉంది. క్రమం తప్పకుండా గర్భధారణ పరీక్షలు చేయించుకోవాలి. డాక్టర్ చెప్పినట్టుగా ఫాలో అప్ తప్పనిసరిగా చేయాలి. అల్ట్రాసౌండ్ స్కాన్లు చేయించుకోవడం ద్వారా శిశువు ఆరోగ్యాన్ని పర్యవేక్షించవచ్చు. అవసరమైతే జన్యు పరీక్షలు చేయించుకోవాలి. ముఖ్యంగా డాక్టర్ సూచించే ఔషధాలను సమయానికి తీసుకోవాలి. ఈ వయస్సులో గర్భధారణ కొంత రిస్క్ ఉన్నప్పటికీ, భయపడాల్సిన పనిలేదు.నా వయసు ఇరవైనాలుగు. ఇది నా రెండవ ప్రెగ్నెన్సీ, ప్రస్తుతం నాలుగో నెలలో ఉన్నాను. నా మొదటి కాన్పు, ముప్పై వారాల సమయంలో ప్రీటర్మ్ డెలివరీ జరిగింది. ఈ గర్భధారణలో మళ్లీ అలాంటి సమస్య రాకుండా సర్జరీ చేయాలని డాక్టర్ సూచించారు. గర్భధారణ సమయంలో శస్త్రచికిత్స చేయించుకోవాలంటే నాకు భయంగా ఉంది. ఇది నిజంగా అవసరమా? ఈసారి కూడా నాకు ముందుగా పుట్టిన బిడ్డ అవుతాడా? ఈ ప్రక్రియ తర్వాత నేను తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి?– వనజ, నర్సాపురంమీ ప్రశ్న చాలా ముఖ్యమైనది. గతంలో ప్రీటర్మ్ డెలివరీ జరిగిన మహిళల్లో, మళ్లీ అదే పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే మేము ముందుగానే జాగ్రత్తలు సూచిస్తాం. గర్భాశయానికి దిగువ భాగాన్ని ‘సర్విక్స్’ అంటారు. సాధారణంగా ఇది పొడవుగా, బిగుతుగా మూసి ఉండాలి. ప్రసవ సమయం దగ్గర పడే సరికి మాత్రమే ఇది చిన్నదవుతూ తెరుచుకోవాలి. కాని, కొంతమంది మహిళల్లో, ముఖ్యంగా మీరు చెప్పినట్లుగా నెలలు నిండక ముందే బిడ్డ పుట్టిన అనుభవం ఉన్నవారిలో, ఇది గర్భధారణ పూర్తయ్యే లోపే చిన్నదై తెరుచుకోవడం ప్రారంభమవుతుంది. దీనిని సర్వికల్ ఇన్సఫిషియెన్సీ అంటారు. ఈ పరిస్థితిని సకాలంలో గుర్తించకపోతే, మళ్లీ ప్రీటర్మ్ డెలివరీ జరగవచ్చు. ఈ పరిస్థితిని తెలుసుకోవడానికి సర్వికల్ లెంగ్త్ స్కాన్ అనే ఒక సాధారణ వజైనల్ అల్ట్రాసౌండ్ పరీక్ష చేస్తాం. ఇందులో సర్విక్స్ పొడవు, బిగుతు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు. అది తక్కువగా ఉంటే లేదా బలహీనంగా కనిపిస్తే, రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి ప్రొజెస్టెరోన్ మందులు ఇవ్వడం, రెండోది సర్విక్స్‌ను బిగుతుగా కట్టే చిన్న శస్త్రచికిత్స చేయడం. ఇందులో సర్విక్స్‌ను ప్రత్యేకమైన దారంతో కట్టి, గర్భధారణ పూర్తయ్యేంత వరకు బిగుతుగా ఉంచుతాం. ఇది సురక్షితమైన పద్ధతి, అనేకమందికి మంచి ఫలితాలను ఇచ్చింది. ఈ చికిత్స చేసిన తర్వాత మీరు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. వీలైనంత వరకు బెడ్‌రెస్ట్ తీసుకోవాలి, భారమైన పనులు చేయకూడదు, బరువులు అస్సలు ఎత్తకూడదు. లైంగిక చర్యలు నివారించాలి. డాక్టర్ చెప్పినట్లుగా రెగ్యులర్‌గా ఫాలోఅప్ చేయాలి. తరచు స్కాన్లు చేయించుకోవాలి, బిడ్డ ఆరోగ్యంగా ఎదుగుతున్నదీ లేనిదీ చూడాలి. ఈ విధంగా ముందుగానే చర్యలు తీసుకుంటే, గర్భధారణను సురక్షితంగా కొనసాగించే అవకాశం చాలా పెరుగుతుంది. నిజానికి ఈ శస్త్ర చికిత్స లేదా ప్రొజెస్టెరోన్ వాడకం తర్వాత చాలామంది మహిళలు ముప్పై ఏడు వారాలు లేదా అంతకన్నా ఎక్కువ వరకు గర్భధారణ కొనసాగించి, ఆరోగ్యవంతమైన శిశువుకు జన్మనిస్తున్నారు. డా. కడియాల రమ్య, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: భావోద్వేగాలను అదుపు చేసుకోవాలంటే..!) -
భావోద్వేగాలను అదుపు చేసుకోవాలంటే..!
మెదడుకు చేరాల్సిన ఆక్సిజన్ స్థాయిల్లో మార్పులు, రక్తప్రసరణల అడ్డంకులు రకరకాల సమస్యలకు కారణం అవుతుంటాయి. మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపే ఈ సమస్యను యోగాసనాల ద్వారా బ్యాలెన్స్ చేసుకునే ఎన్నో పద్ధతులున్నాయి. వాటిలో ప్రసరిత హస్త ఉత్థానాసన ఒకటి. దీన్నే వైడ్ స్టాన్స్ ఫార్వర్డ్ బెండ్ అని కూడా అంటారు.ప్రసరిత హస్త ఉత్థానాసన...సంస్కృతంలో ‘హస్త’ అంటే చేతులు, ‘ఉత్’ అంటే తీవ్రమైన, ‘తాన్’ అంటే సాగదీయడం, ‘ప్రసరిత’ అంటే విస్తరించడం. చేతులు, పాదాలను స్ట్రెచ్ చేయడం ఈ ఆసనంలో చూస్తాం. ఈ ఆసనం ఆక్సిజన్ ప్రవాహాన్ని మెరుగుపరుస్తుందని, గుండె ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుందని హైలైట్ చేసింది. మీరు దీన్ని ఎలా చేయవచ్చో ఇక్కడ ఉంది.ఇలా చేయాలి... సమస్థితిలో నిలబడి, దీర్ఘ శ్వాస తీసుకొని, వదలాలి చేతులను తలపైకి లేపి, వెన్నును ముందుకు తలను వెనక్కి వంచాలి. ఈ సమయంలో చేతులు కూడా వెనక్కి వంచాలి అదే భంగిమ నుంచి మెల్లగా తల భూమికి ఆనేలా ముందుకు వంగాలి. చేతులను నేలకు ఆనించడం, వీలైతే దాలను పట్టుకోవడం.. చేయవచ్చు ఈ భంగిమలు ఐదు దీర్ఘ శ్వాసలు తీసుకొని, వదలాలి. తిరిగి యధా స్థితికి చేరుకోవాలి దీంతో ఉచ్ఛ్వాస నిశ్వాసలు మెరుగు అవుతాయి. సూర్య నమస్కారాల్లో రెండవ భంగిమతో మొదలుపెట్టే ఈ ఆసనం వల్ల ఆక్సిజన్ లెవల్స్, రక్త ప్రసరణలో మెరుగైన ఫలితాలు పొందవచ్చు. దీని వల్ల మానసిక ఒత్తిడి, ఆందోళన వంటివి బ్యాలెన్స్డ్గా ఉంటాయి. (చదవండి: ఎకో ఫ్రెండ్లీ లైఫ్‌కి నిర్వచనం ఈ దంపతులు..!) -
'నాన్ డైరియల్ డీహైడ్రేషన్'..! సాధారణ నీటితో భర్తీ చేయలేం..
అలసట, మానసిక మందకొడితనం (బ్రెయిన్ ఫాగ్), తలనొప్పి, లోబీపీ వంటి లక్షణాలతో క్లినిక్స్‌ను సందర్శిస్తున్న వారి సంఖ్య నగరంలో పెరుగుతోంది. గతంలో ఈ తరహా సమస్యలకు వేర్వేరు కారణాలు ఉండేవి.. కానీ ఇప్పుడు వీటన్నింటికీ శరీరంలో ద్రవాల కొరతే ప్రధానంగా కనిపిస్తోందని వైద్యులు అంటున్నారు. వాంతులు, విరేచనాలు లేకపోయినా శరీరం తీవ్ర ద్రవాల కొరతను ఎదుర్కొంటోంది. అందుకే ప్రస్తుతం వైద్యులు దీనిని ‘నాన్ డైరియల్ డీహైడ్రేషన్’ అని పేర్కొంటున్నారు. వైద్యులు చెబుతున్న ప్రకారం.. డీహైడ్రేషన్ అనేది ఇప్పుడు సర్వకాల సర్వావస్థలలోనూ కలిగే సమస్యగా మారింది. గతంలో వేసవి కాలంలో మాత్రమే సంభవించేదని చాలా మంది భావించేవారు. కానీ తాజాగా వైద్యుల క్లినికల్ అనుభవాల్లో కాలంతో పాటు లక్షణాలను కూడా ఇది మార్చుకుంటోందనే కొత్త మార్పు గుర్తిస్తున్నారు. ఇది హఠాత్తుగా సంభవించేది కాదని గుర్తించలేని విధంగా గుట్టుగా శరీరంలో ఉండి నిదానంగా పెరుగుతోంది. దీనికి కొన్ని కారణాల్లో.. నగరంలో ఎక్కువగా వేడి – తేమ వాతావరణం ఉంటోంది. ఇలా వాతావరణంలో తేమ అధికంగా ఉన్నప్పుడు చెమట ఆవిరి కాకుండా చర్మంపై ఆగిపోతుంది. దీని వల్ల ద్రవనష్టం జరుగుతూనే ఉంటుంది. కానీ దాహం వేయడానికి బదులు అలసట, మత్తు, శరీరం బరువు అనిపించడం ఉంటుంది. తరచూ మూత్రానికి వెళ్లడం, మూత్రనాళం దగ్గర నొప్పి వంటి సమస్యల వల్ల చాలామంది నీరు తాగడాన్ని తగ్గిస్తారు. దీని ఫలితంగా మూత్రనాళ ఇన్ఫెక్షన్ సమస్య వస్తుంది. నగరంలో దీర్ఘకాలిక ప్రయాణాలు చేసేవారు ఎక్కువయ్యారు. విమాన ప్రయాణాల్లో నీరు తీసుకోవడం బాగా తక్కువ. పైగా పొడి గాలి, సాల్టెడ్ స్నాక్స్, వేడి పానీయాల సేవనం.. వల్ల కూడా ద్రవనష్టం జరుగుతుంది. పరిష్కారం ఏమిటి? హైడ్రేషన్ అంటే కేవలం నీటి పరిమాణం మాత్రమే కాదు, దాని ఖచ్చితత్వం కూడా. కాబట్టి నీటి పరిమాణం తగ్గింది అని నీరు తీసుకుంటే మాత్రమే సరిపోదు.. తగిన పోషకాలున్న ద్రవాహారం అవసరం. సోడియం, పొటాషియం, క్లోరైడ్ వంటి ముఖ్య ఎలక్ట్రోలైట్ సొల్యూషన్స్ కలిగిన తక్కువ గ్లూకోజ్. క్యాలరీ, డయాబెటిక్ సేఫ్ ఫార్ములాతో తయారైన రెడీ టు డ్రింక్స్ కూడా ఈ లోటును భర్తీ చేయగలవు. పనిలో ఉండగా అలసట వచ్చినా లేదా ప్రయాణంలోనూ సరిపడా నీటితో పాటు ఎలక్ట్రోలైట్స్, గ్లూకోజ్, ఎనర్జీ సమతుల్యంగా తీసుకోవడం శరీరానికి అవసరం. ఊపిరి పీల్చడం నుంచి మొదలై ఆహారం జీర్ణం కావడం వరకు ప్రతీదీ ద్రవ ప్రమేయంతోనే జరుగుతుంది. వీటితో పాటు చెమట వల్ల రోజుకు కనీసం 2.5 లీటర్ల ద్రవ నష్టం జరుగుతుంది. కాఫీ, టీ వంటివి అతిగా తీసుకోవడం, భోజనాలు స్కిప్ చేయడం, ఒత్తిడి ఇవన్నీ కలిపితే ఆ నష్టం మరింత భారీగా ఉంటుంది. ద్రవాహారంతో.. అసమతుల్యత సరిచేయాలి.. డీహైడ్రేషన్ డయాబెటిస్, బీపీ ఉన్నవారికి ఇది ఎక్కువ ప్రమాదకరం. ఎప్పుడూ వాంతులు, విరేచనాలతోనే వస్తుందని కాదు. ఇది రోజువారీగా నిశ్శబ్దంగా ఏర్పడి, ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. దీనికి పరిష్కారాన్ని కేవలం నీటితో సరిపెట్టకూడదు. శరీరం కోల్పోతున్న అసలు మూలకాలు ఏవో తెలుసుకుని భర్తీ చేయాలి. ఎలక్ట్రోలైట్స్ లేకపోతే మెదడు, కండరాలు సరిగా పనిచేయవు. శరీరం కోల్పోయే సోడియం, పొటాషియం, గ్లూకోజ్ వంటి మూలకాల్ని భర్తీ చేయకపోతే కణాల పనితీరు దెబ్బతింటుంది. – డా.మోసిన్ అస్లం, కన్సల్టెంట్ ఫిజీషియన్, ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ, హైదరాబాద్ (చదవండి: అబుదాబిలో గంగా హారతి..! ఏకంగా రూ. 961 కోట్లు..) -
నైట్ ఈటింగ్ సిండ్రోమ్..!
ఈశ్వర్ తిండి అలవాట్లు ఇటీవల చాలా విచిత్రంగా మారాయి. ఈమధ్య రాత్రి భోజనం కాగానే వెంటనే నిద్రపట్టడం లేదు. కాసేపాగాక ఏదైనా తిందామంటూ మాటిమాటికీ ఫ్రిజ్ తెరచి చూస్తుంటాడు. రాత్రిపూట ఆకలేయడం గుర్తుకొచ్చి ప్రతిరోజూ రాత్రి తినడం కోసం చిప్స్ అనీ, కారా అనీ... ఏదో ఒక రకమైన శ్నాక్స్ తెచ్చుకుంటూ ఉంటాడు. కొన్నిసార్లు ముందుగానే స్వీట్స్ కూడా తెచ్చిపెట్టుకుంటాడు. రాత్రి రెండు గంటలయినప్పటికీ ఆ టైమ్‌లోనైనా తింటే తప్ప నిద్రపట్టదు. ఇలా రాత్రి తినేయడంతో పొద్దున్న బ్రేక్‌ఫాస్ట్ టైమ్‌కు అంతగా ఆకలేయదు. ఈ అలవాటు వల్ల ఇటు ఆహారపు అలవాట్లూ, అటు నిద్రవేళలూ ఈ రెండూ అస్తవ్యస్తంగా మారాయి. ఎట్టకేలకు డాక్టర్‌ను సంప్రదిస్తే ఇది ఒకరకమైన రుగ్మత అనీ దీని పేరే ‘నైట్ ఈటింగ్ సిండ్రోమ్–(ఎన్ఈఎస్)’ అనీ తెలిసింది. ఈ అనారోగ్య సమస్యపై అవగాహన కోసమే ఈ కథనం...ఈ కేస్ స్టడీలో ఈశ్వర్ అంతగా పట్టించుకోలేదుగానీ... ఈ అలవాటు అదేపనిగా కొనసాగుతుండటంతో కొన్ని ఇబ్బందులు వచ్చిపడుతుంటాయి. పెందరాళే నిద్రలేవలేకపోవడంతో ఆఫీసులో మందకొడిగా మారిపోవడం, అర్ధరాత్రి తినేసి ఉండటంతో బ్రేక్‌ఫాస్ట్ టైమ్‌కు ఆకలి లేకపోవడం... దాంతో పగలు భోజన వేళలు తప్పడం వంటి అనర్థాలు ఏర్పడతాయి. దాంతో దీర్ఘకాలంలో ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదమూ ఉంటుంది.గుర్తించడం ఎలా... రాత్రిళ్లు వారంలో కనీసం నాలుగు నుంచి ఐదు రాత్రులు నిద్రలేకపోవడం ఉదయం లేచాక ఆకలి లేకపోవడం రాత్రి భోజనం తర్వాత ఎంతకీ నిద్రపట్టకపోతే నిద్రపట్టాలంటే మళ్లీ ఏదోటి తినక తప్పదని అనుకుంటూ ఉండటం ఒకలాంటి డిప్రెషన్ మూడ్... సాయంత్రాలు ఈ ఫీలింగ్ మరింత ఎక్కువ.ఇలాంటిదే మరో సమస్య...బింజ్ ఈటింగ్ డిజార్డర్ అనే మరో సమస్య కూడా ఉంది. ‘నైట్ ఈటింగ్ సిండ్రోమ్’ కంటే ఇది కాస్త వేరుగా ఉంటుంది. బింజ్ ఈటింగ్ డిజార్డర్‌లో బాధితులు ఏమాత్రం గ్యాప్ లేకుండా అదేపనిగా తినేస్తుంటారు. కానీ నైట్ ఈటింగ్ సిండ్రోమ్‌లో బాధితులు అదేపనిగా కాకుండా కొద్ది కొద్ది మొత్తాల్లో తింటుంటారు.‘నైట్ ఈటింగ్ సిండ్రోమ్’కు కారణాలు... ఈ సమస్యకు కారణం ఇదమిత్థంగా తెలియదు. డాక్టర్ల అంచనా ప్రకారం నిద్ర΄ోవడానికి – నిద్రలేవడానికి తోడ్పడే నిద్ర సైకిల్లో అస్తవ్యస్తతతోపాటు కొన్ని హార్మోన్ల అసమతౌల్యత వల్ల ఇలా జరుగుతుంది. స్థూలకాయుల్లో ఇది కనిపించడంతోపాటు డిప్రెషన్, యాంగై్జటీతో బాధపడేవారిలో ఇది సాధారణంగా కనిపిస్తుంటుంది. సాధారణంగా నైట్ ఈటింగ్ సిండ్రోమ్ సమస్య ప్రతి వందమందిలో ఒకరి లో కనిపిస్తుంటుంది. ఒకవేళ స్థూలకాయుల్లోనైతే ప్రతి 10 మందికి ఒకరిలో కనిపిస్తుంది. ఇక ఈ సమస్యకూ జన్యుపరమైన అంశాలకూ సంబంధముందని వైద్యపరిశోధకులు చెబుతున్నారు. బాడీ క్లాక్‌ని నియంత్రించే ‘పీఈఆర్–1’ అనే జన్యువులోని లోపం కారణంగా ఈ సమస్య ఉత్పన్నమవుతుందన్నది శాస్త్రవేత్తల మాట.నిర్ధారణ పరీక్షలు: బాధితులు తిండి, నిద్ర అలవాట్ల గురించి డాక్టర్లు తెలుసుకోవడం పాలీసోమ్నోగ్రఫీ అనే పరీక్ష సహాయంతో మెదడులోని తరంగాలు, ఆక్సిజన్ మోతాదులు, గుండె స్పందనల, శ్వాస తీసుకునే రేటు వంటి పరీక్షల సహాయంతో డాక్టర్లు ఈ సమస్యను నిర్ధారణ చేస్తారు.ఆరోగ్యంపై ఎన్ఈఎస్ దుష్ప్రభావాలు... ఎన్ఈఎస్కూ స్థూలకాయానికీ సంబంధం ఉందని తెలుసుగానీ... స్థూలకాయం వల్లనే ఈ ఎన్ఈఎస్ వస్తుందా అన్న విషయం ఇంకా వైద్యనిపుణులకు తెలియరాలేదు. అయితే వీళ్లలో చాలామందికి స్థూలకాయం ఉంటుంది కాబట్టి ఒబేసిటీ వల్ల వచ్చే అన్ని రకాల దుష్ప్రభావాలూ ఎన్ఈఎస్లో కనిపించడానికి అవకాశముంది. ఇక కొందరిలోనైతే ఈ ఎన్ఈఎస్ వల్లనే తర్వాత్తర్వాత ఊబకాయం వచ్చే అవకాశమూ ఉంటుంది.చికిత్స... సైకియాట్రిస్టుల ఆధ్వర్యంలో కొన్ని రకాల యాంటీడిప్రెసెంట్లతో పాటు అవసరాన్ని బట్టి బిహేవియర్ థెరపీ ఇస్తారు. కొన్ని రకాల రిలాక్సేషన్ టెక్నిక్స్ అవలంబిస్తూ రాత్రి తిండిని క్రమంగా ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కి షిఫ్ట్ అయ్యేలా కౌన్సెలింగ్ చేయడం ద్వారా చికిత్స అందిస్తారు. (చదవండి: ఎవరీ టీనేజర్ తేజస్వి మనోజ్? వృద్ధుల రక్షణ కోసం..) -
నింద, ఒత్తిడి, మౌనం..ఇంత పనిచేయిస్తాయా?
దేశవ్యాప్తంగా ఒత్తిడి, మానసిక ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని, అవి ఆత్మహత్య ఆలోచనలకు దారితీస్తున్నాయని హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఆత్మహత్య నిరోధ హెల్ప్‌లైన్ (7893078930) అయిన 1 లైఫ్ సంస్థ (1life.org.in) తెలిపింది. తాజాగా విడుదల చేసిన నివేదికలో ఇందుకు సంబంధించి పలు అంశాలు వెల్లడించింది. తమకు ఫోన్ చేసేవారిలో చాలామంది తీవ్రమైన భావోద్వేగ, ఆర్థిక, సామాజిక ఒత్తిడిలో ఉంటున్నారని.. దానివల్ల వారిలో ఆత్మహత్యల ఆలోచనలు వస్తున్నాయని వెల్లడించింది.1 లైఫ్ హెల్ప్‌లైన్‌కు ఏడాదికి సగటున 23వేల కాల్స్ వస్తుంటాయి. వీటిని కౌన్సెలర్లు విశ్లేషించి, సమాజంలో మానసిక ఆరోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయని తెలిపారు. ఈ కష్టాల నుంచి కోలుకోవడం చాలా ముఖ్యం. వాటిలో వ్యక్తిగత సంబంధాలు తెగిపోవడం, వ్యవస్థాపరమైన సమస్యలు, నిరాశావాదం లాంటివి చాలా ఉంటాయి. ప్రతి కాల్లోనూ తీవ్ర సంక్షోభంలో ఉన్న వ్యక్తులు ఎదురవుతారు. వాళ్లను బాగా అర్థం చేసుకోవడం, సానుభూతి చూపించడం, మద్దతు ఇవ్వడం లక్ష్యంగా కౌన్సెలర్లు మాట్లాడతారు.మానసిక ఆరోగ్యం మీద బహిరంగంగా జరగాల్సిన చర్చలను నింద, మౌనం ఎలా అడ్డుకుంటాయో కూడా ఈ డేటా చెబుతుంది. చాలా కుటుంబాల్లో వ్యక్తులు తమ సమస్యలను చెప్పడానికి అనుమతించరు. ఎవరైనా తమను తప్పుగా అనుకుంటారేమో, లేదా సమాజంలో చిన్నచూపు చూస్తారేమోనన్న భయంతో కూడా తమ లోపలి ఆలోచనలను బయటపెట్టకుండా లోలోపలే కుమిలిపోతుంటారు. తమ లోపలి భావాలను బయటపెట్టకపోవడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతుంది. దాంతో వాళ్లు మరింత ఒంటరి అయిపోయినట్లు భావిస్తారు. ఈ తరహా ట్రెండ్లను బట్టి చూస్తే.. జాలి, సమయానికి జోక్యం చేసుకోవడం లాంటి వాటి ప్రాధాన్యం సమాజానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని 1లైఫ్ భావిస్తోంది.హైరిస్క్ ఫోన్ కాల్స్ విషయంలో..రిలేషన్షిప్ సమస్యలు (సుమారు30%): గొడవలు, బ్రేకప్ లేదా వైవాహిక సమస్యలు చాలావరకు ఆత్మహత్య ఆలోచనలకు కారణమవుతున్నాయి. కాల్ చేసేవారిలో చాలామంది తమ మాట వినిపించుకోవడం లేదని, ఒంటరిగా అయిపోయామని చెబుతూ ఈ కష్టాల నుంచి తప్పించుకోవాలంటే ఆత్మహత్య ఒక్కటే మార్గమని భావిస్తారు. కుటుంబాల్లో సరిగా మాట్లాడుకోలేకపోవడం, యుక్త వయసులో భావోద్వేగాలను తట్టుకునే శిక్షణ లేకపోవడం వల్ల పరిస్థితి ఇంతవరకు వస్తుంది. సామాజికంగా చురుగ్గా ఉంటున్నా, విజయాలు సాధిస్తున్నా కూడా వ్యక్తిగత సంబంధాల విషయంలో బాగా ఇబ్బంది పడుతున్నవారు తమలో తామే కుమిలిపోతున్నారని కౌన్సెలర్లు గుర్తించారు.అప్పులు, ఆర్థికసమస్యలు (25%): నిరుద్యోగం, పెరిగిపోతున్న అప్పులు, బెట్టింగ్ యాప్‌లలో నష్టాలు, తిరిగి ఇవ్వని వ్యక్తిగత రుణాలు, ఆర్థిక మోసాలకు గురికావడం లాంటివి చాలామందిని నిరాశలోకి నెట్టేస్తాయి. ఆర్థికంగా విఫలమయ్యామన్న కుంగుబాటు, అప్పులవాళ్లు, కుటుంబసభ్యుల నుంచి పెరిగిపోయే ఒత్తిడి వల్ల ఇక నిస్సహాయంగా మిగిలిపోతారు. చాలామందికి తమ కుటుంబాలను పోషించలేకపోవడంతో సిగ్గుపడి, అది చివరకు తీవ్ర నిరాశలోకి దించేస్తుంది. ఆర్థిక అక్షరాస్యత, సమాజం నుంచి మద్దతు లాంటివి బలహీనంగా ఉండడంతో ఊరట కోసం సురక్షిత ప్రాంతాలకు వెళ్దామనుకున్నా అవి ఉండవు.విద్య/వృత్తిపరమైన ఒత్తిడి (సుమారు 22%): విద్యార్థులు, యువ వృత్తినిపుణులు తరచు తమకు పరీక్షలు, వృత్తిపరమైన సమస్యలు, పనివాతావరణం సరిగా ఉండకపోవడం లాంటి సమస్యలతో సతమతం అవుతున్నట్లు చెబుతారు. విఫలం అవుతామన్న భయం, అంచనాలను అందుకోలేకపోవడంతో తరచు తమమీద తమకే అనుమానం వచ్చి, ఆందోళనతో ఆత్మహత్య ఆలోచనలొస్తాయి. పక్కవాళ్లతో పోల్చిచూడడం, సోషల్ మీడియాలోనూ పోలికలు ఎక్కువ కావడంతో ఈ సమస్యలు ఎక్కువైపోయి తాము వెనకబడుతున్నామని అనుకుంటారు. మెంటార్లు లేదా మద్దతిచ్చే వృత్తివాతావరణం లేకపోవడంతో చాలామంది తమ పరిస్థితి డెడ్ ఎండ్ అని భావిస్తారు.మానసిక ఆరోగ్య సమస్యలు (సుమారు 10%): ఒంటరితనం, ఒత్తిడి, కుంగుబాటు, పనికిరామన్న భావనలు ఎక్కువమంది కాలర్స్‌లో కనిపిస్తున్నాయి. కుటుంబం నుంచి సమాజం నుంచి తగిన మద్దతు లేకపోతే చాలామంది మౌనంగా బాధపడుతూ, కనిపించని ఇబ్బందిలో మునిగిపోతారు. కొందరు సాయంకోసం ప్రయత్నించినా తమను ఎద్దేవా చేస్తున్నారని, కొట్టిపారేస్తున్నారని చెబుతూ మరింత ఒంటరితనంలో కూరుకుపోతున్నారు. అందుబాటులో మానసిక ఆరోగ్య సేవలు లేకపోవడంతో వారు సరైన సమయానికి సాయం అందుకోకవడం కష్టమవుతోంది.సామాజిక సమస్యలు (సుమారు 12%): ఎల్జీబీటీక్యూ లాంటి కొన్ని వర్గాలకు చెందినవారు బలవంతపు పెళ్లిళ్లు చేసుకోవాల్సి వస్తుంది, తరచు వీరిని వెలివేస్తారు, లేదా తాము అంగీకరించని గుర్తింపుతో జీవించాల్సి వస్తుంది. ఇలా తరచు ఉండే ఒత్తిడి వల్ల వారికి తప్పనిసరిగా ఆత్మహత్య ఆలోచనలొస్తాయి. చాలా సందర్భాల్లో కుటుంబం, సమాజం వెలివేయడంతో వాళ్లకు చాలా అవసరమైన మద్దతు దొరకదు. తమ గుర్తింపును నిరూపించుకోవడానికి పోరాడుతుంటే తరచు ఎదురయ్యే ఛీత్కారాలు వారికి తీవ్ర మానసిక సమస్యలను సృష్టించి, తప్పించుకోవడాన్ని అసాధ్యం చేస్తాయి.ఈ మేరకు 1 లైఫ్ ఆత్మహత్యల నిరోధ హెల్ప్‌లైన్‌లోని కన్సల్టెంట్ సైకాలజిస్ట్ మిస్ రెబెక్కా మాట్లాడుతూ, “ప్రతి కాల్ వెనుక భరించలేని బాధ, భయం, లేదా ఒంటరితనంతో పోరాడే ఒకవ్యక్తి ఉంటారు. నిజానికి వాళ్లు చనిపోవాలని అనుకోరు. కానీ తమ కష్టాలకు ముగింపు కోరుకుంటారు. వాళ్లను జడ్జ్ చేయకుండా, వారికి ఒక ఆశ కల్పించేలా వినడం ద్వారా జీవించడానికి తగిన కారణాలు కనుగొనడంలో వారికి సాయం చేయగలం. ఒకసమాజంగా, మనం తప్పనిసరిగా మానసిక ఆరోగ్యం గురించి చర్చించడం, సామాజిక సమస్యలు తగ్గించడం, బేషరతుగా మద్దతు ఇవ్వడం లాంటివి చేయాలి” అని వివరించారు.కష్టాల్లో ఉన్నవారు మౌనంగా బాధపడడం కంటే సహాయం పొందడాన్ని 1లైఫ్ ప్రోత్సహించింది. తగిన సమయానికి చేసే కౌన్సెలింగ్.. నిరాశను అనుకూలతగా మార్చగలదని సంస్థ పేర్కొంది. మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇచ్చే వ్యవస్థలను రూపొందించడానికి విధాన నిర్ణేతలు, విద్యావేత్తలు, ఉద్యోగ నియామక సంస్థలు, సమాజంలో నాయకులు కూడా ప్రోయాక్టివ్ చర్యలు తీసుకోవాలి. ఆత్మహత్యల నిరోధం అనేది కేవలం హెల్ప్లైన్ల బాధ్యత మాత్రమే కాదని 1లైఫ్ నొక్కిచెబుతోంది. కుటుంబాలు, కార్యాలయాలు, మొత్తం సమాజం కలిసికట్టుగా చేయాల్సిన పని అని పేర్కొంది. -
వయసు పెరిగినా..నోరు బోసి పోదు..!
వృద్ధులకు వయసు పరంగా వచ్చే అనేక సమస్యలతో పాటు పళ్ల సమస్యలూ తప్పవు. వృద్ధుల పళ్లకు సంబంధించిన వైద్యశాస్త్రాన్ని ‘జీరియాట్రిక్ డెంటిస్ట్రీ’ లేదా ‘జీరియోడాంటిక్స్’ అంటారు. ఇందులో వృద్ధుల పళ్లకు వచ్చే వైద్య, ఆరోగ్య సమస్యలు, వాటి నిర్ధారణ, చికిత్స వంటి అంశాలు ఉంటాయి. పళ్లు కోల్పోకుండా కేవలం వాటికి వచ్చే సమస్యలను మాత్రమే పోగొట్టుకోవడం ఎలాగో చెప్పే కథనమిది. ఇటీవలి వైద్యవిజ్ఞానం బాగా పురోగతమించింది. దాంతో గతం సగటుతో పోలిస్తే ప్రజల సగటు ఆయుర్దాయమూ బాగా పెరిగింది. ప్రజలు చాలాకాలం జీవిస్తున్నారు. దాంతో సమాజంలో వృద్ధుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఒకనాడు ముసలితనానికి బోసినోరు ఒక ప్రతీక. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. జీవితంలో కష్టపడాల్సినంత పడి... తమ వృద్ధాప్యాన్ని ఒక సంతోషకరమైన మజిలీగా చేసుకుంటూ ఇకపై జీవితాన్ని అనుభవించాల్సిందంతా ఈ వయసునుంచే అనే భావన పెరగడంతో ఆ వయసునూ ఆనందమయం చేసుకుంటున్నారు. ఫలితంగా ఒకనాడు పళ్లూడిపోయే వృద్ధులకు బదులు మంచి పలువరస ఉన్నవారే ఎక్కువగా కనబడుతున్నారు. ఎందుకంటే... ఎంతగా వయసు పైబడినప్పటికీ పళ్లు, చిగుర్ల సమస్యలు రాకుండా చూసుకుంటే పళ్లు ఎన్నాళ్లైనా గట్టిగానే ఉంటాయి. ఇందుకోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో చూద్దాం.వృద్ధాప్యంలో వచ్చే పంటి సమస్యలు/కారణాలు సాధారణంగా వయసు పెరుగుతున్నకొద్దీ పళ్లు కూడా వదులైపోతాయన్నది చాలామందిలో ఉండే ఓ అ΄ోహ. ఆ వయసులో బీపీ, షుగర్ లాంటి సమస్యలుంటే పళ్లు వాటంతట అవే ఊడి΄ోతాయని అనుకుంటారు. ఆ పరిస్థితి కోసం మానసికంగా సిద్ధపడుతుంటారు. కానీ ఇది వాస్తవం కాదు. పళ్లకు లేదా చిగుర్లకు సంబంధించన జబ్బులు వస్తేనే పళ్లు ఊడి΄ోవడమో లేదా వదులై΄ోవడమో లేదా తీసేయాల్సిన పరిస్థితి ఎదురుకావడమో జరుగుతుంది. నోటి జబ్బులు రానంతవరకు పళ్లు జీవితకాలం దృఢంగానే ఉంటాయి.వృద్ధాప్యంలో దంతాలకు వచ్చే సమస్యలు...సాధారణంగా వృద్ధాప్యంలో వచ్చే కొన్ని దంత సమస్యలు పంటిమూలంలో వచ్చే పిప్పిపళ్లు (రూట్కేరిస్), పళ్లు అరిగి΄ోవడం (అట్రిషన్), చిగుర్లవ్యాధులు (పెరియోడాంటల్ డిసీజ్), పళ్ల మధ్య అక్కడోపన్ను, ఇక్కడోపన్ను కోల్పోవడం కారణంగా వచ్చే సందులు (ఎడెంట్యులిజమ్), పైవరస పళ్లు, కిందివరస పళ్ల గట్టిదనంలో నాణ్యత లేకపోవడం (పూర్ క్వాలిటీ ఆఫ్ అల్వియొలార్ రిడ్జ్), కట్టుడుపళ్లు సరిగా అమర్చకపోవడం, దవడల పక్కన ఉండే మృదువైన మ్యూకోజాలో పుండ్లు, నోటిలో పుండ్లు, నోటిలో తడి తక్కువ కావడం (గ్జీరోస్టోమియా), నోటి క్యాన్సర్లు వంటివి.చేజేతులారా తెచ్చిపెట్టుకునే సమస్యలు...ఇక మరికొన్ని యౌవనంలో ఉన్నప్పుడు మనలో కొందరు వారంతట వారే చేజేతులారా తెచ్చిపెట్టుకునేవే ఎక్కువ. ఉదాహరణకు వయసులో ఉన్నప్పుడు పొగతాగడం, పొగాకు నమలడం, పాన్‌పరాగ్, గుట్కా, వక్కపొడి నమలడం వంటి పంటికి చేటు చేసే అలవాట్లు. ఈ అలవాట్లను మానకపోవడం, అలా నిర్లక్ష్యం చేస్తూ పోవడం వల్ల వృద్ధాప్యంలో పళ్లు తీవ్రంగా దెబ్బతింటాయి.వృద్ధాప్యంలో వ్యాధినిరోధక శక్తి తగ్గడంతో... యౌవనంతో పోలిస్తే వృద్ధాప్యదశలో వ్యాధినిరోధకశక్తి ఎంతోకొంత తగ్గుతుంది. కాబట్టి అప్పటివరకూ నిద్రాణంగా ఉన్న కొన్ని సమస్యలు పళ్లపై ప్రభావం చూపుతాయి.వృద్ధాప్యంలో వాడుతూ ఉండే మందుల కారణంగా...పెద్దవయసు వచ్చేనాటికి చాలామందిలో హై–బీపీ, షుగర్ సమస్యలు కనిపిస్తాయి కాబట్టి వాటికోసం మందులు వాడుతుంటారు. ఇలా... బీపీ, షుగర్లను అదుపులో పెట్టేందుకు వాడే మందులు, మానసిక సమస్యలకోసం వాడే యాంటీసైకోటిక్, యాంగ్జైటీని తగ్గించడం కోసం వాడే యాంగ్జియోలైటిక్స్... ఇలాంటి మందుల కారణంగా నోటిలో లాలాజల స్రావాలు తగ్గుతాయి. దాంతో అవి నోటిని పొడిబారిపోయేలా చేస్తాయి. ఈ అంశం కూడా దంతసమస్యలకు కారణమవుతుంది. వృద్ధాప్యంలో సంపాదన లేమితో : వృద్ధాప్యంలో చాలామందికి మునుపు ఉన్నంత సంపాదన ఉండదు. ఇలా తమకు ఉండే ఆదాయవనరులు తగ్గిపోవడం, దానికి తోడు కుటుంబసభ్యుల నుంచి అందాల్సినంత ప్రోత్సాహం ఉందక΄ోవడమనే అంశం కూడా దంత సమస్యలకు ఓ పరోక్ష కారణమవుతుంది. పైన పేర్కొన్న అనేక సమస్యల కారణంగా పళ్లు వదులైపోవడంతో వృద్ధాప్యంలో ఆహారం తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బందులు తలెత్తుతాయి. అంతేకాదు.. పళ్ల వల్లనే మానవుల్లో ఉచ్చారణ స్పష్టంగా ఉంటుంది. పళ్లలో సమస్యల కారణంగా భాషలో స్పష్టతా లోపించి కమ్యూనికేషన్కూ ఇబ్బందులు కలుగుతాయి.వృద్ధాప్యంలో ఆరోగ్య సమస్యలూ – పళ్లపై వాటి ప్రభావాలుడయాబెటిస్... పళ్ల సమస్యలు : ఈ రెండు అంశాలూ ఒకదాని కారణంగా మరొకటి కనిపిస్తూ ఉంటాయి. అంటే డయాబెటిస్ ఉన్నవారిలో పళ్లూ, చిగుళ్ల సమస్యలు ఎక్కువ. అలాగే పళ్లూ చిగుళ్ల సమస్యలు ఉన్నవారిలో... ఆ అంశాలు రక్తంలోని గ్లూకోజ్ పెరిగేలా చేసి, డయాబెటిస్‌కు కారణమవుతాయి. అందుకే డయాబెటిస్ ఉన్నవారూ పంటి జబ్బుల విషయంలో జాగ్రత్తపడాలి. లేనివారూ పళ్లను శుభ్రంగా ఉంచుకుని డయాబెటిస్‌ను రాకుండా నివారించుకోవాలి. డయాబెటిస్ ఉన్నవారికి సీరియస్ చిగుర్ల సమస్యలు, దంతక్షయం, లాలాజల గ్రంధులు సరిగా పనిచేయకపోవడం, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, లైకెన్ప్లానస్, లైకెనాయిడ్ రియాక్షన్, నోటి ఇన్ఫెక్షన్లు అంత తేలిగ్గా తగ్గకపోవడం వంటి సమస్యలు వస్తుంటాయి.నివారణకు సూచనలివి : పళ్లను శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతి ఆర్నెల్లకోమారు దంతవైద్యుడిని కలిసి క్లీనింగ్ చేయించుకోవాలి. డయాబెటిస్ ఉన్నవారు రక్తంలో గ్లూకోజ్ ΄ాళ్లను సమర్థంగా నియంత్రించుకుంటూ ఉండేలా తగిన మందులు తీసుకోవాలి. ఒత్తిడి లేకుండా చూసుకోవలి. డయాబెటిస్ ఉన్నవారు డాక్టర్లు సూచించినవిధంగా తాము తీసుకోవాల్సిన ఆహారాన్ని తీసుకోవాలి.గుండెజబ్బులూ... చిగుర్ల వ్యాధులు...ఇటీవలి కొత్త పరిశోధనల వల్ల నోటి ఆరోగ్యానికీ, గుండెజబ్బులకూ దగ్గరి సంబంధం ఉందని తేలింది. సాధారణంగా చిగుర్ల వ్యాధి ఉన్నవాళ్లలో... తమకు పెద్దగా నొప్పి తెలియకుండానే పంటికింద ఉండే గులాబిరంగు చిగురుభాగం నెమ్మదిగా కిందికి కిందికి తగ్గుతూపోతుంది. కానీ పంటి కింది ఎముక భాగం కూడా నాశనమయ్యే దశకు చేరినప్పుడు, అక్కడ చేరిన బ్యాక్టీరియా రక్తప్రవాహంలో కలుస్తుంది. దాంతో అది గుండె కండరాన్ని దెబ్బతీసి, గుండెజబ్బులకూ దారితీసే ప్రమాదం ఉందని ఇటీవలి అనేక పరిశోధనల వల్ల తేలింది. ఇక పంటి మీద ఉండే పాచి/గారలో ఉండే సూక్ష్మక్రిములు రక్తనాళాలల్లోకి చేరడం వల్ల రక్తనాళాలు సన్నబడి కూడా రక్తప్రవాహ సంబంధమైన (వాస్క్యులార్ డిసీజెస్) రావచ్చు. పెద్దవయసువారంతా తెలుసుకోవాల్సిన మరో అంశం ఏమిటంటే దీర్ఘకాలంగా ఉండే చిగుర్ల వ్యాధుల వల్ల అకస్మాత్తుగా వచ్చే గుండెపోటు ముప్పు కూడా ఉంటుంది.నివారణకు సూచనలివి : ఈ సమస్య నివారణకు చేయాల్సిందల్లా సరైన రీతిలో బ్రషింగ్, మన ఆహారాన్ని బాగా నమిలి మింగడం. ఈ రెండూ శ్రద్ధగా చేస్తూ ఉంటే... పెద్దవయసు వారిలో చాలావరకు గుండెజబ్బులనూ, గుండెపోటునూ నివారించవచ్చు. పక్షవాతం – పంటి జబ్బులు: పక్షవాతానికి, పంటిజబ్బులకూ నేరుగా సంబంధం లేకపోయినా... గుండెజబ్బులకు ఉన్న సంబంధమే ఇక్కడా పనిచేస్తుంటుంది. ఉదాహరణకు పంటికి పట్టే గార/పాచి (ప్లాక్) వంటివి, పంటి జబ్బుల వల్ల రక్తప్రవాహంలో పేరుకుపోయే సూక్ష్మక్రిముల వల్ల రక్తనాళాలు సన్నబడటం, రక్తనాళాల్లో ప్లాక్ పేరుకుని అది రక్తం సాఫీగా ప్రవహించకుండా అడ్డుపడటం జరుగుతాయన్న విషయం తెలిసిందే. ఇదే ప్రమాదం గుండెకు సంబంధించిన ధమనుల విషయంలో జరిగితే అది గుండెపోటుకు దారితీస్తుంది. ఒకవేళ అదే మెదడుకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల (ధమనుల) విషయంలో జరిగితే అది పక్షవాతానికి దారితీసే ప్రమాదముంటుంది. నివారణకు సూచనలివి: పంటి జబ్బులను నివారించుకోవడం లేదా నిరోధించుకోవడం; పంటి సమస్యలను దూరం చేసుకోవడం; పంటి శుభ్రతను పాటించడం (డెంటల్ హైజీన్) వల్ల ఒకవైపు గుండెజబ్బులనూ మరోవైపున పక్షవాతాన్నీ నివారించుకోగలమని గుర్తుంచుకోవాలి.చివరగా... ఒకవేళ నివారణకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోకపోయినవారు, దురదృష్టవశాత్తూ తమ పళ్లు కోల్పోయినప్పటికీ... వాళ్ల దవడ ఎముక ఎంత సన్నగా ఉన్నప్పటికీ, కృత్రిమ దంతాలు అమర్చడానికి ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నా మనకు అందుబాటులో ఉన్న నేటి డెంటిస్ట్రీలో అందుబాటులో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కృత్రిమ దంతాలను అమర్చడం, ఎలాంటి దంతసమస్యలకైనా పరిష్కారాలను అందించడమూ పూర్తిగా సాధ్యమయ్యే విషయమే.ఆర్థరైటిస్... పంటి సమస్యలుదాదాపుగా 65 ఏళ్లుదాటిన 50 శాతం మందిలో ఎముకలకు సంబంధించిన జబ్బు అయిన ఆర్థరైటిస్ కనపడుతుంది. దీనివల్ల ఎముకల మధ్య రాపిడి, ఎముకల సాంద్రత తగ్గి, పెళుసుగా మారడం, ఫలితంగా అవి తేలిగ్గా విరిగి΄ోవడంలాంటివి తరచూ జరుగుతుంటాయి. ఈ జబ్బులో కూడా ఎముకలు, కీళ్ల మధ్య నొప్పిని నివారించడానికి నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ (ఎన్ఎస్ఏఐడీ మందులు) వాడటం సాధారణం. ఈ ఆర్థరైటిస్ సమస్య ఉన్నవారికి సాధారణంగా మెథోట్రెక్సేట్ అనే మందులను ఉపయోగిస్తారు. ఇవన్నీ నోటి ఆరోగ్యాన్ని ప్రభావితం చేసేవే. ఉదాహరణకు మెథోట్రెక్సేట్ మందులు వాడేవాళ్ల నోళ్లలో పుండ్లు (అల్సర్స్) వస్తుంటాయి. ఇక రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు వాడే గోల్డ్ సోడియమ్ థయోమెలనేట్ అనే మందు వల్ల జింజివైటిస్ అనే చిగుర్లకు వచ్చే ఇన్ఫెక్షన్, గ్లాసైటిస్ అనే నాలుక ఇన్ఫెక్షన్, స్టొమటైటిస్ అనే నోటి ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఇక పై మందుల వాడకం వల్ల రక్తంలోని తెల్లరక్తకణాలు తగ్గడం, ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గడం వంటి దుష్పరిణామాలూ ఉంటాయి. కాబట్టి వాటి వల్ల రోగనిరోధకశక్తి తగ్గడం, పంటి చిగుర్ల నుంచి రక్తస్రావం వంటి పరిణామాలూ కనిపిస్తుంటాయి. లాలాజల గ్రంథులు...నోటి సమస్యలు నోటిలో ఉరుతూ ఉండే లాలాజలం (సలైవా) వల్ల నోరు ఎప్పుడూ తడిగా ఉంటుంది. ఇది నిత్యం నోటిలో ఉండే ఆహారపదార్థాలను కడిగేస్తూ ఉంటుంది. నోరు పొడిబారిపోవడం అనే లక్షణం డయాబెటిస్ బాధితులతో బాటు, కొన్ని వ్యాధుల్లో మందులు తీసుకునేవారికి, తల, గొంతు క్యాన్సర్ కారణంగా రేడియేషన్ చికిత్స తీసుకున్నవారికి లాలాజలం తగ్గుతుంది. నోటిలో తగినంత లాలాజలం లేకపోవడం వల్ల బ్యాక్టీరియా పెరిగిపోతుంది. నోరు పొడిబారిపోవడం దీర్ఘకాలంపాటు సాగితే నోటిలోని మృదుకణజాలం దెబ్బతిని, నొప్పి వస్తుంది. దాంతో దంతక్షయం (టూత్ డికే), చిగుర్ల వ్యాధులకు అవకాశాలు పెరుగుతాయి.కొన్ని సూచనలూ – మరికొన్ని చికిత్సలు... లాలాజల స్రావాలు తగ్గి తరచూ నోరు పొడిబారుతుంటే తక్షణం దంతవైద్యులను కలవాలి. వారు కొన్ని పుక్కిలించే ద్రావణాలు, పైపూత (టాపికల్)గా వాడదగ్గ ఫ్లోరైడ్ ద్రావణాలను సూచిస్తారు. కొన్ని చక్కెర లేని గమ్స్, మింట్స్ వంటివి నోటిలో తగినంత లాలాజలం ఊరేలా చేస్తాయి. దాంతోపాటు తరచూ కొద్దికొద్దిగా నీళ్లు తీసుకుని గుటక వేస్తుండటం, కరిగే ఐస్‌ను చప్పరించడం కూడా నోరు పొడిబారడాన్ని తగ్గిస్తాయి. ఇలా నోరు పొడిబారేవాళ్లు కెఫిన్ ఎక్కువగా ఉండే కాఫీలాంటి డ్రింక్స్‌ను చాలా తక్కువగా తీసుకోవడం, ఆల్కహాల్‌ను మానివేయడం మేలు.హైబీపీ – పంటిసమస్యలుఈ రెండు అంశాలకూ మధ్య సంబంధం ఉంది. హై–బీపీతో బాధపడేవారిలో వాళ్ల అధిక రక్తపోటు అనే అంశం గుండెజబ్బులకూ, గుండెపోటుకు దారితీయకుండా కొన్ని మందులు ఇస్తుంటారన్న విషయం తెలిసిందే. పంటి సమస్యలు ఉన్నవారికి ఇచ్చే నాన్‌స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ (ఎన్ఎన్ఏఐడి మందుల) వల్ల... హై–బీపీ ఉన్నవారు తాము తీసుకునే మందుల ప్రభావం తగ్గుతుంది. దీంతోపాటు మరో ప్రమాదమూ ఉంది. హై–బీపీ ఉన్నవారికి ఇచ్చే మందుల వల్ల నోటిలో తడి తగ్గి అది జీరోస్టోమియా అన్న కండిషన్‌కు దారితీస్తుంది. ఈ జీరోస్టోమియా కూడా పంటి సమస్యలను పెంచడమే కాకుండా... పలువరసలో అమర్చిన కృత్రిమ దంతాలకూ, స్క్రూల వంటి అనుబంధ అంశాలకూ నోటిలోని మృదుకండరాలకూ మధ్య ఘర్షణ (ఫ్రిక్షన్)ను పెంచి మరిన్ని పంటి సమస్యలకు దారితీసేలా చేస్తుంది. క్యాల్షియమ్ బీటా బ్లాకర్స్ అనే మందులు వాడే పది శాతం మందిలో దాని తాలూకు సైడ్‌ఎఫెక్ట్‌గా జింజివల్ హైపర్‌ప్లేసియా అనే చిగుర్లవ్యాధి కనిపిస్తుంది. ఈ వ్యాధి మందులు మొదలుపెట్టిన కొన్ని నెలల్లోనే ఇది కనిపిస్తుందని అనేక పరిశీలనల్లో తేలింది.నివారణకు సూచనలివి...హైబీపీకి మందులు వాడేవారు తమకు ఎదురైన అనుభవాన్ని తమ ఫిజీషియన్‌ను వివరించి, తరచూ తమ దంతవైద్యులను కూడా కలిసి తమ మందులను వారిచేత కూడా సమీక్షింపజేసుకుంటూ ఉండాలి. సరైన నోటి శుభ్రత పాటిస్తూ డయాబెటిస్‌ను సాధ్యమైనంతవరకు నివారించుకుంటూ ఉండటం మేలు. డాక్టర్ నరేంద్రనాథ్ రెడ్డి, సీనియర్ డెంటల్ స్పెషలిస్ట్ (చదవండి: వర్షం సైతం ఆ నృత్యాన్ని అడ్డుకోలేకపోయింది..!) -
తీవ్ర మనోవ్యాధికి సంజీవని!
మేము కోయంబత్తూరులో సెటిల్ అయిన తెలుగు వాళ్ళము. మా అబ్బాయి బీటెక్ తర్వాత ఎం. ఎస్. కోసం సంవత్సరం క్రితం అమెరికాకు వెళ్ళాడు. మొదట 6 నెలలు బాగానే ఉన్నాడు. తర్వాత అతని ఆలోచనలు, ప్రవర్తనలు మారాయి. అమెరికాలో ఉన్న పోలీసులు, గూఢాచారులు తనని వెంబడిస్తున్నారని తన మెదడు మీద, ఎలాన్ మస్క్, ట్రంప్ ప్రయోగాలు చేస్తున్నారని అనుమానంతో భయపడుతూ– ఉండేవాడు. ఆ ప్రవర్తన ఎక్కువై బాగా చికాకు చేస్తే అక్కడే ఉండే మా చుట్టాలు 6 నెలల క్రింద ఇండియాకు పంపించారు. ఎయిర్‌పోర్టులో దిగాక నేరుగా చెన్నైలో ఒక ఆస్పత్రిలో అడ్మిట్ చేశాము. ’స్కిజోఫ్రినియా’ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని, బాగా అగ్రెసివ్‌గా, సూసైడల్ ఆలోచనలతో ఉన్నాడని అక్కడి డాక్టర్లు ఇ.సి.టి. ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. మా ఫ్యామిలీ డాక్టర్ని అడిగితే ఆయన ఇ.సి.టి. వల్ల మెదడు దెబ్బతింటుంది, భవిషత్తులో ఇబ్బందులు వస్తాయని చెప్పారని, మేము ఆ ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ చేసి వేరే హాస్పిటల్‌కి తీసుకెళ్లాము. పెద్దగా ఫలితం కనిపించకపోయేసరికి ఇంగ్లీష్ వైద్యం కాకుండా వేరేవైద్యానికి వెళ్ళాము. చాలా రోజులు ఆ మందులు వాడినా ఎలాంటి మార్పూ లేదు. దయచేసి మాకు ఏదైనా మంచి దారి చూపగలరు.– సోమలింగేశ్వరరావు, కోయంబత్తూరుచాలామందిలో అంతర్గతంగా ఉండే ఇలాంటి సమస్యను సాక్షి ద్వారా తెలియజేసినందుకు మీకు నా అభినందనలు. మీ అబ్బాయికి వచ్చిన స్కిజోఫ్రీనియా వ్యాధి వలన ఎంతగా సంఘర్షణకి గురయ్యారో అర్థం అవుతోంది. ముందుగా మీరు అర్థం చేస్కోవాల్సింది, మెదడులో వచ్చే కొన్ని రసాయనిక మార్పుల వల్లనే ఇలాంటి మానసిక సమస్యలు వస్తాయని, అవి తగ్గాలంటే ఆ రసాయనాలని సాధారణ స్థితికి తీసుకురావాలనీ మానసిక వైద్యులు మొదటిగా మందులు, కౌన్సెలింగ్ ద్వారా మార్పులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. అయితే కొన్నిసార్లు ఆ సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు లేదా పేషెంటుకి ఆత్మహత్య ఆలోచనలు, జబ్బువల్ల ఇతరులకు హాని చేసేంత ఆవేశం, కోపం, ఉన్నప్పుడు, మందులు పని చేయడానికి చాలా సమయం పట్టొచ్చు: అలాంటప్పుడు పేషెంటుకి కుటుంబ సభ్యులకి జరిగే నష్టం ఎక్కువ. దీన్ని నివారించడం కోసం అత్యంత వేగంగా. ప్రభావ వంతంగా పనిచేసే ఒక సంజీవని లాంటి వైద్య విధానమే’ ఇ.సి.టి. ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ. అంతమంచి చికిత్స విధానాన్ని వాడుక భాషలో ‘షాక్ ట్రీట్మెంట్‘ అంటారు. అదే అన్ని సమస్యలకి, అపోహలకి కారణం అయింది. దీనివల్ల మనిషికి ప్రాణహాని అని లేదా నరాలు చచ్చుబడి, సంసారానికి పనికి రారు అని అనేక అపోహలు, సాధారణ ప్రజలతోటు, కొంత మంది వైద్యుల్లో కూడా ఉన్నాయి. మన శరీరంలో ఇతర జ్ఞానేంద్రియాలు, కండరాలు ఇతర వ్యవస్థలన్ని పనిచేయడానికి మెదడులో ఉత్పత్తి అయ్యే కరెంట్ చాలా ముఖ్యం. దాన్ని మార్చడం ద్వారా మొదడులోని రసాయనాల అసమతుల్యను కూడా సరి చేయవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఫోన్ లేదా కంప్యూటర్ కి వైరస్ వచ్చి పని చేయకపోతే రీసెట్ ‘ బటన్ నొక్కి దాన్ని పనిచేసే కండిషన్‌కి ఎలా తీసుకు వస్తామో ఇ.సి.టి. కూడా మెదడుని అలాగే రీసెట్ చేస్తుంది. దీనివల్ల దీర్ఘకాలికంగా ఎలాంటి సమస్యలు వస్తాయని ఇప్పటి వరకు ఎలాంటి శాస్త్రీయ పరిశోధనా తేల్చలేదు. ఒక పేషెంట్ అన్ని రకాలుగా శారీరకంగా ఫిట్‌గా ఉంటేనే ఇ.సి.టి. చికిత్స చేస్తారు. మీ అబ్బాయిని పరీక్షంచిన డాక్టరు అన్ని పరీక్షలు చేసి ఎలాంటి ఇబ్బంది లేకపోతేనే ఇ.సి.టి. ట్రీట్మెంట్ గురించి చెప్పి ఉంటారు. కాబట్టి ఎలాంటి అపోహలు, భయాలు లేకుండా చికిత్స ఇప్పించి, మీ వాడి జబ్బు లక్షణాలను తొందరగా తగ్గించుకోండి. మీ అలాగే వాళ్ళు చెప్పినన్ని రోజులు మందులు వాడితే జబ్బు మళ్ళి తిరిగబెట్ట కుండా ఉంటుంది. ఆల్ ది బెస్ట్ !డా. ఇండ్ల విశాల్ రెడ్డి,సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ.(మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com)(చదవండి: -
ఇది నాకూ బిడ్డకూ ప్రమాదమా?
నేను ఐదు నెలల గర్భవతిని. డాక్టర్ చెప్పడంతో ఓజీటీటీ పరీక్ష చేయించుకున్నాను. దీంతో రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. ఇది నాకు, నా బిడ్డకు ప్రమాదమా? ఇందుకోసం ప్రత్యేక ఆహార నియమాలు పాటించాల్సి వస్తుందా?– శైలజ, గుంటూరుగర్భధారణ సమయంలో చాలామంది మహిళల్లో మధుమేహం వచ్చే అవకాశం ఉంటుంది. దీనిని గర్భస్థ మధుమేహం (జెస్టేషనల్ డయాబెటిస్) అంటారు. ఇది గర్భధారణ సమయంలో విడుదలయ్యే హార్మోన్ల ప్రభావంతో శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోవడం వలన వస్తుంది. ఎక్కువగా ఇది ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది వారాల మధ్య కనిపిస్తుంది. అందుకే ఆ సమయంలో ఓజీటీటీ పరీక్షను చేయాలని ప్రతి గర్భిణీకి సూచిస్తారు. ఇప్పుడు మీలో గర్భస్థ మధుమేహం నిర్ధారణ కావడంతో, కొంచెం ఆందోళన కలగడం సహజమే! దీనిని సరైన సమయంలో గుర్తించడం, నియంత్రణలో ఉంచడం చాలా ముఖ్యం. గర్భస్థ మధుమేహం నియంత్రణలో లేకపోతే తల్లికి ప్రసవ సమయంలో ఇబ్బందులు, ఇన్ఫెక్షన్లు లేదా రక్తస్రావం ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది. అలాగే శిశువు గర్భంలోనే బరువు ఎక్కువ కావచ్చు, ఉమ్మనీరు పెరిగే అవకాశం ఉంటుంది. పుట్టిన తర్వాత కొన్నిసార్లు బిడ్డకు రక్తంలో తక్కువ చక్కెర స్థాయి లేదా స్వల్ప శ్వాస ఇబ్బందులు రావచ్చు. అయితే ఇవన్నీ సాధారణంగా సులభంగా చికిత్స చేయగలిగినవే. గర్భస్థ మధుమేహం నిర్ధారణ అయిన వెంటనే మీరు కొన్ని ప్రత్యేక ఆహార నియమాలు పాటించాలి. తక్కువ కార్బోహైడ్రేట్లు, తక్కువ కొవ్వులు, అధిక ప్రొటీన్లు కలిగిన ఆహారం తీసుకోవాలి. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవటం చాలా ముఖ్యం. ఆహారం, వ్యాయామాలతో ఈ మధుమేహం నియంత్రణ కాకపోతే, డాక్టర్లు సురక్షితమైన మాత్రలు లేదా ఇన్సులిన్ ఇంజెక్షన్లు సూచిస్తారు. ఇవి తల్లికీ, బిడ్డకీ పూర్తిగా హానికరం కాదు. సరైన నియంత్రణతో గర్భస్థ మధుమేహం సాధారణంగా ప్రసవం జరిగిన వెంటనే తగ్గిపోతుంది. కాని, కొన్నిసార్లు ప్రసవం తర్వాత కూడా మందులు, ఆహార నియమాలు కొంతకాలం కొనసాగించాల్సి రావచ్చు. భవిష్యత్తులో మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ప్రసవం తర్వాత కూడా ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఫాలోఅప్ తప్పనిసరిగా చేయించుకోవాలి.నాకు గతంలో ఏడు వారాలలో గర్భస్రావం అయింది. ఇప్పుడు గర్భవతిని. ఈ గర్భధారణలోనూ ఇప్పటివరకు రెండుసార్లు బ్లీడింగ్ వచ్చింది. డాక్టర్ నాకు విశ్రాంతి తీసుకోవాలని, కొన్ని మందులు వాడాలని చెప్పారు. ఈ బిడ్డను కూడా కోల్పోతానేమో అన్న భయం నన్ను చాలా బాధిస్తోంది. ఇది నా ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తోంది. దయచేసి మార్గనిర్దేశం చేయండి.– రూప, కర్నూలుగర్భధారణలో తొలి పన్నెండు వారాలను ఫస్ట్ ట్రైమెస్టర్ అంటారు. ఈ దశలో బిడ్డ ముఖ్యమైన అవయవాలు అభివృద్ధి చెందుతాయి. అదే సమయంలో గర్భస్రావం వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ దశలో రక్తస్రావం, కడుపు నొప్పి వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. అయితే ప్రతి రక్తస్రావం గర్భస్రావానికే సంకేతం కాదు. ఇంప్లాంటేషన్ బ్లీడింగ్, హార్మోన్ల మార్పులు, గర్భాశయంలో చిన్న మార్పుల వలన కూడా రక్తస్రావం రావచ్చు. ఇవి సాధారణంగా హానికరం కావు. కాని, రక్తస్రావం వచ్చిన ప్రతిసారీ డాక్టర్‌ను సంప్రదించాలి. డాక్టర్ మీ వైద్య చరిత్ర తెలుసుకొని, శరీరపరీక్ష చేసి, అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తారు. బిడ్డ ఆరోగ్యంగా ఉంటే ఎక్కువగా ఆందోళన అవసరం ఉండదు. చికిత్సలో భాగంగా విశ్రాంతి తీసుకోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం ముఖ్యమైనవి. కొన్నిసార్లు ప్రొజెస్టరాన్ మందులు ఇస్తారు. రక్తస్రావం అధికంగా ఉంటే ఆసుపత్రి పర్యవేక్షణ అవసరం కావచ్చు. గతంలో గర్భస్రావం అనుభవించారని, ఇప్పుడు కూడా మళ్లీ అదే జరుగుతుందని భావించాల్సిన అవసరం లేదు. ప్రతి గర్భస్రావం తర్వాత మళ్లీ అదే జరుగుతుందన్న నిబంధన లేదు. సమయానికి వైద్యుల సహాయం తీసుకుంటే చాలామంది మహిళలు సురక్షితంగా గర్భధారణను కొనసాగించి, ఆరోగ్యవంతమైన బిడ్డలకు జన్మనిస్తున్నారు. కాబట్టి ప్రశాంతంగా ఉండి వైద్యుల సూచనలు పాటించడం అత్యంత ముఖ్యం. డా. కడియాల రమ్య, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ -
డయాబెటిస్ స్త్రీ పురుషుల మధ్యన తేడా ఇది!
యాభై ఏళ్లలోపు పురుషుల్లో టైప్–2 డయాబెటిస్ అనేది టైప్–1 కంటే తీవ్రమైన దుష్ప్రభావాలు చూపుతుంది. అదే మహిళల విషయానికి వస్తే వాళ్లలో టైప్–1 డయాబెటిస్ అనేదే ఎక్కువ దుష్ప్రభావాలు చూపుతుందని తేలింది. దాదాపు నాలుగు లక్షలమందికి పైగా పేషెంట్లపై స్వీడన్‌కు చెందిన పరిశోధకులు నిర్వహించిన ఓ అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. వివరాల్లోకి వెళ్తే... కాస్తంత చిన్నవయసు పురుషుల్లో అంటే 50 ఏళ్లలోపు పురుషుల్లో టైప్–1 డయాబెటిస్ కంటే టైప్–2 డయాబెటిస్ తీవ్రమైన దుష్ప్రభావాలను కలగజేస్తుంది. ఉదాహరణకు టైప్–2 డయాబెటిస్తో బాధపడుతున్న పురుషుల్లో 51 శాతానికి పైగా వ్యక్తుల్లో గుండెజబ్బుల (కార్డియోవాస్క్యులార్ డిసీజెస్) ముప్పు ఉంటుంది. దాంతోపాటుగా హార్ట్ ఫెయిల్యూర్ లేదా గుండె΄ోటు రిస్క్ కూడా వాళ్లలో రెట్టింపు ఉంటుంది. దీనికి కారణాలు ఆ వయసులో పురుషుల్లో ఊబకాయం, హైబీపీ జబ్బులతోపాటు వారి జీవనశైలి కాస్త అస్తవ్యవస్తంగా ఉండటంతో అది టైప్–2 డయాబెటిస్ తాలూకు దుష్ప్రభావాలను మరింతగా ప్రేరేపిస్తుంది. అయితే పురుషుల వయసు పెరుగుతున్నకొద్దీ ఈ ముప్పు క్రమంగా కాస్త తగ్గుతూ పోతుంది. అంటే వాళ్ల వయసు 60కి చేరేనాటికి వాళ్లలో టైప్–1 డయాబెటిస్తో వచ్చే ముప్పు కంటే టైప్–2 డయాబెటిస్తో వచ్చే ముప్పులు కాస్త తగ్గుతాయని చెప్పవచ్చు. ఇక వాళ్ల వయసు 70కి చేరేనాటికి టైప్–1 డయాబెటిస్తో ఉన్నవారిలో వచ్చే గుండెపోట్ల కంటే టైప్–2 డయాబెటిస్తో ఉన్నవారిలో గుండెపోటు వచ్చే ముప్పు 26 శాతం తక్కువ. ఇక మహిళల విషయానికి వస్తే వాళ్లలో టైప్–1 డయాబెటిస్తో ముప్పు ఎక్కువ. అందునా అది ఏ వయసువారిలోనైనా ఎక్కువే. ఇలా టైప్–1 డయాబెటిస్తో బాధపడే యువతులూ, మహిళల్లో గుండెజబ్బులూ, గుండె΄ోట్లు వచ్చే ముప్పు టైప్–2 డయాబెటిస్తో బాధపడే మహిళల కంటే ఎక్కువే. అదే మహిళల వయసు 50 దాటాక... టైప్–1 డయాబెటిస్ బాధపడేవాళ్లతో పోలిస్తే టైప్ – 2 డయాబెటిస్తో బాధపడేవారిలో గుండెజబ్బులూ, గుండె΄ోట్లు వచ్చే ముప్పు 25 నుంచి 47 శాతం తక్కువ. ఇక అన్ని రకాల గుండెజబ్బుల ముప్పులనూ పరిగణనలోకి తీసుకుంటే టైప్ –2 డయాబెటిస్తో బాధపడే మహిళల్లో గుండెజబ్బులతో మృతిచెందడానికి ఉన్న అవకాశాలు టైప్ – 1 మహిళల కంటే 19 శాతం తక్కువ. దీన్ని బట్టి తేలిసేదేమిటంటే... టైప్ –1 అలాగే టైప్ –2 డయాబెటిస్ల ముప్పులు ఇటు మహిళలూ, అటు పురుషుల్లో వేర్వేరు దుష్ప్రభావాలను చూపుతుంటాయని ఈ స్వీడిష్ అధ్యయనంలో వెల్లడైంది. (చదవండి: ఈ జబ్బులకు లింగ వివక్ష?) -
ఈ జబ్బులకు లింగ వివక్ష?
అదేమిటో గానీ... కొన్ని జబ్బులు కక్ష పట్టినట్టుగా మహిళల్లోనే ఎక్కువగా కనిపిస్తాయి. వాళ్లపైనే తమ దుష్ప్రభావాలు ఎక్కువగా చూపిస్తాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్‌కు చెందిన రుమటాయిడ్ ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, జువెనైల్ ఇడియోపథిక్ ఆర్థరైటిస్, సిస్టమిక్ లూపస్ అరిథమెటోసిస్ (ఎస్‌ఎల్‌ఈ), మయోసైటిస్ వంటివి. అవి వాళ్లలోనే ఎందుకలా వస్తాయన్న విషయాన్ని అనన్య అనే ఓ అమ్మాయి వృత్తాంతంతో డాక్టర్లు వివరిస్తున్నారు. అనన్య కథేమిటో చూద్దామా!ఓ అనన్య కథ అనన్య 24 ఏళ్ల ఓ అమ్మాయి. పెదవుల మీద చెరగని చిర్నవ్వు... ఎల్లప్పుడూ చకచకా కదులుతూ ఉండే చురుకుదనం... కళ్లనిండా భవిష్యత్తు మీద ఆశ! మొన్ననే కాలేజీ చదువులు పూర్తి చేసిన ఆ అమ్మాయి ఇటీవలే ఓ ఐటీ కంపెనీలో చేరింది. అలా చదువై΄ోయిందో లేదో ఇలా ఉద్యోగం వచ్చిందన్న సంతోషం ఈమధ్య అంతగా ఉండటం లేదు. కారణం... ఆమె ఉదయాలు కష్టంగా మారాయి. వేళ్ల కణుపుల వద్ద వాపు బ్రష్ చేయనివ్వడం లేదు. ఆఫీసులో కీబోర్డు మీద టైప్ కూడా చేయనివ్వడం లేదు. మెట్లెక్కే సమయంలో మోకాళ్లలో నొప్పి. ఆమె మొదట్లో ఈ బాధను కాస్త తేలిగ్గా తీసుకుంది. సిస్టమ్ ముందు ఎక్కువ సేపు కూర్చోవడం వల్లనో లేదా పని ఒత్తిడి కారణంగాలో ఇలా జరుగుతోందని అనుకుంది. పోనుపోనూ ఈ నొప్పి... తొలుత అసౌకర్యంగా... తర్వాత ఇబ్బందికరంగా... ఇప్పుడు బాధాకరంగా మారింది. తన రోజువారీ పనుల మీద తీవ్ర ప్రభావం చూపడం మొదలైంది. మొదట్లో కుటుంబ సభ్యులు ఆమెను తమ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. తనను పరీక్షించిన డాక్టర్ ఆమెను రుమటాలజిస్ట్ దగ్గరికి పంపారు. జాయింట్ల పరిశీలనా, రక్తపరీక్షలూ అయ్యాక ఆమెకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని నిర్ధారణ అయ్యింది. ఆర్థరైటిస్‌లో అదోరకం. అనన్య జీవితంలో అదో అతిపెద్ద షాక్!! ‘‘ఆర్థరైటిసా? ఈ వయసులోనా? సాధారణంగా అది వృద్దాప్యంలో వచ్చే వ్యాధి కదా’’ అనుకుంది. ఆమె మనసులో ఎన్నో ప్రశ్నలు. ‘‘నేనిక పని చేయగలనా? పెళ్లి మాటేమిటి? నేనెప్పటికీ ఈ నొప్పులతోనే బతకాలా? ఈ మందులు సురక్షితమేనా? వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా? ఆ దుష్ప్రభావాలతో ఇక సహజీవనం తప్పదా??? ఆమె మనసులో మెదిలే అనేక ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం. డాక్టర్ చెప్పినట్టుగా పురుషులతో ΄ోలిస్తే ఈ తరహా ఆర్థరైటిస్‌ల వ్యాప్తి, దుష్ప్రభావాలు మహిళల్లోనే ఎందుకు ఎక్కువ, వాటిని అ«ధిగమించడమెలాగో, ఆ వివరాలేమిటో తెలుసుకుందాం. ∙∙ అసలు ఆటోఇమ్యూన్ రుమాటిక్ వ్యాధులు అంటే ఏమిటి? మన శరీర రక్షణ వ్యవస్థ (ఇమ్యూన్ సిస్టమ్) ఎల్లప్పుడూ మనల్ని వైరస్‌లూ, బ్యాక్టీరియా బారి నుంచి కాపాడుతూ ఉంటుంది. బయటి వ్యాధి కారకాలు ఏవైనా మనలోకి ప్రవేశించిన వెంటనే మన వ్యాధి నిరోధక వ్యవస్థ అప్రమత్తమై, వాటితో పోరాడటానికి తన రక్షణ కణాలను పంపుతుంది. అయితే ఈ క్రమంలో మన వ్యాధి నిరోధక కణాలు... ఒక్కోసారి తమ ఒంట్లోని సొంత కణాలనే శత్రు కణాలుగా పొరబడతాయి. వాటితో తలబడతాయి. అలా మన సొంత వ్యాధి నిరోధక వ్యవస్థ తన సొంత కణాలపైనే దాడి చేయడం వల్ల వచ్చే వ్యాధులనే ‘ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్’గా చెబుతారు. ఇలా దాడి చేసే క్రమంలో అవి మన కీళ్లు (జాయింట్లు), కండరాలు (మజిల్స్), చర్మం, కొన్ని సందర్భాల్లో ఒంట్లోని కీలక అవయవాలపై తీవ్రంగా దాడి చేసి, బాధిస్తాయి. ఈ తరహా వ్యాధులు యువతులు / మహిళల్లో తమ 20 నుంచి 40 ఏళ్ల వయసులో ఎక్కువగా వస్తుంటాయి. దాంతో వాళ్ల చదువులూ, కెరియర్, కుటుంబ జీవితంపై ప్రభావం చూపడటంతో భావోద్వేగాల పరంగా కూడా వీళ్లు ఎక్కువగా ప్రభావితమవుతుంటారు.కొన్ని ప్రధానమైన జబ్బులివి... రుమటాయిడ్ ఆర్థరైటిస్ (ఆర్ఏ) : ఇది రెండు చేతులూ, మోకాళ్లలోని కీళ్లను (జాయింట్స్)ను ప్రభావితం చేస్తుంది. యాంకలైజింగ్ స్పాండిలైటిస్ : మెడ, వెన్నెముకలను ప్రభావితం చేస్తుంది. సోరియాటిక్ ఆర్థరైటిస్ : సోరియాసిస్‌లో లాగా జుట్టు నుంచి వెండిరంగులో ఉండే చర్మం సొలుసులు రాలడంతోపాటు కీళ్లవాపు, తీవ్రమైన కీళ్ల నొప్పులు కనిపిస్తాయి. జువెనైల్ ఇడియోపథిక్ ఆర్థరైటిస్ : చిన్నపిల్లలూ, టీనేజీలో ఉండే కౌమార వయసులో ఉండే పిల్లల్లో కనిపించే ఎముకల, కీళ్ల వ్యాధి ఇది.ఎక్కువగా మహిళల్లోనే... ఎందుకిలా? అనేక గణాంకాల నుంచి లభ్యమైన వివరాల ప్రకారం ఆటోఇమ్యూన్ వ్యాధులతో బాధపడేవారిలో దాదాపు 75 శాతం మంది మహిళలే. ఇవి వాళ్లలోనే ఎక్కువగా కనిపించడానికి కారణాలు... హార్మోన్ల ప్రభావం: ఈస్ట్రోజెన్ అనే హార్మోన్ ప్రధానంగా మహిళల్లోనే ఎక్కువగా స్రవిస్తుంది. ఈ హార్మోన్ ఇమ్యూన్ వ్యవస్థపై చూపే ప్రభావం ఇందుకు ఒక కారణం. జన్యుపరమైన అంశాలు: మహిళల్లో ఉండే కొన్ని రకాల జన్యువులు (జీన్స్) ఈ తరహా వ్యాధులను ప్రేరేపించడం. ఇమ్యూన్ వ్యవస్థలో తేడాలు: స్వాభావికంగా పురుషులతో పోలిస్తే మహిళల వ్యాధి నిరోధక (ఇమ్యూన్) వ్యవస్థ చాలా బలంగా, శక్తిమంతంగా ఉంటుంది. అదే కారణం చేత... ఒకవేళ ఆ ఇమ్యూన్ వ్యవస్థ తన సొంత కణాలపై పనిచేసేటప్పుడు కూడా ఆ ప్రతిచర్యలూ (రియాక్షన్స్) అంతే బలంగా ఉండటం.ఈ జబ్బుల తాలూకు మందుల పట్ల ఉండే భయాలివి... ఈ జబ్బుల్లో సాధారణంగా కొన్నింటికి మందుల వల్ల కొన్ని రకాల భయాలూ, ఆందోళనలూ ఉంటాయి. కారణం కొన్ని సందర్భాల్లో సైడ్ఎఫెక్ట్స్ ఎక్కువగా కనిపిస్తుండటమే. అయితే గుర్తుంచుకోవాల్సిందేమిటంటే... ఈ సైడ్ఎఫెక్ట్స్ తాత్కాలికమే. ఈ మందులన్నీ చాలావరకు సురక్షితమే. ఇటీవల బయాలజిక్స్ అనే కొత్తరకం మందులు అందుబాటులోకి వచ్చాయి. సాధారణ మందులతో అంతగా ప్రభావం కనిపించనివాళ్లలో డాక్టర్లు ఈ కొత్తరకం మందులైన బయాలజిక్స్నూ వాడుతుంటారు. చికిత్స తీసుకోకపోతే... చాలా కేసుల్లో ఈ లక్షణాలు చాలామందిలో ఏదో ఒక సమయంలో కనిపించే చాలా సాధారణ లక్షణాలనే కలిగి ఉండటంతో చాలామంది మొదట్లో నిర్లక్ష్యం చేస్తారు. అయితే ఈ తరహా వ్యాధుల్లో ఎంత నిర్లక్ష్యం చేస్తే అంత ప్రమాదం జరుగుతుంది. కొందరిలో శాశ్వత వైకల్యమూ కలగవచ్చు. అందుకే వీటిని నిర్లక్ష్యం చేయకూడదు. ఈ వ్యాధితో సాధారణ ప్రజల్లాగే జీవించడానికి... పొగతాగడం, మద్యం అలవాట్లకు దూరంగా ఉండాలి. పూర్తిగా మానేయడం మంచిది. యోగా, ఈత, నడక వంటి తేలికపాటి వ్యాయామాలను నిత్యం చేస్తుండటం. కీళ్ల జబ్బులు కనిపించగానే డాక్టర్లు సూచించిన సహాయక పరికరాలను వాడుతుండటం. ద్యానం, మంచి హాబీలతో, రిలాక్సేషన్ టెక్నిక్స్‌తో ఒత్తిడిని అదుపులో పెట్టుకోవడం. ఎముకల ఆరోగ్యం కోసం డాక్టర్లు సూచించిన విధంగా క్యాల్షియమ్, విటమిన్–డి సప్లిమెంట్లు తీసుకోవడం. ∙∙ చివరగా... ‘‘నేను మళ్లీ మామూలుగా జీవించడం సాధ్యమవుతుందా?’’ అడిగింది అనన్య. ‘‘పూర్తిగా సాధ్యమే. ఇది కలలకు ముగింపు కాదు. కొద్దిపాటి జాగ్రత్తలతో పూర్తిస్థాయిలో మామూలు జీవితం గడపవచ్చు. కెరియర్, పిల్లలూ, ప్రయాణాలూ... ఇవన్నీ మామూలుగానే జరుగుతాయి. కాకపోతే డాక్టర్లు సూచించిన మందులూ, జాగ్రత్తలూ పాటించాలి. ఇక ముందుగానే గుర్తించడం, అవగాహన కలిగి ఉండటం, నిరంతర పర్యవేక్షణ... ఇవీ మనకు అవసరమైన తారక మంత్రాలు’’ అంటున్న డాక్టర్ల మాటలు ఈ తరహా ఆర్థరైటిస్ వ్యాధులతో బాధపడే మహిళల జీవితాలకు ఒక మంచి భరోసా. ఈ జబ్బుల తాలూకు లక్షణాలు కనిపించిన వెంటనే నిపుణులైన రుమటాలజిస్టులను సంప్రదించాలి. ఎందుకంటే ఈ లక్షణాలు మామూలుగా చాలామందిలో చాలా సాధారణంగా కనిపించేవి కావడంతో సాధారణ డాక్టర్లు వెంటనే వాటిని గుర్తించలేకపోవచ్చు. దాంతో చికిత్స ఆలస్యమయ్యే కొద్దీ దుష్ప్రభావాలూ, కీళ్లు దెబ్బతినడం కూడా పెరగడం జరగవచ్చు. రుమటాలజిస్టలను కలిస్తే వారు కొన్ని పరీక్షలు చేయిస్తారు. అవి... ఈఎస్ఆర్, సీఆర్పీ, రుమటాయిడ్ ఫ్యాక్టర్, ఏఎన్ఏ, యాంటీ సీసీపీ, కీళ్ల (జాయింట్ల) ఎక్స్–రే, అల్ట్రా సౌండ్ పరీక్షల వంటివి. వ్యాధి నిర్ధారణ జరిగిన వెంటనే రుమటాలజిస్టులు డీఎమ్‌ఏఆర్‌డీ (డిసీజ్ మాడిఫైయింగ్ యాంటీ రుమాటిక్ డ్రగ్స్) అని పిలిచే మెథోట్రెక్సేట్, హైడ్రాక్సీక్లోరోక్విన్, సల్ఫాసలాజీన్ వంటి మందులను సూచిస్తారు. వీటిని ఎంత త్వరగా మొదలుపెడితే... జరగబోయే నష్టాలు అంతగా నివారితమవుతాయి. చికిత్సలు మొదలయ్యాక క్రమం తప్పకుండా ఫాలో అప్‌లకు వెళ్తుండాలి. అప్పుడు డాక్టర్లు మందుల ప్రభావాన్ని తరచూ పరీక్షిస్తూ మోతాదులను సవరిస్తుంటారు. డాక్టర్ విజయ ప్రసన్న పరిమిసీనియర్ రుమటాలజిస్ట్ (చదవండి: మేలైన ఆరోగ్యానికి మల్బరీ..!) -
జస్ట్ నాలుగు నెలల్లో 25 కిలోలు తగ్గింది..! అమూల్యమైన ఆ ఏడు పాఠాలివే..
బరువు తగ్గడం అనేది అదిపెద్ద క్లిష్టమైన టాస్క్. తగ్గడం అంత ఈజీ కాదు. ఆ క్రమంలో ఒక్కోసారి తగ్గినట్లు తగ్గి..మళ్లీ యథాస్థితికి వచ్చినవాళ్లు కూడా ఉన్నారు. అయితే అందరు ఈ వెయిట్ లాస్ జర్నీలో కొన్ని పొరపాట్లు చేస్తుంటారని, వాటిని సర్దుబాటు చేసుకుంటే కిలోలు కొద్ది బరువు సులభంగా తగ్గిపోగలమని అంటోంది ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ అమకా. తనకు స్లిమ్‌గా మారడంలో హెల్ప్ అయిన ఏడు జీవనశైలి పాఠాలను కూడా సోషల్‌మీడియా వేదికగా షేర్ చేసుకుంది. అవేంటో చూద్దామా..!.బరువు తగ్గాలంటే కచ్చితంగా మన జీవనశైలిలో అతిపెద్ద మార్పులు చేయక తప్పదని అంటోంది. దాంతోపాటు ఓర్పు, క్రమంతప్పకుండా వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం అత్యంత కీలకమని అంటోందామె. తాను ఆక్రమంలో ఏడు అద్భుతమైన పాఠాలను నేర్చుకున్నట్లు వివరించింది. ప్రస్తుతం తాను నాలుగు నెలల్లో అద్భుతంగా 25 కిలోలు అమాంతం తగ్గిపోయినట్లు ఇన్‌స్టా పోస్ట్‌లో తెలిపింది. నిజానికి ఎందువల్ల త్వరగా బరువు తగ్గలేకపోతున్నామనే దాని గురించి ఓపెన్‌గా మాట్లాడరని అంటెంది. అన్ని చేస్తున్న కొండలాంటి మన శరీరం ఏ మాత్రం మార్పు చెందని ఫీల్ కలుగుతుంటుంది. అలాంటి బరువుని తగ్గించాలంటే ఈ మార్పులు స్వాగతించండి, డైలీలైఫ్‌లో భాగం చేసుకోండని అంటోంది. అవేంటంటే..ఆకలి అనేది చిరుతండి లేదా మరొక ఎక్స్ట్రా ప్లేట్ ఆహారం కాదని నమ్మండి, ఆకలిగా అనిపించిన ప్రతిసారి తినేందుకు త్వరపడొద్దు. నిద్ర కూడా అత్యంత ముఖ్యమైనదని గ్రహించండని హెచ్చరిస్తోంది. నిద్ర కూడా మన బాడీకి ఒక ఆహారం లాంటిదేనని తెలుసుకోండని చెబుతోంది. తగినంత నిద్ర లేకపోతే తినాలనే కోరికలు ఎక్కువవుతాయట. స్థిరత్వం పరిపూర్ణమైన మార్పులకు మచ్చు తునక అట. దానికి ప్రాధాన్యత ఇస్తే..సకాలంలో మెరుగైన ఫలితాలు పొందడమే గాక చాలామటుకు లిమిటెడ్‌గా తినడాన్ని బ్యాలెన్స్ చేయగలుగుతారు. స్ట్రెంగ్స్ ట్రైనింగ్ కార్డియో వ్యాయామాల కంటే మెరుగ్గా పనిచేశాయాని చెబుతోంది. బరువులు ఎత్తడం, తన శరీర ఆకృతిని మార్చడంలో హెల్ప్ అయ్యిందని అంటోంది.అలాగే చక్కెర తగ్గించడం అనేది బరువు తగ్గడంలో చక్కటి గేమ ఛేంజర్ అని అంటోంది. సోడాలు, స్వీట్లు, పేస్ట్రీలకు దూరంగా ఉండటంతో.. వెంటనే బొడ్డు కొవ్వు తగ్గడం ప్రారంభించిందని అంటోంది. ఇవేగాక రాత్రిపూట తాగే హెర్బల్ పానీయాలు బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తాయని అంటోంది. అవి ఆకలి కోరికలను నియంత్రిస్తాయని చెబుతోంది. ఉదా: లెమెన్ టీ, అల్లం టీ, యాపిల్ సైడ్ వెనిగర్, దాల్చిన చెక్క టీ వంటివి. వీటన్నింటి తోపాటు నియామానుసారంగా ఈ అలవాట్లను పాటించడం అనే క్రమశిక్షణ తనకు మరింత బాగా హెల్ప్ అయ్యిందని అంటోంది. అన్నింట్లకంటే బరువు తగ్గాలనే ఇంటెన్షన్‌తో కూడిన స్థిరత్వం కలిగిన మనసు అత్యంత ప్రధానమని, అప్పుడే సత్ఫలితాలను సులభంగా అందుకోగలమని అంటోంది ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ అమాక. కాగా, నెటిజన్లు ఈ పోస్ట్‌ని చూసి..బరువు తగ్గడంలో సత్ఫలితాలు అందాక దాదాపు ఆశను వదిలేసుకున్నాం. మీరిచ్చిన ఉత్తమ సలహాలతో కొంగొత్త ఆశ రెకెత్తించిందంటూ పోస్టు పెట్టారు. అయితే అమాక మాత్రం మన నిర్దేశిత లక్ష్య బరుని చేరుకోవడం అనేది అంత సులభం కాదని గుర్తెరగండి. కేవలం అటెన్షన్ అనే, స్థిరత్వం అనేవే టార్గెట్‌ని రీచ్ అయ్యేలా బరువు తగ్గుతామని గ్రహించండని సూచిస్తోంది.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: పారాగ్లైడింగ్ చేస్తూ లైవ్ మ్యూజిక్ ప్లే చేసిన మహిళ..!) -
మేలైన ఆరోగ్యానికి మల్బరీ..!
మల్బరీ పండ్లు శాస్త్రీయంగా మోరస్ జాతికి చెందినవి, తీపి, పులుపు రుచుకలను కలిగి ఉంటాయి. వీటిని నేరుగా తినవచ్చు లేదా జ్యూస్, జామ్, వైన్ ఇతర ఆహార పదార్థాలలో కలిపి ఉపయోగించవచ్చు. మల్బరీ పండ్లను వాడటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. మల్బరీలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మలబద్ధకం, ఉబ్బరం, కడుపులో మంటలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది: మల్బరీలోని రెస్వెరాట్రాల్ అనే ముఖ్యమైన ఫ్లేవనాయిడ్ రక్త నాళాల పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని పెంచుతుంది, ఇది రక్త నాళాలను సడలించి రక్తం గడ్డకట్టే అవకాశాలను తగ్గిస్తుంది, తద్వారా స్ట్రోక్స్, గుండె΄ోటు వంటి సమస్యలను నివారిస్తుంది.మల్బరీలో పుష్కలంగా ఉండే విటమిన్ సి శరీరంలోని వ్యాధులకు వ్యతిరేకంగా మంచి రక్షణను అందిస్తుంది.మల్బరీలోని విటమిన్ కె, కాల్షియం, ఐరన్ వంటి ఖనిజాలు ఆరోగ్యకరమైన ఎముకలను నిర్వహించడానికి అవసరం.మల్బరీ జ్యూస్ తాగడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. ఇందులో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది, ఇది కంటి చూపును బలపరుస్తుంది. కంప్యూటర్ ముందు గంటల తరబడి పనిచేసే వారికి కంటి ఒత్తిడిని తగ్గిస్తుంది.మల్బరీ జ్యూస్ శస్త్రచికిత్స తర్వాత రోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. -
పోషకాల బ్రేక్‌ఫాస్ట్..!
ఒక రోజంతా శక్తిమంతంగా, ఉత్సాహంగా గడిచిందంటే వారిపై ఆ రోజు ఉదయాన్నే తీసుకునే అల్పాహారం ప్రభావం తప్పక ఉంటుంది. పిల్లల జ్ఞాపకశక్తికీ పోషకాలు గల ఆహారం ఎంతో మేలు చేస్తుంది. ఉదయాన్నే పిల్లలు, పెద్దలు తీసుకునే బలవర్ధకమైన, సులువుగా తయారు చేసుకునే వంటకాలు ఇవి.. హెల్తీ మిక్స్ హల్వాకావల్సిన పదార్థాలుహెల్త్ మిక్స్ – కప్పు (క్యారెట్ లేదా బీట్రూట్ లేదా గుమ్మడి తురుము లేదా గోధుమ నూక); నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు; బెల్లం లేదా కొబ్బరి చక్కెర – 1/4 కప్పు; పాలు – కప్పు; బాదం, జీడిపప్పు, చియా సీడ్స్ – టేబుల్ స్పూన్;తయారీ విధానంపాన్లో నెయ్యి వేడి చేసి, హెల్తీ మిక్స్ వేసి, బాగా వేయించాలి. పాలు పోసి, కలుపుతూ ఉండాలి.. మిశ్రమం చిక్కగా అయ్యాక, తురిమిన బెల్లం, కొబ్బరి చక్కెర ’కోకో షుగర్) వేసి బాగా కలపాలి. అన్నీ పూర్తిగా కలిసే వరకు మరో 2–3 నిమిషాలు ఉడికించాలి.తరిగిన డ్రై ఫ్రూట్స్ అలంకరించి, సర్వ్ చేయాలి. పోషకాలు: పిల్లలకు, పెద్దలకు ఇష్టమైనదే కాదు... మంచి పోషకాలు కూడా ఉండే స్వీట్ ఇది. బెల్లం లేదా కొబ్బరి చక్కెర వాడటం వల్ల ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది. బీట్రూట్, క్యారట్, గుమ్మడిలో పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు లభిస్తాయి. పాల మిశ్రమం కాబట్టి క్యాల్షియమూ అందుతుంది. చిల్లాకావల్సిన పదార్థాలు: పెసరపప్పు – కప్పు (తగినన్ని నీళ్లు ΄ోసి, రెండు గంటలసేపు నానబెట్టాలి); నీళ్లు – అర కప్పు (తగినన్ని); ఉల్లిపాయ – చిన్నది (సన్నగా తరగాలి); పచ్చి మిర్చి – సన్నగా తరగాలి; కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూన్; ఉప్పు – రుచికి తగినంత; నూనె – తగినంత.తయారీ విధానంపెసరపప్పును వడకట్టి, నీళ్లు కలిపి, మెత్తగా రుబ్బుకోవాలి. పిండిని గిన్నెలోకి తీసుకొని (క్యారెట్ తురుము, పాలకూర తరుగు, నానబెట్టిన ఓట్స్ కూడా కలుపుకోవచ్చు) తరిగిన ఉల్లిపాయలు, పచ్చి మిర్చి తరుగు, కొత్తిమీర, ఉప్పు వేసి కలపాలి. పెనం వేడి చేసి, ఒక గరిటెతో పెనం పైన పిండి పోసి, దోసెలా వెడల్పు చేయాలి. మీడియం మంట మీద రెండు వైపులా గోధుమ రంగు వచ్చేవరకు ఉంచాలి. కొత్తిమీర, పుదీనా చట్నీతో వేడిగా సర్వ్ చేయాలి.పోషకాలుక్యాలరీలు తక్కువగా ప్రోటీన్లు, క్యాల్షియం, ఐరన్, జింక్ సమృద్ధిగా లభించే ఈ చిల్లా ఉదయం, సాయంత్రం స్నాక్‌గా తీసుకోవచ్చు. పిల్లలకు లంచ్ బాక్స్లోకీ బాగుంటుంది. దీనిని రోల్ చేసి, ఉడికించిన కూరగాయలతో స్టఫ్ చేసి కూడా అందివ్వవచ్చు. హెల్తీ మిక్స్ పరాఠాకావల్సిన పదార్థాలుహెల్తీ మిక్స్ (రాగులు, జొన్న, సజ్జలు, కొర్రలు మొలకెత్తిన గింజలు, గుమ్మడి, అవిసెగింజలతో చేసిన పిండి) – కప్పు; నెయ్యి లేదా నూనె – టీ స్పూన్; ఉప్పు – తగినంత; గోరువెచ్చని నీళ్లు (తగినన్ని); తయారీ విధానంఒక గిన్నెలో, మిల్లెట్ మిక్స్, ఉప్పు వేయాలి. గోరువెచ్చని నీటిని క్రమంగా వేస్తూ, పిండిని మెత్తని ముద్దలా అయ్యేలా బాగా కలపాలి. చేతులకు నూనె లేదా నెయ్యి రాసుకొని, చిన్న చిన్న ముద్దలుగా తీసుకోవాలి. రెండు బటర్ పేపర్ షీట్ల మధ్య పిండి బాల్ ఉంచి, చపాతీ కర్రతో మెల్లగా, తేలికపాటి ఒత్తిడితో, రోల్ చేయాలి. పెనం వేడి చేసి, ప్రతి పరాఠాను సన్నని మంట మీద కొద్దిగా నెయ్యి/నూనెతో బంగారు గోధుమ రంగు వచ్చే వరకు రెండు వైపులా కాల్చాలి. చట్నీ లేదా పెరుగుతో వేడిగా వడ్డించాలి. పోషకాలు: పరాటాకు కూరగాయలను ఉడికించి, వాడుకోవచ్చు. ఏమేం దినుసులు, కూరగాయలు వాడుతున్నామో దానిని బట్టి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లు, క్యాల్షియం, ఐరన్ సమృద్ధిగా లభిస్తాయి. (చదవండి: కూల్ మాన్సూన్లో..స్పెషల్ హాట్ ట్రీట్స్..!) -
ఆరుపదులు దాటినా ఫిట్‌గా కనిపించాలంటే..! నాగార్జున ఫిట్నెస్ మంత్ర.
టాలీవుడ్ కింగ్, హీరోయిన్ల మన్మథుడు హీరో నాగార్జున ఇవాళ 67వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. అయితే ఆయన ఇప్పటికీ అంతే గ్లామర్‌గా టోన్డ్ బాడీతో ఆకర్షణగా కనిపిస్తారు. ఆగస్టు 29 ఆయన పుట్టిన రోజు సందర్భంగా అంతలా ఫిట్‌గా ఉండేందుకు నాగార్జున ఎలాంటి వ్యాయామాలు చేస్తుంటారు, ఆరుపదులు వయసులో కూడా అంతలా యంగ్‌గా కనిపించేందుకు ఎలాంటి చిట్కాలు అనుసరిస్తారు వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా..!.నాగార్జున ఇంచుమించుగా గత 30 లేదా 35 సంవత్సరాలుగా వర్కౌట్లు చేస్తూనే ఉన్నారు. ఎన్నడు స్కిప్ చేయలేదని ఆయన ఫిట్నెస్ ట్రైనర్ చెబుతున్నారు. ఒక ఇంటర్వ్యూలో కూడా క్రమంతప్పకుండా వ్యాయామం చేస్తానని ఆయనే స్వయంగా చెప్పారు. వాటిలో కార్డియో, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వంటి వ్యాయామాలు తప్పనిసరి. అయితే అవన్ని ప్రతి ఉదయం జస్ట్ 45 నిమిషాల నుంచి ఒక గంట వరకే చేస్తారట. అంతలా ఫిట్‌గా ఉండటానికి రీజన్..క్రమంతప్పకుండా వ్యాయామం చేయడం అనేది తప్పనిసరి అని చెబుతున్నారు నాగార్జున. అంతేగాదు పనిచేయకుండానైనా ఉంటాను గానీ వ్యాయామం చేయకుండా అస్సలు ఉండనని చెబుతున్నారు. మేల్కొన్న వెంటనే వ్యాయామం తన తొలి ప్రాధాన్యతని చెబుతున్నారు. కచ్చితంగా వారానికి ఐదు నుంచి ఆరు రోజులు వర్కౌట్లనేవి తన దినచర్యలో భాగమని చెబుతున్నారు. అయితే అవి చాలా తీవ్రంగా ఉంటాయట.ఆ ఏజ్‌లో కూడా యంగ్‌గా కనిపించాలంటే..వర్కౌట్ల సమయంలో తన హృదయ స్పందన రేటును గరిష్ట రేటు 70 శాతం కంటే ఎక్కువగా ఉంచుకోవడం ఎలాగై తన ట్రైనర్ నేర్పించాడని తెలిపారు నాగార్జున. అధిక జీవక్రియను నిర్వహించడానికి వర్కౌట్ల సమయంలో విశ్రాంతి , పరధ్యానం అనేవి అస్సలు పనికిరావని, పైగా మెరుగైన ఫలితాలు అందుకోలేమని చెప్పారు. చేసేపని చిన్నదైన, పెద్దదైనా ఫోకస్, స్కిప్ చేయని అంకిత భావం అంత్యంత ముఖ్యమని, అప్పుడే ఎప్పటికీ యవ్వనంగా ఉండగలమని పరోక్షంగా చెప్పకనే చెప్పారు హీరో నాగార్జున. View this post on Instagram A post shared by Aalim Hakim (@aalimhakim) (చదవండి: ఫుడ్ డెలివరికి వెళ్లి కస్టమర్‌కి ప్రపోజ్ చేశాడు ..కట్‌చేస్తే..!) -
99 కిలోలు నుంచి 59 కిలోలుకు..! నో స్ట్రిక్ట్ డైట్ కానీ
ఎన్నో వెయిట్ లాస్ స్టోరీల్లో డైట్, జిమ్ వంటి వాటితో బరువు తగ్గడం చూశాం. కానీ ఈ మహిళ చివరి వరకు స్థిరంగా ఉంటూ..తినే ఆహారంలో ఎలాంటి మార్పులు చేయకుండానే తగ్గింది. తాను రెగ్యులర్‌గా తీసుకునే డైట్‌నే తీసుకుంటూ వెయిట్ లాస్ అయ్యింది. అది తనకు ఏవిధంగా సాధ్యమైందో ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకుంది. కొందరు క్రమశిక్షణతో కూడిన జీవనశైలి, మరికొందరు ఓపికకు పెద్దపీటవేసి బరువు తగ్గడం జరుగుతుంది. కానీ ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సాచిపై నెమ్మదిగా, స్థిరమైన ప్రయత్నంతో అసాధారణ ఫలితాలను అందుకుంది. ఎలాంటి షార్ట్కట్లు, తీవ్రమైన డైట్లు అనుసరించలేదు. కేవలం క్వాండిటీలో మార్పు చేసింది. తాను రోజు తినే ఆహారంలో మార్పులేమి లేవు. కేవలం తీసుకునే క్వాండిటీనే తగ్గించి తీసుకునేది. అలగే మొదట 20 నిమిషాల నడక నుంచి మొదలు పెట్టి 60 నిమిషాల వరకు నడిచేలా ప్లాన్ చేసింది. అలా పదివేల అడుగులు పైనే తీసుకుంది. ప్రోటీన్ జోడించడమే గాక అల్పాహారం తప్పనిసరి చేసుకుంది డైట్లో. అలాగే తరుచుగా బరువు తగ్గానా లేదా అని అద్దంలో చూసుకోవడం నివారించాల్సిందేనంటా. అప్పుడే బరువు తగ్గడంలో గణనీయమైన మార్పులు సంభవిస్తాయట. తీసుకునే ఆహారం..సాధారణంగా మొదట డబల్ఎక్స్ఎల్లో ఉన వ్యక్తి తన సైజుని ఎక్స్ఎస్ సైజుకి మార్చుకునేలా వ్యాయమాలు కూడా హెల్ప్ అయ్యాయి. మొదటి ఐదు నుంచి ఆరు నెలలు ఇంట్లో చేసే సాధారణ వ్యాయామాలు చేయగా, ఆమె స్టామినా పెరిగే కొద్దీ..భారీగా బరువులు ఎత్తేలా జిమ్‌కి వెళ్లటం, పైలేట్స్ వంటివి జోడించినట్లు పేర్కొంది. మార్షల్ ఆర్ట్స్‌తో కలగలసిన ఈత వ్యాయామాలు తన మెరుగైన శరీరాకృతి మార్పుకి దోహదపడిందని చెప్పుకొచ్చింది. అలాగే తినే ఆహారంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండకుండా చూసుకునేదట. ముఖ్యంగా బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్డులోని తెల్లసొనతో అవకాడో, లెట్యూసక్ష, టమాటాలు, చికెన్ రోల్ చేసుకుని తినేదట. స్పైసీ రొయ్యల న్యూడిల్స్, హైడ్రేటెడ్‌గా ఉండేలా చూసుకోవడం, ఉల్లిపాయలు, క్యారెట్లు, బెల్పిప్పర్, క్యాబేజీ వంటి రంగురంగు కూరగాయలతో చేసిన స్పైసి రైస్ లేదా న్యూడిల్స్ తీసుకునేదట. వీటి తోపాటు ఫిష్ ఫ్రై, సలాడ్, పప్పు అన్నం, తదితరాలు తీసుకునేదట. ఇవి తనకు ఆకలిని నియంత్రించేలా చేసి, ఎక్కువగా ఆకలి వేయకుండా కపాడేదని పేర్కొంది. తాను స్థిరత్వం, సమతుల్యమైన ఆహారంతో ఇంతలా విజయవంతంగా బరువు తగ్గాగలిగానంటోందామె.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Saachi | Pilates. Fat Loss. Real Talk. (@saachi.pai) (చదవండి: నటి తనిష్టా ఛటర్జీ ఎదుర్కొంటున్న ఒలిగోమెటాస్టాటిక్ కేన్సర్ అంటే..! ఎందువల్ల వస్తుందంటే..) -
స్మార్ట్‌గా సమయాన్ని, సామర్థ్యాన్ని మింగేస్తోంది..!
నగర అధునాతన సాంకేతిక జీవనశైలిలో వేగం పెరిగిన కొద్దీ యువత ‘స్క్రీన్ టైమ్–సెంట్రిక్’ దినచర్యగా, బానిసత్వంగా మారుతోందని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇందులో భాగంగా తాజా సర్వేలు చెబుతున్న ఆందోళనకర విషయం ఏంటంటే.. నగరంతో పాటు రాష్ట్రంలోని 14 నుంచి 16 ఏళ్ల పిల్లల్లో 92 శాతం మందికి స్మార్ట్‌ఫోన్ వినియోగ పరిచయం ఉండటం. ఇందులో చదువుకోసం వాడుతున్నవారు 61 శాతం కాగా సోషల్ మీడియా బ్రౌజింగ్కి వెళ్తున్నవి 82.5 శాతం కావడం విశేషం. ఇది విద్యార్థుల చదువుపైనే కాకుండా దుష్పభావాలపై ఆందోళనల్ని పెంచుతోందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా టీనేజ్ పిల్లల్లో మొబైల్‌తో పాటు వివిధ సాంకేతిక మాధ్యమాల స్క్రీన్ టైం విపరీతంగా పెరిగిందని సూచిస్తున్నాయి. నెక్ట్స్ మ్యాచ్ నెక్ట్స్ర్యాంక్..ఎక్కువ సమయం స్క్రీన్కు అతుక్కుపోవడం ఒక్క చదువుకు మాత్రమే కాదు నిద్రపట్టలేని లక్షణాన్ని కూడా గందరగోళపరుస్తోంది. దేశవ్యాప్తంగా విద్యార్థుల మానసిక ఆనందంపై ‘స్టూడెంట్ వెల్బీయింగ్ పల్స్’ నివేదిక చెబుతున్న తాజా వివరాల ప్రకారం.. రాత్రివేళల సోషల్ మీడియా వాడకం నిద్రను తగ్గించి, జీవన సంతృప్తిని–ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. 12వ తరగతి విద్యార్థుల్లో దాదాపు 75 శాతం మందికి స్కూల్ డేస్‌లో 7 గంటల కన్నా తక్కువ నిద్రే వస్తోందట. ఇది ఆందోళనను పెంచుతూ మానసిక ఆరోగ్య సంక్షోభానికి దారి తీస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్క్రీన్టైమ్లో ల్యాప్టైమ్, మొబైల్, ట్యాబ్స్ తదితర మాధ్యమాల్లో ‘పది నిమిషాలే’ అని మొదలయ్యే రీల్స్–బింజ్, నిద్రపోయే బెడ్ టైంకు ముందు ఆ స్క్రీన్లకు కళ్లు పెనవేసుకుని ఉండటం వల్ల నిద్రను చెడగొట్టి, మరుసటి రోజు ఫోకస్, శక్తిని నిర్వీర్యం చేస్తున్నాయని కొత్త అధ్యయనం హెచ్చరిస్తోంది. 30 నిమిషాలకంటే ఎక్కువ స్క్రీన్ చూశాక నిద్ర నాణ్యత తక్కువగా ఉందని ఈ డేటా చెబుతోంది. అలాగే 41 వేల మందిపై నిర్వహించిన ఒక సర్వేలో ‘సోషల్ స్క్రోల్’ వల్ల నిద్ర ఆలస్యమవుతుందనే విషయం కూడా బయటపడింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా యువతలో హెల్తీ ఆన్లైన్ అలవాట్ల అవసరాన్ని స్పష్టంగా తెలిపే నివేదికను విడుదల చేసింది. పరిష్కారం ఏంటి?ఈ స్క్రీన్ టైం బానిసత్వానికి గేమింగ్ మరో పెద్ద టైమ్సింక్. మల్టీప్లేయర్/ఈ–స్పోర్ట్స్ మోడ్‌లో ‘నెక్ట్స్ మ్యాచ్ నెక్ట్స్ ర్యాంక్’ లూప్ యువతను ముంచేస్తుంది. భారతీయ పరిశోధనల ప్రకారం హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో గేమింగ్ అలవాట్లు.. ఫంక్షనాలిటీ, సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని సూచిస్తున్నాయి. అదే సమయంలో కాలేజీ విద్యార్థులపై చేసిన అధ్యయనాల్లో ‘నలుగురిలో ఒక్కడికి’ స్మార్ట్‌ఫోన్ అడిక్షన్ లక్షణాలు కనిపించాయని నివేదికలు వెల్లడించాయి. స్క్రీన్‌పై గడిపే సమయం పెరిగేకొద్దీ మార్కులపై వస్తున్న ఫలితాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. తక్కువ కాలంలోనే మువతలో వచ్చిన ఈ మార్పులతో పాటు డోపమైన్ హిట్స్ కోసం వేపింగ్/సబ్స్టెన్స్ ట్రయల్స్ వైపు అడుగులు కూడా ఆందోళనకరంగా మారాయి. తెలంగాణ యాంటీ–నార్కోటిక్స్ బ్యూరో ప్రణాళికలే ఈ విషయాలను చెబుతున్నాయి. హైదరాబాదు పరిసరాల్లో కుర్రాళ్లలో వీటి సరఫరా సులభంగా లభించడం వంటి కారణాలు అటు వైపు నెడుతున్నాయని నివేదికలు సూచిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో పరిష్కార మార్గాలపై నిపుణులు, సామాజికవేత్తలు దృష్టి సారించారు. పాఠశాలలు–కాలేజీలు ‘డిజిటల్ హైజీన్, కెరీర్ గైడెన్స్, లైఫ్ స్కిల్స్’ను కాంబోగా ఇవ్వాలి సూచిస్తున్నారు. విద్యార్థులకు భవిష్యత్ సలహాలకంటే ఇలాంటి అంశాలపై అవగాహన కలి్పంచడం ప్రాథమిక బాధ్యత అని విన్నవిస్తున్నారు. ఇంట్లో కూడా ‘స్క్రీన్ కర్ఫ్యూ’ (బెడ్‌టైమ్‌కు 60–90 నిమిషాల ముందు స్క్రీన్ ఆఫ్), నప్లిమిట్ (మధ్యాహ్నం 20–30 నిమిషాలకే), ‘నో ఫోన్ ఇన్ డైనింగ్ టేబుల్’, ‘రీల్స్‌కు రూల్ ఆఫ్ 15’ (రోజు 15 నిమిషాలకే) వంటి మైక్రో రూల్స్ అమలు చేస్తే ఫోకస్, నిద్ర, మూడ్ మెరుగుపడతాయని, నిద్ర–మానసిక అంశాలకు చెందిన ఆరోగ్య డేటా సూచిస్తోంది. నగర జీవనశైలిలో యువతను నిరీ్వర్యం చేస్తున్న ‘మూడు ఎస్’లు.. స్క్రీన్, స్క్రోల్, సబ్‌స్టాన్స్. చదువు/కెరీర్ లక్ష్యాలకు ‘డీప్ వర్క్ విండోలు’, ఆఫ్‌లైన్ హాబీలు, క్రీడలు, కమ్యూనిటీ వాలంటీరింగ్ వంటి ‘డోపమైన్ ఆల్టర్నేటివ్‌లు’ అవసరం. లేదంటే రాత్రి స్క్రోలు ఉదయాన్ని అలసటగా మార్చడమే కాకుండా ‘డెడ్‌లైన్ డిజాస్టర్’గా తిరిగి వస్తూనే ఉంటుంది. (చదవండి: బొజ్జలు కాదు.. కండలు పెంచగలం..!) -
ఊపందుకుంటున్న సోలో డేట్ కల్చర్..!
నాలో నేనేనా.. ఏదో అన్నానా.. నాతో నే లేని మైమరపున.. ఏమో అన్నానేమో..నువ్వు విన్నావేమో..విన్న మాటేదో నిన్నడగనా.. అలా సాగిపోతున్న నాలోన.. ఇదేంటిలా కొత్త ఆలోచన.. అవును కాదు తడబాటుని.. అంతో ఇంతో గడి దాటనీ.. విడి విడిపోని పరదాని.. పలుకై రాని ప్రాణాన్ని.. అని బాణం చిత్రంలో రామజోగ్య శాస్తి రాసిన పాట మనందరికీ సుపరిచితమే.. ఇదే పాటను అనుకరిస్తూ.. పలువురు నగర వాసులు సోలో డేట్‌కు సై అంటున్నారు. కొందరు పర్సనల్ స్పేస్ వెతుక్కుంటూ.. లాంగ్ డ్రైవ్స్, టూర్స్‌కు వెళ్తున్నారు.. మరికొందరు తమకు నచి్చన ఆహారంతో.. ఇంకొందరు పుస్తకాలు, మ్యూజిక్‌తో సావాసం చేస్తున్నారు.. నేనూ నా నీడ.. ఇద్దరమే చాలంటూ పలువురు నగరవాసులు పాశ్చాత్య దేశాల నుంచి విస్తరిస్తున్న ట్రెండ్‌కు ఊతమిస్తున్నారు. ‘డేట్‌కి వెళదామా? అని ప్రశ్నిస్తే.. ఏ ఆన్సర్ వస్తుందో అనే ఆందోళన ఉండదు. ‘డేటింగ్’ కోసం మరొకరిని మెప్పించాలనే తాపత్రయమూ ఉండదు. నచ్చని పనులు చేయాల్సిన అవసరమూ ఉండదు.. నచి్చన పనులు మానాల్సిన అవసరం అస్సలే ఉండదు. అంత అద్భుతమైన అనుభవమా? అదెక్కడ? అది ఎలా? అనే ప్రశ్నలకు నగర యువత ఇప్పుడు కనుగొన్న సమాధానమే సోలో డేటింగ్. ‘సారీ రేపు ఎవరినీ కలవదలచుకోలేదు. ఏకాంతంగా రోజంతా గడపదలచుకున్నాను...’ ఇలాంటి మాటలు ఇప్పుడు నగరంలో తరచూ వినబడుతున్నాయి. ‘సోలో డేటింగ్’ అనే అనుభవం పట్ల ప్రతి ఒక్కరిలోనూ పెరుగుతున్న ఆసక్తే దీనికి కారణం. అలా పుట్టింది.. పొద్దున్న లేస్తే.. ఎవరికి కాల్ చేయాలి? ఎవరిని కలవాలి? ఎవరితో చర్చించాలి.. ఏ మీటింగ్‌కి అటెండవ్వాలి? ఎవరికి పనులు అప్పజెప్పాలి.. ఎవరు చెప్పిన పనులు చేయాలి? ఎవరిని ప్రేమించాలి? ఎవరిని మెప్పించాలి?.. బయటకు వెళ్లడం మాత్రమే కాదు కమ్యూనికేషన్ పుణ్యమాని ఇంట్లో ఉన్నా ఇదే పరిస్థితి.. రోజువారీ షెడ్యూల్ మొత్తం ఇలాగే మరొకరితో ముడిపడిపోతున్న నగర వాసంలో.. తనను తాను కోల్పోతున్నామనే భావన చాలా మందిలో పెరుగుతోంది. దాన్ని పూడ్చుకోవాలనే ఆలోచనల నుంచి పుట్టిందే సోలో డేటింగ్ సంస్కృతి. ఇలా విస్తరించింది.. తొలుత అమెరికా, యూరప్ దేశాల్లో అంకురించిన సోలో డేటింగ్ పెద్ద ట్రెండ్‌గా మారింది. మీ టైమ్, సోలో డేట్, సెల్ఫ్ లవ్ అనే హాష్‌ట్యాగ్స్ మిలియన్ల పోస్టులతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జపాన్‌లో అయితే ‘ఒంటరి డైనింగ్’ (సోలో డైనింగ్) అనేది రెస్టారెంట్లలో ప్రత్యేక కాన్సెప్ట్‌గా ప్రవేశపెట్టారు. ఒంటరిగా వచ్చిన వారికోసం ప్రత్యేక టేబుల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ‘సోలో ట్రావెల్ – డేటింగ్’ ప్యాకేజీలు అందిస్తున్న ట్రావెల్ ఏజెన్సీలు పెరుగుతున్నాయి. మన దేశంలో కూడా యువత, ముఖ్యంగా హైదరాబాద్ తదితర మెట్రో నగరాల్లో, వీకెండ్ సోలో డేట్స్‌ని ట్రెండ్‌గా మార్చుకుంటున్నారు. ఇప్పటి బిజీ జీవితంలో ‘సెల్ఫ్ కేర్’ అనే భావనకు కొత్త రూపంగా దీన్ని పేర్కొంటున్నారు. సోలో డేటింగ్.. ఇలా! ఇది మనం మనకోసమే ప్లాన్ చేసుకునే ఒక ప్రత్యేక సమయం. సోలోగా గడపడం అంటే ఏదో ఒంటరిగా ఉండటం మాత్రమే కాదు. ఒక రొమాంటిక్ పార్ట్నర్తో కలిసి వెళ్లినట్టు అలా వెళ్లినప్పుడు వారి ఆనందం కోసం మనం ఏవైతే చేస్తామో, చేద్దాం అనుకుంటామో.. అలా మనకోసమే మనం వెళ్లడం.. ఒక డేట్ ప్లాన్ చేసుకోవడం. ఆ రోజు మొత్తం మనకు నచ్చిన పనులు చేస్తూ గడిపేయడం. మనకు నచి్చన టైమ్‌కి నిద్ర లేవడం మొదలుకుని ఏదైనా కాఫీ షాప్లోనో కల్చరల్ స్పేస్ లోనో కాసేపు గడపడం, సినిమానో, నాటకమో, స్టాండప్ కామెడీయో.. ఏది చూడాలనుకుంటే అది చూడటం, పార్కులో వాకింగ్ లేదా పర్వతాల్లో ట్రెక్కింగ్ ఇలా ఏదైనా సరే.. రోజంతా మనం ఎంజాయ్ చేయాలనుకున్నా చేయలేకపోతున్నవి చేస్తూ గడిపేయడం.. కొన్ని సూచనలు.. దీని వల్ల ఒంటరిగా ఆనందించగలం అని మన మీద మనకు నమ్మకం పెరుగుతుంది. దీంతో ఆనందం కోసం ఇతరులపై ఆధారపడడం తగ్గుతుందనే విషయం గుర్తుంచుకోవాలి. రోజూ తప్పక చేసే పనులకు ఒక్కరోజు పూర్తిగా వీడ్కోలు పలకాలి. సోలో డేటింగ్ అంటే ఏదో ఒంటరిగా స్తబ్ధుగా గడిపేయడం కాదు. ప్రణాళికా బద్దంగా, రాజీ పడకుండా మనం కోరుకున్నట్టుగా ఎంజాయ్ చేయడం. ఒత్తిడి నుంచి సామాజిక బాధ్యతల నుంచి కూడా విరామం లభిస్తుంది. ఆ డేట్ గురించి ఎవరికీ చెప్పక్కర్లేదు.. ఎవరు చెప్పిందీ ఫాలో అవ్వాల్సిన పని అంతకన్నా లేదు. కేవలం మనసు మాట మాత్రమే వినాలి. నిజంగా మనకు ఏం కావాలో మనకు నచ్చింది ఏంటో తెలుసుకునే సెల్ఫ్ అవేర్నెస్ కలుగుతుంది.(చదవండి: వాన వెలిసినా... ముసిరే వ్యాధులు) -
బాబోయ్..బనానా చిప్స్ తింటే... ఆరోగ్యం ఆటలో అరటిపండే...
అరటి పండు చిప్స్.. వీటి గురించి తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఓ రకంగా హాట్ చిప్స్ అనే ఒక పూర్తి స్థాయి చిరుతిళ్ల దుకాణాలు అన్ని నగరాల్లో పాగా వేయడానికి కూడా ఈ బనానా చిప్స్ పై జనంలో పెరిగిన క్రేజ్ బాటలు వేసిందని చెప్పొచ్చు. సాయంత్రం వేళ స్నాక్స్ నుంచి రాత్రి వేళల్లో ఛీర్స్ దాకా కాస్త ఆరోగ్య స్పృహ ఉన్నవారు ఎంచుకునే చిరు తిండి అదే. ముఖ్యంగా కేరళ రాష్ట్రాన్ని అక్కడి ప్రకృతి సౌందర్యాన్ని ఇష్టపడే చాలా మంది పర్యాటకులు తప్పకుండా చేసే పనులలో ఒకటి అక్కడ నుంచి తాజా తాజా బనానా చిప్స్‌ను కొనుగోలు చేసి తమ స్వస్థలాలకు తీసుకురావడం.. ఎవరైనా సన్నిహితులు కేరళ వెళుతుంటే కూడా వచ్చేటప్పుడు బనానా చిప్స్ తీసుకురా అంటూ అభ్యర్ధించే తెలుగువారికీ కొదవలేదు.ఈ నేపథ్యంలో గత ఏప్రిల్ 2024 నుంచి మార్చి 2025 మధ్య కేరళ ఆహార భద్రతా కమిషనరేట్ ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఆహార పదార్ధాలలో కల్తీపై తనిఖీలు నిర్వహించింది. ఆ సందర్భంగా సేకరించిన నమూనాలపై జరిపిన పరీక్షలలో, విభ్రాంతికర విషయాలు వెలుగు చూశాయి. గాడ్స్ ఓన్ కంట్రీగా పేరొందిన కేరళ లో రాష్ట్రవ్యాప్తంగా విక్రయించే ఆహారాలలో నిషేధిత రంగులు, నిల్వకారక రసాయనాలు, పురుగుమందుల మిశ్రమాలు బయటపడ్డాయి. అవి అనుమతించదగిన పరిమితి కంటే దాదాపు 3,500% వరకూ ఎక్కువగా ఉండడం అందర్నీ షాక్‌కి గురి చేసింది.అధికారులు తమ నివేదికను సిద్ధం చేయడానికి రాష్ట్రంలో విక్రయించే 650 పైగా ఆహార పదార్ధాల నమూనాలను పరీక్షించారు. వారి పరిశోధన ఫలితాల ప్రకారం... స్వల్ప స్థాయిలో కూడా ఏదైనా ఆహారాన్ని విషపూరితంగా మార్చే పారిశ్రామిక రంగు అయిన రోడమైన్ బి, పామ్ షుగర్ బెల్లంలలో కనపడింది. క్యాన్సర్ కారక రసాయనమైన అమరాంత్, రోజ్బెర్రీ, బీఫ్ చిల్లి, డ్రైడ్ ప్లమ్‌లలో, మరొక హానికరమైన రసాయనం, ఆరెంజ్ 2, రెడ్ గ్రామ్ నిమ్మకాయ ఊరగాయలలో లభ్యమైంది. స్థానికంగా ఉత్పత్తి చేసిన బ్రాండెడ్ మిరపకాయ పొడులలో సుడాన్ 1, 2, 3, 4 అనే పేరు కలిగిన క్యాన్సర్–సంబంధిత పదార్థాల జాడ దొరికింది.ఈ తరహా హానికారక ఉత్పత్తులు మేళవించిన వివిధ రకాల మిశ్రమాలు, ప్లం కేక్‌తో పాటు బనానా చిప్స్‌లో కూడా బయటపడడం అరటి పండు చిప్స్ ని ఇష్టంగా తినేవారిని భయాందోళనలకు గురి చేసింది. ఈ మిశ్రమం..అరటి పండు చిప్స్ తినేవారిలో కలిగించే అనారోగ్యాలు సాధారణ అజీర్ణం నుంచి ప్రాణాంతక క్యాన్సర్ల వరకూ ఉండవచ్చునని వెల్లడి కావడం మింగుడు పడని విషయంగా మారింది. ఈ నేపధ్యంలో కేరళ నుంచి తరలివచ్చే వాటితో పాటు తెలుగు రాష్ట్రాల్లో తయారవుతున్న బనానా చిప్స్ ను వినియోగించే విషయంలో సైతం ఆరోగ్యార్ధులు ఆచితూచి వ్యవహరించడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. అదే విధంగా కేరళ రాష్ట్రంలో అధికారులు చేసినట్టుగా తెలుగు రాష్ట్రాల్లో కూడా అధికారులు తినుబండారాలపై తనిఖీలు చేపట్టాలని, వారు విడుదల చేసినట్టుగానే హానికారక పదార్ధాలను కొలతలతో సహా జాబితాగా విడుదల చేస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.(చదవండి: 16 వేల అడుగుల ఎత్తులో పూతరేకులు తిన్నారా..?) -
రుతుక్రమం వాయిదా వేసే మాత్రలు వాడొచ్చా..?
నా వయసు ఇరవై ఐదు సంవత్సరాలు. పెళ్లి నిశ్చయమైంది. త్వరలో ఒక కుటుంబ కార్యక్రమం ఉంది. ఆ సమయానికి రుతుక్రమం రాకుండా వాయిదా వేసే మాత్రలు వాడాలని మా ఇంట్లో అందరూ చెబుతున్నారు. కాని, వాటి వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు వస్తాయో, భవిష్యత్తులో గర్భధారణకు ఇబ్బందులు కలుగుతాయో తెలుసుకోవాలని ఉంది.– ప్రియాంక, హైదరాబాద్మీ వయసు, శరీర పరిస్థితి, రుతుక్రమం సక్రమంగా జరుగుతుందా లేదా అన్న విషయాలను ముందుగా పరిశీలించడం అవసరం. రుతుక్రమం వాయిదా వేసే మాత్రలు సాధారణంగా అధిక మోతాదు ప్రొజెస్టెరాన్ హార్మోన్లు కలిగి ఉంటాయి. ఇవి శరీరంలో సహజంగా ఏర్పడే హార్మోన్ల సమతుల్యాన్ని మార్చి, గర్భాశయంలో ఏర్పడిన పొర ఊడిపోకుండా అడ్డుకుంటాయి. మాత్రలు వాడుతున్నంత కాలం రుతుక్రమం రాదు. కాని, ఆపిన తరువాత గర్భాశయ పొర ఒకేసారి ఊడిపోవడం వల్ల ఎక్కువ రక్తస్రావం జరగవచ్చు. తరచుగా వాడితే రుతుక్రమం అసాధారణంగా మారడం, గర్భసంబంధిత సమస్యలు రావచ్చు. గతంలో ఇలాంటి మాత్రలు వాడిన మహిళల్లో అండాల ఉత్పత్తి తగ్గిపోవడం, ఆరోగ్యకరమైన అండాల లభ్యత తగ్గడం వలన గర్భధారణలో ఇబ్బందులు ఎదురైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ సమస్య సర్దుకోవడానికి కొంతమందికి నెలల తరబడి లేదా సంవత్సరాల పాటు సమయం పడుతుంది. తాత్కాలిక దుష్ప్రభావాలలో మానసిక భావప్రకటన మార్పులు, అజీర్ణం, వాంతులు, మైగ్రేన్ తలనొప్పి, స్తనాల నొప్పి, బరువు పెరగడం ఉంటాయి. అధిక బరువున్నవారు వాడితే రక్తం గడ్డకట్టడం, గుండె సంబంధిత వ్యాధులు, ఊపిరితిత్తుల సమస్యలు, మెదడులో రక్తనాళాలు మూసుకుపోయే ప్రమాదం ఎక్కువ. కుటుంబంలో క్యాన్సర్, అధిక రక్తపోటు, గుండె సమస్యల చరిత్ర ఉన్నవారు లేదా ఇప్పటికే రక్తపోటు ఉన్నవారు ఈ మాత్రలు వాడకూడదు. దీర్ఘకాలంగా వాడితే శాశ్వత ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి రుతుక్రమం వాయిదా వేసే ముందు తప్పనిసరిగా డాక్టర్ని కలసి, శరీర పరిస్థితి అంచనా వేయించు కోవాలి. తక్కువ మోతాదులో ఉండే మాత్రలను, కార్యక్రమానికి ఒకటి రెండు నెలల ముందు ప్రారంభిస్తే కొంత సురక్షితంగా వాడవచ్చు. భవిష్యత్తులో గర్భధారణకు సిద్ధమవుతున్న వారు అనవసరంగా ఈ మాత్రలను వాడకూడదు. ఎందుకంటే ఇవి గర్భంలో శిశువు అభివృద్ధికి అవసరమైన హార్మోన్లపై ప్రభావం చూపవచ్చు. కాబట్టి మీ వయసు, ఆరోగ్య చరిత్ర, ప్రస్తుత రుతుక్రమ స్థితి ఇవన్నీ పరిశీలించి, వైద్యుని సలహా తీసుకుని మాత్రమే నిర్ణయం తీసుకోవాలి.నా వయసు పద్దెనిమిదేళ్లు. మొదటి నుంచే నాకు పీరియడ్స్ రెగ్యులర్‌గా రావు. ఈ అక్టోబర్ నెలలో దసరా పండుగకు మేము ఇంట్లో దేవుడికి పెద్దగా పూజ చేద్దామని అనుకుంటున్నాం. కాబట్టి, ఆ సమయంలో పీరియడ్స్ రాకుండా పోస్ట్‌పోన్ లేదా ప్రీపోన్ టాబ్లెట్లు వాడవచ్చా?– స్వాతి, విజయవాడమీ పీరియడ్స్ రెగ్యులర్‌గా లేనందున, వచ్చే నెలలో పీరియడ్స్ ఏ తేదీన వస్తాయో ముందుగా చెప్పడం కష్టం. అందుకే ఆ తేదీని ముందుకు తేవడం లేదా వెనక్కు మార్చడం ఈ పరిస్థితిలో కష్టమైన పని. సాధారణంగా, పీరియడ్స్ సరిగ్గా వచ్చే వాళ్లకి, తేదీకి కొన్ని రోజులు ముందు హైడోస్ హార్మోన్ మాత్రలు ఇస్తే పీరియడ్స్ వాయిదా వేయవచ్చు. కాని, మీలా నెలసరి క్రమం తప్పి ఉన్నవాళ్లకి ఇది సురక్షితం కాదు. ఈ మాత్రలు వాడితే వికారం, వాంతులు, తలనొప్పి, పొత్తికడుపు నొప్పి, మూడ్ స్వింగ్స్ వంటి సమస్యలు రావచ్చు. కొన్ని సందర్భాల్లో రక్తం గడ్డకట్టడం, కాలేయానికి నష్టం వంటి తీవ్రమైన సమస్యలు కూడా రావచ్చు. వీటిని తరచుగా వాడితే పీరియడ్స్ ఇంకా అస్తవ్యస్తంగా మారే అవకాశం ఉంది. మీ వయసులో పీరియడ్స్ రెగ్యులర్‌గా కాకపోవడం సహజం. ఎందుకంటే ఈ వయసులో శరీరం ఇంకా మార్పులు పొందుతూ ఉంటుంది. చాలా అమ్మాయిల్లో ఇది ఇరవై ఏళ్ల వరకు క్రమంగా సర్దుకుంటుంది. కాని, పీరియడ్స్ ఎప్పుడూ రెగ్యులర్ కాకపోతే, పీసీఓఎస్ (పాలీసిస్టిక్ ఓవరీస్ సిండ్రోమ్), థైరాయిడ్ సమస్యలు, అధిక బరువు, తక్కువ బరువు, ఒత్తిడి, నిద్రలేమి, సరైన ఆహారం తీసుకోకపోవడం వంటి కారణాలు కూడా ఉండవచ్చు. నా సలహా ఏమిటంటే, కేవలం పూజల కోసమే హార్మోన్ మందులు వాడడం కంటే, ముందుగా మీ సమస్యకు గల అసలు కారణాన్ని గుర్తించి చికిత్స చేయించుకోవడం ఉత్తమం. ఇలా చేస్తే మీ సైకిల్ సరిగా వచ్చి, భవిష్యత్తులో గర్భధారణ సామర్థ్యం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా ఫార్మసీ నుంచి ఇలాంటి మందులను స్వయంగా అసలు కొనకండి.డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: అనాథశ్రమంలో పెరిగి ఐఏఎస్ అయ్యాడు..! ట్విస్ట్ ఏంటంటే..) -
ఆరోగ్యమే.. అందం.. ఆనందం
జీవితంలో ఎంత ఎదిగినా, ఏం సాధించినా.. ఆరోగ్యం, మానసిక ప్రశాంతత ఎంతో ప్రధానమైనవని, ఇంటర్నల్ వెల్నెస్, ఎక్స్టర్నల్ కేర్ప్రతి ఒక్కరి వ్యక్తిత్వాన్నీ ప్రదర్శిస్తాయని ప్రముఖ సినీతార శ్రియా శరణ్ తెలిపారు. చాలా రోజుల తరువాత ఈ పాన్ ఇండియా నటి నగరంలో సందడి చేశారు. నగరంలోని కొండాపూర్ వేదికగా వెల్నెస్, చర్మ సంరక్షణ, అధునాతన సౌందర్య సేవలందించే ‘జెన్నారా క్లినిక్స్’ను శ్రియా శరణ్ ప్రారంభించారు. ఈసందర్భంగా ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. అందమైన జీవితం, ఆరోగ్యకరమైనప్రయాణంతో పాటు తన తదుపరి సినిమాల గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే.. ఆ రోజులు ఎంత మధురమో.. చాలా మంది నన్ను కలిసినప్పుడు అప్పుడూ.. ఇప్పుడూ ఒకేలా ఎలా ఉండగలుగుతున్నారని అడుగుతున్నారు.., దానంతటికీ కారణం ‘ఎల్లప్పుడూ నాకు మానసిక సంతోషాన్నందిస్తున్న అభిమానుల ప్రేమ, రెండోది ఆరోగ్యం పట్ల నా జాగ్రత్త. సినిమా రంగంలో ఉన్నాను కాబట్టి ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా సంరక్షించుకోవాలి. దీని కోసం నేను సాధారణ పద్ధతులను కొనసాగిస్తాను. ఇంట్లో తయారు చేసిన ఫేస్‌ప్యాక్‌లు వాడతాను, కొబ్బరి నూనె, ఆల్మండ్ ఆయిల్ వినియోగించడంతో పాటు ఆయుర్వేదిక్ పద్ధతులను పాటిస్తాను. మన సంస్కృతిలో ఇలాంటి ఎన్నో మంచి అలవాట్లు ఉన్నాయి. అప్పటి రోజులు ఎంత మంచివో.., అమ్మమ్మలు, నానమ్మల కాలంలో ఎలాంటి కాలుష్యం ఉండేదికాదు. రసాయనాలు లేని ఆహారం తినేవారు. అందుకే వారి మోములో సహాజ సౌందర్యం ఉట్టిపడేది. ఆ గ్లో నాకు చాలా ఇష్టం. ప్రస్తుత ఫాస్ట్ ఫుడ్ కల్చర్‌లో అలా బతకడం కాస్త కష్టమే కానీ ఎవరికి వారు వారి ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలి. ఈ తరాన్ని నేను వేడుకునేది కూడా ఇదే, మైండ్ మెడిటేషన్, యోగా చేయండి. పాజిటివ్ లైఫ్ పై అవగాహన పెంచుకోండి. నాలాగే మినరల్స్, విటమిన్స్ ఉన్నటువంటి ఆహారాన్ని స్వీకరించండి. హైదరాబాద్‌లో సౌందర్య రంగం, సినిమా రంగం గ్లోబల్ స్థాయిని చేరుకుంది. మోడ్రన్ లైఫ్‌స్టైల్ హబ్‌గా మారింది. దానిని ఆస్వాదిస్తూనే విభిన్న విధాలుగా మనల్ని మనం సంరక్షించుకోవడం చాలా ముఖ్యం. ఆల్ టైం ఫేవరెట్.. హైదరాబాద్ ఎప్పటికీ నా ఫేవరెట్ సిటీ. ఎన్నెన్నో మధురమైన అనుభవాలు, ఆనందాలు నగరంతో పెనవేసుకుని ఉన్నాయి. 17 ఏళ్లప్పుడు అనుకుంటా మొదటిసారి ఇక్కడికి వచ్చాను. సినీ ప్రయాణంలో భాగంగా ఈ నగరాన్ని నాకు కుటుంబంలా మార్చేసింది. ఇప్పటికీ నా బెస్ట్ ఫ్రెండ్స్‌ను కలవడానికే ఇక్కడికి వస్తుంటాను. నా తదుపరి సినిమాలతో మళ్లీ తెలుగు ప్రేక్షకులను చేరుకుంటున్నాను. ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మిరాయ్ సినిమాలో నటించాను. ఇందులో నా పాత్ర అందరికీ నచ్చుతుంది. మరో అద్భుతమైన ప్రాజెక్ట్ చంద్రయాన్. ఈ సినిమా కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాను. వినూత్నమైన సబ్జెక్ట్ ఇది. ఎంతో వైవిధ్యమున్న ఈ సినిమాలో నటించడం ఆనందంగా ఉంది. (చదవండి: ఓపెన్‌గా మాట్లాడేస్తా.. అంటే కుదరదు..! నటి శ్రుతి హాసన్ ఎదుర్కొన్న చేదు అనుభవం..) -
మనసును ‘స్కాన్’ చేసి వైద్యం నడిపిద్దాం
ఓ టీనేజీ అమ్మాయి అప్పటివరకూ అన్ని విధాలా ఆరోగ్యంగా ఉంది. కానీ అకస్మాత్తుగా కాళ్లు రెండూ చచ్చుబడ్డాయి. ఏమాత్రం కదల్లేకపోవడంతో వీల్‌చైర్‌కు పరిమితమైంది. కారణం తెలుసుకోడానికి చేయని పరీక్ష లేదూ... తీయని స్కాన్ లేదు. కానీ ఎందులోనూ ఏమీ కనిపించలేదు. ఎట్టకేలకు తెలిసిన విషయం డాక్టర్లనే అబ్బురపరచింది. ఆ మెడికల్ సీక్రెట్ ఏమిటో చూద్దాం. ఈ కథ ఓ మెడికల్ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎంతకూ క్లూయే దొరకని పరిశోధనాత్మకమైన సస్పెన్స్ స్టోరీని గుర్తుచేస్తుంది. రియా (పేరు మార్చాం) అనే ఓ పదిహేనేళ్ల చురుకైన అమ్మాయికి అకస్మాత్తుగా ఓ క్షణాన రెండు కాళ్లూ పడిపోయాయి. ఎంతకీ చలనం కలగలేదు. దాంతో అమ్మాయి వీల్ చైర్‌కే పరిమితం కావాల్సివచ్చింది. రియాను హాస్పిటల్‌కు తరలించారు. అపరాధ పరిశోధనల్లో నేరస్తుని జాడల కోసం వెతికినట్టుగా డాక్టర్లు ఓ అమ్మాయి జబ్బుకు కారణమైన ఆ అంశం కోసం పరిశోధనలు చేశారు... చేస్తూ పోయారు. రక్తపరీక్షలు చేశారు, ఎమ్మారైలు తీశారు. వాటి ద్వారా కండరాలను పరీక్షించారు. నరాలల్లోకి పరికించి చూశారు. ఇంకా ఇంకా అడ్వాన్స్డ్ పరీక్షలతో మెదడూ, వెన్నుముల్లోకి తరచి చూశారు. ఊహూ... కారణమెంతకూ దొరకలేదు. రియా చదువుల్లో సరస్వతి. స్కూలు వక్తృత్వపు పోటీల్లో మంచి వక్త. అంతేకాదు... మంచి మంచి పెయింటింగ్స్ కూడా వేసేది. అలాంటి అమ్మాయిని పేరు తెలియని జబ్బు హైజాక్ చేసేసింది. కాళ్లనొప్పితో ఎలాగో కుంటుతూ స్కూలు దాకా వెళ్లిన ఆ అమ్మాయి స్కూలు నుంచి తిరిగి వచ్చేసరికి ఆమె రెండు కాళ్లూ చచ్చుబడ్డాయి. రక్త పరీక్షలు చేశారు. ఏమీలేదు. ఇలా ఎన్ని పరీక్షలు చేసినా జబ్బు ఆచూకీ అంతు చిక్కలేదు. విటమిన్ లెవెల్స్, ఎలక్ట్రోలైట్స్ ఇలా ఎన్ని చికిత్సలు చేసినా ఫలితమూ దక్కలేదు. అప్పటివరకూ అక్షరాలా ‘తన కాళ్ల మీద తాను నిలబడ్డ’ ఆ అమ్మాయి తన స్వతంత్రతను కోల్పోయి మరొకరి మీద ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. దాంతో లంబార్ పంక్చర్ అనే వెన్నుముక గాటు పెట్టి అందులో నీరు తీసి చూసే చిట్టచివరి పరీక్షకు డాక్టర్లు సిఫార్సు చేశారు.రెండో ఒపీనియన్ కోసం... దేహానికి గాటు పెట్టి చేసి మరింత తీవ్రమైన పరీక్షలతో ఆమెను బాధించడానికి పూనుకునే ముందర ఎందుకోగానీ... రియా తల్లిదండ్రులు రెండో ఓపీనియన్ కోసం హైదరాబాద్‌లోని సుధీర్‌కుమార్ అనే న్యూరాలజిస్టును సంప్రదించారు. ఇతరత్రా పరీక్షలతో పాటు రిపోర్టుల్లో విటమిన్–బి12, విటమిన్ డీతోపాటు మెదడూ, వెన్నెముకా, నర్వ్ కండక్షన్ స్టడీస్... ఇలాంటివన్నీ పరిశీలిస్తున్న డాక్టర్గారికి ఎందుకో అనుమానం వచ్చి ‘హూవర్స్ సైన్’ అనే ఓ సునిశిత పరిశీలన చేశారు.ఏమిటీ హూవర్స్ సైన్ ? బాధితులను పడుకోబెట్టాక రెండు కాళ్ల మడమల కింద రెండు చేతులూ పెట్టి, బలహీనంగా ఉన్న ఓ కాలిని ప్రయత్నపూర్వకంగా ఎంతోకొంత పైకెత్తమని డాక్టర్లు అడుగుతారు. వాస్తవంగా కాళ్లలో పూర్తిగా చచ్చుబడిపోయిన వ్యక్తుల్లో ఓ కాలు కాస్త ఎత్తడానికి ప్రయత్నించినా రెండోకాలిలో ఎలాంటి చలనమూ ఉండదు. కానీ అది వాస్తవంగా చచ్చుబడిన కేసు కానప్పుడు బాధితులు ఓ కాలు ఎత్తడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మరో కాలిమీద బరువు/ఒత్తిడి పెరుగుతుంది. అంటే... కాలిని ఎత్తే ప్రయత్నంలో మరోకాలు వెనక్కెళ్తుండటంతో ఇలా జరుగుతుంది. (ఈ హూవర్స్ సైన్ (గుర్తు) అన్నది కాలు చచ్చుబడిపోయిన సందర్భంలో నిర్ధారణ కోసం చేసేది. ఇలాంటి హూవర్స్ సైన్స్ (గుర్తులు) ఊపిరితిత్తుల విషయంలో మరో రకంగా ఉంటాయి). దాంతో ఇది వాస్తవంగా కాళ్లు చచ్చుబడిపోయిన కేసు కాదనీ, ఆ కండిషన్‌ను అనుకరిస్తున్న (మిమిక్ చేస్తున్న కేసు) అని డాక్టర్‌కు అర్థమైంది. అంతా బాగున్నప్పటికీ ఆమె కాళ్లను కదలించలేకపోతోందంటే ఏదో మతలబు ఉంది.అది నటన కాదు... బాధితురాలు నటించడం లేదు... అయితే ఇక్కడ బాధితురాలు రియా నటిస్తోందని అనుకోడానికి వీల్లేదు. కాళ్లు పడిపోవడం జరగనప్పటికీ... మానసిక కారణాలతో కాళ్లను కదలించలేకపోతోంది. తన మానసిక సమస్య కారణంగా నిజంగానే ఆమె కాళ్లు కదిలించలేకపోతోంది. దీన్ని వైద్యపరిభాషలో ‘ఫంక్షనల్ న్యూరలాజికల్ డిజార్డర్ – ఎఫ్ఎన్డీ’ అంటారు. దీనికి కౌన్సెలింగ్ అవసరమని గ్రహించిన డాక్టర్ సుధీర్‌కుమార్ ఆమెతో ఏకాంతంగా మాట్లాడారు.అసలు కారణమిది... రియా కాస్త బొద్దుగా ఉండటంతో తోటి విద్యార్థినీ, విద్యార్థులు ఆమెను వెక్కిరిస్తుండేవాళ్లు. ఆమె బరువును చూసి గేలి చేస్తుండేవాళ్లు. దాంతో తీవ్రమైన వ్యాకులతకూ, మనఃక్లేశానికీ లోనైన ఆమె తనకు తెలియకుండానే ఇలాంటి కండిషన్‌కు గురైంది. అన్నీ నార్మల్‌గా ఉన్నా అనారోగ్యానికి గురయ్యే మానసిక సమస్య అని తేల్చారు డాక్టర్ సుధీర్‌కుమార్. ఇందులో నరాలకు సంబంధించిన అంశంతో పాటు మానసిక నిపుణులతో మల్టీ డిసిప్లినరీగా ప్రయత్నించాల్సిన సంక్లిష్టమైన కేసు. ఇది అర్థమయ్యాక ఆమెలో మానసిక స్థైర్యం నింపేలా అనేక స్పెషాలిటీలకు సంబంధించిన డాక్టర్లు సంయుక్తంగా చికిత్స మొదలుపెట్టారు.ఆర్నెల్ల తర్వాత... అన్ని చికిత్సలూ ఫలించడంతో రియా మామూలుగా మారింది. ఇప్పుడు తన కాళ్ల మీద తాను మళ్లీ నిలబడటంతో పాటు తన చేతుల్లోని కుంచెను కదిలించి అందమైన బొమ్మలు వేయడం మొదలుపెట్టింది. ఇప్పుడామె టీనేజ్ లైఫ్ తాను వేస్తున్న పెయింటింగ్స్ అందంగా అందులోని కలర్సంతగా రంగులమయంగా మళ్లీ మారిపోయింది. చివరగా... అందించాల్సిన ట్రీట్మెంట్ ఒక్కటే డాక్టర్ల బాధ్యత కాదు... సంక్లిష్ట సమయాల్లో అందించాల్సినవి... చికిత్సా, మందులతో పాటు అక్కడ నిజంగా అందాల్సినదీ, అవసరమైనదేమిటంటే... చక్కటి సానుభూతీ, చిక్కటి సహానుభూతి. – యాసీన్డాక్టర్లూ... ఇది వినండిఈ కేసు ద్వారా డాక్టర్లకూ ఓ సందేశమిస్తున్నారు డాక్టర్ సుధీర్‌కుమార్. అదేమిటంటే... కేవలం రిపోర్టులు చూసే ఓ నిర్ధారణకు రాకండి. బాధితులు చెప్పేది పూర్తిగా సానుభూతితో, సహానుభూతితో వినండి. అప్పుడు కొన్ని వాస్తవాలు తెలుస్తాయి.ఫంక్షనల్ డిజార్డర్లలో పేషెంట్స్ చేసేది నటించడం కానే కాదు. వాళ్ల బాధలు పూర్తిగా జెన్యూన్. వాళ్లు చెప్పేది పచ్చి వాస్తవం. క్లినికల్ పరీక్షల తర్వాత కూడా ఏ కారణాలూ తెలియకపోతే... వారిని కోసి చేసే పరీక్షలకూ, పొడిచి నిర్వహించాల్సిన ప్రోసీజర్లకు వెంటనే గురిచేయకండి. కాస్త చురుగ్గా, నిశితంగా ఆలోచించి ‘హూవర్స్ సైన్స్’ లాంటి వాటి గురించి మీ పరిధి దాటి (ఔట్ ఆఫ్ ద బాక్స్) ఆలోచించేలా ప్రయత్నించండి. దాంతో పేషెంట్స్‌ను బాధించి చేసే ఇన్వేజివ్ ఇన్వెస్టిగేషన్స్‌కు ముందే జబ్బు నిర్ధారణకు అవకాశం దొరుకుతుంది. ఒక వ్యక్తికి స్వస్థత చేకూర్చడం మీ ఒక్కరివల్లనే కుదరనప్పుడు టీమ్‌తో కలిసి... అంటే సైకాలజిస్టులూ, ఫిజీషియన్లూ, ఫిజియోథెరపిస్టుల తోపాటు అవసరమైతే టీచర్లూ, కుటుంబ సభ్యులందరూ బృందంగా టీమ్‌వర్క్‌తో తగిన చికిత్స అందించి, బాధితులు హాయిగా కోలుకునేలా చేయండి. డాక్టర్ సుధీర్‌కుమార్, సీనియర్ న్యూరో ఫిజీషియన్ (చదవండి: 'శంఖారావం' చేస్తే..ఆ వ్యాధి తగ్గిపోతుందట..! అధ్యయనంలో వెల్లడి) -
ఐస్‌క్రీం తింటూ పదికిలోలు తగ్గింది..! అదికూడా ఏఐ సాయంతో..!
వివిధ వ్యాధులకు మూలమైన అధిక బరువు ప్రస్తుతం అందర్నీ వేధించే పెనుసమస్యగా మారింది. బరువు తగ్గడం అనేది ఓ సవాలు. మాటల్లో చెప్పినంత సులవు కాదు తగ్గడం. స్ట్రాంగ్మైండ్ అచంచలమైన అంకితభావం ఉన్నవాళ్లే బరువు తగ్గడంలో విజయవంతమవ్వగలురు. అందుకోసం ఫిట్నెస్ నిపుణులు లేదా వ్యక్తిగత వైద్యులు సలహాలు సూచనలతో ప్రారంభించడం అనేది సర్వసాధారణం. కానీ ఇప్పుడు అరచేతిలో ప్రపంచాన్ని చూపించే ఏఐ సాంకేతికతను స్మార్ట్‌గా ఉపయోగించుకుంటూ ఆశ్చర్యపరిచేలా స్లిమ్‌గా అవుతున్నారు. సాంకేతికతను వాడోకవడం వస్తే..బరువు అనేది భారం కాదని ప్రూవ్ చేస్తున్నారు. ఇక్కడొక ఆరోగ్య నిపుణురాలు ఏఐ సాంకేతికను ఉపయోగించుకుంటూ.. తన కిష్టమైన ఐస్క్రింని త్యాగం చేయకుండానే బరువు తగ్గి చూపించింది. అది కూడా హాయిగా ఐస్‌క్రీంలు లాగించేస్తూనే ఎన్నికిలోలు తగ్గిందో వింటే నోరెళ్లబెడతారు.వెయిట్‌లాస్ జర్నీలో ఆహారాలు, వ్యాయామ షెడ్యూల్, జీవనశైలి తదితరాలు ఇతరులకు మార్గదర్శకంగా ఉంటాయి. కానీ ఈ మహిళ ఆరోగ్యకరంగా బరువు తగ్గేందుకు కృత్రిమ మేధ సాయాన్నితీసుకుంది. ఇది మనిషి సందేహాలను సత్వరమే నివృత్తిచేసి..గైడ్ చేయగలదని చాలామంది ప్రగాఢంగా నమ్ముతుండటం విశేషం. ఆ నేఫధ్యంలోనే ప్రముఖ ఆరోగ్యనిపుణురాలు సిమ్రాన్ వలేచా కూడా ఏఐ ఆధారిత చాట్‌జీపీటి సాయంతో తీసుకుని బరువు తగ్గేందుకు ప్రయత్నించింది. డిసెంబర్ 2024లో ఈ చాట్‌జీపీటీ(ChatGPT) సాయం తీసుకుని వెయిట్ లాస్ జర్నీని ప్రారంభించారామె. అయితే ఆమె తనకెంతో ఇష్టమైన ఐస్క్రీని అస్సలు త్యాగం చేయకుండా బరువు తగ్గానంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అంతేగాదు వెయిట్‌లాస్ కోసం చాట్‌జీపీటీతో మాట్లాడి ధైర్యంగా ముందడుగు వేయొచ్చని ధీమాగా చెప్పేస్తున్నారామె. ఇన్‌స్టా పోస్ట్‌లో సిమ్రాన్ ఇలా రాశారు. "ఐస్‌క్రీం తింటూనే పది కిలోలు తగ్గాను. అలాగే బరువు తగ్గాలనుకుంటే స్వంతంగా డైట్‌ని ఎంచుకోండి. అందుకోసం చాట్‌జీపీటీని ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి". అంటూ సవివరంగా తన వెయిట్ లాస్ జర్నీ గురించి వివరించింది.చాట్‌జీపీటీలో ఎలా అడగాలంటే..చాట్‌జీపీటీలో సిమ్రాన్ తన ఎత్తు, బరువు వివరాలను వెల్లడించినట్లు తెలిపింది. ఆరోగ్యకరంగా బరువు తగ్గాలనకుంటున్నా..అందుకోసం తీసుకోవాల్సిన ఆహారాలు, చిరుతిండ్లు వివరాలను ఇవ్వాల్సిందిగా కోరినట్లు పేర్కొంది. అలాగే తన పనిగంటలు, ఖాళీ సమయం వంటి వివరాలు కూడా ఏఐకి ఇచ్చినట్లు తెలిపింది. ఎన్నిగంటలు వ్యాయమానికి కేటాయించగలను అనేది కూడా ఇచ్చినట్లు తెలిపింది. అల్పాహారం దగ్గర నుంచి రాత్రి భోజనం వరకు ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తులు తీసుకోవాలో సవివరంగా తెలుసుకుని బరువు తగ్గానని పోస్ట్‌లో రాసుకొచ్చింది సిమ్రాన్. గమనిక: ఇక్కడ సాంకేతికత అనేది జస్ట్ ఆరోగ్యంపైన అవగాహన కల్పించగలదని, అదే కచ్చితమని భావించరాదని వైద్యలు హెచ్చరిస్తున్నారు. అది మనలను ఆరోగ్యంపై ఒక అవగాహన కల్పించే అప్లికేషన్ అని గుర్తించగలరు. వ్యక్తిగతంగా అనుసరించాలనుకుంటే వైద్యులను లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Simran - Health, Wellness & Weight Loss Expert (@simvalecha) (చదవండి: 'బ్యూటిఫుల్ బామ్మ'..! ఫిట్‌నెస్‌లో సరిలేరు ఈమెకెవ్వరూ..) -
82 ఏళ్ల వయసులోనూ ఫిట్‌గా అమితాబ్..! ఆ జాగ్రత్తలు తప్పనిసరి..
‘వయసు పైబడడం అనేది సహజం... వచ్చే సమస్యలు కూడా సహజం’ అని ఆరోగ్యాన్ని గాలికి వదిలేసేవారు కొందరు. ‘వయసు పైబడడం అనేది సహజమే అయినా, తగిన జాగ్రత్తలు తీసుకోవడం, వ్యాయామాలు చేయడం తప్పనిసరి’ అని ముందుకు వెళ్లేవారు కొందరు. బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ రెండో కోవకు చెందిన వ్యక్తి.తన ఆలోచనలను పర్సనల్ బ్లాగ్ ద్వారా ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటారు బిగ్ బి. 82 సంవత్సరాల అమితాబ్ తాజాగా వృద్ధాప్యానికి సంబంధించిన సవాళ్ల గురించి తన తాజా పోస్ట్‌లో రాశారు. ఇంట్లో ‘హ్యాండిల్ బార్స్’ అవసరం గురించి ప్రస్తావించారు.వృద్ధుల కోసం బాత్రూమ్లో, ఇంట్లోని కొన్ని చోట్ల హ్యాండిల్ బార్స్ లేదా గ్రాబ్ బార్స్ ఏర్పాటు చేస్తారు.‘మీట్–అండ్–గ్రీట్ విత్ ఫ్యాన్స్’లో భాగంగా అభిమానులను కలుసుకున్న తరువాత తన దినచర్య గురించి రాశారు బిగ్ బి.‘శరీరం క్రమేణా సమతుల్యత కోల్పోతోంది’ అని రాసిన బచ్చన్ తన ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెడుతున్నారు. యోగా, శ్వాస వ్యాయామాలు, మొబిలిటీ వ్యాయామాల ప్రాముఖ్యత గురించి తన పోస్ట్‌లో నొక్కి చెప్పారు.‘82 సంవత్సరాల వయసులోనూ ఇంత చురుగ్గా ఎలా ఉండగలుగుతున్నారు?’ అనే ప్రశ్నకు సోషల్ మీడియాలో ఆయన పోస్ట్‌లే సమాధానం చెబుతాయి. సందర్భానుసారంగా ఉన్నత జీవనశైలికి సంబంధించిన అలవాట్ల గుంచి ఎన్నో పోస్ట్‌లలో వివరించారు అమితాబ్.ఎన్నో అనారోగ్య సమస్యలను అధిగమించి ఉత్సాహంగా ముందుకు వెళుతున్న సూపర్ స్టార్ నిజమైన పోరాట యోధుడు. ఎంతోమందికి స్ఫూర్తినిచ్చే వ్యక్తి. (చదవండి: 'బ్యూటిఫుల్ బామ్మ'..! ఫిట్‌నెస్‌లో సరిలేరు ఈమెకెవ్వరూ..) -
డిజిటల్ డ్యామేజ్..! స్క్రీన్ టైం తగ్గించాల్సిందే..
ప్రస్తుత స్క్రీన్ వినియోగ దోరణులు ఇలాగే కొనసాగితే 2050 నాటికి దాదాపు 50% మంది పిల్లలు మయోపియాకు ప్రభావితమవుతారని ఆప్తాల్మిక్ – ఫిజియోలాజికల్ ఆప్టిక్స్ అంచనా. వినోదం నుంచి విద్య వరకూ డిజిటల్ స్క్రీన్లు వినియోగించడం అనేది నగర రోజువారీ జీవితంలో భాగమవుతోంది. దీంతో చిన్నారుల్లో కంటి సంబంధిత మయోపియా నుంచి డిజిటల్ కంటి ఒత్తిడి, నిద్రలోపాలు, ప్రవర్తనా మార్పుల వరకూ పలు అనారోగ్య సమస్యలు భారీగా పెరిగే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు, క్యూరియస్ జర్నల్ పరిశోధన ఫలితాలను ఉటంకిస్తూ ఇటీవల ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లల్లో 50% కంటే ఎక్కువ మంది డిజిటల్ కంటి ఒత్తిడి లక్షణాలను కలిగి ఉన్నారు. వీటిలో అలసట, తలనొప్పి, నిద్ర ఆటంకాలు, మానసిక పరమైన ప్రవర్తనా సమస్యలు ఉన్నాయి. ఇవి దీర్ఘకాలిక ఆరోగ్యంపై చూపే ప్రభావం గురించిన ఆందోళనలు పెంచుతున్నాయి.కఠిన పరిమితులు అవసరం.. ‘ప్రారంభంలోనే ఆరోగ్యకరమైన స్క్రీన్ అలవాట్లను పెంపొందించడం పిల్లల కంటి ఆరోగ్యాన్ని కాపాడటానికి కీలకం’ అని వైద్యులు చెబుతున్నారు. ‘కఠినమైన స్క్రీన్ సమయ పరిమితిని నిర్ణయించడం అనే అంశానికి తల్లిదండ్రులు కూడా మద్దతు ఇవ్వగలగడం ఆరోగ్యకరమైన మార్పుకు ఒక మార్గం. విద్యావేత్తలకు స్క్రీన్లు అవసరమైనప్పుడు, 20–20–20 నియమాన్ని అనుసరించండి. ప్రతి ఇరవై నిమిషాలకు, ఇరవై సెకన్ల విరామం తీసుకోండి. డిజిటల్ కంటి ఒత్తిడిని తగ్గించడానికి 20 అడుగుల దూరంలో ఉన్న దేనినైనా చూడండి. బ్లూ లైట్ ఫిల్టర్ మోడ్ ఉపయోగించడం కూడా కంటి ఆరోగ్యానికి సహాయపడుతుంది’ అంటూ సూచిస్తున్నారు. స్క్రీన్ టైం ప్రభావం.. ‘ఎక్కువసేపు స్క్రీన్ టైం వాడటం వల్ల పాఠశాల వయసు పిల్లలకు మయోపియా లేదా సమీప దృష్టి లోపం కలుగుతోంది. ఈ మయోపియా వేగంగా అభివృద్ధి చెందడం వల్ల మెల్లకన్ను, పొడి కంటి వ్యాధి, కంటి డిజిటల్ ఒత్తిడి ప్రమాదం ఎక్కువవుతుంది’ అని కంటి వైద్య నిపుణులు అంటున్నారు. ‘స్క్రీన్ నుంచి వెలువడే నీలి కాంతి విభిన్న రకాల ముప్పును కలిగిస్తుంది. ఫ్రీ రాడికల్స్ కారణంగా రెటీనాకు నష్టం కలిగించడం, మెలటోనిన్‌ను అణచివేయడం వల్ల నిద్రకు భంగం కలుగుతుంది. తద్వారా మొత్తం ఆరోగ్యం ప్రభావితం అవుతుందని వివరిస్తున్నారు. (చదవండి: వ్యాధులు.. ప్రభావాలు! కంటిపై 'కన్నేస్తాయి'..) -
కబూతర్..! ఖానా కహానీ..
ప్రేమ చిహ్నాలుగా వర్థిల్లిన పావురాలే పలు రకాల వైరస్ వ్యాప్తికి కారకాలుగా మారుతున్నాయి. నగరాల్లోనూ వీటి సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న నేపథ్యంలో అనారోగ్య సమస్యలూ, ఊపిరితిత్తుల సమస్యలు అధికమవుతున్నాయి. దీంతో వాటికి ఆహారాన్ని అందించడాన్ని ఇటీవలే ముంబయి, పుణె వంటి నగరాలు నిషేధించాయి. నగరంలో కూడా పావురాల సంఖ్య, వాటికి ఆహారం అందించే అలవాటు పెరుగుతున్న నేపథ్యంలో నగరంలో పావురాల ఫీడింగ్ అంశం చర్చనీయాంశంగా మారింది. గతంలో ముంబైలోని ఒక అపార్టుమెంట్లో చోటు చేసుకున్న పావురాల సమస్య రెండు కుటుంబాల మధ్య ఘర్షణకు దారితీసింది. అనంతరం ఆ సమస్య ఏకంగా కోర్టు గడప కూడా తొక్కింది. అయితే ఆ స్థాయికి చేరకున్నా.. మన నగరంలోనూ నిత్యం ఇదే అంశంపై నగరవాసుల్లో వాదోపవాదాలు నడుస్తూనే ఉన్నాయి. పావురాల వల్ల మనుషులకు కలిగే అనారోగ్యాలపై అవగాహన పెరగడమే దీనికి కారణం. నగరంలో అలవాటుగా.. హాబీగా పావురాలకు ఆహారం వేసేవారితో పాటు మతపరమైన లేదా మరే ఇతర కారణాల వల్ల కూడా నగరంలో పావురాల ఫీడింగ్ సర్వసాధారణంగా మారింది. బహిరంగ ప్రదేశాల్లో వందలాది పావురాలు గుంపులుగా వస్తాయి. ప్రతి రోజూ ఉదయం వేళల్లో ప్రజలు ఈ పావురాలకు ఆహారం ఇవ్వడం సర్వసాధారణం. ట్యాంక్ బండ్, నాంపల్లి, సికింద్రాబాద్‌లోని క్లాక్ టవర్.. ఇలా పలు చోట్ల పావురాల ఫీడింగ్ నిత్యం కనిపించే అంశాలు. ఇలా ఫీడింగ్ చేసేవారి కోసం గింజలు, ఇతర ఆహార ఉత్పత్తులు విక్రయించే వారు కూడా పుట్టుకొచ్చారంటే అర్థం చేసుకోవచ్చు ఫీడింగ్ ఏ విధంగా జరుగుతుందో. అవగాహన పెరగాలి.. ‘పావురాల విసర్జన ప్రజల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందనే విషయం తెలియక చాలా మంది పక్షులకు ఆహారం ఇస్తారు’ అని నగరానికి చెందిన ఒక స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు సబా క్వాద్రి అంటున్నారు. అంతేకాదు పావురాలు, ఇతర పక్షులకు కూడా ఇది శాపంగా మారుతోంది. ‘ఇతర పక్షులను ఆకర్షించడానికి కొన్ని గింజలను బయట పెడుతాం. కానీ పావురాలు ఆ ప్రాంతాలను హైజాక్ చేసి ఇతర పక్షులకు ఉద్దేశించిన ఆహారాన్ని దక్కించుకుంటాయి’ అని సబా వెల్లడించారు. ముంబై వంటి నగరాల్లో చేసినట్లుగానే, పావురాలకు ఇష్టారాజ్యంగా ఆహారం అందించడాన్ని నివారించేందుకు జరిమానా విధించడమే మంచిదని ఆమె సూచిస్తున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం వంటి ప్రాంతాల్లో గణనీయమైన సంఖ్యలో పావురాలు ఉంటున్నాయి. ‘విశ్వవిద్యాలయ వీధులను శుభ్రం చేసే స్వీపర్ల నుంచి భవనాల్లో నివసించే విద్యార్థుల వరకు, చాలా మంది పావురాల బిందువుల ద్వారా సంక్రమించే వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది’ అని వర్సిటీ ఉద్యోగి ఒకరు చెప్పారు. ఉదయం వేళల్లో పావురాలకు ఆహారం ఇవ్వొద్దని చెప్పేందుకే ఓయు ప్రత్యేకంగా ఒక భద్రతా అధికారిని నియమించిందని సదరు ఉద్యోగి వివరించారు. అంతేకాక వర్సిటీ భవనాల వెలుపల పావురాలకు ఆహారం ఇవ్వడం వల్ల కలిగే ప్రమాదాల గురించి తెలియజేసే బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. విసర్జన.. విషమౌతోంది.. పావురాల ప్రభావానికి ముఖ్యంగా విసర్జనకు ఎక్కువ కాలం గురికావడం వల్ల వివిధ రకాల హానికరమైన శిలీంధ్రాలు, బ్యాక్టీరియా పరాన్నజీవులు ఉత్పత్తి అవుతాయని, ఫలితంగా ఇన్ఫెక్షన్లు, పలు రకాల వైరస్లు వ్యాప్తి చెందుతాయని వైద్యులు చెబుతున్నారు. విసర్జనాలు ఎండిపోయినప్పుడు, అవి దుమ్ము రూపంలో గాలిలోకి ఎగిరి, ఊపిరి తీసుకునే సమయంలో గాలి ద్వారా మానవ శరీరంలోకి ప్రవేశించి ఊపిరితిత్తులను చేరతాయి. ఈ క్రమంలోనే హైపర్సెన్సిటివిటీ న్యుమోనైటిస్కు కారణమవుతోంది. ఇది కొన్ని పరిస్థితుల్లో ప్రాణాంతకం కావచ్చు. ఈ ఇన్ఫెక్షన్లు పెంపుడు కుక్కలు, పిల్లుల వెంట్రుకల ద్వారా వచ్చే అలెర్జీల కంటే కూడా ప్రమాదకరంగా ఉంటాయి. పావురాల విసర్జన ఊపిరితిత్తుల వాపుకు కారణమవుతాయి. ఒక్కోసారి అవయవాలకు శాశ్వత నష్టాన్ని కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇన్ఫెక్షన్.. ఎలా గుర్తించాలి? పావురాల విసర్జన వల్ల సోకే ఇన్ఫెక్షన్ తీవ్రత అధికంగా ఉంటుంది. ప్రారంభ దశలో నిరంతరం పొడి దగ్గు వస్తుంది. దీనికి యాంటీబయాటిక్స్, బ్రోంకోడైలేటర్లను ఉపయోగించినా ఉపశమనం దొరకదు. దగ్గు రెండు నుంచి మూడు వారాల కంటే ఎక్కువ కాలం కొనసాగిన క్రమంలో తదుపరి పరీక్షల కోసం పల్మనాలజిస్ట్‌ను సంప్రదించాల్సి ఉంటుంది.పలు దేశాల్లోనూ.. వెనిస్ నగరంలోని చారిత్రాత్మక చతురస్రాల్లో పావురాలకు ఆహారం నిషేధించారు. ఈ ఫీడింగ్‌కు సింగపూర్ భారీ జరిమానాలు విధిస్తోంది. అలాగే న్యూయార్క్, లండన్ కూడా దాణా ప్రదేశాలను నియంత్రించాయి. మన దేశంలో ముంబై, థానె, పుణెలో కేసులు నమోదు చేస్తున్నారు. ఢిల్లీలో కూడా పావురాల ఫీడింగ్ను నియంత్రించే దిశగా చర్యలు తీసుకోనుందని తెలుస్తున్న నేపథ్యంలో మన నగర పరిస్థితి ఏమిటని పలువురు నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. -
వ్యాధులు.. ప్రభావాలు! కంటిపై 'కన్నేస్తాయి'..
‘కన్ను లేనిదే కలికాలమే లేద’ని సామెత. అయితే వ్యాధుల్లేకుండా కూడా ఈ కలికాలం లేదు. పైగా ఈ వ్యాధులన్నీ అంతటి కీలకమైన కంటిని దెబ్బతీసే అవకాశం లేకపపోలేదు. డయాబెటిస్, రక్తపోటు వంటివి కనిపించినప్పుడు ఇంకేవైనా అవయవాలు దెబ్బతిన్నాయో చూడటంతోపాటు డాక్టర్లు కంటి పరీక్షలూ విధిగా నిర్వహిస్తారు. అలాగే మైగ్రేన్ మొదలుకొని థైరాయిడ్, రక్తహీనత (అనీమియా) వరకు ఎన్నో రకాల వ్యాధులు కంటి చూపుపై తమ దుష్ప్రభావాన్ని చూపే అవకాశముంది. అందుకే నేరుగా కంటికి వచ్చే ఆరోగ్య సమస్యలతోపాటు ఇతర వ్యాధుల వల్ల కంటిపై పడే దుష్ప్రభావాలు ఎలా ఉంటాయో, వాటి వల్ల కంటికి వచ్చే సమస్యలేమిటో తెలుసుకుందాం...ఎవరిలోనైనా ఏదైనా వ్యాధి వచ్చిందంటే చాలా సందర్భాల్లో అది ఆ అవయవానికో లేదా ఆ అవయవం ఏ వ్యవస్థదైతే ఆ వ్యవస్థకు మాత్రమే పరిమితమని అపోహ పడుతుంటాం. ఉదాహరణకు రక్తహీనత ఏర్పడిందంటే... అది రక్తం సరఫరా అయ్యే అన్ని అవయవాలతో పాటు కంటిపైనా తన దుష్ప్రభావాన్ని చూపవచ్చు. ఇక థైరాయిడ్‌కు ఏదైనా జబ్బు వస్తే అది థైరాయిడ్‌కు మాత్రమే పరిమితం కాక΄ోవచ్చు. అలా కంటిపై ప్రభావం చూపేందుకు అవకాశమున్న కొన్ని ఆరోగ్య సమస్యలూ, వ్యాధులు, కండిషన్స్ తాలూకు ఉదాహరణలు... డయాబెటిస్ రక్తపోటు థైరాయిడ్రక్తహీనత (అనీమియా) ∙కొలాజెన్ వాస్క్యులార్ డిసీజ్ ∙ఆటోఇమ్యూన్ డిసీజెస్ ∙కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ కొన్ని ట్యూమర్లు (గడ్డలు) ∙వంశపారంపర్యంగా వచ్చే కొన్ని రకాల (హెరిడిటరీ) వ్యాధులు. ఇవి మాత్రమే కాదు... మనం వాడే కొన్ని రకాల మందులు, మన హార్మోన్లలో చోటుచేసుకునే అసమతౌల్యతలు... ఇవి కూడా కంటిపైన దుష్ప్రభావాలను చూపవచ్చు. అందుకే కొన్ని వ్యాధులు ఉన్నవారు, కొన్ని మందులు తీసుకునేవారు విధిగా వాటి వల్ల తమ కంటిపై ఏదైనా చెడు ప్రభావాలు కనిపిస్తాయా అని తెలుసుకోవాలి. అలాంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టరును సంప్రదించాలి. కొన్ని జబ్బులూ... కంటిపై అవి చూపే దుష్ప్రభావాలు...డయాబెటిస్ఈరోజుల్లో ఇంటికి ఒకరికైనా ఉండే లైఫ్‌స్టైల్ వ్యాధి ఇది. ఈ సమస్య వచ్చినవారిలోని కనీసం 20 శాతం మందిలో దాని దుష్ప్రభావాలు కంటిపైనా పడే అవకాశాలుంటాయి. డయాబెటిస్ వల్ల కంటికి వచ్చే వ్యాధులివే...డయాబెటిక్ రెటినోపతి : కంటివెనక ఉండే రెటీనా అనే తెరపై పడే ప్రతిబంబం నుంచి మెదడుకు సిగ్నల్స్ అందడం వల్లనే మనం చూడగలం. డయాబెటిస్ కారణంగా రక్తనాళాలు మొద్దుబారడంతో రెటినాకు అందాల్సిన పోషకాలు, ఆక్సిజన్ అందకపోవడంతో రెటీనా పనితీరు క్రమక్రమంగా తగ్గే అవకాశముంటుంది. ఫలితంగా దృష్టిలోపం వచ్చే ముప్పు ఉంటుంది. అందుకే డయాబెటిస్తో బాధపడుతున్నవారు క్రమం తప్పకుండా కంటి పరీక్షలూ, కంటి నరాలు మొద్దుబారుతున్నాయా అన్న విషయాన్ని క్రమం తప్పకుండా పరీక్షించుకుంటూ ఉండాలి. గ్లకోమా : డయాబెటిస్ ఉన్నవారికి కంట్లో నల్లముత్యం లేదా నీటికాసులు అనే గ్లకోమా బారిన పడే ముప్పు ఉంటుంది. గ్లకోమా ఉన్నవాళ్లలో కంట్లో ఉండే ఇంట్రా ఆక్యులార్ ప్రెషర్ అనే ఒత్తిడి పెరిగి మనం చూసే దృష్టి విస్తృతి (ఫీల్డ్ ఆఫ్ విజన్) క్రమంగా తగ్గి΄ోతుంది. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు గ్లకోమా కండిషన్ ఏమైనా వచ్చిందా అని తరచూ కంటి డాక్టర్ చేత పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. క్యాటకార్ట్ : కంట్లోని లెన్స్ తన పారదర్శకతను కోల్పోయే కండిషన్‌ను కాటకార్ట్ అంటారన్న విషయం తెలిసిందే. వయసు పెరగడమే (ఏజింగ్ మాత్రమే) కాకుండా డయాబెటిస్ వల్ల కూడా కాటకార్ట్ వచ్చే అవకాశమున్నందువల్ల చక్కెర వ్యాధితో బాధపడేవారు క్యాటరాక్ట్‌కు సంబంధించిన పరీక్షలూ చేయించుకోవాలి. ఎందుకంటే సాధారణ ఆరోగ్యవంతులతో పోలిస్తే డయాబెటిస్ ఉన్నవాళ్లకు క్యాటరాక్ట్ పదేళ్లు ముందుగానే వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. ఆప్టిక్ న్యూరోపతీ : డయాబెటస్ వల్ల నరాలు మొద్దుబారి తమ చైతన్యాన్ని కోల్పోతాయన్న విషయం తెలిసిందే. అన్ని నరాలతో పాటు ఆప్టిక్ నర్వ్‌కు కూడా ఈ ముప్పు పొంచి ఉంటుంది. మిగతా నరాల విషయం ఎలా ఉన్నా చూపునిచ్చే ఆప్టిక్ నర్వ్ దెబ్బతింటే జీవితమంతా చీకటయ్యే ముప్పు ఉన్నందున డయాబెటిస్ ఉన్నవారు తప్పనిసరిగా క్రమం తప్పకుండా కంటిపరీక్షలు చేయించుకుంటూ ఉండాలి.పాటించాల్సిన సూచనలు / తీసుకోవాల్సిన జాగ్రత్తలు / చికిత్సలు...డయాబెటిస్ ఉన్నవారు క్రమం తప్పకుండా మందులు వాడుతూ, వ్యాయామం చేస్తూ రక్తంలో చక్కెర మోతాదులను ఎప్పుడూ అదుపులో పెట్టుకుంటూ ఉండటం క్రమం తప్పకుండా తమ వ్యక్తిగత వైద్యులతో పాటు కంటి డాక్టర్ ఫాలో అప్‌లో ఉండటం.రక్తపోటు (హైపర్‌టెన్షన్)రక్తపోటు ఉన్నవారిలో కొందరికి అకస్మాత్తుగా చూపు కొంత మసకబారవచ్చు. లేదా దాదాపుగా చూపు కనిపించకపోవచ్చు. దీనికి అనేక కారణాలుంటాయి. రక్తపోటు కారణంగా... రెటీనాకు సంబంధించిన ప్రధాన రక్తనాళం (సిర)లోగానీ లేదా ఇతరత్రా ఏదైనా చిన్న రక్తనాళం (బ్రాంచ్ ఆఫ్ బ్లడ్ వెసెల్)లోగానీ రక్తం గడ్డకట్టి క్లాట్ ఏర్పడి అది అడ్డుపడే ముప్పు ఉండవచ్చు. రెటీనాకు సంబంధించిన ప్రధాన ధమని లేదా ధమని శాఖలో రక్తం గడ్డకట్టి రక్తప్రవాహానికి ఆ క్లాట్ అడ్డుపడవచ్చు. ఆప్టిక్ న్యూరోపతి అనే నరాలకు సంబంధించిన సమస్య రావచ్చు.కన్నులోని ఒక భాగమైన విట్రియల్ ఛేంబర్లో రక్తస్రావం కావచ్చు. గ్లకోమా వచ్చే ముప్పు కూడా ఉంటుంది.పాటించాల్సిన సూచనలు / తీసుకోవాల్సిన జాగ్రత్తలు / చికిత్సలు...రక్తపోటు ఉన్నవారు బీపీని అదుపులో ఉంచే ప్రయత్నాలు చేస్తుండాలి ఉప్పు, నూనె పదార్థాలు చాలా తక్కువగా తీసుకోవాలి కంటికి సంబంధించిన సమస్య వస్తే మందులు వాడటం లేదా లేజర్ చికిత్స లేదా శస్త్రచికిత్స చేయించుకోవాలి. డిస్లిపిడేమియారక్తంలో ఉండే కొన్ని రకాల కొవ్వు పదార్థాలు (ఉదా: కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరాయిడ్స్ వంటివి) ఉండాల్సిన మోతాదుల్లో కాకుండా హెచ్చుతగ్గులతో ఉన్నప్పుడు కంటి సమస్యలు రావచ్చు. అవి చూపును ప్రభావితం చేసే అవకాశం ఉంది.పాటించాల్సిన సూచనలు / తీసుకోవాల్సిన జాగ్రత్తలు / చికిత్సలు... కొవ్వులు తక్కువగానూ, పీచు ఎక్కువగానూ ఉండే ఆహారపదార్థాలు తీసుకోవాలి తాము తీసుకున్న కొవ్వులు దహనమయ్యేలా (బర్న్) అయ్యేలా వ్యాయాయం చేయాలి డాక్టర్లు కొవ్వుల మోతాదులను తగ్గించే మందులు సూచిస్తే వాటిని తప్పక వాడాలి. రక్తహీనత (అనీమియా)మన రక్తంలో ఉండే ఎర్ర రక్తకణాలే దేహంలోని అన్ని కణాలకూ అవసరమైన ఆక్సిజన్‌నూ, పోషకాలను మోసుకెళ్తుంటాయన్న విషయం తెలిసిందే. అనేక రకాల కారణాలతో కొంతమందిలో ఈ ఎర్రరక్తకణాల సంఖ్య (ఆర్బీసీ) తక్కువగా ఉండే కండిషన్‌ను రక్తహీనత (అనీమియా) అంటారు. మరికొందరిలో రరక్తకణాల సంఖ్య తగినంతగా ఉన్నా ఆక్సిజన్‌ను మోసుకు΄ోయే హిమోగ్లోబిన్ తక్కువగా ఉండవచ్చు. ఇలా రక్తహీనత ఉన్నవారిలో ఈ కింది లక్షణాలు కనిపిస్తాయి. రెటీనాపై రక్తస్రావం (రెటినల్ హేమరేజ్) కంటిలోని లెన్స్ తన పారదర్శకత కోల్పోవడం నరాల సమస్య వంటివి.పాటించాల్సిన సూచనలు / తీసుకోవాల్సిన జాగ్రత్తలు / చికిత్సలు... అనీమియాను తగ్గించే ఐరన్ టాబ్లెట్లు / ఐరన్ సప్లిమెంట్లు ఉన్న మందులు వాడటం ∙ఐరన్, ఇతరత్రా విటమిన్లు, ఇతర పోషకాలు సమృద్ధిగా ఉండే ఆహారాలు తీసుకోవడం. మైగ్రేన్ఇది ఒక రకం తలనొప్పి. తరచూ వస్తూ పోతూ... చాలా తీవ్రంగా బాధించే ఈ తలనొప్పి చాలామందిలో నుదుటికి ఒకవైపే రావచ్చు. అందుకే కొందరు దీన్ని పార్శ్వపు నొప్పి అని కూడా పిలుస్తారు. టీనేజ్ పిల్లల్లో తీవ్రంగా వచ్చి వాళ్ల చదువుపై కూడా ప్రభావం చూపే ఈ నొప్పిలో కన్ను కూడా చాలా నొప్పిగా ఉన్నట్లుగా అనిపిస్తుంటుంది. దాంతో పాటు కంటికి సంబంధించిన ఈ కింద లక్షణాలూ కనిపిస్తాయి. అవి... చూపు సరిగా కనిపించకుండా మసకమసగ్గా కనిపించడం నుదుటి మీద ఒకవైపున లేదా ఒక పక్క కన్నుగుడ్డులో తీవ్రమైన నొప్పి ఉండటం తాత్కాలికంగా చూపు తగ్గడం లేదా తాత్కాలికంగా ఏమీ కనిపించకపోవడం కంటి కండరాలకూ, కనురెప్పలకూ తాత్కాలికంగా పక్షవాతం రావడం. పాటించాల్సిన సూచనలు / తీసుకోవాల్సిన జాగ్రత్తలు / చికిత్సలు...కొన్ని అంశాలు మైగ్రేన్ తలనొప్పిని తక్షణం ప్రేరేపిస్తాయి. ఉదాహరణకు కొన్ని రకాల సుగంధద్రవ్యాల వాసనా లేదా అగరుబత్తీల వాసనలు మైగ్రేన్‌ను ప్రేరేపించి వెంటనే తలనొప్పి వచ్చేలా చేస్తాయి. ఇలా మైగ్రేన్ తలనొప్పిని ప్రేరేపించే అంశాలను ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ అంటారు. తమకు తలనొప్పి ఏ అంశం వల్ల వస్తుందో గుర్తించి దాని నుంచి దూరంగా ఉండటం వల్ల దీన్ని చాలావరకు నివారించవచ్చు. ఇక మైగ్రేన్‌కు సంబంధించి డాక్టర్లు రెండురకాల చికిత్సలు చేస్తారు. మొదటిది... నొప్పి తక్షణమే తగ్గేందుకు చేసే చికిత్స, రెండోది దీర్ఘకాలంలో ఈ నొప్పి మళ్లీ మళ్లీ రాకుండా నివారించేందుకు ఇచ్చే ప్రివెంటివ్ చికిత్స. ఈ రెండు రకాల ఈ మందులను బాధితులు తప్పనిసరిగా వాడాలి. గుండెజబ్బులుకొన్ని రకాల గుండెజబ్బులు (కార్డియోవాస్క్యులార్ డిసీజెస్) కూడా కంటిపై దుష్ప్రభావాన్ని చూపవచ్చు. గుండెజబ్బుల కారణంగా కొందరిలో ఈ లక్షణాలు కనిపించవచ్చు. ఉదాహరణకు... అకస్మాత్తుగా చూపు మందగించడం తాత్కాలికంగా చూపు కోల్పోవడం కంటి చూపునకు / దృష్టిజ్ఞానానికి సహాయపడే నరానికి (ఆప్టిక్ నర్వ్‌కు) సంబంధించిన సమస్యలు.పాటించాల్సిన సూచనలు / తీసుకోవాల్సిన జాగ్రత్తలు / చికిత్సలు...అసలు సమస్యకు (అండర్లైయింగ్ హార్ట్ ప్రాబ్లమ్‌కు) చికిత్స తీసుకోవడం వల్ల దాని కారణంగా వచ్చే కంటి సమస్యలూ తగ్గుతాయి. అలాగే తరచూ కంటి పరీక్షలూ చేయించుకుంటూ ఉండాలి. సోరియాసిస్సోరియాసిస్ వ్యాధిలో చర్మం పొడిబారి పట్టు రాలుతున్నట్లుగా ఉంటుంది. సొంత రోగ నిరోధకశక్తి బాధితులపై ప్రతికూలంగా పనిచేయడంతో పాటు మరికొన్ని కారణాలతో వచ్చే ఈ జబ్బులో కన్ను కూడా ప్రభావితమయ్యే అవకాశాలుంటాయి. ఈ జబ్బు ఉన్నవాళ్లలో...రెటీనాకూ, తెల్లగుడ్డులో భాగమైన స్క్లెరాలరా ΄÷రకు మధ్య ఇన్ఫ్లమేషన్ రావడం (యువైటిస్) కార్నియాకు ఇన్ఫ్లమేషన్ రావడం (కెరటైటిస్), కంటిలో ఉండే కంజెంక్టివా అనే పొరకు ఇన్ఫెక్షన్ రావడం (కంజెక్టివైటిస్), కన్ను పొడిబారడం (డ్రై ఐ) వంటి లక్షణాలు కనిపించవచ్చు.పాటించాల్సిన సూచనలు / తీసుకోవాల్సిన జాగ్రత్తలు / చికిత్సలు...సోరియాసిస్‌కు ఇప్పుడు గతంలో కంటే అధునాతనమైన చికిత్స ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు పూవా, గతంలో మాదిరిగా అల్ట్రావయొలెట్ రేడియేషన్ కిరణాలతో ఇచ్చే చికిత్సలు, ఇమ్యూనోమాడ్యులేటర్స్ అనే ఆధునిక తరహా చికిత్సలు. వీటిని తీసుకుంటూనే ఒకసారి కంటి వైద్యుడిని కూడా సంప్రదించాలి.కొలాజెన్ వ్యాస్క్యులార్ డిసీజెస్ కొలాజెన్ అనేది శరీరంలోని ఒకరకం ప్రోటీన్లతో కూడిన కణజాలం. మన రోగనిరోధక శక్తి మన కణజాలాన్నే శత్రువుగా పరిగణించి మన కొలాజెన్ ప్రోటీన్లపై దాడి చేయడం వల్ల కొన్ని వ్యాధులు కనిపిస్తాయి. వాటన్నింటినీ కలిపి కొలాజెన్ వ్యాస్క్యులార్ డిసీజెస్‌గా చెబుతారు. ఆ వ్యాధులేమిటంటే... సిస్టమిక్ లూపస్ అరిథమెటోసిస్ (ఎస్‌ఎల్‌ఈ) ∙కీళ్లనొప్పులు (జాయింట్‌పెయిన్స్) రుమటాయిడ్ ఆర్థరైటిస్ వెజెనెర్స్ గ్రాన్యులొమాటోసిస్ వంటి వ్యాధులు. ఎస్‌ఎల్‌ఈ (లూపస్) : లూపస్ అంటే వుల్ఫ్ (తోడేలు) అని అర్థం. ముఖం మీద ముక్కుకు ఇరువైపులా మచ్చతో కనిపించే వ్యాధి తాలూకు ఒక లక్షణం. ఇది శారీరక వ్యవస్థలపై ప్రభావం చూపుతుంది కాబట్టి దీన్ని సిస్టమిక్ లూపస్ అరిథమెటోసస్ (ఎస్‌ఎల్‌ఈ) అని చెబుతారు. లక్షణాలు... ముక్కుపై నుంచి చెంపలపైన ఇరువైపులా మచ్చల్లా కనిపించే దద్దుర్లలా (ర్యాష్) వస్తుంది. సూర్యకాంతి (ఫోటోసెన్సిటివిటీతో) వల్ల ఈ ర్యాష్ మరింత పెరగవచ్చు. పాలిపోయినట్లుగా ఉండే చర్మం ∙కొందరిలో వెంట్రుకల మూలాలు మూసుకుపోవడం (లూపస్‌లో ఇది ఒక రకం). దీన్ని డిస్కాయిడ్ లూపస్ అంటారు. ఇది వచ్చిన వారిలో ర్యాష్ చేతులు, ముఖం మీద వస్తుంది. కొన్నిసార్లు ఒళ్లంతా ర్యాష్ కూడా రావచ్చు కారణం తెలియని జ్వరం ∙బరువు తగ్గడం కాళ్లూ చేతులకు సంబంధించిన రెండు మూడు జాయింట్స్‌లో వాపు; రుమటాయిడ్ జబ్బుల్లోలా లూపస్‌లో జాయింట్స్ వాపు వచ్చి జాయింట్స్ ఒంగిపోతాయి. అయితే... రుమటిజంలోలా ఈ ఒంపు వల్ల శాశ్వత అంగవైకల్యం రాదు. ఇది కేవలం తాత్కాలికం. కొందరు డిప్రెషన్‌తో ఉద్వేగాలకు లోనవుతుంటారు. వీళ్ల సమస్యను మానసికమైన లేదా నరాలకు సంబంధించినదిగా పొరపాటు పడే అవకాశం ఉంది. ఇలాంటి వాళ్లలో ఏఎన్ఏ పరీక్ష నిర్వహించి– లూపస్ వల్ల మెదడుపై ఏదైనా దుష్ప్రభావం పడిందేమోనని పరీక్షించాలి. కొందరిలో ఫిట్స్ కొందరిలో జుట్టు రాలడం మరికొందరిలో నోటిలో, ముక్కులో పుండ్లు (అల్సర్స్) కూడా రావచ్చు. ఈ అల్సర్స్ వల్ల నొప్పి ఉండదు. ఇక ఈ వ్యాధుల వల్ల కంటిపై పడే దుష్పరిణామమేమిటంటే... అరుదుగా కొందరిలో కళ్లలో రక్త΄ోటు పెరిగి (హేమరేజిక్ రెటినైటిస్) అంధత్వానికి దారితీయవచ్చు. కొందరిలో కంటి చూపు క్రమంగా తగ్గుతూ ఉండవచ్చు. వీటన్నింటితో పాటు కళ్లకు సంబంధించి కన్ను పొడిబారడం (డ్రై ఐ); రెటీనాకూ, తెల్లగుడ్డులో భాగమైన స్క్లెరా పొరకు మధ్య ఇన్ఫ్లమేషన్ రావడం (యువైటిస్); స్క్లెరా పొరకు ఇన్ఫ్లమేషన్; కార్నియాకు ఇన్ఫ్లమేషన్ రావడం (కెరటైటిస్) వంటి సమస్యలు రావచ్చు.పిల్లల్లోనూ... పిల్లల్లోనూ లూపస్ రావచ్చు. దీన్ని జువెనైల్ సిస్టమిక్ లూపస్ అని అంటారు. పిల్లల్లో జ్వరం వచ్చి రెండు మూడు కీళ్లలో వాపు రావడం ద్వారా ఇది కనిపిస్తుంది. ఎండను చూడలేక బాధపడుతుండే పిల్లల విషయంలో జువెనైల్ లూపస్ ఉందేమోనని అనుమానించి పరీక్షలు చేయించడం ముఖ్యం. పిల్లల్లో వచ్చినప్పుడు (నియోనేటల్ లూపస్)–పుట్టుకతోనే గుండె కవాటాలలో లోపం (కంజెనిటల్ హార్ట్ బ్లాక్) రావచ్చు. ఇలా పిల్లల్లో లూపస్ వస్తే అది కళ్లపై దుష్ప్రభావం చూపుతుంది కాబట్టి స్కూళ్లకు వెళ్లే వయసు పిల్లల్లో ప్రతి ఆర్నెల్లకు ఓమారు వైద్యపరీక్షలు, కంటి పరీక్షలు (మాక్యులార్ టెస్ట్) చేయించడం మంచిది.పాటించాల్సిన సూచనలు / తీసుకోవాల్సిన జాగ్రత్తలు / చికిత్సలు : ప్రధానమైన సమస్యలైన సిస్టమిక్ లూపర్ అరిథమెటోసిస్ (ఎస్‌ఎల్‌ఈ), కీళ్లనొప్పులు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి సమస్యలకు చికిత్స తీసుకోవడంతో పాటు కంటికి సంబంధించిన సమస్యలకూ తగిన చికిత్స తీసుకోవాలి. ఇక పిల్లల్లో జువెనైల్ సిస్టమిక్ లూపస్‌ను గుర్తించడం సాధ్యం కాదు కాబట్టి స్కూల్ పిల్లలందరికీ కంటివైద్యుల ద్వారా ప్రతి ఆర్నెల్లకోమారు పరీక్షలు చేయించడం అవసరం. డాక్టర్ రవికుమార్ రెడ్డి, సీనియర్ కంటి వైద్య నిపుణులు (చదవండి: కుంభకర్ణుడిని తలదన్నేలా.. ఆమె ఏకంగా 32 ఏళ్లు నిద్రపోయింది!) -
నార్కోలెప్సీ: స్లీప్‌లోకి స్లిప్!
కొందరు ఎక్కడ ఉంటే అక్కడ నిద్రలోకి జారిపోతుంటారు. ఇలా బస్సెక్కగానే అలా నిద్రపోతుంటారు. వాళ్లను చూసినప్పుడు కొంతమంది వాళ్లంత అదృష్టవంతులు లేరని అంటుంటారు. ఇలా పడుకోగానే అలా నిద్రపట్టేయడం మంచిదే. అయితే నిద్రకు ఉపక్రమించినప్పుడు నిద్రపట్టడానికీ... తమకు తెలియకుండానే నిద్రలోకి జారిపోవడానికీ తేడా ఉందంటున్నారు వైద్యనిపుణులు. కొందరు కూర్చుని పనిచేస్తూ చేస్తేనే... మరికొందరు కూర్చుని తింటూ తింటూ కూడా నిద్రలోకి జారుకుంటూ ఉంటారు. ‘నార్కొలెప్సీ’ అనే స్లీప్ సమస్య ఉన్నవారు పట్టపగలు తాము పని చేస్తూ చేస్తూనే తమకు తెలియకుండానే నిద్రలోకి వెళ్లిపోతుంటారు. దీన్ని ఒక రకం స్లీప్ డిజార్డర్‌గా పరిగణించాలి.నార్కోలెప్సీ ఎలా వస్తుందంటే...? నిద్రలో కొన్ని దశలు అంటే స్లీప్ సైకిల్స్ నడుస్తుంటాయి. మొదట ప్రాంరంభ దశ తర్వాత గాఢ నిద్ర దశ, ఆ తర్వాత కనుపాపలు వేగంగా కదిలే దశ... ఇలాగ దశలవారీగా స్లీప్‌సైకిల్స్ కొనసాగుతుంటాయి. వేగంగా కదిలే దశను ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ (ఆర్ఈఎమ్) నిద్ర దశగా పేర్కొంటారు. నార్కొలెప్సీతో బాధపడేవారిలో నిద్రలోకి జారుకున్న వెంటనే ఈ ఆర్ఈఎమ్ నిద్ర దశ సాధారణం కంటే వేగంగా వచ్చేస్తుంది. ఈ దశలో కను΄ాపలు, ఊపిరితిత్తులను పనిచేయించే డయాఫ్రమ్ తప్ప మిగతా అన్ని కండరాలూ పూర్తిగా అచేతన స్థితిలో ఉంటాయి.ఎందుకో ఇప్పటికీ పెద్దగా తెలియదు... ఈ సమస్య జన్యువులతో ముడిపడి ఉన్నందున చాలామందిలో నార్కొలెప్సీతో బాధపడేవారి కుటుంబాల్లోని పిల్లల్లో కనిపించడాన్ని పరిశోధకులు గమనించారు. అయితే నార్కొలెప్సీ ఎందుకొస్తుందనే అంశం ఇంకా నిర్దిష్టంగా తెలియరాలేదు. ఈ సమస్యతో బాధపడేవారు హెవీ మెషిన్స్, డ్రైవింగ్ వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. చికిత్స... నార్కొలెప్సీ వచ్చినప్పుడు మనం చేతనావస్థలో ఉపయోగించే కండరాలు అకస్మాత్తుగా అచేతనం అయిసెతాయి. మాటకూడా ముద్దముద్దగా వస్తుంది. వారు కొన్ని రకాల భ్రాంతులకూ గురికావచ్చు. ఇప్పటికి దీనికి పూర్తిగా చికిత్స లేక΄ోయినా నార్కోలెప్సీతో బాధపడేవారు స్లీప్ స్పెషలిస్టులను సంప్రదిస్తే... వారు కొన్ని రకాల యాంటీడిప్రెసెంట్స్, యాంఫిటమైన్ మందులతో కొంతవరకు మంచి ఫలితాలు వచ్చేలా చూస్తారు. అలాగే ఈ సమస్య తాలూకు మేనేజ్మెంట్ ఎలాగో సూచిస్తారు. డా‘‘ రమణ ప్రసాద్, సీనియర్ స్లీప్ స్పెషలిస్ట్, పల్మునాలజిస్ట్, హైదరాబాద్ (చదవండి: -
కాలమూ కాటేస్తది..! పక్షవాతంపై సీజన్స్ ప్రభావం..
బ్రెయిన్ స్ట్రోక్ అంటే పక్షవాతం రావడానికి మన సీజన్స్ కూడా ఓ అంశంగా ఉంటాయన్న విషయం తెలుసా? వేసవిలో ఒక రకంగా, వర్షకాలంలో మరో రకంగా, చలికాలంలో ఇంకో రకంగా ఇలా వేర్వేరు తీరుల్లోస్ట్రోక్ వచ్చేలా ఆయా కాలాలు పక్షవాతాన్ని పరోక్షంగా ట్రిగర్ చేస్తాయన్న సంగతీ మీకు తెలుసా? చాలామందికి తెలియని ఈ విషయాన్ని చూద్దాం... రండి...స్ట్రోక్ రావడానికి ఆ సీజన్ తాలూకు వాతావరణం కూడా కొంత మేర కారణమవుతుంటుంది. అలా కాలాలకూ స్ట్రోక్‌కూ సంబంధముంటుంది. ఆరుబయట అప్పుడుండే వాతావరణం దేహంలోపల ఉండే మెదడు స్ట్రోక్‌కు ఎలా కారణమవుతుందన్న కోణంలో చూసినప్పుడు... వాతావరణంలోని అప్పుడుండే ఉష్ణోగ్రత, తేమ... ఆమాటకొస్తే అప్పుడున్న వాతావరణంలోని గాలిలోని కాలుష్యాలూ (ఎయిర్ క్వాలిటీ) ఇవన్నీ స్ట్రోక్‌ను ప్రేరేపిస్తాయి. అదెలాగో తెలుసుకునే ముందు అసలు స్ట్రోక్ (బ్రెయిన్ స్ట్రోక్ / పక్షవాతం) అంటే ఏమిటో చూద్దాం.బ్రెయిన్ స్ట్రోక్ అంటే... అన్ని అవయవాల్లాగే మెదడుకూ ప్రతినిత్యం రక్తం ద్వారా ఆక్సిజన్, పోషకాలు అందుతుండాలి. పైగా మెదడు కీలకమైన అవయవం కావడంతో మొత్తం దేహానికి సరఫరా అవుతుండే రక్తంలోంచి 20 శాతం మెదడుకే సప్లై అవుతుంటుంది. ఇంతటి కీలకమైన మెదడుకు ఏ కారణంగానైనా రక్తసరఫరా జరగక΄ోవడం వల్ల పక్షవాతం / స్ట్రోక్ వస్తుంది. ఇందులోనూ మళ్లీ రెండు రకాలుగా రక్తం అందకపోవడం జరుగుతుంది. అవి... 1) ఇస్కిమిక్ స్ట్రోక్ : మెదడులోని రక్తనాళాల్లో ఏదైనా అడ్డంకి ఏర్పడటం వల్ల అక్కడి భాగాలకు రక్తప్రసరణ సరిగా జరగక వచ్చే స్ట్రోక్‌ను ఇస్కిమిక్ స్ట్రోక్ అంటారు. మెదడులోని ఏయే భాగాలకు రక్తం అందదో ఆ సెంటర్స్ నియంత్రించే అవయవాలు చచ్చుబడతాయి. 2) హేమరేజిక్ స్ట్రోక్ : మెదడులో రక్తనాళాలు చిట్లడంతో అక్కడ రక్తస్రావం అయి వచ్చే పక్షవాతాన్ని హేమరేజిక్ స్ట్రోక్ అంటారు. మెదడులోని ఏ భాగంలో రక్తస్రావం అవుతుందో ఆ భాగం నియంత్రించే అవయవాలు చచ్చుబడతాయి. 3) ట్రాన్సియెంట్ ఇస్కిమిక్ అటాక్ (టీఐఏ) : ఇది ఒక రకంగా చూస్తే ఇస్కిమిక్ అటాకే గానీ... ఇందులో తొలుత పక్షవాతం లక్షణాలు కనిపించాక మళ్లీ అవి 24 గంటలలోపు తగ్గి΄ోయి బాధితులు దాదాపుగా రికవర్ అయితే దాన్ని ‘ట్రాన్సియెంట్ ఇస్కిమిక్ అటాక్’గా చెబుతారు. అంటే... భారీ భూకంపం రావడానికి ముందు చిన్న చిన్న ప్రకంపనల (ట్రిమర్స్)లాగే... ఓ పెద్ద స్ట్రోక్ రావడానికి ముందస్తు సూచనగా ఇలాంటివి వస్తుంటాయి. ఒకవేళ ఈ మినీ–స్ట్రోక్ తాలూకు చిన్న చిన్న లక్షణాలు కనిపించాక 24 గంటల తర్వాత కూడా బాధితుడు వాటి ప్రభావం నుంచి బయటపడక΄ోతే అప్పుడు దాన్ని పూర్తిస్థాయి స్ట్రోక్‌గా పరిగణిస్తారు. ఇక స్ట్రోక్ లక్షణాలైన... దేహంలోని ఒకవైపు భాగాలు బలహీనంగా మారడం, అయోమయం, మాట్లాడటంలో ఇబ్బంది / మాట ముద్దగా రావడం, ముఖంలో ఒకవైపు భాగంపై నియంత్రణ కోల్పోవడం వంటివి కనిపిస్తే... ఆ బాధితులను తక్షణం ఆసుపత్రికి తరలించాలి. చివరగా... వాతావరణాన్నీ అందులోని మార్పులనూ మనమెవరమూ మార్చలేమూ, నియంత్రించలేం. అయితే మన వ్యక్తిగత అలవాట్లతో మంచి జీవనశైలి మార్పులతో ఆరోగ్యంగా ఉండటం ద్వారా పక్షవాతం ముప్పును నివారించగలం. కాబట్టి మంచి జీవనశైలితో వ్యక్తిగత ఆరోగ్య నిర్వహణతో స్ట్రోక్ ముప్పును తప్పించుకోవచ్చు.వేసవిలోని వేడిమి...డీ–హైడ్రేషన్ : ఎండాకాలంలో వాతావరణంలో విపరీతమైన వేడిమి ఉంటుంది. దాంతో ఒంట్లోని నీళ్లు చెమట రూపంలో చాలా ఎక్కువగా వాతావరణంలోకి చేరుతుండటంతో దేహం డీ–హైడ్రేట్ అవుతుంది. ఎప్పుడైతే రక్తంలోని నీటిపాళ్లు తగ్గుతాయో అప్పుడు రక్తం చిక్కబడుతుంది. చిక్కబడ్డ రక్తం కాస్తా క్లాట్స్‌కు కారణమవుతాయనీ, దాంతో అవి స్ట్రోక్నూ ప్రేరేపించవచ్చన్న విషయం తెలిసిందే. వడదెబ్బ (హీట్‌స్ట్రోక్) : వడదెబ్బ కూడా స్ట్రోక్ ముప్పును పెంచడంతోపాటు ఆ టైమ్‌లో కనిపించే లక్షణాలనూ కనిపించేలా చేస్తుంది. అత్యంత ఎక్కువగా అలసటకూ / నీరసానికి గురి కావడం (ఓవర్ ఎగ్జర్షన్) : వేసవిలో తక్కువగా శ్రమ చేసినప్పటికీ ఆ శ్రమ తాలూకు లక్షణాలై అలసటా, నీరసం, నిస్సత్తువగా, తీవ్రంగా చెమటలు పట్టడం చాలా ఎక్కువగా జరుగుతుంటాయి. ఎర్రటి ఎండలో దేహానికి తీవ్రమైన శ్రమ కలిగించడం జరిగితే... ఒకవేళ బాధితుల్లో ఇంతకు మునుపే రక్త΄ోటు వంటి రిస్క్‌ఫ్యాక్టర్లు ఉన్నవారైతే వాళ్లలో స్ట్రోక్ ముప్పు మరింతగా పెరుగుతుంది.వర్షాకాలంలో...ఇన్ఫెక్షన్లు : నీళ్లు పెరగడం కారణంగా అందులో వృద్ధి చెందే బ్యాక్టీరియల్ / వైరల్ ఇన్ఫెక్షన్ల కారణంగా దేహంలో ఇన్ఫ్లమేషన్ పెరగడం వల్ల. రక్తపోటులో హెచ్చుతగ్గులు (బ్లడ్ ప్రెషర్ ఫ్లక్చుయేషన్స్) : వాతావరణంలో వర్షం కురవబోయే ముందర తీవ్రమైన ఉక్కబోత లేదా వర్షం కురవగానే ఉండే చలి... ఇలా వర్షాకాలంలో వాతావరణంలోని వేడిమి అస్థిమితంగా ఉండటం వల్ల దానికి అనుగుణంగా రక్త΄ోటూ మారుతుంటుంది. ఇలా రక్త΄ోటు లోని హెచ్చుతగ్గులు (బీపీ ఫ్లక్చుయేషన్స్) స్ట్రోక్ ముప్పును పెంచుతాయి. వాతావరణంలోని అధిక తేమ, డీ హైడ్రేషన్ : మాన్సూన్ సీజన్లో వర్షం కురవబోయే ముందరి ఉక్క΄ోతతో దేహం డీ–హైడ్రేషన్‌కు గురికావడం... దాంతో రక్తం చిక్కబడటం వంటి అంశాలు రక్త΄ోటు ముప్పును పెంచుతాయి. ముప్పును పెంచే వ్యక్తిగత అంశాలు : నిజానికి సీజన్ల తాలూకు ఈ మార్పులన్నీ స్ట్రోక్ ముప్పును ప్రతి ఒక్కరిలోనూ సమానంగా పెంచవు. అంతకు మునుపే వ్యక్తిగతంగా రిస్క్ ఎక్కువగా ఉన్నవారిలో ఇవి స్ట్రోక్ ముప్పును పెంచుతాయి.చలికాలంలో...వాతావరణంలోని వేడిమి ఒక సెంటీగ్రేడ్ తగ్గినా... అది స్ట్రోక్ వచ్చే ముప్పును నాలుగు శాతం పెంచుతుందన్నది నిపుణులు గమనించిన అంశం. వాసోకన్స్ట్రిక్షన్ : చలికాలంలోని తీవ్రమైన చల్లదనం కారణంగా రక్తనాళాలు సన్నబారతాయి. ఇలా రక్తనాళాలు సన్నబారడాన్ని వాసోకన్స్ట్రిక్షన్ అంటారు. నాళం సన్నబారడంతో రక్తం ప్రవహించే వేగం (రక్తపోటు / బీపీ) పెరుగుతుంది. రక్తపు సాంద్రత పెరగడం : చల్లదనం కారణంగా అన్ని ద్రవాలూ చిక్కబడ్డట్టే రక్తమూ చిక్కబడుతుంది. ఇలా రక్తం చిక్కబడటం అన్నది రక్తంలో క్లాట్స్ పెరిగేలా చేసి స్ట్రోక్ ముప్పును పెంచుతుంది. చురుకుదనం తగ్గడం : చలికాలంలో జనం వేసవిలో ఉన్నంత చురుగ్గా ఉండరు. వాళ్ల కదలికలూ మందగిస్తాయి. ఇలా చురుకుదనం తగ్గి, కదలికలు తగ్గడంతో దేహానికి అవసరమైన వ్యాయామం అందక బరువు పెరగుతారు. అంతేకాదు... చురుకుదనం తగ్గడంతో రక్తంలో (కొలెస్ట్రాల్ వంటి) కొవ్వుల మోతాదులూ పెరుగుతాయి. బరువూ, కొవ్వులూ పెరగడం స్ట్రోక్ ముప్పును పెంచుతుందన్న విషయం తెలిసిందే. డీ–హైడ్రేషన్ : చలికాలంలో నీళ్లు తాగడం తగ్గుతుంది. దాంతో రక్తంలో నీటి మోతాదులూ తగ్గడంతో రక్తం చిక్కబడుతుంది. ఇలా చిక్కబడటమన్నది స్ట్రోక్ వచ్చే అవకాశాలను పెంచుతుంది. ఇన్ఫెక్షన్లు : చలికాలంలో ఫ్లూ, శ్వాసకోశ సమస్యలకు కారణమయ్యే ఇన్ఫెక్షన్ల ముప్పు పెరగడంతో... అది స్ట్రోక్ ముప్పు కూడా పెరిగేలా చేస్తుంది. వాతావరణ కాలుష్యాలు : చలికాలంలో వాతావరణంలోకి చేరే పొగ, కాలుష్యాలన్నీ అప్పుడు కురిసే మంచు (ఫాగ్)తో కలిసి ‘స్మాగ్’ అనే మంద΄ాటి కాలుష్యాల తెరలు ఏర్పడేలా చేస్తాయి. కాలుష్యాలతో కూడిన స్మాగ్ కూడా స్ట్రోక్ ముప్పును పెంచేస్తుంది. నివారణ...ప్రతి ఒక్కరూ తగినన్ని నీళ్లూ ద్రవాహారాలు తీసుకుంటూ హైడ్రేటెడ్‌గా ఉండటం. అన్ని సీజన్లలోనూ ఆయా సీజన్లో దొరికే పోషకాలతో కూడిన మంచి సమతులాహారం తీసుకోవడం. ఏ సీజన్లోనైనా తగినంత వ్యాయామం చేస్తూ, దేహాన్ని చురుగ్గా ఉంచడం. కంటినిండా తగినంత నిద్రపోతుండటంతోపాటు ఒత్తిడి లేకుండా చూసుకోవడం.ఒకవేళ అధికరక్తపోటు (హైబీపీ), డయాబెటిస్ ఉంటే... మందులతో వాటిని ఎప్పుడూ అదుపులో ఉండేలా చూసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలి. (చదవండి: ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు హెపటైటిస్ బీ వస్తే ప్రమాదమా..? బిడ్డకి కూడా వస్తుందా?) -
ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు హెపటైటిస్ బీ వస్తే ప్రమాదమా..?
నాకు ఇటీవల హెపటైటిస్–బీ వచ్చిందని తెలిసింది. ఇప్పుడు నేను ఎనిమిది నెలల గర్భవతిని. మా కుటుంబంలో కొంతమందికి కూడా ఇదే వ్యాధి ఉంది. ఈ విషయం డాక్టర్‌కు ముందుగా చెప్పాలా? నా బిడ్డకు కూడా ఈ వ్యాధి వస్తుందా?– జ్యోతి, హైదరాబాద్ గర్భవతిగా ఉన్న మీరు ఈ హెపటైటిస్–బీ వంటి వ్యాధి గురించి ముందుగానే తెలుసుకోవడం చాలా అవసరం. ఇది ఒక వైరస్ వలన కలిగే వ్యాధి. ఇది రక్తం ద్వారా వ్యాపించి, మీ లివర్‌ను ప్రభావితం చేస్తుంది. గర్భధారణ సమయంలో తల్లి శరీరంలో వైరస్ ఉంటే, బిడ్డ పుట్టే సమయంలో తల్లి రక్తంతో సంపర్కంలోకి వచ్చేటప్పుడు వైరస్ బిడ్డకు వ్యాపించే అవకాశం ఉంటుంది. ఇది చాలా తీవ్రమైన విషయం. శిశువులకు వైరస్ సోకినప్పుడు దాదాపు తొంభై శాతం శాశ్వత లివర్ వ్యాధిగా మారుతుంది. ఈ ప్రమాదాన్ని తగ్గించాలంటే మీరు ఇప్పుడే మీ వైద్యులకు చెప్పాలి. ముందుగా సమాచారం ఉంటే తగిన చికిత్సలు, జాగ్రత్తలు తీసుకోవచ్చు. బిడ్డ పుట్టిన వెంటనే ఇన్ఫెక్షన్స్ రాకుండా నివారించేందుకు ప్రత్యేకమైన రక్షణ చికిత్సలు ఉన్నాయి. బిడ్డ పుట్టిన నాటికి రెండు పనులు చేయాలి. ఒక్కటి ఇమ్యూనోగ్లోబ్యులిన్ ఇంజెక్షన్ ఇవ్వాలి. ఇది వైరస్‌ను వెంటనే అడ్డుకుంటుంది. రెండు, హెపటైటిస్–బీ టీకా మొదటి మోతాదును ఇవ్వాలి. ఈ రెండు కూడా బిడ్డ పుట్టిన ఇరవై నాలుగు గంటల లోపల చేయాలి. తర్వాత పూర్తిగా ఆరోగ్యంగా ఉండాలంటే, ఆరు మోతాదుల టీకా షెడ్యూలును పూర్తి చేయాలి. మొదటి మోతాదు పుట్టిన వెంటనే, రెండవ మోతాదు నాలుగు వారాల్లో, మూడవది ఎనిమిది వారాల్లో, నాల్గవది పన్నెండు వారాల్లో, ఐదవది పదహారు వారాల్లో, ఆరవది ఇరవై నెలల్లో వేయాలి. ఆరు మోతాదులు పూర్తయిన తర్వాత బిడ్డకు రక్తపరీక్ష చేయాలి. అప్పుడే శరీరంలో రోగనిరోధక శక్తి ఏర్పడిందో లేదో తెలుస్తుంది. తల్లి ఈ సంగతిని వైద్యులకు ముందుగానే చెప్పడం వల్లే సాధ్యమవుతుంది. అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటే బిడ్డను సంపూర్ణంగా రక్షించవచ్చు. కాబట్టి ఆలస్యం చేయకుండా తగిన సమాచారం డాక్టర్‌కి ఇవ్వండి. నేను గర్భధారణకు ప్లాన్ చేస్తున్నాను. కొంతమంది రుబెల్లా వ్యాక్సిన్ తప్పకుండా వేయించుకోవాలని చెబుతున్నారు. కాని, ఇదివరకు నాకు ఈ వ్యాధి వచ్చిందో లేదో తెలియదు. ఇప్పుడు ఏం చేయాలో స్పష్టంగా చెప్పండి.– అనిత, రాజమండ్రిమీరు గర్భధారణ కోసం సిద్ధమవుతుంటే, రుబెల్లా వ్యాధి గురించి ముందుగానే తెలుసుకోవడం, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. రుబెల్లా అనేది ఒక వైరస్ వలన వచ్చే వ్యాధి. ఇది దగ్గుతో, తుమ్ముతో గాలిలోకి వచ్చే జలకణాల ద్వారా సులభంగా వ్యాపిస్తుంది. సాధారణంగా ఇది తేలికపాటి జ్వరం, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలతో కనిపిస్తుంది. కాని, గర్భధారణ సమయంలో ఈ వైరస్ సోకితే, బిడ్డకు తీవ్రమైన శారీరక, మానసిక సమస్యలు కలగవచ్చు. ఈ వ్యాధి గర్భంలో ఉన్న శిశువుకు సోకితే, చెవిటితనం, కాటరాక్ట్ వంటి కంటి లోపాలు, గుండెకు సంబంధించిన లోపాలు, మెదడు ఎదుగుదలపై ప్రభావం, లేదా గర్భస్రావం కూడా జరిగే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా గర్భధారణ తొలి మూడు నెలల్లో ఈ ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. ఇది నివారించడానికి ముందుగా ఒక రక్త పరీక్ష చేయించుకోవాలి. రుబెల్లా ఐజీజీ అనే పరీక్ష చేసి, మీ శరీరంలో ఇప్పటికే ఈ వైరస్‌కు వ్యతిరేకంగా యాంటీబాడీలు ఉన్నాయా లేదా తెలుసుకుంటారు. యాంటీబాడీలు ఉన్నట్లయితే, మీ శరీరానికి రక్షణ ఉంది కాబట్టి టీకా అవసరం ఉండదు. యాంటీబాడీలు లేనట్లయితే, తప్పకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఈ వ్యాక్సిన్ ఎమ్ఎమ్ఆర్ (మీజిల్స్, మంప్స్, రుబెల్లా) రూపంలో ఇవ్వబడుతుంది. ఒక మోతాదుతో ప్రారంభించి, అవసరమైతే రెండో మోతాదును కొన్ని వారాల గ్యాప్‌లో వేయొచ్చు. అయితే, వ్యాక్సిన్ వేసిన తరువాత కనీసం రెండు నెలల పాటు గర్భం ధరించకూడదు. ఎందుకంటే ఈ సమయంలో శరీరం రక్షణ ఏర్పరచుకుంటుంది. ఇది శిశువును రక్షించడంలో కీలకంగా పనిచేస్తుంది. టీకా వల్ల కొన్నిసార్లు తేలికపాటి జ్వరం రావచ్చు. మీరు ఎప్పుడైనా ఈ వ్యాక్సిన్ వేసుకున్నారా అనే విషయం స్పష్టంగా గుర్తులేనట్లయితే, పరీక్ష చేయించుకోవడం ఉత్తమం. టీకా అవసరమైతే ఇప్పుడే వేయించుకుని, రెండు నెలలు గడిచిన తరువాత గర్భధారణకు ప్లాన్ చేసుకోండి. ఇలా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల గర్భంలో ఉన్న శిశువు ఎలాంటి హానికి గురికాకుండా, ఆరోగ్యంగా జన్మించే అవకాశం ఉంటుంది. డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్(చదవండి: Independence Day 2025: మోదీ ప్రసంగంలో ఆరోగ్యంపై కీలక వ్యాఖ్యలు..! హాట్‌టాపిక్‌గా ఊబకాయం..) -
ఫ్యాటీ లివర్‌కు బొప్పాయితో చెక్
కాలేయంలో అదనపు కొవ్వు పేరుకుని పోయే ఫ్యాటీ లివర్ వ్యాధికి ఇతర ఔషధాలకన్నా బొప్పాయి మంచి మందని పరిశోధనలు చెబుతున్నాయి. ఇవాల్టి టిప్ ఆఫ్ ది డేలో వారేం చెబుతున్నారో చూద్దాం...బొప్పాయిలో విటమిన్ సి, బీటా–కెరోటిన్, ఫ్లేవనాయిడ్లు వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఈ పోషకాలు కాలేయాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షిస్తాయి.లివర్ డిటాక్స్‌కు మద్దతు బొప్పాయిలో పపైన్ మరియు కైమో΄ాపైన్ వంటి ఎంజైమ్‌లు ఉంటాయి, ఇవి జీర్ణక్రియకు సహాయపడతాయి. పరోక్షంగా కాలేయం నిర్విషీకరణ విధులకు మద్దతు ఇస్తాయి. ఈ ఎంజైమ్‌లు ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయడంలో, కాలేయంపై జీర్ణ భారాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.కాలేయ ఎంజైమ్ స్థాయిలను మెరుగుపరుస్తుంది. బొప్పాయి వంటి కాలేయానికి అనుకూల మైన పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కాలేయ ఎంజైమ్ ప్రొఫైల్స్ మెరుగుపడతాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. వాపును తగ్గిస్తుందిబొప్పాయిలోని కొన్ని సమ్మేళనాలు కాలేయ కణజాలాలలో వాపును తగ్గించడంలో సహాయపడతాయి. బొప్పాయిలోని పోషక విలువలుతక్కువ కేలరీలు, అధిక ఫైబర్ కంటెంట్, సహజ చక్కెరలు, అనారోగ్యకరమైన కొవ్వులు లేదా కొలెస్ట్రాల్ ఉండకపోవడమనే లక్షణాలు కొవ్వు కాలేయ ఆహారాన్ని అనుసరించే వారికి బొ΄్పాయిని ఆదర్శవంతమైన పండుగా చేస్తాయి. ఎంత తినాలి?మితంగా తినడం చాలా ముఖ్యం. రోజుకు ఒక చిన్న గిన్నె బొప్పాయి – ఉదయం లేదా మధ్యాహ్నం స్నాక్‌గా – సహజ చక్కెరలపై ఓవర్‌లోడ్ లేకుండా అవసరమైన పోషకాలను అందిస్తుంది. కూరగాయలు, లీన్ ప్రొటీన్లు, తృణధాన్యాలు అధికంగా ఉండే సమతుల్య ఆహారంతో దీన్ని ఎల్లప్పుడూ జత చేయండి. -
మంచి నిద్ర కోసం..ఏడు చిట్కాలు..!
-
పిల్లి పోజుతో వెన్నునొప్పి దూరం!
-
'వైకింగ్స్ డైట్' అంటే..! ఆరోగ్యానికి మంచిదేనా?
చాలా రకాల డైట్లు గురించి విన్నాం. ఇదేంటి 'వైకింగ్స్ డైట్(Viking Diet)'. పేరే ఇలా ఉంది. ఇక డైట్ ఎలా ఉంటుందో అనిపిస్తోంది కదూ..!. అదేం లేదండి అసలు అలా పిలవడానికి పెద్ద కథే ఉంది. ఆలస్యం చేయకుండా అదేంటో చకచక చదివేయండి మరి..'వైకింగ్స్' అంటే ఎనిమిదో శతాబ్దం నుంచి పదకొండవ శతాబ్దం వరకు స్కాండినేవియా నుంచి వచ్చిన సముద్రయాన ప్రజల(Scandinavian people)ను వైకింగ్స్ అని పిలుస్తారు. వీళ్లు దాడిదారులు లేదా సముద్రదొంగలు అని కూడా అంటారు. వలసదారులుగా ఐరోపా వచ్చి అక్కడ స్థానిక వ్యాపారాలపై దాడుల చేసి స్థిరపడ్డ ప్రజలను ఇలా వైకింగ్స్ అని పిలుస్తారు. వీళ్లంతా డెన్మార్క్, నార్వే, స్వీడన్ నుంచి వలస వచ్చిన వారు. అలా వలస వచ్చేటప్పుడూ స్థానికంగా దొరికే వాటినే తమ ఆహారంలో భాగం చేసుకుంటారు. అలా పుట్టుకొచ్చిందే ఈ 'వైకింగ్స్ డైట్'. అయితే ఇది ఆరోగ్యకరమైనది, పైగా అన్ని విధాల మంచిదని నిపుణులు చెబుతుండటం విశేషం. అలాగే ఈ డైట్లో కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నట్లు తెలిపారు. మరి ఆ డైట్లో ప్రజలు ఏం తినేవారో చూద్దామా..!.'వైకింగ్స్ డైట్' అంటే?దీన్ని 'నార్డక్ డైట్' అని కూడా పిలుస్తారు. ఇది బౌగోళిక స్థానం, సామాజిక స్థితి, సీజన్ ఆధారంగా తీసుకునే ఆహారపదార్థాలను కలిగి ఉంటుంది. తీర ప్రాంతాల్లో నివశించేవారికి చేపలు ప్రదాన ఆహారం. కాబట్టి వాళ్లంతా వైకింగ్స్ కాడ్, హెర్రింగ్, ఈల్ వంటి చేపలను తింటుంటారు. వీటి తోపాటు మస్సెల్స్, ఓస్టర్స్ వంటి సముద్ర ఆహారాన్ని తీసుకునేవారు. అలాగే బెర్రీలు, ఆపిల్స్, ఫ్లమ్స్ వంటి పండ్లుఉ, కాబ్యేజీ, క్యారెట్లు, ఉల్లిపాయలు వంటి కూరగాయలను కూడా తమ డైట్లో భాగం చేసుకునేవారు. ఆవులు, మేక, గొర్రెల నుంచి పాలు, జున్ను వంటివి తీసుకునేవారు. పైగా ఆహారాన్ని నిల్వ చేసుకునేందుకు ఉప్పు వేయడం లేదా కిణ్వన ప్రక్రియ వంటి పద్ధతులను వినియోగించేవారు. మంచిదేనా..?ఈ డైట్లో అందుబాటులో ఉన్న ఆహారానికే పరిమితం అవ్వుతూ..ఆరోగ్యకరమైన పోషక పదార్థాలనే తీసుకోవడంతో ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలకు పేరుగాంచిందని చెబుతున్నారు నిపుణులు. ఇందులో పండ్లు, కూరగాయలు, చిక్కుళ్లు, గింజలు, తృణధాన్యాలు, ఫైబర్ అధికంగా ఉండే కార్బోహైడ్రేట్లు, పేగు ఆరోగ్యానికి మద్దుతిస్తాయి. పైగా మధుమేహం, హృదయ సంబంధ వ్యాధులు, కేన్సర్లతో సహా వివిధ జీవనశైలి వ్యాధులను నివారించడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. దుష్ప్రభావాలు..అయితే ఈ డైట్లో కొన్ని పోషకపరమైన నష్టాలు కూడా ఉంటాయని చెబుతున్నారు. మెడిటేరియన్ డైట్‌తో గణనీయమైన మొత్తంలో మాంసం, జంతువుల కొవ్వు ఉంటుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అధిక కొవ్వు పదార్థం ఆ ప్రజలకు శీతకాలన్ని తట్టుకునేందుకు సహాయపడుతుంది గానీ ఆ సంతృప్త కొవ్వు హృదయ సంబంధ ప్రమాదాన్ని పెంచుతుందని చెబుతున్నారు నిపుణులు. ఈ డైట్‌ని అనుసరించేవాళ్లు ఆరోగ్యకరమైన అలవాట్లకు కట్టుబడి ఉండి, అధిక కొవ్వు ఉన్న ఆహారాలకు దూరంగా ఉండాలని సూచించారు నిపుణులు.(చదవండి: మండే ఎఫెక్ట్ ఇంతలా ఉంటుందా..? ఏంటి ‘మండే బ్లూస్?) -
మండే ఎఫెక్ట్ ఇంతలా ఉంటుందా..? ఏంటి ‘మండే బ్లూస్' ?
ఉదయాన్నే నిద్రలేవడం, ఉత్సాహంగా రొటీన్ వర్క్‌లోకి దూకేయడం... ప్రతిరోజూ ఏమోగానీ, సోమవారం మాత్రం అంత వీజీ కాదు. విద్యార్థుల నుంచి కార్పొరేట్ ఉద్యోగుల దాకా... సోమవారం ముంచుకొచ్చే బద్ధకం.. మండే అంటే ఒళ్లు మండేలా చేస్తోంది. ఇదే మండే బ్లూస్‌కి కారణమవుతోంది. ‘మండే బ్లూస్ అనే పదం సాధారణంగా సోమవారం రోజు పని లేదా చదువులను మొదలు పెట్టాల్సిన తప్పనిసరి అవసరం వల్ల కలిగే అలసట, నిరుత్సాహం వంటి భావాలకు అద్దం పడుతోంది. కొంతకాలంగా లెక్కలేనన్ని మీమ్స్, ట్వీట్లు కాఫీ మగ్ నినాదాలకు ‘మండే బ్లూస్‘అనేది ఒక పంచ్‌లైన్. ఆ పాపం వీకెండ్ దే... వారాంతంలో 2 రోజులపాటు సెలవులు అనే కార్పొరేట్ కల్చర్ విస్తృతంగా వ్యాపించడం ఈ మండే బ్లూస్‌కి ప్రధాన కారణమవుతోంది. వారంలో ఐదురోజుల పని ముగుస్తుండగానే శుక్రవారం సాయంత్రానికే వీకెండ్ ఉత్సాహం పుంజుకుంటుండగా, శనివారం, ఆదివారం సెలవులు పూర్తయ్యాక సోమవారం మళ్లీ రొటీన్ వర్క్ లేదా స్కూల్/కాలేజ్‌కు వెళ్లాల్సిన పరిస్థితి మండే బ్లూస్ని సృష్టిస్తోంది. సాధారణంగా సోమవారం ఆలస్యంగా లేచే అలవాటు చాలామందిలో ఉంటుంది. దీనికి కారణం వీకెండ్ రోజుల్లో ఆలస్యంగా నిద్రలేవడమే. పని మొదలు పెట్టే రోజు కాబట్టి సోమవారం పట్ల మానసిక విరక్తి, పని పట్ల ప్రతికూల భావన ఏర్పడుతోంది. ఒత్తిడి స్థాయిలు పెరుగుతున్నాయ్... వారంలో తొలి నిరుత్సాహకర ప్రారంభం అనేది కేవలం మన ఆలోచనలపై మాత్రమే ప్రభావం చూపడం లేదని, అది మన శారీరక ధర్మాలను కూడా ప్రభావితం చేస్తోందని వైస్ (వీఐసీఇ) రిపోర్ట్ పేరిట జర్నల్ ఆఫ్ ఎఫెక్టివ్ డిజార్డర్స్‌లో ప్రచురించిన తాజా అధ్యయనం వెల్లడిస్తోంది. దీని ప్రకారం.. ఒత్తిడిని అనుభవిస్తున్న వ్యక్తుల్లో కార్టిసాల్ స్థాయిలు ఇతర ఏ రోజు ఒత్తిడిని నివేదించిన వారి కంటే సోమవారాల్లో 23 శాతం వరకు ఎక్కువగా ఉన్నాయి. డాక్టర్ తరణి చందోలా నేతృత్వంలో 3,500 మందిపై నిర్వహించిన ఈ అధ్యయనం ప్రాథమిక ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ ‘సోమవారం వ్యక్తుల’లో గణనీయంగా పెరిగినట్టు కనిపెట్టింది. మానసికమే కాదు, అంతకు మించి... కార్టిసాల్ దీర్ఘకాలిక ఒత్తిడికి గురి కావడానికి కీలకమైన బయోమార్కర్ అని పరిశోధకులు వెల్లడించారు. మెదడుకు ముప్పు లేదా ప్రమాదాన్ని గ్రహించినప్పుడు కలిగే ప్రతిస్పందన ఈ హార్మోన్. అంతేకాదు కార్టిసాల్ స్థాయిల్లో హెచ్చుతగ్గులు హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం, బలహీనమైన రోగనిరోధక శక్తి, రక్తపోటు, మధుమేహం వంటి వాటికి కూడా దారితీస్తున్నాయి. సంక్షిప్తంగా చెప్పాలంటే సోమవారం భయం మానసిక స్థితిని దెబ్బతీయడం కంటే మరింత ఎక్కువ హాని కలిగిస్తుంది. అది వ్యక్తుల ఆరోగ్యాన్ని నిశ్శబ్దంగా దెబ్బతీస్తుంది. పరిష్కారం..సైకాలజిస్ట్‌ల కొన్ని సూచనలు.. ప్రణాళికాబద్ధంగా పనిని విభజించుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి. వారాంతపు రోజుల్లో ఆహారపు అలవాట్లలో అతి మార్పు చేర్పులు చేయవద్దు. శుక్రవారం రోజే సోమవారం నాటి పనులను పకడ్బందీగా ప్లాన్ చేసుకోవడం వర్క్ ప్రెషర్‌ను దూరం చేస్తుంది. ప్రతీ సోమవారం ఏదైనా కొత్త రకం వ్యాయామం, కొత్త రూట్లో వాకింగ్ వంటివి ప్లాన్ చేయడం ద్వారా కొత్త ఉత్సాహం వస్తుంది. మరోవైపు.. సోమవారాల్లో గుండె సంబంధిత సంఘటనలు పెరగడాన్ని వైద్యులు చాలాకాలంగా గమనిస్తున్నారు. దీన్ని ‘‘మండే ఎఫెక్ట్’’అని పిలుస్తారు. వారంలోని మొదటి రోజున గుండెపోటు, ఆకస్మిక గుండె సంబంధిత మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని గణాంకాల పరంగా గుర్తించారు. ఈ ధోరణికి తరచూ వారాంతపు విశ్రాంతి నుంచి ఆకస్మిక పని వైపు మళ్లిన ఆలోచనలే కారణమని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో వైద్యుల సలహాలను అనుసరించి ఈ సమస్య నుంచి వీలైనంత త్వరగా బయటపడటం అవసరం. -
రోజుకింత 'పీచు' చాలు..!
షుగర్ ఉన్నవారు, లేదా షుగర్ వచ్చే దశకు (ప్రీడయాబెటిస్) చేరుకున్నవారు నిరంతరం జాగ్రత్తగా ఉండటం అవసరం. మందులు సక్రమంగా వేసుకోవాలి. జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. తరచు షుగర్ టెస్ట్ చేయించుకుంటుండాలి. ఇదంతా కూడా ఒక ప్రణాళికలా ఉంటుంది. అయితే ఆ ప్రణాళికను పాటిస్తూనే, మీ షుగర్‌ను మీరు నియంత్రణలో ఉంచుకోటానికి ఒక తేలికైన మార్గం కూడా ఉంది. అదేమిటంటే, ఆహారంలోకి మీరు తీసుకునే పీచుపదార్థాలను (డైటరీ ఫైబర్) మరికాస్త ఎక్కువ చేయటం! ‘అమెరికన్ డయబెటిస్ అసోసియేషన్’ (ఎ.డి.ఎ.) తాజాగా పూర్తి చేసిన ఒక అధ్యయనం ప్రకారం.. షుగర్ ఉన్నవారు లేదా షుగర్ వచ్చే దశలో ఉన్నవారు డైటరీ ఫైబర్‌ను ఎక్కువగా తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుందని వెల్లడైంది. డైటరీ ఫైబర్ అంటే?పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, చిక్కుళ్లు వంటి శాకాహారాల్లో కనిపించే ఒక రకమైన కార్బోహైడ్రేటే.. డైటరీ ఫైబర్. ఇతర కార్బోహైడ్రేట్ల (పిండి పదార్థాల) మాదిరిగా ఈ డైటరీ ఫైబర్ మీ శరీరంలో త్వరగా జీర్ణం కాకపోగా, ఇది మీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచటానికి తోడ్పడుతుంది. మీ రక్తప్రవాహంలోకి చక్కెర ప్రవేశించే వేగాన్ని నెమ్మదింపజేస్తుంది జీర్ణకోశంలోని మంచి బాక్టీరియాకు దన్నుగా ఉంటుంది. అధ్యయనంలో ఏం తేలింది?అధ్యయనం కోసం ఎ.డి.ఎ. పరిశోధకులు డయాబెటిస్ లేదా ప్రీడయాబెటిస్ ఉన్న 3,000 కంటే ఎక్కువమంది అమెరికన్ల ఆరోగ్య వివరాలను అనేక ఏళ్ల పాటు నిశితంగా పరిశీలించారు. వారు ఎంత ఫైబర్‌ను తీసుకున్నారు, వారిలో ఎంతమంది ఎంతకాలానికి మరణించారు, మరణించినవారు ఏదైనా ఇతర కారణం వల్ల మరణించారా లేదా గుండె జబ్బుల వల్ల మరణించారా అన్నది చూశారు. ఫలితాలు స్పష్టంగా ఉన్నాయి. వాటి ప్రకారం, ఎక్కువ ఫైబర్ తీసుకున్న వ్యక్తులు ఏ కారణం చేతనైనా చనిపోయే ప్రమాదం చాలా తక్కువగా ఉంది. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే వారు ప్రతిరోజూ తీసుకునే ప్రతి అదనపు గ్రాము ఫైబర్‌కు, వారు మరణించే అవకాశం దాదాపు 2 శాతం తగ్గింది. ఫైబర్‌తో గుండె ఆరోగ్యంహృద్రోగ మరణాల విషయానికి వస్తే... ఫైబర్‌కు, గుండె ఆరోగ్యానికి మధ్య సంబంధం కొంచెం సంక్షిష్టంగానే ఉంది. ఎక్కువ ఫైబర్ తీసుకోవటం వల్ల మరణ ప్రమాదం తగ్గింది కాని, అయితే అది ఒక నిర్దిష్ట పరిమితి వరకే. ఫైబర్ వల్ల గుండెకు చేకూరే ప్రయోజనాలు రోజుకు దాదాపు 26 గ్రాముల ఫైబర్‌తో ఆగిపోయాయి. ఫైబర్ అంతకు మించితే ప్రయోజనం లేకపోగా, ప్రమాదం పెరిగే అవకాశం కనిపించింది. అయినప్పటికీ ఇది పూర్తిగా నిర్ధారణ కాని విషయంగానే మిగిలింది. దీనిని బట్టి ఫైబర్ గుండెకు మంచిదే అయినప్పటికీ, ఎక్కువ తీసుకోవడం అన్నది అంత మంచిది కాకపోవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.ఇలా చేయండిమీకు ఫైబర్‌ను తీసుకునే అలవాటు లేకపోతే, కడుపులో అసౌకర్యాన్ని నివారించటం కోసం మొదట కొద్ది మొత్తంలో ఫైబర్‌ను మీ ఆహారంలో చేర్చుకోండి. మీ జీర్ణ వ్యవస్థలోకి చేరిన ఫైబర్ క్రియాశీలం అవటానికి నీరు తాగటం అవసరం.ఫైబర్ ఫలితాన్ని సంపూర్ణంగా పొందటానికి పండ్ల రసాలు కాకుండా పండ్లుగా తినండి. అలాగే మీ ఆహారంలో కూరగాయలు ఎక్కువగా ఉండేటట్లు చూసుకోండి. తృణధాన్యాలను ఎంచుకోండి. తెల్ల బియ్యం, బ్రెడ్ నుండి బ్రౌన్ రైస్, హోల్–వీట్ బ్రెడ్‌కు మారండి.∙చిక్కుళ్లను మీ ఆహారానికి జోడించండి. బీన్స్, కాయధాన్యాలు, సెనగల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. మాంసకృత్తులు కూడా దండిగా ఉంటాయి. తీసుకోవలసిన జాగ్రత్తలుఒకేసారి ఎక్కువ ఫైబర్ తీసుకోవడం వల్ల ఉబ్బరం లేదా కడుపులో గ్యాస్ వస్తుంది. కనీసం ఫైబర్ మీకు అలవాటయ్యే వరకైనా పూర్తి మొత్తం ఫైబర్‌ను తీసుకోకండి. అధిక మోతాదులో ఫైబర్ తీసుకోవడం వల్ల కాల్షియం లేదా ఇనుము వంటి కొన్ని ఖనిజాల శోషణ (శరీరం పీల్చుకోవటం) తగ్గుతుంది. కాబట్టి సమతులం అన్నది కీలకం.డయాబెటిక్ గ్యాస్ట్రోపరేసిస్ (తిన్న తర్వాత కడుపు ఎంతకూ ఖాళీ అయినట్లు ఉండకపోవటం) వంటి కొన్ని పరిస్థితులు ఉన్నవారు ఫైబర్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. తేడా వస్తే వైద్యుడిని సంప్రదించాలి. ఎంత ఫైబర్ తీసుకోవాలి?తాజా అధ్యయనం ఆధారంగా, రోజుకు 25 నుండి 26 గ్రాముల ఫైబర్ తీసుకోవటం సురక్షితం, ప్రభావవంతం అని తెలుస్తోంది. అనేక ఆరోగ్య సంస్థల సిఫారసులకు అనుగుణంగా ఈ మోతాదును నిర్ణయించారు. డయాబెటిస్ లేదా ప్రీడయాబెటిస్ ఉన్నవారు తమ ఆహారంలోకి ఫైబర్‌ను తగినంతగా తీసుకోవటం వల్ల రక్తంలో షుగర్ నియంత్రణ ఒక సహజ ప్రక్రియగా జరిగిపోతుంది.కొంతమందికి సాధారణ స్థాయిలో ఫైబర్ తీసుకుంటే సరిపోతుంది. కొంతమంది ఎక్కువ మోతాదులో ఫైబర్‌ను తీసుకోవలసిన అవసరం ఉంటుంది. ఈ విషయంలో వైద్యుడిని సంప్రదించటం తప్పనిసరి. నేడు మీరు ఫైబర్ తీసుకుంటే అది మీ రేపటి జీవితానికి ఆరోగ్యకరమని గుర్తుంచుకోండి. సాక్షి, స్పెషల్ డెస్క్(చదవండి: కొరకరాని గింజలే గాని...) -
‘కోవిడ్–19’తో మహిళల్లో ఆ సమస్య..!
‘కోవిడ్–19’ మహమ్మారి తర్వాత చాలామంది చాలారకాల ఆరోగ్య సమస్యలకు లోనవుతున్న వార్తలు తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. ‘కోవిడ్–19’ ఇన్ఫెక్షన్ ప్రభావం వల్ల, ఆ తర్వాత తీసుకున్న కోవిడ్ వ్యాక్సిన్ వల్ల పలువురు మహిళలు రుతుక్రమంలో అస్తవ్యస్తతలు, దానికి తోడు అసాధారణ రక్తస్రావంతో బాధపడుతున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. ‘కోవిడ్–19’ ఇన్ఫెక్షన్, కోవిడ్ వ్యాక్సిన్ల కారణంగా పలువురు మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి, అధిక రక్తస్రావం సమస్య తలెత్తుతోందని లండన్‌లోని వైద్య నిపుణులు ఇటీవల గుర్తించారు. ఈ సమస్యపై వారు క్షుణ్ణంగా అధ్యయనం చేసి, తమ అధ్యయన వివరాలను ‘క్లినికల్ సైన్స్’ జర్నల్‌లో ప్రచురించారు. ‘కోవిడ్–19’ ఇన్ఫెక్షన్కు గురైన వారిలో దాదాపు 33.8 శాతం మహిళలకు రుతుక్రమంలో అస్తవ్యస్తతలు ఏర్పడ్డాయి. 26 శాతం మహిళల్లో అస్తవ్యస్తమైన రుతుక్రమంతో పాటు అధిక రక్తస్రావం సమస్య ఏర్పడింది. 19.7 శాతం మహిళల్లో రుతుక్రమంలో అస్తవ్యస్తతలు లేకున్నా, అధిక రక్తస్రావం సమస్య తలెత్తింది. డాక్టర్ ప్రమత శిరీష, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: ‘కోవిడ్–19’తో మహిళల్లో ఆ సమస్య..!) -
స్కార్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే..? ఇది ప్రమాదకరమా..
నేను రెండోసారి గర్భవతిని. ఇప్పుడు స్కాన్‌లో స్కార్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని తేలింది. ఇది ప్రమాదకరమా? ఆపరేషన్ తప్పకుండా చేయించుకోవాలా?– మధు, విశాఖపట్నంస్కార్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది ఒక అరుదైన గర్భధారణ సమస్య. ఇది సాధారణంగా గర్భాశయంలో ఏర్పడే గర్భం కాకుండా, గతంలో సిజేరియన్ చేసిన కుట్టు వద్ద ఏర్పడుతుంది. ఇది సుమారు రెండువేల మందిలో ఒకరికి మాత్రమే వచ్చే సమస్య. ప్రస్తుతం సిజేరియన్ డెలివరీల సంఖ్య పెరగడం, స్కానింగ్ పరికరాల మెరుగుదల వలన స్కార్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని సకాలంలో గుర్తించడం సాధ్యమవుతోంది. కానీ, ఈ గర్భం కొనసాగితే తీవ్రమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గర్భధారణ సమయంలో గర్భాశయపు కుట్టు తెరుచుకోవడం, గర్భాశయం చీలిపోవడం వంటి ప్రమాదాలు ఉన్నాయి. గర్భం పెరిగే కొద్దీ కుట్టుపై ఒత్తిడి పెరిగి అది తెరుచుకోవచ్చు. ఇది ప్రాణాపాయ పరిస్థితికి దారి తీసే అవకాశం ఉంది. ఇంకా, స్కార్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వలన ప్లాసెంటా గర్భాశయ గోడకు గట్టిగా అతుక్కుపోయే అవకాశం ఉంటుంది. దీనిని ప్లాసెంటా అక్రీటా స్పెక్ట్రమ్ అంటారు. ఇది గర్భధారణ చివర్లో తీవ్రమైన రక్తస్రావానికి కారణమవుతుంది. కొన్నిసార్లు ప్లాసెంటా మూత్రాశయానికి కూడా అతుక్కుపోతుంది. అలాంటి పరిస్థితుల్లో గర్భాశయాన్ని పూర్తిగా తీసేయాల్సి రావచ్చు. ఇవన్నీ ముందుగా గుర్తించడం కష్టం. చాలా సందర్భాల్లో చిన్న లక్షణాలు మాత్రమే కనిపిస్తాయి. ప్రసవ సమయంలో కూడా స్కార్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వలన తీవ్రమైన రక్తస్రావం సంభవించవచ్చు. ముఖ్యంగా ప్లాసెంటా వేరుచేసే సమయంలో ఇది జరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో గర్భాశయాన్ని తొలగించడం, రక్త మార్పిడి, ఐసీయూలో చికిత్స అవసరం కావచ్చు. గర్భాన్ని కొనసాగించాలంటే అత్యంత జాగ్రత్తగా, నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే ఉండాలి. అవసరమైన ప్రత్యేక స్కాన్లు, పరీక్షలు చేయించుకోవాలి. స్కార్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉన్న చోట ప్లాసెంటా అతుక్కుపోతే, పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారుతుంది. ఈ పరిస్థితిని ముందే అంచనా వేసి, తగిన నిర్ణయం తీసుకోవాలి. సాధారణంగా స్కార్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు గర్భాన్ని తొలగించడం ఉత్తమమని వైద్య నిపుణులు సూచిస్తారు. దీనికోసం కొన్ని మార్గాలు ఉన్నాయి. ఒకటి: చిన్న రంధ్రాల ద్వారా శస్త్రచికిత్స చేసి గర్భాన్ని తొలగించడం. ఈ సమయంలో గత కుట్టు భాగాన్ని బలపరచే చర్యలు కూడా తీసుకుంటారు. తద్వారా భవిష్యత్తులో స్కార్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మళ్లీ కలుగకుండా ఉంటుంది. ఇంకొన్ని సందర్భాల్లో, స్కార్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ప్రారంభ దశలో ఉంటే, మిథోట్రెక్సేట్ అనే ఔషధాన్ని గర్భాశయంలోకి నేరుగా ఇంజెక్షన్ రూపంలో ఇచ్చి, గర్భాన్ని ఆపవచ్చు. ఇది గర్భం చాలా చిన్న దశలో ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగపడుతుంది. చివరిగా, డి అండ్ సి (డైలటేషన్ అండ్ క్యూరెటేజ్) అనే చిన్న శస్త్రచికిత్స ద్వారా కూడా గర్భాన్ని తొలగించవచ్చు. కాబట్టి, స్కార్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని తెలిసిన వెంటనే ఆలస్యం చేయకుండా ప్రసూతి నిపుణులను కలసి, గర్భాన్ని కొనసాగించాలా లేక తొలగించాలా అనే విషయాన్ని నిర్ణయించుకోవాలి. భవిష్యత్తులో సురక్షితమైన గర్భధారణ కోసం ఇది చాలా అవసరం. డాక్టర్ ప్రమత శిరీష, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: శాకాహారుల్లో బీ12 లోపం అంటే..?)∙ -
ఒంటరితనం కోసం 'రిటైల్ థెరపీ'..! కరణ్ జోహార్ హెల్త్ టిప్స్
ఒంటరితనంతో ఇటీవల చాలామంది బాధపడుతున్నారు. ఉరుకుల పరుగుల జీవన విధానంలో మంచి సత్సంబంధాలు నెరపలేక ఒంటరిగా మిగిలిపోతుంటారు కొందరు. అలాగని మనం చొరవగా ఉన్నా.. మన సన్నిహితులు మనతో ఎంజాయ్ చేయలేనంత బిజిబిజీ పనులతో సతమతమవుతుంటారు. దాంతో తెలియని ఒంటిరితనం ఆవరిస్తుంటుంది. అది ఒక్కోసారి డిప్రెషన్‌కి దారితీస్తుంది కూడా. దానికి సరైన మందు రిటైల్ ధెరపీ అని అంటున్నారు బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్. అసలేంటి థెరపీ..?, ఎలా పనిచేస్తుందంటే..ఎన్నో బ్లాక్‌బస్టర్ మూవీలతో మంచి సక్సెస్‌ని అందుకున్న ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్. ఆయన కాస్ట్యూం డిజైనర్, రచయితగా, నిర్మాతగా తన మల్టీ టాలెంట్‌తో ప్రేక్షఖులను అలరించి ఎన్నో అవార్డులను అందుకున్నారుడా. అంతటి విజయాన్ని అందుకుని కూడా ఒక్కోసారి దారుణమైన ఒంటరితనం అనే సమస్యను ఫేస్ చేస్తుంటారట కరణ్. స్వయంగా ఆ విషయాన్ని సోల్ సఫర్ విత్ భావ్ అనే పాడ్‌కాస్ట్ సంభాషణలో కరణ్ వెల్లడించారు. తాను కూడా భావోద్వేగా సమస్యలను ఎదుర్కొని ఒంటరిగా ఫీలవుతుంటానని అన్నారు. దాన్ని అధిగమించేందుకు షాపింగ్ చేస్తుంటానని అన్నారు. దీన్ని రిటైల్ థెరపీ అంటారని చెప్పారు కరణ్. సక్సెస్ అందుకుంటే ఆనందం వస్తుందని చాలామంంది అనుకుంటారు కానీ అది ముమ్మాటికి తప్పని అంటున్నారు. ఇలాంటి భావోద్వేగ సమస్యలు, విచారం, ఒంటరితనం ఆవరించినప్పుడూ ధెర్యంగా నిలబడి ఎదర్కొన్నప్పుడూ కలిగే ఆనందమే వేరెలెవల్ అని అంటున్నారు కరణ్. ఈ విచారం, ఒంటిరితనానికి తాను రిటైల్ ధెరపీతో చెక్పెడతాని అన్నారు. ఆ థెరపీలో భాగంగా ఆయన షాపింగ్ చేస్తుంటారట. ఈ ఒంటరితనాన్ని భర్తీ చేసేందుకు షాపింగ్ చేస్తుంటానని చెప్పారు. నా భావోద్వేగాన్ని అదుపు చేసేందుకు ఇలా షాపింగ్ పేరుతో వస్తువును కొని ఆ వ్యాధిని అధిగమిస్తానని అన్నారు. కొనుగోలు చేస్తున్నప్పుడూ ఎంత ఖరీదు వస్తువు కొంటున్నామనే దానిపై ధ్యాస..ఎంత ఖర్చు చేస్తున్నాం అనేదానిపై అటెన్షన్‌తో ఈ ఒత్తిడి, విచారం, ఒంటరితననాన్ని తెలియకుండానే దూరం చేసుకుంటామని చెబుతున్నారు కరణ్. View this post on Instagram A post shared by Soul Safar with Bhaav (@soulsafarwithbhaav) మంచిగానే పనిచేస్తుందా..?రిటైల్ థెరపీ అంటే..నిరాశనిస్ప్రుహలకు లోనైనప్పుడూ లేదా ఒత్తిడికి గురైనప్పుడు షాపింగ్ చేయడాన్ని రిటైల్ థెరపీ అంటారట. మానసిక స్థితిని పెంచేలా వస్తువులు కొనుగోలు చేయడమే రిటైల్ థెరపీ అట. అధ్యయనాలు కూడా మానసిక స్థితిని మెరుగ్గా ఉంచాడానికి ఇది సరైన థెరపీగా పేర్కొన్నాయి. నిజానికి ఇది తాత్కాలిక పరిష్కారం కాకపోయినా..అప్పటికప్పుడూ ఈ ఒత్తిడిని హ్యాండిల్ చేసేందుకు షాపింగ్‌ని ఉపయోగిస్తే..ఆటోమెటిగ్గా మానసికంగా మెరుగ్గా ఉండే వీలు ఏర్పడుతుందట. వ్యక్తిగతంగా ఈ థెరపీ మనల్ని ఇబ్బంది పెట్టే వాటిని ఎదుర్కొనేలా సహాయపడకపోయినా.. మన మానసిక స్థితి అప్పటికప్పుడూ సవ్యంగా సాధారణ స్థితికి తీసుకువస్తుందట. ఇది దీర్ఘకాలిక ఫలితాలను ఇవ్వగల ప్రొఫెషనల్ థెరపీ మాత్రం కాదట. కేవలం ఆ సమయంలో మనలో వచ్చే నెగిటివ్ ఆలోచనలకు చెక్‌పెట్టి సాధారణ స్థితికి వచ్చేలా చేసే రెడీమేడ్ పరిష్కారంగా ఈ రిటైల్ థెరపీని పేర్కొనవచ్చు అని చెబుతున్నారు నిపుణులు .గమనిక: ఇది కేవలం అవగాన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: 'మన ఆరోగ్యానికి మనమే సీఈఓ': నటి లిసా రే) -
ఇలా చేస్తే.. జస్ట్ ఐదు నెలల్లోనే 25 కిలోల బరువు..!
బరువు తగ్గాలని స్ట్రాంగ్ డిసైడ్ ఉన్నావారు ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే చాలంటోంది ఫిట్నెస్ కోచ్ అమకా. జస్ట్ ఐదు నెలల్లోనే మంచి ఫలితాలు అందుకోవాలని ప్రగాఢంగా కోరుకుంటే ఇలాంటి చిట్కాలు అనుసరించడం మంచిదని సూచిస్తుంది. తాను ఆ రెమిడీస్తోనే ఐదు నెలల్లోనే అనూహ్యంగా కిలోలు కొద్దీ బరువు తగ్గినట్టు చెప్పుకొచ్చింది. త్వరితగతిన ఆరోగ్యకరమైన రీతీలో బరువు తగ్గాలనుకుంటే.. బెస్ట్ టిప్స్ ఇవే అని చెబుతోంది ఫిట్నెస్ కోచ్ అమకా.బరువు తగ్గాలనుకుంటున్నవారు ముందుగా తాను ఎందుకు బరువు తగ్గలనుకుంటున్నా, ఎంత వెయిట్ లాస్ అవ్వాలన్నది లక్ష్యం అనేవి స్ట్రాంగ్‌గా నిర్దేశించుకోవాలంటున్నారు అమకా. అది మీకు లక్ష్యంపై ఫోకస్ పెట్టేలా చేస్తుందట. బరువు తగ్గాలనుకునేవారు ఎవ్వరైనా సింపుల్ దినచర్యను ప్రారంభించాలని చెప్పారు. ముందుగా రోజుకు మూడు లేదా రెండు సార్లు సమతుల్య భోజనం, పది నుంచి 20 నిమిషాల నడక, రెండు లీటర్ల నీరు, మంచి నిద్ర, సరైన క్వాంటిటీలో తీసుకోవడం వంటివి చాలని చెప్పారు. ఇక్కడ ఆహారం శరీరానికి సరిపడ పోషకాలు అందేలా సంతృప్తిని కలిగించేలా ఉండాలని చెప్పారు. అతిగా తినడాన్ని నివారించాలన్నారు. ముఖ్యంగా ప్రతి భోజనంలో ప్రోటీన్, అధిక ఫైబర్ తప్పనిసరిగా భాగం చేసుకోవాలని చెప్పారు. కార్బోహైడ్రేట్లు కూడా తగు మోతాదులో తీసుకోవాలని సూచించారు. ప్రధానంగా సమతుల్యతను పాటిస్తే చాలు ఎలాంటి ఆహారమైనా ధైర్యంగా తినొచ్చని చెబుతున్నారామె. ప్రతి రోజు వాకింగ్, చక్కెర పానీయాలు దూరంగా ఉండటం అనేది అత్యంత ముఖ్యం. ఈ చిన్నపాటి రెమిడీలు భారీ ఫలితాలను అందించి..శరీరంలో సత్వర మార్పులకు నాంది పలుకుతుందట. ఇలా స్ట్రిక్ట్‌గా డైట్‌ని అనుసరిస్తే..జస్ట్ ఐదు నెలల్లోనే 25 కిలోలు మేర బరువు తగ్గుతారట. తాను కూడా అలాంటి సింపుల్ చిట్కాలను అనుసరించే ఐదునెలల్లోనే 25 కిలోలు పైనే తగ్గానని చెప్పుకొచ్చింది. ఆరోగ్యకరమైన రీతీలో బరువు తగ్గాలనుకుంటే ఈ విధానం చాలా హెల్ప్ అవుతుందని సూచిస్తోంది ఫిట్నెస్ కోచ్ అమకా. View this post on Instagram A post shared by CERTIFIED NUTRITIONIST (@shred_with_amaka) (చదవండి: Mona Singhs weight loss journey: యోగా, డైట్‌తో ఆరు నెలల్లో 15కిలోలు..! స్లిమ్‌గా మోనాసింగ్) -
తుమ్ములు కుమ్మేస్తున్నాయా..? వాచ్ ది హాచ్
తరచుగా తుమ్ములు రావడం, ఛాతీ అంతా నొక్కేసినట్టుగా అనిపించడం చాలామంది ఎదుర్కొనే సమస్య. సాధారణంగా అలెర్జీలు, జలుబు వంటివి వచ్చినప్పుడు తుమ్ములు ఓ లక్షణంగా కనిపిస్తుంటాయి. కొన్నిసార్లు తుమ్ములు చాలా మామూలు విషయమే గానీ... మరికొన్నిసార్లు అవి మరింత తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు ఓ సూచన కావచ్చు. ఈ నేపథ్యంలో తరచూ కనిపించే తుమ్ములు ఎందువల్ల వస్తాయో, ఏయే సమయాల్లో అవి తీవ్రమైన సమస్యలకు సూచికగా ఉంటాయో అలాంటప్పుడు అవసరమైన సాధారణ ఇంటి చిట్కాలు మొదలుకొని... పెద్ద సమస్యలకు అవసరమైన చికిత్సలేమిటన్న అనేక అంశాలపై అవగాహన కలిగించే కథనమిది...ఆవలింతకు అన్న ఉన్నాడుగానీ... తుమ్ముకు తమ్ముడు లేడని ఓ వాడకమాట. అంటే ఒకరు ఆవలించగానే మరొకరికి ఆవలింత వస్తుంది... కానీ తుమ్ము అలాకాదు... సోలోగా వస్తుందని అర్థం. తుమ్ము ఎలాంటి ఆరోగ్య సమస్యలను సూచిస్తుందో చూద్దాం...అలెర్జీలు, పుప్పొడి, ధూళిలో ఉండే అతి చిన్న డస్ట్‌మైట్స్, పెంపుడు జంతువుల వెంట్రుకలు (పెట్ డ్యాండర్), బూజు వంటివి ఊపిరితిత్తులను ప్రేరేపించి తుమ్ములొచ్చేలా చేస్తాయి.జలుబు అలాగే ఫ్లూ (కామన్ కోల్డ్ అండ్ ఫ్లూజ్వరం)లో : వైరల్ ఇన్ఫెక్షన్ల కారణంతో ముక్కు కారుతుండే సమయంలో; దగ్గు, గొంతునొప్పి, జ్వరంతో పాటు తుమ్ములూ వస్తుంటాయి. నాన్–అలెర్జిక్ రైనైటిస్: ఈ సమస్య ఉన్నప్పుడు అలెర్జీని ట్రిగర్ చేసే కారకాలు లేకుండానే వచ్చే తుమ్ములూ, ముక్కు కారడం వంటి లక్షణాలతో ఉంటాయి. వాతావరణంలో మార్పులు, కొన్ని రకాల వాసనలు, మసాలాలు ఇందుకు కారణమవుతుంటాయి. దుమ్ము, ధూళి, వాతావరణ కాలుష్యాలు (డస్ట్ అండ్ పొల్యూషన్) : వాతావరణంలోని దుమ్ము, పొగ, వాయుకాలుష్యం వంటి అంశాలు ముక్కులోని అతి సున్నితమైన పొరలను ఇరిటేట్ చేయడం ద్వారా తుమ్ములొచ్చేలా చేస్తాయి. బాగా ఘాటుగా ఉండే వాసనలు (స్ట్రాంగ్ సెంట్స్) : కొన్ని రకాల సెంట్లూ, పెర్‌ఫ్యూమ్‌లూ, శుభ్రం చేయడానికి వాడే సువాసనగల క్లీనింగ్ ఉత్పత్తులు లేదా కొన్ని రకాల రసాయనాల తాలూకు ఘాటు వాసనలు తుమ్ములను తెప్పిస్తాయి.ఛాతీ బిగుసుకుపోయినట్టు అనిపించేలా చేసే ఈ కారణాలన్నీ తుమ్ములతో సంబంధం ఉన్నవే. చాలాసార్లు తుమ్ములు వస్తున్నప్పుడు ఊపిరితిత్తులపై ఒత్తిడి పడుతున్నట్లుగానూ, ఛాతీ బాగా బిగదీసుకుపోయిన ఫీలింగ్ కలుగుతుంటుంది. ఇలా ఏయే సమయాల్లో జరుగుతుందో తెలుసుకుందాం. తరచుగా వచ్చే దగ్గుతో (ఫ్రీక్వెంట్ కాఫ్ వల్ల) : తుమ్ములతోపాటు తరచూ వచ్చే దగ్గు వల్ల ఛాతీ కండరాలపై ఒత్తిడి పడుతుంది. దాంతో ఛాతీ బిగుసుకుపోయినట్టు అనిపిస్తుంది. అలెర్జిక్ ఆస్తమా : అలెర్జీ సమస్య ఉన్న కొందరిలో అదేపనిగా తుమ్ములు వస్తుండటంతోపాటు వాళ్ల శ్వాసనాళాలూ, ఊపిరితిత్తుల్లోని గాలిగొట్టాలూ సంకోచించి సన్నబారిపోతుంటాయి. దాంతో గాలి సాఫీగా ప్రవహించడానికీ / ప్రసరించడానికీ తగినంత స్థలం లేకపోవడంతో శ్వాస తీసుకోవడం కష్టంగా మారడం (ఆస్తమా) జరగవచ్చు. ఆ శ్వాసనాళాలన్నీ సన్నబారి ఊపిరితీసుకోవడం కష్టంగా మారడంతో ఛాతీలోనూ బిగుతుగా అనిపిస్తుంది. పిల్లికూతలతోపాటు ఇలా శ్వాస తీసుకోవడం కష్టం కావడాన్నే ఆస్తమాగా పేర్కొంటారు. సైనస్‌తో పెరిగే ఒత్తిడి (సైనస్ ప్రెషర్): ముఖం ఎముకల మధ్య ఉండే ఖాళీ ప్రదేశాలను సైనస్ అంటారు. తుమ్ములు, జలుబు లేదా అలెర్జీల వల్ల సైనస్లలో ఇన్ఫెక్షన్ (అంటే వాపు వచ్చి) ఆ కారణంగా ఛాతీపై పరోక్షంగా ఒత్తిడి పెరగవచ్చు. ఇలా సైనస్లలో పేరుకు΄ోయిన శ్లేష్మం... ఛాతీపై ఒత్తిడిని పెంచుతుంది.కండరాల నొప్పి (మజిల్ స్ట్రెయిన్): తరచుగా తుమ్మడం వల్ల ఛాతీ కండరాలపై ఒత్తిడి పడుతుండటం వల్ల ఆ కారణంగా నొప్పిగానూ, ఛాతీ బిగుతుగా అనిపించవచ్చు.తుమ్ములతో ఊపిరితిత్తులపై పడే ప్రభావమిలా...సాధారణంగా తుమ్మడమనే ప్రక్రియ... ముక్కు లేదా శ్వాసనాళాల్లో అడ్డుగా ఉండి చికాకు కలిగించే కొన్ని వ్యర్థాలనూ, కణాలను బలంగా బయటకు పంపడానికి శరీరం అసంకల్పితంగా చేసే ఓ రక్షణాత్మకమైన ప్రక్రియ. అయితే, తరచుగా, అలాగే తీవ్రంగా, అదేపనిగా తుమ్ములు వస్తున్న కొన్ని సందర్భాల్లో అవి ఊపిరితిత్తులపై కొంత ప్రతికూల ప్రభావం చూపవచ్చు. ఊపిరితిత్తుల కండరాలపై ఒత్తిడి (స్ట్రెయిన్ ఆన్ లంగ్ మజిల్స్)తుమ్మిన ప్రతిసారీ కడుపును రెండు భాగాలుగా విభజించి, ఊపిరితిత్తులనూ, కడుపు తాలూకు జీర్ణవ్యవస్థలోని భాగాల్ని వేరు చేసే డయాఫ్రమ్ అనే పొర, ఛాతీ కండరాలూ సంకోచిస్తాయి. ఇలా మరీ ఎక్కువగానూ, శక్తిమంతంగానూ తుమ్ములు వస్తున్నప్పుడు అక్కడి కండరాలపై తీవ్రమైన ఒత్తిడి కలిగిస్తాయి. దాంతో ఛాతీలో నొప్పి, అక్కడి కండరాలకు తీవ్రమైన అసౌకర్యం కలుగుతుంది. దీనివల్ల ఊపిరితిత్తులపైన నేరుగా ప్రభావం పడదుగానీ... శ్వాసప్రక్రియకు సహాయపడే కండరాలపై తీవ్రంగా ఒత్తిడి పడుతుంది. దాంతో శ్వాస సరిగా ఆడకపోవడం, ఆయాసం రావడం జరుగుతాయి. దీన్నే వాడుక భాషలో ఉబ్బసంగా చెబుతుంటారు. శ్వాసనాళాల్లో ఇబ్బంది (ఇరిటేషన్), వాపు (ఎయిర్ వే ఇరిటేషన్ అండ్ ఇన్ఫ్లమేషన్)తుమ్మినప్పుడు గాలి అకస్మాత్తుగా చిమ్మినట్టుగా చాలా వేగంగా బయటకు వస్తుంది. ఇది శ్వాసనాళాల లోపలి పొరల్లో ఇబ్బంది (ఇరిటేషన్) కలిగిస్తుంది. అలాగే అలెర్జీలూ, మాటిమాటికీ వచ్చే ఇన్ఫెక్షన్ల వల్ల వల్ల తరచుగా తుమ్ములు వస్తున్నట్లయితే, ఈ ఇబ్బంది (ఇరిటేషన్) కాస్తా దీర్ఘకాలిక వాపునకు (క్రానిక్ ఇన్ఫ్లమేషన్) దారితీసే అవకాశముంది. ఈ ఇన్ఫ్లమేషన్ కాస్తా శ్వాసనాళాలను మరింతగా కుంచించుకు΄ోయేలా చేసి, గాలి సాఫీగా ప్రసరించడాన్ని ఆటంకపరుస్తుంది. ఫలితంగా హాయిగా ఊపిరి పీల్చుకోవడం కష్టమవుతుంది.ఆస్తమాను ప్రేరేపించడం లేదా తీవ్రతరంచేయడం(ట్రిగరింగ్ / వర్సెనింగ్ ఆస్తమా) : ఆస్తమా సమస్య ఉన్నవారిలో తుమ్ములు ఆస్తమా అటాక్‌ను ప్రేరేపించగలవు... అంటే ట్రిగర్ చేయగలవు. అలెర్జీని కలిగించే అంశాలను (అలర్జెన్స్‌ను) దేహం ఎదుర్కొన్నప్పుడు యధేచ్ఛగా తుమ్ములు వస్తూ అవి శ్వాసనాళాలను కుంచించుకుపోయేలా / బిగుసుక΄ోయేలా చేస్తాయి. దాంతో ఛాతీ బిగదీసుకుపోవడం ఆస్తమా లక్షణాలు తీవ్రతరం కావడం జరగవచ్చు. అప్పుడు శ్వాసనాళాలు సన్నబారడంతో దగ్గు, ఆయాసం, ఎగశ్వాస, ఛాతీ బిగదీసుకుపోవడం వంటి ఆస్తమా లక్షణాలు కనిపిస్తాయి లేదా వాటిని తీవ్రతరం చేస్తాయి కూడా. తుమ్ములు మరింత ఎక్కువగా వస్తూ, దగ్గు కూడా తోడైనప్పుడు ఊపిరితిత్తులపై ఒత్తిడి బాగా పెరిగి, ఆస్తమా ఉన్నవారికి అది మరింత కష్టంగా పరిణమించవచ్చు.ఇన్ఫెక్షన్ వ్యాప్తి (స్ప్రెడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్):జలుబు లేదా ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్ల వల్ల తుమ్ములు వస్తున్నప్పుడు, అలా తుమ్మినప్పుడు వెలువడే అతి సన్నటి తుంపర్లలతో వైరస్లు ఉంటాయి. ఆ తుంపర్ల కారణంగా వైరస్ ఇతరులకు వ్యాప్తి చెందడంతో పాటు, కొన్నిసార్లు శ్వాసనాళాల లోపల మరింత లోతుకు విస్తరించి బ్రాంకైటిస్ లేదా నిమోనియా వంటి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చు. మరీ ముఖ్యంగా వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో ఇలా జరగడం చాలా సాధరణం.గాలి గదులు ధ్వంసం కావడం లేదా న్యూమోథొరాక్స్ : ఇది చాలా అరుదుగా మాత్రమే చోటు చేసుకునే ప్రమాదం. కొన్ని తీవ్రమైన సందర్భాల్లో, అంటే మరీ ముఖ్యంగా ముఖ్యంగా ఊపిరితిత్తులలోని అంతర్గత సమస్యలు (ఉదాహరణకు ఎంఫసిమా వంటి సమస్యలు) ఉన్నవారిలో, తుమ్ములు చాలా బలంగా లేదా తీవ్రంగా వస్తున్నప్పుడు ఊపిరితిత్తులలోని అతి చిన్న గాలి గదులు (బ్లెబ్స్ అండ్ బ్యుల్లే) ఫటేల్మంటూ పగిలినట్టుగా అయ్యే ముప్పు ఉంటుంది. అయితే ఇది చాలా అరుదు. అయితే ఇది జరిగితే దీనివల్ల ఊపిరితిత్తీ అలాగే ఛాతీ గోడకు మధ్యన గాలి లీక్ అయి, న్యుమోథొరాక్స్ (కొలాప్స్‌డ్ లంగ్) అనే తీవ్రమైన కండిషన్‌కు దారి తీస్తుంది. ఇది చాలా అత్యవసరంగా వైద్యచికిత్స అందించాల్సిన పరిస్థితి.... అంటే మెడికల్ ఎమర్జెన్సీ.వైద్యచికిత్స ఎప్పుడంటే... ఈ కింద పేర్కొన్న లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. అవి... గాలి పీల్చడంలో తీవ్రమైన ఇబ్బంది; శ్వాస సరిగా తీసుకోలేక΄ోవడం, ఊపిరి అందక΄ోవడం / ఊపిరాడకపోవడం ఛాతీ బిగుసుకు΄ోవడం / ఛాతీలో తీవ్రమైన నొప్పి ఒక పట్టాన తగ్గని తీవ్రమైన జ్వరం శ్లేష్మం / కఫం పసుపురంగులో లేదా ఆకుపచ్చరంగులో ఉండటం ఇక్కడ పేర్కొన్న ఈ లక్షణాలు కొన్ని రోజుల తర్వాత కూడా తగ్గకుండా ఉండటం లేదా మరింత తీవ్రతరమైతే తక్షణం డాక్టర్‌ను సంప్రదించడం అవసరం.కొన్ని ఇతర వైద్యపరమైన సమస్యలతో కనిపించే లక్షణాలు : గుండె సంబంధిత సమస్యల కుటుంబ చరిత్ర / వైద్య చరిత్ర (హెల్త్ అండ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవారు బాగా ఛాతీలో ఇబ్బంది లేదా ఛాతీ బిగుసుకు΄ోవడం వంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు. తరచుగా తుమ్ములు, ఛాతీలో బాగా బిగదీసుకుపోయి ఛాతీలో ఒత్తిడి ఉన్నట్లుగా అనిపిస్తుండటం (ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు ఎంతమాత్రమూ నిర్లక్ష్యం చేయకూడదు. ఈ సందర్భాల్లో సమస్య చాలా సాధారణంగా కనిపిస్తున్నా లేదా అంత తీవ్రమైన సమస్య కానప్పటికీ ఆ లక్షణాలను నిర్లక్ష్యం చేయడం సరికాదు. ఈ లక్షణాలు కనిపించినప్పుడు డాక్టర్‌కు చూపించి వెంటనే తగిన చికిత్స తీసుకోవడం అవసరం.చివరగా... తరచుగా తుమ్ములు రావడమన్నది దాదాపుగా అందరిలోనూ తమ జీవితకాలంలోని ఏదో ఒక సమయంలో అనుభవంలోకి వచ్చే సమస్య. అయితే ఇలా తుమ్ములు పదేపదే కనిపిస్తుంటే మాత్రం ఒకసారి డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.తుమ్ముల నివారణా... అందుకు ఉపకరించే ఇంటి చిట్కాలు నివారణకు అనుసరించాల్సిన సూచనలు : అలెర్జీకి కారణమయ్యే కారకాల (అలర్జెన్స్)ను గుర్తించడం, వాటికి దూరంగా ఉండటం. (అంటే మనకు ఏ కారణంగా అలెర్జీ వస్తుందో తెలుసుకుని, వాటి నుంచి దూరంగా ఉండటం, అవి ఎదురుకాకుండా చూసుకోవడం; ఇంట్లో అలెర్జెన్స్ లేకుండా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం; దుమ్మూ ధూళి లేకుండా జాగ్రత్తపడటం; పెంపుడు జంతువులూ, వాటి వెంట్రుకల నుంచి దూరంగా ఉండటం. డాక్టర్లు సూచించిన మేరకు అలర్జీలను నివారించే నేసల్ స్ప్రేలు వాడటం లేదా యోగా ప్రక్రియలో కొమ్ముతో ఉండే చిన్న భరిణె లాంటి ఉద్ధరిణి సహాయంతో ‘నేతి’ అనే యోగప్రక్రియతో ముక్కు రంధ్రాల్ని శుభ్రం చేసుకోవడం (ఈ నేతి ప్రక్రియ కారణంగా ముక్కులోని అలెర్జీ కారకాలు (అలర్జెన్స్). శ్లేష్మం కొట్టుకుపోయి ముక్కు శుభ్రంగా ఉండటంతో అలెర్జీ, ఆస్తమా నివారితమవుతాయి). ఆవిరి పీల్చడం (స్టీమ్ ఇన్హెలేషన్) : వేడినీటి ఆవిరి పీల్చడం వల్ల ముక్కుదిబ్బడ తగ్గడంతోపాటు శ్వాస తేలిగ్గా అందుతుంది. నీరూ, ద్రవపదార్థాలూ ఎక్కువగా తీసుకోవడం (హైడ్రేటెడ్‌గా ఉండటం) : నీళ్లు ఎక్కువగా తాగుతుండటం వల్ల శ్లేష్మం (స్ఫుటమ్) పల్చబడి అది తేలిగ్గా బయటకు వస్తుంది. (ఈ శ్లేష్మం ఊపిరితిత్తుల్లోనూ, గొంతులోనూ ఇరుక్కుని ఉన్నప్పుడు శ్వాస సరిగా అందకపోవడం, ఊపిరితీసుకోడానికి అది అడ్డుపడటం వల్ల చికాకుగా ఉండటం వంటివి చాలామందికి అనుభవంలోకి వచ్చే విషయమే). ఇంటి చిట్కాలుతేనె అల్లం కలిపిన పానియాలు : తేనె (హనీ), జింజర్ (అల్లం) కలిపి చేసుకున్న పానియాల వల్ల గొంతు నొప్పి తగ్గడం, దగ్గు నుండి ఉపశమనం కలగడం వంటి ఫలితాలుంటాయి. తుమ్ములూ తగ్గుతాయి.తగినంత విశ్రాంతితో : శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వడం వల్ల వ్యాధి నిరోధక శక్తి మెరుగవ్వడంతోపాటు త్వరగా కోలుకోవచ్చు. పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండటం : పొగతాగడం, పొగకు ఎక్స్పోజ్ అవుతుండటం వల్ల శ్వాసకోశ సమస్యలు మరింత తీవ్రమవుతాయి. ఇక పోగ ఎక్కువగా వస్తున్నచోట ఉంటే ఊపిరిసలపనట్టుగా అనిపిస్తుండటం అందరికీ అనుభవంలోకి వచ్చే విషయమే. అందుకే పొగ అలవాటుకూ, పొగకూ దూరంగా ఉండటం మేలు. (చదవండి: Beauty Tip: మేకప్ లేకున్నా...అందంగా కనిపించాలంటే..!) -
గుండె జబ్బులు...మూడు కారణాలు.. నాలుగు పరిష్కార మార్గాలు! (ఫొటోలు)
-
అరుదైన స్ట్రోక్‌తో..మెడుల్లాపై దాడి!
స్ట్రోక్ అంటే మనకు తెలిసింది మెదడుకు వచ్చే బ్రెయిన్ స్ట్రోక్. అయితే చిన్నప్పట్నుంచీ మనం చదువుకున్న మెదడులోని భాగాలైన పెద్ద మెదడు, చిన్న మెదడు, మెడుల్లా అబ్లాంగేటాలలో... మెడుల్లా అనే భాగానికి కూడా స్ట్రోక్ వచ్చే అవకాశముంది. ఆ భాగానికి స్ట్రోక్ వచ్చినప్పుడు కలిగే కొన్ని నరాల మార్పుల (న్యూరలాజికల్ కండిషన్స్) వల్ల దేహంలోని ఓ పక్క భాగం (అంటే లాటరల్ భాగం) అచేతనమైపోయే అవకాశం ఉంది. ఇలా మెదడులోని మెడుల్లా అనే భాగానికి వచ్చే స్ట్రోక్ వల్ల కలిగే మార్పుల కారణంగా కళ్లు తిరుగుతున్నట్లు ఉండటం (డిజ్జీనెస్), సరిగా నిలబడలేక΄ోవడం, గుటక వేయలేకపోవడం వంటి లక్షణాలతో కనిపించే ఈ అనారోగ్యాన్ని ‘ల్యాటరల్ మెడుల్లరీ సిండ్రోమ్’ అంటారు. ఈ సమస్యపై అవగాహన కోసమే ఈ కథనం.ల్యాటెరల్ మెడుల్లరీ సిండ్రోమ్ అనే ఈ సమస్య... సాధారణంగా మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే పోస్టీరియర్ ఇన్ఫీరియర్ సెరెబెల్లార్ ఆర్టరీ (పీఐసీఏ)లో రక్తప్రవాహం ఆగడం వల్ల వస్తుంది. దాంతో మెడుల్లా (బ్రెయిన్ స్టెమ్)లోని ఒక పక్క భాగం (పార్శ్వం) ప్రభావితమవుతుంది. ఇవీ లక్షణాలు... బాధితులకు నొప్పి, వేడిమి, ఉష్ణబాధలు తెలియకపోవడం బాలెన్స్ కోల్పోవడం, నడుస్తున్నప్పుడు సరైన రీతిలో నడవలేకపోవడం (గెయిట్ సరిగా లేకపోవడం) ∙తల, కళ్లు తిరుగుతుండటం ∙గుటకవేయలేక΄ోవడం, గొంతు బొంగురుపోవడం, మాట ముద్దముద్దగా రావడం. (మెదడులోని మింగే వ్యవస్థనూ, మాట్లాడే కేంద్రాన్ని నియంత్రించే ‘న్యూక్లియస్ యాంబిగస్’ అనే భాగం ఆయా వ్యవస్థలపై అదుపు కోల్పోవడంతో ఈ పరిణామం సంభవిస్తుంది) కనురెప్ప దానంతట అదే వాలిపోవడం, కనుపాప దగ్గరగా ముడుచుకోవడం (ప్యూపిల్ కన్‌స్ట్రిక్షన్), కొన్నిసార్లు కళ్లు (నల్లగుడ్డు) వాటంతటవే కదుతుండటం కొందరిలో వికారం, వాంతులు, ఎక్కిళ్లు.కారణాలు... మెదడులోని కొన్ని భాగాలకు రక్తం అందించే ధమనులు గట్టిబారి΄ోయి సన్నబడటం లేదా ఆ గోడల్లో పగుళ్లు రావడం వల్ల మెడను సరిగా ఉపయోగించకుండా రఫ్‌గా వాడినప్పుడు అక్కడి వర్టెబ్రల్ ఆర్టరీస్‌లో పగుళ్లు రావడం వల్ల లేదా మార్ఫన్స్ సిండ్రోమ్, ఎహ్లెర్–డ్యాన్లస్ సిండ్రోమ్, ఫైబ్రోమస్క్యులార్ డిస్ప్లేసియా (రక్తనాళాల లోపలివైపున కణాలు పెరగడం వల అవి సన్నబారిపోవడం) వంటి కారణాలతో ఈ సమస్య వస్తుంది. అయితే మిగతా కారణాలతో పోలిస్తే ఈ అంశాలు చాలా అరుదు.నిర్ధారణ... మెదడు ఎమ్మారై ద్వారా అలాగే లక్షణాలను బట్టి దీన్ని నిర్ధారణ చేస్తారు. అయితే చాలా సందర్భాల్లో నిర్ధారణ సరిగా జరగక... ఈ సమస్యను ఇతర సమస్యగా పొరబడటం జరుగుతుంటుంది. ప్రధానంగా వికారం, వాంతులు, తలతిరగడం, కళ్లుతిరగడం వంటి లక్షణాలను బట్టి దీన్ని ఈఎన్టీ సమస్యగా పొరబడుతుంటారు. చికిత్స... స్ట్రోక్ అనేది ఈ తరహాదైనప్పటికీ దానికి అత్యంత త్వరగా చికిత్స అందడం అవసరం. అప్పుడే వీలైనంత తక్కువ నష్టం జరుగుతుంటుంది. ఈ తరహా స్ట్రోక్ మొదలుకొని అది ఎలాంటిదైనప్పటికీ వీలైనంత త్వరగా హాస్పిటల్‌కు తీసుకురావాలి. బాధితుల్ని కనీసం మూడు నుంచి నాలుగు గంటల లోపు తీసుకొస్తే డాక్టర్లు థ్రాంబోలిటిక్ థెరపీ (అంటే ధమనుల్లో రక్తసరఫరాను పునరుద్ధరించేందుకు ఇంజెక్షన్ ద్వారా మందును ఇచ్చే చికిత్స)ని బాధితులకు అందించడానికి ప్రయత్నిస్తారు. ఇదే కాకుండా కొన్ని సందర్భాల్లో కొందరికి ‘మెకానికల్ థ్రాంబెక్టమీ’ అనే (రక్తనాళాల్లో పేరుకుపోయిన క్లాట్‌ను తొలగించడానికి చేసే) శస్త్రచికిత్సతో పరిస్థితిని చక్కబరుస్తారు. ఇటీవల ఈ సమస్యపట్ల కొంత అవగాహన పెరగడంతో మునపటిలా కాకుండా సంబంధిత చికిత్సలు సత్వరమే జరుగుతున్నాయి. అయితే ముందుగా చెప్పినట్లుగా థ్రాంబోలిటిక్ థెరపీ చేయడానికి అవకాశం లేకుండా కాస్తంత ఆలస్యంగా వచ్చినవారికి క్లాట్స్ ఏర్పడకుండా ఉంచేందుకు రక్తం గడ్డకట్టి ఉండలుగా మారకుండా యాంటీ ప్లేట్లెట్ ఏజెంట్స్‌ను ఇవ్వడం, రక్త΄ోటు (బీపీ) అదుపులో ఉంచడం, కొలెస్ట్రాల్ వంటి కొవ్వులను తగ్గించడం, రక్తాన్ని పలచబర్చేలా యాంటీ కోయాగ్యులెంట్స్ ఇవ్వడం వంటి మేనేజ్మెంట్ చికిత్సలూ అవసరమవుతాయి.రీ–హ్యాబిలిటేషన్... ఇక్కడ పేర్కొన్నవే కాకుండా బాధితులు కోలుకునేందుకు వీలుగా ఫిజియో వంటి ‘రీ–హ్యాబిలిటేషన్’ వంటి కాస్త సుదీర్ఘ చికిత్సలతో పాటు బ్యాలెన్స్డ్గా నడక ప్రాక్టీస్ చేయించడం, మాట ముద్దగా వస్తున్నవారికి స్పీచ్ థెరపీ వంటివి కూడా అవసరమవుతాయి. భవిష్యత్తు ఆశారేఖలివి... ఇప్పుడున్న మందులు కాకుండా న్యూరో ప్రొటెక్టివ్ మెడిసిన్, స్టెమ్‌సెల్ చికిత్సల వంటి వాటిపైనా విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ లక్షణాలతో స్ట్రోక్‌ను గుర్తించి వీలైనంత త్వరగా బాధితులను హాస్పిటల్‌కు తరలించడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వల్ల జరిగే నష్టాన్ని వీలైనంతగా తగ్గించవచ్చు.(చదవండి: సర్వైకల్ క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్ తీసుకోవచ్చా?) -
అరవైలలోని మహిళలకూ ఆ ముప్పు!
హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్‌పీవీ) కారణంగా సర్వైకల్ క్యాన్సర్ సోకే ముప్పు యువతులకు, నడివయసు మహిళలకు మాత్రమే పరిమితం అనుకుంటే పొరపాటే! అరవై ఏళ్లు నిండిన వయసులోని మహిళలకు కూడా ఈ ముప్పు ఎక్కువగానే ఉంటుందని ఇటీవలి పరిశోధనల్లో తేలింది. అందువల్ల అరవైలలోని మహిళలు కూడా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం మంచిదని అంతర్జాతీయ వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఇటీవల విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2022లో సర్వైకల్ క్యాన్సర్ సోకిన మహిళల్లో 65 ఏళ్లు పైబడిన మహిళలు 1,57,182 మంది ఉంటే, వారిలో 1,24,269 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ లెక్కన వార్ధక్యంలో సర్వైకల్ క్యాన్సర్ సోకిన మహిళలు ప్రాణాపాయం బారిన పడే అవకాశాలే ఎక్కువగా ఉంటున్నట్లు స్పష్టమవుతోంది. సాధారణంగా ఈ వయసులోని మహిళలు వ్యా«ధి రెండో దశలోను, ఇంకా ముదిరిన దశలోను ఆస్పత్రుల్లో చేరుతున్నట్లు డబ్ల్యూహెచ్ఓ నివేదికలు చెబుతున్నాయి. అందువల్ల అరవైలలో ఉన్న మహిళలు కూడా నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల సూచనలపై ఎప్పటికప్పుడు స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని, దానివల్ల వ్యాధిని తొలిదశలోనే గుర్తించి ప్రాణాపాయాన్ని నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు. సర్వైకల్ క్యాన్సర్ ముప్పును చాలావరకు తప్పించగల హెచ్‌పీవీ వ్యాక్సిన్ అందు బాటులోకి వచ్చినా, వ్యాక్సిన్ తీసుకుంటున్న మహిళల సంఖ్య ఇంకా తక్కువగానే ఉంటోంది. డబ్ల్యూహెచ్ఓ లెక్కల ప్రకారం 2017–2023 మధ్య కాలంలో 25–54 ఏళ్ల వయసు గల మహిళల్లో కేవలం రెండు శాతం మంది మాత్రమే ఈ వ్యాక్సిన్ తీసుకున్నారు. (చదవండి: సర్వైకల్ క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్ తీసుకోవచ్చా?) -
సర్వైకల్ క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్ తీసుకోవచ్చా?
నేను ఇద్దరు పిల్లల తల్లిని. వయసు నలభై రెండు సంవత్సరాలు. ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్ తీసుకోవచ్చా?– శాంత, విజయవాడ.మీరు తప్పకుండా ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఎందుకంటే సర్వైకల్ క్యాన్సర్ హ్యూమన్ పాపిలోమా వైరస్ వలన వస్తుంది. ఇది లైంగిక చర్యల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపించే ఇన్ఫెఫెక్షన్. ఎక్కువసార్లు ఈ ఇన్ఫెక్షన్ కు ఎటువంటి లక్షణాలు ఉండవు. మన రోగనిరోధక వ్యవస్థ చాలాసార్లు దీన్ని తట్టుకోగలుగుతుంది. కాని, కొన్నిసార్లు హైరిస్క్ వైరస్లు పదహారు నుంచి పద్దెనిమిది రకాలు శరీరంలో ఉండిపోతే, గర్భాశయ కణాల్లో మార్పులు వస్తాయి. ఇవి కాలక్రమంలో క్యాన్సర్‌కి దారితీయవచ్చు. ఇలా క్యాన్సర్‌గా మారటానికి మూడు నుంచి పదిహేను సంవత్సరాల వరకు పడుతుంది. ఇది కేవలం సర్వైకల్ క్యాన్సర్‌కే కాకుండా జననాంగ క్యాన్సర్, మలద్వారం, నోటి, గొంతు క్యాన్సర్లు, పురుషుల్లో పురుషాంగ క్యాన్సర్ వంటి ఇతర ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. ఈ టీకా ఎక్కువ ప్రయోజనం ఇచ్చేది పెళ్లికి ముందే తీసుకుంటే. ఎందుకంటే లైంగికంగా చురుకుగా ఉండే వారిలో ఈ ఇన్ఫెక్షన్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనకు తెలిసిన పదమూడు రకాల వైరస్ల వలన క్యాన్సర్ రావచ్చు. అయితే, ఈ టీకా వాటిలో కొన్ని ముఖ్యమైన రకాల నుంచే రక్షణ ఇస్తుంది. అందుకే టీకాతో పాటు కండోమ్ వాడటం, అవసరమైనప్పుడు స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం కూడా చాలా ముఖ్యం. ఇది నిర్ధారించాలంటే ప్యాప్ టెస్ట్, వైరస్ టెస్ట్ అనే రెండు పరీక్షలు చేయించాలి. ఇవి గర్భాశయ కణాల్లో అసాధారణ మార్పులను ముందే చూపిస్తాయి. అవసరమైతే వెంటనే చికిత్స తీసుకుని క్యాన్సర్ దశకు వెళ్లకుండా అడ్డుకోవచ్చు. వైరస్ టెస్ట్ ద్వారా హైరిస్క్ వైరస్లు ఉన్నాయా లేదా అనే విషయం స్పష్టమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ టీకా వలన సర్వైకల్ క్యాన్సర్, మొటిమలు వచ్చిన వారి సంఖ్య చాలా తగ్గిపోయింది. అందుకే టీకా తీసుకోవడం ఎంతో అవసరం. టీకా తీసుకున్నాక కూడా ప్రతి మూడేళ్లకోసారి లేదా ఐదేళ్లకోసారి స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. తొమ్మిది నుంచి నలభై ఐదేళ్ల వయస్సు మధ్యలో ఉన్నవారికి ఈ టీకా ఇవ్వవచ్చు. తొమ్మిది నుంచి పద్నాలుగేళ్ల లోపు వయస్సు కలిగినవారికి రెండు డోసులు వేస్తారు. మొదటి డోసు తర్వాత ఆరు నుంచి పన్నెండు నెలల్లో రెండవ డోసు వేయాలి. పదిహేను నుంచి నలభై ఐదేళ్లవారికి మూడు డోసులు అవసరం. మొదటి డోసు తర్వాత రెండు నెలల్లో రెండవ డోసు, ఆరు నెలల్లో మూడవ డోసు తీసుకోవాలి. ఈ టీకాతో పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది సురక్షితమైంది. కాబట్టి డాక్టర్‌ను సంప్రదించి వారి పర్యవేక్షణలో తప్పకుండా తీసుకోండి. డాక్టర్ ప్రమత శిరీష, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: గుండె ఆరోగ్యం కోసం బ్రిస్క్ వాకింగ్..! ఎలా చేయాలంటే..) -
గుండె ఆరోగ్యం కోసం బ్రిస్క్ వాకింగ్..! ఎలా చేయాలంటే..
బ్రిస్క్ వాకింగ్ గుండె ఆరోగ్యానికి మంచిది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. బ్రిస్క్ వాకింగ్ అంటే మీ సాధారణ నడక కంటే వేగంగా నడవడం. అంటే హృదయ స్పందన రేటును పెంచే వేగంతో నడవాలి. ఇది మితమైన తీవ్రత కలిగిన వ్యాయామం, అంటే నడుస్తున్నప్పుడు శ్వాస తీసుకోవడంలో కొంచెం ఇబ్బంది పడతారు, కానీ మాట్లాడగలరు. బ్రిస్క్ వాకింగ్ ప్రయోజనాలుబ్రిస్క్ వాకింగ్ గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది ∙బ్రిస్క్ వాకింగ్ కేలరీలను కరిగించడానికి ఉపకరిస్తుంది. దీనిద్వారా ఇది బరువు తగ్గడానికి లేదా బరువును నిర్వహించడానికి సహాయపడుతుంది. ∙మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది బ్రిస్క్ వాకింగ్ ఒత్తిడి, ఆందోళన, నిరాశను తగ్గించడానికి సహాయపడుతుంది. ∙ఎముకలు, కండరాలను బలోపేతం చేస్తుంది. బ్రిస్క్ వాకింగ్ ఎముకలు, కండరాలను బలంగా ఉంచడంలో సహాయపడుతుంది, ఇది ఎముకల సాంద్రతను పెంచడం ద్వారా బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది.∙శక్తి స్థాయులను పెంచడానికి, అలసటను తగ్గించడానికి సహాయపడుతుంది. జ్ఞాపకశక్తిని, నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. బ్రిస్క్‌వాకింగ్ ఎలా చేయాలి?మీ సాధారణ నడక వేగాన్ని పెంచండి.మీ చేతులను మీ వైపులా వదిలివేయండి, లేదా వాటిని కొద్దిగా వంచి, ముందుకు వెనుకకు ఊపండి. మీ నడకలో వేగం, దూరాన్ని పెంచండి. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల బ్రిస్క్ వాకింగ్ చేయడానికి లక్ష్యంగా పెట్టుకోండి. బ్రిస్క్‌వాకింగ్ ప్రారంభించడానికి చిట్కాలు. ∙మీకు నడవడం అలవాటు లేక΄ోతే, నెమ్మదిగా ప్రారంభించండి.క్రమంగా వేగాన్ని, దూరాన్ని పెంచండి. ∙మీకు నచ్చిన ప్రదేశంలో నడవండి ఉదాహరణకు తోటల్లో లేదా బీచ్ వంటి ప్రదేశాలలో అన్నమాట.. దీనిని ఒక సామాజిక కార్యకలాపంగా మార్చడానికి స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో కలిసి నడవండి. -
ఆయుష్షా.. ఆరోగ్యమా..!
ఆయుష్షు.. ఆరోగ్యం.. ఈ రెండింటిలో మీ ఓటు దేనికి అంటే చెప్పలేం. ఎందుకంటే ఎంత ఆరోగ్యంగా ఉన్నా... ఆయుష్షు లేకపోతే ఏం లాభం? అదేవిధంగా ఎంత కాలం జీవించి ఉన్నా, ఆరోగ్యం లేకుండా ఎప్పుడూ మంచంలో పడి ఉంటే ప్రయోజనం ఏముంది? అయితే జీవిత కాలానికి, ఆరోగ్య కాలానికీ తేడా ఏమిటని అడిగితే మాత్రం కచ్చితంగా చెప్పచ్చు... జీవిత కాలం అంటే మనం లేదా ఇతర జీవులు ఎంతకాలం పాటు గరిష్టంగా జీవించి ఉన్నారన్నది చెప్పడమే. అదే ఆరోగ్య కాలం అంటే మనం లేదా ఆయా జీవులు బతికిన కాలంలో ఎంత కాలం పాటు ఆరోగ్యంగా ఉన్నారో చెప్పడం. ఆయుష్షులోనూ, ఆరోగ్యంలోనూ జన్యువుల పాత్ర కీలకమైనప్పటికీ ఎవరికి వారు కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా ఆరోగ్యంగా ఉండటం, అలా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ద్వారా అధిక కాలం జీవించడం అనేది వారి చేతుల్లోనే ఉంటుంది. ఆయుఃప్రమాణం దేశాన్ని బట్టి మారుతుంటుంది. ఉదాహరణకు అమెరికాలో పురుషుల సగటు ఆయుఃప్రమాణం 75 ఏళ్లయితే స్త్రీలకు 80 సంవత్సరాలు. ప్రతివారూ దీర్ఘకాలం టు ఆరోగ్యంగా గడపాలంటే కొవ్వు స్థాయులు తక్కువగా.. పోషకాలు, పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం, తేలికపాటి వ్యాయామాలు చేయడం, ఆరోగ్యకరమైన జీవన శైలి పాటించడం వంటి అలవాట్ల వల్ల జీవిత కాలం, ఆరోగ్య కాలం.. రెండూ సమతుల్యంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. (చదవండి: జస్ట్ 30 నిమిషాల పనికి రూ. 18 వేలు..! కార్పొరేట్ ఉద్యోగి రేంజ్లో..) -
బీపీ మందులు పనిచేయకపోవడానికి రీజన్ ఇదే..!
హైపర్‌టెన్షన్ లేదా అధిక రక్తపోటు అనేది ఒక నిశ్శబ్ద కిల్లర్. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేస్తున్న వ్యాధి. మందులు తీసుకున్నప్పటికీ, చాలా మంది వ్యక్తులు ఇప్పటికీ వారి రక్తపోటును సమర్థవంతంగా నియంత్రించలేక పోతున్నారు.నేషనల్ హెల్త్ మిషన్ ప్రకారం, ఏడాదికి 1.6 మిలియన్ల మరణాలకు కారణం రక్తపోటే. ఒక్కమాటలో చెప్పాలంటే భారతీయ జనాభాలో దాదాపు 29.8% మందిని ప్రభావితం చేస్తోంది. సమర్థవంతమైన చికిత్సా విధానాలు ఉన్నప్పటికీ లక్షలాది మంది ఇంకా ఈ సమస్యను ఎదుర్కొంటూనే ఉండటం బాధకరం. కొందరికి మందులతో రక్తపోటు అదుపులో ఉండగా, మరికొందరిలో ఇది అసాధ్యంగా ఉండటానికి గల కారణాలు, ఈ వ్యాధిని ఎలా అర్థం చేసుకోవాలి తదితరాల గురించి అపోలో ఆస్పత్రి ఇంటర్వెన్షన్ కార్డియాలజీస్ట్ డాక్టర్ మనోజ్ కుమార్ అగర్వాలా మాటల్లో తెలుసుకుందాం. మందులు వాడుతున్నప్పటికీ రక్తపోటు అదుపులో లేదని ఆందోళన చెందాల్సిన పనిలేదంటున్నారు డాక్టర్ మనోజ్. దీన్ని నిరోధక రక్తపోటుగా పిలుస్తారని తెలిపారు. సాధారణ చికిత్సల వల్ల అంతగా మార్పు లేదంటే..అంతర్గత అవయవ నష్టానికి సంకేతంగా పరిగణించాలని అన్నారు. అలాంటప్పుడు మూత్రపిండాల డెనెర్వేషన్' వంటి ఆధునిక చికిత్సలు ఈ సమస్య నుంచి బయటపడేయగలవని చెబుతున్నారు. ఈ విధానంలో మూత్రపిండాల్లోని హైపర్యాక్టివ్ నరాలకు చికిత్స చేయడం ద్వారా రక్తపోటుని నియంత్రించగలగడమే కాకుండా దీర్ఘకాలిక హృదయనాళ ప్రమాదాన్ని కూడా తగ్గించగలమని చెప్పారు. ఈ చికిత్సా విధానం మెరుగైన జీవన నాణ్యతను అందించి, జీవితంపై కొత్త ఆశను అందిస్తుందన్నారు. అయితే రక్తపోటు మందులు రోగికి పనిచయడానికి ప్రధానంగా మూడు కారణాలని వాటి గురించి వివరించారు. మందులు పనిచేయకపోవడానికి రీజన్..నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ నివేదిక ప్రకారం, దాదాపు 50% మంది రోగులు తమ ఔషధ మోతాదులను సమర్థవంతంగా పాటించరు. అలాగే తాము ఆరోగ్యంగా ఉన్నామని భావించినప్పుడు లేదా దుష్ప్రభావాలు ఎదుర్కొన్నప్పుడూ మందులను నిలిపేస్తారు. అందువల్లే రక్తపోటు నియంత్రణ లోపం తలెత్తుందట. ఫలితంగా దీర్ఘకాలిక అనారోగ్యాల బారినపడే ప్రమాదం పెరుగుతుందని చెబుతున్నారు డాక్టర్ మనోజ్. ఇక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ నివేదిక ప్రకారం, భారతదేశంలో 28.1% మంది పెద్దలకు అధిక రక్తపోటు ఉన్నప్పటికీ, వారిలో కేవలం 36.9% మందికి మాత్రమే కచ్చితమైన రోగనిర్ధారణ జరిగింది. వారిలో మందులు వాడేవాళ్లు 44.7% కాగా, కేవలం 8.5% మందికి బీపీ నియంత్రణలో ఉందట. సకాలంలో మందులు తీసుకోలేకపోవడాన్ని వైద్యులకు తెలిపి తగు ప్రత్యామ్నాయా వైద్య చికిత్సలు తీసుకోవాలని చెబుతున్నారు డాక్టర్ మనోజ్.సాధారణ చికిత్సలకు స్పందించకపోవడానికి కారణం..కొన్ని సందర్భాల్లో రక్తపోటు అనేది ఒక హెచ్చరిక. దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి (CKD), అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా, లేదా హార్మోనల్ అసమతుల్యతలు వంటి మూల రుగ్మతలకు ప్రధాన కారణమవుతుంది. సాధారణ చికిత్సల ద్వారా రక్తపోటు నియంత్రణ సాధ్యం కాకపోతే, వైద్య నిపుణులు అంతర్లీన ఆరోగ్య సమస్యలను వెలికితీసేందుకు ప్రత్నించడమే కాకుండా సమర్థవంతంగా నిర్వహించి రక్తపోటు స్థాయిలను నియంత్రిస్తారు. పలితంగా రోగి మొత్తం ఆరోగ్య స్థితి కూడా గణనీయంగా మెరుగవుతుంది.రెసిస్టెంట్ హైపర్‌టెన్షన్ కావొచ్చు..మందులకు లొంగకపోతే అది'రెసిస్టెంట్ హైపర్ టెన్షన్' గా పరగణిస్తారు. అంటే ఆయా రోగుల్లో రక్తపోటు 140/90 mmHg కన్నా ఎక్కువ ఉంటుందట. ఈ పరిస్థితి గుండెపోటు, స్ట్రోక్ లేదా మూత్రపిండాల వైఫల్యం వంటి తీవ్రమైన ఆరోగ్యప్రమాదాలను గణనీయంగా పెంచుతుంది. అలాంటప్పుడే మూత్రపిండాల డెనెర్వేషన్ లేదా RDN వంటి అత్యాధునిక చికిత్సలు చేయాల్సి వస్తుందని చెబుతున్నారు డాక్టర్ మనోజ్. ఈ విధానంలో రేడియోఫ్రీక్వెన్సీ టెక్నాలజీ సాయంతో రక్తపోటును ప్రభావితం చేసే మూత్రపిండాల ధమనుల్లో ఉన్న అధిక ఉత్కంఠ కలిగించే నరాలను లక్ష్యంగా చికిత్స అందిస్తారు. ఫలితంగా రక్తపోటు గణనీయంగా నింయత్రణలోకి వస్తుంది. సాదారణ మందుకుల స్పందించిన రోగులకు ఈ చికిత్సా విధానం ఒక వరం లాంటిది.తక్షణమే అవగాహన అవసరం.."రక్తపోటు మందుకు పనిచేయకపోతే సంప్రదాయ ఔషధ చికిత్సలకు మించి అత్యాధుని చికిత్స అవసరం అనేది గుర్తించాలి. ఈ విషయాన్ని వైద్యునితో చర్చించాలి. ఆర్డీఎన వంటి అత్యాధునిక చికిత్స విధానం అవసరం అవ్వక మునుపే మేల్కొని ..ఈ వ్యాధిని నియంత్రణలోకి తెచ్చుకోవాలి. ఇక్కడ రక్తపోటు నియంత్రణలో ఉండటం అనేది మెరుగైన ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు పునాది లాంటిది అని గ్రహించాలి". చెబుతున్నారు డాక్టర్ మనోజ్డాక్టర్ మనోజ్ కుమార్ అగర్వాలా, డైరెక్టర్ ఇంటర్వెన్షన్ కార్డియాలజీ, అపోలో ఆస్పత్రి, హైదరాబాద్గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం(చదవండి: ఆ గుండె17 నిమిషాల పాటు ఆగింది!) -
అతిగా చేస్తే.. ప్యాకైపోతారు..!
శరీరాకృతిపై నేటి తరం యువతలో ఆసక్తి పెరుగుతోంది. అయితే ఇది ఓ క్రమ పద్ధతిలో చేస్తే లక్ష్యాన్ని సునాయాసంగా చేరుకోవచ్చు. ఇందుకు ఆహార అలవాట్లలోనూ అనేక జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. కానీ ఇవేవీ పాటించకుండా ఓవర్‌నైట్‌లో కండలు, సిక్స్ ప్యాక్స్ సొంతం చేసుకోవాలనే అపోహతో అతిగా సాధన చేస్తున్నారు. గంటల తరబడి బరువులు ఎత్తుతూ సొంతంగా అనర్థాలకు కారకులవుతున్నారని పలువురు జిమ్ ట్రైనర్స్, వైద్యులు చెబుతున్న మాట. ఇటీవల తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరంలో పలువురు అనారోగ్యానికి గురైన సంఘటనలే దీనికి నిదర్శనం. ఈ తరహా ప్రమాదాలు రెగ్యులర్‌గా జరుగుతున్నాయని, పరిస్థితి దెబ్బతిన్న తర్వాత తమను సంప్రదిస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. నగరంలో సుమారు 1.4 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఒత్తిడులతో నిత్యం బిజీగా గడిపేస్తున్నారు. వీరిలోనూ ముఖ్యంగా సాఫ్ట్వేర్, ప్రభుత్వ, కొన్ని ప్రయివేటు రంగ సంస్థల్లో పనిచేవారిలో ఎక్కువ మంది రోజుకు 8 నుంచి 9 గంటల పాటు కుర్చీలకే పరిమితమవుతున్నారు. ఈ కారణంగా శరీరాకృతిలో భారీగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎక్కువ శారీరక శ్రమ లేకపోవడం ఒకెత్తయితే.. పని ఒత్తిడి, స్ట్రెస్ మరో ఎత్తు.. దీంతో తమ శరీరంలో పేరుకుపోయిన కేలరీలు తగ్గించుకునేందుకు వీలు చిక్కినప్పుడల్లా తమకు అందుబాటులో ఉన్న జిమ్ములు, పార్కులు, ఆట స్థలాల్లో తమకు తోచిన రీతిలో వ్యాయామాలు చేస్తున్నారు. కొందరైతే వీటికి ప్రత్యామ్నాయంగా ఆటలు, డ్యాన్స్ వంటి వాటిని సాధన చేస్తున్నారు. పొంచి ఉన్న ముప్పు.. క్రమ పద్ధతి పాటించకుండా అతిగా వ్యాయామం చేయడం, తగినంత విశ్రాంతి తీసుకోకపోవడం వల్ల తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. హార్మోన్ల సమతుల్యత దెబ్బతినడం, కండరాల్లో దీర్ఘకాలిక అలసట, నొప్పులు, రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం, నీరసం, ఆందోళన, నిరుత్సాహం, శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు రావచ్చని నిపుణులు చెబుతున్నారు. రోజువారీ పనులు చేసుకోడానికి కూడా బద్ధకం అనిపిస్తుంది. కార్టిసాల్, టెస్టోస్టిరాన్ వంటి హార్మోన్ల పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. నిద్రలేమి సమస్య తలెత్తుతుంది. శరీరానికి ఎక్కువ శ్రమ కలిగించడం వల్ల గుండె పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. ఫలితంగా కార్డియాక్ అరెస్ట్‌కు దారితీయవచ్చు.. ఇటీవల తరచూ కనిపిస్తున్న కేసుల్లో 90 శాతం ఈ తరహా సమస్యలే ఎక్కువని, క్రీడలు, వ్యాయామం చేస్తుండగానే కుప్పకూలిపోతున్నారన్న విషయం తెలిసిందే.. లైఫ్‌స్టైల్ మేనేజ్మెంట్ అవసరం.. లైఫ్‌స్టైల్ మేనేజ్మెంట్లో శరీరానికి విశ్రాంతి ఎంత అవసరమో.. వ్యాయామం, ఆహారపు అలవాట్లు అంతే అవసరం.. ఒక్కసారిగా సన్నబడిపోవాలని ఎక్కువగా జిమ్ చేయడం, అలసిపోయే వరకూ క్రీడల్లో పాల్గొనడం కార్డియాక్ అరెస్ట్‌కు కారణం కావచ్చు. ఆహారం తగ్గించి ప్రొటీన్ పౌడర్ తీసుకోవడం మంచిది కాదు. జిమ్, క్రీడా మైదానాల్లో ఇంప్లాంటబుల్ కార్డియో వర్టర్ డీఫిబ్రిలేటర్ (ఐసీడీ) అనే పరికరం వినియోగిస్తే గుండె లయను క్రమబద్ధీకరిస్తుంది. ఎయిర్ పోర్టు, మాల్స్‌లో ఏఈడీ పరికరాలు అందుబాటులో ఉన్నాయి. గుండె ఆగిపోయినప్పుడు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటివి కమ్యూనిటీల్లోనూ అందుబాటులోకి తీసుకురావాలి. విద్యార్థి దశ నుంచే పీసీఆర్‌పై శిక్షణ ఇస్తే అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది. – డాక్టర్ భార్గవి, కార్డియాలజిస్ట్, రెయిన్బో హార్ట్ ఇన్స్‌స్టిట్యూట్ -
టీ ఆరోగ్యకరమే గుండెకు మంచిదే ! ఇలా తాగితే..
చాలా మందికి కప్పు చాయ్ తాగితే గాని రోజు ప్రారంభం కాదు, లక్షలాది మంది భారతీయులకు, టీ అనేది కేవలం ఒక పానీయం కంటే ఎక్కువ. కొన్ని చోట్ల ఇది ఒక ఆచారం కూడా. అయితే ఇది ఒక కప్పులో మనకు అందిస్తున్న వైద్య చికిత్స కూడా అంటున్నాయి అధ్యయనాలు. రోజుకు రెండు కప్పుల వరకు టీ తాగడం గుండెను కాపాడుతుంది. అంతేగాదు స్ట్రోక్, గుండె వైఫల్య ప్రమాదాన్ని తగ్గించవచ్చు అని ఒక కొత్త అధ్యయనం చెబుతోంది. నాంటాంగ్ విశ్వవిద్యాలయం చేపట్టిన 2 అధ్యయనాలు టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలపై దృష్టి సారించాయి. అవి నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ లో ‘‘హృదయ నాళ ప్రమాద కారకాలను నిర్వహించడంలో టీ పాత్ర: అందే ప్రయోజనాలు, విధానాలు ఇంటర్వెన్షనల్ వ్యూహాలు’’ అనే అంశంపై అదే విధంగా కార్డియోవాస్కులర్ రిస్క్ అండ్ ప్రివెన్షన్ అనే అంశంపైనా నిర్వహించిన పరిశోధన ఫలితాలు ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ కార్డియాలజీలో ప్రచురితమయ్యాయి. అవి చెబుతున్న ప్రకారం...టీ దాని రసాయన కూర్పు కారణంగా కేవలం పానీయం కాదు; ఇది యాంటీఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ ప్రత్యేకమైన మొక్కల సమ్మేళనాలతో నిండిన సహజ శక్తి కేంద్రం. దీనిలో గుండె ఆరోగ్యానికి మద్దతు ఇచ్చే, వాపును తగ్గించే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడే కాటెచిన్లు థియాఫ్లావిన్లు ఉన్నాయి. అంతేకాకుండా, టీ లోని పాలీశాకరైడ్లు రక్తంలో చక్కెరను సరైన విధంగా నిర్వహించడానికి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి.ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ కార్డియాలజీ: కార్డియోవాస్కులర్ రిస్క్ అండ్ ప్రివెన్షన్ లో ప్రచురించిన ఈ నాంటాంగ్ విశ్వవిద్యాలయం చేసిన అధ్యయనం దాదాపు 13 సంవత్సరాలుగా 177,000 మందిని భాగం చేసింది.టీ దాని ఆరోగ్య ప్రయోజనాలకు చాలా కాలంగా పేరొంది. శరీరంలో ఆరోగ్యకరమైన లిపిడ్ (కొవ్వు మరియు కొలెస్ట్రాల్) స్థాయిలకు మద్దతు ఇచ్చే దాని సామర్థ్యం వాటిలో ముఖ్యమైనది.ప్రతిరోజూ రెండు కప్పుల వరకు టీ తాగితే.. గుండె పోటు ప్రమాదం 21% తగ్గుతుంది. స్ట్రోక్ వచ్చే ప్రమాదం 14%, కరోనరీ హార్ట్ డిసీజ్ వచ్చే ప్రమాదం 7% తగ్గుతాయి.కొవ్వు జీవక్రియను మెరుగుపరుస్తుంది: టీ శరీరపు సహజ కొవ్వును నిర్మూలించే ప్రక్రియలను బలోపేతం చేస్తుంది. ఇది ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించే యాంటీఆక్సిడెంట్ ఎంజైమ్‌లను సక్రియం చేస్తుంది అల్లం వంటి సప్లిమెంట్లతో కలిపితే ట్రైగ్లిజరైడ్లు, కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి సహాయపడుతుంది.మహిళలకు ఎక్కువ ప్రయోజనాలు: శరీరంలో కొవ్వు సంబంధిత నష్టాన్ని తగ్గించే విషయంలో 20 నుండి 48 సంవత్సరాల వయస్సు గల మహిళలు విటమిన్ల నుంచి వచ్చే వాటి కంటే టీ తాలూకు యాంటీఆక్సిడెంట్ల నుంచి మరింత ప్రయోజనం పొందవచ్చు.రక్తపోటు (అధిక రక్తపోటు) గుండె జబ్బులకు ప్రధాన ప్రమాద కారకం. ముఖ్యంగా మితమైన పరిమాణంలో దీర్ఘకాలిక టీ వినియోగం వృద్ధులలో సిస్టోలిక్ డయాస్టొలిక్ రక్తపోటు రెండింటినీ 2–3 ఎంఎంహెచ్‌జి వరకూ తగ్గించడంలో సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.తైవాన్ లో జరిగిన ఒక అధ్యయనంలో సంవత్సరానికి పైగా రోజుకు 120 మి.లీ. మించకుండా టీ తాగేవారికి అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం బాగా తక్కువని తేలింది. రక్త నాళాల పనితీరును మెరుగుపరుస్తుంది: టీలో చాలా యాంటీఆక్సిడెంట్లు పాలీఫెనాల్స్ ఉన్నాయి, ఇవి రక్త నాళాలు సరళంగా ఉండటానికి (వాసోడైలేషన్), వాపును తగ్గించడానికి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయి. ఇవన్నీ కాలక్రమేణా రక్తపోటు స్థాయిలను మెరుగుపరుస్తాయి.ప్రయోజనాలు అందాలంటే...ఇలా తాగాలంతే...కానీ ట్విస్ట్ ఏమిటంటే... టీకి చక్కెర లేదా కృత్రిమ స్వీటెనర్లను జోడించిన వెంటనే అనేక ఆరోగ్య ప్రయోజనాలు అదృశ్యమవుతాయి, అంటే చాలా మంది ఇష్టపడే తీపి, పాల మసాలా చాయ్ వల్ల లాభాలు శూన్యం. ఆకుపచ్చ లేదా నలుపు రంగులో (గ్రీన్ టీ లేదా బ్లాక్ టీ) ఉన్న ప్రతి కప్పు సైన్స్ ఆధారిత ఆరోగ్య లాభాలను అందిస్తుంది. అంతేగాదు చక్కెర లేదా కృత్రిమ స్వీటెనర్లు లేకుండా ఆస్వాదించినప్పుడు దాని నిజమైన రుచి అలవాటవుతుంది. దానిని ఆరోగ్యం కోసం అనుసరించే ప్రిస్క్రిప్షన్ గా భావించాలి. కొన్ని రోజులు దీన్ని కొద్ది కొద్దిగా ప్రయత్నిస్తే త్వరగానే అలవాటు పడతారు దాని స్వచ్ఛమైన రూపంలో టీ ఎంత రిఫ్రెషింగ్‌గా సహజంగా సంతృప్తికరంగా ఉంటుందో కూడా తెలిసివస్తుంది. -
ప్రకృతి సిద్ధమైన ఓజెంపిక్ !
-
కాలేయ సంబంధిత సమస్యలపై ఉచిత ఆరోగ్య శిబిరం
మెహదీపట్నంలోని ఆలివ్ ఆసుపత్రిలో జూలై 26 నుంచి 28వ తేదీ వరకూ నిర్వహించిన ఉచిత ఆరోగ్య శిబిరంలో సుమారు రెండు వందల మంది పాల్గొన్నట్లు ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. హెపటైటిస్ కన్సల్టేషన్ కోసం ఈ ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించినట్లు తెలిపింది. కాలేయ సంబంధిత ఆరోగ్య సమస్యలు పెరిగిపోతున్న ఈ తరుణంలో వీటిపై ప్రజల్లో అవగాహన పెరగాల్సిన అవసరముందని, ఈ దిశగా తామీ ప్రయత్నం చేశామని ఫెలోషిప్ ఇన్ అడ్వాన్స్డ్ ఎండోస్కోపిక్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, హెపటాలజీ కన్సల్టెంట్ డాక్టర్ పరాగ్ దశావతార్ (ఎండీ జనరల్ మెడిసిన్) తెలిపారు. జీర్ణకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు సుమారు 200 మంది కన్సల్టేషన్ సేవలు పొందారని ఆయన వివరించారు. ఆలివ్ హాస్పిటల్ సుమారు 210 పడకల అత్యాధునిక ఆసుపత్రి అని, తరచూ ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తూంటుందని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది.(చదవండి: 12వ తరగతి డ్రాపౌట్..సొంతంగా జిమ్..ఇంతలో ఊహకందని మలుపు..!) -
రుచిని ఆస్వాదిస్తూనే హాయిగా తినొచ్చు ఇలా..! గ్యాస్, అధిక బరువు..
ఇటీవల కాలంలో అందరిని వేదించే సమస్య అధిక బరువు, జీర్ణ సంబంధిత సమస్యలు. ఎందుకంటే నచ్చిన ఆహారం కాస్త ఎక్కువగా తినకుండా ఉండలేరు చాలామంది. చెప్పాలంటే.. ఫుడ్ విషయంలో నోరు కంట్రోల్లో ఉంటే చాలా వరకు ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. అది చాలా కష్టం. ఎందుకంటే నోరూరించే పదార్థాలు తినమని పిలుస్తుంటే ఆగకుండా ఉండటం ఎవరికి సాధ్యం. మరి అలాంటి సమస్యను అధిగమించి రుచిని ఆస్వాదిస్తూ..బి లిమిట్‌ని పాటించటం ఎలాగో తెలుసుకుందామా..!.బాలీవుడ్ నటి కరీనా కపూర్ పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్ ..మనసారా నచ్చిన ఆహారం తింటూనే అధిక బరువు, గ్యాస్ సమస్యకు ఎలా చెక్ పెట్టొచ్చొ షేర్ చేసుకున్నారు. నిజానికి మనం ఏ ఆహారాన్ని తింటున్నా..ఒకటి రెండు, మూడు..అలా అన్ని సార్లు పెట్టుకుంటూ లాగించేస్తాం. మరి ఇష్టమైన ఫుడ్ అయితే ..ఎంతలా తింటారో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. నియంత్రణ లేకుండా తినడాన్ని నియంత్రణలోకి తెచ్చుకోవాలంటే..ఈ మైండ్‌ఫుల్‌నెస్ టెక్నీక్ అయినా జోర్డాన్ ఫార్ములాను ఫాలోకండని చెబుతున్నారామె. ఇంతకీ అదేంటంటే..అందుకు ఆమె ఒక స్నాక్స్ ఐటెంని ఉదాహారణ తీసుకుంటూ చెప్పుకొచ్చారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఉదాహరణకు సగ్గుబియ్యం వడలు స్నాక్స్‌గా తినాలనుకున్నారు. అప్పుడు వెంటనే ప్లేట్ ఓ ఐదు వడలు తక్కువ కాకుండా లాగించేస్తారు. కానీ అలా కాకుండా ఇంత వరకు తినాలని ఫిక్స్అవ్వాలి. వంటకాలు నోరూరించేలా ఉండొచ్చు..కానీ ఆరోగ్యంపై ధ్యాస..ఎలా తింటే బెటర్‌గా ఉంటానన్నది ఆ పదార్థాలను చూడగానే ఠక్కున గుర్తుకు రావాలి. అలాంటి ఆలోచన రాగానే తినాలనే ఆలోచన ఆటోమెటిగ్గా నియంత్రణలోకి వచ్చేస్తుంది. వేసుకునేటప్పుడే రెండు లేదా మూడుతో ఆపేస్తారని చెబుతున్నారామె. పైగా దాన్ని ఎంజాయ్ చేసేలా చట్నీ లేదా ఇతరత్రా వాటిని సిద్ధం చేసుకుని ప్రతి ముక్కను ఆస్వాదిస్తూ..తింటుంటే కడుపు నిండిన అనుభూతి ప్లస్..తక్కువ తినడం రెండు సాధ్యమవుతాయట. దీన్ని మైండ్‌ఫుల్‌నెస్ తినడం అంటారని అన్నారు. రుజుతా ఈ చిట్కాకు జోర్డాన్ ఫార్ములాగా పేర్కొన్నారు. మంచి జోష్‌తో నచ్చిన ఫుడ్‌ని ఎంజాయ్ చేస్తూ లిమిట్‌గా తినడమే ఈ జోర్డాన్ ఫార్ములానట. ఈ టెక్నిక్‌లో బేసి సంఖ్యలో పదార్థాలను తీసుకునేలా ఫిక్స్ అవ్వడం తోపాటు..క్రమశిక్షణతో తినడం అలవడుతుందట. అయితే ఇక్కడ తప్పనిసరిగా బుద్ధిపూర్వకంగా, నెమ్మదిగా ఆస్వాదిస్తూ తినడం అనేది అత్యంత కీలకం. అప్పుడే తీసుకునే ఆహారంపై కంట్రోల్ ఉంటుందట. ఇది స్వీయ నియంత్రణను మెరుగుపరుస్తూ..ఆహారంపై అవగాహన ఉండేలా తీసుకునేలా చేస్తుందట. ఇది చక్కటి సత్ఫలితాలనిస్తుందని ఆమె ధీమాగా చెబుతున్నారు. మంచి ఆరోగ్యానికి సమతుల్య ఆహారం, ఆకలే ప్రధానం. అందుకోసం ఆనందిస్తూ తినేలా..పరిమితంగా తినడం అనేదానిపై శ్రద్ధ పెట్టడం అనే జోర్డాన్ సూత్రం పాటిస్తే చాలు అని చెబుతున్నారు పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్. మరి ఇంకెందు ఆలస్యం ప్రయత్నంచి చూడండి. View this post on Instagram A post shared by Rujuta Diwekar (@rujuta.diwekar) గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: 12వ తరగతి డ్రాపౌట్..సొంతంగా జిమ్..ఇంతలో ఊహకందని మలుపు..!)) -
బరువు తగ్గించే అద్భుత పానీయాలు ఇవే..!
బరువు తగ్గేందుకు ఎన్నో రకాల డైట్లు, వర్కౌట్లు చేస్తుంటారు. వాటి తోపాటు బాడీలోని చెడు కొలస్ట్రాల్‌ని తగ్గించి మొత్తం ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచే ఈ పానీయాలను కూడా జోడించినట్లయితే బరువు తగ్గడం మరింత సులభమవుతుంది. అందుకోసం అల్లాన్ని తప్పనిసరిగా మన రోజువారి జీవితంలో భాగం చేసుకోవాలి. మరి అదెలాగో తెలుసుకుందామా..!.అధిక బరువుకి చెక్ చెప్పే అద్భుత పానీయాలివే..గోరు వెచ్చిని అల్లం లెమెన్ వాటర్.. గోరువెచ్చని అల్లం నీటిలో కొద్దిగా నిమ్మరసం జోడించి పరగడుపునే తీసుకుంటే జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. అలాగే బాడీలోని చెడు కొలస్ట్రాల్‌ని తగ్గించి త్వరితగతిన బరువు తగ్గేలా చేస్తుంది. తయారీ విధానం: గోరువెచ్చని నీటిలో అల్లం వేసి మరిగించాలి. ఆ తర్వాత నిమ్మకాయను జోడించి తీసుకుంటే చాలు. కావాలనుకుంటే దాల్చిన చెక్క లేదా నల్లమిరియాలు కూడా జోడించొచ్చు. ఆపిల్ సైడర్ వెనిగర్ లేదా అల్లం షాట్: ఆపిల్ సైడర్ వెనిగర్ రక్తంలోని చక్కెరను సమర్థవంతంగా నియంత్రిస్తుంది. అల్లంతో కలిపి తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఎలా తయారు చేయాలంటే: ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్‌కు అరటీస్పూన్ అల్లం రసం జోడించాలి. ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల గోరువెచ్చని నీరు జోడించాలి. రోజుకు ఒకసారి భోజనానికి ముందు తాగాలి. ఇది దంతాల సంరక్షణకు, నోటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దోసకాయ అల్లం డీటాక్స్: దీన్ని రిఫ్రెషింగ్ డ్రింగ్గా పిలుస్తారు. రోజంతా ఈ నీటిని సిప్ చేయొచ్చు. ఇది మిమ్మల్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. అనవసరమైన చిరుతిండిని అరికట్టడంలో సహాయపడుతుంది. తయారీ విధానం: దోసకాయ, ఒక చిన్న అల్లం ముక్క, పుదీనా ఆకులు వేసి కొన్ని గంటలు లేదా రాత్రంత నానబెట్టాలి. ఈ వాటర్‌ని ఒక బాటిల్లో పోసుకుని కూడా హాయిగా తీసుకువెళ్లొచ్చు. అల్లం గ్రీన్ టీ: ఇది శరీరంలో కొవ్వుని సులభంగా కరిగిస్తుంది. భారీ భోజనాన్ని నివారిస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. తయారీ విధానం: వేడినీటిలో గ్రీన్ టీ బ్యాగ్‌ని ఉంచి, అల్లం జోడించాలి. తాగాడానికి కొన్ని నిమిషాలు ముందు చేసుకుంటే చాలు. వ్యాయమానికి ముందు ఆస్వాదిస్తే..సులభంగా బరువు తగ్గుతారు.పసుపు అల్లం లాట్టే (గోల్డెన్ మిల్క్)మంచి నిద్రకు సరైనది ఇది. చలికాలంలో మంచి వెచ్చదనాన్ని అందించి ఉపశమనాన్ని ఇస్తుంది. అల్లం, పసుపు మిశ్రం శరీరంలోని మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. రాత్రిపూట జీర్ణక్రియకు మద్దతిస్తుంది. తయారీ విధానం: గోరువెచ్చని ఒక కప్పు బాదం లేదా ఓట్మిల్క్లో తాజా అల్లం లేదా అలం పొడిని కలపాలి. చిటికెడు నల్లమిరాయాలు, దాల్చిన చెక్క కలపి మరిగించండి. అవసరమైతే తేనెతో తాగండి. ఈ పానీయాలు డైట్లో చేర్చుకుంటే ఆకస్మికంగా అద్భుతమైన మార్పులు రాకపోయినప్పటికీ, మొత్తం ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. అలాగే సమతుల్యం ఆహారాన్ని మెయింటైన్ చేయడంలో ఉపకరించడమే గాక సులభంగా బరువు తగ్గేందుకు దారితీస్తుంది.(చదవండి: యువరాజ్ సింగ్ లగ్జరీ ఇల్లు.. అసలైన ఇంటీరియర్ డిజైన్ అదే అంటున్న యువీ!) -
పెయిన్ కిల్లర్స్ వాడితే..ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయకూడదా..?
నాకు ముప్పై ఐదు ఏళ్లు. మోకాలి నొప్పి చాలా ఎక్కువగా ఉంది. కొన్ని రోజులు పెయిన్ కిల్లర్స్ వాడాను. ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నాను. మునుపటి మందుల వలన ఏదైనా ఇబ్బంది ఉంటుందా? ఇప్పటికీ ఆ మందులు వాడొచ్చా?– అనిత, మెదక్.మీరు చెప్పిన మోకాలి నొప్పి సమస్య ఆస్టియో ఆర్థరైటిస్ కారణం కావచ్చు. ఇది జాయింట్ డీజెనరేషన్ లక్షణాలలో ఒకటి కావచ్చు. పెయిన్ కిల్లర్ మందులు తాత్కాలిక ఉపశమనం ఇస్తాయి కాని, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న సమయంలో మాత్రం ఈ మందుల వాడకాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. ఐబుప్రొఫెన్ లాంటి మందులు తక్కువ కాలం ఉపశమనం ఇస్తాయి కాని, దీర్ఘకాలంగా వాడడం సురక్షితమేమీ కాదు. ముందుగా పూర్తి పరీక్షలు చేయించుకోవాలి. ఫోలిక్ యాసిడ్ వంటి సప్లిమెంట్లు తప్పనిసరిగా వాడాలి. ఐబుప్రొఫెన్ వంటి మందులు ఎన్ ఎస్ఎఐడీ గ్రూపులోకి వస్తాయి. ఇవి నొప్పికి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి. అయితే కొన్ని సైడ్ ఎఫెక్టులు కూడా వుంటాయి. మోకాలిలో నొప్పి లేదా గట్టిపడటం వంటి సందర్భాల్లో శరీరంలో ప్రోస్టాగ్లాండిన్లు అనే కెమికల్స్ విడుదల అవుతాయి. వీటిని తగ్గించడానికే ఈ మందులు పనిచేస్తాయి. ప్రెగ్నెన్సీలో వీటిని వాడితే పుట్టబోయే బిడ్డ ఎదుగుదలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కొన్ని మందులు జీర్ణాశయంలో అల్సర్లు, శ్వాస సమస్యలు, బ్లడ్ క్లాట్లు వంటి ఇబ్బందులు కలిగించవచ్చు. హెర్బల్ మందులు కూడా డాక్టర్ సలహా లేకుండా వాడకూడదు. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న సమయంలో ఏ ఔషధాన్నైనా డాక్టర్‌ను సంప్రదించి మాత్రమే వాడాలి.నాకు యాభై ఐదు ఏళ్లు. ఇటీవల వజైనాలో పొడిగా ఉంటోంది. ఇరిటేషన్, ఇచింగ్, డిశ్చార్జ్ వస్తోంది. కొన్ని క్రీములు వాడాను. అయినా తగ్గడం లేదు. పరిష్కారం చెప్పండి.– సుజాత, రాజోలు.వజైనాలో పొడిబారడం అంటే ఎక్కువగా హార్మోనుల మార్పుల వలన వచ్చే సమస్య. ముఖ్యంగా మెనోపాజ్ తర్వాత ఎక్కువగా కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో పచ్చటి డిశ్చార్జ్ వస్తే, అది ఇన్ఫెక్షన్ కావొచ్చు. పొడిగా మారడం, ఇచింగ్ అనేవి వజైనల్ వాల్స్, యూరినరీ ట్రాక్ట్ సున్నితంగా మారినప్పుడు జరుగుతుంది. ఆరోగ్యకరమైన వజైనల్ మ్యూకస్ ఫ్లూయిడ్ తగ్గిపోతుంది. దీనివల్ల వజైనాలో తేమ తగ్గిపోతుంది. ఇక ఎక్కువ మంది బాధపడే ఇచింగ్ సమస్యకు కేవలం ఇన్ఫెక్షన్ మాత్రమే కాదు, వజైనల్ బ్యాక్టీరియా లోపం కూడా కారణం కావచ్చు. మెనోపాజ్ తర్వాత ఓవరీల నుంచి ఈస్ట్రోజన్ ఉత్పత్తి తగ్గుతుంది. ఒత్తిడి వల్ల కూడా తేమ తగ్గే అవకాశం ఉంటుంది. వజైనల్ గ్లాండ్లు ఈస్ట్రోజ పై ఆధారపడి మ్యూకస్ తయారుచేస్తాయి. అవి తగ్గిపోతే పొడి సమస్య ఎక్కువవుతుంది. యాంటీఫంగల్ ఆయింట్మెంట్లు, పౌడర్లు తాత్కాలిక ఉపశమనం ఇస్తాయి కానీ మళ్లీ మళ్లీ వస్తుంటుంది. కాబట్టి దీనికి పరిష్కారం ఈస్ట్రోజన్ క్రీములు, వజైనల్ లూబ్రికెంట్లు, వజైనల్ ఈస్ట్రోజన్ టాబ్లెట్లు, కొన్ని ప్రత్యేకమైన మందులు డాక్టర్ సూచనతోనే వాడాలి. బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నవారు ఈ చికిత్సలు తీసుకోకూడదు. కనుక తప్పకుండా గైనకాలజిస్టును సంప్రదించి, వారి సూచనల మేరకు తగిన చికిత్స తీసుకోవాలి.(చదవండి: పెద్ద పిల్లల్లో చొల్లు చేటే..! సీరియస్‌గా తీసుకోవాల్సిందే..) -
పెరిగే ఒత్తిడి కంటికీ కాటే..!
ఇటీవలి జీవనశైలిలో ఒత్తిడి ఓ అనివార్యమైన విషయం. ఒత్తిడి (స్ట్రెస్) ప్రభావం దేహంలోని అనేక అవయవాల మీద ప్రతికూలంగా పడుతుందన్న సంగతి తెలిసిందే. చాలామందికి తెలియనిదేమిటంటే... ఒత్తిడి ప్రభావం కంటిపై కూడా ఉంటుందని! చాలాకాలం పాటు కంటి మీద పడే ఒత్తిడి అనేక కంటి సమస్యలను తెచ్చిపెడుతుందంటున్నారు కంటి వైద్య నిపుణులు. సుదీర్ఘకాలం పడే ఒత్తిడి కారణంగా కంటికి సంబంధించి స్వల్పమైనవి మొదలు చాలా తీవ్రమైన అనర్థాల వరకూ ఏర్పడడతాయని చెబుతున్నారు. అదెలాగో చూద్దాం. ఒత్తిడి మన అంతర్గత అవయవాలపైనా, మెదడుపైనా ప్రతికూల ప్రభావాలను చూపి, అనేక ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది. ఉదాహరణకు గుండె, మానసిక ఆరోగ్యం, జీర్ణవ్యవస్థ మొదలైన అంశాలపై ఒత్తిడి ప్రభావం చాలా తీవ్రంగానే పడి గుండె΄ోటు మొదలుకొని, జీర్ణసమస్యలూ, మానసిక సమస్యలూ వస్తాయి. అలాగే కంటి విషయంలో ఒత్తిడి తన దుష్ప్రభావాన్ని ఎలా తెచ్చిపెడుతుందో తెలుసుకుందాం.కంటిపై ఒత్తిడి దుష్ప్రభావం ఎలాగంటే... కంటిపై పడే దుష్ప్రభావాలకంటే ముందుగా... అసలు ఒత్తిడి వల్ల దేహంపై కలిగే ప్రభావాలేమిటో, అసలవి ఎందుకు కలుగుతాయో చూద్దాం. అపాయకరమైన పరిస్థితుల్లో ఒత్తిడి కలుగుతుంది. తీవ్రమైన ఒత్తిడిలో దేహం ‘ఫైట్’ లేదా ‘ఫ్లైట్’ అనే పరిస్థితికి సిద్ధమవుతుంది. అంటే పోరాడు’ కుదరకపోతే పారిపో’ అనే పరిస్థితులకు దేహాన్ని సిద్ధం చేస్తుంది. ఈ సమయంలో దేహంలో కార్టిసోల్, అడ్రినలిన్ అనే హార్మోన్లు వెలువడతాయి. ఆ హార్మోన్ల వల్ల దేహం చాలా కొద్ది వ్యవధిలోనే పారిపోవడానికి లేదా పోరాటానికి అవసరమైన బలాన్ని ఎక్కువ మొత్తంలో విడుదలయ్యేలా చేస్తుంది. పదే పదే కలిగే ఒత్తిడి కారణంగా కండరాలు ఒత్తిడికి గురి కావడం, వాటికి అవసరమైన రక్తప్రవాహం అందక΄ోవడం, కండరాల్లో ఇన్ఫ్లమేషన్ వంటి అనర్థాలు ఏర్పడే అవకాశాలుంటాయి. కంట్లో ఉండేవీ కండరాలే కావడంతో అన్ని కండరాల్లాగానే వీటిపైన కూడా ఆ దుష్ప్రభావాలు పడతాయి.కంటిపై ఒత్తిడి పెంచే అంశాలివి... ఎప్పుడూ ఒత్తిడికి గురయ్యేవారిలో కళ్లపై కొన్ని దుష్ప్రభావాలు పడతాయి. అన్ని రకాల ఒత్తిళ్లతో పాటు మరికొన్ని అంశాలు కళ్లపై తమ ప్రభావాన్ని నేరుగా పడేలా చేస్తాయి. అవి... ఎక్కువ సేపు స్క్రీన్‌ను చూస్తుండటం. (అది టీవీ, కంప్యూటర్, మొబైల్ స్క్రీన్ ఏదైనా కావచ్చు); నిద్రలేకపోవడం; వేళాపాళా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు తింటుండటం... ఇవన్నీ కంటిపైనా ఒత్తిడి పడేలా చేస్తాయి.ఒత్తిడి కారణంగా వచ్చే కంటి సమస్యలివి... కన్ను స్ట్రెయిన్ కావడం (ఏస్థెనోపియా) : డిజిటల్ స్క్రీన్స్‌కు నిత్యం ఎక్స్΄ోజ్ అవుతూ ఉండటం. ఈ కారణంగా కళ్లు స్ట్రెయిన్ అవుతుంటే తలనొప్పి, కళ్లు ΄÷డిబారడం, మసక మసగ్గా కనిపించడం వంటివి.డ్రై ఐస్ : ఒత్తిడి కారణంగా కళ్లలో స్రవించే నీరు (కన్నీరు లేదా లాక్రిమస్ సెక్రిషన్) తగ్గుతుంది. దీని కారణంగా కళ్లు పొడిబారడంతో పాటు కళ్లలో ఇసకపడ్డట్లు ఫీలింగ్, ఇరిటేషన్, కళ్లమంటల వంటి లక్షణాలు కనిపిస్తాయి. బ్లర్డ్ విజన్ : కంటి చుట్టూతా ఉండే కండరాలు ఒత్తిడితో బిగుసుకుపోతున్న కారణంగా... చూపు స్పష్టంగా కనిపించక ఎదుటనున్నవి మసక మసగ్గా కనిపిస్తాయి. ఒక్కోసారి ఒత్తిడి కారణంగా కళ్లలో సన్నటి కన్నీటి పొర అవరించినప్పుడూ ఇలా మసగ్గా కనిపించవచ్చు. కన్ను అదరడం (ట్విచ్చింగ్) : కన్ను అదరడం చాలామందిలో కనిపించే సాధారణమైన అంశం. కన్ను అదరడాన్ని బట్టి కొందరు శుభసూచనలను / అశుభసూచకాలను దీనికి ఆ΄ాదిస్తుంటారు. ఇలా కన్ను అదరడాన్ని (ట్విచ్చింగ్ను) దీన్నే వైద్య పరిభాషలో ‘మయోకైమియా’ అంటారు. ఇది దీనివల్ల ఎలాంటి హానీ ఉండదు. అయితే ఒక్కోసారి తీవ్రమైన ఒత్తిడి కారణంగా కన్ను అదురుతుండటం చాలా ఇబ్బందిని కలిగిస్తూ ఉంటుంది. కాంతికి ప్రతిస్పందించడం (లెట్ సెన్సిటివిటీ) : తీవ్రమైన కాంతిలో కన్ను చాలా ఇబ్బందికి గురయ్యే విషయం తెలిసిందే. ఒత్తిడితో కన్ను రెండు రకాలుగా ఇబ్బంది పడుతుంది. తీవ్రమైన ఒత్తిడి... మైగ్రేన్‌ను కలగజేస్తుందన్న విషయం తెలిసిందే. మైగ్రేన్‌లో కన్ను మామూలు కాంతిని కూడా చూడలేక΄ోతుంది. అలాగే ఆరుబయట తీవ్రమైన కాంతి ఉన్నప్పడూ కన్ను తెరుచుకోడానికి చాలా ఇబ్బంది కలుగుతుంది. కొన్ని కంటి భ్రమలూ, భ్రాంతులు (విజువల్ హేలూసినేషన్స్) : అరుదుగా కొన్ని సందర్భాల్లో కంటికి కొన్ని దిగ్భ్రమలు కలుగతాయి. దాంతో కంటి ముందు లేనివి కూడా ఉన్నట్లు కనిపిస్తాయి. ఉదాహరణకు కొన్ని కాంతిపుంజాలు వెలుగుతున్నట్లుగానూ, అవి తేలుతూ పోతున్నట్లుగానూ (వీటినే ఫ్లోటర్స్ అంటారు), మెరుపులు మెరుస్తున్నట్లుగా దిగ్భ్రమలు కలగవచ్చు. కొన్నిసార్లు తాత్కాలికంగా కన్ను దేన్నీ చూడలేకపోవచ్చు కూడా. ముఖ్యంగా ఇలాంటివి ఆక్యులార్ మైగ్రేన్ అనే కండిషన్లో కలుగుతాయి.మేనేజ్మెంట్ / చికిత్స...లక్షణాలను బట్టి చికిత్స ఉంటుంది. ఉదాహరణకు కన్ను పొడిబారిన సందర్భాల్లో కృత్రిమంగా కన్నీటిని ఇచ్చే చుక్కల మందులూ, ల్యూబ్రికేటింగ్ ఐ డ్రాప్స్, కన్ను సరిగా చూడలేక΄ోతున్న సందర్భాల్లో యాంటీ గ్లేర్ కళ్లజోడు, కన్ను పూర్తిగా అలసి΄ోతున్నప్పుడు కంటికి సంబంధించిన కొన్ని వ్యాయామాలను డాక్టర్లు చెబుతారు. దీనికి తోడు పూర్తి దేహానికి ఒత్తిడి తొలగేందుకు యోగా, పప్రాణాయామ వంటి కొన్ని రిలాక్సేషన్ టెక్నిక్స్ అవలంబించాలంటూ చెబుతారు. ఇక కొందరికి కౌన్సెలింగ్ అవసరమవుతుంది. దీనికి తోడు దేహానికి తగినన్ని ద్రవాలు అందుతూ దేహాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచేలా నీరూ, ద్రవాహారం తీసుకోవడం, స్క్రీన్ టైమ్ తగ్గించడం, మంచి ΄ోషకాహారం తీసుకోవడం వంటి మంచి జీవనశైలి మార్గాలను అనుసరించాల్సి ఉంటుంది. చివరగా... ఇటీవల వైగవంతమైన జీవనశైలిలో కంటినీ, కంటి ఆరోగ్యాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారు. మొదట్లో ఒత్తిడి (స్ట్రెస్) కారణంగా కంటికి వచ్చే అనారోగ్యాలు పెద్దగా ఇబ్బంది పెట్టక΄ోవచ్చుగానీ... ఇదే వత్తిడి దీర్ఘకాలం ఉంటూ అదేపనిగా కంటిపై ఒత్తిడి కలగజేస్తే అది మరిన్ని దుష్పరిణామాలకు దారితీయవచ్చు. అందుకే ‘చికిత్స కంటే నివారణ మేలు’ అనే సూక్తిని అనుసరించి సమస్య చిన్నగా ఉన్నప్పుడే దానిపై దృష్టి కేంద్రీకరించి, దాన్ని పూర్తిగా తగ్గించుకోవలన్న వాస్తవం కంటి విషయంలో మరింతగా ఆచరించాల్సిన సత్యం. కంటిపై ఒత్తిడి తగ్గి... కన్ను ఆరోగ్యంగా ఉండాలంటే...ప్రతి 20 నిమిషాలకొకసారి 20 అడుగుల దూరాన్ని 20 సెకన్ల పాటు చూస్తుండాలి.ప్రతి రెండు గంటలకోసారి (కంప్యూటర్ చూడ్డంలాంటి) పనికి బ్రేకిచ్చి 10 – 15 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి. రాత్రి నిద్రకు ఉపక్రమించే గంటా లేదా రెండుగంటల ముందర మొబైల్ ఆపేయాలి. రాత్రి చీకట్లో లైట్ లేకుండా మొబైల్గానీ, లాప్టాప్గానీ చూడకూడదు.ఇటీవలి జీవనశైలిలో ఒత్తిడి ఓ అనివార్యమైన విషయం. ఒత్తిడి (స్ట్రెస్) ప్రభావం దేహంలోని అనేక అవయవాల మీద ప్రతికూలంగా పడుతుందన్న సంగతి తెలిసిందే. చాలామందికి తెలియనిదేమిటంటే... ఒత్తిడి ప్రభావం కంటిపై కూడా ఉంటుందని! చాలాకాలం పాటు కంటి మీద పడే ఒత్తిడి అనేక కంటి సమస్యలను తెచ్చిపెడుతుందంటున్నారు కంటి వైద్య నిపుణులు. సుదీర్ఘకాలం పడే ఒత్తిడి కారణంగా కంటికి సంబంధించి స్వల్పమైనవి మొదలు చాలా తీవ్రమైన అనర్థాల వరకూ ఏర్పడడతాయని చెబుతున్నారు. అదెలాగో చూద్దాం. (చదవండి: అరటి తొక్కలతో దంతాలకు తళతళలాడే తెలుపు..! నిపుణులు మాత్రం..) -
పీరియడ్ నొప్పి తగ్గాలంటే..! (ఫొటోలు)
-
వేడి వేడి కాఫీ...సైన్స్ ఏం చెబుతోంది? (ఫొటోలు)
-
ఉల్లి... వెల్లుల్లి.. తల్లి!.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు (ఫొటోలు)
-
ఊరికే అలసిపోతున్నారా?
మన శరీరానికి అవసరం అయ్యే అనేక పోషకాల్లో పొటాషియం ఒకటి. పొటాషియం మన శరీరంలో బీïపీని నియంత్రిస్తుంది. స్ట్రోక్స్ రాకుండా చూస్తుంది. కండరాల నొప్పులు, కండరాలు పట్టుకుపోయినట్లు అనిపించడం వంటి సమస్యలను పొటాషియం తగ్గిస్తుంది. అలాగే గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. అందువల్ల పొటాషియం ఉండే ఆహారాలను తీసుకోవాలి. పొటాషియం లోపిస్తే కండరాలు బలహీనంగా మారుతాయి. కండరాలు పట్టుకుపోయినట్లు అనిపిస్తుంది. అలసట, గుండె వేగంగా కొట్టుకోవడం, ఆకలి లేక΄ోవడం, మానసిక కుంగుబాటు, తరచు వాంతులు, విరేచనాలు అవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరికి మలంలో రక్తం కూడా వస్తుంది. అందువల్ల పొటాషియం లోపించకుండా చూసుకోవాలి.సాధారణంగా మనకు రోజుకు 2.5 నుంచి 3.5 గ్రాముల వరకు పొటాషియం అవసరం అవుతుంది. మనం తినే ఆహారాల నుంచే మనకు పొటాషియం లభిస్తుంది. సప్లిమెంట్లను వాడాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే పలు ఆహారాలను తీసుకోవడం వల్ల పొటాషియం లోపం రాకుండా చూసుకోవచ్చు.ఎందులో లభిస్తుందంటే.. కోడిగుడ్లు, టమాటాలు, చిలగడ దుంపలు, విత్తనాలు, నట్స్, అరటి పండ్లు, యాప్రికాట్స్, చేపలు, తృణ ధాన్యాలు, పెరుగు, పాలు, మాంసం, తర్బూజా, క్యారెట్, నారింజ, కివీ, కొబ్బరినీళ్లు, బీట్రూట్ వంటి ఆహారాల్లో పొటాషియం విరివిగా లభిస్తుంది కాబట్టి వీటిని తరచూ తీసుకుంటే పొటాషియం లోపం రాకుండా ఉంటుంది.మనం ఏం చేయాలంటే...ఎవరైనా ‘మిరాకిల్ క్యూర్‘ అంటే వారి మాటలు నమ్మవద్దు. వాస్తవాలను చెక్ చేయాలి. ఇన్ఫ్లూయెన్సర్ల మాటల్ని అస్సలు నమ్మవద్దు. సోషల్ మీడియాలో చెప్పే ఔషధాలు/క్రీములు చాలావరకు నిర్ధారణ కానివే. వేళకు పోషకాహారం తినడం, నిద్ర, వ్యాయామం.. ఇవే నిజమైన యవ్వన రహస్యాలు.వయస్సు పెరిగినా యవ్వనాన్ని అవగాహనతో అందంగా, ఆరోగ్యంగా నిలుపుకోవచ్చు.ఔషధాలా, చికిత్సలా అనే విషయంలో నిర్ణయం తీసుకోవడానికి ముందు, పూర్తి అవగాహనకు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. (చదవండి: ఎప్పటికీ యవ్వనంగా.. అలాంటి చికిత్సలు తీసుకోవచ్చా..?) -
జిడ్డు ఆముదమే కానీ..ఎన్ని ప్రయోజనాలో తెలుసా..! (ఫొటోలు)
-
పదేపదే చెవుల్లో మ్యూజిక్ వినిపించడం మానసిక సమస్య..?
నేను ఇంటర్మీడియట్ దాకా చదువుకున్నాను. కుటుంబపోషణ కోసం చిన్నప్పటినుంచే మా నాన్న గారి సెలూన్లో పని చేసేవాణ్ణి. పెళ్లిళ్లలో సన్నాయి వాయించడం కోసం కూడా వెళ్ళేవాణ్ణి. ఇప్పుడు నాకు 60 ఏళ్లు. నా పిల్లలు బాగా చదువుకొని సెటిల్ అయ్యారు. నేను సెలూన్ పని మానేసి పదేళ్లవుతోంది. సన్నాయి వాయించడం కూడా ఆపేశాను. కాలక్షేపం కోసం ఇంటి దగ్గర చిన్న షాపు పెట్టుకున్నాను. నాకు ఒక సంవత్సర కాలం నుండి నేను గతంలో పెళ్లిళ్లలో వాయించిన సంగీతం, పాటలు చెవిలో మళ్లీ మళ్లీ వినపడుతున్నాయి, ముందు ఇంటి దగ్గర్లో ఏదైనా పెళ్లి అవుతుంటే అక్కడ నుండి వచ్చే శబ్దాలు, పాటలు అనుకున్నాను కానీ అని పగలు, రాత్రి, రోజంతా వినపడుతూనే ఉంటాయి. ఆ శబ్దాల వల్ల నాకు విపరీతంగా తలనొప్పి వస్తుంది. మా ఇంట్లో వాళ్ళకి చెప్తే మాకే శబ్దాలూ వినపడట్లేదు. నువ్వు ఊహించుకుంటున్నావు అంటున్నారు. నాకే ఎందుకు ఇలా అవుతోంది... ఈ బాధ నుంచి నన్ను బయట పడేయండి డాక్టరు గారూ!– గురునాథం, కరీంనగర్ మీరు జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని మీ పిల్లల్ని మంచి స్థితికి తీసుకెళ్లినందుకు ముందుగా మీకు నా అభినందనలు. ఇక మీ సమస్య విషయానికి వస్తే మీకు ఉన్న కండిషన్‌ని ‘మ్యూజికల్ హెలూసినోసిస్’ అంటారు. మనం గతంలో విన్న పాటలు, శబ్దాలు అప్పుడుప్పుడు వినపడటం అందరికీ జరుగుతుంటుంది. ఉదాహరణకు పొద్దున మనకు నచ్చిన పాట వింటే అది కాసేపు అలాగే ‘మైండ్‌లో’ ప్లే అవడం, దాన్ని మనం ఎంజాయ్ చేయడం సర్వసాధారణం! కాసేపటికి వాటంతట అవే తగ్గిపోతాయి. కానీ మీ విషయంలో ఎప్పుడో విన్న పాటలు, సంగీతం పదే పదే వినిపించడం, అవి మిగిలిన వాళ్ళకి వినపడకపోవడం, దానివల్ల డిప్రెషన్, ఆత్మహత్య ఆలోచనలు రావడం ఇవన్నీ ఖచ్చితంగా ఒక మానసిక సమస్యను సూచిస్తున్నాయి. ‘మ్యూజికల్ హెలూసినోసిస్’ అనేది అరుదుగా కనబడే ఒక లక్షణం. దీనికి అనేక కారణాలు ఉండొచ్చు. ముందుగా మీకు వినికిడి సమస్య లాంటివి ఏమైనా ఉన్నాయా అనేది చెక్ చెయించుకోండి. అలాంటిది ఏదైనా ఉంటే హియరింగ్ మెషిన్ వాడితే మీ సమస్య చాలావరకు తగ్గిపోతుంది. మీ వయస్సు 60 సంవత్సరాలు కాబట్టి పెద్ద వయసులో వచ్చే డిమెన్షియా, మెదడులో ఇతరత్రా సమస్యలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా పరిశీలించాలి. ఇవేమీ లేవని నిర్ధారణ అయితే అప్పుడు మీకు దగ్గర్లో ఉన్న సైకియాట్రిస్ట్‌ని కలిస్తే మీకు పరీక్షలు చేసి ‘యాంటీ సైకోటిక్’ మందులు, అలాగే మీ డిప్రెషన్ తగ్గడానికి మందులు, కౌన్సెలింగ్ ఇస్తారు. వాటిని కొంతకాలం వాడితే మీ సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. ధైర్యంగా ఉండండి. (డా. ఇండ్ల విశాల్ రెడ్డి సీనియర్ సైకియాట్రిస్ట్ విజయవాడమీ సమస్యలు, సందేహాలు sakshifamily3@gmail.com)(చదవండి: దటీజ్ షెకావత్..! వృద్ధురాలైన తల్లితో కలిసి స్కైడైవింగ్‌కి సై) -
Today tip : ఒళ్లంత తుళ్లింత.. ఈ టిప్స్ తప్పవు మరి!
చిరు జల్లుల, హోరు వానలతో వర్షాకాలం హాయిగా మనల్ని పలకరించేసింది. ఒళ్లంత తుళ్లింత కావాలిలే.. గుండెల్లో జల్లంతా కురవాలిలే! అన్న మురిపెం మాత్రమే కాదు ఇది వ్యాధులు ముసురుకునే కాలం కూడా. వైరస్లు, బ్యాక్టీరియా విజృంభించే కాలం. ఇన్ఫెక్షన్లు చాలా తొందరగా వ్యాపిస్తాయి. ఫలితంగా వైరల్ ఫీవర్లు, జలుబు, దగ్గు, గొంతు నొప్పి, కలరా, టైఫాయిడ్ ముసిరే అవకాశం ఉంది. ఇవాల్టి టిప్ ఆఫ్ ది డే లో భాగంగా వర్షకాలంలో తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు గురించి తెలుసుకుందాం.వేసవి తర్వాత వాతావరణంలో జరిగే మార్పులు, రుతుపవనాలు మార్పుల తదితర కారణా లరీత్యా సీజనల్ వ్యాధులు దాడిచేస్తాయి.ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది.ఎడతెరపి లేని వర్షాలు, వాటివల్ల నిల్వ ఉండే నీటిలో దోమలు ఆవాసాలను ఏర్పరచుకోవడం, రోడ్లపై మురిగిన నీరు ఉండటం.. ఇలా రకరకాల కారణాల వల్ల సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందుతాయి.నీటికుంటలో, కాలువల్లో, ఇంటి పరిసరాల్లో నీరు చేరకుండా చూసుకోవాలి. నిల్వ ఉన్న నీరు దోమలకు, బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలకు సంతానోత్పత్తి నిలయంగా మారి,వ్యాధులకు కారణమవుతాయి.దోమల డెంగ్యూ, మలేరియా టైపాయిడ్ తో పాటు గాలి ద్వారా వ్యాపించే జబ్బులు జలుబు, గొంతునొప్పి వస్తాయి. (Today Tip బరువు తగ్గాలంటే.. జామ ఆకూ ఔషధమే)వర్షాల వల్ల నీరు కలుషితమయ్యే అవకాశాలు ఎక్కువ. అందుకే శుభ్రమైన, కాచి చల్లార్చిన నీటిని తాగడం మంచిది. గోరువెచ్చని నీటిని తాగితే ఇంకా మంచిది.తాజాకూరగాయలు, పండ్లు తీసుకోవాలి. ముఖ్యంగా వర్షాకాలంలో ఆకుకూరలు వాడేటపుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. శుభ్రంగా కడిగి, బాగా ఉడికించి తీసుకోవాలి.బయట ఫుడ్‌కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇంట్లోనే తయారు చేసుకున్న ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. కలుషిత ఆహారం ద్వారా వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంటుంది. అందుకే వీలైనంతవరకు స్ట్రీట్ ఫుడ్ తినడం మానుకోవాలి.ఆహారానికి తీసుకునేముందు ముందు చేతులు కడుక్కోవాలి.ఏదైనా తినడానికి ముందు శుభ్రంగా చేతులు కడుక్కోవాలి. ఈ చిన్న అలవాటు మిమ్మల్ని ప్రమాదకర బ్యాక్టీరియా, వైరస్ నుంచి కాపాడుతుంది. ముఖ్యంగా పిల్లలకు దీన్ని బాగా అలవాటు చేయాలి.రాత్రి పూటదోమలు కుట్టకుండా దోమతెరలు వాడటం మంచిది. బాగా చల్లగా ఉన్నపుడు శరీరం వెచ్చగా ఉండేలా ఉన్ని దుస్తులు ధరించాలి.పోషకాహారం ఆహారంపై శ్రద్ధపెట్టాలి. రోగనిరోధక శక్తి బలపడేలావిటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉండే ఆహారాలు ఎక్కువగా తినాలి. ఇవి వ్యాధులు రాకుండా నివారిస్తాయి.వర్షం అనగానే సంబరపడిపోయే పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒక వేళ వర్షంలో తడిచినా, వెంటనే శుభ్రంగా తుడిచి పొడి బట్టలు వేయాలి. ముఖ్యంగా తల తడి లేకుండా చూసుకోవాలి. ఏమాత్రం అశ్రద్ధ చేసినా అనారోగ్యం తప్పదు.ఇదీ చదవండి : కూతురి కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని తండ్రి సాహసం, వైరల్ వీడియోపిల్లల్లో జలుబు, చిన్నపాటి జ్వరాల నుంచి కాపడడానికి అల్లం, తులసి, వామ్ము ఆకులతో చేసిన కషాయానికి కొద్దిగా తేనె కలిపి ఇస్తే మంచి ఉపశమనం లభిస్తుంది.నోట్ : ఈ జాగ్రత్తలు పాటిస్తూనే ఎలాంటి అనారోగ్య లక్షణాలు కన్పించినా వెంటనే వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవడం ఉత్తమం. -
చినుకుల్లో హాయి..! జాగ్రత్తలు అవసరమోయి..
చిరుజల్లులలో ఏదైనా వేడి వేడి ఫుడ్ ఉంటే.. దానికి తోడు కమ్మటి వాసనతో హాట్ కాఫీ సిప్ చేస్తుంటే.. ఆ హాయి మరోలా ఉంటుంది. ఇలాంటి అనుభూతులు నగరవాసులకు ఎన్నెన్నో.. సిటీలో చినుకులు పడుతుంటే చాలు జనం ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్లపై సందడి చేస్తుంటారు. చల్లటి వాతావరణాన్ని ఆస్వాదిస్తారు. అయితే ఈ మాన్సూన్ సీజన్లో ఆరోగ్యం, హైజీన్, డిజిటల్ టూల్స్ వంటి అంశాలను సైతం సమానంగా పరిగణనలోకి తీసుకుంటున్నారు నగరవాసులు. ఎందుకంటే ఈ కాలంలో వైరల్ ఇన్ఫెక్షన్లు, నీటి కాలుష్యం, వాతావరణ మార్పులతో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందుకే వర్షాకాలాన్ని సురక్షితంగా, అందంగా అనుభవించడానికి కొన్ని లైఫ్‌స్టైల్ హ్యాక్స్, గాడ్జెట్స్, యాప్స్ సైతం అందుబాటులో ఉన్నాయి. వర్షాకాలం అనేది సహజంగా ఆనందాన్ని కలిగించేది. కానీ అదే సమయంలో కొంత జాగ్రత్త అవసరం. ఆరోగ్యాన్ని, గాడ్జెట్లను, ఇంటిని, ఫ్యాషన్‌ను సమానంగా వాడుకుంటే ఈ సీజన్‌ను ఎంతో ప్రయోజనకరంగా మార్చుకోవచ్చు. మోడ్రన్ లైఫ్స్టైల్లో టెక్నాలజీ సహకారంతో వర్షాకాలాన్ని మరింత ఆహ్లాదకరంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ తరం. ఈ వానల్లో మీరు తీసుకునే జాగ్రత్తలు మీరు పొందే ఆనందానికి బలం అవుతాయి.వర్షాకాలం హెల్త్‌కేర్ టిప్స్.. వానల సమయంలో నీటి కాలుష్యం, ఆహారంలోని బ్యాక్టీరియా వల్ల జ్వరాలు, డైజెస్టివ్ సమస్యలు, స్కిన్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువ. ఈ సీజన్లో ఇంట్లోనే వంట చేసుకోవడం, వేడి నీళ్లు తాగడం, తులసి టీ, అల్లం–పెప్పర్ సూప్ వంటి బూస్టింగ్ ఫుడ్స్ తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఫ్యాషన్‌తో పాటు ఫంక్షనాలిటీ.. వర్షాకాలం అంటే మడమ తొక్కినట్లుగా బురద, తడిగా మారే దుస్తులు.. కానీ ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్న వాటర్ రిపెలెంట్ ఫ్యాబ్రిక్స్, సిలికాన్ షూ కవర్స్, ఫోల్డబుల్ రైనిక్స్ లాంటి ఉత్పత్తులతో స్టైలిష్‌గా ఉండటమే కాకుండా తడిసిపోకుండా ఉండొచ్చు. ట్రెండీ అంబ్రెల్లాస్: యాక్టివ్ కలర్స్, ఓపెన్–క్లోజ్ మెకానిజంతో అందంగా ఉండే మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. వాటర్‌ప్రూఫ్ బ్యాక్‌ప్యాక్స్: టెక్ లవర్స్ కోసం వర్షంలో కూడా ల్యాప్‌టాప్, గ్యాడ్జెట్లు భద్రంగా తీసుకెళ్లేందుకు ఉపయోగకరం. వాటర్‌ప్రూఫ్ ఫోన్ కవర్లు: ముఖ్యంగా రోడ్ల మీద లేదా బైక్ ప్రయాణాల్లో తప్పనిసరి. హెల్త్ మానిటరింగ్ యాప్‌లు, గాడ్జెట్స్.. ఫిట్ బిట్, ఎమ్ఐ బ్యాండ్ వంటి వేరబుల్స్ ద్వారా వాకింగ్ ట్రాక్ చేయవచ్చు. హెల్తీ ఫై మీ వంటి డైట్ యాప్‌లు మంచి ఆహార నియమాలు పాటించేందుకు దోహదపడుతున్నాయి. ప్రాక్టో, టాటా 1 ఎంజీ వంటి యాప్‌ల ద్వారా ఇంట్లో నుంచే డాక్టర్ కన్సల్టేషన్ పొందవచ్చు.టెక్నాలజీతో వర్షాన్ని అనుభవించండి.. వర్షాలు ఎప్పుడు వస్తాయో, ఎక్కడ ట్రాఫిక్ జామ్ ఉంటుందో ముందే తెలిసిపోతే బాగుంటుందనే మాట వాస్తవమే. ఈ విషయంలో కొన్ని యాప్స్‌తో పాటు ప్రయాణించవచ్చు. ఆక్యూ వెదర్, స్కైమెట్ వెదర్, లైవ్ రడార్తో వర్ష సూచన. గూగుల్ మ్యాప్స్, మై గేట్ల టెక్నాలజీతో ట్రాఫిక్ అప్డేట్స్, లోకేషన్ ఆధారిత అలర్ట్స్. స్పాటీ ఫై, పాకెట్ ఎఫ్ఎఫ్: వానలో ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు, లేదా ఇంట్లో కూర్చుని విండో వెనుకగా జల్లులు చూస్తున్నప్పుడు మంచి ఎంటర్టైన్మెంట్. వర్షంలో ఇంటిని కాపాడండి డోర్ మ్యాట్స్, షూ స్టాండ్స్: వర్షపు నీళ్లు ఇంట్లోకి రాకుండా అడ్డుకునేందుకు.. డీహ్యూమిడిఫైయర్స్: గదుల్లో తడిగా మారే వాతావరణం, మబ్బును నివారించేందుకు ఉపయోగపడతాయి. ఆరోమా డిఫ్యూజర్లు: తడి వాసనను తొలగించి ఫ్రెష్‌నెస్ కలిగించేందుకు ఉపయోగకరంగా ఉంటుంది.విందుగా మార్చే చిట్కాలు వీకెండ్ విత్ రైన్ థీమ్: ఇంట్లో ఫ్రెండ్స్‌తో టీవీకి దగ్గరగా బీన్స్ బ్యాగ్స్, మసాలా టీ, బజ్జీలు.. ఇదే అసలైన హ్యాపీనెస్. రెయిన్ ఫ్రేమ్స్ ఫొటోగ్రఫీ: వర్షపు నీటి బిందువులు, బల్కనీ పూల మధ్య సెల్ఫీలు.. సోషల్ మీడియాకు మరిచిపోలేని అనుభూతులు. రెయిన్ ఫ్రెండ్లీ రైడ్స్: వర్షంలో బైక్ రైడ్స్, సైక్లింగ్ ట్రిప్స్ వంటి గ్రూప్ యాక్టివిటీస్ ద్వారా వర్షాన్ని మరింత ఆస్వాదించవచ్చు. (చదవండి: 22వేల కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్, అతిపెద్ద ప్యాలెస్.. ఐనా ఆమె స్టిల్ బ్యాచిలర్..!) -
నా మొండి భర్తను మార్చగలరా!
నా భర్తకు 48 ఏళ్లు, రైల్వే ఉద్యోగి. చిన్నవయసు నుండే కుటుంబ బాధ్యతలు ఆయన మీద పడ్డాయి. అప్పటి నుండే మందుకు, స్మోకింగ్కి బానిస అయ్యారు. ఈ మధ్య గుండెకి ఆపరేషన్ కూడా అయింది. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన తర్వాతి రోజే మళ్లీ మందు, సిగరెట్ మెదలుపెట్టారు. ఆఫీస్‌కి సరిగా వెళ్ళరు. మందులు వేసుకోరు. ఈయన పరిస్థితికి భయం వేసి హైదరాబాద్‌లో రిహాబిలిటేషన్ సెంటర్లో జాయిన్ చేశాము. కొన్నిరోజులు అవగానే అక్కడ తిండి తినకుండా గొడవ చేసి మారుతానని బతిమిలాడితే ఇంటికి తీస్కొచ్చేశాం. బయటకు రాగానే అన్నీ – మళ్ళీ మొదలు పెట్టారు. ఇలా కనీసం ఇప్పటికి మూడుసార్లు జరిగింది. అసలు ఆయన మారతాడంటారా? సలహా ఇవ్వండి.– పద్మలత, కాజీపేట మీ భర్త ఆరోగ్యం గురించి మీరు పడే ఆందోళన, తపన అర్థం అవుతున్నాయి. ఇది ఆల్కహాల్‌కి బానిస అయిన చాలామంది పేషెంట్ల కుటుంబ సభ్యుల సమస్య కూడా. ఆల్కహాల్ అడిక్షన్కి వంశపారంపర్యం, వ్యక్తిత్వం, చుట్టూ ఉండే పరిస్థితులు, ఇతర మానసిక సమస్యలు... ఇలా అనేకమైన కారణాలు ఉంటాయి. మద్యం లేదా ఇతర, మత్తుపదార్థాలకు బానిస అయిన వారి మెదడు అనేకమైన మార్పులకి గురయి ఉంటుంది. వారిని ఆ అలవాటు నుండి బయట తీసుకు రావడానికి చాలా సమయం పడుతుంది. ఇక రిహాబిలిటేషన్ అనేది చాలా నిదానంగా చేసే చికిత్స. అందుకని ఆ వ్యక్తికి మారాలి అనే ఆలోచన లేనపుడు, ఆ ఆలోచన తీసుకురావడానికి కూడా చాలా సమయం పడుతుంది. చికిత్సకి అసలు సహకరించరు. ఇలాంటి సందర్భాల్లో కుటుంబ సభ్యుల సహకారం అవసరం. వీరిలో మారాలనే ఆలోచన వచ్చేలా సి.బి.టి, మోటివేషన్ ఇంటర్వ్యూయింగ్ పద్ధతులు వాడతాము. ఒకసారి మోటివేషన్ వస్తే అపుడు మళ్ళీ మద్యం జోలికి పోకుండా ఉండడానికి ‘ప్రివెన్షన్ రిలాప్స్’ పద్ధతులు చెబుతారు. దీనితోపాటు వారి జీవన శైలిలో, స్నేహితుల విషయాలలో చాలా మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. స్ట్రెస్ తట్టుకోడానికి, కోపం తొందరపాటు తగ్గించుకునేలా కూడా థెరపీ ఇస్తారు. 30 సంవత్సరాల అలవాటుని 30 రోజుల్లో మార్చడం అసంభవం అని గుర్తుపెట్టుకోండి! ఈ సందర్భంలోనే మీరు ఓర్పుగా, నేర్పుగా సంయమనంతో ఉండాలి. అలాగే మీరు చేర్పించే రీహాబిలిటేషన్ సెంటర్లో సరైన శిక్షణ, అనుభవం కలిగిన మానసిక వైద్యులు, కౌన్సిలర్లు, సోషల్ వర్కర్లు, యోగ థెరపిస్ట్ లాంటి సౌకర్యాలు ఉన్నాయో లేదో చూడండి. పేషెంట్‌తో పాటు కుటుంబ సభ్యులు కూడా రెగ్యులర్ కౌన్సెలింగ్ తీసుకోవాలి. వైద్యుల సలహా మేరకు చికిత్స పూర్తి స్థాయిలో అందించండి. అతనిలో తప్పకుండా పరివర్తన వస్తుంది. ఆల్ ది వెరీ బెస్ట్ !డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్ విజయవాడ(మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ sakshifamily3@gmail.com)(చదవండి: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా క్యూట్ లవ్ స్టోరీ..! ప్రియతమ ఈ జర్నీలో..) -
ఆసనం.. ఓ ఔషధం..! అధ్యయనం చెబుతోందిదే..
ఒకప్పుడు ఆధ్యాత్మిక, మానసిక ప్రశాంతత కోసం మాత్రమే యోగాని ఒక మార్గంగా పరిగణించేవారు. ప్రస్తుతం అనారోగ్యానికి చికిత్సా మార్గంగా మారింది. దీంతో ఆధునిక వైద్యంలో అనేక దీర్ఘకాలిక వ్యాధులను తగ్గించడంలో యోగాసనాల ప్రాముఖ్యత పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఒక్కో వ్యాధికీ ఒక్కో రకం మందు లాగా వ్యాధికి తగిన యోగాసనం ఉండటం విశేషం. దినచర్యలో ఈ ఆసనాలను చేర్చడం ద్వారా ఒక్కోసారి మందులు లేకుండానే లేదా మందులతో పాటు అనుసరించి శరీరాన్ని ఆరోగ్యకరంగా మార్చుకోవచ్చు. రానున్న ఆరోగ్య సమస్యల నివారణకు మాత్రమే కాదు, చికిత్సకు కూడా ఒక బలమైన సాధనంగా అవతరిస్తోంది. కేవలం మందులపైనే ఆధారపడే పలువురు బాధితులకు యోగా చికిత్సగా మారుతోంది. అనారోగ్య సమస్యను బట్టి ఆసనాన్ని సూచించే విధానం స్థిరపడుతోంది. నగర జీవనశైలిలో ఎంత వేగం పెరిగినప్పటికీ ఆరోగ్యం కూడా అంతే వేగంగా దెబ్బతింటోంది. ఒత్తిడితో కూడిన జీవన శైలి కారణంగా శారీరక, మానసిక ఒత్తిడులు, జీవనశైలిలో మార్పుల కారణంగా అనేక రకాల దీర్ఘకాలిక రోగాలు నగరవాసులను ఇబ్బంది పెడుతున్నాయి. ఇలాంటి సమయంలో ప్రాచీన భారతీయత అందించిన వారసత్వ సంపదగా యోగా, గతంలో వ్యాధుల నివారణకు మాత్రమే అన్నట్టుగా ఉండగా, ఇప్పుడు వాటి చికిత్సకు కూడా ఉపయుక్తంగా మారుతోంది. నివారణకు ఇలా... యోగా సాధన ద్వారా శరీరానికి కావాల్సిన స్థితిస్థాపక శక్తి, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. నాడీ వ్యవస్థ, రక్తప్రసరణ, జీర్ణవ్యవస్థ ద్వారా కొత్తగా వ్యాధులు వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది. అదే సమయంలో ఇప్పటికే ఉన్న రోగాలను నియంత్రించేందుకు యోగా ఒక సహాయక పద్ధతిగా మారుతోంది. ప్రాణాయామం, ధ్యానం, ఆసనాల ద్వారా వ్యాధుల నుంచి త్వరగా కోలుకునేలా చేసి దెబ్బతిన్న ఆరోగ్యాన్ని తిరిగి పొందవచ్చు. దీని కోసం అనారోగ్యాన్ని బట్టి వైద్యులు పలు ఆసనాలు సూచిస్తున్నారు.. అస్తమా (ఉపశ్వాసక సమస్యలు): శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడేవారి ఊపిరితిత్తులకు శక్తినిచి్చ, ఆమ్లజన సరఫరా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. దీని కోసం భ్రస్తిక ప్రాణాయామం, ధనురాసనం వంటి ఆసనాలను వైద్యులు సూచిస్తున్నారు. డయాబెటిస్ (షుగర్): నగరంలో అనేక మందికి దీర్ఘకాలికంగా ఇబ్బందులు పెడుతున్నాయి. వాటిలో ముఖ్యమైనది డయాబెటిస్. దీనికి నిరంతరం ఇన్సులిన్, మందుల వాడకం తప్పడం లేదు. అయితే ఈ వ్యాధి నుంచి కోలుకోడానికి వాడుతున్న మందులు మరింత సమర్థవంతంగా పనిచేయడానికి పవనముక్తాసనం, అర్ధ మత్సేద్రాసనం, సూర్య నమస్కారాలు వంటివి ఉపకరిస్తాయని చెబుతున్నారు. ముఖ్యంగా క్లోమగ్రంధి పనితీరును మెరుగుపరచడంలో ఆసనాల పాత్ర కీలకమని, రోజూ 15–20 నిమిషాల పాటు సాధన వల్ల రక్తంలో షుగర్ స్థాయిని నియంత్రించవచ్చని అంటున్నారు. బీపీ (అధిక రక్తపోటు): వయసులకు అతీతంగా ఇబ్బంది పెడుతున్న ఆరోగ్య సమస్యల్లో హైపర్ టెన్షన్ (అధిక రక్తపోటు) కూడా ఒకటి. దీని చికిత్సలో శవాసనం, వజ్రాసనం, నాడీ శోధన ప్రాణాయామం సహకరిస్తాయని వైద్యుల సూచన. ఈ ఆసనాలు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. మెదడుకు ఆక్సిజన్ సరఫరా పెరిగి హృదయ స్పందనలు సరైన విధంగా నియంత్రించవచ్చు. జీర్ణ సమస్యలు (గ్యాస్ట్రో): వేళాపాళా లేని ఆహారపు అలవాట్ల కారణంగా నగరవాసుల్లో జీర్ణకోశ వ్యాధులు సర్వసాధారణంగా మారాయి. వీటి నుంచి కోలుకునే క్రమంలో పశి్చమోత్తానాసనం, వజ్రాసనం అనుసరించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆహారం తీసుకున్న తర్వాత, భోజనానంతరం వజ్రాసనంలో కూర్చోవడం జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. వాయువు, గ్యాస్ వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మైగ్రేన్ (పార్శ్వపు నొప్పి): ఇటీవల తలనొప్పి అదే విధంగా మైగ్రేన్ సమస్యలు అధికంగా కనిపిస్తున్నాయి. వీటికి మందులతో పాటు శశాంకాసనం, పద్మాసనం, బ్రహ్మరి ప్రాణాయామం వంటివి చికిత్సగా పనిచేస్తాయి. ఈ ఆసనాలు నాడీ తంత్రానికి విశ్రాంతిని అందిస్తాయి. మానసిక ఒత్తిడిని తగ్గించడంతో పాటు మైగ్రేన్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. అత్యున్నత పరిష్కారం.. యోగాసనాలు కేవలం శరీర అవయవాలను కదలించే వ్యాయామం మాత్రమే కాదు.. వ్యాధులను తగ్గించే ఔషధం. ఆరోగ్య సమస్యల నుంచి కోలుకోడంలో యోగాసనాల ప్రభావం అధికంగా ఉంటుంది. దీనిపై నగరవాసులకు మరింత అవగాహన అవసరం. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు అత్యున్నత పరిష్కారం. శ్రద్ధతో సాధన చేస్తే అద్భుత ఫలితాలు పొందవచ్చు. దీనిపై సోషల్ మీడియా సహా విభిన్న మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నా. – డా.జయప్రకాశ్ సాయి, వైద్యులు ఊబకాయం (ఒబెసిటీ): నగరంలో చిన్నా పెద్దా తేడా లేకుండా వేధిస్తున్న సమస్య ఓవర్‌వెయిట్, ఒబెసిటీ(సూ్థలకాయం). దీని నుంచి బయటపడేందుకు సూర్య నమస్కారాలు, నవక్రియాసనాలు, త్రికోణాసనం సాధన చేయాలి. ఇవి శరీరానికి తగిన రక్తప్రసరణ, చక్కటి వ్యాయామం అందించటంతో పాటు శరీరంలో అధిక క్యాలరీలను ఖర్చు చేయిస్తాయి. డిప్రెషన్, ఆందోళన: పని ఒత్తిడితోపాటు అనేక రకాల మానసిక సమస్యలతో నిత్యం పోరాటం చేస్తున్నారు. వీటిని తగ్గించుకునే క్రమంలో ధ్యానం, అనులోమవిలోమ ప్రాణాయామం వంటివి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సాధనాలు. ఇవి మెదడులో సెరటోనిన్ వంటి ‘హ్యాపీ హార్మోన్ల’ను విడుదల చేస్తాయి. అయితే యోగా ఏ ఒక్క రోజులో ఫలితమివ్వదు. దినచర్యలో భాగంగా దీన్ని కొనసాగిస్తేనే దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయి’ అంటున్నారు ప్రముఖ యోగా నిపుణురాలు డా.మంజురెడ్డి. ముందస్తుగా శరీర పరిస్థితిని తెలుసుకుని నిపుణుల శిక్షణలో ప్రారంభించాలని సూచిస్తున్నారు. అధ్యయనాలు చెబుతోందిదే.. దీర్ఘకాలిక తక్కువ వెన్నునొప్పికి ప్రారంభ నాన్ ఫార్మాస్యూటికల్ చికిత్సలో భాగంగా యోగాను అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ సిఫార్సు చేస్తోంది. యోగాభ్యాసం గుండె జబ్బుల కారకాలను తగ్గించగలదని వృద్ధుల్లో అంతర్గత అవయవాల పనితీరు మెరుగు.. జీవన నాణ్యతలో గణనీయమైన మెరుగుదలను అందిస్తుందని అధ్యయనంలో వెల్లడైంది. నొప్పులను నియంత్రించడంలో యోగా ప్రభావవంతంగా పనిచేస్తోందని, తలనొప్పి, ఆస్టియో ఆర్థరైటిస్, మెడనొప్పి, నడుమునొప్పి వంటి ఇబ్బందులను యోగా తొలగిస్తుందని పరిశోధనలు నిరూపిస్తున్నాయి. ఎనిమిది వారాల యోగా సాధనతో మోచేయి, మోకాలి కండరాల బలాన్ని 10%–30% మెరుగుపరుస్తుందని పరిశోధకులు తేల్చారు. చీలమండ, భుజం, తుంటి, కీళ్ల ఫ్లెక్సిబిలిటీ 13%–188% పెరిగిందని గుర్తించారు. ఎనిమిది నుంచి 12 వారాల సాధారణ అభ్యాసన ఆందోళన, నిరాశ నిస్పృహలను తగ్గిస్తుందని, ఒత్తిడి నిర్వహణలో సహాయపడుతుందని పరిశోధనలు తేల్చాయి. (చదవండి: -
దారపు నరాలు..ఇట్టే నయం..!
చర్మంపై నరాలు తేలి అవి పైకి కనిపిస్తే అందవిహీనంగా కనిపిస్తుంది. నిజానికి ఈ సమస్యను దారపు నరాలు లేదా స్పైడర్ వీన్స్ అంటారు. ఇవి ఎక్కువగా కాళ్లు, తొడల భాగాల్లో నరాలు చర్మంపైకి నల్లటి లేదా ఎర్రటి చారల్లా కనిపిస్తాయి. సమస్య తీవ్రతను బట్టి అవి ముఖంపై కూడా వస్తుంటాయి. వాటికి సమర్థమైన చికిత్స ‘లిక్విడ్ స్క్లెరో థెరపీ’. ఈ ప్రక్రియలో, ఒక ప్రత్యేక రసాయనిక ద్రావణాన్ని, నేరుగా ప్రభావిత నరంలోకి ఇంజెక్ట్ చేస్తారు. చిన్న చారల నుంచి మధ్యస్థాయి చారల వరకు, ఈ చికిత్స చేస్తే ఫలితం ఉంటుంది. చాలామందికి ఒకటి కంటే ఎక్కువ సెషన్స్ అవసరం కాకపోవచ్చు. చికిత్స తర్వాత స్వల్ప అసౌకర్యం, వాపు ఉండవచ్చు కాని, అదంతా త్వరగా తగ్గిపోతుంది. ఈ థెరపీ చాలా సురక్షితం.చర్మ సౌందర్యానికి, జుట్టు ఆరోగ్యానికి వేర్వేరు పరికరాలను ఉపయోగిస్తున్నారా? ఇక ఆ అవసరం లేదు. ‘మైట్రెక్స్ ప్రూవ్ టోటల్ లిఫ్ట్’ అనే ఈ పరికరంలో ముఖం, తల, శరీర సంరక్షణకు అవసరమైన అన్ని ఫీచర్స్ కలిగి ఉంది. ఇది ఎలక్ట్రిక్ మజిల్ స్టిమ్యులేషన్‌తో హై పవర్ పల్స్‌తో చర్మాన్ని ఉత్తేజపరచి, కండరాలను బలోపేతం చేస్తుంది. దాంతో చర్మాన్ని బిగుతుగా మార్చి, నిగారింపునిస్తుంది.అలాగే ఈ మెషిన్ మూడు విభిన్న అటాచ్మెంట్లతో రూపొందింది. దీనికున్న బ్రష్ అటాచ్మెంట్ తలకు మసాజ్ చేసి, జుట్టు కుదుళ్లను దృఢంగా మారుస్తుంది. దీని కర్వ్డ్ అటాచ్మెంట్ ముఖంపై చర్మాన్ని బిగుతుగా మార్చి, ముడతలను నివారిస్తుంది. ఫ్లాటర్ అటాచ్మెంట్ శరీర భాగాలైన చేతులు, కాళ్లు వంటి వాటిపై చర్మాన్ని మెరుగుపరుస్తుంది.ఇది వాటర్‌ప్రూఫ్ డివైస్ కావడంతో తడి చర్మంపై కూడా సురక్షితంగా ఉపయోగించుకోవచ్చు. దీనిలో ఐదు లెవల్స్, రెండు మోడ్స్ ఉండటంతో అవసరాన్ని బట్టి మార్చుకోవచ్చు. దీనికి ఒక్కసారి చార్జ్ పెడితే 7 నుంచి 11 గంటల వరకు పనిచేసే బ్యాటరీ సామర్థ్యం, నిరంతరాయంగా పని చేస్తుంది. 15 నిమిషాల తర్వాత ఆటో–ఆఫ్ టైమర్ ఉండటంతో దీనిని వినియోగించడం చాలా తేలిక. (చదవండి: ముప్పై ఐదేళ్లు దాటాక ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయడం ప్రమాదమా...?) -
బ్రెయిన్ షార్ప్‌గా ఉండాలంటే..?
మన శరీర భాగాల్లో ఎక్కువ శ్రమపడేది– మెదడు. ఇది అద్భుతమైన శక్తులతో కూడినది. కాని, దానికి ఇచ్చే విశ్రాంతి, శ్రద్ధ మాత్రం చాలా తక్కువ. మెదడును పదిలంగా ఉంచుకోవాలంటే గంటల తరబడి యోగా, వ్యాయామం అవసరమేమీ కాదు. రోజుకు ఐదు నిమిషాల ‘చిన్న అలవాట్లు’ మన మెదడును శక్తిమంతంగా మార్చగలవని తాజా న్యూరో సైన్స్ పరిశోధనలు స్పష్టంగా చెబుతున్నాయి. ఈ ఐదు నిమిషాల అలవాట్లు కేవలం ప్రస్తుతానికే కాక, భవిష్యత్తులో వృద్ధాప్యంలో మెదడు మందగించడం నుంచి మిమ్మల్ని రక్షించే సాధనాలవుతాయి. అవేమిటో ఈ రోజు తెలుసుకుందాం. 1. ముక్కుతోనే పీల్చాలిమనం బతకాలన్నా, మెదడు బతకాలన్నా శ్వాస కావాలి. అయితే మనం ఎలా ఊపిరి పీలుస్తున్నామన్నది మెదడుపై ప్రభావాన్ని చూపుతుంది. ముక్కు ద్వారా పీల్చే శ్వాస నేరుగా ‘అల్ఫ్యాక్టరీ బల్బు’కు అనుసంధానమై ఉంటుంది. దీని వల్ల మెమరీ సెంటర్లు యాక్టివేట్ అవుతాయి. ముక్కు ద్వారా ఊపిరి తీసుకునే సమయంలో మెదడు స్మృతి కేంద్రాలను ప్రేరేపించే ‘సబ్టల్ ఎలక్ట్రికల్ రిథమ్స్’ను ఉత్పత్తి చేస్తుంది. అందువల్లనే నోటిద్వారా శ్వాస తీసుకునే వారికంటే ముక్కుద్వారా శ్వాసతీసుకునేవారు 40శాతం మెరుగైన మెమరీ చూపించారు.2. బాక్స్ బ్రీతింగ్నాలుగు సెకన్లు శ్వాస తీసుకొని, నాలుగు సెకన్లు శ్వాస నిలిపి, నాలుగు సెకన్లు విడిచి, మరో నాలుగు సెకన్లు ఖాళీగా ఉండటం. ఈ విధానాన్ని రోజుకు ఐదు నిమిషాలు పాటిస్తే, మీ మెదడు ముందు భాగంలో (ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్) 25శాతం అదనపు ఆక్సిజన్ చేరుతుంది. ఇది నిర్ణయం తీసుకోవడం, ఫోకస్, మెమరీ వంటివి మెరుగుపరుస్తుంది. అంతేకాదు, ఇది మీ పారా సింపథటిక్ నాడీ వ్యవస్థను యాక్టివేట్ చేస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తూ, కార్టిసాల్ స్థాయిని నియంత్రిస్తుంది. ఒక్క రోజు బాక్స్ బ్రీతింగ్ చేయడం, ఫోకస్‌ను పదిశాతం పెంచుతుంది. అదే అలవాటు 30 రోజులు కొనసాగితే మీ మెదడు పనితీరులో 40శాతం మెరుగుదల ఉంటుంది. 3. డెస్క్ వర్కవుట్స్... అధిక తీవ్రత గల వ్యాయామం చేసిన వారు రెండు గంటలపాటు మెరుగైన మెదడు పనితీరు చూపారని ఒక అధ్యయనంలో వెల్లడైంది.. దీనివల్ల బ్రెయిన్ అండ్ డిరైవ్డ్ న్యూరోట్రోఫిక్ ఫ్యాక్టర్ (బీడీఎన్ఎఫ్) విడుదల అవుతుంది, ఇది మెదడు న్యూరాన్ల వృద్ధిని పెంచుతుంది. కేవలం మీ డెస్క్ దగ్గరే ఐదు నిమిషాల్లోనే సాధ్యమయ్యే వ్యాయామాల ఉదాహరణ: 30 సెకన్లు బాడీ వెయిట్ స్క్వాట్స్, 30 సెకన్లు ఆర్మ్ సర్కిల్స్, 30 సెకన్లు హై నీస్, 30 సెకన్లు వాల్ పుషప్స్– ఈ చర్యలతో మెదడులో రక్తప్రసరణ పెరిగి, మీ ఫోకస్, శక్తి, ఆలోచనా సామర్థ్యం మెరుగుపడతాయి.4. విభిన్న మేధా కార్యకలాపాలుపజిల్స్, బ్రెయిన్ గేమ్స్ కాకుండా, మీ మెదడుకు ‘కొత్త’ అనుభవాలు ఇవ్వడం వల్ల అత్యంత ప్రభావం ఉంటుంది. రోజుకు ఒక కొత్త పదాన్ని నేర్చుకొని మూడు వేర్వేరు సందర్భాలలో ఉపయోగించడం, చిన్న గణిత సమస్యలను కాగితం–పెన్సిల్ లేకుండా లెక్కించడం, లేదా సాధారణ వస్తువులకు అసాధారణ ఉపయోగాలను కనుగొనడం వంటివి మెదడులో క్రియేటివ్, భాగాలను కలుపుతూ డైవర్జెంట్ థింకింగ్‌ను మెరుగుపరుస్తాయి. మళ్లీ మళ్లీ అదే ఆటలు ఆడే కన్నా, చిన్న కొత్త విషయాలే మెరుగైన న్యూరోప్లాస్టిసిటీని అందిస్తాయి.5. సంగీతంతో సరళతసంగీతం మనసుకు సాంత్వననిస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే గిటార్, పియానో లాంటి వాయిద్యాలను వాయించడం వల్ల మెదడులోని అనేక భాగాలు ఒకేసారి ఉత్తేజితమవుతాయి. ‘అరె... నాకే వాయిద్యమూ రాదండీ’ అని బాధపడకండి. బీట్‌కు సరిపడేలా వేలితో ట్యాప్ చేయడం వల్ల మెదడులోని మోటార్ కార్టెక్స్, ఆడిటరీ కార్టెక్స్, అటెన్షన్ భాగాలు యాక్టివ్ అవుతాయి. ఇది మీకు గణనీయమైన కాగ్నిటివ్ స్టిమ్యులేషన్ ఇస్తుంది.6. నలుగురితో మాట్లాడండిఐదు నిమిషాల సామాజిక సంభాషణలు మీ మెదడు పనితీరు, విశ్లేషణ సామర్థ్యం, వర్కింగ్ మెమరీని మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా కొత్త వ్యక్తులతో, కొత్త విషయాలపై చేసిన సంభాషణలు మీ మెదడుకు అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తాయి. పాత పరిచయాల కన్నా వయస్సులో తేడా గలవారితో సంభాషణ వల్ల మెదడు కొత్త దృక్కోణాలనూ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. సరదా కబుర్ల కన్నా లోతైన సంభాషణలు మెరుగైన కాగ్నిటివ్ బెనిఫిట్స్‌ను అందిస్తాయి. వీడియో, ఫోన్ సంభాషణలు టెక్స్ట్ మెసేజెస్ కంటే నేరుగా మాట్లాడటమే మెరుగైన ప్రభావాన్ని చూపుతాయని పరిశోధనలు సూచిస్తున్నాయి.సైకాలజిస్ట్ విశేష్www.psyvisesh.com(చదవండి: ముప్పై ఐదేళ్లు దాటాక ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయడం ప్రమాదమా...?) -
ముప్పై ఐదేళ్లు దాటాక ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయడం ప్రమాదమా...?
నాకు ముప్పై ఐదు సంవత్సరాలు. ఇంకా పెళ్లి కాలేదు. ఫర్టిలిటీకి సంబంధించి పెళ్లిని ఇంకెంత కాలం వాయిదా వేసుకోవచ్చో చెప్పండి?– శ్రీలేఖ, హైదరాబాద్. ప్రస్తుతం మీరు ముప్పై ఐదేళ్ల వయస్సులో ఉన్నందున గర్భధారణకు సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోవడం అవసరం. వయస్సు పెరిగేకొద్దీ శరీరంలో ఎగ్స్ కౌంట్, వాటి నాణ్యత రెండూ తగ్గిపోతాయి. ముప్పై ఏళ్ల తర్వాత గర్భధారణలో సమస్యలు ఎక్కువ అవుతాయి. గర్భస్రావం, బీపీ, సుగర్, శిశువుకు జన్యుపరమైన లోపాలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. మహిళల ఫర్టిలిటీ గరిష్ఠ స్థాయిలో ఉండే వయస్సు ఇరవై నుంచి ముప్పై మధ్య. ఇరవై ఏళ్లలోపు గర్భం ధరించే అవకాశం ఎనభై ఐదు శాతం ఉంటే, ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య అది అరవై శాతానికి పడిపోతుంది. ముప్పై ఐదు నుంచి నలభై మధ్య నలభై శాతానికి పడిపోతుంది. వయస్సు పెరిగే కొద్దీ గర్భం ధరించే అవకాశం తగ్గుతుంది. అప్పుడు సహజ గర్భధారణ కష్టమై, ఐయూఐ లేదా ఐవీఎఫ్ వంటి వైద్యపద్ధతులపై ఆధారపడాల్సి వస్తుంది. మీ వయస్సును బట్టి, ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవడం చాలా అవసరం. నెలసరి చక్రాలు క్రమంగా ఉన్నాయా? పీసీఓఎస్, ఎండోమెట్రియోసిస్ వంటి సమస్యలున్నాయా అన్నది పరిశీలించాలి. అధిక బరువు, పొగతాగే అలవాటు, రక్తపోటు, సెక్స్ మూలంగా వచ్చే వ్యాధులు వంటి అంశాలు కూడా గర్భధారణను ప్రభావితం చేస్తాయి. కనీసం ఒక సంవత్సరం పాటు సహజంగా గర్భం ధరించే ప్రయత్నం చేయాలి. ఫలితం రాకపోతే, వైద్య నిపుణుడిని కలవాలి. వయస్సు, జన్యు చరిత్ర ఆధారంగా తగిన మందులు, అవసరమైతే ఐయూఐ లేదా ఐవీఎఫ్ వంటి వైద్య విధానాలను సూచిస్తారు. అందుకే ఆలస్యం చేయకుండా మంచి నిర్ణయం తీసుకోండి. నా వయస్సు అరవై సంవత్సరాలు. ఇరవై సంవత్సరాల క్రితం బ్లీడింగ్ అవుతోందని గర్భాశయం తీసేశారు. ఇప్పుడు దగ్గినా, తుమ్మినా యోని భాగంలో గడ్డలాగా కనిపిస్తోంది. కానీ నొప్పి లేదు. డాక్టర్‌ను కలవాలా?– శారద, విశాఖపట్నం. మీరు చెప్పిన వివరాల ప్రకారం, మీ వయస్సులో యోని భాగంలో గడ్డలాగా కనిపించడం నిర్లక్ష్యం చేయదగ్గ విషయం కాదు. గర్భాశయం తొలగించిన తర్వాత ఆ ప్రాంతం బలహీనపడడం వలన కొన్ని సంవత్సరాల తర్వాత యోని భాగం కిందకు జారిపోతుంది. ఇది సాధారణంగా నొప్పిని కలిగించదు. కాని, ఏదో బరువుగా, ఒత్తిడిగా అనిపిస్తుంది. ఈ పరిస్థితిని వజైనల్ వాల్ ప్రోలాప్స్గా పరిగణిస్తారు. ఇది నరాలపై ఒత్తిడి కలిగించి అసహజమైన ఫీలింగ్‌ను కలిగిస్తుంది. అలాగే, యోని భాగంలో పుండ్లు, మంటలు, వాపులు ఏర్పడిన సందర్భాల్లో కూడా గడ్డలాగా అనిపించవచ్చు. మూత్రనాళ సమస్యల కారణంగా కూడా ఇలాంటి సమస్యే వస్తుంది. మరికొన్ని సందర్భాల్లో వజైనల్ వాల్‌తో పాటు మూత్ర సంచి లేదా మోషన్ పేగు కూడా బలహీనపడిపోయి కిందకు జారిపోవచ్చు. అప్పుడు మూత్రం పూర్తిగా వెలువడకపోవడం, మూత్ర సంచి తడిపోవడం, మలవిసర్జన నియంత్రణ కోల్పోవడం వంటి సమస్యలు కనిపిస్తాయి. ఇవన్నీ పెల్విక్ భాగం బలహీనతకు సంకేతాలు. ఇలాంటి సందర్భాల్లో ఆలస్యం చేయకుండా డాక్టర్‌ను కలవాలి. వారు పెల్విక్ వ్యాయామాలు సూచిస్తారు. అవసరమైతే మల్టీ విటమిన్ మాత్రలు ఇస్తారు. మూత్రపరీక్ష, రక్తపరీక్ష, కల్చర్ పరీక్షలు చేసి, ఇన్ఫెక్షన్స్ ఏవైనా ఉన్నాయా? లేదా? అని చెక్ చేస్తారు. శరీరానికి అవసరమైన పోషకాహారం గురించి కూడా సలహా ఇస్తారు. మీ వయస్సును బట్టి, ముందు వ్యాయామం చేయటం ప్రారంభించాలి. ఇన్ఫెక్షన్ లేకపోతే, యోనిలో పెట్టుకునే వజైనల్ పెస్సరీ వాడాలని సూచిస్తారు. ఇది సాఫ్ట్ పదార్థాలతో తయారైన దై, డాక్టర్ సూచించిన పరిమాణంలో మాత్రమే వాడాలి. ఉపయోగించడం, తొలగించడం నేర్చుకున్న తర్వాత కూడా ప్రతి రెండు నెలలకోసారి వైద్యుని పునర్విమర్శ అవసరం. ఇది ఉపశమనం కలిగిస్తే కొనసాగించవచ్చు. లేకపోతే శస్త్రచికిత్సను సూచిస్తారు. డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: నెలలు నిండాక వచ్చే నొప్పులు పురిటినొప్పులేనా..?) -
'4ఏ మోడల్'తో ఒత్తిడిని జయిద్దాం ఇలా..!
ఒత్తిడిని జయించడంఈ రోజుల్లో ప్రతి మనిషి జీవితంలో ఒత్తిడి అనేది ఒక భాగంగా మారిపోయింది. ఉద్యోగ బాధ్యతలు, కుటుంబ సమస్యలు, భవిష్యత్‌పై భయాలు.. ఐటీ ఉద్యోగాలు కావొచ్చు, తీరికలేని వ్యాపారాలు కావొచ్చు.. జీవితంలో ఇంకేమైనా కారణాలు కావొచ్చు, కానీ ఒత్తిడి అనేది ప్రధాన సమస్యగా మారింది. ఇది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో పాటు మానసిక రుగ్మతలకు కారణమవుతోంది. దీంతో వ్యక్తిగతంగానే కాకుండా కుటుంబం పరంగా మనశ్శాంతిని కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో ఒత్తిడిని తగ్గించడానికి పలు థెరపీలు, విధానాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఒత్తిడిని పూర్తిగా నివారించడం సాధ్యం కాకపోయినా, దాన్ని సమర్థవంతంగా నిర్వహించడం మన చేతిలోనే ఉంది.ఒత్తిడిని నియంత్రించే ‘4ఏ మోడల్’.అవాయిడ్ (తగ్గించండి): అవసరం లేని ఒత్తిడికి తలవంచకండి. కొన్ని పనులను ఇతరులకు అప్పగించండి. జీవితంలో అసలైన ప్రాధాన్యతలను గుర్తించి, వాటినే ముందుగా చేయండి. ఇది మనసును చాలా వరకు ప్రశాంతంగా ఉంచుతుంది. అడాప్ట్ (అనుకూలించండి): ప్రస్తుత పరిస్థితులను మారుస్తూ, సరికొత్తగా ఆలోచించండి. అంచనాలను ఆచరణీయంగా మార్చుకోండి. నెగటివ్ ఆలోచనల్ని పాజిటివ్ దృష్టితో చూడటం అలవాటు చేసుకోండి. ప్రతి సమస్యలో పాఠం ఉంటుంది. దాన్ని గుర్తించి సమన్వయంగా ముందుకు సాగండి. ఆల్టర్(మార్పు తీసుకోండి): మీ అవసరాలను స్పష్టంగా వ్యక్తం చేయండి. ప్రతి పనిని చిన్నచిన్న దశల్లో విడదీసి చేయండి. సమస్యలు వచి్చనప్పుడు వాటిని తొలగించే మార్గాలు వెతకండి. ఇది మానసిక ఒత్తిడిని తగ్గించే ఉత్తమ మార్గాల్లో ఒకటి. యాక్సెప్ట్ (అంగీకరించండి): కొన్ని విషయాలను మనం మార్చలేం. అలాంటి వాటిని అంగీకరించడం వల్ల మనసు హాయిగా ఉంటుంది. గతాన్ని మర్చిపోండి. ప్రతి సవాల్లో అభివృద్ధికి అవకాశం ఉందని తెలుసుకోండి. ఒత్తిడి పెరుగుతోంది అంటే భయపడాల్సిన అవసరం లేదుం దానిని ఎదుర్కొనడంపై దృష్టి సారించాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. మనసుకు శాంతి, శరీరానికి విశ్రాంతి ఇచ్చే మార్గాల్ని అన్వేషించడం ఈ తరానికి చాలా అవసరమని నిపుణుల మాట. ఈ నేపథ్యంలో ఒత్తిడిని తగ్గించేందుకు ఉపయోగపడే ‘4 ఏ మోడల్’ (అవాయిడ్, అడాప్ట్, ఆల్టర్, యాక్సెప్ట్), ‘6 ప్రాక్టికల్ టెక్నిక్స్’ బాగా ఉపయోగపడుతున్నాయి. శ్వాస వ్యాయామాలు, డిజిటల్ డిటాక్స్, మానసిక దృక్పథం మార్పు వంటి చిట్కాలతో మనశ్శాంతి ఎలా పొందాలో స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఒత్తిడిని తగ్గించేందుకు 6 మార్గాలు.. 4–7–8 బ్రీత్ టెక్నిక్: నాలుగు సెకన్లు శ్వాస తీసుకోండి, 7 సెకన్లు ఆపండి, 8 సెకన్లకు మెల్లగా విడిచిపెట్టండి. ఇది నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తుంది. ప్రోగ్రెసివ్ మసిల్ రిలాక్సేషన్: ఒత్తడికి లోనైన కండరాలను గట్టిగా పట్టుకుని మెల్లగా విడవండి. శరీరమంతా రిలాక్స్ అవుతుంది. మెల్ రాబిన్స్ 5 సెకండ్ రూల్: ఒక నిర్ణయం తీసుకునే ముందు 5 నుంచి 1 వరకు వెనక్కి లెక్కించండి. దీని వల్ల ఆలస్యం కారణంగా వచ్చే ఒత్తిడిని నివారించవచ్చు. డిజిటల్ డిటాక్స్: రోజులో కొన్ని గంటలు స్క్రీన్లను పూర్తిగా దూరం పెట్టండి. ప్రత్యేకించి రాత్రి పూట ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు పక్కన పెట్టడం ద్వారా మెదడు విశ్రాంతి పొందుతుంది. ఏబీసీ టెక్నిక్: ఒత్తిడికి కారణమైన సందర్భాన్ని, దానిపై మన నమ్మకాలను, దాని పరిణామాలను విశ్లేషించండి. ఇందులోని అవాస్తవ పరిస్థితులను మానసికంగా వదిలేయండి. బాక్స్ బ్రీథింగ్: నాలుగు సెకన్లు శ్వాస తీసుకోండి. నాలుగు సెకన్లు ఆపి వదలాలి. మరో నాలుగు సెకన్ల సమయం తరువాత ఈ పద్ధతిని మళ్లీ కొనసాగించాలి. మానసిక ఒత్తిడి తగ్గి మనోస్థితి స్థిరంగా ఉంటుంది. (చదవండి: నీట్లో సత్తా చాటిన కూలీ, చిరువ్యాపారి, రైతుల కూతుళ్లు..!) -
శరీరానికి సరిపడ బెస్ట్ ఫుడ్స్ ఏంటో తెలుసుకుందాం ఇలా..!
