Sri Sathya Sai
-
ఆగస్టులోపు పూర్తి చేస్తాం
ఎస్సీ, ఎస్టీ గృహాలపై ఉచిత సోలార్ యూనిట్ల ఏర్పాటు పనులు ఆగస్టులోపు 100 శాతం పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం. జిల్లాలో ఐదుగురు కాంట్రాక్టర్లు సోలార్ పనులు చేస్తున్నారు. వారితో ఇప్పటికే ప్రత్యేకంగా సమావేశమయ్యాం. అనుకున్న లక్ష్యాలను ఎట్టి పరిస్థితుల్లోను పూర్తి చేస్తాం. కొన్ని నియోజకవర్గాల్లో పనులు సాగడం లేదన్న మాట వాస్తవమే. అక్కడ కాంట్రాక్టర్లతో చర్చించి పనులు వేగవంతం చేయాలని ఆదేశించాం. – శేషాద్రి శేఖర్, విద్యుత్‌శాఖ ఎస్ఈ, అనంతపురం -
‘ఐఎంఏ’ను మరింత అభివృద్ధి చేస్తాం
ధర్మవరం రూరల్: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సేవలను మరింత అభివృద్ధి చేస్తామని ఏపీ ఐఎంఏ అధ్యక్షుడు బాలరాజు, రాష్ట్ర కార్యదర్శి సుభాష్‌చంద్రబోస్ తెలిపారు. ఆదివారం ధర్మవరం పట్టణంలోని ఐఎంఏ పనితీరును, వారు చేస్తున్న సేవలను పరిశీలించారు. అనంతరం వారు పట్ట్టణంలో ఐఎంఏ చేస్తున్న సేవలను, వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎస్బీఐ కాలనీలోని డాక్టర్ నరసింహులతో వారు పలు విషయాలపై చర్చించారు. త్వరలో పుట్టపర్తి రోడ్డులో నిర్మించనున్న ఐఎంఏ కార్యాలయ స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు ఐఎంఏ కార్యదర్శి వరుణ్‌కుమార్‌రెడ్డి, మాజీ రాష్ట్ర అధ్యక్షులు ప్రసాద్‌రెడ్డి, రాష్ట్ర వర్కింగ్ సభ్యులు నరసింహులు, స్థానిక ఐఎంఏ సభ్యులు సుధాకర్, వాసుదేవరెడ్డి, వెంకటరామిరెడ్డి, మదన్‌మోహన్‌రెడ్డి, సూర్యనారాయణరెడ్డి, పద్మ, కుమార్‌బాబు, జగదీష్, విక్రాంత్, నజీర్, హరి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. విజయభాస్కర్ మృతిపై విచారణ జరపాలి మడకశిర: దళిత యువకుడు విజయభాస్కర్ మృతిపై రాష్ట్ర ప్రభుత్వం సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలోని దళిత హక్కుల పరిరక్షణ సమితి కార్యాలయంలో దళిత సంఘాల నాయకులు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. దళిత హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు హనుమంతు అధ్యక్షత వహించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో గుడిబండ మండలం మందలపల్లికి చెందిన దళిత యువకుడు విజయభాస్కర్ (24) అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన అంశంపై చర్చించారు. విజయభాస్కర్‌ను హత్య చేశారని, హత్య కేసు నమోదు చేసి హంతకులను అరెస్ట్ చేయాలని నాయకులు పెద్ద ఎత్తున మడకశిరలో ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. అయినా ఇంత వరకు విజయభాస్కర్ మృతి మిస్టరీ వీడ లేదు. దీంతో దళిత సంఘాల నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి విజయభాస్కర్ మృతిపై విచారణ జరిపి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు తిప్పేస్వామి, ఎస్సీ,ఎస్టీ జేఏసీ చైర్మన్ సాకే హరి, ఎస్సీ జన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కుళ్లాయప్ప, బహుజన చైతన్య వేదిక అధ్యక్షుడు శివరామక్రిష్ణ, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు సాకే వినయ్‌కుమార్ మాట్లాడుతూ విజయభాస్కర్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు. సమావేశంలో వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి తిప్పేస్వామి, న్యాయవాది గోపాలకృష్ణ, దళిత సంఘాల నాయకులు కుళ్లాయప్ప, తదితరులు పాల్గొన్నారు. -
ఊదరగొట్టి.. కష్టాల్లోకి నెట్టి
పుట్టపర్తి అర్బన్: తాము అధికారంలోకి రాగానే పెట్రోలు ధరలు తగ్గిస్తామంటూ గత సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టిన నారా లోకేష్ మాట తప్పారు. అధికారంలోకి వచ్చాక ఆ విషయమే మరచిపోయారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను మరింత పెంచినా నోరు మెదపడం లేదు. పెరిగిన ఇంధన ధరలతో జిల్లా వాసులపై ప్రతి నెలా రూ.1.30 కోట్ల అదనపు భారం పడనుండడం గమనార్హం. బెంబేలెత్తుతున్న సామాన్యులు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకు షాకుల మీద షాకులు ఇస్తోంది. సర్కారు అలసత్వం కారణంగా విత్తన ధరలు, కూలీ రేట్లు, ఎరువుల ధరలు పెరగడంతో రైతులు దిక్కులు చూస్తున్నారు. పండిన పంటలకు గిట్టుబాటు ధరలు దక్కక ఎటూ పాలుపోవడం లేదు. మరోవైపు విద్యుత్ చార్జీలు, గ్యాస్ సిలిండర్ ధరలు, స్కూల్ ఫీజులు, వైద్య ఖర్చులు పెరిగి సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా తాజాగా పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగడంతో పేద, మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఆటోలపై పిడుగు.. రాష్ట్రంలో సీ్త్ర శక్తి పథకం అమలుతో ఆటో రంగం కుదేలైంది. చాలా మంది తమ ఆటోలు అమ్ముకున్నారు. ఎటూపాలుపోని కొందరు చేసేదిలేక ఎలాగోలా నెట్టుకొస్తున్నారు. ఈ సమయంలోనే డీజిల్, పెట్రోలు ధరలు పెంచడంతో ఆటోవాలాలు కూడా ఛార్జీలు పెంచక తప్పని పరిస్థితి. ఇప్పటికే ఆటోల్లో ప్రయాణికులు అంతంత మాత్రమే ఎక్కుతున్న నేపథ్యంలో.. మళ్లీ చార్జీలు పెంచితే వచ్చే వారు సైతం రారని ఆటోవాలాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్రో ధరలు తగ్గిస్తామని ఎన్నికల ప్రచారంలో లోకేష్ హామీ అధికారంలోకి వచ్చాక గాలికొదిలిన చినబాబు నేడు కేంద్ర ప్రభుత్వం మరింత పెంచినా నోరు మెదపని వైనం దగాపై నేడు వైఎస్సార్ సీపీ నిరసనలు నిలదీద్దాం.. నినదిద్దాం ప్రజలను దారుణంగా మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వ తీరును నిరసిస్తూ సోమవారం పుట్టపర్తిలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించనున్నారు. మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక పార్టీ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకూ భారీ ర్యాలీగా వెళ్లి ఆర్డీఓకు వినతి పత్రం అందజేయనున్నారు. వైఎస్సార్ సీపీ శ్రేణులతో పాటు స్వచ్ఛందంగా ప్రజలు కూడా ర్యాలీలో పాల్గొని కూటమి ప్రభుత్వ తీరును నిలదీద్దామని శ్రీధర్‌రెడ్డి పిలుపునిచ్చారు. -
నేడు పరిష్కార వేదిక
ప్రశాంతినిలయం: కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పీజీఆర్ఎస్ మందిరంలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకూ కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొంటారని, ప్రజలు తమ సమస్యలపై వారికి అర్జీలు సమర్పించుకోవచ్చని సూచించారు. గతంలో ఇచ్చిన అర్జీలకు పరిష్కారం దొరకని వారు 1100కు ఫోన్ చేయవచ్చన్నారు. meekosam.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్‌లైన్‌లోనూ అర్జీలు సమర్పించవచ్చన్నారు. జిల్లా కేంద్రంతో పాటు డివిజన్, మునిసిపల్, మండల కార్యాలయాల్లోనూ కార్యక్రమం జరుగుతుందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రేషన్ బియ్యం పట్టివేతహిందూపురం: చౌక దుకాణాల ద్వారా ప్రజలకు చేరాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయి. బ్లాక్‌లో అమ్ముకునేందుకు లారీలో తరలిస్తున్న 16 టన్నుల బియ్యాన్ని ఆదివారం పట్టుకున్నట్లు హిందూపురం రూరల్ సీఐ ఆంజనేయులు తెలిపారు. ఆయన వివరాల మేరకు... ప్రజలకు పంపిణీ చేయాల్సిన రేషన్ బియ్యం కర్ణాటక రాష్ట్రంలోని తుమకూరు ప్రాంతానికి అక్రమంగా తరలిస్తున్నారని కచ్చితమైన సమాచారం వచ్చింది. ఈ మేరకు మణేసముద్రం గ్రామ పరిసరాల్లో ఐచర్ (ఏపీ39 టీఎన్ 3414) వాహనంలో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని గుర్తించారు. హిందూపురం పౌర సరఫరాల డిప్యూటీ తహసీల్దార్ హారతి సమక్షంలో 16 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 294 బస్తాల 50 కేజీల బియ్యం ప్యాకెట్లు, మరో 52 బస్తాల్లో 25 కేజీల బియ్యం ప్యాకెట్లు ఉన్నాయని సీఐ తెలిపారు. బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న సోమందేపల్లికి చెందిన కొత్త ఎ.మహేష్, కె.రామకృష్ణప్పపై కేసు నమోదు చేశామన్నారు. ప్రధాన నిందితుడు రామకృష్ణప్ప పరారీలో ఉన్నాడన్నారు. బియ్యం అక్రమ రవాణాను చాకచక్యంగా అడ్డుకొని భారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్న సీఐ ఆంజనేయులు, పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించి రివార్డు ప్రకటించారు. నకిలీ కరెన్సీ ముఠా అరెస్ట్ సాక్షి, పుట్టపర్తి: నకిలీ కరెన్సీ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి నకిలీ నోట్లు, ఒక ఇన్నోవా కారు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ నోట్లు తరలిస్తున్నారన్న సమాచారం మేరకు హిందూపురం అప్‌గ్రేడ్ సీఐ ఆంజనేయులు, రూరల్ సీఐ జనార్దన్ బృందం హిందూపురం రూరల్ మండల పరిసరాల్లో మూడు రోజుల క్రితం నిందితులను అదుపులోకి తీసుకుంది. నిందితుల్లో చిలమత్తూరు మండల టీడీపీ నాయకుడు లక్ష్మినారాయణ యాదవ్ అనుచరులు వెంకటేష్, బాలాజీతో పాటు మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేరచరిత్ర కలిగిన వీరు లక్ష్మినారాయణ యాదవ్ ప్రోద్బలంతో ఈ వ్యవహారం నడిపినట్టుగా జోరుగా చర్చ నడుస్తోంది. -
నకిలీగాళ్లతో పారాహుషార్
సాక్షి, పుట్టపర్తి: నకిలీగాళ్లు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ అధికారుల పేరుతో దోపిడీ చేస్తున్నారు. మోసపోయామని బాధితులు గుర్తించేలోపే ఉడాయిస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారుల పేరుతో ఇటీవల నల్లమాడ, బుక్కపట్నం, ఓడీ చెరువు, కొత్తచెరువు, గోరంట్ల, తనకల్లు తదితర ప్రాంతాల్లో దుకాణాలలోకి దుండగులు చొరబడడం ఆందోళన కలిగిస్తోంది. వాహనాలకు నకిలీ ప్రభుత్వ స్టిక్కర్లు అతికించి, కార్డులు మెడలో వేసుకుని ఉండడంతో అమాయకులు భయపడిపోయి వారు అడిగినంత సమర్పించుకుంటున్నారు. సైబర్.. టెర్రర్ హిందూపురం, పుట్టపర్తి, కొత్తచెరువు, ధర్మవరం, కదిరి తదితర ప్రాంతాల్లో సైబర్ మోసాలు పెరిగిపోయాయి. అమాయకులను టార్గెట్ చేసి బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ముఠాగా ఏర్పడి కొత్త మొబైల్ నంబర్ల నుంచి కాల్ చేసి మాయమాటలు చెప్పి డబ్బు లాగుతున్నట్లు తెలిసింది. ఏడాది క్రితం హిందూపురం మున్సిపల్ ఆఫీస్ నుంచి అంటూ పలువురికి కాల్స్ చేసి కరెంట్ బిల్లు, ఇంటి పన్ను, నీటి పన్ను ఆన్లైన్ ద్వారా చెల్లిస్తే 50 శాతం రాయితీ వస్తుందని నమ్మబలికిన మాయగాళ్లు రూ.లక్షల్లో గుంజడం గమనార్హం. అధికారులపైనా ఆరోపణలు కొందరు ప్రభుత్వ అధికారులు తమ పరిధిలో అక్కడక్కడా ఏజెంట్లను పెట్టుకుని నకిలీ ఐడీ కార్డులు అందజేసి వసూళ్లు చేయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై కొందరిని ప్రశ్నించగా, తమకు సంబంధం లేదని దాటవేశారు. నకిలీ అధికారుల ఆచూకీ తెలిపితే తాము పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెబుతున్నారు.ఫుడ్ సేఫ్టీ, తూనికలు– కొలతలు, ఆదాయ పన్ను, కరెంట్ బిల్లు వసూలు, బ్యాంకుల్లో పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డు ఆఫర్లు తదితర పేర్లతోనే ఎక్కువగా దందాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. అప్రమత్తతే శ్రీరామరక్ష అప్రమత్తతతోనే మోసాల నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. పుట్టపర్తిలో ప్రైవేటు క్లినిక్ నిర్వహిస్తున్న ఓ డాక్టర్‌కు ఇటీవల మున్సిపల్ కమిషనర్ పేరుతో ఫోన్ కాల్ వచ్చింది. పన్ను బకాయిలు చాలా ఉన్నాయని, మొదట ఎంతోకొంత అందజేస్తే మాఫీ అయ్యే అవకాశం ఉందంటూ ఫోన్ పే నంబరు కూడా చెప్పారు. అయితే డాక్టర్ తెలివిగా వ్యవహరించి మున్సిపల్ అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఆ తర్వాత ఆ ఫోన్ నంబర్లన్నీ స్విచాఫ్ కావడం గమనార్హం. పోలీసులకు సమాచారమివ్వండి సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మొబైల్‌కు వచ్చే ఓటీపీలను తెలియని వ్యక్తులు అడిగితే చెప్పరాదు. పన్ను వసూళ్ల పేరుతో వచ్చే ఫోన్ కాల్స్‌కు స్పందించాల్సిన అవసరం లేదు. నకిలీ అధికారులని ఎలాంటి అనుమానం వచ్చినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. – ఎస్.సతీశ్‌కుమార్, ఎస్పీ -
పీఎం సూర్యఘర్ పథకం కింద ఎస్సీ, ఎస్టీ గృహాలపై ఉచిత సోలార్ యూనిట్ల ఏర్పాటు నత్తనడకన సాగుతోంది. లక్ష్యం బారెడు ఉన్నా... పనులు మాత్రం ఊపందుకోవడం లేదు. కొన్ని ప్రాంతాల్లో కూటమి నాయకులు వాటాలివ్వాలని డిమాండ్ చేస్తుండటంతో పనులకు బ్రేక్ పడుతోంది.
శింగనమలలో ఏర్పాటు చేసిన సోలార్ యూనిట్ అనంతపురం టౌన్: ఎస్సీ, ఎస్టీ గృహాలపై ఉచిత సోలార్ ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రతి ఇంటిపై 2 కిలోవాట్ల సామర్థ్యంతో దాదాపు రూ.1.50 లక్షల మేర ఖర్చు చేసి సోలార్ యూనిట్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా 29,860 యూనిట్లకు రూ.350 కోట్ల మేర నిధులు కేటాయిస్తూ టెండర్లను పిలిచారు. ఈ ఏడాది ఆగస్టులోపు పనులు పూర్తి చేసే విధంగా లక్ష్యాన్ని నిర్దేశించారు. అయితే పనులు మాత్రం మందకోడిగా సాగుతున్నాయి. సింగిల్ డిజిట్ దాటితే ఒట్టు.. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా 8 నియోజకవర్గాల్లో పీఎం సూర్యఘర్ పథకం లక్ష్యంలో సింగిల్ డిజిట్ కూడా దాటలేదంటే పరిస్థితి ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అనంతపురం, కళ్యాణదుర్గం, తాడిపత్రి, రాప్తాడు, ధర్మవరం, పుట్టపర్తి, తదితర నియోజకవర్గాల్లో సోలార్ యూనిట్లు ఏర్పాటు సింగిల్ డిజిట్ సైతం దాట లేదు. మిగిలిన నియోజకవర్గాల్లో సైతం అంతంత మాత్రంగానే సాగుతోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 30 వేలకు పైగా యూనిట్లు మంజూరైతే ఇప్పటి వరకు 350పైగా యూనిట్లు మాత్రమే పూర్తి చేశారు. దీన్ని బట్టి 3 శాతం మాత్రమే పనులు పూర్తి చేశారు. మరో మూడు నెలల కాలంలో 97 శాతం మేర పనులను ఎలా పూర్తి చేస్తారో అధికారులకే తెలియాల్సి ఉంది. మోకాలడ్డుతున్న కూటమి నేతలు.. సోలార్ పనులకు కూటమి నేతలు మోకాలడ్డుతుండటంతో కొన్ని ప్రాంతాల్లో పనులు ముందుకు సాగడం లేదు. తమ వర్గానికి చెందిన వారికి మాత్రమే మొదట సోలార్ ఏర్పాటు చేయాలని నాయకులు.. కాంట్రాక్టర్లపై ఒత్తిడి తీసుకువచ్చి పనులను అడ్డుకుంటుండటంతో సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ఇదే విషయాన్ని పలువురు కాంట్రాక్టర్లు విద్యుత్‌శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి తమ ఆవేదనను తెలియజేశారు. మరికొన్ని నియోజకవర్గాల్లో ఏకంగా కాంట్రాక్టర్లనే ముడుపులు అడుగుతున్నారని సమాచారం. దీంతో కాంట్రాక్టర్లు సైతం పనులు చేసేందుకు ముందుకు రావడం లేదు. వీటిపై అధికారులు దృష్టి సారించి పనులు వేగవంతమయ్యేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైన ఉంది. నత్తనడకన ఎస్సీ, ఎస్టీ గృహాలపై సోలార్ యూనిట్ల ఏర్పాటు ఉమ్మడి జిల్లాకు 30 వేల యూనిట్లు మంజూరు పూర్తి చేసింది మాత్రం 350 యూనిట్లే.. కొన్నిచోట్ల వాటాల కోసం మోకాలడ్డుతున్న కూటమి నేతలు -
ఈసారీ ముందస్తుగానే ‘నైరుతి’
అనంతపురం అగ్రికల్చర్: ఆశల ‘నైరుతి’ ఈసారి కూడా ముందస్తుగా ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. సాధారణంగా జూన్ ఒకటిన కేరళను తాకే ‘నైరుతి’ రుతుపవనాలు జూన్ రెండో వారంలోనే ఎక్కువగా జిల్లాను పలకరించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కానీ తొలిసారిగా గతేడాది అంటే 2025 ఖరీఫ్‌లో మే 26న జిల్లాలోకి ప్రవేశించాయి. ఈ క్రమంలో ఈ ఏడాది కూడా ఈనెల 29న పలకరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. చరిత్రను పరిశీలిస్తే జూన్ రెండో వారంలో చాలాసార్లు రుతుపవనాలు జిల్లాలోకి ప్రవేశించాయి. అయితే గతేడాదితో పాటు ఈసారి దాదాపు వారం రోజులు ముందుగానే ‘నైరుతి’ పలకరించనుంది. ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి లక్షలాది హెక్టార్ల ఖరీఫ్ సాగుకు నైరుతి రుతుపవనాలు (సౌత్‌వెస్ట్ మాన్సూన్స్) అత్యంత కీలకం. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో ప్రభావం చూపిస్తే మంచి వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉంటాయి. నైరుతి వర్షాలపై ఖరీఫ్ ఆశలు.. ఉమ్మడి జిల్లా పరిధిలో వర్షాధారంగా దాదాపు 7 లక్షల హెక్టార్ల భారీ విస్తీర్ణంలో సాగులోకి వచ్చే పంటలకు నైరుతి రుతుపవనాల ప్రభావంతో కురిసే వర్షాలే కీలకం. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య నాలుగు నెలల పాటు వీటి ప్రభావంతో వర్షాలు నమోదవుతాయి. జిల్లా వార్షిక సాధారణ వర్షపాతం 512.4 మి.మీ కాగా అందులో కీలకమైన ఖరీఫ్ నాలుగు నెలల కాలంలో 321.5 మి.మీ నమోదు కావాల్సి ఉంటుంది. జూన్‌లో 61.2 మి.మీ, జూలైలో 64.3 మి.మీ, ఆగస్టులో 84.4 మి.మీ, సెప్టెంబర్‌లో 111.6 మి.మీ సాధారణ వర్షపాతంగా నిర్ధారించారు. నైరుతి ప్రభావంతో కురిసే వర్షాలపై ఆధారపడి ఉమ్మడి జిల్లాలో దాదాపుగా 20 లక్షల ఎకరాల భారీ విస్తీర్ణంలో వేరుశనగ, కంది, ఆముదం, పత్తి, మొక్కజొన్నతో పాటు మరో 15 రకాల పంటలు సాగు చేస్తారు. ఆ తర్వాత అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు రబీ కాలంలో ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో వర్షాలు నమోదవుతాయి. భయపెడుతున్న ‘ఎల్–నినో’.. నైరుతి రుతుపవనాలు గతేడాది అనుకున్న దాని కన్నా 10 రోజులు ముందుగానే పలకరించినా పెద్దగా ప్రభావం చూపలేదు. ఖరీఫ్ పంటల సాగుకు కీలకమైన జూన్, జూలైలో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో అతికష్టమ్మీద పంటలు సాగులోకి వచ్చాయి. ఆగస్టులో మాత్రమే మంచి వర్షాలు కురిశాయి. అయితే ‘సూపర్ ఎల్–నినో’ అంటూ ఈసారి మూడు నెలలు ముందుగానే భారత వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేయడం, రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులను మానసికంగా సిద్ధం చేస్తుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. నైరుతిపై ఎల్–నినో ప్రభావం వల్ల వర్షాలు సాధారణం కన్నా తక్కువగా నమోదవుతాయని, అవి కూడా గతి తప్పే ప్రమాదం ఉన్నట్లు ప్రకటనలు చేస్తుండటంతో ‘ముంగారు’ వ్యవసాయం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ప్రభుత్వ ప్రకటనలతో ‘అనంత’లో ముందస్తుగానే కరువు మేఘాలు కమ్ముకున్నాయి. గతేడాది మే 26న పలకరించినా పెద్దగా ప్రభావం చూపని వైనం ఈసారి ఈనెల 29న రుతుపవనాల ప్రవేశం ఉంటుందని అంచనా జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య నైరుతి ప్రభావంతో జిల్లాకు వర్షాలు ఈసారి సాధారణ వర్షపాతం నమోదు కాకపోవచ్చని ప్రకటన అనంతపురం జిల్లాలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశం ఇలా.. -
తూకం.. దారుణ మోసం
జిల్లాలో వివరాలిలా.. చౌకదుకాణాలు 1,367 రేషన్ కార్డులు 5,76,203 లబ్ధిదారులు 17,42,136 బియ్యం 8710.86 మెట్రిక్ టన్నులుకదిరి: తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని ఎవరి స్థాయిలో వారు నొక్కేస్తున్నారు. ఎఫ్‌సీఐ గోడౌన్ల నుంచి ఎంఎల్ఎస్ పాయింట్లకు వచ్చే బియ్యం తూకాల్లో కొంత తేడా వస్తోంది. అక్కడి నుంచి డీలర్ దగ్గరకు వచ్చే సరికి మరికొంత తగ్గుతోంది. కార్డు లబ్ధిదారులకు ఇచ్చే తూకాలు చూస్తే మరీ దారుణంగా ఉన్నాయి. 50 కిలోల బియ్యం బస్తా అక్కడ కొంచెం.. అక్కడ కొంచెం కరిగి పోయినట్లు చివరికి చేరే సరికి ఐదారు కిలోల తేడా వస్తోంది. అంతిమ నష్టం లబ్ధిదారులకే.. శ్రీ సత్యసాయి జిల్లాకు ప్రతి నెలా 87,10,680 కిలోల బియ్యం సరఫరా అవుతోంది. ఇందుకోసం రూ. 38.32 కోట్లు ఖర్చు అవుతోంది. ఆ బియ్యం మొదట జిల్లాలోని కదిరి, గాండ్లపెంట, తనకల్లు, ఓడీ చెరువు, ముదిగుబ్బ, గోరంట్ల, బుక్కపట్నం, ధర్మవరం, సీకే పల్లి, పెనుకొండ, హిందూపురం, మడకశిరలలో ఉన్న ఎంఎల్ఎస్ పాయింట్లకు చేరుతుంది. తర్వాత వాటి పరిధిలోని చౌక డిపోలకు సరఫరా చేస్తారు. తాను చౌకడిపోలో 50 కిలోల బస్తా తూకం వేస్తే 43.040 కిలోలు మాత్రమే వచ్చిందని ఈ తరుగు కార్డుదారులపై వేయక తప్పదని ఓ చౌకడిపో డీలర్ అన్నారు. కొంత మంది లబ్ధిదారులకు కొన్నిసార్లు ఎగ్గొట్టాల్సి వస్తోందని, అప్పుడు కొందరు గొడవలకు దిగిన సంఘటనలు కూడా ఉన్నాయని తెలిపారు. జగన్ హయాంలో పక్కాగా.. వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో లబ్ధిదారులు రేషన్ దుకాణాల వద్ద క్యూలో నిల్చొనే బాధల నుంచి విముక్తి కల్గించారు. మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ (ఎండీయూ)ల ద్వారా నేరుగా వారి ఇంటి వద్దకే బియ్యం సరఫరా చేశారు. వాటిలో ఎలక్ట్రానిక్ డిజిటల్ తూకపు యంత్రాలు ఉండేవి. వీటిని బిల్లింగ్ మిషన్లకు బ్లూటూత్ ద్వారా అనుసంధానం చేయడంతో లబ్ధిదారునికి పక్కాగా అందేది. బియ్యం కల్తీకి ఆస్కారం లేకుండా ప్రత్యేక మైన ప్యాకెట్లలో వచ్చేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అడుగడుగునా అక్రమాలే. రేషన్ దుకాణాల్లో తూకాల్లో భారీ తేడా సరఫరాలోనే స్వాహా అంటున్న డీలర్లు నష్టపోతున్న రేషన్ కార్డుదారులు టీడీపీ నాయకులు మెక్కేస్తున్నారు చౌక బియ్యాన్ని కొందరు టీడీపీ నాయకులు బాగా మెక్కేస్తున్నారు. తూకాల్లో మోసం చేసేవాళ్లు కొందరైతే, వేల బస్తాల బియ్యం అక్రమంగా జిల్లాలు దాటించి సొమ్ము చేసుకుంటున్నారు. అధికారులకు తెలిసినా అధికార పార్టీ నాయకులను ఏమీ అనలేక పోతున్నారు. –ఉషశ్రీ చరణ్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ధర్మవరం మార్కెట్ ఏరియాలోని ఒక చౌక డిపోలో స్థానిక మహిళ ఇటీవల 15 కిలోల బియ్యం తీసుకెళ్లింది. ఇంటికెళ్లి తూకం వేస్తే 13.25 కిలోలు మాత్రమే వచ్చాయి. మళ్లీ డీలర్ చెంతకు వెళ్లి అడిగింది. ఆయన అక్కడున్న ఓ 50 కిలోల బియ్యం బస్తాను దించి ఆమె కళ్ల ముందే తూకం వేశాడు. 46 కిలోలు మాత్రమే ఉన్నాయి. ‘ప్రతి 50 కిలోల బస్తాకు నాలుగైదు కిలోలు తక్కువ వస్తున్నాయి.. నా బాధ ఎవరికి చెప్పుకోవాలి..’ అని చెప్పడంతో ఆమె మరోమాట మాట్లాడకుండా వెనుదిరిగింది. ఈ సమస్య ఽఅక్కడ మాత్రమే కాదు.. జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్లా ఉంది. -
బాబు పాలనలో బాదుడే బాదుడు
పెనుకొండ రూరల్: చంద్రబాబు పాలనలో ఇష్టారాజ్యంగా ధరలు పెంచుతూ సామాన్యులను బాదేస్తున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ ధ్వజమెత్తారు. ఆదివారం సోమందే పల్లిలోని మారుతీ నగర్లో నిర్వహించిన ‘కాఫీ విత్ వైఎస్సార్ సీపీ’ కార్యక్రమంలో ఉషశ్రీ చరణ్ పాల్గొన్నారు. ఇంటింటా తిరిగి స్థానికులతో మాట్లాడారు. అనంతరం పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయన్నారు. ఇప్పటికే వంట నూనె, గ్యాస్ ధరలు పెరిగి సామాన్య ప్రజలకు బతుకు భారంగా మారిందన్నారు. పొరుగున ఉన్న తెలంగాణ, కర్ణాటకతో పోల్చితే ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధిక ధరలకు పెట్రోల్, డీజిల్ విక్రయిస్తున్నారన్నారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో లీటర్ పెట్రోల్ ధర వంద లోపే ఉందని, మన రాష్ట్రంలో చంద్రబాబు మాత్రం అదనపు ట్యాక్స్‌లు వేస్తూ ప్రజల నడ్డి విరుస్తున్నారని విమర్శించారు. రాష్ట్రం అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మారిందన్నారు. సంక్షేమ పథకాలను విస్మరించి, అమరావతి పేరుతో అప్పులు చేస్తున్నారన్నారు. రాజధాని ముసుగులో రైతులను దోచుకుంటున్నారన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ధరలు కొద్దిగా పెరిగితేనే విమర్శలు గుప్పించిన పవన్ కల్యాణ్ నేడు ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. మంత్రి సవిత కూడా పెట్రోల్ బంక్ యజమాని అని, సామాన్యుల కష్టాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి ఇంధన ధరల నియంత్రణకు చర్యలు చేపట్టాలన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలను చంద్రబాబు ప్రభుత్వం నియంత్రించాలని, లేని పక్షంలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్లు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, అనుబంధ విభాగాల నాయకులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ ధ్వజం -
సామాన్యుడు జీవించలేని పరిస్థితి
పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచడంతో సామాన్యులపై పెను భారం పడుతుంది. లీటరు పెట్రోలు, డీజిల్‌పై ఒకే సారి రూ.3కు పైగా పెంచడం దారుణం.దేశంలోనే అత్యధికంగా రాష్ట్రంలో ఇంధన ధరలు ఉండడం సిగ్గుచేటు. పక్కనున్న కర్ణాటక, తమిళనాడు, తెలంగాణతో పోల్చితే ఏపీలో భారం అధికమైంది. రాష్ట్రంలో సామాన్యుడు జీవించలేని పరిస్థితి దాపురించింది. – వేమనారాయణ, రైతు సంఘం నాయకుడు, పుట్టపర్తి రైతుకు కోలుకోలేని దెబ్బ ఇంధన ధరల పెంపుతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ప్రస్తుతం అన్ని పనులూ యంత్రాలతోనే చేస్తుండడంతో ట్రాక్టర్ బాడుగ నుంచి మార్కెట్‌కు వ్యవసాయ ఉత్పత్తులు తరలించే వరకూ అన్ని ధరలూ పెరుగుతాయి. ఇప్పటికే విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల ధరలు పెరగడంతో రైతులకు వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదు. – క్రిష్ణారెడ్డి, రైతు, చౌటకుంట పల్లి, నల్లమాడ మండలం -
హెచ్ఐవీ బాధితులపై వివక్ష వద్దు
పుట్టపర్తి అర్బన్: హెచ్ఐవీ/ఎయిడ్స్ బాధితులపై వివక్ష చూపకూడదని లెప్రసీ, ఎయిడ్స్, టీబీ అధికారి డాక్టర్ అనుపమ జేమ్స్ పేర్కొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం అంతర్జాతీయ ఎయిడ్స్ దీప స్మృత్యాంజలి దినం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతూ చనిపోయిన వారికి శ్రద్ధాంజలి ఘటించారు. డీఎంహెచ్ఓ కార్యాలయం నుంచి ప్రశాంతి గ్రామంలోని వై జంక్షన్ వరకూ కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అనుపమ జేమ్స్ మాట్లాడుతూ ఎయిడ్స్‌పై జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముందన్నారు. ఎయిడ్స్ దీప స్మృత్యంజలి 1983లో ప్రారంభమైందన్నారు. ప్రతి ఏటా మే నెల 3వ ఆదివారం ఈ కార్యక్రమాన్ని 115 దేశాలలో నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఎయిడ్స్ రోగులకు ఏఆర్టీ సెంటర్ల ద్వారా ఉచిత వైద్యం, మందులు అందిస్తున్నామన్నారు. జిల్లాలో 10,490 మంది ఎయిడ్స్/హెచ్ఐవీతో బాధపడుతున్నట్లు గుర్తించామని తెలిపారు. 7,110 మంది క్రమం తప్పకుండా మందులు వాడుతున్నారన్నారు. కార్యక్రమంలో జిల్లా సూపర్వైజర్ రమణ, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ సునీల్, ప్రభాకరరెడ్డి, కమ్యూనిటీ ఆఫీసర్లు శివరాం, వన్నప్ప, జనజాగృతి తదితరులు పాల్గొన్నారు. లెప్రసీ, ఎయిడ్స్, టీబీ అధికారి డాక్టర్ అనుపమ జేమ్స్ -
ఆటో బోల్తా – ఏడుగురికి గాయాలు
మదనపల్లె టౌన్: హార్సిలీ హిల్స్ పర్యటన ముగించుకుని తిరిగి వెళ్తుండగా ఆటో బోల్తా పడటంతో ఏడుగురు గాయపడ్డారు. బాధితుల వివరాలమేరకు... శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన పి.కార్తీక్‌తో పాటు మరో ఆరుగురు స్నేహితులు హార్సిలీ హిల్స్ పర్యటనకు వచ్చారు. పర్యటన ముగించుకుని సాయంత్రం ఆటోలో తిరుగు ప్రయాణమయ్యారు. మార్గం మధ్యలో హార్సిలీ హిల్స్ 3వ మలుపు వద్దకు రాగానే ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఏడుగురిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను బయటికి తీసి మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బి.కొత్తకోట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. హార్సిలీ హిల్స్ ఘాట్ రోడ్డులో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, స్పీడ్ బ్రేకర్లు, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని పర్యాటకులు కోరుతున్నారు. బతుకుబండి లాగేదెలా? ● నాలుగు నెలలుగా గ్రంథాలయ ఉద్యోగులకు జీతాలు కరువు ● అరకొర నిధులు విడుదల చేసినా వాడుకోలేని దుస్థితి అనంతపురం కల్చరల్: ‘జీతాలొస్తాయన్న ఆశ రోజు రోజుకు సచ్చిపోతోంది. ఒకటి కాదు.. రెండు కాదు జీతాలందక నాలుగు నెలలు దాటిపోయింది. ఎలా బతకాలో తెలీడం లేదు. ఎక్కడైనా చెప్పుకుందామన్నా టార్గెట్ చేస్తారేమోనన్న భయం వెంటాడుతోంది. బతుకు అప్పుల కుప్పగా మారుతోంది. ఎలా బతకాలో అర్థకావడం లేదు’ ఇదీ గ్రంథాలయ ఉద్యోగుల ఆవేదన. సంపద సృష్టి కర్త చంద్రబాబు పాలనలో గ్రంథాలయ ఉద్యోగుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. 70 గ్రంథాలయాల్లో... ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొత్తం 70 గ్రంథాలయాలు ఉన్నాయి. అందులో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి వేతనం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. శాశ్వత ఉద్యోగుల పరిస్థితే ఇలా ఉంటే.. ఇక కాంటాక్టు ఉద్యోగులైతే ఆశలు వదులుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కంటెంట్జెంట్, పేపర్, ఎలక్ట్రికల్ బిల్లుల చెల్లింపుకు కూడా నిధులు విడుదల చేయకపోవడం పరిస్థితి దుర్భరంగా మారింది. గ్రంథాలయ ఉన్నతాధికారుల నిర్లక్ష్యంతో ఇటీవల పదవీ విరమణ చేసిన వారికి బెనిఫిట్స్ ఆగిపోయాయి. పెన్షన్లు అందక 4 నెలలు గడుస్తున్నాయి. ఇదిలా ఉంటే కొద్ది రోజుల కిందట ప్రభుత్వం రూ.కోటి విడుదల చేసింది. మరో రూ. 82 లక్షలు కూడా ఉండటంతో ఫిబ్రవరి మాసం జీతం, ఆపైన మార్చిది కూడా తీసుకోవచ్చు. కానీ ప్రభుత్వ పెద్దలు నిబంధనలను కఠినంగా మార్చడంతో ఉన్న నిధులు వాడుకోవాలన్నా వచ్చేనెల 1 వరకు ఆగాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. జిల్లా గ్రంథాలయ చరిత్రలో ఇన్ని నెలలు జీతాలు ఆగిన దాఖలాలు లేవని, అబద్దపు హామీలు, ప్రచారాలతో అధికారంలోకి వచ్చిన ప్రజాప్రతినిధులు దీనికి సమాధానం చెప్పాలని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఎక్కడా నోరెత్తకూడదు.. జీతాలు రాక నాలుగు నెలలు గడుస్తున్నా లోలోన మదన పడాల్సిందే తప్ప.. బయట చెప్పుకునే పరిస్థితి కూడా ఉద్యోగులకు లేకుండా పోయింది. టార్గెట్ చేస్తే తీవ్ర ఇబ్బందులు పడతామన్న భయం వారిని వెంటాడుతోంది. సాధారణ ఉద్యోగులతో పాటు ఉద్యోగ సంఘాల నేతలు కూడా పెదవి విప్పకపోవడం గమనార్హం. రెండు నెలల జీతం తీసుకోవచ్చు నాలుగు నెలల జీతం రాకపోవడం ఉద్యోగులందరూ ఇబ్బంది పడుతున్నారు. రూ.కోటి నిధులు విడుదలయ్యాయి. ఇప్పటికే మరో రూ.82 లక్షలున్నాయి. నిధుల విడుదలకు థంబ్ వేశాము కాబట్టి ఫిబ్రవరి జీతం వస్తుంది. అన్ని అనుకూలిస్తే మిగిలిన నిధులతో ఈనెల 26న మరోసారి థంబ్ వేస్తాము. దాంతో మార్చి నెల జీతం కూడా వస్తుందన్న విశ్వాసం ఉంది. అయినా ఏప్రిల్, మే నెలల జీతాలు పెండింగ్‌లో ఉంటాయి. మరోసారి నిధులు విడుదల చేస్తేనే మా పూర్తి జీతాలకు అవకాశం ఉంటుంది. – కమ్మన్న, కార్యదర్శి, జిల్లా కేంద్ర గ్రంథాలయం -
పేదల స్థలాలపై కూటమి గద్దలు
ధర్మవరం: పేదలకు గత ప్రభుత్వంలో ఇచ్చిన ఇంటి స్థలాలను కాజేసేందుకు కూటమి నాయకులు పన్నాగం పన్నడం విమర్శలకు తావిస్తోంది. సాక్షాత్తు మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మవరం నియోజకవర్గంలో వెలుగుచూసిన ఈ అరాచకం చర్చనీయాంశంగా మారింది. ముదిగుబ్బ మండల కేంద్రానికి సమీపంలో అనంతపురం–చైన్నె జాతీయ రహదారికి ఆనుకుని గుంజేపల్లి పొలం సర్వే నంబర్ 75లో 13 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. పేదల సొంతింటి కల సాకారం చేయాలన్న సంకల్పంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో గుంజేపల్లి, ముదిగుబ్బకు చెందిన 80 మందికి రెండు సెంట్ల చొప్పున ఇక్కడ పట్టాలు మంజూరు చేశారు. ప్రస్తుతం ఈ భూమి విలువ రూ.10 కోట్లకు పైగా పలుకుతోంది. పాసు పుస్తకాలు సృష్టించి..! చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే బత్తలపల్లి మండలానికి చెందిన టీడీపీ ముఖ్య నేత, ముదిగుబ్బ మండలం ఈదులపల్లికి చెందిన ఓ బీజేపీ నాయకుడి కన్ను ఈ భూమిపై పడింది. పీసీరేవుకు చెందిన కంతేటి నారాయణ, రామస్వామి తండాకు చెందిన పార్వతి బాయి కుటుంబాలకు చెందిన వ్యక్తుల ద్వారా రంగ ప్రవేశం చేశారు. 2021లో ఫేక్ పాసు పుస్తకాలు మంజూరు చేసి జైలుకు వెళ్లి వచ్చిన అప్పటి తహసీల్దార్ అన్వర్ హుస్సేన్ ఇచ్చినట్లుగా పాసుపుస్తకాలు సృష్టించి తతంగానికి తెరలేపినట్లు తెలిసింది. ముదిగుబ్బ మండలం గుంజేపల్లి రెవెన్యూ గ్రామ పరిధిలోని భూమికి తమకు 2021లోనే పాసుపుస్తకాలు ఇచ్చారని, వన్‌బీలో కూడా తమ పేరుందని చెబుతూ పొలాన్ని సర్వే చేసేందుకు ఇటీవల యత్నించడం వివాదాస్పదమైంది. స్థలంలోని రాళ్లను పీకేసి జేసీబీలతో చదును చేసేందుకు యత్నించగా బాధితులు తిరగబడ్డారు. కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. కోర్టులో కేసు కూడా వేశారు. అయితే కోర్టులో కేసు ఉన్నప్పటికీ మళ్లీ వారు రెండు రోజుల క్రితం కూటమి నాయకుల అండతో సర్వే చేసేందుకు రావడం గమనార్హం. ఈ క్రమంలోనే బాధితులు సర్వే ఆపివేయించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముదిగుబ్బలో 6.90 ఎకరాల దురాక్రమణకు యత్నం బహిరంగ మార్కెట్లో దీని విలువ రూ.10 కోట్లకు పైనే వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పేదలకు పట్టాల మంజూరు విచారణ చేస్తున్నాం సర్వే నంబర్ 75–1కి సంబంధించి వివాదంపై విచారణ చేస్తున్నాం. సదరు స్థలంలో పట్టాలు ఇచ్చారని కొంత మంది, పొలం తమదని మరికొందరు రెవెన్యూ రికార్డులు, కోర్టు ఇంజెంక్షన్ ఆర్డర్ చూపుతున్నారు. సమగ్ర విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిస్తాం. –మహేశ్వర్‌రెడ్డి, తహసీల్దార్, ముదిగుబ్బ అంతా అనుమానాస్పదమే.. నారాయణస్వామి, పార్వతిబాయి చూపుతున్న ఆధారాలు అనుమానాస్పదంగానే ఉన్నాయి. సబ్ డివిజన్ చేయకుండానే భూమిని ఆన్లైన్లో పొందుపరిచారు. వన్‌బీలో సర్వే నంబర్ 75–1లో ఇద్దరికి 3.5 ఎకరాలు,3.10 ఎకరాలు ఉన్నట్లు, అది కూడా పిత్రార్జితమని కనబరచడం గమనార్హం. గుంజేపల్లి పంచాయతీకి సంబంధం లేని వ్యక్తులకు ప్రభుత్వ భూమికి పట్టా ఎలా ఇస్తారు.. ఒకవేళ వారు చెప్పినట్లుగా 2021లో పట్టాలు మంజూరు చేసి ఉంటే అప్పుడు అసైన్మెంట్ కూడా జరగలేదు. పైపెచ్చు వీరికి సొంత పంచాయతీలలో పొలాలు ఉండడం గమనార్హం. -
ప్రైవేటు ట్రావెల్ బస్సు ఢీ .. వ్యక్తి మృతి
చిలమత్తూరు: మండల పరిధిలోని 44వ నెంబరు జాతీయ రహదారి కొడికొండ చెక్‌పోస్ట్ గంగోత్రి ధాబా వద్ద 7 హిల్స్ ప్రైవేటు ట్రావెల్ బస్సు ఢీకొని మైసూరుకు చెందిన ప్రకాష్ (60) అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్ఐ శ్రీధర్ తెలిపిన వివరాల మేరకు.. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో రాయచూరు నుంచి ప్రకాష్ బెంగళూరుకు బస్సులో వెళ్తున్నాడు. అయితే టీ తాగడానికి బస్సు గంగోత్రి ధాబా వద్ద ఆపారు. ప్రకాష్ రోడ్డు అవతలి వైపు మూత్ర విసర్జన కోసం వెళ్లే క్రమంలో బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళుతున్న బస్సు ఢీకొనడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. బస్సును సీజ్ చేసి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. చిన్నారికి గాయాలు రాయదుర్గంటౌన్: పట్టణంలోని కోతగుట్ట కాలనీలో ఆడుకుంటూ ఓ చిన్నారి మిద్దైపె నుంచి పడి గాయాలపాలైన ఘటన ఆదివారం సాయంత్రం జరిగింది. వివరాలు... ధర్మవరం నియోజకవర్గం సీకే పల్లికి చెందిన హంపి కుమార్తె నిహారిక (8) వేసవి సెలవుల నిమిత్తం రాయదుర్గంలోని పెదనాన్న తిమ్మరాజు ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం మిద్దైపె ఆడుకుంటూ కాలు జారి కింద పడింది. తలకు బలమైన గాయాలు కావడంతో స్థానిక ఏరియా ఆస్పత్రిలో చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురంకు వైద్యులు సిఫార్సు చేశారు. ప్రస్తుతం బాలిక కోలుకుంటున్నట్లు బంధువులు తెలిపారు. -
సమాజాభివృద్ధిలో భాగస్వాములు కండి
● యువతకు ఎస్పీ సతీష్‌కుమార్ పిలుపు కనగానపల్లి: వ్యసనాల బారిన పడకుండా స్ఫూర్తిదాయకమైన జీవనంతో సమాజాభివృద్ధిలో భాగస్వాములు కావాలని యువతకు ఎస్పీ సతీష్‌కుమార్ పిలుపునిచ్చారు. చెన్నేకొత్తపల్లి కేంద్రంగా పోలీసుల ఆధ్వర్యంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ క్రికెట్ టోర్నీ శనివారం ప్రారంభమైంది. చెన్నేకొత్తపల్లి, రామగిరి, కనగానపల్లి మండలాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. ఎస్పీ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసులకు, యువత మధ్య ఐక్యతను పెంపొందించాలన్న లక్ష్యంతో ఈ ఫ్రెండ్లీ పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని, బ్యాటింగ్ చేసి టోర్నీని ప్రారంభించారు. కార్యక్రమంలో రామగిరి సీఐ మహమ్మద్ అలి, చెన్నేకొత్తపల్లి, కనగానపల్లి, రామగిరి ఎస్ఐలు సత్యనారాయణ, మహమ్మద్ రిజ్వాన్, ప్రదీప్‌రాజ్, సిబ్బంది పాల్గొన్నారు. హాట్‌టాపిక్‌గా దొంగనోట్ల యవ్వారం చిలమత్తూరు: దొంగనోట్ల చలామణి అంశం ప్రస్తుతం హిందూపురం నియోజకవర్గ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పోలీసుల అదుపులో నిందితులు ఉండటంతో ఈ అంశంపై ప్రజల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. నకిలీ కరెన్సీ చలామణి అంశం దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పలువురు పేర్కొంటున్నారు. చిలమత్తూరు మండల కేంద్రంగా ఈ ముఠా నకిలీ నోట్లను చలామణి చేసినట్లుగా తెలుస్తోంది. మార్కెట్లు, చిరు వ్యాపారులు, సామాన్య ప్రజలే ఇలాంటి మోసాలకు ఎక్కువగా గురయ్యారు. ఈ వ్యవహారంలో ఉన్న టీడీపీ నేతలు ఎవరనే ఆసక్తి ప్రజల్లో వ్యక్తమవుతోంది. కాగా,నకిలీ కరెన్సీ చలామణి అంశంలో అసలు పాత్రధారులు ఎవరు అనే కోణంలో పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా విచారణ కొనసాగిస్తున్నట్లు సమాచారం. వ్యక్తి దుర్మరణం గోరంట్ల: ద్విచక్ర వాహనం అదుపు తప్పి కిందపడిన ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... పెనుకొండ మండలం శెట్టిపల్లికి చెందిన చాకలి వెంకటేశు(45) శనివారం గోరంట్ల వైపు నుంచి స్కూటీపై గాజులపల్లి గ్రామానికి వెళుతుండగా కరావులపల్లి తండా సమీపంలో అదుపు తప్పి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనకు భార్య సుజాత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సమాచారం అందుకున్న సీఐ శేఖర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి, కేసు నమోదు చేశారు. కాగా, స్కూటీని వెనుక వైపు నుంచి గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతోనే వెంకటేశు మృతి చెంది ఉంటాడనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇసుక ట్రాక్టర్ల పట్టివేత పరిగి: మండలంలోని జయమంగళి, పెన్నా నది పరివాహక ప్రాంతాల నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లను శనివారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనదారులకు జరిమానాలు విధించినట్లు ఎస్ఐ రవికుమార్ తెలిపారు. -
పారిశుధ్యానికి ప్రాధాన్యం ఇవ్వండి
ప్రశాంతి నిలయం: స్వచ్ఛ గ్రామాలే లక్ష్యంగా అందరూ పనిచేయాలని, అందులో భాగంగా పారిశుధ్యం మెరుగునకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన కలెక్టరేట్లోని వీసీ హాలు నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... స్వచ్ఛ సర్వేక్షన్ సర్వేలో జిల్లాను ముందంజలో నిలపడానికి నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. అలాగే అన్ని మున్సిపాలిటీల్లో చెత్త సేకరణ, ప్లాస్టిక్ నిషేధంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులందరూ సమన్వయంతో కష్టపడి పని చేయాలన్నారు. కుమారుడికి ‘ఫీజు’ పథకం..టీచర్ సస్పెండ్ పెనుకొండ: వాస్తవాలను దాచిపెట్టి తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో తన కుమారుడికి ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా లబ్ధి పొందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని జిల్లా విద్యాశాఖ అధికారి సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వెళితే...పెనుకొండ బాలికల ఉన్నత పాఠశాలలో స్వర్ణలత హిందీ టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె కుమారుడు ఉన్నత విద్య చదువుతుండగా... దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నట్లు ఆధారాలు సృష్టించి ప్రభుత్వం నుంచి కుమారుడికి ఫీజ్ రీయింబర్స్మెంట్ పొందారు. దీనిపై జిల్లా విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు అందడంతో ఇటీవల డీవైఈఓ పాఠశాలలో విచారణ చేసి ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. స్వర్ణలత ఉద్దేశపూర్వకంగానే పత్రాలు సృష్టించి ఫీజు రీయింబర్స్మెంట్ పొందినట్లు నిర్ధారణ కావడంతో జిల్లా విద్యాశాఖ అధికారి ఆమెను సస్పెండ్ చేస్తూ శనివారం జారీ చేశారు. ఈ విషయమై స్థానిక బాలికల ఉన్నత పాఠశాల హెచ్ఎం. శ్రీలతను వివరణ కోరగా... స్వర్ణలతను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశామని జిల్లా విద్యాశాఖ అధికారులు ఫోన్ ద్వారా 3 రోజుల క్రితం తెలిపారన్నారు. గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు ధ్వంసం బత్తలపల్లి: మండలంలోని రామాపురం గ్రామానికి చెందిన కుమ్మర పట్నం రమాదేవి ఇంట్లో శనివారం రాత్రి వంట గ్యాస్ సిలిండర్ పేలింది. ఘటనతో ఇంటి పైకప్పు ధ్వంసమైంది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. పెద్ద శబ్దం రావడంతో గ్రామస్తులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. రూ.4 లక్షలు వరకు నష్టం వాటిల్లినట్లు బాధితులు వాపోయారు. విషయాన్ని రెవెన్యూ అధికారుల దృష్టికి గ్రామస్తులు తరిగోపుల చౌదరి, చెన్నకేశవులు తీసుకెళ్లారు. బాధితులను ఆదుకోవాలని విన్నవించారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి, విచారణ చేపట్టారు. -
71 స్కూల్ బస్సుల్లో లోపాలు
పుట్టపర్తి అర్బన్: జిల్లాలో ప్రైవేటు పాఠశాలలకు సంబంధించిన 71 బస్సుల్లో లోపాలు గుర్తించినట్లు ఆర్టీఓ కరుణాసాగర్‌రెడ్డి తెలిపారు. పాఠశాలలు పునఃప్రారంభమయ్యే సమయానికి సరిదిద్దకపోతే యాజమాన్యాలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. మోటారు వాహన చట్టం 1988(ఏఐఎస్3) ప్రకారం విద్యార్థుల భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా బస్సులు ఉన్నాయా? లేదా అనే అంశంపై జిల్లా వ్యాప్తంగా తనిఖీలు కొనసాగుతున్నాయన్నారు. మొత్తం 596 విద్యాసంస్థల బస్సులు ఉండగా శనివారం నాటికి ఐదు బృందాల ద్వారా 85 విద్యాసంస్థలకు చెందిన 244 బస్సులను పూర్తి స్థాయిలో తనిఖీ చేసినట్లు వివరించారు. ఇందులో ఫిట్నెస్ సర్టిఫికెట్లు, పర్మిట్లు, ఇన్సూరెన్స్, డ్రైవర్ లైసెన్స్ పత్రాల్లో లోపాలు, స్పీడ్ గవర్నర్, ఎమర్జెన్సీ ఎగ్జిట్లు, అగ్నిమాపక సిలిండర్లు, ప్రథమ చికిత్స కిట్లు లేని 71 బస్సులకు చెందిన స్కూల్ యజమానులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు వివరించారు. నిర్ణీత గడువులోపు లోపాలను సరిదిద్ది సంబంధిత పత్రాలను రవాణా శాఖ కార్యాలయంలో సమర్పించాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సరిదిద్దకపోతే కఠిన చర్యలు తప్పవు ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలకు ఆర్టీఓ హెచ్చరిక -
వివాహం.. విరామం
నెలరోజులు ఆగాల్సిందే ఈ నెల 14 నుంచి వివాహ ముహూర్తాలు లేవు. ఈ నెల 18 నుంచి జూన్ 18 వరకూ మూఢమి వస్తోంది. అప్పుడు శుభ కార్యాలేవీ చేయకూడదు. పెళ్లికై నా..ఇంకే శుభ కార్యానికై నా మూఢమి తర్వాతే. అందువల్ల నెలరోజులు ఆగాల్సిందే. – నరసింహాచార్యులు, ‘ఖాద్రీ’ ఆలయ ప్రధాన అర్చకులు కదిరి: పెళ్లి లేదా గృహ ప్రవేశం..ఇలా ఏ శుభ కార్యానికై నా మంచి ముహూర్తం చూసుకుంటాం. ఏ రోజు బాగుందో అర్చక పండితులను అడిగి మరీ తేదీ ఖరారు చేస్తాం. అలాంటి శుభ కార్యాలకు నెల రోజుల పాటు బ్రేక్ పడనుంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఈ నెల 13 వరకూ జిల్లా వ్యాప్తంగా కొన్ని వందల జంటలు ఒక్కటయ్యాయి. ఈ నెల 13వ తేదీనే చివరి ముహూర్తం. హిందూ పంచాంగం ప్రకారం ఈ నెల 18 నుంచి జూన్ 18 వరకు అధిక జ్యేష్ఠ మాసం(మూఢమి)కావడంతో వివాహాది శుభ కార్యాలకు బ్రేక్ పడనుందని అర్చక పండితులు చెబుతున్నారు. మళ్లీ జూన్ 19 నుంచి శుభ ముహూర్తాలు ఉంటాయని వారంటున్నారు. నెల రోజులు ఖాళీ.. శుభకార్యాలపై ఆధారపడి జీవిస్తున్న కొంతమంది మూఢమి కారణంగా ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు, పురోహితులు, డెకరేషన్ నిర్వాహకులు, పందిళ్లు వేసేవారు, పెళ్లి మండపాలు నిర్మించేవారు, క్యాటరింగ్ వ్యాపారులు, లైటింగ్ ఏర్పాటు చేసేవారు, పూలమాలలు కట్టేవారు..ఇలా ఎంతోమంది నెల రోజుల పాటు ఉపాధి కోల్పోనున్నారు. ఈ ఏడాది శుభ ముహూర్తాలు ఇవే... జూన్ 19, 20, 21, 24, 25, 26, 27, 28 తేదీలతో పాటు జూలై 1, 2, 3, 4, 5, 8, 9 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయి. అలాగే ఆగస్టు 16, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 30 తేదీలతో పాటు సెప్టెంబర్ 1, 3, 4, 5 తేదీల్లో శుభకార్యాలకు మంచి రోజులని పండితులు చెబుతున్నారు. ఇక అక్టోబర్ 11, 14, 29, 30 తేదీలతో పాటు నవంబర్ 5, 11, 12, 13, 14, 15, 18, 19, 20, 21, 22, 24, 25, 26 తేదీలు, డిసెంబర్ 2, 3, 4, 10, 11, 12, 13, 15, 16, 17, 18, 19, 22, 23, 27, 29, 30, 31 తేదీల్లో శుభకార్యాలకు మంచి ముహూర్తాలున్నట్లు పండితులు చెబుతున్నారు. రేపటి నుంచి జూన్ 18 వరకు అధిక జ్యేష్ఠమాసం నెలరోజుల పాటు శుభకార్యాలకు బ్రేక్ జూన్ 19 నుంచి మళ్లీ ముహూర్తాలు -
విద్యార్థుల జీవితాలతో చెలగాటమొద్దు
అనంతపురం ఎడ్యుకేషన్: నీట్–2026 ప్రశ్నపత్రం లీకేజీపై ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. లక్షలాదిమంది విద్యార్థులు రాత్రింబవళ్లు కష్టపడి చదివి, కోచింగ్ తీసుకుని పరీక్షలకు సిద్ధమవుతుంటే కొందరు అక్రమ మార్గాల్లో ప్రశ్నపత్రాలను లీక్ చేసి విద్యావ్యవస్థ విశ్వసనీయతపై దెబ్బ తీశారన్నారు. ఇది కేవలం ఒక పరీక్షకు సంబంధించిన అంశం కాకుండా, దేశ భవిష్యత్తును నిర్మించే విద్యార్థుల ఆశయాలపై జరిగిన దాడిగా భావించాల్సి వస్తుందన్నారు. 2025లో జరిగిన ప్రశ్నపత్రం లీక్‌కు సంబంధించిన కొన్ని నిజాలు వెలుగులోకి వస్తున్నాయని పేర్కొన్నారు. ప్రశ్నపత్రం లీకేజీల కారణంగా నిజాయితీతో చదువుకున్న విద్యార్థులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారన్నారు. నీట్ వంటి జాతీయ స్థాయి పరీక్షలపై విద్యార్థులు, ప్రజల్లో నమ్మకం కోల్పోతే అది దేశ విద్యా వ్యవస్థకే ప్రమాదకరమని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో లీకేజీ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా శాశ్వత వ్యవస్థను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. పరీక్ష విధానలో పారదర్శకత, భద్రత, డిజిటల్ సెక్యూరిటీ, ప్రశ్నపత్రాల రవాణా, పరీక్ష కేంద్రాల పర్యవేక్షణ వంటి అంశా ల్లో సమగ్ర మార్పులు తీసుకురావాలని సూచించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి -
లోకేష్.. సాహసం సూపర్
● ఐదురోజుల్లోనే బైక్‌పై ఉమ్లింగ్లా శిఖరం అధిరోహణ ● గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్న ఓడీసీ యువకుడు ఓడీచెరువు: సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన ఓ యువకుడు కష్టపడి చదివి సీఏ (చార్టర్డ్ అకౌంటెంట్)గా రాణిస్తూనే బైక్‌పై పర్వతాలు అధిరోహిస్తూ సరికొత్త రికార్డు సృష్టించాడు. మండలంలోని రామిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన పెద్దసాని హనుమంతరెడ్డి కుమారుడు లోకేష్‌కుమార్ రెడ్డి దేశంలోనే అత్యంత ఎత్తైన పర్వత కనుమ ‘ఉమ్లింగ్లా’ను బైక్‌పై ఐదు రోజుల్లోనే అధిరోహించి గిన్నిస్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకున్నాడు. హాబీతో అరుదైన గుర్తింపు.. సీఏ పూర్తి చేసిన లోకేష్ కుమార్‌రెడ్డి ప్రస్తుతం సొంతంగా కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నాడు. వృత్తిరీత్యా క్షణం తీరిక లేకుండా ఉన్నప్పటికీ... బైక్‌పై సుదూర ప్రాంతాలకు వెళ్లడం హాబీగా మార్చుకున్నాడు. ఆ తర్వాత బైక్‌లపై పర్వతాలను అధిరోహించడాన్ని ఆస్వాదించేవాడు. ఈ క్రమంలోనే ఇటీవల అరుదైన సాహసయాత్రకు శ్రీకారం చుట్టాడు. లడఖ్‌లోని 19,024 అడుగుల (5,798.25 మీటర్లు) ఎత్తైన ఉమ్లింగ్లా శిఖరాన్ని అధిరోహించేందుకు మే 8వ తేదీన సిద్ధమయ్యాడు. తీవ్రమైన చలి, ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకుంటూ కేవలం ఐదు రోజుల్లోనే (మే 13వ తేదీ) ఉమ్లింగ్లా శిఖరాన్ని విజయవంతంగా చేరుకున్నాడు. తన అసాధారణ సాహసంతో ‘గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్’లో స్థానం దక్కించుకున్నాడు. -
ప్రజల భాగస్వామ్యంతోనే డెంగీ నియంత్రణ
పుట్టపర్తి అర్బన్: ప్రజల భాగస్వామ్యంతోనే డెంగీ నియంత్రణ సాధ్యమవుతుందని డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజ బేగం అన్నారు. జాతీయ డెంగీ నివారణ దినోత్సవం, స్వర్ణాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా డీఎంహెచ్ఓ కార్యాలయం నుంచి ప్రశాంతి గ్రామంలోని వై జంక్షన్ వరకూ శనివారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడారు. ప్రజల భాగస్వామ్యం లేనిదే ఏదీ సాధ్యం కాదన్నారు. గ్రామాల్లో పరిశుభ్రత వాతావరణం ఉంటే రోగాలు దూరమవుతాయన్నారు. స్వర్ణాంధ్ర కార్యక్రమాలో భాగంగా సింగిల్ యూస్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేదిద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి డాక్టర్ చెన్నారెడ్డి, ఎస్ఓ కళాధర్, డీపీహెచ్ఎన్ఓ వీరమ్మ, డిప్యూటీ డెమో సుబ్రహ్మణ్యం, డిప్యూటీ హెచ్ఈఓ రామలక్ష్మి, సీహెచ్ఓ వన్నప్ప, సిబ్బంది ఫైరోజ్, నాగభూషణం, లక్ష్మీ నాయక్ తదితరులు పాల్గొన్నారు. బీటెక్ విద్యార్థిని అదృశ్యంరాప్తాడు రూరల్: అనంతపురం రూరల్ మండలం ఉప్పరపల్లికి చెందిన సాంబశివయ్య కుమార్తె సానే దివ్యశ్రీ కనిపించకుండా పోయింది. పోలీసుల సమా చారం మేరకు... ఎస్కే యూ సమీపంలోని అనంతలక్ష్మి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ (సీఎస్ఈ–ఏఐఎంఎల్) మొదటి సంవత్సరం చదువుతున్న దివ్యశ్రీ ఈ నెల 15న ఉదయం 9.30 గంటల సమయంలో కళాశాలకని ఇంటి నుంచి బయలుదేరి వెళ్లింది. సాయంత్రం తిరిగి ఇంటికి చేరుకోలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు కళాశాలలో ఆరా తీశారు. లాభం లేకపోయింది. బంధువులు, పరిచయ స్తులను విచారించారు. ఆచూకీ లభ్యం కాకపోవడంతో శనివారం తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇటుకలపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువతి ఆచూకీ తెలిసిన వారు 99898 51996, 94901 06738, 94407 96807కు సమాచారం అందించాలని పోలీసులు కోరారు. రైలు నుంచి జారిపడిన యువకుడు పెనుకొండ(సోమందేపల్లి): వేగంగా వెళుతున్న రైలు నుంచి ఓ యువకుడు (32) జారి కిందపడ్డాడు. సోమందేపల్లి మండలం చాకార్లపల్లి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. అపస్మారకంగా పడి ఉన్న యువకుడిని వెంటనే పెనుకొండలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాళ్లు, చేతులు విరిగాయని డాక్టర్లు వెల్లడించారు. పోక్సో కేసులో బాలుడికి రెండేళ్ల జైలుకదిరి అర్బన్: బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో బాల నేరస్తుడికి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ జువైనైల్ జస్టిస్ బోర్డు, అనంతపురం ప్రిన్సిపల్ మేజిస్ట్రేట్ హారిక తీర్పు వెలువరించారు. వివరాలను కదిరి రూరల్ అప్‌గ్రేడ్ పీఎస్ సీఐ నిరంజన్‌రెడ్డి శనివారం వెల్లడించారు. 2020 మార్చి 11న కదిరి రూరల్ పరిధిలోని ఓ కాలనీలో రాత్రి సమయంలో ఆడుకుంటున్న బాలికపై అదే గ్రామానికి 13 ఏళ్ల బాలుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ సమయంలో బాలిక కేకలు విన్న తల్లి అటుగా వెళ్లి చూడగా బాలుడు పరారయ్యాడు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అప్పట్లో బాలుడిపై ఐపీసీ 376, పోక్సో యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు వాదనలు అప్పటి నుంచి కొనసాగుతూ వచ్చాయి. తుది విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో బాలుడికి రెండేళ్ల జైలు శిక్ష, రూ.10 వేలు జరిమానా విధిస్తూ శుక్రవారం సాయంత్రం న్యాయమూర్తి హారిక తీర్పు వెలువరించారు. దీంతో బాలుడిని తిరుపతిలోని పరిశీలనా కేంద్రానికి తరలించారు. కారులో వచ్చి దోచుకెళ్లారు!గుత్తి: స్థానిక ఆర్ఎస్లోని చంద్ర ప్రియనగర్‌లో శనివారం తెల్లవారు జామున చోరీ జరిగింది. కాలనీలో నివాసముంటున్న భాగ్యలక్ష్మి ఇంటికి తాళం వేసి పాతకొత్తచెరువుకు వెళ్లారు. తాళం వేసిన ఇంటిని గమనించిన ఐదుగురు దుండగులు దర్జాగా కారులో వచ్చి భాగ్యలక్ష్మి ఇంటి తాళం తెరిచి లోపలకు ప్రవేశించి బీరువాలోని రూ. 5 వేల నగదు, 30 తులాల వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. గమనించిన కాలనీ వాసులు అడ్డుకోబోగా కారులో ఉడాయించారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరా ఫుటేజీల్లో నిక్షిప్తమయ్యాయి. కాలనీవాసులు వెంట పడినా డ్రైవర్ కారు ఆపకుండా మూడు రౌండ్లు గిరగిరా తిప్పి శరవేగంగా దూసుకెళ్లిపోవడం గమనార్హం. బాధితురాలి ఫిర్యాదు మేరకు శనివారం రాత్రి పోలీసులు కేసు నమోదు చేసి, సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. -
‘రెవెన్యూ’లో పదోన్నతులకు కసరత్తు
అనంతపురం అర్బన్: రెవెన్యూశాఖలో సీనియర్ అసిస్టెంట్లు, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్లకు రీసర్వే డిప్యూటీ తహసీల్దార్లు(ఆర్ఎస్డీటీలు)గా పదోన్నతి కల్పించేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఆర్‌ఎస్‌డీటీ పోస్టులు అనంతపురం జిల్లాలో 11, శ్రీ సత్యసాయి జిల్లాలో 5 ఖాళీగా ఉన్నాయి. వీటిని పదోన్నతుల ద్వారా భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టారు. ప్రభుత్వ నిబంధన ప్రకారం పదోన్నతుల ప్రక్రియ ప్రారంభించే ముందు సంబంధిత కంట్రోలింగ్ అధికారి నుంచి కేడర్‌కు సంబంధించి సర్వీస్ వివరాలతో మొత్తం సిబ్బందిని చూపిస్తూ (అర్హులు, అనర్హులు, మరణించిన, ఉద్యోగ విరమణ చేసిన వారిని) నోటీసు జారీ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రకారం రెవెన్యూ శాఖలో ఉన్న మొత్తం ఎస్ఏలు, ఎంఆర్ఐలు 85 మందిని చూపిస్తూ డీఆర్ఓ మలోల నోటీసును జారీ చేశారు. ఖాళీలు ఇలా... అనంతపురం జిల్లాలో ఆర్‌ఎస్‌డీటీ పోస్టులు కళ్యాణదుర్గం, శెట్టూరు, వజ్రకరూరు, పామిడి, బొమ్మనహాళ్, గుమ్మఘట్ట, ఆత్మకూరు, అనంతపురం అర్బన్, డి.హీరేహాళ్ బ్రహ్మసముద్రం మండలాల్లో ఖాళీగా ఉన్నాయి. ఇక శ్రీసత్యసాయి జిల్లాలో కదిరి, హిందూపురం, లేపాక్షి, రొద్దం, గోరంట్ల మండలాల్లో ఖాళీగా ఉన్నాయి. పరిశీలనాంతరం సీనియార్టీ జాబితా.. ప్రస్తుతం జారీ చేసిన నోటీసులో చూపిన మొత్తం 85 మంది ఉద్యోగుల్లో ఇప్పటికే ఐదుగురు చనిపోగా, 11 మంది ఉద్యోగ విమరణ చేశారు. మిగిలిన 69 మందిలో ఆర్ఎస్డీటీగా పదోన్నతి పొందేందుకు అవసరమైన ఐదు పరీక్షల్లో ఉత్తీర్ణులైన 25 మందిని అర్హులుగా చూపించారు. ఇందులో 19మంది అర్హులు, పదోన్నతి ఇష్టం లేనివారు ఐదుగురు, ఒకరు అర్హత ఉన్నా చార్జెస్ పెండింగ్ ఉన్నాయి. ప్రస్తుతం జారీ చేసిన నోటీసు బహిరంగంగా ప్రదర్శించి అభ్యంతరాలు స్వీకరిస్తారు. వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం సీనియారిటీ జాబితాను సిద్ధం చేస్తారు. ఆ తరువాత సీనియార్టీ జాబితాపై మరోసారి అభ్యంతరాలు స్వీకరిస్తారు. అనంతరం పదోన్నతులు కల్పిస్తారు. ఉమ్మడి జిల్లాలో 16 ఆర్‌ఎస్‌డీటీ పోస్టుల ఖాళీ ఎస్ఏ, ఆర్ఐలకు ఆర్‌ఎస్‌డీటీలుగా పదోన్నతికి చర్యలు 85 మంది సిబ్బందిని చూపిస్తూ నోటీసు జారీ -
పేదలకు ఇళ్ల స్థలాలు దక్కకుండా చేస్తారా?
ధర్మవరం: నిరుపేదలకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలాలను ఆక్రమించుకునేందుకు కూటమి నాయకులు ప్రయత్నిస్తున్నారని, వారి దౌర్జన్యాల నుంచి తమ స్థలాలకు రక్షణ కల్పించాలంటూ అధికారులకు బాధితులు విన్నవించారు. వివరాల్లోకి వెళితే... ముదిగుబ్బలోని సర్వే నంబర్ 75–1లో 80 మంది నిరుపేదలకు జగన్ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించింది. ఈ స్థలం పక్కనే జాతీయ రహదారి ఉండడంతో విలువ గణనీయంగా పెరిగింది. దీంతో ఆ స్థలం తమదేనంటూ కంతే నారాయణ, పార్వతీబాయి శనివారం సర్వే అధికారులతో కలిసి అక్కడకు చేరుకుని కొలతలు తీసేందుకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న లబ్ధిదారులు అక్కడు చేరుకోగా వారితో వాగ్వాదానికి దిగారు. బాధితులు తీవ్ర స్థాయిలో ప్రతిఘటించడంతో సర్వేయర్లు అక్కడి నుంచి జారుకున్నారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. ఇల్లు కట్టుకునే స్థోమత లేక ఇబ్బందులు పడ్డామని, అయితే ఆ భూమి తమదని, కూటమి నాయకుడు కొనుగోలు చేశారంటూ కొందరు కొత్తగా తెరపైకి వచ్చి దౌర్జన్యం చేస్తున్నారని మండిపడ్డారు. అసైన్మెంట్ భూమిని ఎలా కొనుగోలు చేస్తారని ప్రశ్నించారు. ఈ విషయమై ఇప్పటికే తాము కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామని, న్యాయస్థానంలో కేసు కూడా నడుస్తోందని గుర్తు చేశారు. ప్రభుత్వం స్పందించి తమ స్థలాన్ని రక్షించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గుంజేపల్లి శంకర్, బాధితులు ఈశ్వరమ్మ, రామాంజినమ్మ, కాంతమ్మ, నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు. ముదిగుబ్బ మండలంలో బాధితుల ఆక్రందన -
ఫుడ్‌సేఫ్టీ అధికారులమంటూ డబ్బు వసూలు
బెళుగుప్ప: ఫుడ్ సేఫ్టీ అధికారులమంటూ ఐదుగురు మహిళలు శనివారం బెళుగుప్పలో హల్చల్ చేశారు. కిరాణా దుకాణాలు, బేకరీలో తనిఖీలు చేపట్టి ఒక్కో దుకాణదారుడి నుంచి రూ.1,200 నుంచి రూ.1,500 వరకూ వసూలు చేసి, ఫుడ్ సేఫ్టీ సర్వీసెస్, కృష్ణానగర్, గుంటూరు చిరునామాతో ఉన్న రసీదులు అందజేశారు. దీంతో అనుమానం వచ్చిన కొందరు వెంటనే విషయాన్ని స్థానిక విలేకరుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో విలేకరులు అక్కడకు చేరుకుని ప్రశ్నిస్తే పొంతనలేని సమాధానాలు ఇచ్చారు. ఫొటోలు తీయబోతుండగా ముఖాలను దాచుకుని జిల్లా ఫుడ్‌సేఫ్టీ అధికారి తమకు తెలుసునని, కావాలంటే మాట్లాడండి అంటూ ఫోన్ కాల్ చేసి చేతికి ఇవ్వబోయారు. అయితే పోలీస్ స్టేషన్లోనే అనుమానాలు నివృత్తి చేసుకుందామంటూ స్థానికులు పేర్కొనగానే ముఖాలు కనిపించకుండా చున్నీలు, కొంగులు అడ్డు పెట్టుకుని ఆటోలో కళ్యాణదుర్గం వైపుగా ఉడాయించారు. ఘటనపై జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్ అధికారి దేవరాజ్‌ను వివరణ కోరగా.. వారంతా నకిలీలని, దుకాణదారులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. -
రుణం బంగారమాయె!
బత్తలపల్లి: బ్యాంకుల్లో గోల్డ్ లోన్ పొందడం ఇక చాలా కష్టం. రూ.2 లక్షల వరకై తే ఫర్వాలేదు గానీ ఆపైన కావాలంటే సవాలక్ష నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. గతంలో రైతులు పట్టాదారు పాసు పుస్తకాల సాయంతో బ్యాంకుల్లో బంగారు తాకట్టు పెట్టి రుణాలు పొందేవారు. కానీ ఇప్పుడు అలా కుదరదని ఆర్బీఐ తేల్చిచెబుతోంది. మే 1వ తేదీ నుంచి బంగారు రుణాల మంజూరుకు కఠిన నిబంధనలు విధించింది. గతంలో బంగారు తూకాల్నిబట్టి ఎంతమొత్తమైనా రుణంగా ఇచ్చేవారు. ఆర్బీఐ విధించిన తాజా నిబంధనలతో బంగారు తాకట్టు పెట్టుకుని ఎలాంటి నిబంధనలు లేకుండా కేవలం రూ.2.50 లక్షలు మాత్రమే ఇస్తున్నారు. పాన్‌కార్డు ఉన్న రైతులకై తే రూ.5 లక్షల్లోపు, రూ.5 లక్షలు పైబడి రుణం పొందాలంటే ఇన్‌కంట్యాక్స్ చెల్లించే రైతులు మాత్రమే అర్హులని బ్యాంకు సిబ్బంది చెబుతున్నారు. అది కూడా ఇప్పటికే ఉన్న ఇతర రుణాలు, ఈఎంఐలు లెక్కించి వాస్తవాదాయాన్ని బేరీజు ఎంతమేరకు రుణం తిరిగి చెల్లించగలరో అంత మొత్తానికే బంగారం తీసుకుని రుణం మంజూరు చేస్తామంటున్నారు. దీనిపై రైతులు పెదవివిరుస్తున్నారు. అసలు.. వడ్డీ కట్టాల్సిందే.. బ్యాంకుల్లో తీసుకున్న బంగారు రుణాన్ని ఏడాదిలోపు రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో అయితే బ్యాంకుల్లో తీసుకున్న రుణానికి వడ్డీ మాత్రం కట్టించుకుని రెన్యూవల్ చేసేవారు. తాజాగా ఆర్బీఐ విధించిన నిబంధనల వల్ల వడ్డీతో పాటు అసలు కూడా చెల్లించాల్సి వస్తోంది. దీనివల్ల గతంలో అధిక మొత్తంలో బంగారుపై రుణం పొందిన రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో మళ్లీ వడ్డీవ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోందని పలువురు వాపోతున్నారు. ఇప్పటికై నా పాలకులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లి ఆర్బీఐ విధించిన నిబంధనలను సడలించే విధంగా ఒత్తిడి తీసుకురావాలని పేర్కొంటున్నారు. లేకపోతే రైతులు, సామాన్యులు మళ్లీ వడ్డీవ్యాపారుల ధన దాహానికి బలయ్యే ప్రమాదం ఉందంటున్నారు. నిబంధనలు మార్చకుంటే ఉద్యమిస్తాం... బంగారు రుణాలపై బ్యాంకులకు ఆర్బీఐ విధించిన నిబంధనలు దారుణంగా ఉన్నాయి. ఈ నిబంధనలు వల్ల రైతులు, సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడతారు. బ్యాంకులు కూడా రైతుల స్థితిగతులను గమనించి వారి సమస్యలను ఆర్బీఐ దృష్టికి తీసుకువెళ్లి నిబంధనలను వెంటనే సడలించేలా చూడాలి. లేనిపక్షంలో ప్రజా సంఘాలను కలుపుకొని ఉద్యమిస్తాం. బ్యాంకులను ముట్టడించి కార్యకలాపాలను స్థంభింపజేస్తాం. – కమతం కాటమయ్య, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, రైతు సంఘం బ్యాంకుల్లో ‘గోల్డ్ లోన్’ కష్టమే కఠిన నిబంధనలు విధించిన ఆర్బీఐ రుణం రూ.2 లక్షలు దాటితే పాన్‌కార్డు ఉండాల్సిందే ఐటీ రిటర్న్ ఫైల్ చేసి వారికే రూ.5 లక్షలపైన రుణం బంగారం చేతిలో ఉంటే బ్యాంకులో తాకట్టు పెట్టి నిమిషాల్లో రుణం పొందే రోజులకు కాలం చెల్లింది. ‘గోల్డ్ లోన్’పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిబంధనలను తీవ్రతరం చేసింది. దీంతో మీవద్ద ఎంత బంగారం ఉన్నా... తీసుకున్న రుణం చెల్లించగలిగే స్థాయిలో మీరు ఉన్నారన్న ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తేనే రుణం మంజూరయ్యే అవకాశం ఉంది. దీనివల్ల రైతులు, సామాన్యులు మళ్లీ ప్రైవేటు వ్యక్తుల వద్ద జీవితాలను తాకట్టుపెట్టాల్సిన పరిస్థితి తలెత్తింది. -
తొలిసారి గెలిచి మంత్రి అయినా.. చివరి స్థానమే
సవిత... తొలిసారిగా ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్నారు. ఎలాగోలా గట్టెక్కారు. మహిళా కోటాలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి అయ్యారు. అయితే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా స్వప్రయోజనాల కోసం తాపత్రయ పడుతూ అధ్వాన పనితీరుతో చివరి స్థానంలో నిలిచారు. సాక్షి, పుట్టపర్తి: సీఎం చంద్రబాబు ఇటీవలమంత్రుల పనితీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రులకు సంబంధించి ప్రకటించిన పనితీరు జాబితాలో శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన మంత్రి సవిత చివరన ఉండటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అధికారాన్ని అడ్డు పెట్టుకుని అక్రమార్జనే ధ్యేయంగా ముందుకు సాగుతుండడంతోనే ఆమె చివరి స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. విసుగెత్తిన సొంత పార్టీ కార్యకర్తలు.. సవిత వ్యవహారాలతో సొంత పార్టీ కార్యకర్తలే విసిగిపోయినట్లు తెలిసింది. ఇటీవల పార్టీ అధిష్టానం వద్ద టీడీపీకి చెందిన పలువురు సీనియర్ నేతలు అన్ని విషయాలను విన్నవించినట్లు తెలిసింది. అధికారాన్ని అడ్డు పెట్టుకుని అక్రమార్జనే ధ్యేయంగా ఆమె అనుచరులు పెనుకొండలో రెచ్చిపోతున్నారని, వారిని నియంత్రించడంలో మంత్రి పూర్తిగా విఫలం అయ్యారని చెబుతున్నారు. సీనియర్ నాయకులను విస్మరించి మంత్రి అన్నీ తానై వ్యవహరిస్తుండటంపై పార్టీ నాయకుల్లో అసమ్మతి నెలకొంది. రొద్దం, పరిగిలో ఇసుక దందా.. మంత్రి సవిత ప్రాతినిథ్యం వహిస్తున్న పెనుకొండ నియోజకవర్గం పరిధిలోని రొద్దం, పరిగి మండలాల్లో పెన్నా, జయమంగళి నదుల నుంచి రాత్రింబవళ్లు ఇసుకను అక్రమంగా తోడేస్తున్నారు. జేసీబీలతో తవ్వేసి ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా కర్ణాటక తరలిస్తున్నారు. అడ్డుకోవాల్సిన అధికారులను నియంత్రిస్తుండటంతో ఇసుక దోపిడీకి అదుపు లేకుండా పోతోంది. రోజూ వందల సంఖ్యలో ట్రాక్టర్లు, టిప్పర్లలో ఇసుక పొరుగు రాష్ట్రం చేరుతోంది. ఇసుకను అక్రమంగా తరలించే వాహనాలను పట్టుకున్న అధికారులపై మంత్రి బదిలీ వేటు వేయించారు. దీంతో మిగతా అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. పెనుకొండలో అన్నీ తామై.. నియోజకవర్గ కేంద్రంలో మంత్రితో పాటు అనుచరులు అన్నీ తామై వ్యవహరిస్తున్నారు. మద్యం దుకాణాల టెండర్ల నుంచి కియా కార్ల కంపెనీలో కాంట్రాక్టుల వరకు వాటా దక్కాల్సిందే. ప్రారంభోత్సవాల్లో రిబ్బన్ కటింగ్‌లకు కూడా పార్టీలోని సీనియర్లను విస్మరిస్తున్నారు. హిందూపురం పార్లమెంటు సభ్యుడు పెనుకొండ వాసి అయినప్పటికీ ప్రొటోకాల్ పాటించకుండా ఆయన్ను పక్కకు నెట్టేస్తుండడం ఇప్పటికే పలుమార్లు వివాదాస్పదమైంది. మంత్రికి తెలియకుండా ఎంపీ పార్థసారథి ఎలాంటి కార్యక్రమం నిర్వహించే పరిస్థితి లేదు. గోరంట్లలో భారీ భూ దోపిడీ.. కర్ణాటక శివారున ఉన్న గోరంట్ల మండలంలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఇదే అదనుగా అధికార పార్టీ నాయకులు పేద రైతుల భూములను బలవంతంగా లాక్కుని ప్రైవేటు కంపెనీలకు అప్పజెప్పేయత్నం చేస్తున్నారు. ఇప్పటికే సుమారు రూ.100 కోట్ల భూ కుంభకోణం వెలుగు చూసింది. ల్యాండ్ సీలింగ్ కింద పంచిన భూములపై మంత్రి అనుచరులు కన్నేసి పంజాబ్ కంపెనీకి కొంత రిజిస్ట్రేషన్ చేశారు. ఇంకొంత మంది రైతులు విక్రయించలేదని బెదిరింపులకు దిగినట్లు తెలిసింది. ప్రజల్లోనూ అసంతృప్తి.. మంత్రి అండతో పెనుకొండ నియోజకవర్గంలో ఆమె అనుచరులు చేస్తున్న అరాచకాలతో ప్రజలు విసుగెత్తిపోయారు. దందాలు, దోపిడీలు, కబ్జాలు జరుగుతున్నా పట్టీపట్టనట్లు వ్యవహరిస్తుండటంతో మంత్రి తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. అధికారులపైనా ఒత్తిళ్లు.. మాట వినని అధికారులపై మంత్రి సవిత టక్కున వేటు వేయిస్తున్నారు. తాను చెప్పిన వారిపై అక్రమ కేసులు నమోదు చేయాలని పోలీసులపై పలుమార్లు ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. దీంతో విధి నిర్వహణలో ఇబ్బందులు ఎదుర్కోలేమని చెప్పిన ముగ్గురు ఎస్ఐలను ఇప్పటికే పంపించేశారు. మరో సీఐ పైన కూడా మంత్రి కక్ష కట్టినట్లు తెలుస్తోంది. తాను చెప్పిన వారికి పనులు చేయలేదని ఓ తహసీల్దార్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆయన అందించిన పూల బొకేను అందరూ చూస్తుండగానే విసిరేయడం అప్పట్లో సర్వత్రా చర్చనీయాంశమైంది. -
కోర్టు ప్రాంగణంలో రెండు రోజులు ఉండాలని శిక్ష
తాడిపత్రి రూరల్: రెండు రోజుల పాటు కోర్టు ప్రాంగణంలో ఉండాలని జూదరులకు శిక్ష విధిస్తూ తాడిపత్రి సెకండ్‌క్లాస్ మేజిస్ట్రేట్ ప్రభావతి తీర్పు వెలువరించారు. వివరాలను అప్‌గ్రేడ్ పీఎస్ సీఐ శివగంగాధర్‌రెడ్డి శుక్రవారం వెల్లడించారు. తాడిపత్రి మండలం సజ్జలదిన్నె గ్రామ సమీపంలో పేకాట ఆడుతూ పట్టుపడిన 11మందిని శుక్రవారం న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. కేసు విచారణ అనంతరం జూదరులు ఒక్కొక్కరికి రూ.300 చొప్పున జరిమానా, రెండు రోజుల పాటు ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కోర్టు ప్రాంగణంలోనే ఉండాలని శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. బూదివర్తిలో వడగండ్ల వాన బెళుగుప్ప: మండలంలోని బూదివర్తి గ్రామంలో శుక్రవారం సాయంత్రం పెను గాలులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. గ్రామస్తులు వడగండ్లను చేతుల్లోకి తీసుకుని మురిసిపోయారు. గ్రామం సమీపంలోని పొలాల్లో కురిసిన వడగళ్లు ముత్యాల మాదిరిగా మిలమిల మెరుస్తూ కనిపించాయి. -
ఆలయ ప్రాశస్త్యం.. రాజకీయ ప్రాపకం
చిలమత్తూరు: ప్రపంచ ప్రసిద్ధి గాంచిన లేపాక్షి వీరభద్ర ఆలయ కమిటీ చైర్మన్ పదవి హాట్ కేక్‌లా మారింది. ప్రస్తుతం చైర్మెన్‌గా వ్యవహరించిన రమానందన్ పదవీ కాలం ఈ ఏడాది మార్చితో ముగియడంతో ఆ పదవికి తీవ్ర పోటీ నెలకొంది. దీంతో ఎలాగైనా ఆలయ కమిటీ చైర్మన్ పదవి దక్కించుకునేందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారులు పోటీ పడ్డారు. లేపాక్షి ఆలయానికి రాజకీయ రంగు: లేపాక్షి వీరభద్రస్వామి ఆలయాన్ని ప్రధాని మోదీ సందర్శించిన తర్వాత భారీగా పర్యాటకులు సందర్శిస్తున్నారు. దీంతో ఆలయ ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఎంతో ప్రాశస్త్యం ఉన్న ఆలయానికి చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు పైరవీలు ఊపందుకున్నాయి. ఇదే అదనుగా ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏలు రంగంలో దిగి చైర్మన్ పదవిని అమ్మకానికి పెట్టారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. తమకు అనుకూలంగా ఉన్న పరిగికి చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారితో ముడుపులు దండుకుని ఆలయ కమిటీ చైర్మన్ పదవి అంటగట్టేందుకు సిద్ధమైనట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం కొలువు దీరిన ఏడాదిలోనే ఆలయం వద్ద వాహనాల పార్కింగ్ వేలం పాటలోనూ ఎమ్మెల్యేల పీఏలు భారీగా అవకతవకలకు పాల్పడిన విషయం తెలిసిందే. చివరకు ఈ అంశంపై ఏసీబీ రంగంలో దిగి విచారణ చేపట్టడం అప్పట్లో సంచలనం రేకెత్తించింది. తాజాగా చైర్మన్ పదవి అంశంలోనూ మితిమీరిన రాజకీయ జోక్యంపై స్థానికుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. హాట్ కేక్‌లా మారిన లేపాక్షి ఆలయ కమిటీ చైర్మన్ పదవి పోటీ పడుతున్న రియల్టర్లు స్థానికులను కాదని బయటి వ్యక్తులకు పదవి కట్టబెట్టే ప్రయత్నం ఎమ్మెల్యే బాలయ్య పీఏల తీరుపై స్థానిక కూటమి నేతల్లో అసహనం స్థానిక నేతల్లో అసంతృప్తి లేపాక్షి ఆలయ కమిటీ చైర్మన్‌ను స్థానికులకు కాకుండా స్థానికేతరులకు కట్టబెడుతుండడంపై లేపాక్షి టీడీపీ నేతల్లో అసంతృప్తి రగిల్చింది. ఇప్పటికే ఎమ్మెల్యే మొదలు పీఏలు.. ఇతర కీలకమైన పదవుల్లో స్థానికేతరులకే పట్టం కట్టడంపై విసిగిపోయిన టీడీపీ నేతలు అధిష్ణానం తీరుపై మండిపడుతున్నారు. ఎంత కాలం తాము జెండాలు మోయాలంటూ ప్రశ్నిస్తున్నారు. లేపాక్షి ఆలయ కమిటీ చైర్మన్ పదవిని స్థానికులకే ఇవ్వాలని కూటమిలోని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అలా కాదని స్థానికేతరులకు కట్టబెడితే చూస్తూ ఊరుకోబోమని బహిరంంగానే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. -
వడ్డీ వ్యాపారుల వేధింపులు తాళలేక యువకుడి ఆత్మహత్య
ధర్మవరం: వడ్డీ వ్యాపారుల వేధింపులు తాళలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన మేరకు... ధర్మవరంలోని ప్రియాంక నగర్లో నివాసముంటున్న రామిరెడ్డి కుమారుడు లక్ష్మీరెడ్డి (25) ఎలక్ట్రీషియన్‌గా జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం రాత్రి పొద్దుపోయాక ఇంటికి చేరుకున్న ఆయన తల్లిదండ్రులు నిద్రిస్తున్న సమయంలో ఇంటికి ఎదురుగా ఉన్న రేకుల షెడ్డులో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాసేపటి తర్వాత తండ్రి రామిరెడ్డి నిద్ర లేచి కుమారుడి కోసమని బయటకు వచ్చి చూడగా బంక్‌కు వేసుకున్న ఉరికి విగతజీవిగా వేలాడుతున్న లక్ష్మీరెడ్డి కనిపించడంతో పెద్దగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని పరిశీలించారు. అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించుకున్నారు. సమాచారం అందుకున్న వన్‌టౌన్ పోలీసులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, కేసు నమోదు చేశారు. కాగా, లక్ష్మీరెడ్డి ఆత్మహత్యకు ప్రధాన కారణం అప్పుల బాధలేనని స్థానికులు తెలిపారు. వడ్డీ వ్యాపారుల వేధింపులు తాళలేకనే తనువు చాలించినట్లుగా సమాచారం. మాట నిలబెట్టుకున్న గురువు రాప్తాడు రూరల్: విద్యార్థులు పెద్ద లక్ష్యాలు నిర్దేశించుకుని చదవాలని ప్రోత్సహిస్తూ ఇచ్చిన మాటను నిలబెట్టుకుని ఓ ఉపాధ్యాయుడు ఆదర్శంగా నిలిచారు. వివరాల్లోకి వెళితే.. రాప్తాడు మండలం గొందిరెడ్డిపల్లి జెడ్పీహెచ్ఎస్లో ఇంగ్లిష్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బీకే నారాయణ.. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో 550 మార్కులకు పైగా సాధించిన విద్యార్థులకు తన సొంత ఖర్చులతో విమాన ప్రయాణం చేయిస్తానని ప్రకటించారు. ఈ ప్రకటన విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. పట్టుదలతో చదువుకున్న విద్యార్థిని ఈ.రాజిత 563 మార్కులు సాధించడంతో శుక్రవారం ఉదయం 7 గంటలకు తన సతీమణి పద్మావతి (వ్యవసాయ శాఖ సూపరింటెండెంట్)తో కలిసి రాజితను బెంగళూరు నుంచి విజయవాడకు విమానంలో ఉపాధ్యాయుడు నారాయణ పిలుచుకెళ్లారు. విజయవాడలో కనకదుర్గ అమ్మవారి దర్శనం చేయించడంతో పాటు ప్రసిద్ధ ఉండవల్లి గుహలను చూపించారు. సాధారణ కుటుంబానికి చెందిన ఓ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని తొలిసారి విమానంలో ప్రయాణించడం ఆమెకు జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతిగా మారింది. -
ఎద్దుల బండిని ఢీకొన్న లారీ – రైతు మృతి
రొద్దం: ఎద్దుల బండిని లారీ ఢీకొన్న ఘటనలో ఓ రైతు మృతి చెందగా, మరొకరితో పాటు ఎద్దులకూ తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన మేరకు... రొద్దం మండలం చెరుకూరు గ్రామానికి చెందిన రైతు కురుబ పుట్టప్ప (69) శుక్రవారం ఉదయం ఎద్దుల బండి కట్టుకుని తన పొలానికి బయలుదేరాడు. ఈ క్రమంలో తన పొలం పక్కనే ఉన్న మహిళా రైతు ప్రమీల కూడా అదే ఎద్దుల బండిని ఎక్కారు. మార్గం మధ్యలో ప్రధాన రహదారిపైకి చేరుకోగానే వేగంగా దూసుకొచ్చిన లారీ ఢీకొంది. రైతులిద్దరితో పాటు రెండు ఎద్దులకూ తీవ్ర గాయాలయ్యాయి. లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. క్షతగాత్రులను వెంటనే పెనుకొండలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పుట్టప్ప మృతి చెందగా, పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రమీలను బెంగళూరుకు వైద్యులు రెఫర్ చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కారు బోల్తా పడి.. పెనుకొండ: కారు బోల్తాపడిన ఘటనలో ఓ యువకుడు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... చేనేత వృత్తితో జీవనం సాగిస్తున్న సోమందేపల్లికి చెందిన పవన్ (32) శుక్రవారం ఉదయం పట్టు చీరల కలెక్షన్ కోసం ధర్మవరానికి కారులో వెళ్లాడు. అక్కడ పని ముగించుకుని తిరుగు ప్రయాణమైన ఆయన.. పెనుకొండ సమీపంలోని ఆర్సీపీఎల్ కంపెనీ వద్దకు చేరుకోగానే 44వ జాతీయ రహదారిపై నియంత్రణ కోల్పోవడంతో కారు ఒక్కసారిగా రోడ్డు పక్కన పల్లంలోకి బోల్తా కొట్టింది. అటుగా వెళుతున్న వారి సమాచారంతో 108 సిబ్బంది అక్కడకు చేరుకుని క్షతగాత్రుడిని పెనుకొండలోని ప్రభుత్వాస్పత్రికి తరలించింది. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు బెంగళూరుకు రెఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ పవన్ మృతి చెందాడు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. -
హంద్రీ–నీవా కాలువలో పడి బీటెక్ విద్యార్థి మృతి
హిందూపురం: మండలంలోని రాచపల్లి శివారున హంద్రీ–నీవా కాలువ నీటి ప్రవాహంలో ప్రమాదవశాత్తు బీటెక్ విద్యార్థి పడి మృతి చెందాడు. శుక్రవారం ఉదయం పశువులను మేపు కోసం రాచపల్లికి చెందిన బీటెక్ విద్యార్థి చేతన్‌రెడ్డి (19) తోలుకెళ్లాడు. మధ్యాహ్నం కాలువ వద్ద నీరు తాగేందుకు పశువులను వదిలిన సమయంలో ప్రమాదవశాత్తూ అదుపు తప్పి నీటి ప్రవాహంలో పడిపోయాడు. విషయం తెలుసుకున్న స్థానికులు గంటల పాటు గాలించినా ఆచూకీ లభించలేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని గాలించి మృతదేహాన్ని వెలికి తీశారు. ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బీ–ఫార్మసీ సప్లి ఫలితాల విడుదలఅనంతపురం టౌన్: జేఎన్టీయూ(ఏ) పరిధిలో ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌లో నిర్వహించిన బీ–ఫార్మసీ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఈ మేరకు వర్సిటీ డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ఆచార్య నాగప్రసాద్ నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు. బీ–ఫార్మసీ నాల్గో సంవత్సరం మొదటి, రెండో సెమిస్టర్ ఫలితాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. కార్యక్రమంలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆచార్య శివకుమార్, డాక్టర్ శారద, డాక్టర్ అంకారావు, శ్రీధర్ పాల్గొన్నారు. శ్రీవారి హుండీ కానుకల లెక్కింపుకదిరి టౌన్: ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులు సమర్పించిన హుండీ కానుకలను శుక్రవారం ఆలయ అధికారులు లెక్కించారు. 59 రోజులకు గాను రూ 1,15,13,345 నగదు, 24 గ్రాముల బంగారం, 480 గ్రాముల వెండి సమకూరినట్లు ఆలయ ఈఓ వి. శ్రీనివాసరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఆలయ హుండీల పర్యవేక్షణాధికారి, బ్యాంక్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అదృశ్యమైన వ్యక్తి మృతిమడకశిర రూరల్: ఐదు రోజుల క్రితం కనిపించకుండా పోయిన వ్యక్తి మృతదేహమై కనిపించాడు. పోలీసులు తెలిపిన మేరకు... మడకశిర మండలం గౌడనహళ్లి గ్రామానికి చెందిన చంద్రప్ప (50)కు భార్య, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. మద్యానికి బానిసైన చంద్రప్ప ఐదు రోజుల క్రితం కనిపించకుండా పోయాడు. అప్పటి నుంచి కుటుంబసభ్యులు గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. శుక్రవారం ఉదయం గ్రామ సమీపంలోని ఓ పొలంలో పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడిని చంద్రప్పగా కుటుంబసభ్యులు ధ్రువీకరించారు. పొలం వద్దకు వెళ్లిన సమయంలో దాహంతో అలమటిస్తూ వడదెబ్బ సోకి మృతి చెంది ఉంటాడనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ దిశగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 1 నుంచి ప్రభుత్వ భవనాలకు ప్రీ పెయిడ్ స్మార్టు మీటర్లు అనంతపురం టౌన్: ప్రభుత్వ కార్యాలయాల విద్యుత్ సర్వీసులకు జూన్ 1 నుంచి ప్రీ పెయిడ్ మీటర్లను అమల్లోకి తీసుకువస్తున్నట్లు ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకల్ లోతేటి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అనంతపురం జిల్లాలో 8,422, శ్రీ సత్యసాయి జిల్లాలో 7,002 సర్వీసులకు ప్రీ పెయిడ్ విధానంలో విద్యుత్ సరఫరా అవుతుందన్నారు. ఈ విధానంలో వినియోగదారుల్లో జవాబుదారీతనం మరింత మెరుగుపడుతుందన్నారు. రోజువారీ విద్యుత్ వినియోగం ఏ స్థాయిలో ఉందో సులువుగా తెలుసుకోవచ్చని, దీంతో విద్యుత్‌ను పొదుపుగా వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. స్మార్ట్ మీటర్ సర్వీసులను గ్రూప్‌గా ఏర్పాటు చేసి ఈ–వాలెట్ ద్వారా రీచార్జ్ చేసుకునే సౌలభ్యాన్ని కల్పిస్తామన్నారు. విద్యుత్ చార్జీలు, స్థిర చార్జీల అడ్వాన్స్ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రతి వినియోగదారునికి ఎస్ఎంఎస్ రూపంలో మొబైల్‌కు ఎప్పటికప్పుడు సమాచారం అందుతుందని, బ్యాలెన్స్ సున్నాకు చేరినప్పుడు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని తెలిపారు. -
నిరసన హోరు
బకాయి వేతనాలు చెల్లించాలంటూ కొద్ది రోజులుగా సత్యసాయి తాగునీటి పథకం కార్మికులు చేస్తున్న సమ్మె ఉధృతంగా సాగుతోంది. ఆయా ప్రాంతాల్లోని సత్యసాయి తాగునీటి పథకం కేంద్రాల వద్ద కార్మికులు రోజుకో రీతిలో తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే శుక్రవారం కూడా ఆందోళన కొనసాగించారు. కార్మిక సంఘాలతో పాటు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు కూడా వీరికి మద్దతు ప్రకటించి నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే ప్రభుత్వం, అధికారుల్లో చలనం రాకపోవడం సిగ్గుచేటని కార్మిక సంఘం నాయకులు విమర్శిస్తున్నారు. పెండింగ్‌లో ఉన్న జీతాలు చెల్లించాలని, సత్యసాయి బోర్డులోనే తమను కొనసాగించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. – ధర్మవరం/కదిరి అర్బన్/తాడిమర్రి/బత్తలపల్లి: -
ప్రజలకు పెట్రో ‘వాత’
● పెట్రల్, డీజిల్ ధర లీటర్‌పై రూ.3 పెంపు ● వినియోగదారుల జేబుకు చిల్లు ● నెలసరి భారం రూ.5.59 కోట్లు అనంతపురం అర్బన్: కేంద్ర ప్రభుత్వం ప్రజలకు పెట్రో ‘వాత’ పెట్టింది. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ముగిసిన తరువాత పెట్రోల్, డీజిల్ ధర పెంచనుందనే విషయాన్ని ‘సాక్షి’లో గతనెల 27న ప్రచురితమైన ‘తీవ్రమైన పెట్రోల్ కష్టాలు’ కథనం ద్వారా తెలియజేసింది. ఇప్పుడు అదే జరిగింది. లీటర్ పెట్రోల్‌పై రూ.3.30, లీటర్ డీజిల్‌పై రూ.3.14 పెంచింది. ధరల పెంపుతో జిల్లా పెట్రోల్, డీజిల్ వినియోదారులపై రోజువారీగా రూ.19.10 లక్షలుగా నెలసరి రూ.5.59 కోట్లు ఆర్థిక భారం పడనుంది. ధర పెంపు తీవ్రభారం ఇప్పటికే పెరిగిన నిత్యావసర సరుకుల ధరలతో పేద, సామాన్య, మధ్యతరగతి వర్గాలు తీవ్ర ఇబ్బంది పడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పెట్రోల్, డీజిల్ ధర పెంపు భారం ఆ వర్గాలపై తీవ్రంగా మారింది. జిల్లావ్యాప్తంగా 188 పెట్రోల్ బంక్‌లు ఉన్నాయి. రోజువారీగా పెట్రోల్ 2.50 లక్షల లీటర్లు, డీజిల్ 3.72 లక్షల లీటర్లు వినియోగం ఉంది. పెట్రోల్‌పై రూ.3 పెంచడతో వినియోగదారులపై రోజువారీగా రూ.7.50 లక్షలుగా నెలసరి రూ.2.25 కోట్లు భారం పడనుంది. ఇక డీజిల్‌పై రూ.3 పెంచడంతో వినియోగదారులపై రోజువారీగా రూ.11.16 లక్షలుగా నెలసరి రూ.3.348 కోట్లు భారం పడనుంది. పెట్రోల్, డీజిల్ ధర పెంపుతో ప్రజల జేబుకు రోజువారీగా రూ.19.10 లక్షలుగా నెలసరి రూ. 5.598 కోట్లు చిల్లుపడనుంది. -
ఆర్టీసీ బస్టాండ్‌లో దొంగల బెడద
ఉరవకొండ: ఆర్టీసీ బస్టాండ్లలో దొంగల బెడద తీవ్రమైంది. ఉరవకొండ, కళ్యాణదుర్గం ఆర్టీసీ బస్టాండ్లలో ఈ తీవ్రత మరీ ఎక్కువగా ఉందని ప్రయాణికులు వాపోతున్నారు. బస్సులు ఎక్కే సమయంలో గేటు వద్ద భారీ జనం గుమిగూడటాన్ని ఆసరాగా చేసుకుని వారి జేబుల్లోని సెల్ఫోన్లను దొంగలిస్తున్నారు. శుక్రవారం ఉరవకొండలో ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సు ఎక్కుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు మోహన్‌కృష్ణ జేబులోని ఖరీదైన మొబైల్‌ను దుండగులు అపహరించారు. ఈ ఘటనపై ప్రభుత్వ ఉపాధ్యాయుడు పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాక సీసీ కెమెరా పుటేజీల్లో అనుమానితుడి ఫొటోను పోలీసులకు అందించారు. అలాగే మూడు రోజులుగా నాలుగు విలువైన సెల్ఫోన్లను ప్రయాణికుల నుంచి దుండగులు అపహరించినట్లుగా సమాచారం. రెండు రోజుల క్రితం కళ్యాణదుర్గంలోనూ అనంతపురం వెళ్లే బస్సు ఎక్కే సమయంలో ఇద్దరు ప్రయాణికుల వద్ద సెల్ఫోన్లను దుండగులు అపహరించారు. కంబదూరు గ్రామానికి చెందిన ఓ మహిళ తన బ్యాగ్‌లో రూ.3లక్షల విలువైన బంగారు ఆభరణాలు పెట్టుకుని బస్టాండ్‌కు చేరుకోగా, కొద్ది సేపటికే బ్యాగులోని బంగారు గొలుసును దుండగులు ఎత్తుకెళ్లారు. పోలీసులు ఇప్పటికై నా స్పందించి ఆర్టీసీ బస్టాండ్లలో చోరీలను అరికట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు. అంధకారంలో నాలుగు గ్రామాలు బొమ్మనహాళ్: మండలంలోని మైలాపురంలో గురువారం సాయంత్రం వీచిన పెనుగాలులు నాలుగు గ్రామాలను అంధకారంలోకి నెట్టేశాయి. రెండు రోజులుగా విద్యుత్ లేక ప్రజలు చీకట్లోనే మగ్గుతున్నారు. రైస్‌మిల్ గోడ కూలి ఒకరు మృతి చెందగా, మరో వ్యక్తి గాయపడిన విషయం తెలిసిందే. పెను గాలులకు విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు నేలకొరగడంతో మైలాపురం, ఏలంజి, కానాపురం, కొత్తూరు గ్రామాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఫలితంగా తాగునీటి సమస్య తీవ్రమైంది. శుక్రవారం ఉదయం మైలాపురంలో బొమ్మనహాళ్ తహసీల్దార్ మునివేలు పర్యటించి నష్టాన్ని పరిశీలించారు. బాధితులతో మాట్లాడారు. నష్టంపై పూర్తి నివేదికను సిద్దం చేసి ఉన్నతాధికారులకు పంపుతున్నట్లు తెలిపారు. విద్యుత్‌శాఖ ఏఈఈ లక్ష్మీరెడ్డి మాట్లాడుతూ.. మైలాపురం ఫీడర్ పరిధిలో 11 కేవీ లైన్‌కు చెందిన 52 విద్యుత్ స్తంభాలు, ఏలంజికి చెందిన 26 స్తంభాలు, 10 ట్రాన్స్ఫార్మర్లు నేలకొరిగినట్లుగా తెలిపారు. అలాగే కానాపురం ఫీడర్ పరిధిలో 40 విద్యుత్ స్తంభాలు, 6 ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసమయ్యాయన్నారు. విద్యుత్ సరఫరా పునరుద్దరణకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ద్విచక్ర వాహనాల ఢీ .. ఒకరి దుర్మరణం విడపనకల్లు: ద్విచక్ర వాహనాలు పరస్పరం ఢీకొన్న ఘటనలో ఓ వృద్ధుడు దుర్మరణం పాలయ్యాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. విడపనకల్లు మండలం పాల్తూరు గ్రామ శివారున ఈ ఘటన చోటు చేసుకుంది. ఉరవకొండ మండలం వ్యాసాపురం గ్రామానికి చెందిన రాజన్న, నల్లారెడ్డి ఇద్దరూ ఒకే ద్విచక్ర వాహనంపై శుక్రవారం పాల్తూరు నుంచి స్వగ్రామానికి బయలుదేరారు. గాజుల మల్లాపురం సమీపంలోని పెద్ద వంక వద్దకు చేరుకోగానే ఎదురుగా వస్తున్న పంపన్న గౌడ్ (67) ద్విచక్ర వాహనం, రాజన్న బైక్ పరస్పరం ఢీకొన్నాయి. ఘటనలో బైక్ మీద నుంచి కిందపడి తలకు తీవ్ర గాయం కావడంతో పంపన్న గౌడ్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయ పడిన రాజన్న, నల్లారెడ్డిని అటుగా వెళుతున్న వారు వెంటనే ఉరవకొండలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై పాల్తూరు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
బ్యూటీషియన్ కోర్సుల్లో శిక్షణ
సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో.. కార్యక్రమంలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీ నుంచి జూన్ 21వ తేదీ వరకు బ్యూటీ షియన్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు శిక్షణ ఇస్తారు. శిక్షణలో నేర్పించే అంశాలు ఐబ్రోస్(త్రేడింగ్), వ్యాక్స్, పెడిక్యూర్, మెనిక్యూర్, బ్లీచ్, స్కిన్‌కేర్, హెయిర్ కేర్, ఫేస్‌ప్యాక్స్, హెయిర్ కట్స్, హెయిర్‌స్టైల్స్, హెన్నా ప్రిపరేషన్, బేసిక్ పింపుల్ ట్రీట్మెంట్, మేకప్స్ (బ్రైడల్, పార్టీ, లైట్ మేకప్స్), హెయిర్ మసాజ్, హెయిర్ కట్స్, కమ్యూనికేషన్ అండ్ సెల్ఫ్ గ్రూమింగ్, శారీ డ్రాపింగ్. రిజిస్ట్రేషన్లు స్వీకరించు తేదీలు : ఈ నెల16 నుంచి 21వ తేదీ వరకు సమయం : ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రిజిస్ట్రేషన్ ఫీజు : రూ.2,500 వర్క్‌షాపు షెడ్యూల్ తేదీలు : ఈ నెల 22 నుంచి వచ్చేనెల 21 వరకు శిక్షణ సమయం : ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 9502499079, 9666697219 -
సత్యసాయి సేవలో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్
ప్రశాంతినిలయం: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ శుక్రవారం సత్యసాయి సన్నిధిలో గడిపారు. శుక్రవారం బ్రాహ్మణపల్లి వద్ద అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాప్ట్ (ఏఎంసీఏ) డిఫెన్స్ ప్రాజెక్టు శంకుస్థాపనకు విచ్చేసిన ఆయన కార్యక్రమం అనంతరం సీఎం చంద్రబాబుతో కలిసి ప్రశాంతినిలయానికి చేరుకున్నారు. సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మహాసమాధిపై పూల మాలలు, బొకేలు ఉంచి ప్రార్థించారు. అనంతరం యజుర్ మందిరంలోనూ కాసేపు గడిపారు. వారి వెంట సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, సవిత, పయ్యావుల కేశవ్, ఎంపీ పార్థసారథి, పలువురు ఎమ్మెల్యేలు, బీజేపీ నాయకులు విష్ణువర్దన్‌రెడ్డి, కలెక్టర్ శ్యాం ప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్, జేసీ మౌర్య భరద్వాజ్ తదితరులు ఉన్నారు. వైఎస్సార్ సీపీ అనుబంధ కమిటీల్లో చోటుపుట్టపర్తి అర్బన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ రాష్ట్ర కమిటీల్లో జిల్లాకు చెందిన ముగ్గురు నాయకులకు స్థానం దక్కింది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ధర్మవరం నియోజకవర్గానికి చెందిన తాడిమర్రి మనోజ్‌కుమార్‌రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా రాప్తాడు నియోజకవర్గానికి చెందిన వీఎస్ రామాంజనేయులు, అలాగే మడకశిర నియోజకవర్గానికి చెందిన పి. మధుసూదన్‌ను పార్టీ సోషల్ మీడియా విభాగం రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. ఈమేరకు వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా ఉపాధ్యక్షుడిగా జాఫర్‌ఖాన్ వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడిగా కదిరి నియోజకవర్గానికి చెందిన పఠాన్ జాఫర్ ఖాన్‌ను నియమించారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. పుట్టపర్తిలో డయాలసిస్ సెంటర్ ప్రారంభం పుట్టపర్తి అర్బన్: సత్యసాయి బాబా విద్యాసంస్థల పూర్వ విద్యార్థులు నిర్వహిస్తున్న పాలియేటివ్ సెంటర్‌కు అనుసంధానంగా ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాన్ని శుక్రవారం మంత్రి సత్యకుమార్ యాదవ్, కలెక్టర్ శ్యాం ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పాలియేటివ్ సెంటర్లో అందుతున్న సేవలు స్వయంగా పరిశీలించి నిర్వాహకులను అభినందించారు. అనంతరం సమీపంలోనే రూ.7.4 కోట్ల వ్యయంతో పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేస్తున్న క్యాన్సర్ ఆస్పత్రి భవన నిర్మాణ పనులను పరిశీలించారు. భవిష్యత్తులో ఏ సహాయం కావాలన్నా చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. వారి వెంట డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజాబేగం, సంస్థ ప్రతినిధులు ఉన్నారు. పోలీసుల అదుపులో దొంగనోట్ల చలామణి ముఠా? ● పట్ట్టుబడిన వారిలో టీడీపీ నేతల ప్రధాన అనుచరులు! సాక్షి, పుట్టపర్తి: హిందూపురంలో దొంగ నోట్లను చలామణి చేస్తున్న ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. రెండు రోజుల క్రితం హిందూపురం రూరల్ మండల పరిధిలో ఆరుగురు పట్టుబడినట్లుగా తెలుస్తోంది. అయితే ముఠా వెనుక ఉన్న అసలు నేరస్తులను గుర్తించే పనిలో భాగంగా ముఠా సభ్యులను పోలీసులు విచారణ చేస్తున్నట్లు సమాచారం. కాగా, పట్టుబడిన నిందితుల్లో చిలమత్తూరు మండల టీడీపీ నేతల ప్రధాన అనుచరులు ఉన్నట్లుగా వదంతులు వ్యాపించాయి. నేర చరిత్ర కలిగిన వాళ్లను మండలంలోని కొందరు టీడీపీ నేతలు ప్రోత్సహిస్తూ దొంగనోట్లు చలామణిలో వాడుకుంటున్నారన్న ఆరోపణలూ వెల్లువెత్తాయి. -
టీచర్లకు టెట్ టెన్షన్..!
