breaking news
Alluri Sitarama Raju
-
నాపైనే ఫిర్యాదు చేస్తారా?: టీడీపీ ఎమ్మెల్యే చిందులు
రంపచోడవరం(పోలవరం జిల్లా): అడ్డ తీగలలో టీడీపీ సమావేశంలో కార్యకర్తలపై ఆ పార్టీకే చెందిన రంపచోడవరం ఎమ్మెల్యే శిరీష దేవి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు తాటతీస్తానంటూ కార్యకర్తలను హెచ్చరించారు. ‘పనిచేయరు... ఓట్లు వేయించలేరు..... తిరిగి తమపై హైకమండ్ కు ఫిర్యాదు చేస్తారా’ అంటూ కార్యకర్తలపై చిందులు తొక్కారు. ఏమైనా కార్యక్రమం జరిగితే ఒక్కడైనా ఫ్లెక్సీలు కట్టిస్తున్నాడా ఆగ్రహం వ్యక్తం చేశారు శిరీష. ఎమ్మెల్యే శిరీష్. ఎమ్మెల్యే శిరీష వ్యాఖ్యలతో రంపచోడవరం టీడీపీ క్యాడర్లో కలకలం మొదలైంది. తమను ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని సీనియర్ కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం పనిచేసిన వారికి ఎమ్మెల్యే వ్యాఖ్యలు అవమానకరంగా ఉందంటూ కొందరు నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదీ చదవండి: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి షాక్? -
నేడు రాజకీయ పార్టీలనేతలతో సమావేశం
గూడెంకొత్తవీధి: స్థానిక ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కేంద్రాల మార్పులు, చేర్పులు సూచనలపై చర్చించేందుకు బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో రమణబాబు తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలో 18 ఎంపీటీసీ స్థానాలు,జెడ్పీటీసీ స్థానానికి సంబంధించిన పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను మంగళవారం ప్రదర్శించారు. గతంలో మండలంలో 48 పోలింగ్ కేంద్రాలు ఉండగా, ఓటర్ల సౌకర్యార్థం అదనంగా మరో 12 కేంద్రాలను పెంచి, ఆ సంఖ్యను 60కి పెంచినట్లు వెల్లడించారు. ఈ పెంచిన పోలింగ్ కేంద్రాలపై ఏవైనా అభ్యంతరాలు లేదా సలహాలు ఉంటే అఖిలపక్ష సమావేశంలో తెలియజేయవచ్చని ఎంపీడీవో సూచించారు. ఈ కార్యక్రమంలో ఏవో ఇమ్మానుయేల్, డిప్యూటీ ఎంపీడీవో జగదీష్ పాల్గొన్నారు. -
దారి తప్పి గాయపడిన జార్ఖండ్ యువకుడు
అనకాపల్లి: పొట్టకూటి కోసం వచ్చి దారి తప్పి గాయపడిన జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన యువకుడిని అతడి కుటుంబ సభ్యులకు పట్టణ పోలీసులు మంగళవారం అప్పగించారు. పట్టణ సీఐ జి.ప్రేమ్‌కుమార్ తెలిపిన వివరాలివి. జార్ఖండ్‌కు చెందిన భీమ్‌కుమార్ మహతో పరవాడ మండలంలో ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేసేందుకు తన స్నేహితుడితో ఈ నెల 8న కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరి, 10న అనకాపల్లి రైల్వేస్టేషన్లో దిగాడు. అక్కడ నుంచి బయటకు వచ్చే సమయంలో ప్రమాదవశాత్తూ తప్పిపోయాడు. మహతో స్నేహితులు ఈ నెల 14న ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేయగా, స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలో గాయాలతో లక్ష్మీదేవిపేట సమీపంలో సంచరిస్తున్నట్టు గుర్తించారు. మహతో తలకు తీవ్ర గాయాలు కావడంతో త్వరగా గుర్తించి, తోటి స్నేహితుల సహకారంతో అతడి కుటుంబ సభ్యులకు ఈ నెల 15న అప్పగించామని సీఐ చెప్పారు. క్షేమంగా కుటుంబ సభ్యులకు అప్పగించిన పట్టణ పోలీసులు -
నేర నియంత్రణలో అప్రమత్తంగా వ్యహరించాలి
సబ్బవరం: నేరాల నియంత్రణలో అప్రమత్తంగా వ్యవహరించడంతో పాటు ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా పోలీస్ సిబ్బందికి సూచించారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌ను మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీచేసి, స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిస్థితి, నేర నియంత్రణ చర్యలపై అధికారులతో సమీక్షించారు. తనిఖీలో భాగంగా క్రైమ్ రికార్డులు, జనరల్ డైరీ, పెండింగ్ కేసుల ఫైళ్లు, కంప్యూటర్ విభాగం, లాకప్ గది, స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. పెండింగ్ కేసులు సుదీర్ఘంగా ఉంచకుండా ఆధారాలతో దర్యాప్తు పూర్తి చేసి, సకాలంలో కోర్టుల్లో చార్జిషీట్లు దాఖలు చేయాలని ఆదేశించారు. రాత్రి వేళల్లో ప్రధాన కూడళ్లు, కాలనీలు, జాతీయ రహదారులపై బీట్, పెట్రోలింగ్‌ను మరింత పటిష్టం చేయాలని సూచించారు. దొంగతనాలు, ఇతర నేరాలకు ఆస్కారం లేకుండా అనుమానిత వ్యక్తుల కధలికలపై నిఘా ఉంచాలన్నారు. గంజాయి, అక్రమ మద్యం, జూదం తదితర అసాంఘిక కార్యకలాపాలపై నిఘా కొనసాగిస్తూ, చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులు, ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి, వారి సమస్యలను శ్రద్ధగా వినాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలపై వాహనదారులకు అవగాహన కల్పించడంతో పాటు, నిబంధనలు ఉల్లంఘించేవారిపై చర్యలు తీసుకోవాలన్నారు. సబ్బవరం సీఐ జి.రామచంద్రరావు, ఎస్ఐ సింహాచలం, స్టేషన్ సిబ్బంది ఆయనకు అవసరమైన సమాచారం అందించారు. సబ్బవరం పోలీస్‌స్టేషన్ తనిఖీలో ఎస్పీ తుహిన్ సిన్హా -
110 మద్యం సీసాలు స్వాధీనం
నక్కపల్లి: మండలంలో దేవవరం జంక్షన్లో మంగళవారం బెల్టుషాపుపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఎస్ఐ సన్నిబాబు తెలిపిన వివరాల ప్రకారం.. సీఐ మురళి అందించిన సమాచారం మేరకు దేవవరం జంక్షన్లో పాన్‌షాపుపై దాడులు నిర్వహించారు. గ్రామానికి చెందిన బొట్టా రాము నిర్వహిస్తున్న బెల్టుషాపుపై దాడులు చేసి 110 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. కస్టమర్లలా వచ్చి దుకాణాల్లో చోరీ అనకాపల్లి: పట్టణంలో వినాయక చవితిని పురస్కరించుకుని రద్దీగా ఉన్న రెండు బియ్యం దుకాణాల్లో రెండు వేర్వేరు ఘటనల్లో పట్టపగలే బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు నగదు చోరీకి పాల్పడ్డారు. వివరాలివి. ఈనెల 12న కూరగాయలు మార్కెట్ వద్ద బియ్యం దుకాణానికి కస్టమర్లుగా వచ్చిన ఇద్దరు వ్యక్తులు అదును చూసి దుకాణంలో రూ.30 వేలు చోరీకి పాల్పడ్డారు. అదేవిధంగా 13న కన్యకాపరమేశ్వరి ఆలయ రహదారిలో బచ్చు వీరభద్ర ప్రకాశరావు బియ్యం దుకాణంలో మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు వచ్చి రెండు బియ్యం బస్తాలు కావాలని అడిగారు. బియ్యం దుకాణం యజమాని రామకృష్ణతో మాట్లాడుతూ ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు బాత్రూమ్కు వెళ్లి వెస్తానని చెప్పగా, మరో వ్యక్తి తనకు మరో బియ్యం బస్తా కావాలని చెప్పడంతో దుకాణం యజమానిలోనికి వెళ్లాడు. దీంతో అప్పటికే క్యాష్ బాక్స్ వద్ద బ్యాగ్‌లో ఉన్న రూ.60వేలు నగదును బ్యాగ్‌తో సహా పట్టుకుని బైక్‌పై ఇద్దరు వ్యక్తులు ఉడాయించారు. దీంతో దుకాణ యజమాని రామకృష్ణ సీసీ ఫుటేజీలు ఆధారంగా అదేరోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్టణ సీఐ జి.ప్రేమ్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో జైలు శిక్ష నక్కపల్లి: ఇటీవల మండలంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డ వారికి యలమంచిలి కోర్టు మంగళవారం రూ.10వేల చొప్పున జరిమానా విధించిందని ఎస్ఐ సన్నిబాబు తెలిపారు. నలుగురు వ్యక్తులు పట్టుబడ్డారని, కేసు నమోదు చేసి వీరిని కోర్టులో హజరు పరచగా జరిమానా విధించిందన్నారు. వీరిలో ఒకరు జరిమానా కట్టలేనందున వారం రోజుల జైలు శిక్ష విధించిందన్నారు. ఘన, ఈ వ్యర్థాల నిర్వహణపై అవగాహన అనకాపల్లి టౌన్: మున్సిపల్, ఈ వర్థాల నిర్వహణపై అవగాహన కల్పించేందుకు కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు డీఈవో జి.నాగేశ్వరరావు తెలిపారు. పాఠశాలల్లోని ఘన వ్యర్థాలు, ఈ వ్యర్ధాల నిర్వహణపై ఈనెల 16న ఉదయం 10 నుంచి 11 గంటల వరకు ప్రత్యేక కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్ లైవ్ ద్వారా వీక్షించే అవకాశం కల్పించినట్టు తెలిపారు. ఈ నెల 17 నుంచి అక్టోబర్ 17 వరకు స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక స్వచ్ఛతా కార్యక్రమాలు ఉద్దేశించినట్టు తెలిపారు. -
ఉపమాక వెంకన్నకు బ్రహ్మోత్సవాలు
నక్కపల్లి: ప్రాచీన పుణ్యక్షేత్రం ఉపమాక వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారం ఈ ఉత్సవాలను నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉత్సవ కావడి ఊరేగింపు ఈ ఉత్సవాలకు సంబంధించి ఉదయం ఉత్సవ కావడిని మాడవీధుల్లో ఊరేగించడంతో ఉత్సవాలు లాంఛనంగా ప్రారంభమయినట్లేనని ప్రధానార్చకులు గొట్టుముక్కల వరప్రసాద్ తెలిపారు. గరుడాద్రి పర్వతంపై కల్కి అవతారంలో స్వయంభూగా వెలసిన స్వామివారి మూలవిరాట్‌కు అభిషేకం, నిత్య పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్సవాల ప్రారంభ సూచకంగా గ్రామ మాఢవీధుల్లో ఉత్సవ కావడి ఊరేగించారు. భక్తులు స్వామివారికి పసుపు కొమ్ములు, కుంకుమ, కొబ్బరి బొండాలు కానుకలు సమర్పించారు. అనంతరం స్వామివారి ఉత్సవ మూర్తులకు, సుదర్శన పెరుమాళ్లకు అర్చకులు స్వప్న తిరుమంజన కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలు అలంకరించారు. క్షేత్రపాలకుడు వేణుగోపాలస్వామికి ఉత్సవమూర్తులకు విశేష పూజలు నిర్వహించారు. రాత్రి అంకురార్పణ సోమవారం రాత్రి విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, రుత్విక్ వరుణ, రక్షాబంధనం, అంతరాలయ పూజలతో కార్యక్రమాలు ప్రారంభించారు. అనంతరం సుదర్శన పెరుమాళ్లను పల్లకిలో ఉంచి గ్రామంలో ఉత్తర ఈశాన్య దిక్కున ఉన్న ప్రదేశానికి తీసుకెళ్లి మత్స్యంగ్రహణ (పుట్టమన్ను) తెచ్చే కార్యక్రమం నిర్వహించారు..తాత్కాలిక యాగశాల వద్ద అంకురార్పణ, అగ్నిప్రతిష్టాపన చతుస్థాన అర్చనలు పూర్తిచేసి గరుడ ఆవాహన, గరుడ అప్పాల నివేదన కార్యక్రమాలు నిర్వహించారు. నేత్రపర్వంగా ధ్వజారోహణం బ్రహ్మోత్సవాల్లో మంగళవారం ఉదయం ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది. గరుడాద్రిపై స్వయం వ్యక్తమై వెలసిన స్వామివారి మూలవిరాట్‌కు నిత్యాభిషేకం అర్చనలు పూర్తి చేశారు. కొండదిగువన ఉత్సవమూర్తుల వద్ద ప్రత్యేక ఆరాధనలు, అర్చనలు అనంతరం ధ్వజస్తంభం వద్ద ధ్వజారోహణ కార్యక్రమాన్ని అర్చక స్వాములు ప్రసాదాచార్యులు, కృష్ణమాచార్యులు, శేషాచార్యులు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల ప్రారంభ సూచకంగా ధ్వజపటాన్ని ఎగుర వేశారు. అశ్వవాహనంపై స్వామివారికి తిరువీధి సేవలు నిర్వహించారు. ఈ నెల 14 నుంచి 23 వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. రథోత్సవం, వసంతోత్సవం, మృగవేట ఉంగరపు సేవ వంటి ప్రధాన ఘట్టాలను తిలకించేందుకు చుట్టు పక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తారు. -
సహచరుడ్ని కాపాడబోయి సముద్రంలో యువకుడు గల్లంతు
యలమంచిలి రూరల్: రాంబిల్లి మండలం వాడ రాంబిల్లి సముద్ర తీరంలో సహచర కార్మికుడ్ని కాపాడబోయిన బీహార్ రాష్ట్రానికి చెందిన యువకుడు రంజిత్‌కుమార్(18) గల్లంతయ్యాడు. గల్లంతైన యువకుడి ఆచూకీ కోసం పోలీసు, మైరెన్, కోస్ట్ గార్డ్, నేవీ శాఖల అధికారులు, సిబ్బంది సంయుక్తంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. నేవీ సిబ్బంది హెలికాఫ్టర్‌తో యువకుడు గల్లంతైన ప్రాంతంలో వెతికారు. సోమవారం సాయంత్రం సముద్ర తీరంలో నీటిలో గల్లంతైన యువకుడి జాడ మంగళవారం రాత్రి వరకు తెలియలేదు. రాంబిల్లి సీఐ సీహెచ్ నర్సింగరావు తెలిపిన వివరాల ప్రకారం బీహార్ రాష్ట్రానికి చెందిన 17 మంది కార్మికులు సంతోష్‌రామ్ కాంట్రాక్టర్ వద్ద విద్యుత్ పనులు చేయడానికి వచ్చి రాంబిల్లి మండలం గోవిందపాలెం వద్ద శిబిరంలో వసతి పొందుతున్నారు. సోమవారం వినాయక చవితి సందర్భంగా సెలవు కావడంతో కార్మికులంతా సరదాగా గడపడానికి సమీపంలో ఉన్న వాడ రాంబిల్లి బీచ్‌కు వెళ్లారు. అక్కడ స్నానానికి దిగిన కార్మికుడు బిపిన్‌కుమార్ సముద్రంలో అలల తీవ్రతకు నీట మునిగిపోతుండడం చూసిన తోటి కార్మికుడు రంజీత్‌కుమార్ అతడ్ని రక్షించేందుకు సముద్రంలోకి వెళ్లి గల్లంతయ్యాడు. గల్లంతైన ఇద్దరిలో బిపిన్కుమార్ను స్థానిక ఈతగాళ్లు రక్షించగా, రంజీత్‌కుమార్ జాడ తెలియలేదు. రంజీత్‌కుమార్ స్వస్థలం బీహార్ రాష్ట్రం పశ్చిమ చంపారన్ జిల్లా బైరియా మండలం పఖానాహే బజార్ ప్రాంతంగా పోలీసులు గుర్తించారు. ఉపాధి నిమిత్తం బీహార్ నుంచి ఇక్కడకు వచ్చిన యువకుడు సముద్రంలో గల్లంతవడంతో కార్మికులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. యువకుడు ప్రాణాలతో తిరిగి రావాలని వారంతా దేవుణ్ని ప్రార్థిస్తున్నారు. -
స్వయంభూ విఘ్నేశ్వరుని ఆలయంలో ఘనంగా ఉత్సవాలు
చోడవరం: స్థానిక శ్రీస్వయంభూ విఘ్నేశ్వరస్వామి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. వేలాది మంది భక్తుల తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఉత్సవాలను ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్. రాజు ప్రారంభించారు. ఆలయ ప్రధాన అర్చకుడు కొడమంచిలి చలపతిరావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామివారి తిరువీధి ఉత్సవం ఘనంగా జరిపారు. దేవదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కిరణ్మయి, పలువురు ప్రముఖులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణాన్ని ప్రత్యేక విద్యుత్ దీపాలతో అలంకరించారు. సంగీత విధ్వాంసుడు రామయ్యరెడ్డి ఆధ్వర్యంలో అన్నమాచార్య సంగీతం పీఠం విద్యార్థులు కీర్తనలు ఆలపించారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు మంగళవారం శ్రీ స్వయంభూ విఘ్నేశ్వరస్వామి వారు పసుపు అలంకరణలో భక్తులకు దర్శన మిచ్చారు. -
కూటమి ప్రభుత్వంలో కొత్త పింఛన్ల దరఖాస్తు ప్రక్రియ గిరిజనులకు తీవ్ర నరకయాతనగా మారింది. గ్రామ సచివాలయాల్లో సర్వర్లు చాలాచోట్ల స్తంభించడంతో దరఖాస్తులు ఆన్లైన్ కాక అర్హులైన పేదలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సాంకేతిక సమస్యలకు తోడు ఓటీపీలు రాకపోవడం, ఆంక్షల పే
సాక్షి, పాడేరు: కూటమి ప్రభుత్వం సామాజిక పింఛన్లు ఇస్తుందో లేదో తెలియదు గానీ, కొత్త పింఛన్ల కోసం దరఖాస్తుదారులు మాత్రం తీవ్ర అవస్థలు పడుతున్నారు. పింఛన్ పొందడానికి ప్రభుత్వం విధించిన నిబంధనలపై గిరిజనులకు అవగాహన లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. వివిధ రకాల ధ్రువీకరణ పత్రాలు పొందడం, వాటిని సచివాలయాలకు తీసుకెళ్లి దరఖాస్తుతో పాటు వెబ్సైట్లో అప్లోడ్ చేయడం వంటి పనులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధ్రువీకరణ పత్రాల సేకరణలో ఆలస్యం కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో పాటు ఒంటరి మహిళలకు సంబంధించిన సర్టిఫికెట్ల మంజూరులో తీవ్ర ఆలస్యం జరుగుతోంది. దీనికితోడు వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితి మరింత గందరగోళంగా మారింది. ఇప్పటికీ అనేకచోట్ల దరఖాస్తుదారులు పత్రాలను పూర్తిస్థాయిలో పొందలేని దుస్థితి నెలకొంది. అర్హులైన ఒంటరి మహిళలు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ ధ్రువీకరణ పత్రాలు దొరక్క అల్లాడుతున్నారు. మరోవైపు విద్యుత్ మీటర్ రీడింగ్, హౌస్‌హోల్డ్ మ్యాపింగ్, ఆధార్ హిస్టరీ వంటి వివరాలను కూడా దరఖాస్తులో పొందుపరచాలనే నిబంధనలతో గిరిజనులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడుగడుగునా నెట్వర్క్ సమస్యలు జిల్లాలోని 11 మండలాల పరిధిలోని గ్రామ సచివాలయాల్లో నెట్వర్క్ సమస్యలు తీవ్రంగా వేధిస్తున్నాయి. దీంతో సచివాలయ ఉద్యోగులతో పాటు దరఖాస్తుదారులు నరకయాతన అనుభవిస్తున్నారు. మంగళవారం దరఖాస్తులను ఆన్లైన్ చేసేందుకు వెబ్సైట్ ఓపెన్ కాకపోవడంతో అన్ని సచివాలయాల్లోనూ పనులు నిలిచిపోయాయి. ఆన్లైన్ ప్రక్రియ, ఓటీపీల కోసం దరఖాస్తుదారులు గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరకు ఓటీపీలు రాకపోవడంతో చేసేదేమీ లేక నిరాశతో ఇళ్లకు తిరిగి వెళ్లిపోయారు. గడువు పెంచాలి.. – ప్రజాసంఘాల డిమాండ్ పింఛన్ దరఖాస్తుల స్వీకరణ సమయాన్ని పెంచాలని జిల్లా వ్యాప్తంగా డిమాండ్ వ్యక్తమవుతోంది. సాంకేతిక సమస్యల కారణంగా జిల్లాలో సుమారు 5 వేల మంది వరకు దరఖాస్తులు సమర్పించలేకపోయారు. ఇప్పటికీ ఓటీపీలు రానివారు వేల సంఖ్యలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో కొత్త పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ గడువును పెంచాలని గిరిజనులు, ప్రజాసంఘాలు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటివరకు 13,085 దరఖాస్తుల స్వీకరణ జిల్లా వ్యాప్తంగా 212 గ్రామ సచివాలయాల పరిధిలో మంగళవారం సాయంత్రం నాటికి 13,085 దరఖాస్తులను డీఆర్డీఏ అధికారులు స్వీకరించారు. వీటిలోనూ ఓటీపీల సమస్య తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో వృద్ధాప్య పింఛన్లు 9,690, వితంతు 2,211, దివ్యాంగులు 1,095, ఒంటరి మహిళలు 78, మత్స్యకారులు 6, ఇతరులు 3, డప్పు కళాకారులు ఒకటి, సంప్రదాయ చర్మకారులు ఒకటి ఉన్నాయి. బుధవారమే దరఖాస్తుల స్వీకరణకు చివరి రోజు కావడంతో, గడువు ముగుస్తుందనే భయంతో వేలాది మంది దరఖాస్తుదారుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.పింఛన్ ఆశలకు సర్వర్ శాపం సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు దరఖాస్తు చేసేందుకు అవస్థలు నేటితో ముగియనున్న గడువు స్పందించని ప్రభుత్వం పేదల్లో ఆందోళన -
పండగ వేళ కాటేసిన మృత్యువు
● విశాఖపట్నం–అరకు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం ● ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొట్టినద్విచక్రవాహనం ● ఒకరు మృతి, కొన ఊపిరితో మరొకరు.. కొత్తవలస : వినాయక చవితి పర్వదినాన జరిగిన రోడ్డు ప్రమాదం ఆ కుంటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. ఆనందగా గడపాల్సిన వేళ యువకుడిని మృత్యువు కాటేసింది. అరుకు–విశాఖపట్నం జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందగా,.. మరో యువకుడు తీవ్ర గాయాలతో కొన ఊపిరితో పోరాడుతున్నాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్లూరి సీతారామాజు జిల్లా అరకు సమీపంలోని అనంతగిరి ప్రాంతానికి చెందిన బిడ్డక చరణ్ (21), బిడ్డక రాజు ఇంటి వద్ద వినాయక పూజలు ముగించుకొని తమ ద్విచక్రవాహనంపై విశాఖపట్నం బయలుదేరారు. కొత్తవలస మండలం జిందాల్ ఫ్యాక్టరీకి సమీపంలోని చెరువు వద్ద మరమ్మతులతో రోడ్డుపై నిలిపివేసిన బొలోరా వాహనాన్ని బైక్‌తో ఢీకొట్టారు. ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు 108 సిబ్బంది ఎస్.కోట సీహెచ్‌సీకి తరలించారు. అక్కడకు చేరుకునే సరికి తలకు తీవ్రగాయాలు కావడంతో చరణ్ (21) మృతిచెందినట్టు వైద్యులు నిర్థారించారు. రాజు కొన ఊపిరితో వైద్యసేవలు పొందుతున్నాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు. -
మన్యాన్ని కమ్మేసిన మేఘాల తెరలు
పాడేరు మండలం వంటివీధుల ఘాట్‌లో కనువిందు చేస్తున్న సూర్యోదయండుంబ్రిగుడలో జాతీయ రహదారిని కమ్మేసిన మంచు తెరలుపాడేరు మండలం వంజంగి కొండలపై అబ్బుర పరిచిన మేఘ సౌందర్యంసాక్షి, పాడేరు / డుంబ్రిగుడ: సాధారణంగా అక్టోబర్, నవంబర్ నెలల్లో కనిపించే దట్టమైన పొగమంచు.. ఈసారి సెప్టెంబర్‌లోనే మన్యాన్ని పలకరిస్తోంది. ఏజెన్సీ వ్యాప్తంగా గత రెండు రోజులుగా ఉదయం 8 గంటలైనా మంచు తెరలు వీడక, పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందిస్తున్నాయి. మంగళవారం ఉదయం పాడేరు మండలంలోని సుప్రసిద్ధ వంజంగి కొండలు, కించూరు పంచాయతీ పరిధిలోని వంటివీధుల ప్రాంతాల్లో సూర్యోదయ వేళ మేఘాలు, పొగమంచు కలసిపోయిన దృశ్యాలు కనువిందు చేశాయి. అలాగే డుంబ్రిగుడ మండల కేంద్రంతో పాటు అరకు – పాడేరు జాతీయ రహదారిని దట్టమైన మంచు కమ్మేయడంతో వాహనదారులు హెడ్లైట్లు వేసుకుని ప్రయాణించాల్సి వచ్చింది. ప్రస్తుతం వర్షాలు ముఖం చాటేయడంతో దిగులు చెందుతున్న కూరగాయల రైతులకు ఈ పొగమంచు ఊరటనిస్తోంది. వర్షం లేకపోయినా, ఈ మంచు తేమతోనైనా కూరగాయల పంటల కాపు పెరిగి మంచి దిగుబడి వస్తుందని ఏజెన్సీ రైతాంగం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. పర్యాటకులకు కంటికి విందునిస్తూ.. రైతులకు ఆశలు రేకెత్తిస్తున్న ఈ అకాల మంచు మన్యం అందాలను మరింత ద్విగుణీకృతం చేస్తోంది. సెప్టెంబర్‌లోనే శీతాకాలాన్ని తలపిస్తున్న వాతావరణం -
సైబర్ నేరాలపైఅవగాహన అవసరం
జి.మాడుగుల: సైబర్ నేరాల నివారణతో పాటు గంజాయి వంటి మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సోషల్ మీడియా సీఐ వెంకటరమణ, స్థానిక ఎస్ఐ సాయిరాం పడాల్ సూచించారు. మండలంలోని సంతబయలు గ్రామంలో మంగళవారం జరిగిన వారపుసంతలో సైబర్ మోసాలు, గంజాయి నిర్మూలన, రహదారి భద్రతపై పోలీసు శాఖ ఆధ్వర్యంలో విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... గంజాయి సాగు, రవాణా, వినియోగం సమాజానికి శ్రేయస్కరం కాదని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గంజాయి వల్ల కలిగే అనర్థాలను గిరిజనులకు వివరించారు. అలాగే ఆన్లైన్ స్కామ్‌లు, ఓటీపీ, యూపీఐ పిన్ మోసాల పట్ల ప్రజలు నిత్యం అప్రమత్తంగా ఉండాలని కోరారు. అపరిచిత వ్యక్తులకు, తెలియని ఫోన్ కాల్స్‌కు బ్యాంక్ ఖాతా వివరాలు, పిన్ నంబర్లు తెలపకూడదని స్పష్టం చేశారు.వాహనదారులు రహదారి భద్రతా నియమాలు పాటించాలని అధికారులు స్పష్టం చేశారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. -
ప్రమాదవశాత్తూ రైలుపట్టాలపై పడిన ప్రయాణికుడు
అనకాపల్లి టౌన్: రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి పట్టాల మధ్య చిక్కుకుపోయిన ప్రయాణికుడిని ప్రాణాలకు తెగించి రక్షించిన యలమంచిలి రూరల్ పోలీస్‌స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ ఎం.చంద్రరావు సాహసాన్ని ఎస్పీ తుహిన్ సిన్హా ప్రశంసించారు. ఈ మేరకు ఎస్పీ కార్యాలయలో ప్రశంసా పత్రంతో పాటు నగదు రివార్డును అందజేశారు. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లోనూ ఏమాత్రం వెనుకాడకుండా స్పందించి ప్రయాణికుడి ప్రాణాలను కాపాడిన చంద్రరావు సేవలను కొనియాడారు. తుని రైల్వే స్టేషన్ సమీపంలో ప్రమాదవశాత్తూ రైలు కింద పడిన ఓ ప్రయాణికుడు తీవ్ర గాయాలతో పట్టాల మధ్య చిక్కుకుపోయాడు. విషయం తెలుసుకున్న హెడ్ కానిస్టేబుల్ చంద్రరావు ఆలస్యం చేయకుండా అక్కడికి చేరుకొని తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రైలు కిందకు వెళ్లి బాధితుడిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఆయన చూపిన సమయస్ఫూర్తి, ధైర్య సాహసాలు పలువురి ప్రశంసలు అందుకున్నాయి. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విపత్కర పరిస్థితుల్లో కొందరు సంఘటనను వీడియో తీసేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ చంద్రరావు మాత్రం ఏ మాత్రం సంకోచించకుండా బాధితుడి ప్రాణాలను కాపాడేందుకు ముందుకు రావడం ఆయన మానవత్వానికి నిదర్శనమని అభినందించారు. -
భారీ వర్షంతో రైతులకు ఊరట
జి.మాడుగుల: మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం కుండపోత వర్షం కురిసింది. భారీ వర్షానికి వీధులు, రహదారులు జలమయం కావడంతో ద్విచక్ర వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సంతబయలు గ్రామంలో నిర్వహించిన వారపు సంత వర్షపు నీటికి తడిసి ముద్దయింది. సంతలోని నిత్యావసర సరుకులు, వస్త్రాల దుకాణాలు నీట మునిగి సామగ్రి తడవడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు జి.మాడుగుల–వంజరి, లంబసింగి మార్గంలో నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారి మట్టి రోడ్డు వర్షానికి బురదమయంగా మారడంతో వాహనాల రాకపోకలు తీవ్రంగా నిలిచిపోయాయి. కొయ్యూరు: మండలంలో గత రెండు రోజులుగా భానుడి ప్రతాపానికి చెక్ పెడుతూ భారీ వర్షం దంచికొట్టింది. సోమవారం వినాయక చవితి పూజా కార్యక్రమాలు పూర్తయిన వెంటనే గంటకు పైగా కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. అలాగే మంగళవారం ఉదయం కూడా బలమైన వర్షం కురిసింది. ఎండ తీవ్రతకు వరి పంటలు ఎండిపోతాయని దిగులు చెందుతున్న రైతులకు ఈ వర్షం కొండంత భరోసానిచ్చింది. ఈ వర్షాలతో వరి 15 రోజుల వరకు నీటి ఇబ్బంది తీరినట్లేనని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు వర్షాభావం వల్ల స్థానిక కాలువల్లో నీటి ఉద్ధృతి పెరగకపోవడంతో రైతులు కొంత ఆందోళన చెందుతున్నారు. రాబోయే రోజుల్లో కాలువలు పూర్తిస్థాయిలో ప్రవహించకపోతే, పంటల సాగు కోసం మళ్లీ వర్షాలపైనే ఆధారపడాల్సి వస్తుందని రైతులు పేర్కొంటున్నారు. -
మహిళల భద్రత మన బాధ్యత
● పాడేరు డీఎస్పీ వేణుగోపాల్అరకులోయ టౌన్: మహిళల భద్రత అందరి బాధ్యత అని, ప్రతి ఒక్కరూ మహిళా పరిరక్షణ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని పాడేరు డీఎస్పీ వేణుగోపాల్ సూచించారు. మంగళవారం మండలంలోని పానిరంగిని మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థినులకు ‘మహిళా భద్రత– చట్టాలు’ అనే అంశంపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడు తూ... సమాజంలో మహిళలను గౌరవం, ప్రేమ, అనురాగాలతో చూడాలని ఆకాంక్షించారు. జిల్లాలోని ప్రతి ఒక్క మహిళకూ వారి పరిరక్షణ చట్టాల పట్ల పూర్తి అవగాహన కల్పించాలని ఎస్పీ అమిత్ బర్దర్ ఆదేశించినట్లు తెలిపారు. మహిళలకు ఎలాంటి సమస్యలు, వేధింపులు ఎదురైనా ధైర్యంగా ముందుకు వచ్చి సమీపంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవచ్చని హామీ ఇచ్చారు. శక్తి యాప్ వినియోగించాలి : విద్యార్థినులు సోషల్ మీడియా ఉచ్చులో పడి మోసపోవద్దని డీఎస్పీ హెచ్చరించారు. ప్రతి మహిళా తప్పనిసరిగా తమ స్మార్ట్ఫోన్లలో ‘శక్తి యాప్’ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఏదైనా అత్యవసర పరిస్థితి లేదా ప్రమాదం ఎదురైనప్పుడు శక్తి యాప్ ద్వారా పోలీసులకు సమాచారం అందిస్తే తక్షణమే రక్షణ చర్యలు చేపడతామని వివరించారు. ఇదే సమయంలో బాలికల పరిరక్షణకు సంబంధించిన పోక్సో చట్టం అంశాలను, దాని ప్రాముఖ్యతను విద్యార్థినులకు కూలంకషంగా వివరించారు. కళాశాల అధ్యాపకులు, పెద్ద సంఖ్యలో విద్యార్థినులు పాల్గొన్నారు. -
నాసిరకం ఎరువులపై ఫిర్యాదు
ఎస్.రాయవరం: అడ్డురోడ్డు మనగ్రోమోర్ దుకా ణం నుంచి తరచూ నాసిరకం ఎరువులు, పురుగు మందులు రావడంతో స్థానిక రైతులు బెంబేలెత్తిపోతున్నారు. యూరియాలో మట్టి పెచ్చులు ఎక్కువగా రావడంతో కొరుప్రోలు గ్రామ రైతు చేకూరి శ్రీరామరాజు మంగళవారం వ్యవసాయాధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఏవో సౌజన్య మనగ్రోమోర్ కేంద్రంలో శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపారు. ఇదే క్రమంలో రెండు నెలల క్రితం గోదావరి కార్బన్ ఎరువు నాసిరకంగా ఉందని, క్రిమి సంహారక మందు పిచికారీతో బెండతోట పాడైందని రైతు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. శాశ్వత చర్యలు తీసుకోలేదని విమర్శిస్తున్నారు. -
సర్వర్ ఏడిపింఛెన్
నాతవరం: సామాజిక పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు పెద్దఎత్తున సచివాలయాలకు తరలివస్తున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు బుధవారంతో గడువు ముగుస్తుండడంతో పరుగులు పెడుతున్నారు. అయితే, దరఖాస్తుదారుల వివరాలను ఆన్లైన్ చేసేందుకు పలు సచివాలయాల్లో సర్వర్ సమస్య తలెత్తుతోంది. దీంతో ఆన్లైన్ ప్రక్రియ ఇబ్బందిగా మారింది. ఒక్కో దరఖాస్తుదారుని వివరాలను నమోదు చేయడానికి గంటకు పైగా సమయం పడుతుండడం... మరోపక్క బుధవారంతో గడువు ముస్తుండడంతో ఆందోళన చెందుతూ దరఖాస్తుదారులు గంటల తరబడి పడిగాపులు కాయవలసి వస్తోంది. మండలంలో మంగళవారం నాతవరం, మర్రిపాలెం, డి.యర్రవరం గ్రామ సచివాలయాల్లో పింఛన్‌దారులు తీవ్ర అవస్థలకు గురయ్యారు. డి.యర్రవరం సచివాలయంలో సర్వర్ మొరాయించడంతో గంటల తరబడి నిరీక్షించవలసి వచ్చింది. నాతవరం సచివాలయానికి అధిక సంఖ్యలో దరఖాస్తుదారులు రావడంతో ఇబ్బందులకు గురికావాల్సి వచ్చింది. మర్రిపాలెం సచివాలయంలో నిర్ణీత సమయం కంటే ఆలస్యంగా సిబ్బంది రావడంతో దరఖాస్తుదారులు బయట వేచి ఉండాల్సి వచ్చింది. కూటమి నేతల ఆదేశాల మేరకే సిబ్బంది ఆన్లైన్ చేస్తున్నారంటూ పలువురు ఆరోపించారు. మందకొడిగా నమోదు బుచ్చెయ్యపేట: మండలంలో కొత్త పింఛన్ల నమోదు మందకొడిగా సాగుతోంది. 35 పంచాయతీల్లో ఇప్పటి వరకు 1,400 మంది వరకు దరఖాస్తు చేసుకోగా, కేవలం 147 దరఖాస్తులు మాత్రమే ఎంపీడీవో లాగిన్లోకి వచ్చాయి. మిగిలిన దరఖాస్తులన్నీ డీఏ, వెల్ఫేర్ లాగిన్‌లోనే ఉన్నాయి. ఎంపీడీవో లాగిన్లోకి వచ్చిన వారికి మాత్రమే కొత్త పింఛన్లు మంజూరవుతాయి. బుధవారంతో పింఛన్ల నమోదు గడువు ముగుస్తుండడంతో తమకు పింఛన్ మంజూరు అవుతుందో లేదోనని దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. కె.కోటపాడు: స్థానిక గ్రామ సచివాలయంలో ఇప్పటి వరకూ 80 మంది పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులను ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేస్తున్నట్టు పంచాయతీ కార్యదర్శి శ్రీను తెలిపారు. మంగళవారం భారీ సంఖ్యలో దరఖాస్తుదారులు సచివాలయానికి వచ్చారు. రోలుగుంట: మండలంలోని 15 సచివాలయాల వద్ద పింఛన్ దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియ ఎంపీడీవో పర్యవేక్షణలో జరిగింది. విద్యుత్ కోత, సర్వర్లు పనిచేయకపోవడం తదితర సమస్యలతో ఆన్లైన్లో తీవ్ర జాప్యం జరిగింది. ప్రతి సచివాలయం వద్ద టీడీపీ నాయకులు వచ్చి హడావుడి చేశారు. మునగపాక: అర్హులైన పేదలకు పింఛన్లు అందించే కార్యక్రమంలో భాగంగా దరఖాస్తు చేసుకునే లబ్దిదారులు ఇబ్బందులు పడుతున్నారు. కూటమి నేతల హడావుడి ఎక్కువైపోతుందంటూ పలువురు బాహాటంగా ఆరోపిస్తున్నారు. ఎటువంటి రాజకీయ నేతల ప్రమేయం లేకుండా పింఛన్ కోసం దరఖాస్తులు చేసుకోవాల్సి ఉన్నా కొంతమంది కూటమి నేతలు మాత్రం స్వర్ణ మునగపాక–1, 2 వద్ద హంగామా చేస్తున్నారు. దీంతో అటు ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నేతలతో పాటు ఇటు దరఖాస్తులు చేసుకునే వారు ఆరోపణలు గుప్పిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా పింఛన్ దరఖాస్తు ప్రక్రియ సక్రనంగా జరిగేలా చూడాలని పలువురు కోరుతున్నారు. -
నేత్రపర్వంగా ఒడ్డిమెట్ట గిరి ప్రదక్షిణ
నక్కపల్లి: జిల్లాలో ప్రసిద్ధి గాంచిన ఒడ్డిమెట్ట లక్ష్మీగణపతి గిరిప్రదక్షిణ సోమవారం నేత్రపర్వంగా జరిగింది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన ఈ గిరి ప్రదక్షిణలో నక్కపల్లి, అడ్డురోడ్డు, తుని, పాయకరావుపేట పట్టణాలతోపాటు, పరిసర గ్రామాల నుంచి వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. స్వామివారి స్వయంభూగా వెలసిన చోట ఆలయం నిర్మించి పూజలు మొదలుపెట్టిన 150 సంవత్సరాల తర్వాత తొలి సారిగా గతేడాది గిరి ప్రదక్షిణ ప్రారంబించారు. దేవాదాయ ఽశాఖ ఆధీనంలో ఉన్న ఈ ఆలయం ఎంతో ప్రాచుర్యం పొందింది. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా ఇక్కడ లక్ష్మీగణపతి పూజలందుకుంటున్నాడు. విఘ్నాలు తొలగించే వినాయకుడిగా ప్రాశస్త్యం పొందాడు. గిరిప్రదక్షిణను పురస్కరించుకుని ముందుగా అర్చక స్వాములు జయంతిగోపాలకృష్ణ కై లాసగిరిపై స్వయంభూగా వెలసిన లక్ష్మీగణపతి మూలవిరాట్‌కు, స్వామివారి ఉత్సవ మూర్తులకు ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఉత్సవమూర్తులను పల్లకిలో ఉంచి కొండ దిగువన తూర్పు మండపం వద్ద కొబ్బరికాయ కొట్టి గిరిప్రదక్షిణ ప్రారంభించారు. జాతీయ రహదారి, ఒడ్డిమెట్ట పాతరోడ్డు, గుంటపల్లి పాతరోడ్డు, రామాలయం, పశ్చిమ గణపతి మండపం, జాతీయ రహదారి మీదుగా తిరిగి తూర్పు మండపం చేరుకుని అక్కడ నుంచి కై లాసగిరిపైకి చేరుకుంది. మహిళల కోలాటాలు, భజన బృందం సభ్యులు ఆలపిస్తున్న భజన గీతాలతో గిరిప్రదక్షిణ శోభాయమానంగా జరిగింది. గణపతి బప్పా మోరియా, జైబోలో గణేష్ మహారాజ్‌కీ జై అంటూ భక్తులు లంబోదరుడ్ని స్మరిస్తూ గిరిప్రదక్షిణలో ఉల్లాసంగా పాల్గొన్నారు. గణేషుని నినాదాలతో ఒడ్డిమెట్ట పరిసర ప్రాంతాలు మార్మోగాయి. మూడు కిలోమీటర్ల మేర జరిగిన ఈ గిరిప్రదక్షిణలో చుట్టు పక్కల గ్రామాల నుంచి వందలాది మంది పాల్గొన్నారు. గిరిప్రదక్షిణ అనంతరం మూలవిరాట్ ఉన్న ఆలయం చుట్టూ స్వామివారి ఉత్సవ మూర్తులతో ప్రదక్షిణ నిర్వహించారు. గిరిప్రదక్షిణలో పాల్గొన్న భక్తులంతా స్వామివారిని దర్శించుకున్నారు. గిరిప్రదక్షిణ తొలిసారిగా ప్రారంభిస్తున్న సమాచారం తెలుసుకున్న ఉద్దండపురం, గొడిచర్ల, దేవవరం, నామవరం, గుంటపల్లి, సీతారామపురం, పాయకరావుపేట తుని, పీఎల్‌పురం, తదితర గ్రామాల నుంచి వందలాది మంది మహిళలు తరలివచ్చి గిరిప్రదక్షిణ పూర్తయిన తర్వాత కూడా కై లాసగిరి చుట్టూ ప్రదక్షిణ చేయడం గమనార్హం. ఈ గిరిప్రదక్షిణలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ తోట నగేష్, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు జి. నర్సింహమూర్తి, జిల్లా ప్రధాన కార్యదర్శి శీరం నర్సింహమూర్తి, పాయకరావుపేట మాజీ ఉప సర్పంచ్ జగతా భవానీశ్రీనివాస్, ఉప సర్పంచ్ వేగేశ్న చంటి, ఒడ్డిమెట్ట దేవస్థాన చైర్మన్ పైలా నూకన్ననాయుడు, మాజీ చైర్మన్ దండు బలరామరాజు, ఇందుకూరి రవిరాజు, పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగతా శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
బంగారుమెట్టలో విద్యుత్ డీపీ చోరీ