నగరంలో ఫుడీస్, ఫుడ్ లవర్స్, భోజనప్రియులు.. పేరేదైనా కానీ.. విభిన్న వంటకాలు ఆస్వాదించేవారు పెరుగుతున్నారు. మరోవైపు రెస్టారెంట్స్‌లో మాత్రమే కాదు సంపన్నుల బఫే డిన్నర్స్లోనూ, పారీ్టస్లోనూ విభిన్న రకాల విదేశీ రుచుల వడ్డన సర్వసాధారణం అయ్యింది. అయితే కంటికి ఇంపైనంత మాత్రాన ఇంటికి ఇంపు కావాలని లేనట్టే, నోటికి ఇంపుగా అనిపించినంత మాత్రాన శరీరానికి ఇంపు కాకపోవచ్చని వైద్యులు చెబుతున్నారు. రుచుల వేట సాగించేవాళ్లు ముందస్తుగా ఫుడ్ ఇన్టోలరెన్స్ టెస్టు చేయించుకోవడం మంచిదని సూచిస్తున్నారు. వైద్యులు చెబుతున్న వివరాల ప్రకారం.. సాధారణంగా మనుషులు తినకూడని ఆహారాలు మనకి తెలుసు. తినదగినవీ తెలుసు. కానీ కొందరికి మాత్రమే తినదగినవి, కొందరు తినకూడనివి కూడా ఉంటాయి. అలానే ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలు కూడా కొన్నిసార్లు అస్వస్థతకు కారణమవుతాయి. ఇవి జీర్ణక్రియ సమస్యలు, చర్మం మీద ర్యాషెస్, తలనొప్పి, కీళ్ల నొప్పులు వంటి లక్షణాలను కలిగించవచ్చు. అయితే ఎటువంటి ఆహారం అనారోగ్యానికి కారణమవుతుందో గుర్తించడం చాలా కష్టం. అనేక సందర్భాల్లో ఈ లక్షణాలు ఆహారం తిన్న కొన్ని గంటల తరువాత మాత్రమే బయటపడతాయి. ఈ క్రమంలో ఫుడ్ ఇన్టోలరెన్స్ టెస్ట్ అనేది ఉపయోగపడుతుంది. ఫుడ్ అలర్జీ.. లక్షణాలు ఇలా.. ఆహారం పడకపోవడం వల్ల మొదటిగా చర్మంపై పొక్కులు, ఎర్రని దద్దుర్లు, నొప్పులు రావచ్చు. అయితే చిన్నపిల్లల్లో మొదటి లక్షణంగా చర్మంపై ర్యాష్ కనిపిస్తుంది. అలాగే శ్వాస సంబంధిత వ్యవస్థపై ప్రభావంతో దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ బిగుదల, ముక్కు పొంగడం వంటి సమస్యలు కలగవచ్చు. జీర్ణ వ్యవస్థపై దాడితో.. నాలుక ఉబ్బిపోవడం, బొజ్జ నొప్పి, నోటిలో మెటాలిక్ రుచి వంటి లక్షణాలు కనిపించవచ్చు. అలాగే అనాఫిలాక్టిక్ షాక్ అనే తీవ్ర పరిస్థితి ఏర్పడినప్పుడు వేగంగా నాడీ స్పందన, పెదవులు, గొంతు ఉబ్బిపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చర్మం తెల్లగా కనిపించడం, మూర్ఛ వంటివి కూడా రావచ్చు.నప్పనివి ఏమిటి? సాధారణంగా నప్పని ఆహారాల్లో పాలు, సోయా, గుడ్లు, గోధుమలు, షెల్ ఫిష్, పీనట్స్, వాల్నట్, ఆల్మండ్, కాజు, పీకాన్ వంటి డ్రై ఫ్రూట్స్.. అయితే ఇవి నప్పకపోవడానికి వాటిలో ఉండే కొన్ని ఉపపదార్థాలు కూడా కారణమే. ఉదాహరణకు పాలలో ఉండే లాక్టోజ్ అనే ఒక రకమైన తియ్యటి పదార్థం, గోధుమలు, బార్లీ వంటి ధాన్యాల్లో ఉండే గ్లూటెన్ అనే ప్రొటీన్, ఫుడ్ ఫ్లేవర్ పెంచడానికి ఉపయోగించే ఎంఎస్‌జీ అనే పదార్థం.. ఇలా.. కొన్ని సందర్భాల్లో అతి తక్కువ మోతాదులో ఈ ఆహారాలను తీసుకున్నా తీవ్ర సమస్యలకు కారణం కావచ్చు. అలాగే మనకు ఏ మాత్రం పరిచయం లేని వంటకాల్లో ఏయే దినుసులు కలుపుతున్నారో వాటిలో ఏవి మనకు నప్పవో తెలీదు కాబట్టి మరింత జాగ్రత్త అవసరం. ఆహారం.. అసహనం.. మన శరీరానికి హానికరం కాని ఆహారాలను హానికరమైన వైరస్‌లా గుర్తించి స్పందించే స్థితి కూడా ఉంటుంది. ఇది కొన్నిసార్లు చిన్నపాటి జీర్ణ సమస్యలుగా ఉంటే, మరికొన్నిసార్లు అనాఫిలాక్టిక్ షాక్ అనే ప్రాణాంతక పరిస్థితికి దారితీస్తుంది. ఈ సమస్య చిన్నపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 5 శాతం కంటే ఎక్కువ మంది చిన్నారులు దీని ప్రభావానికి లోనవుతున్నారు. చాలామంది పిల్లలు పెద్దయ్యాక ఈ అసహనాన్ని సహనంగా మార్చుకోగలుగుతారు. కానీ కొందరు మాత్రం కొన్నింటిని నప్పేలా చేసుకుంటారు కొన్నింటి పట్ల అసహనాన్ని కొనసాగిస్తారు. ఫుడ్ అలర్జీ పరీక్షలు.. ఎలా? ఎక్కడ? అనుమానాస్పద ఆహారాన్ని స్వల్పంగా ప్రయోగించి శరీరం ఎలా స్పందిస్తుందో పరిశీలించడాన్ని ఓరల్ ఛాలెంజ్ టెస్ట్ అంటారు. అలాగే అనుమానాస్పద ఆహారాలను పూర్తిగా ఆపి, తర్వాత ఒక్కొక్కటిగా మళ్లీ ఆహారంలో చేర్చడాన్ని ఎలిమినేషన్ డైట్, ఆహారాన్ని చర్మంపై ఉంచి సూదితో తక్కువగా గుచ్చి చేసే స్కిన్ ప్రిక్ టెస్ట్, రక్తంలో ఐజీఇ యాంటీబాడీస్ ఉన్నాయా లేదా అనేది పరీక్షించడానికి బ్లడ్ టెస్ట్ చేస్తారు. నగరంలో థైరోకేర్, మై డయాగ్నోస్టిక్స్, డీఎన్ఎ ల్యాబ్స్ ఇండియా, రెడ్ క్లిఫ్ ల్యాబ్స్, ల్యూసిడ్.. వంటి చోట్ల ఈ పరీక్షలు చేస్తున్నారు. కనీసం 200 రకాలు.. ఆ పైన అలర్జీలను గుర్తించేందుకు చేసే పరీక్షల వ్యయం కనీసం రూ.5వేల నుంచి రూ.15వేల వరకూ అవుతుంది. (చదవండి: ఆ జంట పిల్లలు కోసం సరోగసికి వెళ్తే.. ఊహకందని ట్విస్ట్! చివరికి..) -
పీసీఓఎస్‌తో మానసిక సమస్యలు..
నేను గర్భవతిని అని మూత్రపరీక్ష ద్వారా తెలిసింది. డాక్టర్‌ను ఎప్పుడు కలవాలి?– రమ్య, గుంటూరుగర్భ నిర్ధారణ జరిగిన వెంటనే డాక్టర్‌ను కలవాలి. ఎందుకంటే శరీరంలో థైరాయిడ్, సుగర్, రక్తపోటులాంటి సమస్యలు ఉంటే, శిశువుపై వాటి ప్రభావం పడే ప్రమాదం ఉంటుంది. డాక్టర్‌ను కలిసిన వెంటనే వారు రక్తపరీక్షలు, మూత్రపరీక్షలు చేస్తారు. అలాగే, శరీర పరిస్థితిని బట్టి ఫోలిక్ యాసిడ్, విటమిన్ –డి వంటి మాత్రలు సూచిస్తారు. ఇంతకు ముందు నుంచి ఏవైనా మందులు వాడుతుంటే, ఇప్పుడు కూడా అవి కొనసాగించాలా, వద్దా అనే విషయం మీద స్పష్టత ఇస్తారు. మొదటి వారాల్లోనే శుభ్రమైన, పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఇందుకు తగిన ఆహార నియమాలు కూడా డాక్టర్ ద్వారా తెలుసుకోవచ్చు. కుటుంబంలో వంశపారంపర్య వ్యాధులు, జన్యుపరమైన లోపాలు భర్తవైపు లేదా భార్యవైపు ఉన్నా, అవి శిశువుకు వచ్చే అవకాశముంటుంది. అందుకే ప్రారంభ దశలోనే ఆయా సమస్యలను గుర్తించేందుకు పరీక్షలు చేయించుకోవాలి. ఏదైనా సమస్య ఉంటే, దానికి తగిన వైద్యం తీసుకోవాలి. సాధారణంగా గర్భం ఎనిమిదో వారం వచ్చేసరికి మొదటి స్కాన్ చేస్తారు. దానితో బిడ్డ గుండె చప్పుడు ఎలా ఉందో తెలుసుకోవచ్చు. తర్వాతి స్కా మూడో నెలలో చేస్తారు. ఈ స్కానింగ్, మొదటి దశ రక్తపరీక్షల ద్వారా చాలా ముఖ్యమైన విషయాలను గుర్తించవచ్చు. అవసరమైన మందులు, తీసుకోవాల్సిన చికిత్సలు కూడా సూచిస్తారు. శరీర బరువు, రక్తపోటు స్థాయిని బట్టి ప్రారంభ దశలో చేయవలసిన వ్యాయామాలు, ఆరోగ్యకరమైన అలవాట్లను సూచిస్తారు. ఆహార నిపుణుల సలహాలు, జన్యుపరమైన కౌన్సెలింగ్ కూడా ఇప్పటి నుంచే తీసుకోవాలి. అందుకే ప్రెగ్నెన్సీ అని తెలిసిన వెంటనే ప్రసూతి నిపుణులను తప్పనిసరిగా కలవాలి.పీసీఓఎస్‌తో మానసిక సమస్యలుప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది మహిళలను ఇబ్బందిపెట్టే సమస్యల్లో పాలీసిస్టిక్ ఓవరీస్ సిండ్రోమ్ (పీసీఓఎస్) ఒకటి. ఇటీవలి కాలంలో ఈ సమస్యతో బాధపడే మహిళల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. పీసీఓఎస్‌తో బాధపడే మహిళలకు నెలసరి క్రమం తప్పడం, బరువు పెరగడం, శరీరంపై అవాంఛిత రోమాలు పెరగడం, ముఖంపై మొటిమలు ఎక్కువగా రావడం, తల మీద జుట్టు పల్చబడిపోవడం వంటి శారీరక సమస్యలే కాకుండా పలు మానసిక సమస్యలు కూడా ఇబ్బంది పెడతాయని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. పీసీఓఎస్‌తో బాధపడే మహిళలకు నడివయసుకు చేరుకునే సరికి మతిమరపు బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, అలాగే, దేనిపైనా దృష్టి కేంద్రీకరించలేకపోవడం, ఒక్కోసారి మానసిక కుంగుబాటుకు లోనవడం వంటి లక్షణాలతో బాధపడతారని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా న్యూరాలజీ ప్రొఫెసర్ డాక్టర్ హీదర్ హడల్స్టన్ ఆధ్వర్యంలో చేపట్టిన పరిశోధనలో తేలింది. అలాగే, పీసీఓఎస్‌తో బాధపడే మహిళలకు టైప్–2 డయాబెటిస్ ముప్పు సాధారణ మహిళల కంటే రెట్టింపుగా ఉంటుందని కూడా ఈ పరిశోధనలో బయటపడింది. ఈ సమస్యల కారణంగానే పీసీఓఎస్‌తో బాధపడే మహిళలు నడివయసులో కెరీర్లోను, ఆర్థిక వ్యవహారాల్లోను వెనుకబడిపోతారని కాలిఫోర్నియా వర్సిటీ నిపుణులు చెబుతున్నారు. ఈ పరిశోధన సారాంశం ‘న్యూరాలజీ’ జర్నల్‌లో ప్రచురితమైంది.ఆత్మహత్యా ధోరణులు కూడా..పీసీఓఎస్‌తో బాధపడే మహిళల్లో రకరకాల శారీరక, మానసిక సమస్యలతో పాటు ఆత్మహత్యా ధోరణులు కూడా పెరుగుతాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. సాధారణ మహిళలతో పోల్చుకుంటే పీసీఓఎస్‌తో బాధపడే మహిళల్లో ఆత్మహత్యా ధోరణులు ఎనిమిది రెట్లు ఎక్కువగా ఉన్నట్లు కొన్ని అధ్యయనాల్లో తేలింది. సాధారణ మహిళలతో పోల్చుకుంటే, పీసీఓఎస్‌తో బాధపడే మహిళలు ఆత్మహత్యా ప్రయత్నాలకు పాల్పడే అవకాశాలు మూడు శాతం ఎక్కువగా ఉన్నట్లు తైవాన్‌లోని తైపీ వెటరన్స్ జనరల్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ ము హాంగ్ చెన్ నేతృత్వంలో జరిపిన పరిశోధనల్లో వెల్లడైంది. (చదవండి: మాటల్లో మార్పు రాకపోతే బంధాల్లో మార్పు రాదు) -
ఐస్ బాత్ థెరపీ ట్రెండ్..! నిపుణులు ఏమంటున్నారంటే..
నగరవాసం అంటేనే కొత్త కొత్త అనుభూతులు, అనుభవాలతో సహవాసం.. విశ్వవ్యాప్తంగా రాకపోకలు సాగించే మహానగరాల్లో కొత్త విశేషాలకు కొరత ఎప్పుడూ ఉండదు. అంతేకాదు కొత్త విషయాలకు నగరవాసులు ఎప్పుడూ ఆకర్షితులే.. వాటిలోని వింత అనుభవాలను చవిచూడాల ఎప్పుడూ ఉవి్వళ్లూరుతూ ఉంటారు. ఇలాంటి నయా ట్రెండ్స్‌కు తామేమీ తక్కువ కాదన్నట్లు భావిస్తుంటారు. అందుకే ఏ విషయంలోనైనా భాగ్యనగరవాసులు ముందుంటారు.. అలాంటి మరో కొత్త విశేషమే నగరానికి పరిచయమైంది. అదే ఐస్ బాత్. ఈ పేరిట ఇటీవలే ఓ ట్రెండ్ పరిచయమైంది. ఐస్ బాత్ థెరపీ నగరంలోని ఆరోగ్య, ఫిట్నెస్ ప్రియులకు నూతన ట్రెండ్‌గా మారింది. ఈ థెరపీ ద్వారా శరీరానికి మాత్రమే కాదు.. మానసికంగానూ అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని దీన్ని అందిస్తున్న నిపుణులు చెబుతున్నారు. సమంత, విరాట్ కోహ్లీ, విజయ్ దేవరకొండ, అనమ్ మీర్జా, విష్ణు మంచు వంటి ప్రముఖులు ఐస్ బాత్ తో వారి అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఇది అనేకమందిలో ఈ థెరపీ పట్ల ఆసక్తిని పెంచుతోంది. మరి కొందరు సైతం ఐస్బాత్ను ఒక ఈవెంట్‌లా నగరంలోని కేఫ్స్, క్లబ్స్.. వంటి విభిన్న ప్రదేశాల్లో నిర్వహిస్తున్నారు. స్నాన విశేషాలివీ.. ఐస్ బాత్ అనేది చల్లటి నీటిలో, సాధారణంగా 10 నుంచి 15 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో, 10 నుండి 15 నిమిషాల పాటు శరీరాన్ని ముంచడం. దీనినే క్రయోథెరపీ లేదా కోల్డ్–వాటర్ ఇమ్మర్షన్ టెక్నిక్/కోల్డ్ ప్లంజ్ థెరపీ అని కూడా పిలుస్తారు. ఈ ప్రక్రియ శరీరంలోని రక్తనాళాలను సంకోచింపజేస్తుంది. తద్వారా వాపు, నొప్పి తగ్గుతుంది. కొన్ని ఇబ్బందుల నుంచి శరీరం త్వరగా కోలుకోవడంలో సహాయపడుతుంది. ఈ చికిత్స విచిత్రంగా అనిపించవచ్చు, కానీ ఇది చాలా ప్రతిఫలదాయకంగా ఉంటుంది. ప్రారంభ షాక్ తర్వాత, శరీరం అలవాటుపడుతుంది. ఆరోగ్య ప్రయోజనాలివీ.. ఈ ఐస్‌బాత్ సేవలు అందిస్తున్నవారు చెబుతున్న వివరాల ప్రకారం.. దీని ద్వారా కండరాల నొప్పి, వాపు తగ్గుతుంది. చల్లటి నీటిలో శరీరం ఉన్నప్పుడు రక్తప్రసరణ మెరుగై, ఎండార్ఫిన్లు విడుదలై, మానసిక ఒత్తిడి తగ్గుతుంది. క్రమం తప్పని ఐస్ బాత్‌తో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. చల్లటి నీటి ప్రమేయంతో నాడీ వ్యవస్థను సక్రమం చేస్తుంది. ఇది డోపమైన్ స్థాయిలను పెంచుతుంది. అత్యంత చల్లటి నీటిలో ఒక మునక డోపమైన్ ఉత్పత్తిని 250% వరకూ పెంచుతుంది. తద్వారా సహజమైన మానసిక ఆరోగ్యాన్ని ఇస్తుంది.. ఇబ్బంది కలిగించే చలిని ఎదుర్కోవడం మెదడుని అసౌకర్యాన్ని స్వీకరించడానికి, స్థితిస్థాపన క్రమశిక్షణను పెంపొందించడానికి సహాయపడుతుంది. వ్యక్తిగతంగా మెచ్చి.. స్వదేశానికి తెచ్చి.. ‘మారథాన్ రన్నర్స్, క్రీడాకారులకు కఠినమైన శిక్షణ తర్వాత అలసట దూరం కావడానికి ఈ థెరపీ ఉపయోగపడుతుంది. ఈ క్రమంలో ఇది బాగా ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు విభిన్న వర్గాల వారు ఆరోగ్యం కోసం దీన్ని ఎంచుకుంటున్నారు. మార్షల్ ఆర్ట్స్‌పై ఆసక్తితో థాయిలాండ్‌లోని ఎలైట్ ఫైట్ క్లబ్లో సభ్యులుగా శిక్షణ పొందుతున్న సమయంలో ఈ ఐస్ బాత్ థెరపీ గురించి తెలిసింది. నగరంలో దీనిని ప్రవేశపెట్టాలని నార్సింగిలో ఓ సెంటర్‌తో పాటు మొబైల్ ఐస్ బాత్ థెరపీ అందుబాటులోకి తీసుకొచ్చాం. ప్రారంభకులకు 90 సెకన్ల నుంచి అత్యధికంగా 3 నిమిషాలు మాత్రమే సూచిస్తాం. ఆ తర్వాత వారి వారి ఇష్టం, సామర్థ్యాలను బట్టి వ్యవధి పెంచుకోవచ్చు. వ్యక్తిగతంగా 18 నిమిషాల వరకూ ఐస్ బాత్ చేయగలను. జాగ్రత్తలు తప్పనిసరి.. ఐస్‌బాత్ ఈవెంట్లో పాల్గొనాలని అనుకున్నప్పుడు తప్పనిసరిగా ముందస్తు వైద్య సలహా తీసుకోవాలి. అధిక లేదా తక్కువ రక్తపోటు, గుండె సంబంధిత రుగ్మతలు, నాడీ సంబంధిత పరిస్థితులు, మధుమేహం లేదా వాసు్కలర్, ఏవైనా ఇతర సమస్యలు ఉన్నవారికి ఇది నప్పదు. ఐస్ బాత్ వ్యవధి ఒక నిమిషం నుంచి 2 నిమిషాలు వరకూ సరిపోతుందని, అయితే కొన్ని సెషన్ల తర్వాత వ్యక్తులు వారి వారి శరీర తత్వాన్ని బట్టి వ్యవధిని పెంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ప్రారంభకులకు, సంవత్సరానికి 3–4 సెషన్లు సరిపోతాయి. శరీరం ప్రతిస్పందనను బట్టి ఆరోగ్య లక్ష్యాల ఆధారంగా ఫ్రీక్వెన్సీని పెంచవచ్చు. ప్రస్తుతం సెషన్ సెటప్ ఫెసిలిటేటర్ నైపుణ్యాన్ని బట్టి రూ.2,000 నుంచి రూ.8,000 వరకూ ఉంది. (చదవండి: అత్యంత వృద్ధ డాక్టర్‌గా రికార్డు..! ఇప్పటికీ వైద్య సేవలోనే..! ఏజ్‌లో సెంచరీ కొట్టాలంటే..) -
102 ఏళ్ల డాక్టర్..ఇప్పటికీ వైద్య సేవలోనే..! చిరకాలం బతకాలంటే..
ఎవ్వరైన రిటైర్మెంట్ ఏజ్ వరకు పనిచేస్తారు. ఆ తర్వాత పదవీవిరణ చేసి..రెస్ట్ తీసుకుంటారు. ఇది సర్వసాధారణం. కానీ ఈ శతాధికుడు విరామం ఎరుగని వైద్యుడు. ఇప్పటికీ డాక్టర్‌గా ప్రాక్టీస్ చేస్తూ..స్ఫూర్తిగా నిలుస్తున్నారు. నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. రెండొవ ప్రపంచకాలం నాటి ఈ వృద్ధ డాక్టర్ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ అందిపుచ్చుకుంటూ అంతకంతకు పురోగమిస్తున్నారు. యువకుడి మాదిరిగా చురుగ్గా అన్నిపనులు చురుగ్గా చేసుకుంటారాయన. అంతేగాదు సుదీర్ఘకాలం ఆరోగ్యంగా బతకాలంటే ఆ పనులు చేయొద్దని సూచనలిస్తున్నారాయన.అతడే. అమెరికాలో క్లీవ్‌ల్యాండ్‌కు చెందిన న్యూరాలజిస్ట్ డాక్టర్ హోవార్డ్ టక్కర్. ఆయనకు 102 ఏళ్లు. ఇప్పటికీ డాక్టర్‌గా ప్రాక్టీస్ చేస్తూ..ఎందరో వైద్య విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. అంతేగాదు టక్కర్ అత్యంత వృద్ధ ప్రాక్టీస్ డాక్టర్(Worlds Oldest Practicing Doctor)గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను కూడా దక్కించుకున్నాడు. 1922లో జన్మించిన డాక్టర్ టక్కర్ మహా మాంద్యం, రెండో ప్రపంచ యుద్ధం, కోవిడ్-19 మహమ్మారితో సహా ఒక శతాబ్ద నాటి చారిత్రక సంక్షోభాలకు నిలువెత్తు సాక్ష్యం ఆయన. విశేషం ఏంటంటే..ఇప్పటివరకు పూర్తి ఆరోగ్యంతోనే ఉన్నారు డాక్టర్ టక్కర్. తాను ఇంతవరకు ఎలాంటి భయానక వ్యాధులతో బాధపడలేదన్నారు. అయితే 80లలో మాత్రం మెడ సమస్యతో కొన్నాళ్లు ఇబ్బంది పడ్డానని, అయితే సునాయాసంగా ఆ సమస్యను జయించానని చెప్పారు. తన జీవితానుభవంతో నేర్చుకున్న ఆ నాలుగు పాఠాలే తన దీర్ఘాయువు రహస్యంగా విశ్వసిస్తారాయన. అంతేగాదు పదవీవిరమణ గురించి కూడా అస్సలు ఆలోచించరట. ఎందుకంటే దీర్ఘాయువు ప్రధాన శత్రువే పదవీ విరమణ అని నొక్కి చెబుతున్నారాయన. మరి టక్కర్ దీర్ఘాయువు రహస్యం ఏంటో తెలుసుకుందాం..👉 ఈ వృద్ధ డాక్టర్ తన జీవితాంతం వ్యాయామాన్ని స్కిప్ చేయలేదన్నారు. ఈత కొట్టడం దగ్గర నుంచి జాగింగ్, స్కీయింగ్, జిమ్, ట్రెడ్‌మీల్ వరకు అన్నింటి ని చేస్తారట ఆయన.👉 అలాగే ఉద్యోగానికి పదవీవిరమణ ఇవ్వొద్దు..ఏదో ఒక వ్యాపకంతో ఉండండి. చేయగలిగిన ఉద్యోగం ఏదో ఒకటి చేయండి అని అంటున్నారు. లేదంటే మెదడు పిచ్చి పిచ్చి ఆలోచనలతో పాడవ్వుతుందట. తద్వారా అనారోగ్యాల బారినపడతామట. 👉 ఎల్లప్పుడూ పనిజీవితం, కుటుంబ జీవితంలో సంతోషంగా ఉండేందుకు ప్రయత్నించండి. అలాగే ఎల్లప్పుడూ సానుకూలత, ఆశావాదానికే ప్రాముఖ్యత ఇవ్వండి. 👉 భవిష్యత్తు గురించి చిత్తించకుండా చేసే పనిలో సంతోషాన్ని వెతకండి. అలాగే కుటుంబసభ్యులు, స్నేహితులతో సంతోషంగా గడపండి. 👉 ఈ వృద్ధ డాక్టర్ వ్యక్తిగత జీవితానికి వస్తే..మానసిక నిపుణురాలైన సారా అనే మహిళను పెళ్లి చేసుకున్నారు. ఆ దంపతులకు నలుగురు పిల్లలు, పదిమంది మనవరాళ్లు ఉన్నారు. అయితే ఇప్పటికీ తన భార్యతో గొడపడటం, ప్రేమించడం వంటివి చేస్తానన్నారు.👉 చివరగా ప్రతిఒక్కరు తమ జీవిత లక్ష్యాలను ఏర్పరుచుకోవాలన్నారు. ప్రతి ఉదయం సాధారణంగా సాగిపోకూడదన్నారు. అప్పుడే జీవితానికి సార్థకత ఉంటుందని చెప్పారు. 👉 అలాగే ఆయన సాధ్యమైనంత వరకు స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్‌ని వినియోగిస్తారు. సోషల్ మీడియా స్టార్‌గా మాత్రం ఉండనున్నారు. ఎందుకంటే స్వానుభవాలే..గొప్ప పాఠాలనేది ఆయన అభిమతం. 👉 వీటన్నింటి తోపాటు ధూమపానం, మద్యపానం సేవించొద్దని అన్నారు. తాను జీవితాంతం వాటి జోలికిపోలేదన్నారు. అలాగే మితంగానే ఆహారం తీసుకుంటానని చెప్పారు. 👉 అంతేగాదు డాక్టర్ టక్కర్ "జీవితమే ప్రాణాంతక వ్యాధి , దానికి విరుగుడు జీవించడమే" అని చమత్కారంగా చెప్పారు. ఈ వృద్ధ డాక్టర్ మాములు గ్రేట్ కాదు. అద్భుతమైన జీవిత పాఠాలు, ఆరోగ్య విధానం గురించి బహు చక్కగా వివరించారు డాక్టర్ టక్కర్. (చదవండి: ఆక్సియమ్ స్పేస్ మిషన్‌లో ఈసారి సరస్వతి దేవి వాహనం..) -
‘ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ’ అంటే ..?
సినిమాల్లో ఈ థెరపీని భయంకరంగా చూపిస్తారు. ఎవరినైనా హింసించడానికి దాన్ని వాడుకుంటున్నట్టుగా చూపుతారు. అంతేకాదు... కొన్ని హాస్య సన్నివేశాల్లోనూ నవ్వించడానికీ దాంతో కామెడీ యాక్టర్లకు షాక్ ఇస్తున్నట్టు చూపి, నవ్వు తెప్పించడానికి వాడతారు. ఇక వార్తా కథనాల్లో ఎదుటి పార్టీవారికీ, ప్రత్యర్థులకు షాక్ ఇచ్చినప్పుడు ‘షాక్ ట్రీట్మెంట్’ అనే పదాన్ని విచ్చలవిడిగా వాడుతుంటారు. అలా దానిపై ఎన్నో అనుమానాలూ, అపోహాలూ కల్పిస్తారు. కానీ నిజానికి అదో మంచి ట్రీట్మెంట్. బాధితులకు షాక్ తగినట్లుగా తెలియనివ్వని చికిత్స. మరెంతో మందికి మానసిక చికిత్సల కోసం, అనేక మందికి ప్రాణరక్షణ కోసం వాడే థెరపీ. దాదాపు ఎనిమిది దశాబ్దాల నుంచి అనేక మందికి ప్రాణరక్షణ ఇచ్చిన చికిత్సా ప్రక్రియ. ఎంతో మందిని రక్షించిన ఆ చికిత్స పేరే ఎలక్ట్రిక్ షాక్ ట్రీట్మెంట్. వైద్య పరిభాషలో ‘ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ’అని పిలుస్తూ సంక్షిప్తంగా ‘ఈసీటీ’ అనే ఈ చికిత్సపై ఉండే అపోహలూ, అపార్థాలు తొలగించి, ఈ చికిత్స ప్రక్రియపై మంచి అవగాహన కల్పించేందుకే ఈ కథనం. సినిమాల్లో, అలాగే కొన్ని టీవీ సీరియల్స్‌లో ఎంతగానో భయంగొలిపేలా చూపే ఈ షాక్ ట్రీట్మెంట్ నిజజీవితంలో ఎంత మాత్రమూ భయం గొలిపే చికిత్స కాదు. దీనిపై ఎంతగా అపార్థాలు నెలకొన్నాయంటే బాధితుడికి ఎలక్ట్రిక్ షాక్ ఇవ్వాలంటూ డాక్టర్లు చెబితే... అతడి బంధువులూ, స్నేహితులూ ఆందోళనకు గురయ్యేంతగా ఇది అపోహలకు గురయ్యింది. కొన్ని రకాల మానసిక సమస్యలతో బాధపడుతున్న అనేకమందిని తిరిగి సాధారణ స్థితికి రావడానికి ‘ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ’ ఎంతగానో ఉపయోగపడింది. ప్రతి ఏటా దాదాపు లక్షల సంఖ్యలోని బాధితులకు వారి సమస్యలను నయం చేస్తూ, అనేక రకాలుగా స్వస్థత చేకూర్చే ఈ చికిత్స ప్రక్రియ అందుబాటులోకి రావడమూ చాలా నాటికీయంగా జరిగింది. అది సివియర్ డిప్రెషన్, కెటటోనియా లాంటి ఎన్ని రకాల సమస్యలనుంచి విముక్తి కల్పిస్తుందనే విషయంతోపాటు అసలు అది ఓ చికిత్సగా ఆవిర్భవించిన తీరుతెన్నులూ... ఈ విశేషాలన్నింటి గురించీ తెలుసుకుందాం...షాక్ ట్రీట్మెంట్ ఓ చికిత్సగా ఆవిర్భవించిన తీరిది... అసలు కరెంటు షాక్ ద్వారా కొన్ని మానసిక వ్యాధులను నయం చేయవచ్చని ఎలా తెలిసిందన్నదే అబ్బురాన్ని కలిగించే విషయం. తొలుత 1934లో డాక్టర్ మెడూనా అనే శాస్త్రవేత్త మానసిక సమస్యలు ఉన్న బాధితులకు క్యాంఫర్‌ను ఇంజెక్షన్ రూపంలో ఇచ్చాడు. అలా ఇవ్వడం ద్వారా బాధితుడికి మూర్చ (ఫిట్స్ / కన్వల్సెన్స్)ను కలిగించి, మానసిక సమస్యలను నయం చేయడానికి ప్రయత్నించాడు.ఇప్పుడు మరింత సమర్థంగా మాడిఫైడ్ ఈసీటీ రూపంలో ... ఇటీవల పెరిగిన వైద్యవిజ్ఞానంతో చాలా తక్కువ డోసులో మత్తు మందుతోపాటు తక్కువ మోతాదులో కరెంట్ ఇవ్వడం ఆధునిక మాడిఫైడ్ ఈసీటీలో జరుగుతుంది. శాస్త్రవిజ్ఞానం ఎంతో పెరిగిన ఇటీవల కాలంలో బాధితులకు ఇప్పుడు మత్తు కూడా చాలా తక్కువ మోతాదులో (షార్ట్ యాక్టింగ్) అలాగే చాలా సురక్షితంగా కూడా ఇస్తున్నారు. కండరాలుకు తగినంత విశ్రాంతి కలిగించే మందులు ఇవ్వడం ద్వారా ఎలక్ట్రో కన్వల్సివ్ చికిత్స (ఈసీటీ) చేయడం జరుగుతుంది. ఇందులో బాధితులకు తమకు కరెంట్ షాక్ ఇస్తున్న విషయమూ తెలికుండానే... వారికి అసలేమీ జరగదలేదని అనిపించేలా... కేవలం 15 నుంచి 20 నిమిషాల్లో ఈ ప్రక్రియను పూర్తిచేయడం సాధ్యమవుతోంది. నిద్రలోకి వెళ్లి మళ్లీ లేచినప్పుడు మాత్రమే బాధితులకు తమకేదో చికిత్స చేశారనే విషయం తెలుస్తుందిగానీ.... ఇందులో నిజానికి ఎలాంటి బాధా ఉండదు. ఈసీటీ ఇచ్చిన తర్వాత సుమారు 2 గంటల పాటు వైద్యులు సదరు మానసిక సమస్యల బాధితుల్ని తమ పర్యవేక్షణలోనే ఉంచుకుని (తాము వాడిన మందుల ప్రభావం తగ్గేంతవరకు) ఆ తర్వాత ఇంటికి పంపిస్తారు. అంటే ఈసీటీకి ప్రస్తుతం అత్యంత సులువైన, ప్రమాదరహితమైన ఔట్‌పేషెంట్ పద్ధతిలోనే చికిత్స జరుగుతుందన్నమాట. మన సమాజంలో నిజానికి మానసిక సమస్యలు వాటి కారణాలు గురించి చాలా తక్కువ అవగాహనే ఉంది. ఇప్పటికీ చాలా కుటుంబాల్లోని సభ్యులకు ఏదైనా మానసిక సమస్య ఉందంటే... వారు దాన్ని బయటకు చెప్పడానికి ఇష్టపడరు. చాలా గోప్యంగా ఉంచడానికే మొగ్గుచూపుతారు. ఇది సరైన పద్ధతి కాక΄ోయినా... దురదృష్టవశాత్తు ఇంకా ఇప్పటికీ ఇలాంటి ఆలోచన ధోరణే ప్రజల్లో / సమాజంలో కొనసాగుతోంది. నిజానికి మన దేహంలో ఆధునిక శాస్త్రీయ పరిజ్ఞానానికి ఇంకా పూర్తి స్థాయిలో అంతుచిక్కనిదీ లేదా చాలా తక్కువగా తెలిసిన విషయం ఏదైనా ఉందంటే అది మన మెదడు గురించే. మెదడు నిర్మాణం, జీవక్రియలూ అత్యంత సంక్లిష్టంగా ఉండటం వల్ల ఇలా జరుగుతూ... ఈ అంశం మన మెదడు తాలూకు సంక్లిష్టతను తెలియజేస్తుంది. అందుకే మానసిక సమస్యల తాలూకు కారణాలు తెలుసుకోవడం చాలా సంక్లిష్టమైన కఠినమైన విషయంగా మారింది. ఇప్పుడిప్పుడు మెదడుకు సంబంధించిన చాలా రహస్యాలు మెల్లమెల్లగా తెలిసివస్తున్నాయి. ఈసీటీ ప్రక్రియ... మెదడులోని అనేక స్థాయుల్లో చాలారకాల మాలిక్యులార్ బయోకెమికల్, ఎండోక్రైన్, స్ట్రక్చరల్, జెనెటిక్ మార్పులను కలగజేస్తుంది. తద్వారా ఈ ప్రక్రియ వ్యాధిని నయం చేయడానికి కారణమవుతోంది. ఎలక్ట్రో కన్వల్సివ్ ప్రక్రియ(ఈసీటీ) ఎలా పనిచేస్తుందంటే...నిజానికి ఈసీటీ చికిత్స ఎంత సురక్షితమైనదో చెప్పడానికి తార్కాణమేమిటంటే... గర్భవతుల్లో (ప్రెగ్నెన్సీలో)అలాగే ప్రసవం అయ్యాకకొత్తగా తల్లులైన మహిళల్లో వచ్చే పోస్ట్‌పార్టమ్ సైకోసిస్‌కు చికిత్సఇచ్చేటప్పుడు ఆ బాలెంతకూ...అంతేకాదు...గర్భంలో ఉన్నశిశువుకుసైతం ఈసీటీఅనేది చాలాసురక్షితమైన ప్రక్రియ అనితేలింది. ఈ నేపథ్యంలోసమాజంలో ఈ చికిత్సపై ఉన్న అపోహలు తొలగించుకోవడం అన్నది ఎంతో ముఖ్యమైన విషయం.ఈసీటీతో ఏయే సమస్యలుఉన్నవారికి చికిత్స అందిస్తారంటే...తీవ్రమైన వ్యాకులత, కుంగుబాటు (డిప్రెషన్) వంటి సమస్యలు ఉన్నవారికి. ఆత్మహత్య చేసుకోవాలని తీవ్రంగా అనుకుంటున్నవారికీ, ఆత్మహత్యలకు ప్రయత్నించేవారికీ (సూసైడల్ టెండెన్సీస్ ఉన్నవారికీ) ఆహారాన్ని తిరస్కరించేవారికి. బైపోలార్ డిప్రెషన్ ఉన్న బాధితులకు మందులతో పైన పేర్కొన్న వ్యాధులు నయంకాని సందర్భాల్లో... స్కీజోఫ్రీనియా వంటి మానసిక సమస్యలు ఉన్నవారికి. కెటటోనియా అనే మానసిక సమస్యలో (ఈ పరిస్థితిలో బాధితులు పూర్తిగా ఓ శిలాప్రతిమలా బిగుసుకుని ఉండిపోతారు. నిజానికి ఈ స్థితి అనేక మానసిక వ్యాధుల కారణంగా కలుగుతుంది. కెటటోనియా స్థితి నుంచి బాధితులను మామూలు స్థితికి తీసుకురావడానికి షాక్‌థెరపీ బాగా ఉపయోగపడుతుంది. తొలినాళ్లలో కాస్త ముతకగా... ఆ తర్వాతమెరుగ్గాతొలినాళ్లలో బాధితులకు మత్తు మందు ఇవ్వకుండానే ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ (ఈసీటీ)ని ఇచ్చేవారు. దాంతో బాధితుల్లో మూర్చలు కలిగినప్పుడు వారికి గాయాలు కావడం, ఒళ్లు నొప్పులు రావడం, ఎముకలు గాడితప్పడం (డిస్ లొకేట్ కావడం), ముఖ్యంగా దవడ ఎముక (జా డిజ్‌లొకేషన్) వంటివి ఎక్కువగా కనిపించేవి. అయితే తొలిసారిగా 1940లో బెనెట్ అనే శాస్త్రవేత్త మత్తుమందు ఇచ్చి ఈ చికిత్స ఇవ్వడం వల్ల పైన పేర్కొన్న సమస్యలేవీ రావనీ, దాంతో కొద్దిగా మత్తు ఇవ్వడం ద్వారా ఇతరత్రా సమస్యలేమీ లేకుండా చాలా సురక్షితంగా ఈ చికిత్సను అందించడం సాధ్యమేనని కనుగొన్నాడు.ఈసీటీపై అపోహలూ వాస్తవాలు అపోహ:ఈసీటీ ప్రక్రియ మెదడును గాయపరుస్తుంది. వాస్తవం : ఈసీటీ వల్ల మెదడు నిర్మాణానికి గానీ, లేదా ఇతరత్రాగానీ ఎలాంటి గాయాలూ కావనీ, మెదడులో ఏ రకమైన ప్రమాదకరమైన మార్పులూ కలగవంటూ అనేక పరిశోధనల్లో స్పష్టంగా తేలింది. అపోహ:ఈసీటీ వల్ల మతిమరపు వస్తుంది.వాస్తవం : ఈసీటీ వల్ల బాధితుల జ్ఞాపపశక్తిపై దాదాపుగా ఎలాంటి ప్రభావమూ పడదని చెప్పవచ్చు. ఒకవేళ పడినా అది చాలా చాలా తక్కువ. ఈసీటీ ఇచ్చే ముందు తాత్కాలికంగా ఇచ్చే మందు మోతాదు కూడా చాలా తక్కువ. అయితే ఈ మత్తు నుంచి బయటకు వచ్చే ముందర బాధితుల్లో కాస్త అయోమయ స్థితి కనిపించవచ్చు. ఇదే ఇలాంటి దురభిప్రాయానికి కారణమవుతోంది. అంతేతప్ప జ్ఞాపకశక్తి పూర్తిగా తగ్గదు. అయితే చాలా కొద్దిమందిలో మాత్రం ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చినప్పుడు తాత్కాలికంగా జ్ఞాపకశక్తి తగ్గినప్పటికీ అది కేవలం ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు మాత్రమే. ఈసీటీ వల్ల శాశ్వతమైన జ్ఞాపకశక్తి లోపం దాదాపుగా ఉండదనే చెప్పవచ్చు. అపోహ: ఈసీటీ వల్ల మెదడులోనికి ఒక్కోసారి ప్రమాదకరమైన రీతిలో కరెంట్ ప్రవహించవచ్చు. వాస్తవం : ఇది పూర్తిగా అవాస్తవం. అప్పుడున్న అత్యాధునిక పరికరాల వల్ల కరెంట్ ఇచ్చే ప్రక్రియ పూర్తిగా సురక్షితం. దాంతో ఇది పూర్తిగా ప్రమాదరహితమైన వైద్యం ప్రక్రియ అని చెప్పవచ్చు. పైగా ఈసీటీలకు వాడే వోల్టేజీ కూడా చాలా తక్కువ. అపోహ: ఈసీటీకి వల్ల మెదడు దెబ్బతిని కొన్ని మానసిక వ్యాధులు రావచ్చు. వాస్తవం : ఇది పూర్తిగా అవాస్తవం. ఈసీటీతో కొన్ని మానసిక సమస్యలు తగ్గడమే తప్ప కొత్తగా ఎలాంటి మానసిక వ్యాధులూ రావని స్పష్టంగా చెప్పవచ్చు. అపోహ: కరెంట్ షాక్ ఇస్తారు కాబట్టి ఇది చాలా ప్రమాదకరమైనది. వాస్తవం : ఇది పూర్తిగా ప్రమాదరహితం. అయితే ఎలక్ట్రో కన్వల్సివ్ ట్రీట్మెంట్లో ఇచ్చే మత్తుమందు (అనస్థీషియా) వల్ల ఇతరత్రా శస్త్రచికిత్సలో ఉండే రిస్క్ మాత్రమే ఇందులోనూ ఉంటుంది. అంతేతప్ప ఇందులో ఎలాంటి అదనపు ముప్పూ ఉండదు. అయితే అనస్థీషియా ఇచ్చేందుకు ఇతరత్రా జబ్బుల్లో ఇచ్చినప్పుడు చూసినట్టుగానే బాధితులకు దాన్ని తట్టుకునే ఫిట్నెస్ ఉందే లేదో చూసుకోవాలి. గుండెజబ్బులు, ఇతర శారీరక సమస్యలు ఉన్నాయేమో గమనించాలి. అప్పుడే అనస్థీషియాతో వచ్చే సమస్యలను గుర్తించి వాటిని నివారించవచ్చు. ఈసీటీ ఇచ్చే సమయంలో పల్స్ ఆక్సీమీటర్ అనే సాధనంతో గుండె, ఊపిరితిత్తులు మొదలైన శారీరక వ్యవస్థలను గమనిసూ ఉంటే ఇరత శరీరక సమస్యలపై పడే ప్రమాదాలను నివారించవచ్చు.ఈసీటీ ఇవ్వడం ఎప్పుడు సరికాదంటే...నిజానికి కొన్ని రకాల సమస్యలు ఎంతకీ తగ్గకుండా ఉన్నప్పుడు... ఒకవేళ అవి ఈసీటీ ఇవ్వడం వల్ల తగ్గేవైతే... అలాంటి సందర్భాల్లో మందులు మార్చి చూడటం కంటే ఈసీటీతోనే మంచి ఫలితాలు ఉంటాయంటూ వైద్యపరిశోధకులు, వైద్యులు గుర్తించారు. అయితే ఈసీటీ అన్నది పూర్తిగా ప్రమాదరహితమైన ప్రక్రియే అయినప్పటికీ ఈ చికిత్సకూ కొన్ని పరిమితులు ఉన్నాయి. అవేమిటంటే... మెదడులో సెరిబ్రోస్పినల్ ఫ్లుయిడ్ కలిగించే ఒత్తిడి ఉన్నప్పుడు ఈసీటీ వాడకూడదు. ఇటీవల ట్రాన్స్‌క్రేనియల్ మాగ్నెటిక్ స్టిమ్యులైజేషన్ అనే ప్రక్రియ వల్ల కూడా ఈసీటీతో ఉండే ప్రయోజనాలే కలుగుతాయని కొత్త పరిశోధనలతో తేలింది. కాబట్టి ఇదే ఈసీటీనే ఇంకాస్త అధునాతంగా ఇవ్వడంపై కూడా ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయి. డాక్టర్ శ్రీనివాస్ ఎస్ఆర్ఆర్వైహెచ్వోడీ ఆఫ్ సైకియాట్రీ –సీనియర్ సైకియాట్రిస్ట్ఎంజీఎం ప్రభుత్వ ఆసుపత్రి, వరంగల్ (చదవండి: ఆ మూడు తినదగినవి కావు..కానీ అవే ఆరోగ్యం..! బిగ్‌బీకి కూడా నచ్చవట..) -
గుండెదడ ఎందుకొస్తుంది..? ఆరోగ్యానికి ప్రమాదకరమా..?
నిజానికి గుండెదడ ఒక జబ్బు కాదు. కాకతే కొన్ని సాధారణ లేదా తీవ్రమైన గుండె సమస్యల తాలూకు ఓ లక్షణంగా భావించవచ్చు. ఒక్కోసారి గుండె దడదడలాడుతున్న విషయం బాధితులకు ఏ ఉపకరణం లేదా ఏ టెస్ట్ సహాయం లేకుండానే తెలిసిపోతుంటుంది. ఆందోళనతో కూడా ఇలా జరగడానికి అవకాశం ఉంది. అయితే అరుదుగా కొన్ని సందర్భాల్లో మాత్రం తీవ్రమైన గుండె జబ్బులకు అదో సూచన కావచ్చు. అందుకే గుండెదడ గురించి అవగాహన కలిగి ఉండటం అవసరం. అలాంటి అవగాహన కల్పించేందుకే ఈ కథనం. గుండెదడను వైద్యపరిభాషలో పాల్పిటేషన్ అంటారు. చాలామంది జీవితకాలంలో ఏదో ఒకసారి అనుభవించే సాధారణ లక్షణం ఇది. చాలా సందర్భాల్లో ఏదో ఒక మానసిక ఆందోళన లేదా ఉద్విగ్నత వంటి కారణాలతో కనిపించే అత్యంత మామూలు సమస్య ఇది. చాలా వరకు తీవ్రమైన సమస్య కాకపోయేందుకే అవకాశాలెక్కువ. కాకపోతే చాలా అరుదుగానే ఏదైనా తీవ్రమైన గుండె సమస్యకు సూచన అయ్యేందుకూ అవకాశాలు లేకపోలేదు.పాల్పిటేషన్స్ అంటే...? గుండె నిత్యం స్పందిస్తున్నప్పటికీ... అది కొట్టుకుంటున్న తీరు సాధారణంగా మన అనుభవంలోకి రాదు. కానీ కొన్నిసార్లు వేగంగా స్పందించే ఆ స్పందనలు వ్యక్తుల అనుభవంలోకి వస్తాయి. కొట్టుకుంటున్న వేగాన్ని బట్టి వాటిని ఇంగ్లిష్‌లో సాధారణంగా ఫ్లట్టరింగ్, పౌండింగ్ లేదా రేసింగ్‌గా చెబుతుంటారు. కొన్నిసార్లు వ్యక్తులు వేగంగా పరిగెత్తడం, తీవ్రమైన భావోద్వేగాలకు గురికావడం, ఉద్విగ్నతకూ, తీవ్రమైన ఆందోళనకూ గురికావడం, అలాగే తీవ్రమైన జ్వరం లేదా గర్భధారణ సమయంలో గుండెదడ (పాల్పిటేషన్స్) అనుభవంలోకి వచ్చేందుకు అవకాశాలెక్కువ. అలాగే కొన్ని సందర్భాల్లో ఎక్కువసార్లు కాఫీ తాగడం, కొన్ని సందర్భాల్లో పొగతాగడం, మద్యం తీసుకోవడం లేదా నిద్రలేమి వంటి జీవనశైలి అలవాట్లు కూడా పాల్పిటేషన్స్కు దారితీయవచ్చు. సాధారణ జీవక్రియల్లో భాగంగానే ఇలా గుండెదడ రావచ్చు. అలాంటప్పుడు గుండెదడ పెద్దగా హానికరం కాదు.మరి పట్టించుకోవాల్సిందెప్పుడంటే... గుండెదడ (పాల్పిటేషన్ ) అకస్మాత్తుగా స్పష్టమైన కారణం లేకుండా వచ్చినప్పడు. తలతిరుగుతుండటం, ఛాతీ నొప్పి, శ్వాస ఆడకపోవడం, స్పృహ తప్పడం వంటివి జరిగినప్పుడు.గుండె లయ తప్పడం (అబ్నార్మల్ రిథమ్ లేదా అరిథ్మియా) వంటి లక్షణాలు కనిపించినప్పుడు...పైన పేర్కొన్న లక్షణాలు కనిపించినప్పుడు దాన్ని కొంత సీరియస్‌గా పరిగణించాల్సి ఉంటుంది. ఇక్కడ గుండె లయతప్పడంలో ఒక ప్రత్యేకమైన రకం గురించి చెప్పుకోవాలి. గుండె లయబద్ధంగా స్పందించడానికి వీలుగా సయనో ఏట్రియల్ నోడ్ అనే చోట ఎలక్ట్రిక్ సంకేతాలు వెలువడుతుంటాయి. వీటి కారణంగానే గుండె ఒకే రకమైన లయతో స్పందిస్తుంటుంది. ఒకవేళ అలా కాకుండా ఆ ఎలక్ట్రిక్ స్పందనలు అసాధారణంగా ఎక్కడపడితే అక్కడ (అంటే నిర్దిష్టమైన ట్రాక్‌లో కాకుండా ఒకదానిని మరొకటి బైపాస్ చేస్తూ) వెలువడుతున్నప్పుడు... గుండె తన నిర్దిష్టమైన లయతో... లయబద్ధంగా కాకుండా ఎలా పడితే అలా కొట్టుకుంటూ ఉండేందుకు అవకాశముంది. దాంతో గుండె రిథమ్ దెబ్బతినడం వల్ల అరిథ్మియా వచ్చే అవకాశముంది. అయితే ఇలా జరిగినప్పుడు అదృష్టవశాత్తు శస్త్రచికిత్స వంటి సంక్లిష్టమైన ప్రక్రియలు అవసరం లేకుండానే ‘రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ (ఆర్ఎఫ్ఏ)’ అని పిలిచే రక్తనాళాల్లోకి పైప్‌ను పంపే క్యాథెటర్ ప్రోసిజర్స్తోనే ‘ఎలక్ట్రో ఫిజియాలిస్ట్లు’ అనే నిపుణులు ఈ సమస్యను చక్కదిద్దే అవకాశం ఉంది.గుండెదడతో ఎవరెవరికి ముప్పు...?స్థూలకాయం (ఒబేసిటీ), అధిక రక్తపోటు (హైబీపీ), డయాబెటిస్ లేదా గుండె జబ్బులున్నవారు గుండెదడ లక్షణాన్ని కాస్త సీరియస్‌గానే పరిగణించాలి. అందునా మరీ ముఖ్యంగా వెంట్రిక్యులార్ ట్యాకికార్డియా అనే ‘అరిథ్మియా’ (గుండె లయ తప్పడం) లేదా ఆర్టీరియల్ ఫిబ్రిలేషన్ వంటి సమస్యలు ఉన్నవారిలో గుండెదడ ఒక్కోసారి ప్రమాదకరమైన పరిస్థితికి తీసుకెళ్లి కార్డియాక్ అరెస్ట్ లేదా పక్షవాతం (స్ట్రోక్) వంటి ప్రాణహాని కలిగించేంత తీవ్రమైన ముప్పునకు కారణమయ్యే అవకాశాలుంటాయి. అందుకే ఇక్కడ పేర్కొన్న రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవారు గుండెదడ విషయంలో ఒకింత జాగ్రత్తగా ఉండటం అవసరం. ఇక మరో రకమైన ముప్పు ఎవరిలోనంటే... కొందరి కుటుంబాల్లో అకస్మాత్తుగా గుండె΄ోటు వచ్చి మరణించిన (సడన్ కార్డియాక్ డెత్) దాఖలాలు ఉన్న వైద్య చరిత్ర గలవారైతే... అలాంటి కుటుంబాల్లోని వ్యక్తులు గుండెదడను అంత తేలిగ్గా తీసుకోకూడదు. ఇక కార్డియో మయోపతి (గుండె కండరానికి సంబంధించిన ఆరోగ్య సమస్య) లేదా వంశపారంపర్యంగా గుండె ఎలక్ట్రిక్ స్పందనల్లో తేడాలు కనిపించే ఛానెలోపతీస్) వంటి వారిలోగుండెదడ ముప్పుగా పరిణమించే అవకాశాలు ఉంటాయి. ఇలాంటివారు ఎలక్ట్రోఫిజియాలజిస్టుల ఆధ్వర్యంలో తరచూ వైద్యపరీక్షలు చేయించుకుంటూ ఉండటం మంచిది.ఆధునిక కార్డియాక్ ఎలెక్ట్రోఫిజియాలజీ భూమిక... కార్డియాక్ ఎలెక్ట్రోఫిజియాలజీ అనేది గుండె లయ (హార్ట్ రిథమ్) సమస్యలను గుర్తించడం, నిర్ధారణలతో పాటు ఆ సమస్యలకు తగిన చికిత్స అందించడానికి రూపొందిన గుండె చికిత్స విభాగం. గుండె సమస్యల నిర్ధారణ కోసం ఈసీజీ, హోల్టర్ మానిటరింగ్, ఎలక్ట్రో ఫిజియోలాజికల్ స్టడీస్, అత్యాధునిక ఇమేజింగ్ వంటి ప్రక్రియల సహాయం తీసుకుంటారు. వాటి సాయంతో ఎలక్ట్రోఫిజియాలజిస్టులు ఈ తరహా సమస్యలను గుర్తిస్తారు. ఇక అత్యధికంగా ముప్పు ఉన్న బాధితులకు ముందుగానే ప్రమాదాలను నివారించేందుకు దేహంలో అమర్చే ఇంప్లాంటబుల్ కార్డియో–వెర్టర్ డీఫిబ్రిలేటర్స్ (ఐసీడీ) వంటి ఉపకరణాలను అమర్చుతారు. ఈ ఉపకరణాలు గుండె లయతప్పినప్పుడుల్లా చిన్న ఎలక్ట్రిక్ షాక్‌ను వెలువరించడం ద్వారా గుండె లయను మళ్లీ క్రమబద్ధీకరిస్తాయి. దాంతో గుండెనొటు వంటి ప్రాణాంతక పరిస్థితులు నివారితమవుతాయి. చివరగా... సాధారణగా గుండెదడ అన్నది అంత హానికరం కాదనే చెప్పవచ్చు. ఒకరకంగా చెప్పాలంటే ముప్పు ఉన్నవారిలో అవి కొంత ప్రమాద హెచ్చరికలు (వార్నింగ్ సిగ్నల్స్)గా పరిగణించవచ్చు. కాబట్టి ఆ హెచ్చరికల ఆధారంగా వైద్యులను సంప్రదించడం వల్ల ఒక రకంగా గుండెదడ మేలే చేస్తుందని కూడా చెప్పవచ్చు. ఇప్పుడు అందుబాటులో ఉన్న వైద్య ప్రక్రియలూ, ఆధునిక చికిత్సల వల్ల ప్రమాదాలను నివారించుకునేందుకు, చికిత్సతో నయం చేసుకునేందుకు వీలుంది కాబట్టి ఆందోళన అక్కర్లేదు. కాకతే తగిన జాగ్రత్త మాత్రం అవసరమంటూ గుండెదడ ఓ వార్నింగ్ బెల్లా పనిచేస్తుందని చెప్పవచ్చు. డాక్టర్ ఏ సురేశ్, సీనియర్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ అండ్ ఎలక్ట్రో ఫిజియాలజిస్ట్, హైదరాబాద్(చదవండి: బొడ్డు తాడుని ఆలస్యంగా ఎందుకు కట్ చేస్తారంటే..?) -
బొడ్డు తాడుని ఆలస్యంగా ఎందుకు కట్ చేస్తారంటే..?
నాకిప్పుడు తొమ్మిదోనెల. ఈ మధ్యన ఇంటర్నెట్లో బొడ్డుతాడును ఆలస్యంగా కత్తిరించడం గురించి చదివాను. అది ఎలా ఉపయోగపడుతుంది? – వెన్నెల, కర్నూలు. బొడ్డుతాడును ఆలస్యంగా కత్తిరించడం అనేది ఇప్పుడు అన్ని ఆసుపత్రులూ రొటీన్‌గా ఫాలో అవుతున్నాయి. బొడ్డుతాడు బేబీని, తల్లి ప్లాసెంటాకు జాయిన్ చేస్తుంది. ఈ తాడును డెలివరీ తరువాత కట్ చేస్తాం. ఈ పద్ధతిలో కనీసం ఒక నిమిషం నుంచి మూడు నిమిషాలు ఆగి ఆలస్యంగా కట్ చేస్తే బేబీకి ఉపయోగాలు ఉంటాయని పరిశోధనల్లో తేలింది. ఇందులో అధిక రక్తప్రసరణ జరిగి, బేబీకి మంచి జరుగుతుంది. అందుకే, దీనిని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా సపోర్ట్ చేస్తోంది. అకస్మాత్తుగా బొడ్డుతాడును కత్తిరించినప్పుడు బేబీ బ్లడ్ ప్రెజర్ సడన్‌గా డ్రాప్ అవుతుంది. ఈ బొడ్డుతాడుతో బేబీకి బ్లడ్ ఐరన్ లెవెల్స్ స్టేబుల్‌గా ఉంటాయి. మెదడు ఎదుగుదలకు కూడా ఇది సహాయం చేస్తుంది. ఈ ప్రాసెస్ నార్మల్ డెలివరీ అయిన కేసెస్‌లో ఫాలో కావాలి. బేబీ పుట్టిన వెంటనే డ్రై చేసి, పొత్తిళ్లలో చుట్టి, పిల్లల డాక్టర్ అసెస్మెంట్ చేస్తారు. బేబీ ఏడుపు బాగుంటే, కనీసం ఒక నిమిషం ఆగి, బొడ్డుతాడును కత్తిరిస్తారు. ప్రీ ట్రర్మ్, సిక్ బేబీస్‌కి ఇలా ఆలస్యంగా బొడ్డుతాడును కత్తిరించడం ఇంకా మంచిది. అయితే, మరీ, ఆలస్యంగా బొడ్డుతాడును కత్తిరించడం కారణంగా, కొంతమంది బేబీస్‌కి ఎక్కువ రక్తం వెళ్తుంది. చాలా అరుదుగా జాండీస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇది కంట్రోల్ చెయ్యటానికి బేబీస్‌కి ఫొటోథెరపీ అవసరం. కానీ, కొంతమందికి కాన్పు కష్టంగా జరిగినప్పుడు, ఆలస్యం చేయకుండా వెంటనే బొడ్డుతాడును కత్తిరిస్తారు. కానీ, తల్లి ఆరోగ్యం నిలకడగా ఉంటే, బేబీ బొడ్డుతాడుని తప్పకుండా ఒక నిమిషం ఆగి, ఆ తర్వాతే కత్తిరిస్తారు. నాకు బిడ్డపుట్టి నెలవుతుంది. డెలివరీ అయినప్పటీ నుంచి నాకు పాలు తక్కువగానే వస్తున్నాయి. పాలు బాగా రావటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – శైలజ, తిరుపతి. అప్పుడే పుట్టిన పిల్లలకు తల్లిపాలు చాలా ముఖ్యం. బేబీ కనీసం పదిహేను నుంచి నలభై నిమిషాల పాటు రొమ్ములను కంటిన్యూయస్‌గా సకింగ్ చెయ్యాలి. అప్పుడు ఆ స్టిమ్యులేషన్కి పాలు కూడా బాగా ఉత్పత్తి అవుతాయి. కొంతమంది బేబీ బాగా నిద్ర పోయినప్పుడు పాలు ఇవ్వకుండా ఉంటారు. అలా చేయకూడదు. బేబీ నిద్రపోయినా సరే, మీరు బేబీని రొమ్ముకి పెట్టుకొని నిద్రలేపటానికి ప్రయత్నించాలి. కనీసం రోజులో ఎనిమిదిసార్లు పాలు తాగేటట్టు చేయాలి. కొంత సమయం, ఓపిక, సపోర్ట్ ఇచ్చినప్పుడు బ్రెస్ట్‌ఫీడ్ చెయ్యలేకపోవటం అనేది ఉండదు. కొంతమంది బేబీస్ అసలు పాలు తాగడానికి కూడా ప్రయత్నం చెయ్యరు. అప్పుడు మీరు హ్యాండ్ ఎక్స్‌ప్రెస్ చేసి, ఉగ్గు గిన్నెలో నుంచి పట్టడానికి లేదా బ్రెస్ట్ బిల్క్ బాటిల్ నిపుల్ ద్వారా ఇవ్వటానికి ప్రయత్నించండి. బేబీకి బ్రెస్ట్ ఫీడ్ అలవాటు కావటానికి ఎప్పుడూ స్కిన్ టు స్కిన్ దగ్గరగా ఉంచండి. రెండు గంటలకు ఒకసారి పాలు ఇవ్వండి. బేబీ నిపుల్ని నోటితో పట్టుకునేటట్లు ప్రతి గంటన్నరకు ప్రయత్నించండి. చాలా డల్‌గా ఉంటే బేబీని ఒకసారి పిల్లల డాక్టర్‌కు చూపించండి. కొన్నిసార్లు షుగర్ డౌన్ అయితే అలా ఉంటారు. అప్పుడు ఫార్ములా ఫీడ్ ఎలా ఇవ్వాలో చెప్తారు. బ్రెస్ట్ పంప్ ఉపయోగించడం చాలా మంచిది. బేబీ నిపుల్ పట్టుకోకపోతే ప్రతి రెండు గంటలకు ఎలక్ట్రానిక్ పంప్ వాడడం వల్ల నిపుల్ బాగా స్టిమ్యులేట్ అవుతుంది. దీనితో ప్రోలాక్టిన్ రిసెప్టర్స్ స్టిమ్యులేట్ అవుతాయి. సాధారణంగా డెలివరీ అయిన రెండు వారాల తరువాతే బ్రెస్ట్ మిల్క్ ఫ్లోలాగా చాలామందికి వస్తుంది. అందుకే ముందే మిల్క్ రావట్లేదు అని టెన్షన్ పడి, బ్రెస్ట్ ఫీడింగ్‌కి దూరం చేసే బాటిల్ ఫీడ్, ఫార్ములా ఫీడ్ ఇవ్వకండి. ట్రై చేస్తూనే ఉంటే ఫీడింగ్ ఇంప్రూవ్ అవుతుంది. పోషకాహారాలు ఎక్కువ ఉండే డైట్, లాక్టేషన్ డైట్ కౌన్సెలర్‌ని కలసి సలహా తీసుకోండి. డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: ఈ చికిత్సతో..పుట్టుమచ్చలను ఈజీగా తొలగించుకోవచ్చు..!) -
ఫింగర్స్ అలా మారిపోతున్నాయా..? హీరో మాధవన్ హెల్త్ టిప్స్
ఇటీవల కాలంలో చేతిలో మొబైల్ లేనిదే మన ప్రపంచమే ఆగినంతగా మారిపోయింది జీవితం. అది లేకపోతే మన గమనం లేదు అని చెప్పొచ్చు. అంతలా ప్రతిదానికి ఆ స్మార్ట్‌ఫోన్ పైనే ఆధారపడిపోతున్నారు అందరూ. ఏం కావాలన్న ఠక్కున జేబులోంచి ఫోన్ తీసి చెక్ చేసుకోవడం ఓ అలవాటుగా మారిపోయింది. అలా ఫోన్ చూడనిదే పూట గడవదు అన్నంతగా యువత, పెద్దలు అడిక్ట్ అవుతున్నారు. ఈ సమస్య నుంచి బయటపడే యత్నం చేయాలని నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. తాజాగా తమిళ హీరో మాధవన్ కూడా ఫోన్ వాడకం గురించి ఆసక్తికర విషయాలు చెప్పడమే కాదు చక్కటి హెల్త్ టిప్స్‌ని కూడా పంచుకున్నారు.ఎన్నో వైవిధ్యభరితమైన మూవీలతో కుర్రకారుని ఉర్రూతలూగించిన నటుడు మాధవుడు. అమ్మాయి కలల రాకుమారుడిగా మంచి క్రేజ్‌ని, ఫ్యాన్ ఫాలోయింగ్‌ని సంపాదించుకున్న నటుడు. ప్రతి మూవీ అత్యంత విలక్షణంగా ఉండేలా జాగ్రత్త తీసుకోవడమే గాక, విలన్ పాత్రలతో కూడా మెప్పించి, విమర్శకుల ప్రశంసలందుకున్నాడు. ఆయన ఎప్పటికప్పుడూ ఫిట్నెస్, పోషకాహారం తదితరాల గురించి సోషల్‌మీడియాలో నెటిజన్లతో షేర్ చేసుకుంటూనే ఉంటారు. ఈసారి ఒక సెమినార్లో ఫోన్ వాడకం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి మాట్లాడారు మాధవన్. ఈ డిజటల్ పరికరాలకు అలా అంకితమైపోతే..మానసిక ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినడమేగాక మానవ సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఒక్కసారి ఫోన్‌కి బ్రేక్ ఇచ్చి..మనతో మనం మమేకమైతే భావోద్వేగ పరంగా మెరుగవ్వడమే కాకుండా మంచి సంబధాలను నెరపగలుగుతామని అన్నారు. అంతేగాదు ఎప్పుడైనా.. మొబైల్‌ని పట్టుకోని చేతికి..వినియోగించే చేతికి తేడాని గమనించారా...? అని అడిగారు. సింపుల్‌గా చెప్పాలంటే మీ చేతి వేళ్లను బట్టి మీరెంతలా ఫోన్ వినియోగిస్తున్నారో చెప్పేయొచ్చని అంటున్నారు మాధవన్. వేళ్లల్లో గుంతలు కనిపిస్తున్నాయా..వేళ్ల ఎముకలు పక్కటెముకలు మాదిరిగా వంకర తిరిగి ఉన్నాయా..?.. గమనిస్తున్నారా అని ప్రశ్నించారు. అలా మారిన వేళ్లను మొబైల్ ఫోన్ ఫింగర్స్(mobile phone fingers) అంటారని, అవి మితిమీరిన ఫోన్ వాడకాన్ని చెప్పకనే చెప్పేస్తాయని అంటున్నారు. అంతేగాదు ఆ రక్తసికమైన ఫోన్ మీ శరీరం తీరుని పూర్తిగా మార్చేస్తోందని అన్నారు. అందువల్ల ఫోన్ వాడకాన్ని తగ్గించి ఆరోగ్యంగా ఉండేందుకు ప్రయత్నిద్దాం అని పిలుపునిచ్చారు నటుడు మాధవన్మొబైల్ ఫోన్ ఫింగర్స్ అంటే..చేతి వేళ్లు సహజసిద్ధంగా లేకుండా..మారిపోవడాన్ని మొబైల్ ఫోన్ వేళ్లు అంటారు. అంటే అధికంగా మొబైల్ ఫోన్ వినియోగించే వారి చేతి వేళ్లు తిమ్మిర్లు వచ్చి.. జాయింట్లు తప్పడం లేదా గ్యాప్ రావడం జరగుతుందని చెబుతున్నారు నిపుణులు. వాటినే మొబైల్ ఫింగర్స్ అటారట. ఎక్కువసేపు పోన్ని వినియోగించేవారి చేతిలో కండరాలు దృఢత్వం కోల్పోయి తిమ్మిర్లు, మణికట్టు నొప్పి వంటి సమస్యలు వస్తాయట. ముఖ్యంగా తరుచుగా స్క్రోలింగ్, టైప్ చేయడం, ఎక్కువసేపు పట్టుకోవడం తదితర కదలికలు వల్ల ఉత్ఫన్నమవుతాయని చెబుతున్నారు నిపుణులు. దీన్ని తేలిగ్గా తీసుకుంటే అంతే సంగతులని వార్నింగ్ ఇస్తున్నారు నిపుణులు. ఇది దీర్ఘకాలిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని పరిశోధనలు చెబుతున్నాయని అన్నారు.ఎలా నిరోధించాలంటే..సాధ్యమైనంతవరకు మొబైల్ వాడకాన్ని పరిమితం చేయాలి. పనిచేయడం, వీడియోలు చూడటం, చదవటం వంటి కార్యకలాపాలకు కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌లను ప్రత్యామ్నాయంగా వినియోగించాలి. ఎందుకంటే ఈ పరికరాలు తగిన సెటప్‌ని అందిస్తాయి..పైగా చేతులు, వేళ్లపై తగిన ఒత్తిడి తగ్గుతుంది. అలాగే వినియోగించక తప్పదు.. అనుకునేవారు..క్రమం తప్పకుండా విరామాలు తీసుకోవడం, చేతులు సాగదీయడం లేదా రెండు చేతులతో ఫోన్ పట్టుకోవడం వంటివి చేస్తే..చేతులపై ఒత్తిడి తగ్గుతుంది. ఇది ఒకరకంగా మీ కళ్ల ఆరోగ్యానికే కాకుండా మొత్తం ఆరోగ్యానికి మేలే చేకూరుస్తుందని అన్నారు. మెదడుపై కూడా మితిమీరిన స్మార్ట్‌ఫోన్ వినియోగం అధిక ప్రభావం చూపిస్తుందని అన్నారు. నెమ్మదిగా ఫోన్ వాడకాన్ని తగ్గించడం వల్ల గణనీయమైన ప్రయోజనాలు పొందుతారని చెబుతున్నారు నిపుణులు.నిర్ణిత వేళలో ఫోన్ రహిత సమయంగా పెట్టుకోవడం వంటివి చేయాలి. సోషల్ మీడియా వినియోగం తగ్గించడం తోపాటు యాప్‌ల వినియోగాన్ని తగ్గించాలి. దీనివల్ల నిద్ర నాణ్యత పెరుగుతుంది, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల బారినపడే ప్రమాదం కూడా తగ్గుతుందని చెబుతున్నారు నిపుణులు.(చదవండి: Joe Biden: సివియర్ కేన్సర్ స్టేజ్..! ఏకంగా ఎముకలకు.. ) -
మామిడి తొక్కే కదా అని పారేయొద్దు.. లాభాలెన్నో తెలుసా?