కదిరి: విద్యారంగంలో నూతన సంస్కరణల పేరుతో చంద్రబాబు ప్రభుత్వం ఉపాధ్యాయులను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఇప్పటికే పలు రకాల యాప్‌లతో ప్రభుత్వ ఉపాధ్యాయులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతుండగా.. తాజాగా వారిపై ‘టెట్’ (టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్) బాంబు వేసింది. 2010కి ముందు ఉద్యోగం సాధించిన ఉపాధ్యాయులంతా ‘టెట్’ రాసి అర్హత సాధిస్తేనే పదోన్నతులు కల్పించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఐదేళ్లకు పైబడి సర్వీసు ఉన్న ఉపాధ్యాయులందరూ రెండేళ్లలో టెట్ ఉత్తీర్ణులు కావాలని, లేని పక్షంలో ఉద్యోగం నుంచి తొలగిస్తామని ఇది వరకే ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. పదవీ విరమణకు ఐదేళ్లలోపు సర్వీసు ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇచ్చినప్పటికీ వారికి కూడా పదోన్నతులు రావాలంటే టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి అంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది. సీనియారిటీ జాబితాలో మార్పులు.. జిల్లాలో 1 నుంచి 10వ తరగతి వరకూ బోధించే పాఠశాలలు 2,078 ఉండగా, ఆయా పాఠశాలల్లో మొత్తంగా 8,307 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. ప్రభుత్వం టెట్‌పై ఇటీవల ఇచ్చిన ఆదేశాల ప్రకారం... సుమారు 4 వేల మంది దాకా ఉపాధ్యాయులు టెట్ పాస్ కావాల్సి ఉంది. లేని పక్షంలో పదోన్నతులు కోల్పోవడంతో పాటు చివరికి ఉద్యోగాన్ని కూడా కోల్పోవాల్సి ఉంటుంది. ఉపాధ్యాయుల వ్యక్తిగత వివరాలు, సర్వీసు రికార్డులతో పాటు వారు టెట్ ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు?..ఎన్ని మార్కులు సాధించారు?..ఈ అంశాలన్నీ సీనియారిటీ జాబితా ప్రత్యేక కాలంలో పొందు పరచాలని జిల్లా విదాశాఖ కార్యాలయానికి ఆదేశాలు అందాయి. టెట్ పాసైన వారి పేర్లు మాత్రమే స్కూల్ అసిస్టెంట్, గ్రేడ్–2 హెచ్ఎం పదోన్నతుల జాబితాలో ఉండేలా చూడాలని ప్రభుత్వం ఆదేశించింది. వీరికి మినహాయింపు.. టెట్ అర్హత పరీక్షకు సంబంధించి 2010 ఆగస్టు 23న నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్(ఎన్సీటీఈ)కీలక నోటిఫికేషన్ జారీ చేసింది. ఉపాధ్యాయ నియామకానికి ‘టెట్’ ఉత్తీర్ణత తప్పనిసరిగా పేర్కొంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ జీఓ జారీ కంటే ముందు ఉద్యోగంలో చేరిన ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష నుంచి మినహాయింపు ఉంటుంది. అలాగే ఐదేళ్లలోపు సర్వీసు ఉన్న వారికీ మినహాయింపు ఇచ్చారు. 2012 తర్వాత డీఎస్సీతో పాటు ‘టెట్’ కంపల్సరీ చేసిన సంగతి తెలిసిందే. మాట తప్పిన తండ్రీ కొడుకులు.. ‘‘ఇన్ సర్వీస్ టీచర్లు ఎవ్వరూ ‘టెట్’ నిబంధనకు భయపడాల్సిన అవసరం లేదు. ఈ విషయంపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తాం. అవసరమైతే పార్లమెంట్లో చట్ట సవరణ కూడా చేస్తాం’ అని గతంలోనే చంద్రబాబుతో పాటు ఆయన కుమారుడు లోకేష్ హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు వారు నోరు మెదపకపోవడంతో టీచర్లు మండిపడుతున్నారు. తప్పనిసరి పక్షంలో మాకు ప్రత్యేక టెట్ నిర్వహించాలని కొందరు టీచర్లు సూచిస్తుంటే, మరికొందరేమో ‘20, 30 ఏళ్లుగా ఉద్యోగం చేస్తున్నాం. ఈ వయసులో మాకు ఈ పరీక్షేంటి?’ అని భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పరీక్ష పాసైతేనే ఉపాధ్యాయులకు పదోన్నతులు రెండేళ్లలో టెట్ ఉత్తీర్ణత కాకపోతే ఇంటికే కలవరపెడుతున్న విద్యాశాఖ నిర్ణయాలు సీనియర్ ఉపాధ్యాయుల్లో ఆందోళన కష్టమైన పరీక్షే.. ఎప్పుడో ఉద్యోగం సాధించిన ఉపాధ్యాయులు ఇప్పుడు టెట్ పాస్ కావాలంటే కాస్త కష్టమే. ఈ పరీక్ష 150 మార్కులకు ఉంటుంది. ఇందులో అర్హత సాధించాలంటే ఓసీలు 90 శాతం, బీసీలు 60 శాతం, ఎస్సీలు 50 శాతం మార్కులు సాధించాలి. అయితే టెట్ పేపర్–1 పాస్ కావాలంటే చైల్డ్ డెవెలప్మెంట్, తెలుగు, ఆంగ్లం, గణితం, పర్యావరణానికి సంబందించిన అంశాలన్నీ చదవాలి. పేపర్–2లో కూడా అదే పరిస్థితి. బయో సైన్స్ ఉపాధ్యాయులకు గణితం, తెలుగు పండితులకు సోషల్ స్టడీస్, ఇలా సంబంధం లేని సబ్జెక్టులు పెట్టి పాస్ కావాల్సిందే..అంటే ఎలా? అని టీచర్లు ఆగ్రహిస్తున్నారు. -
హంద్రీ–నీవా కాలువ గట్టుకు గండం
పెనుకొండ:(సోమందేపల్లి): అధికారుల పర్యవేక్షణ లోపంతో హంద్రీనీవా కాలువకు గండం ఏర్పడింది. సోమందేపల్లి సమీపంలోని చాకర్లపల్లి చెరువు కుంట వద్ద హంద్రీనీవా కాలువ గట్టు కూలింది. గతంలోనే ఈ ప్రాంతంలో కాలువ దెబ్బతినగా..అప్పట్లో మట్టి తోలించి అధికారులు సరిచేశారు. అయితే తాజాగా అదే ప్రాంతంలో పెద్దఎత్తున కాలువ సైడ్ బండ్ నెర్రెలు చీలి మట్టి కిందికి పడిపోయింది. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా పెద్దఎత్తున ప్రమాదం చోటు చేసుకుంటుందని రైతులు, ప్రజలు అభిప్రాయపడుతున్నారు. పలు ప్రాంతాల్లో కట్ట బలహీనంగా ఉండడంతో తెగిపోతే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న ఎన్హెచ్ఎస్ఎస్ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆ ప్రాంతంలోకి ఎవరు రాకుండా కాలువ గట్టుపై రాళ్లు అడ్డుగా ఉంచారు. చాకర్లపల్లి వద్ద నెర్రెలు చీలి కుంగిన వైనం -
ప్రభుత్వ ఆఫీసులకూ ‘స్మార్ట్ మీటర్లు’
అనంతపురం టౌన్: ప్రభుత్వ కార్యాలయాల విద్యుత్ సర్వీసులకు జూన్ 1 నుంచి ప్రీ పెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగించనున్నట్లు ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అనంతపురం జిల్లాలో 8,422, శ్రీ సత్యసాయి జిల్లాలో 7,002 సర్వీసులకు ప్రీ పెయిడ్ విధానంలో విద్యుత్ సరఫరా అవుతుందన్నారు. ఈ విధానంలో వినియోగదారుల్లో జవాబుదారీతనం మరింత పెరుగుతుందన్నారు. రోజువారీ విద్యుత్ వినియోగం ఏ స్థాయిలో ఉందో సులువుగా తెలుసుకోవచ్చని, తద్వారా విద్యుత్‌ను పొదుపుగా వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. స్మార్ట్ మీటర్ సర్వీసులను గ్రూప్‌గా ఏర్పాటు చేసి ‘ఈ–వాలెట్’ ద్వారా రీచార్జ్ చేసుకునే సౌలభ్యాన్ని కల్పిస్తామన్నారు. విద్యుత్ చార్జీలు, స్థిర చార్జీల అడ్వాన్స్ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందన్నారు. వినియోగదారులకు ఎస్ఎంఎస్ రూపంలో మొబైల్‌కు ఎప్పటికప్పుడు సమాచారం అందుతుందని, బ్యాలెన్స్ సున్నాకు చేరినప్పుడు సరఫరా నిలిచిపోతుందని సీఎండీ వెల్లడించారు. ‘చల్లటి’ కబురు ● రాగల ఐదు రోజులు తేలికపాటి వర్షసూచన అనంతపురం అగ్రికల్చర్: భానుడి భగభగలతో అల్లాడిపోతున్న ఉమ్మడి అనంతపురం జిల్లా వాసులకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రాగల ఐదు రోజులూ ఉమ్మడి జిల్లాకు తేలికపాటి వర్ష సూచన ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం.విజయశంకరబాబు, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి.నారాయణస్వామి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 16 నుంచి 20వ తేదీ వరకు 1 నుంచి 3 మి.మీ మేర తేలికపాటి సగటు వర్షసూచన ఉందన్నారు. పగటి వేళ 41.6 డిగ్రీల నుంచి 41.4 డిగ్రీల మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదుకావొచ్చన్నారు. అలాగే రాత్రి వేళల్లో 25.4 డిగ్రీల నుంచి 26.8 డిగ్రీల మధ్య రికార్డు కావొచ్చన్నారు. గంటకు 6 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో నైరుతి దిశగా గాలి వీస్తుందని పేర్కొన్నారు. -
మార్కెట్ సౌకర్యం కల్పించండి
చింతపండు రైతుల ఇబ్బందులను ప్రభుత్వం పరిష్కరించాలి. స్థానికంగా మార్కెట్ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నాం. రవాణా ఖర్చులను రూ.వేలల్లో భరించాల్సి వస్తోంది. చింతపండు రైతులపై అదనపు ఆర్థిక భారం పడుతోంది. ఈఏడాది దిగుబడి తగ్గి నష్టపోయాం. ఉత్పత్తి వ్యయం పెరిగి ఆర్థికంగా నష్టాన్ని కలిగించింది. ప్రభుత్వం చర్యలు తీసుకుని స్థానికంగానే మార్కెట్ సౌకర్యం కల్పిస్తే కొంత వరకు ఆర్థిక భారం తగ్గుతుంది. – గోవిందరాజులు, గుడ్డగుర్కి, రొళ్ల మండలం -
నేడు పుట్టపర్తికి కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్
● సీఎం చంద్రబాబుతో కలిసి యుద్ధ విమానాల తయారీ పరిశ్రమకు భూమి పూజ పుట్టపర్తి అర్బన్/ప్రశాంతినిలయం: కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ శుక్రవారం పుట్టపర్తికి విచ్చేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి బ్రాహ్మణపల్లి వద్ద ఏర్పాటుకానున్న యుద్ధ విమానాల తయారీ పరిశ్రమకు భూమి పూజ చేయనున్నారు. ఈ నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ సతీష్‌కుమార్ పేర్కొన్నారు. స్థానిక సాయి ఆరామంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన పోలీస్ అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రతి ఒక్కరూ సమన్వయం చేసుకొని జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు. అనంతరం పట్టణంతో పాటు ప్రశాంతి గ్రామం, సభాస్థలి, విమానాశ్రయం వద్ద బందోబస్తును ఏర్పాటు చేసి పర్యవేక్షించారు. నేడు పుట్టపర్తికి చంద్రబాబు రాక సీఎం చంద్రబాబు శుక్రవారం ఉదయం పుట్టపర్తికి రానున్నారు. పుట్టపర్తి విమానాశ్రయానికి 9.15 గంటలకు చేరుకుంటారు. 10.15 గంటలకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కలిసి ఎయిర్ క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్ అండ్ ఫ్లైట్ టెస్ట్ సెంటర్, ఏడీఏ, అండ్ ట్యాక్టికల్ డిఫెన్స్ ప్రాజెక్టుకు భూమి పూజ చేస్తారు. మధ్యాహ్నం 12.30 గంటల వరకూ ఏఎంసీఏ శంకుస్థాపనతో పాటు వివిధ డిఫెన్స్ , డ్రోన్ ప్రాజెక్టులకు భూమి పూజల్లో పాల్గొంటారు. బాల్య వివాహంపై కేసు నమోదు కదిరి టౌన్: మండల పరిధిలోని అబ్బావాండ్లపల్లికి చెందిన బాలిక (17)కు అదే గ్రామానికి చెందిన రోహిణి కుమార్‌తో వారి తల్లిదండ్రులు మున్సిపల్ పరిధిలోని సైదాపురం ఆంజనేయస్వామి ఆలయంలో వివాహం జరిపించారు. విషయం ఐసీడీఎస్ సూపర్ వైజర్ లక్ష్మీదేవి దృష్టికి రావడంతో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి పెళ్లి చేసుకున్న రోహిణి కుమార్, అమ్మాయి తల్లిదండ్రుల మీద ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ వి.నారాయణరెడ్డి తెలిపారు. బాల్య వివాహాలను ఎవరూ చేయకూడదని, లేకపోతే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. సమగ్ర శిక్ష ఏపీసీగా వెంకటేష్ పుట్టపర్తి: సమగ్ర శిక్ష అసిస్టెంట్ ప్రాజెక్టు కోఆర్డినేటర్‌గా వెంకటేష్‌ను నియమించారు. స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ అయిన వెంకటేష్ వైఎస్సార్ కడపలో పని చేస్తున్నారు. తాజాగా ఆయన్ను ఫారిన్ సర్వీస్ కింద జిల్లాలో సమగ్ర శిక్ష ఏపీసీగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లోకేష్ పర్యటనకు రావాలని కూలీలకు బెదిరింపులు ధర్మవరం రూరల్: బత్తలపల్లి పర్యటనకు వస్తున్న విద్యా, ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ కార్యక్రమానికి ఉపాధి హామీ పథకం కూలీలందరూ తప్పక రావాలని మండల పరిధిలోని గొట్లూరు ఫీల్డ్ అసిస్టెంట్ చిరంజీవి బెదిరించారని గ్రామానికి చెందిన పలువురు కూలీలు వాపోయారు. ఈ పంచాయతీలో కూలీల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. దీంతో జనసమీకరణ కోసం నాయకులు పడరాని పాట్లు పడుతున్నారు. ఇందులో భాగంగా ఉపాధి కూలీలను తరలించే విధంగా స్థానిక పీల్డ్ అసిస్టెంట్‌కు బాధ్యతలు అప్పజెప్పినట్లు సమాచారం. దీంతో ఫీల్డ్ అసిస్టెంట్ కూలీల ఇళ్ల వద్దకు వెళ్లి కచ్చితంగా లోకేష్ పర్యటనకు రావాల్సిందేనని బెదిరింపులకు దిగారంటున్నారు. పర్యటనకు రాకపోతే ఉపాధి పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ కల్పించమని చెబుతున్నారని కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైతే బత్తలపల్లికి రారో వారి ముఖ హాజరు తీసేదేలేదని హెచ్చరిస్తున్నారన్నారు. టన్ను మామిడి రూ.40 వేలు అనంతపురం అగ్రికల్చర్: కక్కలపల్లి మార్కెట్లో గురువారం టన్ను మామిడికాయలు గరిష్టంగా రూ.40 వేలు పలికినట్లు రాప్తాడు మార్కెట్ కమిటీ సెక్రటరీ రూప్‌కుమార్ తెలిపారు. మార్కెట్‌కు 260 టన్నులు అమ్మకానికి రాగా, వాటిని వేలం వేశారన్నారు. బేనీషా రకం మామిడి టన్ను గరిష్టంగా రూ.40 వేలు, కనిష్టంగా రూ.15 వేల ప్రకారం ధర పలికాయన్నారు. -
అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య
వజ్రకరూరు: అప్పులు తీర్చకపోతే గ్రామంలో పరువు పోతుందని భావించిన ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన మేరకు... వజ్రకరూరు మండలం పీసీ ప్యాపిలి తండాకు చెందిన విజయకుమార్ నాయక్ (39)కు భార్య అన్నపూర్ణ, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. తనకున్న నాలుగు ఎకరాలతో పాటు మరో ఐదు ఎకరాలు కౌలుకు తీసుకుని వేరుశగనతో పాటు కంది పంట సాగు చేసేవాడు. బోరుబావుల తవ్వకం, పంటల పెట్టుబడులకు ప్రైవేట్ వ్యక్తుల వద్ద రూ.15 లక్షల వరకు అప్పులు చేశాడు. అయితే బోరు బావుల్లో నీటి లభ్యత తగ్గడంతో దిగుబడులు తగ్గాయి. దీంతో అప్పులు తీర్చకపోతే గ్రామంలో పరువు పోతుందంటూ కుటుంబసభ్యులతో చెప్పుకుని బాధపడేవాడు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం గ్రామ శివారున ఉన్న హంద్రీ–నీవా కాలువ వద్దకు చేరుకుని విషపు గుళికలు మింగాడు. అపస్మారకంగా పడి ఉండడంతో అటుగా వెళుతున్న వారు గుర్తించి సమాచారం ఇవ్వడంతో కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని వెంటనే ఉరవకొండలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురానికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ విజయకుమార్ నాయక్ మృతి చెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వ్యక్తి ఆత్మహత్యహిందూపురం: స్థానిక రైల్వే స్టేషన్‌కు సమీపంలోని ఎంజీఎం మైదానం వద్ద రైలు కిందపడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కీ మెన్ శ్రీనునాయక్ సమాచారంతో రైల్వే పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. జేబులో లభ్యమైన ఉత్తరం ఆధారంగా మృతుడిని వాల్మీకి సర్కిల్ వద్ద నివాసముంటున్న రఘుశంకర్ (67)గా గుర్తించారు. పురోహితుడిగా పనిచేస్తూ తన అక్క ఇంట్లో నివాసముండేవాడు. వివాహం కాలేదు. దీంతో ఒంటరి జీవిఇతాన్ని తాళలేకపోతున్నట్లుగా ఉత్తరం రాసి గురువారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
అహా.. ఓహో అంటేనే అనుమతి
● లోకేష్ సమావేశంలో భజనపరులకు పెద్దపీట అనంతపురం క్రైం: మంతి నారా లోకేష్ గురువారం అనంతపురంలో నిర్వహించిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమన్వయ సమావేశంపై సొంత పార్టీ కార్యకర్తలే విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యులను కాదని భజన పరులకు పెద్ద పీట వేశారంటూ మండిపడుతున్నారు. సమావేశానికి ముందు జెడ్పీ ఎదుట ఉన్న రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో జిల్లా నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు సమావేశమై ఎవరిని లోపలికి అనుమతించాలనే అంశంపై చర్చించి జాబితా సిద్ధం చేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో పలువురు సీనియర్ కార్యకర్తలు సమావేశం వద్దకు వెళ్లినా ‘జాబితాలో మీ పేరు లేదు’ అంటూ వెనక్కి పంపించేశారు. ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి వర్గీయులను సమావేశానికి పూర్తిగా దూరం పెట్టేశారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు, ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ప్రమేయమే ఇందుకు కారణంగా పలువురు ఆరోపిస్తున్నారు. సమావేశానికి మీడియా ప్రతినిధులను సైతం అనుమతించలేదు. అంతర్గత విభేదాలు బయట పడకుండా ఉండేందుకే మీడియాను దూరంగా ఉంచినట్లు సమాచారం. ఆర్టీటీ సేవలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలి బత్తలపల్లి: నిరుపేదలకు ఆర్టీటీ అందిస్తున్న సేవలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని మంత్రి నారా లోకేష్ ఆకాంక్షించారు. ఆర్డీటీ సంస్థకు ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ అయిన తరువాత తొలిసారి ఆయన గురువారం రాత్రి బత్తలపల్లిలోని ఆర్డీటీ ఆస్పత్రిని సందర్శించి రోగులతో మాట్లాడారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఆర్డీటీ సంస్థకు ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ కావడంపై హర్షం వ్యక్తం చేశారు. తాను యువగళం పాదయాత్ర సందర్భంగా ఆర్డీటీ గురించి విన్నానని, ఆర్డీటీ చేపట్టిన కార్యక్రమాలను కళ్లారా చూశానన్నారు. దివ్యాంగులు, ఇతరులను ఆర్డీటీ ప్రోత్సహిస్తున్న తీరు అద్భుతమన్నారు. ఇతర జిల్లాల్లోనూ ఆర్డీటీ సేవలు విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అర్డీటీకి అండగా నిలుస్తామని పేర్కొన్నారు. అంతకు ముందు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ ఘాట్ వద్ద మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన వెంట మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, సవిత, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు, హిందుపురం ఎంపీ బీకే పార్థసారథి, పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు. కాగా, ఆర్డీటీ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ సేవలు అందేలా చొరవ తీసుకుంటామని మంత్రి నారా లోకేష్ పేర్కొనడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు స్తంభించాయి కదా అని విలేకరులు ప్రశ్నించారు. దీంతో ‘అంతపెద్ద మాటలు వద్దులే గురువుగారు’ అంటూ మాట మార్చారు. ఇక ‘నీట్ పరీక్ష రద్దు’పై విలేకరులు ప్రశ్నించగా... ఇక్కడొద్దు అంటూ దాటవేశారు. అనంతరం మంత్రి లోకేష్‌కు ఆర్డీటీ పొగ్రామ్ డైరెక్టర్ మాంఛో ఫెర్రర్ అభినందలు తెలిపారు. లోకేష్‌కు ఘన స్వాగతం పుట్టపర్తి అర్బన్: మంత్రి నారా లోకేష్‌కు పుట్టపర్తి విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఆయనతో పాటు మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, సవిత ఉన్నారు. ఎంపీలు పార్థ సారధి, అంబికా లక్ష్మీనారాయణ, పలువురు ఎమ్మెల్యేలు, కలెక్టర్ శ్యాం ప్రసాద్, ఎస్పీ సతీష్‌కుమార్, జేసీ మౌర్య భరద్వాజ్, ఆర్డీఓ సువర్ణ ఘన స్వాగతం పలికారు. -
కన్నీటి కష్టం.. ప్రశ్నించలేని దైన్యం
సాక్షి, టాస్క్‌ఫోర్స్: రాప్తాడు నియోజకవర్గంలో నియంతృత్వ పోకడలు తారాస్థాయికి చేరుకున్నాయి. తన పరిధిలో ఎలాంటి సమస్యలు లేవని, ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారంటూ పార్టీ అధిష్టానం మెప్పు పొందే క్రమంలో ప్రజాగొంతుకను స్థానిక ప్రజాప్రతినిధి తొక్కి పెట్టారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫలితంగా గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ప్రజాప్రతినిధిని, నాయకులను, చివరకు అధికారులను సైతం అడగలేని నిస్సహాయ స్థితిలో ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. ఎమ్మెల్యే పరిటాల సునీత సొంత పంచాయతీ నసనకోటతో పాటు పెద్దకొండాపురంలో కొన్ని నెలలుగా తాగునీటి కోసం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నాయకులు, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోక పోవడంతో గుక్కెడు నీటి కోసం ఆయా గ్రామాల ప్రజలు కిలోమీటర్ల దూరం వెళ్లి వ్యవసాయ బోరు బావుల నుంచి సేకరించుకోవాల్సి వస్తోంది. భయం గుప్పిట్లో నలుగుతున్న ఆయా గ్రామాల ప్రజలు సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని నాయకులకు, అధికారులకు విన్నవించుకోలేక పోతున్నారు. ఒకవేళ ధైర్యం చేసి విన్నవించినా ఎలాంటి దారుణాలు చవి చూడాల్సి వస్తుందోననే ఆందోళన అందరిలోనూ వ్యక్తమవుతోంది. దీంతో వ్యవసాయ బోరు బావుల వద్ద పడిగాపులు కాస్తూ రైతులు మోటార్లు ఆన్ చేసినప్పుడు నీరు పట్టుకుంటున్నారు. ఫలితంగా సొంత పనులు కూడా చేసుకోలేక సతమతమవుతున్నారు. కొన్ని నెలలుగా ఇదే పరిస్థితి. ట్యాంకర్ల ద్వారా అధికారులు సరఫరా చేస్తున్న నీరు తమ అవసరాలకు ఎంత మాత్రమూ సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వేడుకుంటున్నారు. పొలం వద్ద నుంచి నీటిని తీసుకెళుతున్న దృశ్యంపెద్దకొండాపురంలో ఇళ్ల వద్ద ఏర్పాటు చేసుకున్న డ్రమ్ములు పరిటాల సొంత మండలంలో వేళ్లూనుకుంటున్న విషసంస్కృతి సమస్య పరిష్కారంపై చొరవ చూపని ఎమ్మెల్యే సునీత ఇబ్బందులు చెప్పుకునేందుకు జంకుతున్న స్థానికులు పేరూరు డ్యాంకు నీరుఅధికారంలోకి వచ్చిన వెంటనే పేరూరు డ్యాం (అప్పర్ పెన్నార్ ప్రాజెక్ట్)కు నీరందిస్తామంటూ ఎన్నికల సమయంలో పరిటాల సునీత స్పష్టమైన హామీనిచ్చారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ఈ హామీ నెరవేరలేదు. అంతేకాక డ్యాంలో ఉన్న కొద్దిమేర నీటిని గేట్ల మరమ్మతు పేరుతో దిగువకు వదిలేయడంతో ప్రస్తుతం చుక్క నీరు లేకుండా రిజర్యావర్ వట్టి పోయింది. దీంతో భూగర్భ జలాలు అడుగంటి బోరుబావుల్లో నీరు అందకుండా పోయింది. పంట సాగు దేవుడెరుగు... కనీసం గొంతు తడుపుకుందామనుకున్నా.. గుక్కెడు నీరు లభ్యం కాక గ్రామీణులు విలవిల్లాడుతున్నారు. పరిటాల సొంత ఇలాకా రామగిరి మండల వాసులు గతంలో ఎన్నడూ లేని విధంగా తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే పరిటాల సునీత ఎలాంటి చర్యలూ చేపట్టకపోవడంతో ప్రజల ఇక్కట్లు రెట్టింపయ్యాయి. అయితే తమ తాగునీటి కష్టాలపై ఎమ్మెల్యే సునీతను కనీసం ప్రశ్నించలేని అసహాయ స్థితిలో స్థానికులు కొట్టుమిట్టాడుతున్నారు. సమస్యపై గళమిప్పితే ఎలాంటి దౌర్జన్యాలు చవిచూడాల్సి వస్తోందోనని భయపడుతున్నారు. భయం గుప్పిట్లో గ్రామీణులు -
భూ కబ్జాల మంత్రి సవిత
పరిగి: మంత్రి సవిత పెనుకొండ నియోజకవర్గానికి అనకొండగా మారిందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ విమర్శించారు. భూకబ్జాల్లో సవిత ఆరితేరిపోయారని, అధికారమే అడ్డుగా ఆమె చేస్తున్న భూకబ్జాలతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారన్నారు. గురువారం ఆమె పరిగి మండలంలోని కొడిగెనహళ్లి పంచాయతీ కాలువపల్లిలో నిర్వహించిన ‘కాఫీ విత్ వైఎస్సార్సీపీ లీడర్స్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలుత కాలువపల్లి గేట్ నుంచి పార్టీ శ్రేణులతో కలిసి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. అక్కడి నుంచి ప్రతి గడపకూ వెళ్లి ప్రజలతో మమేకమై చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను వివరించారు. కబ్జా మంత్రిగా పేరు.. పెనుకొండలో మంత్రి సవిత ప్రోద్బలంతో భూకబ్జాలకు పాల్పడుతున్నారని, ఆమె అనుచరుడు హరికృష్ణ యథేచ్ఛగా కబ్జా చేస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఉషశ్రీచరణ్ ప్రశ్నించారు. అక్రమ లేఅవుట్లకు అనుమతుల పేరుతో లక్షలాది రూపాయలను వసూలు చేయడం సిగ్గు అనిపించడం లేదా? అని మండిపడ్డారు. సూపర్ సిక్స్ అంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వ పెద్దలు సూపర్ మోసాలకు పాల్పడుతూ ప్రజలను అన్యాయం చేశారని విమర్శించారు. బీసీ సంక్షేమశాఖ మంత్రిగా బీసీలను సవిత మోసం చేశారని, 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని చెప్పి మాట తప్పిన మంత్రిగా చరిత్రలో నిలిచిపోతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను మోసం చేసిందంటూ సవిత తల్లి స్వయాన కుమార్తైపె కోర్టులో కేసు వేసిన సంగతి జిల్లా ప్రజలందరికీ తెలుసన్నారు. సత్యసాయి కార్మికుల ఉసురు తగులుతుంది జిల్లా పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వెంటనే సత్యసాయి తాగునీటి పథకంలో పనిచేస్తున్న కార్మికులను ఆదుకోవాలని ఉషశ్రీచరణ్ డిమాండ్ చేశారు. జీతాలు చెల్లించలేక కార్మిక కుటుంబాలు రోడ్డున పడుతున్నా పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. వారి ఉసురు తప్పక చంద్రబాబు ప్రభుత్వానికి తగులుతుందన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ నరసింహమూర్తి, మాజీ సర్పంచ్ సాకమ్మ, గిరి, ఎంపీటీసీ చిక్కన్న, అంజి, మారుతీరెడ్డి, అడ్వొకేట్ వన్నేరువప్ప, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెనుకొండను అనకొండగా మార్చారు తల్లికి ద్రోహం చేసిన ఘనత సవితకే చెల్లింది వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ -
దూసుకెళ్లిన శ్రీరామ్ కాన్వాయ్.. టీడీపీ కార్యకర్తకు గాయాలు
బత్తలపల్లి: మంత్రి నారా లోకేష్ బత్తలపల్లి పర్యటనలో అపశ్రుతి చోటు చేసుకుంది. గురువారం మంత్రి వస్తున్నట్లుగా తెలుసుకున్న కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బత్తలపల్లిలోని కూడలికి చేరుకున్నారు. ఇంతలో టీడీపీ ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ కాన్వాయ్ వచ్చింది. ఆ సమయంలో కార్యకర్తలు తోసుకోవడంతో తంబాపురం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త నాగార్జున పాదంపై కాన్వాయ్‌లోని ఓ కారు దూసుకెళ్లింది. క్షతగాత్రుడిని అక్కడున్న వారు ఆర్డీటీ ఆస్పత్రికి తరలించి చేతులు ఎత్తేశారు. అతని బాగోగులు పట్టించుకోకపోవడంతో నొప్పి తాళలేక విలవిల్లాడాడు. తనను ఎవరూ పట్టించుకోలేదంటూ బాధితుడు కన్నీటి పర్యంతమయ్యాడు. -
అసంబద్ధ జీఓలు రద్దు చేసే వరకూ ఉద్యమం
అనంతపురం అగ్రికల్చర్: ఉద్యోగుల హక్కులు కాలరాసేలా చంద్రబాబు ప్రభుత్వం విడుదల చేసిన అసంబద్ధ జీఓలను రద్దు చేసేవరకూ తమ ఉద్యమం కొనసాగుతుందని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) నాయకులు స్పష్టం చేశారు. ఈ మేరకు యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసులు, అసోసియేట్ ప్రెసిడెంట్ పి.హనుమంతరెడ్డి, ప్రధాన కార్యదర్శి డి.శ్రీనివాసులు, కోశాధికారి ఎం.హనుమంతరెడ్డి తదితరులు సహాయ నిరాకరణ కొనసాగిస్తామంటూ జేఏసీ తీర్మానించిన నోటీసు ప్రతులను గురువారం డీసీసీబీ చైర్పర్సన్ ముంటిమడుగు కేశవరెడ్డి, సీఈఓ కె.సురేఖారాణి, జిల్లా సహకార అధికారి ఈ.అరుణకుమారికి అందజేశారు. తమ న్యాయబద్ధమైన డిమాండ్ల సాధనకు గత 22 నెలలుగా పలు రూపాల్లో నిరసనలు, ఆందోళనలు, నిరవధిక సమ్మె కొనసాగించామని గుర్తు చేశారు. ఈ క్రమంలో న్యాయం చేస్తామంటూ రాష్ట్ర సహకార శాఖ మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందన్నారు. కంటితుడుపుగా జీఓలు 112, 322 విడుదల చేసి ఉద్యోగులకు అన్యాయం చేశారని మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తమ నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా అన్ని సహకార సంఘాల్లో ‘డే ఎండ్, ఆడిట్ వర్క్, ఇయర్ ఎండ్’ ప్రాసెస్ చేయకుండా నిలిపివేస్తామని స్పష్టం చేశారు. నోటీసులిచ్చిన పీఏసీఎస్ ఉద్యోగులు -
రైతులకు ‘చింత’
మడకశిర: చింత రైతులు మరోసారి నష్టాల బాట పట్టారు. ఈ ఏడాది దిగుబడి తగ్గిపోవడం, మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడంతో రైతుల ఆశలు ఆవిరయ్యాయి. జిల్లాలోనే చింతపండు ఉత్పత్తికి మడకశిర నియోజకవర్గం ప్రసిద్ధి. నియోజకవర్గంలోని 5 మండలాల పరిధిలో దాదాపు 30 వేల చింతచెట్లు ఉన్నాయి. 15 వేల మంది రైతులు చింతచెట్లపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఇతర పంటలను సాగు చేసి నష్టపోయిన రైతులను చింత చెట్లు ఆర్థికంగా అంతో ఇంతో ప్రతి ఏడాది ఆదుకునేవి. ముగిసిన చింతపండు సీజన్ నియోజకవర్గంలో చింతపండు సీజన్ ఈ ఏడాది దాదాపుగా ముగిసింది.ప్రతి ఏడాది జనవరి చివరిలో చింతపండు సీజన్ ప్రారంభమవుతుంది. మే చివరి దాకా సీజన్ కొనసాగుతుంది. అయితే ఈ ఏడాది చింతపండు దిగుబడి పూర్తిగా తగ్గడంతో సీజన్ మే మధ్యలోనే ముగిసే పరిస్థితి ఏర్పడింది. రూ.1.50 కోట్లకు పడిపోయిన ఉత్పత్తి నియోజకవర్గంలో ప్రతి ఏడాది రూ.3 కోట్ల విలువ చేసే చింతపండు ఉత్పత్తి జరగాల్సి ఉంది. అయితే ఈ ఏడాది సగానికి సగం తగ్గి పోయినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఈ ఏడాది రూ.1.50 కోట్ల విలువ చేసే చింత పండు మాత్రమే ఉత్పత్తి అయిందంటున్నారు. దిగుబడి ఎన్నడూ లేని విధంగా ఈఏడాది తగ్గి పోయింది. దీంతో చింతపండు ఉత్పత్తి విలువ కూడా పడిపోయింది. ధరలు నిలకడగా కొనసాగినా.... ఈఏడాది చింతపండు ధరలు ప్రారంభం నుంచి చివరి దాకా దాదాపుగా నిలకడగానే కొనసాగాయి. ప్రారంభంలో మొదటి రకం (కరిపుళి) చింతపండు ధర రూ.క్వింటాల్ రూ.25 వేల వరకూ పలికింది. అదే విధంగా రెండో (ఫ్లవర్) చింతపండు ధర ప్రారంభంలో క్వింటాలు రూ.15 వేల వరకూ పలికింది. ఆ తర్వాత చింతపండు ధరలు కొంత మేరకు తగ్గినా పూర్తిస్థాయిలో ధరలు పడిపోలేదు. రైతులకు గిట్టుబాటు అయ్యే విధంగానే ధరలు కొనసాగాయి. చివరిలో కూడా మొదటిరకం చింతపండు ధర రూ.18 వేలు, రెండో రకం ధర రూ.10 వేల వరకూ పలికాయి. అయితే ధరలు నిలకడగా కొనసాగినా దిగుబడి లేకపోవడంతో చింత పండు రైతులకు ఆశించిన స్థాయిలో గిట్టుబాటు కాలేదు. ఉత్పతి వ్యయం పెరగడం రైతులకు శాపం చింతపండు ఉత్పత్తి వ్యయం కూడా ఈ ఏడాది భారీగా పెరిగింది. దీంతో చింతపండు రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రధానంగా చింతపండు ఉత్పత్తిలో కూలీలు కీలక పాత్ర పోషిస్తారు. ఈ ఏడాది కూలీ ఖర్చులు సగానికి సగం పెరిగాయి. దిగుబడి తగ్గడం, కూలీ ఖర్చులు పెరగడం చింతపండు రైతులకు శాపంగా మారింది. ఈఏడాది రైతులు మగ కూలీకి రోజూ రూ.1000 చెల్లించారు. గత ఏడాది మగ కూలీకి రూ.700 చెల్లించారు. ఆడ కూలీకి ఈఏడాది రూ.350 చెల్లించారు. గత ఏడాది రూ.250 మాత్రమే చెల్లించారు. ఇలా కూలీ ఖర్చులు విపరీతంగా పెరగడంతో చింతపండు రైతులకు ఈఏడాది గిట్టుబాటు కాలేదు. మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో.. మడకశిర నియోజకవర్గంలో మార్కెట్ సౌకర్యం లేదు. హిందూపురం మార్కెట్‌కు అమ్మకానికి వచ్చే చింతపండులో సగం మడకశిర ప్రాంతానికి చెందినదే ఉంటుంది. మడకశిర ప్రాంతం నుంచి చింతపండును హిందూపురానికి తరలించడానికి రైతులు రవాణా ఖర్చులను రూ.వేలల్లో భరించాల్సి వస్తోంది. మడకశిరలో ప్రతి ఏడాది రూ.3 కోట్ల విలువ చేసే చింతపండు ఉత్పత్తి ఈ ఏడాది ఉత్పత్తి విలువ అర్ధానికి పడిపోయిన వైనం దిగుబడి తగ్గిపోవడంతోనే ఈ దుస్థితి గిట్టుబాటు కాక నష్టాల్లోకి రైతులు -
‘పచ్చ’ మూక దౌర్జన్యం
కదిరి అర్బన్: మండలంలోని ఎగువపల్లిలో బుధవారం సాయంత్రం టీడీపీ నేతలు రెచ్చిపోయారు. వైఎస్సార్సీపీ నేత చంద్రశేఖర్, అతని భార్య పార్వతి, కుమార్తె అర్చనపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. వివరాల్లోకి వెళితే.. 1976లో చంద్రశేఖర్ కుటుంబానికి 1976లో ప్రభుత్వం ఇచ్చిన పట్టా భూమి ఉంది. ఆ భూమిలో తమకూ హక్కు ఉందంటూ టీడీపీ నాయకులు దౌర్జన్యంగా పునాదులు తీయడం మొదలు పెట్టారు. ఈ నిర్మాణాన్ని అడ్డుకోబోతే తమపై టీడీపీ నేతలు రమణ, ప్రతాప్, నాగేంద్ర, నల్లమాడ మండలానికి చెందిన చెన్నకేశవులు దాడికి తెగబడ్డారని బాధితుడు వాపోయాడు. ఘటనలో పార్వతికి తీవ్రగాయమైంది. చికిత్స నిమిత్తం కదిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కదరి రూరల్ మండల పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. చేపల వలలో చిక్కుకుని వ్యక్తి మృతిచిలమత్తూరు: చేపల వలలో చిక్కుకుని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన మేరకు.. చిలమత్తూరు మండలం కోడూరుకు చెందిన పెద్ద రెడ్డప్ప (40) మూడు రోజుల క్రితం దిగువ తుమ్మలకుంట సమీపంలోని చెరువులో చేపల వేటకు వెళ్లాడు. ఆ సమయంలో వలలో చిక్కుకుని నీట మునిగిపోయాడు. చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో ఈ అంశం వెలుగు చూడలేదు. గురువారం ఉదయం చెరువు వైపుగా వెళ్లిన స్థానికులు నీటిలో తేలియాడుతున్న మృతదేహాన్ని గుర్తించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని వెలికి తీయించి, పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. కాగా, మృతుడికి ఓ సోదరుడు ఉన్నాడు. కూలి పనులతో జీవనం సాగించేవాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. పాముకాటుతో పాడి రైతు మృతిధర్మవరం రూరల్: పాము కాటుతో ఓ పాడి రైతు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన మేరకు.. ధర్మవరం మండలం తుంపర్తి కాలనీకి చెందిన దేవరకొండ వెంకటరమణ(46)కు భార్య వెంకరమణమ్మ, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. పాడి పోషణతో జీవనం సాగిస్తున్నాడు. గురువారం ఉదయం షెడ్డులో ఉన్న పాడి ఆవులకు మేత వేసే క్రమంలో వామి వద్ద గడ్డిలో దాగి ఉన్న నాగుపాముపై కాలు వేశాడు. దీంతో పాము కాలి బొటనవేలును గట్టిగా కరిచి పట్టుకుంది. గమనించిన వెంకటరమణ కాలిని విదిలించినా పాము విడవలేదు. దీంతో చేతితో పామును పట్టుకుని పక్కకు లాగి దూరంగా విసిరేశాడు. అనంతరం కుటుంబసభ్యులకు ఫోన్ చేయడంతో వెంటనే వారు అక్కడకు చేరుకుని చికిత్స నిమిత్తం ధర్మవరంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లుగా నిర్ధారించారు. ఘటనపై ధర్మవరం రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పట్టపగలే చోరీ పుట్టపర్తి: బుక్కపట్నం మండలం పాముదుర్తిలో పట్టపగలే ఓ ఇంట్లో చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. గ్రామంలో నివాసముంటున్న ఒంటరి మహిళ కాళసముద్రం రామక్క గురువారం ఉదయం 10.30 గంటలకు చికిత్స చేయించుకునేందుకు ఇంటికి తాళం వేసి ఆస్పత్రికి వెళ్లింది. తిరిగి ఇంటికి చేరుకున్న ఆమె ఇంటి తలుపులు తీసి ఉండడంతో ఆందోళనకు లోనవుతూ లోపలికి వెళ్లి పరిశీలించింది. బీరువాలోని సామగ్రిని చిందరవందరగా పడేసి ఉండడంతో చోరీ జరిగినట్లుగా నిర్ధారించుకుంది. సమాచారం అందుకున్న ఎస్ఐ నారాయణరెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బీరువాలో దాచిన 4 తులాలు బంగారు గొలుసు, 6 గ్రాముల తాళిబొట్టు గిన్నెలు రెండు, రూ.1.20 లక్షల నగదు అపహరించుకెళ్లినట్లు బాధితురాలు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
గాలివాన విధ్వంసం
బొమ్మనహాళ్: గాలివాన విధ్వంసం మైలాపురం గ్రామాన్ని అతలాకుతలం చేసింది. ఒక్కసారిగా విరుచుకుపడిన వర్షం ప్రభావంతో ఐదేళ్ల క్రితం మూతపడిన పాత రైస్ మిల్లు గోడ కూలి గొర్రెల కాపరి మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గ్రామస్తుల సమచారం మేరకు.. గురువారం సాయంత్రం మైలాపురం గ్రామానికి చెందిన హరిజన వెంకటేశులు (55), కురుబ శివ అనే ఇద్దరు కాపరులు గొర్రెలు కాసుకుంటూ ఉండి ఇంటికి బయలుదేరారు. అదే సమయంలో గాలివాన ప్రారంభమైంది. వెంటనే వర్షం నుంచి తప్పించుకునేందుకు గ్రామ శివారులోని పాత రైస్‌మిల్లు వద్దకు చేరుకున్నారు. వర్షంలో తడవకుండా రైస్‌మిల్లు గోడకు ఆనుకొని నిల్చున్నారు. బలంగా గాలి వీచడంతో బలహీనంగా ఉన్న గోడ కుప్పకూలింది. గోడ కింద పడి హరిజన వెంకటేశులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కురుబ శివ తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. స్ధానికులు వెంటనే శివను బళ్లారి విమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో దాదాపు 30 గొర్రెలు గోడకింద పడి మృతి చెందాయి. గాలివాన ధాటికి 12 ట్రాన్స్ఫార్మర్లు, 30కిపైగా విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అనేక రేకుల షెడ్లు గాలికి ఎగిరిపోయాయి. కొంతమంది ఇళ్ల పైకప్పులు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ హఠాత్పరిణామంతో గ్రామ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఏఎస్ఐ విజయ్‌కుమార్ సంఘటన స్ధలాన్ని పరిశీలించారు. ఎగిరిపోయిన సోలార్ ప్యానెళ్లు.. మండలంలోని ఉంతకల్లు ఆర్డీటీ కాలనీలో పలు ఇళ్లపై ఉన్న సోలార్ ప్యానెళ్లు ఈదురుగాలులకు ఎగిరిపోయాయి. ఉంతకల్లు క్రాస్‌లోని బళ్లారి–కళ్యాణదుర్గం ఆర్అండ్బీ రహదారిపై పెద్ద వేపమాను నేలకొరగడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. కొంతసేపటి తర్వాత స్ధానికులు, పోలీసులు చెట్టును రోడ్డుపై నుంచి తొలగించారు. గోడ కూలి కాపరి మృతి మరొకరికి తీవ్ర గాయాలు నేలకొరిగిన ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు -
(ఈ హామీలు ఎలా అమలు చేయాలిరా బాబోయ్)
సాక్షి, పుట్టపర్తి: అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న ప్రాంతమని.. తాను అధికారంలోకి వచ్చాక జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో హామీ గుప్పించారు ప్రస్తుత సీఎం చంద్రబాబు. ‘సూపర్ సిక్స్’తో పాటు క్షేత్రస్థాయిలో ఇచ్చిన హామీల అమలు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. గతేడాది పింఛన్ల పంపిణీ కోసం తలుపుల మండలం పెద్దన్నవారిపల్లికి వచ్చిన సమయంలో చంద్రబాబు మాట్లాడుతూ.. కదిరి పట్టణానికి చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకొస్తే ఖర్చు ఎక్కువ వస్తోంది. అందుకే చెర్లోపల్లి రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకొచ్చి ప్రజల దాహార్తిని తీర్చడంతో పాటు ఖర్చు తగ్గిస్తామన్నారు. ఇంతవరకు అది కార్యరూపం దాల్చలేదు. అలాగే కదిరిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం, పట్టణానికి రింగు రోడ్డు, తిరువీధుల విస్తరణ హామీలు మాటలకే పరిమితం అయ్యాయి. కదిరిలో ప్రెస్‌క్లబ్ నిర్మాణం చేస్తామని చంద్రబాబు చేతుల మీదుగా వేసిన శిలాఫలకం కూడా ఇప్పటికీ వెక్కిరిస్తోంది. మడకశిర పర్యటనలో చంద్రబాబు లెక్క లేనన్ని హామీలు ఇచ్చారు. 2024 ఆగస్టు 1న గుండుమల పర్యటన సందర్భంగా వక్క మార్కెట్, హంద్రీనీవా పూర్తి, మడకశిర వద్ద వెయ్యి ఎకరాల్లో పారిశ్రామికవాడ క్లస్టర్, రూ.60 కోట్లతో రింగ్ రోడ్డు, ఎన్‌హెచ్ 44 నుంచి పెనుకొండ నుంచి మడకశిర మీదుగా కర్ణాటకలోని హిరియూరుకు అనుసంధానం చేస్తామన్నారు. ఇప్పటి వరకు ఒక్క పరిశ్రమ లేదు. జాతీయ రహదారి పనులు ప్రారంభం కాలేదు. వక్క మార్కెట్ కోసం స్థల పరిశీలన మాత్రమే చేశారు. పారిశ్రామికవాడ గురించి పట్టించుకునే నాథుడు లేరు. అధికారంలోకి వచ్చిన వెంటనే సోమందేపల్లి చెరువుకు హంద్రీనీవా కాలువ నుంచి నీరు మళ్లిస్తామని సవిత హామీ ఇచ్చారు. కానీ ఆ దిశగా ప్రయత్నం చేయలేదు. అలాగే పెనుకొండలో పాలిటెక్నిక్ కాలేజీ కట్టిస్తామన్నారు. స్థల పరిశీలన కూడా జరగలేదు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం హామీలు గుప్పించడం.. అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. ప్రజలను మోసం చేయడంలో ఆయన్ను మించిన వారు లేరు. గత ఎన్నికల సందర్భంగా జిల్లా వాసులకు అలవిగాని హామీలిచ్చారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా.. ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా అటకెక్కించారు. పుట్టపర్తిలో యుద్ధ విమానాల తయారీ కేంద్రం ప్రారంభోత్సవానికి నేడు పుట్టపర్తికి సీఎం హోదాలో చంద్రబాబు వస్తున్న సందర్భంగా గత హామీలను ప్రజలు గుర్తు చేస్తున్నారు. చేనేతలపైనా చిన్నచూపే.. ఎన్నికల సమయంలో నారా లోకేష్ పాదయాత్రకు వచ్చినప్పుడు ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి ఇచ్చిన హామీ ఇప్పటి వరకు అమలు కాలేదు. ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికులకు రూ .10 లక్షల పరిహారం ఇస్తామని ప్రకటించారు. అలాగే చేనేతలకు జీఎస్టీ మినహాయింపు ఇస్తామన్నారు. అంతకుముందు ఐదేళ్లు వర్తించిన ‘నేతన్న నేస్తం’ కూడా ఎగ్గొట్టారు. ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికులకు గతంలో ఇచ్చిన రూ.5 లక్షల పరిహారాన్ని రూ.1.50 లక్షలకు తగ్గించి నిలువునా మోసం చేశారు. అధికారం చేపట్టి రెండేళ్లవుతున్నా హామీల అమలును పట్టించుకోని సీఎం చంద్రబాబు నీటి మీద రాతగానే చేనేతలకు రూ.10 లక్షల పరిహారం కదిరికి అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ ఇప్పటికీ కరువు పుట్టపర్తిలో 193 చెరువులకు నీళ్లు ఉత్తుత్తి మాటలే.. సోమందేపల్లిలో పారని హంద్రీ–నీవా జలాలు మడకశిరకు రెండు రిజర్వాయర్లు, వక్క మార్కెట్ పట్టదా? నేడు పుట్టపర్తిలో యుద్ధవిమానాల తయారీ కేంద్రానికి భూమిపూజ కేంద్ర మంత్రి రాజనాథ్ సింగ్‌తో పాటు హాజరు కానున్న చంద్రబాబు ‘పుట్టపర్తి’లో 193 చెరువులకు నీరేదీ ? వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మంజూరైన 193 చెరువుల అభివృద్ధి పనులు యథావిధిగా కొనసాగిస్తామని హంద్రీనీవా కాలువ ద్వారా అన్ని చెరువులు నింపి సస్యశ్యామలం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అలాగే సత్యసాయి తాగునీటి ప్రాజెక్టును దత్తత తీసుకుంటానని నారా లోకేశ్ మాట ఇచ్చారు. వాటికి సంబంధించి నేటికీ ఒక్క అడుగు ముందుకు పడలేదు. నియోజకవర్గంలోని చెరువులన్నీ హంద్రీనీవా నీళ్ల కోసం ఎదురు చూస్తున్నాయి. అంతేకాకుండా పుట్టపర్తి, బుక్కపట్నం, కొత్తచెరువు కలిపి ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేస్తామన్న హామీ కూడా మాటలకే పరిమితమైంది. కదిరి ప్రజల దాహార్తి తీర్చేదెన్నడో... కానరాని రిజర్వాయర్ల జాడ.. సోమందేపల్లికి కృష్ణాజలాలు కరువు -
లోటుపాట్లు లేకుండా చూడండి
పుట్టపర్తి టౌన్: కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, సీఎం చంద్రబాబు ఈనెల 15న పర్యటించనున్న నేపథ్యంలో ఎలాంటి లోటు పాట్లు లేకుండా చూడాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఎస్పీ సతీష్‌కుమార్, జాయింట్ కలెక్టర్ మౌర్యభరద్వాజ్, అడిషనల్ ఎస్పీ అంకిత సురానా, ఇతర శాఖల అధికారులతో కలసి బ్రాహ్మణపల్లి వద్ద సభా వేదికను పరిశీలించారు. అనంతరం సత్యసాయి విమానాశ్రయం, సభా ప్రాంగణం, పార్కింగ్ స్థలాలు, విద్యుత్ పారిశుధ్యం, ట్రాఫిక్ నియంత్రణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ సీఎం సభా ప్రాంతంలో ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడకుండా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. భద్రత పరంగా ఎలాంటి లోటు పాట్లు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అప్రమత్తంగా ఉండాలి పుట్టపర్తి టౌన్: కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి పుట్టపర్తి పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఎస్పీ సతీష్‌కుమార్ సిబ్బందిని ఆదేశించారు. బుధవారం పోలీస్ కార్యాలయంలో వీడియో కాన్ఫెరెన్స్ హాల్లో సీఎం బందోబస్త్ సెక్టార్ అధికారులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. అనంతరం సభా వేదిక పరిశీలించారు. -
దొంగతనం కేసులో ముద్దాయికి జైలు
పుట్టపర్తి అర్బన్: దొంగతనం కేసులో ముద్దాయి బెస్త మనోజ్‌కుమార్‌కు ఒక ఏడాది జైలు శిక్ష , రూ.2500 జరిమానా విధిస్తూ పుట్టపర్తి జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. వివరాలు.. 2017 మార్చి 9న కొత్తచెరువులోని నెహ్రూనగర్‌లోని సూర్యనారాయణ ఇంట్లో బెస్త మనోజ్‌కుమార్ దొంగతనం చేశాడు. ఇంటి తాళాలు పగలగొట్టి సుమారు 10 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లాడు. ఈ ఘటనపై కొత్తచెరువు పోలీస్‌స్టేషన్‌లో అదే రోజు కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకొని ముద్దాయిని రిమాండ్‌కు పంపారు. ఈ కేసులో సాక్ష్యాధారాలను పరిశీలించిన అనంతరం బుధవారం ముద్దాయికి జైలు శిక్షతో పాటు రూ.2,500 జరిమానా విధించారు. డీఎస్పీ శివన్నారాయణ పర్యవేక్షణలో పుట్టపర్తి ఏపీపీ ప్రత్యూష, లైజనింగ్ ఆఫీసర్ సీఐ ఇస్మాయిల్, ఎస్ఐ రాజశేఖర్, కోర్టు కానిస్టేబుల్ చంద్రానాయక్ సాక్షులను సకాలంలో కోర్టులో హాజరు పరిచారు. పోలీస్ అధికారులను, సిబ్బందిని ఎస్పీ సతీష్‌కుమార్ అభినందించారు. యువకుడి ఆత్మహత్య పెనుకొండ: నగర పంచాయతీ పరిధిలోని తిమ్మాపురం గ్రామానికిచెందిన అజయ్ (25) ఆత్మహత్య చేసుకున్నాడు. కార్పెంటర్‌గా పనిచేసేవాడు. ఇటీవల కుటుంబంలో మనస్పర్థలు చెలరేగడంతో మనస్తాపం చెందిన అతను బుధవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. టీడీపీ నేత మోసంపై ఫిర్యాదు కదిరి అర్బన్: పట్టాదారు పాసుబుక్కు చేయించి బ్యాంక్ రుణం ఇప్పిస్తానంటూ కేఎన్ పాళ్యం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు నాగూరి శ్రీనివాసరెడ్డి తన వద్ద నుంచి రూ.లక్ష తీసుకుని మోసం చేశాడంటూ ఆర్డీఓ కార్యాలయం ఎదుట బుధవారం నల్లగుట్టతండాకు చెందిన లక్ష్మేనాయక్ నిరసన వ్యక్తం చేశాడు. సర్వే నంబర్ 848–2సీ, 586లో మొత్తం 6 ఎకరాలకు 1990లో దొంగ పాసుబుక్కులు చేయించాడని ఆరోపించారు. తనకు దొంగ పట్టా ఇచ్చిన సర్వే నంబర్లోని భూమి తన బంధువు, ముదిగుబ్బ మండలం గుడ్డంపల్లికి చెందిన రవినాయక్ పేరుపై ఉందన్నారు. ఈ మోసంపై టీడీపీ నేతను నిలదీసి డబ్బు వెనక్కు ఇవ్వాలని అడిగితే బెదిరిస్తున్నాడని, ఈ అంశంపై నాగూరి శ్రీనివాసరెడ్డిని విచారణ చేసి తమకు న్యాయం చేయాలని బాధితుడు డిమాండ్ చేస్తూ ఆర్డీఓ కార్యాలయ ఏఓ రవికుమార్‌కు వినతి పత్రం అందజేశాడు. అనంతరం కదిరి రూరల్ అప్‌గ్రేడ్ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. ఫ్లాట్‌ఫారంపై వృద్ధుడి మృతదేహం గుంతకల్లు: స్థానిక రైల్వేస్టేషన్‌లోని 7వ ఫ్లాట్‌ఫారంపై బుధవారం ఉదయం ఓ వృద్ధుడి మృతదేహాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. సుమారు 60 ఏళ్లు పైబడి ఉంటాయి. చామనఛాయ రంగులో ఉండి, తెలుపు రంగు పుల్షార్ట్, తెల్లటి పంచ ధరించి ఉన్నాడు. కుడి చిటికెన వేలుపై నల్లటి పుట్టు మచ్చ ఉంది. ఆచూకీ తెలిసిన వారు 90145 86555 కు సమాచారం అందించాలని జీఆర్పీ ఏఎస్ఐ ప్రేమ్‌కుమార్ కోరారు. -
కలసి కట్టుగా కృష్ణా జలాలను సాధించుకుందాం
పావగడ: పార్టీలు, ప్రాంతీయ బేధాలు లేకుండా అందరూ కలసికట్టుగా కృష్ణా జలాల సాధనకు ఉద్యమిద్ధామని రాప్తాడు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం పావగడకు వచ్చిన ఆయన స్థానిక అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్న తాను అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో హంద్రీ–నీవా పథకం కింద రొద్దం పెద్దకోడిపల్లి చెరువు నింపి అక్కడి నుంచి నాగలమడక ఉత్తర పినాకిని నది ద్వారా పేరూరు అప్పర్ పెన్నార్ డ్యాం కు కృష్ణా జలాలు తరలించినట్లు గుర్తు చేశారు. దీంతో నాగలమడక నదీ పరివాహక గ్రామాల బోరుబావుల్లో భూగర్భ జలాలు పెరిగి తాగు, సాగు నీటికి ఇబ్బందులు లేకుండా పోయాయన్నారు. అయితే గత మూడేళ్లుగా ఈ ప్రక్రియ నిలిచి పోయిందని, అలాగే జీడిపల్లి రిజర్వాయర్ నుంచి పేరూరు డ్యాం కు నీటి సరఫరా చేయడానికి సంబంధించిన కాలువ పనులు పూర్తి కాలేదన్నారు. ఈ లెక్కన పేరూరు డ్యాంకు నీరు చేరాలంటే దాదాపు 20 ఏళ్లు పడుతుందన్నారు. నాగలమడక ఉత్తర పినాకిని నది ద్వారా పేరూరు డ్యాం కు సులభరీతిలో నీటిని తరలించే అంశంపై రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత దృష్టి సారించాలన్నారు. అలాగే స్థానిక మాజీ ఎమ్మెల్యే తిమ్మరాయప్ప సైతం కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామితో మాట్లాడి నీటి తరలింపుల అంశంపై ఏపీ సీఎం చంద్రబాబుతో చర్చించాలన్నారు. కార్యక్రమంలో స్థానిక మాజీ ఎమ్మెల్యే తిమ్మరాయప్ప పలువురు జేడీఎస్ నేతలు పాల్గొన్నారు. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి -
వైఎస్సార్సీపీ నేతలపై వేధింపులు ఆపాలి
చిలమత్తూరు: వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై వేధింపులు, అక్రమ కేసులను వెంటనే ఆపాలని వైఎస్సార్సీపీ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు మనోజ్ మింటు, నాయకులు డిమాండ్ చేశారు. కర్నూలు నగర యువజన విభాగం అధ్యక్షుడు బాలును అధికార పార్టీ నేతలు కక్షగట్టి అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురిచేయడంతో మనస్తాపం చెంది ఆయన ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ తీరును నిరసిస్తూ హిందూపురం అంబేడ్కర్ కూడలి వద్ద నాయకులు, కార్యకర్తలతో కలిసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్సీపీలో క్రియాశీలకంగా ఉండే నాయకులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని వేధింపులకు గురిచేయడం దుర్మార్గం అని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర, జిల్లా నాయకులు మనేసముద్రం గిరీష్‌కుమార్, శంకరయ్య, లోకేష్,రామాంజినేయులు, శ్రీరాములు, నరసింహమూర్తి, ప్రణయ్‌రెడ్డి, కొటిపి శ్రీనివాసరెడ్డి, మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఏపీఆర్జేసీలో ‘విశ్వం’ ఉత్తమ ఫలితాలు తిరుపతి అర్బన్: ఏపీఆర్జేసీ 2026లో ఫలితాల్లో తిరుపతిలోని విశ్వం విద్యాసంస్థ సత్తా చాటింది. రాష్ట్రస్థాయిలో ఉత్తమ మార్కులు సాధించి ముందు వరుసలో నిలిచారు. వి.మోక్షిత్ రాష్ట్రస్థాయి ప్రథమ ర్యాంకు సాధించగా, టి. శ్రీదర్శిని రాష్ట్రస్థాయి 8వ ర్యాంకు, కే.పవ్యశ్రీ 9వ ర్యాంకు, కే.హర్షవర్ధన్ 11వ ర్యాంకు, కే.జ్యోత్స్న 12వ ర్యాంకు, ఎన్.హాసిని 13వ ర్యాంకు, ఈ. మునిశంకర్ 14వ ర్యాంకు, బి. హర్షిత్ 15వ ర్యాంకు, పి. తేజస్వి 16వ ర్యాంకు, కే. హర్ష 17వ ర్యాంకు, వి. పూజ 18వ ర్యాంకు, ఎం. చారుణ్య, కే. గీతిక 19వ ర్యాంకు, ఏ. రితీష్ కుమార్, కే. ధోనీష్ 20వ ర్యాంకు సాధించారు. ప్రతిభ చాటిన విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులను విశ్వం విద్యా సంస్థల అధినేత ఎన్. విశ్వనాథ్‌రెడ్డి, విశ్వం అకడమిక్ డైరెక్టర్ విశ్వచందన్‌రెడ్డి, విశ్వశ్రీ , కరస్పాండెంట్ తులసీ విశ్వనాథ్‌రెడ్డి అభినందించారు. -
ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకోవాలి
పెనుకొండరూరల్(సోమందేపల్లి): చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ భూములను టీడీపీ నేతలు కబ్జా చేస్తున్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు కేవీ ఉష శ్రీచరణ్ విమర్శించారు. సోమందేపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 746–1లో 1.80 ఎకరాల భూమిని మంత్రి సవిత అనుచరుడు హరికృష్ణ తన పేరు మీదుగా రికార్డులు బదలాయించుకున్న విషయం తెలుసుకున్న ఆమె బుధవారం నేరుగా తహసీల్దార్‌ను కలిసి వినతి పత్రం అందజేసి, మాట్లాడారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలో భూకబ్జాలు ఓ దినచర్యగా టీడీపీ నేతలు మలుచుకున్నారని మండిపడ్డారు. మండల కేంద్రానికి 5 కిలోమీటర్ల పరిధిలో భూ పంపిణీ చేపట్టకూడదనే నిబంధన ఉన్నా... రూ. కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని టీడీపీ నాయకుడి పేరుపై ఎలా బదలాయిస్తారని ప్రశ్నించారు. కియా పరిసర ప్రాంతాలతో పాటు గోరంట్ల మండల పరిధిలోని బెస్ట్ యూనివర్సిటీ భూములను ఆక్రమించుకునేందుకు మంత్రి సవిత కుట్రలు పన్నుతున్నారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా అన్యాక్రాంతమైన భూములను తక్షణమే స్వాధీనం చేసుకోవాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉష శ్రీచరణ్ -
బతుకు బరువు
తెర మరుగు..గతంలో ఓ వెలుగు వెలిగిన సినిమా థియేటర్లు ఓటీటీ దెబ్బకు మూతపడుతున్నాయి. సినిమా విడుదలైన మూడు, నాలుగు వారాల్లోనే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపైకి అందుబాటులోకి వస్తుండడంతో థియేటర్‌కు వెళ్లేవారు కరువయ్యారు. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చాలా థియేటర్లు మూత పడుతున్నాయి. ఫలితంగా కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. థియేటర్ కాస్త ఓ తియ్యని జ్ఞాపకంగా మిగలనుంది. అనంతపురం కల్చరల్: కొత్త సినిమా విడుదలైతే థియేటర్ల వద్ద సందడి అంతా.. ఇంతా కాదు. అలాగే థియేటర్లలో పనిచేసే సిబ్బందికీ అంతే క్రేజ్ ఉండేది. టికెట్ల కోసం అభిమానులు పోటీ పడేవారు. ప్రస్తుతం పరిస్థితి తిరగబడింది. సినిమా విడుదలైన 15 రోజుల్లోనే సెల్ఫోన్లలో ప్రత్యక్షమవుతోంది. దీనికి తోడు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే బలమైన కథలు, భారీ చిత్రాలూ రావడం లేదు. అరకొర సినిమాలు కాస్త జనాదరణ పొందినా మల్టీప్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్స్‌లో టికెట్, తినుబండారాల ఖర్చులు సామాన్యుడికి భారం కావడంతో థియేటర్లకు వెళ్లేవారు కరువయ్యారు. దీంతో థియేటర్ల నిర్వాహకులకు విద్యుత్ బిల్లులు, సిబ్బంది జీతాలు, థియేటర్ల లీజు భారంగా మారాయి. 15 రోజులుగా తెర లేవలేదు ప్రతి థియేటర్లో కనీసం 300 నుంచి 500 సీటింగ్ కెపాసిటీ ఉంటుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 74 థియేటర్లు ఉండగా, ప్రేక్షకాదరణ లేకపోవడంతో చాలా వాటిలో సినిమాలు ఆడడం లేదు. కొన్నింటిని యజమానులు మూతేశారు. ప్రస్తుతం అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలో కేవలం 50 థియేటర్లు మిగిలుండగా, వీటిల్లోనూ ఎప్పుడో ఒకసారి మాత్రమే సినిమాలు ఆడిస్తున్నారు. అనంతపురంలోని శ్రీకంఠం, రఘువీరా, నీలం, కృష్ణా థియేటర్లు ప్రస్తుతం షాపింగ్ కాంప్లెక్స్‌లుగా మారిపోగా రమణ, రమేష్, రాజా, సంఘమేష్ థియేటర్లు కల్యాణమండపాలుగా రూపాంతరం చెందాయి. ఈ పరిస్థితి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉంది. అనంతపురంలో ప్రస్తుతం 11 థియేటర్లు ఉండగా, వాటిలో శాంతి, గౌరి, త్రివేణి, ఎస్వీ థియేటర్లు మినహా మిగతావన్నీ వారాల తరబడి మూతపడే ఉంటున్నాయి. త్రివేణి గ్రూపు థియేటర్లు వీ మెగా వారి ఆధ్వర్యంలో నడుస్తుండగా, శాంతి, గౌరీ కాంప్లెక్సులు సురేష్ ప్రొడక్షన్స్ వారు నడుపుతున్నారు. ఇక ఎస్వీ, నీలిమా (ఎన్ మాక్స్) థియేటర్లు కూడా కదిరికి చెందిన వారి ఆధీనంలో నడుస్తున్నాయి. వీటన్నింటిలో పెద్ద హీరోల చిత్రాలు రెండు వారాలకు మించి ఆడని పరిస్థితి. చిన్న సినిమాలైతే రెండోరోజుకే బంద్ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. రోడ్డున పడుతున్న కార్మికులు వెండి తెర వెలుగులీనుతున్న రోజుల్లో ఒక్కో థియేటర్లో 15 నుంచి 25 మంది కార్మికులు పనిచేసేవారు. ఈ లెక్కన అప్పట్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,110 కు పైగా కార్మిక కుటుంబాలు జీవనం సాగించేవి. ప్రస్తుతం ప్రేక్షకాదరణ లేక థియేటర్లు మూత పడుతుండడంతో కార్మికులు రోడ్డు పడుతున్నారు. ఓటీటీ, పైరసీ కారణంగా ఉపాధికి భద్రత లేక పోవడంతో చాలా మంది కార్మికులు ఆటో డ్రైవర్లుగా, కూరగాయల విక్రయాలతో జీవనం సాగిస్తున్నారు. ‘పవర్’ చూపని ‘స్టార్’ ప్రేక్షకుల్లో అత్యంత మాస్ ఇమేజ్ కలిగిన హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, ఉప ముఖ్యమంత్రి పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌తో సినీ పరిశ్రమ రూపరేఖలు మారిపోతాయని పలువురు ఆశించారు. పైరసీని అరికట్టడంతో పాటు రాయితీలతో థియేటర్ల యజమానులకు అండగా నిలుస్తారని భావించారు. అయితే రోజులు గడుస్తున్నా చలనచిత్ర పరిశ్రమ పరిరక్షణపై పవన్ కళ్యాణ్, బాలకృష్ణ ఎలాంటి భరోసా ఇవ్వకపోవడంతో అందరిలోనూ నిరాస నిస్పృహలు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వ చేతకానితనంతో సినిమా విడుదలైన రెండో రోజే హెచ్డీ ప్రింట్లు అరచేతిలోకి వచ్చేస్తున్నాయి. దీని వెనుక ప్రభుత్వ పెద్దల హస్తమందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. థియేటర్ల బాగు కోసం, కార్మికుల సంక్షేమానికి పవర్‌స్టార్ చేసిందేమీ లేదంటూ పెదవి విరుస్తున్నారు. సినిమా థియేటర్లకు ప్రేక్షకాదరణ కరువు వారాల తరబడి మూతబడుతున్న థియేటర్లు -
తీర్థయాత్రలకు వెళ్లి వస్తూ...
