Business
-
అక్షయ తృతీయ.. రూ.16,000 కోట్ల అమ్మకాలు
న్యూఢిల్లీ: అక్షయ తృతీయ రోజున (నేడు) దేశవ్యాప్తంగా రూ.16,000 కోట్ల విలువైన ఆభరణాల అమ్మకాలు నమోదు కావొచ్చని ఆల్ ఇండియా జ్యుయలర్స్ అండ్ గోల్డ్‌స్మిత్ ఫెడరేషన్ అంచనా వేస్తోంది. ధరలు గణనీయంగా పెరిగిపోయిన నేపథ్యంలో బంగారం, వెండి కొనుగోళ్లలో మిశ్రమ ధోరణి ఉంటుందని అఖిల భారత రిటైల్ వర్తకుల సమాఖ్య (సీఏఐటీ) అంచనా వేసింది. ప్రస్తుతం బంగారం ధర 10 గ్రాములకు రూ.లక్ష స్థాయిలో ఉండగా, వెండి ధర సైతం కిలోకి రూ.లక్ష సమీపంలో ఉండడం గమనార్హం. గతేడాది అక్షయ తృతీయ నుంచి బంగారం ధర చెప్పుకోతగ్గ స్థాయిలో పెరిగిపోవడం తెలిసిందే. ‘‘సాధారణంగా అక్షయ తృతీయ రోజున కొనుగోళ్లు పెరుగుతుంటాయి. ధరలు పెరిగిపోవడం ఈ ఏడాది వినియోగ డిమాండ్‌పై ప్రభావం చూపించొచ్చు. అక్షయ తృతీయ రోజున 12 టన్నుల బంగారం (రూ.12,000 కోట్లు), 400 టన్నుల వెండి (రూ.4,000 కోట్లు) కలిపి మొత్తం మీద రూ.16,000 కోట్ల అమ్మకాలు ఉండొచ్చని అంచనా’’అని ఆల్ ఇండియా జ్యుయలర్స్ అండ్ గోల్డ్‌స్మిత్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ పంకజ్ అరోరా తెలిపారు. కస్టమర్ల కొనుగోళ్ల సెంటిమెంట్ కొంత తగ్గొచ్చన్నారు.అంతర్జాతీయంగా భౌగోళిక, వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సురక్షిత సాధనంగా బంగారంలో పెట్టుబడులు పెరిగిపోవడం ధరల ర్యాలీకి కారణమని తెలిసిందే. ప్రస్తుతం వివాహాల సీజన్ నడుస్తుండడం జ్యుయలరీ డిమాండ్ పడిపోకుండా సాయపడుతున్నట్టు సీఏఐటీ నేషనల్ ప్రెసిడెంట్ బీసీ భార్తియా తెలిపారు. అక్షయ తృతీయ సందర్భంగా అమ్మకాలు పెంచుకునేందుకు ప్రముఖ జ్యయలరీ సంస్థలు ధరలో, తయారీ చార్జీల్లో తగ్గింపును ఇప్పటికే ప్రకటించాయి. -
సోలార్ కాంట్రాక్టుల్లో అవకతవకలేమీ జరగలేదు
న్యూఢిల్లీ: సౌర విద్యుత్ కాంట్రాక్టులు దక్కించుకునే విషయంలో తాము ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదంటూ స్వతంత్ర దర్యాప్తులో తేలిందని అదానీ గ్రీన్ వెల్లడించింది. సౌర విద్యుత్ కాంట్రాక్టుల కోసం భారత్‌లో ప్రభుత్వ వర్గాలకు లంచాలిచ్చారని, అమెరికన్ ఇన్వెస్టర్ల నుంచి నిధులు సమీకరించే క్రమంలో ఆ విషయాన్ని దాచిపెట్టారని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతం అదానీ, ఆయన సోదరుడి కుమారుడు సాగర్ అదానీ, ఎండీ వినీత్ జైన్‌లపై అమెరికాలో అభియోగాలు మోపారు. అదానీ గ్రూప్ ఈ ఆరోపణలను ఖండించింది. స్వతంత్ర దర్యాప్తులో అవకతవకలు జరగలేదని వెల్లడైనట్లు అదానీ గ్రీన్ పేర్కొంది. -
హైదరాబాద్‌లో ఆజాద్ ఇంజినీరింగ్ తయారీ ప్లాంటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీఈ వెర్నోవాకి చెందిన స్టీమ్ పవర్ సర్వీసెస్ అవసరాల కోసం హైదరాబాద్‌లో లీన్ తయారీ ప్లాంటును ప్రారంభించినట్లు ప్రెసిషన్ ఇంజినీరింగ్ సంస్థ ఆజాద్ ఇంజినీరింగ్ వెల్లడించింది. ఈ ప్లాంటు లో 180 మంది సుశిక్షితులైన ప్రొఫెషనల్స్ ఉండగా, రాబోయే రోజుల్లో వందల సంఖ్యలో మరింత మంది నిపుణులను రిక్రూట్ చేసుకోనున్నట్లు సంస్థ చైర్మన్ రాకేష్ చోప్దార్ వివరించారు. ఈ ఫ్యాక్టరీ నుంచి ఏటా 1,00,000 బ్లేడ్లను ఉత్పత్తి చేయనున్నట్లు చెప్పారు. ఏరోస్పేస్, డిఫెన్స్, ఎనర్జీ, ఆయిల్..గ్యాస్ తదితర రంగాల సంస్థలతో పటిష్టమైన భాగస్వామ్యాలు కుదుర్చుకునేందుకు ఇలాంటి వ్యూహాలు తోడ్పడగలవని రాకేష్ తెలిపారు. -
సూచీలకు స్వల్ప లాభాలు
ముంబై: ఒడిదుడుకుల ట్రేడింగ్‌లో భాగంగా స్టాక్ సూచీలు మంగళవారం స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. సెన్సెక్స్ 70 పాయింట్లు పెరిగి 80,288 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఏడు పాయింట్ల నామమాత్ర లాభంతో 24,336 వద్ద నిలిచింది. వరుసగా రెండో రోజూ లాభాల్లో నిలిచాయి. భారత్–పాక్‌ల మధ్య నెలకొన్న భౌగోళిక ఉద్రికత్త పరిస్థితుల దృష్ట్యా ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. సెన్సెక్స్ 443 పాయింట్లు ఎగసి 80,661 వద్ద, నిఫ్టీ 129 పాయింట్లు పెరిగి 24,458 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి.ఐటీ, క్యాపిటల్ గూడ్స్, ఇండస్ట్రియల్, కన్జూమర్ రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. మెటల్, యుటిలిటీ, టెలీకమ్యూనికేషన్, సర్విసెస్, బ్యాంకులు, ఫైనాన్స్ సర్విసెస్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ 27 పైసలు బలపడి 84.96 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. మెరుగైన ఫలితాలతో పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ 4% పెరిగి రూ.1,031 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో 10% ఎగసి రూ.1,085 తాకింది రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు 2%, టీసీఎస్, ఇన్ఫోసిస్ షేర్లు ఒకశాతం చొప్పున రాణించి సూచీలకు దన్నుగా నిలిచాయి. -
బజాజ్ ఫైనాన్స్ బోనస్ బొనాంజా
న్యూఢిల్లీ: ఎన్బీఎఫ్సీ దిగ్గజం బజాజ్ ఫైనాన్స్ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 16 శాతం ఎగసి రూ. 3,940 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో రూ. 3,402 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 12,764 కోట్ల నుంచి రూ. 15,808 కోట్లకు జంప్ చేసింది.స్టాండెలోన్ ఫలితాలివి. వడ్డీ ఆదాయం రూ. 11,201 కోట్ల నుంచి రూ. 13,824 కోట్లకు బలపడింది. కాగా.. కన్సాలిడేటెడ్ నికర లాభం సైతం 19 శాతం వృద్ధితో రూ. 4,546 కోట్లకు చేరింది. నిర్వహణలోని మొత్తం ఆస్తులు(ఏయూఎం) 26 శాతం ఎగసి రూ. 4,16,661 కోట్లయ్యాయి. 2025 మార్చి31కల్లా స్థూల మొండి బకాయిలు(ఎన్పీఏలు) 0.96 శాతం, నికర ఎన్పీఏలు 0.44 శాతంగా నమోదయ్యాయి. అందుబాటులోకి షేరు బజాజ్ ఫైనాన్స్ వాటాదారులకు రూ. 2 ముఖ విలువగల ఒక్కో షేరుకి రూ. 44 డివిడెండ్ చెల్లించనుంది. రూ. 2 ముఖ విలువగల ప్రతీ షేరుని రూ. 1 ముఖ విలువగల 2 షేర్లుగా విభజించనుంది. అంతేకాకుండా 4:1 నిష్పత్తిలో బోనస్ ప్రకటించింది. అంటే వాటాదారుల వద్దగల ప్రతీ 1 షేరుకి 4 షేర్లు ఉచితంగా జారీ చేయనుంది. ఈ ప్రతిపాదనలను తాజాగా బోర్డు అనుమతించినట్లు కంపెనీ వెల్లడించింది. కాగా.. గతంలో నమోదు చేసిన రూ. 249 కోట్ల పన్ను వ్యయాలను రివర్స్ చేసింది. దీంతో పూర్తి ఏడాదిలో పన్ను ప్రొవిజన్ రూ. 99 కోట్లకు పరిమితమైనట్లు పేర్కొంది. వెరసి క్యూ4లో రూ. 348 కోట్ల పన్ను తగ్గినట్లు తెలిపింది. ఫలితాల నేపథ్యంలో బజాజ్ ఫైనాన్స్ షేరు బీఎస్ఈలో నామమాత్ర నష్టంతో రూ. 9,089 వద్ద ముగిసింది. -
ఇండస్ఇండ్ సీఈఓ రాజీనామా!
న్యూఢిల్లీ: అకౌంటింగ్ అవకతవకల నేపథ్యంలో ఇండస్ఇండ్ బ్యాంక్‌లో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఎండీ, సీఈవో సుమంత్ కథ్పాలియా మంగళవారం రాజీనామా చేశారు. అంతకన్నా ముందే సోమవారం నాడు డిప్యుటీ సీఈవో అరుణ్ ఖురానా తప్పుకోగా, ఈ ఉదంతం బైటపడటానికి ముందే చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌వో) గోవింద్ జైన్ వైదొలిగారు. డెరివేటివ్స్ పోర్ట్‌ఫోలియోలో దాదాపు రూ. 1,960 కోట్ల మేర అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఇవి ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కథ్పాలియా రాజీనామా ఏప్రిల్ 29న పని గంటలు ముగిసిన తర్వాత నుంచి తక్షణమే అమల్లోకి వచ్చినట్లు బ్యాంకు తెలిపింది.తన దృష్టికి వచ్చిన అంశాల విషయంలో తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమైనందుకు గాను నైతిక బాధ్యత వహిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కథ్పాలియా వివరించారు. శాశ్వత ప్రాతిపదికన కొత్త సీఈవోను నియమించే వరకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బాధ్యతలను నిర్వర్తించేందుకు ఎగ్జిక్యూటివ్స్ కమిటీని ఏర్పాటు చేసేందుకు అనుమతించాల్సిందిగా ఆర్బీఐని ఇండస్ఇండ్ బ్యాంక్ కోరింది. డెరివేటివ్స్ లావాదేవీల అకౌంటింగ్ విధానాల్లో తేడాల వల్ల 2024–25 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు నికర విలువపై రూ. 1,979 కోట్ల మేర ప్రతికూల ప్రభావం పడుతుందంటూ బైటి ఏజెన్సీ నివేదిక ఇచ్చినట్లు బ్యాంకు ఇటీవలే ప్రకటించింది. దీని వల్ల 2024–25లో బ్యాంకు నికర లాభాలు భారీగా క్షీణించవచ్చని లేదా నష్టాలను ప్రకటించవచ్చని అంచనాలు నెలకొన్నాయి. క్యూ4 ఫలితాలను ఎప్పుడు ప్రకటించేది బ్యాంకు ఇంకా వెల్లడించలేదు. ఏం జరిగిందంటే.. డెరివేటివ్స్ పోర్ట్‌ఫోలియోను లెక్కగట్టే అకౌంటింగ్ విధానాల్లో లోపాల కారణంగా బ్యాంక్ నికర విలువపై సుమారు 2.35 శాతం ప్రతికూల ప్రభావం పడొచ్చని ఇండస్ఇండ్ బ్యాంక్ గత నెల ప్రకటించడం కలకలం రేపింది. దీనిపై స్వతంత్ర విచారణ జరిపేందుకు మార్చి 20న బ్యాంకు ఓ ప్రొఫెషనల్ సంస్థను నియమించింది. అంతర్గతంగా డెరివేటివ్స్ ట్రేడ్లను నమోదు చేయడంలో లోపాల వల్ల ఊహాజనిత లాభాలు నమోదు కావడమే అకౌంటింగ్ అవకతవకలకు దారి తీసిందని, దీనితో మొత్తం గణాంకాలన్నీ మారిపోయాయని సదరు సంస్థ తన నివేదికలో విశ్లేషించింది.ఆర్బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా గతేడాది ఏప్రిల్ 1 నుంచి ఇంటర్నల్ డెరివేటివ్ ట్రేడింగ్‌ను బ్యాంక్ నిలిపివేసినప్పటికీ, అంతకన్నా ముందు 5–7 ఏళ్లుగా డెరివేటివ్స్ పోర్ట్‌ఫోలియో ఖాతాల్లో వ్యత్యాసాలు నమోదవుతూ వస్తున్నాయి. ఇది అంతర్గత, ఆర్బీఐ ఆడిట్లలో కూడా బైటపడకపోవడం గమనార్హం. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఎండీగా సుమంత్‌ను మరో మూడేళ్ల పాటు పొడిగించాలన్న బ్యాంక్ ప్రతిపాదనకు ఆర్బీఐ నిరాకరించి, ఏడాదికే అనుమతించడం పరిస్థితి తీవ్రతపై సందేహాలు రేకెత్తాయి. షేరు క్రాష్..!ఈ క్రమంలోనే ఇండస్ఇండ్ బ్యాంకు షేరు ఏడాది గరిష్ట స్థాయి రూ. 1,576 నుంచి ఒక దశలో సుమారు యాభై శాతం పైగా పతనమైంది. ప్రస్తుతం రూ. 837 వద్ద ట్రేడవుతోంది. అయితే, తాజా వరుస రాజీనామాల పరిణామాలతో బుధవారం బ్యాంకు షేర్లు గణనీయంగా క్షీణించే అవకాశం ఉందని అంచనాలు నెలకొన్నాయి. -
2025 కేర్ఎడ్జ్ స్టేట్ ర్యాంకింగ్స్: అగ్రస్థానంలో మహారాష్ట్ర
2025లో అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాలుగా మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక మొదటి వరుసలో నిలిచాయి. మంగళవారం విడుదలైన తాజా కేర్ఎడ్జ్ రేటింగ్స్ స్టేట్ ర్యాంకింగ్‌లో పశ్చిమ, దక్షిణ ప్రాంతాలు ప్రధమ స్థానాల్లో ఆధిపత్యం చెలాయిస్తున్నట్లు తెలిసింది. ఆర్థిక, మౌలిక సదుపాయాలు, సామాజిక, పాలన, పర్యావరణం ఆధారంగా ఈ ర్యాంకింగ్స్ ఇవ్వడం జరిగింది.ఆర్ధిక, సామాజిక విషయాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలువగా.. ఆర్థిక పనితీరులో గుజరాత్ ముందుంది. కర్ణాటక పారిశ్రామిక, పర్యావరణ సూచికలలో ముందు వరుసలో ఉంది. పశ్చిమ రాష్ట్రాలు ఆర్థిక పరంగా ముందు స్థానంలో ఉండగా.. దక్షిణాది రాష్ట్రాలు పాలన, పర్యావరణం, సామాజిక రంగాలలో రాణించాయి.ఆర్థిక అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, ఆర్థిక సూచికలలో బలమైన ప్రదర్శనలతో.. ఈశాన్య, కొండ ప్రాంతాలు.. చిన్న రాష్ట్రాలలో గోవా అత్యున్నత స్థానంలో ఉంది. కేంద్రపాలిత ప్రాంతాలను ఈ విశ్లేషణలో చేర్చలేదు.తలసరి స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (GSDP), అధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI), పరిశ్రమలకు బలమైన స్థూల స్థిర మూలధన నిర్మాణం (GFCF) ద్వారా 'గుజరాత్' ఆర్థిక రంగంలో అగ్రస్థానంలో నిలిచింది. స్థూల విలువ ఆధారిత (GVA)లో పరిశ్రమ, సేవలలో మహారాష్ట్ర, కర్ణాటక అధిక వాటాను పొందాయి.రెవెన్యూ లోటు, వడ్డీ చెల్లింపులు, రుణ స్థాయిలు, ఆర్థిక హామీలపై మంచి స్కోరు సాధించిన 'ఒడిశా' ఆర్థిక రంగంలో మంచి స్కోర్ సాధించింది. బ్యాంకులు, NBFCల బలమైన రుణ పంపిణీ, మ్యూచువల్ ఫండ్స్, ఆరోగ్య బీమా అధిక వ్యాప్తి ద్వారా మహారాష్ట్ర ఆర్థిక అభివృద్ధిలో కూడా ముందుంది.తలసరి విద్యుత్ లభ్యత, రైల్వే సాంద్రత, నికర నీటిపారుదల ప్రాంతం పరంగా పంజాబ్ & హర్యానా అధిక స్కోర్లతో మౌలిక సదుపాయాలలో అత్యుత్తమ స్థానాలను పొందాయి. సామాజిక సూచికలలో కేరళ ముందుంది. వ్యాపార వాతావరణం, న్యాయ సామర్థ్యం, పరిపాలనా బలం పరంగా ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది.పర్యావరణ పనితీరులో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ముందు వరుసలో నిలిచాయి, కర్ణాటక గాలి నాణ్యత, పునరుత్పాదక శక్తిలో ముందంజలో ఉంది. అటవీ విస్తీర్ణం మార్పులు, త్రాగునీటి లభ్యతలో తెలంగాణ మంచి స్కోర్ చేసింది. -
తెలుగు రాష్ట్రాల్లో మూడు రెట్ల వృద్ధి: టాటా ఏఐజీ
హైదరాబాద్: గత ఏడాది వ్యవధిలో 82,000 పైచిలుకు పాలసీదారులకు కవరేజీని అందించడం ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌వ్యాప్తంగా తమ రిటైల్ హెల్త్ పోర్ట్‌ఫోలియోలో మూడు రెట్లు వృద్ధి సాధించినట్లు భారత్‌లో అగ్రగామి జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ 'టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్' వెల్లడించింది. జాతీయ సగటు కన్నా ఆరోగ్య బీమా విస్తృతి తక్కువగా ఉంటున్న దక్షిణాది మార్కెట్లలో విశ్వసనీయమైన బీమా సాధనాలకు పెరుగుతున్న డిమాండ్‌కి ఈ వృద్ధి నిదర్శనంగా నిలుస్తుంది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని 51 జిల్లాల్లో కంపెనీ తన కార్యకలాపాలను పటిష్టం చేసుకుంది. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, వరంగల్, కరీంనగర్, నెల్లూరులో కీలక శాఖలను ఏర్పాటు చేసింది. టాటా ఏఐజీ నెట్వర్క్, 1,600 పైగా ఆసుపత్రులు, 14,500 అడ్వైజర్లతో సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య, బీమా సేవలను మరింత అందుబాటులోకి తీసుకొచ్చి, జీవనోపాధి అవకాశాలను కూడా సృష్టిస్తోంది.వైద్య బీమా సేవల లభ్యతను మరింతగా పెంచే దిశగా కంపెనీ కొత్తగా మెడికేర్ సెలెక్ట్ పేరిట, మారుతున్న కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ఉండే సరళతరమైన, తక్కువ వ్యయాలతో కూడుకున్న హెల్త్ ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టింది. జాతీయ స్థాయిలో సగటున వైద్యచికిత్సల ద్రవ్యోల్బణం 13 శాతం స్థాయిలో ఉండగా, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లో 16 శాతానికి పెరిగిన నేపథ్యంలో ఈ పెను సవాలును అధిగమించేందుకు, కస్టమర్లకు కీలక పరిష్కారాన్ని అందించేందుకు ఈ సాధనం తోడ్పడగలదు.నవజాత శిశువుల నుంచి సీనియర్ల వరకు, ఎటువంటి వయోపరిమితి లేకుండా అన్ని వర్గాల కస్టమర్లకు అనువైనదిగా, అందుబాటు ప్రీమియంలతో ఉండేలా మెడికేర్ సెలెక్ట్ రూపొందించబడింది. వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా మార్చుకోతగిన విధంగా ఇది ఉంటుంది. జీవితకాల యంగ్ ఫ్యామిలీ డిస్కౌంట్, 7.5% శాలరీ డిస్కౌంట్లాంటి ఉపయుక్తమైన ఫీచర్ల కారణంగా అన్ని రకాల ఆదాయవర్గాల వారు, జీవితంలో వివిధ దశల్లో ఉన్న వారికి ఇది అనువైనదిగా ఉంటుంది.గడిచిన మూడేళ్లుగా.. తెలంగాణ & ఆంధ్రప్రదేశ్‌లో క్యాన్సర్ చికిత్స కోసం ఆసుపత్రిలో చేరే ఉదంతాలు అగ్రస్థానంలో ఉంటున్నాయి. ఖర్చులు 25 శాతం పెరగ్గా, సగటు ట్రీట్మెంట్ వ్యయాలు రూ. 1.6 లక్షలకు చేరాయి. కరోనరీ ఆర్టెరీ డిసీజ్ (సీఏడీ) చికిత్స వ్యయాలు 40% పెరిగాయి. సగటు ఖర్చులు కూడా రూ. 1.6 లక్షలకు చేరాయి. 2025లో టాటా ఏఐజీ ఒక కార్డియోవాస్కులర్ కండీషన్ (CAD with STEMI) కేసుకి సంబంధించి హైదరాబాద్‌లో అత్యధికంగా రూ. 1 కోటి హెల్త్ క్లెయిమ్ చెల్లించింది. తీవ్రమైన కిడ్నీ డిసీజ్ (సీకేడీ) చికిత్స ఖర్చులు 38% పెరిగాయి. ఇవన్నీ కూడా అత్యవసరంగా అందుబాటు ప్రీమియంలతో హెల్త్‌కేర్ లభ్యత ఆవశ్యకతను సూచిస్తున్నాయి. -
ఈ స్కూటర్లపై రూ.40000 డిస్కౌంట్: అదే రోజు డెలివరీ..
అక్షయ తృతీయ (Akshaya Tritiya 2025) సందర్భంగా బంగారం కొనుగోలు చేసేవారు మాత్రమే కాకుండా.. కొత్త వాహనాలను కొనుగోలు చేసేవారి సంఖ్య కూడా ఎక్కువే ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని దేశీయ వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ అద్భుతమైన ఆఫర్స్ అందించడం మొదలుపెట్టింది.ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ అక్షయ తృతీయను పురస్కరించుకుని 72 గంటల ఎలక్ట్రిక్ రష్ అనే లిమిటెడ్ టైమ్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇది ఏప్రిల్ 30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ సమయంలో ప్రత్యేక తగ్గింపులు, ఉచిత పొడిగించిన వారంటీలు..ఎంపిక చేసిన రాష్ట్రాల్లో అదే రోజు స్కూటర్ డెలివరీలు కూడా ఉంటాయి.ఓలా ఎలక్ట్రిక్ ఇస్తున్న ఆఫర్ సమయంలో.. జెన్ 2, జెన్ 3 మోడళ్లతో సహా S1 పోర్ట్‌ఫోలియో అంతటా రూ.40,000 తగ్గింపు పొందవచ్చు. ఈ తగ్గింపులు తరువాత Gen 2 స్కూటర్ల ధరలు రూ. 67,499 నుంచి.. Gen 3 లైన్అప్ ధర రూ. 73,999 నుంచి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్) ప్రారంభమవుతుంది.ఓలా #హైపర్‌డ్రైవ్ సర్వీస్ కింద.. అదే రోజు డెలివరీ, రిజిస్ట్రేషన్ వంటివి చేయనున్నట్లు ప్రకటించింది. ఈ సదుపాయం బెంగళూరులో మాత్రమే అందుబాటులో ఉంది. కొనుగోలుదారులు స్కూటర్లను ఆన్లైన్లో లేదా డీలర్‌షిప్‌లో కొనుగోలు చేసుకోవచ్చు.అక్షయ తృతీయ ఆఫర్స్ ఇస్తున్న ఇతర కంపెనీలుఅక్షయ తృతీయ సందర్భంగా ఓలా ఎలక్ట్రిక్ మాత్రమే కాకుండా.. బజాజ్ ఆటో, హోండా మోటార్ సైకిల్ వంటివి కూడా ఆఫర్స్ అందిస్తున్నాయి. అయితే ఏ కంపెనీ ఎంత ఆఫర్ ఇస్తుందనే విషయం తెలుసుకోవడానికి మీ సమీపంలోని బ్రాండ్ డీలర్షిప్ సందర్శించి తెలుసుకోవచ్చు. -
1925లో బంగారం రేటు ఇంత తక్కువా?
భారతీయులు అలంకార ప్రియులు. కాబట్టి చాలామంది ఆభరణాలను ధరిస్తారు. ఆభరణాలలో కూడా ఎక్కువగా బంగారమే ఉంటుంది. ఇప్పుడు (2025లో) గోల్డ్ అంటే.. కొనడానికి కూడా కొంతమంది వెనుకడుగు వేస్తున్నారు. అయితే ఒకప్పుడు (1925లో) తులం పసిడి రేటు రూ. 18.75 ఉండేదంటే బహుశా కొందరు నమ్మక పోవచ్చు. నమ్మకపోయినా అదే నిజం. ఈ కథనంలో శతాబ్దానికి ముందు ఇండియాలో గోల్డ్ రేటు ఎలా ఉండేదో తెలుసుకుందాం.▸1925: రూ. 18.75▸1935: రూ. 30.81▸1945: రూ. 62.00▸1955: రూ. 79.00▸1965: రూ. 72.00▸1975: రూ. 540.00▸1985: రూ. 2130.00▸1995: రూ. 4680.00▸2005: రూ. 7000.00▸2015: రూ. 26845.00▸2016: రూ. 29560.00▸2017: రూ. 29920.00▸2018: రూ. 31730.00▸2019: రూ. 36080.00▸2020: రూ. 48480.00▸2021: రూ. 50000.00▸2022: రూ. 53000.00▸2023: రూ. 60000.00▸2024: రూ. 80000.00▸2025: రూ. 97970.001925లో 10 గ్రాముల రూ.18.75 వద్ద ఉండేది. అయితే ఈ రోజు గోల్డ్ రేటు రూ. 97,970 వద్దకు చేరింది. అంటే వందేళ్లలో బంగారం ధర 97951.25 రూపాయలు పెరిగింది.బంగారం ధరలు పెరగడానికి కారణాలుబంగారం ధరలు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. బంగారం కొనేవారి సంఖ్య ఎక్కువవ్వడం, నిల్వలు తక్కువ కావడం. భౌగోళిక, రాజకీయ కారణాలు. బంగారం మీద పెట్టుబడి పెట్టే వారి పెరగడం కూడా గోల్డ్ ధరలు పెరగడానికి కారణమయ్యాయి. దీంతో పసిడి ధర సుమారు లక్ష రూపాయలకు చేరింది.ఇదీ చదవండి: భద్రత కోసం రూ.70 కోట్లు!.. సుందర్ పిచాయ్ జీతం ఎంతంటే? -
తయారీని బలోపేతం చేసేందుకు కమిటీ: నీతి ఆయోగ్ సీఈవో
న్యూఢిల్లీ: ప్రతిపాదిత జాతీయ తయారీ కార్యక్రమం రూపురేఖలను ఖరారు చేయడానికి వీలుగా ప్రభుత్వం ఓ అంతర్ మంత్రిత్వ కమిటీని నియమించింది. నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రమణ్యం చైర్మన్‌గా ఏర్పాటైన ఈ కమిటీ భాగస్వాములతో విస్తృత సంప్రదింపులు నిర్వహించనున్నట్టు ఓ అధికారి తెలిపారు.భారత్‌లో తయారీని మరింత ప్రోత్సహించేందుకు కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం లోగడే ప్రకటించడం గమనార్హం. దీన్ని ఇప్పుడు ఆచరణలోకి తీసుకొచ్చింది. వ్యాపార నిర్వహణ వ్యయాలు తగ్గించడం, భవిష్యత్‌కు అనుగుణమైన ఉద్యోగులను సిద్ధం చేయడం, ఎంఎస్ఎంఈని బలోపేతం చేయడం, టెక్నాలజీ లభ్యత, నాణ్యమైన ఉత్పత్తులు.. అనే ఐదు అంశాలపై ఈ కమిటీని కీలక సిఫారసులు చేయనుంది. -
భద్రత కోసం రూ.70 కోట్లు!.. సుందర్ పిచాయ్ జీతం ఎంతంటే?
ప్రపంచంలోని దిగ్గజ కంపెనీల సీఈఓల గురించి తెలుసుకునే చాలామంది.. మొదట సెర్చ్ చేసే విషయం జీతమే. ఎందుకంటే వారి వేతనాలు కోట్ల రూపాయల్లో ఉంటాయి. ఇప్పుడు తాజాగా 2024లో సుందర్ పిచాయ్ జీతానికి సంబంధించిన విషయాలు వెల్లడయ్యాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఆల్ఫాబెట్ 2025 ప్రాక్సీ స్టేట్మెంట్ ప్రకారం, సుందర్ పిచాయ్ వేతనం 2024లో 10.73 మిలియన్ డాలర్లు (రూ. 91.4 కోట్లు). ఇందులో ఎక్కువ భాగం స్టాక్ అవార్డ్స్, ఇతర పరిహారాల రూపంలో అందింది. కాగా ఈయన బేసిక్ శాలరీ 2 మిలియన్ డాలర్లు (రూ. 17.04 కోట్లు). సాధారణ ఉద్యోగి జీతంతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. 2023లో పిచాయ్ వేతనం 8.8 మిలియన్ డాలర్లు మాత్రమే.జీతం విషయం పక్కన పెడితే.. సుందర్ పిచాయ్ భద్రత కోసం ఆల్ఫాబెట్ కంపెనీ ఏకంగా 8.27 మిలియన్ డాలర్లను (రూ. 70.45 కోట్లు) ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అంతకు ముందు ఏడాది సంస్థ భద్రత కోసం చేసిన ఖర్చు 6.78 మిలియన్ డాలర్లు. అంటే సెక్యూరిటీ కోసం.. కంపెనీ అంతకు ముందు సంవత్సరం కంటే 22 శాతం ఎక్కువ ఖర్చు చేసింది.ఇదీ చదవండి: ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం: మరో 195 మంది ట్రైనీలు..కంపెనీ అందించే భద్రతా ప్యాకేజీలో.. ఇంటి నిఘా, ప్రయాణ రక్షణ, వ్యక్తిగత డ్రైవర్లు వంటివన్నీ ఉంటాయి. అయితే దీనిని సంస్థ సుందర్ పిచాయ్ వ్యక్తిగత ప్రయోజనంగా కాకుండా.. ఉద్యోగ భద్రతలో భాగంగానే భావిస్తుంది. నిజానికి, సీఈఓ సుందర్ పిచాయ్ జీతం సగటు ఉద్యోగి జీతం కంటే దాదాపు 32 రెట్లు ఎక్కువ. -
18 ఏళ్లలో 33 లక్షల మంది కొన్న కారు: దీని గురించి తెలుసా?
2007లో ఇండియన్ మార్కెట్లో అరంగేట్రం చేసినప్పటి నుంచి 'హ్యుందాయ్ ఐ10' ఏకంగా 33 లక్షల యూనిట్ల అమ్మకాలను అధిగమించింది. ఒక్క భారతదేశంలోనే ఈ కారును 20 లక్షల కంటే ఎక్కువ మంది కొనుగోలు చేశారు. కాగా కంపెనీ 140 కంటే ఎక్కువ దేశాలలో మరో 13 లక్షల యూనిట్లను ఎగుమతి చేసినట్లు తెలుస్తోంది.హ్యుందాయ్ కంపెనీకి చెందిన ఐ10ను ఎక్కువగా దక్షిణాఫ్రికా, మెక్సికో, చిలీ, పెరూ దేశాలకు ఎగుమతి చేశారు. 2007లో మొదటి సారి ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టిన ఈ కారు.. ఆ తరువాత అనేక అప్డేట్స్ పొందుతూ.. ఐ10, గ్రాండ్ ఐ10, గ్రాండ్ ఐ10 నియోస్ అనే మూడు వేరియంట్లలో.. 1.2 లీటర్ పెట్రోల్ మాన్యువల్, 1.2 లీటర్ పెట్రోల్ ఆటోమాటిక్, CNGతో 1.2 లీటర్ పెట్రోల్ అనే మూడు ఇంజిన్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చింది.ఇదీ చదవండి: ధర ఎక్కువైనా అస్సలు తగ్గని జనం: ఒకేరోజు 52 కార్ల డెలివరీహ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ ప్రతి ఏటా సగటున లక్ష యూనిట్ల కంటే ఎక్కువ ఐ10 కార్లను విక్రయించింది. ఇది మంచి డిజైన్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్, కీలెస్ ఎంట్రీ వంటి అనేక కొత్త ఫీచర్స్ పొందింది. గ్రాండ్ i10 నియోస్ ధర రూ. 5.92 లక్షల నుంచి రూ. 8.56 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఇది ఎరా, మాగ్నా, కార్పొరేట్, స్పోర్ట్జ్, ఆస్టా అనే ఐదు వేరియంట్లలో లభిస్తోంది. -
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం మిశ్రమంగా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సరికి స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 28.11 పాయింట్లు లేదా 0.035 శాతం లాభంతో.. 80,246.48 వద్ద, నిఫ్టీ 7.45 పాయింట్లు లేదా 0.031 శాతం లాభంతో 24,335.95 వద్ద నిలిచాయి.టాప్ గెయినర్స్ జాబితాలో మాలు పేపర్ మిల్స్, పరాస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్, డేటా ప్యాటర్న్స్ (ఇండియా), గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ & ఇంజనీర్స్, టీబీఓ టెక్ వంటి కంపెనీలు చేరగా.. మ్యాక్స్ ఇండియా లిమిటెడ్, గ్లోబల్ వెక్ట్రా హెలికార్ప్, మనక్సియా, శివ మిల్స్ లిమిటెడ్, లక్ష్మీ ఫైనాన్స్ అండ్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు). -
కొత్త ఏఐ ఆధారిత ల్యాప్‌టాప్‌లు.. ఫీచర్లు..
హెచ్‌పీ తన తదుపరి తరం ఏఐ ఆధారిత ల్యాప్‌టాప్‌లను మార్కెట్లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. కొత్తగా ప్రవేశపెట్టిన హెచ్‌పీ ఎలైట్ బుక్, ప్రోబుక్, ఓమ్నీబుక్‌లను విభిన్న వ్యాపారాలు, వినియోగదారుల అభివృద్ధి చెందుతున్న అవసరాలను తీర్చడానికి రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. వీటిలో సెకనుకు 40 నుంచి 55 ట్రిలియన్ కార్యకలాపాలను అందించగల డెడికేటెడ్ న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్లు (ఎన్పీయూ) ఉన్నాయని పేర్కొంది. ఏఐ కంప్యూటింగ్‌లో ఈ డివైజ్‌లు ముందంజలో ఉన్నాయని తెలిపింది.ఇంటెల్ కోర్ అల్ట్రా 200 వి సిరీస్, ఏఎండీ రైజెన్ ఏఐ 300 సిరీస్, క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ ఎక్స్ సిరీస్ చిప్‌లతో ఈ ల్యాప్‌టాప్‌లను తయారు చేసినట్లు సంస్థ చెప్పింది. తాజా ప్రాసెసర్లతో నడిచే ఈ ల్యాప్‌టాప్‌లు అడాప్టివ్ వర్క్‌లోడ్‌ను సర్దుబాటు చేసుకుంటూ రియల్ టైమ్ నాయిస్ క్యాన్సిలేషన్, వీడియో కాల్స్ సమయంలో ఆటో ఫ్రేమింగ్ వంటి ఆప్టిమైజేషన్లను అందిస్తాయని తెలిపింది.ఏఐ ఫీచర్లుహెచ్పీ ఏఐ కంపానియన్: ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా వినియోగదారుల ప్రశ్నలకు తక్షణ సమాధానాలు, సురక్షితమైన ఫైల్ విశ్లేషణను అందించే రీసెర్చ్ అసిస్టెంట్.పాలీ కెమెరా ప్రో: ఆటో ఫ్రేమింగ్, మల్టీ కెమెరా సపోర్ట్, స్ట్రీమింగ్ ఇంటిగ్రేషన్‌తో వర్చువల్ సమావేశాలను మెరుగుపరచడం.మైహెచ్‌పీ ప్లాట్ ఫామ్: వినియోగదారు భద్రతను ప్రోత్సహిస్తూ డివైజ్ పనితీరు, బ్యాటరీ ఆప్టిమైజేషన్‌ను మెరుగుపరుచడం.డివైజ్ తయారీలో రీసైకిల్ చేసిన ప్లాస్టిక్, లోహాన్ని ఉపయోగించారు. ఇది పర్యావరణ సుస్థిరత పట్ల కంపనీ నిబద్ధతను స్పష్టం చేస్తుంది. ఎనర్జీ స్టార్ సర్టిఫికేషన్, ఈపీఈఏటీ గోల్డ్ రిజిస్ట్రేషన్‌ను సొంతం చేసుకుంది. ఇది గ్రీన్ టెక్నాలజీ పట్ల కంపెనీ అంకితభావాన్ని మరింత బలోపేతం చేస్తుంది. హెచ్‌పీ వోల్ఫ్ ప్రో సెక్యూరిటీ వంటి భద్రతా ఫీచర్లు పెరుగుతున్న ఆన్లైన్ బెదిరింపుల నుంచి రక్షణ ఇస్తాయని సంస్థ పేర్కొంది.ఇదీ చదవండి: మొక్కుబడిగా ఏసీ కొనవద్దు..హెచ్‌పీ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ ఇప్సితా దాస్ గుప్తా మాట్లాడుతూ..‘భారతదేశం అభివృద్ధి చెందుతున్న కృత్రిమ మేధ పర్యావరణ వ్యవస్థ ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని వీటిని రూపొందించాం. హెచ్‌పీ డివైజ్‌ల్లో పరిశ్రమలు, స్టార్టప్‌లు, వ్యక్తుల సాధికారతలో అర్థవంతమైన ఆవిష్కరణలను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నాం’ అన్నారు. హెచ్‌పీ ఇండియా పర్సనల్ సిస్టమ్స్ సీనియర్ డైరెక్టర్ వినీత్ గెహానీ మాట్లాడుతూ..‘కృత్రిమ మేధ ఆధారిత పీసీలు పనితీరు, భద్రతను మెరుగుపరుస్తాయి. భారతీయ వినియోగదారులు, వ్యాపారాల విభిన్న అవసరాలను ఇవి తీరుస్తాయి’ అని చెప్పారు. -
ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం: మరో 195 మంది ట్రైనీలు..
2025లోనూ లేఆప్స్ పర్వం కొనసాగుతూనే ఉంది. టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ వరుస తొలగింపులు చేపడుతూనే ఉంది. తాజాగా మరో 195 మంది ఉద్యోగులను తొలగించింది. ఈ ఏడాదిలోనే ట్రైనీలను తొలగించడం వరుసగా నాలుగోసారి కావడం గమనార్హం.ఇంటర్నల్ అసెస్మెంట్ ప్రోగ్రామ్‌లో విఫలమైన కారణంగా 195 మందిని తొలగించినట్లు తెలుస్తోంది. వీరందరికీ కంపెనీ ఈ మెయిల్స్ ద్వారా సమాచారం అందించినట్లు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. 2025 ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు సంస్థ సుమారు 800 మంది ట్రైనీలను తొలగించింది.భారతదేశంలో రెండవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఏప్రిల్ 18న దాదాపు 240 మందిని తొలగించగా, అంతకు ముందు ఫిబ్రవరిలో 300 మందికి పైగా ట్రైనీలను, మార్చిలో 30 నుంచి 35 మందిని తొలగించింది. తొలగించిన ట్రైనీలకు ఒక నెల ఎక్స్‌గ్రేషియాతో పాటు రిలీవింగ్ లెటర్‌ను కూడా సంస్థ అందిస్తోంది. ఇన్ఫోసిస్ కంపెనీ తొలంగించిన ట్రైనీలందరినీ.. 2022లో నియమించుకుంది.ఇదీ చదవండి: అద్దె అపార్ట్మెంట్లోనే విక్కీ కౌశల్: వామ్మో రెంట్ మరీ ఇంతనా.. -
మొక్కుబడిగా ఏసీ కొనవద్దు..
భానుడి ప్రకోపం మరింత ముదురుతోంది. ఈ ఏడాది భారీగానే వేసవి తాపం ఉంటుందని కొన్ని సంస్థలు ఇప్పటికే అంచనా వేశాయి. రానున్న రోజుల్లో ఎండలు మరింత పెరగనున్నాయి. ఇంట్లో తీవ్ర ఉక్కపోత మొదలైంది. ఫ్యానులు, కూలర్లు ఉన్నా గది అంతా చల్లదనం రాక ఇబ్బందులు పడుతున్నారు. దాంతో చాలా మంది ఏసీలు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి సంస్థల నుంచి, రిటైల్ స్టోర్‌ల్లో వీటి అమ్మకాలు ఇప్పటికే ఊపందుకున్నాయి. అయితే వాటిని కొనుగోలు చేసేపుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.ఐసెర్ రేటింగ్సరైన అవగాహన లేక కొందరు పెద్ద గదులకు తక్కువ సామర్థ్యం ఉన్న ఏసీలు కొనుగోలు చేస్తారు. 110 చదరపు అడుగులు పరిమాణంలో గది ఉంటే 1 టన్ను, 110-150 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన గదికి 1.5 టన్నులు, 150-190 చదరపు అడుగుల గదికి 2 టన్నుల సామర్థ్యమున్న ఏసీని ఎంచుకోవాలి. ఏసీ కొనుగోలు చేసేటప్పుడు ముఖ్యంగా ఐసెర్ (ఐఎస్‌ఈఈఆర్) రేటింగ్ చూడాలి. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియెన్సీ ప్రమాణాల ప్రకారం ప్రతి రెండు సంవత్సరాలకు ఐసెర్ రేటింగ్ మారుతుంది. ప్రస్తుతం ఐసెర్ రేట్ 5 అంత కంటే ఎక్కువ ఉంటే ఫైవ్ స్టార్ ఉంటుంది. రేటింగ్ 4.4- 4.99 మధ్య ఉంటే ఫోర్ స్టార్ రేటింగ్ ఉంటుంది. రేటింగ్‌లో తేడా వల్ల విద్యుత్తు వినియోగంలో మార్పు ఉంటుందని గమనించాలి.ఇన్వర్టర్తో మేలుచాలా ఇళ్లల్లో నిత్యం ఏసీని ఉపయోగించే వారు ఇన్వర్టర్తో కూడిన ఏసీ కొనుగోలు చేసుకోవాలి. ఇది విద్యుత్తును పొదుపు చేస్తుంది. మోటారు వేగాన్ని నియంత్రిస్తూ గది ఉష్ణోగ్రతను సర్దుబాటు చేస్తుంది. నాన్ ఇన్వర్టర్ ఏసీల్లో ఈ వెసులుబాటు ఉండదు. కేవలం ఆన్, ఆఫ్ మాత్రమే ఉంటాయి. కేవలం వేసవిలో మాత్రమే రోజుకు మూడు నుంచి నాలుగు గంటలు ఉపయోగించేవారు నాన్ ఇన్వర్టర్ ఏసీ కొనుక్కోవచ్చు. మార్కెట్లో చాలా వరకు కన్వర్ట్‌బుల్ ఏసీలు అందుబాటులో ఉన్నాయి. చిన్న గదిలో 1.5 టన్నుల సామర్థ్యం కలిగిన వాటిని ఏర్పాటు చేసినా.. అవసరం మేరకు 1 టన్ను, 0.8 టన్ను ఇలా సమర్థ్యాన్ని మార్చుకోవచ్చు. సామర్థ్యం తగ్గించడం వల్ల ఫ్యాన్ వేగం తగ్గి విద్యుత్తు పొదుపు అవుతుంది.ఇదీ చదవండి: అక్షయ తృతీయ రోజు బంగారు నగలే కొనాలా?ధరల మధ్య వ్యత్యాసంఏసీ కొనుగోలు చేసేప్పుడే తప్పకుండా స్టెబిలైజర్ కొనాలి. వోల్టేజ్ హెచ్చుతగ్గుల పరిధి దాటినప్పుడు స్టెబిలైజర్ లేకుంటే ఏసీ పాడవుతుంది. వోల్టేజ్ హెచ్చుతగ్గుల వల్ల పాడైతే వారంటీ ఉండదనే విషయం గుర్తుపెట్టుకోవాలి. చాలా కంపెనీలు స్మార్ట్ ఏసీలను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. వాటిని యాప్‌ల ద్వారానూ నిర్వహించవచ్చు. ఏసీ కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా వారంటీ చూసుకోవాలి. ఈ-కామర్స్ సంస్థల మధ్య ధరల విషయంలో తేడాలు ఉంటాయి. ఆఫర్లు ఉంటే గమనించాలి. కొన్ని సందర్భాల్లో ఈ-కామర్స్ సంస్థల కంటే కంపెనీల డీలర్ల వద్ద కూడా తక్కువ ధరకు లభిస్తాయి. -
అక్షయ తృతీయ రోజు బంగారు నగలే కొనాలా?
భారత్‌లో బంగరానికి ఉన్న విలువ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. తరాలుగా పసిడి సంపదకు గుర్తుగా ఉంటోంది. సంపద ఉంటే ఆర్థిక ఇబ్బందులు దరిచేరకుండా హ్యాపీగా ఉండవచ్చు. కాబట్టి ఏటా అక్షయ తృతీయ సందర్భంగా బంగారం కొనుగోలు చేయాలని చాలామంది భావిస్తారు. ఆరోజు పసిడి కొంటే ఆ ఏడాదంతా సంపద సొంతం అవుతుందని అనుకుంటారు. రేపు అక్షయ తృతీయ సందర్భంగా సాధారణంగా బంగారం షాపులు కిక్కిరిసిపోతాయి. అయితే బంగారాన్ని కేవలం నగల రూపంలోనే కొనుగోలు చేయాలని చాలామంది అనుకుంటారు. కానీ మార్కెట్లో వివిధ మార్గాల ద్వారా కూడా బంగారంలో పెట్టుబడి పెట్టవచ్చు. వాటి గురించి తెలుసుకుందాం.గోల్డ్ ఈటీఎఫ్ (Gold ETF)ఫిజికల్ గోల్డ్ సొంతం చేసుకోవాలనే ఇబ్బంది లేకుండా బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) మంచి ఎంపిక. గోల్డ్ ఈటీఎఫ్‌లు ఫిజికల్ గోల్డ్ ధరను ట్రాక్ చేసే ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్. షేర్ల మాదిరిగానే వీటిని స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ట్రేడ్ చేస్తారు. గోల్డ్ ఈటీఎఫ్ ప్రతి యూనిట్ సాధారణంగా ఒక గ్రాము బంగారం లేదా దానిలో కొంత భాగాన్ని సూచిస్తుంది. వీటివల్ల కలిగే ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. స్టాక్ ఎక్స్ఛేంజీల్లో సులభంగా కొనడం, విక్రయించడం చేయవచ్చు. ఫిజికల్ గోల్డ్ మాదిరిగా కాకుండా మేకింగ్ ఛార్జీలు లేదా నిల్వ ఖర్చులు ఉండవు. ధరలు నేరుగా బంగారం రేట్లతో ముడిపడి ఉంటాయి. ద్రవ్యోల్బణం, మార్కెట్ అస్థిరతకు వ్యతిరేకంగా పెట్టుబడికి రక్షణ కవచంగా పనిచేస్తుంది. గోల్డ్ ఈటీఎఫ్‌లను ట్రేడ్ చేయడానికి డీమ్యాట్ ఖాతా అవసరం ఉంటుంది. మార్కెట్లో చాలా స్టాక్ బ్రోకింగ్ కంపెనీల నుంచి ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు.డిజిటల్ గోల్డ్ (Digital Gold)డిజిటల్ గోల్డ్ అనేది భౌతికంగా బంగారాన్ని సొంతం చేసుకోకుండా అందులో పెట్టుబడి పెట్టడానికి ఒక ఆధునిక మార్గం. ఇది ఆన్లైన్లో బంగారాన్ని కొనడానికి, విక్రయించడానికి, నిల్వ చేయడానికి ఉపయోగపడుతుంది. మీరు కొనుగోలు చేసే బంగారానికి సురక్షితమైన వాల్ట్‌ల్లో నిల్వ చేసిన భౌతిక బంగారం మద్దతుగా నిలుస్తుంది. కనీసం రూ.10 నుంచి ఎప్పుడైనా, ఎక్కడైనా బంగారంపై ఇన్వెస్ట్ చేయవచ్చు. 24 క్యారెట్ల బంగారం నాణ్యతకు సర్టిఫికేట్ ఇస్తారు. ఈ డిజిటల్ గోల్ట్కు బీమా చేసిన వాల్ట్‌ల ద్వారా భద్రత కల్పిస్తారు. దాంతో దొంగతనం జరుగుతుందేమోనని ఆందోళన చెందనవసరం లేదు. అవసరమైనప్పుడల్లా డిజిటల్ బంగారాన్ని ఫిజికల్ గోల్డ్ లేదా క్యాష్‌గా మార్చుకోవచ్చు. పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే వంటి ప్లాట్‌ఫామ్‌లతోపాటు ప్రముఖ బ్యాంకులు ఈ డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లను అందిస్తున్నాయి. ఎంఎంటీసీ-పీఏఎంపీ, సేఫ్గోల్డ్ ఆగ్మాంట్ గోల్డ్ లిమిటెడ్ వంటి సంస్థలు ఈ పెట్టుబడులకు మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నాయి. ఫిజికల్ గోల్డ్ మాదిరిగానే డిజిటల్ గోల్డ్ కూడా క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్‌కు లోబడి ఉంటుంది.ఇదీ చదవండి: భగ్గుమంటున్న పసిడి ధరలు! తులం ఎంతంటే..చివరగా.. అప్పు చేసి వద్దు!అక్షయ తృతీయ మంచి రోజు.. ఏది కొన్నా కలిసి వస్తుందని భావించి అప్పులు చేసి మరీ బంగారం కొనేవారూ ఉన్నారు. కానీ అప్పు చేసి కొంటే రుణాలు పెరిగే ప్రమాదం ఉంటుంది. అందుకే బంగారం కొనకపోయినా పర్లేదు.. ఉన్నంతలో ఆ రోజున నలుగురికి సాయపడితే.. అంతకు మించిన పుణ్యం మరొకటి ఉండదు! అప్పు మాత్రం చేయకండి. -
రేపే అక్షయ తృతీయ.. భగ్గుమంటున్న పసిడి ధరలు!
స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర ఇటీవలి కాలంలో తగ్గుముఖం పట్టినట్లే పట్టి తిరిగి ఈరోజు మళ్లీ పెరిగింది. త్వరలో తులం రూ.ఒక లక్షకు చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో మంగళవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rates) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.89,800 (22 క్యారెట్స్), రూ.97,970 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. సోమవార ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.400, రూ.440 పెరిగింది.చెన్నైలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.400, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.440 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.89,800 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.97,970 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.400 పెరిగి రూ.89,950కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.440 పెరిగి రూ.98,120 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరల మాదిరిగా కాకుండా మంగళవారం వెండి ధర(Silver Prices)ల్లో ఎలాంటి మార్పులు కనిపించలేదు. నిన్నటి ధరలతో వెండి ధర స్థిరంగా ఉంది. దాంతో కేజీ వెండి ధర రూ.1,11,000 వద్ద నిలిచింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
‘ఏటీఎంల్లో రూ.100, 200 నోట్లను పెంచండి’
ప్రజలకు రూ.100, రూ.200 నోట్లు మరింతగా అందుబాటులో ఉండేలా ఏటీఎంలలో ఆయా డినామినేషన్ నోట్ల లభ్యతను మరింతగా పెంచాలని రిజర్వ్ బ్యాంక్ ఆదేశించింది. దశలవారీగా ఈ ఆదేశాలను అమలు చేయాలని బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లకు ఒక సర్క్యులర్‌లో సూచించింది. 2025 సెప్టెంబర్ 30 నాటికి 75 శాతం ఏటీఎంలలో కనీసం ఒక్క క్యాసెట్(ఏటీఎంలో డబ్బు స్టోర్ చేసే కంటైనర్)లోనైనా రూ.100 లేదా రూ.200 నోట్లు ఉండేలా చూడాలని తెలిపింది. 2026 మార్చి 31 నాటికి దీన్ని 90 శాతం ఏటీఎంలకు పెంచాలని పేర్కొంది.డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్న కొద్దీ ఫిజికల్ క్యాష్ వినియోగం తగ్గుతుందని కొందరు భావిస్తున్నారు. కానీ నిత్యం ఫిజికల్ క్యాష్ అవసరాలు ప్రత్యేకంగా ఉంటూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో డబ్బు లభ్యతకు పెద్దపీట వేయాలని ఆర్బీఐ ఇటీవల బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇటీవల ఏటీఎంల్లో నగదు లభ్యత తగ్గడానికిగల కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు.ఇదీ చదవండి: ప్రముఖ ఆర్థిక సంస్థల పనితీరు ఇలా..దేశంలో ప్రధాన ఏటీఎం సర్వీస్ ప్రొవైడర్ అయిన ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్ పతనం అనేక బ్యాంకులకు నగదు రీఫిల్లింగ్ సేవలకు అంతరాయం కలిగించింది. యూపీఐ వంటి డిజిటల్ చెల్లింపు పద్ధతులను ఎక్కువగా అవలంబించడం వల్ల నగదుకు డిమాండ్ తగ్గింది. ఇది బ్యాంకులు తమ ఏటీఎం నెట్‌వర్క్‌లను ఆప్టిమైజ్ చేయడానికి దారితీసింది. కొత్త ఆర్బీఐ నిబంధనలు, ఇంటర్‌ఛేంజ్ ఫీజు స్ట్రక్చర్లు ఏటీఎం మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టకుండా అడ్డుకట్ట వేస్తున్నాయి. నగదు భర్తీలో లాజిస్టిక్ సమస్యలు కూడా తాత్కాలిక కొరతకు కారణం అవుతున్నాయి. -
స్థిరంగా కదలాడుతున్న సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే మంగళవారం స్థిరంగా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 9:49 సమయానికి నిఫ్టీ(Nifty) 9 పాయింట్లు నష్టపోయి 24,330కు చేరింది. సెన్సెక్స్(Sensex) 28 పాయింట్లు పెరిగి 80,236 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.02 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 64.4 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.2 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో గతంతో పోలిస్తే స్థిరంగా ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.06 శాతం లాభపడింది. నాస్డాక్ 0.1 శాతం దిగజారింది.రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి కంపెనీలు ఊహించిన దానికంటే మెరుగైన క్యూ4 ఫలితాలను రిపోర్ట్ చేశాయి. ఇది పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచింది. ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ) ఇటీవలి సెషన్లలో నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. ఇది మార్కెట్లలోకి గణనీయమైన మూలధనాన్ని సమకూరుస్తుంది. ఆసియా మార్కెట్లలో సానుకూల ధోరణులు, అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం సెంటిమెంట్‌కు దోహదపడుతున్నాయి. ఇండియా-పాక్ ఉద్రిక్తతలను మార్కెట్ వర్గాలు నిశితంగా పరిశీలిస్తున్నారు. తగ్గిన చమురు ధరలు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను తగ్గించి, ఆర్థిక వృద్ధికి తోడ్పడుతున్నాయి. మహారాష్ట్ర డే సందర్భంగా గురువారం(మే 1న) మార్కెట్లు పనిచేయవు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ప్రముఖ ఆర్థిక సంస్థల పనితీరు ఇలా..
గృహ రుణ రంగ సంస్థ పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 25 శాతం జంప్‌చేసి రూ. 550 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో రూ.439 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ.1,814 కోట్ల నుంచి రూ. 2,037 కోట్లకు ఎగసింది. వాటాదారులకు షేరుకి రూ.5 డివిడెండ్ ప్రకటించింది. కాగా.. వడ్డీ ఆదాయం రూ.1,693 కోట్ల నుంచి రూ. 1,906 కోట్లకు బలపడింది. నికర వడ్డీ ఆదాయం 16 శాతం పుంజుకుని రూ.734 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 3.65 శాతంనుంచి 3.75 శాతానికి మెరుగయ్యాయి. స్థూల మొండి బకాయిలు(ఎన్పీఏలు) ఫ్లాట్‌గా 1.08 శాతంవద్ద నిలవగా.. నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) 13 శాతం వృద్ధితో రూ.80,397 కోట్లకు చేరాయి. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం 28 శాతం జంప్‌చేసి రూ.1,936 కోట్లయ్యింది. 2023–24లో రూ. 1,508 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 7,024 కోట్ల నుంచి రూ. 7,661 కోట్లకు ఎగసింది.యుకో బ్యాంక్ లాభం జూమ్పీఎస్యూ సంస్థ యుకో బ్యాంక్ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 24 శాతం జంప్‌చేసి రూ. 666 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో రూ. 538 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 6,984 కోట్ల నుంచి రూ. 8,136 కోట్లకు ఎగసింది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి బ్యాంక్ నికర లాభం రూ. 1,671 కోట్ల నుంచి రూ. 2,468 కోట్లకు జంప్‌చేసింది. స్థూల మొండి బకాయిలు(ఎన్పీఏలు) 3.46 శాతం నుంచి 2.69 శాతానికి దిగిరాగా.. నికర ఎన్పీఏలు 0.89 శాతం నుంచి 0.5 శాతానికి తగ్గాయి. క్యూ4లో ప్రభుత్వ వాటా 95.39 శాతం నుంచి 90.95 శాతానికి క్షీణించింది.ఐడీబీఐ బ్యాంక్ లాభం అప్పీఎస్యూ బీమా దిగ్గజం ఎల్ఐసీ నియంత్రణలోని ఐడీబీఐ బ్యాంక్ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 26 శాతం జంప్‌చేసి రూ. 2,051 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో రూ. 1,628 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 7,887 కోట్ల నుంచి రూ. 9,035 కోట్లకు ఎగసింది. వడ్డీ ఆదాయం నామమాత్ర క్షీణతతో రూ. 6,979 కోట్లకు పరిమితమైంది. వాటాదారులకు షేరుకి రూ. 2.1 డివిడెండ్ ప్రకటించింది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం 33 శాతం జంప్‌చేసి రూ. 7,515 కోట్లకు చేరింది. 2023–24లో రూ. 5,634 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 30,037 కోట్ల నుంచి రూ. 33,826 కోట్లకు ఎగసింది. స్థూల మొండి బకాయిలు(ఎన్పీఏలు) 4.53 శాతం నుంచి 2.98 శాతానికి దిగిరాగా.. నికర ఎన్పీఏలు 0.34 శాతం నుంచి 0.15 శాతానికి తగ్గాయి. ఐఆర్ఎఫ్సీ లాభం నేలచూపుక్యూ4లో రూ. 1,667 కోట్లు రూ. 60,000 కోట్ల సమీకరణకు సైరైల్వే రంగ ఫైనాన్స్ కంపెనీ ఐఆర్ఎఫ్సీ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి (క్యూ4)లో ప్రభుత్వ రంగ సంస్థ నికర లాభం 3 శాతం నీరసించి రూ. 1,667 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో రూ. 1,717 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 6,478 కోట్ల నుంచి రూ. 6,723 కోట్లకు బలపడింది. మొత్తం వ్యయాలు సైతం రూ. 4,761 కోట్ల నుంచి రూ. 5,042 కోట్లకు పెరిగాయి. కాగా.. దేశ, విదేశీ మార్కెట్ల నుంచి రూ. 60,000 కోట్లవరకూ పెట్టుబడులు సమీకరించేందుకు బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు కంపెనీ వెల్లడించింది. ఇందుకు వీలుగా ప్రయివేట్ ప్లేస్మెంట్ లేదా పబ్లిక్ ఇష్యూ ద్వారా పన్నురహిత బాండ్లు, సాధారణ బాండ్లు జారీ చేయనుంది. వీటిలో క్యాపిటల్ గెయిన్ బాండ్లు, ప్రభుత్వ హామీగల బాండ్లు తదితరాలున్నట్లు కంపెనీ పేర్కొంది. వివిధ మార్గాలలో చౌకగా పెట్టుబడులను సమీకరించే ప్రణాళికల్లో ఉన్నట్లు కంపెనీ సీఎండీ మనోజ్ కుమార్ దూబే పేర్కొన్నారు. -
యాప్ స్టోర్.. ఏడాదిలో రూ.44 వేల కోట్ల విక్రయాలు
టెక్ దిగ్గజం యాపిల్ యాప్ స్టోర్ ద్వారా గతేడాది రూ.44,447 కోట్ల విలువ చేసే డెవలపర్ల బిల్లింగులు, విక్రయాలు (ఉత్పత్తులు, సేవలు) నమోదయ్యాయి. యాపిల్‌కి కమీషన్లులాంటివి లేకుండా ఇందులో 94 శాతం భాగం నేరుగా డెవలపర్లు, వ్యాపార సంస్థలకే లభించింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (అహ్మదాబాద్)కి చెందిన ప్రొఫెసర్ విశ్వనాథ్ పింగళి నిర్వహించిన అధ్యయన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.నివేదికలోని అంశాల ప్రకారం గత అయిదేళ్లలో భారతీయ డెవలపర్లకు అంతర్జాతీయంగా వచ్చే ఆదాయాలు రెట్టింపయ్యాయి. ఫుడ్ డెలివరీ, ట్రావెల్, గేమింగ్, ఎంటర్టైన్మెంట్ తదితర రంగాలకు చెందిన యాప్‌ల వినియోగం గణనీయంగా పెరిగింది. గతేడాది భారతీయ డెవలపర్ల ఆదాయాల్లో దాదాపు 80 శాతం వాటా ఇతర దేశాల్లోని యూజర్ల నుంచే వచ్చింది. ఏడాది పొడవున యాప్ స్టోర్ నుంచి 75.5 కోట్ల సార్లు మన డెవలపర్ల యాప్‌లను యూజర్లు డౌన్లోడ్ చేసుకున్నారు.ఇదీ చదవండి: వ్యాపార ‘పద్మా’లు..భారతదేశంలోని డెవలపర్ల సృజనాత్మకత, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడంలో యాప్ స్టోర్ కీలక పాత్ర పోషిస్తుంది. యాపిల్ వ్యాపార నమూనాలో ‘ఫ్రీ’మియం(ఉచితం) యాప్‌లు, పెయిడ్ యాప్‌లు, ఇన్-యాప్ పర్చేజ్లు లేదా సబ్స్క్రిప్షన్లతో కూడిన యాప్‌లు వంటి వివిధ మానిటైజేషన్ విధానాలు ఉన్నాయి. ఇది డెవలపర్లను వారి లక్ష్యాలకు అనుగుణంగా టార్గెటెడ్ ఆడియన్స్‌ను ఎంచుకునేందుకు వీలు కల్పిస్తుంది. -
పరిశ్రమలు డీలా..
దేశీ పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) వృద్ధి స్థిరంగా కొనసాగుతోంది. ఫిబ్రవరిలో నమోదైన 2.7 శాతంతో పోలిస్తే మార్చిలో పెద్దగా మార్పులు లేకుండా 3 శాతంగా నమోదైంది. తయారీ, మైనింగ్, విద్యుత్ రంగాల పేలవ పనితీరు కారణంగా గత ఆర్థిక సంవత్సరం మార్చిలో నమోదైన 5.5 శాతం పోలిస్తే మాత్రం తగ్గింది. ఇక 2024–25 పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఐఐపీ వృద్ధి నాలుగేళ్ల కనిష్టమైన 4 శాతానికి నెమ్మదించింది.2023–24లో ఇది 5.9 శాతంగా, 2020–21లో ఏకంగా మైనస్ 8.4 శాతంగా నమోదైంది.2021–22లో 11.4 శాతంగా, 2022–23లో 5.2 శాతంగా ఉంది.ఇదీ చదవండి: వ్యాపార ‘పద్మా’లు..జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్వో) ప్రకారం ఈ ఏడాది మార్చిలో తయారీ రంగ వృద్ధి 5.9 శాతం నుంచి (వార్షికంగా) 3 శాతానికి, మైనింగ్ ఉత్పత్తి 1.3 శాతం నుంచి 0.4 శాతానికి, విద్యుదుత్పత్తి 8.6 శాతం నుంచి 6.3 శాతానికి నెమ్మదించింది.ఐఐపీ గణాంకాలను 28వ తారీఖున విడుదల చేయడం ఇదే ప్రథమం.ఇప్పటివరకు నెల ముగిసిన ఆరు వారాల తర్వాత ప్రతి నెల 12వ తారీఖున విడుదల చేసేవారు. ఇకపై నాలుగు వారాల తేడాతో ప్రకటిస్తారు. -
వ్యాపార ‘పద్మా’లు..
న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో సోమవారం ప్రతిష్టాత్మక ‘పద్మ’ పురస్కారాల ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జైడస్ లైఫ్‌సైన్సెస్ ఛైర్మన్ పంకజ్ పటేల్ పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. పద్మశ్రీ గ్రహీతల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ ఛైర్పర్సన్ అరుంధతి భట్టాచార్య, పారిశ్రామికవేత్త పవన్ కుమార్ గోయెంకా ఉన్నారు. సుజుకీ మోటర్ మాజీ చీఫ్, దివంగత ఒసాము సుజుకీకి (మరణానంతరం) ప్రకటించిన పద్మ విభూషణ్ పురస్కారాన్ని సుజుకీ మోటర్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ తొషిహిరో సుజుకీ అందుకున్నారు.పంకజ్ పటేల్పంకజ్ పటేల్ దేశంలోని ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీల్లో ఒకటైన జైడస్ లైఫ్ సైన్సెస్ ఛైర్మన్. 1953 మార్చి 16న గుజరాత్లో జన్మించిన ఆయన హెల్త్ కేర్ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన నాయకత్వంలో జైడస్ అధిక కొలెస్ట్రాల్ కలిగిన మధుమేహ వ్యాధిగ్రస్తులకు తొలి భారతీయ ఔషధం లిపాగ్లిన్, దేశంలో మొట్టమొదటి హెచ్ 1 ఎన్ 1 వ్యాక్సిన్ వాక్సిఫ్లూ-ఎస్ వంటి ఉత్పత్తులను అభివృద్ధి చేసింది.అరుంధతీ భట్టాచార్యప్రముఖ భారతీయ బ్యాంకర్, కార్పొరేట్ లీడర్‌గా గుర్తింపు పొందారు. 2013 నుంచి 2017 వరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఛైర్‌పర్సన్‌గా పనిచేసిన తొలి మహిళ. ఆమె తన పదవీకాలంలో మహిళా ఉద్యోగులకు విశ్రాంతి సెలవులు, సంస్థలో మహిళలకు ఉచిత గర్భాశయ క్యాన్సర్ టీకాలు వంటి విధానాలను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం సేల్స్‌ఫోర్స్ ఇండియా ఛైర్పర్సన్, సీఈఓగా ఉన్నారు. గతంలో రిలయన్స్ ఇండస్ట్రీస్, విప్రో సహా పలు బోర్డుల్లో పనిచేశారు.పవన్ కుమార్ గోయెంకాఆటోమోటివ్ రంగంలో సేవలందిస్తున్న ప్రముఖ భారతీయ పారిశ్రామికవేత్త. మహీంద్రా స్కార్పియో ఎస్యూవీ వంటి ఐకానిక్ వాహనాల అభివృద్ధికి కృషి చేశారు. మహీంద్రా అండ్ మహీంద్రాను గ్లోబల్ బ్రాండ్‌గా మార్చడంలో కీలక పాత్ర పోషించారు. 2021లో పదవీ విరమణ చేసే వరకు మహీంద్రా అండ్ మహీంద్రా మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (ఐఎన్-స్పేస్) ఛైర్మన్‌గా ఉన్నారు.ఇదీ చదవండి: భారత్‌లో తగ్గిన పేదరికం! ఎలాగంటే..ఒసాము సుజుకి ప్రపంచ ఆటోమోటివ్ పరిశ్రమలో సేవలించిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. సుజుకి మోటార్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్, సీఈఓగా పని చేశారు. భారత కార్ల మార్కెట్లో మారుతి సుజుకి ద్వారా విప్లవాత్మకమైన పాత్ర పోషించారు. ఇది దేశంలో సరసమైన, నమ్మదగిన వాహనాలకు గుర్తింపుగా మారింది. కంపెనీలో తన నాయకత్వం 1978 నుంచి 2021 వరకు నాలుగు దశాబ్దాలకు పైగా కొనసాగింది. 1930 జనవరి 30న జపాన్‌లో జన్మించిన ఒసాము సుజుకీ 1958లో సుజుకి మోటార్ కార్పొరేషన్లో చేరారు. 2024 డిసెంబర్ 25న తన 94వ ఏట కన్నుమూశారు. -
మహిళలకు ఉద్యోగాల బూమ్
న్యూఢిల్లీ: ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో ఉద్యోగ దరఖాస్తులు (నియామకాలు) గణనీయంగా పెరిగినట్టు.. ముఖ్యంగా మహిళల భాగస్వామ్యం పెరిగినట్టు ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫామ్ ఆప్నా వెల్లడించింది. సౌకర్యవంతమైన పని నమూనాలు, టైర్–2, 3 పట్టణాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నట్టు తెలిపింది. ఈ మేరకు ఆప్నా ఒక నివేదికను విడుదల చేసింది. జనవరి–మార్చి మధ్య 1.81 కోట్ల ఉద్యోగ దరఖాస్తులు వచ్చాయని, గతేడాది మొదటి మూడు నెలలతో పోల్చితే 30 శాతం పెరిగినట్టు తెలిపింది. బీపీవో, ఫైనాన్స్, హెచ్ఆర్ తదితర విభాగాల్లో నియామకాలు పెరగడం, ఆర్థిక వ్యవస్థ పట్ల ఆశావహ పరిస్థితులకు ఈ గణాంకాలు నిదర్శమని పేర్కొంది. ముఖ్యంగా మహిళల నుంచి దరఖాస్తులు 23 శాతం పెరిగి 62 లక్షలుగా ఉన్నాయి. మొత్తం దరఖాస్తుల్లో ఫ్రెషర్ల (ఉద్యోగానికి కొత్త/అనుభవం లేని) నుంచి వచి్చనవి 66 లక్షలు ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చితే 46 శాతం పెరిగాయి. చండీగఢ్, ఇందోర్, జమ్షెడ్పూర్ తదితర టైర్ 2, 3 పట్టణాల నుంచి అధిక దరఖాస్తులు వచ్చాయి. ముఖ్యంగా ఆప్నా ప్లాట్‌ఫామ్‌పై 3.1 లక్షల జాబ్ పోస్టింగ్‌లు నమోదయ్యాయి. 2024 క్యూ1తో పోల్చితే 26% పెరిగాయి. చిన్న, మధ్య తరహా సంస్థల నుంచి ఎక్కువగా ఉన్నాయి. వరంగల్‌లో పెరుగుతున్న టెక్ నియామకాలు ఎల్ఐసీ, పేటీఎం, డెల్హివరీ, ఫ్లిప్‌కార్ట్ తదితర సంస్థల నుంచే లక్ష నియామకాలు జరిగాయి. ఇవి మెట్రోలకు బయట ఇతర పట్టణాల్లోనూ నియామకాలు చేపట్టాయి. సాఫ్ట్వేర్/వెబ్ డెవలపర్ ఉద్యోగాలకు పోస్టింగ్‌లు 65 శాతం మేర పెరిగాయి. ఈ పోస్ట్‌లకు ఫ్రెషర్ల నుంచి 42 శాతం అధికంగా దరఖాస్తులు రావడం గమనార్హం. ఏఐ/ఎంఎల్, సైబర్ సెక్యూరిటీ, బిజినెస్ ఇంటెలిజెన్స్ తదితర ఉద్యోగాల్లో నిపుణుల అవసరం పెరిగింది. ఇక కొత్త నియామకాల్లో ఢిల్లీ ఎన్సీఆర్, బెంగళూరు, ముంబై ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. జైపూర్ లక్నో, రాజ్‌కోట్, వరంగల్ టెక్నాలజీ ఉద్యోగ నియామకాల్లో కీలక కేంద్రాలుగా అవతరిస్తున్నట్టు ఆప్నా నివేదిక వెల్లడించింది. ఈ పట్టణాల్లో 30–50 శాతం వృద్ధి కనిపించినట్టు పేర్కొంది. దేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ 2030 నాటికి ట్రిలియన్ డాలర్లకు చేరుకునే విషయంలో టైర్ 2, 3 పట్టణాలు కీలక పాత్ర పోషించనున్నట్టు తెలిపింది. -
యూట్యూబ్ కంట్రీ ఎండీగా గుంజన్ సోని
న్యూఢిల్లీ: ఆన్లైన్ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫాం యూట్యూబ్ భారత విభాగం ఎండీగా గుంజన్ సోని నియమితులయ్యారు. ఆమె గతంలో జలోరా, స్టార్ ఇండియా, మింత్రా వంటి సంస్థల్లో కీలక హోదాల్లో సేవలు అందించారు. బిజినెస్, టెక్నాలజీ, మార్కెటింగ్, ఈ–కామర్స్ తదితర విభాగాల్లో రెండు దశాబ్దాలపైగా అనుభవం ఉంది. సింగపూర్‌కి చెందిన జలోరాలో గత ఆరేళ్లుగా ఆమె గ్రూప్ సీఈవోగా వ్యవహరిస్తున్నారు. కొత్త కేటగిరీలు, ఆవిష్కరణలను ప్రవేశపెట్టడంలో కీలకంగా వ్యవహరించారు. స్టార్ ఇండియాలో ఈవీపీగా, మింత్రాలో సీఎంవోగా వ్యవహరించినందున ఆమెకు భారతీయ మీడియా, మార్కెటింగ్ రంగాల్లో కూడా గణనీయంగా అనుభవం ఉందని సంస్థ తెలిపింది. అంతక్రితం ఆమె మెకిన్సేలో పార్ట్నర్గా వ్యవహరించారు. ఫార్చూన్ 500 కంపెనీ అయిన సీబీఆర్ఈ గ్రూప్ బోర్డులో ఉన్నారు. -
ఆటో విడిభాగాలకు టారిఫ్‌ల సెగ
న్యూఢిల్లీ: టారిఫ్‌ల వల్ల ఎగుమతులు మందగించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరం ఆటో విడిభాగాల తయారీ సంస్థల ఆదాయాలు సుమారు రూ. 4,500 కోట్ల మేర క్షీణించవచ్చని రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. 2024 ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ. 3 లక్షల కోట్లుగా పరిశ్రమ ఆదాయం నమోదైందని, ఒకవేళ టారిఫ్‌ల వివాదం వల్ల అమెరికాకు ఎగుమతులు మధ్యస్త–గరిష్ట సింగిల్ డిజిట్ స్థాయిలో క్షీణించిన పక్షంలో 2025–26లో ఆదాయ వృద్ధి 6–8 శాతానికి పరిమితం కావచ్చని పేర్కొంది. గతంలో ఇది 8–10 శాతంగా ఉండొచ్చని ఇక్రా అంచనా వేసింది. భారీ టారిఫ్‌ల వల్ల సరఫరా వ్యవస్థపై అదనంగా రూ. 9,000 కోట్ల భారం పడుతుందని, దీన్ని అమెరికా వినియోగదారులు, అక్కడి దిగుమతిదారులు, భారతీయ ఎగుమతిదారులు భరించాల్సి వస్తుందని వివరించింది. సరఫరాదారు ప్రాధాన్యత, పోటీ, సాంకేతిక ప్రాధాన్యత అంశాలను బట్టి వారు ఎంత మేర భారాన్ని బదలాయించగలరనేది ఆధారపడి ఉంటుందని ఇక్రా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ షంషేర్ దివాన్ తెలిపారు. ఒకవేళ అదనపు టారిఫ్ వ్యయాల్లో 30–50 శాతాన్ని భారతీయ ఆటో విడిభాగాల ఎగుమతిదారులు భరించే పక్షంలో సుమారు రూ. 2,700–4,500 కోట్ల భారం మోయాల్సి వస్తుందని వివరించారు. ఇది పరిశ్రమ నిర్వహణ లాభాల్లో 3–6 శాతమని, ఆటో విడిభాగాల ఎగుమతిదార్ల నిర్వహణ లాభాల్లో 10–15 శాతం అని పేర్కొన్నారు. 2024 ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ మొత్తం ఆదాయాల్లో అమెరికా వాటా సుమారు 8 శాతంగా నమోదైంది. 2020–24 మధ్య కాలంలో అమెరికాకు ఆటో విడిభాగాల ఎగుమతులు వార్షిక ప్రాతిపదికన 15 శాతం స్థాయిలో పెరిగాయి. ఇంజిన్లు, ఎలక్ట్రికల్ కాంపొనెంట్లులాంటి కీలకమైన ఆటోమొబైల్ విడిభాగాలపై మే 3 నుంచి అమల్లోకి వచ్చేలా అమెరికా 25 శాతం టారిఫ్‌లు ప్రకటించిన సంగతి తెలిసిందే. భారత్ ఎగుమతి చేసే విడిభాగాల్లో దాదాపు 65 శాతం కాంపొనెంట్లు 25 శాతం టారిఫ్‌ల కేటగిరీలోకి వస్తాయి. -
అక్షయ తృతీయ ఆఫర్లు షురూ
కోల్‌కతా: బంగారం ధరలు గరిష్ట స్థాయికి చేరిన తరుణంలో అక్షయ తృతీయ అమ్మకాలు తగ్గకుండా జ్యుయలర్లు మార్కెటింగ్ సన్నాహాలు మొదలుపెట్టారు. మరిన్ని అమ్మకాలు సాధించేందుకు వీలుగా డిస్కౌంట్లు, ఇతర ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటిస్తున్నారు. ఈ నెల 30న అక్షయ తృతీయ (వైశాఖ శుద్ధ తదియ) అన్న విషయం తెలిసిందే. ఏటా ఆ రోజున బంగారం కొనుగోలు చేసేందుకు ఎక్కువ మంది ముందుకు వస్తుంటారు. ఈ ఏడాది అధిక ధరల నేపథ్యంలో అమ్మకాలపై మిశ్రమ అంచనాలు వ్యక్తమవుతుండడం గమనార్హం. దీంతో ప్రముఖ బ్రాండ్లు తనిష్క్, సెంకో గోల్డ్, ఎంపీ జ్యుయలర్స్, పీసీ చంద్ర జ్యుయలర్స్ ఇప్పటికే ఆఫర్లను ప్రకటించాయి. → టాటా బ్రాండ్ తనిష్క్ బంగారం ఆభరణాల తయారీ చార్జీల్లో 20 శాతం తగ్గింపు ఇస్తున్నట్టు ప్రకటించింది. → బంగారం ధరపై రూ.350 డిస్కౌంట్‌ను సెంకో గోల్డ్ ఆఫర్ చేస్తోంది. అలాగే తయారీ చార్జీల్లో 30 శాతం రాయితీ ఇస్తోంది. డైమండ్ ఆభరణాలపై తయారీ చార్జీల్లో 100 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. → ఎంపీ జ్యుయలర్స్ గ్రాము బంగారంపై రూ.300 డిస్కౌంట్ ప్రకటించింది. తయారీ చార్జీల్లో 10 శాతం రాయితీ ఇస్తోంది. → పీసీ చంద్ర జ్యుయలర్స్ గ్రాము బంగారంపై రూ.200.. తయారీ చార్జీల్లో 15 శాతం తగ్గింపు ఇస్తున్నట్టు తెలిపింది. డైమండ్ జ్యుయలరీపై 10 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. మంచి డిమాండ్ ఉంటుంది.. ‘‘అక్షయ తృతీయ సందర్భంగా అమ్మకాలు మంచిగా ఉంటాయని అంచనా వేస్తున్నాం. ఎందుకంటే వినియోగదారుల్లో బంగారం పట్ల విశ్వాసం బలంగా ఉంది’’అని అంజలి జ్యుయలర్స్ డైరెక్టర్ అనర్గ ఉట్టియ చౌదరి తెలిపారు. దీంతో తయారీ చార్జీల్లో రాయితీలు ఇస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల్లో బంగారాన్ని సురక్షిత సాధనంగా చూస్తున్నట్టు చెప్పారు. దీంతో బంగారంపై మరింత పెట్టుబడులకు కొనుగోలుదారులు మొగ్గు చూపించొచ్చన్నారు. ప్రస్తుత పరిస్థితులే కొనసాగితే బంగారం ధరలు స్వల్పకాలంలో మరో 5–7 శాతం వరకు పెరగొచ్చని.. సమీప కాలంలో దిద్దుబాటు అవకాశాలు కనిపించడం లేదన్నారు. ధరలు పెరగడంతో అమ్మకాల పరిమాణం తగ్గినట్టు సెంకో గోల్డ్ ఎండీ, సీఈవో సువాంకర్ సేన్ తెలిపారు. అయితే అక్షయ తృతీయ సందర్భంగా కొనుగోళ్ల డిమాండ్ బలంగా ఉండొచ్చన్న అంచనాతో ఉన్నారు. ముత్యాలు, రత్నాలను చేర్చడం ద్వారా వివాహ ఆభరణాల ధరలను 25–30 శాతం వరకు తగ్గించే చర్యలు చేపట్టినట్టు తెలిపారు. జియో ఫైనాన్స్ యూజర్లకు గోల్డెన్ ఆఫర్ముంబై: అక్షయ తృతీయను పురస్కరించుకుని పసిడి కొనుగోళ్లకు సంబంధించి జియో ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. జియోఫైనాన్స్, మైజియో యాప్ యూజర్లకు జియో గోల్డ్ 24కే డేస్ ఆఫర్ ప్రకటించింది. దీని ప్రకారం ఏప్రిల్ 29 నుంచి మే 5 వరకు రూ. 1,000 నుంచి రూ. 9,999 వరకు విలువ చేసే డిజిటల్ గోల్డ్‌ను కొనుగోలు చేసే వారు జియోగోల్డ్1 కోడ్‌ను ఉపయోగించి అదనంగా 1 శాతం పసిడిని ఉచితంగా దక్కించుకోవచ్చు. రూ. 10,000కు మించిన కొనుగోళ్లపై జియోగోల్డ్‌ఎట్100 ప్రోమో కోడ్‌తో 2 శాతం పసిడి అందుకోవచ్చు. ఆఫర్ వ్యవధిలో ఒక్కో యూజరు 10 లావాదేవీల వరకు, గరిష్టంగా రూ. 21,000 వరకు విలువ చేసే పసిడిని పొందవచ్చు. గోల్డ్ సిప్‌లు కాకుండా ఏకమొత్తంగా చేసే పసిడి కొనుగోళ్లకు ఇది వర్తిస్తుంది. -
యువ ప్రతిభకు 'మకుటం': క్రీడాకారునికి చేయూత
హైదరాబాద్‌లో చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ అండ్ నిర్మాణ సంస్థ అయిన మకుటా డెవలపర్స్, నిర్మాణాలతో సొంతిటి కలల్ని సాకారం చేస్తూనే, ప్రతిభ కలిగిన యువతకు చేయూతనిచ్చి లక్ష్య సాధనలో ప్రోత్సహిస్తుంది. అంతర్జాతీయ క్రీడా వేదికలపై రాణిస్తున్న క్రీడాకారునికి వెన్నుతట్టి నడిపిస్తోంది.దక్షిణ కొరియాలో జరిగే 20వ ఆసియా రోలర్-స్కేటింగ్ చాంపియన్‌షిప్ భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్‌లోని అల్వాల్‌కు చెందిన యువ రోలర్ స్కేటర్ 'ప్రతీక్'ను మకుట నిర్మాణ సంస్థ స్పాన్సర్‌గా వ్యవహరించేందుకు ముందుకు వచ్చింది. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ప్రతీక్ అన్ని పోటీల్లో రాణిస్తూ, అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతున్నాడు.రోలర్ స్కేటింగ్‌లో యువ క్రీడాకారుని అంకితభావం, అభిరుచిని గుర్తించి మకుట డెవలపర్స్ స్పాన్సర్ షిప్ చేస్తోంది. ప్రతీక్ పోటీల్లో రాణించి సత్తా చాటేందుకు మద్దతుగా ₹2 లక్షలు విరాళంగా ఇచ్చింది. ఈ విరాళాన్ని శ్రీ జనార్ధన్ కొంపల్లి (వ్యవస్థాపకుడు & CEO), శ్రీ హర్షవర్ధన్ రెడ్డి వంగా (డైరెక్టర్) చేతుల మీదుగా ప్రతీక్, అతని తల్లి శ్రీమతి మృదులకు సోమవారం అందజేశారు.ఈ సందర్భంగా మకుట వ్యవస్థాపకులు కొంపల్లి జనార్ధన్ మాట్లాడుతూ.. "సమాజం అభివృద్ధి చెందినప్పుడే నిజమైన వృద్ధి జరుగుతుందని మేము నమ్ముతాము. యువ ప్రతిభకు మద్దతు ఇవ్వడం అనేది మెరుగైన భవిష్యత్తుకు పెట్టుబడి లాంటిది. ప్రతీక్ లాంటి యువ ప్రతిభను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. సామాజిక బాధ్యతతో ఇలాంటి ఆటగాళ్లకు మద్దతు తెలిపితే, అంతర్జాతీయ క్రీడా పోటీల్లో రాణించి భారతదేశం ఖ్యాతి, గౌరవాన్ని పెంచుతారని'' కొంపల్లి అన్నారు. -
అద్దె అపార్ట్మెంట్లోనే విక్కీ కౌశల్: వామ్మో రెంట్ మరీ ఇంతనా..
ప్రముఖ బాలీవుడ్ నటుడు 'విక్కీ కౌశల్' ముంబైలోని జుహు ప్రాంతంలోని విలాసవంతమైన అపార్ట్మెంట్లో నివసిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ అపార్ట్మెంట్ లీజును పునరుద్ధరించారు. నెలవారీ అద్దె ఇంతకు ముందు చెల్లిస్తున్నదాని కంటే ఎక్కువైంది.ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ (IGR) వెబ్సైట్ ద్వారా స్క్వేర్ యార్డ్స్ సమీక్షించిన ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం.. విక్కీ కౌశల్ నెలవారీ అద్దె రూ. 17.01 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. మూడు సంవత్సరాల లీజు లావాదేవీ అధికారికంగా ఏప్రిల్ 2025లో నమోదు నమోదు చేశారు.జనవరి 2025 నుంచి ప్రారంభమయ్యే ప్రస్తుత మూడు సంవత్సరాల లీజు ఒప్పందంలో.. మొదటి, రెండవ సంవత్సరాలకు నెలవారీ అద్దె రూ.17.01 లక్షలు ఉంటుంది. మూడో సంవత్సరంలో ఇది రూ.17.86 లక్షలకు పెరుగుతుంది. లీజు వ్యవధిలో,విక్కీ కౌశల్ చెల్లించే మొత్తం అద్దె సుమారు రూ.6.2 కోట్లకు చేరుకుంటుందని అంచనా. దీనిపై విక్కీ కౌశల్ అధికారికంగా స్పందించలేదు.ఇదీ చదవండి: సొంతంగా స్టార్టప్.. కుమార్తెపై బిల్‌గేట్స్ ప్రశంసల వర్షం2021 జులైలో నెలవారీ అద్దె రూ.8 లక్షల నుంచి ప్రారంభమైంది. ఇప్పుడు అద్దె రెట్టింపు అయింది. లీజుకు సంబంధించిన నివేదికల ప్రకారం, విక్కీ కౌశల్ అపార్ట్మెంట్ రాజ్ మహల్లో ఉంది. ఇది ఒక రెడీ-టు-మూవ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్. స్క్వేర్ యార్డ్స్ రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం.. అపార్ట్మెంట్ 258.48 చదరపు మీటర్ల కార్పెట్ ఏరియాను కలిగి ఉంది. దీనితో పాటు మూడు కార్ పార్కింగ్ స్థలాలు లభిస్తాయి. ఈ లావాదేవీలకు నటుడు రూ. 1.69 లక్షల స్టాంప్ డ్యూటీ చెల్లింపు, రూ. 1,000 రిజిస్ట్రేషన్ ఛార్జీలు, రూ. 1.75 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్ వంటివి చెల్లించినట్లు సమాచారం. -
మార్కెట్లోకి సరికొత్త హైటెక్ ఫ్యాన్: ధర ఎంతంటే?
అసలే ఎండాకాలం.. భానుడి భగభగలు కారణంగా రోడ్డు మీదనే కాదు, ఇంట్లో ఉండటం కూడా కష్టతరమైపోయింది. డబ్బున్నవాళ్ళు ఏసీలు, కూలర్లు వంటివి కొనేస్తుంటారు. పేదవాళ్ళు ఫ్యాన్లకు మాత్రమే పరిమితమవుతారు. ఇప్పటికే మార్కెట్లో లెక్కకు మించిన ఫ్యాన్లు వివిధ ధరలలో అందుబాటులోకి వచ్చేసాయి. కాగా గోల్డ్‌మెడల్ ఎలక్ట్రికల్స్ కంపెనీ ఓ సరికొత్త ఫ్యాన్‌ను పరిచయం చేసింది. దీని గురించి వివరంగా ఇక్కడ తెలుసుకుందాం.భారతదేశంలోని ప్రముఖ ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రికల్ గూడ్స్ (FMEG) కంపెనీలలో ఒకటైన గోల్డ్‌మెడల్ ఎలక్ట్రికల్స్ 'విస్టా 3600 పెడెస్టల్ ఫ్యాన్'ను పరిచయం చేసింది. 360 డిగ్రీలు కదిలే ఈ ఫ్యాన్ మంచి కూలింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఇది హై-గ్రేడ్ ప్లాస్టిక్ చేత నిర్మితమై ఉంది.విస్టా 3600 పెడెస్టల్ ఫ్యాన్.. మూడు స్పీడ్ సెట్టింగ్‌లతో పాటు, నార్మల్, బ్రీజ్, నైట్ వంటి మల్టిపుల్ ఆపరేటింగ్ మోడ్‌లను పొందుతుంది. ఇన్ఫ్రారెడ్ (IR) రిమోట్ సౌలభ్యంతో.. అడ్జస్టబుల్ సెట్టింగ్‌లు సులభంగా ఉంటాయి. అంతే కాకుండా స్మార్ట్ ఎల్ఈడీ డిస్ప్లే ఫ్యాన్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాల్లో జియో ఎయిర్ ఫైబర్ జోరుఎక్కువ రోజులు ఇది పనిచేసేలా ఉండటానికి కంపెనీ హై-గ్రేడ్ కాపర్ మోటార్‌ను ఇందులో ఫిక్స్ చేసింది. ఎనిమిది గంటల వ్యవధిలో ఈ ఫ్యాన్ స్విచ్ ఆఫ్ అయ్యేలా సెట్ చేసుకోవడానికి ఒక టైమర్ కూడా ఇందులో ఉంటుంది. విస్టా 3600 పెడెస్టల్ ఫ్యాన్ ధర అమెజాన్‌లో రూ. 11,427. కెంపెనీ దీనిపై రెండు సంవత్సరాల వారంటీని అందిస్తుంది. -
తెలుగు రాష్ట్రాల్లో జియో ఎయిర్ ఫైబర్ జోరు
హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో జియో ఎయిర్ ఫైబర్ సేవల ద్వారా 5జీ ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ (FWA) విభాగంలో జియో తన ఆధిపత్యాన్ని మరింత బల పరుచుకుంది. భారత టెలికాం నియంత్రణ సంస్థ (TRAI) ఫిబ్రవరి 2025కి విడుదల చేసిన తాజా డేటా ప్రకారం.. జియో తెలుగు రాష్ట్రాల్లో 5జీ ఎఫ్‌డబ్ల్యుఏ విభాగంలో అత్యధిక మార్కెట్ షేర్‌ను సంపాదించింది.ఈ గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్(తెలంగాణ, ఆంధ్రప్రదేశ్)లో జియో ఎయిర్‌ఫైబర్ యాక్టివ్ సబ్స్క్రైబర్లు 2025 జనవరిలో 4,27,439 ఉండగా ఫిబ్రవరిలో 4,58,372 మందికి పెరిగారు. భారతీ ఎయిర్టెల్ సబ్స్క్రైబర్లు ఫిబ్రవరిలో 95,164 మంది మాత్రమే ఉన్నారు. అంటే.. 84% మార్కెట్ వాటా, అద్భుతమైన పనితీరుతో ఈ విభాగంలో జియో తన పోటీదారుల కంటే 5 రెట్లు ఎక్కువగా సబ్‌స్క్రైబర్ బేస్‌ను సంపాదించుకుంది.తన 5జీ మౌలిక సదుపాయాలను వేగంగా అభివృద్ధి చేయడం, అందుబాటులో ఉన్న ప్లాన్లను అందించడం.. సులభమైన కస్టమర్ అనుభవాన్ని కల్పించడం ద్వారా జియో ఈ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రత్యేకంగా గ్రామీణ, నగర ప్రాంతాలలో ఎన్నో సవాళ్లను అధిగమించి మారు మూల ప్రాంతాలకు సైతం హై స్పీడ్ కనెక్టివిటీని జియో అందిస్తోంది. ఆప్టికల్ ఫైబర్ (జియో ఫైబర్) విస్తరించలేని చోట్ల ప్రతి ఇల్లు మరియు చిన్న వ్యాపారానికి.. గృహ వినోదం, బ్రాడ్‌బ్యాండ్ సేవలను జియో ఎయిర్ ఫైబర్ అందుబాటులోకి తెచ్చింది.జియో ఎయిర్ ఫైబర్.. 800కి పైగా డిజిటల్ టీవీ ఛానళ్ళు, 11కి పైగా ఓటీటీ యాప్‌లు, నిరంతరాయంగా వైఫై, స్మార్ట్ హోమ్ సర్వీస్, హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్‌తో ప్రపంచ స్థాయి హోమ్ ఎంటర్టైన్మెంట్ను అందిస్తోంది. వివిధ వయస్సుల.. నేపథ్యాల నుంచి వినియోగదారులు ఇప్పుడు నిరవధిక హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ & ప్రపంచ స్థాయి హోమ్ ఎంటర్టైన్మెంట్ను పొందుతూ డిజిటల్ ఇండియా ప్రయోజనాలను నిజంగా అనుభవిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో వందలాది చిన్న, పెద్ద పట్టణాలు, వేలాది గ్రామాల్లో జియో ఎయిర్ ఫైబర్ డిజిటల్ ప్రాణశక్తిగా మారింది. -
హైదరాబాద్‌లో బిర్లా ఓపస్ పెయింట్ స్టూడియో
హైదరాబాద్: ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీ గ్రాసిమ్ ఇండస్ట్రీస్‌లో భాగమైన 'బిర్లా ఓపస్ పెయింట్స్'.. ఈరోజు హైదరాబాద్‌లో తన బిర్లా ఓపస్ పెయింట్ స్టూడియోను (కంపెనీ యాజమాన్యంలోని కంపెనీ ఆపరేటెడ్ ఎక్స్పీరియన్స్ స్టోర్) ప్రారంభించామని ప్రకటించింది. గురుగ్రామ్, లక్నో, ముంబయి, నవీ ముంబయి, బెంగళూరులో ఇప్పటికే విజయవంతంగా ప్రారంభించిన అనంతరం, పెయింట్, డెకర్ పరిశ్రమను ఆవిష్కరణ, ప్రీమియం ఆఫర్లు, నిజంగా లీనమయ్యే కస్టమర్ అనుభవం ద్వారా మార్చాలనే బ్రాండ్ నిబద్ధతను ఈ విస్తరణ మరింత బలోపేతం చేస్తుంది.బిర్లా ఓపస్ పెయింట్స్ హైదరాబాద్ స్టూడియో సాధారణ రిటైల్ ప్రయాణాన్ని స్ఫూర్తిదాయకమైన, లీనమయ్యే అనుభవంగా మార్చడానికి ఆలోచనాత్మకంగా రూపొందించారు. ఈ పెయింట్ స్టూడియో సంప్రదాయ పెయింట్ దుకాణాలకు అతీతంగా సృజనాత్మకతకు కేంద్రంగా తీర్చిదిద్దారు. ఇది ఒక ఎక్స్పీరియన్స్ కేంద్రం. ఇది వినియోగదారుల సృజనాత్మకతను మరింత కొత్తగా ఆవిష్కరించుకునేందుకు, నిజ జీవిత వాతావరణంలో రంగులను తాకడానికి, అనుభూతి చెందడానికి మరియు ఆస్వాదించేందుకు అనుమతిస్తుంది.వినియోగదారుల వ్యక్తిగతీకరించిన గైడ్ ద్వారా షేడ్ ఎంపిక, టెక్చర్లు, వినియోగించే నైపుణ్యాలపై నిపుణుల నుంచి ఉచిత మార్గదర్శకత్వాన్ని కూడా పొందవచ్చు. అధునాతన విజువలైజేషన్ సాధనాలు ఇంటి యజమానులు వారు ఎంచుకున్న రంగులు నిజ జీవిత సెట్టింగ్‌లలో ఎలా కనిపిస్తాయో ముందస్తుగా వీక్షించేందుకు సహాయపడతాయి. పెయింట్లకు మించి, పెయింట్ స్టూడియో వాల్కవరింగ్లు, డిజైనర్ ఫినిషింగ్‌లు మరియు సమగ్ర డెకర్ సొల్యూషన్ కోసం స్పెషాలిటీ కోటింగ్ ఎంపికలను కూడా కలిగి ఉంది.ఈ స్టోర్ 170 కంటే ఎక్కువ ఉత్పత్తులను ప్రదర్శించడమే కాకుండా, రంగుల ఎంపికపై నిపుణుల సంప్రదింపులు, వినూత్న అప్లికేషన్ టెక్నిక్‌లు, గొప్ప స్థానిక వారసత్వం నుంచి ప్రేరణ పొందిన క్యూరేటెడ్ డెకర్ సొల్యూషన్లతో సహా పలు ప్రత్యేక సేవలను అందిస్తుంది. ఇది స్థానిక అభిరుచులు, వారసత్వానికి అనుగుణమైన ఎంపికలతో శక్తివంతమైన నగర స్ఫూర్తిని ప్రతిబింబించే ప్రత్యేకమైన షేడ్స్‌ను క్యూరేటెడ్ డెకర్ ప్యాకేజీలను అందిస్తుంది.దేశ వ్యాప్తంగా.. తన రిటైల్ పాదముద్రను విస్తరించే లక్ష్యంతో బిర్లా ఓపస్ పెయింట్స్ వృద్ధి వ్యూహంలో ఈ ప్రారంభం కూడా ఒక ముఖ్యమైన అడుగు. అనుభవపూర్వక రిటైల్‌పై దృష్టి సారించి, రాబోయే నెలల్లో ఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, జైపూర్, అహ్మదాబాద్ మరియు సూరత్‌లలో అదనపు అనుభవ కేంద్రాలను ప్రారంభించాలని కంపెనీ యోచిస్తోంది.బిర్లా ఓపస్ పెయింట్స్ సీఈఓ రక్షిత్ హర్గవే మాట్లాడుతూ, “హైదరాబాద్‌లోని మా కొత్త పెయింట్ స్టూడియో కేవలం రిటైల్ స్థలం మాత్రమే కాదు, ఇది మీ పెయింటింగ్ అవసరాలకు ఒక అనుభవ కేంద్రం. అత్యాధునిక సాంకేతికత నుంచి స్థానికంగా ప్రేరణ పొందిన షేడ్ ప్యాలెట్ల వరకు, వినియోగదారులు, నిపుణులు అన్వేషించేందుకు, ప్రయోగాలు చేయడానికి, వ్యక్తీకరించడానికి మేము ఒక స్థలాన్ని సృష్టిస్తున్నాము. భారతదేశం పెయింట్లతో నిమగ్నమయ్యే విధానాన్ని మార్చడానికి, పెయింటింగ్ ప్రయాణాన్ని మరింత వ్యక్తిగతీకరించేందుకు, లీనమయ్యేలా.. స్ఫూర్తిదాయకంగా మార్చడానికి మా నిబద్ధతను ఈ స్టూడియో ప్రతిబింబిస్తుంది’’ అని వివరించారు. -
సొంతంగా స్టార్టప్.. కుమార్తెపై బిల్‌గేట్స్ ప్రశంసల వర్షం
తల్లిదండ్రులు ఎంత సంపాదించినా.. వారి ఆస్తి నుంచి చిల్లిగవ్వ తీసుకోకుండా ఎదిగేవాళ్ళు చాలా తక్కువమందే ఉంటారు. ఇలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు.. బిల్‌గేట్స్ కుమార్తె 'ఫోబ్ గేట్స్' (Phoebe Gates). ఈమె తండ్రిపై ఆధారపడకుండానే.. సొంతంగా స్టార్టప్ కోసం నిధులను సమకూర్చుకుంది. ఇది తనకు చాలా సంతోషంగా ఉందని టెక్ బిలియనీర్ న్యూయార్క్ టైమ్స్ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.తన కుమార్తె ఫోబ్ గేట్స్.. తన స్టార్టప్ కోసం నిధులను సేకరించే క్రమంలో, తన దగ్గరకు వస్తుందని నేను ఊహించాను. ఒకవేళ తను నన్ను సహాయం చేయమని అడిగి ఉంటే.. తప్పకుండా చేసేవాణ్ణి. అయితే కొన్ని షరతులు కూడా పెట్టేవాడినని బిల్‌గేట్స్ అన్నారు. అయితే నిధుల కోసం నన్ను సంప్రదించకుండా.. సొంతంగా సమకూర్చుకున్న కూతురిపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు.22 ఏళ్ల ఫోబ్ గేట్స్.. తన స్నేహితురాలు సోషియా కియానీతో కలిసి 'ఫియా' అనే స్టార్టప్ ప్రారంభించారు. ఇది ఒక సిజిటల్ ఫ్యాషన్ ప్లాట్‌ఫామ్. ఇందులో సుమారు 40,000 కంటే ఎక్కువ వెబ్సైట్లలో అందుబాటులో ఉన్న దుస్తుల ధరలను వెల్లడిస్తుంది. వినియోగదారులకు ఫ్యాషన్ ఉత్పత్తుల మీద బెస్ట్ డీల్స్ అందించడంతో పాటు.. ఆన్లైన్ షాపింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరచడమే దీని ప్రధాన లక్ష్యం.ఇదీ చదవండి: నాలుగు రోజులు సెలవు పెట్టాను: హెచ్ఆర్ కాల్ చేసి..2024లో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన.. ఫోబ్ గేట్స్ తన స్టార్టప్ కోసం వెంచర్ క్యాపిటలిస్టులు & ఏంజెల్ ఇన్వెస్టర్ల నుంచి సుమారు 500000 డాలర్ల కంటే ఎక్కువ నిధులను సేకరించింది. సుమారు 102.2 బిలియన్ డాలర్ల సంపద కలిగిన తన తండ్రి బిల్‌గేట్స్ సహాయం పొందకుండా.. స్టార్టప్ ప్రారభించడం గొప్ప విషయం అని పలువు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. బిల్ గేట్స్ తన మాజీ భార్య మెలిండా ఫ్రెంచ్ గేట్స్ తో ముగ్గురు పిల్లలను కన్నారు. వారు జెన్నిఫర్ (28), రోరీ (25), ఫోబ్. -
నాలుగు రోజులు సెలవు పెట్టాను: హెచ్ఆర్ కాల్ చేసి..
జాబ్ చేసేవారు తమ ఉద్యోగ కష్టాలు.. ఆఫీసులో ఎదురయ్యే అనుభవాలు, ఎదుర్కొంటున్న సమస్యలు మొదలైనవన్నీ చెప్పుకోవడానికి రెడ్డిట్ ఓ మంచి వేదికగా మారింది. ఇందులో భాగంగానే ఒక వ్యక్తి.. తాను ఆఫీసులో ఎదుర్కొంటున్న కష్టాలను షేర్ చేశారు.నేను పనిచేసే కంపెనీలో.. ఆదివారం మాత్రమే సెలవు ఉంటుంది. అయితే కొన్నిసార్లు ఆదివారాల్లో కూడా ఐదు గంటల నుంచి ఆరు గంటలు పనిచేయాలని మేనేజర్ పేర్కొంటారు. ఇటీవల నేను నాలుగు రోజులు సెలవు కావాలని అడిగాను, చాలా చర్చలు జరిపిన తరువాత సెలవు మంజూరు చేశారు.సెలవులు ఇచ్చారు, కానీ.. సమయం దొరికినప్పుడల్లా ఆఫీస్ వర్క్ చేయాలని మేనేజర్ చెప్పారు. కానీ ఆ సమయంలో పని చేయడం కష్టమవుతుందని, వీలైతే చేస్తానని నేను (ఉద్యోగి) చెప్పాను. అయితే సెలవుల సమయంలో వర్క్ చేయలేకపోయాను.సెలవుల తరువాత నేను ఆఫీసుకి తిరిగి వచ్చాను. ఆ రోజు సాయంత్రానికే.. నా పనితీరు తక్కువగా ఉందని, నన్ను పీఐపీ( పర్ఫామెన్స్ ఇంప్రూమెంట్ ప్లాన్)లో ఉంచినట్లు హెచ్ఆర్ నుంచి కాల్ వచ్చింది. దీనికి కారణం సెలవుల్లో పనిచేయకపోవడమే అని నాకు అర్థమైంది. ఇది నన్ను చాలా గందరగోళానికి గురిచేసింది. చట్టబద్ధంగా ఇది ఎలా జరుగుతుందో నాకు అర్థం కాలేదు? సంస్థలకు తాము చేయగలిగింది చేయగలిగేంత అధికారం ఉందా?..ఈ చర్యలను ఎదుర్కోవడానికి తగిన పరిష్కారం ఉందా.. అని పోస్ట్ చేశారు.ఇదీ చదవండి: రూ.60 లక్షల ఆదాయం.. అన్నీ సమస్యలే: పోస్ట్ వైరల్దీనిపై పలువురు నెటిజన్లు స్పందించారు. కంపెనీ, మేనేజర్ పేరు చెప్పి అవమానించండి అని ఒకరు అన్నారు. చాలా కంపెనీలలో ఇలాగే జరుగుతోందని ఇంకొకరు అన్నారు. హెచ్ఆర్ను మీకు ఈ మెయిల్ చేయమని చెప్పండి అని మరొకరు అన్నారు. ఇలా ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు సలహాలు ఇచ్చారు. -
లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
సోమవారం ఉదయం లాభాల్లో మొదలైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1,005.84 పాయింట్లు లేదా 1.27 శాతం లాభంతో 80,218.37 వద్ద, నిఫ్టీ 272.90 పాయింట్లు లేదా 1.14 శాతం లాభంతో 24,312.25 వద్ద నిలిచాయి.జయస్వాల్ నెకో ఇండస్ట్రీస్, ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్, ఓరియంటల్ ట్రైమెక్స్, సౌత్ వెస్ట్ పినాకిల్ ఎక్స్‌ప్లోరేషన్, బార్బెక్యూ నేషన్ హాస్పిటాలిటీ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. లాయిడ్స్ ఇంజనీరింగ్ వర్క్స్, తేజస్ నెట్వర్క్స్, అసోసియేటెడ్ ఆల్కహాల్ అండ్ బ్రూవరీస్, ఎస్ఎమ్ఎల్ ఇసుజు, అవంటెల్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు). -
భారత కార్బన్ మార్కెట్ ప్రారంభం..
భారత్‌తోపాటు ప్రపంచం అంతటా వాతావరణ కాలుష్యం ప్రధాన సమస్యగా మారుతోంది. ఇందుకు కార్బన్ ఉద్గారాలు కీలకంగా ఉన్నాయి. వివిధ ఉత్పత్తుల తయారీలో భాగంగా వీటిని విడుదల చేస్తున్న కంపెనీలపై కాలుష్య నియంత్రణ ప్రభావం పడుతుంది. ముఖ్యంగా అల్యూమినియం, సిమెంట్, క్లోర్-ఆల్కలీ, పేపర్ ఇండస్ట్రీల్లో 282 యూనిట్లకు నిర్దిష్ట ఉద్గార తీవ్రత లక్ష్యాలను నోటిఫై చేయడం ద్వారా గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాల సమస్యను కొంతవరకు కట్టడి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కర్బన ఉద్గారాలను నియంత్రించడం, పరిశ్రమల్లో స్థిరమైన పద్ధతులను ప్రోత్సహించడం లక్ష్యంగా కార్యాచరణను తయారుచేసింది. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ మార్గదర్శకాల ప్రకారం పవర్ ఎక్స్ఛేంజీల్లో కార్బన్ క్రెడిట్ సర్టిఫికేట్లు ట్రేడ్ కావడంతో భారతదేశం ఇటీవల తన కార్బన్ మార్కెట్‌ను ప్రారంభించింది.కాంప్లయన్స్ కార్బన్ మార్కెట్పరిశ్రమలు ప్రభుత్వం నిర్ణయించిన లక్ష్యాల మేరకే ఉత్పత్తులను తయారు చేయాల్సి ఉంటుంది. బాధ్యతాయుతమైన సంస్థలు (ఆబ్లిగేటెడ్ ఎంటిటీస్-ఓఈ) ఉద్గార పరిమితులను చేరుకోవాలి. ఈ పరిమితుల కంటే అధికంగా ఉద్గారాలు ఉంటే చర్యలు తప్పవు. టన్ను కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించినా లేదా నివారించినా కార్బన్ క్రెడిట్ సర్టిఫికేట్లను జారీ చేస్తారు. ఈ ధ్రువీకరణ పత్రాలను రెగ్యులేటర్లకు సమర్పించాల్సి ఉంటుంది. వీటిని పాటించనందుకు జరిమానాలు సైతం విధించేలా నిబంధనలు సిద్ధం చేశారు.కార్బన్ క్రెడిట్ సర్టిఫికేట్లు అంటే..ఒక టన్ను కార్బన్ డయాక్సైడ్ (CO2) లేదా గ్రీన్ హౌస్ వాయువులు (GHG) నివారిస్తే కంపెనీలకు ప్రత్యేకంగా ఇచ్చే సర్టిఫికేట్లు. కంపెనీలు కర్బన ఉద్గారాలను తగ్గించడానికి, ఆ దిశగా సంస్థలను ప్రోత్సహించడానికి వీటిని రూపొందించారు. ఒక ప్రాజెక్ట్ విజయవంతంగా GHG ఉద్గారాలను తగ్గించినప్పుడు నియంత్రణ సంస్థలు లేదా స్వతంత్ర సంస్థల ద్వారా కార్బన్ క్రెడిట్ సర్టిఫికేట్లు జారీ చేస్తారు. ఉదాహరణకు, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు లేదా అడవుల పెంపకం కార్యక్రమాలతో ఈ క్రెడిట్లను సంపాదించవచ్చు.ఉద్గారాల పరిమితిని దాటిన కంపెనీలు మిగులు క్రెడిట్లు ఉన్న సంస్థల నుంచి ఈ సర్టిఫికేట్లను కొనుగోలు చేయవచ్చు. ఇది ఉద్గారాల తగ్గింపునకు మార్కెట్ ఆధారిత విధానాన్ని సృష్టిస్తుంది. సంస్థలు ఉద్గారాలను తగ్గించడం లేదా కార్బన్ క్రెడిట్లను కొనుగోలు చేయడం ద్వారా లక్ష్యాలను చేరుకోవాలి. దీన్ని పాటించడంలో విఫలమైతే జరిమానాలు తప్పవు. కార్పొరేట్ సామాజిక బాధ్యత లేదా నైతిక పద్ధతుల్లో భాగంగా కంపెనీలు తమ ఉద్గారాలను భర్తీ చేయడానికి స్వచ్ఛందంగా కార్బన్ క్రెడిట్లను కొనుగోలు చేయవచ్చు.ఇదీ చదవండి: భారత్‌లో తగ్గిన పేదరికం! ఎలాగంటే..ప్రయోజనాలుఇది క్రెడిట్ సర్టిఫికేట్లు కలిగి ఉన్న కంపెనీలకు సుస్థిర ప్రాజెక్టుల్లో పెట్టుబడులు వచ్చేలా ప్రోత్సహిస్తుంది. ఉద్గారాల తగ్గింపునకు సంస్థలకు ఆర్థిక వెసులుబాటు అందిస్తుంది. వాతావరణ కాలుష్య కట్టడికి ఇతర కంపెనీలకు తోడ్పడుతుంది. -
ఐపీఎల్ 2025 కెప్టెన్స్ ఖరీదైన కార్లు.. ఇవే
ఐపీఎల్ 2025 ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఈ సమయంలో కేవలం క్రికెట్ ఆటగాళ్లు, టీమ్ ఓనర్స్ గురించి మాత్రమే కాకుండా.. కెప్టెన్స్ ఎలాంటి కార్లను ఉపయోగిస్తారనే విషయాలను తెలుసుకోవడానికి కూడా కొందరు ఆసక్తి చూపుతారు. ఈ కథనంలో 2025 ఐపీఎల్ కెప్టెన్లు ఉపయోగించే ఖరీదైన కార్లు ఏవో చూసేద్దాం..➤హార్దిక్ పాండ్యా (ముంబై ఇండియన్స్): రోల్స్ రాయిస్ ఫాంటమ్ (రూ. 9.50 కోట్లు)➤శ్రేయాస్ అయ్యర్ (పంజాబ్ కింగ్స్): లంబోర్గిని హురాకాన్ ఈవీఓ స్పైడర్ (రూ. 3.73 కోట్లు)➤పాట్ కమ్మిన్స్ (సన్‌రైజర్స్ హైదరాబాద్): ఫెరారీ 488 జీటీబీ (రూ. 3.68 కోట్లు)➤మహేంద్ర సింగ్ ధోని (చెన్నై సూపర్ కింగ్స్): ఫెరారీ 599 జీటీఓ (రూ. 3.57 కోట్లు)➤అజింక్య రహానే (కోల్‌కతా నైట్ రైడర్స్): మెర్సిడెస్ మేబ్యాచ్ జీఎల్ఎస్ 600 (రూ. 2.96 కోట్లు)➤రిషబ్ పంత్ (లక్నో సూపర్ జెయింట్స్): ఆడి ఏ8 (రూ. 1.3 కోట్లు)➤సంజు సామ్సన్ (రాజస్థాన్ రాయల్స్) రేంజ్ రోవర్ స్పోర్ట్ (రూ. 1.6 కోట్లు)➤అక్షర్ పటేల్ (ఢిల్లీ క్యాపిటల్స్): మెర్సిడెస్ సీ క్లాస్ (రూ. 1 కోటి)➤శుభ్‌మాన్ గిల్ (గుజరాత్ టైటాన్స్): మెర్సిడెస్ బెంజ్ ఈ350 (రూ. 75 లక్షల నుంచి రూ. 90 లక్షలు)➤రజత్ పాటిదార్ (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు): హ్యుందాయ్ ఐ20 (రూ. 7 లక్షల నుంచి రూ. 10 లక్షలు)ఐపీఎల్ 2025 టీమ్ కెప్టెన్లలో ఖరీదైన కారును కలిగి ఉన్న వ్యక్తి 'హార్దిక్ పాండ్యా' అని స్పష్టమవుతోంది. ఈయన వద్ద ఉన్న రోల్స్ రాయిస్ ఫాంటమ్ అత్యంత ఖరీదైన కార్ల జాబితాలో ఒకటి. దీని ధర రూ. 9.50 కోట్లు. ఆ తరువాత జాబితాలో శ్రేయాస్ అయ్యర్, పాట్ కమ్మిన్స్, ఎంఎస్ ధోని మొదలైనవారు ఉన్నారు. ధోని గ్యారేజిలో లెక్కకు మించిన కార్లు, బైకులు ఉన్నాయి. వీటిలో ఖరీదైన కారు ఫెరారీ 599 జీటీఓ అని తెలుస్తోంది.ఇదీ చదవండి: ఫ్రీ వైఫై వినియోగం.. ప్రభుత్వం హెచ్చరిక -
కొత్త లీవ్ పాలసీ జూలై 1 నుంచి..?
