
ఎన్నో వెయిట్ లాస్ స్టోరీల్లో డైట్, జిమ్ వంటి వాటితో బరువు తగ్గడం చూశాం. కానీ ఈ మహిళ చివరి వరకు స్థిరంగా ఉంటూ..తినే ఆహారంలో ఎలాంటి మార్పులు చేయకుండానే తగ్గింది. తాను రెగ్యులర్‌గా తీసుకునే డైట్‌నే తీసుకుంటూ వెయిట్ లాస్ అయ్యింది. అది తనకు ఏవిధంగా సాధ్యమైందో ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకుంది.
కొందరు క్రమశిక్షణతో కూడిన జీవనశైలి, మరికొందరు ఓపికకు పెద్దపీటవేసి బరువు తగ్గడం జరుగుతుంది. కానీ ఈ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ సాచిపై నెమ్మదిగా, స్థిరమైన ప్రయత్నంతో అసాధారణ ఫలితాలను అందుకుంది. ఎలాంటి షార్ట్‌కట్‌లు, తీవ్రమైన డైట్‌లు అనుసరించలేదు. కేవలం క్వాండిటీలో మార్పు చేసింది. తాను రోజు తినే ఆహారంలో మార్పులేమి లేవు.
కేవలం తీసుకునే క్వాండిటీనే తగ్గించి తీసుకునేది. అలగే మొదట 20 నిమిషాల నడక నుంచి మొదలు పెట్టి 60 నిమిషాల వరకు నడిచేలా ప్లాన్ చేసింది. అలా పదివేల అడుగులు పైనే తీసుకుంది. ప్రోటీన్ జోడించడమే గాక అల్పాహారం తప్పనిసరి చేసుకుంది డైట్‌లో. అలాగే తరుచుగా బరువు తగ్గానా లేదా అని అద్దంలో చూసుకోవడం నివారించాల్సిందేనంటా. అప్పుడే బరువు తగ్గడంలో గణనీయమైన మార్పులు సంభవిస్తాయట.
తీసుకునే ఆహారం..
సాధారణంగా మొదట డబల్‌ఎక్స్‌ఎల్‌లో ఉన వ్యక్తి తన సైజుని ఎక్స్‌ఎస్ సైజుకి మార్చుకునేలా వ్యాయమాలు కూడా హెల్ప్ అయ్యాయి. మొదటి ఐదు నుంచి ఆరు నెలలు ఇంట్లో చేసే సాధారణ వ్యాయామాలు చేయగా, ఆమె స్టామినా పెరిగే కొద్దీ..భారీగా బరువులు ఎత్తేలా జిమ్‌కి వెళ్లటం, పైలేట్స్ వంటివి జోడించినట్లు పేర్కొంది. మార్షల్ ఆర్ట్స్‌తో కలగలసిన ఈత వ్యాయామాలు తన మెరుగైన శరీరాకృతి మార్పుకి దోహదపడిందని చెప్పుకొచ్చింది.
అలాగే తినే ఆహారంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండకుండా చూసుకునేదట. ముఖ్యంగా బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్డులోని తెల్లసొనతో అవకాడో, లెట్యూసక్ష, టమాటాలు, చికెన్ రోల్ చేసుకుని తినేదట. స్పైసీ రొయ్యల న్యూడిల్స్, హైడ్రేటెడ్‌గా ఉండేలా చూసుకోవడం, ఉల్లిపాయలు, క్యారెట్లు, బెల్‌పిప్పర్, క్యాబేజీ వంటి రంగురంగు కూరగాయలతో చేసిన స్పైసి రైస్ లేదా న్యూడిల్స్ తీసుకునేదట.
వీటి తోపాటు ఫిష్ ఫ్రై, సలాడ్, పప్పు అన్నం, తదితరాలు తీసుకునేదట. ఇవి తనకు ఆకలిని నియంత్రించేలా చేసి, ఎక్కువగా ఆకలి వేయకుండా కపాడేదని పేర్కొంది. తాను స్థిరత్వం, సమతుల్యమైన ఆహారంతో ఇంతలా విజయవంతంగా బరువు తగ్గాగలిగానంటోందామె.
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
(చదవండి: నటి తనిష్టా ఛటర్జీ ఎదుర్కొంటున్న ఒలిగోమెటాస్టాటిక్ కేన్సర్ అంటే..! ఎందువల్ల వస్తుందంటే..)