ధర్మవరం అర్బన్: స్థానిక జగ్జీవన్‌రామ్‌నగర్‌కు చెందిన రేషం వ్యాపారి పూజారి రాఘవ(35) ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి మృతి చెందాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటనకు సంబంధించి వివరాలు... పది రోజుల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి హరిద్వార్ యాత్రకు వెళ్లిన రాఘవ రైలులో తిరుగు ప్రయాణమయ్యారు. నాలుగురోజుల క్రితం రైలు కర్ణాటకకు చేరుకోగానే రాఘవ కనిపించలేదు. రైలు మొత్తం కుటుంబ సభ్యులు గాలించినా ఫలితం లేకపోయింది. దీంతో ధర్మవరానికి చేరుకున్న అనంతరం కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రెండో పట్టణ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో కర్ణాటకలోని రాయచూర్ సమీపంలో రైలు నుంచి జారిపడి మృతిచెందినట్లుగా గుర్తించారు. విషయం తెలుసుకున్న రాఘవ కుటుంబ సభ్యులు రాయచూర్‌కు బయలుదేరి వెళ్లారు. ఆయనకు భార్య, ఓ కుమారుడు ఉన్నారు. -
వలస కార్మికుడి బలవన్మరణం
కదిరి టౌన్: పొట్ట కూటి కోసం తండ్రితో పాటు బిహార్ నుంచి వలస వచ్చిన ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. బిహార్‌కు చెందిన ఉమేష్ పాశ్వాన్, ఆయన కుమారుడు చోటుకుమార్ (17) జీవనోపాధి కోసం కదిరికి వలస వచ్చారు. కొంత కాలంగా స్థానిక రాయచోటి మార్గంలోని ఓ రైస్‌మిల్‌లో తండ్రితో పనిలోకి చోటుకుమార్ వెళ్లేవాడు. రెండు నెలలుగా తరచూ ఫోన్లో మాట్లాడుతుండడంతో తండ్రి మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన చోటు కుమార్ మంగళవారం రాత్రి అతిగా నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కాగా, మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. ఖాళీ బిందెలతో నిరసన ఓడీచెరువు: తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ ఓడీ చెరువు మండలం ఇనగలూరు ఎస్సీ కాలనీ వాసులు ఖాళీ బిందెలతో బుధవారం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కదిరప్ప మాట్లాడారు. గ్రామంలోని దుర్గమ్మ గుడి వద్ద తాగునీటి పథకానికి సంబంధించి ఏర్పాటు చేసిన బోరు బావిలో మోటారు పైపులు పూర్తిగా తొలగించారన్నారు. మరమ్మతుల కారణంగా మారెమ్మ గుడి వద్ద ఉన్న మోటారు పనిచేయడం లేదన్నారు. దీంతో మూడు నెలలలుగా స్థానికులు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. విషయం అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా, సమస్య పరిష్కారంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికై నా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోకపోతే తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయ ఏఓ రమణానాయక్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కాలనీ మహిళలు శ్రీలత, గంగులమ్మ, అనిత, నర్సమ్మ, తదితరులు పాల్గొన్నారు. తాగునీటి సమస్య పరిష్కరించాలిపరిగి: స్థానిక సాయినగర్‌లో నెలకొన్న తాగునీటి సమస్యపై పరిష్కారం కోరుతూ బుధవారం కాలనీలో వాసులు ఖాళీ బిందెలతో ధర్నా చేపట్టారు. పరిగి చెరువు నిండా నీరు ఉన్నా గుక్కెడు తాగునీటి కోసం ఇబ్బంది పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నీటి సమస్య పరిష్కరించాలని అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోతోందని మండిపడ్డారు. ఇప్పటికై నా నీటి సమస్యను పరిష్కరించాలని, లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిస్తూ సచివాలయంలో అధికారులకు వినతిపత్రాన్ని అందించారు. ద్విచక్ర వాహనాల దొంగల అరెస్ట్ ధర్మవరం అర్బన్: ద్విచక్ర వాహనాలను అపహరించుకెళుతున్న ఇద్దరు యువకులను అరెస్ట్ చేసినట్లు ధర్మవరం రెండో పట్టణ సీఐ రెడ్డప్ప తెలిపారు. బుధవారం స్థానిక టూటౌన్ పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను ఆయన వెల్లడించారు. అనంతపురం జిల్లా ఇటుకలపల్లికి చెందిన చాకలి మధు, కదిరిలోని పార్థసారధి కాలనీకి చెందిన షేక్ ముబారక్ జల్సాలకు అలవాటు పడి, తమ అవసరాలకు ద్విచక్ర వాహనాలను అపహరించి, తక్కువ ధరకు విక్రయించి సొమ్ము చేసుకునేవారు. బుధవారం ధర్మవరంలోని గుట్టకిందపల్లి సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టిన అక్కడే ఉన్న మధు, ముబారక్ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో ఎస్ఐ వీరేష్ అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది. దీంతో వారి నుంచి ఆరు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని, కేసు నబమోదు చేశారు. -
పేరుకే ఉచిత గ్యాస్
ఉచిత గ్యాస్ అన్నారే గానీ డబ్బులు మాత్రం సక్రమంగా జమకావడంలేదు. మాకు ఒక్కసారి మాత్రమే డబ్బులు పడ్డాయి. తర్వాత రాలేదు. ఎవరికి చెప్పినా పడుతుందిలే..అంటారే గానీ డబ్బు మాత్రం పడలేదు. – జి.ఈశ్వరమ్మ, వేపులకుంట, గాండ్లపెంట మండలం ఒక్క విడత కూడా పడలేదు మాకు ఉచిత గ్యాస్ డబ్బులు ఒక్కసారి కూడా పడలేదు. అధికారులను అడిగితే ఈ కేవైసీ కాలేదన్నారు. అన్ని పత్రాలు ఇచ్చాము. ఇంత వరకూ జమ కాలేదు. ఎన్నిసార్లు తిరిగినా సమస్య పరిష్కారం కాలేదు. – ప్రశాంత్, వెలిచలమల, ఎన్పీ కుంట మండలం -
కదిరి మున్సిపల్ స్పెషలాఫీసర్‌గా జేసీ
కదిరి: కదిరి మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్‌గా జేసీ మౌర్య భరద్వాజ్‌ను ప్రభుత్వం నియమించింది. గత కొద్ది నెలలుగా కదిరి మున్సిపాలిటీ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. కమిషనర్‌గా ఉన్న కిరణ్‌కుమార్‌తో పాటు ఆయనకు పీఏ తరహాలో వ్యవహరించిన సచివాలయ శానిటరీ సెక్రెటరీ పరమేశ్వర్ అవినీతిపై ‘సాక్షి’ ఇటీవల వరుస కథనాలు ప్రచురించింది. దీంతో ఇరువురినీ తప్పించిన విషయం తెలిసిందే. తాజాగా బుధవారం ప్రభుత్వం మరో జీఓ విడుదల చేసింది. ప్రస్తుతం కదిరి మున్సిపాలిటీకి ప్రత్యేక అధికారిగా ఉన్న ఆర్డీఓ సన్యాసి శర్మకు ఇక్కడ జరుగుతున్న అవినీతి వ్యవహారాలు తెలిసినప్పటికీ దీన్ని ఆయన ‘మామూలు’గా తీసుకోవడంతో ప్రభుత్వం ఆయనను తప్పించింది. ఆయన స్థానంలో జాయింట్ కలెక్టర్ భరద్వాజ్‌ను ఇక్కడ ప్రత్యేక అధికారిగా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.సురేష్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్‌ను కలసిన జెడ్పీ సీఈఓ ప్రశాంతి నిలయం: జిల్లా పరిషత్ నూతన సీఈఓ విజయలక్ష్మి బుధవారం కలెక్టర్ శ్యాంప్రసాద్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. కలెక్టరేట్లోని చాంబర్లో కలెక్టర్‌కు మొక్కను అందజేశారు. జిల్లా అభివృద్ధి, పరిపాలనా అంశాలపై ఆమెకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. అంతకు ముందు ఆమె అనంతపురం జిల్లా పరిషత్ కార్యాలయంలో సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. ఈశ్వరమ్మ సీబీఎస్ఈ సీనియర్ ఇంటర్లో అద్భుత ఫలితాలు పుట్టపర్తి: స్థానిక ఈశ్వరమ్మ హయ్యర్ సెకండరీ స్కూల్ విద్యార్థులు ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో సత్తా చాటారని ప్రిన్సిపాల్ శివరామకృష్ణ పేర్కొన్నారు. బుధవారం విడుదలైన ఫలితాల్లో పాఠశాలలోని విద్యార్థులంతా ఫస్ట్ క్లాస్‌లో ఉత్తీర్ణులైనట్లు చెప్పారు. పుట్టపర్తి పరిసర ప్రాంతాల్లో గ్రామీణ విద్యార్థుల కోసం సత్యసాయి బాబా తన తల్లి పేరుమీద పాఠశాలను స్థాపించినట్లు తెలిపారు. ఎంపీసీ, బైపీసీ, సీఏఈ మూడు గ్రూపుల్లో 30 మంది విద్యార్థినులు పరీక్షలు రాయగా అందరూ పాసయ్యారన్నారు. బ్రాహ్మణపల్లికి చెందిన షామీర్‌బాష, యాస్మిన్ దంపతుల కుమార్తె షేక్ సల్మా సీఏఈలో 95.6 శాతం పర్సేంటేజ్తో మొదటి ర్యాంకు సాధించగా, యామిని 91 మార్కులతో రెండో ర్యాంకు సాధించినట్లు పేర్కొన్నారు. -
వెలగని ‘దీపం’ !
కదిరి: అధికారంలోకి వస్తే మహిళలకు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలెండర్లు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ ఆ పథకం ద్వారా సగం మంది దీపం వంట గ్యాస్ వినియోగదారులకు కూడా లబ్ధి చేకూరడం లేదు. రాయితీ సొమ్ము సకాలంలో జమకాక లక్ష మందికి పైగా లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. సిలిండర్లు డెలివరీ అయినా సబ్సిడీ సొమ్ము తమ బ్యాంకు ఖాతాల్లో జమ కాకపోవడంతో లబ్ధిదారులు గ్యాస్ ఏజెన్సీలు, సచివాలయాలతో పాటు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. 4 నెలలకు ఒక సిలెండర్.. ఏడాదికి 3 ఉచిత సిలిండర్ల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం 2024 డిసెంబర్లో ప్రారంభించింది. ప్రతి నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున డబ్బుపెట్టి తీసుకుంటే తర్వాత రెండు రోజుల్లోగా ప్రభుత్వం సిలిండర్‌కు రూ.851 నగదు జమ చేస్తుంది. ఇలా ఒక్కో లబ్ధిదారుడికి ఏడాదికి 3 సిలిండర్లకు కలిపి రూ.2,415 రాయితీ నగదు జమ చేయాల్సి ఉంది. 2024 డిసెంబర్–మార్చి తొలివిడత, ఏప్రిల్–జూలై రెండో విడత, ఆగస్టు–నవంబర్ మూడో విడత చొప్పున ఇప్పటికి ఏడు విడతలు పూర్తయింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో 8వ విడత ప్రారంభమైంది. జిల్లాలో 7వ విడతలో దీపం కింద 3,42,621 సిలిండర్లు పంపిణీ చేస్తే 1,25,112 మంది లబ్ధిదారులకు ఇప్పటి దాకా నగదు జమ కాలేదు. వీరికి రూ.11 కోట్లకు పైగా నగదు జమ కావాల్సి ఉంది. ఒక్క విడత కూడా నగదు జమ కాని వారు జిల్లాలో 70,215 మంది ఉన్నారని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. అర్జీలు బుట్టదాఖలు.. గ్యాస్ కనెక్షన్, ఆధార్‌తో పాటు రేషన్‌కార్డు అనుసంధానం కాకపోవడం, గ్యాస్ ఏజెన్సీలో రిజిస్టర్ అయిన బ్యాంకు ఖాతా వివరాలు వేరుగా ఉండటం, పాత దీపం కనెక్షన్ వివరాలు కొత్త దీపం–2 సర్వర్‌తో అప్డేట్ కాకపోవడం ఇలా పలు కారణాలతో చాలా మంది అర్హులైనప్పటికీ నగదు కోల్పోతున్నారు. సంబంధిత అధికారులకు పలుమార్లు అర్జీలు ఇచ్చినప్పటికీ తమ సమస్య పరిష్కారం కాలేదని అర్హులైన లబ్ధిదారులు వాపోతున్నారు. కుటుంబంలో ఎవరి పేరుమీద గ్యాస్ కనెక్షన్ ఉన్నా..వారి పేరు రేషన్ కార్డులో ఉంటే చాలు. దీపం పథకానికి అర్హులే.. అనే నిబంధనలున్నా, ఈ విషయంలో సంబంధిత అధికారులు కొందరికి సరైన అవగాహన లేకపోవడంతో జిల్లాలో ఎంతోమందికి రాయితీకి దూరమవుతున్నారు. లబ్ధిదారుల ఖాతాల్లో జమకాని రాయితీ గ్యాస్ ఏజెన్సీల చుట్టూ లబ్ధిదారుల ప్రదక్షిణ అధికారులకు చెప్పినా ప్రయోజనం సున్నా ఉచిత సిలిండర్లు ఉత్తుత్తి మాటే అంటున్న జనం చిలమత్తూరు మండలం శెట్టిపల్లికి చెందిన రమణ దీపం–2 పథకం ద్వారా వంట గ్యాస్ బుక్ చేసుకుంటున్నారు. కానీ ఒక్కసారి కూడా రాయితీ సొమ్ము అందలేదు. అధికారులను అడిగితే ‘మీ పేరు మీద వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇల్లు ఉంది. అందుకే మీరు అర్హులు కాదు’ అన్నారు. వాస్తవానికి ఆయన ఇల్లు 700 చదరపు అడుగుల లోపే ఉంది. ఎన్నిసార్లు అర్జీ ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదు. ఇలాంటి వారు జిల్లా వ్యాప్తంగా లక్ష మందికి పైగా ఉన్నారు. -
‘పరమేశ్వర్..నీ సేవలిక చాలు’
కదిరి: అధికార తెలుగుదేశం పార్టీని అడ్డంపెట్టుకొని రెండేళ్లుగా మున్సిపాలిటీలో పెత్తనం చెలాయిస్తున్న సచివాలయ శానిటరీ సెక్రటరీని ఎట్టకేలకు తప్పించారు. ‘పచ్చ’ ఉద్యోగి..పరిధి దాటి’ శీర్షికన ఆయన చేస్తున్న అవినీతి, అక్రమాలపై ‘సాక్షి’లో రెండు రోజుల క్రితం ప్రముఖంగా ప్రచురించిన విషయం తెలిసిందే. దీనికి మున్సిపల్ కమిషనర్ సందీప్ స్పందించారు. మున్సిపాలిటీకి సంబంధించిన వాహనాల డీజిల్ స్కాంలో పెద్ద మొత్తంలో ఇతను అవినీతికి పాల్పడ్డారని, ఇతని అవినీతి, అక్రమాలపై ‘సాక్షి’లో ప్రచురించిన ప్రతి అంశం వాస్తవమని కమిషనర్ చేపట్టిన విచారణలో బయట పడింది. బదిలీపై వెళ్లిన కమిషనర్ కిరణ్‌కుమార్‌కు ఇతను పీఏ తరహాలో వ్యవహరిస్తూ మున్సిపల్ ఉద్యోగులు, సిబ్బందితో పాటు అన్ని వార్డుల సచివాలయ ఉద్యోగులను బెదిరిస్తూ వచ్చారనే విషయం కూడా కమిషనర్ విచారణలో వెలుగుచూసింది. దీంతో అతన్ని ఆ బాధ్యతల నుంచి తప్పించి మున్సిపాలిటీ ఇన్చార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ నటరాజు బాబుకు బాధ్యతలు అప్పగించారు. ‘మున్సిపాలిటీలో మీ సేవలు ఇక చాలు. సచివాలయానికే పరిమితం కండి’ అంటూ కుటాగుళ్ల–3వ వార్డు సచివాలయానికి పరిమితం చేస్తూ కమిషనర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
బాధ్యతలు స్వీకరించిన డీఆర్ఓ కొండయ్య
ప్రశాంతి నిలయం: నూతన డీఆర్ఓ కొండయ్య మంగళవారం కలెక్టరేట్లో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మర్యాద పూర్వకంగా కలెక్టర్ శ్యాంప్రసాద్, జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, ఇతర అధికారులను కలిశారు. ఈ సందర్భంగా డీఆర్ఓ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. రెవెన్యూ పరంగా మెరుగైన సేవలు అందిస్తామని, సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందజేలా ప్రభుత్వ యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతామన్నారు. 15న పుట్టపర్తికి కేంద్ర మంత్రి రాక పుట్టపర్తి అర్బన్: కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, సీఎం చంద్రబాబు ఈనెల 15న పుట్టపర్తికి రానున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లిలో యుద్ధ విమానాల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో సభా స్థలాన్ని కలెక్టర్ శ్యాంప్రసాద్, జేసీ మౌర్య భరద్వాజ్ తదితరులు మంగళవారం పరిశీలించారు. సభా వేదిక, అవసరమైన ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. వేదికతో పాటు ప్రజలు కూర్చునే సదుపాయాలు, తాగునీరు, పారిశుధ్యం, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలపై సమీక్షించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. విద్యుత్, వైద్య సదుపాయాలు, అగ్నిమాపక ఏర్పాట్లు సిద్ధంగా ఉంచాలన్నారు. కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించండి ● డీఈఓ కిష్టప్ప పుట్టపర్తి: పిల్లల భవిష్యత్‌కు ప్రభుత్వ పాఠశాలలే పునాది అని డీఈఓ కిష్టప్ప పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి విద్యాశాఖ ఆధ్వర్యంలో వాహన ర్యాలీని మంగళవారం ప్రారంభించారు. కొత్తచెరువులోని డీఈఓ కార్యాలయంలో ఉపాధ్యాయులతో కలిసి డీఈఓ వాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం డీఈఓ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు ఉంటారని, ఉచిత బోధన అందిస్తామన్నారు. అలాగే విద్యార్థి మిత్ర కిట్‌లో యూనిఫారం, పుస్తకాలు, స్కూల బ్యాగ్, షూ అందిస్తారని పేర్కొన్నారు. మధ్యాహ్న భోజనం నాణ్యంగా అందిస్తారని, అలాగే రాగిజావ, కోడిగుడ్లు చిక్కీలు పంపిణీ చేస్తారన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని కోరారు. టన్ను మామిడి రూ.44 వేలుఅనంతపురం అగ్రికల్చర్: అనంతపురంలోని కక్కలపల్లి మార్కెట్లో మంగళవారం టన్ను మామిడి కాయలు గరిష్టంగా రూ.44 వేలు పలికినట్లు రాప్తాడు మార్కెట్ కమిటీ సెక్రటరీ రూప్‌కుమార్ తెలిపారు. మార్కెట్‌కు 260 టన్నుల మామిడికాయలు అమ్మకానికి రాగా, వాటిని బహిరంగ వేలం వేశారన్నారు. అందులో హిమాయత్ రకం మామిడి టన్ను గరిష్టంగా రూ.44 వేలు, కనిష్టంగా రూ.20 వేలు, సరాసరిన రూ.30 వేల ప్రకారం ధర పలికాయన్నారు. అలాగే బేనీషా రకం మామిడి టన్ను గరిష్టంగా రూ.41 వేలు, కనిష్టంగా రూ.15 వేలు, సరాసరిన రూ.28 వేలు కాగా పలికాయని వివరించారు. ఇక మల్లికా రకం మామిడికాయలు టన్ను గరిష్టంగా రూ.35 వేలు, కనిష్టంగా రూ.10 వేలు, సరాసరిన రూ.20 వేల ప్రకారం క్రయ విక్రయాలు జరిగినట్లు మార్కెట్ కమిటీ సెక్రటరీ వెల్లడించారు. -
విద్యార్థుల జీవితాలతో చెలగాటమా?
వైద్య విద్యను అభ్యసించాలనే లక్ష్యంతో లక్షలాది మంది నీట్ పరీక్ష రాస్తే ఆ పరీక్షను రద్దు చేసి విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది. నిర్వహణలో ఎన్టీఏ, కేంద్ర ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. పరీక్ష నిర్వహణలో పారదర్శకత, భద్రత, సమన్వయం లేకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. పరీక్ష రద్దుతో లక్షల కుటుంబాల ఆశలపై నీళ్లు చల్లారు. ప్రతి ఏడాది పేపర్ లీక్ ఆరోపణలు రావడం సాధారణమైపోయింది. పరీక్ష లీక్‌కు సంబంధించి ఇంత వరకూ బాధ్యులపై చర్యలు ఎందుకు తీసుకోలేదో చెప్పాలి. కేవలం పరిపాలనా లోపం కాదని ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. – శెట్టిపి జయచంద్రారెడ్డి, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి -
ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న దొంగ అరెస్ట్
రామగిరి: దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్న దొంగను అరెస్ట్ చేసి బంగారు, వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. మంగళవారం సాయంత్రం రామగిరి పోలీసుస్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. అనంతపురం జిల్లాలోని శెట్టూరు మండలం మాకొడికి గ్రామానికి చెందిన వడ్డే మర్రిస్వామి అలియాస్ సంకేత కర్ణాటక రాష్ట్రంలోని పావగడలో నివాసం ఉంటున్నాడు. వ్యసనాలకు బానిసైన ఇతను పలు చోట్ల అప్పులు చేశాడు. ఈ క్రమంలోనే దేవాలయాల్లో చోరీలకు పాల్పడేవాడు. ముందుగా భక్తుడి వేషంలో వెళ్లి జనసంచారం తక్కువగా ఉండే ఆలయాలను గుర్తించేవాడు. రాత్రి సమయంలో ఇనుప రాడ్ల సహాయంతో తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించి చోరీలకు పాల్పడేవాడు. బంగారం, వెండి ఆభరణాలు, హుండీ నగదును అపహరించేవాడు. దొంగిలించిన వెండి వస్తువులను కరిగించి వెండి బిస్కెట్లుగా మార్చి విక్రయించేవాడు. జిల్లాతో పాటు కర్ణాటకలోని పలు దేవాలయాల్లో కూడా చోరీలకు పాల్పడ్డాడు. సాంకేతిక ఆధారాల ద్వారా నిందితుడిపై నిఘా ఉంచిన ఎస్ఐలు టి. ప్రదీప్ రాజ్, ఎస్ఐ సత్యనారాయణ ఆధ్వర్యంలోని ప్రత్యేక పోలీసు బృందాలు నిందితుడిని మంగళవారం అదుపులోకి తీసుకున్నాయి. నిందితుడి వద్ద నుంచి 27.5 గ్రాముల బంగారు ఆభరణాలు, 380 గ్రాముల వెండి ఆభరణాలు, ఒక వెండి బిస్కెట్‌తో పాటు చోరీలకు వినియోగించిన మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా రామగిరి సర్కిల్ సీఐ ఎస్ఎం అలీ, ఎస్ఐలు ప్రదీప్ రాజ్, సత్యనారాయణ, పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు. 27.5, గ్రాముల బంగారం, 380 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం -
విద్యార్థుల డాక్టర్ కలను చిదిమేశారు
● ‘నీట్’ రద్దుతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన అనంతపురం: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి ఈ నెల మూడో తేదీన నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్ యూజీ–2026)ను రద్దు చేయడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పరీక్షకు సంబంధించి కొత్త తేదీలను త్వరలో వెల్లడించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పేర్కొంది. నీట్లో విద్యార్థులు ఎదుర్కొన్న ప్రశ్నలను పోలిన 100 ప్రశ్నలు పరీక్ష ప్రారంభానికి ముందే లీక్ అయినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై రాజస్థాన్ పోలీసులు విచారణ చేపట్టారు. ఏళ్ల తరబడి సన్నద్ధమై, కోచింగ్ తీసుకుని పరీక్ష రాస్తే ఇప్పుడు రద్దు చేశారన్న వార్త విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఆవేదన కలిగించింది. ప్రశ్నలు సులువుగా ఉన్నాయి.. పరీక్ష బాగా రాశాం.. మంచి ర్యాంకు వస్తుంది.. ఎంబీబీఎస్ కల నెరవేరుతుందనే ఆశను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చిదిమేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది విద్యార్థులు ఈ నిర్ణయంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఉత్తరాఖండ్, హర్యానా, కేరళ రాష్ట్రాల్లో ప్రశ్నపత్రం లీక్ అయితే.. అక్కడ పరీక్షను రద్దు చేయాలి కానీ ఆంధ్రప్రదేశ్‌లో రద్దు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో మొత్తం 2,534 మంది నీట్ యూజీ రాశారన్నారు.పరీక్ష రద్దు చేయడం సరికాదు -
●తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు
గుత్తి: తాగునీటి సమస్యను పరిష్కరించాలని మహిళలు డిమాండ్ చేశారు. గుత్తిలోని జంగాల కాలనీకి చెందిన మహిళలు ఖాళీ బిందెలతో మంగళవారం రోడ్డెక్కి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ 20 రోజులుగా తాగునీటిని సరఫరా చేయడం లేదన్నారు. మున్సిపల్ అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదన్నారు. తాగునీటి కోసం అనేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. వాటర్ ట్యాక్స్ కడుతున్నా ఎందుకు నీటిని సరఫరా చేయడం లేదని ప్రశ్నించారు. తాగునీటిని డబ్బు పెట్టి కొనాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. వెంటనే తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ధర్నాతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం తలెత్తింది. వాహనాలు బారులు తీరాయి. సమస్యను పరిష్కరిస్తామని మున్సిపల్ అధికారులు హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. -
వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అంటే ఒక నమ్మకం.. ఒక అనుబంధం.. ఒక ఆప్యాయత.. ఒక భరోసా.. అందుకే ఆయన్ను చూసేందుకు జనం ప్రభంజనంలా తరలివచ్చారు. పామిడి పెన్నానది తీరాన మండుటెండలోనే గంటల తరబడి వేచి ఉండి తమ అభిమాన నాయకుడిని
అనంతపురం/ పామిడి: జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (ఏడీసీసీబీ) మాజీ చైర్మన్ పామిడి వీరాంజనేయులు కుమార్తె లిఖిత, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ డాక్టర్ ఎ.మధుసూదన్ కుమారుడు చైతన్య మిత్రల వివాహం ఇటీవల జరిగింది. మంగళవారం ఉదయం 11 గంటలకు పామిడిలోని వీరాంజనేయులు నివాసంలో ఏర్పాటు చేసిన వివాహ రిసెప్షన్లో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. నూతన వధూవరులు లిఖిత, చైతన్య మిత్రలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. 3 కిలో మీటర్లు.. 35 నిమిషాలు వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా కల్లూరులో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి పామిడికి మూడు కిలోమీటర్ల దూరం ఉంది. వైఎస్ జగన్ ఉదయం 11:10గంటలకు హెలికాప్టర్లో హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. 11:20 గంటలకు హెలిప్యాడ్ నుంచి బయటకు వచ్చారు. అప్పటికే అక్కడికి వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా రిసెప్షన్ వేదిక వద్దకు బయల్దేరారు. వైఎస్ జగన్ కారుమీద నిలబడి ప్రతి ఒక్కరికీ ఆత్మీయ అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. జన సందోహం నడుమ కాన్వాయ్ ముందుకు వెళ్లలేని పరిస్థితితో 35 నిమిషాల సేపు ప్రజలకు, అభిమానులకు అభివాదం చేస్తూనే ఉన్నారు. పామిడిలో భవనాలు, మిద్దెలు ఎక్కిన ప్రజలు .. జగన్‌ను చూసి మురిసిపోయారు. జాతీయ రహదారి–44 జనంతో నిండిపోయింది. అన్ని దారులూ పామిడి వైపే అన్నట్లు.. జన సందోహం వెళ్లింది. ఉదయం 7 గంటలకే హెలిప్యాడ్ వద్దకు జనం చేరుకున్నారు. మండుటెండను లెక్క చేయకుండా జగన్‌ను చూసేందుకు వేచి ఉన్నారు. అడుగడుగునా నీరాజనం పామిడి వీరాంజనేయులు ఇంటి వద్ద ఏర్పాటు చేసిన వివాహ రిసెప్షన్ ప్రాంగణానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేరుకోగానే అక్కడి పరిసరాలు జై జగన్ నినాదాలతో హోరెత్తాయి. వైఎస్ జగన్‌తో కరచాలనం చేయడానికి పోటీ పడ్డారు. వధూవరులను ఆశీర్వదించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి 12.20 గంటలకు హెలికాప్టర్లో బెంగళూరుకు బయల్దేరారు. ఆత్మీయ స్వాగతం హెలిప్యాడ్ వద్ద మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నియోజకవర్గాల సమన్వయకర్తలు పుష్పగుచ్ఛం అందించి ఆత్మీయ స్వాగతం పలికారు. ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి, ఆలూరు ఎమ్మెల్యే బి.విరూపాక్షి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్సీ మంగమ్మ, వై.శివరామిరెడ్డి, మాజీ మంత్రులు సాకే శైలజానాథ్, మాలగుండ్ల శంకరనారాయణ, పీఏసీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎంపీ తలారి రంగయ్య, సీఈసీ సభ్యుడు మహాలక్ష్మి శ్రీనివాస్, రాప్తాడు, తాడిపత్రి, మడకశిర, రాయదుర్గం సమన్వయకర్తలు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఈరలక్కప్ప, మెట్టు గోవిందరెడ్డి, ఎస్ఈసీ సభ్యుడు కోగటం విజయభాస్కర్ రెడ్డి, చిత్తూరు జిల్లా పరిశీలకులు చవ్వా రాజశేఖర్‌రెడ్డి, మాజీ ఎంపీలు గోరంట్ల మాధవ్, బుట్టా రేణుక, పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, రాష్ట్ర కార్యదర్శి రమేష్‌గౌడ్ , ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెన్నోబులేసు, పార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతీరెడ్డి, మహిళా విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణవేణి, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చామలూరు రాజగోపాల్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నార్పల సత్యనారాయణరెడ్డి, మాజీ మేయర్ వసీం, మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాగజ్‌ఘర్ రిజ్వాన్ పాల్గొన్నారు. పామిడిలో వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం ఏడీసీసీబీ మాజీ చైర్పర్సన్ లిఖిత వివాహ రిసెప్షన్‌కు హాజరు జగన్‌ను చూసేందుకు తరలివచ్చిన వైఎస్సార్సీపీ శ్రేణులు హెలిప్యాడ్ నుంచి పామిడి వీరా ఇంటి వరకు నీరాజనమే అందర్నీ ఆప్యాయంగా పలకరించిన మాజీ ముఖ్యమంత్రి -
యానిమేటర్ భర్త ఘరానా మోసం
బ్రహ్మసముద్రం: ఓ యానిమేటర్ భర్త ఘరానా మోసానికి పాల్పడిన విషయం మండలవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని ఎర్ర కొండాపురం గ్రామంలో 16 డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. యానిమేటర్‌గా గ్రామానికి చెందిన అంజలి ఉన్నా ఆమె భర్త, టీడీపీ కార్యకర్త శ్రీకాంత్ అన్నీ తానై వ్యవహరిస్తున్నాడు. 8 సంఘాలకు చెందిన రూ.3 లక్షలకుపైగా పొదుపు సొమ్మును తన తల్లి తిమ్మక్క, భార్య అంజలి ఖాతాల్లో వేసుకున్నాడు. మంగళవారం గ్రామానికి చెందిన పలువురు మహిళలు తమ సంఘాలకు సంబంధించి లావాదేవీలపై వేపులపర్తి యూనియన్ బ్యాంక్‌లో ఆరా తీయగా శ్రీకాంత్ బాగోతం వెలుగుచూసింది. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసేందుకు బాధిత మహిళలు బ్రహ్మసముద్రం వెలుగు కార్యాలయానికి వెళ్లారు. కార్యాలయంలో అధికారులు లేకపోవడంతో నిరసన తెలియజేశారు. తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.పెళ్లి ఇష్టం లేక యువతి ఆత్మహత్య కళ్యాణదుర్గం రూరల్: పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన కళ్యాణదుర్గం పట్టణంలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు... ఉరవకొండకు చెందిన మోహన్, లలితమ్మ దంపతుల కుమార్తె రేవతి (21)ని ఆమె చిన్నతనంలోనే కళ్యాణదుర్గంకు చెందిన వారి బంధువు శకుంతల దత్తత తీసుకుంది. డిగ్రీ వరకూ చదివించింది. రేవతికి ఇంకా చదవాలనే కోరిక ఉండేది. కుటుంబ సభ్యులకు ఆర్థిక స్థోమత లేకపోవడంతో పెళ్లి సంబంధాలు చూడడం ప్రారంభించారు. దీంతో మనస్తాపం చెందిన రేవతి మంగళవారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక సీహెచ్‌సీకి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధరించారు. అభయాంజనేయుడికి వెండి కవచం వితరణ గుంతకల్లుటౌన్: హనుమాన్ సర్కిల్లో ఉన్న అభయాంజనేయస్వామి మూలవిరాట్‌కు 3 కేజీల వెండి కవచాన్ని దాతలు వితరణ చేశారు. మంగ ళవారం హనుమాన్ జయంతిని పురస్కరించుకుని బెల్డోన స్వామి ఆధ్వర్యంలో పట్టణానికి చెందిన గౌరీలక్ష్మి, కుమారులు పవన్‌కుమార్, రవికుమార్, ఆదినారాయణలు వెండి కవచాన్ని అర్చకుడికి అందజేశారు. -
దివ్యాంగ డీలర్‌కు వేధింపులు
హిందూపురం: వైఎస్సార్ సీపీ సానుభూతిపరుడు కావడంతో ఓ దివ్యాంగ డీలర్‌పై టీడీపీ నాయకులు కక్ష కట్టారు. హైకోర్టు నుంచి బాధితుడు ఉత్తర్వులు తెచ్చుకున్నా వేధింపులు మాత్రం ఆగడం లేదు. వివరాలిలా ఉన్నాయి.. హిందూపురం మండలం కగ్గల్లు ఎఫ్పీ షాపు డీలర్ పొట్టి ఆదినారాయణప్ప 18 ఏళ్లుగా డీలర్‌గా పనిచేస్తున్నాడు. ఇతను వైఎస్సార్ సీపీ సానుభూతిపరుడు. దీంతో రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడగానే స్థానిక టీడీపీ నాయకులు ఇతనిపై కక్ష కట్టారు. రెండేళ్ల క్రితం అక్రమంగా డీలర్షిప్ తొలగించారు. దీనిపై బాధితుడు హైకోర్టుకు వెళ్లాడు. తన దయనీయ పరిస్థితిని కోర్టుకు తెలిపి డీలర్‌షిప్‌నకు తిరిగి అనుమతి తెచ్చుకున్నాడు. అయినప్పటికీ అధికార పార్టీ నాయకుల వేధింపులు ఆగలేదు. గత జనవరిలో మళ్లీ డీలర్ షిప్ తొలగించడంతో తనకు జరిగిన అన్యాయంపై ఆదినారాయణ మళ్లీ హైకోర్టును ఆశ్రయించాడు. కోర్టు అతని దీన పరిస్థితిని చూసి డీలర్‌గా కొనసాగించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో మే 1 నుంచి 3 వరకు బియ్యం వేయడానికి అనుమతి పొందిన ఆదినారాయణప్ప కార్డు పంచింగ్ మిషన్ల కోసం ఇటీవల తహసీల్దార్ కార్యాలయం వద్దకు వెళ్లాడు. అప్పటికే అక్కడ ఉన్న గ్రామ అధికార పార్టీ నాయకుల ఎదుటనే నారాయణప్పను రెవెన్యూ అధికారి నానా దుర్భాషలాడి అవమానించాడు. ‘ఈ సారి తీసేస్తాం.. దిక్కున్న వారికి చెప్పుకో’ అంటూ బెదిరించాడు. విషయాన్ని ఆర్డీఓ, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా.. అధికారులు స్పందించి ఈనెల 8న కార్డు పంచింగ్ మిషన్ ఇచ్చి బియ్యం పంపిణీ చేయాల్సిందిగా నారాయణప్పకు సూచించారు. నాలుగు రోజుల్లో మళ్లీ.. స్టాక్‌ను పంపిణీ చేసిన నాలుగు రోజులకే స్టోర్ వద్దకు విజిలెన్సు అధికారులు వచ్చి తనిఖీలు చేశారు. అయితే, ఎలాంటి లోపాలు లేవని తేల్చారు. దీన్ని తట్టుకోలేని స్థానిక అధికార పార్టీ నాయకులు గ్రామంలో తమకు అనుకూలమైన వారితో ఫిర్యాదు చేయించడం గమనార్హం. దీంతో దివ్యాంగుడైన ఆదినారాయణ తీవ్ర ఆందోళన చెందుతున్నాడు. ఉన్న ఫలంగా డీలర్షిప్ తీసేస్తే కుటుంబం రోడ్డున పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తనను వేధిస్తున్న వారిపై పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. వైఎస్సార్ సీపీ సానుభూతిపరుడు కావడంతో కక్ష కట్టిన టీడీపీ నాయకులు హైకోర్టు నుంచి ఉత్తర్వులు వచ్చినా ఆగని వేధింపులు -
వాల్మీకీ ప్రతిభా అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
ధర్మవరం అర్బన్: వాల్మీకీ ప్రతిభా అవార్డులకు దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర వాల్మీకి ఉద్యోగుల సంఘం ఆర్థిక కార్యదర్శి ఈశ్వరయ్య, సీనియర్ నాయకుడు బీకే ముత్యాలప్ప తెలిపారు. పట్టణంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ పదో తరగతిలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులైతే 450 మార్కులకుపైగా ఉండాలని, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు 500 మార్కులకు పైగా ఉండాలన్నారు. ఇంటర్లో ప్రభుత్వ కాలేజీల విద్యార్థులు 750 మార్కులు, ప్రైవేటు కాలేజీల విద్యార్థులు 850 మార్కులు తెచ్చుకున్న వారు అర్హులన్నారు. ఈనెల 20 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్‌కార్డు, మార్కుల పత్రం 9652800038, 9394798674 ఫోన్ నంబర్లకు వాట్సాప్‌లో పంపించాలన్నారు. ఈనెల 31న పట్టణంలోని షిరిడీ సాయిబాబా కల్యాణ మండపంలో ప్రతిభా అవార్డులు అందిస్తామని తెలిపారు. సమావేశంలో వాల్మీకీ ఉద్యోగుల సంఘం నాయకులు రామకృష్ణ, జెన్నే నాగప్ప, నరసింహులు, చంద్రశేఖర్, నాగరాజు, వెంకటేష్, శివయ్య, పోతలయ్య పాల్గొన్నారు. విమానయానం.. ఆదర్శం లేపాక్షి: ఆ టీచర్ దంపతులు ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఆదర్శంగా నిలిచారు. అందరి ప్రశంసలు అందుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కొండూరు ఉన్నత పాఠశాల హెచ్ఎం శేషగిరిబాబు తమ పాఠశాలలో పదో తరగతిలో 550 పైన మార్కులు సాధించే విద్యార్థులకు విమాన ప్రయాణం చేయిస్తానని గతంలో మాట ఇచ్చారు. అదేవిధంగా శేషగిరిబాబు భార్య బయాలజీ సైన్సు టీచర్ టీఎన్ మాధవి తాను పనిచేసే చిలమత్తూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థికి విమాన ప్రయాణం చేయిస్తానని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం భార్యాభర్తలు తమ తమ పాఠశాలల్లో అత్యధిక మార్కులు సాధించిన కే.నాని(574 మార్కులు), ఎం.సుప్రజ (589 మార్కులు)ను మంగళవారం హైదరాబాద్ నుంచి బెంగళూరుకి విమానంలో తీసుకెళ్లారు. విమానయానంతో విద్యార్థులను ప్రోత్సహించడం గొప్ప విషయ మని పలువురు వారిని అభినందించారు. వ్యక్తి బలవన్మరణం గుంతకల్లు టౌన్: కుటుంబ కలహాల కారణంగా పట్టణంలోని మోమినాబాద్‌కు చెందిన కె.రవికుమార్ (36) మున్సిపల్ పాత ఎస్ఎస్ ట్యాంక్‌లో పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వన్‌టౌన్ పోలీసులు తెలిపిన మేరకు... మెయిన్‌రోడ్డు మున్సిపల్ ఆఫీసు ఎదురుగా తోపుడు బండిని ఏర్పాటు చేసుకుని బొప్పాయికాయలను విక్రయిస్తూ జీవనాన్ని సాగిస్తున్న రవికుమార్‌కు భార్య సంధ్య, ఐదుగురు పిల్లలున్నారు. 9వ తేదీ (శనివారం) భార్యతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయిన రవికుమార్ మంగళవారం ఉదయం పాత రిజర్వాయర్‌లో శవమై తేలాడు. మున్సిపల్ వాటర్ వర్క్స్ సిబ్బంది నీటిలో తేలియాడుతున్న మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారమివ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని బయటకు తీయించి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మనోహర్ తెలియజేశారు. -
బలిపశువులను చేశారు
డాక్టర్ కావాలని లక్ష్యం పెట్టుకుని ప్రిపేర్ అయ్యాం. ‘నీట్’ పరీక్ష బాగా రాశాం. కీ ఆధారంగా మంచి స్కోరు వస్తుందని అంచనా వేశాం. సీటు వస్తుందని కలలు కంటున్న వేళ ప్రభుత్వం ‘నీట్’ను రద్దు చేసినట్లు ప్రకటించడం చాలా బాధ కలిగించింది. ఎక్కడో ప్రశ్నపత్రం లీక్ అయిందని దేశ వ్యాప్తంగా ఆ పరీక్ష రద్దు చేయటం మంచిది కాదు. ప్రభుత్వం చేసిన తప్పిదానికి విద్యార్థులను బలిపశువులను చేశారు. ఇదెక్కడి న్యాయం? – వడుగూరు అర్షియా, పెద్దవడుగూరు -
డిజిటైడ్లో ఉద్యోగావకాశాలు
పుట్టపర్తి అర్బన్: హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఐటీ సంస్థ డిజిటైడ్ పూల్ డ్రైవ్ నిర్వహిస్తోందని, అర్హత కలిగిన అభ్యర్థులు సద్విని యోగం చేసుకోవాలని పుట్టపర్తి సంస్కృతీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ విజయ్ భాస్కర్‌రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇంటర్, డిగ్రీ, బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈనెల 15న కళాశాలలో సంప్రదించాలన్నారు. ముందస్తుగా 9100974544 ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. అభ్యర్థులు హైదరాబాద్‌లో పని చేయాల్సి ఉంటుందన్నారు. యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. నాణ్యతకు ప్రతిరూపం భారతి సిమెంట్ ధర్మవరం: నాణ్యత, మన్నికకు ప్రతిరూపం భారతి సిమెంట్ అని కంపెనీ టెక్నికల్ హెడ్ ఓబుళరెడ్డి తెలిపారు. ధర్మవరంలో మంగళవారం భారతి సిమెంట్ డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతి సిమెంట్ రోబోటిక్ టెక్నాలజీతో తయారవుతుందని వివరించారు. అత్యుత్తమ ప్రమాణాలు పాటించి ప్రజల విశ్వాసాన్ని పొందిందన్నారు. కార్యక్రమంలో భారతి సిమెంట్ మార్కెటింగ్ మేనేజర్ ప్రతాప్‌రెడ్డి, టెక్నికల్ ఇంజనీర్ మోతీలాల్‌నాయక్, డీలర్ చాంద్‌భాష, పలువురు డీలర్లు పాల్గొన్నారు. ఆలయంలో చోరీ కదిరి అర్బన్: మండల పరిధిలోని యర్రదొడ్డి గంగమ్మ ఆలయంలో మంగళవారం చోరీ జరిగింది. అమ్మవారి కిరీటం, రెండు గొడుగులను భక్తుని అవతారంలో వచ్చిన దొంగ అపహరించాడు. దుండగుడు కారులో వచ్చి మరీ దొంగ తనం చేయడం గమనార్హం. చోరీ విషయమై రూరల్ అప్‌గ్రేడ్ పోలీస్టేషన్లో సిబ్బంది, అర్చ కులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాలుడి మృతదేహం లభ్యం గుమ్మఘట్ట: మండలంలోని బైరవానితిప్ప ప్రాజెక్టులో అదృశ్యమైన బాలుడి మృతదేహం మంగళవారం లభ్యమైంది. వివరాలిలా ఉన్నాయి.. తాళ్లకెరకు చెందిన మారెన్న, సుమక్క దంపతులకు కుమారుడు ఉమేష్ (14), ముగ్గురు కుమార్తెలున్నారు. వారు గొర్రెలు మేపుకుని జీవనం సాగించేవారు. తండ్రికి తోడుగా ఉమేష్ గొర్రెలు మేపేందుకు సోమవారం గ్రామ సమీపంలోని బీటీపీ రిజర్వాయర్ దగ్గరకు వెళ్లాడు. సాయంత్రం 4 గంటల సమయంలో రిజర్వాయర్‌లోని ఓ గుంతలోకి ఉమేష్ ఈతకు వెళ్లాడు. ఈత రాకపోవడంతో నీటిలో మునిగి గల్లంతయ్యాడు. ఆలస్యంగా గమనించిన తండ్రి నీటిలో గాలించినా ఫలితం లేకుండా పోయింది. మంగళవారం మృతదేహాన్ని వెలికితీసిన పోలీసులు కుటుంబసభ్యులకు అందజేశారు. ఒక్కగానొక్క కుమారుడు కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో తల్లిదండ్రుల ఆవేదన వర్ణనాతీతంగా మారింది. -
అర్హులకు అందే పరిస్థితి లేదు
సబ్సిడీ ట్రాక్టర్ల పథకం కోసం రైతులు రెండేళ్లుగా ఎదురుచూస్తున్నారు. అయితే చందబ్రాబు ప్రభుత్వం అరకొర నిధులు మంజూరు చేసింది. అంతేకాకుండా పథకం అమలుకు అలవిగాని నిబంధనలు పెట్టింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అడిగిన వారందరికీ సబ్సిడీతో ట్రాక్టర్లు మంజూరు చేసింది. ట్రాక్టర్ పంపిణీ చేసే రోజే సబ్సిడీ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసింది. కానీ ప్రస్తుత నిబంధనల పేరుతో అర్హులకు అందకుండా చేస్తున్నారు. – దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, పుట్టపర్తి నిబంధనల మేరకు మంజూరు ప్రభుత్వ నిబంధనల మేరకు సబ్సిడీ ట్రాక్టర్లు, యంత్రాలు అందజేస్తాం. అర్హులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే లాటరీ తీసి జాబితా సిద్ధం చేస్తారు. అనంతరం జిల్లా ఇన్చార్జ్ మంత్రి ఆమోదంతో పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుంది. మే నెల చివరి నాటికి యంత్రాలు అందజేసినా సబ్సిడీ మొత్తం జూలై నెలలో అందజేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. – కృష్ణయ్య, జిల్లా వ్యవసాయాధికారి -
సోమందేపల్లి చెరువులో మట్టి తోడేళ్లు
పెనుకొండ(సోమందేపల్లి): సోమందేపల్లి చెరువులో మట్టి తోడేళ్లు పడ్డాయి. అక్రమంగా మట్టి తరలించేస్తూ సొమ్ము చేసుకుంటున్నాయి. 15 రోజులుగా మట్టి దోపిడీ నిరాటంకంగా సాగుతోంది. కొందరు టీడీపీ నాయకులు అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఎలాంటి అనుమతులు తీసుకోకుండా మట్టిని తరలిస్తుండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు ‘మామూలు’గా పోతుండడంపై స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. క్షేత్రస్థాయి సర్వేలో పారదర్శకత పాటించాలి ● డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ప్రశాంతినిలయం: జిల్లాలో అర్బన్ ఫ్రేమ్ సర్వే (యూఎఫ్ఎస్), గణాంకాల సేకరణలో పారదర్శకత పాటించాలని డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో కలెక్టర్ శ్యాంప్రసాద్‌తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలు, రిజర్వేషన్ల ఖరారులో పాటించాల్సిన విధివిధానాలపై సుదీర్ఘంగా చర్చించారు. రిజర్వేషన్ల ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ సువర్ణ, సీపీఓ విజయ్‌కుమార్, డీపీఓ సమత, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. టన్ను మామిడి రూ.40 వేలు అనంతపురం అగ్రికల్చర్: స్థానిక కక్కలపల్లి మార్కెట్లో సోమవారం టన్ను మామిడి గరిష్టంగా రూ.40 వేలు పలికినట్లు రాప్తాడు మార్కెట్ కమిటీ సెక్రటరీ రూప్‌కుమార్ తెలిపారు. మార్కెట్‌కు 183 టన్నులు అమ్మకానికి రాగా, వాటిని వేలం వేశామన్నారు. అందులో బేనీషా రకం మామిడి టన్ను గరిష్టంగా రూ.40 వేలు, కనిష్టంగా రూ.15 వేలు, సరాసరిన రూ.24 వేల ప్రకారం ధర పలికాయన్నారు. మల్లికా రకం మామిడి టన్ను గరిష్టంగా రూ.40 వేలు, కనిష్టంగా రూ.20 వేలు, సరాసరిన రూ.30 వేల ప్రకారం ధర పలికాయన్నారు. అలాగే తోతాపురి రకం మామిడి టన్ను గరిష్టంగా రూ.20 వేలు, కనిష్టంగా రూ.10 వేలు, సరాసరిన రూ.15 వేల ప్రకారం క్రయ విక్రయాలు జరిగినట్లు వెల్లడించారు. ధర్మవరం ఆర్టీసీ డిపోలో డ్రైవర్లకు ఉద్యోగావకాశాలు ధర్మవరం అర్బన్: ధర్మవరం ఆర్టీసీ డిపోలో ఆన్ కాల్ డ్రైవర్లుగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు ఆర్టీసీ డీఎం సత్యనారాయణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రోజు వేతనం ప్రాతిపదికన పనిచేసేందుకు హెవీ లైసెన్స్ కలిగి ఉండి అనుభవం కలిగిన డ్రైవర్లు అర్హులన్నారు. ఒరిజినల్ సర్టిఫికెట్లు, లైసెన్సుతో ఆర్టీసీ డిపోలోని మేనేజర్ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. ఖాళీలు పరిమితంగా ఉండటంతో ముందుగా వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. -
వంట ఏజెన్సీలకు ‘స్మార్ట్’ మంట
కదిరి: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం వేడివేడి భోజనం వండి.. వడ్డించి విద్యార్థుల ఆకలి తీరుస్తున్న మధ్యాహ్న బోజన పథకం కార్మికులపై చంద్రబాబు ప్రభుత్వం స్మార్ట్‌గా వేటు వేస్తోంది. స్మార్ట్ కిచెన్ల పేరుతో వారి ఉపాధికి గండి కొట్టే చర్యలు చేపట్టింది. ఇందుకు సంబంధించి జిల్లాలోనూ ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. జిల్లాలో స్మార్ట్ కిచెన్లు అందుబాటులోకి వస్తే 1,500 మంది మధ్యాహ్న భోజన ఏజెన్సీల కార్మికులు రోడ్డున పడనున్నారు. గరిష్టంగా 30 పాఠశాలలకు ఒకటి మండల కేంద్రాల్లో ఒకట్రెండు స్మార్ట్ కిచెన్లు ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఆ మండలంలోని అన్ని పాఠశాలలకు మధ్యాహ్న భోజనం సరఫరా చేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో స్మార్ట్ కిచెన్ నిర్మాణానికి రూ.55 లక్షలు ఖర్చు చేయనుంది. వీటి నిర్మాణంతో పాటు నిర్వహణ బాధ్యతలు కూడా టీడీపీ కార్యకర్తలకే అప్పగించాలని భావిస్తోంది. ఇప్పటికే వైఎస్సార్ కడప జిల్లాలో ప్రయోగాత్మకంగా 4 స్మార్ట్ కిచెన్లు నిర్వహిస్తున్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని, స్మార్ట్ కిచెన్ల ఏర్పాటుకు స్థల పరిశీలన చేయాలని ఇటీవల కలెక్టర్ల సమావేశంలో విద్యాశాఖామంత్రి లోకేష్ ఆదేశించారు. వేడి భోజనం ఇక లేనట్లే! జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు 1,159, ప్రాథమికోన్నత పాఠశాలలు 230, ఉన్నత పాఠశాలలు 307 ఉన్నాయి. వీటి పరిధిలో 1,27,104 మంది విద్యార్థులున్నారు. వీరికి 1,438 భోజనం ఏజెన్సీల ద్వారా అప్పటికప్పుడు ఆయా పాఠశాలల్లోనే వేడివేడి భోజనం వండి పెడుతున్నారు. భోజనం నాణ్యతను సైతం అక్కడున్న టీచర్లు రోజూ పరిశీలిస్తున్నారు. కానీ మండల కేంద్రంలో స్మార్ట్ కిచెన్లు ఏర్పాటు చేస్తే అక్కడ సిద్ధం చేసిన భోజనాన్ని 5 నుంచి 10 కి.మీ పరిధిలో సగటున 30 పాఠశాలలకు ప్రత్యేక వాహనంలో చేరవేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో భోజనం కోసం విద్యార్థులకు పడిగాపులు తప్పవనిపిస్తోంది. చివరి పాఠశాలకు అందేసరికి వేడి భోజనం కాస్తా చల్లారి పోతుంది. అలాగే నాణ్యతపై ప్రశ్నించే అధికారం కూడా టీచర్లకు ఉండకపోవచ్చు. భవిష్యత్‌లో పాఠశాలలకే కాకుండా అంగన్వాడీ కేంద్రాలు, కళాశాలలతో పాటు హాస్టళ్లకూ స్మార్ట్ కిచెన్ల నుంచే భోజనం సరఫరా చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. బడుల రూపురేఖలు మార్చేసిన వైఎస్ జగన్ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ‘జగనన్న గోరుముద్ద’ పేరుతో మధ్యాహ్న భోజన పథకాన్ని అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పటిష్టంగా అమలు చేశారు. పిల్లలకు పోషకాలతో కూడిన రుచికరమైన భోజనాన్ని అందించారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ బడులను నిర్వీర్యం చేసే పనిలో పడింది. ఇప్పటికే చాలా మంది పిల్లలు సర్కారు బడి వీడి, ప్రైవేటు, కార్పొరేట్ బాట పట్టారు. ఇలాంటి తరుణంలో స్మార్ట్ కిచెన్ల పేరుతో మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికుల పొట్ట కొట్టే చర్యలకు ప్రభుత్వం దిగడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలోని పాఠశాలలు 2,078 మధ్యాహ్న భోజన ఏజెన్సీలు 1,438 విద్యార్థుల సంఖ్య 1,27,104 ఉపాధ్యాయుల సంఖ్య 8,307 పార్టీ కార్యకర్తలకు లబ్ధి చేకూరేలా బాబు ‘స్మార్ట్’ ఆలోచన జిల్లాలో తొలివిడతలో 10 స్మార్ట్ కిచెన్లకు ప్రతిపాదనలు ఒక్కొక్కటి రూ.55 లక్షలతో ఏర్పాటు జిల్లాలో రోడ్డున పడనున్న 1,500 మంది కార్మికులు త్వరలో మధ్నాహ్న భోజన ఏజెన్సీలకు మంగళం గోరంట్ల మండలంలోని ఒక ఎంపీపీ స్కూల్లో 23 మంది విద్యార్థులున్నారు. అక్కడ పిల్లలకు ఓ వితంతు మహిళ మధ్యాహ్న భోజనం వండి పెట్టగా వచ్చిన డబ్బుతో తన ఇద్దరు పిల్లలను చదివిస్తోంది. చంద్రబాబు సర్కారు స్మార్ట్ కిచెన్లు ఏర్పాటు చేస్తే ఆమెను ఆ బాధ్యతల నుంచి తప్పిస్తారు. అప్పుడు ఆమె జీవనం దుర్భరంగా మారనుంది. ఈ పరిస్థితి కేవలం ఆమె ఒక్కరిదే కాదు... చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న ‘స్మార్ట్ కిచెన్’ నిర్ణయంతో జిల్లా వ్యాప్తంగా ఎంతోమంది కార్మికులు రోడ్డున పడనున్నారు. -
వాహనం ఢీకొని జింక మృతి
పెనుకొండ: స్థానిక యోగా నరసింహస్వామి ఆలయం సమీపంలో 44వ జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ జింక మృతి చెందింది. సోమవారం ఉదయం అటుగా వెళ్లిన వారు గుర్తించి సమాచారం ఇవ్వడంతో ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరెడ్డి, అధికారులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. రెండు రోజల క్రితం రోడ్డు దాటుతున్న జింకను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మృతి చెంది ఉంటుందని ప్రాథమికంగా నిర్ధారించారు. రోడ్డు పక్కనే పోస్టుమార్టం నిర్వహించి జింక కళేబరాన్ని దహనం చేశారు. ప్రమాదంలో అటవీశాఖ ఉద్యోగికి తీవ్ర గాయాలుధర్మవరం రూరల్: మండలంలోని పోతుకుంట వద్ద చోటు చేసుకున్న ప్రమాదంలో అటవీశాఖ ఉద్యోగి బి.హనుమంతరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. సోమవారం మధ్యాహ్నం విధులు ముగించుకుని స్వగ్రామమైన మామిళ్లపల్లికి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా మార్గం మధ్యలో పోతుకుంట వద్ద ఆటో ఢీకొంది. ప్రమాదంలో కాలు పూర్తిగా విరిగింది. మూగదెబ్బలు తగిలాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది అక్కడకు చేరుకుని క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ధర్మవరంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించింది. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి వైద్యులు రెఫర్ చేశారు. ఘటనపై ధర్మవరం రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గుర్తుతెలియని వ్యక్తి మృతదేహంధర్మవరం అర్బన్: స్థానిక ప్రభుత్వాస్పత్రి ఎదుట ఉన్న కోటా స్కూల్ వద్ద తోపుడు బండిపై ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని సోమవారం ఉదయం అటుగా వెళ్లిన వారు గుర్తించారు. సమాచారం అందుకున్న వన్‌టౌన్ పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. సదరు వ్యక్తి బేల్దారి పనులకు వెళ్లి రాత్రి ఆస్పత్రి పరిసర ప్రాంతాల్లో నిద్రిస్తుండేవాడని ప్రాథమికంగా నిర్ధారించారు. ఇన్ఫెక్షన్ కారణంగా కాలు మొత్తం వాచిపోయి చీము కారుతోంది. జీవించి ఉన్నప్పుడు తన పేరు కిష్టప్ప అని, కొత్త చెరువు గ్రామమని స్థానికులకు తెలిపినట్లుగా సమాచారం. మృతుని పూర్తి వివరాలు తెలియకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు ధర్మవరం వన్‌టౌన్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. జాతీయ కుస్తీ పోటీలకు ఎంపికఅనంతపురం టౌన్: జాతీయ స్థాయి కుస్తీ పోటీలకు ఉమ్మడి జిల్లా నుంచి ముగ్గురు క్రీడాకారులు ఎంపికయ్యారు. ఇటీవల గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీల్లో పామిడి మండలం గజరాంపల్లికి చెందిన నల్లబోతుల వాణి, రాఘవేంద్ర, శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం నాగినాయని చెరువు తండాకు చెందిన నవీన్‌నాయక్ ప్రతిభ చాటి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి పాండురంగారావు, అనంతపురం డీఎస్డీఓ మంజుల అభినందించారు. -
అదనపు అతిథి గృహం ఏర్పాటు చేయండి
లేపాక్షి: పర్యాటక కేంద్రమైన లేపాక్షిలో ఏపీ టూరిజం శాఖ ఆధ్వర్యంలో అదనపు అతిథి గృహం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని విజయవాడలో సోమవారం జరిగిన టూరిజం సమావేశంలో టూరిజం డైరెక్టర్ జయప్ప సూచించారు. ప్రస్తుతమున్న అతిథి గృహంలోని 10 గదులు పర్యాటకులకు సరిపోవని, దీంతో పర్యాటకులు హిందూపురం, బాగేపల్లి ప్రాంతాలకు వెళ్లి బస చేస్తున్నారని వివరించారు. మరో 10 గదులు ఏర్పాటు చేయాలని విన్నవించారు. దీనిపై అధికారులు మాట్లాడుతూ.. ప్రస్తుతానికి ఎనిమిది గదుల నిర్మాణానికి నిధులు విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. దీనిపై డైరెక్టర్ జయప్ప మాట్లాడుతూ.. పక్కనే నంది విగ్రహం ఉండడంతో గదుల నిర్మాణానికి పురావస్తు శాఖ అధికారులు అనుమతులు ఇవ్వడం లేదన్నారు. అయితే టూరిజం గెస్ట్ హౌస్ వెనుక భాగంలో అదనపు గెస్ట్ హౌస్ నిర్మించేందుకు అనువైన స్థలం ఉందని తెలిపారు. దీనిపై సానుకూలంగా స్పందించిన చైర్మన్ డాక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. త్వరలో స్థలాన్ని పరిశీలించి పర్యాటకులకు అనుకూలంగా మంచి గదుల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని హామీనిచ్చారు. సమావేశంలో ఈడీ పద్యావతి, డైరెక్టర్లు పాల్గొన్నారు. పర్యాటక శాఖ చైర్మన్‌కు ౖ డెరెక్టర్ జయప్ప వినతి -
ఏసీబీ వలలో నగర పాలక ఉద్యోగులు
అనంతపురం క్రైం: అవినీతి నిరోధక శాఖ అధికారుల ఉచ్చులో అనంతపురం నగర పాలక సంస్థ ఉద్యోగులు చిక్కుకున్నారు. ఎగ్జిబిషన్ నిర్వాహకుడి నుంచి లంచం తీసుకుంటూ నగరపాలక సంస్థ ఇన్చార్జ్ ఎంహెచ్ఓ బీఎల్ నరసింహులు, జూనియర్ అసిస్టెంట్ సందీప్‌చౌత సోమవారం అడ్డంగా దొరికిపోయారు. ఏసీబీ డీఎస్పీ ప్రసాదరెడ్డి తెలిపిన మేరకు... అనంతపురంలోని గుత్తి మార్గంలో భారత్ ట్రేడర్స్ పేరుతో రఘుప్రసాదరావు ఎగ్జిబిషన్ నిర్వహణకు అనుమతులు కోరుతూ నగరపాలక సంస్థలో దరఖాస్తు చేసుకున్నాడు. అయితే శానిటరీ సర్టిఫికెట్ జారీకి నగర పాలక సంస్థ అధికారులు రూ.30 వేలు డిమాండ్ చేయడంతో అంత మొత్తం తన వల్ల కాదని, చివరకు రూ.25 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే లంచం ఇవ్వడం ఇష్టం లేని అతను ఈ విషయాన్ని ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. వారి సూచన మేరకు సోమవారం ఉదయం రూ.25 వేలు ఇచ్చేందుకు జూనియర్ అసిస్టెంట్ సందీప్చౌతాకు ఫోన్ చేయగా... నగర పాలక సంస్థ సమీపంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద వేచి ఉండాలని తెలిపాడు. ఆ తర్వాత డ్వామా కార్యాలయం వద్దకు రమ్మని తెలిపాడు. దీంతో రఘుప్రసాద్ డ్వామా కార్యాలయం వద్దకెళ్లి అక్కడ వేచి ఉన్న సందీప్‌కు రూ.25 వేలు ఇస్తుండగా... అప్పటికే అక్కడ కాపుకాసిన అనంతపురం–కర్నూలు ఏసీబీ బృందాలు మెరుపు దాడి చేసి పట్టుకున్నాయి. సందీప్‌ను అదుపులోకి తీసుకుని నగదు స్వాధీనం చేసుకున్నారు. దీంతో తాను లంచం డిమాండ్ చేయలేదని ఇన్చార్జ్ ఎంహెచ్ఓ నరసింహులు సూచన మేరకే డబ్బు తీసుకున్నానని సందీప్ తెలిపాడు. దీంతో ఏసీబీలోని మరో బృందం నగరపాలక సంస్థ కార్యాలయంలోని ఇన్చార్జ్ ఎంహెచ్ఓ చాంబర్‌కు వెళ్లి నరసింహులును అదుపులోకి తీసుకున్నారు. ఇళ్లలోనూ సోదాలు ఇన్చార్జ్ ఎంహెచ్ఓ బీఎల్ఓ నరసింహులు ఫ్లాట్‌తో పాటు అనంతపురంలోని పాతూరులో ఉన్న సందీప్ చౌతా నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో స్థిర, చరాస్తులకు సంబంధించిన పలు పత్రాలు, కొంత నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇదే క్రమంలో ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ అధికారి, ఉద్యోగికి సంబంధించిన ఫోన్‌పే నంబర్లు కూడా పరిశీలించారు. వారి ఫోన్‌పేలకు చాలా మంది కాంట్రాక్టర్లు నగదు బదిలీ చేసినట్లు గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసి ఇద్దరినీ అరెస్ట్ చేసి కర్నూలు ఏసీబీ కోర్టుకు తరలించారు. సార్ కొత్తగా పైళ్లెంది ఏసీబీ అధికారులకు దొరికిపోగానే జూనియర్ అసిస్టెంట్ సందీప్ చౌతా తప్పించుకోవాలని తీవ్రస్థాయిలో ప్రయత్నించాడు. ఎక్కడ తన చేతులు కడిగిస్తారోనని పదే పదే చేతులను తన చొక్కాకు, ప్యాంటుకు తుడుచుకున్నాడు. చివరికి ఏసీబీ అధికారులు తమదైన శైలిలో కౌన్సెలింగ్ ఇవ్వగానే ఏడుపు మొదలెట్టాడు. ‘సార్...ఈ మధ్యే నాకు పైళ్లెంది. నన్ను అరెస్ట్ చేస్తే నా జీవితం నాశనమవుతుంది సార్’ అంటూ లబోదిబోమన్నాడు. ఇన్చార్జ్ ఎంహెచ్ఓ తీసుకోమంటేనే డబ్బు తీసుకున్నానంటూ గగ్గోలు పెట్టాడు. నేనేమైనా ఉగ్రవాదినా? కాంట్రాక్టర్లు, కొందరు మీడియా ప్రతినిధులు, ఇన్చార్జ్ ఎంహెచ్ఓ సిబ్బంది అందరూ ఉండగానే నరసింహులు చాంబర్లోకి ఏసీబీ అధికారులు దూసుకెళ్లారు. బీఎల్ నరసింహులు అంటే మీరేనా అంటూ ఆరా తీసి ఏసీబీ అని చెప్పిన అధికారులు అతని సెల్‌ఫోన్ లాక్కొన్నారు. ఆ సమయంలో ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ నేనేమైనా ఉగ్రవాదినా అంటూ ఎదురు తిరిగే ప్రయత్నం చేశారు. తీరా సందీప్‌చౌతా గురించి అడగగానే తెల్లమొహం వేశారు. ఎగ్జిబిషన్ నిర్వాహకుడి నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం శానిటరీ సర్టిఫికెట్ జారీకి రూ.25 వేలు డిమాండ్ -
వినూత్నంగా సత్యసాయి కార్మికుల నిరసన
బత్తలపల్లి: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సత్యసాయి తాగునీటి పథకం కార్మికులు అర్ధనగ్న ప్రదర్శనతో సోమవారం ఏడవ రోజు నిరవధిక సమ్మె కొనసాగించారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ జిల్లాలో ప్రజల దాహార్తి తీరుస్తున్న పథకానికి బడ్జెట్లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఐదు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలు చెల్లించాలన్నారు. సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతోనే సమ్మె చేస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి తమ డిమాండ్లను నెరవేర్చి సమ్మెను విరమింపజేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. అంతకు ముందు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమంలో బత్తలపల్లి, తాడిమర్రి, అప్పరాచెరువు సత్యసాయి తాగునీటి పథకం కార్మికులు పాల్గొన్నారు. -
పుట్టపర్తిని హరిత నగరంగా తీర్చిదిద్దుదాం
పుట్టపర్తి టౌన్: జిల్లా కేంద్రమైన పుట్టపర్తిని హరిత నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్‌కుమార్ పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా సోమవారం పుట్టపర్తిలో అటవీశాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్‌కుమార్, ఎమ్మెల్యే సింధూరారెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. గణేష్ కూడలి నుంచి ఫైర్ స్టేషన్ కార్యాలయం వరకు అధికారులు, విద్యార్థులతో కలసి 330 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో మొక్కల పాత్ర చాలా కీలకమన్నారు. జిల్లా వ్యాప్తంగా అటవీ విస్తీర్ణాన్ని పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. పట్టణ ప్రజలు, అధికారులు, విద్యార్థులు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు. మొక్కలకు మనం రక్షణ ఇస్తే అవి మనకు రక్షణ ఇస్తాయన్నారు. అధికారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కలు నాటడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో డీఎఫ్ఓ చక్రపాణి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు, డీఈఓ కిష్టప్ప తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్‌కుమార్ -
నేడు పామిడికి వైఎస్ జగన్
పామిడి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం పామిడికి విచ్చేయనున్నారు. ఏడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ పామిడి వీరాంజనేయులు కుమార్తె ఏడీసీసీ బ్యాంకు మాజీ చైర్పర్సన్ ఎం. లిఖిత వివాహ రిసెప్షన్‌కు హాజరు కానున్నారు. ఉదయం 10 గంటలకు వైఎస్ జగన్ బెంగళూరు నుంచి హెలికాప్టర్లో బయల్దేరి 11.10 గంటలకు పామిడిలోని హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. 11.20 గంటలకు హెలీప్యాడ్ నుంచి బయల్దేరి 11.35 గంటలకు రిసెప్షన్ వేదిక వద్దకు చేరుకుంటారు. 11.50 గంటల వరకు రిసెప్షన్లో పాల్గొని నూతన వధూవరులు ఎం.లిఖిత, ఎ.చైతన్యమిత్రను ఆశీర్వదించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు పామిడి నుంచి హెలికాప్టర్లో తిరుగుపయనమవుతారు. హెలీప్యాడ్ సిద్ధం వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో పామిడి – కల్లూరు మార్గంలో ఉన్న పామిడి వీరా ఫంక్షన్ హాలు వద్ద హెలీప్యాడ్ ఏర్పాటు చేశారు. హెలీప్యాడ్ ప్రాంతాన్ని సోమవారం సాయంత్రం వైఎస్సార్సీపీ రాష్ట్ర నాయకులు ఆలూరు సాంబశివారెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదన్, ఏడీసీసీబీ మాజీ చైర్మన్ పామిడి వీరాంజనేయులు పరిశీలించారు. అలాగే పామిడి వీరాంజనేయులు గృహ సమీపంలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ వేదికను కూడా పరిశీలించారు. వారితో పాటు గుంతకల్లు డీఎస్పీ శ్రీనివాస్, పామిడి సీఐ శివశంకర్‌నాయక్ హెలిప్యాడ్, రిసెప్షన్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
అత్యవసర సేవల్లో ‘రక్షక్’ కీలకం
పెనుకొండ రూరల్: ప్రజలకు అత్యవసర సేవలు అందించడంలో రక్షక్ వాహనాలు కీలకపాత్ర పోషిస్తాయని ఎస్పీ సతీష్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం మండలంలోని కియా పోలీస్ స్టేషన్‌కు సంఘు హైటెక్ కంపెనీ వారు సీఎస్ఆర్ నిధులతో రక్షక్ వాహనాన్ని అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణకు ‘రక్షక్’ వాహనాలు ఉపయోగపడతాయన్నారు. కియా యాజమాన్యం జిల్లాలోని పలు పోలీసుస్టేషన్లకు సీఎస్ఆర్ నిధులతో వాహనాలు అందించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో సంఘూ హైటెక్ పరిశ్రమ ప్రతినిధులు చున్సీబ్ కిమ్, డీఎస్పీ నరసింగప్ప, సీఐ రాఘవన్, ఎస్ఐలు రాఘవయ్య, రాజేష్, వెంకటేశ్వర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. అర్జీలు పునరావృతం కానీయొద్దు పుట్టపర్తి టౌన్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అర్జీలు పునరావృతమైతే చర్యలు తప్పవని పోలీస్ అధికారులను ఎస్పీ సతీష్‌కుమార్ హెచ్చరించారు. సోమవారం పుట్టపర్తి పోలీస్ కార్యాలయంలోని ఎస్పీ చాంబర్లో ‘ప్రజాసమస్యల పరిష్కారి వేదిక’ నిర్వహించారు. వివిధ సమస్యలపై 61 వినతులు అందాయి. ఎస్పీ సతీష్ కుమార్ స్వయంగా దివ్యాంగుల వద్దకు వెళ్లి వినతులు స్వీకరించి బాధితులతో ముఖాముఖి మాట్లాడారు. సమస్యలు ఓపికగా విని సంబంధిత పోలీస్ అధికారులకు ఫోన్ చేసి సూచనలు చేశారు. సమస్య తీవ్రతను తెలుసుకొని చట్టపరిధిలో విచారించి పరిష్కారం చూపాలన్నారు. ఫిర్యాదుదారులతో మర్యాద పూర్వకంగా మాట్లాడాలన్నారు. కార్యక్రమంలో సీఐ బొజ్జప్ప, డీటీఆర్సీ సీఐ లక్ష్మీకాంత్‌రెడ్డి, లీగల్ అడ్వైజర్ సాయినాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కేంద్ర రక్షణ మంత్రి పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు
ప్రశాంతి నిలయం: కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 15న పుట్టపర్తిలో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లు పటిష్టంగా ఉండాలని సంబంధిత అధికారులను కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశించారు. బ్రాహ్మణపల్లి సమీపంలో ఏర్పాటు చేస్తున్న సభా స్థలిని సోమవారం కలెక్టర్ పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. సీఎం, కేంద్ర మంత్రి పర్యటనలో ఎలాంటి లోటు పాట్లు తలెత్తరాదన్నారు. హెలీప్యాడ్ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేయాలని ఆర్అండ్బీ అధికారులకు సూచించారు. హెలీప్యాడ్ నుంచి రూట్ మ్యాప్‌లను పక్కాగా సిద్దం చేయాలన్నారు. నిరంతర విద్యుత్, సౌండ్ సిస్టం, ఎల్ఈడీ స్క్రీన్లు, ఏర్పాటు చేయాలన్నారు. శానిటేషన్ నిర్వహణపై ప్రత్యేక శ్రద్ద చూపాలన్నారు. ప్రజల రాకపోకలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. సమావేశంలో జేసీ మౌర్య భరద్వాజ్, ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, అన్ని శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
కంటితుడుపు జీఓలు వద్దు
అనంతపురం అగ్రికల్చర్: కంటితుడుపు జీఓలు కాకుండా న్యాయబద్ధమైన జీఓ ఇచ్చే వరకూ ఆందోళన కొనసాగిస్తామంటూ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) ఉద్యోగులు తేల్చిచెప్పారు. పీఏసీఎస్ ఉద్యోగులకు అన్యాయం చేస్తూ ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జీఓ 322 ప్రతులను ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో సోమవారం దగ్ధం చేసే కార్యక్రమం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొనసాగింది. సీఐటీయూ, రైతు సంఘం నాయకులు సంఘీభావం తెలిపారు. రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి అచ్చెన్నాయుడుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతపురంలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) ప్రధాన కార్యాలయంతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న సహకార బ్యాంకుల ఎదుట చేపట్టిన నిరసన కార్యక్రమంలో జీఓ 322 ప్రతులు దగ్ధం చేసే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పీఏసీఎస్ ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసులు, అసోసియేట్ ప్రెసిడెంట్ పి.హనుమంతరెడ్డి, కోశాధికారి ఎం.హనుమంతరెడ్డి తదితరులు మాట్లాడుతూ... తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు జేఏసీ పిలుపు మేరకు గత ఫిబ్రవరిన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సమ్మె చేపట్టామని గుర్తు చేశారు. ఆ సమయంలో దిగివచ్చిన ప్రభుత్వం న్యాయం చేస్తామని హామీ ఇచ్చి.. నేడు కంటితుడుపుగా జీఓ 322 విడుదల చేసి అన్యాయం చేసిందని మండిపడ్డారు. ఈ జీఓలో ఎక్కడేగానీ ఉద్యోగులకు న్యాయం చేకూరే అంశం కనిపించడం లేదన్నారు. తమకు న్యాయం జరిగేలా మరో జీఓ విడుదల చేసే వరకూ వివిధ రూపాల్లో ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. న్యాయబద్ధమైన జీఓ ఇచ్చే వరకూ ఆందోళన ధర్నాలో పీఏసీఎస్ ఉద్యోగులు -
విద్యార్థికి కలెక్టర్ అభినందన
ప్రశాంతి నిలయం: అంగ వైకల్యాన్ని జయించి ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను అధిరోహించిన విద్యార్థిని కలెక్టర్ శ్యాం ప్రసాద్ అభినందించారు. ఏపీ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నిర్వహించిన అడ్వెంచర్ స్పోర్ట్స్ కార్యక్రమంలో భాగంగా 25 మంది విద్యార్థుల బృందం గత నెల 25న 5,364 మీటర్ల ఎత్తులో ఉన్న బేస్ క్యాంప్‌ను చేరుకుని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వీరిలో జిల్లాలోని తనకల్లుకు చెందిన పసల ప్రసాద్ ఉన్నారు. తిరిగి వచ్చిన ప్రసాద్ సోమవారం కలెక్టర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఆ సమయంలో శాలువా కప్పి కలెక్టర్ సత్కరించారు. కార్యక్రమంలో డీఈఓ కిష్టప్ప, స్పోర్ట్స్ కన్సల్టెంట్ కడపల శంకర్, పుల్లన్న తదితరులు ఉన్నారు. విద్యుదాఘాతంతో బాలుడి మృతికనగానపల్లి: విద్యుత్ షాక్‌కు గురై ఓ బాలుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన మేరకు.. కనగానపల్లి మండలం బద్ధలాపురం గ్రామానికి చెందిన మధుకుమార్గౌడ్ నూతన గృహ నిర్మాణం చేపట్టాడు. ఈ క్రమంలో ఇంటి పనులకు నీటి సరఫరా చేసేందుకు సింగిల్ ఫేజ్ మోటర్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. సోమవారం ఉదయం మధుకుమార్ గౌడ్ కుమారుడు చరిత్గౌడ్ (8) మోటార్ ఆన్ చేస్తుండగా షాక్‌కు గురై కుప్పకూలాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. హ్యాండ్లూమ్ టెక్స్టైల్ టెక్నాలజీలో ప్రవేశాలుఅనంతపురం కల్చరల్ : తిరుపతిలోని ప్రగడ కోటయ్య మెమోరియల్ ఇండియన్ ఇనిస్టిట్యూషన్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో హ్యాండ్లూమ్ టెక్స్టైల్ టెక్నాలజీలో ప్రవేశాలు చేపట్టనున్నారు. ఈ మేరకు జిల్లా చేనేత, జౌళీశాఖ అధికారి వరప్రసాద్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మూడేళ్ల డిప్లోమా కోర్సు అనంతరం ఉద్యోగ అవకాశాలతో పాటు పారిశ్రామిక వేత్తలుగా ఎదిగే అవకాశముంది. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన సర్టిఫికెట్లను అందజేస్తారు. మరింత సమాచారం కోసం 93999 36872, 90102 43054 లో సంప్రదించవచ్చు. ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలుపుట్టపర్తి అర్బన్: మండలంలోని మార్లపల్లి గంగమ్మ ఆలయం సమీపంలో చోటు చేసుకున్న ప్రమాదంలో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన మేరకు.. పెడపల్లికి చెందిన మక్తర్ అల్లుడు అల్లాబకాష్, సుబ్బరాయనిపల్లికి చెందిన శంకరప్ప కుమారుడు రమేష్ ఇద్దరూ సోమవారం రాత్రి 7.30 గంటలకు ద్విచక్ర వాహనంపై కియా పరిశ్రమకు బయలుదేరారు. మార్లపల్లి సమీపంలోకి చేరుకోగానే అదుపు తప్పి కిందపడడంతో తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళుతున్న వారు గుర్తించి వెంటనే ఆ మార్గంలో వెళుతున్న కారులో పెనుకొండలోని ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. -
53 గ్రామ పంచాయతీల్లో ‘వాల్టా’
అనంతపురం అగ్రికల్చర్: ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 53 గ్రామపంచాయతీల్లో ఆంధ్రప్రదేశ్ నీరు, భూమి, వృక్షముల చట్టం (వాల్టా–2002) అమలు చేయనున్నారు. ఈ పంచాయతీల పరిధిలో కొత్తగా బోరుబావుల తవ్వకాన్ని నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. అత్యవసరమైతే ఉన్నతాధికారుల అనుమతితో తాగునీటి అవవసరాల కోసం మాత్రమే బోరుబావుల తవ్వకం చేయాలంటూ జీఓలో పేర్కొన్నారు. వాల్టా పరిధిలోకి వచ్చిన గ్రామాల్లో అత్యధికంగా భూగర్భజలాలు, నీటి వినియోగం (ఓవర్ ఎక్స్‌ప్లాయిటెడ్) ఉన్నట్లు గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏడు జిల్లాల పరిధిలో 258 గ్రామ పంచా యతీలను ‘వాల్టా’ పరిధిలోకి తీసుకొచ్చారు. అందులో అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 91 గ్రామాలు ఉండగా.. శ్రీకాకుళంలో 76, శ్రీసత్యసాయి జిల్లాలో 39, పల్నాడులో 20, అనంతపురంలో 14, వైఎస్సార్ కడపలో 10, చిత్తూరు జిల్లాలో 8 చొప్పున మొత్తం 258 గ్రామ పంచాయతీల్లో ‘వాల్టా’ అమలు చేయాలని ఆదేశించారు. జిల్లా పరిధిలో గ్రామాలివే... అగళి మండలం హుళ్లికెరదేవరహళ్లి,నరసాంబూది, పి.బ్యాడిగెర, అమడగూరు మండలం కర్ణిరెడ్డిపల్లి, లోకోజిపల్లి, చిలమత్తూరు మండలం హుస్సేనాపురం, గాండ్లపెంట మండలం సామచేనుబైలు, చామాలగొంది, గాండ్లపెంట–1, జీనులకుంట, కురుమామిడి, మడుగువానిగొంది, సోమయాజుల పల్లి–1, గుడిబండ మండలం జి.మోరుబాగల్, కేకాతి, ఎస్.రాయాపురం హిందూపురం మండలం దేవరపల్లె–2, కిరికెర, కొట్నూరు, మణేసముద్రం, శ్రీకంఠాపురం రూరల్, ఎన్పీ కుంట మండలం ఎదురుదొన, గూటిబయలు, ముడుపలజూవి, రొద్దం మండలం చెరకూరు, రొళ్ల మండలం బొమ్మగుండనహళ్లి, దొడ్డేరి,కాకి,ఎం.రాయాపురం, రొళ్ల–1, తనకల్లు మండలం అగ్రహారంపల్లె, బాలసముద్రం–1, బొంతలపల్లె, చీకటిమానిపల్లి, దిగువమందలపల్లి, గుర్రంబయలు, కోటపల్లె, మద్దినాయనిపాలెం, టి.సదుం గ్రామ పంచాయతీలను ‘వాల్టా’ పరిధిలోకి చేర్చారు. కొత్తగా బోరుబావుల తవ్వకం నిషేధం శ్రీసత్యసాయి జిల్లాలో 39 గ్రామాలు -
కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ రద్దు
ప్రశాంతినిలయం: ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఈ సోమవారం రద్దు చేసినట్లు కలెక్టర్ శ్యాంప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. కొన్ని అనివార్య కారణాలతో కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు. అర్జీదారులు ఎవరూ సోమవారం కలెక్టరేట్‌కు రావద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలన్నారు. టన్ను మామిడి రూ.35 వేలుఅనంతపురం అగ్రికల్చర్: స్థానిక కక్కలపల్లి మార్కెట్లో ఆదివారంం టన్ను మామిడికాయలు గరిష్టంగా రూ.35 వేలు పలికినట్లు రాప్తాడు మార్కెట్ కమిటీ సెక్రటరీ రూప్‌కుమార్ తెలిపారు. మార్కెట్‌కు 40 టన్నులు అమ్మకానికి రాగా, వాటిని వేలం వేశారన్నారు. అందులో బేనీషా రకం మామిడి టన్ను గరిష్టంగా రూ.35 వేలు, కనిష్టంగా రూ.10 వేలు, సరాసరిన రూ.20 వేల ప్రకారం ధర పలికాయన్నారు. అలాగే హిమాయత్ రకం టన్ను గరిష్టంగా రూ.27 వేలు, కనిష్టంగా రూ.9 వేలు, సరాసరిన రూ.18 వేలు, మల్లికా రకం మామిడి టన్ను గరిష్టంగా రూ.17 వేలు, కనిష్టంగా రూ.8 వేలు, సరాసరిన రూ.11 వేల ప్రకారం క్రయ విక్రయాలు జరిగినట్లు మార్కెట్ కమిటీ సెక్రటరీ వెల్లడించారు. జాతీయస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు ఎంపికధర్మవరం అర్బన్: జాతీయస్థాయిలో జరిగే బాస్కెట్‌బాల్ పోటీలకు విద్యార్థిని కిరణ్మయి ఎంపికై నట్లు ఉమ్మడి అనంతపురం జిల్లా బాస్కెట్‌బాల్ అసోసియేషన్ అసోసియేట్ కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి తెలిపారు. స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఆదివారం విద్యార్థినిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 22 నుంచి 28వ తేదీ వరకూ పుదుచ్చేరి రాష్ట్రంలో జరిగే 76వ నేషనల్ జూనియర్ బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ బాలికల బాస్కెట్‌బాల్ జట్టుకు కిరణ్మయి ఎంపికై ందని పేర్కొన్నారు. చిత్తూరు నగరంలో ఈనెల 20 వరకూ జరిగే కోచింగ్ క్యాంపునకు విద్యార్థిని వెళ్తోందని చెప్పారు. జాతీయస్థాయిలో జరిగే పోటీల్లోనూ కిరణ్మయి ప్రతిభ చూపి ధర్మవరానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ధర్మాంబ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు మేడాపురం రామిరెడ్డి, కార్యదర్శి వాయల్పాడు హిదయతుల్లా తదితరులు పాల్గొన్నారు. హ్యాండ్‌బాల్ విజేత పశ్చిమ గోదావరి జట్టుకదిరి అర్బన్: పట్టణంలోని ఎస్టీఎస్ఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండు రోజులగా జరుగుతున్న 48వ రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ జూనియర్ బాలికలు, బాలుర చాంపియన్ షిప్ పోటీల్లో బాలికల విభాగంలో పశ్చిమ గోదావరి, బాలుర విభాగంలో చిత్తూరు జట్లు విజేతలుగా నిలిచాయి. బాలికల విభాగంలో ద్వితీయ స్థానంలో శ్రీసత్యసాయి జిల్లా, తృతీయ స్థానంలో విజయనగరం జిల్లా జట్టు నిలిచాయి. బాలుర విభాగంలో ద్వితీయ స్థానంలో శ్రీసత్యసాయి జిల్లా, తృతీయ స్థానంలో విజయనగరం జట్లు సాధించాయి. గెలుపొందిన జట్లకు చాంపియన్ ట్రోఫీని బహూకరించారు. -
కొండెక్కితే బాదుడే !
అబ్బుర పరిచే రహదారి.. కనువిందు చేసే కోట అందాలు.. ఆహ్లాద పరిచే వాతావరణం.. అందుకే పెనుకొండ కొండపైకి వెళ్లేందుకు ఉమ్మడి అనంతపురం వాసులే కాకుండా బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తుంటారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం తాజాగా టోల్ ట్యాక్స్ అంటూ కొండపైకి వెళ్లే వాహనదారుల నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తోంది. దీంతో పర్యాటక అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారుతోంది. సాక్షి, పుట్టపర్తి: ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన పెనుకొండ కోటకు పూర్వ వైభవం తెచ్చేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. ఇందులో భాగంగానే ఇక్కడ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. పెనుకొండ కొండపైకి వెళ్లేందుకు రూ.20 కోట్లు వెచ్చించి కొండపై వరకు రోడ్డు కూడా నిర్మించారు. ఇన్నాళ్లూ రూపాయి ఖర్చు లేకుండా పర్యాటకులు పెనుకొండ కోటను సందర్శించే వారు. అయితే తాజాగా అటవీశాఖ ఆధ్వర్యంలో టోల్గేట్ ఏర్పాటు చేయడంతో పర్యాటకుల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. మంత్రి సవిత ప్రాతినిథ్యం వహిస్తున్న పెనుకొండలో టోల్ బాదుడుపై ప్రజలు, పర్యాటకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వారంతంలో కిట కిట పెనుకొండ కోటను సందర్శించేందుకు ప్రతి శని, ఆదివారాల్లో ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచే కాకుండా బెంగళూరు నుంచి వేలాది మంది పర్యాటకులు బైక్‌లు, కార్లలో వస్తుంటారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొండపైకి రోడ్డు వేసినప్పటి నుంచి పర్యాటకుల సంఖ్య బాగా పెరిగింది. అంతకు ముందు వందల సంఖ్యలో వెళ్లే పర్యాటకులు రోడ్డు పూర్తయ్యాక వేల సంఖ్యకు చేరారు. అయితే తాజాగా టోల్ గేట్ ఏర్పాటు చేయడంతో పర్యాటకులు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని స్థానికులతో పాటు పర్యాటకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంత్రిగా ఉన్నప్పటికీ.. పెనుకొండ నుంచి గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన శంకరనారాయణ మంత్రిగా పని చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో అప్పట్లోనే పెనుకొండ కోట అభివృద్ధి చేయాలని భావించారు. ఈ క్రమంలో ప్రభుత్వంతో మాట్లాడి రూ.20 కోట్లు వెచ్చించారు. అయితే గతంలో సుంకం వసూలు చేయలేదు. కానీ పెనుకొండ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్న సవిత టోల్‌ను ఎందుకు ప్రోత్సహిస్తున్నారని పర్యాటకులు ప్రశ్నిస్తున్నారు. ప్రజలు, పర్యాటకుల గురించి ఆలోచించకుండా టోల్ ప్రారంభోత్సవంలోనూ పాల్గొనడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. మంత్రి సవిత ఇలాకాలో ‘టోల్’ దందా పెనుకొండ కొండపైకి వెళ్లే వాహనదారుల నుంచి టోల్ వసూలు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రూ.20 కోట్లతో అభివృద్ధి టోల్ వసూలుపై సర్వత్రా విమర్శలు టోల్ వసూలు దుర్మార్గం గత ప్రభుత్వంలోనే కొండపైకి రోడ్డు పెనుకొండ వాసులకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించడమే కాకుండా, వాణిజ్య, వ్యాపారంగా అభివృద్ధి చేసేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రయత్నించింది. పెనుకొండ కొండ రోడ్డు కారణంగా సందర్శకుల తాకిడి పెరిగింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం ప్రస్తుతం కొండపైకి వెళ్లే వాహనదారుల నుంచి టోల్ ట్యాక్స్ వసూలు చేయడం దుర్మార్గం. దీని వల్ల పర్యాటకుల సంఖ్య తగ్గిపోయే అవకాశం ఉంది. వెంటనే టోల్ ట్యాక్స్ వసూళ్లను రద్దు చేయాలి. – ఉషశ్రీచరణ్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు శ్రీకృష్ణదేవరాయలు పాలించిన పెనుకొండను పర్యాటక ప్రాంతంగా మార్చాలనే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎన్నో చర్యలు చేపట్టాము. ఇందులో భాగంగానే రూ.20 కోట్లతో కొండపైకి రోడ్డు నిర్మించాము. అప్పటి నుంచి ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తున్నారు. అభివృద్ధిని కొనసాగించాల్సిన చంద్రబాబు ప్రభుత్వం దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తుండటం సరికాదు. కొండ ఎక్కే వాహనదారుల నుంచి టోల్ వసూలు చేయడం అన్యాయం. – మాలగుండ్ల శంకరనారాయణ, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు -
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి
బత్తలపల్లి: మండల పరిధిలోని పోట్లమర్రి సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద శనివారం రాత్రి రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు. బత్తలపల్లి పోలీసులు తెలిపిన మేరకు.. తాడిమర్రి మండలం నిడిగల్లు గ్రామానికి చెందిన గోనుగుంట్ల ఆంజనేయులు కుమారుడు గోనుగుంట్ల దేవేంద్రనాయుడు (29) ధర్మవరం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో కిరాణ దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం రాత్రి దుకాణం మూసి వేసి స్వగ్రామానికి ద్విచక్రవాహనంలో బయలుదేరాడు. బత్తలపల్లి మండలం పోట్లమర్రి సమీపంలోని పెట్రోల్ బంకు దాటిన తరువాత కల్వర్ట్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీ కొంది. ఈ ప్రమాదంలో అతని తల, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 వాహనంలో ఆర్డీటీ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం తీసుకెళ్లగా.. చికిత్స ఫలించక ఆదివారం మృతి చెందాడు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు బత్తలపల్లి పోలీసులు తెలిపారు. లేపాక్షిలో కుక్క స్వైర విహారంలేపాక్షి: లేపాక్షిలోని బస్టాండు ఆవరణంలో ఆదివారం ఓ కుక్క స్వైర విహారం చేసింది. 12 మందిని కరిచి గాయపరిచింది. వెంటనే వారిని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 9 మందికి వైద్య సిబ్బంది వ్యాక్సిన్ వేసి మందులు పంపిణీ చేశారు. ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానిక ప్రజలు కుక్కను కొట్టి చంపేశారు. ఎంపీడీఓ శ్రీనివాసులు, పంచాయతీ కార్యదర్శి నాగరాజు ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారి వెంకటచిరంజీవికి సూచించారు. సమస్యలు పరిష్కరిస్తేనే సమ్మె విరమణబత్తలపల్లి: తమ న్యాయమైన సమస్యలకు పరిష్కారం చూపితేనే సమ్మె విరమిస్తామని సత్యసాయి తాగునీటి పథకం కార్మికులు స్పష్టం చేశారు. ఆదివారం బత్తలపల్లిలోని సత్యసాయి వాటర్ ట్యాంకు వద్ద సత్యసాయి కార్మికులు నల్ల బ్యాడ్జ్‌లు ధరించి ఆరవ రోజు సమ్మె కొనసాగించారు. నిరసన శిబిరం వద్దకు సత్యసాయి బోర్డు ఎస్ఈ ప్రభాకర్‌రావు చేరుకొని కార్మికులతో చర్చించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కార్మికులకు అనుకూలంగా ప్రకటన చేశారని, సమ్మెను విరమించి విధుల్లోకి చేరాలని కోరారు. అయితే, కార్మికులు మాత్రం తమ న్యాయమైన సమస్యలకు పరిష్కారం చూపితేనే సమ్మె విరమిస్తామని స్పష్టం చేయడంతో ఆయన వెనుదిరిగి వెళ్లారు. కార్యక్రమంలో బత్తలపల్లి, తాడిమర్రి, అప్పరాచెరువు సత్యసాయి కార్మికులు పాల్గొన్నారు. ఐషర్ను ఢీకొన్న లారీ ●16 మంది భక్తులకు గాయాలు మదనపల్లె టౌన్: ఐషర్ను లారీ ఢీకొనడంతో 16 మంది భక్తులకు గాయాలైన ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలంలో జరిగింది. రెండో పట్టణ సీఐ మహ్మద్ రఫి తెలిపిన మేరకు.. పుట్లూరు మండలం కడవకల్లు గ్రామానికి చెందిన 60 మంది భక్తులు బోయకొండకు ఐషర్, బొలెరో వాహనాల్లో బయలుదేరారు. మదనపల్లె బైపాస్‌లో ఉన్న రాయల్ ఉడ్ దగ్గర ఆదివారం వేకువజామున ఐషర్ను వెనుక నుంచి లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో 16 మందికి గాయాలయ్యాయి. మిగిలిన వారికి త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. స్థానికులు స్పందించి క్షతగాత్రులను ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వెంటనే చికిత్స అందించడంతో వారంతా ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. గాయపడిన వారు.. రోడ్డు ప్రమాదంలో రాజేశ్వరి, లక్ష్మీనారాయణకు తీవ్ర గాయాలు కావడంతో డాక్టర్లు మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి రెఫర్ చేశారు. స్వల్పంగా గాయపడిన వారిలో సహస్ర, అశ్వని, లక్ష్మీదేవి, రమాశ్రీ, అరుణ, పుల్లమ్మ, గంగాధర్, వెంకటరాయుడు, కుల్లాయమ్మ, శివశంకర్, లక్ష్మి, రాజా, లక్ష్మీదేవి, భవ్యశ్రీ మదనపల్లె ఆసుపత్రిలోనే చికిత్సలు పొందుతున్నారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ వాహనం వదిలేసి పరారయ్యాడు. టూ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం ఆస్పత్రి వద్దకు వచ్చి క్షతగాత్రులను విచారించారు. కేసు నమోదు అనంతరం సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నట్లు సీఐ మహమ్మద్ రఫి తెలిపారు. -
లోప భూయిష్టంగా భూసేకరణ
● వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆవుటాల రమణారెడ్డి పుట్టపర్తి టౌన్: పుట్టపర్తి విమానాశ్రయ సమీపంలో ఏపీఐఐసీ వారు సేకరిస్తున్న భూ సేకరణ లోపభూయిష్టంగా ఉందని వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆవుటాల రమణారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. బ్రాహ్మణపల్లి, బీడుపల్లి రెవెన్యూ గ్రామాలలో వివిధ వర్గాలకు చెందిన రైతులకు ఒకటి, రెండు ఎకరాల భూమి ఉందన్నారు. గతంలో కూడా సత్యసాయి విమానాశ్రయం కోసం కొంత మేరకు భూములు తక్కువ ధరలకు ఇచ్చారన్నారు. మళ్లీ నేడు రెవెన్యూ అధికారులు భూసేకరణ చేపట్టారన్నారు. అందులో 70 శాతం గిరిజనుల కుటుంబాలకు సంబంఽధించి భూమి ఉందని, నూతన జిల్లా ఏర్పాటు చేయడంతో ఎకరం భూమి కోటి రూపాయలకు పైగా పలుకుతోందన్నారు. అలాంటి భూములను రెవెన్యూ అధికారులు బలవంతంగా సేకరిస్తున్నారన్నారు. ఇందులో 2013 భూసేకరణ చట్టం ప్రకారం పారదర్శకత లేకుండా పోయిందన్నారు. భూములు కోల్పోతున్న రైతులకు న్యాయపరమైన పరిహారంతోపాటు ఇంటి స్థలాలు, ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ అద్దె బస్సు ఓడీచెరువు(నల్లమాడ): ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ అద్దె బస్సు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన ఘటన నల్లమాడ మండలంలో జరిగింది. వివరాలు.. పుట్టపర్తి డిపోనకు చెందిన ఆర్టీసీ అద్దె బస్సు ప్రయాణికులతో కదిరి నుంచి కొత్తచెరువుకు వెళుతుండగా నల్లమాడ సమీపంలోని షాదీమహల్ వద్ద అదుపు తప్పింది. బస్సు బ్రేకులు పడకపోవడంతో అప్రమత్తమైన డ్రైవర్ బస్సును పొలాల్లోకి మళ్లించాడు. కొద్దిదూరం వెళ్లాక బస్సు ఆగిపోయింది. ఈ క్రమంలో భయపడిన కొందరు ప్రయాణికులు బస్సు కిటికీల ద్వారా బయటకు దూకారు. బస్సులో ఉన్న 22 మంది ప్రయాణికులు క్షేమంగా బయటపడినట్లు కండక్టర్ నాగేంద్రనాయక్ తెలిపాడు. వడదెబ్బతో యువరైతు మృతి ఓడీచెరువు(నల్లమాడ): నల్లమాడ మండలం మస్కవంకపల్లిలో ఓ యువరైతు వడదెబ్బతో మృతి చెందాడు. మృతుని కుటుంబీకులు తెలిపిన వివరాల మేరకు... మస్కవంకపల్లికి చెందిన చాగలేటి రామచంద్ర(37) వ్యవసాయం చేస్తూ కుటుంబానికి చేయూతగా ఉంటున్నాడు. తనకున్న రెండెకరాల్లో వేరుశనగ సాగుచేసిన రామచంద్ర...రెండురోజుల క్రితం పంటకు పురుగుల మందు కొడుతూ అస్వస్థతకు గురయ్యాడు. తీవ్ర జ్వరంతో బాధపడుతుండగా కుటుంబీకులు నల్లమాడలోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయినా కోలుకోలేక ఆదివారం ఉదయం రామచంద్ర మృతి చెందాడు. మృతుడు అవివాహితుడు. మూగ మహిళపై అత్యాచారయత్నం పుట్లూరు: కూలీ పనులకు వెళ్లిన ఓ మూగ మహిళపై అరటి తోట యజమాని అత్యాచార యత్నం చేశాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు ఆదివారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేంద్రబాబు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని ఓ గ్రామానికి చెందిన మూగ మహిళ ఈ నెల 8న అదే గ్రామానికి చెందిన రమణారెడ్డి అరటి తోటలోకి కూలీ పనులకు వెళ్లింది. పనులు చేస్తున్న సమయంలో మహిళపై గాలి రమణారెడ్డి అత్యాచారానికి యత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
అమ్మ కడుపులోనే హత్య!