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏటా 42 అదనపు సెలవులు మంజూరు చేస్తున్నట్లు, దీనికి సంబంధించిన కొత్త లీవ్ పాలసీ జూలై 1 నుంచి అమల్లోకి వస్తున్నట్లు కొన్ని వార్తా కథనాలు వచ్చాయి. అయితే ఈ అదనపు సెలవులు కేంద్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీనా.. లేక ప్రత్యేకంగా కొంతమందికేనా అన్న గందరగోళం నెలకొంది.అవయవ దాతలకు సెలవులువాస్తవంగా అవయవాలను దానం చేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గరిష్టంగా 42 రోజులు స్పెషల్ క్యాజువల్ సెలవులు మంజూరు చేయనున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఏప్రిల్ 2న లోక్‌సభ ప్రకటనలో తెలియజేశారు. ఈ సెలవులను శస్త్రచికిత్సకు ముందు, ఆసుపత్రిలో చేరినప్పుడు, రికవరీ సమయంలో వినియోగించుకోవచ్చు. ఇది అన్ని అవయవ దాన శస్త్రచికిత్సలకూ వర్తిస్తుంది. అలాగే ఇది వైద్య సిఫార్సుల ఆధారంగా వన్-టైమ్ బెనిఫిట్. ఏటా ఇచ్చే సెలవులు కాదు. ఇది అవయవదానాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం అందిస్తున్న చొరవ. సాధారణ సెలవు విధానం కాదు.ఏటా 42 అదనపు సెలవులు?పూర్తికాల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ సంవత్సరానికి 42 అదనపు సెలవులను మంజూరు చేసే కొత్త లీవ్ పాలసీ జూలై 1 నుండి అమలులోకి వస్తోందని కొన్ని మీడియా నివేదికలు పేర్కొన్నాయి. పని-జీవిత సమతుల్యతను మెరుగుపరచడానికి ప్రస్తుత క్యాజువల్, ఆర్జిత, వైద్య సెలవులకు అదనంగా ఈ లీవ్స్‌ను ప్రభుత్వం ఇస్తోందంటూ నివేదించాయి. అయితే దీనికి సంబంధించి అధికారిక ధ్రవీకరణ రావాల్సి ఉంది. -
భారత్‌లో తగ్గిన పేదరికం! ఎలాగంటే..
భారత్‌లో గడిచిన దశాబ్దకాలంలో పేదరికం తగ్గుతుందని నివేదికలు చెబుతున్నాయి. ప్రపంచబ్యాంకు ఇటీవల విడుదల చేసిన ‘పావర్టీ అండ్ ఈక్విటీ బ్రీఫ్ ఆన్ ఇండియా’ రిపోర్ట్‌లో పేదరిక నిర్మూలనలో దేశం సాధించిన పురోగతిని హైలైట్ చేసింది. 2017 పీపీపీ(పర్చేజింగ్ పవర్ పారీటీ-కొనుగోలు శక్తి సమానత్వ సూచీ) నిబంధనల ప్రకారం రోజుకు 2.15 డాలర్ల కంటే తక్కువ ఆదాయం సంపాదిస్తున్నవారు ‘తీవ్ర పేదరికం’లో ఉన్నట్లు భావిస్తున్నారు. ఇటీవల ఆ సూచీని భారత్ గణనీయంగా అధిగమించినట్లు నివేదిక తెలుపుతుంది. 2011-12లో 16.2%గా ఉన్న తీవ్ర పేదరికం 2022-23 నాటికి కేవలం 2.3%కు పడిపోయిందని పేర్కొంది. ఈ మార్పు 17.1 కోట్ల మందిని తీవ్రమైన పేదరికం నుంచి దూరం చేసింది.పేదరిక నిర్మూలనకు కొన్ని ప్రధాన కారణాలుదేశంలో 80 కోట్లకు పైగా లబ్ధిదారులకు ఆహార ధాన్యాలను విస్తృతంగా పంపిణీ చేయడం వంటి ఆహార భద్రత కార్యక్రమాలు ఇందులో కీలక పాత్ర పోషించాయి. జన్ ధన్ యోజన, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, రాష్ట్ర స్థాయి సంక్షేమ పథకాలు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్స్ (డీబీటీలు) ద్వారా ప్రజలకు సహాయం అందింది. 2022-23, 2023-24 సంవత్సరాలకుగాను గృహ వినియోగదారుల వ్యయ సర్వేల్లో (హెచ్సీఈఎస్) ఉపయోగించిన కొత్త పద్ధతులు పేదరిక గణాంకాలను మరింత కచ్చితంగా తెలియజేశాయి.తీవ్ర పేదరికానికి అతీతంగా..తక్కువ, మధ్య ఆదాయ దేశంలో పేదరికాన్ని కొలిచేందుకు రోజుకు 3.65 డాలర్ల (పీపీపీ) సంపాదనను బెంచ్‌మార్క్‌గా తీసుకుంటారు. దీన్ని పరిగణలోకి తీసుకుంటే భారత్‌లో 2011-12లో 61.8 శాతంగా ఉన్న పేదరికం 2022-23 నాటికి 28.1 శాతానికి పడిపోయింది. ఈ దశాబ్దంలో 37.8 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు.అసమానతలు..వినియోగ ఆధారిత అసమానతలు తగ్గినప్పటికీ, దేశంలో ఆదాయ అసమానతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2023-24లో సంపాదనలో దిగువన ఉన్న 10% ప్రజల కంటే టాప్‌లో నిలిచిన 10% మంది 13 రెట్లు అధికంగా సొమ్ము కూడగట్టుకున్నారు. పట్టణ-గ్రామీణ వినియోగంలో వ్యత్యాసం 2011-12లో 84% నుంచి 2023-24 నాటికి 70%కి తగ్గింది. అయినప్పటికీ గణనీయమైన అసమానతలు కొనసాగుతున్నాయి. దేశంలో పేదరికాన్ని కట్టడి చేసేందుకు ‘ఉచితాలు’ లేదా సంక్షేమ పథకాల్లోని అంశాలను మరింత విశ్లేషించాల్సిన అవసరం ఉంది.ఇదీ చదవండి: వడ్డీ రేట్ల తగ్గింపు.. లాభామా? నష్టమా?పరిష్కారాలుదేశంలో పేదరికాన్ని తగ్గించడానికి సుస్థిర అభివృద్ధిని ప్రోత్సహిస్తూనే ఆర్థిక అసమానతల మూల కారణాలను పరిష్కరించాలని నిపుణులు చెబుతున్నారు. అందుకు కొన్ని సూచనలు చేస్తున్నారు. వాటి ప్రకారం.. తయారీ, వ్యవసాయం, సాంకేతిక పరిజ్ఞానం వంటి పరిశ్రమలను ప్రోత్సహించి మరిన్ని ఉపాధి అవకాశాలను సృష్టించాలి. రుణాలు, సబ్సిడీలు, టెక్నాలజీ అప్గ్రేడ్ల ద్వారా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు (ఎంఎస్ ఎంఈ) మద్దతు ఇవ్వాలి. నాణ్యమైన విద్యను విస్తరించాలి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వేతనంతో కూడిన ఉద్యోగాల కోసం వ్యక్తులకు తగిన నైపుణ్యాలు అందించాలి. శిశుసంరక్షణ సౌకర్యాలు, సురక్షితమైన పనివాతావరణాలు, ఆర్థిక స్వాతంత్ర్య కార్యక్రమాలను అందించడం ద్వారా శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలి. -
ఇదిగో ఇన్వెస్ట్మెంట్కూ ఇదే సూత్రం..
మీరో రోడ్ ట్రిప్‌కు బైల్దేరారు. కారు విండోలు కిందికి దించి, స్వేచ్ఛగా, ఝామ్మంటూ, జోరుగా దూసుకెళ్తున్నారు. దారిలో ఏ అడ్డంకి వచ్చినా దాటేయగలను అనే ఆత్మవిశ్వాసంతో వెళ్తున్నారు. కానీ, ఇంతలోనే వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. కుండపోతగా వాన మొదలైంది. ముందేమీ సరిగ్గా కనిపించడం లేదు. కారు పట్టు తప్పిపోతోంది. అప్పటిదాకా థ్రిల్లింగ్ అనిపించిన జర్నీ కాస్తా, ఒక్కసారిగా గందరగోళంగా మారిపోయింది. అప్పుడు అనిపిస్తుంది. మీరు అనుకున్నంత స్థాయిలో రిస్కులను ఎదుర్కొనేంత సన్నద్ధత మీకు లేదేమోనని. ఇదిగో, పెట్టుబడులకు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. చాలా మంది ఇన్వెస్టర్లకు తాము చాలా రిస్కు తీసుకోగలమనో లేదా ఒక మోస్తరుగా తీసుకోగలమనో తమ తమ రిస్కు సామర్థ్యాల విషయంలో ఒక భావన ఉంటుంది. కానీ వాస్తవ ప్రపంచంలో పరిస్థితులు వేరుగా ఉంటాయి. ఈ ధీమాను విపరీతంగా పరీక్షిస్తాయి. మార్కెట్లో ఒడిదుడుకులను ఆచరణలో ఎదుర్కొనడమనేది థియరీలో చెప్పినంత సులువైన వ్యవహారం కాదు. ఇలా, మనకు ఉన్నాయనుకునే రిస్కు సామర్థ్యాలకు, వాస్తవంగా ఉన్న సామర్థ్యాలకు మధ్య వైరుధ్యం నెలకొన్నప్పుడు, భావోద్వేగాలకు లోనై, నిర్ణయాలు తీసుకుంటాం.కంగారుపడిపోయి, ముందుగానే తప్పుకుంటాం లేదా సామర్థ్యానికి మించి మరింత రిస్కు తీసుకుంటాం. ఊహించుకుంటున్న సామర్థ్యాలకు, వాస్తవ సామర్థ్యాలకు మధ్య వ్యత్యాసాన్ని ముందుగానే గుర్తించి, క్రియాశీలకంగా చక్కదిద్దుకుంటే సంపద సృష్టికి దోహదపడుతుంది. లేకపోతే సంపద నాశనానికి దారితీస్తుంది. మరికొందరు ఇన్వెస్టర్లు, మరింత ఎక్కువగా రిస్కులు తీసుకోగలిగినప్పటికీ, తమకు అంత సామర్థ్యం లేదని భావిస్తుంటారు. ఇలా మరీ మెతక వైఖరి వల్ల వృద్ధి అవకాశాలను కోల్పోతుంటారు. అవగాహన ఉండాలి.. రిస్కు సామర్థ్యం అనేది ఆర్థిక లక్ష్యాలు, పెట్టుబడుల వ్యవధి, వ్యక్తిత్వాన్ని బట్టి ఇన్వెస్టరు ఏ స్థాయిలో రిస్కును తీసుకోగలుగుతారనేది చూచాయగా తెలియజేస్తుంది. ఇక రిస్క్ సహనశీలత అనేది, మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నప్పుడు ఇన్వెస్టరు వాస్తవంగా – ఇటు భావోద్వేగాలపరంగా అటు ఆర్థికంగా – ఎంత వరకు రిస్కు తీసుకుంటారనేది తెలియజేస్తుంది. ఉదాహరణకు ఈక్విటీల విషయంలో తాను ఎంతైనా రిస్కు తీసుకోగలనని ఓ ఇన్వెస్టరు అనుకోవచ్చు. కానీ మార్కెట్లు పతనమవుతున్నప్పుడు కంగారుపడిపోయి, అమ్మేయొచ్చు. అంటే, తాము రిస్కుల విషయంలో ముందుగా ఊహించుకున్న దానికన్నా సహనశీలత చాలా తక్కువగా ఉందని అర్థం. ఇలా ఊహించుకునే దానికి, వాస్తవానికి మధ్య ఉండే వ్యత్యాసం వల్ల భావోద్వేగాలకు లోనై నిర్ణయాలు తీసుకోవడంతో ఆర్థిక ప్రణాళికలు తల్లకిందులవుతాయి. రిస్కులపై భ్రమలు.. మనం ఊహించుకునే రిస్కు సామర్థ్యాలకు, వాస్తవ పరిస్థితికి మధ్య వ్యత్యాసాలకు చాలా కారణాలే ఉంటాయి: మార్కెట్ పరిస్థితులు: బుల్ మార్కెట్లు మనకు ఆత్మవిశ్వాసం ఉన్నట్లు భ్రమింపచేస్తాయి. మరోవైపు, మార్కెట్లు పతనమైనప్పుడు తీవ్రమైన భయం వేస్తుంది. దీంతో ఇన్వెస్టర్లు, ముందూ వెనుకా ఆలోచించకుండా తమ రిస్కు సామర్థ్యాలను పక్కనపెట్టి అప్పటికప్పుడు నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటారు. అనుభవం: మొదటిసారిగా ఇన్వెస్ట్ చేస్తున్నవారు, మార్కెట్ల పతనాన్ని తొలిసారి చవిచూసే వరకు తాము ఎలాంటి రిస్కులనైనా ఎదుర్కొనగలమనే భావనలో ఉండొచ్చు. కానీ అనుభవజ్ఞులైన ఇన్వెస్టర్లకు మాత్రమే వాస్తవిక దృక్కోణం ఉంటుంది. భావోద్వేగాలపరమైన పక్షపాత ధోరణులు: నష్టాన్ని అస్సలు ఇష్టపడకపోయే ధోరణి ఉంటే, లాభాలు ఎంత వచ్చినా గానీ కాస్తంత నష్టం వస్తే చాలా కష్టంగా అనిపించేలా చేస్తుంది. అలాగే, ఇటీవలి కాలంలో కనిపించిన ధోరణుల వైపు మొగ్గు చూపే ఆలోచన విధానం ఉంటే, మార్కెట్లు స్వల్పకాలిక ఒడిదుడుకులకు లోనైనా ఇన్వెస్టర్లు భావోద్వేగంతో నిర్ణయాలు తీసుకునే పరిస్థితి తలెత్తుతుంది. గుంపును అనుసరించి ముందుకెళ్లే ధోరణి, ఇన్వెస్టర్లు తమకు అనువు కాని రిస్కులను తీసుకునేలా ప్రేరేపిస్తుంది. జీవితంలో మార్పులు: యువ ప్రొఫెషనల్స్‌కు కాస్తంత రిస్కులు తీసుకునే సామర్థ్యాలు ఎక్కువే ఉండొచ్చు. కానీ పెళ్లి, పిల్లలు, రిటైర్మెంట్కు దగ్గరవుతుండటంలాంటి పరిస్థితుల కారణంగా ప్రాధాన్యతలు మారొచ్చు. దానికి అనుగుణంగానే రిస్క్ సామర్థ్యాలూ మారొచ్చు. కాలవ్యవధిపై భ్రమలు: పెట్టుబడులు మొదలెట్టినప్పుడు తమకు బోలెడంత సమయం ఉందని ఇన్వెస్టర్లు భావిస్తుంటారు. కానీ స్వల్పకాలికంగా నష్టాలు ఎదురైనప్పుడు, అసలు సమయమే లేదనే రీతిలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. సామర్థ్యాలకు తగ్గట్లుగా పెట్టుబడులు.. ఇన్వెస్టర్లు తమ వాస్తవిక రిస్కు సామర్థ్యాల గురించి అర్థం చేసుకున్న తర్వాత, తదనుగుణంగా పోర్ట్‌ఫోలియోను సరి చేసుకోవడం చాలా కీలకం. ఈక్విటీలు, ఫిక్సిడ్ ఇన్‌కం, ప్రత్యామ్నాయ పెట్టుబడి సాధనాలతో పోర్ట్‌ఫోలియోలో వైవిధ్యాన్ని పాటిస్తే, రిస్కులను సమర్ధంగా ఎదుర్కొనేందుకు వీలవుతుంది. పెట్టుబడులను దీర్ఘకాలికంగా కొనసాగించడం ద్వారా ఒడిదుడుకులను ఎదుర్కొనేందుకు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు (సిప్) ఉపయోగపడతాయి. జీవితంలోని దశలు, మార్కెట్ పరిస్థితులను బట్టి రిస్క్ సామర్థ్యాలు మారిపోతుంటాయి కాబట్టి, మధ్యమధ్యలో పోర్ట్‌ఫోలియోను సమీక్షించుకుంటూ ఉండాలి.క్రమం తప్పకుండా రీబ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటే రిస్కులకు తగ్గట్లుగా మెరుగైన రాబడులను పొందేందుకు సాధ్యపడుతుంది. ప్రొఫెషనల్ సలహాలను తీసుకుంటే మనకు అనువైన వ్యూహాలను అమలు చేసేందుకు వీలవుతుంది. పెట్టుబడులు విజయవంతం కావాలంటే మనపై మనకు అవగాహన ఉండటం ముఖ్యం. తప్పుగా అంచనా వేసుకుంటే, భావోద్వేగాలపరమైన నిర్ణయాలతో అంతిమంగా ఆర్థిక ప్రణాళికలు పట్టాలు తప్పుతాయి. క్రమం తప్పకుండా సమీక్షించుకుంటూ ఉండటం, క్రమశిక్షణతో పెట్టుబడులు, సమతుల్యమైన వ్యూహాలు వంటి అంశాలు లక్ష్యాల సాధన దిశగా ముందుకెళ్లేందుకు ఉపయోగపడతాయి.ఎలా గుర్తించాలి.. వాస్తవిక రిస్క్ సామర్థ్యాలను అర్ధం చేసుకోవాలంటే గతంలో చేసిన పెట్టుబడుల ధోరణులను ఒకసారి విశ్లేషించుకోవాలి. మార్కెట్లు పతనమైనప్పుడు కూడా పెట్టుబడులను కొనసాగించారా లేదా కంగారు పడిపోయి, నిష్క్రమించారా? అనే అంశాన్ని పరిశీలించుకోవాలి. ఆదాయ స్థిరత్వం, పెట్టుబడుల కాలవ్యవధి, ఒడిదుడుకుల విషయంలో భావోద్వేగాలపరమైన స్పందన తదితర అంశాలను పరిగణనలోకి తీసుకునే రిస్క్ ప్రొఫైలింగ్ సాధనాలు ఇందులో కాస్త సహాయపడగలవు. ఇక అసెట్లకు జరిపే కేటాయింపులు కూడా మనం ఎంతవరకు రిస్కులను ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉంటామనే విషయాన్ని తెలియజేస్తుంది.ఉదాహరణకు పెట్టుబడుల విషయంలో చాలా దూకుడుగా, చురుగ్గా ఉంటాననుకునే వ్యక్తి ఎక్కువగా ఫిక్సిడ్ ఇన్‌కం అసెట్స్వైపే మొగ్గు చూపుతున్నారంటే, తాము ఊహించుకుంటున్న దానికన్నా వారి రిస్క్ సామర్థ్యాలు తక్కువగా ఉన్నట్లు భావించవచ్చు. పెట్టుబడుల కాలవ్యవధి, ఆర్థిక లక్ష్యాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. స్వల్పకాలిక లిక్విడిటీ అవసరాలు ఉన్న వారితో పోలిస్తే దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు సాధారణంగా కాస్తంత ఎక్కువ రిస్కులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక చిన్న స్ట్రెస్ టెస్టుతో వాస్తవ పరిస్థితులను అంచనా వేసుకోవచ్చు. పోర్ట్‌ఫోలియో 20 శాతం పడిపోయినా ఎలాంటి మార్పులు, చేర్పులూ చేయకుండా ఓర్చుకోగలమా అనే చిన్న ప్రశ్న వేసుకుంటే మన రిస్క్ సామర్థ్యాలు మనకు అర్థమవుతాయి.- రోహిత్ మట్టూ, నేషనల్ హెడ్ – రిటైల్ సేల్స్, యాక్సిస్ మ్యుచువల్ ఫండ్ -
ఈ-అంబులెన్స్‌ల తయారీలో జాప్యం.. కారణం..
ఎలక్ట్రిక్ మొబిలిటీని ప్రోత్సహించడానికి ఉద్దేశించిన ప్రధానమంత్రి ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్(పీఎం ఈ-డ్రైవ్) పథకంలో భాగంగా ఈ-అంబులెన్స్‌లు రోడెక్కేందుకు మరింత సమయం పట్టనుంది. 2024 సెప్టెంబర్‌లో ఈ-అంబులెన్స్‌ల కోసం రూ.500 కోట్ల కేటాయించారు. ఈ-డ్రైవ్ పథకంలో భాగంగా వీటిని తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ఇది ఇప్పటికీ స్పష్టమైన ఫలితాలను ఇవ్వలేదు. పీఎం ఈ-డ్రైవ్ కోసం మొత్తం రూ.10,900 కోట్ల వ్యయం చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ-అంబులెన్స్ విభాగంలో ఫోర్స్ మోటార్స్, మారుతీ సుజుకి ఇండియా, టాటా మోటార్స్ వంటి కొన్ని కంపెనీలు మాత్రమే వీటి తయారీకి ఆసక్తి కనబరిచాయి.కీలక సవాళ్లుపరిమిత తయారీదారుల భాగస్వామ్యం వల్ల ఇప్పటి వరకు తయారీలో పురోగతి లేదనే వాదనలున్నాయి. 2025 మార్చి నాటికి ఈ-అంబులెన్స్‌లను ప్రారంభిస్తామని ఈ ప్రాజెక్టుకు కట్టుబడిన మొదటి కంపెనీ ఫోర్స్ మోటార్స్ హామీ ఇచ్చింది. కానీ ఇప్పటికీ వాహనాలను పంపిణీ చేయలేదు. మారుతీ సుజుకి ఇండియా తయారీని ప్రారంభించినట్లు తెలిపింది. కానీ సంస్థ ఎండీ హిసాషి టకేచి వాహనాల కచ్చితమైన డెలివరీ సమయాన్ని మాత్రం తెలియజేయలేదు.సబ్సిడీ మార్గదర్శకాల్లో జాప్యంఏఆర్ఏఐ లేదా ఐసీఏటీ వంటి ఏజెన్సీలు వాహనాలకు హోమోలాగేషన్ (పబ్లిక్ రోడ్లపై ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రయాణిస్తుందనే అధికారిక ఆమోదం) లేకపోవడం వల్ల భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఐ) సబ్సిడీల మార్గదర్శకాలను జారీ చేయలేదు. ఇప్పటివరకు భారత్‌లో సర్టిఫైడ్ ఈ-అంబులెన్స్‌లు లేకపోవడం కూడా భద్రతా మార్గదర్శకాల అమలుకు నిరోధకంగా మారింది.హైబ్రిడ్ అంబులెన్సులుతక్షణ అవసరాలను తీర్చడానికి పీఎం ఈ-డ్రైవ్ పథకం హైబ్రిడ్ అంబులెన్సులకు ప్రోత్సాహకాలు అందిస్తుంది. కంపెనీలకు సబ్సిడీలు ఇస్తుంది. ఈ హైబ్రిడ్ అంబులెన్స్‌లను వినియోగించేందుకు అన్ని విధాలా సహకరిస్తుంది. అయినప్పటికీ, హైబ్రిడ్ నమూనాలు ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్నాయి. పీఎం ఈ-డ్రైవ్ ఎలక్ట్రిక్ మొబిలిటీలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో ప్రధానంగా 14,028 ఈ-బస్సులు, 2.05 లక్షల ఈ-త్రీవీలర్ వాహనాలు, 1.10 లక్షల ఈ-రిక్షాలు, 24.79 లక్షల ఎలక్ట్రిక్ టూవీలర్ వాహనాలు, ఇ-ట్రక్కులు, ఈవీ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.ఇదీ చదవండి: వడ్డీ రేట్ల తగ్గింపు.. లాభామా? నష్టమా?ఈ-బస్సులు, ఈ-టూ వీలర్స్ వంటి విభాగాల్లో పురోగతి ఉన్నప్పటికీ ఈ-అంబులెన్స్‌లు తయారీ ఇంకా ప్రాథమిక ధశలోనే ఉంది. ప్రభుత్వ అధికారులు ఈ జాప్యాన్ని అంగీకరిస్తున్నారు. కానీ నిబంధనలను ఖరారు చేయడానికి, విజయవంతంగా వాటిని అమలు చేయడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. తయారీ భాగస్వాములు, ప్రభుత్వ యంత్రాంగం వెంటనే స్పందించి వీటిని వీలైనంత త్వరగా రోడెక్కించాలని నిపుణులు కోరుతున్నారు. -
గోల్డ్ డౌన్.. నగల బంగారం రూ.90 వేల దిగువకు..
దేశంలో భారీగా పెరిగి తారాస్థాయికి చేరిన బంగారం ధరలు (Gold Prices) దిగివస్తున్నాయి. వరుసగా ఆరో రోజూ తగ్గుముఖం పట్టాయి. నేడు (ఏప్రిల్ 28) పసిడి ధరలు భారీగా తగ్గాయి. ఇటీవల మేలిమి బంగారం 10 గ్రాముల ధర రూ.లక్ష దిగువకు వచ్చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఈరోజు తగ్గుదలతో 22 క్యారెట్ల నగల బంగారం రూ.90 వేల దిగువకు వచ్చేసింది.అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు, డాలర్‌తో రూపాయి మారకం రేటు, స్థానిక డిమాండ్ వంటి అంశాలు భారత్‌లో పసిడి ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ఏప్రిల్ 28 నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్, 22 క్యారెట్ బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి..తెలుగు రాష్ట్రాల్లో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,530- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,400హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, స్థానిక జ్యువెలరీ షాపుల్లో మేకింగ్ ఛార్జీలు,జీఎస్టీ కారణంగా కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.680, రూ.620 చొప్పున తగ్గాయి.👉ఇది చదివారా? బంగారం భారీగా పడిపోతుంది: గోల్డ్ మైనర్ అంచనాచెన్నైలో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,530- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,400చెన్నైలో బంగారం ధరలు ఇతర నగరాలతో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ పోర్ట్ సౌకర్యాలు, డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.680, రూ.620 చొప్పున తగ్గాయి.ఢిల్లీలో.. - 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,680- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,550ఢిల్లీలో బంగారం ధరలు రవాణా ఖర్చులు, స్థానిక ట్యాక్స్‌ల కారణంగా కొంత ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ నగరంలో బంగారం కొనుగోలుదారులు హాల్‌మార్క్ ఆభరణాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.630, రూ.620 చొప్పున తగ్గాయి.ముంబైలో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,530- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,400ముంబైలో బంగారం ధరలు స్థానిక డిమాండ్, జ్యువెలరీ డిజైన్లపై ఆధారపడి మారుతూ ఉంటాయి. ఈ నగరంలో బంగారం కొనుగోలు చేసే ముందు పలు జ్యువెలరీ షాపుల ధరలను సరిపోల్చడం మంచిది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.680, రూ.620 చొప్పున తగ్గాయి.బెంగళూరులో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.97,530- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.89,400బెంగళూరులో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి, కానీ స్థానిక ఆర్థిక పరిస్థితులు, ఫెస్టివల్ సీజన్ డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేయవచ్చు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.680, రూ.620 చొప్పున తగ్గాయి.👉ఇది చదివారా? బంగారం.. ఈ దేశాల్లో చవకే..!!బంగారం ధరల మార్పునకు కారణాలు భారత రూపాయి విలువ, దిగుమతి సుంకాలు, స్థానిక ట్యాక్స్‌లు, రవాణా ఖర్చులు ధరలలో వ్యత్యాసాలకు కారణమవుతున్నాయి. అదనంగా, భారతదేశంలో వివాహ సీజన్, పండుగల సమయంలో బంగారం డిమాండ్ పెరగడం వల్ల ధరలు కొంత పెరిగే అవకాశం ఉంది. బంగారం కొనుగోలు చేసే ముందు, హాల్‌మార్క్ సర్టిఫికేషన్‌ను తప్పనిసరిగా తనిఖీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) హాల్‌మార్క్ బంగారం స్వచ్ఛతను నిర్ధారిస్తుంది. అలాగే, వివిధ జ్యువెలరీ షాపుల్లో ధరలు, మేకింగ్ ఛార్జీలను సరిపోల్చడం ద్వారా మంచి డీల్ పొందవచ్చు.👉ఇది చదివారా? ఆ బంగారం మర్చిపోండి.. ఈ లోహమే ‘భవిష్యత్ బంగారం’వెండి ధరలు ఇలా..దేశవ్యాప్తంగా వెండి ధరలు కూడా నేడు భారీగా తగ్గాయి. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీకి రూ.900 మేర క్షీణించి రూ.1,11,000 వద్దకు తగ్గింది. అదే ఢిల్లీ ప్రాంతంలో అయితే అత్యధికంగా రూ.1400 తగ్గి రూ. 1,00,500 వద్ద కొనసాగుతోంది.(గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
వడ్డీ రేట్ల తగ్గింపు.. లాభామా? నష్టమా?
భారతీయ బ్యాంకులు ఇటీవల పొదుపు ఖాతాలు, ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటు తగ్గించడంతో ఈమేరకు బ్యాంకులు కూడా కీలక వడ్డీ రేట్లను కుదించాయి. ప్రపంచ ఉద్రిక్తతలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఆర్థిక అనిశ్చితుల మధ్య వృద్ధిని ఉత్తేజపరచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే వడ్డీ రేట్ల తగ్గింపు వల్ల ప్రయోజనాలు ఉన్నప్పటికీ, ఆర్థిక వ్యవస్థలోని కొన్ని అంశాలపై ప్రతికూల ప్రభావం కూడా ఉన్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.రుణాలు, పెట్టుబడులకు ప్రోత్సాహంతక్కువ వడ్డీ రేట్లు వ్యక్తులు, వ్యాపారాలకు రుణాలు చౌకగా అందేలా చేస్తాయి. ఇది మౌలిక సదుపాయాలు, తయారీ, ఇతర రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది. ఉద్యోగాల సృష్టికి ఊతం ఇస్తుంది. ఆర్థిక విస్తరణకు దారితీస్తుంది. తగ్గిన రుణ ఈఎంఐలు డిస్పోజబుల్ ఆదాయాన్ని(నెలవారీ ఖర్చులుపోను మిగిలిన డబ్బు) పెంచుతాయి. వినియోగదారుల వ్యయాన్ని అధికం చేస్తాయి.పొదుపుపై ప్రభావంమరోవైపు పొదుపు ఖాతాలు, ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గుతుండడంతో సంప్రదాయ పొదుపు తగ్గిపోతుంది. దాంతో ఖాతాదారులు మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ లేదా రియల్ ఎస్టేట్ వంటి ప్రత్యామ్నాయ పెట్టుబడులవైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. ఇవి అధిక నష్టాలను కలిగి ఉంటాయి కానీ, మంచి రాబడిని అందిస్తాయి. ఫైనాన్షియల్ మార్కెట్లను మరింత బలోపేతం చేయగలిగినప్పటికీ, ఇది మార్కెట్ అస్థిరతకు దారి తీయవచ్చు. బ్యాంకుల్లో పొదుపు డబ్బును ఇలా ఇతర మార్గాలవైపు మళ్లించడం బ్యాంకులకు కొంతమేరకు సవాలుగా మారుతుంది.ఇదీ చదవండి: ఏప్రిల్‌లో విడుదలైన టాప్ 10 మొబైల్స్ఏం చేయాలంటే..భారతీయ బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించడం రెండువైపులా పదునున్న కత్తితో సమానం. ఇది ఆర్థిక వృద్ధిని, పెట్టుబడులను ప్రేరేపించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ, పొదుపుదారులకు, బ్యాంకింగ్ రంగానికి సవాళ్లను మిగులుస్తుంది. ఆర్థిక స్థిరత్వంతో వృద్ధిని సమతుల్యం చేయడానికి ఈ మార్పులు ఎంత సమర్థవంతంగా నిర్వహించబడుతున్నాయనే దానిపై దీర్ఘకాలిక ప్రభావం ఆధారపడి ఉంటుంది. ఈమేరకు వ్యవస్థలు సమర్థ విధానాలు రూపొందించి అమలు చేయాల్సి ఉంటుంది. -
రెండు రోజులే పనిచేసే రోజులొస్తాయ్..
విపరీతమైన పని గంటలు, వర్క్-లైఫ్ బ్యాలెన్స్ వంటి అంశాలపై ఇటీవల చర్చ ఎక్కువగా జరుగుతోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా మానవ ఉద్యోగాలకు ముప్పు తప్పదన్న ఆందోళనలూ మరోవైపు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఆసక్తికరమైన అంచనాను వెల్లడించారు.వారానికి ఐదు.. ఆరు రోజులు పని, 9 టు 5 జాబ్.. ఈ సంప్రదాయ భావనలకు కాలం చెల్లిపోనుందా? ఈ పరిస్థితి మరీ అంత ఎక్కువ దూరంలో ఏమీ ఉండకపోవచ్చు. కృత్రిమ మేధస్సు ప్రపంచ శ్రామిక శక్తిని పునర్నిర్మించగలదని, వచ్చే దశాబ్దంలో ప్రామాణిక పని వారాన్ని కేవలం రెండు రోజులకు తగ్గించగలదని బిల్ గేట్స్ చెప్పారు.బిల్ గేట్స్ బోల్డ్ జోస్యంజిమ్మీ ఫాలన్ ది టునైట్ షోలో ఇటీవల కనిపించిన గేట్స్, ప్రస్తుతం మానవులు చేస్తున్న చాలా పనులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ త్వరలో నిర్వహిస్తుందని జోస్యం చెప్పారు. తత్ఫలితంగా, సాంప్రదాయ ఐదు రోజుల పని వారం అంటే వారంలో పనిచేసే రోజులు తగ్గిపోతాయని, విశ్రాంతి, సృజనాత్మకత, వ్యక్తిగత సంతృప్తి కోసం ఉద్యోగులకు ఎక్కువ సమయం లభిస్తుందని చెప్పుకొచ్చారు. దైనందిన జీవితంలో అపారమైన మార్పులను తీసుకురావడంతో పాటు వైద్యులు, మానసిక ఆరోగ్య నిపుణుల కొరత వంటి ప్రధాన సమస్యలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిష్కరించగలదని గేట్స్ పేర్కొన్నారు.పని గంటల్లో ఊహించని మార్పువారానికి ఐదు రోజులు, 40 పని గంటల విధానం దశాబ్దాలుగా ఆధునిక సమాజంలో లోతుగా పాతుకుపోయింది. కానీ ఇది నాటకీయంగా మారుతుందని గేట్స్ భావిస్తున్నారు. తయారీ, లాజిస్టిక్స్ దగ్గర నుండి విద్య, ఆరోగ్య సంరక్షణ వరకు అన్నింటా కృత్రిమ మేధ (ఏఐ) సహాయం చేయడమే కాదు.. మనుషులు చేసే పనిని కూడా భర్తీ చేస్తుందని ఆయన ఊహిస్తున్నారు. ఈ మార్పు ఉద్యోగం అర్థాన్నే పునర్నిర్వచించగలదని గేట్స్ సూచిస్తున్నారు. వారంలో రెండు లేదా మూడు రోజులే పనిచేసే రోజులొస్తాయంటున్నారు.సృజనాత్మకత పెంపు, సంక్లిష్ట సమస్యల పరిష్కారంలో ఆర్టిఫీషియల్ జనరల్ ఇంటెలిజెన్స (ఏజీఐ) సామర్థ్యం గురించి గేట్స్ ఆశాజనకంగా ఉన్నప్పటికీ, ఇది కలిగించే సామాజిక, ఆర్థిక అంతరాయాల గురించి కూడా ఆయన హెచ్చరిస్తున్నారు. తయారీ, రవాణా, వ్యవసాయం వంటి కార్యకలాపాల్లో యంత్రాలు ఆధిపత్యం చెలాయిస్తున్నప్పటికీ, సాంస్కృతిక, భావోద్వేగ కారణాల వల్ల సమాజం కొన్ని మానవ కేంద్రీకృత కార్యకలాపాలను సంరక్షిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. -
భారత్-పాక్ ఉద్రిక్తతలున్నా బుల్ జోరు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే సోమవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 9:32 సమయానికి నిఫ్టీ(Nifty) 103 పాయింట్లు పెరిగి 24,156కు చేరింది. సెన్సెక్స్(Sensex) 471 పాయింట్లు పుంజుకుని 79,689 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.66 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 65.97 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.24 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.74 శాతం లాభపడింది. నాస్డాక్ 1.26 శాతం ఎగబాకింది.ఇదీ చదవండి: భారత్-పాక్ వాణిజ్య సంబంధాలు ఎలా ఉన్నాయంటే..గత వారం జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో టూరిస్టులపై ఉగ్రదాడి కారణంగా భారత్, పాకిస్థాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు ప్రభావం చూపనున్నాయి. దీంతో రెండు దేశాల మధ్య రాజకీయ, భౌగోళిక ఆందోళనలు సెంటిమెంటుకు కీలకంగా నిలవనున్నట్లు విశ్లేషకులు ప్రస్తావించారు. ఇవికాకుండా అమెరికా, చైనా మధ్య టారిఫ్‌ల సంక్షోభానికి సైతం ప్రాధాన్యత ఉన్నట్లు తెలియజేశారు. ఈ నేపథ్యంలో గత వారం చివర్లో మార్కెట్లు ఉన్నట్టుండి బలహీనపడ్డాయి. ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. మహారాష్ట్ర డే సందర్భంగా గురువారం(మే 1న) మార్కెట్లు పనిచేయవు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ఏప్రిల్‌లో విడుదలైన టాప్ 10 మొబైల్స్
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ స్మార్ట్ ఫోన్లకు భారీగా డిమాండ్ ఏర్పడుతుంది. చాలా కంపెనీలు మొబైల్ ఫీచర్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను పరిచయం చేస్తున్నాయి. దాంతో మొబైల్ ఫోన్లను మరింత స్మార్ట్‌గా మార్చాలని విభిన్న ప్రయోగాలు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 2025లో విడుదలై వినియోగదారుల ఆదరణ పొందుతున్న కొన్ని ప్రముఖ కంపెనీల ఉత్పత్తులను కింద తెలుసుకుందాం.2025 ఏప్రిల్ విడుదలైన కొన్ని కంపెనీల స్మార్ట్ఫోన్లుషియోమీ 15 అల్ట్రా: 6.73 అంగుళాల డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, 200 మెగాపిక్సెల్ సెన్సార్‌తో క్వాడ్ కెమెరా సెటప్ ఉంది.శాంసంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా: 6.90 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్సెట్, 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా.ఐక్యూ జెడ్10: 7300 ఎంఏహెచ్ బ్యాటరీ.రియల్మీ 14 సిరీస్: స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 చిప్సెట్, 120 ఎఫ్‌పీఎస్ గేమింగ్ సపోర్ట్.ఒప్పో కే13 5జీ: 7000 ఎంఏహెచ్ బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 చిప్సెట్.సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రో: డైమెన్సిటీ 7300 ప్రో చిప్సెట్, ఆండ్రాయిడ్ 15.శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 ఎడ్జ్: డ్యూయల్ రియర్ కెమెరాలతో స్లిమ్మెస్ట్ ఫోన్‌గా గుర్తింపు పొందింది.మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్: ఐపీ69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్.నథింగ్ ఫోన్ (3ఏ): మంచి కెమెరా ఎక్స్‌పీరియన్స్‌తో లాంచ్ చేశారు.వివో ఎక్స్ 200 అల్ట్రా: ఏప్రిల్ 29, 2025న లాంచ్ అయ్యే అవకాశం ఉంది. 200 మెగాపిక్సెల్ కెమెరా. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్.నోట్: వీటితోపాటు గతంలో విడుదలై మరింత ప్రజాదరణ పొందిన మెరుగైన ఉత్పత్తులు మార్కెట్లో ఉన్నాయని గుర్తుంచుకోవాలి.ఇదీ చదవండి: భారత్-పాక్ వాణిజ్య సంబంధాలు ఎలా ఉన్నాయంటే.. -
భారత్-పాక్ వాణిజ్య సంబంధాలు ఎలా ఉన్నాయంటే..
జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడి భారత్-పాక్‌ల మధ్య ఇప్పటికే దెబ్బతిన్న వాణిజ్య సంబంధాలను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2025 ఏప్రిల్ 22న జరిగిన ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర సంఘటన నేపథ్యంలో పాకిస్థాన్‌తో వాణిజ్య సంబంధాలను నిలిపివేయడంతో సహా కఠిన చర్యలు ఉంటాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈమేరకు భారత్ ఇప్పటికే కొన్ని చర్యలు అమలు చేసింది.అట్టారి ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్ మూసివేతచారిత్రాత్మకంగా భారత్-పాకిస్థాన్ మధ్య వాణిజ్యం సవాళ్లతో కూడుకున్నది. 2019లో పుల్వామా దాడి తరువాత పాక్ వస్తువులపై భారతదేశం 200% సుంకాన్ని విధించింది. ఇది ద్వైపాక్షిక వాణిజ్యం గణనీయం దెబ్బతినేందుకు దారితీసింది. ఇటీవల జరిగిన పహల్గాం దాడి ఈ వాణజ్య ఉద్రిక్తతలను మరింత తీవ్రతరం చేసింది. ఇది ఇరు దేశాల మధ్య వాణిజ్య కార్యకలాపాలకు కీలకంగా ఉన్న అట్టారి వద్ద ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్‌ను మూసివేసేందుకు కారణమైంది. ఈ మూసివేతతో సుమారు రూ.3,800 కోట్ల విలువైన సీమాంతర వాణిజ్యం నిలిచిపోనుందని నిపుణులు చెబుతున్నారు. ఇది రెండు ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. అయితే భారత్ శత్రదేశంతో ఎలాగో విభేదాలు తలెత్తుతాయనే ఉద్దేశంలో కొన్నేళ్లుగా క్రమంగా వాణిజ్యాన్ని తగ్గించుకుంటూ వస్తోంది. దీంతో ఇరుదేశాల మధ్య వాణిజ్యం నిలిచిపోవడం భారత్‌పై పెద్దగా ప్రభావం చూపదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.పరోక్ష వాణిజ్యంఅధికారిక ఆంక్షలు ఉన్నప్పటికీ భారత వస్తువులు దుబాయ్, సింగపూర్ వంటి థర్డ్ పార్టీ మార్గాల ద్వారా పాకిస్థాన్‌కు చేరుకుంటూనే ఉన్నాయి. ఇది వాణిజ్య నెట్‌వర్క్‌ల భద్రతను హైలైట్ చేస్తుంది. ఏదేమైనా అటువంటి పరోక్ష వాణిజ్యం నైతిక, రాజకీయ చిక్కులకు కారణమవుతుందనే వాదనలున్నాయి. పహల్గాం దాడి దౌత్యపరమైన విభేదాలకు కూడా దారితీసింది. సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన భారత్.. పాక్ పౌరులకు వీసాలను రద్దు చేసింది. ఉగ్రవాదానికి మద్దతిస్తున్న పాకిస్థాన్‌పై చర్యలు తీసుకోవాలని భారత్ సంకల్సిస్తోంది.ఇదీ చదవండి: వాట్సప్ యూజర్లే లక్ష్యంగా కొత్త మోసం!భారత్ నుంచి పాకిస్థాన్‌కు జరిగే ఎగుమతులు ప్రధానంగా..సేంద్రీయ రసాయనాలుఫార్మాస్యూటికల్ ఉత్పత్తులుచక్కెర, మిఠాయిలుయంత్రాలు, వస్త్రాలుకాఫీ, టీ, మసాలా దినుసులు2023లో పాకిస్థాన్‌కు భారతదేశ ఎగుమతుల విలువ సుమారు 523.22 మిలియన్ డాలర్లు.సేంద్రీయ రసాయనాలు, ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులు ఇందులో గణనీయమైన భాగాన్ని కలిగి ఉన్నాయి.పాకిస్థాన్ నుంచి భారత్‌కు దిగుమతులుఉప్పు, సల్ఫర్, సున్నంసిమెంట్జౌళి ఉత్పత్తులు2023లో పాకిస్థాన్ నుంచి దిగుమతుల విలువ 2.27 మిలియన్ డాలర్లు. -
బ్యాంకులో క్యాష్ వేస్తున్నారా..? జాగ్రత్త!!
నగదు .. అంటే కరెన్సీ నోట్లను బ్యాంకు అకౌంటులో జమచేయడం మీద ఎన్నో ఆంక్షలు ఉన్నాయి. » పాన్ నెంబర్ వేయకుండా, అంటే అవసరం లేకుండా ఒక వ్యవహారంలో రూ.50,000 దాటకుండా డిపాజిట్ చేయవచ్చు. » అలా అని ఒకరోజు మొత్తంలో రూ. 2 లక్షలు దాటి తీసుకోరు. » ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలు డిపాజిట్లు చేసారంటే మీరు జాగ్రత్త పడాలి.ఈ పరిమితిని ఒక ఆంక్షలాగే భావించాలి. మొదటగా పాన్ నెంబర్ ఇవ్వాలి. అంతేకాకుండా సదరు బ్యాంకు బ్రాంచి ఏ పొదుపు ఖాతాలో నగదుగా రూ.10 లక్షలు, అంతకన్నా ఎక్కువగా డిపాజిట్ అయ్యిందో, వారి అకౌంటు వివరాలు... సంవత్సర కాలంలో నగదు మొత్తం ఎంత జమ అయ్యిందో, సమాచారం తెలియజేస్తారు. ప్రతి బ్యాంకుకి వారి వారి పాలసీలు కూడా అమలులో ఉన్నాయి. ఈ క్రింది కేసులు/వ్యవహారాలు గమనించండి.ఈశ్వరరావు పాలబూత్‌లో కార్డులు, అరువులు కాకుండా రోజూ నగదు రూపేణా రూ.20 వేల అమ్మకాలు ఉండేవి. రోజూ ఉదయం బ్యాంకు తెరవగానే ఆ మొత్తాన్ని డిపాజిట్ చేసేవాడు. ఏడాదికి గాను రూ.72 లక్షలు డిపాజిట్ అయ్యాయి. నోటీసులు వచ్చాయి. నగదుగా చేసిన డిపాజిట్ నుంచి సరఫరా చేసే డైయిరీఫాం వారికి పెద్ద పెద్ద మొత్తాలు చెక్కు/డీడీ రూపంలో చెల్లించేవాడు. డిపాజిట్ చేసిన మొత్తం పాల విక్రయం ద్వారా ఏర్పడింది. కానీ అది నూటికి నూరు పాళ్ళు ఆదాయం కాదు. లాభమూ కాదు. నోటీసులకు జవాబులిచ్చి బయటపడేసరికి తలప్రాణం తోకకి వచ్చింది. ఇలా కొన్ని వ్యాపారాలు/వృత్తుల్లో ప్రైవేటు హాస్పిటల్స్, సినిమా పరిశ్రమ, రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం, హోటల్స్, సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్‌లో నగదు వస్తుంటుంది. తగిన జాగ్రత్త వహించాలి. అలాగే గుడి, గోపురాల్లో కూడా.దామోదర్ రెడ్డికి నగరశివార్లలో ఒక పెద్ద కాంప్లెక్స్, 12 ఫ్లాట్లు ఉన్నాయి. అద్దెలు వస్తున్నాయి. వయస్సు పెద్దది. సమయం, ఓపిక లేదు. అందరూ నగదే చెల్లిస్తున్నారు. అందరిని తన పొదుపు ఖాతాలోకి నగదు రూపంలో డిపాజిట్ చేయమనేవాడు. వారందరూ మాట ప్రకారం అకౌంట్లోనే జమచేసేవారు. లక్షల్లో తేలేది అద్దె ఆదాయం. నోటీసులు తథ్యం. అకౌంటు చేయక తప్పలేదు. వీరభద్రానికి పెద్ద ఇల్లు. నలుగురు పిల్లలు. భారీ సంపాదన. అంతా చెక్కు రూపంలోనే స్వీకరించేవారు. నగదు విత్‌డ్రా చేయడం ఖర్చులన్నీ పోగా మిగిలిన మొత్తాన్ని నగదు ద్వారా బ్యాంకులో డిపాజిట్ చేసేవారు. ఇలా చేసిన డిపాజిట్లు రూ.10 లక్షల దాటాయి. నోటీసులు... కథా కమామీషు.👉ఇది చదివారా? బంగారం భారీగా పడిపోతుంది: గోల్డ్ మైనర్ అంచనాహస్తవాసి ఉన్న డాక్టర్ ఆనంద్‌రావు ఖాతాలు, ఎన్నో గుళ్లు గోపురాలు ప్రతిష్ట చేసిన బ్రహ్మ గారి ఖాతాలు, లంచాలు లాగి.. లాగి అమాయకంగా బ్యాంకులో నగదు డిపాజిట్ చేసిన లంచావతారం ఖాతాలు, అదర్శ రైతు అవార్డు పొందిన రైతుగా తన వ్యవసాయ ఆదాయాన్ని బ్యాంకు అకౌంటులో డిపాజిట్ చేసిన నాగయ్య, ఎన్నో ఇళ్లు కట్టిన మేస్త్రిగా మంచి పేరు పొందిన కొండయ్య, బొటిక్ పెట్టి మంచి పేరుతో డబ్బులు సంపాదించి బ్యాంకులో డిపాజిట్ చేసిన రాణి, కేటరింగ్‌తో లక్షలు సంపాదించి నగదు డిపాజిట్ చేసిన శ్రీను.. ఇలా ఎందరో నగదు డిపాజిట్‌దారులు.. ఎన్నెన్నో కథలు. ప్రయివేటు చిట్టీల్లో వచ్చిన మొత్తాలు... భూములు, పొలాలు, ఇండ్లు అమ్మగా వచ్చిన మొత్తాలు... స్నేహితులు, చుట్టాలు ఇచ్చిన రుణాలు... అప్పులు... ఇలా ఎంతమందినైనా చెప్పవచ్చు. ఎన్నో వ్యవహారాలు ప్రస్తావించవచ్చు. అన్నీ డిపాజిట్ల ఆదాయం కాకపోవచ్చు. సరైన, సమగ్రమైన, సంతృప్తికరమైన వివరణ ఇస్తే బయపడవచ్చు. లేదంటే ఈ డిపాజిట్లలో నగదును ఆదాయంగా భావించే ప్రమాదం ఉంది. 1.4.2024 నుంచి 31.3.2025 మధ్య ఇటువంటి డిపాజిట్లు ఉంటే విశ్లేషించుకోండి. విషయాన్ని బయటపెట్టండి. ::కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య, ట్యాక్సేషన్ నిపుణులుపన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com కు ఈ–మెయిల్ పంపించగలరు. -
ఈ టాటా ఫండ్‌తో దీర్ఘకాలంలో మంచి రాబడి
ఈక్విటీ మార్కెట్లు ఎప్పుడూ లాభాల బాటలోనే ప్రయాణించవు. ఎగుడుదిగుళ్లు సర్వసాధారణం. ర్యాలీ తర్వాత స్టాక్స్‌లో దిద్దుబాటు సహజం. కనుక ఇన్వెస్టర్లు అన్ని కాలాలకూ అనుకూలమైన పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలంటే అందుకు వ్యాల్యూ ఫండ్స్ మంచి ఎంపిక అవుతుంది. గత మూడు నెలల్లో లార్జ్‌క్యాప్‌తో పోల్చితే మిడ్, స్మాల్‌క్యాప్ స్టాక్స్‌లో భారీ దిద్దుబాటు చూశాం. వ్యాల్యూ ఫండ్స్ ఆకర్షణీయమైన విలువల వద్ద ఉన్న కంపెనీలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటాయి.తద్వారా దీర్ఘకాలంలో మంచి రాబడిని తెచ్చిపెట్టే పనితీరు చూపిస్తాయి. గ్రోత్ స్టాక్స్ మాదిరి వ్యాల్యూ స్టాక్స్ ధరలు పరుగులు పెట్టవు. కానీ స్థిరమైన పనితీరు చూపిస్తుంటాయి. అస్థిరతలు తక్కువ. దీర్ఘకాలంలో వ్యాల్యూ స్టాక్స్ సైతం మంచి రాబడులను ఇస్తాయని గణాంకాలు తెలియజేస్తున్నాయి. కనీసం ఏడేళ్లు అంతకు మించిన దీర్ఘకాల లక్ష్యాల కోసం ఇన్వెస్టర్లు వ్యాల్యూ ఫండ్స్ విభాగాన్ని ఎంపిక చేసుకోవవచ్చు. ఈ విభాగంలో టాటా ఈక్విటీ పీఈ ఫండ్ పనితీరు నిలకడగా ఉండడాన్ని గమనించొచ్చు.రాబడులు ఈ పథకం రాబడులను గమనించినట్టయితే.. గడిచిన ఏడాది కాలంలో 4.54 శాతంగా ఉన్నాయి. కరెక్షన్ కారణంగా రాబడి తక్కువగా కనిపిస్తోంది. మూడేళ్లలో చూస్తే వార్షికంగా 20.55 శాతం చొప్పున రాబడిని ఇచ్చింది. ఐదేళ్లలో 26.38 శాతం, ఏడేళ్లలో 14 శాతం, పదేళ్లలో 15 శాతానికిపైనే వార్షిక రాబడులు ఈ పథకంలో కనిపిస్తాయి. పెట్టుబడుల విధానం అంతర్గత విలువతో (ఇంట్రిన్సిక్ వ్యాల్యూ) పోలిస్తే ఆకర్షణీయమైన ధరల వద్ద లభించే వాటిని వ్యాల్యూ స్టాక్స్‌గా చెబుతారు. బీఎస్ఈ సెన్సెక్స్ పీఈ కంటే తక్కువ పీఈ రేషియోలో ట్రేడ్ అవుతున్న (గత 12 నెలల ట్రెయిలింగ్ పీఈ రేషియో) స్టాక్స్‌ను ఈ పథకం ఎంపిక చేసుకుంటుంది. తన నిర్వహణలోని మొత్తం పెట్టుబడుల్లో 70 శాతాన్ని ఈ స్టాక్స్‌కే కేటాయిస్తుంటుంది.ఇలా ఎంపిక చేసిన కంపెనీల్లోనూ భవిష్యత్తులో మంచి వృద్ధికి అవకాశం ఉన్న వాటిని తుది జాబితాగా తీసుకుంటుంది. ఆయా రంగాల్లో కంపెనీల స్థానం ఏంటి, వాటికి ఉన్న వృద్ధి అవకాశాలు, రాబడుల రేషియోలు ఎలా ఉన్నాయి, స్టాక్ లిక్విడిటీ ఈ అంశాలన్నింటికీ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. అన్ని రంగాల మధ్య, అన్ని స్థాయిల కంపెనీల్లోనూ (లార్జ్, మిడ్, స్మాల్‌క్యాప్) ఇన్వెస్ట్ చేస్తుంటుంది. పోర్ట్‌ఫోలియో ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.8,004 కోట్ల ఆస్తులున్నాయి. ఇందులో 94 శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయగా.. మిగిలిన మొత్తాన్ని నగదు రూపంలోనే కలిగి ఉంది. పోర్ట్‌ఫోలియోలో మొత్తం 37 స్టాక్స్ ఉన్నాయి. టాప్ 10 స్టాక్స్‌లోనే 46 శాతం పెట్టుబడులు ఉండడం గమనార్హం. పోర్ట్‌ఫోలియోలోని స్టాక్స్ సగటు పీఈ రేషియో 12.68 శాతంగా ఉంది.ఈక్విటీ పెట్టుబడులను గమనించినట్టయితే 68 శాతం లార్జ్‌క్యాప్ కంపెనీలకు కేటాయించగా.. మిడ్‌క్యాప్ స్టాక్స్‌లో 24.57 శాతం, స్మాల్‌క్యాప్ స్టాక్స్‌లో 7.68 శాతం వరకు పెట్టుబడులు పెట్టి ఉంది. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు అత్యధికంగా 39.48 శాతం పెట్టుబడులు కేటాయించింది. ఆ తర్వాత ఇంధన రంగ కంపెనీల్లో 12.65 శాతం ఇన్వెస్ట్ చేసింది. టెక్నాలజీ కంపెనీలకు 11 శాతం, కన్జ్యూమర్ డిస్క్రీషినరీ కంపెనీలకు 9.57 శాతం చొప్పున కేటాయించింది.టాప్ ఈక్విటీ హోల్డింగ్స్కంపెనీ పెట్టుబడులు శాతంహెచ్డీఎఫ్సీ బ్యాంక్ 10.22 బీపీసీఎల్ 4.87 కోల్ ఇండియా 4.79 కోటక్ బ్యాంక్ 4.18 ముత్తూట్ ఫైనాన్స్ 3.94 రాడికో ఖైతాన్ 3.82 ఐసీఐసీఐ బ్యాంక్ 3.79 విప్రో 3.60 శ్రీరామ్ ఫైనాన్స్ 3.47 ఎన్టీపీసీ 3.36 -
నా బడ్జెట్‌కు 50-30-20 రూల్ సరిపోతుందా?
మూడు నుంచి ఐదేళ్ల కాలానికి.. కార్పొరేట్ ఫండ్స్, షార్ట్ డ్యురేషన్ ఫండ్స్, పీఎస్‌యూ ఫండ్స్‌లో ఏది అనుకూలం? – మంజునాథ్ కార్పొరేట్ బాండ్ ఫండ్స్ 80 శాతం అధిక క్రెడిట్ రేటింగ్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. బ్యాంకింగ్ అండ్ పీఎస్‌యూ ఫండ్స్ 80 శాతం బ్యాంకులు, ప్రభుత్వరంగ సంస్థల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. వీటితోపాటు షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ అన్ని రకాల పరిస్థితుల్లోనూ అనుకూలమైనవి. దీర్ఘకాలంలో వీటిలోని రిస్క్–రాబడులు ఇంచుమించు ఒకే మాదిరి ఉంటాయి.ఇన్వెస్టర్లు రెండు కారణాల దృష్ట్యా షార్ట్ డ్యురేషన్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఇవి వివిధ రకాల డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. వైవిధ్యం ఎక్కువ. మెచ్యూరిటీ కాలంపై స్పష్టత ఉంటుంది. ఏడాది కాలానికి మించిన లక్ష్యాల కోసం, డెట్ విభాగంలో షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ అనుకూలంగా ఉంటాయి.ఇంటి బడ్జెట్ విషయంలో 50–30–20 ఆర్థిక సూత్రం గురించి విన్నాను. నా ఆర్థిక అంశాలకు ఇది మంచి సూత్రమేనా? – కరణ్ రాథోడ్మీ నెలవారీ ఆదాయాలను ఏ రకంగా వర్గీకరించాలన్నది ఈ సూత్రం తెలియజేస్తుంది. ఆదాయంలో 20 శాతాన్ని అవసరాల కోసం కేటాయించాలి. అంటే ఇంటి అద్దె, గ్రోసరీ, విద్యుత్, ఈఎంఐలు, స్కూల్ ఫీజులు అన్నీ కలిపి 50 శాతానికే పరిమితం కావాలి. ఆదాయంలో 30 శాతాన్ని కోరికల కోసం కేటాయించుకోవచ్చు. అంటే రెస్టారెంట్లలో విందులు, ఓటీటీ చందాలు, విహార యాత్రలు, షాపింగ్, ఇతర హాబీల కోసం కేటాయింపులు 30 శాతం మించకూడదు. ఇక మిగిలిన 20 శాతాన్ని పొదుపు కోసం కేటాయించాలి.మీ ఆర్థిక అంశాలను సులభంగా నిర్వహించుకునేందుకు ఇది అనుకూలిస్తుంది. ముఖ్యంగా వేతన జీవులు, అప్పుడే కెరీర్ ఆరంభించిన వారికి ఇది ఎంతో సులభం. కాకపోతే ఇదొక సాధారణ సూత్రమే కానీ, అందరికీ అనుకూలమని చెప్పలేం. వ్యక్తిగత ఆదాయం, జీవన వ్యయాలు, బాధ్యతలు ఇవే ఒకరి బడ్జెట్‌ను నిర్ణయించేవి.ఉదాహరణకు ఒక నగరానికి చెందిన యువ ఉద్యోగి నెలకు రూ.40,000 సంపాదిస్తున్నాడని అనుకుందాం. పెద్ద నగరం కావడంతో అద్దెకు, రవాణా కోసమే నెల జీతంలో సగం ఖర్చు చేయాల్సి వస్తుంది. అప్పుడు కోరికలు, పొదుపు కోసం మిగిలేదేమీ ఉండదు. అదే రూ.2 లక్షలు సంపాదిస్తున్న వ్యక్తి అయితే ఆదాయంలో 30–35 శాతంతోనే అవసరాలను తీర్చుకోవడం సులభం. అప్పుడు పొదుపు చేయడానికి 30–40 శాతం మిగులు ఉంటుంది. కనీసం 20 శాతం పొదుపు ఎవరైనా సరే బడ్జెట్ ఆరంభించేందుకు 50–30–20 సూత్రం మంచి ఫలితమిస్తుంది. మీ జీవన అవసరాలు ఆదాయాన్ని మించకుండా చూసుకోవాలి. అలాగే, ఆదాయంలో కనీసం 20 శాతాన్ని పొదుపు చేయాలి. కోరికల విషయంలో కొంత రాజీ పడినా సరే పొదుపును కొనసాగించాలి.ఎలా ఆరంభించాలో తెలియకపోతే అప్పుడు ఆదాయంలో 20 శాతాన్ని పెట్టుబడులకు మళ్లించే విధంగా ఆటోమేట్ చేసుకోవాలి. అగ్రెస్సివ్ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి వెళ్లేలా సిప్ పెట్టుకోవాలి. మొదట పొదుపు, పెట్టుబడి తర్వాతే ఖర్చులకు వెళ్లాలి. స్థిరమైన పొదుపు, వివేకంతో చేసే ఖర్చుతో మీ ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. సమాధానాలు:: ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
హైబ్రిడ్ ఫండ్స్‌కి ఆదరణ
న్యూఢిల్లీ: హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి 2024–25లో రూ.1.19 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 2023–24లో వచ్చిన పెట్టుబడులు రూ.1.45 లక్షల కోట్లతో పోల్చి చూస్తే 18 శాతం తగ్గాయి. అయినప్పటికీ గణనీయంగా పెట్టుబడులు రావడం గమనించొచ్చు. అంతేకాదు, ఇన్వెస్టర్ల పెట్టుబడి ఖాతాలతో (ఫోలియోలు)పాటు, హైబ్రిడ్ ఫండ్స్ నిర్వహణలోని పెట్టుబడులు (ఏయూఎం) అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలి్చతే వృద్ధి చెందడం గమనార్హం. ఫోలియోలు (పెట్టుబడి ఖాతాలు) 1.35 కోట్ల నుంచి గత ఆర్థిక సంవత్సరం చివరికి 1.56 కోట్లకు పెరిగాయి. ఇక వీటి నిర్వహణలోని ఆస్తుల విలువ రూ.7.23 లక్షల కోట్ల నుంచి రూ.8.83 లక్షల కోట్లకు పెరిగింది. అంటే ఏయూఎంలో 22 శాతం వృద్ధి నమోదైంది. ఈక్విటీ మార్కెట్లో అనిశి్చతులు పెరిగిపోవడం, కంపెనీల ఫలితాలు ఆశాజనకంగా లేకపోవడం వంటి పరిణామాలు పెట్టుబడులపై ప్రభావం చూపించినట్టు నిపుణులు చెబుతున్నారు. హైబ్రిడ్ ఫండ్స్ ఈక్విటీ, డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయని తెలిసిందే. హైబ్రిడ్ పథకాల్లో డెట్ పెట్టుబడులకు ఉండే రక్షణ దృష్ట్యా అవి గణనీయమైన పెట్టుబడులను ఆకర్షించినట్టు ట్రేడ్జినీ సీవోవో త్రివేష్ తెలిపారు. అచ్చమైన ఈక్విటీలతో పోలి్చతే ఈ పథకాల్లో పెట్టుబడుల విషయంలో ఇన్వెస్టర్లు అంత ఆందోళన చెందక్కర్లేదన్నారు. 2022–23లో ఇదే విభాగం నికరంగా రూ.18,813 కోట్లను కోల్పోవడం గమనార్హం. -
వర్షాకాల సమావేశాల్లోనే బీమా సవరణ బిల్లు
న్యూఢిల్లీ: బీమా రంగంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) వీలు కల్పించే సవరణ బిల్లును వచ్చే వర్షకాల సమావేశాల్లో పార్లమెంట్ ముందుంచనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ముసాయిదా బిల్లు సిద్ధమైందని, త్వరలోనే కేబినెట్ ఆమోదం తీసుకోనున్నట్టు తెలిపాయి. కేబినెట్ ఆమోదం అనంతరం పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టే ప్రక్రియను ఆర్థిక వ్యవహారాల విభాగం మొదలు పెడుతుందని పేర్కొన్నాయి. పార్లమెంటు వర్షకాల సమావేశాలు సాధారణంగా జూలైలో ఆరంభం అవుతుంటాయి. ప్రస్తుతం బీమా రంగంలో 74 శాతం మేర ఎఫ్‌డీఐలకు అనుమతి ఉండగా, 100 శాతానికి పెంచే ప్రతిపాదనను 2025–26 బడ్జెట్లో ప్రతిపాదించడం గమనార్హం. బీమా సవరణ చట్టంలో ఎఫ్‌డీఐ పెంపుతోపాటు మూలధన నిధుల అవసరాలను తగ్గించడం, కాంపోజిట్ లైసెన్స్ తదితర ప్రతిపాదనలు చోటుచేసుకోనున్నాయి. బ్రోకర్లు సైతం ఒకటికి మించిన బీమా కంపెనీల ఉత్పత్తుల విక్రయానికి అవకాశం లభించనుంది. -
ఫలితాలు, విదేశీ అంశాలపై కన్ను
ముంబై: దేశీ స్టాక్ మార్కెట్లు ఈ వారం పలు అంశాల ఆధారంగా కదలనున్నాయి. ప్రధానంగా గత వారం జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో టూరిస్టులపై ఉగ్రదాడి కారణంగా భారత్, పాకిస్తాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు ప్రభావం చూపనున్నాయి. దీంతో రెండు దేశాల మధ్య రాజకీయ, భౌగోళిక ఆందోళనలు సెంటిమెంటుకు కీలకంగా నిలవనున్నట్లు విశ్లేషకులు ప్రస్తావించారు. ఇవికాకుండా అమెరికా, చైనా మధ్య టారిఫ్‌ల సంక్షోభానికి సైతం ప్రాధాన్యత ఉన్నట్లు తెలియజేశారు. ఈ నేపథ్యంలో గత వారం చివర్లో మార్కెట్లు ఉన్నట్టుండి బలహీనపడ్డాయి. ఫలితంగా ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ 23,800కు ఎగువన నిలవగలిగితేనే సాంకేతికంగా బుల్లిష్ ధోరణి కొనసాగే వీలున్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. కాగా.. ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. మహారాష్ట్ర డే సందర్భంగా గురువారం(మే 1న) మార్కెట్లు పనిచేయవు. ఇంధన, సిమెంట్ కంపెనీలు ఇప్పటికే గత ఆర్థిక సంవత్సర(2024–25) ఫలితాల సీజన్ ప్రారంభమై జోరందుకుంది. ఈ బాటలో ఈ వారం మరికొన్ని దిగ్గజాలు క్యూ4(జనవరి–మార్చి) పనితీరుతోపాటు పూర్తి ఏడాది ఫలితాలు ప్రకటించనున్నాయి. జాబితాలో ఇంధన రంగ పీఎస్‌యూలు ఇండిఆయన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బీపీసీఎల్)సహా.. సిమెంట్ దిగ్గజాలు అంబుజా, అల్ట్రాటెక్, టాటా గ్రూప్ దిగ్గజం ట్రెంట్, ద్విచక్ర వాహన దిగ్గజం టీవీఎస్ మోటార్, బజాజ్ ఫైనాన్స్ తదిరాలున్నాయి. గత వారం చివర్లో డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ క్యూ4, పూర్తి ఏడాది ఫలితాలు వెలువరించింది. ఈ ప్రభావం నేటి(సోమవారం) ట్రేడింగ్‌లో రిలయన్స్ కౌంటర్‌పై కనిపించనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇతర అంశాలు గత వారం ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ వెనకడుగు వేసింది. మరోవైపు దేశీ స్టాక్స్‌లో ఎఫ్‌పీఐలు భారీగా ఇన్వెస్ట్ చేశారు. వెరసి డాలరుతో మారకంలో దేశీ కరెన్సీ రూపాయి బలపడింది. అమెరికా, చైనా మధ్య టారిఫ్‌ల సంక్షోభం కారణంగా పసిడి ధరలు మండుతున్నప్పటికీ ముడిచమురు ధరలు దిగివస్తున్నాయి. బ్రెంట్ చమురు 65 డాలర్ల సమీపంలో కదులుతోంది. రూపాయి పుంజుకోవడం, చమురు చల్లబడటం దేశీ ఆర్థిక వ్యవస్థకు సానుకూల అంశాలుగా మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ వారం భారత్, పాకిస్తాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు, అంతర్జాతీయ టారిఫ్‌ల సంక్షోభం సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ సీనియర్ వీపీ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. ఇవికాకుండా దేశీయంగా పలు కార్పొరేట్ దిగ్గజాలు క్యూ4 ఫలితాలు ప్రకటించనుండటంతో ఇన్వెస్టర్లు వీటిపై దృష్టి పెట్టనున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ వెల్త్ మేనేజ్మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా తెలియజేశారు. మరోవైపు ఎఫ్‌పీఐలు కొనుగోళ్లకు ఆసక్తి చూపుతుండటం సానుకూల అంశమని జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయకుమార్ పేర్కొన్నారు. సానుకూలం2024 అక్టోబర్ మొదలు దేశీ స్టాక్స్‌లో పెట్టుబడుల ఉపసంహరణకే పెద్దపీట వేస్తున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) ఇటీవల కొనుగోళ్ల యూటర్న్ తీసుకోవడం గమనార్హం! దీంతో గత 7 ట్రేడింగ్ రోజుల్లో ఎఫ్‌పీఐలు నగదు విభాగంలో నికరంగా రూ. 27649 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. గత వారం రూ. 17,425 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు. ఫలితంగా భారత్, పాక్ ఉద్రిక్తతల నడుమ చివరి రెండు రోజుల్లో మార్కెట్లు నీరసించినప్పటికీ నికరంగా గత వారం లాభపడ్డాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 659 పాయింట్లు(0.84 శాతం) పుంజుకుని 79,213 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 188 పాయింట్లు(0.8 శాతం) ఎగసి 24,039 వద్ద స్థిరపడింది. అయితే బీఎస్ఈ మిడ్‌క్యాప్ మరింత అధికంగా 1.3 శాతం బలపడగా, స్మాల్‌క్యాప్ 0.12 శాతమే లాభపడింది.ఐఐపీవైపు చూపుమార్చి నెలకు పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ) గణాంకాలు నేడు విడుదలకానున్నాయి. ఫిబ్రవరిలో ఐఐపీ వృద్ధి గత 6 నెలల్లోనే కనిష్టంగా 2.9 శాతానికి పరిమితమైంది. జనవరిలో నమోదైన 5.2 శాతంతో పోలిస్తే భారీగా క్షీణించింది. ఇక ఏప్రిల్ నెలకు హెచ్ఎస్బీసీ ఇండియా తయారీ పీఎంఐ వారాంతాన(మే 2న) విడుదలకానుంది. అంతర్జాతీయ అంశాల విషయానికివస్తే మార్చి నెలకు 29న యూఎస్ ఉపాధి గణాంకాలు వెల్లడికానున్నాయి. ఏప్రిల్‌కు చైనా తయారీ పీఎంఐ గణాంకాలు, ఏప్రిల్‌కు యూఎస్ పీసీఈ ధరల ఇండెక్స్ 30న వెలువడనున్నాయి. మే 1న బ్యాంక్ ఆఫ్ జపాన్ వడ్డీ రేట్ల నిర్ణయాలు, రిటైల్ ధరలు ప్రకటితంకానున్నాయి. ఈ బాటలో యూఎస్ తయారీ పీఎంఐ, వ్యవసాయేతర ఉపాధి, నిరుద్యోగిత గణాంకాలు 2న వెల్లడికానున్నాయి. -
ఎడెల్వీజ్ ఇంటర్నెట్ ఎకానమీ ఇండెక్స్ ఫండ్
ఎడెల్వీజ్ మ్యూచువల్ ఫండ్ దేశంలో మొదటి ‘ఇంటర్నెట్ ఎకానమీ ఇండెక్స్ ఫండ్’ను ఆవిష్కరించింది. ఈ నూతన ఫండ్ ఆఫర్ ఈ నెల 25న ప్రారంభమైంది. వచ్చే నెల 9వ తేదీ వరకు పెట్టుబడులను స్వీకరించనుంది. బీఎస్ఈ ఇంటర్నెట్ ఎకానమీ టోటల్ రిటర్న్ ఇండెక్స్‌లో మొత్తం 20 స్టాక్స్ ఉన్నాయి. సూచీలో వెయిటేజీ ఆధారంగా ఆయా స్టాక్స్‌లో ఈ పథకం ఇన్వెస్ట్ చేస్తుంది. దేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో భాగమైన కంపెనీల్లో పెట్టుబడులకు ఈ పథకం వీలు కల్పిస్తుంది. కనీసం రూ.100 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. -
నేటి నుంచి ఏథర్ ఐపీవో
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన కంపెనీ ఏథర్ ఎనర్జీ పబ్లిక్ ఇష్యూ నేడు(28న) ప్రారంభంకానుంది. 30న ముగియనున్న ఇష్యూకి ధరల శ్రేణి రూ. 304–321కాగా.. యాంకర్ ఇన్వెస్టర్లకు షేరుకి రూ. 321 ధరలో 4.17 కోట్ల షేర్లను కేటాయించింది. తద్వారా రూ. 1,340 కోట్లు అందుకుంది. మ్యూచువల్ ఫండ్స్‌సహా 36 సంస్థలు ఇన్వెస్ట్ చేశాయి. కాగా.. ఇష్యూలో భాగంగా రూ. 2,626 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 1.1 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా మొత్తం రూ. 2,981 కోట్లు సమకూర్చుకోనుంది. వెరసి కొత్త ఆర్థిక సంవత్సరం (2025–26)లో తొలి పబ్లిక్ ఇష్యూగా నిలవనుంది. ఐపీవో ద్వారా మహారాష్ట్రలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అవసరమైన పెట్టుబడులను సమీకరించాలని భావిస్తోంది. రుణ చెల్లింపులకూ నిధులను వెచ్చించనుంది. ఐపీవో ద్వారా దేశీ స్టాక్ ఎక్సే్ఛంజీలలో గతేడాది ఆగస్ట్‌లో లిస్టయిన ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ తదుపరి రెండో ద్విచక్ర ఈవీ కంపెనీగా ఏథర్ నిలవనుంది. ఓలా ఎలక్ట్రిక్ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 6,145 కోట్లు అందుకున్న విషయం విదితమే. మొత్తం రూ. 11,956 కోట్ల విలువలో ఏథర్ ఎనర్జీ ఐపీవోకు వస్తోంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 46 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. గరిష్టంగా 13 లాట్లవరకూ దరఖాస్తుకు వీలుంటుంది. షేర్ల కేటాయింపు మే 2న ఉండవచ్చు. స్టాక్ ఎక్సే్ఛంజీలలో 6న లిస్టయ్యే వీలుంది. -
ఈపీఎఫ్ క్లెయిమ్‌కు వెళ్తున్నారా..?
వేతన జీవుల్లో అధిక శాతం మందికి నెలవారీ ఖర్చులు ఆదాయాన్ని మించుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రుణాలను ఆశ్రయిస్తున్నారు. దీని ఫలితమే పర్సనల్, క్రెడిట్ కార్డ్, బంగారం రుణాలు గడిచిన కొన్నేళ్లలో గణనీయంగా పెరిగిపోవడం చూస్తున్నాం. కానీ, ఒక్కసారి ఈ రుణ చక్రంలోకి దిగితే.. అది అంత తొందరగా విడిచిపెట్టదు. అందుకే దీనికి ప్రత్యామ్నాయాలను పరిశీలించాలి. ఇటీవలి కాలంలో వేతన జీవుల నుంచి భవిష్యనిధి క్లెయిమ్‌లు పెరగడం చూస్తున్నాం. అత్యవసరాల్లో ఈపీఎఫ్ నుంచి పాక్షిక ఉపసంహరణ అవకాశాన్ని ఉద్యోగులు వినియోగించుకుంటున్నారు. నిర్దేశిత అర్హతలు, నిబంధనల మేరకే ఈపీఎఫ్ క్లెయిమ్ చేసుకోగలరు. ఈ విషయంలో ఎలా వ్యవహరించాలన్న దానిపై నిపుణులు అందిస్తున్న సమాచారం ఇది... ‘ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్’ (ఈపీఎఫ్) వేతన జీవుల భవిష్యత్ లక్ష్యాల కోసం ఉద్దేశించిన సాధనం అని అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ముఖ్యంగా రిటైర్మెంట్ అవసరాల కోసం దీన్ని ఏర్పాటు చేశారు. అదే సమయంలో సొంతిల్లు, వైద్య అవసరాల్లోనూ దీన్ని వినియోగించుకోవచ్చు. భవిష్యత్ లక్ష్యాల కోసం ఉద్దేశించిన ఈ నిధిని తాత్కాలిక అవసరాల కోసం ఖాళీ చేయడం మంచి నిర్ణయం అనిపించుకోదు. కానీ, ఆర్థిక, అత్యవసర పరిస్థితుల్లో కొందరు ఉద్యోగులకు మరో ప్రత్యామ్నాయం లేకపోవచ్చు. ఖర్చులు ఆదాయాన్ని మించినప్పుడు.. రుణాలు తీసుకోవడం వల్ల చెల్లింపులు భారంగా మారతాయి. కనుక విశ్రాంత జీవనం కోసం ప్రత్యామ్నాయ ప్రణాళిక కలిగిన వారు.. విద్య, వైద్యం, వివాహం వంటి అత్యంత ముఖ్యమైన, క్లిష్టమైన అవసరాల్లో ఈపీఎఫ్ క్లెయిమ్‌ను పరిశీలించొచ్చు. అలాంటి సందర్భాల్లో ఎంత మేర వెనక్కి తీసుకోవచ్చు? అర్హతల గురించి ఉద్యోగులకు తప్పక అవగాహన ఉండాలి. ఏ అవసరానికి ఎంత? వివాహం లేదా ఉన్నత విద్య కోసం ఈపీఎఫ్ నిధిని వినియోగించుకోవాలంటే కఠిన నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. ఉద్యోగి కనీసం ఏడేళ్ల పాటు ఈపీఎఫ్ సభ్యుడు/సభ్యురాలిగా ఉంటేనే ఈ అవసరాల కోసం క్లెయిమ్ చేసుకునేందుకు అర్హత లభిస్తుందని ప్రావిడెంట్ ఫండ్ మాజీ ప్రాంతీయ కమిషనర్ సంజయ్ కేసరి తెలిపారు. ఉద్యోగంలో చేరిన తేదీ క్లెయిమ్ తేదీకి ఏడేళ్ల ముందు అయి ఉండాలన్నారు. ఈ నిబంధనలో ఎలాంటి వెసులుబాటు ఉండదు. తన సర్విస్ మొత్తంలో ఉన్నత విద్య (పదో తరగతి తర్వాత చదువులు), వివాహ అవసరాల కోసం కలిపి మూడు పర్యాయాలు ఉపసంహరణకు వెళ్లొచ్చు. ఒకవేళ వైద్యం కోసం అయితే సర్విస్తో సంబంధం లేకుండా క్లెయిమ్‌కు వెళ్లొచ్చు. గరిష్టంగా క్లెయిమ్ ఇన్ని సార్లు అన్న పరిమితి అయితే లేదు. వివాహం ఉద్యోగి తన సొంత వివాహం కోసం, తన తోడ బుట్టిన వారి వివాహం కోసం, తన పిల్లల వివాహాల కోసం పీఎఫ్ నిధిని పొందొచ్చు. కనీసం ఏడేళ్ల సర్వీస్ ఉండాలి. ఉద్యోగి వాటాల రూపంలో జమలు, వడ్డీ నుంచి 50 శాతం ఉపసంహరించుకోవచ్చు. వైద్యం సభ్యుడు, అతను/ఆమె జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు, తన పిల్లల వైద్యం కోసం తీసుకోవచ్చు. వైద్య అవసరాలకు కనీస సర్వీస్ నిబంధన వర్తించదు. ఎన్ని పర్యాయాలు ఉపసంహరించుకోవచ్చన్న పరిమితి లేదు. ఉద్యోగి స్వీయ జమల రూపంలో పోగైన మొత్తం, వడ్డీ లేదా.. నెలవారీ మూలవేతనం, డీఏకి ఆరు రెట్లు.. ఈ రెండింటిలో ఏది తక్కువ అయితే అంత మేరకు వెనక్కి తీసుకోవచ్చు. ఇల్లుప్లాట్ కొనుగోలు లేదా ఇల్లు/ఫ్లాట్ నిర్మాణం, కొనుగోలు కోసం ఉద్యోగి తన జీవిత కాలంలో ఒక్కసారి మాత్రమే పీఎఫ్ క్లెయిమ్‌కు వెళ్లొచ్చు. కనీసం ఐదేళ్ల సర్వీస్‌ను పూర్తి చేసి ఉండాలి. ఉద్యోగి సొంతంగా లేదా జీవిత భాగస్వామితో కలసి జాయింట్‌గా ప్రాపర్టీ కొనుగోలు చేయడం లేదా కలిగి ఉండడం తప్పనిసరి. ప్లాట్ కొనుగోలుకు అయితే నెల జీతానికి 24 రెట్లు.. ఇల్లు కొనుగోలు లేదా ఇంటి నిర్మాణం కోసం అయితే నెలవారీ జీతానికి 36 రెట్లు.. లేదా ఉద్యోగి, యాజమాన్యం జమలు, వీటిపై వడ్డీ మొత్తం.. లేదా కొనుగోలు/నిర్మాణ వ్యయం.. ఇందులో ఏది తక్కువ అయితే ఆ మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు. గృహ నవీకరణ ఇల్లు నిర్మించుకున్న ఐదేళ్ల తర్వాత అనుమతిస్తారు. ఉద్యోగి నెలవారీ మూలవేతనం, డీఏకి 12 రెట్ల వరకు తీసుకోవచ్చు. లేదా ఉద్యోగి స్వీయ జమలు, వాటిపై వడ్డీ.. లేదా నవీకరణకు అయ్యే వ్యయం.. ఈ మూడింటిలో తక్కువ మొత్తాన్నే అనుమతిస్తారు. గృహ రుణం తీర్చివేసేందుకు కనీసం మూడేళ్ల సర్విస్ పూర్తి చేసి ఉండాలి. బ్యాలన్స్ నుంచి 90% వెనక్కి తీసుకోవచ్చు. విద్య తన కుమారుడు లేదా కుమార్తెల ఉన్నత విద్య కోసమే భవిష్య నిధి నుంచి పాక్షిక ఉపసంహర ణకు అనుమతిస్తారు. కనీసం ఏడేళ్ల సర్విస్ ఉండాలి. ఉద్యోగి జమలు, వడ్డీ మొత్తం నుంచి 50 శాతాన్ని తీసుకోవచ్చు. ఇలా 3 పర్యాయాలు ఉపసంహరించుకోవచ్చు. ఈ 3 సార్లు అన్న పరిమితి వివాహం, విద్యకు కలిపి వర్తిస్తుంది. ఉద్యోగం కోల్పోయిన పరిస్థితుల్లో.. ఒకచోట ఉద్యోగం కోల్పోవడం లేదంటే మానివేసి.. నెల రోజులకు పైగా మరో ఉపాధి లేని పరిస్థితుల్లో పీఎఫ్ బ్యాలన్స్ నుంచి 75 శాతాన్ని ఉపసంహరించుకోవచ్చు. ఉపాధి లేకుండా రెండు నెలలు దాటిపోతే అప్పుడు మిగిలిన 25 శాతాన్ని కూడా వెనక్కి తీసేసుకోవడానికి నిబంధనలు అనుమతిస్తున్నాయి. ఒక సంస్థలో ఉద్యోగం మానేశామన్న కారణంతో పీఎఫ్ ఖాతాను ఖాళీ చేయాలనేమీ లేదు. మరో సంస్థలో చేరిన తర్వాత పీఎఫ్ ఖాతాను బదిలీ చేసుకోవచ్చు. తద్వారా అందులో ప్రయోజనాలను అలాగే కొనసాగించుకోవచ్చు.ఉపసంహరణ ఎలా..? ఆన్లైన్ క్లెయిమ్ ప్రక్రియను ఈపీఎఫ్‌వో ఎంతో సులభతరం చేసింది. ఈపీఎఫ్ ఇండియా పోర్టల్‌కు వెళ్లి కుడి భాగంలో పైన కనిపించే ‘ఆన్లైన్ క్లెయిమ్స్’ దగ్గర క్లిక్ చేయాలి. ఆ తర్వాత ప్రత్యేక విండో తెరుచుకుంటుంది. అక్కడ ‘యూఏఎన్’ నంబర్, పాస్వర్డ్ నమోదు చేసి, మొబైల్‌కు వచ్చే ఓటీపీతో లాగిన్ అవ్వాలి. లాగిన్ పూర్తయిన తర్వాత పైన కనిపించే ఆప్షన్లలో ‘ఆన్లైన్ సర్విసెస్’ సెక్షన్లో ‘క్లెయిమ్ ఫారమ్’ను ఎంపిక చేసుకోవాలి. అక్కడ యూఏఎన్‌కు లింక్ చేసిన బ్యాంక్ ఖాతా నంబర్‌ను నమోదు చేసి ధ్రువీకరించాలి. అక్కడ పీఎఫ్ అడ్వాన్స్‌ను సెలక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత సెలక్ట్ సర్వీస్ దగ్గర పనిచేస్తున్న సంస్థను ఎంపిక చేసుకోవాలి. దాని కింద క్లెయిమ్ దేనికోసమన్న కారణాన్ని ఎంపిక చేసుకోవాలి. అనంతరం అక్కడ కోరిన వివరాలు ఇచ్చి దరఖాస్తును సమర్పించాలి. చివరిగా మొబైల్‌కు వచ్చే ఓటీపీని నమోదు చేసిన అనంతరం అది విజయవంతంగా దాఖలవుతుంది. క్లెయిమ్ దరఖాస్తు పురోగతిని సైతం ఇదే మాదిరి లాగిన్ అయ్యి చెక్ చేసుకోవచ్చు. పరిశీలన కోసం చెక్ కాపీని స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి రావచ్చు. కనుక ముందే సిద్ధం చేసుకోవాలి. సంబంధిత చెక్ లీఫ్‌పై సభ్యుడి పేరు, బ్యాంక్ ఖాతా తదితర వివరాలు ఉండాలి. ఉమంగ్ యాప్ నుంచి కూడా క్లెయిమ్ దాఖలు చేసుకోవచ్చు. అదే ఆఫ్‌లైన్‌లో క్లెయిమ్ దరఖాస్తు సమర్పించేందుకు, కావాల్సిన అన్ని డాక్యుమెంట్లతో సమీపంలోని ఈపీఎఫ్‌వో కార్యాలయానికి వెళితే సరిపోతుంది. అక్కడ విత్‌డ్రాయల్ ఫారమ్ పూరించి, వారు కోరినట్టు డాక్యుమెంట్లను జత చేసి సమర్పించాల్సి ఉంటుంది. ఆన్లైన్లో క్లెయిమ్ దరఖాస్తు 3–4 రోజుల్లో పరిష్కారం అవుతుంది. క్లెయిమ్ రూ. లక్ష లోపు ఉంటే ఆటోమేటిక్‌గా అనుమతి లభిస్తుంది. ఆఫ్‌లైన్‌లో ఇందుకు 10–20 రోజులు పట్టొచ్చు. ఈపీఎఫ్ ఖాతా నుంచి ఉపసంహరించుకున్న నిధులను, రుణం కాదు కనుక తిరిగి జమ చేయాల్సిన అవసరం లేదు. అలాగే, ఈపీఎఫ్ బ్యాలన్స్‌పై ఎలాంటి రుణ సదుపాయం లేదు. → క్లెయిమ్ భారీగా ఉంటే అప్పుడు విద్యార్హత సర్టిఫికెట్లు లేదా వైద్య డాక్యుమెంట్ల కాపీలు అప్లోడ్ చేయాల్సి రావచ్చు. → అర్హతలు, పరిమితులను ఒక్కసారి సమగ్రంగా తెలుసుకోవాలి. ముఖ్యమైన అవసరాల్లోనే ఈపీఎఫ్‌ను వివేకంగా ఉపయోగించుకోవాలన్నది నిపుణుల సూచన. → ఈపీఎఫ్ క్లెయిమ్‌కు వెళ్లే ముందు తమ కేవైసీ వివరాలు సరిగ్గా ఉన్నాయేమో ఒక్కసారి సరిచూసుకోవాలి. అంటే బ్యాంక్ ఖాతా వివరాలు, ఆధార్, పాన్ వివరాలు నమోదు చేసి, ధ్రువీకరించి ఉండాలి. దీనివల్ల క్లెయిమ్ దరఖాస్తు తిరస్కరణకు గురికాకుండా ఉంటుంది. 54 ఏళ్లు నిండితే..54 ఏళ్లు నిండిన తర్వాత, ముందస్తు పదవీ విరమణ/వయోభారం రీత్యా విరమణ చేసిన వారు 58 ఏళ్లు రాకముందే మొత్తం పీఎఫ్ బ్యాలన్స్‌లో 90 శాతాన్ని ఉపసంహరించుకోవచ్చు.పన్ను భారం? ఈపీఎఫ్ ఖాతా ప్రారంభించిన ఐదేళ్ల తర్వాత ఉపసంహరణకు వెళితే ఆ మొత్తంపై ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేదు. ఒకవేళ సర్విస్ ఐదేళ్లలోపు ఉండి, ఉపసంహరించుకునే మొత్తం రూ.50,000 మించితే అప్పుడు దీనిపై 10 శాతం టీడీఎస్ మినహాయిస్తారు. పాన్ నంబర్ ఇవ్వకపోతే 20 శాతం టీడీఎస్ పడుతుంది. ఐదేళ్లలోపు రూ.50 వేలకు మించి ఉపసంహరించుకుంటే ఆ మొత్తాన్ని వార్షిక ఆదాయానికి కలిపి చూపించి నిబంధనల మేరకు పన్ను చెల్లించాల్సి వస్తుంది. పన్ను పరిధిలోకి రాకపోతే, పీఎఫ్‌పై మినహాయించిన టీడీఎస్‌ను రిఫండ్ కోరొచ్చు. ఒకవేళ ఉద్యోగం నుంచి తొలగింపునకు గురై లేదా కంపెనీ మూసివేసిన కేసుల్లో ఉద్యోగులు పీఎఫ్ నిధిని ఉపసంహరించుకుంటే, అప్పుడు సర్విస్ ఐదేళ్లలోపు ఉన్నా సరే ఆ మొత్తం పన్ను పరిధిలోకి రాదు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఫ్రీ వైఫై వినియోగం.. ప్రభుత్వం హెచ్చరిక
ఉచితంగా వస్తుందంటే.. ఎవరు మాత్రం కాదంటారు. అయితే ఫ్రీ వైఫై మాత్రం వద్దనే చెప్పాలంటూ.. ప్రభుత్వం హెచ్చరించింది. ఇంతకీ ప్రభుత్వం ఎందుకిలా అంటోంది?, కారణాలు ఏమిటనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.విమానాశ్రయాలు, కాఫీ షాపులు మొదలైన పబ్లిక్ ప్రదేశాల్లో ఫ్రీ వైఫై సదుపాయం అందుబాటులో ఉంటుంది. ఇలాంటివి కనెక్ట్ చేసుకోవడం ఏ మాత్రం భద్రం కాదని ప్రభుత్వం వెల్లడించింది. స్కామర్లు, హ్యాకర్లు అమాయక ప్రజలను ట్రాప్ చేయడానికి ఏర్పాటు చేసిన ఓ ఉచ్చు కూడా కావచ్చని స్పష్టం చేసింది.ఫ్రీ వైఫై ఉపయోగించుకోవడం వల్ల.. ప్రైవేట్ డేటా, ఆర్థిక సమాచారానికి సంబంధించిన విషయాలు మోసగాళ్ల చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉంది. ఇటువంటి మోసాలను అరికట్టడానికి.. డిజిటల్ భద్రతా అవగాహనను మరింత పెంచడానికి CERT-In తన 'జాగ్రూక్త దివాస్' చొరవ కింద, పబ్లిక్ Wi-Fi నెట్‌వర్క్‌ల ద్వారా లావాదేవీలు చేయకుండా పౌరులను హెచ్చరించింది.ఇదీ చదవండి: రూ.60 లక్షల ఆదాయం.. అన్నీ సమస్యలే: పోస్ట్ వైరల్సైబర్ నేరగాళ్లు పెరుగుతున్న సమయంలో.. మోసాలు కూడా ఎక్కువైపోతున్నాయి. కాబట్టి ఏదైనా తెలియని లైక్స్ మీద లేదా అటాచ్మెంట్ల మీద ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయకూడదు. ఏవైనా ఖాతాలకు స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌లను ఫిక్స్ చేసుకోవడం మంచిది. ఎప్పటికపుడు జాగ్రత్తగా ఉండాలని CERT-In పేర్కొంది. -
రూ.60 లక్షల ఆదాయం: అన్నీ సమస్యలే..
అభివృద్ధి చెందుతున్న భారతదేశంలోని ప్రధాన నగరాల్లో.. నివాసం చాలా కష్టతరమని గతంలో కొంతమంది పేర్కొన్నారు. ఇప్పుడు రూ. 60 లక్షల వార్షిక ఆదాయం వచ్చే కుటుంబానికి చెందిన బెంగళూరు వ్యక్తి దేశంలో నివసించడం చాలా ఖరీదైనదిగా అయిపోయిందని అన్నారు. దీనికి సంబంధించిన ఒక పోస్ట్ కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. మరిన్ని వివరాలు ఇక్కడ ఈ కథనంలో చూసేద్దాం..నేను హోరేమావు (బెంగళూరు)లో నివసిస్తున్నాను. మౌలిక సదుపాయాలు చాలా దారుణంగా ఉన్నాయి. ఆఫీసుకు చేరుకోవడానికి మూడు కిలోమీటర్లు ప్రయాణించాలి.. ఈ ప్రయాణం నాకు సుమారు 40 నిమిషాలు పడుతుంది. ఆఫీసుకు చేరుకునే సమయానికి నీరసించిపోతాను. ప్రతి రోడ్డులోనూ అడ్డంకులు ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు పూర్తవుతాయో?, ప్రాజెక్టులు ప్రారంభమవుతాయి కానీ ఎప్పటికీ పూర్తి కావు. జవాబుదారీతనం ఎక్కడ ఉందని అన్నారు.బెంగళూరు రోడ్డు పన్ను దేశంలోనే అత్యధికంగా ఉంది. ఢిల్లీలో చెల్లించే దానికంటే నేను రూ. 2.25 లక్షలు ఎక్కువగా రోడ్డు పన్ను చెల్లించాను. దానికి ప్రతిఫలంగా నాకు ఏమి లభిస్తుంది? రోడ్లకు క్రేటర్లు, ట్రాఫిక్ కష్టాలు, నిరంతర నిర్మాణాలు. ఇది పూర్తిగా పగటిపూట జరుగుతున్న దోపిడీ. మనం భారీగా చెల్లిస్తున్నాము, దీని ప్రతిఫలం శూన్యం.కెనడా, జర్మనీ వంటి దేశాలలో..మన ఆదాయంలో 30-40% పన్నుల రూపంలోకి వెళుతుంది. ప్రతిదానిపై GST కూడా. ఇవన్నీ చెల్లించినా మనకు ఏమీ లభించదు. ఉచిత ఆరోగ్య సంరక్షణ లేదు, మంచి విద్య లేదు, మంచి నీరు కూడా లేదు. ప్రైవేట్ పాఠశాలలు, ప్రైవేట్ ఆసుపత్రులకు మనం విడిగా చెల్లించాలి. నీటి ట్యాంకర్లకు అదనం. 30-40% పన్ను చెల్లిస్తూ.. ఇంకా నీరు కొనాల్సిన పరిస్థితి ఉంది. కెనడా లేదా జర్మనీ వంటి దేశాలలో, నేను ఇదే పన్ను చెల్లిస్తే.. ఉచిత ఆరోగ్య సంరక్షణ, మంచి విద్య, మంచి మౌలిక సదుపాయాలు లభిస్తాయి.జీవన నాణ్యత కూడా విచారకరంగా ఉంది. ప్రతిచోటా దుమ్ము, శబ్దం.. వీటివల్ల ఒత్తిడి, కోపం. ప్రశాంతంగా నడవలేము, స్వచ్ఛమైన గాలి పీల్చుకోలేము. సాయంత్రం 7 గంటల తర్వాత నా భార్యను ఒంటరిగా బయటకు పంపడం సురక్షితం కాదు. దాదాపు ప్రతి ప్రభుత్వ శాఖ అవినీతిమయమైంది. లంచం ఇవ్వకపోతే పని జరగదు.పరిస్థితులు మెరుగుపడతాయా..ప్రతిదీ చాలా ఖరీదైనదిగా మారుతోంది. ఈ సంవత్సరం అద్దె 10% పెరుగుతోంది. స్కూల్ ఫీజులు అంతకు మించే ఉన్నాయి. మా ఇంటి ఆదాయం కంటే ఖర్చులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. నేను నిజంగా ఈ దేశానికి తోడ్పడాలనుకుంటున్నాను. ఇక్కడే ఉండి ఏదైనా చేయాలనుకుంటున్నాను. కానీ ఈ వ్యవస్థ ఏ మాత్రం బాగాలేదు. మనం పన్ను చెల్లించే ప్రతి రూపాయి రాజకీయ నాయకుల ఖజానా నింపడానికి వెళుతుందనే అభిప్రాయం నాకు ఏర్పడింది.నేను నిజాయితీగా అడుగుతున్నాను. ఇక్కడ పరిస్థితులు మెరుగుపడతాయని కొంత ఆశ పెట్టుకోవచ్చా అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించాడు.ఇదీ చదవండి: టైటానిక్ మృత్యుంజయుడు రాసిన లేఖ.. రూ.3 కోట్లు పలికిందిదీనిపై పలువురు నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. మీకు వేరే ఆప్షన్ ఉంటే.. వేరే దేశంలో సెటిల్ అవ్వండి. ఎందుకంటే ఇక్కడ పరిస్థితులు ఎప్పటికీ మారవని ఒకరు అన్నారు. ఇవన్నీ మారవు.. మనం ఎప్పటికీ అంతం కాని లూప్‌లో జీవిస్తున్నామని మరొకరు అన్నారు. ఇలా ఎవరికీ తోచిన రీతిలో వారు స్పందిస్తున్నారు. -
టైటానిక్ మృత్యుంజయుడు రాసిన లేఖ.. రూ.3 కోట్లు పలికింది
టైటానిక్ షిప్ మునిగిపోవడానికి కొన్ని రోజుల ముందు ఒక ప్రయాణికుడు (కల్నల్ ఆర్చిబాల్డ్ గ్రేసీ) రాసిన లేఖ యూకేలో జరిగిన వేలంలో రికార్డు స్థాయిలో.. సుమారు రూ. 3.4 కోట్లకు అమ్ముడైంది. విల్ట్‌షైర్‌లోని హెన్రీ ఆల్డ్రిడ్జ్ అండ్ సన్ నిర్వహించిన వేలంలో దీనిని విక్రయించారు.టైటానిక్ ఒక మంచుకొండను ఢీకొని ఉత్తర అట్లాంటిక్ మంచు నీటిలో మునిగిపోవడానికి కొన్ని రోజుల ముందు 'కల్నల్ ఆర్చిబాల్డ్ గ్రేసీ' రాసిన ఈ లేఖ.. 1912 ఏప్రిల్ 10న సౌతాంప్టన్ నుంచి రాసినట్లు తెలుస్తోంది. ఇందులో "ఇది మంచి షిప్, కానీ నేను దీనిపై తీర్పు చెప్పే ముందు నా ప్రయాణాలు ముగిసే వరకు వేచి ఉండాలి" అని ఉంది.1912 ఏప్రిల్ 15 తెల్లవారుజామున టైటానిక్ ఒక మంచుకొండను ఢీకొని మునిగిపోయిన తరువాత సుమారు 1500 మందికి పైగా మరణించారు. అయితే ఈ ప్రమాదంలో బతికి బయటపడిన అతి తక్కువ మందిలో గ్రేసీ ఒకరు. 1913లో ఈయన మరణించిన తరువాత.. ప్రచురించబడిన తన 'ది ట్రూత్ ఎబౌట్ ది టైటానిక్' పుస్తకంలో తాను తప్పించుకున్న విషయాన్ని వివరించాడు.ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీ సమయంలో కాలేయ వ్యాధి: ఇప్పుడు ఓ కంపెనీ అధినేత్రి..ఆ పుస్తకంలో.. ఓడ మునిగిపోయిన తర్వాత, మంచు నీటిలో బోల్తా పడిన లైఫ్ బోట్‌ను ఎక్కి తాను ఎలా బయటపడ్డాడో వివరించాడు. మొదట లైఫ్ బోట్ చేరుకున్న వారిలో సగానికి పైగా అలసట లేదా చలి కారణంగా మరణించారని ఆయన రాశారు.కల్నల్ గ్రేసీ ఆ విపత్తు నుంచి బయటపడినప్పటికీ, అతితక్కువ ఉష్ణోగ్రత కారణంగా.. గాయాల వల్ల ఆరోగ్యం పాడైంది. ఆ తరువాత డయాబెటిస్ సమస్యలతో.. డిసెంబర్ 1912లో మరణించారు. అయితే ఆయన మరణానంతరం ఈ లేఖ భారీ మొత్తానికి అమ్ముడైంది. -
ప్రపంచంలోని 10 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు: లేటెస్ట్ రిపోర్ట్
భారత ఆర్ధిక వ్యవస్థ దినదినాభివృద్ధి చెందుతోంది. ఇండియా.. జర్మనీ, జపాన్‌లను అధిగమించి ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని పలువురు నిపుణులు చెబుతూనే ఉన్నారు.భారతదేశం ప్రపంచానికి విద్యా కేంద్రంగా మారగలదని, మిగతావన్నీ పక్కన పెడితే మన దేశంలోని ప్రజాస్వామ్యమే మనకు అతిపెద్ద ప్రయోజనమని నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం తన అభిప్రాయాన్ని ఇటీవలే వ్యక్తం చేశారు. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో ఐదవ అతిపెద్దది. వచ్చే ఏడాది చివరి నాటికి మనం నాల్గవ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా ఉండబోతున్నాము. ఆ తర్వాత ఏడాది మూడవ అతిపెద్దదిగా ఉంటామని ఆయన వివరించారు.ప్రపంచంలోని టాప్ 10 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు ప్రపంచ GDPకి గణనీయంగా దోహదపడతాయి. అంతే కాకుండా అంతర్జాతీయ వాణిజ్యం, ఆర్థిక విధానాలపై కూడా బలమైన ప్రభావాన్ని చూపుతాయి. వరల్డ్ ఎకనామిక్ అవుట్‌లుక్ నివేదిక ప్రకారం.. టాప్ 10 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు ఇలా..➤యునైటెడ్ స్టేట్స్ (యూఎస్): 30.507 ట్రిలియన్ డాలర్లు➤చైనా: 19.231 ట్రిలియన్ డాలర్లు➤జర్మనీ: 4.744 ట్రిలియన్ డాలర్లు➤భారతదేశం: 4.187 ట్రిలియన్ డాలర్లు➤జపాన్: 4.186 ట్రిలియన్ డాలర్లు➤యునైటెడ్ కింగ్డమ్ (యూకే): 3.839 ట్రిలియన్ డాలర్లు➤ఫ్రాన్స్: 3.211 ట్రిలియన్ డాలర్లు➤ఇటలీ: 2.422 ట్రిలియన్ డాలర్లు➤కెనడా: 2.225 ట్రిలియన్ డాలర్లు➤బ్రెజిల్: 2.125 ట్రిలియన్ డాలర్లు -
అలాంటి బ్యాంక్ అకౌంట్స్ వెంటనే క్లోజ్ చేసుకోండి
సాధారణంగా చాలా మందికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి. అయితే.. అందులో ఒకటి లేదా రెండు మాత్రమే ఉపయోగిస్తుంటారు. మిగిలినవన్నీ వృధా అన్న మాట. ఇలా వదిలేయడం వల్ల.. కొన్ని నష్టాలు భరించాల్సి ఉంటుంది. ఈ కథనంలో అలాంటి నష్టాలేమిటో తెలుసుకుందాం..బ్యాంక్ చార్జీలుఒక బ్యాంకులో అకౌంట్ ఉందంటే.. అందులో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెనెన్స్ చేయాల్సిందే. ఒకవేళా మినిమమ్ బ్యాలెన్స్ లేకుండా ఉంటే.. వాటిపై బ్యాంక్ చార్జీలు వసూలు చేస్తుంది. కొన్ని సార్లు మైనస్ బ్యాలెన్స్‌లోకి కూడా వెళ్లే అవకాశం ఉంటుంది. ఆ తరువాత లావాదేవీలు చేయాలంటే.. ముందు మైనస్ బ్యాలెన్స్ క్లియర్ చేయాల్సిందే.డబ్బు వృధాబ్యాంక్ అకౌంట్ ఉపయోగించకుండా.. అలాగే వదిలేస్తే అందులో ఉన్న మినిమమ్ బ్యాలెన్స్ వంటివి వృధా అవుతాయి. మీకు ఓ ఐదు అకౌంట్స్ ఉన్నాయనుకుంటే.. అందులో మీరు కేవలం ఒకదాన్ని మాత్రం వాడుతూ.. మిగిలినవి ఉపయోగించకుండా వదిలేస్తే అందులో ఉన్న డబ్బు వృధా అయినట్టే. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఎక్కువ అకౌంట్స్ మెయింటెన్సన్ చేయకుండా ఉండటమే ఉత్తమం.ఇదీ చదవండి: ధర ఎక్కువైనా అస్సలు తగ్గని జనం.. ఒకేరోజు 52 కార్ల డెలివరీమోసాలకు అవకాశంటెక్నాలజీ పెరుగుతున్న సమయంలో మోసాలు ఎక్కువవుతున్నాయి. మీరు ఉపయోగించకుండా ఉంటే.. అలాంటి అకౌంట్లను కొందరు సైబర్ నేరగాళ్లు ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఇవి మిమ్మల్ని చిక్కుల్లో పడేసే అవకాశం ఉంది. కాబట్టి బ్యాంక్ అకౌంట్ వృధాగా ఉన్నా.. అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. లేదా క్లోజ్ చేసుకోవడం మంచిది.సిబిల్ స్కోరుపై ప్రభావంబ్యాంక్ అకౌంట్ యాక్టివ్‌గా లేకుంటే.. మైనస్ బ్యాలెన్స్‌లోకి వెళ్ళిపోతుంది. అంటే దీనర్థం మీరు బ్యాంకుకు అప్పు ఉన్నారన్నమాట. ఇది మీ క్రెడిట్ స్కోర్ మీద ప్రభావం చూపిస్తుంది. దీంతో సిబల్ స్కోర్ తగ్గిపోతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే.. యాక్టివ్‌గా ఉన్న అకౌంట్స్ కాకుండా.. మిగిలినవన్నీ వెంటనే క్లోజ్ చేసుకోవాలి. -
స్నానానికి సిగ్నల్ సిస్టమ్.. కొలతల కొళాయి: సరికొత్త గ్యాడ్జెట్స్
అసలే వేసవి కాలం, నీటి కష్టాలు చాలానే ఉంటాయి. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే.. పట్టణ ప్రాంతాల్లో వాటర్ ప్రాబ్లమ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి నీటిని పొదుపుగా వాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికోసం కొన్ని ప్రత్యేకమైన పరికరాలు అందుబాటులోకి వచ్చేశాయి. వీటి గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో..వాటర్ పెబుల్కచ్చితమైన కొలతతో స్నానం చేస్తే చాలా నీటిని ఆదా చేసిన వారమవుతాం. అయితే, అంత కచ్చితంగా కొలత ప్రకారం స్నానం చేయడం సులువుగా సాధ్యం కాదు. అందుకే, రూపొందించారు ఈ ‘వాటర్ పెబుల్’. చూడ్డానికి చిన్న గుండ్రటి బిళ్లలా కనిపిస్తుంది. కాని, ఈ పెబుల్ మిమ్మల్ని కేవలం నాలుగు నిమిషాల్లో మాత్రమే స్నానం చేసేలా ట్రైన్ చేయగలదు.సమయం మించిపోయే కొద్దే ట్రాఫిక్ సిగ్నల్స్ మాదిరి ఎరుపు, నారింజ, ఆకుపచ్చ లైట్లతో హెచ్చరికలు చేస్తుంది. ఎరుపు రంగు లైట్ చూపిస్తే, స్నానం వెంటనే పూర్తి చేయమని అర్థం. నారింజ అయితే సగం స్నానం పూర్తి చేశారని అర్థం. ఆకుపచ్చ అయితే, సమయం ఇంకా ఉందని అర్థం. ఇలా ఎంతో సులభంగా అందరూ అర్థం చేసుకునేలా ఉండే దీని ధర 14 డాలర్లు (రూ. 1,119) మాత్రమే!కొలతల కొళాయి మంచినీటి కొళాయి మనకు ఎంత అవసరమో అంతే నీటిని, కొలిచి ఇస్తే బాగుంటుంది కదూ! అచ్చం ఇలాగే ఈ ‘మెజర్ఫిల్ టచ్ కిచెన్ టాప్’ పనిచేస్తుంది. చాలా రకాల వంటకాలు కచ్చితమైన నీటి కొలతతోనే వండాలి. వంటగదికి ఇది బాగా ఉపయోగపడుతుంది. వంద మిల్లీ లీటర్ల నుంచి ఐదు లీటర్ల వరకు కచ్చితమైన నీటి పరిమాణాన్ని ఇది అందించగలదు. అవసరమైన మేర కొలతను సర్దుబాటు చేసుకునే వీలుంది. ఇక ఇందులోని టచ్ ఫంక్షనాలిటీ సాయంతో సులభంగా ఆన్, ఆఫ్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ ట్యాప్ ఆఫ్ చేయటం మర్చిపోతే, ఐదు నిమిషాల తర్వాత ఆటోమేటిక్‌గా ట్యాప్ ఆఫ్ అయిపోతుంది. ధర రూ. 359 డాలర్లు (రూ. 30,741).ఇదీ చదవండి: కొత్త ఏటీఎమ్.. ఇలా బంగారం వేస్తే అలా డబ్బులొస్తాయ్..తడిపొడి విడివిడి..వేసవి వచ్చిదంటే చాలామంది వాటర్ రైడ్స్, స్విమ్మింగ్ ఇలా వివిధ రకాల జలక్రీడలతో కాలక్షేపం చేయడానికి Ðð ళ్తుంటారు. అయితే, చెమట, తడి దుస్తుల కారణంగా లగేజీ మొత్తం దుర్వాసన వస్తుంది. ఇలా కాకుండా ఈ వెట్ అండ్ డ్రై సపరేషన్ బ్యాగ్‌తో తడి దుస్తులను, పొడి దుస్తులను వేర్వేరుగా ఉంచితే, దుర్వాసన రాకుండా ఇది అరికడుతుంది. ఇది అత్యుత్తమ వాటర్ ప్రూఫ్ లైనింగ్, వాటర్ ప్రూఫ్ జిప్పర్తో వస్తుంది. జిమ్, లాండ్రీ బ్యాగ్‌లా కూడా దీనిని ఉపయోగించుకోవచ్చు. స్మాల్, మీడియం, లార్జ్ ఇలా వివిధ సైజుల్లో లభిస్తుంది. ధర వివిధ తయారీ కంపెనీలు, పరిమాణాలను బట్టి ఉంటుంది. -
ఏఐ జాబ్ మార్కెట్ బూమ్.. టాప్ 10 స్కిల్స్ ఇవే..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉద్యోగ మార్కెట్ అనూహ్యమైన వృద్ధిని సాధిస్తోంది. యునైటెడ్ స్టేట్స్లో 2024లో ఏఐ జాబ్ పోస్టింగ్‌లలో 20% పెరుగుదల నమోదైందని లైట్కాస్ట్ నిర్వహించిన 2025 AI ఇండెక్స్ రిపోర్ట్ తెలిపింది. 109 బిలియన్ డాలర్ల ప్రైవేట్ పెట్టుబడులతో ఊపందుకున్న ఈ మార్కెట్, ప్రత్యేక ఏఐ నైపుణ్యాల డిమాండ్‌ను పెంచుతూ ఉద్యోగ రంగాన్ని పునర్నిర్మిస్తోంది.పైథాన్ అత్యంత డిమాండ్ ఉన్న నైపుణ్యంగా నిలిచింది. గత సంవత్సరం దాదాపు 200,000 ఉద్యోగ పోస్టింగ్‌లలో ఈ నైపుణ్యాన్ని అడిగారు. రిపోర్ట్ ప్రకారం.. పైథాన్, ప్రోగ్రామింగ్, డేటా సైన్స్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్‌తోపాటు అధిక డిమాండ్ ఉన్న టాప్ 10 ఏఐ ఉద్యోగ నైపుణ్యాలు ఇవే..👉పైథాన్ (199,213 పోస్టింగ్‌లు, 2012-2014తో పోలిస్తే 527% వృద్ధి)👉కంప్యూటర్ సైన్స్ (193,341 పోస్టింగ్‌లు, 131% వృద్ధి)👉డేటా అనాలిసిస్ (128,938 పోస్టింగ్‌లు, 208% వృద్ధి)👉SQL (119,441 పోస్టింగ్‌లు, 133% వృద్ధి)👉డేటా సైన్స్ (110,620 పోస్టింగ్‌లు, 833% వృద్ధి)👉ఆటోమేషన్ (102,210 పోస్టింగ్‌లు, 361% వృద్ధి)👉ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ (101,127 పోస్టింగ్‌లు, 87% వృద్ధి)👉అమెజాన్ వెబ్ సర్వీసెస్ (100,881 పోస్టింగ్‌లు, 1,778% వృద్ధి)👉అజైల్ మెథడాలజీ (88,141 పోస్టింగ్‌లు, 334% వృద్ధి)👉స్కేలబిలిటీ (86,990 పోస్టింగ్‌లు, 337% వృద్ధి)కింగ్ ‘పైథాన్’పైథాన్ బహుముఖ ప్రజ్ఞ, విస్తృత లైబ్రరీలు దీనిని ఏఐ అభివృద్ధిలో కీలకమైన అంశంగా మార్చాయని స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీలో డేటా సైన్స్ ప్రొఫెసర్ డాక్టర్ ఎమిలీ చెన్ అన్నారు. "మెషిన్ లెర్నింగ్ నుండి ఆటోమేషన్ వరకు, పైథాన్ అనివార్యం" ఆమె తెలిపారు.డేటా సైన్స్ (833% వృద్ధి), అమెజాన్ వెబ్ సర్వీసెస్ (1,778% వృద్ధి) వంటి నైపుణ్యాలు అత్యధిక వృద్ధిని సాధించాయి, ఇవి సంక్లిష్ట డేటాసెట్ల నుండి సమాచారాన్ని సంగ్రహించే, స్కేలబుల్ ఏఐ సిస్టమ్‌లను నిర్మించే నైపుణ్యాల అవసరాన్ని సూచిస్తున్నాయి. అజైల్ మెథడాలజీ (88,141 పోస్టింగ్‌లు) సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఇటరేటివ్ విధానాలకు ఉన్న ప్రాధాన్యతను హైలైట్ చేస్తుంది.ఈ డిమాండ్ విస్తరణ టెక్ దిగ్గజ కంపెనీల నుండి స్టార్టప్‌ల వరకు వివిధ రంగాలలో అవకాశాలను సృష్టిస్తోంది. "కంపెనీలు AIని సమగ్రపరచడానికి పోటీపడుతున్నాయి, దీనికి నైపుణ్యం కలిగిన నిపుణులు అవసరం," అని సిలికాన్ వ్యాలీలో టెక్ రిక్రూటర్ మార్క్ రివెరా అన్నారు. అయితే, ఈ వేగవంతమైన వృద్ధి నైపుణ్యాల అంతరాన్ని గురించి ఆందోళనలను లేవనెత్తింది. కొందరు నిపుణులు విద్యా సంస్థలు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా కరికులమ్‌ను సవరించాలని సూచిస్తున్నారు.ఏఐ రంగం విస్తరిస్తున్న నేపథ్యంలో డిమాండ్ ఉన్న ఈ స్కిల్స్‌లో నైపుణ్యం కలిగిన ఉద్యోగార్థులు ఏఐ జాబ్ బూమ్‌ను సద్వినియోగం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రంగంలోకి ప్రవేశించాలనుకునే వారికి పైథాన్, డేటా సైన్స్‌లో నైపుణ్యం సాధించడం ఏఐలో లాభదాయకమైన కెరీర్‌కు కీలకంగా మారవచ్చు. -
బంగారం భారీగా పడిపోతుంది!
ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు అంతకంతకూ పెరుగుతూ తారాస్థాయికి చేరాయి. భారత్‌లో అయితే 10 గ్రాముల పసిడి ధర ఏకంగా రూ.లక్ష దాటి తర్వాత కాస్త తగ్గింది. ఈ నేపథ్యంలో పెరుగుతున్న బంగారం ధరలతో ఆందోళన చెందుతున్న వారికి ఉపశమనం కలిగించే వార్తొకటి వచ్చింది. వచ్చే 12 నెలల్లో బంగారం ధర భారీగా పడిపోయే అవకాశం ఉందని కజకిస్థాన్ గోల్డ్ మైనింగ్ సంస్థ సాలిడ్ కోర్ రిసోర్సెస్ పీఎల్సీ సీఈఓ చెబుతున్నారు.12 నెలల్లో బంగారం ధరలు (ఒక ఔన్స్) 2,500 డాలర్లకు చేరుకుంటుందని సాలిడ్ కోర్ రిసోర్సెస్ సీఈఓ 'విటాలీ నేసిస్' రాయిటర్స్‌తో చెప్పారు. అయితే 1,800 - 1,900 డాలర్ల స్థాయికి చేసే అవకాశం లేదు. సాధారణంగా బంగారంపై ఓ స్థాయి వరకు ప్రతిస్పందన ఉంటుంది. కానీ ప్రస్తుతం జరుగుతున్నది (ధరలు పెరగడం) ఓవర్ రియాక్షన్' అని కజకిస్థాన్ రెండో అతిపెద్ద గోల్డ్ మైనర్ సాలిడ్‌కోర్ నేసిస్ అంటున్నారు.ఎంతకు తగ్గొచ్చు? నేసిస్ చెబుతున్నదాని ప్రకారం.. ఒక ఔన్స్ అంటే 28.3495 గ్రాముల బంగారం ధర 2,500 డాలర్లకు తగ్గుతుంది. అంటే 10 గ్రాముల ధర దాదాపు రూ. 75,000 లకు దిగొస్తుంది. సాంప్రదాయకంగా రాజకీయ, ఆర్థిక అనిశ్చిత పరిస్థితులకు వ్యతిరేకంగా రక్షణ కవచంగా భావించే బంగారం ధర ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 26 శాతం పెరిగింది. ఎందుకంటే యూఎస్ సుంకాలు మాంద్యం భయాలను రేకెత్తించాయి. ఈ క్రమంలో గత మంగళవారం అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో ఔన్స్ బంగారం రికార్డు స్థాయిలో 3,500.05 డాలర్లను తాకింది.👉ఇదీ చదవండి: చూశారా.. ‘బంగారమే డబ్బు’!ప్రస్తుతం ధరలు ఇలా..అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు, డాలర్‌తో రూపాయి మారకం రేటు, స్థానిక డిమాండ్ వంటి అంశాలు ఈ ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ఏప్రిల్ 26 నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్, 22 క్యారెట్ బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి..తెలుగు రాష్ట్రాల్లో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,210- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,020చెన్నైలో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,210- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,020👉ఇది చదివారా? బంగారం.. ఈ దేశాల్లో చవకే..!!ఢిల్లీలో.. - 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,310- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,170ముంబైలో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,210- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,020బెంగళూరులో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,210- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,020(గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
నిరాశపరిచిన ఎస్బీఐ కార్డ్
న్యూఢిల్లీ: ఎస్బీఐ కార్డ్ (క్రెడిట్ కార్డు సేవల్లోని) గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికి (2025 జనవరి–మార్చి) రూ.534 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో లాభం రూ.662 కోట్లతో పోల్చి చూస్తే 19 శాతం తగ్గిపోయింది. క్రెడిట్ కార్డులపై రుణ ఎగవేతలు పెరగడం లాభాలకు గండికొట్టింది. మొత్తం ఆదాయం మాత్రం ఇదే కాలంలో రూ.4,475 కోట్ల నుంచి రూ.4,832 కోట్లకు వృద్ధి చెందింది. వడ్డీ ఆదాయం రూ.2,415 కోట్లకు మెరుగుపడింది.క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది రూ.2,139 కోట్లుగా ఉంది. స్థూల నిరర్థక రుణాలు (వసూలు కాని/ఎన్పీఏలు) మొత్తం రుణాల్లో 3.08 శాతంగా ఉన్నాయి. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇవి 2.76 శాతమే. నికర ఎన్పీఏలు గమనించినా.. 0.99 శాతం నుంచి 1.46 శాతానికి పెరిగాయి. నష్టాలు/మొండి బకాయిలకు కేటాయింపులు క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.944 కోట్లుగా ఉంటే, సమీక్షా కాలంలో రూ.1,245 కోట్లకు పెరిగిపోయాయి.ఇక 2024–25 పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఎస్బీఐ కార్డ్ రూ.1,916 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. 2023–24లో నమోదైన రూ.2,408 కోట్లతో పోల్చి చూస్తే 20 శాతం క్షీణించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ.17,484 కోట్ల నుంచి రూ.18,637 కోట్లకు వృద్ధి చెందింది. బ్యాలన్స్ షీట్ విలువ రూ.58,171 కోట్ల నుంచి రూ.65,546 కోట్లకు పెరిగింది. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ షేరు ధర ఒక శాతానికి పైగా లాభపడి రూ.927 వద్ద ముగిసింది. -
పహల్గామ్ బాధితులకు సులువుగా బీమా క్లయిమ్
పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు బీమా చెల్లింపులు సులభతరం చేసేందుకు దేశంలోని అతిపెద్ద జీవిత బీమా సంస్థల్లో ఒకటైన హెచ్డీఎఫ్సీ లైఫ్ ముందుకు వచ్చింది. ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన పాలసీదారుల కుటుంబ సభ్యులు / నామినీల క్లెయిమ్ సమర్పణ కోసం సరళీకృత ప్రక్రియను ప్రకటించింది.ఈ ఉగ్రదాడిలో చనిపోయినవారికి హెచ్డీఎఫ్సీ లైఫ్‌లో బీమా పాలసీ ఉన్నట్లయితే వారి నామినీ / చట్టపరమైన వారసులు డెత్ క్లెయిమ్ సమర్పించవచ్చు. ఇందుకోసం ఉగ్రవాద దాడి కారణంగా సంభవించిన పాలసీదారు మరణానికి రుజువును స్థానిక ప్రభుత్వం, పోలీసు, ఆసుపత్రి లేదా సంబంధిత అధికారుల నుండి సమర్పించాలి.డెత్ క్లెయిమ్ కోసం నామినీలు కాల్ సెంటర్ నంబర్ 022-68446530, service@hdfclife.com అనే ఈమెయిల్ ద్వారా హెచ్డీఎఫ్సీ లైఫ్‌ను సంప్రదించవచ్చు. లేదా ఏదైనా బ్రాంచ్ కార్యాలయాలను సందర్శించవచ్చు. బాధిత కుటుంబాలకు క్షేత్రస్థాయిలో సహాయ, సహకారాలు అందించడానికి అన్ని ప్రదేశాలలోనూ కంపెనీ స్థానిక బ్రాంచ్ సిబ్బంది అందుబాటులో ఉంటారని హెచ్డీఎఫ్సీ లైఫ్ తెలిపింది.ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని హెచ్డీఎఫ్సీ లైఫ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సమీర్ యోగీశ్వర్ తెలిపారు. బాధితులకు జరిగిన నష్టాన్ని ఏదీ భర్తీ చేయలేనప్పటికీ, ఈ సరళీకృత ప్రక్రియ ద్వారా క్లెయిమ్ సమర్పణకు ప్రయాసలను మాత్రం తగ్గించగలమని ఆయన పేర్కొన్నారు. -
హెచ్‌పీ నుంచి 9 కొత్త ఏఐ ల్యాప్‌టాప్‌లు
న్యూఢిల్లీ: కృత్రిమ మేథకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కంప్యూటర్స్ తయారీ దిగ్గజం హెచ్‌పీ తాజాగా తొమ్మిది ల్యాప్‌టాప్ మోడల్స్‌ను ఆవిష్కరించింది. వీటి ధర రూ. 78,999 (16 అంగుళాల హెచ్‌పీ ఆమ్నిబుక్5 నుంచి రూ. 1.86 లక్షల వరకు (హెచ్‌పీ ఆమ్నిబుక్ అల్ట్రా 14 అంగుళాలు) ఉంటుంది.మరోవైపు, భారత్‌లో తమ ఉత్పత్తుల తయారీని 2031 నాటికి రెట్టింపు చేసుకునే యోచనలో ఉన్నట్లు సంస్థ తెలిపింది. దీనితో భారత్‌లో విక్రయించే ప్రతి మూడు హెచ్‌పీ పీసీల్లో ఒకటి ఇక్కడ తయారు చేసినదే ఉంటుందని సంస్థ భారత విభాగం సీనియర్ డైరెక్టర్ వినీత్ గెహానీ తెలిపారు.2025లో భారత్‌లో తాము విక్రయించే మొత్తం పీసీల్లో 13 శాతం దేశీయంగా ఉత్పత్తి చేసినవే ఉంటాయని వివరించారు. 2024లో దేశీ పీసీ మార్కెట్లో 30.1 శాతం వాటాతో హెచ్‌పీ అగ్రస్థానంలో నిల్చింది. కంపెనీ తమ ల్యాప్‌టాప్‌ల కోసం ఎలక్ట్రానిక్స్ తయారీ సర్వీసుల కంపెనీలు డిక్సన్, వీవీడీఎన్తో జట్టు కట్టింది. -
ఈ ‘ప్రపంచ కుబేరుడు’ ఒకప్పుడు క్లీనర్.. అంతేనా.. ఎన్నో ట్విస్ట్‌లు!
ఎలాన్ మస్క్ జీవితం మూడు దేశాలతో ముడివడి ఉంది. దక్షిణాఫ్రికా–కెనడా–అమెరికా. ఈ మూడు దేశాల పౌరసత్వాలు అతడికి ఉన్నాయి. ఎలాన్ దక్షిణాఫ్రికాలో జన్మించారు. తండ్రిది దక్షిణాఫ్రికా, తల్లిది కెనడా. ఆమె మోడల్. ఆయన కెమికల్ ఇంజినీర్. ఎలాన్‌కు 8 ఏళ్ల వయసప్పుడే తల్లీ తండ్రి విడిపోయారు. అంతటి కుటుంబ కల్లోలంలోనూ తన జీవిత నావను జాగ్రత్తగా నడుపుకుంటూ వచ్చి.. నేడు అమెరికాను పాలిస్తున్న ఆ దేశ అధ్యక్షుడికే చేదోడు అయ్యేంతగా ఎదిగారు ఎలాన్. ఆయన జీవితంలోని ప్రతి దశా కీర్తి కిరీటాన్ని ధరించినదే.పన్నెండేళ్లకే తొలి బిజినెస్ ఎలాన్‌కి చిన్నప్పట్నుంచీ సైన్స్ ఫిక్షన్ అంటే ఇష్టం. 12 ఏళ్ల వయసులోనే ‘బ్లాస్టర్’ అనే వీడియో గేమ్‌ను సొంతంగా కనిపెట్టి, ఆ గేమ్ సాఫ్ట్‌వేర్‌ను ఒక పత్రికకు 500 డాలర్లకు అమ్మేశాడు. అదే అతడి మొదటి బిజినెస్. ప్రాణాంతక హైడ్రోజన్ బాంబులను మోసుకెళ్లే గ్రహాంతర రవాణా నౌకను అంతరిక్ష పైలట్ ధ్వంసం చేసే ఆట ‘బ్లాస్టర్’.ఫీజు కోసం క్లీనింగ్ పనికాలేజ్లో ఎలాన్ సబ్జెక్టులు ఫిజిక్స్, ఎకనామిక్స్. స్టాన్ఫోర్డ్, పెన్సిల్వేనియా యూనివర్సిటీల్లో చదివారు. కష్టపడి పని చేసి తన కాలేజ్ ఫీజు తనే కట్టుకున్నారు. ఎన్ని పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేసి ఫీజులు కట్టినా కాలేజ్ చదువు పూర్తయ్యే నాటికి లక్ష డాలర్లు అప్పు మిగిలే ఉంది. అది తీర్చటానికి గంటకు 18 డాలర్ల వేతనంతో కలపకోసే మిల్లులో క్లీనర్ పనితో సహా అనేక పనులు చేశారు ఎలాన్.ఒక కంపెనీతో ఆగిపోలేదు!ఎలాన్ 24 ఏళ్ల వయసులో తన తొలి కంపెనీ ‘జిప్2’ని ప్రారంభించారు. వార్తాపత్రికలకు ఆన్లైన్ సిటీ గైడ్ సాఫ్ట్‌వేర్‌ను సమకూరుస్తుంది జిప్2. తర్వాత నాలుగేళ్లకు 1999లో కంపాక్ కంపెనీ జిప్2ను 307 మిలియన్ డాలర్లకు కొనేసింది. ఎలాన్ తన ఇంకో కంపెనీ ఎక్స్.కామ్‌ను 2000లో కాన్ఫినిటీ అనే సాఫ్ట్వేర్ కంపెనీలో విలీనం చేశారు. తర్వాతి ఏడాదికే అది ‘పేపాల్’ అనే ఆన్లైన్ పేమెంట్ ప్లాట్‌ఫామ్‌గా అవతరించింది.పేపాల్‌ను 2002లో ఈబే 1.5 బిలియన్ డాలర్లకు కొనుక్కుంది. అదే ఏడాది ఎలాన్ వ్యోమనౌకల తయారీ సంస్థ ‘స్పేస్ ఎక్స్’ను స్థాపించారు. అంతరిక్ష రవాణా సేవల్ని కూడా ఆ కంపెనీ అందిస్తోంది. అంతరిక్షయాన వ్యయాన్ని తగ్గించటం, ఏదో ఒక నాటికి అంగారక గ్రహంపై భూగోళ వాసుల కాలనీని ఏర్పాటు చేయటం స్పేస్ఎక్స్ లక్ష్యం. ప్రఖ్యాతి గాంచిన టెస్లా, ఓపెన్ ఏఐ, ‘ది బోరింగ్ కంపెనీ’, ఎక్స్ కార్పొరేషన్, ‘థడ్’ (వ్యంగ్య వార్తల మీడియా కంపెనీ)లు కూడా ఒంటి చేత్తో ఎలాన్ నెలకొల్పినవే.ఐరన్ మ్యాన్ 2లో చిన్న పాత్రఎలాన్ దగ్గర ఇంత డబ్బుంది, అంత డబ్బుంది అని చెప్పడం కంటే తేలికైన మార్గం అతడిని ఒక్క మాటలో ‘ప్రపంచ కుబేరుడు’ అనేయటం! 2025 ఏప్రిల్ మొదటి వారం నాటికి అతడి గరిష్ఠ సంపద సుమారు 433 బిలియన్ డాలర్లు. ఇంకో 567 బిలియన్ డాలర్లను పోగేయగలిగితే ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్ అవుతారు ఎలాన్. డబ్బు, ధనం, సంపద.. ఇవన్నీ అలా ఉంచండి. అంతకంటే ఆసక్తికరమైన విషయాలు అతడి జీవితంలో ఉన్నాయి. 2008 నాటి ‘ఐరన్ మ్యాన్’ సినిమాలో ‘టోనీ స్టార్క్’ పాత్రకు ఎలాన్ మస్క్ ఇన్స్పిరేషన్! ఆ తర్వాత 2010లో వచ్చిన ‘ఐరన్ మ్యాన్ 2’ లో మస్క్ చిన్న పాత్ర వేశారు కూడా.తిట్లనూ తేలిగ్గా తీసుకుంటారు!ఎలాన్ దగ్గర ఎంత సంపద ఉందో అంత సెన్సాఫ్ హ్యూమర్ కూడా ఉంది. విమర్శల్ని చాలా తేలిగ్గా తీసుకుంటారు. తను అనుకుంటే ఏదైనా జరిగి తీరాల్సిందే అనే నైజం కూడా ఆయనలో ఉంది. ఇందుకు చిన్న ఉదాహరణ... కాలిఫోర్నియాలోని అలమీడా కౌంటీలో ఆయనకు ఒక ఫ్యాక్టరీ ఉంది. కరోనా లాక్డౌన్ వల్ల అది ఆగిపోయింది. ‘‘ఇంకెంత కాలం ఈ లాక్డౌన్’’ అని లాక్ డౌన్ పూర్తి కాకుండానే ఫ్యాక్టరీని తెరవబోయారు ఎలాన్.కౌంటీ అధికారులు ‘నో’ అన్నారు. మీరిలా అడ్డుకుంటే ఫ్యాక్టరీని కాలిఫోర్నియా నుంచి వేరే చోటికి మార్చేస్తా అని ఎలాన్ బెదిరించారు. కేసు కూడా వేస్తానన్నారు. ఆయన అలా బెదిరించడం కాలిఫోర్నియా అసెంబ్లీ సభ్యురాలు లోరేనా గాన్జెలజ్ కు కోపం తెప్పించింది. ‘‘చెత్త మొహం ఎలాన్ మస్క్. వెళ్లిపో’’ అని ట్వీట్ చేశారు. అందుకు మస్క్ కోపం తెచ్చుకోలేదు. ‘మెసేజ్ రిసీవ్డ్’ అని రిప్లయ్ ట్వీట్ ఇచ్చారు. కోపాలు వస్తుంటాయి. తగ్గడం తెలిస్తే నవ్వులూ పూస్తాయి. -సాక్షి, స్పెషల్ డెస్క్ -
రూ. 10,000 కోట్లు దాటేసిన డీఎస్ గ్రూప్
న్యూఢిల్లీ: దేశీ ఎఫ్ఎంసీజీ కంపెనీ ధరమ్‌పాల్ సత్యపాల్(డీఎస్) గ్రూప్ నాలుగేళ్లలో ఆదాయాన్ని రెట్టింపునకు పెంచుకోవాలని చూస్తోంది. ఇందుకు వీలుగా మొత్తం రూ. 3,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు కంపెనీ వైస్‌చైర్మన్ రాజీవ్ కుమార్ తెలియజేశారు. తద్వారా శత వసంతాలు పూర్తి చేసుకోనున్న 2029కల్లా రూ. 20,000 కోట్ల టర్నోవర్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.దీనిలో భాగంగా ఆతిథ్యం, ఆహారం, పానీయాల విభాగాలలో ఇతర సంస్థలను కొనుగోలుచేసే అవకాశాలను అన్వేషిస్తున్నట్లు పేర్కొన్నారు. తద్వారా కార్యకలాపాలను వేగంగా విస్తరించే వ్యూహాలపై దృష్టిపెట్టినట్లు వివరించారు. గతంలో నమిలే పొగాకు ఉత్పత్తులతో ప్రసిద్ధమైన కంపెనీ వీటిని టర్నోవర్‌లో 10 శాతానికంటే తక్కువకు పరిమితం చేసినట్లు తెలియజేశారు.మార్చితో ముగిసిన గతేడాది(2024–25) సాధించిన రూ. 10,000 కోట్ల ఆదాయంలో వీటి వాటా 10 శాతంకంటే తక్కువేనని, అయితే ఈ విభాగం నుంచి పూర్తిగా వైదొలగబోమని స్పష్టం చేశారు. ఆహారం, పానీయాల నుంచి 42 శాతం సమకూరినట్లు వెల్లడించారు. -
డిజిటల్ కామర్స్‌కు నియంత్రణ సంస్థ ఉండాలి
న్యూఢిల్లీ: పోటీ సంస్థలను దెబ్బతీసే విధమైన ధరలు నిర్ణయిస్తున్నాయని, భారీగా డిస్కౌంట్లు ఇస్తున్నాయని, గిగ్ వర్కర్ల శ్రమ దోపిడీ చేస్తున్నాయని ఈ–కామర్స్, క్విక్ కామర్స్ ప్లాట్‌ఫాంలపై ఆరోపణలున్న నేపథ్యంలో వాటిని పర్యవేక్షించేందుకు స్వతంత్ర డిజిటల్ కామర్స్ నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయాలని ట్రేడర్ల సమాఖ్య సీఏఐటీ కేంద్రాన్ని కోరింది.వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం కింద నేషనల్ ఈ–కామర్స్ పాలసీ, ఈ–కామర్స్ నిబంధనలను సత్వరం ప్రకటించాలని విజ్ఞప్తి చేసింది. ఆన్లైన్లో కొనుగోళ్లు చేయడం లగ్జరీగానే పరిగణించవచ్చు కాబట్టి ఈ–కామర్స్ ప్లాట్‌ఫాంల ద్వారా విక్రయించే ఉత్పత్తులపై ప్రస్తుత జీఎస్టీ నిబంధన ప్రకారం ’లగ్జరీ ట్యాక్స్’ విధించాలని సీఏఐటీ పేర్కొంది.లాభదాయకత లేకపోవడంతో గత రెండు, మూడేళ్లలో 10 లక్షల పైగా కిరాణా దుకాణాలు మూతబడ్డాయని ఆలిండియా కన్జూమర్ ప్రోడక్ట్స్ డిస్ట్రిబ్యూటర్ ఫెడరేషన్ (ఏఐసీపీడీఎఫ్) నేషనల్ ప్రెసిడెంట్ ధైర్యశీల్ పాటిల్ తెలిపారు. ఈ వ్యవధిలో కొత్తగా ప్రారంభమైన స్టోర్లతో పోలిస్తే మూతబడినవే ఎక్కువని వివరించారు. -
ప్రభుత్వ సంస్థగా ‘వొడా’?.. కేంద్రమంత్రి స్పష్టత
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ వొడాఫోన్ ఐడియా (వీఐఎల్)లో వాటాలను మరింతగా పెంచుకుని, దాన్ని ప్రభుత్వ రంగ సంస్థగా మార్చే యోచనేదీ ప్రభుత్వానికి లేదని కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేశారు. ప్రస్తుతమున్న 48.99 శాతం వాటాలకే ప్రభుత్వం పరిమితమవుతుందని తెలిపారు. కేంద్రం తన వంతు తోడ్పాటు అందించినందున ఇకపై పనితీరును మెరుగుపర్చుకోవాల్సిన బాధ్యత వొడాఫోన్ ఐడియాదేనని ఆయన తెలిపారు.వొడాఫోన్ ఐడియా బకాయిలకు బదులుగా ప్రభుత్వం వాటాలు తీసుకోవడం వల్ల స్వల్పకాలిక ఊరట లభించినప్పటికీ కంపెనీ నిలదొక్కుకోవాలంటే యూజర్ల బేస్ స్థిరంగా ఉండటం, టారిఫ్‌లను పెంచడం, దీర్ఘకాలిక రుణాల సమీకరణ మొదలైనవి కీలకాంశాలుగా ఉంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి గట్టెక్కినా, భవిష్యత్తులో బాకీల చెల్లింపుల విషయంలో కంపెనీ సవాళ్లు ఎదుర్కొనవచ్చని భావిస్తున్నారు.ఈ నేపథ్యంలో ప్రభుత్వం మళ్లీ రంగంలోకి దిగి మద్దతునిస్తుందా అనే సందేహాన్ని మంత్రి నివృత్తి చేశారు. మరోవైపు, బ్యాంక్ రుణాల చెల్లింపులో ఎంటీఎన్ఎల్ డిఫాల్ట్ కావడంపై స్పందిస్తూ కంపెనీకి గణనీయంగా స్థలాలు ఉన్నాయని, వాటిని నగదీకరణ చేయడం ద్వారా రుణాలను తీర్చేసే అవకాశం ఉందన్నారు. -
భారత్ వృద్ధికి క్రూడాయిల్ దన్ను
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధ భయాలు నెలకొన్నప్పటికీ తగ్గిన క్రూడాయిల్ రేట్లతో దేశీయంగా ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు నెమ్మదించడం, దేశీయంగా వినియోగం పెరగడం లాంటి దేశ వృద్ధికి సానుకూలంగా దోహదపడనున్నాయి. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు 6.5 శాతంగా ఉండొచ్చని కన్సల్టెన్సీ సంస్థ ఈవై ఒక నివేదికలో పేర్కొంది. ఎగుమతుల క్షీణత, గ్లోబల్ మందగమనం, ముడిచమురు ధరల తగ్గుదల, అంతర్జాతీయంగా ఉత్పత్తి సామర్థ్యాలు పెరిగిపోవడం వంటి అంశాలు భారత వృద్ధిపై ప్రభావం చూపనున్నాయని వివరించింది. సముచిత ఆర్థిక, ద్రవ్య విధానాలతో రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 4 శాతం లోపునకు కట్టడి చేస్తూ, 2026 ఆర్థిక సంవత్సరంలోను, అలాగే మధ్యకాలికంగాను భారత్ 6.5 శాతం వృద్ధి రేటు నమోదు చేయొచ్చని ఈవై ఇండియా చీఫ్ పాలసీ అడ్వైజర్ డీకే శ్రీవాస్తవ చెప్పారు. ‘అంతర్జాతీయంగా క్రూడాయిల్ రేట్లు బ్యారెల్‌కు 60–65 డాలర్ల శ్రేణిలో ఉండొచ్చని, ఇది భారత్‌కు సానుకూలంగా పరిణమించగలదని అంచనా వేస్తున్నాం‘ అని వివరించారు. వివిధ అంతర్జాతీయ సంస్థలు అంచనా వేసిన 6.2–6.7 శాతం వృద్ధి రేటు శ్రేణిలోనే ఈవై అంచనాలు ఉండటం గమనార్హం. టారిఫ్‌ల యుద్ధం, అమెరికా వాణిజ్య విధానంపై అనిశ్చితి నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్ వృద్ధిరేటు 6.2 శాతం ఉంటుందని ఐఎంఎఫ్, 6.3 శాతం ఉంటుందని వరల్డ్ బ్యాంక్ పేర్కొన్నాయి. ఇక ఆర్బీఐ, ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ 6.5 శాతంగా ఉంటుందని, ఓఈసీడీ, ఫిచ్ రేటింగ్స్ 6.4 శాతానికి పరిమితమవుతుందని అంచనా వేశాయి. నివేదికలో మరిన్ని విశేషాలు.. → అధిక టారిఫ్‌లు, అంతర్జాతీయంగా బలహీన డిమాండ్ కారణంగా ఎగుమతులు నెమ్మదించవచ్చు. అయితే, స్థూల దేశీయోత్పత్తిపై ప్రభావం ఒక మోస్తరుగానే ఉండొచ్చు. → గ్లోబల్ మందగమనంతో ప్రపంచవ్యాప్తంగా వృద్ధి నెమ్మదించినా, పటిష్టమైన ఆర్థిక, ద్రవ్య విధానాల వల్ల భారత్ కాస్త మెరుగైన స్థితిలో ఉండొచ్చు. → ప్రధాన ఎగుమతి దేశాల్లో ఉత్పత్తి సామర్థ్యాలు పెరగడం వల్ల డంపింగ్ రిస్కులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి భారత్ యాంటీ–డంపింగ్ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. → గ్లోబల్ అవాంతరాలపై భారత్ వ్యూహాత్మకంగా స్పందించాల్సి ఉంటుంది. వృద్ధికి ఊతమిచ్చే ఆర్థిక విధానాలు, ఉదార ద్రవ్య విధానాల ద్వారా భారత్ ఈ పరిస్థితుల నుంచి పటిష్టంగా బైటపడొచ్చు. → స్వల్పకాలికంగా అమెరికా నుంచి కొంత క్రూడాయిల్ దిగుమతులను పెంచుకోవడం ద్వారా ఆ దేశంతో వాణిజ్య లోటును భర్తీ చేసుకోవడంతో పాటు ప్రతీకార టారిఫ్ రేట్లను కూడా తగ్గిస్తే భారత్‌కు శ్రేయస్కరంగా ఉంటుంది. → 2025 సెపె్టంబర్–అక్టోబర్ నాటికి సమగ్ర ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదిరితే అమెరికాతో వాణిజ్యంలో కాస్త స్థిరత్వం వస్తుంది. → స్వల్పకాలికం నుంచి దీర్ఘకాలిక దృష్టికోణంలో చూస్తే భూ, కార్మిక చట్టాల్లో సంస్కరణలు వేగవంతం చేయాలి. విద్య, ఏఐ.. జెన్‌ఏఐలాంటి కొత్త నైపుణ్యాల్లో శిక్షణపై మరింతగా ఇన్వెస్ట్ చేయాలి. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల స్కీము పరిధిని విస్తరించాలి. -
ప్రత్యక్ష పన్నులపై రిఫండ్ ఎఫెక్ట్
న్యూఢిల్లీ: భారీ స్థాయిలో రిఫండ్లు జారీ చేయడంతో గత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు నిర్దేశించుకున్న లక్ష్యం స్థాయిలో వసూలు కాలేదు. 2024–25లో నికరంగా రూ. 22.37 లక్షల కోట్లు టార్గెట్‌గా పెట్టుకోగా నికరంగా రూ. 22.26 లక్షల కోట్లు వసూలయ్యాయి. ఇది అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 13.57 శాతం అధికమే అయినప్పటికీ నిర్దేశిత లక్ష్యానికి మాత్రం చేరలేదు. గతేడాది జూలై నాటి బడ్జెట్లో రూ. 22,07,000 కోట్ల ప్రత్యక్ష పన్నుల వసూళ్లు నిర్దేశించుకోగా, దాన్ని ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ. 22,37,000 కోట్లకు సవరించారు. సాధారణంగా కార్పొరేట్ ట్యాక్సులు, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (ఎస్టీటీ), నాన్–కార్పొరేట్ ట్యాక్సులు (గతంలో వ్యక్తిగత ఆదాయ పన్ను) మొదలైనవి ప్రత్యక్ష పన్నుల పరిధిలోకి వస్తాయి. వ్యక్తులు, సంస్థలు, హిందూ అవిభక్త కుటుంబాలు (హెచ్‌యూఎఫ్‌లు) మొదలైన వర్గాలు కట్టే పన్నులు నాన్–కార్పొరేట్ ట్యాక్సుల పరిధిలోకి వస్తాయి. స్థూల వసూళ్లు 16 శాతం అప్.. అధికారిక డేటా ప్రకారం మార్చి 31తో ముగిసిన 2024–25 ఆర్థిక సంవత్సరంలో స్థూల ప్రత్యక్ష పన్నుల వసూళ్లు (రిఫండ్లకు ముందు) 15.59 శాతం పెరిగి రూ. 27.02 లక్షల కోట్లకు చేరాయి. అంతక్రితం 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఇవి రూ. 23.37 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఇక, రిఫండ్ల జారీ తర్వాత నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్ల ప్రొవిజనల్ గణాంకాలు రూ. 22.26 లక్షల కోట్లుగా నమోదైయ్యాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో నమోదైన రూ. 19.60 లక్షల కోట్లతో పోలిస్తే 13.57 శాతం పెరిగాయి. – ఇవన్నీ ప్రొవిజనల్ గణాంకాలు మాత్రమే. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తుది దశ రీకన్సిలియేషన్, సర్దుబాట్లు జరుగుతున్నందున నికర వసూళ్లు మరికాస్త పెరగొచ్చని అధికారులు తెలిపారు. మరిన్ని వివరాలు.. → ఎస్టీటీ నుంచి రెవెన్యూ రూ.34,192 కోట్ల నుంచి రూ. 53,296 కోట్లకు పెరిగింది. → ప్రొవిజనల్ నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు, జులై బడ్జెట్ లక్ష్యంతో పోలిస్తే (రూ. 22.07 లక్షల కోట్లు) 100.78 శాతం పెరగ్గా, ఫిబ్రవరిలో సవరించిన అంచనాలతో పోలిస్తే (రూ. 22.37 లక్షల కోట్లు) 99.51 శాతం పెరిగాయి. → 2024–25లో ట్యాక్స్ డిపార్ట్మెంట్ అత్యధిక స్థాయిలో రూ. 4,76,743 కోట్లు రిఫండ్ జారీ చేసింది. 2023–24లో నమోదైన రూ. 3,78,255 కోట్లతో పోలిస్తే ఇది 26.04 శాతం అధికం. → రికార్డు స్థాయిలో రూ. 4.76 లక్షల కోట్లు రిఫండ్లు జారీ చేసినప్పటికీ స్థూల ప్రత్యక్ష పన్నుల వసూళ్లు బడ్జెట్లో నిర్దేశించుకున్న రూ. 22.37 లక్షల కోట్ల స్థాయిని మించి నమోదైనట్లు అధికారులు తెలిపారు. సిసలైన క్లెయిమ్‌లను పారదర్శమైన, సముచితమైన విధంగా తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటామని ట్యాక్స్‌పేయర్లకు ఇచ్చిన హామీకి డిపార్టుమెంట్ కట్టుబడి ఉండటం ఇందుకు కారణమని వివరించారు. → సమీక్షాకాలంలో నికర కార్పొరేట్ ట్యాక్సుల వసూళ్లు (ప్రొవిజనల్) 8.30 శాతం పెరిగి రూ. 9,86,719 కోట్లకు చేరాయి. స్థూల కార్పొరేట్ వసూళ్లు 12.41 శాతం వృద్ధితో రూ. 12,72,516 కోట్లుగా నమోదయ్యాయి. -
ఒకేచోట 15 లక్షల కార్లు: ఇండియాలో సౌత్ కొరియా బ్రాండ్ హవా
సౌత్ కొరియన్ కార్ బ్రాండ్ అయిన 'కియా మోటార్స్'.. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలోని తన తయారీ కేంద్రం నుంచి 15 లక్షల వాహనాలను ఉత్పత్తి చేసి అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది.కియా ఇండియా 2019 ఆగస్టు నుంచి దేశీయ మార్కెట్లో అధిక ప్రజాదరణ పొందుతూ.. ఎప్పటికప్పుడు కొత్త కార్లను లాంచ్ చేస్తూ ఉంది. అతి తక్కువ కాలంలో ఈ ఉత్పత్తి మైలురాయిని చేరుకున్న కార్ల తయారీదారుగా కియా సరికొత్త చరిత్ర సృష్టించింది. అనంతపురం ప్లాంట్ కియా కార్యకలాపాలకు మూలస్తంభంగా ఉంది.కియా ఇండియా అనంతపురం ప్లాంట్‌లో సెల్టోస్, సోనెట్, కారెన్స్, కార్నివాల్, సైరోస్ వంటి కార్లను ఉత్పత్తి చేస్తోంది. కంపెనీ ఈ కార్లను భారతదేశంలో విక్రయించడం మాత్రమే కాకుండా.. ఇక్కడ నుంచి విదేశీ మార్కెట్లకు కూడా ఎగుమతి చేస్తుంది.ఇదీ చదవండి: 2025 హంటర్ 350 బైక్ ఇదే.. ధర ఎంతంటే?ఉత్పత్తి గణాంకాల విషయానికొస్తే.. సెల్టోస్ 7,00,668 యూనిట్ల ఉత్పత్తితో (46.7%) ముందంజలో ఉంది. తరువాత సోనెట్ 5,19,064 యూనిట్లతో (34.6%) రెండవ స్థానంలో ఉంది. కారెన్స్ 2,41,582 యూనిట్లు (16.1%), సైరోస్ & కార్నివాల్ వంటి ఇటీవలి మోడళ్లు వరుసగా 23,036 యూనిట్లు (1.5%) మరియు 16,172 యూనిట్లు (1.1%)గా ఉన్నాయి. -
వేర్‌హౌస్ లావాదేవీల్లో.. అప్ అండ్ డౌన్
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ పారిశ్రామిక గిడ్డంగుల(వేర్‌హౌస్) విపణిలో భిన్న వాతావరణం ఏర్పడింది. ఈ ఏడాది తొలి త్రైమాసికం(క్యూ1)లో నగరంలో 3 లక్షలు చ.అ. లావాదేవీలు జరిగాయి. గతేడాది ఇదే కాలంలో జరిగిన 2 లక్షల లావాదేవీలతో పోలిస్తే ఇది 50 శాతం అధికం. ఇక, 2025 క్యూ1లో నగరంలో కొత్తగా 2 లక్షల చ.అ. గిడ్డంగుల స్థలం సరఫరా అయ్యింది. గతేడాది ఇదే కాలంలో సరఫరా అయిన 6 లక్షల చ.అ.లతో పోలిస్తే ఇది 67 శాతం తక్కువ.ఈ ఏడాది క్యూ1లో దేశంలోని 8 ప్రధాన నగరాల్లో 90 లక్షల చ.అ. పారిశ్రామిక గిడ్డంగుల స్థల లావాదేవీలు జరిగాయి. గతేడాది ఇదే కాలంలో జరిగిన 78 లక్షల చ.అ. లావాదేవీలతో పోలిస్తే ఇది 15 శాతం అధికం. ఎక్కువగా ఇంజినీరింగ్ కంపెనీలు 25 శాతం, ఈ–కామర్స్ సంస్థలు 21 శాతం స్పేస్‌ను లీజుకు తీసుకున్నాయని కొలియర్స్ ఇండియా నివేదిక వెల్లడించింది. అలాగే ఈ క్యూ1లో కొత్తగా 94 లక్షల చ.అ. స్పేస్ సరఫరా అయింది. గతేడాది క్యూ1తో పోలిస్తే ఇది 16 శాతం ఎక్కువ. -
2025 హంటర్ 350 బైక్ ఇదే: ధర ఎంతంటే?
రాయల్ ఎన్ఫీల్డ్ ఎట్టకేలకు దాని అత్యంత సరసమైన మోటార్‌సైకిల్.. హంటర్ 350ను కొత్త హంగులతో 2025 వెర్షన్‌గా మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ బైక్ ధర రూ. 1.50 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది దాని స్టాండర్డ్ మోడల్ కంటే ఎక్కువ అప్గ్రేడ్లను పొందుతుంది.2025 హంటర్ 350 బైకులో అతిపెద్ద మార్పు సస్పెన్షన్ అప్‌గ్రేడ్. వెనుక భాగంలో మెరుగైన కంప్రెషన్ & రీబౌండ్ అనుభవాలను అందించే ప్రోగ్రెసివ్ స్ప్రింగ్‌లు లభిస్తాయి. అంతే కాకుండా ఇందులో స్లిప్ అండ్ క్లచ్ అసిస్ట్ క్లచ్ కూడా ఉంది. కొత్త హ్యాండిల్‌బార్, ఫాస్ట్ USB ఛార్జింగ్, కొత్త సీటు, కొత్త ఎగ్జాస్ట్ రూటింగ్ మాత్రమే కాకుండా పెరిగిన గ్రౌండ్ క్లియరెన్స్ వంటివి ఇక్కడ చూడవచ్చు.ఇదీ చదవండి: ధర ఎక్కువైనా అస్సలు తగ్గని జనం: ఒకేరోజు 52 కార్ల డెలివరీపర్ఫామెన్స్ పరంగా, ఇంజిన్‌లో ఎటువంటి మార్పులు లేవు. ఈ బైక్ మూడు కొత్త రంగులలో లభిస్తుంది. ఎంట్రీ-లెవల్ మోడల్ ధర రూ. 1.50 లక్షలు, మిడ్ వేరియంట్ ధర రూ. 1.77 లక్షలు, టాప్ ఎండ్ ధర రూ. 1.82 లక్షలు (అన్ని ధరలు, ఎక్స్ షోరూమ్). -
ఇళ్ల కొనుగోలు నిర్ణయం.. యువతే కీలకం
సాక్షి, సిటీబ్యూరో: కరోనాతో స్థిరాస్తి రంగానికి జరిగిన ప్రధాన మేలు.. సొంతింటి అవసరం తెలిసిరావటమే. మరీ ముఖ్యంగా గృహ విభాగంలో యువతరం భాగస్వామ్యం పెరగడం. ఇళ్ల కొనుగోలు నిర్ణయంలో వీరు కీలకంగా మారారు. 74 శాతం సంపన్న కొనుగోలుదారులు ద్రవ్యోల్భణాన్ని నిరోధించేందుకు రియల్ ఎస్టేట్ ఒక ప్రధాన ఆస్తిగా పరిగణిస్తారు. విశాలవంతమైన గృహాలు, గ్రీనరీ ఎక్కువగా ఉండే ప్రాపర్టీలకే లగ్జరీ కొనుగోలుదారులు మొగ్గు చూపిస్తున్నారు.సంపన్న భారతీయుల ప్రాపర్టీ ఎంపికలో తొలి ప్రాధాన్యం మెరుగైన ఫిజికల్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదుపాయాలకే. సంపన్న కొనుగోలుదారులు ప్రాపర్టీ కొనుగోళ్లకు ప్రధాన కారణం మెరుగైన జీవన శైలి. మూలధన వృద్ధి, భవిష్యత్తు తరాలకు ఆస్తి వంటివి ఆ తర్వాతి అంశాలు.ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై, గోవా, బెంగళూరు నగరాలలో గృహాల కొనుగోళ్లకు హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్(హెచ్ఎన్ఐ), అల్ట్రా హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్(యూహెచ్‌ఎన్‌ఐ)లు ఆసక్తిగా ఉన్నారు. 11 శాతం మంది సంపన్నులు విదేశాలలో ప్రాపర్టీలకు మొగ్గు చూపుతున్నారు. విలాసవంతమైన భారతీయులు న్యూయార్క్, మయామి, లండన్, దుబాయ్, లిస్బన్ దేశాలలో లగ్జరీ అపార్ట్మెంట్ల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. -
మామకు తగ్గ కోడళ్లు.. బిజినెస్‌లో చక్రం తిప్పుతున్నారు
భారతదేశంలో అత్యంత సంపన్నులైన ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీల గురించి.. వారి పిల్లల గురించి దాదాపు అందరికీ తెలుసు. అయితే వారి కోడళ్ళు కూడా వ్యాపార సామ్రాజ్యంలో తమదైన గుర్తింపు తెచుకున్నవారే.. అని బహుశా కొంతమందికి మాత్రమే తెలుసుంటుంది. ఈ కథనంలో రిలయన్స్ గ్రూప్, అదానీ గ్రూప్ అధినేతల కోడళ్ల గురించి వివరంగా తెలుసుకుందాం.శ్లోకా మెహతాముఖేష్ & నీతా అంబానీల పెద్ద కోడలు, ఆకాశ్ అంబానీ భార్య శ్లోకా మెహతా ప్రఖ్యాత వజ్రాల వ్యాపారి రస్సెల్ మెహతా కుమార్తె. 2014 నుంచి తన కుటుంబ వ్యాపారమైన రోజీ బ్లూ డైమండ్స్ కంపెనీలో కీలక బాధ్యతలు చేపట్టారు. శ్లోకా రోజీ బ్లూ ఫౌండేషన్ డైరెక్టర్ కూడా. ఈమె నికర విలువ రూ.130 కోట్ల కంటే ఎక్కువే అని తెలుస్తోంది.రాధిక మర్చంట్ముఖేష్, నీతా అంబానీల చిన్న కోడలు, అనంత్ అంబానీ భార్య 'రాధిక మర్చంట్' ఎన్కోర్ హెల్త్‌కేర్‌లో డొమెస్టిక్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. అంతే కాకుండా ఈమె ఎన్కోర్ హెల్త్‌కేర్‌కు సీఈఓ & వైస్-చైర్మన్ కూడా. ఈమె నికర విలువ రూ. 10 కోట్ల కంటే ఎక్కువ.ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీ సమయంలో కాలేయ వ్యాధి: ఇప్పుడు ఓ కంపెనీ అధినేత్రి..పరిధి ష్రాఫ్గౌతమ్ అదానీ కోడలు, కరణ్ అదానీ భార్య 'పరిధి ష్రాఫ్'.. వృత్తిరీత్యా న్యాయవాది. ఈమె న్యాయ దిగ్గజం సిరిల్ ష్రాఫ్ కుమార్తె. పరిధి ష్రాఫ్ భారతదేశంలోని అత్యంత చురుకైన చట్టపరమైన మనస్తత్వం కలిగిన వారిలో ఒకరు. సిరిల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్‌లో భాగస్వామిగా ఉన్న ఈమె ఎస్సార్-రోస్నెఫ్ట్ వంటి బిలియన్ డాలర్ల ఒప్పందాలపై పనిచేశారు.దివా జైమిన్ షాఈ ఏడాది ఫిబ్రవరిలో గౌతమ్ అదానీ చిన్న కొడుకును వివాహం చేసుకున్న 'దివా జైమిన్ షా'.. ఫైనాన్స్ అండ్ మేనేజ్మెంట్లో డిగ్రీ పూర్తి చేసింది. ఈమె చార్టర్డ్ ఫైనాన్స్ అనలిస్ట్.. గతంలో డెలాయిట్ ఇండియాలో ఫైనాన్షియల్ కన్సల్టెంట్‌గా పనిచేశారని సమాచారం. ఈమె వజ్రాల వ్యాపారి జైమిన్ షా కుమార్తె మరియు ప్రముఖ వజ్రాల తయారీ సంస్థ సి. దినేష్ అండ్ కో. ప్రైవేట్ లిమిటెడ్ సహ యజమాని. -
ఫారిన్ ఫ్లో: స్థిరాస్తి రంగంలో విదేశీ పెట్టుబడుల వెల్లువ..
ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొంటే.. మన దేశం మాత్రం వేగవంతమైన ఆర్థిక అభివృద్ధి సాధిస్తోంది. దేశీయ స్థిరాస్తి రంగంలో విదేశీ పెట్టుబడులు గణనీయంగా పెరుగుతున్నాయి. దేశాభివృద్ధిపై దేశీయ పెట్టుబడిదారులకు విశ్వాసం ఉన్నప్పటికీ.. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో విదేశీ పెట్టుబడిదారుల భాగస్వామ్యం పెరిగింది. దేశంలో బలమైన ఆర్థిక వృద్ధి, వేగవంతమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రోత్సాహకర ప్రభుత్వ విధానాలు, సులభతర పెట్టుబడి విధానం వంటి రకరకాల కారణాలతో విదేశీ పెట్టుబడిదారుల వాటా గతేడాది తొలి త్రైమాసికం(క్యూ1)లో 2 శాతం నుంచి ఈ ఏడాది క్యూ1 నాటికి ఏకంగా 43 శాతానికి పెరిగిందని వెస్టియన్ నివేదిక వెల్లడించింది. - సాక్షి, సిటీబ్యూరోవిదేశీ పెట్టుబడుల వెల్లువ..దేశంలోకి 2024 క్యూ1లో 552.1 మిలియన్ డాలర్ల సంస్థాగత పెట్టుబడులు వచ్చాయి. ఇందులో విదేశీ పెట్టుబడులు కేవలం 4 శాతమే. అంటే 11 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. అదే 2025 క్యూ1 నాటికి మొత్తం 813.3 మిలియన్ డాలర్ల పెట్టుబడులు రాగా.. ఇందులో విదేశీ పెట్టుబడుల వాటా ఏకంగా 43 శాతం. 346.9 మిలియన్ డాలర్ల ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. నివాసంలోకే అత్యధికం.. నివాస విభాగంలో పెట్టుబడులకే విదేశీయులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. గృహ రంగంలోకి 506 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. మొత్తం ఇన్వెస్ట్‌మెంట్స్‌లో రెసిడెన్షియల్ సెక్టార్ వాటా 62 శాతం. గతేడాది క్యూ1తో పోలిస్తే ఇది 41 శాతం అధికం. విలువల పరంగా చూస్తే.. పెట్టుబడులు వార్షికంగా 125 శాతం వృద్ధి నమోదు చేశాయి. ఆ తర్వాత వాణిజ్య విభాగంలోకి 307.2 మిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి.ఇదీ చదవండి: పెరిగిన అద్దెలు.. హైదరాబాద్‌లో అక్కడే ఫుల్ డిమాండ్!ఈ త్రైమాసికంలో వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో ఈ విభాగం వాటా 38 శాతం. అయితే ఈ క్యూ1లో పారిశ్రామిక, గిడ్డంగుల విభాగంలోకి ఎలాంటి పెట్టుబడులు రాలేదు. అయితే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ–కామర్స్ రంగం, లాజిస్టిక్ ఖర్చుల తగ్గింపు నేపథ్యంలో భవిష్యత్తులో ఈ విభాగంలోకి పెట్టుబడులు వచ్చే అవకాశాలు అపారంగా ఉన్నాయి. -
పెరిగిన అద్దెలు.. హైదరాబాద్‌లో అక్కడే ఫుల్ డిమాండ్!
సాక్షి, సిటీబ్యూరో: కొనేటప్పుడు తక్కువ ధరకు కావాలి.. అమ్మేటప్పుడు ఎక్కువ ధర రావాలని కోరుకునేది స్థిరాస్తి రంగంలోనే.. ఇది అద్దె విభాగానికీ వర్తిస్తుంది. గత కొన్నేళ్లుగా దేశంలోని ప్రధాన నగరాలలో అద్దె గృహాల మార్కెట్ క్రమంగా పెరుగుతోంది. ప్రధానంగా మెరుగైన ప్రయాణ సాధనాలు, పని కేంద్రాలకు చేరువలో ఉన్న అద్దె ఇళ్లకు డిమాండ్ ఉంది.ప్రాపర్టీల విలువ పెరగడంతో గృహ యజమానులు అద్దెల కంటే లాభదాయకమైన ఆస్తుల విక్రయాల కోసం అన్వేషిస్తుండంతో సప్లయ్ తగ్గింది. దీంతో అద్దె గృహాలకు డిమాండ్‌తో పాటు రెంట్లు కూడా పెరిగాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది తొలి త్రైమాసికంలో హైదరాబాద్‌లో అద్దె గృహాలకు డిమాండ్ 22 శాతం మేర పెరిగింది. సరఫరా 2.1 శాతం క్షీణించగా.. సగటు రెంట్లు 4.5 శాతం మేర పెరిగాయి. అద్దెల మార్కెట్లో డిమాండ్ 50, సప్లయి వాటా 39 శాతంగా ఉన్నాయి.పశ్చిమంలో డిమాండ్ ఎక్కువ.. గచ్చిబౌలి, మాదాపూర్ వంటి పశ్చిమ హైదరాబాద్ ప్రాంతాల్లోని అద్దె గృహాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. కార్యాలయాలు, ఉపాధి కేంద్రాలకు సమీపంలో ఉండటం, ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)తో మెరుగైన కనెక్టివిటీనే ప్రధాన కారణం. రూ.25 వేలు నుంచి రూ.35 వేలు నెలవారీ అద్దెలకు కోసం ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. 1,000 చ.అ. నుంచి 1,500 చ.అ. విస్తీర్ణంలో ఉన్న గృహాలకు డిమాండ్ అధికంగా ఉంది.ఇదీ చదవండి: ధర ఎక్కువైనా అస్సలు తగ్గని జనం: ఒకేరోజు 52 కార్ల డెలివరీ -
అనంత్ అంబానీకి కొత్త బాధ్యతలు: మే 1 నుంచి ఐదేళ్లు..
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) శుక్రవారం తన కంపెనీకి ఫుల్ టైమ్ డైరెక్టర్‌గా చైర్మన్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు 'అనంత్ అంబానీ'ని నియమిస్తున్నట్లు ప్రకటించింది. మానవ వనరులు, నామినేషన్, వేతన కమిటీ సిఫార్సు ఆధారంగా బోర్డు ఈ నియామకానికి ఆమోదం తెలిపింది.అనంత్ అంబానీ.. వాటాదారుల ఆమోదానికి లోబడి 2025 మే 1 నుంచి ఐదు సంవత్సరాల పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ హోల్ టైమ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తారని కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది.రిలయన్స్ బోర్డులో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేసిన అనంత్ అంబానీ.. ఇప్పుడు భారతదేశంలోని అత్యంత విలువైన కంపెనీలో డైరెక్టర్‌గా ఉండనున్నారు. ఇప్పటికే అనంత్ పలు రిలయన్స్ గ్రూప్ కంపెనీలలో కీలక బాధ్యతలు చేపట్టారు. నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు అనంత్ వేతనం.. ఏడాదికి రూ.4.2 కోట్లు. అయితే ఇప్పుడు ఫుల్ టైమ్ డైరెక్టర్‌గా నియామకమవ్వడంతో ఆయన వేతనం అంతే ఉంటుందా? పెరుగుతుందా అనే విషయం తెలియాల్సి ఉంది.అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పొందిన అనంత్ అంబానీ, జంతు సంక్షేమం పట్ల కూడా చాలా మక్కువ కలిగి ఉన్నారు. ప్రమాదంలో ఉన్న జంతువులకు పునరావాసం కల్పించడం.. వాటి చివరి సంవత్సరాల్లో సంరక్షణ అందించడంపై దృష్టి సారించిన అనేక కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీ సమయంలో కాలేయ వ్యాధి: ఇప్పుడు ఓ కంపెనీ అధినేత్రి..ఆకాష్ అంబానీ గ్రూప్ టెలికాం అండ్ డిజిటల్ సేవల విభాగం అయిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఛైర్మన్‌గా కూడా ఉన్నారు. ఇషా అంబానీ రిటైల్ విభాగం అయిన రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. అంతే కాకుండా ఆకాశ్, ఇషా అంబానీలు కూడా RIL బోర్డులో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా కూడా పనిచేస్తున్నారు. -
వాట్సప్ యూజర్లే లక్ష్యంగా కొత్త మోసం!
దేశంలోని వాట్సప్ వినియోగదారులపై ‘ఫ్యాట్ బాయ్ పానెల్’ అనే కొత్త మాల్వేర్ దాడి చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది 2.5 కోట్లకు పైగా ఆండ్రాయిడ్ పరికరాలను ప్రమాదంలోకి నెడుతోందని చెబుతున్నారు. వాట్సప్‌లో షేర్ అయ్యే ఫేక్ బ్యాంకింగ్ యాప్స్ ద్వారా యూజర్ల బ్యాంక్ అకౌంట్ల నుంచి నేరుగా డబ్బులు దొంగిలించేందుకు ఈ మాల్వేర్ను రూపొందించినట్లు తెలిపారు. దీన్ని గతంలో కంటే అధునాతన సైబర్ మోసంగా నిపుణులు చెబుతున్నారు. ఇది భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థలను పోలి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.మోసం చేశారిలా..తాజాగా వెలుగులోకి వచ్చిన వివరాలను పరిశీలిస్తే, ధారశివ్ అనే ప్రాంతానికి చెందిన 44 ఏళ్ల డెయిరీ వ్యాపారికి బ్యాంకు అధికారిగా నటిస్తూ ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. వెంటనే బ్యాంక్ యాప్‌ను అప్డేట్ చేయకపోతే ఆ వ్యక్తి అకౌంట్ బ్లాక్ అవుతుందని పేర్కొన్నాడు. భయాందోళనకు గురైన ఆ వ్యక్తి వాట్సప్ ద్వారా పంపిన బ్యాంకింగ్ యాప్ లింక్‌ను ఇన్స్టాల్ చేయడానికి అనుమతించాడు. దీన్ని ఇన్స్టాల్ చేసిన కొద్ది నిమిషాల్లోనే 26 అనధికారిక లావాదేవీల నుంచి అకౌంట్ బ్యాలెన్స్ దొంగలించారు. అయితే మోసగాళ్లు వాట్సప్‌లో పంపుతున్న లింక్‌లో ఫ్యాట్ బాయ్ పానెల్ ఉందని నిపుణులు చెబుతున్నారు.ఫ్యాట్ బాయ్ పానెల్ అంటే ఏమిటి?సైబర్ సెక్యూరిటీ సంస్థ జింపిరియం తెలిపిన వివరాల ప్రకారం ఫ్యాట్ బాయ్ ప్యానెల్ అనేది మొబైల్ ఫస్ట్ బ్యాంకింగ్ ట్రోజన్‌గా పని చేస్తుంది. ఇది దాదాపు 900 నకిలీ యాప్‌లలో దాగి ఉందని కనుగొన్నారు. ఎక్కువగా ఏపీకే ఫైల్స్ ద్వారానే ఇది వ్యాపిస్తుంది. గూగుల్ అధికారిక ప్లే స్టోర్‌లో కాకుండా నేరుగా ప్రత్యేక ఫైల్ ద్వారానే దీన్ని ఇన్స్టాల్ చేయిస్తారు. దీన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత మాల్వేర్ గూగుల్ ప్లే ప్రొటెక్ట్‌ను నిలిపివేస్తుంది. ఎస్ఎంఎస్లను సొంతంగా చదవడానికి అనుమతిని పొందుతుంది. ఓటీపీలను (వన్-టైమ్ పాస్ వర్ట్‌లు) అడ్డుకుంటుంది. దాంతో యూజర్ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బును ఇతర ఖాతాల్లోకి బదిలీ చేయడానికి వీలవుతుంది.ఎందుకు అంత ప్రమాదకరం?తక్కువ స్థాయిలో పనిచేసే పాత మాల్వేర్ మాదిరిగా కాకుండా ఫ్యాట్ బాయ్ ప్యానెల్ చాలా సమన్వయంతో ఉంటుంది.. ఇది సెంట్రల్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా పని చేస్తుంది. ఈ మాల్వేర్ బహుళ వెర్షన్లను ఏక కాలంలో నిర్వహిస్తుంది. దీన్ని కట్టడి చేయడం కష్టతరం. ఇది ఇప్పటికే 25 మిలియన్లకు పైగా పరికరాల నుంచి డేటాను సేకరించిందని జింపిరియం చీఫ్ సైంటిస్ట్ తెలిపారు. ఇది నిరంతరం అభివృద్ధి చెందుతోందని చెప్పారు. సాంప్రదాయ భద్రతా సాధనాలతో దీన్ని గుర్తించడం కష్టమని తెలిపారు.ఇదీ చదవండి: రిటైర్ అవుతున్నారా? రూ.5 కోట్లు సరిపోవు!ఎలా రక్షించుకోవాలి?యాప్‌లను ప్లేస్టోర్ నుంచి కాకుండా ఇతర మార్గాల ద్వారా డౌన్లోడ్ చేయవద్దు.అధికారిక గూగుల్ ప్లే స్టోర్ నుంచి మాత్రమే యాప్‌లను డౌన్ లోడ్ చేసుకోవాలి.ఆటోమేటిక్ స్కానింగ్ కోసం గూగుల్ ప్లే ప్రొటెక్ట్ ఎనేబుల్ చేసుకోవాలి.రియల్ టైమ్ ప్రొటెక్షన్‌తో కూడిన లైసెన్స్ వర్షన్ మొబైల్ సెక్యూరిటీ యాప్‌ను ఉపయోగించాలి.ముఖ్యంగా వాట్సప్‌లో తెలియని లింక్‌ను క్లిక్ చేయకూడదు.అప్లికేషన్ పర్మిషన్లను జాగ్రత్తగా సమీక్షించాలి.పూర్తిగా అవసరమైతే తప్ప ఎస్ఎంఎస్ లేదా కాల్ యాక్సెస్ ఓకే చేయవద్దు. -
ఆ బ్యాంకు భళా.. ఈ బ్యాంకు డీలా..