బుచ్చెయ్యపేట: మండలంలో గల బంగారుమెట్ట కిల్లి వారి పాకలు వద్ద ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారు. విద్యుత్ స్తంభం వద్ద ఉన్న సిమెంట్ దిమ్మపై ఉన్న డీపీని దించి ట్రాన్స్ఫార్మర్ను పగులగొట్టి అందులో ఉన్న రాగి వైర్‌ను పట్టుకుపోయారు. మంగళవారం పొలాల్లోకి వెళ్లిన రైతులు వ్యవసాయ మోటార్లు తిరగకపోవడంతో కరెంట్ రాలేదని లైన్‌మ్యాన్‌కు ఫిర్యాదు చేయగా, లైన్‌మ్యాన్ వచ్చి చూడగా ట్రాన్స్‌ఫార్మర్‌లో వైరు చోరీ జరిగినట్టు గుర్తించారు. దీనిపై విద్యుత్‌శాఖ అధికారులు బుచ్చెయ్యపేట పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. వర్షాలు సక్రమంగా కురవక పోవడంతో వెంటనే కొత్త విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసి వ్యవసాయ మోటార్లకు విద్యుత్ సదుపాయం కల్పించి పంటలు ఎండిపోకుండా చూడాలని స్థానిక రైతులు కోరుతున్నారు. ఇటీవల తరుచూ రైతుల పొలాల్లో ఉన్న విద్యుత్ వైర్లు చోరీ ఘటనలు జరుగుతున్నాయని, వీటిపై పోలీసులు నిఘా వేసి గట్టి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. -
నిత్యావసరాల ధరలు తగ్గించాలని సీపీఎం ధర్నా
నర్సీపట్నం: నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలంటూ సీపీఎం ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నా చేశారు. ధరలను తగ్గించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు అడిరగ్ల రాజు, సాపిరెడ్డి నారాయణమూర్తి, ఇతర నాయకులు మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో వ్యవసాయం పూర్తిగా దెబ్బతినడంతో వ్యవసాయ పనులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇదే క్రమంలో ఉల్లి, పాలు, నూనెలు, పప్పుల ధరలు పెరగడంతో ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపుతుందన్నారు. నిత్యావసర ధరలు తగ్గించి, రేషన్ డిపోల ద్వారా సరుకులను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. డీజిల్, పెట్రోల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలన్నారు. అనకాపల్లిని కరువు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈమేరకు ఆర్డీవో రమణకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సూర్య ప్రభ, చిరంజీవి పాల్గొన్నారు. -
తాత్కాలిక వంతెన పునరుద్ధరణ
సీలేరు: దారకొండ పంచాయతీ నుంచి గంగవరం మీదుగా ఒడిశా వెళ్లే ప్రధాన రహదారిలో, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కొట్టుకుపోయిన తాత్కాలిక వంతెన పనులను అధికారులు మంగళవారం పూర్తి చేసి రాకపోకలను పునరుద్ధరించారు. ఉప ముఖ్యమంత్రి ఆదేశాలతో అధికారులు వేగంగా స్పందించి ఈ పనులు చేపట్టారు. అయితే, 2014లో వచ్చిన వరదల్లో ఇక్కడ ఉన్న ప్రధాన వంతెన కొట్టుకుపోగా, నాటి నుంచి అధికారులు తాత్కాలిక ఏర్పాట్లతోనే సరిపెడుతున్నారని గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిసారి వర్షాలకు తాత్కాలిక వంతెన కొట్టుకుపోయి గంటల తరబడి రాకపోకలు నిలిచిపోవడం వల్ల నిత్యావసరాలు అందక, అత్యవసర వైద్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. శాశ్వత వంతెన కోసం ఎన్నిసార్లు నిరసనలు తెలిపినా, వినతిపత్రాలు ఇచ్చినా అధికారులు ప్రతిపాదనల సాకుతో కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించి పూర్తిస్థాయి వంతెన నిర్మించాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని గిరిజనులు హెచ్చరించారు. శాశ్వత వంతెన నిర్మించాలనిగిరిజనుల డిమాండ్ -
వాహనాల రికార్డులుసక్రమంగా ఉండాలి
● ఎస్ఐ నాని ముంచంగిపుట్టు: వాహనదారులు తప్పనిసరిగా రికార్డులు సక్రమంగా ఉంచుకోవాలని, నిబంధనలు పాటిస్తూ ప్రయాణాలు చేయాలని స్థానిక ఎస్ఐ పి.నాని సూచించారు. మండల కేంద్రం నుంచి పెదబయలు వెళ్లే మార్గంలో గల కొత్తూరు జంక్షన్ వద్ద ఆదివారం ఆయన ఆధ్వర్యంలో పోలీసులు ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని, పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తున్న వాహనదారులకు జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ... ప్రతి వాహనదారుడు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని స్పష్టం చేశారు. రవాణా వాహనాలకు ఇన్సూరెన్స్ తప్పనిసరి అని, మద్యం సేవించి లేదా అతివేగంగా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
చాపరాయి, పైనరీలకుపోటెత్తిన జనం
డుంబ్రిగుడ: మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రాలైన చాపరాయి జలపాతం, అరకు పైనరీలు పర్యాటకుల కలకలంతో కళకళలాడుతున్నాయి. గత రెండు వారాలుగా సందర్శకులు లేక బోసిపోయిన ఈ ప్రాంతాలు... శని, ఆదివారాలతో పాటు వినాయక చవితి సెలవు తోడవడంతో మైదాన ప్రాంతాల పర్యాటకులతో నిండిపోయాయి. మూడు రోజుల వరుస సెలవులు రావడంతో పర్యాటకులు కుటుంబసమేతంగా గిరిజన ప్రాంత అందాలను తిలకించేందుకు తరలివచ్చారు. దీంతో చాపరాయి, పైనరీ ప్రాంతాలలో పర్యాటకుల హడావుడి కనిపిస్తోంది. పర్యాటకులు గిరిజన సంప్రదాయ దుస్తులు ధరించి, థింసా నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా గడుపుతున్నారు. ఇక్కడ ప్రత్యేకం లభించే బ్యాంబూ చికెన్, బ్యాంబూ బిర్యానీ కొనుగోలుకు పర్యాటకులు పోటీ పడుతుండటంతో మంచి డిమాండ్ ఏర్పడింది. గత రెండు వారాలుగా వ్యాపారాలు లేక తీవ్ర ఇబ్బందులు పడిన స్థానిక వ్యాపారులు... ఈ మూడు రోజుల సెలవుల్లో పర్యాటకుల రాక పెరగడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
మాటల్లో ప్రోత్సాహం... చేతల్లో శూన్యం
జిల్లాలో రాజ్మా విత్తనాల కొరత గిరిజన రైతులకు శాపంగా మారింది. గంజాయి నిర్మూలనలో భాగంగా ప్రత్యామ్నాయ సాగుకు మొగ్గు చూపుతున్న రైతులకు అరకొర సబ్సిడీ విత్తనాల పంపిణీ తీరని అన్యాయం చేస్తోంది. ఒకవైపు సాంకేతికత పేరిట ఓటీపీ, నెట్వర్క్ సమస్యల నరకం... మరోవైపు రవాణా బాదుడు, దళారుల దోపిడీతో ఏజెన్సీ రైతాంగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. సాక్షి, పాడేరు: జిల్లాలో గిరిజన రైతుల అవసరాలకు, సాగు విస్తీర్ణానికి తగినట్లుగా రాజ్మా విత్తనాలను అందుబాటులోకి తేవడంలో ప్రభుత్వం విఫలమైంది. రాజ్మా విత్తనాలు విత్తుకునే సమయం ఆసన్నమవ్వడంతో విత్తనాల కొరత గిరిజనులకు తీవ్ర సమస్యగా మారింది. జిల్లాలోని 11 మండలాల పరిధిలో ప్రతి ఏటా సుమారు 18 వేల హెక్టార్లలో రాజ్మా సాగు చేస్తారు. దీనికి దాదాపు 10 వేల క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయి. అయితే ప్రభుత్వం ఈ ఏడాది 90 శాతం సబ్సిడీపై కేవలం 4,913 క్వింటాళ్ల విత్తనాలను మాత్రమే అందుబాటులోకి తెచ్చింది. ఇది కేవలం 9,600 హెక్టార్లకు మాత్రమే సరిపోతుంది. దీంతో మిగిలిన భూముల్లో సాగుకు విత్తనాలు దొరకక గిరిజన రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గంజాయి రహిత గ్రామాలకు అరకొర విత్తనాలే! గంజాయి నిర్మూలనలో భాగంగా ప్రత్యామ్నాయంగా రాజ్మా సాగుకు గిరిజన రైతులు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. పెదబయలు, జి.మాడుగుల, ముంచంగిపుట్టు, చింతపల్లి, గూడెంకొత్తవీధి, కొయ్యూరు, డుంబ్రిగుడ మండలాల్లోని మారుమూల గ్రామాల గిరిజనులు సబ్సిడీ విత్తనాల కోసం ఎదురుచూస్తున్నారు. బహిరంగ మార్కెట్, వారపు సంతల్లో దళారులు కిలో విత్తనాలను రూ.130 వరకు విక్రయిస్తుండటంతో గిరిజనులు కొనుగోలు చేయలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 15నుంచి 20 క్వింటాళ్ల విత్తనాల అవసరం ఉన్న గ్రామాలకు వ్యవసాయ శాఖ కేవలం రెండు నుంచి మూడు క్వింటాళ్లు పంపిణీ చేసి చేతులు దులుపుకుంటోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓటీపీ, నెట్వర్క్ సమస్యలతో నరకం సబ్సిడీ రాజ్మా విత్తనాలు పొందేందుకు గిరిజన రైతులకు ఓటీపీలు, ఆన్లైన్ సమస్యలు చుక్కలు చూపిస్తున్నాయి. మారుమూల గ్రామాల నుంచి పంచాయతీ కేంద్రాలకు పట్టాదారు పాస్ పుస్తకాలతో మైళ్ల దూరం నడిచొస్తున్నా... ఆధార్‌కు ఫోన్ నంబర్ లింక్ కాలేదని, సెల్‌ఫోన్‌కు ఓటీపీలు రావడంలేదని సిబ్బంది సాకులు చెబుతూ సబ్సిడీ విత్తనాలు ఇవ్వడంలేదని రైతులు వాపోతున్నారు. రవాణా పేరుతో దోపిడీ MìSÌZ Æ>gŒæÐ]l* AçÜË$ «§ýlÆý‡ Æý‡*.158 M>V>, 90 Ô>™èl… çܼÞyîl ´ù¯]l$ Ñ$Wͯ]l Ððl¬™é¢-°MóS OÆð‡™èl$-ÌSMýS$ Ñ{MýSƇ$$…-^éÍ. M>± Ð]l*Æý‡$-Ð]lÊÌS {´ë…™éÌZÏ Æý‡Ðé-×ê QÆý‡$aÌS õ³Æý‡$™ø A§ýl-¯]l…V> Ð]lçÜ*Ë$ ^ólçÜ$¢-¯é²Æý‡$. E§é-çßæ-Æý‡-׿MýS$ ò³§ýl-º-Ķæ$Ë$ Ð]l$…yýlÌS… C…fÇ ç³…^éĶæ$¡ `MýS$-糯]lçÜ {´ë…™èl…ÌZ 20 MìSÌZÌS Ñ™èl¢¯éÌS ºÝë¢ çܼÞyîl ´ù¯]l$ Æý‡*.150MóS CÐéÓÍÞ E…yýlV>, íܺ¾…¨ Ð]l$…VýS-âýæÐéÆý‡… Æý‡*.200 ^ö糚¯]l Ñ{MýS-Ƈ$$…-^éÆý‡$. Æý‡Ðé-×ê õ³Æý‡$™ø ºÝë¢MýS$ ₹50 A§ýl-¯]l…V> Ð]lçÜ*Ë$ ^ólĶæ$-yýl…Oò³ WÇ-f¯]l$Ë$ ¡{Ð]l B{VýSçßæ… Ð]lÅMýS¢… ^ólçÜ$¢-¯é²Æý‡$. ఓటీపీ సమస్యతోఅందని విత్తనాలు గతంలో భూమి పట్టా చూపి స్తే రాజ్మా విత్తనాలు ఇచ్చేవారు. ఏడాది ఆధార్‌తో పట్టా భూమి అనుసంధానం, ఫోన్‌కు వచ్చే ఓటీపీ వంటి సాకులు చెబుతూ విత్తనాలు పంపిణీ చేయకపోవడం దారుణం. మారుమూల గ్రామాల రైతులకు పూర్తిస్థాయిలో రాజ్మా విత్తనాలు అందజేయకుండా ప్రభుత్వం అన్యాయం చేస్తోంది. మొబైల్ ఫోన్‌తో సంబంధం లేకుండా రాజ్మా విత్తనాలు అందజేయాలి. – కొర్రవంగి ప్రసాద్, గిరిజన రైతు, తూలం, పెదబయలు మండలం చాలని 20 కిలోల విత్తనాలు సాగుకు ప్రత్యామ్నాయంగా వాణిజ్య పంట అయిన రాజ్మాను ప్రోత్సహించేందుకు పూర్తి శాతం సబ్సిడీపై విత్తనాలు ఇస్తామన్నారు. అయితే పూర్తిస్థాయిలో పంపిణీ చేయకుండా అరకొరగా ఇవ్వడం సరికాదు. నాకున్న పొలంలో పంట సాగుకు వంద కిలోల రాజ్మా విత్తనాలు అవసరం కాగా, అధికారులు కేవలం 20 కిలోలకే పరిమితం చేశారు. మిగిలిన విత్తనాలను దళారుల వద్ద అధిక ధరలకు కొనుగోలు చేసే ఆర్థిక స్తోమత నాకు లేదు. – కిల్లుడు పొట్టిబాబు, గిరిజన రైతు, చీకుపనస, పెదబయలు మండలం ఓటీపీలు రావు... విత్తనాలు ఇవ్వరు రాజ్మా విత్తనాల కొరతతో గిరిజన రైతులకు తీరని అన్యాయం ప్రత్యామ్నాయ సాగు ప్రోత్సాహంపైఅధికారుల నిర్లక్ష్యం గంజాయి రహిత ఏజెన్సీ లక్ష్యానికిఅధికారులే గండి! -
పర్యావరణ హితం... మట్టి గణపతుల వినియోగం
సాక్షి, పాడేరు: వినాయక చవితి పురస్కరించుకుని మట్టి విగ్రహాల వినియోగం, పర్యావరణ పరిరక్షణపై గుర్రగరువు గ్రామంలోని ఆదివాసీ చిన్నారులు ఆదివారం చైతన్య ప్రదర్శన చేపట్టారు. ’బాలనేస్తం క్రియేటివ్ లెర్నింగ్ సెంటర్’ టీచర్ ఇంద్రజ, గిరిజన సంఘం నాయకుడు పాలికి లక్కు ఆధ్వర్యంలో చిన్నారులంతా మట్టి గణపతి విగ్రహాలను స్వయంగా తయారు చేశారు. పర్యావరణ పరిరక్షణ ప్లకార్డులతో గ్రామంలో ప్రదర్శన నిర్వహిస్తూ, తమ తల్లిదండ్రులకు, గ్రామస్తులకు ఉచితంగా మట్టి ప్రతిమలను పంపిణీ చేశారు. స్థానిక ఉమా నీలకంఠేశ్వరస్వామి ఆలయంలో భక్తులకు మట్టి గణపతి విగ్రహాలను ఆలయ ధర్మకర్త కొట్టగుళ్లి సింహచలం నాయుడు, రమాదేవి జంట పంపిణీ చేశారు. ఆలయ అర్చకుడు ఉప్పల సీతారామశాస్త్రి, ఆలయ కమిటీ ప్రతినిధులు శివరాత్రి శ్రీనివాస్‌కుమార్, కిముడు ప్రభాకర్, కార్ాత్యయని, బొడ్డు ముకుందరావు, సిద్ధనాతి కొండలరావు, కొట్టగుళ్లి పోతురాజు పాల్గొన్నారు. ఆదివాసీ చిన్నారుల చైతన్య ప్రదర్శన -
వినాయకుడికి వెండి కిరీటం బహూకరణ
మాడుగుల రూరల్ : మండలంలో ఎం.కోడూరు గ్రామంలో మోదమాంబ ఆలయంలో ఉపాలయంలో గల సిద్ధి వినాయక విగ్రహానికి దాతలు సహకారంతో వెండి కిరిటంను ఆదివారం అందజేశారు. కాకినాడ జిల్లా, జగ్గంపేట మండలం, రాజపూడి గ్రామానికి చెందిన కోరుకొండ సూర్యారావు, కోరుకొండ వెంకట శ్రీనివాసరావు, కోరుకొండ సూర్య సత్తిబాబు, కోరుకొండ సూర్య గంగాధర్ జగదీశ్, దంపతులు, పాడేరు గ్రామానికి చెందిన నవర బబ్లూ, సహకారంతో 750 గ్రాముల విలువ చేసే వెండి కిరీటాన్ని ఆలయ కమిటీ చైర్మన్ గొల్లవిల్లి సంజీవిరావుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రధానార్చకులు శ్రీనివాసశర్మ, భారతి దంపతులతో పాటు స్థానికులు శానాపతి గణేశ్, కలిమి గోపాల్, ఎంపిటిసి సభ్యుడు ముమ్మిన రమణబాబు, పడాల అప్పలనాయుడు, పోతిన జగదీష్ పాల్గొన్నారు. -
టీడీపీలో చేరికల ప్రచారంలో వాస్తవం లేదు
జి.మాడుగుల: మండలంలోని సొలభం పంచాయతీ పరిధిలోని పలు గ్రామాల వైఎస్సార్సీపీ కార్యకర్తలు టీడీపీలో చేరినట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని సొలభం తాజా మాజీ సర్పంచ్ ఐసరం హనుమంతరావు, వైఎస్సార్సీపీ నాయకులు ఖండించారు. ఆదివారం స్థానిక విలేకరులతో వారు మాట్లాడుతూ... మండలంలోని ఎస్.కొత్తూరు, వనభరంగిపాడు, దబ్బగరువు, పెదబయలు, లకిడిలంక గ్రామాల నుంచి 100 మంది వైఎస్సార్సీపీ శ్రేణులు పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి సమక్షంలో టీడీపీలో చేరారని నాయకులు చేస్తున్న ప్రచారం అబద్ధమన్నారు. సొలభం పంచాయతీలో మాజీ ఎమ్మెల్యే పర్యటించిన సమయంలో ఆయా గ్రామాలకు చెందిన 9 మంది వలస కార్మికులను పిలిచి, టీడీపీ కండువాలు కప్పి పార్టీలో చేరినట్లు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. కేవలం స్వార్థ రాజకీయాలు, స్వలాభం కోసమే ఇష్టం లేని వారికి కండువాలు కప్పి ఫోటోలకు పోజులిస్తున్నారని... ఇలాంటి డ్రామాలను నమ్మి ప్రజలు టీడీపీకి ఓటు వేసే పరిస్థితి లేదని స్పష్టం చేశారు.వైఎస్సార్సీపీ నేతల స్పష్టీకరణ -
గంగవరం వాగులో గిరిజనుల నిరసన
సీలేరు: గూడెం కొత్తవీధి మండల పరిధిలోని ధారకొండ పంచాయతీ గంగవరం వద్ద కూలిపోయిన వంతెనను శాశ్వతంగా నిర్మించాలని కోరుతూ ఆదివారం గిరిజనులు వాగులో దిగి నిరసన వ్యక్తం చేశారు. 2024లో సంభవించిన విపత్తులో ఈ వంతెన కొట్టుకుపోయింది. నాటి నుంచి అధికారులు నిర్మించిన తాత్కాలిక మార్గం ప్రతి వర్షాకాలంలోనూ ప్రవాహానికి కొట్టుకుపోతుండటంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోతున్నాయి. ఫలితంగా ధారకొండ పంచాయతీలోని పెద్ద గంగవరం, చిన్న గంగవరం, గుడారిమామిడి, డి.నర్సమామిడిగొంది, పేట్రాయి సహా 10 గ్రామాలతో పాటు ఆంధ్ర–ఒడిశా సరిహద్దు గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్నాయి. ఆసుపత్రి అత్యవసరాల కోసం గిరిజనులను డోలీల్లో మోస్తూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రవాహాలు దాటాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గిరిజన సమాఖ్య నాయకుడు పాంగి నాగేశ్వరరావు మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించి గంగవరం వాగుపై శాశ్వత వంతెనను నిర్మించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసనలో సీపీఐ మండల కార్యదర్శి భగవాన్, పీసీ కమిటీ అధ్యక్షుడు వంతల చిట్టినాయుడు, బలరామ్, సొమరా, సూరిబాబు పాల్గొన్నారు. తూరల పునరుద్ధరణ గంగవరం వద్ద వర్షాలకు దెబ్బతిన్న తాత్కాలిక వంతెన మరమ్మతు పనులను ఆదివారం సాయంత్రం అధికారులు యుద్ధప్రాతిపదికన ప్రారంభించారు. వంతెన కొట్టుకుపోవడంతో గిరిజనులు పడుతున్న ఇబ్బందులపై కథనాలు రావడంతోపాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా స్పందించి ఆదేశాలు జారీ చేశారు. దీంతో స్పందించిన కలెక్టర్ సహాయ చర్యలు వేగవంతం చేశారు. జేసీబీల సహాయంతో కొట్టుకుపోయిన శిథిలాలను తొలగించి, తూరల పునరుద్ధరణ జరుగుతోంది. శాశ్వత వంతెన నిర్మించాలని డిమాండ్! -
పురపాలికలో విజయదుందుభి మోగిద్దాం
మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ నర్సీపట్నం : పురపాలిక ఎన్నికల్లో విజయ దుందుభి మోగిద్దాం అని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మున్సిపాలిటీ నాయకులతో పార్టీ కార్యాలయంలో ఆదివారం విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. పార్టీ ఐడీ కార్డులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చైర్మన్‌తో పాటు మున్సిపాలిటీలోని స్థానాల్లో గెలుపు కోసం కృషి చేద్దామన్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు సీఎం చంద్రబాబు అబద్దాలను అస్త్రంగా వాడుకుంటున్నారన్నారు. ప్రజల్లో కూటమిపై వ్యతిరేక పవనాలు వీస్తుండడంతో స్థానిక ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు పింఛన్లు పంపిణీని తెరమీదకు తెచ్చారన్నారు. గత ప్రభుత్వంలో జగనన్న ఇచ్చిన పింఛన్లు చంద్రబాబు తీసేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నికలు వచ్చాయనే మళ్లీ పింఛన్ల డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ప్రజలందరూ సంక్షేమ ప్రదాత జగనన్న పాలన కోసం ఎదురు చూస్తున్నారన్నారు. ప్రతి వార్డులో అభ్యర్థులను బరిలో దింపడమే కాకుండా గెలుపు ధ్యేయంగా పని చేద్దామని కోరారు. ఎన్నికల సమయంలో బెదిరింపులకు గురిచేసిన ప్రతి అధికారి వివరాలు మన డిజిటల్ బుక్‌లో నమోదు చేయాలని సూచించారు. పురపాలికలో మెజారిటీ స్థానాలు గెలిచి జగనన్నకు కానుకగా ఇద్దామన్నారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల సన్యాసిపాత్రుడు, పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పెట్ల అప్పలనాయుడు, టౌన్ పార్టీ అధ్యక్షుడు ఏకా శివ, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు బయపురెడ్డి గణమ్మ తదితరులు పాల్గొన్నారు. -
ఎట్టకేలకు తాండవ స్పిల్‌వే గేట్లకు మరమ్మతులు
నాతవరం : ఎట్టకేలకు తాండవ స్పిల్‌వే గేట్లు మరమ్మతులు చేస్తున్నారు. జిల్లాలోనే మేజర్ ప్రాజక్టు తాండవ రిజర్వాయరు నిర్మాణ సమయం దగ్గరుంచి స్పిల్‌వే గేట్లు సుమారుగా 53 ఏళ్లుగా వినియోగిస్తున్నారు. కొంత కాలంగా స్పిల్‌వే గేట్లు దెబ్బతిన్నాయి. తాండవ ప్రాజెక్టులో నీటి మట్టం ప్రమాద స్థాయికి చేరినప్పుడు తాండవ ప్రమాదాన్ని నివారించడానికి అత్యవసర సమయంలో నదిలోకి నీరు విడుదల చేసేటప్పుడు అనేకసార్లు గేట్లు మొరాయించిన సందర్భాలు ఉన్నాయి. భారీ వర్షాలు, తుపానుల సమయంలో ప్రాజెక్టులో నీటి మట్టం పెరిగితే ప్రమాదస్థాయి నీటి మట్టాన్ని తగించేందుకు స్పిల్‌వే గేట్లు ప్రఽధాన పాత్ర షోషిస్తాయి. ఈ నేపథ్యంలో తాండవ అఽధికారులు ఆధ్వర్యంలో తాండవ స్పిల్‌వే గేట్లు మూడు రోజులుగా ఇంజినీరింగ్ సిబ్బంది మరమ్మతు పనులు చేస్తున్నారు. ఈ ఏడాది తాండవలో నీటి మట్టం గణనీయంగా తగ్గిపోవడంతో స్పిల్‌వే గేట్ల మరమ్మతులకు వీలుగా ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. -
మద్యం దుకాణాల లైసెన్సులరెన్యువల్కు నోటిఫికేషన్
● దరఖాస్తుల స్వీకరణకు 21 ఆఖరి తేదీ ● ఎకై ్సజ్ డీసీ రామచంద్రమూర్తి చోడవరం: ఉమ్మడి విశాఖ జిల్లాలో 355 మద్యం దుకాణాల లైసెన్సుల పొడిగింపు (రెన్యువల్)కు నోటిఫికేషన్ జారీ చేసినట్టు ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ రామచంద్రమూర్తి తెలిపారు. మద్యం దుకాణాల యజమానులతో చోడవరంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఏడాది లీజుదారులు కూడా ఇప్పుడు రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన చెప్పారు. అనకాపల్లి జిల్లాలో 150, విశాఖ జిల్లాలో 150, అల్లూరి జిల్లాలో 21, పోలవరం జిల్లాలో 15 షాపులతో పాటు పర్మిట్ రూమ్‌ల లైసెన్సుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు. ఈ నెల 21వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. రెన్యువల్స్ చేసుకునేవారు నాలుగు రకాల చెల్లింపులు చేయాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం ఉన్న లైసెన్సు ఫీజులో 38 శాతం రెన్యువల్ అమౌంట్, ఒక ఇన్స్టాల్మెంట్ లైసెన్సు ఫీజు, పర్మిట్ రూమ్ లైసెన్సు ఫీజులో ఒక ఇన్స్టాల్మెంట్, అదేవిధంగా రూ. 5 వేలు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలని చెప్పారు. ఈ ఫీజులన్నీ ఆన్లైన్ ద్వారా చెల్లించాలని స్పష్టం చేశారు.రెన్యువల్ చేసుకోని షాపులకు 22వ తేదీన రీ–నోటిఫికేషన్ జారీ చేస్తామని డీసీ రామచంద్రమూర్తి చెప్పారు. రీ–నోటిఫికేషన్లో ప్రతి షాపునకు ఇచ్చే ప్రతి దరఖాస్తుకూ రూ. 3 లక్షల ఫీజు చెల్లించాల్సి ఉంటుందని, ఒక్కో షాపునకు కనీసం నాలుగు దరఖాస్తులు వచ్చినప్పుడే కేటాయింపునకు లాటరీ తీస్తామని చెప్పారు. సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ రవికుమార్, డీపీఈవో వి.సుధీర్, చోడవరం సీఐ పాపునాయుడు, చోడవరం, మాడుగుల నియోజకవర్గాల మద్యం దుకాణాల లైసెన్సుదారులు పాల్గొన్నారు. -
ఓం భారత్ శక్తి పీఠంనిర్మాణ పనులకు భూమి పూజ
దేవరాపల్లి: మారేపల్లి పాండవుల మెట్టపై ఓం భారత్ శక్తి పీఠం నిర్మాణ పనులకు ఆదివారం భూమి పూజ చేశారు. సుమారు రూ. 7 కోట్ల వ్యయంతో గురూజీ భారతానంద మహరాజ్ పర్యవేక్షణలో రాతితో అరుంధతి, వశిష్ఠుల వారి ఆలయం, భారతమాత, సప్తరుషుల ధ్యాన మందిరంతో పాటు అనాధలు, వికలాంగులు, వృద్దులు, సన్యాసులకు ఒకే చోట ఆశ్రమాన్ని నిర్మిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు, రాధా మనోహర రామదాసు స్వామీజీ, కమలానంద భారతీ స్వామీజీ, ఆదిత్య పరాశ్రీ స్వామీజీ, శంకరానంద స్వామీజీ పాల్గొన్నారు. -
చదివిన బడిలోనేపీఈటీగా ఉద్యోగం
బుచ్చెయ్యపేట: మండలంలోని రాజాం గ్రామానికి చెందిన జెర్రిపోతుల అప్పలనాయుడుకి తాను చదివిన పాఠశాలలోనే పీఈటీగా పోస్టింగ్ లభించింది. నిరుపేద కుటుంబంలో పుట్టిన అప్పలనాయుడు ఐదో తరగతి వరకు రాజాంలో చదివాడు. మునగపాక ఎస్సీ గురుకుల పాఠశాలలో 10వ తరగతి వరకు, అనంతరం ప్రైవేట్‌గా డిగ్రీ పూర్తి చేసి, ఆ తర్వాత కాలేజీలో ఏడాది పాటు పీఈటీ కోర్సు పూర్తి చేశాడు. ఇటీవల రాజాంలో పీఈటీగా పోస్టింగ్ లభించడంతో ఆదివారం గ్రామంలో ఆకుల ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామస్తులు అప్పలనాయుడును ఘనంగా సన్మానించారు. -
విభిన్నం.. రమణీయం
మన్యంలో ఆదివారం విభిన్నమైన, రమణీయమైన వాతావరణం నెలకొంది. ఉదయం 8 గంటల వరకు చినుకుల జల్లులు కురవగా, మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు పాడేరు ఘాట్‌రోడ్డును దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీంతో ఘాట్ రోడ్డులో వాహనదారులు హెడ్లైట్లు వేసుకుని ప్రయాణించాల్సి వచ్చింది. ఇక సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో ఆకాశం ధగధగలాడే బంగారు వర్ణాన్ని సంతరించుకుని చూపురులను ఆకట్టుకుంది. ఒకే రోజున భిన్నమైన శీతోష్ణస్థితి, ప్రకృతి అందాలు కంటికి విందు చేయడంతో స్థానికులు, పర్యాటకులు ఎంతో మురిసిపోయారు. – సాక్షి, పాడేరు -
మట్టి వినాయకుల పంపిణీ
బుచ్చెయ్యపేట : ఐయితంపూడి వైఎస్సార్సీపీ యూత్ అధ్యక్షుడు ముచ్చకర్ల శివ మట్టి వినాయకులను తయారు చేయించి, ఆదివారం జెడ్పీటీసీ దొండా రాంబాబు, మండల పార్టీ అధ్యక్షుడు జోగా కొండబాబు చేతుల మీదుగా పలువురికి పంపిణీ చేశారు. వైఎస్సార్సీపీ నాయకులు సుంకరి శ్రీను, గాంధీ, గాడి శ్రీను, గోపిశెట్టి శ్రీను, ఐయితరెడ్డి ప్రసాద్, కొల్లి దశరధ, వరహాలబాబు, గాడి శ్రీను, రాము, అప్పారావు పాల్గొన్నారు. మాడుగుల రూరల్ : కె.జె.పురం గ్రామంలో స్థానిక బిక్యూట్ గార్మెంట్స్ యజమాని కాళ్ల హరిబాలకృష్ట సహకారంతో సుమారు 150 మట్టి విగ్రహాలను అందజేశారు. మాకవరపాలెం: పర్యావరణాన్ని కాపాడేందుకు అందరూ మట్టి వినాయక విగ్రహాలను వినియోగించాలని ఎంపీపీ రుత్తల సర్వేశ్వరరావు కోరారు. కొండల అగ్రహారంలో గల శారదాంబ పెట్రోల్ బంక్ వద్ద కన్నూరు నాయుడు సమకూర్చిన మట్టి వినాయక విగ్రహాలను ఆదివారం పంపిణీ చేశారు. మాకవరపాలెంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలోనూ మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. నాతవరం : మండలంలో పలు గ్రామాల్లో ఆదివారం మండల బీజేపీ అధ్యక్షుడు సబ్బి కుమారస్వామి ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేశారు. మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ నర్సీపట్నం : గ్రీన్ క్లబ్ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయ మెయిన్ రోడ్డు ప్రత్యేక శిబిరం ఏర్పాటు మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి డీఎస్పీ పి.శ్రీనివాసరావు విచ్చేసారు. ఆయన చేతుల మీదగా క్లబ్ సభ్యులు వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. క్లబ్ ఆధ్వర్యంలో 300 మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ పర్యావరణ హితం కోరి గ్రీన్ క్లబ్ వారు మట్టి విగ్రహాలు పంపిణీ చేయటం అభినందనీయమన్నారు. క్లబ్ ప్రతినిథి డి.గోపీనాథ్ పాల్గొన్నారు. అలాగే జాప్ యూనియన్ ఆధ్వర్యంలో పాత్రికేయులు అబిద్‌సెంటర్‌లో ప్రత్యేక శిబిరం ఏర్పాటు మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన టౌన్ సీఐ ఎస్.కె.గపూర్, యూనియన్ రాష్ట్ర కార్యదర్శి యలమంచిలి వేణు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోసూరు రామకృష్ణ విగ్రహాలను పంపిణీ చేశారు. -
ఆకట్టుకునే జిల్లేడుపూడి వినాయకుడు
నాతవరం : భక్తులు ఆరాధ్య దైవంగా పూజించే అది దేవుడు వినాయక పండగ పూజకు సర్వం సిద్ధం చేసుకున్నారు. నాతవరం మండలం జిల్లేడుపూడి పంచాయతీలో వినాయకుడి విగ్రహం ఉంది. ఇక్కడ మర్రిచెట్టు ఊడలు నీడలో చూడముచ్చటగా వినాయకుడి విగ్రహం ఉంది. ఏనుగుతొండంలోంచి ఆలయం నిర్మించారు. ఇక్కడ ప్రధానంగా మర్రిచెట్టు నీడలో అమ్మవారి ఆలయం ఉంది. అమ్మవారికి ఎడమ భాగంలో వినాయకుడి ఆలయం కుడి భాగంలో 50 అడుగుల ఎత్తయిన నాగసర్పంతో కూడిన శివలింగం నిర్మించారు,. వినాయక పండగ సందర్భంగా ముందు ఆదిదేవుడికి పూజ అనంతరం అమ్మవారిని, శివలింగాన్ని భక్తులు దర్శించుకోవడం ఆనవాయితీ. జిల్లేడుపూడి వద్ద ఏలేరు కాలువకు సొరంగం తవ్వకాల కోసం వచ్చిన కాంట్రాక్టరు ప్రభాకర్ చౌదరి నిర్మాణ పనులు అనంతరం 1988లో ఆలయాలు నిర్మించారు. అనాటి నుంచి ఇక్కడ వినాయకుడికి వైభవంగా పండగ చేస్తుంటారు. అలాగే నాతవరం వినాయక ఆలయంలో ఆలయ కమిటీ చైర్మన్ యర్రా కాశీ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలకు ఏర్పాట్లు చేశారు. తాండవ జంక్షన్, ఎం.బి.పట్నం తదితర గ్రామాల్లోనూ వినాయక చవితి ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు చేశారు. -
కొట్టుకుపోయిన తాత్కాలిక వంతెన
20 గ్రామాలకు నిలిచిన రాకపోకలుచింతపల్లి: మండలంలోని కోరుకొండ–బూరుగుబయలు గ్రామాల మధ్య ఉన్న తాత్కాలిక వంతెన శనివారం కురిసిన వర్షాలకు పూర్తిగా కొట్టుకుపోవడంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మండలంలో అత్యంత మారుమూల ప్రాంతమైన బలపం పంచాయతీలో 33 శివారు గ్రామాలు ఉన్నాయి. వీటిలో ఘాట్ దిగువన ఉన్న కొన్ని గ్రామాలకు మాత్రమే రోడ్డు సౌకర్యం ఉండగా, పైన ఉన్న అత్యధిక గ్రామాలకు నేటికీ పూర్తిస్థాయి రహదారి లేక గిరిజనులు నానా అవస్థలు పడుతున్నారు. ఆదివాసీలు తమకు ఏ వస్తువు కావాలన్నా కొండలు, గుట్టలు, వాగులు దాటి కోరుకొండ కూడలికి రావాల్సిన దుస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కోరుకొండ–బూరుగుబయలు గ్రామాల మధ్య వంతెన, రహదారి నిర్మాణానికి గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం రూ. కోటి మంజూరు చేసింది. ప్రస్తుతం వంతెన నిర్మాణ పనులు కొనసాగుతుండటంతో, గిరిజనుల రాకపోకల కోసం పక్కనే తాత్కాలికంగా తూరలతో వంతెన నిర్మించారు. అయితే ఈ ఇది శనివారం కురిసిన వర్షాలకు పూర్తిగా కోతకు గురై కొట్టుకుపోయింది. దీంతో బలపం పంచాయతీలోని కుడుముల, సుర్తిపల్లి, వలసపల్లి, వీరవరం గ్రామాలకు చెందిన 500 కుటుంబాలతో పాటు, గూడెం కొత్తవీధి మండలం జెర్రెల, మొండిగెడ్డ పంచాయతీలకు చెందిన 20 గ్రామాలకు రవాణా సౌకర్యం స్తంభించిపోయింది. ఈ మార్గం గుండానే పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు నిత్యావసర సరకులు తరలించడం, ఉపాధ్యాయుల రాకపోకలు, అత్యవసర సమయాల్లో రోగులను అంబులెన్స్ ద్వారా ఆసుపత్రులకు తరలించడం వంటివి జరుగుతుంటాయి. పది రోజుల క్రితం కోతకు గురైన ఈ వంతెనకు అధికారులు మరమ్మతులు చేపట్టారు. కానీ తరచూ ఈ తూరల కల్వర్టు ధ్వంసమవుతుండటంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి తాత్కాలిక దారిని పునరుద్ధరించడంతో పాటు, కోరుకొండ–బూరుగుబయలు రహదారి, శాశ్వత వంతెన నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని పలు గ్రామాల గిరిజనులు కోరుతున్నారు.రహదారి పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలి కోరుకొండ నుంచి బూరుగుబయలు మార్గంలో గిరిజనులు సురక్షితంగా రాకపోకలు సాగించేలా సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు వెంటనే తాత్కాలిక రహదారి సౌకర్యాన్ని పునరుద్ధరించాలి. ఇక్కడ శాశ్వత వంతెన నిర్మాణ పనులు అసంపూర్తిగా మిగిలిపోవడం, వర్షాలకు తాత్కాలిక పైపుల కల్వర్టు తరచూ కోతకు గురికావడంతో అనేక గ్రామాల గిరిజనులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గెడ్డ ఉధృతి అధికంగా ఉండటంతో వాగు దాటడానికి ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి రాకపోకలు పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టాలి. – గబులంగి మోహన్‌రావు,వైఎస్సార్సీపీ నేత, బలపం -
జెడ్పీటీసీ నిధులతోగ్రావెల్ రోడ్డు పనులు
కె.కోటపాడు : దండుముత్యాలమ్మ ఆలయం నుండి గరుగుబిల్లి వరకూ గల మట్టిరోడ్డును గ్రావెల్రోడ్డుగా నిర్మాణం చేపనున్నట్టు వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి దాట్ల శివాజీరాజు, వైస్ ఎంపీపీ రొంగలి సూర్యనారాయణ అన్నారు. చౌడువాడ–2 సిగ్మెంట్ పరిధిలో గ్రావెల్ రోడ్డు నిర్మాణానికి జెడ్పీటీసీ ఈర్లె అనురాధ రూ.5 లక్షల నిధులను మంజూరు చేశారు. ఈ నిధులతో ఆదివారం గ్రావెల్‌రోడ్డు నిర్మాణానికి భూమిపూజను గ్రామ పెద్దలతో కలిసి శివాజీరాజు, సూర్యనారాయణ జరిపారు. గతంలో దండుముత్యాలమ్మ ఆలయం నుంచి గరుగుబిల్లి వెళ్లే మట్టిరోడ్డుతో ప్రజలు ఇబ్బందులు పడేవారని, ఈ సమస్యను జెడ్పీటీసీ దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే ఆమె నిధులను మంజూరు చేశారని సూర్యనారాయణ తెలిపారు. గ్రావెల్‌రోడ్డు నిర్మాణం పూర్తయితే ఈ మార్గంలో ప్రయాణించే ప్రజల రాకపోకల ఇబ్బందులు తీరినట్టేనని ఆయన తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దాడి ఎరుకునాయుడు, వారాధి అప్పారావు, ఆకుల సాయిప్రసాద్, చల్లా సురేష్, యాదవ సంఘం కమిటీ పెద్దలు పాల్గొన్నారు. -
అనుమతి లేకుండా వెళ్లిన విద్యార్థినులు క్షేమం
హెచ్ఎంకు అప్పగించిన పోలీసులుచింతపల్లి: మండలంలోని వంగసార గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల నుంచి అనుమతి లేకుండా బయటకు వెళ్లిన ఇద్దరు విద్యార్థినులను పట్టుకుని, తిరిగి పాఠశాల అధికారులకు అప్పగించినట్లు డీఎస్పీ తిరుమలరావు తెలిపారు. ఈ నెల 12న పాఠశాలలో 8, 9 తరగతులకు చెందిన ఇద్దరు విద్యార్థినులు మధ్యాహ్నం కాంపౌండ్ గోడ దూకి బయటకు వెళ్లిపోయారు. విషయాన్ని గమనించిన ప్రధానోపాధ్యాయులు వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక ఎస్డీపీవో ఆదేశాల మేరకు చింతపల్లి, అన్నవరం ఎస్ఐలు వీరబాబు, సాయికుమార్ రంగంలోకి దిగి విద్యార్థినుల ఆచూకీ కనుగొన్నారు. ఆదివారం డీఎస్పీ ఆధ్వర్యంలో వారిని వంగసార పాఠశాలకు తీసుకువెళ్లి హెచ్ఎంకు సురక్షితంగా అప్పగించారు. వినాయక చవితి పండుగ సందర్భంగా మూడు రోజులు సెలవులు ఇచ్చినా తమను ఇంటికి వెళ్లేందుకు అనుమతించకపోవడంతోనే గోడ దూకి వెళ్లామని విద్యార్థినులు తెలిపారు. ఈ సందర్భంగా భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా విద్యార్థినులు, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చామని డీఎస్పీ చెప్పారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం పలాసి ప్రసాద్, సీఐ సింహాచలం, ఎస్ఐలు వీరబాబు, సాయికుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
బలవంతపు భూసేకరణ తగదు
కె.కోటపాడు : గొండుపాలెం గ్రామంలో ఎంఎస్ఎంఈ పార్కు కోసం బలవంతంగా రైతుల వద్ద నుంచి భూములను తీసుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం అన్యాయమని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు లోకనాథం అన్నారు. గొండుపాలెం గ్రామంలో ఎంఎస్ఎంఈ పార్కు కోసం సేకరిస్తున్న భూములను పరిశీలించి, ఆయా రైతులతో ఆదివారం లోకనాథం మాట్లాడారు. 2013 భూసేకరణ చట్టంకు లోబడి ఎంఎస్ఎంఈ పార్కు కోసం గొండుపాలెంలో భూసేకరణ చేయలేదన్నారు. ముందుగా గ్రామసభను కుడా పెట్టకుండా రైతుల నుంచి భూములను తీసుకోవడం చట్టానికి విరుద్ధమని అన్నారు. రైతుల నుండి కారుచౌకగా భూములను తీసుకొని కంపెనీలకు కట్టబెట్టేందుకు ఈ చర్యలు తీసుకున్నట్టుగా ఉందని లోకనాథం అన్నారు. రైతుల వద్ద నుంచి బలవంతంగా భూసేకరణ చేస్తే సీపీఎం ద్వారా పోరాటం చేయనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు గండి నాయినిబాబు, రొంగలి ముత్యాలనాయుడు పాల్గొన్నారు. -
జెడ్.జోగుంపేటలో పోలింగ్ బూత్ ఏర్పాటు చేయాలి
రావికమతం : చీమలపాడు పంచాయితీ జెడ్.జోగుంపేటలో పోలింగ్ ఏర్పాటు చేయాలని ఆదివారం గిరిజనులు డోలీ కట్టి విన్నూతంగా నిరసనలు తెలిపారు. చీమలపాడు పంచాయితీ పరిదిలో జెడ్.జోగుంపేట, బంగారు బందలు, జీలుగులోవ, కడగడ్డ ఆజేయపురం, గంగంపేట, తాటిపర్తి, పెద్దగరువు, రోచ్చుపణుకు, రాయపాడు గ్రామాల్లో 720 మంది ఓటర్లు ఉన్నారు. అయితే వీరు ఓటు హక్కు వినియోగించుకోవడానికి సుమారు 10 కిలోమీటర్లు దూరంలో ఉన్న చీమలపాడు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలి. 10 కిలోమీటర్లు దూరంలో ఉన్న చీమలపాడు రావాలంటే కళ్యాణపులోవ వరకు గుర్రాలపై, వృద్ధులైతే డోలీ ద్వారా వచ్చి అక్కడ నుంచి ఆటోల ద్వారా, లేదా ఇతర వాహనాలపై వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలి. కొన్ని సమయాల్లో పోలింగ్ బూత్ వద్ద ఓటు వేయడం ఆలస్యం అయితే కొండ శిఖర గ్రామాలకు వెళ్లాలి. ఈ పది గ్రామాలకు జెడ్.జోగుంపేటలో పోలింగ్ బూత్ ఏర్పాటు చేయాలని గతంలో డిమాండ్ చేసినా అధికారులు పట్టించుకోలేదని గిరిజనులు వాపోయారు. జెడ్.జోగుంపేటలో పోలింగ్ బూత్ ఏర్పాటు చేస్తే ఎటువంటి ఇబ్బందులు లేవని, దీనిపై ఈ నెల 16న రావికమతం మండలంలో ఎంపీడీవో కార్యాలయంలో జరిగే అన్ని రాజకీయ పార్టీ నాయకులతో జరిగే సమావేశంలో తెలుపుతామని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె.గోవిందరావు తెలిపారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి జెడ్.జోగుంపేటలో పోలింగ్ బూత్ ఏర్పాటు చేయాలని గిరిజనులు పాంగి రమేష్, తులసమ్మ, కె.భవానీ, కిలో పిట్టదొర కోరారు. -
వామపక్ష భావజాలానికి ప్రతీక సీతారాం ఏచూరి
● సీపీఎం జిల్లా కార్యదర్శి అప్పలనర్స పాడేరు రూరల్: వామపక్ష భావజాలానికి నిలువెత్తు ప్రతీక సీపీఎం పార్టీ నేత, స్వర్గీయ కామ్రేడ్ సీతారాం ఏచూరి అని సీపీఎం జిల్లా కార్యదర్శి అప్పలనర్స అన్నారు. జిల్లా కేంద్రమైన పాడేరులోని పార్టీ కార్యాలయంలో శనివారం సీతారాం ఏచూరి రెండో వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అప్పలనర్స మాట్లాడుతూ, కమ్యూనిస్టు పార్టీలకు సీతారాం ఏచూరి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారని అన్నారు. ఆయన ఆశయాలు, సిద్ధాంతాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి చిట్టిబాబు, జిల్లా కార్యవర్గ సభ్యులు ఉమ, దాసు, లక్కు, నాయకులు జీవన్, కార్తీక్ పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
నక్కపల్లి: జాతీయ రహదారిపై వెదుళ్లపాలెం జంక్షన్ వద్ద శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. సీఐ జె.మురళి తెలిపిన వివరాల ప్రకారం తమ్మయ్యపేటకు చెందిన సూరాకాసుల గురుమూర్తి(46) వెదుళ్లపాలెంలో ఉంటూ బోదిగల్లం పునరావాసకాలనీలో తన కొత్త ఇంటిపనులు ముగించుకుని రోడ్డుపై నడచి వెళ్తుండగా అనకాపల్లి నుంచి తునివైపు వెళ్తున్న వాహనం ఢీకొంది. గురుమూర్తి తీవ్రంగా గాయ పడి అక్కడికక్కడే మరణించాడు. మృతుడి సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
విద్యుత్ బస్సుల పేరుతో ఆర్టీసీ నిర్వీర్యానికి కుట్ర
పాడేరు రూరల్: విద్యుత్ బస్సుల పేరుతో కూటమి ప్రభుత్వం పినాకిల్ సంస్థకు ఆర్టీసీ సేవలను కట్టబెట్టే ప్రయత్నాన్ని విరమించుకోవాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు.శనివారం సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పాడేరు ఆర్టీసీ డిపో వద్ద కార్మికులను కలిసి కరపత్రాలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తూ ఆర్టీసీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ఇప్పటికే రాష్ట్రంలో నాలుగు డిపోలను ఖాళీ చేయించిందని, మరో ఎనిమిది డిపోలను ఖాళీ చేయడానికి సిద్ధమవుతోందని తెలిపారు. తొలి దశలో 750 విద్యుత్ బస్సులను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్నారని, మరో 300 బస్సులను కూడా అప్పగించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారని పేర్కొన్నారు. ఈ విద్యుత్ బస్సుల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం ఒక్కో బస్సుకు రూ.40 లక్షల చొప్పున సబ్సిడీ అందిస్తోందని తెలిపారు. భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులను పూర్తిగా తొలగించి, ప్రైవేటీకరణను ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోందని విమర్శించారు. ఆర్టీసీని నష్టాల్లోకి నెట్టేందుకే అక్రమ ఒప్పందాలు కుదుర్చుకుంటోందని ఆరోపించారు. అలాగే, ’సీ్త్ర శక్తి’ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించాల్సిన రూ.1,680 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వానికి నిజంగా కార్మికులపై చిత్తశుద్ధి ఉంటే ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 12 వేల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. పాడేరు డిపోలో ప్రస్తుతం 45 బస్సులు మాత్రమే ఉన్నాయని, కొత్త బస్సులను కొనుగోలు చేసి మారుమూల గ్రామాలకు మరిన్ని రవాణా సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకుడు సుందర్‌రావుతో పాటు కార్మికులు తదితరులు పాల్గొన్నారు.సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు -
డీఆర్టీలో ప్రత్యేక జాతీయ లోక్ అదాలత్
అల్లిపురం: విశాఖ కేంద్రంగా పనిచేస్తున్న డెట్ రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్టీ)లో శనివారం ప్రత్యేక జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మంజూరు చేసిన రుణాల వసూళ్లకు సంబంధించిన వివాదాలను వేగవంతంగా, చట్టబద్ధంగా పరిష్కరించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. డీఆర్టీ న్యాయమూర్తి కృష్ణ గోపాల్ ద్వివేది ఆధ్వర్యంలో, సభ్యులు ఏ. శ్రీనివాస్, కొండా వేదవతి పర్యవేక్షణలోని ప్రత్యేక బెంచ్ ద్వారా సుమారు రూ. 46 కోట్ల మేర రుణ బకాయిలను రాజీ మార్గంలో పరిష్కరించి వసూలు చేసినట్లు న్యాయమూర్తి తెలిపారు. అనంతరం డీఆర్టీ కోర్టు ఆవరణలో మీడియాతో న్యాయమూర్తి కృష్ణ గోపాల్ ద్వివేది మాట్లాడుతూ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, రుణగ్రహీతలు పరస్పర అంగీకారంతో వివాదాలను పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ ఒక మంచి వేదిక. దీనివల్ల ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సమయం, ఆర్థిక భారం ఆదా అవుతాయని పేర్కొన్నారు. ప్రముఖ న్యాయవాది కొండా వేదవతి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు ఏకై క డీఆర్టీ కోర్టు విశాఖలోనే ఉందని తెలిపారు. ఇప్పటివరకు నిర్వహించిన లోక్ అదాలత్‌ల ద్వారా సుమారు రూ. 225 కోట్ల మేర బకాయిలు వసూలయ్యాయని ఆమె వివరించారు. డీఆర్టీ రిజిస్ట్రార్ పీసీ థామస్ మాట్లాడుతూ రుణగ్రహీతల ప్రయోజనార్థం మున్ముందు కూడా ఇటువంటి ప్రత్యేక లోక్ అదాలత్‌లను విస్తృతంగా నిర్వహిస్తామన్నారు. రుణగ్రహీతలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ రుణ వివాదాలను సునాయాసంగా పరిష్కరించుకోవాలని ఆయన కోరారు.రూ. 46 కోట్ల రుణ బకాయిల పరిష్కారం -
భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న అరకు ఎంపీ
భద్రాచలం (తెలంగాణ): భద్రాచలంలో శ్రీ సీతారామ చంద్రస్వామి వారిని శనివారం ఏపీకి చెందిన అరకు ఎంపీ గుమ్మ తనూజరాణి, రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి దర్శించుకున్నారు. ప్రదక్షిణ అనంతరం అంతరాలయంలో మూలమూర్తులను దర్శించుకున్నారు. అనంతరం వారికి పండితులు వేద ఆశీర్వచనం, స్వామివారి ప్రసాదాలు అందజేశారు. అంతేకాక భద్రాచలం పట్టణంలోని షిర్డీ సాయిబాబా ఆలయాన్ని కూడా ఎంపీ తనుజారాణి, రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ తనూజరాణి, మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి మాట్లాడుతూ ప్రజలంతా ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎటపాక వైఎస్సార్ సీపీ నాయకులు అన్నెం రామిరెడ్డి, ఆకుల వెంకటరామారావు, తోట శశికుమార్, రాము, సారెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. -
విఘ్నాలు తొలగించే ఒడ్డిమెట్ట వినాయకుడు
జాతరకు వేలాదిగా తరలిరానున్న భక్తులు రేపటి నుంచి నవరాత్రులు ప్రారంభం ఏర్పాట్లు చేసిన దేవదాయ శాఖ నక్కపల్లి: విఘ్నాలు తొలగించే వినాయకుడిగా, భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న ఒడ్డిమెట్ట లక్ష్మీగణపతి నవరాత్రి మహోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. వినాయకచవితి నుంచి తొమ్మిది రోజుల పాటు ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు దేవదాయశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. చవితినాడు గణపతిని దర్శించుకునేందుకు అనకాపల్లి, యలమంచలి, నర్సీపట్నం, తుని, అన్నవరం, పాయకరావుపేట, నక్కపల్లి తదితర పట్టణాల నుంచి వేలాది మంది భక్తులు తరలి వస్తారు. తాటి చెట్టు మొదలులో వెలిసిన స్వామి ఒడ్డిమెట్ట కై లాసగిరిపై దాదాపు నూరేళ్ల క్రితం తాటిచెట్టు మొదలులో లక్ష్మీగణపతి వెలిసినట్టు పూర్వీకుల కథనం. నామవరానికి చెందిన ఒక వ్యక్తికి కలలో స్వామి కనిపించి కై లాసగిరిపై పలానా చోట తాను వెలిసినట్లు చెప్పడంతో అక్కడ తవ్వకాలు జరుపగా విగ్రహం బయటిపడింది. ఐదో నంబరు జాతీయరహదారికి ఆనుకుని పందిర వేసి విగ్రహం పెట్టి పూజలు చేయడం ప్రారంభించారు. రహదారిపై ప్రయాణించే వారు కానుకల రూపంలో సమర్పించిన నగదుతో పాటు విరాళాలు సేకరించి కొండపై ఆలయాన్ని నిర్మించారు. తర్వాత ఈ ఆలయం దేవదాయశాఖ ఆధీనంలోకి వెళ్లింది. చవితినాడు ఇక్కడ భారీ ఎత్తున జాతర జరుగుతుంది. వేకువ జామునుంచే స్వామిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుతారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించేవారు, కొత్త వాహనాలు కొనుగోలు చేసిన వారు తొలుత ఇక్కడ విఘ్నేశ్వరుడికి పూజలు చేసిన తర్వాత తమ పనులు ప్రారంభిస్తారు. వినాయకుడిని దర్శించుకుని ఏ శుభకార్యం తలపెట్టినా నిర్విఘ్నంగా నెరవేరుతుందనేది భక్తుల విశ్వాసం. ఇక్కడ గణపతి ఆలయంతోపాటు కాశీవిశ్వేశ్వర స్వామి, కనకదుర్గ, లక్ష్మీనారాయణ, నవగ్రహ ఆలయాలున్నాయి. ఒడ్డిమెట్ట గ్రామస్తుల ఇలవేల్పు ఒడ్డిమెట్ట గ్రామస్తులు లక్ష్మీగణపతిని తమ ఇలవేల్పుగా కొలుస్తారు. సంక్రాంతి, ఉగాది తర్వాత అంతే ఘనంగా వినాయక చవితిని వారు జరుపుకొంటారు. చవితినాడు బంధువుల రాకతో ఇళ్లన్నీ సందడిగా ఉంటాయి. నవరాత్రులకు ఏర్పాట్లుపూర్తి తొమ్మిది రోజుల పాటు జరిగే మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దేవస్థాన పాలకమండలి చైర్మన్ పైలా నూకన్ననాయుడు, అర్చకులు జయంతి గోపాల కృష్ణ తెలిపారు. ఉదయం 5గంటల నుంచే స్వామివారి దర్శనం కల్పిస్తామన్నారు. 14వ తేదీ రాత్రి స్వామివారి కల్యాణం నిర్వహించనున్నట్టు వారు చెప్పారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా బారికేడ్లు, క్యూలైన్లు, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నట్టు తెలిపారు. ర ప్రత్యేకదర్శనం కోసం టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. పోలీసు బందోబస్తు వినాయకచవితి సందర్భంగా ఒడ్డిమెట్ట వినాయకుడిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలిరానున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నక్కపల్లి సీఐ జె.మురళి, ఎస్ఐ సన్నిబాబుల పర్యవేక్షణలో విస్తృత బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. జాతీయరహదారిని ఆనుకుని ఆలయం ఉండటంతో ట్రాఫిక్‌జాం జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. మెట్లమార్గం వరకు వాహనాలను అనుమతించకుండా రోడ్డుపైనే పార్కింగ్ చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. భక్తులు క్యూలైన్ల ద్వారానే స్వామిని దర్శించుకోవాలన్నారు. నక్కపల్లి, పాయకరావుపేటలనుంచి పోలీస్ సిబ్బందిని రప్పించి బందోబస్తు నిర్వహిస్తామని తెలిపారు. రెండేళ్ల క్రితం ప్రభుత్వ నిధులు, దాతల విరాళాలు సేకరించి రూ.20లక్షల వ్యయంతో కొండపైకి సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. -
మాలధారణకు పోటెత్తిన భక్తులు
చోడవరం: వినాయకుడి మాలధారణకు స్థానిక స్వయంభూ విఘ్నేశ్వరస్వామి ఆలయానికి శనివారం భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయం కిక్కిరిసిపోయింది. వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా 11 రోజుల పాటు మాలధారణ చేస్తారు. ఏటా వేలాది మంది భక్తులు స్వామివారి మాలను ధరిస్తారు. ఈ ఏడాది కూడా మాల ధరించి శనివారం నుంచి ఈ నెల 23వ తేదీ వరకూ 11 రోజుల పాటు దీక్ష చేపట్టేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. వినాయకుడి మాలధరించి, దీక్ష చేపడితే తమ కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఇక్కడ ఆలయ ప్రధాన అర్చకుడు కొడమంచిలి చలపతిరావు ఆధ్వర్యంలో మాలధారణ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో జరిగింది. మాలను ధరించిన వారంతా తెల్ల దుస్తులు వేసుకొని ఇక్కడి స్వయంభూ విఘ్నేశ్వరుని దర్శించుకున్నారు. కిక్కిరిసిన స్వయంభూ విఘ్నేశ్వరస్వామి ఆలయం -
జనజీవనం
స్తంభించినసీలేరు: జిల్లాలోని సీలేరు ఏజెన్సీ సరిహద్దు నుంచి ఒడిశా వెళ్లే రెండు ప్రధాన రహదారుల్లో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. గురువారం సాయంత్రం నుంచి సరిహద్దు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ఈ పరిస్థితి నెలకొంది. అధికారులు స్పందించకపోవడంతో శనివారం తెల్లవారుజాము నుంచి ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కొట్టుకుపోయిన గంగవరం వంతెన దారకొండ పంచాయతీ గంగవరం రహదారిలోని తాత్కాలిక తూరల వంతెన వరద ధాటికి కొట్టుకుపోయింది. ఏడాదిన్నర కిందట ఇక్కడ వంతెన కొట్టుకుపోవడంతో గిరిజనులే స్వయంగా దీనిని నిర్మించుకున్నారు. ఇప్పుడు అది కూడా కొట్టుకుపోవడంతో ఒడిశా వైపు వెళ్లే మార్గంలో సుమారు 30 గ్రామాల ప్రజలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. పిల్లిగెడ్డ అప్రోచ్ రోడ్డు ధ్వంసం ఆంధ్రా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఒడిశాలను కలిపే సీలేరు సమీప పిల్లిగెడ్డ వంతెన అప్రోచ్ రోడ్డు భారీ గోతులు పడి బురదమయంగా మారింది. శనివారం ఉదయం వాహనాలు బురదలో కూరుకుపోవడంతో ఇరువైపులా రాకపోకలు నిలిచిపోయి అంతర్రాష్ట్ర ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. అధికారులు ఎవరూ రాకపోవడంతో ఎస్ఐ యాసి న్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఉధృతంగా ప్రవహిస్తున్న గంగవరం గెడ్డను ఎవరూ దాటవద్దని, అత్యవసర సమయాల్లో సీ లేరు పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని సూచించారు. ఇలావుండగా పిల్లిగెడ్డ వంతెనకు సీసీ అప్రోచ్ రోడ్డు వేయాలని, గంగవరం వద్ద శాశ్వత వంతెన నిర్మించాలని విన్నవిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గిరిజనులు మండిపడుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు చేపడతామని ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య జిల్లా అధ్యక్షుడు పాంగి నాగేశ్వరరావు హెచ్చరించారు. కూలిన చెట్టు.. నిలిచిన రాకపోకలు సీలేరు పోలీస్ స్టేషన్ పరిధిలోని దుప్పులువాడ వద్ద శనివారం తెల్లవారుజామున భారీ వృక్షం కూలిపోవడంతో రెండు గంటల పాటు అంతర్రాష్ట్ర రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు, గ్రామస్తులు శ్రమించి చెట్టును తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. దెబ్బతిన్న ఇల్లు దారకొండ పంచాయతీ జగ్గంపల్లిలో లక్ష్మణరావు అనే గిరిజనుడి ఇంటిపై పక్కనే ఉన్న మట్టిపెళ్లలు విరిగిపడటంతో ఇల్లు పాక్షికంగా దెబ్బతింది. ప్రమాదాన్ని గమనించిన కుటుంబసభ్యులు బయటకు పరుగులు తీయడంతో ప్రాణనష్టం తప్పింది. పొంగిన కాలువ : గాలికొండ పంచాయతీ పరిధిలోని బత్తునూరు కాలువ వర్షాలకు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో లేతమర్రి, మైనకోట, బుగ్గిరాయి, పాత్రునుగుంట తదితర గ్రామాల ప్రజలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి, శనివారం సప్పర్ల సంతకు కూడా రాలేని పరిస్థితి ఏర్పడింది. కాలువపై వంతెన నిర్మించకపోవడంతో అత్యవసర వైద్యం, నిత్యవసర సరుకుల కోసం ప్రమాదకర స్థితిలోనే వాగు దాటాల్సి వస్తోందని గిరిజనులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పెదబయలు మండలంలో ప్రాణాలకు తెగించి కించూరు గెడ్డను దాటుతున్న ఉపాధి కూలీలు ఆంధ్రా–ఒడిశా సరిహద్దులోభారీ వర్షాలు కొట్టుకుపోయిన తాత్కాలిక వంతెనలు నిలిచిన రాకపోకలు వాహనదారుల ఇబ్బందులు కూలిన పూరిల్లు చింతపల్లి: మండలంలోని లంబసింగి పంచాయతీ పరిధిలోని చిట్టంగరువు గ్రామంలో రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొర్రా లక్ష్మణరావు అనే గిరిజనుడి పూరిల్లు పూర్తిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇంటో ఉన్న నిత్యావసర వస్తువులు పాడవడంతో పాటు రెండు మేకలు మృతి చెందాయి. రెక్కాడితే గానీ డొక్కాడని తమ కుటుంబం తీవ్రంగా నష్టపోవడంతో లక్ష్మణరావు కన్నీరుమున్నీరయ్యారు. బాధిత కుటుంబాన్ని మాజీ సర్పంచ్ కొర్రా రఘునాథ్, వైఎస్సార్సీపీ నాయకులు నూకరాజు, దేపూరి గిరి తదితరులు పరామర్శించి, ప్రభుత్వం తరఫున తగిన సాయం అందేలా చూస్తామని భరోసానిచ్చారు. -
తూనికల్లో మోసాలపై మెరుపుదాడులు
● పాడేరులో 18 మంది వ్యాపారులపై కేసు ● తూకం యంత్రాలను సీజ్ చేసినలీగల్ మెట్రాలజీ అధికారులు ● రూ.40 వేల అపరాధ రుసుం వసూలు సాక్షి, పాడేరు: జిల్లా కేంద్రం పాడేరులోని వ్యాపార దుకాణాల్లో తూనికలు, కొలతల్లో మోసాల ఫిర్యాదులతో ఉమ్మడి విశాఖ జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారుల బృందం శనివారం సాయంత్రం మెరుపుదాడులు నిర్వహించింది. మెయిన్‌రోడ్డు, సినిమా హాల్ సెంటర్లోని కిరాణా, కూరగాయలు, సిమెంట్, ఐరన్ తదితర దుకాణాల్లో రాత్రి వరకు తనిఖీలు కొనసాగాయి.వినాయక చవితి పండగ సామగ్రి అమ్మకాలతో బిజీగా ఉన్న కిరాణా దుకాణాల్లోకి అనకాపల్లి, పాడేరు లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్లు పద్మావతి, అనురాధ తమ సిబ్బందితో కలిసి వెళ్లి తనిఖీలు చేపట్టారు. తూకం యంత్రాలను పరిశీలించడంతో పాటు వాటి సీళ్లు, తూకాల్లో తేడాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్యాకింగ్ చేసిన సామగ్రిని కూడా తూకం వేశారు. పలు దుకాణాల్లో తూకాల్లో తేడాలను గుర్తించిన అధికారులు సంబంధిత వ్యాపారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు తూకాలతో వినియోగదారులను మోసం చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. తప్పుడు తూకం యంత్రాలు, ఇతర అక్రమాలను గుర్తించిన అధికారులు 18 మంది వ్యాపారులపై కేసులు నమోదు చేసి, ఆయా తూకం యంత్రాలను సీజ్ చేశారు. వ్యాపారుల నుంచి రూ.40 వేల అపరాధ రుసుము వసూలు చేశారు. వ్యాపారులంతా నాణ్యమైన తూనికలు, కొలతలను ఉపయోగించి వ్యాపారాలు నిర్వహించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఇన్స్పెక్టర్లు హెచ్చరించారు. ఈ తనిఖీల్లో సిబ్బంది శ్రీనివాస్, రమేష్ పాల్గొన్నారు. -
డివైడర్‌ను ఢీకొన్న కారు
● ముగ్గురికి గాయాలు ● వీరిలో ఒకరి పరిస్థితి విషమం డుంబ్రిగుడ : అరకు–పాడేరు జాతీయ రహదారిపై బిల్లాపుట్టు సమీపంలో శనివారం తెల్లవారుజామున కారు డివైడర్‌ను ఢీకొన్న ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. వారిలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. విశాఖపట్నం నుంచి అరకు అందాలను వీక్షించేందుకు పర్యాటకులు కారులో అరకు వైపు వెళ్తుండగా ఉదయం 5 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి గాయాలయ్యాయి. ఎదురుగా కూర్చున్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అంబులెన్స్ సిబ్బంది ఈఎంటీ అప్పలనాయుడు, పైలట్ ప్రవీణ్ క్షతగాత్రులను అరకులోయ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి తీవ్రంగా గాయపడిన పర్యాటకుడి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ సురేష్ తెలిపారు. -
స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం ఖాయం
నాతవరం: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం ఖాయమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ అన్నారు. మండల కేంద్రం నాతవరంలో పార్టీ మండల అధ్యక్షుడు లగుడు నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన పార్టీ సమావేశంలో ప్రసాద్ మాట్లాడారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తే సునాయాసంగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. జిల్లాలో ఎక్కడా లేని విధంగా కూటమి నాయకులు నర్సీపట్నం ప్రాంతంలో వైఎస్సార్సీపీ నాయకులపై కక్షసాధింపు రాజకీయాలు చేస్తున్నారన్నారు. మాజీ ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్ ప్రజల పక్షాన పోరాడుతుంటే తప్పుడు కేసులు పెట్టి అన్యాయంగా జైలుకు పంపించేందుకు కుట్ర చేశారని గుర్తు చేశారు. ఇటీవల జరిపిన సర్వేలో జిల్లాలోనే నర్సీపట్నం నియోజకవర్గంలో ప్రజలు టీడీపీ కంటే వైఎస్సార్సీపీ వైపు 8 శాతం అధికంగా ఉన్నారని తేలిందన్నారు. డీఎస్సీలో భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయని, క్రీడాకారుల కోటా పేరుతో నచ్చినవారికి పోస్టులు కట్టబెట్టారని ఆరోపించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి 1.30 లక్షలకు పైగా సచివాలయ ఉద్యోగాలను ఎటువంటి అవినీతి, అక్రమాలకు తావులేకుండా భర్తీ చేశారని చెప్పారు. గతంలో పోలవరం కాలువ పనులను గాలికి వదిలేసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన కృషి వల్లే సాధ్యమైందని గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. హామీలు ఎప్పుడు నెరవేరుస్తారు? అనంతరం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ మాట్లాడుతూ... ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేరుస్తారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకుండా కూటమి నాయకులు జిమ్మిక్కులు చేస్తున్నారన్నారు. ఎన్నికలు వస్తేనే చంద్రబాబుకు పింఛన్లు, బీసీల రిజర్వేషన్లు గుర్తుకు వస్తాయని, తర్వాత మళ్లీ యథావిధిగా మరిచిపోతారని ఎద్దేవా చేశారు. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో రాజకీయాలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా పథకాలు అందించారన్నారు. ఎన్నికలు ఎప్పుడు పెట్టినా సైనికుల్లా పనిచేసి విజయబావుటా ఎగురవేయాలన్నారు. అభ్యర్థుల ఎంపికను స్థానికంగానే చేయాలని, అందులో తమ ప్రమేయం ఉండదన్నారు. అనంతరం 31 గ్రామ పంచాయతీల్లో నాయకులు, కార్యకర్తలకు గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి, వైస్ ఎంపీపీలు పైల సునీల్, మైనం శ్రీనాగ గోపి, జెడ్పీటీసీ కాపారపు అప్పలనర్స, నాలుగు మండలాల అధ్యక్షులు లగుడు నాగేశ్వరరావు, చిటికిల రమణ, కోరుప్రోలు పాణిశాంతారాం, ఏకా శివ చినబాబు, జిల్లా కమిటీ సభ్యులు కరక అప్పలరాజు, శిరుసుపల్లి నర్సింగరావు, పైల పోతురాజు, గొర్లె వరహాలబాబు, మంకు సాంబమూర్తి, ఇట్టంశెట్టి శ్రీను, మండల యూత్ అధ్యక్షుడు బండారు నాయుడు, మహిళా విభాగం అధ్యక్షురాలు పోలుపర్తి రాధ, మాజీ సర్పంచులు అంకంరెడ్డి పార్వతి, గొలగాని రాణీ, పైల శిరీషా, లాలం లోవ, వేముల సూర్యనారాయణ, పార్టీ సీనియర్ నాయకులు సిద్దాబత్తుల వెంకటరమణ, గుడపర్తి అచ్చియ్యనాయుడు, నాతవరం గ్రామ కమిటీ అధ్యక్షుడు శెట్టి లచ్చబాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం బొడ్డేడ ప్రసాద్‌ను మాజీ ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్ తదితరులు సన్మానించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ -
అనుమానాస్పదంగా వ్యక్తి మృతి
నర్సీపట్నం: మండలంలో అమలాపురం గ్రామానికి చెందిన మాకిరెడ్డి రమణ(38) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ నెల 11వ తేదీ రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. గ్రామ సమీపంలోని కాలువ పక్కన రమణ మృతి చెంది ఉండడాన్ని శనివారం తెల్లవారుజామున స్థానికులు గుర్తించారు. మృతుడి భార్య భవాని ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రూరల్ ఎస్ఐ రాజారావు తెలిపారు. మృతదేహన్ని పోస్టు మార్టానికి నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడు సరుగుడు కర్రల వ్యాపారం చేస్తుంటాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
మాదిగ కులస్తునికి ఓసీ ధ్రువపత్రం జారీ
రోలుగుంట: మాదిగ కులానికి చెందిన తమకు ఓసీ కుల ధ్రువపత్రాన్ని ఇవ్వడం వల్ల గృహ విద్యుత్ లైన్ కట్ చేశారని బాధితులు ఎత్తుల ముత్యాలు, అర్జున, లోవరాజు వాపోయారు. రెండో దఫా దరఖాస్తు చేసుకుంటే ఎస్సీ – సీ (మాల) సర్టిఫికెట్ ఇచ్చారని, దీన్ని సరి చేయకుంటే ఈ నెల 16వ తేదీన సీపీఎం ఆధ్వర్యంలో అందోళనకు దిగుతామని హెచ్చరించారు. శనివారం వారు విలేకరుల వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. రోలుగుంటకు చెందిన తాము ఆరు మాసాల క్రితం మాదిగ కులం ధ్రువపత్రం కోసం దరఖాస్తు చేసుకోగా, తహసీల్దార్ కార్యాలయం నుంచి ఓసీ ధ్రువపత్రం జారీ అయిందన్నారు. దీని ఆధారంగా తమ ఇంటి విద్యుత్ మీటరు లైనును అధికారులు కట్ చేశారన్నారు. మరలా రెండో దఫా కుల ధ్రువీకరణ సరిచేసి ఇవ్వాలని దరఖాస్తు చేయగా, ఎస్సీ– సీ(మాల) సర్టిఫికెట్ ఇచ్చారని వాపోయారు. ఈ సమస్యపై పీజీఆర్ఎస్లో మార్చి 17న ఫిర్యాదు చేశామన్నారు. అధికారులు విచారణ చేసి మాదిగ కులంగా ధ్రువీకరించి జేసీకి నివేదిక పంపించి ఆరు మాసాలవుతుందని తెలిపారు. అప్పటి నుంచి కాళ్లరిగేలా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగినా కలెక్టరేట్ నుంచి ఆదేశాలు రాలేదని చెబుతున్నారని వాపోయారు. తమ పిల్లల చదువులతోపాటు రాయితీలు వర్తించక ఇక్కట్లు పడుతున్నామన్నారు. అధికారులు తప్పు సరిచేయకుంటే తహసీల్దారు కార్యాలయం వద్ద కుల వ్యవస్థ వ్యతిరేక పోరాట కమిటీ, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కె.గోవిందరావు, ఇ. చిరంజీవి ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. దాని ఆధారంగా గృహ విద్యుత్ లైన్ కట్ చేశారని ఆవేదన -
స్వర్ణ గ్రామ ఆదివాసీ ఉద్యోగుల సంఘ నూతన కార్యవర్గం
సాక్షి, పాడేరు: జిల్లా స్వర్ణ గ్రామ ఆదివాసీ ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గాన్ని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు జి. ధనుంజయ్, అధ్యక్షుడు పి. సింహాచలం ఆధ్వర్యంలో స్వర్ణ గ్రామ ఆదివాసీ ఉద్యోగులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా సి.హెచ్. అనీల్‌కుమార్, టి. ప్రసన్నకుమార్, కోశాధికారిగా పి. సత్యవతి, అధికార ప్రతినిధిగా ఎన్. పద్మారావు, సోషల్ మీడియా ప్రతినిధిగా జే. దామోదర్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా ఎస్. త్రినాథరావు, టి. మీనాక్షి, ఎల్. మోహన్, కార్యదర్శులుగా పి. మనోజ్‌కుమార్, డి. ప్రవీణ్, జే. బాలకృష్ణ, సహాయ కార్యదర్శులుగా జి. మనోహర్, ఎం. ఇంద్రజ ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా అనీల్, వీరయ్య, గణపతి తదితరులు ఎన్నికయ్యారు. స్వర్ణ గ్రామ ఆదివాసీ ఉద్యోగుల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నూతన కార్యవర్గం పనిచేస్తుందని ప్రతినిధులు తెలిపారు. -
విశాఖ–కిరండూల్ రైలుకు అదనపు విస్టాడోమ్ కోచ్
తాటిచెట్లపాలెం: ప్రయాణికుల డిమాండ్, వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విశాఖ–కిరండూల్–విశాఖ పాసింజర్ రైలుకు ఆయా తేదీల్లో అదనపు విస్టాడోమ్ కోచ్‌ను జత చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. విశాఖ–కిరండూల్ (58501) పాసింజర్ రైలుకు ఈ నెల 13, 15, 17, 19, 21, 23, 25, 27, 29 తేదీల్లో అదనపు అద్దాల కోచ్‌ను జత చేయనున్నారు. అదేవిధంగా తిరుగు ప్రయాణంలో కిరండూల్–విశాఖ (58502) పాసింజర్ రైలుకు ఈ నెల 14, 16, 18, 20, 22, 24, 26, 28, 30 తేదీల్లో అదనపు విస్టాడోమ్ కోచ్ అందుబాటులో ఉంటుందని అధికారులు వెల్లడించారు. -
పెట్రోల్ బాటిళ్లతో ఏఎన్ఎంల ఆందోళన
సాక్షి, పార్వతీపురం మన్యం/పార్వతీపురం రూరల్: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజన గర్భిణుల వసతిగృహాలను మూసివేసి తమను విధుల నుంచి తొలగించారని, తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఏఎన్ఎంలు నినదించారు. శుక్రవారం పార్వతీపురం కలెక్టరేట్ వద్ద పెట్రోల్ బాటిళ్లతో నిరసన వ్యక్తం చేశారు. సూసైట్ నోట్ రాసి ఆత్మహత్యాయత్నం చేశారు. జాయింట్‌కలెక్టర్(జేసీ), ఐటీడీఏ పీఓ వైశాలి తమ సమస్యను పరిష్కరిస్తామని మాట ఇచ్చి ఇప్పుడు ముఖంచాటేశారని ఆవేదన వ్యక్తంచేశారు. పోలీసులు జోక్యం చేసుకుని ఏఎన్ఏంలను వారించారు. పెట్రోల్బాటిళ్లను లాక్కున్నారు. అసలేం జరిగిందంటే.. గతంలో సాలూరు, గుమ్మలక్ష్మీపురంలలో గిరిజన గర్భిణుల వసతి గృహాలను అప్పటి ఐటీడీఏ పీఓ లక్ష్మీశా ఆధ్వర్యంలో ప్రారంభించారు. వాటి వల్ల గిరిజనుల్లో మాతా శిశు మరణాలు తగ్గాయి. గత ప్రభుత్వం హయాం వరకూ ఇవి సజావుగా సాగాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే.. జిల్లాలో ఈ రెండు వసతి గృహాలను మూసివేశారు. గుమ్మలక్ష్మీపురం, సాలూరు హాస్టళ్ల ఉద్యోగులు రోడ్డున పడ్డారు. తమకు ప్రత్యామ్నాయం చూపించాలని పోరుబాట పట్టారు. గత నెలలో పార్వతీపురం ఐటీడీఏ వద్ద బైఠాయించిన సమయంలో పీఓగా ఉన్న జేసీ వైశాలి రెండువారాల్లో సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మధ్యలో ఓసారి మంత్రి సంధ్యారాణి నుంచి అనుమతి పత్రం తీసుకురావాలని సూచించడంతో ఏఎన్ఎంలు అది తీసుకొచ్చారు. అయినా తమను విధుల్లోకి తీసుకోకపోవడంతో గత సోమవారం పీజీఆర్ఎస్లో విన్నవించుకున్నారు. దీంతో విసిగిపోయిన ఏఎన్ఎంలు శుక్రవారం మధ్యాహ్నం కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. దాదాపు రెండుగంటలపాటు ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నా జేసీ కిందికి దిగి రాలేదు. డీఆర్వో హేమలత, ఆర్డీవో మాధురిలను ఏఎన్ఎంల వద్దకు పంపారు. వారు సర్దిచెప్పే యత్నం చేసినా ఏఎన్ఎంలు వినలేదు. మూడు రోజుల వరుస సెలవుల అనంతరం ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. -
పౌష్టికాహారంతోనేఆరోగ్యవంతమైన సమాజం
● సీడీపీవో శ్రీదేవి చింతపల్లి: గర్భిణులు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించినప్పుడే బిడ్డల భవిష్యత్తు ఆరోగ్యవంతంగా ఉంటుందని ఐసీడీఎస్ సీడీపీవో శ్రీదేవి అన్నారు. శుక్రవారం మండలంలోని పలు పంచాయతీ కేంద్రాల్లో జాతీయ పోషణ్ మాస కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగా కిటుముల పంచాయతీ బౌడ గ్రామంలో జరిగిన కార్యక్రమంలో సీడీపీవో పాల్గొని, పోషణ్ మాస ప్రాముఖ్యతను వివరించారు. సమతుల్యాహారం అవసరం: గర్భిణులు, బాలింతలు తప్పనిసరిగా సమతుల్య పౌష్టికాహారాన్ని తీసుకోవాలని సూచించారు.ఏడు నెలల నుంచి మూడు సంవత్సరాల వయసు గల పిల్లలకు నాణ్యమైన పోషకాహారాన్ని అందించాలని స్పష్టం చేశారు. అంగన్వాడీ సూపర్వైజర్లు జయభారతి, గౌరి, తులసి పాల్గొన్నారు. -
నేడు ‘క్రిటికల్ కేర్’ ప్రారంభం
అనకాపల్లి: జిల్లాలో రసాయన పరిశ్రమలతోపాటు ఇతర కంపెనీల్లో తరచూ సంభవించే అగ్ని ప్రమాదాల్లో గాయపడే కార్మికులకు, ఉద్యోగులకు అత్యవసర వైద్య సేవల కోసం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్మించిన క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభానికి ముస్తాబైంది. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో రూ.22.5 కోట్లతో అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రి ఎదురుగా 50 పడకలతో క్రిటికల్ కేర్ బ్లాక్(ఆస్పత్రి) భవనం మూడు అంతస్తుల్లో నిర్మించారు. అప్పట్లోనే 80 శాతంపైగా పనులు పూర్తయ్యాయి. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం రెండున్నరేళ్ల తర్వాత మిగిలిన పనులు పూర్తి చేసి రోగులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. జిల్లాలో అచ్యుతాపురం, పరవాడ, నక్కపల్లి, రాంబిల్లి మండలాల్లో ఎక్కువగా రసాయన పరిశ్రమలు ఉన్నాయి. వీటితోపాటు ఇతర ప్రాంతాల్లోని పరిశ్రమల్లో సంభవించే అగ్ని ప్రమాదాల్లో పలువురు మృతి చెందుతున్నారు. గాయపడిన మరి కొంతమందిని విశాఖ సిటీలో కార్పొరేట్ ఆస్పత్రులకు తరలించే క్రమంలో కొంతమంది మార్గమధ్యంలో మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథ్యంలో అనకాపల్లిలో క్రిటికల్ కేర్ ఆస్పత్రిని ఏర్పాటు చేసినట్లయితే వారికి సకాలంలో వైద్యసేవలు అందించినట్లయితే ప్రాణాలు కాపాడవచ్చు. ఈ విషయమై 2023 డిసెంబర్లో అప్పటి సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ఎంపీ బీవీ సత్యవతి, స్థానిక ఎమ్మెల్యే, మంత్రి గుడివాడ అమర్నాథ్, జిల్లా అధికారులు అప్పటి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిని కోరగా క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణానికి రూ.22.3 కోట్లు విడుదల చేశారు. 2024 ఫిబ్రవరిలో అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రి ఎదురుగా ప్రభుత్వ స్థలంలో 50 పడకల ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అప్పట్లో ప్రారంభమైన పనులు 80 శాతం పూర్తయ్యాయి. తొలి ఏడాది కేంద్ర ప్రభుత్వ నిర్వహణలో వైద్య సిబ్బందికి జీతాలు చెల్లిస్తుంది. రెండో ఏడాది నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తుంది. క్రిటికల్ కేర్ బ్లాక్‌లో వైద్యం... గుండెపోటు, శ్వాసకోశ వైఫల్యం, తీవ్రమైన గాయాలైన వారికి ఇక్కడ వైద్య సేవలందిస్తారు. 24 గంటలు నిపుణులైన వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉంటూ క్షతగాత్రులకు సకాలంలో వైద్యం అందిస్తారు. గ్రౌండ్ ఫ్లోర్ : డిలేసిస్ (4 పడకలు), డాక్టర్ రూమ్, డోనింగ్, డీయూ ఎంసీహెచ్(2 పడకలు), ఎల్డీఆర్ (ఒక్కొక్కరికి 1 బెడ్), డోనింగ్ ఫిమెల్, ఆర్వో డయాలైజర్, అల్ట్రా సౌండ్, ప్లాస్టర్ రూమ్, పీఓసీ ల్యాబ్, ఎలక్ట్రికల్ రూమ్, డ్యూటీ డాక్టర్/ఎగ్జామినేషన్ రూమ్, ఎమర్జెన్సీ వార్డ్ (6 పడకలు), మైనర్ ప్రొసీజర్, నర్సుల రూమ్, ఇంజెక్షన్ డ్రెస్సింగ్ రూమ్, మరుగుదొడ్లు... మొదటి అంతస్తు: ఐఎస్ఓ రూమ్ (2 పడకలు), డైనింగ్ మెల్ –2 నంబర్లు, డీయూ, ఏఎస్వో వార్డు (6 పడకలు), క్లినికల్ టెస్ట్, ఐఎస్వో వార్డు (15 పడకలు), కౌన్సెలింగ్ రూమ్‌లు–2 నోస్, డౌఫింగ్, ఐసీయూ–ఐఎస్ఓ స్టోర్, డీఆర్ డ్యూటీ, స్టాఫ్ రూమ్, ఐఎస్వో వార్డ్ –2 నంబర్లు (ఒక్కొక్కటి 2 బెడ్లు) మరుగుదొడ్లు ఉంటాయి. రెండవ అంతస్తు: హెచ్‌డీయూ(6 బెడ్లు), డీయూ, అనస్థీషియా రూమ్, అటెండెంట్ వెయిటింగ్, ఐసీయూ(10 బెడ్లు), ఓటీలు– 2 నంబర్లు, స్టెరిలైజేషన్, ఎలక్ట్రికల్ రూమ్, ఈక్యూఎంటీ రూమ్, ఫ్రీ అండ్ ఫోస్ట్ ఓపీ– 5 బెడు,్ల డీఆర్ డ్యూటీ, స్టాఫ్ నర్సులు ప్రత్యేక సౌకర్యాలు ఉంటాయి. వాహనాలు పార్కింగ్‌కు ప్రత్యేక సౌకర్యాలు... క్రిటికల్ కేర్ బ్లాక్‌కు ఎదురుగా వాహనాలు నిలుపుదల చేసేందుకు ఎక్కువగా పార్కింగ్ స్థలం ఉంది. రోగితో పాటు రోగి బంధువులు ఉండేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తి 50 పడకల క్రిటికల్ కేర్ ఆస్పత్రిని ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ శనివారం ప్రారంభిస్తారని ఎన్టీఆర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ రవికుమార్ తెలిపారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. వైఎస్సార్సీపీ పాలనలోరూ.22.5 కోట్లతో నిర్మాణం 50 పడకలతో అత్యవసర రోగులకు వైద్యం అందుబాటులోకి రానున్న కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు -
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తత అవసరం
● వైద్యాధికారి కిషోర్ జి.మాడుగుల: వాతావరణ మార్పుల వల్ల సంభవించే సీజనల్ వ్యాధుల పట్ల గిరిజనులు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా వెంటనే సమీప పీహెచ్సీ/ వైద్య సిబ్బందిని సంప్రదించాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి కిషోర్ సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆదేశాల మేరకు శుక్రవారం మండలంలోని దిగువ రచ్చపల్లి గ్రామంలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో జ్వరం, ఒళ్లు నొప్పులు, జలుబు, దగ్గు, రక్తపోటు వంటి సమస్యలతో బాధపడుతున్న మొత్తం 46 మందికి డాక్టర్ కిశోర్ వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.జ్వరంతో బాధపడుతున్న ఆరుగురికి ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ ద్వారా మలేరియా పరీక్షలు చేయగా నెగటివ్‌గా నమోదైంది. అలాగే ఒళ్లు నొప్పులతో 13 మంది, జలుబుతో 16 మంది, దగ్గుతో 5 గురు, బీపీతో 6 మంది బాధపడుతున్నట్లు గుర్తించి వారికి తగిన చికిత్స అందించారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను పాటించాలని డాక్టర్ కిశోర్ కోరారు. నీటిని కాచి చల్లార్చి, వడపోసి మాత్రమే తాగాలని గిరిజనులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీహెచ్‌ఈవో ప్రకాష్, ఎంపీహెచ్ఏ శోభన్, ఎంఎల్‌హెచ్‌పీ జ్యోతి, ఏఎన్ఎంలు దేవి, కుమారి, రత్నకుమారి, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు. -
సర్వర్ నిరాశ
పింఛన్‌పై ఆశసీలేరు: మారుమూల గ్రామాల్లో పింఛన్ల దరఖాస్తు ప్రక్రియ గిరిజనులకు తీవ్ర పరీక్షగా మారింది. గత 27 నెలలుగా పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు దరఖాస్తు చేసుకునేందుకు సచివాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. ఈ నెల 16తో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగుస్తుండటం, మధ్యలో శని, ఆది, సోమవారాలు సెలవులు కావడంతో లబ్ధిదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అడుగడుగునా సాంకేతిక ఆటంకాలు ఏజెన్సీలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల నెట్వర్క్ వ్యవస్థ దెబ్బతిని, సచివాలయాల్లో సర్వర్ ఎర్రర్లు తలెత్తుతున్నాయి. ఒక్కో దరఖాస్తు నమోదుకు 20 నిమిషాలకు పైగా సమయం పడుతోంది. నెట్వర్క్ లేక, సచివాలయాలకు వెళ్లాలంటే పది కిలోమీటర్ల మేర ఉప్పొంగే వాగులు, గెడ్డలు దాటాల్సి వస్తోందని గిరిజనులు వాపోతున్నారు. సదరం సర్టిఫికెట్ లేక.. పుట్టుకతోనే వికలాంగులైన పలువురు బాధితులకు పాడేరు లేదా మైదాన ప్రాంతాలకు వెళ్లి సదరం ధ్రువపత్రం తెచ్చుకునేంత ఆర్థిక, శారీరక శక్తి లేదు. చింతపల్లి క్యాంప్‌కు చెందిన కిలో గణేష్ (13), చంద్రుపల్లికి చెందిన జానకిరామ్ (18), పార్వతీనగర్‌కు చెందిన కుర్ర అజయ్ (12), పరమసింగవరం గ్రామానికి చెందిన పోలియో బాధితుడు రాజులాంటి ఎందరో సదరం ధ్రువపత్రాలు లేక దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. ● మారుమూల అటవీ ప్రాంతాల్లోని ఈ అభాగ్యులకు ప్రత్యేకాధికారులు స్వయంగా గ్రామాలకు వచ్చి పరిశీలించి ’సదరం’ సర్టిఫికెట్లు మంజూరు చేయాలని స్థానికులు కోరుతున్నారు. అలాగే వర్షాలు, సర్వర్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని పింఛన్ల దరఖాస్తు గడువును పొడిగించాలని గిరిజనులు విజ్ఞప్తి చేస్తున్నారు. డుంబ్రిగుడలో సర్వర్ ఎర్రర్ డుంబ్రిగుడ: మండల కేంద్రంలోని సచివాలయంలో ప్రభుత్వం అందిస్తున్న వృద్ధాప్య, వికలాంగ, వితంతు, ఒంటరి మహిళా పింఛన్ల ఆన్లైన్ ప్రక్రియ కాకపోవడంతో గిరిజనులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు కార్యాలయం మూసివేసే వరకు సచివాలయం చుట్టూ పడికాపులు కాస్తున్నా పనులు కావడం లేదని వాపోతున్నారు. సర్వర్ ఎర్రర్ కారణంతో సచివాలయ సిబ్బంది ఆన్లైన్ ప్రక్రియను పక్కనబెట్టేశారని గిరిజనులు ఆరోపిస్తున్నారు. శని, ఆది, సోమవారాలు వరుస సెలవు దినాలు కావడంతో పింఛన్ల దరఖాస్తుకు నిర్ణయించిన గడువు తేదీ దాటిపోతుందని దరఖాస్తుదారులు తీవ్ర దిగులు చెందుతున్నారు. తహసీల్దార్ కార్యాలయంలో పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునే వారికి కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తక్షణమే అందిస్తున్నప్పటికీ, సచివాలయంలో ఆన్లైన్ చేయకపోవడంపై పలువురు మండిపడుతున్నారు. వందల సంఖ్యలో పెండింగ్ సిబ్బంది కొరతతో పాటు వెబ్సైట్ ఎర్రర్ వల్ల సచివాలయంలో వందలాది దరఖాస్తులు మూలనపడి ఉన్నాయని, మంగళవారంతో గడువు ముగిస్తే తమకు పింఛన్ రాదేమోనని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా పంచాయతీ కార్యదర్శులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, సచివాలయ సిబ్బంది స్పందించి, గిరిజనుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సాకులు చెప్పకుండా పింఛన్ల దరఖాస్తులను త్వరగా ఆన్లైన్ చేయాలని కోరుతున్నారు. దరఖాస్తు గడువు పెంచాలి: గిరిజన సంఘం డిమాండ్ చింతపల్లి: మండలంలో కొత్తగా పింఛన్లకు దరఖాస్తు చేసుకునే లబ్ధిదారులకు గడువు పొడిగించాలని మండల గిరిజన సంఘం కార్యదర్శి సాగిన చిరంజీవి డిమాండ్ చేశారు. శుక్రవారం చౌడుపల్లి పంచాయతీ పరిధిలోని సచివాలయం–2లో పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి వచ్చిన లబ్ధిదారులతో కలిసి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కొత్త పింఛన్ల కోసం వేలాది మంది అర్హులు ఎదురుచూస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ఉన్నపళంగా వృద్ధాప్య, వితంతు, వికలాంగ పింఛన్ల దరఖాస్తులకు కేవలం 7 రోజులే గడువు ఇవ్వడం అన్యాయమన్నారు. ప్రభుత్వం ప్రకటించిన 7 రోజుల గడువులో 3 రోజులు సెలవులే రావడం వల్ల అర్హులైన వారు దరఖాస్తు చేసుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పింఛన్ల దరఖాస్తుకు పలు రకాల ధ్రువీకరణ పత్రాలు అవసరం కావడంతో వాటిని సమకూర్చుకోవడానికే సమయం సరిపోవడం లేదన్నారు. స్వల్ప వ్యవధి విధించడం వల్ల ఎంతో మంది అర్హులు పింఛన్లకు దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు. లబ్ధిదారుల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని దరఖాస్తుల స్వీకరణ గడువును ఈ నెలాఖరు వరకు పొడిగించేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీసా కమిటీ ఉపాధ్యక్షుడు లోచలి రాజారావు, చిన్నాలదొర, లక్ష్మణరావు, మల్లుపడాల్, లక్ష్మయ్య పాల్గొన్నారు. చౌడుపల్లిలో పేదలతో కలిసి ఆందోళన చేస్తున్న గిరిజన సంఘం కార్యదర్శి చిరంజీవి ముంచంగిపుట్టు మండలం లక్ష్మీపురంలో మాట్లాడుతున్న మాజీ సర్పంచ్ త్రినాథ్ దరఖాస్తు చేసుకునేందుకుసాంకేతిక ఇబ్బందులు గడువు ముగుస్తుండటంతోఆందోళన -
వెటర్నరీ డీడీ జయరాజు హఠాన్మరణం
● గుండెపోటు కారణం ● పాడేరులో విషాదం పాడేరు రూరల్: పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ జయరాజు శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో ఆకస్మిక గుండెపోటుతో మృతి చెందారు. ఆయన హఠాన్మరణం పట్ల జిల్లా యంత్రాంగం, సహచర ఉద్యోగులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జయరాజు మృతి వార్త తెలుసుకున్న పలు శాఖల జిల్లా అధికారులు, ఉద్యోగులు పాడేరులోని ఆయన నివాసానికి చేరుకుని భౌతికకాయానికి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అనంతరం, భౌతికకాయాన్ని ఆయన స్వస్థలమైన కృష్ణా జిల్లా, గుడ్లవల్లేరు మండలం, డోకిపర్రు గ్రామానికి తరలించేందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. -
గణితంపై దృష్టి సారించాలి
● డీఈవో నాగేశ్వరరావు నక్కపల్లి: అన్ని పాఠశాలల్లో విద్యార్థులు చదవడం, రాయడంతో పాటు గణితంలో ప్రాథమిక అంశాలపై దృష్టిసారించాలని జిల్లా విద్యాశాఖాధికారి నాగేశ్వరరావు అన్నారు. చినదొడ్డిగల్లు జెడ్పీ ఉన్నతపాఠశాలను శుక్రవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. పదోతరగతి విద్యార్థులతో మాట్లాడి, అకడమిక్ క్యాలెండర్ ప్రకారం బోధన జరుగుతోందా, లేదా అనే విషయాన్ని పరిశీలించారు. పదోతరగతి విద్యార్థులతోపాటు మిగిలిన తరగతుల విద్యార్థులను రైజింగ్‌స్టార్, షైనింగ్స్టార్లుగా విభజించి మెరుగైన ఫలితాలు వచ్చేలా చూడాలని ఉపాధ్యాయులకు సూచించారు. పాఠ్యాంశాల బోధనకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని తెలిపారు. ఈ ఏడాది అన్ని పాఠశాలల్లో నూరుశాతం ఉత్తీర్ణత సాధించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. మండల విద్యాశాఖాధికారి, ప్రధానోపాధ్యాయుడు ప్రత్యేకంగా మానటరింగ్ చేసి ఫీడ్ బ్యాక్ డీఈవో కార్యాలయానికి ఎప్పటికప్పుడు పంపించాలన్నారు.పాఠశాలలో గ్రీన్ యాక్టవిటీ గురించి హెచ్ఎం బాలాజీని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థి దశ నుంచే పర్యావరణ విలువ తెలియజేయాలని సూచించారు. -
జాతీయ పురస్కార సాధనకు సమష్టి కృషి
● జెడ్పీ సీఈవో నారాయణమూర్తి కశింకోట: మండలంలోని జి.భీమవరం గ్రామ పంచాయతీకి జాతీయ పురస్కారం సాధించడమే లక్ష్యంగా సమష్టిగా కృషి చేయాలని జెడ్పీ సీఈవో పి. నారాయణమూర్తి అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం పంచాయతీని ఆకస్మికంగా సందర్శించారు. పంచాయతీలో నిర్వహిస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక వసతులపై పరిశీలించారు. జి.భీమవరాన్ని జాతీయ పురస్కారానికి ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, ఇతర చర్యలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. వెల్నెస్ కేంద్రం వద్ద సిమెంట్ కాలువ ఏర్పాటు చేయాలని, సంపద కేంద్రానికి గ్రావెల్‌రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామాభివృద్ధి పనుల్లో నాణ్యత, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. సంపద కేంద్రాన్ని, దాని పని తీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఎంపీడీవో సీహెచ్. చంద్రశేఖరరావు, డిప్యూటీ ఎంపీడీవో ఎం.వెంకటలక్ష్మి, పీఆర్ ఏఈ శేఖర్, పంచాయతీ అభివృద్ధి అధికారి ఆర్.నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. -
మట్టి గణపతినే పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుకుందాం
సాక్షి, పాడేరు: వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రజలంతా బాధ్యతగా మట్టి గణపతి విగ్రహాలనే పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ పిలుపునిచ్చారు. కలెక్టరేట్లో శుక్రవారం రాత్రి అధికారులు, సిబ్బందికి ఆమె మట్టి వినాయక విగ్రహాలను అందజేసి, ముందస్తు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసిన విగ్రహాల వినియోగానికి ప్రజలు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు.ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేయడం వల్ల నదులు, చెరువులు, ఇతర జలవనరులు తీవ్రంగా కలుషితమవుతాయని.. దీనివల్ల జలచరాలకు, పర్యావరణానికి ఎంతో హాని జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఇంట్లో, ప్రతి మండపంలోనూ మట్టి గణపతులను ప్రతిష్టించి పర్యావరణహితంగా పండుగను జరుపుకోవాలన్నారు. పిల్లల్లో సృజనాత్మకత పెంపొందించేలా వారితోనే సొంతంగా మట్టి విగ్రహాలను తయారు చేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎంవీఎస్ లోకేశ్వరరావు, కలెక్టరేట్ ఏవో, సూపరింటెండెంట్లు, వివిధ సెక్షన్ల సిబ్బంది పాల్గొన్నారు.జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ -
కళ్లకు గంతలు కట్టుకుని నిరసన
అనకాపల్లి: సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి నాయకులు ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు చేయకపోవడం అన్యాయమని ఏపీ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా జేఏసీ చైర్మన్ జయలక్ష్మి అన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్థానిక ఎన్టీఆర్ ఆస్పత్రి వద్ద కాంట్రాక్ట్ వైద్య ఉద్యోగులు కళ్లకు గంతలు కట్టుకుని శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంట్రాక్ట్ వైద్య ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా నాయకులు జగదీశ్వరి, శోభ, రమేష్, మోహన్, నందకిషోర్, దివాకర్ తదితరులు పాల్గొన్నారు. -
దరఖాస్తు చేసుకున్న అర్హుడికి పింఛన్ ఇవ్వాలి
అనకాపల్లి టౌన్: దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్క అర్హుడికి వచ్చేనెల 1వ తేదీ నుంచి పింఛన్ మంజూరు చేయాలని వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు డిమాండ్ చేశారు. స్థానిక వేల్పులవీధి స్వర్ణ సచివాలయంలో జరుగుతున్న పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను శుక్రవారం 82, 83 వార్డు పార్టీ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పింఛన్ల విషయాన్ని తెరపైకి తీసుకువచ్చారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి రెండున్నరేళ్లు అయిందని, పెన్షన్లపై తరచూ వైఎస్సార్ సీపీ పోరాటాలు చేస్తున్నా.. పట్టించుకోని ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికల్లో ఓట్ల కోసం ఒక్కసారిగా పింఛన్లు ఇస్తామంటూ హడావుడి చేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఇప్పుడు కేవలం దరఖాస్తులు స్వీకరణ మాత్రమేనని, బడ్జెట్ చూసిన తర్వాతే పింఛన్లు మంజూరు చేస్తామనడం చంద్రబాబు మార్క్ పాలనకు నిదర్శనమన్నారు. వారం రోజుల మాత్రమే గడువు పెట్టారని, అందులో రెండో శనివారం, ఆదివారం, వినాయక చవితి పండగ పోతే కేవలం నాలుగు రోజుల మాత్రమే దరఖాస్తులు స్వీకరించడం అన్యాయమన్నారు. గత వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో సంక్షేమ పథకాలు వలంటీర్ల ద్వారా ఇంటింటికీ అందింవడం నిరతర ప్రక్రియగా కొనసాగేదని గుర్తు చేశారు. ఇప్పుడు ఇచ్చిన గడువును పొడిగించి దరఖాస్తులు స్వీకరించాలని డిమాండ్ చేశారు. పార్టీ నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు జాజుల రమేష్, 82, 83 వార్డు అధ్యక్షుడు అల్లు త్రినాథ్, బుద్ద భాస్కరరావు, మాజీ కౌన్సిలర్లు నడిశెట్టి మధు, కొండూరు రవీంద్ర, కుండల రామకృష్ణ, పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఉగ్గిన అప్పారావు, కాకుకుండి కన్నబాబు, ఉగ్గిన శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. -
మట్టి గణపతిని పూజిద్దాం
● జేసీ శౌర్యమాన్ పటేల్ తుమ్మపాల: పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలను పూజించాలని జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్ కోరారు. ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం ఆధ్వ ర్యంలో ఉచిత మట్టి వినాయక ప్రతిమల పంపిణీని శుక్రవారం కలెక్టరేట్ ప్రాంగణంలో ఆయన ప్రారంభించి, పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణేష్ నవరాత్రి ఉత్సవాలను పర్యావరణహితంగా నిర్వహించాలన్నారు. పర్యావరణ హితమైన గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని, ప్రకృతి, జలవనరులను కాపాడుతూ భక్తిశ్రద్ధలతో పండగను చేసుకోవాలని తెలిపారు. -
శరణమయ్యా.. స్వయంభూ గణపయ్యా
ఆది పూజలు అందుకునే దేవుడు... సకల ప్రమథ గణాలకు అధిపతి అయిన వినాయకుని పూజిస్తే కార్యసిద్ధి తప్పకుండా కలుగుతుందని విశ్వాసం. కార్యసిద్ధి గణపతిగా ప్రసిద్ధి చెందిన చోడవరంలో వెలసిన స్వయంభూ విఘ్నేశ్వరుడి ఆలయం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ ఆలయాన్ని ఉత్తరాంధ్ర వాసుల కాణిపాకంగా వ్యవహరిస్తారు. చోడవరంలో 14 నుంచి నవరాత్రి ఉత్సవాలు ● భారీగా ఏర్పాట్లు చోడవరంలో స్వయంభూ విఘ్నేశ్వరస్వామిఆలయం ప్రధాన సింహద్వారం చోడవరం: రాష్ట్రంలో విశిష్టత కలిగిన స్వయంభూ విఘ్నేశ్వరాలయాలు రెండు ఉండగా వాటిలో ఒకటి చిత్తూరు జిల్లా కాణిపాకంలో, రెండవది విశాఖజిల్లా చోడవరంలో ఉంది. ఆదిదేవుడై, ఆపద్బాంధు వుడిగా, కోర్కెలు తీర్చే బొజ్జగణపతిగా, విద్యార్థు లకు ఆరాధ్యదేవుడిగా శ్రీ స్వయంభూ విఘ్నేశ్వరస్వామి పూజలందుకుంటున్నారు. తనను ఆశ్రయించిన భక్తుల కోరికలు తీరుస్తూ వారి పాలిట కొంగుబంగారమై భాసిల్లుతున్న ఈ స్వామి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్నాయి. 300 ఏళ్ల చరిత్ర సుమారు 300 ఏళ్లనాటి చరిత్ర కలిగిన చోడవరం ప్రధాన రహదారిని ఆనుకుని తూర్పుదిశగా ఉన్న ఈ ఆలయంలో విఘ్నేశ్వరుని విగ్రహం నడుము పైభాగం మాత్రమే దర్శనమిస్తుంది. స్వామివారి తొండం చివరిభాగం పైకి కనిపించదు. ఈ విగ్రహం ఏటేటా పెరుగుతుందని ప్రతీతి ఉంది. పాతచెరువు ఒడ్డున ఉన్న ఈ స్వయంభూ వినాయకుని విగ్రహాన్ని పక్కనే ఉన్న స్వయంభూ గౌరీశ్వరాలయంలోకి తరలించడానికి అప్పట్లో తవ్వకాలు జరిపించగా, ఎంత తవ్వినా స్వామివారి తొండం చివరి భాగం కనిపించకపోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నట్టు పూర్వీకులు చెబుతారు. తవ్వకాన్ని జరిపిన ప్రాంతాన్ని ‘ఏనుగుబోదె’గా పిలుస్తుంటారు. ఒకనాడు జీర్ణావస్థలో ఉన్న ఈ స్వయంభూ విఘ్నేశ్వరాలయాన్ని 1856లో చుండూరు వెంకన్న పంతులు ఆధ్వర్యంలో కొడమంచిలి చలపతిరావు అర్చకత్వంలో పునఃసంప్రోక్షణ జరిపారు. 1875లో కొడమంచిలి గణేష్, పలువురు కలసి స్థాపించిన శ్రీ బాలగణపతి సంఘం సహకారంతో ఈ ఆలయ పునఃనిర్మాణం చేపట్టారు. దేవదాయ ధర్మాదాయశాఖ ఆధీనంలో స్వామి వారికి పూజలు జరుగుతూ పుణ్యక్షేత్రంగా విరజిల్లుతోంది. ఈ ఆలయానికి ఉత్తర రాజగోపురం మాత్రమే ఉండేది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ చొరవతో సుమారు రూ. 3కోట్ల వ్యయంతో తూర్పు, పశ్చిమం, దక్షిణ రాజగోపురాలు నిర్మించారు. సుమారు 40 అడుగుల ఎత్తులో నిర్మించిన తూర్పు రాజగోపురం ఆలయానికి సరికొత్త ఆధ్యాత్మిక శోభను తెచ్చింది. మాడవీధుల నిర్మాణంలో భాగంగా మూడు రాజగోపురాలను కలుపుతూ రోడ్డు వేశారు. ఆలయ ప్రాంగణంలో ప్రతీ బుధ, శుక్రవారాల్లో గణపతి, లక్ష్మీగణపతి హోమాలు, లోకకల్యాణం కోసం నిర్వహించే హోమాలు కోసం ప్రత్యేకంగా యాగశాల ఉంది. ఆలయప్రాంగణంలో సంతోషిమాత ఆలయాన్ని కూడా నిర్మించారు. సర్వాంగ సుందరంగా నిర్మించిన ఈ ఆలయంలో భూమిలో వెలసిన శ్రీ స్వయంభూ విఘ్నేశ్వరున్ని దర్శించుకోవడానికి అన్ని ప్రాంతాల నుంచి భక్తులు నిత్యం వస్తారు. స్వామివారికి నిత్యపూజలు, అన్నదాన కార్యక్రమాలు, ప్రత్యేక కుంకుమార్చనలు వేదపండితుల సహస్రోర్చనల మధ్య అర్చనలు జరుపుతారు. నిత్యాన్నదానం ఇక్కడ నిర్వహిస్తున్నారు. 14 నుంచి ఉత్సవాలు ఈ ఏడాది వినాయక చవితి పండుగ, నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిపేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. ఈనెల 14వ తేదీన వినాయక చవితి పండగ నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. తొమ్మిది రోజుల పాటు ఈనెల 23వ తేదీ వరకూ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిపేందుకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయానికి రంగులు వేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. -
గిరి రైతుకు వర్ష యోగం
● విస్తారంగా వానలు ● ప్రాణం పోసుకుంటున్న ఖరీఫ్ పంటలు ● గిరి రైతుల్లో ఆనందం సాక్షి, పాడేరు: జిల్లాలో గత రెండు రోజులుగా మన్యంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో కొండవాగులు, గెడ్డల్లో వరద నీటి ప్రవాహం గణనీయంగా పెరిగింది. మరికొన్ని చోట్ల మోస్తరు వర్షం కురిసింది. పాడేరు, హుకుంపేట, డుంబ్రిగుడ, అరకులోయ ప్రాంతాల్లో గురువారం రాత్రంతా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. సంతలపై ప్రభావం.. పాడేరు పట్టణ పరిధిలో శుక్రవారం ఉదయం 9 గంటల తర్వాత వర్షం తగ్గడంతో వారపు సంతకు వచ్చే ప్రజలకు, వ్యాపారులకు పెద్దగా ఇబ్బంది తప్పింది. అయితే మిగిలిన ప్రాంతాల్లో వర్షం కొనసాగడంతో అరకు వారపు సంతలో చిరువ్యాపారులు, గిరిజనులు తీవ్ర అవస్థలు పడ్డారు. రైతన్నల ఆనందం సాగునీరు అందక ఎండిపోయే దశకు చేరుకున్న ఖరీఫ్ వ్యవసాయ భూములకు ఈ వర్షాలు ఎంతో మేలు చేశాయని గిరిజన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 197.6 ఎంఎం వర్షపాతం జిల్లాలో హుకుంపేటలో 31.8 మిల్లీమీటర్లు, పాడేరులో 29.6, ముంచంగిపుట్టులో 22.6, చింతపల్లిలో 22.2, డుంబ్రిగుడలో 16.4, జి.మాడుగులలో 16.4, అరకులోయలో 15.2, పెదబయలులో 12.8, అనంతగిరిలో 7.2, కొయ్యూరులో 7 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. సీలేరు: ఆంధ్రా–ఒడిశా సరిహద్దు అటవీ ప్రాంతాల్లో గురువారం సాయంత్రం 4 గంటల నుంచి భారీ వర్షం కురుస్తోంది.రోడ్లన్నీ జలమయమయ్యాయి. దారకొండ దారాలమ్మ ఘాట్ రోడ్డుపై వర్షం కారణంగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అంతర్రాష్ట్ర రహదారిపై సీలేరు సమీపంలోని ఎర్రదెబ్బల వద్ద రోడ్డుపై భారీ వృక్షం కూలిపోవడంతో ఇరువైపులా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. సీలేరు ప్రధాన రహదారి అంతటా వర్షపు నీరు ప్రవహిస్తోంది. వర్షం తీవ్రతకు మారుమూల ప్రాంతాల్లోని వ్యాపార సముదాయాలు, దుకాణాలు మూతపడ్డాయి. మాదిగమల్లు, పిల్లిగెడ్డ, చిన్నగంగవరం, వలసగెడ్డ వాగులు పొంగిపొర్లుతున్నాయి.గిరిజనుల పంట పొలాల్లోకి నీరు చేరడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
ఉత్సాహంగా చెకుముకి పోటీలు
కశింకోట: స్థానిక బాలికల జిల్లా పరిషత్ హైస్కూల్లో శుక్రవారం మండల స్థాయి చెకుముకి పోటీలు నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పోటీలకు హాజరై, తమ ప్రతిభను ప్రదర్శించారు.కశింకోట డీపీఎన్ జెడ్పీ హైస్కూలు, ప్రైవేటు సెయింట్ జాన్స్ స్కూలు విద్యార్థులు విజేతలుగా నిలిచారు. ఈ సందర్భంగా ఎంఈవో రమణశ్రీ మాట్లాడుతూ విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం పెరగాలని, సైన్స్‌ను అర్థం చేసుకోవాలన్నారు. పాఠశాల హెచ్ఎం ఎం.ఎస్. స్వర్ణకుమారి మాట్లాడుతూ శాస్త్ర, సాంకేతిక రంగాల్లో రాణించాలంటే ఇటువంటి పోటీల్లో అందరూ పాల్గొవాలని కోరారు. జిల్లా సైన్స్ అధికారి దాడి కాళిదాసు మాట్లాడుతూ విద్యార్థులు అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకుని శాస్త్రవేత్తలు కావడానికి కృషి చేయాలన్నారు. భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు కేశవరావు మాట్లాడుతూ విద్యార్థులు మూఢ నమ్మకాలను విడనాడాలన్నారు. జిల్లా జన విజ్ఞాన వేదిక అధ్యక్షుడు ఎం.ఎస్.వి.ఎస్.పి. వర్మ తదితరులు పాల్గొన్నారు. -
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
చింతపల్లి: ప్రముఖ పర్యాటక ప్రాంతమైన లంబసింగి పరిసరాల్లో రానున్న పర్యాటక సీజన్లో పోలీసు నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్థానిక డీఎస్పీ సీహెచ్ తిరుపతిరావు హెచ్చరించారు. శుక్రవారం స్థానిక సబ్ డివిజనల్ పోలీసు అధికారి కార్యాలయంలో లంబసింగి, తాజంగి పరిసర ప్రాంతాల్లో ప్రైవేటు రిసార్టులు నడుపుతున్న నిర్వాహకులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. పర్యాటక సీజన్లో ఈ ప్రాంతాన్ని సందర్శించే కుటుంబాలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సురక్షితమైన వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత రిసార్ట్ నిర్వాహకులపైనే ఉందన్నారు. రిసార్టులకు వచ్చే పర్యాటకుల గుర్తింపు కార్డులు, ఫోన్ నంబర్లు, పూర్తి వివరాలను ప్రత్యేక రిజిస్టర్లో నమోదు చేయాలని సూచించారు. రిసార్టుల్లో అక్రమంగా మద్యం సేవించడాన్ని పూర్తిగా నిషేధించాలని ఆదేశించారు. యువకులు, ఇతర బృందాలు వచ్చినప్పుడు వారి ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనిస్తుండాలని సూచించారు. ప్రతి రిసార్ట్ ప్రవేశ ద్వారం, పార్కింగ్, కారిడార్లు తదితర ప్రాంతాల్లో 24 గంటలూ పనిచేసే సీసీ కెమెరాలను విధిగా ఏర్పాటు చేయాలన్నారు. కనీసం నెల రోజుల సీసీ పుటేజీలను భద్రపరచాలని సూచించారు. చీకటి పడిన తర్వాత రిసార్ట్ ప్రాంగణాల్లో తగిన వెలుగు ఉండేలా ప్రత్యేక లైటింగ్ సౌకర్యం కల్పించాలన్నారు. రాత్రి 10 గంటల తర్వాత ఎలాంటి డిజే సౌండ్ సిస్టమ్‌లు వాడకూడదని సూచించారు. ఏ ఒక్కరూ అనుమానాస్పదంగా కనిపించినా వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలన్నారు. సీఐ సింహాచలం, పలువురు ప్రైవేటు రిసార్ట్ నిర్వాహకులు పాల్గొన్నారు. -
కూడ గ్రామంలో రేషన్ డిపో ఏర్పాటుకు వినతి
డుంబ్రిగుడ: మండలంలోని గసభ పంచాయతీ కూడ రెవెన్యూ గ్రామంలో నూతన రేషన్ డిపోను ఏర్పాటు చేయాలని కోరుతూ స్థానిక రేషన్ కార్డుదారులు శుక్రవారం పాడేరులో జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గసభ పంచాయతీ మాజీ సర్పంచ్ పాంగి సురేష్‌కుమార్‌తో పాటు 5 గ్రామాల ప్రజలు మాట్లాడుతూ.. తమ ప్రాంతవాసులు రేషన్ బియ్యం కోసం సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న లోగిలి డిపోకు వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నడవలేని వృద్ధులు, గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రని, ప్రజలకు అందుబాటులో ఉండేలా కూడ గ్రామంలో వెంటనే రేషన్ డిపోను ఏర్పాటు చేయాలని కోరా రు. స్థానికుల వినతిపై జాయింట్ కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. రేషన్ డిపోతో పాటు అర్హులైన గిరిజనులకు పోడు పట్టాలు మంజూరు చేయాలని కూడా అధికారులకు వినతిపత్రం అందజేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డు మెంబర్ పాంగి గోపాల్, గెమ్మెలి రామన్న, మర్రి రామన్న, కొర్రా రాజారావు, గెమ్మెలి రఘునాథ్, హరిబాబు, బొంజుబాబు తదితరులు పాల్గొన్నారు. -
ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లపై సుప్రీం తీర్పును అమలు చేయాలి
తుమ్మపాల: ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగబద్ధంగా కల్పించిన రిజర్వేషన్ల అమలులో సుప్రీంకోర్టు తీర్పును ప్రభుత్వం అమలు చేయాలని ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణ సమితి నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం కలెక్టరేట్ గేటు వద్ద నిరసన వ్యక్తం చేసి, జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు రావాడ గణేష్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వ్యక్తులు మతం మారిన సందర్భంలో వర్తించే రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిబంధనల ప్రకారం అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ మాల కొండయ్య, ప్రాజెక్టు ప్రముఖ్ ఎస్.సత్యనారాయణ, జిల్లా ప్రచారక్ శ్రీను పాల్గొన్నారు. -
పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ
జి.మాడుగుల: మండలంలోని కుంబిడిసింగి, కోరాపల్లి పంచాయతీ పరిధిలోని చింతలగొంది, వరదమామిడి గ్రామాల్లో గురువారం నిర్వహించిన ’మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమంలో తహసీల్దార్ గిడ్డి రాజ్‌కుమార్, వైఎస్సార్సీపీ మండల నాయకుడు పెద్దబాలన్న గిరిజన రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. చింతలగొంది గ్రామంలో మొత్తం 41 మంది లబ్ధిదారులకు పాసుపుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గిరిజన లబ్ధిదారులు తమ భూములను సద్వినియోగం చేసుకుని, వ్యవసాయాభివృద్ధితో ఆర్థికంగా నిలదొక్కుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిట్టిబాబు, పాడేరు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గబ్బాడి శాంతికుమారి, ఎంపీటీసీ రామారావు, మాజీ సర్పంచ్‌లు కృష్ణమూర్తి, అప్పన్నదొర, ఏ.రామూర్తి, వీఆర్వోలు అనిత, యేసురత్నం, సర్వేయర్ శ్రీకాంత్ పాల్గొన్నారు. అర్హులందరికీ పట్టాలివ్వాలి గూడెంకొత్తవీధి: అర్హులైన రైతులందరికీ పట్టాలు పంపిణీ చేయాలని ఎంపీపీ బోయిన కుమారి కోరారు. గూడెంకొత్తవీధి పంచాయతీ బోనంగిపల్లిలో గురువారం తహసీల్దార్ అన్నాజీరావుతో కలిసి 45 మంది రైతులకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ చాలా మంది రైతులకు పట్టాలు అందలేదన్నారు. రీసర్వే అనంతరం వారికి కూడా పట్టాలు ఇవ్వాలని కోరారు. దీనిలో స్థానికులు కొర్రా బలరాం, నాగమణి, వీర వెంకట్ పాల్గొన్నారు. -
ఏలేరుకు పోలవరం నీరు నిలిపివేత
కశింకోట : మండలంలోని తాళ్లపాలెం సంత వద్ద అనుసంధాన ప్రాంతంలో పోలవరం ఎడమ కాలువ నీటి ప్రవాహాన్ని గురువారం నిలిపి వేశారు. ఈ మేరకు ఏలేరు కాలువతో కలిసే చోట నీరు ప్రవహించకుండా పోలవరం కాలువకు అడ్డుకట్ట వేశారు. ఈ కాలువ ద్వారా తాగునీటి అవసరాలకు విశాఖలోని స్టీల్‌ప్లాంట్ వద్ద ఉన్న కణితి జలాశయానికి 250 క్యూసెక్కుల నీరు తరలింపు పూర్తి కావడంతో తాత్కాలికంగా నిలిపి వేసినట్టు పోలవరం 7వ ప్యాకేజీ అధికారులు తెలిపారు. మళ్లీ ఉన్నతాధికారుల ఆదేశిస్తే విశాఖకు నీటి తరలింపునకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం తాళ్లపాలెం, యలమంచిలి మండలంలోను ఉన్న మదుముల ద్వారా పోలవరం కాలువ నీటిని వ్యవసాయ అవసరాలకు శారద, వరహా నదుల్లోకి విడుదల చేసి తరలిస్తున్నట్టు చెప్పారు. ఇదిలా ఉండగా తాళ్లపాలెం వద్ద నర్సీపట్నం రోడ్డు వైపు రెండు వైపులా కొత్తగా నిర్మించిన పోలవరం కాలువ దిగువ నుంచి నీరు లీక్ అవుతుందని, దీనివల్ల ప్రమాదం పొంచి ఉందని స్థానిక సంత ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే కాలువ లీక్ కాదని, లీక్ అయితే అది క్రమేపీ పెద్దది అవుతుందని, అటువంటిది లేదని అధికారులంటున్నారు. సాధారణంగా ఉండే భూ స్థాయిలో నీరు అని, కాలువ నుంచి లీక్ అవ్వడం కాదని, దీనికి భయపడాల్సిన అవసరం లేదంటున్నారు. ఇదిలా ఉండగా గురువారం కురిసిన వర్షానికి ఎడమ వైపు రక్షణ గట్టు నుంచి మట్టి కాలువలోకి కొంతమేర కొట్టుకుపోయి గొయ్యిలా ఏర్పడింది. -
మృత్యువులోనూ వీడని స్నేహ బంధం
అచ్యుతాపురం రూరల్ : పెన్షన్ దరఖాస్తు చేసుకునేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు గీత కార్మికులను వెనుక నుంచి వేగంగా వచ్చిన బైక్ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటన బుధవారం మండల కేంద్రమైన అచ్యుతాపురానికి కూత వేటు దూరంలో ఉన్న వెదురువాడ గ్రామ సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మెట్టధర్మవరం గ్రామానికి చెందిన గీత కార్మికులు పెంకే మారయ్య (53), రెడ్డి అప్పారావు (53) బుధవారం ఉదయం 10 గంటల సమయంలో టీవీఎస్ మోపేడ్ (ఏపీ40హెచ్‌జీ8272) నెంబరు గల ద్విచక్ర వాహనంపై వెదురువాడ సచివాలయానికి బయలు దేరారు. మారయ్య వాహనం నడుపుతుండగా, అప్పారావు వెనుక కూర్చున్నారు. పూడి ఆర్అండ్ఆర్ కాలనీ కూడలికి సుమారు 100 మీటర్ల దూరంలో యలమంచిలి వైపు నుండి వేగంగా, అజాగ్రత్తగా వచ్చిన గ్లామర్ బైక్ (ఏపీ31డీజెడ్7909) వారి వాహనాన్ని బలంగా ఢీకొంది. ప్రమాదంలో మారయ్య, అప్పారావులకు తీవ్రంగా గాయాలు కావడంతో రోడ్డుపై పడిపోయారు. వెంటనే అంబులెన్స్‌లో అనకాపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో రెడ్డి అప్పారావు మృతి చెందగా, అదే రోజు రాత్రి 11.30 గంటల సమయంలో పెంకే మారయ్య కూడా మృతి చెందారు. అప్పారావు భార్య రెడ్డి నూకరత్నం గురువారం ఉదయం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. కేసు దర్యాప్తును ఎస్ఐ ఎమ్.వెంకటరావు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన బైక్ వివరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అకాల మరణం చెందిన ఇద్దరూ 1973వ సంవత్సరంలో జన్మించి నేటికీ అన్నదమ్ముల్లా కలసి మెలసి జీవించారని కుటుంబీకులు ఆవేదన చెందారు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు కుటుంబ పెద్దలు మృత్యువాత పడడంతో ఆ కుటుంబాల్లో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కుటుంబాలకు చెందిన ఇరువురు కుటుంబాల్లో ఇంకా తమ బాధ్యత నెరవేర్చాల్సి ఉండగా ఇటువంటి అనుకోని ప్రమాదంలో ఇరువురి ప్రాణాలు కోల్పోవడం ఆయా కుటుంబాల్లో తీవ్ర ఆవేదనను కలిగించింది. ప్రభుత్వం స్పందించి మృతుని కుటుంబాలను ఆదుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు, అనకాపల్లి జిల్లా యాత సంక్షేమ సంఘం అధ్యక్షులు పెంకే మారేష్ కోరారు. -
మూతబడిన పాఠశాలకు రూ.10 లక్షలతో ప్రహరీ నిర్మాణం!
దేవరాపల్లి : మండలంలోని కాశీపురం పంచాయతీ శివారు చంద్రయ్యపేటలో విద్యార్థులు లేక మూతపడిన ప్రాథమిక పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మించడం సర్వత్రా విమర్శలకు దారి తీసింది. రెండేళ్ల క్రితం నుంచి విద్యార్థులు లేని కారణంగా (జీరో ఎన్రోల్మెంట్ స్కూల్) ఈ పాఠశాలలో ఉపాధ్యాయురాలను దేవరాపల్లికి సర్దుబాటు చేశారు. ఒక్క విద్యార్ది కూడా లేని పాఠశాలలో నిర్మించిన ప్రహరీ గోడను స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి గురువారం ప్రారంభోత్సవం చేయడం పట్ల స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎవరి ప్రయోజనం కోసం ఈ ప్రహరీ గోడను నిర్మించారని పంచాయతీకి చెందిన పలువురు వ్యక్తులు బాహాటంగా ప్రశ్నిస్తున్నారు. కేవలం టీడీపీ కార్యకర్తలకు ఆర్థిక ప్రయోజనం చేకూర్చేందుకే రూ.9.92 ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులతో ప్రహరీ గోడను నిర్మించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కార్యకర్తలకు దోచిపెట్టేందుకు ప్రభుత్వ నిధులను ఇలా దుర్వినియోగం చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిధులను ప్రజా ప్రయోజనం కోసం కాకుండా తమ పార్టీ కార్యకర్తల లబ్ధి కోసం కేటాయించడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదే కాశీపురం నుంచి గవరవరం వరకు రోడ్డు రెండేళ్లుగా అసంపూర్తిగా ఉండడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని చిత్తశుద్ధి ఉంటే ఈ రోడ్డు పనులు పూర్తి చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ రోడ్డులో రాళ్లు తేలడంతో సుమారు 20 గ్రామాల ప్రజలు నిత్యం నరకయాతన పడుతున్నారని, ఇంతటి ప్రాధాన్యం కలిగిన రోడ్డును పట్టించుకోకపోవడం దారుణమని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఇక్కడి పాఠశాల ప్రహరీ ప్రారంభోత్సవానికి ఉపాధి కూలీలను పని ప్రదేశం నుంచి తీసుకువచ్చి ఇబ్బందులకు గురి చేయడం, సుమారు నాలుగైదు వారాలుగా కూలీ సొమ్ము అందక అవస్థలు పడుతున్నా పట్టించుకోక పోవడం విమర్శలకు తావిస్తుంది. -
రూ.27 లక్షల విలువైన లిక్విడ్ గంజాయి పట్టివేత ●ఇద్దరు అరెస్ట్
పట్టుబడిన గంజాయి నింధితులతో డిఎస్పీ శ్రీనివాసరావు, సీఐ గపూర్ నర్సీపట్నం : బైక్‌పై రవాణా చేస్తున్న రూ.27.70 లక్షలు విలువైన లిక్విడ్ గంజాయిని నర్సీపట్నం టౌన్ పోలీసులు గురువారం పట్టుకున్నారు. డీఎస్పీ పి.శ్రీనివాసరావు అందించిన వివరాలివి. పెదబొడ్డేపల్లి జంక్షన్ వద్ద సీఐ ఎస్.కె.గపూర్, ఎస్ఐ రమేష్ సిబ్బందితో వాహన తనిఖీలు చేస్తున్నారు. అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతం నుంచి 2 కిలోల లిక్విడ్ గంజాయిని బైక్‌పై తీసుకువస్తూ యువతి, యువకుడు పోలీసులకు పట్టుబడ్డారు. కొయ్యూరు మండలం, డొకురాయి గ్రామానికి పాంగి శివ(25), కిత్తాబ్ గ్రామానికి మర్రి ఇందు(20) అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. గంజాయి అమ్మిన వ్యక్తిని అరెస్టు చేస్తామన్నారు. నిందితుల దగ్గర నుంచి రెండు సెల్ఫోన్లు, బైక్ సీజ్ చేశామన్నారు. -
క్వారీల నిర్వహణపై ప్రజాభిప్రాయ సేకరణ
హాజరైన గ్రామస్తులు, మాట్లాడుతున్న సీపీఐ జిల్లా కార్యదర్శి రాజాన దొరబాబు, పాల్గొన్న నర్సీపట్నం ఆర్డీవో వి.వి.రమణ, ఎన్విరాన్మెంట్ డీటీ ముకుందరావు మాడుగుల : వొమ్మలి జగన్నాథపురం గ్రామంలో ఆర్నా గ్రానైట్ పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ నర్సీపట్నం ఆర్డీవో వి.వి.రమణ, ఎన్విరాన్మెంట్ ఈఈ ముకుందరావు ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా 23 మందితో ప్రజాభిప్రాయ సేకరణ తీసుకున్నారు. వీజేపురం గ్రామానికి చెందిన జయరామ్, శామంతుల అచ్చిబాబు, తాడి వెంకటరమణ, మజ్జి శంకరరావు, మాట్లాడుతూ మండలంలో వెనుకబడిన వీజేపురం గ్రామానికి ఆర్న గ్రానైట్ వల్ల నష్టం లేదని, గ్రామానికి చెందిన నిరుద్యోగులకు జీవనోపాధి కల్పించాలని, గ్రామాన్ని ఆర్థికంగా ఆదుకుంటున్నారని, ధూళి రాకుండా ఉదయం, సాయంకాలం వాటరింగ్ చేస్తున్నారని, మా గ్రామానికి క్వారీల నిర్వహణ వల్ల ఎటువంటి నష్టం లేదని చెప్పారు. రావికమతం గుమ్మాళ్లపాడు గ్రామానికి చెందిన బంటు శ్రీనివాసరావు మాట్లాడుతూ క్వారీ నిర్వాహణ వల్ల పర్యావరణానికి నష్టం జరగకుండా మొక్కలు నాటాలని, భారీ క్వారీ లారీల వల్ల రోడ్లు ధ్వంసం అవుతున్నాయని, వాటి బరువుకు తగిన రోడ్లు ఏర్పాటు చేయాలన్నారు. క్వారీ వల్ల నష్టం కలిగే రైతులకు ఉపాధి చూపించాలన్నారు. సీపీఎం గోవిందరావు మాట్లాడుతూ ఉరలోవకొండపై ఆధారపడి 300 గిరిజన కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని వారికి నష్టం జరగకుండా క్వారీ యజమానులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి రాజాన దొరబాబు మాట్లాడుతూ గ్రానైట్ క్వారీల వల్ల వచ్చే డీఎంఎఫ్ నిధుల్లో గణనీయమైన భాగాన్ని ప్రభావిత గ్రామాల మౌలిక సదుపాయాలకు కేటాయించాలని, స్థానిక యువతకు ఉపాధి కల్పించాలని, గ్రీన్ బెల్ట్ అభివృద్ధి నిబంధనలు పాటించాలని అన్నారు. తహసీల్దార్ రమాదేవి, డీటీ రాజా, ఎస్ఐ జి.నారాయణరావుతో సిబ్బంది, వీజేపురం గ్రామస్తులు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. -
ఏఐ నైపుణ్యాలతో మంచి భవిష్యత్తు
● జేసీ తిరుమణి శ్రీపూజ చింతపల్లి: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో నైపుణ్యాలు పెంచుకోవడం ద్వారా భవిష్యత్తులో అత్యుత్తమ ఉపాధి అవకాశాలు లభిస్తాయని జాయింట్ కలెక్టర్ శ్రీమణి పూజ తెలిపారు. గురువారం స్థానిక యూత్ ట్రైనింగ్ సెంటర్లోలో నిర్వహిస్తున్న ఆరోహణ్’ ఏఐ శిక్షణా కార్యక్రమాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైటీసీలో విద్యార్థులకు అందుతున్న బోధన, తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్‌లతో పాటు శిక్షణ తీరుతెన్నులను జేసీ స్వయంగా పరిశీలించారు. క్లాసుల నిర్వహణ, భోజన వసతి, ఇతర వసతులపై విద్యార్థులతో నేరుగా మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. శిక్షణలో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి సూచనలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఏఐ సాంకేతికతను విద్యార్థులు సమర్థవంతంగా నేర్చుకుని, భవిష్యత్తులో లభించే ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేలా మెరుగైన, నాణ్యమైన శిక్షణ అందించాలని ట్రైనర్లకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ త్రివేణి, ఆర్ఐ కృష్ణమూర్తి, ‘ఆరోహణ్’ సంస్థ ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఫేక్ యాప్‌లను నమ్మి మోసపోవద్దు
● పాడేరు డీఎస్పీ రాజా సింహారెడ్డి జి.మాడుగుల: ఫేక్ యాప్‌లు, నకిలీ లింకులు, మోసపూరిత మెసేజ్‌లను నమ్మి ప్రజలు ఆర్థికంగా మోసపోవద్దని పాడేరు డీఎస్పీ రాజా సింహారెడ్డి సూచించారు. మండలంలోని కే.కోడాపల్లి పంచాయతీ కేంద్రంలో గురువారం పోలీసుల ఆధ్వర్యంలో సైబర్ నేరాలు, మహిళా భద్రత, గంజాయి నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. గుర్తుతెలియని లింకులు, యాప్‌లను డేవ్లోడ్ చేయవద్దన్నారు. అంతేకాకుండా బ్యాంకు వివరాలు, ఓటీపీ, ఏటీఎం సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు. మహిళల భద్రతలో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీఐ లక్ష్మణరావు, ఎస్ఐ సాయిరాం పడాల్, ఇతర సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు. -
పారామెడికల్ ఉద్యోగుల పోస్టుకార్డు ఉద్యమం
పోస్టుకార్డును వేస్తున్న అసోసియేషన్ జిల్లా జేఏసీ చైర్మన్ జయలక్ష్మి అనకాపల్లి : రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ అండ్ హెల్త్ విభాగంగా కాంట్రాక్టు పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించి, రెగ్యులర్ ఉద్యోగులుగా నియామకాలు చేయాలని మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ అసోసియేషన్(పారామెడికల్) జిల్లా జేఏసీ చైర్మన్ జయలక్ష్మి అన్నారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో 100 రోజుల ప్రణాళికలో భాగంగా స్థానిక ఉడ్‌పేట తపాల కార్యాలయం వద్ద పోస్టు డబ్బాలో ఉత్తరాలను బుధవారం వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మెడికల్ అండ్ హెల్త్ విభాగంగా వివిధ విభాగాల్లో అనేక సంవత్సరాలుగా చాలీచాలని జీతాలతో ఉద్యోగాలు చేయడం జరుగుతుందని, కూటమి ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికల సమయంలో కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తింపు తీసుకువస్తామని ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు జిల్లా నాయకులు జగదీశ్వరి, శోభ, రమేష్, మోహన్, నందకిషోర్, దివాకర్ పాల్గొన్నారు. -
క్లీన్‌స్వీప్ లక్ష్యం
స్థానిక ఎన్నికల్లో● వైఎస్సార్సీపీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ● స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవాలకు తావులేకుండా బరిలోకి.. కష్టపడే కార్యకర్తలకే టికెట్లు ● కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, గిరిజన వ్యతిరేక విధానాలపై నిరంతర పోరాటానికి పిలుపు అరకులోయ టౌన్: కూటమి వైఫల్యాలను ఎండగడుతూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని, ఎట్టి పరిస్థితుల్లో ఏకగ్రీవాలకు అవకాశం లేకుండా చూడాలన్నారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గురువారం అరకులోయలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం ఆయన అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేసి.. పార్టీ బలాన్ని మరోసారి చూపించాలన్నారు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి, సామాజిక సమీకరణాలు, గెలుపు గుర్రాలకే అవకాశమిస్తూ అభ్యర్థులను బరిలోకి దించనున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను, గిరిజన వ్యతిరేక విధానాలను నిరంతరం ఎండగట్టాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పనిసరిగా అవకాశం ఉంటుందన్నారు. అనంతరం ’వెన్నుపోటు పార్టీ–వెన్నుపోటు పాలన’ పోస్టర్‌ను పార్టీ నేతలు ఆవిష్కరించారు. వెన్నుపోటు పాలన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీ నాయకులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని అరకు ఎంపీ గుమ్మా తనూజరాణి ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడల్లా గిరిజనులకు వెన్నుపోటు పొడవడమే నైజమని మండిపడ్డారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో అరకులో నిర్వహించిన సభలో చంద్రబాబు ఇచ్చిన జీవో నంబరు 3 హామీని నేటికీ నెరవేర్చలేదని విమర్శించారు. స్థానిక ఎన్నికల్లో గిరిజనుల సత్తా ఏంటో చూపించాలన్నారు. కూటమి నేతల్లో భయం అరకు పార్లమెంట్ పరిధిలోని ఎంపీతో పాటు రెండు ఎమ్మెల్యే స్థానాలను వైఎస్సార్సీపీ గెలుచుకోవడంతో కూటమి నేతల్లో గుండె దడ మొదలైందని ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర వ్యాఖ్యానించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు మన్యంలో పర్యటించి ఓట్లు అడుక్కునే దుస్థితి దాపురించిందని ఎద్దేవా చేశారు. వైఎస్సార్సీపీ జెండా ఎగరాలి పాడేరు ఏజెన్సీలోని 135 గ్రామ పంచాయతీల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్సీ కుంభా రవిబాబు అన్నారు. స్థానిక పోరులో విజయం సాధిస్తే, 2029లో జగన్‌ను మళ్లీ సీఎం చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రలో గిరిజన ప్రాంతాలు జగనన్న వైపే నిలిచాయని కొనియాడారు. టీడీపీ కాదు.. వెన్నుపోటు పార్టీ ఇకపై ’తెలుగుదేశం పార్టీ’ అని అనకుండా ’వెన్నుపోటు పార్టీ’ అని సంబోధించాలని అరకు అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకుడు బాణాల శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. కూటమి గాలిలోనూ మన్యంలో వైఎస్సార్సీపీ అభ్యర్థులే గెలిచారని గుర్తుచేశారు. అభ్యర్థులను ముందేసిద్ధం చేసుకోవాలి ప్రతి సెగ్మెంట్లోనూ ఒక మహిళ, ఒక పురుష అభ్యర్థిని ముందుగానే ఎంపిక చేసుకుంటే రిజర్వేషన్ల సమయానికి ఉపయోగపడుతుందని అరకు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు చింతలపూడి వెంకట్రామయ్య సూచించారు. నాడు–నేడు, మెడికల్ కాలేజీల ఏర్పాటుతో మన్యాన్ని అభివృద్ధి చేసిన ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు. సమన్వయంతో పనిచేయాలి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మళ్లీ అధికారంలోకి వచ్చి, ’జగన్ అనే నేను’ అంటూ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయాలంటే.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిష్టానం ఎవరికి టికెట్ కేటాయించినా వారి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి పిలుపునిచ్చారు. గ్రామ స్థాయిలో కూటమికి బలమైన క్యాడర్ లేదని, ఈ పరిస్థితిని వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు అనుకూలంగా మార్చుకోవాలని సూచించారు. గ్రామాల్లో వైఎస్సార్సీపీకి మరింత బలం గతంలో ’గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్లడంతో వైఎస్సార్సీపీకి మరింత బలం చేకూరిందని, మన్యం గ్రామాల్లో పార్టీ కార్యకర్తలకు మంచి గౌరవం ఉందని మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ అన్నారు. గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో కన్వీనర్లు, బూత్ కన్వీనర్లను నియమించామని గుర్తుచేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల టికెట్ల కేటాయింపులో వారికి సముచిత స్థానం కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి పాంగి చిన్నారావు, రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడు రేగం చాణక్య, మాజీ జీసీసీ చైర్పర్సన్ శోభ స్వాతిరాణి, జిల్లా ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి శెట్టి అప్పాలు, ఉమ్మడి విశాఖ జిల్లా ఎస్టీ సెల్ మాజీ అధ్యక్షుడు కమిడి అశోక్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు సత్తిబాబు, జెడ్పీటీసీ చటారి జానకమ్మ, ఎంపీపీలు బాకా ఈశ్వరి, టి. మిథుల, మాజీ ఎంపీపీ శెట్టి నీలవేణి, మండల పార్టీ అధ్యక్షులు స్వాభి రామమూర్తి, పాంగి పరశురామ్, కొర్రా సూర్యనారాయణ, చంద్రుబాబు, అనిల్, పద్యారావు, ఉపాధ్యక్షులు పల్టాసింగ్ విజయ్ కుమార్, ప్రకాష్ రావు తదితర నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పోస్టర్ ఆవిష్కరిస్తున్న మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ, ఎంపీ తనూజారాణి, అసెంబ్లీ పరిశీలకులు వెంకట్రామయ్య, శ్రీనివాస్, అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, ఎమ్మెల్సీ రవిబాబు, మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మిమాట్లాడుతున్న ఎమ్మెల్యే మత్స్యలింగం, వేదికపై ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్రవైఎస్సార్సీపీలోభారీగా చేరికలు హుకుంపేట నుంచి 40 మంది, పెదబయలు నుంచి 50 మంది, ముంచంగిపుట్టు నుంచి 30 మంది, అనంతగిరి నుంచి 20 మంది కూటమి కార్యకర్తలు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. -
సెల్ టవర్ల నిర్మాణం వేగవంతం
సాక్షి, పాడేరు: మారుమూల గిరిజన ప్రాంతాలకు టెలికాం నెట్వర్క్ సేవలు అందించేందుకు మంజూరైన సెల్టవర్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ అధికారులను ఆదేశించారు. గురువారం ఆమె నెట్వర్క్ సంస్థల ప్రతినిధులు, రెవెన్యూ, అటవీశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయి పరిశీలన నివేదికలను అధికారులు వెంటనే సమర్పించాలన్నారు. జిల్లా స్థాయి కమిటీ క్లియరెన్స్ ఇచ్చిన అన్ని ప్రాంతాల్లో పనులను తక్షణమే ప్రారంభించి, వేగవంతం చేయాలని సూచించారు. జియో సంస్థకు మంజూరైన 6 ప్రదేశాలకు గానూ ఇప్పటికే 2 చోట్ల పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. టవర్ల నిర్మాణానికి స్థానిక కార్మికులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, స్థల సమస్యలు ఏవైనా ఉంటే తక్షణమే పరిష్కరించాలని తహసీల్దార్లను ఆదేశించారు. అలాగే నెట్వర్క్ కనెక్టివిటీకి రహదారుల పరంగా ఎదురవుతున్న ఇబ్బందులపై సమీక్షించి వివరాలు అందజేయాలని కోరారు. చవితి మండపాలకు అనుమతి తప్పనిసరి వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని జిల్లాలో భారీగా పందిళ్లు, మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు పోలీసు శాఖ నుంచి తప్పనిసరిగా ముందస్తు అనుమతులు పొందాలని జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ స్పష్టం చేశారు. వినాయక చవితి ఏర్పాట్లపై రెవెన్యూ, పోలీస్, విద్యుత్, అగ్నిమాపక, రవాణా, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్టించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆన్లైన్ సింగిల్ విండో విధానం ద్వారానే మండపాల ఏర్పాటుకు అనుమతులు తీసుకోవాలని సూచించారు. రహదారులపై రాకపోకలకు, ప్రజలకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు వహించాలని కోరారు. లౌడ్ స్పీకర్లు, మైకులు, డిజే సౌండ్స్ వాడకంపై పూర్తి నిషేధం ఉంటుందన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలకు అనుమతి తప్పనిసరి, వీటిని రాత్రి 9 గంటలలోపే ముగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విగ్రహాల ఏర్పాటుకు దారి కాచి, తాడులు, కర్రలు అడ్డుపెట్టి వాహనదారుల నుంచి బలవంతపు చందాలు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అధికారులు నిర్దేశించిన చెరువులు, గెడ్డలలో మాత్రమే విగ్రహాలను నిమజ్జనం చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. లోతుగా ఉండే ప్రవాహాలు, చెరువుల వద్దకు వెళ్లకుండా చూడాలన్నారు. ఈ సమావేశంలో ఇన్చార్జి డీఆర్వో లోకేశ్వరరావు, ఆర్డీవో భుజంగరావు, తహసీల్దార్ శ్రీనివాసరావు, డీఎల్పీవో కుమార్, విద్యుత్‌శాఖ ఎస్ఈ విజయానంద్, డీఈఈ సీహెచ్ పాత్రుడు, అగ్నిమాపక అధికారి లక్ష్మణస్వామి, ఎంపీడీవో తేజారతన్ పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ ఆదేశం -
పంట మార్పిడితోనే మేలు
● చింతపల్లి ఆర్‌ఏఆర్‌ఎస్ ఏడీఆర్ ఆదిలక్ష్మి పాడేరు: ఎల్‌నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున రైతులు పంటల ప్రణాళికలో తగిన మార్పులు చేసుకోవాలని చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం ఏడీఆర్ డాక్టర్ డి.ఆదిలక్ష్మి సూచించారు. గురువారం స్థానిక ఏరువాక కేంద్రంలో ఎల్‌నినో పరిస్థితులపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు రైతులకు పలు సూచనలు చేశారు. నేలలో తేమను కాపాడుకునేందుకు పొలాల్లో నీటి కుంటలు, తోటల్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. చిసెల్ నాగలితో లోతుగా దున్నుకోవడంతో పాటు పంట వ్యర్థాలతో మల్చింగ్ చేయాలని సూచించారు. నీటి ఎద్దడిని తట్టుకునే కరువు నిరోధక వంగడాలను ఎంపిక చేసుకోవడం శ్రేయస్కరమన్నారు. ఎక్కువ నీరు అవసరమయ్యే వరికి బదులుగా చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు సాగు చేయడం శ్రేయస్కరమని తెలిపారు. వరి సాగు చేసేవారు ప్రత్యామ్నాయంగా ’తడిపి–ఎండబెట్టే’ పద్ధతిని పాటించి నీటిని ఆదా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏరువాక కేంద్రం సమన్వయకర్త డాక్టర్ పి.ప్రదీప్‌కుమార్, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి.ఉమామహేశ్, స్పైసెస్ బోర్డ్ సెక్షన్ ఆఫీసర్ కళ్యాణి, రైతులు పాల్గొన్నారు. -
సిల్వర్ దందా
మన్యంలోస్థానికంగా రూ.10కే లభించే సిల్వర్ ఓక్ మొక్కకు టెండర్లలో రూ.19 మన్యం మొక్కల్ని వదిలి.. కడియం మొక్కలకు ‘పచ్చజెండా’ ● గిరిజన నర్సరీలకు మొండిచెయ్యి ● మైదాన ప్రాంత వ్యాపారులకు పెద్దపీట ● డ్వామా అధికారుల ఇష్టారాజ్యం ● డిప్యూటీ సీఎంని కలిసినా దక్కని న్యాయం అల్లం తిన్న నోటికి బెల్లం ఇచ్చినట్టు ఉండాలి కానీ.. ఇంటి దీపం ఆర్పేసి, పొరుగింటిలో వెలుగు నింపినట్టు ఉంది డ్వామా అధికారుల తీరు. తక్కువ ధరకు సొంత ఊరిలోనే లభించే మొక్కలను వదిలేసి, కడియం వ్యాపారుల జేబులు నింపడానికి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని నీళ్లలా భక్షిస్తున్నారు. గిరిజన నర్సరీల నోట్లో మట్టికొడుతూ సాగుతున్న ఈ ’సిల్వర్ ఓక్’ టెండర్ల దందా మన్యంలో తీవ్ర ఆగ్రహానికి కారణమవుతోంది. సాక్షి, పాడేరు : కాఫీ తోటల విస్తరణలో భాగంగా పంపిణీ చేసే నీడనిచ్చే ’సిల్వర్ ఓక్’ మొక్కల కొనుగోలు వ్యవహారంలో డ్వామా అధికారుల తీరు తీవ్ర వివాదాస్పదమవుతోంది. స్థానికంగా రూ.10లకే లభించే మొక్కను పక్కనబెట్టి, మైదాన ప్రాంత వ్యాపారుల నుంచి రవాణాతో కలిపి రూ.19 చొప్పున కొనుగోలు చేసేందుకు టెండర్లు ఖరారు చేయడంపై మన్యంలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఉపాధి హామీ నిధుల సాకుతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని బయటి వ్యాపారులకు దోచిపెడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గిరిజనుల ఉపాధికి గండి కాఫీ తోటల విస్తరణకు దాదాపు కోటి సిల్వర్ ఓక్ మొక్కలు అవసరం. గత ప్రభుత్వాల హయాంలో ఐటీడీఏ కాఫీ విభాగం స్థానిక గిరిజన నర్సరీల నుంచే వీటిని కొనుగోలు చేస్తూ వారి ఉపాధికి బాటలు వేసేది. అయితే ప్రస్తుతం అధికార యంత్రాంగం స్థానిక నర్సరీలను విస్మరించి, మైదాన ప్రాంతాల నుంచి అధిక ధరలకు కొనుగోలు చేస్తూ గిరిజన రైతుల పొట్ట కొడుతోంది. అధికారుల ఇష్టారాజ్యం జిల్లా కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారుల పర్యవేక్షణలోనే ఈ పంపిణీ జరగాల్సి ఉన్నా, కొందరు అధికారులు ఉన్నతాధికారులను పక్కదోవ పట్టిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఏజెన్సీ పరిధిలో గిరిజనులు తమ నర్సరీల్లో దాదాపు 90 లక్షల మొక్కలను విక్రయానికి సిద్ధం చేశారు. ఒక్కో మొక్క పెంపకానికి రూ.6 వరకు ఖర్చు కాగా, రూ.10కే విక్రయించేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. అయినా డ్వామా అధికారులు స్థానిక మొక్కలను కొనేందుకు ముఖం చాటేస్తున్నారు. సిండికేట్‌గా మారి ధరల బాదుడు 30 వేల ఎకరాలకు సరిపడే 98 లక్షల సిల్వర్ ఓక్ మొక్కల కోసం డ్వామా సంస్థ టెండర్లు పిలవగా, టెండర్ల సమాచారం గిరిజనులకు అందకుండా చేశారు. దీంతో కడియం, రాజమండ్రికి చెందిన 65 మంది మైదాన ప్రాంత వ్యాపారులు సిండికేట్‌గా మారి టెండర్లను దక్కించుకున్నారు. ఒక్కో మొక్కకు రూ.15, రవాణా ఖర్చు కింద మరో రూ.4 చొప్పున మొత్తం రూ.19కి అధికారులు ధర ఖరారు చేయడం గమనార్హం. డిప్యూటీ సీఎంను కలిసినా.. మొక్కల పెంపకం కోసం ఒక్కో నర్సరీ నిర్వాహకుడు రూ.5 లక్షల వరకు అప్పులు చేశారు. తీరా కొనేవారు లేక నష్టాల ఊబిలో కూరుకుపోతున్నామని వాపోతున్నారు. ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను, ఆయన పేషీ అధికారులను కలిసి తమ బాధను వెళ్లబోసుకోగా.. న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కానీ, ఇప్పటివరకు డ్వామా అధికారులు తమ నర్సరీలను పరిశీలించడానికి కూడా రాలేదని గిరిజన రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.స్థానికంగా కొనుగోలు చేయాలి కాఫీ తోటలకు అవసరమైన లక్షలాది సిల్వర్ ఓక్ మొక్కలు స్థానిక గిరిజన నర్సరీలలో సిద్ధంగా ఉన్నాయి. వాటిని వదిలేసి టెండర్ల పేరుతో మైదాన ప్రాంత వ్యాపారులకు కట్టబెట్టడం తీవ్ర అన్యాయం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోకపోవడం విచారకరం. ప్రభుత్వం తక్షణమే స్పందించి మా నర్సరీల్లోని మొక్కలనే కొనుగోలు చేయాలి. – తుర్రె సత్యమయ్య, నర్సరీ యజమాని, పాడేరు స్థానిక నర్సరీల వద్దకొనుగోలు చేస్తాం సిల్వర్ ఓక్ మొక్కల సరఫరాకు సంబంధించి పారదర్శకంగానే టెండర్ల ప్రక్రియను నిర్వహించాం. టెండర్లలో స్థానిక నర్సరీల నిర్వహకులు పాల్గొనకపోవడంతో టెండరు సాధించిన వ్యాపారులకు ఆర్డర్లు ఇవ్వాల్సి వచ్చింది. స్థానికంగా నర్సరీలు నిర్వహిస్తున్న గిరిజన రైతుల వద్ద ప్రస్తుతం మొక్కలు కొనుగోలుకు చర్యలు తీసుకుంటాం. – విద్యాసాగర్, పీడీ, డ్వామా -
క్రీడా పోటీల్లో స్వర్ణ పతకాలు సాధించిన కానిస్టేబుల్
కానిస్టేబుల్ విజయను సత్కరించిన సీఐ వినోద్‌బాబు, సిబ్బంది పాయకరావుపేట : రాష్ట్ర స్థాయి పోలీసు క్రీడా పోటీల్లో స్థానిక పోలీసు కానిస్టేబుల్ విజయ ఆరు స్వర్ణ పతకాలను సాధించినట్టు సీఐ ఎం.వినోద్‌బాబు తెలిపారు. రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో ఈనెల ఒకటి నుంచి 4 వ తేదీ వరకు అమరావతిలో నిర్వహించిన వివిధ పోటీల్లో పాల్గొని, 5 వేల మీటర్లు, 1500 మీటర్లు, 800 మీటర్లు, 400 మీటర్లు రన్నింగ్, కబడ్డీ, ఖో ఖో పోటీల్లో విజయ ఆరు విభాగాలల్లో ప్రథమ స్థానాలు సాధించి స్వర్ణ పతకాలు సాధించిందన్నారు. పోలీసు శాఖలో విధులు నిర్వహిస్తూ క్రీడా పోటీల్లో పాల్గొని స్వర్ణ పతకాలు సాధించడం ఎంతో గర్వకారణమన్నారు. ఈ మేరకు కానిస్టేబుల్ వి.విజయను సీఐ ఎం.వినోద్‌బాబు, ఎస్ఐ పురుషోత్తం, పోలీసు సిబ్బంది ఘనంగా సత్కరించారు. -
దంచికొట్టిన వాన..
తుమ్మపాల : ఇటీవల తీవ్ర ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరైన నియోజకవర్గ ప్రజలకు గురువారం మధ్యాహ్నం కురిసిన వర్షం ఎంతో ఊరటనిచ్చింది. ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం దంచికొట్టడంతో ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు. వర్షాకాలం కొనసాగుతున్నప్పటికీ వేసవిని తలపించేలా ఎండలు, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఈ వర్షం ఉపశమనాన్ని కలిగించింది. కొంతకాలంగా ఉదయం నుంచే ఎండ తీవ్రత పెరగడం, మధ్యాహ్నానికి ఉష్ణోగ్రతలు మరింత అధికం కావడంతో ప్రజలు బయటకు రావడానికి ఇబ్బందులు పడ్డారు. రాత్రివేళల్లోనూ ఉక్కపోత కారణంగా సరిగా నిద్రపట్టని పరిస్థితి నెలకొంది. వర్షాకాలంలో సాధారణంగా ఉండాల్సిన చల్లని వాతావరణానికి భిన్నంగా ఎండలు మండుతుండడంతో ప్రజలు వర్షం కోసం ఎదురుచూశారు. నేల తడవడంతో రైతుల్లో ఆనందం అనకాపల్లి పట్టణంతో పాటు మండలం, కశింకోట మండలాల్లో పలు గ్రామాల్లో భారీ వర్షం కురవడంతో పొలాలు, ఖాళీ ప్రదేశాలు తడిశాయి. ఇప్పటికే వర్షాల కోసం ఎదురు చూస్తున్న పలు ప్రాంతాల్లో ఈ వర్షం రైతులకు ఆశలు కలిగించింది. ఎండ తీవ్రత వల్ల పశువులు ఇబ్బందులు పడుతున్న సమయంలో వర్షం కురవడం ఉపశమనాన్ని కలిగించిందని పాడి రైతులు చెబుతున్నారు. వర్షానికి ముందు ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై బలమైన గాలులు వీచాయి. అనంతరం ఉరుములు, మెరుపులతో వర్షం ప్రారంభమైంది. కొద్దిసేపు దంచికొట్టిన వర్షంతో రహదారులు, పంట పొలాలు తడిసిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో రహదారులపై నీరు చేరడంతో వాహనదారులు నెమ్మదిగా రాకపోకలు సాగించారు. చోడవరంలో భారీ వర్షంచోడవరం: వర్షం కోసం ఎదురు చూస్తున్న రైతులకు కాస్త ఊరట లభించింది. వరి నాట్లు వేసిన తర్వాత సరైన వానలు పడక నీరు లేక రైతులు అల్లాడుతున్న సమయంలో గురువారం కురిసిన వర్షం రైతులకు చాలా మేలు చేసింది. చోడవరం పరిసర ప్రాంతాల్లో ఖరీఫ్ సీజన్ అంతా సరైన వర్షాలు పడలేదు. ఎండా కాలాన్ని తలపిస్తూ ఎండలు మండిపోవడం, కనీస వర్షపాతం కూడా కురవకపోవడంతో 40 శాతానికి మించి ఎక్కడా వరి నాట్లు వేయలేదు. నాట్లు వేసిన పొలాలకు నీరు లేక అవి కూడా ఎండిపోతున్నాయి. ఒక దుక్కు వర్షమైనా పడితే తప్పా వరి నాట్లు బతకవని ఆకాశం వైపు ఎదురు చూస్తున్న రైతన్నలకు ఇప్పుడు కురిసిన వవర్షం చాలా మేలు చేసింది. మరో పక్క వర్షం పడితే నాట్లు వేద్దామని ఎదురు చూస్తున్న బీడుగా ఉన్న భూములకు కూడా ఈ వర్షం చాలా ఉపయోగకరంగా మారింది. చోడవరం పరిసరాల్లో 20 నుంచి 25 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. వరితోపాటు అన్ని పంటలకు చాలా మేలు జరిగింది. మరోపక్క ఇప్పటి వరకు అధిక ఉష్ణోగ్రతలతో వేడిక్కిపోయిన వాతావరణంతో అల్లాడుతున్న జనానికి కూడా ఈ వర్షం చాలా చల్లదనాన్ని ఇచ్చింది. రోడ్లన్నీ వర్షపునీటితో నిండిపోయాయి. అపరాలు, కూరగాయల పంటలకు ఈ వర్షం చాలా మేలు చేసింది. మెట్ల ప్రాంతాల్లో దమ్ముపట్టేందుకు సిద్ధంగా ఉన్న పొలాలకు మరింత భారీ వర్షం కావాలని రైతులు చెబుతున్నారు. -
గర్భిణులకు ఉచిత భోజనం ప్రారంభం
గర్భిణులకు భోజనం వడ్డిస్తున్న బాలాజీ దంపతులు సీలేరు: స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ప్రతినెల 9వ తేదీన వైద్య పరీక్షల కోసం వచ్చే గర్భిణులు, రోగులకు సీలేరు బాలాజీ రెస్టారెంట్ యజమాని నక్క జ్ఞానేశ్వర్ రావు–భార్య ఉచిత భోజన సదుపాయం ప్రారంభించారు. మారుమూల గ్రామాల నుంచి వచ్చే గర్భిణులు రోజంతా ఆకలితో అలమటించడాన్ని గమనించి వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. బుధవారం ఆసుపత్రి ఎదుట అన్నసంతర్పణ నిర్వహించి గర్భిణులకు భోజనాలు వడ్డించారు. ప్రతి నెల 9న ఈ సేవలు అందిస్తామని తెలిపిన ఆ దంపతుల ఉదారతను గ్రామస్తులు అభినందించారు. -
లైగండ హెచ్ఎంకు రాష్ట్రస్థాయి పురస్కారం అభినందనీయం
హస్తకళల్లో శిక్షణ పొందుతున్న మహిళలు వెదురుతో కళాకృతుల తయారీలో నిమగ్నమైన అరకులోయ టౌన్: డుంబ్రిగుడ మండలం లైగండ హెచ్ఎం జ్యోతి లక్ష్మి రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకోవడం అభినందనీయమని అరకులోయ మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ అన్నారు. బుధవారం మాజీ ఎమ్మెల్యే పాల్గుణ అరకులోయలోని జ్యోతి లక్ష్మి నివాసానికి వెళ్లి, ఆమెను దుశ్శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మారుమూల గిరిజన ప్రాంతంలో జన్మించి, ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి ఎంతో మంది విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దారని కొనియాడారు. ఈ ఏడాది ఉమ్మడి విశాఖ జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించి, 8వ తరగతి గణిత పాఠ్యాంశాల రూపకల్పనలో రచయిత్రిగా కీలక పాత్ర పోషించి రాష్ట్ర ప్రభుత్వం అందించే ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందుకోవడం ఆమె కుటుంబ సభ్యులకు, తోటి ఉపాధ్యాయులు, గిరిజన ప్రాంతానికి గర్వకారణమని అన్నారు. జ్యోతి లక్ష్మిని సన్మానించిన వారిలో మాజీ సర్పంచ్ పాడి రమేష్, మాజీ ఎంపీటీసీలు శెట్టి వెంకటరావు, బూర్జ సుందర్రావు, పార్టీ నాయకులు బాక సింహాచలం, కొర్రా బలరామ్, ఉపాధ్యాయుడు మండియకేడి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల సభను తలపించిన బీసీల సభ
నర్సీపట్నం : టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన జయహో బీసీ సభ..ఎన్నికల సభను తలపించింది. బీసీల అవగాహన సభ అంటూనే రాజకీయ మీటింగ్ తరహాలో నేతల ప్రసంగాలు సాగాయి. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు 2029 సార్వత్రిక ఎన్నికల లక్ష్యంగా పని చేయాలని నేతలు పిలుపునిచ్చారు. స్పీకర్ సిహెచ్.అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ 34 శాతం రిజర్వేషన్లు బీసీలకు ఎంతో ఉపయోగమన్నారు. రిజర్వేషన్ వల్ల కలిగే ప్రయోజనాన్ని గ్రామాల్లో ప్రజలకు తెలియజేయాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికకు సంబంధించిన అభ్యర్థులను గ్రామస్థాయి నాయకులే ఎంపిక చేయాలన్నారు. ఎవరైతే గ్రామాభివృద్ధికి పాటుపడతాడో అటువంటి వ్యక్తుల పేర్ల జాబితాను ఇవ్వండి.. మీరు సూచించిన వ్యక్తికే సీటు ఇస్తా...గెలిపించుకోవాల్సిన బాధ్యత మీదే అన్నారు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీల అభ్యర్ధులను పార్టీ నాయకులే ఎంపిక చేయాలని సూచించారు. బీసీలకు సముచిత స్థానం కల్పించింది టీడీపీ మాత్రమే అన్నారు. రాజ్యసభ సభ్యుడు చింతకాయల విజయ్ మాట్లాడుతూ రిజర్వేషన్లతో సీఎం చంద్రబాబు బీసీల జీవితాల్లో వెలుగు నింపారన్నారు. బీసీలకు బంగారు బాట వేసారన్నారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టకపోతే కేంద్రం నుంచి రావాల్సిన 16వ ఆర్థిక సంఘం నిధులు రూ.3 వేల కోట్లు వరకు రాష్ట్రం నష్టపోతుందన్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీ సత్తా చా టాలని పిలుపునిచ్చారు. పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. -
కుంకుమ పువ్వు సాగుకు స్థల పరిశీలన
చింతపల్లి: మండలంలో కుంకుమపువ్వు సాగు చేపట్టేందుకు స్థల పరిశీలన చేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీమణి పూజ తెలిపారు. బుధవారం చౌడుపల్లి పంచాయతీ పరిధిలోని ధనంజయవీధి, చెరువూరు, కొత్తవీధి గ్రామాలలో ఈ ప్రాజెక్టుకు కేటాయించిన ప్రభుత్వ స్థలాన్ని ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం ధనంజయవీధిలో గిరిజనులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చింతపల్లి మండలంలో చేపడుతున్న కుంకుమపువ్వు ప్రాజెక్టుకు సంబంధించి స్థల పరిశీలన జరుపుతున్నామన్నారు. ఇందులో భాగంగా ఎంతోకాలంగా గిరిజనుల ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూమిని 23 మంది గిరిజన రైతుల నుంచి దాదాపు 50 ఎకరాలు స్వాధీనం చేసుకోవడం జరుగుతోందన్నారు. ప్రభుత్వ భూమిని తాత్కాలికంగా గిరిజనులు సాగు చేసుకుంటున్నప్పటికీ, ప్రభుత్వ అవసరాల నిమిత్తం దానిని తిరిగి తీసుకోవడం జరుగుతోందని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు వల్ల ఎంతోమంది గిరిజన రైతులకు, యువతకు ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయన్నారు. ఇది ప్రారంభమైతే జిల్లా చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. మన్యంలో వాతావరణం ఇప్పటికే ఎన్నో విదేశీ పంటల సాగుకు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో, ఈ కుంకుమపువ్వు ప్రాజెక్టును కూడా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోనుందని తెలిపారు.అనంతరం స్థానిక యూత్ ట్రైనింగ్ కేంద్రాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ హనుమంతు త్రివేణి, ఆర్ఐ కృష్ణమూర్తి మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. -
సమన్వయంతోవిద్యా ప్రమాణాలు పెంచాలి
కోటవురట్ల : విద్యా ప్రమాణాల మెరుగుకు ఉపాధ్యాయుల సమన్వయం అవసరమని డీఈవో జి.వి.ఎస్.ఎస్.నాగేశ్వరరావు తెలిపారు. జల్లూరు జెడ్పీ హైస్కూల్‌ను ఆయన బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదో తరగతి విద్యార్ధులను కలుసుకుని వారి అభ్యసనా సామర్‌ాధ్యలు, విద్యా ప్రగతి, పరీక్షల సన్నద్ధత గురించి వివరాలు తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలు ఎదురవుతున్నాయా అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి విద్యా ప్రమాణాలను పెంపొందించుకునేందుకు అనుసరించాల్సిన విధానాలపై సలహాలు, సూచనలు ఇచ్చారు. విద్యార్ధులపై వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలన్నారు. వెనుకబడిన విద్యార్థుల పట్ల పర్యవేక్షణతో పాటు ప్రత్యేక ప్రణాళిక ఉండాలన్నారు. అనంతరం మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి నాణ్యత, పరిశుభ్రత, ప్రమాణం తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. -
సీఎంకు వెయ్యి పోస్టు కార్డులు
మహారాణిపేట: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కాంట్రాక్ట్ వైద్య ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరవుతూ, నిరసన తెలియజేస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టినట్లు జిల్లా జేఏసీ కన్వీనర్ కిషోర్రావు తెలిపారు. కేజీహెచ్ క్లాక్‌టవర్ నుంచి బుధవారం పోస్ట్‌కార్డు ఉద్యమం నిర్వహించారు. రాష్ట్ర మెడికల్ అండ్ హెల్త్ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు, విశాఖపట్నం జిల్లా జేఏసీ కమిటీ ఆధ్వర్యంలో కేజీహెచ్ సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించిన అనంతరం మానవహారంగా ఏర్పడ్డారు. కిషోర్రావు మాట్లాడుతూ తమ డిమాండ్లను మానవతా దృక్పథంతో పరిశీలించాలని కోరుతూ ముఖ్యమంత్రికి వెయ్యి మంది ఉద్యోగులు పోస్టుకార్డులు పంపినట్లు తెలిపారు. జేఏసీ చైర్మన్ ఎస్.కె.ఆశ మాట్లాడుతూ ఏళ్ల తరబడి వైద్య ఆరోగ్య శాఖలో సేవలందిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ వెంటనే రెగ్యులర్ చేయాలన్నారు. రెగ్యులరైజేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు 100శాతం గ్రాస్ వేతనం చెల్లించాలని, విధి నిర్వహణలో మరణించిన వారి కుటుంబానికి రూ.50లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు ఒకరికి ఉద్యోగం కల్పించాలని కోరారు. జేఏసీ నాయకుడు శివప్రసాద్, జేఏసీ కో–చైర్మన్ పైడిరాజు మాట్లాడుతూ ఈపీఎఫ్, హెల్త్‌కార్డు తదితర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖకు చెందిన అన్ని విభాగాల కాంట్రాక్ట్ ఉద్యోగులు సంఘం నాయకులు, జేఏసీ నాయకులు రాజశేఖర్,పద్మావతి, దుర్గాభవాని, కేకే రాజు, కె.నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఫీజు బకాయిలను చెల్లించాలి
చోడవరం : విద్యారంగ సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (పీడీఎస్ఓ) ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ నిరసన ర్యాలీ చేశారు. చోడవరం పట్టణంలో ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్ నుంచి మెయిన్‌రోడ్డు మీదుగా కొత్తూరు జంక్షన్ వద్దరూ అన్ని కాలేజీల విద్యార్థులు కలిసి భారీ ర్యాలీ చేశారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేసి తహసీల్దార్ రామారావుకు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు రీయింబర్స్‌మెంటు, స్కాలర్ షిప్స్ బకాయిలు రూ.7వేల కోట్లు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని పీడీఎస్‌వో, విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ బకాయిలు విడుదల చేయకపోవడం వల్ల కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులపై ఫీజు కట్టాలని ఒత్తిడి చేస్తున్నారని, ఫీజులు కట్టకపోతే పరీక్షల హాల్ టిక్కెట్లు ఇవ్వమని హెచ్చరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం ఫీజు బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సంక్షేమ హాస్టళ్లలో పూర్తి స్థాయి సిబ్బంది లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, చోడవరం ఏబీసీడబ్ల్యూ పరిధిలో 15 బీసీ హాస్టళ్లు ఉంటే వీటిలో 10 హాస్టళ్లకు పూర్తిస్థాయి వార్డెన్లు లేరని విద్యార్థులు తెలిపారు. మెస్ ఛార్జీలు రూ. 3వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. హాస్టళ్ల కు విద్యార్థి సంఘాలను రాకుండా నిలువరిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీఓను వెంటనే రద్దు చేయాలన్నారు. ప్రైవేటు విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టాలని, చోడవరం నుంచి పరిసర గ్రామాలకు విద్యార్థులు ప్రయాణించేందుకు వీలుగా గతంలో నడిచే రూట్లలో స్కూల్ బస్సులను పునరుద్ధరించా లని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో పీడీఎస్ఓ నాయకులు బి.రాజేష్, డి.వరహాలనాయుడు, కె. వరుణ్‌కుమార్, టి.తరుణ్ పాల్గొన్నారు.చోడవరంలో విద్యార్థుల ర్యాలీ -
మూడు కిలోమీటర్లు నడిస్తేనే చదువులు
● పాఠశాల లేక లుక్కురు, టిక్రపడ, పనసపుట్టు విద్యార్థుల అవస్థలు కాలినడకన కడుతుల పాఠశాలకు వెళ్తున్న విద్యార్థులు ముంచంగిపుట్టు: గిరిజన విద్యార్థులు చదువుకోవాలంటే ప్రతిరోజూ మూడు కిలోమీటర్లు నడవాల్సి వస్తోంది. పనసపుట్టు పంచాయతీ కడుతుల గ్రామంలో ఉన్న మండల పరిషత్ మోడల్ ప్రైమరీ పాఠశాలకు లుక్కురు, టిక్రపడ, పనసపుట్టు గ్రామాలకు చెందిన 26 మంది విద్యార్థులు రోజూ 3 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. పిల్లలు ప్రతిరోజూ ఆర్అండ్బీ ప్రధాన రహదారి గుండా నడుచుకుంటూ బడికి వెళ్తున్నారు. అది ప్రధాన రహ దారి కావడంతో బస్సులు, లారీలు, జీపులు ఎక్కువగా తిరుగుతుంటాయి. దీంతో పిల్లలు బడికి వెళ్లి సురక్షితంగా ఇంటికి తిరిగొచ్చే వరకు తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు.తమకు సమీపంలోనే లేదా అందుబాటులో ఒక ప్రాథమిక పాఠశా లను ఏర్పాటు చేస్తే కష్టాలు తొలగుతాయని ఈ గ్రా మాల గిరిజన విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత
● ఎంవీఐ సాయి రమేష్అవగాహన కల్పిస్తున్న మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ సాయి రమేష్ పాడేరు: రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, వాటి నివారణకు రోడ్డు భద్రతా నియమాలపై కనీస అవగాహన కలిగి ఉండాలని పాడేరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సాయి రమేష్ అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం రహదారి భద్రతపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ’పీఎం రహవీర్’ పథకం కింద రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ సహాయం అందించి, వారిని ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడే వారికి రూ.25 వేల ప్రోత్సాహకం అందుతుందని తెలిపారు. అలాగే ’పీఎం రాహత్’ పథకం కింద ప్రమాద బాధితులకు రూ.2.50 లక్షల వరకు వైద్య చికిత్స ఖర్చులు అందుతాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా, ట్రాఫిక్ నియమాలను తప్పక పాటించాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. సత్యనారాయణ, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ గౌరీశంకర్, విద్యార్థులు పాల్గొన్నారు. -
షణ్ముఖ శర్మకు ‘కొప్పరపు కవుల’ పురస్కారం
మద్దిలపాలెం: కొప్పరపు కవుల కళాపీఠం 24వ వార్షికోత్సవ వేడుకలు బుధవారం కళాభారతి ఆడిటోరియంలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రవచనకారుడు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మకు ప్రతిష్టాత్మక ‘కొప్పరపు కవుల జాతీయ ప్రతిభా పురస్కారం–2026’ను ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణ మోహన్, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ దుర్గా ప్రసాద్, ఆచార్య విశ్వనాథ గోపాలకృష్ణశాస్త్రి, ఆచార్య తాడేపల్లి పతంజలిశాస్త్రి, అమెరికాకు చెందిన ప్రముఖ హృద్రోగ నిపుణుడు డాక్టర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా పురస్కారాన్ని అందజేశారు. కార్యక్రమానికి ఆచార్య బేతవోలు రామబ్రహ్మం అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్ మాట్లాడుతూ భారతీయ వాజ్మయంలో విద్యార్థులను తీర్చి దిద్దుతున్న అభినవ వ్యాసుడు సామవేదం షణ్ముఖశర్మ అని ప్రశంసించారు. కొప్పరపు సోదరకవుల పద్యాలు తెలుగు పాఠ్యాంశాలుగా రావాలని తద్వారా తెలుగు భాషకు పూర్వ వైభవం తేవాలని ఆకాంక్షించారు. గౌరవ అతిథి ఏపీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ భారతీయ అవధాన ప్రక్రియను శిఖర స్థాయికి తీసుకెళ్లిన కొప్పరపు సోదరకవుల స్మారకంగా వారి పేరిట అవధాన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం ప్రజలందరి సంతకాలతో ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించాలని సూచించారు. అనంతరం ‘దైవ సంకల్పం’ అనే అంశంపై సుమారు గంటపాటు సామవేదం షణ్ముఖ శర్మ చేసిన ప్రవచనం అందరినీ ఆకట్టుకుంది. -
కూటమి మోసాలను ఎండగడదాం
అనకాపల్లి : జీవీఎంసీ, మున్సిపాల్,ఎంపీటీసీ, గ్రామ సర్పంచ్ ఎన్నికలు అక్టోబర్ నెలాఖరుకు పూర్తి చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని, వైఎస్సార్సీపీ బలమైన అభ్యర్థులు పోటీలో గెలుపొందేలా కృషి చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ అన్నారు. స్థానిక రింగ్‌రోడ్డు వైఎస్సార్సీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు ఆధ్వర్యంలో బుధవారం రాత్రి జరిగింది. ఈ సందర్బంగా ప్రసాద్ మాట్లాడుతూ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులపై చర్యలు చేపట్టడం జరుగుతుందని, గ్రామీణస్థాయి నుంచి ప్రజలు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని గెలిపించుకోవాలని ఎదురుచూస్తున్నారని, రెండున్నరేళ్ల పాలనలో కూటమి ప్రభుత్వం ప్రజలకు సూపర్‌సిక్స్ పథకాలు అమలు చేయకుండా ఎలా మోసం చేసిందో తెలియజేయాలన్నారు. గ్రామీణ స్థాయి నుంచి బలమైన గెలుపొందే నాయకులను పోటీలో నిలిచే విధంగా చర్యలు చేపట్టి గెలుపు కోసం కృషి చేయాలన్నారు. కార్పొరేటర్ ఆరు వార్డులో వైఎస్సార్సీపీ అభ్యర్థుల గెలుపుకోసం కృషి చేయాలన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి చంద్రబాబుకు బుద్ధి చెప్పాలన్నారు. నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్‌కుమార్ మాట్లాడుతూ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి, అబద్ధపు హామీలతో (సూపర్ సిక్స్ పథకాలు) కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి రెండున్నరేళ్లు అవుతున్నా పథకాలు అమలు చేయకుండా మరోసారి స్థానిక ఎన్నికల ముందు వృద్ధులకు ప్రభుత్వ పింఛన్లు అమలు చేస్తున్నట్టు మోసానికి పాల్పడుతుందన్నారు. ఈ విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. వారం రోజుల్లో పట్టణ, మండల స్థాయి సమావేశాలు నిర్వహించి, నియోజకవర్గంలో పార్టీ శ్రేణులకు 6300 గుర్తింపు కార్డులు అందజేయడం జరుగుతుందని తెలిపారు. పార్టీలో కుట్రలు కుతంత్రాలు చేయకుండా సరైన మార్గంలో పార్టీ కోసం పనిచేయాలని లేని పక్షంలో చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. మాజీ ఎంపీ బి.వి. సత్యవతి మాట్లాడుతూ పార్టీలో క్రీయశీలకమైన సభ్యత్వం ఉన్న కార్యకర్తలకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి బీమా చేయించడం జరుగుతుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుందన్నారు. వైఎస్సార్సీపీ పాలనలో గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులు, కూటమి ప్రభుత్వం ప్రజలను ఎలా మోసం చేసిందో ప్రజలకు తెలియజేయాలన్నారు. నాడు–నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అభివృద్ధి చేశామన్నారు. కరోన వంటి కష్టకాలంలో ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందన్నారు. నియోజకవర్గ పరిశీలకుడు పి.సతీష్‌వర్మ మాట్లాడుతూ గ్రామాల్లో తాగునీటి సమస్యతో ప్రజలు, వర్షాభావంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతుంటే, సీఎం చంద్రబాబు జిల్లాలో రెండుసార్లు పర్యటించినా కరువు జిల్లాగా ప్రకటించకపోవడం అన్యాయమన్నారు. జగన్ పాలనకు, సీఎం చంద్రబాబు పాలనకు ప్రజల్లో ఇప్పటికే అవగాహన కలిగిందని, గ్రామీణ ప్రాంతాల ప్రజలు ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డిని గెలిపించుకోవాలని ఎదురుచూస్తున్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేయాలన్నారు. రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్‌కుమార్ మాట్లాడుతూ గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి, ప్రజలకు అనుకూలమైన అభ్యర్థులను బరిలోకి దించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గొర్లి సూరిబాబు, కశింకోట జెడ్పీటీసీ దంతులూరి శ్రీధర్‌రాజు, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు జాజుల రమేష్, 80,81,84 వార్డు ఇన్చార్జులు కెఎం.నాయుడు, బొడ్డేడ శివ, కె.రాఘవ, పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు వేగి త్రినాథ్, అనకాపల్లి, కశింకోట మండలపార్టీ అధ్యక్షులు పెదిశెట్టి గోవింద్, మలసాల కిషోర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గొల్లవిల్లి శ్రీనివాసరావు, జిలా అధికార ప్రతినిఽధి మళ్ల బుల్లిబాబు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. స్థానిక ఎన్నికల్లో గెలుపునకు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, సమన్వయకర్త భరత్‌కుమార్ వైఎస్సార్సీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం -
అప్పన్న సన్నిధిలో సినీ దర్శకుడు శివ నిర్వాణ
● ‘ఇరుముడి’ విజయంపై హర్షం సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని సినీ దర్శకుడు శివ నిర్వాణ కుటుంబసమేతంగా బుధవారం దర్శించుకున్నారు. ఆలయంలోని కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అంతరాలయంలో ఆయన పేరిట అర్చకులు అష్టోత్తరపూజ నిర్వహించారు. వేద ఆశీర్వచనం అందజేశారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం స్వామివారి ప్రసాదం, శేషవస్త్రంలను ఏఈవో పిల్లా శ్రీనివాసరావు అందించారు. ఇటీవల తాను దర్శకత్వం వహించిన ఇరుముడి సినిమా విశేషంగా ప్రేక్షకాదరణ పొందడం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. -
స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుదాం
రోలుగుంట : జిల్లాలో 55 వేల హెక్టార్లలో వరి సాగు కావాల్సి ఉండగా సుమారు 5 వేల హెక్లార్లలో కూడా సాగు కాలేదని, తీవ్ర వర్షాభావంతో జిల్లా రైతులను కరువు వేధిస్తోందని వైఎస్సార్సీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక మండల కార్యాలయాల కూడలి సమీపంలో బుధవారం వైఎస్సార్సీపీ మండలస్థాయి కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి, చోడవరం నియోజకవర్గం సమన్వయకర్త, పశ్చిమ గోదావరి జిల్లా కో–ఆర్డినేటర్ గుడివాడ అమర్నాథ్. పీఏసీ సభ్యులు, పార్టీ మాజీ ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ, జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. ‘ఎల్‌నినోతో వర్షాలు కురవవు, వ్యవసాయం మానేయండి...అని రైతులను ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు అనడం సరికాదని నాయకులు మండిపడ్డారు. పెట్టుబడులు నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, నష్టపోయిన పెట్టుబడి పరిహారం అందించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వానికి హితవు పలికారు. రైతులకు రూ.30 కోట్ల బకాయిలు.. 18 నెలలుగా గోవాడ చెరకు రైతులకు సుమారు 30 కోట్ల రూపాయలు, ఉద్యోగుల జీత భత్యాలకు రూ.5 కోట్లు వెరసి రూ.35 కోట్లు బకాయిలున్నాయన్నారు. వీటిని ఈ నెల 21లోపు బాధితులకు చెల్లించాలని, అలాగే ప్రతి ఏడాది గోవాడలో రైతులతో నిర్వహించే సభ నిర్వహించాలని ప్రభుత్వానికి మన పార్టీ తరపున అల్టిమేటం పంపించామన్నారు. గడువులోపే చెల్లించకుంటే తమ పార్టీ రంగంలోకి దిగి వారికి బాకీ జమ చేయించే బాధ్యత తీసుకుంటుందని, చెరకు రైతుల సమావేశాన్ని కూడా ఈ నెలాఖరున నిర్వహించడం జరుగుతుందన్నారు. స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెలలో స్థానిక ఎన్నికలకు సమాయత్తం అవుతుందని అందుకు సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు, నాయకులకు పిలుపునిచ్చారు. వార్డు మెంబరు, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఇలా ప్రతి చోటా పోటీ చేయాలన్నారు. యుద్ధంలోకి వెళ్లాల్సిందే..యుద్ధం చేయాల్సిందే...విజయం సాధించాల్సిందేనని కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. అధికార పార్టీకి పోలీసులు బలం అయితే...ప్రజలు, కార్యకర్తలే మనకు బలం అని అభివర్ణించారు. కార్యక్రమంలో నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్, చోడవరం నియోజకవర్గం ఎన్నికల పరిశీలకుడు గండి రవి, జెడ్పీటీసీ పోతల లక్ష్మీ, ఎంపీపీ యర్రంశెట్టి శ్రీనివాసరావు, మండల పార్టీ అధ్యక్షుడు టి.వి.రమణ మాట్లాడారు. మాజీ ఎంపీపీ శెట్టి సత్యనారాయణమూర్తి, నాయకులు పోతల లక్ష్మీ శ్రీనివాస్, చెట్టుపల్లి వెంకట్రావు, మడ్డు అప్పలనాయుడు, చెటికెల వెంకట సత్యనారాయణ పాల్గొన్నారు. సమావేశం అనంతరం పదవీ విరమణ చేసిన సర్పంచ్‌లు, పదవి ముగియనున్న ఎంపీటీసీలు, పోటీ చేసి ఓటమి చెందిన సర్పంచ్, ఎంపీటీసీలను శాలువాలు, పుష్పగుచ్ఛాలతో నాయకులు ఘనంగా సత్కరించారు. గడువు దాటితే వైఎస్సార్సీపీపోరాటం ఉధృతం మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, ప్రభుత్వ మాజీ విప్ కరణం ధర్మశ్రీ, జిల్లా పార్టీ అధ్యక్షుడుబొడ్డేడ ప్రసాద్ వెల్లడి -
జెడ్పీ నిధులతో పూర్తిస్థాయిలో అభివృద్ధి
ముంచంగిపుట్టు: ప్రజల సంక్షేమం కోసం జెడ్పీ నిధులతో అభివృద్ధి పనులు చేసి చూపించామని ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర అన్నారు. మండలంలోని జోలాపుట్టు పంచాయతీ కేంద్రంలో జెడ్పీ నిధులు రూ.20 లక్షలు, మండల పరిషత్ నిధులు రూ.5 లక్షలతో నిర్మించిన సామాజిక భవన ప్రారంభోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర చేతుల మీదుగా శిలాఫలకం ఆవిష్కరించి, రిబ్బన్ కత్తిరించి భవనాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ... మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనుగ్రహంతో, ప్రజలు ?నకిచ్చిన అవకాశంతో గిరిజన ప్రాంత అభివృద్ధి, సంక్షేమం కోసం నిత్యం కృషి చేశానని తెలిపారు. గిరిజన గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రెయిన్లు, బోర్లు, భవన నిర్మాణాలు చేపట్టామని, ఈ పనుల్లో తన కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు నిరంతరం అండగా నిలిచారన్నారు. అనంతరం ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం మాట్లాడుతూ... గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మహిళలకు అత్యధిక ప్రాధాన్యత లభించిందన్నారు. జెడ్పీ పీఠాన్ని గిరిజన మహిళకు కేటాయించడం వల్ల గిరిజన గ్రామాల్లో పెద్దఎత్తున మౌలిక సదుపాయాలు కల్పించడం సాధ్యమైందని కొనియాడారు. సామాజిక భవనాన్ని అందుబాటులోకి తెచ్చిన జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర–మూర్తి దంపతులకు ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ భాగ్యవతి, ఎంపీటీసీలు సుబ్బలక్ష్మి, కమల, నబ్బో, గణపతి, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు పద్మారావు, జేసీఎస్ జిల్లా కోఆర్డినేటర్ జగబంధు, మాజీ సర్పంచులు నీలకంఠం, రమేష్, పార్టీ నాయకులు సోలమన్, దాశరథి, మణి, తిరుపతి, రామరాజు, బుద్ధ, రామచందర్, వివిధ శాఖల అధికారులు, గిరిజనులు పాల్గొన్నారు. -
పిడుగు పాటుకు రైతు మృతి
సబ్బవరం: పిడుగు రూపంలో వచ్చిన ప్రకృతి విపత్తు ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. మండలంలోని అంతకాపల్లి శివారు రావలమ్మపాలేనికి చెందిన రైతు సబ్బవరపు శ్రీరామ్(54) బుధవారం పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, స్థానికుల వివరాల ప్రకారం.. శ్రీరామ్ స్థానిక జగనన్న కాలనీలో నివాసం ఉంటున్నాడు. బుధవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో సమీప ప్రాంతానికి బహిర్భూమికి వెళ్లాడు. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తుండగా ఆయన సమీపంలో పిడుగు పడింది. దీంతో తల, ముఖానికి తీవ్ర గా యాలై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న వీఆర్వో వాత్సల్యరాయ్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనపై నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. శ్రీరామ్‌కు భార్య లక్ష్మి, ఇద్దరు కుమార్తెలు నాగమణి, లాస్య ఉన్నారు. నాగమణికి ఇప్పటికే వివాహం కాగా.. చిన్న కుమార్తె లాస్య వివాహం వచ్చే నెలలో జరగాల్సి ఉంది. పెళ్లి ఏర్పాట్లతో కళకళలాడాల్సిన ఇంట్లో పిడుగుపాటుతో విషాదం నెలకొంది. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న శ్రీరా మ్ అకాల మరణంతో భార్య, కు మార్తెలు కన్నీరుమున్నీరుగా విలపిస్తు న్నా రు. ప్రభుత్వం ఆదు కోవాలని గ్రామస్తు లు కోరుతున్నారు. -
అక్షరం రాని చేతులే.. అద్భుత శిల్పాలను చెక్కుతున్నాయి! సవర ఆర్ట్, మట్టి పాత్రలు, వెదురు అలంకరణలు.. ఒకటేమిటి, గిరిజన కళల రూపురేఖలను మార్చేందుకు అరకు వేదికగా ఒక నైపుణ్య విప్లవం సాగుతోంది. స్థానిక కళాకారుల నైపుణ్యానికి అంతర్జాతీయ మార్కెట్ గుర్తింపు తెచ్చేలా
మూడు చోట్ల ప్రత్యక్ష శిక్షణ అరకు గిరిజన మ్యూజియం: ఇక్కడ లక్క బొమ్మల తయారీ, రంగురంగుల గాజులు, సంప్రదాయ సవర ఆర్ట్, బుద్ధ్ధ కళలపై శిక్షణ ఇస్తున్నారు. మాడగడ: మట్టితో మ్యాజిక్ చేసే టెర్రకోట ఆర్ట్, వివిధ రకాల అలంకరణ పాత్రలు, మట్టి కళాకృతుల తయారీ సాగుతోంది. ముసిరిగూడ గ్రామం: స్థానికంగా లభ్యమయ్య వెదురుతో అందమైన గృహాలంకరణ వస్తువులుగా, హస్తకళలుగా మలిచే బ్యాంబూ క్రాఫ్ట్ శిక్షణ ఇస్తున్నారు. ఇతర రాష్ట్రాల కళాకారుల భాగస్వామ్యం.. స్థానిక కళాకారులకు ప్రాక్టికల్ నైపుణ్యం అందించేందుకు దేశంలోని ప్రముఖ హస్తకళా నిపుణులను రప్పించారు. వెదురు ఉత్పత్తుల తయారీలో ఛత్తీస్‌గఢ్ నిపుణులు, మట్టి కళలలో ఒడిశా మాస్టర్ క్రాఫ్ట్స్మన్, లక్క ఆర్ట్‌లో రాజస్థాన్ హస్తకళాకారులు స్థానిక గిరిజనులకు స్వయంగా శిక్షణనిస్తున్నారు. గిరిజన సంస్కృతికి వ్యాపారాత్మక గుర్తింపు తెచ్చి, కళాకారులకు ఆర్థిక ఊతమివ్వడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ కోఆర్డినేటర్లు ప్రొఫెసర్ డాక్టర్ నాగరాజు చిక్కాల, అసోసియేట్ ప్రొఫెసర్ కాట్రగడ్డ శ్రీనివాస వరప్రసాద్, అధికారులు ఎన్. మురళీకృష్ణ ప్రసాద్, జి. గణపతి నాయుడు, పిచ్చయ్య నాయుడు, మ్యూజియం సిబ్బంది పాల్గొన్నారు. -
గ్యాస్ కొరత లేకుండా చర్యలు
పెదబయలు: స్థానిక గిరిజన సహకార సంస్థఆధ్వర్యంలో నడుస్తున్న భారత్ గ్యాస్ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని పాడేరు జీసీసీ డివిజన్ మేనేజర్ కృష్ణప్రసాదరావు తెలిపారు. బుధవారం ఆయన పెదబయలు జీసీసీ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇటీవల పెదబయలు గ్యాస్ గోదాంలో లబ్ధిదారులకు గ్యాస్ అందించడంలో జాప్యం జరుగుతోందని, వినియోగదారులు అవస్థలు పడుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి ఒక్కరికీ కొరత లేకుండా సకాలంలో సిలిండర్లు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం కార్యాలయ రికార్డులను పరిశీలించి, ప్రతి డీఆర్ డిపోలో ఇతర డీఆర్పీ సరుకుల అమ్మకాలను పెంచాలని సూచించారు. గ్యాస్ గోదాము నిర్వహణపై తరచూ ఫిర్యాదులు, వార్తలు వస్తున్నాయని... సిబ్బంది తమ పనితీరు మార్చుకోవాలని హెచ్చరించారు. రేపటి నుంచి గ్యాస్ డోర్ డెలివరీ పెదబయలు జీసీసీ భారత్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ నుంచి ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారికి గురువారం నుంచి డోర్ డెలివరీ చేస్తామని డీఎం తెలిపారు. ఆన్లైన్ బుకింగ్స్ పెరిగితే రెండు వాహనాల ద్వారా సరఫరా చేస్తామన్నారు.ఇదే సమయంలో స్థానిక వైఎస్సార్సీపీ నాయకుడు గంపరాయి సూరయ్య డీఎంను కలిసి ఒక వినతిపత్రం సమర్పి ంచారు. 2015–2016 సంవత్సరంలో దీపం పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్లు పొందిన వేలాది మంది లబ్ధిదారులకు ఇప్పటివరకు గ్యాస్ బుక్కులు, బాండ్ పేపర్లు మంజూరు చేయలేదని డీఎం దృష్టికి తీసుకెళ్లారు. పాస్‌బుక్‌లు లేక, వివరాలు ఆన్లైన్ కాకపోవడంతో ప్రస్తుతం వారికి గ్యాస్ అందడం లేదని వివరించారు. వెంటనే వారికి గ్యాస్ పుస్తకాలు పంపిణీ చేసి, ఆధార్ కార్డుతో అనుసంధానించడం ద్వారా న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జీసీసీ మేనేజర్ జి. అప్పన్న, జీసీసీ సిబ్బంది పాల్గొన్నారు. -
పకడ్బందీగా కుష్టు గుర్తింపు సర్వే
పాడేరు: అంగవైకల్యం నివారణకు ముందస్తుగానే ఇంటింటా కుష్టు వ్యాధి గుర్తింపు సర్వే చేపడుతున్నామని, ఈనెల 11 నుండి 24 వరకు సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ ఆదేశించారు. ఐటీడీఏ కార్యాలయంలోని తన ఛాంబర్లో బుధవారం కుష్టు వ్యాధి గుర్తింపు సర్వే పోస్టర్లు, బ్యానర్లను వైద్యారోగ్య శాఖ సిబ్బందితో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆశా కార్యకర్తలు, ఎంపిక చేసిన పురుష ఆరోగ్య కార్యకర్తలు బృందాలుగా ఏర్పడి ప్రతి ఇంటినీ సందర్శించి పరీక్షలు నిర్వహించాలన్నారు. అనుమానిత కేసులను గుర్తించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్య బృందం ద్వారా మరోసారి నిర్ధారణ పరీక్షలు చేయాలన్నారు. వ్యాధి నిర్ధారణ అయితే ఉచితంగా బహుళ ఔషధ చికిత్స అందించనున్నట్లు తెలిపారు. తొలిదశలోనే వ్యాధిని గుర్తించి చికిత్స తీసుకోవడం ద్వారా అంగవైకల్యాన్ని అరికట్టవచ్చన్నారు. శరీరంపై స్పర్శ తెలియని అనుమానాస్పద మచ్చలు ఉంటే సర్వే బృందానికి తెలియజేసి, ప్రజలంతా ఈ సర్వేకు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ రియాజ్ బేగ్, జిల్లా కుష్టు, క్షయ, ఎయిడ్స్ నియంత్రణ అధికారి డాక్టర్ కిరణ్‌కుమార్, ఏడీఎంహెచ్ఓ డాక్టర్ బాలమురళీకృష్ణ, డిప్యూటీ డీఎంవో సింహాచలం, ఎంపీహెచ్‌ఈవో సంజీవపాత్రుడు తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ వైర్ల దొంగలనుపట్టుకున్న రైతులు
మునగపాక : మండలంలో పలు చోట్ల విద్యుత్ వైర్లను అపహరించుకుపోతున్నారు. దీంతో పలువురు రైతులు న్యాయం చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. దీనిలో భాగంగా బుధవారం ఉదయం మునగపాకకు చెందిన శరగడం ఆదినారాయణకు చెందిన మోటార్ వైర్లను కట్ చేస్తుండగా స్థానికులు పట్టుకున్నారు. అనకాపల్లి బీఆర్టీ కాలనీకి చెందిన ముగ్గురు వ్యక్తులు వైర్లను తొలగిస్తుండడాన్ని గమనించిన స్థానిక రైతులు వారిని పట్టుకునే క్రమంలో ఒకరు పారిపోగా మిగిలిన ఇద్దరు వ్యక్తులను పట్టుకొని పోలీసు స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఇద్దరినీ అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. -
యలమంచిలిలో భారీ వర్షం
యలమంచిలి రూరల్ : పట్టణంలో బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి భానుడి ప్రతాపం, వేడి గాలుల వాతావరణంతో ఉక్కిరిబిక్కిరైన జనం ఒక్కసారిగా వాతావరణం మేఘావృతమై ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం కురవడంతో ఉపశమనం పొందారు. ఎల్‌నినో ప్రభావంతో వరుణుడు ముఖం చాటేయడం, వేసవిని తలపించేలా ఎండల తీవ్రత ఉండడంతో నేల పొడిబారిపోయింది. సాగులో ఉన్న వరి పొలాల్లో నేల బీటలు వారింది. మోటార్లతో ఎంత నీరు పొలాలకు పంపుతున్నా పొడి వాతావరణం కారణంగా పంట ఎదగడం లేదు.పెట్టుబడులు పెట్టిన రైతులు పంటలు కాపాడుకోవడానికి నానా ఇక్కట్లు పడుతున్న తరుణంలో బుధవారం యలమంచిలి ప్రాంతంలో కురిసిన భారీ వర్షంతో పంటలకు జీవం వచ్చినట్టయిందని రైతులు చెబుతున్నారు. భారీ వర్షంతో యలమంచిలి పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నీరు చేరడంతో చెరువులా మారింది. క్రీడాకారులు మరో రెండు,మూడు రోజుల వరకు సాధన చేయలేని విధంగా మైదానం చిత్తడిగా తయారైంది. పలు వీధుల్లో రహదారులపై వర్షపు నీరు నిలిచిపోవడంతో జనం రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు. -
విద్యుత్‌షాక్‌తో రైతు మృతి
● ఒమ్మలి గ్రామంలో విషాదం మాడుగుల రూరల్ : మండలంలో ఒమ్మలి గ్రామంలో పొలానికి వ్యవసాయ బోరు ద్వారా నీరు పెట్టేటప్పుడు విద్యుత్ మోటారు ఆన్ చేయగా ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్ తగిలి నల్లబోయిన శంకరావు (36) రైతు మృతి చెందారు. బుధవారం జరిగిన ఈ సంఘటన ఒమ్మలి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. వర్షాభావ పరిస్థితుల వల్ల ఒమ్మలి శివార్లలో గల తన వరి పంటకు వ్యవసాయ బోరు ద్వారా నీరు పెట్టే క్రమంలో మోటారు స్విచ్ ఆన్ చెయ్యగా ఈ ప్రమాదం జరిగింది. ఈ మేరకు మృతుడు మామ మోదినాయుడు, స్థానిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ జి.నారాయణరావు బుధవారం రాత్రి తెలిపారు. మృతుడికి భార్య లక్ష్మి, ఒక కుమారై, కుమారుడు ఉన్నారు. వీరు ఇరువురు స్థానిక జిల్లా పరిషత్ ప్రభుత్వ హైస్కూల్లో చదువుతున్నారు. శంకరరావు మృతదేహాన్ని అనకాపల్లి పోస్టుమార్టంకు పంపించినట్టు ఎస్ఐ తెలిపారు. -
పోలవరం కాలువలో గల్లంతైన వ్యక్తి మృతి
