breaking news
Mancherial
-
నకిలీపత్రాలు సృష్టిస్తున్న ముఠా గుట్టురట్టు
ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలో ప్రభుత్వ శాఖల నకిలీపత్రాలు, స్టాంపులు, అధికారుల సంతకాల స్టాంపులు సృష్టించే ముఠాను ఆదిలాబాద్ పోలీసులు గుట్టురట్టు చేశారు. డాక్యుమెంట్ రైటర్ ముసుగులో అక్రమాలకు పాల్పడుతున్న తండ్రి, కుమారుడిపై కేసు నమోదు చేశారు. తండ్రిని అరెస్ట్ చేయగా కుమారుడు పరారీలో ఉన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఎస్పీ అఖిల్ మహాజన్ శనివారం ఈమేరకు వివరాలు వెల్లడించారు. పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన లాడ్వే బద్రినాథ్ కుమారుడు రాహుల్‌కుమార్. ఇతను డాక్యుమెంట్ రైటర్‌గా పనిచేస్తున్నాడు. గత మూడేళ్లుగా తండ్రి కుమారుడు నకిలీపత్రాలు, స్టాంపులు సృష్టించి ప్రజలను మోసం చేస్తున్నట్లు ఫిర్యాదు అందింది. పక్కా సమాచారంతో శుక్రవారం రాత్రి వారి ఇంటిపై పోలీసులు దాడి చేశారు. వివిధ జిల్లాల్లో శాఖల అధికారుల సంతకాలతో కూడిన స్టాంపులు, పత్రాలు, వాటిని తయారుచేసే రసాయనాలు, పరికరాలు, కంప్యూటర్, స్కానర్, హార్డ్‌డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నకిలీ పత్రాలతో అక్రమాలు మావల మండలంలోని సర్వేనంబర్ 170లోని ప్లాట్ల పత్రాలను మండల రెవెన్యూ అధికారి కేటాయించినట్లుగా సృష్టించారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి ట్రెడ్ లైసెన్స్ నకిలీపత్రాలు, పోలీస్ డిపార్ట్మెంట్కు సంబంధించిన, ఆర్టీవో వాహన రిలీజ్ పత్రాలు, ఆధార్‌కార్డులతోపాటు వివాహ సర్టిఫికెట్లు సృష్టించి అక్రమాలకు పాల్పడ్డారు. వివిధ హాస్పిటల్స్‌కు సంబంధించిన నకిలీ డాక్యుమెంట్లు తయారుచేసి ప్రభుత్వం ద్వారా కొంతమందికి విక్రయించి లబ్ధిని పొందేలా చూశారు. మహాలక్ష్మి మాన్పవర్ అండ్ ప్లేస్‌మెంట్స్ సర్వీసెస్ అనే ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా నకిలీ ఉద్యోగ నియామకపత్రాలు తయారు చేసి మోసగించారు. నకిలీ పత్రాలతో ప్రభుత్వ స్థలాలను కబ్జాచేసిన వారిని పట్టుకునేందుకు ప్రత్యేకంగా పోలీస్ బృందాలు ఏర్పాటు చేస్తామని ఎస్పీ తెలిపారు. బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ ముఠా గుట్టు రట్టు చేయడంలో కీలకపాత్ర పోషించిన సీసీఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, వన్‌టౌన్ సీఐ బి.సునీల్ కుమార్‌లను అభినందించారు. సమావేశంలో డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి, వన్‌టౌన్ సీఐ బి.సునీల్‌కుమార్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. తండ్రి అరెస్ట్, పరారీలో కుమారుడు కంప్యూటర్, స్కానర్, హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం వెల్లడించిన ఎస్పీ అఖిల్ మహాజన్ -
చోరీ సామగ్రిని తిరిగి వదిలిన ఆగంతకులు
బెల్లంపల్లి: మండలంలోని గురిజాల రైతువేదిక నుంచి అపహరించుకు వెళ్లిన సామగ్రిని ఆగంతకులు తిరిగి అక్కడే వదిలివెళ్లారు. గురువారం రాత్రి రైతు వేదిక తాళం పగులగొట్టి అందులో సామగ్రిని పట్టుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై వ్యవసాయ అధికారులు తాళ్లగురిజాల పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. సామగ్రిని ఎత్తుకెళ్లిన గుర్తుతెలియని వ్యక్తులు 24 గంటల వ్యవధిలో శుక్రవారం రాత్రి ఆ రైతువేదిక వద్ద తీసుకువచ్చి వదిలివెళ్లారు. బెల్లంపల్లి ఏడీఏ రాజా నరేందర్, బెల్లంపల్లి రూరల్ సీఐ అఫ్జలుద్దిన్, తాళ్లగురిజాల ఎస్సై సీహెచ్.రమేశ్, ఏవో ప్రేమ్‌కుమార్ శనివారం ఉదయం అక్కడికి చేరుకుని చోరీకి గురైన సామగ్రిని పరిశీలించారు. ఈ ఘటనపై తదుపరి విచారణ చేస్తామని వ్యవసాయ, పోలీసు అధికారులు తెలిపారు. -
పాలిటెక్నిక్ సీట్లకు కౌన్సెలింగ్
శ్రీరాంపూర్: సీసీసీలోని సింగరేణి పాలిటెక్నిక్ కాలేజీలో యాజమాన్యం కోటా సీట్లు భర్తీ చేశారు. శనివారం కౌన్సెలింగ్‌కు కంపెనీ ఉద్యోగుల పిల్లలు, రిటైర్డ్ ఉద్యోగుల పిల్లలు హాజరయ్యారు. మొత్తం సీట్లలో యాజమాన్యం కోటా కింద సగం సీట్లను కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేశారు. ప్రతీ కోర్సుల్లో 30 సీట్ల చొప్పున 150 సీట్ల ఉండగా, కౌన్సెలింగ్‌లో 84 మంది విద్యార్థులు సీట్లు పొందారు. మొదటి సీటును 1,445 ర్యాంకు సాధించిన ఈ.సుజల్ అనే విద్యార్థి కంప్యూటర్స్‌లో సీటు పొందగా, ప్రిన్సిపాల్ పి.శ్రీనివాస్‌రావు ఆయనకు అడ్మిషన్ అందించారు. మిగిలిన సీట్లలో.. సివిల్‌లో 26, కంప్యూటర్స్‌లో 01, ఎలక్ట్రీకల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్‌లో 5, మెకానికల్‌లో 24, మైనింగ్‌లో 10 సీట్లను త్వరలో స్పాట్ కౌన్సెలింగ్‌లో భర్తీ చేస్తామన్నారు. కార్యక్రమంలో బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్ ఎం.దేవేందర్, హెచ్ఓడీలు జి.దామోదర్, జి.రవీందర్, నరసింహాస్వామి, శ్యామల, కె.సుమన్ పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదం.. పశువుల యజమానిపై కేసు
మంచిర్యాలరూరల్(హాజీపూర్): రోడ్డు ప్రమాదానికి కారణమైన పశువుల యజమానిపై హాజీపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై స్వరూప్‌రాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. మున్సిపల్ కార్పొరేషన్ పరిధి నర్సింగాపూర్‌కు చెందిన ఏనుగు జయపాల్‌రెడ్డి శనివారం ఉదయం కారులో మంచిర్యాల నుంచి నర్సింగాపూర్‌కు వెళ్తున్నాడు. వేంపల్లిలో జాతీయ రహదారిపై ఒక్కసారిగా మూడు బర్రెలు అడ్డువచ్చాయి. దీంతో కారు బర్రెలను ఢీకొట్టి ధ్వంసం కాగా.. జయపాల్‌రెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. మూడు బర్రెలు మృతిచెందాయి. పశువులను ఇంటి వద్ద, కొట్టంలో ఉంచాల్సి ఉండగా.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాతమంచిర్యాల జ్యోతినగర్‌కు చెందిన పశువుల యజమాని కార్ల మల్లేశ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. మల్లేశ్‌ను అదుపులోకి తీసుకుని నోటీసులు జారీ చేశామని ఎస్సై తెలిపారు. పశువులను యజమానులు ఇళ్లు, కొట్టాల్లో కాకుండా రహదారులపైకి వదిలి ఇతరుల ప్రాణాలకు హాని కలిగించే విధంగా వ్యవహరిస్తే చట్టప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. 12న చెట్ల తొలగింపునకు వేలంమంచిర్యాలటౌన్: పట్టణంలోని ఐబీ చౌరస్తా నుంచి శ్రీనివాస గార్డెన్) వరకు (హైదరాబాద్–కరీంనగర్–చాందా రోడ్డు 251/9 నుంచి 255/7 కిలోమీటర్లు) విస్తరణలో భాగంగా ఇరువైపులా 63 చెట్ల తొలగింపునకు ఈనెల 12న వేలం పాట నిర్వహిస్తున్నట్లు రోడ్లు, భవనాల శాఖ కార్యనిర్వాహక ఇంజినీర్ లక్ష్మీనారాయణ ఓ ప్రకటనలో తెలిపారు. నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని రోడ్లు, భవనాల శాఖ కార్యాలయంలో సాయంత్రం 4 గంటలకు వేలం ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు ఈ వేలంలో పాల్గొనాలని కోరారు. ఆర్ఎంపీ క్లినిక్‌లపై చర్యలు తీసుకోవాలి●● సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ రామకృష్ణాపూర్: అనుమతులు లేకుండా ఇష్టానురీతిన వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆర్ఎంపీ, పీఎంపీ క్లినిక్‌లపై అధికారులు చర్యలు తీసుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, జిల్లా సమితి సభ్యుడు వనం సత్యం డిమాండ్ చేశారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరులతో వారు మాట్లాడారు. జిల్లా వైద్యాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కొంతమంది ఆర్ఎంపీలు ఇష్టారీతిన వైద్యం చేస్తున్నారన్నారు. ఆర్కేపీలో ఓ ఆర్ఎంపీ నిర్లక్ష్యం కారణంగానే శ్రీనాథ్ అనే కాంట్రాక్ట్ కార్మికుడు ఇంజక్షన్ వికటించి మృతిచెందాడని అన్నారు. ఆ వైద్యుడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బాధితుడి పక్షాన కాకుండా స్థానిక కొంతమంది నాయకులు ఆర్ఎంపీ పక్షాన నిలుస్తూ సెటిల్మెంట్లకు యత్నించడం బాధాకరమన్నారు. యువకుడి ప్రాణాన్ని రూ.2 లక్షలకు విలువ కట్టడం ఏమిటని మండిపడ్డారు. సమావేశంలో పార్టీ పట్టణ కార్యదర్శి మిట్టపెల్లి శ్రీనివాస్, ఇప్పకాయల లింగయ్య, నక్క వెంకటస్వామి, సాంబయ్య, పౌల్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు తొలి ఏకాదశి
● చాతుర్మాస్య వ్రతాలు ప్రారంభం ● కిటకిటలాడనున్న ఆలయాలు చెన్నూర్: తొలి ఏకాదశి పండగను ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఆషాఢశుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. సంవత్సరం మొత్తంలో 24 ఏకాదశులు ప్రతినెల కృష్ణపక్షంలో ఒకటి, శుక్లపక్షంలో ఒకటి మొత్తం రెండు ఏకాదశులు వస్తాయి. ఆదివారం తొలి ఏకాదశి పండగ నుంచే చాతుర్మాస్య వ్రతాలు ప్రారంభమవుతాయి. ఆషాఢ శుక్లపక్షం నుంచి కార్తీక శుక్లపక్షం వరకు చాతుర్మాస్య దీక్షలు చేయడం అనవాయితీగా వస్తుంది. తొలి ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువు యోగా నిద్రకు ఉపక్రమిస్తారు. దీన్ని శయన ఏకాదశి అని పిలుస్తారు. నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి మేల్కొంటారు. ఈ నాలుగు నెలల కాలాన్ని ప్రజలు పవిత్ర నెలలుగా భావించి చాతుర్మాస్య దీక్షలు చేస్తారు. పండగ విశిష్టత.. భక్తులు సూర్యోదయానికి ముందే గోదావరినదిలో స్నానాలు అచరించి మహావిష్ణువు ఆలయాలను సందర్శించి పూజలు చేస్తారు. చాతుర్మాసం ప్రారంభం కానుండడంతో శ్రీ మహావిష్ణువు ఆలయాలు కిటకిటలాడుతాయి. తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉండి తర్వాత రోజు మహావిష్టువును పూజించి నైవేద్యం సమర్పించి భోజనం చేస్తారు. వ్రతాలు ఆచరించాలి తొలి ఏకాదశి నుంచి చాతుర్మాస్య వ్రతాలు ఆచరించాలి. శ్రీమహావిష్ణువు యోగా నిద్రకు ఉపక్రమించే రోజు కావడంతో తొలి ఏకాదశి రోజున ఉపవాసం చేసి మహావిష్టువు పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. – వేమారం మహేశ్వర్‌శర్మ, అర్చకుడు, శివాలయం -
భూకబ్జాకు పాల్పడిన 9 మందిపై కేసు
● ఐదుగురి అరెస్ట్, పరారీలో నలుగురు ● వివరాలు వెల్లడించిన డీఎస్పీ జీవన్‌రెడ్డి ఆదిలాబాద్‌రూరల్: భూమి పత్రాలను ఫోర్జరీ చేసి, ప్లాట్లను కబ్జా చేసి డబ్బులు డిమాండ్ చేస్తూ యజమానులను బెదిరించిన 9 మందిపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి తెలిపారు. మావల పోలీసుస్టేషన్లో శనివారం ఈమేరకు వివరాలు వెల్లడించారు. పట్టణంలోని భుక్తపూర్ కాలనీకి చెందిన జనకొండ పోసాని 2009లో ఖానాపూర్ శివారు ప్రాంతంలోని సర్వే నంబర్ 68/44/1లో 30, 38 నంబర్ గల రెండు ప్లాట్లు కొనుగోలు చేశారు. మావల పోలీసుస్టేషన్ పరిధిలోని పైక్ రావు ఆనంద్ (మాజీ కౌన్సిలర్ కుమారుడు), సద్దాం హుస్సేన్, షేక్ షాదుల్లా, బోడకుంట రాజు, అజీముద్దీన్, సంతోష్, మనోహర్, షాబానా బేగం, హీనా అంజుమ్‌లు తప్పుడు పత్రాలు సృష్టించి ఆ ప్లాట్లను కబ్జా చేశారు. మున్సిపల్ అధికారులను మోసం చేసి ఇంటి నంబర్లు పొందారు. దీంతో బాధితురాలు ఈనెల 3న పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. శుక్రవారం ఐదుగురు నిందితులు పైక్ రావు ఆనంద్, సద్దాం, షేక్ షాదుల్లా, బోడకుంట్ల రాజు, షేక్ అజీముద్దీన్లను అరెస్టు చేసినట్లు తెలిపారు. మిగతా నలుగురు సంతోష్, మనోహర్, షాబానా బేగం, హీనా అంజుమ్‌లు పరారీలో ఉన్నారు. వారిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా అరైస్టెన వారిని 15 రోజుల రిమాండ్‌కు తరలించారు. ప్లాట్ ఇంటి నంబర్లకు సహకరించిన మున్సిపల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ సుదర్శన్, రెవెన్యూ ఆఫీసర్ జాదవ్ కృష్ణపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సమావేశంలో మావల సీఐ కర్రె స్వామి, ఎస్సై ముజాహిద్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజల భద్రత కోసమే కార్డన్‌సెర్చ్
మంచిర్యాలక్రైం: ప్రజల భద్రత కోసమే కార్డన్‌సెర్చ్ నిర్వహిస్తున్నట్లు ఏసీపీ ఆర్.ప్రకాశ్ తెలిపారు. జిల్లాకేంద్రంలోని రాజీవ్‌నగర్‌లో శనివారం రాత్రి కార్డన్‌సెర్చ్‌లో భాగంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నంబర్ ప్లేట్ లేకుండా ఎలాంటి పత్రాలు లేని 30 బైక్‌లు, బెల్ట్ షాపుల వద్ద నుంచి సుమారు రూ.10 వేల విలువ గల అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడు తూ జిల్లాలో చట్టవ్యతిర్జే కార్యకలాపాలకు పాల్ప డితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. ఆర్జీయూకేటీలో కౌన్సెలింగ్ ఏర్పాట్లపై సమీక్షబాసర: ఆర్జీయూకేటీలో అడ్మిషన్ల కౌన్సెలింగ్ ఏర్పాట్లపై అధికారులతో ఇన్చార్జి వీసీ గోవర్ధన్ శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాసర, మహబూబ్‌నగర్ కేంద్రాల్లో ఈనెల 7, 8, 9 తేదీల్లో అడ్మిషన్ల కౌన్సెలింగ్ ఉంటుందని పేర్కొన్నారు. ఇందుకు గాను అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు తెలిపారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీని ఏ ర్పాటు చేసినట్లు తెలిపారు. సమావేశంలో అడ్మిషన్ల కన్వీనర్ చంద్రశేఖర్, కోకన్వీనర్ దేవరాజు, బండి హరికృష్ణ, అడ్వైజరీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
రేబిస్‌తో జాగ్రత్త
● పరిశుభ్రతతోనే వ్యాధులు దూరం ● సీజన్‌కు అనుగుణంగా టీకాలు తప్పనిసరి ● నేడు ప్రపంచ జూనోసిస్ దినోత్సవం మంచిర్యాలఅగ్రికల్చర్: కుక్కలు, పశువులు, కోళ్లు, పక్షుల నుంచి మనుషులకు సక్రమించేవి జూనోసిస్ వ్యాధులు అంటారు. పశువుల పాకల అపరిశుభ్రత, తదితర కారణాల వల్ల సుమారు 200 రకాల వ్యాధులు సోకే అవకాశం ఉంది. ఈ వ్యాధులపై పశుపోషకులు, జంతు ప్రేమికులు అప్రమత్తంగా ఉండాలి. దీనిపై అవగాహన కల్పించి, ఆ వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా పశువైద్యాధికారి శంకర్ పేర్కొంటున్నారు. పశువుల కాపర్లు, పశు వైద్యులు, కుక్కలు, పక్షులు పెంచేవారు, పశువుల డెయిరీ ఫాంలో పనిచేసే వారు అప్రమత్తంగా ఉండాలి. పెంపుడు కుక్కలను పెంచడంలో జాగ్రత్తలు తీసుకోవాలి. శుచి, శుభ్రత పాటించడం ఈ వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. ఇదే రోజు ఎందుకు? 1885 జూలై 6న లూయిస్ ప్యాశచర్ అనే శాస్త్రవేత్త పిచ్చికుక్క కరిచిన ఓ బాలుడికి మొదటిసారిగా వ్యాధి నిరోధక టీకా ఇచ్చారు. ఆ ప్రయత్నం విజయవంతం కావడంతో జూలై 6న ప్రపంచ జూనోసిస్ దినోత్సవంగా పాటిస్తారు. పిచ్చికుక్క కాటుతో.. పిచ్చికుక్కకాటు వల్ల పశువులు, కుక్క కరిచిన మనుషులకు రేబిస్ సోకుతుంది. ఈ వ్యాధి ప్రాణాంతకమైనది. పిల్లులు, ముంగిసలు, నక్కలు, తోడేళ్లు తదితర జంతువుల ద్వారా చిట్టెలుక నుంచి ఏనుగు వరకు అన్ని క్షీరదాలకు ఈ వ్యాధి సోకుతుంది. కు క్క కరిచిన తర్వాత 2 నుంచి 3 వారాల తర్వాత వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. ఒక్కోసారి 5 నుంచి 6 నెలల తర్వాత బయటపడుతాయి. కుక్కల ద్వా రా గజ్జి వంటి చర్మ వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. గ్రామీణ ప్రాంతాల్లో పిచ్చికుక్కకాటుకు గురై పశువులు, మనుషులు మృత్యుబారిన పడుతుంటారు. పెంపుడు కుక్కలకు ప్రతీఏటా యాంటీ రేబిస్ వ్యా క్సిన్(ఏఆర్వీ) ఇప్పిస్తే ఈ వ్యాధిని అరికట్టవచ్చు. సీజన్‌కు అనుగుణంగా పశువులు, పెంపుడు కుక్కలకు రేబిస్ నివారణ టీకా సకాలంలో వేయించాలి. పెంపుడు కుక్కలకు మొదటిసారి 30వ రోజు, బూస్టర్ డోసు 90వ రోజు టీకాలు వేయించాలి. సకాలంలో టీకాలు వేయించాలి వ్యాధులు సోకిన జంతువులు, కోళ్ల మాంసాన్ని సరిగా ఉడకని గుడ్డు తినవద్దు. చెడిపోయిన, అపరిశుభ్రంగా ఉన్న పాలు, మాంసం, గుడ్లు ఆహారంగా తీసుకోవద్దు. వ్యాధి సోకిన పశువుల పాలు తాగవద్దు. పాడి పశువులు, జంతువుల పాకలను శుభ్రంగా ఉంచాలి. కాలానికనుగుణంగా పశువులు, జంతువులు, పక్షులు, కోళ్లకు రోగ నిరోధక టీకాలు వేయించాలి. చనిపోయిన పశువులు, జంతువులను దూరప్రాంతాల్లో లోతైన గోతిలో సున్నంచల్లి పూడ్చిపెట్టాలి. అంత్రాక్స్– బ్రూసెల్లోసిస్ పశువుల నుంచి మనుషులకు దొమ్మ(అంత్రాక్స్), బ్రూసెల్లోసిస్ తదితర వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంది. సరిగా వైద్యం చేయిస్తే వ్యాధిని అరికట్టవచ్చు. దీని నివారణకు టీకాలు అందుబాటులో ఉన్నాయి. కలుషితమైన పాలు తాగితే క్షయ సోకుతుంది. పందులు, కొంగలు నివాస ప్రాంతాలకు చేరువలో ఉన్నప్పుడు మనుషులు వీటి ద్వారా కూడా మెదడు వాపు సోకవచ్చు. పందులు, దోమలను అరికడితే ఈ వ్యాధి వ్యాప్తిని నివారించవచ్చు. -
కొత్త ప్లాంట్ నిర్మాణ పనులపై సమీక్ష
జైపూర్: 1200 మెగావాట్ల సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ విస్తరణలో భాగంగా నూతనంగా నిర్మించనున్న మూడో యూనిట్ (800మెగా వాట్ల) థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులపై సింగరేణి డైరెక్టర్ సత్యనారాయణరావు శనివారం అడ్మిన్ భవన కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. పనుల పురోగతిని అధికారులు వివరించారు. నిర్దేశిత గడువులోపు పనులు పూర్తిచేసేందుకు ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు. అనంతరం సింగరేణి ఉద్యోగి, ఉత్తమ జ్యోతిష్య, జాతీయ ప్రతిభ రత్న, బంగారు నంది అవార్డు గ్రహీత డాక్టర్ దూళిపాళ్ల మల్లికార్జున్శర్మను అధికారులు ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. జ్యోతిష్యంపై మక్కువతో మల్లికార్జున్‌శర్మ బెనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి జ్యోతిష్యశాస్త్రంలో గోల్డ్‌మెడల్ సాధించారని తెలిపారు. సాయంత్రం 5గంటలకు సంస్థ సీఎండీ బలరాం థర్మల్ పవర్ ప్లాంట్, సోలార్ ప్లాంట్ల విద్యుత్ ఉత్పత్తి, ఉత్పాదకత మీద నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. ఎస్టీపీపీ ఈడీ చిరంజీవి, జీఎంలు శ్రీనివాసులు, నరసింహారావు, వోఅండ్‌ఎం చీఫ్ జెన్సింగ్, ఏఐటీయూసీ సెక్రటరీ సత్యనారాయణ, సీఎంవో ఏఐ సెక్రటరీ సంతోష్‌కుమార్, ఏజీఎంలు మురళీధర్, మధన్మోహన్, డీజీఎం కిరణ్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
అనుమానాస్పదంగా యువకుడి మృతి
రామకృష్ణాపూర్: క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని గద్దెరాగిడి అమ్మాగార్డెన్స్ ప్రాంతానికి చెందిన తడక దినేశ్ (29) అనుమానాస్పదంగా మృతిచెందాడు. శుక్రవారం రాత్రి ఇంట్లో అపస్మారక స్థితిలో ఉండటాన్ని గమనించిన స్నేహితులు వెంటనే అతన్ని మంచిర్యాల ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. స్నేహితులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అక్కడ నిద్రమాత్రలు లభించాయని, ఆ మాత్రలు వేసుకుని దినేశ్ ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నామని పట్టణ ఎస్సై రాజశేఖర్ తెలిపారు. కాగా, అమెరికాలో ఉన్న కూతురు మౌనిక వద్దకు తల్లిదండ్రులు పద్మావతి, రవి ఇటీవల వెళ్లారు. దీంతో వారు తిరిగి వచ్చేవరకు మృతదేహాన్ని మంచిర్యాల ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీలో ఉంచారు. వారి ఫిర్యాదు అనంతరం మృతదేహానికి పోస్టుమార్టం చేయిస్తామని పట్టణ ఎస్సై తెలిపారు. చికిత్స పొందుతూ మహిళ మృతిసోన్: పురుగుల మందు తాగిన మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు.. మండలంలోని మాదాపూర్‌కు చెందిన సల్ల భోజవ్వ (54)కు కుమారుడు నరేశ్ ఉన్నారు. నరేశ్‌కు పెళ్లి చేసింది. పదేళ్ల క్రితం భర్త నరేశ్‌తో గొడవపడి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో భోజవ్వ బాధపడుతుండేది. కోడలు రావడం లేదని మనస్తాపం చెందిన ఆమె శుక్రవారం సాయంత్రం ఇంట్లో గుర్తు తెలియని పురుగుల మందు తాగింది. కుమారుడు నరేశ్ గమనించి నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతిచెందింది. కుమారుడు ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కె.గోపి తెలిపారు. మహిళలను వేధిస్తున్న వ్యక్తిపై కేసుఆదిలాబాద్టౌన్: మహిళలను వేధిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు టూటౌన్ సీఐ కరుణాకర్‌రావు తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని కేఆర్కే కాలనీకి చెందిన అనీస్ రైల్వేస్టేషన్ ఎదుట నుంచి వెళ్తున్న మహిళలు, యువతులను వేధింపులకు గురి చేస్తున్నాడని తెలిపారు. పలువురు షీ టీంకు సమాచారం అందించగా.. అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు. అడవిపంది దాడిలో ఒకరికి తీవ్రగాయాలుఇచ్చోడ: అడవిపంది దాడిలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. మండలంలోని దేవుల్‌నాయక్ తండాకు చెందిన రాథోడ్ గంభీర్సింగ్ శనివారం వ్యవసాయ పొలంలో పనిచేస్తున్నాడు. అటవీ ప్రాంతం నుంచి వచ్చిన అడవి పంది ఒక్కసారిగా అతనిపై దాడి చేయగా తప్పించుకునే క్రమంలో జారిపడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. గంభీర్సింగ్ను అంబులెన్స్‌లో ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మద్యం తాగొద్దన్నందుకు భర్త ఆత్మహత్యమంచిర్యాలక్రైం: మద్యం తాగొద్దని భార్య మందలించడంతో భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. ఏఎస్సై దివాకర్, కు టుంబీకులు తెలిపిన వివరా లు.. జిల్లాకేంద్రంలోని గాంధీనగర్‌కు చెందిన ఒల్లెపు వెంకటేశ్(40), సుజాత దంపతులు. వీరికి కుమారుడు గణేశ్, కూతుళ్లు బిందు, దివ్య ఉన్నారు. కూలీ పనిచేస్తూ జీవనం సాగించేవా రు. వెంకటేశ్ గత కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. ప్రతి రోజు మద్యం తాగి ఇంటికి రావడంతో తరచూ గొ డవలు జరిగేవి. ఎదిగిన పిల్లలు ఉన్నారని, మద్యం తాగుడు మానేయాలని భార్య మందలించడంతో వెంకటేశ్ మనస్తాపం చెందాడు. శుక్రవారం ఎఫ్ సీఐ గోదాము వెనుకాల మద్యం మత్తులో పురుగు ల మందు తాగి చనిపోతున్నానని కుటుంబీకులకు ఫోన్‌చేసి చెప్పాడు. వారు అక్కడికి చేరుకుని అతన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై తెలిపారు. -
రాష్ట్రస్థాయి అథ్లెటిక్ పోటీలకు ఎంపిక
వేమనపల్లి: మంచిర్యాలలో నిర్వహించిన జిల్లాస్థాయి అథ్లెటిక్ పోటీల్లో మండలంలోని నీల్వాయి జెడ్పీఎస్ఎస్ పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు హెచ్ఎం గిరిధర్‌రెడ్డి, పీఈటీ దాసరి మల్లేశ్ తెలిపారు. వశాక రజిత, అల్వియ మహివీన్, చింతల మహేశ్వరి, కొట్రంగి అనూష సత్తాచాటారు. హన్మకొండలో జవహర్లాల్ స్టేడియంలో ఆదివారం జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో వారు పాల్గొంటారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు. -
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
నస్పూర్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ గ్రా మీణ బ్యాంక్ మంచిర్యాల ఆర్ఎం ప్రభుదాస్ సూచించారు. పట్టణ పరిధిలోని మెప్మా కా ర్యాలయంలో సీతారాంపల్లి, సింగాపూర్ శా ఖలు, మెప్మా ఆధ్వర్యంలో మహిళా సంఘాల కు రుణాల మంజూరు, ఖాతాల నిర్వహణపై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు. ఈ రెండు శాఖల పరిధిలో ఇప్పటివరకు రూ.48కోట్ల రుణాలు మంజూ రు చేసినట్లు చెప్పారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ద్వారా ప్రతీ ఏడాది రూ.20 చెల్లించి రూ.2లక్షల ప్రమాదబీమా, రూ.436 చెల్లించి ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా ద్వారా సాధారణ మరణానికి రూ.2 లక్షల బీమా సదుపాయం పొందవచ్చని తెలిపారు. మేనేజర్లు నరసింహస్వామి, రాము, ఫీల్డ్ అధికారులు రవి, డేవిడ్ పాల్గొన్నారు. -
విద్యార్థులకు చట్టాలపై అవగాహన అవసరం
మంచిర్యాలరూరల్(హాజీపూర్): విద్యార్థులు చట్టాలపై కూడా అవగాహన పెంచుకోవాలని లీగల్ సర్వీసెస్ అథారిటీ జిల్లా చీఫ్ లీగల్ ఎ యిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఎండీ సంధాని తెలి పా రు. శనివారం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముల్కల్ల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల, జూనియర్ కళాశాలలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు భారత న్యాయ సంహిత చట్టాలపై అవగాహన సద స్సు నిర్వహించారు. లీగల్ సర్వీసెస్ అథారిటీ సూపరింటెండెంట్ భాస్కర్, డెప్యూటీ చీఫ్ శ్రీనివాస్, అసిస్టెంట్లు రాములు, సదయ్య, కళాశాల ప్రిన్సిపల్ మోహన్, వైస్ ప్రిన్సిపల్ మహేశ్వర్‌రావు, అధ్యాపకులు డాక్టర్ నగేశ్, ప్రమోద్, సంతోష్‌గౌడ్, కిరణ్, సంధ్య, ఉదయశ్రీ, శృతి, శరణ్య, సత్యనారాయణ, శ్రీనివాస్, వినయ్, సురేందర్ పాల్గొన్నారు. -
అర్జీలు పెండింగ్..!
● వేలాదిగా వచ్చిన దరఖాస్తులు ● వందల్లోనే సమస్యలు పరిష్కారం ● కొనసాగుతున్న పరిశీలన ప్రక్రియ ● సాదాబైనామాలకు కలగని మోక్షం ● ఇదీ ‘భూ భారతి’ దరఖాస్తుల తీరు సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: జిల్లాలో నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తు ల పరిశీలన కోసం సంబంధిత అధికారులు సతమతమవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా భూ సమస్యల పరిష్కారానికి వేలల్లో వినతులు వచ్చాయి. కాగా, వందల సంఖ్యలోనే పరిష్కారానికి అవకాశం కలు గుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్ స్థానంలో భూ భారతి చట్టాన్ని అమల్లోకి తెచ్చిన విషయం తె లిసిందే. జిల్లాలో తొలుత పైలట్ మండలంగా భీ మారాన్ని ఎంపిక చేయగా, తర్వాత జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో సదస్సులు నిర్వహించి భూ సమస్యలపై అర్జీలు స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన సదస్సుల ద్వారా 16వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ఇప్పటివరకు 200పైచిలుకు మాత్రమే పరిష్కారానికి నోచుకున్నాయి. ఇంకా వేలాది అర్జీలు పెండింగ్‌లోనే ఉన్నాయి. సాదాబైనామాలు..సాదాబైనామాలు, పీవోటీ, ప్రభుత్వ భూములకు సంబంధించి 5వేలకు పైగా అర్జీలు వచ్చాయి. తెల్ల కాగితాలపై జరిగిన భూ క్రయవిక్రయాలపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. జిల్లాలో వేలాదిమంది ఈ సమస్య పరిష్కారం కోసం వేచి చూస్తున్నారు. మిగతావి సర్వే నంబర్ మిస్సింగ్, 2 వేలకు పైగా డిజిటల్ సైన్ పెండింగ్‌పై వచ్చాయి. మిగతా దరఖాస్తులో కోర్టు కేసులు, భూ విస్తీర్ణంలో హెచ్చుతగ్గులు, భూమి రకంలో మార్పు, విరాసత్, కుటుంబ సభ్యుల పేర్లలో తప్పులు తదితర సమస్యలపై వచ్చినవి ఉన్నాయి. వీటన్నింటినీ అధికా రులు ఆన్లైన్లో నమోదు చేశారు. ప్రస్తుతం అర్జీల పరిశీలన ప్రక్రియ కొనసాగుతోంది. అధికారులు మొదట నోటీసులు ఇస్తూ దరఖాస్తుదారుల వద్ద ఉన్న రికార్డులు, ఆధారాలను పరిశీలిస్తున్నారు. హద్దు సమస్యలు అలాగే..అటవీ, రెవెన్యూ హద్దుల సమస్యలపై జిల్లా వ్యా ప్తంగా అనేక దరఖాస్తులు వచ్చాయి. ఈ సమస్యల పరిష్కారానికి అటవీ, రెవెన్యూ, సర్వే శాఖల అధి కారులు క్షేత్రస్థాయిలో సర్వే చేయాల్సి ఉంది. ఇందుకోసం ఇరు శాఖల మధ్య రికార్డుల ఆధారంగా ఆ భూములు ఏ రకానికి చెందినవో తేల్చాల్సి ఉంటుంది. అయితే ఈ సమస్యలు పరిష్కారం దిశగా వెళ్లడం లేదు. కొన్నిచోట్ల జాయింట్ సర్వేలు జరుగుతున్నప్పటికీ అటవీ, రెవెన్యూ శాఖలలో వేటివో స్పష్టంగా తేల్చలేకపోతున్నారు. ఇక ప్రభుత్వ, ప్రైవేట్ భూములున్న చోట కూడా రికార్డుల్లో స్పష్ట త లేక అధికారులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. పైలట్ మండలంలోనూ..పైలట్ మండలం భీమారంలోనూ భూ సమస్యలు పరిష్కారం కాలేదు. ఈ మండలంలో 2,140 దరఖాస్తులు రాగా, వీటిలో వెయ్యికిపైగా అర్జీలు సాదా బైనామాలవే ఉన్నాయి. మొత్తంగా 200 అర్జీలు పరి ష్కార యోగ్యంగా ఉన్నాయి. వీటిలో 108 అర్జీలు ఆర్డీవో స్థాయిలో సమస్య పరిష్కారానికి నివేదించారు. మిగతావి పరిశీలన దశలో ఉన్నాయి. -
త్యాగానికి ప్రతీక మొహర్రం
● వెల్లివిరుస్తున్న మత సామరస్యం ● జిల్లాలో నేడు మొహర్రం పండుగ నెన్నెల: మహ్మద్ ప్రవక్త మనుమడు హజరత్ ఇమా మ్ హుస్సేన్ త్యాగానికి ప్రతీకగా ముస్లింలు మొహర్రం పండుగ జరుపుకొంటారు. ఇమామ్ హుస్సేన్‌తోపాటు ఆయన కుటుంబ సభ్యులందరికీ పది రో జులపాటు నివాళులర్పిస్తారు. మొహర్రం ఉత్సవా ల్లో కులమతాలకు అతీతంగా పాల్గొంటారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే వేడుకల్లో భాగంగా ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో పీరీలను కొలుస్తారు. ప ది రోజుల పాటు పూజలందుకున్న పీరీలను మొహర్రం సందర్భంగా నేడు నిమజ్జనం చేయనున్నారు. హస్సేన్, హుస్సేన్ పేరిట గ్రామాల్లో కొలువుదీరే సవార్లను (పీరీలు) భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. పీరీల వద్ద కోరుకున్న మొక్కులు తీరుతాయని ప్రజల ప్ర గాఢ నమ్మకం. పీరీల మొక్కుతో పిల్లలు పుడితే ము స్లింలు వారికి హస్సేన్, హుస్సేన్ అని పేరు పెడతా రు. హిందువులైతే ఆశన్న, ఉశన్న, ఆడపిల్లలైతే ఆశ క్క, ఉశక్క అని నామకరణం చేస్తారని పలువురు పేర్కొంటున్నారు. ఇలాంటి పేర్లు కలిగిన వారు గ్రామాల్లో చాలా మంది ఉన్నారు. పదిరోజులపా టు నిర్వహించే ఈ ఉత్సవాల్లో తారతమ్య భేదాలు లేకుండా పాల్గొంటారు. పీరీలను నమ్మేవారు మొ హర్రం నెల వంక కనిపించిన నుంచి నిమజ్జనం జరి గే వరకు మద్యం, మాంసాహారానికి దూరంగా ఉంటారు. పీరీలకు మలిద ముద్దలు, కుడుకలు, బెల్లంషరబత్ నైవేద్యంగా సమర్పిస్తారు. సబ్జా ఆకులు, పూలు, కుడుకల దండలతో అలంకరిస్తారు. పీరీల వద్ద అగ్నిగుండం (అలావా) ఏర్పాటు చేసి దాని చుట్టూ కాళ్లకు గజ్జెలు కట్టుకుని డప్పుచప్పుళ్ల మధ్య లయబద్ధంగా అసైదులా ఆడతారు. -
విధులు నిర్లక్ష్యం చేస్తే చర్యలు
● కలెక్టర్ కుమార్ దీపక్ ● కార్యాలయాల తనిఖీ మంచిర్యాలఅగ్రికల్చర్: విధులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని కలెక్టర్ కుమార్ దీపక్ హెచ్చరించారు. శనివారం జిల్లా సమీకృత కలెక్టరేట్లోని వివి ధ శాఖల కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చే శారు. రిజిస్టర్లు, రికార్డులు, అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది హాజరు పట్టికలు, ఆయా కార్యాలయాల పరిధిలో కొనసాగుతున్న పనుల వివరాలు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ.. ఆలస్యంగా వచ్చిన, సమాచారం లేకుండా విధులకు గైర్హాజరైన అధికారులు, సిబ్బందికి షోకా జ్ నోటీసులు జారీ చేయాలని కలెక్టరేట్ ఏవో రాజేశ్వర్‌ను ఆదేశించారు. అధికారులు ఆయా కార్యాల యాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. ఈవీఎంల గోదాం పరిశీలన జిల్లాలోని నస్పూర్లోగల ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల గోదాంను కలెక్టర్ కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించారు. గోదాం వద్ద పటిష్ట భద్రత చేపట్టినట్లు తెలిపారు. సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
మరిన్ని కొత్త బడులు
● 20 మంది విద్యార్థులుంటే చాలు.. ● మంచిర్యాలలో 15, నిర్మల్‌లో ఐదు స్కూళ్ల ప్రారంభానికి సన్నాహాలు ● అద్దెభవనాల్లో ఏర్పాటుకు చర్యలుమంచిర్యాలఅర్బన్: నిరుపేద విద్యార్థులకు సర్కా రు విద్యను చేరువ చేసేందుకు ప్రభుత్వం దృష్టి సా రిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్, మంచిర్యాలలో కొత్తగా పాఠశాలలు ప్రారంభించేందుకు నిర్ణయించింది. 20 మంది, అంతకంటే ఎక్కు వ పిల్లలున్న ప్రాంతాలను గుర్తించి పాఠశాలల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. దీనిపై శుక్రవారం డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటికే విద్యార్థులు లేరంటూ మూసేసిన పాఠశాలల పునఃప్రారంభానికి విద్యాశా ఖ శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది ఇప్పటికే మంచి ర్యాల జిల్లాలో మూడు పాఠశాలలు పునఃప్రారంభించింది. హజీపూర్ మండలం వెంపల్లి, లక్సెట్టిపే ట్ మండలం కొత్త కొమ్ముగూడ, దండేపల్లి మండలం కొత్త మామిడిపల్లిలో పాఠశాలలు తెరుచుకున్నాయి. ‘ప్రైవేట్’కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక (ప్రీ ప్రైమరీ) విద్యను సర్కారు అందుబాటులోకి తెచ్చింది. ఉమ్మడి ఆదిలాబాద్ జి ల్లాలో 23పాఠశాలల్లో పూర్వప్రాథమిక విద్యను అం దుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం విద్యార్థులుండి బ డులు లేని చోట వెంటనే కొత్తగా ప్రైమరీ స్కూళ్ల ఏ ర్పాటే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా నిర్మల్ జిల్లాలో 5, మంచిర్యాలలో 15 కొత్త బడులు త్వరగా ప్రారంభించాలని ప్రభుత్వం ఆయా జిల్లా ల విద్యాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఏర్పాట్లలో అధికారులుగ్రామీణ, పట్టణ ప్రాంతాలవారీగా కొత్త ప్రభుత్వ పాఠశాలల ఏర్పాటుపై విద్యాశాఖ అధికారులు తలమునకలయ్యారు. కిలోమీటరు లోపు ప్రైమరీ, మూడు కిలోమీటర్ల లోపు అప్పర్ ప్రైమరీ, ఐదు కి లోమీటర్లలోపు హైస్కూల్ ఉండాలని విద్యాహక్కు చట్టం చెబుతోంది. ఆయా గ్రామాలు, పట్టణాల్లో ఎంత మంది పిల్లలున్నారు? పాఠశాల తెరిచే అవకాశాలు ఎంత మేర ఉన్నాయి? అనే విషయాలపై క్షేత్రస్థాయి పరిశీలన చేసిన అధికారులు ఉన్నతాధికారులకు నివేదించారు. ఇందులో భాగంగా కొత్తగా సర్కారు పాఠశాలలకు అవసరమైన వసతిగృహా లు, అద్దె భవనాలు ఎక్కడెక్కడా ఉన్నాయో.. ఆరా తీస్తున్నారు. ప్రభుత్వ భవనాలు ఏమైనా ఉన్నా యా.. అని పరిశీలిస్తున్నారు. ఫర్నిచర్ బోర్డులు, వి ద్యా సామగ్రి కోసం అవసరమైన బడ్జెట్ కలెక్టర్ ద్వారా సమకూర్చనున్నారు. కొత్త పాఠశాలలు గ్రా మీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా ప్రారంభం కానున్నాయి. వీటికి అనువైన భవనాలు దొరుకుతాయా? లేదా? తేలాల్సి ఉంది. త్వరలోనే కొత్త పాఠశాలలు ప్రారంభిస్తాం కొత్తగా ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు వచ్చాయి. విద్యార్థులుండి ప్రభుత్వ పాఠశాలలు లేని చోట కొత్త బడులు ఏర్పాటు కానున్నాయి. పాఠశాలలకు అనుకూలమైన భవనాలు, మౌలిక వసతులు సమకూర్చడంపై దృష్టి సారించాం. వీలైనంత త్వరలోనే కొత్త బడులు ప్రారంభం కానున్నాయి. ఇదివరకు పిల్లలు తక్కువగా ఉండి.. టీచర్లు ఎక్కువగా ఉన్న పాఠశాలల నుంచి కొత్త పాఠశాలలకు ఉపాధ్యాయులను డిప్యూటేషన్‌పై పంపిస్తాం. – యాదయ్య, మంచిర్యాల డీఈవోకొత్తవి ఇక్కడే..20 మంది కంటే ఎక్కువ విద్యార్థులున్నా ప్రభు త్వ, స్థానిక సంస్థల పాఠశాలలు అందుబాటులో లేని గ్రామీణ ఆవాసాలు, పట్టణ ప్రాంతా ల్లో వార్డుల జాబితాను విద్యాశాఖ అధికారులు రూపొందించారు. ఇందులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 20 చోట్ల పాఠశాలలు ఏ ర్పాటు కానున్నాయి. మంచిర్యాల జిల్లాలో 15 చోట్ల ప్రారంభించనున్నారు. ఇందులో బెల్లంపల్లి మండలం సోమగూడెం, క్యాతన్‌పల్లిలోని వార్డు నంబర్–17 (‘బీ’ జోన్ పార్ట్), శ్రీనివాసనగర్, శేషుపల్లి విలేజీ, నాగార్జున కాలనీ క్వార్టర్, కాకతీయ కాలనీ, నస్పూర్‌లోని సుభాష్‌నగర్, హౌసింగ్‌బోర్డు కాలనీ, లక్సెట్టిపేట్లోని గో దావరి రోడ్ వీకర్ సెక్షన్, గొల్లగూడ మోదేల, మందమర్రి మండలంలోని బురదగూడెం, పా కిస్తాన్క్యాంపు, మంచిర్యాలలోని హైటెక్‌సిటీ కా లనీ, ఎల్ఐసీ కాలనీ, గోసేవా మండల్లో 20 మంది కంటే ఎక్కువ విద్యార్థులున్నట్లు గుర్తించి పాఠశాలలు ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యా రు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని బంగాల్పేట్ మహాలక్ష్మీవాడ–1, డబుల్బెడ్రూం (ఎల్లపల్లి), ఖానాపూర్ డబుల్ బెడ్రూం కాలనీ (కుమురంభీం ఎక్స్‌రోడ్), భైంసాలోని బాబ్లాగామ్, ఖానా పూర్లోని రంగపేట్ గ్రామంలో అధికారులు కొత్త పాఠశాలలు ఏర్పాటు చేయనున్నారు. -
విద్యుత్ ప్రమాదాలపై అవగాహన
మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ మండలంలోని దొనబండలో శనివారం విద్యుత్‌శాఖ ఆధ్వర్యంలో పొలంబాట కార్యక్రమాన్ని నిర్వహించి రై తులకు అవగాహన కల్పించారు. ఎస్ఈ ఉత్తమ్ జా డే మాట్లాడుతూ.. రైతులు వానాకాలంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సొంతంగా విద్యు త్ పనులు చేయవద్దని, ఎక్కడైనా వేలాడుతున్న, తెగిపడిన తీగలు కనిపిస్తే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. జీఐ వైర్‌పై బట్టలు ఆరవేయరాదని, మేతకు వెళ్లే పశువులు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల వైపు వెళ్లకుండా చూడాలని సూచించారు. పొలాల వద్ద మోటర్లు, స్టార్టర్లు, జీఐ పైపులున్న ప్రాంతాల్లో రైతులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. విద్యుత్ సమస్యలు ఉత్పన్నమైతే 1912 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి చెప్పాలని సూచించా రు. పొలంబాటలో రైతులు అనుమానాలను నివృత్తి చేస్తూ పొలాల్లో వంగి ఉన్న విద్యుత్ స్తంభాలను సరి చేయించారు. కార్యక్రమంలో ఆపరేషన్ డీఈ మహ్మద్ కై సర్, ఏఈ మహేందర్‌రెడ్డి, లైన్మెన్లు, రైతులు, స్థానికులు పాల్గొన్నారు. -
జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొన్ని చోట్ల వైద్యులు, సిబ్బంది కొరత కారణంగా అరకొరగా వైద్యం అందుతోంది. అపరిశుభ్రత, అసౌకర్యాలతో రోగులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ‘సాక్షి’ శుక్రవారం విజిట్ నిర్వహించింది.
ఆసుపత్రి చుట్టూ అపరిశుభ్రత మంచిర్యాలటౌన్: మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి భవనం శిథిలావస్థకు చేరింది. వరండా, పలు గదుల్లో రెండేళ్లుగా స్లాబ్ పెచ్చులూడుతోంది. దీంతో రోగులు, వైద్యులు, సిబ్బంది భయపడుతున్నారు. కాలేజీ రోడ్డులోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆవరణలో నూతనంగా 450పడకలతో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి భవన నిర్మాణం పూర్తి కావస్తుండడంతో ప్రస్తుత భవనంలో మరమ్మతులు చేపట్టడం లేదు. ఇప్పటికే నూతన భవన నిర్మాణం పూర్తి కావాల్సి ఉండగా.. ఆలస్యమవుతోంది. వర్షాకాలం తర్వాతే అందుబాటులో రానుండగా.. మరో మూడు నెలలు ఇబ్బందుల్లోనే ఆస్పత్రి నిర్వహించాల్సి ఉంది. ఆస్పత్రిలో వెలువడే బయోవేస్టేజ్, చెత్తను కలిపి ఆస్పత్రి వెనుకాల ఉన్న ఖాళీ స్థలంలో వేస్తుండడంతో దుర్గంధం వెదజల్లుతోంది. జిల్లాతోపాటు కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా, మహా రాష్ట్ర నుంచి నిత్యం 500కు పైగా రోగులు(ఓపీ) వస్తుంటారు. అన్ని విభాగాల్లో వైద్యులు లేకపోవడం, అపరిశుభ్రత, ఇతరత్రా కారణాలతో రోగుల సంఖ్య తగ్గింది. అత్యవసర విభాగంలో పది మంది వైద్యులకు గాను ఏడుగురు మాత్రమే ఉన్నారు. వీరిలో ఒకరు మెటర్నిటీ లీవులో వెళ్లారు. దంత, కంటి వైద్యులు లేరు. గుండె వైద్య నిపుణుడు డిప్యూటేషన్‌పై ఖమ్మంలో పని చేయగా.. ఇటీవల డిప్యూటేషన్ రద్దు చేసినా ఇక్కడికి రాకపోవడంతో వైద్యసేవలు అందుబాటులో లేవు. మాతాశిశు ఆరోగ్య కేంద్రం ప్రసూతి విభాగంలో 14మంది గైనకాలజిస్టులకు ఆరుగురే పని చేస్తున్నారు. నవజాత శివు సంరక్షణ కేంద్రంలో అసోసియేట్ ప్రొఫెసర్లు ఇద్దరు ఉండాల్సి ఉండగా.. రెండు పోస్టులూ ఖాళీగా ఉన్నాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఎనిమిది గాను ముగ్గురే ఉన్నారు. వాహనాల పార్కింగ్ స్థలం లేక, ఇష్టారీతిన పార్కింగ్తో అంబులెన్స్‌లు లోపలికి రాని పరిస్థితి ఏర్పడుతోంది. వైద్యుల నియామకానికి నివేదించాంమంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, మాతాశిశు ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టుల భర్తీకి ఉన్నతాధికారులకు నివేదించాం. పదోన్నతులతో కొందరిని, నూతనంగా నియామకం చేపట్టి మరికొందరిని కేటాయించే అవకాశం ఉంది. ఆసుపత్రి ఆవరణలో పరిశుభ్రతకు చర్యలు తీసుకోవడంతోపాటు వర్షాకాలంలో రోగులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం. పాత భవనం కావడం వల్ల కొన్ని ఇబ్బందులున్నా, నూతన భవనం పూర్తయితే పూర్తిస్థాయి సౌకర్యాలు అందుతాయి. – డాక్టర్ హరీశ్‌చంద్రరెడ్డి, మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ప్రారంభం కాని పక్కా భవనం లక్సెట్టిపేట: మండల కేంద్రంలోని ప్రభుత్వ సివిల్ ఆస్పత్రి పాత రేకుల షెడ్డులోనే కొనసాగుతోంది. 30పడకల పక్కా ఆస్పత్రి భవనం పూర్తి కాగా త్వరలో ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నారు. ఎనిమిది మంది వైద్యులకు గాను ఐదుగురే ఉన్నారు. వీరిలో ముగ్గురు డిప్యూటేషన్‌పై విధులు నిర్వర్తిస్తున్నారు. స్టాఫ్‌నర్సులు 14మంది ఉండాల్సి ఉండగా.. ఆరుగురే ఉన్నారు. వీరిలో ఇద్దరు డిప్యూటేషన్‌పై మంచిర్యాలలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఎంఎన్‌వోలు నలుగురికి గాను ఒక్కరే ఉన్నారు. ఎఫ్ఎన్వో నలుగురికి గాను ఒక్కరూ లేరు. -
సమస్యల్లో సర్కారు ఆస్పత్రులు
బెల్లంపల్లి/తాండూర్/నెన్నెల/వేమనపల్లి/కాసిపేట: బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రభుత్వ ఆస్పత్రులు సమస్యలకు నిలయాలుగా మారాయి. వైద్యులు, సిబ్బంది కొరత, అసౌకర్యాలతో రోగులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి వంద పడకలకు ఇంకా అప్‌గ్రేడ్ కాలేదు. ప్రస్తుతం 30పడకల సామర్థ్యంతో నిర్వహిస్తున్నారు. రోగుల తాకిడి అధికంగా ఉండగా.. నర్సుల కొరత నెలకొంది. వంద పడకలకు గాను 26మంది నర్సులు ఉండాల్సి ఉండగా.. 19మంది పని చేస్తున్నారు. వీరిలో తొమ్మిది మంది డిప్యూటేషన్‌పై వచ్చారు. నర్సుల పోస్టుల భర్తీలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందడం లేదు. రోజువారీగా 250 నుంచి 300 మంది రోగులు వస్తున్నారు. పది మంది వైద్యులతో నెట్టుకొస్తున్నారు. అత్యవసర చికిత్స కోసం మంచిర్యాలకు రెఫర్ చేస్తున్నారు. ఒక్కరే వైద్యులు బెల్లంపల్లి మండలం తాళ్లగురిజాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు వైద్యుల్లో ఒకరు మందమర్రికి డిప్యూటేషన్‌పై వెళ్లారు. ఒక్కరే వైద్యులు ఉండడంతో గ్రామీణులకు మెరుగైన వైద్య సేవలు అందడం లేదు. ఆరోగ్య కేంద్రం దారి చిరుజల్లులకే బురదగా మారడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. వైద్యాధికారి పోస్టు ఖాళీగా ఉంది. వారానికోసారి రాక తాండూర్ మండలం మాదారం టౌన్షిప్ సింగరేణి డిస్పెన్సరీలో వారానికోసారి బుధవారం మాత్రమే వస్తుంటారు. మిగతా రోజుల్లో రోగులకు వైద్య సేవలు అందడం లేదు. ఇద్దరు స్టాఫ్‌నర్సులు, వార్డు అసిస్టెంట్ వైద్యం అందిస్తుంటారు. ● తాండూర్ పీహెచ్సీలో ముగ్గురు వైద్యులకు గాను శుక్రవారం ఇద్దరే కనిపించారు. ఏఎన్ఎం పోస్టులు మూడు ఖాళీ ఉండగా.. ఖాళీగా ఉన్న సబ్సెంటర్లో ఓ ఏఎన్ఎంతో నెట్టుకొస్తున్నా రు. ఆపరేషన్ థియేటర్లోని పరికరాలు చాలా రోజుల నుంచి వాడక నిరుపయోగంగా మారా యి. అవసరమైన పరికరాలు లేక గర్భిణులకు ప్రసవం చేయడం లేదు. బెల్లంపల్లి ఆస్పత్రికి రెఫర్ చేస్తున్నారు. కుక్కకాటు కేసులు అధికంగా వస్తున్నాయి. ఆయుర్వేద వైద్యశాలలో రెగ్యులర్ డాక్టర్ లేరు. డిప్యూటేషన్‌పై గురు, శుక్ర, శనివా రాల్లో వైద్యురాలు వస్తుంటారు. కాళ్లనొప్పులకు సంబంధించిన మందుల కొరత ఉంది. రక్త పరీక్షలకు ఇబ్బంది నెన్నెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది కొరత వేధిస్తోంది. రోజుకు 80నుంచి 100మంది రోగులు వస్తుండగా సరైన సేవలు అందడం లేదు. ఇద్దరు డాక్టర్లకు గాను ఒకరే విధులు నిర్వర్తిస్తున్నారు. ల్యాబ్‌టెక్నీషియన్ లేక గర్భిణులు, జ్వరబాధితులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు రక్త పరీక్షలకు ఇబ్బందులు పడుతున్నారు. ఒక స్టాఫ్‌నర్సు పోస్టు ఖాళీగా ఉంది. ఎస్వో లేక ఉన్న వైద్యుడిపై పని భారం పెరిగింది. ఆస్పత్రిలో తాగునీరు లేక రోగులు, సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. సమయపాలన పాటించని వైద్య సిబ్బంది వేమనపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బంది సమయపాలన పాటించడం లేదు. శుక్రవారం ఉదయం 11.30గంటల వరకు వైద్యాధికారి రాజేష్ విధులకు హాజరు కాలేదు. 24గంటల వైద్యం అమలులో ఉన్నా సమయపాలన పాటించకపోవడం గమనార్హం. 11.30గంటలకు ఎనిమిది మంది ఓపీ వచ్చారు. ఓపీ గది పక్కనే బ్లీచింగ్ పౌడర్ బస్తా చిరిగిపోయి ఉండడంతో వాసన వస్తోంది. అదనపు వైద్యాధికారి, సీహెచ్‌వో, మేల్ సూపర్వైజర్ స్టాఫ్‌నర్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. చామనపల్లి, నీల్వాయి, జిల్లెడ సబ్సెంటర్లలో ఏఎన్ఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎన్సీడీ సమావేశానికి ఏఎన్ఎంలు, సిబ్బంది హాజరు కాగా వైద్యాధికారి సమయానికి రాలేదు. ఆసుపత్రి ముందే బురద కాసిపేట పీహెచ్సీ ఎదుట బురదగా మారడంతో రోగులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. 108, ఆటోరిక్షాలు వెళ్లేందుకు, నడవలేని వారిని వాహనాల్లో తీసుకెళ్లడం సమస్యగా మారింది. డ్రైవర్, ఆపరేటర్, స్టాఫ్‌నర్సు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పరికరాలు సమకూర్చితే ప్రసూతి చేస్తాం ఆసుపత్రి థియేటర్లోని పరికరాలు చాలా రోజుల నుంచి వాడకపోవడంతో పనికి రాకుండా పోతున్నాయి. నిధుల లేమితో కొత్త పరికరాలు కొనుగోలు చేయలేకపోతున్నాం. పరికరాలు సమకూర్చితే గర్భిణులకు ప్రసవాలు చేస్తాం. – డాక్టర్ ఝాన్సీ, తాండూర్ పీహెచ్సీ -
సెల్ఫోన్లు చోరీ చేసి..పాస్వర్డ్లు ఓపెన్ చేసి
● ఫోన్ పే, గూగుల్ పే నుంచి నగదు తస్కరణ ● పోలీసులకు పట్టుబడ్డ మైనర్ బాలుడు సారంగపూర్: ప్రజల వద్ద నుంచి సెల్ఫోన్లు చోరీ చేసి..పాస్వర్డ్లు ఓపెన్ చేసి గూగుల్ పే, ఫోన్ పే ద్వారా మైనర్ బాలుడు డబ్బులు తస్కరించిన ఘటన మండలంలో చేసుకుంది. స్థానిక పోలీసుస్టేషన్లో నిర్మల్ రూరల్ సీఐ కృష్ణ, ఎస్సై శ్రీకాంత్ ఈమేరకు వివరాలు వెల్లడించారు. సారంగపూర్ మండలం ఆలూరుకు చెందిన దండు రవికిరణ్, నిర్మల్‌లోని బుధవార్‌పేట్‌కు చెందిన రవికుమార్‌ల కిరాణా షాపునకు వెళ్లి వారం క్రితం ఓమైనర్ బాలుడు సరుకులు కొనుగోలు చేస్తున్నట్లు నటించి వారి సెల్ఫోన్లు చోరీ చేశాడు. పాస్వర్డ్ తెరిచి ఫోన్‌పే యాప్ ద్వారా దండు రవికిరణ్ ఫోన్ నుంచి రూ.20 వేలు, రవికుమార్ ఖాతా నుంచి రూ.13 వేలను ఇతర ఖాతాలకు బదిలీ చేసి నగదుగా మార్చుకున్నాడు. ఈ విషయమై సదరు షాపు యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై శ్రీకాంత్, రూరల్ సీఐ మున్నూరు కృష్ణలు సాంకేతిక పరిజ్ఞానంతో విచారణ ప్రారంభించారు. సదరు మైనర్ బాలుడు తస్కరించిన ఫోన్లలో తన ఫొటోలు తీసుకున్నాడు. అయితే సదరు ఫొటోలు బాధితుల గూగుల్ ఫొటోల్లోకి అప్లోడ్ కావడంతో బాధితులు వెంటనే పోలీసులకు సమాచారం చేరవేశారు. శుక్రవారం సారంగపూర్ పరిధిలో బాలుడిని అదుపులో తీసుకుని విచారణ చేపట్టారు. అతన్ని వద్ద నుంచి రూ.38వేల నగదు, ఒక వీవో 5జీ సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసును త్వరితగతిన ఛేదించిన రూరల్ సీఐ, స్థానిక ఎస్సై, సిబ్బంది ఆకాశ్, వినోద్, ప్రణీత్‌లను ఎస్పీ జానకీ షర్మిల, ఏఎస్పీ రాజేష్ మీనా అభినందించారు. -
భార్యను హత్య చేసిన భర్త అరెస్టు
తాండూర్: ఈనెల 3న కన్నెపల్లి మండలం మెట్పల్లిలో భార్యను హత్య చేసిన భర్తను అరెస్టు చేసినట్లు సీఐ కుమారస్వామి తెలిపారు. తాండూర్ సర్కిల్ కార్యాలయంలో శుక్రవారం ఈమేరకు వివరాలు వెల్లడించారు. మెట్‌పల్లికి చెందిన ముడిమడుగుల తిరుపతికి దహెగాం మండలం భావన్‌నగర్ గ్రా మానికి చెందిన తులసీతో 14 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి గ్రీష్మ (4) పాప ఉంది. పెళ్లయిన నాటి నుంచి భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఇటీవల కాలంలో తిరుపతి తన భార్య తులసీపై మరింత అనుమానం పెంచుకున్నా డు. ఈనెల 2న ఈ విషయమై భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. ఎలాగైనా కట్టుకున్న భార్యను కడతేర్చాలని నిర్ణయించుకున్నాడు. ఈనెల 3న ఇంట్లో తులసీ నిద్రిస్తుంది. మద్యం మత్తులో ఇంటికి వచ్చిన తిరుపతి ఆమె మెడపై గొడ్డలితో నరికి చంపాడు. భార్యను చంపానని బంధువులకు ఫోన్లలో తెలిపాడు. తులసీ తండ్రి శంకర్ ఫిర్యాదు మేరకు పోలీసులు శుక్రవారం నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో కన్నెపల్లి ఎస్సై గంగారాం, సిబ్బంది పాల్గొన్నారు. -
వీడని అసంతృప్తి!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మంత్రి పదవి ఆశించి భంగపడిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు(పీఎస్సార్) అసంతృప్తి వీడడం లేదు. రెండో విడతలో తనకు కేబినెట్ బెర్త్ ఖాయమని భావించినా పక్కన పెట్టడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆయన అనుచరవర్గానికి ఊహించని విధంగా షాక్ తగిలింది. మరోవైపు జిల్లా నుంచే చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్‌వెంకటస్వామికి మంత్రిగా అవకాశం కల్పించి తనకు ఇవ్వకపోవడంపై గత కొద్ది రోజులుగా అసంతృప్తితోనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు గత పదేళ్లుగా ఉమ్మడి జిల్లాలో బలోపేతానికి కృషి చేశానని, తనకు అవకాశం కల్పించాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఇంద్రవెల్లి సభ నుంచి అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పాదయాత్రతోపాటు మంచిర్యాలలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే బహిరంగ సభ వరకు ఎన్నో పార్టీ కార్యక్రమాలు విజయవంతం చేశారు. ఎన్నికల ముందు ఏఐసీసీ అధ్యక్షుడితో సహా పలువురు అగ్రనేతలు పీఎస్సార్‌కు సముచిత స్థానం ఉంటుందని హామీలు ఇచ్చారు. తీరా ఆయనకు అవకాశం రాకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. ఇటీవల గాంధీభవన్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకున్నారు. తనకు అవకాశం కల్పించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఎటువైపో..! గత ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించిన ‘జై బాపు జై భీమ్ జై సంవిధాన్’ బహిరంగ సభలో తన గొంతు నొక్కొద్దంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు ముందే ఆవేదనతో మాట్లాడారు. నిన్న మొన్న వచ్చిన వాళ్లకు అవకాశం ఇచ్చి తనను విస్మరిస్తున్నారని అన్నారు. ఉమ్మడి జిల్లాకు పదవుల్లో అన్యాయం చేస్తే ఏం చేయడానికై నా సిద్ధమేనంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో తన అసంతృప్తి ఎటువైపు దారి తీస్తుందోనని రాజకీయంగా చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచీ విధేయతగా ఉంటున్నారు. అయినా కేబినెట్లో చోటు దక్కకపోవడంపై తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. దీంతో మంత్రివర్గంలో చోటు కాకుండా ఇతర ఏ పదవీ ఇచ్చినా తీసుకునేందుకు ఇష్టపడడం లేదు. ఎమ్మెల్యేగానే నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకునే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో అధిష్టానం ఆయనకు అవకాశం ఇస్తుందా..? లేదా..? పీఎస్సార్ వెనక్కి తగ్గి ఉంటారా..? అనే చర్చ పార్టీ వర్గాల్లో నడుస్తోంది. మంత్రివర్గంలో చోటు దక్కక నిరాశలో పీఎస్సార్ అగ్రనేతలను కలుస్తున్న మంచిర్యాల ఎమ్మెల్యే తనకు అన్యాయం జరిగిందంటూ వేడుకోలు -
‘బస్తా ఇస్తలేరు.. పట్టించుకుంటలేరు’
కౌటాల(సిర్పూర్): తొమ్మిది రోజుల నుంచి అధికా రుల చుట్టూ తిరిగినా.. ఒక్క యూరియా బస్తా కూడా ఇస్తలేరని చింతలమానెపల్లి మండల రైతులు ఆందోళనకు దిగారు. శుక్రవారం కౌటాల రైతు వేదిక ఎదుట భైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూరియా బస్తాల కోసం వ్యవసాయ పనులు ఆపి కార్యాలయాల చుట్టూ తిరిగినా అధికారులు పట్టించుకోవ డం లేదన్నారు. ఎరువుల కోసం గంటల తరబడి పడిగాపులు గాయాల్సి వస్తుందని వాపోయారు. సరిపడా ఎరువులు పంపిణీ చేయకుంటే వ్యవసాయం చేయలా వద్దా అని ప్రశ్నించారు. యూరి యా బస్తాల కోసం చింతలమానెపల్లికి వెళ్తే.. కౌటాల వెళ్లాలని చెబుతున్నారని, కౌటాలకు వెళ్తే అక్కడికే వెళ్లాలంటున్నారని తెలిపారు. చింతలమానెపల్లిలోనే అక్కడి రైతులకు ఎరువులు పంపిణీ చేయాలన్నారు. కాగా, యూరియా బస్తాలు అందజేస్తామని కౌటాల ఏవో ప్రేమలత తెలపడంతో రైతులు ఆందోళన విరమించారు. కౌటాల, చింతలమానెపల్లి మండలాల రైతులు భారీగా తరలిరావడంతో పోలీసుల బందోబస్తు మధ్య యూరియా బస్తాలు పంపిణీ చేశారు. -
నకిలీ పోలీస్ అరెస్ట్
గుడిహత్నూర్: పోలీ స్ అవతారమెత్తి ప్ర జలను మోసగిస్తూ, డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్న నకిలీ పోలీస్‌ను శుక్రవారం అరెస్టు చేసినట్లు ఇ చ్చోడ సీఐ బండారి రాజు, పీఎస్సై మధుకృష్ణ తెలిపారు. వారి కథ నం ప్రకారం.. మండల కేంద్రంలోని ఎక్స్‌రోడ్డు వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు అనుమానాస్పదంగా వ్యక్తి కనిపించా డు. సదరు వ్యక్తిని విచారించగా నార్నూర్‌కు చెందిన కుడ్మెత నాగరావ్ అని గుర్తించి సెల్‌ఫోన్‌ను పరిశీలించారు. పోలీసు యూనిఫాంతో ఉన్న అతడి ఫొటోలు ఉన్నాయి. వాట్సాప్ డీపీలో యూనిఫాం వేసుకున్న ఫొటో పెట్టాడు. వీటిని చూపిస్తూ ప్రజల వద్ద డబ్బులు వసూళ్లు చేసినట్లు నేరం ఒప్పుకున్నాడు. అతని వద్ద నుంచి పోలీస్ అని రాసి ఉన్న బైక్, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
సెల్ఫీ కొట్టు..ప్రైజ్ పట్టు
మంచిర్యాలఅర్బన్: కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఏటా విద్యార్థులకు జాతీయ విద్యార్థుల పర్యావరణ పోటీ (ఎన్ఎస్పీసీ)ని నిర్వహిస్తోంది. హరిత్–ద వే ఆప్ లైఫ్ అనే థీమ్‌తో దేశవ్యాప్తంగా విద్యార్థుల కు పోటీలు నిర్వహిస్తున్నారు. ఈనెల 1న ప్రారంభమైన పోటీలు 21 వరకు కొనసాగనున్నాయి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటడం, వ్యర్థాలు వేరు చేయడం, వాతావరణంలో పొంచి ఉన్న ప్రమాదాలను లోతుగా అర్థం చేసుకునేందు కు విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు దీని ప్రధాన ఉద్దేశం. జిల్లాలో అన్ని పాఠశాలల యాజ మాన్యాలు గత నాలుగు రోజులుగా విద్యార్థులు ప్రధానంగా మొక్కలు నాటడం, వ్యర్థాలను వేరు చేయడం, నీటి సంరక్షణ అంశాలకు సంబంధించి స్వీయచిత్రాలు (సెల్ఫీ దిగి) యాప్‌లో ఉత్సాహంగా అప్లోడ్ చేస్తున్నారు. ఈ క్విజ్ పోటీల్లో పాల్గొనే విద్యార్థులందరూ ఇ–సర్టిఫికెట్లు అందుకుంటున్నా రు. జాతీయస్థాయిలో క్విజ్ పోటీల్లో ప్రతిభ చూపి న వారికి నగదు పారితోషికంతోపాటు జాతీయ హరిత విద్యార్థి అవార్డు అర్హత పొందవచ్చు. ఒకటో తరగతి నుంచి..ఈ పోటీల్లో ఒకటి నుంచి పరిశోధన విద్యార్థుల వరకు ఐదు విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. ఏకో మిత్రం యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. హిందీ, ఇంగ్లిష్, ఇతర భాషల్లో క్విజ్ ఉంటుంది. మొక్క నాటుతున్న నీరు పొదుపు చేస్తున్న వ్యర్థాలను వేరు చేస్తున్న సెల్ఫీ లోడ్ చేయాల్సి ఉంటుంది. 1 నుంచి 5వ తరగతి వరకు, 6 నుంచి 8 వరకు, మూడో గ్రూప్‌లో 9 నుంచి 12వ తరగతి, నాలుగో గ్రూప్‌లో గ్రాడ్యుయేట్, పీజీ పరిశోధకులు, ఐదో గ్రూప్‌లో ఇతరులకు అవకాశం కల్పించారు. ఈనెల 21 వరకు పోటీలు నిర్వహిస్తారు. ఆగస్టు 30న ఫలితాలు వెల్లడించనున్నారు. పర్యావరణంపై ఏకోమిత్రం పోటీలు జూలై 21 వరకు పోటీల నిర్వహణ ఉత్సాహంగా పాల్గొంటున్న విద్యార్థులు విద్యార్థులను ప్రోత్సహించాలి ప్రతీ పాఠశాల విద్యార్థులు పర్యావరణ ఏకోమిత్రం పోటీల్లో పాల్గొనేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి. ఈపోటీల్లో పాల్గొనేవారికి ఇ–సర్టిఫికెట్ల ఇవ్వడంతోపాటు విద్యాసంస్థలకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కలుగుతుంది. – యాదయ్య, డీఈవో -
వసతిగృహాల్లో సదుపాయాలు కల్పించాలి
● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాల్లో విద్యార్థులకు అన్ని సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో డీఈవో యాదయ్యతో కలిసి జిల్లా అధికారులు, ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాల ప్రిన్సిపాళ్లతో విద్యార్థులకు కల్పించాల్సిన సదుపాయాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మహనీయుల మార్గంలో నడవాలి మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రజల సంక్షేమం కోసం విశేష కృషి చేసిన మహనీయుల మార్గంలో నడవాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం తెలంగాణ సాయుధ పోరాట వీరుడు దొడ్డి కొమురయ్య వర్ధంతి, మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జయంతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఏ.పురుషోత్తం, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి దుర్గాప్రసాద్, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి రాజేశ్వరి, క్రీడా శాఖ అధికారి హనుమంత్‌రెడ్డి, కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. నాణ్యమైన భోజనం అందించాలి లక్సెట్టిపేట: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని కేజీబీవీ, జూనియర్ కళాశాల, ప్రభుత్వ సివిల్ ఆసుపత్రి నూతన భవ నం నిర్మాణ పనులను పరిశీలించి మాట్లాడారు. పాఠశాలల ప్రిన్సిపాల్, వైద్యులు పాల్గొన్నారు. -
ఏసీబీకి చిక్కిన డిప్యూటీ తహసీల్దార్
కోటపల్లి: మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల డిప్యూటీ తహసీల్దార్ నవీన్‌కుమార్ శుక్రవారం ఏసీబీ అధికారులకు చిక్కారు. భీమారం గ్రామానికి చెందిన గంట నరేశ్ నుంచి డబ్బులు డిమాండ్ చేసి పట్టుబడ్డారు. వివరాలిలా ఉన్నాయి. భీమారానికి చెందిన గంట నరేశ్ మండలంలోని రాజారం శివారులో సర్వే నంబరు 71/13/2లో 20గుంటల భూమిని తన తండ్రి లక్ష్మయ్య పేరిట పట్టా చేయించేందుకు ఈ కేవైసీ కోసం డిప్యూటీ తహసీల్దార్ నవీన్‌కుమార్‌ను సంప్రదించాడు. ఆయన రూ.15వేలు డిమాండ్ చేయగా.. అంత ఇచ్చే స్థోమత లేదని, రూ.10వేలు ఇస్తానని ఒప్పుకున్నాడు. శుక్రవారం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి నవీన్‌కుమార్‌కు సమాచారం ఇవ్వగా.. తాత్కాలిక ఉద్యోగి అంజికి ఇవ్వాలని సూచించారు. కార్యాలయం వెనుకాల డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నగదు సీజ్ చేసి కార్యాలయంలో తనిఖీలు నిర్వహించి పలు ఫైళ్లు స్వాధీనం చేసుకున్నారు. అంజి, డిప్యూటీ తహసీల్దార్ నవీన్‌కుమార్‌ను ఏసీబీ డీఎస్పీ మధు అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. కేసు నమోదు చేసి కరీంనగర్‌లోని ఏసీబీ కోర్టుకు తరలిస్తామని పేర్కొన్నారు. 20గుంటల భూమి పట్టా చేసేందుకు డిప్యూటీ తహసీల్దార్ పది రోజులుగా వేధిస్తున్నారని, ప్రతీరోజు ఉదయం సాయంత్రం వరకు ఇక్కడే ఉండడం డ్యూటీగా మారిందని నరేశ్ ఆవేదన వ్యక్తం చేశాడు. -
వేర్వేరు కారణాలతో ముగ్గురి ఆత్మహత్య
ఉమ్మడిజిల్లాలో వేర్వేరు కారణాలతో ముగ్గు రు బలవన్మరణాలకు పాల్పడ్డారు. మద్యానికి బానిసై ఒకరు, మద్యంమత్తులో మరో యువ కుడు, అనారోగ్యంతో మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. పురుగుల మందు తాగి ఒకరు..లోకేశ్వరం: మండలంలో ని రాజూర గ్రామానికి చెందిన తోట దేవన్న(52) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై ఆశోక్ కథనం ప్రకారం.. దేవన్న కొంతకాలంగా మద్యానికి బానిసై ఎలాంటి పని చేయకుండా తిరుగుతుండేవాడు. గురువారం రాత్రి అతి గా మద్యం తాగి ఇంటికి రావడంతో ఈ విషయమై భార్య హేమలత, కుమారుడు మందలించారు. దీంతో మనస్తాపం చెందిన దేవన్న అదేరాత్రి గుర్తుతెలియని పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అంబులెన్స్‌లో నిర్మల్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం మృతిచెందాడు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు సతీశ్ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మద్యం మత్తులో యువకుడు.. బజార్హత్నూర్: మద్యం మత్తులో యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఏఎస్సై లింబాజీ తెలిపారు. ఆయన కథనం ప్రకా రం.. మండల కేంద్రంలోని ముత్యంపేటకు చెందిన సుకుల్ నారాయణ–లక్ష్మి దంపతుల కుమారుడు సుకుల్ తరుణ్(23) ఓ ఫర్టిలైజర్ షాపులో పనిచేస్తున్నాడు. గత కొన్నిరోజులుగా మద్యానికి బానిసయ్యాడు. బహిర్భుమికని గురువారం మధ్యాహ్నం చెరువుకట్ట వైపు వెళ్లి తిరిగిరాలేదు. అక్కడ పురుగుల మందు తాగి కిందపడిపోయి ఉన్నాడని స్థానికులు గమనించి కుటుంబీకులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని అతన్ని పీహెచ్‌సీకి తీసుకెళ్లి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్‌లో ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి మృతిచెందాడు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు. అనారోగ్యంతో మహిళ..లింగాపూర్: అనారోగ్యంతో బాధపడుతున్న మహి ళ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై గంగన్న కథనం ప్రకారం.. మండలంలోని జాముల్దర గ్రామానికి చెందిన సలాం సరస్వతీ(33) గత రెండేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఆసుపత్రుల్లో చూపించిన నయం కాలేదు. దీంతో మనస్తాపం చెందిన ఆమె గురువారం రాత్రి ఇంట్లో పురుగుల మందు తాగింది. గమనించిన భర్త, కుటుంబ సభ్యులు ఆమెను జైనూర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో ఆదిలాబాద్ రిమ్స్‌కు పంపించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
బస్తీ దవాఖానాలో పరికరాలు కరువు
చెన్నూర్/చెన్నూర్‌రూరల్/కోటపల్లి/మందమర్రిరూరల్: చెన్నూర్ నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది కొరత నెలకొంది. కొన్ని ఆస్పత్రుల్లో పరికరాల కొరత కారణంగా వైద్యం అరకొరగా అందుతోంది. చెన్నూర్ బస్తీ దవాఖానా హెడ్‌నర్సు కృష్ణకుమారి ఒక్కరే ఉన్నారు. వైద్యులు చెన్నూర్ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి వెళ్లారని తెలిపారు. బస్తీ దవాఖానాకు రోజు ఓపీ 20 నుంచి 30మంది వస్తున్నారని, కొన్ని పరికరాలు కావాల్సి ఉందని, త్వరలోనే వస్తాయని వైద్యురాలు లక్ష్మీప్రసన్న తెలిపారు. ● చెన్నూర్ మండలం అంగ్రాజ్‌పల్లి పీహెచ్సీ వైద్యుడు ఉన్నత చదువుల నిమిత్తం వెళ్లారు. దండేపల్లి వైద్యుడు డిప్యూటేషన్ విధులు నిర్వర్తిస్తున్నారు. పీహెచ్సీ పరిధిలోని ఎనిమిది సబ్సెంటర్లలో మొదటి ఏఎన్ఎంలు ఎనిమిది మంది ఉండాల్సి ఉండగా.. నలుగురే ఉన్నారు. హెచ్‌ఈవో, సూపర్వైజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నలుగురు హెల్త్ అసిస్టెంట్లకు గాను ఒక్కరే ఉన్నారు. ● కోటపల్లిలోని ఆయుర్వేద వైద్యశాల సిబ్బంది లేక ఏడాదిగా మూసి ఉంటోంది. పీహెచ్సీలో ఫార్మాసిస్టు, ల్యాబ్ టెక్నీషియన్లు లేరు. రక్త పరీక్షలు ప్రైవేటుగా చేయించుకుంటున్నారు. ● మందమర్రి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రెండు మూడు నెలలుగా ఇన్స్‌లిన్ కొరత ఉంది. రోగులు ప్రైవేటు మందుల దుకాణాల్లో కొనుగోలు చేయాల్సి రావడంతో ఆర్థిక భారం తప్పడం లేదు. మందమర్రి, పొన్నారంలో ఒక్కో వైద్యుడి పోస్టు ఖాళీగా ఉన్నాయి. -
చోరీ చేసిన బంగారు గొలుసు విక్రయిస్తూ..
నిర్మల్‌టౌన్: చోరీ చేసిన బంగారు గొలుసు విక్రయించేందుకు వెళ్తున్న ఇద్దరు మహిళల ను అరెస్టు చేసినట్లు నిర్మల్ ఏఎస్పీ రాజేష్ మీనా తెలిపారు. జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీ వివరాలు వెల్లడించా రు. గతనెల 30న నిర్మల్ ఆర్టీసీ బస్టాండ్ వద్ద కడెంకు చెందిన కిష్టమ్మ మెడలో రెండు తు లాల బంగారుగొలుసు చోరీకి గురైంది. పోలీ సులు బస్టాండ్ వద్ద గల సీసీ ఫుటేజీలను పరి శీలించి దొంగలు ఆదిలాబాద్‌కు చెందిన సంగింటి లక్ష్మి, నిర్మల్‌కు చెందిన పండెన కవిత గుర్తించారు. చోరీ చేసిన బంగారాన్ని విక్రయించేందుకు ఇద్దరు మహిళలు వెళ్తున్నారు. జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి రెండు తులాల బంగారు గొలుసు, కత్తెరను స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ తెలిపారు. ఈ కేసు ఛేదనలో ప్రతిభ కనబర్చిన పట్టణ సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సై సంజీవ్, జిల్లా సీసీఎస్ టీమ్‌ను ఎస్పీ జానకీ షర్మిల అభినందించారు. -
12నుంచి సకల కళల సంబరాల జాతర
బెల్లంపల్లి: ఈ నెల 12, 13వ తేదీల్లో వరంగల్‌లో సకల కళల సంబరాల జాతర నిర్వహించనున్నట్లు రాష్ట్ర జానపద కళాకారుల సంఘం కార్యదర్శి హన్మాండ్ల మధు తెలిపారు. గురువారం ఆయన బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతర పోస్టర్లను మాజీ జెడ్పీటీసీ సభ్యుడు కారుకూరి రాంచందర్, కాంగ్రెస్ నాయకులు, కళాకారులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో జేబీ కల్చరల్ ఆర్ట్స్ సొసైటీ ఆధ్వర్యంలో 1,116 మంది కళాకారులతో 30 గంటలపాటు ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్ కోసం నిర్వహిస్తున్న జాతరను కళాకారులు విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేబీ కల్చరల్ ఆర్ట్స్ సొసైటీ అధ్యక్షుడు జాడాల శివ, ప్రధాన కార్యదర్శి పీఆర్ ప్రసాద్, జిల్లా నృత్య కళా సమాఖ్య సభ్యులు ఆర్.అర్జున్, రమేష్, గిరి లక్ష్మణ్, తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం పట్టణ అధ్యక్షుడు జంజర్ల దినేష్‌కుమార్, కళాకారులు అర్చన, రాంచందర్, సకినాల రాజేశ్వరరావు, బాలకృష్ణ, రాములు తదితరులు పాల్గొన్నారు. -
● సెప్టెంబర్ 30 డెడ్‌లైన్ ● పాత వాహనాలకు హై సెక్యూరిటీ నంబరు ప్లేట్ అమర్చుకోవాలి ● 2019కి ముందు కొన్నవాటికి తప్పనిసరి ● ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిన రవాణా శాఖ
మంచిర్యాలరూరల్(హాజీపూర్): నకిలీ నంబరు ప్లేట్లను అరికట్టడం, రహదారి భద్రతపై సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి అన్ని రకాల వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నంబరు ప్లేట్(హెచ్ఎస్ఆర్ఎన్పీ) తప్పనిసరి చేస్తూ రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నంబరు ప్లేట్ల చివరన ఉన్న లేజర్ కోడ్‌ను ట్రాక్ చేసి వాహనదారుడి పేరు, వివరాలు, వాహనం ధ్వంసమైనా లేజర్ కోడ్ ద్వారా వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. 2019 ఏప్రిల్ ఒకటి కన్న ముందు కొనుగోలు చేసిన వాహనాలకు ఈ నంబరు ప్లేటు బిగించని పక్షంలో రోడ్లపైకి వచ్చే అవకాశం ఉండదు. తుది గడువు సెప్టెంబర్ 30లోగా అమర్చుకోవాలని రవాణా శాఖ స్పష్టం చేసింది. లేనిపక్షంలో భారీ జరిమానాలు, శిక్ష విధించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ నంబరు ప్లేట్లు అమర్చుకునేందుకు వాహనాల తీరు ఆధారంగా ప్రత్యేక రుసుములు ప్రకటించారు. కాలం చెల్లిన వాహనాల కట్టడి కాలపరిమితి ముగిసిన వాహనాలు రోడ్లపై తిరగకుండా రవాణా శాఖ పటిష్ట చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా 15ఏళ్ల కాలపరిమితి ముగిసిన వాహనాలను గుర్తించే ప్రక్రియ చేపట్టింది. కాలపరిమితి ముగిసిన వాహనాలు వేర్వేరు నంబరు ప్లేట్లతో రోడ్లపై తిరుగుతూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. అనేక వాహనాలకు సకాలంలో సామర్థ్య పరీక్షలు చేయించడం లేదు. ఇకపై అలాంటి వాటికి అడ్డుకట్ట పడనుంది. జిల్లా వ్యాప్తంగా 2019 మార్చి 31లోగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాహనాలు 2,18,246 ఉండగా ఇందులో అన్ని రకాల పాత వాహనాలు అంటే కాల పరిమితి ముగిసినవి మినహా మిగతా వాటికి హై సెక్యూరిటీ నంబరు ప్లేట్లు బిగించుకోవాల్సిందేనని అధికారులు స్పష్టం చేశారు. 2019 ఏప్రిల్ తర్వాత వాహనాలకు ఇప్పటికే హైసెక్యూరిటీ నంబరు ప్లేటు నిబంధన అమలవుతోంది. ఇప్పటివరకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ బిగించుకున్న వాహనాలు 3,02,010 ఉన్నాయి. ఇందులో చాలా వాహనాలు సాధారణ నంబర్ ప్లేట్‌తో తిరుగుతున్నాయి. ప్లేట్ బిగించని వాహనాలను అమ్మాలన్నా.. కొనాలన్నా ఇబ్బందులు తప్పేలా లేవు. ఆర్టీఏ అధికారుల తనిఖీల్లో పట్టుబడితే కేసులు నమోదు చేసి జరిమానా వేయడం, వాహనం సీజ్ చేయడం చేస్తారు. మార్పు ఇలా.. పాత వాహనానికి కొత్తగా హై సెక్యూరిటీ నంబర్ ప్లేటు పొందాలంటే వాహనదారుడే నేరుగా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. https://bookmyhsrp.com వెబ్సైట్లో వాహనం నంబరు, వాహన రకం, కంపెనీ, జిల్లా తదితర వివరాలు నమోదు చేయాలి. నంబర్ ప్లేట్ షోరూం వివరాలు వస్తాయి. వెంటనే ఆ షోరూంకు వెళ్లి వాహనానికి హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ అమర్చుకుని ఫొటో తీసి మరోసారి వెబ్సైట్లో నమోదు చేయాల్సిన బాధ్యత వాహనదారుడిపై ఉంది. ఈ విధానంతో నిరక్షరాస్యులు, స్మార్ట్ఫోన్లు లేని వాహనదారులు అయోమయానికి గురి కానున్నారు. విధిగా అమర్చుకోవాలిపాత వాహనాలకు కొత్తగా హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు విధిగా అమర్చుకోవాల్సిందే. ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల మేరకు నిర్ణయించిన ఫీజుతో నంబర్ ప్లేట్ తీసుకోవాల్సి ఉంటుంది. రోడ్లపై తిరిగే ప్రతీ వాహనం హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ అమర్చుకోవాలి. తనిఖీలో పట్టుబడితే కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్ చేస్తాం. అవసరమైతే బీమా, రిజిస్ట్రేషన్ తదితర సేవలు నిలిపివేసేలా రవాణా శాఖ చర్యలు చేపడుతోంది. – సంతోశ్‌కుమార్, డీటీఓ, మంచిర్యాల -
నీటి వనరులపై శిక్షణ
మంచిర్యాలఅగ్రికల్చర్: 7వ చిన్న తరహా, 2వ నీటి వనరుల గణనపై మండల ప్రణాళిక, గణాంక అధికారులకు శిక్షణ ఇచ్చినట్లు జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి(సీపీవో) వి.పూర్ణచంద్రరావు తెలిపారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మండల ప్రణాళిక, గణాంక అధికారులకు ఏర్పాటు చేసిన నీటి వనరుల గణనపై శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సీపీవో మాట్లాడుతూ జిల్లాలోని అన్ని నీటి వనరులను గ్రామాలు, వనరుల వారీగా గణన చేసేందుకు శిక్షణ ఇచ్చామని తెలిపారు. శిక్షణ పొందిన అధికారులు తమకు కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గణాంక అధికారి, డివిజనల్ ఉప గణాంక అధికారి, కార్యాలయ ఉప గణాంక అధికారి, మండల ప్రణాళిక, గణాంక అధికారులు పాల్గొన్నారు. -
ఆదివాసీలను విడుదల చేయాలి
దండేపల్లి: జన్నారం మండలం కోలాంగూడకు చెందిన ఆదివాసీలు ఆత్రం రాజు, అతడి కుమారులు రవికుమార్, సుధాకర్‌లను వెంటనే విడుదల చేయాలని ఆదివాసీ సేన జిల్లా అధ్యక్షుడు పెంద్రం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గురువారం దండేపల్లి మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆదివాసీల గుడిసెలు, కుల దైవం భీమన్న దేవుని గుడిపై అటవీ అధికారులు దాడి చేసి ధ్వంసం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఆత్రం రాజు, అతడి ఇద్దరు కుమారులను అకారణంగా అరెస్టు చేశారని ఆరోపించారు. విడుదల చేయని పక్షంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆదివాసీ సేన జిల్లా కోశాధికారి మర్సుకొల సంతోష్, రాజ్‌గోండ్ సేవ సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి పెంద్రం నరేందర్, నాయకులు టేకం భీంరావ్, అడై తిరుపతి, అడై భగవంత్‌రావ్ పాల్గొన్నారు. అటవీశాఖ అధికారుల దిష్టిబొమ్మ దహనం పాతమంచిర్యాల: అటవీ శాఖ అధికారుల తీరును నిరసిస్తూ జిల్లా కేంద్రంలో గురువారం సీపీఎం ఆధ్వర్యంలో అటవీ శాఖ అధికారుల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆదివాసీలపై అక్రమంగా కేసులు బనాయించి హింసకు గురి చేస్తున్నారని ఆరోపించారు. జన్నారం మండలం తపాలాపూర్‌లో ఆది వాసీల దైవం భీమన్నదేవుని గుడిని అటవీ అధికా రులు ధ్వంసం చేయడం అన్యాయమని అన్నారు. దీనిపై నిలదీసిన ఆత్రం రాజు, అతడి ఇద్దరు కుమారులు రవికుమార్, సుధాకర్‌లపై అక్రమ కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి సంకె రవి, జిల్లా కమిటీ సభ్యులు దుంపల రంజిత్, దూలం శ్రీనివాస్, ప్రేంకుమార్, మిడివెళ్లి రాజు, అరిగెల మహేష్, మోహన్ పాల్గొన్నారు. -
‘మోదీ పాలనలోనే దేశం అభివృద్ధి’
మంచిర్యాలటౌన్: ప్రధాని నరేంద్ర మోదీ 11ఏళ్ల పాలనతో దేశం ఎంతగానో అభివృద్ధి చెందిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని మార్కెట్ ఏరియాలో గురువారం సాయంత్రం ఆయన పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్‌తో కలిసి పలు దుకాణాల్లో ప్రధాని చేసిన అభివృద్ధిని వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానిగా ఆయన తీసుకున్న నిర్ణయాలు అభివృద్ధికి ఎంతగానో సహకరించాయని తెలిపారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌కు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించేందుకు సిద్ధంగా ఉందని అన్నారు. డీపీఆర్‌ను సిద్ధం చేసి కలెక్టర్ ద్వారా సంబంధిత మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపిస్తే నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. -
నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలి
చెన్నూర్/భీమారం: వినియోగదారులకు నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలని జిల్లా విద్యుత్ శాఖ అధికారి ఉత్తమ్ జాడే అన్నారు. గురువారం ఆయన చెన్నూర్ సబ్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. వర్షాకాలంలో విద్యుత్ సమస్యలు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. చెట్ల కొమ్మలు, లూజ్లైన్లను సరి చేయాలని సూచించారు. విద్యుత్ కనెక్షన్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. భీమారం మండలం నర్సింగాపూర్‌లో నిర్మించనున్న 33/11కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ స్థలాన్ని పరిశీలించారు. భీమారం నుంచి నర్సింగాపూర్ వరకు అటవీప్రాంతం గుండా విద్యుత్తు స్తంభాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా అందుకు అటవీశాఖ అభ్యంతరం తెలిపింది. భీమారం–నెన్నెల రహదారి గుండా వెళ్లే ఈ లైను రోడ్డుకి ఎంత దూరం నుంచి ఏర్పాటు చేయాల్సి ఉంటుందనేది పరిశీలించారు. అటవీశాఖ అనుమతి పొందేందుకు కలెక్టర్‌ను కలిసి వివరించన్నుట్లు తెలిపారు. కలెక్టర్ నుంచి అనుమతి రాగానే విద్యుత్ లైను వేసే పనులు చేపడుతామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో డీఈ రాజన్న, ఏడీఈ బాలకృష్ణ, ఏఈలు ఏ.శ్రీనివాస్, శంకర్, ఏఏవో శ్రీనివాస్ పాల్గొన్నారు. నేడు దొడ్డి కొమురయ్య వర్ధంతి మంచిర్యాలటౌన్: ఈ నెల 4న కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శుక్రవారం ఉదయం 9:30 గంటలకు దొడ్డి కొమురయ్య వర్ధంతి వేడుకలు నిర్వహించనున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఎ.పురుషోత్తం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వేడుకలకు అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు సకాలంలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. -
ఆరోగ్య శిబిరం.. సత్ఫలితం
జిల్లాలోని వైద్య శిబిరాల్లో కేసుల వివరాలువైద్య శిబిరాలు 21 టీబీ పరీక్షలు చేసింది 2,121 టీబీ లక్షణాలు ఉన్నది 1,347 హెచ్ఐవీ పరీక్షలు 2008 పాజిటివ్‌గా నిర్ధారణ 5 హైపటైటిస్ బీ పరీక్షలు 129 మధుమేహావ్యాధి నిర్ధారణ 457 రక్తపోటు గుర్తింపు 640మంచిర్యాలటౌన్: జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆరోగ్య శిబిరాలు సత్ఫలితా లు ఇస్తున్నాయి. టీబీ ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా దేశంలో 2030నాటికి క్షయను సంపూర్ణంగా నివారించాలన్న ఆశయంతో కేంద్ర ప్రభుత్వం వంద రోజుల సమగ్ర ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తోంది. క్షయవ్యాధి నిర్ధారణ కోసం జిల్లా వ్యాప్తంగా ప్రతీ గ్రామం, పట్టణాల్లోని వార్డుల్లో ప్రతీ రోజు ఒక వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నారు. స్థానికంగా ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. క్షయ, హెచ్ఐవీ, హెపటైటిస్ బీ, మధుమేహం, బీపీ వంటి పరీక్షలు చేస్తున్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలే వేళ జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ఆరోగ్య శిబిరాల్లో జ్వరం, జలుబు, దగ్గు వంటి వ్యాధులకూ పరీక్షలు చేస్తున్నారు. ఫలితంగా సీజనల్ వ్యాధుల ప్రభావం జిల్లాలో కొంతమేర తగ్గింది. సమగ్ర ఆరోగ్య శిబిరాలతోపాటు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల్లో వ్యాధులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి.. పలు రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. క్షయవ్యాధిపై అనుమానం ఉన్నవారిని ఎక్స్‌రే కోసం 102 వాహనాల్లో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి, అక్కడి నుంచి ఇంటికి తరలిస్తున్నారు. సీజనల్ వ్యాధులపై అవగాహన ఆరోగ్య శిబిరాలతోపాటు వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధులపై ప్రజలు, విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వర్షాలు కురుస్తుండడంతో నీటిని వేడి చేసి చల్లార్చి తాగాలని, వేడి ఆహారాన్ని తీసుకోవాలని, బయటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని, ఈగలు, దోమలు వాలకుండా చూసుకోవాలని వివరిస్తున్నారు. దోమల వృద్ధికి కారణమయ్యే నీటి నిల్వ, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం, ప్రతీ శుక్రవారం డ్రైడే పాటించడం, ఇంట్లో ఉన్న నిల్వ నీటిని ఎప్పటికప్పుడు తొలగించడం చేయాలని సూచిస్తున్నారు. డెంగీ, మలేరియా, డయేరియా వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు వివరిస్తున్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా శిబిరాలు, అవగాహన కార్యక్రమాలు దోహదపడుతున్నాయి. టీబీ ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా వైద్య శిబిరాలు టీబీ, హెచ్ఐవీ, హైపటైటిస్ బీ, బీపీ, మధుమేహం పరీక్షలు జ్వరం, ఇతర వ్యాధులకు వైద్య పరీక్షలుపరీక్షలు చేస్తున్నాంజిల్లాలో 100 రోజుల ప్రణాళికలో భాగంగా అన్ని వార్డులు, గ్రా మాల్లో సమగ్ర ఆరో గ్య శిబిరాలు నిర్వహిస్తున్నాం. అన్ని రకాల వ్యాధులకు పరీక్షలు చేయడంతోపాటు అవసరమైన వారికి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పరీక్షలు చేసి మందులు ఇస్తున్నాం. ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా సీజనల్ వ్యాధులను కొంతవరకు అరికట్టే అవకాశం ఉంది. – డాక్టర్ హరీశ్‌రాజ్, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి -
‘ప్రాణహిత’లో పెరుగుతున్న నీటిమట్టం
వేమనపల్లి: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రాణహిత నదిలో వరద నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. వేమనపల్లి పుష్కరఘాట్ వద్ద రెండు రోజులుగా నది రెండు పాయలుగా ప్రవహిస్తోంది. మహారాష్ట్ర తీరం వైపు ఎక్కువగా, తెలంగాణ(వేమనపల్లి) తీరం వైపు తక్కువగా వరద ప్రవాహం ఉంది. దీంతో నది చూడముచ్చటగా రెండు పాయలతో నిండుకుండలా పారుతోంది. ప్రయాణికులకు రెండు పడవల ప్రయాణం తప్పడం లేదు. వేమనపల్లి వైపు నుంచి నాటుపడవలో కొద్ది దూరం ప్రయాణించి నది మధ్యలో ఇసుక తిన్నెలపై దిగుతున్నారు. అక్కడ నుంచి ఇంజన్ పడవలో నది దాటి అవతలి వైపు ఉన్న మహారాష్ట్ర తీరం వైపు వెళ్తున్నారు ప్రమాదకరమే అయినా తప్పనిసరి పరిస్థితుల్లో అధిక చార్జీలు చెల్లిస్తూ ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. -
విద్యారంగం బలోపేతానికి చర్యలు
● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ● పాఠశాలలు, ఇందిరమ్మ ఇళ్ల సందర్శనజైపూర్: విద్యారంగం బలోపేతానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మండలంలోని పౌనూర్ గ్రామంలో ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను గురువారం ఆయన సందర్శించారు. విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, విద్యాబోధన, మధ్యాహ్న భోజన సదుపాయాలను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని సూచించారు. పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని అన్నారు. విద్యార్థుల సంఖ్య పెంపొందించాలని, బడియట పిల్లలు, మానివేసిన పిల్లలను తిరిగి చేర్పించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని తెలిపారు. అంగన్వాడీ కేంద్రంలో శారీరక, మానసిక ఎదుగుదల లోపం ఉన్న పిల్లల కు ఆహారం, అవసరమైన మందులు అందించాలని పేర్కొన్నారు. అనంతరం శివ్వారం ప్రభుత్వ పాఠశాలలో తరగతి గదులు, వంటశాల పరిసరాలు పరిశీలించి ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పరిశీలించి వేగవంతం పూర్తి చేయాలని సూచించారు. డీసీఎంఎస్ ఫార్మర్ సర్వీస్ సెంటర్లో ఎరువులు, విత్తనాల నిల్వలు, రిజిష్టర్లు పరిశీలించారు. గంగిపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, జైపూర్‌లోని తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలను సందర్శించారు. తహసీల్దార్ కార్యాలయంలో రేషన్‌కార్డుల దరఖాస్తులను పరిశీలించి అర్హులకు కార్డులు జారీ చేయాలి, భూభారతి రెవెన్యూ సదస్సుల్లో అందిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తహసీల్దార్ వనజారెడ్డి, ఎంపీడీవో సత్యనారాయణ పాల్గొన్నారు. -
మల్లిఖార్జున ఖర్గేను కలిసిన ప్రేమ్‌సాగర్‌రావు
మంచిర్యాలటౌన్: ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు, డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ కలిశారు. గురువారం ఆయనను హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణ హోటల్లో మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడారు. ఈ నెల 4న గ్రామస్థాయి కాంగ్రెస్ నేతలతో ఎల్బీ స్టేడియంలో జరిగే బహిరంగ సభకు ఖర్గే హాజరు కానుండగా సభ నిర్వహణపై చర్చించారు. ఇటీవల మంత్రివర్గ విస్తరణలో పదవిని ఆశించి భంగపడిన నాయకులతో ఖర్గే ప్రత్యేకంగా మాట్లాడగా, ప్రేమ్‌సాగర్‌రావుతోనూ చర్చించినట్లు సమాచారం. -
కళలు సంస్కృతికి ప్రతిబింబాలు
నిర్మల్‌ఖిల్లా: కళలు సాంస్కృతిక వైభవాన్ని చాటే ప్రతిబింబాలని, కళాకారులు సాంస్కృతిక వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని ముందుకు సాగాలని చలనచిత్ర, టీవీ కళాకారుల అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆడిచర్ల రాజు, జన్ను అనిల్‌కుమార్ అన్నారు. జిల్లా నూతన కార్యవర్గాన్ని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాలో చలనచిత్ర టీవీ కళాకారులు ప్రత్యేక అభిరుచితో తమ ప్రతిభను చాటుతూ రాణిస్తున్నారన్నారు. వీరి సంక్షేమం కోసం సంఘం తరఫున తగిన కృషిచేస్తామని నూతన కార్యవర్గ సభ్యులు తెలిపారు. అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా అడిచర్ల రాజు, ప్రధాన కార్యదర్శిగా జన్ను అనిల్‌కుమార్, కోశాధికారిగా సామెర్ల రాజన్న, ఉపాధ్యక్షులుగా చెట్పల్లి కమలాకర్, నరసయ్యచారి, వెన్నెల రాజేందర్, సంయుక్త కార్యదర్శిగా డాక్టర్ కత్తి కిరణ్, ప్రచార కార్యదర్శిగా గర్దాసు నరేందర్, సహాయ కార్యదర్శిగా కృష్ణవర్మ, కార్యనిర్వాహక కార్యదర్శిగా రాం రమేశ్, ఎర్ర రవీందర్, సలహాదారులుగా టీఎన్జీవో ప్రభాకర్, పురుషోత్తం, మోహన్‌రావు ఎన్నికయ్యారు. -
ట్రిపుల్‌ఐటీలో పారిశుద్ధ్య కార్మికుల విధుల బహిష్కరణ
● వర్సిటీని సందర్శించిన ఏసీఎల్ ● పెండింగ్ వేతనాలు ఇప్పించిన అధికారులు భైంసా: బాసర ట్రిపుల్‌ఐటీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో గురువారం విఽ దులు బహిష్కరించి ట్రిపుల్ఐటీ ప్రధాన గేటు ఎదుట ఆందోళన నిర్వహించారు. కార్మికుల వేతనాల్లో కోతలు, భారీ అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని, కోట్ల నిధులు పక్కదారి పట్టాయని ఆరోపణలు ఉన్నాయి. గడువు ముగిసినా ప్రైవేటు సంస్థకే పనులు పొడగించారని ప్రధాన ఆరోపణ ఉంది. 2021లో ప్రైవేటు సంస్థ ఏడాది గడువుతో పారిశుద్ధ్య నిర్వహణ దక్కించుకుంది. 2022లో కాంట్రాక్టు గడువు ముగిసినా అధికారులు అదే సంస్థకు పొడగిస్తున్నారు. దీనిపై అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. ఏసీఎల్ చేరుకుని... కార్మిక శాఖ సహాయ కమిషనర్ ముత్యంరెడ్డి బాసర క్యాంపస్‌కు చేరుకుని విధులు బహిష్కరించి ఆందోళన కొనసాగిస్తున్న పారిశుద్ధ్య కార్మికులను కలిశారు. సమస్యలు అడిగితెలుసుకున్నారు. తమకు ఏప్రిల్ నుంచి వేతనాలు చెల్లించడంలేదని, ఇతర సమస్యలు ఉన్నాయని వివరించారు. దీంతో సహాయ కమిషనర్ ట్రిపుల్ఐటీ ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీదర్శన్తో పాటు ఇతర అధికారులతో చర్చించి మే నెల వరకు కార్మికుల వేతనాలను ఇప్పించారు. జూన్ వేతనాలను ఈనెల చెల్లించేలా చూడాలని సంబంధిత సంస్థను ఆదేశించారు. వేతనాలు అందడంతో కార్మికులు విధుల్లో చేరారు. -
రూ.63 వేల విలువైన దేశీదారు ధ్వంసం
రెబ్బెన: పోలీసుల తనిఖీలో పట్టుబడిన రూ.63వేల విలువైన దేశీదారు బాటిళ్లను గురువారం స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలో ఎకై ్సజ్, పోలీసు సిబ్బంది ధ్వంసం చేశారు. గత డిసెంబర్ 31న రాత్రి కాగజ్‌నగర్ ఎక్స్‌రోడ్ వద్ద రెబ్బెన పోలీసులు తనిఖీ చేస్తుండగా మహారాష్ట్ర నుంచి అక్రమంగా తరలిస్తున్న 18 కాటన్ల దేశీదారు బాటిళ్లు లభ్యమయ్యాయి. పట్టుబడిన మద్యం స్థానిక పోలీస్ స్టేషన్లో భద్రపర్చగా గురువారం ఎకై ్సజ్, స్థానిక పోలీస్ సిబ్బంది బాటిళ్లను జేసీబీతో ధ్వంసం చేశారు. నాటుసారా పట్టివేత మండల కేంద్రంలోని ప్రగతినగర్‌కు చెందిన లావుడ్య రమేశ్ వద్ద 3 లీటర్ల నాటుసారాను పట్టుకుని అతనిపై కేసు నమోదు చేసినట్లు ఎకై ్సజ్ సిబ్బంది తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ఎకై ్సజ్ ఇన్చార్జి సీఐ రమేశ్‌కుమార్, హెడ్‌కానిస్టేబుల్ లక్ష్మణ్, కానిస్టేబుళ్లు కమలాకర్, మమత, విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. -
దొంగను పట్టించిన బైక్ నంబర్
కుంటాల: మహిళ మెడలో నుంచి గొలుసు చోరీకి యత్నించిన దొంగను బైక్ నంబర్ ఆధారంగా పట్టుకున్నట్లు ఎస్సై అశోక్ తెలిపారు. గురువారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మండలంలోని అందకూర్ గ్రామానికి చెందిన అక్కాచెల్లెళ్లు గత నెల 30న తమ కుమారుడితో కలిసి బైక్‌పై కుభీర్‌లో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లారు. తిరుగుప్రయాణంలో కల్లూరు బ్రిడ్జి వద్ద గుర్తు తెలియని వ్యక్తి మహిళ మెడలో నుంచి గొలుసు చోరీకి యత్నించాడు. వెనుక నుంచి వస్తున్న అందకూర్ గ్రామానికి చెందిన రవి గుర్తు తెలియని వ్యక్తి వాహనాన్ని వెంబడించి నంబర్ నోట్ చేసుకున్నాడు. బైక్ నంబర్ ఆధారంగా నిజామాబాద్ జిల్లా పోచంపాడ్ గ్రామానికి చెందిన సాయికిరణ్‌గా గుర్తించారు. గురువారం నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. -
‘ది స్టూడెంట్ మ్యాగజైన్’ ఆవిష్కరణ
బాసర: బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్(ఆర్జీయూకేటీ) విద్యార్థుల మాసపత్రిక ‘ది స్టూడెంట్ మాగజైన్’ను గురువారం ఆవిష్కరించారు. ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్, వోఎస్డీ డాక్టర్ ఈ.మురళీధర్, డాక్టర్ పి.చంద్రశేఖరరావు, డాక్టర్ ఎస్.విఠల్, డాక్టర్ టి.రాకేశ్‌రెడ్డి, నాగరాజు తదితరులు సంచికను విడుదల చేశారు. ఈ మ్యాగజైన్లో యూనివర్సిటీ క్యాంపస్‌లో ఏప్రిల్‌లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమాలు, విద్య, సాంస్కృతిక, క్రీడారంగాల్లో విద్యార్థుల సాధనలను పొందుపర్చారు. పత్రికలో విద్యార్థుల కథనాలు, సృజనాత్మక రచనలు, విజయాలు, వినూత్న ఆవిష్కరణలు, సామాజిక సేవా కార్యక్రమాలు వంటి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు. ప్రతినెలా విడుదలయ్యే ఈ పత్రిక, విద్యార్థులకు మాత్రమే కాకుండా తల్లిదండ్రులు, సామాజికవర్గాలకు విద్య, పర్యావరణంపై అవగాహన కల్పించనున్నారు. విద్యార్థుల ఎడిటోరియల్ బృందం, డాక్టర్ టి.రాకేశ్‌రెడ్డి మార్గదర్శనంలో ఈ పత్రికను రూపొందించింది. -
ట్రాక్టర్ బోల్తాపడి డ్రైవర్‌కు గాయాలు
రెబ్బెన: మండ ల కేంద్రంలోని జర్నలిస్టు కాలనీవద్ద జాతీయ రహదారిపై గురువారం డివైడర్‌ను ఢీకొట్టి ఇసుక ట్రాక్టర్ బోల్తా పడింది. రెబ్బెన వైపు నుంచి పులికుంట వైపు ఇసుకలోడుతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి జాతీయ రహదారి డివైడర్‌ను ఢీకొట్టడంతో బోల్తాపడింది. పులికుంటకు చెందిన డ్రైవర్ దుర్గం మారుతికి తీవ్రగాయాలు కావడంతో గమనించిన స్థానికులు స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. ప్రథమ చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలకు తరలించారు. ఎస్సై చంద్రశేఖర్‌ను వివరణ కోరగా ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. అరగంటయినా రాని అంబులెన్స్ జాతీయ రహదారిపై ప్రమాదాలు జరిగితే క్షతగాత్రులను సకాలంలో ఆస్పత్రికి చేర్చేందుకు నే షనల్ హైవే అధికారులు అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచుతారు. గురువారం జరి గిన ఘటనపై స్థానికులు అంబులెన్స్‌కోసం నేషనల్ హైవే అధికారులకు ఫోన్‌చేస్తే అరగంట దాటినా అంబులెన్స్ రాలేదు. డ్రైవర్ పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో 108కు సమాచారం అందించగా వాహనంలో మంచిర్యాలకు తరలించారు. డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించాక నేషనల్ హైవే అంబులెన్స్ సంఘటన స్థలానికి చేరుకుంది. అయితే ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే సకాలంలో సంఘటన స్థలానికి చేరుకోవాల్సిన నేషనల్ హైవే అంబులెన్సు తీవ్ర జాప్యం చేస్తూ ఆలస్యంగా రావడంపై వాహనదారులు అసహనం వ్యక్తం చేశారు. యాప్ ఓపెన్‌తో ఖాతాలో రూ.50 వేలు మాయంజన్నారం: స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో సెల్‌కు వచ్చిన ఒక యాప్ మెసేజ్‌ను ఓపెన్ చేసిన వ్యక్తి ఖాతాలోంచి రూ.50 వేలు మాయమయ్యాయి. బాధితుడు తెలిపిన వివరాల మేరకు జన్నారం మండలం రాంపూర్ గ్రామానికి చెందిన దాసరి చంద్రమోహన్ ఉపాధి నిమిత్తం కొంతకాలంగా కరీంనగర్లో నివాసం ఉంటున్నాడు. గురువారం తన ఫోన్‌కు ఎస్బీఐ రివార్డు పేరుతో ఒక వాట్సప్ మెసేజ్ వచ్చింది. దానిని ఓపెన్ చేయడంతో తన ఖాతాలో నుంచి రూ.50 వేలు డెబిట్ అయినట్లు మెసేజ్ వచ్చిందని బాధితుడు వాపోయాడు. సైబర్ నేరగాళ్ల పనే అయిఉంటుందని కరీంనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. -
చదువులు సాగేదెలా..?
● కేజీబీవీలకు ఇంటర్ పుస్తకాల సరఫరాలో జాప్యం ● విద్యార్థినులకు తప్పని ఎదురుచూపులు మంచిర్యాలఅర్బన్: గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాలకు చెందిన బాలికలకు విద్యనందిస్తున్న కేజీబీవీల్లో ఇంటర్ విద్యార్థినులకు పాఠ్యపుస్తకాల సరఫరాలో జాప్యం జరుగుతోంది. విద్యాసంవత్స రం ప్రారంభమై నెలరోజులు దాటినా పుస్తకాలకో సం విద్యార్థినులకు ఎదురుచూపులు తప్పడంలేదు. ఆరు నుంచి పదోతరగతి వరకు చదివే విద్యార్థినులకు మాత్రమే పుస్తకాలు రాగా ఇంటర్ విద్యార్థుల కు రాకపోవడంతో అవస్థలు తప్పడంలేదు. విద్యార్థులకు చదువుకునేందుకు, అధ్యాపకులు బోధించే పాఠాలు అర్థమయ్యేందుకు పాఠ్యపుస్తకా లు ఎంతో అవసరం. పాఠ్యపుస్తకాలు లేక ఏపాఠం విన్నారో..ఎలా చదవాలో..అర్థంకాని పరిస్థితి నెలకొంది. 15 కళాశాలల్లో ఇంటర్ చదువులు మంచిర్యాల జిల్లాలోని 18 కేజీబీవీల్లో 6 నుంచి ఇంటర్ వరకు 4,586 మంది బాలికలు విద్యను అభ్యసిస్తున్నారు. ఇందులో 15 చోట్ల ఇంటర్మీడియట్ వరకు తరగతులు కొనసాగుతున్నాయి. మంచిర్యాల, లక్సెట్టిపేట్, జైపూర్, బెల్లంపల్లి, చెన్నూర్‌లో బైపీసీ, ఎంపీసీ కోర్సులు ఉన్నాయి. జన్నారం, తాండూర్, మందమర్రి, నస్పూర్, నెన్నెలలో సీఈసీ, ఎంపీహెచ్‌డబ్ల్యూ కోర్సులు ఉన్నాయి. ప్రతీ కోర్సులో 40 మంది చొప్పున విద్యార్థులు చదువుతున్నారు. హాజీపూర్‌లో బైపీసీ, ఎంఎల్టీ, కోటపల్లిలో బైపీసీ, కన్నెపల్లిలో బైపీసీ, దండేపల్లిలో ఎంఎల్టీ, కమర్షియల్ గార్మెంట్స్, వేమనపల్లిలో ఎంఎల్టీ కోర్సులు ఉన్నాయి. ఆయా కోర్సుల్లో చేరిన వారికి ప్రభుత్వం ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందించాల్సి ఉంది. కానీ ఈ విద్యాసంవత్సరం ఇప్పటి వరకు ఒక్క పుస్తకం కూడా రాలేదు. దీంతో కొన్నిచోట్ల పాత పుస్తకాలనే సర్దుబాటు చేస్తున్నారు. కొత్తగా ఇంటర్ ప్రవేశపెట్టిన కేజీబీవీల్లో పుస్తకాలు లేక బోధన ముందుకు ఎలా సాగుతుందో అధికారులకే తెలియాలి. నెలన్నర దాటిపోతుండటంతో విద్యార్థుల చదువులపై ప్రభావం చూపుతుంది. ఇప్పటికై నా జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి వెంటనే పాఠ్యపుస్తకాలు అందించేలా చర్యలు చేపట్టాలని పలువురు విద్యార్థినులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.రాగానే ఇస్తాం త్వరలోనే పుస్తకాలు వచ్చే అవకాశాలున్నాయి. రాగానే విద్యార్థినులకు పంపిణీ చేస్తాం. జిల్లాకు అవసరమైన ఇండెంట్ గతంలోనే పంపించాం. హైదరాబాద్ నుంచి నేరుగా ఆయా కస్తూర్బాలకు పుస్తకాలు సరఫరా అవుతాయి. విద్యార్థుల చదువులకు ఆటంకం కలుగకుండా పాత పుస్తకాలు సర్దుబాటు చేశాం. – యశోధర, జీసీడీవో, మంచిర్యాల -
బెల్లం, పటిక స్వాధీనం
కాగజ్‌నగర్‌టౌన్/చింతలమానెపల్లి: కాగజ్‌నగర్ ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ పరిధిలోని చింతలమానెపల్లి మండలంలో గురువారం నాటుసారాకు ఉపయోగించే బెల్లం, పటిక స్వాధీనం చేసుకున్నట్లు ఎకై ్సజ్ సీఐ రవికుమార్ తెలిపారు. ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ రఘురామ్, జిల్లా అధికారి ఆదేశాల మేరకు దాడులు నిర్వహించి 10 లీటర్ల నాటుసారా, 1800 కిలోల పటిక, క్వింటాలు బెల్లం, నాటుసారా తయారీ పదార్థాలను సరఫరా చేసే స్కూటీ స్వాధీనం చేసుకున్నారు. 200 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసి రణవెల్లి గ్రామానికి చెందిన జటోత్ నారిబాయి, లంబడిహెట్టకి చెందిన అజ్మెర శ్యామ్లాల్పై కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. పట్టుబడిన ముడి సరుకు విలువ సుమారు రూ. లక్ష వరకు ఉంటుందన్నారు. దాడుల్లో ఎస్సైలు లోబానంద్, సురేష్, సిబ్బంది మల్లేశ్, సతీష్, తదితరులు పాల్గొన్నారు. -
మూత‘బడి’ని తెరిపించారు
దండేపల్లి: మండలంలోని కొత్తమామిడిపల్లిలో గత 15ఏళ్ల క్రితం విద్యార్థులు లేని కారణంగా మూతపడిన ప్రాథమిక పాఠశాలను బుధవారం తెరిపించారు. గ్రామంలో బడిని తెరిపించి పిల్లల ను బడికి పంపించాలని గ్రామస్తులు నిర్ణయించారు. ఇటీవల ఎంఈవో చిన్నయ్యను కలిసి వినతిపత్రం అందజేశారు. దీంతో బుధవారం 20 మంది విద్యార్థులతో పాఠశాలను పునఃప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై తహాసీనొద్దీన్, కాంప్లెక్స్ హెచ్ఎం శ్రీనివాస్, ఎంఐఎస్ నగేష్, సీఆర్పీ నర్సయ్య, మాజీ సర్పంచ్‌లు గడ్డం రాజయ్య, త్రిమూర్తి, మాజీ జెడ్పీటీసీ నాగరాణి, పెరిక సంఘం మండల అధ్యక్షుడు గడ్డం రాంచందర్, వీవీ గడ్డం కీర్తన, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. వేంపల్లిలో.. మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధి వేంపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను డీఈఓ యాదయ్య బుధవారం ప్రారంభించారు. పదేళ్ల క్రితం మూతపడిన పాఠశాలలో తాజాగా ఏడుగురు విద్యార్థులు చేరారని, మరికొందరు చేరేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారులు చౌదరి, సత్యనారాయణమూర్తి, ఎంఈఓ తిరుపతిరెడ్డి, మండల నోడల్ అధి కారి హన్మాండ్లు, ప్రధానోపాధ్యాయుడు సుధారాణి, ఉపాధ్యాయురాలు రేవతి పాల్గొన్నారు.విద్యార్థుల ప్రతిభకు డీఈఓ చప్పట్లునంనూర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ డీఈఓ యాదయ్య చప్పట్లు కొట్టారు. బుధవారం పాఠశాలను తనిఖీ చేసిన ఆయన 1వ, 7వ తరగతి గదుల్లో విద్యార్థుల ప్రతిభా పాఠవాలను పర్యవేక్షించారు. తెలుగు, ఇంగ్లిష్ పాఠ్యపుస్తకాల్లోని పదాలు, పాఠ్యాంశాలను చదివించి బోర్డుపై పదాలు చెబుతూ రాయించారు. పదాలు స్పష్టంగా రాయడంతో అభినందించారు. విద్యార్థుల ప్రవేశాలను 100వరకు పెంచినందుకు ప్రధానోపాధ్యాయుడు గురవయ్య, ఉపాధ్యాయులను ప్రత్యేకంగా ప్రశంసించారు. సెక్టోరియల్ అధికారి చౌదరి, ఉపాధ్యాయులు సత్యనారాయణచారి, ప్రశాంత్ పాల్గొన్నారు. -
అలరించిన పోలీస్ డ్యూటీ మీట్
మంచిర్యాలక్రైం: కాళేశ్వరం జోన్‌స్థాయి తెలంగాణ స్టేట్ పోలీస్ డ్యూటీ మీట్ బుధవారం రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో ప్రారంభమైంది. నైపుణ్యం, సామర్థ్యం, ప్రతిభ గుర్తించడానికి పోలీస్ డ్యూటీ మీట్ ఏర్పాటు చేశారు. రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాళేశ్వరంజోన్లోని రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి, మంచిర్యాల జోన్, కుమురంభీమ్ ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లా పరిధిలోని పోలీస్ అధికారులు, సిబ్బందికి పలు పోటీలు నిర్వహించారు. గురువారం కూడా పోటీలు జరుగుతాయి. కార్యక్రమంలో అదనపు డీసీపీ(అడ్మిన్) రాజు, స్పెషల్ బ్రాంచ్, గోదావరిఖని, ట్రాఫిక్, ఏఆర్ ఏసీపీలు మల్లారెడ్డి, రమేశ్, శ్రీనివాస్ ప్రతాప్, సీఐలు బాబురావు, సతీశ్, చంద్రశేఖర్‌గౌడ్, ఆర్ఐలు దామోదర్, వామనమూర్తి, మల్లేశం, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
మావోయిస్టులు లొంగిపోవాలని పోస్టర్లు
వేమనపల్లి/భీమిని: సిద్ధాంతాల కోసం అడవి బాట పట్టిన మావోయిస్టులు లొంగిపోయి జన జీవన స్రవంతిలో కలవాలని మావోయిస్టు ఆత్మ పరిరక్షణ ప్రజాఫ్రంట్ తెలంగాణ పేరిట వేమనపల్లి, కన్నెపల్లి మండలాల్లో బుధవారం పోస్టర్లు వెలిశాయి. వేమనపల్లి మండలం ప్రాణహిత సరిహద్దు గ్రామాలైన కళ్లంపల్లి, ముక్కిడిగూడెం, జాజులపేట, సుంపుటం గ్రామాల సమీప కల్వర్టులు, మిషన్ భగీరథ వాటర్‌ట్యాంకులు, సూచిక బోర్డులకు, కన్నెపల్లి తహసీల్దార్ కార్యాలయం, గ్రామీణ బ్యాంక్ ఎదుట గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్లు అతికించారు. మావోయిస్టు అగ్ర నాయకులారా మీరు నమ్మిన కాలం చెల్లిన సిద్ధాంతాలు సామాన్యుడికి ఆశాకిరణాలు ఎక్కడయ్యాయి, మీరు నమ్మిన ఉద్యమబాట ప్రజాదరణ లేక మోడుబారిన బీడు భూమి అయ్యిందని, అడవిని వీడి ప్రజల్లోకి రావాలని పోస్టర్లలో పేర్కొన్నారు. ఆయా గ్రామాల్లో వెలిసిన పోస్టర్లు కలకలం రేపాయి. వేమనపల్లి మండలంలోని గ్రామాల్లో వెలిసిన పోస్టర్లపై ఎస్సై శ్యాంపటేల్ విచారణ చేపట్టారు. -
హక్కుల సాధనకు ఐక్యంగా ఉద్యమించాలి
పాతమంచిర్యాల: ముదిరాజ్‌లు హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్యమించాలని ముదిరాజ్ మహాసభ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల మల్లేశం అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని అన్నపూర్ణ హాల్లో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 60లక్షలకు పైగా ఉన్న ముదిరాజ్‌లకు రాజకీయ, విద్య, ఉపాధి రంగాల్లో అన్యాయం జరుగుతోందని తెలిపారు. ముదిరాజ్‌లను బీసీ డీ నుంచి బీసీ ఏకు మార్పు చేసే వరకు ఉద్యమిస్తూనే ఉంటామని అన్నారు. మత్స్య సంపదపై ఆధారపడి జీవించే వారికి ప్రభుత్వ రుణాలు, వస్తు సామగ్రి అందడం లేదన్నారు. ఈ సమావేశంలో ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు గరిగంటి కొమురయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బల్ల సత్తయ్య, రాష్ట్ర కార్యదర్శులు టి.శ్రీకాంత్, కంకణాల సతీష్, జిల్లా ప్రధాన కార్యదర్శి సాధనబోయిన కృష్ణ, పట్టణ అధ్యక్షుడు భూతపల్లి రాజేశం, యూత్ అధ్యక్షుడు గరికె సుమన్ పాల్గొన్నారు. -
జిల్లాలో యూరియా కొరత లేదు
నెన్నెల: జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా వ్యవసాయ అధికారి కల్పన అన్నారు. ‘యూరియా కోసం రైతుల కొట్లాట’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన వార్తకు స్పందించారు. బుధవారం మండల కేంద్రంలోని మహిళా ఉత్పత్తిదారుల సంస్థ(డబ్ల్యూఎఫ్పీసీ)తోపాటు ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. యూరియా నిల్వలు, రిజిష్టర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతుల గొడవ యూరియా కోసం కాదని, వ్యక్తిగత కారణాలతో గొడవపడినట్లు తన దృష్టికి వచ్చిందని అన్నారు. మండలానికి 342మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేశామని, డీలర్లు దుకాణాలు రోజూ తెరిచి ఉంచాలని తెలిపారు. కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ–పాస్ యంత్రాల పంపిణీ నెన్నెల రైతు వేదికలో భీమిని, నెన్నెల, కన్నెపల్లి, వేమనపల్లి మండలాల ఎరువుల డీలర్లకు ఈ–పాస్ యంత్రాలను జిల్లా వ్యవసాయ అధికారి కల్పన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ–పాస్ యంత్రాల ద్వారానే ఎరువులు విక్రయించాలని, అమ్మకాలు, నిల్వల్లో పారదర్శకత పాటించాలని సూచించారు. ఈ–పాస్ యంత్రంలో వివరాలు నమోదు చేస్తే ఎంత ఎరువులు ఎవరి పేరు మీద అమ్మారనేది తెలుస్తుందని అన్నారు. ఈ విధానం ద్వారా ప్రతీ గ్రామం, మండలం, జిల్లా వారీగా పంటల సాగు విస్తీర్ణం అంచనాల ప్రకారం ఎరువుల వినియోగాన్ని పర్యవేక్షించడం సాధ్యమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భీమిని ఏడీఏ సురేఖ, ఏఓ సృజన, ఏఈఓ రాంచందర్ పాల్గొన్నారు. -
నిర్లక్ష్యం.. ప్రాణాంతకం!
మంచిర్యాలక్రైం: నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఇటు వాహన చోదకులకు అటు ఇతరులకు ప్రాణాంతకంగా మారుతోంది. ఇటీవల జరుగుతున్న ప్రమాదాలతో చిన్న వాహనదారులు, ప్రజలు రోడ్డెక్కాలంటేనే భయపడాల్సి వస్తోంది. యేటా ప్రమాదాల్లో పలువురు మృతిచెందుతుండగా.. వందల సంఖ్యలో క్షతగాత్రులు అవుతున్నారు. జిల్లాలో తరచూ ప్రమాదాలు జరిగే 30 ప్రాంతాలను బ్లాక్స్పాట్లుగా గుర్తించిన పోలీసులు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. వాహనదారులు సైతం నిర్లక్ష్యపు డ్రైవింగ్ వీడాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కొరడా ఝళిపిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు జరగడానికి పలు కారణాలను గుర్తించారు. కారణాలివే.. ● కొత్త కొత్త ఫీచర్లు, హైస్పీడ్‌తో వాహనాలు వస్తున్నాయి. వాహనాల సాంకేతిక పరిజ్ఞానంపై చోదకులకు అవగాహన లేక నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ● రోడ్లపై ఇష్టానుసారంగా గుంతలు తవ్వి వదిలేయడం, వాహనదారుల తొందరపాటు, గమ్యస్థానానికి త్వరగా చేరుకోవాలనే ఆతృత, మితిమీరిన వేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం. ● రహదారుల విస్తరణ, మరమ్మతుల సమసయంలో కాంట్రాక్టర్లు సరైన రక్షణ చర్యలు చేపట్టకపోవడం. ● గ్రామాల నుంచి హైవే రహదారులకు అనుసంధానం అయ్యే లింకు రోడ్ల వద్ద సరైన అవగాహన, ట్రాఫిక్ నిబంధనలు లేకుండా, ప్రమాద సూచిక బోర్డులు లేకపోవడం. ● వాహనదారులు మద్యంమత్తు, భారీ వాహనాలు నడిపే డ్రైవర్లు విశ్రాంతి తీసుకోకపోవడం, ఒత్తిడిలోనే డ్రైవింగ్ చేయడం. ● మైనర్ డ్రైవింగ్, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం. నివారణ చర్యలు జిల్లాలోని జాతీయ, రాష్ట్ర రహదారుల అధికారుల సమన్వయంతో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. రాత్రివేళల్లో రోడ్ల వెంట రిఫ్లెక్టింగ్ లైట్లు, అవసరమైన చోట స్పీడ్‌బ్రేకర్లు, కాలినడకన రోడ్డు దాటే చోట జీబ్రా లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. నేషనల్ హైవే అధికారులతో చర్చించి ప్రమాదాల నివారణఖు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో భాగంగా సుమారు రూ.60లక్షల విలువైన సామగ్రి అవసరమని పోలీసులు నివేదిక పంపించారు. రూ.40లక్షలు మంజూరు కాగా సూచిక బోర్డులు, జీబ్రాలైన్లు, చిన్న స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయనున్నారు. జిల్లా కేంద్రం మంచిర్యాల ఐబీ చౌరస్తాలో తరచూ ప్రమాదాలు జరుగుతుండేవి. వాటి నివారణకు ఇరువైపు ప్లాస్టిక్ స్టిక్స్ రోప్‌తో లైనింగ్ ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ పోలీసులను అప్రమత్తంగా ఉంచుతున్నారు. జిల్లాలో గుర్తించిన బ్లాక్స్పాట్లు నేషనల్ హైవే–63 మంచిర్యాల: మేదరివాడ, లక్ష్మిటాకీస్, ఓవర్ బ్రిడ్జి, నస్పూర్ తోళ్లవాగు, అంబేడ్కర్ కాలనీ, తెలంగాణతల్లి చౌక్, సీసీ ఎక్స్‌రోడ్, శ్రీరాంపూర్ పెట్రోల్‌బంక్, శ్రీరాంపూర్ సోనియానగర్, ఎస్ఆర్పీ–3 మెయిన్‌రోడ్, శ్రీరాంపూర్ బస్టాండ్, జీఎం ఆఫీస్ హాజీపూర్: గుడిపేట బెటాలియన్ పెట్రోల్‌బంక్, ముల్కల్ల బస్‌స్టాప్, బ్రిడ్జి, వేంపల్లి మేకల మండి, జీపీ ఆఫీస్, లక్సెట్టిపేట: ఆంధ్రబోర్, కరీంనగర్ చౌరస్తా, గుల్ల కోట, రాయపట్నం బ్రిడ్జి నేషనల్ హైవే–363 రామకృష్ణాపూర్: గద్దరాగడి, బొక్కలగుట్ట, పులిమడుగు, మందమర్రి ఈసర్ పెట్రోల్‌బంక్, ఎస్ఎండీసీ కాలేజీ అందుగులపేట, యాపల్ ఏరియా, కాసిపేట జంక్షన్ సోమగూడెం చౌరస్తా, బెల్లంపల్లి గంగరాంనగర్, స్టేట్ హైవే–1 జైపూర్: అటవీశాఖ చెక్‌పోస్ట్ ఇందారం, ఇందారం ఎక్స్‌రోడ్ స్టేట్ హైవే–24 జన్నారం: పొనకల్ బస్టాండ్, పైడిపల్లి డీర్ పార్క్, దండేపల్లి మండలం ముత్యంపేట అటవీశాఖ చెక్‌పోస్ట్ నుంచి నెల్కి వెంకటపూర్ వరకుప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టిరోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించి కార్యాచరణ మొదలుపెట్టాం. జిల్లాలో తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించాం. అక్కడ ప్రమాదాలు జరగకుండా జాతీయ, రాష్ట్ర రహదారులు, పోలీసు అధికారుల కమిటీ సమన్వయంతో జాగ్రత్తలు తీసుకుంటున్నాం. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవు. – సత్యనారాయణ, ట్రాఫిక్ సీఐ, మంచిర్యాలజిల్లాలో బ్లాక్‌స్పాట్ ప్రాంతాల్లో ప్రమాదాలుసంవత్సరం ప్రమాదాలు మృతులు2022 144 66 2023 95 36 2024 81 48 2025 185 65 రోడ్డు ప్రమాదాలతో రక్తసిక్తం నివారణపై పోలీసుల ప్రత్యేక దృష్టి జిల్లాలో 30 బ్లాక్స్పాట్లు గుర్తింపు -
ఇంటర్.. ఇక కొత్తగా
● సర్కారు కళాశాలల దిద్దుబాటు ● ప్రతీ తరగతి గదిలో సీసీ కెమెరా ● కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం ● బోధన, విద్యార్థుల అభ్యసనపై పర్యవేక్షణమంచిర్యాలఅర్బన్: రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ కళాశాలల బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించింది. విద్యా నాణ్యత, మౌలిక సౌకర్యాల కల్పన, విద్యార్థుల హాజరు, బోధనా పద్ధతుల పర్యవేక్షణ కోసం సమగ్ర చర్యలు చేపట్టింది. సీసీ కెమెరాల ఏర్పాటు, ఫేషియల్ రికగ్నేషన్ సిస్టమ్ వంటి చర్యలతో సంస్కరణలు ఊపందుకున్నాయి. సీసీ కెమెరాలతో పర్యవేక్షణ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధనా పద్ధతులు, లెక్చరర్ల సమయపాలన, విద్యార్థుల హాజరును పర్యవేక్షించేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలోని 10 ప్రభుత్వ కళాశాలల్లో ప్రతీ తరగతి గది, ల్యాబ్, ప్రిన్సిపాల్ గదిలో ఒక్కో సీసీ కెమెరా బిగిస్తున్నారు. జిల్లాకు మొత్తం 175కి పైగా కెమెరాలు అందగా, మంచిర్యాల కళాశాలలో 22, లక్సెట్టిపేటలో 15 కెమెరాలు అమర్చనున్నారు. ఈ కెమెరాలను నాంపల్లి లోని ఇంటర్మీడియెట్ బోర్డు కార్యాలయంలో ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానిస్తారు. హైదరాబాద్ నుంచి అధికారులు, నిపుణులు బోధనా తీరును పరిశీలించి, లోపాలను సరిదిద్దేందుకు సలహాలు, సూచనలు అందిస్తారు. లెక్చరర్ల సెలవులు, టైంటేబుల్ అమలు వంటి అంశాలను కూడా ఈ కెమెరాల ద్వారా నిశితంగా పర్యవేక్షిస్తారు. ఫేషియల్ రికగ్నేషన్... విద్యార్థుల గైర్హాజరు సమస్యను నియంత్రించేందుకు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఫేషియల్ రికగ్నేషన్ సిస్టమ్(ఎఫ్ఆర్ఎస్) అమలు చేయనున్నారు. ప్రతీ గ్రూపునకు ఒక లెక్చరర్ వాట్సాప్ గ్రూప్ ఇన్చార్జిగా ఉంటారు. విద్యార్థులు తరగతులకు హాజరు కాకపోతే, వారి తల్లిదండ్రులకు సెల్‌ఫోన్ ద్వారా సమాచారం ఇస్తారు. వారం రోజులకు మించి గైర్హాజరైతే లెక్చరర్, ప్రిన్సిపాల్‌కు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధానం విద్యార్థులు కళాశాలకు హాజరయ్యేలా చేయడంతోపాటు డుమ్మాలకు చెక్ పెడుతుంది. మౌలిక సౌకర్యాల కల్పన.. ఏళ్ల తరబడి నిధుల కొరతతో సమస్యలు ఎదుర్కొంటున్న జూనియర్ కళాశాలలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1.40 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో జిల్లాలోని 10 కళాశాలల్లో దండేపల్లి మినహా తొమ్మిది కళాశాలల్లో విద్యుత్, తాగునీరు, చిన్నచిన్న మరమ్మతులు చేపట్టి సౌకర్యాలు కల్పిస్తారు. కళాశాలల్లో విద్యార్థుల ఇబ్బందులు తొలగిస్తారు. పెరుగుతున్న ప్రవేశాలు.. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఉచిత పాఠ్యపుస్తకాలు, నాణ్యమైన బోధన, మెరుగైన సౌకర్యాలు, విస్తృత ప్రచారం వంటి కారణాలతో విద్యార్థులు ప్రభుత్వ కళాశాలల వైపు మొగ్గుతున్నారు. జిల్లాలో జనరల్, వొకేషనల్ కలిపి 1,461 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. లక్షెట్టిపేటలోని ఆధునిక కళాశాలలో అత్యధికంగా 290 మంది, మంచిర్యాలలో 275 మంది చేరగా, సౌకర్యాలు తక్కువగా ఉన్న దండేపల్లిలో 49 మంది ప్రవేశించారు. కళాశాల వారీగా మంజూరైన నిధులు..కళాశాలపేరు నిధులు(రూ.లక్షల్లో)మంచిర్యాల 16.05 మందమర్రి 16.65 కాసిపేట 16.22 చెన్నూరు 21.9 బెల్లంపల్లి బాలికల 16.65 బెల్లంపల్లి 5.6 జైపూర్ 20.81 జన్నారం 16.22 లక్సెట్టిపేట 10.85సంస్కరణలతోపాటు సౌకర్యాలు.. ప్రభుత్వం చేపట్టిన వివిధ సంస్కరణలతో కళాశాలల్లో విద్యాబోధన మెరుగుపడుతుంది. సౌకర్యాలు సమకూరుతాయి. నిధుల మంజూరుతో సమస్యలు దూరం కానున్నాయి. ప్రతీ తరగతి గదిలో సీసీ కెమెరా ఏర్పాటుతో బోధనలో పారిదర్శకత పెరుగుతుంది. – అంజయ్య, డీఐఈవో, మంచిర్యాల -
క్యాన్సర్ బాధితులకు రిమ్స్‌లో మెరుగైన వైద్యం
ఆదిలాబాద్‌టౌన్: క్యాన్సర్ బాధితులకు రిమ్స్‌లో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ తెలిపారు. బుధవారం రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాన్సర్ వైద్య నిపుణుడు జక్కుల శ్రీకాంత్ బాధ్యతలు చేపట్టిన సంవత్సర కాలంలో 300లకు పైగా క్యాన్సర్ ఆపరేషన్లు చేశారన్నారు. తాజాగా ఆహారనాళం సర్జరీ ఓపెన్‌లో కాకుండా ల్యాప్రోస్కోపీ ద్వారా నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఇటీవల కాలంలో నాలుగు క్లిష్టమైన సర్జరీలను పూర్తి చేసినట్లు తెలిపారు. త్వరలో కిడ్నీ మార్పిడి ఆపరేషన్లకు ప్రణాళికలు చేస్తున్నామన్నారు. కార్డియాలజీ వైద్యులను నియమించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. సమావేశంలో వైద్యులు సత్యనారాయణ, కార్తీక్, నరేందర్, దేవిదాస్, తదితరులు పాల్గొన్నారు. -
గ్లోబల్ లెర్నింగ్‌లో ఆర్జీయూకేటీ ముందడుగు
బాసర: బాసర ఆర్జీయూకేటీ గ్లోబల్ లెర్నింగ్‌లో మరో ముందడుగు వేసిందని వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ అన్నారు. బుధవారం ఓఎస్డీ మురళీదర్శన్తో కలిసి గ్లోబల్ లెర్నింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2025–2026 విద్యాసంవత్సరానికి అమెరికాలోని ప్రఖ్యాత వార్టన్ బిజినెస్ స్కూల్, యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా ద్వారా ఆఫర్ చేస్తున్న రెండు అంతర్జాతీయ ప్రోగ్రామ్‌లకు సంబంధించి రూ.40 లక్షల విలువైన 453 ఉచిత కోర్సెరా లైసెన్స్‌లు విద్యార్థులకు అందించామన్నారు. ఈ కోర్సుల ద్వారా విద్యార్థులు లీడర్షిప్, ఇన్నోవేషన్, మషీన్ లెర్నింగ్ వంటి అత్యవసర నైపుణ్యాలలో అంతర్జాతీయ సర్టిఫికేషన్‌తో కూడిన అనుభవాన్ని పొందనున్నారన్నారు. ఈ ప్రోగ్రామ్‌లు నేటి నుంచి ఈనెల 14 వరకు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ సుజయ్ సర్కార్, కోర్సు ఇన్స్ట్రక్టర్లు స్వాతి, స్వప్నిల్, ఐఐఈడీ కోఆర్డినేటర్ రాకేష్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
రూ.21.50 లక్షల విలువైన మద్యం ధ్వంసం
● ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో పట్టుకున్న అధికారులుచింతలమానెపల్లి: కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో టీచర్స్, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో పట్టుకున్న రూ.21.50 లక్షల విలువైన మద్యాన్ని ఎస్పీ కాంతిలాల్ పాటిల్, జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్‌శాఖ అధికారి జ్యోతి కిరణ్ పర్యవేక్షణలో బుధవారం పోలీసులు ధ్వంసం చేశారు. ఎస్పీ కాంతిలాల్ పాటిల్ వివరాలు వెల్లడించారు. ఫిబ్రవరి 25న చింతలమానెపల్లి మండలంలోని గూడెంలో అక్రమంగా మద్యం నిల్వ ఉంచారనే స మాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో స్థానిక వైన్స్ నుంచి తరలించి అక్రమంగా ఓ బెల్టుషాపులో నిల్వ ఉంచిన రూ.21.50 లక్షల విలువైన మద్యం స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేష న్కు తరలించారు. కోర్టు ఉత్తర్వుల మేరకు 10,155 బీరు బాటిళ్లు, మరో 300 విస్కీ సీసాలను బుధవారం పోలీస్‌స్టేషన్ ఎదుట రోడ్డుపై వరుసగా పే ర్చి రోలర్‌తో ధ్వంసం చేశారు. పగిలిన సీసాల నుంచి మద్యం వరదలా ప్రవహించింది. కార్యక్రమంలో కాగజ్‌నగర్ డీఎస్పీ రామానుజం, కౌటాల సీఐ ము త్యం రమేశ్, ఎకై ్సజ్ సీఐ రవికుమార్, చింతలమానెపల్లి ఎస్సై ఇస్లావత్ నరేశ్, సిబ్బంది పాల్గొన్నారు. -
తాండూర్ సీఐ కుమారస్వామి బదిలీ
తాండూర్: తాండూర్ సీఐ కే.కుమారస్వామిని ఖమ్మం జిల్లా మధిర సర్కిల్‌కు బదిలీ చేస్తూ మల్టీజోన్–1 ఐజీపీ చంద్రశేఖర్‌రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. దాదాపు ఏడాదిన్నర కాలం ఇక్కడ పని చేసిన ఆయన గంజాయి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించారు. నకిలీ విత్తనాల నిర్మూలనపై రైతులకు అవగాహన కల్పించారు. యువత చెడు వ్యసనాలకు లోనుకాకుండా కబడ్డీ, వాలీబాల్, క్రికెట్ పోటీలు నిర్వహించారు. చెన్నూర్ రూరల్ సీఐగా బన్సిలాల్ చెన్నూర్ రూరల్ సీఐగా ఆర్.బన్సిలాల్ను నియామకం అయ్యారు. వెయిటింగ్లో ఉన్న ఆయనకు పోస్టింగ్ కల్పిస్తూ ఐజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. హోటల్ యజమానులపై కేసుఆదిలాబాద్టౌన్: మైనర్లను పనిలో పెట్టుకున్న ఆదిలాబాద్ పట్టణంలోని గణేశ్ హో టల్ యజమాని కేశవ్, జైఅంబే హోటల్ య జమాని రాజేష్ శర్మపై కేసు నమోదు చేసిన ట్లు వన్‌టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. గణేశ్ హోటల్లో మహారాష్ట్రకు చెందిన 17 ఏళ్ల బాలుడు సోహిల్ సోంట్వాల్, జైఅంబే హోటల్లో మహారాష్ట్రకు చెందిన 17 ఏళ్ల బాలుడు సుజిల్ రాంకిషన్‌ను పనిలో పెట్టుకున్నట్లు తెలిపారు. కార్మిక శాఖ జూనియర్ అసిస్టెంట్ సందీప్ రెడ్డి ఫిర్యాదు మేరకు రెండు హోటాళ్ల యజమానులపై బుధవారం కేసు నమోదు చేసినట్లు వివరించారు. మద్యం విక్రేతపై..ఆదిలాబాద్‌టౌన్: అధిక ధరకు మద్యం విక్రయిస్తున్న ఆదిలాబాద్ పట్టణంలోని తిర్పెల్లికి చెందిన కరోర శుభంపై కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. వైన్స్ షాపుల నుంచి తక్కువ ధరకు మద్యం కొనుగోలు చేసి తన ఇంట్లో నిల్వ ఉంచి అధిక ధరకు విక్రయిస్తున్నాడన్నారు. బుధవారం మద్యం సీసాలను కొనుగోలు చేస్తున్న సమయంలో వన్‌టౌన్ పోలీసులు పట్టుకుని డౌన్‌టౌన్ విస్కీ 29 బాటిళ్లు, ఒరిజినల్ చాయిస్ 20 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వాటి విలువ రూ.5,990 ఉంటుందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయిస్తుండడంతో కేసు నమోదు చేసినట్లు వివరించారు. విద్యుదాఘాతంతో మూగజీవాలు మృతితానూరు: మండలంలోని ఝరి(బి)లో విద్యుదాఘాతంతో రెండు మూగజీవాలు మృతి చెందాయి. గ్రామానికి చెందిన రైతు గుర్ల శ్రీనివాస్ మంగళవారం రాత్రి వర్షం కురుస్తోందని తన ఎద్దు, ఆవును రేకులషెడ్డులో కట్టేశాడు. స్తంభం నుంచి షెడ్డులోకి సరఫరా అవుతున్న విద్యుత్ తీగలు రేకులు కోసుకుని తెగిపోవడంతో విద్యుత్ సరఫరా జరిగింది. షెడ్డులో కట్టేసిన ఆవు, ఎద్దు షాక్‌కు గురికావడంతో అక్కడికక్కడే మృతి చెందాయి. వాటి విలువ రూ.లక్ష వరకు ఉంటాయని బాధిత రైతు వాపోయాడు. -
పంట రుణాలకు ప్రదక్షిణలు
● పట్టాలు ఉన్నా కనికరించని బ్యాంకర్లు ● నిబంధనల పేరుతో తిరస్కరిస్తున్న వైనం ● మూడేళ్లుగా తిరుగుతున్న పోడు రైతులు ● ప్రజావాణిలో కలెక్టర్‌కు అన్నదాతల ఫిర్యాదురైతుభరోసా వచ్చినా.. మంచిర్యాలఅగ్రికల్చర్: అటవీ ప్రాంతంలో నివా సం ఉంటున్న గిరిజన రైతులు పాతికేళ్లుగా సాగు చేసుకుంటున్న భూములకు హక్కుపత్రాల కోసం అధికారుల చుట్టూ తిరిగారు. ప్రస్తుతం పట్టా పాసు పుస్తకాలున్నా పంట రుణం కోసం మూడేళ్లుగా బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. రైతుబంధు, రైతు భరోసా సైతం అందుతున్నా బ్యాంకర్లు పంటరుణాలు మాత్రం ఇవ్వడం లేదని వాపోతున్నా రు. పంట రుణాలు అందించడంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోతీరుగా నిబంధనలు అమలు చేస్తున్నారని బ్యాంకర్ల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకుల చుట్టూ తిరిగి వేసారి ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తున్నారు. పట్టా పాసు పుస్తకాలున్నా.. పంటలు సాగు చేస్తున్నా.. మాకెందుకు రుణాలు ఇవ్వడంలేదని గోడు వెళ్లబోసుకుంటున్నారు. గతేడాది వానాకాలం తాండూర్ మండలం పెగడపల్లికి చెందిన పోడురైతులు కలెక్టర్‌ను కలిసి విన్నవించారు. అయినా ఫలితం లేకపోవడంతో బ్యాంకు వద్ద ఆందోళన చేపట్టారు. తహసీల్దార్ కార్యాలయం నుంచి ధ్రువీకరణపత్రం తీసుకొస్తే రుణం మంజూరు చేశారు. అది కూడా ఎకరాలతో సంబంధం లేకుండా ఒక్కో రైతుకు రూ.20 వేల నుంచి రూ.30 వేల చొప్పున అందజేశారు.ఏళ్ల తరబడిగా అటవీ భూములను సాగు చేసుకుంటున్న గిరిజన, ఆదివాసీ రైతులకు 2006లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో పట్టా పాస్‌పుస్తకాలు అందజేశారు. అప్పటి నుంచి పంట రుణాలు తీసుకోవడంతో పాటు రుణమాఫీ సైతం వర్తించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2023లో 13 మండలాల్లోని 3821.24 ఎకరాలకుగానూ 1847 మంది రైతులకు పట్టా పాసుపుస్తకాలు అందజేసింది. రైతుబంధు నగదు సైతం ఖాతాలో జమచేసింది. ప్రస్తు త కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుభరో సా ఎకరానికి రూ.6 వేల నగదు అందుకుంటున్నా రు. కానీ ఽపహాణి, వన్‌బి ఇస్తేనే రుణాలు ఇస్తామని బ్యాంకర్లు నిబంధనలు విధిస్తున్నారు. కానీ ఈ పో డు భూములకు ప్రస్తుతం రెవెన్యూ రికార్డుల నుంచి పహాణి, వన్‌బి రావడం లేదు. దీంతో రుణా లు ఇవ్వడంలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. -
టేకు చెట్ల నరికివేత
జన్నారం: జన్నారం అటవీ డివిజన్లోని కవ్వాల్ సెక్షన్ పరిధిలో విలువైన టేకు చెట్లు నరికివేతకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కలప స్మగ్లర్లు గుట్టు చప్పుడు కాకుండా కవ్వాల్ బీట్ బోడగుట్ట ప్రాంతంలో మూడు టేకు చెట్లను నరికి తీసుకెళ్లినట్లు తెలిసింది. అయితే సంఘటన జరిగి వారంరోజులైనా అటవీశాఖ అధికారులు గుర్తించకపోవడం గమనార్హం. బుధవారం అడవికి వెళ్లిన ఓ వ్యక్తి గమనించడంతో విషయం బయటకు వచ్చింది. విషయం తెలుసుకున్న అధికారులు ఆ ప్రాంతానికి వెళ్లి నరికివేతకు గురైన చెట్ల కొలతలు సేకరించారు. అధికారుల నిర్లక్ష్యంతోనే.. కవ్వాల్ సెక్షన్ పరిధిలో పనిచేసే అధికారులు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నట్లు ఈ సంఘటన ద్వారా తెలుస్తోంది. రాత్రి వేళ పెట్రోలింగ్ నిర్వహించకపోవడం, సిబ్బంది స్థానికంగా ఉండక పోవడం వల్లే స్మగ్లర్లు దుశ్చర్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. గతంలో రేంజ్ అధికారి శ్రీనివాస్ రాత్రి సమయాల్లో పెట్రోలింగ్ నిర్వహించి అడపా దడపా తనిఖీలు చేయడంతో స్మగ్లర్లు కాస్త వెనక్కి తగ్గారు. ఈ విషయమై ఇందన్పల్లి రేంజ్ అధికారి కారం శ్రీనివాస్‌ను సంప్రదించగా కలప స్మగ్లర్లు 3 టేకుచెట్లను నరికి తీసుకెళ్లినట్లు తెలిపారు. వాటి విలువ సుమారు 1.15 లక్షలు ఉంటుందన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఘటనపై విచారణ జరుపుతున్నామన్నారు. బాధ్యులపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
నెన్నెల: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందినట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు. సంఘటనకు సంబంధించిన వివ రాలు ఇలాఉన్నాయి. మహా రాష్ట్రలోని సిరోంచ తాలూకా పెంటుపాకకు చెందిన బోగె నవీన్ (23) బుధవా రం నెన్నెలలో ఉన్న అత్తగారింటికి వచ్చాడు. మఽ ద్యాహ్నం బైక్‌పై స్వగ్రామానికి వెళ్తుండగా జోగా పూర్ వద్ద బైక్ అదుపుతప్పి కిందపడ్డాడు. తీవ్రగా యాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య మాధురి, కుమార్తె ప్రియాన్షిక (10 నెలలు) ఉన్నారు. మాధురి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు ఒకరికి తీవ్రగాయాలుమంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల నుంచి లక్సెట్టిపేట వైపు వెళ్తున్న ఇన్నోవా కారు బుధవారం రాపల్లి శివారులో అదుపుతప్పి ఓ చెట్టును వేగంగా ఢీ కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న హాజీపూర్ మండలానికి చెందిన పోరెడ్డి ప్రవీణ్, చింతకింది హరీశ్‌కు స్వల్పంగా మల్యాల కిరణ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను మంచిర్యాలలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. -
ఇన్వెస్టిగేషన్ టూల్‌గా సైన్స్
● నిజామాబాద్ సీపీ సాయిచైతన్య ● కమిషనరేట్‌లో బాసర జోన్ – 2 పోలీస్ డ్యూటీ మీట్ ● హాజరైన నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, ఆదిలాబాద్ పోలీసులు ఖలీల్‌వాడి: మారుతున్న కాలానికి అనుగుణంగా చట్టాలను, సైన్స్‌ను ఇన్వెస్టిగేషన్ టూల్‌గా మార్చుకోవాలని పోలీస్ కమిషనర్ సాయిచైతన్య సిబ్బందికి సూచించారు. జోన్ – 2 బాసర లెవల్ పోలీస్ డ్యూటీమీట్ – 2025ను నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో సీపీ బుధవారం ప్రారంభించారు. విధి నిర్వహణ సామర్థ్యం పెంచే ఉద్దేశంతో నిర్వహిస్తున్న మీట్లో మూడు రోజులపాటు డిపార్ట్మెంటల్ పోటీలు కొనసాగనుండగా, నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన పోలీసు సిబ్బంది పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పోటీల ద్వారా పోలీస్ విభాగంలో కానిస్టేబుల్ స్థాయి నుంచి సీఐ స్థాయి వరకు పని పద్ధతులు మెరుగుపడి ఇన్వెస్టిగేషన్ స్థాయి పెరుగుతుందని, పనిలో పోటీతత్వం అలవడుతుందన్నారు. సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్, ఫొరెన్సిక్, ఫింగర్ ప్రింట్ ఇన్వెస్టిగేషన్ ఎంపికల్లో భాగంగా నేరం జరిగిన చోట శ్రీక్లూస్శ్రీ సేకరణకు సంబంధించి పరీక్షను మొదటి రోజు నిర్వహించామన్నారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబర్చేందుకు ఈ పోటీలు ఉపయోగపడతాయన్నారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారిని రాష్ట్ర స్థాయిలో నిర్వహించే డ్యూటీ మీట్‌కు పంపిస్తామన్నారు. కార్యక్రమంలో అదనపు డీసీపీలు బస్వారెడ్డి (అడ్మిన్), రామ్‌చందర్‌రావు(ఏఆర్), సీసీఎస్ ఏసీపీ నాగవేంద్రచారి, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ సీఐలు, ఏఎస్సైలు, తదితరులు పాల్గొన్నారు. -
విద్యాప్రమాణాల మెరుగుకు ప్రత్యేక ప్రణాళిక
● ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తాఉట్నూర్రూరల్: గిరిజన విద్యా ప్రమాణాల మెరుగు పరచడానికి ఐటీడీఏ ఎడ్యుకేషన్ విజయ్–2035 ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశామని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఖుష్బూ గుప్తా అన్నారు. బుధవారం పీఎంఆర్సీ ఉట్నూర్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా ఆశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, వసతి గృహ సంక్షేమ శాఖ అధికారుల సమావేశానికి హాజరై మాట్లాడారు. రాబోయే పదేళ్లలో డ్రాపౌట్లు లేకుండా వందశాతం విద్యార్థుల నమోదుతో నాణ్యమైన విద్యను అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. పది రోజుల్లో ఆశ్రమ పాఠశాలలకు 80 శాతం విద్యార్థులు హాజరయ్యేలా చూడాలన్నారు. అనంతరం ఐటీడీఏ ఎడ్యుకేషన్ విజన్ 2035 లోగో ప్రతులను ఆవిష్కరించారు. గతేడాది పదో తరగతిలో వందశాతం ఫలి తాలు సాధించిన ఆశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులను సన్మానించారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీడీలు జాదవ్ అంబాజీ, రమాదేవి, డీటీడీవో జనార్దన్, ఏసీఎంవోలు జగన్, ఉద్దవ్, శివాజీ, జీజీడీవోలు చాయ, శంకుంతల, జిల్లా క్రీడా అధికారి పార్థసారథి పాల్గొన్నారు. -
మూడోరోజూ అదే ముసురు
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాను మూడురోజు లుగా ముసురు వీడడం లేదు. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు కూడా కొనసాగుతూనే ఉంది. చల్లని ఈదురుగాలలు వీ స్తుండడంతో చిన్నారులు, వృద్ధులు వణుకుతో మంచం పడుతున్నారు. ఆలస్యంగానైనా పత్తిపంటకు అనుకూల వర్షం కురుస్తుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 8.8 మిల్లి మీటర్ల వర్షంజిల్లాలో మంగళవారం 8.8 మిల్లి మీటర్ల వర్షపాతం నమోదైంది. దండేపల్లి 33.3 మిల్లిమీ టర్లు, లక్సెట్టిపేట 14, జన్నారం 11.6, హా జీపూర్ 12.5, భీమిని 10.1, వేమనపల్లి 8.8, బెల్లంపల్లి 8.6, కన్నెపెల్లి 8.4, తాండూర్ 8, కోటపల్లి 7.5, నెన్నెల 6, మంచిర్యాల 5, కాసిపేట 4, నస్పూర్ 3.4, జైపూర్ 3, చెన్నూరు 3.5, భీమారం 1.9 మిల్లిమీటర్ల వర్షం కురి సింది. జిల్లా సాధారణ వర్షపాతం 168 మిల్లిమీటర్లు కాగా, 104.5 మిల్లిమీటర్లు కురిసింది. 38శాతం లోటు నెలకొంది. -
బెల్లంపల్లి.. చెత్త లొల్లి
బెల్లంపల్లి మున్సిపాలిటీ వివరాలు బెల్లంపల్లి: బెల్లంపల్లి మున్సిపల్ పరిధిలో చెత్త సేకరణ అస్తవ్యస్తంగా తయారైంది. వార్డుల్లో వారం రోజులకోసారి చెత్త సేకరించేందుకు ఆటో ట్రాలీలు వస్తుండగా ఇళ్లు, వీధుల్లో చెత్త పేరుకుపోతోంది. మున్సిపల్ పరిధిలో 34 వార్డులుండగా 2011 జనాభా లెక్కల ప్రకారం 56,396 మంది జనాభా ఉన్నారు. చెత్త సేకరణకు సరిపడా ఆటో ట్రాలీలు లేవు. గతంలో 23 ఆటో ట్రాలీలు కొనుగోలు చేయగా వీటిలో ప్రస్తుతం 12 మాత్రమే వినియోగంలో ఉన్నాయి. మిగతా 11 మరమ్మతుకు నోచుకోక నిరుపయోగమయ్యాయి. ఆటో ట్రాలీల కొరతతో చెత్త సేకరణలో ఇబ్బందులేర్పడుతున్నాయి. కొన్ని వార్డుల్లో వారానికి రెండ్రోజులు, మరికొన్ని వార్డుల్లో వారానికోసారి ఆటో ట్రాలీలు వస్తున్నట్లు ఆయా కాలనీల ప్రజలు చెబుతున్నారు. ఇక తడి, పొడి చెత్త వేర్వేరు చేయడంలేదు. ఎనిమిదేళ్ల క్రితం తడి, పొడి చెత్త వేరు చేసి ఇచ్చేందుకు ఇంటింటికీ ప్లా స్టిక్ డబ్బాలు అందజేసినా ప్రజలు రెండింటినీ కలిపే ఇస్తున్నా రు. మున్సిపాలిటీ పరిధిలో రోజుకు 25 మెట్రిక్ టన్నుల చెత్త వెలువడతుండగా 10 మెట్రిక్ టన్నులు మాత్రమే సేకరిస్తున్నారు. పేరుకు ద్వితీయ శ్రేణి మున్సిపాలిటీ అయినప్పటికీ ఇప్పటివరకు డంప్‌యార్డు ఏర్పాటు చేయలేదు. సేకరించిన చెత్తను శ్మశాన వాటిక, బస్తీల శివారు ప్రాంతాల్లో డంప్ చేస్తున్నారు. వానాకాలం కావడంతో ఈగలు, దోమలు వృద్ధి చెంది వ్యాధులు విజృంభించే అవకాశముంది. మున్సిపల్ పరిధిలో ని డ్రైనేజీలు శుభ్రం చేయడంలేదు. రోజువారీగా చెత్త సేకరించేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. మున్సిపల్ వార్డులు : 34జనాభా: 56,396రోజుకు వెలువడే చెత్త: 25 మెట్రిక్ టన్నులు సేకరిస్తున్న చెత్త : 10 మెట్రిక్ టన్నులు ఆటో ట్రాలీలు : 23వినియోగిస్తున్నవి : 12మూలనపడ్డవి : 11 -
కంపు కొడుతున్న ‘క్యాతనపల్లి’
రామకృష్ణాపూర్: క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో చెత్త సమస్యకు సరైన పరిష్కారం లభించడం లేదు. బల్దియాలో మొత్తం 22 వార్డులుండగా దాదాపు 48,950 మంది జ నాభా ఉన్నారు. మున్సిపాలిటీలో ఎక్కువ వార్డులు సింగరేణి పరిధిలో ఉండటంతో చె త్త సేకరణ సమస్యగా మారింది. మున్సిపాలిటీ పరిధిలో చెత్త సేకరణ దాదాపు నిత్యం జరుగుతుండగా సింగరేణి పరిధిలోని కాలనీల్లో రెండు, మూడు రోజులకోసారి చెత్త సేకరిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించడం కాకుండా సింగరేణి ఆధ్వర్యంలో పాత పద్ధతిలోనే చెత్త సేకరణ కొనసాగుతోంది. దీంతో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయి కాలనీలు కంపు కొడుతున్నాయి. చె త్త సేకరణకు 16 ఆటోలు, రెండు ట్రాక్టర్లు, 20 మంది వరకు డ్రైవర్లున్నారు. రోజుకు సుమారు 14 మెట్రిక్ టన్నుల చెత్తను ము న్సిపాలిటీ సిబ్బంది సేకరిస్తున్నారు. తొమ్మిదోవార్డు పరిధి పెద్దది కావడంతో చెత్త సేకరణ కోసం త్వరలో రెండు, మూడు పెద్ద ట్రాలీలు కొనుగోలు చేయనున్నట్లు మున్సి పల్ కమిషనర్ రాజు తెలిపారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ వివరాలుమున్సిపల్ వార్డులు : 22జనాభా : 48,950రోజుకు వెలువడే చెత్త : 14 మెట్రిక్ టన్నులు చెత్త సేకరించే వాహనాలు : 18 -
చెన్నూర్‌లో చెత్త కుప్పలు
చెన్నూర్ మున్సిపాలిటీ వివరాలుచెన్నూర్: చెన్నూర్ మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడి చెత్త అక్కడే ఉంటోంది. రెండు, మూడు రోజులకోసారి చెత్త వాహనాలు రావడంతో కుప్పలుగా పేరుకుపోతోంది. వానాకాలం కావడంతో చెత్త కుప్పుల నుంచి దుర్గంధం వ్యాపిస్తున్నట్లు సమీప నివాసాల ప్రజలు వాపోతున్నారు. 18 వార్డులుండగా 25,579 మంది జనాభా ఉన్నారు. రోజూ చెత్త సేకరించాలనే లక్ష్యంతో నాలుగేళ్ల క్రితం 18 వాహనాలు కొనుగోలు చేశారు. ఇందులో 11 వాహనాలు మూలనపడి మరమ్మతుకు నోచుకోవడం లేదు. ప్రస్తుతం ఏడు వాహనాల ద్వారానే చెత్త సేకరించాల్సి వస్తోంది. వాహనాల కొరతతో వార్డుల్లో రెండు, మూడురోజులకోసారి చెత్త సేకరిస్తున్నారు. దీంతో కాలనీల్లో చెత్త కుప్పలు పేరుకుపోతున్నాయి. గతంలో ఒక్కో చెత్త వాహనానికి డ్రైవర్‌తో పాటు హెల్పర్ ఉండేవారు. వీరు ఆయా కాలనీల నుంచి సేకరించిన చెత్తను డంప్‌యార్డుకు తరలించేవారు. ప్రస్తుతం ఒక్కో వాహనానికి ఒక్క డ్రైవర్ మాత్రమే ఉండడంతో ఇళ్ల నుంచే చెత్త సేకరిస్తున్నారు. దీంతో పారిశుధ్యం లోపించి జనం పరేషాన్ అవుతున్నారు. రో జూ చెత్త సేకరించాలని ఆయా కాలనీల ప్రజలు కోరుతున్నారు. మున్సిపల్ వార్డులు : 18జనాభా: 25,579 మంది చెత్త సేకరించే వాహనాలు : 18వినియోగిస్తున్నవి : 7మూలనపడ్డవి : 11కంపు భరించలేక పోతున్నం చెత్త బండ్లు మూడు రోజు లకోసారి వస్తున్నయ్. దీంతో కాలనీలో రోడ్ల వెంట ఎక్కడ పడితే అక్క డే చెత్త పేరుకుపోతోంది. వానాకా లం కావడంతో చెత్త కుప్పల్లో పందులు దొర్లుతున్నాయి. కంపు భరించలేకపోతున్నం. రోజూ చెత్త తరలించేలా చూడాలె. – మధునక్క, లైన్‌గడ్డ, చెన్నూర్ -
మెనూ ప్రకారం భోజనం అందించాలి
భీమిని: విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూ చించారు. మంగళవారం కన్నెపల్లి మండల కేంద్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించా రు. అధికారులు సమయపాలన పాటించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. గ్రా మాల్లో పారిశుధ్యాన్ని పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. అనంతరం కన్నెపల్లి, టేకులపల్లిలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పరిశీలించారు. కన్నెపల్లిలోని కేజీబీవీని సందర్శించి వంటశాల, తరగతి గ దులు, రిజిస్టర్లు పరిశీలించి పలు సూచనలు చేశా రు. కన్నెపల్లి ప్రాథమిక పాఠశాలలో మరుగుదొడ్ల మూసి ఉండగా నీటి వసతి కల్పించి విద్యార్థులు వి నియోగించుకునేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి చిన్నారుల వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మండల కేంద్రంలో చేపట్టిన పీహెచ్సీ భవన నిర్మాణాన్ని పరిశీలించారు. పనులు త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ శ్రావణ్‌కుమార్, సిబ్బంది ఉన్నారు. బాలల హక్కులు కాపాడాలి మంచిర్యాలఅగ్రికల్చర్: బాలల హక్కులను కాపాడాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంక్షేమ శాఖల అధికారులు, పోలీస్, కార్మిక, విద్య, వైద్య ఆరోగ్యశాఖల అధికారులతో ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ అమలుపై సమీక్ష నిర్వహించారు. ఈ నెల 31వరకు బృందాలుగా ఏర్పడి జిల్లాలోని అన్ని పని ప్రదేశాలను సందర్శించాలని తెలిపారు. అనంత రం కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. సీడబ్ల్యూసీ చైర్మన్ వహిద్, జిల్లా సంక్షేమశాఖ అధికారి రౌఫ్‌ఖాన్, జిల్లా సంక్షేమశాఖల అభివృద్ధి అధికారి దుర్గాప్రసాద్, పురుషోత్తం, మైనార్టీ శాఖ అధికారి రాజేశ్వరి, డీఈవో యాదయ్య, బెల్లంపల్లి, జైపూర్ ఏసీపీలు రవికుమార్, వెంకటేశ్వర్లు, బాలల పరిరక్షణ కమిటీ అధికారి ఆనంద్ ఉన్నారు. అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. కలెక్టర్ చాంబర్లో గ్రామీణ నీటి సరఫరా, రోడ్లు–భవనా లు, పంచాయతీరాజ్ శాఖల ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. -
దోమలను నివారించాలి
మంచిర్యాలటౌన్: దోమలను నివారించాలని జిల్లా కీటక జనిత వ్యాధుల నియంత్రణ అధికారి డాక్టర్ అనిత సూచించారు. జిల్లా వైద్యారోగ్యశాఖ ద్వారా మంగళవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కాలేజీలో కీటక జనిత వ్యాధులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతీ శుక్రవారం డ్రైడేగా పాటించాలని సూచించారు. అనంతరం దోమ తెరల వినియోగంపై అవగాహన కల్పించారు. విద్యార్థులుండే అన్ని గదుల్లో దోమల నివారణకు మందు పిచికారి చేయించారు. డాక్టర్ శివప్రతాప్, శ్రీనివాస్, సీహెచ్‌వో దీక్షితరాణి, కళాశాల ప్రిన్సిపాల్ అనూష, సబ్ యూనిట్ అధికారి నాందేవ్, ఏఎన్ఎం అంజలి, ఎంటీఎస్ సంతోష్ పాల్గొన్నారు. -
ఐఈఈఈ లోగో ఆవిష్కరణ
బాసర: బాసర ఆర్జీయూకేటీలో ఐఈఈఈ (ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్) స్టూడెంట్ బ్రాంచ్ అధికారిక లోగోను మంగళవారం వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్, ఓఎస్డీ ప్రొఫెసర్ ఈ.మురళీదర్శన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఐఈఈఈ అనేది ప్రపంచంలో అతిపెద్ద సాంకేతిక ప్రొఫెషనల్ సంస్థ అని, ఇది విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మమేకమయ్యే అవకాశాన్ని, వృత్తిపరమైన నిపుణులతో నెట్వర్కింగ్ అవకాశాలను కల్పిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ డీన్లు డాక్టర్ విఠల్, డాక్టర్ మహేష్, డాక్టర్ చంద్రశేఖర్ విభాగాధిపతి డాక్టర్ భావ్ సింగ్, అధ్యాపకులు, అధికారులు పాల్గొన్నారు. -
ఆన్లైన్ జూదం.. జీవితాలు ఆగం
● యువత జీవితాలపై మాయాజాలం ● గేమింగ్ ముసుగులో రమ్మీ ఉచ్చు.. ● టైమ్ పాస్‌తో మొదలై అప్పుల ఊబిలోకి ● ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్న యువత మంచిర్యాలక్రైం: జిల్లాలో ఆన్లైన్ రమ్మీ గేమింగ్ యాప్‌ల సంస్కృతి పెరుగుతోంది. యువత జీవితా లపై బలమైన దాడి చేస్తున్నాయి. గేమింగ్ ముసుగులో ఆన్లైన్ జూదపు బానిసత్వం విస్తృతంగా వ్యాపిస్తోంది. ఫలితంగా అనేక మంది ఈ ఉచ్చులో చిక్కుకుని అప్పులు మూట గట్టుకుంటున్నారు. వాటిని తీర్చలేక చివరికి ప్రాణాలు తీసుకుంటున్నారు. ప్రధానంగా ప్రముఖ పట్టణ ప్రాంతాలతో పాటు పల్లెల్లో సైతం ఆన్లైన్ జూదం పెరిగింది. రమ్మీ కల్చర్, ఏ23 రమ్మీ, వెల్త్ రమ్మీ, జంగిల్ రమ్మీ వంటి యాప్‌లు టాప్–డౌన్లేడెడ్గా ఉన్నాయి. టెలిగ్రామ్ చానల్స్ ద్వారా 100 శాతం గెలుపు ట్రిక్స్ మీకు మద్దతు అందించే రమ్మీ టీచర్స్ తదితర పేర్లతో ఇన్ఫ్లూయెన్సర్లు మోసం చేస్తూనే ఉన్నారు. అందరూ టార్గెటే... యూత్ నుంచి గృహిణుల వరకు అన్నివర్గాలను ఈ రమ్మీ యాప్‌లు టార్గెట్ చేస్తూ విస్తరిస్తున్నాయి. బీటెక్, డిగ్రీ, ఇంటర్ విద్యార్థులు.. ఇలా అనేకమంది ఆకర్షితులవుతున్నారు. ముఖ్యంగా ప్రధాన పట్టణాల పరిధి విద్యాసంస్థల్లో చదివేవారు, ప్రభుత్వ, ప్రైవేటు అధ్యాపకులు, ఉద్యోగులు ఆర్థిక ఒత్తిడిలో ఉన్నవారు. టైమ్‌పాస్‌గా మొదలు పెట్టి ఆతర్వాత ఆర్థిక నష్టాల్లో కూరుకుపోతున్నారు. వారం రోజుల క్రితం జిల్లాలోని ఓ ప్రభుత్వ శాఖలో పనిచేసే చిరుద్యోగి ఆన్లైన్ రమ్మీ గేమ్ ఆడి సుమారు రూ.40లక్షల వరకు పోగొట్టుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మోసం ఎలా జరుగుతోందంటే... మొదటి మూడు గేములు గెలిచేలా ఈ యాప్‌లను రూపొందించి నమ్మకం కలిగిస్తారు. ఆ తర్వాత చివరికి ‘ఆటోబాట్’ వాడడం వల్ల యూజర్ గెలిచే అవకాశం కనీస స్థాయికి దిగిపోతోంది. యూజర్ నెగ్గడం పక్కన పెడితే... ఒక వేళ గెలిచినా ఆ డబ్బును దక్కించులేక పోతున్నారు. అంతేకాకుండా గెలుచుకున్న డబ్బును విత్ డ్రా చేసుకోవడంలో ఆలస్యం జరిగితే పూర్తిగా నిలిపివేస్తున్నట్లు పలువురు బాధితులు పేర్కొంటున్నారు. గేమ్‌లోకి స్నేహితులను లాగితే ఒకరికి రూ.100 బోనస్ అంటూ రెఫరల్ మాయాజాలంతో పాటు అనేక రకాలుగా వల వేస్తున్నట్లు తెలుస్తోంది. హెల్ప్‌డెస్క్ ఉన్నా ఫలితం శూన్యం తెలంగాణ వ్యాప్తంగా సైబర్ సెల్ గేమింగ్ యాప్ మోసాలపై, సైబర్ మోసాలపై పోలీస్ శాఖ స్పెషల్ హెల్ప్‌లైన్ 1930 ప్రారంభించింది. కానీ గేమింగ్ యాప్‌లపై పోలీస్ శాఖ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంలో విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆన్లైన్ యాప్‌లు విదేశి సంస్థల ఆధీనంలో ఉండడం వల్ల వాటిపై నేరుగా చర్య తీసుకోవడం కష్టంగా ఉందని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో గేమ్ యాప్‌లు వినియోగించే వారు ఎక్కువవుతున్నారని ఓ పోలీస్ అధికారి ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. భవిష్యత్ నాశనం చేసుకోవద్దు ప్రభుత్వం నిషేధించిన ఆన్లైన్ గేమ్స్ ఆడటం చట్టరీత్యా నేరం. నిర్వాహకులు, ఆడిన వారిపై చర్యలు ఉంటాయి. యువత ఆన్లైన్ గేమ్స్ ఆడటం సరికాదు. తల్లిదండ్రులు తమ పిల్లలు ఏం చేస్తున్నారో గమనిస్తూ ఉండాలి. ఆన్లైన్ ఆటలకు బానిస కావొద్దు. బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దు. – ఎగ్గడి భాస్కర్, డీసీపీ, మంచిర్యాల -
పాత నేరస్తుల బైండోవర్
కాగజ్‌నగర్‌టౌన్: గతంలో నాటుసారా, దేశీదారు అమ్ముతూ పట్టుబడిన 8 మంది పాత నేరస్తులను ఎకై ్సజ్ అధికారులు మంగళవారం తహసీల్దార్ మధుకర్ ఎదుట బైండోవర్ చే శారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ మరోసారి నాటుసారా, దేశీదారు అమ్మి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే రూ.లక్ష జరిమానాతో పాటు జైలుశిక్ష విధిస్తామని హెచ్చరించారు. దేశీదారు పట్టివేతకాగజ్నగర్టౌన్: మహారాష్ట్ర నుంచి కాగజ్‌నగర్‌కు కారులో అక్రమంగా తరలిస్తున్న దేశీదారు మద్యాన్ని సోమవారం రాత్రి పట్టుకున్నట్లు కాగజ్‌నగర్ ఎకై ్సజ్ సీఐ రవి తెలిపారు. జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి బి.జ్యోతి ఆదేశాల మేరకు పట్టణంలోని ఈఎస్ఐ మూలమలుపు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా కారులో అక్రమంగా తరలిస్తున్న 17 కాటన్ల 90 ఎంఎల్ దేశీదారు బాటిళ్లు లభ్యమయ్యాయి. మద్యం విలువ సుమారు రూ.68 వేలు ఉంటుందన్నారు. కౌటాలకు చెందిన దుర్గం సాయిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. తనిఖీల్లో ఎస్సై లోబానంద్, సిబ్బంది రాజ్‌కుమార్, హుస్సేన్, మండల్, తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ రంగంలో దళారీ వ్యవస్థను నిర్మూలించాలిపాతమంచిర్యాల: వ్యవసాయ రంగంలో దళారీ వ్యవస్థను నిర్మూలించాలని సోషలిస్టు రిపబ్లికన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మోతే రాజలింగు అన్నారు. మంగళవారం ప్రపంచ వ్యవసాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దళారీ వ్యవస్థ వలన రైతులు తమ పంటలను సరైన ధరలకు అమ్ముకోలేకపోతున్నారన్నారు. పంటచేతికొచ్చిన సమయంలో అమ్మకం కోసం దళారులను ఆశ్రయించి కనీస మద్దతు ధర పొందలేకపోతున్నారన్నారు. దళారులు నిర్ణయించిన ధరకే పంటలను అమ్ముకుని ఆర్థికంగా నష్టపోతున్నారన్నారు. రైతులు పండించిన పంటలను నిలువ చేసుకుని వారికి నచ్చిన ధరకు విక్రయించుకునేలా ప్రభుత్వాలు గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజ్ప్లాంట్లు ఏర్పాటు చేయాలన్నారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు సురేందర్, సతీశ్ పాల్గొన్నారు. ఫిజియోథెరపీ సేవలకు దరఖాస్తుల స్వీకరణమంచిర్యాలఅర్బన్: ఐఈఆర్సీ, నాన్ ఐఈఆర్సీలో ప్రత్యేక అవసరాలుగల పిల్లలకు ఫిజియోథెరపీ సే వలు అందించేందుకు గుర్తింపు పొందిన స్టేట్ పా రామెడికల్ బోర్డు ద్వారా బ్యాచ్‌లర్ ఆఫ్ ఫిజియోథెరపీ (బీపీటీ) కోర్సు చేసిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు డీఈవో యాదయ్య తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు స్తానిక మండలానికి చెందిన వారికి ప్రాధాన్యత ఉంటుందని, ఈనెల 5 లోగా జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వారానికి రెండు సార్లు సీడబ్ల్యూఎస్ఎన్ పిల్లలకు ఫిజియోథెరపీ సేవలు అందించాల్సి ఉంటుందన్నారు. -
దళితుల అభివృద్ధికి పాటుపడాలి
మంచిర్యాలరూరల్(హాజీపూర్): దళితుల అభివృద్ధికి పాటుపడాలని దళిత హక్కుల పోరాట సమితి (డీహెచ్‌పీఎస్) రాష్ట్ర కార్యదర్శి మారుపాక అనిల్‌కుమార్ అన్నారు. మంగళవారం గుడిపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ అభయహస్తం పేరుతో అర్హులైన దళిత కుటుంబాలకు రూ.12 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అమలులో విఫలమైందన్నారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించకుండా దళితుల ఆర్థికాభివృద్ధికి కేటాయించాలని, దళితులకు భూ పంపిణీ చేపట్టాలని, పెరిగిన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ శాతం పెంచాలని, ప్రైవేట్ రంగాల్లోనూ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో డీహెచ్‌పీఎస్ జిల్లా కార్యదర్శి దేవి పోచన్న, జిల్లా ఉపాధ్యక్షుడు రవి, సహాయ కార్యదర్శి తిరుపతి, జాతీయ సమితి సభ్యుడు అశోక్, రాష్ట్ర సహాయ కార్యదర్శి రాజారత్నం, ఏఐవైఎఫ్ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు లక్ష్మణ్, నాయకులు అబ్రహం, ఏలియా, యోసేపు, తదితరులు పాల్గొన్నారు. -
‘లేబర్కోడ్ల రద్దుకు ఉద్యమించాలి’
పాతమంచిర్యాల: కార్మికచట్టాల సవరణ పేరుతో తీసుకువచ్చిన నాలుగు లేబర్కోడ్ల రద్దుకు ఉద్యమించాలని జాతీయ కార్మిక సంఘాల నాయకులు పిలుపు నిచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని మార్క్స్ భవన్లో ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ, టీయూసీఐ నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఏడు రోజుల పనివిధానం నాలుగు రోజులకు కుదించడం వలన కార్మికులు ఉపాధి కోల్పేయే ప్రమాదముందన్నారు. లేబ్కోడ్ల అమలును కేంద్రం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కులు, చట్టాల రక్షణకోసం ఈనెల 9న చేపట్టనున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మేకల దాసు, ఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకులు ఎండీ చాంద్‌పాషా, టీయూసీఐ జిల్లా కార్యదర్శి జాడి దేవరాజ్, నాయకులు మిట్టపల్లి పౌలు, తాళ్లపల్లి శ్రీనివాస్, బ్రహ్మానందం, అరుణ, సురేందర్, చిన్నయ్య, ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు. -
ఫార్మా పేలుడులో దండేపల్లి వాసి మృతి
దండేపల్లి: సంగారెడ్డి జిల్లా సిగాచి ఫార్మా పరిశ్రమలో సోమవారం జరిగిన పేలు డు ఘటనలో మంచి ర్యాల జిల్లా దండేపల్లి కి చెందిన వొజ్జకేశవుల నాగేశ్వరరావు, అలి యాస్ రాజు (52) మృతి చెందాడు. ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చేసిన నాగేశ్వర్రావు గతంలో కొద్దిరోజులు సిర్పూర్ పేప ర్ మిల్లో పనిచేశాడు. ఆ తరువాత హైదరా బాద్ వెళ్లి పటాన్ చెరువులో నివాసం ఉంటూ పదేళ్లుగా సిగాచి ఫార్మా పరిశ్రమలో క్వాలిటీ సెల్ విభాగంలో పనిచేస్తున్నాడు. మృతునికి భార్య హేమలత, ఇద్దరు కుమారులున్నారు. చికిత్స పొందుతూ వ్యక్తి ..వాంకిడి: మద్యం మ త్తులో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై ప్రశాంత్ తెలిపారు. మండలంలోని రాజీవ్ నగర్ గ్రామానికి చెందిన నాయిని మనోహర్ (45) గత నెల 26న మద్యం మత్తులో ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు మంచిర్యాల ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి మంగళవారం మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఒకరు..ఆదిలాబాద్‌టౌన్: మహారాష్ట్రలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన పప్పు ర మణ (40) జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రి లో మంగళవారం మృతి చెందినట్లు టూటౌన్ ఎస్సై ముకుంద్‌రావు తెలిపారు. మహారాష్ట్రలోని కిన్వట్లో కూరగాయల నర్సరీ నిర్వహిస్తున్న రమణ కిన్వట్ నుంచి ఆది లాబాద్ వైపు మ్యాక్స్ బొలెరో వాహనంలో వస్తుండగా ఆదిలాబాద్ వైపు నుంచి కిన్వట్ వైపు వెళ్తున్న మహారాష్ట్ర ఆర్టీసీ బస్సు కిన్వట్–అంబాడి ప్రాంతంలో ఢీకొట్టింది. తీవ్రగా యాలు కావడంతో జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆ స్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అ ప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ మేరకు జీరో కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. గల్ఫ్‌లో టెంబుర్నివాసి అనుమానాస్పద మృతినర్సాపూర్(జి): ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశానికి వెళ్లిన జిల్లాకు చెందిన వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు నిర్మల్ జిల్లా నర్సాపూర్ (జి) మండలంలోని టెంబుర్ని గ్రామానికి చెందిన బొగడ మీది సంతోష్ (36) జూన్ 21న గల్ఫ్ దేశంలోని అబుదాబికి కూలీపని నిమిత్తం వెళ్లాడు. ఇంతలో ఏంజరిగిందో తెలియదుకానీ అక్కడి ఎంబసీ, ముస్సాఫా పోలీస్ స్టేషన్ నుంచి బొగడమీది సంతోష్ మృతి చెందాడని మంగళవారం తనకు ఫోన్ వచ్చిందని మృతుని భార్య ప్రేమల తెలిపింది. తన భర్త మృతికి గల కారణాలు తెలపాలని, మృతదేహాన్ని స్వగ్రామానికి రప్పించేలా చూడాలని వేడుకుంటోంది. -
ఆశ్రమ పాఠశాలలో డీటీడీవో విచారణ
● హెచ్ఎంపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రుల వినతికోటపల్లి: పాఠశాల పునఃప్రారంభం రోజు కాకుండా సోమవారం వచ్చిన విద్యార్థినులు, వారితో వ చ్చిన తల్లిదండ్రులను కోటపల్లి గిరిజన బాలికల ఆ శ్రమ పాఠశాల ప్రిన్సిపల్ బయటే వానలో నిల్చోబెట్టారు. దీనిపై ‘ఆలస్యంగా వచ్చారని..’ శీర్షికన మంగళవారం సాక్షిలో ప్రచురించిన కథనానికి జిల్లా అధికారులు స్పందించారు. డీటీడీవో జనార్దన్ పాఠశాలను సందర్శించారు. ఆలస్యంగా వచ్చిన విద్యార్థినులతో మాట్లాడి హెచ్ఎం అ శోక్ను మందలించినట్లు సమాచారం. విద్యార్థినులు పాఠశాలకు సక్రమంగా హాజరు కావాలని సూచించారు. పదో తరగతిలో ఉ త్తమ ఫలితాలు సాధించేలా వి ద్యార్థినులను తీర్చిదిద్దాలని హెచ్ఎంను ఆదేశించా రు. కాగా, విచారణకు వచ్చిన డీటీడీవో విద్యార్థినులు, హెచ్ఎం అశోక్ ముందే విచారణ చేపట్టారు. దీంతో విద్యార్థినులు హెచ్ఎంపై ఫిర్యాదు చేయడానికి ఇబ్బంది పడినట్లు సమాచారం. గతంలో పలు సార్లు హెచ్ఎంపై జిల్లా అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. అయినా నామమాత్రపు విచారణతో అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అధికారులు స్పందించి బాలికల పాఠశాలకు మహిళా హెచ్ఎంను నియమించాలని, హెచ్ఎం వైఖరిపై లోతుగా విచారణ జరిపించాలని తలిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. -
మహిళ మెడలోంచి గొలుసు అపహరణ
బెల్లంపల్లిరూరల్: ఇంట్లో నిద్రిస్తున్న మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు దొంగిలించిన ఘటన బెల్లంపల్లి మండలంలో చోటు చేసుకుంది. తాళ్లగురిజాల ఎస్సై రమేశ్ తెలిపిన వివరాల మేరకు రవీందర్‌నగర్‌కు చెందిన గాదం శ్వేత సోమవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి చొరబడి ఆమె మెడలో ఉన్న రెండు తులాల గొలుసు అపహరించాడు. బాధిత మహిళ కేకలు వేయడంతో దొంగ పరారయ్యాడు. పోలీసులకు సమాచారం అందించడంతో మంగళవారం డాగ్‌స్కాడ్‌తో ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య
వాంకిడి: ఉరేసుకుని ఒకరు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై ప్రశాంత్ తెలిపిన వివరాల మేరకు బెజ్జుర్ మండలంలోని రేచిని గ్రామానికి చెందిన వడై వెంకటి (40)కి వాంకిడి మండలంలోని నార్లాపూర్‌కు చెందిన తానుబాయితో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. అప్పటి నుంచి మద్యానికి బానిసయ్యాడు. దీంతో తానుబాయి అతనితో మద్యం మానిపించాలని నార్లాపూర్‌కు తీసుకువచ్చింది. అక్కడే వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కొంతకాలం బాగానే ఉన్న వెంకటి మళ్లీ మద్యానికి బానిసయ్యాడు. మద్యం సేవించి ఇంటికి వచ్చి నిత్యం భార్యతో గొడవపడేవాడు. కుటుంబ సభ్యులు మందలించేందుకు ప్రయత్నిస్తే ఉరేసుకుంటానని బెదిరించేవాడు. ఈ క్రమంలోనే సోమవారం సాయంత్రం వాంకిడి వెళ్తానని చెప్పి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు తెలిసిన చోట వెతికినా ఆచూకీ లభించలేదు. మంగళవారం ఉదయం అదే గ్రామానికి చెందిన వడై సంతోష్ చేనులో చెట్టుకు ఉరేసుకుని కనిపించాడు. తానుబాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. భూతగాదాల కారణంగా..నర్సాపూర్(జి): భూతగాదాలతో మనస్తాపం చెంది ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై గణే శ్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని కుస్లి గ్రామానికి చెందిన నార్వాడె ఆనంద్‌రావు(54)కు, తన సమీప బంధువులకు మధ్య భూ తగాదాలు ఉన్నాయి. దీంతో మనస్తాపం చెందిన ఆనంద్‌రావు సోమవారం ఇంటివద్ద పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు ఆటోలో నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతుని భార్య అనురాధ ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మనస్తాపంతో యువకుడు..సోన్: ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై గోపి తెలిపిన వివరాల మేరకు మండలంలోని సాకేర గ్రామానికి చెందిన సారంగ విజయ్ (29) అనే కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో మనస్తాపానికి గురయ్యాడు. మంగళవారం గ్రామానికి సమీపంలో ఉన్న సూర్యకుటీర్లో చెట్టుకు ఉరేసుకున్నాడు. మృతుని తల్లి సుశీల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సై గోపి సంఘటన స్థలాన్ని సందర్శించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. జీవితంపై విరక్తితో ఒకరు..సాత్నాల: జీవితంపై విరక్తితో ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై గౌతమ్ పవర్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని పార్టీ (బి) గ్రామానికి చెందిన బండి వెంకటి (38) పంటచేనులో రసాయన మందులు పిచికారీ చేస్తుండగా ఎదురుగాలి వీయడంతో అతనిపై పడి అనారోగ్యానికి గురయ్యాడు. పలు ఆస్పత్రుల్లో చికిత్స చేయించినా నయం కాకపోవడంతో మంచానికే పరిమితమయ్యాడు. దీంతో జీవితంపై విరక్తి చెంది గతనెల 29న ఇంట్లో ఎవరూలేని సమయంలో పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి మంగళవారం మృతి చెందాడు. మృతునికి కుమారుడు, కూతురు ఉన్నారు. మృతుని భార్య పుష్పలత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఒకరి మృతికి కారణమైన వ్యక్తికి జైలునిర్మల్టౌన్: ఒకరి మృతికి కారణమైన వ్యక్తికి రెండేళ్ల జైలుశిక్ష, రూ.4 వేల జరిమానా విధిస్తూ జిల్లా కోర్టు జడ్జి శ్రీవాణి మంగళవారం తీర్పునిచ్చినట్లు కోర్టు సమన్వయల అధికారి డల్లు సింగ్ తెలిపారు. లోకేశ్వరం మండలం భామిని(బి) గ్రామానికి చెందిన త్రయంబకరావు 2020లో అడవి జంతువులు వస్తున్నాయని తన మొక్కజొన్న చేనుచుట్టూ జియోవైరు చుట్టి విద్యుత్ కనెక్షన్ ఇచ్చాడు. అటుగా వెళ్లిన అదే గ్రామానికి చెందిన బాలాజీ వైరును తాకడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడంతో విచారణ చేపట్టి నిందితుడిని కోర్టులో హాజరు పరిచారు. -
ఏరియాస్థాయి స్ట్రక్చరల్ సమావేశం
శ్రీరాంపూర్: సింగరేణి యజమాన్యానికి, గుర్తింపు సంఘం ఏఐటీయూీసీ నాయకుల మధ్య సోమవారం ఏరియా స్థాయి స్ట్రక్చరల్ సమావేశం జరిగింది. జీఎం కార్యాలయంలోని సమావేశ మందిరంలో జీఎం శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో యూనియన్ నాయకులు పలు డిమాండ్లపై చర్చించారు. ఏరియాలో సర్ఫేస్ డిపార్టుమెంట్లో ఖాళీ ఉన్న జనరల్ అసిస్టెంట్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, రిటైర్డ్ క్లైములను వెంటనే సెటిల్ చేసి డబ్బులను చెల్లించాలని, టింబర్ వర్క్‌మెన్ డిజిగ్నేషన్‌ను మార్చి కేటగిరీ ఉద్యోగులుగా పరిగణించాలని, తదితర సమస్యలు పరిష్కరించాలని కోరారు. సమావేశంలో ఎస్వోటు జీఎం ఎన్.సత్యనారాయణ, డీజీఎం(పర్సనల్) ఎస్.అనిల్‌కుమార్, గుర్తింపు సంఘం బ్రాంచ్ కార్యదర్శి బాజీసైదా, యూనియన్ ప్రతినిధులు కొట్టే కిషన్‌రావు, మోత్కూరి కొమురయ్య, చంద్రమోహన్, బద్రి బుచ్చయ్య, సంపత్, తదితరులు పాల్గొన్నారు. -
సఫారీకి సెలవు
● జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు నిలిపివేత ● అక్టోబర్ నుంచి పునఃప్రారంభం మూణ్నెళ్లు బంద్‌చేస్తాం ఎన్టీసీఏ సూచనల ప్రకారం ప్రతి సంవత్సరం వర్షాకాలంలో మూడు నెలలపాటు సఫారీ ప్రయాణం బంద్ చేయడం జరుగుతోంది. వర్షాల కారణంగా అడవిలో బురదలో వాహనాలు కూరుకుపోయి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. అక్టోబర్‌లో తిరిగి అనుమతులు ఇస్తాం. పర్యాటకులు గమనించాలి. – రామ్మోహన్, ఎఫ్‌డీవో జన్నారం: కవ్వాల్ అభయారణ్యంలోని జన్నారం అటవీ డివిజన్లో జంగల్ సఫారీకి అటవీశాఖ మూడు నెలలపాటు సెలవు ప్రకటించింది. జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు నిలిపివేస్తున్నట్లు అటవీశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. పచ్చదనం పంచుతున్న అడవి అందాలను తిలకించేందుకు పర్యాటకశాఖ జన్నారంలో హరిత రిసార్ట్లు ఏర్పాటు చేయగా పర్యాటకశాఖ రెండు సఫారీలు, అటవీశాఖ ఐదు సఫారీలు ఏర్పాటు చేశారు. జన్నారం వచ్చిన పర్యాటకులు సఫారీ ద్వారా దట్టమైన అడవిలోనికి వెళ్లి పచ్చని చెట్ల నడుమ పర్యటించడం వల్ల ఆహ్లాదం పొందుతున్నారు. అడవుల అందాలను, వన్యప్రాణుల పరుగులను చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. మూడు నెలలపాటు నిలిపివేత అడవుల అందాలను తిలకించేందుకు వచ్చే పర్యాటకులకు మూడు నెలల పాటు సఫారీ ప్రయాణానికి అనుమతి లేదు. ఎందుకంటే వర్షాకాలంలో వన్యప్రాణులు ఎదకు వచ్చి బయట విచ్చలవిడిగా తిరుగుతాయి. సఫారీ ప్రయాణంతో వాటికి ఆటంకం కలుగుతుంది. వన్యప్రాణుల స్వేచ్ఛకు భంగం కలిగించవద్దనే ఉద్దేశంతో మూడు నెలలు (జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు) అనుమతులు నిరాకరిస్తూ అటవీశాఖ అధికారులు పర్యాటకశాఖకు ఉత్తర్వులు జారీ చేశారు. -
‘ఇసుక అక్రమ రవాణాకు తావులేదు’
కోటపల్లి: మండలంలోని ఎర్రాయిపేట ఇసుక క్వారీలో ఎలాంటి అక్రమ రవాణా జరగడంలేదని మైనింగ్ ఏడీ జగన్మోహన్ రెడ్డి, ఏసీపీ వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం పార్పల్లి జాతీయ రహదారిపై టీజీఎండీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇసుక క్వారీ చెక్‌పోస్టును సందర్శించారు. మైనింగ్ ఏడీ మాట్లాడుతూ మండలంలోని ఇసుక క్వారీల్లో 24గంటలు మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారుల తనిఖీలతో పకడ్భందీగా ఇసుక తరలిస్తున్నామని, ఎలాంటి అక్రమాలకు తావివ్వకుండా నిర్వహణ చేపడుతున్నట్లు తెలిపారు. సీసీ కెమెరాల పర్యవేక్షణ లో లారీల్లో ఇసుకలోడ్ జరుగుతుందని, అక్ర మ రవాణా జరుగుతుందని వస్తున్న వదంతులను నమ్మవద్దన్నారు. ఇసుక లోడింగ్ నిలిచి పోవడంతో లారీలు పెద్దఎత్తున ఆగాయని, వా టిని కూడా పార్కింగ్ చేసుకునేలా ఏర్పాట్లు చే స్తామన్నారు. కార్యక్రమంలో సీఐ దేవేందర్‌రావు, ఎస్సై రాజేందర్, తహసీల్దార్ రాఘవేందర్రావు, డీటీ నవీన్‌కుమార్ పాల్గొన్నారు. చికిత్స పొందుతూ విద్యార్థి మృతి మందమర్రిరూరల్: మందమర్రి రైల్వేస్టేషన్లో ఆదివారం రైలులోంచి కిందపడిన కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం బోదన్పల్లికి చెందిన ఐటీఐ విద్యార్థి చింతపూడి కార్తీక్ (17) చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందినట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ తెలిపారు. మృతుడు కార్తీక్ తన తల్లి భీమక్కతో కలిసి కాజీపేట నుంచి సిర్పూర్ కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌లో వెళ్తుండగా మందమర్రి రైల్వేస్టేషన్ వద్ద కాలుజారి కిందపడ్డాడు. గాయాలు కావడంతో మంచిర్యాలలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భీమక్క ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహన్ని అప్పగించినట్లు హెడ్ కానిస్టేబుల్ తెలిపారు. -
జీవితం పేదల కోసమే..
ఆదిలాబాద్‌టౌన్: జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నా. పేదలకు సేవ చేయడానికి జీవితాన్ని అంకితం చేశా. నిత్యం రోగులకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందిస్తున్నా. నిత్యం 300 నుంచి 400 మంది ఆయా సేవల నిమిత్తం వస్తుంటారు. చివరి పేషెంట్ వరకు ఏరోజుకు ఆరోజు స్కానింగ్ చేయడంతో పాటు రిపోర్టులు తయారు చేసి రోగులు ఇబ్బందులు పడకుండా చూస్తాం. సేవలకు గుర్తింపుగా కలెక్టర్, మంత్రుల చేతుల మీదుగా పలుమార్లు అవార్డులు అందుకున్నా. – నూతుల కళ్యాణ్‌రెడ్డి, ప్రొఫెసర్, రిమ్స్ ప్రజలకు సేవ చేయాలని.. ఆదిలాబాద్‌టౌన్: వరంగల్‌లోని కేఎంసీలో వైద్య విద్య అభ్యసించా. ఢిల్లీలో పీజీ పూర్తి చేశా. అక్కడే అంబేడ్కర్ ఆస్పత్రిలో వైద్యసేవలు అందించా. జిల్లా ప్రజలకు వైద్యసేవలు అందించాలని తండ్రి శ్రీరాములు కోరిక మేరకు జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లో వైద్యునిగా చేరారు. నాలుగేళ్లుగా అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా సేవలు అందిస్తున్నా. 24 గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉంటున్నా. – డాక్టర్ ఆడె విఠల్, అసిస్టెంట్ ప్రొఫెసర్, రిమ్స్ -
మేమున్నామని..
నమ్మకమైన సేవలు అందించాలి అమ్మానాన్నల ప్రోత్సాహంతో వైద్య కోర్సు పూర్తిచేశా. వైద్యోనారాయణోహరి అనే నానుడిని నేడు కార్పొరేట్ ఆస్పత్రులు పూర్తిగా డబ్బులకు ఆశపడి మరిచిపోతున్నాయి. వైద్యులు రోగులకు నమ్మకమైన సేవలందించాలి. వైద్యరంగంలో రాణించాలనుకునే యువత ముందుగా ఎథికల్ ప్రాక్టీస్ చేయాలి. వైద్యులు ముఖ్యంగా మాతాశిశు మరణాలు జరగకుండా ఆపగలిగితే మనదేశం అభివృద్ధిలో మరింత ముందుంటుంది. – డాక్టర్ ప్రత్యూష, లక్ష్మణచాంద పీహెచ్సీ వృత్తిలో తృప్తి రోగులకు వైద్యసేవలు అందించడం అదృష్టంగా భావిస్తున్నా. ఇష్టంగా ఎంచుకున్న వృత్తిలో విజయాలు సాధించినప్పుడు కలిగే ఆనందం గొప్పది. గ్రామీణ ప్రజలకు సేవలు అందించేందుకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాం. ప్రస్తుతం కడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు పెంబి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కూడా విధులు నిర్వహిస్తున్నా. వైద్య వృత్తిలో తృప్తి లభిస్తోంది. – శివకుమార్, కడెం పీహెచ్సీ -
మీ తమ్మునిపై కేసు అయ్యింది..
● ఉపాధ్యాయుడికి సైబర్ నేరస్తుడి ఫోన్.. ● అప్రమత్తతతో తప్పించుకున్న బాధితుడు జన్నారం: హలో.. నేను సీబీఐ నుంచి మాట్లాడుతున్నా.. మీ తమ్మునిపై కేసు నమోదైంది. మీరు వెంటనే ఆదిలాబాద్ రండి.. లేకుంటే చాలా ప్రమాదంలో పడుతారని ఉపాధ్యాయుడికి ఫోన్‌రావడంతో మొదట బిత్తరపోయిన ఉపాధ్యాయుడు తేరుకుని సైబర్ నేరస్తుడని గ్రహించి తప్పించుకున్న సంఘటన జన్నారంలో చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు జన్నారం మండలం కిష్టాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు ప్రకాశ్నాయక్కు ఓ వ్యక్తి ఫోన్‌చేసి నేను సీబీఐ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నా.. మీ తమ్ముదు ప్రమోద్‌పై కేసు నమోదైంది. మీరు వెంటనే ఆదిలాబాద్‌కు రండి అని చెప్పాడు. మొదటగా భయాందోళనకు గురైన ఉపాధ్యాయుడు వెంటనే ఆదిలాబాద్‌లో ఉంటున్న ప్రమోద్‌కు ఫోన్ చేశాడు. ఎక్కడున్నావని అడుగగా గుడిలో పూజ చేస్తున్నట్లు చెప్పాడు. సదరు ఉపాధ్యాయుడు అదే నంబర్‌కు ఫోన్ చేసి బెదిరించడంతో సైబర్ నేరగాడు ఫోన్ కట్ చేశాడు. విషయాన్ని ఎస్సై అనూషకు చెప్పడంతో అలాంటి ఫేక్ కాల్‌లను నమ్మవద్దని సూచించారు. -
25 ఏళ్ల అనుభవం..
1995లో గాంధీ యూనివర్సిటీలో ఎంబీబీఎస్, 1998లో ఎండీ, పిడియాట్రీషన్ పూర్తిచేశా. మూడేళ్లపాటు నిజామాబాద్‌లో పిల్లల వైద్యునిగా పనిచేశా. 2012లో నిజామాబాద్ జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరైనప్పటి నుంచి వివిధ హోదాలలో సేవలు అందించా. గతేడాది నుంచి నిర్మల్ మెడికల్ కళాశాల సూపరింటెండెంట్‌గా బాధ్యతలు చేపట్టా. ఈ 25 ఏళ్ల అనుభవంలో ఎంతో మందికి సేవలు అందించా. పేదలకు సేవ చేయడం గొప్పగా భావిస్తున్నా. – డాక్టర్ గోపాల్‌సింగ్, సూపరింటెండెంట్, జిల్లా జనరల్ ఆసుపత్రి, నిర్మల్ వైద్యసేవలు అందించాలనే.. పేదలకు వైద్యసేవలు అందించాలనే వైద్యవృత్తిని ఎంచుకున్నా. 25 ఏళ్లుగా ప్రజలకు సేవలందిస్తున్నా. ఆస్పత్రికి వచ్చే రోగులకు అవసరమయ్యే వసతులు, వైద్యసేవలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నా. 24 గంటలపాటు ప్రజలకు అందుబాటులో ఉంటున్నా. వైద్యవృత్తి సేవా దృక్పధంతో ముడిపడి ఉంటుంది. డబ్బుల కోసమే కాకుండా స్వచ్ఛందంగా వైద్య సేవలందించాలి. – డాక్టర్ కాశీనాథ్, సూపరింటెండెంట్, భైంసా ఏరియా ఆసుపత్రి -
ఆర్జీయూకేటీలో అకడమిక్ రివ్యూ మీటింగ్
బాసర: బాసర ఆర్జీయూకేటీలో 2025–26 విద్యాసంవత్సరాన్ని పురస్కరించుకుని సోమవారం అకడమిక్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీసీ ప్రొఫెసర్ ఏ.గోవర్ధన్, ఓఎస్డి ప్రొఫెసర్ ఈ. మురళీదర్శన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వీసీ గోవర్ధన్ మాట్లాడుతూ విద్యార్థుల హాజరు, రిజిస్టర్ల నిర్వహణ, డేటా భద్రతపై దృష్టి పెట్టాలన్నారు. ఎన్ఏఏసీ ఫైల్ తయారీపై అన్ని శాఖల అధ్యాపకులు శ్రద్ధ వహించాలని సూచించారు. త్వరలో (ఎంటెక్)పీహెచ్డీ ప్రవేశ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. బాసర, మహబూబ్ నగర్ సెంటర్లకు సంబంధించిన ప్రవేశ ఫలితాలు విడుదల జూలై 4న, జూలై 7, 8, 9 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ ఫలితాలను మొదటిగా విడుదల చేసిన విశ్వవిద్యాలయంగా బాసర ఆర్జీయూకేటీ నిలిచిందన్నారు. ఇందులో భాగమైన టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. సమావేశంలో డీన్లు డాక్టర్ మహేష్, డాక్టర్ విట్టల్, డాక్టర్ నాగరాజు, అన్ని విభాగాల హెచ్ఓడీలు, పీఆర్వో విజయ్ కుమార్, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. సాంస్కృతికశాఖ సలహామండలి సభ్యుడిగా నాగరాజుమందమర్రి రూరల్: మందమర్రి పట్టణానికి చెందిన ధూంధాం సాంస్కృతిక విభాగం వ్యవస్థాపకుడు అంతడ్పుల నాగరాజును తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ సలహా మండలి సభ్యుడిగా నియమిస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ సాంస్కృతిక మండలి సలహాదారుగా నియమించడం సంతోషంగా ఉందన్నారు. పలువురు కళాకారులు నాగరాజును అభినందించారు. ‘9న సమ్మె విజయవంతం చేయాలి’శ్రీరాంపూర్: జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను సింగరేణిలో విజయవంతం చేయాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. సోమవారం నస్పూర్ కాలనీలోని జీటీ హాస్టల్ వద్ద పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న హక్కులను మోడీ సర్కార్ కాలరాస్తుందన్నారు. 44 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చి కార్మిక హక్కులను హరిస్తోందన్నారు. ఈ సమ్మెతో కేంద్రానికి బుద్ధి చెప్పాలన్నారు. ఈ సమావేశంలో జేఏసీ నాయకులు ముస్కే సమ్మయ్య, బాజీ సైదా, కిషన్ రావు, కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, బండి రమేశ్, చంద్రశేఖర్, వెంగళ శ్రీనివాస్, కిషన్ రెడ్డి, కాంతయ్య, సత్యం, కనకయ్య, తదితరులు పాల్గొన్నారు. హెచ్ఎంఎస్ సమ్మె నోటీసు జూలై 9న జరుపతలపెట్టిన సార్వత్రిక సమ్మెకు సంబంధించిన నోటీసును హెచ్ఎంఎస్ నాయకులు శ్రీరాంపూర్ జీఎం ఎం.శ్రీనివాస్‌కు అందించారు. కార్యక్రమంలో హెచ్ఎంఎస్ కేంద్ర నాయకులు తిప్పారపు సారయ్య, ఉపాధ్యక్షుడు అనిల్‌రెడ్డి, అశోక్, గొల్ల్ల సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. -
సమాజ సేవలో చంద్రదత్
మంచిర్యాలటౌన్: మంచిర్యాలకు చెందిన వైద్యుడు జీవీఎంఎస్ చంద్రదత్ ఐబీ సమీపంలో ప్రైవేటు ఆసుపత్రి నిర్వహిస్తున్నారు. తరచూ ఉచిత వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి మందులు సైతం అందిస్తున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ఆస్పత్రికి వచ్చే రోగుల ఆర్థిక పరిస్థితినిబట్టి ఫీజులు తీసుకుంటున్నారు. అనవసరమైన టెస్టులు చేయకపోవడం, అవసరానికి మించి మందులు రాయడం వంటివి లేకపోవడంతో ప్రజలు నమ్మకంగా వస్తున్నారు. రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అనాధ, వృద్ధాశ్రమంలో ఉచితంగా వైద్య శిబిరం నిర్వహించి మందులు సైతం ఉచితంగా అందిస్తున్నారు. ఆశ్రమాలకు అవసరమైన సరుకులు, నగదు అందజేస్తున్నారు. – డాక్టర్ చంద్రదత్, జనరల్ మెడిసిన్ -
ఆలస్యంగా వచ్చారని..
కోటపల్లి: పాఠశాలకు ఆలస్యంగా వచ్చారని విద్యార్థులు, వారి తల్లిదండ్రులను వానలో నిలబెట్టారు కోటపల్లి గిరిజన ఆశ్రమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్. పాఠశాలలో 6, 9, 10వ తరగతి చదువుతున్న విద్యార్థినులు పాఠశాల పునఃప్రారంభం తర్వాత సోమవారం పాఠశాలకు తల్లిదండ్రులతో కలిసి వచ్చారు. ఆలస్యంగా వచ్చారని ఆగ్రహించిన ప్రిన్సిపాల్ విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులను లోని కి రానివ్వలేదు. ఒవైపు వర్షం కురుస్తున్నా.. గేటు తీయలేదు. దీంతో రెండు గంటలపాటు వానలోనే నిరీక్షించారు. చివరకు తల్లిదండ్రులు ఇంకోసారి జరగదని లిఖితపూర్వకంగా హామీ ఇస్తామని తెలిపారు. అయినా ప్రిన్సిపాల్ అంగీకరించలేదు. ఉన్నతాధికారుల అనుమతి తీ సుకుని రావాలని ఆదేశించారు. దీంతో తల్లిదండ్రుల ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు బీఆర్ఎస్ నాయకుల జోక్యంతో పిల్లలను అనుమతించారు. ఈ విషయంపై పాఠశాల హెచ్ఎం ఆశోక్‌ను వివరణ కోరగా, విద్యార్థులను ఇ బ్బంది పెట్టాలనే ఉద్దేశం లేది, విద్యార్థులకు, తల్లిదండ్రులకు చదువు, క్రమశిక్షణ విలువ తెలియాలని అనుమతించలేదని తెలిపారు. -
మల్లన్న కల్యాణం
జైపూర్: ఏటా తొలి ఏకాదశికి ముందు వేలాల మల్లికార్జునస్వామి కల్యాణోత్సవాలు మూడు రోజులపాటు నిర్వహించడం ఆనవాయితీ. ఈ క్రమంలో ఆదివారం ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మొదటిరోజు ఖేతమ్మ భ్రమరాంభిక శ్రీమల్లన్న స్వామికి పవిత్ర గోదావరిలో పుణ్యస్నానం చేయించారు. సోమవారం ఉదయం ఒగ్గు పూజారుల నేతృత్వంలో పెద్దపట్నం వేసి ఖేతమ్మ భ్రమరాంభికాసమేత శ్రీమల్లికార్జునస్వామి కల్యాణం వైభవంగా జరిపించారు. సాయంత్రం అగ్నిగుండాల కార్యక్రమం నిర్వహించగా, సమీప ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులు స్వామివారి కల్యాణం వీక్షించి తరించారు. స్వామివారిని దర్శించుకుని పూజలుచేశారు. అగ్నిగుండాల్లో నిప్పులపై నడిచారు. మొక్కులు చెల్లించుకున్నారు. వానలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని మల్లన్నను ప్రార్థించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో రమేశ్, ఎస్సై శ్రీధర్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. -
జిల్లాస్థాయి క్రికెట్ జట్టు ఎంపిక
బెల్లంపల్లి: పట్టణంలోని మురళి మెమోరియల్ క్రికెట్ అకాడమీలో అండర్ –16, 19 విభాగాల్లో క్రికెట్ జట్ల ఎంపిక పోటీలు సోమవారం నిర్వహించారు. ఈ పోటీలను ప్రముఖ వైద్యుడు జగదీశ్‌నాయుడు ప్రారంభించారు. జిల్లా జట్టుకు ఎంపికై న క్రీడాకారులు నిర్మల్, ఆదిలాబాద్, ఆర్మూర్, నిజామాబాద్, బెల్లంపల్లిలో జరిగే టోర్నమెంట్లో పాల్గొంటారు. కార్యక్రమంలో న్యాయవాది నల్లుల సంగీత, తెలంగాణ క్రికెట్ అసోషియేషన్ జిల్లా ఇన్చార్జి నర్సింగ్, వెంకటేశ్వర్లు, కోచ్‌లు శేఖర్, గౌతమ్, ఒకేషనల్ ప్రిన్సిపాల్ రాజేశ్ పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు గురుకుల విద్యార్థులు
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల ము న్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముల్కల్ల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, బాలుర జూనియర్ కళాశాలలకు చెందిన ఇద్దరు విద్యార్థులు రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారని పీడీ శ్రీకాంత్, పీఈటీ సాగర్ తెలిపారు. జూన్ 29న మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన జిల్లాస్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ మీట్లో 12–14 ఏళ్ల విభాగంలో ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని పేర్కొన్నారు. 14 ఏళ్ల విభాగంలో లాంగ్‌జంప్, పరుగుపందెం పోటీల్లో ఎ.అరుణ్‌కుమార్, 12 ఏళ్ల విభాగంలో జావలిన్‌త్రోలో జి.సాయిచరణ్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు వివరించారు. జులై 6న హన్మకొండలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలి పారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న క్రీడాకారుల ను ప్రిన్సిపాల్ మోహన్, సీనియర్ వైస్ ప్రిన్సిపాల్ కె.మహేశ్వర్‌రావు, జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ రమేశ్, అధ్యాపకులు అభినందించారు. -
ఎక్కడి సమస్యలు అక్కడే పరిష్కరించాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రజల సమస్యలు ఎక్కడికక్కడే పరిష్కరించాలని, పరిష్కారానికి కలెక్టరేట్‌కు వచ్చే వరకూ చూడొద్దని కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. ప్రజావాణికి వచ్చే అర్జీలు పరిష్కరించడంలోనూ జాప్యం చేయవద్దని సూచించారు. కలెక్టేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో మంచిర్యాల, బెల్లంపల్లి ఆర్డీవోలు శ్రీనివాస్, హరికృష్ణతో కలిసి దరఖాస్తులు స్వీకరించారు. భూ సమస్యలు, పింఛన్లు, పరిహారం, ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయి. ప్రజలు కలెక్టరేట్‌కు వచ్చే వరకూ చూడొద్దు అర్జీలు పెండింగ్‌లో పెట్టొద్దు కలెక్టర్ కుమార్ దీపక్ -
రోజంతా ముసురు
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం రాత్రి వరకు ముసురు వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ చిత్తడిగా మారాయి. వర్షంతోపాటు చల్లగాలి వీయడంతో వృద్ధులు, చిన్నారులు వణుకుతున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న ముసురు వర్షంతో వాతావరణం పూర్తిగా చల్లబడింది. ప్రస్తుతం కురుస్తున్న ముసురు వర్షంతో పత్తి మొలకలు ప్రాణం పోసుకుంటున్నాయి. భారీ వర్షాలు లేక, వాగులు, వంకల్లో ప్రవాహం లేదు. చెరువులు, కుంటల్లోకి కొత్త నీరు చేరలేదు. జూలైలో ఆశించిన వర్షాలు కురుస్తాయని రైతులు ఆశత ఎదురు చూస్తున్నారు. జిల్లాలో నమోదైన వర్షపాతం.. జిల్లాలో అదివారం నుంచి సోమవారం వరకు 13.9 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. భీమినిలో 26.1 మిల్లిమీటర్లు, కన్నెపల్లిలో 24, కోటపల్లిలో 22.8, వేమనపల్లిలో 22.5, నెన్నెలలో 20.2, చెన్నూర్‌లో 17.7, బెల్లంపల్లిలో 17.2, తాండూర్‌లో 14.2, భీమారంలో 13.2, మందమర్రిలో 12.8, జైపూర్‌లో 12.4, మంచిర్యాలలో 12, నస్పూర్‌లో 10.5, కాసిపేటలో 8.3, హాజీపూర్‌లో 7.7, దండేపల్లిలో 4.9, లక్షెట్టిపేటలో 3.2, జన్నారంలో 1.1 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. జిల్లా జూన్ 30 వరకు సాధారణ వర్షపాతం 159.8 మిల్లిమీటర్లు కాగా, 95.7 మిల్లిమీటర్లు కురిసింది. సగటున 40 శాతం లోటు నెలకొంది. -
ఇళ్ల పట్టాల కోసం ధర్నా
శ్రీరాంపూర్: సింగరేణి స్థలాల్లో శాశ్వతంగా నివా సం ఉంటున్నవారికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని బీజేపీ నాయకులు శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం ఎదు ట సోమవారం ధర్నా చేశారు. ఏరియా ఎస్‌ఓటూ జీఎం సత్యనారాయణకు వినతిపత్రం అందించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్, రాష్ట్ర నాయకుడు వెరబెల్లి రఘునాథరావు మాట్లాడుతూ అందరికీ పట్టాలిస్తామని బీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చి, కొద్ది మందికే ఇచ్చి చేతులు దులుపుకుందన్నారు. కాంగ్రెస్ కూడా పట్టాలిస్తామని విస్మరించిందని పేర్కొన్నారు. ధర్నాలో జిల్లా నాయకులు గాజుల ముఖేశ్‌గౌడ్, ఎనగందుల కృష్ణమూర్తి, తిరుపతి, పి.కమలాకర్‌రావు, పట్టణ అధ్యక్షుడు సత్రం రమేశ్, నాయలు పాల్గొన్నారు. -
సీఎంఆర్ లక్ష్యాలు పూర్తి చేయాలి
● రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ప్రధాన కార్యదర్శి డీఎస్.చౌహన్మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాకు కేటాయించిన సీఎంఆర్ లక్ష్యాలను త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ప్రధాన కార్యదర్శి డీఎస్.చౌహన్ సూచించారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ సంచాలకులు ముజా మిల్ఖాన్, ఇతర అధికారులతో కలిసి కలెక్టర్, పౌరసఫరాల శాఖ అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సీజన్లో లక్ష్యానికి మించి ధాన్యం కొనుగోలు చేయడంతో బాధ్యత మరింత పెరిగిందన్నారు. బ్యాంకు గ్యారంటీలు ఇచ్చిన రైస్‌మిల్లులకు ధాన్యం కేటాయించాలని తెలిపారు. వచ్చే సీజన్లో ధాన్యం కొనుగోలుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. రేషన్ కార్డు కోసం వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి అర్హులకు జారీ చేయాలని తెలిపారు. కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ జిల్లాలో లక్ష్యం మేరకు ధాన్యం సేకరించి మిల్లులకు తరలించామని తెలిపారు. సీఎంఆర్ లక్ష్యాలను త్వరగా పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి బ్రహ్మరావు, జిల్లా మేనేజర్ శ్రీకళ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
పట్టు పురుగుల పెంపకానికి అనుమతివ్వాలి..
‘మాది చెన్నూర్ మండలం కిష్టపేట. 40 ఏళ్లుగా అటవీ శాఖకు చెందిన 110 హెక్టార్ల భూమిలో పట్టు పురుగులు పెంచుతూ ఉపాధి పొందుతున్నాం. ఇటవీల అటవీ శాఖ అధికారులు ‘కావ్వల్ టైగర్ రిజర్వర్ పరిధిలో పట్టు పురుగల పెంపకం నిషేధం’ అని బోర్డు పెట్టారు. మమ్మల్ని అటవీ భూముల్లోకి రానివ్వడం లేదు’ అని పట్టుపురుగుల పెంపకం రైతులు విన్నవించారు. స్పందించిన కలెక్టర్ అక్కడే ఉన్న పట్టుపరిశ్రమ శాఖ ఏడీ పార్వతి రాథోడ్‌ను వివరణ కోరారు. అటవీ శాఖ అధికారులు సమాచారం ఇచ్చారని ఏడీ తెలిపారు. ఆ విషయం రైతులకు ఎందుకు తెలుపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అక్కడే తెలియజేశానని, అయినా వచ్చాని వెల్లడించారు. మరోసారి ఇక్కడ వివరించాలని ఆదేశించడంతో ఆమె తెలియజేశారు. అనంతరం రైతులు తమకు ఆధారం చూపాలని కలెక్టర్‌ను వేడుకున్నారు. స్పందించిన కలెక్టర్ అటవీశాఖ అధికారులతో మాట్లాడారు. చెట్లు నరకకుండా పెంచుకునేందుకు అభ్యంతరం లేదని తెలిపారు. దీంతో కలెక్టర్ వారికి వెల్లడించారు. -
ఆర్టీసీ అభివృద్ధికి ప్రభుత్వం కృషి
● ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు మంచిర్యాలఅర్బన్: ఆర్టీసీ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు అన్నారు. మంచిర్యాల బస్టేషన్, డిపోను ఆర్ఎం భవానీప్రసాద్‌తో కలిసి సోమవారం పరిశీలించారు. బస్‌స్టేషన్ విస్తరణపై చర్చించారు. మర్రి చెన్నారెడ్డి హయాంలో బస్‌స్టేషన్, డిపో ప్రారంభమయ్యాయని తెలి పారు. అప్పటి నుంచి ఎలాంటి అభివృద్ధి జరుగలేదని పేర్కొన్నారు. త్వరలోనే అభివృద్ధి చేస్తానని వెల్లడించారు. ఆర్టీసీని లాభాల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇక బీజేపీకి ఎన్నికలప్పుడే రాముడు గుర్తొస్తాడని ఎద్దేవా చేశారు. అనంతరం ఎమ్మెల్యేను ఆర్టీసీ అధికారులు సన్మానించారు. ఆయన వెంట ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(కరీంనగర్ జోన్) బుచయ్య, ఆదిలాబాద్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ అంజనేయులు, డీఎం శ్రీనివాసులు, అసిస్టెంట్ డిపో మేనేజర్ శ్రీలత తదితరులు ఉన్నారు. -
సీతక్క ఎదుగుదల ఓర్వలేకనే విమర్శలు
ఆదిలాబాద్‌రూరల్: మంత్రి సీతక్క ఎదుగుదల ఓర్వలేకనే కొంతమంది అగ్రవర్ణ రాజకీయ పార్టీల నాయకులు ఆమైపె లేనిపోని విమర్శలు చేస్తున్నార ని తుడుందెబ్బ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు గోడం గణేశ్ అన్నారు. శనివారం మావల మండలంలోని బట్టిసావర్గాం శివారులో గల కుమురం భీం గూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మంత్రి సీతక్కను ధూషిస్తున్నారన్నారు. సమావేశంలో తుడుందెబ్బ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పెందూర్ దాదిరావు, వెట్టి మనోజ్, ఆదిలాబాద్ డివిజన్ అధ్యక్షుడు ఆత్రం గణపతి, మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు గోడం రేణుక, ఉపాధ్యక్షురాలు ఉయిక ఇంద్రా పాల్గొన్నారు. -
పుట్టినరోజే ఆగిన ఊపిరి
● 12 రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఓడిన చిన్నారి ఆదిలాబాద్‌టౌన్: నవమాసాలు మోసి.. కంటికి రెప్పలా కాపాడిన ఓ తల్లికి తీరని గర్భశోకం మిగి లింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న ఇద్దరు పిల్ల లను రోడ్డు ప్రమాదం కబళించింది. పక్షం రోజుల క్రితం ఉట్నూర్ మండలంలోని బిర్సాయిపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కుమారుడిని, తల్లిని కోల్పోయిన సృజనిత శనివారం కుమార్తెను కూడా కోల్పోయింది. ఉన్న ఇద్దరు పిల్లలు దూరం కావడం ఆ కుటుంబంలో అంతులేని విషాదం నింపింది. దైవదర్శనానికి వస్తుండగా ఈనెల 16న బిర్సాయిపేట మూలమలుపు వద్ద కారు అదుపుతప్పి చెట్టు ను ఢీకొట్టింది. అందులో ఆదిలాబాద్ పట్టణంలోని రిక్షా కాలనీకి చెందిన డాక్యుమెంట్ రైటర్ ఈర్ల రా జు, అతని భార్య సృజనిత, అత్తమ్మ గంట విజయ, కు మారుడు సహర్ష్తో పాటు కుమార్తె అద్యశ్రీ (12) ప్ర యాణించారు. సహర్ష్, గంట విజయ మృతి చెందిన విషయం తెలిసిందే. తీవ్రంగా గాయపడిన అద్యశ్రీ ని మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. 12 రోజుల పా టు మృత్యువుతో పోరాడిన ఆ చిన్నారి శనివారం తన పుట్టిన రోజునాడే తనువు చాలించింది. పుట్టిన రోజునాడే చిన్నారి దూరం కావడంతో తల్లిదండ్రులు తీవ్రంగా తల్లడిల్లుతున్నారు. అందరితో కలుపుగోలుగా ఉండే చిన్నారుల మరణంతో కాలనీలోనూ తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. ఆదివా రం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. -
అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తే ఊరుకోం
● నిధులు దుర్వినియోగం చేస్తున్న పీవోను బదిలీ చేయాలి ● ఆదిమ గిరిజన కొలాం సేవా సంఘం అధ్యక్షుడు సోనేరావుఆదిలాబాద్అర్బన్: పీవీటీజీల అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తూ నిధులు సక్రమంగా వినియోగించకుండా దుర్వినియోగం చేస్తే ఊరుకునేది లేదని ఆదిమ గిరిజన కొలాం సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కొడప సోనేరావు అన్నారు. శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆదివాసీ కొలాం, తోటి, చెంచు, కొండరెడ్ల నిధులు దుర్విని యోగం చేస్తున్న ఐటీడీఏ పీవోను బదిలీ చేయాలని కలెక్టర్‌ను కోరామన్నారు. ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించకుండా వైద్యారోగ్యం, పౌష్టికాహారంపై గిరిజన పల్లెలను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. పక్కా ఇళ్ల నిర్మాణంలో నిర్లక్ష్యంగా ఉన్నారని, గ్రామాల్లో తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయకపోవడంతో ఇప్పటికీ మంచినీటికి దూరంగా ఉన్నాయన్నారు. గిరిజన గ్రామాలను మెయిన్ రోడ్డుకు అనుసంధానం చేయకుండా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారన్నారు. కొన్ని గ్రామాలకు ఇప్పటికీ విద్యుత్ సౌకర్యం లేదన్నారు. ఉమ్మడి జిల్లా కొలాం, ఆదివాసీ గిరిజన గ్రామాలకు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వ నిధులపై ఆరా తీసి సక్రమంగా ఖర్చుచేయాలన్నారు. సమావేశంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు గోవింద్రావు, గౌరవ అధ్యక్షులు టేకం రాజు, మడావి కిషన్, నాయకులు టేకం లక్ష్మణ్, కుమ్ర రాజు, టేకం జంగు, టేకం గణేశ్, బాలు, మడావి జంగు, తదితరులు పాల్గొన్నారు. -
మానవ అక్రమ రవాణా ముఠా అరెస్ట్
● ముగ్గురిపై కేసు నమోదు ● వివరాలు వెల్లడించిన డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి ఆదిలాబాద్‌టౌన్: మానవ అక్రమ రవాణా చేస్తున్న ముఠాను అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. భీంపూర్ మండలానికి చెందిన ఓ బాలిక బంధువుల ఇంట్లో ఉంటూ పదోతరగతి చదువుతోంది. ఈ నెల 2న ఉదయం ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లా ఘంటంజీ తాలుకా కిన్హి గ్రామానికి చెందిన భార్యాభర్తలు నిర్మల బాపూణ్య ఆత్రం, బాపూణ్య రాజారాం ఆత్రం బాలిక ఇంటికి వచ్చారు. కిన్హిలో ఓ కార్యక్రమం ఉందని మాయమాటలు చెప్పి ఆదిలాబాద్‌కు తీసుకొచ్చారు. బస్సులో నాగ్‌పూర్‌కు తీసుకెళ్లిన తర్వాత అక్కడి నుంచి రైలులో రాజస్థాన్‌లోని కోటాకు తీసుకెళ్లి కరణ్ అలియాస్ భగవత్ మీనన్‌కు అప్పగించారు. అతని వద్ద నుంచి రూ.10వేలు తీసుకున్నారు. కరణ్ బాలికను తన ఇంట్లో అక్రమంగా నిర్బంధించి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి బంధువులు ఈ నెల 22న భీంపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో నిందితులు ఆ బాలికను రైలులో ఆదిలాబాద్‌కు తీసుకురాగా 25న ఇంటికి చేరుకుంది. నిందితులు శనివారం రైలుమార్గంలో ఆదిలా బాద్ నుంచి పారిపోతుండగా రైల్వే స్టేషన్లో పట్టుకున్నారు. వారి వద్ద నుంచి సెల్ ఫోన్‌తో పాటు రూ.2వేల నగదును స్వాధీనం చేసుకుని ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో జైనథ్ సీఐ డి.సాయినాథ్, భీంపూర్ ఎస్సై బి.పీర్ సింగ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
బాసరలో సీసీ కెమెరాలు ధ్వంసం
బాసర: మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కొంతమంది దుండగులు ధ్వంసం చేశారు. పీఎంశ్రీ పథకం కింద ఏర్పాటు చేసిన నాలుగు సీసీ కెమెరాలు ధ్వంసం చేసి రెండింటిని ఎత్తుకెళ్లారు. శనివారం ప్రధానోపాధ్యాయుడు నరసయ్య పాఠశాలను తెరిచే సరికి సీసీ కెమెరాలు చిందరవందరంగా ఉండడంతో పోలీసులకు సమాచారం అందించాడు. గతంలో సైతం పాఠశాల ప్రాంగణంలోకి చొరబడి దుశ్చర్యలకు పాల్పడ్డారని, అసాంఘిక కార్యకలాపాలకు ప్రభుత్వ పాఠశాల అడ్డాగా మా రిందని ఆవేదన వ్యక్తం చేశాడు. పాఠశాలకు రాత్రిపూట భద్రత కరువైందని ఉన్నతాధికారులకు పలుమార్లు విన్నవించినా ఫలితం లేదన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. హీరాసుక్క ఆశయ సాధనకు కృషి బజార్హత్నూర్: ఆదివాసీల ఆరాధ్య దైవం, ఆదివాసీల గోండి ధర్మ గురువు హీరాసుక్క ఆశయ సాధనకు కృషి చేస్తామని పర్ధాన్ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు దుర్వ నాగేశ్వర్ అన్నారు. శనివారం మండలంలోని యేసాపూర్లో హీరాసుక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసీ గిరిజనులు ఆర్థిక, సామాజిక, విద్యా, ఉద్యోగాలు సాధించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఉయికే సుదర్శన్, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సిడం కిషన్, ఐటీడీఏ పీవీటీజీ అధ్యక్షుడు మేస్రం మనోహర్, కౌడుజీ, మడావి నరహరి, నర్సయ్య, పాండురంగ్, కొడప నగేష్, నైతం రమేష్, ఉత్తం, శ్రీరాం, తదితరులు పాల్గొన్నారు. -
ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ మృతి
తాండూర్: ఇసుక ట్రా క్టర్ బోల్తాపడి డ్రైవర్ మృతి చెందిన సంఘటన మండలంలో చో టు చేసుకుంది. ఎస్సై కిరణ్‌కుమార్ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. కన్నెపల్లి మండలం టేకులపల్లి గ్రామానికి చెందిన విఘ్నేష్ (21) శనివారం తెల్ల వారుజామున తమ సొంత ట్రాక్టర్లో ఇసుక నింపుకుని టేకులపల్లి నుంచి అచ్చలాపూర్వైపు వస్తుండగా అదుపుతప్పి ఒర్రెలో పడిపోయింది. తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని తండ్రి కృష్ణమూర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. చికిత్స పొందుతూ యువకుడు.. ముధోల్: ఈ నెల 18న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై బిట్లా పెర్సిస్ తెలిపారు. మండలంలోని వడ్తాలా గ్రామానికి చెందిన పవన్‌కుమార్ (28) ఈనెల 18న పురుగుల మందు తాగడంతో గమనించిన కుటుంబ సభ్యులకు చికిత్స నిమిత్తం భైంసా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. లారీ బోల్తా సాత్నాల: భోరజ్ మండల కేంద్రంలోని 44వ అంతర్రాష్ట్ర రహదారిపై చెక్‌పోస్ట్ వద్ద శనివారం అదుపుతప్పి లారీ బోల్తా పడింది. హైవే పెట్రోలింగ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హర్యానాకు చెందిన మతిన్ లారీలో జైపూర్ నుంచి చైన్నెకి ఎల్ఈడీ బల్బులు రవాణా చేస్తుండగా భోరజ్ చెక్‌పోస్ట్ వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఘటన సమయంలో చెక్‌పోస్ట్ సిబ్బంది ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మూడిళ్లలో చోరీకి యత్నం ముధోల్: మండల కేంద్రంలోని పలు కాలనీల్లో శుక్రవారం రాత్రి మూడిళ్లలో చోరీకి యత్నించినట్లు ఎస్సై బిట్లా పెర్సిర్ తెలిపారు. గుర్తు తెలియని దుండగులు రాత్రిపూట తాళం వేసిన ఇళ్లలో చోరీకి యత్నించినట్లు ఆయన పేర్కొన్నారు. ఎలాంటి నగదు, ఆభరణాలు చోరీ కాలేదన్నారు. బాధితులు సట్లొల్ల గంగాధర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు. చోరీకి యత్నించిన నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. -
మరో సూపర్ బజార్‌కు మంగళం..!
● ఇప్పటికే నస్పూర్‌లో మూసివేత ● ఈ నెల 30తో రామకృష్ణాపూర్లో క్లోజ్ ● సింగరేణి నిర్ణయంతో కార్మికులపై భారం ● రాయితీ సరుకులకు కార్మిక కుటుంబాలు దూరం ● ఉనికి కోల్పోనున్న కార్మిక క్షేత్రం సింగరేణి సంస్థ కార్మికులకు మేలురకమైన సరుకులు అందించేందుకు ఏర్పాటు చేసిన సూపర్ బజార్లకు మంగళం పాడుతోంది. ఇటీవలే నస్పూర్‌లోని సూపర్ బజార్‌ను మూసివేసిన సంస్థ యాజమాన్యం ఇప్పుడు రామకృష్ణాపూర్ సూపర్ బజార్‌పై కన్నేసింది. జనరల్ మేనేజర్ కార్యాలయం, వర్క్‌షాప్, టింబర్‌యార్డు, స్టోర్స్.. ఇలా అనేక కార్యాలయాలు, భూగర్భ గనులతో తులతూగిన రామకృష్ణాపూర్ పట్టణం.. సూపర్ బజార్ మూసివేతతో ఉనికినే కోల్పోయే దుస్థితికి చేరనుంది. ఎంతో శ్రమకోర్చి చెమటోడ్చిన బొగ్గు గని కార్మికులు ఇప్పుడు సింగరేణి సూపర్ బజార్లకు నోచుకోని పరిస్థితి నెలకొంది. బొగ్గు గనులతో పాటు కార్మికుల సంక్షేమానికి కూడా యాజమాన్యం గండి కొడుతోందన్నా విమర్శల నేపథ్యంలో సాక్షి ప్రత్యేక కథనం. రామకృష్ణాపూర్: మందమర్రి ఏరియా రామకృష్ణాపూర్ పట్టణంలోని సింగరేణి సూపర్ బజార్ ఈ నెలాఖరుతో మూతపడనుంది. పైనుంచి వెలువడిన ఆదేశాల మేరకు మూసివేతకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇక్కడి సరుకులను మందమర్రి సూపర్‌బజార్‌కు తరలించేందుకు చర్యలు చేపట్టారు. సింగరేణి కార్మికులకు ఇప్పటి వరకు సూపర్ బజార్లు నిత్యావసర సరుకులే కాకుండా ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా అందిస్తూ వచ్చాయి. సంస్థలో పనిచేస్తున్న కార్మికులకు ఉద్దెర రూపంలో నిత్యావసర సరుకులు లభిస్తుండేవి. ఎలక్ట్రానిక్ పరికరాలకు ఈఎమ్ఐ ద్వారా చెల్లించే వెసులుబాటు ఉండేది. ఉద్యోగుల వేతనం నుంచి డబ్బులు కట్ చేసేవారు. అయితే కొన్ని రోజులుగా ఇక్కడి సూపర్బజార్లో నిత్యావసర సరుకులు నిలిపివేయడమే కాకుండా మొత్తానికే ఎత్తివేస్తున్నారని తెలిసి స్థానికులు అవాక్కవుతున్నారు. సంస్థ మనుగడ కోసం తమ చెమటను ధారబోసినా కనీసం సూపర్బజార్లకు కూడా నోచుకోక పోతున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సూపర్ బజార్ అంటే ఓ బ్రాండ్...సింగరేణి వ్యాప్తంగా సంస్థ సూపర్ బజార్లంటే ఒక బ్రాండ్ ఇమేజ్ ఉండేది. రామకృష్ణాపూర్లో షాపు ఏర్పాటు చేసిన ప్రాంతాన్ని సూపర్‌బజార్ ఏరియా అనే పేరుతో పిలిచేవారు. ఇక్కడి సూపర్ బజార్లో నిత్యావసర సరుకులే కాకుండా టీవీలు, ఫ్రిజ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు కార్మికులకు అందుబాటులో ఉండేవి. గ్యాస్ సిలిండర్ల పంపిణీ కూడా వీటి ద్వారానే జరిగేది. ఇలాంటి సూపర్ బజార్‌ను ఉన్నట్టుండి ఒక్కసారిగా మూసివేయాలని యాజమాన్యం నిర్ణయించడంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దశాబ్దాల క్రితం ప్రారంభించిన ఆర్కేపీ సూపర్ బజార్ ఇప్పుడు మూసివేస్తున్నారని తెలిసి పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సూపర్ బజార్ పర్యవేక్షణ జరిపే ఉద్యోగి ఈ నెలాఖరుతో రిటైర్ అవుతున్న నేపథ్యంలో అతని స్థానంలో మరొకరిని నియమించి సరుకులను అంటుబాటులో ఉంచి షాపును కొనసాగించే అవకాశం ఉన్నప్పటికీ ఇలా మూసివేయడంపై కార్మికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.మొన్న నస్పూర్..నేడు ఆర్కేపీసింగరేణి వ్యాప్తంగా సూపర్ బజార్లకు స్వస్తి పలకాలని భావిస్తున్న యాజమాన్యం వీటి మూసివేతే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. శ్రీరాంపూర్ ఏరియాలో ఇప్పటికే శ్రీరాంపూర్ సూపర్ బజార్ మూసివేతకు గురికాగా కొద్ది రోజుల క్రితమే నస్పూర్ సూపర్ బజార్‌ను మూసివేశారు. ఉన్నతాధికారుల చర్యలు చూస్తుంటే సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ ఎత్తివేయడమే సంస్థ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తుందని కార్మికుల్లో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా ఆర్కేపీ సూపర్‌బజార్ మూసివేతతో ఈ ప్రాంతమే ప్రాభవం కోల్పోతుందని చెప్పాలి. ఇప్పటివరకు వీటిపైన ఆధారపడి ఉన్న సింగరేణి కార్మికులు ఇక ప్రైవేట్ దుకాణాలను ఆశ్రయించే పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. ప్రైవేటుకు ధీటుగా డీమార్ట్ స్థాయిలో చక్కటి సూపర్ మార్కెట్వలే రామకృష్ణాపూర్ సూపర్ బజార్‌ను మార్చుకునే బిల్డింగ్, స్థలం అన్నీ ఉన్నప్పటికీ గుట్టుచప్పుడు కాకుండా కాలగర్భంలో కలిపివేయడంతో కార్మికులు, స్థానికులు అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ప్రధాన కార్మిక సంఘాలు నోరు మెదపకుండా ఉండడంతో యూనియన్ నాయకత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
మందమర్రిరూరల్: కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో శనివారం జీఎం కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని జీఎం దేవేందర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ఏరియా ఉపాధ్యక్షుడు దేవి భూమ య్య, సెంట్రల్ కమిటీ సీనియర్ వైస్ ప్రెసిడెండ్ కాంపెల్లి సమ్మయ్య మాట్లాడుతూ కేకే ఓసీలో విధులు నిర్వహించే క్వార్టర్లేని కార్మికులకు 9 శాతం ఇంటి అద్దె చెల్లించాలని, మహిళా ఉద్యోగులకు ప్లేడేలు వర్తింప జేయాలని, క్యాంటీన్లలో భోజన సౌకర్యం కల్పించాలని, ఎస్అండ్పీసీ సిబ్బందికి నాణ్యమైన యూనిఫాంతో పాటు రెయిన్‌కోట్స్ ఇవ్వాలని, కేకే–6 గని, శ్రావన్‌పల్లి గనులను త్వరగా ప్రారంభించాలని డిమాండ్ చేశారు. -
ప్రకృతి సోయగం... మిట్టే జలపాతం
దట్టమైన అడవిలో ప్రకృతి సోయగాల నడుమ మిట్టే (సప్తగుండాలు) జలపాతం పర్యాటకులకు కనువిందు చేస్తోంది. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండల కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో రామ గుండం, లక్ష్మణ గుండం, సీత గుండం, భీమ గుండం, సవతిగుండం, చిరుతల గుండం, బుగ్గ గుండం ఉన్నాయి. సప్త గుండాలను కలిపి మిట్టే జలపాతంగా పిలుస్తారు. పూర్వం రాముడు, సీత, లక్ష్మణుడు వనవాసానికి వచ్చిన సమయంలో ఇక్కడ స్థిరనివాసం ఏర్పర్చుకున్నట్లు పూర్వీకులు పేర్కొంటున్నారు. జిల్లా కేంద్రానికి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు. – లింగాపూర్ -
● మహారాష్ట్ర నుంచి తరలించే యత్నం ● అంగీకరించిన తడోబా అధికారులు ● ఎన్టీసీఏ ఓకే చెబితేనే టైగర్ల రాక ● సంరక్షణ అధికారులకు సవాలే..!
మహారాష్ట్ర నుంచి వచ్చిన పులి (ఫైల్)సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: కవ్వాల్కు కొత్త పులు లు రానున్నాయి. మహారాష్ట్ర పులులను ఇక్కడికి త రలించేందుకు ప్రయత్నం జరుగుతోంది. ఉమ్మడి జిల్లాలో విస్తరించిన కవ్వాల్ కోర్ ప్రాంతంలో నేటి కీ ఒక్క పులి కూడా శాశ్వతంగా నివాసం ఏర్పరుచుకోలేదు. మరోవైపు పొరుగునే ఉన్న మహారాష్ట్రలోని తిప్పేశ్వర్, తడోబా, ఛత్తీస్‌గఢ్‌లోని ఇంద్రావతి టైగ ర్ రిజర్వ్ నుంచి పదుల సంఖ్యలో పులులు వలస వస్తూ.. పోతున్నాయి. ఇక్కడి వాతావరణం అనుకూలించినంత వరకు సంచరిస్తూ వెళ్లిపోతున్నాయి. తోడు, ఆవాసం, మానవ సంచారం కారణంగా పు లులు వచ్చి తిరిగి వెళ్లి పోతున్నాయి. ఆడ, మగ కలిపి ఐదు దాకా.. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్ డి విజన్‌లో కొన్ని పులులు శాశ్వత నివాసమేర్పుచుకో గా, ఆదిలాబాద్, ఖానాపూర్, ఇచ్చోడ, బెల్లంపల్లి, చెన్నూర్, మంచిర్యాల డివిజన్ల వరకు వాటి సంచారం ఉంది. అయితే చాలా పులులు ఇక్కడ సంచరించి కొద్ది రోజులకే తిరిగి వెళ్లిపోతున్నాయి. ఈ క్ర మంలో ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ డివిజన్లను టైగ ర్ కన్జర్వేషన్‌గా గుర్తిస్తూ అటవీశాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో అక్కడి పులుల రక్షణకు వీలు కలగనుంది. మరో అడుగు ముందుకేసి మహారాష్ట్రలోని తడోబా పులులనే ఇక్కడికి తరలించేందుకు ప్రతిపాదనలు పంపగా, అక్కడి అధికారులు అంగీకరించడంతో కవ్వాల్కు కొత్తపులులు వచ్చే అవకాశాలు న్నాయి. ఆడ, మగ కలిపి ఐదు వరకు తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ఎన్టీసీఏ (జాతీయ పులుల సంరక్షణ సంస్థ) ఈ మేరకు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయనుంది. చివరికి తరలింపునకే మొగ్గు మహారాష్ట్ర పులులు భవిష్యత్‌లో ఉమ్మడి ఆదిలాబా ద్ జిల్లాకు వస్తాయనే దూరదృష్టితో అధికారులు 13ఏళ్ల క్రితం కవ్వాల్ కేంద్రంగా 2వేల చ.కి.మీటర్లకు పైగా అటవీ భూభాగాన్ని పులుల అభయారణ్యంగా నోటిఫై చేశారు. అయితే అప్పటినుంచి ఇ ప్పటివరకు కోర్ ఏరియాలోనే పులులు నివాసమేర్పరుచుకోలేదు. ఏళ్లుగా అనేక ప్రయత్నాలు చేస్తూ అధికారులు రూ.కోట్లు ఖర్చు చేస్తున్నారు. మానవ కార్యక్రమాలను తగ్గించేందుకు కోర్ పరిధిలో ఉండి, పులుల రాకపోకల మార్గంలో ఉన్న గ్రామాలను గుర్తించి తరలించడం ప్రారంభించారు. అయినా, పలు కారణాలతో పులులు రాలేదు. చివరకు మహా రాష్ట్రలోని తడోబాలో అధికసంఖ్యలో ఉంటూ ఇరు కు ఆవాసాలు, సంరక్షణ కష్టమవుతున్న నేపథ్యంలో కవ్వాల్కు పులులను ఇక్కడికి తీసుకువచ్చేందు కు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే పులుల సంచారంతో తమకు ఇబ్బంది కలుగుతుందని స్థాని క గిరిజన రైతులు, అటవీ ప్రాంత సమీప గ్రామాల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశముంది. కవ్వాల్ అభయారణ్యం ముఖద్వారంసంరక్షణ సవాలే..!కవ్వాల్‌లో విశాల భూభాగం పులుల జీవనానికి అనుకూలంగా ఉంది. కొంతకాలంగా ఇక్కడ గడ్డి క్షేత్రాల పెంపు, శాకాహార జీవుల పెరుగుదలతో పాటు కోర్ గ్రామాలైన కడెం మండలం రాంపూర్, మైసంపేటను తరలించారు. అయితే వలస పులులు సంచరిస్తున్న సమయంలో ఇదివరకు అనేక చోట్ల వేట ముప్పు ఎదుర్కొన్నాయి. విద్యుత్ కంచెలు, వేట కారణంగా అభయారణ్యంలో మృత్యువాత పడ్డాయి. రూ.కోట్లు ఖర్చు పెట్టి సంరక్షణ చర్యలు చేపట్టినా ఇక్కడి పరిస్థితులకు సరిపోక అనేక పులులు తిరిగి వెళ్లిపోయాయి. తాజాగా అధికారులు ఇక్కడికి తరలించే పులుల సంరక్షణ స్థానిక అధికారులకు సవాల్‌గా మారనుంది. అటవీశాఖలో సిబ్బంది కొరతతో పాటు స్థానిక పరిస్థితులు, అడవిలో మానవ అలజడి కొత్త పులుల జీవనంపై ప్రభావం చూపనున్నాయి. మరోవైపు పునరావాస గ్రామాల వా సులకు పూర్తిస్థాయిలో హామీలు అమలు చేయలేదని పేర్కొంటూ పాత గ్రామాల్లోకి వెళ్లేందకు సిద్ధపడి నిరసనలు చేపట్టారు. కవ్వాల్ కోర్ ప్రాంతాల్లో ఇప్పటికే మానవ కార్యకలాపాలు, పంట చేన్లు ఉన్నాయి. ఈ క్రమంలో జాతీయ జంతువు సంరక్షణకు ఇక్కడి అటవీ అధికారులు మరింత శ్రమించాల్సి ఉంది. -
వైద్య కళాశాలలో సదుపాయాలు కల్పిస్తాం
● రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ ఆయేషా మస్రత్ఖానంమంచిర్యాలటౌన్/మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల ప్రభుత్వ వైద్య కళాశాలలో జా తీయ మెడికల్ కౌన్సిల్(ఎన్ఎంసీ) నిబంధనల మేరకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్ప నకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర వైద్య, ఆ రోగ్యశాఖ జాయింట్ సెక్రెటరీ ఆయేషా మస్రత్ ఖానం తెలిపారు. వైద్య కళాశాలల్లో సదుపాయా ల కల్పనకు ఏర్పాటైన మెడికల్ కాలేజీ మానిట రింగ్ కమిటీ (ఎంసీఎంసీ) బృందం సభ్యులు శని వారం జిల్లా కేంద్రంలో పర్యటించారు. కాలేజీ రోడ్డులో మాతాశిశు ఆరోగ్య కేంద్రంలోని వార్డులు పరిశీలించి రోగులతో మాట్లాడారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆవరణలో 450 పడకలతో నిర్మి స్తున్న ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి భవనం పనులు పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ మెడికల్ కా లేజీలో ప్రిన్సిపాల్, వైద్య బృందంతో సమీక్షించా రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాలేజీలో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీతో పాటు అవసరమైన సిబ్బందిని ఔట్సోర్సింగ్ ప ద్ధతిలో తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ రిమ్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ జైసింగ్, టీజీఎంఎస్ఐడీసీ ఈఈ ఆదిలాబాద్ ఆర్.నర్సింహారావు, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సులేమాన్, సూపరింటెండెంట్ డాక్టర్ హరీశ్చంద్రారెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ రేఖ, ఆర్ఎంవోలు డాక్టర్ భీష్మ, డాక్టర్ శ్రీధర్, డాక్టర్ శ్రీమన్నారాయణ, డెమో వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
రైతులకు ప్రభుత్వ అండ
● మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు దండేపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు పేర్కొన్నారు. మండల కేంద్రంలో శని వారం రైతు భరోసా సంబరాలు నిర్వహించా రు. ఈ సందర్భంగా నిర్వహించిన ఎడ్లబండ్ల ర్యాలీలో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి పాల్గొన్నా రు. ఎడ్లబండి నడిపి ప్రత్యేక ఆకర్షణగా నిలిచా రు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. రైతులందరి ఖాతాల్లో రైతు భరో సా డబ్బులు పడ్డాయని, ఖరీఫ్ సాగు ఖర్చులకు వినియోగించుకోవాలని సూచించారు. విద్యార్థులకు ఎలాంటి లోటు రావొద్దు ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో ఉండే విద్యార్థులకు ఎలాంటి లోటు రావద్దని ఎమ్మె ల్యే ప్రేంసాగర్‌రావు పేర్కొన్నారు. దండేపల్లి కే జీబీవీ, లింగాపూర్ మోడల్‌స్కూల్‌ను ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులు, సిబ్బందితో మా ట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. కేజీబీవీలో కోతుల బెడద ఉన్నట్లు విద్యార్థులు తెలుపగా పరిష్కరిస్తామని చెప్పారు. అనంతరం లింగా పూర్ మోడల్ స్కూల్లో చేపట్టిన పలు నిర్మాణాలను పరిశీలించారు. ఎంపీడీవో ప్రసాద్, అ ధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ప్రారంభానికి సిద్ధం చేయాలి లక్సెట్టపేట: ప్రభుత్వ ఆస్పత్రి భవనం ప్రారంభానికి సిద్ధం చేయాలని ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు సూచించారు. మండల కేంద్రంలో చేపట్టి న ఆస్పత్రి భవన నిర్మాణ పనులు పరిశీలించి మాట్లాడారు. ఆస్పత్రి భవనం ప్రారంభ తేదీని త్వరలోనే నిర్ణయిస్తామని, మిగతా పనులు పూ ర్తి చేయాలని సూచించారు. నాయకులు ఎండీ ఆరీఫ్, పింగిళి రమేశ్, అశోక్, నాగభూషణం, శ్రీనివాస్, సురేశ్, స్వామి, తహసీల్దార్ దిలీప్‌కుమార్, వైద్యులు శ్రీనివాస్, సురేశ్ పాల్గొన్నారు. -
కాసిపేటలో వందశాతం అక్షరాస్యత
కాసిపేట: మండలంలో కలెక్టర్ కుమార్ దీపక్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన ‘100 రోజుల్లో వందశాతం అక్షరాస్యత’ కార్యక్రమం విజయవంతమైంది. 3,462 మంది నిరక్షరాస్యులు అక్షరాస్యులు గా గుర్తింపు తెచ్చుకున్నారు. శనివారం జిల్లా వయోజన విద్య అధికారి పురుషోత్తంనాయక్ ఆధ్వర్యంలో ధర్మరావుపేట, ముత్యంపల్లి రైతువేదికలతో పాటు గ్రామపంచాయతీలవారీగా పరీక్షలు నిర్వహించి మూల్యాంకనం చేశారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దుర్గాప్రసాద్, తహసీల్దార్ భోజన్న, ఆత్మ చై ర్మన్ రౌతు సత్తయ్య, లీడ్ బ్యాంక్ మేనేజర్ తిరుప తి, విద్యాశాఖ క్వాలిటీ కోఆర్డినేటర్ సత్యనారాయణమూర్తి, ఏవో ప్రభాకర్, ఎంపీవో షేక్ సబ్ధర్ అలీ, డీఆర్పీలు శాంకరి, జనార్దన్, అశోక్‌రావు, వెంకటేశ్వర్లు, సీనియర్ అసిస్టెంట్ లక్ష్మీనారాయణ, నాయకులు రమేశ్, స్వామి, శ్రీనివాస్, నారాయణ, కార్యదర్శులు, అధికారులు, వలంటీర్లు పాల్గొన్నారు. -
విధులు నిర్లక్ష్యం చేస్తే చర్యలు
● సీపీ అంబర్ కిషోర్ ఝా ● కమిషనరేట్‌లో నేర సమీక్షమంచిర్యాలక్రైం: పోలీస్ అధికారులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని రామగుండం పోలీస్ కమిషనర్ అంబ ర్ కిషోర్ ఝా హెచ్చరించారు. పోలీస్ కమిషనరే ట్ ఆవరణలో శనివారం మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల పోలీస్ అధికారులతో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. పోలీస్స్టేషన్ల వారీగా నేరా లను సమీక్షించారు. పెండింగ్ కేసుల వివరాలు తెలుసుకుని సూచనలు, సలహాలు ఇచ్చారు. అ నంతరం ఆయన మాట్లాడుతూ.. కేసు పరిశోధనలో పారదర్శకంగా వ్యవహరించాలని సూచించా రు. కేసులు నమోదైన వారం రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయాలని, స్టేషన్ ఎస్‌హెచ్‌వోలు ప్రతీరో జు ఒక గంట పెండింగ్ కేసులపై సిబ్బందితో స మీక్షించాలని ఆదేశించారు. బాలికల మిస్సింగ్ కే సుల్లో రికార్డుల దర్యాప్తు వేగవంతం చేయాలని తెలిపారు. రౌడీ షీటర్లపై కఠినంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. వారి కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని సూచించారు. ఇటీవల బెల్లంపల్లిలో ఏటీఎం చోరీకి యత్నించిన వారిని పట్టుకున్న నెన్నెల ఎస్సై ప్రసాద్, బ్లూకోల్ట్స్ సిబ్బందిని అభినందిస్తూ క్యాష్ రివార్డు అందజేశారు. సమావేశంలో డీసీపీలు ఎగ్గడి భాస్కర్, కరుణాకర్, అడిషనల్ డీసీపీ రాజు, ఎస్బీ ఏసీపీ మల్లారెడ్డి, ఏసీపీలు ఆర్ ప్రకాశ్, వెంకటేశ్వర్లు, రవికుమార్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. -
అటవీభూములు ఆక్రమిస్తే చర్యలు
దండేపల్లి: అటవీ భూములను ఆక్రమిస్తే చర్యలు తప్పవని జన్నారం ఎఫ్‌డీవో రామ్మోహన్ హెచ్చరించారు. మండలంలోని లింగాపూర్ అ టవీ బీట్‌లోని 380 కంపార్ట్మెంట్లో ఐదారు రోజులుగా సమీప గ్రామాల గిరిజనులు, నిరుపేదలు అటవీ భూముల ఆక్రమణకు ప్రయత్నిస్తూ చెట్ల పొదలు తొలగిస్తున్నారు. ఫారెస్ట్, పోలీస్ అధికారులు ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు. శనివారం అదే ప్రాంతంలో గిరి జనులు, పేదలు, చెట్ల పొదలు తొలగించారు. విషయం తెలుసుకున్న ఎఫ్‌డీవో, లక్సెట్టిపేట సీఐ రమణమూర్తి, దండేపల్లి తహసీల్దార్ రో హిత్ దేశ్‌పాండే, ఎస్సై తహసినొద్దీన్తో కలిసి అక్కడికి చేరుకున్నారు. గిరిజనులు, పేదలతో మాట్లాడారు. అటవీ భూములను ఆక్రమించుకోవడం, వాటికి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేయడం సరికాదని తెలిపారు. అటవీ భూముల్లో చెట్లు, పొదలు తొలగిస్తే అటవీ హక్కుల చ ట్టంతో పాటు వన్యప్రాణుల చట్టాలను ఉపయోగించి చట్టపరమైన చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు. ఈక్రమంలో కొందరు గి రిజన మహిళలు ఎఫ్‌డీవో, తహసీల్దార్ కాళ్లపై పడి తమకు భూములు కేటాయించి పట్టాలివ్వాలని వేడుకున్నారు. ఆయన వెంట తాళ్లపేట అటవీ రేంజ్ సిబ్బంది ఉన్నారు. -
అతివలకు అండగా ‘సీ్త్రనిధి’
పాతమంచిర్యాల: మహిళా సంఘాల ఆర్థిక స్వావలంబనకు గ్రామీణాభివృద్ధి శాఖ సీ్త్రనిధి ద్వారా రు ణాలు మంజూరు చేస్తోంది. 11శాతం వడ్డీకే రుణా లు మంజూరు చేసి పొదుపును ప్రోత్సహిస్తోంది. 2025–26ఆర్థిక సంవత్సరానికి గాను మహిళా సంఘాలు స్వయం ఉపాధి యూనిట్లు నెలకొల్పడానికి రూ.55కోట్లు రుణాలు అందించాలని లక్ష్యంగా నిర్ణయించింది. గత సంవత్సరం రూ.47కోట్లు రుణా లు అందించాల్సి ఉండగా.. రూ.50కోట్లు అందజేసి 106శాతం లక్ష్యాన్ని సాధించడంతో జిల్లా రాష్ట్ర స్థా యిలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. అదే స్ఫూర్తి తో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కూడా లక్ష్యాన్ని చేరుకునేలా అధికారులు వార్షిక రుణ ప్రణాళిక ఖరారు చేశారు. మెప్మా పరిధిలోని బెల్లంపల్లి, చెన్నూర్, క్యాతనపల్లి, లక్సెట్టిపేట, మంచిర్యాల, మందమర్రి, నస్పూర్ మున్సిపాల్టీల్లో టీఎల్‌ఎఫ్‌లకు రూ.12,09,99,900 రుణాలు ఇవ్వడానికి ప్రణాళిక రూపొందించారు. సెర్ప్ పరిధిలోని గ్రామైక్య మహిళా సంఘాలకు రూ.42కోట్లు కేటాయిస్తున్నట్లు రుణ ప్రణాళికలో అధికారులు పేర్కొన్నారు. జిల్లాకు మంజూరైన యూనిట్లు జిల్లాలో 705వీవోలు, 16,883 గ్రామైక్య సంఘాల్లో 1,80,369మంది సభ్యులున్నారు. జిల్లాకు వివిధ విభాగాల్లో యూనిట్లు మంజూరయ్యాయి. పాడిపరిశ్రమ (డెయిరీ ఫాంలు) 70, గొర్రెల పెంపకం 70, పౌల్ట్రీఫాంలు 2, పెరటి కోళ్ల పెంపకం 120, క్యాంటీన్ 1, హౌసింగ్లోన్లు (ఇళ్ల మరమ్మతు) 120, పీ ఎంఎఫ్ఎంఈ (ఫుడ్ ప్రాసెసింగ్) 50, వీధి వ్యాపారులు 70, లోకల్ కేబుల్ ఆపరేటర్లు 70, రాజీవ్ యువ వికాసం 240, వ్యవసాయేతర యూనిట్లు 1,400, వీవో స్థాయి సోలార్ ప్రాజెక్టు 1, రూఫ్‌టాప్ సోలార్ యూనిట్లు 120, ఈ ఆటో 20, ఈబైక్‌లు 20 యూనిట్లు మంజూరు చేయనున్నారు. రుణాల పంపిణీ, చెల్లింపులపై మహిళా సంఘాలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అధికా రులు తెలిపారు. సీ్త్రనిధి రుణాలు ఫోన్‌పే, పోస్టాఫీస్, బ్యాంక్ మిత్ర, పాయింట్ ఆఫ్ సేల్ మిషన్ల ద్వారా చెల్లించేలా వివరిస్తున్నారు. రుణాలు తీసుకున్న సభ్యులకు యూనిట్ల ఆధారంగా బీమా చేయిస్తున్నామని, రుణాలు తీసుకున్న సభ్యులు మరణించిన పక్షంలో రుణం చెల్లించాల్సిన అవసరం ఉండదని అధికారులు తెలిపారు. ఈ రుణాల్లో సువిధ పథకం ద్వారా రూ.5వేల నుంచి రూ.50వేలు, ప్రగతిపథకం ద్వారారూ.50వేల నుంచి రూ.లక్ష వరకు, అక్షయ పథకంలో రూ.లక్ష నుంచి రూ.2లక్షల వర కు, సౌభాగ్యలో రూ.2లక్షల నుంచి రూ.3లక్షల వర కు, ఐశ్వర్య పథకంలో రూ.3లక్షల నుంచి రూ.5లక్షల వరకు రుణ సదుపాయం కల్పిస్తారు. 2025–26 రుణ ప్రణాళిక ఖరారు రుణ లక్ష్యం రూ.55 కోట్లు స్వయం ఉపాధి యూనిట్లకు ప్రాధాన్యంరుణాలు సద్వినియోగం చేసుకోవాలిమహిళా సంఘాల స భ్యులు సీ్త్రనిధి ద్వారా అందించే రుణాలు సద్వినియోగం చేసుకోవాలి. రుణాలు తీ సుకున్న సభ్యులు క్ర మం తప్పకుండా వాయిదాలు చెల్లిస్తే తిరిగి మళ్లీ రుణం పొందే అవకాశం ఉంది. ఎక్కువ వడ్డీలకు మైక్రోఫైనాన్స్‌ల ద్వారా తీసుకుని ఆర్థికంగా నష్టపోవద్దు. ప్రభుత్వం మహిళా సంఘాల బలోపేతానికి తక్కువ వడ్డీకే రుణా లు అందిస్తోంది. అర్హులంతా సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలి. – వెంకటరమణ, సీ్త్రనిధి ప్రాంతీయ మేనేజర్ -
అంతరించిపోతున్నఅరుదైన జంతువు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అరుదైన జంతువు అలుగు (పంగోలిన్) ప్రమాదంలో పడింది. సంప్రదాయ వైద్యం, పలు ఉత్పత్తుల్లో వాడకం పేరుతో ఈ వన్యప్రాణిని వేటగాళ్లు హత మార్చుతుండడంతో అంతరించపోతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ములుగు, ఏటూరు నాగారం, అమ్రాబాద్ టైగర్ రిజర్వుతో సహా పలు అటవీ ప్రాంతాల్లో గుట్టుగా వేటాడుతూ.. డిమాండ్ ఉన్న ప్రాంతాలకు అక్రమంగా రవాణా చేస్తున్నారు. వైల్డ్ లైఫ్ ట్రస్టు ఆఫ్ ఇండియా (డబ్ల్యూటీఐ) సంస్థ, అటవీ అధికారులు తెలంగాణలో పలుచోట్ల రహస్యంగా మాటు వేసి నిందితులను పట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా అలుగులనే అత్యధికంగా వేటాడి అక్రమరవాణా చేస్తుండగా.. వీటి సంఖ్య క్రమంగా క్షీణిస్తోందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రక్షణ చర్యల్లో భాగంగా ఐయూసీఎన్ (ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్) ఈ వన్యప్రాణిని అంతరించిపోతున్న జాతుల్లో చేర్చింది.వైవిధ్యం గల జీవిశరీరంపై గట్టి పొలుసులు ఉండే అలుగు.. క్షీరదాల్లో ఎంతో ప్రత్యేకతను కలిగి ఉంది. ఆకారంలో ముంగిస తరహాలో ఉంటుంది. ఎదురుగా ఏదైనా కనిపిస్తే వెంటనే బంతి ఆకారంలో ముడుచుకు పోతుంది. సిగ్గరిగా, మనుషులకు దూరంగా ఉంటుంది. ఎవరిపైనా ఎటువంటి దాడి చేయదు. కేవలం రాత్రి వేళ సంచరిస్తూ చెదలు, చీమలు, పురుగులను ఆహారంగా తీసుకుంటుంది. వాసన, వినికిడి శక్తి అధికంగా ఉంటుంది.శాస్త్రీయంగా నిరూపణ లేకున్నాచైనాతో సహా పలు దేశాల్లో ఈ జీవి శరీర భాగాలను సంప్రదాయ వైద్యంలో అనేక చికిత్సలకు వాడుతున్నారు. దీంతో అక్రమంగా అడవుల నుంచి రవాణా చేస్తూ పొలుసులు, మాంసాన్ని తరలిస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా చాలామంది నాటు వైద్యులు.. ఈ జీవి శరీర భాగాలను మందులు, చికిత్సలో ఉపయోగిస్తున్నారు. ఇందుకోసం అటవీ సమీప ప్రాంతాల వారికి డబ్బు ఆశ చూపిస్తూ.. అలుగును అక్రమ రవాణా చేస్తున్నారు. కొన్నిసార్లు మధ్యవర్తులతో ఇతర దేశాలకు రవాణా జరుగుతోంది. పలు చికిత్సల్లో వాడుతున్నప్పటికీ రోగ నివారణపై శాస్త్రీయంగా ఎటువంటి ఆధారాల్లేవని అటవీ, వైద్యరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మానవ స్వార్థం కోసం అరుదైన అడవి జంతువులను వేటాడొద్దని వన్యప్రాణి ప్రేమికులు కోరుతున్నారు. ఇప్పటికే ఈ వన్యప్రాణుల సంఖ్య తగ్గి పోయిందని.. భవిష్యత్‌లో మరింత ముప్పును ఎదుర్కోబోతున్నాయని హెచ్చరిస్తున్నారు.ఆగని అక్రమ రవాణాగత మార్చిలో అలుగును వేటాడుతూ మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట రేంజీలో ముగ్గురు పట్టుబడ్డారు. అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వు పరిధిలో పలు చోట్ల అలుగు అక్రమ రవాణా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. గతంలో ఏటూరునాగారం, మంచిర్యాల, కాగజ్‌నగర్ ప్రాంతాల్లో అలుగును అక్రమంగా తరలిస్తున్న ముఠాలు అటవీ అధికారులకు చిక్కాయి. -
గిరిజనుల పోడు పోరు
● అడవిలో చెట్ల పొదల తొలగింపు ● అడ్డుకున్న అటవీ, పోలీస్ అధికారులు దండేపల్లి: మండలంలో కొద్ది రోజులుగా చల్లబడ్డ పోడు పోరు మళ్లీ మొదలైంది. అటవీ భూముల ఆక్రమణకు గిరిజనులు ప్రయత్నిస్తున్నారు. నాలుగైదు రోజులుగా మండలంలోని లింగాపూర్ అటవీ బీట్ 380 కంపార్ట్మెంట్లో దమ్మన్నపేట, మామిడిగూడ, గిరిజనులతోపాటు లింగాపూర్ గ్రామానికి చెందిన కొందరు నిరుపేదలు చెట్ల పొదలు తొలగిస్తున్నారు. అటవీ శాఖ అధికారులు నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నా వినిపించుకోవడం లేదు. దీంతో నాలుగు రోజులుగా పోరు సాగుతోంది. శుక్రవారం లక్సెట్టిపేట సీఐ రమణమూర్తి, దండేపల్లి ఎస్సై తహాసీనొద్దీన్ అటవీ ప్రదేశానికి వెళ్లి చెట్లపొదలు తొలగిస్తున్న వారితో మాట్లాడారు. వారికి కౌన్సెలింగ్ ఇచ్చివెళ్లారు. పోలీసులు, అటవీ అధికారులు వెళ్లిన వెంటనే గిరిజనులు మళ్లీ పొదలు తొలగిస్తూ విత్తనాలు విత్తారు. -
చదువుతో జ్ఞానం, ధైర్యం
వేమనపల్లి: చదువు మనిషికి జ్ఞానం, ధైర్యాన్ని అందిస్తుందని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. శుక్రవారం ఆయన కలెక్టర్ కుమార్ దీపక్, మాజీ జెడ్పీటీసీ ఆర్.సంతోష్‌కుమార్‌తో కలిసి నీల్వాయి జూనియర్ కాలేజీలో రూ.66 లక్షలతో అదనపు గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వేమనపల్లిలో 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పాఠశాలల్లో ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎమ్మెల్యేకు పలు గ్రామాల రైతులు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సాబీర్ఆలీ, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు సమ్మయ్యమాదిగ, ట్రాన్స్‌కో ఎస్ఈ గంగారాం, ఎంపీడీఓ కుమారస్వామి, తహసీల్దార్ సంధ్యారాణి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సత్యనారాయణ, మాజీ సర్పంచ్‌లు గాలి మధు, తోకల రాంచందర్, మాజీ ఎంపీపీలు వెంకటేషం, లింగాగౌడ్ పాల్గొన్నారు. -
దేశీదారు పట్టివేత
వాంకిడి: మహారాష్ట్ర నుంచి ఆర్టీసీ బస్సులో అక్రమంగా తరలిస్తున్న దేశీదారును శుక్రవారం పట్టుకున్నట్లు ఎస్సై ప్రశాంత్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. విశ్వసనీయ సమాచారం మేరకు వాంకిడి బస్టాండ్‌లో ఏఎస్సై పోశెట్టి ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేపట్టారు. గడ్చిరోలి జిల్లా సిరోంచకు చెందిన మారగోని కృష్టమూర్తిగౌడ్ బస్సులో దేశీదారు తరలిస్తూ పట్టుబడ్డాడు. అతడి నుంచి 250 (90ఎంఎల్) దేశీదారు మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. పట్టుబడిన మద్యం విలువ సుమారు రూ.12,500 ఉంటుందని పేర్కొన్నారు. -
వాతావరణం
ఆకాశం మేఘావృతమై ఉంటుంది. పగటి ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయి. పడమర దిశగా ఈదురుగాలులు వీస్తాయి. పూడిక నిండి.. పిచ్చిమొక్కలు పెరిగి.. బెల్లంపల్లి: బెల్లంపల్లి ద్వితీయ శ్రేణి మున్సిపాల్టీలో మౌలిక సదుపాయాలు సరిగా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 34 వార్డుల్లోనూ సమస్యలు ఎదుర్కొంటున్నారు. శివారు వార్డులు తీవ్ర నిరాదరణకు గురవుతుండగా.. అన్ని వార్డుల్లో సమస్యలు తిష్ట వేసి అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి. వర్షాకాలంలో మరిన్ని ఇక్కట్లు ఎదురవుతున్నాయి. గంగారాంనగర్, కాల్టెక్స్ ఏరియా, షంషీర్‌నగర్, అంబేడ్కర్ నగర్, హన్మాన్బస్తీ, కన్నాల బస్తీ, మధునన్ననగర్, అశోక్‌నగర్, రైల్వేరడగంబాల బస్తీ, సుభాష్‌నగర్, గోల్‌బంగ్లాబస్తీ, శాంతిఖని, బెల్లంపల్లి బస్తీ తదితర ప్రాంతాల్లో మురికి నీటి కాలువలు అధ్వానంగా ఉన్నాయి. కొన్ని వీధుల్లో మురికి కాలువల్లో పూడిక నిండి, పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగాయి. మరికొన్ని చోట్ల నేటికీ మురికి కాలువల నిర్మాణం చేపట్టలేదు. సగానికిపైగా జనావాసాలను ఆనుకుని మురికి నీరు గుంతల్లో స్థిరంగా నిలిచి ఉండడంతో దోమలు వృద్ధి చెందాయి. బూడిదగడ్డ బస్తీ నుంచి అశోక్‌నగర్ మీదుగా ప్రవహించే వాగు నుంచి వచ్చే వరద నీరు వెళ్లిపోవడానికి డ్రెయినేజీలు నిర్మించకపోవడంతో చెట్లు, పిచ్చిమొక్కలు పెరిగి అటవీ ప్రాంతాన్ని తలపిస్తున్నాయి. చెదిరిన, గుంతలు పడిన రోడ్లపై రాకపోకలు సాగించడానికి వీల్లేకుండా తయారయ్యాయి. హన్మాన్బస్తీ–రాంనగర్ బస్తీ మధ్య వాగుపై లోలెవల్ వంతెన ఏటా వర్షాకాలంలో వరద నీటిలో మునిగి రాకపోకలకు అవస్థలు పడుతున్నారు. ఇళ్లలోకి వరద నీళ్లు మురికి కాలువ కట్టాలని ఎన్నో ఏళ్ల సంది వేడుకుంటున్నం. గెల్సినోళ్లు, అధికారులు మాటిచ్చి పట్టించుకుంట లేరు. గట్ల జేయబట్టి వరద నీరంతా కాలువ నిండా ప్రవహించి ఇండ్లల్లకత్తన్నయ్. నీళ్లు రాబట్టి పొయినేడు మా ఇంటి గోడ కూలిపోయింది. మళ్లా కట్టిచ్చినం. ఎవలకు ఎన్నిసార్లు జెప్పినా సరే అని అంటండ్లు కానీ చెవిన పెడ్తలేరు. ఈసారైనా మురికి కాలువ కట్టిచ్చి నీళ్లు ఇండ్లల్లకు రాకుండా చర్యలు తీసుకోవాలే. – లింగాల రాములు, అశోక్‌నగర్ -
భూగర్భ జలాల పనుల పరిశీలన
చెన్నూర్‌రూరల్: మండలంలోని 30 గ్రామ పంచాయతీల్లో జలశక్తి అభియాన్ కింద చేపట్టిన 46 వివిధ రకాల అభివృద్ధి పనులను శుక్రవారం కేంద్ర భూగర్భ నీటి బోర్డు శాస్త్రవేత్త రాంబాబు పరిశీలించారు. నీటికుంటల ప్రగతిని క్షేత్ర స్థాయిలో సమీక్షించి వివరాలు నమోదు చేసుకున్నారు. ఫారెస్టు ట్రెంచ్, చిన్న నీటికుంటలు, ఇంకుడు గుంతల నిర్మాణం, భూగర్భ రీచార్జ్ స్ట్రక్చర్‌ను పరిశీలించారు. ఎంపీడీవో మోహన్, నోడల్ అధికారి సదానందం, ఇంజినీరింగ్ కన్సల్టెంట్ సత్యనారాయణ, చంద్రశేఖర్, డీఆర్పీ రాజ్‌కుమార్, ప్లాంటేషన్ అధికారి శ్రీని వాస్, కుమారస్వామి, మధు, టీఏలు మహేశ్వర్‌రెడ్డి, రవీందర్, రవి, వెంకటస్వామి పాల్గొన్నారు. -
లక్ష్యాల సాధనకు ప్రణాళికలు సిద్ధం చేయాలి
శ్రీరాంపూర్/జైపూర్: నిర్ధేశిత ఉత్పత్తి లక్ష్యాల సాధనకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సింగరేణి డైరెక్టర్(ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్) కే.వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం ఆయన శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గనిని సందర్శించారు. క్వారీలోకి వెళ్లి కోల్ బెంచీలు, ఆఫ్‌లోడింగ్ ప్రదేశాలు పరిశీలించారు. జైపూర్ మండలం ఇందారం ఐకే–ఓసీపీ ఆవరణలో వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2025–26 ఆర్థిక సంవత్సరంలో నిర్ధేశించిన ఉత్పత్తి లక్ష్యాన్ని నూరు శాతం సాధించాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ బాధ్యతతో పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ ఏరియా జీఎం ఎం.శ్రీనివాస్, ఏరియా ఎస్ఓటు జీఎం యన్.సత్యనారాయణ, శ్రీరాంపూర్ ఓసీపీ పీఓ చిప్ప వెంకటేశ్వర్లు, ఇందారం ఓసీపీ పీఓ ఏవీ రెడ్డి, మేనేజర్లు నాగన్న, శంకర్, ఇంజనీర్ రామకృష్ణరావు, రక్షణాధికారి మహేశ్, ఫారెస్ట్ అధికారి మేఘన, సెక్యూరిటీ అధికారి జక్కారెడ్డి, ఫిట్ ఇంజనీర్ భీమన్న తదితరులు పాల్గొన్నారు. -
పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి
లక్సెట్టిపేట/మంచిర్యాలరూరల్(హాజీపూర్): వర్షాకాలం దృష్ట్యా ప్రజలు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా వైద్యాధికారి హరీష్‌రాజ్ అన్నారు. శుక్రవారం లక్సెట్టిపేట మున్సిపాల్టీ పరిధిలోని ఇటిక్యాలలో వార్డులను పరిశీలించారు. హాజీపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రి పరిసరాలు, వార్డులు, ల్యాబ్, ఫార్మసీ రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది ఇటిక్యాలలో చాలామంది డెంగీ బారినపడ్డారని, డెంగీ రహితంగా ప్రకటించేలా కార్యాచరణ చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ప్రో గ్రాం అధికారి ప్రసాద్, వైద్యులు సతీష్‌కుమార్, లింగారెడ్డి, పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ లహరి, ప్రోగ్రాం అధికారి డాక్టర్ ప్రసాద్, ఎన్సీడీ అధికారి డాక్టర్ శివప్రతాప్, డీఈఎంఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
కాళ్లు కడిగి వీడ్కోలు పలికారు
భైంసాటౌన్: పట్టణంలోని ఏరియాస్పత్రిలో పారిశు ధ్య విభాగంలో పనిచేసిన కార్మికురాలు చంద్రబా యికి ఆస్పత్రి సిబ్బంది అరుదైన వీడ్కోలు పలికా రు. పట్టణానికి చెందిన చంద్రబాయి 15 ఏళ్లుగా ఆ స్పత్రిలో సేవలందిస్తోంది. 60 ఏళ్లు పూర్తి కావడం, అనారోగ్య కారణాలతో ఉద్యోగ విరమణ పొందింది. దీంతో శుక్రవారం ఆస్పత్రి సూపరింటెండెంట్ కాశీనాథ్ ఆధ్వర్యంలో ఆమెకు వీడ్కోలు కార్యక్ర మం నిర్వహించారు. శాలువా, పూలమాలతో సత్కరించారు. సిబ్బంది ఆమె కాళ్లు కడిగి ఆత్మీయంగా వీడ్కోలు పలికారు. దీంతో వైద్యులు అనిల్, నర్సులు, తోటి సిబ్బంది వారిని అభినందించారు. -
ఇంటి కోసం మహిళ ఆత్మహత్యాయత్నం
మందమర్రిరూరల్: మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం ఓ మహిళ తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాప్రయత్నం చేయడం చర్చనీయాంశమైంది. మండలంలోని క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని కనుకదుర్గ కాలనీకి చెందిన పూరెల్లి లక్ష్మి తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని తహసీల్దార్‌కు వినతిపత్రం అందించింది. తనకు ఫస్ట్ లిస్ట్‌లో పేరు వచ్చిందని ఫైనల్ లిస్ట్‌లో తొలగించారని ఆరోపించింది. 30 ఏళ్లుగా అద్దె ఇంట్లో ఉంటూ ఇండ్లల్లో గిన్నెలు కడుక్కుని జీవనం సాగిస్తున్నానని తెలిపింది. అద్దె చెల్లించలేక ఇబ్బంది పడుతున్నానని వివరించింది. ఇల్లు కేటాయించాలని కోరింది. దరఖాస్తు పరిశీలించిన అనంతరం అర్హత ఉంటే తప్పకుండా ఇల్లు మంజూరవుతుందని తహసీల్దార్ సమాధానం ఇచ్చారు. వెంటనే మహిళ తహసీల్దార్ కార్యాలయం నుంచి బయటకు వచ్చి ముందుగానే వెంట తెచ్చుకున్న పెట్రోల్ మీద పోసుకుంది. ఇల్లు కేటాయించకుంటే ఆత్మహత్య చేసుకుంటానని తెలిపింది. అక్కడున్న కార్యాలయ సిబ్బంది అప్రమత్తమై ఆ మహిళ ప్రయత్నాన్ని నిలువరించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళను అదుపులోకి తీసుకున్నారు. సముదాయించి ఆమె ఇంటికి పంపారు. -
ఆక్రమణలు.. అపరిశుభ్రత
● వర్షాలు పడితే వరద నీరు పారడం కష్టమే ● డ్రెయినేజీల్లోనూ నిండిన పూడిక ● రోడ్లపై పారుతున్న మురుగునీరుమంచిర్యాలటౌన్: పేరుకే జిల్లా కేంద్రం.. ప్రతియేటా వర్షాకాలంలో నగరంలోని కొన్ని కాలనీలకు వరద ముప్పు పొంచి ఉంటోంది. నగరాన్ని ఆనుకుని రాళ్లవాగు, తోళ్లవాగులు ప్రవహిస్తుండగా.. ఈ నీరు నేరుగా వెళ్లి గోదావరినదిలో కలుస్తుంది. డ్రెయినేజీల ద్వారా వెళ్లే నీరు వాగుల్లోకి చేరి అక్కడి నుంచి గోదావరిలో కలుస్తుండడం, ప్రతియేటా వర్షాకాలంలో వరద నీరు వాగుల ద్వారా వెనక్కి వచ్చి పలు కాలనీలు నీటమునగడం జరుగుతోంది. సాధారణ వర్షాలకే వరద నీరు నిండి డ్రెయినేజీల నుంచి బయట రోడ్లపై చేరుతోంది. హైటెక్‌సిటీ కాలనీలోని డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో కాలంతో సంబంధం లేకుండా మురుగునీరు రోడ్లపై పారుతోంది. వర్షాకాలంలో వరద నీరు తోడై నడవలేని పరిస్థితి ఎదురవుతోంది. రామునిచెరువు మత్తడి కాలువ ద్వారా చెరువునీటితోపాటు స్థానికంగా డ్రెయినేజీ నీరు ఈ కాలువ ద్వారానే వెళ్లి రాళ్లవాగులో కలుస్తుంది. మత్తడి కాలువలో పిల్లర్లు వేసి స్లాబ్ వేయడం వల్ల మురుగు నీరు పారేందుకు అడ్డుగా మారుతోంది. గతంలో స్లాబ్‌లను కార్పొరేషన్ అధికారులు తొలగించగా మళ్లీ వేస్తుండడంతో వరద నీరు పారడం కష్టమే. కాలువ ఉప్పొంగి పక్కనే ఉన్న ఇస్లాంపుర కాలనీకి వరద ముప్పు ఏటా పొంచి ఉంటుంది. పట్టణంలోని రాంనగర్, రెడ్డికాలనీ, ఎన్టీఆర్నగర్, పద్మశాలికాలనీ, ఆదిత్య ఎంక్లేవ్, బృందావనం కాలనీ, సూర్యనగర్ కాలనీలు చిన్నపాటి వర్షానికే వరద నీరు చేరి ముంపుగా మారుతున్నాయి. వర్షాకాలానికి ముందే డ్రెయినేజీల్లోని చెత్తాచెదారం, పిచ్చి మొక్కలు తొలగించాల్సి ఉండగా ఇప్పటికీ చేపట్టలేదు. ఈ కారణంగా కూడా డ్రెయినేజీల్లోని మురుగునీరు రోడ్లపైకి పారుతోంది. -