ప్రైవేటు రంగ డీసీబీ బ్యాంక్ మార్చితో అంతమైన త్రైమాసికంలో మెరుగైన పనితీరు చూపించింది. లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 14 శాతం పెరిగి రూ.177 కోట్లకు చేరుకుంది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.156 కోట్లుగానే ఉండడం గమనార్హం. మొత్తం ఆదాయం రూ.1,581 కోట్ల నుంచి రూ.1,961 కోట్లకు వృద్ధి చెందింది. బ్యాంక్ స్థూల నిరర్థక రుణ ఆస్తులు (ఎన్పీఏలు) 2.99 శాతంగా నమోదయ్యాయి.క్రితం ఏడాది ఇదే త్రైమాసికం చివరికి ఇవి 3.23 శాతంగా ఉన్నాయి. నికర ఎన్పీఏలు పెద్దగా మార్పు లేకుండా 1.12 శాతానికి పరిమితమయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇవి 1.11 శాతంగా ఉన్నాయి. వాటాదారుల వద్దనున్న ప్రతి షేరుకు రూ.1.35 చొప్పున డివిడెండ్ ఇవ్వాలని కంపెనీ బోర్డు నిర్ణయించింది. ఇందుకు కంపెనీ వార్షిక సమావేశంలో (ఏజీఎం) వాటాదారులు ఆమోదం తెలపాల్సి ఉంటుంది.ఆర్బీఎల్ బ్యాంక్ లాభాలకు కోత ప్రైవేటు రంగ ఆర్బీఎల్ బ్యాంక్ కన్సాలిడేటెడ్ లాభం గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో (2024–25 క్యూ4) గణనీయంగా (76 శాతం) తగ్గిపోయింది. రూ.89 కోట్ల లాభం నమోదైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో లాభం రూ.364 కోట్లుగా ఉండగా, 2024 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.47 కోట్లుగా ఉండడం గమనార్హం. నికర వడ్డీ ఆదాయం 2 శాతం తగ్గి రూ.1,563 కోట్లుగా నమోదైంది. రుణాల్లో 7 శాతం వృద్ధి కనిపించింది. ముఖ్యంగా ప్రొవిజన్లు, కంటింజెన్సీలకు (మొండి బకాయిలు, ఇతర అవసరాలకు) కేటాయింపులు రూ.785 కోట్లకు పెరిగిపోవడం లాభాలకు కోత పెట్టింది.క్రితం ఏడాది ఇదే క్వార్టర్లో ఇవి రూ.414 కోట్లుగానే ఉన్నాయి. నికర వడ్డీ మార్జిన్ 5.45 శాతం నుంచి 4.89 శాతానికి తగ్గింది. బ్యాంకు రుణ ఆస్తుల నాణ్యతను గమనిస్తే.. స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్పీఏలు) 2.6 శాతంగా నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇవి 2.65 శాతంగా ఉన్నాయి. నికర ఎన్పీఏలు సైతం 0.74 శాతం నుంచి 0.29 శాతానికి తగ్గాయి. ఇక 2024–25 ఆర్థిక సంవత్సరానికి రూ.695 కోట్ల లాభం నమోదైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.1,168 కోట్లుగా ఉంది. ప్రతీ షేరుకు రూ.1 చొప్పున డివిడెండ్ పంపిణీకి బోర్డు సిఫారసు చేసింది. -
ఈవీ విడిభాగాల తయారీలోకి హిందాల్కో.. పుణెలో ప్లాంటు
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) విడిభాగాల తయారీ విభాగంలోకి ప్రవేశించినట్లు హిందాల్కో వెల్లడించింది. ఇందుకు సంబంధించి పుణెలోని చకాన్‌లో రూ. 500 కోట్లతో తేలికపాటి బ్యాటరీ సొల్యూషన్స్ ఉత్పత్తి కోసం తయారీ ప్లాంటును ప్రారంభించింది. ఎంఅండ్ఎం సంస్థకు 10,000 అల్యూమినియం బ్యాటరీ ఎన్క్లోజర్లను కూడా అందించినట్లు కంపెనీ సందర్భంగా తెలిపింది.మహీంద్రాతో కలిసి అభివృద్ధి చేసిన ఈ బ్యాటరీ ఎన్‌క్లోజర్, సాధారణ ఉక్కు డిజైన్లతో పోలిస్తే 40 శాతం తక్కువ బరువు ఉంటుంది. వాహన రేంజి సుమారు 8–10 శాతం మెరుగుపడుతుంది. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకుని దేశీయంగానే అత్యంత నాణ్యమైన అల్యూమినియం ఉత్పత్తులను తయారు చేసుకునేందుకు చకాన్ ప్లాంటు తోడ్పడగలదని హిందాల్కో ఇండస్ట్రీస్ ఎండీ సతీష్ పాయ్ తెలిపారు. -
రిటైర్ అవుతున్నారా? రూ.5 కోట్లు సరిపోవు!
ఆరుపదుల వయసులో రిటైర్ అవ్వాలంటే భారత్‌లాంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో ఎంత కార్పస్ కావాలో తెలుసా? పెరుగుతున్న ద్రవ్యోల్బణం, రూపాయి విలువ తగ్గడం, ఖర్చులు పెరగడం.. వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ సార్థక్ అహుజా ఇటీవల లింక్డ్ఇన్ పోస్ట్‌లో అందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. రిటైర్మెంట్ ప్లాన్‌కు సరిపడా డబ్బుకు సంబంధించి ఆన్లైన్లో అందుబాటులో ఉండే అంచనాలు చాలా తక్కువగా ఉన్నాయని తెలిపారు.‘ఈ రోజు ఇండియాలో రిటైర్ కావడానికి ఎంత డబ్బు అవసరమో తెలిస్తే షాక్ అవుతారు. దేశంలో చాలా రిటైర్మెంట్ పోర్ట్‌ఫోలియోలు ఈక్విటీలు, ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలోనే ఉంటున్నాయి. కొందరు దీన్ని తొందరగా క్యాష్ చేసుకునేందుకు వీలుగా ఈక్విటీ, డెట్ ఫండ్స్‌ల్లోకి మళ్లిస్తున్నారు. ఈక్విటీ నుంచి 12–14 శాతం, డెట్ నుంచి 5–7 శాతం కలిపి ఏడాదికి 10% మిశ్రమ రాబడిని అంచనా వేస్తున్నారు. క్రమంగా పన్నులు, ద్రవ్యోల్బణం పెరుగుతున్నాయి. రిటైర్మెంట్ సమయంలో పెట్టుబడి ఆదాయంపై 20 శాతం పన్ను విధించడం, ద్రవ్యోల్బణం ఏటా మరో 6 శాతం ఉంటుండడంతో వాస్తవ రాబడులు గణనీయంగా తగ్గిపోతున్నాయి. రిటైర్మెంట్ ఫండ్‌పై కేవలం 2% నికర రియల్ రిటర్న్ మాత్రమే వస్తుంది’ అని చెప్పారు.ఇదీ చదవండి: ధోనీ కంపెనీలో 200 మందికి లేఆఫ్స్‘భారత్‌లో పదవీ విరమణ పొందిన తర్వాత సౌకర్యవంతమైన జీవనశైలి కోసం ప్రస్తుతానికి నెలకు కనీసం రూ.1.5 లక్షలు అవసరమవుతాయి. ఏటా మీకు రూ.20 లక్షలు అవసరం. 2% రియల్ రిటర్న్స్ అంటే.. మీ రిటైర్మెంట్ కార్పస్ కనీసం రూ.10 కోట్లు ఉండాలి. మీరు లగ్జరీగా జీవించాలంటే ఇది ఏమాత్రం సరిపోదు. హాయిగా బతకాలనుకుంటే ఇంకా ఎక్కువ లక్ష్యం పెట్టుకోవాలి. మీ రిటైర్మెంట్ ఫండ్ వార్షిక ఖర్చుకు 50 రెట్లు ఉండాలి. అంటే మీ కుటుంబం ఏటా రూ.10 లక్షలు ఖర్చు చేయాలంటే రూ.5 కోట్లు కావాలి. ఏడాదికి రూ.20 లక్షలు అంటే రూ.10 కోట్లు అవసరం’ అని తెలిపారు. -
గ్రీన్ ఆఫీసులకు ఆదరణ
కరోనా తర్వాత స్థిరాస్తి కొనుగోలుదారులలో మార్పులు వచ్చాయి. తినే తిండితో పాటు ఉండే ఇల్లు కూడా హైజీన్‌గా ఉండాలని భావిస్తున్నారు. దీంతో పర్యావరణహితమైన భవన నిర్మాణాలకు ఆదరణ పెరిగింది. ఈ గ్రీనరీ కేవలం ఇళ్లకే కాదు పనిచేసే ఆఫీసులూ హరితంగానే ఉండాలని భావిస్తున్నారు. దీంతో ఉద్యోగస్తుల అభిరుచులకు తగ్గట్టుగానే యాజమాన్యాలు కూడా గ్రీన్ స్పేస్ ఆఫీసులకే ప్రాధాన్యత ఇస్తున్నాయని క్రెడాయ్– కొలియర్స్ నివేదిక వెల్లడించింది. - సాక్షి, సిటీబ్యూరోకరోనా తర్వాతి నుంచి బహుళ జాతి సంస్థలు ఇంధన సామర్థ్యం, కార్బన్ ఉద్గారాల తగ్గుదలతో పాటు ఉద్యోగుల శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. దీంతో హరిత కార్యాలయాలకు ఆదరణ పెరుగుతుంది. 2010లో దేశంలోని ఆఫీసు స్పేస్ స్టాక్‌లో గ్రీన్ ఆఫీసు స్పేస్ వాటా 52 శాతంగా ఉండగా.. గత ఐదేళ్లలో ఏకంగా 80 శాతానికి పైగా చేరడమే ఇందుకు ఉదాహరణ. హరిత భవనాల అత్యధికంగా ఐటీ, బీఎఫ్ఎస్ఐ, హెల్త్‌కేర్ అండ్ ఫార్మా, ఇంజినీరింగ్ అండ్ మాన్యుఫాక్చరింగ్ సంస్థలు లీజుకు తీసుకుంటున్నాయి.హరిత భవనాలు 1,300 కోట్ల చ.అ.. డెవలపర్లు, పెట్టుబడిదారులు, కొనుగోలుదారులు గ్రీన్ సర్టిఫికెట్, ఇంధన సమర్థవంతమైన నిర్మాణాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. స్థిరమైన భవన పద్ధతులు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, సరళమైన నిబంధనలు గ్రీన్ బిల్డింగ్‌ల నిర్మాణానికి ప్రధాన కారణం. దీంతో గృహాలు, ఆఫీసులు, వాణిజ్య సముదాయాలు, గిడ్డంగులు, డేటా సెంటర్లు కూడా కార్బన్ ఉద్గారాల తగ్గించే భవన నిర్మాణానికే బిల్డర్లు మొగ్గు చూపిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో హరిత భవనాలు 1,300 కోట్ల చ.అ.కు చేరాయని ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్(ఐజీబీసీ) తెలిపింది. గతేడాది ముగింపు నాటికి దేశంలో 21 లక్షలకు పైగా గృహాలు, 6,500 వాణిజ్య సముదాయాలు, 750 పారిశ్రామిక ప్రాజెక్ట్‌లు గ్రీన్ సర్టిఫికెట్‌ను పొందాయి.అద్దెలు ప్రీమియమే.. గ్రీన్ సర్టిఫికెట్ పొందిన ఆఫీసు భవనాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. వీటిల్లో ఆక్యుపెన్సీ లెవల్ 80–90 శాతం వరకు ఉంది. సాధారణ భవనాలలో పోలిస్తే గ్రీన్ ఆఫీసుల అద్దె 25 శాతం అధికంగా ఉంటుంది. దేశంలోని గ్రీన్ సర్టిఫైడ్ ఆఫీసు స్పేస్ స్టాక్‌లో 31 శాతం వాటాతో బెంగళూరు తొలి స్థానంలో నిలవగా.. ఢిల్లీ–ఎన్సీఆర్ 19 శాతం, హైదరాబాద్ 17 శాతంతో ఆ తర్వాతి స్థానాలలో నిలిచాయి. 2024 చివరి నాటికి 50.3 కోట్ల చ.అ. గ్రేడ్–ఏ ఆఫీసు స్పేస్ స్టాక్ ఉంది. వచ్చే 2–3 ఏళ్లలో 70 కోట్ల చ.అ.లకు చేరుతుందని అంచనా.పాత భవనాలు గ్రీనరీగా.. దేశంలో పదేళ్లకు పైగా మించిన 35.5 నుంచి 38.5 కోట్ల చ.అ.లలో పాత భవనాలు ఉన్నాయి. వీటిని గ్రీన్ ఆఫీసులుగా పునరుద్ధరించడానికి 425 బిలియన్లకు పైగా పెట్టుబడులు అవసరం. అలాగే పదేళ్లలోపు 8 నుంచి 11 కోట్ల చ.అ. పాత భవనాలు ఉన్నాయి. వీటి పునరుద్ధరణకు 22–32 బిలియన్లు అవసరం.మార్కెట్లోకి ఆఫీసు స్పేస్ సరఫరా.. వచ్చే మూడేళ్లలో ఆరు ప్రధాన నగరాల్లో 17–20 కోట్ల చ.అ. ఆఫీసు స్పేస్ అందుబాటులోకి వస్తుందని అంచనా. అత్యధికంగా ఐటీ హబ్‌లైన బెంగళూరు, హైదరాబాద్‌లో సరఫరా రానుంది.ప్రయోజనాలివీ..» ఏటా 6,430 యూనిట్ల విద్యుత్ ఆదా » సంవత్సరానికి 19,800 కోట్ల లీటర్ల నీరు ఆదా » వార్షికంగా 5.14 కోట్ల టన్నుల సీఓ–2 ఉద్గారాల తగ్గుదల » ఏటా 25 లక్షల టన్నుల నిర్మాణ వ్యర్థాల పునర్వినియోగం » ఇంట్లోకి ధారాళమైన గాలి, వెలుతురు » తక్కువ యూటిలిటీ బిల్లులు -
ధోనీ కంపెనీలో 200 మందికి లేఆఫ్స్
పాత కార్ల కొనుగోలు, అమ్మకానికి వేదికగా ఉన్న ‘కార్స్ 24’ సంస్థ ఇటీవల 200 మంది ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించింది. కంపెనీ కార్యకలాపాలను పునర్నిర్మించడానికి ఉద్దేశించిన చర్యల్లో భాగంగా ఈ తొలగింపులు జరిగాయని సంస్థ సహ వ్యవస్థాపకులు, సీఈఓ విక్రమ్ చోప్రా ఉద్యోగులకు అంతర్గత నోట్లో స్పష్టం చేశారు. ఈ తొలగింపులు నిరంతర లేఆఫ్స్ ప్రక్రియకు ప్రారంభం కాదని, కంపెనీ దీర్ఘకాలిక లక్ష్యాలకు అవసరమైన చర్యగా ఆయన ఉద్యోగులకు హామీ ఇచ్చారు. కార్స్24 సంస్థలో ప్రముఖ క్రికెటర్ ఎంఎస్ ధోనీకి వాటాలుండడం గమనార్హం.కఠినంగా నియామకాలుకార్స్24 మరింత కఠినమైన విధానాన్ని అనుసరిస్తూ నియామకాల ప్రక్రియ చేపడుతుందని చోప్రా నొక్కి చెప్పారు. ప్రస్తుత లేఆఫ్స్ కంపెనీ వ్యూహాత్మక లక్ష్యాలకు అనుగుణంగా ఉద్యోగులను సర్దుబాటు చేసేందుకు తోడ్పడుతాయని తెలిపారు. కార్స్ 24 కొత్త వ్యాపార విభాగాలకు విస్తరిస్తున్న సమయంలో ఈ తొలగింపులు జరిగాయి. కంపెనీ తన ప్లాట్‌ఫామ్ సామర్థ్యాలను పెంచడానికి, ఆటోమోటివ్ కమ్యూనిటీని బలోపేతం చేయడానికి దేశపు అతిపెద్ద ఆటోమోటివ్ ఫోరమ్ ‘టీమ్-బీహెచ్పీ’ని ఇటీవల కొనుగోలు చేసింది. అదనంగా, కార్స్ 24 వాహన మరమ్మతులు, ఫైనాన్సింగ్, బీమాతో సహా కొత్త కార్ల అమ్మకాలు, అనుబంధ సేవల కోసం ఆన్లైన్ సర్వీసులను ప్రారంభించింది.ఇదీ చదవండి: లేటరల్ ఎంట్రీ నియామకాలకు నోటిఫికేషన్ఆర్థిక పనితీరు, వ్యూహాత్మక సర్దుబాట్లుకార్స్ 24 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.498 కోట్ల నికర నష్టాన్ని నివేదించింది. ఇది వ్యూహాత్మక సర్దుబాట్ల అవసరాన్ని ఎత్తిచూపింది. యూనిట్ల అమ్మకాలు, సగటు అమ్మకపు ధరల పెరుగుదలతో కంపెనీ నిర్వహణ ఆదాయం 25 శాతం పెరిగి రూ.6,917 కోట్లకు చేరుకుంది. దాంతో కంపెనీ వ్యయాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తుంది. -
మారుతీ సుజుకీ వెనకడుగు..
న్యూఢిల్లీ: కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. నవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం స్వల్ప వెనకడుగుతో రూ. 3,911 కోట్లకు పరిమితమైంది. అధిక వ్యయాలు ప్రభావం చూపాయి. అంతక్రితం ఏడాది (2023–24) ఇదే కాలంలో రూ. 3,952 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 38,471 కోట్ల నుంచి రూ. 40,920 కోట్లకు బలపడింది.మొత్తం వ్యయాలు 8%పైగా పెరిగి రూ. 37,585 కోట్లను తాకాయి. కంపెనీ బోర్డు వాటాదారులకు షేరుకి రూ. 135 డివిడెండ్ ప్రకటించింది. ఈ కాలంలో 3% అధికంగా 6,04,635 యూనిట్ల అమ్మకాలు సాధించింది. ఒక క్వార్టర్‌కు ఇది కంపెనీ చరిత్రలోనే అత్యధికం. దేశీ విక్రయాలు 3% వృద్ధితో 5,19,546 యూనిట్లకు చేరాయి. ఎగుమతులు 8% ఎగసి 85,089గా నమోదయ్యాయి.పూర్తి ఏడాదికి...మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి మారుతీ కన్సాలిడేటెడ్ నికర లాభం 7.5 శాతం పుంజుకుని రూ. 14,500 కోట్లయ్యింది. 2023–24లో రూ. 13,488 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 1,41,858 కోట్ల నుంచి రూ. 1,52,913 కోట్లకు ఎగసింది. ఈ కాలంలో మొత్తం 22,34,266 వాహనాలను విక్రయించింది. వెరసి గతేడాది కంపెనీ చరిత్రలోనే అత్యధిక విక్రయాలు, ఎగుమతులను నమోదు చేసింది. దేశీయంగా మందగమనం ఉన్నప్పటికీ పటిష్ట ఫలితాలు సాధించినట్లు కంపెనీ చైర్మన్ ఆర్సీ భార్గవ పేర్కొన్నారు. -
భారత ప్రత్యక్ష పన్ను వసూళ్లు ఎంతంటే..
ప్రత్యక్ష పన్ను వసూళ్లలో భారతదేశం 2024-25 ఆర్థిక సంవత్సరానికి గణనీయమైన వృద్ధిని సాధించింది. స్థూల వసూళ్లు 15.59% పెరిగి రూ.27.02 లక్షల కోట్లకు చేరుకున్నాయి. అధిక కార్పొరేట్, నాన్-కార్పొరేట్ పన్ను ఆదాయాలు, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్ (ఎస్టీటీ) రాబడుల్లో పెరుగుదల నమోదైంది. ఈ పెరుగుదల దేశం బలమైన ఆర్థిక కార్యకలాపాలు, మెరుగైన పన్ను విధానాన్ని ప్రతిబింబిస్తుంది.కార్పొరేట్ ట్యాక్స్ రాబడులు: కార్పొరేట్ పన్ను వసూళ్లు 2024-25లో రూ.12.72 లక్షల కోట్లకు చేరాయి. అంతకుముందకు ఏడాది ఇది రూ.11.31 లక్షల కోట్లుగా ఉంది.నాన్ కార్పొరేట్ ట్యాక్స్ రెవెన్యూ: నాన్ కార్పొరేట్ ట్యాక్స్ వసూళ్లు 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.11.68 లక్షల కోట్ల నుంచి 2024-25లో రూ.13.73 లక్షల కోట్లకు పెరిగాయి.సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (ఎస్టీటీ): క్యాపిటల్ మార్కెట్లలో కార్యకలాపాలు పెరగడంతో ఎస్టీటీ రాబడులు రూ.34,192 కోట్ల నుంచి రూ.53,296 కోట్లకు పెరిగాయి.నికర పన్ను వసూళ్లు, రీఫండ్లురిఫండ్లను పరిగణనలోకి తీసుకుంటే నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.22.26 లక్షల కోట్లలో 26.04 శాతం పెరిగి రూ.4.76 లక్షల కోట్లకు చేరాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.19.60 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 13.57% పెరుగుదలను సూచిస్తుంది. ఇది ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ చట్టబద్ధమైన రీఫండ్ క్లెయిమ్‌లకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేస్తుంది.ఇదీ చదవండి: ఏడాదిలో రూ.21.16 లక్షల కోట్లు గీకారు!వృద్ధికి సంకేతంప్రత్యక్ష పన్ను వసూళ్లు పెరగడం భారత ఆర్థిక వృద్ధికి సానుకూల సంకేతం. ప్రభుత్వ ఆదాయాన్ని బలోపేతం చేయడం, రుణాలపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ఇది తోడ్పడుతుంది. అధిక పన్ను ఆదాయాలు మౌలిక సదుపాయాలు, సాంఘిక సంక్షేమం, ఇతర కీలక రంగాలపై ప్రభుత్వ వ్యయాన్ని పెంచడానికి వీలు కల్పిస్తాయి. -
బంగారం తగ్గింది కానీ...
దేశంలో తారాస్థాయికి చేరిన బంగారం ధరలు (Gold Prices) దిగివస్తున్నాయి. వరుసగా నాలుగో రోజూ తగ్గుముఖం పట్టాయి. నేడు (ఏప్రిల్ 26) కూడా పసిడి ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. మూడు రోజుల క్రితం పుత్తడి ధర 10 గ్రాములకు ఏకంగా రూ.3000 మేర క్షీణించి రూ.లక్ష దిగువకు వచ్చేసిన సంగతి తెలిసిందే. ఈరోజు బంగారం చాలా స్వల్పంగా తగ్గినప్పటికీ, మళ్లీ పెరగనందుకు సంతోషం అని కొనుగోలుదారులు భావిస్తున్నారు.అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు, డాలర్‌తో రూపాయి మారకం రేటు, స్థానిక డిమాండ్ వంటి అంశాలు ఈ ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ఏప్రిల్ 26 నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్, 22 క్యారెట్ బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి..తెలుగు రాష్ట్రాల్లో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,210- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,020హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, స్థానిక జ్యువెలరీ షాపుల్లో మేకింగ్ ఛార్జీలు,జీఎస్టీ కారణంగా కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.30, రూ.30 చొప్పున తగ్గాయి.👉ఇదీ చదవండి: చూశారా.. ‘బంగారమే డబ్బు’!చెన్నైలో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,210- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,020చెన్నైలో బంగారం ధరలు ఇతర నగరాలతో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ పోర్ట్ సౌకర్యాలు, డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.30, రూ.30 చొప్పున తగ్గాయి.ఢిల్లీలో.. - 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,310- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,170ఢిల్లీలో బంగారం ధరలు రవాణా ఖర్చులు, స్థానిక ట్యాక్స్‌ల కారణంగా కొంత ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ నగరంలో బంగారం కొనుగోలుదారులు హాల్‌మార్క్ ఆభరణాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.30, రూ.30 చొప్పున తగ్గాయి.ముంబైలో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,210- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,020ముంబైలో బంగారం ధరలు స్థానిక డిమాండ్, జ్యువెలరీ డిజైన్లపై ఆధారపడి మారుతూ ఉంటాయి. ఈ నగరంలో బంగారం కొనుగోలు చేసే ముందు పలు జ్యువెలరీ షాపుల ధరలను సరిపోల్చడం మంచిది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.30, రూ.30 చొప్పున తగ్గాయి.బెంగళూరులో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,210- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,020బెంగళూరులో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి, కానీ స్థానిక ఆర్థిక పరిస్థితులు, ఫెస్టివల్ సీజన్ డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేయవచ్చు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.30, రూ.30 చొప్పున తగ్గాయి.👉ఇది చదివారా? బంగారం.. ఈ దేశాల్లో చవకే..!!బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు భారత రూపాయి విలువ, దిగుమతి సుంకాలు, స్థానిక ట్యాక్స్‌లు, రవాణా ఖర్చులు ధరలలో వ్యత్యాసాలకు కారణమవుతున్నాయి. అదనంగా, భారతదేశంలో వివాహ సీజన్, పండుగల సమయంలో బంగారం డిమాండ్ పెరగడం వల్ల ధరలు కొంత పెరిగే అవకాశం ఉంది. బంగారం కొనుగోలు చేసే ముందు, హాల్‌మార్క్ సర్టిఫికేషన్‌ను తప్పనిసరిగా తనిఖీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) హాల్‌మార్క్ బంగారం స్వచ్ఛతను నిర్ధారిస్తుంది. అలాగే, వివిధ జ్యువెలరీ షాపుల్లో ధరలు, మేకింగ్ ఛార్జీలను సరిపోల్చడం ద్వారా మంచి డీల్ పొందవచ్చు.👉ఇది చదివారా? ఆ బంగారం మర్చిపోండి.. ఈ లోహమే ‘భవిష్యత్ బంగారం’వెండి ధరలుదేశవ్యాప్తంగా వెండి ధరలు నేడు మార్పు లేకుండా నిలకడగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీ రూ.1,10,900 వద్ద ఉండగా ఢిల్లీలో రూ. 1,00,900 వద్ద కొనసాగుతోంది.(గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
ఏడాదిలో రూ.21.16 లక్షల కోట్లు గీకారు!
క్రెడిట్ కార్డు వ్యయం 2025 ఆర్థిక సంవత్సరంలో అనూహ్యంగా పెరిగి రికార్డు స్థాయిలో రూ.21.16 లక్షల కోట్లకు చేరుకుంది. వినియోగదారుల డిమాండ్, డిజిటల్ లావాదేవీలకు పెరుగుతున్న ప్రాధాన్యత కారణంగా గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 15% పెరుగుదలను నమోదు చేసింది. రుణ ఆధారిత వినియోగం అధికం అవుతుండడానికిగల కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు.పట్టణ, డిజిటల్ పరిజ్ఞానం ఉన్న వినియోగదారులు విచక్షణా వ్యయం కోసం క్రెడిట్ కార్డులను వాడుతున్నారు. ముఖ్యంగా ఈ-కామర్స్, ట్రావెల్, డైనింగ్ వంటి రంగాల్లో దీన్ని అధికంగా ఉపయోగిస్తున్నారు.ఆన్లైన్ చెల్లింపులపై ఆసక్తి చూపడం క్రెడిట్ కార్డు వినియోగానికి ఆజ్యం పోసింది. మూడింట రెండొంతుల లావాదేవీలు డిజిటల్ రూపంలో జరుగుతున్నాయి.వ్యయాల పెరుగుదల ఆర్థిక వ్యవస్థపై స్థిరమైన విశ్వాసాన్ని సూచిస్తుంది.ఇదీ చదవండి: లేటరల్ ఎంట్రీ నియామకాలకు నోటిఫికేషన్2025 మార్చి నాటికి చలామణిలో ఉన్న క్రెడిట్ కార్డుల సంఖ్య 10.98 కోట్లకు చేరింది. ఇది ఏడాది క్రితం 10.18 కోట్లుగా ఉండేది. కొత్త కార్డుల జారీ బ్యాంకుల వారీగా భిన్నంగా ఉంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ కార్డ్స్ వంటి ప్రముఖ సంస్థలు గణనీయమైన పెరుగుదలను నమోదు చేయగా, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్ వంటి ఇతర సంస్థలు రెగ్యులేటరీ సవాళ్లు, భాగస్వామ్యాల్లో మార్పుల కారణంగా కార్డుల జారీలో క్షీణతను ఎదుర్కొన్నాయి. అన్ సెక్యూర్డ్ రుణాలకు సంబంధించిన రిస్క్‌లను తగ్గించడానికి బ్యాంకులు క్రెడిట్ క్వాలిటీకి ప్రాధాన్యత ఇస్తున్నాయి. బ్యాంకులు ఇప్పటికే ఉన్న వినియోగదారులకు ఆర్థిక ఉత్పత్తులను క్రాస్-సెల్లింగ్ చేయడంపై దృష్టి పెడుతున్నాయి. -
బాలికల ప్రత్యేక స్కీమ్.. వడ్డీ రేటు మారిందా?
సుకన్య సమృద్ధి యోజన (SSY) దేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన చిన్న పొదుపు పథకాలలో ఒకటి. ఆడపిల్లల చదువు, వివాహం కోసం పొదుపు చేసే తల్లిదండ్రులకు ఈ పథకం అధిక వడ్డీ ఇస్తుంది. వచ్చే రాబడులపై కూడా పన్ను ఉండదు. బేటీ బచావో, బేటీ పడావో కార్యక్రమం కింద భారత ప్రభుత్వం ఈ పథకానికి సార్వభౌమ గ్యారంటీని అందిస్తోంది.సుకన్య సమృద్ధి యోజన వడ్డీ తగ్గిస్తున్నారా?సుకన్య సమృద్ధి యోజన సహా చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను ప్రభుత్వం ప్రతి త్రైమాసికానికి సమీక్షిస్తుంది. ఈ నేపథ్యంలో 2025 ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేటు మారిందా అన్న సందేహం చాలా మందిలో ఉంది. కానీ సుకన్య సమృద్ధి యోజనపై వడ్డీ రేటును ప్రభుత్వం మార్చలేదు. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఈ పథకం కింద డిపాజిట్లపై సంవత్సరానికి 8.2 శాతం లభిస్తుంది. పోస్టాఫీసు పొదుపు పథకాలలో ఇదే అత్యధికం. ఈ పథకానికే కాదు ప్రస్తుత త్రైమాసికంలో ఏ చిన్న పొదుపు పథకానికి ప్రభుత్వం వడ్డీ రేటును మార్చకపోవడం గమనార్హం.గరిష్ట, కనిష్ట డిపాజిట్లు..సుకన్య సమృద్ధి యోజన కింద, డిపాజిట్లు నిర్దిష్ట నిబంధనలకు లోబడి ఉంటాయి. కనీసం రూ.250 ప్రారంభ డిపాజిట్‌తో ఈ ఖాతాను తెరవవచ్చు. కాబట్టి ఇది ఎక్కువ కుటుంబాలకు అందుబాటులో ఉంటుంది. ఖాతా యాక్టివ్‌గా ఉండాలంటే ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ .250 అయినా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ స్కీమ్‌లో ఒక ఆర్థిక సంవత్సానికి గరిష్టంగా రూ .1.5 లక్షలు డిపాజిట్ చేయొచ్చు. డిపాజిటర్లు తమ సౌలభ్యాన్ని బట్టి ఏకమొత్తంలో లేదా నెలవారీ వాయిదాల ద్వారా పొదుపు జమ చేసుకోవచ్చు.విత్‌డ్రా ఎప్పుడు?సుకన్య సమృద్ధి ఖాతా తెరిచిన 21 సంవత్సరాల తరువాత మెచ్యూరిటీ అవుతుంది. ఈ సమయంలో ఖాతాను క్లోజ్ చేసి, వడ్డీతో సహా పూర్తి బ్యాలెన్స్ పొందవచ్చు. ప్రత్యామ్నాయంగా, అమ్మాయి వివాహం తర్వాత లేదా ఆమెకు 18 ఏళ్లు వచ్చాక ఖాతాను మూసివేయవచ్చు. మెచ్యూరిటీ తర్వాతే నిధులు తీసుకునేందుకు వీలున్నప్పటికీ బాలిక చదువు కోసం అంతకుముందే పాక్షిక ఉపసంహరణకు అవకాశం ఉంది.బాలికకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత లేదా పదో తరగతి పూర్తయిన తర్వాత ఏది ముందయితే అది కొంత మేర నిధులు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఉపసంహరణ మొత్తం గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి అందుబాటులో ఉన్న బ్యాలెన్స్‌లో 50% వరకు ఉంటుంది. దీన్ని వన్ టైమ్ ఏకమొత్తంగా లేదా ఐదేళ్లకు మించకుండా సంవత్సరానికి ఒకటి చొప్పున వాయిదాల్లో పొందవచ్చు. -
లేటరల్ ఎంట్రీ నియామకాలకు నోటిఫికేషన్
దేశంలో అతిపెద్ద సాఫ్ట్వేర్ సర్వీసుల ఎగుమతిదారుగా ఉన్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఉద్యోగార్థులకు శుభవార్త చెప్పింది. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్ట్‌లతోపాటు, కొత్త ప్రాజెక్టుల్లో పని చేసేందుకు నియామక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఏప్రిల్ 26, శనివారం బెంగళూరులో లేటరల్ నియామకాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు పేర్కొంది.మై ఎస్‌క్యూఎల్ డీబీఏ, అజూర్ ఎస్ఎంఈ, ఐబీఎం డీబీ2, ఏడబ్ల్యూఎస్ ఎస్ఎంఈ, ఒరాకిల్ డీబీఏ, డీబీ2 డిజైనర్ విభాగాల్లో నైపుణ్యాలున్న వారి కోసం టీసీఎస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కనీసం 15 ఏళ్ల ఫుల్ టైమ్ ఉద్యోగం చేసిన నిపుణుల కోసం కంపెనీ ఈమేరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. విద్య, ఉద్యోగాల మధ్య రెండేళ్లకు మించి గ్యాప్ ఉండకూడదనే షరతు ఉంది.ఇప్పటికే మార్చి 22న ఐదు నగరాల్లోని టెక్ నిపుణుల కోసం వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించిన టీసీఎస్ తిరిగి నెల తర్వాత మళ్లీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. గతంలో జరిగిన నియామకంలో ఆటోమేషన్ టెస్టర్ (సెలీనియం, కుకుంబర్), జావా డెవలపర్స్ (స్ప్రింగ్ బూట్ అండ్ మైక్రో సర్వీసెస్), ఫ్రంట్ ఎండ్ యాంగులర్ డెవలపర్స్, డేటా సైంటిస్ట్ (పైథాన్), డేటా సైంటిస్ట్స్ (ఎస్ఏఎస్/ఎస్‌క్యూఎల్), పవర్బీ డెవలపర్, స్నోఫ్లేక్, లీడ్ వెబ్ కాంపోనెంట్ డెవలపర్స్ (యాంగులర్) వంటి వివిధ పోస్టులకు మూడు నుంచి ఆరేళ్ల అనుభవం ఉన్నవారిని చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పుణె, కోల్‌కతాల్లో నియమించుకుంది.ఇదీ చదవండి: జియో స్టోర్స్‌ల్లో స్టార్‌లింక్ హార్డ్వేర్ఈ ఏడాది జనవరిలో అట్రిషన్(కంపెనీ మారడం) కారణంగా టీసీఎస్ ఉద్యోగుల సంఖ్య 5,000 మంది తగ్గిందని, జనవరి-మార్చి త్రైమాసికంలో కంపెనీ స్వల్పంగానే ఈ లోటును భర్తీ చేసినట్లు తెలిపింది. మరో సాఫ్ట్వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఇదే తరహా నియామకాల ప్రక్రియను కొనసాగిస్తుండటంతో టీసీఎస్ నియామకాలు ఊపందుకున్నాయి. క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, జావా పైథాన్, డాట్నెట్, ఆండ్రాయిడ్/ ఐఓఎస్ డెవలప్మెంట్, ఆటోమేషన్ టెస్టింగ్ సహా 40+ నైపుణ్యాలకు సంబంధించిన ఉద్యోగుల కోసం వెతుకుతున్నట్లు ఇన్ఫోసిస్ గత నెలలో అంతర్గత మెయిల్‌ను పంపించింది. -
కాస్త పెరిగిన ఇంటి అద్దెలు..
కొనేటప్పుడు తక్కువ ధరకు కావాలి.. అమ్మేటప్పుడు ఎక్కువ ధర రావాలని కోరుకునేది స్థిరాస్తి రంగంలోనే.. ఇది అద్దె విభాగానికీ వర్తిస్తుంది. గత కొన్నేళ్లుగా దేశంలోని ప్రధాన నగరాలలో అద్దె గృహాల విపణి క్రమంగా పెరుగుతోంది. ప్రధానంగా మెరుగైన ప్రయాణ సాధనాలు, పని కేంద్రాలకు చేరువలో ఉన్న అద్దె ఇళ్లకు డిమాండ్ ఉంది. - సాక్షి, సిటీబ్యూరోప్రాపర్టీల విలువ పెరగడంతో గృహ యజమానులు అద్దెల కంటే లాభదాయకమైన ఆస్తుల విక్రయాల కోసం అన్వేషిస్తుండటంతో సప్లయి తగ్గింది. దీంతో అద్దె గృహాలకు డిమాండ్‌తో పాటు రెంట్లు కూడా పెరిగాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది తొలి త్రైమాసికంలో హైదరాబాద్‌లో అద్దె గృహాలకు డిమాండ్ 22 శాతం మేర పెరిగింది. సరఫరా 2.1 శాతం క్షీణించగా.. సగటు రెంట్లు 4.5 శాతం మేర పెరిగాయి. అద్దెల మార్కెట్లో డిమాండ్ 50, సప్లయి వాటా 39 శాతంగా ఉన్నాయి.పశ్చిమంలో డిమాండ్ ఎక్కువ.. గచ్చిబౌలి, మాదాపూర్ వంటి పశ్చిమ హైదరాబాద్ ప్రాంతాల్లోని అద్దె గృహాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. కార్యాలయాలు, ఉపాధి కేంద్రాలకు సమీపంలో ఉండటం, ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)తో మెరుగైన కనెక్టివిటీనే ప్రధాన కారణం. రూ.25 వేలు నుంచి రూ.35 వేలు నెలవారీ అద్దెలకు కోసం ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. 1,000 చ.అ. నుంచి 1,500 చ.అ. విస్తీర్ణంలో ఉన్న గృహాలకు డిమాండ్ అధికంగా ఉంది. -
జియో స్టోర్స్‌ల్లో స్టార్‌లింక్ హార్డ్‌వేర్
భారతదేశపు ప్రముఖ టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో దేశవ్యాప్తంగా ఉన్న తన రిటైల్ అవుట్లెట్లలో స్టార్‌లింక్ హార్డ్‌వేర్‌ను అందించడానికి స్పేస్ఎక్స్తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. శాటిలైట్ ఇంటర్నెట్ పరికరాలను మరింత సులువుగా వినియోగదారులకు అందించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపింది. ఇది దేశంలోని డిజిటల్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో కీలకంగా మారనుందని చెప్పింది. అయితే, స్పేస్ఎక్స్ దేశంలో తన కార్యకలాపాలు నిర్వహించేందుకు రెగ్యులేటరీ అనుమతులను పొందాల్సి ఉంది.రిలయన్స్ జియో ఇటీవల ప్రకటించిన త్రైమాసిక ఫలితాల సందర్భంగా కంపెనీ ఆర్థిక పనితీరును, భవిష్యత్తు ప్రణాళికలను హైలైట్ చేసింది. జియో విస్తృతమైన స్థానిక ఉనికిని, స్టార్‌లింక్ అత్యాధునిక లో-ఎర్త్-ఆర్బిట్ శాటిలైట్ టెక్నాలజీతో కలపడం ద్వారా గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో మెరుగైన ఇంటర్నెట్ సర్వీసులు అందించవచ్చని ఇరు కంపెనీలు భావిస్తున్నాయి. స్టార్‌లింక్ పరికరాల ఇన్స్టలేషన్, యాక్టివేషన్ కోసం ప్రత్యేకమైన కస్టమర్ సర్వీస్ మెకానిజంను ఏర్పాటు చేయడం, వినియోగదారులకు అంతరాయం లేని సర్వీసులు అందించడం ఈ సహకారంలో భాగం. ఇది అందుబాటులోకి వస్తే స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు జియో ప్రస్తుత బ్రాడ్‌బ్యాండ్ ఆఫర్‌లైన జియో ఫైబర్, జియోఎయిర్ ఫైబర్లకు అనుబంధంగా ఉంటాయో లేదో తేలాల్సి ఉంది.ఇదీ చదవండి: అవి ‘అల్లం’.. ఇవి ‘బెల్లం’!జియో ప్రస్తుత చర్యలు దేశంలో డిజిటల్ అంతరాన్ని పూడ్చడానికి ఎంతో తోడ్పడుతాయని కంపెనీ నమ్ముతుంది. స్టార్‌లింక్ అధునాతన ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం ద్వారా రిమోట్ ఏరియాలకు హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించడం, ఆర్థిక వృద్ధి, సామాజిక అభివృద్ధిని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. మార్చి 2025 నాటికి రిలయన్స్ జియో 48.8 కోట్లకు పైగా చందాదారులను కలిగి ఉంది. ఇందులో 19.1 కోట్లు ట్రూ 5జీ వినియోగదారులు ఉన్నారు. -
పీఎఫ్ ఖాతా బదిలీ.. ఈపీఎఫ్‌వో గుడ్‌న్యూస్!
న్యూఢిల్లీ: ఒక సంస్థలో ఉద్యోగం వీడి, మరో సంస్థలో చేరిన సందర్భాల్లో భవిష్యనిధి (పీఎఫ్) ఖాతాను ఆన్లైన్లో సులభంగా బదిలీ చేసుకునే దిశగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు కొన్ని రకాల అనుమతులను తొలగించింది.‘‘ఇప్పటి వరకు పీఎఫ్ ఖాతా బదిలీ రెండు ఈపీఎఫ్ కార్యాలయాలతో ముడిపడి ఉండేది. ఇందులో ఒకటి పీఎఫ్ జమలు జరిగిన (సోర్స్) ఆఫీస్. ఈ మొత్తం మరో ఈపీఎఫ్ కార్యాలయం పరిధిలో (డెస్టినేషన్ ఆఫీస్)కి బదిలీ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను మరింత సులభతరం చేసే లక్ష్యంతో క్లెయిమ్‌ల బదిలీకి డెస్టినేషన్ ఆఫీస్ అనుమతుల అవసరాలను తొలగించాం. ఇందుకు సంబంధించి పునరుద్ధరించిన ఫామ్ 13 సాఫ్ట్‌వేర్‌ను అమల్లోకి తెచ్చాం. ఇక నుంచి క్లెయిమ్‌లకు సోర్స్ ఆఫీస్ నుంచి అనుమతి లభించగానే, సభ్యుడి/సభ్యురాలి పీఎఫ్ ఖాతా ప్రస్తుత కార్యాలయం పరిధిలోకి మారిపోతుంది’’అని కేంద్ర కార్మిక శాఖ తెలిపింది. -
రిలయన్స్ రికార్డ్.. రూ. 10 లక్షల కోట్లు..
ముంబై: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 2.4 శాతం పుంజుకుని రూ. 19,407 కోట్లను తాకింది. ప్రధానంగా రిటైల్ బిజినెస్ క్రమబద్ధీకరణ, టెలికం మార్జిన్లు మెరుగుపడటం ఇందుకు సహకరించాయి.అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో రూ. 18,951 కోట్లు ఆర్జించింది. క్యూ3(అక్టోబర్–డిసెంబర్)లో సాధించిన రూ. 18,540 కోట్లతో పోల్చినా లాభంలో వృద్ధి నమోదైంది. కంపెనీ బోర్డు వాటాదారులకు షేరుకి రూ. 5.5 డివిడెండ్ ప్రకటించింది. మొత్తం ఆదాయం రూ. 2.4 లక్షల కోట్ల నుంచి రూ. 2.6 లక్షల కోట్లకు బలపడింది. ఇబిటా 3.6 శాతం వృద్ధితో రూ. 48,737 కోట్లకు చేరింది. పూర్తి ఏడాదిలో మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి ఆర్ఐఎల్ దాదాపు యథాతథంగా రూ. 69,648 కోట్ల నికర లాభం ఆర్జించింది. అయితే రూ. 10 లక్షల కోట్ల నెట్‌వర్త్‌ను సాధించిన తొలి దేశీ కంపెనీగా రికార్డు నెలకొల్పింది. ఈ బాటలో గతేడాది రూ. 20 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్(విలువ)ను అందుకున్న తొలి సంస్థగా సైతం నిలిచింది! ప్రయివేట్ ప్లేస్మెంట్ పద్ధతిలో మార్పిడిరహిత డిబెంచర్లు తదితర సెక్యూరిటీల జారీ ద్వారా రూ. 25,000 కోట్లవరకూ సమీకరించేందుకు బోర్డు అనుమతించినట్లు ఆర్ఐఎల్ వెల్లడించింది. 2025 మార్చి31కల్లా రుణ భారం రూ. 3.24 లక్షల కోట్ల నుంచి రూ. 3.47 లక్షల కోట్లకు పెరిగింది. విభాగాలవారీగా రిలయన్స్ రిటైల్ వెంచర్స్ నికర లాభం క్యూ4లో 29 శాతం జంప్‌చేసి రూ. 3,545 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం 16 శాతం వృద్ధితో రూ. 88,620 కోట్లయ్యింది. ఈ కాలంలో 238 స్టోర్లను కొత్తగా తెరవడంతో వీటి సంఖ్య 19,340కు చేరింది. అయితే స్టోర్ల క్రమబద్ధీకరణతో నిర్వహణ ప్రాంతం 2 శాతం తగ్గి 7.74 కోట్ల చదరపు అడుగులకు పరిమితమైంది. ఇక ఆయిల్ టు కెమికల్(ఓ2సీ) బిజినెస్ నిర్వహణ లాభం క్యూ4లో 10 శాతం క్షీణించి రూ. 15,080 కోట్లకు చేరింది. ఇంధన రిటైల్(జియో–బీపీ) బిజినెస్‌లో పెట్రోల్ అమ్మకాలు 24%, డీజిల్ విక్రయాలు 25% ఎగశాయి. కేజీ డీ6 క్షేత్రాలలో గ్యాస్ ఉత్పత్తి తగ్గడంతో ఇబిటా 8.6% నీరసించి రూ. 5,123 కోట్లకు పరిమితమైంది. గ్యాస్ ఉత్పత్తి రోజుకి 26.73 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్లకు చేరగా.. చమురు 19,000 బ్యారళ్లుగా నమోదైంది.జియో జోరు టెలికం, డిజిటల్ బిజినెస్‌ల జియో ప్లాట్‌ఫామ్స్ నికర లాభం క్యూ4లో 26 శాతం జంప్‌చేసి రూ. 7,022 కోట్లను తాకింది. పూర్తి ఏడాదిలో 22% ఎగసి రూ. 26,120 కోట్లకు చేరింది. జియో వినియోగదారుల సంఖ్య 48.21 కోట్ల(క్యూ3) నుంచి 48.82 కోట్లకు ఎగసింది. ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం (ఏఆర్పీయూ) రూ. 203.3(క్యూ3) నుంచి రూ. 206.2కు మెరుగుపడింది. క్యూ4 ఆదాయం రూ. 33,986 కోట్లు కాగా.. పూర్తి ఏడాదిలో రూ.1,28,218 కోట్లకు చేరింది. విలీనం తర్వాత జియోహాట్‌స్టార్ ఆదాయం రూ. 10,006 కోట్ల స్థాయిని అధిగమించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 14న జియోసినిమా, డిస్నీప్లస్‌హాట్‌స్టార్ విలీనంతో జియోహాట్‌స్టార్ ఏర్పాటైంది.నిలకడగా.. ప్రపంచ బిజినెస్ వాతావరణరీత్యా గతేడాది సమస్యాత్మకంగా నిలిచింది. బలహీన ఆర్థిక పరిస్థితులు, రాజకీయ, భౌగోళిక మార్పుల నేపథ్యంలో నిర్వహణా సంబంధ క్రమశిక్షణ, కస్టమర్ కేంద్రంగా ఆవిష్కరణలు కంపెనీ నిలకడైన పనితీరు చూపేందుకు దోహదపడ్డాయి. – ముకేశ్ అంబానీ, చైర్మన్, రిలయన్స్ ఇండస్ట్రీస్ -
వాణిజ్య ఒప్పందంతో కొత్త అవకాశాలు
న్యూఢిల్లీ: భారత్, వాణిజ్య ఒప్పందం, అమెరికా ఉత్పత్తులకు, కొత్త అవకాశాల,ను తీసుకొస్తుందని అమెరికా వాణిజ్య ప్రతినిధి (యూఎస్టీఆర్) జైమీసన్ గ్రీర్ తెలిపారు. అంతేకాదు ఇరు దేశాల్లోని కారి్మకులు, రైతులు, వ్యాపారవేత్తలకు కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయన్నారు. భారత్–అమెరికా కాంపాక్ట్ భాగస్వామ్యం ప్రాధాన్యతను ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన మరోసారి ధ్రువీకరించినట్టు చెప్పారు. రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం దిశగా పురోగతిని ప్రస్తావించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ద్వైపాక్షిక చర్చలు వాణిజ్యం విషయంలో సమతుల్యతను తీసుకొస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. యూఎస్‌టీర్, భారత వాణిజ్య శాఖ, పరిశ్రమల శాఖలు చర్చలకు సంబంధించి నిబంధనలను ఇప్పటికే ఖరారు చేసినట్టు చెప్పారు. భారత మార్కెట్లో తన ఉత్పత్తులకు మరింత ప్రవేశం కల్పించడం కోసం అమెరికా చూస్తోందని, టారిఫ్, నాన్ టారిఫ్ అడ్డంకులను తగ్గించుకోవాలని అనుకుంటున్నట్టు తెలిపారు. దీర్ఘకాల ప్రయోజనాల దృష్ట్యా అదనపు హామీలపై చర్చించనున్నట్టు చెప్పారు. భారత్ పెద్ద ఎత్తున టారిఫ్‌లు విధిస్తోందంటూ అమెరికా ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో ఆరోపించడం గమనార్హం. భారత్‌తో 45.7 బిలియన్ డాలర్ల వాణిజ్యలోటును అమెరికా మోస్తోంది. 2024లో భారత్‌తో అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం 129.2 బిలియన్ డాలర్లుగా ఉంది. భారత ఉత్పత్తులపై అమెరికా సగటు టారిఫ్ 3.3 శాతంగా ఉంటే, అమెరికా ఉత్పత్తులపై భారత్ సగటున 17 శాతం టారిఫ్ విధిస్తుండడం గమనార్హం. టారిఫ్‌లకు అదనంగా సేవల మార్కెట్‌కు సంబంధించి సాంకేతిక పరమైన అవరోధాలు, నియంత్రణపరమైన అవరోధాలు భారత్‌తో అమెరికా వాణిజ్యం పెంచుకునే విషయంలో అవరోధాలు కలి్పస్తున్నట్టు జైమీసన్ గ్రీర్ తెలిపారు. -
భారత షిప్పింగ్ మూలాలు పటిష్టం
న్యూఢిల్లీ: అమెరికా ప్రతీకార టారిఫ్‌ల వల్ల షిప్పింగ్ రంగంలో స్వల్పకాలికంగా కాస్త సమస్యలు తలెత్తినా, దీర్ఘకాలికంగా చూస్తే భారత మారిటైమ్ మూలాలు పటిష్టంగా ఉన్నాయని అంతర్జాతీయ షిప్ మేనేజ్మెంట్ కంపెనీ సినర్జీ మెరైన్ గ్రూప్ సీఈవో జెస్పర్ క్రిస్టెన్సన్ తెలిపారు. పోర్టు సామర్థ్యాలు .. ఎగుమతుల బేస్ పెరుగుతుండటం, సుశిక్షితులైన సిబ్బంది లభ్యత తదితర అంశాల దన్నుతో గ్లోబల్ షిప్పింగ్ పరిశ్రమలో పరిస్థితులకు అనుగుణంగా భారత్ తనను తాను మల్చుకోగలిగే స్థితిలో ఉందని వివరించారు. బహుళ నైపుణ్యాలున్న ప్రొఫెషనల్స్‌కి షిప్పింగ్ రంగంలో డిమాండ్ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదని చెప్పారు. డిజిటలైజేషన్, డీకార్బనైజేషన్, నిబంధనలు తదితర అంశాల ఆధారంగా షిప్పింగ్ రంగంలో నైపుణ్యాల ఆధారంగా నియామకాలు ఉంటున్నాయని వివరించారు. సినర్జీలో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 28,000 మంది సీఫేరర్స్ ఉండగా, వీరిలో 70 శాతం మంది భారతీయులేనని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఫ్లీట్ విస్తరణకు అనుగుణంగస్మరిన్ని నియామకాలు చేపట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. -
సరఫరా వ్యవస్థలో మార్పులతో భారత్‌కు ప్రయోజనాలు
న్యూఢిల్లీ: సరఫరా వ్యవస్థల్లో సర్దుబాట్లు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించి వైవిధ్యమైన వనరులు, ఇన్వెస్టర్లలో నెలకొన్న ఆసక్తి తదితర అంశాలతో భారత్‌కు ప్రయోజనాలు చేకూరగలవని ఏప్రిల్ బులెటిన్‌లో రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. సరీ్వసుల ఎగుమతులు నిలకడగా నమోదవుతుండటం, రెమిటెన్సులు మెరుగ్గా ఉండటం.. కరెంటు అకౌంటుకు కాస్త బాసటగా నిలుస్తున్నాయని వివరించింది. పాలసీపరమైన మద్దతు ఉంటే అంతర్జాతీయంగా నెలకొన్న ఒడిదుడుకులను భారత్ తనకు అవకాశంగా మల్చుకునేందుకు వీలవుతుందని పేర్కొంది. వాణిజ్యం, టారిఫ్లపరమైన ఉద్రిక్తతలు పెరగడం, ఫలితంగా ఆర్థిక మార్కెట్లలో తీవ్ర ఒడిదుడుకులు తలెత్తడం వల్ల సమీప భవిష్యత్తులో ప్రపంచ వృద్ధి బలహీనపడుతుందేమోనన్న ఆందోళన నెలకొందని ఆర్బీఐ వివరించింది. ఇతర దేశాల్లో డిమాండ్ బలహీనపడటం వల్ల భారత ఆర్థిక వృద్ధిపై ప్రతికూల ప్రభావం పడినా.. దేశీయంగా వృద్ధి చోదకాలుగా ఉంటున్న వినియోగం, పెట్టుబడులపై మాత్రం ప్రభావం పెద్దగా ఉండదని పేర్కొంది. 2025లో వర్షపాతం సాధారణంగా కన్నా మెరుగ్గా ఉంటుందనే అంచనాలతో వ్యవసాయ రంగం ఆశావహంగా కనిపిస్తోందని, దీనితో రైతుల ఆదాయాలు పెరిగి, ఆహార ధరలు అదుపులో ఉండవచ్చని రిజర్వ్ బ్యాంక్ వివరించింది. ’బ్యాంక్‌డాట్‌ఇన్’ డొమైన్‌కు మార్పు .. బ్యాంకులు ప్రస్తుతం తాము ఉపయోగిస్తున్న డొమైన్ నుంచి ’బ్యాంక్‌డాట్‌ఇన్’ డొమైన్‌కి మారే ప్రక్రియను ప్రారంభించాలని రిజర్వ్ బ్యాంక్ సూచించింది. ఈ ఏడాది అక్టోబర్ 31 నాటికి దీన్ని పూర్తి చేయాలని పేర్కొంది. డిజిటల్ పేమెంట్స్ మోసాల ఉదంతాలు పెరుగుతున్న నేపథ్యంలో భారతీయ బ్యాంకులన్నింటికీ ఈ ప్రత్యేక డొమైన్‌నే వినియోగంలోకి తేవాలని ఆర్బీఐ నిర్ణయించింది. -
బంగారం.. కొనేదెలా..?
న్యూఢిల్లీ: బంగారం ధర రూ.లక్షలకు పెరిగిపోవడం వినియోగదారులు, ముఖ్యంగా మహిళల ఆకాంక్షలపై నీళ్లు చల్లినట్లయింది. భారతీయ మహిళలకు బంగారంతో విడదీయలేని అనుబంధమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సామాన్య కుటుంబాలకు చెందిన వారు సైతం బంగారు ఆభరణాల కోసమని చెప్పి తమకు తోచినంత పొదుపు చేస్తుంటారు. ఇటీవలి కాలంలో ధరలు అసాధారణంగా పెరిగిపోవడాన్ని వారు ఇప్పుడు జీరి్ణంచుకోలేకపోతున్నారు. ఏటా వైశాఖమాసంలో వచ్చే అక్షయ తృతీయ(మొదటి తదియ), వివాహాల సందర్భంగా బంగారం ఆభరణాల కొనుగోళ్లు పెద్ద ఎత్తున జరుగుతుంటాయి. ఈ ఏడాది ఇప్పటికే బంగారం ధరలు 22 శాతం పెరిగిపోవడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. జవవరి 1న 10 గ్రాముల బంగారం ధర రూ.79,390గా ఉండగా, అక్కడి నుంచి చూస్తే రూ.1.01 లక్షల వరకు వెళ్లి ప్రస్తుతం రూ.98వేల స్థాయిలో ఉంది. ఇలా అయితా ఎలా కొనగలం? ‘‘వచ్చే నవంబర్‌లో నా కుమార్తె వివాహం ఉంది. ఈలోపే బంగారం ధర గణనీయంగా పెరిగింది. ఇప్పుడు వివాహం కోసం బంగారం ఎలా కొనుగోలు చేయాలి?’’ అన్నది నోయిడాకు చెందిన రూప అభిప్రాయం. పండగలు, వివాహాల సమయంలో బంగారం కొనుగోలు చేయకపోతే ఏదో కోల్పోయినట్టు ఉంటుందని ఢిల్లీ మయూర్ విహార్‌కు చెందిన సుశీలా దేవి మనోగతం. గతంలో 10 గ్రాములు కొనేవాళ్లం కాస్తా.. ఇప్పుడు 5 గ్రాములతో సరిపెట్టుకోవడమేనని నిర్వేదం వ్యక్తం చేశారు. ‘‘నాకు బంగారం ఆభరణాలంటే ఎంతో ఇష్టం. అందుకే ఏటా ఒకసారి కొనుగోలు చేస్తుంటా. ధర రూ.లక్షకు చేరడం నన్ను కలచివేస్తోంది’’అని ఛత్తీస్‌గఢ్‌లోని కోబ్రా జిల్లా వాసి సీతా సాహు తెలిపారు. మరోవైపు చెప్పుకోతగ్గ స్థాయిలో బంగారం ఆభరణాలను సమకూర్చుకున్నవారు.. ధరలు భారీగా పెరిగిపోవడం పట్ల ఒకింత ఆనందాన్నీ వ్యక్తం చేస్తున్నారు. ‘‘నా భర్త ఏటా బంగారం కొనిపెడుతుండేవారు. కానీ, నేడు ఆయన లేకపోయినప్పటికీ.. ఆభరణాలు మాత్రం నాకు గౌరవంతోపాటు, మద్దతుగా నిలుస్తున్నాయి’’అని పుణెకు చెందిన అర్చనా దేశ్‌ముఖ్ (65) చెప్పారు. అమ్మకాలపై ప్రభావం.. ధరల పెరుగుదలతో అమ్మకాలు తగ్గుతున్నట్టు ఆభ రణాల వర్తకులు చెబుతున్నారు. ముఖ్యంగా చిన్న వర్తకులపై దీని ప్రభావం ఎక్కువగా కనిపి స్తోంది. ‘‘దశాబ్దాల నుంచి ఇదే వ్యాపారంలో ఉ న్నాం. మొదటిసారి కస్టమర్ల మొహాల్లో అయోమయాన్ని చూస్తున్నాం. గతంలో కస్టమర్లు ఆభరణాల డిజైన్లను ఎన్నింటినో చూసేవారు. ఇప్పుడు వాటిని చూసి వెనక్కి ఇచ్చేస్తున్నారు. ధరలు ఇలాగే పెరిగితే చిన్న వర్తకులు కొనసాగడం కష్టమే’’అని ఢిల్లీ మ యూర్ విహార్‌కు ‘ఊరి్మళా జ్యుయలర్స్’ స్వర్ణకారి ణి సోనూసోని తెలిపారు. కానీ మహిళలు బంగా రం తప్పకుండా పొదుపు చేసి, ఆభరణాలను కొనుగోలు చేస్తూనే ఉంటారని రాధేశ్యామ్ జ్యుయలర్స్‌కు చెందిన కరణ్ సోని అభిప్రాయపడ్డారు. లైట్ వెయిట్ జ్యుయలరీకి డిమాండ్? బంగారం ధరలు పెరిగిపోవడంతో ఈ నెల 30న అక్షయ తృతీయ సందర్భంగా కస్టమర్లు తేలికపాటి ఆభరణాలను కొనుగోలు చేయొచ్చని జ్యుయలర్లు అంచనా వేస్తున్నారు. ‘‘అక్షయ తృతీయకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ సమయంలో బంగారం కొనుగోళ్లు పెరుగుతుంటాయి. ఈ ఏడాది ధరలు పెరిగినప్పటికీ లైట్ వెయిట్ ఆభరణాల రూపంలో మంచి డిమాండ్ ఉంటుందని అంచనా వేస్తున్నాం’’అని ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యుయలరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ రాజేష్ రోక్డే తెలిపారు. ధరల పెరుగుదల పట్ల కస్టమర్లు అసహనం వ్యక్తం చేసినప్పటికీ.. సురక్షిత సాధనంగా, మన సంస్కృతి, సంప్రదాయాల్లో భాగం కావడంతో క్రమంగా అమ్మకాలు సానుకూల స్థితికి చేరుకుంటాయన్నారు. ధరల పెరుగుదల నేపథ్యంలో విక్రయాలను పెంచుకునేందుకు వర్తకులు అన్ని రకాల ధరల్లో ఆభరణాలను అందుబాటులో ఉంచడంపై దృష్టి సారించినట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. అధిక ధరలతో అమ్మకాల పరిమాణం క్రితం ఏడాది స్థాయిలోనే ఉండొచ్చని లేదా 10 శాతం వరకు తగ్గొచ్చని ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యుయలరీ డొమెస్టిక్ కౌన్సిల్ వైస్ చైర్మన్ అవినాష్ గుప్తా అభిప్రాయపడ్డారు. అక్షయ తృతీయ, వివాహాల సీజన్ కావడంతో విక్రయాల పట్ల ఆశావహంగా ఉన్నట్టు పీఎన్జీ జ్యుయలర్స్ చైర్మన్ సౌరభ్ గాడ్గిల్ పేర్కొన్నారు. -
భారీగా పెరిగిన టెలికం కంపెనీల ఆదాయం: ఏకంగా..
ముంబై: భారత కంపెనీల ఆదాయ వృద్ధి ఈ ఏడాది మార్చితో ముగిసిన త్రైమాసికంలో (2024–25 క్యూ4) ఫ్లాట్‌గా 5–6 శాతం స్థాయిలో ఉంటుందని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. అదే సమయంలో లాభదాయకత విస్తరిస్తుందని పేర్కొంది. కంపెనీల నిర్వహణ మార్జిన్లు 8 శాతం స్థాయిలో ఉంటాయని.. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే ఇది 0.60 శాతం అధికమని తెలిపింది. ఎన్ఎస్ఈ మార్కెట్ విలువలో 50 శాతం వాటా కలిగిన 400 కంపెనీల ఖాతాలను క్రిసిల్ రేటింగ్స్ విశ్లేషించింది. వినియోగ ఆధారిత రంగాలు ఆదాయ వృద్ధిలో కిలక పాత్ర పోషిస్తాయని తెలిపింది. కన్జ్యూమర్ డిస్కీషినరీ ఉత్పత్తులు, సేవలు, స్టెపుల్ సర్వీసెస్ విభాగాల్లో ఆదాయం 8–9 శాతం మేర పెరుగుతుందని పేర్కొంది.‘‘ముఖ్యంగా టెలికం సేవల కంపెనీల ఆదాయం 15 శాతం పెరుగుతుంది. గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో టారిఫ్‌లను గణనీయంగా పెంచడం, ప్రీమియం 5జీ ప్లాన్లను ప్రవేశపెట్టడం ఇందుకు మద్దతుగా నిలుస్తుంది. రిటైల్ రంగంలో ఆదాయం 17 శాతం వృద్ధి చెందుతుంది. ముఖ్యంగా వ్యాల్యూ ఫ్యాషన్, ఫుడ్, గ్రోసరీ విభాగాల్లో డిమాండ్ బలంగా ఉంది. స్టోర్ల నెట్వర్క్ విస్తరణ కూడా ఇందుకు మద్దతునిస్తుంది’’అని క్రిసిల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ పూషన్ శర్మ తెలిపారు.ఆదాయాల్లో వృద్ధి..▸క్యూ4లో ఆటోమైబైల్ రంగం ఆదాయం 6 శాతం పెరగొచ్చు. ప్యాసింజర్ వాహన విక్రయాలు ఊపందుకోవడం, ఎగుమతుల వాటా పెరగడం అనుకూలిస్తుంది. ఎఫ్ఎంసీజీ రంగం ఆదాయం 4–6 శాతం మేర పెరుగుతుంది. విక్రయాల్లో స్తబ్దత నేపథ్యంలో కంపెనీలు ధరలను పెంచడం ఇందుకు మద్ద తునిస్తుంది. పట్టణ వినియోగంలో స్తబ్దత నెలకొంటే, గ్రామీణ వినియోగం బలంగా ఉంది. ▸ఎగుమతుల ఆదాయం 4% పెరుగుతుంది. ఐటీ సేవల ఆదాయం 2–3% మేర పెరగొచ్చు. ఫార్మాస్యూటికల్స్ ఆదాయం 8% పెరుగుతుంది. ▸వ్యవసాయ రంగంలో ఎరువులు తదితర కంపె నీల ఆదాయం 17–19% స్థాయిలో వృద్ధి చెందొచ్చు. వేసవిలో సాగు స్థిరంగా ఉండడం, మెరుగైన దిగుబడులు, ఖరీఫ్‌లో వరికి మంచి ధరలు పలకడం వినియోగాన్ని పెంచుతాయి. ▸నిర్మాణ అనుబంధ రంగాల్లో ఆదాయం కేవలం 1–2 శాతమే పెరగొచ్చు. ఏడాది వ్యాప్తంగా చౌక స్టీల్ దిగుమతులతో ధరలు తక్కువగా ఉండడాన్ని ఈ నివేదిక ప్రస్తావించింది. ప్రభుత్వం దిగుమతులపై సుంకాలు పెంచిన తర్వాత ధరల్లో పెరుగుదలను గుర్తు చేసింది.వీటి మార్జిన్లు ప్లస్ ▸ఫార్మాస్యూటికల్స్, విద్యుత్, కన్జ్యూమర్ డిస్క్రిíÙనరీ, టెలికం సేవల్లో మార్జిన్లు విస్తరించొచ్చు. ▸ఆటోమొబైల్, ఐటీ సేవలు, ఎఫ్ఎంసీజీ, సిమెంట్, స్టీల్ కంపెనీల మార్జిన్లు తగ్గొచ్చు. ▸అల్యూమినియం ధరలు పెరగడంతో ఆటోమొబైల్ రంగ కంపెనీల మార్జిన్లు ఒక శాతం తగ్గొచ్చు. ▸ఐటీ కంపెనీల మార్జిన్లు 0.40 శాతం మేర క్షీణించొచ్చు. ఎఫ్ఎంసీజీ రంగ కంపెనీల మార్జిన్లు 0.50–1 శాతం మధ్య తగ్గొచ్చు. పామాయిల్, టీ, ఎండు కొబ్బరి చిప్పల ధరలు పెరగడాన్ని కారణంగా క్రిసిల్ రేటింగ్స్ నివేదిక పేర్కొంది. -
రూ.2.5 కోట్ల కారు.. గంటలో బూదిడైపోయింది
ఎవరికైనా సొంతంగా కారు కొనుగోలు చేయాలని, దాన్ని డ్రైవ్ చేయాలనీ ఉంటుంది. కారు కొన్న గంటలోనే.. బూడిదైపోతే?, ఆ బాధ ఎలా ఉంటుందో అనుభవించేవారికే తెలుస్తుంది. అలాంటి ఘటనే జపాన్‌లో వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.33 ఏళ్ల మ్యూజిక్ ప్రొడ్యూసర్ 'హోంకాన్' 10 సంవత్సరాలు డబ్బు పోగు చేసి, తనకు ఇష్టమైన ఫెరారీ 458 స్పైడర్ కారును కొనుగోలు చేశారు. దీని ధర రూ. 2.5 కోట్లు కంటే ఎక్కువే. ఇష్టమైన కొత్త కారు కొన్న ఆనందంలో.. డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే, కారులో నుంచి పొగలు రావడం గమనించాడు. వెంటనే కారులో మంటలు చెలరేగాయి. కారు పేలిపోతుందేమో అని భయపడ్డానని హోంకాన్ ట్వీట్ చేశారు.కారు కాలిపోవడానికి.. సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో ఖరీదైన కారు మంటల్లో చిక్కుకుని ఉండటం, కాలిపోయిన తరువాత ఎలా ఉందనేది.. ఫోటోలలో గమనించవచ్చు.ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీ సమయంలో కాలేయ వ్యాధి: ఇప్పుడు ఓ కంపెనీ అధినేత్రి..కారు ప్రమాదానికి గురైన తరువాత.. అగ్నిమాపక సిబ్బంది 20 నిమిషాల్లో మంటలు ఆర్పారు. అయితే ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదు, ప్రాణహాని కూడా జరగలేదు. కారులో ఎలా మంటలు చెలరేగాయి. కారుకు ఇన్సూరెన్స్ వంటివి ఉన్నాయా అనే దిశగా దర్యాప్తు జరుగుతోంది.社長がフェラーリ買ったらしいから乗せてもらった1時間後に燃えた pic.twitter.com/kZq4QYgwkZ— ポケカメン@ちょこらび (@GC5R5OGIKgV0yvz) April 16, 2025 -
ప్రెగ్నెన్సీ సమయంలో కాలేయ వ్యాధి: ఇప్పుడు ఓ కంపెనీ అధినేత్రి..
బిజినెస్ అంటే.. కేవలం పురుషులకు మాత్రమే సాధ్యమవుతుందన్న రోజులు పోయాయి. వ్యాపార ప్రపంచంలో మహిళలు కూడా మేము సైతం అంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు.. 'సాక్షి ఛబ్రా మిట్టల్' (Sakshi Chhabra Mittal). ఇంతకీ ఈమె ఎవరు?, ఈమె సాధించిన సక్సెస్ ఏమిటి?, అనే వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.సాక్షి ఛబ్రా మిట్టల్.. లండన్‌కు చెందిన 'ఫుడ్‌హాక్' వ్యవస్థాపకురాలు, సీఈఓ. బర్మింగ్‌హామ్ యూనివర్సిటీ నుంచి బయోటెక్నాలజీలో బీఎస్సీ, ది వార్టన్ స్కూల్ నుంచి ఎంబీఏ పట్టా పొందిన సాక్షి.. ఫైజర్‌లో తన కెరీర్ ప్రారంభించింది. అక్కడే ఆరోగ్య సంరక్షణ, జీవ శాస్త్రాల వంటి వాటిలో మంచి పట్టును సాధించింది. సైన్స్ అండ్ బిజినెస్ వంటి వాటిపై అమితాసక్తి కలిగిన ఈమె.. ఆనతి కాలంలోనే బాబిలోన్, డెలివరూ, డార్క్ట్రేస్ వంటి కంపెనీలలో పెట్టుబడి పెట్టింది.ఆరోగ్య సంరక్షణ వైపు..ఆ తరువాత సాఫ్ట్‌బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్‌లో చేరి, సాఫ్ట్‌బ్యాంక్ విజన్ ఫండ్ యొక్క పెట్టుబడి బృందంలో కీలక సభ్యురాలిగా మారింది. ఆ సమయంలో రోయివెంట్ సైన్సెస్‌తో ఒక బిలియన్ ఈక్విటీ ఒప్పందంతో సహా ప్రధాన పెట్టుబడులకు నాయకత్వం వహించింది. ఇక్కడ పనిచేస్తున్న సమయంలోనే.. ఈమె దృష్టి ఆరోగ్య సంరక్షణ వైపు మళ్లింది.కాలేయ వ్యాధి..2017లో సాక్షి ఛబ్రా మిట్టల్ మొదటి గర్భధారణ సమయంలో.. అనారోగ్యం వచ్చింది, దాని ఫలితంగా కాలేయ వ్యాధి వచ్చింది. అప్పుడు ఆయుర్వేద ఆహారాన్ని స్వీకరించి పూర్తిగా నయం చేసుకుంది. అప్పుడే ఒక ఆలోచన వచ్చింది. ఆహారమే ఔషధం అని భావించి.. ఫిబ్రవరి 2021లో ఫుడ్‌హాక్ సంస్థను ప్రారభించింది. ఇది అతి తక్కువ కాలంలోనే అధిక ప్రజాదరణ పొందగలిగింది. ఇది (ఫుడ్‌హాక్) ఆరోగ్యకరమైన ఆహారాన్ని మరింత అందుబాటులోకి తీసుకురావడానికి సైన్స్, టెక్నాలజీ, ఆయుర్వేద సూత్రాలను మిళితం చేసి భోజనం అందించే డెలివరీ సంస్థ.సాక్షి ఛబ్రా.. భారతి గ్లోబల్‌కు నాయకత్వం వహిస్తున్న 'శ్రావిన్ మిట్టల్'ను వివాహం చేసుకుంది. ఢిల్లీలోని బ్రిటిష్ స్కూల్లో క్లాస్మేట్స్గా ఉన్న ఈ జంట 2015లో వివాహం చేసుకున్నారు. ఈయన భారతీయ బిలియనీర్ సునీల్ మిట్టల్ కుమారుడు. సునీల్ మిట్టల్ భారతి ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకుడు & ఛైర్మన్ మరియు నికర విలువ రూ. 2,63,099 కోట్లు.ఇదీ చదవండి: బంగారంపై పెట్టుబడి కష్టమే!.. ప్రత్యామ్నాయ మార్గాలివిగో.. -
మే నెలలో బ్యాంక్ హాలిడేస్: ఇదిగో జాబితా..
ఏప్రిల్ నెల ముగియనుంది. మే నెల వచ్చేస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వచ్చే నెల సెలవుల జాబితాను కూడా విడుదల చేసింది. మే నెలలో శని, ఆదివారాలతో కలిపి మొత్తం 12 బ్యాంకు సెలవులు ఉంటాయి.మే నెలలో బ్యాంకు సెలవుల జాబితా➤మే 1, 2025 – కార్మిక దినోత్సవం, మహారాష్ట్ర దినోత్సవం➤మే 4, 2025 – ఆదివారం➤మే 9, 2025 – రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి➤మే 10, 2025 – రెండవ శనివారం➤మే 11, 2025 – ఆదివారం➤మే 12, 2025 – బుద్ధ పూర్ణిమ➤మే 16, 2025 – సిక్కిం స్టేట్ డే➤మే 18, 2025 – ఆదివారం➤మే 24, 2025 – నాల్గవ శనివారం➤మే 25, 2025 – ఆదివారం➤మే 26, 2025 – కాజీ నజ్రుల్ ఇస్లాం పుట్టినరోజు➤మే 29, 2025 – మహారాణా ప్రతాప్ జయంతిఇదీ చదవండి: పహల్గాం ఘటన.. ఎల్ఐసీ కీలక ప్రకటనబ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పని చేసుకోవాలనుకునే వారు బ్యాంక్ హాలిడేస్ గమనించి ముందుగానే పనులు పూర్తి చేసుకోవాలి. అయితే ఆన్లైన్ సేవలు అన్నీ సెలవు దినాల్లో కూడా అందుబాటులో ఉంటాయి.(బ్యాంకింగ్ సెలవుల షెడ్యూల్ మారవచ్చు.. కాబట్టి హాలిడే క్యాలెండర్లో ఏవైనా అప్డేట్లు లేదా రివిజన్ల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. లేదా మీ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల అధికారిక ప్రకటనలను గమనించాల్సి ఉంటుంది). -
సత్తా చాటిన ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్: రూ.35 వేల కోట్లకుపైగా బిజినెస్
ముంబయి: ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ 2025 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 35,577 కోట్ల రూపాయల న్యూ బిజినెస్ ప్రీమియం సాధించింది. గత సంవత్సరం 38,238 కోట్లతో పోలిస్తే, రెగ్యులర్ ప్రీమియం 11% వృద్ధి చెందింది. ప్రొటెక్షన్ న్యూ బిజినెస్ ప్రీమియం 4,095 కోట్ల రూపాయలు, వ్యక్తిగత ప్రొటెక్షన్ ప్రీమియం 793 కోట్ల రూపాయలుగా నమోదైంది.వ్యక్తిగత న్యూ బిజినెస్ ప్రీమియం 26,360 కోట్ల రూపాయలతో 11% వృద్ధి సాధించింది. పన్ను తర్వాత లాభం 2,413 కోట్ల రూపాయలతో 27% వృద్ధి చెందగా, సాల్వెన్సీ నిష్పత్తి 1.96 వద్ద బలంగా ఉంది. ఆస్తుల నిర్వహణ 4,48,039 కోట్ల రూపాయలకు 15% వృద్ధి చెందింది, డెట్-ఈక్విటీ మిశ్రమం 61:39గా ఉంది. 94% డెట్ పెట్టుబడులు ట్రిపుల్ ఏ, సావరిన్ ఇన్స్ట్రుమెంట్స్లో ఉన్నాయి.దేశవ్యాప్తంగా 309,034 మంది బీమా నిపుణులు, 1,110 కార్యాలయాలతో బ్యాంకాషూరెన్స్, ఏజెన్సీ, కార్పొరేట్ ఏజెంట్లు, బ్రోకర్లు, పీవోఎస్, వెబ్ అగ్రిగేటర్ల ద్వారా విస్తృత సేవలు అందిస్తోంది.2025 మార్చి 31 నాటి పనితీరువ్యక్తిగత రేటెడ్ ప్రీమియం 19,354 కోట్ల రూపాయలతో 22.8% మార్కెట్ వాటా.ఏపీఈ 21,417 కోట్ల రూపాయలతో 9% వృద్ధి.వ్యక్తిగత న్యూ బిజినెస్ సమ్ అష్యూర్డ్ 2,76,918 కోట్ల రూపాయలతో 43% వృద్ధి.13 నెలలు, 61 నెలల పర్సిస్టెన్సీలో 63 బీపీఎస్, 528 బీపీఎస్ మెరుగుదల.వీవోఎన్‌బీ 5,954 కోట్ల రూపాయలతో 7% వృద్ధి, మార్జిన్ 27.8%.ఐఈవీ 70,250 కోట్ల రూపాయలతో 21% వృద్ధి.ఆపరేటింగ్ రిటర్న్ ఆన్ ఎంబెడెడ్ వాల్యూ 20.2%.ఆస్తుల నిర్వహణ 4,48,039 కోట్ల రూపాయలతో 15% వృద్ధి.సాల్వెన్సీ నిష్పత్తి 1.96. -
ధర ఎక్కువైనా అస్సలు తగ్గని జనం: ఒకేరోజు 52 కార్ల డెలివరీ
చైనీస్ ఎలక్ట్రిక్ ఆటోమోటివ్ దిగ్గజం 'బీవైడీ' (బిల్డ్ యువర్ డ్రీమ్స్) ఇటీవల ఇండియన్ మార్కెట్లో 'సీలియన్ 7' లాంచ్ చేసింది. కంపెనీ ఈ కారును లాంచ్ చేసినప్పటి నుంచి కొనుగోలుదారులు దీనిని ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు. ఇటీవల ఒకే రోజు 52 కార్లను డెలివరీ చేసి.. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్‌ను సాధించినట్లు ప్రకటించింది.గతంలో చాలా కంపెనీ వందలాది వాహనాలను డెలివరీ చేశాయి. కానీ బీవైడీ కంపెనీ డెలివరీ చేసిన కారు ధరలు ధర రూ. 48.9 లక్షల నుంచి రూ. 54.9 లక్షలు మధ్య ఉన్నాయి. ఇంత ఖరీదైన కార్లను 52 డెలివరీ చేయడం బహుశా ఇదే మొదటిసారి. ఈ కారణంగానే కంపెనీ అమ్మకాల్లో అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది. సీలియన్ 7 ఎలక్ట్రిక్ కార్ల డెలివరీకి సంబంధించిన ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నాయి.ఇదీ చదవండి: 2025 మార్చిలో ఎక్కువమంది కొన్న కారు ఇదే..బీవైడీ సీలియన్ 7 ఎలక్ట్రిక్ కారు ప్రీమియం, పర్ఫామెన్స్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. ప్రీమియం వేరియంట్ ఒకే ఎలక్ట్రిక్ మోటారుతో 308 Bhp పవర్, 380 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తే.. పర్ఫార్మెన్స్ వేరియంట్ డ్యూయల్ మోటార్ సెటప్ ద్వారా 523 Bhp పవర్, 690 Nm టార్క్ అందిస్తుంది. ఈ రెండూ 82.56 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ద్వారా వరుసగా 567 కిమీ, 542 కిమీ రేంజ్ అందిస్తాయి. మంచి డిజైన్, అత్యాధునిక ఫీచర్స్ కలిగిన ఈ కారు సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ పొందింది. View this post on Instagram A post shared by BYD India (@byd.india) -
'భార్యలు చాలా తెలివైనవారు': హర్ష్ గోయెంకా ట్వీట్
సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ ఉండే.. RPG గ్రూప్ చైర్మన్ 'హర్ష్ గోయెంకా' భార్యల తెలివితేటలను ప్రశంసిస్తూ.. ఓ ట్వీట్ చేశారు. ఇది ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.10 సంవత్సరాల క్రితం.. నేను రూ. 8 లక్షలకు కారు కొన్నాను. ఆమె రూ. 8 లక్షలకు బంగారం కొన్నది. ఈ రోజు ఆ కారు విలువ రూ. 1.5 లక్షలకు చేరింది. బంగారం విలువ రూ. 32 లక్షలకు చేరింది. నేను బంగారం కొనడం మానేద్దాం.. వెకేషన్‌కు వెళ్దాం అన్నాను. వెకేషన్ 5 రోజులు మాత్రమే ఉంటాయి, బంగారం ఐదు తరాలు ఉంటుందని ఆమె చెప్పిందని హర్ష్ గోయెంకా చెప్పారు.ఇదీ చదవండి: కుమారుల కోసం ధీరూభాయ్ అంబానీ వదిలివెళ్లిన ఆస్తి ఎంతంటే..నేను ఒక లక్ష రూపాయలు పెట్టి మొబైల్ ఫోన్ కొన్నాను. అదే ధరకు ఆమె బంగారం కొన్నది. నా ఫోన్ ధర ఇప్పుడు రూ. 8వేలు. ఆమె కొన్న బంగారం రూ. 2 లక్షలు. దీన్ని బట్టి చూస్తే 'భార్యలు చాలా తెలివైనవారు' అని గోయెంకా చెప్పారు. ఈ ట్వీట్ ఎంతోమంది నెటిజన్లను ఆకర్శించింది. చాలామంది ఈ విషయంలో ఏకీభవించారు. ఇప్పటికైనా భార్యలు మాట వినాలంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు.10 yrs ago, I bought a car for ₹8L. She bought gold for ₹8L.Today- car’s worth ₹1.5L. Her gold? ₹32L.I said, “Let’s skip gold, go on a vacation?”She said, “Vacation lasts 5 days. Gold lasts 5 generations.”I bought a phone for ₹1L. She bought gold.Now? Phone’s worth…— Harsh Goenka (@hvgoenka) April 23, 2025 -
లాభాలకు చెక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
శుక్రవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ నష్టాలను చవి చూశాయి. సెన్సెక్స్ 588.90 పాయింట్లు లేదా 0.74 శాతం నష్టంతో 79,212.53 వద్ద, నిఫ్టీ 207.35 పాయింట్లు లేదా 0.86 శాతం నష్టంతో.. 24,039.35 వద్ద నిలిచాయి.లక్ష్మీ ఫైనాన్స్ అండ్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్, కారారో ఇండియా, బటర్‌ఫ్లై గాంధీమతి అప్లయెన్స్, మనక్సియా స్టీల్స్, కంట్రీ కాండోస్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో నిలువగా.. SRM కాంట్రాక్టర్స్, PVP వెంచర్స్, భండారీ హొజియరీ ఎక్స్‌పోర్ట్స్, మైండ్టెక్ (ఇండియా), మాగ్నమ్ వెంచర్స్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో ఉన్నాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు). -
ఐటీఆర్ ఫైలింగ్‌కు వేళాయే..
గడిచిన 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలు చేయడానికి సమయం ఆసన్నమైంది. దీనికి సంబంధించి ఆదాయపు పన్ను శాఖ త్వరలో ఆన్లైన్ ఫైలింగ్ పోర్టల్‌ను ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో రిటర్న్స్ ఎప్పుడు దాఖలు చేయాలి, గడువు ఎప్పుడు, రిఫండ్‌ను ఎప్పుడు పొందే అవకాశం ఉందనే అంశాల గురించి తెలుసుకుంది.ఐటీఆర్‌ను ఎప్పుడు ఫైల్ చేయవచ్చు?ఆన్లైన్ పోర్టల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత 2025-26 మదింపు సంవత్సరానికి మీ ఐటీఆర్‌ను సమర్పించవచ్చు. ఇంకా దీనికి సంబంధించిన ధ్రువీకరణ తేదీని అధికార వర్గాలు వెల్లడించలేదు. అయినప్పటికీ ఆదాయ పన్ను శాఖ సాధారణంగా ఏటా ఏప్రిల్ నాటికి ఐటీఆర్ ఫారాలను అందుబాటులో ఉంచుతుంది. ఫారాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్సైట్ ద్వారా తమ రిటర్నులను ఈ-ఫైలింగ్ చేయడం ప్రారంభించవచ్చు.ఐటీఆర్ నమోదు చేయడానికి చివరి తేదీ ఏమిటి?గత ఏడాది షెడ్యూల్ ప్రకారం జరిమానా లేకుండా రిటర్న్స్ దాఖలు చేయడానికి చివరి తేదీ జులై 31, 2024గా నిర్ణయించారు. జరిమానాలతో ఆలస్యంగా రిటర్న్స్ దాఖలు చేయడానికి డిసెంబర్ 31 వరకు అనుమతించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి కూడా ఇదే పరిస్థితి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇప్పటికైతే ఎలాంటి ప్రకటన రాలేదు.రిఫండ్లు ఎప్పుడు పొందవచ్చు?రిఫండ్ ప్రక్రియను ఆదాయపు పన్ను శాఖ మరింత సులభతరం చేసింది. చాలా మంది పన్ను చెల్లింపుదారులు తమ రిటర్న్స్ దాఖలు చేసిన వారం నుంచి 20 రోజుల్లో వారి రిఫండ్లను పొందేందుకు వీలు కల్పిస్తున్నారు. అయితే పన్ను చెల్లింపుదారులు దాఖలు చేసిన రిటర్నుల్లో ఎలాంటి దోషాలు ఉండకూడదు. ఫైలింగ్ సమయంలో ఆధార్ ఓటీపీతో ధ్రువీకరించాలి. బ్యాంక్ ఖాతాను ముందుగా నమోదు చేసి పాన్‌తో లింక్ చేసుకోవాలి.ఇదీ చదవండి: అవి ‘అల్లం’.. ఇవి ‘బెల్లం’!కీలక డాక్యుమెంట్లు ఏమిటి?మీ రిటర్న్‌ను సజావుగా, వేగంగా దాఖలు చేయడానికి అవసరమైన అన్ని పత్రాలను ముందుగానే సేకరించుకోవడం చాలా ముఖ్యం. ఇందులో పాన్ కార్డు, ఆధార్ కార్డు, మీరు పని చేస్తున్న యజమాని నుంచి ఫారం 16, వేతన స్లిప్పులు, మీ బ్యాంకు నుంచి ధ్రువీకరణ పత్రాలు, ఏదైనా మూలధన లాభాల వివరాలు ఉంటే వాటిని సమర్పించాల్సి ఉంటుంది. అలాగే మీరు అద్దె ఆదాయం పొందినట్లయితే దానికి రుజువులను కూడా జత చేయాల్సి ఉంటుంది. -
పహల్గాం ఘటన: ఎల్ఐసీ కీలక ప్రకటన
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన తరువాత బాధితుల కుటుంబాలకు అండగా నిలబడటానికి.. త్వరితగతిన డెత్ క్లెయిమ్ పరిష్కారాలను అందించడానికి 'లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా' (LIC) ఓ స్పెషల్ విండోను అందుబాటులోకి తీసుకొచ్చింది."పహల్గాంలో అమాయక పౌరుల మరణం పట్ల ఎల్ఐసి ఆఫ్ ఇండియా తీవ్ర విచారం వ్యక్తం చేస్తోంది. మరణించిన వారి డెత్ క్లెయిమ్‌ను వీలైనంత త్వరగా పరిష్కరించడానికి ప్రత్యేక రాయితీలను ప్రకటించింది. దుఃఖంలో ఉన్న బాధిత కుటుంబానికి ఎల్ఐసి ఆఫ్ ఇండియా అండగా నిలుస్తుంది" అని ఎల్ఐసి మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ సిద్ధార్థ మొహంతి ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.డెత్ క్లెయిమ్ ప్రక్రియ పూర్తిగా ఆఫ్‌లైన్‌లో ఉందని క్లెయిమ్‌దారులు తప్పకుండా గమనించాలి. ఈ ప్రక్రియను ప్రారంభించడానికి, నామినీ అవసరమైన అన్ని పత్రాలను తీసుకొని పాలసీని జారీ చేసిన ఎల్ఐసీ శాఖను సంప్రదించాలి. పాలసీ ప్రీమియంలు రెగ్యులర్‌గా చెల్లించి ఉంటే లేదా గ్రేస్ పీరియడ్లోపు మరణం సంభవించినట్లయితే క్లెయిమ్ సెటిల్మెంట్కు అర్హత ఉంటుంది.క్లెయిమ్ ప్రాసెస్➤నామినీ అవసరమైన పత్రాలతో.. పాలసీ జారీ చేసిన ఎల్ఐసీ బ్రాంచ్‌ను సంప్రదించాలి.➤పాలసీ నంబర్, తేదీ, మరణించడానికి కారణం వంటి వివరాలతో LIC సర్వీసింగ్ బ్రాంచ్‌కు లిఖితపూర్వకంగా తెలియజేయాలి.➤నామినీదారునికి, మరణించిన వ్యక్తికి గల సంబంధాన్ని తెలియజేయడానికి ఫారమ్ Aను సబ్మిట్ చేయాలి.➤అధికారిక మరణ ధ్రువీకరణ పత్రంగా.. స్థానిక మరణ రిజిస్టర్ నుంచి ధ్రువీకరించిన పత్రాలను సమర్పించాలి. వయస్సు ధ్రువీకరణ కోసం ఆధార్ లేదా పాన్ కార్డు వంటివి ఇవ్వాల్సి ఉంటుంది.➤మరణ ధృవీకరణ పత్రాలకు బదులుగా, ఉగ్రవాద దాడి కారణంగా పాలసీదారు మరణించినట్లు ప్రభుత్వ రికార్డులలో ఉన్న ఏవైనా ఆధారాలు లేదా కేంద్ర / రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించిన ఏదైనా పరిహారం వంటివి పాలసీదారు మరణించినట్లు నిర్దారించడానికి ఉపయోగపడతాయి.➤వీటన్నింటినీ.. పరిశీలించి ఎల్ఐసీ క్లెయిమ్ సెటిల్ చేస్తుంది.ఇదీ చదవండి: కుమారుల కోసం ధీరూభాయ్ అంబానీ వదిలివెళ్లిన ఆస్తి ఎంతంటే.. -
అవి ‘అల్లం’.. ఇవి ‘బెల్లం’!
టాప్ టెక్ కంపెనీల్లో పని చేయాలని చాలామంది భావిస్తుంటారు. అందుకు వర్క్‌ప్లేస్ ఒక కారణం అవుతుంది. కొన్ని కంపెనీలు పరిశ్రమలో ఆదరణ పొందినా సరైన పని వాతావరణాన్ని కల్పించలేవు. అదే ఇంకొన్ని సంస్థల పేర్లు పెద్దగా వినిపించకపోయినా మెరుగైన వర్క్‌ప్లేస్‌ను అందిస్తాయి. భారత్‌లో మంచి పని వాతావరణాన్ని అందిస్తున్న కంపెనీల జాబితాను ‘బ్లైండ్’ అనే సంస్థ రూపొందించింది. వాటి వివరాలు కింది విధంగా ఉన్నాయి.గ్లోబల్ టెక్ దిగ్గజాలు ఆపిల్, గూగుల్, మెటా టాప్ 10 బెస్ట్ రేటింగ్ కంపెనీల్లో చోటు దక్కించుకోగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండస్ట్రీ లీడర్ ఎన్విడియా రిటైల్ దిగ్గజం టార్గెట్ సంస్థ తర్వాత రెండో స్థానంలో నిలిచింది. మరోవైపు అమెజాన్ కంపెనీ ఇండియాలోనే అత్యంత పేలవమైన వర్క్‌ప్లేస్‌గా ఉందని నివేదిక తెలిపింది. పేటీఎం, ఇన్ మొబి, కాయిన్ బేస్, ఐబీఎం, స్ప్రింక్లర్ వంటి ఇతర ప్రధాన టెక్ కంపెనీలు కూడా పేలవమైన వర్క్‌ప్లేస్ జాబితాలో చివరన నిలిచాయి.బ్లైండ్ సంస్థ దేశంలోని 7,020 కంపెనీల ఉద్యోగుల నుంచి సమాచారం సేకరించి ఈ జాబితాను సిద్ధం చేసింది. ఆరు కేటగిరీల్లో ప్రతి కంపెనీకి 5 పాయింట్ల స్కేలును నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది. ముఖ్యంగా బ్లైండ్ సంస్థ ఉద్యోగుల వేతనం, సంతృప్తికర పని వాతావరణాన్ని పరిగణలోకి తీసుకున్నట్లు పేర్కొంది. కొన్ని మెరుగైన కంపెనీలు కూడా కొన్ని అంశాలను అధిగమించలేకపోయాయని తెలిపింది.ఇదీ చదవండి: రియల్టీలోకి రూ.2.29 లక్షల కోట్లుకంపెనీ కల్చర్ పరంగా టార్గెట్, ఎన్వీడియా, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, అకామై టెక్నాలజీస్, సర్వీస్ నౌ, జోహో, అరిస్టా నెట్వర్క్స్, మోర్గాన్ స్టాన్లీ, వీఎంవేర్, జేపీ మోర్గాన్ ఛేజ్ అండ్ కో అత్యధిక స్కోర్లను సాధించాయి. ట్రస్ట్ ఇన్ మేనేజ్మెంట్ కేటగిరీలో టార్గెట్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, సర్వీస్ నౌ, అరిస్టా నెట్వర్క్స్, ఎన్వీడియా, ప్యూర్ స్టోరేజ్, యాపిల్, హార్నెస్, ఈపీఏఎం సిస్టమ్స్ వంటి సంస్థలు రాణించాయి. గత ఏడాది కాలంలో భారతీయ నిపుణులు ఎక్కువగా సెర్చ్ చేసిన కంపెనీల్లో మెటా, అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్, ఎన్వీడియా, బైట్ డాన్స్, నెట్‌ఫ్లిక్స్, ఓపెన్ఏఐ, వాల్‌మార్ట్ ఉన్నాయి. వీటితో పాటు ఇండియా ఆఫర్, లేఆఫ్, రిఫరల్, ప్రమోషన్, హెచ్-1బీ వంటి ట్రెండింగ్ సెర్చ్ పదాలు ఉన్నాయి. -
రియల్టీలోకి రూ.2.29 లక్షల కోట్లు
రియల్ ఎస్టేట్ మార్కెట్లో పెట్టుబడుల పట్ల సంస్థాగత ఇన్వెస్టర్లు ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ రంగం 2022–24 మధ్యకాలంలో (మూడేళ్లలో) 26.7 బిలియన్ డాలర్ల (రూ.2.29 లక్షల కోట్లు) ఈక్విటీ పెట్టుబడులను అందుకున్నట్టు సీఐఐ–సీబీఆర్ఈ సంయుక్త నివేదిక తెలిపింది. ఇందులో పావు శాతం అంటే 6.7 బిలియన్ డాలర్లను (రూ.57,600 కోట్లు సుమారు) ముంబై నగరం ఆకర్షించడం గమనార్హం.ముంబైతోపాటు ఢిల్లీ–ఎన్సీఆర్, బెంగళూరు ఈ మూడు నగరాల నుంచి మార్కెట్లోకి వచ్చిన పెట్టుబడులు 16.5 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. మొత్తం రియల్ ఎస్టేట్ రంగంలోకి 2022–24 మధ్య వచ్చిన పెట్టుబడుల్లో 62 శాతాన్ని ఈ మూడు నగరాలు దక్కించుకున్నాయి. పెట్టుబడి శ్రేణికి సంబంధించిన ప్రాజెక్టులు ప్రధానంగా ఈ నగరాల్లో కేంద్రీకృతమై ఉండడం, బలమైన మౌలిక సదుపాయాలు, నైపుణ్య మానవ వనరుల లభ్యత, రియల్ ఎస్టేట్ రంగం క్రమంగా సంఘటితంగా మారుతుండడం ఈ మూడు నగరాలకు అనుకూలిస్తున్నట్టు ఈ నివేదిక వివరించింది. అభివృద్ధిపైనే అధికంగా..ల్యాండ్ డెవలప్మెంట్ ప్రాజెక్టులు 2022–24 మధ్య 44 శాతం మేర ఈక్విటీ పెట్టుబడులను ఆకర్షించినట్టు, ఆ తర్వాత ఆఫీస్ నిర్మాణ ఆస్తుల్లోకి 32 శాతం వచ్చినట్లు సీఐఐ–సీబీఆర్ఈ నివేదిక వెల్లడించింది. ఇక గత మూడేళ్లలో 10 శాతం మేర ఈక్విటీ పెట్టుబడులు (3 బిలియన్ డాలర్లు) టైర్–2 పట్టణ రియల్ ఎస్టేట్‌లోకి వచ్చినట్టు తెలిపింది. ‘భారత రియల్ ఎస్టేట్ రంగం కొత్త వృద్ధి పథంలోకి అడుగు పెట్టింంది. బలమైన మూలధన పెట్టుబడులు, అభివృద్ధికి భూముల లభ్యత ఇందుకు మద్దతునిస్తున్నాయి’ అని సీబీఆర్ఈ భారత ఛైర్మన్, సీఈవో అన్షుమన్ మ్యాగజిన్ తెలిపారు.ఇదీ చదవండి: ఉద్యోగంలో ఉంటారా? ప్యాకేజీ తీసుకొని వెళ్తారా?ఆఫీస్ అసెట్స్, నివాస గృహ ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు బలమైన సెంటిమెంట్ ఉండడం అన్నది స్థిరమైన వినియోగ డిమాండ్‌కు నిదర్శనంగా అన్షుమన్ పేర్కొన్నారు. దేశ రియల్ ఏస్టేట్ రంగం మరింత సంస్థాగతంగా మారుతున్నట్టు సీఐఐ పశ్చిమ ప్రాంత ఛైర్మన్ రిషి కుమార్ బగ్లా తెలిపారు. దీంతో ఈ రంగం మరింత పారదర్శకతతో, అంతర్జాతీయ ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటున్నట్టు చెప్పారు. ఈ రంగం మరింత సంస్థాగతంగా, నియంత్రితంగా మారితే అప్పుడు అంతర్జాతీయ ఫండ్స్ పెద్ద ఎత్తున పెట్టుబడులతో ముందుకు వస్తాయన్నారు. -
కొత్త టెక్నాలజీలను ఆవిష్కరించిన టీసీఎస్
దేశ డిజిటల్ వృద్ధిని మరింత బలోపేతం చేసేందుకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మూడు కొత్త సాంకేతిక సర్వీసులను ఆవిష్కరించింది. న్యూఢిల్లీలో జరిగిన ‘యాక్సిలరేటింగ్ ఇండియా’ కార్యక్రమంలో ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించింది. ఈ సేవలు దేశ అవసరాలకు అనుగుణంగా రూపొందించామని కంపెనీ తెలిపింది. ఈ సర్వీసులు డేటా భద్రత, స్థిరత్వంతో పాటు కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత ఆవిష్కరణలను వేగవంతం చేస్తాయని పేర్కొంది.టీసీఎస్ సావరిన్‌సెక్యూర్ క్లౌడ్: దేశంలోని పబ్లిక్ సెక్టర్ కంపెనీలకు ఈ క్లౌడ్ ఏఐ సామర్థ్యాలను అందిస్తుంది. ముంబై, హైదరాబాద్‌లోని టీసీఎస్ డేటా సెంటర్లలో నిర్వహించబడే ఈ క్లౌడ్ డిజిటల్ వ్యక్తిగత డేటా రక్షణ చట్టం 2023కు అనుగుణంగా ఉంటుంది. 2030 నాటికి నెట్ జీరో కార్బన్ ఉద్గారాల లక్ష్యంతో ఈ క్లౌడ్ తక్కువ లెటెన్సీతో కీలక అప్లికేషన్లకు అవకాశం కల్పిస్తుంది. ఏఐ ఆధారిత డేటా విశ్లేషణలు, నిరంతర భద్రతా పరీక్షలతో పౌర సేవలను మెరుగుపరుస్తూ, డేటా ఆధారిత నిర్ణయాలను వేగవంతం చేస్తుంది.టీసీఎస్ డిజిబోల్ట్: ఏఐ ఆధారిత ప్లాట్‌ఫామ్ డిజిబోల్ట్ డిజిటల్ ప్రక్రియలను ఆటోమేషన్ చేసి సంస్థలు తమ ఆవిష్కరణలను వేగంగా అమలు చేయడానికి వీలు కల్పిస్తుంది.టీసీఎస్ సైబర్ డిఫెన్స్ సూట్: ఈ ఏఐ ఆధారిత సైబర్‌సెక్యూరిటీ సర్వీసు భారత సంస్థలకు అధునాతన రక్షణను అందిస్తుంది. సైబర్ బెదిరింపులను ముందస్తుగా గుర్తించి, ఆటోమేటెడ్ రెస్పాన్స్‌తో స్పందిస్తూ, హైబ్రిడ్ మల్టీ క్లౌడ్, ఐటీ సదుపాయాలకు రక్షణ కల్పిస్తుంది. 16,000 మంది సైబర్‌సెక్యూరిటీ నిపుణులతో టీసీఎస్ దేశంలో సైబర్ రక్షణను బలోపేతం చేస్తోంది.ఇదీ చదవండి: ఉద్యోగంలో ఉంటారా? ప్యాకేజీ తీసుకొని వెళ్తారా?ఈ సందర్భంగా టీసీఎస్ ప్రెసిడెంట్ గిరీష్ రామచంద్రన్ మాట్లాడుతూ..‘దేశంలోని వివిధ సంస్థలు ఉపయోగిస్తున్న డేటాకు ఏఐ టూల్స్‌తో భద్రత కల్పిస్తున్నాం. ఈ సర్వీసులు భారత అవసరాలకు అనుగుణంగా రూపొందించాం. దేశ ఆస్తులను రక్షిస్తూ, ఆర్థిక వృద్ధి, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నాం’ అని తెలిపారు. కార్యక్రమంలో టీసీఎస్ సీఈవో కె.కృతివాసన్‌తోపాటు ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల అధికారులు పాల్గొన్నారు. -
రూ.లక్ష చేరువలో పసిడి! తులం ఎంతంటే..
సేఫ్డ్ అసెట్‌గా భావించే బంగారం పెట్టుబడులను ఇటీవల కాలంలో ఈక్విటీల్లోకి మళ్లిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లు భారీగా ఒడిదొడుకులకు లోనవుతున్న నేపథ్యంలో కొన్ని స్టాక్‌లు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. దాంతో చాలా మంది బంగారంలోని పెట్టుబడులను ఈక్వీటీలకు మళ్లిస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్నటి ధరతో పోలిస్తే శుక్రవారం బంగారం ధర తగ్గిపోయింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో శుక్రవారం గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.90,050 (22 క్యారెట్స్), రూ.98,240 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. గురువారం ధరలతో పోలిస్తే ఈ రోజు బంగారం ధర స్థిరంగా ఉంది. చెన్నైలో శుక్రవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు వరుసగా రూ.90,050 రూ.98,240కు చేరింది.ఇదీ చదవండి: ఉద్యోగంలో ఉంటారా? ప్యాకేజీ తీసుకొని వెళ్తారా?దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే స్థిరంగా ఉంది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.90,200కు కాగా.. 24 క్యారెట్ల ధర రూ.98,340 వద్దకు చేరింది. బంగారం ధరలు స్థిరంగా ఉన్నట్లే వెండి ధర కూడా ఈ రోజు నిలకడా ఉంది. కేజీ వెండి రేటు రూ.1.10,900కు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ఉద్యోగంలో ఉంటారా? ప్యాకేజీ తీసుకొని వెళ్తారా?
తక్కువ పనితీరు కనబరుస్తున్న ఉద్యోగులకు రెండు ఆప్షన్లు ఇచ్చేలా మైక్రోసాఫ్ట్ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఒకటి.. పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్(పనితీరు మెరుగుదల కార్యక్రమం-పీఐపీ). ఇందులో భాగంగా కఠినమైన లక్ష్యాలను అంగీకరించి, అందుకు తగ్గట్టుగా నైపుణ్యాలను మెరుగుపరుచుకుని ఉద్యోగులు వృత్తిపరంగా తమనుతాము నిరూపించుకోవాల్సి ఉంటుంది. రెండోది.. కంపెనీ ఆఫర్ చేసిన ప్యాకేజీని తీసుకొని కంపెనీ నుంచి నిష్క్రమించడం. స్వచ్ఛందంగా వైదొలగాలనుకునే ఉద్యోగులకు కంపెనీ 16 వారాల వేతనాన్ని అందిస్తోంది. అయితే ఈ రెండు ఆప్షన్స్‌లో దేన్ని ఎంచుకుంటారనే దానిపై ఉద్యోగులు ఐదు రోజుల్లో స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది.బిజినెస్ ఇన్సైడర్ నివేదిక ప్రకారం మైక్రోసాఫ్ట్ కొత్త చీఫ్ పీపుల్ ఆఫీసర్ అమీ కోల్మన్ ఒక ఈమెయిల్లో ఈమేరకు వివరాలు వెల్లడించారు. ‘అధిక పనితీరును వేగవంతం చేయడానికి, తక్కువ పనితీరు సమస్యను అంతే వేగంగా పరిష్కరించడానికి ఈ విధానం మెరుగైన సాధనంగా తోడ్పడుతుంది’ అని ప్రకటించారు. మైక్రోసాఫ్ట్‌లో పీఐపీలు ఎంచుకున్న ఉద్యోగులు వారి పనితీరును బెంచ్‌మార్క్‌తో రుజువు చేసుకోవాల్సి ఉంటుంది లేదా కంపెనీ కొత్తగా ప్రవేశపెట్టిన ‘గ్లోబల్ వాలంటరీ సెపరేషన్ అగ్రిమెంట్ (జీవీఎస్‌ఏ) కింద సెవెరెన్స్ ప్యాకేజీని ఎంచుకోవాలని ఈమెయిల్లో సూచించారు. పీఐపీ మార్గాన్ని ఎంచుకున్న వారు సెవెరెన్స్ ప్రయోజనాలను కోల్పోతారని కంపెనీ తెలిపింది. అందుకు సంబంధించి ఉద్యోగులు ఐదు రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని ఈమెయిల్లో పేర్కొన్నారు.ఇదీ చదవండి: ‘మీరూ జాగ్రత్తగా ఉండాలి’పీఐపీ సమయంలో పేలవమైన పనితీరు ప్రదర్శించిన ఉద్యోగులపై రెండేళ్లపాటు తిరిగి సంస్థలో చేరకుండా నిషేధం విధిస్తూ ఈ విధానం నిర్ణయం తీసుకుంది. పనితీరు తక్కువగా ఉన్న సిబ్బందిని మైక్రోసాఫ్ట్‌లోని ఇతర ప్రాజెక్ట్‌ల్లో బదిలీ చేయకుండా కూడా ఈ విధానం పరిమితులు విధించింది. మైక్రోసాఫ్ట్ ఈ ఏడాది ప్రారంభంలో తక్కువ పనితీరు కనబరిచిన సుమారు 2,000 మంది ఉద్యోగులను తొలగించింది. ప్రపంచవ్యాప్తంగా స్థిరమైన, పారదర్శకమైన సర్వీసులు అందించడానికి, జవాబుదారీతనం, పనితీరును బలోపేతం చేయడానికి ఈ కొత్త చర్యలు రూపొందించినట్లు కంపెనీ వైస్ ప్రెసిడెంట్ క్రిస్ కోల్మన్ తెలిపారు. -
కొనసాగుతున్న బుల్ జోరు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే శుక్రవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 9:27 సమయానికి నిఫ్టీ(Nifty) 67 పాయింట్లు పెరిగి 24,311కు చేరింది. సెన్సెక్స్(Sensex) 162 పాయింట్లు పుంజుకుని 79,952 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.61 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 66.95 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.31 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 2.03 శాతం లాభపడింది. నాస్డాక్ 2.74 శాతం ఎగబాకింది.భారత స్టాక్ మార్కెట్లో ఇటీవలి ర్యాలీకి అనేక అంశాలు కారణమవుతున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. రిటైల్ ద్రవ్యోల్బణం ఆరేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయి మార్చిలో 3.34 శాతానికి చేరుకుంది. దీంతో ఇన్వెస్టర్లలో విశ్వాసం పెరిగింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) భారత మార్కెట్లో క్రమంగా పెట్టుబడి పెట్టాలని భావిస్తున్నారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి ప్రధాన బ్యాంకుల పనితీరుపై పెట్టుబడిదారులు సానుకూలంగా ఉన్నారు. బ్రెంట్ క్రూడ్ ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇది ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను తగ్గిస్తుంది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
‘మీరూ జాగ్రత్తగా ఉండాలి’
పెట్టుబడుల విషయంలో నియంత్రణ నిబంధనలు మాత్రమే మదుపరులను కాపాడలేవని, ఇన్వెస్టర్లు కూడా తప్పకుండా తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని బీఎస్ఈ ఎండీ సుందరరామన్ రామమూర్తి తెలిపారు. సొంతంగా విషయాలను ఆకళింపు చేసుకోకుండా, వాళ్లూ వీళ్లు చెప్పిన మాటల మీద ఆధారపడి ఇన్వెస్ట్ చేసే ధోరణి మంచిది కాదని వ్యాఖ్యానించారు.‘కూరగాయలు కొనుక్కునేటప్పుడు ముందుగానే చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. కానీ మీ జీవితకాల ఆదాయాన్ని పెట్టుబడి పెట్టేటప్పుడు మాత్రం ఎవరో చెప్పిన మాటలు విని ముందూ, వెనకా చూసుకోకుండా ఇన్వెస్ట్ చేస్తారు. అలా చేయొద్దు. మీకు అర్థమైనదే ట్రేడ్ చేయండి. ఏం ట్రేడ్ చేస్తున్నారో అర్థం చేసుకోండి. లేకపోతే సమస్యలు తప్పవు. మిమ్మల్ని మీరు కాపాడుకోదల్చుకోకపోతే ఎన్ని నిబంధనలున్నా ఏవీ మిమ్మల్ని రక్షించలేవు. కాబట్టి అలర్టుగా ఉండండి’ అని రిటైల్ ఇన్వెస్టర్ల కోసం కలకత్తా చాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా హెచ్చరించారు. ఇదీ చదవండి: అనుకున్నదొకటి అయినదొకటి..మార్కెట్‌పై అవగాహన లేని రిటైల్ ఇన్వెస్టర్లు పెట్టుబడుల కోసం మ్యుచువల్ ఫండ్ మార్గాన్ని ఎంచుకోవడం శ్రేయస్కరమని సూచించారు. అప్పుడు కూడా థీమ్యాటిక్ ఫండ్స్ జోలికి వెళ్లకుండా విస్తృత సాధనాల్లో ఇన్వెస్ట్ చేసే మ్యుచువల్ ఫండ్లు లేదా లార్జ్ క్యాప్ ఫండ్లను ఎంచుకోవడం మంచిదని పేర్కొన్నారు. కెరియర్ ప్రారంభించిన తొలినాళ్ల నుంచే పెట్టుబడులు పెట్టడాన్ని అలవర్చుకోవాలని మహిళలు, యువతకు రామమూర్తి సూచించారు. నియంత్రణ సంస్థలు, స్టాక్ ఎక్సే్చంజీలు ఎంత అప్రమత్తంగా ఉన్నా కొన్ని ఎస్ఎంఈ లిస్టింగ్‌లలో అవకతవకలు జరిగే అవకాశాలను తోసిపుచ్చలేమని పేర్కొన్నారు. ఐపీవో పత్రాల్లో అనుమానాస్పద అంశాలను పసిగట్టేందుకు ఏఐ, లార్జ్ ల్యాంగ్వేజ్ మోడల్స్‌ను బీఎస్ఈ ట్రయల్ ప్రాతిపదికన ఉపయోగిస్తోందని రామమూర్తి చెప్పారు. -
అనుకున్నదొకటి అయినదొకటి..
ప్రముఖ కంపెనీలు కొన్ని క్యూ4లో ఫలితాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. కానీ అనుకున్న విధంగా లాభాలు పోస్ట్ చేయలేకపోయాయి. సిమెంట్ తయారీ దిగ్గజం ఏసీసీ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. గతంలో ఈ త్రైమాసికంలో మెరుగైన ఫలితాలు వెలువడుతాయని అంచనా వేసినా లాభం లేకుండా పోయింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 20 శాతంపైగా క్షీణించి రూ.751 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో రూ.943 కోట్లు ఆర్జించింది. కంపెనీ బోర్డు వాటాదారులకు షేరుకి రూ.7.5 డివిడెండ్ ప్రకటించింది. సిమెంట్ అమ్మకాల ఆదాయం మాత్రం 11 శాతం ఎగసి రూ. 5,686 కోట్లకు చేరింది. రెడీమిక్స్ కాంక్రీట్ ఆదాయం 32 శాతం జంప్‌చేసి రూ. 420 కోట్లను తాకింది. దీంతో మొత్తం టర్నోవర్ 12 శాతం మెరుగుపడి రూ. 6,067 కోట్లకు చేరింది. అయితే మొత్తం వ్యయాలు 13 శాతం పెరిగి రూ. 5,515 కోట్లుగా నమోదయ్యాయి. ఈ కాలంలో అమ్మకాల పరిమాణం 14 శాతం పుంజుకుని 11.9 మిలియన్ టన్నులను తాకింది. వెరసి ఒక క్వార్టర్‌కు కంపెనీ చరిత్రలోనే అత్యధిక అమ్మకాలు సాధించింది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం 3 శాతం వృద్ధితో రూ. 2,402 కోట్లను అధిగమించింది. మొత్తం ఆదాయం 12 శాతం బలపడి రూ. 22,835 కోట్లకు చేరింది. ఇదీ చదవండి: ‘పహల్గాం బాధిత కుటుంబ సభ్యులకు ఉద్యోగాలిస్తాం’నెస్లే ఇండియా లాభం డౌన్న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం నెస్లే ఇండియా గత ఆర్థిక సంవత్సరం(2024–25) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 6 శాతంపైగా క్షీణించి రూ. 873 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో రూ. 934 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం 4 శాతం వృద్ధితో రూ. 5,448 కోట్లకు చేరింది. అంతక్రితం క్యూ4లో రూ. 5,254 కోట్ల అమ్మకాలు సాధించింది. కంపెనీ బోర్డు వాటాదారులకు షేరుకి రూ. 10 చొప్పున తుది డివిడెండ్ ప్రకటించింది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి రూ.3,208 కోట్ల నికర లాభం ఆర్జించింది. 2025 జులైలో పదవీ విరమణ చేయనున్న చైర్మన్, ఎండీ సురేష్ నారాయణన్ స్థానే 2025 ఆగస్ట్ 1 నుంచి మనీష్ తివారీ ఎండీగా బాధ్యతలు చేపట్టేందుకు బోర్డు అనుమతించినట్లు నెస్లే ఇండియా వెల్లడించింది. -
దిగ్గజ ఎఫ్ఎంసీజీ కంపెనీ లాభాలు డీలా
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్(హెచ్‌యూఎల్) గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి (క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 3 శాతంపైగా క్షీణించి రూ. 2,475 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది (2023–24) ఇదే కాలంలో రూ. 2,561 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం 3 శాతం వృద్ధితో రూ. 15,416 కోట్లను అధిగమించింది. అంతక్రితం క్యూ4లో రూ. 15,013 కోట్ల అమ్మకాలు సాధించింది. కంపెనీ బోర్డు వాటాదారులకు షేరుకి రూ. 24 చొప్పున తుది డివిడెండ్ ప్రకటించింది. ఇబిటా మార్జిన్లు 0.3 శాతం నీరసించి 23.1 శాతాన్ని తాకాయి. మొత్తం వ్యయాలు 3 శాతం పెరిగి రూ.12,478 కోట్లకు చేరాయి. ఇదీ చదవండి: ‘పహల్గాం బాధిత కుటుంబ సభ్యులకు ఉద్యోగాలిస్తాం’విభాగాలవారీగా..: క్యూ4లో హెచ్‌యూఎల్ ఆదాయంలో గృహ సంరక్షణ నుంచి 2 శాతం అధికంగా రూ. 5,815 కోట్లు సమకూరింది. సౌందర్యం, పోషక విభాగం 7 శాతం ఎగసి రూ. 3,265 కోట్లుగా నమోదైంది. వ్యక్తిగత సంరక్షణ నుంచి 3 శాతం వృద్ధితో రూ. 2,126 కోట్లు లభించింది. ఆహార విభాగం నామమాత్ర క్షీణతతో రూ. 3,896 కోట్లకు పరిమితమైంది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం 4 శాతం పుంజుకుని రూ. 10,671 కోట్లను తాకింది. ఇక మొత్తం ఆదాయం 2 శాతంపైగా వృద్ధితో రూ. 64,138 కోట్లకు చేరింది. -
ప్రముఖ టెక్ కంపెనీల త్రైమాసిక ఫలితాలు ఇలా..
ముంబై: సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజం టెక్ మహీంద్రా గతేడాది (2024–25) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 77 శాతం జంప్‌చేసి రూ. 1,167 కోట్లను తాకింది. మార్జిన్లు 3.5 శాతం మెరుగుపడటం ఇందుకు సహకరించింది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో కేవలం రూ. 661 కోట్లు ఆర్జించింది. ఈ కాలంలో 79.8 కోట్ల డాలర్ల(రూ. 6,800 కోట్లు) విలువైన ఆర్డర్లు కొత్తగా పొందింది. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి 42 శాతం అధికంగా 2.7 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 27,000 కోట్లు) విలువైన డాలర్లు సాధించినట్లు కంపెనీ సీఈవో, ఎండీ మోహిత్ జోషీ తెలియజేశారు. చివరి త్రైమాసిక ఆర్డర్లలో 60 శాతం వృద్ధిని అందుకున్నట్లు వెల్లడించారు. వాటాదారులకు షేరుకి రూ. 30 చొప్పున తుది డివిడెండ్ ప్రకటించింది. కాగా.. మొత్తం ఆదాయం రూ. 12,871 కోట్ల నుంచి రూ. 13,384 కోట్లకు బలపడింది. పూర్తి ఏడాదికి నికర లాభం 80 శాతం ఎగసి రూ. 4,251 కోట్లను అధిగమించింది. 2023–24లో రూ. 2,358 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం 2 శాతం మెరుగై రూ. 52,988 కోట్లను తాకింది. కంపెనీ మొత్తం సిబ్బంది సంఖ్య 3,276 తగ్గి 1,48,731కు చేరింది. 2025 మార్చి31కల్లా చేతిలో నగదు, తత్సమాన నిల్వలు 89.6 కోట్ల డాలర్లకు చేరినట్లు కంపెనీ వెల్లడించింది.సైయెంట్ డివిడెండ్ రూ. 14హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంజినీరింగ్, టెక్నాలజీ సొల్యూషన్స్ సంస్థ సైయెంట్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 186 కోట్ల లాభం ప్రకటించింది. క్రితం క్యూ4లో ఇది రూ. 197 కోట్లు. ఆదాయం రూ. 1,861 కోట్ల నుంచి రూ. 1,909 కోట్లకు చేరింది. 2024–25కి గాను రూ. 5 ముఖ విలువ చేసే ఒక్కో షేరుపై కంపెనీ రూ.14 తుది డివిడెండ్ ప్రకటించింది. డీఈటీ వ్యాపార విభాగంలో సుమారు 371 కోట్ల డాలర్ల విలువ చేసే 24 భారీ కాంట్రాక్టులు దక్కించుకున్నట్లు ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ కృష్ణ బోదనపు తెలిపారు. కొత్తగా సెమీకండక్టర్ అనుబంధ సంస్థను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇది ప్రధానంగా ఏఐ ఆధారిత టెక్నాలజీ డెవలప్మెంట్పై దృష్టి పెడుతుందని తెలిపారు. ఇక డీఈటీ (డిజిటల్, ఇంజినీరింగ్, టెక్నాలజీ) విభాగం టెక్నాలజీ సరీ్వసులు, ఇంజినీరింగ్ కార్యకలాపాలపై, డీఎల్ఎం వ్యాపార విభాగం ఇంజినీరింగ్ ఆధారిత ప్రోడక్ట్ తయారీపై ఫోకస్ పెడుతుందని వివరించారు. డిమాండ్‌పరంగా ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ తాము మెరుగైన పనితీరు కనపర్చినట్లు చెప్పారు. సమీప భవిష్యత్తులో కొంత అనిశ్చితి నెలకొన్నా సవాళ్లను అధిగమించేందుకు కస్టమర్లతో కలిసి పని చేస్తున్నట్లు కృష్ణ చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధం వరకు ఈ పరిస్థితి కొనసాగవచ్చన్నారు. పెర్సిస్టెంట్ సిస్టమ్స్ లాభం అప్క్యూ4లో రూ.396 కోట్లుముంబై: సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజం పెర్సిస్టెంట్ సిస్టమ్స్ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 25 శాతం జంప్‌చేసి రూ. 396 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో రూ. 315 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 25 శాతం ఎగసి రూ. 3,242 కోట్లకు చేరింది. అంతక్రితం క్యూ4లో రూ. 2,591 కోట్ల టర్నోవర్ అందుకుంది. నిర్వహణ లాభ మార్జిన్లు 14.5 శాతం నుంచి 15.6 శాతానికి బలపడ్డాయి. అనిశ్చితులు కొనసాగుతున్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26)లో 2 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సాధించగలమని భావిస్తున్నట్లు కంపెనీ సీఎఫ్‌వో వినీత్ టి. పేర్కొన్నారు. ఈ కాలంలో 51.75 కోట్ల డాలర్ల విలువైన కొత్త డీల్స్ కుదుర్చుకుంది. కంపెనీ 700 మంది ఉద్యోగులను జత కలుపుకోవడంతో మొత్తం సిబ్బంది సంఖ్య 24,594కు చేరింది. -
ఈడీ అదుపులో జెన్సోల్ ప్రమోటర్!
న్యూఢిల్లీ: జెన్సోల్ కంపెనీ ప్రమోటర్ల నిధుల మళ్లింపు వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. ఢిల్లీ, గురుగ్రామ్, అహ్మదాబాద్‌లోని కంపెనీ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా)లోని నిబంధనల కింద ఈ సోదాలు చేపట్టింది. ఢిల్లీలోని ఓ హోటల్లో ఉన్న కంపెనీ సహ ప్రమోటర్ పునీత్ సింగ్ జగ్గీని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. మరో ప్రమోటర్ అన్మోల్ సింగ్ జగ్గీ దుబాయ్‌ల్లో ఉన్నట్టు సమాచారం. ప్రమోటర్లు అన్మోల్ సింగ్ జగ్గీ, పునీత్ సింగ్ జగ్గీ కంపెనీ ఖాతాల నుంచి నిధులు మళ్లించారంటూ సెబీ దర్యాప్తులో తేలడం తెలిసిందే. ఇరెడా, పీఎఫ్సీ నుంచి ఈవీలు, ఈపీసీ కాంట్రాక్టుల కోసం తీసుకున్న రుణాలను ప్రమోటర్లు మళ్లించి ఆస్తులు కొనుగోలు చేసినట్టు సెబీ గుర్తించింది. దీంతో ఈ వ్యవహారంపై ఈడీ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. -
ఉక్కు భారతాన్ని నిర్మిద్దాం
ముంబై: సవాళ్లను దీటుగా అధిగమించే, విప్లవాత్మకమైన, ఉక్కులాంటి దృఢమైన దేశంగా భారత్‌ను తీర్చిదిద్దడంలో పరిశ్రమ కూడా కలిసి రావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. నిరాటంకంగా ముడి వస్తువుల సరఫరా ఉండేలా చూసుకునేందుకు అంతర్జాతీయంగా పటిష్టమైన భాగస్వామ్యాలను ఏర్పర్చుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. దేశీయంగా ఉక్కు ఉత్పత్తిని పెంచేందుకు వినియోగంలో లేని గనుల నుంచి ఇనుప ఖనిజాన్ని వెలికితీయడంపై మరింతగా దృష్టి పెట్టాలని పరిశ్రమకు ఆయన సూచించారు. ఇండియా స్టీల్ 2025 కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ప్రధాని ఈ విషయాలు తెలిపారు. ఉక్కు పరిశ్రమ ఇప్పుడిప్పుడే ఉదయిస్తున్న రంగంగా ఆయన అభివర్ణించారు. అభివృద్ధికి వెన్నెముక ఈ కమోడిటీ ఉత్పత్తిని మరింతగా పెంచాలని, కొత్త ప్రక్రియలను వినియోగంలోకి తేవాలని పేర్కొన్నారు. కొత్త ఆవిష్కరణలు చేయడం, ఉత్తమ విధానాలను అమలు చేయడం, బొగ్గు దిగుమతులకు ప్రత్యామ్నాయాలను అన్వేíÙంచడంలాంటి అంశాలపై దృష్టి పెట్టాలని మోదీ సూచించారు. ప్రైవేట్, ప్రభుత్వ రంగ సంస్థలు తయారీ, టెక్నాలజీ అప్‌గ్రేడేషన్‌కి సంబంధించి కొత్త ఆవిష్కరణలు చేయాలని, వాటిని పరస్పరం ఇచి్చపుచ్చుకోవాలని సూచించారు. ముడి వస్తువులు సవాలే.. ఉక్కు రంగానికి నిరాటంకంగా ముడి వస్తువుల సరఫరా పెద్ద సవాలుగానే ఉంటోందని ప్రధాని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా భాగస్వామ్యాలను బలోపేతం చేసుకుని సరఫరా వ్యవస్థలను పటిష్టపర్చుకోవాలని చెప్పారు. ‘ఆందోళనకరమైన అంశాల్లో ముడి వస్తువుల సరఫరా కూడా ఒకటి. మనం ఇప్పటికీ నికెల్, కోకింగ్ కోల్, మ్యాంగనీస్ కోసం దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తోంది. కాబట్టి గ్లోబల్ భాగస్వామ్యాలను పటిష్టం చేసుకుంటూ, టెక్నాలజీలను అప్‌గ్రేడ్ చేసుకోవడంపై మరింతగా దృష్టి పెట్టాలి‘ అని ప్రధాని చెప్పారు. భవిష్యత్ పరిస్థితులను ఎదుర్కొనేందుకు పరిశ్రమ సన్నద్ధంగా ఉండాలని, కొత్త ప్రక్రియలను వినియోగంలోకి తేవాలని సూచించారు. 2024 ఆర్థిక సంవత్సరంలో 179 మిలియన్ టన్నులుగా ఉన్న ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని 2030 నాటికి 300 మిలియన్ టన్నులకు పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు ఆయన చెప్పారు. అలాగే తలసరి ఉక్కు వినియోగం కూడా 98 కేజీల నుంచి 160 కేజీలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ‘రహదారులు, రైల్వేలు, విమానాశ్రయాలు, పోర్టులు, పైప్లైన్లు ఇలా ఎన్నో పనులు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఉక్కు రంగానికి కొత్త అవకాశాలే‘ అని మోదీ తెలిపారు. మెగా ప్రాజెక్టులు పెరుగుతుండటం వల్ల హై–గ్రేడ్ స్టీల్‌కి డిమాండ్ పెరుగుతుందన్నారు. యువతకు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కూడా కలి్పంచే రంగం కావడంతో ఉక్కు పరిశ్రమ చాలా కీలకమైనదని మోదీ చెప్పారు. -
ఫెమా పెనాల్టీ ఫ్రేమ్‌వర్క్‌ను సడలించిన ఆర్బీఐ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) పెనాల్టీ నిబంధనలను సవరించింది. ఇందులో భాగంగా ఆర్బీఐ తాజాగా ఫెమా నిర్దిష్ట ఉల్లంఘనలకు జరిమానాలను రూ.2 లక్షలకు పరిమితం చేస్తున్నట్లు తెలిపింది. ఇది విదేశీ మారకద్రవ్య లావాదేవీలతో సంబంధం ఉన్న వ్యక్తులు, వ్యాపారాలకు కీలకం కానుంది.గతంలోని నిబంధనల ప్రకారం ఉల్లంఘనల మొత్తంలో కొంత శాతంగా ఈ జరిమానాలను వసూలు చేసేవారు. దీని స్థానంలో రూ.2 లక్షలు స్థిరమైన జరిమానా నిబంధనను తీసుకొచ్చారు. గతంలోని విధానం ద్వారా తరచుగా భారీ ఆర్థిక జరిమానాలు చెల్లించాల్సి వచ్చేది. ఫెమా పెనాల్టీ ఫ్రేమ్‌వర్క్ కింద లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) రాబడులు, ఎగుమతి కాలపరిమితిలో జాప్యం, అధిక విలువ కలిగిన షేర్లను బహుమతిగా ఇవ్వడం వంటి అంశాలు ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. పెనాల్టీలో భాగంగా ఫిక్స్డ్ క్యాప్‌ను ప్రవేశపెట్టడం ద్వారా జరిమానాల ప్రక్రియను సరళతరం చేసినట్లయిందని కొందరు భావిస్తున్నారు. ఇటువంటి నియంత్రణ ఉల్లంఘనల సమయంలో వ్యక్తులు, వ్యాపారాలు ఎదుర్కొనే ఆర్థిక ఒత్తిడిని తగ్గించడమే లక్ష్యంగా ఆర్బీఐ ఈ మార్పులు చేసినట్లు చెప్పింది.ఇదీ చదవండి: ‘పహల్గాం బాధిత కుటుంబ సభ్యులకు ఉద్యోగాలిస్తాం’ఈ చర్య వాటాదారులపై భారాన్ని తగ్గించి ఫెమా మార్గదర్శకాలను మరింత మెరుగ్గా పాటించేలా చేస్తుందని కొందరు చెబుతున్నారు. జరిమానాలు నిష్పాక్షికంగా ఉండేలా చూడటం ద్వారా దేశంలో మరింత స్నేహపూర్వక వ్యాపార వాతావరణాన్ని పెంపొందించేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు. -
‘పహల్గాం బాధిత కుటుంబ సభ్యులకు ఉద్యోగాలిస్తాం’
జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో బాధిత కుటుంబాలకు అండగా నిలిచేందుకు పాలసీబజార్ మాతృసంస్థ పీబీ ఫిన్‌టెక్ కట్టుబడి ఉందని తెలిపింది. ఇందులో భాగంగా ప్రత్యేక నియామక కార్యక్రమాన్ని ప్రకటించింది. సామాజిక బాధ్యత పట్ల సంస్థ నిబద్ధతను తెలియజేస్తూ, బాధిత కుటుంబ సభ్యులకు ఉద్యోగావకాశాలు కల్పించడంతో పాటు వారి పిల్లల చదువులకు సాయం చేయనుందని చెప్పింది.దేశంలోని పీబీ ఫిన్‌టెక్ కార్యాలయాల్లో ఈమేరకు అవకాశాలు కల్పిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. ఈ కష్ట కాలంలో ఆయా కుటుంబాలకు దీర్ఘకాలిక సాయాన్ని అందించేందుకు సంస్థ నిబద్ధతతో ఉందని తెలిపింది. ఈ సందర్భంగా కంపెనీ సహ వ్యవస్థాపకులు, ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ అలోక్ బన్సాల్ మాట్లాడుతూ.. ‘కంపెనీ అందిస్తున్న సాయం కేవలం పౌరులకే కాకుండా దాడిలో ప్రభావితమైన పోలీసు సిబ్బంది, పారామిలటరీ దళాలు, సాయుధ దళాల కుటుంబాలకు కూడా వర్తిస్తుంది. వారి అపారమైన త్యాగాలను గుర్తించి, ఈ కుటుంబాలకు సామాజిక భద్రతను కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉంది’ అని చెప్పారు.ఇదీ చదవండి: బంకుల్లో పెట్రోల్, డీజిల్ పోయమన్నా పోయరు!‘భాదిత కుటుంబాలకు కుచ్‌తో కర్నా హై(ఏదో ఒకటి చేయాలి) అనే భావనతో ఈ సాయం చేయాలని భావిస్తున్నాం. ఆ కుటుంబాలు కోల్పోయిన తమ ఆత్మీయులను తిరిగి తీసుకురాలేము. కానీ వారి బాధను కొంతైనా పంచుకునే అవకాశం ఉంది. మనం ఇప్పుడు వారికి సాయం చేయకపోతే ఎవరూ ముందుకురారు. బాధితులు ఎప్పటికీ ఒంటరికాదు. మేమంతా ఉన్నాం’ అని వారిలో ధైర్యం నింపారు. -
కొత్త ఫీచర్‌తో వాట్సప్ గ్రూప్ కంటెంట్‌కు మరింత భద్రత
వినియోగదారులు తమ సందేశాలు, మీడియా ఫైల్స్‌పై మరింత నియంత్రణను కల్పించేందుకు ప్రముఖ ఆన్లైన్ చాటింగ్ యాప్ వాట్సాప్ అడ్వాన్స్డ్ చాట్ ప్రైవసీ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ఇతరులు తమ చాట్‌లోని సందేశాలను, మీడియా ఫైల్స్‌ను ఎక్స్పోర్ట్ చేయకుండా, ఆటో డౌన్ లోడ్ చేయకుండా, ఏఐ సంబంధిత సాధనాల కోసం సందేశాలను ఉపయోగించకుండా నిరోధిస్తుంది.ఇదీ చదవండి: బంకుల్లో పెట్రోల్, డీజిల్ పోయమన్నా పోయరు!గోప్యతకు అత్యంత ప్రాముఖ్యతనిస్తూ వినియోగదారుల అవసరాల కోసం ఈ ఫీచర్‌ను తీసుకొచ్చినట్లు కంపెనీ తెలిపింది. గ్రూప్ మేసేజ్‌లకు మరింత భద్రత కల్పించేందుకు ఇది ఎంతో తోడ్పడుతుందని పేర్కొంది. చాట్ సెట్టింగ్స్‌లో ‘అడ్వాన్స్డ్ చాట్ ప్రైవసీ’ ఆప్షన్ ద్వారా దీన్ని మాన్యువల్‌గా ఎనేబుల్ చేయవచ్చు. ఒకసారి యాక్టివేట్ అయిన తర్వాత చాట్‌లో పాల్గొనే వారందరికీ పరిమితులు వర్తిస్తాయి. గ్రూప్‌లోని కంటెంట్ వాట్సాప్‌లోనే ఉండేలా చూసుకుంటుంది. -
బంకుల్లో పెట్రోల్, డీజిల్ పోయమన్నా పోయరు!
వాతావరణంలోని గాలి నాణ్యతను మెరుగుపరిచేందుకు ఢిల్లీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా జులై 1, 2025 నుంచి ‘ఎండ్-ఆఫ్-లైఫ్(ఈఓఎల్-నిబంధనల ప్రకారం వాడకూడని వాహనాలు)’ వాహనాలకు ఇంధనం నింపడాన్ని నిషేధించాలని నిర్ణయించింది. దేశ రాజధానిలో వాయు కాలుష్యానికి ప్రధాన కారమవుతున్న వాహనాల ఉద్గారాలను నియంత్రించడమే లక్ష్యంగా 15 ఏళ్లు పైబడిన పెట్రోల్ వాహనాలు, 10 ఏళ్లకు పైబడిన డీజిల్ వాహనాలను లక్ష్యంగా చేసుకుంటున్నట్లు తెలుస్తుంది.ఈ చర్యలను అమలు చేయడానికి ఢిల్లీలోని అన్ని ఇంధన స్టేషన్లలో జూన్ 30, 2025 నాటికి ఆటోమేటెడ్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ఏఎన్పీఆర్) కెమెరాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ అధునాతన వ్యవస్థ ఈఓఎల్ వాహనాలను గుర్తించి, వాటిలో ఇంధనం నింపకుండా నిరోధించేందుకు సాయం చేస్తుంది. ఈ ఆంక్షలు ఒక్క ఢిల్లీకే పరిమితం కావని కొందరు అధికారులు తెలుపుతున్నారు. నవంబర్ 1, 2025 నుంచి నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్) పరిధిలోని ఐదు జిల్లాల్లో ఈ నిషేదాజ్ఞలు ఉండబోతున్నాయి. ఇందులో గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘజియాబాద్, గౌతమ్ బుద్ధ నగర్, సోనిపట్లు ఉన్నాయి. ఏప్రిల్ 1, 2026 నాటికి ఈ విధానం మొత్తం ఎన్సీఆర్ను పరిధిలో విస్తరించబోతున్నట్లు తెలుస్తుంది.ఇదీ చదవండి: బీమా ప్రీమియం రేట్ల నోటిఫికేషన్లో జాప్యంమరోవైపు 2025 నవంబర్ 1 నుంచి బీఎస్-6 కాని రవాణా, వాణిజ్య గూడ్స్ వాహనాలను ఢిల్లీలోకి ప్రవేశించడాన్ని కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ (సీఏక్యూఎం) నిషేధించింది. ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాలలో వాహన కాలుష్యం క్లిష్టమైన సమస్యగా ఉన్నందున ఈ విధానాలు స్థిరమైన పద్ధతులను ప్రోత్సహించడానికి, ప్రజారోగ్యాన్ని రక్షించడానికి ఎంతో తోడ్పడుతాయని అధికారులు తెలిపారు. -
బీమా ప్రీమియం రేట్ల నోటిఫికేషన్లో జాప్యం
మోటార్ థర్డ్ పార్టీ (టీపీ) ప్రీమియం రేట్ల నోటిఫికేషన్ విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతోంది. 2025-26 సంవత్సరానికి సవరించిన మోటార్ థర్డ్ పార్టీ (టీపీ) ప్రీమియం రేట్ల వివరాలు ఇంకా విడుదల కాకపోవడంతో జనరల్ ఇన్సూరెన్స్ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ), రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ మధ్య సంప్రదింపుల తర్వాత సాధారణంగా ఈ రేట్లను ప్రకటిస్తారు.ప్రస్తుతానికి అయితే బీమా సంస్థలు గత ఏడాది రేట్ల ఆధారంగానే ప్రీమియంలను వసూలు చేస్తున్నాయి. త్వరలో వెలువడే సవరించిన రేట్లు ప్రస్తుతం కంటే ఎక్కువగా ఉంటే బీమా సంస్థలు నష్టపోయే ప్రమాదం ఉంది. అదే రేట్లు తక్కువగా ఉంటే వినియోగదారులు నష్టపోయే అవకాశం ఉంది. ఈ అనిశ్చితి మోటార్ ఇన్సూరెన్స్ రంగంలో ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీస్తోందని కొందరు నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ఇప్పటికే తన సిఫార్సులను పూర్తి చేసిందని, తదుపరి రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకోవాలని ఐఆర్డీఏఐ సీనియర్ అధికారి ఒకరు స్పష్టం చేశారు. తొలుత ఈ రేట్లను 2025 మార్చి 31 లోపు విడుదల చేయాలని అధికారులు భావించారు. వాటిని ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాల్సి ఉంది. కానీ రేట్ల విడుదలలో జాప్యం జరుగుతోంది. అయితే ఈసారి కొన్ని వాహన కేటగిరీలకు 10-15% ఇన్సూరెన్స్ ప్రీమియం పెంపు ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో సేవలు నిలిపివేత.. కారణం..గత ఐదేళ్లలో థర్డ్ పార్టీ ప్రీమియం రేట్లు 2-4% వరకు స్వల్పంగా పెరిగాయి. కానీ బీమా సంస్థలు ఈ ఏడాది గణనీయంగా రేట్లను సవరించనున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. పెరుగుతున్న క్లెయిమ్ ఖర్చులు కంపెనీల నష్టాలకు దారితీస్తున్నాయనే అభిప్రాయాలున్నాయి. ఇదిలాఉండగా, రోడ్డు ప్రమాద కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బీమా సంస్థలు ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడం, బాధితుల సామాజిక భద్రతను రక్షించేందుకు కట్టుబడి ఉండాలి. కానీ రేట్ల నిర్ధారణలో జాప్యం జరుగుతున్న నేపథ్యంలో బీమా సంస్థల వైఖరిపట్ల కొంత అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. -
ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో సేవలు నిలిపివేత.. కారణం..
ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం (సీఎస్ఎంఐఏ) పునర్నిర్మాణ ప్రణాళికలో భాగంగా ఆగస్టు 16, 2025 నుంచి సరుకు రవాణా కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. రన్‌వే 14/32 కోసం కొత్త ట్యాక్సీవేల నిర్మాణం చేపడుతున్న నేపథ్యంలో సర్వీసులను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఈ మౌలిక సదుపాయాల ఏర్పాటు వల్ల భవిష్యత్తులో ఎయిర్పోర్ట్ సామర్థ్యం మెరుగవుతుందని అధికారులు తెలిపారు. తిరిగి తదుపరి నోటీసులు అందేవరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయిని చెప్పారు.ముంబయిలో ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సరఫరా కావాల్సిన సరుకు రవాణా నవీ ముంబై విమానాశ్రయం నుంచి జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు. ఈ మార్పు ఆచరణాత్మక పరిష్కారాన్ని అందిస్తున్నప్పటికీ ఫార్మాస్యూటికల్స్, పాడైపోయే వస్తువులు వంటి ప్రత్యేక సరుకు రవాణా నిర్వహణపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ రెండు ఎయిర్‌పోర్ట్‌ల మధ్య దూరం, ముంబయి భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా సరుకు రవాణా ఆలస్యం కావచ్చని కొందరు భావిస్తున్నారు.సీఎస్ఎంఐఏకు పెరుగుతున్న ప్యాసింజర్, కార్గో రద్దీ కారణంగా ఎయిర్‌క్రాఫ్ట్‌ల రవాణా ఆలస్యం అవుతుంది. దాంతో మరిన్ని మెరుగైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని ఎయిర్పోర్ట్ వర్గాలు ఈ చర్యలకు పూనుకున్నాయి. ఎయిర్ ట్రాఫిక్‌కు గ్లోబల్ హబ్‌గా ముంబయి స్థానాన్ని బలోపేతం చేయడానికి ఈ సదుపాయాలు ఎంతో కీలకం కానున్నాయని తెలిపాయి.ఇదీ చదవండి: ప్రభుత్వ బాధ్యతల నుంచి మస్క్ వెనక్కిమౌలిక సదుపాయాల నవీకరణ ఇలా..రన్ వే 14/32 కోసం కొత్త టాక్సీవేలుటెర్మినల్ 1లో ఏటా రెండు కోట్ల మంది ప్రయాణీకులకు వసతి కల్పించడానికి ఏర్పాటు చేస్తున్నారు.మల్టీ మోడల్ ట్రాన్సిట్ హబ్ (ఎంఎంటీహెచ్)లో భాగంగా ఎయిర్‌పోర్ట్‌కు డైరెక్ట్ మెట్రో యాక్సెస్, అండర్ గ్రౌండ్ బస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు.అత్యాధునిక ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్లు, బ్యాగేజ్ హ్యాండ్లింగ్ సిస్టమ్‌ను అప్‌గ్రేడ్ చేస్తున్నారు.ఈగేట్స్, ఫాస్టాగ్ ఎనేబుల్డ్ పార్కింగ్, ఉచిత ఇంటర్ టెర్మినల్ కోచ్ ట్రాన్స్ఫర్ సర్వీసులను అందించేలా చర్యలు చేపడుతున్నారు. -
వరుస లాభాలకు బ్రేక్..
దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 82 పాయింట్లు నష్టపోయి 24,246 వద్దకు చేరింది. సెన్సెక్స్ 315 పాయింట్లు దిగజారి 79,801 వద్దకు చేరింది. ఇటీవల వరుసగా పెరిగిన మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాల్లోకి చేరుకున్నాయి.సెన్సెక్స్ 30 సూచీలో ఇండస్ఇండ్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా మోటార్స్, సన్‌ఫార్మా, టైటాన్, ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, బజాజ్ ఫిన్సర్వ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, కోటక్ మహీంద్రా బ్యాంక్ స్టాక్‌లు లాభాల్లో ముగిశాయి. హెచ్‌యూఎల్, భారతీ ఎయిర్టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, జొమాటో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఎం అండ్ ఎం, బజాజ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, ఇన్ఫోసిస్, నెస్లే, టీసీఎస్ స్టాక్‌లు నష్టపోయాయి.ఇదీ చదవండి: ప్రభుత్వ బాధ్యతల నుంచి మస్క్ వెనక్కిఈ రోజు మార్కెట్ల ఒడిదొడుకులకుగల కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇన్వెస్టర్లు ఇటీవలి లాభాలను స్వీకరించేందుకు పూనుకున్నారు. ఇది అమ్మకాల ఒత్తిడికి దారితీసింది.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
ప్రభుత్వ బాధ్యతల నుంచి మస్క్ వెనక్కి
ప్రపంచ కుబేరుడు, దిగ్గజ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలనలో చేపట్టిన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ(డోజ్)లో తన ప్రమేయాన్ని గణనీయంగా తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. డోజ్‌కు కేటాయిస్తున్న సమయాన్ని వచ్చే నెల నుంచి తగ్గించబోతున్నట్లు చెప్పారు. టెస్లాపై దృష్టి సారించాలనే ఉద్దేశంతో వారానికి ఒకటి నుంచి రెండు రోజులు మాత్రమే డోజ్‌కు సమయం కేటాయిస్తానని మస్క్ పేర్కొన్నారు.టెస్లాపై దృష్టి సారిస్తూ అధిక సమయం దానికే కేటాయించబోతున్నట్లు మస్క్ తీసుకున్న నిర్ణయంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఎలాన్ మస్క్ డోజ్ బాధ్యతలకు అధిక సమయం కేటాయించనప్పటికీ ట్రంప్ మస్క్‌పై ప్రశంసలు కురిపించారు. ఈమేరకు అమెరికాలోని ఓవల్ కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేసిన సందర్భంగా మస్క్ తెలివితేటలు, దేశభక్తిని కొనియాడారు. ఫెడరల్ సంస్కరణల్లో ఆయన చేసిన కృషిని సమర్థించారు.నిజమైన దేశభక్తుడు..మస్క్ తన ప్రభుత్వ పాత్ర కంటే టెస్లా వ్యాపారానికే అధిక ప్రాధాన్యత ఇస్తారని అందరికీ తెలుసునని ట్రంప్ అన్నారు. డోజ్‌లో మస్క్ పాత్ర వివాదాన్ని రేకెత్తించినప్పటికీ టెక్నాలజీలో తాను ఎంతో కృషి చేశారని చెప్పారు. రాజకీయ విభేదాల వల్ల తన ఆవిష్కరణల ప్రాధాన్యతను తగ్గించకూడదన్నారు. తాను నిజమైన దేశభక్తుడన్నారు. స్పేస్ఎక్స్తో మస్క్ ఏరోస్పేస్ విభాగంలో చేసిన ఆవిష్కరణలను గుర్తు చేసుకున్నారు. స్పేస్ఎక్స్ రాకెట్లు నింగిలో దూసుకెళ్లి, తిరిగి క్షేమంగా ల్యాండ్ అవ్వడం ఒక అద్భుతం అన్నారు. ఇది కేవలం మస్క్‌తోనే సాధ్యమైందని చెప్పారు. తిరిగి తాను త్వరలోనే డోజ్‌కు అధిక సమయం కేటాయించాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.ఇదీ చదవండి: 7.39 లక్షల మందికి కొత్తగా ఈపీఎఫ్2025 మొదటి త్రైమాసికంలో టెస్లా లాభాలు 71% క్షీణించాయి. మస్క్ సంపద తగ్గడానికి తాన వ్యాపారాల్లో పెరుగుతున్న రాజకీయ ప్రమేయమే కారణమని తెలుస్తోంది. ట్రంప్ ఎన్నికల ప్రచారానికి మస్క్ భారీగా ఖర్చు చేశారు. దీంతో అమెరికా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత.. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ (DOGE) అధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. -
7.39 లక్షల మందికి కొత్తగా ఈపీఎఫ్
ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) సామాజిక భద్రతా పథకం కిందకు ఫిబ్రవరి నెలలో నికరంగా రూ.16.10 లక్షల మంది సభ్యులు చేరారు. 2024 ఫిబ్రవరి నెలలో సభ్యుల నికర చేరికతో పోల్చితే 4 శాతం ఎక్కువ మందికి ఉపాధి లభించినట్టు ఈపీఎఫ్‌వో పేరోల్ గణంకాలు తెలియజేస్తున్నాయి. ఇందులో 7.39 లక్షల మంది కొత్తగా చేరారు. పెరుగుతున్న ఉపాధి అవకాశాలు, ఉద్యోగుల ప్రయోజనాలపై విస్తృతమవుతున్న అవగాహన, ఈపీఎఫ్‌వో అవగాహన కార్యక్రమాలు కొత్త సభ్యుల చేరిక పెరిగేందుకు కారణమని కార్మిక శాఖ తన ప్రకటనలో పేర్కొంది.కొత్త సభ్యుల్లో 4.27 లక్షల మంది 18–25 ఏళ్ల వయసు నుంచి ఉన్నారు. మొత్తం కొత్త సభ్యుల్లో వీరి వాటాయే 58 శాతంగా ఉంది. అంటే సంఘటిత రంగంలో వీరు మొదటిసారి ఉపాధి పొందినట్టు తెలుస్తోంది. సుమారుగా 13.18 లక్షల మంది సభ్యులు ఒక సంస్థను వీడి మరో సంస్థలో చేరిపోయారు. గతేడాది ఇదే నెలలో పోల్చి చూస్తే 12 శాతం పెరుగుదల నమోదైంది. పాత ఖాతాను మూసివేయకుండా, కొత్త సంస్థకు బదిలీ చేసుకున్నారు.3.37 లక్షల మంది మహిళలు.. ఫిబ్రవరిలో ఈపీఎఫ్‌వోలో నికరంగా చేరిన సభ్యుల్లో 3.37 లక్షల మంది మహిళలు కావడం గమనార్హం. 2024 ఫిబ్రవరి గణాంకాలతో పోల్చి చూస్తే 9.23 శాతం పెరుగుదల నమోదైంది. ఇందులో 2.08 లక్షల మంది కొత్తగా చేరారు. 2024 ఫిబ్రవరితో పోల్చి చూస్తే కేవలం 1.26 శాతమే పెరిగింది. అత్యధికంగా మహారాష్ట్ర నుంచి ఫిబ్రవరిలో 20.90 శాతం సభ్యులు నికరంగా చేరారు. ఆ తర్వాత తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, హర్యాన, ఢిల్లీ, తెలంగాణ, యూపీ నుంచి 5 శాతానికి పైన సభ్యులు నమోదయ్యారు. ఫిష్ ప్రాసెసింగ్, నాన్ వెజిటేరియన్ ఆహార కేంద్రాలు, సొసైటలు, క్లబ్‌లు, స్వీపింగ్ సేవల్లో సభ్యుల చేరిక పెరిగింది. ఎగుమతి సేవల్లో సభ్యుల చేరిక 41.72 శాతంగా ఉంది. -
ఫ్రెషర్లకు జాబ్స్ జాతర.. 4 లక్షల ఉద్యోగాలు
ముంబై: దేశీయంగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలో (జీసీసీ) ఫ్రెషర్లకు భారీగా కొలువులు రానున్నాయి. 2030 నాటికి 4 లక్షల పైచిలుకు ఉద్యోగాల కల్పన జరగనుంది. హెచ్ఆర్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్‌ఫాం ఫస్ట్‌మెరీడియన్ ఒక నివేదికలో ఈ విషయాలు వెల్లడించింది. డిజిటల్ సామర్థ్యాలున్న నిపుణుల లభ్యత, వ్యయాలపరంగా అనుకూల పరిస్థితులు తదితర అంశాల కారణంగా భారత్‌లో జీసీసీ వ్యవస్థ వేగంగా ఎదుగుతోంది. 2030 నాటికి ఇది 110 బిలియన్ డాలర్లకు చేరుతుందనే అంచనాలు ఉన్నాయని ఫస్ట్‌మెరీడియన్ బిజినెస్ సర్వీసెస్ సీఈవో సునీల్ నెహ్రా తెలిపారు.ఈ వృద్ధితో 2030 నాటికి జీసీసీల్లో మొత్తం ఉద్యోగుల సంఖ్య 30 లక్షలకు చేరుతుందని పేర్కొన్నారు. ఇందులో సుమారు ఎంట్రీ స్థాయి ఉద్యోగాలు గణనీయంగా ఉంటాయని వివరించారు. జీసీసీ సిబ్బందిలో మహిళల వాటా 40 శాతానికి చేరవచ్చని పేర్కొన్నారు. -
హైదరాబాద్‌లో ఫిట్నెస్ ఇన్నోవేషన్ సెంటర్
హైదరాబాద్: ఫిట్నెస్ సంస్థలకు టెక్నాలజీ సేవలు అందించే గ్లోబల్ సంస్థ ఏబీసీ ఫిట్నెస్ హైదరాబాద్‌లో తమ ఇన్నోవేషన్ హబ్‌ను ఆవిష్కరించింది. ఫిట్నెస్ పరిశ్రమకు అవసరమైన టెక్నాలజీలను రూపొందించడంపై ఇది ప్రధానంగా దృష్టి పెడుతుంది.అంతర్జాతీయంగా ఎఫ్45 ఫ్రాంచైజీ, స్థానికంగా ది ఫిట్ స్ట్రీక్లాంటి ఇరవై పైగా కస్టమర్లకు కంపెనీ సర్వీసులు అందిస్తోంది. సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, డేటా సైంటిస్టులు సహా వచ్చే ఏడాది వ్యవధిలో 200 మంది సిబ్బందిని నియమించుకోనున్నట్లు సంస్థ సీఈవో బిల్ డేవిస్ వివరించారు. భారత్‌లో ఒసాము సుజుకీ ఎక్సలెన్స్ సెంటర్జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం సుజుకీ మోటర్ కార్పొరేషన్ తమ మాజీ చైర్మన్, దివంగత ఒసాము సుజుకీ గౌరవార్థం భారత్‌లో ఆయన పేరిట సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను (ఓఎస్సీవోఈ) ఏర్పాటు చేయనుంది. దేశీ కార్ల దిగ్గజం మారుతీ సుజుకీతో కలిసి గుజరాత్, హర్యానాలో ఓఎస్సీవోఈని నెలకొల్పనుంది. తయారీ రంగం అధిక వృద్ధి సాధనలోను, విడిభాగాల తయారీ సంస్థల ప్రమాణాలను మెరుగుపర్చడంలోను ప్రభుత్వ లక్ష్యాలకు తోడ్పడేదిగా ఇది ఉంటుందని మారుతీ సుజుకీ తెలిపింది. -
ఎస్బీఐ జనరల్ లాభం రూ. 509 కోట్లు
ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం(2024–25) ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. నికర లాభం రెట్టింపునకుపైగా జంప్‌చేసి రూ. 509 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది(2023–24) కేవలం రూ. 240 కోట్లు ఆర్జించింది.స్థూల ప్రీమియం ఆదాయం(జీడబ్ల్యూపీ) సైతం 11 శాతం ఎగసి రూ. 14,140 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది రూ. 12,731 కోట్ల జీడబ్ల్యూపీ సాధించింది. కంపెనీ సాల్వెన్సీ రేషియో ఆర్థిక పటిష్టతను సూచిస్తూ 2ను మించింది. నిబంధనల ప్రకారం 1.5 నిష్పత్తిని మించింది. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐకు సాధారణ బీమా రంగ అనుబంధ సంస్థ ఇది.హెల్త్ ఇన్సూరెన్స్ విభాగం 19.2 శాతం, మోటార్ ఇన్సూరెన్స్ 31.2 శాతం వృద్ధిని నమోదు చేసుకోవడంతో కంపెనీ పటిష్టమైన పనితీరు కనబరిచింది. మెరైన్ కార్గో, ఇంజినీరింగ్, కమర్షియల్ లైన్స్ సహా ఇతర విభాగాలు కూడా బీమా కంపెనీ వృద్ధికి ఊతమిచ్చాయి.ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈఓ నవీన్ చంద్ర ఝా మాట్లాడుతూ ‘2025 ఆర్థిక సంవత్సరం పనితీరు కస్టమర్ సర్వీస్, వృద్ధి, లాభదాయకత పట్ల మా నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. జీడబ్ల్యూపీ వృద్ధి 11.1 శాతం, పీఏటీలో 2.1 రెట్లు పెరుగుదలతో, మేము మార్కెట్ కంటే వేగంగా అభివృద్ధి చెందుతున్నాం’ అన్నారు. -
బ్యాంకులకు ఏప్రిల్‌లో ఇంకా 4 సెలవులు..
మరికొన్ని రోజుల్లో ఏప్రిల్ నెల ముగుస్తుంది. ఈ మిగిలిన రోజుల్లో ఏప్రిల్ 30 వరకూ దేశంలోని బ్యాంకులకు నాలుగు రోజులు సెలవులు ఉన్నాయి. వీటిలో సాధారణ వారాంతపు సెలవులైన నాలుగో శనివారం, ఆదివారంతోపాటు విశేష దినోత్సవాల సెలవులూ ఉన్నాయి. ఆయా రోజుల్లో బ్యాంకు శాఖలు ఖాతాదారులకు అందుబాటులో ఉండవు.దేశంలో బ్యాంకులకు సెలవులను భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) నిర్ణయిస్తుంది. స్థానిక పండుగలు, విశేష సందర్భాల ఆధారంగా ఈ సెలవులు రాష్ట్రాన్ని బట్టి మారవచ్చు. ఈ సెలవులు ఏయే ప్రాంతాల్లో ఉన్నాయో ముందస్తుగా తెలుసుకుంటే వినియోగదారులు తమ బ్యాంకింగ్ కార్యకలాపాలను ప్లాన్ చేసుకోవడానికి వీలుంటుంది.రానున్న బ్యాంక్ సెలవుల జాబితా» ఏప్రిల్ 26న నాలుగో శనివారం, గౌరీ పూజ కారణంగా పలు రాష్ట్రాల్లో బ్యాంకులు మూతపడనున్నాయి.» ఏప్రిల్ 27న ఆదివారం సాధారణ వారాంతపు సెలవు ఉంటుంది.» ఏప్రిల్ 29న పరశురామ్ జయంతి సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ లో బ్యాంకులకు సెలవు.» ఏప్రిల్ 30న కర్ణాటకలో బసవ జయంతి, అక్షయ తృతీయను పురస్కరించుకుని బ్యాంకులు మూతపడనున్నాయి.ఈ సెలవులు ఆఫ్‌లైన్ బ్యాంకింగ్ సేవలపై ప్రభావం చూపినప్పటికీ, ఖాతాదారులకు డిజిటల్ బ్యాంకింగ్ సేవలను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. చాలా కీలకమైన బ్యాంకింగ్ కార్యకలాపాలు ఇప్పుడు మొబైల్ ఫోన్ ఉపయోగించి నిర్వహించుకునే వెసులుబాటు ఉంది. -
బంగారం ధరల్లో మళ్లీ మార్పు
దేశంలో తారాస్థాయికి చేరిన బంగారం ధరలు (Gold Prices) దిగివస్తున్నాయి. వరుసగా రెండో రోజూ తగ్గుముఖం పట్టాయి. నేడు (ఏప్రిల్ 24) కూడా పసిడి ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. క్రితం రోజున పుత్తడి ధర 10 గ్రాములకు ఏకంగా రూ.3000 మేర క్షీణించి రూ.లక్ష దిగువకు వచ్చేసిన సంగతి తెలిసిందే.అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు, డాలర్‌తో రూపాయి మారకం రేటు, స్థానిక డిమాండ్ వంటి అంశాలు ఈ ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ఏప్రిల్ 24 నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్, 22 క్యారెట్ బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి..తెలుగు రాష్ట్రాల్లో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,240- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,050హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, స్థానిక జ్యువెలరీ షాపుల్లో మేకింగ్ ఛార్జీలు,జీఎస్టీ కారణంగా కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.100, రూ.110 చొప్పున తగ్గాయి.👉ఇదీ చదవండి: చూశారా.. ‘బంగారమే డబ్బు’!చెన్నైలో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,240- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,050చెన్నైలో బంగారం ధరలు ఇతర నగరాలతో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ పోర్ట్ సౌకర్యాలు, డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.100, రూ.110 చొప్పున తగ్గాయి.ఢిల్లీలో.. - 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,340- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,200ఢిల్లీలో బంగారం ధరలు రవాణా ఖర్చులు, స్థానిక ట్యాక్స్‌ల కారణంగా కొంత ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ నగరంలో బంగారం కొనుగోలుదారులు హాల్‌మార్క్ ఆభరణాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.100, రూ.160 చొప్పున తగ్గాయి.ముంబైలో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,240- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,050ముంబైలో బంగారం ధరలు స్థానిక డిమాండ్, జ్యువెలరీ డిజైన్లపై ఆధారపడి మారుతూ ఉంటాయి. ఈ నగరంలో బంగారం కొనుగోలు చేసే ముందు పలు జ్యువెలరీ షాపుల ధరలను సరిపోల్చడం మంచిది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.100, రూ.110 చొప్పున తగ్గాయి.బెంగళూరులో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,240- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,050బెంగళూరులో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి, కానీ స్థానిక ఆర్థిక పరిస్థితులు, ఫెస్టివల్ సీజన్ డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేయవచ్చు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.100, రూ.110 చొప్పున తగ్గాయి.👉ఇది చదివారా? బంగారం.. ఈ దేశాల్లో చవకే..!!బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు భారత రూపాయి విలువ, దిగుమతి సుంకాలు, స్థానిక ట్యాక్స్‌లు, రవాణా ఖర్చులు ధరలలో వ్యత్యాసాలకు కారణమవుతున్నాయి. అదనంగా, భారతదేశంలో వివాహ సీజన్, పండుగల సమయంలో బంగారం డిమాండ్ పెరగడం వల్ల ధరలు కొంత పెరిగే అవకాశం ఉంది. బంగారం కొనుగోలు చేసే ముందు, హాల్‌మార్క్ సర్టిఫికేషన్‌ను తప్పనిసరిగా తనిఖీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) హాల్‌మార్క్ బంగారం స్వచ్ఛతను నిర్ధారిస్తుంది. అలాగే, వివిధ జ్యువెలరీ షాపుల్లో ధరలు, మేకింగ్ ఛార్జీలను సరిపోల్చడం ద్వారా మంచి డీల్ పొందవచ్చు.👉ఇది చదివారా? ఆ బంగారం మర్చిపోండి.. ఈ లోహమే ‘భవిష్యత్ బంగారం’వెండి ధరలుదేశవ్యాప్తంగా వెండి ధరలు కూడా నేడు స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి. వెండి ధర కేజీకి రూ.100 మేర క్షీణించింది. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీ రూ.1,10,900 వద్ద ఉండగా ఢిల్లీలో రూ. 1,00,900 వద్ద కొనసాగుతోంది.(గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు
భారత బెంచ్ మార్క్ ఈక్విటీ సూచీలు గురువారం మార్కెట్ ప్రారంభంలో నష్టపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 171.85 పాయింట్లు లేదా 0.21 శాతం క్షీణించి 79,944.64 వద్ద, నిఫ్టీ 50 సూచీ 47.95 పాయింట్లు లేదా 0.2 శాతం తగ్గి 24,281 వద్ద ట్రేడవుతున్నాయి.బీఎస్ఈ సెన్సెక్స్‌లో జీఎస్ఎస్ ఇన్ఫోటెక్, మోడీ రబ్బర్, థైరోకేర్ టెక్నాలజీస్, వివిడ్ మర్కంటైల్, కేఐవోసీఎల్ టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. మరోవైపు స్టెర్లైట్ టెక్నాలజీస్, బృందావన్ ప్లాంటేషన్, డాప్స్ అడ్వర్టైజింగ్, సింజీన్ ఇంటర్నేషనల్, ప్రైమా ఆగ్రో ప్రొడక్ట్స్ టాప్ లూజర్స్‌గా కొనసాగుతున్నాయి.నిఫ్టీ ఎఫ్ అండ్ ఓ కాంట్రాక్టుల నెలవారీ గడువు ముగియడంతో పాటు టెక్ మహీంద్రా, నెస్లే ఇండియా వంటి కంపెనీల నాలుగో త్రైమాసిక ఫలితాల కారణంగా ఇన్వెస్టర్లు కదలికలపై ఓ కన్నేసి ఉంచనున్నారు. -
ఏథర్ ఐపీవో: ఒక్కో షేర్ ధర ఎంతంటే..
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన కంపెనీ ఏథర్ ఎనర్జీ పబ్లిక్ ఇష్యూకి రూ. 304–321 ధరల శ్రేణి ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 28న ప్రారంభమై 30న ముగియనుంది. దీనిలో భాగంగా రూ. 2,626 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 1.1 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు.తద్వారా రూ. 2,981 కోట్లు సమీకరించనుంది. వెరసి కొత్త ఆర్థిక సంవత్సరం(2025–26)లో తొలి పబ్లిక్ ఇష్యూగా నిలవనుంది. ఈ ఇష్యూలో ఒక్కో షేర్ ముఖ విలువ రూ.1గా ఉంటుంది. ఒక్కో ఇన్వెస్టర్ కనీసం 46 షేర్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.యాంకర్ ఇన్వెస్టర్లకు ఏప్రిల్ 25నే బిడ్డింగ్ ప్రారంభం కానుంది. ఇక తమ ఉద్యోగులకు లక్ష షేర్ల వరకూ కేటాయించిన ఏథర్.. వారికి ఒక్కో షేర్‌పై రూ.30 తగ్గింపు అందిస్తోంది. ఐపీవో ద్వారా దేశీ స్టాక్ ఎక్స్ఛేంజీలలో గతేడాది ఆగస్ట్‌లో లిస్టయిన ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ తదుపరి రెండో ద్విచక్ర ఈవీ కంపెనీగా ఏథర్ నిలవనుంది. -
పసిడి పరుగుతో లాకర్లకు డిమాండ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పసిడి ధర పరుగులు తీస్తున్న నేపథ్యంలో హోమ్ లాకర్లకు కూడా గణనీయంగా డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే గోద్రెజ్ ఎంటర్ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన సెక్యూరిటీ సొల్యూషన్స్ విభాగం సరికొత్త సెక్యూరిటీ సొల్యూషన్స్‌ను ఆవిష్కరించింది. గృహ, వ్యాపార అవసరాల కోసం ఉపయోగపడే 7 ఉత్పత్తులు ఉన్నాయి.వీటిలో డిజిటల్.. బయోమెట్రిక్ యాక్సెస్, ఇంటెలిజెంట్ ఐబజ్ అలారం సిస్టం వంటి ఫీచర్లు ఉన్నట్లు సెక్యూరిటీ సొల్యూషన్స్ బిజినెస్ హెడ్ పుష్కర్ గోఖలే వివరించారు. ఇళ్లలో వినియోగించే ఉత్పత్తుల ధర శ్రేణి రూ. 9,000 నుంచి ప్రారంభమవుతుందన్నారు. ఏపీ, తెలంగాణలో 500 పైచిలుకు అవుట్‌లెట్స్ ఉండగా, సుమారు రూ. 130 కోట్ల ఆదాయం ఉంటోందని జోనల్ హెడ్ శరత్ మోహన్ పేర్కొన్నారు. -
బంగారం డిమాండ్‌కు ‘ధరా’ఘాతం!
ముంబై: బంగారం ధరలు గణనీయంగా పెరిగిపోవడం వినియోగ డిమాండ్‌ను దెబ్బతీయొచ్చని పరిశ్రమ వర్గాలు, రేటింగ్ ఏజెన్సీలు భావిస్తున్నాయి. అయినప్పటికీ ఈ నెల 30న అక్షయ తృతీయ, తదుపరి మే చివరి వరకు వివాహాల సీజన్ నేపథ్యంలో కొనుగోళ్ల సెంటిమెంట్ సానుకూలంగా ఉండొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఈ నెల 22న బంగారం 10 గ్రాములకు ఢిల్లీలో రూ.1,01,350కు పెరిగిపోవడం తెలిసిందే. ‘‘బంగారం ధరలు అనూహ్యంగా పెరగడం అన్నది డిమాండ్‌పై కచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. ఈ షాక్ నుంచి తేరుకున్న తర్వాత డిమాండ్ స్థిరపడుతుంది. మొత్తం మీద అయితే మార్కెట్లో సానుకూల సెంటిమెంట్ ఉంది. అక్షయ తృతీయ, వివాహాల సీజన్ నేపథ్యంలో వినియోగదారుల నుంచి మంచి డిమాండ్ ఉంటుందని అంచనా వేస్తున్నాం’’ అని ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యుయలరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ రాజేష్ రోక్డే తెలిపారు.2023లో 741 టన్నుల బంగారం దిగుమతి కాగా, ధరలు 20% మేర పెరిగినప్పటికీ 2024లో 802 టన్నులు దిగుమతి కావడాన్ని ఆయన ప్రస్తావించారు. బంగారం ధర రూ.లక్షకు చేరడం కచ్చితంగా డిమాండ్‌పై 10–15% ప్రభావం ఉండొచ్చని ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యుయలరీ డొమెస్టిక్ కౌన్సిల్ వైస్ చైర్మన్ అవినాష్ గుప్తా చెప్పారు. ఒత్తిడి ఉన్నప్పటికీ.. ‘‘మార్కెట్లో ఆశావహ వాతావరణం కనిపిస్తోంది. బంగారం ధరలు భవిష్యత్తులో ఇంకా పెరుగుతాయన్న అంచనాలు నెలకొన్నాయి. కొంతకాలంగా ధరలు పెరుగుదలతో అమ్మకాల పరిమాణంపై ఒత్తిడి నెలకొంది. అయినప్పటికీ వినియోగదారుల్లో ఉన్న సానుకూల సెంటిమెంట్ పరిశ్రమకు అనుకూలిస్తుంది’’ అని పీఎన్ గాడ్గిల్ జ్యుయలర్స్ చైర్మన్ సౌరభ్ గాడ్గిల్ తెలిపారు.విక్రయాలు 9–11 శాతం తగ్గొచ్చు.. బంగారం ధరలు ఆల్‌టైమ్ గరిష్టాలకు చేరినందున ఈ ఏడాది (2025–26) సంస్థాగత రిటైల్ జ్యుయలర్ల అమ్మకాలు (పరిమాణం పరంగా) 9–11% వరకు తగ్గొచ్చని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. అధిక ధరల కారణంగా వినియోగదారులు తక్కువ పరిమాణంలో కొనుగోళ్లకు మొగ్గు చూపించొచ్చని పేర్కొంది. కొనుగోలు వ్యయం అంతే ఉండి, క్యారట్, గ్రాముల రూపంలో తగ్గొచ్చని వివరించింది. అయినప్పటికీ అమ్మకాల ఆదాయం క్రితం ఆర్థిక సంవత్సరం కంటే 13–15% పెరగొచ్చని తాజా నివేదికలో తెలిపింది.రూ.లక్ష దిగువకు పసిడిబంగారం ధర రూ.లక్షను దాటిన ఒక్కరోజులోనే అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నది. బుధవారం ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాములకు (99.9 శాతం స్వచ్ఛత) రూ.2,400 నష్టపోయింది. రూ.99,200 వద్ద స్థిరపడింది. 99.5% స్వచ్ఛత బంగారం రూ.3,400 నష్టపోయి రూ.98,700కు దిగొచ్చింది. చైనాపై విధించిన టారిఫ్‌లు చాలా ఎక్కువగా ఉన్నాయని, వాటిని త్వరలోనే తగ్గించనున్నట్టు ట్రంప్ ప్రకటించడం అమ్మకాలకు దారితీసింది. -
ఖరీదైనవి కొంటున్నారా? కట్టండి పన్ను..
న్యూఢిల్లీ: హ్యాండ్ బ్యాగ్‌లు, చేతి గడియారాలు, పాదరక్షలు, క్రీడా వస్త్రాలు రూ.10 లక్షలు మించినవి మరింత ఖరీదుగా మారనున్నాయి. వీటిపై ఒక శాతం మూలం వద్దే పన్ను వసూలు (టీసీఎస్) చేయనున్నారు. ప్రస్తుతం ఒక శాతం టీసీఎస్ రూ.10 లక్షలు మించిన మోటారు వాహనాలపైనే అమలవుతోంది. ఒక శాతం టీసీఎస్ వర్తించే విలాస వస్తువుల జాబితాను ఆదాయపన్ను శాఖ తాజాగా విడుదల చేసింది.పెయింటింగ్‌లు, శిల్పాలు, పురాతన వస్తువులు, కాయిన్లు, స్టాంప్‌లు, పడవలు, హెలికాప్టర్లు, లగ్జరీ హ్యాండ్‌బ్యాగ్‌లు, కళ్లద్దాలు, పాదరక్షలు, క్రీడావస్త్రాలు, క్రీడా పరికరాలు, హోమ్ థియేటర్ సిస్టమ్‌లు, రేసింగ్ కోసం ఉద్దేశించిన గుర్రాల విక్రయ ధరపై ఒక శాతం టీసీఎస్ అమలవుతుంది. కొనుగోలుదారుల నుంచి ఉత్పత్తి ధరపై ఒక శాతం అదనంగా టీసీఎస్‌ను విక్రయదారులే వసూలు చేస్తారు. వారి పాన్ వివరాలు కూడా తీసుకుని, ఆదాయపన్ను శాఖకు జమ చేస్తారు. కొనుగోలుదారులు ఆదాయపన్ను రిటర్నులు వేయడం ద్వారా తమ పన్ను చెల్లింపులో సర్దుబాటు చేసుకోవచ్చు.పన్ను చెల్లించే బాధ్యత లేకపోతే రిఫండ్ కోరొచ్చు. టీసీఎస్ రూపంలో ఆదాయపన్ను శాఖకు అదనంగా ఎలాంటి పన్ను ఆదాయం రాదు. కాకపోతే అధిక కొనుగోళ్ల వివరాలను పాన్ నంబర్ల ఆధారంగా తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది. అధిక విలువతో కూడిన విచక్షణారహిత కొనుగోళ్ల పర్యవేక్షణను బలోపేతం చేయడం, పన్ను చెల్లింపుదారులను పెంచుకోవడం దీని లక్ష్యమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.