యలమంచిలి రూరల్: మండలంలోని మర్రిబంద సమీపంలో పోలవరం ఎడమ ప్రధాన కాల్వలో సోమవారం ప్రమాదవశాత్తూ జారి పడి గల్లంతైన మర్రిబంద గ్రామానికి చెందిన కంచు అప్పలనాయుడు మృతదేహం మంగళవారం గల్లంతైన ప్రదేశానికి దగ్గరలోనే నీటిలో తేలింది. మృతుడి తమ్ముడు కంచు సన్యాసిరావు గ్రామస్తుల సహకారంతో అన్న అప్పలనాయుడు మృతదేహాన్ని కాలువలోంచి బయటకు తీశారు. ఈ మేరకు యలమంచిలి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వ్యక్తి అదృశ్యం కేసును నీట మునిగి చనిపోయిన కేసుగా సెక్షన్లు మార్పు చేసినట్టు ఎస్ఐ ఉపేంద్ర తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామన్నారు. శవ పంచనామా, పోస్టుమార్టం అనంతరం అప్పలనాయుడు మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. ఉపాధి పనులకు వెళ్లి వస్తూ పోలవరం కాలువ వద్ద కాళ్లు, చేతులు, ముఖం కడుగుకోవడానికి ప్రయత్నించిన అప్పలనాయుడు ప్రమాదవశాత్తూ కాల్వలో జారిపడి మృతి చెందడంతో కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. -
ఐదు రోజులపాటు తేలికపాటి వర్షాలు
చింతపల్లి: జిల్లాలో రానున్న ఐదు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ , వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ డి. ఆదిలక్ష్మి తెలిపారు. ఈననెల 9 నుంచి 13 వరకు జిల్లాలో ఉండబోయే వాతావరణ వివరాలను ఆమె వెల్లడించారు. చింతపల్లి, పాడేరు, అరకు డివిజన్ల పరిధిలో 4 నుంచి 8 మిమీ వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. గరిష్ట ఉష్ణోగ్రతలు 35.2 నుండి 37.2 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రతలు 28.0 నుండి 28.4 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండవచ్చని పేర్కొన్నారు. గాలిలో తేమ శాతం ఉదయం వేళల్లో 68 నుంచి 75 శాతం, మధ్యాహ్నం 60 నుంచి 72 శాతం మధ్య నమోదు కావచ్చని తెలిపారు. గంటకు 5 నుంచి 6 కిలోమీటర్ల వేగంతో ఈశాన్య/తూర్పు గాలులు వీచే సూచనలు ఉన్నాయని, ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని వివరించారు. రాబోయే వర్షాలను దృష్టిలో ఉంచుకుని రైతులు తమ పంటల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏడీఆర్ డాక్టర్ ఆదిలక్ష్మి సూచించారు. -
పరిశుభ్ర వాతావరణమే లక్ష్యం
అరకులోయ టౌన్: పరిశుభ్రత, పర్యాటకులతో స్నేహపూర్వక వాతావరణమే లక్ష్యంగా బాధ్యతాయుతమైన యూత్ టూరిజంను ప్రోత్సహిస్తున్నామని జిల్లా పర్యాటక శాఖాధికారి పట్టాసి చలపతిరావు తెలిపారు. మంగళవారం మండలంలోని సుంకరమెట్ట సమీపాన ఉన్న ఎకో టూరిజం ఉడెన్ బ్రిడ్జి వద్ద ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి సంస్థ డివిజనల్ మేనేజర్ గెమ్మెలి కృష్ణబాబు ఆధ్వర్యంలో జిల్లా పర్యాటక శాఖ ప్లాస్టిక్ నిర్మూలన, క్లీన్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా జిల్లా పర్యాటకాధికారి చలపతిరావు మాట్లాడుతూ.. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నెలకు ఒకరోజు ప్రత్యేక స్వచ్ఛత కార్యక్రమం నిర్వహిస్తామని, పర్యాటకులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. ఎకో టూరిజం ప్రాజెక్ట్‌లో ఉడెన్ బ్రిడ్జ్ నిర్వహణ, సిబ్బంది పనితీరు చాలా బాగుందని అభినందించారు. అనంతరం ఉద్యోగులు, కార్మికులతో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీడీవో వి. ప్రసాద్ మాట్లాడుతూ.. పర్యాటక సిబ్బంది ప్రతి ఒక్కరూ పర్యాటకులతో ఎంతో బాధ్యతగా, స్నేహపూర్వక వాతావరణాన్ని ఏర్పరచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎఫ్డీసీ రేంజర్ కె. అవేష, పంచాయతీ సిబ్బంది, ఉడెన్ బ్రిడ్జ్ ఉద్యోగులు, స్థానిక వ్యాపారులు పాల్గొన్నారు. -
కాఫీ పరిశోధన స్థానం స్వర్ణోత్సవాలకు ఏర్పాట్లు
సాక్షి,పాడేరు: ఏపీలో ఏజెన్సీ ప్రాంతంలో కాఫీ రంగానికి సంబంధించి 50 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్న గూడెం కొత్తవీధి మండలం ఆర్వీ నగర్ కాఫీ పరిశోధన స్థానం స్వర్ణోత్సవ వేడుకల’ను ఘనంగా నిర్వహించేందుకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ టి. నిశాంతి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో కాఫీ బోర్డు అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 1976లో స్థాపించిన ఆర్వీ నగర్ కాఫీ పరిశోధన కేంద్రం గత ఐదేళ్లుగా మన్యంలో కాఫీ తోటల అభివృద్ధికి ఎంతో కృషి చేసిందన్నారు. గిరిజనులలో పోడు వ్యవసాయం తగ్గించి, కాఫీ సాగు వైపు మళ్లించడం ద్వారా వారి సామాజిక, ఆర్థికాభివృద్ధికి ఎంతగానో దోహదపడిందని కొనియాడారు. స్వర్ణోత్సవ సంబరాల సందర్భంగా కాఫీ ప్రాముఖ్యతను తెలిపే ఫోటో ఎగ్జిబిషన్ స్టాళ్లు, సాధించిన విజయాలు, రైతుల సమగ్ర వివరాల బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. స్వర్ణోత్సవ ప్రధాన సభా నిర్వహణకు స్థల పరిశీలన పూర్తి చేసి, వీఐపీ, వీవీఐపీల విజిట్స్, ఇతర ఏర్పాట్ల సమగ్ర వివరాలను తదుపరి సమావేశంలో సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో కేంద్ర కాఫీ బోర్డు డిప్యూటీ డైరెక్టర్ మురళీధర్, కాఫీ పరిశోధన స్థానం ఇన్చార్జ్ సునీల్ బాబు, వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు, కాఫీ బోర్డు ప్రతినిధులు పాల్గొన్నారు. -
గర్భిణులకు ఉచిత భోజనం
సీలేరు: మానవ సేవే మాధవ సేవ అనే సంకల్పంతో మారుమూల గిరిజన ప్రాంతాల నుంచి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే గర్భిణులు, బాలింతలకు ఉచిత భోజన సదుపాయం కల్పిస్తున్నట్లు సీలేరు బాలాజీ రెస్టారెంట్ యజమాని నక్క జ్ఞానేశ్వర్ రావు తెలిపారు. ప్రతి నెల 9వ తేదీన నిర్వహించే క్రమబద్ధ వైద్య పరీక్షల (పీఎంఎస్‌ఎంవై) కోసం వచ్చే గర్భిణులకు ఆసుపత్రి ప్రాంగణంలోనే మధ్యాహ్నం ఉచితంగా నాణ్యమైన భోజనం పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. అలాగే ఆసుపత్రిలో ప్రసవమై (డెలివరీ) వార్డులో ఉన్న బాలింతలకు రోజువారీగా మధ్యాహ్న భోజనాన్ని ఆసుపత్రికే స్వయంగా తీసుకొచ్చి అందిస్తామన్నారు. వైద్యాధికారి అందించే చీటీ చూపిస్తే ఆసుపత్రి వద్ద లేదా రెస్టారెంట్లో తక్షణమే భోజనం అందజేస్తామని వివరించారు. ఈ అవకాశాన్ని సీలేరు పరిసర మారుమూల గిరిజన గ్రామాల ప్రజలు, గర్భిణులు వినియోగించుకోవాలని ఆయన కోరారు. -
రేషన్ బియ్యంలో కోత
● సుమారు కిలో వరకు తగ్గుదల ● సీపీఎం నేతల ఆగ్రహంసెల్స్మెన్తో మాట్లాడుతున్న సీపీఎం మండల నేతలు ముంచంగిపుట్టు: మండలంలోని కర్రిముఖిపుట్టు రేషన్ డిపో ద్వారా పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం తూకాలను మంగళవారం సీపీఎం మండల నాయకులు జీనబంధు, నారాయణ పరిశీలించారు. కార్డుదారుడికి ఇచ్చే మొత్తం బియ్యంలో అర కేజీ నుంచి కేజీ వరకు తక్కువగా రావడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం నేతలు మాట్లాడుతూ.. గత నాలుగు నెలలుగా కర్రిముఖిపుట్టు డిపో పరిధిలో రేషన్ బియ్యం తూకాల్లో తేడాలు వస్తున్నాయని స్థానిక గిరిజనులు తమ దృష్టికి తెచ్చారన్నారు. దీంతో తాము స్వయంగా బియ్యం తూకాలను పరిశీలించగా తేడాలు ఉన్నట్లు స్పష్టమైందన్నారు. పీవీటీజీ గిరిజనులకు అందాల్సిన రేషన్ బియ్యంలో కోతలు విధించడం దారుణమని మండిపడ్డారు. రేషన్ సేల్స్‌మన్‌ను పిలిచి హెచ్చరించామని, మున్ముందు కూడా తూకా ల్లో తేడాలు వస్తే మండల కేంద్రంలోని జీసీసీ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు పరమేష్, వెంకటరావు, రామారావు తదితరులు పాల్గొన్నారు. -
భర్తకు తలకొరివి పెట్టిన భార్య
మునగపాక: భర్తకు భార్య తలకొరివి పెట్టిన ఘటన మునగపాకలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మునగపాక గ్రామానికి చెందిన ఆడారి శ్రీనివాసనాయుడు(54) గతంలో విలేకరిగా పనిచేసేవారు. మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. అందరితో సరదాగా మెలిగే శ్రీనివాసరావు మరణ వార్త తెలియడంతో గ్రామంలో విషాదం అలముకుంది. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకొని శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. కాగా శ్రీనివాసరావు అంత్యక్రియలు ఘనంగా జరిగాయి. అయితే శ్రీనివాసరావుకు కుమారులు లేకపోవడం, అలాగే ఇద్దరు కుమార్తెలు మైనర్లు కావడంతో భార్య వెంకటలక్ష్మి తలకొరివి పెట్టి భర్త రుణం తీర్చుకుంది. ఈ సంఘటన స్థానికులను కలచివేసింది. శ్రీనివాసరావు భార్య వెంకటలక్ష్మి స్థానిక వెలుగు కార్యాలయంలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నారు. -
అప్పన్న సన్నిధిలో అలనాటి సినీ నటి బేబి రాణి
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని మంగళవారం అలనాటి సినీ బాలనటి, జాతీయ అవార్డు గ్రహీత బేబి రాణి (రాణి రుద్రమదేవి) కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలోని కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అంతరాలయంలో ఆమె పేరిట అర్చకులు అష్టోత్తర పూజలు నిర్వహించి, వేద ఆశీర్వచనం అందజేశారు. ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామివారి ప్రసాదం, శేషవస్త్రాలను అధికారులు ఆమెకు అందించారు. ఈ సందర్భంగా బేబి రాణి మాట్లాడుతూ బాలనటిగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం తదితర భాషల్లో 90కిపైగా చిత్రాల్లో నటించినట్లు తెలిపారు. అప్పటి ప్రముఖ తెలుగు నటులు నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్వీ రంగారావు, కృష్ణ, శోభన్‌బాబు, జగ్గయ్య తదితరులతో కలిసి పలు చిత్రాల్లో నటించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. 1968, 1969 సంవత్సరాల్లో జాతీయ అవార్డులు అందుకోవడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని బేబి రాణి తెలిపారు. -
జైల్లో బెంచీల తయారీకి ఎల్అండ్టీ ఆర్డర్
ఆరిలోవ: విశాఖ కేంద్ర కారాగారంలో ఖైదీలు తయారు చేసిన స్కూల్ బెంచీలను ఎల్అండ్ టీ కంపెనీకి మంగళవారం అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల కోసం సీఎస్ఆర్ నిధులతో బెంచీలను తయారు చేయించేందుకు ఎల్అండ్టీ కంపెనీ జైలుకు ఆర్డర్ ఇచ్చింది. ఇందులో భాగంగా డస్క్లతో కూడిన 100 స్కూల్ బెంచీలను సిద్ధం చేసి, ఎల్అండ్టీ కంపెనీకి చెందిన వ్యానులో జైలు అధికారులు మంగళవారం పంపించారు. ప్రస్తుతం పంపిస్తున్న ఈ 100 బెంచీలను మధురవాడ ప్రాంతంలోని చంద్రంపాలెం ఉన్నత పాఠశాలకు అందజేయనున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా జైలు సూపరింటెండెంట్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎల్అండ్టీ కంపెనీ నుంచి ఇటీవల 400 స్కూల్ బెంచీల తయారీకి ఇండెంట్ వచ్చిందన్నారు. విడతల వారీగా 100 బెంచీల చొప్పున అందజేస్తున్నామని తెలిపారు. మంగళవారం ఒక విడత బెంచీలను పంపించామని, మరో మూడు విడతల్లో మిగిలిన బెంచీలను అందజేస్తామని పేర్కొన్నారు. జైలులోని ఖైదీలకు ఉపాధి కల్పించడంలో భాగంగా ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. సామాజిక బాధ్యతలో భాగంగా ముందుకు వచ్చే కంపెనీలు తమ ఉత్పత్తుల తయారీకి జైళ్లకు ఆర్డర్లు ఇచ్చేందుకు సహకరించాలని ఆయన కోరారు. -
పర్యాటకం.. అటకెక్కిపాయె!
సాక్షి, విశాఖపట్నం: ప్రకృతి అందాలకు నెలవైన ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యాటకం పడకేసింది. విశాఖ నగరంలో పలు ప్రాజెక్టులు పునాది రాళ్లకే పరిమితం కాగా.. గిరిజన సంస్కృతికి కేరాఫ్‌గా నిలిచిన అల్లూరి సీతారామరాజు జిల్లాలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీటీడీసీ) ఆధ్వర్యంలో విశాఖలో ఇటీవల నిర్వహించిన సదస్సులో పర్యాటక రంగం అభివృద్ధిపై పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి. గత రెండేళ్లలో ఒకటీ అర ప్రాజెక్టులు మినహా పెద్దగా పర్యాటక రంగం అభివృద్ధి చెందిన దాఖలాలు కనిపించడం లేదని అధికారులు సైతం పెదవి విరిచారు. ప్రభుత్వం శంకుస్థాపనలకే పరిమితమవుతూ.. ప్రాజెక్టుల అభివృద్ధిపై పెద్దగా దృష్టిసారించకపోవడం, స్థానిక పర్యాటక అధికారులు సైతం తమకేమీ సంబంధం లేదన్నట్లుగా అంటీముట్టనట్లు వ్యవహరించడం పర్యాటక రంగం పతనానికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. పుష్కలమైన అవకాశాలున్న అల్లూరి జిల్లాను పూర్తిగా విస్మరించడంతో.. ఈ ఏడాది పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టింది. పర్యాటకుల సందడి ఏదీ ఉమ్మడి విశాఖ జిల్లాకు పర్యాటకుల రాక ఈ ఏడాది దారుణంగా పడిపోయింది. ముఖ్యంగా పర్యాటకులు ఎక్కువగా సందర్శించే అల్లూరి జిల్లాలో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. 2025లో 72,10,942 మంది పర్యాటకులు జిల్లాను సందర్శించగా.. ఈ ఏడాది జూలై నాటికి కేవలం 2,79,553 మంది మాత్రమే వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. పర్యాటక ప్రాంతాల్లో కొత్తగా సందర్శనీయ స్థలాలను అభివృద్ధి చేయకపోవడంతో క్రమంగా పర్యాటకుల సంఖ్య తగ్గిపోతోంది. అందుబాటులో ఉన్న ప్రాంతాలను అభివృద్ధి చేసి, కొత్త ఆకర్షణలను అందుబాటులోకి తీసుకురావడంలో పర్యాటక శాఖ విఫలమవుతోంది. కాగితాల్లోనే పెట్టుబడులు ఏపీటీడీసీ విశాఖ రీజియన్ పర్యవేక్షణలో అల్లూరి జిల్లాలో రూ.375 కోట్ల పెట్టుబడులు, 925 ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించిన మూడు పర్యాటక ప్రాజెక్టులు ఇంకా డీపీఆర్ తయారీ దశలోనే మగ్గుతున్నాయి. రూ.15 కోట్లతో వైజాగ్ రిక్రియేషన్ ప్రై. లిమిటెడ్, రూ.350 కోట్లతో సన్‌విక్ గోల్ఫ్ హెవెన్ ప్రై. లిమిటెడ్, రూ.10 కోట్లతో ఉర్మికా లీజర్ సర్వీసెస్ చేపట్టాల్సిన ప్రాజెక్టులు డీపీఆర్ తయారీ దశను దాటలేదు. కనీసం ఈ ప్రాజెక్టులనైనా ప్రారంభించేందుకు ప్రభుత్వం ఒత్తిడి తీసుకురాకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇవి నిజంగా పెట్టుబడులేనా? లేక చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరుగుతున్న ఉత్తుత్తి ఒప్పందాలా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అరకు మండలం కొత్తవలసలో రూ.18 కోట్లతో చేపట్టాల్సిన టెంట్ సిటీ పనులు ఇంకా టెండర్ దశలోనే ఉన్నాయి. లంబసింగిలో రూ.6.13 కోట్లతో చేపట్టిన టెంట్ సిటీ పనులు అసంపూర్తిగా కొనసాగుతున్నాయి. అంజోడ, అరకు, ముంచంగిపుట్టు, చింతపల్లి ప్రాంతాల్లో కారవాన్ టూరిజం ప్రాజెక్టులు ఇంకా టెండర్ల దశలోనే ఉన్నాయి. అడ్వెంచర్ టూరిజం ప్రాజెక్టులకు సంబంధించిన ఫైళ్లు సైతం ఇంకా సర్క్యులేషన్లోనే ఉండిపోవడం గమనార్హం. మౌలిక వసతులకు నోచుకోని డుడుమ జలపాతంకాగితాలకే పరిమితమైన అభివృద్ధి అల్లూరి జిల్లాపై దృష్టిసారించని ఏపీటీడీసీ ఇంకా డీపీఆర్ దశలోనే రూ.375 కోట్ల పెట్టుబడులు 2025లో 72.10 లక్షల మంది పర్యాటకుల రాక ఈ ఏడాది జూలై నాటికి 2.79 లక్షల మంది సందర్శనభూములున్నా.. అభివృద్ధి శూన్యం అల్లూరి జిల్లాలో పర్యాటక శాఖకు మొత్తం 180.39 ఎకరాల భూమి అందుబాటులో ఉంది. ఇందులో ఏకంగా 92.86 ఎకరాలు ఎలాంటి అభివృద్ధికి నోచుకోకుండా నిరుపయోగంగా పడి ఉన్నాయి. ప్రభుత్వం పర్యాటక శాఖను పూర్తిగా గాలికొదిలేయడంతో.. స్థానిక అధికారులు సైతం ఇక్కడి అవకాశాలను అందిపుచ్చుకోలేకపోతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా పర్యాటక శాఖ కార్యాలయంలో కనీసం రెగ్యులర్ అధికారులు, తగినంత సిబ్బంది, కార్యాలయ వాహనాలు కూడా లేని దుస్థితి నెలకొంది. పర్యాటక కేంద్రాల్లో కనీసం చెత్తకుండీలు, సైనేజ్ బోర్డులు కూడా ఏర్పాటు చేయలేని దయనీయ పరిస్థితి తమ శాఖలో ఉందని కొందరు పర్యాటక శాఖ సిబ్బంది వాపోతుండటం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఫిషింగ్ హార్బర్లో తూనికలు, కొలతల శాఖ మెరుపు దాడులు
మహారాణిపేట: ఫిషింగ్ హార్బర్లోని చేపల వ్యాపారులపై లీగల్ మెట్రాలజీ అధికారులు మంగళవారం మెరుపు దాడులు నిర్వహించారు. లీగల్ మెట్రాలజీ డిప్యూటీ కంట్రోలర్ కేటీ రవికుమార్ ఆధ్వర్యంలో పరిధిలోని ఇన్స్పెక్టర్లు తనిఖీలు చేపట్టారు. ముద్రలు, సీలు లేని కాటాలను కొంతమంది వ్యాపారులు వినియోగిస్తున్నట్లు పీజీఆర్ఎస్లో ఫిర్యాదులు అందాయి. తూనికలు, కొలతల శాఖ నిబంధనల్లోని లోపాలను ఆసరాగా చేసుకుని వినియోగదారులను మోసగిస్తున్నట్లు ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ కంట్రోలర్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో నిబంధనలకు విరుద్ధంగా కాటాలు వినియోగిస్తున్న వారిపై మొత్తం 19 కేసులు నమోదు చేశారు. కొంతమంది వ్యాపారులు కాటాలను దాచిపెట్టినట్లు అధికారులు గుర్తించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కంట్రోలర్ రవికుమార్ మాట్లాడుతూ అక్రమాలను అరికట్టేందుకు ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. వ్యాపారులు వినియోగించే కాటాలకు తప్పనిసరిగా ప్రభుత్వ సీలు, ముద్రలు ఉండాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దాడుల్లో సిటీ ఇన్స్పెక్టర్ దామోదర నాయుడు, గాజువాక ఇన్స్పెక్టర్ రాజారమేష్, పాడేరు ఇన్స్పెక్టర్ అనూరాధ, అనకాపల్లి ఇన్స్పెక్టర్ పద్మావతి, అనకాపల్లి సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ వెంకటరావు, టెక్నికల్ అసిస్టెంట్ ఇస్మాయిల్ పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరించే వరకు శాంతియుత పోరాటం
జి.మాడుగులలో పీహెచ్సీ ఎదుట నిరసన తెలుపుతున్న ఆరోగ్యశాఖ కాంట్రాక్టు ఉద్యోగులు జి.మాడుగుల: వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించే వరకు తమ శాంతియుత పోరాటం కొనసాగుతుందని అడ్మినిస్ట్రేటివ్ మెడిసిన్, హెల్త్ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎన్. ప్రకాష్, కాంట్రాక్టు ఉద్యోగుల యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎస్. బాలయ్య స్పష్టం చేశారు. జి.మాడుగుల మండలం పరిధిలోని వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో విధులు నిర్వర్తిస్తున్న ఆరోగ్య శాఖ కాంట్రాక్టు ఉద్యోగులు మంగళవారం పీహెచ్‌సీల ఎదుట శాంతియుత నిరసన తెలిపారు. అనంతరం ప్రధాన రహదారిపై మానవహారం నిర్వహించి నిరసన వ్యక్తంచేశారు. తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీహెచ్‌డబ్ల్యూలు, కాంట్రాక్టు ఉద్యోగుల యూనియన్ నాయకులు శంకరరావు, పీబీటీఎస్ దేవి, కె. నాగమణి, ఎస్కే లాలు, కొత్తదొర తదితరులు పాల్గొన్నారు. -
పశువుల మాయం వెనుక జీవీఎంసీ సిబ్బంది హస్తం?
బీచ్‌రోడ్డు: నగరంలో పశువుల మాయంపై జీవీఎంసీ సిబ్బందిపై ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. జీవీఎంసీ 20వ వార్డు పరిధిలో గత ఆరు నెలల్లో 15కు పైగా ఆవులు, గేదెలు కనిపించకుండా పోయాయని యాదవ కులస్తులు ఆరోపించారు. జీవనాధారమైన పశువులు మాయమవడంతో లక్షల రూపాయల నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు వారాల క్రితం ఒమ్మి కాశీకి చెందిన రెండు గేదెలు మాయమవ్వడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సీసీ కెమెరాల్లో జీవీఎంసీ పశువుల తరలింపు వాహన డ్రైవర్ గేదెలను తీసుకెళ్తున్న దృశ్యాలు నమోదయ్యాయని బాధితులు తెలిపారు. అధికారిక అనుమతులు లేకుండానే తరలింపు జరిగిందని ఆరోపించారు. ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న డ్రైవర్‌పై గతంలోనూ ఫిర్యాదులు వచ్చాయని, రెండు నెలల పాటు సస్పెన్షన్‌కు గురయ్యాడని స్థానికులు పేర్కొన్నారు. ఈ దందా వెనుక మరికొందరు సిబ్బంది, దళారుల ప్రమేయం ఉందనే అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ విషయంపై మంగళవారం 30 మందికి పైగా యాదవ కులస్తులు మూడో పట్టణ నేర విభాగ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరా ఆధారాలు, గత ఫిర్యాదుల వివరాలను అందించారు. కేసు నమోదు చేసి, పశువులను తిరిగి ఇప్పించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. జీవీఎంసీ కమిషనర్ స్వయంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 20వ వార్డులో యాదవుల ఆగ్రహం -
పరిశోధన సామర్థ్యం పెంపొందించాలి
మాట్లాడుతున్న జిల్లా సైన్స్ అధికారి రామారావు చింతపల్లి: విద్యార్థుల్లో సృజనాత్మకత, పరిశోధనా సామర్థ్యం పెంపొందించి, వారు సొంతంగా ఆలోచించే విధానాన్ని ఉపాధ్యాయులు అభివృద్ధి చేయాలని జిల్లా సైన్స్ అధికారి కేజే రామారావు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులకు ఒకరోజు సైన్స్ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులలో శాసీ్త్రయ దృక్పథాన్ని, విజ్ఞానాన్ని పెంపొందించే దిశగా తరగతి గదిలో పాఠాలు, ప్రయోగాలను నిర్వహించాలని సూచించారు. ఈ విద్యాసంవత్సరంలో జరగబోయే ’ఇన్స్పైర్ మానక్’ అవార్డులకు జిల్లా నుంచి అత్యధిక సంఖ్యలో విద్యార్థులు ఎన్రోల్ అయ్యేలా, ప్రతిష్టాత్మక అవార్డులు సాధించేలా ఉపాధ్యాయులు తర్ఫీదు ఇవ్వాలని కోరారు. సైన్స్ శిక్షణా తరగతులను విద్యార్థులు, ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని కోర్సు డైరెక్టర్, ప్రధానోపాధ్యాయులు సాగిన రామరాజు పడాల్ కోరారు. ఇదే వేదికపై జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్న శేషమాంబ, వై. శారదమ్మలను దుశ్శాలువాలతో ఘనంగా సన్మానించారు. -
స్థానిక ఎన్నికల కోసమే కొత్త పింఛన్ల డ్రామా
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలేసి దగా పాలన సాగిస్తోందని మాజీ డిప్యూటీ సీఎం, శ్రీకాకుళం, పార్వతీపురం జిల్లాల వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ బూడి ముత్యాలనాయుడు ధ్వజమెత్తారు. మంగళవారం విశాఖలోని మద్దిలపాలెంలో గల వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారం చేపట్టి రెండున్నరేళ్ల తరువాత స్థానిక ఎన్నికల దృష్ట్యా ఏడు రోజుల పాటు కొత్త పెన్షన్లకు దరఖాస్తులు స్వీకరిస్తామని ప్రభుత్వం ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని ఆయన విమర్శించారు. రెండున్నరేళ్ల తరువాత కొత్త పెన్షన్లు ఇస్తూ..అది కూడా దరఖాస్తు చేసుకోవడానికి కేవలం ఏడు రోజులు మాత్రమే గడువు ఇవ్వడం సరికాదని హితవు పలికారు. అర్హులైన వారందరికీ అవకాశం దక్కేలా దరఖాస్తు గడువును మరిన్ని రోజులు పెంచాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని టీడీపీ నాయకుల చుట్టూ కొత్త పెన్షన్ దారులను తిప్పుకుంటున్నారని, ఇది సరైన విధానం కాదన్నారు. రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా అర్హులైన వారందరికీ వెంటనే పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఎండిపోయిన నారుమళ్లు.. కరువు విలయతాండవం చంద్రబాబు సీఎంగా ఉంటే రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తుందని విమర్శించారు. వర్షాలు పడక నారుమళ్లు ఎండిపోతుంటే రైతన్నలు ఆకాశం వైపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక నష్టపోతుంటే, ప్రభుత్వం ఎలాంటి చలనం లేకుండా మొద్దునిద్ర నటిస్తోందని విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, ఎన్నికలకు ముందు ధరలను అదుపు చేస్తామని చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ పాలనే స్వర్ణయుగం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పారదర్శకమైన, అవినీతి రహిత పాలన అందించామని ముత్యాలనాయుడు పేర్కొన్నారు. 2019–24 వరకు అర్హులైన వారు ఎప్పుడైనా పింఛన్లకు దరఖాస్తు చేసుకునేలా పోర్టల్‌ను ఆన్లైన్లోనే అందుబాటులో ఉంచామని చెప్పారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేసి ప్రజల గడప వద్దకే పాలన అందించామని గుర్తుచేశారు. వైఎస్ జగన్ పాలనలో పార్టీలకతీతంగా అర్హులైన వారందరికీ పెన్షన్లు, ఇళ్లు, ఇళ్ల స్థలాలు అందించామని, రైతులు సైతం ఆనందంగా ఉన్నారని తెలిపారు. చంద్రబాబు చెప్పే మాయమాటలను నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచించారు. మోసపూరిత హామీలు.. 6.20 లక్షల పింఛన్ల తొలగింపు కూటమి అధికారంలోకి వస్తే 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని చెప్పారని, కానీ గత 26 నెలలుగా కొత్త పెన్షన్లు ఎందుకు మంజూరు చేయలేదని ముత్యాలనాయుడు నిలదీశారు. పైగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకంగా 6,20,000 మంది పేదల పింఛన్లను దారుణంగా తొలగించారని మండిపడ్డారు. వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి 60 ఏళ్లకే పెన్షన్ ఇస్తామన్న మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్లు మంజూరు చేశారని, ఐదేళ్ల కాలంలో 10 లక్షలకు పైగా కొత్త పెన్షన్లు ఇచ్చారని గుర్తు చేశారు. అలాగే, ’ఇంటికొక ఉద్యోగం’, ’నిరుద్యోగ భభృతి నెలకు రూ. 3,000’, 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ’ఆడబిడ్డ నిధి’ కింద నెలకు రూ. 1,500 ఇస్తామని చెప్పి చంద్రబాబు ప్రజలను దారుణంగా మోసం చేశారని ధ్వజమెత్తారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేకపోయిన చంద్రబాబు తక్షణమే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
చౌడుపల్లి నీటి సంఘ అధ్యక్షుడు మృతి
చింతపల్లి: మండలంలోని చౌడుపల్లి నీటి సంఘం అధ్యక్షుడు కంఠా వెంకటరమణ (65) మంగళవారం మృతి చెందారు. ఆయన గతంలో ఇదే పంచాయతీకి ఉప సర్పంచ్‌గా సేవలందించడమే కాకుండా, మండలంలో ఉత్తమ ఆదర్శ, అభ్యుదయ రైతుగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు.గత వారం రోజులుగా గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన విశాఖపట్నంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త విన్న పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కాగా ఆయన కుమార్తె జాహ్నవి ప్రస్తుతం వ్యవసాయశాఖ యలమంచిలి అసిస్టెంట్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. -
ఎల్‌నినో ప్రభావానికి అనుగుణంగా సాగు మేలు
అనకాపల్లి: ఎల్‌నినో కారణంగా వర్షపాతం అనిశ్చితంగా మారుతున్న నేపథ్యంలో రైతులు వాతావరణ సూచనలను నిరంతరం గమనిస్తూ, వాటికి అనుగుణంగా వ్యవసాయ పనులు చేపట్టాలని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం (ఆర్‌ఏఆర్‌ఎస్) అధికారి సీహెచ్.ముకుందరావు సూచించారు. మంగళవారం స్థానిక ఆర్‌ఏఆర్‌ఎస్ కార్యాలయంలో శాస్త్రవేత్తలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పొడి వాతావరణం, తగినంత వర్షపాతం లేకపోవడం వల్ల వరి, మొక్కజొన్న, రాగి, కంది, వేరుశనగ, కూరగాయ పంటలు వడులుతున్న పరిస్థితుల్లో పంటలను తేమ ఒత్తిడి నుంచి కాపాడేందుకు సాధ్యమైనంత వరకు ప్రాణరక్షక నీటి తడులు అందించాలని సూచించారు. నీటిపారుదల సౌకర్యం లేని ప్రాంతాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో 19:19:19 లేదా మల్టీ–కే ద్రావణాన్ని లీటరు నీటికి 5 నుంచి 10 గ్రాములు చొప్పున కలిపి పిచికారీ చేయాలని సూచించారు. గడ్డి, వెడల్పాటి ఆకుల కలుపు మొక్కలు అధికంగా ఉన్నప్పుడు బిస్పైరాబాక్ సోడియంను ఎకరానికి సుమారు 100 మి.లీ లేదా ట్రైఫ్లోమోన్ ఇథాక్సిసల్ఫ్యూరాన్ను ఎకరానికి 90 గ్రాములు చొప్పున పిచికారీ చేయాలన్నారు. వరి పంటలో కాండం తొలిచే పురుగు, ఆకు ముడత పురుగుల వ్యాప్తిని క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు వి.గౌరీ, ఎం.విశాలాక్షి, పి.వి.పద్మావతి, ఎన్.భారతీ, ఎ.అలివేణి, తదితరులు పాల్గొన్నారు. -
ప్రజలకు మెరుగైన సేవలు
పాడేరు: ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అత్యంత పారదర్శకంగా అందేలా చూడాలని జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ ఆదేశించారు. పాడేరులో జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ ప్రతినిధులతో మంగళవారం ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరాలు, సామాజిక సేవా కార్యక్రమాలు, కొత్త సభ్యత్వ నమోదు తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సభ్యత్వ రుసుములను నిబంధనల ప్రకారం రాష్ట్ర, జిల్లా వాటాలుగా సంబంధిత బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని ఆదేశించారు. కార్యవర్గ సభ్యులంతా పరస్పర సమన్వయంతో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులు, సిబ్బంది జీతభత్యాలకు సంబంధించిన అంశాలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి, నిబంధనల మేరకు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. సొసైటీకి సంబంధించిన సమస్యలు, ఫిర్యాదులను అంతర్గతంగా చర్చించుకుని, సేవా కార్యక్రమాలకు ఎటువంటి అంతరాయం కలగకుండా ముందుకెళ్లాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఇన్చార్జి డీఆర్వో లోకేశ్వరరావు, రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా వైస్ చైర్మన్ గంగరాజు, కార్యదర్శి గౌరీశంకర్, కోశాధికారి పల్టాసింగి సూర్యారావు, సొసైటీ ప్రతినిధులు నాగరాజు, జయలక్ష్మి, సుబ్రహ్మణ్యం, రవి, శ్రీనివాసరావు, పూర్ణ తదితరులు పాల్గొన్నారు. -
సీ్త్రశిశు సంక్షేమ కార్యక్రమాలు మరింత విస్తృతం
సాక్షి, పాడేరు: బాలల బంగారు భవిష్యత్తుకు జీవితంలో తొలి వెయ్యి రోజులు ఎంతో కీలకమని, గిరిజన ప్రాంతాల్లో సీ్త్ర, శిశు సంక్షేమ కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని రాష్ట్ర సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ. సూర్యకుమారి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె అల్లూరి జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. ముందుగా అనంతగిరి మండలం కాశీపట్నం, హుకుంపేట మండలం గడుగుపల్లి అంగన్వాడీ కేంద్రాలను ఆమె అకస్మాత్తుగా తనిఖీ చేశారు. క్షేత్రస్థాయిలో అందుతున్న సేవలను పరిశీలించి, చిన్నారులతో కాసేపు ఆటపాటలతో సందడి చేశారు. గర్భిణులు, బాలింతలతో నేరుగా మాట్లాడి అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న పౌష్టికాహారం, సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ లైన్ డిపార్ట్మెంట్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం, ఆరోగ్యం, తల్లిపాల ప్రాముఖ్యతపై అంగన్వాడీ సిబ్బంది నిరంతరం అవగాహన కల్పించాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో ఉన్న సవాళ్లను అధిగమిస్తూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తే మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయన్నారు. సీడీపీవోలు క్రమం తప్పకుండా క్షేత్రస్థాయిలో పర్యటించి అంగన్వాడీల పనితీరును పర్యవేక్షించాలని ఆదేశించారు. కిశోర బాలికల్లో పోషకాహార లోపం నివారించడంపై, అలాగే కౌమార దశ గర్భధారణ అడ్డుకోవడంపై ప్రత్యేక అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం ’లాడిల్ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో రూపొందించిన పోషకాహార అవగాహన పోస్టర్లను ఆమె ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ టి. నిశాంతి, జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ, ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఆదిత్య వర్మ, యూనిసెఫ్ ప్రతినిధులు ఖ్యాతి, రేషా దేశాయ్, ఐసీడీఎస్ పిడి ఝాన్సీరామ్ పడాల్ మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
జాతీయ పురస్కారానికి జి.భీమవరం పంచాయతీ సిద్ధం
కశింకోట: జాతీయ పురస్కారం సాధించేందుకు అవసరమైన అన్ని అర్హతలు మండలంలోని జి. భీమవరం పంచాయతీకి ఉన్నాయని పంచాయతీరాజ్ అదనపు డైరెక్టర్ డి.మల్లేశ్వరి తెలిపారు. ఈ పంచాయతీని జాతీయ స్థాయి పురస్కారానికి ఎంపిక చేసిన నేపథ్యంలో మంగళవారం ఆమె గ్రామాన్ని సందర్శించి, అధికారులు చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్నపాటి లోపాలను సరిదిద్దుకుని పురస్కారం సాధించాలని, ఇతర పంచాయతీలకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. అనంతరం పంచాయతీ రికార్డులు, మౌలిక వసతులు, సిబ్బంది పనితీరును సమగ్రంగా పరిశీలించారు. స్వర్ణపంచాయతీ సిబ్బంది విధులను కూడా సమీక్షించారు. పంచాయతీలో ప్రజలకు అందుతున్న సేవలు, కనీస సౌకర్యాలపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. ఐఎస్వో సర్టిఫికేషన్, గుడ్ గవర్నెన్స్ అంశాల్లో భాగంగా అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సిహెచ్.చంద్రశేఖర్‌రావు, డిప్యూటీ ఎంపీడీవో వెంకటలక్ష్మి, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. -
కేజీబీవీని సందర్శించిన ఎస్ఎస్ఏ అధికారి
నక్కపల్లి: స్థానిక కేజీబీవీ పాఠశాలను సర్వశిక్ష అభియాన్ అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ శ్రీరాములు మంగళవారం సందర్శించారు. పాఠశాల విద్యార్థులతో పలు అంశాలు మాట్లాడారు. పాఠశాలలో విద్యార్థులకు వండి వడ్డించిన పదార్థాలను పరిశీలించారు. విద్యార్థులతో కలసి భోజనం చేసి నాణ్యత రుచి చూశారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా లేదా, పదార్థాలు శుచిగా ఉంటున్నాయా లేదా వంట సిబ్బంది విద్యార్థులతో ఏవిధంగా వ్యవహరిస్తున్నారు అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడుతూ కేజీబీవీ అంటే క్రమశిక్షణకు మారుపేరు అని, ఉపాధ్యాయుల శిక్షణలో బాగా చదువుకుని ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. కేజీబీవీలో సీటు సంపాదించి చదువుకోవడం అదృష్టంగా భావించాలన్నారు. పాఠశాలలో ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలు సద్వినియోగం చేసుకుని సత్ప్రవర్తన కలిగి ఉండాలన్నారు. పాఠశాల ఆవరణలో గార్డెన్ చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంఈవో కుంచం నరేష్, ప్రత్యేకాధికారి సలీమా పాల్గొన్నారు. -
ఎన్టీఆర్ ఆస్పత్రిలో కాంట్రాక్టు ఉద్యోగుల నిరసన
అనకాపల్లి: వైద్య ఆరోగ్యశాఖలో ప్రభుత్వ కాంట్రాక్టు పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా రెగ్యులర్ చేయాలని ఏపీ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్టు అసోసియేషన్ జిల్లా జేఏసీ చైర్మన్ జయలక్ష్మి అన్నారు. స్థానిక ఎన్టీఆర్ ఆస్పత్రిలో మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ఉద్యోగులు నోటికి నల్లమాస్క్‌లు ధరించి, ప్లకార్డులతో బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నో ఏళ్లగా జిల్లాలో వివిధ ప్రభుత్వ ఆస్పత్రిలో చాలీచాలనీ జీతాలతో ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ ప్రభుత్వం రెగ్యులర్ చేయకపోవడం అన్యాయమన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా నాయకులు మోనిక, శివ, బి.పార్వతి, ఎం.రామలక్ష్మి, ఎం.దుర్గా పాల్గొన్నారు. -
రోగులకు మెరుగైన వైద్యసేవలు
● డీసీహెచ్ఎస్ రాము చింతపల్లి ఏరియా ఆసుపత్రిలో రికార్డులను పరిశీలిస్తున్న డీసీహెచ్ఎస్ రాము చింతపల్లి: ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని జిల్లా ఆసుపత్రుల సమన్వయాధికారి డాక్టర్ ఎల్. రాము వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన స్థానిక ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ముందుగా ఆసుపత్రిలోని వివిధ వార్డులను సందర్శించి, చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి అందుతున్న వైద్యసేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమర్జెన్సీ వార్డు, మందుల నిల్వ గదులు, రక్త పరీక్షల కేంద్రం (ల్యాబ్) పరిశీలించి, రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగిపట్ల సిబ్బంది గౌరవంతో, ఆప్యాయతతో వ్యవహరించాలన్నారు. రోగులకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేయాలన్నారు. ఇన్‌పేషెంట్లకు ప్రతిరోజూ నాణ్యమైన పోషకాహారాన్ని అందించాలని సూచించారు. ఆసుపత్రిలో చేపట్టాల్సిన మౌలిక వసతులు, అభివృద్ధి పనులపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నీలవేణితో చర్చించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంతో డాక్టర్ ఇక్రమ్ అలీ ఖాన్, జనరల్ మెడిసిన్ నిపుణులు పవన్ కుమార్, నర్సింగ్ సూపరింటెండెంట్ పద్మావతి, ఆఫీస్ సూపరింటెండెంట్ రాజారావు, ల్యాబ్ టెక్నీషియన్ అనిల్ తదితరులు పాల్గొన్నారు. -
గణేష్ ఉత్సవాల్లో అప్రమత్తంగా ఉండాలి
చింతపల్లి: గణేష్ ఉత్సవాల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని చింతపల్లి డీఎస్పీ సీహెచ్ తిరుపతిరావు సూచించారు. సబ్ డివిజనల్ పరిధి సీఐలు, ఎస్ఐలతో సోమవారం నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక మండపాల ఏర్పాటు, నిమజ్జనం సమయంలో శాంతి భద్రతలకు భంగం కలగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిమజ్జనం సమయంలో విధిగా పోలీసు బందోబస్తు ఉండాలని తెలిపారు. ప్రతి గణేష్ మండపానికి విధిగా అనుమతి ఉండాలని సూచించారు. సున్నితమైన ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. చింతపల్లి సీఐ సింహాచలం, కొయ్యూరు సీఐ శ్రీనివాసరావు, గూడెంకొత్తవీధి సీఐ సుధాకర్, ఆయా స్టేషన్ల ఎస్ఐలు పాల్గొన్నారు. డీఎస్పీ తిరుపతిరావు -
‘అభా’లో సమస్త ఆరోగ్య సమాచారం
పాడేరు: ప్రతి ఒక్కరూ అభా ఐడీ పొందాలని, దానిలో సమస్త ఆరోగ్య సమాచారం ఉంటుందని కలెక్టర్ నిశాంతి తెలిపారు. మరింత సులభంగా, త్వరగా, సమర్థంగా వైద్య సేవలందించడంలో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (అభా ఐడీ) ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. సోమవారం ఉదయం స్థానిక ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రి ఓపీ సమయంలో వైద్యం కోసం వచ్చిన రోగులు, సందర్శకులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అభా ఐడీ అనేది ప్రతి పౌరుడికి కేటాయించే ఒక డిజిటల్ హెల్త్ ఐడీ అని, దీని ద్వారా రోగులకు చేసిన వైద్య పరీక్షలు, చికిత్సలు, వాడిన మందుల వివరాలు తదితర ఆరోగ్య సమాచారం డిజిటల్ రూపంలో ఉంటుందన్నారు. ఈ వివరాలను సురక్షితంగా భద్రపరుచుకోవచ్చన్నారు. జిల్లాలోని మారుమూల ప్రాంతాల గిరిజనులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో చికిత్స పొందే సమయంలో వారి గత వైద్య చరిత్ర వైద్యులకు తక్షణమే అందుబాటులో ఉంటుందన్నారు. తద్వారా సరైన వైద్య సేవలు కాలయాపన లేకుండా వేగంగా అందించే అవకాశం ఉందన్నారు. ప్రజలందరూ అభా ఐడీ యొక్క ప్రాముఖ్యతను గుర్తించి తమ ఆరోగ్య వివరాలను డిజిటల్ రూపంలో భద్రపరుచుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సంప్రదించి తప్పనిసరిగా అభా ఐడీ సృష్టించుకోవాలన్నారు. ఆమె వెంట జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసరావు, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ ఎర్రయ్య, ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది ఉన్నారు. కలెక్టర్ నిశాంతి -
కట్న వేధింపులకు వివాహిత బలి!
చోడవరం : తమ కూతుర్ని అదనపు కట్నం కోసం వేధింపులతో ఆత్మహత్యకు పురిగొల్పిన అత్తింటి వారందరినీ వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ మృతురాలి తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులంతా కలిసి పోలీసు స్టేషన్‌ను ముట్టడించారు. వివరాలివి. చోడవరం మండలం నర్సాపురం గ్రామానికి చెందిన మొల్లి భవానీ (28), ఆమె భర్త గోవిందు, పిల్లలిద్దరితో కలిసి తమ సొంతవూరు కె.కోటపాడు మండలం చౌడువాడ గ్రామం నుంచి చోడవరం మండలం నర్సాపురం వచ్చి ఇటీవల ఇల్లు నిర్మించుకొని ఇక్కడే కాపురం ఉంటున్నారు. అయితే భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాలు చోటు చేసుకోవడంతో భవానీ ఇంట్లోనే పురుగుమందు తాగింది. ఆమె భర్త స్థానికులు కలిసి హుటాహుటిన చోడవరం ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతిచెందింది. కూతురు ఆత్మహత్య చేసుకుందన్న విషయం తెలుసుకున్న వెంటనే పెందుర్తిలో నివాసం ఉంటున్న ఆమె తల్లిదండ్రులు నంబారు అప్పారావు, లక్ష్మితో బంధువులు, నర్సాపురం గ్రామస్తులు పెద్దసంఖ్యలో ఆస్పత్రికి చేరుకున్నారు. అక్కడ నుంచి చోడవరం పోలీసు స్టేషన్‌కు వచ్చి ముట్టడించారు. కుటుంబ కలహాల కారణంగానే తాను గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడుతున్నానంటూ భవానీ తమకు తెలిపిందని కుటుంబసభ్యులు పేర్కొన్నారు. తన అల్లుడే అదనపు కట్నంకోసం, అనుమానపు మాటలతో చిత్రహింసలకు గురిచేశాడని, వెంటనే భర్త గోవిందను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. వందలాది మంది ఒకేసారి పోలీసుస్టేషన్‌కు వచ్చి ముట్టడించడంతో పోలీసులకు మృతురాలు బంధువుల మధ్య వాగ్వాదం జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసి మృతురాలి భర్తను అరెస్టు చేసేందుకు చర్యలు తీసుకున్నామని సీఐ అప్పలరాజు చెప్పడంతో అంతా శాంతించి వెనుదిరిగారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, కుటుంబసభ్యులకు అందజేశామని, ఘటనపై కేసు నమోదు చేశామని సీఐ చెప్పారు. -
ఇష్టమైన బైక్ కోసం మానసిక రోగి ఆరాటం
విశాఖ విద్య: యమహా ఎఫ్‌జెడ్ బైక్ నడపాలన్నది అతని కల. అమ్మానాన్నలను అడిగితే కొనివ్వలేదని, పార్కింగ్‌లో కనిపించిన బైక్‌ను తీసుకెళ్లబోయాడు. పక్కా సమాచారంతో పోలీసులు పట్టుకుని గద్దించేసరికి ఆ యువకుడు చెప్పిన సమాధానాలు పోలీసులనే విస్తుపోయేలా చేశాయి. అది నేర ప్రవృత్తి కాదని, ఓ మానసిక రోగి అమాయక చేష్ట అని తెలియడంతో కఠినంగా వ్యవహరించాల్సిన చట్టం సైతం మానవతా దృక్పథాన్ని కనబరిచింది. విశాఖ ఫోర్త్ టౌన్ క్రైమ్ ఎస్ఐ మొహిద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి దొండపర్తి బాటా షోరూం వద్ద పార్క్ చేసి ఉన్న యమహా ఎఫ్‌జెడ్ బైక్‌ను ఒక యువకుడు అపహరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న క్రైమ్ పోలీసులు సదరు యువకుడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిందితుడు చోడవరం మండలం ఖండివరం గ్రామానికి చెందిన గెడ్డం సాయికుమార్(26)గా గుర్తించారు. బైక్ ఎందుకు దొంగిలిస్తున్నావని ప్రశ్నించగా.. ‘నాకు యమహా బైక్ అంటే చాలా ఇష్టం. మా తల్లిదండ్రులను కొనివ్వమని అడిగినా కొనివ్వలేదు.. అందుకే తీసుకెళ్తున్నా’.. అంటూ అమాయకంగా బదులిచ్చాడు. తాము ఐదు రోజుల క్రితం విశాఖ వచ్చామని, అమ్మానాన్నలతో కలిసి ఆస్పత్రిలో ఉంటున్నట్లు చెప్పడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. అతడు చెబుతున్న ఆస్పత్రి వివరాలపై ఆరా తీసిన పోలీసులు.. అది చిన్నవాల్తేరులోని ప్రభుత్వ మానసిక చికిత్సాలయంగా గుర్తించారు. వెంటనే అక్కడి సిబ్బందిని సంప్రదించగా, ఆదివారం రాత్రి ఆస్పత్రి నుంచి ఒక రోగి తప్పించుకున్నాడని, అతని కోసం గాలిస్తున్నామని తెలిపారు. సాయికుమార్ వైద్య రికార్డులను పరిశీలించి అతడి పరిస్థితిని నిర్ధారించుకున్నారు. నేరగాడిలా చూసి కేసు నమోదు చేయకుండా, అతని మానసిక స్థితిని అర్థం చేసుకున్న పోలీసులు.. సాయికుమార్ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వారి సమక్షంలో యువకుడిని సురక్షితంగా ఆస్పత్రి వర్గాలకు అప్పగించి మానవత్వాన్ని చాటుకున్నారు. -
ఇళ్ల స్థలాల కోసం పొర్లుదండాలతో నిరసన
పాయకరావుపేట: పట్టణంలో పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలంటూ సోమవారం మండల రెవెన్యూ కార్యాలయం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో పొర్లుదండాలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా నివాసముంటున్న పేదలకు ప్రభుత్వం తక్షణమే ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ పార్టీ జిల్లా నాయకుడు ఎం.సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పట్టణంలో చాలా కాలంగా నివాసముంటున్న పేదలకు ఇప్పటికీ ఇళ్ల స్థలాలు కేటాయించకపోవడం అన్యాయమని విమర్శించారు. గత కొన్ని రోజులుగా ఇళ్ల స్థలాల కోసం నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే స్పందించి అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో పార్టీ కార్యకర్తలు, బాధిత కుటుంబాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
ఎస్పీ కార్యాలయంలో 51 ఫిర్యాదులు
అనకాపల్లి : ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్కు జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి 51 ఆర్జీలు వచ్చాయి. ఎస్పీ తుహిన్ సిన్హా ఆర్జీలు స్వీకరించి, వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ చట్టపరిధిలో సమస్యలను వారం రోజుల్లో పరిష్కారానికి చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. భూ తగాదాలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక మోసాలు, భార్యాభర్తల వేధింపులు, గృహ కలహాలు, శాంతిభద్రతలు, పౌర సమస్యలపై ఆర్జీలు స్వీకరించడం జరిగిందని, సమస్యలు పరిష్కారానికి చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్.మోహన్‌రావు, ఎస్ఐ శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
సమయపాలన తప్పనిసరి
జేసీ తిరుమణి శ్రీపూజ సాక్షి,పాడేరు: కలెక్టరేట్లోని అన్ని విభాగాల అధికారులు, ఉద్యోగులు తప్పని సరిగా సమయపాలన పాటించాలని జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ ఆదేశించారు. కలెక్టరేట్ అధికారులతో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. అన్ని విభాగాల ఉద్యోగులు సక్రమంగా విధులు నిర్వహించాలన్నారు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరు అయితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. ఈసమావేశంలో ఇన్చార్జి డీఆర్వో లోకేశ్వరరావు, కలెక్టరేట్ పరిపాలన అధికారులు,అన్ని విభాగాల పర్యవేక్షకులు పాల్గొన్నారు. -
ఓటర్ల జాబితాలో ఇతర పంచాయతీ ఓట్లు
నాతవరం: క్షేత్రస్థాయిలో అధికారులు చేసిన తప్పిదాలు కారణంగా తమ పంచాయతీలోని ఓటర్ల జాబితాలో ఇతర పంచాయతీకి చెందిన 50పైగా ఓట్లు చేరాయని వైఎస్సార్సీపీ సీనియర్ నాయుకుడు గుడపర్తి అచ్చియ్యనాయుడు ఆరోపించారు. ఆయన సోమవారం తహసీల్దార్ ఒ. చందనరేఖ, ఎంపీడీవో శ్రీనివాస్‌లను కలిిసి ఫిర్యాదు చేశారు. తప్పుడు ఓటర్ల జాబితాను చూపించడంతో సదరు అధికారులు అవాక్కయ్యారు. మండలంలో వెదురుపల్లి పంచాయతీ శివారు కొవడటిపూడి గ్రామానికి చెందిన 50పైగా ఓట్లు రాజుపేట అగ్రహారం పంచాయతీ ఓటర్లు జాబితాలో చేరాయన్నారు. రాజుపేట అగ్రహారం పంచాయతీలోని 8 వార్డుల్లో ఓటర్లుగా నమోదు చేశారన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు చేసిన పొరపాట్లను ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టిసారించి ఓటర్ల జాబితా సక్రమంగా తయారు చేయాలని కోరారు. అనంతరం తహసీల్దార్ మాట్లాడుతూ ఎంపీడీవో శ్రీనివాస్‌తో కలిసి రెండు పంచాయతీలను సందర్శించి పొరపాటు ఎక్కడ జరిగిందో పరిశీలించి ఓటర్ల జాబితా సరి చేసేందుకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. -
అక్కా.. నన్ను చంపేస్తారు..!
అల్లిపురం: రెక్కాడితే గానీ డొక్కాడని సామాన్య మత్స్యకార కుటుంబం వారిది. కష్టాల కడలిని ఈదుతూ నాలుగు రాళ్లు సంపాదించుకునేందుకు పొరుగు జిల్లా నుంచి వలసొచ్చిన ఆ కు టుంబంలో తీరని విషాదం అలుముకుంది. రాత్రి ‘బయటకు వెళ్లి వస్తా’నని చెప్పి వెళ్లిన వ్యక్తి.. తెల్లవారేసరికి సముద్రతీరంలో విగతజీవిగా కనిపించడంతో భార్యాపిల్లలు, కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. సముద్రపు ఒడ్డున రక్తపు మడుగులో.. వన్ టౌన్ సీఐ వరప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాం గ్రామానికి చెందిన మైలపల్లి చంటి(30) కొంతకాలంగా విశాఖ ఫిషింగ్ హార్బర్లో చేపలవేట చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. భార్య, పిల్లలతో కలిసి స్థానిక పెయిన్దొరపేటలో నివాసం ఉంటున్నాడు. వారం రోజులుగా వేటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్న చంటి, ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో బయటకు వెళ్లాడు. సోమవారం ఉదయం నేవల్ కోస్టల్ బ్యాటరీ సమీపంలోని గంగాలమ్మ గుడి వద్ద రక్తపు మడుగులో కనిపించాడు. చంటిని గుర్తించిన స్థానిక మత్స్యకారులు పోలీసులకు సమాచారం అందించారు. గుర్తు తెలియని వ్యక్తులు అతడి తలపై కర్రలతో బలంగా కొట్టి, మెడకు నైలాన్ తాడు బిగించి అత్యంత కిరాతకంగా హతమార్చినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ముందే ఊహించినా.. దక్కని ప్రాణం ఈ దారుణం వెనుక పక్కా ప్రణాళిక ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు వ్యక్తులు తనను చంపేస్తామని బెదిరిస్తున్నట్లు ఆదివారమే చంటి తన సోదరి అప్పలకొండ వద్ద వాపోయాడు. అంతలోనే.. హత్యకు గురికావడం ఆ కుటుంబాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ బెదిరింపులకు పాల్పడినవారే ఈ ఘాతుకానికి ఒడిగట్టారా? లేక మరేదైనా వివాదం ఉందా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతుడి సోదరి అప్పలకొండ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్లతో ఘటనా స్థలాన్ని పరిశీలించి కీలక ఆధారాలు సేకరించారు. నిందితులను గుర్తించేందుకు దర్యాప్తును ముమ్మరం చేశారు. కష్టపడి బతికే మత్స్యకారుడి ప్రాణాలు గాల్లో కలసిపోవడంతో స్థానికంగా విషాదం నెలకొంది. -
ఎండుతున్న ఆశలు
కానరాని వర్షాలుఎల్నినో ప్రభావం రోజురోజుకూ తీవ్రమవుతోంది. వర్షాభావం, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు తదితర ప్రతికూల పరిస్థితులతో నాట్లు ఎండి పోతుండడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. సెప్టెంబరులో అయినా వరుణుడు కరుణిస్తాడేమోనని కాస్త ఆశతో రైతులు ఎదురుచూస్తున్నారు. పది రోజుల్లో వర్షాలు కురవకపోతే ఆశలు వదులుకోవాల్సిందేనని రైతులు వాపోతున్నారు. పెదకిల్తారిలో జాతీయ రహదారి పక్కనే నీరు లేక ఎండిపోతున్న వరి నాట్లుసాక్షి, పాడేరు: ఈ ఖరీఫ్ సీజన్లో మొదటి నుంచి గిరి రైతులకు కష్టాలు తప్పడం లేదు. నాట్లు వేశాక వర్షాలు అనుకూలించకపోవడంతో ఎండిపోతున్నాయి. నీరు లేక వర్షాల కోసం రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. సెప్టెంబరు నెల వచ్చి వారం అయిపోతున్నా అయోమయ పరిస్థితి నెలకొంది. ఏడాదికి రెండు పంటలు సాగు చేసే జి.మాడుగుల మండలం వంజరి పంచాయతీ ఘాట్ దిగువ గ్రామాల్లో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. పెదకిల్తారి, చినకిల్తారి, కృష్ణాపురం తదితర గ్రామాల్లోని సుమారు 100 ఎకరాలకు సాగునీరు అందని పరిస్థితి దాపురించింది. తమ కళ్లముందే వరినాట్లు నాశనమవుతుండడంతో గిరిజన రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. తాజంగి మినీ రిజర్వాయర్‌ను ఆనుకుని ఎగువన ఉన్న పంట భూములకు సాగునీటి సమస్య నెలకొంది. మోటార్లు ఉన్నవారు తాజంగి రిజర్వాయర్ నీటిని మడులకు మళ్లిస్తున్నారు. పెదకిల్తారి రైతులు కొండ నుంచి ప్రవహిస్తున్న ఊటనీటిని జాతీయ రహదారి దిగువన ఎండిపోతున్న వరి భూములకు మళ్లించేందుకు పంట కాల్వలను తవ్వుకుంటున్నారు. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలోని 11 మండలాల పరిధిలో ఆశించినంత వర్షాలు పడలేదు. ఇక్కడ వర్షాధారంపైనే వరితో పాటు ఇతర చిరుధాన్యాలు, వాణిజ్య పంటలు, కూరగాయల సాగు చేస్తారు. సాధారణ వరిసాగు విస్తీర్ణం 41,608 హెక్టార్లు కాగా, ఇప్పటివరకూ 34,667 హెక్టార్లలో మాత్రమే అతికష్టం మీద వరినాట్లు పడ్డాయి. అయితే నాట్లు వేసిన తరువాత కూడా వర్షాలు కురవకపోవడంతో అవి ఎండిపోతున్నాయి. 20 శాతం లోతట్టు భూముల్లో పంట ఎదుగుదలకు ఇబ్బంది లేనప్పటికీ, మిగిలిన 80 శాతం భూముల్లో నాట్లు ఎండిపోతున్నాయి. -
విద్యార్థుల భవితవ్యంతో ఆటలా?
ఆర్ఈసీఎస్ పాలిటెక్నిక్... సాక్షి , అనకాపల్లి : భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దాలి. దేశ అభివృద్ధిలో విద్యార్థులు భాగస్వాములు కావాలంటే ముందుగానే లక్ష్యాలను నిర్మించుకోవాలి. సాంకేతిక విద్యకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో సగటు మధ్య తరగతి విద్యార్థులకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల అవసరముంది. ఒకప్పుడు విశాఖ ఉమ్మడి జిల్లా పరిధిలో భాగమైన ఇప్పటి అనకాపల్లి జిల్లాలో పరవాడ ఫార్మాసిటీ, అచ్యుతాపురం–రాంబిల్లి సెజ్,పాయకరావుపేట పరిధిలో పరిశ్రమలు,గాజువాక ఆటోనగర్‌లో నెలకొల్పిన కంపెనీలకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞాన సముపార్జనకు విద్యార్థులకు పాలిటెక్నిక్ కళాశాలలు అవసరమని 2004లో అప్పటి ప్రభుత్వం గుర్తించింది. మెరిట్‌తో పాటు, ఆర్థికంగా బలంగా ఉన్నవారు ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో చదువుకోగలిగినప్పటికీ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉండే అడ్మిషన్ అవకాశాలు తక్కువే. దీంతో కశింకోట ఆర్ఈసీఎస్ పరిధిలో ఉన్న లక్షా యాభై వేల మంది వినియోగదారుల పిల్లలకు 50 శాతం కోటాతో సీట్లు ఇవ్వాలనే లక్ష్యంతో 2009లో ఆవిర్భవించింది ఆర్ఈసీఎస్ పాలిటెక్నిక్ కళాశాల. ప్రశ్నార్థకంగా కళాశాల భవితవ్యం..? ప్రస్తుతం 720 సీట్లు ఉన్న కశింకోట ఆర్ఈసీఎస్ పాలిటెక్నిక్ కళాశాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. సాంకేతికపరమైన అంశాలే దీనికి కారణం కాదు. కూటమి ప్రభుత్వం ఉదాసీన వైఖరి సైతం తోడైంది. వెరశి సదరు కళాశాలలో ప్రస్తుతం చదువుతున్న 615 విద్యార్థులు, 46 మంది సిబ్బంది నిత్యం భయం భయంగానే గడుపుతున్నారు. సమయానికి జీతం రాక కళాశాల సిబ్బంది, ఉపాధ్యాయుల ఆందోళనతో విద్యార్థులకు ఏకాగ్రతతో కూడిన విద్య అందడం లేదు. ఎంతో ప్రత్యేకత..! 2009లో ప్రారంభమైన కశింకోట ఆర్ఈసీఎస్ పాలిటెక్నిక్ కళాశాలలో ఇప్పటి వరకూ 3500 మంది డిప్లొమా పూర్తి చేశారు. 1500 మంది ఉద్యోగాలు సంపాదించగా వందలాది మంది ఉన్నత విద్యనభ్యసించారు. గ్రామీణ ప్రాంతంలో విద్యుత్ కనెక్షన్ కలిగిన మధ్య తరగతి కుటుంబీకులు డిప్లొమా పూర్తి చేయగలిగారు. విలీన ప్రక్రియతో చిక్కులు మొదలు..! ఆర్‌ఈసీఎస్‌ను 2021లో ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఏపీఈపీడీసీఎల్‌లో విలీనం చేసే ప్రక్రియ ప్రారంభించారు. ఇది దశల వారీగా కొనసాగుతోంది. ఆరంభంలో సుమారు 112 కోట్ల రూపాయల ఆస్తులు, డిపాజిట్లు, సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. 2021 నుంచి 2025 కాలంలో 412 కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందిన ఏపీఈపీడీసీఎల్ కేవలం రెండు కోట్ల రూపాయల ఖర్చుని ఆర్ఈసీఎస్ పాలిటెక్నిక్ కోసం వెచ్చించలేదు. 2024 సెప్టెంబర్ నుంచి 2025 అక్టోబర్ వరకూ జీతాలు చెల్లించేందుకు ఏపీఈపీడీసీఎల్ స్పందించకపోవడంతో ఉద్యోగుల ఆందోళన మేరకు సర్దుబాటు చేశారు. మళ్లీ రెండు వారాల క్రితం సిబ్బంది ఆర్తనాదాల మేరకు మళ్లీ జీతాల బకాయిలు చెల్లించారు. ఒకానొక సమయంలో అఫిలియేషన్ కోసం కూడా మ్యాండేటరీ ఫీజును కూడా చెల్లించని నిర్లిప్తతను ఎండీగా వ్యవహరించిన అధికారులు ప్రదర్శించారు. ప్రభుత్వ కళాశాలగా గుర్తింపు ఇవ్వాలి ఏపీఈపీడీసీఎల్ సీఎండీ, జిల్లా కలెక్టర్, ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈలు ఆర్ఈసీఎస్ పాలిటెక్నిక్ కళాశాల నిర్వహణ అంశంపై సమీక్షించాలని పలువురు కోరుతున్నారు. విలీన ప్రక్రియ నత్తనడకన సాగుతున్నందున కళాశాలను ప్రభుత్వ కళాశాలగా గుర్తింపు ఇవ్వాలని, 50 శాతం సభ్యుల పిల్లల అడ్మిషన్ వెసులుబాటు కొనసాగించాలని, సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని, అందరిలో నెలకొన్న భయాన్ని తొలగించాలని నాణ్యమైన సాంకేతిక విద్యను అందించాలని ప్రజలు కోరుకుంటున్నారు. కళాశాల పట్ల కుట్ర ఆర్ఈసీఎస్ పాలిటెక్నిక్ కళాశాల నిర్వీర్యానికి కుట్రకు తెరలేచింది. 1998 కుప్పంలో ప్రారంభించిన పాలిటెక్నిక్ కళాశాలను ప్రభుత్వంలో విలీనం చేశారు. ఇక్కడి పాలిటెక్నిక్ కళాశాల నిర్వహణ పట్ల స్పష్టత లేని వ్యవస్థలకు తోడు దశల వారీగా కళాశాలకు ఎదురవుతున్న సవాళ్లతో సిబ్బంది ఆత్మ రక్షణలో పడగా, విద్యార్థులు అభ్యసనం పట్ల ఏకాగ్రత కోల్పోతున్నారు. విద్యార్థులకు చెల్లించాల్సిన 3 కోట్ల రూపాయల ఫీజు రీయంబర్స్మెంట్ను ప్రభుత్వం ఇంకా విడుదల చేయలేదు. వందలాది కోట్ల ఆస్తుల్ని స్వాధీనం చేసుకున్న ఏపీఈపీడీసీఎల్ ఈ ప్రాంత విద్యార్థుల భవితవ్యంతో మాత్రం ఆటలాడుకుంటుంది. 16 కిలోమీటర్ల దూరంలో మరో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విలీనం చేసే ప్రతిపాదన ఒకటి తెరమీదకు తెచ్చి ఈ కళాశాల ఉనికి లేకుండా చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇక్కడి వర్గాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో రెండే కోర్సులు ఉండగా, ఇక్కడ మాత్రం 4 కోర్పులు ఉన్నాయి. అంతే కాకుండా పేద విద్యార్థులకు 50 శాతం ఆర్ఈసీఎస్ సభ్యుల కుటుంబాల పిల్లలకు అడ్మిషన్ లభించే అవకాశం కోల్పోతారు. అప్పన్నకు కానుకగా 3 కిలోల వెండి పూజాసామగ్రి సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామికి సుమారు 7.58 లక్షలు విలువ చేసే 3.034 కిలోల వెండి పూజాసామగ్రిని ఎండాడకు చెందిన ధనుకొండ శృతి సోమవారం కానుకగా అందజేశారు. ఆలయంలో డిప్యూటీ ఈవో రాధకు వీటిని అందించారు. అధికారులు దేవస్థానం తరపున దాతకు స్వామివారి దర్శనం కల్పించి, ప్రసాదం, శేషవస్త్రాలను అందజేశారు. -
అర్జీదారుల సమస్యలపై నిర్లక్ష్యం వద్దు
తుమ్మపాల : పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్‌లకు వచ్చే అర్జీదారుల సమస్యలను అధికారులు వ్యక్తిగతంగా క్షేత్ర స్థాయిలో పర్యటించి అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కరించాలని వివిధ శాఖల జిల్లా అధికారులను కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరం–1, 2లలో నిర్వహించిన పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో ఆమెతో పాటు, జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, డీఆర్వో వై.సత్యనారాయణరావు వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 364 అర్జీలు నమోదు కాగా వాటిలో 182 భూ సమస్యలు, 42 సర్వే విభాగం, 29 పంచాయతీరాజ్ శాఖల్లో ఉన్నాయి. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఆటో కార్మికుల ధర్నా ఆటో మోటార్ కార్మికులపై ఉరితాడు లాంటి జీవో నంబర్ 21,31ను రద్దు చేయాలంటూ ఏఐటీయూసీ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఆటో కార్మికులు కలెక్టరేట్ వద్ద నిరసన చేసి కలెక్టర్‌కు సమస్యలతో కూడిన వినతిపత్రం అందించారు. ఆటో అండ్ మోటార్ కార్మికులు అనేక సమస్యలతో సతమతమవుతున్నామని, వీరికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు లేవన్నారు. దీనికి తోడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సీ్త్ర శక్తి పథకం తీసుకురావడం వల్ల ఆటో, మోటార్ కార్మికులు 60 శాతం ఆదాయాన్ని కోల్పోయామన్నారు. డ్రైవర్ల సంక్షేమానికి కావలసిన నిధులు కేటాయింపు, 60 సంవత్సరాలు వయసు దాటిన డ్రైవర్లకు నెలకు పదివేల రూపాయలు పెన్షన్ సదుపాయం కల్పించాలని పలు డిమాండ్లు చేశారు. ఏఐటీయూసీ నాయకులు కోన లక్ష్మణ, రాజాన దొరబాబు, పెద్దిరెడ్ల నాగేశ్వరరావు, కోరిబిల్లి జగదీష్, మహంతి శాంతి, షేక్ అన్సర్ బేగ్, చంద్ర రావు, బాలు, వై.రాజు, అప్పన్న దొర, పి.వెంకటేష్, లోవరాజు, శ్రీను పాల్గొన్నారు. ప్రైవేటు క్రషర్లపై ఫిర్యాదు సహజ వనరులైన వాగులు, గెడ్డలను మూసివేసి నీటి ప్రవాహం లేకుండా భూ ఆక్రమణలకు పాల్పడుతున్న ప్రైవేటు క్రషర్లను నియంత్రించి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో మార్టూరు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. అనకాపల్లి మండలం మార్టూరు సర్వే నెం.6,7 వాగులను ఆక్రమించడంతో గ్రామంలో కామన్న చెరువుకు వచ్చే వర్షపు నీటిని అడ్డుకున్నారన్నారు. మార్టూరు, చుట్టుపక్కల గ్రామాల వ్యవసాయం మొత్తం కామన్న చెరువుపైనే ఆధారపడి ఉందని, 100 ఎకరాలకు పైగా మెట్ట, మాగాణి భూములకు నీరందడం లేదన్నారు. మట్టి, బండరాళ్లు, క్రషర్ వ్యర్థాలను డంప్ చేయడం ద్వారా, భారీ వాహనాల కోసం ఒక అప్రోచ్ రోడ్డును నిర్మించడం ద్వారా గెడ్డ పూర్తిగా రూపురేఖలు మారిపోయాయి. అధికారుల ముందు వాస్తవాలను వక్రీకరించి, సరైన అనుమతులు లేకుండా పర్యావరణ నిబంధనలను ఉల్లంఘిస్తూ నడుపుతున్న క్రషర్లపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో పాటు సర్వే నెం.171లో మా భూములు కూడా రవితేజ క్రషర్ వెదజల్లె కాలుష్యంతో నాశనమైపోతున్నాయంటూ గ్రామానికి చెందిన కరణం నర్శింగరావు మరో ఫిర్యాదు చేశారు. ఈఎస్ఐ ఆస్పత్రి కోసం వినతి పరవాడలో ఈఎస్ఐ అసుపత్రి నిర్మాణానికి నిధులు కేటాయించి పనులు చేపట్టాలని సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యులు జి.కోటేశ్వరరావు కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. ఫార్మా, ఎన్టీపీసీ లాంటి పరిశ్రమలు చోట 40 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారని, అక్కడే ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం కోసం సర్వే నెం.259లో 1.43 ఎకరాల స్థలం కూడా కేటాయింపులు జరిగాయన్నారు. ప్రమాదాలు జరిగిన వెంటనే దగ్గరలోని ఆసుపత్రి లేక విశాఖ తరలించే లోపున మరణాలు జరుగుతున్నాయని, ప్రభుత్వం వెంటనే స్పందించి ఆసుపత్రి నిర్మాణానికి నిధులు విడుదల చేయాలన్నారు. -
జలవనరుల శాఖ సీఈ తిరుమలరావు బాధ్యతల స్వీకరణ
ఎంవీపీకాలనీ: జలవనరులశాఖ ఉత్తరాంధ్ర చీఫ్ ఇంజినీర్ (సీఈ)గా డి.తిరుమలరావు బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత సీఈగా ఉన్న రామ్‌గోపాల్ ఇటీవల ఉద్యోగ విరమణ చేయడంతో, తిరుమలరావును ఆ స్థానంలో నియమిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆయన సోమవారం ఉషోదయ జంక్షన్‌లోని కార్యాలయానికి చేరుకుని బాధ్యతలు స్వీకరించారు. గతంలో విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాల్లో వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన ప్రస్తుతం ధవళేశ్వరంలో ఎస్ఈగా విధులు నిర్వర్తిస్తూ, పదోన్నతిపై ఇక్కడికి వచ్చారు. పలువురు విభాగ ఇంజినీరింగ్ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో డిప్యుటీ ఇంజినీర్ శ్రీహరి, ఈఈ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. -
తరగతి గదుల్లోనే దేశ భవిష్యత్తు నిర్మాణం
విశాఖ విద్య: దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే నిర్మితమవుతుందని ఎన్సీటీఈ సభ్యుడు, ది మహారాజా సయాజీరావు యూనివర్సిటీ ఆఫ్ బరోడా ఎడ్యుకేషన్ అడ్మినిస్ట్రేషన్ విభాగాధిపతి ఆచార్య కె.పుష్పనాథం అన్నారు. ఏయూ విద్యా విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఐదురోజుల ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్(ఎఫ్డీపీ)ను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ విద్యా విధానం–2020ను తరగతి గదుల్లో సమర్థంగా అమలు చేసినప్పుడే ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయన్నారు. ఏ దేశమూ తన ఉపాధ్యాయుల స్థాయిని మించి ఎదగదనే విషయాన్ని గుర్తించాలన్నారు. ఏయూ వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్ మాట్లాడుతూ వికసిత్ భారత్ లక్ష్యంతో జాతీయ విద్యా విధానం ముడిపడి ఉందన్నారు. సంక్లిష్ట సమస్యల పరిష్కారంలో ఏఐ సమర్థంగా పనిచేస్తున్నందున ఆధునిక సాంకేతికతలను పాఠ్య ప్రణాళికలో భాగం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం, అమర్‌కంఠక్ విద్యా విభాగాధిపతి ఆచార్య ఎం.టి.వి.నాగరాజు మాట్లాడుతూ జనరేటివ్ ఏఐపై ఎఫ్డీపీ నిర్వహిస్తున్న తొలి వర్సిటీగా ఏయూ నిలుస్తోందన్నారు. ఐఐఐటీ అగర్తల మాజీ సంచాలకులు ఆచార్య పి.ఎస్.అవధాని మాట్లాడుతూ సాంకేతికతతో కలిసి ముందుకు సాగాలని, ఏఐ రంగంలో భారత్ అగ్రగామిగా నిలవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అతిథులను విశ్వవిద్యాలయం తరఫున సత్కరించారు. -
జర్నలిస్టుల అరెస్ట్ అప్రజాస్వామికం
నర్సీపట్నం : నంద్యాలలో ఐ న్యూస్ రిపోర్టర్స్ అరెస్ట్ అప్రజాస్వామికం, వారిని బేషరతుగా విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర కార్యదర్శి సిహెచ్.బి.ఎల్.స్వామి డిమాండ్ చేశారు. వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చిన అంశాలపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఖండన ఇవ్వొచ్చు లేదా న్యాయస్థాఽనాన్ని ఆశ్రయించవచ్చున్నారు. కేసులు పెట్టి అర్ధఽరాత్రి అదుపులోకి తీసుకొని అరెస్ట్ చూపించక పోవడం దారుణమన్నారు. అధికార పార్టీ నేతల అండతోనే అక్రమంగా అరెస్ట్‌లు చేశారని ఆరోపించారు. సీఎం చంద్రబాబు, డీజీపీ వెంటనే స్పందించి జర్నలిస్టులను బేషరతుగా విడుదల చేయాలని, అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.24 మంది జూదరుల అరెస్టు అనకాపల్లి: మండలంలోని తుమ్మపాల గ్రామ వద్ద ఏలేరు కాలువ సమీపంలో జూదం ఆడుతుండగా 24 మందిని సోమవారం అదుపులోకి తీసుకున్నట్టు పట్టణ ఎస్ఐ ఎం.కె.జిలానీ తెలిపారు. వీరు బ్యాచ్‌లుగా ఆడుతుండగా పట్టుకున్నామన్నారు. 16 మంది బ్యాచ్ నుంచి రూ.23 వేలు, మిగిలిన వారి నుంచి రూ.10 వేల వంతున నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు అనకాపల్లి : మండలంలోని తుమ్మపాల గ్రామానికి చెందిన అప్పారావు (52) ఈ నెల 2న అదే గ్రామం వద్ద రోడ్డు దాటుతుండగా ద్విచక్ర వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన సంఘటనపై సోమవారం కేసు నమోదు చేశామని పట్టణ ట్రాఫిక్ సీఐ ఎం.వెంకటరమణ తెలిపారు. బాధితుని నుంచి అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. కమలేష్ మృతదేహం జార్ఖండ్‌కు తరలింపు అచ్యుతాపురం రూరల్ : అపార్ట్‌మెంట్‌పై నుంచి జారిపడి మృతి చెందిన కమలేష్ యాదవ్ (43)ను తన కుటుంబీకులకు అప్పగించారు. జార్ఖండ్‌కు చెందిన కమలేష్ యాదవ్ కుటుంబీకులు మృతదేహాన్ని తీసుకుని తమ సొంత రాష్ట్రమైన జార్ఖండ్‌కు తీసుకువెళ్లినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. -
ఆటోడ్రైవర్ల సంక్షేమానికి నిధులు కేటాయించాలి
అనకాపల్లి : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆటో మోటార్ కార్మికుల మెడకు ఉరి తగిలించే విధంగా జీవో నంబర్లు 21, 31ను తీసుకురావడం వల్ల రూ.100 ఉన్న ఫైన్ రూ.వేలల్లో పడుతుందని, తక్షణమే జీవోను రద్దు చేయాలని ఏపీ ఆటో డ్రైవర్, మోటర్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ)జిల్లా అధ్యక్షుడు కోన లక్ష్మణ డిమాండ్ చేశారు. స్థానిక నెహ్రూచౌక్ వద్ద యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రైవర్ల సంక్షేమం, కుటుంబ రక్షణకు సామాజిక భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని, డ్రైవర్ల సంక్షేమానికి కావలసిన నిధులు కేటాయించాలని, 60 సంవత్సరాలు పైబడిన డ్రైవర్లకు నెలకు రూ.10వేలు పెన్షన్ సదుపాయం కల్పించాలని, ప్రభుత్వాలు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి పీఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్‌తో కూడి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీ్త్ర శక్తి పథకం వల్ల ఆదాయం కోల్పోయిన ఆటో డ్రైవర్లకు నెలకు రూ.10 వేలు ఆర్థిక సహాయం అందజేయాలని, సహాజ మరణానికి రూ.5 లక్షలు, ప్రమాదంలో మృతిచెందితే రూ.10 లక్షలు ఉచిత బీమా పాలసీ అమలు చేయాలని, హెవీ వెహికల్ డ్రైవర్లకు నెలకు రూ.36 వేలు కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి రాజాన దొరబాబు, నాయకులు పెదిరెడ్ల నాగేశ్వరరావు, కోరిబిల్లి జగదీష్, మహంతి శాంతి, షేక్ అన్సర్బేగ్, చంద్రరావు, బాలు.వై.రాజు, అప్పన్న దొర, పి.వెంకటేష్, లోవరాజు పాల్గొన్నారు. -
పోలవరం కాలువలో జారిపడి వ్యక్తి గల్లంతు
యలమంచిలి రూరల్ : మండలంలోని మర్రిబంద గ్రామానికి సమీపంలో పోలవరం ఎడమ ప్రధాన కాలువలో జారిపడి సోమవారం మర్రిబంద గ్రామానికి చెందిన కంచు అప్పలనాయుడు(58) గల్లంతైనట్టు యలమంచిలి రూరల్ ఎస్ఐ ఎం.ఉపేంద్ర తెలిపారు. మర్రిబంద గ్రామానికి చెందిన అప్పలనాయుడు గ్రామస్తులతో కలిసి ఉపాధి హామీ పనులకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా ఉదయం 11.30 గంటల సమయంలో పోలవరం కాలువ ఒడ్డున కాళ్లు కడుక్కుంటుండగా ప్రమాదవశాత్తూ కాల్వలో జారి పడి గల్లంతయ్యాడు. వెంటనే గ్రామస్తులు వెతికినా అతని ఆచూకీ తెలియలేదు. యలమంచిలి అగ్నిమాపక కేంద్రం సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేస్తున్నారు. సోమవారం సాయంత్రానికి అతని ఆచూకీ లభించలేదు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. పోలవరం కాల్వ లోతు, నీటి ప్రవాహ ఉధృతి కారణంగా ప్రజలు, పిల్లలు, విద్యార్థులు కాల్వలోకి దిగవద్దని ఈ మేరకు అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్ఐ తెలిపారు. గల్లంతైన అప్పలనాయుడు తమ్ముడు సన్యాసిరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఆయన తెలిపారు.


