8 ఏళ్ల కూతుర్ని రైలుకిందికి తోసేసి కాపాడొద్దంటూ గగ్గోలు | Mother pushes 8 year old daughter under moving train at MP station | Sakshi
Sakshi News home page

8 ఏళ్ల కూతుర్ని రైలుకిందికి తోసేసి కాపాడొద్దంటూ గగ్గోలు

Mar 19 2026 4:53 PM | Updated on Mar 19 2026 5:01 PM

Mother pushes 8 year old daughter under moving train at MP station

మధ్యప్రదేశ్‌లోని నర్మదాపురం రైల్వే స్టేషన్‌లో మంగళవారం సాయంత్రం దారుణ ఘటన చోటుచేసుకుంది. ఎనిమిదేళ్ల బాలికను స్వయంగా తల్లే రైలు కిందకి తోసేసిన ఘటన దిగ్భ్రాంతి రేపింది.  సీసీటీవీలో రికార్డైన ఈ భయంకరమైన దృశ్యాలు వైరల్‌గా మారాయి.

టైమ్స్ ఆఫ్ ఇండియా  కథనం  ప్రకారం నర్మదాపురంలోని మలఖేడి ప్రాంతంలో నివసించే ప్రభుత్వ ఉద్యోగి బాధిత మహిళ. భర్త మరణం తర్వాత ఆమెకు కాంపెన్సేటరీ ప్రభుత్వ ఉద్యోగం లభించింది. ఎనిమిదేళ్ల కుమార్తెతో కలిసి అప్పటి నుంచి వారిద్దరూ ఒంటరిగా జీవిస్తోంది. ఏం జరిగిందో తెలియదు గానీ, రైల్వే స్టేషన్‌కు వెళ్లి, ఉన్నట్టుండి రెండో తరగతి చదువుతున్న తన కుమార్తెను ఎదురుగా వస్తున్న తమిళనాడు ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలపైకి తోసివేసింది. దీంతో బాలిక తల, నడుము, భుజానికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావం అయిపోయింది.  ఆమెను కాపాడిన  రైల్వే సిబ్బంది ఆమెను జిల్లా ఆసుపత్రికి తరలించారు. వెంటిలేటర్‌పై ఉంచిన చికిత్స అందించినా ఆమె పరిస్థితి విషమించడంతో భోపాల్‌లోని మరో ఆసుపత్రికి  తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని అక్కడ వైద్యులు తెలిపారు. ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతుంది. 

ఇదీ చదవండి: బిడ్డల కోసం...గుండెల్ని పిండేసే అమ్మ కథ!

ఆందోళన కలిగించిన విషయం  ఏమిటంటే..
ఈ ఘటన జరగడానికి దాదాపు మూడు గంటల ముందు నుంచి తల్లీకూతుళ్లు ప్లాట్‌ఫారమ్‌పైనే ఉన్నారని నర్మదాపురం ప్రభుత్వ రైల్వే పోలీస్ ఇన్‌చార్జి సంజీవ్ చౌక్సే  వెల్లడించారు. రాత్రి 7:40 గంటల ప్రాంతంలో తమిళనాడు ఎక్స్‌ప్రెస్ ప్లాట్‌ఫారమ్ నెం. 1 వైపు వస్తుండగా, ఆ మహిళ అకస్మాత్తుగా చిన్నారిని పట్టాలపైకి తోసేసింది. లోకోమోటివ్ ఢీకొనడంతో ఆ బాలిక ప్లాట్‌ఫారమ్ అంచుకు, పట్టాలకు మధ్య ఇరుక్కుపోయింది. తీవ్ర గాయాలుతో నొప్పితో విలవిలలాడిపోయింది. దీంతో చుట్టుప క్కల వారు, రైల్వే సిబ్బంది ఆ చిన్నారి సహాయానికి పరుగెత్తుకొచ్చారు. ఆమెను బయటకు లాగిఆసుపత్రికి తరలించారు. ఆ చిన్నారికి సాయం చేయడానికి పరుగులు తీస్తున్నసందర్భంలో రైలుకిందకి బిడ్డను తోసేసిన ఆ మహిళ,  బిడ్డను రక్షించవద్దని పదే పదే వేడుకుందని పలువురు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రాథమిక విచారణలో  నిందిత మహిళ మానసిక ఆరోగ్య కోణం కూడా ఉండవచ్చని సూచిస్తోంది. ఆ మహిళ చికిత్స చరిత్రను ధృవీకరించే ప్రక్రియలో ఉన్నామని అధికారులు తెలిపారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించామనీ,  తదుపరి విచారణ కొనసాగుతోందన్నారు.
ఇదీ చదవండి: రూ. 4 కోట్లు : హరీష్‌ పరిస్థితి వద్దు, దంపతుల కన్నీరు మున్నీరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement