ఏఐ సదస్సులో ఎనిమిదేళ్ల చిచ్చరపిడుగు..! టెక్‌ దిగ్గజాలు సైతం.. | 8 Year Old Ranveer Sachdeva Became The Youngest Speaker At India AI Impact Summit 2026 With Keynote Speech | Sakshi
Sakshi News home page

ఏఐ సదస్సులో ఎనిమిదేళ్ల చిచ్చరపిడుగు..! టెక్‌ దిగ్గజాలు సైతం..

Feb 20 2026 5:35 PM | Updated on Feb 20 2026 5:53 PM

8 year old became the youngest speaker at india ai impact summit 2026

భారత్‌ మండపంలో ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌ 2026ను గురువారం ప్రధాని నరేంద్ర మోదీ అట్టహాసంగా ప్రారంభించారు. దిగ్గజ సీఈవోలు, ప్రపంచ సాంకేతిక నిపుణులు, ప్రముఖ నాయకులు విచ్చేసిన ఈ సదస్సులో ఒక ఆశ్చర్యకరమైన ఘటన చోటు చేసుకుంది. అందరి ప్రసంగాలు పూర్తి అయ్యాక ఎనిమిదేళ్ల రణ్‌వీర్ సచ్‌దేవా అతి పిన్న వయస్కుడైన ‘కీ నోట్ స్పీకర్’గా వేదికపైకి వచ్చినప్పుడు ఒక్కసారిగా గది అంతా నిశబ్దంగా మారిపోయింది. 

విప్లవాత్మక అల్గారిథంలు, తదుపరి తరం మౌలిక సదుపాయాల గురించి తన వయసుకి మించిన జ్ఞానంతో అలవోకగా మాట్లాడి అందర్ని నిశ్చేష్టులయ్యేలా చేశాడు. ఆ బాలుడి ప్రసంగం అక్కడున్న వారందర్నీ మంత్రముగ్ధుల్ని చేసింది. అలాగే భారతీయ తత్వశాస్త్రం కృత్రిమ మేధస్సు (AI)తో ఎలా జతకడుతుంది, AI పట్ల తనకున్న తన ప్రత్యేక ఆసక్తిని, దృక్పథాన్ని పంచుకున్నాడు. ఈ ఏఐ సాంకేతికతకు సంబంధించిన పలు అంశాల గురించి మాట్లాడుతూ..సాంకేతికత పట్ల ఉన్న తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. 

ఈ శిఖరాగ్ర సమావేశంలో రణవీర్‌  గూగుల్‌ సీఈవో సుందర్ పిచాయ్ ఓపెన్‌ ఏఐ  సీఈవో సామ్ ఆల్ట్‌మన్‌లను కలిశాడు. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. కాగా, ఈ ఏఐ విప్లవం వెనుకున్న ఇద్దరు ప్రముఖులతో ఎనిమిదేళ్ల బాలుడు కలిసి పనిచేయడం, అ‍క్కడున్న టెక్‌ దిగ్గజాలతో సంభాషించడం తదితరాలు నెట్టింట తెగ వైరల్‌ అయ్యాయి.

ప్రపంచంలోని ప్రముఖ టెక్నాలజీ కాన్ఫరెన్స్‌లలో ఒకదానిలో మాట్లాడటం అంత చిన్న విషయం కాదు. అయితే రణ్‌వీర్ టెక్ ప్రపంచానికి కొత్తేమీ కాదు. అతను మూడేళ్ల వయసులోనే కోడింగ్ ప్రారంభించాడు, గతంలో ప్రపంచవ్యాప్తంగా కీనోట్స్‌లో మాట్లాడాడు. తన వయస్సుకు మించి మెషిన్ లెర్నింగ్ మోడల్స్‌ను అధ్యయనం చేశాడు. 

అప్పటి నుండి అతను ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు. లక్షలాది మందికి ప్రేరణగా మారుతున్నాడు. పైగా టెక్నాలజీకి వయోపరిమితి లేదని రణ్‌వీర్ ప్రపంచానికి చాటి చెప్పాడు.

 

(చదవండి: Actress Sneha and Prasanna: మైండ్‌ఫుల్‌ పేరెంటింగ్‌ మంత్ర!)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement