Kamareddy
-
కువైట్‌లో ఎల్లారెడ్డిపల్లెవాసి మృతి
ఇందల్వాయి: మండలంలోని ఎల్లారెడ్డిపల్లె గ్రామానికి చెందిన గోషికొండ గంగ నర్సయ్య(36) శుక్రవారం కువైట్‌లో అనారోగ్యంతో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతుడు నాలుగు సంవత్సరాలుగా కువైట్‌లో ఉంటున్నాడని, మృతుడికి భార్య, ఏడేళ్ల లోపు ఇద్దరు కొడుకులు ఉన్నట్లు తెలిపారు. మృతదేహం స్వగ్రామం చేరుకునేలా ప్రభుత్వం చొరవ చూపాలని మృతుడి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. చోరీ సొత్తుతో పట్టుబడ్డ దొంగ రాజంపేట: చోరీకి పాల్పడి సొత్తుతో బైక్‌పై వెళ్తున్న దుండగుడు పోలీసులకు పట్టుబడ్డాడు. ఎస్సై పుష్పరాజ్ తెలిపిన వివరాలు ఇలా.. రాజంపేట పోలీస్ స్టేషన్ సిబ్బంది ప్రేమ్‌సింగ్, మహమ్మద్ అజీమ్‌లు సోమవారం రాత్రి గస్తీ నిర్వహిస్తుండగా తెల్లవారుజామున అనుమానాస్పదంగా బైక్‌పై వెళ్తున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వాహనాన్ని తనిఖీ చేయగా అతడు చోరీ చేసిన సొమ్ము, వస్తువులు కనిపించాయి. నిందితుడు భిక్కనూర్ మండలం, కామారెడ్డి పట్టణంలో దొంగతనాలకు పాల్పడినట్లు గుర్తించి, కేసు నమోదు చేశారు. అనంతరం జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపించారు. రాత్రివేళ నైట్ డ్యూటీ నిర్వహిస్తూ నిందితుడిని పట్టుకున్న కానిస్టేబుళ్లను ఎస్సై పుష్పరాజ్ అభినందించారు. షార్ట్‌సర్క్యూట్‌తో గడ్డి దగ్ధం మోపాల్: మండలంలోని సిర్పూర్ గ్రామంలో సోమవారం రాత్రి డీసీఎంలో తరలిస్తున్న గడ్డికట్టలు షార్ట్ సర్క్యూట్‌తో దగ్ధమయ్యాయి. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని సిర్పూర్ నుంచి ముదక్‌పల్లికి డీసీఎంలో గడ్డి కట్టలు తీసుకెళ్తున్నారు. సిర్పూర్ గ్రామ పంచాయతీ వద్ద విద్యుత్ తీగలు వ్యాన్‌కు తగిలి మంటలు చెలరేగాయి. స్థానికులు బోరు పైపుతో నీరు పట్టి మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. కానీ గడ్డి కట్టలకు మంటలు అంటుకుని చెలరేగడంతో గ్రామస్తులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారమందించారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదంలో డీసీఎం వ్యాన్ స్పల్పంగా దెబ్బతినగా, గడ్డి కట్టలు కాలిపోయాయి. డ్రంకన్‌డ్రైవ్ కేసులో మూడురోజుల జైలుశిక్ష డిచ్పల్లి: మండల కేంద్రంలోని నాగ్‌పూర్ గేట్, సీఎంసీ చౌరస్తాలో ఈ నెల 20న ఎస్సై ఎండీ షరీఫ్ ఆధ్వర్యంలో పోలీసులు డ్రంకన్‌డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. బీబీపూర్ తండాకు చెందిన బదావత్ మంగులాల్, మహరాష్ట్రకు చెందిన శ్రీరంగు రామ మద్యం తాగి వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డారు. వారిని మంగళవారం కోర్టులో హాజరుపర్చగా సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ రహీముద్దిన్ నిందితులకు మూడు రోజుల జైలు శిక్ష విధించారు. దీంతో నిందితులను జైలుకు తరలించినట్లు ఎస్సై తెలిపారు. దోమకొండలో వ్యక్తి అదృశ్యం దోమకొండ: మండల కేంద్రానికి చెందిన అవధూత నర్సింలు (49) అదృశ్యమైనట్లు ఎస్సై స్రవంతి మంగళవారం తెలిపారు. ఈనెల 25న ఉదయం నర్సింలు ఇంట్లో మేస్త్రి పనికి వెళ్లి వస్తా అని చెప్పి బయటకు వెళ్లాడు. ఇప్పటివరకు తిరిగి ఇంటికి రాలేడు. నాలుగు రోజులుగా కుటుంబసభ్యులు ఎంత వెతికినా అతడి ఆచూకీ లభించలేదు. దీంతో మంగళవారం నర్సింలు కుమారుడు సిద్ధిశ్వర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు. -
గోశాలకు ఆవుల తరలింపు
రామారెడ్డి: కరీంనగర్ జిల్లా నుంచి మూడు చిన్న టాటా ఏస్ వాహనాల్లో 16కు పైగా ఆవులను మంగళవారం మండుటెండలో తూప్రాన్ తరలిస్తుండగా మాచారెడ్డి పోలీసులు పట్టుకొని మద్దికుంటలోని గోశాలకు తరలించారు. ఈ ఆవులను తూప్రాన్ సంతలో రైతులకు అమ్మడానికి తీసుకెళ్తున్నట్టుగా సమాచారం. కానీ ఆవులకు కనీస వసతులు కల్పించకుండా ఒక్కో వాహనంలో ఆరు ఆవులను ఎండలో తరలిస్తుండడంతో అవి విలవిలకొట్టుకోవడాన్ని పోలీసులు గమనించి అడ్డుకున్నారు. నిర్వాహకులపై కేసు నమోదు చేసి, ఆవులను మద్దికుంట గోశాలకు తరలించారు. దొంగల ముఠా సభ్యుల అరెస్టు ఇందల్వాయి: వివిధ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన దొంగల ముఠాలోని ఇద్దరిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇందల్వాయి పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఎస్సై సందీప్, డిచ్పల్లి సీఐ మల్లేశ్ వివరాలు వెల్లడించారు. గన్నారం ఎక్స్ రోడ్ దగ్గర పోలీసులు మంగళవారం ఉదయం వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఇద్దరు వ్యక్తులు కారులో అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని పట్టుకొని, విచారించారు. వారం రోజుల కిందట ఇందల్వాయి మండలంలో జరిగిన వరుస దొంగతనాలు, జక్రాన్‌పల్లి మండలం పడకల్ల్లో జరిగిన దొంగతనాలకు, భిక్కనూరులోని బస్వాపూర్‌లో జరిగిన దొంగతనాలు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో చందుర్తి, కోనారావుపేటల్లో చోరీలకు పాల్పడిన దొంగల ముఠాలోని సభ్యులుగా గుర్తించారు. నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో సుమారు పది కేసులలో నిందితులుగా ఉన్నారన్నారు. వారి వద్ద నుంచి రెండు కార్లు, రెండు ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. రోడ్డు ఆక్రమణల తొలగింపు ఖలీల్‌వాడి: నగరంలోని ఆర్ఆర్ చౌరస్తా, న్యాల్కల్ ప్రాంతాలలో రోడ్డు వరకు ఉన్న షెడ్లు, ఆక్రమణలను మంగళవారం ట్రాఫిక్ ఏసీపీ నారాయణ ఆధ్వర్యంలో తొలగించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించేలా ఆక్రమణలు ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. దుకాణదారులు నగర ప్రజలకు ఇబ్బందులు లేకుండా వ్యాపారాలు నిర్వహించుకోవాలని తెలిపారు. ట్రాఫిక్ సీఐ ప్రసాద్, ట్రాఫిక్ సిబ్బంది ఉన్నారు. -
ఎన్ఫోర్స్మెంట్ టీంకు క్యాష్‌ప్రైజ్
ఖలీల్‌వాడి: నిజామాబాద్ ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ టీంకు రాష్ట్ర ఎకై ్సజ్ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి మంగళవారం రూ. 15వేల క్యాష్ రివార్డు అందజేశారు. ఇటీవల నవీపేట్ మండలం యంచ వద్ద 30కిలోల డ్రై గంజాయి, ఒక కారు, రెండు మోటార్ సైకిళ్లను ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది స్వాధీనం చేసుకుని, ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఈసందర్భంగా వారిని అభినందిస్తూ క్యాష్‌ప్రైజ్‌ను అందజేశారు. అలాగే ఫిబ్రవరి 14న కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్‌లో 91కిలోల ఎండుగంజాయిని పట్టుకున్నారు. వీరికి రూ.30 వేల క్యాష్ ప్రైజ్ ఇచ్చారు. ఎకై ్సజ్ అదనపు కమిషనర్ ముఖర్జీ, డీసీ సోమిరెడ్డి, ఎస్టీఎఫ్ అసిస్టెంట్ కమిషనర్ ప్రణవని, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ప్రదీప్ ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ స్వప్న, ఎస్సై రామకుమార్, సిబ్బంది హమీద్, అవినాష్, విష్ణు, సుకన్య, శ్యామ్ సుందర్, సాయి కుమార్‌లు ఉన్నారు. -
ఉపాధి ప్రణాళిక ఖరారు
కామారెడ్డి రూరల్: గ్రామాల్లో వలసలను నివారించి కూలీలకు పని కల్పించేందుకు జాతీయ ఉపాధి హామీ పథకం కింద 2025–26 ఆర్ధిక సంవత్సరానికి పనిదినాలను అధికారులు ఖరారు చేశారు. గతేడాది అక్టోబరు నుంచి డిసెంబరు వరకు గ్రామాల్లో ఉపాధి పనుల గుర్తింపు కోసం అధికారులు గ్రామసభలను నిర్వహించారు. 2025 ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చి 31వరకు స్థానికంగానే కూలీలకు పనులు కల్పించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. మండలంలోని 14 గ్రామ పంచాయతీల పరిధిలో.. కామారెడ్డి మండలంలోని 14 గ్రామపంచాయతీల పరిధిలో 2025–26 ఆర్థికసంవత్సరంలో మొత్తం 2,20,200 పనిదినాలను కల్పించాలని డీఆర్డీవో అధికారులు నిర్ణయించారు. మొత్తం 6,538 జాబ్ కార్డులున్నాయి. కార్మిక బడ్జెట్ రూ. 12.43 కోట్లు, మెటిరియల్ బడ్జెట్ రూ. 2 కోట్ల 69 లక్షల 78 వేలు మంజూర య్యాయి. గతానికి భిన్నంగా గ్రామం యూనిట్ గా పనులు చేపట్టాలని రెండేళ్లక్రితం కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పనుల గుర్తింపు, కూలీల వేతనాలను చెల్లించేందుకు కొత్త సాప్ట్‌వేర్‌ను ఎన్ఐసీని (నేషనల్ ఇన్ఫార్మాటెక్ సెంటర్)వినియోగిస్తున్నారు. ఈ విధానం ద్వారా ఉపాధి పనులకు హాజరైన కూలీలకు ఆధార్‌కార్డు నంబర్‌తో లింక్ ఉన్న బ్యాంకు ఖాతాలో వేతనాలను జమ చేస్తున్నారు.చేపట్టనున్న పనులు...కేంద్ర ప్రభుత్వ గైడ్‌లైన్స్ ప్రకారం ఈ ఏడాది గ్రామాలకు ఉపయోగపడే పనులను గుర్తించారు. ప్రధానంగా చెరువులు, కుంటలు, పంట కాలువల్లో పూడికతీత, నీటికుంటల నిర్మాణం, ఇంకుడుగుంతలు, వనమహోత్సవానికి గుంతల తవ్వకం, పంటపాలాలకు కొత్త దారుల నిర్మాణం తదితర పనులు చేపట్టనున్నారు. ప్రతి గ్రామంలో వందమందికి తగ్గకుండా ఉపాధి పనులు కల్పించేలా అధికారులు చర్యలు చేపట్టారు. 2025–26 ఏడాదిలో 2.20 లక్షల పనిదినాలు వ్యవసాయ పనులకు ప్రాధాన్యత కామారెడ్డి మండలంలో 6,538 జాబ్ కార్డులు -
లారీలు రావు.. ధాన్యం బస్తాలు పోవు
నిజాంసాగర్ : నిజాంసాగర్, మహమ్మద్‌నగర్ మండలాల్లో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయాలు నెమ్మదిగా సాగుతున్నాయి. ధాన్యం బస్తాల తరలింపునకు లారీలు కొరత తీవ్రంగా ఉంది. దీంతో ధా న్యం తూకాలు వేసినా లారీలు సక్రమంగా రాకపోవడంతో కొనుగోలు కేంద్రాల్లో బస్తాల నిల్వలు పేరుకుపోతున్నాయి. మహమ్మద్‌నగర్ మండలంలోని కోమలంచ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం తూకాలు చేపడుతున్నారు. రైతుల నుంచి ధాన్యం కాంటా వేయడంతో పాటు ధాన్యం బస్తాల తరలింపునకు తంటాలు పడుతున్నారు. ఈ కొనుగోలు కేంద్రానికి లారీలు సక్రమంగా రాకపోవడంతో కొనుగోలు కేంద్రం వద్ద సుమారు 3 వేల వరకు ధాన్యం బస్తాలు పేరుకుపోయాయి. రోజుకు ఒక్క లారీ చొప్పున వస్తుండడంతో ధాన్యం బస్తాల నిల్వలు రోజురోజుకు పేరుకుపోతున్నాయని రైతులంటున్నారు. మరోవైపు కొనుగోలు కేంద్రం వద్ద తూకాలు చేసే యంత్రాలు చెడిపోతుండడంతో నిర్వాహకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. కోమలంచ కొనుగోలు కేంద్రంలో రైతులకు తిప్పలు మూడు వేల బస్తాలు కేంద్రంలోనే ఉన్నాయి ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కేంద్రం నిర్వహిస్తున్నాం. బిహారీ కూలీలు హమాలీ చేస్తుండటంతో తూకాలు చేపడుతున్నాం. రోజుకు ఒక్కలారీ మాత్రం వస్తుండటంతో ధాన్యం బస్తాల నిల్వలు పేరుకుపోతున్నాయి. ప్రస్తుతం మూడు వేల బస్తాల ధాన్యం కేంద్రంలోనే ఉన్నాయి. రోజు ఒక్క లారీ మాత్రం వస్తుండటంతో ధాన్యం బస్తాలు రైస్ మిల్లులకు వెళ్లడం లేదు. రోజుకు రెండు, మూడు లారీలు పంపిస్తే కొరత ఉండదు. – విజయ, గ్రామ సంఘం అధ్యక్షురాలు -
రహదారి విస్తరణతో తొలగుతున్న మలుపులు
ఎల్లారెడ్డి: హైదరాబాద్ –మెదక్ –బోధన్(హెచ్ఎంబీ) జాతీయ రహదారి(765 డి) విస్తరణలో భాగంగా నేషనల్ హైవే అథారిటీ అధికారులు మలుపులను తొలగిస్తున్నారు. దీంతో వాహనదారులకు దూరభారం తగ్గనుంది. 765 డి జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా దిండిగల్ నుంచి రుద్రూర్ రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. ఇప్పటికే దిండిగల్ నుంచి మెదక్ వరకు 10 మీటర్ల రోడ్డు నిర్మాణం పూర్తయ్యింది. టూ లైన్ విత్ పేవ్డ్ షోల్డర్స్ పద్ధతిన మెదక్ నుంచి రుద్రూర్ వరకు కొత్త డిజైన్ ప్రకారం జాతీయ రహదారి నిర్మిస్తున్నారు. దిండిగల్ నుంచి నర్సాపూర్ అటవీ ప్రాంతం గుండా మెదక్ వరకు నిర్మించిన రోడ్డులో భారీ మలుపులను తొలగించి రోడ్డు నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం మెదక్ నుంచి రుద్రూర్ వరకు జరుగుతున్న రోడ్డు పనులలో భాగంగా మెదక్ శివారులోని ఔరంగాబాద్, హవేళీ ఘణపురం, పోచారం అభయారణ్యం, ప్రాజెక్ట్ పైబ్రిడ్జి నిర్మాణంతో బైపాస్ రోడ్డు, తాండూర్ గేట్, జానకంపల్లి, మెల్లకుంట తండా, కన్నారెడ్డి, మాచాపూర్ గ్రామాల వద్ద ఎల్లారెడ్డి వరకు భారీ మలుపులను తొలగించా రు. ఎల్లారెడ్డి నుంచి రుద్రూర్ వరకు లింగారెడ్డిపేట్, తిమ్మారెడ్డి, అన్నాసాగర్, కామ్శెట్టిపల్లి, నస్రుల్లాబాద్ ప్రాంతాలలో భారీ మలుపులను తొలగించి నేరుగా రోడ్డు వేస్తున్నారు. దిండిగల్ నుంచి రుద్రూర్ వరకు మలుపులను తొలగించడం వల్ల సుమారు 35 కిలోమీటర్ల దూరం తగ్గే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. దీని ప్రకారం ఎల్లారెడ్డి నుంచి సికింద్రాబాద్ బస్టాండ్ వరకు గతంలో 138 కిలోమీటర్ల దూరం ఉండగా కొత్త రోడ్డు నిర్మాణంతో 125 కిలోమీటర్లకు తగ్గనున్నట్లు తెలుస్తోంది. జాతీయ రహదారుల నిర్మాణంలో భారీ మలుపులను తొలగించడం వల్ల దూరభారం తగ్గనుండడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తగ్గనున్న దూరభారం హర్షం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు -
హడలెత్తిస్తున్న చోరులు
బాన్సువాడ : పట్టణంలో దొంగలు హడలెత్తిస్తున్నారు. తాళం వేసిన ఇళ్లే టార్గెట్‌గా దోపిడీకి పాల్పడుతున్నారు.దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.పట్టణానికి చెందిన చెనంగారి సాయవ్వ ఈ నెల 19న ఇంటికి తాళం వేసి డాబాపై పడుకోవడంతో ఇంట్లో ఉన్న 12 తులాల బంగారం, సుమారు 60 తులాల వెండి చోరీకి గురయ్యాయి. మనువరాలి పెళ్లికి ఉపయోగపడుతుందని 12 తులాల బంగారం జమ చేస్తే దొంగలు దోచుకెళ్లారని ఆమె వాపోయింది. బాధితులకు అండగా ఉండాల్సిన పోలీసులే ఇంట్లో అంత బంగారం ఎందుకు పెట్టుకున్నారని ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు తెలుస్తోంది. చోరీలు జరిగిన సమయంలో హల్చల్ చేసే పోలీసులు చోరీకి గురైన సొత్తును రికవరి చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పట్టణంలో వరుస చోరీలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రతి గురువారం జరిగే వారంతపు సంతలో నిఘా పెట్టాల్సి ఉంది. పోలీసులు స్పందించి రాత్రి వేళల్లో గస్తీ పెంచాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఘటనలు.. ● ఈ నెల 18న పాత బాన్సువాడ ముదిరాజ్ సంఘం వద్ద ఓ పెళ్లికి వచ్చిన బంధువుది పట్టపగలే ద్విచక్ర వాహనం చోరీకి గురైంది. ● అదే రోజు రామ మందిర్ సమీపంలోని ఓ మిల్క్ సెంటర్ నిర్వహకుడు ఎర్రవాటి సాయిబాబా కౌంటర్‌పై నుంచి సెల్‌ఫోన్ చోరీకి గురైంది. ● మార్చి 12 క్రితం పట్టణంలోని సంగమేశ్వర కాలనీకి చెందిన దుబాస్ రాములు కుటుంబం తన బంధువుల ఇంటికి వెళ్లగా ఇంట్లో ఉన్న రూ. 6500 నగదుతో పాటు 5 తులాల వెండి చోరీకి గురైంది. తలుపులు పూర్తిగా ధ్వంసం చేశారు. ● అదే రోజు అదే కాలనీలో మరో వ్యక్తి ఇంట్లో చోరీ జరిగింది. పాఠశాలలో వాచ్‌మెన్‌గా పనిచేసే ఓ వ్యక్తికి చెందిన పర్సును దొంగిలించారు. తాళం వేసిన ఇళ్లే టార్గెట్ వాహనాలు సైతం.. భయాందోళనలో బాన్సువాడ ప్రజలుపెద్ద చోరీలు ఐతేనే స్పందిస్తున్నారు బాన్సువాడలో దొంగతనాలు నివారించడంలో పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో ఓ చోట చోరీ జరిగిందంటే చుట్టు పక్కల గ్రామాలు, మండల కేంద్రాల్లో విసృతంగా తనిఖీలు చేసేవారు. పెద్ద పెద్ద చోరీలు ఐతేనే స్పందిస్తున్నారు. బైకులు, చిన్న చిన్న దొంగతనం చేస్తే పట్టించుకోవడం లేదు. – దుబాస్ రాములుసీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నాం ఇటీవల జరిగిన చోరీలు స్థానికంగా ఉండే వారే చేసినట్లు అనుమానాలు ఉన్నాయి. సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నాం. పట్టణంలో గస్తీ పెంచుతాం. చోరీల నివారణకు చర్యలు తీసుకుంటాం. – అశోక్, సీఐ బాన్సువాడ -
ఉగ్రదాడిని ప్రతిఒక్కరూ ఖండించాలి
తెయూ(డిచ్పల్లి): జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం పహల్గాంలో పర్యాటకులపై పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేసి హతమార్చడాన్ని ప్రతి ఒక్క భారత పౌరుడు ఖండించాలని తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ యాదగరి అన్నారు. తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (టూటా) ఆధ్వర్యంలో మంగళవారం పహల్గాం అమరుల కుటుంబాలకు సంఘీభావం తెలియజేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ముఖ్యఅతిథిగా పాల్గొని, మాట్లాడారు. ఉగ్రదాడికి ప్రతిగా కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్‌కు, ముస్లిం ఉగ్రవాదులకు ధీటైన జవాబు ఇవ్వాలన్నారు. ప్రిన్సిపాల్ మామిడాల ప్రవీణ్, టూటా అధ్యక్షుడు పున్నయ్య, కోశాధికారి నాగరాజు, వర్సిటీ ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ శివనారాయణసింగ్, అధ్యాపకులు శిరీష, వాసం చంద్రశేఖర్, పాత నాగరాజు, బాలకిషన్, మహేందర్ రెడ్డి, స్రవంతి, స్వప్న, నాన్ టీచింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సాయాగౌడ్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అధ్యక్షుడు సురేష్ పాల్గొన్నారు. -
వీడీసీలను కట్టడి చేయండి
ఆర్మూర్: గ్రామాల్లో రాజ్యాంగానికి వ్యతిరేకంగా సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్న గ్రామాభివృద్ధి కమిటీ (వీడీసీ)లను కట్టడి చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. వీడీసీలకు కుల వృత్తిదారులు వెట్టి చాకిరీ చేసే దయనీయ పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్మూర్‌లో మంగళవారం బీసీ కులాల జేఏసీ ఆధ్వర్యంలో వీడీసీల ఆగడాలను నిరసిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ఉన్న అన్ని కులాలపై వీడీసీలు పెత్తనం చెలాయిస్తూ కుల వృత్తులను నిర్వీర్యం చేస్తున్నారన్నారు. తాళ్లరాంపూర్‌లో గౌడ కులస్తుల మీదనే కాకుండా జిల్లాలోని నాగంపేట్, మెండోర, పల్లికొండ, చేంగల్ తదితర గ్రామాల్లో యాదవులు, గంగపుత్రులు, రజక, ముదిరాజ్ తదితర కుల వృత్తులపై సైతం వీడీసీల ఆగడాలు కొనసాగుతున్నాయన్నారు. ఆయా కులవృత్తిదారుల నుంచి లక్షల రూపాయలు బలవంతంగా వసూలు చేస్తున్నారన్నారు. ఇకపై బీసీ కులాల జేఏసీ ఈ ఆగడాలను నియంత్రించడంలో పోరాటం చేస్తుందన్నారు. అనంతరం ఆర్మూర్ ఆర్డీవో రాజాగౌడ్‌కు గ్రామాభివృద్ధి కమిటీలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రం అందజేశారు. బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షులు రాజారాం యాదవ్, ఆర్మూర్ జేఏసీ అధ్యక్షులు నరసింహ చారి, వివిధ కుల సంఘాల ప్రతినిధులు బిజ్జు దత్తాద్రి, దేగం యాదగౌడ్, బస్సాపూర్ శంకర్, మహిపాల్ యాదవ్, బీఎస్ఎన్ఎల్ రాజన్న, రాజమల్లు యాదవ్, స్వామి యాదవ్, భుమన్న యాదవ్, గూపన్ పల్లి శంకర్, బట్టు నరేందర్, లక్ష్మి నర్సయ్య, రవినాథ్, పల్లికొండ నర్సయ్య, వేల్పూర్ శ్రీనివాస్ గౌడ్, సుదర్శన్, రామగౌడ్, గంగాధర్, చందు, గంగాధర్, నర్సింగ్, రమేష్, శంకర్ గౌడ్ పాల్గొన్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆర్మూర్‌లో బీసీ కులాల జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ -
ఎలక్ట్రీషియన్‌కు నోటీస్
భిక్కనూరు: దక్షిణ కాశీ గా పేరొందిన భిక్కనూ రు శ్రీసిద్దరామేశ్వరాల యం హుండీ లెక్కింపు లో చేతివాటం ప్రదర్శించిన ఎలక్ట్రీషియన్ బి.లక్ష్మీనారాయణకు సంజాయిషీ నోటీస్ జారీ చేసినట్లు ఆలయ ఈవో శ్రీధర్ తెలిపారు. ‘హుండీ లెక్కింపులో ఉ ద్యోగి చేతివాటం’ శీర్షికన ‘సాక్షి’లో మంగళ వారం ప్రచురితమైన వార్తపై గ్రామస్తులు స్పందించారు. సింగిల్ విండో చైర్మన్ గంగళ్ల భూమయ్య, నేతలు మైపాల్‌రెడ్డి, దుంపల మోహన్‌రెడ్డి, నీల అంజయ్య, నర్మల రాంచంద్రం, ద్యాగల కిరణ్, సుధాకర్, జనార్దన్‌రెడ్డి ఆలయానికి వెళ్లి ఈవో శ్రీధర్‌తో మాట్లాడారు. సీసీ ఫుటేజీలను చూపించాలని పట్టుబట్టారు. చేతివాటం ప్రధర్శించిన ఉద్యోగిపై ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని డి మాండ్ చేశారు. దీంతో ఈవో శ్రీధర్ మాట్లాడుతూ సీసీ ఫుటేజీల కోసం టెక్నీషియన్‌ను పిలిపిస్తానన్నారు. ఎలక్ట్రీషియన్ లక్ష్మీనారాయణ వ్యవహారంపై ఆలయ అభివృద్ధి కమి టీ చైర్మన్ మహేందర్‌రెడ్డి తనకు ఫిర్యాదు చేశారన్నారు. ఈ మేరకు లక్ష్మీనారాయణకు సంజాయిషీ నోటీస్ జారీ చేశామన్నారు. నేడు బాల్య వివాహాల నిరోధంపై అవగాహన కార్యక్రమం కామారెడ్డి టౌన్: బాల్య వివాహాల నిరోధంపై బుధవారం జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జస్ట్ ఫర్ రైట్ సాధన సంస్థ జిల్లా కోఆర్డినేటర్ గిరిజ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆలయాలు, ప్రార్థన స్థలాల వద్ద ప్రజలు, పురోహితులు, వివిధ మతాలకు చెందినవారికి అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమాలను విజయవంతం చేయాలని ప్రజలను కోరారు. రేపటినుంచి అథ్లెటిక్స్ వేసవి శిబిరం కామారెడ్డి టౌన్: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆదేశాల మేరకు గురువారంనుంచి అథ్లెటిక్స్ వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు కోచ్ శివ గౌడ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజంపేట మండలంలోని తెలంగాణ క్రీడా ప్రాంగణంలో ఈ సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. మే 30వ తేదీ వరకు కొనసాగే శిబిరాన్ని క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నీటికోసం నిధుల కేటాయింపు నాగిరెడ్డిపేట : రోజురోజుకు ఎండలు ముదురుతున్న నేపథ్యంలో గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఉండేందుకు ముందుజాగ్రత్తగా ప్రభుత్వం జిల్లాకు ప్రత్యేక నిధులను కేటాయించింది. జిల్లాకు రూ. కోటి మంజూరయ్యాయి. జిల్లాలోని మొత్తం 536 గ్రామపంచాయతీల ఖాతాలలో నాలుగురోజుల క్రితం ఆ నిధులను జమ చేశారు. పంచాయతీ స్థాయినిబట్టి ఒక్కోదాని ఖాతాలో రూ.10 వేల నుంచి రూ.29 వేల వరకు జమయ్యాయి. గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఈ నిధులను ఖర్చు చేయాల్సి ఉంటుంది. కాగా వీటిని పైపులైన్ లీకేజీలు, బోర్‌మోటార్ మరమ్మతులు వంటి అత్యవసర పనులకు వినియోగించాలని అధికారులు ఆదేశించారు. ప్రస్తుతం ప్రభుత్వం విడుదల చేసిన నిధులు గ్రామాల్లో తాగునీటి ఎద్దడిని తీర్చేందుకు సరిపోవు. కానీ ఉన్న నిధులను సర్దుబాటు చేసుకునేలా ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. రోజురోజుకు భూగర్భజలాలు పడిపోతుండడంతో గ్రామాల్లో బోరుబావుల్లో నీటిమట్టం తగ్గుతోంది. ఈ క్రమంలో తాగునీటి సమస్య తీవ్రమవుతోంది. ప్రస్తతం విడుదలైన నిధులు కొంత ఊరట ఇవ్వనున్నాయి. గ్రామపంచాయతీ ప్రత్యేకాధికారులు, పంచాయతీ కార్యదర్శులు సంయుక్తంగా ఈ నిధులను ఖర్చు చేయాల్సి ఉంటుంది. సొసైటీకి తాళం మాక్లూర్: కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కాంటా చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ గొట్టుముక్కల గ్రామానికి చెందిన రైతులు మాక్లూర్ సొసైటీకి తాళం వేశారు. మంగళవారం ఉదయం సొసైటీకి చేరుకున్న రైతులు సిబ్బందిని బయటకి పంపి తాళం వేసి ధర్నా చేశారు. సమాచారం అందుకున్న తహసీల్దార్ శేఖర్ సొసైటీ చైర్మన్ బూరోల్ల అశోక్‌ను వెంటబెట్టుకుని సొసైటీ వద్దకు చేరుకుని రైతులతో మాట్లాడారు. రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని వారు హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. -
ఫైనాన్స్ దందా ఆగం..
● అవసరానికి సర్దుబాటు కాని పరిస్థితి ● ఇబ్బంది పడుతున్న పేద, మధ్యతరగతి వర్గాలు ● ఎవరిని కదిలించినా డబ్బు సమస్యనే.. ● పల్లె పట్నం అంతటా ఇదే తీరు సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : గతంలో డబ్బులు అవసరం ఉందంటే ఎవరో ఒకరు సర్దుబాటు చే సేవారు. స్నేహితులు, బంధువులు చేబదలు ఇ చ్చేవారు. లేదంటే అప్పైనా పుట్టేది. వాటితో అ వసరాలు వెళ్లదీసుకుని, డబ్బులు సర్దుబాటు అయ్యాక తిరిగి చెల్లించేవారు. వడ్డీ వ్యాపారులు, ఫైనా న్స్ నిర్వాహకులు కూడా నమ్మకం ఉన్న వారికి అ ప్పులిచ్చేవారు. ఇప్పుడు పరిస్థితులు తలకిందులయ్యాయి. అవసరానికి డబ్బులు సర్దుబాటు కావ డం లేదని, కనీసం అప్పు కూడా పుట్టడం లేదని చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఆపదలో కూడా డబ్బులు సర్దుబాటు కాక పేద, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందిపడుతున్నా రు. వ్యవసాయంలో పెట్టుబడులు పెరగడం, దిగుబడులు తగ్గడంతో కష్టానికి ఫలితం దక్కడం లేదు. ఏడాదికేడాది అప్పులు పెరగడమే తప్ప మిగులుబాటు లేకుండాపోయింది. కుల వృత్తులు, స్వయం ఉపాధి చేసుకునేవారు కూడా అద్దెలు, విద్యుత్ బిల్లులు, నిర్వహణ వ్యయం పెరిగిపోయి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నచిన్న వ్యా పారాలు చేసుకునేవారు కూడా మడిగెల అద్దెలు భా రంగా మారడం, వ్యాపారంలో పోటీ పెరగడంతో వారి ఆర్థిక పరిస్థితి కూడా దెబ్బతింది. రోజువారీ పనులు చేసుకునేవారి సంపాదన బట్టకు, పొట్టకు అన్నట్టుగా తయారైంది. పిల్లల ఉన్నత చదువులు, పెళ్లిళ్లు, ప్లాటు కొనుగోలు, ఇంటి నిర్మాణం.. ఇలా దేనికై నా అప్పులు చేయాల్సినని పరిస్థితి. అయితే ఏ అవసరం ఉన్నా ఎవరో ఒకరు డబ్బులు సర్దుబాటు చేస్తారన్న నమ్మకం లేకుండాపోయింది. దీంతో చాలా మంది మనోవేదనకు గురవుతున్నారు. కలిసిరాని కాంట్రాక్టు పనులు.. ప్రభుత్వ అభివృద్ధి పనుల కాంట్రాక్టులు చేసి నాలుగు డబ్బులు వెనకేసుకోవాలని కొందరు కింది స్థాయి నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అప్పులు చేసి పనులు పూర్తి చేశారు. ఏళ్లు గడుస్తున్నా బిల్లులు రాకపోవడంతో లబోదిబోమంటున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్‌లు చాలా మంది రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల దాకా పనుల మీద పెట్టుబడులు పెట్టారు. వారంతా రెండుమూడేళ్లుగా బిల్లులు రాకపోవడంతో అవస్థలు పడుతున్నారు. ఓ మారుమూల గ్రామ సర్పంచ్ చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో భూమిని అమ్ముకుని అప్పులు కట్టాడు. లాభాల మాట అటుంచితే అప్పుల కింద ఉన్న భూమి పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. చిన్నచిన్న కాంట్రాక్టర్లతో పాటు బడా కాంట్రాక్టర్లు కూడా బిల్లులు రాక ఇబ్బంది పడుతున్నారు. బంగారమే ఆధారం.. బయట అప్పు పుట్టని పరిస్థితుల్లో బంగారమే ఆధారమవుతోంది. చాలామంది బ్యాంకుల్లో బంగారం, ఆభరణాలు తాకట్టుపెట్టి అప్పు తీసుకుంటున్నారు. బంగారం అమ్మితి తిరిగి కొనలేమని కుదువపెడుతున్నారు. ప్రతి బ్యాంకులో నిత్యం ఐదు నుంచి పది మంది గోల్డ్ లోన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. మారుమూల గ్రామాల నుంచి పట్టణాలు, నగరాల దాకా బ్యాంకుల్లో గోల్డ్ లోన్లు విపరీతంగా తీసుకుంటున్నారు. ఏ అవసరం ఉన్నా సరే ఉన్న బంగారాన్ని బ్యాంకుల్లో పెట్టి అప్పు పొందుతున్నారు. అప్పులు తీసుకున్న వారు చాలా మంది డబ్బులు సర్దుబాటు కాక చేతులెత్తేయడంతో కొందరు ఫైనాన్స్ వ్యాపారులు దెబ్బతిన్నారు. దీనికి తోడు అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నారంటూ పోలీసులు ఫైనాన్స్ నిర్వాహకులు, వడ్డీ వ్యాపారుల ఇళ్లపై దాడులు నిర్వహిస్తున్నారు. దీంతో చాలా మంది వడ్డీ, ఫైనాన్స్ వ్యాపారులు దందాను వదిలేశారు. కొందరు ఫైనాన్స్, వడ్డీ వ్యాపారులు కూడా డబ్బులు రికవరీ కాకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నట్టు తెలుస్తోంది. వరుస దెబ్బలతో ఫైనాన్స్ రంగం కుదేలైంది. వెరసి సామాన్యుడికి అప్పు పుట్టని పరిస్థితి ఏర్పడింది. ‘రియల్’ కుదేలై.. చాలామంది భూముల మీద పెట్టుబడులు పెట్టారు. భూముల క్రయవిక్రయాలతో సులువుగా డబ్బులు సంపాదించవచ్చనే భావనతో డబ్బున్నవారితో పాటు మధ్య తరగతి ప్రజలు కూడా అప్పులు చేసి మరీ భూములు కొన్నారు. అయితే కొంతకాలంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలై భూములు, ప్లాట్ల క్రయవిక్రయాలు సాగడం లేదు. సంవత్సరాల తరబడిగా వ్యాపారంలో వృద్ధి లేకపోగా, ధరలు పడిపోవడం అయినా సరే అమ్ముదామంటే కొనేవారు లేకపోవడంతో అప్పులు చేసి పెట్టుబడులు పెట్టిన వారంతా ఇంకా మునిగిపోతున్నారు. జిల్లా కేంద్రంలో ఇళ్లు నిర్మించి అమ్మేవారు ప్లాట్లతో పాటు ఇళ్ల నిర్మాణానికి డబ్బులు వెచ్చించారు. ఇప్పుడు ఇళ్లు అమ్ముడుపోక అవన్నీ ఇరుక్కుపోయాయి. దీంతో అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టిన వారంతా దివాలా అంచున ఉన్నారు. ప్లాటు ధర, ఇంటి నిర్మాణానికి అయిన వ్యయం ఇచ్చినా సరే అమ్ముదామంటే కొనేవాళ్లు లేరని బిల్డర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వడ్డీలకు వడ్డీలు పెరిగి అవస్థలు పడుతున్నామంటున్నారు. -
‘భూభారతి’తో సామాన్యుడికి మేలు
నాగిరెడ్డిపేట/లింగంపేట : భూభారతి చట్టం ద్వా రా సామాన్యుడికి మేలు జరగుతుందని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులే టి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయ న శెట్పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన భూభారతి రెవెన్యూ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ఏది చెబితే అదే చట్టంగా ఉండేదన్నారు. దొర గారు ధరణి పథకాన్ని భూస్వాముల కోసం తెచ్చి వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. భూభా రతి చట్టం అలా కాకుండా పకడ్బందీగా పేదోడికి న్యాయం జరిగేలా రూపొందించామన్నారు. 18 రా ష్ట్రాల్లోని చట్టాలను అధ్యయనం చేసి, 9 నెలలు మే ధోమథనం చేసి మేధావుల సూచనలు, సలహాలు తీసుకొని ఈ చట్టాన్ని తెచ్చామన్నారు. ఇది దేశానికి రోల్ మోడల్ కాబోతుందన్నారు. తరతరాలుగా రై తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు భూభారతి పో ర్టల్ ద్వారా తీరనున్నాయని పేర్కొన్నారు. అంచెలంచెలుగా సమస్యల పరిష్కారం భూభారతి చట్టం ద్వారా తహసీల్దార్, ఆర్డీవో, అడిషనల్ కలెక్టర్, కలెక్టర్, సీసీఎల్.. ఇలా వివిధ స్థా యిలలో భూ సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. ఆయా స్థాయిలలో పరిష్కారం కాకపోతే స్పెషల్ ట్రిబ్యునల్ ప్రవేశపెట్టడానికి చట్టంలో వెసులుబాటు కల్పించామన్నారు. రెవెన్యూ అధికారులు ఉద్దేశపూర్వకంగా తప్పులు చేస్తే ఈ చట్టం ద్వారా సదరు అధికారిపై చర్యలు తీసుకోవడానికి వీలుంటుందన్నారు. లింగంపేట మండలంలో ప్రైవేటు, ప్రభుత్వ, అసైన్మెంటు భూముల సమస్యలు ఉ న్నందున కలెక్టర్ విచారణ చేసి పరిష్కరించాలని ఆదేశించారు. ఎమ్మెల్యే విన్నపం మేరకు.. ముందుగా రాష్ట్రంలో 4 జిల్లాల్లో 4 మండలాలను ఎంపిక చేసి, చట్టాన్ని అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఎమ్మెల్యే మదన్మోహన్రావు విన్నపం మేరకు లింగంపేట మండలాన్ని పైలట్ మండలంగా ఎంపిక చేశామన్నారు. ఇప్పటివరకు మండలంలోని 23 రెవెన్యూ గ్రామాలకుగాను 20 చోట్ల సదస్సులు పూర్తయ్యాయని, వివిధ భూసమస్యలపై 3,400 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు. హామీలు అమలు చేసి తీరుతాం.. ఇందిరమ్మ రాజ్యంలో పేదల కోసం ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు ఇతర హామీలన్నింటిని అమ లు చేసి తీరుతామని పొంగులేటి స్పష్టం చేశారు. ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తున్నామన్నా రు. ప్రజల కోరిక మేరకు పక్షం రోజుల్లో వీఆర్వో లు, వీఆర్ఏలను నియమించనున్నట్లు తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడి ప్రాణహిత ప్యాకేజీ పనులకు నిధులు మంజూరయ్యేలా చూస్తానని జ హీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కార్ పేర్కొన్నారు. ఎల్లారెడ్డి నియోజక వర్గంలో భూ సమస్యలు ఎక్కువగా ఉన్న విషయాన్ని సీఎం, రెవెన్యూ మంత్రి దృష్టికి తీసుకువెళ్లానని, వారు స్పందించి భూభారతి చట్టం అమలుకు లింగంపేట మండలాన్ని పైలట్ మండలంగా ఎంపిక చేశారని ఎమ్మెల్యే మదన్మోహన్రావు పేర్కొన్నారు. రైతులకు భూ సమస్యలు లేకుండా చేయాలన్నదే తన లక్ష్యమన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేశ్ చంద్ర, అదనపు కలెక్టర్ విక్టర్, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, భూభారతి ప్రత్యేకాధికారి రాజేందర్, ఆర్డీవో మన్నె ప్రభాకర్, తహసీల్దార్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.మంత్రి దృష్టికి ‘పోచారం’ భూముల సమస్య నాగిరెడ్డిపేట: పోచారం గ్రామశివారులోని భూముల సమస్యను గ్రామానికి చెందిన మాల్తుమ్మెద సొసైటీ డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. శెట్పల్లి సదస్సు భూసమస్యపై రైతులెవరైనా మాట్లాడాలని మంత్రి సూచించగా.. పోచారం గ్రామానికి చెందిన శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడారు. తమ గ్రామశివారులోని రైతుల భూములకు పట్టాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. పోచారం ప్రాజెక్టు అంచునగల సర్వే నం. 268లో రైతులకు 1975 లోనే అప్పటి ప్రభుత్వం విడతలవారీగా సుమారు 150 ఎకరాలకు పట్టాపాసుపుస్తకాలు ఇచ్చిందన్నారు. కానీ ధరణి వల్ల కొత్త పాస్‌బుక్కులు రాలేదన్నారు. ఈ విషయాన్ని రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్తే సర్వే నం. 268లో 54 ఎకరాల భూమి మాత్రమే ఉందని, కానీ 150 ఎకరాలకు పట్టాలు ఇచ్చారని చెప్పారని పేర్కొన్నారు. తమ గ్రామ రైతులకు పట్టాలు ఇప్పించాలని కోరారు. దీనిపై మంత్రి స్పందిస్తూ రెవెన్యూ అధికారులను వివరణ కోరారు. మరోసారి భూములను సర్వే చేయించి సమస్యను పరిష్కరిస్తామని ఎల్లారెడ్డి ఆర్డీవో మన్నె ప్రభాకర్ పేర్కొన్నారు. 18 రాష్ట్రాల్లో అధ్యయనం చేసి ఈ చట్టాన్ని తెచ్చాం ఇది దేశానికి రోల్ మోడల్ కాబోతోంది త్వరలో వీఆర్వోలు, వీఆర్ఏలను నియమిస్తాం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి -
రజతోత్సవ సభ కాదది ప్రగల్బాల సభ
భిక్కనూరు: వరంగల్‌లో బీఆర్ఎస్ నిర్వహించిన సభ రజతోత్సవ కాదు ప్రగల్బాల సభ అని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బల్యాల సుదర్శన్ అన్నారు. సోమవారం భిక్కనూరులో విలేకరులతో ఆయన మాట్లాడుతూ భూమిలేని దళితులకు గిరిజనులకు మూడు ఎకరాల భూమి అన్ని నమ్మించి మోసం చేశాడన్నారు. ఈ సమావేశంలో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీరామ్ వెంకటేశ్, విండో అధ్యక్షుడు గంగళ్ల భూమయ్య, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు దయాకర్‌రెడ్డి, సీనియర్ నేతలు లింబాద్రి, నర్సింహరెడ్డి , దుంపల మోహన్‌రెడ్డి, కాంగ్రెస్సీనియర్ నేతలు మహిపాల్ రెడ్డి, నీల అంజయ్య, కర్నాల శ్రీనివాస్, నర్మల రాంచంద్రం, నర్సింలు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ వాళ్లు కళ్లుండి చూడలేకపోతున్నారు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : బీఆర్ఎస్ సభకు అనుకున్నదానికన్నా ఎక్కువ మంది తరలివచ్చారని, సభ సక్సెస్ అయ్యిందని మీడియా మొత్తం చెబుతుండగా కాంగ్రెస్ వాళ్లు కళ్లుండి చూడలేకపోతున్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నుంచి సుమారు 40 వేల మందికిపైగా సభకు హాజరయ్యారని తెలిపారు. సభ విజయవంతానికి కృషి చేసిన రెండు జిల్లాల పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గాల ఇన్చార్జీలు, రాష్ట్ర, జిల్లా, మండల నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. సభ సక్సెస్ కావడాన్ని మంత్రులు, కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే అడ్డగోలుగా వాగుతున్నారని విమర్శించారు. 17 నెలల పాలనలో కాంగ్రెస్‌పై, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై వచ్చిన వ్యతిరేకత సభకు వచ్చిన లక్షలాది ప్రజల్లో స్పష్టంగా కనిపించిందని పేర్కొన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని పోలీసులను ఇతర యంత్రాంగాన్ని వాడుకుని సభ విజయవంతం కాకుండా కుట్రలు చేసినప్పటికీ ప్రజలు భారీగా తరలివచ్చారని, కాంగ్రెస్ కుట్ర కారణంగా సభకు చేరుకోలేకపోయిన వారు రోడ్లపైనే కిలోమీటర్ల కొద్దీ వేచి ఉన్నారని తెలిపారు. ఎన్నికల హామీలను నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రజల నుంచి తప్పించుకోలేదని, ఆ పార్టీ వైఫల్యాలను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు గ్రామాల్లో ప్రజల పక్షాన ఎక్కడికక్కడ నిలదీస్తాయని స్పష్టం చేశారు. రజతోత్సవ సభను విజయవంతం చేసిన వారికి ధన్యవాదాలు మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి -
నేడు శెట్పల్లికి మంత్రి పొంగులేటి రాక
లింగంపేట: శెట్పల్లి గ్రామంలో మంగళవా రం నిర్వహించే రెవెన్యూ సదస్సులో పాల్గొనడానికి రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రా నున్నారని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షు డు బుర్ర నారాగౌడ్ తెలిపారు. మంత్రి రాక నేపథ్యంలో సోమవారం శెట్పల్లిలో ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా నారాగౌడ్ మాట్లాడుతూ మంత్రితోపాటు స్థానిక ఎమ్మెల్యే మ దన్మోహన్రావు సదస్సులో పాల్గొంటారన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చే యాలని రైతులను కోరారు. ఏర్పాట్లను పరిశీలించినవారిలో భూభారతి మండల ప్రత్యే కాధికారి రాజేందర్, తహసీల్దార్ సురేష్, ఎంపీడీవో నరేష్ తదితరులున్నారు. ఒకటి నుంచి రేషన్ బియ్యం పంపిణీ కామారెడ్డి రూరల్ : మే నెలకు సంబంధించి న రేషన్ బియ్యం పంపిణీ ప్రక్రియను ఒక టో తేదీనుంచి ప్రారంభించనున్నట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. ఒక్కో యూనిట్‌కు ఆరు కిలోల చొప్పున ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. అంత్యోదయ కార్డులకు 35 కిలోలు, అన్నపూర్ణ కార్డులకు 10 కిలోల చొప్పున అందిస్తామని తెలిపారు. 15వ తేదీ వరకు బి య్యం పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. డీఏవోకు పదోన్నతి కామారెడ్డి క్రైం: జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్‌కు పదోన్నతి లభించింది. ఇప్పటివరకు వ్యవసాయ శాఖలో డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్‌గా ఉన్న ఆయనకు జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్‌గా పదో న్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చే సింది. కలెక్టరేట్లోని వ్యవసాయ శాఖ జిల్లా కార్యాలయంలో సోమవారం ఆయనను జి ల్లాలోని ఏడీఏలు, మండలాల వ్యవసాయ అధికారులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రైతుల శ్రేయస్సుకు కృషి సదాశివనగర్ : రైతుల శ్రేయస్సు కోసం సహకార సంఘాలు కృషి చేస్తున్నాయని డీసీవో రామ్మోహన్ పేర్కొన్నారు. అడ్లూర్ ఎల్లారెడ్డి సింగిల్ విండో కార్యాలయంలో సోమవారం అంతర్జాతీయ సహకార సంవత్సరాన్ని ఘ నంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీ సీవో మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి 2025 సంవత్సరాన్ని అంతర్జాతీయ సహకార సంవత్సరంగా గుర్తించిందన్నారు. సహకార సంఘం చేపడుతున్న వివిధ రకాల కార్యకలాపాల్లో పాలు పంచుకోవాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో విండో చైర్మన్ సదాశివరెడ్డి, సీడీసీ చైర్మన్ ఇర్షాదొద్దీన్, మా నిటరింగ్ అధికారి సాయిలు, సీఈవో భై రయ్య, డైరెక్టర్లు రాములు, ప్రవీణ్‌రెడ్డి, భాస్కర్, ఉమామహేశ్వర్రావు, సిబ్బంది లింగమూర్తి, భైరేశ్, గంగరాజు పాల్గొన్నారు. లండన్‌లో తప్పిపోయిన రెంజర్ల విద్యార్థి బాల్కొండ: ముప్కా ల్ మండలం రెంజర్ల గ్రామానికి చెందిన విద్యార్థి నల్ల అనురాగ్‌రెడ్డి ఈనెల 25న లండన్‌లో తప్పిపోయాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అనురాగ్‌రెడ్డి ఉన్నత చదువులో కోసం ఏడాదిన్నర క్రితం స్టూడెంట్ వీసాపై లండన్ వెళ్లాడు. ఈనెల 25న సా యంత్రం స్నేహితులతో కలిసి కార్డిప్ ప్రాంతానికి వెళ్లి కనిపించకుండా పోయాడు. అత డి స్నేహితులు ఇచ్చిన సమాచారంతో ఆందోళన చెందిన తల్లి హరితారెడ్డి ఈ విషయా న్ని సోమవారం టీఎస్ఎండీసీ చైర్మన్ ఈరవత్రి అనిల్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లారు. తన కుమారుడిని వెతికించి, స్వదేశానికి రప్పించాలని కోరారు. ఈరవత్రి అనిల్ స్పందించి సీఎంవో కార్యాలయ అధికారులతో మాట్లాడారు. ఈ విషయమై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఢిల్లీలోని విదేశాంగ శాఖకు, లండన్‌లోని ఇండియా హైకమిషన్‌కు లేఖలు రాసినట్లు అనిల్ కుమార్ తెలిపారు. -
గాంధీ విగ్రహానికి పార్ట్ టైం అధ్యాపకుల వినతి
భిక్కనూరు: తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం ఆమోదించాలని కోరుతూ తెలంగాణ యునివర్సిటీ సౌత్క్యాంపస్లోని పార్ట్ టైం అధ్యాపకులు సోమవారం క్యాంపస్ ఆవరణలోని గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. తమకు కనీస వేతనం కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదని జీవోనంబర్ 21ను సవరించి తమ సర్వీసులను పరిగణలోకి తీసుకుని తమకు ఉద్యోగ భఽద్రత కల్పించేలా చూడాలన్నారు. పదో రోజుకు చేరిన కాంట్రాక్టు అధ్యాపకుల సమ్మె ఉద్యోగభద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ యునివర్సిటీల కాంట్రాక్టు అధ్యాపకులు చేపట్టిన సమ్మె పదో రోజుకు చేరుకుంది. సోమవారం సౌత్‌క్యాంపస్‌లో దీక్ష శిబిరంలో కూర్చున్న కాంట్రాక్టు అధ్యాపకులకు మద్దతుగా పలువురు విద్యార్థి సంఘాల ప్రతినిధులు వచ్చి సంఘీభావం తెలిపారు. -
సైబర్ నేరాలపై అవగాహన
లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని బస్టాండులో సోమవారం ఏఎస్సై ప్రకాశ్‌నాయక్ సైబర్ నేరాలపై ప్రయాణికులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అపరిచితులకు బ్యాంకు ఖాతా నంబర్లు ఇవ్వద్దన్నారు. ప్రయాణం చేసే సమయంలో విలువైన వస్తువులు, డబ్బులు జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. సెల్ ఫోన్లు పోయినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.మత్తు పదార్థాలకు బానిసలు కావద్దన్నారు. వాహనాలు నడిపేవారు హెల్మెట్ ధరించి, ధువ్రపత్రాలు వెంట పెట్టుకోవాలని సూచించారు. కానిస్టేబుల్స్ తదితరులు పాల్గొన్నారు. -
మామను చంపిన అల్లుడు
నవీపేట: మండలంలోని అనంతగిరి గ్రామంలో మామ అల్లుళ్ల మధ్య జరిగిన ఘర్షణలో మామ హతమయ్యాడు. నిజామాబాద్ రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్సై వినయ్‌లు సోమవారం వివరాలు వెల్లడించారు. ఛత్తీస్గడ్ రాష్ట్రంలోని కచర్దాం జిల్లా చిర్పాలి గ్రామానికి చెందిన బిలంసింగ్ మరవి(48) కూతురు గోమతి దుర్వే, అల్లుడు రాజేష్ దుర్వేలతో కలిసి మండలంలోని గోదాం నిర్మాణంలో కూలీలుగా పనిచేస్తున్నారు. రాజేష్ దుర్వే తరచూ భార్యను మానసికంగా, శారీరకంగా వేధించేవాడు. ఈవిషయమై ఆదివారం రాత్రి మద్యం సేవించాక మామ, అల్లుడు గొడవపడ్డారు. ఆగ్రహానికి లోనైన అల్లుడు ఇటుకను తీసుకొని మామ తలపై విచక్షణరహితంగా బాదాడు. దీంతో మామ బిలం సింగ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితున్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. -
ఎక్స్‌గ్రేషియా చెక్కుల అందజేత
ఖలీల్‌వాడి: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన హెడ్ కానిస్టేబుల్ రాథోడ్ ప్రతాప్ సింగ్ సతీమణికి సోమవారం రూ.16 లక్షల ఎక్స్ గ్రేషియా చెక్కును సీపీ కార్యాలయంలో సీపీ సాయి చైతన్య అందజేశారు. నిజామాబాద్ అదనపు డీసీపీ (ఎఆర్)రామచంద్రరావు, ఏఓ అనిసాబేగం, ఆఫీస్ సూపరింటెండెంట్ వనజ, పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ షకీల్ పాషా తదితరులు ఉన్నారు. బీర్కూర్‌లో యువకుడి ఆత్మహత్య బాన్సువాడ రూరల్: బీర్కూర్ మండల కేంద్రంలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు లా.. మండల కేంద్రానికి చెందిన భూతిపిల్లి మహేష్(35) కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఆదివారం రాత్రి అతడు ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు బీర్కూర్ ఎస్సై రాజశేఖర్ తెలిపారు. ఈత చెట్లు దగ్ధం భిక్కనూరు: మండలంలోని పెద్దమల్లారెడ్డి గ్రామంలో రేణుకాదేవి ఎల్లమ్మ ఆలయం సమీపంలో ఉన్న ఈత వనం సోమవారం దగ్ధమైంది. గౌడసంఘం ఆధ్వర్యంలో ఆరు ఎకరాల స్థలంలో ఈత చెట్లను పెంచుతున్నారు. సోమవారం అకస్మాత్తుగా మంటలు చెలరేగి ఈత చెట్లు దగ్ధం అయ్యాయి. వెంటనే స్థానికులు ఫైర్ఇంజన్కు సమాచారం అందించగా, వారు ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. అప్పటికే రెండు వేల చెట్లు అగ్నికి ఆహుతయ్యాయి. చెట్ల దగ్ధం ఘటన మందుబాబుల పనే కావచ్చునని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. తగ్గెల్లి గ్రామంలో.. బోధన్: సాలూర మండలంలోని తగ్గేల్లి గ్రామ శివారులో గల కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం పరిధిలోని ఈత వనంలో సోమవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఐదు ఎకరాల విస్తీరణంలో ఉన్న ఈత వనంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి చెట్లు కాలిబూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. నాలుగేళ్లుగా ఆరుగాలం కష్టపడి పెంచిన ఈత చెట్లు కాలిపోవడం వల్ల రూ.15 నుంచి 20 లక్షల వరకు నష్టం వాటిల్లిందని సంఘ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. -
రోడ్డు ప్రమాదాలు జరిగిన ప్రదేశాల పరిశీలన
ఎల్లారెడ్డి: రోడ్డు ప్రమాదాలు జరిగిన సంఘటన స్థలాలను సీఐ రవీందర్‌నాయక్ ఆధ్వర్యంలో సోమవారం అధికారులు పరిశీలించారు. మండలంలోని హాజీపూర్, అడివిలింగాల, తిమ్మారెడ్డి, జంగమాయిపల్లి, భిక్కనూర్, మీసాన్‌పల్లి, మాచాపూర్ గ్రామ శివార్లలోని మూల మలుపులను వారు పరిశీలించారు. మూల మలుపుల వద్ద జరిగిన ప్రమాదాలలో మృతి చెందిన సంఘటన స్థలాలను పరిశీలించారు. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలను ఉన్నతాధికారులకు నివేదిక పంపనున్నట్లు సీఐ తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై మహేష్, ఆర్అండ్బీ ఏఈ ఐశ్వర్య, మున్సిపల్, పంచాయత్ రాజ్ అధికారులు ఆంజనేయులు, మల్లేష్ ఉన్నారు. -
భూభారతిని సద్వినియోగం చేసుకోవాలి
నిజాంసాగర్/బాన్సువాడ రూరల్: భూముల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన భూ భూరతి చట్టాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. సోమవారం నిజాంసాగర్, మహమ్మద్ నగర్ మండలాలతోపాటు బాన్సువాడలోని ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సదస్సులలో మాట్లాడారు. భూభారతి చట్టం గురించి వివరించారు. రైతులకు ఉచిత న్యాయ సహాయం అందిస్తామని పేర్కొన్నా రు. కార్యక్రమంలో పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మనోజ్‌కుమార్ పటేల్, బాన్సువాడ మున్సిపల్ కమిషనర్ శ్రీహరిరాజు, నిజాంసాగర్ మండల ప్రత్యేకాధికారి అరుణ, ఏవో నవ్య, తహసీల్దార్లు సవాయిసింగ్, వరప్రసాద్, బాన్సువాడ ఎంపీడీవో బషీరుద్దీన్, నాయకులు రవీందర్‌రెడ్డి, రమేష్ యాదవ్, మల్లయ్యగారి ఆకాష్, నాగభూషణం గౌడ్, తోట రాజు, రఫీక్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ -
భర్తను హత్య చేసేందుకు భార్య కుట్ర
కామారెడ్డి క్రైం: వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని భర్తను హత్య చేయించేందుకు చేసిన కుట్ర ఫెయిల్ అవ్వడంతో నిందితులు కటకటాల పాలయిన ఘటన మాచారెడ్డి మండలంలో వెలుగుచూసింది. ఈ కేసులో మొత్తం ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేయగా మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ రాజేశ్ చంద్ర వివరాలు వెల్లడించారు. మాచారెడ్డి మండలం ఘన్పూర్(ఎం) గ్రామానికి చెందిన సాడెం కుమార్ మెదక్ జిల్లాలోని ఓ మున్సిపాలిటిలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అల్వాల్‌కు చెందిన కాంపల్లి మహేష్ ప్రస్తుతం రాజన్న సిరిసిల్లా జిల్లా తంగళ్లపల్లి వద్ద ఉన్న లలిత మ్మ గుడిలో పూజారిగా పనిచేస్తున్నాడు. కుమార్ భార్య రేణుక నాలుగేళ్లుగా మహేష్‌తో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తుంది. ఈక్రమంలో తమ వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్న కుమార్‌ను హతమార్చాలని రేణుక, మహేష్‌లు కుట్ర పన్నారు. ఆ తర్వాత అతని ఉద్యోగాన్ని, ఆస్తిని దక్కించుకోవాలని భావించారు. అల్వాల్‌కు చెందిన మహమ్మద్ అశ్వాక్తో రూ.15 లక్షలకు సుపారీ మాట్లాడుకున్నారు. అశ్వాక్, అతని అనుచరులు ముబిన్, అమీర్, అన్వర్, మోసిన్లకు అడ్వాన్సుగా రూ.2లక్షలు ఇచ్చారు. ఈ నెల 21న కుమార్ బైక్‌పై వెళ్తుండగా ఫరీద్‌పేట సమీపంలోని సోలార్ ప్లాంట్ వద్ద దారి కాచిన సుపారీ గ్యాంగ్ అతడిని అడ్డుకుని రాడ్లతో దాడి చేశారు. అదే సమయంలో అటుగా కారులో ఓ ఇద్దరు వ్యక్తులు రావడం చూసి అక్కడి నుంచి నిందితులు పరారయ్యారు. వెంటనే కుమార్‌ను స్థానికులు, పోలీసులు కలిసి ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసిన మాచారెడ్డి పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం, సీసీ పుటేజ్‌ల ఆధారంగా నిందితులను గుర్తించారు. వారిని పట్టుకొని విచారించగా నేరం అంగీకరించినట్లు ఎస్పీ తెలిపారు. ప్రధాన నిందితులైన మహేష్, రేణుకలతో పాటు సుపారీ గ్యాంగ్‌కు చెందిన అశ్వాక్, ముబీన్, అమీర్లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నామన్నారు. పరారీలో ఉన్న ఇద్దరి నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు. నిందితుల వద్ద నుంచి ఓ కారు, ఆటో, రెండు బైక్‌లు, గొడ్డలి, రాడ్లు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. కేసు ఛేదనలో విశేషంగా కృషి చేసిన రూరల్ సీఐ రామన్, ఎస్ఐ అనిల్, సిబ్బందిని అభినందించారు. ప్రియుడితో కలిసి ఐదుగురికి రూ.15లక్షల సుపారీ మొత్తం ఐదుగురు అరెస్టు, పరారీలో ఇద్దరు వివరాలు వెల్లడించిన ఎస్పీ రాజేశ్చంద్ర -
పట్టా భూములను రికార్డుల్లో నుంచి తొలగించారు
పట్టా భూములను రెవెన్యూ రికార్డుల్లో నుంచి తొలగించారని గాంధారి మండలం బొప్పాజీవాడి గ్రామానికి చెందిన రైతులు తెలిపారు. వారు మాట్లాడుతూ.. గ్రామానికి సమీపంలో ఉన్న చింతల చెరువు శిఖంలో దాదాపు 20 మంది రైతులకు సంబ ంధించిన 15.15 ఎకరాల స్వంత పట్టా భూములు ఉండేవన్నారు. చెరువులో ప్రతి ఏటా నీరు తగ్గాక యాసంగి పంటలు సాగు చేసుకునేవారమని వెల్లడించారు. గతేడాది గ్రామంలో పర్యటించిన అధికారులు చెరువు శిఖం సర్వే నెంబర్ 14,15 లను, మా పట్టా భూములను రికార్డుల్లో నుంచి తొలగించారన్నారు. రికార్డుల్లో మాభూములను తిరిగి నమోదు చేయాలని ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. -
దుకాణ యజమానులకు జైలుశిక్ష
బోధన్‌టౌన్(బోధన్): పట్టణంలోని రంగర్గల్లికి చెందిన పవన్ చారీ తన బంగారు దుకాణాన్ని, శక్కర్‌నగర్ కాలనీకి చెందిన షేక్ యాకూబ్ తన మిల్క్ డైరీని, అలాగే ఓ బేకరీ యజమాని రాత్రి వేళలో సమయానికి మించి దుకాణాలను తెరిచి ఉంచినందున పోలీసులు వారిని అరెస్టు చేశారు. సోమవారం వారిని కోర్టులో హాజరు పర్చగా బేకరి యజమానికి రెండు రోజుల జైలు, మిగిలిన ఇద్దరికి ఒక రోజు జైలు శిక్షను జడ్జి విధించారు. ఇసుక ట్రాక్టర్ల పట్టివేత నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని వదల్పర్తి గ్రామశివారులోని వాగు నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలించేందుకు ప్రయత్నిస్తున్న రెండు ట్రాక్టర్లను ఆదివారం రాత్రి పట్టుకున్నట్లు ఎస్సై మల్లారెడ్డి తెలిపారు. లింగంపేట మండలం అయ్యపల్లికి చెందిన పోచబోయిన భాస్కర్, ఎక్కపల్లికి చెందిన ఎల్లమోల్ల సాయిలు వదల్పర్తి శివారులోని వాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలించే ప్రయత్నం చేశారు. ఈ సమాచారం అందిన వెంటనే వారిని, ట్రాక్టర్లను అదుపులోకి తీసుకున్నామని ఎస్సై తెలిపారు. రుద్రూర్: పోతంగల్ మండలం కొడిచర్ల గ్రామ శివారు నుంచి అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను సోమవారం పోలీసులు పట్టుకున్నారు. ట్రాక్టర్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. నిజాయితీ చాటిన హోటల్ యజమాని నిజాంసాగర్(జుక్కల్): ఓ మహిళ హోటల్లో మర్చిపోయిన బంగారు అభరణాలను హోటల్ యజమాని బాధిత మహిళకు అప్పగించి నిజాయితీ చాటుకున్నాడు. వివరాలు ఇలా.. తాడ్వాయి మండలం కుప్రియల్ గ్రామానికి చెందిన సైదగారి బాలమణి ఆదివారం మధ్యాహ్నం నిజాంసాగర్ బస్టాండ్‌లో బస్సుదిగింది. అనంతరం సమీపంలోని హోటల్లో టిఫిన్ తినడానికి వెళ్లింది. అదే సమయంలో బంగారు చెవి కమ్మలను హోటల్లో మర్చిపోయి వెళ్లిపోయింది. కొద్దిసేపటికి కమ్మలు కనిపించకపోవడంతో బంధువులకు తెలపగా, వారు హోటల్ యజమానికి ఫోన్లో సంప్రదించారు. యజమాని కమ్మలను భద్రంగా ఉంచాడు. బాధితురాలిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి చెవి కమ్మలను అందజేశాడు. పేకాడుతున్న పలువురి అరెస్టు కామారెడ్డి టౌన్: మున్సిపల్ పరిధిలోని దేవివిహార్ ఫేస్–3 కాలనీలో కొంతమంది వ్యక్తులు పేకాట ఆడుతున్నారని పోలీసులకు సమాచారం రావడంతో దేవునిపల్లి ఎస్సై రాజు, సిబ్బంది దాడులు జరిపారు. పేకాట ఆడుతున్న 9మందిని అరెస్టు చేశారు. అలాగే వారి వద్ద నుంచి రూ. 60,400 నగదుతో పాటు రెండు బైకులు, తొమ్మిది సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. బోధన్ మండలంలో.. బోధన్ రూరల్: మండలంలోని కలదుర్కి గ్రామంలో పేకాట స్థావరంపై దాడిచేసి పేకాడుతున్న 10మందిని అరెస్ట్ చేసినట్లు బోధన్ రూరల్ ఎస్సై సందీప్ సోమవారం తెలిపారు. వారి వద్ద నుంచి రూ.6,600 నగదు, 8సెల్ ఫోన్లు, 2 బైక్‌లు స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. బోధన్ పట్టణంలో.. బోధన్‌టౌన్: పట్టణ శివారులోని డంపింగ్ యార్డ్ వద్ద పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు సోమవారం పట్టణ సీఐ వెంకట నారాయణ, ఎస్సై హబీబ్, సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. పేకాడుతున్న ఐదుగురిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.1950 నగదు, 4 ఫోన్లు, ఒక బైక్, ఒక కార్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ట్రాన్స్ఫార్మర్ చోరీ రెంజల్(బోధన్): మండలంలోని కందకుర్తి ఎత్తిపోతల పథకం ట్రాన్స్ఫార్మర్ను రెండు రోజుల కిందట గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసి, కాపర్ వైరును చోరీ చేసినట్లు ఎస్సై చంద్రమోహన్ తెలిపారు. ధ్వంసమైన ట్రాన్స్ఫార్మర్ను ఆదివారం రాత్రి స్థానిక రైతులు గుర్తించారు. సోమవారం ఉదయం ఎత్తిపోతల చైర్మన్ గయాస్కు తెలుపగా ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
హుండీ లెక్కింపులో ఉద్యోగి చేతివాటం!
భిక్కనూరు: భిక్కనూరు శ్రీసిద్దరామేశ్వరాలయం హుండీ లెక్కింపులో ఆలయంలో పనిచేసే ఓ ఉద్యోగి చేతి వాటాన్ని ప్రదర్శించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి. ఈనెల 22న శ్రీసిద్దరామేశ్వరాలయం హుండీని లెక్కించారు. దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ విజయరామరావు ఆధ్వర్యంలో ప్రక్రియ సాగింది. భక్తులు హుండీ లెక్కిస్తున సమయంలో ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ మహేందర్‌రెడ్డి దేవాదాయశాఖ సహాయ కమిషనర్ విజయరామరావుతో ఆలయ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చిస్తుండగా ఓ ఉద్యోగి చేతివాటాన్ని ప్రదర్శించి, ఓ నోట్ల కట్టను పాకెట్లో పెట్టుకుని నందిమండపం వైపు వెళ్లాడు. ఈ విషయాన్ని గమనించిన ఆలయ కమిటీ చైర్మన్ మహేందర్‌రెడ్డి అతడి వెనకే వెళ్లారు. అక్కడ సదరు ఉద్యోగి లేకపోవడంతో కల్యాణం నిర్వహించే షెడ్డు వైపు వెళ్లగా ఆక్కడ కనిపించాడు. మహేందర్‌రెడ్డి అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జేబులు చూపించమనగా.. ఓ నోట్ల కట్ట కనిపించింది. తొలిసారి తప్పు చేశానని, క్షమించాలని సదరు ఉద్యోగి వేడుకున్నట్లు తెలిసింది. ఈ విషయమై ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్‌ను వివరణ కోరగా ఓ ఉద్యోగి హుండీ లెక్కింపు సమయంలో చేతివాటాన్ని ప్రదర్శించింది వాస్తవమేనని, దీనిపై ఈవోకు ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు. కాగా శ్రీసిద్దరామేశ్వరాలయంలో ఇలాంటి ఘటనలు గతంలోనూ జరిగాయి. ఉన్నతాధికారులు సరైన చర్యలు తీసుకోకపోవడంతో పునరావృతం అవుతున్నాయని భక్తులు పేర్కొంటున్నారు. కఠిన చర్యలు తీసుకుని ఇలాంటివి మళ్లీ జరగకుండా చూడాలని కోరుతున్నారు. -
వేర్వేరు ఘటనల్లో ఏడుగురి మృతి
చికిత్స పొందుతూ ఒకరు.. కామారెడ్డి క్రైం: రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వివరాలు ఇలా.. పాల్వంచ మండలం ఇసాయిపేట గ్రామానికి చెందిన బొట్ల సంజీవ్ (35) కామారెడ్డి గాంధీ గంజ్‌లో డీసీఎం డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 27న సాయంత్రం అతడు బైక్‌పై స్వగ్రామానికి బయలుదేరాడు. ఉగ్రవాయి వద్ద అతడి బైక్‌ను కామారెడ్డి వైపు వెళ్తున్న డీసీఎం ఢీకొట్టింది. ఈ ఘటనలో సంజీవ్‌కు తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు దేవునిపల్లి ఎస్ఐ రాజు తెలిపారు.ఆర్మూర్‌టౌన్: ఆలూర్ మండల కేంద్రంలోని ఊర చెరువులో ఓ వ్యక్తి పడిపోయి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. మండల కేంద్రానికి చెందిన పుట్ట నవీన్(41) మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. సోమవారం ఉదయం ఊర చెరువులో అతడి మృతదేహం తేలింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్‌లో చిట్యాల మాజీ సర్పంచ్.. తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండలంలోని చిట్యాల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ అంబీర్ శారద(50) హైద్రాబాద్‌లో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు. హైదరాబాద్‌లో శారద భర్త మధుసుదన్రావుతో కలిసి బైక్‌పై వెళుతుండగా వెనుక నుంచి లారీ వచ్చి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో శారద అక్కడిక్కడే మృతిచెందగా, మదుసుధన్ రావుకు తీవ్రగాయాలు అయ్యాయన్నారు. శారద 1993–98 వరకు చిట్యాల సర్పంచ్‌గా పనిచేసిందన్నారు. మధుసుదన్‌రావు గతంలో తాడ్వాయి ఎంపీపీగా పనిచేశాడన్నారు. శారద మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఆమె స్వగ్రామమైన చిట్యాలలో సోమవారం అంత్యక్రియలను జరిపించారు. బావిలో పడి ఒకరు.. ఎడపల్లి(బోధన్): మండలంలోని మంగళ్‌పాడ్ గ్రామంలో ఓ యువకుడు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన దేవదాస్ (28) ఆదివారం స్నేహితులతో కలిసి గ్రామశివారులోని పంటపొలాల్లో మద్యం సేవించడానికి వెళ్లారు. కొద్దిసేపటికి దేవదాస్ పక్కనే ఉన్న బావి వద్దకు మూత్ర విసర్జనకు వెళ్లగా ప్రమాదవవాత్తు బావిలో పడి ఈత రాక చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సోమవారం ఉదయం మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎడపల్లి ఎస్సై వంశీకృష్ణారెడ్డి తెలిపారు అశోక్ సాగర్‌లో పడి వృద్ధురాలు.. ఎడపల్లి(బోధన్): మండలంలోని జానకంపేట గ్రామ శివారులోగల అశోక్‌సాగర్‌లో ఓ వృద్ధురాలు ప్రమాదవశాత్తు పడి మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. గ్రామనికి చెందిన బోదాసు దేవమ్మ (60) ఆదివారం సాయంత్రం గ్రామ శివారు కాలకృత్యాలకని వెళ్లి, ప్రమాదవశాత్తు అశోక్ సాగర్‌లో పడి మృతి చెందింది. మృతదేహాన్ని సోమవారం ఎడపల్లి పోలీసులు బయటకు తీసి, బోధన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి కుమారుడు ఈమేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వంశీకృష్ణ రెడ్డి తెలిపారు.ఖలీల్‌వాడి: నగరంలోని తిలక్ గార్డెన్ కాంప్లెక్స్ సమీపంలోగల గ్లామర్ హోటల్ ఎదుట గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు ఒకటో టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి సోమవారం తెలిపారు. హోటల్ ఎదుట అతడు అపస్మారక స్థితిలో ఉండగా అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అతడిని వైద్యులు పరిశీలించగా మృతి చెందినట్లుగా నిర్ధారించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని, సుమారు 40నుంచి 45 ఏళ్ల వయస్సు ఉంటుందని తెలిపారు. మృతుడు బ్లూ కలర్ షర్టు, బ్లాక్ కలర్ ప్యాంట్ ధరించినట్లు తెలిపారు. ఎవరికై నా తెలిసినచో వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో లేదా 87126 59714ను సంప్రదించాలని తెలిపారు. జానకంపేటలో.. ఎడపల్లి: మండలంలోని జా నకంపేట శివారులోగల అశోక్ సాగర్ తూము వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం తేలింది. జానకంపేట గ్రామానికి చెందిన జీపీ కార్మికుడు గుంజ శ్రీనివాస్ మృతదేహాన్ని గమనించి గ్రామస్తులకు, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వయస్సు 45నుంచి 50ఏళ్ల లోపు ఉంటుందన్నారు. అతడి వద్ద ఆధారాలు ఏవీ లభించలేవన్నారు. నీలం కలర్ లుంగీ, తెలుపు బనియన్ ధరించి ఉన్నాడని, ఎవరైనా గుర్తిస్తే 87126 59873 లేదా 87126 59780ను సంప్రదించాలని పోలీసులు తెలిపారు. -
సమస్యలను వెంటనే పరిష్కరించాలి
కామారెడ్డి క్రైం: ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులను, ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 95 ఫిర్యాదులు వచ్చాయి. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అఽధికారులు వెంటనే పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు ఫిర్యాదులను ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ఫిర్యాదులు పెండింగ్‌లో లేకుండా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వీణ, కలెక్టరేట్ పాలనాధికారి మసూర్ అహ్మద్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. చెడిపోయిన మున్సిపల్ నీటి బోరు కామారెడ్డి టౌన్: పట్టణంలోని 26వ వార్డు శేర్గల్లిలో గత 40రోజులుగా మున్సిపల్ నీటి మోటారు, షార్టర్ చెడిపోయింది. దీంతో కాలనీవాసులు నీటికి ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్ అధికారులకు నెల రోజులుగా విన్నవించినా పట్టించుకోవడం లేరని కాలనీవాసులు తెలిపారు. సోమవారం ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.బల్దియా స్థలంలో బోరుకు అనుమతి ఇవ్వాలి మున్సిపాలిటీకి చెందిన స్థలంలో బోరు వేయడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ జిల్లా కేంద్రం లోని అశోక్ నగర్ విద్యాభారతి పురం సంక్షేమ సంఘం ప్రతినిధులు ప్రజావాణికి తరలి వచ్చారు. వారు మాట్లాడుతూ.. కాలనీలో తీవ్రమైన నీటి సమస్య ఉందన్నారు. బోరు వేయడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్ ప్రజావాణికి 95 వినతులు.. -
ఆస్పత్రుల పాలైతేనే చర్యలు..
అన్ని కులవృత్తుల్లానే కల్లు గీత వృత్తి కూడా నిరాదరణకు గురవుతోంది. ప్రధానంగా యువతరం ఈ వృత్తికి దూరంగా ఉంటున్నారు. దీంతో కల్లు గీసేవారు కరువై స్వచ్ఛమైన కల్లు దొరకకుండా పోతోంది. కల్తీ కల్లు మాత్రం విరివిగా లభిస్తోంది. ఎకై ్సజ్ అధికారులు సైతం పట్టించుకోకపోవడంతో కల్తీ కల్లు తయారీ, విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయన్న ఆరోపణలున్నాయి.● వృత్తికి దూరమవుతున్న యువతరం ● చెట్లెక్కి కల్లు గీసేవారు కరువు.. ● పెరిగిన కృత్రిమ కల్లు తయారీ ● పట్టించుకోని ఎకై ్సజ్ అధికారులు కామారెడ్డి క్రైం : గతంలో గ్రామ శివారు ప్రాంతాల్లో ఉండే ఈత వనాలకు వెళ్లి చెట్లను గీసి కల్లు తీసేవారు. ఆ కల్లును తెచ్చి అమ్మేవారు. సరైన ఆదరణ లేక కల్లు గీత వృత్తి చాలా రోజులుగా తగ్గుతూ వస్తోంది. ఓవైపు కొంత కాలంగా కల్లుగీసేవారు తగ్గిపోతున్నా.. మరోవైపు గ్రామాలు, పట్టణాల్లో కల్లు దుకాణాల సంఖ్య మాత్రం రోజురోజుకూ పెరుగుతుండడం గమనార్హం. కొంతమంది ఒక్క చుక్క కూడా స్వచ్ఛమైన కల్లు లేకుండానే వేల లీటర్ల కల్లు తయారు చేస్తున్నారు. కల్లు తయారీలో పోటీలు పడి మరీ మత్తు పదార్థాలు వాడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కృత్రిమ కల్లే దిక్కు.. పొద్దంతా శ్రమించే వారు సాయంత్రం కాగానే అలసటను తీర్చుకోవడం కోసం కల్లు సేవిస్తుంటారు. కొంతమంది రోజూ కల్లు తాగుతుంటారు. ఇది చాలామందికి అలవాటుగా కూడా మారింది. కల్లు లేకపోతే పిచ్చిగా ప్రవర్తించే ప్రమాదకర పరిస్థితులను చూస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ నిత్యం కల్లు విక్రమాలు జరుగుతున్నాయి. అయితే చాలాచోట్ల స్వచ్ఛమైన కల్లు అనేది మచ్చుకై నా కనిపించడం లేదు. అంతా మత్తు పదార్థాలను కలిపి తయారు చేసిన కృత్రిమ కల్లే అందుబాటులో ఉంటోంది. ఈ కల్లుకు అలవాటు పడినవారి పరిస్థితి దారుణంగా మారుతోంది. ఇటీవల దుర్కి అంకోల్, దామరంచ రాంపూర్, సంగెం, గౌరారం గ్రామాలకు చెందిన 83 మంది ప్రజలు కల్తీ కల్లు కారణంగా ఆస్పత్రుల పాలైన విషయం తెలిసిందే. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మాత్రమే ఎకై ్సజ్ అధికారులు హడావుడి చేస్తారని, మిగతా సమయాల్లో కల్తీ కల్లు ఏరులై పారుతున్నా పట్టించుకోరనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ఇటీవల వెలుగు చూసిన కల్తీ కల్లు వ్యవహారాన్ని కలెక్టర్‌తో పాటు మొత్తం జిల్లా యంత్రాంగం సీరియస్‌గా తీసుకుంది. బాధితులకు వైద్యం అందించడంతో పాటు ఘటనకు కారణాలపై ఆరా తీయడం మొదలు పెట్టి కల్లు త యారు చేసిన డిపో యజమానులు సురేందర్, అంజాగౌడ్లపై కేసులు నమోదు చేశారు. జిల్లావ్యాప్తంగా 173 చోట్ల కల్లు దుకాణాల్లో తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో మరో 32 కల్తీ కల్లు విక్రయిస్తున్న కేసులు నమోదు చేసి 28 మంది కల్తీ కల్లు విక్రయదారులను అరెస్ట్ చేశారు. 50 గ్రా ముల అల్ఫ్రాజోలం పట్టుబడింది. మరో 150 శాంపిళ్లు సేకరించారు. కల్లు తయారీలో అల్ప్రా జోలం వినియోగించినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు. నిందితులు పరారీలో ఉండడంతో కల్లు తయారీలో వినియోగించిన డోసు విషయంలో స్పష్టత రాలేదు. కల్తీ కల్లు వ్యవహారం ఎప్పట్నుంచో నడుస్తున్నదే కానీ దుర్ఘటన ఏదైనా జరిగినప్పుడు మాత్రమే అధికారులు చర్యలకు ఉపక్రమిస్తున్నారనే విమర్శలున్నాయి. ఈత వనాలపై నిర్లక్ష్యం.. కల్తీ కల్లును అరికట్టడం దేవుడెరుగు, స్వచ్ఛమైన కల్లు తయారీని ప్రోత్సహించే విషయంలోనూ సరైన చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. కల్లు గీత కార్మికులకు ఉపాధి కల్పించేందుకు స్వచ్ఛమైన కల్లును ప్రోత్సహించే ఉద్దేశంతో ఉపాధి హామీ పథకం, హరిత హారంలలో భాగంగా జిల్లాలోని అన్ని మండలాల పరిధిలో ఈత వనాలు ఏర్పాటు చేశారు. అయితే అధికారుల నిర్లక్ష్యం, నిర్వహణ లోపాల కారణంగా చాలాచోట్ల నాటిన మొక్కలు ఎండిపోయాయి. దీంతో నిధులు వృథా అయ్యాయి. ఇందులో కూడా ఎకై ్సజ్ శాఖ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఎన్ని చెట్లు పెట్టారు, ఎన్ని ఉన్నాయి, ఎన్ని వృథాగా పోయాయో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఈత వనాలు పెంపకంపై దృష్టి సారించి స్వచ్ఛమైన కల్లు దొరికేలా అధికారులు చర్యలు చేపట్టాలని కల్లు ప్రియులు కోరుతున్నారు. కల్తీ కల్లు విక్రయిస్తే చర్యలు తప్పవు జిల్లాలో కల్తీ కల్లు విషయంలో క్రమం తప్పకుండా తని ఖీలు చేస్తున్నాం. కల్తీ కల్లు వల్ల దుష్పరిణామాలపై అవగాహన కల్పిస్తున్నాం. మత్తు పదార్థాలపై నిఘా పెట్టాం. కల్తీ కల్లు విక్రయిస్తే చర్యలు తప్పవు. – హన్మంతరావు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ -
సిరులు ఒడిసిపట్టు!
బీబీపేట: పట్టు పురుగుల పెంపకం (మల్బరీ సా గు) సిరులు కురిపిస్తోంది. ఒక్కసారి మల్బరీ మొ క్కలు నాటితే ఏకంగా 30 ఏళ్ల పాటు ఆదాయం వ చ్చే అవకాశాలుంటాయి. తక్కువ పెట్టుబడితో ఎ క్కువ ఆదాయం వస్తుండడంతో ఈ పంట సాగుకు జిల్లా రైతులు ఆసక్తి చూపుతున్నారు. జిల్లాలో 27 ఎకరాల్లో.. జిల్లావ్యాప్తంగా 27 ఎకరాల విస్తీర్ణంలో మల్బరీ సా గవుతోంది. మరో 40 ఎకరాల్లో సాగు విస్తీర్ణం పెంచేందుకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. రైతులకు పంట విధానంతోపాటు మార్కెటింగ్, కేంద్ర ప్రభుత్వ అందించే రాయితీల గురించి వివరిస్తు న్నారు. బహు వార్షిక పంటైన మల్బరీ మొక్క ఒక సారి నాటితే 30 ఏళ్ల వరకు పంట ఇస్తుంది. మొద టి సంవత్సరం 2 నుంచి 3 పంటలు రాగా రెండో సంవత్సరం నుంచి 7 లేదా 8 పంటలు వస్తాయి. సాగు చేయడం ఇలా.. కనీసం రెండు ఎకరాల విస్తీర్ణంలో మల్బరీ సాగు చే యాలి. తోట పరిసర ప్రాంతంలో 20 ఫీట్ల అడ్డం, 50 ఫీట్ల పొడవు సీడ్స్ షెడ్డును ఏర్పాటు చేయాలి. షెడ్డు నిర్మాణం పరికరాలకు సిల్క్ సమగ్ర పథకం–2లో భాగంగా కేంద్రం రాయితీని అందజేస్తోంది. రెండు ఎకరాల్లో పట్టు పురుగులను పెంచేందుకు మల్బరీ మొక్కలు నాటి 250 గుడ్లు తెచ్చుకోవాల్సి ఉంటుంది. గుడ్ల నుంచి బయటికి వచ్చిన పురుగులకు ఆకు కోసి వేయాల్సి ఉంటుంది. ఏర్పాటు చేసుకున్న షెడ్డులో చల్లటి వాతావరణం ఉండేలా చూసుకోవాలి. 20 నుంచి 25 రోజుల్లో పురుగులు గూళ్లను అల్లుకుంటాయి. చంద్రికల నుంచి పట్టుగూళ్లను వే రు చేసి మార్కెట్‌కు తరలించుకోవచ్చు. ఇలా మల్బ రీ సాగులో సరైన యాజమాన్య పద్ధతులు అమలు చేస్తే స్థిరమైన అధిక ఆదాయాన్ని రైతులు సొంతం చేసుకోవచ్చు. నీటి సౌకర్యం కలిగిన నల్లరేగడి, చౌడు మినహా అన్ని భూములు మల్బరీ సాగుకు అనుకూలమని అధికారులు చెబుతున్నారు. పట్టు పరిశ్రమతో అధికాదాయం.. పట్టు పరిశ్రమపై జిల్లావ్యాప్తంగా రైతులకు అవగాహ న కల్పిస్తున్నాం. రైతులు నే రుగా మమ్మల్ని సంప్రదించి నా వివరాలు చెబుతాం. ప్ర భుత్వం అందించే రాయితీ ని ఉపయోగించుకొని పట్టు పరిశ్రమలు నెలకొల్పా లి. పట్టు సాగుతో అధిక ఆదాయం పొందవచ్చు. – జ్యోతి, జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారి మల్బరీ మొక్కలను ఒక్కసారి నాటితే 30 ఏళ్ల వరకు ఆదాయం ఏడాదికి ఎనిమిది పంటలు.. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు జిల్లాలో పెరుగుతున్న మల్బరీ సాగుకేజీ పట్టు రూ.600 పట్టు పురుగుల గూళ్ల తయారీ అనంతరం వాటి నాణ్యత ఆధారంగా ధర ఉంటుంది. ప్రస్తుతం కేజీ పట్టు ధర రూ.600 ల వరకు పలుకుతోంది. దీంతోపాటు రైతుకు అదనంగా కేజీకి రూ.75 రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకంగా అందిస్తోంది. రైతులు సాగుచేసిన పట్టుగూళ్లు విక్రయించుకునేందుకు హైదరాబాద్‌లోని తిరుమలగిరి, వరంగల్ జిల్లాలోని జనగామలో మార్కెటింగ్ సౌకర్యం కల్పించింది. -
అదృశ్యమైన వ్యక్తి.. నాలుగేళ్లకు ఆచూకీ లభ్యం
బోధన్‌టౌన్(బోధన్): పట్టణానికి చెందిన అబ్దుల్ అజీమ్ నాలుగేళ్ల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయి, ఆదివారం తిరిగి తనవాళ్లకు వద్దకు చేరుకున్నాడు. అనం ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపిన వివరాలు ఇలా.. బోధన్‌కు చెందిన అబ్దుల్ అజీమ్ నాలుగేళ్ల క్రితం మతిస్థిమితం కోల్పోయి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఖమ్మంలోని కారెపల్లిలో తిరుగుతూ ప్రజలపై దాడికి పాల్పడుతుండగా అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి మానసిక పరిస్థితిని గమనించి ఆనం సేవా ఫౌండేషన్‌కు అప్పగించారు. అక్కడ అతడికి వైద్య చికిత్స అందించగా కొద్ది రోజుల నుంచి తన కుటుంబ సభ్యుల వివరాలు వెల్లడిస్తుండంతో ఆదివారం అతడిని బోధన్‌కు తీసుకు వచ్చి ఆచన్‌పల్లిలో నివాసం ఉంటున్న వరుసకు తమ్ముడైన అబ్దుల్ నయీమ్‌కు పోలీసుల సమక్షంలో అప్పగించారు. ఫౌండేషన్ ప్రతినిధులు శ్రీనివాస్, రావట్ల జనార్ధన్, పద్మాసింగ్, పోలీసులు ఉన్నారు. -
ఐదుగురి ప్రాణాలు నిలబెట్టిన అవయవదానం
గాంధారి(ఎల్లారెడ్డి): తాను చనిపోయినా మరో ఐదుగురికి అవయవాలు దానం చేసి ప్రాణాలు నిలబెట్టాడు మండల కేంద్రానికి చెందిన యువకుడు మోచి చరణ్‌రాజ్(30). వివరాలు ఇలా.. మండల కేంద్రానికి చెందిన మోచి రవి, పద్మ దంపతుల చిన్న కుమారుడు చరణ్‌రాజ్ హైదరాబాద్‌లో ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 22న జరిగిన రోడ్డు ప్రమాదంలో అతడి తలకు తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స అందిస్తుండగా బ్రెయిన్ డెడ్ అయింది. దీంతో అతడు కోలుకోవడం కష్టమని వైద్యులు సూచించడంతో శనివారం చరణ్ తల్లిదండ్రులు, భార్య పెద్ద మనసుతో అతడి అవయవాలు దానం చేసి మరో ఐదుగురి ప్రాణాలు నిలబెట్టారు. అనంతరం అతడి అంత్యక్రియలు ఆదివారం స్వగ్రామంలో నిర్వహించారు. -
‘జయంత్యోత్సవాలకు తరలిరావాలి’
బోధన్: పట్టణంలో ఈనెల 30న అంబేడ్కర్, జ్యోతిబాపూలే, జగ్జీవన్‌రాం జయంతిని పురస్కరించుకుని నిర్వహించనున్న మహనీయుల జయంత్యోత్సవ సభ, ర్యాలీకి ప్రజలు తరలిరావాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర ప్రతినిధి పరిమి కోటేశ్వర్రావు కోరారు. బోధన్‌లోని తాలూకా రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ భవన్లో ఆదివారం డివిజన్ కమిటీ ప్రతినిధులతో కలిసి ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో భాగంగా వేలాది మందితో ర్యాలీ నిర్వహించనున్నామని, సభను అంబేడ్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. కమిటీ కన్వీనర్ నీరడి ఈశ్వర్, ప్రతినిధులు రవి కుమార్, వెంకటి, సింగాడి పాండు, సూర్యకాంత్, దేవేందర్, కారం స్వామి, రాహుల్, సురేందర్ పాల్గొన్నారు. ఐకమత్యంతో ముందుకు సాగాలినిజామాబాద్ రూరల్: బ్రాహ్మణులు ఐకమత్యంతో ముందుకు సాగాలని రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య శాశ్వత చైర్మన్ వెన్నంపల్లి జగన్మోహన్ శర్మ పేర్కొన్నారు. తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో బ్రాహ్మణులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఆదివారం జిల్లా కేంద్రంలోని అర్వపల్లి పురుషోత్తం గుప్త కల్యాణ మండపంలో నిర్వహించారు. రాష్ట్రంలో పరిషత్ ద్వారా వచ్చే నిధులు త్వరలోనే విడుదలవుతాయని తెలిపారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మోత్కూరి రామేశ్వరరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న పేద బ్రాహ్మణులకు, పేద విద్యార్థులకు సహాయ సహకారాలు అందించేలా కృషి చేస్తామన్నారు. నూతనంగా ఎన్నికై న రాష్ట్ర శాశ్వత చైర్మన్‌ను సన్మానించారు. కార్యక్రమంలో ఉమాకాంత్, డాక్టర్ చంద్రశేఖర్ బిర్లా రామారావు, భూపతి రావు, ప్రవీణ్ కులకర్ణి, గాయత్రి కులకర్ణి, శరత్ కుమార్, వైద్య రణధీర్, ప్రవీణ్ మహరాజ్, రాజగోపాల చారి, రామ్ శ్యామ్, నవీన్, విజయ్, సభ్యులు పాల్గొన్నారు. నేత్ర, శరీర అవయవ దాతల సంఘం కన్వీనర్‌గా ప్రేమ్‌లాల్ నిజామాబాద్ రూరల్: తెలంగాణ నేత్ర శరీర అవయవ దాతల సంఘం నిజామాబాద్ సిటీ కన్వీనర్‌గా బానోత్ ప్రేమ్‌లాల్ నియామకం అయ్యారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉపేందర్‌రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు కామిడి సతీశ్‌రెడ్డి ఆయనకు నియామకపత్రాన్ని అందజేశారు. -
పనులు త్వరగా పూర్తిచేయాలి
పసుపు వాగు అంచున నా పొలాలున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న వంతెన నిర్మిస్తామంటే కాంట్రాక్టరుకు నా సొంత సాగు భూమిని ఇసుక, కంకర, ఇతర సామగ్రి నిల్వ కోసం కౌలు ధరకు ఇచ్చాను. ఏడాదిన్నర కావస్తున్న పనులు ముందుకు సాగడం లేదు. సామగ్రి పంట పొలంలోనే మిగిలిపోయి ఉంది. ఈ ఏడాదికి సంబంధించి రావాల్సిన కౌలు డబ్బులు రూ.లక్షా 35 వేలు కాంట్రాక్టరు చెల్లించడం లేదు. వంతెన పనులు త్వరితగతిన పూర్తి చేస్తే రైతులకు మేలు జరుగుతోంది. – బుర్క చిన్న లింగాగౌడ్, రైతు, పాన్‌గల్లీ, బోధన్ -
విద్యుత్ షాక్‌తో పశువుల మృత్యువాత
సిరికొండ: మండల కేంద్రంలోని చీమన్‌పల్లి రోడ్డులో ప్రమాదవశాత్తు ట్రాన్స్ఫార్మర్కు తగిలి విద్యుత్ షాక్‌తో ఆవు ఆదివారం మృతి చెందింది. సిరికొండకు చెందిన బొందెరి రవికి చెందిన ఆవు తన వ్యవసాయ క్షేత్రానికి సమీపంలో మేత మేస్తోంది. అక్కడే తక్కువ ఎత్తులో ఉన్న ట్రాన్స్ఫార్మర్కు ఆవు తగలడంతో విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. ఆవు విలువ రూ. 60వేల వరకు ఉంటుందని, నష్ట పరిహరం ఇచ్చి ఆదుకోవాలని బాధితుడు కోరుతున్నాడు. పాల్దా గ్రామంలో.. నిజామాబాద్ రూరల్: మండలంలోని పాల్దా గ్రామ చెరువు శివారులో విద్యుదా ఘాతంతో మూడు పాడిగేదెలు మృతిచెందినట్లు పాడిరైతులు ఆదివారం పేర్కొన్నారు. గ్రామానికి చెందిన సంగేశ్ ప్రశాంత్, చాకలి ఆశోక్‌కు చెందిన పాడిగేదెలు ఊరు బయట చెరువు వద్దకు మేతకు వెళ్లాయి. ప్రమాదవశాత్తు కిందపడిన విద్యుత్‌వైర్ గేదెలకు తగలడంతో కరెంట్‌షాక్‌తో మృతిచెందాయి. ప్రభుత్వం స్పందించి తమకు నష్టపరిహారం అందించాలని బాధిత పాడిరైతులు కోరారు. -
నిధులు సరిపోక నిలిచిన పనులు
బోధన్: బోధన్ పట్టణ శివారులోని బోధన్–బాన్సువాడ బైపాస్ రోడ్డు సమీపంలో గల పసుపు వాగుపై హైలెవల్ వంతెన నిర్మాణ పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. పనులకు కెటాయించిన నిధులు సరిపోక, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, అధికారుల ఉదాసీన వైఖరి ఇలా అనేక కారణాల వల్ల పనులు అర్ధాంతరంగా నిలిచిపోయి, ముందుకు సాగడం లేదు. కాలయాపన వల్ల పనుల అంచనా వ్యయం పెరిగిపోతోంది. మరో వైపు అదనపు నిధుల కోసం పంపిన ప్రతిపాదనలు మేరకు నిధుల మంజూరులో ఆలస్యం జరుగుతోంది. అయినా పాలకులు, అధికారులు స్పందించడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఐదేళ్ల క్రితం ప్రతిపాదనలు.. పసుపు వాగుపై వంతెన నిర్మాణం కోసం 2021–22 ఆర్థిక సంవత్సంరలో పీఎంజీఎస్‌వై (ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన) కింద రూ. 3కోట్ల నిధులు మంజూరయ్యాయి. పీఆర్ ఇంజినీరింగ్ శాఖ పనుల కోసం టెండర్లు నిర్వహించగా 2023లో ప్రక్రియ పూర్తి చేసి కాంట్రాక్టర్‌కు అప్పగించారు. 2023 సెప్టెంబర్‌లో పనులు ప్రారంభించి 2025 మార్చి 1వరకు పూర్తి చేయాలని గడువు విధించారు. కానీ గడువు ముగిసిపోయిన పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. 10 పిల్లర్లు నిర్మించగా, రెండు పిల్లర్ల మేర స్లాబ్ వేసి వదిలేశారు. ఐదేళ్ల క్రితం ప్రతిపాదనల మేరకు మంజూరైన నిధులతో పనులు పూర్తి చేశామని, మరో రూ.3 కోట్లు నిధులు మంజూరుకు ఏడాదిక్రితమే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్టు అధికారులు చెబుతున్నారు. నిధులు ఎప్పుడు మంజూరవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. బోధన్–కోటగిరి మండలాలకు అనుసంధానం బోధన్ పట్టణ శివారు నుంచి పసుపు వాగు వంతెన మీదుగా కోటగిరి మండలంలోని ఎత్తొండ, రాయ్కూర్, దోమలెడ్గి వరకు సుమారు 14 కిలో మీటర్ల పొడువున పీఎంజీఎస్‌వై కింద రూ.6 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టి రెండేళ్ల క్రితమే పూర్తిచేశారు. వాగుపై చేపట్టిన వంతెన నిర్మాణం పూర్తి చేస్తే కోటగిరి మండల ప్రజలకు పట్టణ కేంద్రానికి వచ్చేందుకు దూరం తగ్గడమే కాక మరింత సౌకర్యంగా మారనుంది. ప్రస్తుతం వాగులో తాత్కాలికంగా వేసిన మట్టి రోడ్డు మీదుగా రెండు మండలాల ప్రజలు రాకపోకలు సాగుతున్నాయి. అలాగే పసుపు వాగు అవతలి ఒడ్డున పట్టణ రైతులకు సంబంధించి 250 ఎకరాలకు పైగా సాగు భూములున్నాయి. వర్షాకాలంలో పంట పొలాలకు వెళ్లెందుకు ఏళ్లుగా రైతులు తీవ్ర కష్టాలు పడుతున్నారు. వంతెన పూర్తయితే సాగు కష్టాలు తీరుతాయని సంబుర పడ్డారు. కానీ పనులు ముందుకు సాగకపోవడంతో రైతులు, ఇరు మండలాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి నిధులు మంజూరు చేసి, పనులు పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. బోధన్ శివారులోని పసుపువాగుపై ఏడాది క్రితం వంతెన పనులు ప్రారంభం రూ.3కోట్ల నిధులు సరిపోక అర్ధంతరంగా నిలిచిన బ్రిడ్జి నిర్మాణం -
ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
బిచ్కుంద(జుక్కల్): మండలంలోని హజ్గుల్ సమీపంలోగల మంజీరా నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న 10 ట్రాక్టర్లను కందర్పల్లి వద్ద ఆదివారం పొలీసులు పట్టుకున్నారు. వేబిల్లు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని సమాచారం మేరకు తనిఖీలు చేపట్టి పట్టుకున్నట్లు ఎస్సై మోహన్‌రెడ్డి తెలిపారు. ఖాళీ బిందెలతో మహిళల నిరసన రుద్రూర్: మండల కేంద్రంలోని రాంమందిర్ కాలనీలో ఆదివారం నీటి ఎద్దడి తీవ్రంగా ఉందని మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. గత 15 రోజులుగా పంచాయతీ కుళాయిలు రావడం లేదన్నారు. నీటి కోసం సమీప కాలనీల్లోకి వెళ్తే ఘర్షణ పడుతున్నారని వాపోయారు. మండుటెండలో నీటి కోసం తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై జీపీలో విన్నవిస్తే స్పందన కరువైందన్నారు. ఇకనైనా జీపీ అధికారులు సమస్యను పరిష్కరించాలని కాలనీవాసులు కోరుతున్నారు. -
ఆత్మీయ పలకరింపులు.. మధుర స్మృతులు
లింగంపేట/నిజాంసాగర్/భిక్కనూరు/బీబీపేట/రాజంపేట/నాగిరెడ్డిపేట/రామారెడ్డి: ఆత్మీయ పలకరింపులు.. ఆపాత మధుర స్మృతులను గుర్తుకు తెచ్చుకుని పూర్వ విద్యార్థులు భావోద్వేగానికి లోనయ్యారు. అరే ఎన్నాళ్లయింది కలుసుకుని.. పూర్తిగా మారిపోయావంటూ ఆనాటి స్నేహితులు ఏళ్ల తర్వాత కలుసుకోవడంతో హర్షం వ్యక్తంచేశారు. జిల్లాలోని వివిధ గ్రామాల ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల పదోతరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. ఈసందర్భంగా చిన్నానాటి మిత్రులందరూ ఏళ్ల తర్వాత మళ్లీ ఒకే వేదికపై కలుసుకోవడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఒకరినొకరు పలకరించుకుంటూ అనాటి జ్ఞాపకాలను గుర్తుకుతెచ్చుకున్నారు. నాడు చదువు నేర్పిన ఉపాధ్యాయులను సమ్మేళనానికి ఆహ్వానించి, సన్మానించారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలతో ఉల్లాసంగా గడిపారు. అనంతరం విద్యార్థులు, గురువులు అందరూ కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. జిల్లాలో పలుచోట్ల సమ్మేళనాలు నిర్వహించిన పూర్వవిద్యార్థులు ఏళ్ల తర్వాత కలుసుకోవడంతో భావోద్వేగానికి గురైన మిత్రులు -
పేకాడుతున్న ఏడుగురి అరెస్టు
ఖలీల్‌వాడి/ఆర్మూర్‌టౌన్: ఆర్మూర్ శివారులోని బైపాస్ రోడ్డులో గల మల్లారెడ్డి గెస్ట్‌హౌస్‌లో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై ఆదివారం నిజామాబాద్ సీసీఎస్ పోలీసులు దాడి చేశారు. విశ్వసనీయ సమాచారం రావడంతో సీపీ సాయిచైతన్య ఆదేశాల మేరకు నిజామాబాద్ సీసీఎస్ ఏసీపీ నాగేంద్రచారి ఆధ్వర్యంలో సీసీఎస్ సీఐ రవికుమార్, సిబ్బంది దాడి చేశారు. పేకాట ఆడుతున్న ఏడుగురిని పట్టుకున్నారు. అలాగే వారి వద్ద నుంచి రూ.21830 నగదును స్వాధీనం చేసుకున్నారు. రూ.2,35,000 ఆన్లైన్ చెల్లింపులు యూపీఏల ద్వారా చెల్లించినట్లు గుర్తించి ఫోన్లను సీజ్ చేశారు. అనంతరం ఆర్మూర్ పోలీసులకు అప్పగించారు. శివాలయంలో చోరీ లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని మెంగారం గ్రామంలోని శివాలయంలో దుండగులు చోరీకి పాల్పడినట్లు గ్రామస్తులు తెలిపారు. ఆలయం తాళాలను దుండగులు శనివారం రాత్రి ఇనుప రాడ్‌తో పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. అలాగే ఆలయంలో ఉన్న హుండీని పగుల గొట్టి నగదు, అమ్మవారి మెడలో గల బంగారు పుస్తెను అపహరించారు. ఆలయంలో చోరీ జరగడం ఇది నాలుగోసారి కావడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దొంగతనాల నివారణకు పోలీసులు పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. నగరంలో ఆపరేషన్ ఛబుత్రా ఖలీల్‌వాడి: నగరంలోని బర్కత్‌పురా, గాజులపేట్, హయిత్గల్లీ, శివాజీనగర్, అహ్మద్‌పురా కాలనీలో ఆదివారం రాత్రి పోలీసులు ఆపరేషన్ ఛబుత్రా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయా కాలనీల్లోని ప్రజల వాహనాలకు సంబంధించిన పత్రాలను పోలీసు సిబ్బంది పరిశీలించారు. 36 బైక్‌లు, 6 ఆటోలకు పత్రాలు లేకపోవడంతో సీజ్ చేశారు. పాత నేరస్తులు, రౌడీషీటర్ల గురించి తెలుసుకున్నారు. ఎవరైనా అనుమానితులు ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. పట్టణ సీఐ శ్రీనివాస్ రాజు, ఎస్సైలు యాసీన్ ఆరాఫత్, హన్మండ్లు, ఆర్ఎస్సై అజయ్, సిబ్బంది పాల్గొన్నారు. -
యూనిఫాం కుట్టు కూలి చెల్లించేదెప్పుడో?
బిచ్కుంద(జుక్కల్): ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా యూనిఫాం అందిస్తోంది. గతేడాది యూనిఫాం కుట్టు చార్జీలు ప్రభుత్వం కొన్ని చెల్లించింది. సుమారు రూ.45 లక్షలు మహిళా సంఘాలకు చెల్లించాల్సి ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అందించిన యూనిఫాంలు కొందరు విద్యార్థులకు టైట్, మరికొందరికి లూజ్, చిన్న పెద్దగా ఇచ్చారు దీంతో విద్యార్థులు అసౌకర్యానికి గురయ్యారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం యూనిఫాం కుట్టే బాధ్యతను స్థానిక మహిళా సంఘాల సభ్యులకు అప్పగించింది. వారు పాఠశాలకు వెళ్లి విద్యార్ధుల కొలతలు తీసుకొని కుట్టారు. ఒక్కో జతకు రూ. 50 చెల్లిస్తామని ప్రభుత్వం అప్పట్లో ప్రకటించగా.. అనంతరం రూ.75 చెల్లిస్తామని ప్రభుత్వం ఒప్పుకుంది. గత ఏడాది కుట్టిన కూలీ రూ.50 తోనే చెల్లించింది ఇంకా జతకు రూ. 25 చెల్లించాల్సి ఉంది. జిల్లాలో సుమారు రూ.45 లక్షలు పాత కుట్టు బకాయిలు చెల్లిస్తేనే కొత్త యూనిఫాం కుడుతామని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అప్పులు తీసుకొని కుట్టే వారికి చార్జీలు చెల్లించామని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాత బకాయిలు వెంటనే ప్రభుత్వం చెల్లించాలని వారు కోరుతున్నారు. కొత్త యూనిఫాం కోసం మండలాలకు చేరుతున్న క్లాత్... పాఠశాలలు ప్రారంభం కాకముందే అన్ని పాఠశాలలకు యూనిఫాంలు చేరే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఒక్కో విద్యార్థులకు రెండు జతలు ఇవ్వనున్నారు. జిల్లాలో 49,054 బాలికలు, 45,279 బాలురు మొత్తం 94,333 మంది విద్యార్థులకు యూనిఫాం అందించనున్నారు. జిల్లా కేంద్రం నుంచి యూనిఫాం క్లాత్ మండలాలకు పంపడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సారి కూడా మహిళా సంఘాల సభ్యులకు కుట్టే బాధ్యత అప్పగిస్తున్నారు. పాఠశాలలకు వెళ్లి కొలతలు తీసుకుంటున్నారు ఒక జతకు రూ.75 చెల్లిస్తామని అధికారులు అంటున్నారు. ఒక్కో విద్యార్థికి రెండు జతలు ఇవ్వనున్నారు. 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు బాలికలకు యూనిఫాం ఒకే విధంగా ఉండేలా మార్పులు చేశారు. 6 నుంచి గురుకులాల ఇంటర్ వరకు బాలుర విదార్థులకు ప్యాంట్లు, షర్టులు ఇవ్వనున్నారు. వీటి పరిశీలన బాధ్యత ఎంఈవోలకు అప్పగించనున్నారు. మే నెలాఖరులోగా యూనిఫాంలు పూర్తి చేసి బడిబాటకు ముందే పాఠశాలలకు చేరేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. తరగతులకు పిల్లలు కొత్త దుస్తుల్లో హాజరయ్యేలా కార్యచరణ రూపొందించినట్లు విద్యా శాఖ అధికారులు తెలిపారు. జిల్లాలో పాత బకాయి రూ.45 లక్షలు పాత బకాయిలు చెల్లిస్తేనే కొత్త దుస్తులు కుడుతామంటున్న మహిళా సంఘాల సభ్యులు జిల్లాలో 94,333 విద్యార్థులు -
రోడ్డు ప్రమాదంలో బల్దియా కార్మికుడికి గాయాలు
నిజామాబాద్ సిటీ: నగర కార్పొరేషన్ లో పారిశుధ్య కా ర్మికుడిగా పని చేస్తు న్న శంకర్‌కు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉ న్నాయి. శంకర్ డంపింగ్ యార్డులో శనివారం విధులు ముగించుకొని బైక్‌పై తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో ఎదురుగా ఓ వ్యక్తి బైక్‌తో వచ్చి ఢీకొట్టాడు. ఈ ఘటనలో శంకర్‌కు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన మాక్లూ ర్ మండలం మెట్పల్లి గ్రామానికి చెందిన వ్యక్తిని ఐదో టౌన్ పోలీసులకు అప్పగించారు. రుద్రూర్లో వ్యవసాయ కళాశాల కోసం ప్రయత్నాలురుద్రూర్: రుద్రూర్ మండలం అక్బర్‌నగర్ శివారులో వ్యవసాయ కళాశాలను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉమ్మడి జిల్లాకు వ్యవసాయ కళాశాలను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర సచివాలయంలో ఫిబ్రవరిలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో నిజామాబాద్ జిల్లా రుద్రూర్లో, నల్గొండ జిల్లా కంపసాగర్‌లో వ్యవసాయ కళాశాలల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. దీంతో ఈ ప్రాంత వాసులు, రైతులు వ్యవసాయ కళాశాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇక్కడ కళాశాల ఏర్పాటుకు అవసరమగు స్థలం, మౌలిక వసతులు ఉన్నాయి. వ్యవసాయ విద్యాబోధనకు అనుకూలమైన వాతవరణం ఉంది. ఇక్కడ పరిశోధన కేంద్రంతో పాటు కృషి విజ్ఞాన కేంద్రం, వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల, ఆహార శాస్త్ర విజ్ఞాన కళాశాలలు ఉన్నాయి. పరిశోధన కేంద్రం ద్వారా వ్యవసాయ పద్ధతలను మెరుగు పరచడం, చీడపీడల నివారణ, వరి, చెరకులో కొత్త వంగడాలను రూపొందించి రైతులకు పరిచయం చేస్తున్నారు. ఇది రాష్ట్ర వ్యవసాయ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ సురేశ్ షెట్కార్‌ను ఇటీవల స్వచ్ఛంద సంస్థ రైడ్స్ ఆధ్వర్యంలో కలిసి వినతిపత్రాలు అందజేశారు. రుద్రూర్లో వ్యవసాయ కళాశాలను ఏర్పాటు చేస్తే ఉమ్మడి జిల్లాకు ప్రాధాన్యం ఇచ్చినట్లవుతుందని వారు పేర్కొంటున్నారు. వ్యవసాయ పరిశోధన కేంద్రం భూములను పరిశీలించడానికి అధికారులను పంపించాలని వ్యవసాయ శాఖ మంత్రిని స్థానికులు కోరుతున్నారు. ● ఎమ్మెల్యే, ఎంపీకి వినతిపత్రాలు అందజేత -
బడులకు భద్రత కరువు
నాగిరెడ్డిపేట: పాఠశాలలకు ఈనెల 24 నుంచి వేసవి సెలవులు ప్రారంభమయ్యాయి. దీంతో సెలవులు పూర్తయ్యేవరకు పాఠశాలలవైపు కన్నెత్తి చూసేవారు ఉండరు. ఇదే అదనుగా భావించే ఆకతాయిలు పాఠశాలల భవనాలను అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మార్చుకునే అవకాశాలుంటాయి. దీంతోపాటు గతంలో జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో సెలవుల్లో చోరీలు జరిగిన సంఘటనలూ ఉన్నాయి. జిల్లాలో 710 ప్రాథమిక, 212 ప్రాథమికోన్నత, 322 ఉన్నత పాఠశాలలున్నాయి. ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా జిల్లాలోని చాలా పాఠశాలలకు డిజిటల్ బోర్డులు, కంప్యూటర్లు, డెస్క్బెంచీలతో పాటు తాగునీటి సరఫరాకు సంబంధించి ఆర్వో ప్లాంట్లను సరఫరా చేశారు. పీఎంశ్రీ పథకం ద్వారా కొన్ని పాఠశాలలకు కంప్యూటర్లు, ట్యాబ్‌లను అందజేశారు. దీంతోపాటు పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన సరుకులున్నాయి. చాలా పాఠశాలల భవనాల చుట్టూ ప్రహరీలు లేవు. కొన్ని పాఠశాలల భవనాల చుట్టూ ప్రహరీలున్నా అవి పూర్తిస్థాయిలో లేవు. మరికొన్ని పాఠశాలల భవనాలకు సరైన గేట్లు కూడా లేవు. ప్రస్తుతం వేసవి సెలవులు ఇవ్వడంతో పాఠశాలలకు భద్రత కరువయ్యింది. వేసవి సెలవులు ముగిసేవరకు కాపలా కోసం తాత్కాలికంగా వాచ్మన్లను నియమించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రారంభమైన వేసవి సెలవులు వాచ్మన్లు లేక ఇబ్బందులు -
కూరగాయలు C/o అంకోల్ క్యాంప్
● అంగళ్లకు ఇక్కడి నుంచే సరఫరా ● లాభాలు గడిస్తున్న రైతులు నస్రుల్లాబాద్ : సాధారణంగా ఏ గ్రామంలో అయి నా కొద్దిమంది మాత్రమే కూరగాయలు సాగు చే స్తుంటారు. కానీ అంకోల్ క్యాంప్‌లో మాత్రం ఊరుఊరంతా కూరగాయలు సాగు చేస్తుంది. అది కూ డా సేంద్రియ ఎరువులు వాడుతూ కూరగాయలు పండిస్తున్నారు. వీరు పండించిన కూరగాయలను బాన్సువాడ, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్, పిట్లం, బి చ్కుంద, నిజామాబాద్, బోధన్, కోటగిరి, సాలూ ర, సాటాపూర్, నవీపేట్, పొతంగల్, వర్ని, నారా యణ్ఖేడ్ తదితర ప్రాంతాల్లోని అంగళ్లకు తీసుకువెళ్లి విక్రయిస్తుంటారు. అంకోల్ క్యాంప్‌లో మొత్తం 105 కుటుంబాలున్నాయి. సుమారు 60 కుటుంబాలు కూరగాయల ను సాగు చేస్తున్నాయి. సాధారణ పంటలతోపాటు దాదాపు 45 ఎకరాల్లో ఆయా రకాల కూరగాయలు పండిస్తున్నారు. బెండకాయ, క్యాబేజీ, మిర్చి, వంకాయ, టమాట, క్యాలీఫ్లవర్, సోరకాయ, బీరకా య, కాకరకాయలు ఎక్కువగా పండిస్తారు. రోజూ కూరగాయలు తెంపి, చుట్టు పక్కల గ్రామాల్లో నిర్వహించే అంగళ్లకు తీసుకువెళ్లి విక్రయిస్తారు. అతివలదే ప్రధాన పాత్ర.. కూరగాయల సాగులో మహిళలే క్రియాశీలక పాత్ర పోషిస్తుంటారు. విత్తనాలు విత్తడం, నీరు పెట్టడం, కలుపు తీయడం, ఎరువులు వేయడం, పంట కోయడం వంటి పనులన్నీ మహిళలే చేస్తారు. ఉదయం పంట కోసి బుట్టలు సిద్ధంగా ఉంచితే మగవారు వాటిని తీసుకెళ్లి అమ్ముకొని వస్తారు. కొందరు మహిళలు సైతం మార్కెట్‌కు వెళ్లి కూరగాయలు విక్రయిస్తుంటారు. అన్నీ నేనే చేస్తా.. అర ఎకరం భూమిలో కూరగాయలు పండిస్తాం. మిగతాది వరి పండిస్తాం. పంట కోయడం, కలుపు తీయడం, నీరు పారించడం, మందులు చల్లడం వంటివి నేనే చేసుకుంటాను. మా ఆయనకు చేదోడు వాదోడుగా ఉంటాను. – శోభ, రైతు, అంకోల్ క్యాంపు రెండెకరాల్లో కూరగాయలు పండిస్తున్నా ఉదయం నిద్ర లేచింది మొదలు సాయంత్రం వరకు పొలంలోనే ఉంటా. కూరగాయలు మార్కెట్ వెళ్లగానే తినేసి వచ్చి పనులు చేసుకుంటాం. 2 ఎకరాల్లో వివిధ రకాల కూరగాయలు పండిస్తాం. – లక్ష్మి, రైతు, అంకోల్ క్యాంపు మా కూరగాయల కోసం ఎదురుచూస్తారు మా ఊరి పంట బండ్ల కోసం ప్రజలు ఎదురుచూస్తారు. చుట్టు పక్కల ఎక్కడ అంగడి ఉన్నా మా గ్రామం నుంచే కూరగాయలు పంపిస్తాం. శుభకార్యాలకు ప్రత్యేకంగా వచ్చి తీసుకెళతారు. – సిద్దమ్మ, రైతు, అంకోల్ క్యాంపు సంతోషంగా ఉంది మా ఊరి రైతులు కూర గాయలే కాకుండా వరి పండించడంలోనూ ఆదర్శంగా నిలుస్తున్నారు. కూరగాయల సాగు పను లన్నీ మహిళలే చూస్తా రు. కూరగాయల సాగుతో మా ఊరి రైతులు లాభాలు గడిస్తున్నందుకు సంతోషంగా ఉంది. –వెంకటరమణ, మాజీ సర్పంచ్, అంకోల్ క్యాంపు● ఈమె పేరు చంద్రమ్మ. 73 ఏళ్లు. తనకున్న 1.05 గుంటల భూమిలో వరితోపాటు ఉల్లిగడ్డ, పాలకూర, టమాట, తోటకూర, మెంతికూర, కొత్తిమీర సాగుచేస్తోంది. తానే స్వయంగా పొలంలో పనులు చేస్తుంది. ఇద్దరు కూతుళ్లతోపాటు కొడుకు పెళ్లి చేసింది. కొడుకు హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటుండగా, ఇద్దరు మనవళ్లతో పొలం పనులు చూసుకుంటూ ఆదర్శంగా నిలుస్తోంది. -
పీఎం మన్‌కీ బాత్ వీక్షించిన బీజేపీ నాయకులు
కామారెడ్డి టౌన్ : జిల్లా కేంద్రంలోని 12వ వార్డులో ఆదివారం ప్రధాన మంత్రి మన్‌కీ బాత్ కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు టీవీ లో వీక్షించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు, పట్టణ ఉపాధ్యక్షుడు రజినీకాంత్ రావు, 12 వార్డు బూత్ అధ్యక్షుడు గోపాల్, రామకృష్ణ, బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యుడు తుమ్మ బాలకిషన్, నాయకులు రవీందర్, గోవర్ధన్, దొడ్ల స్వామి, రజినీకాంత్, ప్రభాకర్, శ్రీకాంత్, కిరణ్ కుమార్ పాల్గొన్నారు. 4న వేసవి క్రికెట్ శిక్షణ శిబిరం ప్రారంభం కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని ఇందిరా గాంధీ స్టేడియంలో మే 4 నుంచి 31వ తేదీ వరకు వేసవి క్రికెట్ శిబిరం నిర్వహించనున్నారు. హైదరాబాద్, నిజామాబాద్ క్రికెట్ అసోసియేషన్ల సహకారంతో ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నామని జిల్లా క్రికెట్ అసోసియేష న్ అధ్యక్ష, కార్యదర్శులు మోజామ్ అలీఖాన్, ముప్పారపు ఆనంద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రోజూ ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు శిబిరం ఉంటుందని పేర్కొ న్నారు. 13 నుంచి 23 ఏళ్లలోపువారు అర్హుల ని తెలిపారు. క్రీడాకారులు తెల్లని క్రికెట్ దు స్తులు, క్యాన్వస్ షూస్, క్రికెట్ కిట్ వెంట తీసుకొని రావాలని, వివరాలకు 96666 77786లో సంప్రదించాలని సూచించారు. చిన్నారిని బలిగొన్న కూలర్ మాక్లూర్ : కూలర్ షా క్తో చిన్నారి మృతి చెందిన ఘటన చిక్లి లో చోటు చేసుకుంది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చిక్లికి చెంది న గడ్డం అర్చన, నవీన్ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఉన్న అసెంబుల్డ్ ఐరన్ కూలర్ వద్ద తల్లిదండ్రులతోపాటు పెద్దకూతురు విహంకిత(5) నిద్రపోయింది. సుమారు 2 గంటల సమయంలో నిద్ర నుంచి మేల్కొన్న విహంకిత అకస్మాత్తుగా పక్కనే ఉన్న కూలర్‌కు తగలడంతో విద్యుదాఘాతానికి గురైంది. దీంతో ఇంటి దర్వాజ నుంచి వాకిట్లో పడిపోయింది. ఇంటి ఎదుట రహదారి గుండా వెళ్లేవారు గమనించి తల్లిదండ్రులకు తెలపడంతో విహంకితను వెంటనే జన్నేపల్లిలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యుడు నిర్ధారించారు. అప్పటి వరకు తమతో ఆడుతూ పాడుతూ గడిపిన కూతురు మృతి చెందడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపించారు. -
‘దయానందుడు చూపిన మార్గం ఆచరణీయం’
కామారెడ్డి అర్బన్ : ఆర్య సమాజ స్థాపకులు మహర్షి దయానంద సరస్వతి చూపిన మార్గం ఎంతో ఆచరణీయమైందని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. కామారెడ్డి ఆర్య సమాజం స్వర్ణోత్సవాలను ఆదివారం జిల్లాకేంద్రంలోని శ్రీసరస్వతి విద్యామందిర్ హైస్కూల్ ఆవరణలో నిర్వహించారు. 108 కుండాలతో గాయత్రి మహాయాగం జరిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి చేతుల మీదుగా స్వర్ణోత్సవ ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కామారెడ్డి ఆర్యసమాజం 50 ఏళ్లుగా వేద ధర్మాన్ని ప్రచారం చేస్తూ సమాజ ఉద్ధరణకు పాటుపడుతుండడం అభినందనీయమన్నారు. ఆర్యసమాజం అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఆర్యసమాజం బాధ్యతలను యువతకు అప్పగించాలని సూచించారు. ఆర్ష గురుకులం అధిపతి బ్రహ్మానంద సరస్వతి, కోల్‌కతాకు చెందిన మహేంద్రపాల్ ఆర్య మాట్లాడుతూ ప్రతిఒక్కరు దేశభక్తి కలిగి ఉండాలని, వేదమార్గంలో పయనించాలని సూచించారు. కార్యక్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్యప్రతినిధి సభ కార్యదర్శి హరికిషన్ వేదాలంకార్, కామారెడ్డి ఆర్యసమాజం అధ్యక్షుడు కంకణాల కిషన్, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే నేరెళ్ల ఆంజనేయులు, ఆర్యసమాజం ప్రతినిధులు గరిపల్లి అంజయ్యగుప్తా, గడ్డం రాంరెడ్డి, అర్వపల్లి రమేష్, నందనం కృపాకర్, ఆచార్య సత్యవీర్, దోమకొండ అరుణ, వంగాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.బాహుబలి దివ్యవాణి గ్రంథం.. కామారెడ్డి అర్బన్: కామారెడ్డి ఆర్యసమాజం స్వర్ణోత్సవాలను ఆదివారం జిల్లాకేంద్రంలోని సరస్వతి విద్యామందిర్ హైస్కూల్ ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా పుస్తకాల స్టాళ్లు ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లా తూంపల్లికి చెందిన మర్రి కృష్ణారెడ్డి ఏర్పాటు చేసిన స్టాల్ అందరినీ ఆకర్షించింది. ప్రపంచంలోనే అతిపెద్ద గ్రంథం దివ్యవాణి నాలుగు వేదాల గ్రంథాన్ని ప్రదర్శించారు. 24 కిలోల బరువున్న వేదాల గ్రంథం వెల రూ. 24వేలని మర్రి కృష్ణారెడ్డి తెలిపారు. 4 వేల పేజీలతో 15/20 సైజులో ఈ గ్రంథం ఉంది. నాలుగు వేదాలను సులభమైన భాషలో అనువదించినట్లు మర్రి కృష్ణారెడ్డి తెలిపారు. -
బేస్మెంట్ దశలో నిలిచిన మరుగుదొడ్ల నిర్మాణం
బాన్సువాడ రూరల్: మండలంలోని బోర్లం జెడ్పీహైస్కూల్లో విద్యార్థులు కాలకృత్యాలు తీర్చుకోవడానికి నిర్మించ తలపెట్టిన మరుగుదొడ్ల నిర్మాణ పనులకు రాజకీయ గ్రహణం పట్టుకుంది. 180మంది విద్యార్థులున్న ఈపాఠశాలలో ఒకే ఒక మరుగుదొడ్డి ఉండటంతో విద్యార్థినులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏడాది పూర్తి కావస్తున్న టాయిలెట్ల నిర్మాణం పూర్తికావడం లేదు. అధికారులు బిల్లు నమోదు చేయకపోవడంతో కాంట్రాక్టర్ పనులను బేస్మెంట్ దశలో నిలిపివేశారు. వచ్చే విద్యాసంవత్సరం వరకు టాయిలెట్ల నిర్మాణ పనులు పూర్తిచేసి విద్యార్థుల ఇబ్బందులు తొలగించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. -
కుక్కల దాడిలో 20గొర్రెలు మృత్యువాత
ఎల్లారెడ్డిరూరల్: మండలంలోని మల్లయ్యపల్లి గ్రామంలో కుక్కలు దాడి చేయడంతో 20 గొర్రెలు మృత్యువాత పడినట్లు గ్రామస్తులు శనివారం తెలిపారు. గ్రామంలోని కుర్మ మహేందర్‌కు చెందిన గొర్రెలపై కుక్కలు అకస్మాత్తుగా దాడి చేయడంతో 20 గొర్రెలు మృతి చెందాయని అన్నారు. మృతి చెందిన గొర్రెలను వెటర్నరీ వైద్యురాలు అర్చన పరిశీలించారు. ప్రభుత్వం నష్ట పరిహారం అందించేలా చూడాలని బాధితుడు కోరుతున్నారు. ప్రభుత్వం నుంచి ఆర్థికసాయం అందేలా ఎమ్మెల్యే మదన్మోహన్ చర్యలు తీసుకుంటారని మండల పార్టీ అధ్యక్షుడు సాయిబాబా బాధితుడికి హామీ ఇచ్చారు. విద్యుత్ షాక్‌తో గేదె.. రుద్రూర్: మండలంలోని రాణంపల్లి శివారులో విద్యుత్ షాక్ తగిలి పాడి గేదె మృతి చెందింది. గ్రామానికి చెందిన శ్రీనివాస్ గేదెల పెంపకం ప్రధాన వృత్తిగా జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. శనివారం గేదెలను మేత కోసం గ్రామ శివారులోకి తీసుకెళ్లగా ఒక గేదె ట్రాన్స్పార్మర్ వద్ద విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందింది. మృతి చెందిన గేదె రూ.లక్షా 25వేల వరకు ఉంటుందని, నష్ట పరిహరం ఇప్పించాల్సిందిగా బాధిత రైతు కోరాడు. మహిళ అదృశ్యం రుద్రూర్: కోటగిరి మండలం వల్లాభాపూర్ గ్రామానికి చెందిన మేకల లక్ష్మి అదృశ్యమైనట్టు ఎస్సై సునీల్ శనివారం తెలిపారు. ఈ నెల 17న ఇంట్లోంచి వెళ్లిన లక్ష్మి ఇప్పటి వరకు తిరిగి రాలేదు.బంధువులు,స్నేహితుల వద్ద వెతికినప్పటికీ ఆమె ఆ చూకీ లభించలేదు. దీంతో ఆమె భర్త శివరాములు శనివారం పోలీస్‌స్టేషన్ ఫిర్యా దు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. ఇసుక టిప్పర్లు సీజ్ నిజాంసాగర్(జుక్కల్): కర్ణాటక రాష్ట్రానికి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న రెండు టిప్పర్లను శనివారం సీజ్ చేసినట్లు డోంగ్లి మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ సాయిబాబా తెలిపారు. డోంగ్లి మండలంలోని మంజీరా వాగు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తుండటంతో పట్టుకున్నామన్నారు. -
ధాన్యం కుప్పలు.. వాహనదారులకు తిప్పలు
ఎల్లారెడ్డిరూరల్: రైతులు పండించిన పంటలను కల్లంలో ఆరబెట్టాల్సి ఉన్నప్పటికి ప్రధాన రహదారులపై ఆరబెట్టడంతో పాటు పక్కన పెద్ద పెద్ద బండరాళ్లు ఉంచడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఎన్నిసార్లు అవగాహన కల్పిస్తున్నా రైతులు పెడచెవిన పెడుతున్నారు. ఈ కారణంగా రాత్రివేళల్లో వరి కుప్పలు కనిపించక వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఎల్లారెడ్డి మండలంలోని హాజీపూర్ తండా, లక్ష్మాపూర్ గ్రామాలలో ప్రధాన రహదారులపై ధాన్యం ఆరబెట్టడంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు స్పందించి రోడ్లపై పంటల నూర్పిడి చేయకుండా, ధాన్యం ఆరబెట్టకుండా తగిన చర్యలను తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. ఆరబెట్టకుండా చర్యలు తీసుకోవాలి రోడ్డుపై ధాన్యం ఆరబెట్టడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ధాన్యం ఆరబెట్టకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి. ప్రధానంగా బైకుపై వెళ్లేవారు గాయాలపాలవుతున్నారు. వాహనదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రోడ్డుపై ధాన్యం ఆరబెట్టకుండా చూడాలి. – విజయ్ కుమార్, లింగంపేట కల్లాల్లోనే ఆరబెట్టుకోవాలి రైతులు ధాన్యాన్ని కల్లాల్లోనే ఆరబెట్టుకోవాలి. రోడ్డుపై ధాన్యం ఆరబెట్టుకోవడం సరికాదు. ధాన్యం కుప్పల మీద రాళ్లు పెట్టడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అనుకోని ప్రమాదాలు జరిగితే దానికి పూర్తి బాధ్యులు ధాన్యం ఆరబెట్టిన వారవుతారు. – మహేష్, ఎస్సై, ఎల్లారెడ్డి ఎల్లారెడ్డి మండలంలో ఇబ్బందులు పడుతున్న వాహనదారులు పట్టించుకోని అధికారులు -
కుక్కల దాడిలో దూడలకు గాయాలు
తాడ్వాయి(ఎల్లారెడ్డి): తాడ్వాయి శివారులోని పందిరి కొట్టంలో ఉంచిన రెండు గేదె దూడలపై శనివారం కుక్కలు దాడిచేసి గాయపర్చాయి. స్థానికులు గమనించి వాటిని చికిత్స నిమిత్తం పశువుల ఆస్పత్రికి తరలించారు. గతంలో కూడా మండలంలోని కరడ్‌పల్లి, తాడ్వాయి, నందివాడ శివారులో పశువుల పాకలో ఉంచిన మేకలు, గొర్రెల పిల్లలు, లేగదూడలపై దాడిచేశాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి గ్రామాలలో ఉన్న కుక్కలను బయటకు తరలించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రహదారి పరిశీలన గాంధారి(ఎల్లారెడ్డి): రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యల కోసం నియమించిన యాక్సిడెంట్ రిజల్యూషన్ బృందం శనివారం గాంధారిలో రహదారిని పరిశీలించారు. పలువురు స్థానియ నాయకులతో మాట్లాడారు. ఈ బృందంలో సదాశివనగర్ సీఐ సంతోష్ కుమార్, ఎస్సై ఆంజనేయులు, సహాయ మోటారు వాహనాల ఇన్స్పెక్టర్ భిక్షపతి, ఆర్అండ్బీ ఏఈ రవితేజ తదితరులున్నారు. అలరించిన చిన్నారులు మాచారెడ్డి: మండలంలోని లచ్చాపేట ఉన్నత పాఠశాల వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనతో అందరిని అలరించారు. ఈ సందర్భంగా పాఠశాల వేదిక నిర్మాణ దాత బూస శ్రీనివాస్, రూ. 50వేల విలువైన సామగ్రిని బహూకరించిన అర్కిడ్స్ పాఠశాల ప్రిన్సిపాల్ చెప్యాల గోవర్ధన్ రెడ్డి, పాఠశాలలో చదివి ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన గ్రామస్తులతో పాటు ఇటీవల గ్రూప్– 1 పరీక్షలో విజయం సాధించిన భూస ఉదయ్ కిరణ్ ను సన్మానించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు లక్కిరెడ్డి రాజేశ్వరరెడ్డి, అమ్మ ఆదర్శ పాఠశాల అధ్యక్షురాలు భవాని, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మక్బూల్, మాజీ ఎంపీటీసీ బూస శ్రీనివాస్, జయరామశర్మ, ఉపాధ్యాయులు గ్రామస్తులు ఉన్నారు. -
భరోసా కల్పించడానికే భూభారతి
దోమకొండ/బీబీపేట: రైతులకు భరో సా కల్పించడానికే ప్రభుత్వం భూభార తి చట్టాన్ని తీసుకువచ్చిందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. శనివారం దోమకొండ, బీబీపేటలలో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సుల లో ఆయన పాల్గొన్నారు. ఈ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించడానికి మండలాల వారీగా సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. భూ సమస్యలకు ఈ చట్టంలో పరిష్కారాలు ఉన్నాయన్నారు. ఫాం పాండ్స్ నిర్మించుకోవాలి రైతులు పొలాల్లో ఫాం పాండ్స్ నిర్మించుకోవాలని కలెక్టర్ సూచించారు. వర్షపు నీరు భూమిలోకి ఇంకిపోయేలా చేసి భూగర్భ జలాలను పెంచేందుకు ఫాం పాండ్స్, ఇంకుడు గుంతలు, కాంటూరు కందకాలు ఉపయోగపడతాయన్నారు. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ఉపా ధి హామీ పథకం కింద కనీసం 5 ఫాం పాండ్స్ నిర్మించాలని సూచించారు. కా ర్యక్రమంలో భిక్కనూరు ఏఎంసీ చైర్మన్ పాత రాజు, ఆర్డీవో వీణ, దోమకొండ మండల ప్రత్యేకాధికారి జ్యోతి, తహసీ ల్దార్లు సంజయ్రావు, సత్యానారాయణ, ఎంపీడీవోలు ప్రవీణ్‌కుమార్, పూర్ణచంద్రోదయ కుమార్, నాయకులు తిర్మల్ గౌడ్, ఐరేని నర్సయ్య పాల్గొన్నారు. మధ్యలోనే వెళ్లిపోయిన కలెక్టర్ దోమకొండలో కలెక్టర్ మాట్లాడుతున్న సమయంలో ఇద్దరు రైతులు తమ భూ సమస్యలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. గతంలో అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు. దీంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. అధికారులు వారికి సర్దిచెప్పినా వినలేదు. దీంతో కలెక్టర్ తన ప్రసంగం ముగించి మధ్యలోనే వెళ్లిపోయారు. -
చోరీ కేసులో ముగ్గురి అరెస్టు
నవీపేట: మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన చోరీ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. నిజామాబాద్ నార్త్రూరల్ పోలీస్ స్టేషన్ ఆవణలో శనివారం సీఐ శ్రీనివాస్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ముప్కాల్ మండలంలోని కంజర్ గ్రామానికి చెందిన ముగ్గురు కూలీలు కాలూర్ లత, పంతుల విజయ, ఈర్ల సాయికుమార్ ప్రతిరోజు కలిసి కల్లు తాగేవారు. ఈక్రమంలో ఈజీగా డబ్బు సంపాదించాలనే ఆలోచనలో షేర్‌చాట్‌ను ఫాలో అయ్యారు. కత్తి, కారంతో ఒక మహిళను బెదిరించి.. బంగారం దొంగిలించిన వీడియో వీరికి నచ్చింది. అంతే శుక్రవారం నవీపేటలో వారాంతపు కూరగాయల సంత ఉండడంతో అమాయకుల కోసం గాలించారు. ఈ క్రమంలో మండలంలోని నారాయణ్‌పూర్‌కు చెందిన రాచర్ల కిష్టాబాయి అనే వృద్ధురాలు ఒంటరిగా వెళ్తుండగా ఆమెను వెంబడించారు. కత్తితో బెదిరించి.. కంట్లో కారం చల్లి..బంగారు పుస్తెల గుండ్లు, పడిగెలను దోచుకుని పారిపోయారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దొంగతనానికి పాల్పడిన ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. -
రోడ్డు ప్రమాదం కాదు.. హత్యే..
జక్రాన్‌పల్లి: మండలంలోని సికింద్రాపూర్ 44వ నెంబర్ జాతీయ రహదారిపై ఈ నెల 3న ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో గాయపడగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. మొదట యాక్సిడెంట్‌గా భావించగా, ఇటీవల హత్యగా పోలీసులు నిర్ధారించారు. జక్రాన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో శనివారం డిచ్పల్లి సీఐ మల్లేష్, ఎస్సై తిరుపతి నిందితుల వివరాలను వెల్లడించారు. డిచ్పల్లి మండలంలోని మెంట్రాజ్పల్లికి చెందిన బైరం రవీంద్రవర్మ (37) హైవేపై తలకు గాయాలై అనుమానస్పద స్థితిలో పడి ఉండగా జక్రాన్‌పల్లి పోలీసులు అతనిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై మొదటగా జక్రాన్‌పల్లి ఎస్సై తిరుపతి గుర్తు తెలియని వాహనం ఢీకొని రవీంద్ర వర్మ మృతి చెందాడని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కానీ ఘటన స్థలంలో మృతుడి సెల్‌ఫోన్, బ్యాగ్ లభించకపోవడంతో ఆ దిశగా విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా నిందితులు ఏ1 లక్ష్మీనర్సింలు, ఏ2 చింతల కృష్ణ, ఏ3 కడమంచి మారుతిని పట్టుకుని విచారించారు. వీరు ముగ్గురు కూడా బంధువులు. జల్సాలకు అలవాటు పడిన ముగ్గురు నిందితులు అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని పథకం ప్రకారం దారిదోపిడీలకు పాల్పడుతున్నారని తెలిపారు. అందులో భాగంగానే రవీంద్ర వర్మను ముగ్గురు నిందితులు లిఫ్ట్ ఇస్తామని తమ వాహనంపై ఎక్కించుకున్నారు. కొంతదూరం వెళ్లాక సికింద్రాపూర్ గ్రామ శివారులో వాహనాన్ని ఆపి పథకం ప్రకారం రవీంద్ర వర్మను భయపెట్టి, అతని వద్ద గల సెల్‌ఫోన్, బ్యాగ్, డబ్బులు దోచుకున్నారు. రవీంద్ర వర్మ ఎదురు తిరగడంతో వారు బండరాయితో మోదడంతో స్మృహ కోల్పోయి కిందపడిపోయాడు. నిందితులు అతడిని 44వ నెంబర్ జాతీయ రహదారిపై పడేసి ఏదో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టినట్లు చిత్రీకరించారు. మృతుడి సెల్‌ఫోన్‌ను కనుక్కోవడంతో అసలు విషయం బయటపడింది. దీంతో రవీంద్ర వర్మను హత్య చేసిన నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ, ఎస్సై తెలిపారు. నిందితుల వద్ద నుంచి సెల్ఫోన్లతో పాటు స్కూటీ, బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జక్రాన్‌పల్లి ఎస్సై తిరుపతి, సిబ్బందిని సీఐ అభినందించారు. ఈనెల 3న జరిగిన సికింద్రాపూర్ యాక్సిడెంట్ కేసును చేధించిన పోలీసులు ముగ్గురు నిందితుల అరెస్టు -
ప్రాణహాని ఉందని సీపీకి ఫిర్యాదు
ఎడపల్లి(బోధన్): తనకు, కుటుంబసభ్యులకు ప్రాణహాని ఉందని మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన సుండు సతీష్ శనివారం సీపీ సాయిచైతన్యకు ఫిర్యాదు చేశారు. తనపై కక్ష గట్టిన సుండు యాదగిరి, అరుణ్ కుమార్, సుండు నర్సయ్యలు తనను చంపడానికి యత్నిస్తున్నారని, వీరిపై చర్యలు తీసుకువాలని, తనకు కుటుంబసభ్యులకు రక్షణ కల్పించాలని కోరారు. ఇప్పటి వరకు తనపై తన ఇంటిపై రెండు సార్లు దాడి చేశారని, దాడులకు సంబంధించిన వీడియోలను ఎడపల్లి పోలీసులకు ఇచ్చి ఫిర్యాదు చేశానన్నారు. కానీ ఇప్పటి వరకు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని సీపీ దృష్టికి తీసుకువచ్చినట్లు చెప్పారు. షార్ట్ సర్క్యూట్‌తో దుకాణం దగ్ధం కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని గాంధీ గంజ్‌లో రైతుబజార్ పక్కనే ఉన్న బేకరి, ఎగ్ సెంటర్ రేకుల షెడ్ దుకాణంలో శుక్రవారం అర్ధరాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంతో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో దుకాణంలో మంటలు చెలరేగి సామగ్రి పూర్తిగా దగ్ధం అయింది. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. రూ. 2లక్షలకు పైగా నష్టం జరిగిందని దుకాణం యజమాని ఆసిఫ్ తెలిపారు. -
అంబలి కేంద్రం, చలివేంద్రాలను ప్రారంభించిన కలెక్టర్
కామారెడ్డి క్రైం: ఉద్యోగ జేఏసీ, టీఎన్జీవోఎస్ జిల్లా శాఖల ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన అంబలి కేంద్రం, చలివేంద్రాలను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వివిధ అవసరాల నిమిత్తం కలెక్టరేట్‌కు వచ్చే ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఇవి ఉపయోగపడతాయన్నారు. ఈకేంద్రాలను ఏర్పాటు చేసిన ఉద్యోగ జేఏసీ, టీఎన్జీవోఎస్ ప్రతినిధులను కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చందర్ నాయక్, టీఎన్జీవోఎస్ జిల్లా అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, కార్యదర్శి నాగరాజు, ప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్లు ఇప్పించాలని కలెక్టర్‌కు వినతి.. దోమకొండ: అర్హత కలిగిన పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో భూభారతి కార్యక్రమాన్ని ముగించుకొని కామారెడ్డికి వెళ్తుండగా మార్గమధ్యలో షేక్ అల్మా బేగం ఇంటిని కలెక్టర్ పరిశీలించారు. తాను, తన భర్త కూలీ పనిచేస్తూ ఇద్దరు పిల్లలతో కలిసి ప్లాస్టిక్ కవర్లతో కప్పిన గుడిసెలో ఉంటున్నామని వారు ఆయనకు తెలిపారు. తమకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కలెక్టర్‌ను కోరారు. మండల ప్రత్యేక అధికారిని జ్యోతి, ఎంపీపీవో ప్రవీణ్‌కుమార్, జీపీ కార్యదర్శి యాదగిరి, తదితరులున్నారు. -
కాంగ్రెస్ పార్టీ నుంచి కందూరి లింబాద్రి సస్పెండ్
రామారెడ్డి: కాంగ్రెస్ పార్టీలో ప్రజలకు సేవ చేసే వారికే ప్రాధాన్యత ఉంటుందని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మా గౌడ్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భూ కబ్జాలతో పాటు, హత్య కేసులో నిందితుడిగా ఉన్న రామారెడ్డి మండలం ఇసన్నపల్లి గ్రామానికి చెందిన కందూరి పెద్ద లింబాద్రిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే బాధిత కుటుంబానికి అండగా ఉంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శిలాసాగర్, ఇర్పాన్, రంజిత్, భాస్కర్ ,శేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
నిలువ చేస్తే నిరాశే మిగిలింది
మోర్తాడ్(బాల్కొండ): నిలువ చేసిన పంటను సీజన్ ముగిసిన తర్వాత విక్రయించుకుందామనుకున్న ఎర్రజొన్న రైతులకు నిరాశే మిగిలింది. గత సీజన్లో ఎర్రజొన్న క్వింటాల్‌కు రూ.3,800 ధర లభించడంతో మోర్తాడ్‌కు చెందిన మహిపాల్ అనే రైతు 40 క్వింటాళ్ల ఎర్రజొన్నలను నిలువ చేసుకున్నాడు. సీజన్ ముగిసిన తర్వాత కనీసం రూ.4,200 ధర లభిస్తుందని ఆశించాడు. కానీ, విత్తన వ్యాపారుల సిండికేట్‌తో సీజన్ ముగిసినా ధర ఏమాత్రం పెరగకపోగా కనీసం సీజన్లో లభించిన ధర కూడా దక్కలేదు. దీంతో వారం కింద క్వింటాల్‌కు రూ.400 తక్కువకు పంటను విక్రయించాడు. సుమారు రూ.16 వేల నష్టానికే మహిపాల్ తన పంటను విక్రయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మహిపాల్ మాదిరిగానే ఎర్రజొన్నలను నిలువ చేసుకున్న రైతులందరూ తక్కువ ధరకే తమ పంటను విక్రయించారు. రైతుల వద్ద దాదాపు 5వేల క్వింటాళ్ల ఎర్రజొన్నలు నిలువ ఉండగా ఒక్కో క్వింటాలుకు రూ.3,400 ధర ప్రకారం విక్రయించడంతో రూ.20 లక్షల వరకు లాభాన్ని కోల్పోయారు. గతంలో క్వింటాలుకు రూ.4,500 వరకు పలకగా, సీడ్ వ్యాపారుల గుత్తాధిపత్యంతో ధర పడిపోయి రైతులకు తీరని నష్టం మిగిల్చింది. ఆరబోసిన ఎర్రజొన్నలు(ఫైల్) తగ్గిన ఎర్రజొన్నల ధర ఆవేదనలో అన్నదాత -
కొనుగోళ్లను వేగవంతం చేయండి
దోమకొండ : ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూ చించారు. శనివారం దోమకొండలోని కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అకాల వర్షా లు కురిసే ఆస్కారం ఉన్నందున రైతులకు టార్పాలిన్లు అందజేయాలన్నారు. తూకం వేసిన వడ్లను వెంటవెంటనే మిల్లులకు తరలించాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, నీడ వంటి ఏర్పాట్లు చేయాలని సూచించారు. కార్యక్రమంలో పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ రాజేందర్, జిల్లా పౌరసరఫరాల అధికారి మల్లికార్జున్ బాబు, డీసీవో రామ్మోహన్, మండల ప్రత్యేకాధికారి జ్యోతి తదితరులు పాల్గొన్నారు. -
ఏదడిగినా కేసీఆర్ కాదనలేదు..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : అభివృద్ధి పనుల విషయంలో ఏదడిగినా కేసీఆర్ కాదనలేదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ రజతోత్సవం నేపథ్యంలో ‘సాక్షి’ ఇంటర్వ్యూలో ప్రశాంత్‌రెడ్డి పలు విషయాలను గుర్తుచేసుకున్నారు. ఈ వివరాలు ఆయన మాటల్లోనే.. మోతెలో తీర్మానం.. ముడుపు కట్టిన కేసీఆర్.. తీవ్రమైన కరువు సమస్యను ఎదుర్కొంటున్న వేల్పూర్ మండలంలోని మోతె గ్రామస్తులు తమ సమస్యలు పరిష్కారం కావాలంటే స్వరాష్ట్రం సాధించుకోవాల్సిందేనని నిశ్చయించుకున్నారు. 2001లో కేసీఆర్ బీఆర్ఎస్ ఏర్పాటు చేశాక ఏకగ్రీవ తీర్మానం చేసి కేసీఆర్ వైపు నిలబడ్డారు. ఇదే స్ఫూర్తితో మెండోరా మండలంలోని బుస్సాపూర్ గ్రామస్తులు తీర్మానం చేసుకుని బీఆర్ఎస్కు జైకొట్టారు. తరువాత రాష్ట్రవ్యాప్తంగా వరుసగా అనేక గ్రామాల్లో బీఆర్ఎస్కు మద్దతు పెరిగింది. మోతె గ్రామానికి 2001 మే 5న కేసీఆర్ వచ్చి ఇక్కడి మట్టితో ముడుపు కట్టారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు పార్లమెంట్లో పాసయ్యాక 2014 మార్చి 28న కేసీఆర్ గ్రామానికి వచ్చి ముడుపు విప్పారు. తరువాత మళ్లీ ముఖ్యమంత్రి హోదాలో 2015 జూలై 6 న ఇక్కడికి వచ్చి గ్రామంపై వరాలు కురిపించారు. గ్రామంలో చెరువు, మాటు కాలువ, పాఠశాల, ప్రత్యేకంగా పీహెచ్సీ, కొత్త గ్రామపంచాయతీ, రూ.2 కోట్లతో సీసీ రోడ్లు నిర్మాణమయ్యాయి. అప్పుడు వేల్పూర్‌లోని మా పెంకుటిల్లులోనే కేసీఆర్ బస చేశారు. తండ్రి ఆశయాలను కొనసాగిస్తున్నా.. స్వరాష్ట్రం వస్తేనే అనుకున్న విధంగా అభివృద్ధి సాధ్యమని, గ్రామాలు స్వయం సమృద్ధి సాధించాలంటే చిన్ననీటి వనరులను పెపొందించుకోవాలని మా తండ్రి వేముల సురేందర్‌రెడ్డి చెప్పేవారు. ఆయన స్ఫూర్తిని కొనసాగిస్తున్నా. ఇక్కడ మొదలుపెట్టి.. చెక్‌డ్యాముల నుంచి మొదలు అనేక నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి ప్రతి ప్రయోగం ఇక్కడే చేశాం. ఇక్కడ సక్సెస్ చేశాక కేసీఆర్ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో అమలు చేశారు. ఎస్సారెస్పీ వరద కాలువకు కింది లెవెల్లో 16 తూములు ఏర్పాటు చేయడంతో 45 చెరువు లు నిండుతున్నాయి. కాళేశ్వరం ద్వారా ప్రతి రెండున్నర ఎకరాలకు ఒక అవుట్లెట్ పాయింట్ ఏర్పాటు చేశాం. జగన్మోహన్రెడ్డికి పైలట్‌గా.. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వచ్చినప్పుడు ఆయనను రిసీవ్ చేసుకుని పైలట్‌గా వ్యవహరించే బాధ్యతను కేసీఆర్ నాకు అప్పగించారు. దీన్ని ఎప్పటికీ మరిచిపోలేను. నీటిపారుదల విషయంలో ప్రతి ప్రయోగం ఇక్కడి నుంచే మొదలు మోతె గ్రామస్తుల ఉద్యమ స్ఫూర్తి అజరామరం స్వరాష్ట్రం సిద్ధించాక సీఎం హోదాలో మోతె వచ్చిన కేసీఆర్ రజతోత్సవ సభ నేపథ్యంలో ‘సాక్షి’తో వేముల ప్రశాంత్‌రెడ్డి -
జోరుగా బెటి్టంగ్
నిఘా కరువు..కామారెడ్డి క్రైం : క్రికెట్ అంటే చాలామందికి ఇష్టం. గతంలో ఆటను ఆటగానే చూసేవారు. తమ అభిమాన ఆటగాళ్ల ఆటను చూసేందుకు టీవీల ముందునుంచి కదిలేవారు కాదు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఆట జూదంగా మారిపోయింది. చాలామంది బెట్టింగ్ ఊబిలో కూరుకుపోయారు. బాల్ బాల్‌కు పందెం.. బెట్టింగ్ సంస్కృతి గల్లీలకూ పాకింది. నిర్వాహకుల ను సంప్రదించి మ్యాచ్‌ల వారీగా, ఓవర్ల వారీగా పందాలు కాస్తున్నారు. మ్యాచ్ ఆసక్తికరంగా మారి తే బంతి బంతికీ బెట్టింగ్ నడుస్తోంది. ఈ వ్యసనా నికి బానిసైనవారు బెట్టింగ్‌లో నష్టపోతూ ఆర్థికంగా దివాలా తీస్తున్నారు. మానసికంగానూ నలిగిపోతున్నారు. అప్పుల పాలై, వాటిని ఎలా తీర్చాలో తె లియక ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు సైతం ఉన్నాయి. ఇటీవల దేవునిపల్లికి చెందిన ఓ యువకు డు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. అత ని అప్పులకు క్రికెట్ బెట్టింగ్ ప్రధాన కారణమని తె లిసింది. ఆస్తులు అమ్ముకునే పరిస్ధితి వచ్చిన కు టుంబాలు కూడా ఎన్నో ఉన్నాయి. పరువు పోతుందని బయటకు చెప్పుకోలేని వారు కూడా ఉన్నారు. గల్లీగల్లీకి పాకిన సంస్కృతి వ్యసనంగా మారిన వైనం దృష్టి సారించని పోలీసు శాఖ ఐపీఎల్ ప్రారంభమైన నాటి నుంచి జిల్లావ్యాప్తంగా జోరుగా బెట్టింగ్ నడుస్తోంది. ఇది బహిరంగ రహస్యమే.. ఒక్క నిజామాబాద్ పోలీసులు మాత్రమే ఈ ఏడాది బెట్టింగ్ ముఠాను గుర్తించి పట్టుకున్నారు. మిగతా ఎక్కడా ఐపీఎల్ బెట్టింగ్ మూలాలను గుర్తించలేదు. కామారెడ్డి, బాన్సువాడ లలో గతంలో కొన్ని ముఠాలు బెట్టింగ్ నిర్వహిస్తుండగా పోలీసులు పట్టుకుని రిమాండ్‌కు పంపారు. ఈ సీజన్లో కూడా అన్ని ప్రాంతాల్లో జోరుగా బెట్టింగ్ నడుస్తోంది. పట్టణ ప్రాంతాల్లో బెట్టింగ్ ముఠాలు కార్యకలాపాలు నిర్వహిస్తుండగా.. మండలాలు, గ్రామాల్లో వ్యక్తుల మధ్య నేరుగా పందాలు నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ దందాను అడ్డుకునే విషయమై పోలీసు శాఖ దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. -
కేసీఆర్ వెంటే..
‘తెలంగాణ’లోనూ..● తెలంగాణ కోసం బీఆర్ఎస్తో కలిసి నడిచిన జిల్లావాసులు ● రాష్ట్రమొచ్చాకా కారుకే మద్దతు ● పాతికేళ్ల ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లుసాక్షి ప్రతినిధి, కామారెడ్డి : తెలంగాణ రాష్ట్రం కోసం 2001 లో డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి గులాబీ జెండా అందుకుని కదనరంగాన దూకిన కేసీఆర్‌కు జిల్లా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పల్లెలన్నీ ఆయన వెంట నడిచాయి. కరీంనగర్లో నిర్వహించిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా తరలివెళ్లారు. కామారెడ్డి న్యాయవాదులు అప్పటి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తిర్మల్‌రెడ్డి నాయకత్వంలో తెలంగాణ కోసం తొలి తీర్మానం చేసి కరీంనగర్ సభకు వెళ్లారు. బీఆర్ఎస్ ఆవిర్భావ సమయంలోనే వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గా ల్లో మెజారిటీ మండలాల్లో గులాబీ జెండా ఎగిరింది. ఉమ్మడి జిల్లా పరిషత్‌ను ఆ పార్టీ కై వసం చేసుకుంది. 2004 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌తో బీఆర్ఎస్ పొత్తుపెట్టుకుంది. అప్పుడు జరిగిన ఎన్నికల్లో కామారెడ్డి ప్రాంతంలోని అన్ని అసెంబ్లీ స్థానాలతోపాటు ఒక పార్లమెంట్ స్థానం కూడా కూటమే గెలుచుకుంది. 2009 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్, టీడీపీలు మహాకూటమిగా ఏర్పడి క్లీన్ స్వీప్ చేశాయి. అప్పటి సీఎం వైఎస్సార్ మరణానంతరం తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమం మరోమారు ఊపందుకుంది. ఉద్యమ తీవ్రత పెరగడంతో టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, గంప గోవర్ధన్, హన్మంత్ సింధేలు ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడి గులాబీ కండువా కప్పుకున్నారు. 2010లో కామారెడ్డి, బాన్సువాడలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులుగా గోవర్ధన్, పోచారం పోటీచేసి గెలిచారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే 2014 లో జరిగిన ఎన్నికల్లో నాలుగు అసెంబ్లీ స్థానాలతో పాటు ఒక ఎంపీ స్థానాన్ని కూడా బీఆర్ఎస్ కై వసం చేసుకుంది. 2018 ఎన్నికల్లో ఎల్లారెడ్డిలో మాత్రమే గులాబీ పార్టీ ఓడిపోయింది. అనంతరం రాజకీయ పరిణామాలతో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్ గూటికి చేరారు. జహీరాబాద్ ఎంపీ స్థానాన్ని బీఆర్ఎస్ నిలబెట్టుకుంది. కామారెడ్డి జిల్లా ఏర్పాటైన తర్వాత తొలి జెడ్పీ పీఠం, మండలాలు, మున్సిపాలిటీలు కూడా బీఆర్ఎస్ గెలుచుకుంది. 2023 ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. కామారెడ్డి నుంచి పోటీ చేసిన కేసీఆర్ ఓటమి చెందారు. ఎల్లారెడ్డి, జుక్కల్లలోనూ పరాజయం తప్పలేదు. బాన్సువాడలో గులాబీ జెండా ఎగిరినా.. కొద్ది కాలానికే పోచారం కాంగ్రెస్ గూటికి చేరారు. -
ఎమ్మెల్సీలకు సన్మానం
కామారెడ్డి టౌన్: తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య, పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డిలతోపాటు కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిని సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీలు మాట్లాడుతూ ఉపాధ్యాయ, విద్యారంగ, నిరుద్యోగ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కానికి కృషి చేస్తామన్నారు. అనంతరం అహిల్యా బాయి హోల్కర్ త్రిశతాబ్ది జయంతి వేడుకలలో పాల్గొన్నారు. కార్యక్రమంలో తపస్ రాష్ట అధ్యక్ష, కార్యదర్శులు హన్మంత్‌రావు, సురేష్, జిల్లా అధ్యక్షుడు పుల్గం రాఘవరెడ్డి, నాయకులు పాలేటి వెంకట్రావు, రవీంద్రనాథ్, రమేష్ కుమార్, భాస్కరాచారి, రాంచంద్రం, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. -
‘మూడేళ్లు పోషకాహారం తీసుకోవాలి’
ఎల్లారెడ్డి : గర్భం దాల్చిన నాటి నుంచి చి న్నారులకు రెండేళ్ల వయసు వచ్చేంతవరకు తల్లులు పోషకాహారం తీసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల సూచించారు. ఇది అంగన్వాడీ కేంద్రాల ద్వారా మాత్రమే సా ధ్యమవుతుందన్నారు. శుక్రవారం ఎల్లారెడ్డి ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో పోషణ్ అభియాన్‌లో భాగంగా సామూహిక సీమంతా లు, అక్షరభ్యాసం, అన్నప్రాసన, గ్యాడ్యుయేషన్ డే కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రమీల మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులకు పోషకాహారం అందిస్తున్నామన్నారు. దీనిని తీసుకోవడం వల్ల బిడ్డలు ఆరోగ్యంగా జన్మిస్తారన్నా రు. పిల్లలకు రెండేళ్ల వయసు వచ్చేంత వర కు తల్లిపాలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో సీడీపీవో స్వరూప రాణి, సూ పర్‌వైజర్లు హారతి, భారతి, సీనియర్ అసిస్టెంట్ మహీపాల్, అంగన్వాడీ టీచర్లు దేవ కర్ణ, నీలారాణి, పద్మ తదితరులు పాల్గొన్నారు. ‘ఉగ్రదాడి హేయమైన చర్య’ కామారెడ్డి టౌన్: జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి హేయమైన చర్య అని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. ఇది అమానవీయ చర్య అన్నారు. ఇలాంటివాటిని ప్రతి ఒక్కరు తీవ్రంగా ఖండించాలని కోరారు. కలలో కూడా ఇలాంటి చర్యలకు పాల్పడాలంటే వెన్నులో వణుకు పుట్టేలా నిందితులకు కఠిన శిక్ష అమలు చేయాలని కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బ్లూ కోల్ట్స్ సిబ్బందికి సన్మానం కామారెడ్డి టౌన్: పిట్లం మండలంలో ఇటీవల చెరువులో దూకి ఆత్మహత్యకు యత్నించిన మహిళను కాపాడిన బ్లూ కోల్ట్స్ సిబ్బంది రవిచంద్ర, మారుతిలను జిల్లా ప్రధాన న్యాయమూర్తి వరప్రసాద్ అభినందించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కోర్టు భవనంలో వారిని సన్మానించి, మొక్కలను జ్ఞాపికగా అందించారు. అకాల వర్షంతో ఆందోళన కామారెడ్డి రూరల్/రాజంపేట: కామారెడ్డి బల్దియా పరిధిలోని దేవునిపల్లి, లింగాపూర్, సరంపల్లి గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం అకాల వర్షం కురిసింది. అరగంట పాటు గాలులతో కూడిన వర్షం కురియడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రాజంపేట మండలకేంద్రంలో చిరుజల్లులు కురిశాయి. వర్షంతో ఎక్కడ ధాన్యం తడిచిపోతుందోనని రైతులు ఆందోళన చెందారు. వడ్ల కుప్పలపై టార్పాలిన్లు కప్పారు. ‘మహిళల రక్షణ కోసమే షీటీంలు’ కామారెడ్డి క్రైం: మహిళల రక్షణ కోసమే షీటీంలు ఉన్నాయని ఎస్పీ రాజేశ్ చంద్ర పేర్కొన్నారు. షీటీంలలో కొంతకాలంగా ఉత్తమ సేవలు అందిస్తున్న మహిళా కానిస్టేబుళ్లు సౌజన్య, ప్రవీణలను అభినందించారు. శుక్రవారం తన చాంబర్లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రోత్సాహక బహుమతులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల భద్రత కోసం షీ టీంల ద్వారా అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఎవరికైనా సమస్యలు ఉంటే 87126 86094 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. -
అభివృద్ధిలో తిరుగులేని వేముల
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ రాష్ట్రం సి ద్ధించాక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను అభివృద్ధి చే యడంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి. రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన మోతె గ్రామం ఉన్న బాల్కొండ నియోజకవర్గం నుంచి ఆయన వరుసగా మూడుసార్లు గెలుపొందారు. ఉమ్మడి జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రణాళి కాబద్ధంగా అడుగులు వేశారు. తండ్రి ఆకాంక్షలను నెరవేరుస్తూ.. ప్రశాంత్‌రెడ్డి తండ్రి వేముల సురేందర్‌రెడ్డి బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా గు ర్తింపు పొందారు. ఆయన బీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యులు. అంతకుముందు నిజాం షుగర్స్ చైర్మన్ గా, టీడీపీ జిల్లా అధ్యక్షుడిగానూ వ్యవహరించారు. బీఆర్ఎస్ స్థాపించిన సమయంలో కేసీఆర్‌తో ఉన్న గుప్పెడు మందిలో సురేందర్‌రెడ్డి ఒకరు. ఆయన తుదిశ్వాస విడిచే వరకూ బీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 2009 ఎన్నికల్లో సురేందర్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఓటమి చెందగా ఆ సమయంలో ప్రశాంత్‌రెడ్డి బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జీగా పనిచేశారు. తర్వాత 2014, 2019, 2023 లలో వరుసగా బాల్కొండ నుంచి గెలుస్తూ వస్తున్నారు. కేసీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా సేవలందించారు. తండ్రి సురేందర్‌రెడ్డి ఆశయాల మేర కు నియోజకవర్గంలో అనేక అభి వృద్ధి కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచారు. ఉమ్మడి జిల్లాకు సాగునీరు అందించే, ఆయకట్టు స్థిరీకరణ చేసే కీలకమైన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి 20, 21, 21ఏ ప్యాకేజీ పనులను మంజూరు చేయించి 70 శాతం పూర్తి చేయించారు. సారంగాపూర్, మెంట్రాజ్‌పల్లి, మంచిప్ప వద్ద పంప్‌హౌస్ పనులు, మెయిన్ పైప్‌లైన్ పనులు 70 శాతం పూర్తి చేయించారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్లు నిర్మింపజేశారు. రూ. 14 కోట్లతో నిజామాబాద్‌లో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్) భవనాన్ని పూర్తి చేయించారు. మాధవనగర్, అర్సపల్లి వద్ద ఆర్వోబీ కలల ను సాకారం చేశారు. మాధవనగర్–కంఠేశ్వర్ డబు ల్ రోడ్డును నాలుగు లేన్లుగా అభివృద్ధి చేయించారు. బాల్కొండలో ప్రగతి పరుగులు.. బాల్కొండ నియోజకవర్గంలో మొత్తం రూ.3 వేల కోట్లతో రాష్ట్రంలోనే అత్యధిక అభివృద్ధి పనులు చే యించారు. కాళేశ్వరం 21ఏ ప్యాకేజీ ద్వారా రూ. 1,400 కోట్లతో 80 వేల ఎకరాలకు నీరందించారు. ఈ ప్యాకేజీ కింద పదేళ్లలో రూ. వెయ్యి కోట్లు ఖర్చు చేశారు. రూ. 600 కోట్ల శ్రీరాంసాగర్ పునరుజ్జీవ పథకం పనుల్లో భాగంగా బాల్కొండ నియోజకవర్గంలో రూ. 1,900 కోట్లు ఖర్చు చేశారు. రూ. 200 కోట్లతో 2 చెక్‌డ్యాంలు కట్టించారు. ఈ చెక్‌డ్యాంలు చూసిన కేసీఆర్ రాష్ట్రమంతటా ఇలాంటివి కట్టించారు. రూ. వెయ్యి కోట్లతో 10 ఎత్తిపోతలు నిర్మించారు. రోడ్లు, వంతెనలు, సబ్స్టేషన్లు, ఆస్పత్రులు, పాఠశాలల భవనాల నిర్మాణానికి వందలాది కోట్లు మంజూరు చేయించారు. భీంగల్‌లో బస్‌డిపో, లింబాద్రి గుట్ట అభివృద్ధి, భీంగల్, బాల్కొండలలో డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేయించారు. వరదకాలువకు తూములు.. ఎస్సారెస్పీ వరద కాలువకు జగిత్యాల, కోరుట్ల, బాల్కొండ నియోజకవర్గాల పరిధిలో 16 చోట్ల తూ ములు ఏర్పాటు చేయించారు. వీటి ద్వారా మొత్తం 45 చెరువులు నిండుతున్నాయి. వీటికి నిర్వహణ ఖర్చు అనేదే లేదు. రూ. 12 కోట్లతో లక్ష్మి కాలువ ఆధునికీకరణ, రూ. 6 కోట్లతో నవాబ్ ఎత్తిపోతల పథకం, రూ. 12 కోట్లతో నిజాంసాగర్ ఆధునికీకరణ పనులు చేయించారు. రాష్ట్రంలోనే మొదటిసారి గా చెక్‌డ్యాములకు తూములు ఏర్పాటు చేయించి పచ్చలనడ్కుడ చెరువు నింపారు.ఏది అడిగినా కేసీఆర్ కాదనలేదు.. నియోజకవర్గంలో గ్రామాల వారీగా సమస్య లు నోట్ చేసుకొని అందుకు అనుగుణంగా బడ్జెట్ మంజూరు చేయించుకున్నా. నేను ఏది అడిగినా కేసీఆర్ కాదనలేదు. చెక్‌డ్యాంల కారణంగా వేలాది బోర్లు రీచార్జి అయ్యాయి. కొత్త బోర్లు వేసే అవసరం లేకుండా పోయింది. కాళేశ్వరం 21వ ప్యాకేజీలో భాగంగా డిస్ట్రిబ్యూటరీ లైన్లు వేయించాం. ప్రతి రెండున్నర ఎకరాలకు ఒక ఔట్లెట్ పాయింట్ వచ్చేలా చూశాం. ఈ నీరు వాగులోకి రావడంతో చెక్‌డ్యాంలు నిండుతున్నాయి. చెరువులూ జలకళ సంతరించుకుంటున్నాయి. – వేముల ప్రశాంత్‌రెడ్డి, బాల్కొండ ఎమ్మెల్యే ఉమ్మడి జిల్లా ప్రగతిలో కీలక పాత్ర కాళేశ్వరం 20, 21, 21ఏ ప్యాకేజీలు, ఆర్వోబీలు, న్యాక్ భవనాల నిర్మాణం.. పదేళ్లలో రూ.3 వేల కోట్లతో బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధి వరుసగా మూడుసార్లు శాసనసభకు ఎన్నికై న ప్రశాంత్‌రెడ్డి వేముల ఇరిగేషన్ విధానాలను మెచ్చి రాష్ట్రమంతటా అమలు చేసిన కేసీఆర్ -
రేవంత్ పాలనలో దిగజారిన రాష్ట్ర పరిస్థితి
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ పదేళ్ల కాలంలో అభివృద్ధి, సంక్షేమంలో అన్ని రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా నిలిపారని, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసమర్థ పాలనతో రాష్ట్రం పరిస్థితి దిగజారిందని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం కామారెడ్డిలో మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, మాజీ ఎమ్మెల్యేలు హన్మంత్ సింధే, జాజాల సురేందర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబొద్దీన్లతో కలిసి విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ సీఎంగా ఉండగా తలసరి ఆదాయం దేశంలో ఒకటో స్థానంలో ఉంటే, ఇప్పుడు 11వ స్థానానికి పడిపోయిందన్నారు. జీఎస్డీపీ వృద్ధిలో మూడో స్థానంనుంచి 14 వ స్థానానికి దిగజారిందన్నారు. మోసపూరిత హామీలపై నిలదీస్తాం.. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి అన్ని వర్గాలను వంచించాడని ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. 2 లక్షల ఉద్యోగాలని చెప్పి 11 వేలు మాత్రమే ఇచ్చారని, తాము అధికారంలో ఉన్నపుడు ఇచ్చిన నోటిఫికేషన్లు, పరీక్షలు, నిర్వహించిన ఇంటర్వ్యూలను కూడా వారి ఖాతాలో జమ చేసుకుంటున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ ఆవిర్భవించి 25 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఎల్కతుర్తిలో ఆదివారం నిర్వహించే బహిరంగ సభ ద్వారా కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ మోసాలు, వంచనను ఎండగడతారన్నారు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు 420 వాగ్దానాల అమలు కోసం సర్కారుపై ఒత్తిడి పెంచడానికే సభ నిర్వహిస్తున్నామన్నారు. సభకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి 40 వేల మంది తరలిరానున్నారని వివరించారు. ఉమ్మడి జిల్లా నుంచి 250 ఆర్టీసీ బస్సులు, 264 ప్రైవేటు బస్సులు, 626 తుఫాన్లు తదితర వాహనాలు, 1,266 సొంత వాహనాలతో తరలివెళ్తామన్నారు. వడ్లను కొనుగోలు చేయడంలో తరుగు పేరుతో రైతులను ఇబ్బంది పెడితే ఊరుకోబోమన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు మనోహర్‌రెడ్డి, కుంబాల రవి, కపిల్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, రమేశ్, హఫీజ్, లక్ష్మీనారాయణ, బల్వంతరావ్ తదితరులు పాల్గొన్నారు. ఎల్కతుర్తి సభలో సర్కారును కేసీఆర్ నిలదీస్తారు సభకు ఉమ్మడి జిల్లా నుంచి 40 వేల మందిని తరలిస్తాం మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి -
అప్పు తీర్చడం లేదని వాహనానికి నిప్పు
నాగిరెడ్డిపేట: అత్తింటివారు తీసుకున్న అప్పు తీర్చ డంలేదనే కారణంతో అర్ధరాత్రి వేళ తన మామకు చెందిన టీవీఎస్ ఎక్సెల్ వాహనానికి నిప్పు పెట్టా డో అల్లుడు. అంతటితో ఆగకుండా ధాన్యం కుప్ప ను సైతం తగలబెట్టడానికి యత్నించాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మాసాన్‌పల్లి కి చెందిన చాకలి బాలమణి, సాయిలు దంపతులు తమ కూతురును మండలంలోని మాటూర్ గ్రామానికి చెందిన బాలకృష్ణకు ఇచ్చి వివాహం జరిపించారు. కాగా అవసరాల నిమిత్తం సాయిలు తన అల్లుడు వద్ద రూ. 2 లక్షలు అప్పు తీసుకున్నాడు. ఆ డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో అల్లుడు బాలకృష్ణ.. తన భార్యను పుట్టింటి వద్ద వదిలి వెళ్లాడు. ఈనెల 23న మాసానిపల్లికి వెళ్లి భార్యను తీసుకెళ్లాడు. అత్తింటివారు తీసుకున్న అప్పు చెల్లించడం లేదన్న కోపంతో గురువారం అర్ధరాత్రి మాసాన్‌పల్లికి వెళ్లి తన మామకు చెందిన టీవీఎస్ ఎక్సెల్‌కు నిప్పుపెట్టాడు. దీంతో పాటు గ్రామశివారులోని ధాన్యంకుప్పకు సైతం నిప్పటించాడు. ఎక్సెల్ వాహనం పూర్తిగా కాలిపోగా.. ధాన్యం కుప్ప పాక్షికంగా కాలిపోయింది. ఈ విషయమై చాకలి బాలమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని ఎస్సై మల్లారెడ్డి తెలిపారు. ధాన్యం కుప్పకు సైతం నిప్పంటించిన అల్లుడు పోలీసులకు ఫిర్యాదు చేసిన అత్తింటివారు -
భూ భారతి చట్టం రైతులకు వరం
నిజాంసాగర్/బిచ్కుంద/లింగంపేట: భూ భారతి చట్టం రైతులకు వరమని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. భూ సమస్యలను పరిష్కరించడానికి ప్రజల వద్దకే అధికారులు వస్తారన్నారు. శుక్రవారం బిచ్కుంద, జుక్కల్, లింగంపేటలలో నిర్వహించిన భూ భారతి సదస్సులలో ఆయన పాల్గొన్నారు. భూ భారతి చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఆయా కార్యక్రమాలలో కలెక్టర్ మాట్లాడుతూ భూమికి సంబంధించిన ప్రతి సమస్యకు భూ భారతి చట్టంలో పరిష్కారం ఉందని పేర్కొన్నారు. నీటి కుంటలు ఏర్పాటు చేసుకోవాలి ప్రతి రైతు పొలంలో నీటి కుంటలు, కందకాలు, ఫాంపాండ్ ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. వీటిద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. ఈజీఎస్ పథకం ద్వారా ఫాంపాండ్స్ నిర్మించుకోవచ్చన్నారు. ప్రతి పంచాయతీ పరిధిలో ఐదు ఫాంపాండ్లు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో బాన్సువాడ సబ్‌కలెక్టర్ కిరణ్మయి, భూభారతి ప్రత్యేకాధికారి రాజేందర్, మైన్స్ ఏడీ నగేశ్, ఎల్లారెడ్డి ఆర్డీవో ప్రభాకర్, తహసీల్దార్లు హేమలత, వేణుగోపాల్, సురేశ్, ఎంపీడీవోలు శ్రీనివాస్, గోపాల్, ఏఎంసీ చైర్మన్ కవిత, ఏడీఎ అమీనాబీ తదితరులు పాల్గొన్నారు.1,416 దరఖాస్తులు వచ్చాయి అవగాహన సదస్సులలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ లింగంపేట: పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన లింగంపేట మండలంలో ఇప్పటివరకు 12 రెవె న్యూ గ్రామాల్లో సదస్సులు నిర్వహించామని కలెక్టర్ సంగ్వాన్ తెలిపారు. భూసమస్యలపై ఇప్పటివరకు 1416 దరఖాస్తులు వచ్చాయన్నా రు. శుక్రవారం ఆయన లింగంపేట తహసీల్ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. రైతుల సమస్యలను కేటగిరీల వారీగా వేరు చేసి పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈనెల 30 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని, అనంతరం ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయా దరఖాస్తులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. శుక్రవారం లింగంపేటతో పాటు భవానీపేట, ముంబోజీపేట గ్రామాల్లో సదస్సులు నిర్వహించారు. లింగంపేటలో నిర్వహించిన సదస్సులో కలెక్టర్ పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదాలను నివారించడం కోసం ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు. రహదారి భద్రత నిబంధనలపై నిత్యం అవగాహన కల్పిస్తున్నారు. వాహనాల తనిఖీలు నిర్వహిస్తూ జరిమానాలు విధిస్తున్నారు. అయినా వాహనదారుల్లో మార్పు రావడం లేదు.
కామారెడ్డి క్రైం : జిల్లా పోలీసు శాఖ ఇటీవలి కాలంలో వాహనాల తనిఖీలను పెంచింది. వాహన పత్రాలు లేకపోయినా, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకపోయినా, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా, త్రిబుల్ రైడింగ్ చేస్తున్నా పోలీసులు ఎడాపెడా జరిమానాలు బాదేస్తున్నారు. మూడు నెలల కాలంలోనే (జనవరి నుంచి మార్చి వరకు) జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,19,606 చలాన్లు విధించారు. వాటిలో హెల్మెట్ లేదని విధించిన జరిమానాలే 89,936. హెల్మెట్ ధరించలేదనే కారణంతోనే రోజుకు దాదాపు వెయ్యి చలాన్లు పడుతున్నాయి. జిల్లాలో విస్తృతంగా వాహనాల తనిఖీ హెల్మెట్ లేకుంటే జరిమానా విధిస్తున్న పోలీసులు 3 నెలల్లో 89,936 మందికి ఫైన్.. అయినా మారని వాహనదారులు -
రోడ్డు విస్తరణ పనులను పూర్తి చేయాలి
కామారెడ్డి క్రైం: మద్దెల చెరువు నుంచి పిట్లం వరకు చేపట్టిన రోడ్డు విస్తరణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. శుక్రవారం తన క్యాంప్ కార్యాలయంలో అటవీ, రోడ్లు భవనాల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అటవీ ప్రాంతానికి బయట ప్రాంతంలో ఉన్న చెట్ల నరికివేతకు అటవీ శాఖ నుంచి అనుమతి జారీ చేశామన్నారు. వాటికి శాఖాపరమైన పద్ధతిలో పరిహారం చెల్లించి తొలగించాలని రోడ్లు, భవనాల శాఖను ఆదేశించారు. అటవీ ప్రాంతంలోని చెట్లను తొలగించడం కోసం స్టేజీ– 1 అనుమతులకు చర్యలు తీసుకుని పనులు మొదలు పెట్టాలన్నారు. సమావేశంలో ఆర్డీవో వీణ, ఆర్అండ్బీ ఈఈ రవిశంకర్, ఎఫ్‌డీవో రామకృష్ణ, ఎఫ్ఆర్వో రవి, ఏఈఈ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధిహామీ మేట్‌పై చర్యలు తీసుకోవాలి
పెద్దకొడప్గల్(జుక్కల్): ఉపాధి హామీ పని కల్పించడంపై ఉపాధి హామీ మేట్ రాందాస్ నిర్లక్ష్యం వహిస్తున్నాడని కాటేపల్లి గ్రామస్తులు ఆరోపించారు. ఈమేరకు శుక్రవారం ఎంపీడీవో కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. అనంతరం కార్యాలయంలో వారు వినతిపత్రం అందజేశారు. మండలంలో కాటేపల్లి గ్రామానికి చెందిన ఉపాధి కూలీలు ఏప్రిల్ 24 నుంచి 30 వరకు పని కల్పించాలని మేట్‌కు రాసి ఇచ్చారు. అందులో కొందరికి మాత్రమే పని కల్పించి మిగితా వారికి పని కల్పించలేదని మస్టర్లలో పేర్లు రాని వారు వాపోయారు. పని అందరికీ ఉండాలని, లేకుంటే మొత్తం బంద్ చేయాలని వారు మేట్ రాందాస్‌ను ప్రశ్నించారు. గురు,శుక్రవారాలు ఉపాధి పని చేసినా, మస్టర్లో పేరు రాలేదని, ఆన్లైన్లో హాజరు వేయకపోతే ప్రభుత్వం కూలి డబ్బులు వేయదన్నారు. ఈవిషయమై ఎంపీడీవో కార్యాలయానికి చేరుకొని ఆందోళన చేశారు.మార్చి నెలలో కొందరు కూలీలతో వ్యక్తిగత వ్యవసాయ పనులు చేయించుకొని హాజరు వేశారని, ఉపాధి పని చేయని వారికి హాజరు వేస్తున్నట్లు కూలీలు ఆరోపించారు. మేట్ రాందాస్‌పై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. -
ప్లీజ్ ఒక్క క్షణం..
గతేడాది ఖానాపూర్‌కు చెందిన గౌతం కాంబ్లే(28) అనే యువకుడు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడు. తన తల్లి ఆరోగ్య పరిస్థితి బాగాలేక, ఆస్పత్రిలో చూపించేందుకు డబ్బులు లేవని మానసిక వేదనకు గురై క్షణికావేశంలో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రైవేట్ పని చేస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్న గౌతం మృతితో తల్లిదండ్రులకు తీరని శోకమే మిగిలింది. రూరల్ మండలం ఆకుల కొండూర్ గ్రామానికి చెందిన ఆకాశ్(24) అనే యువకుడు స్థానికంగా పెట్రోల్ బంక్‌లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఆకాశ్ బెట్టింగ్ యాప్‌లకు అలవాటుపడి రూ. ఐదు లక్షల వరకు పోగొట్టుకున్నాడు. తల్లిదండ్రులు ఏమంటారో అనే భయంతో ఈ నెల 2న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మృతితో కుటుంబం కోలుకోవడం లేదు. నిజామాబాద్ రూరల్: జీవించి సాధించాల్సింది.. కుంగుబాటుకు గురై పలువురు అర్ధంతరంగా తనువు చాలిస్తున్నారు. యుక్తవయసులో ఉన్నవారు సైతం బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. జీవితంలో ఎదురైన సమస్యలకు భయపడి.. నిరాశ, నిస్పృహలతో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నారు. ఆపై మనోవేదనతో ప్రాణాలు తీసుకుని.. నిండు జీవితాన్ని కోల్పోతున్నారు. కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగుల్చుతున్నారు. అందుకే మనుషులకు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం ఎంతో ముఖ్యమని మానసిక వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. నిత్యజీవితంలో ఎదురైన సమస్యలను సానుకూల దృక్పథంతో పరిష్కరించుకోవాలని, సర్దుబాటుతత్వంతో ముందుకు సాగితే జీవితం ఆనందంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.పిల్లలతో ఫ్రెండ్లీగా ఉంటేనే..యుక్త వయస్సుకు వచ్చిన పిల్లలతో తల్లిదండ్రులు ఫ్రెండ్లీగా ఉండటమే మంచిది. వారిపై ఎక్కువగా కోపం కన్నా ప్రేమ చూపిస్తే చేసిన తప్పును వెంటనే చెబుతారు. దీంతో సమస్య పరిష్కారమవుతుంది. చేసిన తప్పును పదే పదే వారిపై విరుచుకుపడితే మనస్థాపనకు గురై ఆత్మహత్యలకు పాల్పడే అవకాశం ఉంటుంది. దురాలవాట్లకు గురయ్యే పిల్లలపై నిరంతరం పర్యవేక్షణ ఉండటమే మంచిది. కుటుంబం గురించి.. తల్లిదండ్రులు పడుతున్న బాధలను పిల్లలకు తెలియజేస్తేనే వారు చెడు అలవాట్లకు దూరంగా ఉంటారు. ఆత్మహత్యలు వద్దు.. జీవితమే ముద్దు సర్దుబాటు తత్వంతో ముందుకు సాగితేనే జీవితం ఆనందంజీవితాన్ని నాశనం చేసుకోవద్దు వేగంగా డబ్బులు సంపాదించాలని ఆశతో యువత చెడు మార్గాల వైపు వెళ్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఆన్లైన్ గేమ్‌లతో చాలా మంది యువత నష్ట పోతున్నారు. విద్యార్థులు, యువత తల్లిదండ్రులు పడుతున్న బాధను అర్థం చేసుకోవాలి. అందమైన జీవితాన్ని క్షణికావేశంలో నాశనం చేసుకోకూడదు. – డాక్టర్ విశాల్, ప్రముఖ సైకాలిజిస్టు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి యుక్త వయస్సు వచ్చిన యువకులు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి. వారికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు క్రమశిక్షణతోపాటు మంచి అలవాట్లను నేర్పించాలి. జీవితంలో వచ్చే అటుపోట్లను ఎలా ఎదుర్కోవాలో వివరించాలి. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. – ఆనంద్‌సాగర్, ఎస్సై–2, రూరల్ పీఎస్ -
ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి
గాంధారి(ఎల్లారెడ్డి): ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రానికి తెచ్చి ధాన్యం రాశులను, ఆరబోసిన ధాన్యాన్ని పరిశీలించారు. కేంద్రానికి వచ్చిన ధాన్యాన్ని వెంటవెంటనే తూకం వేయాలని, ఎప్పటికప్పుడు రైస్ మిల్లులకు తరలించాలని ఆదేశించారు. వాతావరణంలో మార్పులు వచ్చిన కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వర్షం పడితే ధాన్యం తడువకుండా రైతులకు తగినన్ని టార్పాలిన్ కవర్లను అందజేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజరు రాజేందర్, జిల్లా పౌర సరఫరాల అధికారి మల్లికార్జున్ బాబు , జిల్లా సహకార అధికారి రామ్మోహన్, తహసీల్దార్ రేణుక చౌహాన్, ఎంపీడీవో రాజేశ్వర్, సింగిల్ విండో చైర్మన్ సాయికుమార్, ఏఎంసీ చైర్మన్ పరమేశ్వర్, గాంధారి మాజీ సర్పంచ్ సంజీవ్, పంచాయతీ కార్యదర్శి నాగరాజు, రైతులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల సర్వే పరిశీలన బిచ్కుంద: మండల కేంద్రంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేను శుక్రవారం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పరిశీలించారు. అర్హులైన వారు కట్టుకుంటామని ముందుకు వచ్చిన ప్రతి లబ్దిదారు పేరు ఇందిరమ్మ జాబితాలో చేర్చాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం ఇస్తున్న రూ.5 లక్షలతో సొంతింటి కళ సాకారం చేసుకోవాలని లబ్ధిదారులకు కలెక్టర్ సూచించారు. -
మనస్తాపంతో ఒకరి ఆత్మహత్య
బాన్సువాడ: అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బాన్సువాడలో చోటు చేసుకుంది. సీఐ అశోక్ శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. బాన్సువాడ పట్టణానికి చెందిన రాంపురం నారాయణ(65) కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో జీవితంపై విరక్తితో స్థానిక ఎల్లయ్య చెరువు కట్ట సమీపంలో ఉన్న చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుమార్తె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి సిరికొండ: మండలంలోని పోత్నూర్ గ్రామానికి చెందిన పెరిక సాగర్(40) ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందినట్లు ఎస్సై ఎల్ రామ్ తెలిపారు. సాగర్ గురువారం ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడని ఎస్సై తెలిపారు. శుక్రవారం చిన్నవాల్గోట్ శివారులోని వ్యవసాయ బావిలో సాగర్ మృదేహం లభ్యమైంది. కాలకృత్యాలకు వెళ్లి కాలు జారి బావిలో పడి మృతి చెందాడని మృతుడి భార్య స్వరూప ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్యతో పాటు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఎలుగుబంటి దాడిలో మహిళకు గాయాలు మోర్తాడ్: భీమ్‌గల్ మండలం రహత్‌నగర్ అటవీ ప్రాంతంలో శుక్రవారం తునికి ఆకు సేకరణకు వెళ్లిన ఓ మహిళపై ఎలుగుబంటి దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మంజుల అనే మహిళ తునికి ఆకు కోస్తుండగా ఎలుగుబంటి వెనుక నుంచి వచ్చి దాడి చేసింది. ఆమె అరుపులు వేయడంతో పరిసరాల్లో ఉన్న ఆకు తెంపేవారు రావడంతో ఎలుగుబంటి పారిపోయింది. ఆమెను మెరుగైన వైద్యం కోసం ఆర్మూర్ ఆస్పత్రికి అంబులెన్స్‌లో తరలించారు.వృద్ధురాలిని గాయపరిచి బంగారం చోరీ నవీపేట: మండల కేంద్రంలో శుక్రవారం సాయంత్రం ముగ్గురు దొంగలు బీభత్సం సృష్టించారు. మండలంలోని నారాయణ్‌పూర్ గ్రామానికి చెందిన వృద్ధురాలు రాచర్ల కిష్టాబాయి మహారాష్ట్రలోని యాతాలం గ్రామంలో జరిగిన శుభకార్యానికి వెళ్లింది. సొంత గ్రామానికి వెళ్లేందుకు నవీపేట బస్టాండుకు వచ్చింది. మల విసర్జనకు టాయిలెట్‌కు వెళ్లగా ఇద్దరు మహిళలు, ఓ వ్యక్తి ఆమెను బలవంతంగా బయటకు పిలిచారు. బయటకు రాగానే ఆమైపె దాడి చేసి మెడలో ఉన్న బంగారు గొలుసు, చెవి కమ్మలను లాక్కొని పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వినయ్ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు రుద్రూర్: పొతంగల్ మండలం తిర్మలాపూర్ శివారులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని హంగర్గ ఫారం వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనం, పొతంగల్ వైపు వస్తున్న ఆటో ఢీకొన్నాయి. ప్రమాదంలో బైక్‌పై ఉన్న వ్యక్తికి గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆర్ఎంపీ క్లినిక్ సీజ్ నిజామాబాద్ నాగారం: నగరంలోని న్యాల్‌కల్‌రోడ్‌లో ఉన్న ఆర్ఎంపీ క్లినిక్‌ను డీఎంహెచ్‌వో రాజశ్రీ శుక్రవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా రోగులకు కుట్లు వేయడం, ఇంజక్షన్లు ఇవ్వడం చూసి సదరు ఆర్ఎంపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే క్లినిక్‌ను సీజ్ చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో సంబంధిత అధికారులు రాత్రి 9:40 ప్రాంతంలో క్లినిక్‌ను సీజ్ చేశారు. -
ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి
కామారెడ్డి అర్బన్: పట్టణంలోని ఆర్బీనగర్ కాలనీలోని ఇష్టకార్య సిద్ధి అంజనేయస్వామి ఆలయ వార్షికోత్సవం శుక్రవారం నిర్వహించారు.ఈసందర్భంగా సువర్చల సహిత హనుమాన్ కల్యాణం, హోమం, అభిషేకం, అలంకరణ, పల్లకీసేవ కార్యక్రమాలు వేదపండితులు జి.అంజనేయశర్మ, సతీష్పాండేలు ఆధ్వర్యంలో కొనసాగాయి. ఈకార్య క్రమానికి ఎమ్మెలే వెంకటరమణారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై తీర్థప్రసాదాలు స్వీకరించారు. భ క్తుల కోసం నిర్మించిన హాల్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆలయ కమిటీ ప్రతినిధులు, వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు నిత్యానందం, తదితరులున్నారు. నృత్య విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే స్థానిక కూచిపూడి కళా క్షేత్రం నృత్య విద్యార్థులు హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో భారత్ ఆర్ట్స్ అకాడమీ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కోసం నిర్వహించిన కూచిపూడి నృత్య రూపకం అంశంలో పాల్గొన్నారు. విద్యార్థులు హర్షిత, రితిక, రసజ్ఞ, హస్విత, నందిని, ఆద్య, విశ్వశ్రీ లతో డ్యాన్స్ మాస్టర్ వంశీ ప్రతాప్ గౌడ్లు శుక్రవారం ఎమ్మెల్యే వెంకట రమణరెడ్డిని కలిసి తమ ప్రతిభను వివరించారు. వారిని ఎమెల్యే అభినందించారు. -
కాటేపల్లిలో అగ్ని ప్రమాదం
పెద్దకొడప్గల్: పశువుల మేత కోసం ట్రాక్టర్లో తరలిస్తున్న గడ్డికి ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగలడంతో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న ఘటన కాటేపల్లిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కాటేపల్లి నుంచి ట్రాక్టర్లో తీసుకెళ్తున్న వరిగడ్డికి కుమ్మరి కుంట వద్ద విద్యుత్ తీగలు తగలడంతో మంటలు చెలరేగాయి. గ్రామస్తులు మంటలను ఆర్పేందుకు యత్నించినా అదుపులోకి రాకపోవడంతో గడ్డిని ట్రాక్టర్ నుంచి తొలగించారు. బోర్గాం జెడ్పీహెచ్ఎస్లో.. మోపాల్: నగర శివారులోని బోర్గాం(పి) జెడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం రాత్రి స్టోర్‌రూమ్‌లో అగ్నిప్రమాదం జరిగింది. గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక కేంద్రం, పాఠశాల హెచ్ఎం శంకర్‌కు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అర్పివేశారు. ప్రమాదంలో పాత పుస్తకాలు, పాత బెంచీలు, ఇతరాత్ర సామగ్రి కాలిపోయాయి. షాట్సర్క్యూట్తోనే ప్రమాదం జరిగినట్లు హెచ్ఎం శంకర్ తెలిపారు. -
ఆ వీడియోలు లీక్ చేస్తా.. ఎమ్మెల్యేను బెదిరించిన యూట్యూబర్ అరెస్ట్
సాక్షి, కామారెడ్డి జిల్లా: ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యేనే టార్గెట్ చేసి బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడిన ఓ యూట్యూబర్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంత రావును బెదిరించిన కేసులో యూట్యూబర్ శ్యామ్‌ను రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపర్చారు. ఎమ్మెల్యేకు సంబంధించిన వీడియోలు ఉన్నాయంటూ శ్యామ్ బ్లాక్‌మెయిలింగ్‌కు దిగాడు.సోషల్ మీడియాలో పోస్ట్ చేయకుండా ఉండాలంటే భారీగా డబ్బులు ఇవ్వాలంటూ శ్యామ్ డిమాండ్ చేశాడు. దీంతో తన నుంచి రూ.5 కోట్లు డిమాండ్ చేశాడంటూ ఎమ్మెల్యే లక్ష్మీకాంత రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు శ్యామ్‌ని అదుపులోకి తీసుకున్నారు. డబ్బుల కోసం బెదిరించిన వ్యవహారంలో శ్యామ్‌తో పాటు మరో మహిళపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. -
స్కావెంజర్ డబ్బులు కాజేత
బిచ్కుంద(జుక్కల్): బిచ్కుంద మండలం హజ్గుల్ గ్రామంలోని ఎస్సీవాడ ప్రాథమిక పాఠశాలలో స్కావెంజర్ డబ్బులను హెచ్ఎం కాజేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు ఇలా..హజ్గుల్ గ్రామంలోని ఎస్సీవాడ ప్రాథమిక పాఠశాల ప్రారంభ సమయంలో వసీమాబేగం స్కావెంజర్‌గా చేరింది. వసీమా బేగంకు ప్రతినెల రూ.6 వేల వేతనాన్ని ప్రభుత్వం స్కూల్ అకౌంట్లో వేస్తుంది. స్కూల్ అమ్మఆదర్శ కమిటీ చైర్మన్ రాంబాయి, హెచ్ఎం సంజీవ్ ఇద్దరు సంతకాలతో డబ్బులు డ్రా చేయాల్సి ఉంటుంది. హెచ్ఎం సంజీవ్ నెలకు రూ.4 వేలు చొప్పున స్కావెంజర్‌కు వేతనం ఇచ్చిన మిగితా డబ్బులు మింగేశాడు. నవంబర్ నుంచి మార్చి వరకు రూ.6 వేల చొప్పున ఐదు నెలల వేతనం రూ.30 వేలు హెచ్ఎం డ్రా చేసుకొని స్కావెంజర్ వసీమా బేగంకు రూ.25 వేలు మాత్రమే ఇచ్చాడు. . ఇప్పుడవి ఐదు వేలు, గతంలోనివి ఎనిమిది వేలు కలిపి మొత్తం రూ.13 వేలు హెచ్ఎం సంజీవ్ తన జేబులో వేసుకున్నాడని స్కావెంజర్ వసీమాబేగం వారం రోజుల క్రితం పాఠశాల తనిఖీకి వచ్చిన ఎంఈవో శ్రీనివాస్ రెడ్డి కి ఫిర్యాదు చేసింది. ఈవిషయమై హెచ్ఎం సంజీవ్‌ను ఎంఈవో మందలించి అక్రమంగా తీసుకున్న డబ్బులు చెల్లించాలని ఆదేశించినా ఇవ్వలేదని స్కావెంజర్ వసీమాబేగం తెలిపింది. ఈవిషయంపై ఉన్నతాధికారులు స్పందించి శాఖపరమైన చర్యలు తీసుకొని వసీమాబేగంకు డబ్బులు ఇప్పించాలని గ్రామస్తులు కోరతున్నారు. హజ్గుల్ పీఎస్ స్కూల్ హజ్గుల్ ఎస్సీవాడ పీఎస్ స్కూల్లో ఆలస్యంగా వెలుగులోకి.. చర్యలు తీసుకోవాలని వినతి హెచ్ఎం డబ్బులు తీసుకున్నది వాస్తవమే స్కావెంజర్ వేతనంలో కోత విధించి మిగతా డబ్బులు హెచ్ఎం సంజీవ్ సారు తీసుకున్నది నిజమే. నేను కూడా సార్‌కు చెప్పి బెదిరించిన.. డబ్బులు ఇస్తానని చెప్పి ఇవ్వలేదు. స్కావెంజర్ వేతనం కోత విధించి జేబులో వేసుకోవడం పద్ధతి కాదు. హెచ్ఎంపై అధికారులకు ఫిర్యాదు చేస్తాను. స్కూల్ గ్రాంట్ వివరాలు కూడా ఇవ్వడం లేదు. – రాంబాయి, స్కూల్ చైర్మన్, హస్గుల్ చిల్లి గవ్వ ఇవ్వనన్నాడు పనికి తగ్గట్టు వేతనం ఇస్తాను. ఇచ్చినన్ని తీసుకో చిల్లిగవ్వ ఇవ్వనని హెచ్ఎం సంజీవ్ సారు చెబుతున్నాడు. అప్పడప్పుడు వచ్చిన వేతనంలో నుంచి కొన్ని కట్ చేసి ఇస్తున్నాడు ఇప్పటి వరకు రూ.13 వేలు కట్ చేసి సారు జేబులో వేసుకున్నాడు. ఎంఈవో సార్ చెప్పినా ఇవ్వడం లేదు. –వసీమాబేగం, స్కావెంజర్ -
రావుల మధుకు డాక్టరేట్
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ విభాగం పరిశోధక విద్యార్థి రావుల మధు పీహెచ్డీ డాక్టరేట్ సాధించారు. వర్సిటీ అధ్యాపకుడు వాసం చంద్రశేఖర్ పర్యవేక్షణలో ‘ప్రిపరేషన్ డెవలప్మెంట్ అండ్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ నావెల్ నానో క్రిస్టలైన్ సిరియా బేస్డ్ ఎట్రోజీనియస్ క్యాటలిస్ట్ ఫర్ ది కటలిటీక్ ఎవాల్యూషన్ ఆఫ్ సెలెక్టివ్ ఆక్సిడేషన్ ఆఫ్ ఆరోమాటిక్ అమైన్న్స్’ అనే అంశంపై మధు పరిశోధన జరిపారు. బుధవారం నిర్వహించిన బహిరంగ మౌఖిక పరీక్షకు కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ టీ సవిత జోత్స్న ఎక్స్టర్నల్ ఎగ్జామినర్‌గా వ్యవహరించారు. కార్యక్రమంలో వర్సిటీ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ విభాగాధిపతి డాక్టర్ మావురపు సత్యనారాయణ రెడ్డి, సైన్స్ డీన్ ఆచార్య కే సంపత్ కుమార్, బోయపాటి శిరీష, అధ్యా పకులు, పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు. -
భూభారతి పోర్టల్‌తో రైతుల సమస్యలు పరిష్కారం
లింగంపేట(ఎల్లారెడ్డి): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి పోర్టల్ ద్వారా రైతులు సమస్యలు పరిష్కారం కానున్నాయని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి వెల్లడించారు. బుధవారం లింగంపేట మండలంలోని జల్దిపల్లి, రాంపూర్ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా జల్దిపల్లిలో ఆమె మాట్లాడారు. ఇచ్చిన సమస్య ను క్షుణంగా విచారించి పరిష్కారం చేయన్నుట్లు ఆమె పేర్కొన్నారు. రెవెన్యూ, అటవీ శాఖ భూము ల వివాదాలను ఇరు శాఖల అధికారులు కలిసి సంయుక్తంగా సర్వే చేసి పరిష్కరించనున్నట్లు తెలిపారు. మండలంలోని జల్దిపల్లి గ్రామంలో 18, రాంపూర్ గ్రామంలో 179 మంది సమస్యలపై దరఖా స్తు చేసుకున్నట్లు తెలిపారు. ఆయా గ్రామాల్లో రెవెన్యూ, అటవీ శాఖ వివాదంలో మరికొన్ని భూములు ఉన్నాయన్నారు. ఆర్డీవో మన్నె ప్రభాకర్, తహసీల్దార్ సురేష్, ఆర్ఐ కిరణ్, ఎఫ్ఆర్వో ఓంకార్, అధికారులు, తదితరులున్నారు.బాన్సువాడ సబ్‌కలెక్టర్ కిరణ్మయి -
ఉద్యోగ భద్రత కల్పించాలని ఎమ్మెల్యేకు వినతి
భిక్కనూరు: యునివర్సిటీల్లో పనిచేస్తున్న పార్ట్ టైం అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ సౌత్‌క్యాంపస్‌లో బుధవారం నిరసన కార్యక్రమాలను చేపట్టారు.ఈ సందర్బంగా విద్యార్థులు పార్ట్ టైం అధ్యాపకుల సమ్మెకు మద్దతుగా తరగతులు బహిష్కరించి ర్యాలీ నిర్వహించి సమ్మె శిబిరం వద్దకు వచ్చి సంఘీభావం తెలిపారు. తదుపరి పార్ట్ టైం అధ్యాపకులు కామారెడ్డికి వెళ్లి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణరెడ్డిని కల్సి తమకు ఉద్యోగ భధత్ర కల్పించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు.కార్యక్రమంలో పార్ట్ టైం అధ్యాపకుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రతినిధులు కనకయ్య, శ్రీను రమేష్, శ్రీకాంత్‌గౌడ్, పోతన వెంకట్‌రెడ్డిలు పాల్గొన్నారు. -
రైతులకు అసౌకర్యం కలగకుండా చూడాలి
కామారెడ్డి క్రైం: రైతులకు అసౌకర్యం కలుగకుండా ధాన్యం కొనుగోళ్లు జరగాలని రాష్ట్ర నోడల్ అధికారి ఫణీంద్ర రెడ్డి సూచించారు. బుధవారం ఆయన జిల్లాలో పర్యటించారు. భిక్కనూర్‌తో పాటు మండలంలోని జంగంపల్లి అంతంపల్లి, కామారెడ్డి మండలంలోని గర్గుల్ గ్రామాల్లో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్న తీరును పరిశీలించారు. అనంతరం కామారెడ్డి కలెక్టరేట్లో జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. కేంద్రాల్లో కనీస వసతులు కల్పించాలన్నారు. ధాన్యం వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్ నమోదు చేసి రైతులకు 72 గంటల్లోగా నగదు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లయ్ కార్పొరేషన్ డీఎం రాజేందర్, డీఎస్వో మల్లికార్జున్ బాబు, డీసీవో రామ్మోహన్, డీఆర్డీవో సురేందర్, డీఏవో తిరుమల ప్రసాద్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.రాష్ట్ర నోడల్ అధికారి ఫణీంద్ర రెడ్డి -
సుర్రుమంటున్న సూరీడు
కామారెడ్డి టౌన్: సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. జిల్లా వ్యాప్తంగా రోజు 43 డిగ్రీల ఉష్ణోగత కంటే తగ్గకుండా ఎండ మండుతుంది. దీంతో జనాలు ఉక్కపోతకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రజలు బయటకు రావడం లేరు. కూలర్లు, ఫ్యాన్లు, ఏసీలు లేకుండా ఇళ్లలో ఉండటం లేరు. నిత్యం రద్దీగా ఉండే పట్టణంలోని ప్రధాన రోడ్లు సిరిసిల్లా రోడ్, జేపీఎన్, సుభాస్, స్టేషన్‌రోడ్, నిజాంసాగర్ చౌరస్తా, దేవునిపల్లిరోడ్, జాతీయరహదారి, కొత్తబస్టాండ్, విద్యానగర్, అశోన్నగర్ కాలనీరోడ్డు ఇలా రోడ్లన్ని జనాలు లేక నిర్మానుష్యంగా కనబడుతున్నాయి. బయటకు రావాలంటే జంకుతున్న జనాలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి -
లింగంపేటలో మహిళ దారుణ హత్య
లింగంపేట(ఎల్లారెడ్డి): లింగంపేట మండల కేంద్రానికి చెందిన అమ్ముల లక్ష్మి(40) అనే మహిళను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లు ఎస్సై వెంకట్రావు తెలిపారు. లక్ష్మి భర్త కొంతకాలం క్రితం మృతి చెందడంతో కూలి పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తుంది. ఆమెకున్న ఒక్కాగానొక్క కూతురు శిరీషకు పెళ్లి చేసి పంపడంతో లక్ష్మి మాత్రమే ఇంట్లో ఉంటోంది. ఈ నెల 20న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చీరతో గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం ఇంటికి తాళం వేసి వెళ్లగా, బుధవారం ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండడంతో చుట్టు పక్కల వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తాళం పగులగొట్టి తలుపులు తెరిచి చూడగా లక్ష్మి మృతదేహం కుళ్లిపోయినట్లు గుర్తించారు. క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌ను రప్పించి ఆనవాళ్లు సేకరించారు. మృతురాలి కూతురు శిరీష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు. ఘటనా స్థలాన్ని ఎల్లారెడ్డి సీఐ రవీందర్‌నాయక్ పరిశీలించారు. -
ఆదర్శప్రాయుడు బుద్దె రాజేశ్వర్
బోధన్ : తుదిశ్వాస వరకు ప్రజలకు సేవలందించిన దివంగత బుద్దె రాజేశ్వర్ ఆదర్శప్రాయుడని, ఆయన జీవితం స్ఫూర్తిదాయకంగా నిలుస్తోందని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బోధన్ మాజీ ఎంపీపీ బుద్దె సావిత్రి భర్త సీనియర్ నేత బుద్దె రాజేశ్వర్ సాలూర గ్రామాభివృద్ధికి, ప్రజా సేవలకు జ్ఞాపకార్థంగా గ్రామస్తులు ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రాజేశ్వర్ ప్రథమ వర్ధంతిని పురస్కరించుకొని బుధవారం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కుటుంబ సభ్యులు, వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రాజేశ్వర్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని వివరిస్తూ పోచారం శ్రీనివాస్ రెడ్డి భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. సర్పంచ్, ఎంపీటీసీ, సొసైటీ చైర్మన్ పదవుల్లో సుదీర్ఘకాలంపాటు బాధ్యతలు నిర్వర్తించిన రాజేశ్వర్ తన వద్దకు ప్రజా సమస్యల పరిష్కారం కోసమే వచ్చేవారని, ఏనాడూ వ్యక్తిగత పనులు కోరలేదన్నారు. రైతుల చిరకాల వాంఛ అయిన మంజీర నదిపై ఎత్తిపోతల పథకాన్ని పట్టుబట్టి సాధించాడని, ఆ ఎత్తిపోతల పథకానికి బుద్దె రాజేశ్వర్ పేరు పెట్టాలని సమష్టి ఆమోదంతో తీర్మానించాలని గ్రామస్తులను కోరారు. స్థలదాత ఇల్తెపు బొర్ర గంగారాం, విగ్రహదాత మిద్దెల రాజును ఎమ్మెల్యే సన్మానించారు. కార్యక్రమంలో రాజేశ్వర్ సతీమణి బుద్దె సావిత్రి, బోధన్, కోటగిరి ఏఎంసీ చైర్మన్లు చీల శంకర్, హన్మంతు, ఏసీపీ శ్రీనివాస్, టీపీసీసీ డెలిగెట్ బీ గంగాశంకర్, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు సింగాడే పాండు, బీఆర్ఎస్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు గోగినేని నరేంద్రబాబు, మందర్నా రవి, పీఆర్టీయూ జిల్లా మాజీ అధ్యక్షుడు ఇల్తెపు శంకర్, కోటగిరి మాజీ జడ్పీటీసీ హెగ్డొలి శంకర్, నాయకులు అల్లె రమేశ్, గణపతి రెడ్డి, బిల్ల రాంమోహన్, డాక్టర్ కౌలయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి -
డ్రెయినేజీలోకి దూసుకెళ్లిన బైకు
నస్రుల్లాబాద్(బాన్సువాడ): మండలంలో జరుగుతున్న 765డీ రోడ్డు పనులలో అధికారుల నిర్లక్ష్యంతో నిత్యం రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. బుధవారం కుర్లం నుంచి నెమ్లి వైపు వెళ్తుండగా మండలకేంద్రంలో ద్విచక్ర వాహనం డ్రెయినేజీలోకి దూసుకుపోయింది. ఈప్రమాదంలో బైక్‌పై ఉన్న కుర్లం గ్రామానికి చెందిన శ్రీను, భీమయ్య, సంజీవ్‌లకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు 108 అంబులెన్సులో బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా, సోమవారం రాత్రి కారు అదుపు తప్పి డ్రెయినేజీ కోసం తవ్విన గుంతలో పడింది. రోడ్డు పనుల నేపథ్యంలో హెచ్చరిక బోర్డులు, రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెరగాలి కామారెడ్డి టౌన్: వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య నమోదు పెరిగేలా బడిబాట కార్యక్రమం ప్రణాళికతో నిర్వహించాలని డీఈవో ఎస్.రాజు తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో నిర్వహించిన విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అభ్యసనాభివృద్ధి పెరగడానికి వేసవిలో ఉపాధ్యాయులకు శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేస్తామన్నారు. ఆర్పీల నియామకాల కోసం మండల, జిల్లా స్థాయిలో ఆర్పీల ప్రతిపాదనలు పంపాలన్నారు. మే 1 నుంచి 15వ తేది వరకు మండల స్థాయిలో సమ్మర్ క్యాంపులు నిర్వహించాలన్నారు. బాలిక శ్రేయస్సు దృష్ట్యా ప్రతి స్కూల్లో జీఈసీఈ క్లబ్‌లు ఏర్పాటు చేయాలన్నారు. పోక్సో చట్టంపై ప్రతి ఉపాధ్యాయుడు అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి డీఈవో అశోక్, సమన్వయకర్తలు వేణుగోపాల్, నాగేందర్, రమణరావు, కృష్ణచైతన్య, పరీక్షల విభాగం కమిషనర్ బలరాం, డీసీఈబీ కార్యదర్శి నీల లింగం, ఎంఈవోలు, నోడల్ అధికారులు, హెచ్ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
అగ్నివీరులు.. అవుతారా?
ఖలీల్‌వాడి: త్రివిధ దళాల్లో చేరాలనే ఆసక్తి ఉన్న యువకులను ఇండియన్ ఆర్మీ ప్రోత్సహిస్తోంది. అగ్నిపథ్ పథకంలో భాగంగా ప్రతి సంవత్సరం రెండుసార్లు అగ్నివీర్ ఎంపికలు నిర్వహిస్తోంది. అగ్నివీరులుగా ఎంపికై న వారికి నాలుగేళ్లపాటు ఐదంకెల వేతనం అందిస్తోంది. అగ్నివీర్‌కు దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య పెరుగుతుండడంతో గడువు తేదీని పొడిగించింది. అయితే ఈ ఉద్యోగం సాధించేందుకు గల అర్హతలు, ఫిజికల్ టెస్ట్, రాత పరీక్ష వివరాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. అర్హతలు: ● అభ్యర్థుల వయస్సు 17.5 నుంచి 21 సంవత్సరాల వరకు ఉండాలి. 10వ తరగతి ఉత్తీర్ణత సాధించాలి. ● ఫిజికల్ టెస్ట్‌లో 1600 మీటర్ల పరుగు, పుల్ అప్స్, జిగ్‌జాగ్ బ్యాలెన్సింగ్, డిచ్ పరీక్షల్లో అర్హత సాధించాలి. పరుగు పందెం.. అగ్నివీర్‌కు మొదటి పరీక్ష పరుగు పందెం. 1600 మీటర్ల పరుగును 5 నిమిషాల లోపు, అంతేకంటే తక్కువ సమయంలో పూర్తి చేయాలి. ఒకేసారి 300 మందికి పోటీ నిర్వహిస్తారు. ఈ పరీక్షలో ఫెయిల్ అయితే మిగితా పరీక్షలకు అవకాశం ఉండదు. జిగ్ జాగ్ బ్యాలెన్సింగ్, డిచ్ : ● పొడువుగా వంకర టింకరగా ఉన్న కర్ర(చెక్క)పై అభ్యర్థులు కిందపడకుండా నడుచుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. దీనినే జిగ్ జాగ్ బ్యాలెన్సింగ్ అంటారు. ఏకాగ్రత, ఆత్మవిశ్వాసంతోనే ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి అవకాశం ఉంటుంది. ● పరుగెత్తుకుంటూ వచ్చి తొమ్మిది మీటర్ల గుంత అవతలి వైపు దూకాలి. దీనినే డచ్ పరీక్ష అంటారు. దీనికి కసరత్తు చేయాల్సి ఉంటుంది. పుల్ అప్స్ ఈ పరీక్షలో పాస్ కావాలంటే తప్పనిసరిగా 10 పుల్ అప్స్ తీయాల్సి ఉంటుంది. ఎక్కువగా తీస్తే బోనస్ మార్కులు కూడా వస్తాయి. ఈ పరీక్ష చేస్తున్నప్పుడు ఎంపిక చేసే అధికారులు అభ్యర్థి వైపు చూస్తూ గట్టిగా అరుస్తారు. భయపడకుండా శ్వాస తీసుకుంటూ పుల్ అప్స్ చేయాలి. అర్హత పరీక్ష ఎంపికై న అభ్యర్థులకు అర్హత పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి ఇండియన్ ఆర్మీ కార్యాలయం నుంచి సమాచారం అందుతుంది. సమాచారం అందుకున్నవారు అధికారులు సూచించిన పత్రాలతోపాటు మెడికల్ టెస్ట్‌కు హాజరుకావాల్సి ఉంటుంది. ప్రక్రియ పూర్తయిన తర్వాత అపాయింట్మెంట్ లెటర్ అందిస్తారు. దీంతో భారతసైన్యంలో సైనికుడిగా శిక్షణ తీసుకుంటారు. నేరుగా భారత సైన్యంలో చేరే అవకాశం దరఖాస్తుకు రేపే చివరి తేదీ -
మతిస్థిమితం లేని మహిళ ఆత్మహత్య
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని ఎక్కపల్లి గ్రామానికి చెందిన ల్యాగల శోభ(45) అనే మహిళ బుధవారం ఉరేసుకొని మృతి చెందినట్లు ఎస్సై వెంకట్రావు తెలిపారు. గత నాలుగైదు సంవత్సరాలుగా శోభ మతిస్థిమితం కోల్పోయి వింతగా ప్రవర్తించేదని, ఆస్పత్రుల్లో వైద్యం చేయించినా తగ్గలేదు. మంగళవారం రాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో బాత్రూమ్ వద్ద ఉన్న కర్రకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. భర్త పర్వయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ముగ్గురికి జైలు రెంజల్(బోధన్): డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబ డిన ముగ్గురికి జైలు శిక్ష విధించగా మరో ము గ్గురికి బోధన్ ద్వితీయ శ్రేణి అదనపు న్యాయమూర్తి జరిమానా వేసినట్లు ఎస్సై చంద్రమో హన్ తెలిపారు. మంగళవారం సాయంత్రం సాటాపూర్ చౌరస్తాలో వాహనాల తనిఖీ చే స్తుండగా తాగి వాహనాలు నడిపిన వారిని పట్టుకొని కేసు నమోదు చేసి బుధవారం కోర్టుకు తరలించినట్లు పేర్కొన్నారు. ముగ్గురికి రెండు రోజుల జైలు, మరో ముగ్గురికి రూ. 4 వేల చొప్పున జరిమానా విధించారు. కిరాణా షాప్ యజమానికి.. ఖలీల్‌వాడి: నగరంలోని రెండో టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నిర్దేశిత సమయానికి మించి కిరాణాదుకాణాన్ని తెరిచి ఉంచిన యజమాని షేక్ జుబేర్ హాజీపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై యాసీన్ ఆరా ఫత్ బుధవారం తెలిపారు. సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చగా నాలుగు రోజుల జైలు శిక్ష విధించినట్లు చెప్పారు. -
ప్రజలను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే
లింగంపేట(ఎల్లారెడ్డి): ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. బుధవారం ఆయన లింగంపేట మండలంలోని జీఎన్ఆర్ గార్డెన్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి గ్రామ స్థాయి నుంచే వ్యతిరేకత వచ్చిందన్నారు. ఈనెల 27న వరంగల్‌లోని ఎల్కతుర్తిలో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రతి మండలం నుంచి 500 మందితో ఎల్లారెడ్డి నియోజక వర్గం నుంచి 3వేల మందిని తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు రమేశ్, మాజీ ఎంపీపీ ముదాం సాయిలు, విష్ణువర్దన్‌రెడ్డి, అశోక్‌రెడ్డి, గన్నూనాయక్, శ్రీకాంత్, నర్సింలు, సురెందర్, ఆయా గ్రామాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సేవ్ ద గర్ల్స్ సొసైటీ తరపున పెళ్లి సాయం అందజేత రామారెడ్డి : రామారెడ్డికి చెందిన తల్లిదండ్రులను కోల్పొయిన భార్గవి అనే యువతి అనే వివాహానికి సేవ్ ద గర్ల్స్ సొసైటీ తరపున బుధవారం రూ.21 వేల ఆర్థిక సాయంను పెళ్లి కానుకగా అందజేశారు. సేవ్ ద గర్ల్స్ సొసైటీ సంస్థను చంచల్‌గుడా జైల్ సూపర్డెండెట్ నవాబ్ శివకుమార్‌గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. బాలసదన్‌కు అనాథ విద్యార్థులు తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని కస్తూ ర్భా గాంధీ పాఠశాలలో ఐదుగురు అనాథ విద్యార్థులు చదువుతున్నారు. వీరిని పాఠశాల సిబ్బంది కామారెడ్డిలోని బాలసదన్‌కు పంపించారు. -
‘ఎక్స్’లో జిల్లా బాస్‌లు యాక్టివ్!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : సామాజిక మాధ్యమాలు ముఖ్యంగా ‘ఎక్స్’లో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేశ్ చంద్ర యాక్టివ్‌గా ఉంటున్నారు. రోజువారీగా జరిగే కార్యక్రమాలు, సక్సెస్‌లు ఎప్పటికప్పడు ఎక్స్ ఖాతాలలో పోస్ట్ చేస్తున్నారు. తమ బాస్‌లు పోస్ట్ చేసిన వాటిని అధికారులు, సిబ్బంది వివిధ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు. కలెక్టర్ కామారెడ్డి పేరుతో ఉన్న ఖాతాలో 7,628 మంది ఫాలోవర్స్ ఉన్నారు. కలెక్టర్ సంగ్వాన్ రోజూ తాను పాల్గొన్న ముఖ్యమైన కార్యక్రమాలు, ముఖ్యమైన విషయాలను అందులో పోస్ట్ చేస్తున్నారు. దీంతో వేలాది మంది వాటిని చూస్తున్నారు. అలాగే ఎస్పీ కామారెడ్డి పేరుతో ఉన్న ఖాతాను 5,813 మంది అనుసరిస్తున్నారు. ఎస్పీ రాజేశ్ చంద్ర కూడా రోజూ చాలా అంశాలను పోస్ట్ చేస్తున్నారు. వివిధ కేసుల్లో నేరస్తులను అరెస్టు చేసిన అంశాలతో పాటు పోలీసు అధికారులతో సమీక్షలు, వివిధ సందర్భాల్లో సిబ్బంది చేసిన కృషిని మెచ్చుకుంటూ వారిని అభినందించిన ఫొటోలు పోస్ట్ చేస్తున్నారు. ఇలా కలెక్టర్, ఎస్పీలు ఎప్పటికప్పుడు ‘ఎక్స్’లో క్రియాశీలకంగా ఉంటూ వివిధ విషయాలను పోస్ట్ చేస్తుండగా.. వాటిని కింది స్థాయి సిబ్బంది, అధికారులు ఇతర సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు. కలెక్టర్, ఎస్పీలకు భారీగా ఫాలోవర్లు రోజువారీ కార్యక్రమాల అప్డేట్.. -
భూ భారతితో సమస్యల పరిష్కారం
గాంధారి/సదాశివనగర్: భూ భారతితో రైతుల భూ సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. బుధవారం గాంధారి, సదాశివనగర్ రైతువేదికలలో నిర్వహించిన భూభా రతి అవగాహన సదస్సులలో ఆయన పాల్గొన్నారు. భూ భారతి చట్టం గురించి ప్రజలకు వివరించారు. భూముల సమస్యల పరిష్కారం కోసం రెండంచెల వ్యవస్థ ఉంటుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సాదాబైనామాలపై కొనుగోలు చేసిన వ్యవసాయ భూముల సమస్యలను క్రమబద్ధీకరించుకునే అవకాశం ఉంటుందన్నారు. 2014 ముందు సాదాబైనామాలపై కొనుగోలు చేసి, అక్టోబర్ 2020 లో క్రమబద్ధీకరణ కోసం చేసిన దరఖాస్తులను సంబంధిత ఆర్డీవోలు పరిశీలించి నిబంధనల మేరకు పరిష్కరిస్తారన్నారు. అలాగే రైతులకు ఆధార్ తరహాలో భూధార్ కార్డులు జారీ చేయనున్నట్లు తెలిపారు. రైతులకు ఉచిత న్యాయ సహాయం అందిస్తామన్నారు. కార్యక్రమాలలో గాంధారి మండల ప్రత్యేకాధికారి మురళి, తహసీల్దార్లు రేణుక చౌహాన్, గంగాసాగర్, ఎంపీడీవోలు రాజేశ్వర్, సంతోష్‌కుమార్, సదాశివనగర్ ఏవో ప్రజాపతి, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, కమలాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు. ఆధార్ తరహాలో భూధార్ కార్డులు ఇస్తాం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ -
కేసులు పెండింగ్‌లో లేకుండా చూడాలి
కామారెడ్డి క్రైం: కేసులు పెండింగ్‌లో లేకుండా చూసుకోవాలని ఎస్పీ రాజేశ్ చంద్ర పోలీస్ అధికారులకు సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసుల పరిశోధన సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసుల్లో నాణ్యమైన విచారణ చేపట్టి బాధితులకు అండగా నిలవాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను ఆక్సిడెంట్ ప్రోన్ ఏరియాగా గుర్తించాలన్నారు. అక్కడ సూచికల బోర్డులను ఏర్పాటు చేయించాలని సూచించారు. వాహనాల తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలను క్రమం తప్పకుండా నిర్వహించాలన్నారు. తప్పుడు నంబర్ ప్లేట్ వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. నేరాల నియంత్రణతో పాటు, జరిగిన నేరాలను ఛేదించడంలో ఎంతగానో ఉపయోగపడే సీసీ కెమెరాల ప్రాధాన్యతను ప్రజలకు వివరించాలన్నారు. స్వచ్ఛందంగా ముందుకువచ్చి ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించాలన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రస్తుత కాలంలో వెలుగుచూస్తున్న వివిధ రకాల ఆన్లైన్ మోసాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. సమావేశంలో అదనపు ఎస్పీ నరసింహారెడ్డి, కామారెడ్డి ఏఎిస్పీ చైతన్యరెడ్డి, డీఎస్పీలు శ్రీనివాస్‌రావు, సత్యనారాయణ, ఎస్బీ సీఐ జార్జ్, డీసీఆర్బీ సీఐ మురళి, జిల్లాలోని అన్ని ఠాణాల సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. రెగ్యులర్‌గా తనిఖీలు నిర్వహించండి నేర సమీక్షలో ఎస్పీ రాజేశ్ చంద్ర -
నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయండి
కామారెడ్డి అర్బన్: వినియోగదారులకు అంతరాయాలు లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడానికి కృషి చేయాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి సూచించారు. ఇందుకోసం సబ్స్టేషన్లలో మరింతగా నూతన సాంకేతికతను అభివృద్ధి చేయాలన్నారు. బుధవారం ఆయన పట్టణంలోని సిరిసిల్లరోడ్డులోని సబ్‌స్టేషన్, పవర్ హౌస్ కాంపౌండ్లను పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇంజినీర్లు, రెవెన్యూ సిబ్బంది, క్షేత్రస్థాయి సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వరుణ్‌రెడ్డి మాట్లాడుతూ విద్యుత్ లైన్లలో సమస్యల పరిష్కారానికి ఫాల్ట్ ప్యాసెజ్ ఇండికేటర్స్, ఏబీ స్విచ్‌లు ఏర్పాటు చేస్తున్నామని, వీటి ద్వారా సమస్య వచ్చిన లోకేషన్‌ను గుర్తించి సంబంధిత అధికారులకు వెంటనే సమాచారం పంపి పరిష్కరించవచ్చని పేర్కొన్నారు. రైతులకు వేగంగా కనెక్షన్లు ఇవ్వాలని ఆదేశించారు. సమావేశంలో ఎన్పీడీసీఎల్ ఫైనాన్స్ డెరెక్టర్ తిరుపతిరెడ్డి, కమర్షియల్ డైరెక్టర్ సదర్లాల్, చీఫ్ ఇంజినీర్ అశోక్, జిల్లా ఎస్ఈ శ్రావణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. అంతరాయాలు లేకుండా చూడండి ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి -
చట్టాలపై అవగాహన అవసరం
మాచారెడ్డి: ప్రతి ఒక్కరు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాణి పేర్కొన్నారు. బుధవారం మాచారెడ్డిలో నిర్వహించిన న్యాయసదస్సులో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాల్యవివాహాలు చేయడం నేరమన్నారు. 14 ఏళ్లలోపు పిల్లలను పనుల్లో పెటుకోవద్దన్నారు. ఆడపిల్లలపై అసభ్యకరంగా ప్రవర్తించే వారిపై పోక్సో కేసులు నమోదవుతాయన్నారు. అంగవైకల్యంతో ఉన్న వారిని గౌరవించాలన్నా రు. అనంతరం దివ్యాంగ విద్యార్థులకు టీఎల్ఎం కిట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంఈవో దేవేందర్‌రావు, మాచారెడ్డి హైస్కూల్ హెచ్ఎం వెంకటాచారి, ఐఆర్బీ మంజుల, ఫిజియోథెరపిస్ట్ నవీన్, సిబ్బంది నర్సింహాచారి, సందీప్, నరేశ్ పాల్గొన్నారు.కాంగ్రెస్ పరిశీలకుల నియామకం సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : కాంగ్రెస్ కార్యక్రమాల పర్యవేక్షణ, అమలు కోసం ఆ పార్టీ జిల్లాలకు పరిశీలకులను నియమించింది. కామారెడ్డి జిల్లాకు నాగుల సత్యనారాయణగౌడ్, బాస వేణుగోపాల్యాదవ్లను నియమిస్తూ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని ఆయా అసెంబ్లీ నియోజక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఇన్చార్జీలు, పార్టీ నేతలతో కలిసి పార్టీ కార్యక్రమాల అమలు గురించి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని పరిశీలకులకు సూచించారు. నిజామాబాద్ జిల్లా పరిశీలకులుగా బల్మూరి వెంకట్, తిరుపతి నియమితులయ్యారు. మహిళను కాపాడిన వారిని అభినందించిన ఎస్పీ కామారెడ్డి క్రైం: ఆత్మహత్యకు యత్నించిన మహిళను కాపాడిన ఓ వ్యక్తిని, పట్టణ పోలీసులను ఎస్పీ రాజేశ్ చంద్ర బుధవారం అభినందించారు. ఈనెల 21 న జిల్లాకేంద్రానికి చెందిన ఓ మహిళ ఆత్మహత్య చేసుకునేందుకు జయశంకర్ కాలనీ సమీపంలోని రైలు పట్టాలపై పడుకుంది. దీనిని గమనించిన దేవ కుమార్ అనే వ్యక్తి డయల్ 100 కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న బ్లూ కోల్ట్స్ కానిస్టేబుల్ నరసింహులు, హోంగార్డు వసంత్ ఆమెను కాపాడి పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఎస్‌హెచ్‌వో చంద్రశేఖర్‌రెడ్డి ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. సమాచారం ఇచ్చిన దేవ కుమార్‌తో పాటు మహిళ ప్రాణాలు కాపాడిన సిబ్బందిని ఎస్పీ బుధవారం జిల్లా కార్యాలయంలో అభినందించి నగదు ప్రోత్సాహక బహుమతులను అందించారు.నేడు మంత్రి జూపల్లి రాక బాన్సువాడ : జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు గురువారం బాన్సువాడకు రానున్నారని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. బాన్సువాడ ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకలలో పాల్గొంటారని పేర్కొన్నారు. వేడుకలకు విజయవంతం చేయాల ని పూర్వ విద్యార్థులకు పిలుపునిచ్చారు. వచ్చేనెలలో సప్లిమెంటరీ పరీక్షలు కామారెడ్డి టౌన్: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను వచ్చేనెల 22 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం తెలిపారు. రీవెరిఫికేషన్, రీవాల్యూయేషన్తో పాటు ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లించడానికి ఈనెల 30 వరకు అవకాశం ఉందన్నారు. దరఖాస్తుల ఆహ్వానం కామారెడ్డి అర్బన్: ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాల (2025–26) కోసం అర్హులైనవారినుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమాధికారి ప్రమీల బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ధైర్యసాహసాలు, క్రీడలు, సామాజిక సేవ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం, కళలు, సంస్కృతి తదితర అంశాల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన బాలబాలికలు జూలై 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. బా లబాలికలు 5 నుంచి 18 ఏళ్లలోపు వారై ఉండాలని జిల్లా సంక్షేమాధికారి పేర్కొన్నారు. -
ఇదిగో నా తరగతి గది..
బాన్సువాడ రూరల్: దేశాయిపేట్ జెడ్పీ హైస్కూల్‌ను బుధవారం జిల్లా ఇన్చార్జి డీఈవో పార్శి అశోక్‌కుమార్ సందర్శించారు. ఆయన స్వస్థలం సోమేశ్వర్ గ్రామం. ప్రస్తుతం నిజామాబాద్ డీఈవోగా పనిచేస్తున్నారు. కామారెడ్డి డీఈవో రాజు సెలవుపై వెళ్లడంతో ఆయన జిల్లా ఇన్చార్జి డీఈవో బాధ్యతలు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన బుధవారం దేశాయిపేట్ హైస్కూల్‌ను సందర్శించారు. పాఠశాల ప్రాంగణంలో కలియదిరిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఇదే పాఠశాలలో ఏడో తరగతి వరకు చదువుకున్నానన్నారు. తాను చదువుకున్న పాఠశాలను చూసి ఆయన మురిసిపోయారు. కామారెడ్డి ఇన్చార్జి డీఈవోగా అశోక్ నిజామాబాద్ అర్బన్: జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ కామారెడ్డి జిల్లా ఇన్చార్జి డీఈవోగా బుధవారం అదనపు బాధ్యతలు స్వీకరించారు. కామారె డ్డి డీఈవో పది రోజులపాటు సెలవులో వెళ్లడంతో అశోక్‌కు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. చదువుకున్న బడిని చూసి డీఈవో సంతోషం -
‘పిల్లల భద్రత కోసం కృషి చేయాలి’
కామారెడ్డి క్రైం: చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులుగా ఎంపికై న ఉపాధ్యాయులు తమ పాఠశాలల్లో పిల్లల భద్రత కోసం కృషి చేయాలని, లైంగిక దాడులు జరగకుండా చూడాలని అదనపు కలెక్టర్ విక్టర్ సూచించారు. జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో మంగళవారం చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులకు శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా ప్రతి పాఠశాలకు ఒక చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్‌ను నియమించామన్నారు. పిల్లలపై ఎలాంటి లైంగిక దాడులు జరగకుండా చూడాలన్నారు. అవసరమైతే తప్పు చేసే వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ చైతన్యరెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల, డీసీపీవో స్రవంతి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యురాలు స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు. -
పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలి
కామారెడ్డి క్రైం: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని రెవె న్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. మంగళవా రం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతి, తదితర అంశాలపై కలెక్టర్లతో సమీక్షించారు. ఇళ్ల నిర్మాణానికి ఇసుక కొరత రాకుండా చూడాలన్నారు. బలహీన వర్గాల వారికి ఇంటి నిర్మాణానికి ఉచితంగా ఇసుక సరఫరా చేయడంకోసం అవసరమైన ఇసుకను అందుబాటులో ఉంచాలని సూచించారు. వర్షాకాలం ప్రారంభం కాకముందే ఇందిరమ్మ ఇళ్లను మంజూ రు చేసి పనులు ప్రారంభించాలన్నారు. భూ భారతిని క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేయాలన్నారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల క్రమబద్ధీకరణలో 25 శాతం రాయితీ గడువును మరోసారి పొడిగించబోమని పేర్కొన్నారు. జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద లింగంపేట్ మండలంలో భూ భారతి అమలు చేస్తున్నామని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. ఈ మండలంలో 23 రెవెన్యూ గ్రామాలున్నాయని, ఇప్పటివరకు 8 గ్రామాల్లో సదస్సులు నిర్వహించామని పేర్కొన్నారు. భూ సమస్యలపై 810 దరఖాస్తులు వచ్చాయన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు విక్టర్, చందర్ నాయక్, సబ్ కలెక్టర్ కిరణ్మయి, డీఎఫ్‌వో నికిత, ఆర్డీవోలు వీణ, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రణాళికలు సిద్ధం చేయాలి జిల్లాలో భూగర్భ జలాలను సంరక్షించడానికి అవసరమైన కట్టడాలకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో ఉన్న మూడు మున్సిపాలిటీలలో రాబోయే వానాకాలంలో తీసుకునే వర్షపు నీటి సంరక్షణ చర్యల కోసం వెంటనే సర్వే చేపట్టాలన్నారు. ఈ వేసవిలో భూగర్భ జలాల సంరక్షణకు నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని డీఆర్డీవో సురేందర్‌ను ఆదేశించారు. వాగులను గుర్తించి వాటిలో నీటి ప్రవాహానికి అడ్డుగా రాతి కట్టడాలను నిర్మించాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. భూగర్బ జలాల సంరక్షణ కోసం ఫాంపాండ్స్, బోర్వెల్ రీచార్జ్ స్ట్రక్చర్, ఇంకుడు గుంతలు ఎక్కువగా నిర్మించాలన్నారు. వానాకాలంలో కురిసే ప్రతి వర్షపు నీటి చుక్కను ఒడిసి పట్టేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చందర్ నాయక్, జిల్లా భూగర్భజల అధికారి సతీశ్ యాదవ్, మున్సిపల్ కమిషనర్లు రాజేందర్, శ్రీహరి, మహేష్, ఇరిగేషన్, పంచాయతీరాజ్ ఇంజినీర్లు పాల్గొన్నారు. భూభారతిని పకడ్బందీగా అమలు చేయాలి వీసీలో గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సరైన పోషకాహారం తీసుకోవాలి గర్భిణులు, బాలింతలు సరైన పోషకాహారం తీ సుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించా రు. కలెక్టరేట్లో మంగళవారం మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో పోషణా పక్షం కార్య క్రమాన్ని నిర్వహించారు. అధికారులు లబ్ధిదారులతో పోషణ ప్రతిజ్ఞ చేయించారు. సామూహిక సీమంతాలు, అన్నప్రసాన కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఏర్పా టు చేసిన పోషకాహార ప్రదర్శనను సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లలో అంగన్వాడి టీచర్లు తయారు చేసిన మునుగ ఆకు ర సం, రాగి జావా, నువ్వుల లడ్లు తదితర పోషకాహారాలను రుచి చూసి వారిని అభినందించారు. -
‘సిల్వర్ జూబ్లీ వేడుకల్లో మంత్రి పాల్గొంటారు’
బాన్సువాడ : పట్టణంలోని ఎస్ఆర్ఎన్కే డి గ్రీ కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకలను గురువారం నిర్వహించనున్నామని, ఇందులో జి ల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పా ల్గొననున్నారని వ్యవసాయ సలహాదారు పో చారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. మంగళవా రం డిగ్రీ కళాశాలలో సిల్వర్ జూబ్లీ వేడుకల కరపత్రాలను ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసు ల బాల్‌రాజ్‌తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కళాశాల ఏర్పాటు చేసినప్పటి నుంచి గత సంవత్సరం వరకు 13,050 మంది చదువుకున్నారని, ఇందులో సుమారు 10 వేల మంది ప్ర భుత్వ ఉద్యోగాలు సాధించారని, మూడు వే ల మంది ప్రైవేటు రంగాల్లో రాణిస్తున్నారని పేర్కొన్నారు. పూర్వ విద్యార్థులందరూ వ చ్చి సిల్వర్ జూబ్లీ వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఏ ర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమంలో కళా శాల ప్రిన్సిపల్ వేణుగోపాల్‌స్వామి, కాంగ్రె స్ నాయకులు పోచారం సురేందర్‌రెడ్డి తదితరులున్నారు. ‘వక్ఫ్ సవరణ చట్టంపై అవగాహన కల్పించాలి’ నాగిరెడ్డిపేట: వక్ఫ్ సవరణ చట్టంపై క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని బీజేపీ కి సాన్ మోర్చా రాష్ట్ర హార్టికల్చర్ కన్వీనర్ గంగారెడ్డి పేర్కొన్నారు. ధర్మారెడ్డిలో మంగళవా రం వక్ఫ్ సవరణ చట్టంపై కార్యకర్తలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వక్ఫ్ సవరణ చట్టంపై కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంలు తప్పుడు ప్రచారం ద్వారా అపోహలు సృష్టిస్తూ, శాంతిభద్రతల సమస్య తలెత్తేలా చేస్తున్నాయని ఆరోపించారు. నిరుపేద ముస్లింల కు న్యాయం చేసేందుకే కేంద్రప్రభుత్వం వ క్ఫ్ సవరణ చట్టం తీసుకువచ్చిందన్నారు. వాస్తవమేమిటో ప్రజలకు తెలిసేలా కార్యకర్త లు కృషి చేయాలన్నారు. సమావేశంలో బీజే పీ మండలాధ్యక్షుడు శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు హన్మండ్లు, నరేందర్‌రెడ్డి, దేవిసింగ్, మండల ఉపాధ్యక్షులు ఈశ్వర్‌గౌడ్, మల్లేశ్, విష్ణు, నాయకులు భాస్కర్ నాయక్, పోచయ్య, గణేష్ నాయక్, బాలు తదితరు లు పాల్గొన్నారు. టీఎస్ఎన్ఏ వైస్ ప్రెసిడెంట్‌గా ఆరోగ్య లక్ష్మి బాన్సువాడ రూరల్ : తెలంగాణ స్టేట్ న ర్సింగ్ అసోసియేషన్(టీఎస్ఎన్ఏ) వై స్ ప్రెసిడెంట్‌గా బా న్సువాడ సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ పూదోట ఆరోగ్య లక్ష్మి ఎన్నికయ్యారు. సోమవారం హైదరాబాద్‌లో ని ర్వహించిన కార్యక్రమంలో ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వైస్ ప్రెసిడెంట్‌గా ఎ న్నికైన ఆరోగ్య లక్ష్మిని స్థానిక వైద్యులు, న ర్సులు అభినందించారు. ఫుట్‌బాల్ అండర్ –14 రాష్ట్ర జట్టుకు ఎంపిక కామారెడ్డి టౌన్: ఈనెల 25 నుంచి మహారాష్ట్రలోని కొల్లాపూర్‌లో జరిగే జాతీయ స్థాయి ఫుట్‌బాల్ పోటీలకు జిల్లాకు చెందిన విద్యార్థిని ఎంపికై నట్లు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి హీరాలాల్ తెలిపారు. రామారెడ్డి మండలం అన్నారం గ్రామ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి అక్షయ అండర్–14 బాలికల విభాగంలో రాష్ట్ర జట్టుకు ఎంపికైందని పేర్కొన్నారు. మంగళవారం డీఈవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అక్షయను డీఈవో కార్యాలయ సూపరింటెండెంట్ జగన్నాథం, వ్యాయామ ఉపాధ్యాయుడు చంద్రయ్య తదితరులు అభినందించారు. -
‘రైతులకు ఇబ్బందులు కలగనీయొద్దు’
భిక్కనూరు : కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇ బ్బందులు కలగకుండా చూడాలని జిల్లా సహకార అధికారి రామ్మోహన్ సూచించారు. మంగళవారం ఆయన అంతంపల్లి, పెద్దమల్లారెడ్డిలలోని కొనుగో లు కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంతంపల్లి కేంద్రం వద్ద రైతుల కోసం పందిళ్లు వేయడం, తాగునీటి సౌకర్యం కల్పించడంపై విండో సీఈవో శ్రీనివాస్‌ను అభినందించారు. వేగంగా కాంటాలు పూర్తి చేసి రైస్‌మిల్లులకు పంపించాలని సూచించారు. ఆయన వెంట క్లస్టర్ అధికారి రమేశ్, మానిటరింగ్ అధికారి నగేశ్, విండో చైర్మన్లు వెంకట్‌రెడ్డి, రాజాగౌడ్, సీఈవో శ్రీనివాస్ ఉన్నారు. -
తూకాలు ప్రారంభించాలంటూ రైతుల ధర్నా
రామారెడ్డి: రెడ్డిపేట కొనుగోలు కేంద్రంలో తూకాలు ప్రారంభించకపోవడంతో రైతులు మంగళవారం కొంతసేపు రాస్తారోకోకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి వడ్లను తీసుకువచ్చి పదిహేను రోజులవుతున్నా కాంటాలు చేయడం లేదన్నారు. దీంతో కొనుగోలు కేంద్రం వద్ద వడ్ల కుప్పలు పేరుకుపోతున్నాయన్నారు. కొనుగోలు కేంద్రం వద్ద కనీస వసతులు కూడా లేవని, ఎండ వేడికి తట్టుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సౌకర్యాలు కల్పించాలని, వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని, లేకపోతే రోడ్ బ్లాక్ చేస్తామని డిమాండ్ చేశారు. -
మళ్లీ అట్టడుగునే..
బుధవారం శ్రీ 23 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025– 10లో u● ఇంటర్ ఫస్టియర్‌లో 50.09 శాతం ఉత్తీర్ణత ● సెకండియర్‌లో 56.38 శాతం.. ● ఫలితాల్లో బాలికలదే పైచేయికామారెడ్డి టౌన్: ఇంటర్ ఫలితాలలో జిల్లా విద్యార్థులు నిరాశ పరిచారు. దాదాపు సగం మందే ఉత్తీర్ణులయ్యారు. దీంతో ఫలితాల్లో కామారెడ్డి జిల్లా వరుసగా రెండో ఏడాదీ రాష్ట్రంలో అట్టడుగున ఉండిపోయింది. ఇంటర్మీయట్ బోర్డు మంగళవారం ఇంటర్ ఫలితాలను విడుదల చేసింది. ఫస్టియర్‌లో 50.09 శాతం, సెకండియర్‌లో 56.38 శాతం ఉత్తీర్ణులయ్యారు. షరా మామూలుగా ఫలితాల్లో ఈసా రి కూడా బాలికలదే పైచేయిగా నిలిచింది. ఫస్టియర్ ఫలితాలు.. జిల్లాలో 8,740 మంది ఫస్టియర్ పరీక్షలు రాయగా 4,378 మంది పాసయ్యారు. ఉత్తీర్ణత శాతం 50.09గా నమోదైంది. ఇందులో బాలురు 4,053మంది పరీక్షలు రాయగా 1,496 ఉత్తీర్ణులయ్యారు. 36.91 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలికల్లో 4,687 మందికి 2,882 మంది పాసయ్యారు. ఉత్తీర్ణత శాతం 61.49గా ఉంది. జనరల్ గ్రూప్స్‌లో 6,828 మంది పరీక్షలు రాయ గా 3,343మంది(48.96 శాతం) పాసయ్యారు. వొకేషనల్ విభాగంలో 1,912 మందికిగాను 1,035 మంది(54.13 శాతం) పాసయ్యారు. సెకండియర్ ఫలితాలు.. జిల్లాలో 7,722 మంది విద్యార్థులు సెకండియర్ ప రీక్షలు రాయగా 4,354 మంది పాసయ్యారు. 56.38 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇందులో బాలు రు 3,580 మంది పరీక్షలు రాయగా 1,569 (43.83 శాతం) పాసయ్యారు. బాలికల్లో 4,141 మందికిగా ను 2,785 (67.24 శాతం) ఉత్తీర్ణులయ్యారు. జనరల్ విభాగంలో 6,485 మంది పరీక్షలు రాయగా 3,562 మంది పాసయ్యారు. ఉత్తీర్ణత శాతం 54.93గా నమోదైంది. వొకేషనల్ విభాగంలో 1,237 మందికిగాను 792 మంది పాసయ్యారు. 64.03 శాతం ఉత్తీర్ణులయ్యారు. న్యూస్రీల్అందరూ ఫెయిల్నాగిరెడ్డిపేట: ఈ ఏడాది నూతనంగా ప్రారంభమైన నాగిరెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫలితాలు నిరాశ పరిచాయి. 45 మంది మొదటి సంవత్సరం పరీక్షలు రాయగా అందరూ అనుత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరైన ఒక విద్యార్థి సైతం ఫెయిల్ అయ్యారు.ఇంటర్ ఫలితాల్లో జిల్లా వరుసగా రెండో ఏడాది కూడా చిట్టచివరి స్థానంలో నిలిచింది. 2023 ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 13వ స్థానంలో ఉన్న జిల్లా.. 2024 సంవత్సరానికి వచ్చేసరికి 35 వ స్థానానికి పడిపోయింది. ఈసారి కూడా చివరిస్థానంలోనే నిలవడం గమనార్హం. -
రైతులందరికి భూధార్ కార్డులిస్తాం
భిక్కనూరు/రామారెడ్డి : భూ భారతి చట్టం అమలులోకి వచ్చిన వెంటనే రైతులందరికీ భూధార్ యునిక్ కార్డులను పంపిణీ చేస్తామని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. మంగళవారం భిక్కనూరు రైతు వేదికలో, రామారెడ్డి రైతు వేదికలలో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సులలో ఆయన మాట్లాడారు. లింగంపేట మండలంలో పైలట్ ప్రాజెక్టుగా భూభారతిని అమలు చేస్తున్నామన్నారు. జూన్ రెండు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ చట్టం అమలులోకి వస్తుందన్నారు. ర్యాగట్లపల్లికి చెందిన రైతు నరేందర్‌రెడ్డి, భిక్కనూరుకు చెందిన రైతు అందె దయాకర్‌రెడ్డి, తిప్పాపూర్‌కు చెందిన రైతు కుంట లింగారెడ్డి ధరిణి పోర్టల్ ద్వారా రైతులు ఎదుర్కొన్న సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వం రైతుల సమస్యల పరిష్కారం కోసమే భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందని కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయసంస్థ చైర్మన్ చంద్రకాంత్‌రెడ్డి, ఆర్డీవో వీణ, భిక్కనూరు, రామారెడ్డి తహసీల్దార్లు శివప్రసాద్, ఉమాలత, ఎంపీడీవోలు రాజ్‌కిరణ్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, భిక్కనూరు డిప్యూటీ తహసీల్దార్ రోజా తదితరులు పాల్గొన్నారు. -
జల్సాల కోసం చోరీలు
కామారెడ్డి క్రైం: జల్సాలకు అలవాటు పడి తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్న ఓ నిందితుడిని దేవునిపల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కామారెడ్డి సబ్ డివిజనల్ పోలీసు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ చైతన్యరెడ్డి వివరాలు వెల్లడించారు. పది రోజుల క్రితం పట్టణ శివారు కాలనీలో ఓ దొంగతనం జరిగింది. పోలీసులు విచారణ చేపట్టగా మాసాయిపేట్కు చెందిన పందిగోటి రామును నిందితుడిగా గుర్తించారు. అతడిని తూఫ్రాన్ ప్రాంతంలో మంగళవారం పట్టుకుని విచారించగా దేవునిపల్లితోపాటు నిజామాబాద్, బోధన్, మేడ్చల్, మనోమరాబాద్ పీఎస్‌ల పరిధిలో మొత్తం 9 చోట్ల చోరీలకు పాల్పడినట్లు తేలింది. దీంతో అతడికి సహకరించిన బంధాపురం మల్లేష్, వడ్డెర నవీన్, శ్యాంలాల్, రినివర్ రాజారాం, మునివర్ గౌతంలను సైతం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తున్నామని ఏఎస్పీ తెలిపారు. నిందితుల వద్ద నుంచి 6 తులాల బంగారం, అర కిలో వెండి ఆభరణాలు రికవరీ చేశామన్నారు. తాళం వేసిన ఇళ్లే టార్గెట్ 9 కేసుల్లో నిందితుడితో పాటు మరో ఐదుగురు అరెస్ట్ వివరాలు వెల్లడించిన ఏఎస్పీ చైతన్యరెడ్డి -
భిక్కనూరు మండల క్రైస్తవ సంఘం కార్యవర్గం ఎన్నిక
భిక్కనూరు: మండల క్రైస్తవ సంఘం నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండలంలోని అన్ని గ్రామలకు చెందిన క్రైస్తవుల ప్రతినిధులు బస్వాపూర్‌లో సమావేశమై నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా కమలాకర్, ఉపాధ్యాక్షులుగా శాంతికుమార్, జోసెప్, ప్రధానకార్యదర్శిగా ఈ. కిషన్, హయకార్యదర్శిగా పి.సుధాకర్, కోషాధికారిగా ఎస్.డేవిడ్, సంయుక్తకార్యదర్శిగా కే.యాదగిరి. సలహదారులుగా ప్రశాంత్‌కుమార్, డేవిడ్‌లు ఎన్నికయ్యారు. పాస్టర్ల కార్యవర్గం.. భిక్కనూరు మండలంలోని చర్చిల పాస్టర్లు నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా జాన్సన్ ఉపాధ్యాక్షుడిగా జోసెఫ్, ప్రధానకార్యదర్శిగా ఎన్.స్వామి, సహయకార్యదర్శిగా పౌల్, కోశాధికారిగా జెమ్స్, కార్యవర్గసభ్యులుగా పరిశుద్ధరావు, బాల్‌రాజులు ఎన్నికయ్యారు. ఈ సందర్బంగ నూతన అధ్యక్షునిగా ఎన్నికై న జాన్సన్ మాట్లాడుతూ చర్చిల అభివృద్ధికి కృషిచేస్తానన్నారు. -
చౌదరి చెరువు మరమ్మతులకు రూ.37లక్షలు మంజూరు
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని పొల్కంపేట చౌదరి చెరువు మరమ్మతులకు రూ. 37 లక్షలు మంజూరైనట్లు కాంగ్రెస్ పార్టీ మండల సమన్వయకర్త నాగరాజు తెలిపారు. చౌదరి చెరువు తూము గత నాలుగు సంవత్సరాల క్రితం భారీ వర్షానికి తెగిపోయి కొట్టుకుపోయినట్లు తెలిపారు. ఈ విషయాన్ని గ్రామ రైతులు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎమ్మెల్యే స్పందించి ఎస్డీఎఫ్ నిధుల నుంచి రూ.37 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్యదర్శి అశ్వక్, గ్రామ కమిటీ అధ్యక్షుడు అజయ్‌గౌడ్, శివ్వయ్య, శ్రీనివాస్, సంజీవరెడ్డి, కృష్ణమూర్తి, దాసరి శ్రీనివాస్, రమేశ్, సతీష్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.పెద్దమ్మ.. కరుణించమ్మా మాచారెడ్డి: మండలంలోని లచ్చాపేటలో మంగళవారం పోచ మ్మ, పెద్దమ్మ బోనాలను ఊరేగించారు. ముదిరాజులు ఇంటికో బోనం చొప్పున అలంకరించి అమ్మ వారికి సమర్పించారు. ఈసారి వర్షాలు బాగా కురిసి పంటలు సమృద్ధిగా పండాలని పెద్దమ్మ తల్లిని వేడుకున్నారు. ఉద్యోగ భద్రత కల్పించే వరకు సమ్మె భిక్కనూరు: ఇచ్చిన హమీ మేరకు విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల ఉద్యోగ భద్రత కల్పించేవరకు సమ్మెను కొనసాగిస్తామని కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం రాష్ట్ర ఉపాధ్యాక్షుడు నారాయణగుప్తా అన్నారు. మంగళవారం తెలంగాణ యునివర్సీటీ సౌత్ క్యాంపస్‌లో కాంట్రాక్టు అధ్యాపకుల సమ్మె శిబిరాన్ని ఆయన సందర్శించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని విశ్వవిద్యాలయాల్లో 1100 మంది కాంట్రాక్లు అధ్యాపకులు ఉన్నారని వీరందరికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హమీ మేరకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో కాంట్రాక్టు అధ్యాపకులు యాలాద్రి, సునిత, నరసయ్య,రమాదేవి, నిరంజన్, వైశాలి, సరిత, శ్రీకాంత్, దిలీప్‌లు పాల్గొన్నారు. -
కుక్కల దాడిలో పసి బాలుడికి గాయాలు
ఆర్మూర్‌టౌన్: పట్టణంలోని 11వ వార్డులో మంగళవారం ఉదయం శ్రేయన్స్ అనే బాలుడిపై కుక్క దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు గమనించి కుక్కను తరిమేసి, గాయపడ్డ బాలుడిని చికిత్స నిమిత్తం ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. మున్సిపల్ అధికారులు ఇప్పటిౖకైనా కుక్కల నివారణకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. మద్నూర్‌లో లేగదూడలకు.. మద్నూర్(జుక్కల్): మండల కేంద్రంలోని లక్ష్మీనారాయణ గోశాలలోని రెండు లేగదూడలపై కుక్కలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. గోశాలలోకి మంగళవారం ఉదయం కుక్కల గుంపు ప్రవేశించి లేగదూడలపై దాడి చేశాయన్నారు. దీంతో లేగదూడలకు తీవ్ర రక్తస్రావం జరిగిందన్నారు. మరో రెండు లేగదూడలు పారిపోయాయని వాటి కోసం వెతుకుతున్నామని గోశాల నిర్వాహకులు తెలిపారు. -
రైతులు రెవెన్యూ సదస్సులు సద్వినియోగం చేసుకోవాలి
లింగంపేట(ఎల్లారెడ్డి): రైతులు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీవో మన్నే ప్రభాకర్ సూచించారు. మంగళవారం లింగంపేట మండలంలోని మెంగారం, ఎల్లారం గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా మెంగారంలో ఆయన మాట్లాడారు. భూభారతి పోర్టల్ ద్వారా రైతుల సమస్యలు పరిష్కారం అవుతాయని ఆయన వెల్లడించారు. రెవెన్యూ, అటవీ శాఖ భూముల వివాదాలను ఇరు శాఖల అధికారులు కలిసి సంయుక్తంగా సర్వే చేసి పరిష్కరించనున్నట్లు తెలిపారు. మండలంలోని మెంగారం గ్రామంలో 321, 322 సర్వే నంబర్లలో 60 మంది రైతులకు చెందిన 185 ఎకరాలు పట్టాలు ఉన్నా ఆన్లైన్లో సర్కారు భూమిగా చూపిస్తున్నట్లు అధికారుల దృష్టికి తెచ్చినట్లు రైతులు తెలిపారు. అలాగే రెవెన్యూ, అటవీ శాఖ వివాదంలో మరికొన్ని భూములు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ సురేష్, ఆర్ఐ కిరణ్, ఎఫ్ఆర్వో ఓంకార్, అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు. -
పార్టీ వదలి వెళ్లిన వారిని తిరిగి చేర్చుకోం
కామారెడ్డి క్రైం/భిక్కనూరు : బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పదవులు పొంది అధికారం పోగానే కాంగ్రెస్‌లో చేరిన నేతలను తిరిగి ఎట్టి పరిస్థితుల్లో పార్టీలోకి చేర్చుకునే ప్రసక్తే లేదని మాజీ మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. భిక్కనూరు మండల కేంద్రంలో, కామారెడ్డి పట్టణ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో మంగళవారం ఆయన పాల్గొని మాట్లాడారు. రైతులకు రెండు లక్షల రుణ మాఫీ చేశామని కాంగ్రెస్‌నేతలు ప్రగల్బాలు పలుకుతున్నారని, వంద శాతం రుణమాపీ జరిగినట్లు నిరూపిస్తే తన ముక్కును నేలకు రాస్తానన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలను కన్నతల్లికి మోసం చేసిన వారిగానే పరిగణిస్తామన్నారు. ఈనెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజత్సోవ సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కామారెడ్డి పట్టణంలో చలో వరంగల్ ఆటో స్టిక్కర్ లను ఆటోలకు ఆయన అతికించారు. బీఆర్ఎస్ లో పలువురు యువకుల చేరిక.. జిల్లా కేంద్రానికి చెందిన 30 మంది యువకులు మంగళవారం కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు కాంగ్రేస్ నాయకులు యువతకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్ రెడ్డి, నాయకులు కుంభాల రవి, ప్రభాకర్ యాదవ్, క్రిష్ణాజీ రావు, పార్టీ అధికార ప్రతినిధి బల్వంత్ రావు, నాయకులు పిట్ల వేణు, లక్ష్మీ నారాయణ, స్వామి, గైని శ్రీనివాస్, హాఫిజ్ భాను ప్రసాద్, కాంగ్రెస్ నేతలు అత్తెల్లి శ్రీనివాస్, నాగార్తి భూంరెడ్డి, వంగేటి చిన్ననర్సరెడ్డి, అందే మహేందర్‌రెడ్డి, తున్కి వేణు, పాలరాంచంద్రం, ద్యావర సాయిరెడ్డి, రవీందర్‌రెడ్డి, బస్వయ్య, ఎనుగు వెంకట్‌రెడ్డి, వలకొండ వెంకట్‌రెడ్డి. అంబల్ల మల్లేషం, తక్కళ్ళ రవీందర్‌రెడ్డి, అనంత్గౌడ్, ముచ్చర్ల రాజిరెడ్డి,లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. రుణమాీఫీ వందశాతం చేసినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ -
లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకోవాలి
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వెంటనే ప్రారంభించాలని ఎల్లారెడ్డి డీఎల్పీవో సురేందర్ సూచించారు. నాగిరెడ్డిపేట మండలం అచ్చాయపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో మంగళవారం ఇందిరమ్మ లబ్ధిదారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైలెట్ గ్రామంగా ఎంపికై న అచ్చాయపల్లి గ్రామపంచాయతీ పరిధిలో మొత్తం 90మంది లబ్ధిదారులకు ఇళ్లు మంజూరుకాగా ఇప్పటివరకు కేవలం 13మంది మాత్రమే ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించారన్నారు. మిగతా లబ్ధిదారులు ఎందుకు ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించడంలేదని ఆయన ఆరా తీశారు. సమావేశంలో నాగిరెడ్డిపేట ఎంపీడీవో ప్రభాకరచారి, గ్రామపంచాయతీ ప్రత్యేకాధికారి పిచ్చయ్య, పంచాయతీ కార్యదర్శి వెంకటరాములు తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు అర్హులను గుర్తించాలి దోమకొండ/ఎల్లారెడ్డిరూరల్/ నిజాంసాగర్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు అర్హులైన పేదలను గుర్తించాలని ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్ అన్నారు. మంగళవారం దోమకొండ మండలం లింగుపల్లి గ్రామంలో లబ్ధిదారుల గుర్తింపుకు అధికారులు ఇంటింటికి తిరిగి గుర్తించారు. గ్రామంలో 12 మంది లబ్ధిదారులను గుర్తించాల్సి ఉండగా, 10 మంది ఇంటి నిర్మాణానికి ముందుకు వచ్చినట్లు ఎంపీడీవో వివరించారు. ఎల్లారెడ్డి మండలం అడివిలింగాల గ్రామంలో ఎంపీవో ప్రకాష్ ఇందిరమ్మ ఇళ్ల సర్వేను నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు చేసుకున్న వారికి సంబంధించిన వారి వివరాలను పరిశీలించారు.నిజాంసాగర్ మండలం మల్లూర్‌తండా గ్రామ పంచాయతీలో ఇందిరమ్మ ఇళ్ల స్థలాలను ఎంపీడీవో గంగాధర్ పరిశీలించారు. ఇందిరమ్మ గృహాలు మంజూరైన లబ్ధిదారుల ఇళ్ల స్థలాలు, ఇంటి నిర్మాణ పనులపై లబ్ధిదారులతో చర్చించారు. ఈకార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. -
డ్రంకన్‌డ్రైవ్ కేసులో ఒకరికి ఐదురోజుల జైలు
ఎడపల్లి(బోధన్): మండలం కేంద్రంలో ఇటీవల పోలీసులు డ్రంకన్‌డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా అంబం(వై)గ్రామానికి చెందిన ఒక వ్యక్తి మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. అతడిని పోలీసులు మంగళవారం కోర్టులో హాజరు పరచగా ఐదు రోజుల జైలు శిక్ష విధిస్తూ జడ్జి తీర్పు వెల్లడించారు. సమయపాలన పాటించని వ్యాపారికి.. ఆర్మూర్‌టౌన్: పెర్కిట్‌లో షేక్ మాజీద్ తన దుకాణంను రాత్రివేళ సమయపాలన పాటించకుండా నడపడంతో ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్ కేసు నమోదు చేశారు. దీంతో షేక్ మాజీద్‌ను మంగళవారం కోర్డులో హాజరుపర్చగా జడ్జి రెండు రోజుల జైలు శిక్ష విధిస్తు తీర్పును వెల్లడించినట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు. తాళం వేసిన ఇంట్లో చోరీ ఆర్మూర్‌టౌన్: పట్టణంలోని యోగేశ్వర కాలనీలో తాళం వేసిన ఇంట్లో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. వివరాలు ఇలా.. కాలనీకి చెందిన తోగటి భమేశ్వర్ కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం ఉదయం ఇంటికి తాళం వేసి మామిడిపల్లిలోని వృద్ధాశ్రమానికి వెళ్లాడు. తిరిగి మధ్యాహ్నం ఇంటికి వచ్చేసరికి తాళం ధ్వంసం చేసిఉండటంతో పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. దుండగులు బీరువాలోని 5తులాల బంగారం, 80గ్రాముల వెండిన దొంగిలించినట్లు తెలిపారు. బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్ తెలిపారు. కులాస్పూర్ తండా, బాడ్సిలో అగ్నిప్రమాదం మోపాల్: మండలంలోని కులాస్పూర్ తండా, బాడ్సి గ్రామాల్లో మంగళవారం మధ్యాహ్న సమయంలో అగ్నిప్రమాదం జరిగింది. కులాస్పూర్ తండాలో బంతిలాల్‌కు చెందిన గడ్డివాముకు మంటలు అంటుకుని పెళ్లి కోసం కొనుగోలు చేసిన కలప దగ్ధమైంది. వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారమివ్వగా, నిజామాబాద్ నుంచి వచ్చిన సిబ్బంది మంటలార్పేశారు. ప్రమాదంలో సుమారు రూ.40వేల వరకు నష్టం జరిగినట్లు బంతిలాల్ పేర్కొన్నాడు. అలాగే బాడ్సిలో కోసిన వరి గడ్డికి నిప్పంటుకుంది. డయల్ 100కు గ్రామస్తులు ఫోన్ చేయడంతో ఎస్ఐ యాదగిరి గౌడ్, సిబ్బందితో అక్కడికి వెళ్లి మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తుండగా, ఇందల్వాయి నుంచి వచ్చిన ఫైరింజన్ మంటలను అదుపులోకి తెచ్చింది. బదావత్ చత్రు గడ్డి, కె శ్రీనివాస్ పైపులు ప్రమాదంలో కాలిబూడిదయ్యాయి. సిర్నాపల్లి అడవుల్లో ఇసన్నపల్లి వాసి హత్య? రామారెడ్డి: కామారెడ్డి మండలంలోని ఇసన్నపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని సిర్నాపల్లి అడవులలో ఏడు నెలల క్రితం హత్య చేసినట్లుగా విశ్వసనీయ సమాచారం. హత్యకు కారకులైన ఇద్దరు వ్యక్తులతో పాటు మృతుడి భార్యను రామారెడ్డి పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. హత్య ఘటనలో ఆరు నుంచి ఎనిమిది మంది పాల్గొన్నట్లు ప్రచారం జరుగుతోంది. మృతుడు గల్ఫ్‌కు వెళ్లినట్లుగా మృతుడి భార్య బంధువులను నమ్మించింది. మృతుడి అన్నకు అనుమానం రావడంతో రామారెడ్డి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశాడు. తన తమ్ముడు గల్ఫ్ దేశం వెళ్లలేదని, తమ్ముడి భార్య వివాహేతర సంబంధం పెట్టుకొని ప్రియుడితో కలిసి అతడిని హత్య చేయించిందని ఫిర్యాదు చేశాడు.మృతుడు గల్ఫ్ దేశం వెళ్లినట్లు ఇమిగ్రేషన్ లేదనే సమాచారం పోలీసులు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసుపై ఎస్పీ నేరుగా రంగంలోకి దిగడంతో హత్య ఘటన కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. -
జొన్న కొనుగోలు పరిమితి పెంపుపై హర్షం
మద్నూర్/నిజాంసాగర్ (జుక్కల్): రైతుల శ్రేయస్సు కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని మద్నూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేశ్ పటేల్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో, నిజాంసాగర్ మండలం అచ్చంపేట సొసైటీ కార్యాలయం ఆవరణలో మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, మంత్రి తుమ్మల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ మాట్లాడుతు ప్రభుత్వ జొన్న కొనుగోలు పరిమితిని ఎకరాకు 8 క్వింటాళ్ల నుంచి 14 క్వింటాళ్ల వరకు పెంపుపై వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వర్రావు దృష్టికి తీసుకువెళ్లి కృషి చేసిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సలాబత్పూర్ హనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్ రాంపటేల్, సొసైటీ చైర్మన్ శీను పటేల్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, అచ్చంపేట సొసైటీ చైర్మన్ నరసింహారెడ్డి, నాయకులు రైతులు పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని ఆయా గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం వేగవంతం చేయాలని సిబ్బందికి సూచించారు. మంగళవారం స్థానిక ఐకేపీ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు తాగునీరు ఏర్పాటు చేసి, నీడకోసం పచ్చని పందిర్లు వేయాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు వేగం పెంచి ట్యాబ్‌లో నమోదు చేయాలన్నారు.అలాగే మహిళా సంఘాల సభ్యులు పాఠశాలల యునిఫామ్స్ కుట్టే ప్రతీ విద్యార్థి కొలతలు తీసుకొని ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. స్కూల్ యునిఫాం కుట్టే మహిళలకు మంచి ఆదాయం వచ్చేలా చూడాలన్నారు. కార్యక్రమంలో ఏపీఎం శ్రీనివాస్, సీసీలు రాజిరెడ్డి, గంగరాజు, నజీర్, మేహర్, మన్సూర్, స్వప్న, శ్రావణ్, బాలయ్య, సీ్త్రనిధి మేనేజర్ అమల, నరేందర్, రవి పాల్గొన్నారు. -
చెరువులో పడి ఒకరి మృతి
ఆర్మూర్‌టౌన్: ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామ శివారులోని గుండ్ల చెరువులో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు వలలో చిక్కుకొని మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. ఇందల్వాయి మండలంలోని గౌరారం గ్రామానికి చెందిన రమేష్(35) బతుకుతెరువు కోసం అంకాపూర్‌కు వచ్చి, పనిచేస్తున్నాడు. కాగ మంగళవారం బర్రెలను మేపుతుండగా చెరువులో పడిన బర్రెను కాపాడే ప్రయత్నంలో రమేష్ నీటిలోకి దిగాడు. చెరువులోని చేపల వల అతడికి తట్టుకోవడంతో నీటిలో మునిగి మృతిచెందాడు. మృతుడి భార్య అపర్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్ తెలిపారు. అనుమానాస్పద స్థితిలో ఒకరు.. వర్ని: మండల కేంద్రంలోని వీక్లీ మార్కెట్లో సత్యనారాయణపురం గ్రామానికి చెందిన ఆర్య రాకేష్ (40) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, ఘటన స్థలానికి చేరుకొని, వివరాలు సేకరించారు. మృతికి గల కారణాలు ఇంకా తెలియ రాలేదని, విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
30 కిలోల గంజాయి పట్టివేత
ఖలీల్‌వాడి: ఎండుగంజాయి తరలిస్తున్న ఐదుగురిని పట్టుకుని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించినట్లు ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. నగరంలోని గంజ్ ప్రాంతంలో ఆటోనగర్‌కు చెందిన మొహమ్మద్ ఆయూబ్ వద్ద గంజాయి ఉన్నదనే సమాచారం మేరకు అతని వద్ద తనిఖీ చేయగా 250 గ్రాముల ఎండుగంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మొహమ్మద్ ఆయూబ్‌ను విచారించగా మహారాష్ట్ర, నాందేడ్‌లోని బోకార్కు చెందిన ఫరూక్ఖురేషీ వద్ద గంజాయి కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఆదివారం రాత్రి నవీపేట్ మండలం యంచ వద్ద ఫారూఖ్ఖురేషీతోపాటు నాందేడ్‌లోని బోకార్కు చెందిన యషేక్ ఫయీమ్, షేక్ సిద్ధిక్, జుబేర్ పఠాన్లను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వారి కారులో తనిఖీలు చేయగా అందులో 30కిలోల ఎండుగంజాయి దొరికినట్లు తెలిపారు. ఫారూక్ఖురేషీ ఆంధ్ర, ఛత్తీష్‌గఢ్ సరిహద్దు ప్రాంతం నుంచి ఎండుగంజాయిని కొనుగోలు చేసి నిజామాబాద్, నాందేడ్ చుట్టుపక్కల ప్రాంతాలలో అమ్మకాలు సాగిస్తున్నట్లు తెలిపారు. 30.250 కిలోల ఎండు గంజాయి విలువ రూ.6లక్షల వరకు ఉంటుదన్నారు. నిందితులను అరెస్టు చేసి, వారి నుంచి కారు, రెండు బైక్‌లు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఎ క్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ స్వప్న, ఎస్సై రాంకుమార్, సిబ్బంది హమీద్, రాజన్న, రాంబచన్, సుకన్య, ఆశన్న, అవినాష్, శ్యాంసుందర్, సాయికుమార్ పాల్గొన్నారు. -
‘భద్రత’తో పోలీసు కుటుంబాలకు భరోసా
కామారెడ్డి క్రైం: భద్రత పథకం కింద మృతి చెందిన పోలీసు కుటుంబాలకు ఆర్ధిక భరోసా లభిస్తుందని ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన రామన్ అనే కానిస్టేబుల్ కుటుంబానికి మంజూరైన రూ. 8 లక్షల పోలీసు భద్రత చెక్కును సోమవారం కుటుంబ సభ్యులకు ఎస్పీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మృతుల కుటుంబాలకు రావాల్సిన సదుపాయాలను వీలైనంత త్వరగా ఇప్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కార్యాలయ ఏవో అఫ్సరుద్దీన్, సూపరింటెండెంట్ నయీం, సిబ్బంది పాల్గొన్నారు. బెట్టింగులు, ఆన్లైన్ గేమ్‌లపై ఉక్కుపాదం లింగంపేట(ఎల్లారెడ్డి): బెట్టింగులు, ఆన్లైన్ గేమ్‌లపై ఉక్కుపాదం మోపనున్నట్లు ఎస్పీ రాజేశ్ చంద్రం వెల్లడించారు. సోమవారం ఆయన లింగంపేట పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఇటీవల కాలంలో క్రికెట్ బెట్టింగులు పెరగడంతో వాటిపై నిఘా పెట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు సైతం సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి రూ. 73 లక్షలు పోగొట్టుకున్నట్లు తెలిపారు. అలాగే కల్తీ కల్లులో అల్ప్రాజోలం వాడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిన కొంత మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. మత్తు మందులు గుర్తించడానికి టెస్టింగ్ కిట్లు వచ్చాయని, ల్యాబ్‌కు పంపకుండానే ఎంత మేరకు మత్తు మందు కలిపారనేది తేలిపోతుందన్నారు. ఎస్పీ రాజేష్ చంద్ర -
టేకుచెట్ల నరికివేతపై విచారణ
ఎల్లారెడ్డి: పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో టేకుచెట్ల నరికివేతపై అటవీశాఖ అధికారులు సోమవారం విచారణ నిర్వహించారు. వార్డెన్ శారదను అటవీశాఖ కార్యాలయంలో ఎఫ్ఆర్వో ఓంకార్ టేకు చెట్ల నరికివేత గురించి వివరాలు సేకరించారు. హాస్టల్లో కోతులు విద్యార్థులపై దాడులు చేస్తుండడంతో చెట్లను నరికివేయించినట్లు వార్డెన్ తెలిపారు. అనుమతులు లేకుండా టేకు చెట్లను నరికినందున అటవీశాఖ చట్టం కింద కేసు నమోదు చేసి నివేదికను ఉన్నతాధికారులకు పంపనున్నట్లు అధికారులు తెలిపారు. స్ట్రైకింగ్ ఫోర్స్ డీఆర్వో అనురంజని, ఎల్లారెడ్డి డీఆర్వో శ్రీనివాస్‌నాయక్ తదితరులున్నారు. మెడికల్ కళాశాలకు మృతదేహం దానం బిచ్కుంద(జుక్కల్): మండల కేంద్రానికి చెందిన చెల్లల గంగారాం (65) సోమవారం అనారోగ్యంతో మృతి చెందాడు. ఈక్రమంలో కుటుంబ సభ్యులు గంగారాం మృతదేహాన్ని నిజామాబాద్ మెడికల్ వైద్య కళాశాలకు దానం చేశారు. జుక్కల్ మండలం దోస్పల్లి తెలంగాణ ఉప పీఠం జగద్గురు రామానంద ఉపదేశాల మేరకు కుటుంబసభ్యులు మృతదేహాన్ని వైద్య విద్యార్థుల శిక్షణ కోసం అప్పగించారు. జగద్గురు స్వామిజీ భక్తులు ఇప్పటి వరకు 94 శవాలను మహారాష్ట్ర, తెలంగాణలోని ఆయా జిల్లాలో మెడికల్ వైద్య కళాశాలకు దానం చేశారు. రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని గాంధారి–లింగంపేట్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాలు ఇలా.. చద్మల్ తండాకు చెందిన మాండు జీవన్(45) సోమవారం బైక్‌పై రాంలక్ష్మణ్‌పల్లి వైపు నుంచి గుర్జాల్‌తండా వైపు బయలుదేరాడు. బ్రాహ్మణ్‌పల్లి స్టేజీ సమీపంలో అతడి బైక్ అదుపుతప్పడంతో కిందపడిపోయాడు. ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య కమలాబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
గల్ఫ్‌లో తప్పిపోయిన భర్తను వెతికించండి
● ప్రజావాణిలో భార్య వినతిరామారెడ్డి: గల్ఫ్‌లో తప్పిపోయిన భర్తపై భార్య ఆవేదన చెందుతోంది. ఈమేరకు సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణిలో ఆమె వినతి పత్రం అందజేసింది. వివరాల్లోకి వెళ్తే.. రామారెడ్డి మండలం ఇసన్నపల్లి గ్రామానికి చెందిన ఎగ్గిని బక్క మల్లవ్వ భర్త బక్క మల్లయ్య ఉపాధి నిమిత్తం పదేళ్ల కింద రూ. లక్ష అప్పు చేసి ముంబయి నుంచి మస్కట్ దేశానికి వెళ్లాడు. మంబయి విమానాశ్రయానికి బయలుదేరే ముందు భర్త ఫోన్లో మాట్లాడిందే చివరి మాట అని బక్కమల్లవ్వ ‘సాక్షి’తో తెలిపారు. తన భర్త ఆచూకీ కనిపెట్టి ఇండియాకు రప్పించాలని, లేనిచో తెలంగాణ ప్రభుత్వం గల్ఫ్ దేశాల్లో చనిపోయిన వారికి రూ.5 లక్షల నష్టపరిహారం ఇస్తున్న నేపథ్యంలో అందించాలని ప్రజావాణిలో వినతి ప్రతం అందించినట్లు ఆమె తెలిపారు. -
తాగునీటి కోసం ఆందోళన
లింగంపేట: తాగునీటి కోసం గాంధీనగర్వాసులు ఆందోళనకు దిగారు. కామారెడ్డి –ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామానికి నీటిని సరఫరా చేసే బోరుబావిలో నీరు అడుగంటిందన్నారు. మరికొన్ని పైపులు దించితే నీరు అందించే అవకాశం ఉన్నా నిధుల కొరతతో పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. సమీపంలోని వ్యవసాయ బోరుబావులలోనూ నీరు అడుగంటడంతో నీటికోసం అవస్థలు పడుతున్నామన్నారు. ట్యాంకర్ ద్వారా సరఫరా చేస్తున్న నీరు సరిపోవడం లేదన్నారు. సమస్య పరిష్కరించాలంటూ సుమారు గంటపాటు రాస్తారోకో చేయడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ఎంపీడీవో గ్రామానికి వచ్చి మాట్లాడారు. తాగునీరు సరఫరా చేయిస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. ఎంపీడీవో వెంటనే మరో ట్యాంకరు ఏర్పాటు చేసి తాగునీరు సరఫరా చేశారు. అలాగే మిషన్ భగీరథ పైపులైన్‌కు మరమ్మతులు చేయించి నీటి సరఫరాను పునరుద్ధరించారు. -
బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని అటకాయించి గొడ్డలితో దాడి
మాచారెడ్డి: బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని అటకాయించి గుర్తుతెలియని దుండగులు ఇనుపరాడ్లు, గొడ్డలితో దాడికి పాల్పడ్డారు. ఈఘటన సోమవారం ఫరీదుపేట, దోమకొండ శివారులో చోటు చేసుకుంది. మాచారెడ్డి ఎస్సై అనిల్ తెలిపిన వివరాలు .. మండలంలోని ఘన్పూర్(ఎం) గ్రామానికి చెందిన సాడెం కుమార్ తూప్రాన్ మున్సిపల్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. రోజు మాదిరిగానే తన బైక్‌పై ఫరీదుపేట మీదుగా దోమకొండ వైపు వెళ్తున్నాడు. ఫరీదుపేట, దోమకొండ గ్రామాల శివారులో రెండు బైకులు, ఒక ఆటోలో దుండగులు అతడిని వెంబడించి ఇనుపరాడ్లు, గొడ్డలితో తలపై బాదారు. కుమార్ రోడ్డు పక్కన కుప్పకూలిపోయాడు. అదే సమయంలో దోమకొండ వైపు నుంచి ఫరీదుపేటకు కారులో వస్తున్న పాల్వంచ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రమేశ్‌గౌడ్ అతడిని గమనించి కారు ఆపాడు. దీంతో దుండగులు దోమకొండ వైపు పారిపోయారని ఎస్సై తెలిపారు. కుమార్‌కు తలపై నాలుగు చోట్ల గాయాలు కావడంతో అంబులెన్స్‌లో కామారెడ్డిలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. పథకం ప్రకారం దాడి జరగడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. యువకుడికి తీవ్ర గాయాలు -
వేర్వేరు కారణాలతో పలువురి ఆత్మహత్య
తాడ్వాయి మండలంలో.. తాడ్వాయి (ఎల్లారెడ్డి): మండలంలోని కాళోజివాడిలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై రాజయ్య తెలిపారు. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన మల్లమారి రాకేష్ (25)కు ఐదేళ్ల క్రితం రామారెడ్డి మండలంలోని పోసానిపేట గ్రామానికి చెందిన సంధ్యతో వివాహం జరిగింది. వారికి మూడేళ్ల కుమారుడు అనూష్ ఉన్నాడు. రెండేళ్లుగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతుండేవి. ఈక్రమంలో ఇటీవల సంధ్య తన పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటినుంచి రాకేష్ తీవ్ర మనస్థాపంతో బాధపడుతుండేవాడు. కాగా సోమవారం మధ్యాహ్నం గ్రామ శివారులోని తన వ్యవసాయ భూమి వద్ద గల వేపచెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వివరించారు.నిజాంసాగర్(జుక్కల్): నిజాంసాగర్ ప్రాజెక్టులో పడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు. వివరాలు ఇలా.. బోధన్ పట్టణంలోని శక్కర్‌నగర్ ప్రాంతంలో అబ్దుల్ సలాం (37) నివసిస్తుండేవాడు. అతడి భార్య ఏడాది క్రితం మృతిచెందడంతో ఆమె తల్లితరపువారు సలాంపై కేసు వేశారు. దీంతో సలాం జైలుకు వెళ్లగా ఇటీవల బయటకు వచ్చాడు. తన పిల్లలను చూడడానికి అత్తగారింటికి వెళ్లిన సలాంను వారు అడ్డుకోవడంతో మనస్థాపం చెందాడు. దీంతో సలాం వాట్సప్ స్టేటస్ పెట్టి, నిజాంసాగర్ ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వర్ని మండలంలో..వర్ని: మండలంలోని చందూర్ గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై మహేష్ తెలిపిన వివరాలు ఇలా.. చందూర్ గ్రామానికి చెందిన అర్కల గోపాల్‌రెడ్డి ఆర్థిక ఇబ్బందులు భరించలేక సోమవారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.ముప్కాల్ మండలంలో.. బాల్కొండ: ముప్కాల్ మండలంలో ఓ వ్యక్తి ఇటీవల ఆత్మహత్యకు యత్నించగా ఆస్పత్రి లో చికిత్స పొందుతూ మృతిచెందాడు. వివరాలు ఇలా.. నా గంపేట్ గ్రామానికి చెందిన ఏ లేటి గంగాధర్ అలియాస్ వకీ ల్ (49) కొంతకాలంగా తనకు ఎవరో మంత్రాలు చేస్తున్నారనే అనుమానంతో మానసికంగా బాధపడుతున్నాడు. మానసిక ప్రశాంతత కోసం ఈనెల 15న గ్రామస్తులతో కలిసి తిరుపతిలో శ్రీవారి సేవ చేయుటకు వెళ్లాడు. గంగాధర్ నిత్యం కల్లు తాగే అలవాటు ఉంది. తిరుపతిలో కల్లు లభించకపోవడంతో మానసిక ఆందోళనకు గురై ఆదివారం గ్రామానికి వస్తుండగా మార్గమధ్యలో పురుగులమందు తాగాడు. అనంతరం కొత్తపల్లికి గ్రామంలో ఓ ఇంటి వద్ద నీరు తాగి అక్కడే కుప్పకూలిపోయాడు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు వెంటనే అతడిని ఆర్మూర్‌లోని ఓ ప్రయివేలు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో జిల్లా కేంద్రంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అదేరోజు రాత్రి మృతిచెందాడు. ఈమేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి
కామారెడ్డి క్రైం: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో సో మవారం నిర్వహించిన ప్రజావాణికి 108 ఫిర్యా దులు వచ్చాయి. వాటిలో భూ సంబంధిత ఫిర్యాదు లే ఎక్కువగా ఉండటం గమనార్హం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించాలన్నారు. వాటిని పరిస్కరించడం గానీ, పరిష్కార మార్గాలు చూపడం గానీ చేయాలన్నారు. తీసుకున్న చర్యలపై ఫిర్యాదుదారునికి సమాచారం ఇవ్వాలన్నారు. రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తుల విచారణ త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. కొనుగోలు కేంద్రాలను తహసీల్దార్లు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. కొన్ని కేంద్రాల్లో ధాన్యం ఉన్నప్పటికీ కొనుగోళ్లు జరగడం లేదని తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపులకు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని సూచించారు. ధరణి ఫైళ్లు ఆన్లైన్లో మాత్రమే వస్తున్నాయనీ, తహసీల్దార్లు మ్యానువల్ ఫైళ్లను పంపడం లేదని, వెంటనే పంపాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చందర్, ఆర్డీవో వీణ, కలెక్టరేట్ పాలనాధికారి మసూద్ అహ్మద్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్ ప్రజావాణికి 108 వినతులు -
గ్రామీణ విద్యార్థులకు పట్టుదల ఎక్కువ
భిక్కనూరు: పట్టణ ప్రాంత విద్యార్థులకంటే గ్రామీ ణ ప్రాంత విద్యార్థులకు పట్టుదల, చురుకుదనం ఎక్కువని ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన భిక్కనూరులోని తెలంగాణ యూనివర్సిటీ సౌత్క్యాంపస్ను సందర్శించారు. తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకుని క్రమశిక్షణతో ముందుకు సాగితే బంగారు భవిష్యత్తు సొంతమవుతుందన్నారు. సౌత్‌క్యాంపస్ సమస్యలను వైస్‌చాన్స్‌లర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరింపజేస్తానన్నారు. అనంతరం బాలకల వసతి గృహంలో విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. ఆయన వెంట ప్రిన్సిపల్ సుధాకర్‌గౌడ్, హాస్టల్ వార్డెన్లు యాలాద్రి, సునీత, అధ్యాపకులు మోహన్‌బాబు, సబిత, హరిత, లలిత, అంజయ్య, నారాయణ, రమాదేవి, నర్సయ్య ఏపీఆర్వో సరిత పాల్గొన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలి వర్సిటీలో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కాంట్రాక్టు అధ్యాపకులు ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డిని కోరారు. ఈ విషయమై వారు సోమవారం వినతి పత్రం అందించారు. ఇతర రాష్ట్రాల్లోని యూనివర్సిటీల్లో పనిచేసిన కాంట్రాక్టు అధ్యాపకులకు పర్మినెంట్ చేశారని గుర్తు చేశారు. కాంట్రాక్టు అధ్యాపకుల సమస్య ప్రభుత్వం దృష్టిలో ఉందని, త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని బాలకృష్ణారెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో నారాయణగుప్తా, యాలాద్రి, సునీత, నరసయ్య, రమాదేవి, శ్రీకాంత్, నిరంజన్, దిలీప్, సరిత పాల్గొన్నారు. 50 పడకల ఆస్పత్రి నిర్మాణానికి స్థల పరిశీలనదోమకొండ : మండల కేంద్రంలో 50 పడకల ఆ స్పత్రి నిర్మాణానికి అధికారులు సోమవారం స్థలాన్ని పరిశీలించారు. హైదరాబాద్‌కు చెందిన ఎంఐడీపీ అధికారి కుమార్ నరసింహ, డీసీహెచ్ఎస్ విజయలక్ష్మి తదితరు లు మండల అధికారులతో కలిసి మండల కేంద్రంలోని దేవునికుంట, గుండ్ల చెరువు ప్రాంతం, ముత్యంపేట రోడ్డు ప్రాంతాలలోని స్థలాలను పరిశీలించారు. అనంతరం స్థానిక అధికారుల తోపాటు కాంగ్రెస్ పార్టీ నాయకులతో ప్రభుత్వ ఆస్పత్రిలో సమావేశం నిర్వహించి మాట్లాడారు. వారి వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ సంజయ్‌రావ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అనంతరెడ్డి, నాయకులు తిరుమల్‌గౌడ్, స్వామి, మధుసూదన్, రామస్వామిగౌడ్, తదితరులున్నారు. తెయూ డిగ్రీ పరీక్షలు వాయిదా తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 28 నుంచి ప్రారంభం కావాల్సిన డిగ్రీ రెగ్యులర్ 2, 4, 6వ సెమిస్టర్, బ్యాక్లాగ్ 1, 3, 5 వ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి సంపత్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం ఫీ జు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చే యకపోవడం, ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోకపోవడంతో ప్రయివేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు పరీక్షల నిర్వహణకు నిరాకరించడంతో వాయిదా వేసినట్లు సమాచారం. -
ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్
ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని పంచాయతీరాజ్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ ఎస్ శ్రీనివాస్ శ ర్మ రూ.7 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. డొంకేశ్వర్‌లో సీసీ రోడ్డు నిర్మాణం పనులకు సంబంధించిన రూ.4 లక్షల 75 వేల బిల్లుల మంజూరు చేసేందుకు రూ.7,500 ఇవ్వాలని కాంట్రాక్టర్‌ను శ్రీనివాస్ డిమాండ్ చేసాడు. దీంతో కాంట్రాక్ట ర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. పక్కా ప్రణాళిక ప్రకారం సోమవారం కాంట్రాక్టర్ రూ.7 వేలు ఇవ్వగా తీసుకుంటున్న శ్రీనివాస్ శర్మను పట్టుకున్నట్లు డీఎస్పీ శేఖర్‌గౌడ్ వివరించారు. విచారణ పూర్తయిన అనంతరం నిందితుడిని హైదరాబాద్ నాంపల్లి కోర్టుకు తరలిస్తామని డీఎస్పీ వివరించారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు నగేశ్, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
‘వేగంగా కాంటాలు వేయాలి’
భిక్కనూరు: కొనుగోలు కేంద్రాలలో ధాన్యా న్ని వేగంగా కాంటాలు వేయాలని టాస్క్ఫో ర్స్ ఓఎస్డీ శ్రీధర్‌రెడ్డి సూచించారు. సోమ వారం టాస్క్‌ఫోర్స్ అధికారులు భిక్కనూరు మండల కేంద్రంలో సింగిల్‌విండో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రంలోని రికార్డులను, వడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఓఎస్డీ శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ కాంటాలు అయిన వెంటనే ట్యాబ్ ఎంట్రీ చే యాలని సూచించారు. వారి వెంట సింగిల్‌విండో అధ్యక్షుడు గంగళ్ల భూమయ్య, ఉపా ధ్యక్షుడు ముచ్చర్ల రాజిరెడ్డి, టాస్క్‌ఫోర్స్ అ ధికారులు అజయ్‌బాబు, లక్ష్మయ్య, శ్రీనివాస్‌రావు, సుదర్శన్, ఎన్ఫోర్స్మెంట్ డిప్యూ టీ తహసీల్దార్ కిష్టయ్య, అసిస్టెంట్ రిజిస్ట్రా ర్ రమేశ్ ఉన్నారు. బ్లూ కోల్ట్స్ సిబ్బందికి అభినందన కామారెడ్డి క్రైం: పిట్లం మండల కేంద్రంలో రెండు రోజుల క్రితం చెరువులో దూకి ఆత్మహత్యకు యత్నించిన మహిళను కాపాడిన బ్లూ కోల్ట్స్ సిబ్బంది కానిస్టేబుల్ రవిచంద్ర, హోంగార్డు మారుతిలను ఎస్పీ రాజేశ్ చంద్ర అభినందించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో వారిని అభినందించి నగ దు ప్రోత్సాహకాన్ని అందించారు. ప్రజల ర క్షణ కోసం పోలీసులు ప్రదర్శించే ధైర్య సా హసాలు శాఖకు గౌరవాన్ని తీసుకువస్తాయ ని పేర్కొన్నారు. నేడు బీఎస్ఎన్ఎల్ సేవా శిబిరం కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ రోడ్లో గల బీఎస్ఎన్ఎల్ సంస్థ కా ర్యాలయంలో మంగళవారం వినియోగదారుల సేవా శిబిరం నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని సంస్థ డీఈ సురేందర్ సోమవా రం ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు ఏవైనా ఫిర్యాదులు, బిల్లులకు సంబంఽధించిన సమస్యలు, ఇతర సేవలపై సలహా లు, సూచనల కోసం శిబిరాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ‘సంఘాల పనితీరు భేష్’ దోమకొండ : స్వయం సహాయక సంఘాల పనితీరు బాగుందని గ్రామీణ పేదరిక ని ర్మూలన సంస్థ జీవనోపాధుల డైరెక్టర్ జాన్స న్ పేర్కొన్నారు. సోమవారం దోమకొండలో మహిళా సంఘాలు చేపడుతున్న జీవనోపాధుల కార్యక్రమాలను ఆయన డీఆర్డీవో సు రేందర్తో కలిసి పరిశీలించారు. లింగుపల్లి గ్రామంలో ఐకేపీ ద్వారా ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడారు. మండల కేంద్రంలో మహిళలు నిర్వహిస్తున్న ఎంటర్‌ప్రైజెస్‌ని సందర్శించా రు. అనంతరం గ్రామ సంఘంలో ఏర్పాటు చేసిన స్టిచ్చింగ్ సెంటర్‌ను ప్రారంభించారు. ముండల సమాఖ్య ద్వారా నిర్వహిస్తున్న మ హిళా శక్తి క్యాంటీన్‌ను సందర్శించి, భోజనం చేసి వారి పనితీరు మెచ్చుకున్నారు. నాణ్యమైన ఆహారం అందించాలని, పరిశుభ్రత పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీడీ కృష్ణమురళి, ఎంపీడీవో ప్రవీణ్‌కుమా ర్, డీపీఎం సుధాకర్, ఏపీఎం రాజు తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం కామారెడ్డి టౌన్:ప్రాథమిక, ఉన్నతపాఠశాల ల ఉపాధ్యాయులకు మండల, జిల్లా స్థాయిలలో శిక్షణ ఇవ్వడంకోసం సబ్జెక్ట్ రిసోర్స్ ప ర్సన్స్ను నియమించనున్నట్లు డీఈవో రాజు తెలిపారు. ఇందుకోసం అర్హులైన ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామన్నారు. ప్రైమరీ స్కూల్ ఉపాధ్యాయుల శిక్షణ కోసం మండల రిసోర్స్ పర్సన్స్ –8 (తెలుగు/ఇంగ్లిష్), జిల్లా రిసోర్స్ పర్సన్స్ –10 (తెలుగు/ఇంగ్లిష్), 4 (ఉర్దూ), అలాగే స్కూల్ అసిస్టెంట్ హైస్కూల్ ఉపాధ్యాయు ల శిక్షణ కోసం డీఆర్పీలు–36(తెలుగు/ఇంగ్లిష్)–10,(ఉర్దూ), అలాగే హెచ్ఎంల శిక్షణ కోసం డీఆర్పీలు–8 పోస్టుల భర్తీ కోసం ఈ నెల 24లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఎంఆర్పీ పోస్టుల కోసం స్థానిక మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో, డీఆర్పీ పోస్టుల దరఖాస్తుల కోసం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. -
భూభారతితో రైతుల సమస్యలు పరిష్కారం
లింగంపేట: భూభారతి పోర్టల్ ద్వారా రైతుల సమస్యలు పరిష్కారం అవుతాయని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. సోమవారం పర్మళ్ల, పొల్కంపే ట గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించా రు. పర్మళ్ల సదస్సులో కలెక్టర్ మాట్లాడుతూ దశాబ్దా లుగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలపై రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, వాటిని చట్ట ప్రకా రం పరిష్కరిస్తామని పేర్కొన్నారు. రైతులు తమ స మస్యలను దరఖాస్తులో స్పష్టంగా రాసి అందించా లన్నారు. భూభారతి పోర్టల్‌లో భూముల రిజిస్ట్రే ష న్లు, సాదాబైనామాలు, రెవెన్యూ భూ రికార్డుల్లో తప్పుల సవరణ, వారసత్వ భూములు, సర్వే నంబర్లలో తప్పులు, ఒకరి భూమి మరొకరి పేరుపై నమోదు కావడం, సర్వే నంబర్లు తప్పుగా నమోదు కావడం తదితర సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు. భూ సమస్యలను జూన్ 2లోగా పరిష్కరిస్తామని పేర్కొన్నారు. పరిష్కారం కాని సమస్యల పై ట్రిబ్యునల్‌కు వెళ్లే అవకాశం ఉంటుందన్నారు. పర్మళ్లలో 165 దరఖాస్తులు, పొల్కంపేటలో 165 దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపా రు. పర్మళ్లలో 331 సర్వే నంబరులో పలువురు రైతులకు చెందిన 62 ఎకరాలు, 380 సర్వే నంబరులో మరికొంతమంది రైతులకు సంబంధించిన 96 ఎకరాలు, 400 సర్వే నంబరులో 120 ఎకరాలు సీలింగ్ భూములుగా నమోదయ్యాయని అధికారుల దృష్టి కి తీసుకువెళ్లారు. వాటిపై విచారణ చేపట్టి పరిష్కా ర మార్గాలు చూపుతామని అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో మన్నె ప్రభాకర్, తహసీల్దార్ సురేశ్ తదితరులు పాల్గొన్నారు. పెద్దకొడప్గల్లో.. పెద్దకొడప్గల్: మండల కేంద్రంలోని రైతు వేదికలో సోమవారం భూభారతి అవగాహన సదస్సు నిర్వహించారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ధరణి వల్ల నష్టపోయిన వారికి మేలు చేయాలనే ఉద్దేశంతో ప్రభు త్వం భూభారతి తీసుకువచ్చిందన్నారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కిరణ్మయి, మండల ప్రత్యేకాధి కారి కిషన్, తహసీల్దార్ దశరథ్, ఎంపీడీవో లక్ష్మీకాంత్‌రెడ్డి, ఏవో కిషన్, కాంగ్రెస్ మండల అధ్యక్షు డు మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ -
రైతులు తలెత్తుకుని తిరిగే రోజు రావాలి
రాష్ట్రంలోని ప్రతి రైతు తలెత్తుకుని తిరిగే రోజు రావాలని, పంట పండించే రైతుకు బోనస్ ఇవ్వడంతో ప్ర భుత్వంపై ప్రజలు సంతృప్తితో ఉన్నారని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సేంద్రియ ఎరువులను ప్రోత్సహించాలని, పెట్టుబడి ఖర్చు తగ్గించాలని, అధిక దిగుబడులు పెరగాలన్నారు. రైతులు అప్పుల నుంచి బయట పడేలా అధికారులు, ప్రభుత్వం పాలనాపరమైన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. పంటలకు బోనస్ ఇస్తే, రైతు భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. -
రైతు ప్రయోజనాలే పరమావధి
ప్రాజెక్టులు పూర్తి చేస్తాం సుభాష్‌నగర్: రాష్ట్రంలోని రైతుల ప్రయోజనాలే పరమావధి అని, ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్‌శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతాంగానికి ఇచ్చిన ప్రతి హామీ అమలు కోసం పని చేస్తామన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో రైతు మహోత్సవం కార్యక్రమం సోమవారం అట్టహాసంగా ప్రారంభమైంది. మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, టీపీసీసీ అధ్యక్షుడు మ హేశ్‌కుమార్‌గౌడ్, ప్రభుత్వ సలహాదారులు పోచా రం శ్రీనివాస్‌రెడ్డి, మహ్మద్ షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి, ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, భూపతిరెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, పైడి రాకేశ్‌రెడ్డి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డితో కలిసి మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు రైతు మహోత్సవాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో తుమ్మలో మాట్లాడుతూ.. సేంద్రియ వ్యవసాయం చేయాలని, సాగుకు ఆధునిక సాంకేతికతను జోడించి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సాధించేలా మెళకువలు అందించేందుకు రైతుమహోత్సవం ఎంతగానో ఉపకరిస్తుందని, దీన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇతర దేశాల్లో సాగు చేసే పంటలు, ఆధునిక సాగుపై మూడురోజులపాటు శాస్త్రవేత్తలు, నిపుణులు అవగాహన కల్పిస్తారని తెలిపారు. అత్యంత లాభదాయకమైన పంట పామాయిల్ అని, జంతువులు, చీడ పురుగులు నష్టం చేయవని, రైతులు సాగు చేయాలని పిలుపునిచ్చారు. వ్యవసాయమే ప్రధాన ఆధారంగా ఉన్న జిల్లాలో వ్యవసాయ కళాశాల ఏర్పాటుకు సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని మంత్రి తుమ్మల తెలిపారు. వ్యవసాయ యాంత్రీకరణ, డ్రిప్ ఇరిగేషన్లో జిల్లాకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులుగా ఎంపిక చేసిన రైతులకు సబ్సిడీతో కూడిన ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలు, చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ, రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, కార్పొరేషన్ చైర్మన్లు ఈరవత్రి అనిల్, అన్వేష్‌రెడ్డి, తాహెర్ బిన్ హందాన్, మా నాల మోహన్‌రెడ్డి, కాసుల బాల్‌రాజ్, జంగా రాఘవరెడ్డి, డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్‌రెడ్డి, నుడా చైర్మన్ కేశ వేణు, నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, నాయకులు ఏనుగు రవీందర్‌రెడ్డి, అరికెల నర్సారెడ్డి, నగేశ్‌రెడ్డి, బాడ్సి శేఖర్‌గౌడ్, మునిపల్లి సాయిరెడ్డి, కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్‌కుమార్, సీపీ సాయిచైతన్య, పసుపు బోర్డు కార్యదర్శి భవానీ శ్రీ, వ్యవసాయశాఖ డైరెక్టర్ఎన్ గోపి, ఉద్యానవనశాఖ కమిషనర్ యాస్మిన్ బాషా, మార్కెటింగ్‌శాఖ జేడీ మల్లేశం, డీడీ పద్మహర్ష, అనుబంధశాఖల ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు, ఐదు జిల్లాల నుంచి రైతులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. జిల్లాలో కాళేశ్వరం 20, 21, 22 ప్యాకేజీల పెండింగ్ పనులతోపాటు గుత్ప ఎత్తిపోతల పథకం మిగులు పనులకు అవసరమైన నిధులు కేటాయించి త్వరలో పూర్తి చేయిస్తామని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. నిజాంసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల పూడికతీతకు ఈనెలాఖరులోగా టెండర్ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. భూగర్భ జలాలు వృద్ధి చెందేలా అవసరమైన చోట విరివిగా చెక్ డ్యామ్‌లు నిర్మిస్తామని అన్నారు. రైతు మహోత్సవం ప్రారంభ సభావేదికపైనే జిల్లా ఎమ్మెల్యేల మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి ప్రసంగిస్తూ గన్నీ బ్యాగుల కొరత ఉందని మంత్రుల దృష్టికి సమస్యను తీసుకొచ్చారు. ఆ తర్వాత మాట్లాడిన రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి.. రాకేశ్‌రెడ్డి వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తంచేశారు. ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి సమస్యలు లేవని, బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి ఉద్దేశపూర్వకంగానే గన్నీ బ్యాగుల కొరత ఉందని చెబుతున్నారని అన్నారు. భూపతిరెడ్డి ప్రసంగం ముగిసిన తర్వాత రాకేశ్‌రెడ్డి మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, జూపల్లి కృష్ణారావు వద్దకు వెళ్లి తనపై చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఇరువురు మంత్రులు రాకేశ్‌రెడ్డిని సముదాయించడంతో వివాదం సద్దుమణిగింది. వేదికపై వాగ్వాదం సాగుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించాలి ఆయిల్‌పామ్ సాగుపై ఆసక్తి చూపాలి రైతులకిచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అట్టహాసంగా ప్రారంభమైన రైతు మహోత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన స్టాళ్లు ఐదు జిల్లాల నుంచి తరలివచ్చిన రైతులు -
రజతోత్సవ సభను విజయవంతం చేయాలి
కామారెడ్డి క్రైం : వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నె ల 27న జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పార్టీ కార్యకర్తలు విజయవంతం చేయాలని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పిలుపునిచ్చారు. సోమవారం కామారెడ్డిలోని ఆయన నివాసంలో రాజంపేట, కామారెడ్డి మండలాల పార్టీ నేతలతో సన్నాహక సభ ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇ చ్చిన హామీలను సీఎం రేవంత్‌రెడ్డి గాలికి వదిలేశా రని ఆరోపించారు. హామీల అమలు చేతకాక ప్రతిపక్షాలపై నోరు పారేసుకుంటున్నారంటూ ధ్వజమెత్తారు. పంట రుణాల మాఫీ, రైతుబంధు అమలు లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలులో మాజీ సీఎం కేసీ ఆర్ దేశానికే ఆదర్శంగా నిలిచారన్నారు. బీఆర్ఎస్ సభకు నియోజకవర్గం నుంచి 3 వేల మంది కార్యకర్తలను తరలించాలని నిర్ణయించినట్లు తెలిపారు. సమావేశంలో ఏఎంసీ మాజీ చైర్మన్ గోపి గౌడ్, పార్టీ మండలాల అధ్యక్షులు ఆంజనేయులు, బలవంతారావు, సింగిల్ విండో చైర్మన్ నల్లవెల్లి అశోక్, వైస్ చైర్మన్ రమేష్, నాయకులు మోహన్‌రెడ్డి, గూడెం బాల్‌రాజు, కమలాకర్‌రావు పాల్గొన్నారు. -
రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనుల పరిశీలన
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులను సోమవారం జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పరిశీలించారు. ఇంజినీర్లతో పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రూ.40 కోట్లతో రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు కొనసాగుతున్నాయన్నారు. పనులను త్వరగా పూర్తి చేయాలని ఎంపీ రైల్వే అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమీపంలో బ్రిడ్జి లేదా ఆర్వోబీ నిర్మించేందుకు సర్వే జరుగుతోందన్నారు. పాతరాజంపేట వద్ద కూడా రైల్వే బ్రిడ్జి నిర్మాణం కోసం ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. రైల్వే స్టేషన్ ముందు భాగంలో ఇన్, ఔట్ గేట్లను ఏర్పాటు చేసే క్రమంలో ఉపాధి కోల్పోతున్న వారికి రైల్వేశాఖ నిర్మించే మడిగెలు కేటాయించాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ అధికారులకు సూచించారు. వారి వెంట అదనపు కలెక్టర్ విక్టర్, ఆర్డీవో వాణి, మున్సిపల్ కమిషనర్ రాజేందర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్‌రెడ్డి, కాంగ్రెస్ నేతలు అశోక్‌రెడ్డి, పాత రాజు, పండ్ల రాజు, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాస్ తదితరులున్నారు. త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించిన ఎంపీ సురేశ్ షెట్కార్ మడిగెలు కోల్పోయే వారికి ప్రత్యామ్నాయం చూపాలి: షబ్బీర్ అలీ -
నేటి నుంచి రైతు మహోత్సవం
● ప్రారంభించనున్న మంత్రులు తుమ్మల, ఉత్తమ్, జూపల్లి ● మూడు రోజులపాటు కొనసాగనున్న కార్యక్రమం ● వ్యవసాయ, అనుబంధ రంగాల స్టాళ్ల ప్రదర్శన ● గిరిరాజ్ కళాశాల మైదానంలో ఏర్పాట్లు పూర్తి నిజామాబాద్ అర్బన్: రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో సోమవారం నుంచి బుధవారం వరకు రైతు మహోత్సవం నిర్వహించనున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పర్యాటక, సాంస్కృతిక శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ ఉదయం 11.00 గంటలకు ప్రారంభించనున్నారు. మూడు రోజులపాటు కొనసాగే ఈ కార్యక్రమం పురస్కార గ్రహీతలైన అభ్యుదయ రైతులతోపాటు రైతు ఉత్పాదక సంస్థలు తమ అనుభవాలు పంచుకునేందుకు వేదిక కానుంది. వ్యవసాయ, అనుబంధ రంగాల ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచనున్నారు. ఇందుకోసం సుమారు 150 స్టాల్స్ ఏర్పాటు చేశారు. వ్యవసాయ, ఉద్యానవన శాస్త్రవేత్తలు, పశుసంవర్ధక, మత్స్యశాఖ నిపుణులు, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు నూతన వ్యవసాయ పద్ధతులపై మూడు రోజుల పాటు వర్క్‌షాప్ నిర్వహిస్తారని, అందుకోసం ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. -
ఎస్ఆర్ఎన్కే @ 25 ఏళ్లు
బాన్సువాడలోని ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కళాశాలబాన్సువాడ : రెండున్నర దశాబ్దాల క్రితం వెలసిన ఈ చదువులమ్మ గుడి.. ఎంతోమంది విద్యార్థులను ఉన్నత స్థితికి చేర్చింది. తన నీడన చేరిన వారికి జ్ఞానాన్ని అందిస్తూ విద్యావృక్షంగా ఎదిగిందీ డిగ్రీ కళాశాల. బాన్సువాడలోని ఎస్ఆర్ఎన్కే (శ్రీరాం నారాయణ్ ఖేడియా) డిగ్రీ కళాశాల ఏర్పాటై 25 ఏళ్లవుతోంది. ఈ సందర్భంగా ఈనెల 24న రజతోత్సవాలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అందుబాటులో ఉన్న గ్రూపులు... ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కళాశాలలో బీఏ, బీకాం, బీకాం కంప్యూటర్స్, బీఎస్సీ (ఎంపీసీ), బీఎస్సీ (ఎంపీసీఎస్), బీజెడ్సీ, ఎంజెడ్సీ, ఎంజెడ్సీఎస్, పీజీ తెలుగు, పీజీ ఇంగ్లిష్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. 52 తరగతి గదులు, సైన్స్, కంప్యూటర్ ల్యాబ్‌లు ఉన్నాయి. కళాశాలకు 2022– 23 సంవత్సరంలో బీ+ న్యాక్ గుర్తింపు లభించింది. 2024–2025లో అటానమస్ (స్వయం ప్రతిపత్తి) హోదా లభించింది. ప్రస్తుతం 1,338 మంది విద్యార్థులు చదువుతున్నారు.అంకురార్పణ ఇలా..ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బాన్సువాడకు డిగ్రీ కళాశాల మంజూరు కాగా దేశాయిపేట్ సమీపంలోని షుగర్ ఫ్యాక్టరీ వద్ద ఏర్పాటు చేస్తే అందరికీ అనుకూలంగా ఉంటుందని భావించారు. యజమాని, పారిశ్రామికవేత్త శ్రీరాం నారాయణ్ ఖేడియాను సంప్రదించగా స్థలాన్ని ఇచ్చేందుకు సానుకూలంగా స్పందించారు. కానీ కళాశాలకు తన పేరు పెట్టాలని కోరడంతో అప్పటి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి సుముఖత వ్యక్తం చేసి ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కళాశాలగా నామకరణం చేశారు. దీంతో బాన్సువాడకు రెండు కిలోమీటర్ల దూరంలో 11.16 ఎకరాల స్థలంలో 25 ఏళ్ల క్రితం అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు కళాశాలను ప్రారంభించారు. 25 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ కళాశాలలో చదివిన వారు ప్రభుత్వ ఉద్యోగులుగా, వ్యాపారవేత్తలుగా స్థిరపడ్డారు. కళాశాల ఏర్పాటై 25 ఏళ్లవుతున్న సందర్భంగా రజతోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 24న సిల్వర్ జూబ్లీ నిర్వహణకు ఏర్పాట్లు పూర్వ విద్యార్థులకు ఆహ్వానంపూర్వ విద్యార్థులను సన్మానిస్తాం ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కళాశాల ప్రారంభమై 25 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ నెల 24న సిల్వర్ జూబ్లీ వేడుకలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. పూర్వ విద్యార్థులందరినీ ఆహ్వానిస్తున్నాం. వివిధ హోదాల్లో ఉన్న పూర్వ విద్యార్థులను సన్మానిస్తాం. – వేణుగోపాల్ స్వామి, ప్రిన్సిపల్, ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కళాశాల -
వివాహ వేడుకలో ఉమ్మడి జిల్లా నేతలు
నిజాంసాగర్: జిల్లా కేంద్రంలోని సత్య కన్వెన్షన్‌లో ఆదివారం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దఫేదార్ శోభ రాజు దంపతుల పెద్ద కూతురు కీర్తన వివాహం జరిగింది. వ్యవసాయశాఖ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ బాల్‌రాజ్, మాజీ ఎంపీ బీబీ పాటిల్, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, గంప గోవర్ధన్, జాజాల సురేందర్, హన్మంత్ సింధే, రవీందర్‌రెడ్డి, సౌదాగర్ గంగారాం, జనార్దన్ గౌడ్, అరుణతార, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబొద్దీన్ తదితరులు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. -
భవిష్యత్తుకు విద్యార్థి దశ కీలకం
భిక్కనూరు: భవిష్యత్తుకు విద్యార్థి దశ పునాది లాంటిదని సాంఘిక సంక్షేమ గురుకులాల రిటైర్డ్ రీజినల్ కో–ఆర్డినేటర్ తులసీదాస్ అన్నారు. ఆదివారం భిక్కనూరు గురుకుల కళాశాలలో నిర్వహించిన 2007–08 పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆ త్మీయ సమ్మేళనానికి ఆయన హాజరై మాట్లాడారు. 18 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై కలుసుకున్న విద్యార్థులు నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. మాజీ ప్రిన్సిపాల్ జనార్దన్, టీచర్లు గులాం యస్దాని, నర్సింగ్‌రావు, నగేశ్, అమర్నాద్, రమేశ్, రాంచంద్రబాబు, సురేందర్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు. -
బొప్పాపూర్‌లో పోలీసులకు చేదు అనుభవం
రుద్రూర్: మండలంలోని బొప్పాపూర్‌లో మహిళ మృతి విచారణకు వెళ్లిన పోలీసులకు చేదు అను భవం ఎదురైంది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన గంగవ్వ(50) ఆదివారం ఉదయం మృతి చెందింది. మహిళది సహజ మరణం కాదంటు మండల కేంద్రంలో పుకార్లు వ్యాపించాయి. ఈ విషయమై విచారణ నిమిత్తం ఎస్సై సాయన్న ఆధ్వర్యంలో బొప్పాపూర్ గ్రామానికి పోలీసులు మధ్యాహ్నం వెళ్లారు. అప్పటికే శవయాత్ర కొనసాగుతోంది. శవయాత్రను అడ్డుకున్న పోలీసులతో మృతురాలి బంధువులు వాగ్వాదానికి దిగారు. దింపుడు కళ్లెం దాటిన తర్వాత ఆపితే గ్రామానికి అరిష్టం వస్తుందని స్థానికులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోస్టుమార్టంకు అంగీకరించేది లేదంటూ శ్మశాన వాటికలో దహనం చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మహిళ సహజంగానే మరణిస్తే పోలీసులతో ఎందుకు వాగ్వాదానికి దిగారు. పోస్ట్‌మార్టం చేయడానికి అంగీకరించక పోవడం అనుమానానికి తావిస్తోంది. పోలీసులు మహిళ ఎలా మృతి చెందిందనే విషయమై గ్రామంలో విచారణ చేపడుతున్నారు. -
ట్రాక్టర్ కింద పడి బాలుడి మృతి
రాజంపేట: ప్రమాదవశాత్తు ట్రాక్టర్ టైరు కింద పడి బాలుడు మృతి చెందిన ఘటన రాజంపేట మండలం గుడితండా గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై పుష్పరాజ్ ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన మాలోత్ అనిత గణేశ్‌లకు ముగ్గురు పిల్లలు. చిన్న కుమారుడైన మాలోత్ చిన్న(3) శనివారం సాయంత్రం ఇంటి వద్ద పార్క్ చేసి ఉన్న ట్రాక్టర్‌పై కూర్చుని ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో బాలుడు ట్రాక్టర్ గేర్‌ను న్యూట్రల్ మార్చడంతో కదిలింది. ట్రాక్టర్ ట్రాలీతోపాటు రివర్స్‌లో వెనక్కి వెళ్తుండడంతో భయాందోళనకు గురైన బాలుడు ట్రాక్టర్‌పై నుంచి కింది దూకే ప్రయత్నంలో టైర్ కిందపడ్డాడు. గమనించిన కుటుంబీకులు వెంటనే బాలుడిని కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు తెలిపారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్సై తెలిపారు. నీట మునిగి వృద్ధురాలు..మాచారెడ్డి: పాల్వంచ మండలం ఇసాయిపేటలో కోలాపురం లక్ష్మి(62) అనే వృద్ధురాలు ఆదివారం నీట మునిగి మృతి చెందినట్లు ఎస్సై అనిల్ తెలిపారు. కొద్ది రోజులుగా మతిస్థిమితం కోల్పోయిన వృద్ధురాలు శనివారం రాత్రి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఆదివారం చెరువులో శవమై తేలింది. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు. చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి ..మాక్లూర్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో గుర్తు తెలియని వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు మాక్లూర్ ఎస్సై రాజశేఖర్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. మాక్లూర్ మండలం అడవి మామిడిపల్లిలో ఓ వ్యక్తి భిక్షాటన చేస్తూ జీవిస్తున్నాడు. మూడు రోజుల క్రితం అతను అనారోగ్యానికి గురికావడంతో గమనించిన స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందాడు. మృతుడి వివరాలు తెలిసిన వారు పోలీసులకు సమాచారం అందించాలని ఎస్సై కోరారు. -
ఫ్రూట్ సలాడ్ కోసం వెళ్తే రూ. లక్ష మాయం
బాన్సువాడ : ఫ్రూట్ సలాడ్ తాగేందుకు వచ్చిన ఓ వ్యక్తి రూ. లక్ష నగదును పోగొట్టుకున్న ఘటన బాన్సువాడలో చోటు చేసుకుంది. బాన్సువాడ మండలం ఇబ్రహీంపేట్ గ్రామానికి చెందిన సాయిలు అనే వ్యక్తి శనివారం బాన్సువాడలోని ఓ బ్యాంకులో రూ. లక్ష నగదును డ్రా చేసుకుని ఫ్రూట్ సలాడ్ తాగేందుకు కూల్‌డ్రింక్ దుకాణానికి వెళ్లాడు. ఫ్రూట్ సలాడ్ తాగుతున్న సమయంలో చేతిలో ఉన్న నగదు కవరును టేబుల్‌పై పెట్టి సలాడ్ తాగి కవర్‌ను అక్కడే మరిచి వెళ్లిపోయాడు. పది నిమిషాల తర్వాత అక్కడికి రాగా నగదు ఉన్న కవర్ కనిపించలేదు. అక్కడున్న సీసీ కెమెరాను పరిశీలించగా ఓ యువకుడు కవరును తీసుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. వెంటనే సాయిలు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. యువకుడిపై కేసు నమోదు రుద్రూర్: మండలంలోని బొప్పాపూర్‌లో మూడు గడ్డివాములు దగ్ధమైన ఘటనలో నందిగామ ప్రవీణ్‌పై కేసు నమోదు చేసినట్టు ఎస్సై సాయన్న తెలిపారు. ఆదివారం తెల్లవారు జామున సంగోళ్ల వినోద్, పట్ల సాయిలు, నరోజి లచ్చయ్య గడ్డివాములకు నిప్పంటించి ప్రవీణ్ పారి పోయినట్లు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై పేర్కొన్నారు. అనుమతులు లేకుండా టేకు చెట్ల నరికివేత ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి పట్టణంలోని ఎస్సీ బాలికల హాస్టల్లో అనుమతులు లేకుండా టేకు చెట్లను నరికి వేసిన ఘటనపై కామారెడ్డి అటవీశాఖ స్ట్రైకింగ్ ఫోర్స్ అధికారులు ఆదివారం తనిఖీలు నిర్వహించారు. హాస్టల్లో అనుమతులు లేకుండా టేకు చెట్లను నరికి వేశారన్న సమాచారం మేరకు కామారెడ్డి అటవీశాఖ స్ట్రైకింగ్ ఫోర్స్ డీఆర్వో అనురంజని, సెక్షన్ ఆఫీసర్ గోపాల్ పరిశీలించారు. నాలుగు చెట్లను నరికి టేకు దుంగలను ఓగదిలో ఉంచిన దానిని పరిశీలించడంతో పాటు, నరికి వేసిన టేకు చెట్ల కొలతలను తీసుకున్నారు. నరికిన టేకు దుంగల విలువ సుమారు రూ. 30 వేల వరకు ఉంటుందన్నారు. టేకు దుంగలను సీజ్ చేసి ఉన్నతాధికారులకు నివేదికను అందిస్తామని డీఆర్వో తెలిపారు. -
అగ్ని ప్రమాదాల నివారణకు కృషి చేయాలి
ఖలీల్‌వాడి: అగ్ని ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీపీ పోతరాజు సాయిచైతన్య అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని అగ్నిమాపక కేంద్రంలో నిర్వహించిన అగ్నిమాపక వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి సీపీ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అగ్నిప్రమాదం సంభవిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కార్యక్రమానికి హాజరైన పలు పాఠశాలల విద్యార్థులకు అవగాహన కల్పించారు. అగ్ని ప్రమాదాలు సంభవించిన స్థానిక ప్రజలు మంటలను ఆర్పివేస్తే ఆస్తి, ప్రాణ నష్టం తక్కువగా ఉంటుందని అన్నారు. అనంతరం విద్యార్థులకు పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. కార్యక్రమంలో ఫైర్ ఆఫీసర్లు పి.నర్సింగ్ రావు, మధుసూదన్, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు. సీపీ పోతరాజు సాయిచైతన్య -
దాది రతన్ మోహిని సేవలు ప్రశంసనీయం
కామారెడ్డి అర్బన్: బ్రహ్మకుమారి చీఫ్ అడ్మినిస్ట్రేటర్ దాది రతన్ మోహిని సేవలు ప్రశంసనీయమని బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వ విద్యాలయం నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల ఇన్చార్జి జయ దిదీ అన్నారు. ఆదివారం కామారెడ్డి ఓంశాంతి కేంద్రంలో రతన్ మోహిని దాది చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో బ్రహ్మకుమారీలు గంగలత, కవిత, లలిత, చంద్రకళ, అనిల్‌కుమార్, జిల్లాలోని ఆయా గ్రామాల ఓంశాంతి కేంద్రాల ప్రతినిధులు పాల్గొన్నారు. నేలకూలిన చెట్లు బీబీపేట: గత రెండు రోజుల క్రితం వీచిన ఈదురు గాలులు, వడగళ్ల వర్షాలకు నేలకూలిన చెట్లను అధికారులు నామమాత్రంగా తొలగించి చేతులు దులుపుకుంటున్నారు. బీబీపేట నుండి తుజాల్పూర్ ప్రదాన రహదారిలో సుమారుగా ఆరు చెట్లు నేలకూలగా అధికారులు వాటిని పట్టించుకోవడం లేదు. రోడ్లపై సగం వరకు అలాగే చెట్లు ఉండడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. ఇప్పటికై నా అధికారులు స్పందించాలని వాహనదారులు కోరుతున్నారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యం బస్తాల గోల్మాల్ నస్రుల్లాబాద్: మండలంలోని అంకోల్ గ్రామంలో ఐకేపీ వారు ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ధాన్యం బస్తాలు గోల్మాల్ జరిగినట్లు బాధిత రైతు వాపోతున్నారు. ఈ నెల 16న అంకోల్ గ్రామానికి చెందిన సంతోష్‌రెడ్డి అనే రైతు ఐకేపీ అధికారులకు 281 సంచులను తూకం చేసి ఇచ్చాడు. ప్రస్తుతం 240 సంచులు మాత్రమే తనయంటు అధికారులు తెలుపుతున్నారని, 40 సంచుల వరకు తేడా వచ్చిందని తనకు న్యాయం చేయాలని బాధిత రైతు కోరుతున్నాడు. ఈ విషయమై ఏపీఎం గంగాధర్‌ను వివరణ కోరగా గ్రామంలో పూర్తి విచారణ చేపట్టి ఎక్కడ లోపం జరిగిందో తెలుసుకుంటామని అన్నారు. -
మున్సిపాలిటీ పేరుతో పన్ను వసూలు
బిచ్కుంద(జుక్కల్): బిచ్కుంద మున్సిపాలిటీగా చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో గోపన్‌పల్లి, దౌల్తాపూర్, కందర్పల్లి గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలో విలీనం చేశారు. ఇదే అదునుగా భావించిన పంచాయతీ అధికారులు పన్ను వసూళ్ల పై ప్రత్యేక దృష్టి సారించారు. మున్సిపాలిటీ అయితే నాలుగైదు రెట్లు అన్ని రకాల పన్నులు పెరిగిపోతాయి. ఇప్పుడు పన్ను కడితే తక్కువ ఖర్చులో చెల్లించవచ్చని జోరుగా ప్రచారం చేస్తున్నారు. అధికారుల పనితీరు చెట్టు పేరుచెప్పి కాయలు అమ్ముకున్నట్లుగా ఉంది. మున్సిపాలిటీ భయంతో ప్రజలు ఇంటి, కుళాయి,వాణిజ్య సముదాయాలు, ట్రెడ్ లైసెన్సులు, ప్లాట్ల నాలా కన్వర్షన్ వివిధ రకాల పన్నులు కట్టడానికి ప్రజలు ముందుకు వస్తున్నారు. దీంతో జీపీలకు పన్ను ఆదాయం పెరుగుతోంది. గతంలో నిలదీశారు... ఇంటింటికి వెళ్లి పన్ను కట్టాలని సిబ్బంది అడిగితే తాగునీరు రావడం లేదని, మురికి కాలువలు శుభ్రం చేయడంలేదని, రోడ్డు పై చెత్త అలాగే ఉందని, వీధిలైట్లు వెలగడం లేదని ప్రజలు నిలదీసేవారు. ఇప్పుడు ఏకంగా ప్రజలే జీపీ వెళ్లి పన్ను చెల్లిస్తున్నారు. బిచ్కుంద గ్రామ పంచాయతీకి 97 శాతం రూ.30 లక్షల పైన పన్ను వసూలైంది. దౌల్తాపూర్‌లో 98 శాతం, కందర్పల్లిలో 95 శాతం, గోపన్‌పల్లిలో 90 శాతం పన్ను వసూలైందని అధికారులు తెలిపారు. ఏమైనా మున్సిపాలిటీ పేరుతో పన్ను ఆదాయం రెట్టింపు పెరిగింది. గృహ నిర్మాణాల కోసం దరఖాస్తులు.. బిచ్కుంద, గోపన్‌పల్లి, కందర్పల్లి, దౌల్తాపూర్ గ్రామ శివారులలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా ఎన్నో వెంచర్లు వెలిశాయి. భవిష్యత్తులో మున్సిపాలిటీ అధికారుల నిబంధనలు కఠినంగా ఉంటాయని భావించి, ఓపెన్ ప్లాట్లు ఉన్న వారు గృహ నిర్మాణాల అనుమతి కోసం జీపీలలో దరఖాస్తులు పెట్టుకుంటున్నారు. మున్సిపాలిటీ గెజిట్ రాకముందే నిర్మాణాల అనుమతులు పొందాలని జీపీల చుట్టూ తిరుగుతున్నారు. జీపీ అధికారులు ఎలాంటి షరతులు లేకుండా అనుమతులు ఇవ్వాలని కొందరు రాజకీయ నాయకులతో సిఫార్సు చేయిస్తున్నారు. మరికొందరు అధికారులకు అడిగినకాడికి మట్టు జెప్పుతున్నారని విమర్శలున్నాయి. జీపీలకు పెరిగిన పన్ను ఆదాయం బిచ్కుంద మున్సిపాలిటీలో మూడు గ్రామాలు విలీనం నాలుగైదు రెట్లు పన్ను పెరుగుతుందని ప్రచారం -
విజేతలకు సీపీ సన్మానం
నిజామాబాద్ అర్బన్: అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా నగర అగ్నిమాపక శాఖ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలలో కాకతీయ ఒలంపియాడ్ విద్యార్థులు ఆయా విభాగాలలో విజేతలుగా ని లిచారు. వ్యాసరచన పోటీలలో పాఠశాలకు చెందిన లక్ష్మీమేఘన(9వ తరగతి), డ్రాయింగ్ పోటీలలో వైభవి(7వతరగతి) విజేతలుగా నిలిచారు. ఆదివారం పోలీసు కమిషనర్ సాయిచైతన్య.. మెమోంటోలతో విద్యార్థులను సన్మానించారు. పాఠశాల డైరెక్టర్ రామోజీరావు మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు కో–కరికులర్ యాక్టివిటీస్ మీద కూడా శ్రద్ధ పెంచుకొని ఇలాంటి మరిన్ని విజయాలను సాధించాలని ఆకాంక్షించారు. పాఠశాల ప్రిన్సిపల్ చంద్రశేఖర్, వైస్ ప్రిన్సిపల్ దిగంబర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
చిన్నారులను బలిగొన్న లారీ
ఆర్మూర్‌టౌన్: వివాహానికి హాజరయ్యేందుకు వెళ్తు న్న ఇద్దరు చిన్నారులను లారీ రూపంలో మృత్యువు కబళించింది. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ వద్ద 44వ నంబరు జాతీయ రహదారి బైపాస్ మార్గంపై ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓంకార్(14), భానుప్రసాద్(11) అనే ఇద్దరు బాలురు దుర్మరణం చెందగా విశ్వనాథ్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆర్మూర్ పట్టణానికి చెందిన బంజ విశ్వనాథ్, లక్ష్మి దంపతుల కుమారుడు ఓంకార్ జక్రాన్‌పల్లి మండలం అర్గుల్ వసతిగృహంలో 8వ తరగతి చదువుతున్నాడు. సెలవుల్లో ఇంటికి వచ్చిన ఓంకార్ ఇంటి పక్కనే ఉండే స్నేహితుడు భానుప్రసాద్‌తో కలిసి ఉదయం వరకు ఆడుకున్నారు. కాగా, విశ్వనాథ్ పెర్కిట్‌లో జరుగుతున్న ఓ వివాహానికి హాజరయ్యేందుకు ఓంకార్, భాను ప్రసాద్‌ను తీసుకొని బైక్‌పై బయలుదేరాడు. పెర్కిట్ జాతీయ రహదారి బైపాస్ మార్గం వద్ద రోడ్డు దాటుతుండగా నిర్మల్ వైపు నుంచి వస్తున్న లారీ బైక్‌ను ఢీకొట్టింది. భానుప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడ్డ తండ్రీకొడుకులు విశ్వనాథ్, ఓంకార్‌ను పోలీసులు పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందిస్తుండగానే పరిస్థితి విషమించి ఓంకార్ మరణించాడు. విశ్వనాథ్‌ను జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్న ఇరుకుటుంబాల వారు తమ పిల్లలు ఇక లేరని తెలుసుకొని గుండెలవిసేలా విలపించారు. ప్రమాదానికి కారణమైన లారీతోపాటు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ గౌడ్ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి ఒకరికి తీవ్రగాయాలు -
ఆనవాయితీగా మారింది
ప్రతి శుభాకార్యానికి కేక్‌ను కట్ చేసుకుని సంబురాలు చేసుకోవడం ఆనవాయితీగా మారింది. జన్మదినం, వివాహం, ఎంగేజ్మెంట్, స్పెషల్ డేలకు తప్పకుండా కేక్ కట్ చేస్తున్నారు. గతంలో జన్మదిన వేడుకలకు మాత్రమే కేక్ కట్ చేయడం చూశాం. ఇప్పుడు అన్నింటికి తప్పనిసరిగా మారింది. – గాండ్ల కృష్ణ, కామారెడ్డి ప్రతి అకేషన్‌కు.. పెళ్లి రోజైన, పుట్టిన రోజైనా మా ఇంటివాళ్లు, మా ఫ్రెండ్స్ అందరం కలిసి కేక్ కట్ చేస్తాం. మా ఫ్రెండ్స్ అందరి పుట్టిన రోజు నాడు నేను కేక్ తీసుకెళ్లి వారితో కట్ చేయిస్తాను. ఆ రోజంతా అందరం కలిసి ఎంజాయ్ చేస్తాం. – సక్కర్లవార్ నరేశ్, మద్నూర్ -
సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం
లింగంపేట : ఏళ్ల తరబడిగా పెండింగ్‌లో ఉన్న భూముల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తున్నామని భూ భారతి ప్రత్యేకాధికారి రాజేందర్ పేర్కొన్నారు. శనివారం మండలంలోని బాయంపల్లి, కన్నాపూర్ గ్రామాల్లో భూ భారతి సదస్సులు నిర్వహించారు. బాయంపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో భూభారతి ప్రత్యేకాధికారి రాజేందర్ మాట్లాడారు. రైతులకు భూ భారతి పోర్టల్‌పై అవగాహన కల్పించారు. రైతులు తమ సమస్యలను ధరఖాస్తులో స్పష్టంగా రాసి అధికారులకు అందించాలని సూచించారు. పథకం అమలు తీరు, పథకంలో ఏ ఏ సమస్యలు పరిష్కారం అవుతాయో వివరించారు. సదస్సుల్లో ఈనెల 30వ తేదీ వరకు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. ఆ తర్వాత జూన్ 2వ తేదీ వరకు రైతుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. 30 రోజుల్లో పరిష్కారం కాని సమస్యలను ఆర్డీవో, కలెక్టర్ పరిధిలో పరిష్కరిస్తామన్నారు. అప్పటికీ పరిష్కారం కానివాటిపై ట్రిబ్యునల్‌కు వెళ్లే అవకాశం ఉంటుందన్నారు. రెవెన్యూ, అటవీ శాఖల మధ్య భూ వివాదాలపై సంయుక్తంగా సర్వే చేసి పరిష్కార మార్గాలు సూచిస్తామన్నారు. కోర్టు కేసులు ఉంటే తమ దృష్టికి తెస్తే సాధ్యమయ్యేవి అయితే అమ్మిన వారికి, కొన్న వారికి నోటీసులు ఇచ్చి పరిష్కరిస్తామన్నారు. బాయంపల్లిలో 86 దరఖాస్తులు, కన్నాపూర్ గ్రామంలో 74 దరఖాస్తులు వచ్చాయన్నారు. బాయంపల్లిలో 19 సర్వే నంబరులో 50 మంది రైతులకు చెందిన 408 ఎకరాలు, 75 సర్వే నంబరులో 25 మందికి సంబంధించిన 135 ఎకరాలు సీలింగ్ భూములుగా నమోదై ఉన్నట్లు రైతులు తన దృష్టికి తెచ్చారన్నారు. వాటిని విచారించి పరిష్కార మార్గాలు చూపుతామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ సురేష్, ఉపతహసీల్దార్ రాందాస్, ఎఫ్ఆర్వో ఓంకార్ తదితరులు పాల్గొన్నారు. భూ భారతి ప్రత్యేకాధికారి రాజేందర్ -
‘అనవసర రాద్ధాంతం చేస్తున్నారు’
కామారెడ్డి టౌన్: వక్ఫ్ బోర్డు సంస్కరణల చట్టం విషయంలో ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర వక్ఫ్ సుధార్ జన జాగరణ్ అభియాన్ సభ్యుడు వెంకట్‌రెడ్డి విమర్శించా రు. శనివారం జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయ న మాట్లాడారు. ఈ చట్ట సవరణ వల్ల ముస్లింలకు ఎలాంటి నష్టం జరగదన్నారు. వక్ఫ్ భూముల దుర్వినియోగాన్ని అరికడుతుందన్నారు. దేశంలో వక్ఫ్ ఆస్తుల ద్వారా భారీగా ఆదాయం వస్తున్నా 3 శాతం ముస్లింలు మాత్రమే వీటిని అ నుభవిస్తున్నారని, 97 శాతం మందికి ప్రయోజనం లేదని పేర్కొన్నారు. ప్రతిపక్షాల రాజకీయ లబ్ధికోసం అసత్య ప్ర చారం చేస్తున్నాయని, వారిని నమ్మవద్దని ప్రజలను కోరారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీ లం చిన్నరాజులు, జుక్కల్ మాజీ ఎమ్మెల్యే అరుణతార, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాణాల లక్ష్మారెడ్డి, రంజిత్ మోహన్, జిల్లా ప్రధాన కార్యదర్శులు రాము, నరేందర్‌రెడ్డి, రవీందర్రావు, నాయకులు కుంట లక్ష్మారెడ్డి, నేహల్, హారిక, బాలమణి, శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
పెద్దమ్మా.. చల్లంగ చూడమ్మా..
మండల కేంద్రంలో పెద్దమ్మ ఆలయ ఉత్సవాల్లో భాగంగా శనివారం బోనాల పండుగ జరుపుకున్నారు. రాత్రి బోనాలతో శోభాయాత్ర నిర్వహించారు. అమ్మవారికి బోనాలు సమర్పించి, మొక్కులు తీర్చుకున్నారు. ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఆలయాన్ని సందర్శించి, అమ్మవారికి పూజలు చేశారు. ఆదివారం తిరుగుబోనాలతో ఉత్సవాలు ముగుస్తాయని ఆలయ కమిటీ అధ్యక్షుడు నాగారపు ఎల్లయ్య తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు పున్న లక్ష్మణ్, కామిండ్ల కృష్ణ, పురుషోత్తం, రాజేందర్, సంతోష్‌కుమార్, రాములు తదితరులు పాల్గొన్నారు. – దోమకొండ -
సిద్ధంగా ఉంచుతున్నాం..
ఒకప్పుడు జన్మదినానికి మాత్రం ముందుగా ఆర్డర్ ఇస్తే కేక్ తయారు చేసి ఇచ్చేవాళ్లం. ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రతి శుభకార్యానికి కేక్ కట్ చేస్తున్నారు. దీంతో ఎప్పుడంటే అప్పుడు 2 నిమిషాల్లోనే కేక్‌లను ఇచ్చేస్తున్నాం. చాలా రకాల కేక్‌లను తయారు చేసి సిద్ధంగా ఉంచుతున్నాం. – నరేశ్, బేకరీ యజమాని, కామారెడ్డి పిల్లల బర్త్‌డేకు తప్పనిసరి పిల్లల బర్త్‌డేకు తప్పనిసరిగా మేం కేక్ కట్ చేస్తాం. పిల్లలు వారి ఫ్రెండ్స్ ఆహ్వానిస్తారు. చాలా ఆనందంగా గడుపుతారు. అలాగే మా ఫ్రెండ్స్‌ను కూడా బర్త్‌డేలకు ఆహ్వానిస్తాం. మ్యారేజ్ డేకు కూడా కేక్ కట్ చేస్తాం. – వంగపల్లి వైష్ణవి, మద్నూర్ -
ప్రణాళికాబద్ధంగా కొనుగోళ్లు చేపట్టాలి
కామారెడ్డి క్రైం/ఎల్లారెడ్డి : ప్రణాళికాబద్ధంగా యా సంగి ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూచించారు. శనివారం ఆయన హైదరాబాద్ నుంచి వీడియో కా న్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో సన్న బియ్యం సరఫరా, ధాన్యం కొనుగోళ్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అకాల వర్షాల కారణంగా రైతులు నష్టపోకుండా ధాన్యాన్ని వేగంగా కొనుగో లు చేయాలన్నారు. ధాన్యం సేకరణపై కలెక్టర్లు ప్ర త్యేక దృష్టి సారించి ప్రత్యేక పర్యవేక్షణ చేయాలన్నా రు. తాలు, తరుగు పేరు మీద రైస్ మిల్లర్లు ఎలాంటి కోతలు విధించకుండా చూడాలన్నారు. సన్న బియ్యం పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలన్నారు. గ్రామాలలో తాగునీటి సమస్యలు రాకుండా చూడాలని సూచించారు. జిల్లాలో 446 కొనుగోలు కేంద్రాలు.. జిల్లాలో 446 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పా టు చేశామని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. ఎ ల్లారెడ్డి ఆర్డీవో కార్యాలయం నుంచి వీసీలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల గురించి మంత్రికి వివరించారు. 63 కేంద్రాల ద్వారా సన్న ధాన్యం సేకరిస్తున్నామన్నారు. జిల్లాకు సంబంధించి 4.49 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యం, 1.13 లక్షల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం కొనుగో లు కేంద్రాలకు రావచ్చని భావిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 4,314 మెట్రిక్ టన్నుల దొడ్డు బి య్యం, 53,340 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం కొనుగోలు చేశామన్నారు. ఆయా కేంద్రాల్లో అవసరమైన టార్పాలిన్లు అందుబాటులో ఉంచామని, సౌకర్యాలు కల్పించామని వివరించారు. వీడి యో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు విక్టర్, చందర్ నాయక్, ఆర్డీవో ప్రభాకర్, డీఆర్డీవో సురేందర్, పౌర సరఫరాల సంస్థ డీఎం రాజేందర్, డీఎస్వో మల్లికార్జున్ బాబు, డీసీవో రామ్మోహన్, మార్కె టింగ్ శాఖ అధికారి రమ్య పాల్గొన్నారు. ధాన్యం సేకరణను కలెక్టర్లు పర్యవేక్షించాలి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి -
పారదర్శకంగా ఎంపిక చేయాలి
పంచాయతీ కార్యదర్శులతో మాట్లాడుతున్న కలెక్టర్ సంగ్వాన్ఎల్లారెడ్డిరూరల్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. శనివారం ఆర్డీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిర మ్మ ఇళ్ల సర్వేను సక్రమంగా నిర్వహించాలని, అ నర్హులకు ఇళ్లను మంజూరు చేయరాదని ఆదేశించారు. లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణానికి ముందుకు రావాలన్నారు. ఆర్థికంగా వెనకబడిన వారికి స్వయం సహాయక సంఘాల ద్వారా లక్ష రూపాయల రుణం మంజూరు చేయాలని సూచించా రు. రేషన్ కార్డుల సర్వే సైతం పారదర్శకంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్ట ర్లు విక్టర్, చందర్‌నాయక్, డీపీవో మురళి, డీఎల్పీవో సురేందర్, మున్సిపల్ కమిషనర్ మహేశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. 57 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నాం జిల్లాలో ఇప్పటివరకు యాసంగికి సంబంధించి 57వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చే శామని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. శ నివారం ఎల్లారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆయ న సందర్శించారు. నూతనంగా వచ్చిన ప్యాడీ క్లీనర్‌ను పరిశీలించారు. అనంతరం ఆయన విలే కరులతో మాట్లాడారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూ డాలని అధికారులను ఆదేశించామన్నారు. కొ నుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని మిల్లులకు తరలించే పనులు జరుగుతున్నాయన్నారు. కాంటాలు ప్రారంభంకాని చోట కాంటాలు ప్రారంభించాలని అధికారులను ఆదేశించామన్నారు. -
ఉమ్మడి జిల్లా రైతులు తరలిరావాలి
సుభాష్‌నగర్: నిజామాబాద్‌లోని జీజీ కాలేజీలో సోమవారం నుంచి మూడు రోజులపాటు నిర్వహించనున్న రైతు మహోత్సవానికి ఉమ్మడి జిల్లా రైతులు తరలిరావాలని డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్‌రెడ్డి కోరారు. నగరంలోని డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వ్యవసాయంలో నూతన పద్ధతులు, సాంకేతిక విజ్ఞానం ద్వారా లాభసాటి వ్యవసాయం, రైతుకు అధిక దిగుబడి వచ్చే అంశాలు, డ్రోన్ వ్యవసాయం, వివిధ రకాల వంగడాలకు సంబంధించిన స్టాళ్లు ఉత్సవాల్లో ఏర్పాటు చేస్తున్నామన్నా రు. సమావేశంలో బ్యాంకు వైస్ చైర్మన్ నల్ల చంద్రశేఖర్‌రెడ్డి, డైరెక్టర్లు గిర్దావర్ గంగారెడ్డి, గోర్కంటి లింగన్న, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. -
‘దోషులకు శిక్ష పడేలా చూడాలి’
కామారెడ్డి క్రైం: కేసులలో దోషులకు శిక్ష పడే లా చూడాలని ఎస్పీ రాజేశ్ చంద్ర సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివా రం నిర్వహించిన సమావేశంలో కోర్టు వి ధులు నిర్వహించే అధికారులు, సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేరస్తులకు శిక్ష పడితే నే నేరాల సంఖ్య తగ్గుతుందని, బాధితులకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ఎఫ్ ఐఆర్ మొదలుకొని చార్జిషీట్, సాక్షులను ప్ర వేశపెట్టడం వరకు అన్ని రకాల కోర్టు విధుల ను పకడ్బందీగా నిర్వహించాలని సూచించా రు. సమావేశంలో ఏఎస్పీ నర్సింహారెడ్డి, అ ధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. తాడ్వాయి ఎస్సైపై సస్పెన్షన్ వేటు కామారెడ్డి క్రైం: విధుల్లో నిర్లక్ష్యాన్ని కనబరిచినందుకు తాడ్వాయి ఎస్సై వెంకటేశ్వర్లుపై స స్పెన్షన్ వేటు పడింది. ఇటీవల ఎస్పీ రాజేశ్ చంద్ర తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చే శారు. ఆ సమయంలో ఎస్సై వెంకటేశ్వర్లు అందుబాటులో లేరు. ఎక్కడికి వెళ్లారన్న వి షయమై సిబ్బంది సరైన సమాధానం ఇవ్వలేదు. అనంతరం ఎల్లారెడ్డిలో పర్యటించిన ఎస్పీ.. కామారెడ్డికి తిరిగి వస్తూ తాడ్వాయి పీఎస్‌ను మరోసారి సందర్శించారు. అప్పు డు కూడా ఎస్సై లేకపోవడంతో వాకబు చే యగా.. సీఐకిగాని, డీఎస్పీకి గాని సమాచా రం ఇవ్వకుండా స్థానికంగా అందుబాటులో లేరని తెలిసింది. సదరు ఎస్సై వ్యవహారంపై విచారణ జరపగా స్థానికంగా సరిగా అందుబాటులో ఉండరని తేలింది. దీంతో శాఖాపరమైన చర్యలకు ఎస్పీ ఉన్నతాధికారులకు నివేదించారు. దీంతో విధుల్లో నిర్లక్ష్యం కనబరిచిన ఎస్సైని సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్ ఐ జీ చంద్రశేఖర్‌రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వరిధాన్యం తూకాలు ప్రారంభం నిజాంసాగర్: నిజాంసాగర్, మహమ్మద్‌నగర్ మండలాల్లోని మల్లూ ర్, మహమ్మద్‌నగర్ గ్రా మాల్లో శనివారం వరిధాన్యం తూకాలను ప్రా రంభించారు. ‘వడ్లు కొనేదెప్పుడో’ శీర్షికన శ నివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి స్పందించిన అధికారులు.. వెంటనే కాంటాలకు చర్యలు తీసుకున్నారు. రెండు గ్రామా ల్లోని కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని కాంటా వేయించారు. మిగిలిన గ్రామాల్లో రెండు, మూడు రోజుల్లో తూకాలు ప్రారంభి స్తామని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో మహమ్మద్‌నగర్ మండల వ్యవసాయ శాఖ అధికారి నవ్య, సొసైటీ సీఈవోలు చింతరాములు సేట్, సాయిలు పాల్గొన్నారు. 350 ఎకరాల్లో నష్టం బీబీపేట: మండల కేంద్రంతో పాటు యాడారం, మల్కాపూర్, శివారు రాంరెడ్డిపల్లి గ్రా మాల్లో శుక్రవారం రాత్రి కురిసిన వడగళ్ల వా నకు సుమారు 350 ఎకరాల్లో వరి, మామిడి తోటలకు నష్టం వాటిల్లిందని మండల వ్యవసాయ అధికారి నరేంద్ర తెలిపారు. అధికారులు శనివారం ఉదయం నుంచి ఆయా గ్రా మాల్లో పంటలను పరిశీలించారు. కోళ్ల ఫా రాల పైకప్పులు లేచిపోవడంతో పౌల్ట్రీ రైతు లూ నష్టపోయారన్నారు. ఏవో వెంట ఏఈ వో రాఘవేంద్ర తదితరులున్నారు. ‘మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి’ కామారెడ్డి క్రైం: యువత మత్తు పదార్థాలకు, కల్తీ కల్లుకు దూరంగా ఉండాలని ఎకై ్సజ్ సూపరింటెండెంట్ హన్మంతరావు సూచించారు. ఈ విషయమై జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. కల్తీకల్లు, మత్తుపదార్థాల కారణంగా కలిగే దుష్ప్రభావాలపై శనివారం జిల్లావ్యాప్తంగా 22 మండలాల పరిఽధిలో 86 గ్రామాల్లో అవగాహన సదస్సులు, ర్యాలీలు నిర్వహించామన్నారు. మత్తు పదార్థాలను రవాణా చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఎవరైనా మత్తు పదార్థాలను సరఫరా చేసినా, విక్రయించినా 1908 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచడంతోపాటు, పారితోషికం అందిస్తామని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
ట్యాబ్ ఎంట్రీ ప్రక్రియను వేగవంతం చేయాలి
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతుల వివరాలకు సంబంధించి ట్యాబ్‌ఎంట్రీ ప్రక్రియను వేగవంతం చేయాలని టాస్క్‌ఫోర్స్ బృందం అధికారులు శ్రీధర్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి సూచించారు. గోపాల్పేట, బంజరతండా, ధర్మారెడ్డి, తాండూర్ గ్రామాల్లో గల ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం వారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యంలో తేమశాతం, తూకం సేకరణ ప్రక్రియను వారు పరిశీలించారు. టాస్క్‌ఫోర్స్ బృందం సభ్యులు లక్ష్మయ్య, శ్రీనివాస్, అసిస్టెంట్ సివిల్ సప్లయ్ అధికారి సుదర్శన్‌రెడ్డి, ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ ఖలీద్, తదితరులున్నారు. -
చారిత్రక కట్టడాల విశిష్టతపై అవగాహన
దోమకొండ: ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని గడికోట, బురుజు, ఉపగడ్డ తదితర చారిత్రక కట్టడాలపై శనివారం విద్యార్థులకు గడికోట ట్రస్టు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా విద్యార్థులకు కట్టడాలను ప్రక్ష్యతంగా చూపించి వాటి విశిష్టతను తెలియజేశారు. గడికోట నుంచి బురుజు వరకు ర్యాలీగా వెళ్లి బురుజు కట్టడం దాని చరిత్ర వా రికి వివరించారు. గడికోట ట్రస్టు మేనేజర్ బా బ్జీ, ట్రస్టు ప్రతినిధులు గణేష్‌యాదవ్, రాజశేఖ ర్, హరీష్, కల్పన విద్యార్థులు ఉన్నారు. -
ప్రతిభను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది
డీఈవో రాజు కామారెడ్డి రూరల్: విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరికీ ఉందని డీఈవో రాజు అన్నారు. శనివారం చిన్నమల్లారెడ్డి బాలుర ఉన్నత పాఠశాల వార్షికోత్సవ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డీఈవో రాజు హాజరై ప్రసంగించారు. విద్యార్థులు చదువుతోపాటు ఆట పాటల్లో ముందుండాలన్నారు. విద్యార్థులు తమ నైపుణ్యాలను ప్రదర్శించేందుకు ఇది మంచి వేదికగా నిలుస్తుందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఎంఈవో ఎల్లయ్య, హెచ్ఎంలు సాయిరెడ్డి, హన్మాండ్లు, సెక్టోరియల్ అధికారి నాగవేందర్, ఎఫ్ఏవో రమేష్, ఏసీజీ బలరాం, జీసీడీవో సుకన్య తదితరులు పాల్గొన్నారు.