అక్కడ అంతా ఆమే.. ! పాపం ఆ గ్రామం ఉనికి కోసం ఏం చేస్తోందంటే.. | Meet Monowi, The Last Remaining Resident Of Nebraska's Smallest Town Who Runs The Entire Municipality At The Age Of 90 | Sakshi
Sakshi News home page

తనకు తాను ఓటు వేసుకుని మేయర్‌ అయిన మహిళ..! ఎక్కడంటే..

Mar 3 2026 2:29 PM | Updated on Mar 3 2026 3:42 PM

Elsie Eiler: She votes for himself becomes Mayor

ఇప్పటివరకు వినని విచిత్రమైన గ్రామం ఇది. దీనికున్న ప్రత్యేకత అంత ఇంతకాదు. ఇలాంటి పట్టణాన్ని చూడటం అత్యంత అరుదు కూడా. దాని ఉనికిని కాపాడటం కోసం  ఈ మహిళ ఎంతలా కష్టపడుతుందో వింటే విస్తుపోతారు. ఎందుకు ఆమెకు ఈ వయసులో అంత తాపత్రయం అని కూడా అనిపిస్తుంది.

గ్రామీణ జీవితం ఎంత ఆహ్లాదభరితంగా ఉంటుందో తెలిసిందే. కానీ యువత ఉద్యోగాల కోసం, సంపాద‌న కోసం పట్టణాల బాట పట్టడంతో గ్రామాలు జనసందోహం లేక వెలవెలబోతున్నాయి. అలానే అమెరికాలోని నెబ్రాస్కా రాష్ట్రంలోని మోనోవి అనే అతి చిన్న పట్టణం ఉంది. సింపుల్‌గా చెప్పాలంటే ఓ చిన్న గ్రామం అనొచ్చు. ఒకప్పుడు చిన్నపట్టణంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ గ్రామం.. రానురాను దెయ్యాల గ్రామంలా మారిపోయింది. 

అంటే జనాలు లేని ఊరిలా నిర్మానుష్యంగా మారిపోయింది. అయితే అక్కడే ఉంటున్న ఏకైక నివాసి 90 ఏళ్ల ఎల్సీ ఐలర్ అనే మహిళ. ఆమె ఆ గ్రామం ఉనికిని చాటేందుకు నడుంకట్టి వార్తల్లో నిలిచింది. అక్కడ ఎవ్వరు లేకపోయినా ఐలర్‌ మాత్రం ఇక్కడే ఉంటూ తనకు తాను ఓటు వేసుకుంటూ ప్రభుత్వాన్ని నిలబెడుతోంది. మున్సిపల్‌ ఎలక్షన్స్‌ నుంచి అన్నింటిని నిర్వహిస్తుంది. తనకు తాను పన్నులు విధించుకుని కడుతుంది కూడా. 

మద్యం లైసెన్సుల దగ్గర నుంచి గుమస్తాగా, లైబ్రెరియన్‌గా అన్ని కార్యకలాపాలను ఆమెనే నిర్వర్తిస్తుంది. అందుకు సంబంధించిన పేపర్‌ వర్క్‌ని చూస్తూ ..రాష్ట్రం ఇక్కడి ప్రభుత్వాన్ని, గ్రామాన్ని గుర్తించేలా.. ప్రభుత్వ రికార్డుల్లో దాని ఉనికి ఉండేలా చేస్తోంది. చిన్న పట్టణంలా ఉండే ఈ గ్రామంలో పుష్కలంగా వ్యవసాయం, రైల్వేలైన్‌ తదితర అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఒకప్పుడు చాలామంది నివాసితులకు నిలయంగా ఉండేది. 

ఆర్థిక అవసరాల దృష్ట్యా యువత నగరాల బాట పట్టడంతో ఆ పట్టణం దాదాపు కనుమరుగయ్యే పరిస్థితికి వచ్చేసింది. అయితే ఐలర్‌ కుటుంబం మాత్రం ఆ గ్రామం ఉనికిని చాటేందుకు చాలా కష్టపడుతుండేది. కానీ అనుకోకుండా 2004లో ఐలర్‌ భర్త‌ మరణించడంతో ఆ గ్రామంలో మిగిలి ఉన్న ఏకైక నివాసిగా ఆమె మిగిలిపోయింది. 

అయితే ఆమె పట్టణాన్ని రద్దు చేయానికి బదులు జనాభా లెక్కల రికార్డుల్లో ఆ గ్రామం ఉండాలని ఐలర్‌ మిగతా పట్టణాల్లో జరిగే అన్ని రకాల ప్రభుత్వ కార్యకలాపాలను స్వయంగా నిర్వర్తిస్తోంది. పైగా ఈ మోనోవి గ్రామం ఏకైవ వ్యక్తి మున్సిపాలిటీ హోదాకు అక్కడి రాష్ట్రం గుర్తింపు ఇవ్వడం విశేషం. ఈ నేపథ్యంలోనే ఈ చిన్న పట్టణం అంతర్జాతీయంగా కుతుహలం పెంచేలా వార్తల్లో నిలవడమే గాక.. అమెరికన్‌ గ్రామీణ జనాభా తగ్గుదలను కూడా హైలెట్‌ చేస్తోంది. 

చదవండి: 93 ఏళ్ల వయసులోనూ చలాకీగా విదేశీ బామ్మ..! ఆమె హెల్త్‌ సీక్రెట్‌ ఇదే..
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement