Tamil Nadu
-
పర్యాటకులకు స్వర్గధామం పుదుచ్చేరి
● పర్యాటక శాఖా మంత్రి లక్ష్మీనారాయణన్ రికార్డు స్థాయిలో సంక్షేమ ఫలాల పంపిణీ ముదురై రైల్వేస్టేషన్లో గుర్తుతెలియని శిశువు సాక్షి , చైన్నె: దేశంలోనే అత్యంత ఆదరణ పొందిన పర్యాటక ప్రదేశం కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అని ఆ రాష్ట్ర ప్రజాపనులు, పర్యాటక శాఖ మంత్రి కె.లక్ష్మీనారాయణన్ తెలిపారు. చైన్నె వేదికగా రాడిసన్ రిసార్ట్ పాండిచ్చేరి బే (జీఆర్టీ హోటల్స్ అండ్ రిసార్ట్స్) నేతృత్వంలో పుదుచ్చేరి పర్యాటకాన్ని సెలబ్రేట్ చేసుకునేలా ప్రత్యేక గ్రీన్ ప్రెస్ కాన్ఫరెన్స్‌ను బుధవారం నిర్వహించారు. జీఆర్టీ హోటల్స్ సీఈఓ విక్రమ్ కోటా అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి పుదుచ్చేరి పర్యాటక శాఖామంత్రి కె.లక్ష్మీనారాయణన్ పాల్గొని గ్రేట్ గ్రీన్ మీటింగ్స్‌ను ప్రారంభించారు. మంత్రి మట్లాడుతూ బెస్ట్ ఇన్ ట్రావెల్–2025 జాబితాలో పుదుచ్చేరి ప్రతిష్టాత్మకమైన స్థానాన్ని సంపాదించుకుందని అన్నారు . ప్రపంచంలో సందర్శన ప్రాంతాల్లో పుదుచ్చేరి రెండో స్థానంలో నిలిచిందన్నారు. పుదుచ్చేరి ప్రభుత్వం పర్యాటక రంగాన్ని వినూత్నంగా అభివృద్ధి పరుస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈక్రమంలో ఎక్స్పీరియన్స్ పాండిచ్చేరి–లోన్లీ ప్లానెట్స్ పిక్ ట్రావెల్ ప్యాకేజీని తీసుకునిరాగా రాడిసన్ రిసార్ట్ పాండిచ్చేరి బే ఒక కొత్త అనుభవపూర్వక ఆఫర్‌ను ప్రవేశపెట్టినట్ట విక్రమ్ కోటా తెలియజేశారు. పైపులైన్ల మరమ్మతులు త్వరితగతిన పూర్తి చేయండి –కలెక్టర్ సుబ్బలక్ష్మి ఆదేశం వేలూరు: వేలూరు కార్పొరేషన్‌కు సరఫరా అయ్యే తాగునీటి పైపులైన్లకు మరమ్మతులు వెంటనే పూర్తి చేసి నీరు సరఫరా చేయాలని కలెక్టర్ సుబ్బలక్ష్మి అధికారులను ఆదేశించారు. వేలూరు కార్పొరేషన్ పరిధిలోని చేపల మార్కెట్ సమీపంలో తాగునీటి పైపులైను మరమ్మతు పనులులచేస్తున్నారు. దీంతో రెండు రోజులుగా కార్పొరేషన్‌కు నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో కలెక్టర్ ఉదయం నేరుగా వెళ్లి పరిశీలించారు. ప్రస్తుతం పనులు చేస్తున్న దృష్ట్యా ట్రాఫిక్ సమస్యతో పాటు తాగునీటి సమస్య కూడా తలెత్తుతోందని, వేసవిలో తాగునీటిని రోజూ సరఫరా చేసే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని, ఎక్కడా పైపులైన్ల లీకేజీలు లేకుండా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు కార్పొరేషన్ కమిషనర్ జానకి, కార్పొరేషన్ అధికారులు, తమిళనాడు నీటి సరఫరా శాఖ ఇంజినీర్లు, అధికారులు పాల్గొన్నారు. పోప్ ఫ్రాన్సిస్‌కు అంజలి రోమన్ క్యాథలిక్ గురువైన పోప్ ప్రాన్సిస్ అస్తమించిన విషయం తెలిసిందే. ఆయన్ని స్మరిస్తూ చైన్నెలోని లయోలా కళాశాలలో సంస్మరణ కార్యక్రమం బుధవారం సాయంత్రం జరిగింది. పోప్ చిత్ర పటానికి సీఎం స్టాలిన్ అంజలి ఘటించారు. పోప్ సేవలను గుర్తు చేస్తూ, ఆయన పార్తీవ దేహానికి తమిళనాడు ప్రభుత్వం తరపున బృందం వాటికన్‌కు వెళ్లి నివాళులర్పించిన విషయాన్ని సీఎం ప్రస్తావించారు. శాంతికి చిహ్నంగాపోప్ కీర్తి అజరామరం అని పేర్కొన్నారు. – సాక్షి, చైన్నె కోవై బ్యాంక్‌కు బాంబు బెదిరింపు తిరువొత్తియూరు: కోవై సింగం ప్రాంతంలో సౌత్ ఇండియన్ బ్యాంక్‌కు బాంబు బెదిరింపు రావడం సంచలనం కలిగించింది. ఈ బ్యాంకుకు బుధవారం ఈ మెయిల్ ద్వారా బాంబు పెట్టి ఉన్నట్లు బెదిరింపు మెసేజ్ వచ్చింది. దిగ్భ్రాంతి చెందిన బ్యాంకు శాఖ మేనేజరు రేస్ కోర్సు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో బాంబు స్క్వాడ్ నిపుణులు, పోలీసులు జాగిలాలతో అక్కడ చేరుకొని డిటెక్టర్ ద్వారా బ్యాంక్ ప్రాంతం అంతా తనిఖీ చేశారు. చివరికి బాంబు ఏదీ లేదని తేల్చారు. ఈమేరకు పోలీసులు విచారణ చేస్తున్నారు. అపోలోలో డిజి–స్టార్ట్ ల్యాబ్ కొరుక్కుపేట: అపోలో డయాగ్నోస్టిక్స్ చైన్నెలో డిజి–స్మార్ట్ సెంట్రల్ రెఫరెన్స్ ల్యాబొరేటరీ(సీఆర్ఎల్)ను అందుబాటులోకి తీసుకొచ్చారు. బుధవారం ఉదయం జరిగిన కార్యక్రమానికి అపోలో గ్రూప్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి పాల్గొని రిబ్బన్ కట్ చేసి లాంచనంగా ప్రారంభించారు. ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్పర్సన్ డాక్టర్ ప్రీతారెడ్డి, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతరెడ్డి పాల్గొన్నారు. అల్లుడికి యావజ్జీవ శిక్ష అన్నానగర్: అత్తను కడతేర్చిన కేసులో అల్లుడికి కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. చైన్నెలోని మాధవరం డెయిరీ ప్రాంతానికి చెందిన బాలాజీ (26). ఇతని భార్య సుధ. వీరిద్దరు 2015లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. భార్య ప్రవర్తనపై బాలాజీకి అనుమానంతో తరచూ ఆమెతో గొడవ పడేవాడు. 2021లో దంపతుల మధ్య వివాదం తలెత్తడంతో బాలాజీ ఆమైపె దాడి చేశాడు. దీంతో సుధ పుట్టింటికి వెళ్లింది. విషయం తెలిసి బాలాజీ డిసెంబర్ 18, 2021న అక్కడికి వెళ్లి గొడవకు దిగాడు. ఆపై బాలాజీ కత్తితో సుధ తల్లి లతను హత్య చేశాడు. ఎంకేబీ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి బాలాజీని అరెస్ట్ చేశారు. జస్టిస్ మురుగేశన్ ఎదుట చైన్నెలోని 6వ అదనపు సెషన్‌న్స్ కోర్టులో విచారణ జరిగింది. పోలీసుల తరఫున అదనపు క్రిమినల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దేవాప్రసాద్ హాజరయ్యారు. బుధవారం కేసును విచారించిన న్యాయస్థానం బాలాజీపై అభియోగం రుజువు కావడంతో జీవిత ఖైదు, రూ.2 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. తిరువళ్లూరు: జిల్లాలోని అర్హులైన వారిని గుర్తించి ఒకేసారి 65వేల మందికి ఇంటి పట్టాలను పంపిణీ చేశామని, అందుకు రెవెన్యూతో సహా అన్ని శాఖలకు చెందిన అధికారులు మూడు నెలల పాటు నిరంతరాయంగా శ్రమించారని మంత్రి నాజర్ అన్నారు. తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ పొన్నేరిలోని అండార్మఠంలో ఇటీవల సీఎం సుమారు రెండు లక్షల మందికి వేర్వేరు సంక్షేమ పథకాల ఫలాలు అందజేయడం విదితమే. జిల్లాలోని దాదాపు 65 వేల మందికి రికార్డు స్థాయిలో ఇంటి పట్టాలను పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సభ, సంక్షేమ పథకాలను పంపిణీ చేయడానికి శ్రమించిన ఉద్యోగులను బుధవారం ఉదయం కలెక్టర్ కార్యాలయంలో సన్మానించారు. ముఖ్యఅతిథిగా రాష్ట్ర మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి నాజర్‌తో పాటు పలువురు హాజరయ్యారు. మంత్రి పై విధంగా మాట్లాడారు. సంక్షేమ పథకాల కోసం అర్హుల ఎంపిక విషయంలో అధికారులు నిరంతరాయంగా కృషి చేశారని అభినందించారు. అనంతరం తహసీల్దార్లు, ఆర్డీఓలు, అన్ని శాఖ అధికారులను మంత్రి, కలెక్టర్ ప్రతాప్ సన్మానించి ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో డీఆర్వో రాజ్‌కుమార్, ప్రాజెక్టు డైరెక్టర్ జయకుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సేలం: నాగర్‌కోయిల్–బెంగళూరు ఎక్స్‌ప్రెస్ (నంబర్. 17236) మదురై, కరూర్, నామక్కల్, సేలం మీదుగా బెంగళూరుకు నడుస్తోంది. అదేవిధంగా ఈ రైలు బెంగళూరు నుంచి సేలం మీదుగా నాగర్‌కోయిల్‌కు నడుస్తోంది. ఈ స్థితిలో ఎప్పటిలాగే ఈ రైలు మంగళవారం రాత్రి 7.15 గంటలకు నాగర్‌కోయిల్ జంక్షన్ రైల్వేస్టేషన్‌న్‌లో బయలుదేరి బెంగళూరు వెళుతోంది. జనరల్ కోచ్‌లో ప్రయాణిస్తున్న వీరమణి (29) వద్ద మదురై రైల్వే స్టేషన్లో రైలు ఆగినప్పుడు, గుర్తుతెలియని వ్యక్తి 8 నెలల బాలుడిని అప్పగించి వాటర్ బాటిల్ కొనుక్కుని వస్తానని చెప్పి వెళ్లాడు. అప్పటికి రైలు బయలుదేరింది. అతను రాకపోవడంతో వీరమణి హెల్ప్‌లైన్‌న్‌కు ఫోన్ చేసి ఈ విషయాన్ని తెలియజేశాడు. దీని ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో రైలు సేలం జంక్షన్ రైల్వేస్టేషన్న్కు రాగానే ఎస్ఐ కోదండపాణి, మహిళా పోలీసు అధికారిణి రమ్య వీరమణి నుంచి చిన్నారిని తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. అనంతరం చిన్నారిని సేలం జిల్లా కలెక్టరేట్లో నిర్వహిస్తున్న శిశు సంక్షేమ క్షేత్రస్థాయి కార్యకర్తకు అప్పగించారు. -
మధుమేహంపై విస్తృత పరిశోధనలు అవసరం
వేలూరు: ప్రపంచ వ్యాప్తంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు పెరుగుతున్నారని, ఈ వ్యాధి విస్తృతి తగ్గించేందుకు పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని వేలూరు వీఐటీ యూనివర్సిటీ చాన్సలర్ విశ్వనాధన్ పిలుపునిచ్చారు. వేలూరు జిల్లా కాట్పాడి ప్రాంతంలోని గాంధీనగర్‌లో డాక్టర్ మోహన్స్ మధుమేహ ఆసుపత్రిని ప్రారంభించి ఆయన మాట్లాడారు. మధుమేహంతో సుమారు 25 శాతం మంది మన ఇండియాలో బాధ పడుతున్నారని, గతంలో కోటీశ్వరులకు మాత్రమే ఈ వ్యాధి వచ్చేదని, ఇప్పుడు చిన్నవయస్సులోనే దీని బారిన పడుతున్నారంటూ దీనికి కారణాలను విశ్లేషించారు. మధుమేహ వ్యాధి వైద్య నిపుణులు డాక్టర్ మోహన్స్ మాట్లాడుతూ, ఈ వ్యాధిపై పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణులకు సైతం అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.. ఈ వ్యాఽధిబారిన వారు మితాహారం తీసుకోవాలని, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అలవరచుకోవాలన్నారు. తమ ఆస్పత్రిలో నిరుపేద మధుమేహ రోగులకు ఇన్సులిన్, మందులను ఉచితంగా ఇస్తున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నందకుమార్, కార్తికేయన్, వైద్య నిపుణులు డాక్టర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. మదుమేహ వ్యాధి గ్రస్తులు తగ్గేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయాలి -
మళ్లీ మెగాఫోన్ పట్టనున్న
శశికుమార్ తమిళసినిమా: యాక్షన్, సెంటిమెంట్, ఫ్యామిలీ ఇలా ఏ తరహా పాత్రనైనా పోషించి మెప్పించగల నటుడు శశికుమార్. ఈయన కథానాయకుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా పరిచయం అయిన చిత్రం సుబ్రమణిపురం. 2008 జూలై 4వ తేదీన విడుదలైన ఈ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. ఆ తరువాత 2010లో ఈశన్ అనే చిత్రానికి దర్శకత్వం వహించి కథానాయకుడిగా నటించారు. ఆ తరువాత నటనపైనే దృష్టి సారించిన శశికుమార్ దర్శకత్వానికి దూరంగా ఉన్నారు. అయినప్పటికీ మళ్లీ దర్శకత్వం వహిస్తానని చాలా కాలంగా చెబుతూనే ఉన్నారు. మధ్యలో ఈయన నటించిన చిత్రాలు ఆశించిన విజయాలను సాదించలేదు. అలాంటిది ఆ మధ్య నటించిన అయోత్తి చిత్రం మంచి పేరు తెచ్చి పెట్టింది. అదే విధంగా సూరి కథానాయకుడిగా నటించిన గరుడన్ చిత్రంలో బలమైన పాత్రను పోషించి ఆ చిత్ర విజయానికి ముఖ్య కారణంగా నిలిచారు. కాగా తాజాగా శశికుమార్ ,సిమ్రాన్ జంటగా నటించిన టూరిస్ట్ ఫ్యామిలీ చిత్రం నిర్మాణ కార్యక్రామలను పూర్తి చేసుకుని గురువారం తెరపైకి రానుంది.ఇది శ్రీలంక నుంచి ఒక కుటుంబం అక్రమంగా చెన్నకి చేరుకుని, ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నారు అన్న ఇతివృత్తంతో రూపొందిన కథా చిత్రం. కాగా ఈ చిత్ర ప్రమోషన్లో భాగంగా నటుడు శశికుమార్ తదుపరి ఒక పిరియడ్ కథా చిత్రంలో నటిస్తూ, దర్శకత్వం వహించనున్నట్లు చెప్పారు.ఈ చిత్ర షూటింగ్‌ను 2026 జనవరిలో ప్రారంభించనున్నట్లు చెప్పారు. అయితే దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. కొన్నేళ్ల క్రితం ఒక పీరియడ్ కథను తయారు చేసి దాన్ని నటుడు విజయ్, సూర్యకు చెప్పానన్నారు. అయితే అది కొన్ని కారణాల వల్ల సెట్ కాలేదని చెప్పారు. కాగా ఈ చిత్రం తరువాత ఆ కథను సరైన హీరో లభించినప్పుడు కచ్చితంగా తెరకెక్కిస్తానని శశికుమార్ చెప్పారు. -
అగస్తీశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
నారాయణవనం : మండలంలోని సముదాయం గ్రామంలో మరగదవళ్లీ సమేత అగస్తీశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలకు బుధవారం సాయంత్రం అంకురార్పణ చేశారు. గురువారం ఉదయం ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని ఆలయ అధికారి నాగరాజు, అర్చకుడు రమేష్ గురుకల్ తెలిపారు. సాయంత్రం మరగదవళ్లీ, అగస్తీశ్వర స్వామి ఉత్సవమూర్తులు తిరుచ్చి వాహనంపై ఆలయ ప్రాకారంలో ఊరేగారు. అనంతరం యాగశాలలో హోమాలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు ఉదయం ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం, సాయంత్రం సముదాయం గ్రామ వీధుల్లో వాహన సేవలను నిర్వహిస్తున్నట్లు నాగరాజు తెలిపారు. మే నెల 2న శుక్రవారం సాయంత్రం సింహవానం, 3న హంస వాహనం, 4న శేషవాహనం, 5న సోమవారం నంది వాహనం, 6న గజ వాహనంపై ఉత్సవర్లు సముదాయం గ్రామ వీధుల్లో విహరిస్తారు. 7న బుధవారం రాత్రి రథోత్సవం, 8న గురువారం సాయంత్రం ఆర్జిత కల్యాణోత్సవం, రాత్రి అశ్వవాహనం, 9న శుక్రవారం ఉదయం నటరాజ ఉత్సవం, సాయంత్రం రావణేశ్వర వాహనంపై ఉత్సవర్లు విహరిస్తారు. 10న శనివారం ఉదయం కై లాసనాథ కోనలో త్రిశూల స్నానం అనంతరం సాయంత్రం ధ్వజారోహణంతో ఉత్సవాలు పరిసమాప్తమవుతాయని ఆలయ అధికారి నాగరాజు తెలిపారు. -
ధనుష్ చిత్రం కోసం 15 ఎకరాల్లో భారీ సెట్
తమిళసినిమా : కథానాయకుడిగా, దర్శకుడిగా, గాయకుడిగా, గీత రచయితగా, నిర్మాతగా తమిళంలోనైనా, తెలుగులోనైనా, హిందీలోనైనా తగ్గేదేలేదంటున్నారు నటుడు ధనుష్. ఇలా బహుభాషా నటుడిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా రాణిస్తున్న ఈయన ఇటీవల స్వీయ దర్శకత్వంలో నిర్మించిన నిలవుక్కు ఎన్ మేల్ ఎన్నడీ కోపం చిత్రం మంచి యూత్‌పుల్ లవ్ కథా చిత్రంగా పేరు తెచ్చుకుంది. కాగా ప్రస్తుతం హిందీలో తేరే ఇష్క్ మెయిన్ అనే చిత్రంలో నటిస్తున్నారు. అదే విధంగా ధనుష్ స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించిన ఇడ్లీ కడై చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. అదే విధంగా తెలుగులో హీరోగా నటించిన కుబేర చిత్రం జూన్ 20వ తేదీన విడుదలకు సిద్ధం అవుతోంది. కాగా మరిన్ని నూతన చిత్రాలు ఈయన కోసం ఎదురు చూస్తున్నాయి. వాటిలో నిర్మాత ఐసరి గణేశ్ నిర్మించనున్న రెండు చిత్రాలు చోటు చేసుకోవడం విశేషం. ఈయన వేల్స్ ఫిలింస్ ఇంటర్నేషనల్ పతాకంపై ధనుష్ హీరోగా నిర్మించినున్న ఒక చిత్రానికి మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించనున్నారు. మరో చిత్రానికి పోర్ తొళిల్ చిత్రం ఫేమ్ విఘ్నేశ్ రాజా దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన వార్తే ఇప్పుడు సామాజక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ చిత్రం ఏప్రిల్‌లోనే ప్రారంభం అవుతుందనే ప్రచారం జరిగింది. అయితే ఈ చిత్ర షూటింగ్‌కు సంబంధించిన సెట్ వేయడంలో ఆలస్యం కావడంతో షూటింగ్ జూన్ నెలకు వాయిదా పడిందని సమాచారం. ఇకపోతే ఈ చిత్రానికి అరువడై అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు తెలిసింది. మరో విషయం ఏమిటంటే ఈ చిత్రం కోసం చైన్నెలోని ఈవీపీ నగర్లో ఐసరి గణేశ్‌కు చెందిన 15 ఎకరాల స్థలంలో భారీ సెట్‌ను వేస్తున్నారట. ఈ సెట్లోనే అధిక భాగం షూటింగ్‌ను నిర్వహించడానికి ప్రణాళికను రచించినట్లు సమాచారం. కాగా ఇందులో ధనుష్‌కు జంటగా నటించే కథానాయకి, ఇతర నటీనటులు,సాంకేతిక వర్గం ఎంపిక జరుగుతున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. -
గంగమ్మ జాతర చాటింపు
తిరుపతి రూరల్ : తిరుపతి రూరల్ మండలం పెరుమాళ్లపల్లిలో గంగమ్మ జాతర చాటింపు నిర్వహించారు. గ్రామపెద్దలు బుధవారం తెల్లవారుజామున నడివీధి గంగమ్మ వద్దకు చేరుకుని వేపాకులతో పాటు పసుపు, కుంకుమలు తీసుకెళ్లి గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో జాతర చాటింపును నిర్వహించారు. మే 6వ తేదీన గ్రామంలో జాతరను నిర్వహించనున్నట్లు గ్రామస్తులకు తెలియపరిచేలా డప్పు కొట్టి చాటింపు వేయించారు. జాతర చాటింపు వేయడంతో గ్రామస్తులు ఎవరూ గ్రామ పొలిమేర్లు దాటి రాత్రిళ్లు నిద్ర చేయరాదని, అలాగే బయటి వ్యక్తులు ఎవరూ గ్రామంలోకి వచ్చి నిద్ర చేయరాదని గ్రామపెద్దలు సూచించారు. గంగ జాతరను పురస్కరించుకుని గ్రామంలో పారిశుద్ధ్య పనులు లోపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పంచాయతీ సర్పంచ్ మోహన్ సిబ్బందికి సూచించారు. -
మున్సిపల్ సిబ్బంది వేతనానికి రూ. 60 వేల విరాళం
తిరువళ్లూరు: మున్సిపల్ పరిధిలో కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేయనున్న ఫిట్టర్‌కు వేతనం ఇవ్వడానికి 60 వేల రూపాయలను విరాళంగా ఇస్తున్నట్టు కౌన్సిలర్ జాన్ ప్రకటించారు. తిరువళ్లూరు మున్సిపల్ కౌన్సిలర్ సమావేశం బుధవారం ఉదయం ఛైర్ పర్సన్ ఉదయమలర్ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి అన్ని శాఖలకు చెందిన అధికారులు, కౌన్సిలర్లు హాజరయ్యారు. సమావేశం ప్రారంభం కాగానే కౌన్సిలర్లు తమ వార్డులోని సమస్యలను ఛైర్మన్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో పాటూ గత సమావేశంలో ప్రస్తావించిన అంశాలను చేర్పర్సన్ పరిస్కరించడంపై హర్షం వ్యక్తం చేశారు. దాదాపు 30 ఏళ్ల పాటు పని చేసి ఇటీవల పదవీ విరమణ పొందిన పిట్టర్ ఉధయకుమార్ను పలువురు అభినందించారు. కాగా మున్సిపల్ పరిధిలో ఫిట్టర్ ఉదయకుమార్ పదవీ విరమణ చేసిన క్రమంలో ఆయన స్థానంలో కాంట్రాక్ట్ పద్ధతిలో మరొకరిని నియమించుకోవాలని తీర్మానించారు. కాగా కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించే పిట్టర్కు ప్రతి నెలా ఐదువేల రూపాయలను వేతనంగా ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో సంవత్సరానికి ఫిట్టర్‌కు 60వేల రూపాయల ఇవ్వాల్సి వున్న క్రమంలో సంబంధిత మొత్తాన్ని తానే భరిస్తానని డీఎంకే కౌన్సిలర్ జాన్ ఈసందర్భంగా ప్రకటించారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు అరుణ, జాన్, అయూబ్‌అలీ, థామస్, శాంతి, వసంతి ప్రభాకరన్‌తో పాటు పెద్ద సంఖ్యలో పలువురు పాల్గొన్నారు. -
ప్రేమికుల ఇతివృత్తంతో మైనర్
తమిళసినిమా: అరబి ప్రొడక్షన్స్, వియన్ వెంచర్స్, మేడే ప్రొడక్షన్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న చిత్రం మైనర్. ఇంతకు ముందు ఫైండర్ చిత్రాన్ని తెరకెక్కించిన వినోద్ రాజేంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ద్వారా శ్రీలంక ర్యాప్ సింగర్ వాగీశన్ కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. బిగ్‌బాస్ ఫేమ్ జనని నాయకిగా నటిస్తున్న ఇందులో చార్లీ, సెండ్రాయన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది ఈతరం ప్రేమికుల నేపథ్యంలో సాగే కథా చిత్రంగా ఉంటుందన్నారు. పాఠశాల దశలో ప్రేమించిన యువతిని వదిలి వెళ్లిపోయిన యువకుడు మళ్లీ ఆమెను వెతుక్కుంటూ వెళతాడన్నారు. అయితే వారు మళ్లీ కలిశారా? వారి ప్రేమ ఫలించిందా ? వంటి పలు ఆసక్తికరమైన అంశాలతో ఈ చిత్ర కథ సాగుతుందన్నారు. కాగా చిత్ర పూజా కార్యక్రమాలను బుధవారం నిర్వహించినట్లు, రెగ్యులర్ షూటింగ్‌ను త్వరలోనే చైన్నె, పాండిచ్చేరి ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. కాగా దీనికి రెజీ సెల్వరాసా చాయాగ్రహణం, ఆర్.సూర్య ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. -
బంగారు తిరుచ్చిపై శ్రీకృష్ణుడు
చంద్రగిరి: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో అనుబంధంగా వెలసిన శ్రీకృష్ణ స్వామివారు, అమ్మవార్లతో కలసి బుధవారం సాయంత్రం బంగారు తిరుచ్చిపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. స్వామివారి జన్మనక్షత్రం రోహిణి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవతో మేల్కొలిపి నిత్యకై ంకర్యాలు చేపట్టారు. అనంతరం స్వామి, అమ్మవార్లను సర్వాంగ సుందరంగా అలంకరించారు. తదుపరి సాయంత్రం శ్రీరుక్మిణీ సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామివారు బంగారు తిరుచ్చిపై ఆశీనులై నాలుగు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. -
ముగిసిన అంతర్జాతీయ నృత్య దినోత్సవాలు
చంద్రగిరి: అంతర్జాతీయ నృత్య దినోత్సవం సందర్భంగా బుధవారం తిరుచానూరు సమీపంలోని శిల్పారామంలో నిర్వహించిన నృత్య ప్రదర్శన ప్రత్యేకంగా ఆకట్టుకుంది. రెండు రోజుల పాటు శిల్పారామం సహకారంతో శ్రీకృష్ణ నటరాజాలయం వ్యవస్థాపకుడు కొండా రవి ఆధ్వర్యంలో దినోత్సవాలను నిర్వహించారు. ఇందులో భరతనాట్యం, కూచిపూడి, జానపద నృత్యాలను శిష్య బృందంతో కలసి ప్రదర్శించారు. 14 ఏళ్లలోపు చిన్నారులు చేసిన నాట్యం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. అనంతరం ఏఓ సుధాకర్ కళాకారులను సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు. -
కూరగాయల మార్కెట్ భవనం ప్రారంభం
తిరుత్తణి: తిరుత్తణి మపోసి రోడ్డులో రూ.3.02 కోట్ల వ్యయంతో నిర్మించిన కూరగాయల మార్కెట్ నూతన భవనాన్ని మంత్రులు బుధవారం ప్రారంభించారు. తిరుత్తణి మాపోసీ రోడ్డులో 40 ఏళ్లుగా కూరగాయల మార్కెట్ నిర్వహిస్తున్నారు. పలు దుకాణాల సముదాయ భవనం దుస్థితికి చేరుకోవడంతో మున్సిపాలిటీ ద్వారా కలైంజ్ఞర్ అభివృద్ధి నిధుల నుంచి రూ.3.02 కోట్లతో నూతన సముదాయ భవనం నిర్మించారు. జిల్లా కలెక్టర్ ప్రతాప్ ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం బుధవారం నిర్వహించారు. మంత్రులు నెహ్రూ, నాజర్ పాల్గొని నూతన భవనం ప్రారంభించారు. 97 దుకాణాల సముదాయ భవనం ద్వారా వ్యాపారులు, వినియోగదారులకు సేవలందించే లక్ష్యంతో ప్రభుత్వం నూతన భవనం నిర్మించినట్లు మంత్రి తెలిపారు. పట్టణ ప్రాంతాలు అభివృద్ధి కోసం డీఎంకే ప్రభుత్వం నాలుగేళ్లలో పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినట్లు ప్రధానంగా బస్టాండ్లు, కూరగాయల మార్కెట్లు, రోడ్లు, విద్యుద్దీపాలు, మరుగుదొడ్లు నిర్మించినట్లు తెలిపారు. అరక్కోణం ఎంపీ జగద్రక్షగన్, ఎమ్మెల్యేలు చంద్రన్, దురైచంద్రశేఖర్, మున్సిపల్ చైర్పర్సన్ సరస్వతి, మున్సిపల్ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం, మున్సిపల్ వైస్ చైర్మన్ స్వామిరాజ్ పాల్గొన్నారు. -
‘నమ్మ చైన్నె.. నమ్మ మార్కెట్’ సేవల విస్తరణ
సాక్షి, చైన్నె: ప్రజలకు చౌక ధరలకే అన్ని రకాల కూరగాయాలు, పండ్లు, ఫలాలను అందించేందుకు వీలుగా నమ్మ చైన్నె..నమ్మ మార్కెట్ సేవలను విస్తరిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గత ఏడాది సెమ్మోళి పార్కులతో ‘నమ్మ చైన్నె..నమ్మ మార్కెట్’ పేరిట కూరగాయలు, పండ్ల విక్రయాలకు శ్రీకారం చుట్టారు. ఈ మార్కెట్లో సంప్రదాయ కూరగాయలు, ఆకుకూరలు, దుంపలు, పండ్లు, విలువ ఆధారిత వివిధ ఉత్పత్తుల అమ్మకాలు చేస్తున్నారు. ఉదయం 8 గంటల వరకు ఇక్కడ రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసి వివిధ వస్తువుల అమ్మకాలు జరుగుతున్నాయి. తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో పండించే స్థానిక కూరగాయలను చౌక ధరకు ఇక్కడ విక్రయాలు జరుగుతుండడంతో ఇక ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ మార్కెట్లో అన్ని రకాల కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, వివిధ వస్తువులను చైన్నె నగర వాసులకు చౌక ధరకే అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దిండుక్కల్, కొడైకెనాల్, కోయంబత్తూరు, కన్యాకుమారి, సేలం, తెన్కాశి, తిరుపూర్, నామక్కల్, నీలగిరిలలో లభించే స్థానికంగా ప్రసిద్ధి చెందిన వస్తువులు, వివిధ రకాల పండ్లు, కూరగాయలు సైతం ఈ మార్కెట్లో కొలువుదీర్చనున్నారు. రాష్ట్రంలోని ప్రధాన నగరాలకు ఈ మార్కెట్ సేవలు విస్తరించేందుకు చర్యలు తీసుకున్నారు. -
శ్రీవారి దర్శనానికి 8 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో కంపార్ట్మెంట్లు ఖాళీగా ఉన్నాయి. మంగళవారం అర్ధరాత్రి వరకు 64,263 మంది స్వామివారిని దర్శించుకోగా 25,019 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.35 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ ట కె ట్లు కలిగిన భక్తులకు సకాలంలో, దర్శన టి కె ట్లు లేని భక్తులకు 8 గంటల్లో, ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం అవుతోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలో వెళ్లాలని, కేటాయించిన సమయం కంటే ముందే వెళ్లిన వారిని అనుమతించరని టీటీడీ స్పష్టం చేసింది. -
ప్రపంచ నృత్య దినోత్సవం సందర్భంగా..
తమిళసినిమా: మన మానవాళికి భాష ఎంత ప్రాధాన్యమో, అంతే ప్రాముఖ్యత నృత్యానికీ ఉంది. నృత్యం భాషలో ఒక భాగంగా మారింది. ఈ నృత్యంలో కూచిపూడి, భరతనాట్యం, కథక్, క్లాసిక్ ఇలా చాలా ఉన్నాయి. వాటితో పాటూ ఆధునిక నృత్యం అంటూ బ్యాలెట్ నృత్యం కూడా ప్రాచుర్యం పొందింది. వాన్ని బ్యాలే డాన్స్ అని కూడా అంటారు. దీనికి ఆధ్యుడు జీన్ జార్జెస్ నోవెర్రే. ఫ్రెంచ్ దేశానికి చెందిన ఈయన ప్రవేశ పెట్టిందే బ్యాలెట్ నృత్యం. దీంతో జీన్ జార్జెస్ నోవెర్రే పుట్టిన రోజు అయిన ఏప్రిల్ 29ని ప్రపంచ బ్యాలెట్ నృత్య దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఆ విధంగా బుధవారం ప్రపంచ నృత్య దినోత్సవం. కాగా నటి మంజువారియర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ప్రముఖ మలయాళ నటి అయిన ఈమె తమిళ చిత్ర పరిశ్రమలోకి అసురన్ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత తుణివు, విడుదలై– 2, వేట్టైయన్ వంటి చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. కాగా ఈమె నటుడు ఆర్య, గౌతమ్ కార్తీక్ కలిసి నటిస్తున్న మిస్టర్ ఎక్స్ చిత్రంలో నటిస్తున్నారు. కాగా నటి మంజువారియర్ మంచి డాన్సర్ కావడం గమనార్హం. ఆమె ప్రపంచ నృత్య దినోత్సవం సందర్భంగా తన కూచిపూడి డాన్స్ చేసిన వీడియోను తన ఇన్ స్ట్రాగామ్‌లో పోస్ట్ చేశారు. అది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పలువురు నటి మంజువారియర్ నృత్యాన్ని ప్రశంసిస్తున్నారు. -
234 వచ్చినా ఆశ్చర్యం లేదు!
సాక్షి, చైన్నె : వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ‘200 కాదు..220 కాదు..234’స్థానాలు డీఎంకే కూటమి గెలుచుకున్నా ఆశ్చర్యం లేదని సీఎం ఎంకే స్టాలిన్ వ్యాఖ్యానించారు. ఆ మేరకు ప్రజలతో మమేకమై శ్రమిస్తున్నామన్నారు. నేడు, ఇతర రాష్ట్రాలకే కాదు, భారతదేశానికే, ఇంకా చెప్పాలంటే ప్రపంచానికి మార్గనిర్దేశం చేయగల గొప్ప ప్రభుత్వం అవశ్యమన్నారు. బుధవారం చైన్నె మైలాపూర్ ఎమ్మెల్యే వేలు ఇంటి శుభ కార్యక్రమానికి హాజరైన సీఎం స్టాలిన్ కేడర్‌ను ఉద్దేశించి సభలో ప్రసంగించారు. వధువరులను ఆశీర్వదించినానంతరం వేలు సేవలను కొనియాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ దశల వారీగా విజయవంతంగా అమలు చేస్తూ వస్తున్నామని వివరించారు. వాగ్దానాలన్నీ కచ్చితంగా నెరవేరినట్టు ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడ కొంత మంది మాట్లాడుతూ చెప్పిన వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నటు పేర్కొంటూ, 2026 లో 200 కాదు, 220 అవుతుందని వివరించారు. ఇందులో తప్పేమీ లేదని డీఎంకే కూటమి 234 స్థానాలు గెలుచుకున్నా (క్లీన్ స్వీప్) ఆశ్వర్యం లేదన్నారు. తాను ప్రతి జిల్లాకు వెళ్లినప్పుడు 5 కి.మీ దూరం నడుస్తున్నానని, ఈ సమయంలో జనం తన మీద చూపుతున్న ఆదరాభిమానుల చూస్తుంటే, ఎంతటి వారినైనా ఎదురించి నిలబడ గలమన్న ధీమా రెట్టింపు అవుతోందన్నారు. ఎందరు ... ఎలాంటి కూటమి వచ్చినా సరే, తన కర్తవ్యాన్ని నిర్వరిస్తానని పేర్కొన్నారు. భయపడాల్సిన అవసరం లేదు. సీబీఐ, ఈడీ వచ్చినా తగ్గేది లేదని ధీమా వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా 1975 పరిస్థితులను గుర్తు చేస్తూ ఆ సమయంలో కలైంజ్ఞర్ కరుణానిధి పాలనా వ్యూహాలను వివరించారు. ప్రభుత్వం కాదు. తమ ప్రాణాలు పోయినా సరే నియంతృత్వానికి మద్దతు ఇవ్వం, ప్రజా స్వామ్యాన్ని పరిరక్షిస్తాం అని అప్పట్లో కలైంజ్ఞర్ స్పష్టం చేశారని పేర్కొన్నారు. ఆ మేరకు శ్రమిస్తున్నాం.. సీఎం స్టాలిన్ 7వసారి వస్తామ్మన్న నమ్మకం ఉంది కలైంజ్ఞర్ సారధ్యంలో ఐదు సార్లు అధికారంలోకి ఈ రాష్ట్రంలో వచ్చామని, అరవ సారి ప్రస్తుతం అధికారంలో ఉన్నామని, ఏడో సారి అధికారం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అధికారం కొనసాగుతుందన్న ఆశ, నమ్మకం తనలో ఉందన్నారు. నెల రోజులకుపైగా జరిగిన అసెంబ్లీ సమావేశాలను గుర్తుచేస్తూ, ఇందులో చేసిన ప్రకటనలు, ప్రధాన ప్రతిపక్ష నేత పళణి స్వామి తీరును వివరించారు. తమకు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వ లేక ఏదో ఒక రకంగా బురద చల్లేందుకు అసెంబ్లీని కూడా వేదికగా చేసుకున్నారని విమర్శించారు. ఆయన ముఖ్యమంత్రి ఎలా అయ్యాడో అన్నది అందరికి తెలిసిన విషయంగా పేర్కొంటూ చమత్కారాలతో కూడిన వ్యంగ్యాస్త్రాలను సందించారు. అసెంబ్లీ వేదికగా 110 నిబంధలకు అనుగుణంగా ప్రకటించిన కొత్త అంశాలన్నీ అమలులోకి రానున్నట్టు వివరించారు. అనంతరం వధూవరులను, ఎమ్మెల్యే వేలును ప్రశ్నిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. దయ చేసి పుట్టే పిల్లలకు తమిళం పేర్లుపెట్టాలని, ఇదే తన అభ్యర్థన అని విజ్ఞప్తి చేశారు. ఈకార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్, సీపీఎం నేత షణ్ముగం, డీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి అందియూరు సెల్వరాజ్, మంత్రులు అనితారాధాకృష్ణన్, రాజకన్నప్పన్, అన్బిల్ మహేశ్ పోయ్యామొళి, కయల్వెలి సెల్వరాజ్ , ఎంపీలు తమిళచ్చి తంగపాండియన్, డాక్టర్ వీరాస్వామి, ద్రవిడ ఉద్యమ తమిళ సమాఖ్య ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ వీరపాండియన్ తదితరులు పాల్గొన్నారు. -
కాలుష్య నివారణకు కఠిన చర్యలు
● ఇకపై రూ. 5 లక్షల వరకు జరిమాన ● చైన్నె కార్పొరేషన్ సమావేశంలో తీర్మానం సాక్షి, చైన్నె: నగరంలో కాలుష్య నివారణకు విస్తృత చర్యలు చేపట్టామని మేయర్ ప్రియ తెలిపారు. నిబంధనలకు విరుద్దంగా నిర్మాణ వ్యర్థాలను నిర్వమించే వారు లేదా ఎక్కడ బడితే అక్కడకు తీసుకెళ్లి పడేసే వారికి ఇక రూ. 5 లక్షల వరకు జరీమాన విధించడం జరుగుతుందని ప్రకటించారు. బుధవారం రిప్పన్ బిల్డింగ్‌లో చైన్నె కార్పొరేషన్ పాలకమండలి సమావేశం జరిగింది. మేయర్ ప్రియ, డిప్యూటీమేయర్ మహేశ్‌కుమార్, కమిషనర్ కుమర కురుబరన్లతో పాటుగా సభ్యులు,అ ధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇందులో 237 తీర్మానాలను ఆమోదించారు. చైన్నె కార్పొరేషన్ పరిధిలో భవన నిర్మాణాల కూల్చివేత, శిథిలాలు, వ్యరాథలను సురక్షితంగా తరలించకుండా ఇక్కడ బడితే అక్కడ పడేయడం వంటి చర్యలకు పాల్పడే వారిపై కొరడా ఝుళిపించేందుకు నిర్ణయించారు. ఢిల్లీ, ముంబయి వంటి నగరాలలో అనుసరిస్తున్న విధానాలను అమలు చేస్తూ ఇక మీదట రూ. 5 లక్షల వరకు జరీమాన విధించేందుకు నిర్ణయించారు. విరుగంబాక్కం, ఓట్టేరిలలో వర్షపు నీరు ఇళ్లలోకి చేచకుండా కెనల్ పునర్ నిర్మాణకు చర్యలు చేపట్టారు. వర్షపు నీటి ప్రవాహాన్ని పూర్తి స్థాయిలో తరలించేందుకు వీలుగా పరిశీలనకు హైడ్రోలాజికల్ నిపుణుడిని నియమించేందుకు నిర్ణయించి, వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదికను తయారీతో పాటూ ఇతర పనులకు రూ. 95 కోట్లు కేటాయించారు. చైన్నె బీచ్ – వేలచ్చేరి మధ్య అదనంగా 20 రైళ్లు ● కొత్త షెడ్యూల్ సిద్దం కొరుక్కుపేట: చైన్నె బీచ్ – వేలచ్చేరి మద్య అదనంగా 20 రైళ్లను నడిపేందుకు కొత్త షెడ్యుల్ విడుదల కానుంది. ఇప్పటికే చైన్నె బీచ్ – తాంబరం – చెంగల్పట్టు మధ్య ఏసీ ఎలక్ట్రిక్ రైలు సర్వీసు ఈనెల 19న ప్రారంభించారు. ఈ రైలు టైమ్ టేబుల్‌ను తాజాగా ప్రచురించారు. రైళ్ల షెడ్యూల్ అన్ని వర్గాల వారికి అనుకూలంగా ఉందా లేదా అనే అంశంపై ప్రయాణికుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. 600 మందికి పైగా తమ వ్యాఖ్యాలను పోస్టు చేశారు. ఈమేరకు టైమ్ మార్పులు ఇలా ఉన్నాయి. ఇందులో తాంబరంలో ఉదయం 6.50 గంటలకు బయలుదేరి ఉదయం 7.35 గంటలకు చెంగలప్పట్టు చేరుకుంటుంది. చెంగల్పట్టులో ఉదయం 7.50కి బయలుదేరి ఉదయం 9.25కి చైన్నె బీచ్ స్టేషన్ చేరుకుంటుంది. ఉదయం 9.41 గంటలకు బీచ్‌లో బయలుదేరి ఉదయం 10.36 గంటలకు తాంబరం చేరుకుంటుంది. అదేవిధంగా మధ్యాహ్నం 2.30 గంటలకు బీచ్‌లో బయలుదేరి సాయంత్రం 4 గంటలకు చెంగల్పట్టు చేరుకుంటుంది. సాయంత్రం 4.30 గంటల చెంగల్ పట్టులో బయలేదురి సాయంత్రం 5 గంటలకు తాంబరం చేరుతుంది. సాయంత్రం 6.17 గంటలకు బీచ్‌లో బయలుదేరి రాత్రి 7.50 గంటలకు చేరుకుంటుంది. సాయంత్రం 8:10 గంటలకు చెంగల్పట్టులో బయలుదేరి రాత్రి 8.50 గంటలకు తాంబరం చేరుకుంటున్నట్టు అధికారుల వెల్లడించారు. ఆస్పత్రిలో అజిత్ తమిళసినిమా: నటుడు అజిత్ బుధవారం చైన్నెలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. దీంతో ఆయనకు ఏమైందన్న ఆందోళన సినీ వర్గాల్లోనూ, అభిమానుల్లోనూ వ్యక్తం అవుతోంది. సినిమా, కార్ రేస్, రైపిల్ షూట్ ఇవి మినహా మరో విషయంపై దృష్టి పెట్టని స్టార్ నటుడు అజిత్. ఆయన సినిమా కార్యక్రమాలు, మీడియా సమావేశాలకు దూరంగా ఉంటారు. ఈయన తాజాగా నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం కమర్షియల్‌గా మంచి విజయాన్ని అందుకుంది. అదే సమయంలో అజిత్ సినీ, క్రీడా సేవలకు గానూ క్రేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా సోమవారం ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డును అందుకోవడానికి నటుడు అజిత్ కుటుంబ సభ్యులతో సహా వెళ్లారు. కాగా పద్మభూషణ్ అవార్డును అందుకుని మంగళవారం రాత్రి చైన్నెకి తిరిగి వచ్చారు. అలాంటిది బుధవారం మధ్యాహ్నం అనూహ్యంగా అజిత్ చైన్నెలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. కాగా సోమవారం రాత్రి డిల్లీ నుంచి చైన్నె వచ్చిన అజిత్‌ను విమానాశ్రయంలో మీడియా సభ్యులు చుట్టు ముట్టారు. ఆ సందర్భంలో ఏర్పడ్డ తోపులాటలో ఆయన కాలుకి దెబ్బ తగిలినట్లు సమాచారం. దీంతో ఆస్పతిలో చేరిన అజిత్‌కు వైద్యులు ఫిజియోథెరఫీ చేయనున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వైద్యుల నుంచి వెలువడాల్సి ఉంది. -
వారసుడికి యువజన విభాగం పగ్గాలు
భారత రత్న ఇవ్వండి సాక్షి, చైన్నె: కరుప్పు ఎంజీఆర్ దివంగత విజయకాంత్ వారసుడు విజయ ప్రభాకరన్‌కు డీఎండీకేలో యువజన పగ్గాలను అప్పగించారు. పార్టీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా ఆయన నియమితులయ్యారు. ఇక, తన సోదరుడు ఎల్కే సుదీష్‌కు పార్టీ కోశాధికారి పదవిని డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్ అప్పగించారు. పార్టీ కార్యవర్గంలో మార్పులతో సర్వ సభ్య సమావేశం వేదికగా ఆమె ప్రకటించారు. విజయకాంత్ మరణానంతరం ఆయన లేని తొలి సర్వసభ్య భేటి ధర్మపురి వేదికగా బుధవారం జరిగింది. వివరాలు.. విజయకాంత్ మరణంతో తర్వాత గత ఏడాది అన్నాడీఎంకే కూటమితో ఎదుర్కొన్న లోక్‌సభ ఎన్నికలలో డీఎండీకే డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఐదు చోట్ల పోటీ చేసి సుమారు 3 శాతం ఓట్లను మాత్రమే ఆ పార్టీ రాబట్టుకోగలిగింది. అయితే, ఆయన వారసుడు విజయ ప్రభాకరన్ విరుదునగర్‌లో స్వల్ప ఓట్లతో ఓటమి చవి చూడటం ఆ పార్టీ వర్గాలను తీవ్ర ఆవేదనలోకి నెట్టాయి. ప్రస్తుతం ఏ కూటమిలోనూ లేని డీఎండీకే అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్దం అయింది. పార్టీ బలోపేతం దిశగా డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్ కసరత్తులు వేగవంతం చేశారు. విజయకాంత్ వారసుడైన విజయ ప్రభాకరన్‌ను పార్టీ పరంగా పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు రెడీ అయ్యారు. ఇంత కాలం తల్లిదండ్రులకు అండగా పార్టీ కార్యక్రమాలో ఓకార్యకర్తగా పాల్గొంటూ వచ్చిన వారసుడికి ప్రస్తుతం అధికారికంగా పదవీ బాధ్యతలను అప్పగించారు. యువజన నేతగా.. ధర్మపురి జిల్లాలోని పాలక్కోడులో డీఎండీకే రాష్ట్ర కార్యవర్గం, సర్వ సభ్య సమావేశం బుధవారం జరిగింది. పార్టీ బలోపేతం, కేడర్‌తో మమేకమయ్యే విధంగా కార్యక్రమాలను విస్తృతం చేస్తూ, కెప్టెన్ విజయకాంత్ అభిమానుల్ని ఏకం చేస్తూ ముందుకు సాగేందుకు తీర్మానించారు. కెప్టెన్ ఆశయ సాధన నినాదంతో అసెంబ్లీ ఎన్నికలలోకి వెళ్లడానికి కార్యాచరణ రూపకల్పన చేశారు. పార్టీలో యువ రక్తాన్ని నింపేదిశగా వారసుడికి యువజన ప్రధాన కార్యదర్శి బాధ్యతలను ఈ సమావేశం ద్వారా అప్పగించారు. మంచి వాక్ చాతుర్యాన్ని ప్రదర్శించే విజయ ప్రభాకరన్ ఇక పూర్తిస్థాయిలో పార్టీకి సేవలు అందించనున్నారు. యువజనులందరూ ఆయనకు అండగా నిలబడాలని, కలిసికట్టుగా పార్టీని బలోపేతం చేసుకుందామని ప్రేమలత విజయకాంత్ పిలుపు నిచ్చారు. విజయకాంత్ ధరించిన ఉంగరాన్ని ఈసందర్భంగా విజయ ప్రభాకరన్‌కు ఆమె తొడిగారు. అలాగే పార్టీ కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా రెండవసారి ఎంపికై న ప్రేమలత విజయకాంత్ వ్యవహరిస్తారు. పార్టీ యువజన నేతగా ఇది వరకు ఉన్న ఆమె సోదరుడు ఎల్కే సుదీష్‌కు పార్టీ కోశాధికారి పగ్గాలను అప్పగించారు. పార్టీ ప్రిసీడియం చైర్మన్‌గా డాక్టర్ వీ ఇళంగోవన్, పార్టీ ప్రధాన కార్యాలయ కార్యదర్శి పార్థసారధి, కార్యదర్శిగా అలగాపురం మోహన్ రాజులు, డిప్యూటీ కార్యదర్శులుగా పన్నీరు సెల్వం, సెంథిల్‌కుమార్, చంద్రన్, సుభా రవిని నియమించారు. డీఎండీకేలో విజయ ప్రభాకరన్‌కు కీలక పదవి సోదరుడికి కోశాధికారి పదవి సినీ, రాజకీయ, సామాజిక, సేవా రంగాలలో అందరికి సుపరిచితుడైన విజయకాంత్‌కు భారత రత్న ఇవ్వాలని డీఎండీకే సర్వ సభ్యసమావేశం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈసందర్భంగా ప్రేమలత విజయకాంత్ మాట్లాడుతూ, కెప్టన్ కలలు, ఆశయ సాధన లక్ష్యంగా తమ పయనం కొనసాగుతందన్నారు. జనవరిలో కడలూరు వేదికగా పార్టీ మహానాడుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. కూటమి గురించి నిర్ణయాన్ని తగిన సమయంలో ప్రకటిస్తామన్నారు. -
కూవాగంలో ‘హిజ్రాల’ పండుగ
● కూత్తాండవర్ ఉత్సవాలకు శ్రీకారం ● 13న పెళ్లి సందడి సాక్షి, చైన్నె: కూవాగంలో హిజ్రాల వసంతోత్సవ వేడుకకు ఏర్పాట్లు చేపట్టారు. బుధవారం కూత్తాండవర్ ఆలయంలో ధ్వజారోహణంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. వివరాలు.. రాష్ట్రంలోని కళ్లకురిచ్చి జిల్లా ఉలందూరు పేట సమీపంలోని కూవాగం గ్రామంలో కొలువు దీరిన కూత్తాండవర్ హిజ్రాలకు ఆరాధ్యుడు. ఈ ఆలయంలో ప్రతి ఏటా జరిగే ఉత్సవాలు దేశ విదేశాల్లోని హిజ్రాలు తరలి వస్తుంటారు. ఇక్కడి వేడుకకు మహాభారత యుద్ధగాధ ముడి పడి ఉందని పురాణాలు చెబుతాయి. ఇతిహాసం మేరకు మోహినీ అవతారంలో ఉన్న శ్రీకృష్ణుడిని వివాహమాడిన ఐరావంతుడిని తమ ఆరాధ్యుడిగా హిజ్రాలు కొలుస్తూ వస్తున్నారు. ఇక్కడ కొలువు దీరిన కూత్తాండవర్(ఐరావంతుడి) ఆలయంలో ప్రతి ఏటా చైత్రమాసంలో వేడుకల్ని జరుపుకోవడం ఆనవాయితీ. ఈ ఏడాది ఉత్సవాలను అత్యంత వేడుకగా జరుపుకునేందుకు హిజ్రాలు సిద్ధం అవుతున్నారు. మంగళవారం రాత్రి నుంచి బుధవారం వేకువ జాము వరకు కూత్తాండవర్ సన్నిధిలో జరిగిన ప్రత్యేక పూజాధి కార్యక్రమాలతో ధ్వజారోహణం వేడుక జరిగింది. ఆ పరిసర గ్రామాల్లోని ప్రజలు రాగి గంజిని తయారు చేసి కుండలు, బిందెల్లో పోసి ఊరేగించారు. స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు. ఇక, ఉప వాస వ్రతంతో ఆలయ అర్చకులు రోజూ విశిష్ట పూజలు నిర్వహించనున్నారు. పది రోజుల పాటూ ఇక్కడ ఆ పరిసర గ్రామాల ప్రజలు ఆలయంలో వివిధ పూజలు, ఇతర వేడుకకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. 13న పెళ్లి సందడి.. ఈ ఉత్సవాల్లో ముఖ్య ఘట్టం హిజ్రాల పెళ్లి సందడి. అత్యంత వేడుకగా జరిగే ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున హిజ్రాలు తరలి వస్తారు. ఈనెల 13వ తేదీన హిజ్రాల పెళ్లి సందడి కూవాగంలో నెలకొననున్నది. ఈ వేడుక నిమిత్తం హిజ్రాలు కూవాగంకు పోటెత్తనున్నారు. వీరి బస కోసం అక్కడి లాడ్జీలు, గెస్టు హౌస్‌లు, విడిదులు ముస్తాబు అవుతున్నాయి. ఇక అందగత్తెలకు తామేమీ తక్కువ కాదన్నట్టుగా సింగారించుకుని వచ్చే హి జ్రాలకు అందాల పోటీలు సైతం ఇక్కడ జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో చివరి రోజు 14వ తేది కూత్తాండవర్ రథోత్సవం, హిజ్రాలు తాళి బొట్టు తెంచి వితంతువుగా మారే విషాద కార్యక్రమాలు జరగనున్నాయి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఎయిడ్స్ కంట్రోల్ బోర్డు , స్వచ్ఛంద సంస్థల నేతృత్వంలో హిజ్రాల కోసం ఏర్పాట్లు సిద్ధం అవుతున్నాయి. -
మీ అభిమానానికి దాసోహం.. అయితే!
● విజయ్ ఆవేదనసాక్షి, చైన్నె : చూపిస్తున్న అభిమానానికి పులకించి పోతున్నాను...మీకు దాసోహం..అయితే, టీవీకే వర్గాల కొన్ని చర్యలు తీవ్ర వేదనకు గురి చేస్తున్నాయని అభిమానులను ఆ పార్టీ నేత, సినీ నటుడు విజయ్ సున్నితంగా మందలించారు. వివరాలు.. కోయంబత్తూరులో జరిగిన బూత్ కమిటీ మహానాడులో తమిళగ వెట్రి కళగం(టీవీకే) నేత, నటుడు విజయ్ కోసం అభిమానులు తండోప తండాలుగా తరలి వచ్చిన విషయం తెలిసిందే. వీరిని కట్టడి చేయడానికి ప్రైవేటు బౌన్సర్లను సైతం వినియోగించక తప్పలేదు. అయినా, విజయ్ను చూసేందుకు అభిమానులు వాహనాలలో దూసుకొచ్చారు. అత్యుత్సాహంతో వాహనాలపైకి ఎక్కి కేరింతలు కొట్టారు. విజయ్ కాన్వాయిని వెంబడించారు. ఇవన్నీ విజయ్‌కు కాస్త ఆవేదన కలిగించినట్టుంది. దీంతో అభిమానులు లెవ్వరు ఇక ఇలాంటి చర్యలకు పాల్పడ కూడదని పేర్కొంటూ సున్నితంగా మందలించే విధంగా, వారికి తన ఆజ్ఞ అన్నట్టుగా బుధవారం ప్రకటన చేశారు. టీవీకే వర్గాలు క్రమ శిక్షణతో కూడుకున్నవారు అని కితాబు ఇచ్చారు. కోయంబత్తూరు వేదికగా చూపించిన అభిమానం తనను పులకింతకు గురిచేసిందన్నారు. అభిమాన వర్షంలో తాను తడిచి ముద్దయినట్టు పేర్కొన్నారు. ప్రజలకు మంచి చేయాలన్న కాంక్షతో , ప్రజా ప్రభుత్వం ఏర్పాటు ధ్యేయంగా 2026 ఎన్నికలలో గెలుపు కోసం ముందుకెళ్తున్నామన్నారు. ప్రజల కోసం టీవీకే అంటూ, ప్రజలకు ఆదర్శంగా కేడర్ నిలవాల్సిన అవసరం ఉందన్నారు. అయితే, తనను చూడాలన్న కాంక్షతో తన వాహనంను వెంబడిస్తూ కేడర్ ద్విచక్ర వాహనాలలో దూసుకు రావడం తనలో తీవ్ర ఆందోళన కలిగించిందన్నారు. హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలను నడిపిన వారిని చూసి కలవరం చెందినట్టు పేర్కొన్నారు. వాహనాల మీదకు ఎక్కి సాహసం చేసే రీతిలో దూసుకు రావడం తనలో భయాన్ని రేపిందన్నారు. తన కేడర్, తన అభిమానులు ఇక మీదట ఇలాంటి చర్యలకు పాల్పడ కూడదనే తాను ఈసందేశాన్ని ఓ ఆజ్ఞగా సూచిస్తున్నట్టు వివరించారు. ఇక మీదట ఇలాంటి చర్యలకు పాల్పడ వద్దు అని, క్రమశిక్షణగా మెలుగుదామని, ఇతర పార్టీల వారికి సైతం ఆదర్శంగా ఉందామని పిలుపు నిచ్చారు. విజయ్‌కు గాలం.. కోయంబత్తూరులో విజయ్ కోసం పోటెత్తిన జన సందోహం సమాచారం ఢిల్లీకి చేరింది. డీఎంకేకు వ్యతిరేక ఓట్లు విజయ్ కారణంగా ముక్కలు కాకుండా అన్ని ఒకే కూటమికి పడే రీతిలో బీజేపీ పెద్దలు వ్యూహాలకు పదును పెట్టినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఎన్డీఏ కూటమిలోకి విజయ్ను తీసుకొచ్చే ప్రయత్నాలపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా దృష్టి పెట్టినట్టు సమాచారం. ఢిల్లీ వెళ్లిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ వద్ద విజయ్‌కు వస్తున్న ఆదరణ సమాచారాన్ని అమిత్ షా రాబట్టినట్టు, విజయ్ను తమ దారిలోకి తెచ్చుకునే విధంగా గాలం వేయబోతున్నట్టు ప్రచారం ఊపందుకుంది. ఈ విషయంగా నైనార్‌ను మీడియా ప్రశ్నించగా, టీవీకేతో బీజేపీ మంతనాలు అన్న విషయం తనకు తెలియదన్నారు. ఎన్నికలకు సమయం ఉందని, ప్రస్తుతానికి తాను కంచి కామాక్షి అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తూ, అన్నీ మంచే జరుగుతాయని పేర్కొనడం గమనార్హం. విజయ్ పార్టీ వర్గాలు పేర్కొంటూ ఇందుకు ఆస్కారమే లేదని విజయ్ ఒంటరిగా నైనా తన బలాన్ని చాటుకుంటారని వ్యాఖ్యానించారు. -
థియేటర్, ఓటీటీలో బ్లాక్ బస్టర్.. ఇప్పుడు సీక్వెల్!
పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకున్న నటుడు విజయ్ సేతుపతి. స్వతహాగా తమిళం అయినప్పటికీ.. తెలుగు, హిందీతో పాటు ఇతర భాషల్లోనూ మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. కొన్నాళ్ల క్రితం తెలుగులో ఉప్పెన చిత్రంలో ప్రతినాయకుడిగా నటించి మనోళ్లకు బాగా దగ్గరయ్యాడు. (ఇదీ చదవండి: 'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్) షారూఖ్ ఖాన్ జవాన్‌లో విలన్‌గా తన నట విశ్వరూపాన్ని చూపించాడు. ఇలా ఎప్పటికప్పుడు వైవిధ్యమైన సినిమాలు తీస్తున్న సేతుపతి.. ప్రస్తుతం మిష్కిన్ దర్శకత్వంలో ట్రైన్, తెలుగు దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తూ బిజీగా ఉన్నాడు. అలానే 'కాక్కా ముట్టై' ఫేమ్ మణికంఠన్ దర్శకత్వంలో ఓ వెబ్ సిరీస్ చేసేందుకు సేతుపతి రెడీ అవుతున్నాడు. గత కొన్నాళ్లుగా హీరోగా హిట్ లేక డీలా పడిపోయిన విజయ్ సేతుపతికి హిట్ ఇచ్చిన సినిమా మహారాజ. గతేడాది రిలీజైంది. తొలుత థియేటర్లలో ఆపై ఓటీటీలోనూ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అందుకుంది. (ఇదీ చదవండి: నెలలోపే ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లర్ సినిమా) ఇది విజయ్ సేతుపతికి 50వ చిత్రం కావడం విశేషం. ఇదే సినిమా చైనీష్ లోనూ అనువాదం అయ్యి చైనాలో రిలీజై మంచి వసూళ్లు సాధించింది. కాగా మహారాజా చిత్రానికి సీక్వెల్ చేయాలని విజయ్ సేతుపతి ఆలోచిస్తున్నట్లు, దానికి తగ్గ కథను సిద్ధం చేయమని దర్శకుడు నితిలన్ స్వామినాథన్ కు చెప్పినట్లు తెలుస్తోంది. కాగా విజయ్ సేతుపతి ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తి చేసిన తర్వాత మహారాజ 2 మొదలు పెడతారా లేదంటే వాటితో పాటే ప్రారంభించి పూర్తి చేస్తారా అనేది చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీలోకి థ్రిల్లర్ సినిమా.. తొమ్మిదేళ్ల తర్వాత తెలుగులో) -
హెల్మెట్ లేకుంటే జరిమానా
తిరుత్తణి: హెల్మెట్ ధరించకుండా ప్రయాణం చేసే ద్విచక్ర వాహనదారులకు రూ.వెయ్యి జరిమానా విధిస్తామని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. వాహన ప్రమాదాలు అరికట్టే విధంగా ద్విచక్ర వాహనదారులు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అయితే చాలా మంది హెల్మెట్ వినియోగించడంలో అలసత్వం వహిస్తున్నారు. దీంతో ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో తిరుత్తణిలో మంగళవారం ఉదయం పట్టణ బస్టాండు సమీపం అరక్కోణం రోడ్డుపై వెళ్లే ద్విచక్ర వాహనదారులను తనిఖీలు చేశారు. వంద మందిలో పట్టుమని పదిమంది కూడా హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడపడంపై ట్రాఫిక్ పోలీసులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదాల సమయంలో హెల్మెట్ ఉంటే ప్రాణాలు కాపాడుకోవచ్చునని అవగాహన కల్పించారు. తరుచూ అవగాహన కల్పిస్తున్నా ఏ మాత్రం పట్టించుకోకుండా ప్రయాణిస్తున్న వారికి రూ.వెయ్యి చొప్పున జరిమానా విధిస్తామని, వారి లైసెన్స్ సైతం రద్దు చేస్తామని హెచ్చరించారు. -
తల్లిని హతమార్చిన కొడుకు అరెస్టు
● గొంతుపై కాలుతో తొక్కి తల్లి హత్య సేలం: తంజావూరు జిల్లా కుంభకోణం సమీపంలో తల్లి గొంతుపై కాలుతో తొక్కి చంపిన కొడుకును పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. కుంభకోణం సమీపంలోని ఆడుతురై గార్డెన్ సిటీకి చెందిన వ్యక్తి స్టాలిన్(47). ఆయన భార్య బృంద (40). వీరి కుమారులు అరుణ్‌కుమార్(18), అన్బుకరసన్(15). కూతురు ఐశ్వర్య(10) ఉన్నారు. కుటుంబ సమస్యల కారణంగా స్టాలిన్, అతని భార్య బృంద గత కొన్ని సంవత్సరాలుగా వారి మధ్య విభేదాలు ఎదుర్కొంటున్నారు. దీని తరువాత బృంద తన కుమార్తె ఐశ్వర్యను కుత్తలం సమీపంలోని అంజరు వార్తలైలో నివశించే తన తల్లి ఇంటికి తీసుకెళ్లింది. ఇద్దరు కుమారులు తమ తండ్రితో ఉన్నారు. స్టాలిన్ నాలుగు సంవత్సరాల క్రితం తిరునాగేశ్వరానికి చెందిన ఉమా మహేశ్వరి అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. వారికి ఒక బిడ్డ ఉంది. ఈ స్థితిలో స్టాలిన్ గత సంవత్సరం అనారోగ్యంతో మరణించాడు. స్టాలిన్ మరణం తర్వాత బృందా తన కుమారులతో కలిసి జీవించాలని నిర్ణయించుకుంది. స్టాలిన్ రెండవ భార్య ఉమా మహేశ్వరి తన జన్మస్థలం తిరునాగేశ్వరానికి వెళ్లిపోయిందని సమాచారం. నాలుగు రోజుల క్రితం, బృంద తన కుమార్తె ఐశ్వర్యతో కలిసి ఆడుదురైలోని ఎస్ఎంఎస్ నగర్‌లోని ఇంటికి తిరిగి వచ్చింది. అప్పుడు ఆమె పెద్ద కొడుకు అరుణ్‌కుమార్ ఇంత చిన్న వయసులోనే ఎందుకు వదిలేశావు, ఇప్పుడు ఎందుకు వచ్చావని వాగ్వాదం చేశాడు. తీవ్ర ఆవేశానికి గురైన అరుణ్‌కుమార్ తల్లిని కిందికి తోసి, మెడపై కాలు పెట్టి తొక్కాడు. దీంతో బృంద సంఘటనా స్థలంలోనే మృతి చెందింది. సమాచారం అందుకున్న తిరువిడైమరుదూర్ పోలీస్ డీఎస్పీ రాజు, ఇన్స్పెక్టర్ రాజా, పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి వెళ్లి దర్యాప్తు చేపట్టారు. బృంద మృతదేహాన్ని కుంభకోణం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. పోలీసులు అరుణ్‌కుమార్‌ను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పహల్గాం మృతులకు అశ్రు నివాళి
వేలూరు: కశ్మీర్లో భారతీయులను అత్యంత క్రూరంగా కాల్చి చంపిన ఉగ్రవాదులను అరెస్ట్ చేసి చట్టం ముందు నిలబెట్టాలని వేలూరు జిల్లా మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధ్వజమెత్తారు. ముందుగా వేలూరు జిల్లా కాట్పాడిలోని చిత్తూరు బస్టాండ్‌లో మాజీ సైనికులు నల్ల దుస్తులు ధరించి మృతి చెందిన 26 మంది చిత్ర పటాలను ఉంచి వారి ఆత్మ శాంతి కలగాలని కొవ్వొత్తులు వెలిగించి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మాజీ సైనికులు మాట్లాడుతూ కశ్మీర్లో ప్రకృతిని ఆస్వాధించడానికి వెళ్లిన భారతీయులను కాల్చి చంపడం హేయమైన చర్య అన్నారు. ఇలాంటి చర్యలతో భారతీయుల ఐక్యత, దేశ సమగ్రతను బలహీన పరచలేరని అన్నారు. ముష్కరులకు తగిన గుణపాఠం చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి దోషులను చట్టం ముందు నిలబెట్టి శిక్షపడే విధంగా చూడాలన్నారు. దేశంలో ఉగ్రవాదాన్ని అణచి వేసే దిశగా కేంద్ర ప్రభుత్వం సైతం దీటుగా వ్యవహరించాలన్నారు. ముందుగా మాజీ సైనికులు నల్ల దుస్తులతో కొవ్వొత్తులను చేత బట్టి ఊరేగింపుగా వచ్చి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనికుల సంక్షేమ సంఘం ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
లైంగిక దాడి కేసులో పన్నెండేళ్ల జైలు శిక్ష
తిరువళ్లూరు: ఇటుక బట్టీలో పనుల కోసం వచ్చిన దివ్యాంగురాలిపై లైంగిక దాడి చేసిన కేసులో నిందితుడికి పన్నెండేళ్ల జైలు శిక్షను విధిస్తూ తిరువళ్లూరు జిల్లా కోర్టు మంగళవారం తీర్పును వెలువరించింది. తిరువళ్లూరు జిల్లా పట్టాభిరామ్ అన్నంబేడు గ్రామంలో ప్రైవేటు వ్యక్తికి చెందిన ఇటుక బట్టీ ఉంది. ఈ చాంబర్లో 2007వ సంవత్సరంలో విల్లుపురం జిల్లాకు చెందిన దివ్యాంగులరాలు కన్నగి తన కుటుంబంతో పని చేయడానికి వచ్చారు. 2007, ఏప్రిల్ 8న పనులు ముగించుకుని ఇంటి బయట నిద్రిస్తున్న దివ్యాంగురాలిని అదే బట్టీలో పని చేస్తున్న తిరుమలై(27), ఆనందన్(26) తదితర ఇద్దరు రాత్రి సమయంలో బలవంతంగా తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. విషయాన్ని బయటకు చెబితే హత్య చేస్తామని సైతం బెదిరించారు. ఈ సంఘటనపై బాధితురాలి తండ్రి వరదరాజన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టాభిరామ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. కేసు విచారణలో ఉన్న సమయంలో గత పన్నెండుళ్లుగా ఆనందన్, తిరుమలై తదితర ఇద్దరు కోర్టుకు హాజరుకాకుండా పరారయ్యారు. దీంతో తిరువళ్లూరు జిల్లా న్యాయమూర్తి నిందితులపై నాన్ బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేశారు. దీంతో పట్టాభిరామ్ పోలీసులు నిందితుల్లో ఒకరైన తిరుమలైను 2023లో పట్టుకుని కోర్టులో హాజరుపరిచి పుళల్ జైలుకు తరలించారు. ప్రస్తుతం పుళల్ జైలులో ఉండగా తిరుమలై కేసు విచారణ తిరువళ్లూరు జిల్లా కోర్టులో సాగింది. విచారణలో యువతిపై అత్యాచారం చేసినట్టు రుజువు కావడంతో నిందితుడికి పన్నెండేళ్ల జైలుశిక్ష, 10 వేల జరిమానా విధిస్తూ జిల్లా న్యాయమూర్తి జూలియట్ పుష్ప తీర్పును వెలువరించారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఆరు నెలల పాటు శిక్షను అనుభవించాల్సి ఉంది. కేసులో మరో నిందితుడు ఆనంద్ పరారీలో ఉండడంతో అతడి కోసం పట్టాభింరామ్ అసిస్టెంట్ కమిషనర్ గిరి నేతృత్వంలో ప్రత్యేక బృందం అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టింది. కేసును పబ్లిక్ ప్రాసిక్యూటర్ తమిళియన్ వాదించారు. -
ప్రభుత్వ పథకాలపై హర్షం
వేలూరు: రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన చట్టంలోని తొమ్మిది పథకాలను ఆహ్వానిస్తున్నట్లు జాక్టో జియో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ఒకేషనల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జనార్దనన్ అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ జాక్టో జియో ఆధ్వర్యంలో అసెంబ్లీలో ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్ల పది డిమాండ్లను పరిష్కరించాలని పలు పోరాటాలు చేయడంతో తమ వినతిని ప్రభుత్వం స్వీకరించి అసెంబ్లీలో తీర్మానం చేయడం అభినందనీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు, టీచర్లకు ఇచ్చిన హామీలు లేనివి కూడా ప్రస్తుతం ప్రకటించడం సంతోషకరమన్నారు. పండుగ రోజుల ముందస్తు నగదు రూ.10 వేలు నుంచి 20 వేలకు పెంచడం, మహిళల ప్రసవ సెలవు దినాలు పెంచడం, ఉన్నత విద్యను అభ్యసించడానికి రూ.1 లక్ష పెంచడం వంటి పథకాలను ప్రకటించడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జాక్టో జియో, ఒకేషనల్ టీచర్లు ఇందుకు మద్దతు తెలుపుతున్నట్లు తెలిపారు. ఆయనతోపాటు తమిళనాడు పట్టభద్రుల టీచర్స్ సంఘం జిల్లా అధ్యక్షుడు జయకుమార్, తమిళనాడు ప్రాథమిక పాఠశాల టీచర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి జోసెఫ్ అన్నయ్య, తమిళనాడు టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జీడీ బాబు, గుణశేఖరన్ తదితరులున్నారు. -
చెక్‌డ్యాంలో మునిగి కేబుల్ ఆపరేటర్ మృతి
తిరుత్తణి: చెక్‌డ్యాంలో మునిగి కేబుల్ ఆపరేటర్ ప్రాణాలు కోల్పోయిన ఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. అరక్కోణం సమీపంలోని ఉలియంపాక్కం గ్రామానికి చెందిన మునిరత్నం కుమారుడు హరిబాబు(40) ఇంటర్నెట్ కేబుల్ ఆపరేటర్‌గా విధులు నిర్వహించేవారు. సోమవారం మధ్యాహ్నం ఉలియంపాక్కం గ్రామానికి చెందిన రమేష్ కుమారుడు శరవణన్(25)తో కలిసి కనకమ్మసత్రంకు బైకులో వెళ్లారు. అక్కడ మద్యం తీసుకుని ఇళుప్పూర్ సమీపంలోని కుశస్థలి నది మధ్యలో చెక్‌డ్యాం ఒడ్డున కూర్చుని మద్యం తాగిన తరువాత సాయంత్రం సమయంలో ఇద్దరూ డ్యాంలో సరదాగా ఈతకు వెళ్లారు. ఈ సమయంలో హరిబాబు డ్యాం మధ్యకు వెళ్లగా గట్టుకు తిరిగి చేరుకునే సమయంలో నీట మునిగి గల్లంతయ్యాడు. వెంటనే శరవణన్ కేకలు వేయడంతో ఆ ప్రాంతంలోని వారు గల్లంతైన వ్యక్తిని కాపాడే ప్రయత్నం చేసినా కుదరకపోవడంతో తిరుత్తణి అగ్నిమాపక శాఖ కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది డ్యాం వద్దకు చేరుకుని గంటపాటు శ్రమించి హరిబాబు మృతదేహాన్ని వెలికితీశారు. కనకమ్మసత్రం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన హరిబాబు తిరుత్తణి శక్తిసాయి నగర్లో ఇల్లు నిర్మించుకుని అతని భార్య భారతి, వారికి యోగిత అనే ఎనిమిదేళ్ల పాప, అత్విక్(5) అనే బాలుడు ఉన్నారు. మద్యం మత్తులో డ్యాంలో మునిగి వ్యక్తి మృతి సంఘటన శోకాన్ని మిగిల్చింది. -
ఉన్నత విద్యపై అవగాహన సదస్సు
వేలూరు: పాఠశాల విద్యార్థులు ఉన్నత విద్యలో ఎటువంటి కోర్సులను అభ్యసించాలనే వాటిపై అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ సుబ్బలక్ష్మి అన్నారు. తమిళనాడు ఉన్నత విద్యాశాఖ, కళాశాల కళలు ఆధ్వర్యంలో వేలూరు వీఐటీ యూనివర్సిటీ ప్రాంగణంలో ప్రభుత్వ పాఠశాలలో ప్లస్‌టూ పరీక్షలను రాసిన విద్యార్థులకు ఒక్కరోజు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సును కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఈ సదస్సులో వేలూరు జిల్లా నుంచి మొత్తం 85 పాఠశాలల నుంచి 1500 మంది విద్యార్థినీవిద్యార్థులు పాల్గొన్నారన్నారు. ప్లస్‌టూ పూర్తి చేసిన విద్యార్థులు ఎటువంటి కోర్సులను అభ్యసిస్తే మంచిదనే వాటిపై ప్రతి సంవత్సరం అవగాహన కల్పిస్తున్నామన్నారు. ప్రస్తుతం తీసుకునే కోర్సులతోనే జీవితం ఆధారపడి ఉంటుందన్నారు. ప్రస్తుతం అనేక మంది ఇంజినీరింగ్, మెడిసిన్ కోసమే ఆశ పడుతుంటారని అయితే వాటిలో కూడా ఎటువంటి కోర్సులను అభ్యసిస్తే ఉద్యోగ అవకాశాలు అధికంగా వస్తున్నాయనే వాటిని తెలుసుకోవాలన్నారు. ప్రస్తుతం మీరు తెలుసుకున్న ఈ విషయాలను సమీపంలోని విద్యార్థులకు కూడా అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ సీఈఓ దయాళన్, అసిస్టెంట్ డైరెక్టర్ గాయత్రి, ఉన్నత విద్యాశాఖ సలహాదారులు జయప్రకాష్ గాంధీ, ప్రొఫెసర్ సెల్వం, మేఘల, విద్యార్థినీవిద్యార్థులు పాల్గొన్నారు. -
ప్రాణం తీసిన అనుమానం
● భార్యను కత్తితో పొడి చంపి... ఉరి వేసుకుని భర్త ఆత్మహత్య సేలం: ధర్మపురి టౌన్, మదికొండపాళయంకు చెందిన రమేష్ కుమార్(32) భార్య మహాలక్ష్మి (28). వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. 2019లో జరిగిన హత్య కేసులో రమేష్‌కుమార్‌కు ధర్మపురి కోర్టు జీవిత ఖైదు విధించింది. అతడిని పోలీసులు సేలం సెంట్రల్ జైలుకు తరలించారు. భార్య, బిడ్డలను చూడడానికి రమేష్ కుమార్ పెరోల్‌పై వచ్చాడు. గత రెండు రోజులుగా భార్యాబిడ్డలతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లి వచ్చాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ధర్మపురి సమీపంలోని గుండలప్పట్టిలో ఉన్న లాడ్జిలో గది తీసుకుని రమేష్ కుమార్, మహాలక్ష్మి మాత్రం బస చేశారు. ఈ స్థితిలో సోమవారం ఉదయం లాడ్జికి ఆందోళనతో వచ్చిన రమేష్‌కుమార్ తల్లిదండ్రులు కిటికీ ద్వారా గదిలో చూడగా రమేష్‌కుమార్ ఉరిపై వేలాడుతూ, మంచంపై మహాలక్ష్మి మృతదేహంగా కనిపించారు. సమాచారం అందుకున్న మదికొండపాళయం పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా రమేష్‌కుమార్ మృతదేహంగా వేలాడుతుండగా, మహాలక్ష్మి గుండెల్లో కత్తితో పొడిచిన స్థితిలో మృతి చెంది పడి ఉంది. భార్య మహాలక్ష్మి ప్రవర్తనపై అనుమానంతో ఆమెను కత్తితో పొడి హత్య చేసి, తర్వాత రమేష్‌కుమార్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు అతని తండ్రి చక్రవర్తి పోలీసులకు తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. -
డ్రైవర్ రహిత మెట్రో ట్రయల్ రన్ విజయవంతం
సాక్షి, చైన్నె: ఫేజ్ –2లో భాగంగా చైన్నెలో పూందమల్లి–పోరూర్ మధ్య డ్రైవర్ రహిత మెట్రో రైలు ట్రయల్ రన్ విజయవంతంమైంది. తక్కువ స్పీడ్ నుంచి క్రమంగా పెంచుతూ 9 కి.మీ దూరం సోమ, మంగళవారాలలో ట్రయల్ రన్‌ను అధికారులు విజయవంతం చేశారు. ఈ రైలులో అధికారులు పర్యటించారు. తొలుత 15 కి.మీ తర్వాత 30 కి.మీ అంటూ క్రమంగా వేగాన్ని పెంచారు. ఈ రన్ విజయవంతం కావడంతో తదుపరి పరిశీలనలతో డిసెంబరు నుంచి ఈ మార్గంలో డ్రైవర్ రహిత మెట్రో సేవలకు కసరత్తులు మొదలెట్టారు. ఇదిలా ఉండగా చైన్నెలో ఏసీ ఎలక్ట్రిక్ రైలు సేవలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు మే 2వ తేదీ నుంచి చైన్నె బీచ్ చెంగల్పట్టు, చైన్నె బీచ్ – తాంబరం మధ్య రైలు సేవల వేళల్లో మార్పులు చేశారు. అదుపులోనే బీపీ, షుగర్ ● మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్ సమాచారం కొరుక్కుపేట: తమిళనాడులో రక్తపోటు, మధుమేహం నియంత్రణను మెరుగుపరచడం ద్వారా పీపుల్ సీకింగ్ మెడిసిన్ కార్యక్రమం బెంచ్‌మార్క్‌కు చేరుకుంది. తమిళనాడులో జాతీయ ఆరోగ్య ఉద్యమం కింద, ప్రజా సంక్షేమ శాఖ ద్వారా ఎస్‌హెచ్‌జీ సభ్యులను సంక్రమించే వ్యాధులను పరీక్షించేందుకు మహిళా ఆరోగ్య వలంటీర్లుగా నియమించడం ద్వారా కమ్యూనిటీ ఆధారిత వైద్య కార్యక్రమం అమలు చేయబడుతోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వరుసగా 8,713 మంది, 2,256 మంది మహిళా ఆరోగ్య వలంటీర్లు ఉప ఆరోగ్య కేంద్రాలకు అనుబంధంగా పనిచేస్తున్నారు. వారు అంటు వ్యాధులను నిర్ధారించడం, రోగులకు కౌన్సెలింగ్ అందించడమే కాకుండా దీర్ఘకాలికంగా వాటిని కూడా అందిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఇద్దరు బిడ్డలను హత్య చేసిన తల్లి అరెస్టు సేలం: సేలం జిల్లా వాళపాడి సమీపంలో ఉన్న అత్తనూర్పట్టి గ్రామానికి చెందిన వ్యక్తి విజయకుమార్(35)–ఇలవరసి(30) దంపతులు. వీరికి విగ్నేష్(6), సతీష్ కుమార్(3) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ స్థితిలో సోమవారం రాత్రి ఇంటికి సమీపంలో ఉన్న సెప్టిక్ ట్యాంకులో పిల్లలు ఇద్దరు మృతదేహాలుగా కనిపించారు. సమాచారం అందుకున్న విజయకుమార్ బంధువులు ఇద్దరు బిడ్డలను చూసి విలపించారు. కుటుంబ సమస్యల కారణంగా ఇలవరసి తన ఇద్దరు బిడ్డలను హత్య చేసి, మృతదేహాలను సెప్టిక్ ట్యాంకులో విసిరి, తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఆ వివరాల మేరకు దర్యాప్తు చేపట్టిన వాళప్పాడి పోలీసులు, పిల్లల తల్లి ఇళవరసిని అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ సంఘటన బంధువుల్లో కలకలం రేపింది. అంబేడ్కర్ విగ్రహానికి ముసుగు – కాకలూరులో ఉద్రిక్తత తిరువళ్లూరు: అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని తొలగించాలని రెవెన్యూ ఽఅధికారులు ఆదేశా లు జారీ చేయడంతో కాకలూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తిరువళ్లూరు జిల్లా కాకలూరులో గత డిసెంబర్ 14న అంబేడ్కర్ విగ్రహాన్ని అదే గ్రామానికి చెందిన యువకులు ఏర్పాటు చేశారు. అయితే విగ్రహం ఏర్పాటుకు రెవెన్యూ పోలీసుల అనుమతి లేదు. ఈ నేపథ్యంలో ఇదే విషయం అధికారుల దృష్టికి రావడంతో విగ్రహాన్ని తొలగించడానికి అధికారులు పోలీసుల బందోబస్తు నడుమ మంగళవారం యత్నించారు. విషయం తెలుసుకున్న యువకులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని విగ్రహన్ని తొలగించవద్దని కోరుతూ వాగ్వాదానికి దిగారు. అయితే అధికారులు విగ్రహం ఏర్పాటు చేయాలనుకుంటే ప్రభుత్వం నుంచి అనుమతి పొందాలని స్పష్టం చేయడంతో యువకులు వెనుక్కి తగ్గి తామే విగ్రహాన్ని రెండు రోజుల్లో తీసుకెళ్తామని అధికారులకు హామీ ఇచ్చారు. అనంతరం విగ్రహానికి ముసుగు వేశారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. -
● ప్రస్తుతం ఉన్నది ద్రావిడ మోడల్ పార్ట్ –1 ● అసెంబ్లీలో సీఎం స్టాలిన్ ● కాలనీ పదం వినియోగంపై నిషేధం
తమిళనాడు, తమిళుల కోసం, వారి హక్కుల సాధన ప్రయాణంలో ఇప్పటి వరకు ద్రావిడ మోడల్ పాలన పార్ట్ –1ను చూస్తున్నారని.. 2026 లో వెర్షన్ 2ఓ పాలన ఉంటుందని సీఎం స్టాలిన్ అన్నారు. ఇది తాజాగా లోడ్ అవుతోందని, మరిన్ని విజయాలు సృష్టించి తమిళనాడు చరిత్రను తిరగ రాస్తామని ధీమా వ్యక్తం చేశారు. సాక్షి, చైన్నె : నెలన్నర రోజులు జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారంతో ముగిశాయి. చివరి రోజున తన పరిధిలోని పోలీసు, జైళ్లు, అగ్నిమాపక శాఖకు నిధుల కేటాయింపునకు సంబంధించిన అంశాలు, పాలసీలు, కొత్త ప్రకటనల గురించి అసెంబ్లీ వేదికగా సీఎం స్టాలిన్ ప్రకటించారు. ద్రావిడ మోడల్ ప్రభుత్వం ఆరవ సారిగా అధికారంలోకి వచ్చి నాలుగో సంవత్సరాన్ని పుర్తి చేసుకుని , ఐదవ సంవత్సరంలో అడుగు పెట్టే స్వర్ణయుగం ప్రారంభం త్వరలో కాబోతోందన్నారు. ముత్తువేల్ కరుణానిధి స్టాలిన్ అను నేను అని బాధ్యతలు స్వీకరించిన రోజైన మే 7వ తేదీకి మరో ఏడు రోజులే సమయం ఉందని వ్యాఖ్యానించారు. ఈ నాలుగేళ్ల కాలంలో ఇప్పటివరకు విజయవంతంగా అమలు చేసిన ఎన్నో పథకాలే ఏడవ సారి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశంగా నిలుస్తుందన్న నమ్మకం తనకు ఉందని ధీమా వ్యక్తం చేశారు. 60 సంవత్సరాల ప్రజా జీవితంలో ఒక్క మాట చెప్పాలంటే, దివంగత నేత కలైంజ్ఞర్ వలే పయనిస్తూ, స్టాలిన్ అంటే శ్రమ– పని – పని , ‘స్టాలిన్ అంటే సాధన – సాధన –‘ అని గుండె చరిచి గాంభీర్యంగా మరెన్నో విషయాలను సభలో తెలియజేయాలనుకుంటున్నట్టు వివరించారు. గత పాలకులు చేసిన పరిపాలనా అవినీతి మయం అని గుర్తు చేస్తూ తన మీదున్న నమ్మకంతో తమిళనాడు ప్రజలు ఆ ప్రభుత్వాన్ని గద్దె దించారని పేర్కొన్నారు. నమ్మకాన్ని వమ్ము చేయకుండా దేశంలో ఏ ఇతర రాష్ట్రం సాధించని ఘనతను ద్రావిడ మోడల్ ప్రభుత్వం సొంతం చేసుకున్నట్టు ప్రకటించారు. 2024–25లో 9.69 శాతం ఆర్థిక వృద్ధిని సాధించి దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తమిళనాడు నిలిచినట్టు ధీమా వ్యక్తం చేశారు. గత ఆర్థిక సంవత్సరంలో ఎగుమతుల్లోనూ రికార్డులు, ఉన్నత విద్యలో రికార్డు అంటూ ఎన్నో రికార్డులను సృష్టించామని వివరించారు. తమిళనాడులో దారిద్య్రరేఖకు దిగువన నివసిస్తున్న వారి జీవన పరిస్థితులు మెరుగు పడ్డాయని, మెరుగైన వైద్య అందరికి దరి చేరినట్టు , పారిశ్రామిక ప్రగతి సాధించినట్టు, మహిళల భాగస్వామ్యం పెరిగినట్టు , స్టార్టప్ ర్యాంకింగ్స్‌లో ౖపైపెకి చేరినట్టు, నూనె గింజలు, వేరుశనగ , చెరకు ఉత్పత్తి సామర్థ్యంలో మొదటి స్థానానికి చేరినట్టు వివరించారు.పోలీసు దినోత్సవం సమష్టి కృషి.. తన ప్రసంగంలో సీఎం స్టాలిన్ తమిళనాడు పథకాలు, ప్రగతి ప్రాజెక్టులు, విజయాలను వివరిస్తూ, ఇది ఇంకా పూర్తి కాలేదని, కొనసాగాల్సి ఉందని వ్యాఖ్యలు చేశారు. ఈసందర్భంగా పైన పాము – కింద నక్కలు... పరుగెడితే గుంటలో పడతాం ఈ రకంగా వీటి మధ్యలో చిక్కుకున్న వ్యక్తి తరహాలో తన ప్రభుత్వ పరిస్థితి ఉందన్నారు. ఓ వైపు కేంద్ర ప్రభుత్వం వైఖరిని, మరోవైపు గవర్నర్ రూపంలో అడ్డంకులను , ఇంకో వైపు ఆర్థిక సంక్షోభం అధిగమిస్తూ విజయాల వైపుగా దూసుకెళ్తున్నామన్నారు. ఈ విజయాలన్ని స్టాలిన్ అనే ఒక వ్యక్తి సాధించినవి కావు అని, నా మంత్రివర్గం, అధికారుల సమష్టి కృషికి ఫలితంగా వివరించారు. ఇది వరకటి ప్రభుత్వాలను కామరాజ్ ప్రభుత్వం – అన్నా ప్రభుత్వం – కలైంజ్ఞర్ ప్రభుత్వ అని సంభోధించే వారని, అయితే, తనది ద్రావిడ మోడల్ ప్రభుత్వం అని ధీమా వ్యక్తం చేశారు. తమిళ సమాజం, సంస్కృతి, హక్కులు, ఆత్మ గౌరవం, సామాజిక న్యాయం, సమానత్వం, సౌభ్రాతృత్వం, లౌకికవాదం, సమైఖ్య వాదం, మరిన్ని అధికారాలు కలిగిన రాష్ట్రంగా తమిళనాడును తీర్చిదిద్దడమే తన లక్ష్యమని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా కాలనీ అన్న పదం గురించి సీఎం స్టాలిన్ గుర్తు చేస్తూ అంటరానితనానికి గుర్తింపుగా మారిన ఈ పదం ఇక ప్రభుత్వ పరంగా గానీ, ఇతర అంశాలలో గాని వాడకం నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించారు. 2026లో శాంతి వనం తమిళనాడు ప్రశాంత పూరితంగా శాంతివనంగా ఉన్నట్టు, అందుకే వివిధ పరిశ్రమల యాజమాన్యాలు ఇక్కడకు తరలి వచ్చి పెట్టుబడులు పెడుతున్నాయని వివరించారు. విద్య పరంగా మహిళలు, యువతలో పురోగతి , క్రీడా రంగం బలోపేతం, ఉత్పత్తి, ఎగుమతుల పెంపు, పర్యాటకం, దేవాలయాలు...ఇలా ప్రతి చోట పోలీసు అన్న శాంతి భద్రతల అంశం ఉంటుందన్నారు. శాంతిభద్రతల నిర్వహణలో తమిళనాడు పోలీసుల పాత్ర అభినందనీయమని, ఇక్కడ ఎలాంటి అల్లర్లు, కుల, మత ఘర్షణలకు చోటు లేదని స్పష్టం చేశారు. కొందరు కొన్ని కుట్రలు,కుతంత్రాలు చేసినా తమిళనాడు ప్రజలే వాటిని తిప్పి కొట్టారన్నారు. కొందరైతే తాను పట్టుకున్న కుందేలుకు మూడు కాళ్లే ఉన్నాయని వాదిస్తుంటారని, అలాంటి వారి విమర్శలు, ఆరోపణలు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఇది మణిపూర్ కాదు! , ఇది కాశ్మీర్ కాదు!, ఉత్తరప్రదేశ్ కుంభమేళా మరణాలు ఇక్కడ జరగలేదు! , ఇది తమిళనాడు! అన్నది ఎన్నడూ మరచిపోవద్దు అని హెచ్చరించారు. పోలీసు శాఖను ఆధునీకరించే ప్రయత్నాల గురించి ఈసందర్భంగా వివరించారు. నేరాలు, నేరస్థులను గుర్తించడానికి ఒక ఆధునిక నెట్వర్క్ ఈ వ్యవస్థను పునర్నిర్మిస్తున్నామని ఫ్రకటించారు. ప్రజలు ఆన్లైన్లో ఫిర్యాదులను నమోదు చేయడం, విభాగాల మధ్య సమాచారాన్ని పంచుకోవడం, సైబర్‌తో సహా అన్ని నేరాల నియంత్రణకు ఈ వ్యవస్థ మరింత దోహదకరంగా ఉంటుందన్నారు. 1859లో మద్రాస్ జిల్లా పోలీసుల వ్యవస్థ ఆధునీక చట్టాన్ని అమలు చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఇక ఏటా సెప్టెంబరు 6వ తేదీని పోలీసు దినోత్సవంగా జరుపుకుంటామని, ఈరోజున విధి నిర్వహణలో విశిష్ట సేవలను అందించిన వారిక పతకాలనుప్రదానం చేయనున్నట్టు ప్రకటించారు. ‘‘తమిళనాడు నేరం లేని రాష్ట్రం! డ్రగ్స్ కదలిక లేని రాష్ట్రం! లైంగిక నేరాలు లేని రాష్ట్రం!’’ అన్న లక్ష్యాన్ని చేరుకోవడం ఇక ముందున్న కర్తవ్యంగా పేర్కొంటూ, నేరాలకు పాల్పడే వారెవ్వరైనా సరే ఉపేక్షించకుండా అరెస్టు చేసి, శిక్ష పడేలా చేయడంలో తగ్గే ప్రసక్తే లేదన్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యేలు పలువురు తన ముందు ఉంచిన డిమాండ్లు, సమస్యలను ప్రస్తావిస్తూ అమలుకు విస్తృత చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. దశాబ్దం కాలం అధికారంలో ఉన్న అన్నాడీఎంకే కంటే వెయ్యిరెట్లు సుపరిపాలనను అందించి అన్ని రంగాలలోనూ ఇజయాలను సాధించామని, ఈ దృఢ సంకల్పంతో , ప్రజలపై నమ్మకంతో తాను చెబుతున్నానని తమిళనాడును తాకట్టు పెట్టే ప్రయత్నం చేసే వారిని, దోచుకోవాలన్న లక్ష్యంతో ఉన్న వారిని ఇక్కడ పాదం మోప నివ్వను అని స్పష్టం చేశారు. ఇంత వరకు ద్రావిడ మోడల్ పాలన పార్ట్ –1 మాత్రమే చూశారని గుర్తు చేశారు. ఇక, 2026లో వెర్షన్ 2.ఓ లోడ్ అవుతోందని, ఇందులో మరిన్ని విజయాలను సృష్టించ బోతున్నామంటూ తమిళం వర్థిల్లాలి, తమిళనాడు వర్థిల్లాలి అన్న నినాదం హోరెత్తించారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, ప్రధాన ప్రతి పక్ష నేత పళణి స్పందిస్తూ, 2026 అన్నాడీఎంకే వెర్షన్ అధికారంలోకి రాబోతోందని స్టాలిన్...బై...బై అన్న నినాదాన్ని ప్రజలు ఇప్పుడే అందుకునేశారని వ్యాఖ్యలు చేశారు. -
ఇండో–యూఎస్ విద్యా సహకారం బలోపేతం
కొరుక్కుపేట: ఇండో–యూఎస్ విద్యా సహకారాన్ని బలోపేతం చేయడానికి క్యాంపస్ యూఎస్ఏ, జడ్సన్ విశ్వవిద్యాలయం భారతీయ విద్యార్థులకు విద్యా అవకాశాలను కల్పిస్తుందని క్యాంపస్ యూఎస్ఏ వ్యవస్థాపకుడు హరీష్ అనంతపద్మనాభన్ తెలిపారు. ఈ సందర్భంగా చైన్నెలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అమెరికాలోని ఇల్లినాయిస్లో జడ్సన్ విశ్వవిద్యాలయంతో కలి ఇండో–యూఎస్ విద్యా రంగంలో అగ్రగామి సంస్థ అయిన క్యాంపస్ యూఎస్ఏ విద్యా భాగస్వామ్యం, పరిశోధన సహకారం విద్యార్థుల మార్పిడి కార్యక్రమాలను పెంపొందించడానికి చైన్నెలోని ప్రముఖ సంస్థలతో అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేసుకున్నట్టు తెలిపారు. భారతదేశం–అమెరికా మధ్య డ్యూయల్–డిగ్రీ ప్రోగ్రామ్‌లు, ఇంటర్న్ షిప్, ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్లు అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. ఈ క్రమంలో చైన్నె టి.నగర్‌లోని అకార్డ్ మెట్రోపాలిటన్‌లో మే 3వ తేదీన స్టడీ ఇన్ ది యూఎస్ఏ ఈవెంట్ జరుగుతుందని అన్నారు. ఆసక్తి గల విద్యార్థులు జడ్సన్ విశ్వవిద్యాలయ అధికారులతో నేరుగా సంభాషించవచ్చునని, ఉన్నత విద్యా అవకాశాలను అన్వేషించవచ్చునన్నారు. స్కాలర్షిప్ ఎంపికలతో స్పాట్ అడ్మిషన్లను కూడా పొందవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్సన్ విశ్వవిద్యాలయం ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ నిక్కీ ఫెన్నర్, కంప్యూటర్ సైన్స్‌లో గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌ల డైరెక్టర్ డాక్టర్ డానా ఓనయేమి పాల్గొన్నారు. -
అమిత్ షాతో నైనార్ భేటీ
సాక్షి, చైన్నె : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టినానంతరం ప్రపథమంగా మంగళవారం నైనార్ నాగేంద్రన్ ఢిల్లీ వెళ్లారు. కేంద్ర హోమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపి నడ్డా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లతో వేర్వేరుగా భేటీ అయ్యారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, పార్టీబలోపేతానికి సంబంధించిన వ్యూహాల గురించి నైనార్‌కు మంత్రులు వివరించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. అన్నాడీఎంకేతో కూటమి ఏర్పడిన దృష్ట్యా, వారితో కలిసి పార్టీ కార్యక్రమాలు, కేంద్ర ప్రభుత్వపథకాలను ప్రజలలోకి విస్తృతంగా తీసుకెళ్లే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించినట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే, పార్టీలోని సీనియర్లను కలుపుకుని వెళ్లాలని, ప్రధానంగా దక్షిణ తమిళనాడులోని జిల్లాల మీద ప్రత్యేక దృిష్టి సారించాలన్న సూచనలు చేసినట్టు సమాచారం. కాగాపార్టీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టినానంతరం పెద్దల ఆశీస్సలు పొందేందుకు ఢిల్లీకి వచ్చినట్టు, వారి సూచనలు, ఆదేశాలకు అనుగుణంగా కార్యక్రమాలు చేపడుతామని నైనార్ పేర్కొన్నారు. క్రీడా వర్సిటీ ఛాన్సలర్‌గా సీఎం సాక్షి, చైన్నె: క్రీడా వర్సిటీకి ఛాన్సలర్‌గా సీఎం వ్యవహరిస్తారని, వీసీ నియామకం, తొలగింపు అన్ని అధికారాలు ఛాన్సలర్కే వర్తించే విధంగా అసెంబ్లీలో చట్ట సవరణ ముసాయిదా దాఖలైంది. సుప్రీంకోర్టు తీర్పుతో పది వర్సిటీల ముసాయిదాలకు ఆమోదం, చట్టబద్ధత కల్పించే విధంగా గెజిట్‌లో వివరాల ప్రకటన విషయం తెలిసిందే. ఈ పరిస్థితులలో మంగళవారం అసెంబ్లీలో క్రీడల మంత్రి, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ఓ ముసాయిదా ప్రవేశ పెట్టారు. వర్సిటీలకు ఛాన్సలర్‌గా సీఎం ఉంటారని పేర్కొంటూ, క్రీడావర్సిటీ ప్రస్తావన చేశారు. వర్సిటీల వీసీల నియామకం, తొలగింపు తదితర అన్ని అధికారాలు ముఖ్యమంత్రికే ఉంటాయని పేర్కొంటూ దాఖలైన ఈ చట్ట సవరణ ముసాయిదాతోపాటుగా చివరి రోజున పలు ముసాయిదాలు అసెంబ్లీ ఆమోదాన్ని పొందాయి. ఇదిలా ఉండగా, కాగ్ నివేదిక అసెంబ్లీకి చేరగా ఇందులో ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించిన ప్రైవేటు విద్యా సంస్థలు విద్యార్థుల నుంచి అధిక ఫీజుగా రూ.3.14 కోట్లు అదనంగా వసూలు చేసినట్టు పేర్కొనడం గమనార్హం. వారి పిటిషన్లు తిరస్కరించండి సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే రెండాకాల గుర్తు వివాదంపై ఎన్నికల కమిషన్ ముందు ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సీవీ షణ్ముగం తన వాదనను వినిపించారు. అన్నాడీఎంకే నుంచి తొలగించిన వారికి పార్టీతో సంబంధం లేదని, వారి పిటిషన్లు తిరస్కరించాలని కోరారు. అన్నాడీఎంకేలో వివాదాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల మద్రాసు హైకోర్టులో విచారణలో ఉన్న అన్నాడీఎంకే అంతర్గాత విభేదాలు, సమరం, రెండాకుల వివాదాల వ్యవహారం విచారణ ముగిసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహరాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ కోర్టులోకి న్యాయమూర్తులు నెట్టారు. ఈ సమయంలో అన్నాడీఎంకే – బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో ఇక రెండాకు సమస్యకు అడ్డుతొలగినట్టే అన్న సంకేతాలు వెలువడ్డాయి. ఇందుకు అనుగుణంగానే తాజా పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. కేంద్ర ఎన్నికల కమిషన్‌లో విచారణ మొదలైంది. మంగళవారం అన్నాడీఎంకే తరపున రాజ్యసభ సభ్యుడు సీవీ షణ్ముగం హాజరై వాదన వినిపించారు. ఈ పిటిషన్ వేసిన వారెవ్వరు అన్నాడీఎంకేలో లేరని, వారందర్నీ తొలగించి ఉన్నట్టు వివరిస్తూ ఈ పిటిషన్ విచారణను తోసి పుచ్చాలని కోరారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ చెఫ్ దామోధరన్కు సత్కారం కొరుక్కుపేట: సౌత్ ఇండియా చెఫ్స్ అసోసియేషన్ (సికా ), ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ కల్నరీ అసొసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత చెఫ్ డాక్టర్ కె దామోధరన్ను మంగళవారం చైన్నెలో ఘనంగా సత్కరించుకున్నారు. చైన్నె ఆలందూర్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ కల్నరీ అసోసియేషన్స్ (ఐఎఫ్‌సీఏ) అధ్యక్షులు చెఫ్ మంజిత్ సింగ్ గిల్, సికా జనరల్ సెక్రటరీ చెఫ్ సీతారాం ప్రసాద్ ఇంకా సికా, ఐఎఫ్సిఏ బోర్డు సభ్యలతో పాటు తమిళనాడు ప్రభుత్వ టీడీడీసీ, ఐటీడీసీ అధికారులు, ప్రముఖులు పాల్గొని చెఫ్ దామోధరన్ను శాలువాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు . ఈ సందర్భంగా చెఫ్ దాము తన స్పందనను తెలియజేస్తూ దేశంలోని అత్యుత్తమ పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ దక్కడం, రాష్ట్రపతి ముర్ము చేతులమీదుగా అందుకోవడం చాలా గర్వంగా ఉందని తెలిపారు . వంటల కళకు తన జీవితాన్నే అంకితం చేశానని అన్నారు . చేసే పని చిన్నది పెద్దది అని చూడకుండా యువత తన పనిని సమర్థవంతంగా, నమ్మకంతో చేస్తే ఏరంగంలోనైనా గుర్తింపు ,గౌరవం దక్కుతుందనేది తానే నిదర్శనం అని అభిప్రాయపడ్డారు. -
102 పథకాలతో పోలీసు శాఖ బలోపేతం
● ఖాకీలపై సీఎం వరాల జల్లు ● అబల భద్రతకు పింక్ గస్తీ వాహనాలు సాక్షి, చైన్నె: సీఎం స్టాలిన్ అసెంబ్లీలో ప్రత్యేక ప్రకటనలు చేశారు. ఇందులో పోలీసులపై వరాల జల్లు కురిపించారు. ఇందులో కోయంబత్తూరు జిల్లా నీలంపూర్లో రూ.4.88 కోట్లతో కొత్త పోలీసు స్టేషన్ ఏర్పాటు. శివగంగై జిల్లా కీలడిలో రూ. 2.83 కోట్లతో కొత్త పోలీసు స్టేషన్ ఏర్పాటు. తిరునెల్వేలి జిల్లాలోని మెలచెవల్లో రూ.4.88 కోట్లతో కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పాటు, తిరుప్పూర్ జిల్లా పల్లడం, కళ్లకురిచ్చి జిల్లా ఉత్కోట్టంలో రూ.2.83 కోట్లతో కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పాటు ఉన్నాయి. అలాగే నామక్కల్ జిల్లా కొక్కరాయన్ పేటలో 4.88 కోట్లతో కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పాటు, తిరువణ్ణామలై జిల్లాలోని తిరువణ్ణామలై టెంపుల్ పోలీస్ రూ. 2.83 కోట్లతో ఏర్పాటు. కన్యాకుమారి జిల్లాలోని కుజితురైలో రూ.2.15 కోట్లతో కొత్త రైల్వే పోలీసు స్టేషన్ ఏర్పాటు. మధురై మున్సిపల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని చింతామణిలో రూ.6.57 కోట్లతో కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పాటుమధురై సిటీ పోలీస్ కమిషనరేట్‌లోని మడక్కుళంలో రూ. 6.57 కోట్లతో కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పాటును ప్రస్తావించారు. చైన్నెలో పోలీసు ఇంటెలిజెన్స్ యూనిట్ ఏర్పాటుకు ప్రణాళిక, యాంటీ నార్కోటిక్స్ ఇంటెలిజెనన్స్ యూనిట్ ఏర్పాటు. చెంగల్పట్టు జిల్లాలో నేర పరిశోధన విభాగం కొత్త యూనిట్ ఏర్పాటు, మైలాడుతురై, రాణిపేట జిల్లాలో రెండు నేర దర్యాప్తు విభాగం యూనిట్లు ఏర్పాటకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చైన్నె మెట్రోపాలిటన్ పోలీస్ ఫోర్స్‌లో కొత్త పోస్టులు.. రైల్వే పోలీస్ స్టేషన్ల పనిని సమన్వయం చేయడమే లక్ష్యంగా చైన్నెలోని ప్రధాన కార్యాలయంలో కొత్త టెలికమ్యూనికేషన్లు పరికరాలతో ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ ఏర్పాటును సీఎం స్టాలిన్ ప్రస్తావించారు. స్నిఫర్ డాగ్ యూనిట్, క్రైమ్ బ్రాంచ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ మెట్రోపాలిటన్ ప్రాంతాల సమన్వయం పరిపాలనా పనుల కోసం ఎస్పీ స్థాయిలో ఇద్దరు కొత్త పోలీసు అధికారులు పోస్టుల సృష్టి. ఆవడి ట్రాఫిక్ పోలీస్ డివిజన్ రెండుగా విభజించబడింది. రెడ్‌హిల్స్‌లో కొత్త ట్రాఫిక్ పోలీసు డివిజన్ ఏర్పాటు, చైన్నె మెట్రోపాలిటన్ పోలీస్ ఫోర్స్‌లో కొత్త పోస్టుల సృష్టించనున్నట్లు వివరించారు. యాంటీ–ఐడల్ యూనిట్, సైబర్ క్రైమ్ యూనిట్, రైల్వే పోలీస్ (చైన్నె, తిరుచ్చి రైల్వే జిల్లాలు) కన్సల్టెంట్ పోస్టుల సృష్టి. సబ్ ఇన్స్పెక్టర్ నేతృత్వంలోని పోలీస్ స్టేషన్లు అప్‌గ్రేడ్‌కు నిర్ణయించారు. చైన్నె నగరంలోమహిళల భద్రతకు రూ.12 కోట్లతో 80 పింక్ గస్తీ వాహనాల కొనుగోలు. పోలీసుల కోసం 10 కొత్త బస్సుల కొనుగోలు. ఖైదీల ఎస్కార్ట్ కోసం 20 కొత్త వాహనాల కొనుగోలు. పోలీసు అధికారులకు సామాగ్రిని రవాణా చేయడానికి 10 ట్రక్కుల కొనుగోలు చేయనున్నట్లు వివరించారు. అన్నా పతకాల సంఖ్యను 100 నుండి 150కి పెంపు సైబర్ క్రైమ్ యూనిట్ ఆధునీకరణ, డార్క్ వెబ్ మానిటరింగ్ సిస్టమ్‌ను ఇనన్స్టాల్. డిజిటల్ రేడియో ఫ్రీక్వెన్సీ మరో నాలుగు జిల్లాలు, రెండు నగరాలకు విస్తరణ, మొబైల్ పోరెన్సిక్ వాహన విభాగం ఏర్పాటుకు నిర్ణయించినట్లు స్టాలిన్ వెల్లడించారు. సేలం, విల్లుపురం, వెల్లూరు, తంజావూరు, మధురై, తిరునెల్వేలిలలోని ప్రాంతీయ ఫోరెన్సిక్ సైనన్స్ ప్రయోగశాలల్లో కొత్తగా సైకోట్రోఫిక్ పదార్థాల పరీక్షా యూనిట్ ఏర్పాటు. చైన్నె, ఆవడి, తాంబరం మినహా అన్ని నగరాలు, జిల్లాల్లో ప్రత్యేక సోషల్ మీడియా కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయించారు. తమిళనాడు పోలీస్ కళాశాలలో కంప్యూటర్–సహాయక బోధన నిర్వహణ ప్రాజెక్టు ప్రారంభం. తమిళనాడులోని ఇంటెలిజెనన్స్ డివిజన్, స్పెషల్ ఆపరేషనన్స్లో అత్యుత్తమ పనికి ఇక, సీఎం పతకం. ఏటా ఇచ్చే అన్నా పతకాల సంఖ్యను 100 నుంచి 150కి పెంపు, ఏటా ఇచ్చే సీఎం పతకాల సంఖ్య 3 వేల నుంచి 4 వేలకు పెంపు. పోలీస్ క్లబ్‌లను ఏర్పాటు. పశ్చిమ ప్రాంతానికి ‘‘హ్యాపీనెస్’’ పోలీస్ సంక్షేమ పథకం విస్తరణ, తమిళనాడు స్పెషల్ పోలీస్ ఫోర్స్‌లో ప్రతి బృందంలోనూ మహిళా అధికారి నియామకం ఉండే విధంగా నిర్వహించాలన్నారు. -
సామాజిక మాధ్యమాలపై గురి
● 464 ఖాతాల సీజ్ సాక్షి, చైన్నె: సామాజిక మాధ్యమాలను అస్త్రంగా చేసుకుని రాష్ట్రంలో రీల్స్ పేరిట ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న వారి భరతం పట్టేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. రెచ్చగొట్టే రీతిలో వ్యాఖ్యలు చేస్తూ వస్తున్న 464 మంది ఖాతాలను సీజ్ చేశారు. కులం పేరిట, మతం పేరిట, ప్రాంతం, సామాజిక వర్గంపేరిట రీల్స్ విడుదల చేస్తూ, కొందరు అదే పనిగా రెచ్చగొట్టే పనిలో నిమగ్నమై ఉండడం వివాదాలకు దారి తీస్తూ వస్తోంది. ఇలాంటి వారిని గుర్తించి భరతం పట్టే విధంగా పోలీసులు దూకుడుపెంచారు. ఆ దిశగా తమిళనాడులో 464 మంది ఖాతాలను బ్లాక్ చేశారు. ఇందులో 252 ఇన్‌స్ట్రాగామ్ పేజిలు ఉన్నాయి.169 ఫేస్బుక్, ఏడు ఎక్స్ పేజీలు కూడా ఉన్నాయ. వీరంతా ఇష్టం వచ్చిన అభిప్రాయాలను వ్యక్తంచేయడం, చర్చలకు దారితీసే పరిణామాలు సృష్టిస్తూ రావడంతో వీరందరి ఖాతాలను బ్లాక్ చేస్తూ పోలీసులు చర్యలు తీసుకున్నారు. చైన్నెలోని వంద మందికి చెందిన ఖాతాలను బ్లాక్ చేశారు. ఇదిలా ఉండగా, గత ఏడాది కాలంగా చైన్నెలో హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడిపిన వారిలో 11.44 లక్షల కేసులు నమోదు చేసిన రూ. 8.28 కోట్లను జరీమాన రూపంలో వసూళ్లు చేశారు. అలాగే సైబర్ నేర గాళ్లు గత ఏడాది కాలంలో ప్రజల నుంచి రూ. 1674 కోట్లు అపహరించి ఉన్నట్టు పరిశీలనలో వెలుగు చూసింది. ఇక ఉత్తర చైన్నెలో పోలీసు యంత్రాంగాన్ని పటిష్టం చేయడానికి రూ. 26.66 కోట్లతో ప్రత్యేక ప్రాజెక్టు అమలు కానుంది. -
రజనీకాంత్ రూటులో రాజచోళన్
నా జీవితం నా ఇష్టం తమిళసినిమా: నటి శృతిహాసన్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఈ బహు భాషా కథానాయకి నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్ వారసురాలు అన్నది తెలిసిందే. బాలీవుడ్లో లక్ చిత్రం ద్వారా కథానాయకిగా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీకి ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోయినా బాగా పాపులర్ చేసింది. తొలి చిత్రంలోనే గ్లామర్ విషయంలో హద్దులు చెరిపేశారు. ఆ తరువాత తెలుగులో ఎంట్రీ ఇచ్చారు. అక్కడ తొలి చిత్రం నిరాశ పరిచినా ఆ తరువాత నటించిన చిత్రాలు వరుసగా విజయం సాధించాయి. దీంతో మొదట్లో అన్ లక్కీ హీరోయిన్గా ముద్ర పడినా పోగా పోగా లక్కీ హీరోయిన్గా మారారు. ముఖ్యంగా తమిళంలో సూర్యకు జంటగా ఆమ్ అరివు చిత్రంతో పరిచయం అయ్యారు. ఏఆర్.మురుగదాస్ దర్శకత్వం వహించిన ఆ చిత్రం అంచనాలను అందుకోలేక పోయింది. అలా చూస్తే శృతిహాసన్ తెలుగు చిత్రాలతోనే వరుస విజయాలను అందుకున్నారు. తాజాగా రజనీకాంత్ హీరోగా నటిస్తున్న కూలీ చిత్రంలో ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. అదే విధంగా విజయ్ సేతుపతి సరసన ట్రైన్ చిత్రంలో నటిస్తున్నారు. ఇకపోతే ప్రేమ వ్యవహారంలో ఈమె ఎప్పుడూ సంచలనమే. ఇప్పటికే రెండు సార్లు ప్రేమలో విఫలం అయ్యారు. ఇదే ఇప్పుడు శృతిహాసన్‌కు తలనెప్పిగా మారింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ బ్యూటీ మాట్లాడుతూ ఎందరు బాయ్ ఫ్రెండ్స్‌ను మార్చారు అని అడుగుతున్నారని, ఇదే వేదన కలిగిస్తోందని చెప్పారు. ఈ విషయమై తాను ఎవరినీ తప్పు పట్టనన్నారు. తన జీవితం తన ఇష్టం అని, తనకు ఇష్టమైనట్లు జీవిస్తానని పేర్కొన్నారు. ప్రస్తుతం తాను సింగిల్ అని నటి శృతిహాసన్ పేర్కొన్నారు.కిస్ మీ ఇడియట్ అంటున్న శ్రీలీల తమిళసినిమా: టాలీవుడ్లో టాప్ కథానాయకిగా వెలిగిపోతున్న నటి శ్రీ లీల ఇప్పుడు కోలీవుడ్ లోనూ తన వేగాన్ని పెంచేస్తున్నారు. ఇప్పటికే పుష్ప– 2 చిత్రంలో కిసక్ అనే ఐటమ్ సాంగ్‌తో కురక్రారును నిద్రను దూరం చేసిన ఈ బ్యూటీ తమిళంలో సుధా కొంగర దర్శకత్వంలో రూపొందుతున్న పరాశక్తి చిత్రంలో శివ కార్తికేయన్‌కు జంటగా నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరో తమిళ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కిస్ మీ ఇడియట్ అనే టైటిల్ నిర్ణయించారు. ఇది నటి శ్రీ లీల 2019లో కన్నడంలో నటించిన శతదినోత్సవ చిత్రం కిస్కు రీమేక్ కావడం గమనార్హం. నాగన్ పిక్చర్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి కన్నడంలో తెరకెక్కించిన ఏపీ అర్జన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. ఇందులో విరాట్ అనే నటుడు కథానాయకుడిగా నటిస్తుండగా రోబో శంకర్, నాంజల్ విజయన్, అస్వతి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జయశంకర్ రామలింగం ప్రకాష్ నిక్కి సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం సెంటిమెంట్‌తో కూడిన యూత్ ఫుల్ లవ్ స్టోరీగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. దీనికి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన వివరాలు త్వరలో వెల్లడించినట్లు చిత్ర యూనిట్ తెలిపారు. మొత్తం మీద కోలీవుడ్‌లో నటి శ్రీలీల మలి చిత్రం షూటింగ్ కూడా మొదలైంది అన్నమాట. హీరో విరాట్, నటి శ్రీలీల -
బ్రహ్మాండోత్సవం
● ‘మీనాక్షి’ అమ్మవారి సన్నిధిలో చిత్తిరై ఉత్సవాలు ● ధ్వజారోహణంతో ప్రారంభం ● నిఘా వలయంలో మదురై ● నగరం అంతా పండుగ శోభ ధ్వజ స్తంభానికి పూజలు నిర్వహిస్తున్న శివాచార్యులు (ఇన్సెట్) విహరిస్తున్న మీనాక్షి అమ్మవారు, శివపార్వతులు సాక్షి, చైన్నె: ఆథ్యాత్మిక నగరం మదురై మీనాక్షి అమ్మవారి సన్నిధిలో చిత్తిరై బ్రహోత్సవ వైభవం మంగళవారం ప్రారంభమైంది. నగరం అంతా పండుగ వాతావరణాన్ని తలపించే విధంగా కొత్త శోభ సంతరించుకుంది. ఉదయం శివాచార్యుల పర్యవేక్షణలో శాస్త్రోక్తంగా జరిగిన పూజాది కార్యక్రమాలతో ఽబ్రహ్మోత్సవాలకు ధ్వజారోహనం జరిగింది. ఈసందర్భంగా శివనామస్మరణతో మదురై తిరువీధులు మారుమోగాయి. వివరాలు.. మదురై పేరు వింటే అందరికీ గుర్తుకొచ్చేది మీనాక్షి అమ్మవారి సన్నిధి. కోరిన కోర్కెలు తీర్చే అమ్మవారుగా ఇక్కడ కొలువు దీరి ఉన్నది సాక్షాత్తూ ఆ పార్వతీ దేవి అవతారమే. పురాణాల మేరకు మదురై పాలకుడు మలయ ధ్వజ పాండ్య చేసిన ఘోర తప్పస్సుకు మెచ్చి ఒక చిన్న పాప రూపంలో భూమ్మీదకు పార్వతీ దేవి అడుగు పెడుతారు. పెరిగి పెద్దయిన ఆమెను వివాహం చేసుకునేందుకు సుందరేశ్వరుడిగా శివుడు ప్రత్యక్షం అవుతాడు. భూమ్మీద జరిగిన ఈ వివాహ ఘట్టానికి సమస్తలోకాలు తరలి వచ్చినట్టుగా పురాణాలు చెబుతాయి. ఆ మేరకు ప్రతి ఏటా మీనాక్షి అమ్మవారి సన్నిధిలో చైత్రమాస (చిత్తిరై) ఉత్సవాలు కనుల పండువగా జరుగుతాయి. ఇక్కడ ఏడాది పొడవున ఉత్సవాలు జరిగినా, చిత్తిరై ఉత్సవాలకు ప్రత్యేకత ఉంది. తమిళనాడు నుంచే కాదు, పొరుగు రాష్ట్రాలు, విదేశాల నుంచి సైతం లక్షలాదిగా భక్తులు మదురై వైపుగా పోటెత్తుతారు. అందుకే ఆథ్యాత్మిక నగరం మదురై నగరంలో పండుగ శోభ సంతరించుకునే విధంగా బ్రహ్మోత్సవ ఏర్పాట్లు చేశారు. ధ్వజారోహణం.. ధ్వజారోహమంతో మంగళవారం బ్రహ్మోత్సవాలకు చుట్టారు. వేకువజాము నుంచే ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు నిర్వహించారు. మీనాక్షి అమ్మవారు, సుందరేశ్వర స్వామి వారిని వేర్వేరుగా బంగారు సింహాసనంలో అధిష్టింప చేసి ఆలయం ఆవరణలో ధ్వజ స్థంబం వద్దకు తీసుకొచ్చారు. స్వామి, అమ్మవార్లు అక్కడ ఆశీనులు కాగా, శివాచార్యుల నేతృత్వంలో 56 అడుగుల ఎత్తులో ఉన్న బంగారు ధ్వజస్తంభం వద్ద విశిష్ట పూజలు, అభిషేకాలు జరిగాయి. 12 రోజుల పాటూ వైభవోపేతంగా జరిగే చిత్తిరై బ్రహ్మోత్సవాలకు శాస్రోక్తంగా పూజలతో శ్రీకారం చుడుతూ ధ్వజారోహణం జరిగింది. ఈ సమయంలో భక్తులు శివనామ శ్మరణను మార్మోగించారు. సరిగ్గా 10.35 గంటల సమయంలో బంగారు ధ్వజస్థంబపై చిత్తిరై ఉత్సవ పతాకాన్ని ఎగుర వేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి పళణి వేల్ త్యాగరాజన్, తదితరులు పాల్గొన్నారు. ఆలయ పరిసరాలను సప్త వర్ణ పుష్పాలు, విద్యుత్ దీప కాంతులతో శోభాయ మానంగా తీర్చిదిద్దారు. రోజుకో ప్రత్యేక ఉత్సవం.. బ్రహోత్సవ వైభవంలో రోజూ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరగనున్నాయి. రోజూ మాసి వీధుల్లో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ధ్వజారోహణం తర్వాత మంగళవారం కల్పవృక్షం, సింహ వాహన సేవ నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో అత్యంత ముఖ్య ఘట్టాలు మే 6వ తేదీ నుంచి కనుల పండువగా జరుగుతాయి. 6వ తేదీన అమ్మవారి పట్టాభిషేకం, 7వ తేదీన దిగ్విజయం, 8వ తేదిన ఉదయం 8.35–8.50 గంటల మధ్య మీనాక్షి, సుందరేశ్వర స్వామి వారి కల్యాణ మహోత్సవం, 9వ తేది రథోత్సవం, 10వ తేదీన తీర్థవారి కార్యక్రమాలు జరగనున్నాయి. మే 12వ తేదీన కళ్లలగర్ స్వామి వారి వైగై నదీ ప్రవేశ ఉత్సవం జరగనుంది. చిత్తిరై ఉత్సవాలతో మదురైలో పండుగ శోభ సంతరించుకుంది. నగరం అంతా విద్యుత్ దీపకాంతుల మయం చేశారు. పెద్దఎత్తున భక్తులు తరలి రానున్నడంతో మదురై ఆథ్మాత్మిక వాతావరణంలో పులకించనుంది. మదురై వైపుగా ఆ పరిసరా జిల్లాల నుంచి ప్రత్యేక బస్సులు రోడ్డెక్కనున్నాయి. ఈ ఉత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా వేలాది మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు. మదురై, విరుదునగర్, రామనాథపురం జిల్లాలకు చెందిన పోలీసులను భద్రతా విధుల్లో నియమించారు. -
చైత్రమాస కృత్తికకు పోటెత్తిన భక్తజనం
తిరుత్తణి: చైత్రమాస కృత్తిక సందర్భంగా తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో మంగళవారం భక్తుల రద్దీ నెలకొంది. కృత్తిక సందర్భంగా వేకువజామున మూలవర్లకు సుగంధ ద్రవ్యాలతో అభి షేక పూజలు చేపట్టి బంగారు కవచంతో అలంకరించి మహాదీపారాధన పూజలు చేశారు. వేకువజాము నుంచే భక్తులు వాహనాల ద్వారా తిరుత్తణికి చేరుకున్నారు. తమ మొక్కులు నిమిత్తం మెట్లు మార్గంతో పాటూ ఘాట్‌రోడ్డులో కొండ ఆలయం చేరుకున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఆలయ మాడ వీధుల్లో భక్తుల సందడి నెలకొంది. ఉచిత దర్శన క్యూలైన్లో 4 గంటలు, రూ.వంద ప్రత్యేక దర్శన మార్గంలో 3 గంటల పాటు భక్తులు వేచివుండి స్వామిని దర్శించుకున్నారు. వేసవి ఎండల నేపధ్యంలో భక్తుల సౌకర్యాలు కల్పించే విధఃగా మాడ వీధుల్లో మ్యాట్ ఏర్పాటు చేసి తాగునీరు, పానకం సరఫరా చేసారు. సాయంత్రం 7 గంటలకు ఉత్సవర్లు వెండి నెమలి వాహనంలో మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. కృత్తిక సందర్భంగా దాదాపు 50 వేల మంది భక్తులు స్వామి దర్శనం చేసి హుండీల్లో కానుకలు చెల్లించి మెక్కులు చెల్లించారు. చైత్ర బ్రహ్మోత్సవాలకు రేపు ధ్వజారోహణం తిరుత్తణి మురునగ్ ఆలయంలో చైత్రమాస బ్రహ్మత్సవాలకు బుధవారం సాయంత్రం అంకురార్పణ నిర్వహిస్తారు. గురువారం వేకువజామున ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రా రంభమవుతాయి. 11 రోజుల పాటూ నిర్వహించే ఉత్సవ వేడుకలు సందర్భంగా రోజూ స్వామి వాహన సేవల్లో ఉదయం, సాయంత్రం సమయాల్లో ఆలయ మాడ వీధుల్లో విహరిస్తారు. మే 7న రథోత్సవం, 8న దేవసేన కల్యాణోత్సవం కమనీయంగా నిర్వహిస్తారు. ఆలయ ట్రస్ట్‌బోర్డు చైర్మన్ శ్రీధరన్, జాయింట్ కమిషనర్ రమణి తదితరుల ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాల వేడుకలను ఆలయ అధికారులు నిర్వహిస్తున్నారు. -
ఆ హీరోయిన్ల పేర్లు కలిసేలా విజయ్ (TVK) పార్టీ ఉంది: మంత్రి
తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, సినీ నటుడు విజయ్‌పై డీఎంకే నేత, మంత్రి పన్నీర్ సెల్వం సంచలన వ్యాఖ్యలు చేశారు. 2026లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో తమకు పోటీ కేవలం డీఎంకే పార్టీ మాత్రమేనని విజయ్ ఇప్పటికే సందేశం పంపాడు. కొద్దిరోజులుగా ముఖ్యమంత్రి స్టాలిన్‌పై విమర్శలు చేస్తున్నారు కూడా.. అధికార పార్టీలో జరుగుతున్న అవినీతిని ఎండగట్టేందుకు తాను ఉన్నానంటూ విజయ్ పలు వేదికలపై చెబుతున్నారు. దీంతో డీఎంకే మంత్రి పన్నీర్ సెల్వం తాజాగా విజయ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.తాజాగా జరిగిన రాజకీయ సమావేశంలో విజయ్ పార్టీ గురించి మంత్రి పన్నీర్ సెల్వం కామెంట్స్ చేశారు. 'బ్లాక్ టికెట్లు అమ్ముకునే వ్యక్తి మాకు అవినీతి గురించి పాఠాలు చెప్పడం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన తీసుకునే డబ్బు (రెమ్యునరేషన్) అంతా బ్లాక్ మనీ అని అందరికీ తెలిసిందే.' అని ఆయన అన్నారు. ఆపై వేదికపై నుంచే విజయ్ పార్టీ (TVK) అంటే ఏంటి..? దానికి సమాధానం చెప్పాలని జనసమూహాన్ని పన్నీర్ సెల్వం కోరారు. వెంటనే వారు (T-త్రిష, V- విజయ్, K- కీర్తి సురేష్) అంటూ సమాధానం ఇచ్చారు. దీంతో మీరంతా బ్రిలియంట్స్ అంటూ మంత్రి వ్యంగ్యాస్త్రాలు కురిపించారు. ఇలాంటి పార్టీ అధికారంలోకి వస్తామని చెబుతుంటే నమ్మడానికి ప్రజలు పిచ్చోళ్లు కాదని ఆయన అన్నారు.రాష్ట్రాన్ని నడపటం అంటే సినిమాలో నటించడం అంత సులభం అనుకుంటున్నారా.? అని మంత్రి ప్రశ్నించారు. జయలలిత మరణం తర్వాత తమిళనాట డీఎంకే పార్టీతో స్టాలిన్ తిరుగులేని విజయాన్ని దక్కించుకున్నారు. ప్రస్తుతం అక్కడ మోస్ట్ పవర్ఫుల్ లీడర్‌గా స్టాలిన్ ఉన్నారని జాతీయ స్థాయి సర్వేలు కూడా తేల్చేశాయి. తర్వాతి రెండో స్థానంలో విజయ్ పార్టీ ఉందని ఆ సర్వేలు చెప్పాయి. అక్కడ మరో ప్రత్యామ్నాయం లేదు. దీంతో 2026 ఎన్నికల్లో విజయ్‌తో స్టాలిన్‌కు గట్టిపోటీ తప్పదని తెలుస్తోంది. -
సుధా కొంగర దర్శకత్వంలో శింబు
తమిళసినిమా: సంచలన నటుడు శింబు చిత్రాల కోసం ఆయన అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ఈయన నటించిన చిత్రం పత్తుతల 2023లో విడుదలైంది. అదీ ఆశించిన విజయాన్ని అందుకోలేదు. కాగా తాజాగా శింబు వరుసగా చిత్రాలను కమిట్ అవుతుండడం విశేషం. ఈయన తాజాగా కమలహాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న థగ్‌లైఫ్ చిత్రంలో ముఖ్య పాత్రను పోషించారు. ఈ చిత్రం జూన్ నెల 5వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి రానుంది. కాగా ప్రస్తుతం పార్కింగ్ చిత్రం ఫేమ్ రామ్‌కుమార్ బాలకృష్ణన్ దర్శకత్వంలో తన 49వ చిత్రాన్ని చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఆ తరువాత దేసింగు పేరియసామి దర్శకత్వంలో తన 50వ చిత్రాన్ని చేయడానికి కమిట్ అయ్యారు. అదే విధంగా డ్రాగన్ చిత్రం ఫేమ్ అశ్వద్ మారిముత్తు దర్శకత్వంలో తన 51వ చిత్రంలో నటించనున్నారు. ఇలా మూడు చిత్రాల్లో నటించడానికి కమిట్ అయిన శింబు కోసం మరిన్ని నూతన చిత్రాలు ఎదురు చూస్తున్నాయి. అందులో ఒకటి సుధా కొంగర దర్శకత్వం వహించే చిత్రం ఒకటి. ఇరుదు చుట్రు చిత్రంతో సూపర్‌హిట్ కొట్టి తమిళసినిమా దృష్టిని తనవైపు తిప్పుకున్న మహిళా దర్శకురాలు సుధా కొంగర. ఆ తరువాత సూరరై పోట్రు వంటి మరో విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన ఈమె ప్రస్తుతం నటుడు శివకార్తీకేయన్ హీరోగా పరాశక్తి చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నటుడు మోహన్ రవి ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా నటి శ్రీలీల నాయకిగా పరిచయం అవుతున్నారు. డాన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. కాగా తదుపరి చిత్రం ఏమిటన్న ప్రశ్నకు తాజాగా శింబును డైరెక్టర్ చేయడానికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీన్ని వైట్టైనాయ్ అనే నవల ఆధారంగా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కాగా ఈ సంచలన చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందన్నది గమనార్హం. అదే విధంగా నటుడు శింబు దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో మరో చిత్రం చేయడానికి చర్చలు జరుగుతున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. -
సామాజిక మాధ్యమాలపై గురి
● 464 ఖాతాల సీజ్ సాక్షి, చైన్నె : సామాజిక మాధ్యమాలను అస్త్రంగా చేసుకుని రాష్ట్రంలో రీల్స్ పేరిట ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న వారి భరతం పట్టేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. రెచ్చగొట్టే రీతిలో వ్యాఖ్యలు చేస్తూ వస్తున్న 464 మంది ఖాతాలను సీజ్ చేశారు. కులం పేరిట, మతం పేరిట, ప్రాంతం, సామాజిక వర్గంపేరిట రీల్స్ విడుదల చేస్తూ, కొందరు అదే పనిగా రెచ్చగొట్టే పనిలో నిమగ్నమై ఉండడం వివాదాలకు దారి తీస్తూ వస్తోంది. ఇలాంటి వారిని గుర్తించి భరతం పట్టే విధంగా పోలీసులు దూకుడుపెంచారు. ఆ దిశగా తమిళనాడులో 464 మంది ఖాతాలను బ్లాక్ చేశారు. ఇందులో 252 ఇన్‌స్ట్రాగామ్ పేజిలు ఉన్నాయి.169 ఫేస్బుక్, ఏడు ఎక్స్ పేజీలు కూడా ఉన్నాయ. వీరంతా ఇష్టం వచ్చిన అభిప్రాయాలను వ్యక్తంచేయడం, చర్చలకు దారితీసే పరిణామాలు సృష్టిస్తూ రావడంతో వీరందరి ఖాతాలను బ్లాక్ చేస్తూ పోలీసులు చర్యలు తీసుకున్నారు. చైన్నెలోని వంద మందికి చెందిన ఖాతాలను బ్లాక్ చేశారు. ఇదిలా ఉండగా, గత ఏడాది కాలంగా చైన్నెలో హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడిపిన వారిలో 11.44 లక్షల కేసులు నమోదు చేసిన రూ. 8.28 కోట్లను జరీమాన రూపంలో వసూళ్లు చేశారు. అలాగే సైబర్ నేర గాళ్లు గత ఏడాది కాలంలో ప్రజల నుంచి రూ. 1674 కోట్లు అపహరించి ఉన్నట్టు పరిశీలనలో వెలుగు చూసింది. ఇక ఉత్తర చైన్నెలో పోలీసు యంత్రాంగాన్ని పటిష్టం చేయడానికి రూ. 26.66 కోట్లతో ప్రత్యేక ప్రాజెక్టు అమలు కానుంది. -
హన్సిక బాటలో శ్రీలీల
తమిళసినిమా: అనతి కాలంలోనే కథానాయకిగా అత్యున్నత స్థాయికి చేరుకున్న నటి శ్రీలీల. చిత్రాంగధ అనే తెలుగు చిత్రంలో చిన పాత్రతో 2017లో పరిచయమైంది. ఆ తరువాత కన్నడంలో కిస్, భరాతే చిత్రాల్లో నటించింది. ఈ తరువాత 2021లో పెళ్లి సందడి అనే తెలుగు చిత్రం ద్వారా కథానాయకిగా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ చిత్రం యావరేజ్‌గా ఆడింది. అయితే ఈ అమ్మడు మాత్రం బాగా పాపులర్ అయ్యింది. అయినప్పటికీ ఆ తరువాత వెంటనే మరో అవకాశం రాలేదు. అలా చిన్న గ్యాప్ తరువాత నటుడు రవితేజ సరసన నటించిన ధమాకా చిత్రం విజయం శ్రీలీల కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆ చిత్రంలో రవితేజతో చేసిన మాస్ డాన్స్‌ను కుర్రకారు బాగా ఎంజాయ్ చేశారు. అంతే ఈమెకు అవకాశాలు వరుస కట్టాయి. మహేశ్‌బాబు, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించడంతో శ్రీలీల టాప్ హీరోయిన్ల పట్టికలో చేరిపోయ్యింది. తాజాగా రవితేజకు జంటగా రెండోసారి జత కట్టిన మాస్ జాతర త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. అదే విధంగా అఖిల్‌కు జంటగా లెనిన్ చిత్రంలో నటిస్తోంది. అంతే కాకుండా తమిళంలోకి పరాశక్తి చిత్రం ద్వారా నేరుగా ఎంట్రీ ఇచ్చారు. శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సుధ కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ అమ్మడు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ ఆషీకీ 3 చిత్రంలో నటిస్తోంది. ఇలా కన్నడం, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటిస్తూ పాన్ ఇండియా నాయకిగా పేరు తెచ్చుకున్న శ్రీలీలలో మానవత్వం అనే మరో గుణం ఉందని చాలా మందికి తెలియకపోవచ్చు. డాక్టర్ వృత్తిని చదివి నటి అయిన ఈమె ఇటీవల ఇద్దరు దివ్యాంగ పిల్లలను దత్తత తీసుకుంది. కాగా తాజాగా మరో చిన్నారిని దత్తత తీసుకుంది. ఈ చిన్నారిని ముద్దాడుతున్న ఫొటోను తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేసింది. అందులో గుండెలపై దండయాత్ర చేయడానికి మా ఇంట్లో మరొకరు అని పేర్కొన్నారు. ఈ ఫొటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.అంతే కాదు ఈ బ్యూటీ మానవత్వాన్ని పలువురు అభినందిస్తున్నారు. కాగా నటి హన్సిక కూడా ఇదే విధంగా తన పత్రి పుట్టిన రోజుకు ఒక అనాథ చిన్నారి లెక్కన ఇప్పుటికే 33 మంది అనాథలను దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. అలా శ్రీలీల కూడా నటి హన్సిక బాటలో నడుస్తోందనిపిస్తోంది. -
మంత్రిగా మనో తంగరాజ్ ప్రమాణ స్వీకారం
● మళ్లీ పాడి పరిశ్రమల శాఖ అప్పగింత సాక్షి, చైన్నె: రాష్ట్ర మంత్రిగా పద్మనాభ పురం ఎమ్మెల్యే మనో తంగరాజ్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత గవర్నర్ ఆర్ఎన్ రవి ప్రమాణ స్వీకారం చేయించారు. వివరాలు.. డీఎంకే ప్రభుత్వం 2021లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. సీఎం స్టాలిన్ నేతృత్వంలో 33 మందితో కూడిన మంత్రి వర్గం ఏర్పాటైంది. 2022లో తొలి సారిగా మంత్రి వర్గంలో మార్పు చేశారు. 2023లో అయితే, ఏకంగా మూడు సార్లు మంత్రి వర్గంలో మార్పులు జరిగాయి. ఓ సారి మార్పుల సమయంలో కొత్తగా కేబినెట్లోకి స్టాలిన్ వారసుడు ఉదయ నిధి, మరోసారి మార్పు సమయంలో సీనియర్ నేత టీఆర్‌బాలు వారసుడు టీఆర్బీ రాజా కెబినెట్లోకి వచ్చారు. గత ఏడాది చివర్లో కూడా మంత్రి వర్గంలో మార్పులు జరిగాయి. ఈ పరిస్థితుల్లో తాజాగా మంత్రి వర్గంలో మార్పు అనివార్యంగా మారింది. మనీ లాండరింగ్ కేసులో బెయిలా.. మంత్రి పదవినా? అని సెంథిల్ బాలాజీని సుప్రీం కోర్టు ప్రశ్నించిన నేపథ్యంలో ఆయన మంత్రి పదవి కోల్పోక తప్పలేదు. ఆయన్ని మంత్రిగా తప్పించిన సీఎం స్టాలిన్ ఆయన చేతిలో ఉన్న విద్యుత్ శాఖను రవాణా మంత్రి శివశంకర్‌కు అదనంగాఅప్పగించారు. మరోశాఖ ఎకై ్సజ్ పదవిని గృహ నిర్మాణశాఖ మంత్రి ముత్తు స్వామికి అందజేశారు. ఇక, మహిళలు, శైవం, వైష్ణవం గురించి వివాదాస్పదన వ్యాఖ్యలు చేసిన సీనియర్ మంత్రి పొన్ముడిని పదవి నుంచి తప్పించారు. ఆయన చేతిలో ఉన్న అటవీ శాఖను పాడి పరిశ్రమల శాఖ మంత్రి రాజకన్నప్పన్‌కు అప్పగించారు. ఇక గత ఏడాది చివర్లో జరిగిన మార్పు సమయంలో మంత్రి పదవిని కోల్పోయిన పద్మనాభ పురం ఎమ్మెల్యే మనో తంగరాజ్కుమరో మారు అవకాశం కల్పించారు. ఆయనకు గతంలో వ్యవహరించిన పాడి పరిశ్రమల శాఖను మళ్లీ అప్పగించారు. ఈ తాజా మార్పులో గతంలో మంత్రి పదవిని కోల్పోయి మళ్లీ పదవి చేజిక్కించుకుని, మళ్లీ కోల్పోయిన వారుగా సెంథిల్ బాలాజీ, పొన్ముడి జాబితాలో చేరారు. గతంలో మంత్రి పదవి కోల్పోయి తాజాగా మళ్లీ దక్కించుకున్న జాబితాలోకి మనో తంగరాజ్ చేరారు. సోమవారం సాయంత్రం 6 గంటలకు రాజ్ భవన్లో మనో తంగరాజ్ ప్రమాణ స్వీకరం జరిగింది. సీఎం స్టాలినన్్ కొన్ని నెలల తర్వాత రాజ్ భవన్లో అడుగు పెట్టారు. గవర్నర్ ఆర్ఎన్ రవితో చిరునవ్వులతో పలకరిస్తూ కనిపించారు. మనో తంగరాజన్‌తో గవర్నర్ రవి ప్రమాణ స్వీకరం చేయించారు. మంత్రిగా ప్రమాణ స్వీకారంచేసిన మనో తంగరాజ్కు గవర్నర్, సీఎం పుష్పగుచ్చాలను అందజేసి శుభకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు, అధికారులు హాజరయ్యారు. -
ప్రత్యేక ఇసుక క్వారీల కోసం ధర్నా
వేలూరు: ఉమ్మడి జిల్లాలోని ఎద్దుల బండి కార్మికులకు ప్రత్యేకంగా ప్రభుత్వ ఇసుక క్వారీలు ఏర్పా టు చేయాలని కోరుతూ వేలూరు జిల్లా ఎద్దుల బండి కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షుడు శంకర్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కార్మికులు మాట్లాడు తూ తాము పలు సంవత్సరాలుగా ఎద్దుల బండ్లను నమ్ముకొని జీవిస్తున్నామని తెలిపారు. అయితే ఎద్దుల బండిలో ఇసుక తీసుకొచ్చినా పోలీసులు తమపై కేసులు నమోదు చేయ డం, ఎద్దుల బండిని స్వాధీనం చేసుకుంటున్నారన్నారు. దీంతో జీవనాధారం కోల్పోయి తమ కుటుంబాలు వీధిన పడు తున్నాయన్నారు. ఎద్దుల బండిలో ఇసుక తరలించేందుకు ప్రభు త్వమే ప్రత్యేకంగా ఇసుక క్వారీ ఏర్పాటు చేస్తే వాటి నుంచి ప్రభుత్వానికి నగదు చెల్లించి ఇసుకను తీసుకొస్తామన్నారు. ప్రభుత్వ ఇసుక క్వారీ ల్లో లారీలను మాత్రమే అనుమతించడం ద్వారా ఎద్దులనే నమ్ముకొని జీవిస్తున్న తాము ఎద్దులను పోషించలేక, వాటికి అవసరమైన ఆహారం పెట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కలెక్టర్ సుబ్బలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. ఈ ధర్నాలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
గర్భిణుల కోసం బయోసెన్సార్
– ఐఐటీ మద్రాసు ఆవిష్కరణ సాక్షి,చైన్నె: గర్భిణుల్లో ప్రీ–ఎక్లంప్సియాను పరీక్షించడానికి కొత్త బయోసెన్సార్ ప్లాట్‌ఫామ్‌ను ఐఐటీ మద్రాస్ నేతృత్వంలోని మల్టీ ఇన్స్టిట్యూట్ పరిశోధన బృందం అభివృద్ధి చేసింది. ప్రసవంలో సంభవించే ప్రాణాంతక సమస్య అయిన ప్రీ–ఎక్లాంప్సియా ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో గర్భిణులు, నవజాత శిశువులను ప్రభావితం చేస్తున్నట్టు పరిశోధనలలో వెలుగు చూశాయి. ఈ బారిన పడ్డ వారికి సకాలంలో చికిత్స కోసం ప్రారంభ దశలోనే వేగవంతమైన, ఆన్–సైట్, సరసమైన స్క్రీనింగ్ అవసరం అని గుర్తించి ఈ ప్లాట్ ఫామ్‌ను అభివృద్ధి చేశారు. ఇప్పటికే ఉన్న సాంకేతికతలకు ప్రత్యామ్నాయంగా ఫైబర్ ఆప్టిక్స్ సెన్సార్ టెక్నాలజీని ఉపయోగించి పాయింట్–ఆఫ్–కేర్(పీఓసీ) పరీక్షను పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ పరీక్ష ఎక్కువగా మారుమూల ప్రాంతాలకు, వనరులు పరిమితంగా ఉన్న ప్రదేశాలకు అందుబాటులో ఉండదదని పేర్కొన్నారు. ప్రీ–ఎక్లాంప్సియా నిర్ధారణ కోసం 3 లక్షణాలతో (సున్నితత్వం, విశిష్టత, వేగం) సులభంగా అందుబాటులో ఉండే, పాయింట్–ఆఫ్–కేర్ పరీక్షా పరికరం తక్షణ అవసరంగా భావించి పరిశోధన బృందం దృష్టి పెట్టింది. ఐఐటీ మద్రాస్‌లోని అప్లైడ్ మెకానిక్స్, బయోమెడికల్ ఇంజినీరింగ్ విభాగం ప్రొఫెసర్ వి.వి. రాఘవేంద్ర సాయి, డాక్టర్ రతన్ కుమార్ చౌదరి, ఐఐటీ మద్రాస్‌లోని బయోటెక్నాలజీ విభాగం డాక్టర్ నారాయణన్ మాడబూసి, వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సెంటర్ ఫర్ నానో బయోటెక్నాలజీ డాక్టర్ జితేంద్ర సతీజ, వెల్లూరులోని శ్రీ నారాయణి హాస్పిటల్ – రీసెర్చ్ సెంటర్లోని శ్రీ శక్తి అమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోమెడికల్ రీసెర్చ్ డాక్టర్ బాలాజీ నందగోపాల్ , డాక్టర్ రాంప్రసాద్ శ్రీనివాసన్‌లు ఈ ప్లాట్ ఫామ్ అభివృద్ధి చేసిన పరిశోధన బృందంలో ఉన్నారు. నిర్ధారణ సులభతరం ప్రీ–ఎక్లాంప్సియా నిర్ధారణకు ఉపయోగించే యాంజియోజెనిక్ బ్లడ్ బయోమార్కర్ ప్లాసెంటల్ గ్రోత్ ఫ్యాక్టర్ (పీఐజీఎఫ్) అనే కీలక ఫలితాలను హైలైట్ చేస్తూ ఐఐటీ మద్రాస్‌లోని అప్లైడ్ మెకానిక్స్, బయోమెడికల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన బయోసెన్సర్స్ లాబొరేటరీ ప్రొఫెసర్ వీవీ రాఘవేంద్ర సాయి స్థానికంగా సోమవారం వివరించారు. ప్రీ–ఎక్లాంప్సియా నిర్ధారణకు ఉపయోగించే యాంజియోజెనిక్ బ్లడ్ బయోమార్కర్ ప్లాసెంటల్ గ్రోత్ ఫ్యాక్టర్, పాలీమైథెల్ మెథాక్రిలేట్ ఆధారిత –బెంట్ పాలీమెరిక్ ఆప్టికల్ ఫైబర్ సెన్సార్ ప్రోబ్లను ఉపయోగించి ఫెమ్టోమోలార్ స్థాయిలో పీఐజీఎఫ్ను గుర్తించడానికి ప్లాస్మోనిక్ ఫైబర్ ఆప్టిక్ అబ్సార్బెన్స్ బయోసెన్సర్ సాంకేతికతను రూపొందించామన్నారు. అయితే, ప్రీ–ఎక్లంప్సియా ఉన్న మహిళల విషయంలో 28 వారాల గర్భధారణ తర్వాత ఇది 2 నుంచి 3 రెట్లు తగ్గుతుందన్నారు. తమ పరిశోధన బృందం అభివృద్ధి చేసిన పీఓఎఫ్ సెన్సార్ ప్రోబ్‌లు పీ అండ్ ఏబీ వ్యూహాన్ని ఉపయోగించి 30 నిమిషాలలో పీఐజీఎఫ్ను కొలవగలవు అని వివరించారు. -
తాండవ్తో బాలికల ఆరోగ్య సంరక్షణ
సాక్షి, చైన్నె: కౌమారదశలో ఉన్న బాలికల ఆరోగ్యం, జీవనశైలి అలవాట్లను హై–ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ (హెచ్ఐఐటీ) ఆధారంగా తాండవ్ కార్యక్రమం మెరుగు పరుస్తుందని డాక్టర్ ఆర్.ఎం.మోహన్స్ డయాబెటిస్ స్పెషాలిటీస్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్, మద్రాస్ డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్ అధ్యక్షురాలు డాక్టర్ ఆర్ఎం అంజనా తెలిపారు. సోమవారం స్థానికంగా తాండవ్ అధ్యయనంపై ఆమె వివరించారు. ఈ అధ్యయనం ఫలితాల మేరకు పది నిమిషాల నృత్య వ్యాయామం అయిన తాండవ్ ప్రయోజనాలు, కౌమార దశకు సాంస్కృతికంగా రూపొందించబడిన కార్యక్రమంగా పేర్కొన్నారు. శారీరక శ్రమ స్థాయి, గుండె ఆరోగ్యం, మొత్తం శ్రేయస్సులో గణనీయమైన మెరుగుదలను చూపించిందన్నారు. రోజువారీ జీవితంలో ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలనే ఆసక్తిని వ్యక్త పరిచిన వారే అధికమని పేర్కొన్నారు. చైన్నెలోని రెండు పాఠశాలల్లో 13–15 సంవత్సరాల వయస్సు గల 108 మంది బాలికలపై ఈ అధ్యయనం జరిగిందన్నారు. శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఈ కార్యక్రమం సాధించిన విజయానికి తోడు, సానుకూల ప్రవర్తనా మార్పులను ప్రోత్సహించే సామర్థ్యం కూడా ఉందన్నారు. ఈ అధ్యయనం ఫలితాల ప్రాముఖ్యతను గుర్తు చేస్తూ, ముఖ్యంగా పెరుగుతున్న అంటువ్యాధి కాని వ్యాధులను ఎదుర్కోవడంలో, కౌమారదశలో ఉన్నవారి దినచర్యలలో శారీరక శ్రమను చేర్చడం కీలకంగా పేర్కొన్నారు. అక్టోబర్ 2023లో ప్రారంభించినప్పటి నుండి ఇప్పటికే 10,000 మందికి పైగా మహిళలు, బాలికలకు ఈ కార్యక్రమం ప్రయోజనం చేకూర్చినట్టు వివరించారు. -
ఘనంగా ప్రోవోక్ అవార్డులు –2025 ప్రదానోత్సవం
కొరుక్కుపేట: ప్రతిష్టాత్మక ప్రోవోక్ అవార్డులో ప్రదానోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఇందులో యువతరానికి స్ఫూర్తినిచ్చే ప్రముఖులను అవార్డులతో పాటూ పలువురికి జీవిత సాఫల్య పురస్కారాలను ప్రదానం చేసి సత్కరించారు. సినిమా, సంస్కృతి, వ్యాపార రంగాల్లో రాణిస్తూ ఆదర్శవంతంగా నిలుస్తున్న వారికి ప్రోవోక్ అవార్డులు ఏటా అందిస్తూ వస్తున్నారు. ఈ సందర్భంగా చైన్నెలో జరిగిన కార్యక్రమంలో 80కి పైగా అవార్డులు ప్రదానం చేశారు. ఇందులో వేల్స్ యూనివర్సిటీ నిర్వాహకులు డాక్టర్ ఇషారి కె.గణేష్, నటుడు కె.భాగ్యరాజ్, నటుడు ఆర్. పార్థిబన్, నటి కుష్బూ సుందర్‌కు జీవిత సాఫల్య పురస్కారాలను అందజేశారు. అలాగే ప్రముఖ సంగీత దర్శకులు, నటుడు జీవీ ప్రకాష్, ఇంకా నటులు కలైయరసన్, సూరి, ప్రియా భవానీ శంకర్, ఐశ్వర్య రాజేష్‌కు అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు డాక్టర్ పాల్ సన్ మాట్లాడుతూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్న వారిని గుర్తించి ఏటా అవార్డులు అందిస్తున్నట్టు తెలిపారు. -
మాజీ మంత్రిని అరెస్టు చేయాలని ధర్నా
తిరుత్తణి: మహిళా సమాజాన్ని కించ పరిచే విధంగా బహిరంగ సభలో మాట్లాడిన మాజీ మంత్రి పొన్ముడిని ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించి అరెస్టు చేయాలనే డిమాండ్‌తో తిరుత్తణిలో అన్నాడీఎంకే మహిళా విభాగం ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేపట్టారు. డీఎంకే సీనియర్ నాయకుడు, పొన్ముడి బహిరంగ సభలో మహిళలను కించపరిచే విధంగా మాట్లాడినట్లు ఆరోపణలతో పార్టీ పదవి, మంత్రి పదవి సైతం కోల్పోయాడు. ఈ క్రమంలో పొన్ముడిని ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించాలనే డిమాండ్‌తో ప్రతిపక్ష పార్టీలు ధర్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా తిరుత్తణిలో అన్నాడీఎంకే మహిళా విభాగం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆ పార్టీ మాజీ మంత్రి, జిల్లా కార్యదర్శి రమణ, మాజీ ఎంపీ హరి, జిల్లా ఎన్నికల పరిశీలకుడు విజయకుమార్ తదితరులు పాల్గొని ధర్నాలో ప్రసంగించారు. తిరుత్తణి నియోజకవర్గం వ్యాప్తంగా నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు, అన్నాడీఎంకే శ్రేణులు పాల్గొని మాజీమంత్రి పొన్ముడిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. డీఎంకే ప్రభుత్వంలో శాంతి భద్రతలు పూర్తిగా లోపించి సామాన్యులకు భద్రత కొరవడిందని, మహిళలు స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితులు తలెత్తినట్లు ఆరోపించారు. ఈ మేరకు ధర్నా చేశారు. అన్నాడీఎంకే శ్రేణులు సౌందర్‌రాజన్, ఈఎన్.కండ్రిగ రవి, టీడీ.శ్రీనివాసన్, రవిచంద్రన్ తదితరులు పాల్గొన్నారు. -
నిమ్మ ధరలకు రెక్కలు
పళ్ళిపట్టు: వేసవి ఎండల ప్రభావంతో నిమ్మపండ్లు దిగుబడి గణనీయంగా తగ్గడంతో వాటి ధరలు రెండింతలు పెరిగాయి. వేసవి ఎండలు భగ్గుమంటున్నాయి. ఎండ వేడిమితో ఆరోగ్యానికి చల్లదనం ఇచ్చే పండ్లు తీసుకునేందుకు చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఆసక్తి చూపుతున్నారు. ప్రధానంగా ఆరోగ్యానికి చల్లదనం ఇచ్చే నిమ్మపండు జ్యూస్‌కు అధిక సంఖ్యలో ఉత్సాహం చూపుతున్నారు. ఆహారంతోపాటు పూజలకు వినియోగించే నిమ్మపండ్లను వేసవి ఎండల తీవ్రతతో జ్యూస్ తాగేందుకు ప్రతి ఒక్కరూ కొనుగోలు చేస్తున్నారు. దీంతో నిమ్మపండ్ల వ్యాపారం రెండింతలుగా పెరిగింది. అదే సమయంలో వేసవి ఎండల తీవ్రతతో నిమ్మ దిగుబడి గణనీయంగా తగ్గింది. ఏప్రిల్ తొలివారం వరకు కోయంబేడు, తిరుత్తణి మార్కెట్లో కేజీ నిమ్మపండ్లు రూ.60 వరకు హోల్‌సేల్ ధరలకు వ్యాపారులు విక్రయించేవారు. గత వారం రోజులుగా నిమ్మ మార్కెట్‌కు రావడం తగ్గి, డిమాండ్ పెరిగింది. పెద్ద సైజు నిమ్మపండ్లు కేజీ రూ.160, చిన్న సైజు రూ.140కి విక్రయిస్తున్నారు. దీంతో రూ.5కు విక్రయించిన పెద్దసైజు నిమ్మ ప్రస్తుతం రూ.10, చిన్న సైజు రూ.5కు విక్రయిస్తున్నట్లు నిమ్మ పండ్లు వ్యాపారి చక్రాల రఘుపతి తెలిపారు. నిమ్మ దిగుబడి తగ్గడంతో ఆంధ్రాలోని కడప, రాజంపేట, కోడూరు ప్రాంతాల నుంచి సరఫరా తగ్గినట్లు తెలిపారు. దీంతో ధరలు గణనీయంగా పెరిగినట్లు మరో నెల రోజులపాటు నిమ్మపండ్లు ధరలు తగ్గే అవకాశం లేదని తెలిపారు. -
పీఎంకే బలోపేతానికి కృషి చేయాలి
వేలూరు: గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు పీఎంకే పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని తమిళనాడు వన్నియర్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అరుల్మొయి అన్నారు. మే 11వ తేదీన జరగనున్న మహానాడుపై వేలూరు ఉమ్మడి జిల్లాలోని కార్యకర్తలతో సమీక్షా సమావేశానికి పీఎంకే జిల్లా అధ్యక్షుడు వెంకటేశన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహానాడుకు వేలూరు ఉమ్మడి జిల్లా నుంచి మొత్తం వెయ్యి బస్సుల్లో 50 వేల మందికి పైగా కార్యకర్తలు తరలిరావాలన్నారు. యువత అఽధిక సంఖ్యలో కలుసుకోవాలన్నారు. పీఎంకే పార్టీలో సామాన్య కార్యకర్త కూడా ఉన్నత పదవులకు వెళ్లవచ్చునని పార్టీలో కష్టపడే వారికి తప్పక మంచి కాలం వస్తుందన్నారు. ప్రతి గ్రామంలోనూ యువతకు మహానాడు గురించి అవగాహన కల్పించి అందులో కలుసుకునే విధంగా చూడాలన్నారు. అనంతరం సమావేశంలో పలు తీర్మానాలను సభ్యులు ఆమోదించారు. ఈ సమావేశంలో పీఎంకే మాజీ కేంద్ర మంత్రి ఎన్టీ షణ్ముగం, వన్నియర్ సంఘం రాష్ట్ర కార్యదర్శి సత్యమూర్తి, తూర్పు డివిజన్ కార్యదర్శి బాబు, జిల్లా అధ్యక్షుడు తవమని, మాజీ ఎమ్మెల్యే ఇళవయగన్, వేలూరు జిల్లా యువజన విభాగం కార్యదర్శి జగన్, గోపి, మురుగన్, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
స్వదేశానికి తరలిన పాకిస్తానీయులు
సాక్షి, చైన్నె: రాష్ట్రంలో ఉన్న 200 మంది పాకిస్తానీయులు వారి దేశానికి బయలుదేరి వెళ్లారు. వీరిలో ఎక్కువ శాతం మంది వైద్య వీసా తీసుకుని ఇక్కడి ఆస్పత్రులలో చికిత్స నిమిత్తం వచ్చి ప్రస్తుతం వెనుదిరిగారు. కశ్మీర్‌లోని పహల్గమ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌పై కేంద్రం కన్నెర్ర చేసిన విషయం తెలిసిందే. దేశంలో ఉన్న పాకిస్తానీయులు అందరూ వారిదేశానికి వెళ్లి పోవాలన్న హెచ్చరికలు జారీ చేశారు. దీంతో తమిళనాడులో ఎక్కడెక్కడ పాకిస్తానీయులు ఉన్నారో అని ప్రత్యేక బృందం ద్వారా అధికార వర్గాలు ఆరా తీశారు. చైన్నె, కోయంబత్తూరు, వేలూరులలో వైద్య చికిత్సల నిమిత్తం వచ్చిన వారు అనేక మంది ఉన్నట్టు వెలుగు చూసింది. రోగులు, వారికి సహ కారంగా ఉన్న వాళ్లు అంటూ మొత్తంగా 150 మందికి పైగా గుర్తించారు. అలాగే వివిధ సంస్థల్లో ఉన్న పాకిస్తానీయులు సమారు 50 మందిని గుర్తించారు. వీరందర్నీ ఖాళీ చేయాలని పోలీసులు సమన్లు జారీ చేశారు. దీంతో వీరంతా వారి దేశానికి తిరిగి వెళ్లి పోయారు. సోమవారం పాకిస్తానీయులు ఎవరైనా ఇంకా ఉన్నారా? అని ప్రైవేటు ఆస్పత్రులలో పోలీసులు ఆరాతీశారు. ఆస్పత్రలలో రోగులుగా ఉన్నవాళ్లంతా డిశ్చార్జ్ చేసుకుని వెళ్లి పోయారు. కొందరికి వారి వారి చికిత్సలకు సంబంధించిన మాత్రలు, మందులను వైద్యులు ఇచ్చి పంపించేశారు. కొందరు శస్త్ర చికిత్సల కోసం ఇక్కడ ఉన్నా, చివరకు వెనుదిరగక తప్పలేదు. వేసవి సెలవుల్లో ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాలి తిరువొత్తియూరు: డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఎస్.కన్నప్పన్ జిల్లా ప్రాథమిక విద్యాశాఖాధికారులకు సోమవారం సర్క్యులర్ పంపారు. అందులో తమిళనాడులో, విద్యార్థుల కోసం ఆధార్ ఎన్రోల్మెంట్ పథకం కింద, జూన్ 2024–25 విద్యా సంవత్సరం నుంచి, అన్ని పాఠశాలల్లో పుట్టినప్పటి నుంచి 17 ఏళ్ల వయసున్న విద్యార్థులకు తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ చేయాల్సి ఉంటుందని ఉత్తర్వులిచ్చారు. ఈ క్రమంలో ప్రభుత్వం, ప్రభుత్వ ఎయిడెడ్, ప్రైవేట్ ఆయా పాఠశాలల్లో ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్డేట్ చేయకుంటే, వేసవి సెలవుల్లో విద్యార్థులకు సమీపంలో ఉన్న ఈ–సేవా కేంద్రాలను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుల ద్వారా, తపాలా కార్యాలయాలు, ప్రాంతీయ సేవా కేంద్రాలలో నిర్వహించే ప్రత్యేక శిబిరాలలో ఆధార్–బయోమెట్రిక్ పునరుద్ధరణను నిర్వహించడానికి తల్లిదండ్రులకు తెలియజేయాలని పేర్కొన్నారు. ఇది కాకుండా, కొత్తగా చేరిన విద్యార్థులను పాఠశాలలో చేరే సమయంలో, బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేసుకోడానికి సూచనలు ఇవ్వాలని, ఈ పనులను పూర్తి చేయమని చెప్పడం ద్వారా, సంక్షేమ సహాయం అందజేయడం వంటి పనులు జాప్యం లేకుండా జరిగేలా చూసుకోవచ్చని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి పాఠశాల ప్రధానోపాధ్యాయులకు తగు సూచనలు ఇవ్వాలని కోరారు. వారసుడికి పదవి? ●విజయ ప్రభాకరన్‌కు యువజన విభాగం పగ్గాలు సాక్షి, చైన్నె: డీఎండీకే దివంగత నేత విజయకాంత్, ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్ దంపతుల కుమారుడు విజయ ప్రభాకరన్‌కు పార్టీ పరంగా కీలక పదవి అప్పగించనున్నారు. పార్టీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి బాధ్యతలను ఆయనకు అప్పగించేందుకు ప్రేమలత విజయకాంత్ నిర్ణయించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. వివరాలు.. కరుప్పు ఎంజీఆర్ (నలుపు ఎంజీఆర్), కెప్టెన్, పురట్చి కలైంజ్ఞర్ (విప్లవనటుడు)గా అశేషాభిమానుల హృదయాలలో విజయ్‌రాజ్ నాయుడు అలియాస్ విజయకాంత్ చోటు సంపాదించుకున్న విషయం తెలిసిందే. వెండి తెర మీదే కాదు, రాజకీయాలలోనూ రాణించే సమయంలో అనారోగ్య సమస్యలు ఆయన్ను ముందుకు సాగనివ్వకుండా చేశాయి. ఏడాదిన్నర క్రితం ఆయన తుది శ్వాస విడిచారు. దీంతో ఆ పార్టీకి అన్ని తానై కేడర్‌కు అండగా ఆయన సతీమణి ప్రేమలత విజయకాంత్ నిలబడ్డారు. లోక్‌సభ ఎన్నికలలో అన్నాడీఎంకే కూటమితో కలిసి పోటీ చేసినా ఓటమిత ప్పలేదు. విజయకాంత్ కంటూ ఒక సైన్యం తమిళనాట ఉండటంతో వారిని రక్షించుకునే దిశగా ప్రేమలత వ్యూహాలకు పదును పెట్టారు. ఇంత కాలం పార్టీలో ఎలాంటి పదవీ అన్నది లేకుండా సేవలు అందిస్తూ వస్తున్న విజయకాంత్ వారసుడు విజయ ప్రభాకరన్‌ను పూర్తి స్థాయిలో పార్టీ పరంగా ఉపయోగించుకునేందుకు సిద్ధమయ్యారు. ఆయన కు యువజన ప్రధాన కార్యదర్శి పగ్గాలు అప్పగించేందుకు నిర్ణయించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. బుధవారం జరిగే డీఎండీకే సర్వ సభ్యసమావేశంలో ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని ఆమోదించి విజయప్రభాకరన్కు యువజన విభాగం బాధ్యతలు అప్పగించ బోతున్నట్టు నేతలు పేర్కొంటున్నారు. కాగా, గత ఏడాది జరిగిన లోక్ సభఎన్నికలలో విజయకాంత్వారసుడు విజయ ప్రభాకరన్ విరుదునగర్ లోక్‌సభ నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓటమి చవి చూసిన విషయం తెలిసిందే. -
సబ్ జైలులో న్యాయమూర్తుల బృందం తనిఖీ
తిరువళ్లూరు: హైకోర్టు ఆదేశాల మేరకు తిరువళ్లూరు సబ్‌జైలులో కలెక్టర్ ప్రతాప్ నేతత్వంలోని అధికారుల బంధం సోమవారం ఉదయం అకస్మిక తనీఖీలను నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా వున్న జైళ్లలో మౌలిక సదుపాయాలు, ఖైదీలకు అందించే ఆహారం, ఆయుధాల భద్రత గదితో పాటు ఇతర అంశాలపై తనిఖీలను నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. ఇందులో భాగంగానే కలెక్టర్ ప్రతాప్, జిల్లా న్యాయమూర్తి జూలియట్ పుష్ప, ఎస్పీ శ్రీనివాసపెరుమాల్, జ్యుడిషియల్ కోర్టు న్యాయమూర్తి మీనాక్షి, చట్ట పనుల కమిషన్ కార్యదర్శి నలినీదేవి తదితరులు ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. తిరువళ్లూరు సబ్‌జైలులో ఖైదీల వివరాలు, తాగునీరు, ఆహారం, మరుగుదొడ్లు, లైబ్రరి, ఆయుదాల బద్రత గది, రికార్డులు, కంప్యూటర్లను పరిశీలించారు. అనంతరం ఖైదీల వద్ద వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఖైదీలను ఇబ్బందులకు గురి చేయకుండా వుండెందుకు చర్యలు తీసుకోవడంతో పాటు వారికి అందించే ఆహారంలోనూ నాణ్యత పాటించాలని ఆదేశించారు. ఈ తనీఖీలో ఆరోగ్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ ప్రియారాజన్, వైద్యశాల డీన్ రేవతితో పాటు రెవెన్యూ, విద్యాశాఖ, అగ్నిమాపకశాఖ, ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనతో పాటూ 22 శాఖలకు చెందిన ఉన్నత అధికారులు హాజరయ్యారు. తిరుత్తణిలో.. తిరుత్తణి: తిరుత్తణిలోని సబ్ జైలులో జిల్లా న్యాయమూర్తి ఆధ్వర్యంలో బృందం సోమవారం ఉదయం తనిఖీ చేశారు. తిరుత్తణి పాత తాలూకా కార్యాలయం సమీపంలో సబ్ జైలు వుంది. ఈ జైలులో 18 మంది విచారణ ఖైదీలు ఉంటున్నారు. ఈ క్రమంలో జైలుల్లో సదుపాయలపై జిల్లా ప్రధాన న్యాయమూర్తి జూలియట్ పుష్ప ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ప్రతాప్, ఎస్పీ శ్రీనివాస పెరుమాళ్, జిల్లా జ్యుడిషియల్ న్యాయమూర్తి మీనాక్షి తదితరుల బందం పాల్గొన్నారు. వారికి డీఎస్పీ కందన్ ఆధ్వర్యంలో పోలీసులు స్వాగతం పలికారు. -
నకిలీ బంగారు బిస్కెట్ విక్రయానికి యత్నం
తిరువళ్లూరు: నకిలీ బంగారు బిస్కెట్లను విక్రయించడానికి యత్నించిన గుంటూరుకు చెందిన అక్కతమ్ముళ్లను తిరువళ్లూరు తాలుకా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తిరువళ్లూరు జిల్లా ఈకాడు ప్రాంతానికి చెందిన మహ్మద్ ఇర్ఫాన్(35) స్నేహితురాలు శరణ్య ఎగువనల్లాట్టూరు గ్రామంలో బ్యూటీ పార్లర్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో గత మార్చి 20న ఆంధ్ర రాష్ట్రం గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గోకులపాడు గ్రామానికి చెందిన డేరంగుల లక్ష్మీ(29), ఈమె సోదరుడు ఉప్పాటాల రవికుమార్ తదితరులు బ్యూటీపార్లర్‌కు వచ్చారు. ఫేషియల్ చేసుకుని ఇంటికి వెళ్లినట్టు సమాచారం. అనంతరం తరచూ దుకాణానికి రావడంతో వీరి మధ్య స్నేహం పెరిగింది. దీనినే అదునుగా భావించిన లక్ష్మీ, రవికుమార్‌లు ఇద్దరూ శరణ్య వద్దకు వచ్చి తాము రోడ్డు విస్తరణ పనుల్లో కూలీలుగా ఉన్నామని తెలిపారు. తాము పనుల్లో ఉంన్న సమయంలో 430 గ్రాముల బంగారు బిస్కెట్ దొరికినట్టు తెలిపారు. తమకు పది లక్షలు ఇస్తే బిస్కెట్‌ను ఇచ్చేస్తాని వివరించారు. దీంతో శరణ్య తన స్నేహితుడైన ఇర్ఫాన్‌కు సమాచారం అందించింది. దుకాణం వద్దకు వచ్చిన ఇర్ఫాన్ లక్ష్మీ, రవికుమార్‌ల వద్ద వున్న బంగారు బిస్కెట్‌ను సమీపంలోని నగల దుకాణానికి తీసుకెళ్లి పరిశీలించగా, సంబంధిత కడ్డీ ఒరిజినల్‌గా తేలింది. నెలరోజుల్లో డబ్బులు సిద్ధం చేసి పిలుస్తామని, అంత వరకు ఎవ్వరికీ విక్రయించవద్దని ఇర్ఫాన్ సూచించారు. రెండు రోజుల క్రితం పది లక్షలు రెడీ చేసిన ఇర్ఫాన్ బంగారు బిస్కెట్‌తో రావాలని కబురు పంపారు. ఇద్దరూ బంగారు బిస్కెట్ శనివారం బ్యూటీపార్లర్ వద్దకు వచ్చి గోల్డ్ బిస్కెట్‌ను అప్పగించారు. దీంతో మళ్లీ ఒకసారి సంబందిత నగలను చెక్‌చేయగా నకిలీగా తేలడంతో షాక్‌కు గురయ్యారు. వెంటనే తాలూకా పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. అక్కాతమ్ముడి అరెస్టు -
ప్రతి ఒక్కరూ విద్యావేత్తలు కావాలి
వేలూరు: ప్రతి ఒక్కరూ విద్యావేత్తలుగా తయారైతే దేశాభివృద్ధి సాధ్యమని డీఎంకే పార్టీ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్యే నందకుమార్ అన్నారు. వేలూరు సమీపంలోని వెంకటాపురంలోని పుదువసూరు గ్రామంలో పెంటెక్ ఇంటర్నేషనల్ పాఠశాల ప్రారంభోత్సవం, రివేరా 21వ వార్షికోత్సవ కార్యక్రమం పాఠశాల చైర్మన్ జానకి అద్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో పాఠశాలలు అందుబాటులో ఉండేవి కావని ప్రభుత్వం ప్రతి చిన్న గ్రామానికి ఒక ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయని వీటిని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ పాఠశాలల్లో చేరి ఉన్నత విద్యను అభ్యసించాలన్నారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతంలో ఇంటర్నేషనల్ పాఠశాలను ప్రారంభించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో వేలూరు ఎమ్మెల్యే కార్తికేయన్, మేయర్ సుజాత, యూనియన్ చైర్మన్ అముద, పాఠశాల కార్యదర్శి బాలాజీ, ట్రెజరర్ విజయ్ ఆనంద్, ట్రస్టీ మోహన్‌రాజ్, టీచర్లు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
వేంబు చిత్రానికి రెండు అంతర్జాతీయ అవార్డులు
తమిళసినిమా: అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో అవార్డులను గెలుచుకోవడం సాధారణ విషయం కాదు. అందుకు తగ్గట్టు కథ, కథనాలు, నటీనటుల ప్రతిభ చాలా అవసరం. అలాంటిది వేంబు చిత్రం విడుదలకు ముందుగానే అహమదాబాద్‌లో జరిగిన అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ఉత్తమ నటి,ఉత్తమ నటుడు అవార్డులను గెలుచుకుంది. మంజల్ సినిమాస్ పతాకంపై గోల్డెన్ సురేశ్,ఎస్.విజయలక్ష్మి కలిసి నిర్మించిన చిత్రం వేంబు. నవ దర్శకుడు వీ. జస్టిన్ ప్రభు తెరకెక్కించిన ఇందులో నటుడు హరికృష్ణన్, నటి షీలా జంటగా నటించారు. మారిముత్తు,జయరావ్, పరియేరుమ్ పెరుమాళ్ కర్ణన్,వాళై చిత్రం ఫేమ్ జానకి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఏ.కుమరన్ ఛాయాగ్రహణం, మణికంఠన్ మురళీ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని మే నెలలో విడుదలకు సిద్ధం అవుతోంది. కాగా ఇది మహిళల ఇతి వృత్తంతో తెరకెక్కిన కథా చిత్రం అని దర్శకుడు తెలిపారు. సీ్త్ర తనను తాను కాపాడుకోవడంతో పాటూ మానవ మృగాల మధ్య ఎలా ధైర్యంగా జీవించాలి అన్న కథాంశంతో కూడిన ఈ చిత్రానికి ఇటీవల జరిగిన అహ్మదాబాద్ అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ఉత్తమ నటుడు, ఉత్తమ నటి అవార్డులను గెలుచుకుందని మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. నేటి సమాజానికి సంబంధించిన ముఖ్య అంశం గురించి చిర్చించిన తమ చిత్రానికి అంతర్జాజాతీయ చిత్రోత్సవాల్లో ఉత్తమ నటుడు, ఉత్తమ నటి అవార్డులు లభించడం సంతోషంగా ఉందని దర్శకుడు పేర్కొన్నారు. ఇది త్వరలో తెరపైకి రానున్న వేంబు చిత్రానికి మరింత బలం చేకూర్చుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాగా ఈ చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని త్వరలోనే నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు పేర్కొన్నారు. ఉత్తమ నటి అవార్డును అందుకుంటున్న నటి షీలా -
మంత్రి పెరియ స్వామి వంతు
సాక్షి,చైన్నె : డీఎంకే మంత్రులు దురై మురుగన్, ఎంఆర్కే పన్నీరు సెల్వం తదుపరి మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి వేల్ మురుగన్ దృష్టిలో మంత్రి ఐ. పెరియస్వామి పడ్డారు. అక్రమాస్తుల కేసులో ఆయన విడుదలను రద్దుచేస్తూ సోమవారం తీర్పు వెలువరించారు. డీఎంకే మంత్రులను కింది కోర్టులు విడదల చేయగా హైకోర్టు పునర్ సమీక్షా పిటిషన్ల విచారణ సమయంలో వాటిని రద్దు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. వారం వ్యవధిలో ముగ్గురు మంత్రుల విడుదల రద్దు అయింది. 2006–2010లో మంత్రిగా ఉన్న సమయంలో ఆదాయానికి మించి మంత్రి ఐ. పెరియ స్వామి ఆస్తులు గడించినట్టుగా గతంలో కేసు నమోదైంది. ఆయన సతీమణి సుశీల, కుమారులు ప్రభు, సెంథిల్‌కుమార్‌ను ఈ కేసులో చేర్చారు. వీరిని దిండుగల్ కోర్టు కేసు నుంచి విడుదల చేసింది. అయితే పునర్ సమీక్షా పిటిషన్ విచారణలో విడుదల తీర్పు రద్దు చేస్తూ న్యాయమూర్తి వేల్ మురుగన్ తీర్పు చెప్పారు. ఈ కేసును ఐ. పెరియస్వామి అండ్ ఫ్యామిలీ మళ్లీ ఎదుర్కోకత ప్పలేదు. ఈ కేసును ఆరు నెలల్లో ముగించే విధంగా కింది కోర్టును న్యాయమూర్తి ఆదేశించారు. -
ఘనంగా కుట్రంతవీర్ ఆడియోలాంచ్
తమిళసినిమా: కర్ణాటకకు చెందిన పాండురంగన్ శ్రీ సాయి సైంధవి క్రియేషన్ పతాకంపై నిర్మించిన తమిళ చిత్రం కుట్రం తవీర్. గజేంద్ర దర్శకత్వం వమించిన ఇందులో రిషీ రిత్విక్, ఆరాధ్య జంటగా నటించారు. నిర్మాత పాండురంగన్ కీలక పాత్రను పోషించడంతో పాటూ ఒక పాటను కూడా రాయడం విశేషం. కాగా ఈ చిత్రంలో సవరణన్, ఆనంద్‌బాబు, వినోదిని, చెండ్రాయిన్, జార్జ్ విజయ్, సాయిదీనా, మీసై రాజేంద్రన్, మాజీ సైనికుడు కామరాజ్‌లతో పాటు బాలనటి సాయి సైంధవి ముఖ్య పాత్రలు పోషించారు. రోవిన్ భాస్కర్ ఛాయాగ్రహణం, శ్రీకాంత్ దేవా సంగీతాన్ని అందించిన కుట్రం తవీర్ నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆదివారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్‌ల్యాబ్‌లో నిర్వమించారు. ఇందులో సీనియర్ దర్శక నిర్మాత, సంగీత దర్శకుడు గంగైఅమరన్, దర్శకుడు పేరరసు, పవిత్రన్, అన్నాడీఎంకే నేత ఈ. పుగళేంది, జయప్రకాశ్ స్వామీజీ, దర్శకుడు రాజ్‌కుమార్, అరవిందరాజ్, వ్యాపారవేత్త ప్రకాశ్ పళని మొదలగు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. చిత్ర నిర్మాత పాండురంగన్ మాట్లాడుతూ కర్ణాటకకు చెందిన తాను తమిళ చిత్రాన్ని నిర్మించానన్నారు. చిత్ర షూటింగ్‌ను అధిక భాగం బెంగళూరులోనే నిర్వహించినట్లు చెప్పారు. చిత్ర నిర్మాణం ద్వారా 2 వేల మందికి పని కల్పించానని ఈ చిత్రాన్ని విజయవంతం చేస్తే మళ్లీ చిత్రం చేసి పలు కుటుంబాలకు పని కల్పిస్తానని చెప్పారు. దర్శకుడు పేరరసు మాట్లాడుతూ ఏ రంగంలో కనిపించని ఐక్యత సినిమా రంగంలో కనిపిస్తుందన్నారు. అందుకు ఈ వేదికనే చిన్న ఉదాహరణ అనీ, ఇక్కడ రాజకీయవాది, ఆధ్యాత్మికవాది, వ్యాపారవేత్త ఇలా పలు రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారన్నారు. ఈచిత్రం పేరు కుట్రం తవీర్ అని, అంటే నేరాలకు దూరంగా ఉండాలని అర్థం అన్నారు. చిత్రానికి శ్రీకాంత్ దేవా మంచి సంగీతాన్ని అందించారని పేర్కొన్నారు. పాటలను చూశామని, ఒక పాటలో హీరోయిన్ చాలా బాగా నటించారని, హీరో మాత్రం హీరోయిన్ హిప్ చూడటం వల్ల లిప్ వదిలేశారని సరదాగా అన్నారు. ఈ చిత్రం హిట్ అయితే నిర్మాత మరో చిత్రం చేస్తానని చెప్పారని, కుట్రం తవీర్ చిత్రానికి మంచి ఆదరణను అందించాలని పేర్కొన్నారు. -
మేయర్ ఇంటికి బాంబు బెదిరింపు
● కోవైలో కలకలం ● కార్పొరేషన్ ఉద్యోగి అరెస్టు సేలం: బిడ్డతో భార్య పుట్టింటికి వెళ్లిందనే కోపంతో మేయర్ ఇంటికి బాంబు బెదిరింపు ఇచ్చిన కోవై కార్పొరేషన్ ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. కోయంబత్తూరు మున్సిపల్ పోలీస్ కమిషనర్ కార్యాలయ ప్రాంగణంలో పోలీస్ కంట్రోల్ రూమ్ పని చేస్తోంది. శనివారం రాత్రి 9.15 గంటల ప్రాంతంలో పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఒక కాల్ వచ్చింది. అందులో మాట్లాడిన వ్యక్తి కోయంబత్తూరు ఆర్.ఎస్. పురంలోని కార్పొరేషన్ మేయర్ ఇంటి వద్ద బాంబు ఉందని, రాత్రి 10 గంటలకు బాంబు పేలుతుందని చెప్పి ఫోన్ కట్ చేశాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, బాంబు నిర్వీర్య దళం హుటాహుటిన కోవై మేయర్ ఆర్.రంగనాయకి ఇంటికి వెళ్లి క్షుణ్ణంగా సోదాలు నిర్వహించారు. పేలుడు పరికరాలను ఉపయోగించి ఇంట్లోని అన్ని ప్రాంతాలలో సోదాలు కూడా నిర్వహించారు. బాంబు ఆనవాళ్లు లేకపోవడంతో అది కేవలం బూటకమని తేలింది. భార్య పుట్టింటికి వెళ్లిందని పోలీసుల విచారణలో బాంబు బెదిరింపు చేసిన వ్యక్తి కౌండంపాలయంలోని ప్రభు నగర్‌లోని టమాటా మార్కె ట్ ప్రాంతానికి చెందిన ఆనంద్ (40) అని తేలింది. అనంతరం పోలీసులు ఆనంద్ వద్ద జరిపిన విచారణలో తిరుపూర్‌కు చెందిన తాను కోవై కార్పొరేషన్లో ప్లంబర్‌గా పని చేస్తున్నట్టు తెలిపాడు. ఆరు నెలల క్రితం కుటుంబ సమస్య కారణంగా తన భార్య బిడ్డతో పాటు పుట్టింటికి వెళ్లిందని, ఎన్ని సార్లు బతిమాలినా ఆమెను తల్లిదండ్రులు కాపురానికి పంపించడం లేదని ఆవేదన తెలిపారు. ఈ విషయంపై ఆన్లైన్లో పలుమార్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తీవ్ర అసంతృప్తితో ఉన్న తాను మేయర్ ఇంటికి బాంబు బెదిరింపు ఇచ్చినట్టు తెలిపాడు. తర్వాత పోలీసులు ఆనంద్‌ను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. -
అభిమానోత్సాహం!
● విజయ్ను చూసేందుకు తండోపతండాలుగా రాక ● కట్టడి చేయలేక బౌన్సర్ల అవస్థలు సాక్షి, చైన్నె: తమిళగ వెట్రి కళగం బూత్ కమిటీ మహానాడు రెండో రోజుగా ఆదివారం కోయంబత్తూరులోని ఓ ప్రైవేటు కళాశాల ఆవరణలో జరిగింది. కోయంబత్తూరు, తిరుపూర్, నీలగిరి, కరూర్ జిల్లాలకు చెందిన ఎనిమిది వేల మందికి మాత్రమే ఈ సమావేశానికి ఆహ్వానం పలికారు. వీరి కోసం ప్రత్యేకంగా గుర్తింపు కార్డులను అందజేశారు. తొలి రోజు శనివారం చోటు చేసుకున్న పరిణామాలు పునరావృతం కాకుండా రెండవ రోజు జాగ్రత్తలు తీసుకున్నారు. అదనంగా కేరళ నుంచి ప్రత్యేక బౌన్సర్లను భద్రత నిమిత్తం తీసుకొచ్చారు. అభిమానులను కట్టడి చేయడానికి ముందస్తు చర్యలు తీసుకున్నా అవన్నీ ఏ మాత్రం అభిమానం ముందు తట్టుకోలేక పోయాయి. రంకెలేసిన అభిమానం బౌన్సర్లు, పోలీసు భద్రత తమను అడ్డుకోలేవని అభిమానులు నిరూపించారు. విజయ్ను చూడాలన్న కాంక్షతో ఎన్నో దార్లు తొక్కారు. ముందు జాగ్రత్త కోసం సిద్ధం చేసిన అంబులెన్స్‌లను అస్త్రంగా చేసుకుని ప్రైవేటు ఆంబులెన్స్‌ల ద్వారా సమావేశ మందిరంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన అభిమానులు ఎందరో. పెద్ద ఎత్తున అభిమానులు విజయ్ కోసం తరలి రావడంతో వారిని కట్టడి చేయలేక బౌన్సర్లు చేతులు ఎత్తేచేశారు. దీంతో పోలీసులు స్వల్పంగా లాఠీలకు పని పెట్టారు. విజయ్ను చూసేందుకు కళాశాల ఆవరణలో పెద్దఎత్తున అభిమానులు ఎదురు చూశారు. అయితే సమావేశ మందిరంలోకి మాత్రం ఎవ్వర్నీ అనుమతించ లేదు. మనం ఏమిటో నిరూపిద్దాం బూత్ కమిటీని ఉద్దేశించి విజయ్ మాట్లాడుతూ నిన్నటి సమావేశంలో ఈ భేటీ అన్నది ఓటు కోసం కాదని తాను వ్యాఖ్యానించినట్టు గుర్తుచేస్తూ, మళ్లీ చెబుతున్నానని టీవీకే అన్నది స్వలాభం కోసం రాలేదని, సామరస్యానికి చోటు లేదని వ్యాఖ్యానించారు. ప్రజలకు మంచి చేయాలన్న లక్ష్యంతోనే రాజకీయాల్లోకి వచ్చామని వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు మంచి జరుగుతుందని భావిస్తే ఎంత వరకై నా వెళ్లడానికి రెడీ అని ప్రకటించారు. తమ పాలన అన్నది క్లీన్ గవర్నమెంట్ అని, అవినీతికి చోటు ఉండదని స్పష్టం చేశారు. బూత్ స్థాయి కమిటీలు ధైర్యంగా ప్రజలలోకి వెళ్లి తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇదిచేస్తుందని స్పష్టం చేయాలని సూచించారు. ఈసందర్భంగా తాను ఒకటి చెప్పదలచుకున్నానని పేర్కొంటూ దివంగత అన్నా సూక్తులను గుర్తు చేశారు. శిరువాని నీరు ఏ విధంగా స్వచ్చంగాఉంటుందో ఆ విధంగానే టీవీకే పాలన ఉంటుందని ప్రజలలోకి తీసుకెళ్లాలని పిలుపు నిచ్చారు. ముందుగా ఆపార్టీ నేత ఆదవ్ అర్జునన్ మాట్లాడుతూ చైన్నె సచివాలయంలో ఉన్న వారికి వినిపించే రీతిలో ఓ నినాదం చేయాలని కోరగా...సీఎం ...సీఎం..సీఎం విజయ్ అంటూ సభా ప్రాంగణం మార్మోగింది. కేసుల నమోదు విజయ్ శనివారం కోయంబత్తూరుకు వచ్చిన సందర్భంగా విమానాశ్రయంలో చోటు చేసుకున్న పరిణామాలు తెలిసిందే. ఈ పరిణామాలపై తమకు అందిన ఫిర్యాదుతో ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించే విధంగా వ్యవహరించారంటూ కోయంబత్తూరు జిల్లా పార్టీ కార్యదర్శులతో పాటుగా ముఖ్య నిర్వాహకులపై కేసులను ఆదివారం పోలీసులు నమోదు చేశారు. అలాగే ఎలాంటి అనుమతి అన్నది లేకుండా విజయ్ వెన్నంటి దూసుకెళ్లి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించినట్టుగా 130కి పైగా వాహనాలకు జరిమానా విధిస్తూ కోయంబత్తూరు పోలీసులు చర్యలు తీసుకున్నారు. -
శాసీ్త్రయ కళలపై అభిరుచి పెంచాలి
● ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్‌కుమార్‌రెడ్డి కొరుక్కుపేట: శాసీ్త్రయ కళలపై చిన్ననాటి నుంచే చిన్నారుల్లో అభిరుచిని పెంచాలని తెలుగు మహాజన సమాజం అధ్యక్షుడు, ప్రముఖ పారిశ్రామిక వేత్త కె.అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. చైన్నె టి.నగర్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానం–చైన్నె శ్రవణం హాలు వేదికగా భారత్ కళా ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపక డైరెక్టర్ నృత్య గురువు రోజారాణి, ఆర్గనైజింగ్ డైరెక్టర్ దుర్జా నటరాజ్ నేతృత్వంలో భరతనాట్య ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టీటీడీ–చైన్నె ఏఈఓ పార్థసారథి, గౌరవ అతిథిగా అనిల్‌కుమార్‌రెడ్డి, ఆత్మీయ అతిథులుగా టీటీడీ స్థానిక సలహామండలి మాజీ అధ్యక్షులు నూతలపాటి శ్రీకృష్ణతోపాటు శంకర్ పాల్గొన్నారు . ఈ సందర్భంగా విశ్వ కామాక్షి కళాలయ గురువు డాక్టర్ నీరజ విశ్వనాథ్ శిష్యులు బృందంలోని 12 మంది చిన్నారులు ఆండాళ్ అరంగేట్రం, శ్రీ వెంకటేశ్వరస్వామి శ్లోకాలు , పాటలకు ఎంతో అద్భుతంగా భరతనాట్య ప్రదర్శన చేసి ప్రేక్షకులను నయనానందపరిచారు. దాదాపు రెండు గంటలపాటు సాగిన ఈ నృత్య ప్రదర్శన ఆద్యంతం ఆకట్టుకుంది. ఈ సందర్భంగా అనిల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ భారతదేశం సంగీత, నృత్య కళలకు పుట్టినిల్లు అని పేర్కొన్నారు. ఇలాంటి కళలను పరిపోషించడంతోపాటు భారతీయ శాసీ్త్రయ కళలపై చిన్నవయస్సు నుంచే పిల్లల్లో అభిరుచిని పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన గురువు రోజారాణి, వారి బృందానికి, చిన్నారులకు దేవుని అశీర్వాదాలు మెండుగా లభించాలని ఆకాంక్షించారు. గురువు రోజారాణి మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో నృత్య ప్రదర్శన ఇచ్చే భాగ్యం తమకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఈ అవకాశం కల్పించిన టీటీడీ–చైన్నె వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలి పారు. నృత్య ప్రదర్శన అందించిన చిన్నారులకు అతిథుల చేతులమీదుగా సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో అకాడమీ సపోర్టింగ్ డైరెక్టర్ ప్రణతిరెడ్డి, వ్యాఖ్యాత రోషిణి, సంగీత కళా ప్రియులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. -
ట్రాన్స్‌పోర్టు కార్మికులకు అండగా ఉంటాం
వేలూరు: ప్రభుత్వ ట్రాన్స్‌పోర్టు కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని టీఎంసీ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పార్లమెంట్ సభ్యుడు షణ్ముగం అన్నారు. వేలూరు రంగాపురంలో వీఎంఆర్ మెమోరియల్ హాల్, కార్మిక సంఘం కార్యాలయం ప్రారంభోత్సవం, పార్టీ జెండా అవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ట్రాన్స్‌పోర్టు కార్యాలయం నష్టాల్లో నడుస్తున్నప్పటికీ కార్మికుల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారన్నారు. ప్రస్తుతం అన్ని గ్రామీణ ప్రాంతాలకు సైతం బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని కార్మికుల సంక్షేమానికి అవసరమైన సంక్షేమ పథకాలు తీసుకొస్తున్న ఘనత డీఎంకే ప్రభుత్వానిదేనన్నారు. అనంతరం కార్మికులకు ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు తదితర వాటిపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో టీఎంసీ కార్మిక సంఘం రీజనల్ చైర్మన్ నటరాజన్, వేలూరు జోన్ ప్రధాన కార్యదర్శి వల్లువన్, వేలూరు ఉమ్మడి జిల్లా కార్మిక సంఘం అధ్యక్షుడు మణి, కార్యదర్శి రమేష్, కోశాధికారి క్రిష్ణన్, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
చైత్ర అమావాస్యకు పోటెత్తిన భక్తులు
● పితృదేవతలకు పిండ ప్రదానం తిరువళ్లూరు: చైత్రమాసం అమావాస్య రోజున పితృదేవతలకు పిండ ప్రదానం చేయడానికి రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు రావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. తిరువళ్లూరు పట్టణంలో ప్రసిద్ధి చెందిన శ్రీ వైద్య వీరరాఘవ స్వామివారి ఆలయం ఉంది. ఆలయానికి తిరువళ్లూరు నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలు, జిల్లాల నుంచి ప్రతి అమావాస్యకు పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీ. ఇందులో భాగంగానే ఆదివారం చైత్రమాసం అమావాస్య కావడంతో శనివారం రాత్రే పెద్ద ఎత్తున చేరుకుని ఆలయం వద్ద జాగారం చేశారు. అనంతరం ఉదయం పుణ్యస్నానాలను ఆచరించి పితృదేవతలకు పిండ ప్రదానం చేసి తమ మొక్కుబడిని చెల్లించుకున్నారు. దాదాపు నాలుగు గంటలపాటు క్యూలైన్లో వేచి ఉండి స్వామి వారిని దర్శించుకున్నారు. పిండ ప్రదానం, స్వామివారి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు రావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడిపోయింది. దీంతోపాటు కొంత మంది భక్తులు పుష్కరిణిలో బెల్లం, ఉప్పు తదితర వాటిని సైతం చల్లి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయంలో దర్శనం కోసం వచ్చిన భక్తులు చేసిన గోవిందనామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. -
స్మగ్లింగ్ కేసులో నలుగురి అరెస్టు
తిరుత్తణి: ఆంధ్రా నుంచి అద్దె కారులో మత్తు మాత్రలు తరలిస్తున్న నలుగురు యువకులను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. తిరుత్తణి సమీపంలోని చైన్నె–తిరుపతి జాతీయ రహదారి పొన్పాడి చెక్‌పోస్టు వద్ద ఆదివారం వేకువజామున మద్యపాన నిషేధిత విభాగం పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆంధ్రాలోని తిరుపతి నుంచి చైన్నెకు వెళ్లిన కారును నిలిపి తనిఖీ చేయగా నిషేధిత మత్తుమాత్రలు తరలించడాన్ని గుర్తించారు. కారుతో సహా స్వాధీనం చేసుకుని, యువకులు నలుగురిని అరెస్టు చేశారు. వారిని తిరుత్తణిలోని మద్యపాన నిషేధిత విభాగం పోలీస్ స్టేషన్లో అప్పగించారు. సీఐ రమేష్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. చైన్నె వెస్ట్ తాంబరానికి చెందిన కమల్(20) తిరుమల దర్శనానికి వెళ్లాలంటూ చైన్నెలో ఓలా కారు బుక్ చేసుకున్నాడు. శనివారం అర్ధరాత్రి పుణెలో 2500 మత్తు మాత్రలు కొనుగోలు చేశాడు. తిరుపతిలోని అతని మిత్రులు వెస్ట్ తాంబరానికి చెందిన దేవకన్నన్(21), శక్తివేల్(20), 17 ఏళ్ల మైనర్ బాలుడు సహా నలుగురూ కారులో చైన్నెకు పయనమైనట్లు తెలిపారు. నిషేధిత మత్తు మాత్రలు తరలించిన నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ముగ్గురిని రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించగా మైనర్ బాలుడికి క్రమశిక్షణ బాలుర వసతి గృహానికి తరలించారు. -
ఆలయంలో చోరీకి యత్నం
సేలం: ధర్మపురి జిల్లా, నల్లంపల్లి సమీపంలోని శేషంపట్టి గ్రామంలో పెరియాండిచ్చి అమ్మన్ ఆలయం ఉంది. ఈ ఆలయంలోకి శనివారం రాత్రి ఒక దొంగ చొరబడ్డాడు. అతను హుండీని పగలగొట్టి డబ్బు దొంగిలించడానికి వచ్చాడు. తరువాత అతను హుండీ లోపలికి చేయి పెట్టి డబ్బు తీసుకోవడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో హుండీలో పెట్టిన చెయ్యి చిక్కుకుపోయింది. దొంగ ఎంత ప్రయత్నించినా, తన చేతిని బయటకు తీయలేకపోయాడు. దీంతో చేసేది లేక రాత్రంతా అలాగే హుండీలో చిక్కుకున్న చేతితో ఉండిపోయాడు. ఈ స్థితిలో ఆదివారం ఆ మార్గంగా వెళ్లిన గ్రామస్తులు హుండీలో దొంగ చేయి పెట్టి ఉండడం చూసి దిగ్భ్రాంతి చెందారు. ఈ సమాచారం అందుకున్న అధియామన్కోట్టై పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, అతని వద్ద పోలీసులు విచారించగా.. అతను శేషంపట్టి సమీపంలోని సౌలూర్ గ్రామానికి చెందిన తంగరాజ్ అని, ఆలయ హుండీలో చోరీకి ప్రయత్నిస్తూ పట్టుబడ్డాడని తెలిసింది. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, హుండీని పగలగొట్టి, దొంగ చేయి విడిపించారు. దీంతో తంగరాజును పోలీసులు అరెస్టు చేశారు. తర్వాత అతడిని కోర్టు ముందు హాజరుపరిచి ధర్మపురి జైలుకు తరలించారు. మరో ఘటనలో.. విల్లుపురం జిల్లా ముట్టం ప్రాంతంలో గత 22వ తేదీ సంతాన భాగ్యం కోరుతూ ఇంటిలో పరిహార పూజ చేస్తున్నట్టు తెలిపి ఇద్దరు 5 సవర్లు చోరీ చేసినట్టు తెలిసింది. పోలీసుల విచారణలో వేలూరుకు చెందిన వల్లరసు, వల్లియమ్మాళ్‌లు అని తెలిసింది. వారిద్దరిని ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో వల్లియమ్మాళ్ సంఘటనకు ముందు రోజు తేనె విక్రయిస్తున్నట్టుగా వచ్చి, ఇంటిని పరిశీలించిన వెళ్లిందన్నారు. ఆ ఇంటిలో సంతానం లేమితో బాధపడుతున్నారని తెలుసుకుని ఆ విషయాన్ని కుమారుడు వల్లరసుకు తెలిపినట్టు విచారణలో తెలిసింది. తర్వాత తల్లి, కుమారుడిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. -
పుదుచ్చేరిలో బీజేపీ నేత హత్య
● నడి రోడ్డుపై నరికి చంపిన ముఠా ● పరిస్థితి ఉద్రిక్తం ● పోలీసుల మోహరింపు సేలం: పుదుచ్చేరిలో బీజేపీ రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడు ఉమా శంకర్ శనివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. లాటరీ వ్యాపారవేత్త మార్టిన్ కుమారుడు జోస్ చార్లెస్ పుట్టినరోజు వేడుకలకు ఏర్పాట్లు చేస్తుండగా ఉమా శంకర్‌ను దుండగులు నరికి చంపారు. వివరాలు... పాండిచ్చేరి సమీపంలోని కరువాడికుప్పం ప్రాంతానికి చెందిన వ్యక్తి ఉమాశంకర్(40). ఆయన పుదుచ్చేరి రాష్ట్ర బీజేపీ యువజన విభాగానికి ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు వహిస్తున్నారు. ప్రముఖ లాటరీ వ్యాపారి మార్టిన్ కుమారుడు జోస్ చార్లెస్ మార్టిన్ పుట్టినరోజు సందర్భంగా శనివారం కరువాడికుప్పం చిత్తానంద ఆలయం సమీపంలో ఏర్పాట్లు చేపట్టారు. ఈ పరిస్థితిలో, కరువాడికుప్పం ప్రాంతంలో సన్నాహాలను పరిశీలించడానికి వెళుతున్న ఉమాశంకర్‌ను అర్ధరాత్రి ఐదుగురు వ్యక్తుల ముఠా అడ్డగించి, అతన్ని కత్తులతో నరికి చంపింది. రక్తపు మడుగులో కుప్పకూలిన ఉమాశంకర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న లాస్‌పేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఉమాశంకర్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అతని బంధువులు అక్కడ నిరసనలో పాల్గొన్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. దాదాపు రెండు గంటలపాటు నిరసన కొనసాగింది. డీఐజీ సత్య సుందరం అక్కడికి వచ్చి చర్చలు జరిపారు. ఆ తరువాత ఆదివారం ఉదయం మృతదేహాన్ని శవపంచనామా నిమిత్తం కటరాగమ ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. హత్యకు గురైన ఉమాశంకర్‌పై పుదుచ్చేరి పోలీస్ స్టేషన్లలో వివిధ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, అతనికి చాలా మంది శత్రువులు ఉన్నారని, అందుకే కేసు నమోదు చేసి అతన్ని ఎవరు చంపారో దర్యాప్తు చేస్తున్నామని లాస్‌పేట పోలీసులు తెలిపారు. -
గంజాయి ప్యాకెట్లు స్వాధీనం
వేలూరు: కాట్పాడి రైల్వే స్టేషన్లో గంజాయి, గుట్కా తదితర మత్తు పదార్థాలు తరలించకుండా రైల్వే పోలీసులు వివిధ నివారణ చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో బిహార్ రాష్ట్రం పాట్నా నుంచి కేరళ రాష్ట్రం ఎర్నాకులం వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు ఆదివారం ఉదయం కాట్పాడి రైల్వే స్టేషన్‌కు వచ్చింది. దీంతో కాట్పాడి రైల్వే పోలీస్ ఇన్స్పెక్టర్ చిత్ర ఆధ్వర్యంలో రైల్వే పోలీసులు రైలులోని బోగీలలో తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో జనరల్ కంపార్టుమెంట్‌లోని మరుగుదొడ్డిలో అనుమానాస్పదంగా ఒక బ్యాగు ఉండడాన్ని గమనించిన పోలీసులు తనిఖీ చేశారు. అందులో సుమారు ఆరు కిలోల గంజాయి రెండు బాక్సులుగా ఉన్నట్లు గుర్తించారు. ఆ గంజాయిని ఎవరు తరలించారనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టినప్పటికీ ఎవరూ ముందుకు రాలేదు. దీంతో రైల్వే పోలీసులు గంజాయిని మాత్రం స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఈ గంజాయి తరలింపుపై విచారణ చేస్తున్నారు. ఘనంగా పశువైద్య దినోత్సవం పళ్లిపట్టు: ప్రపంచ పశుసంవర్ధక వైద్య దినోత్సవం సందర్భంగా పళ్లిపట్టులో ఆదివారం వేడుకలు నిర్వహించారు. స్థానిక పశు సంవర్ధక కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమానికి తిరుత్తణి డివిజన్ పశుసంవర్ధక శాఖ సహాయ డైరెక్టర్ డాక్టర్ దామోదరన్ అధ్యక్షత వహించారు. తిరుత్తణి, ఆర్కేపేట, పళ్లిపట్టు మండలాలకు చెందిన పశు సహాయ వైద్యులు పాల్గొన్న కార్యక్రమంలో పాడి రైతుల కోసం నిరంతరం సహాయకాలు అందించాలన్నారు. మూగజీవులకు ఎప్పటికప్పుడు వైద్య సేవలు అందించి రైతుల జీవితాల్లో ఆర్థిక ప్రగతికి చేదోడుగా ఉండాలని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం వైద్యులు అందరూ శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో పాడి రైతులు పాల్గొని పశువైద్యులకు శుభాకాంక్షలు తెలిపారు. -
పదవీ ఆశలతో లొంగ దీసుకోలేరు!
సాక్షి, చైన్నె : అధికారంలో వాటా, డిప్యూటీ సీఎం పదవీ అన్న ఆశలను చూపించి తనను లొంగ దీసుకోలేరని వీసీకే నేత, ఎంపీ తిరుమావళవన్ వ్యాఖ్యానించారు. తన కోసం తెరిచి ఉంచిన అన్నాడీఎంకే, విజయ్ తమిళగ వెట్రి కళగంల కూటమి తలుపులను తానే మూసి వేసినట్టు స్పష్టం చేశారు. వివరాలు.. పుదుచ్చేరి సమీపంలోని తిరుభువనంలో ప్రతిష్టించిన భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహావిష్కరణ వేడుక ఆదివారం జరిగింది. ఈ విగ్రహాన్ని ఆవిష్కరించినానంతరం వీసీకే నేత తిరుమావళవన్ కూటమి విషయంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ తిరుమావళవన్‌కు పదవీ ఆశ చూపించి కొనలేరని వ్యాఖ్యానించారు. కూటమిలోకి వస్తే, డిప్యూటీ సీఎం పదవి, మంత్రి వర్గంలో వాటా అంటూ ఆశలు చూపించారని, అయితే వీటన్నింటికీ లొంగేవాడ్ని తాను కాదని స్పష్టం చేశారు. అన్నాడీఎంకే, విజయ్ తమిళగ వెట్రి కళగం తన కోసం తెరిచి ఉంచిన డోర్లను తానే మూసి వేసినట్టు వ్యాఖ్యానించారు. తాను ఓ కూటమిలో ఉన్నానని, అయినా, వారి తప్పులను ధైర్యంగా ఎత్తి చూపిస్తున్నానని, పోలీసుల తీరును ఖండిస్తున్నానని డీఎంకే కూటమి గురించి వివరించారు. తాను డీఎంకేలో కొనసాగడాన్ని ఎగతాళిగా చూస్తున్నారని పేర్కొంటూ కూటమిలో ఉన్నా, దైర్యంగా తప్పులను ఎత్తి చూపించడం, విమర్శించడంలో తాము వెనుకాడడం లేదన్నారు. బీజేపీ, పీఎంకే ఏ కూటమిలో ఉంటుందో అక్కడ వీసీకే ఉండదని స్పష్టం చేశారు. విజయ్ తన గురించి ఆయన మనస్సులో ఉన్న మాటను చెప్పారని ప్రస్తావిస్తూ, అయినా తాను కూటమి తలుపు మూసి వేసినట్టు పేర్కొన్నారు. కాగా, తిరుమా చేసిన ఈ వ్యాఖ్యలపై అన్నాడీఎంకే సీనియర్ నేత జయ కుమార్ స్పందిస్తూ, ఆయన డీఎంకే కూటమిలో ఉన్నా, తీవ్ర మనస్తాపంతో ఉన్నట్టు స్పష్టమవుతోందన్నారు. అందుకే కూటమి లెక్కలతో మనస్సులో ఉన్నది వాగేస్తున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ మాట్లాడుతూ, ఇతర కుటమి తలుపులు మూయడం కాదని, ముందు ఆయన ఉన్న కూటమి తలుపు మూసుకోమనండి అని చమత్కరించారు. ముందుగా తాను ఉన్న ఇంటి డోర్లు మూసుకుంటే ఆయనకే మంచిదని వ్యాఖ్యానించారు. అన్నాడీఎంకే కూటమి తలుపులు ఎలా తిరుమా మూయగలరని ప్రశ్నించారు. తిరుమా వ్యాఖ అన్నాడీఎంకే, విజయ్ కూటమి డోర్ల మూత -
వెబ్ ప్రపంచంలోకి ప్రియాంక మోహన్
తమిళసినిమా: ఎప్పుడైతే అవకాశాలు తగ్గుముఖం పడతాయో అప్పుడు మన హీరోయిన్ల దృష్టి పడేది బుల్లి తెరపైకే. అయితే ఇప్పుడు వెబ్ ప్రపంచంలోకి అన్నట్లుగా మారింది. ప్రస్తుతం నటి ప్రియాంక మోహన్ పరిస్థితి ఇదే. ఈ కన్నడ భామ కన్నడం, తెలుగు, తమిళం భాషల్లో నటించి బహు భాషా కథానాయకిగా పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా తెలుగులో నాని గ్యాంగ్ లీడర్ చిత్రం ద్వారా పరిచయం అయింది. ఆ తర్వాత తమిళంలో శివ కార్తికేయన్‌కు జంటగా డాక్టర్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో ఆ తర్వాత అదే హీరోతో డాన్ చిత్రంలో నటించి మరో హిట్టు అందుకుంది. అలా సూర్య సరసన ఎదర్కుమ్ తుణిందవన్, ధనుష్‌తో కెప్టెన్ మిల్లర్ చిత్రాల్లో నటించింది. అదేవిధంగా ఇటీవల తెలుగులో మరోసారి నానితో సరిపోదా శనివారం చిత్రంలో నటించి సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత పవన్ కల్యాణ్‌కు జంటగా ఓజీ చిత్రంలో కమిట్ అయింది. అంతే ఆపై ఈమెకి మరో అవకాశం రాలేదు. అలాంటి పరిస్థితుల్లో నటుడు ధనుష్ దర్శకత్వం వహించి నిర్మించిన నిలవుక్కు ఎన్ మేల్ ఎన్నడీ కోపం చిత్రంలో ఒక ప్రత్యేక పాటలో నటించే అవకాశం కల్పించారు. ప్రత్యేక పాట కూడా ప్రియాంక మోహన్‌కు పెద్దగా హెల్ప్ కాలేదు. తెలుగు చిత్రం ఓజీ షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలియని పరిస్థితి. దీంతో ప్రియాంక మోహన్ ఖాళీగా ఉంది. అయితే ఈ సమయాన్ని విదేశాల్లో ఎంజాయ్ చేయడానికి కేటాయించింది. అదేవిధంగా ఇప్పుడు ఈమె ఒక వెబ్ సిరీస్‌లో నటించడానికి సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం. దీన్ని నెట్ ఫ్లిక్స్ ఓటీటీ సంస్థ రూపొందించనుందని తెలిసింది. ఈ వెబ్ సిరీస్ షూటింగ్‌ను జపాన్‌లో నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉన్నట్టు సమాచారం. ప్రియాంక మోహన్ -
తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు సహించం
● సీమాన్‌పై తెలుంగర్ మున్నేట్రకళగం హెచ్చరిక కొరుక్కుపేట: తమిళనాడులోని తెలుగు ప్రజలను భయపెట్టే రీతిలో, సామాజిక మాధ్యమాల ద్వారా అసభ్యకరంగా మాట్లాడుతున్న నామ్ తమిళర్ కట్చినిర్వాహకుడు సీమాన్ మాట్లాడడం తగదని, ఇలాగే మాట్లాడితే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని తెలుంగర్ మున్నేట్ర కళగం అధ్యక్షుడు పుగళ్ బాలాజీ హెచ్చరించారు. ఆదివారం ఉదయం చైన్నె ట్రిఫ్లికేన్లోని శివానందం సాలై వద్ద తెలుంగర్ మున్నేట్ర కళగం తరఫున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇందులో ద్రావిడ తెలుగుదేశం కట్చి మునిఆరుముగం, వీరపాండ్య కట్టబొమ్మన్ పేరవై ఇళయా కట్టబొమ్మన్, నాయుడు–నాయకర్ పేరవై డాక్టర్ యోగి జయకుమార్, తిరువన్నమలై నాయుడు సంఘం సెల్వరాజ్, కాళిరాజ్తోపాటు 200మందికి పైగా నాయకులు, కార్యకర్తలు, తెలుగు ప్రజలు పాల్గొని సీమాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రంలో తెలుగు, తమిళం అన్న తేడా లేకుండా అన్నదమ్ములుగా జీవిస్తున్నారని, అయితే సీమాన్ మాత్రం తెలుగు ప్రజలను భయపెట్టే రీతిలో అసభ్యకరంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో సీమాన్తోపాటు నకిలీ తమిళ జాతీయ వాదులపై చర్యలు తీసుకోవాలని, వారి సామాజిక మాధ్యమాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు. అలాగే మదురై జిల్లా తిరుమంగళం కప్పలూరులో హైవే శాఖ తరఫున తొలగించిన స్వాతంత్య్ర సమరయోధులు వీరపాండ్య కటబొమ్మన్ విగ్రహాన్ని మళ్లీ అదే స్థానంలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వారు కోరారు . -
లక్ష మందికి ఇంటి పట్టాలు
● నిబంధనల సడలింపు ● వార్షిక ఆదాయం రూ. 5 లక్షలుగా నిర్ణయం సాక్షి, చైన్నె: ప్రభుత్వ పోరంబోకు, ఆక్షేపణకరంగా ఉండే స్థలాలలో ఏళ్ల తరబడి నివాసం ఉంటున్న వారికి ఇంటి పట్టాల పంపిణీని ప్రభుత్వం వేగవంతం చేయనుంది. లక్షల మందికి ఇంటి పట్టాల పంపిణీ దిశగా వార్షిక ఆదాయంలో మార్పుచేస్తూ ఆదివారం ప్రభుత్వం మార్గదర్శకాలను ప్రకటించింది. వార్షిక ఆదాయం రూ. 5 లక్షలుగా నిర్ణయించారు. వివరాలు.. చైన్నె, శివారులోని కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పట్టు జిల్లాలను ఒక బెల్టుగా ప్రభుత్వం ఇటీవల పరిగణించిన విషయం తెలిసిందే. 32 కి.మీ దూరంలోని ఈ బెల్టు పరిధిలో ప్రభుత్వ పోరంబోకు స్థలాలు, ఆక్షేపణ కర స్థలాలలో నివాసాలు ఏర్పాటు చేసుకుని ఏళ్ల తరబడి ఉన్న వారికి ఇంటి పట్టా పంపిణీకి ఫిబ్రవరిలో జరిగిన మంత్రి వర్గం భేటీలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఇంటి పట్టాలు లేక ఏదేని రుణాలు, ప్రభుత్వ పథకాలను పొందేందుకు వీలు లేకుండా ఇబ్బందిపడుతున్న ఈ స్థలాలలో నివాసం ఏర్పాటు చేసుకున్న వారందరికి భరోసా ఇస్తూ సీఎం స్టాలిన్ ప్రకటించారు. సుదీర్ఘ కాలంగా ఈ బెల్టు పరిధిలోనే కాదు, ఇతర జిల్లాలోనూ నివసించే వారికి ఇంటి పట్టాల పంపిణీకి సిద్ధమయ్యారు. చైన్నెలో సుమారు 29 వేల గృహాలు, ఇతర ప్రాంతాలలో మరో 57 వేల గృహాలు ఉన్నట్టు గుర్తించారు. వీరందరికి ఇంటి పట్టా పంపిణీకి సిద్ధమయ్యారు. అయితే ఇంటిపట్టా కోసం దరఖాస్తు చేసుకునే వారి వార్షిక ఆదాయం రూ. 3 లక్షలుగా నిర్ణయించారు. దీంతో అనేక మందికి ఇబ్బందులు తప్పలేదు. దీనిని పరిగణించిన సీఎం స్టాలిన్ ఈనెల 17వ తేదీన జరిగిన మంత్రి వర్గం భేటిలో మార్గదర్శకాల రూపకల్పన,చట్ట సవరణకు నిర్ణయించారు.3 సెంట్ల వరకు స్థలం చట్ట సవరణతో కొత్తగా సిద్ధం చేసిన మార్గదర్శకాలను ఆదివారం రెవెన్యూ శాఖ ప్రకటించింది. ఆ మేరకు 10 సంవత్సరాలకు పైగా నివాసం ఉంటున్న వారికి ఇంటి పట్టాల పంపిణీకి సిద్ధమయ్యారు. ఒకొక్కరికి మూడు సెంట్ల భూమికి సంబంధించి పట్టా ఇవ్వనున్నారు. ఆ మేరకు వార్షిక ఆదాయం రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచారు. ఈవార్షిక ఆదాయం కలిగిన వారు ఇంటి పట్టాకు సంబంధించి దరఖాస్తు చేసుకుంటే 2 సెంట్ల భూమికి ఎలాంటి రుసుం వసూలు చేయరు. మిగిలిన ఒక సెంట్‌కు మాత్రం స్థల విలువలో 25 శాతం ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. వార్షిక ఆదాయం 5 నుంచి 12 లక్షలలోపు ఉన్న వారు అయితే, 2 సెంట్ల భూమికి స్థల విలువలో 50 శాతం, మరో సెంట్ భూమికి స్థల విలువలో వంద శాతం ఫీజు చెల్లించాల్సి ఉంటుందని ప్రకటించారు. 12 లక్షలకు పైగా ఆదాయం పొందే వారు 3 సెంట్లభూమికి స్థల విలువలో 100 శాతం ఫీజు చెల్లించే విధంగా మార్గదర్శకాలను సిద్ధంచేశారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా వర్తిసుందని ప్రకటించారు. -
అప్రకటిత కోతలపై దృష్టి సారించండి
తిరువళ్లూరు: జిల్లా వ్యాప్తంగా అప్రకటిత కోతలు, లో ఓల్టేజ్ సమస్యలపై తరచూ ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో వాటిని సరి చేయాలని విద్యుత్‌శాఖ అధికారులకు కలెక్టర్ ప్రతాప్ ఆదేశాలు జారీ చేశారు. తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో శనివారం రాత్రి 9 గంటల వరకు జరిగింది. విద్యుత్‌శాఖ ఉన్నత అధికారులు సమావేశానికి హాజరుకాగా, కలెక్టర్ ప్రతాప్ హాజరై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో నిర్మిస్తున్న సబ్‌స్టేషన్ వివరాలు, విద్యు త్స్తంభాలు, ట్రాన్స్పార్మర్ల మార్పిడితో పాటూ ఇతర అంశాలపై సమిక్ష నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు. సబ్స్టేషన్ల నిర్మాణపు పనులను వేగంగా పూర్తి చేసి త్వరగా అందుబాటులోకి తేవాలని, తద్వారా అప్రకటిత కోతలు, లోఓల్టేజ్ సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం ఉందన్నారు. సమావేశంలో సీఈ శేఖర్‌తో పాటూ పలువురు పాల్గొన్నారు. -
కోవైలో రంకెలేసిన వీరత్వం
సేలం : కోయంబత్తూరు చెట్టిపాళయం జల్లికట్టు పోటీలను మంత్రి సెంథిల్ బాలాజీ ఆదివారం ప్రారంభించారు. ఈ జల్లికట్టు పోటీలో 800 ఎద్దులు, 500 మంది వీరులు పోటీపడ్డారు. కోయంబత్తూరు చెట్టిపాళయం బైపాస్ రోడ్డులో ఈ పోటీని విద్యుత్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం పోటీలో పాల్గొనాల్సిన ఎద్దులు, క్రీడాకారులకు వైద్య పరీక్షలు నిర్వహించి పోటీలో పాల్గొనడానికి అనుమతి ఇచ్చారు. అంతకుముందు కోయంబత్తూరు జిల్లా కలెక్టర్ పవన్ కుమార్ సమక్షంలో వీరులు జల్లికట్టు ప్రతిజ్ఞ చేశారు. ఆ సమయంలో ఉత్సవ కమిటీ సభ్యులు, ఎద్దుల పోటీదారులు ఎద్దుల యజమానులు అన్ని ప్రభుత్వ నిబంధనలను పూర్తిగా పాటించాలని ఆదేశించారు. ఇంకా మద్రాస్ హైకోర్టు మార్గదర్శకాలను పాటించేలా చూసుకోవడానికి మొత్తం జల్లికట్టు పోటీని వీడియో రికార్డ్ చేశారు. ఈ జల్లికట్టు పోటీలను వీక్షించడానికి ప్రజలకు వీక్షణ సౌకర్యాలు, తాగునీటి సౌకర్యాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఇంకా వీరులకు గాయాలు అయితే తక్షణ చికిత్స అందించడానికి సాధారణ వైద్య బృందాలు, పశువైద్య బృందాలు సిద్ధంగా ఉంచారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ పర్యవేక్షణలో 300 మందికి పైగా పోలీసు సిబ్బందిని భద్రతా పనుల కోసం నియమించారు. కోయంబత్తూరు కార్పొరేషన్ కమిషనర్, కోవై, పొల్లాచి పార్లమెంటు సభ్యులు, కోయంబత్తూరు కార్పొరేషన్ మేయర్ ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా హాజరయ్యారు. పోటీలో గెలుపొందిన వీరులు, ఎద్దుల యజమానులకు కారు, బైక్‌లు, గృహోపకరణాలు వంటి పలు బహుమతులుగా అందజేశారు. కాగా ఈ ప్రాంతంలో జల్లికట్టు పోటీలు 4 సంవత్సరాల తర్వాత నిర్వహించడం గమనార్హం. దీంతో చుట్టు పక్కల పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. ఆకట్టుకున్న జల్లికట్టు పోటీలు -
పాప్‌కార్న్ ధరను ప్రభుత్వమే నిర్ణయించాలి
తమిళసినిమా: సక్సెస్ క్రియేషన్స్ పతాకంపై పౌవులోస్ జార్జ్ నిర్మించిన అగమొళి విళిగళ్, సశీంద్ర కె.శంకర్ దర్శకత్వం వహించారు. ఈయన ప్రముఖ దర్శకుడు భరతన్ శిష్యుడు అన్నది గమనార్హం. నటుడు ఆదమ్ హాసన్, నటి నేహా రత్నాకరన్ జంటగా నటించిన ఈ చిత్రానికి ఎస్పీ వెంకటేష్ సంగీతాన్ని అందించారు. యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని మే నెల 9వ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు పేరరసు కె.రాజన్, చిన్న బడ్జెట్ చిత్రాల నిర్మాతల సంఘం అధ్యక్షుడు కె.అనుబంధం, తమిళనాడు ప్రభుత్వ సాహిత్య సంగీత నాటక మండలి సభ్యుడు మంగై రాజన్, జాగ్వార్ తంగం, తమిళనాడు థియేటర్ల సంఘం కార్యదర్శి తిరుచ్చి శ్రీధర్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని చిత్ర ఆడియోను ఆవిష్కరించారు. చిత్రం నిర్మాత పౌవులోస్ జార్జ్ మాట్లాడుతూ అగమొళి విళిగళ్ చిత్రాన్ని మే నెల తొమ్మిదో తేదీన విడుదల చేస్తున్నామని అందరూ ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. దర్శకుడు పేరరసు మాట్లాడుతూ అగమొళి చిత్రం పేరే అందంగా ఉందన్నారు తమిళ భాష తెలియని ఈ చిత్రం నిర్మాత పేపర్‌పై రాసుకొని మరీ సమావేశంలో మాట్లాడడం ప్రశంసనీయమన్నారు. ఈ చిత్రంలోని పాటలు, విజువల్స్ అన్నీ బాగున్నాయన్నారు. తమిళ సినిమా నశించి పోతుందని అంటున్నారని, ఈ విషయంలో ప్రభుత్వమే తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ముఖ్యంగా సినిమా థియేటర్లో టికెట్ ధరలు నిర్ణయించిన ప్రభుత్వం పాప్‌కార్న్ ధరలను నిర్ణయించలేదా అంటూ ప్రశ్నించారు. థియేటర్లో రూ.30 పాప్‌కార్న్ రూ.300కు విక్రయిస్తున్నారని, అదేవిధంగా సినిమా టిక్కెట్ ధర కంటే కార్ పార్కింగ్ రుసుమే అధికమని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రేక్షకులు థియేటర్లకు రావాలంటే అంటే ఎలా వస్తారని ప్రశ్నించారు. వీటి ధరలను ప్రభుత్వం ఎందుకు నిర్ణయించకూడదు, ప్రజల కోసమే కదా ప్రభుత్వం అని అన్నారు. అగమొళి విళిగళ్ చిత్రాన్ని చిన్న బడ్జెట్లో అద్భుతంగా రూపొందించారన్నారు. విజువల్స్ చూస్తుంటే పెయింటింగ్ మాదిరి ఉన్నాయన్నారు. అంతగా చిత్రం యూనిట్ శ్రమించిందని, ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు దర్శకుడు పేరరసు పేర్కొన్నారు. -
కలైపులి శేఖరన్ కథ చెబితే మర్చిపోలేం..
తమిళసినిమా: నటుడు, నిర్మాత, దర్శకుడు, చైన్నె, చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూర్ జిల్లాల డిస్ట్రిబ్యూటర్ల సంఘం అధ్యక్షుడు కలైపులి శేఖరన్ అనారోగ్యం కారణంగా ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయనకు శనివారం చైన్నె, చెంగల్పట్టు, కాంచీపురం జిల్లాల డిస్ట్రిబ్యూటర్ల సంఘం నేతత్వంలో స్మారకాంజలి కార్యక్రమాన్ని నిర్వహించారు. నిర్మాత కలైపులి ఎస్.థాను ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంఘ నిర్వాహకులు కె.రాజన్, పి.ఆంథోని దాస్, ఎస్.నందు గోపాల్, యు.తరుణ్ కుమార్ తదితర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ముందుగా కలైపులి శేఖరన్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఆయనతో అనుబంధాన్ని, మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. సందర్భంగా నిర్మాత కలైపులి ఎస్.థాను మాట్లాడుతూ తనకు తోడపుట్టని సహోదరుడు కలైపులి శేఖరన్ అని పేర్కొన్నారు.1973వ సంవత్సరం నుంచి ఆయనతో పరిచయం ఏర్పడిందన్నారు. తనకు ఆయనతో పలు మంచి జ్ఞాపకాలు ఉన్నాయన్నారు. పరుమార్లు తన కార్యాలయంలోనే తామిద్దరూ కలిసి భోజనం చేసేవారని చెప్పారు. ఆయన చెప్పే కథలు విని ఆశ్చర్యపోయేవాడు అన్నారు. కలైపులి శేఖరన్ చెప్పే కథలు విని ఎవరూ అంత సులభంగా మరిచిపోరన్నారు. అంత ప్రతిభావంతుడు ఆయన పేర్కొన్నారు. రజినీకాంత్, కమలహాసన్, ప్రభుదేవా, కార్తీక్ వంటి ప్రముఖ నటులకు కలైపులి శేఖరన్ కథలు చెప్పారన్నారు. అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేయనప్పుడు తాను వెళ్లి ఆయన్ని పరామర్శించానని, ఆ సమయంలో ఆయన తన ముందు కొన్ని కోరికలను ఉంచారని, వాటిని తాను నెరవేర్చినట్లు చెప్పారు. కలైపులి శేఖరన్ లేని లోటును ఎవరు తీర్చలేరని కలైపులి ఎస్.థాను పేర్కొన్నారు. అదేవిధంగా దర్శక నిర్మాత కేఆర్, దర్శకుడు వి.శేఖర్, కె.రాజన్ మొదలగు పలువురు సినీ ప్రముఖులు కలైపులి శేఖరన్తో తమ అనుభవాలను పంచుకున్నారు. -
సీమాన్ చిత్రానికి రజనీ టైటిల్
తమిళసినిమా: నామ్ తమిళర్ పార్టీ నేత సెంతమిళన్ సీమాన్ ప్రధానపాత్రను పోషిస్తున్న చిత్రానికి ఇంతకుముందు రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన ధర్మయుద్ధం టైటిల్‌ను ఖరారు చేశారు. ఇంతకుముందు తప్పాట్టం, యాంటీ ఇండియన్, ఉయిర్ తమిళుక్కు వంటి చిత్రాలను నిర్మించిన దర్శక నిర్మాత, మూన్ పిక్చర్స్ సంస్థ అధినేత ఆదం బాల తాజాగా ప్లానెట్–9 పిక్చర్స్ అధినేత డాక్టర్ ఆర్కే శివకుమార్‌తో కలిసి నిర్మిస్తున్న చిత్రానికి ధర్మయుద్ధం అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇందులో సెంతమిళన్ సీమాన్‌తో కలిసి ఆర్కే సురేష్ ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. మలయాళం నటి అను సితార నాయకిగా నటిస్తున్న ఇందులో ఇళవరసు, ఎంఎస్ భాస్కర్, వెట్రి కుమరన్, సాట్టై దురై మురుగన్, జయకుమార్, ఆదిరా పాండియలక్ష్మి, సౌందర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆర్.సుబ్రహ్మణ్యం కథ దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని, చెళియన్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది ఒక హత్య నేపథ్యంలో సాగే సస్పెన్స్ థ్రిల్లర్ ఇన్వెస్టిగేషన్ కథాచిత్రంగా ఉంటుందన్నారు. తెన్కాశి, కుట్రాలం, దిండుగల్ పరిసర ప్రాంతాల్లోని నగర గ్రామీణ ప్రదేశాల్లో షూటింగు నిర్వహించి పూర్తి చేసినట్లు చెప్పారు. పలు ఆసక్తికరమైన అంశాలతో సాగే ధర్మయుద్ధం చిత్రాన్ని త్వరలో తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. సీమాన్, అను సితార -
అమాంతం పెరిగిన బీర్ల విక్రయం
కొరుక్కుపేట: తమిళనాడులో ఏటా వేసవిలో బీర్ రకాలకు విపరీతమైన డిమాండ్ ఉంది. సాధారణ రోజుల్లో పోల్చితే మార్చి చివరి నాటికి బీర్ విక్రయాలు 40 శాతం పెరిగాయి. ఇతర దినాల్లో రాష్ట్రంలో రోజూ రూ.85 కోట్ల వరకు మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం బీరు విక్రయాలు సాధారణం కంటే రెట్టింపు పెరిగడంతో మద్యం విక్రయాలు రూ.లక్ష కోట్ల వరకు పెరగినట్లు అధికారులు చెబుతున్నారు. తీరంలో ఇంధన తవ్వకాలు ● ఓఎన్జీసీకి అనుమతి ● తీరప్రాంత వాసుల్లో ఆగ్రహం సాక్షి, చైన్నె: తమిళనాడు సముద్ర తీరంలో ఇంధనం, గ్యాస్ నిక్షేపాల తవ్వకానికి కేంద్రం అనుమతులు మంజూరు చేసింది. కన్యాకుమారిలో మూడు చోట్ల, చైన్నెకు సమీపంలో ఓ చోట ఈ తవ్వకాల పనులను ఓఎన్జీసికి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో తమిళనాడు తీర వాసులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడులోని డెల్టా జిల్లాలను సురక్షిత వ్యవసాయ క్షేత్రంగా గత అన్నాడీఎంకే ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఇక్కడ బోరు బావులద్వారా ఎలాంటి గ్యాస్, ఇంధనం, హైడ్రో కార్బన్, మిథైన్ వంటి వాటి తవ్వకాలకు బ్రేక్ పడింది. దీంతో కేంద్రం ఇటీవల కాలంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ వస్తోంది. సముద్ర తీరప్రాంతాలపై దృష్టి పెట్టింది. ఇది వరకే సముద్ర తీరంలో జరిగిన పరిశీలనకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా జాలర్ల గ్రామాల ప్రజలు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో సముద్ర తీరంలోని ఇంధనం, గ్యాస్ నిక్షేపాలను తవ్వుకునేందుకు కేంద్రం అనుమతులు జారీ చేసిన సమాచారం తీర వాసులలో ఆదివారం ఆగ్రహ జ్వాలను రగిల్చింది. కన్యాకుమారికి సమీపంలో బంగాళాఖాతం సముద్రంలో 3 చోట్ల, చైన్నెకు కూత వేటు దూరంలో ఓచోట ఈ తవ్వకాల పనులను ఓఎన్జీసీకి అప్పగించిన సమాచారంతో రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా తీరప్రాంత వాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సముద్ర సంపద నాశనం అవుతుందని, చేపల వేట గగనంగా మారుతుందని జాలర్ల సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఈ అనుమతులను తక్షణం నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అనుమతులకు వ్యతిరేకంగా సోమవారం అసెంబ్లీలో సీఎం స్టాలిన్ కీలక ప్రకటన చేయాలన్న నినాదాన్ని జాలర్ల సంఘాలు అందుకున్నాయి. కోయంబత్తూరులో బ్రహ్మాండ హాకీ స్టేడియం – పనులకు డిప్యూటీ సీఎం శంకుస్థాపన సాక్షి, చైన్నె: కోయంబత్తూరులో అంతర్జాతీయ ప్రమాణాలతో బ్రహ్మాండ హాకీ స్టేడియం నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ పనులకు ఆదివారం సాయంత్రం డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ శంకుస్థాపన చేశారు. రూ. 9.67 కోట్లతో కృత్రిమ టర్ఫ్ హాకీ మైదానంగా ఇది రూపుదిద్దుకోనుంది. అలాగే, రూ. 82.14 కోట్లతో చేపట్టనున్న 132 కొత్త ప్రాజెక్టులకు ఉదయనిధి శంకుస్థాపన చేశారు. రూ. 29.99 కోట్లతో పూర్తిచేసిన 54 ప్రాజెక్టులను ప్రారంభించారు. 25,024 మంది లబ్దిదారులకు రూ. 239.41 కోట్ల విలువగల ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందజేశారు. కోయంబత్తూరు ఆర్ఎస్ పురం వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో అన్ని పనులకు ఉదయనిధి శ్రీకారం చుట్టారు. ముందుగా కోయంబత్తూరులో ఉదయ నిధి రోడ్ షో సాగింది. జనం ఆయనకు బ్రహ్మరథం పట్టే విధంగా ఆహ్వానం పలికారు. మంత్రి వర్గంలో కీలక మార్పులు – సెంథిల్, పొన్ముడి అవుట్ సాక్షి, చైన్నె: రాష్ట్ర మంత్రి వర్గంలో ఆదివారం రాత్రి కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. మనీ లాండరింగ్ కేసులో బెయిలా.. మంత్రి పదవినా? అని సెంథిల్ బాలాజీని సుప్రీంకోర్టు ప్రశ్నించిన నేపథ్యంలో ఆయన మంత్రి పదవి ఊడినట్లయ్యింది. ఆయన చేతిలో ఉన్న విద్యుత్ శాఖను రవాణాశాఖ మంత్రి శివశంకర్‌కు అదనంగా అప్పగించారు. మరోశాఖ ఎకై ్సజ్ పదవిని గృహ నిర్మాణ శాఖ మంత్రి ముత్తు స్వామికి అందజేశారు. ఇక మహిళలు, శైవం, వైష్ణవం గురించి వివాదాస్పదన వ్యాఖ్యలు చేసిన సీనియర్ మంత్రి పొన్ముడిని పదవి నుంచి తప్పించారు. ఆయన చేతిలో ఉన్న అటవీ శాఖను పాడి పరిశ్రమల శాఖ మంత్రి రాజకన్నప్పన్‌కు అప్పగించారు. ఇక ఇటీవల మంత్రి పదవిని కోల్పోయిన మనో తంగరాజ్కు మరో మారు అవకాశం కల్పించారు. ఆయనకు ఎలాంటి శాఖను అప్పగించ లేదు. సోమవారం సాయంత్రం 6 గంటలకు మనో తంగరాజ్ ప్రమాణ స్వీకరం రాజ్ భవన్లో జరగనుంది. -
ఆకట్టుకున్న సైకత శిల్పం
ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిధిలోని స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ఇంటీరియర్ డిజైన్ విభాగం నేతృత్వంలో సైకత శిల్పం నిర్మించారు. సృజనాత్మకత శక్తి ద్వారా పర్యావరణంపై అవగాహన పెంచడానికి, సముద్ర కాలుష్యం నియంత్రణ దిశగా ప్రత్యేక కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. చైన్నెలోని ఎలియట్స్ బీచ్‌లో విద్యార్థులు, అధ్యాపక సిబ్బంది ఇసుకను అద్భుతమైన కళాత్మక వ్యక్తీకరణగా మార్చారు. మహాసముద్రాలు , మంచినీటి పర్యావరణ వ్యవస్థలను రక్షించడంపై ఆవశ్యకతను ప్రతిబింబిస్తు దీనిని రూపకల్పన చేశారు. బీచ్‌లో సముద్రాన్ని తలపిస్తూ, వివిధ రకాల జల రాశులకు ఎదురయ్యే పరిస్థితులను గుర్తు చేస్తూ బ్రహ్మాండంగా తీర్చిదిద్దిన ఈ సైకత శిల్పం ఆదివారం ఎలియట్స్ బీచ్‌లో ప్రత్యేక ఆకర్షణగా మారింది. – సాక్షి, చైన్నె -
మన్ కీ బాత్కు అడ్డంకులు
● బీజేపీ వర్గాల ఆగ్రహం ● ఆగమేఘాలపై మరో చోటకు మార్పుసాక్షి, చైన్నె: ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసార కార్యక్రమానికి పోలీసులు చైన్నెలో అడ్డుకట్ట వేశారు. ఎలాంటి అనుమతులు పొందకుండా మరోచోటకు మకాం మార్చాల్సి వచ్చింది. నడిరోడ్డులో ఏర్పాట్లు చేయడాన్ని అడ్డుకున్నారు. ఆగమేఘాలపై నిర్వాహకులు మకాం మరోచోటుకు మార్చుకున్నారు. వివరాలు.. ప్రతి నెలా చివరి ఆదివారంలో మన్‌కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రజలను ఉద్దేశించి పీఎం మోదీ మాట్లాడుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఆదివారం ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా ప్రజలు వీక్షించేందుకు వీలుగా బీజేపీ వర్గాలు చైన్నెలో ఏర్పాట్లు చేశాయి. చైన్నె నడుకుప్పం పరిధిలో ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, మహిళా నేత, ఎమ్మెల్యే వానతీ శ్రీనివాసన్‌తో పాటుగా ముఖ్య నేతలు హాజరు అయ్యేందుకు సిద్ధమయ్యారు. అయితే, ఎలాంటి అనుమతి అన్నది పొందకుండా రోడ్డు మీద ఏర్పాట్లు చేయడాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణించారు. మెరీనా తీరంలోని అవ్వయార్ విగ్రహం ఎదురుగా ఉన్న నెడు కుప్పం రోడ్డులో చేసిన ఏర్పాట్లను అడ్డుకున్నారు. అనుమతి పొందకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారంటూ బీజేపీ వర్గాలపై చర్యకు సిద్ధమయ్యారు. దీంతో పోలీసులకు వ్యతిరేకంగా బీజేపీ వర్గాలు ఆందోళనకు సిద్ధమయ్యారు. చివరకు పోలీసు వర్గాలు మన్ కీ బాత్ ను ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాల ఏర్పాట్లన్నింటిని తొలగించారు. అక్కడకు వచ్చే జనానికి పంపిణి నిమిత్తం సిద్ధం చేసిన ఆహారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. చివరకు అక్కడి నుంచి సమీపంలోని కల్యాణ మండపంకు బీజేపీ వర్గాలు మకాం మార్చుకోవాల్సి వచ్చింది. ఆహారాన్ని పోలీసులు అప్పగించడంతో మధ్యాహ్నం అక్కడకు వచ్చిన వారికి పసందైన విందును బీజేపీ వర్గాలు ఏర్పాట్లు చేశాయి. పోలీసుల తీరును బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ తీవ్రంగా ఖండించారు. తొలి సారిగా మన్‌కీ బాత్ కార్యక్రమానికి అధ్యక్ష హోదాలో వచ్చిన నైనార్‌ను ఘనంగా బీజేపీ నేతలు సత్కరించారు. తొలుత హిందీలో తర్వాత తమిళంలో మన్ కీ బాత్ ప్రసంగాన్ని ప్రసారం చేశారు. -
స్కౌట్ కార్యాలయం ప్రారంభం
తిరువళ్లూరు: సదురంగపేటలో ఏర్పాటు చేసిన నూతన స్కౌట్ కార్యాలయాన్ని తిరువళ్లూరు జిల్లా విద్యాశాఖ సీఈఓ రవిచంద్రన్ ఆదివారం ఉదయం ప్రారంభించారు. తిరువళ్లూరు జిల్లా సదురంగపేటలో నూతన స్కౌట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ నూతన కార్యాలయాన్ని ప్రారంభించే కార్యక్రమం ఆదివారం ఉదయం స్కౌట్ జిల్లా కార్యదర్శి డాక్టర్ శామ్సన్ ఇళంగో అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా సీఈఓ రవిచంద్రన్ హాజరై కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రవిచంద్రన్ మాట్లాడుతూ తిరువళ్లూరు జిల్లాలో 150 పాఠశాలలో స్కౌట్ కార్యాలయం ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. స్కౌట్లో చేరడం ద్వారా క్రమశిక్షణతో పాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్న ఆయన, భవిష్యత్తులో మరింత మంది చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. స్కౌట్‌కు సీఎస్ఆర్ ఫండ్ కింద కొత్త భవనాన్ని నిర్మించడానికి చర్యలు తీసుకుంటామని సీఈఓ హామీ ఇచ్చారు. దీంతో పాటు తిరుత్తణి, పొన్నేరి, తిరువళ్లూరు, ఆవడి, అంబత్తూరు తదితర ప్రాంతాలకు చెందిన స్కౌట్ బృందాలు ఒక్కచోట చేరి సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్కౌట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మురళీ, జిల్లా ఉప కార్యదర్శి పాండ్యన్‌తోపాటు పలువురు పాల్గొన్నారు. -
నన్ను పెళ్లి చేసుకుంటావా? స్నేహితురాలికి ప్రపోజ్ చేసిన దర్శకుడు..
యంగ్ డైరెక్టర్ అబిశన్ జీవింత్ తెరకెక్కించిన చిత్రం టూరిస్ట్ ఫ్యామిలీ (Tourist Family). శశికుమార్, సిమ్రాన్ ప్రధాన పాత్రలు పోషించగా యోగి బాబు, ఎమ్మెస్ భాస్కర్, మిథున్ జే, రమేశ్ తిలక్ తదితరులు నటించారు. ఈ మూవీ మే 1న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో అబిశన్ (Abishan Jeevinth) తన స్నేహితురాలికి ప్రపోజ్ చేశాడు.నీ వల్లే..ముందుగా స్టేజీ ఎక్కిన అబిశన్.. తన సినిమా గురించి చెప్తూ, అందులో నటించిన యాక్టర్స్‌కు, సంగీతాన్ని అందించిన షాన్ రోల్డన్కు కృతజ్ఞతలు తెలిపాడు. ఆ వెంటనే తన స్నేహితురాలు అఖిల ఎలంగోవన్‌కు సైతం థాంక్స్ చెప్పాడు. అబిశన్ మాట్లాడుతూ.. అఖిల.. నీకు నేను చిన్నప్పటి నుంచి తెలుసు. పదో తరగతి నుంచి మనం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాం. మా అమ్మతో పాటు నీవల్లే జీవితంలో మంచి వ్యక్తిగా ఎదిగాను. ఐ లవ్యూ సోమచ్ అని ప్రశ్నించాడు. దర్శకుడి మాటలతో కంటతడిఇప్పుడు నిన్నో విషయం అడగాలనుకుంటున్నాను. అక్టోబర్ 31న నన్ను పెళ్లి చేసుకుంటావా? అని ప్రశ్నించాడు. అక్కడే ఉన్న అఖిల అతడి మాటలు విని భావోద్వేగానికి లోనైంది. సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన జనాలు.. అఖిల అతడి ప్రపోజల్‌కు ఒప్పుకోవమ్మా.. సినిమా ప్రపోజల్ కన్నా ఇదే బాగుంది అని కామెంట్లు చేస్తున్నారు. Beautiful Proposal by The Director of #TouristFamily on Stage ❤️pic.twitter.com/cG3qvN3fF1— Christopher Kanagaraj (@Chrissuccess) April 27, 2025 చదవండి: కీరవాణికి చిన్నపిల్లలే కావాలి.. అతడిపై పోక్సో కేసు పెట్టాలి -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
తిరువళ్లూరు: జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్ ఉలుందై గ్రామానికి చెందిన చికెన్ సెంటర్ నిర్వాహకుడు రవిచంద్రన్ భార్య జయచిత్ర(40). ఈమె శుక్రవారం రాత్రి తిరువళ్లూరు సమీపంలోని పెద్దకుప్పం వద్ద ఉన్న బంధువుల శుభ కార్యానికి హాజరై ద్విచక్ర వాహనంలో ఇంటికి తిరుగు పయనమయ్యారు. పోలీవాక్కం వద్ద వెళ్తున్న సమయంలో ముందు ఉన్న లారీని దాటుకుని వెళ్లడానికి యత్నించి ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న జయచిత్ర లారీ కింద చిక్కుకపోవడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. మనాలనగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మరో సంఘటనలో తిరువళ్లూరు జిల్లా సూలైమేణి గ్రామానికి చెందిన కార్తీక్(30) ఊత్తుకోట సమీపంలోని సిప్కాట్లోని ప్రైవేటు సంస్థలో పని చేస్తున్నాడు. శనివారం ఉదయం విధులు ముగించుకుని ఇంటికి తిరుగు ప్రయాణమయ్యే క్రమంలో పాలవాక్కం వద్ద ప్రమాదానికి గురయ్యాడు. కార్తీక్ వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని లారీ బలంగా ఢీకొట్టి, సమీపంలోని ఇంటిపైకి దూసుకెళ్లింది. ప్రమాదంలో కార్తీక్ అక్కడికక్కడే మృతి చెందగా ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాదవశాత్తు ఇంట్లోని వ్యక్తులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఈ రెండు సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. -
ఆస్కాలో అలరించిన అష్టావధానం
సాక్షి, చైన్నె: ఆంధ్ర సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ట్రస్ట్ (ఆస్కా ట్రస్ట్) ఆధ్వర్యంలో ద్విశతావధాని డాక్టర్ బులుసు అపర్ణ సారథ్యంలో 8 మంది మహిళామణులతో అష్టావధానం కార్యక్రమం నిర్వహించారు. స్థానిక టీనగర్ లోని ఆస్కా ప్రాంగణంలో శనివారం సాయంత్రం 5.45 గంటలకు అతిథులు, నిర్వాహకులు జ్యోతి ప్రజ్వలన చేశారు. అరుణా శ్రీనాథ్ ప్రార్థన గీతంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఆస్కా అధ్యక్షుడు, ఆస్కా ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ కె.సుబ్బారెడ్డి అధ్యక్షత వహించి మాట్లాడారు. అవధాన ప్రక్రియ తెలుగువారికి గర్వకారణమని, దీనిని మద్రాసు మహానగరంలో తెలుగు వారికి కానుకగా అందించడం చాలా గర్వంగా ఉందన్నారు. ఆస్కా తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు నిలయమని, ఆ దిశగా మాతృభాషకు సేవలు అందిస్తుందని గుర్తు చేశారు. తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దం పట్టే కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా స్వాగతోపన్యాసం చేసిన జేకే రెడ్డి పద్యాలతో ఆకట్టుకున్నారు. ముందుగా ఆస్కా ట్రస్ట్ తరఫున గుండె సమస్యలు ఉన్న లక్ష్మీ, కిడ్నీ సమస్యలు ఉన్న ఆర్.దేవిక అనే ఇద్దరికి వైద్య చికిత్స కోసం ఆర్థిక సహాయం అందించారు. జేకే రెడ్డిని సకలకళా వల్లభ పురస్కారంతో సత్కరించారు. అష్టావధానం ద్విశతావధాని డాక్టర్ బులుసు అపర్ణ అష్టావధానంను అద్భుతంగా నిర్వహించారు. ఇందులో పృచ్ఛకులుగా రాపర్తి ఝాన్సీ(నిషిద్ధాక్షరి), డాక్టర్ తిరుమల ఆముక్త మాల్యద(సమస్య), డాక్టర్ పి.ఎస్.మైథిలి (దత్తపది), డాక్టర్ టి.మోహనశ్రీ (వర్ణన), డాక్టర్ ఎ.వి.శివకుమారి(వ్యస్తాక్షరి), ఎస్.పి.వసంతలక్ష్మి(వారగణనం), కమలాకర రాజేశ్వరి(ఆశువు), బిట్రా గజ గౌరి(అప్రస్తుత ప్రసంగం) అనే 8 మంది పాల్గొని తమదైన రీతిలో ఆకట్టుకున్నారు. పృచ్ఛకులు అడిగిన ప్రశ్నలకు డాక్టర్ బులుసు అపర్ణ అలవోకగా సమాధానాలు ఇస్తూ సందర్భానుసారంగా పద్యాలతోనూ అలరించారు. ఈ కార్యక్రమంలో ఆస్కా ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ పి.శ్రీనివాసులురెడ్డి, ట్రస్ట్ సెక్రటరీ ఎ.ఆదినారాయణ రెడ్డి, ట్రస్ట్ కోశాధికారి బీవీఎస్ కోటేశ్వర రావు, తమిళనాడు ఆదాయపు పన్ను శాఖ చీఫ్ కమిషనర్ సుధాకర్ రావు, ఆస్కా సభ్యులు పాల్గొని అష్టావధానంలో పాల్గొన్న తెలుగు కవులు, పండితులను జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. గాయని వినీషా విశిష్ట తనదైన శైలిలో శ్రీకృష్ణుడి పెయింటింగ్‌తో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు ప్రముఖులు ఆదిశేషయ్య, సీఎంకే రెడ్డి, ఆనందకుమార్రెడ్డి, చలపతిరావు, ఎం.రంగారెడ్డి, ఊరా లక్ష్మీ నరసింహారావు, కాసల నాగభూషణం, తెలుగు ప్రముఖులు పాల్గొన్నారు. ● జేకే రెడ్డికి సకలవల్లభ పురస్కార ప్రదానం -
అన్ని భాషలను గౌరవించాలి
● జనని అధ్యక్షురాలు నిర్మల పళనివేల్ ● డబ్ల్యూటీఎఫ్‌లో ముగిసిన ఉచిత తెలుగు తరగతులు కొరుక్కుపేట: మాతృభాషతోపాటు ఇతర భాషలను కూడా నేర్చుకుని గౌరవించాలని జనని సంస్థ అధ్యక్షురాలు డాక్టర్ నిర్మల పళనివేల్ పేర్కొన్నారు. ఈ మేరకు ప్రపంచ తెలుగు సమాఖ్య (డబ్ల్యూటీఎఫ్) నిర్వహణలో ఉచిత తెలుగు తరగతులు పూర్తి అయిన సందర్భంగా శనివారం ప్రశంస పత్రాలు అందజేసే కార్యక్రమం చైన్నె టీనగర్‌లోని సమాఖ్య కార్యక్రమంలో ఘనంగా నిర్వహించారు. సమాఖ్య కార్యదర్శి శ్రీలక్ష్మీ మోహన్ రావు పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిర్మల పళనివేల్ పాల్గొన్నారు. తెలుగు భాషను రాయడం, చదవడం శ్రద్ధగా నేర్చుకున్న చిన్నారుల నుంచి 74 ఏళ్ల వృద్ధుడి వరకు ప్రశంస పత్రాలను అందజేశారు. సమాఖ్య నిర్వాహకులతో కలసి అభినందించారు. ప్రత్యేకించి తెలుగు భాషపై ఇచ్చిన టి.నగర్ కేసరి మహోన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు మోహన్‌ను జ్ఞాపికతో సత్కరించారు. ఈ సందర్భంగా నిర్మల పళనివేల్ మాట్లాడుతూ ఆయా భాషల సంస్కృతి సాంప్రదాయాలు వేర్వేరుగా ఉంటాయని అయినప్పటికీ అవి ప్రజల్లో ఐక్యతను పెంపొందింపజేస్తాయని అన్నారు. ఎక్కువ భాషలు నేర్చుకుంటే జ్ఞానం పెరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డబ్ల్యూటీఎఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు గోటేటి వెంకటేశ్వరరావు, సభ్యులు పాల్గొన్నారు. -
స్పా సెంటర్ మేనేజర్ అరెస్టు
యజమాని కోసం గాలింపు తిరువొత్తియూరు: చైన్నెలో 13 చోట్ల స్పా సెంటర్ ప్రారంభించి అందులో వ్యభిచారం నడుపుతున్న మేనేజర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. యజమాని కోసం గాలిస్తున్నారు. చైన్నె, అన్నానగర్‌లో గత రెండు నెలల క్రితం స్పా అనే పేరుతో ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళలను ఉంచి వ్యభిచారం నడుపుతున్నట్లు సమాచారం అందింది. అన్నానగర్ పోలీసులు వెంటనే ఆ స్పా సెంటర్‌కు వెళ్లి నిఘా వేశారు. ఆ సమయంలో మహిళలను ఉంచి వ్యభిచార వృత్తిని చేస్తున్నట్లు నిర్ధారణ అయింది. దీంతో స్పా సెంటర్లోకి చొరబడి తనిఖీ చేసి అక్కడ ఉన్న ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళలను విడిపించి చైన్నె మైలాపూర్‌లో ఉన్న మహిళ శరణాలయానికి అప్పగించారు. దీని తర్వాత ఇతర రాష్ట్రాల మహిళలతో వ్యభిచారం చేయిస్తున్న మేనేజర్‌తో సహా నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. స్పా సెంటర్ యజమాని పరారీలో ఉన్నాడు. అతని కోసం గాలిస్తున్నారు. ● ఆవిష్కరణ ఇటలీకి చెందిన యూఫోటాన్ సహకారంతో చైన్నెలోని స్పెక్ట్రా మెడికల్ ఇండియా ఎండోలిఫ్ట్ ఎక్స్‌ను ఆవిష్కరించింది. చర్మాన్ని బిగుతుగా చేయడానికి, కొవ్వును తగ్గించడానికి, ముఖం, శరీరాన్ని కనీస ఆకృతి చేయడానికి రూపొందించిన అధునాతన, శస్త్ర చికిత్స లేని లేజర్ చికిత్సతో కూడిన ఎండో లిఫ్ట్ ఎక్స్ పరికరాన్ని శనివారం స్థానికంగా స్పెక్ట్రా మెడికల్ సీఈఓ శ్రీరామ్, ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ జయంతీ రవీంద్రన్, చర్మ వ్యాధి నిపుణురాలు డాక్టర్ శరణ్య, విఘ్నేష్, కార్తీక్, ప్రియం భగత్ పరిచయం చేశారు. దీని పనితీరును వివరించారు. – సాక్షి, చైన్నె ● విరాళం చైన్నెలోని నాలుగు పాఠశాలలకు రూ.28.6 లక్షలు విలువగల 26 స్మార్ట్ బోర్డులను ఈ విద్యా ప్రాజెక్టు ఆర్‌సీఎంటీ విరాళంగా అందజేసింది. వీటిని శనివారం నిర్వాహకులు రాజస్థాన్ రత్న కె.సుభాష్ చంద్ రాంకా, మహావీర్ బోత్రా, నీలకంఠన్ లోకనాథన్, నరేంద్ర శ్రీమల్ తదితరులు ఆయా పాఠశాలలకు అందజేసి, వాటి పనితీరును పరిశీలించారు. – సాక్షి, చైన్నె దర్శకుడు నాగేంద్రన్ కన్నుమూత తమిళసినిమా: కోలీవుడ్‌లో ఇటీవల వరుసగా వరుసగా విషాదఛాయలు నెలకొంటున్నాయి ఇటీవలే రచయిత దర్శకుడు భారతిరాజా వారసుడు నటుడు దర్శకుడు మనోజ్ హఠాత్తుగా కన్ను మూశారు. తాజాగా మరో మరణం సంభవించింది సినీ దర్శకుడు నాగేంద్ర శుక్రవారం రాత్రి చైన్నెలో గుండెపోటుతో కన్నుమూశారు. ఈయన వయసు 50 ఏళ్లు. పలువురు ప్రముఖ దర్శకుల వద్ద పనిచేసిన ఆయన 2015లో నటుడు విమల్ కథానాయకుడుగా నటించిన కావల్ అనే చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యారు. కాగా స్థానిక అశోక్ నగర్‌లోని నటేశన్ రోడ్ లో నివసిస్తూ వచ్చారు. కాగా ఏడాది ముందు అనారోగ్యానికి గురై గుండె ఆపరేషన్ చేయించుకున్నారు. కాగా శుక్రవారం రాత్రి నరేంద్రన్ హఠాత్తుగా మైకంతో పడిపోయారు. వెంటనే 108లో సమీపంలోని ఆసుపత్రికి ఆయన్ని తరలించారు. అయితే వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు నరేంద్రన్ అప్పటికే తుదిశ్వాస విడిచినట్లు ధ్రువీకరించారు. ఆయన మృతిపై నిర్మాత సురేష్ కామాక్షి వంటి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. -
● శిక్షణ ముగింపు
తాంబరం ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుండి అర్హత కలిగిన ఫ్లైయింగ్ ఇన్స్ట్రక్టర్లుగా డిఫెన్స్ ఫోర్సెస్ నుంచి 54 మంది అధికారులు పట్టభద్రులయ్యారు. క్వాలిఫైడ్ ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్స్‌గా పట్టభద్రులయ్యారు. విద్యా, విమాన శిక్షణతో కూడిన 24 వారాల సవాలుతో కూడిన కోర్టును విజయవంతం చేశారు. భారత వైమానిక దళ శిక్షణ కమాండ్ సీనియర్ ఎయిర్ స్టాఫ్ ఆఫీసర్ ఎయిర్ మార్షల్ తేజ్బీర్ సింగ్ ముఖ్య అతిథిగా, కమాండింగ్ ఆఫీసర్ గ్రూప్ కెప్టెన్ కేపీ సింగ్ హాజరై కోర్సులను విజయవంతంగా ముగించిన వారిని సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు. – సాక్షి, చైన్నె -
వాసవీ క్లబ్బుల కీర్తిప్రతిష్టలు పెంచాలి
● ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఎరుకల రామకృష్ణ కొరుక్కుపేట: సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు అందజేసే వాసవీ క్లబ్‌ల కీర్తి ప్రతిష్టలు పెంచేలా ఆ క్లబ్ నిర్వాహకులు కృషి చేస్తున్నారని అంతర్జాతీయ అధ్యక్షుడు ఎరుకల రామకృష్ణ తెలియజేశారు. చైన్నె నుంగంబాక్కంలో శనివారం వాసవీ క్లబ్ చైన్నె, వనిత గ్రాండ్ చైన్నె సంయుక్త ఆధ్వర్యంలో గుడ్ విల్ విజిట్ జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎరుకల రామకృష్ణ, ప్రత్యేక సభ వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ సీహెచ్ వెంకటేశ్వర రావు, ట్రెజరర్ సుజాత రమేష్ బాబు, జిల్లా గవర్నర్ సీఎం రాజేష్, క్లబ్ అధ్యక్షుడు ఎ.సుధాకర్, ఎ.మీనా కుమారి, కార్యదర్శులు ఎం జగదీష్, ఎం.జయలక్ష్మి, కోశాధికారులు ఊరా రమేష్ గుప్తా, పద్మావతి సహా ఈ క్లబ్బుల సభ్యులు ఉన్నారు. ఈ సందర్భంగా రెండు అనాథాశ్రమాలకు వెయ్యి లీటర్ల వాటర్ ట్యాంకులతోపాటు ఏడు సేవా కార్యక్రమాలను అందించినట్లు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వివరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిని ఘనంగా సత్కరించారు. -
ద్వైపాక్షిక వర్తక ప్రోత్సహమే లక్ష్యం
సాక్షి, చైన్నె: ద్వైపాక్షిక వర్తక వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి ఇండోనేషియా నేతృత్వంలో చైన్నెలో ఇండోనేషియా ట్రేడ్ ప్రమోషన్ సెంటర్(ఐటీపీసీ)ని ఏర్పాటు చేశారు. భారతదేశంలోని ఇండోనేషియా రాయబారి హెచ్.ఇనా కృష్ణమూర్తి రాయపేటలోని ఎక్స్‌ప్రెస్ అవెన్యూలో ఐటీపీసీ ఎక్స్పీరియన్స్ సెంటర్‌ను శనివారం ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇండోనేషియా, భారతదేశం నుండి దౌత్య అధికారులు, వ్యాపార సంఘాలు, వ్యాపార సంస్థలు, పెట్టుబడిదారులు సుమారు 100 మంది హాజరయ్యారు. వర్తక, వాణిజ్య ప్రోత్సహం, సాంస్కృతిక అవగాహన, ఆర్థిక సహకారం పెంపొందించడం లక్ష్యంగా, ఇండోనేషియా హస్తకళలు, సృజనాత్మక ఆవిష్కరణలకు ఇది వేదికగా నిలవనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. తమిళనాడు అత్యంత పారిశ్రామికీకరణ చెందిన రాష్ట్రాలలో ఒకటిగా ఉండడంతో ఇండోనేషియాతో బలమైన వాణిజ్య సంబంధాలను కొనసాగిస్తుందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఐటీపీసీ చైన్నె డిప్యూటీ డైరెక్టర్ మహ్మద్ హయకల్, ఇండోనేషియా సీసీ ఏడీ వార్డోయ్, హెడ్ సెక్రటేరియట్ విజయకుమార్, డైరెక్టర్ నుగ్రుహొ ప్రియో ప్రట్మొ పాల్గొన్నారు. -
కొవ్వొత్తులతో ర్యాలీ
వేలూరు: కశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వారికి ఆత్మశాంతి కలగాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వేలూరులోని అన్నారోడ్డులో కొవ్వొత్తులతో ర్యాలీగా వచ్చి నివాళులర్పించారు. ముందుగా ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పీపీ చంద్రప్రకాష్ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మృతి చెందిన వారికి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ర్యాలీగా వచ్చి తీవ్ర వాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ కశ్మీర్ రాష్ట్రం పెహల్లాం సమీపంలో తీవ్రవాదులు పర్యాటకులపై దాడి చేసి హత మార్చడం సరికాదన్నారు. అనంతరం పట్టణంలో మౌనంగా కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్షుడు వాహీద్‌బాషా, ఎస్సీఎస్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిత్తరంజన్, రఘు, మనోహరన్, కేవీ కుప్పం లోకనాథన్, హరిక్రిష్ణన్, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు మహ్మద్ ఆలీజిన్నా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
లంక చెర నుంచి జాలర్ల విడుదల
సేలం: సరిహద్దు దాటి చేపలు పట్టారనే ఆరోపణలపై శ్రీలంక నావికాదళం గత మార్చిలో అరెస్టు చేసిన 14 మంది రామేశ్వరం మత్స్యకారులను విడుదల చేశారు. శుక్రవారం విమానంలో చైన్నె చేరుకున్న మత్స్యకారులను తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనంలో వారి స్వస్థలమైన రామేశ్వరానికి పంపించారు. మార్చి 17న, రామేశ్వరం నుండి 14 మంది జాలర్లు మోటారు పడవలో చేపలు పట్టడానికి వెళ్లారు. వారు హిందూ మహాసముద్రంలో చేపలు పడుతుండగా, శ్రీలంక కోస్ట్ గార్డ్ పెట్రోలింగ్ షిప్ అర్ధరాత్రి వచ్చి రామేశ్వరం జాలర్ల ఫిషింగ్ బోట్‌ను చుట్టుముట్టింది. సరిహద్దు దాటి చేపలు పడుతున్నారని ఆరోపిస్తూ వారు 14 మంది మత్స్యకారులను అరెస్టు చేసి తీసుకెళ్లారు. అదనంగా వారి మోటారు పడవ, ఫిషింగ్ వలలు, వారు పట్టుకున్న చేపలను కూడా జప్తు చేసి శ్రీలంకకు తరలించారు. ఆ తర్వాత, 14 మంది మత్స్యకారులను శ్రీలంక కోర్టు ముందు హాజరుపరిచి జైలులో పెట్టారు. ఈ పరిస్థితిలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శ్రీలంక నావికాదళం అరెస్టు చేసిన తమిళనాడు మత్స్యకారులందరినీ వెంటనే విడుదల చేయాలని, వారి పడవలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌కు అత్యవసర లేఖ రాశారు. తదనంతరం శ్రీలంకలోని భారత రాయబార కార్యాలయం అధికారులు శ్రీలంక ప్రభుత్వ అధికారులతో చర్చలు జరిపారు. కొన్ని రోజుల క్రితం, శ్రీలంక కోర్టు రామేశ్వరం జైలు నుండి 14 మంది జాలర్లను విడుదల చేయాలని ఆదేశించింది. వారందరినీ తరువాత భారత రాయబార కార్యాలయ అధికారులకు అప్పగించారు. భారత రాయబార కార్యాలయ అధికారులు 14 మంది జాలర్లను తమ సంరక్షణలోకి తీసుకుని, విమానంలో చైన్నెకి పంపించడానికి ఏర్పాట్లు చేశారు. అయితే మత్స్యకారుల వద్ద పాస్‌పోర్ట్‌లు లేనందున, రాయబార కార్యాలయం అందరికీ అత్యవసర సర్టిఫికెట్లు, విమాన టిక్కెట్లను ఏర్పాటు చేసింది. తదనంతరం శ్రీలంక రాజధాని కొలంబో నుండి ఎయిరిండియా ప్యాసింజర్ విమానంలో శుక్రవారం 14 మంది రామేశ్వరం జాలర్లను చైన్నెకి పంపించారు. స్వదేశానికి తిరిగి వచ్చిన మత్స్యకారులను తమిళనాడు మత్స్య శాఖ అధికారులు చైన్నె విమానాశ్రయంలో స్వాగతించారు. తరువాత తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనంలో అందరినీ రామేశ్వరం పంపించారు. -
అప్పటి కంటే పది రెట్లు ఎక్కువ లాభం
తమిళసినిమా: పబ్లిసిటీ కింగ్‌గా పేరుగాంచిన నిర్మాత కలైపులి ఎస్ ధాను. ఈయన 20 ఏళ్ల క్రితం విజయ్ కథానాయకుడిగా నిర్మించిన చిత్రం సచిన్. నటి జెలీనియా నాయకిగా నటించిన ఈ చిత్రానికి జాన్ మహేంద్రన్ కథా, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. దేవీశ్రీప్రసాద్ సంగీతాన్ని, దివంగత కెమెరామెన్ జీవా ఛాయాగ్రహణం అందించారు. వైవిధ్య భరిత ప్రేమకథా చిత్రంగా రూపొందిన ఈ చిత్రం 2005 ఏప్రిల్ 14వ తేదీన విడుదలై మంచి విజయాన్ని సాధించింది. కాగా తాజాగా డిజిటల్ ఫార్మెట్లో సరికొత్త హంగులతో గత వారం ప్రపంచవ్యాప్తంగా విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ శనివారం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఇందులో నిర్మాత కలైపులి ఎస్. ధాను, దర్శకుడు జాన్ మహేంద్రన్, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్, నత్య దర్శకుడు శోభి మాస్టర్ పాల్గొన్నారు. దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ తాను తమిళంలో సంగీతాన్ని అందించిన తొలి చిత్రం సచిన్ అని పేర్కొన్నారు. ఇందులో వాడి వాడి కై పడాద సీడీ అనే పాటను విజయ్‌తో పాడించినట్లు చెప్పారు. ఈ చిత్రంలోని పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయని తాను ఏ కచేరి లోనైనా వాడి వాడి కై పడాద సీడీ పాటను పాడకుండా ఉండనన్నారు. చిత్రానికి సక్సెస్ మీట్ నిర్వహించడం అన్నది నిర్మాత ధానుకే చెల్లిందన్నారు. సచిన్ చిత్రం మొదట విడుదల చేసినప్పుడు 200 రోజులకు పైగా ప్రదర్శింపబడిందని, 20 ఏళ్లు తరువాత ఇప్పుడు రీ రిలీజ్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా విజయవంతంగా ప్రదర్శింపబడుతోందని చెప్పారు. మొదటి రిలీజ్ కంటే ఇంప్పుడు 10 రెట్లు అధికంగా లాభాలు తెచ్చిపెడుతోందని తెలిపారు. చిత్రం 50 నుంచి 100 రోజులు వరకు పడుతుందని ఎగ్జిబిటర్లు చెబుతున్నారని, దీంతో త్వరలో సచిన్ చిత్ర సక్సెస్‌ను గ్రాండ్‌గా నిర్వహించనున్నట్లు నిర్మాత కలైపులి ఎస్ ధాను చెప్పారు. -
తమిళంలో నటించడానికి ఆసక్తిగా ఉన్నా..!
తమిళసినిమా: నాచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం హిట్ –ది థర్డ్ కేస్.వాల్ పోస్టర్ సినిమా, ఇనానిమస్ ప్రొడక్షనన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో నటి శ్రీనిధి శెట్టి నాయకిగా నటించారు. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సాను జాన్ వర్గీస్ చాయాగ్రహణం, మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడం,ఋ మలయాళం హిందీ ఐదు భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా విడుదలకు సిద్ధమవుతోంది. కాగా ఈ చిత్రాన్ని తమిళనాడులో సినిమాకారన్ సంస్థ విడుదల చేస్తోంది. దీంతో చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న నాని శుక్రవారం సాయంత్రం చైన్నెకి వచ్చారు ఆయనతోపాటూ నటి శ్రీనిధి శెట్టి కూడా వచ్చారు. చైన్నెలోని ఓ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో నాని మాట్లాడుతూ తాను చైన్నెకి ఎప్పుడు వచ్చినా సొంత ఇంటికి వచ్చిన భావన కలుగుతుందన్నారు. త్వరలోనే విలేకరుల సమావేశంలో తమిళంలో మాట్లాడే ప్రయత్నం చేస్తానన్నారు. తనను నటుడుగా తీర్చిదిద్దింది తమిళ సినిమానే అని చాలా చార్లు చెప్పానన్నారు. 2012 13 ప్రాంతంలో తాను చైన్నె నుంచి బయలుదేరి హైదరాబాద్‌కు చేరుకున్నారన్నారు. అయినప్పటికీ ఇప్పటివరకు తమిళ ప్రవేక్షుల ప్రేమాభిమానాలు తనపై అధికం అవుతూనే ఉన్నాయన్నారు. నేరుగా తమిళ చిత్రంలో నటించాలన్న ఆసక్తి ఉందన్నారు. సరైన అవకాశం వస్తే దానికి సంబంధించిన ప్రకటన వెలువడుతుందని చెప్పారు. ఇకపోతే హిట్– ది థర్డ్ కేస్ చిత్రం మాత్రమే కాదని అద్భుతమైన అనుభవాన్ని ఇచ్చే రూపకల్పన అని పేర్కొన్నారు. ఇంతకుముందు వచ్చిన హిట్, హాట్ 1 చిత్రాలకు దీనికి ఏమాత్రం సంబంధం ఉండదని చెప్పారు. దీని కథ నేపథ్యం కొత్తగా ఉంటాయన్నారు. థియేటర్లో అభిమానులు ఎంజాయ్ చేసే అన్ని అంశాలు ఇందులో ఉంటాయన్నారు. ఇది ఇన్వెస్టిగేషన్ జానర్లో సాగే ఒక అరుదైన థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని నాని పేర్కొన్నారు. ఇది తనకు తెలుగులో తొలి చిత్రం అని కేజీఎఫ్ –2 చిత్రం విడుదల తర్వాత తనను గుర్తుపెట్టుకుని ఇందులో నటించే అవకాశాన్ని కల్పించిన దర్శకుడు శైలేష్ కొలను, నటుడు నానికి థాంక్స్ అని శ్రీనిధి శెట్టి పేర్కొన్నారు. కాగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటుడు నాని ధరించిన చొక్కాపై పలు కొటేషన్స్‌తో కూడిన ఆంగ్ల పదాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా చొక్కా వెనుక భాగంలో లవ్ ఫ్రమ్ తమిళనాడు అనే పదాలు ఉండడం పెద్ద చర్చకు దారితీసింది. -
ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని నిషేధించాలి : కలెక్టర్
తిరువళ్లూరు: జిల్లావ్యాప్తంగా ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని తగ్గించుకోవాలని ప్రజలకు కలెక్టర్ సూచించారు. తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మూలించడం, చెట్లు పెంపకం, పసుపు బ్యాగులను ఉపయోగించడంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మొదట కలెక్టర్ కార్యాలయంలోని ప్లాస్టిక్ వస్తువులను తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం కలెక్టర్ ప్రతాప్, ప్లాస్టిక్‌కు వ్యతిరేకంగా ఉద్యోగుల చేత ప్రతిజ్ఞ చేయించి పసుపు బ్యాగును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతాప్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వస్తువులను పూర్తిగా నిషేదించడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చని తెలిపారు. ప్లాస్టిక్ వస్తువులను నిషేధించాలనే ఉద్దేశంతోనే జనవరి నుంచి ప్రతినెలా ఒకరోజు ప్లాస్టిక్ ఏరివేత కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ఇప్పటి వరకు ఆలయాలు, పుష్కరిణి, స్టేడియం, ప్రభుత్వ కార్యాలయాల్లో ప్లాస్టిక్ వస్తువులను ఏరివేత చేపట్టినట్లు వివరించారు. పర్యావరణానికి ముప్పుగా వున్న ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేదించడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపు నిచ్చారు. -
రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య
● కుమార్తె బాల్య వివాహంపై పోలీసులు కేసు నమోదు చేయడమే కారణమా? వేలూరు: క్రిష్ణగిరి జిల్లా బర్గూర్ సమీపంలోని జగదేవి గ్రామానికి చెందిన కుమార్(50) ఇతని భార్య కవిత(45). దంపతుల 17 సంవత్సరాల కుమార్తె అదే గ్రామానికి చెందిన యువకుడిని ప్రేమిస్తోంది. దీంతో ఇరు కుటుంబ సభ్యులు చర్చించి వారికి వివాహం చేశారు. వివాహం చేసుకున్న యువతి వేరే కులానికి చెందిన వారు కావడంతో ఈ పెళ్లిని పలువురు వ్యతిరేకించినట్లు తెలిసింది. దీంతో బాల్య వివాహం చేసినట్లు బర్గూరు పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో మనో వేదనతో ఉన్న చిన్నారి పురుగుల మందు తాగి ప్రస్తుతం క్రిష్ణగిరి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా బాల్య వివాహం చేయడంతో బర్గూరు పోలీసులు చిన్నారి తల్లిదండ్రులపై కేసులు నమోదు చేశారు. దీంతో చిన్నారి తల్లిదండ్రులు మనో వేదనతో ఉన్నారు. కేసు నమోదు చేయడంతో ముందస్తు జామీను తీసుకునేందుకు చైన్నె హైకోర్టుకు వెళ్తున్నట్లు కుమార్, భార్య కవిత తిరుపత్తూరుకు బయలుదేరి వచ్చారు. అనంతరం మేలకారన్పట్టి గ్రామంలోని రైల్వే పట్టాల వద్దకు చేరుకొని ౖరైలు వచ్చే సమయంలో రైలు పట్టాలపై నిలిచి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. రైలు ఢీకొనడంతో దంపతుల ఇద్దరి మృతదేహాలు చెల్లా చెదరుగా పడింది. విషయం తెలుసుకున్న జోలార్‌పేట రైల్వే పోలీసులు ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తిరుపత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు జోలార్‌పేట రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
రమణ మహర్షి ఆలయంలో 75వ ఆరాధన పూజలు
వేలూరు: తిరువణ్ణామలైలోని రమణ మహర్షి ఆలయంలో 75వ ఆరాధన పూజలు శనివారం అతి వైభవంగా జరిగాయి. తిరువణ్ణామలైలోని భగవాన్ రమణ మహర్షికి భక్తులు నేటికి ఆయన ఉనికిని గుర్తు చేసుకునే విధంగా ప్రత్యేక విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయన మార్గదర్శకత్వంలో నడుస్తున్నారు. అందులో భాగంగా ఉదయం ఆయన విగ్రహానికి ప్రత్యేక పుష్పాలంకరణలు దీపారధన పూజలు చేసి మంగళ హారతి పూజలు చేశారు. అనంతరం మహాన్యాస రుద్రజపం, విశేష పారాయణం, అభిషేకాలు చేశారు. భక్తులు స్వామికి పూల మాలలు, తాల పత్రాలు సమర్పించారు. ఈ సందర్బంగా ఆలయంలో ప్రత్యేక ఆరాధన పూజలు చేశారు. ఈ ఆరాధన పూజలను ఉదయం నుంచి సాయంత్రం వరకు పత్యక్ష ప్రసారం చేయడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు వీటిని వీక్షించారు. గురువు భౌతిక రూపం కాదు. అందువల్ల అతని శరీరం అదృశ్యమైన తర్వాత కూడా గురువుతో సంబంధం కొనసాగుతుందని అని ఆయన చెప్పారని, భగవంతుడు మనలోనే ఉన్నారని మన ఆత్మగా ఎక్కడా వెలగని వెలుగు ఆయన జ్ఞానాన్ని, శాశ్వతత్యాన్ని కొరుకునే వారుగా అతను అనే మాటలు భక్తులకు అవగాహన కల్పించారు. ఈ ఆరాధన పూజల్లో భక్తులకు అన్నదానం చేశారు. ఈ పూజా కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. -
కోవై వేదికగా వరల్డ్ ఇన్నోవేషన్ సమ్మిట్
సాక్షి, చైన్నె: తమిళనాడు ఇన్నోవేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ నేతృత్వంలో కోయంబత్తూర్‌లో జరగనున్న ‘‘వరల్డ్ ఇన్నోవేషన్ సమ్మిట్ –2025’’ లోగోను శనివారం డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ఆవిష్కరించారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో తమిళనాడు ఇన్నోవేషన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ విభాగం ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేసింది. ‘వరల్డ్ ఇన్నోవేషన్ సమ్మిట్ –2025‘లోగో, ప్రత్యేక వెబ్ సైట్‌ను డీప్యూటీ సీఎం ఉదయనిధి సచివాలయంలో ప్రారంభించారు. పారిశ్రామికంగా తమిళనాడును భారతదేశంలో అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో భాగంగా, యువత కొత్త వ్యాపారాల కల్పన, ఆవిష్కరణలు, ఉద్యోగ కల్పన విస్తృతం చేశామని ఈ సందర్భంగా ప్రకటించారు. 2021లో తమిళనాడులో 2,032 పరిశ్రమలు ఉండగా, ప్రస్తుతం నాలుగు రెట్లు అధిగమించి 10,800కి సంఖ్య చేరిందని వివరించారు. 2030 నాటికి తమిళనాడు ఆర్థిక వ్యవస్థ ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యంగా జరుగుతున్న కార్యాచరణలో భాగంగా గత 4 సంవత్సరాలలో చైన్నె, మధురై, ఈరోడ్, తిరునెల్వేలి, హోసూరు, సేలం, కడలూరు, తంజావూరు, కోయంబత్తూరు, తిరుచ్చి వంటి పది నగరాలను ఆవిష్కరణల కేంద్రాలుగా తీర్చిదిద్దామని వివరించారు. తమిళనాడులోని వినూత్న సంస్థలను ప్రపంచ స్థాయికి చేర్చడం కోసం కోయంబత్తూరులోని కోడిసియా మైదానంలో సమ్మిట్ ఏర్పాటు జరుగుతున్నట్టు పేర్కొన్నారు. ఈ గొప్ప కార్యక్రమానికి, ఆవిష్కరణల వేదికకు వివిధ ప్రాంతాలలోని స్టార్టప్, పెట్టుబడి దారులు, విశ్వవిద్యాలయాలలోని ప్రతినిధులు, ఆవిష్కరణ కర్తలు 30 వేల మంది పాల్గొనే అవకాశం ఉందని ప్రకటించారు. ప్రధానంగా అంతరిక్ష సాంకేతికత, వాతావరణ మార్పు నిర్వహణ, విద్యుత్ వాహన సాంకేతికత, వ్యవసాయం టెక్నాలజీ, కృత్రిమ మేధస్సు , ఇతర వినూత్న కంపెనీలు, ప్రభుత్వ విభాగాలు, పెద్ద కార్పొరేషన్లు , వ్యాపార ఇంక్యుబేటర్లతో 750 స్టాల్స్‌ను ఏర్పాటు చేయనున్నామని ప్రకటించారు. ఇందులో పాల్గొనే వారి పేర్ల నమోదు కోసం ఆన్లైన్లో వెబ్ సైట్‌ను ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు. కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ మంత్రి అన్బరసన్, కార్యదర్శి అతుల్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. -
అర్థవంతమైన చిన్న బడ్జెట్ చిత్రాలే చాలు
తమిళసినిమా: మీరా చిత్రానికి కథ బాధ్యతలను నిర్వహించిన ఎమ్మార్ భారతి అళియాద కోళంగళ్– 2 చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. కాగా ఆయన తాజాగా దర్శకత్వం వహించిన చిత్రం డ్రీమ్ గర్ల్. నూతన తారలు జీవ, హరీషా, ప్రభు సాస్త, ఇందిరా తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని చారులత ఫిలిమ్స్ సంస్థ నిర్మించింది. సాలమన్ బోస్ చాయాగ్రహణం, ఇళమారన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమం పూర్తిచేసుకుని త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని శుక్రవారం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఛాయాగ్రాహకుడు,దర్శకుడు పిసి శ్రీరామ్, వసంత్ బాలన్, అజయన్ బాల, నంద పెరియసామి, కదీర్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని చిత్ర ఆడియో ఆచరించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ఎంఆర్ భారతి మాట్లాడుతూ మీరా చిత్రానికి కథ కథనం బాధ్యతలను నిర్వహించిన తాను ఆ తర్వాత అళియాద కోలంగళ్– 2 చిత్రానికి దర్శకత్వం వహించానన్నారు. అందులో నటి అర్చన రేవతి నాజర్ ప్రధానిపాత్రులు పోషించారని చెప్పారు.కాగా ఆ చిత్ర షూటింగ్ ను 12 రోజుల్లో పూర్తి చేసినట్లు చెప్పారు. దాన్ని యూట్యూబ్ ఛానల్ లో లక్షలాది మంది ప్రేక్షకులు చూశారని చెప్పారు కాగా డ్రీమ్ గర్ల్ చిత్రం కోసం నాలుగు సన్నివేశాలు చిత్రీకరించాలని భావించి బయలుదేరిన తాము 16 రోజుల్లో షూటింగ్ దాదాపు పూర్తి చేసినట్లు చెప్పారు. సినిమా అనేది కష్టం కాదని అనవసరంగా శ్రమ పడకూడదన్నారు. ఛాయాగ్రాహకుడు పీసీ. శ్రీరామ్ మాట్లాడుతూ ఎమ్మార్ భారతికి తనకు మధ్య చిరకాల స్నేహం ఉందన్నారు. తమ మధ్య పలు కథలు ఉన్నాయని, తాను చెప్పిన చిన్న స్టోరీ లైన్‌కు భారతి అందమైన కథనాన్ని సిద్ధం చేశారన్నారు. ఇది సాధారణ కథాచిత్రంగా ఉండదన్నారు. ఇలాంటి చిన్న బడ్జెట్ చిత్రాలు చేస్తే చాలని, కోట్లతో భారీ బడ్జెట్ చిత్రాలు చేయాల్సిన అవసరం లేదన్నారు. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించాలని దర్శకుడు భారతికి శుభాకాంక్షలు అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
‘అప్పు’ పేరిట వేధిస్తే.. మూడేళ్లు జైలు!
సాక్షి, చైన్నె: మహిళలు, రైతులు, వెనుకబడిన వర్గాల ప్రజలను అప్పుల వసూళ్ల పేరిట వేధించే వారి భరతం పట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మూడేళ్లు జైలు శిక్ష, రూ. 5 లక్షలు జరిమానా విధించే విధంగా చట్ట సవరణ ముసాయిదాను అసెంబీలలో శనివారం డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ దాఖలు చేశారు. అలాగే, పొరుగు రాష్ట్రాల నుంచి గానీ, ఏదేని ఆస్పత్రుల నుంచి గానీ వైద్య వ్యర్థాలను ఎక్కడ బడితే అక్కడ పడేసిన పక్షంలో విచారణ అన్నది లేకుండా జైలు శిక్ష విధించే రీతిలో గుండా యాక్ట్ ప్రయోగానికి మరో ముసాయిదాను సభలో న్యాయ మంత్రి రఘుపతి దాఖలు చేశారు. వివరాలు.. అసెంబ్లీ సమావేశాలలో ఉదయం ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి ఎం. సుబ్రమణియన్ మాట్లాడుతూ,పదిరోజులలో సిద్ధ, ఆయుర్వేద విభాగంలో ఖాళీగా ఉన్న 121 పోస్టులను భర్తీచేస్తామని ప్రకటించారు. మంత్రి గీతాజీవన్ మాట్లాడుతూ, సాంఘిక సంక్షేమ శాఖలోని 7997 ఖాళీ పోస్టులను త్వరలో భర్తీ చేస్తామన్నారు. మంత్రి తంగం తెన్నరసు మాట్లాడుతూ, సిగరేట్ లైటర్లపై నిషేధం విధించే విధంగా పరిశీలన చేస్తున్నామన్నారు. కోయంబత్తూరు బైపాస్ రోడ్డు పనులు త్వరితగతిన ముగించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి ఏవీ వేలు తెలిపారు. చైన్నె తిరువీకానగర్ మండలంలో 16 చోట్ల విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లను ఏర్పాటు చేస్తామని మంత్రి సెంథిల్ బాలాజీ తెలిపారు. కాగా అన్నాడీఎంకే సభ్యుడు అరక్కోణం రవి సభలో చేతులు పైకి ఎత్తిఎత్తి నొప్పి వస్తున్నట్టు, బటన్ సిస్టమ్ పెట్టాలంటూ వ్యంగ్య్రాస్త్రం సంధించడంతో స్పీకర్ అప్పావు క్లాస్ పీకారు. మంత్రి దురై మురుగన్ స్పందిస్తూ సభ నిబంధనలకు విరుద్ధంగా వ్యంగాస్త్రాలు వద్దంటూ హితవు పలికారు. రఘుపతి ముసాయిదా.. అసెంబ్లీలో వైద్య వ్యర్థాలను ఎక్కడ బడితే అక్కడ పడేయడం, పొరుగు రాష్ట్రాల నుంచి తమిళనాడులోకి తీసుకొచ్చి పడేయడం వంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా సభలో న్యాయమంత్రి రఘుపతి ముసాయిదాను దాఖలు చేశారు. వాస్తవానికి ఈముసాయిదా మంత్రి సెంథిల్ బాలాజీ దాఖలు చేయాల్సి ఉంది. అయితే సుప్రీంకోర్టులో తమ మీదున్న కేసు విచారణ ఉత్కంఠ రేపుతున్న నేపథ్యంలో ఆయన ముసాయిదా దాఖలు చేయలేదు. ఆయన తరపున రఘుపతి దాఖలు చేశారు. వైద్య సంభంధిత వ్యర్థాలను తీసుకొచ్చి పడేస్తే ఇక గుండాయాక్ట్ కింద, విచారణ లేకుండా శిక్ష విధించే విధంగా చర్యలు తీసుకోనున్నామని ప్రకటించారు. కాగా సెంథిల్‌బాలాజీ ముసాయిదా దాఖలు చేయని దృష్ట్యా, ఆయన మంత్రి పదవి రాజీనామా చేయబోతున్నారన్న చర్చ ఊపందుకుంది. ఇప్పటికే మనీ లాండరింగ్ కేసులో బెయిలా? మంత్రి పదవినా? అని సుప్రీంకోర్టు ఆయన్ను ప్రశ్నించడం విధితమే.మాజీలకు పెన్షన్ పెంపు అసెంబ్లీలో సీఎం స్టాలిన్ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యేల పెన్షన్, కుటుంబ భత్యం, వైద్య భత్యం పెంపునకు సంబంధించిన బిల్లును ప్రవేశ పెట్టారు. ఈ పెంపునకు సంబంధించి ఇప్పటికే అనేక విజ్ఞప్తులు వచ్చాయని గుర్తు చేస్తూ, ఇక ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి మాజీ శాసన సభ్యులు, పూర్వపు కౌన్సిల్ సభ్యులకు నెలవారీగా ఇస్తున్న పెన్షన్ ను రూ. 30 వేల నుంచి రూ. 35 వేలుగా పెంచుతున్నామని ప్రకటించారు. అలాగే కుటుంబ పెన్షన్ రూ. 15 వేల నుంచి రూ. 17,500లుగా, వార్షిక వైద్య ఖర్చు రూ. 75 వేల నుంచి రూ. లక్షకు పెంచుతున్నామని వివరించారు. ఇదిలా ఉండగా సభలో నుంచి సీనియర్ మంత్రి దురై మురుగన్ లేచి బయటకు వెళ్లే ప్రయత్నం చేశారు. స్పీకర్ సీటును ఆయన దాటుతుండగా కాళ్లు మెలిక పడ్డట్టుగా కింద తూలి పడ్డారు. అదే సమయంలో సభలోకి వచ్చిన డిప్యూటీ సీఎం ఉదయ నిధి, మంత్రి ఏవీ వేలు, అసెంబ్లీ కార్యదర్శి శ్రీనివాసన్ ఆయన కింద పడకుండా జాగ్రత్తగా పట్టుకున్నారు. తన సీటు వద్దకు తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఈ దృష్ట్యా, సభలో కాసేపు ఉత్కంఠ నెలకొంది. రూ. 5 లక్షల జరిమానా వైద్య వ్యర్థాలను పడేస్తే గుండాయాక్ట్ అసెంబ్లీలో ముసాయిదా దాఖలు మాజీ ఎమ్మెల్యేల పింఛన్ పెంపు సభలో తూలిపడ్డ దురై మురుగన్ సభకు ముసాయిదాలు.. ప్రశ్నోత్తరాల అనంతరం సభలో డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ప్రత్యేక ప్రసంగంతో ముసాయిదాను దాఖలు చేశారు. అప్పులు ఇచ్చే సంస్థలు, తీసుకునే వారి పరిస్థితులు, బలవంతంగా వసూలు గురించి వివరించారు. ఈ బలవంతపు వసూళ్లు ఆత్మహత్యను ప్రేరేపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, రైతులు, వెనుకబడిన వర్గాల ప్రజలు చేసే అప్పులు, తీసుకునే రుణాల విషయంలో వారికి భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని , అందుకే ఈ చట్ట సవరణ ముసాయిదా అని ప్రకటించారు. అప్పుల వసూళ్ల పేరిట వేధిస్తే ఇక మూడేళ్లు జైలు శిక్ష , రూ. 5 లక్షలు జరిమానా విధించడం జరుగుతుందని ప్రకటించారు. బలవంతంగా వసూళ్లు, వేధింపునకు గురై ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే సంబంధిత వ్యక్తులు (అప్పు ఇచ్చినవారు), సంస్థలపై నాన్ బెయిల్ వారెంట్ కేసు నమోదు చేయడం జరుగుతుందన్నారు. కుటుంబ సభ్యులను వేదించినా, బెదిరించినా, వెంటాడినా, బలవంతంగాఆస్తులను జప్తు చేసినా, పై శిక్షలు వర్తించబడుతాయని ప్రకటించారు. అయితే, ఈ ముసాయిదాలో కొన్ని సవరణలు చేయాలని అన్నాడీఎంకేతో పాటుగా కొన్ని పార్టీలు ప్రభుత్వానికి సూచించాయి. -
ప్రభుత్వ ఆసుపత్రిలో రోబోటిక్ సర్జరీ
సేలం : చైన్నెలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక విద్యార్థికి రోబోటిక్ సర్జరీ చేసిన వైద్యులను మంత్రి ఎం. సుబ్రమణియన్ ప్రశంసించారు. ప్రభుత్వ పాఠశాలలో 12వ తరగతి చదువుతున్న అశ్విని (16) అనే విద్యార్థిని చైన్నెలోని ఓమందూర్ గవర్నమెంట్ ఎస్టేట్‌లోని తమిళనాడు ప్రభుత్వ మల్టీ–స్పెషాలిటీ ఆసుపత్రిలో ఈనెల 3వ తేదీ గుండెకు రోబోటిక్ సర్జరీ చేయించుకుని కోలుకుంది. రాష్ట్ర ఆరోగ్య, ప్రజా సంక్షేమ మంత్రి ఎం.సుబ్రమణియన్ శనివారం నేరుగా అశ్వినిని కలిసి ఆమెను పరీక్షించి చికిత్స చేసిన వైద్య బృందాన్ని ప్రశంసించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలోనే ప్రభుత్వ ఆసుపత్రిలో మొట్టమొదటి రోబోటిక్ సహాయంతో గుండె బైపాస్ సర్జరీ జరిగిందని తెలిపారు. చైన్నెలోని మేడవాక్కంకు చెందిన 16 ఏళ్ల విద్యార్థిని అశ్విని ప్రస్తుతం అలందూర్‌లో నివసిస్తోందన్నారు. వైద్యులు రోబోటిక్ సహాయంతో ఆమె గుండెలోని రంధ్రం సరిచేసి పూడ్చి విజయవంతంగా శస్త్ర చికిత్స చేసినట్టు తెలిపారు. ఇలాంటి శస్త్ర చికిత్సకు నెలల తరబడి ఆస్పత్రుల్లో ఉండడం, లక్షల్లో ఖర్చులు అవుతాయన్నారు. అదేవిధంగా రోగి శరీరంపై పెద్ద మచ్చలు ఏర్పడుతాయన్నారు. అయితే ఈ రోబోటిక్ శస్త్ర చికిత్స ద్వారా ఎక్కువ రోజులు ఆస్పత్రిలో ఉండాల్సిన పని లేదని, అదే విధంగా శరీరంపై ఎలాంటి మచ్చలు పెద్దగా ఏర్పడవని తెలిపారు. ఈ చికిత్సకు ముఖ్యమంత్రి సమగ్ర ఆరోగ్య బీమా పథకం పరిధిలోకి రావడంతో అతి తక్కువ ఖర్చుతో శస్త్ర చికిత్సను పూర్తి చేసినట్టు తెలిపారు. దేశంలోనే రాష్ట్ర ప్రజా సంక్షేమశాఖ పలు స్థాయిలలో రికార్డులు సృష్టిస్తోందన్నారు. గత రెండు రోజుల క్రితం కూడా జాతీయ వృద్ధుల సంక్షేమ ఆస్పత్రిలో వారికి అందించే ప్రత్యేక చికిత్స గురించి తెలుసుకోవడానికి దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల నుంచి 41 మంది వైద్యులు ఇక్కడ మూడు రోజులు శిక్షణకు హాజరైనట్లు మంత్రి వెల్లడించారు. -
ఏడుగురిని బలికొన్న బాణసంచా
సేలం : రాష్ట్రంలో సంభవించిన వేర్వేరు బాణాసంచా పేలుడు ప్రమాదాలలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. వివరాలు.. సేలం జిల్లా ఓమలూరు సమీపంలో ఉన్న కంజనాయకన్‌పట్టిలో ద్రౌపది అమ్మవారి ఆలయం ఉత్సవాలు 28 ఏళ్ల తర్వాత జరుపుతున్నారు. ఈ సందర్భంగా రోజూ అమ్మవారికి ఊరేగింపు సమయంలో బాణాసంచా పేల్చుతున్నారు. 15వ రోజు వేడుక శుక్రవారం రాత్రి జరిగింది. అప్పుడు పూజారిపట్టి ప్రాంతం నుంచి గంజనాయకన్పట్టికి భక్తులు అమ్మవారికి సారెను తీసుకువెళ్లారు. వారి వెంట మూడు బైక్‌పై రూ. 3 లక్షల విలువ చేసే బాణాసంచాను తరలించారు. వారి వెంట ఇద్దరు యువకులు బైక్‌లపై తీసుకువస్తున్న బాణాసంచాను తీసి దారి పొడవునా పేలుస్తూ వచ్చారు. అప్పుడు ఒక నిప్పు రవ్వ బైక్‌పై ఉన్న బాణాసంచాపై పడి భారీ ప్రమాదం సంభవించింది. బాణాసంచా పేలడంతో ముగ్గురు ఘటనా స్థలంలో శరీరాలు ఛిద్రమై మృతి చెందారు. మృతులు కంజనాయకన్పట్టికి చెందిన సెల్వరాజ్ (29), సుబ్రమణి కుమారుడు కార్తీ (12), సేట్ కుమారుడు తమిళ్ సెల్వన్ (11) అని గుర్తించారు. తీవ్రంగా గాయపడిన లోకేష్ (20)ని సేలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అర్ధరాత్రి చికిత్స ఫలించక లోకేష్ కూడా మృతి చెందాడు. దీంతో మృతుల సంఖ్య నాలుగుకు పెరిగింది. అదే విధంగా గాయపడిన అదే ప్రాంతానికి చెందిన గణేష్ ప్రభు (28), నవీన్ ప్రభు (32)లు సేలంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ తలా రూ. 3 లక్షల సహాయ నిధిని ప్రకటించారు. ఈ స్థితిలో పర్యాటక శాఖ మంత్రి రాజేంద్రన్ శనివారం నలుగురి కుటుంబీకులకు తలా రూ. 3 లక్షల చెక్కులను అందజేశారు. ఆయనతో పాటు కలెక్టర్ బృందాదేవి, డీన్ దేవి మీనాల్, ప్రభుత్వ శాఖ అధికారులు కూడా ఉన్నారు. అదేవిధంగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడపాడి పళనిస్వామి మృతుల కుటుంబీకులకు సంతాపాన్ని ప్రకటించారు. శివకాశిలో ముగ్గురు విరుదునగర్ జిల్లా శివకాశి సమీపంలో నాగ్‌పూర్ అనుమతి పొందిన ఓ కర్మాగారంలో 100కు పైగా గదులు ఉన్నాయి. మహిళలు, పురుషులు అంటూ 300 మందికి పైగా కార్మికులు పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం 11 గంటల సమయంలో అకస్మాత్తుగా ఓ గదిలో పెలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో మారియమ్మాల్ (51), తిరువాయ్మొళి (45), భాగ్యలక్ష్మి (55) అనే ముగ్గురు మహిళలు శరీరాలు ఛిద్రమై ఘటనా స్థలంలోనే మృతి చెందారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం శివకాశి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పుదుపట్టి పోలీసులు కేసు నమోదు చేసుకుని, యజమాని జైశంకర్ వద్ద విచారణ జరుపుతున్నారు. వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురి దుర్మరణం ఆరుగురికి తీవ్రగాయాలు -
ఐఐటీ మద్రాసులో 100కు పైగా డీప్ టెక్ స్టార్టప్‌లు
సాక్షి, చైన్నె: ఒకే ఆర్థిక సంవత్సరంలో 100కు పైగా డీప్ టెక్ స్టార్టప్‌లను ఐఐటీ మద్రాసు ఇంక్యుబేట్ చేసింది. గత 12 సంవత్సరాలలో 457 డీప్ – టెక్ స్టార్టప్‌లకు మద్దతు ఇవ్వగా వీటి సమష్టి విలువ రూ. 50 వేల కోట్లుకుపైనే అని ప్రకటించారు. ఐఐటీ మద్రాస్ అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థు లు – పూర్వ విద్యార్థులు, బాహ్య వ్యవస్థాపకులు స్థాపించిన ఈ స్టార్టప్‌లు, తయారీ – రోబోటిక్స్ నుండి స్పేస్‌టెక్, ఏరో, డిఫెన్స్, ఏఐ, బయోటెక్ – ఐఓటీ వరకు అనేక రకాల కీలకమైన,అభివృద్ధి చెందుతున్న రంగాలను కలిగి ఉన్నట్టు వివరించారు. ఈ పర్యావరణ వ్యవస్థ నుంచి వెలువడుతున్న ప్రముఖ విజయగాథల్లో ఏథర్, యూనిఫోర్, మెడిబడ్డీ, హైపర్వర్జ్, స్టెల్లాప్స్ (మూపే), అగ్నికుల్, ప్లానీస్, డిటెక్ట్, మైండ్‌గ్రోవ్ గెలాక్సీ, ఇంకా అనేక ఇతర అంశాలు ఉన్నట్టు ప్రకటించారు. ’స్టార్టప్ 100 మిషన్’ అనే కార్యక్రమం గురించి ఐఐటీ మద్రాసు డైరెక్టర్ ప్రొఫెసర్ వి. కామకోటి శనివారం వివరించారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఇంక్యుబేషన్ సెల్ 104 కొత్త స్టార్టప్‌లను ఇంక్యుబేట్ చేసిందన్నారు. ఇది ఒక మైలు రాయిగా ప్రకటించారు. ఇందులో 50 శాతానికి పైగా ఐఐటీ మద్రాస్ సభ్యులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు స్థాపించారన్నారు. ఈ అత్యున్నత ఘనతను సాధించడంలో కీలక భాగస్వాములైన డీన్ (ఐసీఎస్ఆర్) ప్రొఫెసర్ మను సంతానం, స్కూల్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అధిపతి ప్రొఫెసర్ ప్రభు రాజగోపాల్, ఐఐటీఎం ఇంక్యుబేషన్ సెల్ ఫ్యాకల్టీ–ఇన్చార్జ్ ప్రొఫెసర్ మోహన శంకర్ శివప్రకాశం, ఐఐటీఎం ఇంక్యుబేషన్ సెల్ సీఈఓ డాక్టర్ తమస్వతి ఘోష్, ఇతర అధ్యాపకులు, విద్యార్థులు, పరిశోధకులను అభినందించారు. అనువాద పరిశోధన సంస్కృతి విజయానికి దారితీసిన ప్రయత్నాలను వివరిస్తూ, ఐఐటీ మద్రాస్ స్కూల్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ హెడ్ ప్రొఫెసర్ ప్రభు రాజగోపాల్ మాట్లాడుతూ, తమ డైరెక్టర్ ప్రొఫెసర్ వి. కామకోటి ఊహించిన విధంగా సంవత్సరానికి 100 స్టార్టప్‌ల లక్ష్యాన్ని చేరుకోవడం చాలా మందికి అసాధ్యంగా అనిపించినా, తాము సాధించామన్నారు. -
ముదుమలైలో ఉప రాష్ట్రపతి
– ఏనుగులకు ఆహారం పంపిణీ సాక్షి, చైన్నె: కోయంబత్తూరు జిల్లా పరిధిలో ముదుమలై రిజర్వు పారెస్టు ఉన్న ఏనుగుల సంరక్షణా శిబిరాన్ని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ శనివారం సందర్శించారు. ఏనుగులకు ఆహారం పంపిణీ చేశారు. నీలగిరి జిల్లా ఊటీ వేదికగా రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్రవి నేతృత్వంలో వీసీల మహానాడు శుక్ర, శనివారాలలో జరిగిన విషయం తెలిసిందే. ఈ మహానాడుకు రెండవ రోజుగా వీసీలు గైర్హాజరయ్యారు. సెంట్రల్ వర్సిటీ, ప్రైవేటు వర్సిటీల ప్రతినిధులతో ఈమహానాడును ముగించారు. ఈ మహానాడు నిమిత్తం ఊటీకి వచ్చిన ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ శనివారం ముదుమలై రిజర్వు ఫారెస్టులోని ఆసియాలోనే అతి పెద్దదిగా పేరుగడించిన తెప్పకాడు ఏనుగుల సంరక్షణా శిబిరం ను సందర్శించారు. ఊటీ నుంచి రోడ్డు మార్గంలో వెళ్లిన ఆయన అక్కడి ఏనుగులకు ఆహారం పంపిణి చేశారు. ఏనుగు మావటీలతో మాట్లాడారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. కాగా, ఈ తెప్పకాడును ఇప్పటికే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, పీఎం మోదీలు సందర్శించిన విషయం తెలిసిందే. ఎలిపెంట్ విస్పరర్స్ డాక్యుమెంటరీతో ప్రపంచ గుర్తింపు పొందిన గున్న ఏనుగు పర్యవేక్షకులైన బొమ్మన్, బెల్లి దంపతులకు తమ అభినందనలు, ఆశీస్సులను వీరు అందజేశారు. 160 స్థానాలపై పళణి గురి సాక్షి, చైన్నె: రానున్న అసెంబ్లీ ఎన్నికలలో 160 స్థానాలలో పోటీ చేయడానికి అన్నాడీఎంకే వ్యూహ రచన చేసినట్టు సమాచారాలు వెలువడ్డాయి. ఈ మేరకు జిల్లాల కార్యదర్శుల సమావేశంలో పట్టున్న నియోజకవర్గాల పై చర్చించి నిర్ణయాలు తీసుకున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. బీజేపీతో మళ్లీ కూటమి తదుపరి తొలిసారిగా శుక్రవారం సాయంత్రం నుంచి పొద్దు పోయే వరకు అన్నాడీఎంకే జిల్లాల కార్యదర్శుల సమావేశం చైన్నెలోని పార్టీ కార్యాలయం ఎంజీఆర్ మాళిగైలో జరిగింది. ఇందులో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీపరిస్థితుల గురించి చర్చించి నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారాలు వెలువడ్డాయి.ఆ పార్టీ బలోపేతం, పళణి రాష్ట్రపర్యటన కార్యాచరణ సిద్ధం చేసినట్టు పార్టీ వర్గాలు పేర్కొంటూ వచ్చాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంల్నో 234 స్థానాలలో 160 స్థానాలలో అన్నాడీఎంకే పోటీ చేయడమే లక్ష్యంగా జిల్లాల కార్యదర్శుల భేటిలో నిర్ణయించినట్టు సమాచారాలు వెలువడ్డాయి. మిగిలిన స్థానాలను తమతో కలిసి వచ్చే బీజేపీ తదితర పార్టీలకు కేటాయించబోతున్నారు. 160లో 120 నుంచి 140 స్థానాలలో గెలుపు దిశగా ఇప్పటి నుంచి కార్యక్రమాలు విస్తృతం చేయనున్నారు. అధికారం చేపట్టాలంటే మ్యాజిక్ ఫిగర్‌గా 117 స్థానాలు అవసరం. దీనిని దాటితే చాలు సంపూర్ణ మెజారిటీతో ఎవ్వరికి వాటా అన్నది ఇవ్వకుండా ప్రభుత్వాన్ని నడిపేందుకు అవకాశం ఉంటుందని నేతలు ఇచ్చిన సూచనతో తమకు పట్టున్న స్థానాలపై దృష్టి పెట్టే దిశగా కార్యాచరణను పళణి స్వామి సిద్ధం చేసి ఉండడం గమనార్హం. పళణి పర్యటనలన్నీ ఈ 160 అసెంబ్లీ నియోజకవర్గాల చుట్టూ సాగబోతోంది. ఇక్కడున్న నేతలను మరింతగా పరుగులు తీయించే విధంగా కార్యక్రమాలను విస్తృతం చేయబోతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ద్విచక్ర వాహనాలు ఢీ ● ఆంధ్రాకు చెందిన వ్యక్తి మృతి ● నలుగురికి గాయాలు తిరుత్తణి: తిరుత్తణి సమీపంలో జాతీయ రహదారిపై రెండు బైకులు ఢీకొన్న ప్రమాదంలో ఆంధ్రాలోని నగరికి చెందిన వ్యక్తి మృతి చెందగా అతని ఇద్దరు కుమారులు, మరోబైకులో వచ్చిన వ్యక్తితో పాటూ అతనితో పాటు వెళ్లిన చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కథనం మేరకు ఆంధ్రాలోని నగరికి చెందిన మునివేల్(45) అతని కొడుకులు భరిణి(10), రూపేష్(8) ముగ్గురు శనివారం సాయంత్రం తిరుత్తణికి వచ్చి ద్విచక్ర వాహనానికి డ్యూ చెల్లించి ఇంటికి వెళ్తుండగా నాగలాపురానికి చెందిన ప్రశాంత్(35) అతని మిత్రుడి కుమారుడు అమర్నాథ్(10)తో కనకమ్మసత్రానికి వెళ్లారు. చైన్నె తిరుపతి జాతీయ రహదారిలో పొన్పాడి వద్ద రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి,. ప్రమాదంలో మునివేల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అతని ఇద్దరు కుమారులతో పాటూ మరో బైకులో వెళ్లిన ప్రశాంత్, అమర్నాథ్కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
జైలు శిక్ష విధిస్తావా..చంపేస్తాం
తమిళనాడు: గంజాయి అక్రమ రవాణా కేసులో 12 సంవత్సరాల జైలు శిక్ష విధించిన న్యాయమూర్తిని కోర్టు ఆవరణలోనే చంపేస్తామని ఇద్దరు సోదరులు బెదిరించిన ఘటన తేని కోర్టు ఆవరణలో శుక్రవారం కలకలం రేపింది. వివరాలు.. మదురై జిల్లా విల్లాపురం తూర్పు వీధిలోని మునియాండి ఆలయం సమీపంలో కొంతమంది గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు కీరతురై పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లి 25 కిలోల గంజాయి తరలిస్తున్న మురతంభత్రి ప్రాంతానికి చెందిన పాండియరాజన్, ప్రశాంత్, పాండియరాజన్ భార్య శరణ్యలను అరెస్టు చేశారు. విచారణలో, మధురైలోని కామరాజపురం ప్రాంతానికి చెందిన రౌడీ వెల్లైౖకలి మేనల్లుడు షణ్ముగవేలు తమకు 25 కిలోల గంజాయి ఇచ్చాడని వారు వాంగ్మూలం ఇచ్చారు. ఈ కేసు గురువారం మదురై జిల్లా నార్కోటిక్స్ కంట్రోల్ మొదటి అదనపు కోర్టు న్యాయమూర్తి హరిహరకుమార్ ముందు విచారణకు వచ్చింది. ఆ సమయంలో, ముగ్గురిని దోషులుగా నిర్ధారించి, ఒక్కొక్కరికి 12 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ఈ పరిస్థితిలో, పోలీసులు వారిని జైలుకు తరలించారు. ఆ సమయంలో నిందితులు పాండియరాజన్, ప్రశాంత్, న్యాయమూర్తిని చూసి చంపేస్తామని బెదిరించారు. వారు న్యాయమూర్తిని దుర్భాషలాడుతూ కోర్టు భవనం కిటికీలను పగులగొట్టి వీరంగం చేశారు. న్యాయమూర్తిని చంపేస్తామని బెదిరించారు. పోలీసులు, న్యాయవాదులపై అసభ్యకర పదజాలంతో దూషించారు. పోలీసులు వారిద్దరిని వైద్యపరీక్షల కోసం ఆస్పత్రికి తీసుకెళ్లారు. న్యాయమూర్తిని చంపుతామని బెదిరించారని ఆరోపిస్తూ అన్నానగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. -
ఇంట్లో పాముల కలకలం
అన్నానగర్(తమిళనాడు): నాగర్‌కోయిల్ సమీపంలోని పల్లందురై లూర్దేస్ కాలనీలో నివాసం ఉంటున్న రీగన్(30) మత్స్యకారుడు. ప్రస్తుతం తన పాత ఇంటి దగ్గరే కొత్త ఇంటిని నిర్మిస్తున్నాడు. ఇందుకోసం ఏడాది కాలంగా నిరుపయోగంగా ఉన్న పాత ఇంటిని కూల్చివేయాలని రీగన్ నిర్ణయించుకున్నాడు. అక్కడ ఉంచిన వస్తువులను తొలగించే పని గురువారం జరిగింది. ఓ గదిలో ఉన్న బీరువా ఎత్తే ప్రయత్నంలో ఉండగా, దాని కింద నుంచి పెద్ద నాగుపాము బుసలు కొడుతూ బయటకు వచ్చింది. దీంతో కార్మికులు కేకలు వేస్తూ పరుగులు తీశారు. దీంతో పాము అక్కడి నుంచి పారిపోయింది. అనంతరం కార్మికులు బీరువాను తొలగించారు. అక్కడ చూసిన దృశ్యం చూసి షాక్ తిన్నారు. బీరువా కింద ఓ బొందలో బృందాలుగా మెలికలు తిరుగుతున్న పాము పిల్లలు, పాము పిల్లల మధ్య గుడ్లు కూడా పడి ఉన్నాయి. దీంతో వారు పాములు పట్టే సుందరదాస్కు సమాచారం అందించారు. అతను వచ్చి బొందలోంచి పాములను ఒక్కొక్కటిగా బయటకు తీశాడు. అందులో 24 నల్ల పాము పిల్లలు, 7 పాము గుడ్లు ఉన్నాయి. గుడ్లు ముట్టగానే, అవి బయటకి రావడం ప్రారంభించాయి. అనంతరం సుందరదాస్ పాము పిల్లలను, గుడ్లను సంచిలో వేసి వడచేరిలోని అటవీ శాఖ కార్యాలయంలో అప్పగించారు. -
రైలు ప్రమాదానికి కుట్ర?
● సిగ్నల్ సమస్యతో తప్పిన ప్రమాదం ● రైల్వే ఐజీ ఆధ్వర్యంలో దర్యాప్తునకు మూడు ప్రత్యేక బృందాలు ● తిరువలంగాడు రైల్వేస్టేషన్ వద్ద పట్టాల్లో జాయింట్లో ఊడిన బోల్టులు తిరుత్తణి: చైన్నె–అరక్కోణం రైలు మార్గంలో తిరువలంగాడు రైల్వేస్టేషన్ సమీపంలో సిగ్నల్ పాయింట్ వద్ద కప్లింగ్‌లో ఊడిపడిడంతో సిగ్నల్ లేక ఎక్స్‌ప్రెస్ రైలు ఆగడంతో పెనుప్రమాదం తప్పింది. రైలు ప్రమాద కుట్రకు సంబంధించి రైల్వే ఐజీ ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేస్తున్నారు. చైన్నె సెంట్రల్ రైల్వేస్టేషన్ నుంచి అరక్కోణం మార్గంలో గురువారం అర్ధరాత్రి 1.15 గంటలకు ముంబయి మెయిల్ చైన్నె సెంట్రల్ నుంచి ముంబయికి బయల్దేరింది. అరక్కోణం రైల్వేస్టేషన్ జంక్షన్‌కు రాత్రి 2.10 గంటలకు చేరుకోవాల్సి వుంది. అయితే తిరువలంగాడు స్టేషన్‌కు సమీపంలోని అరిచంద్రాపురం వద్ద సిగ్నల్ లేక ఆ రైలు ఆగింది. వెంటనే స్టేషన్ లైన్‌మన్ సిగ్నల్ వున్న ట్రాకు వద్ద వెళ్లి చూడగా మెయిన్ లైన్లో సిగ్నల్ జాయింట్లో క్లప్లింగ్ పాయింట్ రాడ్లు, బోల్టు ఊడి వుండడడంతో వెంటనే అరక్కోణం రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే సంఘటన ప్రాంతం చేరుకున్న రైల్వే పోలీసులు రైళ్ల సేవలకు అంతరాయం కలగకుండా ట్రాకు మళ్లించి రైళ్లు నెమ్మదిగా వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. రైల్వే ఐజీ ఆధ్వర్యంలో తనిఖీ ఎక్స్‌ప్రెస్ రైలు కూల్చే కుట్రగా భావిస్తున్న క్రమంలో సదరన్ రైల్వే భద్రతా విభాగం ఐజీ ఈశ్వరరావు ఆధ్వర్యంలో చైన్నె డీఆర్ఎం విశ్వనాఽథ్ ఇరయన్, చైన్నె డివిజన్ ఐజీ బాబు బృందం మెయిన్ ట్రాకులో రెండు చోట్ల కప్లింగ్ పాయింట్లో బోల్టులు, నట్లు కూల్చివేతకు సంబంధించి పరిశీలించి విచారణ చేపట్టారు. అలాగే వేలిముద్ర నిపుణులు, డాగ్ స్క్వాడ్ బృందం తనిఖీలు చేపట్టారు. దర్యాప్తునకు మూడు ప్రత్యేక బృందాలు నియమించినట్లు చైన్నె డీఆర్ఎం తెలిపారు. మెయిన లైన్లో రెండు చోట్ల కప్లింగ్‌లో సిగ్నల్స్‌కు సంబంధించిన బోల్టులు, నట్లు ఊడిపడిన స్థలంలో రైల్వే సిబ్బంది మరమ్మతులు చేసి ఉదయం 10 గంటల తర్వాత యథవిధిగా రైళ్లు నడిచాయి. -
కలుషిత నీటిని పాలారులో వదలొద్దు
వేలూరు: పరిశ్రమల నుంచి వచ్చే నీటిని పాలారులో వదలకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని రైతు నాయకులు ధ్వజమెత్తారు. వేలూరు కలెక్టరేట్లో కలెక్టర్ సుబ్బలక్ష్మి అధ్యక్షతన జిల్లాలోని రైతు నాయకులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఆంధ్ర సరిహద్దు ప్రాంతమైన కుప్పం నుంచి చైన్నె వరకు పాలారు ఉందని వీటిలో వర్షం వస్తే నీరు ఏరులై పారడంతోపాటు పలు కుంటలు, చెరువులకు నీరు చేరుతోందన్నారు. అయితే వానియంబాడి నుంచి కాంచీపురం మీదుగా తిరువళ్లూరు వరకు వెళ్లే పాలారులో వివిధ పరిశ్రమల నుంచి వచ్చే కలుషిత నీటిని వదలడం ద్వారా పాలారు కలుషితమవుతోందన్నారు. వీటిని ద్వారా వ్యవసాయ పంటలు సైతం చేయలేక పోవడంతోపాటు తాగునీరు కూడా కలుషితమై అంటు రోగాల బారిన పడుతున్నామన్నారు. వీటిపై వెంటనే ప్రభుత్వానికి సిఫారసు పంపుతామని కలెక్టర్ తెలిపారు. రైతులు మాట్లాడుతూ ప్రస్తుతం వేసవి కాలం కావడంతో బోర్లు, బావుల్లో వచ్చే అరకొర నీటితో వ్యవసాయ పంటలు చేసుకుంటున్నామని అయితే అటవీ ప్రాంతాల్లో పండించే పంటలను పూర్తిగా అటవీ ఏనుగులు, పందులు నాశనం చేస్తున్నామని వీటికి ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలని కోరారు. ప్రస్తుతం మామిడి పంటకు పిచికారీ చేస్తున్నందున అన్ని ప్రాంతాల్లో మందుల దుకాణాలు ఏర్పాటు చేసి తక్కువ ధరకు రైతులకు మందులు సరఫరా చేయాలని కోరారు. దీంతో కలెక్టర్ రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. అనంతరం రైతులకు వ్యవసాయ శాఖ ద్వారా సబ్సిడీతో వ్యవసాయ పనిముట్లను అందజేశారు. సమావేశంలో రైతులు, వ్యవసాయ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఇంట్లో పాముల కలకలం
అన్నానగర్: నాగర్‌కోయిల్ సమీపంలోని పల్లందురై లూర్దేస్ కాలనీలో నివాసం ఉంటున్న రీగన్(30) మత్స్యకారుడు. ప్రస్తుతం తన పాత ఇంటి దగ్గరే కొత్త ఇంటిని నిర్మిస్తున్నాడు. ఇందుకోసం ఏడాది కాలంగా నిరుపయోగంగా ఉన్న పాత ఇంటిని కూల్చివేయాలని రీగన్ నిర్ణయించుకున్నాడు. అక్కడ ఉంచిన వస్తువులను తొలగించే పని గురువారం జరిగింది. ఓ గదిలో ఉన్న బీరువా ఎత్తే ప్రయత్నంలో ఉండగా, దాని కింద నుంచి పెద్ద నాగుపాము బుసలు కొడుతూ బయటకు వచ్చింది. దీంతో కార్మికులు కేకలు వేస్తూ పరుగులు తీశారు. దీంతో పాము అక్కడి నుంచి పారిపోయింది. అనంతరం కార్మికులు బీరువాను తొలగించారు. అక్కడ చూసిన దృశ్యం చూసి షాక్ తిన్నారు. బీరువా కింద ఓ బొందలో బృందాలుగా మెలికలు తిరుగుతున్న పాము పిల్లలు, పాము పిల్లల మధ్య గుడ్లు కూడా పడి ఉన్నాయి. దీంతో వారు పాములు పట్టే సుందరదాస్కు సమాచారం అందించారు. అతను వచ్చి బొందలోంచి పాములను ఒక్కొక్కటిగా బయటకు తీశాడు. అందులో 24 నల్ల పాము పిల్లలు, 7 పాము గుడ్లు ఉన్నాయి. గుడ్లు ముట్టగానే, అవి బయటకి రావడం ప్రారంభించాయి. అనంతరం సుందరదాస్ పాము పిల్లలను, గుడ్లను సంచిలో వేసి వడచేరిలోని అటవీ శాఖ కార్యాలయంలో అప్పగించారు. -
అడ్డుగా ఉందని చిన్నారి హత్య
● రెండున్నరేళ్ల కుమార్తెకు మద్యం తాగించి హత్య ● తల్లి, ప్రియుడితో సహా నలుగురు అరెస్టు ● నెల్లైలో కలకలం సేలం: నెల్లై జిల్లా దిసైయిన్‌విలై సమీపంలో సుఖానికి అడ్డుగా ఉందని రెండున్నర ఏళ్ల చిన్నారికి మద్యం తాగించి దారుణంగా హత్య చేసిన తల్లితోపాటు నలుగురిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వివరాలు.. నెల్లై జిల్లా దిసైయిన్‌విలై సమీపంలో ఉన్న మహాదేవన్కుళం ప్రాంతానికి చెందిన బృంద(27). ఈమె భర్త కోవైలో ఉన్న ఒక దుకాణంలో పని చేస్తున్నారు. వీరి కుమార్తె (రెండున్నర సంవత్సరాలు). బృందా మహాదేవకుళం ప్రాంతంలో ఉన్న అరటి తోటకు తన స్నేహితులతో వెళ్లింది. తర్వాత గురువారం సాత్తాన్‌కుళం సమీపంలో ఉన్న షణ్ముగపురంలో ఉన్న తన తల్లి ఇంటికి బృందా తన కుమార్తెతో వెళ్లింది. అక్కడ తన కుమార్తె మృతి చెందినట్టు బృందా భర్తకు తెలిపింది. తర్వాత చిన్నారిని దిసయిన్విలైలో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పుడు చిన్నారి పెదాలు, శరీరంలో అక్కడక్కడ గాయాలు కనిపించడంతో సందేహించిన డాక్టర్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తర్వాత పోలీసులు అక్కడికి చేరుకుని ఆ చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపంచనామా నిమిత్తం నెల్లై ప్రభుత్వ ఆస్పత్రికి తరించారు. అప్పుడు చిన్నారి తల్లి బృందా వద్ద పోలీసులు విచారణ జరిపారు. అప్పుడు బృందా రాత్రి ఒక మగ మిత్రుడితో ఉల్లాసంగా ఉన్న సమయంలో తన కుమార్తెను ఇతర పురుషుల వద్ద అప్పగించి వెళ్లినట్లు తెలిసింది. దీంతో గురువారం రాత్రి ఇట్టమొళి, తువరంపాడు ప్రాంతానికి చెందిన లింగసెల్వన్ (29), బెంజ్‌మెన్ (28), ముత్తుచూడర్ (28) అనే ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేపట్టారు. అందులో లింగసెల్వన్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో అరటి తోటలో వంతెన సమీపంలో ముత్తుచుడర్, బృందా ఉల్లాసంగా ఉన్నట్టు చిన్నారిని తన వద్ద అప్పగించి వెళ్లారని తెలిపాడు. రాత్రి పూట చిన్నారి అరుపులు విని ఎవరైనా వస్తారని పాప అరుపులు నిలపడం కోసం కొట్టి, తిట్టినా అరుపులు నిలపకపోవడంతో తాము తాగుతున్న మద్యంలో కొంత చిన్నారికి తాపించామని తెలిపాడు. అప్పుడు కొంత సేపటికే చిన్నారి శ్వాస ఆడక మృతి చెందినట్టు చెప్పాడు. వేకువజామున చిన్నారిని బృందా వద్ద అప్పగించి వెళ్లినట్లు తెలిపాడు. దీంతో పోలీసులు లింగ సెల్వన్, ముత్తుచుడర్, బెంజిమెన్, బృందాలను అరెస్టు చేసి వారి వద్ద విచారణ జరుపుతున్నారు. -
జైలు శిక్ష విధిస్తావా..చంపేస్తాం
● న్యాయమూర్తికి గంజాయి బ్రదర్స్ బెదిరింపు ● తేని కోర్టు ఆవరణలో కలకలం సేలం: గంజాయి అక్రమ రవాణా కేసులో 12 సంవత్సరాల జైలు శిక్ష విధించిన న్యాయమూర్తిని కోర్టు ఆవరణలోనే చంపేస్తామని ఇద్దరు సోదరులు బెదిరించిన ఘటన తేని కోర్టు ఆవరణలో శుక్రవారం కలకలం రేపింది. వివరాలు.. మదురై జిల్లా విల్లాపురం తూర్పు వీధిలోని మునియాండి ఆలయం సమీపంలో కొంతమంది గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు కీరతురై పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లి 25 కిలోల గంజాయి తరలిస్తున్న మురతంభత్రి ప్రాంతానికి చెందిన పాండియరాజన్, ప్రశాంత్, పాండియరాజన్ భార్య శరణ్యలను అరెస్టు చేశారు. విచారణలో, మధురైలోని కామరాజపురం ప్రాంతానికి చెందిన రౌడీ వైల్లైకలి మేనల్లుడు షణ్ముగవేలు తమకు 25 కిలోల గంజాయి ఇచ్చాడని వారు వాంగ్మూలం ఇచ్చారు. ఈ కేసు గురువారం మదురై జిల్లా నార్కోటిక్స్ కంట్రోల్ మొదటి అదనపు కోర్టు న్యాయమూర్తి హరిహరకుమార్ ముందు విచారణకు వచ్చింది. ఆ సమయంలో, ముగ్గురిని దోషులుగా నిర్ధారించి, ఒక్కొక్కరికి 12 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ఈ పరిస్థితిలో, పోలీసులు వారిని జైలుకు తరలించారు. ఆ సమయంలో నిందితులు పాండియరాజన్, ప్రశాంత్, న్యాయమూర్తిని చూసి చంపేస్తామని బెదిరించారు. వారు న్యాయమూర్తిని దుర్భాషలాడుతూ కోర్టు భవనం కిటికీలను పగులగొట్టి వీరంగం చేశారు. న్యాయమూర్తిని చంపేస్తామని బెదిరించారు. పోలీసులు, న్యాయవాదులపై అసభ్యకర పదజాలంతో దూషించారు. పోలీసులు వారిద్దరిని వైద్యపరీక్షల కోసం ఆస్పత్రికి తీసుకెళ్లారు. న్యాయమూర్తిని చంపుతామని బెదిరించారని ఆరోపిస్తూ అన్నానగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. -
బయల్పడిన వృద్ధురాలి మృతదేహం
తిరువొత్తియూరు: వలసరవాక్కం సౌందర్య నగర్ మెయిన్ రోడ్డులో నివాసముంటున్న విజయభాను(75), ఈమె కుమార్తె కుటుంబంతో సహా అమెరికాలో ఉంటున్నారు. వృద్ధురాలు విజయభాను ఒంటరిగా ఉంటున్న క్రమంలో గత 4 రోజులుగా ఆమె ఇంటి నుంచి బయటకు రాలేదు. దీంతో అనుమానించింన ఇరుగుపొరుగు వారు వలసరవాకం పోలీసులకు సమాచారం తెలిపారు. పోలీసు ఇన్స్పెక్టర్ అన్బుకరసన్, పోలీసులు అక్కడి చేరుకుని తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా అక్కడ విజయభాను మృతి చెంది ఉన్నట్టు తెలిసింది. ఆమె ఎలా మృతి చెందిందనేదానిపై పోలీసులు తీవ్రంగా విచారణ చేస్తున్నారు. వృద్ధురాలి మృతదేహాన్ని శవ పరీక్ష కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైభవంగా తెప్పోత్సవం కొరుక్కుపేట: శ్రీవాసవీ వసంతోత్సవంలో భాగంగా మూడు రోజులపాటు ఏర్పాటు చేసిన తెప్పోత్సవం అత్యంత వైభవంగా గురువారం రాత్రి ఆరంభమైంది. చైన్నె జార్జి టౌన్‌లోని శ్రీకన్యకా పరమేశ్వరి దేవస్థానంలో శ్రీవాసవీ వసంతోత్సవాలు ఈ నెల 18వ తేదీ నుంచి ప్రతీ రోజు ఘనంగా సాగుతున్నాయి. ఆలయం మహా మండపంలో ప్రత్యేకంగా కృత్రిమ కోనేరును ఏర్పాటు చేశారు. అందులో ఈ నెల 26వ తేదీ వరకు శ్రీవాసవి అమ్మవారి తెప్పపై ఊరేగింపు నిర్వహిస్తున్నారు. గురువారం రాత్రి జరిగిన తెప్పోత్సవంలో ఆలయ ట్రస్టీలు పాల్గొని, తెప్పను లాగుతూ అమ్మవారి సేవలో తరించారు. ఆలయ అర్చకులు అమ్మవారికి విశేష పూజలు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఐఐటీ మద్రాసు మరో అరుదైన ఘనత – ఒక్క ఏడాదిలోనే 417 పేటెంట్లు దాఖలు కొరుక్కుపేట: ఐఐటీ–మద్రాసు మరో అరుదైన మైలురాయిని సాదించింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఐఐటీ మద్రాస్ విద్యార్థులు, పరిశోధకులు, అధ్యాపకులు కలసి మొత్తం 417 పేటెంట్లను దాఖలు చేశారు. ఇది డైరెక్టర్ ప్రొఫెసర్ వి. కామకోటి ‘వన్ పేటెంట్ వన్ డే’ దార్శనికతను అధిగమించింది. ఇందులో 298 భారతీయ పేటెంట్లు కాగా 119 అంతర్జాతీయ పేటెంట్లు ఉన్నాయి. అదనంగా, ఇన్స్టిట్యూట్ 39 డిజైన్లు, 6 కాపీరైట్లు, 1 ట్రేడ్‌మార్క్‌ను దాఖలు చేసింది, దీనితో 2024– 25 సంవత్సరానికి మొత్తం ఐపీ ఫైలింగ్‌ల సంఖ్య 463కి చేరుకుందని ఐఐటీ మద్రాసు డైరెక్టర్ ప్రొఫెసర్ వి.కామకోటి తెలిపారు. ఇంకా, గత ఐదేళ్లలో ఐఐటీ మద్రాస్ వివిధ సాంకేతిక పరిజ్ఞానాలను అభివృద్ధి చేసిందని, రూ. 28 కోట్ల విలువైన లైసెన్సింగ్ ఒప్పందాల ద్వారా స్టార్టప్‌లు, ఎంఎస్ఎంఈలు, ఎంఎన్సీల వంటి పరిశ్రమ భాగస్వాములకు బదిలీ అయ్యాయన్నారు. వీటి లో అతిపెద్దది తేజస్ నెట్వర్క్ (టాటా గ్రూప్)కి బదిలీ చేసిన 5జీ ఆర్ఏఎన్ సబ్–సిస్టమ్ టెక్నాలజీ అని తెలిపారు. ఏటా ఏప్రిల్ 26న జరుపుకునే ‘ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం’ సందర్భంగా ఈ వేడుకలు జరుపుకున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు, పరిశోధకులు, అధ్యాపకులకు శుభాభినందనలు తెలియజేశారు. -
రైలులో రేషన్ బియ్యం పట్టివేత
వేలూరు: యశ్వంత్‌పూర్ నుంచి హౌరా ఎక్స్‌ప్రెస్ రైలులో ఆంధ్రకు రైలులో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని రైల్యే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వేలూరు జిల్లా నుంచి ఆంధ్ర, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు తమిళనాడు రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు తీసుకెళ్లి వాటికి పాలిష్ చేసి అధిక ధరలకు విక్రయాలు చేస్తున్నట్లు సివిల్ సప్లయిస్ అధికారులకు రహస్య సమాచారం వచ్చింది. దీంతో కర్ణాటక, ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులతోపాటు పోలీసులు సైతం తరచూ వాహన తనిఖీలు చేస్తున్నారు. దీంతో రేషన్ బియ్యాన్ని రైలు మార్గంలో అధికంగా తరలిస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో రైల్వే పోలీసులు కాట్పాడిలో తనిఖీలను ముమ్మరం చేస్తున్నారు. ఇదిలా ఉండగా యశ్వంత్‌పూర్ నుంచి హౌరా ఎక్స్‌ప్రెస్ రైలులో ఆంధ్రకు జనరల్ కంపార్ట్మెంట్ బోగిలో రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నట్లు రైల్వే పోలీసులకు రహస్య సమాచారం వచ్చింది. దీంతో రైల్వే పోలీసులు తనిఖీలు చేయగా రైలు సీట్లు కింద సుమారు 15 గోనె సంచుల్లో మొత్తం 450 కిలోల రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. అనంతరం పోలీసులు కూలీల సాయంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లయిస అధికారులకు అప్పగించారు. -
దేశ సేవలో భాగం కావాలి
– సర్జన్ వైస్ అడ్మిరల్ ఆర్తి సరిన్ సాక్షి, చైన్నె: వైద్యకోర్సుల్లో పట్టభద్రులైన యువకులు దేశ సేవలో భాగమై త్రివిధ సైనిక దళాల్లో వైద్య సేవలందించేందుకు ముందుకు రావాలని ఢిల్లీలోని సైనిక దళాల వైద్య సేవల డైరెక్టర్ జనరల్ సర్జన్ వైస్ అడ్మిరల్ ఆర్తి సరిన్ పిలుపునిచ్చారు. చైన్నె పోరూరులోని శ్రీరామచంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (డీమ్డ్ యూనివర్సిటీ) 39వ స్నాతకోత్సవం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి సర్జన్ వైస్ అడ్మిరల్ ఆర్తి సరిన్ పాల్గొని స్నాతకోత్సవ సందేశమిచ్చారు. వైద్యరంగంలో కృతిమ మేధోపరిజ్ఞానం(ఏఐ) రోబోటిక్ సర్జరీల ప్రాధాన్యతలు పెరిగాయని అన్నారు. ఈ అవకాశాలుగా సద్వినియోగం చేసుకుని రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే త్రివిధ దళాలో వైద్య సేవలు అందించాలని కోరారు. వైద్యరంగంలోకి వచ్చిన యువతీ యువకులు సేవాభావం అలవరుచుకోవాలి పిలుపునిచ్చారు. చాన్స్‌లర్ వీఆర్ వెంకటాచలం, ప్రొ.చాన్స్‌లర్ ఆర్వీ సెంగొట్టవన్, వైస్ చాన్స్‌లర్ డాక్టర్ ఉమాశంకర్ సమక్షంలో వైద్య పట్టాలు అందుకున్నవారిలో 29 మంది విద్యార్థులకు 40 బంగారు పతకాలను ఆమె అందజేశారు. ప్రత్యేకించి డాక్టర్ సంజన.వి అనే విద్యార్థిని ఐదు బంగారు పతకాలు అందుకోవడం విశేషం. ఈ స్నాతకోత్సవంలో మొత్తం 637 మందికి యూజీ, పీజీ డిగ్రీలు ప్రదానం చేశారు. -
సాంకేతికతను అందిపుచ్చుకోవాలి
కొరుక్కుపేట: ఉత్పత్తుల తయారీలో నాణ్యతా ప్రమాణాలతో పాటు సాంకేతికత అందిపుచ్చుకుని ముందుకు సాగాలని భారత ప్రభుత్వ టెక్స్టైల్స్ మంత్రిత్వశాఖ, టెక్స్టైల్స్ కమిషనర్ రూప్రాశి అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆంధ్రా చాంబర్ ఆఫ్ కామర్స్, నెదర్లాండ్స్‌కు చెందిన ఎఫ్ఎస్ఎస్సీ అనే సర్టిఫికేషన్ సంస్థ సహకారంతో సోషల్ మేనేజ్మెంట్ సిస్టమ్ స్టాండర్డ్స్‌తో గ్లోబల్ ట్రస్ట్ బిల్డింగ్‌పై ఎఫ్ఎస్ఎస్సీ సమ్మిట్‌ను శుక్రవారం నిర్వహించింది. ఆంధ్రా ఛాంబర్ ఆఫ్ కామర్స్ వైస్ ప్రెసిడెంట్ ఎస్. నరసింహన్, ఎఫ్ఎస్ఎస్సీ నెదర్లాండ్స్ మార్కెట్ డెవలప్మెంట్ డైరెక్టర్ కొలిన్ మోర్గాన్ పాల్గొన్నారు. ఆంధ్రా చాంబర్ వైస్ ప్రెసిడెంట్ ఎస్. నరసింహన్ పారిశ్రామిక పురోగతిలో స్థిరమైన అభివద్ధి, పర్యావరణ బాధ్యత పాత్రను వివరించారు. ఐఏఎస్ అధికారి ఆర్ సెల్వం కొఠారి ఇండస్ట్రియల్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ జె రఫీక్ అహ్మద్, పారిశ్రామిక వేత్త నల్లి కుప్పస్వామి శెట్టి పాల్గొన్నారు. -
అర్హులందరికీ మహిళా హక్కు
● జూన్‌లో దరఖాస్తుల ఆహ్వానానికి నిర్ణయం ● అసెంబ్లీలో సీఎం స్టాలిన్ వెల్లడి ● ప్రజాసేవలు డిజిటల్ మయం ● ఆన్లైన్లో అసెంబ్లీ రికార్డులు సాక్షి, చైన్నె: అర్హులైన మహిళలు అందరూ కలైంజ్ఞర్ మహిళా హక్కు పథకంలో చేరేందుకు వీలు కల్పిస్తూ ప్రభుత్వం మరో అవకాశం కల్పించేందుకు నిర్ణయించింది. అసెంబ్లీ వేదికగా సీఎం స్టాలిన్ శుక్రవారం ఇందుకు సంబంధించి ప్రకటన చేశారు. జూన్‌లో దరఖాస్తులను పంపిణీ చేయనున్నట్టు ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాల్లో శుక్రవారం కొంగునాడు మక్కల్ దేశీయ కట్చి సభ్యుడు ఈశ్వరన్ మహిళా హక్కు పథకం గురించి ప్రస్తావించారు. గృహిణులకు నెలవారిగా రూ.1000 పంపిణీ నిమిత్తం చేపట్టిన ఈ పథకం మరెందరో అర్హులైన వారికి దరి చేరలేదని సభకు వివరించారు. ఈపథకాన్ని విస్తరించాలని కోరారు. ఇందుకు సీఎం స్టాలిన్ సమాధానం ఇస్తూ ప్రసంగించారు. కలైంజ్ఞర్ మహిళా హక్కు పథకం కింద ప్రస్తుతం 1.14 కోట్ల మంది మహిళలకు నెలకు రూ. 1000 అందజేస్తున్నామని వివరించారు. అర్హులైన ప్రతిఒక్కరికీ ఈ నగదు ఇస్తామన్నారు. ఇప్పటికే మూడు విడతలుగా అర్హులను ఎంపిక చేశామని గుర్తుచేస్తూ, నాలుగో విడతగా జూన్‌లో దరఖాస్తులను పంపిణీ చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో 9 వేల ప్రాంతాల్లో శిబిరాలను నిర్వహించి అర్హులను ఎంపిక చేయడానికి దరఖాస్తులను అందజేయనున్నామని స్టాలిన్ వివరించారు. రికార్డులన్నీ ఆన్లైన్లో శాసనసభ రికార్డులను కంప్యూటరీకరించి ఆన్లైన్లో పొందుపరిచిన మొదటి దశ పనులను సీఎం స్టాలిన్ ఉదయం అసెంబ్లీ ఆవరణలో పరిశీలించారు. 1952 నుంచి 2024 వరకు ఉన్న శాసన పత్రాలను కంప్యూటరీకరించి ప్రత్యేకంగా రూపొందించిన 'tnardifita.tn.gov.in ’వెబ్‌సైట్‌ను ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రారంభించారు. ఇందులో మొదటి దశలో 1952 నుంచి 2024 వరకు ఉన్న శాసన పత్రాలను కంప్యూటరీకరించారు. శాసనసభ సభ్యులు, సాధారణ ప్రజలు, పరిశోధకులు సహా అన్ని పార్టీల ప్రయోజనం కోసం ప్రత్యేకంగా రూపొందించిన tnardifita.tn.gov.in ’ వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. ఈ వెబ్‌సైట్‌ను సీఎం ఆవిష్కరించారు. స్పీకర్ అప్పావు, మంత్రులు దురైమురగన్, పీటీఆర్ ఆర్ పళణివేల్ త్యాగరాజన్, శాసనసభ డిప్యూటీ స్పీకర్ పిచ్చాండి, ప్రభుత్వ చీఫ్ విప్ రామచంద్రన్, ప్రధాన కార్యదర్శి మురుగానందం, ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి ఉదయచంద్రన్, శాసనసభ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసన్ పాల్గొన్నారు. ఇదిలాఉండగా అఖిల భారత రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలకు సమాఖ్య అందించే జాతీయ ప్రజా బస్సు రవాణా పనితీరు మెరుగుదల ప్రత్యేక అవార్డుల్లో తమిళనాడు రాష్ట్ర రవాణా సంస్థలకు 19 అవార్డులు దక్కాయి. వీటిని ఈసందర్భంగా సీఎం స్టాలిన్‌కు రవాణామంత్రి శివశంకర్ అందజేశారు. అలాగే, తమిళనాడు సాగునీటి వ్యవసాయ ఆధునీకరణ ప్రాజెక్టుకు కేంద్ర నీటిపారుదల విద్యుత్ బోర్డు అందించిన ‘ఉత్తమ ఇంటిగ్రేటెడ్ వాటర్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ 2024 అవార్డును సీఎం స్టాలిన్‌కు ఆ శాఖ అధికారులు అందజేశారు. ఈసంద్భంగా మంత్రి దురైమురుగన్ మాట్లాడుతూ సమగ్ర విధానం ద్వారా, తమిళనాడు నీటి నిర్వహణ, నీటిపారుదల ఆధునికీకరణ ప్రాజెక్ట్ వ్యవసాయం, పశువులు, మత్స్య ఉత్పత్తిని మెరుగుపరిచినట్టు వివరించారు. ఇందుకు ఫలితంగా కేంద్ర ప్రభుత్వ ‘ఉత్తమ సమగ్ర జలవనరుల నిర్వహణ 2024’ అవార్డు లభించిందన్నారు. న్యూస్రీల్గ్రేట్ తమిళ డ్రీమ్‌కు రూ.3 కోట్లు ఉన్నత విద్యాశాఖకు 2025–26 సంవత్సరానికి బడ్జెట్ కేటాయింపు ప్రకటనలో గ్రేట్ తమిళ్ డ్రీమ్ కార్యక్రమం గురించి మంత్రి కోవిచెలియన్ అసెంబ్లీలో వివరించారు. యువతరానికి ప్రాచీన తమిళ భాష గొప్పతనాన్ని వివరించేందుకుగాను ఈ కార్యక్రమానికి రూ.3 కోట్లు కేటాయించామన్నారు. సంప్రదాయ తమిళ భాష గొప్పతనాన్ని యువతరానికి తెలియజేయడం లక్ష్యంగా, ‘మాపెరుం తమిళ కనవు కార్యక్రమాలు’ కళాశాలలలో నిర్వహిస్తామన్నారు. వర్సిటీల వ్యవహారంలో న్యాయపోరాటం చేసిన చారిత్మాత్మక విజయాన్ని తమిళనాడుకే కాదు, దేశంలోని వివిధ రాష్ట్రాలకు అందించిన సీఎం స్టాలిన్‌ను సత్కరించబోతున్నామని ప్రకటించారు. మే 3న నెహ్రూ ఇండోర్ స్టేడియం వేదికగా సీఎం స్టాలిన్‌కు జరిగే సత్కార వేడుకకు అన్ని పార్టీల శాసన సభ్యులు, ప్రజాప్రతినిధులు తరలి రావాలని అసెంబ్లీ వేదికగా ఈ సందర్భంగా కోవి చెలియన్‌కు పిలుపునిచ్చారు. అలాగే, పాఠశాల విద్యామంత్రి అన్బిల్ మహేశ్ మాట్లాడుతూ వంద శాతం ఉత్తీర్ణత సాధించే బడులకు ఇక ప్రత్యేకంగా ప్రశంసాపత్రాలను అందజేయనున్నామని ప్రకటించారు. మంత్రి వర్గంలో మార్పులు తప్పవా? ఎంఆర్కే పన్నీరుసెల్వం వంతు డిజిటల్ మయం సభలో ఐటీ శాఖకు సంబంధించి 2025–26 సంవత్సరానికి బడ్జెట్లో నిధుల కేటాయింపునకు సంబంధించిన పద్దుల వివరాలను మంత్రి పీటీఆర్ పళణివేల్ త్యాగరాజన్ సభకు వివరించారు. ప్రభుత్వ సేవలన్నీ డిజిటల్ మయం చేయనున్నట్టు ప్రకటించారు. వాట్సాప్ యాప్ ద్వారా సేవలను అందించేందుకు చర్యలు చేపట్టనున్నట్టు వివరించారు. రూ.100 కోట్లతో చైన్నె తరమణిలో ఐటీ కారిడార్‌ను ప్రభుత్వ సేవల నిమిత్తం ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు. అలాగే, పరిశ్రమలు, పెట్టుబడుల శాఖకు సంబంధించి బడ్జెట్ ఆర్థిక నివేదికను మంత్రి టీఆర్బీ రాజా సభలో దాఖలు చేశారు. తమిళనాడులోకి అన్ని సంస్థలు వస్తున్నాయని, గుజరాత్‌కు వెళ్లిన అనేక సంస్థలకు సంతోషం కరువైందన్నారు. ఇప్పడు ఆ సంస్థలు తమిళనాడు వైపుగా మళ్లీ చూస్తున్నాయని వ్యాఖ్యలు చేశారు. జూన్ 12న డెల్టాకు మేట్టూరు నీళ్లు ఈ ఏడాది నిర్ణీత జూన్ 12న డెల్టా రైతులకు సాగుబడి నిమిత్తం మేట్టూరు డ్యాం నీళ్లు విడుదల చేస్తామని నీటి పారుదల శాఖ మంత్రి దురైమురుగన్ అసెంబ్లీలో ప్రకటించారు. మే నెలాఖరులోపు తంజావూరు, తిరువారూర్ సహా 12 డెల్టా జిల్లాల పరిఽధిలోని కావేరి తీరంలో ఉన్న కాలువల పూడికతీత పనులు రూ.98 కోట్లతో శరవేగంగా జరుగుతున్నట్టు ఆయన వివరించారు. -
భారీ బడ్జెట్ చిత్రాలు బ్రహ్మాండం కావు
తమిళసినిమా: ది చూసెన్ ఒన్ పతాకంపై అబు కరీమ్ ఇస్మాయిల్ రూపొందించిన వెబ్ సీరీస్ డార్క్ ఫేస్. దీని ద్వారా సంగీత దర్శకుడు చరణ్ ప్రకాశ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన ఇంతకుముందు పదికిపైగా చిత్రాలకు 15కు పైగా మ్యూజికల్ వీడియోలకు సంగీతాన్ని అందించారన్నది గమనార్హం. ఈ వెబ్‌సీరీస్‌కు చరణ్ ప్రకాశ్‌నే సంగీతాన్ని అందించారు. సీనియర్ వైజీ.మహేంద్రన్ న్యాయవాదిగా ప్రధాన పాత్రను పోషించిన ఇందులో ఆయన కూతురు వైజీ.మధువంతి ముఖ్యపాత్రలో నటించారు. వీరితో పాటు విజయ్ టీవీ కేఆర్‌వై రాజవేల్, సౌమ్య, నిర్మాత అబుకరీమ్ ఇస్మాయిల్, యశ్వంత్, శక్తి, సునిల్ ముఖ్య పాత్రలు పోషించారు. కాగా 7 ఎపిసోడ్స్‌తో రూపొందిన ఈ వెబ్ సీరీస్ టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని గురువారం చైన్నెలోని వాణిమహల్లో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో దర్శకుడు లింగుసామి పాల్గొని ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. వైజీ.మహేంద్రన్ మాట్లాడుతూ ఈ వెబ్‌సిరీస్‌ను దర్శకుడు చరణ్ప్రకాశ్ చాలా అద్భుతంగా రూపొందించారన్నారు. ఆయన చెప్పిన కథే బ్రహ్మాండంగా ఉందన్నారు. రూ.200 కోట్లు, రూ.400 కోట్లు ఖర్చు చేసి నిర్మించిన చిత్రాలు బ్రహ్మాండం అని చెబితే తాను నమ్మనన్నారు. సబ్జెక్ట్ బ్రహ్మాండంగా ఉండాలన్నారు. ప్రేక్షకుల మనసులో ఎంతగా గుర్తుండిపోతుందో అదే బ్రహ్మాండ చిత్రం అన్నారు. వెబ్ సీరీస్ కథ సస్పెన్స్ థ్రిల్లర్‌తో కూడిన ఇన్వెస్టిగేషన్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. కోర్టులో నేరస్తుడిగా ఉరిశిక్షను పొందిన వ్యక్తి ఆ తరువాత తాను నిరపరాధినని నిరూపించుకోవడానికి చేసే పోరాటమే ఈ వెబ్ సీరీస్ ప్రధాన ఇతివృత్తం అని చెప్పారు. అతనికి శిక్ష వేయించిన తానే ఆ తరువాత అతన్ని నిరపరాధిగా నిరూపించడానికి ప్రయత్నిస్తానని వైజీ.మహేంద్రన్ చెప్పారు. -
నిరసనల మహానాడు
● ఊటీలో ప్రారంభం ● అధ్వాన్నంగా పాఠశాల విద్య ● గవర్నర్ వ్యాఖ్య ● రాజకీయ శాసన పరిరక్షణలో కీలకంగా గవర్నర్ ● ఉప రాష్ట్రపతి కితాబు ● దూరంగా ప్రభుత్వ వర్సిటీల వీసీలు సాక్షి, చైన్నె: నల్ల జెండాల నిరసనలతో ఊటీ వేదికగా శుక్రవారం వీసీల మహానాడు ప్రారంభమైంది. ఈ మహానాడుకు వ్యతిరేకంగా పలు సంఘాలు, పార్టీలు నిరసనలు హోరెత్తించాయి. ప్రభుత్వ వర్సిటీల వీసీలు, ప్రతినిధులు గైర్హాజరైనా ఈ మహానాడు నిర్వహణలో గవర్నర్ రవి ఏమాత్రం తగ్గలేదు. ఈ కార్యక్రమం వేదికగా రాష్ట్రంలో అమల్లో ఉన్న పాఠశాల విద్య అధ్వాన్నంగా ఉందని గవర్నర్ రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ శాసనాల పరిరక్షణలో గవర్నర్ కీలకంగా శ్రమిస్తున్నట్టు ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ కొనియాడారు. రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి నేతృత్వంలో ప్రతి సంవత్సరం నీలగిరి జిల్లా ఊటీ వేదికగా గవర్నర్ల మహానాడు నిర్వహిస్తున్నారు. అయితే, ఈ ఏడాది కూడా ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో వర్సిటీలకు సంబంధించిన పది ముసాయిదాల వ్యవహారంలో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో రాష్ట్రంలోని 21 వర్సిటీలు ప్రభుత్వ గుప్పెట్లోకి చేరాయి. వీటికి చాన్స్‌లర్‌గా సీఎం స్టాలిన్ ఉంటారని ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో గవర్నర్ నేతృత్వంలో ఊటీలో వీసీల మహానాడు నిర్వహణకు సిద్ధం కావడంతో తమిళ పార్టీల్లో వ్యతిరేకత మొదలైంది. కాంగ్రెస్, పెరియార్ ద్రావిడ కళగం, ద్రావిడర్ తమిళగం, తందై పెరియర్ ద్రావిడ కళగం పార్టీలు సంఘాలు, ఈ మహానాడుకు వ్యతిరేకంగా పోరాటాలకు పిలుపునిచ్చాయి. దీంతో ఊటీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. మహానాడుకు వ్యతిరేకంగా శుక్రవారం ఉదయం నుంచి అనేక చోట్ల నిరసనలు చోటుచేసుకున్నాయి. ఊటీలోని రాజ్‌భవన్ వైపుగా దూసుకెళ్లేందుకు నిరసనకారులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. నిరసనలు ఓ వైపు సాగితే, మరో వైపు రెండు రోజుల మహానాడు నిఘా నీడలో ప్రారంభమైంది. గవర్నర్‌కు కితాబు ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ మాట్లాడుతూ రాజకీయ శాసనాలను పరిరక్షించడంలో గవర్నర్ రవి కీలక సేవలు అందిస్తున్నారన్నారు. విద్యా సంస్థలకు అనుకూలంగా విద్యా అంశాలు, అవకాశాలు ఉండాలని వ్యాఖ్యానించారు. దేశ ప్రగతిలో విద్య విభాగం కీలక పాత్ర పోషిస్తున్నదన్నారు. తాను సైతం చదువుకోవడం ద్వారా మంచి పదవిలో ఉన్నట్టు పేర్కొన్నారు. ఈసందర్భంగా కశ్మీర్లో తీవ్ర వాద దాడులను గుర్తుచేస్తూ, ఈ దాడులు ప్రమాదకరంగా మారాయని వ్యాఖ్యలు చేశారు. దాడుల్లో దేశ ప్రగతిని అడ్డుకోలేరన్నారు. వర్సిటీలు విద్యావ్యవస్థకు మార్గదర్శకంగా ఉండాలని, విద్యాపరంగా ఉన్న సమస్యలను పరిష్కరించుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలు అవశ్యమన్నారు. ఉన్నత విద్య అందరికీ అందాలని ఆకాంక్షించారు. ముందుగా ఊటీకి వచ్చిన ఉప రాష్ట్రపతికి మంత్రి స్వామినాథన్, ఎంపీ రాజా ఆహ్వానం పలికారు. -
ఆర్థికావృద్ధిలో వాణిజ్య వాహనాలు కీలకం
● సీఐఐ సమ్మిట్‌లో నిపుణుల వ్యాఖ్య సాక్షి, చైన్నె: భారతదేశ ఆర్థికావృద్ధికి, జాతీయ పోటీతత్వానికి కీలక శక్తిగా వాణిజ్య పరమైన వాహనాలు నిలుస్తున్నాయని టాటా మోటార్స్ అధ్యక్షుడు రాజేంద్ర పెట్కర్ వ్యాఖ్యానించారు. సీవీలు భారత్ పవర్‌హౌస్‌లు అన్న నినాదంతో సీఐఐ దక్షిణ రీజియన్ సమ్మిట్–2025 శుక్రవారం స్థానికంగా జరిగింది. ఇందులో రాజేంద్ర పెట్కర్ మాట్లాడుతూ భారతదేశ వాణిజ్య వాహన పరిశ్రమ కీలకమైన మలుపులో పయనిస్తున్నట్టు వ్యాఖ్యానించారు. సంక్లిష్టమైన సవాళ్లను ఎదుర్కోవడమే కాకుండా, పరివర్తన అవకాశాలతో నిండి ఉందన్నారు. ప్రపంచ అనిశ్చితి మధ్య స్థితిస్థాపక శక్తిగా ఉండడం, భారతదేశ వృద్ధిలో కీలకమైన శక్తిగా మారడం వరకు, ఈ రంగం ఆర్థిక ఆశయాలు, సాంకేతిక చురుకుదనాన్ని ప్రతిబింబిస్తున్నదన్నారు. భారతదేశం ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నందున, వాణిజ్య వాహనాలు ప్రతిరంగంలోనూ సర్వవ్యాప్తంగా ఉన్నాయన్నారు. ఇది అక్షరాలా పురోగతికి శక్తినిస్తున్నాయని, జాతీయ పోటీతత్వానికి దోహదపడుతున్నాయని, ‘భారత్‌ను నిర్మించడానికి శక్తి కేంద్రం’ నిలుస్తున్నాయని వివరించారు. సీఐఐ డిప్యూటీ చైర్మన్ పి.రవిచంద్రన్, సమ్మిట్ చైర్మన్ ప్రదీప్‌కుమార్ తిమ్మయ్యన్ పాల్గొన్నారు. -
ఇసుక మాఫియాతో బేరం
– ఆడియో వైరల్‌తో వీఆర్‌కు డీఎస్పీ సాక్షి, చైన్నె: ఇసుక మాఫియాతో ఓ డీఎస్పీ బేరం ఆడుతూ అడ్డంగా బుక్కయ్యారు. ఈ ఆడియో వైరల్ కావడంతో పోలీస్ ఉన్నతాధికారులు కన్నెర్ర చేశారు. ఆ డీఎస్పీని విధుల నుంచి తప్పించి వీఆర్‌కు పంపించారు. కళ్లకురిచ్చి జిల్లా ఊలందూరుపేట డీఎస్పీగా ప్రదీప్ పనిచేస్తున్నారు. ఆయన ఇసుక అక్రమ రవాణాకు సహకరించే విధంగా మాఫియా ముఠాతో జరిపిన ఆడియో సంభాషణలు శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ ఆడియో డీఎస్పీదే అన్నది నిర్ధారణ అయింది. దీంతో ఈ వ్యవహారం పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి చేరింది. దీంతో ఆయన్ను విధుల నుంచి తప్పిస్తూ వీఆర్‌కు పంపించారు. అలాగే, ఈ వ్యవహారంపై ఐజీ విచారణకు డీజీపీ శంకర్‌జివాల్ ఆదేశించారు. గ్రూప్–4 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ●దరఖాస్తుల స్వీకరణ ●ఓఎంఆర్ సీట్లో మార్పులు సాక్షి, చైన్నె: తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్–4 పోస్టుల భర్తీకి రంగం సిద్ధం చేశారు. ఓఎంఆర్ సీట్లో మార్పులు చేశారు. దరఖాస్తులను మే 24వ తేదీ వరకు స్వీకరించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న వీఏఓ, జూనియర్ అసిస్టెంట్ వంటి 3,935 పోస్టులను భర్తీ చేయడానికి తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చర్యలు తీసుకుంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను శుక్రవారం విడుదల చేసింది. టీఎన్పీఎస్సీ వెబ్సైట్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. మే 24వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. జూలై 12న రాత పరీక్ష జరగనుంది. ఈసారి ప్రశ్నపత్రాలకు సంబంధించిన ఓఎంఆర్ సీట్లను మార్పు చేశారు. మార్పు వివరాలను వెబ్సైట్లో పొందుపరిచారు. ఓఎంఆర్ షీట్ శాంపిల్ పేరిట దీనిని దరఖాస్తులు చేసుకునే చోటే ఉంచారు. దీని ఆధారంగా ఈ సారి అభ్యర్థులు పరీక్షల్లో సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పరీక్షలకు విద్యార్హత పదో తరగతిగా నిర్ణయించారు. ఎస్వీ.శేఖర్ క్షమాపణకు గడువు తమిళసినిమా: మహిళా పాత్రికేయురాలిని క్షమాపణ కోరడానికి నటుడు, మాజీ ఎంపీ ఎస్వీ.శేఖర్‌కు సుప్రీంకోర్టు జూలై నెల వరకూ అవకాశాన్ని ఇచ్చింది. వివరాలు చూస్తే 2018లో మహిళా పాత్రికేయురాలిని కించపరచే విధంగా మాట్లాడినందుకుగాను ఆమె చైన్నె ప్రత్యేక కోర్టును ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన ప్రత్యేక న్యాయస్థానం ఎస్వీ.శేఖర్‌కు నెల జైలు శిక్ష, రూ.15 జరిమానా విధిస్తూ ఉత్వర్వులు జారీ చేసింది. అయితే ప్రత్యేక కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఎస్వీ.శేఖర్ మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే హైకోర్టు కూడా చైన్నె ప్రత్యేక కోర్టు తీర్పును సమర్థ్ధిస్తూ ఉత్వర్వులు జారీ చేసింది. దీంతో ఎస్వీ.శేఖర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అందులో తాను అవమానించినట్లుగా భావించిన మహిళా పాత్రికేయురాలిని క్షమాపణ కోరడానికి సిద్ధం అని పేర్కొన్నారు. కాగా ఈయన పిటిషన్‌ను శుక్రవారం విచారించిన సుప్రీంకోర్టు మహిళా పాత్రికేయురాలిని కలిసి క్షమాపణ కోరడానికి ఎస్వీ.శేఖర్‌కు జూలై నెల వరకూ కాలావకాశాన్నినిస్తూ ఆదేశాలను జారీ చేసింది. అదేవిధంగా ఈ విషయంలో ఆ పాత్రికేయురాలి వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. విహారయాత్రలో విషాదం ●ఇద్దరు తమిళనాడు వైద్య విద్యార్థినుల మృతి ●ఉత్తర కన్నడ జిల్లాలో ఘోరం యశ్వంతపుర(కర్ణాటక): విహారయాత్రకు వెళ్లిన తమిళనాడుకు చెందిన ఇద్దరు మెడిసిన్ విద్యార్థినులు సముద్రంలో మునిగి మృత్యువాత పడ్డారు. ఉత్తర కన్నడ జిల్లా గోకర్ణ వద్ద మెడికల్ విద్యార్థులు కాంజిమోళి, సింధుజా మృతిచెందారు. విద్యార్థులను రక్షించడానికి స్థానికులు అనేక ప్రయత్నాలు చేశారు. సముద్రంలో మునుగుతుండగా అలలు రావడంతో చిక్కుకున్న వారిని రక్షించడానికి సాధ్యం కాలేదు. మృతులు తమిళనాడులోని తిరుచ్చి మెడికల్ కాలేజీలో చివరి సంవత్సరం చదువుతున్నట్లు తెలిసింది. అనంతరం తీర రక్షణ దళం గాలించి మృతదేహాలను వెలికి తీశారు. గోకర్ణ పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాలకు పోస్టుమార్టం చేయించారు. -
శ్రమిస్తే అధికారం తథ్యం
సాక్షి, చైన్నె: మరింతగా శ్రమిస్తే డీఎంకేను గద్దె దించడం సులభమని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి సూచించారు. 2026లో గెలుపు అవకాశాలు ప్రకాశవంతంగా ఉన్నట్టు, శ్రమిస్తే ప్రజల ఆదరణ మరింతగా దగ్గర అవుతుందని పేర్కొన్నారు. అన్నాడీఎంకే బలోపేతం దిశగా తాను రాష్ట్ర పర్యటన చేయబోతున్నట్టు పళణిస్వామి ప్రకటించినట్టుగా జిల్లాల కార్యదర్శులు పేర్కొంటున్నారు. ఇటీవల బీజేపీ–అన్నాడీఎంకే కూటమి మళ్లీ ఏర్పడిన విషయం తెలిసిందే. కూటమి ఏర్పాటుతో తొలిసారిగా జిల్లాల కార్యదర్శులతో భేటీకి పళణిస్వామి చర్యలు తీసుకున్నారు. పార్టీ పరంగా ఉన్న 80 మేరకు జిల్లాల కార్యదర్శులు, ముఖ్య నేతలు, శుక్రవారం సాయంత్రం ఎంజీఆర్ మాళిగైలో జరిగిన సమావేశానికి హాజరయ్యారు. ఇందులో బూత్ కమిటీల బలోపేతం, గ్రామాలలోకి జిల్లాల కార్యదర్శులు పర్యటించడం వంటి సూచనలు పళణిస్వామి చేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి. కూటమిలోకి మరిన్ని పార్టీలు వస్తాయని, ఆ దిశగా ప్రయత్నాలు చేస్తామని పేర్కొనడం ప్రాధాన్యతకు దారి తీసినట్టు ఓ నేత పేర్కొన్నారు. పార్టీ పరంగా దూరం దూరంగా ఉన్న కొందరు నేతలను దరి చేర్చుకుని ఎన్నికలలోకి వెళ్దామన్న సూచనను పరోక్షంగా కొందరు నేతలు పళని స్వామి దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. వీరిలో మాజీ సీఎం పన్నీరు సెల్వం, అమ్మమక్కల్ మున్నేట్ర కళగం దినకరన్‌లు ఎన్డీఏ కూటమిలో కొనసాగుతుండడంపై ప్రస్తావించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. అయితే ఈ సమావేశంలో మరింత ఆసక్తికర అంశాలతో చర్చలు జరిగినట్టు మరో నేత పేర్కొన్నారు. పళణిస్వామి రాష్ట్ర పర్యటనకు సిద్ధమవుతున్నారని, కేడర్‌తో మమేకం అయ్యే విధంగా ఈ పర్యటన ఉండబోతున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. జిల్లాల కార్యదర్శులకు పళణి ఆదేశాలు త్వరలో రాష్ట్ర పర్యటన -
సీసీ కెమెరాలు ఏర్పాటు చేయండి
తిరువళ్లూరు: జిల్లాలోని వరి కొనుగోలు కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని అగ్రి గ్రీవెన్స్‌డేలో రైతులు కలెక్టర్ ప్రతాప్‌కు సూచించారు. తిరువళ్లూరు కలెక్టరేట్లో అగ్రి గ్రీవెన్స్‌డే శుక్రవారం ఉదయం పది గంటల నుంచి రెండుగంటల వరకు జరిగింది. గ్రీవెన్స్‌డేకు జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున రైతులు హాజరుకాగా, అన్ని శాఖలకు చెందిన అధికారులు హాజరయ్యారు. కార్యక్రమం ప్రారంభం కాగానే రైతులు తమ సమస్యలపై మొరపెట్టుకున్నారు. ఈ సందర్భంగా సింగారరాజపురం గ్రామానికి చెందిన చెరువును పూడికతీత చేపట్టాలని, వరి కొనుగోలు కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు అవినీతిని అరికట్టాలని, బండి కావనూరులో ఆక్రమణలకు గురైన చెరువులు, కాలువలను పరిరక్షించాలని విన్నవించారు. అంతేకాకుండా అడవి పందుల నుంచి రైతులను కాపాలని కోరారు. రైతులకు త్రీఫేజ్ కరెంట్‌ను 24 గంటలూ అందజేయాలని డిమాండ్ చేశారు. స్పందించిన కలెక్టర్ రైతుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. -
మే 17న తెరపైకి మిషన్ ఇంపాజిబుల్
తమిళసినిమా: హాలీవుడ్ సూపర్‌స్టార్ టామ్ క్రూజ్ మరోసారి ప్రపంచ సినీ ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నారు. ఈయన 1996లో నటించిన మిషన్ ఇంపాజిబుల్ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. దీంతో ఆ తరువాత వరుసగా దానికి 7 సీక్వెల్స్ రూపొంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈయన నటించిన మిషన్ ఇంపాజిబుల్ 7 చిత్రం ఏఐ టెక్నాలజీతో రూపొంది గత ఏడాది విడుదలై వసూళ్ల వర్షం కురిపించింది. తాజాగా తెరకెక్కిన మిషన్ ఇంపాజిబుల్–ది ఫైనల్ రిక్కానింగ్ నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని మే నెల 17వ తేదీన భారతదేశంలో విడుదలకు సిద్ధం అవుతోంది. పారమౌంట్ పిక్చర్స్, స్కైడాన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి నటుడు టామ్ క్రూజ్ నిర్మాత కాగా క్రిస్టోఫర్ మెక్వారి దర్శకత్వం వహించారు. యాక్షన్ ఎంటర్టెయినర్గా తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్, ఇటీవలే విడుదలై విశేష స్పందనను తెచ్చుకుంది. అదే విదంగా ఇదే చివరి సీక్వెల్ అని తెలియడంతో మిషన్ ఇంపాజిబుల్ 8 చిత్రంపై ఆసక్తి నెలకొంది. ఈ చిత్రాన్ని మే నెల 23వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే తాజాగా ఈ చిత్రాన్ని ఇండియాలో ఆరు రోజుల ముందుగానే అంటే మే 17న ఇంగ్ల్లిష్, హిందీ, తెలుగు, తమిళం భాషల్లో విడుదల చేస్తున్నారు. దీంతో ఈ సమ్మర్లో భారతీయ సినీ ప్రేక్షకులకు సూపర్ ఎంటర్టెయినర్ ఇచ్చే చిత్రంగా మిషన్ ఇంపాజిబుల్–8 కానుందన్నమాట. ఆ తరువాతనే ఈ చిత్రం ఇతర దేశాల్లో కూడా విడుదల కానుంది. తాజ్‌మహల్ ముందు నటుడు టామ్ క్రూజ్ -
పట్టాల బోల్టులను తొలగించిన దుండగులు.. తప్పిన పెను రైలు ప్రమాదం
సాక్షి,చెన్నై: అరకోణం సమీపంలో పెను రైల్వే ప్రమాదం తప్పింది. దుండగులు రైల్వే పట్టాల బోల్ట్లను తొలగించారు. పట్టాల బోల్టుల తొలగింపుపై రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. రైళ్ల రాకపోకల్ని నిలిపివేశారు. బెంగళూరు, కేరళ వెళ్లే రైళ్లను దారి మళ్లించారు. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
రేషన్ డీలర్ల ధర్నా
వేలూరు: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వ రేషన్ విక్రయదారులు వేలూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. దీనికి తమిళనాడు ప్రభుత్వ రేషన్ విక్రయ దారుల సంఘం జిల్లా అధ్యక్షులు జయవేలు అధ్యక్షత వహించగా రాష్ట్ర కార్యదర్శి సెల్వం ముఖ్య అతిథిగా హాజరై ధర్నాను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ రేషన్ దుకాణాల్లో కుటుంబ రేషన్ కార్డు దారుడు తప్పనిసరిగా వేలి ముద్రలు పెట్టాలని నిబంధనలు పెట్టడం వల్ల కొన్ని సమయాల్లో ఆన్లైన్ పనిచేయక పోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. అదేవిధంగా గోడౌన్ నుంచి వచ్చే నిత్యావసర సరుకులు సరైన తూకంతో రావాలని అన్ని బస్తాలు తక్కువ బరువుతో రావడంతో కార్డు దారులకు నిత్యసర వస్తువులు అందజేయలేక పోతున్నామన్నారు. విక్రయదారులకు సీనియారిటీ ప్రకారం విద్యా అర్హతను బట్టి పదోన్నతులు కల్పించాలని, నాణ్యమైన నిత్యావసర వస్తువులను అందజేయాలని, అధికారులు వారంలో మూడు రోజుల పాటూ తనిఖీల పేరుతో వేధింపులకు గురి చేయడాన్ని మానుకోవాలని తదితర మొత్తం 30 డిమాండ్లు పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఇప్పటికే తమ సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీసుకెల్లినా ఎటువంటి చర్యలు తీసుకోక పోవడంతోనే ధర్నా నిర్వహిస్తున్నామని ఇప్పటికై నా స్పందించకుంటే పోరాటాలను తీవ్రతరం చేస్తామన్నారు. ఈ ధర్నాలో సేల్స్మన్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
శింబు అడిగితే కాదనగలనా!
తమిళసినిమా: నటుడు శింబు తాజాగా నటిస్తున్న చిత్రాలు లైనప్ అవుతున్నాయి. ఈయన కమలహాసన్‌తో కలిసి మణిరత్నం దర్శకత్వంలో నటించిన థగ్ లైఫ్ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూన్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. కాగా తాజాగా తన 49వ చిత్రానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి రామ్‌కుమార్ బాలకృష్ణన్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఇకపోతే నటుడు సంతానం గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. టీవీ కార్యక్రమాల నుంచి కేరీర్‌ను ప్రారంభించి, ఆ తరువాత చిత్ర రంగ ప్రవేశం చేశారు. మొదట్లో కమెడియన్‌గా నటించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన సంతానం ఆ తరువాత కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం ఈయన కథానాయకుడిగా నటించిన డీడీ నెక్ట్స్ లెవెల్ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని మే నెల 16వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. కాగా పలు చిత్రాల్లో కథానాయకుడిగా నటించిన సంతానం ఇప్పుడు మళ్లీ తన పంచ్ డైలాగ్స్ తో అలరించడానికి హాస్య పాత్రలో నటించడానికి రెడీ అవుతున్నారు. నటుడు శింబు హీరోగా నటించనున్న ఆయన 49వ చిత్రంలో సంతానం హాస్య పాత్రలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ విషయాన్ని ఇటీవల ఆయనే ఒక భేటీలో చెప్పారు. నటుడు శింబు ఫోన్ చేసి తన చిత్రంలో నటిస్తారా? అని అడిగారన్నారు. ఆయన అడిగితే నటించను అని చెప్పగలవా? వెంటనే ఒకే చెప్పానన్నారు. కాగా శింబు, సంతానం కలిసి ఇంతకు ముందు వాలు, వానం, ఓస్తీ, సిలంబాట్టం చిత్రాల్లో నటించారన్నది గమనార్హం. కాగా తాజాగా శింబు హీరోగా నటిస్తున్న చిత్రంలో నటించడానికి సంతానం భారీ మొత్తంలో పారితోషకం పుచ్చుకుంటున్నారనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా ఈ క్రేజీ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది. -
శ్రీదేవి వారసురాలి ఎంట్రీ షురూ
తమిళసినిమా: దక్షిణాదిలో టాప్ హీరోయిన్గా ఎదిగి ఉత్తరాది చిత్రాలతో తనదైన ముద్ర వేసుకున్న పాన్ ఇండియా దివంగత నటి శ్రీదేవి. ముఖ్యంగా తమిళం, తెలుగు భాషల్లో బాలనటిగా పరిచయమై ఆ తరువాత స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకున్నారు. కాగా ఇప్పుడు ఆమె వారసురాళ్లు జాన్వీ కపూర్, ఖుషి కపూర్ ఇద్దరూ సినీ పరిశ్రమంలోనే తమ ప్రయాణాన్ని మొదలు పెట్టారు. ముఖ్యంగా జాహ్నవి కపూర్ ఇప్పటికే పలు హిందీ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. 2018లో దడక్ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత రుహీ, గుడ్ లక్ జెర్రా, మిలీ తదితర చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా తరచూ తన గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేస్తూ అభిమానులను అరెస్టు అంటూ ఉంటారు. కాగా ఈమె దక్షిణాది సినీ పరిశ్రమ ఎంట్రీ కోసం అభిమానులు ఎంతగానో చూశారు. అలా 2014లో దేవర చిత్రంతో తెలుగు పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి విజయాన్ని అందుకున్నారు. చిత్రంతోనే స్టార్ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌తో జతకట్టడంతో ఈమె బాగా పాపులర్ అయ్యారు. ప్రస్తుతం తెలుగులో మరో చిత్రం చేస్తున్నారు ఈసారి మరో స్టార్ హీరో రామ్ చరణ్ సరసన పెద్ది చిత్రంలో నటిస్తున్నారు. దీంతో ఈమె కోలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు అన్న ఆసక్తి నెలకొంది. అలాంటిది రానే వచ్చింది. అయితే ఇక్కడ ఎంట్రీ చిత్రంతో కాదు వెబ్ సిరీస్‌తో అని తెలిసింది. ప్రముఖ దర్శకుడు పా.రంజిత్ తన నీలం ప్రొడక్షనన్స్ పతాకంపై నిర్మిస్తున్న వెబ్ సిరీస్‌లో నటి జాన్వీ కపూర్ కథానాయకిగా నటించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. కళవాణి చిత్రం ఫేమ్ సర్గుణం ఈ వెబ్ సిరీస్‌కి దర్శకత్వం వహించనున్నారు. మహిళల పితృత్వంతో అనుబంధం ఉన్న ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన ప్రీ ప్రోడక్షన్ కార్యక్రమాలు ఇప్పటికే ముమ్మరంగా జరుగుతున్నాయి. దీని షూటింగ్ జూలై నెలలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. కాగా ఇది తమిళంలో రూపొందుతున్న వెబ్ సిరీస్ అయినప్పటికీ అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులకు చేరువ అవుతుందన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. కాగా ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన పూర్తి వివరాలతో త్వరలో నిలబడే అవకాశం ఉంది. -
గుర్తింపు కార్డు ఉన్నవారికే అనుమతి
● శరవేగంగా బూత్ కమిటీ మహానాడు పనులు ● కార్డులను పంపిణీ చేసిన టీవీకే ప్రధాన కార్యదర్శి సాక్షి, చైన్నె: బూత్ కమిటీమహానాడుకు హాజరయ్యే వారికి గుర్తింపు కార్డులను తమిళ వెట్రి కళగం పంపిణీ చేస్తోంది. కోయంబత్తూరులో ఈ పంపిణీని గురువారం ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్ ప్రారంభించారు. ఈ మహానాడు ఏర్పాట్లను వేగవంతం చేశారు. వివరాలు.. రాజకీయ ప్రయాణంలో తదుపరి అడుగు వేయడానికి తమిళ వెట్రి కళగం నేత విజయ్ సిద్ధమైన విషయం తెలిసిందే. కోయంబత్తూరు వేదికగా ఈనెల 26,27 తేదిలలో బూత్ కమిటీ మహానాడుకు రెడీ అయ్యారు. కోయంబత్తూరు కురుంబం పాలయంలోని ఓ ప్రైవేటు కళాశాల వేదికగా కొంగు మండలంలోని కోయంబత్తూరు, తిరుప్పూర్, ఈరోడ్, కరూర్, సేలం, నామక్కల్ తదితర జిల్లాలోని బూత్ కమిటీలతో సమావేశానికి చర్యలు తీసుకున్నారు. రెండు రోజుల మహానాడుకు బూత్ కమిటీలకు చెందిన 16 వేల మందిని ఆహ్వానించి ఉన్నారు. వీరందరితో విజయ్ మాట్లాడనున్నారు. వారికి పలు సూచనలు ఇవ్వనున్నారు. ఈ మహానాడు కుహాజరయ్యే వారందరికి గుర్తింపు కార్డులను సిద్ధం చేశారు. ఈకార్డులు ఉన్న వారిని మాత్రమే లోనికి అనుమతించే విధంగా చర్యలు తీసుకున్నారు. ఈ కార్డులను పార్టీ ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కొంగు మండలంలోని జిల్లాలకు చెందిన తమిళగ వెట్రి కళగం నేతలు సంపత్‌కుమార్, బాలాజీ, మదియా జగన్, విఘ్నేష్, రాజ్‌కుమార్, బాలమురుగన్, వెంకటేష్, యువరాజ్, తిరుమలై, వెంకటేష్, ేమణికందన్, సెంథిల్ కుమార్, సెల్వం, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. తమ తమపరిధిలోని బూత్ కమిటీల ప్రతినిధులకు వీరు గుర్తింపు కార్డులను అందజేయనున్నారు. -
విద్యుత్ సబ్ స్టేషన్ పనుల తనిఖీ
తిరువళ్లూరు: అంబత్తూరు సమీప ప్రాంతాల్లో తరచూ ఏర్పడుతున్న లోఓల్టేజ్ సమస్యకు పరిస్కారం చూపాలనే ఉద్దేశంతో తిరువళ్లూరు జిల్లా కొరట్టూరు వద్ద సుమారు 501.72 కోట్లతో ఏర్పాటు చేసిన సబ్‌స్టేషన్ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈక్రమంలో దాన్ని త్వరలో ప్రారంబించి అందుబాటులోకి తెస్తామని అడిషనల్ చీఫ్ సెకరెట్రి, విద్యుత్ బోర్డు అధ్యక్షుడు డాక్టర్ రాధాకృష్ణన్ తెలిపారు. తమిళనాడు విద్యుత్ బోర్డు ఆద్వర్యంలో కొరట్టూరు వద్ద సుమారు 501.72 కోట్లు వ్యయంతో 400 కిలో మోగావాట్ సామరథ్యం వున్న విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ సబ్‌స్టేషన్ పనులు పూర్తయిన క్రమంలో విద్యుత్ శాఖ డైరెక్టర్ ఇంద్రాణితో కలిసి డాక్టర్ రాధాకృష్ణన్ పరిశీలించారు. ట్రయల్‌రన్‌ను సమర్ధంగా నిర్వహించాలని సమస్యలు వుంటే తక్షణం వాటిని పరిష్కరించాలని ఈ సందర్భంగా సిబ్బందిని ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పనులు పూర్తయిన క్రమంలో త్వరలోనే వాటిని ప్రారంభించి అందుబాటులోకి తెస్తామని వివరించారు. విద్యుత్ సబ్‌స్టేషన్ అందుబాటులోకి వస్తే లోఓల్టేజ్ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం దొరుకుందన్నారు. -
తిరుత్తణి హుండీ ఆదాయం రూ.1.40 కోట్లు
తిరుత్తణి: తిరుత్తణి ఆలయంలో 27 రోజుల్లో భక్తులు హుండీల ద్వారా రూ.1.40 కోట్లు కానుకలుగా సమర్పించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు విచ్చేసి ఆలయ హుండీల్లో కానుకలుగా నగలు, నగదు, వస్తువులు చెల్లిస్తుంటారు. ఈక్రమంలో చివరి 27 రోజుల్లో భక్తులు చెల్లించిన కానుకలను ఆలయ జాయింట్ కమిషనర్ రమణి సమక్షంలో హుండీలోని కానుకలను వసంత మండపంలో బుధవారం లెక్కించారు. లెక్కింపులో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. భక్తులు రూ.కోటి 40 లక్షల 13 వేలు, 632 గ్రాముల బంగారం, 13,434 గ్రాముల వెండి భక్తులు కానుకగా చెల్లించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. -
అజిత్ 65వ చిత్రానికి దర్శకుడు..?
తమిళసినిమా: నటుడు అజిత్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ. నటి త్రిష నాయకిగా నటించిన ఈ చిత్రాన్ని ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో టాలీవుడ్ చిత్రం నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. ఇటీవల ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఇది నటుడు అజిత్ కథానాయకుడు నటించిన 64వ చిత్రం అన్నది గమనార్హం. దీంతో ఈయన నటించే 65వ చిత్రానికి దర్శకుడు ఎవరు? ఏ చిత్ర నిర్మాణ సంస్థ నిర్మించనుంది అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. నటుడు అజిత్‌కు ఓ పాలసీ ఉంది. హాయ్ రా నటించిన చిత్రం విడుదలై మంచి విజయాన్ని సాధిస్తే మళ్లీ అదే దర్శకుడితోనో, అదే నిర్మాణ సంస్థలో చిత్రం చేయడం ఆనవాయితీగా వస్తోంది. అలా ఇంతకుముందు దర్శకుడు శివతో వరుసగా నాలుగు చిత్రాలు, అదేవిధంగా విష్ణువర్ధన్తో రెండు చిత్రాలు, దర్శకుడు హెచ్. వినోద్‌తో రెండు చిత్రాలు చేసి మంచి విజయాలను అందుకున్నారు. కాగా తాజాగా ఈయన నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ మంచి విజయాన్ని సాధించడంతో, మళ్లీ ఆ చిత్ర దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్ మరో ఛానన్స్ ఇవ్వబోతున్నట్లు ప్రచారంలో ఉంది. అయితే అంతకుముందే నటుడు ధనుష్ అజిత్‌ను కలిసి కథ చెప్పినట్లు ఆ కథ నచ్చడంతో ఆయన దర్శకత్వంలో నటించడానికి అజిత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. కాగా తాజాగా మరో టాలీవుడ్ సెన్సేషనల్ దర్శకుడితో పనిచేయడానికి అజిత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.ఆయన ఎవరో కాదు. ఇంతకుముందు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా పుష్ప, పుష్ప– 2 వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు సుకుమార్ అని సమాచారం. ఈ దర్శకుడు త్వరలో నటుడు అజిత్ ను కలిసి కథ వినిపించడానికి సిద్ధమవుతున్నట్లు టాక్. అయితే ఇందులో నిజం ఎంత అన్నది పక్కన పెడితే ఈ రేర్ కాంబినేషన్లో చిత్రం అంటే కచ్చితంగా అది వేరే లెవల్ లో ఉంటుందని చెప్పవచ్చు. మరో విషయం ఏంటంటే ఇప్పుడు కోలీవుడ్ స్టార్ నటులు టాలీవుడ్ దర్శకులు, చిత్ర నిర్మాణ సంస్థలపై దృష్టి పెడుతుండడం తెలిసిందే. కాగా నటుడు అజిత్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. ఆయన చైన్నెకి తిరిగి వచ్చిన తరువాత తన తదుపరి చిత్రంపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. -
అభివృద్ధి పనుల తనిఖీ
తిరువళ్లూరు: పొన్నేరి తాలుకా పరిధిలో వేర్వేరు ప్రాంతాల్లో కలెక్టర్ ప్రతాప్, తాహశీల్దార్ సోమసుందరంతో పాటూ ఇతర అధికారులు తనిఖీలు నిర్వహించారు. మొదట స్థానికంగా వున్న అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి అక్కడ విద్యార్దులకు పెడుతున్న భోజనాన్ని పరిశీలించి చిన్నారుల హాజరు వివరాలను సేకరించారు. తర్వాత ఇటీవల నిర్మించిన రోడ్డు నాణ్యతను పరిశీలించారు. అలాగే పళవేర్కాడు చెరువులోని ముఖద్వారం వద్ద సుమారు రూ.26.85 కోట్లు వ్యయంతో జరుగుతున్న వేర్వేరు పనులను కలెక్టర్ పరిశీలించారు. పళవేర్కాడు చెరువులో 325 మీటర్లు దూరంతో నిర్మిస్తున్న అడ్డుగోడ, 4 కిమీ మేరకు నిర్మిస్తున్న రోడ్డు నిర్మాణం, ముఖద్వారం వద్ద పూడిక తీత పనులను సైతం పరిశీలించి సూచనలు చేశారు. అలాగే పొన్నేరి బస్టాండులోని టీ దుకాణంలో పరిశుభ్రత లేకపోవడంతో దానికి సీల్ వేయాలని ఆదేశించారు. -
తెలియకుండానే మంచి జరిగింది
తమిళసినిమా: నటుడు శశి కుమార్, సిమ్రాన్ జంటగా నటించిన తాజా చిత్రం టూరిస్ట్ ఫ్యామిలీ. యోగిబాబు, మిథున్, జయశంకర్, కమలేష్, ఎంఎస్ భాస్కర్, రమేష్ తిలక్, బక్స్ భగవతి పెరుమాళ్, సీజ రవి తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం ద్వారా అభిశక్ జీవిన్ దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. ఇంతకుముందు గుడ్ నైట్, లవర్ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన మిలియన్ డాలర్ స్టూడియోస్, ఎం ఆర్ పీ ఎంటర్టైన్మెంట్ సంస్థల అధినేతలు నజరేద్ ప్రియాన్, మహేష్ రాజ్ పస్లియాన్, యువరాజ్ గణేషన్ నిర్మించారు. అరవింద్ విశ్వనాథన్ చాయాగ్రహణం, షాన్ రోల్డన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకొని కార్మికుల దినోత్సవం సందర్భంగా మే ఒకటవ తేదీన విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సందర్భంగా చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని బుధవారం సాయంత్రం స్థానిక సాలి గ్రామంలోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. నిర్మాతల్లో ఒకరైన మహేష్ రాజ్ పస్లియాన్ మాట్లాడుతూ తాము ఇంతకుముందు నిర్మించిన గుడ్ నైట్, లవర్ వంటి రెండు హిట్ చిత్రాల తర్వాత నిర్మించిన మూడో చిత్రం టూరిస్ట్ ఫ్యామిలీ అని, ఇది కూడా మంచి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం ఉందని అన్నారు. దర్శకుడు అభిశన్ జీవిన్ మాట్లాడుతూ పాఠశాలలో చదువుకుంటున్న సమయంలోనే దర్శకత్వం వహించడమే తన లక్ష్యంగా భావించానన్నారు. అలా ఎవరి వద్ద సహాయ దర్శకుడుగా పని చేయకుండానే కథను సిద్ధం చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు చెప్పారు. నటుడు శశి కుమార్ మాట్లాడుతూ ఇది శ్రీలంక తమిళ కుటుంబానికి సంబంధించిన కథా చిత్రం అని చెప్పారు. ఆ కుటుంబం చైన్నెకి వచ్చి ఎలాంటి సమస్యలను ఎదుర్కొంది అన్నది వినోదభరితంగా చూపించినట్లు చెప్పారు. -
సీఐటీయూ ఆధర్యంలో ధర్నా
తిరువళ్లూరు: ప్రైవేటు కంపెనీ నుంచి తొలగించిన కార్మికులను వెంటనే విధులోకి తీసుకోవాలని, పెండింగ్ వేతనాలను చెల్లించాలని కోరుతూ ప్రైవేటు ఫర్నీచర్ కంపెనీకి చెందిన కార్మికులు, సీఐటూయూ నేతలు గురువారం పట్రపెరంబదూరు టోల్‌గేటు వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఎమ్మేల్యే సౌందరరాజన్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పోర్ట్ ఫర్నీచర్ కంపెనీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం సౌందరరాజన్ మాట్లాడుతూ ప్రైవేటు కంపెనీలో తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, పెండింగ్ వేతనాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులను సమస్యలను పరిస్కరించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం సరికాదన్నారు. అనంతరం కంపెనీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో సీఐటీయూ నేతలు విజయన్, రాజేంద్రన్, నిత్యానందం కార్మిక సంఘాలకు చెందిన నేతలు తమిళరసు, గణేషన్, శంకర్, మురుగన్, కలైయరసన్ పాల్గొన్నారు. -
● సాగరంలో రెస్క్యూ డ్రిల్
సాక్షి,చైన్నె: ఇండియన్ కోస్ట్ గార్డ్ రీజినల్ హెడ్ క్వార్టర్స్ (తూర్పు) విభాగం నేతృత్వంలో కారైకల్ తీరంలో ప్రాంతీయ స్థాయి సెర్చ్ అండ్ రెస్క్యూ ఎక్సర్సైజ్ విజయవంతంగా నిర్వహించారు. నాగపట్నం నుంచి ప్రయాణీకులతో బయలు దేరిన శివగంగై నౌక సముద్రంలో ప్రమాదానికి గురైన సమాచారంతో ఈ రెస్క్యు డ్రిల్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కారైకల్ జిల్లా సోమ శేఖర్ అప్పారావు, నాగపట్నం జిల్లా కలెక్టర్ ఆకాష్,లు హాజరయ్యారు.శివగంగై నౌకలో మంటలు చెలరేగడం, ఫలితంగా అనేక మంది ప్రాణనష్టం సంభవించడం , తక్షణ రెస్క్యూ ఆపరేషర్లకు అవసరమైన కార్యాచరణతో ఈ డ్రిల్ జరిగింది. మారిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్ , ఇండియన్ కోస్ట్ గార్డ్ నౌకలు, హెలికాఫ్టర్లు , రెస్యూ బృందాలు కారైక్కాల్‌కు సమీపంలోని నడీ సముద్రంలోకి దూసుకెళ్తాయి. భారత నావికాదళం, మైలాడుతురై,నాగపట్నం, కారైక్కాల్ నుంచి వచ్చిన సహాయక బృందాలు ఈ డ్రిల్లోభాగస్వాములయ్యాయి. కోస్ట్ గార్డ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నెం.13 కమాండర్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఎస్ఎస్ దాసిలా ఈ డ్రిల్‌ను పర్యవేక్షించారు. -
ప్రతిభ చూపిన ఎస్ఐలకు కమిషనర్ రివార్డు
తిరువళ్లూరు: ఓ ప్రైవేటు పోర్టులో సుమారు 9 కోట్లు రూపాయలు విలువ చేసే వెండి వస్తువులు చోరీకి గురైన క్రమంలో నిందితులను పట్టుకోవడంలో చురుకుగా పని చేసిన పోలీసులు, ఎస్ఐలను ఆవడి కమిషనర్ శంకర్ ప్రశంసించి రివార్డును అందజేశారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా కాట్టుపళ్లిలోని ఓ పోర్టులో భారీగా వెండి వస్తువులు కంటైనర్ నుంచి మాయమైనట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కేసును ఛేదించడానికి ముగ్గురు ఎస్ఐలతో కూడిన స్పెషల్ టీమ్‌ను కమిషనర్ శంకర్ ఏర్పాటు చేశారు. వీరు రెండు వారాల్లో కేసును చేదించి 12 మందిని అరెస్టు చేయడంతో పాటు చోరీకి గురైన వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. దీంతో ముగ్గురు ఎస్ఐలను కమిషనర్ శంకర్ ప్రశంసించి వారికి రివార్డును అందజేశారు. -
శ్రీవారి ఆలయంలో చలువ పందిళ్లు
రాపూరు: మండలంలోని పెంచలకోన పెనుశిల లక్ష్మీనరసింహస్వామి ఆలయం చుట్టూ భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లు ఏర్పాటుచేసినట్టు అధికారులు తెలిపారు. వేసవిలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని, ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసే సమయంలో భక్తులకు కాళ్లు కాలకుండా ఉండేందుకు చలువ పందిళ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే ఆర్టీసీ బస్టాండు నుంచి ఆలయం వరకు, అన్నదాన సత్రం తదితర ప్రాంతాల్లోనూ పందిళ్లు వేస్తున్నట్టు తెలిపారు. అలాగే శ్రీవారి ఆలయం నుంచి అమ్మవారి ఆలయం వరకు తెల్ల సున్నం, పట్ట వేసినట్టు వెల్లడించారు. -
‘కలైంజ్ఞర్’ పేరుతో వర్సిటీ
సాక్షి, చైన్నె: అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఉదయం కాంగ్రెస్ సభ్యుడు సెల్వ పెరుంతొగై, పీఎంకే శాసన సభా పక్ష నేత జీకే మణి, వీసీకే సభ్యుడు చింతనై సెల్వన్, సీపీఎం సభ్యుడు వీపీ నాగై మాలి, సీపీఐ సభ్యుడు రామచంద్రన్, డీఎంకే సభ్యుడు డాక్టర్ సాధన్ తిరుమలైకుమార్, మనిద నేయ మక్కల్ కట్చి సభ్యుడు జవహిరుల్లా, కొంగునాడు మక్కల్ దేశీయ కట్చి సభ్యుడు ఈశ్వరన్, తమిళర్ వాల్వురిమై కట్చి సభ్యుడు వేల్ మురుగన్‌లు సభా నిబంధనలు 55 ప్రకారం ఓ ప్రత్యేక అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చారు. స్పీకర్ అప్పావు అనుమతి ఇవ్వడంతో ఆయా సభ్యులు ప్రసంగించారు. రాష్ట్రంలో దివంగత నేతలు పెరియార్, కామరాజర్, అన్నా, ఎంజీఆర్, జయలలితల పేరిట ఉన్న వివిధ విశ్వ విద్యాలయాల గురించి ప్రస్తావించారు. వీరి సేవలకు గుర్తింపుగా విద్యా పరంగా వర్సిటీలకు పేర్లు పెట్టి గౌరవించి ఉన్నారని గుర్తు చేశారు. తమిళనాడులో గొప్ప రాజకీయ మేధావిగా జీవించి విద్యా వ్యాప్తికి, తమిళ ఖ్యాతికి ఎనలేని సేవలు అందించిన కలైంజ్ఞర్ కరుణానిధి పేరిట ఓ వర్సిటీని ఏర్పాటు చేయాలని కోరారు. కుంభకోణంలో.. సభ్యుల విజ్ఞప్తికి స్పందించిన సీఎం స్టాలిన్ ప్రసంగించారు. సభ్యులు చేసిన విజ్ఞప్తి, సూచనలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. తమిళనాడులోని పాఠశాలలు, కళాశాలలు అన్నీ నేడు అత్యున్నత స్థాయిలో సేవలు అందించడంలో కీలక పాత్ర పోషించిన నేత దివంగత కలైంజ్ఞర్ కరుణానిధి అని కొనియాడారు. విశ్వవిద్యాలయాలకే విశ్వవిద్యాలయం అనేలా కరుణానిధి మేధస్సు ఉండేదని, త్వరలో అందరి విజ్ఞప్తి కార్యరూపంలోకి తీసుకొస్తామని ప్రకటించారు. కలైంజ్ఞర్ జన్మించిన నాటి సమైఖ్య తంజావూరు జిల్లాలో ఉన్న కుంభకోణంలో ఈ వర్సిటీని జీకే మణి చెప్పినట్టుగానే ఎలాంటి సంకోచం అన్నది లేకుండా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కుంభకోణంలో త్వరలో ఒక విశ్వవిద్యాలయం స్థాపించబడుతుందని, దీనికి కలైంజ్ఞర్ పేరు పెట్టడం జరుగుతుందన్నారు. ఈ దృఢమైన సందేశాన్ని ఎలాంటి సంకోచం లేంకుడా మళ్లీ పునరావృతం చేస్తున్నట్టు ప్రకటించారు. కాగా, కలైంజ్ఞర్ పేరిట వర్సిటీ అన్న ప్రకటనను సీఎంస్టాలిన్ చేస్తున్న సమయంలో సీనియర్‌మంత్రి దురై మురుగన్ భావోద్వేగానికి గురయ్యారు. కుంబకోణంలో కరుణ పేరిట ఏర్పాటు అసెంబ్లీలో సీఎం స్టాలిన్ ప్రకటన చైన్నెలో రూ.40 కోట్లతో పోటీ పరీక్షలకు శిక్షణ కేంద్రం డీఎంకే దివంగత నేత, మాజీ సీఎం కలైంజ్ఞర్ ఎం. కరుణానిధి పేరిట విశ్వవిద్యాలయం ఏర్పాటు కాబోతోంది. కుంభకోణంలో ఈ వర్సిటీని నెలకొల్పి తీరుతామని అసెంబ్లీ వేదికగా గురువారం సీఎం ఎంకే స్టాలిన్ ప్రకటించారు. దీనిని అన్ని పార్టీలూ ఆహ్వానించాయి. యువత కలల్ని సాకారం చేయడమే లక్ష్యం యువత కలలను నిజం చేయడమే లక్ష్యంగా ద్రావిడ మోడల్ పాలన జరుగుతోందని సీఎం స్టాలిన్ ధీమా వ్యక్తంచేశారు. అసెంబ్లీలో సభ్యు ఎ. వెట్రి అళగన్ నాన్ మొదల్వన్ ప్రాజెక్టు గురించి, యూపీఎస్సీలో అభ్యర్థులు సాధించిన ఘనతను సభ ముందు వివరిస్తూ ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ మాట్లాడుతూ, నాన్ మొదల్వన్ ప్రాజెక్టు గురించి మరికొన్ని వివరాలను తెలియజేశారు. యూపీఎస్సీలో విజయం సాధించిన విద్యార్థులందర్నీ అభినందిస్తూ, ప్రశంసలు కురిపించారు. సివిల్స్‌కు సిద్ధమయ్యే విద్యార్థులకు నెలకు రూ. 7500, ప్రాథమిక పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి రూ. 25 వేలు ప్రోత్సాహం అందిస్తున్నట్లు వివరించారు. ఈ సంవత్సరం తమిళనాడు నుంచి 57 మంది విద్యార్థులు ఎంపికయ్యారని, ఇది శుభవార్త అని వ్యాఖ్యానించారు. ఈ సంఖ్యను రానున్న కాలంలో పెంచడం లక్ష్యంగా చైన్నెలో 500 మంది విద్యార్థులు శిక్షణ పొందే దిశగా రూ. 40 కోట్లతో శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయనున్నామని ప్రకటించారు. ఈ సంవత్సరం ఉత్తీర్ణులైన వారందర్నీ సత్కరించడం జరుగుతుందన్నారు. అత్యుత్తమ తమిళుడు రూపకల్పన, యువత కలలను నిజం చేయడమే ద్రావిడ మోడల్ పాలన లక్ష్యం అని ధీమా వ్యక్తం చేశారు. విద్యకు పెద్దపీట అసెంబ్లీలో పాఠశాల విద్యాశాఖ, ఉన్నత విద్యా శాఖలకు 2025–26 ఆర్థిక బడ్జెట్లో నిధుల కేటాయింపునకు సంబంధించిన పద్దుల వివరాలు సభకు చేరాయి. పాఠశాల విద్యాశాఖ పద్దుల వివరాలను ఆశాఖ మంత్రి అన్బిల్ మహేశ్ సభలో దాఖలు చేశారు. పాఠశాల విద్యా శాఖకు రూ. 46,766 కోట్లను బడ్జెట్లో ప్రకటించారు. ఈ నిధులతో చేపట్టనున్న వివిధ విద్యా పథకాలు, ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని చేపట్టబోతున్న ప్రాజెక్టులను గురించి విశదీకరించారు. ఉన్నత విద్యా శాఖకు సంబంధించిన నివేదికను ఆ శాఖ మంత్రి కోవి చెలియన్ సభలో దాఖలు చేసి ఉన్నత విద్యకు అందలం వేస్తూ చేపట్టిన పథకాలు, విద్యా కార్యక్రమాలను వివరించారు. ముందుగా సభలో ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యుల ప్రశ్నలకు మంత్రులు దురై మురుగన్, కేఎన్ నెహ్రూ, ఏవీ వేలు, రఘుపతి, ఎంఆర్కే పన్నీరు సెల్వం, గణేషన్, శివశంకర్, టీఆర్బీ రాజ సమాధానం ఇచ్చారు. మంత్రి రఘుపతి మాట్లాడుతూ, జిల్లాలకు ఒక న్యాయ కళాశాల ఏర్పాటు చేయాలన్న ఆకాంక్ష ప్రభుత్వానికి ఉందని, అయితే, అందుకు తగ్గ నిధుల కొరత కారణంగా ఏర్పాటు చేయలేని పరిస్థితి ఉందని వ్యాఖ్యలు చేశారు. నెహ్రూ మాట్లాడుతూ, కోయంబత్తూరు నగర వాసులకు స్వచ్ఛమైన తాగునీటి పంపిణీకి చర్యలు చేపట్టామన్నారు. టీఆర్బీ రాజ పేర్కొంటూ, తమిళనాడు నుంచి ఎలక్ట్రానిక్ వస్తువుల ఎగుమతి పెరిగిందని, అన్ని రకాల ఎగుమతులు విస్తృతమయ్యాయని ప్రకటించారు. ఏవీ వేలు మాట్లాడుతూ, మదురవాయిల్ నుంచి శ్రీపెరంబదూరు వరకు రూ. 1400 కోట్లతో హై లెవల్ వంతెన మార్గం పనులు చేపట్టనున్నామన్నారు. మంత్రి శేఖర్‌బాబు మాట్లాడుతూ, శిరువా పురి మురుగన్ ఆలయంతో పాటూ తమిళ్ కడవుల్ మురుగన్ ఆలయాలన్నింటిలోనూ రూ.1085 కోట్లతో 884 పనులు జరుగుతున్నాయని వివరించారు. పార్ట్ టైం టీచర్ల పర్మినెంట్పై పరిశీలించి చర్యలు తీసుకుంటామని మంత్రి అన్బిల్ మహేశ్ తెలిపారు. 12,110 పంచాయతీలలో గ్రంథాలయాలను ఏర్పాటు చేశామన్నారు. 309 శిబిరాల ద్వారా 24,9392 మందికి ఉద్యోగ నియామకాల ఉత్తర్వులు దక్కే విధంగా చర్యలు తీసుకున్నామని మంత్రి సీవీ గణేషన్ పేర్కొన్నారు. రేషన్ దుకాణాలలో 99.60 శాతం బయోమెట్రిక్ ద్వారానే నిత్యవసర వస్తువుల పంపిణి జరుగుతున్నట్టు మంత్రి చక్రపాణి సభకు వివరించారు. సభలో స్పీకర్ అప్పావు స్పందిస్తూ ప్రశ్నలకు అవును..కాదు అన్న సమాధానాల దిశగా యాప్ రూపకల్పన చేస్తున్నట్టు చమత్కరించారు. డాక్యుమెంట్ల అమ్మకాల ద్వారా రిజిస్ట్రేషన్ల శాఖకు రూ. 72 వేల కోట్ల ఆదాయం డీఎంకే అధికారంలోకి వచ్చినట్టు మంత్రి మూర్తి ప్రకటించారు. -
● ప్రయత్నాలలో సీమాన్ ● పన్నీరుతో భేటీతో చర్చ
సాక్షి, చైన్నె: అసెంబ్లీ ఎన్నికలలో చెరకు రైతు చిహ్నం దక్కించుకునే ప్రయత్నాలలో నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ పడ్డారు. ఈసారి తమకు ఆ చిహ్నం దక్కుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. వివరాలు.. నామ్ తమిళర్ కట్చి గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేస్తూ బలాన్ని పెంచుకుంటున్న విషయం తెలిసిందే. 2021 అసెంబ్లీ ఎన్నికలలో డీఎంకే, అన్నాడీఎంకే తదుపరి ఓటింగ్ శాతంలో నామ్ తమిళర్ కట్చి నిలబడే స్థాయికి చేరింది. గత ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికలలోనూ ఒంటరిగా పోటీ చేసి 8.9 శాతం ఓట్లు దక్కించుకుంది. అలాగే ఎన్నికల కమిషన్ గుర్తును సొంతం చేసుకుంది. అయితే గత లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆ పార్టీకి అనాదిగా వస్తూ వచ్చిన చెరకు రైతు చిహ్నం దూరమైంది. మైక్ చిహ్నంతో సర్దుకున్నప్పటికీ ఓటింగ్ శాతం పెంచుకోవడం విశేషం. ప్రస్తుతం ఎన్నికల కమిషన్ గుర్తింపు పొందిన పార్టీ కావడంతో తమ గుర్తును మళ్లీ దక్కించుకునే ప్రయత్నాలలో సీమాన్ నిమగ్నమయ్యారు. ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించగా, వారి జాబితాలోని పది చిహ్నాలను కేటాయించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇందులో రైతు చిహ్నం సైతం ఉండటంతో దానినే తమకు అప్పగించాలని సీమాన్ తరపు ప్రతినిధులు ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేసుకున్నారు. ఆంతర్యమేమిటో..? చిహ్నం ప్రయత్నాలు ఓ వైపు ఉంటే, మరోవైపు మాజీ సీఎం పన్నీరు సెల్వంను సీమాన్ కలవడం చర్చకు దారి తీసింది. ఇందులోని ఆంతర్యాన్ని కనిపెట్టే పనిలో రాజకీయ విశ్లేషకులు ఉన్నారు. రాష్ట్రంలో అన్నాడీఎంకే – బీజేపీ కూటమి ఏర్పటైన నేపథ్యంలో పన్నీరు సెల్వం తదుపరి కార్యాచరణ ప్రశ్నార్థకంగా మారింది. అన్నాడీఎంకే బహిష్కృత నేతగా ఉన్న పన్నీరు సెల్వం ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పటికీ ఆయన ఓ శిబిరంగానే కొనసాగుతున్నారు. పార్టీ అంటూ వేదిక లేని దృష్ట్యా తదుపరి కార్యాచరణపై కసరత్తు చేస్తున్నారు. ఈ సమయంలో పన్నీరు సెల్వంను సీమాన్ కలవడం చర్చకు దారి తీసింది. సీమాన్‌ను పన్నీరు సెల్వం ఎన్డీఏ కూటమిలోకి ఆహ్వానించి ఉండవచ్చని కొందరు, పన్నీరు సెల్వం కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్టుగా మరికొందరు పేర్కొంటుండడం గమనార్హం. ఈ భేటీ గురించి సీమాన్‌ను ప్రశ్నించగా తండ్రి,కుమారుల బంధం తమది అంటూ, ఆ దిశగానే మర్యాద పూర్వకంగా కలిసినట్టు పేర్కొన్నారు. చివరగా రాజకీయాలకు ప్రాధాన్యత అంటూ మెలిక పెట్టడం గమనార్హం. -
మహిళాభ్యున్నతికి ఎఫ్‌డీఎస్‌ఏ తోడ్పాటు
సాక్షి,చైన్నె : ఫెడరేషన్ ఆఫ్ డైరెక్టర్ సెల్లింగ్ పారిశ్రామిక వృద్ధిలో మహిళల పాత్రను మరింతగా ప్రోత్సహించే దిశగా ఎఫ్‌డీఎస్‌ఏ కేంద్రం మారిందని వక్తలు వ్యాఖ్యానించారు. ఫెడరేషన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ సమాఖ్య, షూలిని వర్సిటీ నేతృత్వంలో చైన్నె అరుంబాక్కంలో గురువారం విద్య, అవగాహన కార్యక్రమాన్నినిర్వహించారు. తమిళనాడులోని 300 మందికి పైగా డైరెక్ట్ సెలర్లు, 29 క్రియా శీలక సభ్య కంపెనీల డైరెక్టర్ సెల్లింగ్ పరిశ్రమల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఎఫ్డీఎస్ఏఅధ్యక్షుడు ఏపీ రెడ్డి, ఉపాధ్యక్షుడు రాజీవ్ గుప్తా, దేవ్ ఆనంద్, షూలినీ వర్సిటీ ప్రతినిధులు ప్రొఫెసర్ థామస్ జోషప్, ప్రొఫెసర్ కమల్‌కాంత్ వశిష్టలు హాజరయ్యారు. ఇందులో రాష్ట్ర పౌరసరఫరాల విభాగం డైరెక్టర్ మోహన్ ముఖ్య అతిథిగా పాల్గొని పరిశ్రమ అవగాన, స్థిరమైన ప్రయత్నాలను ప్రశంసించారు. డైరెక్ట్ సెల్లింగ్ నియమాలు, నైతిక పద్ధతులు, నియంత్రణ చట్టాలు, ది కన్స్యూమర్ ప్రొటెక్షన్ (డైరెక్ట్ సెల్లింగ్) విధానాలను వివరించారు. దీనిని ఒక విద్యా కార్యక్రమంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. భారతదేశంలో డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమ ప్రయాణం గురించి ప్రస్తావిస్తూ, రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వాలతో సహకారం, వినియోగదారుల రక్షణ వంటి అంశాలను విశదీకరించారు. దక్షిణ భారత దేశంలో తమిళనాడు పరిశ్రమలపరంగా ముందంజలో ఉన్నట్టు, ప్రతి జిల్లాకు కనీసం ఒక డైరెక్టర్సెల్లింగ్ నిలయాలు ఉన్నట్టు వివరించారు. ఈ పరిశ్రమ వార్షిక అమ్మకాలు రూ. 26,000 కోట్లకు విస్తరించినట్టు పేర్కొంటూ ప్రధానంగా మహిళా భ్యున్నతికి మరింత తోడ్పాటుగా మారిందని వివరించారు. -
కుల మతాలకు
చెరుకు రైతు గుర్తు దక్కేనా? ఎమ్మెల్యేలకు పళణి విందు కుల మతాలకు అతీతంగా కశ్మీరి ప్రజలు తమను అక్కున చేర్చుకున్నారని, అత్యంత సురక్షితంగా చూసుకున్నారని, జాగ్రత్తగా స్వస్థలాలకు పంపించారని తమిళ పర్యాటకులు వ్యాఖ్యానించారు. కశ్మీర్ పర్యటనకు వెళ్లిన తమిళ పర్యాటకులు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో స్వస్థలాలకు తిరుగు పయనమయ్యారు. గురువారం సుమారు వంద మంది సురక్షితంగా చైన్నెకు చేరుకున్నారు. వీరందరినీ ప్రత్యేక వాహనాలతో వారి వారి స్వస్థలాలకు పంపించారు. తుపాకీ తూటాలకు గాయపడ్డ డాక్టర్ పరమేశ్వరన్‌ను మెరుగైన చికిత్స నిమిత్తం ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు. ఆయన కుటుంబ సభ్యులను ఫోన్ ద్వారా సీఎం స్టాలిన్ పరామర్శించారు. ● కశ్మీరి ప్రజల సహకారంపై తమిళ పర్యటకులు ●సురక్షితంగా స్వస్థలాలకు.. ●చైన్నె నుంచి వాహనాలలో తరలింపు ●నేడు మరో 22 మంది రాక ●ఢిల్లీ ఎయిమ్స్‌కు పరమేశ్వరన్ తరలింపు మృతదేహాన్ని నెల్లూరుకు తరలిస్తూ.. విమానాశ్రయం నుంచి బయటకు వస్తున్న పర్యాటకులు సాక్షి, చైన్నె: జమ్మూ కశ్మీర్ పర్యటనకు వెళ్లిన పర్యాటకులపై మినీ స్విట్జర్లాండ్‌గా పేరుగాంచిన పహల్గాంలోని బైసారన్ ప్రాంతంలో ఈనెల 22న ఉగ్రవాదులు పంజా విసిరిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తమిళులు సైతం చిక్కుకున్నట్టుగా వచ్చిన సమాచారంతో సీఎం స్టాలిన్ ఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి విజయన్, ఇతర సిబ్బందిని అప్రమత్తం చేశారు. పుదుకోట్టైకు చెందిన ఐఏఎస్ అధికారి అఫ్తాబ్ రసూల్‌ను హుటాహుటిన కశ్మీర్‌కు పంపించారు. అక్కడి అధికారులతో కలిసి తమిళుల వివరాలను సేకరించారు. వీరందర్నీ చైన్నెకు సురక్షితంగా తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఢిల్లీకి చేరుకున్న పర్యాటకులను ప్రభుత్వ ప్రతినిధి విజయ్ ఆహ్వానించి, చైన్నెకు పంపించేందుకు చర్యలు తీసుకున్నారు. ఢిల్లీ నుంచి ఉదయాన్నే 22 మందితో తొలి బృందం చైన్నె విమానాశ్రయానికి చేరుకుంది. వీరందర్నీ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఆహ్వానించారు. ప్రత్యేక వాహనాలలో మదురై, కుంబకోణం, ఈరోడ్, తిరుచంగోడు తదితర ప్రాంతాలలోని స్వస్థలాలకు పంపించారు. ఆతర్వాత ఢిల్లీ నుంచి హైదరాబాద్ మీదుగా చైన్నెకు మరో 50 మందితో బృందం వచ్చారు. మొత్తంగా సుమారు వంద మంది చైన్నెకు వచ్చారు. వీరందరినీ స్వస్థలాలకు ప్రభుత్వ ప్రత్యేక వాహనాలలో పంపించింది. తమ వారిని ఆప్తులు ఆలింగనం చేసుకుంటూ ఉద్వేగానికి లోనయ్యారు. ఇక ఈ దాడిలో మరణించిన నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదనరావు భౌతిక కాయానికి అధికారులు నివాళులర్పించారు. అనంతరం రోడ్డు మార్గంలో కావలికి తరలించారు.న్యూస్రీల్పాకిస్తానీయుల వివరాల సేకరణ చైన్నె, కోయంబత్తూరు వంటి నగరాలలో వివిధ సంస్థలు, ఆస్పత్రులలో ఉన్న పాకిస్తానీయుల వివరాల సేకరణలో అధికారులు నిమగ్నమైనట్టు సమాచారాలు వెలువడ్డాయి. వైద్యం కోసం వచ్చిన వారు, వివిధ పనుల నిమిత్తం వచ్చిన వారిని పాకిస్తాన్‌కు వెనక్కు పంపించే దిశగా కసరత్తులు మొదలయ్యాయి. వారంలోపు అందరూ భారత్‌ను వీడాలని కేంద్రం ఆదేశించిన విషయం తెలిసిందే. ఇక చైన్నెతో పాటూ అన్ని నగరాలలోని విమానాశ్రయాలలో భద్రత, తనిఖీలు కొనసాగుతున్నాయి. బస్టాండ్లలోనూ తనిఖీలు చేస్తున్నారు. ప్రధాన మార్గాలలో వాహన తనిఖీలు విస్తృతం అయ్యాయి. ఈ తనిఖీల్లో కోయంబత్తూరులో రూ. 35 లక్షలు నగదును కేరళకు తరలిస్తున్న సత్యవన్ అనే వ్యక్తి పట్టుబట్టాడు. అలాగే కడలూరులో అన్వర్ అనే యువకుడి నుంచి రూ. 40 లక్షలు సీజ్ చేశారు. ఈ నగదు తరలింపునకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేని దృష్ట్యా, హవాల నగదుగా పోలీసులు భావించి కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఆందోళనగా.. చైన్నెకు చేరుకున్న మహిళలు స్పందిస్తూ, తొలుత తమకు ఏం జరిగిందో అన్న విషయం తెలియలేదని, బైసారన్‌కు సమీపంలోని తాము ఉండి పోయామన్నారు. ఆ తర్వాత దాడి సమాచారం తెలుసుకుని తీవ్ర ఆందోళనకు లోనయ్యామని పేర్కొన్నారు. ఈ సమయంలో తమను కశ్మీరి ప్రజలు అక్కున చేర్చుకున్నారని, కుల మతాలకు అతీతంగా తమను రక్షించారని ఆనందం వ్యక్తం చేశారు. అక్కడి డ్రైవర్లు అయితే, అత్యంత సురక్షితంగా తమను వాహనాలలో కిందికి తీసుకొచ్చారన్నారు. ఓ యువకుడు స్పందిస్తూ, తనతో పాటుగా వచ్చినవారితో తాను రోడ్డు మీద ఉండగా ఎ మర్జన్సీ ఎమర్జన్సీ అన్న హెచ్చరికలు వినిపించడంతో ఆందోళనకు గురి అయ్యానని, ఈ సమయంలో అక్కడే ఉన్న స్థానికులు ఇక్కడి నుంచి వాహనాలలో వెళ్లి పోవాలని సూచించారని, కాసేపు టెన్షన్లో పడ్డామన్నారు. అక్కడి స్థానికులు తమకు ఆశ్రయం కల్పించారని, అధికారులు రాక ముందే తమను వాహన డ్రైవర్లు సురక్షిత ప్రాంతానికి తీసుకొచ్చారని వివరించారు. ఓ బాలుడు పేర్కొంటూ, బైసారన్‌కు వెళ్లాల్సిందేనని తాను పట్టుబట్టానని, మార్గం మధ్యలో హోటల్లో తమ కుటుంబ సభ్యులతో టిఫిన్ చేస్తుండగా వాతవరణం అనుకూలించడం లేదని అటు వైపుగా వెళ్ల వద్దు అన్న హెచ్చరికలు రావడంతో తీవ్ర మనో వేదనకు గురి అయ్యానని పేర్కొన్నాడు. అయితే ఆ తర్వాత ఉగ్ర దాడి సమాచారం తెలుసుకుని షాక్‌కు గురైనట్టు వివరించారు. కొందరు తమిళ పర్యాటకులు పేర్కొంటూ, కశ్మీరీ ప్రజలు తమను రక్షించారని, వారికి రుణ పడి ఉన్నామన్నారు. అస్సలు వారే ఎంతో ఆందోళనతో ఉన్నా, తమకు ఆందోళన అన్నది కలుగకుండా జాగ్రత్తగా వాహనాలను డ్రైవర్లు నడి సురక్షితంగా ఎల్తైన ప్రదేశం నుంచి కిందకు తీసుకొచ్చారని పేర్కొన్నారు. కాగా, ఈ దాడిలో గాయపడ్డ చైన్నెకు చెందిన డాక్టర్ పరమేశ్వరన్‌ను మెరుగైన చికిత్స నిమిత్తం విమానంలో ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు విజయన్ తెలిపారు. కశ్మీర్లో 122 మంది తమిళులు పర్యటనలో ఉన్నట్టు గుర్తించామని, వీరిలో 22 మందిని శుక్రవారం చైన్నెకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గాయపడ్డ వారిలో చంద్రు అక్కడి ఆస్పత్రిలోనే చికిత్సలో ఉన్నట్టు పేర్కొన్నారు. -
ఘనంగా ఓయూవీ శర్మ అభినందన సభ
కొరుక్కుపేట: సదరన్ రైల్వేలో 40 ఏళ్లుగా పనిచేసిన ఓ. యు.వీ . శర్మ పదవి విరమణ సంబదర్భంగా ఘనంగా సత్కరించారు . చైన్నె ఎగ్మోర్‌లోని రైల్వే కన్స్ట్రక్షన్ హాలు వేదికగా గురువారం జరిగిన కార్యక్రమంలో రైల్వేకు చెందిన ఉన్నతాధికారులు నారాయణన్, దినకరన్, జయరామన్ , రవ్రీంద సింగ్ రాజ్ పాల్ తదితరులు పాల్గొని ఓయూవీ శర్మ సేవలను ప్రశంసిస్తూ ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంతో క్రమశిక్షణతో సేవలను అందించారని రైల్వే అడ్మినిస్ట్రేషన్ నుంచి అనేక అవార్డులను అందుకున్నారని గుర్తు చేశారు. -
● బూత్‌కమిటీలపై దృష్టి ● నేడు జిల్లాల కార్యదర్శులతో భేటీ
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే ఎమ్మెల్యేలకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పళణి స్వామి విందు ఇచ్చారు. పొద్దు పోయే వరకు ఈ విందు కార్యక్రమం బుధవారం రాత్రి జరిగింది. ఇందులో పసందైన శాఖహారం, మాంసాహరం వంటకాలను వడ్డించారు. అందరితోనూ పళణి స్వామి పలకరిస్తూ ముందుకు సాగారు. డీఎంకేను ఓడించడం లక్ష్యంగా బీజేపీతో కూటమిగా వెళ్తున్నట్టు, మరికొన్ని పార్టీలు కూటమిలోకి రాబోతున్నట్టుగా ఎమ్మెల్యేలకు పళణి స్వామి సూచించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఎమ్మెల్యేలందరూ వారి వారి నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచిస్తూనే, కూటమి ధర్మం కారణంగా ఏదేని నియోజకవర్గాలను కోల్పోవాల్సి వస్తే, అక్కడి సిట్టింగ్‌లకు పార్టీ పరంగా, అధికారంలోకి వచ్చినానంతరం ప్రత్యేక ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నట్టు సమాచారం. ఇక గురువారం బూత్ కమిటీలను పర్యవేక్షిస్తున్న ముఖ్య నిర్వాహకులు, ఇన్‌చార్జ్‌లతో పళణి భేటి సాగింది. బూత్ కమిటీల ఏర్పాటు విస్తృతం చేయాలని పళణి స్వామి ఆదేశించారు. శుక్రవారం పార్టీ జిల్లాల కార్యదర్శుల సమావేశం జరగనుంది. ఏన్డీఏ కూటమిలోకి మళ్లీ చేరినానంతరం తొలిసారిగా జరుగుతున్న జిల్లాల కార్యదర్శుల భేటీ కావడంతో కీలక నిర్ణయాలు తీసుకోవచ్చన్న సంకేతాలు వెలువడ్డాయి. కాగా విందు కార్యక్రమానికి సీనియర్ ఎమ్మెల్యే సెంగోట్టయన్ దూరం కావడం చర్చకు దారి తీసింది. అదే సమయంలో గురువారం అసెంబ్లీలో పళణి నామస్మరణతో ఆయన ప్రసంగించడం ఆ చర్చకు బ్రేక్ పడేలా చేసింది. ఎంజీఆర్, జయలలిత మార్గంలో పార్టీని పళణి స్వామి విజయవంతంగా నడిపిస్తున్నారని సెంగోట్టయన్ కితాబివ్వడం గమనార్హం. -
తిరుత్తణిలో వాహన ప్రమాదాలకు చెక్
● రూ. కోటి వ్యయంతో రౌండ్టానా ఏర్పాటుతిరుత్తణి: తిరుత్తణిలో ట్రాఫిక్ సమస్యతో పాటూ వాహన ప్రమాదాలు అరికట్టే విధంగా రూ. కోటి వ్యయంతో రౌండ్టానా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆధ్యాత్మిక పట్టణం తిరుత్తణికి ప్రతిరోజూ వందలాది వాహనాల్లో వేలాది మంది ద్విచక్ర వాహనాలు, బస్సులు, కార్లు. లారీలు సహా వివిధ వాహనాల్లో ప్రయాణం చేస్తుంటారు. దీంతో పాటూ శుభ ముహూర్త రోజులు, పండుగలు సహా ప్రదాన రోజుల్లో వాహనాల రద్దీ విపరీతంగా పెరిగి ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. ప్రధానంగా బైపాస్‌రోడ్డు నుంచి చిత్తూరు జంక్షన్ వద్ద మూడు వైపుల నుంచి వచ్చే వాహనాలతో ప్రమాదాలు నిత్యం చోటుచేసుకునేవి. దీంతో ఆ ప్రాంతంలో రౌండ్టానా నర్మించేందుకు హైవేశాఖ అధికారులు ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చారు. రోడ్లు విస్తరణ పధకం ద్వారా రూ. కోటి వ్యయంతో చిత్తూరు తిరుత్తణి జంక్సన్ వద్ద రౌండ్టానా నిర్మాణపు జరుగుతున్నాయి. నాలుగు వైపుల నుంచి వాహనాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పయనించే విదంగా రోడ్డు నిర్మాణం చేపట్టి అందంగా రౌండ్టానా ఏర్పాటు చేశారు. పట్టణ ప్రాంతాలతో పోటీ పడే విధంగా తిరుత్తణిలో రోడ్డు నిర్మాణపు పనులు మెరుగుపడడంతో పట్టణ ప్రజలు వాహన చోదుకులు హర్షం వ్యక్తం చేసారు. రౌండ్టానా పట్ల తిరుత్తణి హైవేశాఖ సబ్ డివిజన్ ఇంజినీరు రఘురామన్ మాట్లాడుతూ ప్రమాదాలు అరికట్టే విధంగా రౌండ్టానా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రౌండ్టానా లోపలి భాగంగా వివిధ చెట్లు పెంచి పోషించనున్నట్లు, అలాగే చిత్తూరు తిరుత్తణి రోడ్డు డివైడర్‌కు మధ్యలో అందంగా దర్శనమిచ్చే చెట్లు నాటనున్నట్లు తెలిపారు. పనులు మరో నెల వ్యవధిలో పూర్తి చేయనున్నట్లు తెలిపారు. -
ఉగ్రదాడిని ఖండించిన ఎఫ్హెచ్ఆర్ఏఐ
సాక్షి, చైన్నె : కశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడిని ఫెడరేషన్ ఆఫ్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్హెచ్ఆర్ఏఐ) తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు గురువారం ఆ అసోసియేషన్ అధ్యక్షులు కె శ్యామ రాజు మాట్లాడుతూ పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన దాడితో తాము దిగ్భ్రాంతికి గురయ్యామన్నారు. ఇది చాలా భాద కరమైన ఘటనగా పేర్కొన్నారు. దేశంలోని పక్రృతి అందాలను, అతిథ్యాన్ని అనుభవించడానికి వచ్చిన సందర్శకులను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ అర్థరహిత హింసాత్మక చర్య విచారకరం అని వ్యాఖ్యలు చేశారు. మృత్తులకు తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నామన్నారు. వారి కుటుంబాలకు మనోధైర్యం ప్రసాదించాలని దేవున్ని ప్రార్థిస్తున్నాం అని తెలిపారు. దేశ ప్రధాన మంత్రి ఈ వ్యవహారంలో తీసుకునే అన్ని చర్యలకూ ఎఫ్హెచ్ఆర్ఏఐ మద్దతు ఉంటుందన్నారు. పర్యాటకులకు సాధ్యమైన అన్ని సహాయాలను అందించాలని, ఎలాంటి రుసుం వసూలు చేయకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. నేటి నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ● జూన్ 2న పున:ప్రారంభం కొరుక్కుపేట: విద్యార్థులకు పరీక్షలు గురువారంతో పరీక్షలు ముగియడంతో శుక్రవారం నుంచి వేసవి సెలవులను ఇస్తున్నట్టు విద్యాశాఖ డైరెక్టర్ ఎస్ కన్నప్పన్ ఓ ప్రకటనలో తెలియజేశారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో సెలవులు అనంతరం రాష్ట్రంలోని ప్రభుత్వ , ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలను జూన్ 2న తెరుచుకోనున్నట్టు ఆయన వెల్లడించారు. తమిళనాడు స్కూల్ ఎడ్యుకేషన్ సిలబస్ 10వ తరగతి , ప్లస్–1, ప్లస్– 2 విద్యార్థులకు మార్చి 3వ తేదీ నుంచి ఏప్రిల్ 15 వరకు నిర్వహించారు. అలాగే 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు విద్యార్థులకు గురువారం అన్ని తరగతుల విద్యార్థులకు పరీక్షలు ముగిశాయి. దీంతో శుక్రవారం (ఏప్రిల్ 25) నుంచి విద్యార్థులకు వేసవి సెలవులను ఇచ్చినట్టు తెలిపారు. అయితే ఉపాధ్యాయులు పాఠశాల చివరి పనిదినమైన ఏప్రిల్ 30 వరకు విధులకు రావాలని, జవాబు పత్రం గ్రేడింగ్, విద్యార్థుల ప్రవేశం వంటి పనులు చూసుకోవాలని సూచించారు. ఇదిలా ఉండగా హైకోర్టు మహిళాన్యాయవాద సంఘం విజ్ఞప్తి మేరకు మే 1 నుంచి రాష్ట్రంలోని అన్ని కుటుంబ సంక్షేమ కోర్టులకు రెండు వారాల పాటు వేసవి సెలవులను ప్రకటిస్తూ రిజిస్టార్ అల్లీ ఉత్తర్వూలు చేశారు. పనిభారంతో గతనెలలో ఉద్యోగి ఆత్మహత్య ● తిరుచ్చి ఏసీబీ కోర్టు జడ్జి చైన్నె బదిలీపై చర్చ అన్నానగర్: తిరుచ్చి అవినీతి నిరోధక, లంచాల నిరోధక కోర్టు ప్రత్యేక న్యాయమూర్తిగా భాగ్యం ఉన్నారు. ఈమెను చైన్నెలోని స్మాల్ క్లెయిమ్స్ కోర్టు నెం. 9కి న్యాయమూర్తిగా బదిరీ చేస్తూ చైన్నె హైకోర్టు రిజిస్ట్రార్ అల్లి గురువారం ఆదేశించారు. ఇక తిరుచ్చి యాంటీ కరప్షన్ అండ్ యాంటీ లంచం ట్రిబ్యునల్‌లో ఆఫీసు అసిస్టెంట్‌గా అరుణ్ మారిముత్తు పనిచేస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మరణానికి కార్యాలయ పనిభారమే కారణమన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో అరుణ్ మరిముత్తు పనిచేస్తున్న కోర్టు జడ్జిని బదిలీ చేయడం న్యాయశాఖ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మళ్లీ ఛాన్స్ దక్కేనా..? ● స్టాలిన్‌తో వైగో భేటీ సాక్షి, చైన్నె: మళ్లీ రాజ్యసభ సీటు వైగోకు దక్కేనా అన్న చర్చ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఊపందుకుంది. సీఎం స్టాలిన్‌తో ఆయన భేటీ కావడం ప్రాధాన్యతకు దారి తీసింది. కూటమి ధర్మం మేరకు ఎండీఎంకే వ్యవస్థాపకుడు వైగోకు రాజ్యసభ సీటను డీఎంకే కేటాయించిన విషయం తెలిసిందే. అలాగే గత ఏడాది జరిగిన లోక్ సభఎన్నికలలో ఆయన వారసుడు దురై వైగోకు తిరుచ్చి సీటు ఇచ్చి గెలుపుతో పార్లమెంట్‌కు పంపించారు. ఈ పరిస్థితుల్లో వైగో రాజ్యసభ పదవీ కాలం మరో నెలన్న రోజులలో ముగియనుంది. ఈసారి సీటును కూటమి ధర్మం మేరకు మక్కల్ నీది మయ్యం నేత కమలహాసన్‌కు ఇచ్చే దిశగా డీఎంకే కసరత్తులలో ఉన్నట్టు సమాచారం వెలువడింది. అదే సమయంలో మళ్లీ ఛాన్స్ కోసం వైగో పయత్నాలలో ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇందులో భాగంగా సీఎం స్టాలిన్‌ను ఆయన కలవడం ప్రాధాన్యతకు దారి తీసింది. ఈ భేటీలో రాజ్యసభ సీటు ప్రస్తావనతో పాటూ ఇటీవల కాలంగా ఎండీఎంకేలో నెలకొన్న కొన్ని పరిస్థితులు రెండు రోజుల క్రితం జరిగిన పార్టీ నిర్వాహక కమిటీ సమావేశంలో సమసినట్టుగా స్టాలిన్ దృష్టికి వైగో తీసుకెళ్లినట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. -
రాజీనామా చేయకపోతే బెయిల్ రద్దు!.. తమిళనాడు మంత్రికి సుప్రీం హెచ్చరిక
న్యూఢిల్లీ: తమిళనాడు మంత్రి పదవికి రాజీనామా చేయకపోతే బెయిల్ రద్దు చేస్తామని డీఎంకే నేత వి.సెంథిల్ బాలాజీని సుప్రీంకోర్టు హెచ్చరించింది. పదవి కావాలో? స్వేచ్ఛ కావాలో? తేల్చుకోవాలని సూచించింది. ఉద్యోగాల కోసం నగదు కుంభకోణానికి సంబంధించిన కేసులో బాలాజీకి సెప్టెంబర్ 26న బెయిల్ మంజూరు చేశారు.అయితే.. బెయిల్ మంజూరైన కొద్ది రోజులకే బాలాజీని తిరిగి తమిళనాడు మంత్రిగా నియమించారు. బాలాజీ విడుదలైన తర్వాత మంత్రి అయినందున, ఈ కేసులోని సాక్షులను బెదిరిస్తున్నారని, కోర్టు ఇచ్చిన తీర్పును రీకాల్ చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం చేపట్టింది. బెయిల్ మంజూరు చేయడం అంటే సాక్షులను ప్రభావితం చేసే అధికారం ఇచ్చినట్లు కాదని ఆగ్రహం వ్యక్తం చేసింది.‘మీరు సాక్షులను ప్రభావితం చేస్తారని తీవ్ర భయాందోళనలు ఉన్నాయి. పదవి (మంత్రి), స్వేచ్ఛ రెండింటిలో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాలి. ఏ నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారో మాకు చెప్పండి’అని పేర్కొంది. మనీలాండరింగ్ కేసుల్లో కోర్టు రూపొందించిన ఉదార బెయిల్ చట్టాన్ని రాజకీయ నాయకులు దురి్వనియోగం చేస్తున్నారని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కొంత సమయం కావాలంటూ బాలాజీ తరపు న్యాయవాది కపిల్ సిబల్ చేసిన అభ్యర్థనను అంగీకరించిన అత్యున్నత న్యాయస్థానం విచారణను ఏప్రిల్ 28కి వాయిదా వేసింది. -
ఐఐటీ మద్రాస్‌లో ఘనంగా ఇన్స్టిట్యూట్ దినోత్సవం
సాక్షి, చైన్నె : ఐఐటీ మద్రాసులో బుధవారం సాయంత్రం 66వ ఇన్స్టిట్యూట్ దినోత్సవం ఘనంగా జరిగింది. విద్యార్థులు, పూర్వ విద్యార్థులు , అధ్యాపకులు, వివిధ రంగాలలో రాణించిన వారిని సత్కరించారు. 2016 నుంచి 2024 వరకు వరసగా తొమ్మిది సార్లు ఇంజినీరింగ్ ఇనిస్టిట్యూషన్స్‌లో మొదటి స్థానంలో జాతీయ స్థాయిలో నిలుస్తూ వచ్చిన మద్రాసు ఐఐటీ ఖ్యాతిని చాటే విధంగా జరిగిన వేడుకలకు ముఖ్య అతిథిగా అనుసంధన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్(ఏఎన్ఆర్ఎఫ్) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, పూర్వ విద్యార్థి డాక్టర్ శివకుమార్ కళ్యాణరామన్ హాజరయ్యారు, ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, జాతీయ విద్యా విధానం – 2020 , 2023లో చట్టం అమలుకు దారితీసిన మరిన్ని చర్చల గురించి ప్రస్తావించారు. తమ ఫౌండేషన్ యొక్క ప్రత్యేక లక్షణాలు, విక్షిత్ భారత్ 2047 సాధాన గురించి వివరించారు. ఐఐటీ మద్రాసు డైరెక్టర్ కామకోటి మాట్లాడుతూ గత విద్యా సంవత్సరం సవాలుతో కూడుకున్నదని, ప్రతిఫలదాయకమైనదని వ్యాఖ్యానించారు. అవార్డులు – గుర్తింపు ఈ సందర్భంగా వేడుకలో అనేక అవార్డులను ప్రదానం చేశారు. అప్లైడ్ మెకానిక్స్, బయోమెడికల్ ఇంజినీరింగ్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ శివకుమార్ ఎం. శ్రీనివాసన్, సివిల్ ఇంజినీరింగ్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ పీఎస్ లక్ష్మీ ప్రియ సంయుక్తంగా శ్రీశ్రీమతి మార్తి అన్నపూర్ణ గురునాథ్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ టీచింగ్ – 2025కు ఎంపిక చేశారు. ఎర్లీ కెరీర్ అవార్డు 2025ను డాక్టర్ సురేందర్ సింగ్ ( సివిల్ ఇంజనీరింగ్ విభాగం) డాక్టర్ అరవింద్ కుమార్ చంద్రన్( కెమికల్ ఇంజినీరింగ్ విభాగం) 2025 కెరీర్ అవార్డును ప్రొఫెసర్ సుశాంత కుమార్ పాణిగ్రాహి (మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం), ప్రొఫెసర్ ప్రభు రాజగోపాల్ ( మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం) ఇన్స్టిట్యూట్ బ్లూస్– 2025 అవార్డుకు విద్యార్థులు రాజగోపాల్ సుబ్రమణ్యం సి (సిల్వర్), సుఖేత్ (కాంస్య పతకం), అభినవ్ ఆర్ (కాంస్య పతకం) అందుకున్నారు. అలాగే మాలవ్య అవని తరుణ్, మిహిర లీల నడపనకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా విశిష్ట పూర్వ విద్యార్థుల అవార్డులు, యువ పూర్వ విద్యార్థుల సాధకుల అవార్డులను కూడా ప్రదానం చేశారు. విశిష్ట పూర్వ విద్యార్థుల అవార్డును ప్రొఫెసర్ రమేష్ కె. సీతారామన్, ప్రొఫెసర్ శ్రీనివాసన్ నటరాజన్, ప్రొఫెసర్ సంధ్య ద్వారకాదాస్, డాక్టర్ విజయ్ నారాయణన్, శ్రీనివాస సుబ్రమణి , ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ ఎస్. సోమనాథ్, వెల్లయన్ సుబ్బయ్య, బి.కె. కామేశ్వరరావు, రమేష్ శ్రీనివాసన్, జయశ్రీ దేశ్‌పాండేలకు అందజేశారు. యువ పూర్వ విద్యార్థుల సాధకుల అవార్డు ప్రొఫెసర్ స్వరుణ్ కుమార్, ప్రొఫెసర్ వెంకట సుబ్రమణియన్ విశ్వనాథన్ అందుకున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థుల దుర్మరణం
కొరుక్కుపేట: కార్గో వాహనాన్ని ద్విచక్రవాహనం ఢీ కొట్టిన ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు . ఈ సంఘటన ఈరోడ్డు లో చోటుచేసుకుంది. వివరాలు.. తిరుచెంగోడ్‌లోని ఈరోడ్ రోడ్డులోని కేఎస్ఆర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో బీసీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు పశుపతిపాళెం ప్రాంతానికి చెందిన బాలాజీ(19), వెంగమేడుకు చెందిన తిరుపతి (19 ) సెమిస్టర్ పరీక్షలు రాసి ద్విచక్ర వాహనంపై కరూర్‌కు బయలుదేరారు. తిరుపతి స్థానిక పండుగ కోసం బిజీగా ఉండటంతో, వారిద్దరూ ఎప్పటిలాగే బస్సు ఎక్కకుండా ద్విచక్ర వాహనంపై వెళ్లారు. సిత్తలందూర్ సమీపంలోని కట్టుపాళయం డివిజన్ రోడ్డు సమీపంలో వారు ప్రయాణిస్తుండగా, ఎదురుగా వస్తున్న మహీంద్రా బొలెరో కార్గో వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. విద్యార్థులు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం ముక్కలైపోయింది, తాను ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టానని తెలియక బొలెరో డ్రైవర్ రమేష్ కొద్ది దూరం కారును నడిపాడు, కానీ పక్కనే ఉన్నవారు అతన్ని వెంబడించి పట్టుకుని గ్రామీణ పోలీస్ స్టేషన్ అప్పగించారు. తిరుచెంగోడ్ గ్రామీణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కిలాంబాక్కానికి మెట్రో!
● ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ● విమానాశ్రయం నుంచి విస్తరణ పనులు మెట్రో రైలు సాక్షి, చైన్నె: చైన్నె శివారులోని కిలాంబాక్కంకు మెట్రో రైలు సేవలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సాధ్యా అసాధ్య నివేదిక ఆధారంగా విమానాశ్రయం నుంచి విస్తరణ పనులు జరగనున్నాయి. వివరాలు.. చైన్నె కోయంబేడు బస్టాండ్‌కు ప్రత్యామ్నాయంగా నగర శివారులలో సబర్బన్ బస్ టెర్మినల్స్‌పై సీఎండీఏ దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. ఇందులో మాధవరం సబర్బన్ బస్ టెర్మినల్ ఉపయోగంలోకి వచ్చేసింది. అలాగే, పూందమల్లి సమీపంలో మరో సబర్బన్ టెర్మినల్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దక్షిణ తమిళనాడు వైపుగా వెళ్లే బస్సుల కోసం కిలాంబాక్కం బ్రహ్మాండ టెర్మినల్ రూపుదిద్దుకుంది. ఇక్కడి నుంచి సేవలు విస్తృతం చేశారు. ఈ బస్టాండ్‌కు కూత వేటు దూరంలోని వరదరాజపురంలో ఆమ్నీ బస్ టెర్మినల్ కూడా రూపుదిద్దుకుంది. అలాగే కిలాంబాక్కం బస్టాండ్ ఎదురుగా వండలూరు – ఊరపాక్కం మధ్యలో రూ. 20 కోట్లతో రైల్వే స్టేషన్ ఏర్పాటు పనులు శర వేగంగా జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కిలాంబాక్కంకు నగర వాసులు త్వరితిగతిన చేరుకునేందుకు వీలుగా మెట్రో రైలు సేవలకు సిద్ధమయ్యారు. మెట్రో సేవకు గ్రీన్ సిగ్నల్ రాజధాని నగరం చైన్నెలో ఫేజ్ – 1 పనులు ముగియడంతో విమానాశ్రయం నుంచి కోయంబేడు మీదుగా సెంట్రల్‌కు, సెయింట్థామస్ మౌంట్ – ఆలందూరు – సెంట్రల్మీదుగా విమ్కో నగర్‌కు మెట్రో రైలు సేవలు జరుగుతున్నాయి. ఈ సేవలకు అమిత స్పందన రావడంతో ఫేజ్ 2లో మరో మూడు మార్గాలుగా మాధవరం – సిరుచ్చేరి, మాధవరం – షోళింగనల్లూరు, పూందమల్లి – లైట్ హౌస్‌లను ఎంపిక చేసి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ రైళ్ల సేవల నేపథ్యంలో నగర వాసులు త్వరితగతిన కిలాంబాక్కం సబర్బన్ బస్ టర్మినల్‌కు చేరుకునేందుకు వీలుగా మెట్రో సేవలకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ప్రస్తుతం విమానాశ్రయం వరకు మెట్రో సేవలు ఉన్నాయి. ఇక్కడి నుంచి పల్లావరం, క్రోంపేట, తాంబరం, ఇరుంబలియూరు, పెరుంగళత్తూరు, వండలూరు మీదుగా కిలాంబాక్కంకు మెట్రో సేవలకు సాధ్యా అసాధ్య నివేదికను అధికారులు సిద్ధం చేశారు. విమానాశ్రయం నుంచి పూర్తిగా వంతెన మార్గంలో కిలాంబాక్కంకు 15.46 కి. మీ దూరం రైలు సాగే రీతిలో రూట్ మ్యాప్‌ను సిద్ధం చేశారు. ఈ మార్గంలో మొత్తం 13 రైల్వే స్టేషన్లు రానున్నాయి. ఇందుకు సంబంధించిన సమగ్ర నివేదికను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం పనులకు ఆమోద ముద్ర వేస్తూ బుధవారం నిర్ణయం తీసుకుంది. దీంతో మెట్రో యాజమాన్యం పనులపై దృష్టి పెట్టనున్నది. విమానాశ్రయం – వండలూరు వరకు అనేక వంతెన రోడ్డు మార్గాలు ఉన్నాయి. వీటికి ఎలాంటి ఇబ్బంది అన్నది కలుగకుండా వీటికి ఆనుకునే నిర్మాణాలు మరింత ఎత్తుగా చేపట్టడంతో పాటూ ఇతర ప్రాంతాలలో స్థల సేకరణ ప్రక్రియకు సంబంధించిన కసరత్తులలో మెట్రో యాజమాన్యం నిమగ్నం కానుంది. ఈ విస్తరణ పనులకు అంచనా వ్యయంగా సుమారు రూ. 4 వేల కోట్లుగా నిర్ణయించారు. -
మౌలిక సదుపాయాలను కల్పించాలి
తిరువళ్లూరు: ఎగువనల్లాటూరు గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు ఉపాధి హామీ పనులను కేటాయించాలని కోరుతూ పెద్ద ఎత్తున మహిళలు బుధవారం కడంబత్తూరు బీడీఓ కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళన చేశారు. తిరువళ్లూరు జిల్లాలోని ఎగువనల్లాటూరు గ్రామంలో రెండువేలకు పైగా నివాసాలు వున్నాయి. గ్రామంలో మౌలిక సదుపాయాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సంబంధిత గ్రామాన్ని ఇటీవలే తిరువళ్లూరు మున్సిపాలిటీలో విలీనం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు సైతం జారీ చేసింది. దీంతో మూడు నెలల నుంచి ఉపాధీ పనులు నిలిపివేశారు. మూడు నెలల కూలి సైతం మహిళలకు చెల్లించలేదు. ఇదే విషయాన్ని మహిళలు పలుమార్లు ఉన్నతాధికారులకు చెప్పినా ఫలితం లేకపోవడంతో బుధవారం కడంబత్తూరు బీడీఓ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. కార్యక్రమానికి పార్టీ సీనియర్ నాయకురాలు పూంగోదై, జిల్లా కన్వీనర్ గోపాల్ హాజరై ప్రసంగించారు. ఎగువ నల్లాటూరు గ్రామాన్ని మున్సిపాలిటీలో విలీనం చేయకూడదని, బకాయి కూలిని వెంటనే విడుదల చేయాలని, గ్రామంలో మౌలిక సదుపాయాలను కల్పించాలని డిమాండ్ చేశారు. గంట పాటు ఆందోళన సాగిన క్రమంలో బీడీఓ సెల్వి ఆందోళనకారులతో చర్చలు జరిపారు. వారం రోజుల్లో సమస్యలను పరిస్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు ఆందోళన విరమించారు. -
నావిగేషన్ వ్యవస్థతో ఆర్థోపెడిక్ శస్త్ర చికిత్సలు
సాక్షి, చైన్నె : అధునాతన మెదడు, వెన్నెముక, ఆర్థోపెడిక్ శస్త్ర చికిత్సల కోసం అత్యాధునిక నావిగేషన్ వ్యవస్థతో కూడిన ఓ–ఏఆర్ఎం సర్జికల్ సిస్టమ్‌ను చైన్నెలో ప్రపథమంగా పరిచయం చేశారు. ఈ విధానాన్ని చైన్నెలో ఇస్రో చైర్మన్ డాక్టర్ వీ నారాయణన్ ప్రారంభించారు. కావేరి గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్‌కు చెందిన ఆళ్వార్ పేట ఆస్పత్రిలో ఈ అధునాతన వ్యవస్థను ఏఐ ఆధారిత 2డీ, 3డీ ఇమేజింగ్ ద్వారా అమలు చేయనున్నట్టు ప్రకటించారు. ఓ ఆర్మ్ వ్యవస్థ అత్యంత సంక్లిష్టమైన మెదడు, వెన్నెముక, ఆర్థోపెడిక్ విధానాలను ఖచ్చితత్వం, భద్రతతో నిర్వహిస్తూ సర్జన్లకు సహకారంగా ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో కావేరి ఆస్పత్రి కో ఫౌండర్ అరవిందన్ సెల్వరాజ్, న్యూరో సైన్సెస్ డైరెక్టర్ డాక్టర్ రంఘనాథన్ జ్యోతి, బ్రెయిన్ అండ్ స్పైన్ డైరెక్టర్ డాక్టర్ క్రిష్ శ్రీధర్, వెన్నెముక శస్త్ర చికిత్స విభాగాధిపతి డాక్టర్ బాల మురళి, న్యూరో సర్జన్ డాక్టర్ శ్యామ్ సుందర్ పాల్గొన్నారు. -
టాస్మాక్ స్కాంలో.. సర్కారుకు షాక్!
సాక్షి, చైన్నె: టాస్మాక్ ప్రధాన కార్యాలయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు ఇక మరింత విస్తృతం కానున్నాయి. అధికారులను సైతం విచారించే అవకాశాలు ఉన్నాయి. ఇందుకు కారణం టాస్మాక్, ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు తిరస్కరిస్తూ బుధవారం తీర్పు వెలువరించింది. వివరాలు.. చైన్నెలోని టాస్మాక్ ప్రధాన కార్యాలయంలో గత నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మూడు రోజులు ఈడీ సోదాలు జరిగిన విషయం తెలిసిందే. మద్యం విక్రయాలలో అక్రమాలు జరిగినట్టుగా పేర్కొంటూ ఈ సోదాలు జరిగాయి. ఈ సోదాలలో రూ. 1000 కోట్ల మేరకు అక్రమాలకు సంబంధించిన ఆధారాలు ఈడీకి చిక్కినట్టు సమాచారాలు వెలువడ్డాయి. టాస్మాక్ అధికారులు తమకు కావాల్సిన వారికి బార్ లైసెన్సులు జారీ చేసినట్టు, ఇందులో పెద్దఎత్తున నగదు చేతులు మారినట్టుగా ఈడీ గుర్తించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఈ వ్యవహారాన్ని ప్రతిపక్షాలు అస్త్రంగా చేసుకుని అసెంబ్లీలో సైతం ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా ముందుకెళ్లాయి. అదే సమయంలో ఈడీ తదుపరి అడుగులు వేయడానికి సిద్దమైనట్టు సంకేతాలు వెలువడ్డాయి. టాస్మాక్ అధికారులను విచారించే దిశగా ఈడీ సిద్ధమవుతున్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. దీంతో ప్రభుత్వం, టాస్మాక్ తరపున మూడు పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. చట్ట విరుద్దంగా టాస్మాక్ కార్యాలయంలో సోదాలు జరపడమే కాకుండా,అధికారులు, సిబ్బందిని విచారణ, సోదాల పేరిట వేదిస్తున్నట్టు వాదనలు కోర్టుకు చేరాయి. సోదాల సమయంలో మహిళా అధికారిణులు తీవ్ర ఇబ్బందులకు గురి అయ్యారన్నటాస్మాక్ తరపున వాదన కేసులో కీలకంగా మారింది. అదే సమయంలో తొలుత ఓ బెంచ్, ఆతర్వాత మరో బెంచ్ కేసును విచారించడంతో ఉత్కంఠ నెలకొంది. చివరకు సోమవారం విచారణను ముగించిన న్యాయమూర్తులు ఎస్ఎం సుబ్రమణియన్, రాజశేఖరన్ బెంచ్ బుధవారం తీర్పు వెలువరించింది. ఈడీ విచారణకు గ్రీన్ సిగ్నల్ హైకోర్టు తీర్పుతో ఇక మరింత దూకుడు ఇక, ఈడీ దూకుడు తథ్యం.. ఈడీకి అనుకూలంగా న్యాయమూర్తులు తీర్పు వెలువరించారు. ఈడీ తరపు వాదనలను పరిగణిస్తున్నట్టు పేర్కొన్నారు. 1000 కోట్ల మేరకు మనీ లాండరింగ్ జరిగినట్టు ఈడీ పేర్కొని ఉండడం, దేశ ప్రయోజనాల దృష్ట్యా కేసును ముందుకు తీసుకెళ్లే అవకాశం ఈడీకి కల్పిస్తున్నట్టు ఆదేశించారు. రాజకీయ అంశాల పరంగా వివాదాల జోలికి తాము వెళ్లబోమని, మనీ లాండరింగ్ జరిగినట్టు ఈడీ పేర్కొన్న అంశాలు, ఆధారాల మేరకు టాస్మాక్, ప్రభుత్వం తరపున దాఖలు చేసిన పిటిషన్లను తిరస్కరిస్తున్నట్టు ప్రకటించారు. ఈడీ ఈ కేసును మరింత ముందుకు తీసుకెళ్ల వచ్చు అని కోర్టు సూచించడంతో ఇక, దూకుడు పెంచేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ కేసులో మంత్రి సెంథిల్ బాలాజీ, టాస్మాక్ అధికారులను తొలి విడతగా ఈడీ టార్గెట్ చేయనున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. -
అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తుల వెల్లువ
పళ్లిపట్టు: అంగన్వాడీ ఆర్గనైజర్ పోస్టులకు చివరి రోజైన బుధవారం మహిళలు పోటాపోటీగా దరఖాస్తులు చేసుకున్నారు. తిరువళ్లూరు జిల్లాలోని 14 మండలాల్లో అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా వున్న 305 అంగన్వాడీ ఆర్గనైజర్ల పోస్టులకు సంబంధించి పది రోజుల నుంచి దరఖాస్తులు పంపిణీ చేస్తున్నారు. ఇందులో భాగంగా యూనియన్ స్థాయిలో ఖాళీగా వున్న పోస్టులను సంబంధించి ఆయా యూనియన్ చిన్నారుల సంరక్షణ కేంద్రాల్లో దరఖాస్తులను మహిళలు సమర్పించారు. ప్లస్‌టూ విద్యార్హతగా వున్న వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్ సూచించగా, డిగ్రీలు చదువుకున్న మహిళలు సైతం అంగన్వాడీ పోస్టులకు ఆసక్తి చూపారు. తిరుత్తణి మండలంలోని 13 పోస్టులకు 560 మంది దరఖాస్తులు చేసుకున్నారు. పళ్లిపట్టు మండలంలోని 8 పోస్టులకు మొత్తం 360 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుకు చిన్నారుల సంరక్షణ కేంద్రాల్లో మహిళలు పోటెత్తి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దరఖాస్తులు చేసుకున్నారు. వితంతువులు, ప్రత్యేక ప్రతిభావంతులు, కులగణన ప్రకారం మెరిట్ ఆధారంగా ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నారు. -
చైన్నెలో ఆటోడ్రైవర్ల నిరసన
– 400 మంది అరెస్టు కొరుక్కుపేట: చైన్నెలో బైక్ ట్యాక్సీలను నిషేధించాలని, మీటర్ చార్జీలను నిర్ణయించి, ఆటో యాప్‌లను వెంటనే అమలు చేయాలని కోరుతూ చైన్నెలో ఆటో డ్రైవర్లు నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనకు పోలీసులు అనుమతి నిరాకరిండడంతో ఆటో యూనియన్లు చేపాక్కం శివానంద రోడ్డులో ఆందోళనకు దిగారు. యూనియన్ సమన్వయ కర్త బాలసుబ్రమణ్యం ఆధ్వర్యంలో 300 మందికి పైగా ఆటో డ్రైవర్లు ఆటోలతో అక్కడికి చేరుకున్నారు. పెరియార్ విగ్రహం నుంచి సెక్రటరీయేట్ వైపు ఊరేగింపుగా ప్రారంభించిన ఆటో డ్రైవర్లును దూరదర్శన్ స్టేషన్ సమీపంలో పోలీసుల అడ్డుకున్నారు. వెంటనే రోడ్డుపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ గుమిగూడిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి బస్సుల్లో తీసుకెళ్లారు. అలాగే సైదాపేటలోని పనగల్ హౌస్ దగ్గర జరిగిన నిరసనలో 100 మందికి పైగా ఆటో కార్మికులను అరెస్టు చేశారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరారు . దీంతో పోలీసులు , ఆటో కార్మికుల మద్య తోపులాట జరిగింది. దీంతో పోలీసులు వారందరినీ అదుపులోకి తీసుకున్నారు.