పర్వతగిరి: వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చౌటపల్లి చెందిన ఓ యువకుడిని ఇటీవల మ్యాట్రిమోనీ ద్వారా పెళ్లి చేసుకున్న నిత్య పెళ్లి కూతురు నగలతో ఉడాయించింది. ఆమెకు ఇప్పటికే పెళ్లి అయి 16 సంవత్సరాల కూతురు ఉంది. ఈ క్రమంలో తనకు ఇంకా పెళ్లి కాలేదని, పలు మ్యాట్రిమోనీ సైట్‌లలో ప్రొఫైల్ అప్‌లోడ్ చేసి అమాయకులను పెళ్లి చేసుకుంటోంది. అనంతరం అందినకాడికి నగదు, నగలతో ఉడాయిస్తోంది. ఇదే క్రమంలో గత నెలలో చౌటపల్లి యువకుడిని పెళ్లి చేసుకుని పదిరోజుల క్రితం ఇంట్లో ఉన్న సుమారు 7 నుంచి 12 తులాల బంగారంతో పరారైంది. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు.


