breaking news
Crime News
-
కళ్లు చెదిరే వేగం.. ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నాగ్‌పూర్‌లోని పవన్గావ్–భరత్వాడా వి-పాయింట్ రోడ్డుపై వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. బుధవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదం దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.సీసీటీవీ ఫుటేజ్‌లో కారు అత్యంత వేగంగా దూసుకొస్తూ ఎలాంటి బ్రేకులు వేయకుండానే ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టినట్లు కనిపిస్తోంది. ఢీకొన్న వేగానికి కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాద తీవ్రతకు కారులో ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో యువకుడు తీవ్రంగా గాయపడటంతో అతడిని ఆస్పత్రికి తరలించారు.మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన యువకుడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కలమ్నా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించి ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుంటున్నారు. సీసీటీవీ ఫుటేజ్మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతినాగ్పూర్లోని భరత్వాడా చౌక్ వద్ద అతివేగంగా దూసుకొచ్చి ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారుదీంతో కారులో ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించగా, తీవ్ర గాయాలపాలైన మరో యువకుడు pic.twitter.com/k2Q3moSozR— Telugu Scribe (@TeluguScribe) August 13, 2026 -
బాధితురాలిపై లైంగిక వేధింపులు..! జూబ్లీహిల్స్ CI శ్రీనివాసులు కేసులో ట్విస్ట్
-
రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి దుర్మరణం
విశాఖపట్నం: భీమిలి మండలం తాళ్లవలస పంచాయతీ పరిధిలో ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీకొనడంతో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందగా, మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. వివరాల్లోకి వెళితే.. విజయనగరం జిల్లా రాజాంలోని జీఎంఆర్‌ఐటీ కళాశాలలో బీటెక్ చదువుతున్న ఆర్.గౌతమ్ (22), పోతురాజు రవికిరణ్ (21) భీమిలిలోని ఒక హోటల్లో ఇంటర్న్íÙప్ కోసం వచ్చారు. మంగళవారం సాయంత్రం వీరు బైక్‌పై జేవీ అగ్రహారం నుంచి తాళ్లవలస వైపు వెళ్తుండగా, భీమిలి–క్రాస్‌రోడ్డు రహదారి దాటుతున్న సమయంలో విశాఖ నుంచి భీమిలి వైపు వస్తున్న ‘999’ నంబర్ గల ఆర్టీసీ బస్సు వీరి బైక్‌ను బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో గౌతమ్ అక్కడికక్కడే మృతి చెందగా, రవికిరణ్ తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని వెంటనే విశాఖలోని ఒక కార్పొరేట్ ఆస్పత్రిలో చేరి్పంచారు. గౌతమ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు గౌతమ్ స్వస్థలం పెందుర్తి కాగా, గాయపడిన రవికిరణ్ విజయనగరం జిల్లా తెర్లాం మండలం గంగన్నపాడుకు చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై భీమిలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
జైల్లో CCB ఆకస్మిక తనిఖీలు..ఫోన్ తో అడ్డంగా దొరికిన మాజీ ఎంపీ
-
మానవ అక్రమ రవాణా కేసులో మహిళ అరెస్ట్
-
యువతిపై రేప్.. ఈ ఒక్కసారి క్షమించండి అంటూ ఏడుపు!
అహ్మదాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడిన సెక్యూరిటీ గార్డును పోలీసులు అరెస్టు చేశారు. భవనంలోని టెర్రస్‌పై ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. నిందితుడు సదరు భవనంలో సెక్యూరిటీ గార్డుగా నాలుగు రోజుల క్రితమే ఉద్యోగంలో చేరాడు. ఓ యువతిని టెర్రస్‌పైకి తీసుకెళ్లి ఆమె గొంతు నొక్కి అత్యాచారానికి ఒడిగట్టాడు. అనంతరం ఆమెను టెర్రస్‌పైనే ఉంచి తలుపులకు తాళం వేసి అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలు జరిగిన విషయాన్ని పోలీసులకు తెలియజేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అనంతరం నిందితుడు పోలీసుల ఎదుట ‘‘ఏక్ బార్ మాఫ్ కర్ దో.. ఫిర్ సే నహీం కరూంగా’’ అంటూ వేడుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘‘ఒక్కసారి క్షమించండి.. మళ్లీ ఇలా చేయను’’ అంటూ అతడు క్షమాపణలు కోరుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి, ఘటనకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నారు. యువతిపై అత్యాచారం కేసులో నిందితుడిని పట్టుకున్న పోలీసులుపీఎస్లో ఒక్కసారి క్షమించండి అంటూ ఏడుపునాలుగు రోజుల క్రితమే ఉద్యోగంలో చేరిన సెక్యూరిటీ గార్డు#Ahmedabad లో యువతిపై అత్యాచారానికి పాల్పడిన సెక్యూరిటీ గార్డు#RapeCase #SecurityGuard #Gujarat #viralvídeo #Anntelugu pic.twitter.com/4jVl94lgQe— ANN Telugu (@ANN_Telugu) August 11, 2026 -
11వ అంతస్తులో మంటలు.. ముంబైలో విషాదం
ముంబైలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విలే పార్లే వెస్ట్‌లోని ఓ 12 అంతస్తుల నివాస భవనంలో మంగళవారం రాత్రి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో రెండున్నరేళ్ల చిన్నారి సహా ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. మరో ఆరుగురు గాయపడ్డారు.భవనంలోని 11వ అంతస్తులో రాత్రి సమయంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న ముంబై అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రాత్రి 10.02 గంటలకు అగ్నిమాపక శాఖకు సమాచారం అందగా.. తొలుత ప్రమాదాన్ని లెవల్-1గా ప్రకటించారు. మంటలు తీవ్రత పెరగడంతో 10.16 గంటలకు లెవల్-2కు పెంచారు. దాదాపు అర్ధరాత్రి 1 గంట సమయంలో మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు.విద్యుత్ వైరింగ్ నుంచి మంటలు?అగ్నిప్రమాదంలో ఇంట్లోని విద్యుత్ వైరింగ్, ఏసీ యూనిట్, ఫర్నిచర్, సోఫా, బెడ్, ఫాల్స్ సీలింగ్, వంటగది సామగ్రి భారీగా దెబ్బతిన్నాయి. సుమారు 4 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో మంటలు వ్యాపించినట్లు అధికారులు తెలిపారు. అయితే అగ్నిప్రమాదానికి అసలు కారణం ఇంకా తెలియాల్సి ఉంది.చిన్నారి సహా ఇద్దరి మృతిప్రమాదంలో గాయపడిన ఎనిమిది మందిని ఆసుపత్రులకు తరలించారు. ఇద్దరిని కూపర్ ఆసుపత్రికి, మరో ఆరుగురిని నానావతి ఆసుపత్రికి తరలించారు. నానావతి ఆసుపత్రిలో రెండున్నరేళ్ల అబీర్, 23 ఏళ్ల అంకిత మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.గాయపడిన వారిలో ఫైర్‌మ్యాన్ మనోజ్ సోనావానే (30), శివమ్ ద్వివేది (29) చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. మరో నలుగురు పార్థ్ (32), హిరెన్ (64), యశస్వి (33), అభిషేక్ ప్రస్తుతం స్థిరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వారిలో యశస్వి, అభిషేక్ చికిత్స అనంతరం ఇంటికి వెళ్లారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. Watch: A fire broke out at Shanta Bhavan Building in Mumbai's Vile Parle area. After receiving information about the incident, 10 fire brigade vehicles reached the spot and began efforts to bring the fire under control. No injuries have been reported so far. Firefighters are… https://t.co/PaDkqJiRcZ pic.twitter.com/qvUdBe9Mkn— IANS (@ians_india) August 11, 2026 -
బోడుప్పల్లో చెడ్డీదొంగ హల్చల్
హైదరాబాద్: అర్ధరాత్రి సమయం... ఇంట్లో కుటుంబ సభ్యులు నిద్రలో ఉన్నారు. ఎందుకో తలుపు అలికిడి వినిపించింది. ఒంటిపై చొక్కా, కింది భాగాన చెడ్డీ ధరించిన ఓ దొంగ తలుపును కొడుతున్నాడు. భయభ్రాంతులకు గురై కేకలు వేయడంతో పరుగు లంకించుకున్నాడు. బతుకు దేవుడా! అంటూ బాధితులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన సోమవారం అర్ధరాత్రి మేడిపల్లి ఠాణా పరిధి బోడుప్పల్‌లోని రాఘవేంద్ర కాలనీలో కలకలం సృష్టించింది. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. రాఘవేంద్ర కాలనీలో ఓ కుటుంబం సోమవారం అర్ధరాత్రి గాఢనిద్రలో ఉంది. ఈ నేపథ్యంలో చెడ్డీ ధరించిన దొంగ.. చేతిలో సెల్‌ఫోన్‌తో పక్కనే ఉన్న భవనం నుంచి రెయిలింగ్ దూకి ఇంటి ఆవరణలోకి ప్రవేశించాడు. అనంతరం ఇంటి ప్రధాన తలుపును బద్దలు కొట్టేందుకు ప్రయతి్నంచాడు. తలుపు వద్ద భారీ శబ్దాలు రావడంతో ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు అప్రమత్తమయ్యారు. గట్టిగా కేకలు వేయడంతో దుండగుడు వెంటనే గోడ దూకి పరారయ్యాడు. అర్ధరాత్రి వేళ కుటుంభ సభ్యులు ఇంట్లో ఉండగానే చెడ్డీ దొంగ ఇంట్లోకి చొరబడేందుకు ప్రయతి్నంచడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనతో రాఘవేంద్ర కాలనీ వాసులు భయాందోళనకు గురయ్యారు. రాత్రిపూట పోలీసుల గస్తీని మరింత ముమ్మరం చేయాలని కోరుతున్నారు. -
‘రాము.. ఇంటికి రా..!’ అర్ధరాత్రి ప్రియుడికి భార్య ఫోన్
కర్ణాటక: తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న అక్కసుతో ప్రియుడితో కలిసి ఓ మహిళ భర్తను చంపి అతని మృతదేహాన్ని పొలంలో పాతిపెట్టిన దారుణ ఘటనలో 6 నెలల తర్వాత సదరు నిందితురాలు పోలీసుల వలలో చిక్కింది. బెళగావి జిల్లా చిక్కోడి తాలూకా కడక్లాట్లో ఈ దురంతం చోటు చేసుకుంది. వివరాలు.. రఘు గవాడే(40) హత్యకు గురైన వ్యక్తి. ఇతని భార్య బంగారి గవాడే, ప్రియుడు రాము రాణా నిందితులు. గత ఫిబ్రవరి 7న రాజు గవాడేను హత్య చేసి, భర్త పని కోసం వేరే ఊరికి వెళ్లాడని అందరినీ కిరాతక భార్య నమ్మించింది. బంగారి గవాడేకు రాము రాణాతో అక్రమ సంబంధం ఏర్పడింది. దీంతో భార్యపై అనుమాన పడుతూ రఘు ఘర్షణ పడేవాడు. ఈ క్రమంలో ఫిబ్రవరి 7న రాత్రి మద్యం తాగి వచ్చి ఘర్షణ పడ్డాడు. దీంతో ఆక్రోశానికి గురైన భార్య ప్రియుడు రామును పిలిపించి గాఢ నిద్రలో ఉన్న రఘు గొంతు నులిమి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. అనంతరం అర్ధరాత్రి టాటాఏస్ వాహనంలో పొలానికి శవాన్ని తరలించి దాచిన నిందితులు ఫిబ్రవరి 8న చెరకు చేనులో గొయ్యి తీసి శవాన్ని పాతిపెట్టారని దర్యాప్తులో తేలింది. ఘటనపై కడక్లాట్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి ఎట్టకేలకు నిందితులిద్దరిని అరెస్ట్ చేశారు. -
భర్తను చంపేందుకు భార్య భారీ స్కెచ్..!
తమిళనాడు: మాదక ద్రవ్యాలతో భర్తను హత్య చేసేందుకు యత్నించిన భార్యను పోలిసులు అరెస్టు చేశారు. కల్లకురిచి జిల్లాలోని చిన్నసేలం గ్రామానికి చెందిన రాజీవ్ గాంధీ(40) వ్యవసాయ కూలీ. ఇతను తన భార్య కనగ, పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. ఈ నేపథ్యంలో, గత 6వ తేదీ సాయంత్రం సుమారు 5 గంటలకు రాజీవ్ గాంధీ తన ఇంటి ముందు నిలబడి ఉండగా, పొలం బయట రోడ్డు నుండి బైకు పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో అతని మెడపైనా, నడుముపైనా పొడిచారు. కేకలు విని ఇరుగుపొరుగు వారు వచ్చారు. వారు రావడం చూసిన, ఆ గుర్తుతెలియని వ్యక్తులు బైకు పై పారిపోయారు .దీని తరువాత, రాజీవ్ గాందీని రక్షించి కల్లకురిచి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ఆయనకు ఇంటెన్సివ్ ట్రీట్మెంట్ అందిస్తున్నారు.ఈ విషయమై చిన్నసేలం పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు కోసం రెండు ప్రత్యేక బందాలను ఏర్పాటు చేశారు. అందులో, రాజీవ్ గాంధీ భార్య కనక, ఆమె వివాహితర ప్రియుడు, మాజీ పంచాయత్ అధ్యక్షుడు ధనపాల్ (53), ఇద్దరు అనుచరులతో కలిసి రాజీవ్ గాందీని హత్య చేయడానికి యత్నించినట్లు వెల్లడైంది. దీంతో చిన్నసేలం పోలీసులు ఆ గ్రూపు మాజీ నాయకుడు ధనపాల్, కనక, కిరాయి హంతకులైన పాల్ రాజ్ (24), కార్తీక్‌తో సహా మరో నలుగురి పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. -
ఆ రోజు మాల్లో ఏం జరిగిందంటే... డాక్టర్ ప్రియాంక మరణంపై సాక్షి ప్రత్యక్ష సాక్షిచెప్పిన నిజాలు
-
గర్ల్‌ఫ్రెండ్‌ను గొంతు నులిమి చంపాడని వరుణపై ఆరోపణలు
-
పేపర్ లీక్ కావడంతో మనస్థాపానికి గురై మేఘన ఆత్మహత్య
-
ఆర్ఎంపీ వైద్యం వికటించి బాలిక మృతి.. కుటుంబీకుల ఆరోపణలు
తెలంగాణ: ఖమ్మం జిల్లా, కొణిజర్ల మండలం: ఆర్ఎంపీ వద్ద చికిత్స చేయించుకున్న అనంతరం బాలిక మృతి చెందిన విషాద ఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో చోటుచేసుకుంది. వైద్యంలో భాగంగా అధిక మోతాదులో మందులు, ఇంజక్షన్ ఇవ్వడం వల్లే తమ కుమార్తె మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపించసాగారు.కుటుంబీకుల వివరాల ప్రకారం.. కొణిజర్ల మండలం లింగగూడెం గ్రామానికి చెందిన చల్లా హేమశ్రీ (13) కొణిజర్ల కస్తూరిబా కళాశాలలో 8వ తరగతి చదువుతోంది. బోనాల పండుగ సందర్భంగా ఆదివారం సాయంత్రం వరకు గ్రామస్తులు, స్నేహితులతో కలిసి హేమశ్రీ ఉత్సాహంగా గడిపింది. అనంతరం బాలికకు జలుబు, దగ్గు రావడంతో తల్లిదండ్రులు స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ బాలికకు ఇంజక్షన్ ఇవ్వడంతో పాటు మందులు అందించారు. కానీ కాసేపటికే బాలిక పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారగా, విషయాన్ని గ్రహించిన కుటుంబీకులు మెరుగైన వైద్యం కోసం ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బాలికను పరీక్షించిన ఆస్పత్రి వైద్యులు పరిస్థితి విషమించిందని అప్పటికే మార్గం మధ్యలోనే మృతి చెందిందని చెప్పారు.అయితే, ఆర్ఎంపీ డాక్టర్ అధిక మోతాదులో మందులు ఇవ్వడం వల్లే తమ కుమార్తె మృతి చెందిందని ఆగ్రహించిన కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రి వద్దకు చేరుకుని కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. అనంతరం బాలిక మృతదేహాన్ని పోలీసుల ఆధ్వర్యంలో స్వగ్రామానికి తరలించారు. కుటుంబీకులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. అలాగే, బాలిక మృతికి గల అసలు కారణాలు ఏంటో ఇంకా తెలియాల్సి ఉంది. -
బంగారం కోసం బరితెగింపు.. షాకైన అధికారులు
సూర్య నటించిన వీడొక్కడే గుర్తుందా?. అందులో డ్రగ్స్‌ను పొట్టలో ఉంచుకుని.. బాత్రూమ్కు కూడా పోకుండా స్మగ్లింగ్ చేస్తుంటారు. అది వాస్తవంగా జరిగేదే!. అయితే బంగారం అక్రమ రవాణాకు కొత్త కొత్త మార్గాలను ఎంచుకుంటున్న స్మగ్లర్లకు అధికారులు షాక్ ఇస్తున్నారు. తాజాగా.. శరీరం ప్రైవేట్పార్ట్లో దాచుకుని బంగారం తరలిస్తున్న ఓ ప్రయాణికుడిని అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.అధికారుల వివరాల ప్రకారం.. సర్ఫరాజ్ మాలా అనే ప్రయాణికుడు ఖతార్ ఎయిర్వేస్కు చెందిన విమానంలో జెడ్డా నుంచి అహ్మదాబాద్‌కు చేరుకున్నాడు. ప్రయాణికుల తనిఖీల్లో భాగంగా అతడిపై అనుమానం రావడంతో అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలో అతడి మలద్వారంలో దాచిన బంగారం ప్యాకెట్లను గుర్తించారు. వాటిని బయటకు తీసి పరిశీలించగా.. మొత్తం 467.09 గ్రాముల బంగారం ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీని విలువ సుమారు రూ.65.69 లక్షలు ఉంటుందని అంచనా వేశారు.కడ్డీగా మార్చగా బరువు తగ్గిందిస్వాధీనం చేసుకున్న బంగారాన్ని కరిగించి కడ్డీగా మార్చిన తర్వాత దాని బరువు 422.83 గ్రాములకు చేరిందని అధికారులు వెల్లడించారు. అక్రమంగా బంగారం తరలిస్తున్నందుకు ప్రయాణికుడిపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేపట్టారు. ఈ బంగారం ఎక్కడి నుంచి వచ్చింది? దీని వెనుక ఎవరైనా స్మగ్లింగ్ ముఠా ఉందా? అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.కొనసాగుతున్న అక్రమ రవాణా ప్రయత్నాలువిదేశాల నుంచి బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు స్మగ్లర్లు శరీర భాగాల్లో దాచడం, ప్రత్యేకంగా తయారు చేసిన ప్యాకెట్లను ఉపయోగించడం వంటి పద్ధతులను అనుసరిస్తున్నారు. ఇలాంటి అక్రమ రవాణాను అడ్డుకునేందుకు విమానాశ్రయాల్లో కస్టమ్స్, భద్రతా సిబ్బంది తనిఖీలను మరింత కఠినతరం చేస్తున్నారు. తాజాగా అహ్మదాబాద్ విమానాశ్రయంలో వెలుగుచూసిన ఈ ఘటన మరోసారి కలకలం రేపింది. -
తాగాను.. బండి నడిపాను అంటే సరిపోతుందా?
హైదరాబాద్‌లో ఇవాళ ఒక్కరోజే.. మూడు హిట్ అండ్ రన్ కేసులు నమోదు అయ్యాయి. హైదర్షా కోట్ ఘటనలో ఆర్మీ జవాన్ మృతి చెందగా.. కొండాపూర్ ప్రమాదంలో వనపర్తికి చెందిన వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. బాలాపూర్ ఘటనలోనూ ఒకరు మృతి చెందారు. ఈ ఘటనల్లో రెండింటిలో.. నిందితులు ఫుల్‌గా మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మెడికో ప్రియాంక కేసు విషాదాంతమైన సంగతి తెలిసిందే. రాజమండ్రిలో జరిగిన ఈ కేసులోనూ నిందితులు మద్యం సేవించిన స్థితిలో ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. ఇలాంటి ఘటనలు దేశం నలుమూలాల రోజు నమోదు అవుతూనే ఉన్నాయి. ఏరకంగా చూసుకున్నా.. మద్యం మత్తులో నిర్లక్ష్యం.. కుటుంబాలకు జీవితాంతం తీరని విషాదాన్నే మిగులుస్తోంది.ప్రియాంక.. పక్కన యాక్సిడెంట్ దృశ్యంప్రపంచంలోని అనేక దేశాలు మద్యం తాగి వాహనం నడపడాన్ని సాధారణ ట్రాఫిక్ ఉల్లంఘనగా చూడవు. అది ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగించే తీవ్రమైన నేరంగా పరిగణిస్తాయి. ముఖ్యంగా ప్రమాదం జరిగి మరణాలు సంభవిస్తే శిక్షలు మరింత కఠినంగా ఉంటాయి.అమెరికాలో మద్యం సేవించి వాహనం నడపడం (DUI/DWI) తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. రాష్ట్రాన్ని బట్టి చట్టాలు మారినా.. జరిమానాలు, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు, జైలు శిక్ష వంటి చర్యలు ఉంటాయి. ప్రమాదంలో మరణం జరిగితే కేసు తీవ్రత మరింత పెరుగుతుంది.బ్రిటన్‌లోనూ డ్రంక్ డ్రైవింగ్‌పై కఠిన నిబంధనలు అమల్లో ఉన్నాయి. మద్యం మత్తులో డ్రైవ్ చేస్తూ మరణానికి కారణమైతే దీన్ని అత్యంత తీవ్రమైన నేరంగా పరిగణించి దీర్ఘకాల జైలు శిక్షలు విధించే అవకాశం ఉంటుంది. డ్రైవింగ్ నిషేధం, భారీ జరిమానాలు కూడా ఉంటాయి.ఆస్ట్రేలియా, సింగపూర్, జపాన్ వంటి దేశాల్లోనూ మద్యం సేవించి డ్రైవింగ్‌పై కఠిన చర్యలు తీసుకుంటారు. సింగపూర్‌లో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు భారీ జరిమానాలు, జైలు శిక్షలు విధించే విధానం ఉంది. కొన్ని సందర్భాల్లో వాహనం స్వాధీనం చేసుకునే చర్యలు కూడా ఉంటాయి.లెక్కలు చెబుతున్న భయానక నిజంమద్యం మత్తులో స్టీరింగ్ పట్టడం.. కేవలం ట్రాఫిక్ తప్పిదం కాదు ప్రాణాలను బలిగొనే ప్రమాదకర నిర్ణయం. భారత్‌లో 2022లో డ్రంక్ డ్రైవింగ్‌తో 4,201 మరణాలు.. 2023లో 9,143 కేసులు.. 2024లో 8,270 ప్రమాదాలు నమోదయ్యాయి. ఈ సంఖ్య ఈ మధ్యకాలంలో పెరుగుతూ పోతోంది. ఇవే కాకుండా.. ఇతరుల ప్రాణాలు తీయడమే కాకుండా, తాగి తమ ప్రాణాలు తీసుకుంటున్నవాళ్ల లెక్కలు ఇంకా బోలెడు ఉన్నాయి.భారత్‌లో చట్టాలు ఉన్నా.. భారత్‌లోనూ డ్రంక్ డ్రైవింగ్‌పై చట్టాలు ఉన్నాయి. మోటార్ వాహనాల చట్టం ప్రకారం మద్యం సేవించి వాహనం నడిపితే జరిమానా, జైలు శిక్షకు అవకాశం ఉంటుంది. ప్రమాదం జరిగి మరణం సంభవిస్తే భారత న్యాయ సంహిత (BNS) కింద నిర్లక్ష్యపు చర్యలకు సంబంధించి మరింత తీవ్రమైన కేసులు నమోదు చేయవచ్చు. అయితే సమస్య చట్టాల కొరతలో కాదు.. వాటి అమలులో ఉందనే విమర్శలు ఉన్నాయి. తనిఖీలు జరుగుతున్నప్పటికీ.. కొందరు మద్యం మత్తులో వాహనాలు నడిపి ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారు.శిక్ష భయం ఎందుకు రావడం లేదు?డ్రంక్ డ్రైవింగ్ అనేది కేవలం ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనగా చూడలేం. మద్యం మత్తులో వాహనం నడపడం వల్ల అమాయకుల ప్రాణాలు పోవచ్చు.. ఎన్నో కుటుంబాలు జీవితాంతం తీరని విషాదాన్ని మిగులుస్తాయి. అయినప్పటికీ కొందరిలో ఈ నేరం పట్ల సరైన భయం కనిపించడం లేదు.ఇతర దేశాల్లో డ్రంక్ డ్రైవింగ్‌పై చట్టాల అమలు అత్యంత కఠినంగా ఉంటుంది. తప్పు చేసిన వెంటనే చర్యలు తీసుకోవడం, లైసెన్స్ రద్దు, భారీ జరిమానాలు, జైలు శిక్షలు వంటి పరిణామాలు ఉంటాయనే భయం వాహనదారుల్లో ఉంటుంది. ప్రమాదంలో మరణం సంభవిస్తే కేసును మరింత తీవ్రంగా పరిగణిస్తూ కఠిన శిక్షలు విధిస్తారు.హైదర్షా కోట్ హిట్ అండ్ రన్ దృశ్యం ఇదిభారత్లోనూ చట్టాలు ఉన్నప్పటికీ.. వాటి అమలు, శిక్షలు పడే వేగమే ప్రధాన సవాల్‌గా మారుతోంది. కేసులు దర్యాప్తు, న్యాయ ప్రక్రియలో ఎక్కువ కాలం కొనసాగడం.. శిక్షలు ఆలస్యంగా పడటం వల్ల కొందరిలో నేరం పట్ల భయం తగ్గుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.కఠిన చట్టాలతో పాటు.. వాటిని వేగంగా, సమర్థంగా అమలు చేయడం కూడా అంతే కీలకం. ఎందుకంటే మద్యం మత్తులో స్టీరింగ్ పట్టే ప్రతి వ్యక్తి తన ప్రాణాన్నే కాదు.. రోడ్డుపై ఉన్న ఎంతోమంది జీవితాలను ప్రమాదంలోకి నెడుతున్నాడు. శిక్ష భయం పెరిగినప్పుడే ఇలాంటి నిర్లక్ష్యాలకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంటుంది.మారాల్సింది మనస్తత్వం కూడా..ప్రపంచ దేశాలు చెబుతున్న పాఠం ఒక్కటే.. మద్యం తాగి డ్రైవింగ్ చేయడం సరదా కాదు, అది ప్రాణాలతో చెలగాటం. కఠిన చట్టాలతో పాటు.. వాటి అమలు, ప్రజల్లో బాధ్యతాయుతమైన ప్రవర్తన పెరగాల్సిన అవసరం ఉంది. హిట్ అండ్ రన్ ఘటనలు పెరుగుతున్న వేళ.. ‘‘తాగాను.. డ్రైవ్ చేస్తాను’’ అనే నిర్లక్ష్య ఆలోచనకు అడ్డుకట్ట పడాల్సిన సమయం వచ్చింది. -
నేను చనిపోయినా మెదడు బతికుంటుందిగా.. ఆ 7 నిమిషాలు నీ గురించే..
ఆంధ్రప్రదేశ్: ‘చనిపోయిన ఏడు నిమిషాల తర్వాత వరకు మెదడు బతికే ఉంటుందట కదా..? అప్పుడు కూడా నేను నీ గురించే ఆలోచిస్తా..!’ అంటూ ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్టుపెట్టి ఓ యువకుడు చెట్టుకు ఉరి వేసుకుని తనువు చాలించిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. తాను మరణించబోతున్నానని.. మరణించిన తర్వాత ఫ్రెండ్స్ ఎలా రియాక్ట్ అవుతారు.. అంటూ ఐదు రకాల స్టేటస్లు పెట్టి మృతి చెందాడు. ఇది స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.స్థానికుల వివరాల మేరకు.. గంగాధరనెల్లూరు మండలం, బంగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన పాకాలాయన, రాధిక కూమారుడు జనార్దన్‌రెడ్డి (24) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. కొన్నేళ్ల క్రితమే తల్లిదండ్రులు మృతి చెందగా తనని పట్టించుకునే వారు లేక మద్యానికి బానిసమయ్యాడు. ఆదివారం ఉదయం గ్రామ శివారులో ఓ చెట్టుకు ఉరి వేసుకుని విగత జీవవై వేలాడుతూ కనిపించాడు. మృతుని బంధువులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.చర్చనీయాంశంగా మారిన చివరి స్టేటస్..జనార్దన్ మరణించే 24 గంటల ముందు తన ఇన్‌స్ట్రాగామ్ స్టేటస్‌లో తాను చనిపోతున్నట్లు ఓ సినిమాకు సంబంధించిన స్టేటస్, అలాగే చనిపోయిన తరువాత తన మెదడు ఏడు నిమిషాలు పనిచేస్తుందని.. అప్పుడు కూడా ఒక అమ్మాయి గురించే ఆలోచిస్తుందని.. చనిపోయిన తర్వాత తన స్నేహితులు అంత్యక్రియలు బాధతో నిర్వహిస్తారని అర్థం వచ్చేలా స్టేటస్ వీడియోలు పెట్టాడు. ఆపై ఉరి వేసుకుని మృతి చెందాడు. ఇది ప్రతి ఒక్కరినీ కదిలించింది.గమనిక: మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001; మెయిల్: roshnihelp@gmail.com -
అపార ప్రతిభ.. అకాల మరణం!
ఆంధ్రప్రదేశ్: టేబుల్ టెన్నిస్ బోర్డుపై ర్యాకెట్ పట్టి ప్రత్యర్థులను చిత్తుచేస్తూ.. రాష్ట్రస్థాయి పతకాలు సాధిస్తున్న ఆ చిరుచేతులు ఇక కదలవు. పట్టుదలతో కష్టపడి భవిష్యత్తులో దేశం గర్వించే క్రీడాకారుడిగా ఎదుగుతాడనుకున్న ఆ బాలుడి నవ్వులు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. ఒక చిన్నపాటి శారీరక లోపాన్ని సరిచేసుకుందామని ఆస్పత్రికి వెళ్తే.. విధి వెక్కిరించడంతో ఆ చిన్నారి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. కంటికి రెప్పలా కాపాడుకున్న కంటిపాప కన్నుమూయడంతో ఆ తల్లిదండ్రుల గుండెలు పగిలాయి. అంతటి తీరని దుఃఖంలోనూ కుమారుడి నేత్రాలను దానం చేసి మరొకరి జీవితాల్లో వెలుగులు నింపారు.పతకాల రేసులో నిలిచి..బుచ్చిరాజుపాలెంలో నివాసముంటున్న తిరుమలరాజు హరిబాబు, భవానీ దంపతుల కుమారుడు హర్షవర్ధన్‌వర్మ (12) స్థానిక ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. చదువుతో పా టు ఆటల్లోనూ ఎంతో చురుగ్గా ఉండే హర్షవర్ధన్.. తనకు ఎంతో ఇష్టమైన టేబుల్ టెన్నిస్‌ను ఎంచుకున్నాడు. క్రమశిక్షణతో సాధన చేస్తూ అండర్–12 విభాగంలో రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటాడు. ఎన్నో పతకాలు సాధించాడు.లోపాన్ని సరి చేసుకోవాలనుకుంటే..బాలుడిలో ఉన్న చిన్నపాటి శారీరక లోపాన్ని సరిచేసేందుకు ఇటీవల ఒక ప్రైవేటు ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేయించారు. అయితే దురదృష్టవశాత్తు ఆరోగ్యం విషమించడంతో మృత్యువుతో పోరాడుతూ ఆదివారం హర్షవర్ధన్ కన్నుమూశాడు. హర్షవర్ధన్ భౌతికకాయాన్ని తరలించేందుకు బంధువు అశోక్ పెందుర్తిలోని ‘సాయి హెల్పింగ్ హాండ్స్ చారిటబుల్ ట్రస్ట్’ వ్యవస్థాపకుడు దాడి శ్రీనివాస్‌ను సంప్రదించారు. ఆ సమయంలో శ్రీనివాస్ నేత్రదానం కోసం వివరించగా.. పుట్టెడు శోకంలో ఉన్న తల్లిదండ్రులు హరిబాబు, భవానీ ఏమాత్రం సంకోచించకుండా అంగీకరించారు. -
నటుడు దర్శన్ కేసులో మరో సంచలనం!
రేణుకాస్వామి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో నిందితుడు ప్రదోష్ అప్రూవర్‌గా మారేందుకు దాఖలు చేసిన పిటిషన్లో సంచలన ఆరోపణలు చేశాడు. హత్య జరిగిన రోజు ఏం జరిగింది? ఎలా దాడి చేసి చంపారు?.. అనంతరం సాక్ష్యాలను మాయం చేసే ప్రయత్నాలు.. ఆపై తెరపైకి వచ్చిన కవర్అప్ కథను అందులో అతను ‘పూసగుచ్చినట్లు’ వివరించాడు. దీంతో నటుడు దర్శన్ చుట్టూ ఉచ్చు మరింత బిగిసేలా కనిపిస్తోంది.సంచలనం సృష్టించిన రేణుకాస్వామి హత్య కేసులో పవిత్రగౌడ, దర్శన్‌లు ప్రధాన నిందితులుగా ఉన్నారు. ప్రదోష్ ఏ-14గా ఉన్నాడు. అప్రూవర్‌గా మారేందుకు 59వ సెషన్స్ కోర్టులో అతను వేసిన పిటిషన్లో వివరాలు ఇలా ఉన్నాయి.. తొలుత రేణుకాస్వామిని దర్శన్ మనుషులు కొందరు ఎత్తుకొచ్చారు. పవిత్ర గౌడకు పంపినట్లు చెబుతున్న సందేశాల విషయంలో దర్శన్ అతడిని ప్రశ్నించాడు. ఆ తర్వాతే తన మనుషుల్ని ఉసిగొల్పడంతో.. దాడి జరిగింది. కర్రలు, తాళ్లతో అతన్ని తీవ్రంగా గాయపరిచారు. రేణుకాస్వామి మరణించాడని నిర్ధారించుకున్నాక.. కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేశారు.మృతదేహాన్ని తరలించి.. కథ మార్చే ప్రయత్నం?రేణుకాస్వామి మరణం తర్వాత ఘటనను కప్పిపుచ్చేందుకు ప్రత్యామ్నాయ కథనం సిద్ధం చేసుకున్నారు. తొలుత శవాన్ని మాయం చేయాలని ప్రయత్నించారు. ఆ తర్వాత కొందరు నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోయేలా ప్రణాళిక రూపొందించారు. ఆ నేరం వాళ్ల మీద వేసుకునేందుకు దర్శన్ పవిత్రలు వాళ్లకు డబ్బులు ఆఫర్ చేశారు. ఆ ప్లాన్ ప్రకారమే అంతా నడిచింది కూడా.అయితే ఈ కేసులో జరిగిదంతా నిజాయతీగా వెల్లడించేందుకు సిద్ధంగా ఉన్నానని, అందుకే అప్రూవర్ హోదా ఇవ్వాలని ప్రదోష్ కోర్టును కోరాడు. జైల్లో తనకు భద్రత కల్పించాలని, ఇతర నిందితులతో కలిపి ఉంచొద్దని కూడా విజ్ఞప్తి చేశాడు. అయితే ప్రదోష్ పిటిషన్‌పై వాదనలు విన్న కోర్టు.. తీర్పును రిజర్వ్ చేసింది. ఒకవేళ కోర్టు అతన్ని అప్రూవర్‌గా అంగీకరిస్తే.. ఆపై వాంగ్మూలం లభిస్తే.. దర్శన్, పవిత్ర గౌడ సహా ఇతర నిందితులపై ప్రాసిక్యూషన్ కేసుకు కీలక ఆధారంగా మారే అవకాశం ఉంది. మరోవైపు ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు కూడా అప్రూవర్‌గా మారేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరిణామాలు కేసును మరో మలుపు తిప్పేలా కనిపిస్తున్నాయి.రేణుకాస్వామి అనే వ్యక్తి దర్శన్‌కు వీరాభిమాని. అయితే నటి పవిత్రా గౌడ వల్ల దర్శన్ వ్యక్తిగత జీవితం నాశనమైందని అతను కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలో పవిత్రకు అసభ్యమైన సందేశాలు పంపాడు. ఈ విషయంలోనే ఆగ్రహించిన దర్శన్.. అతన్ని కిడ్నాప్ చేయించి తన మనుషులతో అతికిరాతకంగా హత్య చేయించాడన్నది అభియోగం. ఈ కేసులో అరెస్టైన దర్శన్‌కు తొలుత హైకోర్టు బెయిల్ ఇచ్చింది. అయితే ఈ తీర్పును తీవ్రంగా పరిగణించిన సుప్రీం కోర్టు ఆ బెయిల్ రద్దు చేసింది. కేసు విచారణ త్వరగా ముగించాలని ట్రయల్ కోర్టుకు స్పష్టం చేసింది. దీంతో దర్శన్, పవిత్రలు మళ్లీ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. -
పెళ్లయి వారం రోజులు.. ఇంతలోనే షాకింగ్ ట్విస్ట్!
హైదరాబాద్: ప్రేమ వివాహం చేసుకున్న ఓ నవ వధువు కిడ్నాప్ అయిన ఘటన మంచాల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ మధు కథనం ప్రకారం... రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చిత్తాపూర్‌కు చెందిన ఏర్పుల ప్రవీణ్, నగరంలోని ఐఎస్ సదన్‌కు చెందిన కళ్యాణి కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.వారం క్రితం భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట దేవస్థానంలో వివాహం చేసుకున్నారు. అనంతరం పోలీసులను ఆశ్రయించగా ఇరువురి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అమ్మాయి తరఫున ఎవరూ రాలేదు. చిత్తాపూర్లో ఆ జంట నివాసం ఉంటున్న క్రమంలో శనివారంరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి కళ్యాణిని కారులో ఎత్తుకెళ్లారు. తన భార్యను జ్యోతిబస్ అనే యువకుడితోపాటు కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని ఆదివారం ప్రవీణ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది. -
నర్సాపూర్ అర్బన్ పార్క్‌కు వెళ్లి వస్తుండగా.. విషాదం!
హైదరాబాద్: మెదక్ జిల్లాలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో నగరానికి చెందిన విద్యార్థి దుర్మరణం చెందారని నర్సాపూర్ ఎస్సై రంజిత్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్ మియాపూర్‌కు చెందిన షేక్ హసిన్ మెహతా(19) బీటెక్ ఫైనలియర్ చదువుతున్నాడు.స్నేహితులు వెంకటగిరీష్, చంద్ర, దేవ సునందన్ సాయితో కలిసి మియాపూర్ నుంచి ఆదివారం ఉదయం నర్సాపూర్ అటవీ ప్రాంతంలోని అర్బన్ పార్క్ సందర్శనకు బైక్‌లపై వచ్చారు. అనంతరం తిరుగుప్రయాణంలో కొండాపూర్ సమీపంలోని టర్నింగ్ వద్ద బైక్ అతివేగంగా రెయిలింగ్‌ను ఢీకొట్టగా హసిన్ మెహతాకు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని వెంటనే నర్సాపూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
రూ.500 కోసం దాడి.. అవమానం భరించలేక డ్రైవర్ ఆత్మహత్య
సాక్షి, జగిత్యాల: కేవలం రూ.500 విషయంలో జరిగిన వివాదం తీవ్ర విషాదానికి దారితీసింది. తన యజమాని వద్ద రావాల్సిన డబ్బులు అడిగిన ట్రాక్టర్ డ్రైవర్‌పై దాడి జరగడంతో తీవ్ర మనస్తాపానికి గురైన రమేశ్ అనే ట్రాక్టర్ డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జగిత్యాల జిల్లా వెల్దుర్తిలో చోటుచేసుకుంది.వివరాల ప్రకారం.. వెల్దుర్తికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ రమేశ్‌కు తన యజమాని వద్ద రూ.500 రావాల్సి ఉంది. డబ్బులు ఇవ్వకపోవడంతో రమేశ్ ఫోన్లో యజమానిని మందలించినట్లు సమాచారం. దీంతో ఆగ్రహానికి గురైన యజమాని గంగారెడ్డి మరో వ్యక్తితో కలిసి రమేశ్ ఇంటికి వెళ్లి ‘నన్నే తిడుతావా?’ అంటూ తన భార్య, పిల్లల ఎదుటే రమేశ్‌పై ఇద్దరూ కలిసి దాడి చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ దాడిలో రమేశ్ స్పృహ కోల్పోయి కిందపడిపోయినట్లు తెలిపారు. అనంతరం అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించిన తర్వాత తిరిగి ఇంటికి తీసుకొచ్చినట్లు సమాచారం.అయితే తనకు జరిగిన అవమానంతో తీవ్ర మనస్తాపానికి గురైన రమేశ్ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దాంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. జరిగిన ఘటనపై జగిత్యాల రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రమేశ్‌పై దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గంగారెడ్డితో పాటు మరో వ్యక్తిపై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు రమేశ్‌కు భార్య, కుమారుడు ఉన్నారు. రూ.500 కోసం తమ కుటుంబానికి తీరని నష్టం జరిగిందంటూ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
మెట్రోలో అమ్మాయిలకు అంకుల్ చేతిలో భయానక అనుభవం
న్యూఢిల్లీ: మెట్రోలో ప్రయాణిస్తున్న పలువురు అమ్మాయిలకు ఓ మధ్య వయస్కుడైన వ్యక్తి చేతిలో భయానక అనుభవం ఎదురైంది. తమను ఆ వ్యక్తి రహస్యంగా వీడియో తీస్తున్నాడని ఇద్దరు యువతులు గుర్తించారు. లోక్ నాయక్ భవన్ మెట్రో స్టేషన్ వద్ద, గ్రీన్ పార్క్ వైపు ప్రయాణిస్తున్నప్పుడు ఈ ఘటన జరిగినట్టు సమాచారం. యువతుల్లో ఒకరు తెలిపిన వివరాల ప్రకారం.. తమ సమీపంలో కూర్చున్న ఆ వ్యక్తి తమకు తెలియకుండా ఫొటోలు తీస్తున్నాడనే అనుమానం వచ్చింది.తాము గమనించామని అతనికి తెలిసిన తర్వాత కూడా తమ వైపే చూస్తూ ఉండటంతో పరిస్థితి మరింత అసౌకర్యంగా మారిందని ఆమె ఆరోపించారు. దీంతో మహిళలు అతడిని నిలదీసి, ఫోన్ చూపించాలని కోరారు. తమ ఫొటోలు తీయలేదని అతడు చెప్పాడు. అయితే వారు చూస్తుండగానే తన ఫోన్లోని చిత్రాలు, వీడియోలను తొలగిస్తున్నట్టు కనిపించాడు.ఆ తర్వాత ఫొటోలు తొలగిపోయాయని భావించి వారికి ఫోన్ చూపించాడు. అయితే మహిళలు తర్వాత ఫోన్లోని రీసైకిల్ బిన్ను పరిశీలించగా, అందులో వీడియో కనిపించింది. అనుమతి లేకుండా ఎవరి ఫొటోలు లేదా వీడియోలు తీయడం సరికాదని ఆ యువతులు అతడికి చెప్పారు. ఈ వాగ్వాదానికి సంబంధించిన వీడియోను తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా, అది విస్తృతంగా దృష్టిని ఆకర్షించింది.“మహిళలు నిజంగా సురక్షితమేనా?” అనే శీర్షికతో ఆ వీడియోను పోస్ట్ చేశారు. అనేక మంది సామాజిక మాధ్యమ యూజర్లు ఆ వ్యక్తి ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజువారీ ప్రయాణాల్లో మహిళలు ఇలాంటి అసౌకర్యకర పరిస్థితులను ఎందుకు ఎదుర్కోవాల్సి వస్తోందని ప్రశ్నించారు. అనుమతి లేకుండా అపరిచితుల ఫొటోలు తీసే లేదా వీడియోలు రికార్డు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మరికొందరు కోరారు. View this post on Instagram A post shared by praveenya (@praveenyaaaa) -
వారే టార్గెట్.. ఫోన్లో 600కి పైగా వీడియోలు!
మహారాష్ట్రలోని నందుర్బార్ జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. మైనర్లు, యువకులకు డబ్బు ఆశ చూపి వలలో వేసుకుని.. వారిని బ్లాక్మెయిల్ చేస్తూ లైంగికంగా వేధిస్తున్నాడన్న ఆరోపణలతో ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి ఫోన్లో 600కుపైగా అశ్లీల వీడియోలు, ఫొటోలను పోలీసులు గుర్తించారు.పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. రైజింగ్పురాకు చెందిన చేతన్ ప్రకాశ్ కోలి (22).. 2022 నుంచి మైనర్లు, యువకులను లక్ష్యంగా చేసుకుని ఈ దారుణాలకు పాల్పడుతున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. డబ్బులు ఇస్తానని నమ్మించి బాధితులను ఆకర్షించిన నిందితుడు.. వారితో అసభ్యకర వీడియోలు చిత్రీకరించి, వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తానంటూ బెదిరిస్తూ వేధింపులకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.నిందితుడి మొబైల్ ఫోన్‌ను పరిశీలించగా అందులో పెద్ద సంఖ్యలో అశ్లీల వీడియోలు, ఫొటోలు బయటపడ్డాయని నందుర్బార్ ఎస్పీ అశ్విని సనప్ వెల్లడించారు. ఫోరెన్సిక్ బృందం ఫోన్‌ను స్వాధీనం చేసుకుని పరిశీలనకు పంపినట్లు తెలిపారు. వీడియోల్లో ఉన్న బాధితులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. వారి వాంగ్మూలాలు నమోదు చేయనున్నట్లు అధికారులు చెప్పారు. ఇప్పటివరకు లభించిన ఆధారాల ప్రకారం.. నిందితుడు 2022 నుంచి ఈ అకృత్యాలకు పాల్పడుతున్నట్లు విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. -
ఆ కోపంతోనే కారుతో ప్రియాంకను ఢీకొట్టారు
-
చదవలేక.. తండ్రికి చెప్పలేక తనువు చాలించాడు
మధురానగర్(విజయవాడసెంట్రల్): చదువు ఒంటబట్టక.. ఈ విషయం తండ్రికి చెప్పలేక అర్ధంతరంగా ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకుని తనువుచాలించాడు. విషాద ఘటన శుక్రవారం విజయవాడ మధురానగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధురానగర్ లెక్చరర్స్ కాలనీకి చెందిన సమ్మెట దుర్గాప్రసాద్ ఎల్రక్టీషియన్. ఆయన భార్య ఎనిమిది సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మరణించింది. కుమారుడు సమ్మెట తరుణ్ రాజ్ (13) సత్యనారాయణపురం ఏకేటీపీ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. ప్రతి రోజూలాగే శుక్రవారం ఉదయం 9.15కి స్కూల్‌కి వెళ్తున్నాను అని చెప్పి సైకిల్ మీద వెళ్లాడు. తర్వాత సుమారు 10 గంటల ప్రాంతంలో బయట నంబర్ నుంచి తండ్రికి ఫోన్ చేసి స్కూల్‌కు వెళ్లే సరికి గేటు వేసి ఉందని.. తాను ఇంటికి వచ్చేస్తున్నానని చెపాడు. దీంతో తండ్రి సరే వచ్చేసేయ్ అని చెప్పి తన పనిలో నిమగ్నమయ్యాడు. పని ముగించుకుని దుర్గాప్రసాద్ ఇంటికి వచ్చేసరికి ఇంటి తలుపు లోపల వేసి ఉంది. లోపలికి వెళ్లి చూడగా తరుణ్‌రాజ్ చున్నీతో ఫ్యాన్‌కి ఉరేసుకొని వేలాడుతూ కనిపించాడు. దీంతో దుర్గాప్రసాద్ చుట్టుపక్కల బంధువులను పిలిచి గుణదల పోలీసులకు సమాచారం అందించారు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బెడ్రూంలోని ఒక పుస్తకంలో ‘నాన్నా నువ్వు చదువు .. చదువు అని ఎప్పుడూ అంటూ ఉంటావు. నాకు చదవడం అంతగా రావడం లేదు అందుకే చనిపోతున్నాను’ అని రాసి ఉంది. ఇప్పటికే +భార్యను కోల్పోయిన దుర్గాప్రసాద్ ఇప్పుడు ఉన్న ఒక్కగానొక్క కొడుకు తనువు చాలించటంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. -
అన్నా భయంగా ఉంది.. చంద్రకళ ఏదేదో మాట్లాడుతుంది..!
కాళ్ల పారాణి ఆరకముందే ఆ నవ వధువు నిండు జీవితం ముగిసిపోయింది.. కొత్త బంధంతో సరికొత్త ప్రపంచంలో అడుగుపెట్టిన నాలుగు నెలలకే ఈ లోకాన్నే విడిచి వెళ్లిపోయింది. ఉన్నత చదువులు అభ్యసించి ఉత్తీర్ణురాలైన ఆమె తన గుండెబాధను అధిగమించలేకపోయింది. విజయవాడ అజిత్‌సింగ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అయోధ్యనగర్ బసవతారక నగర్లో ఓ వివాహిత మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. అయోధ్యనగర్ బసవ తారక నగర్ ప్రాంతానికి చెందిన గోనోల్ల దేవేంద్రకు అన్నమయ్య జిల్లా మదనపల్లి ప్రాంతానికి చెందిన మారాని చంద్రకళ (24) తో ఈ ఏడాది ఏప్రిల్ 23న పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. ఎంబీఏ చదువుకున్న చంద్రకళ ఇంటివద్దే ఉంటుండగా దేవేంద్ర హనుమాన్‌పేటలోని ప్రైయివేటు ట్రావెల్స్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. రోజూలానే శుక్రవారం ఉదయం దేవేంద్ర పనికి వెళ్లగా చంద్రకళ ఇంటిలోనే ఉంది. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో దేవేంద్ర భోజనానికి ఇంటికి బయల్దేరుతుండగా చంద్రకళ స్నేహితుడు రమణ ఫోను చేసి అన్నా నాకు చాలా భయంగా ఉంది.. చంద్రకళ ఏదేదో మాట్లాడుతుంది.. నువ్వు త్వరగా ఇంటికి వెళ్లమని చెప్పాడు. దీంతో హుటాహూటిన పని నుంచి ఇంటికి వెళ్లగా భార్య తలుపు వేసుకొని, గొళ్లెం పెట్టుకొని ఉంది. కిటికీ తెరచి చూడగా చంద్రకళ తన చున్నీతో ఫ్యాన్‌కు ఉరివేసుకొని వేలాడుతూ కలినిపించింది. చుట్టుపక్కల వారి సాయంతో గొళ్లెం పగలగొట్టి లోపలకు వెళ్లి చంద్రకళను కిందకి దించాడు. అంబులెన్స్ డాక్టర్ పరీక్షించి అప్పటికే చనిపోనట్టు నిర్ధారించారు. ఇష్టం లేని వివాహం చేసినందుకేనా..? చంద్రకళకు ఇష్టం లేని వివాహం చేయడం వల్లే ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎంబీఏ చదువుకున్న ఆమెకు బెంగళూరులో ఉంటున్న తన స్నేహితుడంటే ఇష్టమై ఉండొచ్చని.. ఆమె కాల్ లిస్ట్‌లో చివరిగా మాట్లాడిన కాల్ కూడా అతనిదేనని సమాచారం. మృతికి కారణాలు పూర్తిగా తెలియడం లేదని.. యువతి తల్లిదండ్రులు నుంచి ఫిర్యాదు స్వీకరించి కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడతామని పోలీసులు తెలిపారు. అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్): -
ఏడాది తర్వాత అస్థిపంజరంగా..!
కట్టుకున్న తోడు లేదు.. కొడుకు కూడా దూరమయ్యాడు. కన్నకూతురుకి ఏమైందో తెలియదు?. ఒంటరి జీవితంతో పోరాడుతూ రోజులు గడిపిన ఆమెను చివరకు మృత్యువు కూడా నిశ్శబ్దంగానే తీసుకెళ్లింది. అయితే ఆమె మరణించిన విషయం చెప్పేందుకు, కన్నీరు పెట్టేందుకు కూడా ఎవరూ లేకపోయారు. చివరకు ఆమె మృతదేహం అస్థిపంజరంగా మారిన తర్వాతే ఈ విషాదం బయటపడింది. పోలీసులు వచ్చి తలుపులు తెరిచినప్పుడు కనిపించిన దృశ్యం అందరినీ కలచివేసింది.మెట్రో నగరం బెంగళూరులో తీవ్ర విషాదం వెలుగు చూసింది. ఒంటరిగా జీవిస్తున్న ఓ మహిళ.. చివరకు తన ఇంట్లోనే కన్నుమూసింది. అయితే ఆమె మరణించిన విషయం ఎవరికీ తెలియలేదు. చివరకు ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. తలుపులు తెరిచిన పోలీసులు చూసిన దృశ్యం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అప్పటికే ఆ మహిళ మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి అస్థిపంజరంగా మారిపోయింది.బెంగళూరులోని బాగలగుంట ప్రాంతం హవనూర్ లేఅవుట్లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంట్లో లభించిన అస్థిపంజరం 52 ఏళ్ల దాక్షాయిణిదిగా గుర్తించారు. దాక్షాయిణి కొంతకాలంగా ఒంటరిగానే నివసిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె భర్త ఉమేశ్ దాదాపు పదేళ్ల క్రితం మరణించగా.. ఆ తర్వాత కొడుకు కూడా క్యాన్సర్‌తో ప్రాణాలు కోల్పోయాడు. వరుస విషాదాలతో మానసికంగా కుంగిపోయిన ఆమె ఒంటరి జీవితాన్ని గడుపుతున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.భర్త, కొడుకు మరణాల తర్వాత ఆమెను పలకరించేవారు కూడా లేకుండా పోయారని తెలుస్తోంది. ఏడాది పాటు ఆమె ఇంటి తలుపులు తెరుచుకోలేదు. కూతురు-అల్లుడు సహా బంధువులు, కుటుంబ సభ్యులు కూడా ఆమెను కలిసేందుకు రాకపోవడంతో విషాదం మరింత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో బాగలగుంట పోలీసులు అక్కడికి చేరుకుని ఇంటి తలుపులు తెరిచారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. దాక్షాయిణి మృతి సహజ మరణమా? లేక మరేదైనా కారణమా? అనే కోణాల్లో విచారణ చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. ఆమె దాదాపు ఏడాది క్రితమే మృతి చెంది ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.జనాలతో కిటకిటలాడే మహానగరంలో.. పక్కింట్లోనే ఓ మనిషి ఏడాది పాటు కనిపించకపోవడం, ఆమె మరణం గురించి ఎవరికీ తెలియకపోవడం ఒంటరి జీవితాలపై మరోసారి ఆందోళన కలిగిస్తోంది. -
బోరబండలో యువతిపై కత్తితో దాడి.. కలకలం
హైదరాబాద్: నగరంలోని బోరబండ ప్రాంతంలో యువతిపై కత్తితో దాడి జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.పోలీసుల వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి సుమారు 8 గంటల సమయంలో హిచ్ హోటల్ సమీపంలో చంపాపేటకు చెందిన కె. చంటి బోరబండకు చెందిన రమ్యశ్రీ మైనర్ బాలికపై కత్తితో దాడి చేశాడు. దీంతో యువతి స్వల్పంగా గాయపడింది. అనంతరం నిందితుడు, బాధితురాలిని పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. ఈ దాడికి గల కారణాలు, ఇద్దరి మధ్య ఉన్న సంబంధం, ఘటన వెనుక అసలు పరిస్థితులేంటనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
ఏసీ గదిలో నిద్ర.. అదే చివరి రాత్రైంది!
ఎల్ నినో ప్రభావంతో వర్షాకాలంలోనూ ఉక్కపోత కొనసాగుతోంది. మండుతున్న వేడి నుంచి ఉపశమనం కోసం ఆ కుటుంబం మొత్తం ఏసీ గదిలో నిద్రకు ఉపక్రమించింది. కానీ అదే వారి చివరి రాత్రిగా మారింది. భారీ వర్షాల ధాటికి దాదాపు 100 ఏళ్ల నాటి ఇల్లు ఒక్కసారిగా కుప్పకూలడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రకృతి ప్రకోపం ఓ కుటుంబాన్ని శాశ్వత విషాదంలోకి నెట్టింది.ఉత్తరప్రదేశ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. మండుతున్న వేడి నుంచి ఉపశమనం కోసం కుటుంబమంతా ఒకే ఏసీ గదిలో నిద్రించగా.. అదే వారికి చివరి రాత్రిగా మారింది. భారీ వర్షాలకు దాదాపు 100 ఏళ్ల నాటి ఇల్లు కూలిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.ప్రతాప్‌గఢ్ జిల్లాలోని మహులి ప్రాంతంలో బుధవారం అర్ధరాత్రి ఈ విషాద ఘటన జరిగింది. నగర్ కోత్వాలి పరిధిలోని ఓ పాత ఇంట్లో కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా పైకప్పు కుప్పకూలింది. ఆ సమయంలో ఇంట్లో ఏడుగురు ఉన్నారు.క్షణాల్లో శిథిలాల కిందఎండ తీవ్రత కారణంగా కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఏసీ ఉన్న ఒకే గదిలో నిద్రించాలని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. ఇప్పటికే బలహీనంగా మారిన పాత ఇంటి పైకప్పు వర్షం ధాటికి కూలిపోయింది. దీంతో నిద్రలో ఉన్న కుటుంబ సభ్యులు శిథిలాల కింద చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల మధ్య చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించారు.ఆరుగురి మృతి.. ఒకరి ప్రాణాలతో పోరాటంఈ ఘటనలో ప్రమోద్ శ్రీవాస్తవ్ (60), ఆయన భార్య రీటా (55), కుమారుడు నితిన్ (25), కోడలు మాధురి (24), మరో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. కుటుంబ పెద్ద కుమారుడు అమన్ (28) మాత్రం ప్రమాదం నుంచి బయటపడ్డాడు. శిథిలాల నుంచి స్వయంగా బయటకు వచ్చి ఇరుగుపొరుగు వారికి సమాచారం అందించాడు. తీవ్ర గాయాలతో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించిన పోలీసులు.. ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. పాత భవనం పరిస్థితి, కూలిపోవడానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.వర్షాలకు వరుస విషాదాలుప్రతాప్గఢ్ ఘటనతో పాటు ఉత్తరప్రదేశ్‌లోని మరికొన్ని ప్రాంతాల్లోనూ పాత నిర్మాణాలు కూలి ప్రాణ నష్టం జరిగింది. బారాబంకీ జిల్లాలోని అలియాబాద్‌లో పాత ఇటుక గోడ కూలడంతో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఆడుకుంటున్న సమయంలో ఒక్కసారిగా గోడ కూలడంతో పిల్లలు శిథిలాల కింద చిక్కుకున్నారు. ఆస్పత్రికి తరలించినప్పటికీ ఏడేళ్ల బాలుడు, 14 ఏళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయారు. సహరన్పూర్ జిల్లాలోనూ భారీ వర్షాల కారణంగా మట్టి ఇల్లు కూలి 35 ఏళ్ల మహిళ మృతి చెందింది. గ్రామస్థుల సహాయంతో ఆమెను బయటకు తీసినా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.వరుసగా కురుస్తున్న వర్షాలు పాత ఇళ్లకు ప్రమాదంగా మారుతున్నాయి. బలహీనంగా ఉన్న నిర్మాణాలు ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. -
ఆ ముగ్గురే సూత్రధారులు
న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీకి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టిఏ)కు చెందిన ముగ్గురు సబ్జెక్టు నిపుణులు పి.వి.కులకర్ణి(కెమిస్ట్రీ), మనీషా సంజయ్ హవల్దార్(ఫిజిక్స్), మనీషా గురునాథ్ మంధారే(బోటనీ, జువాలజీ) కీలక సూత్రధారులు అని సీబీఐ తేల్చిచెప్పింది. ఈ మేరకు ఢిల్లీ కోర్టులో తాజాగా 94 పేజీల చార్జిషీట్ దాఖలు చేసింది. కాన్ఫిడెన్షియల్ సెక్షన్లో ప్రశ్నపత్రాల అనువాదం లేదా పునరనువాదం సమయంలో రఫ్ వర్క్ (ప్రాథమిక పని) కోసం ఈ ముగ్గురు నిపుణులకు ఖాళీ కాగితాలను అందించినట్లు విచారణలో తేలింది. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు పి.వి.కులకర్ణి రసాయన శా్రస్తానికి సంబంధించిన మొత్తం 135 ప్రశ్నలను, వాటి సమాధానాల ఆప్షన్లను చిన్న కాగితం ముక్కలపై క్లుప్తంగా రాసుకుని, వాటిని రహస్యంగా బయటకు తీసుకెళ్లాడని చార్జ్‌షీట్‌లో సీబీఐ అధికారులు వెల్లడించారు. ఢిల్లీ ఎన్టీఏ ఆఫీసులోని కాన్ఫిడెన్షియల్ సెక్షన్లోకి ప్రవేశించేటప్పుడు లేదా నిష్క్రమించేటప్పుడు సబ్జెక్టు నిపుణులను తనిఖీ చేయడం గానీ, సోదా చేయడం గానీ జరగలేదని తెలియజేశారు. కులకర్ణి సులభమైన కొన్ని ప్రశ్నలను కంఠస్థం చేసి, తన హోటల్ గదికి తిరిగి వచ్చిన తర్వాత వాటిని ఒక కాగితంపై రాసుకున్నాడని పేర్కొన్నారు. సీబీఐ చార్జిషీట్లో ఇంకా ఏం ప్రస్తావించారంటే.. నిందితులకు కలిసొచ్చిన పరిస్థితులు ఎన్టిఏలో బోటనీ పేపర్‌ను ఇంగ్లిష్ నుంచి మరాఠీ భాషలోకి అనువాదకురాలిగా, జువాలజీ పేపర్ పునరనువాదకురాలిగా పనిచేసిన మనీషా మంధారే ఆ రోజు తన పని ముగించుకుని హోటల్ గదికి తిరిగి వచ్చిన తర్వాత ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాల్లో సంబంధిత పేరాలను మార్క్ చేసేవారు. ఆయా సబ్జెక్టులపై ఆమెకు ఉన్న దశాబ్దాల అనుభవంతో నీట్ ప్రశ్నలను ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకంలోని సంబంధిత అంశాలతో సులభంగా అనుసంధానించగలిగారు. మార్క్ చేసిన పేరాల ఆధారంగా ఆయా ప్రశ్నలు, వాటి జవాబులను గుర్తించారు. ఇక ఫిజిక్స్ ప్రశ్నల అనువాదకుడిగా పనిచేసిన మనీషా సంజయ్ హవల్దార్ రోజువారీ పని ముగించుకుని ఢిల్లీలోని తన బసకు తిరిగి వచ్చిన తర్వాత ప్రశ్నలను క్లుప్తంగా రాసుకునేవారు. ఎన్టీఏ కార్యాలయంలో సీసీటీవీ లైవ్ ఫీడ్‌ను పర్యవేక్షించడానికి ప్రత్యేక కంట్రోల్ రూమ్ లేకపోవడం నిందితులకు బాగా కలిసొచ్చింది. వారి నిర్వాకం ఎవరి దృష్టికీ రాలేదు. నీట్ పేపర్లోని తుది ప్రశ్నలు ఆయా నిపుణుల నుంచి మధ్యవర్తులకు, సమన్వయకర్తలకు చేరాయి. అభ్యర్థులతో సంప్రదింపులు కోచింగ్ ఇన్స్టిట్యూట్లు, కన్సల్టెన్సీలను నడిపించే తేజస్ హర్షద్‌కుమార్ షా, డాక్టర్ మనోజ్ భగవాన్రావ్ షిరూరే, శివరాజ్ మోతేగాంకర్, ధనంజయ్ నివృత్తి లోఖండే, శివరాజ్ రఘునాథ్ మోతేగాంకర్లకు నీట్ ప్రశ్నలు చేరాయి. ఈ మొత్తం ప్రక్రియలో చివరి దశగా రాజస్తాన్‌లోని శుభమ్ మధుకర్ ఖైర్నార్, మంగిలాల్ బివాల్, దినేష్ బివాల్, వికాస్ బివాల్, హరియాణాలోని యశ్ యాదవ్ ద్వారా నీట్ అభ్యర్థులకు చేరాయి. శుభమ్ మధుకర్ ఖైర్నార్ డబ్బు కోసం అభ్యర్థులతో సంప్రదింపులు జరిపాడు. సెక్యూరిటీ కోసం వారి విద్యా పత్రాలు, ఖాళీ చెక్కులను సేకరించాడు. మధ్యవర్తులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వ్యవహారం చక్కబెట్టాడు. మంగిలాల్ బివాల్ మొబైల్ ఫోన్ నుంచి సేకరించిన ఆడియో ఫైళ్లు ఈ కుట్రకు సంబంధించిన ప్రణాళికను బట్టబయలు చేశాయి. -
పని మనిషి ఇంటికి వెళ్లి.. ఇక తిరిగి రాలేదు!
ఒంటరిగా జీవిస్తున్న ఆ వృద్ధ దంపతుల ఇంట్లో ఒక్కసారిగా కలకలం మొదలైంది. ఇంట్లో నగలు కనిపించకుండా పోయాయి.. వాటి గురించి ఆరా తీసేందుకు వెళ్లిన ఇంటి పెద్ద మహిళ తిరిగి రాలేదు. గాలింపు చేపట్టిన కుటుంబ సభ్యులకు, పోలీసులకు ఊహించని షాక్ ఎదురైంది. అదృశ్యమైన మహిళ ఇంటి సమీపంలోని పైకప్పుపై చెట్టు కింద శవమై కనిపించింది. ఆ తర్వాత బయటపడిన సీసీటీవీ దృశ్యాలు కేసులో కీలక మలుపుగా మారాయి.హర్యానాలోని పంచకుల సెక్టార్-21లో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. రిటైర్డ్ ఆర్మీ కెప్టెన్ మన్మోహన్ లాల్ మెహతా భార్య నీరా మెహతా (72) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఇంటి నుంచి వెళ్లిన ఆమె తిరిగి రాకపోవడంతో భర్త పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. మెహతా ఇంట్లో కొన్ని నగలు కనిపించకుండా పోయాయి. వాటి గురించి తెలుసుకునేందుకు నీరా మెహతా ఇంట్లో పనిచేసే సునీతా దేవి వద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.ఈ గొడవ తీవ్ర రూపం దాల్చి ఘర్షణకు దారితీసి ఉండొచ్చని, ఆ సమయంలోనే నీరా మెహతా మృతి చెంది ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే అసలు కారణాలు పోస్టుమార్టం నివేదిక, ఫోరెన్సిక్ ఆధారాల ద్వారా తేలనున్నాయి.ఇంటి పక్కనే దాచిన మృతదేహంభర్త ఫిర్యాదుతో నీరా మెహతా అదృశ్యంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సునీతా దేవి ఇంటికి వెళ్లగా.. ఆ ఇల్లు బయట నుంచి తాళం వేసి ఉండటంతో అనుమానం వచ్చింది. అనంతరం పక్కింటి పైకప్పు నుంచి పరిశీలించగా.. చెట్టు కింద కప్పి ఉంచిన స్థితిలో నీరా మెహతా మృతదేహం కనిపించింది. వెంటనే ఫోరెన్సిక్ బృందాన్ని రంగంలోకి దించి ఆధారాలు సేకరించారు.సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలుఈ కేసులో సీసీటీవీ ఫుటేజీ కీలక ఆధారంగా మారింది. సునీతా దేవి, ఆమె కుమారుడు రాజా కలిసి మృతదేహాన్ని తరలించి పక్కింటి పైకప్పుపై దాచేందుకు ప్రయత్నించినట్లు దృశ్యాల్లో కనిపించినట్లు పోలీసులు తెలిపారు. హత్య అనంతరం ఆధారాలను చెరిపివేసేందుకు ప్రయత్నించిన కోణంలోనూ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.ముగ్గురి అరెస్టుఈ ఘటనకు సంబంధించి పోలీసులు సునీతా దేవి, ఆమె భర్త శంకర్, కుమారుడు రాజాలను అరెస్టు చేశారు. హత్య, ఆధారాల ధ్వంసం, దొంగతనం, ఉమ్మడి ఉద్దేశం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే నిందితులు మాత్రం నగల దొంగతనం ఆరోపణలను ఖండించినట్లు పోలీసులు తెలిపారు. సునీతా దేవి కన్ఫెషన్ రిపోర్ట్‌లో.. నీరా మెహతా ప్రమాదవశాత్తు జారి పడిపోయారని చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు.ప్రస్తుతం పోస్టుమార్టం నివేదిక, సీసీటీవీ ఫుటేజీ, ఫోరెన్సిక్ ఆధారాల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది. ఒంటరిగా నివసించే వృద్ధులు ఇంట్లో పనిచేసే సిబ్బంది వివరాలను పోలీసులతో ధ్రువీకరించుకోవాలని అధికారులు సూచించారు. ఈ ఘటన పనిమనుషుల బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ ప్రాధాన్యతను మరోసారి తెరపైకి తెచ్చింది. -
పల్నాడులో వైఎస్సార్సీపీ పార్టీ నాయకుడి దారుణ హత్య
ఆంధ్రప్రదేశ్: పల్నాడు జిల్లా రెంటచింతల మండలం రెంటాలలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వైఎస్సార్సీపీ పార్టీ నాయకుడు నవులూరి చెన్నారెడ్డిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత దారుణంగా నరికి చంపారు. ఈ ఘటనతో స్థానికంగా భయాందోళన వాతావరణం నెలకొంది. అయితే, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
సైబర్ క్రైమ్ నియంత్రణలో తెలంగాణకు జాతీయ గుర్తింపు
హైదరాబాద్: సైబర్ క్రైమ్ నియంత్రణ, కేసుల సమర్థవంతమైన నిర్వహణలో తెలంగాణ దేశంలోనే నంబర్-1 స్థానంలో నిలిచిందని రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) వెల్లడించింది. ప్రధానమంత్రి కార్యాలయం (PMO) నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో తెలంగాణ సైబర్ క్రైమ్ పనితీరుపై సమీక్ష నిర్వహించగా, రాష్ట్రం సాధించిన పురోగతిపై అధికారులు వివరించారు.ఈ సమావేశంలో తెలంగాణ సీఎస్ సంజయ్ జాజు, డీజీపీతో కలిసి సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధిపతి షికా గోయల్ పాల్గొన్నారు. సైబర్ నేరాల నియంత్రణ, కేసుల పరిష్కారం, నేరాలపై వేగవంతమైన చర్యల్లో తెలంగాణ పోలీసుల పనితీరుకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని షికా గోయల్ తెలిపారు.తెలంగాణ పోలీసుల సమిష్టి కృషి, సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రత్యేక చర్యల ఫలితంగానే ఈ గుర్తింపు సాధ్యమైందని ఆమె పేర్కొన్నారు. సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణ మరో మైలురాయిని చేరుకుందని, దేశానికి ఆదర్శంగా నిలిచే విధంగా సైబర్ క్రైమ్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని తెలిపారు.సీఎస్ సంజయ్ జాజు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం నేరాల పట్ల జీరో టాలరెన్స్ విధానాన్ని అమలు చేస్తోందన్నారు. TGCSB ద్వారా ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేసి సైబర్ నేరాలపై పోరాటాన్ని మరింత బలోపేతం చేస్తున్నామని చెప్పారు. సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవగాహన కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. తెలంగాణ పోలీసులకు, సైబర్ సెక్యూరిటీ బ్యూరో బృందానికి అభినందనలు తెలిపారు. -
రేణుకాస్వామి కేసులో కీలక పరిణామం
కన్నడ నటుడు దర్శన్ తూగుదీప ప్రధాన నిందితుడిగా ఉన్న రేణుకాస్వామి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో ఏ14 నిందితుడిగా ఉన్న ప్రదోష్ అప్రూవర్ (మాఫీ సాక్షి)గా మారేందుకు సిద్ధమయ్యాడు. ఈ మేరకు బెంగళూరులోని సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టును ఆశ్రయించాడు. ప్రదోష్ కోర్టు ముందు నిజాలు వెల్లడించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొనడంతో.. ఈ పరిణామం దర్శన్‌కు కొత్త చిక్కులు తెచ్చే అవకాశముందనే చర్చ మొదలైంది.రేణుకాస్వామి హత్య కేసులో మొత్తం 17 మంది నిందితులు ఉన్నారు. ప్రధాన నిందితులుగా దర్శన్, పవిత్ర గౌడ పేర్లను ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. ఏ14 నిందితుడు ప్రదోష్ ప్రస్తుతం అప్రూవర్‌గా మారేందుకు కోర్టును ఆశ్రయించాడు. అయితే కేసుకు సంబంధించి తనకు తెలిసిన పూర్తి వివరాలను కోర్టు ముందు వెల్లడించేందుకు సిద్ధంగా ఉన్నానని పిటిషన్లో అతను పేర్కొన్నట్లు తెలుస్తోంది. తనకు చట్టపరంగా మాఫీ సాక్షిగా(approver) మారే అవకాశం కల్పించాలని కోరాడు.కేసులో కొత్త మలుపుప్రదోష్ అభ్యర్థనను కోర్టు అంగీకరిస్తే.. రేణుకాస్వామి హత్య కేసు కొత్త మలుపు తిరిగే అవకాశం ఉంది. ఇప్పటివరకు నిందితుడిగా ఉన్న వ్యక్తి.. సాక్షిగా మారితే కేసులోని కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. అయితే ప్రదోష్ చెప్పే వివరాలను కోర్టు ఎలా పరిగణిస్తుంది? అతడి వాంగ్మూలం కేసులో ఎంతవరకు ప్రభావం చూపుతుంది? అనేది కోర్టు నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.కోర్టు ముందుకు ప్రదోష్ప్రదోష్ ఇవాళో, రేపో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ఎదుట హాజరయ్యే అవకాశం ఉంది. ఈ సందర్భంగా అతడు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఒకవేళ కోర్టు అనుమతిస్తే.. కేసులోని ఇతర నిందితుల పాత్ర, ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.2024 జూన్‌లో బెంగళూరులో వెలుగులోకి వచ్చిన రేణుకాస్వామి హత్య కేసు కర్ణాటకలో తీవ్ర సంచలనం సృష్టించింది. చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి అనే వ్యక్తి.. నటి పవిత్ర గౌడకు అసభ్యకరమైన సందేశాలు పంపాడనే ఆరోపణల నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రేణుకాస్వామిని కిడ్నాప్ చేసి బెంగళూరుకు తీసుకొచ్చి దాడి చేయడంతో అతడు మృతి చెందాడు. ఈ కేసులో నటుడు దర్శన్, పవిత్ర గౌడ సహా 17 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. దర్శన్‌పై హత్య కుట్ర, కిడ్నాప్, దాడి వంటి అభియోగాలు నమోదు చేసి పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. తొలుత కర్ణాటక హైకోర్టు దర్శన్‌కు బెయిల్ మంజూరు చేసినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఆ బెయిల్‌ను రద్దు చేసింది. హైకోర్టు ఉత్తర్వుల్లో చట్టపరమైన లోపాలు ఉన్నాయని పేర్కొంటూ దర్శన్‌ను తిరిగి కస్టడీలోకి తీసుకోవాలని ఆదేశించింది. దీంతో దర్శన్ మళ్లీ జైలు పాలయ్యాడు. అయితే.. ఈ కేసులో సాక్షుల్ని బెదిరిస్తున్నారంటూ తాజాగా ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే జైల్లో దర్శన్ ఆత్మహత్యాయత్నం చేశారంటూ ప్రచారం జరగ్గా, కర్ణాటక డీజీపీ దానిని పుకారుగా కొట్టి పారేశారు. ప్రదోష్ వాంగ్మూలం కీలకమవుతుందా?తాజాగా ఈ కేసులో ఏ14 నిందితుడు ప్రదోష్ అప్రూవర్‌గా మారేందుకు కోర్టును ఆశ్రయించడం మరో కీలక పరిణామంగా మారింది. అప్రూవర్‌గా మారిన వ్యక్తి సాధారణంగా కేసుకు సంబంధించిన కీలకసమాచారాన్ని దర్యాప్తు సంస్థలకు అందించాల్సి ఉంటుంది. ఒకవేళ కోర్టు అతడి అభ్యర్థనను అంగీకరిస్తే.. కేసులోని మరిన్ని వివరాలు, నిందితుల పాత్రకు సంబంధించిన అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. -
12 ఎగ్జామ్స్‌లో టాపరే లీకురాయుడు!
ప్రభుత్వ ఉద్యోగం కోసం ఏళ్ల తరబడి కష్టపడే యువతకు అతడు ఒకప్పుడు ఆదర్శం. వరుసగా పోటీ పరీక్షలు రాసి.. ఒక్కటి కాదు రెండు కాదు.. ఏకంగా 12 పరీక్షల్లో విజయం సాధించాడు. అతడి సక్సెస్ స్టోరీ చూసి ఎంతోమంది అభ్యర్థులు స్ఫూర్తి పొందారు. కానీ ఇప్పుడు అదే వ్యక్తి పేరు పేపర్ లీక్ కేసులో మారుమోగుతోంది. జార్ఖండ్ పరీక్షల కుంభకోణంలో ప్రధాన అనుమానితుడిగా అరెస్టైన అభయ్ కుమార్ తివారీ కథ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.అభయ్ తివారీ.. జార్ఖండ్ పేపర్ లీక్ కేసులో అరెస్టైన 19 మందిలో ఒక్కడు. అయితే అతను సాధించిన విజయాల జాబితా చిన్నది కాదు. నేవీ పరీక్ష, భాభా అణు పరిశోధన కేంద్రం (BARC) పరీక్ష, పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ పరీక్ష, సీఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్, కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (CGL), జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు.. ఇలా అనేక పోటీ పరీక్షల్లో అతడు అర్హత సాధించాడు. 13 ఏళ్లలో 12 ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు క్లియర్ చేయడంతో అతడికి “ఎగ్జామ్ స్టార్”గా గుర్తింపు వచ్చింది. అయితే.. ఇప్పుడు దర్యాప్తు సంస్థల ఆరోపణలు మరో కోణాన్ని తెరపైకి తెస్తున్నాయి. “అతడి వరుస విజయాల వెనుక ప్రతిభేనా? లేక పరీక్షల వ్యవస్థలోని లోపాలను ఉపయోగించుకున్నారా?” అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జార్ఖండ్ సీఐడీ ఆరోపణల ప్రకారం.. అభయ్ తివారీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే ఓ నెట్‌వర్క్‌తో సంబంధాలు కలిగి ఉన్నట్లు అనుమానిస్తున్నారు. పోటీ పరీక్షల్లో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి అభ్యర్థుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో అభ్యర్థి నుంచి రూ.25 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు వసూలు చేసినట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. తన వరుస విజయాలనే(సిసలైన సక్సెసా? లేదంటే మోసమా? అనేది తేలాల్సి ఉంది).. నమ్మకంగా మార్చుకుని అభ్యర్థులను ఆకర్షించాడని అధికారులు భావిస్తున్నారు.పరీక్షల సంస్థతో పాత సంబంధాలుతివారీ గతంలో పరీక్షల నిర్వహణ సంస్థ TRS-Data Processing Private Limitedలో పనిచేశాడు. పరీక్షల నిర్వహణలో అక్రమాల ఆరోపణలు ఎదుర్కొన్న ఈ సంస్థతో అతడికి సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో తేలినట్లు అధికారులు చెబుతున్నారు. తర్వాత అతడు జార్ఖండ్ ప్రభుత్వ ఉద్యోగంలో చేరినా.. పాత పరిచయాలు కొనసాగించాడా? పరీక్షల వ్యవస్థలోకి ఎలా ప్రవేశించాడు? అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది.పేపర్ లీక్‌తో బయటపడిన అసలు విషయంజార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (JPSC), జార్ఖండ్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (JSSC) పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ముఖ్యంగా 14వ JPSC సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల తర్వాత నిరసనలు మరింత పెరిగాయి. పరీక్షల నిర్వహణలో పారదర్శకత లేదని, అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.రాంచీలో రోడ్డెక్కిన విద్యార్థులురాంచీలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. పరీక్షలు రద్దు చేయాలని, అవకతవకలపై పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆందోళనకు రాజకీయ పార్టీల నుంచి కూడా మద్దతు లభించింది. ప్రతిపక్షాలు సీబీఐ విచారణ కోరగా.. ప్రభుత్వం మాత్రం సీఐడీ దర్యాప్తు కొనసాగిస్తోంది.ఇటు సీజేపీ ప్రతినిధి అభిజిత్ దీప్కే కూడా ఈ పోరాటానికి మద్దతు తెలిపారు.నలుగురు మంత్రులతో కమిటీవిద్యార్థుల ఆందోళన తీవ్రత పెరగడంతో జార్ఖండ్ ప్రభుత్వం స్పందించింది. సమస్యలను పరిశీలించేందుకు నలుగురు మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రభుత్వం విద్యార్థులతో చర్చలకు ముందుకొచ్చింది. పరీక్షల వ్యవస్థలో లోపాలను పరిశీలించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. దీంతో ఆందోళనలు కొంత తగ్గినా.. విద్యార్థులు మాత్రం కేవలం హామీలు కాకుండా శాశ్వత పరిష్కారం కావాలని కోరుతున్నారు.ఒక్క తివారీ కేసు కాదు.. వ్యవస్థకే పరీక్షఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి ఆదర్శంగా కనిపించిన అభయ్ తివారీ.. ఇప్పుడు అదే పరీక్షల వ్యవస్థపై వచ్చిన అనుమానాలకు కేంద్రంగా మారాడు. అతడిపై వచ్చిన ఆరోపణలు నిజమా? లేదంటే మరేదైనా కోణం ఉందా? అన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది. కానీ ఈ ఘటన మాత్రం దేశంలో పోటీ పరీక్షల భద్రత, పారదర్శకతపై మరోసారి పెద్ద చర్చకు తెరలేపింది. -
భర్తపై పోలీసులకు భార్య ఫిర్యాదు
మోత్కూరు : తన భర్త ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఓ మహిళ మోత్కూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. విచారణ నిమిత్తం భర్తను బుధవారం సాయంత్రం పోలీస్ స్టేషన్‌కు పిలిపించగా.. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన మోత్కూరు పోలీస్ స్టేషన్ ఎదుట బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని ఆరెగూడెం ఇందిరానగర్ కాలనీకి చెందిన గజ్జెల్లి మనోహర్, ప్రభావతి భార్యాభర్తలు. వీరి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. భర్త ఇబ్బందులు పెడుతున్నాడని ప్రభావతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. విచారణ నిమిత్తం మనోహర్‌ను బుధవారం పోలీసులు స్టేషన్‌కు పిలిపించారు. ఈ క్రమంలో తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు స్టేషన్ ఎదుట తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు మనోహర్‌ను అడ్డుకొని 108 అంబులెన్స్‌లో భువనగిరి ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని ఎస్ఐ సతీష్ తెలిపారు. -
డాక్టర్ ప్రియాంక బ్రెయిన్‌డెడ్.. పార్కింగ్ వివాదమే కారణమా?
తూర్పుగోదావరి జిల్లా: జీఎస్ఎల్ మెడికల్ కాలేజీలో డెర్మటాలజీ పీజీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న 28 ఏళ్ల వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రియాంక, ఈ నెల 3వ తేదీన రాజమండ్రి ఏవీ అప్పారావు రోడ్డులోని ప్రసాదిత్యా మాల్‌కు సినిమా చూసేందుకు వెళ్లారు. మాల్ పార్కింగ్ ప్రాంతంలో వాహనం నిలిపే క్రమంలో నామవరం ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులతో ఆమెకు స్వల్ప వాగ్వాదం జరిగింది.సినిమా ముగిసిన తర్వాత డాక్టర్ ప్రియాంక తన స్కూటీపై ఇంటికి బయలుదేరారు. ఏవీ అప్పారావు రోడ్డుపై వెళ్తుండగా, పార్కింగ్‌లో గొడవపడిన యువకులు ప్రయాణిస్తున్న కారు వెనుక నుంచి అతివేగంగా వచ్చి ఆమె స్కూటీని బలంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన ధాటికి ఆమె రోడ్డుపై పడిపోగా, ఆ కారు ఆమె తలపై నుంచి వెళ్లినట్లు ప్రాథమిక విచారణలో తెలిసింది. తీవ్ర తలగాయాల పాలైన ఆమెను స్థానికులు తక్షణమే స్థానిక ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. అయితే చికిత్స పొందుతూ ఆమె బ్రెయిన్‌డెడ్‌గా మారినట్లు వైద్యులు నిర్ధారించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.ఈ ఘటనపై ప్రకాశ్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన కారును, అందులో ప్రయాణించిన నామవరం ప్రాంతపు ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్కింగ్ వద్ద జరిగిన వివాదం మనసులో ఉంచుకుని ఉద్దేశపూర్వకంగానే కారుతో ఢీకొట్టి హత్యాయత్నానికి పాల్పడ్డారా? లేక ఇది ప్రమాదవశాత్తు జరిగిందా? అనే కోణంలో పోలీసులు తీవ్రంగా విచారిస్తున్నారు. -
గుజరాత్లో ‘చండీపుర’ వైరస్ కలకలం..!
అహ్మదాబాద్: గుజరాత్లో అరుదైన 'చండీపుర వైరస్' ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరల్ వ్యాధి బారిన పడి ఇప్పటివరకు 22 మంది చిన్నారులు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మరో ఏడుగురు పిల్లలు వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.రాష్ట్రంలో 184 మంది అనుమానితులకు పరీక్షలు నిర్వహించగా, వారిలో 35 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిందని వైద్యులు వెల్లడించారు. అయితే, వైరస్ బారిన పడిన వారంతా 15 ఏళ్లలోపు చిన్నారులేనని మంత్రి ప్రఫుల్ పన్సేరియా తెలిపారు. ఇప్పటివరకు ఆరుగురు పిల్లలు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్లు చెప్పారు.దీంతో గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో చండీపుర వైరస్ కేసులు నమోదవుతుండటంతో ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. వ్యాధి వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రత్యేక పర్యవేక్షణ, పరీక్షలు, వైద్య చర్యలు చేపడుతున్నట్లుగా తెలుస్తోంది.అధికారుల ప్రకారం, 'చండీపుర ఎన్సెఫలైటిస్' అనేది అరుదైన వైరల్ వ్యాధి. ఇది ఇసుక ఈగల ద్వారా వ్యాపించి మెదడు వాపునకు దారితీస్తుంది. ఈ వ్యాధి ప్రధానంగా 15 ఏళ్లలోపు పిల్లలపై ప్రభావం చూపుతోందని, అయితే, ఈ వ్యాధికి ప్రస్తుతం నిర్దిష్టమైన టీకా లేదా యాంటీవైరల్ చికిత్స అందుబాటులో లేనట్లుగా వైద్యలు తెలిపారు. అలాగే, సకాలంలో చికిత్స అందకపోతే వాంతులు, మూర్ఛ వంటి తీవ్రమైన లక్షణాలు కనిపించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. -
డబ్బుల్లేవా? అయితే చచ్చిపో!
స్నేహం అంటే నమ్మకం.. కష్టాల్లో అండగా నిలిచే బంధం. కానీ అదే ఓ వ్యక్తి జీవితంలో విషాదానికి కారణమైంది. నమ్మినవాళ్లే మోసం చేయడం, అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వకపోవడం, పైగా బెదిరింపులకు దిగడంతో.. అంతకు మించి అవమానించడంతో ఆ స్నేహితుడు తట్టుకోలేకపోయాడు. తీవ్ర మనోవేదనకు గురై.. చివరకు తన ప్రాణాలనే తీసుకున్నాడు. గుజరాత్ సూరత్‌లోని సార్థానా ప్రాంతానికి చెందిన రాజేశ్‌భాయ్ కుంజాడియా ఎంబ్రాయిడరీ వ్యాపారం చేసేవారు. గత కొన్ని నెలలుగా వ్యాపారంలో నష్టాలు రావడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమయంలో తన స్నేహితులకు అవసరాలు పడడంతో.. తన దగ్గరున్నదంతా ఊడ్చి ఇచ్చేశాడు. అయితే ఆ నమ్మకం వమ్ము కావడానికి ఎంతో సమయం పట్టలేదు. రాజేశ్‌భాయ్ తన స్నేహితుడు ఘనశ్యామ్ అహిర్‌కు కెనడా వెళ్లేందుకు సహాయం చేయాలనే ఉద్దేశంతో రూ.14 లక్షలు ఇచ్చారు. కొంతకాలం తర్వాత డబ్బు తిరిగి అడిగినప్పుడు ఘనశ్యామ్ తప్పించుకోవడం మొదలుపెట్టినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా రాజేశ్‌భాయ్ పేరుతో పలు బ్యాంకు ఖాతాలు తెరవాలని ఒత్తిడి చేశాడు. ఎందుకు? అని గట్టిగా ఆరా తీస్తే.. సైబర్ నేరాలకు ఉపయోగించే ‘మ్యూల్ అకౌంట్స్’ అని తేలింది. ఈ విషయం తెలుసుకున్న రాజేశ్‌భాయ్ అభ్యంతరం చెప్పడంతో తనను సైబర్ కేసుల్లో ఇరికిస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడరు. అదే సమయంలో.. మరో ఇద్దరు స్నేహితులు నికిత్ అలియాస్ రిక్కీ, దాధీ అహిర్లకు కూడా ఆయన డబ్బు ఇచ్చారు. ఒకరికి రూ.2 లక్షలు, మరొకరికి రూ.1.32 లక్షలు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురి వద్ద కలిపి రాజేశ్భాయ్కు రావాల్సిన మొత్తం రూ.17.32 లక్షలు. ఆ ముగ్గురు డబ్బులు తిరిగి ఇవ్వకపోగా.. స్నేహితులు తనను అవమానించారని, ఒత్తిడి చేశారని రాజేశ్‌భాయ్ సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. “డబ్బుల్లేవా? అయితే చచ్చిపో” అంటూ వారు చెప్పడంతో రాజేశ్ డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు.జులై 30న రాజేశ్‌భాయ్ సూసైడ్ నోట్ రాసి.. తన కుమార్తెతో ఇంటి నుంచి బయటకు వెళ్లారు. కొంత దూరం వెళ్లిన తర్వాత కుమార్తెను తిరిగి ఇంటికి పంపించి విషం తీసుకున్నారు. అనంతరం ఇంటికి చేరుకున్న ఆయన అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ మృతి చెందారు.మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు.. సూసైడ్ నోట్, కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు, ఇతర ఆధారాలను పరిశీలించారు. స్నేహితుల వేధింపులే ఆత్మహత్యకు కారణమని గుర్తించి.. ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసు నమోదు చేశారు. ఫ్రెండ్షిప్ డే రోజే(ఆగస్టు 2న) ఘనశ్యామ్, నికిత్, దాధీ అహిర్లను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ముగ్గురూ పోలీసుల అదుపులో ఉండగా.. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. స్నేహం పేరుతో నమ్మకద్రోహం చేస్తే ఎంతటి విషాదానికి దారితీస్తుందో ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది. -
మళ్లీ అదే స్టేషన్.. 12 ఏళ్ల తర్వాత పునరావృతమైన ఘటన
ప్రొద్దుటూరు క్రైం : వ్యభిచారం కేసులో పట్టుబడిన మహిళల నుంచి డబ్బు వసూలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో.. ప్రొద్దుటూరు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో పని చేస్తున్న ముగ్గురు పోలీస్ సిబ్బందిపై జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ వేటు వేశారు. హెడ్‌కానిస్టేబుల్ దస్తగిరి, కానిస్టేబుళ్లు శ్రీనివాసులు, సాయికిశోర్లను కడప వీఆర్‌లో రిపోర్టు చేసుకోవాల్సిందిగా మంగళవారం ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు ముగ్గురు పోలీసు సిబ్బంది కడప హెడ్‌క్వార్టర్‌లో రిపోర్టు చేసుకున్నారు. ఇటీవల ప్రొద్దుటూరులోని ఈశ్వరరెడ్డినగర్ సమీపంలో ఓ ఇంట్లో వ్యభిచారం చేస్తూ పట్టుబడిన మహిళలను.. బెదిరించి వారి నుంచి వన్‌టౌన్ పోలీసు సిబ్బంది డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం పోలీసు శాఖలో తీవ్ర చర్చకు దారి తీసింది. మహిళల నుంచి నేరుగా నగదు తీసుకోకుండా ఓ వ్యక్తి పోన్‌పే ఖాతాకు పెద్ద మొత్తంలో నగదు బదిలీ చేయించినట్లు ఆరోపణలు రావడంతో.. పోలీసు సిబ్బందిపై జిల్లా పోలీసు ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు. డిజిటల్ లావాదేవీలు, సంబంధిత వ్యక్తుల వాంగ్మూలాలు, సాంకేతిక ఆధారాలను సేకరిస్తూ.. అన్ని కోణాల్లో పోలీసు అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.ఇందులో ఆరోపణలు రుజువైతే తరుపరి శాఖాపరమైన చర్యలు ఉంటాయని స్థానిక పోలీసు అధికారులు అంటున్నారు. చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసు సిబ్బందిపైనే ఈ తరహా మహిళల నుంచి డబ్బు వసూలు చేశారనే ఆరోపణలు రావడం తీవ్ర చర్చకు దారి తీసింది. సామాజిక, ఆర్థిక పరిస్థితుల కారణంగా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న మహిళలను బెదిరించి డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు రుజువైతే అది కేవలం పోలీసుశాఖకు మచ్చ మాత్రమే కాదు.. మానవత్వానికి ప్రశ్నార్థకంగా మారుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఫోన్‌పే చెల్లింపులతో అడ్డంగా దొరికిపోయారు ఫోన్‌పే చెల్లింపులతో పోలీసులు అడ్డంగా దొరికిపోయారు. డిజిటల్ చెల్లింపులు నేరాల విచారణలో కీలక ఆధారాలుగా మారుతున్నాయి. తాజాగా వ్యభిచారం కేసులో మహిళ నుంచి ఫోన్‌పే ద్వారా జరిగిన రూ.50 వేల బదిలీ వ్యవహారం పోలీసు శాఖలో సంచలనంగా మారింది. నగదు చేతులు మారి ఉంటే ఈ వ్యవహారం బయటపడేదో లేదో కానీ ఫోన్‌పే ద్వారా జరిగిన ట్రాన్షక్షన్ మాత్రం మొత్తం వ్యవహారాన్ని పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చింది. డిజిటల్ ట్రాన్షక్షన్కు సంబంధించిన ఆధారాలే విచారణలో కీలకంగా మారడంతో ముగ్గురు పోలీసు సిబ్బందిపై వేటు పడింది. 12 ఏళ్ల తర్వాత అదే స్టేషన్లో.. సరిగ్గా 12 ఏళ్ల క్రితం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఒక వ్యభిచారం కేసులో ఆరుగురు సిబ్బందిపై వేటు పడింది. పలువురు పోలీసులు వ్యభిచార నిర్వాహకుల నుంచి డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలపై నాటి పోలీసు అధికారులు.. ఆరుగురిపై చర్యలు తీసుకున్నారు. కాగా అప్పుడు కూడా ఆగస్టు నెలలోనే పోలీసు సిబ్బందిపై వేటుపడటం గమనార్హం. ప్రస్తుతం ముగ్గురు కానిస్టేబుళ్లు వ్యభిచారం వ్యవహారంలోనే ఆరోపణలు ఎదుర్కొంటూ వీఆర్‌కు వెళ్లారు. దీంతో ‘నాడు ఆరుగురు.. నేడు ముగ్గురంటూ’ పలువురు పోలీసులు అప్పటి ఘటనను గుర్తు చేసుకుంటున్నారు. డయల్ 100 కాల్‌కు విలువ లేదా? పోలీసుశాఖలో డయల్ 100 కాల్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఆపదలో ఉన్న ప్రజలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన డయల్ –100 వ్యవస్థపై విశ్వాసాన్ని దెబ్బతీసేలా తాజా ఘటన చర్చకు దారి తీసింది. డయల్– 100కు వచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసు సిబ్బందే.. మహిళలను బెదిరించి డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు రావడం, ఆ తర్వాత ఉన్నతాధికారులను సైతం తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరిగిందనే సమాచారం పోలీసు శాఖలో కలకలం రేపుతోంది. ఈ ఆరోపణలు నిజమని తేలితే డయల్–100 వ్యవస్థ విశ్వసనీయతమైనే ప్రశ్నలు తలెత్తే పరిస్థితి ఏర్పడుతుంది. డయల్ 100 కాల్‌కు వెళ్లిన వారు తప్పుడు సమాచారం ఇవ్వడంపై కూడా పోలీసు ఉన్నతాధికారులు సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. వ్యభిచార నిర్వాహకుడిపై చర్యలేవీ? పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు.. డబ్బులు తీసుకున్నారనే దానిపైనే ఇంత వరకు చర్చ జరుగుతూ వచ్చింది. అయితే వ్యభిచార నిర్వాహకుడి గురించి ఎక్కడా మచ్చుకైనా ప్రస్తావన రాలేదు. పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లే సరికి మహిళలు ఇంట్లో నుంచి బయటికి వస్తున్నారని.. ఇంటి బయటే వారిని విచారణ చేయడం, తదితర పరిణామాలు చేసుకున్నాయని పోలీసు అధికారులు చెబుతున్న మాట. అయితే ఆ ప్రాంత వాసులు తెలిపే వివరాల ప్రకారం.. బైపాస్ రోడ్డులో అధికార పార్టీకి చెందిన ఒక వ్యక్తి కొందరు నాయకుల అండతో వ్యభిచారం, జూదం నిర్వహిస్తున్నాడు.. అతనే మహిళలను పిలిపించి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు చెప్పుకొంటున్నారు. అతను ఆ ప్రాంతంలోని ఓ నాయకుడి అండతో గలీజు దందా కొనసాగిస్తున్నాడని, సదరు వ్యక్తి గురించి పోలీసులకు తెలిసినా చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు వస్తున్నాయి. వ్యభిచారం వ్యవహారంలో కూడా అతనే సెటిల్మెంట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పోలీసు అధికారులు మరింత లోతుగా విచారణ చేస్తే వాస్తవాలు బయటపడే అవకాశం ఉంది. -
హైదరాబాద్‌లో లిఫ్ట్ బీభత్సం.. మహిళ విషాదం!
హైదరాబాద్, చందానగర్: నగరంలో విషాదం చోటు చేసుకుంది. లిఫ్ట్ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. ఎలాంటి సూచిక బోర్డు లేకుండా లిఫ్ట్ ఆపరేటర్ మరమ్మతు చేస్తుండటం, లిఫ్ట్ ఎక్కిన మహిళకు ఆ విషయం తెలియకపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. వికారాబాద్ జిల్లా కుల్కచర్లకు చెందిన దాడి శ్రీనివాస్ నల్లగండ్లలోని అపర్ణ జినిత్లో సెక్యూరిటీ గార్డు. తన భార్య అనసూయ(43)తో కలిసి చందానగర్ అన్నపూర్ణ ఎన్‌క్లేవ్‌లోని చాట్వాజ్ మాన్షన్ అపార్ట్మెంట్లో ఉండే బంధువుల వద్దకు వచ్చారు. రెండో అంతస్తుకు వెళ్లడానికి లిఫ్ట్ ఎక్కారు. ఆమె లోపల అడుగు పెట్టిన వెంటనే తలుపులు వేయకుండానే లిఫ్ట్ కదిలిపోయింది. దీంతో ఆమె కాళ్లు అందులో ఇరుక్కుపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి.వెంటనే ఆమె భర్త కేకలు వేయడంతో వెంటనే వచ్చిన అపార్ట్మెంట్ వాసులు లిఫ్టు తలుపులు తెరిచి ఆమెను బయటకు తీశారు. తీవ్ర గాయాలైన ఆమెను ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించగా, అప్పటికే మృతి చెందిందని వైద్యులు చెప్పారు. కేసు దర్యాప్తులో ఉంది. కాగా, సూచిక బోర్డులు పెట్టకుండా, విద్యుత్ సరఫరా నిలిపివేయకుండా లిఫ్ట్‌కు మరమ్మతులు చేపట్టడంతోనే నిండు ప్రాణం బలి అయిందని కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
YSR జిల్లాలో జంట హత్యలు
-
అర నిమిషంలో 27 కత్తిపోట్లు!
పట్టపగలు.. అదీ అందరూ చూస్తుండగానే ఓ పోకిరీ దారుణానికి తెగబడ్డాడు. తనపై ఫిర్యాదు చేసిందన్న కోపంతో ఓ యువతిపై కిరాతానికి పాల్పడ్డాడు. టీచర్‌పై జరుగుతున్న దాడిని చూసి పిల్లలు, తోటి సిబ్బంది దూరంగా పరిగెత్తగా.. రక్తపు మడుగులో కుప్పకూలి ఆమె అక్కడికక్కడే మరణించింది. ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది.ఫరీదాబాద్ సిక్రోనా గ్రామంలోని సరస్వతి సీనియర్ సెకండరీ స్కూల్లో 29 ఏళ్ల సంధ్య టీచర్‌గా పనిచేస్తున్నారు. సోమవారం ఉదయం సాధారణంగా పాఠశాలకు వచ్చిన ఆమెను కలవాలంటూ ఓ యువకుడు గేటు వద్దకు వచ్చాడు. సిబ్బంది సమాచారం ఇవ్వడంతో సంధ్య బయటకు వెళ్లగా.. అప్పటికే ముసుగు ధరించి ఉన్న నిందితుడు ఆమెపై దాడికి పాల్పడ్డాడు.సీసీటీవీ దృశ్యాల ప్రకారం.. నిందితుడు పాఠశాల లోపలే కొంతసేపు వేచి చూశాడు. సంధ్య బయటకు రాగానే ఆమెను పట్టుకుని లాగి కత్తితో వరుసగా పొడిచాడు. ముఖం, మెడ, ఛాతి, పొట్ట భాగాల్లో తీవ్ర గాయాలు అయ్యాయి. అర నిమిషంలో దాదాపు 20 నుంచి 30 సార్లు కత్తితో దాడి చేసినట్లుప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆ అరుపులు విని పాఠశాల నిర్వాహకుడు తేజ్‌పాల్ అక్కడికి చేరుకుని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే నిందితుడు అతడిపై కూడా కత్తితో దాడికి యత్నించడంతో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అనంతరం సంధ్యపై మరోసారి దాడి చేసి బైక్‌పై పరారయ్యాడు.రెండు గంటల్లో అరెస్ట్ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగాడు. నిందితుడి కోసం గాలించి.. రెండే గంటల్లో అరెస్ట్ చేశాడు. అతన్ని అమిత్(21)గా గుర్తించగా.. విచారణలో అతడు నేరాన్ని అంగీకరించాడు.వేధింపుల కేసే కారణమా?ప్రాథమిక దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అమిత్‌కు సంధ్యతో రెండేళ్ల క్రితం పరిచయం ఏర్పడిందని పోలీసులు తెలిపారు. ఆమె మాట్లాడేందుకు ఆసక్తి చూపకపోయినా.. నిందితుడు వెంటపడుతూ వేధించేవాడని తెలుస్తోంది. వేధింపులు ఎక్కువయ్యే సరికి ఈ మధ్యే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. కేసు కూడా నమోదు అయ్యింది. అయితే ఫిర్యాదు తర్వాత అమిత్ బహిరంగంగా క్షమాపణలు చెప్పడంతో ఆమె కేసు వాపసు తీసుకుంది. అయితే ఆ ప్రతీకారంతోనే ఈ హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. -
ఏపీ.. గూడూరులో టవర్ క్లాక్ వద్ద యువకుడి విషాదం!
ఆంధ్రప్రదేశ్: నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సమీపంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని ఓ యువకుడు గొంతు కోసుకున్నాడు. దీంతో చుట్టుపక్కల ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. రక్తపు మడుగులో ఉన్న యువకుడిని స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, అతడు ఏ కారణంతో ఈ చర్యకు పాల్పడ్డాడనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. అసలు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.గమనిక: మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001; మెయిల్: roshnihelp@gmail.com -
తిరుపతిలో చోరీ కలకలం..
ఆంధ్రప్రదేశ్: తిరుపతి పోలీస్ స్టేషన్ పరిధి భవాని నగర్లో చోరీ ఘటన కలకలం రేపింది. ఒంటరిగా నివసిస్తున్న లక్ష్మి అనే మహిళ ఇంటిలో గుర్తుతెలియని దుండగుడు చోరీకి పాల్పడ్డాడు.బాధితురాలు ఇంటి ఆరుబయట నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన దొంగ, బీరువాలో భద్రపరిచిన సుమారు 30 గ్రాముల బంగారు ఆభరణాలను అపహరించినట్లు సమాచారం. ఉదయం లేచి చూసిన బాధితురాలు నగలు కనిపించకపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించింది.దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఈస్ట్ పోలీసులు ఎస్సై ప్రసాద్ ఆధారాలను సేకరించి, పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించారు. అయితే, నిందితుడిని గుర్తించి త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది. -
హింసించి.. చంపేశారా..?!
అనంతపురం సెంట్రల్: ఆస్పత్రి భవనంపై నుంచి యువకుడు నగ్నంగా దూకడం.. చికిత్స పొందుతూ కొంతసేపటి తర్వాత మృతి చెందడం నగరంలో కలకలం రేపింది. ఆత్మహత్య అని ఆస్పత్రి వారు చెబుతున్నా... చిత్రహింసలు పెట్టి చంపేశారని పలువురు ఆరోపిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు.... శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం రామాపురం గ్రామానికి చెందిన దబ్బర అశోక్ (30) అనంతపురంలోని హిత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌కు కమీషన్ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. గత శుక్రవారం రాత్రి ఆస్పత్రి మూడో అంతస్తు నుంచి నగ్నంగా కిందకు దూకి ఆత్మహత్యాయత్నం చేసి.. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడని ఆస్పత్రి వారు తెలిపారు. ఆ రాత్రి ఏం జరిగింది..? అశోక్‌ను ఆస్పత్రికి చెందిన ప్రముఖ వ్యక్తి, ఓ వివాహిత భర్త, మరో రౌడీషిటర్ కలిసి ఆస్పత్రిలోనే ఓ గదిలో బంధించి.. బట్టలూడదీసి చిత్రహింసలకు గురిచేశారని తెలుస్తోంది. నేరుగా చంపకుండా.. భవనంపై నుంచి దూకి చనిపోవాలని ప్రేరేపించినట్లు సమాచారం. అయితే అశోక్ భవనంపై నుంచి దూకినా స్వల్ప గాయాలే కావడంతో ప్రాణభయంతో పైకిలేచి నడుస్తూ రాగా.. క్షణాల్లో కొందరు వచ్చి ఈడ్చుకుంటూ ఆస్పత్రిలోకి తీసుకెళ్లారు. దీంతో సదరు వ్యక్తులు ఆస్పత్రిలో ఆ యువకుడి ఊపిరి తీసేశారని తెలిసింది. మృతి చెందిన తర్వాత ఆస్పత్రి యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. మృతుడి బంధువులు వచ్చి ఆందోళన చేసి, డయల్ 100కు ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. యువకుడి వీపుపై వాతలు, బలమైన దెబ్బలు ఉండటం కనిపించింది. సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు బయటకు రాకుండా ఆస్పత్రి యాజమాన్యం జాగ్రత్తపడినట్లు తెలుస్తోంది. ప్రేమాయణమా.. అప్పుల వారి పనా..? యువకుడి మృతికి ప్రేమాయణం.. లేదా అప్పులే కారణమై ఉండవచ్చని పలువురు చర్చించుకుంటున్నారు. అశోక్ ఓ వివాహితతో వాట్సాప్ చాటింగ్ చేసేవాడని, ఈ క్రమంలోనే ప్రేమకు దారి తీసి ఉండవచ్చని, విషయం తెలిసిన తర్వాత అతడి అడ్డు తొలగించి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు అప్పులు కూడా చేశాడని, వసూలు చేసే క్రమంలో ఇలా చావబాది.. ఊపిరి తీసేశారా అన్న అభిప్రాయమూ వినపడుతోంది. నిందితులను కాపాడేందుకు ఒత్తిళ్లు.. ఈ కేసులోని నిందితుల్లో హాస్పిటల్‌కు చెందిన ప్రముఖుడు శ్రీ సత్యసాయి జిల్లాలో ఓ మహిళా ప్రజాప్రతినిధి కుమారుడు, శింగనమల నియోజకవర్గంలోని ప్రముఖ వ్యక్తికి సదరు వ్యక్తి బంధువు. దీంతో అతన్ని కాపాడేందు కోసం అధికార తెలుగుదేశం పార్టీ నేతలు రంగంలోకి దిగి.. పోలీసులపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు తెస్తున్నట్లు సమాచారం. ఇది ఆత్మహత్యా.. లేక హత్యా అనేది పోస్టుమార్టం నివేదికలో బయటపడనుంది.త్వరలోనే అన్నీ తెలుస్తాయి హిత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మూడో అంతస్తు నుంచి అశోక్ అనే యువకుడు దూకి.. చికిత్స పొందుతూ మృతి చెందాడని సమాచారం అందిన వెంటనే సంఘటన స్థలానికి వెళ్లాం. మృతిపై అనుమానాలు ఉన్నాయని అతడి అక్క ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. ఈ కేసులో పోస్టుమార్టం నివేదికే కీలకం. ఒత్తిళ్లకు తలొగ్గం. నిబంధనల ప్రకారమే కేసు దర్యాప్తు జరుగుతోంది. త్వరలోనే అసలు విషయాలు బయటకు వస్తాయి. – కౌలుట్లయ్య, సీఐ, త్రీటౌన్ పోలీసుస్టేషన్, అనంతపురం -
మానసిక వైద్యురాలిని కబళించిన డిప్రెషన్!
వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, పని ఒత్తిళ్లు.. కారణాలు ఏవైనా కావొచ్చు. తీవ్రమైన మానసిక ఒత్తిడి మనిషిని కుంగదీస్తుంది. అలాంటి సమయంలో సరైన సహాయం, మద్దతు అందకపోతే పరిస్థితులు విషాదకర పరిణామాలకు దారితీసే ప్రమాదం ఉంటుంది. అయితే ఇలాంటి మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి చికిత్స అందించాల్సిన ఓ వైద్యురాలే.. చివరకు అదే మానసిక ఒత్తిడికి బలికావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. రాజ్‌నగర్ ఎక్స్‌టెన్షన్‌లోని ఆఫీసర్స్ సిటీ-2 సొసైటీలో నివసిస్తున్న డాక్టర్ హేమికా అగర్వాల్ (40) ఆదివారం ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘటన జరిగిన వెంటనే స్థానికులు ఆమెను సమీప ఆస్పత్రికి తరలించినప్పటికీ.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.హేమికా తండ్రి డాక్టర్ ఆర్. చంద్ర కూడా ఘజియాబాద్‌లో ప్రముఖ సైకియాట్రిస్ట్‌గా ఉన్నారు. దాదాపు ఏడాదిన్నర క్రితం జరిగిన విడాకుల తర్వాత ఆమె తీవ్ర భావోద్వేగ ఒత్తిడి, డిప్రెషన్‌తో బాధపడుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. కుమార్తె వివాహ బంధం ముగిసిన తర్వాత మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొందని ఆయన పేర్కొన్నారు.దాని నుంచి బయటపడేందుకు ఆమె తీవ్రంగా ప్రయత్నించారని.. పేషెంట్లకు చికిత్స కొనసాగిస్తుండడంతో మామూలుగా మారిందని తాము భావించామని చెబుతున్నారాయన. మరోవైపు ఆమె మృతి వార్త స్థానికంగా వైద్య వర్గాల్లో విషాదం నింపింది. పలువురు ఆమె మృతికి సంతాపం తెలుపుతూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు.ఇతరుల మానసిక సమస్యలకు పరిష్కారం చూపే వృత్తిలో ఉన్న ఓ వైద్యురాలే వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒత్తిడితో విషాద నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ కేసులో ఇప్పటి వరకు ఎలాంటి సూసైడ్ నోట్ బయటపడకపోవడంతో.. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
భార్య విడాకులు కోరిందని.. కొడుకు వీడియో తీస్తుండగానే..
గురుగ్రామ్‌లోని సూరత్ నగర్లో ఓ వ్యక్తి ఇంట్లో ఉరివేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. భార్య విడాకులు కోరడంతోనే ఈ ఘటన జరిగిందని పోలీసులు భావిస్తుండగా, మృతుడి కుటుంబ సభ్యులు మాత్రం ఇది ఆత్మహత్య కాదని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడు సంజీవ్ యాదవ్ (36) ఓ కంపెనీలో అసోసియేట్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు.ఘటన సమయంలో ఇంట్లో అతడి భార్య మన్‌ప్రీత్ కౌర్, ఏడేళ్ల కుమారుడు మాత్రమే ఉన్నారు. సంజీవ్ ఉరివేసుకున్న దృశ్యాలను కుమారుడు మొబైల్ ఫోన్లో రికార్డు చేసినట్లు పోలీసులు తెలిపారు. భర్తను రక్షించేందుకు మన్‌ప్రీత్ సహాయం కోసం కేకలు వేసిందని, అనంతరం తన కుటుంబ సభ్యులతో పాటు సంజీవ్ తల్లిదండ్రులకు సమాచారం అందించిందని పోలీసులు చెప్పారు.అయితే సంజీవ్ కుటుంబ సభ్యులు మాత్రం ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భార్య విడాకులు కోరడంతో ఇద్దరి మధ్య కొంత కాలంగా వివాదం కొనసాగుతుందని.. సంజీవ్ సోదరి కిరణ్ తెలిపారు. తన సోదరుడి మరణంపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని కోరారు. సంజీవ్ తండ్రి రామ్‌సేవక్ యాదవ్ కూడా తన కోడలిపై అనుమానం వ్యక్తం చేస్తూ.. తన కుమారుడిని కుట్ర పన్ని హత్య చేసి ఉండవచ్చని ఆరోపించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మన్‌ప్రీత్ కౌర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సంజీవ్, మన్‌ప్రీత్‌లు 2018లో ప్రేమ వివాహం చేసుకున్నారు. గురుగ్రామ్‌లోని డెన్సో కంపెనీలో పనిచేసే సమయంలో వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. 2019లో వారికి కుమారుడు జన్మించాడు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించామని.. నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని సబ్ ఇన్స్పెక్టర్ మహేందర్ సింగ్ తెలిపారు. -
ప్రియురాలి కూతురిపై కన్నేసిన ప్రియుడు
అనంతపురం సెంట్రల్: ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి.. ఆమె కూతురిపైనా కన్నేశాడు. బలాత్కారం చేసేందుకు యత్రించగా యువతి తల్లి అతని మర్మాంగంపై కత్తితో దాడి చేసింది. పోలీసుల కథనం మేరకు.. అనంతపురం రూరల్ మండలం రాచానపల్లికి చెందిన ఆటో డ్రైవర్ సురేష్ స్థానిక డ్రైవర్స్ కాలనీలో నివాసముంటున్న ఓ మహిళతో ఐదేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఇటీవల ఆ మహిళ కుమార్తెపైనా కన్నేశాడు. ఈ విషయాన్ని బాలిక పలుమార్లు తల్లికి చెప్పింది. దీంతో ఆమె తన కుమార్తె జోలికి వెళ్లొద్దని ప్రియుడిని హెచ్చరించింది. అయినా అతను పద్ధతి మార్చుకోలేదు. శుక్రవారం సురేష్ ఆమె ఇంటికి వెళ్లాడు. అర్ధరాత్రి తర్వాత మహిళ బాత్రూంకు వెళ్లిన సమయంలో ఆమె కుమార్తెను బలాత్కారం చేసేందుకు యతి్నంచాడు. బాధితురాలు కేకలు వేయడంతో తల్లి పరుగున వచ్చి అడ్డుకోబోయింది. అయినప్పటికీ అతను విరమించుకోకపోవడంతో కత్తితో మర్మాంగంపై దాడి చేసింది. తీవ్ర రక్తస్రావం కావడంతో సదరు వ్యక్తి కుప్పకూలిపోయాడు. అనంతరం పోలీసులకు సమాచారమిచ్చి, స్థానికుల సాయంతో అతన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించింది. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి నిలకడగా ఉంది. విచారణ అనంతరం కేసు నమోదు చేస్తామని అనంతపురం వన్‌టౌన్ పోలీసులు తెలిపారు. -
సన్నిహిత సంబంధం కేసు: 6 నెలల పసికందును కాలువలో పడేసి చంపి..
ప్రియుడి మోజులో పడి అతడితో కలిసి వెళ్లిపోయింది ఓ మహిళ. తమకు అడ్డంగా ఉన్నాడని ఆ మహిళ 6 నెలల కుమారుడిని చంపేసి కాలువలో పడేశాడు ఆమె ప్రియుడు. అందుకు ఆ మహిళ కూడా సహకరించింది.ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌లోని నౌచండి పోలీస్ స్టేషన్ పరిధిలో జులై 12న వైశాలి కాలనీ సమీపంలోని కాలువలో లభించిన 6 నెలల శిశువు మృతదేహం గుర్తింపు ఇప్పుడు పూర్తైంది. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. ఆ చిన్నారి సహారన్పూర్కు చెందిన ఇమ్రాన్, షబానా కుమారుడు సమీర్. ఈ కేసును ఛేదించిన నౌచండి పోలీసులు శిశువు తల్లి షబానా, ఆమె ప్రియుడు విశాల్‌ను అరెస్టు చేశారు.షబానా తన ప్రియుడు విశాల్‌తో కొత్త జీవితం ప్రారంభించాలని అనుకుంది. ఇందుకోసం ఆమె చిన్నకుమారుడు సమీర్‌ను తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. హాపూర్‌కు చెందిన విశాల్ కూడా మీరట్‌కు చేరుకున్నాడు. ఇద్దరూ ముందే కలిసి జీవించాలనే ప్రణాళిక వేసుకున్నారు. అయితే, సమీర్‌ను తనతో ఉంచుకోవడానికి విశాల్ సిద్ధంగా లేడు.సమీర్‌ను అడ్డంకిగా భావించి తొలగించాలనే కుట్ర పన్నారు. విశాల్ శిశువును తనతో తీసుకెళ్లాడు. తర్వాత అతడు శిశువును హత్య చేసి మృతదేహాన్ని కాలువలో పడేశాడు. జూలై 12న శిశువు మృతదేహం నీటిలో తేలుతూ కనిపించింది. అయితే అప్పట్లో ఆ మృతదేహం ఎవరిదో పోలీసులు గుర్తించలేకపోయారు.ఇదిలా ఉండగా, సహారన్‌పూర్‌లోని గంగోహ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇమ్రాన్ తన భార్య షబానా, కుమారుడు సమీర్ కనిపించడం లేదని ఫిర్యాదు నమోదు చేశాడు. పోలీసులు షబానాను గుర్తించారు. కానీ ఆమె 6 నెలల కుమారుడు కనిపించలేదు. షబానా కూడా శిశువు గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఇదే సమయంలో మీరట్‌లో లభించిన గుర్తు తెలియని మృతదేహం ఫొటోలను సమీప జిల్లాలకు పంపించారు.నౌచండి పోలీసులు శిశువు ఫొటోలను సహారన్పూర్ సహా ఇతర జిల్లాలకు షేర్ చేశారు. జులై 13న ఈ సమాచారం సహారన్పూర్ పోలీసులకు కూడా చేరింది. ఫొటో చూసిన ఇమ్రాన్ మృతదేహం తన కుమారుడు సమీర్దేనని గుర్తించాడు. ఆ తర్వాత మీరట్ పోలీసులు కేసులోని అంశాలను కలిపి శిశువు తల్లి, ఆమె ప్రియుడిపై దృష్టి పెట్టారు.సహారన్పూర్లో నమోదు చేసిన జీరో ఎఫ్ఐఆర్ తర్వాత మీరట్ నౌచండి పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. ఎఫ్ఐఆర్ అందిన తర్వాత నిందితుల వద్దకు చేరుకోవడానికి పోలీసులు బృందాన్ని ఏర్పాటు చేశారు. షబానా, విశాల్‌ను విచారించగా ఇద్దరూ హత్య కుట్ర పన్నిన విషయం, నేరాన్ని అమలు చేసిన విషయాన్ని అంగీకరించారు.ఇమ్రాన్, షబానాకు నలుగురు పిల్లలుఇమ్రాన్, షబానాకు మొత్తం నలుగురు పిల్లలు ఉన్నారు. షబానా చిన్న పిల్లాడిని తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. మీరట్ ఎస్పీ సిటీ వినాయక్ గోపాల్ భోస్లే తెలిపిన వివరాల ప్రకారం, జూలై 12న నౌచండి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాలువ నుంచి ఒక శిశువు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసు బృందం ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్షకు పంపించింది. సహారన్పూర్ గంగోహ్ పోలీస్ స్టేషన్లో షబానా, ఆమె శిశువు అదృశ్యమైనట్టు కేసు నమోదు అయింది. షబానాను మొదట గుర్తించారు. ఆ తర్వాత శిశువును గుర్తించారు. ఆ తర్వాత గంగోహ్ పోలీస్ స్టేషన్ నుంచి జీరో ఎఫ్ఐఆర్ను నౌచండి పోలీస్ స్టేషన్‌కు పంపించారు. షబానా, హాపూర్‌కు చెందిన విశాల్‌పై ఇమ్రాన్ హత్య ఆరోపణలు చేశాడు. -
కాపాడాల్సిన పోలీసే కాటేశాడు..!
వరంగల్ క్రైం: సోషల్ మీడియా ద్వారా మహిళలతో పరిచయాలు పెంచుకుని లైంగిక వేధింపులు, బెదిరింపులకు పాల్పడిన ఓ సబ్ ఇన్స్పెక్టర్ కటకటలపాలయ్యాడు. ఈమేరకు శుక్రవారం సుబేదారి ఇన్స్పెక్టర్ రంజిత్‌కుమార్ వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలానికి చెందిన కదిరే శ్రీకాంత్ 2014 బ్యాచ్‌కు చెందిన సబ్ ఇన్స్పెక్టర్. సోషల్ మీడియా వేదికగా మహిళలతో పరిచయం పెంచుకుంటూ.. వారిని మానసికంగా, శారీరకంగా వేధించసాగాడు. 2025లో ఫేస్ బుక్ ద్వారా శ్రీకాంత్ ఓ మహిళతో పరిచయం పెంచుకున్నాడు. అనంతరం ఆమెతో సన్నిహిత సంబంధాలు ఏర్పర్చుకున్నాడు. అతడు జమ్మికుంటలో పనిచేస్తుండగా ఆమె వ్యక్తిగత పరిస్థితులను ఆసరాగా చేసుకుని బలవంతంగా లొంగదీసుకున్నాడు. అనంతరం బాధితురాలి వ్యక్తిగత ఫొటోలతో బెదిరించడం, వీడియో కాల్స్ ద్వారా అసభ్యకరంగా వేధించి, డబ్బులు వసూలు చేశాడు. ఇచ్చిన డబ్బులు అడిగితే బెదిరించాడు. ఈమేరకు బాధితురాలు హనుమకొండలోని సుబేదారి పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సుబేదారి పోలీస్ ఇన్స్పెక్టర్ రంజిత్‌కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విచారణ కొనసాగుతుండగా.. నాలుగు నెలల నుంచి నిందితుడు అరెస్ట్‌కు భయపడి గోవా, హైదరాబాద్, నిజామాబాద్ పలు ప్రాంతాల్లో తలదాచుకుంటూ తిరిగినట్లు పోలీస్ ఇన్స్పెక్టర్ రంజిత్‌కుమార్ వెల్లడించారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు చివరికి సిమ్‌కార్డులు కూడా ధ్వంసం చేసి వై–ఫై ద్వారా కమ్యూనికేషన్ కొనసాగించాడు. సాంకేతిక «ఆధారాలు, విశ్వసనీయ సమాచారం మేరకు నిందితుడు శ్రీకాంత్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీస్ ఇన్స్పెక్టర్ రంజిత్‌కుమార్ తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరు పర్చగా, హనుమకొండ మూడో అదనపు కోర్టు న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్‌కు తరలిస్తున్న ట్లు ఉత్తర్వులు జారీ చేశారని ఇన్స్పెక్టర్ తెలిపారు. -
కబడ్డీ ప్లేయర్ భార్య అనుమానాస్పద మృతి
హర్యానాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కబడ్డీ ఆటగాడు షీలూ బల్హారా భార్య, 23 ఏళ్ల ముస్కాన్ శుక్రవారం మధ్యాహ్నం రోహ్తక్ జిల్లాలోని వారి నివాసంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.రోహ్తక్లోని మెహమ్ ప్రాంతానికి చెందిన ముస్కాన్ 2023 డిసెంబర్లో షీలూను వివాహం చేసుకుంది. ఈ దంపతులకు గతేడాది నవంబర్‌లో హార్దిక్ అనే కుమారుడు జన్మించాడు.ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఫోరెన్సిక్ బృందాన్ని కూడా రంగంలోకి దించి ఆధారాలను సేకరించారు. ముస్కాన్ ఈ తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఇప్పటివరకు తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.పోలీసుల విచారణలో భాగంగా ముస్కాన్ సోషల్ మీడియా కార్యకలాపాలను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఘటనకు ఒక్కరోజు ముందు ఆమె పంజాబీ పాటకు సంబంధించిన రీల్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు నివేదికలు పేర్కొన్నాయి.ముస్కాన్ మృతికి సంబంధించి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కారణం నిర్ధారించేందుకు కుటుంబ సభ్యుల వాంగ్మూలాలతో పాటు ఇతర ఆధారాలను కూడా పరిశీలిస్తున్నారు.షీలూ బల్హారా కెరీర్ విషయానికొస్తే.. షీలూకు హర్యానాలో స్టార్ కబడ్డీ ప్లేయర్‌గా పేరుంది. డిఫెన్స్‌లో ‘క్యాచర్’గా అతడు మంచి గుర్తింపు కలిగి ఉన్నాడు. ఈ ఏడాది అతడిని ఓ స్థానిక టోర్నీలో “India’s leading catchers”లో ఒకరిగా ప్రముఖులు పేర్కొన్నారు. -
పిల్లల ప్రాణాలు పోలేదుగా.. చిన్న గీతే కదా! వార్డెన్ సమాధానం
ఆంధ్రప్రదేశ్, విడపనకల్లు: అనంతపురం జిల్లా విడపనకల్లు మోడల్ స్కూల్ హాస్టల్లో దారుణ సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులు తెలిపిన వివరాల మేరకు.. విడపనకల్లు గ్రామానికి చెందిన చాకలి సుంకన్న కుమార్తె సుస్మిత, మహబూబ్ బాష కుమార్తె సోఫియా స్థానిక ఆదర్శ పాఠశాలలో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం చదువుతున్నారు.ఏమైందో ఏమో కానీ అదే హాస్టల్లో ఉంటూ ఇంటర్ చదువుతున్న మరో విద్యార్థిని గురువారం రాత్రి పడుకున్న సమయంలో బ్లేడుతో సుస్మిత, సోఫియాల గొంతు కోయడానికి ప్రయత్నించింది. బ్లేడు సరిగా తెగకపోవడంతో ఇద్దరికి గొంతు కింద స్వల్ప గాయమైంది. గొంతు కోసిన విద్యార్థినిని వెంటనే హాస్టల్ నుంచి ఇంటికి పంపించేశారు. గాయపడిన విద్యార్థినులను కనీసం ఆసుపత్రికి కూడా తీసుకెళ్లలేదు. వార్డెన్ కనీసం తల్లిదండ్రులకు కూడా తెలపలేదు.విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు శుక్రవారం మోడల్ స్కూల్‌కు చేరుకుని ప్రిన్సిపాల్, వార్డెన్లపై తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. తమ పిల్లలకు ఏదైనా జరిగి ఉంటే ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు. తమ పిల్లల ప్రాణాలతో చెలగాటమాడతారా అంటూ వార్డెన్ నల్లమ్మను నిలదీశారు. ఇందుకు వార్డెన్.. ‘మీ పిల్లల ప్రాణాలు పోలేదు కదా ఏదో చిన్న గీత పడిందంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో తల్లిదండ్రులు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. -
సువేందు పీఏ కేసులో బీజేపీ కార్యకర్తల అరెస్ట్!?
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడి హత్య కేసు అనూహ్య మలుపు తిరిగింది. ఇప్పటివరకు రాజకీయ ప్రత్యర్థుల కుట్ర కోణంలో కేసు దర్యాప్తు కొనసాగగా.. తాజాగా ఇద్దరు బీజేపీ కార్యకర్తలనే సీబీఐ అరెస్ట్ చేయడం సంచలనం సృష్టిస్తోంది. దీంతో ఈ కేసు మరోసారి బెంగాల్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.అరెస్టైన వారిని సాగర్ సోంకర్, సాహెబ్ సోంకర్‌గా గుర్తించారు. వీరిద్దరూ సోదరులని, గతంలో చంద్రనాథ్ రథ్ టీమ్‌లో పనిచేసిన వారేనని సీబీఐ అధికారులు నిర్ధారించారు. ప్రస్తుతం వీళ్లు బీజేపీలో సభ్యులుగా కొనసాగుతున్నట్లు సమాచారం. హత్యకు ముందు రెక్కీ నిర్వహించడం, దాడికి అవసరమైన ఏర్పాట్లు చేయడం, షూటర్లతో మాట్లాడుకుని ప్లాన్ చేయడం వీళ్లిద్దరి పనేనని గుర్తించారు. అయితే హత్యకు అసలు కారకులు ఎవరు? కారణం ఏంటి? అనేది ఇంకా తేలాల్సి ఉంది.సువేందు అధికారి పీఏ చంద్రనాథ్ రథ్ హత్య ఘటన పశ్చిమ బెంగాల్లో తీవ్ర కలకలం రేపింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది రోజులకే ఈ ఘటన జరగడం రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. మే 6న ఉత్తర 24 పరగణాల జిల్లా మాధ్యమ్గ్రామ్ ప్రాంతంలో చంద్రనాథ్ రథ్ తన ఎస్‌యూవీలో ఇంటికి వెళ్తుండగా గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన సువేందు అధికారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మూడు రోజుల ముందు జరగడంతో అప్పట్లో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. రాజకీయ ప్రత్యర్థుల కుట్రగా బీజేపీ నేతలు ఆరోపించగా.. పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. తొలుత బెంగాల్ పోలీసులు సిట్ ఏర్పాటు చేయించి దర్యాప్తు జరిపారు. ఈ క్రమంలో యూపీ, బిహార్ నుంచి కొందరిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కేసు సీబీఐకి చేరింది. ఈ క్రమంలో ఇప్పుడు ఇద్దరిని అరెస్ట్ చేయడం గమనార్హం.హత్యకు ముందే వ్యూహం?సీబీఐ దర్యాప్తులో భాగంగా హత్యను పక్కా ప్రణాళికతో అమలు చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితులు ముందుగానే షూటర్లను ఎంపిక చేయడం, వారికి అవసరమైన వాహనాలు, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయడం, ఘటనకు ముందు ప్రాంతాన్ని పరిశీలించడం వంటి అంశాలపై అధికారులు దృష్టి పెట్టారు. ఈ కేసులో తాజా అరెస్టులతో కలిపి ఇప్పటివరకు తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నట్లైంది. బీజేపీ కార్యకర్తలే ఎందుకు అనుమానితులు?తాజా పరిణామాల్లో ప్రధాన అంశం.. అరెస్టైన ఇద్దరూ బీజేపీ కార్యకర్తలు కావడం. వీరు ఒకప్పుడు చంద్రనాథ్ రథ్‌తో కలిసి పనిచేసినట్లు సీబీఐ వర్గాలు చెబుతున్నాయి. అయితే దర్యాప్తులో భాగంగా వీరికి ప్రత్యర్థి రాజకీయ వర్గాలతో కూడా సంబంధాలు ఉన్నాయా? అనే కోణాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. రాజకీయ విభేదాలా? వ్యక్తిగత కక్షలా? లేక మరేదైనా కారణమా? అనే అంశాలపై ఆధారాలు సేకరిస్తున్నారు. ఇటు బీజేపీ మాత్రం వాళ్లు గతంలో సువేందు టీఎంసీలో ఉన్నప్పుడు.. చంద్రనాథ్ రథ్ టీంలో పని చేశారని అంటున్నారు. అప్పట్లో సువేందు ఆరోపణలు.. చంద్రనాథ్ రథ్ హత్య వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని సువేందు అధికారి గతంలో ఆరోపించారు. తన రాజకీయ ఎదుగుదల, ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీపై సాధించిన విజయం నేపథ్యంలో ఈ దాడి జరిగి ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు. తనకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న వ్యక్తిని లక్ష్యంగా చేసుకున్నారని, దీని వెనుక పెద్ద కుట్ర ఉండొచ్చని ఆయన అప్పట్లో వ్యాఖ్యానించారు.కొత్త మలుపు.. అసలు కుట్రదారులు ఎవరు?తాజా అరెస్టులతో చంద్రనాథ్ రథ్ హత్య కేసు కీలక దశకు చేరుకుంది. ఒకవైపు రాజకీయ కుట్ర కోణం, మరోవైపు సొంత వర్గంలో ఉన్న వ్యక్తుల పేర్లు తెరపైకి రావడం.. కేసును మరింత సంక్లిష్టంగా మార్చింది. -
షేర్ మార్కెట్లో నష్టాలు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య
హైదరాబాద్: ‘ఐ ట్రైడ్... లూసర్’ అని నోట్ రాసి ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ 17వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన మేరకు.. జార్ఖండ్ రాష్ట్రం బొకారో స్టీల్ సిటీకి చెందిన సుజిత్ పండిట్ కుమార్(26) సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తూ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని వాసవి జీపీ ట్రెండ్స్‌లో త్రీ బీహెచ్‌కేలో నివాసముంటున్నాడు. ఒక రూమ్‌లో సుజిత్, మరో రెండు రూమ్‌లలో హర్ష, వివేక్‌లు ఉంటున్నారు. మిగతా ఇద్దరు కంపెనీలకు డ్యూటీకి వెళ్లగా, రాత్రి సమయంలో వర్క్ ఫ్రం హోమ్ చేసిన సుజిత్ గురువారం ఇంటి వద్దనే ఉన్నాడు. గురువారం మధ్యాహ్నం 17వ అంతస్తు బాల్కనీ నుంచి కిందికి దూకడంతో సుజిత్ అక్కడికక్కడే మృతి చెందాడు. సాయంత్రం 4.30 గంటల సమయంలో సెక్యూరిటీ సిబ్బంది గమనించి పోలీసులకు సమాచారం అందించగా మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేసే సుజిత్ కొంతకాలంగా షేర్ మార్కెట్లో ట్రేడింగ్ చేయడంతో దాదాపు రూ.25 లక్షల నష్టం వచి్చనట్లు పోలీసులు తెలిపారు. ప్రైవేట్ యాప్‌లలో లోన్ తీసుకోవడంతో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. ఈ క్రమంలోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ‘ఐ ట్రైడ్... లూసర్’ అని ఓ చిట్టీపై నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బెంగళూరులో ఉన్న సోదరుడు అజిత్ పండిట్ కుమార్ హైదరాబాద్‌కు చేరుకున్నాడు. శుక్రవారం ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని సోదరుడికి అప్పగించారు. -
శిక్ష ఖరారు..ఆప్ మాజీ కౌన్సిలర్‌కు జీవిత ఖైదు
ఢిల్లీ: ఆరేళ్ల క్రితం ఈశాన్య ఢిల్లీ అల్లర్ల సమయంలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల్లో భాగంగా ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ)) ఆఫీసర్ అంకిత్ శర్మ దారుణ హత్యకు గురైన కేసులో ఆప్ మాజీ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్‌కు శిక్ష ఖరారు చేసింది ఢిల్లీ కోర్టు. ఇప్పటికే ఈ కేసులో తాహీర్ హుస్సేన్ దోషిగా తేల్చిన కోర్టు.. జీవిత ఖైదును శిక్షగా ఖరారు చేసింది. ఈ కేసులో ఐదుగుర్ని దోషులుగా తేల్చిన కోర్టు.. తాజాగా వారికి జీవిత ఖైదు విధించింది. ఈ మేరకు కోర్టు అదనపు సెషన్స్ జడ్జి (ASJ) ప్రవీణ్ సింగ్, మరణశిక్ష విధించాలన్న ప్రాసిక్యూషన్ అభ్యర్థనను తిరస్కరించి జీవితఖైదు విధించారు.కాగా, 2020, ఫిబ్రవరి 25వ తేదీన సీఏఏ అల్లర్ల సమయంలో ఐబీ ఆఫీసర్ అంకిత్ శర్మ దారుణ హత్యకు గురయ్యారు. ఆయన మృతదేహాన్ని చాంద్‌బాగ్ ప్రాంతంలోని ఓ డ్రైనేజీలో పడేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఆ రోజు సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన అంకిత్ శర్మ ఇక తిరిగి రాలేదు. ఆ రోజు అప్పుడే ఇంటికి వచ్చిన అంకిత్ శర్మ.. అల్లరి మూకలు స్థానికంగా రెచ్చిపోవడం గమనించారు. దాంతో బయటకు వెళ్లి వారిని సద్దుమణిచే యత్నం చేశారు. అలా ఆప్ కౌన్సిలర్‌గా ఉన్న హుస్సేన్ ఇంటికి వెళ్లిన అంకిత్ శర్మ హత్యకు గురయ్యారు. ఆ సమయంలో అంకిత్ శర్మను అతి దారుణంగా హత్య చేసి డ్రెయిన్‌లో పడేశారు. తన కొడుకు ఎంతకీ ఇంటికీ రాకపోయే సరికి ఆ మరుసటి రోజు ఫిబ్రవరి 26వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు తండ్రి రవీందర్ కుమార్. దాంతో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు.. ఓ యువకుని మృతదేహం డ్రెయిన్‌లో ఉన్న విషయం గమనించడంతో అతను అంకిత్ శర్మగా నిర్దారణ అయ్యింది. దీనిపై హుస్సేన్‌తో పాటు 11 మందిపై కేసు నమోదైంది. అంకిత్ శర్మను అతి దారుణంగా హత్య చేశారు. విచారణలో అంకిత్ శర్మ 51 కత్తిపోట్లకు గురైనట్లు తేలింది.2023. మార్చిలో , అల్లర్లు, వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని ప్రేరేపించడం, హత్య, నేరపూరిత కుట్ర వంటి నేరాలకు సంబంధించి హుస్సేన్‌తో సహా 11 మంది నిందితులపై కోర్టు అభియోగాలను నమోదు చేసింది. ఆ సమయంలో తన గ్రూపును హుస్సేన్ రెచ్చగొట్టారనే ప్రాసిక్యూషన్ వాదనను కోర్టు సమర్ధించడంతో వారికి జైలు శిక్ష పడింది.తన బెయిల్‌కు చేసుకున్న అభ్యర్థనను కూడా అంతకుముందు ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. హుస్సేన్‌పై అభియోగాలు తీవ్రంగా ఉండటంతో బెయిల్ ఇవ్వడానికి ఢిల్లీ కోర్టు నిరాకరించింది. గత తీర్పులో వారిని దోషులుగా తేల్చగా, తాజాగా వారికి శిక్షలు ఖరారు చేసింది. -
మహిళలపై అత్యాచారం కాదు.. ఆ అస్థిపంజరాలు పురుషులవే!
కర్ణాటక, యశవంతపుర: ధర్మస్థలలో అపరిచిత అస్థిపంజరాల కేసులో ఓ మిస్టరీ వీడిపోయింది. గతంలో బంగ్ల గుడ్డలో సిట్ అధికారులు తవ్వకాలు జరిపి మూడు అస్థిపంజరాలను కనుగొన్నారు. వాటికి డీఎన్ఏ పరీక్షలను నిర్వహించగా, మూడు కుటుంబాల నమూనాలతో సరిపోలాయి. మృతుల్లో కొడగు జిల్లా విరాజపేట తాలూకా టి శెట్టిగేరి గ్రామవాసి యు.బి. అయ్యప్ప(70), తుమకూరు జిల్లా గుబ్బి తాలూకా దాసరకల్లహళ్లికి చెందిన ఆదిశేష (27), కోలారు జిల్లా శ్రీనివాసపుర తాలూకా మీసగానహళ్లికి చెందిన కృష్ణప్పలుగా తేలింది. అందరూ పురుషులేనని, మహిళలపై అత్యాచారం చేసి హత్యలు చేసి పూడ్చిపెట్టారనే ఆరోపణలతో సంబంధం లేదని సిట్ అధికారులు తెలిపారు. ఈ నెల 15న బెళ్తంగడి కోర్టుకు సమర్పించిన నివేదికలో ఈ వివరాలను పేర్కొన్నారు.ఇలా మిస్సింగ్2017, జూన్ 25న యుబీ అయ్యప్ప మైసూరు ఆస్పత్రికి వెళ్తున్నట్లు చెప్పి వెళ్లి ఇంక తిరిగి రాలేదు. గుబ్బికి చెందిన ఆదిశేష బెంగళూరులోని బార్లో పని చేసేవాడు, 2013 అక్టోబర్ 2న ఇంటికెళ్లి మొబైల్‌ను వదిలేసి ఎక్కడికి వెళ్లాడో తెలియదు. కృష్ణప్ప 2024 అక్టోబర్ 22న ఇంటి నుంచి వెళ్లిపోయాడు. మూడు కేసుల్లోనూ కుటుంబీకులు మిస్సింగ్ కేసులు పెట్టారు. అలా వెళ్లినవారు బంగ్ల గుడ్డలో ఎలా శవాలయ్యారన్నది తేలాల్సి ఉంది. -
పాత నాణేలు కొనేస్తామంటూ.. మహిళా ఎన్నారైకి బిగ్ షాక్!
సాక్షి, హైదరాబాద్: పాత నాణేలను భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేస్తామంటూ ఇన్‌స్ట్రాగామ్ ద్వారా ప్రచారం చేసిన ఓ ముఠా నగరానికి చెందిన ప్రవాస భారతీయురాలి నుంచి రూ.71.8 లక్షలు కాజేసింది.అమెరికాలో నివసిస్తున్న ఓ మహిళ (73) జనవరిలో ఇన్‌స్టాలో.. పురాతన నాణేలు కొంటామనే ప్రకటన చూశారు. 1947 జార్జ్–6 కింగ్ ఎంపరర్ నాణెం ఫొటో, ఓ ఫోన్ నంబర్‌ను కేటుగాళ్లు పోస్టు చేశారు. నాణెం విలువ రూ.27 లక్షలుగా పేర్కొన్నారు. దీంతో ఎన్నారై మహిళ తన వద్ద ఉన్న మూడు 1947 జార్జ్–6 నాణేలు, రెండు 20 పైసల ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‘ నాణేల ఫొటోలు పంపారు.మోసగాళ్లు ఒక్కో 1947 నాణెం విలువ రూ.27 లక్షలుగా, ఒక్కో 20 పైసల నాణెం విలువ రూ.12 లక్షలుగా ఖరారు చేస్తున్నట్లు సమాచారం ఇచ్చారు. రకరకాల పేర్లతో పలు దఫాలుగా రూ.71,80,950 వసూలు చేసినా వేధింపులు ఆపలేదు. దీంతో ఆమె నగరానికి చెందిన వ్యక్తికి జీపీఏ ఇచ్చి సైబర్ ఠాణాలో ఫిర్యాదు చేయించడంతో కేసు నమోదైంది. -
భర్త ప్రేమకథ.. భార్య విషాదాంతం!
హైదరాబాద్, మీర్‌పేట: సాఫ్ట్వేర్ ఉద్యోగిని అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ శోభన్, మృతురాలి బంధువుల కథనం ప్రకారం. కూకట్పల్లి అల్విన్కాలనీకి చెందిన నర్సింహస్వామి, పద్మల కుమార్తె హేమ (28) సాఫ్ట్వేర్ ఉద్యోగి. అల్మాస్గూడ వినాయకహిల్స్కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి రాజ్‌కుమార్‌తో పదిహేను నెలల క్రితం ఈమెకు వివాహమైంది.ఈ క్రమంలో హేమ గురువారం సాయంత్రం ఆత్మహత్య చేసుకుంది. వివాహమైన కొద్ది రోజులకే తాను మరో యువతితో ప్రేమలో ఉన్నానని, పెద్దల ప్రోద్బలంతోనే వివాహం చేసుకున్నానని భర్త రాజ్‌కుమార్ తరచూ భార్యతో గొడవపడేవాడని మృతురాలి బంధువులు తెలిపారు.హేమ వేతనంతోనే ఈఎంఐలు, ఇంటి అవసరాలు తీరుస్తుండగా, రాజ్‌కుమార్ మాత్రం తన వేతనం గురించి చెప్పేవాడుకాదని, అదే విధంగా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఇంటికి రావాలన్నా తన అనుమతి ఉండాల్సిందేనని హేమను ఇబ్బందులకు గురిచేసేవాడని ఆరోపించారు. వివాహమైన రోజు నుంచి తరచూ గొడవ పడేవాడని, దీంతో రెండు నెలలుగా హేమ పుట్టింటి వద్దే ఉంటోందని, నెల రోజుల క్రితం పెద్దమనుషులు నచ్చజెప్పడంతో మంచిగా ఉంటానని రాజ్‌కుమార్ హామీ ఇవ్వడంతో అత్తవారింటికి పంపామని కుటుంబ సభ్యులు చెప్పారు.రాజ్‌కుమార్ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతోనే హేమ మానసికంగా కుంగిపోయిందన్నారు. ఆమె ఆత్మహత్య చేసుకునేంత బలహీనమైనది కాదని, హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని, తన బిడ్డ మృతిపై అనుమానాలు ఉన్నాయని తండ్రి నర్సింహస్వామి ఆరోపించాడు. పోస్టుమార్టం నివేదిక వస్తేనే పూర్తి వివరాలు తెలుస్తాయని, బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ తెలిపారు. -
నేను చెప్పింది చెయ్! లేదంటే నీ ఫొటోలు అందరికీ..
ఆంధ్రప్రదేశ్, బాపట్ల: ఆన్లైన్లో ఏర్పడిన పరిచయం వేధింపులు ఆపై దాడికి దారితీసిన ఘటన బుధవారం సాయంత్రం చీరాల మండలం జాండ్రపేట సమీపంలోని అక్కయ్యపాలెం రోడ్డులో చోటుచేసుకుంది. ఈ ఘటనపై రాజమండ్రికి చెందిన మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.పోలీసుల వివరాల మేరకు.. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన బలుకూరి సత్యవాణి (32) టైలర్‌గా పని చేస్తోంది. ఆమె భర్త రెండేళ్ల క్రితం మరణించగా అనంతరం సోషల్ మీడియా ద్వారా చీరాల మండలం జాండ్రపేటకు చెందిన జోగాబత్తుని వెంకట కిరణ్‌తో పరిచయం ఏర్పడింది. కొంత కాలం తర్వాత నిందితుడి ప్రవర్తనపై అనుమానం రావడంతో ఆమె అతనికి దూరంగా ఉండడం ప్రారంభించింది. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి దిగిన ఫొటోలను నిందితుడు ఆమె బంధువులకు పంపడంతో బాధితురాలు అతనిపై రాజమండ్రిలో క్రిమినల్ కేసు నమోదు చేసింది.వన్‌టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు..కొంతకాలం అనంతరం మళ్లీ ఆమెకు ఫోన్ చేసి తనతో కలిసి ఉండాలని, లేకపోతే ఫొటోలను అందరికి పంపిస్తానంటూ బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఈ నేపథ్యంలో నిందితుడి ప్రవర్తన గురించి అతని తల్లిదండ్రులతో మాట్లాడేందుకు బాధితురాలు మంగళవారం చీరాల వచ్చారు.సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో అక్కయపాలెం రోడ్డులో వెళుతుండగా వెంకట కిరణ్ అతని స్నేహితులతో కలిసి ఆమెను అడ్డగించి అసభ్య పదజాలంతో దూషించి బెదిరించారని తెలిపింది. అదే సమయంలో అటుగా వెళుతున్న ఆటోడ్రైవర్ జోక్యం చేసుకుని ఆమెను అక్కడి నుంచి సురక్షితంగా చీరాలకు తీసుకువచ్చినట్లు సమాచారం. అనంతరం ఆమె బుధవారం చీరాల వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఓడలో బంగారం వస్తుందన్నాడు.. చివరికి
సాక్షి, హైదరాబాద్: విదేశీ బంగారం వ్యాపారాలతో తనకు ఉన్న పరిచయాలను వినియోగించుకుని, తక్కువ ధరకు బంగారాన్ని ఓడల్లో తెప్పిస్తానంటూ చెప్పి నగరానికి చెందిన వ్యక్తి నుంచి రూ.2 కోట్లు కాజేసిన నిందితుడిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. ఇదే పంథాలో మరికొందరిని మోసం చేసినట్లు, గతంలో ఆరు కేసులు ఉన్నట్లు తేలడంతో వ్యవస్థీకృత నేరగాడిగా పరిగణిస్తున్నట్లు డీసీపీ ఎస్.చైతన్యకుమార్ బు«ధవారం ప్రకటించారు.సనత్‌నగర్‌కు చెందిన రాకేష్ బలరాం గౌడ్‌కు లక్ష్మీకాంత్ రెడ్డితో పరిచయం ఉంది. తనకు విదేశీ బంగారం వ్యాపారులతో సంబంధాలు ఉన్నాయని, వారి నుంచి తక్కువ ధరకు పసిడి ఖరీదు చేస్తుంటానని చెప్పాడు. 2024 జూన్ 14న రాకేష్ ఇంటికి వెళ్లిన లక్ష్మీకాంత్ దుబాయ్ నుంచి శ్రీలంక మీదుగా ముంబైకి ఓడలో బంగారం దిగుమతి చేస్తున్నానని చెప్పాడు. మొబైల్లో బంగారు బిస్కెట్ల వీడియోలు చూపించి, అతి తక్కువ ధరకు 24 క్యారెట్ల బంగారం మూడు కిలోలు ఇప్పిస్తానని హామీ ఇచ్చాడు. 20 రోజుల్లో బంగారం అందజేస్తానని నమ్మించి మొత్తం రూ.2 కోట్లను తీసుకున్నాడు. ఇందులో రూ.1.86 కోట్లు అప్పుగా తెచ్చిన రాకేష్ ఇతడికి చెల్లించాడు. నెల రోజుల తర్వాత సంప్రదించిన లక్ష్మీకాంత్ శ్రీలంకలో 10 కిలోల బంగారంతో పోలీసులకు చిక్కానని చెప్పి పసిడి ఇవ్వలేనన్నాడు. అనంతరం మరో 500 గ్రాముల బంగారం రూ.25 లక్షలకు ఇప్పిస్తానని చెప్పి, 2024 డిసెంబర్ 15న రూ.5 లక్షలు, డిసెంబర్ 17న రూ.16 లక్షలు తీసుకున్నాడు. అనుమానం రావడంతో నగదు ఇస్తున్న సమయంలో బాధితుడు వీడియో రికార్డింగ్ చేశాడు.ఆ తర్వాత లక్ష్మీకాంత్ రెడ్డి తన ఫోన్ కాల్స్, సందేశాలకు స్పందించకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న ఏసీపీ మల్లికార్జున చౌదరి ఎస్సై గోపికిరణ్ రెడ్డి దర్యాప్తు చేశారు. పరారీలో ఉన్న నిందితుడి ఆచూకీని అతడి స్వగ్రామం మహబూబ్‌నగర్ జిల్లా అయ్యవారిపల్లిలో గుర్తించారు. అక్కడే అతడిని పట్టుకున్న సీసీఎస్ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. నిందితుడిపై గతంలో మహంకాళి, రాయదుర్గం, కేపీహెచ్‌బీ, మాదాపూర్‌లతో పాటు కోయిల్‌కొండ, ఏపీలోని పెందుర్తి ఠాణాల్లో కేసులు ఉన్నట్లు గుర్తించారు. -
6 రోజులు అలరించాడు.. ఏడో రోజు సమాధి అయ్యాడు!
ప్రేక్షకుల నుంచి చప్పట్లు అందుకోవాలని చేసిన ఓ సాహస విన్యాసం.. ఓ యువ కళాకారుడి జీవితాన్నే ముగించింది. ఆరు రోజుల పాటు తన సైకిల్ స్టంట్లతో జనాలను అలరించిన 27 ఏళ్ల దీపక్.. ఏడో రోజు చేసిన ‘లైవ్ బరియల్’ (సజీవ సమాధి) స్టంట్‌లో మృతి చెందాడు. అయితే కేవలం ఏడు వేల రూపాయల కోసం నిర్వాహకులే అతని ప్రాణాలను బలిగొన్నారనే ఆరోపణలు ఇప్పుడు తెర మీదకు వచ్చాయి.హరియాణాలోని నూహ్ జిల్లాలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. తావుడు ప్రాంతంలోని ఖోరీ కలాన్ గ్రామంలో ఓ ట్రావెలింగ్ సైకిల్ సర్కస్ నిర్వహిస్తున్నారు. దాదాపు వారం రోజులుగా సాగుతున్న ఈ ప్రదర్శనలో ఫరీదాబాద్ జిల్లా గౌంచి గ్రామానికి చెందిన దీపక్ కీలక పాత్ర పోషించాడు. సైకిల్‌పై ప్రమాదకర విన్యాసాలు చేయడంలో అతడికి మంచి పేరు ఉంది. కళ్లకు గంతలు కట్టుకుని నడపడం, హ్యాండిల్‌పై నిలబడి బ్యాలెన్స్ చేయడం, కదులుతున్న సైకిల్‌పై నిలుచుని ప్రదర్శనలు ఇవ్వడం వంటి స్టంట్లతో ప్రేక్షకులను ఆకట్టుకునేవాడు.అయితే సర్కస్ చివరి రోజు దీపక్ ఓ ప్రత్యేక విన్యాసం చేయడానికి సిద్ధమయ్యాడు. ఇందులో భాగంగా అతడిని ఓ సంచిలో ఉంచి, ప్రత్యేకంగా తవ్విన ఓ గోతిలోకి దించారు. 24 గంటల తర్వాత అతడిని సజీవంగా బయటకు తీస్తామని నిర్వాహకులు ప్రేక్షకులకు ప్రకటించారు. అయితే చెప్పిన సమయానికి దీపక్‌ను బయటకు తీయలేదు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం.. అతడు దాదాపు 36 గంటల పాటు భూమిలోనే ఉన్నాడు. ఫలితంగా అతని ప్రాణం పోయింది. రూ.7,100 కోసం ఆలస్యమైందా?ఈ ఘటనపై ప్రత్యక్ష సాక్షి సంచిత్ సింగ్ కీలక విషయాలు వెల్లడించారు. దీపక్‌ను బయటకు తీయాలంటే రూ.7,100 సేకరించాల్సి ఉందని నిర్వాహకులు ప్రేక్షకులకు చెప్పినట్లు తెలిపారు. ఆ మొత్తాన్ని సేకరించే ప్రక్రియలోనే ఆలస్యం జరిగిందని భావిస్తున్నారు. చివరకు గోతిని తెరిచి దీపక్‌ను బయటకు తీసిన సమయంలో అతడు మృతిచెంది ఉన్నాడు. ఎక్కువ సమయం భూగర్భంలో ఉండటం వల్ల ఊపిరాడక మరణించి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.ఘటనపై ఆగ్రహం.. భద్రతపై అనుమానాలుదీపక్ మృతితో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎలాంటి భద్రతా ఏర్పాట్లు లేకుండా ఇలాంటి ప్రమాదకర స్టంట్లను నిర్వహించడం, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పుడు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు చేసే ఇలాంటి విన్యాసాల్లో కళాకారుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు దీపక్ కుటుంబం నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టింది.పోలీసుల దర్యాప్తుదీపక్ మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అతడిని ఎందుకు సకాలంలో బయటకు తీయలేదు? నిర్వాహకుల నిర్లక్ష్యం ఉందా? స్టంట్ నిర్వహణలో ఎలాంటి భద్రతా చర్యలు తీసుకున్నారనే అంశాలపై విచారణ జరుపుతున్నారు. నూహ్ జిల్లా పోలీసు ప్రతినిధి కృష్ణ కుమార్ ఘటనను ధ్రువీకరించారు. అసహజ మరణం కింద సెక్షన్ 174 ప్రకారం చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.ఆరు రోజుల పాటు తన సాహసాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న దీపక్.. ఏడో రోజు అదే సాహసం కారణంగా ప్రాణాలు కోల్పోవడం విషాదకరంగా మారింది. చప్పట్ల కోసం చేసిన విన్యాసం.. చివరకు అతడి జీవితానికి ముగింపు పలికింది. -
‘‘విక్రమార్కుడు’’లో రవితేజను మించిపోయాడు.. మహిళలకు గుండ్లు
చెన్నై: విక్రమార్కుడు సినిమాలో రవితేజ డబ్బుల ఆశ చూపించి, చాలా మంది మహిళలకు గుండ్లు చేయిస్తాడు. తమిళనాడులోనూ ఇలాగే ఓ వ్యక్తి మహిళలకు గుండ్లు చేయించాడు. గుండ్లు చేయించుకుంటే డబ్బులు వస్తాయని ఆశపడ్డ మహిళలు చివరకు మోసపోయామని గ్రహించి, పోలీసులను ఆశ్రయించారు.సేలం జిల్లాలో మహిళలకు మాయమాటలు చెబుతూ వారికి గుండు చేయించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టైన వ్యక్తి అరియలూరు జిల్లాకు చెందిన ఎం.సతీశ్ కుమార్ (39).పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సతీశ్ కుమార్ తనను అట్టూరు తాలూకా తహసీల్దార్‌గా పరిచయం చేసుకుంటూ మహిళలకు ఫోన్ చేసేవాడు. జుట్టు ద్వారా "ఒమెగా ఇన్ఫెక్షన్" అనే కొత్త వ్యాధి వ్యాపిస్తోందని, కరోనా మాదిరిగా ప్రమాదకరమని చెప్పి భయపెట్టేవాడు. ఆ వ్యాధి రాకుండా ఉండాలంటే గుండు చేయించుకోవాలని నమ్మించేవాడు.అంతేకాకుండా, గుండు చేయించుకున్న వారికి తమిళనాడు ప్రభుత్వం నగదు బహుమతులు ఇస్తోందని చెప్పాడు. మహిళలకు రూ.15,000, విద్యార్థులకు రూ.45,000, పురుషులకు రూ.6,000 ఇస్తారని తెలిపాడు.తన మాటలను నమ్మించే ప్రయత్నంలో, గుండు చేయించుకున్నవారికి డబ్బులు ఇస్తున్నట్టు కనిపించే ఫొటోలను వాట్సాప్ ద్వారా పంపించాడు. వాటిని చూసి నమ్మిన రామాయి (58), చిత్ర (63), కావేరి (64) గుండు చేయించుకున్నారు.తర్వాత డబ్బుల కోసం అతడిని సంప్రదించగా ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో మోసపోయినట్టు గుర్తించారు. దీంతో రామాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తులో సతీశ్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సామాజిక మాధ్యమాల్లో మహిళలు గుండు చేయించుకున్న వీడియోలు చూసి, నిజ జీవితంలో కూడా అలాంటి ఘటన చూడాలనే ఉద్దేశంతో ఈ మోసానికి పాల్పడినట్టు అతడు పోలీసులకు చెప్పాడు.మహిళలపై హింస నిరోధక చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు, అతడిని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ప్రస్తుతం అతడు సేలం కేంద్ర కారాగారంలో ఉన్నాడు. -
1971 నాటి కేసు మళ్లీ తెరపైకి.. పోలీసుల వేట!
మార్కాపురం: 1971లో నమోదైన ఓ కేసుకు సంబంధించి 55 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని అరెస్టు చేసేందుకు మహారాష్ట్ర పోలీసులు మంగళవారం మార్కాపురం చేరుకోవడం ఆసక్తి రేకెత్తించింది. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా హద్గావ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 55 ఏళ్ల క్రితం నేరం చేసిన రామయ్య కుమారుడు నారాయణ మార్కాపురంలో ఉంటున్నాడన్న సమాచారంతో హెడ్‌కానిస్టేబుల్ యువరాజ్ కీర్తిపాల్ రాథోడ్ ఇక్కడికి వచ్చారు. స్థానిక పోలీసుల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడు నెల రోజుల్లోపు హద్గావ్లోని జేఎంఎఫ్‌సీ కోర్టు2 న్యాయమూర్తి ఎస్.ఎస్.లోహకరే జాదవ్ ఎదుట లొంగిపోవాలని జారీ చేసిన నోటీసులను ఆయన వెంట తీసుకొచ్చారు. కాగా, కేసు నమోదైన 1971 నాటికి మార్కాపురం కర్నూలు జిల్లాలో అంతర్భాగంగా ఉండటం గమనార్హం. నిందితుడి ఆచూకీ తెలిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. -
హైకోర్టులో CI నాగరాజు క్వాష్ పిటిషన్ నిజాలు వెలుగులోకి వస్తాయా..?
-
ఔటర్‌పై ఆగిఉన్న లారీని ఢీకొన్న స్విఫ్ట్
హైదరాబాద్: ఓఆర్ఆర్పై ఆగిఉన్న సిమెంట్ లారీని ఢీకొట్టడంతో స్విఫ్ట్ కారులోని యువకుడితో పాటు ఓ యువతి దుర్మరణం చెందిన ఘటన గచ్చిబౌలి పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ కె.సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి– భువనగిరి జిల్లా బొమ్మలరామారం మరియాల గ్రామానికి చెందిన కత్రావత్ సురేందర్ (19), ప్రణతి రెడ్డి (19) ఎల్బీనగర్ అనుష్కపూర్లోని ఓ కళాశాలలో ఇంజినీరింగ్ విద్యనభ్యసిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం సురేందర్ స్విఫ్ట్ కారు కొనుగోలు చేశాడు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం బొమ్మలరామారం నుంచి కారులో బయలుదేరాడు. మంగళవారం ఉదయం కళాశాల హాస్టల్ వద్ద స్నేహితురాలు ప్రణతి రెడ్డిని పికప్ చేసుకున్నాడు. సాయంత్రం 5.45 గంటల సమయంలో వట్టినాగులపల్లి నియోపొలిస్ సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డుపై ఆగి ఉన్న సిమెంట్ లారీని కారు అతివేగంతో ఢీకొంది. లారీలోకి కారు చొచ్చుకుపోయి ముందు భాగం నుజ్జునుజ్జయింది. సురేందర్, ప్రణతి అక్కడికక్కడే మృతి చెందారు. లారీలో ఇరుక్కు పోయిన కారును క్రేన్ సహాయంతో తీసి మృతదేహాలను వెలికి తీశారు. కాలకృత్యాలు తీర్చుకునేందుకు డ్రైవర్ నిర్లక్ష్యంగా రోడ్డుపై లారీ నిలిపాడని, ప్రమాదం జరగగానే పారిపోయాడని పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మహిళకు సీఐ లైంగిక వేధింపులు.. వీఆర్‌కు బదిలీ
జూబ్లీహిల్స్ సీఐ శ్రీనివాసులు రెడ్డిని హైదరాబాద్ సీపీ సజ్జనార్ వీఆర్‌కు బదిలీ చేశారు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళని లొంగదీసుకుని లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో చర్యలు తీసుకున్నారు. మహిళ వీడియోలు అడ్డం పెట్టుకొని డబ్బులు లాగినట్టు పోలీసులు గుర్తించారు.అంతేకాకుండా బాధిత మహిళతో కొద్ది రోజుల పాటు ఓకే ఇంట్లో కలిసున్నారని దర్యాప్తులో వెల్లడైంది. అదే క్రమంలో మహిళను వదిలించేందుకు సీఐ శ్రీనివాసులు రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో జూబ్లీహిల్స్ సీఐ శ్రీనివాసులు రెడ్డిని వీఆర్‌కు బదిలీ చేస్తూ సీపీ సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు. -
రాత్రంతా ప్రియురాలి మృతదేహంతోనే ప్రయాణం.. ఏకంగా 350 కి.మీ
ముంబై: ప్రియురాలికి మరొక వ్యక్తితో సన్నిహిత సంబంధం ఉందని అనుమానించి, ఆమెను గొంతు నులిమి చంపేశాడు 40 ఏళ్ల ఓ వ్యక్తి. అనంతరం ఆమె మృతదేహాన్ని కారులో పెట్టుకుని కొల్హాపూర్ నుంచి థానే వరకు 350 కిలోమీటర్లకు పైగా ప్రయాణించాడు.నిందితుడి పేరు ప్రకాశ్ ఆనంద పాటిల్ (40). ఇతడు మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా షిర్గావ్ గ్రామానికి చెందినవాడు. బాధితురాలు సురేఖ శివాజినే ఆరే (40). ఆమె అదే గ్రామానికి చెందిన వితంతువు. ఆమెతో పాటిల్ రిలేషన్షిప్లో ఉన్నాడు.పోలీసుల సమాచారం ప్రకారం.. సురేఖకు మరొక వ్యక్తితో సంబంధం ఉందని పాటిల్ అనుమానించాడు. ఆదివారం ఉదయం షిర్గావ్లోని తన వ్యవసాయ క్షేత్రంలో ఆమెను గొంతు నులిమి చంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. హత్య తర్వాత నిందితుడు మృతదేహాన్ని చుట్టి కారులో ఉంచి, నేరం జరిగిన ప్రాంతం నుంచి 350 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న థానే జిల్లా భివాండిలోని కసేలీ వైపు రాత్రంతా కారు నడిపాడు.సోమవారం ఉదయం భివాండిలో ఓ స్థానికుడు ఇచ్చిన సమాచారంతో పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. వాహనాన్ని గుర్తించి పాటిల్‌ను అదుపులోకి తీసుకుని, కారులో ఉన్న మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 103(1) కింద జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, తదుపరి దర్యాప్తు కోసం నేరం జరిగిన ప్రాంత పరిధిలోని పోలీస్ స్టేషన్‌కు కేసును బదిలీ చేశారు. థానే చేరుకున్న తర్వాత మృతదేహంతో నిందితుడు ఏం చేయాలనుకున్నాడో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. -
నాకు విలువలున్నాయి.. ఎక్కడికీ పారిపోలేదు: ఉదయ్‌కృష్ణారెడ్డి
సాక్షి, ప్రకాశం: హైదరాబాద్ పోలీస్ అకాడమీ ట్రైనీ ఐపీఎస్‌ల ఎపిసోడ్లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. పరారీలో ఉన్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ట్రైనీ ఐపీఎస్(సస్పెండెడ్) ఉదయ్‌కృష్ణారెడ్డి ఖండించారు. తనపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని పేర్కొన్న ఆయన.. తాను ఎక్కడికీ పారిపోలేదని స్పష్టం చేశారు. న్యాయవ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని తెలిపారు.‘‘మా నాన్నమ్మ ఆరోగ్యం బాగోలేకపోవడంతో స్వస్థలం ప్రకాశం జిల్లా ఊళ్లపాలెం వచ్చా. కేసు కోర్టు పరిధిలో ఉంది. అందువల్ల పూర్తి వివరాలు వెల్లడించలేను. త్వరలోనే నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటా’’ అని మంగళవారం ఉదయ్‌కృష్ణారెడ్డి ఓ మీడియా చానెల్‌తో మాట్లాడారు. నాకు విలువలున్నాయితాను పూర్తి గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తినని, విలువలకు కట్టుబడి జీవిస్తున్నానని ఉదయ్‌కృష్ణారెడ్డి తెలిపారు. పోలీస్, న్యాయ వ్యవస్థలపై తనకు నమ్మకం ఉందని, విచారణ అధికారులకు పూర్తిగా సహకరిస్తానని చెప్పారు.నోటీసులు అందలేదుపోలీసులు నోటీసులు ఇచ్చేందుకు హైదరాబాద్‌లోని తన రెండు చిరునామాలకు వెళ్లారన్న ప్రచారంపై కూడా ఆయన స్పందించారు. ఆ రెండు చిరునామాలు తాత్కాలికమైనవని, తన శాశ్వత చిరునామా అయిన ఊళ్లపాలెంకు ఎలాంటి నోటీసులు రాలేదని తెలిపారు. తాను స్వయంగా హైదరాబాద్‌కు వెళ్తున్నానని, ఎక్కడికీ పారిపోలేదని మరోసారి స్పష్టం చేశారు.తోటి ట్రైనీ ఐపీఎస్ ఫిర్యాదుట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డిపై తోటి ట్రైనీ ఐపీఎస్ అధికారి సంచలన ఆరోపణలతో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కేసు నమోదు అయ్యింది. ఆ వెంటనే దర్యాప్తు నేపథ్యంలో ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. అటుపై ఆరోపణలు తట్టుకోలేక ఉదయ్ ఆస్పత్రి పాలయ్యారు కూడా. అయితే ఈ ఆరోపణలపై ఉదయ్‌కృష్ణారెడ్డి తాజాగా వివరణ ఇచ్చారు.తనపై వచ్చిన ఆరోపణలపై చట్టపరమైన ప్రక్రియను గౌరవిస్తానని ఉదయ్‌కృష్ణారెడ్డి తెలిపారు. విచారణకు పూర్తిగా సహకరిస్తానని, చివరికి నిజాలు బయటకు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. -
Tejaswini Case: అర్థరాత్రి జరిగిన ఘటన.. అందరూ షాక్!
-
జంట హత్యల మిస్టరీ ఛేదించిన పోలీసులు.. టీడీపీ కార్యకర్తల పేర్లు బయటకు!
-
షేవింగ్ బ్లేడ్‌తో భర్తను చంపిన భార్య రేవతి..!
తిరుపతి: ప్రియుడు ప్రేరేపించడంతోనే భార్య తన భర్త గొంతు కోసినట్లు అంగీకరించిందని ఎస్ఐ హరిప్రసాద్ తెలిపారు. ఆయన సోమవారం స్థానిక పోలీసు స్టేషన్లో ముద్దాయిలను అరెస్టు చేసి, విలేకరులకు వివరాలు వెల్లడించారు. మండలంలోని నీర్పాకోటలోని పల్లం దళితవాడకు చెందిన భీమయ్య (42), రేవతి (29)కి 13 ఏళ్ల క్రితం వివాహమైంది. భార్య, ముగ్గురు పిల్లలున్నారు. భీమయ్య బెల్దూరి మేస్త్రీగా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే అతనికి మద్యం సేవించే అలవాటు ఉంది. భార్య రేవతి గతంలో శ్రీసిటీలోని అపాచీ కంపెనీలో పనిచేసేది. ఆ సమయంలో తొట్టంబేడు మండలం, పొయ్యి గ్రామానికి చెందిన నాగరాజుతో ఆమెకు పరిచయమై, వివాహేతర సంబంధానికి దారి తీసింది. అప్పటి నుంచి భీమయ్య భార్యపై అనుమానం పెంచుకుని కంపెనీకి వెళ్లకుండా పని మాని్పంచాడు. ఆరు నెలలుగా రేవతి ఇంటి వద్దనే ఉంటోంది. ఈ నెల 24వ తేదీ భీమయ్య మద్యం మత్తులో భార్యతో గొడవపడగా బంధువులు సర్దిచెప్పారు. ఆ సమయంలో ప్రియుడు నాగరాజుకు రేవతి ఫోన్ చేసి తన భర్తను చంపాలని నిర్ణయింది. అతని సలహా మేరకు రాత్రికి భీమయ్య గొంతు బ్లేడుతో కోసేయాలని రేవతిని ప్రేరేంపించాడు. భీమయ్య నిద్రపోతుండగా అర్ధరాత్రి రాత్రి 1.30 గంటల ప్రాంతంలో భార్య రేవతి షేవింగ్ బ్లేడ్‌తో భర్త భీమయ్య గొంతు కోసింది. ఆ తర్వాత బంధువులకు ఫోన్ చేసి ఎవరో తన భర్త గొంతు కోశారని నమ్మబలికింది. ఈ క్రమంలో పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టడంతో అసలు విషయం తేలింది. భర్తను తానే బ్లేడుతో కోశానని అంగీకరించింది. ప్రస్తుతం భీమయ్య రేణిగుంట సమీపంలోని ఓ ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. ఈ మేరకు 307 సేక్షన్ కింద రేవతి, ఆమె ప్రియుడు నాగరాజుపై కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపరచనున్నట్లు హరిప్రసాద్ తెలిపారు. -
నాటు తుపాకీతో యువకుడు హల్చల్!
హైదరాబాద్: సరూర్‌నగర్ పరిధి భగత్‌సింగ్‌నగర్ బస్తీలో కంట్రీమేడ్ తుపాకీతో హల్చల్ చేస్తున్న ఇమ్రాన్ అలియాస్ ఇబ్బు అనే పాతనేరస్తుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు మల్కాజిగిరి ఎస్ఓటీ, సరూర్‌నగర్ పోలీసులు దాడి చేయగా ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్న ఇమ్రాన్ వద్ద నాటు తుపాకీ, ఒక లైవ్ రౌండ్ లభించాయి.అదుపులోకి తీసుకుని విచారించగా.. ఇతడి స్వస్థలం వరంగల్ జిల్లా గీసుకొండ మండలం జంపాక గ్రామం అని తేలింది. నగరానికి వచ్చి చెడు అలవాట్లకు బానిసై నేరాల బాటపట్టాడని తెలిసింది. రాజేంద్రనగర్‌లోని ఓ స్క్రాప్ దుకాణంలో పని చేసిన సమయంలో బిహార్‌కు చెందిన షకీర్ వద్ద కంట్రీమేడ్ తుపాకి, ఒక లైవ్రౌండ్ రూ.40 వేలకు కొనుగోలు చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. ఇమ్రాన్‌పై ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లలో 17 కేసులు ఉన్నట్లు గుర్తించారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. -
చాక్లెట్ కొనిస్తానని చెప్పి నాలుగేళ్ల చిన్నారిని..
హైదారాబాద్, మల్కాజిగిరి: నాలుగేళ్ల బాలికకు చాక్లెట్ కొనిస్తానని తీసుకెళ్లిన ఓ వ్యక్తి లైంగికదాడికి పాల్పడ్డాడు. మల్కాజిగిరి ఇన్స్పెక్టర్ విజయ్‌కుమార్ తెలిపిన మేరకు.. మల్లికార్జునగర్‌కు చెందిన రవికుమార్(35) అదే ప్రాంతంలోని టెంట్‌హౌస్ దుకాణంలో పనిచేస్తున్నాడు. ఆదివారం టెంట్హస్ సమీపంలో అపార్ట్మెంట్ వద్ద ఆడుకుంటున్న బాలిక (4)కు చాక్లెట్ కొనిస్తానని చెప్పి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఏడ్చుకుంటూ వచ్చిన బాలికను తల్లి ఆరా తీయగా రవికుమార్ తీసుకెళ్లిన విషయం చెప్పింది. ఈ ఘటన పై సోమవారం తల్లి పోలీసులకు ఫిర్యాదుచేసింది. దీంతో నిందితున్ని అదుపులోకి తీసుకొని పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఏం జరిగిందో..? విషం తాగి దంపతుల బలవన్మరణం
విజయవాడ: చూడ ముచ్చటైన జంట.. అనురాగం.. ప్రేమ, ఆప్యాయతలతో సంతోషంగా సాగుతున్న సంసారం.. ఏడేళ్ల ఆ బంధానికి ఇద్దరు మగపిల్లల సంతానం.. అంతా బాగుందని అనుకున్న ఆ చిన్న కుటుంబంలో ఒక్కసారిగా పెను విషాదం చోటుచేసుకుంది. ఏం కష్టమొచ్చిందో.. ఏమో కానీ భార్యాభర్తలిద్దరూ విషం తాగి మృత్యువు ఒడికి చేరిపోయారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని అజిత్‌సింగ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని దేవీనగర్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన సోమవారం కలకలం సృష్టించింది. ఏం జరిగిందంటే.. దేవీనగర్ ప్రాంతానికి చెందిన తాడిశెట్టి బాజీ సైదులు(30), జలసూత్రం మానస(27)కు పెద్దల సమక్షంలో 2019లో వివాహమైంది. వీరికి సంజయ్(5), సంతోష్ (ఏడాదిన్నర) కుమారులు ఉన్నారు. సైదులు విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్లో అవుట్ సోర్సింగ్ విభాగంలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మానస ఇంటి వద్దే ఉంటూ టెట్ పరీక్షలకు సన్నద్ధమవుతోంది. ఆదివారం ఉదయం సైదులు తన పిల్లలిద్దరినీ ఇందిరా నాయక్‌నగర్‌లోని తన సోదరుడు నాగుల్‌మీరా వద్ద దింపి పనులకు వెళ్లగా మానస వారి ఇంటి సమీపంలోని చర్చికి ఉదయం పది గంటలకు వెళ్లి మధ్యాహ్నం రెండు గంటల తిరిగి ఇంటికి వచ్చింది. సాయంత్రం ఐదు గంటల సమయంలో సైదులు తన మావయ్య వీరభద్రరావుకు ఫోను చేసి దంపతులిద్దరం విషం తాగేశామని.. ఆస్పత్రికి తీసుకువెళ్లమని చెప్పాడు. దీంతో అతను తన వియ్యంకుడు ఏడుకొండలు, సైదులు సోదరుడు నాగుల్‌మీరాకు ఫోను చేసి హూటాహూటిన వారి ఇంటికి వెళ్లి తలుపులు పగలకొట్టి అపస్మారక స్థితిలో పడి ఉన్న భార్యాభర్తలిద్దరినీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న భార్యాభర్తలిద్దరూ పరిస్థితి విషమించి సోమవారం మృతిచెందారు. దీంతో వారి ఇళ్లల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆన్లైన్లో ఆర్డరు పెట్టుకొని.. సైదులు, మానస ఎంతో అన్యోన్యంగా ఉంటారని, వారికి ఆర్థిక సమస్యలు కూడా ఏమీ లేవని వారి కుటుంబ సభ్యులు, బంధువులు చెబుతున్నారు. భార్యాభర్తల మధ్య విభేదాలతో మాటామాటా పెరిగి క్షణికావేశంలో ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చని పోలీసులు, కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఆన్లైన్లో గడ్డిమందు, కూల్‌డ్రింక్‌ను ఆర్డర్ పెట్టుకొని డ్రింక్‌లో దానిని కలుపుకొని ఇద్దరూ తాగినట్లుగా తెలుస్తోంది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టామని త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తామని అజిత్‌సింగ్‌నగర్ సీఐ దాడి చంద్ర శేఖర్ తెలిపారు. -
హీటర్ ప్రాణం తీసింది..
హైదరాబాద్: మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ వాటర్ హీటర్ ఉపయోగిస్తుండగా షాక్‌కు గురై మృతి చెందింది. పోలీసులు తెలిపిన మేరకు.. భువనగిరికి చెందిన స్వాతి (40), భర్త శ్రీనివాస్, ముగ్గురు పిల్లలతో కలిసి మల్లికార్జున నగరంలో నివాసముంటోంది. శ్రీనివాస్ చర్లపల్లిలో ఓ ప్రింటింగ్ ప్రెస్‌లో పనిచేస్తున్నాడు.సోమవారం ఉదయం భర్త డ్యూటీకి, పిల్లలు స్కూల్‌కి వెళ్లిన తరువాత డోర్ వేసుకున్న స్వాతి వేడినీటి కోసం బకెట్లో ఎలక్ట్రిక్ వాటర్‌హీటర్ వేసిన సమయంలో ప్రమాదవశాత్తు చెయ్యి వాటర్‌హీటర్ ఉన్న నీటిని తాకింది. దీంతో తీవ్ర కరెంట్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. ఇంటి నుండి పొగలు వస్తుండడాన్ని గమనించిన పై పోర్షన్ వారు భర్తకు సమాచారం అందించడంతో అతను వచ్చి లోపలకు వెళ్లి చూడగా కాలిన గాయాలతో మృతి చెంది ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మేడిపల్లి పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. -
అమ్మా నాన్నలపై అలిగి.. పారిపోయిన ముగ్గురు బాలికలు
హైదరాబాద్: నిత్యం తల్లిదండ్రుల మధ్య గొడవలు జరుగుతున్నాయి.. వారి కూతుళ్లు విసిగి వేసారిపోయారు.. సొంతూరికి వెళ్లి ఏదైనా పని చేసుకుని బతుకుదామని భావించి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా రైలెక్కారు. పిల్లలు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు దోమలగూడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి కేసును ఛేదించారు. ఆదివారం గాందీనగర్ ఏసీపీ కార్యాలయంలో సికింద్రాబాద్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి, అడిషనల్ డీసీపీ నరసయ్య, ఏసీపీ యాదగిరి, దోమలగూడ సీఐ అంజద్ అలీతో కలిసి వివరాలు వెల్లడించారు.ఛత్తీస్‌గఢ్‌కు చెందిన తోటరాం, రాంధులారి దంపతులు 2 నెలల క్రితం నగరానికి వలస వచ్చి దోమలగూడ ఫరీద్ బస్తీలో నివసిస్తున్నారు. హిమాయత్‌నగర్‌లోని ఓ హోటల్లో పనిచేస్తున్నారు. ఆ దంపతుల మధ్య నిత్యం గొడవలు జరుగుతుండటంతో భరించలేక వారి కుమార్తెలు సహిత కుమారి(17), స్నేహ కుమారి(16)తోపాటు సమీప బంధువైన లత(15) గత ఆదివారం ఉదయం తెల్లవారు జామున ఇంట్లోంచి పారిపోయారు. పోలీసులు 5 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దాదాపు 262 సీసీ కెమెరాల ఫుటేజీని జల్లెడ పట్టారు.రైలెక్కి.. ఛత్తీస్‌గఢ్ చేరి..హిమాయత్‌నగర్ మెయిన్ రోడ్లో ఆటో ఎక్కిన బాలికలు కాచిగూడ రైల్వేస్టేషన్‌కు, అక్కడ నుంచి మరో ఆటోలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి ఘన్పూర్ ఎక్స్‌ప్రెస్‌లో నాగ్‌పూర్ చేరుకోగా ఓ వ్యక్తి చేరదీసి ఫాంహౌస్‌లో పనులు చేసేందుకు గడ్చిరోలి మీదుగా ఛత్తీస్‌గఢ్‌లోని పతంజూరుకు చెందిన బిశ్వజిత్ అనే వ్యక్తి దగ్గరికి తీసుకెళ్లాడు. ఇంట్లో నుంచి పారిపోయి వచ్చినట్లు గుర్తించిన బిశ్వజిత్ దోమలగూడ పోలీసులకు సమాచారమిచ్చారు. ఛత్తీస్‌గఢ్‌లోని కాంకర్ పోలీసుల సహకారంతో బాలికలను తీసుకొచ్చి సఖీ సెంటర్‌కు అప్పగించారు. తల్లిదండ్రులు స్నేహపూర్వక వాతావరణంలో పిల్లల్ని పెంచాలని డీసీపీ సూచించారు. -
ఏడు నెలల పసిపాపతో ప్రియుడి ఇంటి ముందు ధర్నా..
దేవరపల్లి: న్యాయం కోసం ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నాకు దిగిన సంఘటన నల్లజర్ల మండలం దూబచర్లలో ఆదివారం జరిగింది. తన ఏడు నెలల పసిపాపతో ప్రియుడి ఇంటి ముందు కుటుంబ సభ్యులతో ఆమె బైఠాయించి పోరాటం చేస్తుంది. పెళ్లి చేసుకుంటానని తనను శారీరకంగా వాడుకుని, ముఖం చాటేస్తున్న అనిల్ కుమార్‌కు డీఎన్ఏ పరిక్ష చేసి తనకు, తన బిడ్డకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేసింది.సంఘటనకు సంబంధించి బాధితురాలి కథనం ప్రకారం ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం గొల్లగూడేనికి చెందిన అడబాల హేమలత నల్లజర్ల మండలం దూబచర్లలో ఓ జీడిగింజల ఫ్యాక్టరీలో పనిచేసే సమయంలో ఫ్యాక్టరీ యజమాని కుమారుడు అనిల్‌కుమార్ తనకు మాయమాటలు చెప్పి ప్రేమిస్తున్నానని లొంగదీసుకున్నట్టు ఆమె తెలిపారు. తనను పెళ్లి చేసుకోవాలని అడగ్గా అలాగేనని నమ్మించి ముఖం చాటుశాడని ఆమె తెలిపారు. దీనిపై ఏడాది క్రితం నల్లజర్ల పోలీసులను ఆశ్రయించి జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేసింది.అయినప్పటికి తనకు ఇప్పటి వరకు న్యాయం జరగలేదని ఆమె వాపోయారు. తనను మోసం చేసిన వ్యక్తికి ఇంతవరకు డీఎన్ఏ పరీక్ష చేయించలేదని ఆమె తెలిపారు. ఆమె తల్లి అడబాల లక్ష్మి కుమార్తెకు అండగా ఉన్నారు. దీనిపై నల్లజర్ల సీఐ రవికుమార్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా ఈ సంఘటన 2025లో జరిగిందన్నారు. బాధితురాలు హేమలత ఇచ్చిన ఫిర్యాదుపై కేసు దర్యాప్తు పూర్తయిందని ఆయన తెలిపారు. అయితే అనిల్‌కుమార్‌కు డీఎన్ఏ పరీక్ష చేయించాలని హేమలత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం వల్ల కోర్టు ఉత్తర్వుల కోసం ఎదురు చూస్తున్నట్టు ఆయన తెలిపారు. -
అబిడ్స్‌లో యువకుడి వీరంగం! కారుతో నేరుగా పోలీసుల పైకే..
హైదరాబాద్: గత కొన్నిరోజులనుంచి డ్రగ్స్ డీల్ సమాచారంతో అబిడ్స్‌లో పోలీసులు నిఘా పెడ్తున్నారు. అయితే, ఈరోజు సోమవారం ఉదయం తెల్లవారుజామున, ఓ యువకుడు బలెనో కార్లో డ్రగ్స్ తీసుకుంటుండగా పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆ యువకుడు కారుతో నేరుగా పోలీసులపైకి దూసుకెళ్లాడు. ప్రమాదంనుంచి తప్పుకునేలోపు నిందితుడు కారును రివర్స్‌లో తీసి పోలీసులపైకి ఎక్కించాడు. ఈ ప్రమాదంలో ఇన్స్పెక్టర్ శ్రీకాంత్, కానిస్టేబుల్ వంశీధర్‌కు గాయాలు కాగా, హెచ్-న్యూ కానిస్టేబుల్ మహేందర్ యాదవ్‌కు కాలు ఫ్రాక్చర్ అయ్యింది. అయినాసరే వారి గాయాలను లెక్కచేయకుండా పారిపోతున్న నిందితుడు సైఫ్‌ను పోలీసులు ఛేజ్‌చేసి పట్టుకుని అరెస్ట్ చేశారు. అనంతరం దగ్గరలో ఉన్నటువంటి యశోధ ఆస్పత్రిలో పోలీసులు చికిత్స పొందుతున్నారు. అయితే, హెచ్-న్యూ కానిస్టేబుల్ మహేందర్ ఫిర్యాదుతో నిందితుడిపై అటెంప్ట్ మర్డర్ కేసు నమోదైంది. హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ విభాగం నిందితుడిని విచారిస్తున్నట్లుగా తెలిసింది. -
మరిది వేసిన మాస్టర్‌ప్లాన్! కథ అడ్డం తిరిగింది..
కరీంనగర్, జగిత్యాల: వదినను చంపి ఆస్తి దక్కించుకోవాలన్న పథకాన్ని పోలీసులు ఛేదించారు. హత్యకు ప్రణాళిక రచించిన మరిది, అతని భార్య, సమీప బంధువులను ఇప్పటికే రిమాండ్‌కు తరలించగా.. తాజాగా మరో నిందితుడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన సచిన్‌వర్మను అరెస్ట్ చేశారు. మెట్పల్లి సర్కిల్ ఆఫీస్‌లో డీఎస్పీ రాములు శుక్రవారం వివరాలు వెల్లడించారు.జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని పోచమ్మవాడకు చెందిన గోనెల శంకర్, రాజం అన్నదమ్ములు. పొత్తుల ఉన్న 58 గుంటల భూమిని శంకర్ తన అన్నకు తెలియకుండా విక్రయించడమే కాకుండా పొత్తులో ఉన్న ఇంటిని సైతం తన పేరిట రిజి స్ట్రేషన్ చేయించుకోవడం ఇరు కుటుంబాల మధ్య గొడవలకు దారితీసింది. ఈక్రమంలోనే రెండు సార్లు శంకర్ తన అన్నవదినలు రాజం, లక్ష్మిలపై దాడి చేయగా కేసులు నమోదయ్యాయి. ఆస్తిని దక్కించుకునేందుకు తన వదిన గోనెల లక్ష్మిని హత్య చేయాలని భార్య అనూష, బంధువు ముత్తన్నలతో కలిసి పథకం రచించాడు.తన వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన సచిన్‌వర్మను సంప్రదించి డబ్బు ఆశ చూపాడు. దీనికి ఒప్పుకున్న సచిన్ గత మార్చిలో ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లి అపరిచిత సాధువు వద్ద నాటు పిస్టల్, మూడు బుల్లెట్లు కొనుగోలు చేశాడు. దీని కోసం శంకర్ రూ.35వేలు ఫోన్‌పే ద్వారా సచిన్‌కు పంపించాడు. సచిన్‌వర్మ మెట్‌పల్లికి తిరిగి వచ్చిన తర్వాత గత నెల 13న లక్ష్మిని చంపడానికి వారి ఇంటికి వెళ్లిన సచిన్ భయాందోళనకు గురై కాల్పులు జరపకుండా వెళ్లిపోయాడు.తిరిగి 15న అర్ధరాత్రి దాటిన తర్వాత ముగ్గురి ప్రోద్బలంతో సచిన్ బైక్‌పై వెళ్లి ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న లక్ష్మిపై కాల్పులు జరిపాడు. అయితే గురితప్పడంతో బుల్లెట్ ఎడమ చెంప భాగంలో తగిలింది. కాల్పులతో భారీ శబ్దం రావడం, లక్ష్మి కేకలు వేయడంతో సచిన్ పరారయ్యాడు. ఆ తర్వాత నిందితులు ఈ ఘటనను గుర్తుతెలియని వ్యక్తులు కర్రలు, రాళ్లతో దాడి చేసినట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.సచిన్‌ను ఉత్తరప్రదేశ్‌కు పంపించి కేసులో ఆధారాలు లభించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టి మరుసటి రోజు శంకర్, ముత్తన్న.. 28న అనూషలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బాధితురాలికి శస్త్ర చికిత్స చేసిన తర్వాత బుల్లెట్ బయటకు రావడంతో కేసు దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. పలు కోణాల్లో విచారించిన పోలీసులు ఈనెల 20న ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లి సచిన్‌ను అదుపులోకి తీసుకొని.. పిస్టల్, రెండు బుల్లెట్స్, బైక్, ఐఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన సీఐ సురేశ్‌బాబు, ఎస్సై కిరణ్‌కుమార్, సిబ్బందిని అభినందించారు. -
గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ అధికారుల దాడులు
ఆదిలాబాద్, మంచిర్యాల: జిల్లాలోని కోటపల్లి మండలం ఎసన్వాయి గ్రామంలో గుడుంబా తయారీ, విక్రయాలపై పోలీస్, ఎక్సైజ్ శాఖ సంయుక్త దాడులు జరిపారు. ఈ దాడుల్లో సరైన ధృవపత్రాలు లేని 35 వాహనాలను సీజ్ చేశారు. అయితే, గ్రామంలోని ప్రతి ఇంటిని తనిఖీ చేసిన ఎక్సైజ్ పోలీసులు.. నిలువ ఉంచబడిన సుమారు 1,000 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసి, 30 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం 9 మందిపై కేసులు నమోదు చేశారు. గుడుంబా నిర్మూలనపై.. ఏసీపీ వెంకటేశ్వర్లు గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అలాగే, ఇలాంటి కార్యకాలపాలు చట్ట విరుద్ధమని, ఇందులో పాల్గొన్నవద్దని వారికి చెప్పడంతోపాటు, గుడుంబా తయారీలో పాల్లొన్నవారిపై చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని గ్రామస్తులను ఏసీబీ హెచ్చరించారు. -
5వ అంతస్తు నుంచి దూకి వైద్య విద్యార్థిని ఆత్మహత్య
హైదరాబాద్: ఓ వైద్య విద్యార్థిని 5వ అంతస్తు నుంచి దూకి మృతిచెందిన సంఘటన కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం మైలారం గ్రామానికి చెందిన వడ్లకొండ ఆనందచారి, తన భార్య అరుణ, పిల్లలతో కలిసి నాగారం వెస్ట్ గాం«దీనగర్ భవానీ ప్యారడైజ్ అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. వారి కుమార్తె దీక్షిత (28) ఎంబీబీఎస్ పూర్తి చేసుకొని పైచదువుల నిమిత్తం ఆరు నెలల కిందట కర్ణాటకలోని సిద్ధార్థ వైద్య కళాశాలలో చేరి పీజీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈనెల 17న నాగారంలోని ఇంటికి వచి్చంది. శుక్రవారం మధ్యాహ్నం అపార్ట్మెంట్ 5వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. వెంటనే కుటుంబసభ్యులు ఆమెను స్థానికంగా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఇంట్లో ఎలాంటి గొడవలు లేవని, ఎలాంటి అనుమానాలు లేవని తల్లిదండ్రులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
'చదవడం' నావల్ల కాదన్నా వినిపించుకోరేం?
ఉరుకులపరుగుల జీవితంలో అన్నింటా పోటీనే.. అన్నింటికీ మార్కులే కొలమానం. ర్యాంకులే రాజ్యమేలుతున్న తరుణంలో అర మార్కు తక్కువైనా... పరువు సమస్య. అందుకే విద్యార్థులపై మోయలేని భారం. నావల్ల కాదన్నా.. వినిపించుకోని కుటుంబం. భరించగలిగినోళ్లు బతికిపోతుండగా.. చేతగాని వారంతా చావును వెతుక్కుంటున్నారు. తాజాగా మార్కుల ఒత్తిడి తట్టుకోలేక.. హాస్టల్లో ఉండలేక మడకశిరలో ఓ విద్యార్థి ఉరివేసుకున్నాడు. హాస్టల్లో చేరిన గంటల వ్యవధిలోనే బలవన్మరణం చెందాడు. హాస్టల్లో ఉండి చదవడం ఇష్టంలేని ఓ విద్యార్థి ఉరివేసుకుని బలవన్మరణం చెందాడు. మృతుని కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు...రొళ్ల మండలం చిగమతిగట్ట గ్రామానికి చెందిన హనుమంతరాయప్ప, నళినమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కూతురు సంతానం. అందరిలో చిన్నవాడైన చంద్రేగౌడ్(18) అగళి మండలం ఇనగలూరు జెడ్పీ హైస్కూల్లో 385 మార్కులతో పదో తరగతి పూర్తి చేశాడు. ఆ తర్వాత హిందూపురంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్లో (ఎంపీసీ) చేరినా అక్కడ ఉండటం ఇష్టంలేక మధ్యలోనే ఇంటికి వచ్చాడు. దీంతో తల్లిదండ్రులు చంద్రేగౌడ్ను మడకశిరలోని వెంకటేశ్వర కళాశాలలో చేర్పించారు.రోజూ ఇంటివద్దనుంచే కళాశాలకు వచ్చి వెళ్లేవాడు. మొదటి సంవత్సరంలో 470 మార్కులకుగాను 399 మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. అయితే కళాశాలలోని హాస్టల్లోనే ఉంచితే చదువుకునేందుకు సమయం ఉంటుందని, మార్కులు కూడా పెరుగుతాయని భావించిన కుటుంబీకులు ద్వితీయ సంవత్సరం హాస్టల్లో ఉండి చదువుకోవాలని చెప్పారు. దీంతో ఇష్టంలేకపోయినా చంద్రేగౌడ్ ఒప్పుకున్నాడు. ఈక్రమంలోనే బుధవారం సాయంత్రం లగేజీతో హాస్టల్‌కు వచ్చిన చంద్రేగౌడ్.. రాత్రి వేళ హాస్టల్లోని వాష్‌రూంకు వెళ్లి అక్కడే ఉరివేసుకున్నాడు.గురువారం ఉదయం గమనించిన హాస్టల్ సిబ్బంది పోలీసులకు, కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. ఇంటికి దూరంగా ఉంటూ ఒత్తిడితో కూడిన చదువులు తనకు ఇష్టంలేదని చంద్రేగౌడ్ తరచూ చెప్పేవాడని, ఈక్రమంలోనే చదవలేక తీవ్ర మానసిక ఒత్తిడికి గురై బలవన్మరణం చెందాడని స్నేహితులు, బంధువులు చెబుతున్నారు. చంద్రేగౌడ్ మృతితో స్వగ్రామం చిగమతిగట్టలో విషాద ఛాయలు అలముకున్నాయి. విషయం తెలుసుకున్న మడకశిర ఎస్ఐ కృష్ణారెడ్డి కళాశాల హాస్టల్‌కు వెళ్లి వివరాలు సేకరించారు. కళాశాల యాజమాన్యం, కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
దొరికినంత దోచుకో.. తోటి పోలీసుల సొమ్ముతో కారు, బంగ్లా..!
దొరికినంత దోచుకో.. దోచుకుంది దాచుకో..కారు, బంగ్లా తీసుకో.. లైఫు నీదే కుమ్ముకో.. ఓ సినిమా పాటలోని అర్థాన్ని కానిస్టేబుల్ రవి తన జీవితాన్ని అన్వయించుకున్నాడు. ఎంచక్కా తోటి సిబ్బంది సొసైటీ ఖాతాల్లోని డబ్బులతో జల్సా చేస్తున్నాడు. కడప అర్బన్: శాంతిభద్రతలను కాపాడుతూ, సమాజంలో నేరాలను అరికట్టాల్సిన పోలీస్ శాఖలోనే ఒక పెద్ద అవినీతి తిమింగలం తిష్టవేసింది. తోటి సిబ్బంది దాచుకున్న రక్తాన్ని, కష్టార్జితాన్ని నమిలి మింగేసింది. జిల్లా పోలీస్ కో–ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలో ఏకంగా రూ.1,07,00,000 (కోటి ఏడు లక్షలు) నిధులు నిలువునా స్వాహా అయిన వైనం జిల్లావ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ భారీ దందా బయటపడి రోజులు గడుస్తున్నా.. ఉన్నతాధికారులు విచారణ పేరిట కాలయాపన చేయడం, బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక పెద్ద తలకాయల హస్తం ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. పిల్లల చదువుల కోసం పెడితే.. బినామీ ఆస్తులకు వాడుకున్నారు! గతంలో కడప ఎస్పీగా పనిచేసిన మనీష్ కుమార్ సిన్హా హయాంలో పోలీసులు తమ అత్యవసర అవసరాల కోసం ఈ కో–ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీని ఏర్పాటు చేసుకుని సభ్యత్వం తీసుకున్నారు. పిల్లల చదువులు, పెళ్లిళ్లు, అనారోగ్యం వంటి అత్యవసర సమయాలలో ఈ సొసైటీ నుంచి లోన్లు తీసుకుని, మరలా వాయిదాల పద్ధతిలో కట్టుకునేలా నిబంధనలు పెట్టుకున్నారు. ఈ వ్యవహారం పద్ధతి ప్రకారం జరిగి ఉంటే ఎవరికీ నష్టం కలిగేది కాదు. కానీ, ఈ సొసైటీ వ్యవహారాలను పర్యవేక్షించాల్సిన బాధ్యత కలిగిన వి.రవి (పీసీ 3275) ఈ భారీ నిధులను స్వాహా చేసినట్లు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇతనికి కొంతమంది ఉన్నతాధికారులు, సిబ్బంది తమ వంతు సహకారాన్ని అందించినట్లు తెలుస్తోంది. కానిస్టేబుల్ రవి 2020 సంవత్సరానికి ముందు సాధారణ జీవితాన్ని గడిపేవాడని, సొసైటీ ఏర్పాటైన తర్వాత వచ్చిన డబ్బుతో ప్రస్తుతం కడప నగరంలో ఒక భారీ భవనాన్ని నిర్మించుకున్నాడని, ఒకే ఫ్యాన్సీ నంబర్ కలిగిన ద్విచక్ర వాహనం, లగ్జరీ కారు కొనుగోలు చేయడం ఆ కానిస్టేబుల్ అవినీతి పలుకుబడికి పరాకాష్టగా మారిందని తోటి సిబ్బంది మండిపడుతున్నారు. ఆర్టీఐ కానిస్టేబుల్‌పై ఎస్పీ సీరియస్? సొసైటీలో కొన్నేళ్లుగా జరుగుతున్న అక్రమాలపై అనుమానం వచ్చిన ఒక బాధిత కానిస్టేబుల్.. ధైర్యంగా ముందుకొచ్చి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేయడంతో ఈ గోల్మాల్ బాగోతం వెలుగులోకి వచ్చింది. అయితే, ఆర్టీఐ ప్రకారం తనకు వివరాలు తెలియజేయాలని దరఖాస్తు చేసుకున్న సదరు కానిస్టేబుల్ పై ప్రస్తుత జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ సీరియస్ అయినట్లు సమాచారం. దాదాపు రెండు నెలల క్రితం బాధితుడైన ఆ కానిస్టేబుల్ నేరుగా ఎస్పీని కలిసి తనకు పూర్తి వివరాలు కావాలని, తమ సొమ్ము తమకు ఇప్పించాలని కోరారు. సదరు కానిస్టేబుల్ విజ్ఞప్తిని స్వీకరించి, విచారిస్తామని చెప్పి రెండు నెలల పైగా గడుస్తున్నా.. ఇప్పటివరకు ఏమాత్రం విచారణ చేయకపోవడం గమనార్హం. మా డబ్బు మాకు వచ్చేదెప్పుడు? ఆధారాలతో సహా ఎస్పీ గారికి ఫిర్యాదు చేసినా విచారణ ఎందుకు నత్తనడకన సాగుతోంది? మాకు ఎప్పుడు న్యాయం జరుగుతుంది? అని బాధిత కానిస్టేబుళ్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తోటి సిబ్బంది కష్టార్జితాన్ని కాజేసిన పీసీ రవి, అతనికి సహకరించిన వారిపై ఎస్పీ ఆధ్వర్యంలో సమగ్రంగా ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని, అతను స్వాహా చేసిన డబ్బును వెనక్కి ఇప్పించేలా కృషి చేయాలని పోలీసు సిబ్బంది విజ్ఞప్తి చేస్తున్నారు. భవిష్యత్తులో డిపార్ట్మెంట్లో ఇలాంటి అవినీతి అక్రమాలకు తావులేకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, సామాజిక కార్యకర్తలు కోరుకుంటున్నారు. -
6 మందిని లేపేసింది.. కానీ ఉరిశిక్ష తప్పించుకుంది..
-
10వ అంతస్తునుంచి దూకిన సాఫ్ట్వేర్ ఇంజనీర్..
హైదరాబాద్, మణికొండ: అపార్ట్మెంట్ 10వ అంతస్తునుంచి దూకి ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఫైనాన్షియల్ జిల్లా పుప్పాలగూడలో జరిగింది. నార్సింగి పోలీసులు, స్థానికులు తెలిపిన మేరకు.. జేపీ మోర్గాన్ చేజ్ అనే ఐటీ సంస్థలో మబ్బు విష్ణువర్దన్‌రెడ్డి(27) సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. బుధవారం రాత్రి విధులు ముగించుకుని ఏఎస్బీఎల్ స్పెక్ట్రా అపార్ట్మెంట్ 10వ అంతస్తులోని తన ఫ్లాట్‌కు వచ్చి పడుకున్నాడు. అయితే గురువారం తెల్లవారు జామున గ్రౌండ్ ఫ్లోర్లో అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. పోలీసులు వెళ్లి చూడగా అప్పటికే మరణించినట్టు నిర్ధారించారు. పోస్టుమార్టం, దర్యాప్తు అనంతరం వివరాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు తెలిపారు. -
కలకలం రేపిన సగం కాలిన మృతదేహం..
విశాఖపట్నం: గోపాలపట్నం, కొత్తపాలెంలోని పులగానిపాలెం పాత ఊరు సమీపంలో రైల్వే ట్రాక్ దాటాక నిర్మానుష్య ప్రాంతంలో సగం కాలిన మృతదేహం ఘటన బుధవారం కలకలం రేపింది. గుర్తుతెలియని, సుమారు 35–40 ఏళ్ల వయస్సున్న వ్యక్తి మృతదేహం సగం కాలి, చెట్టు కింద పడి ఉండడాన్ని స్థానికులు గుర్తించి వీఆర్వో సుబ్బారావుకు సమాచారం ఇవ్వగా, ఆయన పోలీసులకు తెలిపారు. సమాచారం అందుకున్న గోపాలపట్నం సీఐ సన్యాసినాయుడు, ఎస్ఐలు మారయ్య, రామారావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సాయంతో ఆధారాలు సేకరించారు. మృతదేహం వద్ద కాలిపోయిన మొబైల్, కళ్లజోడు తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మృతుడి వేలిముద్రలను కూడా సేకరించారు. అనంతరం సీఐ సన్యాసినాయుడు మాట్లాడుతూ మృతుడు ట్రాక్ ప్యాంటు, రౌండ్ నెక్ టీషర్టు ధరించి ఉన్నాడని తెలిపారు. మృతదేహం పరిస్థితిని బట్టి ఘటన మంగళవారం రాత్రి జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నామన్నారు.మృతదేహంపై ఎలాంటి గాయాలు కనిపించలేదని, వేరే చోట హత్య చేసి, ఆధారాలు చెరిపివేసేందుకు ఇక్కడ కాల్చి ఉండొచ్చన్న అనుమానంతో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. మృతుడి గుర్తింపుతో పాటు ఘటనపై వివరాలు తెలుసుకునేందుకు మొబైల్ ఫోన్ ఆధారాలు, పరిసర ప్రాంతాల సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామన్నారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీఆర్వో సుబ్బారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.మద్యం, గంజాయి కార్యకలాపాలకు అడ్డాఘటన జరిగిన పులగానిపాలెం పాత ఊరు–రైల్వే కల్వర్టు పరిసర ప్రాంతం నిర్మానుష్యంగా ఉండటంతో అక్కడ తరచూ మద్యం సేవించడం, గంజాయి వినియోగం, పేకాట వంటి కార్యకలాపాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. సాయంత్రం వేళల్లో ఈ ప్రాంతానికి రావాలంటే స్థానికులు కూడా భయపడే పరిస్థితి ఉందన్నారు. పోలీసుల నిఘాను మరింత పెంచాలని కోరుతున్నారు. -
గర్భిణి అని కూడా చూడకుండా..
ఆంధ్రప్రదేశ్, అన్నమయ్య: పైళ్లెన పది నెలలకే అత్తింటి వేధింపులు భరించలేక నాలుగు నెలల గర్భిణి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన తంబళ్లపల్లె మండలంలో చోటు చేసుకుంది. మృతురాలి తల్లి దండ్రులు తంబళ్లపల్లె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు... కోటకొండ పంచాయతీ, బీఎస్ఆర్ వడ్డిపల్లికి చెందిన మహేష్, రవళి (18)ని 10 నెలల క్రితం వివాహం చేసుకున్నాడు. పైళ్లెన మూడు నెలల నుంచే అత్త అరుణ వేధింపులు ప్రారంభించింది. దీంతో రవళి తీవ్ర మనోవేదనకు గురైంది.గర్భిణి అని కూడా చూడకుండా..రవళి ప్రస్తుతం నాలుగు నెలల గర్భవతి. అయినప్పటికీ అత్త అరుణ వేధింపులకు గురిచేసేది. వేధింపులు భరించలేక రవళి ఈనెల 15 ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నంకు పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించగా, డాక్టర్లు చికిత్సలు అందించి పరిస్థితి విషమించడంతో రుయాకు రెఫర్ చేశారు. అక్కడి నుంచి బెంగళూరుకు తరలించారు. అక్కడ ఆమె పరిస్థితి మరింత విషమించడంతో మంగళవారం రాత్రి స్వగ్రామానికి తీసుకు వచ్చారు. బుధవారం ఉదయం నాలుగు నెలల గర్భిణి రవళి మృతి చెందింది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు తంబళ్లపల్లె ఎస్ఐ అనీల్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్లాన్-ఏకి భయపడి.. ప్లాన్-బీతో ఘాతుకం!
యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన పుణె లోహగఢ్ కోట హత్య కేసు దర్యాప్తులో మరిన్ని సంచలనాలు బయటకు వస్తున్నాయి. యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్‌తో వివాహం ఇష్టం లేకనే సియా గోయల్, చేతన్ చౌదరి కలిసి హత్య చేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో ఇప్పుడో షాకింగ్ విషయం బయటపడింది. ప్లాన్ ఏకు భయపడి.. ప్లాన్ బీను అమలు చేసి సియా ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. కేతన్, సియాలకు ఈ ఏడాది ఫిబ్రవరిలో నిశ్చితార్థం జరిగింది. నవంబర్‌లో రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఘనంగా వివాహం జరిపేందుకు ఇరు కుటుంబాలు ఏర్పాట్లలో తలమునకలై ఉన్నాయి. అయితే చేతన్‌తో ప్రేమలో ఉన్న సియా మాత్రం ఈ పెళ్లి ఎలాగైనా ఆపాలని తీవ్ర ప్రయత్నాలు చేసింది. ఓవైపు కేతన్‌తో సన్నిహితంగా ఉంటూనే.. మరోవైపు ప్రియుడితో దారుణమైన స్కెచ్‌లు గీసింది. ఇందుకోసం వెబ్ సిరీస్‌లు, క్రైమ్ సినిమాలు చూస్తూ గంటల తరబడి గడిపింది. చివరకు.. చేతన్‌తో కలిసి ఈ పెళ్లి ఆపడానికి రెండు ప్లాన్లు గీసింది. అందులో.. మొదటిది కేతన్కు యాక్సిడెంట్ చేయడం!. అతడిని గాయపరిచి పెళ్లిని వాయిదా వేయాలని.. ఆ తర్వాత కలిసి పారిపోవడమో లేదంటే ఈ గ్యాప్‌లో మరేదైనా ప్లాన్ అమలు చేయాలని భావించింది. అయితే ఆ ప్లాన్‌లో రిస్క్ ఎక్కువగా ఉందని భావించి డ్రాప్ అయ్యారు. కేతన్‌ను ఈ విషయం తెలిసిపోతే తమ పని అయిపోయినట్లేనని భయపడ్డారు. ఒకవేళ ప్లాన్ బెడిసి కొట్టి బలవంతంగా పెళ్లి జరిగితే ఆ తర్వాత తమ బంధం కొనసాగదని భావించారు. అందుకే ప్లాన్ బీ అమలు చేయాలని ఫిక్స్ అయ్యారు. పక్కా ప్లాన్ గీసి కేతన్‌ను అంతమొందించారు. సస్పెన్స్ సినిమాలు.. ఆన్లైన్ సెర్చ్లుహత్యను ప్రమాదంగా చిత్రీకరించేందుకు నిందితులు పక్కా ప్రణాళిక వేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇందుకోసం సస్పెన్స్ సినిమాలు చూసారని, హత్య తర్వాత ఆధారాలు దొరకకుండా ఉండేందుకు ఇంటర్నెట్లో సమాచారం వెతికారని తెలిపారు. సియా ఫోన్ హిస్టరీలో ఈ విషయం బయటపడిందని తెలిపారు. అంతేకాదు.. కేతన్‌ను ఎక్కడ హత్య చేస్తే అది ప్రమాదంలా కనిపిస్తుందో తెలుసుకునేందుకు పలు ప్రాంతాలను పరిశీలించినట్లు వెల్లడించారు. లోనావాలాలోని టైగర్ పాయింట్, విశాపూర్ కోట తదితర ప్రాంతాలను పరిశీలించిన తర్వాత లోహగఢ్ కోటను ఎంచుకున్నారని చెప్పారు.ముందుగానే రెక్కీ చేసిన సియా?దర్యాప్తులో భాగంగా సియా మే 31న కేతన్‌తో కలిసి లోహగఢ్ కోటకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఆ పర్యటన హత్యకు ముందు చేసిన రెక్కీ అయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అక్కడ ఎక్కడ నుంచి తోసేస్తే కేతన్ మృతి చెందుతాడు.. ఆధారాలు దొరకకుండా ఎలా చేయాలనే విషయాలను పరిశీలించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఆ తర్వాత జూన్ 3న మరోసారి అక్కడికి వెళ్లేందుకు కేతన్‌ను ఒప్పించే ప్రయత్నం చేసినట్లు తెలిపారు.బాలి ట్రిప్ కూడా కుట్రలో భాగమేనా?సియా, కేతన్‌లు జూన్ 6న ఇండోనేషియాలోని బాలి పర్యటనకు వెళ్లాల్సి ఉంది. ఎనిమిది రోజుల పాటు అక్కడ గడపాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే ఆ ప్రయాణం తమ కుట్రకు అడ్డుగా మారుతుందని భావించిన నిందితులు.. ఎలాగైనా ఆ పర్యటనను ఆపాలని ప్రయత్నించారు. ముంబై పర్యటన సమయంలో సియా కేతన్ పాస్‌పోర్ట్‌ను దొంగిలించిందని.. దీంతో బాలి ప్రయాణం రద్దయిందని పోలీసులు తెలిపారు.ముందే ఒకసారి హత్యాయత్నం?లోహగఢ్ కోట వద్ద జూన్ 14న సియా కేతన్‌ను తోసేసేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే కేతన్ ఓ పొదను పట్టుకుని ప్రాణాలతో బయటపడ్డాడని తెలిపారు. ఆ సమయంలో అనుమానం రాకుండా.. పాము నుంచి కాపాడేందుకు తానే తోశానని సియా చెప్పినట్లు పోలీసులు పేర్కొన్నారు. తర్వాత జూన్ 18న మరోసారి లోహగఢ్ కోటకు తీసుకెళ్లి.. చేతన్‌తో కలిసి కేతన్‌ను లోయలోకి తోసి చంపినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. ఈ కేసులో దర్యాప్తు ముందుకు సాగే కొద్దీ మరిన్ని కొత్త విషయాలు బయటపడే అవకాశం కనిపిస్తోంది. -
నెలక్రితం ఆమె తలలో దిగింది బుల్లెట్టే..!
కరీంనగర్: మెట్పల్లి పట్టణానికి చెందిన గోనెల లక్ష్మీపై నెల క్రితం జరిగిన దాడి సంఘటనకు సంబంధించి ఆమె తలలో నుంచి బయటపడింది బుల్లెట్టేనని ఫోరెన్సిక్ విభాగం పరిశీలనలో తేలినట్లు తెలిసింది. ఆ రోజు సదరు మహిళను ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువకుడు కాల్చినట్లు గుర్తించిన పోలీసులు.. అప్పటి నుంచి పరారీలో ఉన్న నిందితుడిని మూడురోజుల క్రితం అక్కడకు వెళ్లి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. జిల్లావ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో ఇప్పటికే పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కీలక నిందితుడైన యూపీ యువకుడు పట్టుబడడంతో కేసుపై ఉన్న అనుమానాలు తొలగిపోనున్నాయి.ఉపాధి కోసం వచ్చి..వెంట రివాల్వర్ తెచ్చుకుని..పట్టణంలోని మఠంవాడకు చెందిన గోనెల శంకర్‌కు జేసీబీ ఉంది. దానికి డ్రైవర్‌గా కొంతకాలం నుంచి ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువకుడు పనిచేస్తున్నాడు. అతడు ఇక్కడకు వచ్చేటప్పుడే తన వెంట రివాల్వర్ తెచ్చుకున్నట్లు తెలిసింది. శంకర్‌కు తన సోదరుడైన రాజం కుటుంబంతో ఆస్తి గొడవలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే గత నెల 15న అర్ధరాత్రి దాటిన తర్వాత తన ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న రాజం భార్య లక్ష్మీపై శంకర్, అతని భార్య అనూష, బావమరిది ముత్తన్న యూపీ యువకుడితో కలిసి దాడి చేశారు.ఈ సంఘటనలో లక్ష్మీ తలకు తీవ్ర గాయం కాగా.. మొదట స్థానిక ఆసుపత్రికి ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడ స్కానింగ్ తీయగా ఆమె తలలో ఇనుప ముక్క లాంటిది ఉందని తేలడంతో వైద్యులు శస్త్ర చిక్సిత చేసి తొలగించారు. ముందుగా తనపై కర్రతో దాడి చేశారని లక్ష్మీ చెప్పడంతో తొలుత మామూలు దాడి అని భావించిన పోలీసులు.. బయటపడింది ఇనుపముక్క బుల్లెట్‌లాగా ఉండడంతో కంగుతిన్నారు. తర్వాత దానిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపగా.. అది బుల్లెట్టేనని తేలడంతో దర్యాప్తు జరిపి ఆమెపై కాల్పులకు పాల్పడింది యూపీ యువకుడు అని నిర్ధారణకు వచ్చారు.దాడి తర్వాత యూపీకి పరార్..లక్ష్మీపై దాడి అనంతరం అదే రోజు సదరు యువకుడు యూపీకి పరారైనట్లు పోలీసులు గుర్తించారు. మరోవైపు ఫోరెన్సిక్ నివేదిక రావడంలో జాప్యం నెలకొనడంతో ఇనుప ముక్క విషయంలో స్పష్టత లేక ఇంతకాలం వేచి చూసిన పోలీసులు.. అది బుల్లెట్ అని ఫోరెన్సిక్ విభాగం తేల్చడంతో మూడు రోజుల క్రితం యూపీకి వెళ్లి ఆ యువకుడిని అదుపులోకి తీసుకొని మెట్‌పల్లికి తీసుకొచ్చినట్లు తెలిసింది. నెలకుపైగా మిస్టరీగా ఉన్న ఈ కేసు యువకుడు పట్టుబడడంతో మరో రెండు, మూడు రోజుల్లో కొలిక్కి వచ్చే అవకాశముంది. -
టీచర్ స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియో తీసి..
తమిళనాడు: కన్యాకుమారి జిల్లా తక్కలై సమీపంలో స్నానం చేస్తున్న ఉపాధ్యాయురాలిని రహస్యంగా వీడియో తీసి, బెదిరించి బలవంతంగా శారీరక సంబంధం పెట్టుకున్న యువకుడు దానిని రికార్డ్ చేశాడు. ఆ తర్వాత అతని స్నేహితుడు కూడా సదరు టీచర్‌ను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై వచ్చిన ఫిర్యాదు మేరకు కోర్టు ఆదేశాల ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసి, ఇద్దరు యువకుల కోసం గాలిస్తున్నారు. తమిళనాడు కన్యాకుమారి జిల్లా తక్కలై సమీప ప్రాంతానికి చెందిన 36 ఏళ్ల ఉపాధ్యాయురాలు మదురై హైకోర్టు బెంచ్‌లో ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్లో ‘‘నేను ఒక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నాను. నా భర్త టెంపో డ్రైవర్. నేను నా ఇంటి బాత్రూమ్లో స్నానం చేస్తుండగా, అదే ప్రాంతానికి చెందిన జయకాంతన్ అనే వ్యక్తి రహస్యంగా తన సెల్ఫోన్లో వీడియో తీశాడు. ఆ తర్వాత సదరు వ్యక్తి ఆ వీడియోను అడ్డం పెట్టుకుని తనను బ్లాక్మెయిల్ చేస్తూ, నిరంతరం వేధింపులకు గురిచేశాడు’’ అని ఆ పేర్కొన్నారు. నిందితుడు తనను భయపెట్టి డబ్బులు వసూలు చేయడమే కాకుండా, అతని స్నేహితుడు కూడా ఈ విషయం తెలుసుకుని తనను వేధించాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.ఈ ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన కోర్టు ఆదేశాల మేరకు తక్కలై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులపై సమాచార సాంకేతిక పరిజ్ఞాన దుర్వినియోగం, బలవంతపు వేధింపులు ఇతర తీవ్రమైన సెక్షన్ల కింద విచారణ చేపడుతున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. -
ఒంటరిగా వెళ్తున్నయువతిని ఎత్తుకెళ్ళి అత్యాచారం..!
కర్ణాటక: రాత్రి ఒంటరిగా వెళ్తున్న పశ్చిమ బెంగాల్ కు చెందిన యువతిని కారులో అపహరించి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన మైసూరు జిల్లాలోని టి. నరసిపుర తాలూకాలోని ముగురు గ్రామం వద్ద జరిగింది. ఈ కేసులో టి.నరసిపురలో బట్టల దుకాణదారు రిహాన్ ఖాన్, హౌసింగ్ బోర్డ్వాసి కిషోర్ కుమార్, హెలవర హుండి గ్రామానికి చెందిన కిరణ్ అలియాస్ హుచ్చాను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. బెంగాల్‌కు చెందిన 30 ఏళ్ల యువతి, టి.నరసిపుర పట్టణంలో అద్దె ఇంట్లో నివసిస్తూ, ఒక చాట్ సెంటర్లో పనిచేస్తోంది. ఆమె 19న రాత్రి పార్టీ ఉందంటే మైసూరులో స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. తిరిగి బస్టాండులో దిగి నడిచి వస్తుండగా, కారులో వచ్చిన నిందితులు ఆమెను ఏదో చిరునామా అడిగారు, తనకు తెలియదని చెప్పగా, బలవంతంగా ఎక్కించుకున్నారు. పలు లాడ్జిలు తిప్పుతూ చివరకు ముగురు గ్రామం సమీపంలో ఉన్న ఒక లాడ్జికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మొబైల్ ఫోన్‌తో పాటు రూ. 5 వేలు దోచుకున్నారు. రూ.లక్ష ఇవ్వాలని బెదిరించి రూ.లక్ష ఇవ్వాలని దుండగులు డిమాండ్ చేశారని బాధితురాలు తెలిపింది. డబ్బు ఇంట్లో ఉందని, తీసుకెళ్తే ఇస్తానని చెప్పడంతో ఇంటికి తీసుకెళ్లారని ఆమె పేర్కొంది. బాధితురాలు కారు దిగి వెంటనే ఇంట్లోకి వెళ్లి తలుపు గడియ పెట్టుకుని సహాయం కోసం కేకలు వేసింది. దీంతో నిందితులు పారిపోయారు. ఇంటి యజమాని సహాయంతో మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వివరాల ఆధారంగా కారును సీజ్ చేసి, నిందితులను పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ మల్లికార్జున బాలదండి మంగళవారం తెలిపారు. బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. -
ఆయనకు ఇద్దరు... చిన్నారిపై సవితి తల్లి దారుణం!
నిజామాబాద్, బాన్సువాడ: చిన్నారిపై హత్యాయత్నం చేసిన ఘటనలో తండ్రి, సవతి తల్లిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. సోమవారం బాన్సువాడలో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ విఠల్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. బీర్కూర్‌కు చెందిన టేకు సతీశ్‌కు ఇద్దరు భార్యలు. సతీశ్ మొదట శైలజను పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు ముగ్గురు కుమార్తెలు. ఆ తర్వాత శైలజ చెల్లి సంధ్యను ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో వైష్ణవి జన్మించింది. వైష్ణవి పుట్టినప్పటి నుంచి సతీశ్, శైలజతో గొడవలు జరగడంతో సంధ్య పుట్టింటికి వెళ్లిపోయింది. వైష్ణవిని మాత్రం సతీశ్ తన వద్దనే పెంచుకుంటున్నాడు.ఈ నెల 15న ఉదయం చిన్నారి వైష్ణవి పొదల్లో రక్తమడుగుల్లో కొట్టుమిట్టాడుతూ కనిపించింది. చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో నిజామాబాద్ ఆస్పత్రికి అక్కడి నుంచి హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం విషమంగానే ఉంది. అయితే, అక్క శైలజ తన కుమార్తెను హత్య చేయాలనే ఉద్దేశంతో బ్లేడ్‌తో దాడికి పాల్పడినట్లు సంధ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో బాన్సువాడ రూరల్ సీఐ తిరుపయ్య, బీర్కూర్, పిట్లం ఎస్సైలు రాములు, ఆంజనేయులు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి శాస్త్రీయ దర్యాప్తు చేపట్టినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారించినట్లు తెలిపారు. వైష్ణవిని పోశించడం భారంగా మారడంతోపాటు కుటుంబంలో విభేదాల నేపథ్యంలో చిన్నారిని అడ్డు తొలగించాలని సతీశ్, శైలజ కుట్ర పన్నారు. 14న రాత్రి నిద్రిస్తున్న చిన్నారి వైష్ణవిని ఇద్దరూ కలిసి సీసీ రోడ్డుపై ఈడ్చుకుంటూ కొంతదూరం తీసుకెళ్లి గడ్డి ఉన్న ప్రదేశంలో పడుకోబెట్టి వెంట తెచ్చుకున్న బ్లేడ్‌తో గాయపర్చారు. చిన్నారి ఏడుపు ఆగిపోవడంతో చనిపోయిందని భావించి అక్కడే వదిలేసి తిరిగి ఇంటికి వెళ్లారు. మరుసటి రోజు ఉదయం చిన్నారి కనిపించడం లేదని, గ్రామపెద్దలకు సమాచారం ఇచ్చి వారితో కలిసి వెతుకుతున్నట్లు నటించారు. చిన్నారి ఉన్న ప్రదేశం ముందుగానే తెలిసి కూడా అక్కడికి వెళ్లి కనిపించినట్లు చెప్పి ఎలాంటి అనుమానం రాకుండా బంధువులతో కలిసి చిన్నారిని ఆస్పత్రికి తరలించారు.చిన్నారిని కుక్కలు ఎత్తుకెళ్లి గాయపరిచినట్లు గ్రామస్తులు, బంధువులు, పోలీసులను నమ్మించే ప్రయత్నం చేశారు. సాంకేతిక ఆధారాలు, శాస్త్రీయ పరిశీలన, సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా నిందితులు విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు డీఎస్పీ వెల్లడించారు. నిందితులు సతీశ్, శైలజ వద్ద రెండ్లు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కేసును ఛేదించిన బాన్సువాడ రూరల్ సీఐ తిరుపయ్య, బీర్కూర్, పిట్లం ఎస్సైలు రాములు, ఆంజనేయులులను ఎస్పీ అభినందించారని ఆయన పేర్కొన్నారు. -
ఉదయ్ కృష్ణారెడ్డికి సీబీఐ మాజీ అధికారి అండ
హైదరాబాద్ పోలీస్ అకాడమీలో ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి వ్యవహారం ఇప్పుడు పోలీస్ శాఖలో హాట్ టాపిక్‌గా మారింది. మహిళా ఐపీఎస్ ప్రొబేషనర్ లైంగిక వేధింపుల ఆరోపణలు, కేసు నమోదు.. మనస్తాపం చెందిన ఉదయ్ అత్మహత్యాయత్నం చేయడం.. ఆపై సంచలన ఆరోపణలతో ఈ వ్యవహారం పూటకో మలుపు తిరుగుతోంది. ఈ తరుణంలో ఈ వ్యవహారంపై మాజీ సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ మన్నెం నాగేశ్వరరావు స్పందించారు.ఉదయ్ కృష్ణారెడ్డికి న్యాయం జరగాలని కోరుతూ మన్నెం నాగేశ్వరరావు సోషల్ మీడియా వేదికగా సుదీర్ఘ పోస్టు చేశారు. ఆరోపణలపై పూర్తి స్థాయి విచారణ జరగకముందే ఒక అధికారి కెరీర్‌పై తీవ్ర ప్రభావం పడకూడదని, నిష్పక్షపాత దర్యాప్తు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాదు.. తాత్కాలిక సస్పెన్షన్‌ను కూడా ఆయన తప్పుబట్టారు.కష్టాల నుంచి ఐపీఎస్ వరకు..ఉదయ్ కృష్ణారెడ్డి ప్రయాణాన్ని ప్రస్తావించిన మన్నెం నాగేశ్వరరావు.. అతని ఎదుగుదల ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన ఉదయ్ చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయారని, తీవ్ర ఆర్థిక ఇబ్బందుల మధ్య అమ్మమ్మ సంరక్షణలో పెరిగారని తెలిపారు. తెలుగు మీడియం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న ఆయన.. జీవితంలో ఎదురైన సవాళ్లను అధిగమిస్తూ ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో కానిస్టేబుల్‌గా చేరారు. అయితే ఉన్నత లక్ష్యాన్ని వదులుకోకుండా విధులు నిర్వహిస్తూనే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధమయ్యారని పేర్కొన్నారు.కఠిన పరిస్థితుల్లోనూ పట్టుదలతో చదివి ఐపీఎస్‌కు ఎంపిక కావడం అసాధారణ విజయమని, గ్రామీణ యువతకు ఆయన ప్రయాణం స్ఫూర్తిగా నిలుస్తుందని మన్నెం నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు.రెండు వాదనలు.. ఆధారాలే కీలకంప్రస్తుత వ్యవహారంలో రెండు భిన్నమైన వాదనలు ఉన్నాయని మాజీ ఐపీఎస్ అధికారి పేర్కొన్నారు. మహిళా ప్రొబేషనర్ తనపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారని, మరోవైపు ఉదయ్ కృష్ణారెడ్డి మాత్రం తమ మధ్య సంబంధం పరస్పర అంగీకారంతో కొనసాగిందని, తనపై తప్పుడు ఆరోపణలు చేశారని చెబుతున్నారని వివరించారు. వ్యక్తిగత సంబంధం విఫలమైన తర్వాత ఏర్పడిన వివాదాలను పూర్తిగా నేరపరమైన కోణంలోకి తీసుకెళ్లే ముందు.. వాస్తవాలు, ఆధారాలను పరిశీలించడం చాలా ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.సస్పెన్షన్‌పై ప్రశ్నలుఎఫ్ఐఆర్ నమోదైన వెంటనే ఉదయ్ కృష్ణారెడ్డిపై తీసుకున్న పరిపాలనా చర్యలపై కూడా మన్నెం నాగేశ్వరరావు ప్రశ్నలు లేవనెత్తారు. విచారణ పూర్తికాకముందే ఒక యువ అధికారి భవిష్యత్తు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఒకే ఘటనలో ఇద్దరు వ్యక్తులు భాగస్వాములైతే.. పరిపాలనా చర్యలు కూడా సమానంగా ఉండాలనే సూత్రాన్ని పాటించాలని పేర్కొన్నారు. ఏకపక్ష నిర్ణయాలు సంస్థలపై నమ్మకాన్ని దెబ్బతీస్తాయని వ్యాఖ్యానించారు.శిక్షణ సంస్థల బాధ్యతఐపీఎస్ అధికారులను తీర్చిదిద్దే ఎస్వీపీఎన్పీఏ కేవలం క్రమశిక్షణ అమలు చేసే సంస్థ మాత్రమే కాకుండా.. యువ అధికారులకు మార్గదర్శకత్వం, మానసిక సహకారం అందించే వేదికగా ఉండాలని మన్నెం నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఒక ఆరోపణ లేదంటే వివాదం కారణంగా ఒక అధికారి కష్టపడి సాధించిన కెరీర్ నాశనం కాకూడదని, విచారణ పూర్తయ్యే వరకు న్యాయ ప్రక్రియకు అవకాశం ఇవ్వాలని కోరారు.‘నిష్పక్షపాత విచారణ జరగాలి’ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో చట్టం తన పని తాను చేసుకోవాలని, అదే సమయంలో న్యాయం, సమానత్వ సూత్రాలు పాటించాలని మన్నెం నాగేశ్వరరావు కోరారు. కానిస్టేబుల్ స్థాయి నుంచి ఐపీఎస్ వరకు ఎదిగిన యువ అధికారి విషయంలో తొందరపాటు నిర్ణయాలు కాకుండా.. ఆధారాల ఆధారంగా విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.మన్నెం నాగేశ్వరరావు నేపథ్యం..మన్నెం నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి. 1986 బ్యాచ్‌కు చెందిన ఆయన ఒడిశా క్యాడర్లో సేవలందించారు. సీబీఐలో జాయింట్ డైరెక్టర్‌గా పనిచేసిన ఆయన.. 2018లో సంస్థలో పరిణామాల సమయంలో తాత్కాలిక డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. కృష్ణా జిల్లా ప్రాంతానికి చెందిన నాగేశ్వరరావు.. పోలీస్, దర్యాప్తు విభాగాల్లో కీలక అనుభవం ఉన్న అధికారిగా గుర్తింపు పొందారు. తాజాగా ఉదయ్ కృష్ణారెడ్డి కేసుపై చేసిన వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు.Justice for Uday Krishna Reddy: A Case for FairnessThe allegations levelled by lady IPS probationer Suma H.K. against her co-trainee Uday Krishna Reddy at the Sardar Vallabhbhai Patel National Police Academy (SVPNPA), Hyderabad, have ignited intense public debate.Currently,… pic.twitter.com/YSm2pb0pRS— M. Nageswara Rao IPS (Retired) (@MNageswarRaoIPS) July 21, 2026 -
కుక్కను వెతికిపెడితే రూ.10వేల బహుమతి
నల్గొండ, మిర్యాలగూడ: తన పెంపుడు కుక్కను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారని ఓ వ్యక్తి సోమవారం మిర్యాలగూడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మిర్యాలగూడ పట్టణంలోని వినోభానగర్‌కు చెందిన గడ్డం నాగరాజు పెంచుకుంటున్న కుక్క ఈ నెల 18వ తేదీ నుంచి కనిపిండంలేదు. దీంతో అతడు కాలనీలో సీసీ కెమెరాలను పరిశీలించగా.. వినోభానగర్ చర్జి రోడ్డులో అంబేద్కర్ విగ్రహం వద్ద గుర్తుతెలియని వ్యక్తులు కుక్కను ఎత్తుకెళ్తున్నట్లు గుర్తించాడు. కుక్క ఆచూకీ లభించకపోవడంతో వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తన కుక్కను తీసుకొచ్చి ఇస్తే రూ.10వేల వరకు బహుమతిని ఇస్తానంటూ నాగరాజు వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవడం విశేషం. -
కీచకుడిపై చట్టపరమైన చర్యలు
కాకినాడ క్రైం: ఇద్దరు మైనర్లు, ఆమె తల్లిపై ఘాతుకానికి పాల్పడిన కీచకుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. ‘సాక్షి’ పత్రికలో సోమవారం ప్రచురితమైన ‘కీచకుడి చేతిలో విలవిల’ కథనానికి ఆయన స్పందించారు. ఈ మేరకు, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ, జిల్లా పోలీస్ శాఖ నుంచి నివేదిక కోరామన్నారు. జరిగిన నేరంపై ఆధారాలు లభ్యమయ్యాయని, ఫిర్యాదుతో నిమిత్తం లేకుండా నేరం చేసిన వ్యక్తిపై చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. అలాగే జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ పీడీ చెరుకూరి లక్ష్మిని వివరణ కోరగా, బాధిత కుటుంబంతో సహా బాధ్యుడిని తమ కార్యాలయానికి పిలిపించి మాట్లాడామన్నారు. బాధితులు జరిగిన ఘోరాన్ని వివరించి లిఖిత పూర్వకంగా నిర్ధారించారన్నారు. మైనర్లు, ఆమె తల్లిపై జరిగిన ఘాతుకం నిజమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో బాలికకు ఆరోగ్య పరీక్షలు, ఆమెకు చదువుకు ఏర్పాట్లు, నేరానికి పాల్పడిన యువకుడిపై చట్టపరమైన చర్యలు అనే మూడు అంశాలను సిఫారసు చేస్తూ కలెక్టర్‌కు నోట్‌ఫైల్ పంపామన్నారు. అలాగే ఎస్పీ బిందుమాధవ్‌కు వీరబాబు అనే బాధితుల బంధువు నుంచి మెయిల్ వచ్చిందని, ఆ ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపడుతున్నామని కాకినాడ త్రీ టౌన్ సీఐ సత్యనారాయణ తెలిపారు. భార్య, అత్త, మైనర్ మరదలిపై అత్యాచారం చేసిన అల్లుడు! -
రూ.25 లక్షల కార్ లోన్ తీసుకుని.. కారే అమ్మేసిన మోసగాడు
కర్ణాటక: నగరంలో రూ. 25 లక్షల బ్యాంకు రుణంతో కారు కొని, దానిని అక్రమంగా వేరొకరికి అమ్మేసిన రుణగ్రహీత ఉదంతమిది. వివరాలు.. మధు మోహన్ అనే వ్యక్తి సరస్వతీపురంలోని ఎస్బిఐ బ్యాంక్ శాఖ నుంచి రూ. 25 లక్షల రుణం తీసుకున్నాడు. ఆ తర్వాత అతను ఆ రుణాన్ని తిరిగి చెల్లించలేదు. దీంతో, రుణాన్ని వసూలు చేయడానికి బ్యాంకు సిబ్బంది మధు మోహన్ ఇంటికి వెళ్లినప్పుడు, అతను అందుబాటులో లేడు. పైగా కారును బ్యాంకు నుంచి అనుమతి తీసుకోకుండా, రవాణా అధికారుల నకిలీ సంతకాలతో రికార్డులను తారుమారు చేశాడు, ఆ కారును షకీబ్ మన్సూర్ అనే వ్యక్తికి అమ్మినట్లు తేలింది. దోషులపై చర్యలు తీసుకోవాలని బ్యాంకు సిబ్బంది సరస్వతీపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
‘కేతన్ నా హీరో.. చాలా కేరింగ్’.. పొగడ్తలు గుప్పించిన సియా!
ఒకప్పుడు ప్రేమ, అనుబంధానికి గుర్తుగా నిలిచిన ఓ వీడియో.. ఇప్పుడు తీవ్ర చర్చకు కారణమవుతోంది. పుణే లోహ్‌గఢ్ కేసులో నిందితురాలు సియా గోయల్ కేతన్ అగర్వాల్‌ను పొడుగుతూ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోను నెటిజన్లు చూసి నెటిజన్లు.. పాపం కేతన్, అంత మంచోడిని చంపడానికి చేతులెలా వచ్చాయి? అని సియాను తిట్టుకుంటున్నారు. ఆ వీడియో కేతన్-సియా నిశ్చితార్థ వేడుకలోది. వేదికపై కేతన్, సియా కలిసి ఉన్న సమయంలో అక్కడున్న ఒకావిడ ఓ ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. అప్పటికే సియా కేతన్‌ను తన హీరో అని, ఆ హీరో నెంబర్ 1 అని వ్యాఖ్యానించింది. “కాబోయే భర్తగా కేతన్‌లో మీకు బాగా నచ్చిన విషయం ఏంటి? అతడిని మీ హీరో నంబర్ వన్‌గా భావించడానికి కారణం?” అని ప్రశ్నించారు. దీనికి సియా చిరునవ్వుతో.. “కేతన్ చాలా కేరింగ్, చాలా మంచివాడు” అంటూ సమాధానం ఇచ్చింది. ఆ మాటలు విన్న కేతన్ నవ్వుతూ స్పందించగా.. అక్కడున్న వారంతా చప్పట్లు కొట్టారు. అప్పట్లో ప్రేమగా కనిపించిన ఈ క్షణాలు.. ఇప్పుడు కేతన్ మృతి కేసు నేపథ్యంలో మరో కోణంలో చర్చకు వస్తున్నాయి.'Ketan Agarwal Is Caring & Kind,' Said Siya Goyal During Engagement Ceremony pic.twitter.com/xMy79rhfQg— Pune First (@Pune_First) July 20, 2026పుణెకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ జూన్ 18న లోహగఢ్ కోట సమీపంలోని లోయలో పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తొలుత ఇది ప్రమాదంగా భావించినప్పటికీ.. పుణె రూరల్ పోలీసులు చేపట్టిన దర్యాప్తులో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. వివాహంపై అసంతృప్తితో ఉన్న సియా గోయల్ (20), ఆమె స్నేహితుడు చేతన్ చౌదరి (22) కలిసి ముందస్తు ప్రణాళికతో ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. ఫొటో షూట్ పేరుతో కేతన్‌ను లోహగఢ్ కోటకు తీసుకెళ్లి.. అక్కడి లోయలోకి తోసినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు తెలుస్తోంది. ఘటనను ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాదు.. అంతకు ముందు(జూన్ 14న) ఇదే ప్రాంతంలో కేతన్‌ను చంపేందుకు మరోసారి ప్రయత్నం జరిగినట్లు కూడా తెలుస్తోంది. పుణే కేతన్ అగర్వాల్ కేసు దేశవ్యాప్తంగా సంచలన చర్చకు దారి తీసింది. కాబోయేవాడిని ప్రియుడి సాయంతో హతమార్చడం.. రకరకాల చర్చలకు దారి తీసింది. ఈ తరుణంలో కేసు దర్యాప్తు కొనసాగుతుండగా.. కేతన్‌ను తోసి చంపింది సియానా? లేదంటే చేతనా? అనేది స్పష్టత రావాల్సి ఉంది. విచారణలో పోలీసులును సియా, చేతన్‌లు ఏ వివరాలు చెప్పుకుండా ముప్పు తిప్పలు పెడుతున్నట్లు సమాచారం. అంతేకాదు.. పోలీసులు ఆమెను విచారణ కోసం పలు ప్రాంతాలకు తీసుకెళ్తున్న సమయంలోనూ మీడియా ముందు ఆటిట్యూడ్ ప్రదర్శిస్తూ వస్తోంది. సియా తప్పు చేస్తే కఠినంగా శిక్షించాలంటున్న ఆమె కుటుంబం.. మరోవైపు బెయిల్ కోసం ప్రయత్నిస్తుండడం గమనార్హం. అయితే దర్యాప్తు ఆలస్యం అవుతుండడంతో ఆమె బెయిల్ దక్కవచ్చనే ఆందోళన వ్యక్తం చేస్తోంది కేతన్ కుటుంబం. సియా కేతన్ కలిసి దిగిన ఫొటోలు, సరదాగా గడిపిన వీడియోలు.. ఇప్పుడు “కేతన్ మంచోడు.. కేరింగ్” అని చెప్పిన వ్యక్తికి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటూ వైరల్ అవుతున్న ఆ వీడియోపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. అంత మంచోడికి విషయం చెబితే సరిపోయేది కదా.. ఎందుకు చంపేశావ్? అని కామెంట్లలో సియాను తిట్టి పోస్తున్నారు. -
సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..
సంగారెడ్డి: జిల్లాలోని కల్హేర్ మండలంలో ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. స్థానికుల వివరాల ప్రకారం.. మండలంలోని బచేపల్లి గ్రామం వద్ద 161 జాతీయ రహదారిపై ప్రయానిస్తున్న స్కార్పియో కారు ఎదురుగా వస్తున్న బైక్‌ను తప్పించబోయింది. ప్రమాదావశాత్తు అదుపుతప్పి పల్టీలు కొట్టడంతో కారులో ఉన్నటువంటి భార్యభర్తలతో పాటు 4ఏళ్ల కూతురు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మృతులు నాందేడ్ వాసులుగా తెలుస్తోంది. -
స్కూల్‌కు వెళ్తుండగా నడిరోడ్డులో విద్యార్థినిపై బుల్లెట్ల వర్షం.. మృతి
పట్నా: బిహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలో సోమవారం ఉదయం జరిగిన దారుణ ఘటన ఆ ప్రాంతాన్ని ఉలిక్కిపడేలా చేసింది. పూసా వైని పోలీస్ స్టేషన్ పరిధిలో పాఠశాలకు వెళ్తున్న 15 ఏళ్ల విద్యార్థినిని రోడ్డుపైనే కాల్చి చంపాడు ఓ యువకుడు. సైకిల్‌పై ఆ అమ్మాయి కస్తూర్బా బాలికల ఉన్నత పాఠశాలకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఆమెను చంపాక నిందితుడు బైక్‌పై పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.బైక్‌పై వెంబడించి.. వరుసగా కాల్పులుమృతురాలిని పూసా వైని పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన సోనం కుమారిగా గుర్తించారు. సమాచారం ప్రకారం, సోనం ఎప్పటిలాగే ఉదయం సైకిల్‌పై పాఠశాలకు బయల్దేరింది. ఆమె మంగళ్ స్థాన్ సమీపానికి చేరుకున్న సమయంలో పల్సర్ బైక్‌పై వచ్చిన ఓ యువకుడు వెంబడించడం మొదలుపెట్టాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత కేజియా వార్డు-13 సమీపంలో నిందితుడు ఆమె సైకిల్‌ను ఓవర్టేక్ చేసి ఎదురుగా వచ్చాడు. వెంటనే తుపాకీ తీసి వరుసగా కాల్పులు జరిపాడు. సోనంకు 4 బుల్లెట్లు తగలడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.ఘటన తర్వాత దుండగుడు అక్కడి నుంచి పారిపోయాడు. కాల్పుల శబ్దం విన్న స్థానికులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. కొద్దిసేపటికే పెద్ద సంఖ్యలో గ్రామస్థులు అక్కడికి వచ్చారు. సమాచారం అందుకున్న వైని పోలీస్ స్టేషన్ పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఈ సమయంలో కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్దిసేపు పోలీసులకు, స్థానికులకు మధ్య వాగ్వాదం, స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. తర్వాత కుటుంబ సభ్యులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సమస్తిపూర్ సదర్ ఆసుపత్రికి తరలించారు. పోలీసు సూపరింటెండెంట్ ఆదేశాల మేరకు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్) బృందం ఘటనాస్థలి నుంచి ఆధారాలు సేకరించింది. చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ కెమెరాల దృశ్యాలను కూడా పరిశీలిస్తున్నారు. సదర్ డీఎస్పీ-1 సంజయ్ కుమార్ పాండే మాట్లాడుతూ.. ప్రాథమిక దర్యాప్తులో కుటుంబ సభ్యుల నుంచి కీలక సమాచారం లభించిందని చెప్పారు. ఆ సమాచారం ఆధారంగా అనుమానితుడిని గుర్తించామని తెలిపారు. కేసు తీవ్రత దృష్ట్యా ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్ఐటీ) ఏర్పాటు చేస్తున్నామని, నిందితుడిని త్వరగా అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని చెప్పారు. -
బ్రేకింగ్ న్యూస్..సాయి కృష్ణ ఇంటికి సిట్ అధికారులు
-
టీచర్‌ను హోటల్‌కు తీసుకెళ్లిన జిమ్ ట్రైనర్.. ఆపై నిజస్వరూపం..
విజయవాడ: ఓ యువతిపై జిమ్ ట్రైనర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేసి, నగ్న ఫొటోలు తీసినట్లు బాధిత యువతి ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదుతో జిమ్ ట్రైనర్ అబ్దుల్ ఖాదర్‌పై కేసు నమోదు చేసిన సత్య నారాయణపురం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.బాధిత యువతి ప్రైవేట్ స్కూల్ టీచర్‌గా పని చేస్తోంది. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో జిమ్ ట్రైనర్ అబ్దుల్ ఖాదర్ పరిచయమయ్యాడు. లావుగా ఉన్న టీచర్ స్లిమ్‌గా అయ్యేందుకు జిమ్ సలహాలు ఇస్తూ పరిచయం పెంచుకున్నాడు. ఆమెను ప్రైవేట్ హోటల్‌కు తీసుకువెళ్లి బరువు తగ్గడానికి షేక్ తాగాలంటూ అందులో మత్తు మందు కలిపి ఇచ్చాడని ఆ టీచర్ తెలిపింది. మత్తు ఇచ్చి అత్యాచారం చేశాడని పోలీసులను ఆశ్రయించిన యువతి. కేసు నమోదు చేసి యువతిని పోలీసులు వైద్య పరీక్షల కోసం తరలించారు. జిమ్ ట్రైనర్ ఖాదర్ పరారీలో ఉన్నాడు. -
త్రిపుర డీజీపీ ఆత్మహత్య
అగర్తలా: త్రిపుర డీజీపీ (డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్) అనురాగ్ ఠాకూర్(60) ఆత్మహత్యకు పాల్పడ్డారు. సోమవారం ఉదయం అగర్తలాలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలోని తన సొంత ఆఫీసు ఛాంబర్ బాత్రూంలో ఉరేసుకుని బలవన్మరణం చెందారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి మాణిక్ సాహా ప్రకటించారు. ఠాకూర్ మరణ వార్త విని ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ జేకే సిన్హా,, ఆరోగ్య శాఖ కార్యదర్శి కిరణ్ గిట్టె తదితరులు ఆస్పత్రికి వెళ్లారని ఆయన తెలిపారు. అనురాగ్ ఠాకూర్ మృతిపై సీఎం తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ‘మధ్యాహ్నం 12 గంటలకు డీజీపీ అనురాగ్ ఠాకూర్‌ను ఆస్పత్రికి తీసుకువచ్చారు. పరీక్షించిన వైద్యులు ఆయన అప్పటికే చనిపోయినట్లు 12.48 గంటలకు ప్రకటించారు’అని గోవింద్ వల్లభ్ పంత్ ఆస్పత్రి మెడిసిన్ డిపార్ట్మెంట్ చీఫ్ డాక్టర్ ప్రదీప్ భౌమిక్ వివరించారు. పోస్టుమార్టం అనంతరమే ఠాకూర్ మృతికి దారి తీసిన కారణాలు వెల్లడవుతాయని తెలిపారు. 1994 ఐపీఎస్ బ్యాచ్ అధికారి అయిన అనురాగ్ ఠాకూర్‌కు భార్య, కుమార్తె ఉన్నారు. మేలో డీజీపీగా నియమితులైన ఠాకూర్ మరో 11 నెలల్లో రిటైరవ్వాల్సి ఉంది. #BreakingNews | #Tripura Director General of Police (DGP) Anurag Dhankar was found dead at his office at the Police Headquarters in Agartala on Monday.Preliminary reports suggest that the senior IPS officer allegedly died by suicide. However, the exact circumstances surrounding… pic.twitter.com/ks4KYnOB6Z— NORTHEAST TODAY (@NortheastToday) July 20, 2026 కాగా, రాష్ట్ర పోలీస్ చీఫ్ ఆఫీసులోనే చనిపోవడంపై ప్రతిపక్ష నేత జితేంద్ర చౌదరి అనుమానం వ్యక్తం చేశారు. ఏకంగా సీనియర్ ఐపీఎస్ ఆత్మహత్య పాల్పడటాన్ని చూస్తే రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఏమిటో తెలుస్తుంది. ఆయన తీవ్ర ఒత్తిడులకు గురయ్యారు. అవేంటో వెల్లడికావాలి. ఘటనపై హైకోర్టు పర్యవేక్షణలో జ్యుడీషియల్ దర్యాప్తు జరిపించాలి. మృతికి కారణాలను వెల్లడించాలి’అని జితేంద్ర చౌదరి డిమాండ్ చేశారు. డీజీపీ అనురాగ్ ఠాకూర్ మరణంపై మెజిస్టీరియల్ దర్యాప్తు జరుగుతోందని, నిజాలు త్వరలోనే వెలుగు చూస్తాయని బీజేపీ రాష్ట్ర చీఫ్ అభిõÙక్ దేబ్రాయ్ తెలిపారు. -
‘రేర్ ఆఫ్ ది రేరెస్ట్’.. నెన్మారా కేసులో సంచలన తీర్పు
కేరళలో సంచలనం సృష్టించిన నెన్మారా డబుల్ మర్డర్ కేసులో సోమవారం కీలక తీర్పు వెలువడింది. తల్లీకొడుకులను దారుణంగా హత్య చేసిన కేసులో 61 ఏళ్ల నిందితుడు చెంతమరాకు కోర్టు మరణశిక్ష విధించింది. అంతకు ముందు అదే కుటుంబంలోని వ్యక్తిని హత్య చేసిన చెంతమరా.. బెయిల్‌పై బయటకు వచ్చి జంట హత్యలకు పాల్పడడం గమనార్హం. దీంతో ఈ కేసు అత్యంత అరుదైన కేసుల (రేర్ ఆఫ్ ది రేరెస్ట్) పరిధిలోకి వస్తుందని భావించిన న్యాయస్థానం కఠిన శిక్షను ఖరారు చేసింది.పాలక్కాడ్ జిల్లా నెన్మారా పరిధిలోని పొతుండి ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 2025 జనవరి 27న సుధాకరన్ (55), ఆయన తల్లి లక్ష్మి (75)పై నిందితుడు చెంతమరా (Chenthamara) దాడి చేసి హత్య చేసినట్లు కేసు నమోదైంది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. పోలీసుల దర్యాప్తులో సేకరించిన ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించిన కోర్టు.. నిందితుడిని దోషిగా తేల్చింది.భార్య దూరం కావడంపై అనుమానంతో.. చెంతమరా నేర చరిత్ర మొదలైంది 2019 ఆగస్టు 31న. ఆ రోజు అతను తన పొరుగింటి మహిళ సజిత (35)ను హత్య చేశాడు. పోలీసుల దర్యాప్తు ప్రకారం.. తన భార్య, కుమార్తె తనను విడిచిపెట్టి వెళ్లడానికి సజిత కుటుంబం చేసిన చేతబడే కారణమని చెంతమరా అనుమానించాడు. ఈ అనుమానంతోనే ఘాతుకానికి పాల్పడ్డాడు. బెయిల్‌పై బయటకు వచ్చాక ఘాతుకంసుధాకరన్ భార్య సజిత హత్య కేసులో అరెస్టైన చెంతమరా.. బెయిల్‌పై బయటకు వచ్చాడు. సరాసరి సజిత ఇంటికి వెళ్లి.. ఆమె భర్త సుధాకరన్, తల్లి లక్ష్మిలను హత్య చేశాడు. నేర తీవ్రత, హత్య చేసిన తీరు, బాధిత కుటుంబంపై పడిన ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. ఈ కేసును అత్యంత అరుదైన నేరంగా పరిగణించింది. సాధారణంగా జీవిత ఖైదు విధించే పరిస్థితుల్లో కాకుండా.. అరుదైన సందర్భాల్లో మాత్రమే విధించే మరణశిక్షను పాలక్కాడ్ అదనపు జిల్లా & సెషన్స్ కోర్టు–IV అదనపు సెషన్స్ జడ్జి కెన్నెత్ జార్జ్ (Kenneth George) ఖరారు చేస్తూ తీర్పు ఇచ్చారు.తీర్పుతో ముగిసిపోలేదా?నెన్మారా జంట హత్యల కేసు కేరళలో తీవ్ర చర్చకు దారి తీసింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో స్థానికుల్లో ఆగ్రహం వ్యక్తమైంది. తాజాగా కోర్టు తీర్పుతో ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అయితే న్యాయపరమైన ప్రక్రియలో భాగంగా నిందితుడికి అప్పీల్ అవకాశాలు ఉండనున్నాయి. -
వైద్యం వికటించి మహిళ మృతి
హైదరాబాద్, హయత్‌నగర్: వైద్యం వికటించి ఓ మహిళ మృతి చెందింది. ఈ సంఘటన ఆదివారం హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం గోనె తండా గ్రామానికి చెందిన మంజుల(25) కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం శుక్రవారం రాత్రి హయత్‌నగర్‌లోని నీలాద్రి ఆసుపత్రిలో చేరింది. ఆపరేషన్ పూర్తయిన తర్వాత శనివారం వార్డుకు షిఫ్ట్ చేశారు.సాయంత్రం కడుపునొప్పి రావడంతో పరీక్షించిన డాక్టర్ రక్తస్రావం అవుతున్నట్లు గుర్తించారు. పరిస్థితి విషమిస్తుండడంతో మెరుగైన చికిత్స కోసం ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగా ఆదివారం తెల్లవారుజామున మృతి చెందినట్లుగా డాక్టర్లు నిర్ధారించారు. మంజుల మృతికి నీలాద్రి డాక్టర్ల నిర్లక్ష్యమే కారణం అంటూ బంధువులు పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్దకు వచ్చి ఆందోళన నిర్వహించారు. పోలీసుల జోక్యంతో ఆందోళన విరమించారు. మృతురాలి తల్లి కొర్రా లక్ష్మీభాయి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బంజారాహిల్స్‌లో భారీ చోరీ.. కిలో బంగారం మాయం
బంజారాహిల్స్: ఓ ప్రైవేటు సంస్థ కార్యాలయంలో భద్రపరిచిన కిలో బంగారు ఆభరణాలు చోరీ అయ్యాయి. బంజారాహిల్స్ పోలీసులు తెలిపిన మేరకు.. బంజారాహిల్స్ రోడ్ నెంబర్–10లోని ఈడెన్ గార్డెన్లో ఉన్న గురుకృప ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంలో డైమండ్ ఫిక్సింగ్ కోసం సంస్థ లాకర్లో భద్రపరిచిన 1028.59 గ్రాముల బరువు ఉన్న 14 బంగారు ఆభరణాలు (7 నెక్లెస్‌లు, 7 జతల చెవిపోగులు) కనిపించలేదు. కార్యాలయంలో వాష్‌రూమ్ కిటికీ ధ్వంసమైనట్లు గుర్తించడంతో దుండగులు అక్కడి నుంచి లోపలికి ప్రవేశించి చోరీకి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై గుజరాత్ సూరత్‌కు చెందిన వ్యాపారి ప్రీతేష్రమణి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ట్రైనీ ఐపీఎస్ లైంగిక వేధింపుల కేసులో ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: నగరంలోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో చోటుచేసుకున్న ట్రైనీ ఐపీఎస్ లైంగిక వేధింపుల కేసు సంచలనం రేపుతోంది. మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి ఫిర్యాదు ఆధారంగా తోటి ట్రైనీ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిపై కేసు నమోదు కాగా.. ఆయన ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే అతని ఆరోగ్యం నిలకడగానే ఉందని.. ప్రాణాపాయం లేదని వైద్యులు ప్రకటించారు. అకాడమీలోనే (SVPNPA) మహిళా ట్రైనీ ఐపీఎస్‌ను లైంగికంగా వేధించారని, అసభ్యకరంగా ప్రవర్తించారని, బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ బాధితురాలు అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఆదివారం ఉదయ్ కృష్ణారెడ్డిపై కేసు నమోదు చేశారు. ఈ పరిణామాల తర్వాతే ఆయన ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం.సంచలన ఆరోపణలుకర్ణాటకలోని హాసన్ జిల్లాకు చెందిన 30 ఏళ్ల మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి ఇచ్చిన ఫిర్యాదులో పలు తీవ్ర ఆరోపణలు చేశారు. గత నెల 23వ తేదీ నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి తనను వేధిస్తున్నారని పేర్కొన్నారు. వాట్సాప్‌లో అసభ్యకరమైన మెసేజ్‌లు పంపేవారని, తోటి ట్రైనీ అధికారుల ముందు తనను కించపరిచేలా మాట్లాడేవారని ఆరోపించారు. తనకు మరో అధికారితో సంబంధం ఉందంటూ ఆరోపిస్తూ.. దాన్ని ఒప్పుకోవాలని ఒత్తిడి చేసేవారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన వ్యక్తిగత ఫోన్‌ను బలవంతంగా తీసుకుని మెసేజ్‌లు పరిశీలించేవారని, పాస్వర్డ్ చెప్పాలని ఒత్తిడి చేసేవారని ఆరోపించారు.గదిలోకి లాక్కెళ్లి దాడి చేశారని ఆరోపణఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఈ నెల 8వ తేదీన తనను గదికి తీసుకెళ్లి ఫోన్ పాస్వర్డ్ అడిగి బెదిరించారని బాధితురాలు ఆరోపించారు. అలాగే జూలై 9న తనను జుట్టు పట్టుకుని గదిలోకి లాక్కెళ్లారని, మెడపై కత్తి పెట్టి బెదిరించారని, బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. ఆ సమయంలో కండోమ్ ప్యాకెట్లు విసిరారని, అసభ్యంగా ప్రవర్తించారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. మరుసటి రోజు కూడా తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేలా వ్యవహరించారని ఆమె ఆరోపించారు.ప్రైవేట్ వీడియోలతో బ్లాక్మెయిల్!తనకు తెలియకుండా ప్రైవేట్ వీడియోలు చిత్రీకరించి, వాటిని తన భర్తకు పంపించి బ్లాక్మెయిల్ చేశారని మహిళా అధికారి ఆరోపించారు. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా తప్పుడు ప్రచారం చేశారని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS)లోని పలు సెక్షన్లతో పాటు ఐటీ చట్టంలోని సెక్షన్ 66E, 67A కింద కేసు నమోదు చేశారు. ఇందులో వ్యక్తిగత గోప్యత ఉల్లంఘన, అసభ్యకర కంటెంట్ ప్రసారం వంటి అంశాలు ఉన్నాయి.కేసు నమోదు.. దర్యాప్తు కొనసాగింపుమహిళా ట్రైనీ ఐపీఎస్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన ఆధారాలు, డిజిటల్ రికార్డులు, వాంగ్మూలాలను సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఫిర్యాదులో చేసిన ఆరోపణలు దర్యాప్తులో ఉన్నాయని, వాటి వాస్తవాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.ఆత్మహత్యాయత్నంతో కేసులో కొత్త మలుపుఇదిలా ఉండగా.. కేసు నమోదైన తర్వాత ఉదయ్ కృష్ణారెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఆత్మహత్యాయత్నానికి ముందు తన తప్పు లేదంటూ వాట్సాప్ స్టేటస్ పెట్టినట్లు సమాచారం. లైంగిక వేధింపులు అవాస్తవమని, చట్టంపై నమ్మకముంది.. న్యాయం గెలిచి తీరుతుంది అని ఇన్‌స్టాగ్రామ్‌లోనూ మరో పోస్టులో ఉదయ్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఒకవైపు మహిళా ట్రైనీ ఐపీఎస్ చేసిన తీవ్ర ఆరోపణలు.. మరోవైపు కేసు నమోదైన తర్వాత ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం ఘటనతో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.సిటీ పోలీసుల ప్రకటనఉదయ్ ఆత్మహత్యాయత్నం ఘటనపై సిటీ పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు. అమీర్‌పేట లీలా నగర్‌లోని ఓ అపార్ట్మెంట్లో ఉదయ్ ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అది అతని స్నేహితురాలి నివాసంగా నిర్ధారణ అయ్యింది. కేసు నమోదు అయ్యాక కుటుంబ సభ్యులు అతనికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. అయినా అతను కుంగిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఉదయం 9.30 ప్రాంతంలో ఎస్సార్‌నగర్‌లోని ఓ ఆస్పత్రికి అతన్ని తరలించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నాం అని పోలీసులు వెల్లడించారు. ఉదయ్ సస్పెన్షన్మహిళా ట్రైనీ ఐపీఎస్ ఫిర్యాదు నేపథ్యంలో ఉదయ్ కృష్ణారెడ్డిపై తాత్కాలిక సస్పెన్షన్ వేటు పడింది. కేసు దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ తాత్కాలిక చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. నిబంధనల ప్రకారం అకాడమీ అధికారులు చర్యలు తీసుకోగా.. తదుపరి నిర్ణయం కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ (DoPT) పరిధిలో ఉంటుందని స్పష్టం చేసినట్లు సమాచారం. -
బాలికపై అసభ్య ప్రవర్తన.. కానిస్టేబుల్‌పై పోక్సో కేసు!
నల్లగొండ: విధుల్లో ఉండి చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసు కానిస్టేబుల్‌పైనే పోక్సో కేసు నమోదవడం జిల్లాలో సంచలనంగా మారింది. నల్లగొండ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలో గుర్రంపోడు పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సత్యనారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు.పోలీసుల వివరాల ప్రకారం, సైకిల్‌పై వెళ్తున్న బాలికను నిందితుడు అడ్డగించి అసభ్యంగా తాకి వేధించించాడు . ఈ విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు వెంటనే వన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించారు. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.దర్యాప్తులో భాగంగా ఘటనాస్థలంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. నిందితుడు మాస్క్ ధరించి పలుచోట్ల సంచరించాడు, పోలీస్‌లు సీసీటీవీ దృశ్యాల సహాయంతో అతడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడు గుర్రంపోడు పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సత్యనారాయణగా పోలీసులు గుర్తించారు.ఇదిలా ఉండగా, గతంలో నకిరేకల్‌లో విధులు నిర్వహించిన సమయంలో కూడా అతడిపై రెండు పోక్సో కేసులు నమోదైనట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది. స్టేషన్ కు వచ్చే మహిళల పట్ల కూడా నీచంగా ప్రవర్తించే వాడని ఆరోపణలు ఆరోపణలు ఆరోపణలు ఉన్నాయి.ఇప్పటికే పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై చర్యలు తీసుకోకుండా వివిధ ప్రాంతాల్లో పోస్టింగులు ఇవ్వడంపై స్థానికంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
'మా ఇంటికి ఎందుకొచ్చారు.. వెళ్లిపోండి' అనడమే శాపమైంది..
హైదరాబాద్, బహదుర్‌పురా: ‘మా ఇంటికి ఎందుకు వచ్చారు.. వెళ్లిపోండి’ అన్నందుకు బాలుడు దారుణ హత్యకు గురైన ఘటన కాలాపత్తర్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ మహ్మద్ కలీల్ అహ్మద్ తెలిపిన వివరాల ప్రకారం.. కాలాపత్తర్ బిర్యానీ షా టెకిడీకి చెందిన మహ్మద్ ఫైజ్ ఎలియస్ అజాన్ (17) ఇంటర్మీడియట్ చదువుతున్నాడు.ఐదేళ్ల క్రితం కాలాపత్తర్‌లో ఉన్న అబ్రార్ ప్రస్తుతం బాలాపూర్‌లో నివాసం ఉంటున్నాడు. శనివారం రాత్రి అబ్రార్ తన స్నేహితులు ఆశ్వక్ (21), పర్హాన్ (20) సహా మరో ఇద్దరితో కలిసి మద్యం తాగారు. అబ్రార్ ఆదివారం తెల్లవారుజామున 2.45 గంటలకు ఆశ్వక్, పర్హాన్లను వెంటబెట్టుకుని కాలాపత్తర్ బిర్యానీ షా టెకిడీలోని అజాన్ ఇంటి వద్దకు వచ్చాడు. ఇక్కడికి ఎందుకొచ్చారంటూ అజాన్ మరో ఇద్దరు స్నేహితులతో కలిసి వారిని అడ్డుకున్నారు.ఈ క్రమంలో వీరి మధ్య వాగ్వాదం జరిగి ఆశ్వక్, పర్హాన్, అబ్రార్ కలిసి తలపై కత్తితో పొడవడంతో అజాన్ కుప్పకూలాడు. అతను మృతి చెందినట్లు తెలుసుకున్న అబ్రార్ తన స్నేహితులతో కలిసి నుంచి పరారయ్యాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అజాన్ మామ సాధిక్ అలీ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పాత కక్షల కారణంగా అజాన్‌ను హత్య చేశారా? లేక పథకం ప్రకారం జరిగిందా? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. నిందితులను పట్టుకునేందుకు మూడు టీంలు రంగంలోకి దిగాయి. -
శంకర్‌దాదా.. డాక్టర్ దందా
నగరంలో నకిలీ వైద్యులు దర్జాగా చెలామణి అవుతున్నారు. ఎలాంటి విద్యార్హత లేకున్నా, ప్రభుత్వ పరమైన అనుమతులు లేకుండా దశాబ్దాల కాలంగా దొరికితే దొంగ లేకుంటే డాక్టర్ అన్నట్లు ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. తమ పరిధిలో నడుస్తున్న ఆస్పత్రులు, క్లినిక్‌లు, నర్సింగ్ హోంలో జరిగే కార్యకలాపాలపై దృష్టి సారించాల్సిన జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండగా, మెడికల్ కౌన్సిల్ సభ్యులు అప్పుడప్పుడు తనిఖీలు చేపడుతున్నారు. కాగా.. గల్లీల్లోని నకిలీ వైద్యులు ప్రైవేటు ఆసుపత్రులకు కేసులను రిఫర్ చేస్తూ యాజమాన్యాల నుంచి ఖరీదైన బహుమతులు, నగదు పొందుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. – సాక్షి, హైదరాబాద్‌సికింద్రాబాద్ రాంనగర్‌కు చెందిన ల్యాబ్ టెక్నీషియన్ ఎలాంటి అర్హతలు లేకపోయినా వైద్యుడి అవతారమెత్తాడు. రోగులను పరీక్షించడం, ఇంజెక్షన్లు ఇవ్వడం, ఇతర వైద్య సేవలందిస్తుండటాన్ని మూడు రోజుల క్రితం గుర్తించిన టాస్‌్కఫోర్స్ బృందం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. గత నెల 26న సైదాబాద్ సింగరేణి కాలనీలో మెడికల్ కౌన్సిల్ సభ్యులు విశ్వసనీయ సమాచారం మేరకు ఆకస్మిక తనిఖీ చేసి ముగ్గురు నకిలీ వైద్యులను గుర్తించారు. ఎలాంటి అర్హతలు లేకుండానే స్టెరాయిడ్స్, యాంటీబయోటిక్స్, పెయిన్ కిల్లర్స్, హెచ్–1 డ్రగ్స్ వినియోగిస్తూ ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మెడికల్ కౌన్సిల్ సభ్యులు తెలిపారు.నెల రోజు క్రితం పాతనేరేడ్మెట్ మూడుగుళ్ల ప్రాంతంలో నకిలీ దంత వైద్యుడిని పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో సదరు వ్యక్తి ఇంటర్ కూడా పాస్ కాలేదని గుర్తించారు. గాడితప్పిన పర్యవేక్షణ.. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో గ్రేటర్ పరిధి విస్తరించింది. దీంతో ఆయా ప్రాంతాలపై సంబంధిత జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు పర్యవేక్షించాల్సి ఉన్నా.. పట్టణ పరిధిలోని ఆసుపత్రులపై మానిటరింగ్ గాడి తప్పుతోంది. ఏదైనా సంఘటన జరిగినప్పుడే హడావుడి చేయడం, ఆ తర్వాత షరామామూలే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. వర్షాకాలం వచి్చందంటే రోగాలు ప్రబలుతాయి.1.35 కోట్ల జనాభా ఉన్న గ్రేటర్ పరిధిలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు సుమారు 5 వేలకుపైగా ఉండగా.. ఎలాంటి అనుమతులు లేకుండా కొనసాగుతున్న క్లినిక్‌లు వందల సంఖ్యలోనే ఉంటాయని అంచనా. గత ఏడాదితో పోల్చితే ప్రస్తుతం తెలంగాణ మెడికల్ కౌన్సిల్ తనిఖీలు సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టింది. అందులోనూ కొన్ని ప్రాంతాల్లోనే తనిఖీలు చేపడుతున్నారంటూ విమర్శలను ఎదుర్కొంటున్నారు. నకిలీలను గుర్తించినా చట్టపరంగా చర్యలు తీసుకోవడంలో జిల్లా వైద్యారోగ్య శాఖ, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ మధ్య సమన్వయం లోపించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
మాజీ ప్రియురాలి కాబోయే భర్తకు ఫోన్ చేసి..
"వైషు కథ ముగిసిపోయింది’’ అంటూ తన మాజీ ప్రియురాలు వైష్ణవిని దారుణంగా పొడిచి చంపిన తర్వాత.. ఆమె పెళ్లి చేసుకోబోయే వ్యక్తికి సాహిల్ లవ్హారే అనే యువకుడు ఫోన్ చేసి చెప్పిన మాటలివి. ఈ ఘోరం జరిగిన కొద్ది గంటలకే.. ఘటనా స్థలానికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చెట్టుకు నిందితుడి మృతదేహం ఉరివేసుకుని వేలాడుతూ కనిపించింది. ఉన్మాద ప్రేమికుడి దారుణ ఘటన మహారాష్ట్రలోని నాసిక్‌లో వెలుగుచూసింది. తన మాజీ ప్రియురాలు మరొకరిని పెళ్లి చేసుకోబోతోందనే కోపంతో నిందితుడు ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు.నాసిక్‌లోని ఇందిరానగర్ ప్రాంతంలోని వనసంపద గార్డెన్ సమీపంలో సాహిల్, వైష్ణవి కలుసుకున్నారు. ఆ సమయంలో వారిద్దరి మధ్య సుమారు 30 నిమిషాల పాటు తీవ్రమైన వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన సాహిల్.. వైష్ణవిపై పదే పదే కత్తితో దాడి చేశాడు. దాంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. వైష్ణవిని హత్య చేసిన తర్వాత సాహిల్ కూడా ఆత్మహత్య చేసుకుని మరణించాడు.ఈ ఘటనలో మరో షాకింగ్ విషయం ఏమిటంటే.. హత్య జరగడానికి కొన్ని నిమిషాల ముందు వైష్ణవికి కాబోయే భర్తతో సాహిల్ ఫోన్ మాట్లాడటం.. సాహిల్ ఇక్కడే ఉన్నాడు.. త్వరగా రా’ అంటూ వైష్ణవి ఫోన్లో తన కాబోయే భర్తకు చెప్పింది. ఆ మాట వినగానే ఆమె కాబోయే భర్త తన పనిని వదిలేసి వెంటనే ఆమె ఉన్న లొకేషన్‌కు బయలుదేరాడు. అయితే, అతను ఫోన్ కట్ చేయకుండా అలాగే లైన్లో ఉంచాడు. దాదాపు 22 నిమిషాల పాటు సాహిల్, వైష్ణవిల మధ్య జరిగిన గొడవను అతను ఫోన్లో వింటూనే ఉన్నాడు. కానీ అతను అక్కడికి చేరుకునే లోపే.. ‘ఆమెను చంపేశాను’ అని సాహిల్ చెప్పాడు. మృతురాలు వైష్ణవి అమరావతి జిల్లా, నిందితుడు సాహిల్ యావత్మాల్ ఉమర్‌ఖేడ్‌కు చెందినవారు. -
అక్క ప్రేమ వివాహం చేసుకుందని..
కర్నూలు: అక్క ప్రేమ వివాహం చేసుకుందన్న మనస్తాపంతో ఒక యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని ఆగపల్లి–పెద్దతుండ్ల గ్రామాల మధ్య శనివారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది. మంచాల సీఐ మధు కథనం ప్రకారం.. లోయపల్లి గ్రామానికి చెందిన బూడిద అరుణ్ (18) వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్. ఇటీవల అతని సోదరి ఓ వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. ఇది ఇష్టం లేని అరుణ్ ఆగపల్లిలోని తన బంధువుల ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురై ఆగపల్లి–పెద్దతుండ్ల మార్గంలో ఓ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ‘నేను చనిపోతున్నా.. అక్క ప్రేమ వివాహం చేసుకోవడం నాకిష్టం లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా’.. అని తల్లిదండ్రులు, బంధువులకు ఫోన్ ద్వారా తెలియజేసి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. లోయపల్లిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు సీఐ తెలిపారు. -
మునుకుంట్ల ప్రేమికుల మృతి ఘటనలో ట్విస్ట్..!
నల్లగొండ జిల్లా: కట్టంగూర్ మండలం మునుకుంట్ల గ్రామంలో 24 గంటల వ్యవధిలో చోటుచేసుకున్న ఇద్దరు యువతీయువకుల మరణాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ముందుగా అనుమానాస్పద పరిస్థితుల్లో యువతి మృతి చెందగా, మరుసటి రోజే ఆమెతో ప్రేమలో ఉన్నట్లు చెబుతున్న యువకుడు ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ రెండు ఘటనల మధ్య ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.వివరాల ప్రకారం.. మునుకుంట్ల గ్రామానికి చెందిన లక్ష్మీ ప్రసన్న (23) శుక్రవారం అనుమానాస్పద పరిస్థితుల్లో ఉరికి వేలాడుతూ కనిపించింది. కుటుంబ సభ్యులు ఆమెను గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.లక్ష్మీ ప్రసన్న సూర్యాపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతోంది. ఆమె మృతిపై కుటుంబ సభ్యులు అదే గ్రామానికి చెందిన చరణ్ అనే యువకుడిపై అనుమానాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. గత కొంతకాలంగా లక్ష్మీ ప్రసన్న, చరణ్ ఇద్దరూ ప్రేమించుకుంటున్నారని గ్రామస్తులు చెబుతున్నారు.అయితే, ప్రసన్న మృతి ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్న సమయంలోనే శనివారం ఉదయం చరణ్ గ్రామ శివారులో తాటి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలిసి గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వరుసగా 24 గంటల్లో ఇద్దరు యువతీయువకులు ప్రాణాలు కోల్పోవడంతో మునుకుంట్ల గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.అయితే, లక్ష్మీ ప్రసన్న మృతి, చరణ్ ఆత్మహత్య ఘటనలకు పరస్పర సంబంధం ఉందా? ప్రేమ వ్యవహారమే ఈ విషాదానికి కారణమా? లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. -
నాలుగు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురి దుర్మరణం
హైదరాబాద్: రహదారులు రుధిర ధారలుగా మారాయి. మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. గ్రేటర్ పరిధిలో గురువారం అర్ధరాత్రి, శుక్రవారం మధ్యాహ్నం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఒకరు పాఠశాల విద్యార్థి, మరొకరు ఇంటర్మీడియట్ విద్యార్థి, ఓ మహిళ ఉన్నారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం..మేడ్చల్‌లో బైక్‌ను ఢీకొట్టడంతో.. నగర శివారు ఐడీపీఎల్ దిల్‌కుష్‌నగర్‌కు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థి సొహైల్ (18), కుత్బుల్లాపూర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థి సుమిత్ గైక్వాడ్ (17) గురువారం అర్ధరాత్రి మేడ్చల్ నుంచి కొంపల్లి వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. మార్గంమధ్యలో ఓఆర్ఆర్ అండర్ బ్రిడ్జి సమీపంలోకి రాగానే వీరి బైక్‌ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో సొహైల్, సుమిత్ గైక్వాడ్ రోడ్డుపై పడి అక్కడికక్కడే మృతి చెందారు. మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి కారణమైన వాహనం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సమీప ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.కీసర ఓఆర్ఆర్పై..మెదక్ జిల్లా పాపన్నపేటకు చెందిన రషీద్ (40) మటన్ షాప్ యజమాని. అదే గ్రామానికి చెందిన డ్రైవర్ రాములు (60), గౌస్ కలిసి బొలేరో వాహనంలో గొర్రెల లోడ్‌తో నగర శివారు చెంగిచర్లలోని మండీకి వెళ్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు నిద్ర రావడంతో కీసర ఓఆర్ఆర్పై రాంపల్లి దాయర వద్ద బొలేరో వాహనాన్ని ఎడమ వైపు ఆపి నిద్రించారు. గుర్తు తెలియని వాహనం వెనక నుంచి వచ్చి బొలేరో వాహనాన్ని ఢీకొట్టి వెళ్లిపోయింది. వాహనంలో నిద్రిస్తున్న రషీద్, రాములు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందారు. గౌస్‌కు కాలు విరిగింది. వాహనంలోని కొన్ని గొర్రెలు సైతం మృతిచెందాయి. మృతుడు రషీద్‌కు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. రాములుకు భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు కీసర సీఐ ఆంజనేయులు చెప్పారు. మెట్రో పిల్లర్‌ను బైక్ ఢీ..జగిత్యాల జిల్లా బీజ్పూర్ మండలం నర్సింహుల పల్లె గ్రామానికి చెందిన చెర్పూరి అఖిలేష్ యాదవ్ (24) నగరంలోని కేపీహెచ్‌బీ కాలనీలోని ఓ హాస్టల్లో ఉంటూ ఆస్పత్రిలో ఎలక్ట్రిషియన్‌గా పని చేస్తున్నాడు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నానికి చెందిన మహమ్మద్ యూనిస్ (26) ప్రైవేట్ ఉద్యోగ చేస్తూ ఇక్కడి హాస్టల్లో ఉంటున్నాడు.వీరిద్దరూ కలిసి గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత బైక్‌పై జేఎన్టీయూ నుంచి కూకట్పల్లి వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో కూకట్పల్లి భాగ్యనగర్ బస్టాప్ వద్ద వీరి బైక్ అదుపుతప్పి మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టడంతో అఖిలేష్ యాదవ్ అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ వెనక కూర్చున్న మహమమ్మద్ యూనిస్‌ను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. అఖిలేష్ తండ్రి నారాయణ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
కూతురిని ఆఫ్రికా వ్యభిచార గృహానికి అమ్మేశారు
బెంగళూరు: డబ్బు కోసం 20 ఏళ్ల యువతిని తల్లిదండ్రులు ఆఫ్రికాలో వ్యభిచార గృహానికి అమ్మిన ఘటన చిక్కమగళూరులో వెలుగులోకి వచ్చింది. సంచారజాతికి చెందిన దంపతులు మూలికల కోసం ఆఫ్రికాలోని సెనగల్ దేశానికి వెళ్లారు. అక్కడ తమ కూతురిని రూ.7 లక్షలకు విక్రయించారు. బాధితురాలు ఎలాగో చిక్కమగళూరులో ఉంటున్న బ«ంధువులకు వీడియో కాల్ చేసి తన దుస్థితిని వివరించింది. సహాయం చేయాలని వేడుకొంది. అక్కడి భారత రాయబార సిబ్బంది, పోలీసులు ఆమెను కాపాడారు. ఈలోపు తల్లిదండ్రులు ఊరికి వచ్చేశారు. కామాంధుడు అరెస్ట్ = మహిళల లోదుస్తుల చోరీ కేసు దొడ్డబళ్లాపురం: మహిళల లోదుస్తులు చోరీ చేస్తున్న కామాంధుడిని బెంగళూరు ఇందిరా నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. హొయ్సళ నగర్లో నివసిస్తున్న పలువురు మహిళలు ఉతికి ఆరేసిన తమ లోదుస్తులు కనబడకుండా పోతుండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.రు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేసి నిందితుడిని కనిపెట్టారు. అస్సాంకు చెందిన అబ్దుల్ హుసేన్ అరెస్ట్ మహిళలు ఉతికి ఆరేసిన లోదుస్తులను తస్కరించి వాటిని ధరించి కొన్ని రోజులకు మళ్లీ తెచ్చి అక్కడే పెట్టి వెళ్లిపోయేవాడు. ఈ దృశ్యాలు సీసీ టీవీలో రికార్డు అయ్యాయి. సీసీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు నిందితుడు అబ్దుల్ హుసేన్‌ను అరెస్ట్ చేశారు. -
దారుణం.. ప్రియుడితో కలిసి ఏడేళ్ల కుమారుడిపై..
సాక్షి, చిత్తూరు జిల్లా: వీ.కోటలో వెలుగు దారుణ ఘటన జరిగింది. ప్రియుడితో కలిసి ఏడేళ్ల కుమారుడిని తల్లి హింసించింది.. ప్రియుడితో కలిసి కసాయి తల్లి.. కుమారుడిపై బ్లేడుతో దాడి చేసింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కన్నతల్లి తన ప్రియుడుతో కలిసి కొడుకును అతి కిరాతకంగా చిత్రహింసలకు గురిచేసింది.వీ.కోట ఈశ్వర్ నగర్లో నివాసముంటున్న ఇంద్రజకు భర్త చనిపోగా.. ఎర్ర చేనుకు చెందిన రాజుతో వివాహేతర సంబంధం ఏర్పడింది. తమ సంబంధానికి ఏడేళ్ల కొడుకు విశాల్ అడ్డుగా ఉన్నాడని భావించిన తల్లి.. ప్రియుడుతో కలిసి శరీరం, ప్రైవేట్ పార్ట్‌లలో బ్లేడుతో విచక్షణారహితంగా కోసింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. బాలుడిని కాపాడి ఆసుపత్రికి తరలించింది. -
చనువుగా మాట్లాడతూ.. ఓచర్ రాస్తానని నమ్మించి..
తూర్పు గోదావరి, కైకలూరు: బ్యాంకులో అన్నీ తెలిసిన వ్యక్తిగా చలామణి అవుతాడు. అక్కడ వస్తువులు సర్దుతున్నట్టు నటిస్తూ బ్యాంకు సిబ్బందితో చనువుగా మాట్లాడతాడు. చదువురాని డ్వాక్రా మహిళలను టార్గెట్ చేస్తూ.. అదును చూసి ఫేక్ ఓచర్లు రాసి సొమ్ములు కాజేస్తున్నాడు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన షేక్ నాగూర్ మీరావలి.ఇదే తరహాలో కృష్ణా, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో మీరావలిపై 50కు పైగా కేసులు నమోదయ్యాయి. బ్యాంకుల వద్దకు వచ్చిన డ్వాక్రా మహిళలు, వృద్ధులు, నిరక్షరాస్యులను లక్ష్యంగా చేసుకుని తాను బ్యాంకు ఉద్యోగి, డ్వాక్రా సీసీనంటూ నమ్మించి నగదు తీసుకుని కౌంటర్లో చెల్లిస్తానని నమ్మిస్తున్నాడు. వారికి ఫేక్ ఓచర్ అందించి సొమ్ముతో ఉడాయిస్తున్నాడు.మోసం బట్టబయలు ఇలా.. కలిదిండి మండలం గుర్వాయిపాలేనికి చెందిన బొల్లా ముత్యాలమ్మ గత నెల 6న కలిదిండి ఎస్బీఐ బ్యాంకుకు డ్వాక్రా రుణ వాయిదా చెల్లించేందుకు వెళ్లింది. అప్పటికే కొన్ని రోజులుగా డ్వాక్రా మహిళలకు తాను బ్యాంకు సిబ్బంది, వెలుగు కార్యాలయానికి చెందిన వ్యక్తిగా మీరావలి నమ్మిస్తూ వచ్చాడు. దీంతో ఓచర్ రాసి నగదు కౌంటర్లో చెల్లిస్తానని చెప్పగా ముత్యాలమ్మ నమ్మింది. అతడికి రూ.61 వేలు ఇవ్వగా.. కౌంటర్ వద్దకు వెళ్లి నగదు చెల్లించకుండా అప్పటికే తన జేబులో సిద్ధం చేసుకున్న చెల్లింపు రశీదును ఆమెకు ఇచ్చి మోసం చేశాడు.ఆ రశీదు తీసుకుని ఆమె ఇంటికి వెళ్లిపోయింది. తాజాగా తిరగి వాయిదా చెల్లించేందుకు వెళ్లగా, అసలు బండారం బయట పడింది. ఆమె కలిదిండి పోలీసులను ఆశ్రయించగా.. బ్యాంకులో సీసీ పుటేజీని పరిశీలించి నాగూల్ మీరావలిని గుర్తించారు. అతడికి ఆచూకీ తెలిసిన వారు పోలీసు సిబ్బందికి సమాచారం అందించాలని కోరారు. బ్యాంకుల వద్ద ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని కలిదిండి ఎస్సై పవన్‌కుమార్ సూచించారు. -
వివాహేతర సంబంధం.. ప్రియుడిని రాడ్డుతో కొట్టి దారుణ హత్య!
ప్రకాశం, సంతమాగులూరు(అద్దంకి): వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ప్రియుడిని మహిళ కుమారుడు రాడ్డుతో కొట్టి దారుణంగా హత్య చేసిన ఘటన సంతమాగులూరు మండలం పాతమాగులూరులో గురువారం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. పాతమాగులూరుకు చెందిన సజ్జల పిచ్చిరెడ్డి (47) వ్యవసాయం చేస్తుంటాడు.ఆయనకు భార్య అనూష, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కాగా, పిచ్చిరెడ్డికి అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఆ మహిళ కుమారుడు విష్ణువర్ధన్ చైన్నెలో ఉద్యోగం చేస్తున్నాడు. బుధవారం రాత్రి చైన్నె నుంచి వచ్చిన విష్ణు నేరుగా ఇంటికి వెళ్లాడు. అప్పటికే తన ఇంట్లో ఉన్న పిచ్చిరెడ్డిని చూసి తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. విష్ణును గమనించిన పిచ్చిరెడ్డి భయంతో బయటకు పరుగులు తీశాడు. అయితే, అతన్ని వెంబడించిన విష్ణువర్ధన్ ఇనుప రాడ్‌తో తలపై బలంగా కొట్టడంతో పిచ్చిరెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.బుధవారం రాత్రి బయటకు వెళ్తున్నానని చెప్పిన భర్త తిరిగి రాకపోవడంతో.. ఆ మహిళ ఇంటికే వెళ్లి ఉంటాడని భార్య అనూష భావించింది. గురువారం ఉదయం భర్త హత్యకు గురయ్యాడన్న వార్త తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరైంది. తన భర్తను సదరు మహిళ కుమారుడే హత్య చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంతమాగులూరు సీఐ శేషగిరిరావు సమాచారంతో దర్శి డీఎస్పీ పి.బాలమురళీకృష్ణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌ను రప్పించి వేలిముద్రలు, ఆధారాలు సేకరించారు.లొంగిపోయిన నిందితుడుహత్యకు పాల్పడిన విష్ణువర్ధన్ తన తల్లితో కలిసి వెళ్లి అద్దంకి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. గతంలోనే వీరి సంబంధం గురించి తెలుసుకున్న విష్ణువర్ధన్.. తమ ఇంటికి రావొద్దని పిచ్చిరెడ్డిని తీవ్రంగా హెచ్చరించినట్లు స్థానికులు చెబుతున్నారు.ఉలిక్కిపడ్డ మండల వాసులుఫ్యాక్షన్ ప్రాంతంగా గుర్తింపు ఉన్న పాతమాగులూరులో ఉదయాన్నే హత్య వార్త దావానలంలా వ్యాపించింది. ఏ రాజకీయ హత్య జరిగిందోనని మండల ప్రజలు తొలుత తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అయితే, హత్యకు దారితీసిన అసలు కారణం తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. -
షాబాద్ హత్యల కేసులో కీలక పరిణామం
సాక్షి, రంగారెడ్డి: సంచలనం సృష్టించిన షాబాద్ ఆరు హత్యల కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. భార్య, ఇద్దరు బిడ్డలతో పాటు మైనర్ బాలిక, ఇద్దరు మహిళలను అత్యంత దారుణంగా హత్య చేసిన నిందితుడు పార్వతి రాజ్‌కుమార్ మృతిపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. రాజ్‌కుమార్ సెల్ఫీ వీడియో, అతడి మొబైల్ ఫోన్లో లభించిన వివరాల ఆధారంగా కేసు నమోదు చేసినట్లు సమాచారం. అతడి మరణం ఆత్మహత్యేనా? లేదంటే ఇతర కోణాలేమైనా ఉన్నాయా? అనే అంశాలపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.జులై 10 తేదీ అర్ధరాత్రి సమయంలో రాజ్‌కుమార్ దైవాలగూడలో నరమేధం సృష్టించాడు. రెండు రోజుల తర్వాత.. కొత్తూరు మండలం పెంజర్ల సమీపంలోని ఓ రియల్ ఎస్టేట్ వెంచర్లో రాజ్‌కుమార్ మృతదేహం లభించిన విషయం తెలిసిందే. మృతదేహం పక్కనే పురుగుమందు డబ్బా ఉండటంతో అతడు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అనంతరం మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు.సెల్ఫీ వీడియోలో ఏముంది?రాజ్‌కుమార్ మొబైల్ ఫోన్లో పోలీసులు గుర్తించిన సెల్ఫీ వీడియో ఇప్పుడు కేసులో కీలక ఆధారంగా మారింది. అందులో తనపై నమోదైన పోక్సో కేసు, తన జీవితంలో జరిగిన పరిణామాలను ప్రస్తావిస్తూ.. బాధితులను హత్య చేసి అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. హత్యలకు కొన్ని గంటల ముందే ఈ వీడియోను రికార్డు చేసినట్లు గుర్తించారు.అలాగే రాజ్‌కుమార్ రాసినట్లుగా భావిస్తున్న నాలుగు పేజీల లేఖ కూడా వెలుగులోకి వచ్చింది. అందులోనూ తన చర్యలకు సంబంధించిన వివరాలు ఉన్నట్లు సమాచారం. ఈ లేఖ, సెల్ఫీ వీడియోను పోలీసులు ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు.మృతిపై కూడా కేసు నమోదురాజ్కుమార్ మృతికి సంబంధించి అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసిన పోలీసులు.. సెల్ఫీ వీడియో, పోస్టుమార్టం నివేదిక, ఫోరెన్సిక్ ఆధారాలను పరిశీలించి తదుపరి చర్యలు చేపట్టనున్నారు. వీడియోలో పేర్కొన్న వ్యక్తులను పోలీసులు విచారించే అవకాశం కనిపిస్తోంది. చట్టపరమైన ప్రక్రియలో భాగంగానే మృతిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం.ఏం జరిగింది?పోక్సో కేసు నమోదుపై కక్ష పెంచుకున్న రాజ్‌కుమార్.. గత శుక్రవారం రాత్రి బాలిక, ఆమె తల్లి, నానమ్మలను హత్య చేశాడు. అనంతరం ఇంటికి వెళ్లి భార్యతో పాటు ఇద్దరు చిన్నారులను కూడా కిరాతకంగా చంపేశాడు. కేవలం అరగంట వ్యవధిలోనే.. మొత్తం ఆరు హత్యలు చేశాడు. అనంతరం తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పి.. తాను చనిపోతున్నానంటూ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి పరారయ్యాడు.రెండు రోజుల వేట తర్వాత..ఆరు హత్యల అనంతరం పరారైన రాజ్‌కుమార్ కోసం పోలీసులు 14 ప్రత్యేక బృందాలతో విస్తృత గాలింపు చేపట్టారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, హైవేలు, లాడ్జీలు, దాబాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో పెంజర్ల సమీపంలో అతడి మృతదేహం లభించడంతో గాలింపు ముగిసింది.కుటుంబం నిరాకరించడంతో..రాజ్‌కుమార్ మృతదేహాన్ని స్వీకరించేందుకు కుటుంబ సభ్యులు నిరాకరించారు. దీంతో పోలీసుల ఆధ్వర్యంలో చేవెళ్ల మున్సిపాలిటీ సిబ్బంది స్థానిక శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. -
పటాన్చెరు ఓఆర్ఆర్ పరిధిలో మహిళ దారుణ హత్య
మెదక్, పటాన్చెరు: ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు చెట్ల పొదల్లో ఓ మహిళను దారుణంగా హత్య చేసిన ఘటన పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. సదాశివపేటకు చెందిన మంజుల(45) 15 ఏళ్ల క్రితం భర్త చనిపోవడంతో బతుకుదెరువు కోసం ఇద్దరు కొడుకులను తీసుకుని జీ.పీ డివిజన్ పరిధిలోని అంబేడ్కర్ కాలనీకి వచ్చి ఉంటూ, స్థానికంగా మేస్త్రీ కింద కూలిపని చేస్తుంది. ఇద్దరు కుమారులు కూడా కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.ఈ క్రమంలో బుధవారం సాయంత్రం అంబేడ్కర్ కాలనీ ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కాగా గురువారం ఉదయం పటాన్చెరు శివారులో ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్లో పక్కన మహిళ హత్యకు గురైందని సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు మంజుల తలకు, కంటికి తీవ్ర గాయాలు ఉన్నట్లు గుర్తించారు. గుర్తుతెలియని వ్యక్తులు ఆమెను అక్కడికి తీసుకువచ్చి తలపై బలంగా దాడి చేసి హత్య చేసి ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. మృతురాలు ధరించిన దుస్తులు కూడా చిరిగిపోయి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలాన్ని క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ బృందం, డీసీపీ చింతమనేని శ్రీనివాస్, ఏసీపీ శ్రీనివాస్, సీఐ వినాయక్ రెడ్డి, సిబ్బందితో కలసి పరిశీలించి ఆధారాలు సేకరించారు. హత్యకు గల కారణాలు, ఘటనకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నారు. -
నిందితుడి అరెస్టుకి 'మమ్మీ–డాడీ’ టాటూనే కీలక ఆధారం..
సాక్షి, హైదరాబాద్: బాలీవుడ్‌తో సంబంధాలున్నట్లు నమ్మించి, ఫారెక్స్ వ్యాపారికి చెందిన ముగ్గురు ఉద్యోగులను మోసం చేసి, ముంబైలో నిర్భంధించిన ఓ ముఠా వారి యజమాని నుంచి రూ.55 లక్షలు వసూలు చేసింది. ఆ మొత్తాన్ని హైదరాబాద్‌లోని తన అనుచరుడికి ఇచ్చేలా చేసి బందీలను వదిలి పారిపోయి వచ్చింది. దీనిపై ముంబైలోని వకోల పోలీసుస్టేషన్లో కేసు నమోదు కాగా... దర్యాప్తు చేసిన క్రైమ్ బ్రాంచ్ యూనిట్–8 అధికారులు సోమవారం హైదరాబాద్‌లో దాడులు చేశారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి మంగళవారం ముంబైకి తరలించారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం ముంబైతో పాటు సిటీలోనూ గాలిస్తున్నారు. ఈ కేసు కొలిక్కి రావడానికి ఓ నిందితుడి చేతిపై ఉన్న ‘మమ్మీ–డాడీ’ టాటూనే కీలక ఆధారమైంది.బాలీవుడ్ ఫైనాన్సియర్లుగా నమ్మించి...ఢిల్లీకి చెందిన మయాంక్ శర్మ అలియాస్ లడ్డూ కొన్నేళ్లుగా ముంబైలో ఉంటున్నాడు. తాను బాలీవుడ్‌కు చెందిన ఫైనాన్సియర్ కృష్ణగా వకోల ప్రాంతానికి చెందిన ఫారెక్స్ వ్యాపారిని పరిచయం చేసుకున్నాడు. దేశవిదేశాల్లో జరిగే షూటింగ్స్‌ను అవసరమైన నగదు అందిస్తూ ఉంటానని, తనతో కలిసి పని చేస్తే భారీ లాభాలు ఉంటాయని చెప్పాడు. ఫారెక్స్ వ్యాపారి ఇది నమ్మడంతో ఈ నెల 8న అతడిని సంప్రదించిన మయాంక్ హైదరాబాద్‌లో ఓ సినిమా షూటింగ్ జరుగుతోందని, దాని నిర్మాతకు అక్కడ రూ.55 లక్షలు ఇవ్వాల్సి ఉందని చెప్పాడు. ఆ మొత్తాన్ని తాను ముంబైలో అప్పగిస్తానని నమ్మబలికాడు. దీనికి అంగీకరించిన వ్యాపారి ముంబైలో నగదు తీసుకునే బాధ్యతల్ని తన ఉద్యోగి ఖుష్పాల్ మోహన్ సింగ్‌కు అప్పగించాడు.ఓ ఫ్లాట్‌లో నిర్భంధించి, బెదిరించి...ఈ నెల 9న ఖుష్పాల్ను సంప్రదించిన మయాంక్ ఆ రోజు మధ్యాహ్నం సుమారు 12.30 గంటలకు కలీనా ప్రాంతంలోని సీఎస్టీ రోడ్డులో ఉన్న నవరత్న భవనానికి రావాలని సూచించాడు. అందులోని రూమ్ నం.901లో తాను బస చేశానని, వస్తే రూ.55 లక్షలు ఇస్తానని, వెంటనే హైదరాబాద్‌లో డెలివరీ చేయాల్సి ఉంటుందని చెప్పాడు దీనికి అంగీకరించిన ఖుష్పాల్ తన సహోద్యోగులు విక్రమ్, మహావీర్లతో కలిసి అక్కడకు వెళ్లారు. అప్పటికే అక్కడ తన అనుచరులు ఉత్తరప్రదేశ్‌కు చెందిన మజీద్ ఖాన్ అలియాస్ మన్ను, థానే నివాసి ఆకాశ్ అగర్వాల్ అలియాస్ కబీర్‌లతో కలిసి వేచి ఉన్న మయాంక్ ఆ ముగ్గురినీ నిర్భంధించాడు. ఇక్కడ రూ.55 లక్షలు ముట్టినట్లు తమ యజమానికి ఫోన్ చేసి చెప్పాలని, అలా కాకుంటే చంపేస్తామంటూ తుపాకీతో బెదిరించారు. దీంతో ఖుష్పాల్ అలానే చేశాడు.నగరానికి పారిపోయి వచ్చిన గ్యాంగ్...ఇది నమ్మిన ఫారెక్స్ సంస్థ యజమాని హైదరాబాద్‌లో వేచి ఉన్న ఇద్దరు మయాంక్ అనుచరులకు రూ.55 లక్షలు అందేలా చేశాడు. నగదు ముట్టినట్లు ఖరారు చేసుకున్న ఆ ముగ్గురూ బందీలను వదిలిపెట్టి హైదరాబాద్ పారిపోయి వచ్చేశారు. తన అనుచరుల నుంచి నగదు తీసుకుని, వారి కొంత ఇచ్చి ముంబై పంపేశారు. మయాంక్, మజీద్, ఆకాశ్ మాత్రం కొన్నాళ్లు షెల్టర్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడి ఓ గెస్ట్‌హౌస్‌లో బస చేశారు. ఖుష్పాల్ ద్వారా జరిగిన విషయం తెలుసుకున్న ఫారెక్స్ వ్యాపారి దీనిపై వకోల పోలీసులకు ఫిర్యాదు చేయించారు. ఆ ఠాణాలో కేసు నమోదు కాగా... ఈ గ్యాంగ్ కోసం క్రైమ్ బ్రాంచ్ యూనిట్–8కు చెందిన ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. ఇన్స్పెక్టర్ లక్ష్మీకాంత్ సాలుంఖే నేతృత్వంలోని టీమ్ దర్యాప్త చేపట్టింది.‘మమ్మీ–డాడీ’ టాటూని చూసి...ఈ బృందం నవరత్న భవనానికి వెళ్లి అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌ను పరిశీలించింది. అందులో దుండగుల కదలికలు రికార్డు కాగా... ఆకాశ్ చేతిపై ఉన్న ‘మమ్మీ–డాడీ’ అనే టాటూని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గమనించారు. అతడిపై గతంలోనూ కొన్ని కేసులు ఉండటంతో అధికారులు వెంటనే అతడిని గుర్తించారు. ఎక్కడ ఉన్నాడనే అంశాన్ని సాంకేతికంగా ఆరా తీయగా హైదరాబాద్‌లో ఉన్నట్లు తేలింది. దీంతో సోమవారం సిటీకి చేరుకున్న ప్రత్యేక బృందం గెస్ట్‌హౌస్‌పై దాడి చేసి ఆకాశ్‌తో పాటు మయాంక్, మజీద్‌లను పట్టుకుంది. వీరిని మంగళవారం ముంబై తరలించి కోర్టులో హాజరుపరిచింది. న్యాయస్థానం పోలీసు కస్టడీకి ఇవ్వడంతో విచారిస్తోంది. పరారీలో ఉన్న అజీజుద్దీన్ ఖాన్, గంగా రాజీవ్ కోసం గాలిస్తున్నారు. -
మేక మాంసంలో కల్తీ.. విస్తుపోయే నిజాలు!
హైదరాబాద్, నాంపల్లి: కల్తీ మేక మాంసాన్ని విక్రయించిన వ్యక్తిపై చీటింగ్ కేసుతో పాటు పలు సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. ఈ నెల 1వ తేదీన హబీబ్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని మల్లేపల్లి బడే మసీదు వద్ద మహ్మద్ ఉస్మాన్ ఖురేషి దుకాణంపై హెచ్– ఫాస్ట్ ఎస్సై నవీన్, జీహెచ్ఎంసీ వెటర్నరీ వైద్యాధికారి డాక్టర్ శ్రీకాంత్, హబీబ్‌నగర్ ఎస్సై అశోక్, సీసీఎస్ పోలీసులు దాడులు జరిపారు. దుకాణంలోని 50 కిలోల కల్తీ మాంసాన్ని స్వాదీనం చేసుకున్నారు. సీజ్ చేసిన మాంసాన్ని చెంగిచర్లలోని నేషనల్ మీట్ రీసెర్చి ఇనిస్టిట్యూట్ (ఎన్ఎంఆర్ఐ) ల్యాబ్‌కు తరలించి డీఎన్ఏ పరీక్షలు చేయగా.. విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. మేక మాంసంలో బర్రె దూడ మాంసం కలిపినట్లుగా నిర్ధారించి సంబంధిత అధికారులకు నివేదిక అందజేశారు.ఈ నేపథ్యంలో కల్తీ మాంసం విక్రయించిన మహ్మద్ ఉస్మాన్ ఖురేషిపై త్వరలో చార్జ్‌షీట్‌ను నమోదు చేసి రిమాండ్‌కు తరలించే అవకాశం ఉందని సమాచారం. కల్తీ కేటుగాళ్లు ఎక్కువగా బర్రె దూడలనే ఎంచుకుని మేక, గొర్రె మాంసంలో కలుపుతూ విక్రయిస్తుంటారని పోలీసులు పేర్కొన్నారు. మేక, గొర్రె మాంసంలో కల్తీ చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్– ఫాస్ట్ అధికారులు హెచ్చరించారు. -
ప్రియుడి సోదరుడి కక్ష.. అమాయక ప్రియురాలు బలి
ప్రేమ పేరుతో మొదలైన పరిచయం చివరకు విషాదాంతమైంది. ప్రేమపై యువతికి నమ్మకం దెబ్బతింది. చివరకు చోటుచేసుకున్న పరిణామాలు యువతి ప్రాణాలనే బలితీసుకున్నాయి. ఈ ఘటన బెంగళూరులో తీవ్ర కలకలం రేపింది.లా చదువుతున్న అమృత అనే విద్యార్థిని ధనుష్ అనే ఓ యువకుడిని ప్రేమించింది. అయితే, ఆ యువకుడికి అప్పటికే పెళ్లి జరిగి, ఓ పిల్లాడు కూడా కూడా ఉన్నాడు. తన భార్యతో విడాకులు తీసుకున్నాడు. ఆ విషయాన్ని తన ప్రియురాలు అమృతకు చెప్పలేదు.అమృత ఓ పిజ్జా దుకాణంలో పార్ట్‌టైమ్ ఉద్యోగం కూడా చేసేది. అమృతకు ధనుష్‌తో కుటుంబ పరిచయం ద్వారా మాటలు కలిశాయి. ఇద్దరూ ప్రేమించుకున్నారు. అయితే, ధనుష్‌కు ఇప్పటికే విడాకులు అయ్యాయన్న విషయం, ఓ బిడ్డ ఉన్న విషయాన్ని దాచిపెట్టాడని తెలుసుకున్న తర్వాత అమృత బ్రేకప్ చెప్పేసింది.ఆ యువతి బ్రేకప్ నిర్ణయం తీసుకున్నందుకు ధనుష్ సోదరుడు సూర్య అమృతను బెదిరించినట్టు ఆరోపణలు ఉన్నాయి. జులై 13న అమృతను ఇంటి సమీపంలో సూర్య అడ్డగించాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో సూర్య అమృత ఛాతీ, వీపుపై కత్తితో పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్ర గాయాలతో ఉన్న అమృతను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె బుధవారం మరణించింది.దాడి చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సూర్యతో పాటు ధనుష్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరిపైనా కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది. అమృత మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్ష కోసం సీవీ రామన్ ఆసుపత్రికి తరలించారు. -
సియా గోయల్ కుటుంబానికి బిగ్ షాక్
యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో నిందితురాలిగా ఉన్న సియా గోయల్ పేరు మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఆమె బెయిల్ కోసం తీవ్రంగా యత్నిస్తున్న కుటుంబానికి ఇప్పుడు పెద్ద షాకే తగిలింది. సియా కుటుంబం నిర్వహించే మసాలా, డ్రై ఫ్రూట్స్ వ్యాపార సంస్థపై మహారాష్ట్ర ఆహార భద్రతా విభాగం (FDA) చర్యలు తీసుకుంది. నిబంధనల ఉల్లంఘనలు, కల్తీ అనుమానాల నేపథ్యంలో దుకాణ కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. పుణెలోని మార్కెట్ యార్డ్ ప్రాంతంలో ఉన్న బీజీ గోయల్ అండ్ కంపెనీ (M/s BG Goyal and Company) అనే సంస్థను సియా కుటుంబం నిర్వహిస్తోంది. ఈ షాపులో తాజాగా ఎఫ్‌డీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా కొన్ని ఉత్పత్తులను గుర్తించారు. వీటిలో పసుపు పొడి, నువ్వులు, సోయాబీన్ చంక్స్ వంటి ఉత్పత్తులు ఉన్నాయి. తనిఖీల సందర్భంగా మొత్తం 4,172 కిలోల ఆహార ఉత్పత్తులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.8.14 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఆహార భద్రత, ప్రమాణాల చట్టం (FSS Act) ప్రకారం తప్పనిసరిగా పాటించాల్సిన నిబంధనలను సంస్థ ఉల్లంఘించిందని ఎఫ్‌డీఏ ఒక ప్రకటనలో పేర్కొంది. లైసెన్స్ వివరాల్లో అవసరమైన మార్పులు చేయాలని గతంలో సూచించినప్పటికీ.. సంస్థ నుంచి సరైన స్పందన రాకపోవడంతో వ్యాపార కార్యకలాపాలను నిలిపివేయాలని నోటీసులు జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఉత్పత్తుల లేబులింగ్‌లో నిబంధనల ఉల్లంఘనలు ఉన్నట్లు, కల్తీ జరిగి ఉండొచ్చన్న అనుమానంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.ఇదిలా ఉండగా.. సియా గోయల్ పేరు దేశం అంతటికి తెలిసిందే. తన కాబోయే భర్త కేతన్ (25)ను ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి లోహగఢ్ కోట వద్ద నుంచి తోసి హత్య చేసిన కేసులో ఆమె నిందితురాలిగా ఉంది. జూన్ 18న ఈ ఘటన జరగ్గా.. అనేక మలుపులు తిరిగిన ఈ కేసు చివరకు సియా, చేతన్ అరెస్ట్‌తో ఓ కొలిక్కి వచ్చింది. అయితే కేతన్‌ను తోసిందెవరు? అనే మిస్టరీ ఇంకా వీడాల్సి ఉంది. ఈ విషయంలో నిందితులిద్దరూ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. అలాగే ఇద్దరూ రహస్య వివాహం చేసుకున్నట్లు కూడా పోలీసులు భావిస్తున్నారు. ఇటు హత్య కేసు విచారణ కొనసాగుతున్న వేళ.. తాజాగా ఆమె కుటుంబ వ్యాపారంపై FDA చర్యలు తీసుకోవడం పుణెలో చర్చనీయాంశంగా మారింది.ఇదిలా ఉంటే.. మహారాష్ట్రలో ఎఫ్‌డీఏ దూకుడు ప్రదర్శిస్తోంది. కొత్తగా బాధ్యతలు చేపట్టిన కమిషనర్ తుకారాం ముండే కల్తీపై కొరడా ఝుళిపిస్తున్నారు. కల్తీ ఆహారం, నిషేధిత ఉత్పత్తులు, నాసిరకం మందులపై వరుస దాడులు జరుగుతున్నాయి. గతంలో కఠిన నిర్ణయాలతో గుర్తింపు పొందిన ముండే.. బాధ్యతలు చేపట్టిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో పలు జిల్లాల్లో అక్రమ తయారీ కేంద్రాలు, గుట్కా విక్రయదారులు, నిబంధనలు ఉల్లంఘిస్తున్న వ్యాపార సంస్థలపై కేసులు, సీజ్ చర్యలు కొనసాగుతున్నాయి. -
రక్తపు మడుగులో భర్త, కొడుకు.. ఫోన్లో బిజీగా భార్య!
కర్ణాటకలోని ధార్వాడ్‌లో చోటుచేసుకున్న దారుణ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఓ వైద్యుడు ఇంట్లోనే హత్యకు గురి కాగా.. ఆయన ఎనిమిదేళ్ల కొడుకు ప్రాణాల కోసం ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతున్నాడు. అయితే.. ఈ కేసులో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులకు ఓ షాకింగ్ దృశ్యం కనిపించింది. భర్త శవం, కొడుకు రక్తపు మడుగులో ఉండగా.. ఆ భార్య మాత్రం ఏం జరగలేదన్నట్లు ఫోన్ చూస్తూ తాపీగా కనిపించింది. ధార్వాడ్‌లోని బారాకోట్రి ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్న అనస్థీషియాలజిస్ట్ డాక్టర్ కిరణ్ హొన్నన్నవర్ (45) దారుణ హత్యకు గురయ్యారు. ఆయన ఎనిమిదేళ్ల కుమారుడు కూడా తీవ్ర కత్తిపోట్లకు గురయ్యాడు. ప్రస్తుతం బాలుడు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటన జరిగిన సమయంలో ఇంట్లో డాక్టర్ కిరణ్, ఆయన భార్య డాక్టర్ ప్రియాంక, వారి కుమారుడు మాత్రమే ఉన్నారు. భద్రత ఎక్కువగా ఉండే అపార్ట్మెంట్లోకి బయటి వ్యక్తులు ప్రవేశించిన ఆనవాళ్లు ఇప్పటివరకు లభించలేదని హుబ్లీ-ధార్వాడ్ పోలీస్ కమిషనర్ ఎన్. శశికుమార్ తెలిపారు.ఫోన్ కాల్స్‌కు స్పందించకపోవడంతో వెలుగులోకి..డాక్టర్ కిరణ్‌కు బంధువులు, స్నేహితులు పలుమార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో ఆయన భార్య ప్రియాంకను సంప్రదించగా.. ఆమె మొదట ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారని, ఆ తర్వాత డ్యూటీకి వెళ్లారని చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆమె చెప్పిన సమాధానాలపై అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు అపార్ట్‌మెంట్‌కు చేరుకున్నారు. అక్కడ ఓ గదిలో డాక్టర్ కిరణ్ రక్తపు మడుగులో పడి ఉండగా.. మరో గదిలో తీవ్ర గాయాలతో బాలుడు కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.Shocking, horrifying & ruthless. A woman allegedly killed her doctor husband & stabbed her 8yr old son inside their #Dharwad apartment. As the child lay in a pool of blood fighting for life, mother was scrolling through her phone. @compolhdc rescued the boy & shifted to hospital. pic.twitter.com/RL5GO9fzEV— Sagay Raj P || ಸಗಾಯ್ ರಾಜ್ ಪಿ (@sagayrajp) July 16, 2026భార్యపై అనుమానాలు.. విచారణఘటన తర్వాత పోలీసులు డాక్టర్ ప్రియాంకను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఘటనాస్థలిలో ఆమె ఫోన్ చూస్తూ కనిపించిన దృశ్యాలు కూడా చర్చకు దారితీశాయి. అయితే హత్యకు సంబంధించిన పూర్తి కారణాలు ఇంకా నిర్ధారణ కాలేదని పోలీసులు చెబుతున్నారు. కుటుంబ కలహాలు ఈ ఘటనకు కారణమై ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హత్యల తర్వాత ఆమె ప్రవర్తించిన తీరుతో మానసిక స్థితిపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే హత్యకు దారితీసిన పరిస్థితులు, దాడి జరిగిన సమయం, ఆయుధం తదితర అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ప్రముఖ వైద్య కుటుంబంలో విషాదండాక్టర్ కిరణ్ స్థానికంగా పేరున్న వైద్యుడిగా గుర్తింపు పొందారు. ఆయన భార్య ప్రియాంక కంటి వైద్యురాలు. ఇద్దరూ వైద్య వృత్తిలో ఉండగా.. ఇంట్లోనే ఈ దారుణం చోటుచేసుకోవడం స్థానికంగా విషాదాన్ని నింపింది. పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి, ఫోరెన్సిక్ నివేదికలు, కుటుంబ సభ్యుల వాంగ్మూలాల ఆధారంగా పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. -
స్నేహితుడి పోస్టే పోలీసులకు క్లూ.. చిక్కిన రౌడీబాబా!
సాక్షి, హైదరాబాద్: లేక్ పోలీసుస్టేషన్ పరిధిలో రౌడీషీటర్‌గా ఉన్న జావేద్ 2018లో సైఫాబాద్ ఠాణా పరిధిలో జరిగిన హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. గత ఏడాది జూన్ నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో ఇతడిపై నాన్–బెయిలబుల్ వారెంట్ (ఎన్బీడబ్ల్యూ) జారీ అయింది. ఈ విషయం తెలిసి అరెస్టును తప్పించుకోవడానికి బాబా అవతారం ఎత్తాడు. ఇతడి స్నేహితుడు సోషల్‌మీడియాలో షేర్ చేసిన ఫొటో జావేద్ ఆచూకీపై ఆధారాన్ని ఇచ్చింది. దీంతో రంగంలోకి దిగిన ఖైరతాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్ టీమ్ నెల రోజులు గాలించి చెరియాలలో మంగళవారం పట్టుకుని సైఫాబాద్ పోలీసులకు అప్పగించింది.కోర్టుకు, పోలీసుల వద్ద హాజరుకాకుండా... ఎంఎస్ మక్తా ప్రాంతానికి చెందిన మహ్మద్ షేక్ జావేద్‌పై లేక్ ఠాణాలో రౌడీషీట్ ఉంది. 2018లో సైఫాబాద్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసులో ఐదో నిందితుడిగా అరెస్టు అయ్యాడు. బెయిల్‌పై బయటకు వచ్చిన ఇతడు గత ఏడాది జూన్ 5 నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అటు కోర్టు వాయిదాలకు, ఇటు టాస్క్‌ఫోర్స్, లేక్ పోలీసుస్టేషన్లో హాజరుకాకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. దీంతో ఇతడిపై న్యాయస్థానం ఎన్బీడబ్ల్యూ జారీ చేసింది. జావేద్‌ను ఔట్ ఆఫ్ వ్యూలో (ఓవీ) నేరగాళ్ల జాబితాలో చేర్చిన ఖైరతాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆరు నెలలుగా ముమ్మరంగా గాలిస్తున్నారు. తన ఫోన్, సోషల్‌మీడియా ఖాతాలతో సహా ఏదీ వినియోగించకుండా ఉన్న జావేద్ తన ఉనికి బయటపడనీయలేదు.అమ్మమ్మ ఇంట్లో మకాం... బాబా అవతారం...ఖైరతాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ పి.రాఘవేందర్ నేతృత్వంలోని బృందం జావేద్ స్నేహితులు, బంధువుల సోషల్‌మీడియా ఖాతాలను విశ్లేషించడం ప్రారంభించింది. పోలీసులకు చిక్కకుండా ఉండటానికి జావేద్ ఈ ఏడాది జనవరి నుంచి సంగారెడ్డి జిల్లా చెరియాల్ రోడ్డు సమీపంలోని తన అమ్మమ్మ ఇంట్లో తలదాచుకుంటున్నాడు. నకిలీ బాబా అవతారం ఎత్తి కంది మండలంలో చెరియాల్ రోడ్డు వద్ద ఉన్న జిందేషా మదార్ దర్గాలో పూజారిగా చేరాడు. తన వద్దకు వచ్చిన వారికి దువా ఇస్తున్నట్లు నటిస్తూ వారందరినీ మోసం చేస్తున్నాడు. ప్రధానంగా చిన్నారులు, మహిళలకు దువా ఇస్తున్నట్లు హడావుడి చేసే వాడు. నగరానికి చెందిన జావేద్ స్నేహితుడు అతడు నిజమైన బాబా అని నమ్ముతూ ఇటీవల వెళ్లి అతడికి కలిసి వచ్చాడు. ఆ సందర్భంలో ఓ మహిళకు దువా ఇస్తుండగా ఫొటో తీశాడు.నెల రోజులు నిఘా ఉంచి...ఈ ఫొటోను సదరు స్నేహితుడు తన సోషల్‌మీడియా ఖాతాలో పోస్టు చేశాడు. అప్పటికే అనేక ఖాతాలను విశ్లేషిస్తున్న ఖైరతాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్ టీమ్ కంట్లో ఇది పడింది. వెంటనే అతడిని పిలిచిన అధికారులు ‘జావేద్ బాబా’ అడ్రస్ తెలుసుకున్నారు. కానిస్టేబుల్ పురుషోత్తం వారం రోజుల పాటు చెరియాల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికి జిందేషా మదార్ దర్గాలో జావేద్ ఆచూకీ కనిపెట్టాడు. అయితే అక్కడ అరెస్టు చేస్తే ఇబ్బందులు వస్తాయని అతడి కదలికలపై నెల రోజులుగా నిఘా ఉంచారు. సైఫాబాద్ నానా మియా మసీదు సమీపంలోని పూల్ బాగ్ ప్రాంతానికి వచ్చిన జావేద్‌ను గుర్తించి పట్టుకున్నారు. చేరుకుని, నిందితుడు మహ్మద్ షేక్ జావేద్‌ను విజయవంతంగా అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద ఉన్న క్యారీబ్యాగ్‌లో ఉన్న 115 గ్రాముల గంజాయి, మారువేషం కోసం ఉపయోగించిన ఆకుపచ్చ రంగు పీర్ బాబా దుస్తులను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. -
స్నానం చేస్తుండగా ఫొటోలు.. బ్లాక్‌మెయిల్‌తో గ్యాంగ్‌రేప్..!
జగిత్యాలజోన్: మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డ కేసులో ఐదుగురు నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష, ఒక్కొక్కరికి రూ.20 వేల జరిమానా విధిస్తూ జగిత్యాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్నపద్మావతి బుధవారం సంచలనాత్మక తీర్పునిచ్చారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామకృష్ణారావు కథనం ప్రకారం.. మెట్పల్లి ప్రాంతానికి చెందిన ఓ బాలిక ఇంట్లో స్నానం చేస్తుండగా, అదే ప్రాంతానికి చెందిన లోకిని రాజేశ్ ఫొటోలు తీశాడు. ఆ ఫొటోలను అందరికీ చూపిస్తానంటూ బాలికను బెదిరించి అత్యాచారం చేశాడు. అత్యాచారం విషయం ఎవరికైనా చెపితే ‘నిన్ను నీ కుటుంబసభ్యులను చంపేస్తా’ అంటూ బెదిరించాడు. ఇలా, బాలికను ఫొటోలతో బ్లాక్మెయిల్ చేస్తూ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో 6 అక్టోబర్ 2020 రోజున ‘నీతో, నీ స్నేహితుడు మాట్లాడతా అంటున్నాడు, బయటకు రా’ అంటూ సదరు బాలికకు రాజేశ్ ఫోన్ చేశాడు. బాలిక బయటకు రాగానే పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి మళ్లీ అత్యాచారం చేశాడు. రాజేశ్ అత్యాచారం చేస్తున్న సమయంలో, అక్కడికి వచ్చిన అతడి నలుగురు స్నేహితులు దరంగుల సాయికుమార్, మొగిలిపాక అనిల్‌కుమార్, కుంచెపు శివ, కుంచెపు వెంకటేశ్‌ను బాలిక చూసి, ‘నన్ను ఏమి చేయవద్దు’ అని బతిమిలాడినా ఒకరి తర్వాత ఒకరు కొట్టుకుంటూ అత్యాచారం చేస్తూ వీడియోలు తీశారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని, ఫొటోలు, వీడియోలు బయటపెట్టి, నీ జీవితాన్ని నాశనం చేస్తామంటూ బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అపస్మారక స్థితిలోకి వెళ్లి, నడవలేని స్థితిలో ఉన్న ఆ బాలిక అక్కడి నుంచి మెళ్లగా ఇంటికి చేరుకుంది. ఇంటి పరువు పోతుందని ఎవరికీ చెప్పకుండా ఆ భాదను తనలోనే దాచుకుంది. చివరకు జరిగిన ఘటనను తమ కుటుంబసభ్యులకు తెలియజేయగా, మెట్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పటి ఎస్సై ఎన్.సదాకర్ కేసు నమోదు చేయగా, అప్పటి డీఎస్పీ ఎండీ గౌస్‌బాబా ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. తర్వాత వచ్చిన డీఎస్పీ వి.రవీందర్‌రెడ్డి కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి, కోర్టులో నిందితులపై చార్జీషీట్ దాఖలు చేశారు. కోర్టు మానిటరింగ్ అధికారులు ఎం.కిరణ్‌కుమార్, డి.శ్రీధర్, బి.రాజు బలమైన సాక్ష్యాలను కోర్టులో ప్రవేశపెట్టారు. జడ్జి సాక్ష్యాధారాలను పరిశీలించి నిందితులకు యావజ్జీవ శిక్ష, జరిమానా విధించారు. భాదితురాలికి రూ.12 లక్షల పరిహారం అందించాలని ప్రభుత్వానికి సూచించారు. -
కక్షతో.. బాత్రూం క్లీన్ చేసే రసాయనం తాగించి..
హైదరాబాద్, సుభాష్‌నగర్: ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేస్తున్నారని అధికారులకు ఫిర్యాదు చేసిన మహిళపై దాడికి పాల్పడ్డ వారిని పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం సూరారం పోలీస్ స్టేషన్లో పేట్‌బషీరాబాద్ ఏసీపీ బాలగంగిరెడ్డి వివరాలు వెల్లడించారు. గాజులరామారం కైసర్ నగర్‌లోని సర్వేనెంబర్ 342 ప్రభుత్వ స్థలంలో కబ్జాలు జరుగుతున్నాయని స్థానికురాలు సల్మా బేగం జూన్ 19న రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో కబ్జాదారుడు రత్నాకరం సాయిరాజ్ ఆమెపై కక్ష పెంచుకున్నాడు.సల్మా బేగంపై దాడి చేయాలని స్థానికంగా ఉన్న హేమశ్రీ, సయ్యద్ రేష్మ బేగం, సయ్యద్ రహీం, షహనాజ్ అనే మహిళలను ప్రేరేపించాడు. ఈ నెల 8న సల్మా బేగం ఇంట్లోకి నలుగురు చొరబడి ఆమెపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అంతేకాకుండా బాత్రూం క్లీన్ చేసే రసాయనాన్ని బలవంతంగా తాగించి ప్రాణాపాయ స్థితికి గురి చేశారు. దాడి దృశ్యాలను సల్మా బేగం కూతురు ఫోన్లో చిత్రీకరిస్తుండగా మొబైల్‌ను లాక్కొని నేలకేసి కొట్టి ధ్వంసం చేశారు.దీంతో ఈ నెల 8న సల్మా బేగం సూరారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు నలుగురిని అరెస్టు చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడైన రత్నాకరం సాయిరాజ్ కోసం గాలిస్తున్నామని ఏసీపీ పేర్కొన్నారు. సాయిరాజ్‌పై గతంలో ఆరు కేసులు ఉండగా అతనిపై భూకబ్జా షీటు నమోదు చేస్తున్నామని, అదే విధంగా ఓ మహిళపై గతంలో ఐదు కేసులు ఉండగా, దీనితో కలిపి ఆరో కేసు నమోదు చేసి ఆమెపై కూడా రౌడీ షీట్ నమోదు చేస్తామన్నారు. -
భవనం పైనుంచి దూకి సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
హైదరాబాద్: గచ్చిబౌలి ఐటీకారిడార్పరిధిలోని నాలెడ్జి సిటీలోని ఐటీ కంపెనీలో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి పనిచేస్తున్న సంస్థ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. రాయదుర్గం పోలీసుల కథనం ప్రకారం...ఏపీలోని నెల్లూరుకు చెందిన టి. అవినాష్ (40)కు జ్యోతితో వివాహం జరగ్గా, వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. రెండు నెలల క్రితమే బెంగళూరు కూకట్‌పల్లికి మకాం మార్చారు. నాలెడ్జి సిటీలోని క్వాల్కామ్ భవనంలోని హెచ్‌సీఎల్ కంపెనీలో పనిచేస్తున్నాడు.మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఆఫీస్ నుండి బయలుదేరుతున్నట్లు భార్యకు మెసేజ్ చేసిన అవినాష్, ఆ తర్వాత ఫోన్లు ఎత్తలేదు. ఆందోళన చెందిన భార్య సమాచారంతో ఆమె సోదరుడు అరుణ్‌కుమార్ రాత్రి 8.30 గంటలకు క్వాల్కామ్ భవనం వద్దకు వెళ్ళాడు. అక్కడ అవినాష్ 5వ అంతస్థు నుంచి కిందకు దూకి మృతిచెంది ఉండటం గమనించాడు. రాయదుర్గం పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. -
బాలికపై లైంగికదాడి.. ఆరుగురిపై పోక్సో కేసు నమోదు
సూపర్‌బజార్(కొత్తగూడెం): కొత్తగూడెం టూటౌన్ పరిధిలో బాలికపై లైంగికదాడి చేసిన ఘటనలో ఆరుగురిపై పోక్సో కేసు నమోదు చేయగా నలుగురిని అరెస్ట్ చేశామని డీఎస్పీ ఆదినారాయణ తెలిపారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని చెప్పారు. పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. గరీబ్‌పేటకు చెందిన మార్తి రామకృష్ణ ఓ బాలికను ప్రేమపేరుతో వేధించాడు. ఆ తర్వాత ఆమెను జాలె నవీన్, గణేశ్ సహకారంతో ఈ నెల 3వ తేదీన తన బావ, కానిస్టేబుల్ వెంకటేశ్ గదికి తీసుకువెళ్లి లైంగికదాడి చేశాడని తెలిపారు. తరువాత స్నేహితులైన కలకుంట్ల విజేందర్, బడేటి మహేశ్‌కు చెప్పగా వారు కూడా ఈనెల 4, 5వ తేదీల్లో వేర్వేరుగా బాధితురాలిని భయపెట్టి ఆటోల్లో తీసుకువెళ్లి లైంగికదాడి చేశారని వివరించారు. ఈ విషయమైబాలిక ఈ నెల 11న తల్లికి తెలపగా టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి బుధవారం మార్తి రామకృష్ణ, కలకుంట్ల విజేందర్, బడేటి మహేశ్, బాలె నవీన్‌ను అరెస్ట్ చేసి వారి నుంచి మూడు ఆటోలు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. మిగిలిన నిందితుల్లో కానిస్టేబుల్ వెంకటేశ్‌తో పాటు గణేశ్ పరారీలో ఉన్నట్లు డీఎస్పీ వివరించారు. వన్‌టౌన్ సీఐ కరుణాకర్, టూటౌన్ ఎస్ఐ రాజశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రియుడితో కలిసి.. భర్తను పరుగెత్తించి చంపిన భార్య..!
నిండా రెండేళ్లు పూర్తి కాని వివాహ బంధం. దానికి ప్రతిఫలంగా పుట్టిన ఏడు నెలల బిడ్డ. అన్యోన్యంగా సాగుతోందని బంధువులు అనుకున్న కాపురం. భార్య వివాహేతర సంబంధం కాలనాగులా మారి భర్తను కాటేసింది. భార్య తోడ్పాటుతో ఆమె ప్రియుడి చేతిలో భర్త హతమయ్యాడు. జీవిత భాగస్వామి పన్నిన వ్యూహంలో చిక్కుకుని అతను ప్రాణాలు కోల్పోయాడు. సాక్షి, చిత్తూరు : శాంతిపురం మండలం కెనమాకులపల్లి పంచాయతీ బోయనపల్లికి చెందిన యువతికి రెండేళ్ల క్రితం తమిళనాడులోని సూలగిరికి చెందిన రమేష్‌తో పెద్దలు పెళ్లి చేశారు. ఇద్దరూ అన్యోన్యంగా ఉన్నారని ఇరు కుటుంబాల వారు భావించారు. ఏడు నెలల క్రితం ఆ యువతి ఓ ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. రెండు నెలల క్రితం అత్తారింటికి వెళ్లింది. అంతా సవ్యంగా సాగుతోందనుకుంటే ఆమెకు పుట్టిన ఊరిలో మరో యువకుడితో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసినట్టు తెలిసింది. ఈ క్రమంలో తమ బంధానికి అడ్డుగా ఉన్న భర్తను తప్పించాలని భార్య ప్రియుడితో కలిసి పథకం పన్నింది. రెండు రోజుల క్రితం ఆమె భర్త రమేష్ తో కలిసి పుట్టింటికి వచ్చింది. మంగళవారం భర్త, బిడ్డను గుడుపల్లి మండలంలోని మల్లప్ప కొండౖపై ఉన్న మల్లేశ్వరస్వామి ఆలయానికి వెళ్లారు. ఈ విషయాన్ని ముందుగానే ప్రియుడికి చేరవేసింది. అతను తన స్నేహితుడితో కలిసి మల్లప్పకొండపై ఆలయానికి వెళ్లే మార్గంలో కాపు కాసి బైకును అడ్డుకున్నట్టు తెలిసింది. దాడి జరుగుతోందని గమనించిన రమేష్ తప్పించుకుని పారిపోయే ప్రయత్నంలో రోడ్డు నుంచి దాదాపు 100 మీటర్లు తనను వెంబడించిన ప్రియుడు, తన స్నేహితుడు విచక్షణారహితంగా నరికినట్టు సంఘటనా స్థలంలో పరిస్థితులను బట్టి తెలుస్తోంది. హత్య చేసిన అనంతరం యువతి, తన ప్రియుడు, ప్రియుడి స్నేహితుడు కలిసి మృతుడికి చెందిన బైకుపైనే వెళ్లిపోయినట్టు సమాచారం. చంటి బిడ్డతో గుడికి వెళ్లిన దంపతులు తిరిగిరాకపోవడంతో బంధువులు గాలించినా ప్రయోజనం లేకపోయింది. వారు పోలీసులను ఆశ్రయించారు. అదే సమయంలో మల్లప్ప కొండపై శవం ఉందనే సమాచారం రావడంతో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. యువతి తన భర్తతో కలిసి మల్లప్ప కొండ వైపు వెళ్తున్న దృశ్యాలను సీసీటీవీ పుటేజీల్లో గుర్తించారు. భర్త శవం దొరకడంతో భార్య, బిడ్డ ఏమయ్యారని ఆరా తీశారు. ఈ నేపథ్యంలో ఇద్దరు వ్యక్తులతో కలిసి యువతి బైకుపై వెళుతున్నట్టు సీసీ టీవీల్లో తేలింది. భార్య, తన ప్రియుడు మరో వ్యక్తితో కలిసి రమేష్ ను హతమార్చినట్టు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. దీనిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. భర్త హత్య కేసులో నిందితురాలిగా ఉన్న యువతి ఇంకా మైనర్ అని బోయనపల్లి గ్రామస్తులు చెప్పారు. రెండేళ్ల క్రితం తను 9వ తరగతి చదువుతుండగానే ఈ బాలికకు పెద్దలు పెళ్లి చేశారని పేర్కొన్నారు. -
ధార్వాడ్‌లో ఘోరం.. ఇంట్లోనే డాక్టర్ దారుణ హత్య
కర్ణాటకలోని ధార్వాడ్‌లో బుధవారం ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. బారాకోట్రి ప్రాంతంలో అనస్థీషియాలజిస్ట్ కిరణ్ హోనన్నవర్(45)ను గుర్తుతెలియని దుండగులు తన అపార్ట్మెంట్లోనే అత్యంత కిరాకతంగా హత్య చేశారు. ఆయన ఎనిమిదేళ్ల కుమారుడు సైతం తీవ్రమైన కత్తిపోట్లకు గురయ్యాడు.ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న బాలుడిని వెంటనే ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మృతుడి భార్య, ఆప్తమాలజిస్ట్ అయిన డాక్టర్ ప్రియాంకను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ధార్వాడ్ పోలీస్ కమిషనర్ ఎన్. శశికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. "ఈ ఘటన జరిగిన అపార్ట్మెంట్ అత్యంత భద్రత కలిగిన ప్రాంతంలో ఉంది. మా ప్రాథమిక విచారణలో ఘటన జరిగిన సమయంలో ఇంట్లోకి బయటి వ్యక్తులు ఎవరూ ప్రవేశించినట్లు ఆధారాలు లభించలేదు. ఆ సమయంలో ఇంట్లో కేవలం డాక్టర్ కిరణ్, ఆయన భార్య ప్రియాంక, వారి కుమారుడు మాత్రమే ఉన్నారు" అని పేర్కొన్నారు.ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో వెలుగులోకి..కాగా డాక్టర్ కిరణ్ బంధువులు ఆయనకు వరుసగా ఫోన్ చేయగా ఎలాంటి స్పందన రాలేదు. ఈ క్రమంలో ఆయన భార్య ప్రియాంకకు ఫోన్ చేశారు. అయితే ఆమె పొంతన లేని సమాధానాలు చెప్పింది. దీంతో అనుమానం వచ్చి బంధువులు నేరుగా అపార్ట్‌మెంట్‌కు చేరుకున్నారు.అక్కడికి వచ్చి చూడగా ఒక గదిలో డాక్టర్ కిరణ్ మృతదేహం, మరో గదిలో గాయపడిన బాలుడు పడి ఉన్నారు. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు మృతుడి భార్యను విచారిస్తున్నారు. ఆమె పోలీసులకు కూడా పొంతన లేని సమాధానాలు చెబుతున్నట్లు తెలుస్తోంది. ఈ దారుణ ఘటనకు కుటుంబ కలహాలే కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే కిరణ్ కుటంబ సభ్యులు మాత్రం డాక్టర్ ప్రియాంకనే ఈ హత్యకు ఒడిగట్టారని ఆరోపిస్తున్నారు. -
పోలీసులా.. రాక్షసులా? మరో లాకప్ డెత్..
-
కారు అదుపు తప్పి బోల్తా.. వైద్య విద్యార్థిని మృతి
హైదరాబాద్: ఔటర్ రింగ్‌రోడ్డుపై కారు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో వైద్య విద్యార్థిని మృతి చెందినట్లు శంషాబాద్ ఇన్స్పెక్టర్ కె.నరేందర్‌రెడ్డి తెలిపారు. సికింద్రాబాద్‌లోని అమ్స్రీ సెంట్రల్ కోర్టు నివాసి అద్దంకి అమూల్య(21) ఎంఎన్ఆర్ కళాశాలలో డెంటల్ విద్య అభ్యసిస్తోంది. ఈ నెల 13న అర్ధరాత్రి దాటిన తర్వాత స్నేహితుడు సిద్ధార్థ్‌తో కలిసి శంషాబాద్ చూడటానికి కారులో వచి్చంది. మంగళవారం తెల్లవారుజామున సికింద్రాబాద్ బయలుదేరారు. వీరు దారి తప్పి ఔటర్‌పైకి వచ్చి పెద్ద అంబర్పేట్ వైపు వెళ్తూ పెద్దగోల్కొండ టోల్గేట్ దాటగానే ప్రమాదానికి గురయ్యారు. అతివేగంగా వెళ్తున్న వీరి కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి రోడ్డు అవతలి వైపునకు వెళ్లి బోల్తా పడింది. డ్రైవింగ్ చేస్తున్న అమూల్య కారులోంచి రోడ్డుపై పడడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. గాయపడిన సిద్ధార్థ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పెట్రోలింగ్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రి మార్చురికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
స్నానపు వీడియోతో వివాహితకు బ్లాక్మెయిల్!?
స్నానం చేస్తుండగా ఓ యువకుడు మహిళను రహస్యంగా వీడియో తీశాడు. ఆ వీడియోతో ఆమెను లోబర్చుకున్నాడు. విషయం ఆమె భర్తకు తెలిసినా కుటుంబ పరువు పోతుందనే భయంతో మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే యువకుడి ఆగడాలు మితిమీరిపోవడంతో.. అతడిని లేకుండా చేయాలని దంపతులు పథకం రచించారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో తీవ్ర కలకలం రేపిన ఘటన వివరాల్లోకి వెళ్తే..గాంధీనగర్ జిల్లా పరిధిలోని కలొల్ ప్రాంతానికి చెందిన హార్దిక్ (20) కాలేజీ స్టూడెంట్. దాదాపు ఒకటిన్నర నెలల క్రితం ఓ మహిళ స్నానం చేస్తుండగా చాటుగా తన ఫోన్‌తో వీడియో తీశాడు. ఆ వీడియోను అడ్డుపెట్టుకుని ఆమెను మహిళను బెదిరించాడు. తనతో శారీరక సంబంధం కొనసాగించాలని ఆమెపై ఒత్తిడి చేశాడు. భయంతో ఆమె అతడి డిమాండ్లకు అంగీకరించింది.మహిళ భర్త ఫ్యాన్ రిపేర్లు, వైరింగ్ పనులు చేస్తుంటాడు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. భార్య పదే పదే ఫోన్లో మాట్లాడడంపై గట్టిగా నిలదీశాడు. ఆమె జరిగింది చెప్పింది. అయితే పరువు పోతుందనే భయంతో అతను మౌనంగా ఉండిపోయాడు. అయితే ఈలోపు హార్ధిక్ మితిమీరి ప్రవర్తించాడు.ఇంటి ముందు నుంచి వెళ్లే సమయంలో మహిళను చూసి కన్ను కొట్టడం, అసభ్య సైగలు చేయడం ఆ భర్త భరించలేకపోయాడు. మొదట హార్దిక్ కుటుంబ సభ్యులతో పంచాయితీ పెట్టి విషయం చెప్పాలని దంపతులు భావించారు. అయితే.. విషయం బయటకు తెలిసిపోతుందని భావించారు. ఈలోపు హార్దిక్ చేష్టలు ఆ భర్తకు మరింత కోపం తెప్పించాయి. దీంతో అతన్ని హతమార్చాలని ఆ దంపతులు నిర్ణయించుకున్నారు.పథకం ప్రకారం జూలై 11 ఉదయం మహిళ హార్దిక్‌కు ఫోన్ చేసి ఇంటికి రావాలని చెప్పింది. అంతకుముందే భర్త పని కోసం బయటకు వెళ్తున్నట్లు నటించి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. పిల్లలు స్కూల్‌కు వెళ్లిపోయారు. హార్దిక్ తన తండ్రికి ఫోన్ చేసి.. పర్బత్పురలో ఓ భూమి చూసేందుకు వెళ్తున్నట్లు చెప్పాడు. అయితే అతడు నేరుగా ఆమె ఇంటికి వెళ్లాడు.ఈలోపు.. హఠాత్తుగా ఎంట్రీ ఇచ్చిన భర్తను చూసి హార్దిక్ పరుగులు తీయబోయాడు. భర్త అతని ఛాతీ మీద కూర్చోగా.. భార్య కాళ్లు, చేతులు బలంగా పట్టుకుంది. తొలుత ఆమె స్కార్ప్‌తో, ఆ తర్వాత కరెంట్ వైర్లను మెడకు బిగించి హార్దిక్‌ను హత్య చేశారు. ఆపై మృతదేహాన్ని ప్లాస్టిక్ సంచిలో పెట్టి ఇంటికి తాళం వేశారు. సరాసరి స్కూల్‌కు వెళ్లి పిల్లలను తీసుకుని.. వివాహిత స్వస్థలానికి పారిపోయారు.మొబైల్ స్విచ్చాఫ్ రావడంతో..హార్దిక్ ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో కంగారుపడ్డ తండ్రి.. కలోల్ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో నిందితుల ఇంటి నుంచి దుర్వాసన రావడంతో ఈ హత్య బయటపడింది. పోస్టుమార్టం నివేదికలో గొంతు నులిమి మరణించినట్లు వెల్డి కావడంతో.. దంపతుల్ని ట్రేస్ చేసి పోలీసులు అరెస్ట్ చేశారు.హార్దిక్ వద్ద ఉన్న మొబైల్లోనే మహిళకు సంబంధించిన వీడియో ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య తర్వాత భర్త ఆ ఫోన్‌ను పగలగొట్టి రోడ్డుపక్కన పడేసినట్లు సమాచారం. ఫోన్ స్వాధీనం చేసుకునేందుకు నిందితులను విచారించనున్నట్లు పోలీసులు తెలిపారు. -
జనసేన కార్యకర్తపై భార్య ఫిర్యాదు
ఏలూరు: కైకలూరులో రాజ్యాంగేతర శక్తిగా మారిన జనసేన కార్యకర్త కొల్లి వీర వెంకట సత్య వరప్రసాద్ (బాబీ) నిజస్వరూపాన్ని అతని భార్య దుర్గాదేవీ మీడియా ముందు మంగళవారం బట్టబయలు చేసింది. ఇటీవల కైకలూరు దానిగూడెం దళితుల దాడి కేసులో జైలు జీవితం అనుభవించి వచ్చిన కొల్లి బాబీ మరోసారి వార్తల్లోకెక్కాడు. ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ప్రధాన అనుచరుడిగా చలామణి అవుతున్న ఇతనిపై మట్టిదందా, పేకాట నిర్వాహణ వంటి పలు ఆరోపణలు ఉన్నాయి. కైకలూరు టౌన్ స్టేషన్లో బాబీపై అతని భార్య వరకట్న వేధింపులు, అక్రమ సంబంధం, పిల్లలను కలవనివ్వడం లేదంటూ వంటి వాటిపై తల్లితో కలిసి ఫిర్యాదు చేసింది. కొల్లి బాబీకి పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరానికి చెందిన దుర్గాదేవీతో వివాహ సమయంలో భారీగా కట్నకానుకలు ఇచ్చారు. మరింత కట్నం కోసం వేధిస్తుంటే అదనంగా ఇచ్చారు. వీరికి ఇద్దరు అబ్బాయిలు. కొల్లి బాబీ వ్యసనాలకు బానిసై తనను మానసికంగా వేధించాడని ఆమె పేర్కొంది. తన పుస్తెలు, పదో తరగతి సర్టిఫికెట్లపై లోను తీసుకుని కార్లలో తిరుగుతూ తనను మనిషిగా చూసేవాడు కాదని వాపోయింది. తనను 5 సంవత్సరాలుగా దూరం పెట్టి ఇంటికి పంపారన్నారు. తన బిడ్డలను సెలవులకు తీసుకొచ్చి ఏలూరు సిద్దార్థ హాస్టల్లో పెట్టారని వారిని చూడనివ్వకుండా చేస్తున్నారని వాపోయింది. తన భర్తతో ప్రాణభయం ఉందని, అతనికి వివాహేతర సంబంధం ఉందని ఆమె తెలిపింది. ఇంటికి వస్తే నరికేస్తా అంటూ బెదిరిస్తున్నాడని, తన భర్తతో పాటు, నా బిడ్డలతో కలసి జీవించే విధంగా న్యాయం చేయాలని కోరింది. ఇందులో ఏ రాజకీయ పార్టీ ప్రమేయం లేదన్నారు. దుర్గాదేవి ఫిర్యాదుపై టౌన్ సీఐ ఏవీఎస్ రామకృష్ణను వివరణగా కోరగా ఫిర్యాదు అందిందని, ఇద్దరికీ కౌన్సిలింగ్ నిర్వహిస్తామన్నారు. -
నిజం చెరగకూడదని.. చేతులు, కాళ్ల నిండా సూసైడ్ లేఖ రాసుకుని..
భోపాల్: ఒక మహిళ ఎన్నో ఏళ్లుగా తన గుండెల్లో దాచుకున్న బాధను ఇక భరించలేకపోయింది. అత్తింట్లో ఎదుర్కొంటున్న వేధింపులు ఆమె మనసుని చంపేశాయి. ఎవరూ తీసుకోకూడని నిర్ణయం తీసుకుంది. ఆత్మహత్య చేసుకోవాలని భావించింది. అయితే, తాను చనిపోతే తన గొంతు మూగబోతుందని, తనకు జరిగిన అన్యాయాన్ని ప్రపంచానికి తెలియజేయాలనే ఆవేదనతో కాగితంపై కాకుండా... తన చేతులు, కాళ్లపైనే మెహందీతో చివరి సందేశం రాసింది. మధ్యప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది.ఛింద్వారాకు చెందిన ఓ మహిళ అత్తింటి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. చనిపోవడానికి ముందు ఆమె తన చేతులు, కాళ్లపై మెహందీతో సూసైడ్ నోట్ రాసింది. అందులో అత్తింట్లో ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొన్న వేధింపుల గురించి రాసిన విషయాలు గుండెను కలిచివేస్తున్నాయి. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించి కేసు దర్యాప్తు మొదలుపెట్టారు. మృతురాలి చేతులు, కాళ్లపై రాసిన సూసైడ్ నోట్‌కు వీడియోగ్రఫీ కూడా చేశారు.చేతులు, కాళ్లపై సూసైడ్ నోట్ ఎందుకు?చౌరై పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే ఆ మహిళ పేరు ప్రీతి వర్మ (32). ఆమె విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం.. ప్రీతికి సుమారు 13 ఏళ్ల క్రితం లఖన్ వర్మతో వివాహం జరిగింది. పెళ్లి అయినప్పటి నుంచి భర్త లఖన్, అతని కుటుంబ సభ్యులు ప్రీతిని వేధించేవారు.మృతురాలు ప్రీతి సోదరుడు హరియోమ్ జాంగేలా అత్తింటి వారిపై వేధింపుల ఆరోపణలు చేశారు. ప్రీతి చనిపోయిన తర్వాత కాగితంపై రాసిన సూసైడ్ నోట్‌ను అత్తింటి వారు నాశనం చేసే అవకాశం ఉందని ఆమె భయపడి ఉండొచ్చని చెప్పారు. అందుకే తన శరీరంపైనే మెహందీతో సూసైడ్ నోట్ రాసిందని, అలా చేస్తే దాన్ని చెరపలేరని తెలిపారు. భర్త లఖన్ వర్మ, అత్తింటి వారు చాలాకాలంగా ప్రీతిని వేధించారని చెప్పారు. ఆమెపై మానసికంగా, శారీరకంగా వేధింపులు జరిగేవని తెలిపారు. ప్రీతి 2-3 సార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా, ప్రతిసారీ భర్త లఖన్ వర్మ ఆమెను నమ్మించి, బాగా చూసుకుంటానని తిరిగి తీసుకెళ్లేవాడని చెప్పారు.వాంగ్మూలం ఇచ్చేలోపే ప్రీతి మృతిపోలీసుల సమాచారం ప్రకారం.. ప్రీతి వర్మ విషం తాగిన తర్వాత కుటుంబ సభ్యులు ముందుగా జిల్లా ఆసుపత్రికి, ఆ తర్వాత ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పోలీసులు ఆమె వాంగ్మూలం నమోదు చేసేలోపే శనివారం సాయంత్రం చికిత్స పొందుతూ ప్రీతి చనిపోయింది. మృతురాలి కుటుంబ సభ్యులు కూడా అత్తింటి వారిపై వేధింపుల ఆరోపణలు చేశారు. -
క్షణికావేశం.. యువ సర్పంచ్ జ్యోతి మృతి
ఆదిలాబాద్: ఆమె ఒక గ్రామానికి సర్పంచ్. గ్రామంలోని ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపుతూ, ఎందరికో న్యాయం చేసింది. కానీ తన ఇంట్లో జరిగిన చిన్న గొడవకు క్షణికావేశంలో ప్రాణాలు తీసుకొని తన ఇద్దరు చిన్నారులకు తీవ్ర అన్యాయం చేసింది. ఇంట్లో జరిగిన చిన్నపాటి గొడవకు క్షణికావేశంలో బోరిగాం గ్రామానికి చెందిన సర్పంచ్ పల్లె జ్యోతి (25) ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై షేక్ జుబేర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం రాత్రి జ్యోతి ఆమె భర్త విఠల్ల మధ్య పిల్లలను పాఠశాలకు పంపించే విషయమై చిన్నపాటి గొడవ జరిగింది. మనస్తాపానికి గురైన జ్యోతి అందరూ నిద్రిస్తున్న సమయంలో సోమవారం తెల్లవారుజామున వంట గదిలో చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచా రం అందించడంతో సీఐ రవీందర్ నాయక్, ఎస్సై షేక్ జుబేర్‌లు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. జ్యోతి తండ్రి మాదు ఫి ర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ట్లు ఎస్సై వెల్లడించారు. ఆమెకు నాలుగేళ్ల కుమార్తె, రెండేళ్ల కుమారుడు ఉన్నారు. చిన్న పిల్లలు ఉన్నారన్న విషయాన్ని మరిచి తల్లి ప్రాణాలు తీసుకోవడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. -
4 నెలలకే.. నవ దంపతుల విషాదం! అసలేం జరిగింది?
కర్ణాటక, తుమకూరు: పెళ్లయిన 4 నెలలకే నూతన జంట ఆత్మహత్య చేసుకుంది. వందేళ్లు సుఖ సంతోషాలతో జీవించాలన్న పెద్దల దీవెనలు ఫలించలేదు. తుమకూరు జిల్లా శిర తాలూకాలోని హనుమానహళ్లిలో శరణ్య (20), గిరీష్ (28) ప్రాణాలు తీసుకున్నారు. పొరుగూరు సిద్ధనహళ్లి గ్రామానికి చెందిన శరణ్య డిగ్రీ చదువుతోంది. ఇటీవల ఆమెకు తల్లి సోదరుని కుమారుడైన గిరీష్‌తో వివాహం చేశారు. కొత్త సంసారం సజావుగా సాగుతోంది. సోమవారం అత్తమామలు, భర్త పత్తి విత్తనాలు వేసేందుకు పొలానికి వెళ్లారు.సాయంత్రం భర్త ఇంటికి వచ్చి పిలిచాడు. స్పందన రాకపోవడంతో, కిటికీలో నుంచి చూడగా, శరణ్య ఉరికి వేలాడుతూ కనిపించడంతో గిరీష్ దిగ్భ్రాంతికి గురయ్యాడు. తీవ్ర భయాందోళన చెంది పొలంలోని చెట్టుకు అతడూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యలకు గల కచ్చితమైన కారణం తెలియరాలేదు. పట్టణాయకనహళ్లి పోలీసులు కేసు నమోదు చేశారు. తల్లిదండ్రులు, బంధువుల రోదనలతో గ్రామంలో విషాదం నెలకొంది. -
ఢిల్లీలో దారుణం.. భార్య పుట్టిన రోజునాడే నడిరోడ్డుపై..
ఢిల్లీ: నగరంలోని వినోద్ నగర్ ప్రాంతంలో దారుణం జరిగింది. భార్య పుట్టినరోజు నాడే నడిరోడ్డుపై భర్త తుపాకీతో కాల్చి చంపాడు. 2023లో మనీష్ భాటి అనే వ్యక్తితో ప్రియాంకకు వివాహం జరిగింది.నిందితుడు మనీష్.. ఢిల్లీ పోలీసు విభాగంలోని యాంటీ ఆటో థెఫ్ట్ స్క్వాడ్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. ప్రియాంక పుట్టినరోజు కావడంతో, దంపతులిద్దరూ కలిసి రాత్రి రెండు గంటలకు బైక్‌పై బయటకు వెళ్లగా.. మార్గమధ్యలో లాల్ బహదూర్ శాస్త్రి ఆసుపత్రి సమీపంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ప్రియాంక బైక్ దిగి వెళ్లిపోతుండగా.. తుపాకీ బయటకు తీసి కాల్పులు జరిపి మనీష్ పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావంతో రోడ్డుపై పడి ఉన్న ప్రియాంకను గమనించిన ఓ డెలివరీ బాయ్ వెంటనే ఆసుపత్రికి తరలించగా.. ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇంటి నుంచి బయలుదేరే సమయంలో కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగిందని స్థానికులు చెబుతున్నారు. 2024లో కట్నం కోసం మనీష్ భార్య ప్రియాంకను వేధింపులకు గురిచేశాడని.. ఆ సమయంలో సుమారు 8 నెలలు సోదరుడి ఇంట్లోనే ప్రియాంక ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. హత్య కేసు నమోదు చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడి ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. -
నా చావుకు అతడే కారణం
మంచిర్యాల జిల్లా: ప్రేమించాను.. నిన్నే పెళ్లి చేసుకుంటానని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానంటూ యువతిని ఓ యువకుడు రెండేళ్లుగా వేధిస్తున్నాడు. దీంతో వేధింపులు తాళలేక యువతి ఉరేసుకు ని ఊపిరి తీసుకుంది. తన చావుకు యువకుడే కారణమంటూ సూసైడ్ నోట్లో పేర్కొంది. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ఓ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఆ గ్రామానికి చెందిన దంపతులకు నలుగురు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. చిన్న కూతురు తన చదువు పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటోంది. ఇదే గ్రామానికి చెందిన సింగరేణి కార్మికుడు గోనే వెంకటేశ్ రెండేళ్లుగా సదరు యువతిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని వెంటపడుతున్నాడు. అతడి తల్లి శంకరమ్మ, అక్క శైలజ కూడా వెంకటేశ్‌ను పెళ్లి చేసుకోవాలని వేధించడంతో ఆ యువతి తీవ్ర మనోవేదనకు గురైంది. తన వెంట పడొద్దని ప్రాధేయపడ్డా వినకుండా పెళ్లి చేసుకోకుంటే చనిపోతానని బెదిరించాడు. దీంతో ఇరువురి కుటుంబ సభ్యులతో పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించి యువతి వెంట పడొద్దని సూచించారు. అయినా వెంకటేశ్ మానలేదు. అతడితోపాటు కుటుంబ సభ్యులు వేధించడంతో సోమవారం మధ్యాహ్నం ఆ యువతి ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. యువతి ఆత్మహత్యకు వెంకటేశ్, అతడి కుటుంబ సభ్యులే కారణమని, న్యాయం చేయాలని ఆమె కుటుంబ సభ్యులు మంచిర్యాల ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి, ఐబీ చౌరస్తాలో రాస్తారోకో చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని సీఐలు ప్రమోద్‌రావు, నవీన్‌కుమార్, ఎస్సై భూమేశ్ నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. కాగా, నిందితుడు వెంకటేశ్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. -
రాజ్ కుమార్ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏం తెలుస్తుంది ?
-
ఉపాధికై నగరానికి వచ్చి.. నిండు ప్రాణాలు కోల్పోయి
ఉపాధి కోసం.. పని వెదుక్కుంటూ.. కూతురుని చూసేందుకు.. నగరానికి వచ్చిన ముగ్గురు వ్యక్తులు రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. వేర్వేరుచోట్ల జరిగిన ఈ దుర్ఘటనల్లో ఏపీలోని ప్రకాశం జిల్లా వారు ఇద్దరు యువకులు, రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లాకు మహిళ మృతి చెందారు. నిజాంపేట్: ద్విచక్రవాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. బాచుపల్లి పోలీసులు తెలిపిన మేరకు.. ఏపీలోని ప్రకాశం జిల్లా పల్లమల్లి గ్రామానికి చెందిన ఎల్రక్టీíÙయన్ శివసాయి పవన్ (25) బాచుపల్లిలోని రేణుక ఎల్లమ్మ కాలనీలో ఉంటున్నాడు. స్నేహితుడు ఉమాప్రసాద్ (23)తో కలిసి ఆదివారం అర్ధరాత్రి బైక్‌పై బాచుపల్లి నుంచి ప్రగతి నగర్ వైపు బయలుదేరారు. బైక్ అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శివసాయి పవన్‌కు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న ఉమాప్రసాద్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు.ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి..హయత్‌నగర్: ముందు వెళుతున్న ద్విచక్రవాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. హయత్‌నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన ఆదినారాయణ (35) హయత్‌నగర్‌లోని సూర్యనగర్‌లో నివాసముంటూ కూలి పనులు చేస్తూ జీవిస్తున్నాడు. సోమవారం ఉదయం ఆటోనగర్ నుంచి ఇంటికి వెళ్తుండగా, హయత్‌నగర్‌లో వెనుక నుంచి వేగంగా వచి్చన ఆర్టీసీ బస్సు ఆదినారాయణ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఆయన తల బస్సు చక్రాల కింద నలిగిపోయి అక్కడికక్కడే మృతిచెందాడు. భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. -
పల్నాడులో విషాదం.. ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య
పల్నాడు జిల్లా: పల్నాడు జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. వినుకొండ మండలం విఠంరాజుపల్లి గ్రామానికి చెందిన భారతి అనే మహిళ తన ఇద్దరు చిన్నారులను హత్య చేసి, అనంతరం తాను ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.ఘటనాస్థలిలో పోలీసులు ఓ సూసైడ్ లెటర్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అందులో ‘నా చావుకు ఎవరూ కారణం కాదు‘ అని భారతి రాసినట్లు తెలుస్తోంది. భారతి ఈ ఘోర నిర్ణయం ఎందుకు తీసుకుందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులను పోలీసులు విచారిస్తూ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక, ఫోరెన్సిక్ ఆధారాలు, సూసైడ్ లెటర్ పరిశీలన అనంతరం ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. -
ఆరుగురిని ఎందుకు చంపానంటే! రాజ్ కుమార్ సెల్ఫీ వీడియో
-
ఐబీ ఆఫీసర్ హత్య కేసు: ఆప్ మాజీ నేతను దోషిగా తేల్చిన కోర్టు
న్యూఢిల్లీ: ఆరేళ్ల క్రితం ఈశాన్య ఢిల్లీ అల్లర్ల సమయంలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల్లో భాగంగా ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ)) ఆఫీసర్ అంకిత్ శర్మ దారుణ హత్యకు గురైన కేసులో ఆప్ మాజీ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్‌తో పాటు మరో నలుగురిని ఢిల్లీలోని కర్కర్దూమా కోర్టు దోషులుగా తేల్చింది.ఈ కేసులో మొత్తం 11 మంది నిందితులు ఉండగా, మొత్తం ఐదుగురిని దోషులుగా నిర్ధారించింది కోర్టు, ఈ కేసులో అదనపు సెషన్స్ జడ్జి ప్రవీణ్ సింగ్తుది తీర్పును వెలువరించారు. 11 మంది నిందితులకు గాను తాహిర్ హుస్సేన్, హసీన్ (అలియాస్ ముల్లాజీ), నజీమ్, కాసిమ్, సమీర్ ఖాన్‌లను కోర్టు దోషులుగా నిర్ధారించింది. మరో ఆరుగురిని సాక్ష్యాధారాలు లేకపోవడంతో నిర్దోషులుగా వదిలేసింది. దోషులుగా తేలిన వారిపై హత్య (302), అల్లర్లు (147, 148), మత విద్వేషాలు రెచ్చగొట్టడం (153A) తదితర ఐపీసీ సెక్షన్ల కింద అభియోగాలు రుజువయ్యాయి. దోషులకు విధించే శిక్షల వివరాలను త్వరలోనే కోర్టు ఖరారు చేయనుంది.2020, ఫిబ్రవరి 25వ తేదీన సీఏఏ అల్లర్ల సమయంలో ఐబీ ఆఫీసర్ అంకిత్ శర్మ దారుణ హత్యకు గురయ్యారు. ఆయన మృతదేహాన్ని చాంద్‌బాగ్ ప్రాంతంలోని ఓ డ్రైనేజీలో పడేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఆ రోజు సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన అంకిత్ శర్మ ఇక తిరిగి రాలేదు. ఆ రోజు అప్పుడే ఇంటికి వచ్చిన అంకిత్ శర్మ.. అల్లరి మూకలు స్థానికంగా రెచ్చిపోవడం గమనించారు. దాంతో బయటకు వెళ్లి వారిని సద్దుమణిచే యత్నం చేశారు. అలా ఆప్ కౌన్సిలర్‌గా ఉన్న హుస్సేన్ ఇంటికి వెళ్లిన అంకిత్ శర్మ హత్యకు గురయ్యారు. ఆ సమయంలో అంకిత్ శర్మను అతి దారుణంగా హత్య చేసి డ్రెయిన్‌లో పడేశారు. తన కొడుకు ఎంతకీ ఇంటికీ రాకపోయే సరికి ఆ మరుసటి రోజు ఫిబ్రవరి 26వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు తండ్రి రవీందర్ కుమార్. దాంతో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు.. ఓ యువకుని మృతదేహం డ్రెయిన్‌లో ఉన్న విషయం గమనించడంతో అతను అంకిత్ శర్మగా నిర్దారణ అయ్యింది. దీనిపై హుస్సేన్‌తో పాటు 11 మందిపై కేసు నమోదైంది. అంకిత్ శర్మను అతి దారుణంగా హత్య చేశారు. విచారణలో అంకిత్ శర్మ 51 కత్తిపోట్లకు గురైనట్లు తేలింది.2023. మార్చిలో , అల్లర్లు, వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని ప్రేరేపించడం, హత్య, నేరపూరిత కుట్ర వంటి నేరాలకు సంబంధించి హుస్సేన్‌తో సహా 11 మంది నిందితులపై కోర్టు అభియోగాలను నమోదు చేసింది. ఆ సమయంలో తన గ్రూపును హుస్సేన్ రెచ్చగొట్టారనే ప్రాసిక్యూషన్ వాదనను కోర్టు సమర్ధించడంతో వారికి జైలు శిక్ష పడింది.తన బెయిల్‌కు చేసుకున్న అభ్యర్థనను కూడా అంతకుముందు ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. హుస్సేన్‌పై అభియోగాలు తీవ్రంగా ఉండటంతో బెయిల్ ఇవ్వడానికి ఢిల్లీ కోర్టు నిరాకరించింది. తాజాగా వారిని దోషులుగా తేల్చుతూ కర్కర్దూమా కోర్టు తీర్పును వెలువరించింది. -
శనగ కూరలో విషం కలిపి తల్లికి పెట్టిన కొడుకు.. ఎందుకో తెలిస్తే షాక్
ఆగ్రా: ఓ వ్యక్తి తన కన్నతల్లికి విషం పెట్టాడు. పిల్లనిచ్చిన అత్త మాటలు విని ఇంతటి దారుణానికి ఒడిగట్టాడు అతడు. ఈ ఘటన ఆగ్రాలోని పిధౌరా పరిధిలో ఉన్న బర్పురా గ్రామంలో జరిగింది. నిందితుడు రవీంద్ర, అతని తమ్ముడు ముకేశ్ మధ్య భూ వివాదం తలెత్తింది. ఆ వివాదం తర్వాత రవీంద్ర భార్య తన పుట్టింటికి వెళ్లిపోయింది. భార్యను తిరిగి తీసుకురావడానికి రవీంద్ర అత్తింటికి వెళ్లగా, అతని అత్త ఓ షరతు పెట్టింది. తన కూతురిని తిరిగి పంపాలంటే ‘‘ముందుగా నీ తల్లిని చంపాలి’’ అని ఆమె చెప్పింది. తల్లికి పెట్టే శనగ కూరలో విషం కలిపి చంపాలని కూడా అత్త సూచించింది. రవీంద్ర ఆ షరతుకు అంగీకరించి ఇంటికి వచ్చాడు. అనంతరం శనగ కూరలో విషం కలిపి తన తల్లికి తినిపించాడు. దీంతో ఆమె ఆరోగ్యం విషమించింది.కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. ఈ ఘటన సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. పోలీసులు రవీంద్రను అరెస్టు చేశారు. అతని అత్త ఫూల్వతి పరారీలో ఉండగా, ఆమె ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు.ఈ కేసు వివరాలను సహాయ పోలీసు కమిషనర్ రాజీవ్ రంజన్ వెల్లడించారు. రవీంద్రను అరెస్టు చేసినట్టు తెలిపారు. ఫూల్వతిని పట్టుకునేందుకు దాడులు కొనసాగుతున్నాయని చెప్పారు. -
ప్రశాంతగా చచ్చిండు.. రాజ్ కుమార్ చావు పై అన్న రియాక్షన్
-
క్లూజ్ టీమ్ చేతికి ఆధారాలు


