ఇరాన్‌ యుద్ధంపై ట్రంప్‌ సంచలనం | Trump says he will destroy Iran missiles, navy, and nuclear program | Sakshi
Sakshi News home page

ఇరాన్‌ యుద్ధంపై ట్రంప్‌ సంచలనం

Mar 3 2026 7:33 AM | Updated on Mar 3 2026 8:45 AM

Trump says he will destroy Iran missiles, navy, and nuclear program

వాష్టింగన్‌: పశ్చిమాసియాలో అంతకంతకూ ఉద్రిక్తలు పెరుగుతున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ అగ్నికి ఆజ్యం పోశారు. ఇరాన్‌ దాడులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు కంబాట్‌ దాడులే చేశాం. అవసరమైతే అమెరికా సైన్యాన్ని ఇరాన్‌కు పంపిస్తాం. ప్రత్యక్ష యుద్ధం చేస్తాం’అని స్పష్టం చేశారు. 

ఇరాన్‌పై కొనసాగుతున్న దాడులపై డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందించారు. ఇరాన్‌ ప్రతిసారి అబద్ధం చెబుతోంది. ఇరాన్‌ దగ్గర అమెరికాను టార్గెట్‌ చేసే మిసైల్‌ వ్యవస్థ ఉంది. ఇరాన్‌ నాయకత్వం లొంగిపోయేందుకు సిద్ధంగా ఉంది. ఇరాన్‌లో ఆపరేషన్‌ ఫ్యూరీ కొనసాగుతుంది.

అణ్వాయుధాల తయారీని ఇరాన్‌ ఆపడం లేదు. ఇరాన్‌ అణ్వాయుధాలు కలిగి ఉండటం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించం. ఖమేని మరణంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్‌కు చెందిన మొత్తం యుద్ధ నౌకల్ని ధ్వంసం చేశాం. ఆదేశంపై మరిన్ని దాడులు జరుపుతాం.

ఇరాన్‌ బాలిస్టిక్‌ క్షిపణులను నాశనం చేస్తాం. ఇప్పటికే ఇరాన్‌ నావికాదళాన్ని తుడిచిపెట్టాం. ఇరాన్‌ క్షిపణి కేంద్రాలను భూగర్భంలో కొండల మధ్య దాచింది. అమెరికా,ఇజ్రాయెల్ సైన్యాలకు పెనుసవాల్‌గా మారింది. లక్ష్యాలను సాధించడానికి నాలుగు నుంచి ఐదు వారాల సమయం పడుతుంది. అవసరమైతే గ్రౌండ్‌ ట్రూప్స్‌ పంపడానికి వెనకాడబోం. ఇవాళ రాత్రంతా ఇరాన్‌పై దాడులు జరుపుతాం’అని హెచ్చరించారు.

ఇజ్రాయెల్‌,అమెరికా లక్ష్యంగా ఇరాన్‌ దాడుల్ని తీవ్రతరం చేసింది. ఈ క్రమంలో సౌదీ రియాద్‌లో యూఎస్‌ ఎంబీసీపై ఇరాన్‌ రెండు డ్రోన్లతో దాడి చేసింది. ఈ దాడులతో రాయబార కార్యాలయం అగ్నికి ఆహుతైంది. అమెరికా ఎంబసీపై ఇరాన్‌ దాడిని ట్రంప్‌ ఖండించారు. ఇరాన్‌కు గట్టి బుద్ధి చెబుతాం. ప్రతీకారం ఎలా ఉంటుందో చూపిస్తాం’అని పునరుద్ఘాటించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement