నిరుపయోగంగా.. రైతుబజార్‌లు | - | Sakshi
Sakshi News home page

నిరుపయోగంగా.. రైతుబజార్‌లు

May 14 2026 6:45 AM | Updated on May 14 2026 6:45 AM

● రైతులు, కొనుగోలుదారులు లేక శిథిలావస్థకు..

తిరువళ్లూరు: రైతులకు వినియోగదారులకు మధ్య దళారులను తొలగించి కూరగాయలు, పండ్లును నేరుగా విక్రయించుకోవడానికి అనుగుణంగా 1999వ సంవత్సరం నవంబర్‌ 14న రాష్ట్ర ప్రభుత్వం అప్పటి సీఎం కరుణానిధి రాష్ట్ర వ్యాప్తంగా 180కి పైగా రైతుబజారులను ప్రారంభించారు. కలెక్టర్‌ పర్యవేక్షణలో నడిచే రైతుబజార్‌లో రైతులు తాము పండించిన పంటలను నేరుగా విక్రయించుకోవచ్చు. తద్వారా రైతులకు 20 నుంచి 30 శాతం మేరకు అదనపు లాభాలు రావడంతో పాటు గిట్టుబాటు ధర లబించే అవకాశం ఉంది. దీంతో పాటూ మధ్యవర్తులతో సంబంధం లేకుండా రైతులు విక్రయించుకోవచ్చు. ఇందులో భాగంగానే తిరువళ్లూరులో రైతుబజారును ఏర్పాటు చేశారు. మొదట్లో రైతు బజారుకు రావడానికి రైతులు పెద్దగా ఆసక్తి ప్రదర్శించారు. తాము పండించిన పంటలను నేరుగా రైతుబజారుకు తీసుకొచ్చి విక్రియంచడం ప్రారంభించారు. అయితే రైతులకు కొనుగోలుదారుల నుంచి పెద్దగా మద్దతు లభించలేదు. దీంతో లాభాలు రాకపోగా నష్టాలు రావడం ప్రారంబించింది. రైతు బజారుకు కొనుగోలుదారులను రప్పించడంలో అధికారులు విఫలమయ్యారు. దీంతో తిరువళ్లూరులోని రైతుబజారు నిర్మానుష్యంగా మారింది. రైతుల కోసం ఏర్పాటు చేసి షెడ్‌లు శిధిలావస్థకు చేరాయి. 2021వ సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన వెంటనే డీఎంకే ప్రభుత్వం రైతు బజార్లును అభివృద్ధి చేసినా ఆశించిన ఫలితం దక్కలేదు. దీంతో జిల్లా కేంఽద్రమైన తిరువళ్లూరులో రైతు బజారు నిరుపయోగంగా మారింది. ఇప్పటికై నా అధికారులు స్పందించి విక్రయాలపై రైతులకు భరోసా ఇవ్వడంతో పాటు రైతు బజార్‌లకు పూర్వ వైభవాన్ని తీసుకుని రావాలని పలువురు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement