
ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం(అక్టోబర్ 10)ని పురస్కరించుకుని యువజన మీడియా ప్లాట్‌ఫామ్ ‘యువ’ భాగస్వామ్యంతో ‘స్నాప్ ఇంక్’ ఆధ్వర్యంలో ‘కేర్ నాట్ కంట్రోల్’ పేరిట కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ విషయాన్ని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
సోషల్ మీడియా, అభద్రత, ఒత్తిళ్లను దృష్టిలో పెట్టుకుని ఆన్‌లైన్ ప్రపంచాన్ని సురక్షితంగా మార్చడం టీనేజర్ల మధ్య ఆరోగ్యకరమైన సంభాషణలను పెంపొందించడమే ప్రధానంగా దీని ఉద్ధేశ్యమన్నారు. భారతీయ స్నాప్‌చాటర్‌ల డిజిటల్ శ్రేయస్సుకు ఇది మద్దతు అందిస్తుందని వివరించారు. ఈ వీడియో ప్రచారం ఈ నెల 10 వరకూ కొనసాగుతుందన్నారు.
చిన్నపాటి చిట్కాలు..
అలాగే బాగా ఒత్తిడిలో ఉన్నప్పుడువెంటనే అమ్మకు ఫోన్ చేసి ఆమె గొంతు వినండి... చిన్నప్పుడు అమ్మ పాడే జోలపాట వింటూ హాయిగా నిద్దురలోకి జారినంత తేలిగ్గా మీరు ఒత్తిడి నుంచి బయట పడతారని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.
(చదవండి: Custard Apple: సీజన్‌లో నిండుగా..సిటీలో పండు'గ'! జ్యూస్, ఐస్‌క్రీమ్స్, స్వీట్స్ నుంచి..)