రూపే కార్డు వినియోగం పెంచాలి | latest RuPay card usage recent government financial reports | Sakshi
Sakshi News home page

రూపే కార్డు వినియోగం పెంచాలి

Feb 18 2026 8:43 AM | Updated on Feb 18 2026 9:30 AM

latest RuPay card usage recent government financial reports

చెల్లింపులకు యూపీఐ ప్రధాన సాధనంగా మారిందని.. నగదు లావాదేవీలను మించిపోయాయని కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం ప్రకటించింది. రూపే డెబిట్‌ కార్డు వాడకం లక్ష్యిత చర్యలు అవసరమని పేర్కొంది. ఇందుకు సంబంధించి ఒక సర్వే చేసింది. 15 రాష్ట్రాల్లో 10,378 మంది అభిప్రాయాలను స్వీకరించింది. భిన్న సామాజిక ఆర్థిక విభాగాల్లో డిజిటల్‌ చెల్లింపుల ఆమోదం పెరిగినట్టు తెలిసింది. 

సర్వేలో పాల్గొన్న వారిలో 57 శాతం మంది చెల్లింపులకు యూపీఐ సాధనాన్ని వినియోగిస్తున్నారు. నగదు వినియోగం 38 శాతాన్ని ఇది అధిగమించినట్టు ఈ నివేదిక తెలిపింది. సులభంగా, చెల్లింపులు అప్పటికప్పుడు పూర్తయిపోతుండడాన్ని ఇందుకు అనుకూలంగా పేర్కొంది. 65 శాతం మంది రోజులో ఒకటికి మించిన లావాదేవీలను యూపీఐ ద్వారానే నిర్వహిస్తున్నట్టు చెప్పారు. రూపే డెబిట్‌ కార్డు వినియోగాన్ని, ముఖ్యంగా గ్రామీణ, చిన్న పట్టణాల్లో పెంచాలంటూ.. వర్తకులు ఈ కార్డులను ఆమోదించే విధంగా ప్రోత్సాహక కార్యక్రమాలను అమలు చేయాలని సూచించింది.

ఇదీ చదవండి: డిజిటల్‌ రాజ్యంలోనూ.. క్యాషే కింగ్‌
 

Advertisement
 
Advertisement
Advertisement