● ధర్మవరం మండలానికి చెందిన దంపతులకు ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు సంతానం. మూడోసారి మగబిడ్డ కావాలనుకున్నారు. సదరు మహిళ గర్భందాల్చగానే భర్త ఓ స్కానింగ్ సెంటర్‌ను సంప్రదించాడు. వారు చెప్పిన అడ్రెస్‌కు వెళ్లగా.. స్కానింగ్ మాత్రమే అయితే రూ.6 వేలు, ఆడబిడ్డ అయితే తీసేసేందుకు మరో రూ.20 వేలు అంటూ ధరల పట్టిక చెప్పారు. స్కానింగ్‌లో అమ్మాయి అని తేలగానే మొత్తంగా రూ.30 వేలు తీసుకుని అబార్షన్ చేశారు. .. ఇలా జిల్లాలో నిత్యం బ్రూణ హత్యలు జరుగుతూనే ఉన్నాయి. ఆడ అని తెలిస్తే చాలు పిండాన్ని కరిగించేస్తున్నారు. డబ్బులకు కక్కుర్తి పడుతున్న స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు లింగనిర్ధారణ పరీక్షలు చేస్తుండగా... గర్భిణులు ఒప్పుకోకపోయినా కుటుంబీకుల బలవంతంతో కొందరు వైద్యులు అబార్షన్లు చేస్తున్నారు. సాక్షి, పుట్టపర్తి: ఎన్ని రకాలుగా అవగాహన కల్పించినా భ్రూణ హత్యలు జరుగుతూనే ఉన్నాయి. మగవారితో సమానంగా చదువు, ఉద్యోగం, వివిధ రంగాల్లో పోటీ పడుతున్నా.. తల్లి గర్భంలో నుంచి భూమిపై అడుగు పెట్టనివ్వడం లేదు. ‘ఆడబిడ్డను బతకనిద్దాం.. బతుకునిద్దాం’ అని ఊరూరా అవగాహన కల్పిస్తున్నప్పటికీ మార్పు రావడం లేదు. శ్రీసత్యసాయి జిల్లా వ్యాప్తంగా చాలా ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఆడపిల్ల అయితే తీసేయండి అని దంపతులు సహకరిస్తున్న దాఖలాలు వెలుగు చూస్తున్నాయి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో జిల్లా వ్యాప్తంగా పలు స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఆ తర్వాత గర్భిణి ఒప్పుకుంటే.. అబార్షన్ చేసేస్తున్నారు. ప్రమాదమని తెలిసినా గర్భంలోనే ఆడపిల్లలను చిదిమేస్తున్నారు. యథేచ్ఛగా లింగ నిర్ధారణ జిల్లా వైద్యారోగ్య శాఖాధికారులు నిత్యం ఆస్పత్రులు తనిఖీలు చేస్తున్నట్లు చెబుతున్నారు. కానీ లింగ నిర్ధారణ చేస్తున్న సెంటర్ల జోలికి మాత్రం వెళ్లడం లేదు. దీంతో యథేచ్ఛగా లింగ నిర్ధారణ చేసి కోడ్ భాషలో ఆడ, మగ అనేది గర్భిణులకు తెలియజేస్తున్నారు. మగ పిల్లాడు అయితే ‘6’ అని.. ఆడ పిల్ల అయితే ‘9’ అనే నంబర్లు వినియోగిస్తూ సమాధానం ఇస్తున్నారు. ముందుగానే ఫోన్లో సంప్రదించి.. బస్టాండు చేరుకోవాలని చెబుతారు. అక్కడికి ఆస్పత్రి సిబ్బంది వెళ్లి.. కేవలం గర్భిణిని మాత్రమే తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేసి పంపిస్తున్నారు. అందరూ వెళ్లిపోయాక తర్వాత ఫోన్ కాల్ చేసి కోడ్ భాషలో రిపోర్టుల గురించి వివరిస్తారు. గుట్టు చప్పుడు కాకుండా.. గ్రామస్థాయిలో ఆర్ఎంపీలు, చిన్న క్లినిక్‌ల ద్వారా గుట్టు చప్పుడు కాకుండా ఈ దందా జరుగుతున్నట్లు తెలిసింది. కొందరు ఆర్ఎంపీలు మగపిల్లాడి కోసం ఎదురు చూసే అమాయకులను మభ్యపెట్టి ధనార్జనే ధ్యేయంగా స్కానింగ్ సెంటర్లకు పంపిస్తున్నారు. పుట్టబోయేది ఆడబిడ్డ అనేది తెలిస్తే ముందుగా ఒప్పందం చేసుకున్న ప్రైవేటు ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లకు పంపించి అబార్షన్ చేయిస్తున్నారు. ‘ఆ’ పేరు చెబితే కడుపులోనే ఖతం జిల్లాలోని స్కానింగ్ సెంటర్లలో గుట్టుగా లింగ నిర్ధారణ పరీక్షలు డబ్బు తీసుకుని అబార్షన్ చేస్తున్న సిబ్బంది ల్యాబ్‌లు, నర్సింగ్ హోమ్‌లపై దృష్టి సారించని అధికారులు తనిఖీలు చేస్తున్నాం గర్భస్థ లింగ నిర్ధారణ ప్రక్రియ చట్టాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేస్తున్నాం. కలెక్టర్ ఆదేశాల మేరకు.. పోలీసు ఇతర శాఖల సమన్వయంతో స్కానింగ్ సెంటర్లను తనిఖీలు చేస్తున్నాం. నిబంధనలు పాటించని వారికి నోటీసులిస్తున్నాం. లింగ నిర్ధారణకు పాల్పడినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ ఫైరోజాబేగం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి -
‘గుక్కెడు నీళ్లివ్వలేని స్థితిలో బాబు సర్కారు’
కదిరి: ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ప్రజలు మంచినీటికి ఇబ్బంది పడుతున్నారని, గుక్కెడు నీళ్లిచ్చే స్థితిలో కూడా చంద్రబాబు ప్రభుత్వం లేదని మాజీ మంత్రి శైలజానాథ్, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా సురక్షితమైన తాగునీరు సరఫరా చేస్తామని ఎన్నికల సమయంలో చెప్పిన హామీ ఏమైంది బాబూ అని ప్రశ్నించారు. ఆదివారం వారు కదిరిలో మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా స్వగృహానికి విచ్చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల భూములను రీ సర్వే చేసి, క్యూఆర్ కోడ్‌తో పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. ట్యాంపరింగ్‌కు అవకాశం లేకుండా, భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపారన్నారు. చంద్రబాబు రైతులకు సకాలంలో పాసుపుస్తకాలు ఇవ్వనందున రైతులు బ్యాంకుల్లో రుణాలు పొందలేక పోతున్నారని, బిడ్డ పెళ్లికి ఎకరం భూమి అమ్మాలన్నా ఇబ్బంది పడుతున్నారని వారు వాపోయారు. ఎన్నికల సమయంలో ఉద్యోగులకు చంద్రబాబు ఎన్నో హామీలిచ్చారని, కానీ వారికి న్యాయబద్ధంగా రావాల్సిన డీఏలు గానీ, పీఆర్సీ గానీ.. ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. ప్రతి మహిళకు నెలకు రూ. 1,500, నిరుద్యోగులకు రూ. 3 వేలు, 20 లక్షల ఉద్యోగాలు ఎప్పుడిస్తావు బాబూ అని ప్రశ్నించారు. అంతకు మునుపు వారిరువురినీ అత్తార్ ఘనంగా సన్మానించారు. -
వర్షం కోసం వింత ఆచారం
అగళి: వరుణుడి కరుణ కోసం గ్రామాల్లో వింత ఆచారాలను పాటిస్తున్నారు. కప్పలు, గాడిదల పెళ్లిళ్లు, ఊరి నుంచి వలస వెళ్లడం, బండరాయిపై నైవేద్యాన్ని నాలుకతో నాకడం లాంటివి చేస్తుంటారు. ఇందులో భాగంగానే అగళి మండలం నరసంబూదిలో ఓ ఆచారాన్ని పాటిస్తున్నారు. గ్రామంలోని పిల్లలు చెరువులోని మట్టిని సేకరించి దాన్ని విగ్రహంగా తయారు చేశారు. గ్రామంలోని ఇంటింటికీ వరుణ దేవుడు (మండ్రయ) విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లారు. ప్రతిమ ఎత్తుకున్న వారిపై నీరు పోసి ధాన్యాన్ని సేకరించారు. కార్యక్రమం మొత్తం పూర్తయిన తర్వాత ఆ విగ్రహాన్ని చెట్టు కింద కొలువుదీర్చి ధాన్యంతో భోజనాలు చేసి భక్తులకు అన్నదానం చేశారు. ఇలా చేస్తే వరుణ దేవుడు కరుణించి వర్షం కురుస్తుందని గ్రామ పెద్దలు చెబుతున్నారు. మట్టి విగ్రహాన్ని నెత్తిన పెట్టుకొని ఇంటింటికీ వెళ్లి ధాన్యాన్ని సేకరిస్తున్న పిల్లలు -
తల్లిదండ్రుల కష్టాన్ని వృథా పోనివ్వొద్దు
పుట్టపర్తి టౌన్: తల్లిదండ్రుల కష్టాన్ని వృథా పోనివ్వకుండా విద్యార్థులు కష్టపడి చదవాలని ఆర్టీఓ సువర్ణ సూచించారు. ఆదివారం పుట్టపర్తి పట్టణంలోని బీసీ సంక్షేమ వసతి గృహంలో ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు. పదో తరగతి పరీక్షల్లో 500కు పైగా మార్కులు సాధించిన మాల సామాజికవర్గానికి చెందిన విద్యార్థులను ఘనంగా సన్మానించి సత్కరించారు. కార్యక్రమానికి ఆర్డీఓ సువర్ణ, రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షుడు కోట్ల గంగాధర్, ఉపాధ్యక్షుడు జూటూరు మహేంద్ర, జిల్లా అధ్యక్షుడు శంకర్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. వారు మాట్లాడుతూ చదువుతోనే దేనినైనా సాధించవచ్చన్నారు. చిన్నతనంలోనే లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సూచించారు. అంబేడ్కర్ కలలు గన్న సమాజ నిర్మాణానికి విద్య ఏకై క మార్గమన్నారు. భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకుని తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలన్నారు. కార్యక్రమంలో మాలమహానాడు నాయకులు మూర్తి, రామాంజనేయులు, చెరుకూరి గంగులయ్య, గోవిందు, శ్రీనివాసులు, ఈశ్వరయ్య, మనోహర్, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు ఆర్డీఓ సువర్ణ సూచన -
భక్తిశ్రద్ధలతో గంగమ్మకు జ్యోతులు
గాండ్లపెంట: మండల కేంద్రమైన గాండ్లపెంటలో గంగమ్మ తిరునాల వైభవంగా ముగిసింది. మూడోరోజు భక్తులు అమ్మవారికి బోనాలు, జ్యోతులను సమర్పించారు. పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసింది. అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేందుకు పోటీ పడ్డారు. ఉత్సాహంగా ఉట్ల తిరునాల ఆలయ ఆవరణలో ఆదివారం సాయంత్రం ఉత్సాహంగా ఉట్ల తిరునాల నిర్వహించారు. ఉట్టిని అందుకునేందుకు యువకులు బృందాలుగా ఏర్పడి పోటీపడ్డారు. చివరకు నాయనివారిపల్లికి చెందిన యువకుల బృందం ఉట్టిని అందుకుంది. దీంతో మూడు రోజుల పాటు జరిగిన గంగమ్మ తిరునాల ముగిసింది. -
అ‘పూర్వ’ కలయిక
కదిరి అర్బన్: మండల పరిధిలోని పట్నం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం 2007–08 పదో తరగతి బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సందడిగా సాగింది. తమకు పాఠాలు నేర్పిన గురువులను శాలువలు, పూలమాలలతో పూర్వ విద్యార్థులు సన్మానించారు. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఓడీ చెరువులో.. ఓడీచెరువు: ఓడీచెరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1989–90 సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది. 36 సంవత్సరాల తర్వాత కలిసిన పూర్వ విద్యార్థులు ఆనాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకొని మురిసిపోయారు. పాఠశాల ప్రాంగణంలో ఆటల పోటీలతో మైమరిచిపోయారు. అనంతరం ఏర్పాటు చేసిన విందు ఆరగిస్తూ కుటుంబ సభ్యులను పరిచయం చేసుకున్నారు. తమకు విద్యా బుద్ధులు నేర్పిన గురువులు అందుబాటులో లేకపోవడంతో వారిని ఫోన్లో పలకరించి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో బొడ్డు నాగరాజు, అదే పాఠశాలలో ప్రస్తుతం పీడీగా పనిచేస్తున్న గోపినాథ్‌రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గౌడ్, మామిళ్లకుంట్లపల్లికి చెందిన రామస్వామిరెడ్డి, మమత, రవీంద్రరెడ్డి, సుధాకర్, బాలరాజు, ఇనగలూరు లక్ష్మన్న, రామకృష్ణ, రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు -
సొంత ఖర్చుతో నీరందిస్తే అడ్డుకుంటారా?
ముదిగుబ్బ: యువకులు సేవాభావంతో ముందుకు వచ్చి తమ సొంత ఖర్చులతో నీరందిస్తే అడ్డుకుంటారా అంటూ పంచాయతీ కార్యదర్శిపై మహిళలు తిరగబడిన ఘటన ఆదివారం మద్దన్నగారిపల్లిలో చోటుచేసుకుంది. వివరాలు.. మండలంలోని మద్దన్నగారిపల్లిలో 250 కుటుంబాలు నివాసముంటున్నాయి. పంచాయతీ తరఫున మూడు బోర్లు వేయించినా మోటార్లను బిగించకపోవడంతో కొద్దిరోజులుగా నీటి ఎద్దడి నెలకొంది. ఈ క్రమంలోనే ఆదివారం గ్రామానికి చెందిన రఘు, మునీంద్ర, హర్ష, బాబులు తమ సొంత ఖర్చుతో రెండు ట్యాంకర్లతో తాగునీరు సరఫరా చేశారు. అయితే ఆర్డబ్ల్యూఎస్ జేఈ ప్రసాద్, పంచాయతీ కార్యదర్శి ఆ యువకులకు ఫోన్ చేసి ఎవరి అనుమతితో నీరు సరఫరా చేస్తున్నారంటూ బెదిరించినట్లు సమాచారం. గ్రామస్తులకు స్వచ్ఛందంగా నీరందిస్తే బెదిరించడమేమిటని యువకులు అధికారులను ప్రశ్నించారు. దీంతో పంచాయతీ కార్యదర్శి వచ్చి ఆ యువకులను అడ్డుకునే ప్రయత్నం చేయగా.. స్థానిక మహిళలు ఒక్కసారిగా కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యువకులు స్వచ్ఛందంగా సమస్యను పరిష్కరిస్తుంటే మీకు వచ్చిన బాధ ఏమిటంటూ నిలదీయడంతో కార్యదర్శి అక్కడి నుంచి జారుకున్నారు. గ్రామంలో నీటి సమస్య ఉందని పలుమార్లు అధికారులకు చెప్పినా పట్టించు కోలేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యదర్శిపై తిరగబడ్డ మహిళలు -
రైతులకు ఫ్రీహోల్డ్ కష్టాలు
ముదిగుబ్బ: చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకం కారణంగా రైతులకు ఫ్రీహోల్డ్ కష్టాలు మొదలయ్యాయి. ఫ్రీహోల్డ్ భూముల వివరాలు వన్‌బీ అడంగల్‌లో రాకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. అలాగే రీ సర్వే చేసిన భూములకు కూడా కొన్ని సర్వే నంబర్లు గల్లంతయ్యాయి. రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో అన్నదాతల కష్టాలు చెప్పనలవిగా మారాయి. దిక్కుతోచని స్థితిలో.. రైతులు పంటలు సాగు చేసుకునే నిమిత్తం బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను ఏడాదికోసారి రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి భూమి వివరాలు తెలిపే వన్‌బీ అడంగల్‌ను సమర్పించాల్సి ఉంటుంది. అయితే, ఫ్రీహోల్డ్ భూములకు సంబంధించిన వన్‌బీ అడంగల్ ఆన్లైన్లో రావడం లేదు. ‘మీ సేవ’ వారు తెల్లకాగితంపై వివరాలు రాసిస్తున్నారు. ఆ కాగితంపై వీఆర్ఓ, తహసీల్దార్‌తో సంతకం చేయించుకున్న అనంతరం రైతులు బ్యాంకులకు వెళ్తున్నారు. ఈ క్రమంలో బ్యాంక్ సిబ్బంది వెబ్‌ల్యాండ్‌లో భూముల వివరాలు పరిశీలన చేస్తున్నారు. వారికి ఆయా భూముల వివరాలు కనిపించకపోవడంతో పంట రుణ పరిమితి పెంచడం లేదు. దీనికితోడు రూ.3 లక్షల వరకు రుణం తీసుకున్న రైతులకు రూ.లక్ష తిరిగి బ్యాంకుకు చెల్లించమని సిబ్బంది చెబుతుండడంతో వారికి దిక్కుతోచడం లేదు. ఇక.. రీ సర్వే జరిగిన గ్రామాల్లోనూ ఒకే సర్వే నంబర్లో అన్నదమ్ముల భాగాలు వన్‌బీ అడంగల్‌లో కనిపించకపోవడం గమనార్హం. మెలిక పెట్టి.. కష్టాల్లోకి నెట్టి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు మంచి చేయాలనే ఉద్దేశంతో 20 సంవత్సరాల అనుభవంలో ఉన్న భూమిని క్రయ విక్రయాలు చేసుకునేందుకు జీవోను విడుదల చేశారు. అయితే, చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. భూముల వివరాలు ఆన్లైన్లో కనిపించకుండా హోల్డ్‌లో పెట్టారు. విచారణ తరువాత భూములను విడుదల చేస్తామని మెలిక పెట్టి రెండేళ్లు గడుస్తున్నా ఎటూ తేల్చకుండా రైతులను అవస్థలకు గురి చేస్తున్నారు. దీనిపై అన్నదాతలు మండిపడుతున్నారు. వన్‌బీలో కానరాని భూముల వివరాలు రీ సర్వేలో తప్పులతోనూ ఇబ్బందులు నానా కష్టాలు పడుతున్న అన్నదాతలు పట్టించుకోని చంద్రబాబు సర్కారు ముదిగుబ్బ మండలంలో క్రాప్ లోన్ వివరాలిలా.. ని‘బంధనాల’తో కష్టాలు పంట రుణాలు ఒక బ్యాంక్‌లో మాత్రమే తీసుకోవాలని బ్యాంక్ అధికారులు చెబుతుండడం అన్నదాతలను మరింతగా కుంగదీస్తోంది. గతంలో చాలా మంది రైతులు సొసైటీల్లో పాసుపుస్తకం జిరాక్స్‌లతో పంట రుణాలను తీసుకున్నారు. నేడు ఒక రైతుకు ఒక బ్యాంక్‌లో మాత్రమే పంట రుణం ఉండాలని ప్రభుత్వం నిబంధనలు విధించడంతో ఇబ్బందులు తప్పడం లేదు. -
ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శన
ప్రశాంతి నిలయం: సత్యసాయి ఆధ్యాత్మిక వైభవాన్ని, పౌరాణిక విశిష్టతను వివరిస్తూ నిర్వహించిన సాంస్కృతిక భక్తి రస కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పర్తియాత్రలో భాగంగా పుట్టపర్తికి విచ్చేసిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సత్యసాయి భక్తులు రెండోరోజు ఆదివారం సాయి కుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహా సమాధి చెంత సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. ఉదయం ఉమ్మడి అదిలాబాద్ జిల్లా సత్యసాయి యూత్ సంగీత విభావరి నిర్వహించింది. ఈ సందర్భంగా వారు చక్కటి భక్తి గీతాలతో ఆకట్టుకున్నారు. సాయంత్రం ‘చిత్త రోగానికి చికిత్స ఎక్కడ ’అన్న పేరుతో నృత్య నాటిక నిర్వహించారు. సత్యసాయి తన జీవిత గమనంలో భక్త కోటికి తలెత్తే ఆధ్యాత్మిక, మానసిక, సామాజిక సమస్యలకు పరిష్కారం చూపించిన విధానాన్ని వివరించారు. అనంతరం అదిలాబాద్ భక్తులు సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్నారు. -
‘రక్షక్’ వాహనాల ప్రారంభం
హిందూపురం: పట్టణంలోని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ ఆవరణంలో ఎస్పీ సతీష్‌కుమార్ ఏడు నూతన ద్విచక్ర వాహనాలకు పూజ చేసి జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ సతీష్‌కుమార్ మాట్లాడుతూ ప్రజల భద్రత, పోలీసుల తక్షణ స్పందన, రాత్రి పహారా బలోపేతమే లక్ష్యంగా రక్షక్ వాహనాలను అందిస్తున్నట్లు తెలిపారు. వీటిని ఉపయోగించుకొని అత్యవసర పరిస్థితుల్లో పోలీసులు వేగంగా స్పందిస్తారన్నారు. హిందూపురం నియోజకవర్గంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజాప్రతినిధులు పోలీసు శాఖకు అందిస్తున్న సహకారం అభినందనీయమన్నారు. రూ.15 లక్షల విలువ గల ఏడు వాహనాలను దాతలు అందించడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ మహేష్, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. హనుమజ్జయంతి ఉత్సవాలు ప్రారంభం గుంతకల్లు రూరల్: కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో ఆదివారం హనుమజ్జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేకువజామునే ప్రత్యేక యాగశాలలో ఆలయ ఈఓ మేడేపల్లి విజయరాజు, ధర్మకర్త సుగుణమ్మ ఆధ్వర్యంలో కలశ ప్రతిష్ట, గణపతి పూజ, పుణ్యాహవచనం, మంటపారాధన, పంచగవ్యప్రాశన, గోపూజ, సుందరకాండ మన్యుసూక్తపారాయణ హోమం నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు ఆలయ ముందు భాగంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై స్వామివారి ఉత్సవ మూర్తిని కొలువుదీర్చి ప్రత్యేక పూజలు చేశారు. తమలపాకులతో లక్షార్చన చేసిన తర్వాత భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. -
డీఎస్పీని భిక్షమడిగారని స్టేషన్‌కు తరలించారు!
లేపాక్షి: శ్రీసత్యసాయి జిల్లా లేపాక్షిలోని వీరభద్రస్వామి దేవాలయం పరిసరాల్లో భిక్షాటన చేసి జీవనం సాగించే వృద్ధ మహిళలను స్థానిక పోలీసుస్టేషన్ వద్ద గంటల తరబడి ఉంచడం చర్చనీయాంశమైంది. భిక్షం అడిగినందుకే తమను పోలీసుస్టేషన్‌కు పిలిపించారని బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం లేపాక్షి ఆలయ సందర్శనకు హిందూపురం డీఎస్పీ మహేష్ రాగా, ఆయన్ను కొందరు వృద్ధ మహిళలు భిక్షమడిగారు. ఆయనకు అసౌకర్యం కలిగించారనే కారణంతో వారిని స్థానిక పోలీసుస్టేషన్‌కు పిలిపించారు. స్టేషన్ ప్రాంగణంలో గంటల తరబడి కూర్చోబెట్టారు. తాము పేదరికం కారణంగా భిక్షాటన చేస్తున్నామని, తమను ఇలా స్టేషన్‌కు పిలిపించి ఇబ్బంది పెట్టడం బాధాకరమని బాధితులు వాపోయారు. ఈ విషయంపై ఎస్ఐ నరేంద్రను వివరణ కోరగా.. భిక్షాటన చేసే వారికి ఎవరూ దిక్కులేకుంటే అనాథాశ్రమంలో చేర్పిస్తామని, బంధువులుంటే వారిని పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తామని చెప్పారు. -
ఆరుగురు కిడ్నాపర్లకు రిమాండ్
● భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా ఆరుగురిపై రౌడీషీట్ ● ఇన్నోవా కారు, టూవీలర్, ప్రామిసరీనోట్ల స్వాధీనం ● వివరాలు వెల్లడించిన ధర్మవరం ఇన్చార్జ్ డీఎస్పీ నర్సింగప్ప ధర్మవరం అర్బన్: భూ వివాదంలో రైతును కిడ్నాప్ చేసి దాడి చేసిన ఘటనలో ఆరుగురు కిడ్నాపర్లను రిమాండ్ పంపినట్లు ధర్మవరం ఇన్చార్జ్ డీఎస్పీ నర్సింగప్ప తెలిపారు. శనివారం ఆయన స్థానిక వన్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో విలేకరులతో మాట్లాడారు. భవిష్యత్తులో ఇలాంటి నేరాలకు పాల్పడకుండా ఆరుగురు కిడ్నాపర్లపై రౌడీషీట్ ఓపెన్ చేశామని తెలిపారు. 140(2), 308(5) ఆర్/డబ్ల్యూ 3(5) బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని వెల్లడించారు. రైతు కిడ్నాప్..నిందితుల అరెస్టుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ వెల్లడించారు. భూవివాదంలో కిడ్నాప్.. ముదిగుబ్బ మండలం కమ్మవారిపల్లి గ్రామానికి చెందిన రైతు ముసుగు నారాయణస్వామి 1997 సంవత్సరంలో అదే గ్రామానికి చెందిన కంద్యాల నారాయణతో 1.65 ఎకరాల భూమిని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అయితే కంద్యాల నారాయణ కుమారుడు కంద్యాల రవీంద్రనాయుడు మాత్రం ముసుగు నారాయణస్వామి కొనుగోలు చేసిన భూమిపై తనకు హక్కు ఉందంటూ నారాయణస్వామితో తరచూ గొడవపడేవాడు. ఈ భూ వివాదంపై ఆర్డీఓ కోర్టులో కేసు వేశారు. ఈనెల 8వ తేదీన ఆర్డీఓ కోర్టుకు రైతు ముసుగు నారాయణస్వామి రావడంతో కంద్యాల రవీంద్రనాయుడు, అతని కుమారుడు కంద్యాల అరుణ్‌కుమార్, అతని స్నేహితులు మార్కెట్‌వీధికి చెందిన నారా మధుసూదన్‌నాయుడు, వైఎస్సార్‌కాలనీకి చెందిన తులచూరి ప్రదీప్‌కుమార్, పోతుకుంట బీసీ కాలనీకి చెందిన పసుపులేటి ఉదయ్, బుక్కపట్నం మండలం యాదాలంకపల్లి గ్రామానికి చెందిన బిల్లే హరి ఆర్డీఓ కార్యాలయంలో ఉన్న రైతు నారాయణస్వామిని ఇన్నోవా కారులో కిడ్నాప్ చేశారు. మామిళ్లపల్లి మీదుగా రామగిరి మండలం శ్రీహరిపురం వద్దకు తీసుకెళ్లి రైతును విచక్షణారహితంగా కొట్టి గాయపరిచారు. ‘‘భూమి ఇస్తావా... లేక రూ.50 లక్షలు ఇస్తావా..ఏదో ఒకటి డిసైడ్ చేయకపోతే చంపేస్తాం’’ అని బెదిరించి ప్రాంసరీనోట్లపై బలవంతంగా సంతకాలు చేయించారు. రైతును కిడ్నాప్ చేశారన్న సమాచారం రాగానే ధర్మవరం వన్ టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్, ఎస్ఐ ఉమాదేవి అప్రమత్తాయరన్నారు. సిబ్బందితో కలిసి వెళ్లి శ్రీహరిపురం వద్ద కిడ్నాపర్లను అదుపులోకి తీసుకుని రైతును విడిపించారు. అలాగే కిడ్నాపర్ల నుంచి ఏపీ03బీయూ 1177 నంబరు గల ఇన్నోవా కారు, ఏపీ39 ఎల్వి 3446 నంబరు గల టూవీలర్, ఐదు ఖాళీ ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. శనివారం ఆరుగురు కిడ్నాపర్లను కోర్టు ఎదుట హాజరు పరచగా, న్యాయమూర్తి వారికి రిమాండ్ విధించారు. -
అన్న క్యాంటీన్ సిబ్బంది కొడుతున్నారు
● అన్నం తక్కువగా పెడుతున్నారన్నందుకు దాడి చేశారు ● బాధితుల ఆవేదన ● సోషల్ మీడియాలో వీడియో వైరల్ ధర్మవరం: ‘అన్నం ఎందుకు తక్కువ పెడుతున్నారు. కూరలు కూడా నాసిరకంగా ఉన్నాయి’ అంటూ ప్రశ్నించినందుకు నిరుపేద కూలీలపై అన్న క్యాంటీన్ సిబ్బంది దాడి చేసిన ఘటన సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. క్యాంటీన్ సిబ్బందితో బాధితులు వాగ్వాదం చేస్తుండగా, కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. వివరాలు.. ధర్మవరంలోని ప్రభుత్వాసుపత్రి వద్ద ఉన్న అన్న క్యాంటీన్లో భోజనం చేసేందుకు ఇటీవల రాత్రి వేళ నిరుపేద కూలీలు వెళ్లారు. ఆహార పదార్థాలు నాసిరకంగా ఉండడంతో క్యాంటీన్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అన్న క్యాంటీన్ నిర్వాహకుడు కూలీలపై రెచ్చిపోయాడు. కర్రతో దాడి చేసినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై అన్న క్యాంటీన్ సిబ్బందిని వివరణ కోరగా తాము ఎవరిపైనా దాడి చేయలేదన్నారు. శభాష్ సాయిగౌతం ● ఐఎఫ్ఎస్కు ఎంపికై న శ్రీ సత్యసాయి పాఠశాల పూర్వ విద్యార్థి ప్రశాంతినిలయం: పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి హయ్యర్ సెకండరీ స్కూల్ పూర్వ విద్యార్థి కే.సాయిగౌతం ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్)కు ఎంపికయ్యారు. దేశస్థాయిలో 113వ ర్యాంకు సాధించి పలువురి ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం ఆయన జిల్లాలో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. సాయిగౌతం తండ్రి వినాయక ప్రసాద్ విద్యుత్ శాఖలో డీఈగా పని చేసి పదవీ విరమణ పొందారు. ఆయన తల్లి సుశీల గృహిణి కాగా సోదరుడు ప్రవీణ్ ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఆర్థోపెడిక్ సర్జన్‌గా పని చేస్తున్నారు. సాయి గౌతం యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూను 3 సార్లు, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఇంటర్వ్యూను 3 సార్లు, ఏపీపీఎస్సీ గ్రూప్–1 ఇంటర్వ్యూను 3 సార్లు ఎదుర్కోవడం గమనార్హం. పట్టు వదలకుండా ప్రయత్నించిన ఆయన తాజాగా ఐఎఫ్ఎస్కు ఎంపికయ్యారు. 100 మందికి పైగా సివిల్ సర్వీసెస్ ర్యాంకర్లకు సాయి గౌతం మార్గదర్శనం చేయడం గమనార్హం. చిన్నారిని మింగిన స్విమ్మింగ్ పూల్ పావగడ: స్విమ్మింగ్ పూల్‌లో మునిగి బాలుడు మృతి చెందిన ఘటన పావగడలో చోటు చేసుకుంది. వివరాలు.. పట్టణంలోని కన్మాన్ చెరువు వీధిలో నివసిస్తున్న రిజ్వాన్ కుమారుడు తాహిర్ (13) శనివారం స్థానిక వీరమ్మనహళ్లి గేటు వద్ద ఉన్న స్విమ్మింగ్ పూల్ వద్దకు వెళ్లాడు. ఈత కొట్టే క్రమంలో నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. కుమారుడి మృతదేహం వద్ద తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. పోలీసులు సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. విద్యాసంస్థల బస్సుల్లో తనిఖీలు ముమ్మరంపుట్టపర్తి టౌన్: జిల్లాలోని అన్ని విద్యాసంస్థల బస్సులపై తనిఖీలు ముమ్మరం చేస్తున్నట్లు జిల్లా రవాణాశాఖ అధికారి కరుణసాగర్‌రెడ్డి తెలిపారు. శనివారం జిల్లా వ్యాప్తంగా స్కూల్‌బస్సుల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్సుల పరిశీలనకు ఐదు తనిఖీ బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిబంధనల ప్రకారం ఫిట్నెస్ సర్టిఫికెట్, పర్మిట్, బీమా, డ్రైవర్ లైసెన్స్ వంటి పత్రాలతో పాటు లోపాలు, స్పీడ్ గవర్నర్లు, ఎమర్జెన్సీ ఎగ్జిట్లు, అగ్నిమాపక సిలిండర్లు, ప్రథమ చికిత్స కిట్లు, ఫైర్ డిటెక్షన్‌పై ఆరా తీస్తున్నట్లు పేర్కొన్నారు. లోపాలు ఉంటే విద్యాసంస్థల యజమానులకు నోటీసులు జారీ చేసి గడువు లోపు సరిదిద్దుకోవాలని ఆదేశిస్తున్నట్లు వివరించారు. మహిళపై టీడీపీ కార్యకర్తల దాడికనగానపల్లి: మండలంలోని కొండపల్లి గ్రామంలో ఎస్సీ కాలనీకి చెందిన మహిళపై స్థానిక టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. బాధిత మహిళ భూలక్ష్మి కనగానపల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. గ్రామానికి చెందిన తిప్పేస్వామి, అతని భార్య భూలక్ష్మి కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. దీంతో పాటు జీవనోపాధికి సొంతంగా ఒక ఆటో కూడా పెట్టుకున్నారు. రెండు రోజుల క్రితం ఆటోను వారి ఇంటి పక్కనే రోడ్డుపై నిలిపి ఉంచగా, స్థానిక కాలనీకి చెందిన టీడీపీ కారకర్తలు లక్ష్మిదేవి, ముత్యాలు, లక్ష్మేంద్ర, సుబ్బరాయుడు, రామలీలు వచ్చి రాజకీయ కక్షతో వీరితో గొడవకు దిగారు. తర్వాత భర్త తిప్పేస్వామి ఇంటి వద్ద లేని సమయంలో వచ్చి భూలక్ష్మిని విచక్షణారహితంగా కొట్టారు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమెను కుటుంబ సభ్యులు ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం అనంతపురం ఆస్పత్రికి తీసుకెళ్లారు. శనివారం బాధితురాలు కనగానపల్లి పోలీస్ స్టేషన్లో దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేసింది. -
గ్రామాలకు అందని జలం
బకాయి చిట్టాలో జీతం...ఆత్మకూరు: ఉమ్మడి జిల్లాకు సత్యసాయి తాగునీటి ప్రాజెక్ట్ ఓ వరం. 1995లో ప్రజల దాహార్తిని గుర్తించిన సత్యసాయి బాబా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్‌కు జీవం పోశారు. 1997లో ఏపీ ప్రభుత్వానికి అప్పగించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ చిత్రావతి, పీఏబీఆర్ నుంచి నీటిని తీసుకుని శుద్ది చేసి ప్రత్యేక పైప్లైన్లు, సంపుల ద్వారా ఉమ్మడి అనంత పురం జిల్లాలోని 11 నియోజకవర్గాల పరిధిలో ఉన్న 870 గ్రామాలకు నీటిని అందజేస్తున్నారు. మహోన్నత ఆశయంతో నాడు సత్యసాయి ప్రారంభించిన ఈ పథకం కాస్త.. చంద్రబాబు ప్రభుత్వ తీరుతో నిర్వీర్యమైంది. సకాలంలో జీతాలు అందక రెండేళ్లుగా పలు దఫాలుగా కార్మికులు ఆందోళన బాట పడుతూ వచ్చారు. నిరవధిక సమ్మె చేపట్టిన ప్రతిసారీ ఎంతో కొంత చెల్లించడం... ఆ తర్వాత చేతులెత్తేస్తుండడంతో కార్మిక కుటుంబాలు అర్ధాకలితో అలమటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఐదు రోజుల క్రితం మరోసారి కార్మికులు విధులు బహిష్కరించి నిరవధిక సమ్మెలోకి వెళ్లారు. జీతాలు చెల్లించే వరకూ సమ్మె విరమించబోమంటూ భీష్మించారు. ఒక్కో కార్మికుడికి రూ.లక్ష బకాయి సత్యసాయి తాగునీటి ప్రాజెక్ట్‌లో భాగంగా ఉమ్మడి జిల్లా పరిధిలో 572 మంది కార్మికులు పనిచేస్తున్నారు. గత ఐదు నెలలుగా కార్మికులు జీతాలు అందడం లేదు. ఈ క్రమంలో కార్మికుడికి రూ.లక్ష వరకూ బకాయి పేరుకుపోయింది. దీంతో అప్పులు చేసి కుటుంబాలను పోషించుకోవాల్సి వస్తోందని కార్మికులు వాపోతున్నారు. కీలకమైన పండుగలు, పర్వదినాల్లోనూ చేతిలో చిల్లిగవ్వ లేకుండా కార్మిక కుటుంబాలు ఇబ్బంది పడ్డాయి. దీంతో తమ సమస్యకు పరిష్కారం చూపాలంటూ పలు దఫాలుగా ఆందోళనలు చేపట్టారు. అయినా ప్రభుత్వం కనీసంగానూ స్పందించలేదు. చివరకు గత్యంతరం లేని పరిస్థితుల్లో ఐదు రోజుల క్రితం కార్మికులు విధులు బహిష్కరించి నిరవధిక సమ్మెలోకి వెళ్లిపోయారు. ఫలితంగా 870 గ్రామాలకు తాగునీరు అందకుండా పోయింది. వేసవిలో ఎందుకింత నిర్లక్ష్యం? తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భూగర్భ జలాలు అడుగంటాయి. వేసవిలో తాగునీటి కోసం తరచూ ఏదోక గ్రామంలో ప్రజలు ఖాళీ బిందెలతో నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇలాంటి తరుణంలో సత్యసాయి కార్మికుల దశల వారీ సమ్మెతో పది రోజులుగా గ్రామాల్లో నీరు అందకుండా పోయింది. ఐదు రోజులుగా చుక్క నీరు అందకపోవడంతో గ్రామాల్లో దాహం కేకలు మిన్నంటుతున్నాయి. వేసవిని దృష్టిలో ఉంచుకుని కార్మికులకు జీతాలు చెల్లించి సమస్యకు పరిష్కారం చూపాల్సిన ప్రభుత్వం ఇందుకు విరుద్ధంగా నిర్లక్ష్యం వహిస్తుండడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల ఇబ్బందులు అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోలేదంటూ పెద్ద ఎత్తున ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి సత్యసాయి తాగునీటి పథకం కార్మికుల సమస్యలకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు. ఐదు నెలలుగా సత్యసాయి తాగునీటి పథకం కార్మికులకు అందని జీతాలు అప్పులతో కుటుంబాల పోషణ ఐదు రోజులుగా నిరవధిక సమ్మెలో కార్మికులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 870 గ్రామాల్లో నెలకొన్న తాగునీటి ఎద్దడి ఉమ్మడి జిల్లాలో సత్యసాయి తాగునీటి ప్రాజెక్ట్ పరిధి మొత్తం గ్రామాలు : 870 మొత్తం కార్మికులు : 572 మంది జీతం బకాయిలు : ఐదు నెలలు ఒక్కో కార్మికుడికి చెల్లించాల్సిన బకాయి : రూ.లక్ష -
‘కియా’ అనుబంధ పరిశ్రమ కార్మికుడి మృతి
పెనుకొండ రూరల్: ‘కియా’ అనుబంధ పరిశ్రమలో పని చేస్తున్న కార్మికుడు ప్రమాదవశాత్తూ మృతి చెందిన సంఘటన శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు... వైఎస్సార్ కడప జిల్లా అట్లూరి మండలం బోడిశెట్టిపల్లి గ్రామానికి చెందిన రామాంజనేయులు(22) ఆరు నెలలుగా ‘కియా’ అనుబంధ ఎన్వీహెచ్ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. ఎప్పటికలాగే శుక్రవారం రాత్రి విధులకు వెళ్లగా...పనిలో నిమగ్నమై ఉన్న సమయంలో ఉన్నట్టుండి భారీ యంత్రం తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. తోటి కార్మికులు రామాంజనేయులును హుటాహుటీన పెనుకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మృతి చెందినట్లు నిర్ధారించారు. కాగా, పరిశ్రమలోని ఆపరేటర్ అజాగ్రత్త వల్లే కార్మికుడు రామాంజనేయులు మృతి చెందినట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మృతుని తండ్రి లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ‘కియా’ ఎస్ఐ రాఘవయ్య తెలిపారు. రూ.కోటి పరిహారం ఇవ్వాలి.. ‘కియా’ అనుబంధ ఎన్వీహెచ్ పరిశ్రమలో పనిచేస్తూ మృతి చెందిన రామాంజనేయులు కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం వారు పట్టణంలోని పౌరసరఫరాలశాఖ గోడౌన్ వద్ద విలేకరులతో మాట్లాడారు. కార్మికులకు పరిశ్రమల్లో భద్రత లేకుండా పోతోందన్నారు. కార్మిక శాఖ అధికారులు కనీస చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైనా ప్రమాదం జరిగితే కార్మికుల ప్రాణాలమీదకు రాకుండా పరిశ్రమలలో అత్యాధునిక సెన్సార్ వంటి రక్షణ చర్యలు ఏర్పాటు చేయాలన్నారు. రామాంజనేయులు మృతి ఘటనలోనూ ఆ పరిశ్రమ నిర్లక్ష్యం చాలా ఉందన్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే తప్పించుకునే మార్గాలు కూడా చాలా కంపెనీల్లో లేవన్నారు. ఇప్పటికైనా కార్మిక శాఖ అధికారులు ఆయా కంపెనీల్లో తనిఖీలు చేయాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు బాబావలి, వెంకటరాముడు, నారాయణ, నాగభూషణ, హనుమంతు తదితరులు పాల్గొన్నారు. ప్రమాదవశాత్తూ ఫ్యాక్టరీలోనే దుర్మరణం -
ట్రాన్స్‘ఫార్మర్’ కష్టాలు
పుట్టపర్తి అర్బన్: ఆరుగాలం రెక్కలుముక్కలు చేసుకుని స్వేదం చిందించి పంటలు సాగుచేసే రైతులకు అండగా నిలవాల్సిన అధికారులు వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. సాగునీరు ఇబ్బందులతో రూ.లక్షలు ఖర్చు చేసి బోర్లు వేసుకున్నా...కరెంటు కనెన్షన్ ఇవ్వకుండా వేధిస్తున్నారు. విద్యుత్‌శాఖలోని కొందరు అవినీతి అధికారుల వల్ల రైతులకు ట్రాన్స్ఫార్మర్లు మంజూరు కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కళ్లముందే పంటలు ఎండుతుండగా కన్నీటిపర్యంతమవుతున్నారు. ట్రాన్స్ఫార్మర్కు రూ.50 వేలు అదనం.. వ్యవసాయబోరుకు విద్యుత్ కనెక్షన్ కావాలంటే.. ముందుగా విద్యుత్ లైను లాగాలి. ఇందుకు విద్యుత్ స్తంభాలతో పాటు పలు పరికరాలు అవసరమవుతాయి. వీటిని ధర్మవరంలోని ఓ ప్రైవేటు వ్యాపారి వద్ద అధికారులు బలంవంతంగా కొనుగోలు చేయిస్తున్నారు. ఇక ట్రాన్స్ఫార్మర్ కోసం ఒక్కో రైతు నుంచి రూ.20 వేల వరకూ డిపాజిట్ వసూలు చేస్తున్నారు. దీనికి అదనంగా ఒక్కో రైతు నుంచి రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకూ వసూలు చేస్తున్నారు. డబ్బు చెల్లించినా ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు చెప్పిన వారికి మాత్రం రోజుల వ్యవధిలోనే ట్రాన్స్ఫార్మర్లు, ఇతర పరికరాలు ఇచ్చి పంపుతున్నారు. ఫిర్యాదు చేసినా ఫలితం లేదు.. ఇటీవల రొద్దం మండలానికి చెందిన పలువురు రైతులు విద్యుత్ అధికారుల తీరుపై కలెక్టర్ శ్యాం ప్రసాద్‌కు ఫిర్యాదు చేసి ఆందోళన చేయడంతో అదే వారంలో కొంత మందికి ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చారు. రొద్దం మండలంలోని రొద్దం, కొత్తూరు దొడగట్ట తదితర గ్రామాల్లో ట్రాన్స్ఫార్మర్లు లేక వందలాది ఎకరాల్లో పంటలు ఎండుతుండగా.. ఇటీవల విద్యుత్ శాఖ కార్యాలయాన్ని రైతులు ముట్టడించి నిరసన తెలిపారు. వెంటనే ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెకమండేషన్ ఉంటే వెంటనే... కొత్తచెరువు మండలంలో ట్రాన్స్ఫార్మర్ల కోసం పలువురు రైతులు డిపాజిట్లు చెల్లించారు. కానీ రెకమండేషన్ ఉన్న కొందరు రైతులకే ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చారు. కొత్తచెరువు ఏఈ కేవలం టీడీపీ మద్దతుదారులకు రాత్రి వేళల్లో దొంగగా పరికరాలు అందజేస్తూ అర్హులైన రైతులకు అన్యాయం చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. మామూళ్లు సైతం రూ.50 వేలపైన ఇస్తే వెంటనే అన్ని సమకూరుతాయి. లేదంటే కొన్ని పరికరాలు ఇచ్చి తక్కినవి పెండింగ్ పెడుతున్నారు. ట్రాన్స్ఫార్మర్ల మంజూరు ఆలస్యంపై విద్యుత్ శాఖ డీఈ శివరాములును వివరణ కోరగా... త్వరలోనే అందరికీ అందజేస్తామని చెప్పారు. డిపాజిట్ కట్టినా ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేయని అధికారులు నెలల తరబడి విద్యుత్‌శాఖ కార్యాలయాల చుట్టూ రైతుల ప్రదక్షిణ పంటలు ఎండుతున్నా పట్టించుకోని వైనం మామూళ్లు ఇచ్చిన వారికి మాత్రం వెంటనే మంజూరు -
కసాపురంలో నేటి నుంచి హనుమజ్జయంతి వేడుకలు
గుంతకల్లు రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో హనుమజ్జయంతి ఉత్సవాలు ఆదివారం ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు సాగే ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈఓ మేడేపల్లి విజయరాజు తెలిపారు. ఉత్సవాల్లో తొలిరోజు ఆదివారం ఉదయం గణపతి పూజ, పుణ్యాహవచనం, మంటపారాధన, పంచగవ్యప్రాశన, గోపూజ, సుందరకాండ, మన్యుసూక్త పారాయణ తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సాయంత్రం ఉత్సవ మూర్తికి తమలపాకులతో లక్షార్చన నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేయనున్నారు. రెండో రోజు సోమవారం ఉదయం యథావిధిగా పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటలకు ఉత్సవ మూర్తికి సింధూరంతో లక్షార్చన పూజను నిర్వహించి తీర్థప్రసాదాల పంపిణీ చేయనున్నారు. చివరిరోజు మంగళవారం హనుమజ్జయంతి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. సాయంత్రం ఉత్సవ మూర్తికి లక్ష పుష్పాలతో అర్చన చేసి పూర్ణాహుతితో ఉత్సవాలు ముగించనున్నారు. -
భిక్షమడిగినందుకు స్టేషన్‌కు పిలిచారు!
లేపాక్షి: లేపాక్షిలోని వీరభద్రస్వామి దేవాలయం పరిసరాల్లో భిక్షాటన చేస్తూ జీవనం సాగించే వృద్ధ మహిళలను స్థానిక పోలీసుస్టేషన్ వద్ద గంటల తరబడి ఉంచుకోవడం చర్చనీయాంశంగా మారింది. భిక్షం అడిగినందుకే తమను పోలీసుస్టేషన్‌కు పిలిపించారని బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. వివరాలిలా ఉన్నాయి. శనివారం లేపాక్షి ఆలయ సందర్శనకు హిందూపురం డీఎస్పీ మహేష్ వచ్చారు. ఆయన్ను కొందరు వృద్ధ మహిళలు భిక్షమడిగారు. అయితే ఆయనకు అసౌకర్యం కలిగించారంటూ వారిని స్థానిక పోలీసుస్టేషన్‌కు పిలిపించారు. స్టేషన్ ప్రాంగణంలో గంటల తరబడి కూర్చోబెట్టారు. తాము కటిక పేదరికం కారణంగా భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నామని, తమను ఇలా స్టేషన్‌కు పిలిపించి ఇబ్బంది పెట్టడం బాధాకరమని బాధితులు వాపోయారు. వృద్ధాప్యంలో ఆదుకునే వారు లేక భిక్షాటన చేసి పొట్ట నింపుకుంటున్న వారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించడం సరికాదని స్థానికులు అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై ఎస్ఐ నరేంద్రను వివరణ కోరగా.. భిక్షాటన చేసే వారికి దిక్కులేకుంటే అనాథాశ్రమంలో చేర్పిస్తామని, బంధువులు ఉంటే వారిని పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తామని చెప్పారు. ఇందులో వారిని ఇబ్బంది పెట్టే ఉద్దేశం తమకు లేదన్నారు. డీఎస్పీకి అసౌకర్యం కల్గించారంటూ ఖాకీల చర్యలు వృద్ధ మహిళలను గంటల తరబడి స్టేషన్లో ఉంచడంపై సర్వత్రా విమర్శలు -
కిడ్నాప్ కలకలం
● కిడ్నాపర్ కదిరి ఎమ్మెల్యే కందికుంట అనుచరుడిగా గుర్తింపు ● ఓడీ చెరువు పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు ● పోలీసుల అదుపులో కిడ్నాపర్ షాబాజ్ కదిరి/ఓడీచెరువు: ఓడీ చెరువు మండలం బాబాసాహెబ్పల్లెలో శనివారం కిడ్నాప్ కలకలం రేపింది. గ్రామస్తులు ఒక్కటై ప్రతిఘటించారు. ఈలోగా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అంతలోగా కిడ్నాపర్లు కొందరు పారిపోగా, ప్రధాన నిందితుడు కదిరికి చెందిన వేముల షాబాజ్ పోలీసులకు పట్టుబడ్డాడు. ఇతను కదిరి టీడీపీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్‌తో దిగిన ఫొటోలను బట్టి ఆయన అనుచరుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితుడు మహబూబ్‌బాషా కథనం ప్రకారం... కదిరి–మదనపల్లి రోడ్డులో నాగిరెడ్డిపల్లి సమీపాన మహబూబ్‌బాషాకు 1.68 ఎకరాల భూమి ఉంది. దీన్ని ఇటీవల కదిరి ఎమ్మెల్యే కందికుంట అనుచరుడిగా భావిస్తున్న వేముల షాబాజ్‌కు రూ.30 లక్షలకు విక్రయించాడు. రూ.15 లక్షలు అడ్వాన్స్ తీసుకుని అగ్రిమెంట్ చేయించాడు. మిగిలిన రూ.15 లక్షలు ఇవ్వగానే రిజిష్టర్ చేయిస్తానని ఒప్పందం కుదుర్చుకున్నారు. మిగిలిన డబ్బు ఇవ్వకుండానే రిజిస్ట్రేషన్ చేయించాలని మహబూబ్‌బాషాను రెండు,మూడు సార్లు షాబాజ్ బలవంత పెట్టాడు. తనకు ఇవ్వాల్సిన మిగిలిన డబ్బు చెల్లిస్తేనే రిజిస్ట్రేషన్‌కు వస్తానని, లేదంటే మీరు అడ్వాన్స్‌గా ఇచ్చిన రూ.15 లక్షలు వాపసు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెబుతూ వచ్చాడు. ఈ క్రమంలోనే శనివారం కదిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ముందే మాట్లాడుకుని రిజిస్ట్రేషన్‌కు రంగం సిద్ధం చేశారు. షాబాజ్‌తో పాటు మరికొందరు ఒక వాహనంలో వెళ్లి మహబూబ్‌బాషాను బలవంతంగా తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని పథకం వేశారు. ఇందులో భాగంగా వారు బాబాసాహెబ్పల్లెకు వెళ్లి అతన్ని బలవంతంగా ఎత్తుకెళ్లాలని ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నారు.ఈలోగా పోలీసులు అక్కడికి చేరుకోవడంతో షాబాజ్ పట్టుబడగా, మిగిలిన వారు పరారయ్యారు. బాధితుడు మహబూబ్‌బాషా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు నల్లమాడ సీఐ శ్రీనివాసులు తెలిపారు. తాగునీటి సమస్యలు తలెత్తకూడదు ● యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశం ప్రశాంతి నిలయం: ‘‘వేసవిలో జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్యలు తలెత్తకూడదు. ఎక్కడైనా చిన్న చిన్న మరమ్మతు పనులు ఉంటే వెంటనే చేయించండి..ముందస్తు ప్రణాళికతో ముందుకు వెళ్లండి..పల్లెల్లో నీటి సరఫరా మరింత మెరుగు పరచండి’’ అని కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్షించారు. ఆర్డబ్ల్యూఎస్ వన్ యాప్, వాటర్ ట్రాన్స్‌పోర్టేషన్ రిపోర్టులను రోజూ అప్డేట్ చేయాలన్నారు. గ్రామాల వారీగా నీటి సరఫరాను పర్యవేక్షించాలన్నారు. నీటి కొరత ఉన్న చోట ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలన్నారు. అవసరమైతే ప్రైవేటు బోర్లను వినియోగించుకోవాలన్నారు. పైప్‌లైను, మోటర్లను వెంటనే మరమ్మత్తులు చేయించాలన్నారు. క్లోరినేషన్ ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలన్నారు. జిల్లాలో నిర్మాణంలో ఉన్న 271 కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్సులను పూర్తి చేయాలన్నారు. సమీక్షలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ మురళీధర్, గ్రామీణ నీటి పారుదల శాఖ అధికారులు, ఇంజినీర్లు పాల్గొన్నారు. టన్ను మామిడి రూ.32 వేలు అనంతపురం అగ్రికల్చర్: స్థానిక కక్కలపల్లి మార్కెట్లో శనివారం టన్ను మామిడి కాయలు గరిష్టంగా రూ.32 వేలు పలికినట్లు రాప్తాడు మార్కెట్ కమిటీ సెక్రటరీ రూప్‌కుమార్ తెలిపారు. మార్కెట్‌కు 358 టన్నుల మామిడికాయలు అమ్మకానికి రాగా, వాటిని వేలం వేశామన్నారు. అందులో బేనీషా రకం మామిడి టన్ను గరిష్టంగా రూ.32 వేలు, కనిష్టంగా రూ.20 వేల ప్రకారం ధర పలికాయన్నారు. తోతాపురి రకం టన్ను గరిష్టంగా రూ.30 వేలు, కనిష్టంగా రూ.15 వేలు పలికాయని, మల్లికా రకం టన్ను గరిష్టంగా రూ.25 వేలు, కనిష్టంగా రూ.10 వేల ప్రకారం ధర పలికినట్లు వెల్లడించారు. -
చతికిల బడి
నాడు–నేడు కింద సుందరంగా రూపుదిద్దుకున్న ఓడీ చెరువు మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలపుట్టపర్తి: ప్రభుత్వ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించడమే లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ‘ప్రైవేట్’కు పెద్ద పీట వేస్తూ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను నిర్వీర్యం చేస్తోంది. గత జగన్ సర్కార్‌లో జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 1,45,000 మంది విద్యార్థులు ఉండగా, చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఆ సంఖ్య గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం 1,02,500 మంది విద్యార్థులు మిగిలారు. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతిలో చేరికలు పూర్తిగా పడిపోయాయి. 163 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా చేరలేదంటే ఎంతగా చతికిలబడ్డాయో అర్థం చేసుకోవచ్చు. పాఠశాలల పునఃప్రారంభానికి నెలు రోజులే మిగిలి ఉన్నా చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటి వరకు 1వ తరగతి ప్రవేశాల కోసం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. దీంతో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రయివేట్ పాఠశాలల్లో చేరుస్తున్నారు. జగన్ హయాంలో మహర్దశ వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రభుత్వ పాఠశాలలు ఓ వెలుగు వెలిగాయి. నాడు–నేడుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలే మారిపోయాయి. బడులన్నీ సుందరంగా రూపుదిద్దుకున్నాయి. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ‘అమ్మ ఒడి’ పథకం ప్రవేశపెట్టి ప్రతి విద్యార్థికీ రూ.15 వేలు అందజేశారు. క్రమం తప్పకుండా పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. ‘జగనన్న గోరుముద్ద’తో నాణ్యమైన భోజనం అందించారు. వేసవి సెలవుల్లోనూ విద్యార్థుల ఇంటి వద్దనే చిక్కీలు పంపిణీ చేసేలా చర్యలు చేపట్టారు. అప్పట్లో ప్రవేశ పెట్టిన సంస్కరణలతో ప్రభుత్వ పాఠశాలల్లో ‘నో న్యూ అడ్మిషన్’ బోర్డులు కనిపించా యంటే పరిస్థితి ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. కానీ, చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. రకరకాల కొర్రీలతో ‘తల్లికి వందనం’ లబ్ధిదారులను తగ్గించేశారు. కొత్త కొత్త నిబంధనలు తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేస్తున్నారు. సర్వత్రా ఆందోళన చంద్రబాబు ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలు కూడా క్రమేపీ కనుమరుగువుతున్నాయి. జగన్ ప్రభుత్వ హయాంలో జిల్లాలో అన్ని ప్రభుత్వ పాఠశాలలు కలిపి 2,074 ఉండేవి. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే ప్రభుత్వ బడులపై నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రెండేళ్లలోనే చాలా పాఠశాలలు మూతపడ్డాయి. 2026–27 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ బడుల సంఖ్య 1,965కు పడిపోనుందనే ఆందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయాలతో రాబోవు రోజుల్లో పల్లెల్లో ప్రభుత్వ పాఠశాలలు కనుమరుగు కావడం ఖాయంగా కనిపిస్తోందని మేధావులు అభిప్రాయపడుతున్నారు. సర్కారు బడులకు చంద్రగ్రహణం 163 పాఠశాలల్లో ఒకటో తరగతి ప్రవేశాలు నిల్ కొత్త చేరికలపై ఎలాంటి చర్యలూ తీసుకోని చంద్రబాబు ప్రభుత్వం జగన్ ప్రభుత్వంలో వెలుగు వెలిగిన ప్రభుత్వ బడులు జిల్లాలో వివరాలిలా.. నియోజకవర్గం పేరు 1వ తరగతిలో విద్యార్థులు చేరని పాఠశాలల సంఖ్య పుట్టపర్తి 25 ధర్మవరం 18 కదిరి 47 హిందూపురం 12 పెనుకొండ 18 మడకశిర 28 రాప్తాడు 15 మొత్తం 163 టీచర్లపైనా ఒత్తిడి.. చంద్రబాబు ప్రభుత్వం టీచర్లపైనా ఒత్తిడి పెంచు తోంది. సాధారణంగా పాఠశాలల ప్రారంభంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు గ్రామాల్లో ప్రతి ఇంటి వద్దకూ వెళ్లి విద్యార్థులను పాఠశాలలో చేర్చాలని కోరడం జరుగుతుంది. కానీ, చంద్రబాబు ప్రభుత్వం అందుకు భిన్నంగా శిక్షణలు, బదిలీల పేరుతో ఉపాధ్యాయులపై తీవ్రమైన ఒత్తిడి పెంచింది. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు చేరకుండా కావాలనే చంద్రబాబు ఇలా చేస్తోందని, ప్రభుత్వానికి కొమ్ముకాస్తున్న ప్రైవేటు విద్యా సంస్థలలో చేరే విధంగా పెద్ద కుట్రకు తెరలేపిందనే విమర్శలున్నాయి. -
రూ.100 కోట్ల భూమిపై మంత్రి సవిత అనుచరుల కన్ను
సాక్షి, పుట్టపర్తి: అధికారాన్ని అడ్డు పెట్టుకుని రాష్ట్ర మంత్రి సవిత అనుచరులు రూ.100 కోట్లు విలువ చేసే భూమిని కాజేసేందుకు పన్నాగం పన్నారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం గౌనివారిపల్లి సర్వే నంబరు 409లోని 97.5 ఎకరాల భూమిని రైతుల నుంచి బలవంతంగా లాక్కుని పంజాబ్‌కు చెందిన వారికి అమ్మి, ఆ తర్వాత ఓ ప్రైవేటు కాలేజీకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. బాధిత రైతులు ఆ భూమి తమదేనని కలెక్టరేట్లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయట పడింది. దీంతో ఫిర్యాదు చేసిన రైతులను మంత్రి అనుచరులు బెదిరించినట్లు తెలిసింది. మంత్రి అండదండలు ఉండటంతో కబ్జాదారుల ఆగడాలను అధికారులు పట్టించుకోవడం లేదు. ఆన్లైన్లో తొలగించి.. ఆ తర్వాత బెదిరించి.. సర్వే నంబరు 409లోని 97.5 ఎకరాల భూమి కరణం రామప్పగారి కొండప్ప, కరణం నానెప్ప గారి వెంకటరామప్ప అనే ఇద్దరికి సంబంధించినది. 1987లో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం (17–1406, 18–4106) ఆ భూమిని 39 మంది పేద రైతులకు పంచి పెట్టారు. నిబంధనల ప్రకారం ల్యాండ్ సీలింగ్‌లో ఉన్న భూమిని ఎవరూ కొనకూడదు, అమ్మకూడదు. కానీ, మంత్రి సవిత అనుచరులు ఈ భూమిని రైతుల నుంచి కాజేసి ఓ ప్రైవేటు కాలేజీకి అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కొందరికి కొంత మొత్తం ముట్టజెప్పి పంజాబ్ కంపెనీ పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు.అమ్మడానికి ముందుకు రాని రైతులను బెదిరించారు. ఆ రైతుల భూముల వివరాలను ఆన్లైన్లో తొలగించారు. ఇప్పటికే కొన్ని మ్యుటేషన్లు కూడా పూర్తి చేసినట్లు తెలిసింది. ‘తిరిగి భూమి పొందే అవకాశం లేదు. ఇచి్చనంత తీసుకుని సంతకాలు పెట్టాలి’ అంటూ కొందరు టీడీపీ నేతలు రైతులను బెదిరించినట్లు తెలిసింది. దీంతో దిక్కుతోచని స్థితిలో బాధిత రైతులు కలెక్టర్‌ను ఆశ్రయించారు. అయినా ఇప్పటి వరకు ఎలాంటి ఫలితమూ లేదు.కాలేజీకి అమ్మి కమీషన్ తీసుకోవాలనిల్యాండ్ సీలింగ్‌లో ఉన్న 97.5 ఎకరాలను పంజాబ్ కంపెనీ పేరిట రిజిస్ట్రేషన్ చేసి.. ఆ తర్వాత వారి నుంచి పక్కనే ఉన్న ఓ ప్రైవేటు కాలేజీకి అమ్మి రూ.కోట్లలో కమీషన్ తీసుకోవాలని టీడీపీ నాయకులు ఈ భూ దందాకు తెరలేపారు. మంత్రి సవిత అండ చూసుకుని అధికారులపై కూడా పెత్తనం చేస్తున్నట్లు తెలుస్తోంది. ల్యాండ్ సీలింగ్ భూమిని విక్రయించకూడదు. అయినా ఈ భూమిని కొనడమే కాకుండా, కొంత భూమిని రిజిస్ట్రేషన్ కూడా చేశారు. ఎవరి ప్రోద్బలంతో అధికారులు రిజిస్ట్రేషన్ చేశారనేది సస్పెన్స్‌గా మారింది. -
దమ్ముంటే అడ్డుకోండి చూద్దాం!
‘ప్రభుత్వం మాది. ఇక్కడ మేము ఏమి చేసినా చెల్లుతుంది. దమ్ముంటే మమ్మల్ని అడ్డుకోండి.. చూద్దాం’ అంటూ అధికారులకే సవాల్ విసురుతున్నారు కొందరు టీడీపీ నేతలు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి జిల్లాలో నెలకొన్న పరిస్థితి ఇది. అధికారాన్ని అడ్డు పెట్టుకుని వారు సాగిస్తున్న ఆకృత్యాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. సహజ వనరులపై కన్నేసిన వారు చెరువులు, వాగులు, వంకలతో పాటు చివరకు ప్రభుత్వ భూముల్లోని ఎర్రమట్టినీ వదలడం లేదు. రాప్తాడు నియోజకవర్గంలో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా ఉంది. రాప్తాడు రూరల్: అనంతపురం రూరల్ మండలంలో సహజ వనరుల దోపిడీ రోజురోజుకూ పెచ్చుమీరుతోంది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన ఈ రెండేల్లలో చియ్యేడు, పూలకుంట, మన్నీల, కృష్ణమరెడ్డిపల్లి ప్రాంతాల నుంచి భారీగా గ్రావెల్, ఎర్రమట్టిని అక్రమంగా తరలిస్తున్నా సంబంధిత శాఖల అధికారులు అడ్డుకోలేకపోతుండడం విమర్శలకు తావిస్తోంది. ప్రజల ఆస్తిగా భావించాల్సిన సహజ వనరులను చేజిక్కించుకున్న కొందరు.. వాటిని రూ.కోట్ల విలువైన అక్రమ వ్యాపారంగా మార్చేశారు. స్థానికుల ఫిర్యాదులు బుట్టదాఖలు గతం నుంచి సహజ వనరుల దోపిడీనే ఆదాయ వనరుగా మార్చుకున్న టీడీపీ నేతలు.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఐదేళ్లూ కిమ్మనకుండా ఉండిపోయారని, తిరిగి చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్రమ తవ్వకాలు పెరిగిపోయాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. తాము చేసిన ఫిర్యాదులు కాస్త బుట్టదాఖలవుతున్నాయని అంటున్నారు. రేయింబవళ్లు టిప్పర్లతో గ్రావెల్, ఎర్రమట్టిని తరలిస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూగర్భ గనుల శాఖ అధికారులు నామమాత్రపు తనిఖీలతో చిన్నపాటి జరిమానాలు విధిస్తూ చేతులు దులుపుకుంటున్నారని మండిపడుతున్నారు. ప్రభుత్వ భూమినీ వదలని వైనం తాజాగా రెండు రోజుల క్రితం కృష్ణమరెడ్డిపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 90/3 లో జగనన్న కాలనీకి కేటాయించిన స్థలంలో అక్రమంగా మట్టిని తవ్వడం కలకలం రేపుతోంది. ప్రభుత్వ అవసరాల కోసం కేటాయించిన స్థలంలో మట్టిని తవ్వి, ఇటుకలపల్లి సమీపంలో డంప్ చేసి అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ వ్యవహారంలోని ప్రధాన సూత్రధారులు తమ వెనుక రాప్తాడు నియోజకవర్గానికి చెందిన కొందరు ముఖ్య నాయకులు ఉన్నారంటూ వారి పేర్లు చెబుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో గ్రామస్తులు కూడా బహిరంగంగా మాట్లాడలేకపోతున్నారు. కృష్ణమరెడ్డిపల్లికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఈ మట్టితరలింపు వ్యవహారంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లుగా సమాచారం. పోలీసులు, విజిలెన్స్, భూగర్భ గనుల శాఖ అధికారుల నుంచి కఠిన చర్యలు లేకపోవడంతో మరింత రెచ్చిపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గ్రావెల్, ఎర్ర మట్టి అక్రమ తవ్వకాలపై ప్రత్యేక దర్యాప్తు నిర్వహించాలని, బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి యథేచ్చగా సహజ వనరుల దోపిడీ టీడీపీ నేతల ఒత్తిళ్లతో అటుగా కన్నెత్తి చూడని అధికారులు ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తిన సమయంలో నామమాత్రపు చర్యలు -
ముగ్గురు హోంగార్డులపై వేటుకు రంగం సిద్ధం!
గుత్తి: స్థానిక పీఎస్ పరిధిలో పని చేస్తున్న ముగ్గురు హోంగార్డులపై వేటుకు పోలీసు ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. వారిని అనంతపురం హెడ్ క్వార్టర్స్‌లో రిపోర్టు చేయాలని శుక్రవారం రాత్రి ఆదేశాలు జారీ అయ్యాయి. వ్యభిచార నిర్వాహకులతో సన్నితంగా ఉంటూ అవినీతి, అక్రమాలు, బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారనే కారణంతో హెడ్ క్వార్టర్స్‌ను నుంచి పిలుపు వచ్చినట్లు సమాచారం. వీఆర్వో సస్పెన్షన్ తాడిపత్రి రూరల్: లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన తాడిపత్రి మండలం సజ్జలదిన్నె వీఆర్వో రామకృష్ణపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు ఉత్తర్వులను కలెక్టర్ ఓ.ఆనంద్ ఈ నెల 2న జారీ చేసినట్లు తహసీల్దార్ కార్యాలయ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. ఓ రైతుకు చెందిన భూమిని ఆన్లైన్లో ఎక్కించేందుకు గత నెల 29న వీఆర్వో రామకృష్ణ రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన విషయం తెలిసిందే. అశ్వవాహనంపై శ్రీవారు రాయదుర్గం టౌన్: స్థానిక కోటలో వెలసిన ప్రసన్న వేంకటరమణస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం శ్రీవారి పార్వేట ఉత్సవం, అశ్వవాహనోత్సవం కనులపండువగా సాగింది. ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా భక్తులకు వేంకటరమణస్వామి దర్శనమిచ్చారు. రాయదుర్గం రెడ్డి సంక్షేమ సంఘం, ఆరెకటిక, నాయీబ్రాహ్మణ, ఈడిగ సంఘాల ఆధ్వర్యంలో సాగిన ఈ ఉత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం వసంతోత్సవం, సాయంత్రం మయూర వాహన సేవలు ఉంటాయని ఈఓ నరసింహారెడ్డి తెలిపారు. -
బాబోయ్ ఇదెక్కడి చోద్యం!
పుట్టపర్తి టౌన్: రోడ్డు నిర్మాణ పనుల్లో గతంలో ఎన్నడూ లేని కొత్త సంస్కృతికి కాంట్రాక్టర్ శ్రీకారం చుట్టాడు. దీనికి రోడ్లు భవనాల శాఖ అధికారులు వత్తాసు పలికారు. సాధారణంగా రోడ్డు నిర్మించాక రెన్యువల్ పనులు ఐదేళ్ల పాటు చేస్తారు. ఈ క్రమంలో పాత రోడ్డు మీద తారు, బిటుమిన్‌తో కొత్త లేయర్ వేస్తుంటారు. అయితే పుట్టపర్తిలో మాత్రం ఇందుకు విరుద్ధంగా పనులు సాగుతున్నాయి. గత ఏడాది నవంబర్‌లో వేసిన రోడ్డును పూర్తిగా పెకలించి అవశేషాలను పక్కన పరుస్తూ మధ్యలో కొత్తగా రోడ్డు నిర్మాణం చేపట్టారు. వాస్తవానికి కొత్తగా వేసిన రోడ్డుకు పక్కన గ్రావెల్ పరిచి చదును చేయాల్సి ఉండగా ఇందుకు విరుద్ధంగా కాంట్రాక్టర్ చేపట్టిన పనులను అధికారులు చూస్తూ మిన్నకుండి పోయారు. పట్టుమని ఏడు నెలలు తిరక్కుండానే భగవాన్ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా గత ఏడాది నవంబర్‌లో రూ.2.20 కోట్ల వ్యయంతో సత్యసాయి సూపర్ ఆస్పత్రి నుంచి బ్రాహ్మణపల్లి, ఎనుములపల్లి క్రాస్ మీదుగా గణేష్ కూడలి వరకూ తారు రోడ్డు వేసే పనిని ఓ కాంట్రాక్టర్‌కు రోడ్లు భవనాల శాఖ అప్పగించింది. ఈ పనులు కొద్ది మేర మిగిలి ఉన్నాయి. ఇక్కడ వరకూ అంతా బాగున్నా... ఈ నెల 15న పుట్టపర్తిలో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు పర్యటించనున్న నేపథ్యంలో ఈ మార్గంలో మరోసారి తారు రోడ్డు వేసేందుకు అధికారుల నుంచి ఒత్తిళ్లు మొదలు కావడంతో కాంట్రాక్టర్ హడావుడిగా పనులు చేపట్టాడు. కొత్త రోడ్డు వేసే క్రమంలో పాత రోడ్డును పిక్కింగ్ చేయాల్సి ఉండగా ఇందుకు విరుద్ధంగా మొత్తం తారు రోడ్డును పెకలించేశాడు. అనంతరం దానిని ముక్కలుగా చేసి కొత్త రోడ్డుకు పక్కగా పరిచేశాడు. వాస్తవానికి వాహనాలు దిగి, ఎక్కేందుకు వీలుగా కొత్త రోడ్డు ఎత్తుకు సరిపడేలా గ్రావెల్ పరచాల్సి ఉంది. ఇందుకు విరుద్ధంగా తారు కంకర ముక్కలు పరిచేయడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఖర్చు తగ్గించుకునే క్రమంలో కాంట్రాక్టర్ పెడదారి పట్టినా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి నూతన రోడ్డుకు ఇరువైపులా గ్రావెల్ వేసి చదను చేయించాలని స్థానికులు కోరుతున్నారు. కొత్త రోడ్డు నిర్మాణంలో పాత రోడ్డు అవశేషాలు నిబంధనలకు విరుద్ఢంగా పనులు కాంట్రాక్టర్ పనితీరుపై అవాక్కవుతున్న ప్రజలు -
కవి మాణిక్యం ఇషాక్‌కు సింగపూర్‌లో సన్మానం
పుట్టపర్తి: రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, కొత్తచెరువు మండలం బండ్లపల్లి జెడ్పీహెచ్ఎస్లో తెలుగు పండితుడిగా పనిచేస్తున్న కవి మాణిక్యం ఇషాక్‌కు సింగపూర్‌లో ఘన సన్మానం లభించింది. సింగపూర్ విద్య అధ్యయనంపై ఈ నెల 2న పలువురు ఉపాధ్యాయులను రాష్ట్ర ప్రభుత్వం అక్కడకు పంపిన విషయం తెలిసిందే. ఈ అధ్యయనం శుక్రవారంతో ముగిసింది. ముగింపు రోజున సింగపూర్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఎన్ఐఈ)లో జరిగిన కార్యక్రమంలో తాను రాసిన ‘మాణిక్య శతకం’ పుస్తకాన్ని ప్రముఖుల చేతుల మీదుగా ఆయన ఆవిష్కరింపజేశారు. ఇషాక్ రాసిన పాటలను వీడియో రూపంలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు ఆయనతో పాటు ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ వెంకటకృష్ణారెడ్డిని నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. రాష్ట్రం నుంచి తరలివెళ్లిన 37 మంది ఉపాధ్యాయులతో పాటు ఎస్సీఈఆర్టీ అధికారులు వెంకటరమణ, మహేశ్వర్‌రెడ్డి, జిల్లా రచయితల సంఘం అద్యక్షుడు జాబిలి చాంద్‌బాషా తదితరులు పాల్గొన్నారు. -
కిరణ్‌కుమార్‌కు ఆ అర్హత లేదు
కదిరి: ‘‘కిరణ్‌కుమార్‌కు మన్సిపల్ కమిషనర్‌గా ఉండే అర్హత లేదు. హార్టికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్న ఆయన్ను నిబంధనలకు విరుద్ధంగా మళ్లీ కదిరి కమిషనర్‌గా కొనసాగిస్తూ ఆదేశాలిస్తే హార్టికల్చర్ శాఖ అభ్యంతరం చెప్పాలి. సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీ కమిషనర్‌గా హార్టికల్చర్ ఏడీని నియమించడం సరికాదు. ఆయన డిప్యుటేషన్ కూడా చెల్లదు’’ అంటూ హైకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. కదిరి మున్సిపల్ కమిషనర్‌గా కిరణ్‌కుమార్‌ను నిబంధనలకు విరుద్ధంగా నియమించారని, ఆయన నియామకాన్ని రద్దు చేయాలని గతంలోనే శివశంకర్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ శుక్రవారం విచారణకు రాగా, న్యాయమూర్తి వి.సుజాత కీలక వ్యాఖ్యలు చేశారు. హార్టికల్చర్ ఏడీగా ఉన్న కిరణ్‌కుమార్‌ను డిప్యుటేషన్‌పై కదిరి మున్సిపల్ కమిషనర్‌గా నియమించడం సరికాదని అభిప్రాయపడ్డారు. కదిరి మున్సిపాలిటీలో ఈయన హయాంలో జరిగిన అవినీతిపై వచ్చిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకొని విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. అలాగే కిరణ్‌కుమార్ అదనంగా పొందిన జీత భత్యాలను సైతం తిరిగి రాబట్టాలని ఆదేశించారు. ఒకవేళ మళ్లీ ఆయననే కదిరి మున్సిపల్ కమిషనర్‌గా నియమిస్తే హైకోర్టు తలుపు తట్టవచ్చని పిటిషనర్ శివశంకర్‌కు హైకోర్టు న్యాయమూర్తి సూచించారు. కాగా, ఇప్పటికే కిరణ్‌కుమార్‌ను కదిరి కమిషనర్ బాధ్యతలనుంచి తప్పించి, మాతృశాఖకు పంపించేశారని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. కొత్త కమిషనర్‌గా అజయ్? కదిరి మున్సిపల్ కమిషర్‌గా ఉన్న కిరణ్‌కుమార్‌ను తప్పించి ఆయన స్థానంలో ఇక్కడే ఏఈగా ఉన్న సందీప్‌కు కమిషనర్‌గా పూర్తి స్థాయి బాధ్యతలు ఇస్తూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. తనకు ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ అండదండలున్నాయని, మళ్లీ తానే కమిషనర్‌గా వస్తానని కిరణ్‌కుమార్ ధీమాగా ఉన్నా.. హైకోర్టు ఆదేశాలతో ఆయన ఇక్కడ తట్టా, బుట్టా సర్దుకోవాల్సిందే. కాగా కొత్త కమిషనర్‌గా ఆడిట్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్న అజయ్ కుమార్ రావచ్చని విశ్వసనీయ సమాచారం. కదిరి మున్సిపల్ కమిషనర్ విషయంలో హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణకు ఆదేశం కిరణ్‌నే మళ్లీ నియమిస్తే కోర్టు తలుపు తట్టాలని పిటిషనర్‌కు సూచన -
ఈతకు వెళ్లి విద్యార్థి మృతి
వజ్రకరూరు: మండలంలోని కొనకొండ్ల గ్రామానికి చెందిన వడ్డె కిష్టప్ప, రమాదేవి దంపతుల కుమారుడు ప్రవీణ్ (15) ఈతకని వెళ్లి నీట మునిగి మృతి చెందాడు. గుంతకల్లులోని ప్రైవేట్ పాఠశాలలో ఇటీవల తొమ్మిదో తరగతి పూర్తి చేసుకుని, వేసవి సెలవులు కావడంతో ఇంటిపట్టునే ఉంటున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం స్నేహితులతో కలిసి గ్రామ శివారున ఉన్న బావిలోకి ఈత కొట్టేందుకు వెళ్లాడు. సరదాగా ఈత కొడుతూ నీటి అడుగు భాగానికి చేరుకున్న ప్రవీణ్ అక్కడే పూడికలో ఇరుక్కుపోయాడు. ఎంత సేపటికీ బయలకు రాకపోవడంతో కంగారు పడిన స్నేహితుల సమాచారంతో అక్కడే ఉన్న గ్రామస్తులు వెంటనే బావిలో దిగి బాలుడిని వెలికి తీసి ఆగమేఘాలపై మాజీ ఎంపీపీ రామచంద్ర ద్విచక్ర వాహనంలో గుంతకల్లులోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే బాలుడు మృతిచెందినట్లు నిర్ధారించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రవీణ్ (ఫైల్) -
లంచం కేసులో పీఆర్ ఏఈకి ఏడేళ్ల జైలు
అనంతపురం సెంట్రల్: సీసీ రోడ్డు నిర్మాణానికి ఎంబుక్‌లను ప్రాసెస్ చేసి బిల్లు మంజూరు చేయడానికి లంచం తీసుకున్న కేసులో పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ బండారు చిన్నపుల్లయ్యకు కర్నూలు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి శ్రీవిద్య ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.2 లక్షల జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు వెలువరించారు. వివరాలు... 2018 సంవత్సరంలో అమడగూరు మండలం సీతిరెడ్డిపల్లిలో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. అయితే ఎంబుక్‌లను ప్రాసెస్ చేసి బిల్లుల మంజూరుకు అప్పటి పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ చిన్నపుల్లయ్య (ప్రస్తుతం రిటైర్డ్) రూ.20 వేలు లంచం డిమాండ్ చేశారు. బాధితుడు వెంకటనారాయణపల్లికి చెందిన లక్ష్మీపతి 2018 అక్టోబర్ 8న అనంతపురం ఏసీబీ డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. లంచం తీసుకుంటుండగా చిన్న పుల్లయ్యను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. కేసు విచారణ అనంతరం కర్నూలు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి శ్రీవిద్య తీర్పు వెలువరించారు. చిన్నపుల్లయ్యకు ఏడు సంవత్సరాల కఠిన కారాగారశిక్ష, రూ.2 లక్షల జరిమానా విధించారు. జరిమానా డబ్బులు చెల్లించలేకపోతే అదనంగా 6 నెలలు సాధారణ జైలు శిక్ష అనుభవించాలన్నారు. జరిమానా మొత్తంలో రూ.2 లక్షలను ఫిర్యాదుదారునికి నష్టపరిహారంగా చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. అనంతరం ముద్దాయిని కర్నూలు శివారులోని జిల్లా జైలుకు తరలించారు. -
చదువు మానేయలేక.. బాలిక ఆత్మహత్య
గార్లదిన్నె: తల్లిదండ్రులు పెళ్లి ప్రయత్నం చేస్తుండడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం చేసిన బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు తెలిపిన మేరకు.. గార్లదిన్నె మండలం మర్తాడు గ్రామానికి చెందిన రాజేశ్వరి, రామాంజనేయుల దంపతుల కుమార్తె రూపకీర్తన(17) అనంతపురంలోని వివేకానంద జూనియర్ కళాశాలలో ఇంటర్ (ఎంపీసీ) మొదటి సంవత్సరం చదువుతోంది. ఇటీవల రాసిన పరీక్షల్లో ఆమె ఉత్తీర్ణత సాధించింది. వేసవి సెలవులు కావడంతో ఇంటి పట్టునే ఉంటోంది. ఈ నేపథ్యంలో మంచి సంబంధం వస్తే పెళ్లి చేసేద్దామని తల్లిదండ్రులు మాట్లాడుకుంటుండగా విన్న ఆమె అందుకు అభ్యంతరం తెలిపింది. తాను చదువుకుంటానని, ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని తెలిపింది. దీంతో తల్లిదండ్రులు సర్ది చెప్పి ఇప్పట్లో పెళ్లి చేయబోమని, మంచి సంబంధాలు ఏమైనా ఉన్నాయోనని మాట్లాడుకుంటున్నట్లు తెలిపారు. అయినా తనకు పెళ్లి చేస్తారేమోననే భయంతో బాలిక ఈ నెల 6న ఇంట్లోనే గడ్డి నివారణకు ఉపయోగించే మందు తాగింది. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే అనంతపురంలోని ఓప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం బాలిక మృతి చెందింది. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు గార్లదిన్నె పోలీసులు తెలిపారు. -
విద్యుదాఘాతంతో డ్రైవర్ మృతి
గోరంట్ల: విద్యుత్ షాక్‌కు గురై తమిళనాడుకు చెందిన కంటైనర్ డ్రైవర్ మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. పాలసముద్రం నుంచి కదిరి వైపుగా ఖాళీగా శుక్రవారం బయలుదేరిన కంటైనర్ గోరంట్ల సమీపంలోకి చేరుకోగానే ఏఎన్‌కే డిగ్రీ కళాశాల వద్ద రోడ్డు పక్కన ఆపేందుకు డ్రైవర్ ప్రయత్నించాడు. ఆ సమయంలో పైనున్న విద్యుత్ తీగలు తగిలి కంటైనర్‌కు విద్యుత్ ప్రసరించి మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు కేకలు వేయడంతో డ్రైవర్ వెంటనే కిందకు దిగి కాలుతున్న టైర్లపై నీరు చల్లే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. లభ్యమైన ఆధారాలను బట్టి మృతుడిని తమిళనాడుకు చెందిన ప్రదీప్ (27)గా నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చోరీ కేసుల్లో నిందితుడికి రిమాండ్ గాండ్లపెంట: మండలంలోని కటారుపల్లిలో వెలసిన గంగమ్మ ఆలయం, సాదులవాండ్లపల్లిలోని బొగాదమ్మ ఆలయంలో చొరబడి హుండీలోని భక్తుల కానుకలను అపహరించిన కేసులో నిందితుడు కరుణాకర్‌రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ సుమతి తెలిపారు. తలుపుల మండలం మామిళ్లపల్లికి చెందిన కరుణాకర్‌రెడ్డి.. ఈ నెల 1న రెండు ఆలయాల్లోనూ చోరీలకు పాల్పడినట్లు వివరించారు. ఆయా ఘటనలపై కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా పక్కా ఆధారాలు సేకరించి శుక్రవారం కదిరిలోని కోర్టు రోడ్డులో తచ్చాడుతున్న నిందితుడిని అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాలతో రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. పాము కాటుతో రైతు మృతి కనగానపల్లి: మండలంలోని తల్లిమడుగుల గ్రామానికి చెందిన రైతు ఈడిగ వన్నూరప్ప (53) పాముకాటుకు గురై మృతి చెందాడు. ఆయనకు భార్య యల్లమ్మ, ఓ కుమారుడు ఉన్నారు. శుక్రవారం తెల్లవారుజామున పంటకు నీరు పెట్టేందుకు వెళ్లిన ఆయన పొలం గట్టుపై తిరుగుతుండగా పాము కాటేసింది. ఆ సమయంలో తన కాలికి ఏదో గుచ్చుకుందని భావించిన ఆయన ఇంటికి వెళ్లిపోయాడు. కాసేపటి తర్వాత నోటి నుంచి బురుగు వస్తుండడంత గమనించిన కుటుంబసభ్యులు ఆగమేఘాలపై ధర్మవరంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు పాము కాటుతో అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. చైన్ స్నాచర్ అరెస్ట్ శింగనమల(నార్పల): ఈ నెల 5న నార్పలలోని సుల్తాన్‌పేటలో చైన్‌స్నాచింగ్‌కు పాల్పడిన బ్రహ్మసముద్రం మండలం రాయలప్పదొడ్డికి చెందిన రాయల తరేష్ని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించినట్లు నార్పల పీఎస్ ఎస్ఐ సాగర్ తెలిపారు. వివరాలను శుక్రవారం ఆయన వెల్లడించారు. ఒంటరిగా వెళుతున్న మహిళలకు కత్తి చూపి బెదిరించి, వారి మెడలోని బంగారు గొలుసులను లాక్కొని ఉడాయించేవాడు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 5న సుల్తాన్‌పేటలో ఒంటరిగా వెళుతున్న నంద్యాల నరసమ్మ మెడలోని బంగారు గొలుసు లాక్కొని ఉడాయించాడు. ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు పక్కా ఆధారాలతో శుక్రవారం నిందితుడిని అదుపులోకి తీసుకుని బంగారు గొలుసు, ద్విచక్ర వాహనం, కత్తిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. -
ఏడాదిగా తిప్పుతున్నారు
నా భర్త ఏడాది క్రితం చనిపోయాడు. ఆయన పేరుమీద ఉన్న పాసుబుక్కు నా పేరుమీద మార్చాలని ఏడాదిగా తిరుగుతున్నా. మాకు 6 ఎకరాలంటే కేవలం 4 ఎకరాలు మాత్రం 1–బీలో ఎక్కించారు. కానీ పాసుబుక్కు మాత్రం ఇవ్వలేదు. మిగిలిన రెండెకరాలు 1–బీలో కూడా నమోదు చేయలేదు. బ్యాంకులో అప్పు తీసుకుందామని పోతే పాసుబుక్కు అడుగుతున్నారు. – శ్యామలమ్మ, పులిమివాండ్లపల్లి, నల్లచెరువు మండలం రైతుల ఉసురు తగలక తప్పదు ఈ ప్రభుత్వానికి రైతుల ఉసురు తగులుతుంది. వైఎస్ జగన్ సర్కార్ క్యూఆర్ కోడ్‌తో ట్యాంపరింగ్‌కు అవకాశం లేకుండా పాసుపుస్తకం ఇచ్చింది. దానిపై జగన్ ఫొటో ఉందనే ఒకే ఒక్క కారణంతో ఈ ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురి చేస్తోంది. రీ సర్వే విషయంలో గగ్గోలు చేసిన చంద్రబాబు.. చివరకు జగన్‌ను అనుసరించక తప్పలేదు. –ఉషశ్రీ చరణ్, జిల్లా అధ్యక్షురాలు, వైఎస్సార్ సీపీ ప్రతి రైతుకు ఇస్తాం రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో ఇప్పటికే పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశాం. తప్పులున్న వాటిని సరిదిద్దేందుకు కొన్నిచోట్ల వెనక్కు తీసుకున్నాం. కొత్త పాసుపుస్తకాలు చైన్నెలో ప్రింట్ చేస్తున్నారు. అక్కడి నుంచి రాగానే రైతులకు అందజేస్తాం. భూమి ఉన్న ప్రతి రైతుకూ కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలు అందిస్తాం. – మౌర్య భరద్వాజ్, జాయింట్ కలెక్టర్ -
టన్ను మామిడి రూ.52 వేలు
అనంతపురం అగ్రికల్చర్: స్థానిక కక్కలపల్లి మార్కెట్లో శుక్రవారం టన్ను మామిడికాయలు గరిష్టంగా రూ.52 వేలు పలికినట్లు రాప్తాడు మార్కెట్ కమిటీ సెక్రటరీ రూప్‌కుమార్ తెలిపారు. మార్కెట్‌కు 420 టన్నులు అమ్మకానికి రాగా, వాటిని వేలం వేశారన్నారు. అందులో బేనీషా రకం మామిడి టన్ను గరిష్టంగా రూ.52 వేలు, కనిష్టంగా రూ.20 వేలు, సరాసరిన రూ.35 వేల ప్రకారం ధర పలికాయన్నారు. మల్లికా రకం మామిడి కాయలు టన్ను గరిష్టంగా రూ.48 వేలు, కనిష్టంగా రూ.20 వేలు, సరాసరిన రూ.30 వేలు పలికాయని తెలిపారు. ఇక హిమాయత్ రకం మామిడికాయలు టన్ను గరిష్టంగా రూ.41 వేలు, కనిష్టంగా రూ.15 వేలు, సరాసరిన రూ.25 వేల ప్రకారం క్రయ విక్రయాలు జరిగినట్లు మార్కెట్ కమిటీ సెక్రటరీ రూప్‌కుమార్ వెల్లడించారు. ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదల అనంతపురం: ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో లేటరల్ ఎంట్రీ కింద అడ్మిషన్లు పొందడానికి నిర్వహించిన ఏపీ ఈసెట్ (ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్–2026) ఫలితాలు విడుదలయ్యాయి. జిల్లాలో 90.60 శాతం, శ్రీ సత్యసాయి జిల్లాలో 91.33 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. జిల్లాలో 1,541 మంది అబ్బాయిలు పరీక్ష రాయగా, 1,389 మంది (90.14 శాతం), అమ్మాయిలు 736 మంది రాయగా, 674 మంది (91.58 శాతం) ఉత్తీర్ణులయ్యారు. శ్రీ సత్యసాయి జిల్లాలో 122 మంది అబ్బాయిలు పరీక్ష రాయగా, 107 మంది (87.70 శాతం), అమ్మాయిలు 74 మంది రాయగా, 72 (97.30 శాతం) మంది అర్హత సాధించారు. ఎంజేపీ స్కూళ్లలో ప్రవేశాలు ప్రశాంతి నిలయం: జిల్లాలోని 11 మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతిలో (2026–27 విద్యా సంవత్సరం) ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. తొలివిడతలో 5వ తరగతిలో చేరేందుకు అర్హత సాధించిన విద్యార్థులు ఈ నెల 15వ తేదీ లోపు సంబంధిత పాఠశాలలో అడ్మిషన్ పొందాలని జిల్లా కన్వీనర్, ప్రిన్సిపాల్ జమున బాయి శుక్రవారం ఒక ప్రకటనలో సూచించారు. విద్యార్థులు తమ వెంట అవసరమైన ధ్రువీకరణ పత్రాలను తీసుకురావాలన్నారు. పూర్తి వివరాలకు 9440111302 నంబరులో సంప్రదించాలన్నారు. -
వ్యక్తి బలవన్మరణం
పరిగి: మండలంలోని శీగిపల్లికి చెందిన ఈడిగ శ్రీనివాసులు(40) ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామనికి చెందిన బోయ అనితను 2007లో కులాంతర వివాహం చేసుకున్నాడు. ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబసభ్యులు తెలిపిన మేరకు... వివాహం అనంతరం శ్రీనివాసులు తన భార్యతో కలిసి బెంగళూరులో నివాసముంటూ అక్కడే పెయింటింగ్ పనులతో జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల దంపతుల మధ్య మనస్పర్థలు చోటు చేసుకుని తరచూ గొడవపడేవారు. దీంతో శ్రీనివాసులు మద్యానికి బానిసయ్యాడు. ఈ నెల 3న దంపతులిద్దరూ శీగిపల్లికి వచ్చారు. అదే రోజు అనిత బెంగళూరుకు తిరిగి వెళ్లింది. గురువారం రాత్రి భోజనం అనంతరం ఇంటి పైనున్న గదిలో పడుకుంటానంటూ కుటుంబసభ్యులకు తెలిపి శ్రీనివాసులు వెళ్లాడు. శుక్రవారం ఉదయం 10 గంటలైనా కిందకు దిగి రాకపోవడంతో తల్లి వెళ్లి తలుపు తట్టింది. ఎలాంటి స్పందన లేకపోవడంతో కిటికీలో నుంచి చూసింది. అప్పటికే లుంగీతో ఫ్యాన్‌కు వేసుకున్న ఉరికి విగతజీవిగా వేలాడుతున్న కుమారుడిని చూసి గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి తల్లి ఈడిగ రత్నమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
మొదటి హత్యను బయటపెట్టిన రెండో హత్య
● దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన సంచలనాలు రాప్తాడు రూరల్: ఓ హత్య కేసు దర్యాప్తులో అంతకు ముందు చేసిన హత్య బయటపడడంతో పోలీసులు అవాక్కయ్యారు. వివరాలను రాప్తాడు సీఐ వెంకటేశులు శుక్రవారం వెల్లడించారు. అనంతపురం రూరల్ మండలం సిండికేట్‌నగర్‌లో నివాసం ఉంటున్న రాధ (53), చెరుకూరి ఆదినారాయణ కొంతకాలంగా సహజీవనం సాగిస్తున్నారు. రాధ కుమారుడు సందీప్‌కుమార్ చౌదరి తన భార్యతో కలిసి బెంగళూరులో నివాసముంటున్నాడు. అలాగే కుమార్తె కూడా భర్తతో కలసి హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఇటీవల రాధ, ఆదినారాయణ మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో గత నెల 16న ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో ఆగ్రహానికి లోనైన ఆదినారాయణ టవల్‌తో రాధ మెడ బిగించి హతమార్చాడు. అనంతరం ఆమె మొబైల్ తీసుకుని ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. మరుసటి రోజు బెంగళూరులో ఉన్న రాధ కోడలికి, హైదరాబాద్‌లో ఉంటున్న కుమార్తెకు ఆదినారాయణ ఫోన్ చేసి రాధ మృతి చెందినట్లుగా తెలపడంతో అనుమానాలు మొదలయ్యాయి. ఆ సమయంలో కుమారుడు కూచి సందీప్‌కుమార్ చౌదరి ఫిర్యాదు మేరకు అనంతపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న ఆదినారాయణ కోసం గాలింపు చేపట్టారు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం సిండికేట్ నగర్లో తచ్చాడుతున్న ఆదినారాయణను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అసలు కథ వెలుగులోకి ఆదినారాయణను విచారణ చేయడంతో సంచలనాలు వెలుగు చూశాయి. వివాహేతర సంబంధం తెలుసుకున్న భర్త రవిచంద్రనాయుడు ఇద్దరినీ మందలించడంతో రాధ, ఆదినారాయణ ఇద్దరూ కలిసి 2025 మే 20న రాత్రి రవిచంద్ర నాయుడిని హతమార్చారు. నిద్రలో ఉన్న సమయంలో ముఖంపై దిండు అదిమి ఊపిరాడకుండా చేసి చంపినట్లు నిందితుడు అంగీకరించాడు. హత్య అనంతరం అనారోగ్యంతో మృతి చెందినట్లుగా పిల్లలను నమ్మించి అంత్యక్రియలు పూర్తి చేసేశారు. అప్పటి నుంచి రవిచంద్రనాయుడు హత్య ఉదంతం వెలుగు చూడలేదు. తాజా దర్యాప్తులో ఈ విషయం వెలుగులోకి రావడంతో ఆదినారాయణపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. రూరల్ తహసీల్దార్, వైద్యులు, అసిస్టెంట్ సైంటిఫిక్ టీం సమక్షంలో శుక్రవారం రవిచంద్రనాయుడు మృతదేహాన్ని వెలికితీసి పంచనామా నిర్వహించారు. ఫోరెన్సిక్ పరీక్షల కోసం అస్థికలను సేకరించి ల్యాబ్‌కు పంపారు. -
రైతు కోసం రణన్నినాదం
మడకశిర: రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్ సీపీ పోరుబాట పట్టింది. శుక్రవారం మడకశిరలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ఈరలక్కప్ప, పార్టీ ఎస్ఈసీ సభ్యుడు వైసీ గోవర్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో వందలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు రైతులతో భారీ ర్యాలీ నిర్వహించి రణన్నినాదం చేశారు. రైతు సమస్యలను పరిష్కరించపోతే రాజీలేని పోరాటం చేస్తామన్నారు. పట్టణంలో భారీ ర్యాలీ.. నియోజకవర్గంలోని 5 మండలాల నుంచి వందలాది మంది వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు రైతులతో కలిసి పట్టణంలోని వైఎస్సార్ సర్కిల్‌కు చేరుకున్నారు. అక్కడ వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. ర్యాలీలో చంద్రబాబు సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతు సమస్యలను పరిష్కరించాలని, పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, కృష్ణా జలాలు అందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం వద్దకు చేరుకుని ధర్నా చేపట్టారు. రైతు సమస్యల పరిష్కారంలో చంద్రబాబు సర్కార్ విఫలం.. రైతుల సమస్యలు పరిష్కరించడంలో చంద్రబాబు సర్కార్ పూర్తిగా విఫలమైందని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఈరలక్కప్ప, పార్టీ ఎస్ఈసీ సభ్యుడు వైసీ గోవర్దన్‌రెడ్డి అన్నారు. వరి, మొక్కజొన్న తదితర పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు నష్ట పోతున్నా.... చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మడకశిర ప్రాంతానికి కృష్ణా జలాలు అందించడంలో కూడా ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతులకు కూటమి ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదన్నారు. వైఎస్ జగన్ హయాంలో రైతులకు అనేక సంక్షేమ పథకాలు అందాయని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ఉచిత బీమా పథకాన్ని కూడా రద్దు చేసిందన్నారు. రైతు సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామన్నారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయ ఏఓకు వినతి పత్రాన్ని అందించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు నరసింహమూర్తి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి జీబీ శివకుమార్, మండల కన్వీనర్ శ్రీరాములు, పట్టణ కన్వీనర్ ఓంకుమార్, అగళి, గుడిబండ, రొళ్ల, అమరాపురం మండలాల కన్వీనర్లు శ్రీనివాస్, యంజారేగౌడ్, సంతోష్, త్రిలోక్‌నాథ్, పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర కార్యదర్శి నాగభూషణ్‌రెడ్డి, నాయకులు తిప్పేస్వామి, రంగనాథ్, తిమ్మారెడ్డి, శేషాద్రి, నరసింహ, మల్లికార్జున, లక్ష్మీనారాయణగౌడ్, సికిందర్, శివన్న, జయకుమార్, గోపి, అంజలి తదితరులు పాల్గొన్నారు. రైతు సమస్యల పరిష్కారానికి రోడ్డెక్కిన వైఎస్సార్సీపీ శ్రేణులు మడకశిరలో రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తల భారీ ర్యాలీ కృష్ణానీరివ్వడంతో పాటు పంటలకు గిట్టుబాటుధర కల్పించాలని డిమాండ్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా.. చంద్రబాబు సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు సర్కార్ స్పందించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామన్న నాయకులు -
‘ఉద్యాన పాలిటెక్నిక్’ ప్రవేశాలకు నోటిఫికేషన్
మడకశిర రూరల్: డాక్టర్ వైఎస్సార్ ప్రభుత్వ ఉద్యాన విశ్వ విద్యాలయం పరిధిలోని కళాశాలల్లో ఉద్యాన, ల్యాండ్ స్కేపింగ్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. 2026–2027 విద్యా సంవత్సరానికిగాను ఉద్యాన పాలిటెక్నిక్‌లో ప్రవేశాలకు పదో తరగతి ఉత్తీర్ణులైన లేదా తత్సమాన తరగతుల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని స్థానిక ప్రభుత్వ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బయ్యన్న శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 9వ తేదీ (శుక్రవారం) నుంచి 23వ తేదీలోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఆసక్తి కలిగిన వారు https:// drysrhu.ap.gov.in వెబ్సైట్ చూడాలన్నారు. మడకశిర ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాలకు ప్రభుత్వం 60 సీట్లు కేటాయించిందన్నారు. పూర్తి వివరాల కోసం 7382633687, 9182677322, 9492328008 నంబర్లలో సంప్రదించాలన్నారు. 14వ శతాబ్దం నాటి ఆలయం గుర్తింపు పుట్టపర్తి: బుక్కపట్నం గ్రామానికి దక్షిణాన ఉన్న నల్లకొండ మీద ఉన్న తిరుమల దేవర ఆలయం 14వ శతాబ్దానికి చెందినదిగా గుర్తించినట్లు చరిత్రకారుడు బుక్కపట్నం గోపి తెలిపారు. వివరాలను శుక్రవారం ఆయన వెల్లడించారు. ఈ ఆలయానికి తూర్పు, ఉత్తర ద్వారాలతో పాటు దక్షిణ మార్గం కూడా ఉందన్నారు. గుప్త నిధుల తవ్వకాల కారణంగా ఆలయం శిథిలావస్థకు చేరుకుందన్నారు. ఇదే కొండపై విజయనగర రాజులు నిర్మించిన సైనిక పహారా బురుజు, నీటి తొట్టె ఉన్నాయన్నారు. తిరుమల దేవర ఆలయంతో పాటు అహోబిలేశ్వర ఆలయం, అక్క దేవతల ఆలయాలను కలుపుతూ రహదారి ఏర్పాటు చేస్తే నల్లకొండ పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వేడుకగా ధ్వజ అవరోహణం ఉరవకొండ రూరల్: ప్రసిద్ధి చెందిన పెన్నహోబిలం లక్ష్మీ నృసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ధ్వజ అవరోహణ కార్యక్రమం నిర్వహించారు. వేద పండితులు ముక్కోటి దేవతలకు వేదమంత్రాలతో పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత నృసింహస్వామి శయనోత్సవాన్ని అర్చకులు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో ఈఓ సాకే రమేష్ బాబు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ‘ఇన్‌స్టా’లో ప్రేమ.. పెళ్లికి నిరాకరణఅనంతపురం సెంట్రల్: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచడం ప్రేమగా మారింది. మూడేళ్లుగా ప్రేమాయణం సాగించిన యువకుడు... పెళ్లి పేరు ఎత్తగానే ‘నో’ అనేశాడు. దీంతో యువతి పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళితే.. అనంతపురానికి చెందిన ఓ యువతికి తెలంగాణలోని కరీంనగర్ నివాసి, డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న పర్వేజ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమయ్యాడు. తరచూ చాటింగ్ చేసుకునేవారు. ఈ క్రమంలో నువ్వంటే నాకిష్టమంటూ ఒకరినొకరు చెప్పుకున్నారు. పలు దఫాలు ప్రత్యక్షంగా కలుసుకుని మాట్లాడుకున్నారు. ఈ నేపథ్యంలో పెళ్లి చేసుకుందామంటూ కొన్ని రోజులుగా యువతి అభ్యర్థిస్తూ వచ్చింది. ఈ అభ్యర్థనను సదరు యువకుడు తిరస్కరిస్తూ రావడంతో చివరకు అనంతపురం వన్‌టౌన్ పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలో దిగిన పోలీసులు కరీంనగర్ నుంచి పర్వేజ్‌ను రప్పించుకుని మాట్లాడారు. కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా ససేమిరా అనడంతో చివరకు కేసు నమోదు చేసి, శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. -
తీరిన నీటి సమస్య
అమరాపురం: మండలంలోని తమ్మిడేపల్లిలో నెలకొన్ని తాగునీటి సమస్యను అధికారులు పరిష్కరించారు. కొన్ని రోజులుగా తాగునీరు అందకపోవడంతో స్థానికులు బుధవారం సచివాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ అంశం ‘ప్రజల కష్టాలు పట్టని మారాజు’ శీర్షికన గురువారం ‘సాక్షి’లో కథనం వెలువడింది. దీనిపై స్పందించిన పంచాయతీ కార్యదర్శి యోగానంద గురువారం ఉదయం రాజీవ్‌నగర్‌కు వెళ్లి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. వాటర్‌మెన్‌ను పిలిపించుకుని బోరుబావి వద్ద నెలకొన్న సమస్యను పరిష్కరించి కుళాయిల ద్వారా నీటి సరఫరాను పునరుద్ధరించారు. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టీసీ ఆర్థికాభివృద్ధికి కృషి చేయాలి : డీపీటీఓపుట్టపర్తి టౌన్: ఆదాయ మార్గాలు అన్వేషించి జిల్లాలో ఆర్టీసీని లాభాల బాటలోకి తీసుకెళ్లడానికి కృషి చేద్దామని ఉద్యోగులకు డీపీటీఓ మధుసూదన్ పిలుపునిచ్చారు. జిల్లాలోని ఆర్టీపీ డిపో మేనేజర్లు, ట్రాఫిక్, గ్యారేజ్, పర్సనల్, అకౌంట్ డిపార్టుమెంట్ సూపర్వైజర్లతో గురువారం తన కార్యాలయంలో ఆయన సమావేశమై మాట్లాడారు. ప్రతి బస్సు రూటును సూపర్వైజర్లు పరిశీలించాలన్నారు. సెక్టార్ వారీగా పనితీరు బాగాలేని సర్వీసులను రీసెట్ చేయాలన్నారు. ప్రమాదాలు జరగకుండా డ్రైవర్లకు కండెక్టర్లకు, గ్యారేజ్ సిబ్బందికి అవగాహన కల్పించాలన్నారు. ప్రతి స్టేజ్‌లోనూ బస్సులు సక్రమంగా ఆపి ప్రయాణికులను ఎక్కించుకోవాలని, స్టేజ్ల్లో బస్సులు ఆపలేదని ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు అందితే కఠిన చర్యలు తప్పనవి హెచ్చరించారు. దివ్యాంగులకు కేటాయించిన సీట్లలో వారిని కూర్చొనేలా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని బస్టాండ్లలో తాగునీరు, శుభ్రమైన టాయిలెట్లు, ప్రయాణికులకు కుర్చీలు, ఫ్యాన్లు, చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాలని మేనేజర్లను ఆదేశించారు. అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్ తుమకూరు: తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను అరెస్ట్ చేసినట్లు కర్ణాటకలోని తుమకూరు జిల్లా పోలీసులు వెల్లడించారు. గురువారం మధుగిరి తాలూకా కొడిగెనహళ్లి పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడి వివరాలను ఎస్ఐ రాజేష్ వెల్లడించారు. కొడిగెనలహళ్లి హోబలి జి.హోసహళ్లి గ్రామానికి చెందిన రామకృష్ణప్ప ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇంటికి తాళం వేసి కుటుంబసభ్యులతో కలసి సమీప బంధువు ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో తాళం బద్ధలుగొట్టి లోపలకు ప్రవేశించిన దుండగుడు బీరువాలో ఉన్న 37 గ్రాముల బంగారు నగలను అపహరించుకెళ్లాడు. ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు కొడిగెనహళ్లి పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా పక్కా ఆధారాలు సేకరించిన పోలీసులు గురువారం శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం పట్టణానికి చెందిన నరసింహమూర్తిని అరెస్ట్ చేసి, విచారణ చేస్తున్నారు. అశ్వ వాహనంపై శ్రీవారు ఉరవకొండ రూరల్: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిలం లక్ష్మీ నృసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం దేవేరులతో కలిసి అశ్వ వాహనంపై భక్తులకు శ్రీవారు దర్శనమిచ్చారు. ఉదయం మూలవిరాట్‌కు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు పెద్ద ఎత్తున సాగాయి. సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత నృసింహస్వామి ఉత్సవ మూర్తులను అశ్వ వాహనంపై కొలువు దీర్చి ఆలయం చుట్టూ ఊరేగించారు. కార్యక్రమానికి ఉరవకొండకు చెందిన అంగదాల నారాయణస్వామి, అంగదాల ఆంజనేయులు, అంగదాల అభినయ్, గాజుల నాగరాజు ఉభయదాతలుగా వ్యవహరించారు. -
అంతర్ జిల్లా దొంగల అరెస్ట్
గోరంట్ల: చోరీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగలను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. గోరంట్ల పీఎస్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను సీఐ శేఖర్ వెల్లడించారు. 2024, ఏప్రిల్ 2న గోరంట్లలోని చైతన్య పాఠశాల బయట నిలిపిన స్కూటర్ డిక్కీ ధ్వంసం చేసి అందులోని రూ. 5.90 లక్షలను దుండగులు అపహరించారు. అలాగే 2025, జూలై 14న గోరంట్లలోని వాసవి ఫంక్షన్ హాల్ ఎదుట నిలిపిన కారు అద్దాలు ధ్వంసం చేసి అందులోని రూ.7 లక్షలను ఎత్తుకెళ్లారు. ఈ రెండు ఘటనలపై అప్పట్లో బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసిన పోలీసులు పక్కా ఆధారాలతో అనకాపల్లి జిల్లా కె.కొత్తపాటు మండలం గొట్లం గ్రామానికి చెందిన ఎరికల రావుల ఆనంద్, ఇదే జిల్లా దేవరపల్లి మండలం కొత్తూరు ముత్యాలమ్మ పాళ్యం గ్రామానికి చెందిన కోరుకొండ త్రిమూర్తులు, విజయనగరం జిల్లా కొత్తవలస గ్రామానికి చెందిన గుమ్మడి సురేష్, ఇదే జిల్లా కొత్తవలస మండలం గొల్లల పాళ్యం నివాసి నంబారు సుధీర్‌ని గురువారం అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.10 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. వ్యసనాలకు బానిసలుగా మారిన వీరు ఏపీ వ్యాప్తంగా పలు జిల్లాలో చోరీలకు పాల్పడి జైలుకు వెళ్లారని, అక్కడి నుంచి విడుదలైన అనంతరం గోరంట్లకు చేరుకుని చోరీలు కొనసాగిస్తూ వచ్చారని పోలీసులు వివరించారు. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. కారు ఢీకొని యువకుడి మృతిలేపాక్షి: కారు ఢీకొన్న ఘటనలో ఓ ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... హిందూపురం పట్టణానికి చెందిన శేఖర్ (27)కు భార్య మాధవి, మూడేళ్ల వయసున్న కుమారుడు ఉన్నారు. బేల్దారి పనులతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి హిందూపురంలో పని ముగించుకుని ద్విక్రవాహనంపై లేపాక్షి మండలం కొండూరుకు బయలుదేరిన శేఖర్... చోళసముద్రంలోని హెరిటేజ్ వద్దకు చేరుకోగానే ఎదురుగా దూసుకొచ్చిన కారు ఢీకొంది. ఈ ఘటనతో రోడ్డుపై పడిన శేఖర్ తలకు తీవ్ర గాయమై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అటుగా వెళుతున్న వారు గుర్తించి సమాచారం ఇవ్వడంతో 108 సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించారు. అప్పటికే మృతి చెందినట్లుగా నిర్ధారించడంతో పోలీసులు మృతదేహాన్ని హిందూపురం ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
మంచం పట్టిన పెద్దిరెడ్డిపల్లి
పరిగి: మండలంలోని కొడిగెనహళ్లి పంచాయతీ పరిధిలోని పెద్దిరెడ్డిపల్లి మంచం పట్టింది. గ్రామంలోని పలువురు గురువారం అస్వస్థతకు గురయ్యారు. గ్రామంలోనే వైద్య శిబిరం ఏర్పాటు చేసి బాధితులకు చికిత్సలు అందిస్తోంది. ఆహారం, నీరు కలుషితం.. మంగళవారం పెద్దిరెడ్డిపల్లి, బిందూనగర్, దామోదర్ కాలనీ, మారుతీనగర్ ప్రాంతాల్లో ముత్యాలమ్మ జాతర సందర్భంగా అమ్మవారికి జ్యోతుల సమర్పణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఆయా గ్రామాల వారు బంధువులు, మిత్రులను ఆహ్వానించడంతో గ్రామాలన్నీ జనంతో నిండిపోయాయి. ఈ క్రమంలో ఆహారంతో పాటు నీరు కూడా కలుషితమైనట్లు తెలుస్తోంది. గురువారం ఉదయం నుంచి వాంతులు, విరోచనాలతో పలువురు అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలిసిన వెంటనే పరిగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు పెద్దిరెడ్డిపల్లి గ్రామానికి వెళ్లారు. ఇంటింటికీ తిరిగి బాధితులతో మాట్లాడి చికిత్సలు అందించారు. డీఎంహెచ్ఓ ఫైరోజాబేగం కూడా గ్రామానికి వెళ్లి మూడు రోజులుగా నిర్వహిస్తున్న వైద్య శిబిరాన్ని పరిశీలించారు. కలుషిత ఆహారం తిన్న బాధితుల పరిస్థితిపై మెడికల్ ఆఫీసర్లు స్వరూపరెడ్డి, సురేష్‌తో ఆరాతీశారు. ఈ సందర్భంగా గ్రామంలో పారిశుధ్యంపై పంచాయతీ అధికారులతో పాటూ క్షేత్ర స్థాయి సిబ్బందితో సమీక్షించారు. కాగా వాంతులు, విరేచనాల బాధితులకు ఇబ్బంది లేదని, తగిన వైద్య సేవలను అందిస్తున్నామన్నారు. అనంతరం గ్రామంలోని మురుగుకాల్వల్లో బ్లీచింగ్ పౌడర్‌ను చల్లించారు. పీహెచ్సీ తనిఖీ పరిగి ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి ఫైరోజాబేగం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మందుల నిల్వలతో పాటూ నిత్యం ఓపీ నమోదు శాతంపై ఆరా తీశారు. పలు రికార్డులను పరిశీలించారు. వాంతులు, విరేచనాలతో పలువురికి అస్వస్థత జిల్లా వైద్యాధికారి పర్యటన -
టీడీపీ నేత ఇంట పేకాట
గార్లదిన్నె: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీడీపీ నేతలు ప్రతి దానినీ ఆదాయవనరుగా మార్చుకున్నారు. ఈ క్రమంలో యథేచ్ఛగా జూదాలనూ ప్రోత్సహిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగానే గార్లదిన్నెలో ఓ టీడీపీ నేత తన ఇంటినే పేకాట స్థావరంగా మార్చి పెద్ద ఎత్తున జూదాన్ని నిర్వహిస్తుండడం కలకలం రేపింది. విషయం పసిగట్టిన పోలీసులు గురువారం తనిఖీలు చేపట్టడంతో గుట్టు కాస్త రట్టయింది. అనంతపురం రూరల్ డీఎస్పీ శ్రీనివాసులు, గార్లదిన్నె పీఎస్ ఎస్ఐ గౌస్ మహమ్మద్ బాషా తెలిపిన మేరకు... శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన కోటి బళ్లారి వెంకటేష్ ఉమ్మడి జిల్లా పరిధిలోని ఎంపిక చేసిన పట్టణాలు, గ్రామాల్లో పేకాట స్థావరాలు నిర్వహిస్తూ ఫోన్ ద్వారా ముందస్తుగానే జూదరులకు సమాచారం ఇచ్చి, ఆయా ప్రాంతాలకు రప్పించుకునేవాడు. ఈ క్రమంలో ముదిగుబ్బ, బత్తలపల్లి, అనంతపురము మూడో పట్టణ పీఎస్ పరిధిలోనూ పేకాట స్థావరాలు నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. కొన్ని రోజులుగా గార్లదిన్నె మండలానికి చెందిన టీడీపీ నేత ఖాసీం నాయుడుతో కుమ్మకై స్థానిక కెనరాబ్యాంక్ సమీపంలో ఉన్న ఆయన ఇంటినే పేకాట స్థావరంగా మార్చి జూదరులకు అన్ని సౌకర్యాలు కల్పించి పెద్ద ఎత్తున జూదం నిర్వహిస్తూ వస్తున్నాడు. రోజూ కొత్త వ్యక్తుల సంచారం ఎక్కువగా ఉండడంతో అనుమానం వచ్చిన స్థానికుల ఫిర్యాదుతో డీఎస్పీ శ్రీనివాసులు అప్రమత్తమయ్యారు. గురువారం తనిఖీలు చేపట్టడంతో ఖాసీం నాయుడు ఇంట్లో సాగుతున్న పేకాట వ్యవహారం కాస్త వెలుగులోకి వచ్చింది. మొత్తం 14 మంది జూదరులను అరెస్ట్ చేసి, వీరి నుంచి 14 సెల్ఫోన్లు, రూ.3.85 లక్షల నగదు, ఓ ఖరీదైన కారును స్వాధీనం చేసుకున్నారు. జూదరులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 14 మంది జూదరుల అరెస్ట్ రూ.3.85 లక్షల నగదు, కారు స్వాధీనం -
ఎండకు మూగ జీవాలు విలవిల
కనగానపల్లి: గతంలో ఎన్నడూ లేనంతగా జిల్లాలో ఈ వేసవిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలకు మనుషులతో పాటు మూగజీవాలూ విలవిలలాడుతున్నాయి. రోజంతా మెట్ట భూముల్లో తిరుగుతూ మేత మేసే గొర్రెలు ఎండ వేడిమికి తాళలేకపోతున్నాయి. దీంతో మధ్యాహ్నాం ఒంటి గంట దాటిందంటే ఎండలో ఉండలేక చెట్ల నీడన చేరుతున్నాయి. ఎండ వేడిమి తాళలేక చిన్న గొర్రె పిల్లలు మృత్యువాత పడుతున్నాయి. రాప్తాడు నియోజక వర్గంలో నాలుగు లక్షల పైగా గొర్రెలు ఉండగా, ఒక్క కనగానపల్లి మండలంలోనే అత్యధికంగా 1.35 లక్షల గొర్రెలు ఉన్నాయి. మండలంలోని పర్వతదేవరపల్లి, మామిళ్లపల్లి, కనగానపల్లి, కోనాపురం, ఎలకుంట్ల, నరసంపల్లి, కేఎన్ పాళ్యం గ్రామాలలో గొర్రెల పోషణతో జీవించేవారు ఎక్కువగా ఉన్నారు. వడదెబ్బ ప్రభావంతో.. ప్రస్తుత వేసవిలో పగటి పూట 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఎండ వేడిమిని తట్టుకోలేక చాలా గ్రామాల్లో గొర్రె పిల్లలు మృత్యువాత పడుతున్నాయి. ఎండ వేడిమికి గొర్రె పిల్లలు వడదెబ్బకు గురై మృతి చెందుతున్నాయని కాపరులు భాస్కరగౌడ్, జ్యోతప్ప, ఓబులేసు, నరసింహులు అంటున్నారు. ఎండ వేడిమి నుంచి జీవాలను కాపాడేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేదని వాపోతున్నారు. ఒక మందలో రోజుకు ఒకటి, రెండు జీవాలు వడ దెబ్బ సోకి చనిపోతున్నాయన్నారు. పర్వతదేవపల్లి, మామిళ్లపల్లి, కనగానపల్లి గ్రామాల్లో 30 రోజుల వ్యవధిలోనే వందకు పైగా గొర్రె పిల్లలు మృతి చెందినట్లు కాపరులు తెలిపారు. మధ్యాహ్నా సమయంలో ఎండ వేడిమి తాళలేక గొర్రెలను చెట్ల నీడనే చేర్చాల్సి వస్తోందని, అయితే వందలాది జీవాలకు ఒకేచోట నీడనిచ్చే చెట్లు దొరకాలంటే కష్టంగా ఉందంటున్నారు. అలాగే వేసవిలో నీటి ఎద్దడి కూడా ఎక్కువగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాభావ పరిస్థితులతో భూగర్భ జలాలు అడుగంటి వ్యవసాయ బోరుబావుల్లో నీటి లభ్యత తగ్గిందని, దీంతో రైతులు నీటిని బయటకు వదలడం లేదని అంటున్నారు. మృత్యువాత పడుతున్న గొర్రె పిల్లలు భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఎండలు మండిపోతున్నాయి. దీంతో మనుషులే కాదు.. మూగ జీవాలూ విలవిల్లాడిపోతున్నాయి. పెరిగిన వేసవి తాపంతో పశు, పక్షులు అల్లాడిపోతున్నాయి. చల్లని ప్రదేశాలను వెతుక్కుంటూ రక్షణ పొందే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎండ వేడిమి తట్టుకోలేక కొన్ని.. నీళ్లు లేక గొంతెండి మరికొన్ని పక్షులు నేలరాలుతున్నాయి.. జీవాలు మృత్యువాతపడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా నోరు లేని మూగజీవాల వేసవి కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. -
బైక్ పైనుంచి కిందపడి ఒకరి మృతి
బత్తలపల్లి: అనంతపురం రూరల్ మండలం మన్నీల క్రాస్ వద్ద చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ వృద్ధుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... బత్తలపల్లి మండలం రామాపురం గ్రామానికి చెందిన తిరుపాలు వ్యక్తిగత పనిపై బుధవారం ఉదయం అనంతపురానికి ద్విచక్ర వాహనంపై బయలు దేరాడు. అదే సమయంలో గ్రామానికి చెందిన రామకృష్ణ (65) అభ్యర్థన మేరకు ఆయనను కూడా ద్విచక్ర వాహనంపై ఎక్కించుకున్నాడు. మన్నీల క్రాస్ వద్దకు చేరుకోగానే రోడ్డుపై పడిన కంకర రాళ్లపై చక్రం ఎక్కడంతో బైక్ అదుపు తప్పి ఇద్దరూ కిందపడ్డారు. ఘటనలో రామకృష్ణ అక్కడికక్కడే మృతి చెందగా, తలకు తీవ్రగాయమైన తిరుపాలును స్థానికులు వెంటనే 108 వాహనంలో బత్తలపల్లిలోని ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తీసుకెళ్లారు. కాగా, గ్రామంలో రామకృష్ణ ఆర్ఎంపీగా ప్రజలకు సేవలు అందిస్తూనే ఆర్టీసీలో కాంట్రాక్ట్ మెకానిక్‌గా పనిచేస్తున్నారు. గతంలోనే ఆయన భార్య మృతి చెందింది. పిల్లలు లేరు. ఘటనపై ఇటుకలపల్లి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. సింగపూర్ వేదికగా బోద్ధ కావ్యం ఆవిష్కరణపెనుకొండ: స్థానిక కవి, రచయిత జాబిలి చాంద్‌బాషా కలం నుంచి జాలువారిన బోద్ధ కావ్యాన్ని మంగళవారం రాత్రి సింగపూర్‌లో ఆవిష్కరించారు. సింగపూర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో జాబిలి చాంద్‌బాషా ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. సింగపూర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థిని సంపూర్ణ మానవుడిగా తీర్చిదిద్ది సమాజానికి అర్పించే ఉపాధ్యాయుడు ఒక సజీవ విశ్వవిద్యాలయమని కొనియాడారు. సమాజంలోని ప్రతి కీలక రంగం ఉపాధ్యాయుడి బోధన నుంచే ఉద్భవిస్తుందన్నారు. బోద్ధ కావ్యం ఉపాధ్యాయ లోకానికి గొప్ప ప్రేరణనిస్తుందని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకటరమణ, మహేశ్వరరెడ్డి, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత తిరుమల శ్రీదేవి, ప్రిన్సిపాల్ యశోదలక్ష్మి, అరుణాయాదవ్, ప్రధానోపాధ్యాయులు సుధాకర్, మక్బూల్‌బాషా, విద్యాభారతి, మాణిక్యం, ఇషాక్, బండి శ్రీనివాసులు, ఖాదర్, నౌషాద్, ఆది, సుబ్రహ్మణ్యశర్మ తదితరులు పాల్గొన్నారు. దుకాణదారుడిపై కత్తితో దాడి ముదిగుబ్బ: సిగరెట్లు అప్పుగా ఇవ్వలేదంటూ దుకాణదారుడిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేసిన ఘటన బుధవారం ముదిగుబ్బ గేటు కొట్టాలలో చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన మేరకు.. ముదిగుబ్బ గేటు కొట్టాలలో దుకాణం నిర్వహిస్తున్న మణికంఠ వద్దకు బుధవారం ఉదయం స్థానికుడు వసంత్ వెళ్లి సిగరెట్లు అడిగాడు. నగదు చెల్లిస్తేనే సిగరెట్లు ఇస్తానని మణికంఠ తెలపడంతో వసంత్ అప్పటికే తన వద్ద సిద్ధంగా ఉంచుకున్న కత్తితో దాడి చేసి పొట్టలో బలంగా పొడిచి ఉడాయించాడు. క్షతగాత్రుడిని కుటుంబసభ్యులు వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం కదిరికి తీసుకెళ్లారు. -
రమణీయం.. నృసింహుడి రథోత్సవం
ఉరవకొండ : పెన్నహోబిలం క్షేత్రంలో వెలసిన లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మ రథోత్సవం బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది. నమో నారసింహ నామం మార్మోగింది. రథోత్సవం సందర్భంగా శ్రీవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తెచ్చి మహా రథంలో కొలువుదీర్చి ఉత్సవాన్ని ప్రారంభించారు. అశేష భక్త జనం నడుమ బ్రహ్మ రథోత్సవం కనులపండువగా సాగింది. ఆలయ మాడ వీధులన్నీ భక్తులతో నిండిపోయాయి. బ్రహ్మ రథోత్సంలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గుంతకల్లు డీఎస్పీ శ్రీనివాస్ పర్యవేక్షణలో పోలీసులు బందోబస్తు చేపట్టారు. లక్ష్మీ నరసింహస్వామికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి పయ్యావుల కేశవ్ పట్టువస్త్రాలను సమర్పించారు. -
జనగణన పక్కాగా చేయాలి
● అధికారులకు జేసీ మౌర్య భరద్వాజ్ ఆదేశం మడకశిర రూరల్: జనగణనను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, దీన్ని గుర్తించి సర్వే సిబ్బంది కూడా జనగణనను పక్కాగా చేయాలని జేసీ మౌర్య భరద్వాజ్ తెలిపారు. బుధవారం ఆయన మండల పరిధిలోని కదిరేపల్లి గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. సచివాలయం ద్వారా ప్రజలకు అందించే సేవలు, జనగణన సర్వే వివరాలను అడిగి తెలుసుకున్నారు. జనగణన సర్వేలో వెనుకబడి ఉన్నారని, వెంటనే సర్వే వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ సేవలు సకాలంలో ప్రజలకు అందించాలన్నారు. జేసీ వెంట ఆర్డీఓ ఆనంద్‌కుమార్, తహసీల్దార్ మైనుద్దీన్, ఎంపీడీఓ సోనిబాయి, ఆర్ఐ సోమశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. రాగుల కొనుగోలు కేంద్రం ప్రారంభం గుడిబండ: జిల్లాలోని రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులు పండించిన రాగులను మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ తెలిపారు. బుధవారం ఆయన మండల పరిధిలోని మోరబాగల్ గ్రామంలో రాగుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ... క్వింటా రాగులను రూ. 4,886 మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నామని, రాగులు పండించిన రైతులందరూ రైతు సేవా కేంద్రాల్లో వివరాలను అందించాలన్నారు. ఒక రైతు నుంచి ఎకరాకు 13.50 క్వింటాళ్ల చొప్పున కొనుగోలు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ ఆనంద్‌కుమార్, ఏడీఏ కృష్ణమీనన్, సివిల్ సప్లయీస్ డీఎం రాజు, తహసీల్దార్ కళ్యాణ చక్రవర్తి, ఎంపీడీఓ రామారావు, ఏఓ వీరనరేష్ పాల్గొన్నారు. -
‘పచ్చ’మూక దౌర్జన్యకాండ
పెనుకొండ: స్థానిక అర్బన్ కాలనీలో టీడీపీ నేతలు ఏకపక్షంగా జరిపిన దాడిలో ఆరుగురు గాయపడ్డారు. దీంతో అర్బన్ కాలనీలో భయానక వాతావరణం నెలకొంది. ఘటనపై బాధితులు బుధవారం వాట్సాప్ ద్వారా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వివరాలు.. అర్బన్ కాలనీలో ఇష్టారాజ్యంగా ద్విచక్రవాహనాలను డ్రైవింగ్ చేస్తున్న యువకులను బాబా అనే వ్యక్తి నిలువరించి జిగ్‌జాగ్ డ్రైవింగ్ చేయొద్దని సూచించాడు. కాలనీలో చిన్నపిల్లలు రోడ్డుపై ఆడుకుంటూ ఉంటారని ఏదైనా ప్రమాదం చోటు చేసుకుంటే అందరూ బాధపడాల్సి ఉంటుందని హితవు పలికాడు. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకుడు నవాజ్, మరికొందరు మంగళవారం అర్ధరాత్రి సమయంలో అర్బన్ కాలనీకి చేరుకుని బాబాతో ఘర్షణకు దిగారు. సర్థి చెప్పడానికి వచ్చిన బాబా అల్లుళ్లపై ఇష్టారాజ్యంగా రాళ్లు,, కర్రలతో దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన బాబా, అతని అల్లుళ్లు, మరి కొందరిని స్థానికులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై బుధవారం పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేసి, తమకు రక్షణ కల్పించాలంటూ ఎస్పీకి వాట్సాప్ ద్వారా సమాచారం అందించారు. దాడిలో 10 మంది యువకులు పాల్గొన్నారని పేర్కొన్నారు. -
కక్షిదారులకు సత్వర న్యాయమే లక్ష్యం
హిందూపురం/ ధర్మవరం అర్బన్: కక్షిదారులకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యమని, ఇందుకోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సైతం అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసాగిల్ పేర్కొన్నారు. బుధవారం జిల్లాలోని ధర్మవరంలో రెండు అడిషినల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులు, హిందూపురంలో ఒక సివిల్ జడ్జి న్యాయస్థానాలను బుధవారం ఆమె అమరావతి నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. న్యాయమూర్తులు భానుమతి, సురేష్‌రెడ్డి, చల్లా గుణరంజన్ వర్చువల్‌గా పాల్గొన్నారు. అనంతరం హిందూపురం, ధర్మవరం కోర్టులను ఉమ్మడి అనంతపురం జిల్లా న్యాయమూర్తి భీమారావు రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలతో పాటు సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం జిల్లా న్యాయమూర్తి భీమారావు అదనపు కోర్టుల ఏర్పాటు వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. కక్షిదారులు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో కేసులను సత్వరం పరిష్కరించాలని అదనపు న్యాయస్థానాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. న్యాయమూర్తులు సైతం కేసులను సత్వరం పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని సైతం ఎప్పటికప్పుడు ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా న్యాయమూర్తిని ధర్మవరం, హిందూపురంలో స్థానిక బార్ అసోసియేషన్ల నేతలు సన్మానించారు. హిందూపురం నూతన కోర్టు విధులను ఇన్చార్జి న్యాయమూర్తి లలితా లక్ష్మీ హారిక ప్రారంభించారు. న్యాయమూర్తులు హేమలత, రమణయ్య, రమాదేవి పాల్గొన్నారు. ధర్మవరంలో జరిగిన కార్యక్రమంలో ఎస్పీ సతీష్‌కుమార్, సివిల్ జడ్జి వెంకటేశ్వర్లు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి నందిని, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి వెంకట హరీష్ పాల్గొన్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసాగిల్ వర్చువల్‌గా జిల్లాలో మూడు న్యాయస్థానాల ప్రారంభం -
అధ్వాన ఆస్పత్రులు!
సాక్షి, పుట్టపర్తి: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సర్కారు ఆస్పత్రుల్లో వైద్య సేవలు అటకెక్కాయి. ఓపీ విభాగం దగ్గర నుంచి మార్చురీ గది వరకు సేవలు సరిగా అందడం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్యుల సంఖ్య తక్కువగా ఉండటంతో పాటు మందుల కొరత పట్టిపీడిస్తుండటంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా పరిధిలో హిందూపురం, మడకశిర, పెనుకొండ, ధర్మవరం, కదిరి నియోజకవర్గ కేంద్రాల్లోని ప్రభుత్వాస్పత్రులను ‘సాక్షి’ విజిట్ చేయగా రోగుల అవస్థలు, డాక్టర్ల నిర్లక్ష్యం, వసతుల లేమి, మందుల కొరత స్పష్టంగా కనిపించాయి. చిన్న పిల్లల వార్డులో ఉక్కపోత హిందూపురంలోని జిల్లా ఆస్పత్రిలో రోగులకు అరకొరగా వైద్య సేవలు అందుతున్నాయి. సాయంత్రం 4 గంటల వరకు ఓపీ విభాగంలో చీటీలు ఇస్తున్నా... రోగులకు వైద్యం చేసేందుకు ఆస్పత్రిలో డాక్టర్లు ఉండటం లేదు. గైనిక్ వార్డులో ఇద్దరు డాక్టర్లు మాత్రమే ఉండటంతో అత్యవసర సమయాల్లో ఇతర ఆస్పత్రులకు వెళ్లాలని రోగులకు సూచిస్తున్నారు. మాతాశిశు భవనం పైభాగంలో అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో కాన్పుల వార్డు, చిన్న పిల్లల వార్డులో ఏసీలు పని చేయడం లేదు. ఎండాకాలం కావడంతో చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఆస్పత్రిలో రక్త పరీక్షలకు ఎక్కువ సమయం పడుతోందని రోగులు చెబుతున్నారు. డయాలసిస్ వార్డులో జనరేటర్ లేకపోవడంతో కరెంట్ పోతే రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మందకొడిగా నిర్మాణాలు మడకశిర పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి అభివృద్ధికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రూ.20 కోట్లు కేటాయించారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పనులన్నీ అటకెక్కాయి. రెండేళ్లు గడిచినా సగం కూడా పనులు పూర్తి కాలేదు. దీంతో రోగులు, సిబ్బంది, డాక్టర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళల్లో సమయానికి రోగులకు వైద్య సేవలు అందడం లేదని, రాత్రి పూట డాక్టర్లు, సిబ్బంది విధుల్లో అలసత్వం వహిస్తున్నారని రోగులు చెబుతున్నారు. పెనుకొండలో సేవలు అధ్వానం మంత్రి సవిత ప్రాతినిథ్యం వహిస్తోన్న పెనుకొండ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి రోజుకు సగటున 500 మంది రోగులు వస్తుంటారు. అయితే రోగులకు కూర్చునేందుకు వసతి లేదు. డాక్టర్ల కొరత ఉంది. ఆక్సిజన్ ప్లాంట్ పని చేయడం లేదు. ట్రామా కేర్ నిర్వహణలో లేదు. మార్చురీ గది అధ్వానంగా ఉంది. హాస్పిటల్ ఆవరణలో ద్విచక్ర వాహనాలు ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేస్తుండటంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. గర్భిణుల నుంచి డబ్బులు డిమాండ్ కదిరి పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ప్రసవం కోసం వచ్చిన గర్భిణుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. అలాగే డయాలసిస్ రోగులకు సకాలంలో సేవలు అందడం లేదని చెబుతున్నారు. మందులు కూడా అందజేయడం లేదని వాపోతున్నారు. ఆక్సిజన్ ఉన్నా .. కనెక్షన్ లేదు ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ప్రాతినిథ్యం వహిస్తున్న ధర్మవరం పట్టణంలోని ఏరియా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందుబాటులో ఉన్నా... సిలిండర్లకు కనెక్షన్ ఇవ్వలేదు. దీంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. కేవలం ఆపరేషన్ థియేటర్లో మాత్రమే ఆక్సిజన్ అందుబాటులో ఉంచారు. మిగతా వార్డుల్లోని రోగులకు ఆక్సిజన్ అవసరమైతే అంతే సంగతి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతుల లేమితో రోగుల అవస్థలు తీసికట్టుగా సేవలు.. మందుల కొరత ప్రముఖ విభాగాల్లో డాక్టర్ పోస్టుల ఖాళీ వెంటాడుతున్న వసతుల లేమి -
ఆదర్శం.. ఈశ్వరమ్మ జీవితం
ప్రశాంతి నిలయం: సత్యసాయికి జన్మనిచ్చిన ఈశ్వరమ్మ అవనికే ఆదర్శమూర్తి అని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ రాజు అన్నారు. బుధవారం ఈశ్వరమ్మ వర్ధంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత సాయికుల్వంత్ సభా మందిరంలో బాల వికాస్ చిన్నారులు భక్తి గీతాలు ఆలపించారు. ఈశ్వరమ్మను, సత్యసాయిని కీర్తిస్తూ చక్కటి గీతాలతో ఆకట్టుకున్నారు. అనంతరం స్వయం ఉపాధి కల్పన కోసం పలువురు మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. ఆ తర్వాత సత్యసాయి పూర్వ ప్రసంగాల్లో మాతృమూర్తి ఈశ్వరమ్మ గొప్పతనాన్ని వివరించే సందేశాన్ని డిజిటల్ స్క్రీన్ల మీద భక్తులకు వినిపించారు. ఆ తర్వాత పట్టణంలోని సమాధి రోడ్డులోని సత్యసాయి మాతృమూర్తి ఈశ్వరమ్మ, తండ్రి పెదవెంకమరాజు సమాధుల వద్ద సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ రాజు కుటుంబ సభ్యులు, పలువురు ట్రస్ట్ సభ్యులు, సత్యసాయి విద్యాసంస్థల సిబ్బంది, భక్తులు పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యసాయి విద్యార్థులు, భక్తులు సంగీత విభావరి నిర్వహించారు. హాజరైన భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. పుట్టపర్తి వీధుల్లో పూలు, కూరగాయలు, పండ్లు విక్రయించే వ్యాపారులకు ఎండ వేడిమి నుంచి తట్టుకునే విధంగా గొడుగులను పంపిణీ చేశారు. సాయంత్రం పలువురు బాలవికాస్ విద్యార్థులు ఈశ్వరమ్మ ఆదర్శ విలువల గురించి ప్రసంగించారు. అనంతరం సంగీత విద్వాంసురాలు ఎల్. కీర్తన బృందం సంగీత విభావరి నిర్వహించి భక్తులను ఆకట్టుకున్నారు. వర్ధంతి వేడుకల్లో ఆర్జే రత్నాకర్ రాజు సేవా కార్యక్రమాలతో స్ఫూర్తి చాటిన వైనం -
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించండి
● విజయవాడలో నినదించిన వైఎస్సార్‌టీఏ నాయకులు పుట్టపర్తి: ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ విజయవాడ వేదికగా వైఎస్సార్‌టీఏ నాయకులు బుధవారం నినదించారు. జిల్లా నలుమూలల నుంచి పెద్దఎత్తున ఉపాధ్యాయులు విజయవాడ చేరుకుని ధర్నాలో పాల్గొన్నారు. వీరిలో వైఎస్సార్‌టీఏ జిల్లా అధ్యక్షుడు పీవీ రమణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి లీలా ఇంద్ర ప్రసాద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంషీద్, నాయకులు భాస్కరరెడ్డి, ప్రతాపరెడ్డి, శివయ్య, శ్రీనివాసరెడ్డి, కిష్టప్ప, శ్రీనివాసులు, మనోహర్‌రెడ్డి, సునీత, అనిత, ఇందిర, సురేష్, మహమ్మద్ అలీ, జమీర్, ప్రభాకర్‌రెడ్డి, హర్షవర్దన్‌రెడ్డి తదితరులు ఉన్నారు. ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు అందరాదు●ఆర్టీసీ కడప జోన్ ఈడీ రాఘవకుమార్ పుట్టపర్తి టౌన్ : ప్రయాణికుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు అందకుండా నాణ్యమైన సేవలు అందించాలని ఆర్టీసీ అధికారులను కడప జోన్ ఈడీ రాఘవకుమార్ ఆదేశించారు. బుధవారం పుట్టపర్తిలోఆర్టీసీ బస్టాండ్, డిపో కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలు, డిపోలోని విడిభాగాలను పరిశీలించారు. అందుతున్న సౌకర్యాలపై ప్రయాణికులతో ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 45 ఏళ్లు దాటిన ప్రతి ఉద్యోగి హెల్త్ కార్డులు తప్పనిసరిగా చేయించుకోవాలన్నారు. ఆరోగ్యం పట్ల ఽశ్రద్ధ వహించాలని సూచించారు. అనంతరం ఉద్యోగ నిర్వహణలో ప్రతిభ కనబరచిన డ్రైవర్లను సన్మానించారు. కార్యక్రమంలో డీపీటీఓ మధుసూదన్, డీవైఈఈ సురేంద్రబాబు, డిపో మేనేజర్ ఇనాయతుల్లా, సూపర్వైజర్ విజయానంద్, శోభారాణి పాల్గొన్నారు. పత్తి విత్తనం విక్రయ దుకాణాల తనిఖీపెనుకొండ: స్థానికంగా పత్తి విత్తనాన్ని విక్రయిస్తున్న దుకాణాలను వ్యవసాయ శాఖ కమిషనరేట్ ఏడీఏ జి.కళ్యాణ్ బుధవారం తనిఖీ చేసారు. హెర్బిసైడ్ టాలరెంట్ (హెచ్‌టీ) రకం పత్తి విత్తనాల అమ్మకాలను నిరోధించేందుకు స్థానిక అధికారులతో కలసి తనిఖీలు చేపట్టినట్లు ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. హెచ్‌టీ రకం పత్తి విత్తనాల సాగుతో మానవాళికి అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, భూసారం తీవ్రంగా దెబ్బతింటుందని, వీటిని రైతులకు విక్రయించరాదని డీలర్లకు సూచించారు. కార్యక్రమంలో ధర్మవరం మండల వ్యవసాయాధికారి ముస్తాఫా, అనంతపురం వ్యవసాయాధికారి శ్రీనాథరెడ్డి, పెనుకొండ మండల ఏఓ చందన, ఏఈఓ అశోక్‌కుమార్ పాల్గొన్నారు. దారితప్పితే కఠిన చర్యలు ● రౌడీ షీటర్లను హెచ్చరించిన అదనపు ఎస్పీ అంకితా సురానా హిందూపురం: దారి తప్పి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని రౌడీ షీటర్లను అదనపు ఎస్పీ అంకితా సురానా హెచ్చరించారు. బుధవారం హిందూపురంలో డీఎస్పీ మహేష్, సీఐలతో కలిసి ఆమె పర్యటించారు. గుడ్డం ఏరియా, రహమత్‌పూర్, బోయపేట, నింకంపల్లి, మోతుకపల్లి తదితర ప్రాంతాల్లోని రౌడీషీటర్ల ఇళ్లను పరిశీలించారు. కుటుంబసభ్యులకు పలు సూచనలు చేశారు. మళ్లీ గొడవల్లో పాల్గొనే వారిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయడంతో పాటు పట్టణ బహిష్కరణ ఉంటుందన్నారు. మంచి ప్రవర్తనతో మెలిగి కుటుంబ సభ్యులకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలన్నారు. -
గ్రాసం కరువు.. పోషణ బరువు
కదిరి: కరువు మేఘం కమ్ముకోవడంతో జిల్లాలో పశుగ్రాసం కరువైంది. మండు వేసవిలో భానుడి ఉగ్రరూపంతో పచ్చని మొక్కలన్నీ ఎండిపోయాయి. మరోవైపు వరి, వేరుశనగ కోతలకు యంత్రాల వినియోగం, వాతావరణ మార్పులు, వర్షాభావంతో బోరు బావుల్లో నీరు అడుగంటి పోవడంతో సాగు భూమి తగ్గిపోవడం..ఇలా పలు కారణాలతో పశువులకు గ్రాసం కరువైంది. పచ్చగడ్డి, నీటి లభ్యత లేకపోవడంతో పశువులు బక్కచిక్కి పోయాయి. ఇతర ప్రాంతాల నుంచి గడ్డి తీసుకువచ్చేందుకు ప్రయత్నించినా ధరలు ఆకాశంలో ఉండటంతో పాడిరైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డారు. ఈ నేపథ్యంలోనే ఇష్టం లేకపోయినా వాటిని కబేళాలకు విక్రయిస్తున్నారు. దీంతో పశు సంపద కూడా బాగా తగ్గిపోతోంది. ట్రాక్టర్ గడ్డి రూ.30 వేలుపైనే మామూలు రోజుల్లో పశువులను అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి మేపేవారు. అయితే ప్రస్తుతం ఎక్కడా మేత దొరకడం లేదు. దీంతో మేతకు డిమాండ్ పెరిగి గ్రాసం ధరలు ఆకాశాన్నంటాయి. గతంలో రూ.10 వేలు ఉన్న ట్రాక్టర్ గడ్డి ధర ఇప్పుడు రూ.30 వేలకు చేరింది. అది కూడా స్థానికంగా మేత దొరక్కపోవడంతో ఇతర జిల్లాల నుంచి గడ్డిని ట్రాక్టర్లు, లారీలలో తెచ్చుకుంటున్నారు. వీధుల్లో తిరిగే పశువుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. మేత దొరక్క చెత్త, ప్లాస్టిక్ కవర్లు వంటివి తింటూ, మురుగునీరు తాగుతూ వ్యాధుల బారిన పడుతున్నాయి. పాడిరైతుల దీనావస్థ వ్యవసాయమే జీవనాధారమైన జిల్లాలో పాడిపశువుల సంఖ్య కూడా బాగానే ఉంది. ధర్మవరం డివిజన్లో 65,966 ఆవులు, ఎద్దులు, 28,009 బర్రెలు, 9,14,202 గొర్రెలు, 1,19,031 మేకలు ఉన్నాయి. అలాగే హిందూపురం డివిజన్లో 1,00,945 ఆవులు, ఎద్దులు, 29.611 గేదెలు, 6,34,832 గొర్రెలు, 1,15,923 మేకలు ఉన్నాయి. అదే విధంగా పెనుకొండ డివిజన్ పరిధిలో 1,14,325 పశువులు, 37,925 బర్రెలు, 10,80,253 గొర్రెలు, 2,37,138 మేకలు ఉన్నాయి. గత ప్రభుత్వాలు పాడిపశువుల పెంపకం చేపట్టే రైతులకు ప్రోత్సాహకాలు అందించి పాడిపశువుల సంఖ్య పెరుగుదలకు కృషి చేశాయి. అలాగే గ్రాసం కొరత ఏర్పడకుండా తగు చర్యలు చేపట్టేవి. కానీ చంద్రబాబు ప్రభుత్వానికి మూగ జీవాల వేదన ఏమాత్రమూ పట్టలేదు. రైతులకు కేవలం గడ్డి విత్తనాల పంపిణీతో చేతులు దులుపుకుంటోంది. రాయితీ ఏదీ? గ్రాసం సాగుచేసుకునే పశుపోషకులకు రాయితీ ఇస్తామని చంద్రబాబు ప్రభుత్వం గొప్పగా హామీలిచ్చింది. 10 సెంట్ల భూమిలో పశుగ్రాసం సాగు చేసిన రైతులకు కూలీల ఖర్చు, సామగ్రితో కలిపి రూ.6,599, అలాగే 20 సెంట్లలో సాగుచేస్తే రూ.13,197, ఇక 30 సెంట్లలో సాగుచేసిన వారికి రూ.19,795, 40 సెంట్లలో సాగుచేస్తే రూ.26,394, అర ఎకరం(50 సెంట్లు)లో సాగు చేస్తే రూ.32,992 చొప్పున పశుపోషకులకు రాయితీ ఇస్తామని సర్కార్ చెప్పింది. కానీ జిల్లాలో ఈసారి 325 మంది రైతులు గ్రాసం సాగుచేసినప్పటికీ వారికి ఇంత వరకూ ఒక్క రూపాయి కూడా ఇచ్చిన పాపాన పోలేదు. పశుగ్రాసం పథకం ఉందనే విషయం జిల్లాలో 90 శాతం మంది రైతులకు తెలియదని ఆ శాఖ అధికారే ఒకరు చెప్పడం గమనార్హం. పాడి పరిశ్రమపై కరువు పోటు మేతలేక బక్కచిక్కుతున్న పశువులు రెండేళ్లలో మూడు రెట్లు పెరిగిన గ్రాసం ధర పాడిపశువులను పస్తుపెట్టలేక అమ్ముకుంటున్న పోషకులు గడ్డి ధర పెరిగింది నాకు నాలుగు గేదెలున్నాయి. గతంలో మేతకు పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. ప్రసుత్తం బయట ఎక్కడా పచ్చగడ్డి లేదు. దీంతో దానాతో పాటు గడ్డి ధర విపరీతంగా పెరిగింది. అంత డబ్బు వెచ్చించలేక పశువులను పస్తు పెట్టలేక చాలా మంది అమ్ముకున్నారు. నాకు పశువులను అమ్మేందుకు మనస్సురాక అలాగే ఉంచుకున్నా. ప్రభుత్వం పాడి రైతులను ఆదుకోకపోతే భవిష్యత్‌లో పశువులు కనబడవు. – ఆంజనేయులు, పాడి రైతు, కదిరి గ్రాసం కొరత ఉంది గ్రాసం కొరతకు చాలా కారణాలున్నాయి. యంత్రాలతో వరికోతలు, కూరగాయలు, పండ్లు, పూల తోటల సాగు కారణంగా గడ్డి కొరత నెలకొంది. గడ్డి విత్తనాలు పంపిణీ చేశాం. గడ్డి కొరతపై నివేదికలు తెప్పించుకుని ప్రభుత్వానికి నివేదిస్తాం. – శుభదాస్, జేడీ, పశుసంవర్ధక శాఖ -
● ప్ర’జల’ కష్టాలు పట్టని మా‘రాజు’
అమరాపురం/అగళి: స్థానికేతరుడైనా మా‘రాజు’ అని ఎన్నికల్లో గెలిపిస్తే ఇప్పుడేమో మా కష్టాలు పట్టించుకోకుండా ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తిరుగుతున్నారని అమరాపురం మండలం తమ్మడేపల్లి, అగళి మండలం కురసాంగనపల్లి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయా గ్రామాల్లో నెలకొన్న తాగునీటి సమస్యపై గ్రామస్తులు బుధవారం ఆందోళన చేపట్టారు. తమ్మడేపల్లిలోని రాజీవనగర్ సచివాలయం ఎదుట కాలనీ వాసులు ఖాళీ బిందెలతో బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాలనీ వాసులు శ్రీనివాస్, గంగమ్మ, కెంచమ్మ, మంజమ్మ, భాగ్యమ్మ, తిమ్మక్క తదితరులు మాట్లాడుతూ.. తమ కాలనీ కోసం ఏర్పాటు చేసిన బోరుబావిలో నీరు సమృద్ధిగా ఉన్నా, 15 రోజులుగా చుక్క తాగునీరు సరఫరా కావడం లేదని మండిపడ్డారు. గ్రామ సచివాలయంలో విన్నవించేందుకు వస్తే ఇక్కడ ఒక్కరూ కూడా అందుబాటులో లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల కష్టాలు ఎమ్మెల్యే ఎంఎస్ రాజుకు పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాగూ ఆయన అందుబాటులో ఉండడం లేదని, కనీసం అధికారులైన అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు తీర్చాలని డిమాండ్ చేశారు. అలాగే అగళి మండలం కురసాంగనపల్లిలో తాగునీటి సరఫరా కోసం ఏర్పాటు చేసిన బోరు బావిలో నీరు అడుగంటిందని, మూడు రోజులుగా తాగునీటి కోసం నానా ఇబ్బంది పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పంచాయతీ కార్యదర్శి సురేష్ అక్కడకు చేరుకుని సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీనివ్వడంతో ఆందోళన విరమించారు.అమరాపురం మండలం తమ్మడేపల్లి గ్రామ సచివాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలు అగళి మండలం కురసాంగనపల్లిలో ఖాళీ బిందెలతో రోడ్డుపై నిరసన తెలుపుతున్న గ్రామస్తులు -
రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అక్రమాలపై విచారణ చేపట్టాలి
ప్రశాంతినిలయం: కదిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో చోటు చేసుకున్న భారీ అవినీతి, అక్రమాలపై విచారణకు ఆదేశించాలని కలెక్టర్‌ను బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు విష్ణువర్ధన్‌రెడ్డి కోరారు. బుధవారం కలెక్టర్ శ్యాంప్రసాద్‌ను ఆయన కలిసి వినతి పత్రం అందజేశారు. నకిలీ డాక్యుమెంట్ల దందా, రెవెన్యూ రికార్డులను అక్రమంగా తారుమారు చేయడం, ఫోర్జరీ డాక్యుమెంట్లతో అక్రమ రిజిస్ట్రేషన్లు నిర్వహిస్తుండడం తదితర అంశాలకు సంబంధించిన ఆధారాలనూ సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కదిరి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో చోటు చేసుకుంటున్న అక్రమాలపై గతంలో తాము ఫిర్యాదు చేసినా అధికారులు నేటికీ సరైన చర్యలు తీసుకోలేదన్నారు. ప్రభుత్వ భూములు సైతం ప్రైవేటు వ్యక్తుల పరం చేస్తున్నారని, అసలు సూత్రధారులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించడంతో ఆయన హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు బూదిలి సుదర్శన్, కొండమరాజు, కత్తి రాజారెడ్డి, జ్యోతి ప్రసాద్, తిరుమలేష్, బాలగంగాధర్, కళ్యాణ్‌కుమార్, లక్ష్మీనారాయణ, నారాయణ, భాస్కర్ ఉన్నారు. -
కల్యాణం.. కమనీయం
రాయదుర్గం: పట్టణంలోని కోటలో వెలసిన ప్రసన్న వేంకటరమణుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం బాలికతో శ్రీవారి వివాహ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. విశిష్ట సంప్రదాయం ప్రకారం నిర్వహించిన ఈ ఘట్టాన్ని కనులారా వీక్షించిన భక్తులు తరించారు. పద్మశాలీయ వంశం అరవ తెగకు చెందిన బాలికతో శ్రీనివాసుడి కల్యాణం జరిపితే, ఆ బాలికకు సకల గుణ సంపన్నుడు భర్తగా వస్తాడని భక్తుల నమ్మకం. అందులో భాగంగా ఈ ఏడాది కర్ణాటక రాష్ట్రం విజయనగర జిల్లాలోని కానాహొసళ్లికి చెందిన అరవ నగేష్, పావని దంపతుల కుమార్తె పద్మావతిని వధువుగా నిర్ణయించారు. ముందుగా పట్టణంలోని అరవ తెగ కులదైవం భక్త మార్కండేయుని ఆలయం వద్ద వేంకటేశ్వరుడి ఉత్సవ విగ్రహం ఎదుట కులపెద్దల సమక్షంలో తాంబూలాలు మార్చుకున్నారు. అనంతరం మేళతాళాలు, డప్పు వాయిద్యాల నడుమ స్వామి ఆలయం వద్దకు ఊరేగింపుగా వెళ్లారు. అభిజిత్ లగ్నంలో శ్రీదేవి, భూదేవి సమేతుడైన వేంకటేశ్వరుడితో బాలిక మెడలో ఆమె తల్లి పావని చేత పసుపుతాడు కట్టించారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి వివాహ వేడుకను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గోవిందా.. గోవింద నామస్మరణతో ఆలయాన్ని మార్మోగించారు. భక్తులకు ఆలయ నిర్వాహకులు ప్రసాదాలు పంచి పెట్టడంతో పాటు అన్నదానం చేశారు. వైఎస్సార్సీపీ ఎస్ఈసీ మెంబర్ గౌని ఉపేంద్ర రెడ్డి, బీఎన్టీ, కేకేటీ కుటుంబాల ఆధ్వర్యంలో 4,500 లడ్డూలను భక్తులకు పంపిణీ చేశారు. ● ప్రసన్న వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాల్లో గురువారం (రేపు) ఉదయం 11 గంటలకు మడుగుతేరు, సాయంత్రం 4 గంటలకు బ్రహ్మరథోత్సవం నిర్వహించనున్నారు. బాలికతో శాస్త్రోక్తంగా శ్రీవారి వివాహం వేడుకను తిలకించేందుకు తరలివచ్చిన భక్తజనం -
తరుముకొస్తున్న కరువు
రాయదుర్గం: గత ఐదేళ్లు సమృద్ధిగా కురిసిన వానలు ఈ ఏడాది ముఖం చాటేయనున్నాయి. సూపర్ ఎల్‌నినో ప్రభావం కారణంగా కరువు పరిస్థితులు తప్పవని తెలుస్తోంది. ఫలితంగా జిల్లాలో రైతు పరిస్థితి మూడు అడుగులు ముందుకు ఆరు అడుగులు వెనక్కి అనే చందంగా మారింది. ఇప్పటి వరకూ వేసవి దుక్కులు సైతం ఊపందుకోలేని పరిస్థితి. వ్యవసాయమే ప్రధాన జీవనాధారంగా ఉన్న జిల్లాలో వరుణుడు ముఖం చాటేస్తే కరువు కరాళనృత్యం తప్పదని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏటా ఖరీప్‌లో జిల్లాలో 16,54,080 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగులోకి వస్తాయి. ఇందులో వేరుశగన, కంది, ఆముదం, పత్తి మెజార్టీ పంటలు. జూన్ నుంచి సెఫ్టెంబర్ వరకు ఎల్‌నినో ముప్పు పొంచి ఉండవచ్చునని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న క్రమంలో ఖరీఫ్ సాగుపై ప్రభావం పడనుంది. రుతుపవనాలు ముందే వచ్చినా? నైరుతి రుతుపవనాలు జాన్ మొదటి వారంలోనే జిల్లాలో ప్రవేశించనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. తొలకరి వర్షాలు కురిసినా ఎల్‌నినో దెబ్బకు ఆ తర్వాత పెద్ద విరామం ఉండే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్నదాతలు ఆలోచించి అడుగేయాల్సి వస్తోంది. జిల్లాలో సాధారణంగా ఖరీప్‌లో వేరుశనగ, కంది, పత్తి, ఆముదం, జొన్న, సజ్జ, ఉలువ లాంటి పంటలు సాగుచేస్తారు. ఎల్‌నినో ప్రభావం కారణంగా ఈ సారి తక్కువ నీటితో ఎక్కువ ఉత్పత్తి సాధించే పంటల వైపు రైతులు దృష్టి సారిస్తే ప్రయోజనంగా ఉంటుంది. అలాగే తీవ్ర వర్షాభావం కారణంగా భూగర్భ జలాలు కూడా అడుగంటిపోయే ప్రమాదం ఉండడంతో బోరుబావుల కింద వరి కాకుండా ఇతర ఆరుతడుల పంటలు సాగు చేయడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. సూపర్ ఎల్నీనో ఎఫెక్ట్ కారణంగా ముఖం చాటేయనున్న వర్షాలు ఆలోచించి అడుగేయాలి ఎల్‌నినో ప్రభావం ఉంటుందని ఇప్పటికే వాతావరణశాఖ అప్రమత్తం చేసింది. దీనిపై ఇటీవల ఓ సమావేశం కూడా జరిగింది. సరైన స్పష్టత వెలువడాల్సి ఉంది. అలాంటిదేదైనా ఉంటే రైతులు ఆలోచించి అడుగేయాలి. తక్కువ వర్షాపాతానికి తట్టుకునే పంటల సాగుపై దృష్టిసారించడం మంచిది. – మల్లికార్జున, సేద్యం విభాగపు శాస్త్రవేత్త, కళ్యాణదుర్గం -
● ఇల్లే.. వ్యవసాయ క్షేత్రం
తాడిపత్రి టౌన్: ప్రకృతి ప్రేమికులు ఎక్కడున్నా పచ్చదనాన్ని కోరుకుంటారు. గ్రీనరీ అంటే ఎవరికై నా ఇష్టం.. చెట్లు, పూల మొక్కలు పెంచుకోవాలని చాలా మందికి ఉంటుంది. కానీ కాంక్రీట్ జంగిల్లో ఇంటికే స్థలం సరిపోవట్లేదు... ఇక మొక్కలు పెట్టేందుకు స్థలమెక్కడిది? అయితే ఓ ఫర్టిలైజర్ షాపు యజమాని తన ఇంటినే వ్యవసాయ క్షేత్రంగా మార్చేశారు. వివిధ రకాల ఉద్యాన పంటలతో పాటు పూలు, కూరగాయలు పండిస్తూ అందరినీ అబ్బుర పరుస్తున్నారు. ఈ నందన వనాన్ని చూడాలనుకుంటే తాడిపత్రిని సందర్శించాల్సిందే. పట్టణంలోని సంజీవనగర్‌కు చెందిన రాజేష్, శ్రీలత దంపతులు తమ ఇంటి ఆవరణతో పాటు మిద్దైపె కూడా డ్రమ్ములు, బ్యాగ్‌లలో మట్టి నింపి 25 రకాల మందార మొక్కలు, నాలుగు రకాల మల్లె మొక్కలతో పాటు వివిధ రకాల పూలు, ఆకుకూరలు, మామిడి, జామ, నిమ్మ చెట్లను పెంచుతున్నారు. తన తండ్రి వెంకటరమణారావు మొక్కలపై మమకారంతో ఇంట్లో పచ్చని చెట్లను పెంచారని, ఆయన మరణాంతరం తండ్రి జ్ఞాపకాలను మొక్కల్లో చూసుకుంటూ మొక్కలను సంరక్షించుకుంటున్నట్లు రాజేష్ తెలిపారు. -
అర్ధరాత్రి దొంగల బీభత్సం
● ఇంటి తాళం బద్ధలుగొట్టి 15 తులాల బంగారు నగల అపహరణ కళ్యాణదుర్గం రూరల్: స్థానిక మున్సిపాలిటీ పరిఽధిలోని ఒంటిమిద్ది గ్రామంలో సోమవారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. పోలీసులు తెలిపిన మేరకు.. ఒంటిమిద్దిలో నివాసముంటున్న దంపతులు రామాంజనేయులు, గీతమ్మ వ్యవసాయంతో జీవనం సాగిస్తున్నారు. ఇటీవల రామాంజనేయులు అనారోగ్యానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే రోజూ ఇంటికి తాళం వేసి సమీపంలోని బంధువుల ఇంటి ఆవరణలో నిద్రించేవారు. సోమవారం బంధువుల ఇంటి వద్దకు దంపతులు వెళ్లిన సమయంలో ఇంటి తాళాన్ని దుండగులు బద్ధలుగొట్టి లోపలకు ప్రవేశించారు. బీరువాలోని 15తులాల బంగారు నగలు, రూ.6వేలు నగదు అపహరించారు. మంగళవారం ఉదయం ఇంటికి చేరుకున్న రామాంజనేయులు దంపతులు చోరీ జరిగిన విషయాన్ని గుర్తించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీంను రంగంలో దించి నిందితుల వేలి ముద్రలను సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ హరినాథ్ తెలిపారు. రైలు కింద పడి యువకుడి మృతి గుంతకల్లుటౌన్: స్థానిక హనుమాన్ జంక్షన్ రైల్వేస్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఓ యువకుడు మృతి చెందాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. లభ్యమైన ఆధారాలను బట్టి మృతుడిని కర్నూలు జిల్లా మద్దికెరకు చెందిన విశ్రాంత ఆర్టీసీ డ్రైవర్ గోపాల్ కుమారుడు కె.బాలచంద్ర (34)గా గుర్తించారు. గుంతకల్లులోని కొనకొండ్ల రైల్వేగేట్ సమీపంలో ఉన్న ఆర్డీటీ బిల్డింగ్స్‌లో అద్దెకుంటున్నాడు. అవివాహితుడు. ఆర్టీసీ అద్దె బస్సుల్లో క్లీనర్‌గా దినసరి కూలి పనితో జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసయ్యాడు. మంగళవారం వేకువజామున రైలుకింద పడి మృతి చెందాడు. కాగా, మద్యం మత్తులో రైలు కిందపడ్డాడా? లేక ఆత్మహత్య చేసుకున్నాడా? అనే కోణంలో రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఉత్సాహంగా గ్రామీణ క్రీడా పోటీలుఆత్మకూరు: మండలంలోని ముట్టాల, పాపంపల్లి గ్రామాలకు సంబంధించిన అక్కమ్మగార్ల పరుష ఉత్సవాల్లో భాగంగా మంగళవారం పరుష కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అక్కమ్మ గార్లకు పూజలు నిర్వహించి టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే ఆలయం వద్ద పెద్ద ఎత్తున భక్తులకు అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణంలో ఉత్సాహంగా రాతి దూలం లాగుడు, ఇరుసు ఎత్తే పోటీలను నిర్వహించారు. -
ఆగిన సత్యసాయి నీటి సరఫరా
● డిమాండ్లు పరిష్కరించేదాకా సమ్మె విరమించబోమంటున్న కార్మికులు బత్తలపల్లి: శ్రీసత్యసాయి రక్షిత తాగునీటి పథకం కార్మికుల సమ్మెతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తాగునీటి సరఫరా నిలిచిపోయింది. మంగళవారం నుంచి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 800 మంది కార్మికులు నిరవధిక సమ్మెను సత్యసాయి పంప్‌హౌస్‌ల వద్ద చేపట్టారు. బత్తలపల్లిలో కార్మికులు నీటి ట్యాంకుల వద్ద సమ్మెకు దిగారు. పథకం నిర్వహణకు అవసరమైన నిధులు కేటాయించడంతో పాటు కార్మికులకు పెండింగ్‌లో ఉన్న ఐదు నెలల వేతనం మంజూరు తదితర డిమాండ్ల సాధనలో భాగంగా సమ్మె చేపట్టినట్లు కార్మికులు పేర్కొన్నారు. మండల కేంద్రంతో పాటు అప్పరాచెరువు సమీపంలోని సత్యసాయి పంపుహౌస్ వద్ద సమ్మె చేస్తున్న కార్మికులకు వైఎస్సార్సీపీ నాయకులు మద్దతు తెలిపారు. ఇదిలా ఉండగా.. సత్యసాయి కార్మికుల సమ్మెతో జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో నీటి కష్టాలు మొదలయ్యాయి. అధికారులు, ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన కార్మికులతో చర్చించి సమ్మెను విరమింపచేయాలని ప్రజలు కోరుతున్నారు. ఆర్ఓ ప్లాంట్లు పనిచేసేలా చూడండిధర్మవరం అర్బన్: సెలవులు ముగిసిన వెంటనే ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేయని ఆర్ఓ ప్లాంట్లకు మరమ్మతులు చేయించి పనిచేసేలా చూడాలని జిల్లా విద్యాశాఖ అధికారి కిష్టప్ప తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం పది మండలాల హెచ్ఎంలతో ఆయన సమావేశం నిర్వహించారు. డీఈఓ కిష్టప్ప మాట్లాడుతూ ‘మన బడి – మన భవిష్యత్తు’ కింద జిల్లాలో 1248 ఆర్ఓ ప్లాంట్లు ఫేస్–1, ఫేస్–2 కింద మంజూరయ్యాయని పేర్కొన్నారు. కొన్ని పాఠశాలల్లో ఆర్ఓ ప్లాంట్లు పనిచేయలేదని చెప్పారు. జూన్ 12న పాఠశాలలు ప్రారంభించే సమయానికి ప్రతి పాఠశాలలో ఉన్న ఆర్ఓ ప్లాంటు పనిచేసేటట్లు చూడాలని ఆదేశించారు. పదో తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులకు రెమెడియన్ క్లాసులు నిర్వహించాలన్నారు. ఐదు సంవత్సరాలు దాటిన ప్రతి విద్యార్థిని ప్రాథమిక పాఠశాలలో చేర్పించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. సమావేశంలో ఎంఈఓ గోపాల్‌నాయక్, సీఎంఓ హరిప్రసాద్, ఏపీఓ ఫణిరాజ్శర్మ, ఏఎస్ఓ మాధవరెడ్డి, కొత్తపేట పాఠశాల హెచ్ఎం పద్మావతి, ఆర్ఓ ప్లాంట్ల టెక్నీషియన్లు కిశోర్, నగేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
బీమాతో కుటుంబానికి రక్ష
మడకశిర: వ్యక్తిగత బీమా (ఇన్సూరెన్స్) కుటుంబానికి రక్షణగా నిలుస్తుందని, ఆర్టీసీ కార్మికులు తప్పనిసరిగా బీమా చేయించుకోవాలని ఆర్టీసీ కడప జోనల్ ఈడీ రాఘవకుమార్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన మడకశిర డిపోను తనిఖీ చేశారు. డిపోలోని వివిధ విభాగాలను పరిశీలించారు. సీ్త్రశక్తి పథకం అమలు తీరుపై సమీక్షించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆర్టీసీ అధికారులు, కార్మికులు, సిబ్బందితో సమావేశమై పలు సూచనలు చేశారు. ఆర్టీసీ కార్మికులందరూ ఎస్బీఐ బీమా చేయించుకోవాలన్నారు. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. సమయపాలనతో ఆర్టీసీకి మంచి పేరు తీసుకుని రావాలని కోరారు. సమావేశంలో డీపీటీఓ మధుసూదన్, డీఎం ధర్మకీర్తి తదితరులు పాల్గొన్నారు. సమస్యలను పరిష్కరించండి మడకశిర డిపోలో పనిచేస్తున్న ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కడప జోనల్ ఆర్టీసీ ఈడీ రాఘవకుమార్కు ఎన్ఎంయూఏ, ఈయూ నాయకులు వినతి పత్రాలను సమర్పించారు. ప్రధానంగా శ్రీశైలం బస్సు పని గంటలను సవరించాలని కోరారు. డిపో మేనేజర్ కార్యాలయం నిర్మాణానికి చొరవ తీసుకోవాన్నారు. గ్యారేజీలో బస్సుల మరమ్మతుకు అదనపు పిట్స్ ఏర్పాటు చేయాలని, సిబ్బంది, కార్మికులకు ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యం కల్పించాలని, రద్దు చేసిన బస్సు సర్వీసులను పునరుద్ధరించాలని విన్నవించారు. అనంతరం ఈడీని ఘనంగా సన్మానించారు. డీపీటీఓ మధుసూదన్, స్థానిక డీఎం ధర్మకీర్తి, ఆర్టీసీ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు హనుమంతరాయప్ప, రంగప్ప, చెన్నారెడ్డి, ఉలిగమ్మ, ఈయూ డిపో అధ్యక్షుడు రఫిక్, కార్యదర్శి రంగనాథ్, రీజియన్ సభ్యుడు సిద్ధగంగప్ప, కేటీస్వామి, గంగరాజు, ఎన్ఎంయూ డిపో అధ్యక్షుడు ముద్దప్ప, కార్యదర్శి కరియప్ప, ఎన్ఎంయూ జిల్లా ఉపాధ్యక్షుడు రామకృష్ణ తదితరులు హాజరయ్యారు. ఆర్టీసీ కార్మికులు తప్పనిసరిగా బీమా చేయించుకోవాలి ఆర్టీసీ కడప జోనల్ ఈడీ రాఘవకుమార్