ఇది మామిడి సీజన్ – ఎండల వేడితో పాటూ దక్కే తీపి రుచులు మామిడి పండ్లు. ఈ సీజన్లో మామిడి పండ్లు తింటాం కానీ.. తొక్క మాత్రం తీసి విసిరేస్తాం. కానీ మీకు తెలుసా? మామిడి తొక్క కూడా ఓ పోషకవంతమైన ఆహారం కావచ్చు. అవును – మామిడి తొక్క తినదగినదే, కొన్ని సందర్భాల్లో ఆరోగ్యానికి మంచిది కూడా అంటున్నారు పోషకాహార నిపుణులు..తొక్క తినడం సురక్షితమేనా?సాంకేతికంగా చూస్తే, అవును. మామిడి తొక్క విషమేమీ కాదు. ఇది ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, మాంగిఫెరిన్, క్వెర్సిటిన్, కెరోటినాయిడ్లు వంటి బయోయాక్టివ్ పదార్థాలతో నిండివుంది. అయితే మామిడి తొక్క మందంగా, కొద్దిగా చేదుగా, కొన్నిసార్లు కొబ్బరి తరహాల ఉంటుంది. అందువల్ల చాలా మందికి నచ్చదు.అంతేకాదు కొంత మందికి మామిడి తొక్కలోని కొన్ని పదార్థాలు అలెర్జీ కలిగించొచ్చు మామిడిని తీసేటప్పుడు మురికితో పాటు చర్మంపై మంట వచ్చినట్లయితే, తొక్క తినకుండా ఉండటమే మంచిది.తొక్కలో పోషకాలు...ఇందులోని ఫైబర్: జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది. యాంటీఆక్సిడెంట్లు మాంగిఫెరిన్ వంటి పదార్థాలు శరీరంలో అలర్జీలు, వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తాయి. చర్మ ఆరోగ్యానికి మేలు చేసే కెరోటినాయిడ్లు, విటమిన్ ఇ చర్మాన్ని కాంతి వంతం చేస్తుంది. అలాగే కొన్ని పరిశోధనలు మామిడి తొక్క బ్లడ్ షుగర్‌ను నియంత్రించడంలో సహాయపడవచ్చని చెబుతున్నాయి. రుచికరంగా తినే విధాలు:మామిడి తొక్క చట్నీ:2 మామిడిల తొక్క (శుభ్రంగా కడగాలి)ఒక పచ్చిమిరపకాయ ఒక టేబుల్ స్పూన్ తురిమిన కొబ్బరిఅల్లం చిన్న ముక్క, తగినంత ఉప్పు,కొద్దిగా నిమ్మరసం తీసుకోవాలి. ఈ పదార్థాలన్నింటినీ మిక్సీలో కొద్దిగా మిక్స్ చేయండి. కావాలంటే మస్టర్డ్ గింజలు, కరివేపాకు టాంపర్ చేయొచ్చు.ఎండబెట్టి పొడి తయారు చేయడం:మామిడి తొక్కని ఎండలో లేదా ఓవెన్ లో బాగా ఎండబెట్టి పొడి చేసి, స్మూతీల్లో లేదా మసాలా మిశ్రమాలలో కలుపుకోవచ్చు. ఒక చిన్న ముక్క మామిడి తొక్క పండిన మామిడి, అరటిపండు, యోగర్ట్‌తో కలిపి మేళవిస్తే.. తీపి, చేదు మధ్య బ్యాలెన్స్ అవుతుంది. తొక్కని తరిగి, నీళ్ళలో నానబెట్టి, కొన్ని రోజులు ఫెర్మెంటేషన్‌కు ఉంచండి. స్వచ్చమైన వెనిగర్ లాగా తయారవుతుంది. సలాడ్ డ్రెస్సింగ్‌కు బాగా సరిపోతుంది.శుభ్రంగా కడిగిన మామిడి తొక్కని వేడి నీటిలో లేదా గ్రీన్ టీ లో వేసి మరిగించండి. హల్కా రుచి, యాంటీ ఆక్సిడెంట్ల తేలికపాటి పౌష్టికత మీకు లభిస్తుంది.జాగ్రత్తలు...పండే మామిడి తొక్కపై పురుగుమందుల శేషాలు ఉండొచ్చు. తొక్క తినాలంటే ఆర్గానిక్ మామిడిని మాత్రమే ఎంచుకోవాలి. అలా దొరకని పక్షంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి అవేంటంటే..నీళ్ళలో 1 టీస్పూన్ ఉప్పు, టీస్పూన్ పసుపు కలిపి 10–15 నిమిషాలు నానబెట్టి, తరువాత శుభ్రంగా కడగడం ద్వారా కాయపై అలుముకున్న పెస్టిసైడ్స్ ఏవైనా ఉంటే తొలగించవచ్చు. అలాగే ఒక బౌల్ నీటిలో 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసి 15 నిమిషాలు నానబెట్టి, తరువాత మంచి నీటితో కడగడం 1:3 నిష్పత్తిలో వెనిగర్ : నీటిలో కలిపి 15–20 నిమిషాలు నానబెట్టి శుభ్రంగా కడగాలి. అలాగే తినాలనుకుంటే మామిడి తొక్కని మృదువైన బ్రష్ లేదా గుడ్డతో సున్నితంగా తోమి శుభ్రం చేయాలి.(చదవండి: Miss World 2025: మెక్సికన్ 'మే'నూ..! అందుబాటులో అంతర్జాతీయ వంటకాలు..) -
పగలబడి నవ్వేందుకు పది కారణాలు...
'సంతోషం సగం బలం హాయిగా నవ్వమ్మా'..అంటున్నారు నిపుణులు. నవ్వు నాలుగు విధాల చేటు కాదు ఆరోగ్యం అని ఘంటాపథంగా చెబుతున్నారు. నవ్వడం వల్ల మనసు ప్రశాంతంగా ఉండటమే గాక ఒత్తిడి తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ముఖం సదా నవ్వుతూ ఉండే సంబంధబాంధవ్యాలు కూడా సానుకూలంగా ఉంటాయట. నిజానికి 'నవ్వు' వైజ్ఞానికంగా చాలా మంచిది అనే విషయాన్ని హైలెట్ చేస్తోంది. ఇలా ఎందుకు అంటున్నారంటే..నవ్వు ఆరోగ్యానికి ఎందుకు మంచిదంటే..రోగనిరోధక శక్తిని పెంచుతుంది - ఇది యాంటీబాడీల ఉత్పత్తిని పెంచి రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది - నవ్వడం వల్ల రక్త ప్రసరణ సక్రమంగా ఉండి రక్తపోటును తగ్గుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది - నవ్వు కార్టిసాల్ (ఒత్తిడి హార్మోన్)ను తగ్గిస్తుంది, మరింత రిలాక్స్‌గా ఉండటానికి సహాయపడుతుంది.మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది - ఇది శరీరం సహజ అనుభూతిని కలిగించే రసాయనాలు అయిన ఎండార్ఫిన్ల విడుదలను ప్రేరేపిస్తుంది.సామాజిక బంధాలను బలపరుస్తుంది - నవ్వుతూ ఉంటే అందరు మనతో మాట్లాడటానికి, ఉండటానికి ఇష్టపడతారు. తద్వారా సమాజంలో ఇతరులతో మంచి సంబంధాలనే కుటుంబ సంబంధాలు కూడా బాగుంటాయి. ఆహ్లాదకరమైన సానుకూల వాతావరణాన్ని సొంతం చేసుకోవచ్చు. నొప్పిని తగ్గిస్తుంది - డోపమైన్ ఉత్పత్తిని ప్రేరేపించి..వివిధ రుగ్మతల నివారిణిగా పనిచేస్తుంది.సానుకూలతను ప్రోత్సహిస్తుంది - అంతేగాదు మనలో తెలియని కాన్ఫిడెన్స్ పెరిగి ఎలాంటి సవాళ్లనైనా సులభంగా అధిగమించగలుగుతారు. మానసిక ఆరోగ్యానికి మద్దతిస్తుంది - నవ్వు విశ్రాంతిని ప్రోత్సహించి ఆందోళన, నిరాశను తగ్గిస్తుంది.ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తుంది - గాఢమైన నవ్వు డయాఫ్రాగమ్‌కు మంచివ్యాయామంగా పని చేస్తుంది. పైగా శ్వాసక్రియను మెరుగ్గా ఉంచుతుంది. దీర్ఘాయువును ప్రోత్సహిస్తుంది - ఎక్కువగా నవ్వే వ్యక్తులు ఎక్కువ కాలం, ఆరోగ్యంగా జీవిస్తారని అధ్యయనాలు సైతం సూచిస్తున్నాయి.కావునా హాయిగా మనస్ఫూర్తిగా నవ్వేద్దాం..చక్కటి ఆరోగ్యాన్ని పొందుదాం. ](చదవండి: Summer Weight Loss Tips: బరువు తగ్గేందుకు బెస్ట్ సీజన్..! ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటే..) -
సరికొత్త వెల్నెస్ ట్రెండ్ "ఫార్ట్ వాక్" అంటే ..? వైద్య నిపుణుల సైతం బెస్ట్..
ప్రస్తుతం అభివృద్ధి చెందిన సాంకేతికత తోపాటు..సరికొత్త వెల్నెస్ ట్రెండ్లు తెగ పుట్టుకొచ్చేస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా పుణ్యమా అని సామాన్యులు సైతం ఆరోగ్యంపై శ్రద్ధ పెడుతున్నారు. పైగా ఇంట్లో వాళ్లకు కూడా అవగాహన కల్పిస్తున్నారు. ఈ డైట్ మంచిది, ఇలా చేస్తే బెటర్ అంటూ ఎన్నెన్నో ఆరోగ్య చిట్కాలు కోకొల్లలుగా వచ్చేస్తున్నాయి. అలానే ఇప్పుడు మరో వెల్నెస్ ట్రెండ్ నెట్టింట సందడి చేస్తోంది. ఆఖరికి నిపుణులు సైతం చాలా మంచిదని చెబుతుండటం మరింత విశేషం. మరీ ఆ ట్రెండ్ ఏంటి..? దానివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటీ అంటే.."ఫార్ట్ వాక్"(Fart Walk) అనే పదాన్ని తొలిసారిగా కెనడియన్ కుక్‌బుక్ రచయిత్రి మైర్లిన్ స్మిత్ రూపొందించారు. ఇదే చాలామంది వ్యక్తుల దీర్ఘాయువు రహస్యం అట. తక్కువ శ్రమతో కూడిన ఆరోగ్య రహస్యమని అంటున్నారు. ఇంతకీ అసలు ఈ వాక్ ఎలా చేస్తారంటే..ఫార్ట్ వాక్ అంటే..భోజనం తర్వాత తేలికపాటి నడకనే ఫార్ట్వాక్ అంటారు. అంటే ఇక్కడ రాత్రిభోజనం తర్వాత తప్పనిసరిగా వాక్ చేయడంగా భావించాలి. ఇది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలందిస్తుందని వైద్యనిపుణులు కూడా చెబుతున్నారు. ముఖ్యంగా వృద్ధాప్యానికి సహాయపడుతుందట. ఈ ఫిట్నెస్ దినచర్య ప్రాథమిక లక్ష్యం జీర్ణక్రియకు సహాయపడటం, తీవ్రమైన వ్యాధులను నివారించడం అని రచయిత్రి స్మిత్ చెబుతున్నారు. View this post on Instagram A post shared by Dr. Tim Tiutan | Internal Medicine (@doctortim.md) మనం ఫైబర్‌తో కూడిన భోజనం తీసుకుంటాం కాబట్టి గ్యాస్ సమస్య ఉత్ఫన్నమవుతుందట. అలాంటప్పుడు గనుక ఇలా ఫార్ట్ వాక్ చేస్తే.. ఆపానవాయువు నోరు లేదా కింద నుంచి బయటకు వెళ్లిపోయే అవకాశం ఉంటుందట. జస్ట్ రెండు నిమిషాలు ఆ విధంగా నడిస్తే..టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు కూడ తగ్గుతాయని చెబుతున్నారు స్మిత్. కేన్సర్ వైద్యుడు డాక్టర్ టిమ్ టియుటన్ రచయిత్రి స్మిత్ సూచించిన ఫిట్నెస్ చిట్కాని సమర్థించారు. ఆమె చెప్పింది సరైనదేనని, నిజంగానే దీంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఇన్స్టాగ్రామ్ వేదికగా చెప్పారు. భోజనం తర్వాత నడవడం వల్ల పేగు చలనశీలత - లేదా మన ప్రేగుల కదలిక అనేది గ్యాస్‌ను వదిలించుకోవడమే గాక మలబద్ధకాన్ని కూడా నివారిస్తుందని చెప్పారు. అలాగే రక్తంలోని చక్కెర స్థాయిలను నివారించడం లేదా 24 గంటల వరకు ఇన్సులిన్ సమస్య ఏర్పడదని అన్నారు. అలాగే మరో వైద్యుడు అమెరికాకు చెందిన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ క్రిస్టోఫర్ డామన్ కూడా ఈ ఫిట్‌నెస ట్రెండ్‌కి మద్దుతిచ్చారు. భోజనం తర్వాత నడక అనేది తిన్న గంటలోపు చేస్తేనే అత్యంత ప్రభావవంతంగా ఉంటుందని అన్నారు. ఆలస్యంగా నడక ప్రారంభిస్తే అప్పటికే పోషకాలు శోషించబడి రక్తంలో కలిసిపోతాయని, అలాగే గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోతాయని చెబుతున్నారు డామన్. కలిగే లాభాలు..కేన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మంచి దీర్ఘాయువుని అందిస్తుందిఎలాంటి అనారోగ్యల బారినపడకుండా కాపాడుతుందివృద్దాప్యంలో ఎలాంటి సమస్యల బారిన పడకుండా రక్షిస్తుంది. కాబట్టి రాత్రి భోజనం చేసిన వెంటేనే కాసేపు ఓ రెండడుగులు అటు.. ఇటు..నడిచి ఆరోగ్యంగా ఉందామా మరీ..!. (చదవండి: Summer Tips: ఏసీతో పనిలేకుండానే సహజసిద్ధంగా ఇంటిని చల్లగా మార్చేద్దాం ఇలా..!) -
శరీరానికి సరిపడే ఆహారాలే తీసుకోవాలి..! పోషకాలపై దృష్టి పెట్టాలి..
ఇంటిల్లిపాదికి శక్తిని ఇవ్వడానికి కష్టపడే మహిళలు ఎలాంటి ఆహారం తీసుకుంటారో ఒకసారి గమనిస్తే కొన్ని విషయాలు స్పష్టంగా తెలుస్తాయి. అందరూ తిన్నాక మిగిలినదో, ఫ్రిజ్‌లో ఉంచి తీసినవి తినడమో చాలా మంది చేస్తుంటారు. సమయానుకూలంగా ఆహారాన్ని తీసుకోరు. ఈ నిర్లక్ష్యం వల్లే ప్రపంచవ్యాప్తంగా మహిళలు, గర్భిణులు 30 శాతానికి పైగా రక్త హీనతతో బాధపడుతున్నారని నివేదికలు చూపుతున్నాయి. పోషకాలపై దృష్టి అవసరంజీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు కేవలం ఆహార ప్లానింగ్ వల్లనే కాదు... తిన్నది జీర్ణం కాకపోవడం, మలబద్దకం వంటి వాటితోనూ వస్తుంటాయి. తమ శరీరానికి ఏ ఆహారాలు సరిపడుతున్నాయో, సమస్య దేని వల్ల వస్తుందో తెలుసుకోవాలి. అప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎంతవరకు తీసుకోవాలి అనే అవగాహన కలుగుతుంది. సహజంగా మహిళలు రుతుక్రమంలో ఉన్నప్పుడు ప్రతి నెలా కొంత రక్తం పోతుంటుంది. దానిని భర్తీ చేయడానికి ఐరన్ సమృద్ధిగా లభించే బీట్రూట్, వేరుశనగ వంటి నట్స్ తీసుకోవాలి. ఆహారం తయారు చేసినప్పుడే ఈ విషయాన్ని ఆలోచించుకోవాలి. ఖరీదైన ఆహారంలోనే పోషకాలు ఉంటాయనుకుంటే పొరబాటు. ఆకుకూరలు, మొలకెత్తిన గింజలు, తృణధాన్యాలనూ ఆహారంలో చేర్చుకోవాలి.పరీక్షలతో లోపాల గుర్తింపుఆహారం ద్వారా శరీరానికి పోషక విలువలు ఎంతమేరకు అందుతున్నాయి, హార్మోన్ల స్థితి ఎలా ఉంది.. అనే విషయాలు అర్థం చేసుకోవడానికి కొన్ని రక్తపరీక్షలు, ఫంక్షనల్ టెస్ట్‌లు ఉన్నాయి. వీటి ద్వారా పోషకాహార లోపాలను గుర్తించవచ్చు. హార్మోన్ల అసమతుల్యతను అంచనా వేయడంలోనూ, ఇతర ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించడంలోనూ ఈ టెస్టులు సహాయపడతాయి. కండరాల పటుత్వానికి40 నుంచి 50 ఏళ్ల మహిళల్లో కండరాల పటుత్వం తగ్గుతుంది. ఈ వయసులో సమతుల ఆహారంపై దృష్టిపెట్టకపోతే ఆ తర్వాత వయసులో మరిన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. అందుకని ఐరన్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్లు, జింక్, మెగ్నీషియం, బీ కాంప్లెక్స్, విటమిన్ డి ... ఉండే ఆహారాలతోపాటు యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ తీసుకోవాలి. విశ్రాంతికీ ప్రాధాన్యత ఇవ్వాలిసమతుల ఆహారం తీసుకోవడానికి ఎంత శ్రద్ధ చూపుతామో పనుల వల్ల అలసిన శరీరానికి తగినంత విశ్రాంతినివ్వాలి అనే విషయంలోనూ అంతే జాగ్రత్త చూపాలి. అందుకు ఎనిమిది గంటల పాటు కంటినిండా నిద్ర ఉండాలి. ఒత్తిడిని బ్యాలెన్స్ చేసుకోగలగాలి. రుతుక్రమ దశలోనూ, మెనోపాజ్ దశలోనూ భావోద్వేగాలలో మార్పు మహిళల్లో ఎక్కువ చూస్తుంటాం. ఆహారం నుంచి తగినన్ని పోషకాలు అందక΄ోతే నిపుణుల సాయంతో సప్లిమెంట్స్ వాడాలి. ప్రతి పోషకాన్నీ కవర్ చేస్తూ సరైన ఆహారం తీసుకోవడం, ఫిట్‌గా ఉండటం చాలా ముఖ్యం. – డాక్టర్ సమత తూళ్ల, ఎమ్.డి, మెడికల్ డైరెక్టర్, కో–ఫౌండర్, పిఎమ్ఎక్స్ హెల్త్ (చదవండి: పేరెంట్స్ 'నో' చెప్పడం నేర్చుకోవాలి..! హెచ్చరిస్తున్న నిపుణులు) -
సమ్మర్ హీట్‌ని తట్టుకోవాలంటే..కళ్లకు సన్‌గ్లాస్ పెట్టాల్సిందే..!
సమ్మర్ హీట్‌ని బీట్ చేయాలంటే కళ్లకు సన్‌గ్లాస్ పెట్టాల్సిందే. సన్‌గ్లాసెస్ ఫ్యాషన్ యాక్సెసరీ మాత్రమే కాదు అంతకంటే ఎక్కువ. సూర్యుడి అతి నీలలోహిత కిరణాలకు రేడియేషన్‌కు ఎక్కువసేపు గురి కావడం రకరకాల సమస్యలకు కారణం అవుతుంది. సూర్యుని నుంచి వెలువడే హానికరమైన రేడియేషన్ నుంచి సన్‌గ్లాసెస్ మన కళ్లకు రక్షణగా ఉంటాయి.ఎలాంటి సమస్యలు రాకుండా కంటి ఆరోగ్యం కోసం సన్ గ్లాసెస్ ఉపయోగపడతాయి. తీవ్రమైన సూర్యకాంతి వల్ల కళ్లు ఒత్తిడికి గురవుతాయి. తలనొప్పి రావచ్చు. బయటికి వెళ్లినప్పుడు సూర్యకాంతి ప్రభావాన్ని తగ్గించి కంటిపై ఒత్తిడి లేకుండా చేస్తాయి కూల్ గ్లాసెస్.ఎలాంటి సన్‌గ్లాసెస్‌ను ఎంచుకోవాలంటే...100 శాతం యూవీ ప్రొటెక్షన్ ఇచ్చేవాటిని ఎంపిక చేసుకోవాలి. పోలరైజ్డ్ లెన్సెస్ సూర్యకాంతి ప్రభావాన్ని తగ్గిస్తాయి. బ్రైట్ కండీషన్స్‌లో పోలరైజ్డ్ గ్లాసెస్ మంచి క్లారిటీని ఇస్తాయి స్ట్రాంగ్, స్క్రాచ్–రెసిస్టెంట్ సన్ గ్లాసెస్‌ను ఎంచుకోవాలి లైట్ వెయిట్, ఇంపాక్ట్–రెసిస్టెంట్, గుడ్క్లారిటీ కోసం పాలీకార్బోనేట్ లెన్సులు పాపులర్ ఛాయిస్రకరకాల సైజ్, షేప్‌లలో సన్‌గ్లాసెస్ వస్తున్నాయి. అయితే వాటిలో మన ముఖ ఆకృతికి నప్పే అద్దాలను ఎంచుకోవడం ఉత్తమం. (చదవండి: చీర కేవలం మహిళల సొత్తు కాదు..! స్టైలిష్ ధోతీలా పురుషులు కూడా..) -
లెడ్ పాయిజనింగ్ అవుతోందా?
నాకిప్పుడు మూడోనెల. నేను పెయింట్, డైయింగ్ షాప్‌లో చాలా సంవత్సరాలుగా పని చేస్తున్నాను. లెడ్ పాయిజనింగ్ అవుతుందని విన్నాను. నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – దేశీత, శ్రీకాకుళం.పెయింట్, డైయింగ్ పరిశ్రమల్లో పనిచేసే వారు ఎక్కువ శాతం లెడ్ డస్ట్‌కి గురవుతారు. లెడ్ పెయింట్స్‌ని స్ట్రిప్ చేసినప్పుడు, అది పీల్చుకుంటే లెడ్ డస్ట్ ఎక్కువ ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. ఈ పరిశ్రమల్లో ఉండే ప్రాంతంలోని గ్రౌండ్ వాటర్ కూడా కలుషితం అవుతుంది. ఎక్కువ కాలం లెడ్ డస్ట్‌కు గురైతే, లెడ్ పార్టికల్స్ శరీరంలోకి చేరుతాయి. అందుకే, ఈ పరిశ్రమల్లో పని చేసేవారు శరీరం, చేతులను బాగా శుభ్రం చేసుకోవాలి. సాధారణ వాతావరణం ద్వారా అందరికీ కొంత లెడ్ ఎక్స్పోజర్ అవుతుంది. కానీ, ఎక్కువ శాతం ఈ పెయింట్, డైయింగ్ పరిశ్రమల్లో వారికే అవుతుంది. ఈ లెడ్ శరీరంలోకి వ్యాపించి ఎముకలు, దంతాల్లో నిల్వ ఉంటుంది.అంతేకాదు, ప్రెగ్నెన్సీలో ఈ లెడ్ పార్టికల్స్ బ్లడ్ స్ట్రీమ్‌లోకి చేరి తల్లికి, బిడ్డకు ప్రమాదం చేస్తాయి. అందుకే, ప్రెగ్నెన్సీలో రక్తపరీక్షల్లో ఈ లెడ్ లెవల్‌ను పరిశీలిస్తాం. క్యాల్షియం, ఐరన్, విటమిన్ డీ, విటమిన్ ఈ, విటమిన్ సీలను ఆహారంలో తక్కువ తీసుకునే వారికి ఈ లెడ్ అబ్జార్ప›్షన్ పెరుగుతుంది. అందుకే, సమతుల్యమైన ఆహారం, పోషకాహారం ప్రెగ్నెన్సీలో తీసుకోవాలి. ఈ లెడ్ లెవెల్స్ 5 ఎమ్సీజీ / డీఎల్ కన్నా ఎక్కువ ఉంటే అది డేంజర్ లెవెల్ అని అర్థం. లెడ్ మెటల్ ప్లాసెంటాను దాటి పిండంలోకి చేరగలదు. ఈ లెడ్ లెవెల్స్ ఎక్కువ ఉంటే గర్భస్రావం, పుట్టిన బిడ్డకు అంగవైకల్యం, బిడ్డ బరువు తక్కువ ఉండటం, నెలలు నిండకుండానే కాన్పు, హై బీపీ వంటి సమస్యలు పెరుగుతాయి. బిడ్డ మెదడుపై కూడా ప్రభావం పడుతుందని పరిశోధనల్లో తేలింది.బేబీకి బుద్ధిమాంద్యం ఏర్పడవచ్చు. అందుకే, డాక్టర్‌ను వెంటనే సంప్రదించాలి. రక్త పరీక్షలు, అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి బిడ్డ ఎదుగుదల ఎలా ఉంది, రక్తంలో మీ లెడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అని చెక్ చెస్తారు. నీటిలో కూడా లెడ్ ఎక్స్‌ప్లోజర్ కావచ్చు. కాబట్టి వడగట్టి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలి. పరీక్షల్లో లెడ్ లెవెల్స్ ఎక్కువ ఉంటే మొదట క్యాల్షియం మాత్రలు ఇస్తారు. ఒక గ్రాము డోస్ రోజూ డెలివరీ వరకు తీసుకోవాలి. చెలేషన్ థెరపీ ఇవ్వాలి. రెండు నుంచి నాలుగు వారాల తరువాత లెడ్ లెవెల్స్‌ను మళ్లీ చెక్ చేస్తాం. రెండో త్రైమాసికంలో సురక్షితంగా ఈ మందును అడ్జస్ట్ చేసి ఇస్తాం. భవిష్యత్తులో లెడ్ ఎక్స్పోజర్ ఎక్కువ కాకుండా డెలివరీ వరకు జాగ్రత్తగా చూసుకోవాలి.ఎలాంటి వారికి సమస్య ఎక్కువ?నా వయసు ముప్పై సంవత్సరాలు. ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌లో ఉన్నాము. ఎలాంటి వాళ్లకి ప్రెగ్నెన్సీలో ఆరోగ్య సమస్యలు ఎక్కువ ఉంటాయి?– ప్రణతి, గుంటూరు.ప్రెగ్నెన్సీలో కొందరికి ఎక్కువ సమస్యలు కావచ్చు. మరికొందరికి తక్కువ ఉండవచ్చు. సాధారణంగా అలసట, థైరాయిడ్ సమస్యలను ఎక్కువమందిలో చూస్తాం. కానీ, కొన్ని ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్న వారిలో సమస్యలు ఎక్కువ అవుతాయి. బరువు ఎక్కువ ఉండటం, స్థూలకాయం, బీఎమ్ఐ 30 కంటే ఎక్కువ ఉన్నవారిలో తల్లికి బీపీ, మధుమేహం, ఫిట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ. బేబీకీ వెన్నెముక, మెదడు సమస్యలు పెరుగుతాయి. వయసు 35 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న తల్లుల్లో క్రోమోజోమ్ అసాధారణతలు ఎక్కువ ఉంటాయి. అలానే టీనేజ్ ప్రెగ్నెన్సీలో కూడా సమస్యలు ఎక్కువ. కొన్నిసార్లు ఆరోగ్యకరమైన కండిషన్స్‌లో కూడా ప్రమాదం ఎక్కువ ఉంటుంది. కొంతమందికి ట్విన్స్, మల్టీపుల్ ప్రెగ్నెన్సీస్లో ఉండవచ్చు. వారిలో షుగర్, హై బీపీ ప్రమాదం పెరుగుతుంది. ఇంతకు ముందు ప్రెగ్నెన్సీలో ఎదుగుదల సమస్యలు, ప్లాసెంటా సమస్యలు ఉన్నా ఇప్పుడు అవి ప్రభావం చూపుతాయి. అందుకే, మూడవనెల నుంచి మంచి ఆహారం తీసుకుంటూ, డాక్టర్ పర్యవేక్షణలో మందులు వాడాలి. ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌కి ముందు ఒకసారి డాక్టర్ని సంప్రదిస్తే, ప్రమాదాలను గుర్తించి అందుకు తగ్గట్టుగా పరీక్షలు చేసి, మందులను సూచిస్తారు.ప్రెగ్నెన్సీలో బేబీకి ప్రమాదమా?నేను ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌లో ఉన్నాను. ఇంట్లో ఉమ్మడి కుటుంబ సమస్యలు చాలా ఉన్నాయి. అలాగే పనిచేసే ఆఫీసులోనూ కూడా చాలా టార్గెట్స్ ఉంటాయి. ఒత్తిడి చాలా ఎక్కువ అవుతుంది. అది తగ్గించుకోవాలన్నా అవటం లేదు. ఈ ఒత్తిడి వలన ప్రెగ్నెన్సీలో బేబీకి ఏదైనా ప్రభావం ఉంటుందా? – రూప, బెంగళూరు.ఒత్తిడి అనేది మానవ జీవితంలో సహజం. కానీ, ప్రెగ్నెన్సీ చాలా సంతోషంగా, ఆరోగ్యంగా అనుభవించవలసిన సమయం. ఆ సమయంలో ఎంత ప్రశాంతంగా ఉంటే అంత సంతోషంగా ముందుకు వెళ్లగలరు. సానుకూల వైఖరి చాలా అవసరం. సర్దుకుపోయే మనస్తత్వం ఉండాలి. ఒత్తిడి పెంచే ఆలోచనలు అస్సలు చెయ్యకూడదు. ప్రెగ్నెన్సీలో శరీరం, మెదడులో చాలా మార్పులు వస్తాయి. హార్మోన్ల మార్పుల వలన కొంత అసహనం, చిరాకు ఉంటాయి. అతిగా ఒత్తిడికి గురైతే నిద్రలేమి, తలనొప్పి, ఆకలి లేకపోవడం, హై బీపీ, నెలలు నిండకుండానే ప్రసవం, పుట్టిన బిడ్డ బరువు తక్కువ ఉండటంలాంటి సమస్యలు రావచ్చు. ఒత్తిడికి దారితీసే కారణాలను వెతికి, వాటిని ముందే పరిష్కరించుకోవాలి. కనీసం తగ్గించుకునే ప్రయత్నం చెయ్యాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. రోజూ ఒక గంటసేపు వ్యాయామం చేయటం అలవాటు చేసుకోవాలి. బాగా నిద్రపోవాలి. -
ఆయన వింతగా ప్రవర్తిస్తున్నారు!
మా ఆయనకు 52 సం‘‘లు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు. వృత్తిలో పెద్దగా సమస్య లేదు. కాని ఈ మధ్య రాత్రి నిద్రలో తన కాళ్ళతో నన్ను కొడుతున్నాడు. నిద్రలో కాళ్ళను గట్టిగా కదిలించడం, అప్పుడప్పుడు కేకలు వేయడం, కలలో ఎవరితోనో పోరాడుతున్నట్లు ప్రవర్తిస్తున్నాడు. ఉదయాన్నే లేచిన తరువాత అడిగితే రాత్రి జరిగిన విషయాలు ఏమి గుర్తులేవని అనడమే కాక, అసలు అలా చేయనే లేదని చెప్తున్నారు. మా ఇద్దరి వైవాహిక జీవితంలో వేరే ఏ సమస్యా లేదు. నాకు ఏం చేయాలో తోచడం లేదు. నాపైన కోపంతో పగలు నన్నేం అనలేక రాత్రి నిద్రలో నన్ను ఇబ్బంది పెడ్తున్నారేమోనని అనిపిస్తుంది. దీనికి తగిన పరిష్కారం చెప్పగలరు.– వరలక్ష్మి, మహబూబ్ నగర్ మీ భర్త విషయంలో మీరు వివరించిన లక్షణాలు రాత్రి నిద్రలో కాళ్ళతో తన్నడం, కేకలు వేయడం, చేతులు కదిలించడం, పొద్దున దాని గురించి అసలేం గుర్తు లేకపోవడం... ఇవన్నీ ‘రెమ్ స్లీప్ బివేవియర్ డిజార్డర్’ అనే నిద్రకు సంబంధించిన రుగ్మతను సూచిస్తున్నాయి. ఈ సమస్యలో ఆ వ్యక్తి నిద్రదశలో కలల్లో వచ్చే విషయాలకు అనుగుణంగా వారికి తెలియకుండానే ఆ విధంగా ప్రవర్తిస్తారు. సాధారణంగా కలలు వచ్చే సమయంలో మన శరీర కండరాలు అచేతనమై ఉంటాయి. కానీ పైన చెప్పిన సమస్య ఉన్న వారిలో అలా జరగక΄ోవడం వల్ల వారు విపరీతంగా కదలడం, కాళ్ళతో చేతులతో కొట్టడం చేస్తారు. మీరు వెంటనే మీ భర్తను ఒక న్యూరాలజిస్ట్ లేదా సైకియాట్రిస్ట్ వద్దకు తీసుకెళ్ళి ‘స్లీప్ స్టడీ’ చేయించి ఈ రుగ్మతను నిర్ధారించుకోవాలి. కొన్ని మంచి మందులతో ఈ లక్షణాలను పూర్తిగా తగ్గించవచ్చు. చికిత్స మొదలయ్యే వరకు మీ భద్రత కోసం మీరు వేరే బెడ్‌పై లేదా వేరే గదిలో నిద్రిస్తే మంచిది. ఆయన నిద్ర΄ోయే ముందు మద్యపానం, కాఫీ, సిగరెట్ లాంటివి తీసుకోకుండా చూడండి. అన్నిటికీ మించి ఇది ఆయన అదుపులో లేని ఒక వైద్యసమస్య అని గుర్తించండి. ఆయన్ని కోపగించుకోకుండా, అర్థం చేసుకొని వైద్య చికిత్స చేయించండి! అన్నీ సర్దుకుంటాయి. ఆల్ ది బెస్ట్!(చదవండి: మంచి పనిచేశా..! భారత్‌పై డెన్మార్క్ మహిళ ప్రశంసల జల్లు..) -
సుధామూర్తి హెల్త్ టిప్స్: అధిక కేలరీల ఆహారాన్ని ఎలా నివారించాలంటే..?
రాజ్యసభ ఎంపీ, ఇన్ఫోసిస్ కోఫౌండర్ నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రస్ ఆమె. తరుచుగా చుట్టూ జరుగుతున్న లోపాల గురించి తనదైన శైలిలో మాట్లాడుతూ..సలహాలు సూచనలు ఇస్తుంటారు. చిన్నారులు దగ్గర నుంచి నేటి యువత వరకు ఎలాంటి జీవన విధానంతో లైఫ్‌ని లీడ్ చేస్తే బెటర్ అనే దాని గురించి అమూల్యమైన సలహలిస్తుంటారు కూడా. అలానే తాజాగా ఆహారపు అలవాట్లు ఎలా ఉంటే ఆరోగ్యానికి మంచిదో చెప్పారు. దాంతోపాటు తన తన ఆరోగ్యకరమైన డైట్ సీక్రెట్‌ని కూడా పంచుకున్నారు. మనం మనుషులం కాబట్టి ఒక్కోసారి చీట్ మీల్ తినేస్తుంటాం. అందుకు తాను కూడా మినహా కాదని నవ్వతూ చెప్పారామె. మరీ ఆ విషయాలేంటో చూద్దామా..!.పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్‌తో జరిగిన సంభాషణలో రాజ్యసభ ఎంపీ, విద్యావేత్త సుధామూర్తి భారతదేశం ఆహారం, భారతీయుల ఆహారపు అలవాట్ల గురించి మాట్లాడారు. సుధామూర్తి ఆ భేటీలో ఇంట్లో వండిన ఆహారం తినడం ప్రాముఖ్యతను హైలెట్ చేశారు. మనసుకు సంతృప్తిని, హాయిని ఇచ్చే ఆహారం తినడం గురించి నమ్ముతానన్నారు. అయితే అధిక కేలరీల ఆహారాన్ని మాత్రం తప్పకుండా నివారించాలన్నారు. అందుకోసం తానేం చేస్తారో కూడా వివరించారు. నోరూరించే అధిక కేలరీలు ఆహారాలు తన భోజనం టేబుల్‌పై లేకుండా ఉండేలా చూసుకుంటారట. చాలావరకు ఆ విషయంలో స్వీయ నియంత్రణ చాలా కష్టంగా ఉంటుంది. తాను కూడా ఒక్కోసారి చీట్ మీల్ చేస్తుంటానని అన్నారు. తనకు పెడ, బర్ఫీ లేదా మైస్ వంటి స్వీట్లంటే ఎంతో ఇష్టమని చూడగానే మనసు పారేసుకుంటానని నవ్వుతూ చెప్పారు. అయితే తీసుకునే ముందు ఇదొక్కటే లేదంటే తన ఆరోగ్యానికి ఇబ్బంది అని సర్ది చెప్పుకుంటూ ఆపేస్తా అన్నారు. డైట్ ఎలా ఉంటుందంటే..రోటీలలో ఒకటైన భక్రిని తాను ఇష్టంగా తింటానన్నారు. ఇక్కడ భక్రి అంటే మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో తినే ప్రసిద్ధ ఫ్లాట్‌బ్రెడ్.ఎర్రటి గోధమ జోవర్ వంటి చిరుధాన్యాలను తీసుకుంటారెమె. చివరగా తీపి తినాలనే కోరికను నివారించడానికి పండ్లు ఎక్కువగా తీసుకుంటానన్నారు. అన్నీంట్ల కంటే కంఫర్ట్ ఫుడ్ - పోహా అంటారెమె. తన ప్రతి భోజనంలో తప్పనిసరిగా అది ఉండాల్సిందేనట.(చదవండి: అలనాటి గోల్డెన్ డేస్: ఆ తాతయ్య కనులలో కోటి పండగల కళ..) -
ఎక్కువ ఆయుర్దాయం కావాలా? జపనీయుల టాప్ సీక్రెట్స్ ఇవే!
జపనీయుల దీర్ఘాయువు వెనక... స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, అస్తవ్యస్తమైన జీవనశైలి, ఒత్తిడి, కాలుష్యం వంటి కారణాల వల్ల అనుకున్నంత కాలం జీవించలేకపోతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం జపాన్? ప్రజలు మాత్రం ప్రపంచంలోనే అత్యధిక ఆయుర్దాయంతో ఎక్కువకాలం పాటు జీవిస్తున్నారు. అందుకు కారణాలేమిటో తెలుసుకుందాం.. మనం కూడా వారిని అనుసరిద్దాం.డబ్ల్యుహెచ్. ఓ. అంచనాల మేరకు... జపాన్ ప్రజల సగటు ఆయుర్దాయం 83.7 సంవత్సరాలు (మహిళలకు 86.8 సంవత్సరాలు పురుషులకు 80.5 సంవత్సరాలు)గా ఉంది. జపాన్ ప్రజల జీవన విధానం, ఆహారపు అలవాట్లు, వ్యాయామం, సంస్కృతి, జెనెటిక్స్? దీనికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. ఇకిగై (సంతోషంతో జీవించడం): జపనీయులు ‘ఇకిగై’ అనే సిద్ధాంతంతో సంతోషంగా జీవిస్తారు. ఆనందంతో జీవించాలని ఈ పురాతన తత్వశాస్త్రం బోధిస్తుంది. అంతేకాక, ఎందుకు జీవిస్తున్నామనే దానిపై స్పష్టతతో జీవితానికి లక్ష్యాన్ని ఏర్పర్చుకోవడం, ఇతరులకు సహాయం చేయడం, సమతుల ఆహారాన్ని తీసుకోవడం, స్నేహితులు, కుటుంబ సభ్యులతో ప్రేమతో కలిసి ఉండటం వంటి అంశాలు వారి ఆయుష్షును పెంచుతాయి. హరా హాచ్ బన్ మి. ఇది జపాన్‌లో ఒక సామెత. అంటే తగిన మోతాదులోనే ఆహారం తినాలని అర్థం. కడుపులో 80 శాతం నిండినంత వరకు మాత్రమే తింటే దీర్ఘాయువు కలిగి ఉంటామని జపనీయుల నమ్మకం. అంతేకాదు, పెద్ద పళ్లెంలో కాకుండా చిన్న చిన్న ప్లేట్లలో లేదా బౌల్స్‌లో నెమ్మదిగా తినడానికి ప్రాధాన్యమిస్తారు. కుటుంబ సభ్యులంతా కలిసి తింటారు. భోజనం చేసేటప్పుడు టీవీ, సెల్ ఫోన్ వంటి వాటికి దూరంగా ఉంటారు. కింద కూర్చునే తింటారు. సమతుల ఆహారం: జపనీస్ ఆహారం లో పండ్లు, ఒమేగా ఫాటీ ఆమ్లాలు అధికం గా ఉండే చేపలు, బియ్యం, తృణధాన్యాలు, టోఫు, సోయా, మిసో, ఆకుపచ్చ కూరగాయలు ఎక్కువగా తీసుకుంటారు. ఇవన్నీ తక్కువ కొవ్వులు, చక్కెరలను కలిగి ఉంటాయి. వీటిలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. తద్వారా కాన్సర్, గుండె జబ్బుల నుంచి బయట పడొచ్చు. ఈ ఆహారం కారణంగానే జపాన్‌లో ఊబకాయం రేటు చాలా తక్కువగా ఉందని చెప్పవచ్చు.హెర్బల్ టీ: జపనీస్ ప్రజలు టీ తాగడాన్ని ఇష్టపడతారు. అది వారి సంస్కృతిలో భాగంగా భావిస్తారు. జపాన్ ద్వీప సమూహంలో మాచా టీ చాలా ప్రాచుర్యం పొందింది. టీ తయారీలో ఉపయోగించే టీ ఆకులు అధిక పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు కాన్సర్‌తో పోరాడే శక్తినిస్తాయి. కాలి నడకకు ప్రాధాన్యం: జపాన్ ప్రజలు ఒకేచోట కూర్చుని పని చేసే జీవన శైలిని అంతగా ఇష్టపడరు. యువకుల నుంచి వృద్ధుల వరకు అంతా నడవడానికే ఇష్టపడతారు. విద్యార్థులు, ఉద్యోగులు సమీపంలోని రైల్వే స్టేషన్‌కు నడవడం లేదా సైక్లింగ్? చేయడం వంటివి చేస్తుంటారు. ఇవన్నీ వారి ఆయుర్ధాయం పెరగ డానికి దోహదం చేస్తాయి.జీన్స్ ఇవి వారు ధరించే జీన్స్ కాదు.. జపనీస్‌లో సహజసిద్ధంగా ఉండే జన్యువులు. ఇవే వారి ఆయుష్షును పెంచుతున్నాయి. టైప్ 2 డయాబెటిస్, స్ట్రోక్స్, గుండెపోటు, సెరెబ్రోవాస్కులర్, హృదయ సంబంధ వ్యాధులలను నిరోధించడానికి ఈ జన్యువులు సహాయపడతాయి.వృద్ధుల సంరక్షణ: ఇతర దేశాలలా జపాన్ ప్రజలు వయసు పైబడిన తమ కుటుంబ సభ్యులను ఓల్డ్? ఏజ్?హోమ్‌లకు పంపించరు. కుటుంబ సభ్యుల సంరక్షణ బాధ్యతను చూసుకోవడం అక్కడి వారి సాంప్రదాయం. వృద్ధాప్యంలో కుటుంబంతో కలిసి జీవిస్తే మానసికంగా అనేక ప్రయోజనాలు కలుగుతాయని, సంతోషంగా జీవిస్తారని అక్కడి వారి నమ్మకం. చదవండి: #WomenPower :హంపీ టెంపుల్లోని ఈ సారథుల గురించి తెలుసా?ఆరోగ్య సంరక్షణ: జపాన్‌లో అనారోగ్యాలను నివారించి, ఆరోగ్య రక్షణకు ప్రాధాన్యతనిచ్చే ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ఉంది. క్రమం తప్పకుండా తనిఖీలు చేయడం, వ్యాధులను ముందుగానే గుర్తించడం మొత్తం ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.సామాజిక నిర్మాణం: బలమైన సామాజిక సంబంధాలు, సమాజ మద్దతు మెరుగైన మానసిక ఆరోగ్యానికి, ఒత్తిడి స్థాయులను తగ్గించడానికి దారితీస్తుంది, ఇవి దీర్ఘాయువుకు ముఖ్యమైనవి.చదవండి: ఇక్కడ జిమ్‌లో చేరాలంటే నెలకు తొమ్మిది లక్షలు!చూశారుగా...పైన చెప్పుకున్న వాటిలో ఒక్క జన్యుపరమైన కారణాలు తప్ప మిగతావన్నీ మనం సులువుగా అనుసరించదగ్గవే. వీలయిన వాటిని వీలయినంత వరకు అనుసరించి ఆయురారోగ్యాలతో హాయిగా ఉందాం. దీర్ఘాయుష్మాన్ భవ! -
యూట్యూబ్ సలహా ప్రమాదం కావచ్చు...
ఉదయాన్నే రాగి సంగటి తినమంటారొకరు. తింటే డేంజరంటారొకరు. వేపాకులను తినేయండి అని ఒకరు. రావి ఆకుల జ్యూస్ అని ఒకరు. ఇటీవల ఆరోగ్యం మీద అందరికీ ఆసక్తి పెరిగింది. దానికి తగ్గట్టు యూట్యూబ్‌లో చిట్కాల వీడియోలు పెరిగాయి. అర్హతలు ఉన్నవారూ లేనివారూ చెప్పేది వింటే ప్రొణం మీదకు రావచ్చు.కేరళలోని కన్నూరులో ఓ 18 ఏళ్ల యువతి బరువు తగ్గడానికి కేవలం వేడినీళ్లు తాగుతూ అవయవాలు దెబ్బ తిని మరణించింది. పిల్లలను హెచ్చరించే మనం జాగ్రత్త పడాల్సిన సమయం ఇది.ఆరోగ్య ప్రచారం మంచికోసం కాకుండా సబ్స్ట్రయిబర్ల కోసం, వ్యూస్ కోసం సాగడం నేటి విషాదం. ఎలాంటి టిప్స్ చెప్పిస్తే వీడియోలు వైరల్ అవుతాయో చూస్తున్నారో తప్పితే చెబుతున్న విషయాలు ఎవరికి, ఎంతవరకు అవసరమో ఎవరికి కీడు చేస్తాయో చెప్పడం లేదు. ఆహార విధానాలు కూడా ఎప్పటికప్పుడు కొత్త సిద్ధాంతాలు లేవనెత్తుతూ అయోమయానికి గురి చేయడం నేడు చూస్తున్నాం. కోడిగుడ్డు పచ్చసొన కొందరు వద్దు అంటే కొందరు అదే మంచిది అంటారు. ఇలాంటి అయోమయం మధ్యలో ప్రత్యామ్నాయ ఆహార ప్రచారకర్తలు ముందుకు వచ్చి తాము నమ్మిన విధానాలను ప్రచారం చేస్తున్నారు. వీరు చేస్తున్న వీడియోలకు శాస్త్రీయ నిర్థారణ ఏమిటి అన్నది ఎవరూ చూడటం లేదు. అలాగే చురుగ్గా, ఆరోగ్యంగా ఉండటమే కాకుండా ‘సన్నగా’ కనిపించడం అవసరం అనుకుంటున్నారు చాలామంది. సన్నగా అవడం అందరి శరీరతత్వాలకు సరిపడుతుందో లేదో వైద్య సలహా తీసుకోవడం లేదు. వీడియోలు చూసి బరువు తగ్గేందుకు ప్రయత్నించిప్రొణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కేరళలో జరిగిన ఉదంతం ఈ విషయంలో హెచ్చరిక చేస్తోంది.50 కిలోల నుంచి 24 కిలోలకుకన్నూరు జిల్లా కలూరుపరయకు చెందిన 18 ఏళ్ల ఫస్ట్ ఇయర్ డిగ్రీ అమ్మాయి శ్రీనంద బరువు తగ్గిపోయి మాట్లాడలేని స్థితికి చేరుకోగా తల్లిదండ్రులు ఆమెను తలస్సెరి కోఆపరేటివ్ హాస్పిటల్‌కు తీసుకు వచ్చారు. ఆమెకు వైద్యం చేసిన డాక్టర్ ప్రభు మాట్లాడుతూ ‘ఆమె బరువు 24 కేజీలు ఉంది. బి.పి. 70, ఆక్సిజన్ లెవల్ 70, బ్లడ్‌షుగర్ 45.. సోడియం, పొటాషియం లెవల్స్ పూర్తిగా పడిపోయాయి. ఆమె ఆరు నెలలుగా ఆహారం తినకుండా దాచేస్తోంది. మూడునెలలుగా యూట్యూబర్‌ను నమ్మి హాట్ వాటర్ మాత్రమే తీసుకుంటోంది. 50 కిలోల నుంచి మూడునెలల్లో 24 కిలోలకు వచ్చేసింది. ఇది ఆహారాన్ని నిరాకరించే ‘అనొరెక్సియా’ అనే మానసిక స్థితి. తల్లిదండ్రులు ఆ విషయాన్ని కనిపెట్టలేకపోయారు. ఇలాంటి వారిని ముందే గుర్తించి మానసిక వైద్యం చేయించాలి’ అన్నారు. ‘రోజుల తరబడి ఆహారం తీసుకోకపోవడం వల్ల ఆమె అంతర్గత అవయవాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వెంటిలేటర్ మీద ఉంచి చికిత్స అందించినా ఫలితం దక్కలేదు’ అని ఆయన తెలిపారు.బాడీ షేమింగ్, వీడియోలుఇటీవల కాలంలో బాడీ షేమింగ్ వల్ల టీనేజర్లు ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపు దేశప్రధాని మన దేశంలో ఊబకాయం పెరిగిపోతోందని ఆందోళన చెందుతోంటే, అందుకు కారణాలను అర్థం చేసుకోకుండా ఊబకాయులను బాడీ షేమింగ్ చేస్తున్నారు కొందరు. టీనేజ్‌లో ఉన్న పిల్లలు సన్నబడాలని హటాత్తుగా బరువు తగ్గితే అది అవయవాల మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇలాంటి వారిని ఆకర్షించేలా యూట్యూబ్‌లో బోలెడన్ని వీడియోలు ఉంటున్నాయి. ‘ఇలా చేస్తే వెంటనే బరువు తగ్గుతారు’ అనే వీడియోలు నమ్మవద్దని పిల్లలకు చె΄్పాల్సిన అవసరం ఉంది.గుడ్డిగా నమ్మవద్దుఅలోపతిలోగాని ఆయుర్వేదంలోగాని లేదా ప్రత్యామ్నాయ వైద్య విధానాల్లోగాని కచ్చితమైన నిపుణులను కలిసి పూర్తిగా కేస్ హిస్టరీ చెప్పి సన్నబడటానికి లేదా బరువు తగ్గడానికి ప్రయత్నించాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పచ్చి ఆకుకూరల, కాయగూరల జ్యూసులు తాగేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. నిపుణుల సలహా తప్పనిసరిబరువు తగ్గడం అనేది మానసిక వైకల్యంగా మారే స్థితికి కొంతమంది చేరుకోవడం బాధాకరం. ఇలాంటి వారు యూట్యూబ్, ఇన్‌స్టా తదితర ప్లాట్‌ఫామ్స్‌లో తెలిసీ తెలియక చెప్పే సలహాలు నమ్మి నష్టపోతున్నారు. కేరళలో చనిపోయిన అమ్మాయి ఆరు నెలలు ‘హాట్‌వాటర్’ థెరపీ చేసింది. తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఏ ఇద్దరూ ఒకే విధంగా బరువు తగ్గరు. అందుకు వయసు, శరీరతత్త్వం, జన్యుపద్ధతి, జీవన విధానం... ప్రభావం చూపుతాయి. బరువు తగ్గించాలంటే ఎక్స్‌పర్ట్‌లు వ్యక్తిగతంగా వివరాలు తీసుకుని, మెడికల్ హిస్టరీ తెలుసుకొని, ఎటువంటి ఆహారం తీసుకోవాలో, వద్దో సూచిస్తారు. క్వాలిఫైడ్ డైటిషియన్స్ను వ్యక్తిగతంగా కలిసి డైట్ పాటించాలి తప్ప ఎవరూ ఇన్ఫ్లూయెన్సర్లు చెప్పే విధానాలకు దిగవద్దు.– డా.వాణి కత్తి, ఫుడ్‌సైన్స్ ఎక్స్పర్ట్ -
కివిపండుని తొక్కతో సహా తింటున్నారా..?
కివి విదేశీ పండైనా..మనకి మార్కెట్లలో అందుబాటులోనే ఉంది. దీన్ని చైనీస్ గూస్బెర్రీ అని కూడా పిలుస్తారు. చాలామంది ఇష్టంగా తింటారు కూడా. అయితే ఈ పండుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. అన్నీ లాభాలనందించే ఈ పండుని తొక్కతో తినొచ్చా..? ఏ సమయంలో తింటే మంచిది వంటి వాటి గురించి తెలుసుకుందామా..!రుచిలో తియ్యగా, పుల్లగా ఉంటుంది. అందుకే చాలామంది దీన్ని ఎక్కువగా ఇష్టపడతారు. అయితే తియ్యగా, పుల్లగా ఉండే ఈ కివీ వివిధ వ్యాధుల బారినపడకుండా రక్షిస్తుంది. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు తప్పనిసరిగా ఈ పండుని తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. ఈ కివి పండుని తీసుకోవండ కలిగే లాభాలేంటంటే..ఆరోగ్య ప్రయోజనాలు..కివి పండులో విలువైన ఫైబర్, విటమిన్లు ఉంటాయి. ఉబ్బరం తగ్గిస్తుంది గట్ బ్యాక్టీరియాకు ఉపయోగపడుతుంది సెరటోనిస్ హార్మోన్ ఉత్పత్తి పెరిగి హాయిగా నిద్రపడుతుంది ∙బరువు తగ్గడానికి ఉపకరిస్తుంది ∙రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఒమేగా ఫ్యాటీ అమ్లాల వల్ల చర్మం మృదువుగా తయారవుతుంది. ఎముకలు దృఢంగా ఉండడానికి ఉపయోగపడుతుంది మల బద్దకం సమస్య లేకుండా చేస్తుంది. కివీలో ఉండే ఫైబర్ జీర్ణ ఆరోగ్యానికి ఉపకరిస్తుంది ∙శరీరం కోల్పోయిన నీటిని అందించడంలో కివీలోని విటమిన్లు సి, ఇ, పొటాషియం... ఉపయోగపడతాయి. ఏ సమయంలో తినాలి కివి తినడానికి సరైన సమయం ఉదయం. కివిలో పుష్కలంగా పోషకాలు ఉన్నాయి. కివి ఆరోగ్యానికి అద్భుతమైన ఔషధంగా పనిచేస్తాయి. పుల్లటి పండ్లను ఖాళీ కడుపుతో తింటే ఎసిడిటీ సమస్యలు వస్తాయి కాబట్టి ఖాళీ కడుపుతో తినకుండా కాస్త బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత తినడం మంచిది.ఎలా తింటే మంచిదంటే..కివీ పండ్లతో ప్రయోజనాలోన్నో. దీని తొక్కను తీసి పారేస్తుం టాం. కానీ అందులో చాలా విషయం ఉంది. తొక్కు వెనుక యాంటీ ఆక్సిడెంట్లు పూర్తి పీచు పదార్థంతో నిండిన గుజ్జు ఉంటుంది. మొక్కజొన్నను మినహా యిస్తే.. కంటి చూపును కాపాడే లుటియిన్ పదార్థ్ధం ఏ ఇతర పండు, కూరగాయాల్లో కూడా ఇందులో ఉన్నంత ఉండదు. రోజుకు రెండు నుంచి మూడు కివీలు తిన్నవారిలో శరీరం లోపల రక్తం గడ్డకట్టే ప్రమాదం తగ్గినట్లు నార్వేలో గుర్తించారు. (చదవండి: బీట్రూట్ని మజ్జిగతో కలిపి ఎందుకు తీసుకోవాలంటే..!) -
National Dentists Day : రోజుకు ఎన్నిసార్లు బ్రష్ చేయాలి?
నిజామాబాద్ నాగారం: మానవ శరీరంలో ఉన్న అవయవాలు సమర్థవంతంగా పనిచేసేందుకు శక్తినిచ్చేది దంతాలు. ఆహారాన్ని నమిలి మింగడానికి దోహదప డతాయి. అందుకే నోరు బాగుంటేనే ఆరోగ్యం బాగుంటుందని దంత వైద్యులు చెబుతుంటారు. నోటి శుభ్రతపై నిర్లక్ష్యం వహించొద్దని సూచిస్తున్నారు. నేడు జాతీయ దంత వైద్యుల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. ఉదయం, సాయంత్రం సరిగా బ్రష్ చేసుకోకపోవడంతో నోట్లో ఆహారం చేరి బ్యాక్టీరియా తయారవుతుంది. దీంతో పుప్పిపళ్ల సమస్య ఉత్పన్నమవుతుంది. ఇదే కాకుండా నోరు శుభ్రంగా లేకపోతే రోగాలు దరి చేరుతాయని వైద్యులు చెబుతున్నారు. దంతాల శుభ్రతలో జాగ్రత్తలు.. ●దంతాలను ఆరోగ్యంగా ఉంచేందుకు రోజుకు రెండుసార్లు బ్రష్ చేయాలి. ● ఏదైనా తిన్న తర్వాత నోటిని నీటితో కడగాలి. దీంతో పంటిలో చిక్కుకున్న ఆహారం బయటకు పోతుంది. ● ప్రతి ఆరు నెలలకోసారి దంత పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. ● మన్నికై న టూత్ పేస్ట్, టూత్ బ్రష్‌లను వాడాలి. ● చాక్లెట్లు, చిప్స్, తీపి పదార్థాలు తినొద్దు. ప్రతి సంవత్సరం మంచి నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో దంతవైద్యులు మరియు వారు అందించే ముఖ్యమైన పాత్రను గుర్తించేందుకు జాతీయ దంతవైద్యుల దినోత్సవంగా మార్చి 6న పాటిస్తారు. జాతీయ దంతవైద్యుల దినోత్సవ చరిత్ర 20వ శతాబ్దం నాటిది, దీనిని అమెరికన్ డెంటల్ అసోసియేషన్ (ADA) అధికారికంగా మొదలు పెట్టింది. దంతవైద్యంలో మైలురాళ్లను స్మరించుకోవడానికి ఈ రోజును పాటిస్తారు. ఉదాహరణకు, 1840లో డాక్టర్ హోరేస్ వెల్స్ మొదటిసారిగా అనస్థీషియాను ఉపయోగించారు. దంతవైద్యులు దంత సమస్యలను నయం చేయడమే కాకుండా నోటి అనారోగ్యానికి సంబంధించిన సంక్లిష్ట ఆరోగ్య సమస్యలను కూడా గుర్తిస్తారు. -
కాల్షియం ఎక్కువగా ఎందులో ఉంటుంది రాగులా? పాలా?
శరీరానికి కాల్షియం అనేక రోజువారీ పనులు చేసేందుకు ఉపకరిస్తుంది. అందువల్ల మన డైట్లో కాల్షియంని చేర్చుకోవడం ముఖ్యం. జున్ను, బొప్పాయి, మల్బరీ, లిచీ, కివి, బచ్చలికూర, బ్రకోలీలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. వీటిని రెగ్యులర్‌గా తినడం వల్ల చాలా సమస్యల్ని దూరం చేసుకోవచ్చు. ఆరోగ్యంగా కూడా ఉంటారు. పాలు, రాగుల్లో కాల్షియం ఎక్కువగా ఎందులో ఉంటుందంటే...పాలు, రాగులు రెండూ ఒకదానికి మించి లాభాలని అందిస్తాయి. ఉదాహరణకి..100 మి.లీ పాలు తాగితే 110 మిల్లీ గ్రాముల కాల్షియం లభిస్తుంది. అదే 100 గ్రాముల రాగులని తీసుకుంటే, దాదాపు 350 మిల్లీ గ్రాముల కాల్షియం లభిస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థని ఆరోగ్యంగా ఉంచితే, ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తహీనత ఉన్నవారికి రాగులు మంచిది. రాగుల్లో ఉండే పొటాషియం వంటి ఇతర పోషకాలు మొత్తం శరీర ఆరోగ్యానికి సాయపడతాయి. పాలలో పోషకాలతో పాటు ఉండే ఎలక్ట్రోలైట్స్ బాడీని హైడ్రేట్ చేస్తాయి. రాగులు షుగర్ ఉన్నవారికి చాలా మంచిది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండి గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది బ్లడ్ షుగర్ లెవల్స్‌ని నియంత్రిస్తుంది కాబట్టి, మీ అవసరాలని బట్టి ఏది మంచిదో నిర్ణయించుకోవడం ఉత్తమం.ఇదీ చదవండి: భరించలేని మోకాళ్ల నొప్పులకు.. సూపర్ ఫుడ్ ఈ లడ్డూ...అంతేనా!రాగులు, ఆరోగ్య ప్రయోజనాలుభారతదేశంలోని చాలా ప్రాంతాలలో రాగిగా ప్రసిద్ధి చెందిన ఫింగర్ మిల్లెట్ అతి ముఖ్యమైన చిరుధాన్యాలలో ఒకటి ప్రధాన ఆహారంగా పరిగణించబడుతుంది. ఇది సులభంగా జీర్ణం అవుతుంది కాబట్టి దీనిని తరచుగా శిశువులకు , వృద్ధులకు ఆహారంగా ఇవ్వవచ్చు. రాగులలో ప్రోటీన్ ,ఫైబర్స్ వంటి స్థూల పోషకాలతో పాటు, కాల్షియం, మెగ్నీషియం, మెథియోనిన్, లైసిన్, అమైనో ఆమ్లాలు ఉన్నాయి. సంతృప్తిగా ,కడుపు నిండిన అనుభూతిని ఎక్కువసేపు ఉంచుతుంది.ట్రిప్టోఫాన్ అనే ముఖ్యమైన అమైనో ఆమ్లం కలిగి ఉండటం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది.రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనకరంగా ఉంటుందిగ్లూటెన్ రహితం కాబట్టి గ్లూటెన్ అసహనం ఉన్నవారికి ఇది ఉపయోగపడుతుంది.తక్కువ కొవ్వును కలిగి ఉంటుంది , అసంతృప్త కొవ్వు అధికంగా ఉంటుంది.కాల్షియం మూలమైన రాగులు ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయిమొలకెత్తిన రాగులు విటమిన్ బి 12 అవసరాలను తీరుస్తాయి.శీతాకాలంలో ఇది బెస్ట్ ఫుడ్. శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది.ఇది మలబద్దకానికి సహాయపడుతుంది.ఎవరు తీసుకోకూడదుమూత్రపిండాల్లో రాళ్ళు, తీవ్రమైన మూత్రపిండాల వైఫల్యం వంటి మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు లేదా డయాలసిస్ చేయించుకుంటున్నవారురాగులలో పొటాషియం అధికంగా ఉంటుంది కనుక హైపర్కలేమియా లేదా సీరం పొటాషియం స్థాయిలు పెరిగినవారు. అలాగే రాగులు రాత్రి పూట తినకుండా ఉండటం మంచిది.ఇదీ చదవండి : ఇలాంటి పీడ కలలు మీకూ వచ్చాయా? అర్థం, అనర్థాలేమిటి?