విపరీతంగా ఈగలు, దోమలు
చెన్నూర్: మున్సిపాల్టీ పరిధిలో మురికి కాలువలు అస్తవ్యస్తంగా మారాయి. దీంతో వర్షాకాలం సీజనల్ వ్యాధులు పొంచి ఉన్నాయి. ప్రధాన రోడ్లలో వ్యాపార సముదాయాలు, డ్రెయినేజీలపై స్లాబ్‌లు వేయడంతో మురికి కాలువలు శుభ్రం చేయడం కష్టమవుతోంది. ఆయా ప్రాంతాల్లో చెత్తాచెదారం పేరుకుపోవడంతో భారీ వర్షాలు కురిసిన సమయంలో డ్రెయినేజీల నీరు రోడ్లపై పారుతోంది. పాతబస్టాండ్ నుంచి మార్కెట్‌కు వెళ్లే దారిలో డ్రెయినేజీల్లోని నీరు వర్షాకాలంలో మేరవాడలోని ఇళ్లలోకి చేరుతోంది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పాతబస్టాండ్ నుంచి ఖబ్రస్తాన్ పక్కన ఉన్న డ్రెయినేజీలు శుభ్రం చేయించాల్సిన అవసరం ఉంది. పట్టణంలోని బలిజవాడ, జెండవాడ, ఇందిరానగర్, బేతాళవాడ, ఆదర్శనగర్, లైన్‌గడ్డ ప్రాంతాల్లో మురికికాలువలు శుభ్రం చేయకపోవడంతో చెత్తతో నిండి దుర్వాసన వెదజల్లుతున్నాయి. పలు కాలనీల్లో రోడ్లపై వేసిన చెత్త తొలగించకపోవడంతో కుళ్లిపోతోంది. చెత్తకుప్పలు, మురికికాలువలతో ఈగలు, దోమలు వృద్ధి చెందాయి. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. దోమలు, ఈగల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కాలనీల ప్రజలు ఆరోపిస్తున్నారు. జిల్లా అధికారులు స్పందించి పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కాలువల్లో గడ్డి డ్రెయినేజీలు చెత్తాచెదారంతో నిండిపోయాయి. కాలువలు శుభ్రం చేయకపోవడంతో గడ్డి మొలుస్తుంది. దోమలు, ఈగలు విపరీతంగా పెరిగాయి. కొన్ని డ్రెయినేజీలు సక్రమంగా లేక వర్షపు నీరు రోడ్లపై పారుతోంది. జ్వరాలు సోకక ముందే అధికారులు మురికి కాలువలు శుభ్రం చేయించాలి. –మానికరౌతు తిరుపతమ్మ, బలిజవాడకాలనీ కంపు కొడుతోంది.. ఇందిరానగర్ కాలనీలో డ్రెయినేజీలు లేక మురుగునీరు ఖాళీ స్థలాల్లో చేరి కంపు కొడుతోంది. డ్రెయినేజీలు నిర్మించి మురుగు నీరు నిలువకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. ఇప్పుడే నీరు నిలిచి దుర్వాసన వస్తుంది. వర్షాకాలంలో మురికినీరుతోపాటు వర్షపు నీరు నిలిస్తే భరించలేకుండా ఉంటుంది. అధికారులు స్పందించి ఖాళీ స్థలంలో నిలిచిన నీరును డ్రెయినేజీలకు మళ్లించే ఏర్పాటు చేయాలి. –సీహెచ్.నవీన్, ఇందిరానగర్ కాలనీ -
రుణ లక్ష్యాల సాధనకు కృషి చేయాలి
● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లా వార్షిక రుణ లక్ష్యాల సాధనకు బ్యాంకర్లు కృషి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ తిరుపతి, ఆర్బీఐ ఏజీఎం యశ్వంత్‌సాయి, నాబార్డ్ డీడీఎం వీరభద్రులు, తెలంగాణ గ్రామీణ బ్యాంకు రీజినల్ మేనేజర్ ప్రభుదాస్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజినల్ మేనేజర్ రాధాకృష్ణన్‌తో కలిసి వివిధ బ్యాంకుల అధికారులతో రుణ లక్ష్యసాధనపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ 2025–26 ఆర్థిక సంవత్సరానికి పంట రుణాలకు రూ.2,422 కోట్లు, దీర్ఘకాలిక రుణాలకు రూ.765 కోట్లు, వ్యవసాయ అనుబంధ రుణాలు రూ.157 కోట్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం రూ.249 కోట్లు, మొత్తం వ్యవసాయ రంగానికి రూ.4,203 కోట్లు లక్ష్యంగా నిర్ధేశించినట్లు తెలిపారు. ప్రాధాన్యత రంగాలకు రూ.5,817 కోట్లు, ప్రాధాన్యేతర రంగాలకు రూ.1,940 కోట్లు నిర్ధేశించినట్లు తెలిపారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. రైతులు రుణాలు సకాలంలో చెల్లించి తిరిగి పొందేలా అవగాహన కల్పించాలని తెలిపారు. -
ఎట్టకేలకు వేతనాలు
● డీఎస్సీ–2008 ఎస్జీటీల సాలరీ నిధుల విడుదల ● గత ఫిబ్రవరిలో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా చేరిక ● 61మంది ఉపాధ్యాయులకు లబ్ధి ● ఉమ్మడి జిల్లాకు రూ.2.5 కోట్లు విడుదలనిర్మల్ఖిల్లా: ఉద్యోగ నియామకం కోసం పరీక్ష రాసి ఎంపికై న తర్వాత 15 ఏళ్లుగా వేచి చూసిన వా రికి గత ఫిబ్రవరిలో నియామక ఉత్తర్వులు చేతికందాయి. ఫిబ్రవరి 16వ తేదీన కాంట్రాక్ట్ ఎస్జీటీలుగా కొలువులో చేరిన వీరికి ఇప్పటివరకు వేతనాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎట్టకేలకు ఉమ్మ డి జిల్లాలోని ఎస్జీటీలకు రూ.2.5 కోట్ల నిధులు వి డుదల చేస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో విధుల్లో చేరిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని 61 మంది కాంట్రాక్ట్ ఎస్జీటీలు హర్ష వ్యక్తం చేస్తున్నారు. డీఎస్సీ 2008 బాధితులు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నోటిఫికేషన్ వెలువడిన అనంతరం తీసుకున్న నిర్ణయం మేరకు 30 శాతం పోస్టులు ప్రత్యేకంగా డీఈడీ అభ్యర్థులకు కేటాయించడంతో అప్పడు బీఈడీ పూర్తి చేసుకుని ఎస్జీటీలు గా ఎంపికై న ఉమ్మడి జిల్లాలోని 100 మందికి పైగా అభ్యర్థులు ఉద్యోగాలు కోల్పోయారు. అప్పటినుంచి దశాబ్దకాలానికి పైగా కోర్టుల్లో న్యాయపోరాటం చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే అభ్యర్థులకు కాంట్రాక్ట్ విధానంలో ఎస్జీటీలుగా నియామకాలు పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు గత ఫిబ్రవరి 15వ తేదీన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 61 మందికి నియామక ఉత్తర్వులు అందజేశారు. 16ఏళ్ల పాటు ఉద్యోగాలకు దూరమై కోర్టుల చుట్టూ తిరిగిన వీరికి నియామకాలు పొందిన త ర్వాత కూడా దాదాపు నాలుగు నెలలు పూర్తవుతు న్నా వేతనాలు రాక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా 2025– 26 విద్యా సంవత్సరానికి రాష్ట్రవ్యాప్తంగా బడ్జెట్ కేటాయించగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మ ల్, ఆదిలాబాద్, మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో కాంట్రాక్ట్ ఎస్జీటీలుగా విధులు ని ర్వహిస్తున్న 61 మందికి వేతనాలు అందనున్నాయి. ఒక్కో ఎస్జీటీకి నెలకు బేసిక్ పే రూ.31,040 కాగా, నాలుగునెలల వేతనాలు వారి అకౌంట్లలో జమచేయనున్నారు. సుధీర్ఘ నిరీక్షణ అనంతరంనిర్మల్ జిల్లాలో 14 మంది, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 28 మంది, ఆదిలాబాద్ జిల్లాలో ఏడుగురు, మంచిర్యాల జిల్లాలో 12 మంది కాంట్రాక్ట్ ఎస్జీటీలున్నారు. వీరి నాలుగు నెలల పెండింగ్ వేతనాలు చెల్లింపునకు ఉమ్మడి జిల్లాకు రూ.2కోట్ల 54లక్షల 93వేల 800 విడుదల చేయడంతో నిర్మల్ జిల్లాకు చెందిన కాంట్రాక్ట్ ఎస్జీటీలు గంగాధర్, రాజేశ్వర్, ప్రభ, చంద్రశేఖర్, వినోద్ తదితరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇలా..జిల్లా ఎస్జీటీలు విడుదలైన నిధులు (రూ.లో) నిర్మల్ 14 58,51,000 ఆదిలాబాద్ 07 29,25,500 కుమురంభీం 28 1,17,02,100 మంచిర్యాల 12 50,15,200 మొత్తం 61 2,54,93,800 -
రైళ్ల రాకపోకలకు అంతరాయం
బెల్లంపల్లి: పెద్దపల్లి రైల్వే జంక్షన్ శివారులోని కూనారం ఆర్ఓబీ వద్ద క్లస్టర్ విరిగిపోయి గడ్డర్లు కుంగడంతో శుక్రవారం కాజీపేట–బల్లార్షా సెక్షన్ పరిధిలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముందస్తుగా ఈ మార్గంలో రైళ్లను ఎక్కడికక్కడ రైల్వేస్టేషన్లలో నిలిపివేయడంతో గంటలకొద్దీ ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కొన్ని రైళ్లు పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. మరికొన్ని రైళ్లను కాజీపేట నుంచి అటువైపే నడపాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లోని మంచిర్యాల, బెల్లంపల్లి, రవీంద్రఖని, రేచినీరోడ్ రైల్వేస్టేషన్, ఆసిఫాబాద్ ఎక్స్‌రోడ్, కాగజ్‌నగర్, సిర్పూర్ రైల్వేస్టేషన్లు బోసిపోయాయి. హైదరాబాద్–సిర్పూర్ కాగజ్‌నగర్–బీదర్ వెళ్లే ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు పొత్కపల్లి రైల్వేస్టేషన్ వరకు నడపనున్నారు. సికింద్రాబాద్–సిర్పూర్ కాగజ్‌నగర్–సికింద్రాబాద్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ పాక్షికంగా కాజీపేట నుంచి సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్యలో రద్దు చేశారు. భద్రాచలం రోడ్ నుంచి బల్లార్షా వైపు వెళ్లే సింగరేణి మెము ఎక్స్‌ప్రెస్ రైలు వరంగల్ నుంచి బల్లార్షా మధ్య పాక్షికంగా రద్దు చేసి వరంగల్ నుంచి భద్రాచలం రోడ్ వరకు నడపనున్నారు. కాజిపేట–సిర్పూర్ వైపు వెళ్లే మెము ఎక్స్‌ప్రెస్ రైలు పొత్కపల్లి వరకే నడస్తుంది. బోధన్–సిర్పూర్ టౌన్–బోధన్ పుష్పుల్ రైలు రద్దు చేశారు. కాజీపేట–బల్లార్షా ఎక్స్‌ప్రెస్ రైలు రద్దయింది. భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ రైలు కాజిపేట–సికింద్రాబాద్ మధ్య పాక్షికంగా రద్దు చేశారు. -
బీసీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి
పాతమంచిర్యాల: బీసీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హన్స్‌రాజ్ గంగారం అహీర్‌కు నాయకులతో కలిసి బహిరంగ లేఖ విడుదల చేశారు. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి బీసీ సబ్‌ప్లాన్‌ను రూ.2 లక్షల కోట్లతో ఏర్పాటు చేయాలని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్ కల్పించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా సీనియర్ నాయకులు తులా మధుసూదన్, కర్రె లచ్చన్న, గజెల్లి వెంకటయ్య, భీంసేన్, గాజుల ప్రభాకర్, ఎస్.కిష్టయ్య, అంకం సతీష్ పాల్గొన్నారు. -
భాషా పండితుల పదోన్నతులకు కృషి
మంచిర్యాలఅర్బన్: ఎన్నో కష్టాలను అధిగమించి భాషా పండితుల పదోన్నతులకు కృషి చేసినట్లు రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు జగదీష్ తెలిపారు. శుక్రవారం స్థానిక బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో రాష్ట్రీయ ఉపాధ్యాయ జిల్లా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పండితుల అప్‌గ్రేడేషన్ ప్రక్రియ కోసం పడిన కష్టాలను వివరించారు. జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జగదీష్‌ను భాషా పండిత ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా కొండ శ్రీధర్‌స్వామి, ప్రధాన కార్యదర్శిగా సత్యనారాయణచారి, గౌరవ అధ్యక్షుడిగా సంతోష్‌కుమార్‌శర్మ, కోశాధికారిగా శ్రీనివాసవర్మ, ఉపాధ్యక్షులుగా విశ్వప్రసాద్, నారాయణ, తిరుపతి, మహిళా ఉపాధ్యక్షురాలుగా శ్రీలత, సంయుక్త కార్యదర్శిగా రమేష్, సరేందర్, మహిళా కార్యదర్శులుగా యశోదలక్ష్మీ, నీల్కమల్, సాంస్కృతిక కార్యదర్శిగా శశికుమార్, రాష్ట్ర కార్యవర్గసభ్యులుగా మహేందర్‌రెడ్డి, శివప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య
తాంసి: మనస్తాపంతో యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండలంలోని జామిడి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మునేశ్వర్ అరుణ్ (32) వ్యవసాయం చేస్తూ కుటుంబానికి అండగా ఉంటున్నాడు. గతేడాది అరుణ్ వివాహం నిశ్చయమై ఆ తర్వాత క్యాన్సిల్ అయింది. అలాగే తనకున్న రెండెకరాలపై జామిడి సహకార సంఘంలో రూ.2.30 లక్షల రుణం తీసుకోగా మాఫీ కాలేదు. దీంతో కొంతకాలంగా దిగులు చెందుతున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం వేకువజామున పంటచేనుకు వెళ్లి పురుగులమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు అరుణ్‌ను అంబులెన్స్‌లో రిమ్స్ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతదేహాన్ని రిమ్స్ ఆస్పత్రిలో తాంసి ఎస్సై ప్రణయ్‌కుమార్ పరిశీలించారు. పంచనామా నిర్వహించి పోస్టుమార్టం కోసం తరలించారు. మృతుడి సోదరుడు కిరణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం ఆదిలాబాద్‌రూరల్: మండలంలోని లాండసాంగ్వి శివా రు ప్రాంతంలోగల వాగులో చేపల వేటకు వెళ్లి గల్లంతైన యువకుడు జొగ్ధాన్ శేఖర్ (19) మృతదేహం శుక్రవారం లభ్యమైనట్లు ఎస్సై విష్ణువర్ధన్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ పట్టణంలోని డాల్డా కంపెనీ ప్రాంతానికి చెందిన శేఖర్, వికాస్, కృష్ణ గురువారం చేపల వేటకు వెళ్లిన విషయం తెలిసిందే. చేపలు పట్టే సమయంలో శేఖర్ ప్రమాదవశాత్తు జారి వాగులో పడ్డాడు. నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. శేఖర్ కోసం గురువారం రాత్రి వరకు గాలించినా ఆచూకీ లభించలేదు. శుక్రవారం గాలింపు కొనసాగించగా అతడి మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తల్లి రేఖ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఆర్జీయూకేటీలో ధ్రువపత్రాల పరిశీలన
బాసర: రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టె క్నాలజీస్ (ఆర్జీయూకేటీ) బాసరలో మహబూబ్‌నగర్ కేంద్రానికి చెందిన స్పోర్ట్స్, ఎన్సీసీ కోటా ఆధారిత విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన శుక్రవారం చేపట్టారు. ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్, ఓఎస్డీ ప్రొఫెసర్ ఈ మురళీదర్శన్ ప్రక్రియను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ గో వర్ధన్ మాట్లాడుతూ.. యూనివర్సిటీ చాలా సమర్థవంతంగా, సజావుగా ముందుకు సాగుతోందని తె లిపారు. నాణ్యమైన విద్య, విద్యార్థుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. ప్రతీ సమస్యను పట్టుదలతో పరిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. సమర్థవంతంగా యూనివర్సిటీని నిర్వహించడమే తమ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఎన్సీసీ కోటాలో వి ద్యార్థులు అందించిన క్యాంప్ సర్టిఫికెట్లు, రిపబ్లిక్ డే పరేడ్ సర్టిఫికెట్లు పూర్తిగా పరిశీలించినట్లు చెప్పారు. స్పోర్ట్స్ కోటా కోసం 31 క్రీడల జాబితాలో లభించే ఆటల ఆధారంగా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పొందిన ప్రమాణ పత్రాలను తప్పనిసరి గా ధ్రువీకరించినట్లు తెలిపారు. క్రీడా సంఘాల గుర్తింపు, పోటీల స్థాయి, తేదీ, అర్హత ప్రమాణాల ను బట్టి జాగ్రత్తగా తనిఖీ చేసినట్లు చెప్పారు. ధ్రువపత్రాల పరిశీలనను కన్వీనర్ డాక్టర్ చంద్రశేఖర్, కోకన్వీనర్లు డాక్టర్ దేవరాజు, డాక్టర్ విఠల్, డాక్టర్ భవ్‌సింగ్, డాక్టర్ రాకేశ్‌రెడ్డి సమన్వయం చేశారు. కార్యక్రమంలో ఎన్సీసీ ఇన్చార్జి దస్తగిరి, స్పోర్ట్స్ ఇన్చార్జి పీడీ శ్యాంబాబు, సహాయకులు కిషన్, ఉదయ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
మానవ అక్రమ రవాణా కేసులో మరో ఇద్దరి అరెస్ట్
● హరిదాస్‌ను కానిస్టేబుల్ ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగింపుసాక్షి, ఆసిఫాబాద్: మానవ అక్రమ రవాణాకు పా ల్పడి పరారీలో ఉన్న ఇద్దరు నిందితులను ఆసిఫాబాద్ పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆసిఫాబాద్ సబ్ డివిజన్ ఏఎస్పీ చిత్తరంజన్ శుక్రవారం మధ్యాహ్నం సీఐ రవీందర్‌తో కలిసి విలేకరులకు వెల్లడించారు. వివరాలు ఆయన మాటల్లో.. ‘మానవ అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలుంటాయి. తన కూతురు ఏడాదిగా కనబడడం లేదని ఈ నెల 11న వాడిగొంది గ్రామవాసి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు ప్రారంభించాం. మహిళకు చెందిన ఆధార్ కార్డులోని ఫోన్ నంబర్‌కు కాల్ చేయగా.. ఆమె మ ధ్యప్రదేశ్‌లో ఉన్నట్లు పోలీసులకు తెలిపింది. ఆమె ఇచ్చిన సమాచారంతో ఒక పోలీస్ బృందాన్ని మ ధ్యప్రదేశ్‌కు పంపి ఆమెను ఇక్కడికి తీసుకువచ్చాం. ఆమె ఇచ్చిన వివరాల మేరకు.. చింతలమానేపల్లి పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తూ 2022 నుంచి విధులకు గైర్హాజరవుతున్న కామెరి హరిదా స్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న నేపథ్యంలోనే.. తననూ కానిస్టేబుల్ హరిదాస్ ముఠా మో సం చేసి విక్రయించిందని ఆసిఫాబాద్ పట్టణ స్టేష న్లో ఫిర్యాదు చేసింది. ఈ రెండు వేర్వేరు కేసుల్లో లోతుగా దర్యాప్తు చేపట్టగా మొత్తం 10 మందికి సంబంధం ఉన్నట్లు తెలిసింది. ఇందులో ఎనిమిది మంది నిందితులను 10రోజుల కిందట అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించాం. పరారీలో ఉన్న మధ్యప్రదేశ్‌కు చెందిన బషీర్ రమేశ్‌గౌడ్ (ఏ7), జగదీశ్ సోనీ (ఏ9)ని శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించాం.’ అని ఏఎస్పీ తెలిపారు. ‘తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి’ ‘పెళ్లికుమారుడికి వరకట్నం ఇస్తేనే ఆడపిల్లలకు పె ళ్లిళ్లు జరుగుతున్న నేటి పరిస్థితుల్లో.. ఆడపిల్లకు ఎ దురుకట్నం ఇచ్చి పెళ్లి చేసుకుంటామని మాయమాటలు చెప్పి మోసగించి ఇతర రాష్ట్రాలకు తరలి స్తు న్న వారిపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. అసలు వారు తమ పిల్లను ఎందుకు పెళ్లి చేసుకో వాలనుకుంటున్నారు? వారి వివరాలు ఏమిటి? వా రు ఎక్కడి నుంచి వచ్చారు? వారికి స్థానికంగా సహకరిస్తున్న వారెవరు? అలాంటి వారి గత చరిత్రపై ఆరా తీయాలి. ఎలాంటి సందేహం తలెత్తినా వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే బాధితులకు న్యాయం చేస్తాం.’ అని ఏఎస్పీ సూచించారు. కానిస్టేబుల్ ఉద్యోగం నుంచి తొలగింపు తిర్యాణి పోలీస్ట్‌స్టేషన్ పరిధిలో ఇదివరకు ఇలాంటి కేసులో ముద్దాయిగా ఉన్న కానిస్టేబుల్ కామెరి హరిదాస్.. మళ్లీ తన విధానం మార్చుకోకపోగా తాజాగా రెండు వేర్వేరు కేసుల్లో నిందితుడిగా తేలింది. దీంతో అతనిపై శాఖాపరమైన చర్యలకు ఉన్నతాధికారులకు సిఫార్సు చేయగా.. గురువారం అతన్ని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు పోలీస్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే పోలీసులపైనా కఠినచర్యలు ఉంటాయనడానికి కానిస్టేబుల్ హరిదాస్ ఉధంతమే ఒక నిదర్శనం. -
జీవో 49ని అమలు కానివ్వం
● ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ● ఆదివాసీ సంఘాల నాయకులతో సమీక్షా సమావేశంఉట్నూర్రూరల్: జీవో 49ని అమలు కాకుండా చూస్తామని ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు. శుక్రవారం మండల కేంద్రంలోని కేబీ ప్రాంగణంలోగల పీఎమ్మార్సీ సమావేశ మందిరంలో ఆదివాసీ సంఘాల నాయకులు, పెద్దలతో సమీక్ష నిర్వహించారు. అంతకుముందు కేబీ ప్రాంగణంలోని కుమురంభీం విగ్రహంపై పూ లు చల్లి నివాళులర్పించారు. ముందుగా ఆదివాసీ పెద్దలు మాట్లాడుతూ.. పులుల సంరక్షణ కేంద్రాల ఏర్పాటు పేరిట జీవో 49 అమలు అంటూ ఫారెస్ట్ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరో పించారు. జీవోను రద్దు చేయాలని ఆదివాసీ సంఘాల నాయకులు, గిరిజన పెద్దలు, ఎమ్మెల్యేలు కో వ లక్ష్మి, హరీశ్‌బాబు డిమాండ్ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. జీవో 49పై గెజిట్ నోటిఫికేషన్ ఇంకా జారీ చేయలేదని, అమల్లోకి రాలేదని చె ప్పారు. గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయవద్దని అధి కారులకు ఆదేశాలు జారీ చేశారు. దీనిపై ఆది వాసీలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలి పారు. అటవీ, పర్యావరణ అంశం కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుందని, రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న విస్తృత అధికారాలను ఉపయోగించి ఆదివాసీలకు మేలు చేసేలా సముచిత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వ సహకారం అందేలా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉందని తెలిపారు. గెజిట్ వచ్చిందన్న ఎంపీ నగేశ్ జీవో 49పై గెజిట్ రాలేదని మంత్రి జూపల్లి అంటున్న సందర్భంలో ఎంపీ గోడం నగేశ్ కల్పించుకుని గెజిట్ నోటిఫికేషన్ వచ్చిందని తెలిపారు. దీంతో స్పందించిన మంత్రి సమావేశంలోనే అటవీశాఖ ఉన్నతాధికారిని ఫోన్లో సంప్రదించగా ఇంకా జారీ చేయలేదని సమాధానం రాగా సమావేశం సజావుగా సాగింది. ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు మాట్లాడుతూ.. సీఎం దృష్టికి సమస్య తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. కలెక్టర్లు రాజర్షిషా, వెంకటేశ్ దోత్రే, ఎస్పీలు అఖిల్ మహాజన్, కాంతిలాల్ పాటిల్, డీఎఫ్‌వోలు నీరజ్‌కుమార్, ప్రశాంత్ బాజీరావు పాటిల్, ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, రాయిసెంటర్ సర్మేడి దుర్గు, ఏఎస్పీ కాజల్, సబ్‌కలెక్టర్ యువరాజ్, ఆయా శాఖల అధికారులు, ఆదివాసీలు పాల్గొన్నారు. ఇంద్రవెల్లి స్తూపం వద్ద నివాళి ఇంద్రవెల్లి: ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపానికి ఉ మ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పూ లమాల వేసి నివాళులర్పించారు. అనంతరం స్మృతి వనంలో మొక్క నాటారు. టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ఎమ్మెల్సీ దండే విఠల్, కలెక్టర్ రాజర్షిషా, ఐటీడీఏ పీవో కుష్బూగుప్తా, ఏఎంసీ చైర్మన్ ముఖడే ఉత్తం, రగల్ జెండా ఆశయ సాధన కమిటీ అధ్యక్షుడు తోడసం నాగోరావ్ తదితరులున్నారు. -
సడెన్‌గా ఆగిన లారీని ఢీకొన్న ఆటో
● తీవ్రంగా గాయపడ్డ ఆటో డ్రైవర్ మృతి ● ఇద్దరు ప్రయాణికులకు తీవ్ర గాయాలు ● ఒకరి పరిస్థితి విషమంజైపూర్: కళ్లు మూసి తెరిచేలోపే మృత్యువు కబలించింది. వేగంగా వెళ్తున్న లారీ ఒక్కసారిగా ఆగడంతో వెనుక వస్తున్న ఆటో అదుపు తప్పి బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆ టో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాలలోని సాయిరాంనగర్‌కు చెందిన పౌడల రాజేశ్ (30) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నా డు. శుక్రవారం ఉదయం మంచిర్యాల నుంచి గోదా వరిఖనికి రాళ్లపేటకు చెందిన సయ్యద్ అజీమ్, బెల్లంపల్లికి చెందిన ఆయిల్ల రమను ఆటోలో గో దావరిఖనికి తీసుకువెళ్తున్నాడు. ఇందారం అటవీ శాఖ చెస్పోస్టు దాటిన తర్వాత గోదావరి బ్రిడ్జి వద్ద మంచిర్యాల నుంచి గోదావరిఖని వైపు వేగంగా వెళ్తున్న లారీని డ్రైవర్ సడెన్‌గా బ్రేక్ వేసి నిలిపివేయడంతో వెనుకే వస్తున్న ఆటో అదుపు తప్పి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో ముందు భా గం నుజ్జునుజ్జు కాగా, ఆటో డ్రైవర్ రాజేశ్ తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న ఇద్దరు ప్యాసింజర్లు సయ్యద్ అజీమ్, అయిల్ల రమ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని 108 అంబులెన్స్‌లో గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రమ తలకు బలమైన గాయం కావడంతో ఆమె పరిస్థితి విషమంగా మారింది. దీంతో ఆమెను కరీంనగర్‌కు తరలించారు. ఘటనా స్థలాన్ని స్థానిక ఎస్సై శ్రీధర్ పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతుడు రాజేశ్‌కు ఇద్దరు భార్యలు లావణ్య, గా యత్రి ఉన్నారు. రెండ్రోజుల క్రితం ఇదే ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడడం గమనార్హం. -
చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి
● సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎదుట ప్రజాసంఘాల ధర్నా మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థిని కుమ్మరి స్వప్న (19) ఈ నెల 24న రాత్రి కళాశాల భవనం మూడో అంతస్తు నుంచి కిందపడి తీవ్రంగా గాయపడిన ఘటన తెలిసిందే. కాగా స్వప్నను హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ శుక్రవా రం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపా రు. ఆమె కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం మార్థిడి గ్రామానికి చెందిన కుమ్మరి లచ్చన్న–సుక్కవ్వ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు. చిన్న కూతురు స్వప్న జిల్లా కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాలలో బీజెడ్సీ రెండో సంవత్సరం చదువుతోంది. లచ్చన్న వ్యవసాయంతోపాటు ఆర్ఎంపీగా పని చేసి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కాగా, స్వప్న మరణాన్ని లచ్చన్న కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. స్వప్న చికిత్స పొందుతూ మృతి చెందిన అనంతరం లచ్చన్న హైదరాబాద్‌లోని పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం పూర్తి చేసి స్వప్న మృతదేహాన్ని అప్పగించారు. కాగా, స్వప్న మృతి మిస్టరీగానే మిగిలింది. హాస్టల్ భవనం వద్ద ఆందోళన స్వప్న మరణ వార్త తెలుసుకున్న కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రజాసంఘాల నాయకులు, కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాల నాయకులు, బీఆర్ఎస్ నాయకులు జిల్లా కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు. స్వప్న మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. స్వప్న కు టుంబానికి రూ.50లక్షల పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. విష యం తెలుసుకున్న సీఐ ప్రమోద్‌రావు కళాశాల వద్దకు చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. స్వప్న కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని భరోసా ఇచ్చి ఆందోళన విరమింపజేశారు. స్వగ్రామానికి మృతదేహం తరలింపు ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు స్వప్న మృతదేహాన్ని ఆమె స్వగ్రామం మార్థిడికి హైదరాబాద్ నుంచి నేరుగా తరలించారు. కళాశాల భవనం వద్ద ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు ముందస్తుగా భారీగా మోహరించారు. -
పాలిసెట్ కౌన్సెలింగ్‌కు 295 మంది హాజరు
బెల్లంపల్లి: బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల హెల్ప్‌లైన్ సెంటర్లో శుక్రవారం పాలిసెట్–25లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. రెండోరోజు విద్యార్థులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన కౌన్సెలింగ్ సాయంత్రం 6 గంటల వరకు సాగింది. మొత్తం 295 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరి సర్టిఫికెట్లను సంబంధిత అధికా రులు పరిశీలించి ధృవీకరించారు. పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ దేవేందర్, కౌన్సెలింగ్ ఇన్చార్జి టీ మధుకర్, అధ్యాపకులు పాల్గొన్నారు. బాధ్యతల స్వీకరణలక్సెట్టిపేట: మున్సిపల్ కమిషనర్‌గా సంపత్‌కుమార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇక్కడ పని చేసిన మారుతీప్రసాద్ సీడీఎంఏకు బదిలీ కాగా, హైదరాబాద్‌లోని సెక్రటేరియట్లో విధులు నిర్వహిస్తున్న సంపత్‌కుమార్ బది లీపై ఇక్కడకు వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం అతడికి కార్యాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. నకిలీ విత్తనాలపై ఉక్కుపాదంఇచ్చోడ: నకిలీ విత్తనాలపై ఉక్కు పాదం మోపుతున్నామని ఇచ్చోడ సీఐ రాజు తెలిపారు. నకి లీ విత్తనాలు అమ్ముతున్న ఇద్దరిపై ఈనెల 16న కేసు నమోదు చేయగా, పరారీలో ఉన్న వ్యక్తిని శుక్రవారం పట్టుకుని రిమాండ్‌కు తరలించిన ట్లు పేర్కొన్నారు. శుక్రవారం ఇచ్చోడ పోలీస్‌స్టేషన్‌లో ఇందుకు సంబంధించిన వివరాలు విలేకరులకు వెల్లడించారు. జిల్లాలో నకిలీ విత్తనా లను అరికట్టేందుకు ఎస్పీ ఆదేశాల మేరకు ప్ర త్యేక టాస్క్‌ఫోర్స్ బృందం తనిఖీలు నిర్వహిస్తుందని తెలిపారు. ఇందులో భాగంగానే ఈనె ల 16న ఇచ్చోడ మండలం దాబా(బి) గ్రామంలో తనిఖీలు నిర్వహించగా నరవాటే ఈశ్వర్‌ను పట్టుకున్నట్లు పేర్కొన్నారు. అతడి వద్ద 20 బ్యాగ్‌ల పింక్ బాండ్ 5జీ నకిలీ విత్తనాలు ల భించగా, విచారణలో తాను ఆదిలాబాద్‌కు చెందిన పిప్పల్వార్ సునీల్ వద్ద తీసుకున్నట్లు చెప్పాడని తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. కాగా, పరారీలో ఉన్న పిప్పల్వార్ సునీల్‌ను ఆదిలాబాద్ జిల్లా సాంకేతిక నిపుణులు, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆర్.గోపీకృష్ణ సూచన మేరకు ఇచ్చోడ ఎస్సై పురుషోత్తం హైదరాబాద్‌కు పోలీస్ బృందాన్ని పంపి అతడిని పట్టుకున్నట్లు పేర్కొన్నారు. -
తల్లి మృతి.. అనాథలుగా మారిన చిన్నారులు
మంచిర్యాల: భర్త చేతిలో భార్య హతమైన సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని దర్బాతాండకు చెందిన ఆడె నటరాజన్‌కు 2021లో మామడ మండలం గాయిది పల్లకి చెందిన సుజాత (25)తో వివాహమైంది. మండల కేంద్రంలోని అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న నటరాజన్ కోరమండల్ కంపెనీలో పనిచేస్తుండగా సుజాత టైలరింగ్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. దంపతులకు కుమారుడు, కూతురు ఉన్నారు. బుధవారం రాత్రి దంపతుల మధ్య గొడవ చోటు చేసుకుంది. క్షణికావేశంలో గొంతునొక్కడంతో మృతి చెందింది. విషయం తెలుసుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు గురువారం ఉదయం మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. తరచూ అదనపు కట్నంకోసం వేధిస్తుండేవాడని, ఈక్రమంలో హత్య చేశాడని ఆరోపించారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. విషయం తెలుసుకున్న ఏఎస్పీ కాజల్ సింగ్ సంఘటన స్థలానికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. అనంతరం పోలీసులు బాధిత కుటుంబ సభ్యులను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి పూర్తి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్పీ తెలిపారు. తల్లి మృతి చెందడంతో ఇద్దరు చిన్నారులు రోధించిన తీరు పలువురిని కంటతడి పెట్టింది. కాగా బోథ్ నుంచి మృతదేహాన్ని ఆదిలాబాద్ రిమ్స్‌కు పోస్టుమార్టమ్ నిమిత్తం తరలించారు. -
కేయూ డిగ్రీ సెమిస్టర్ల ఫలితాలు విడుదల
కేయూక్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో ఏప్రిల్, మేలో నిర్వహించిన డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ, బీసీఏ, బీబీఏ, బి ఒకేషనల్, బీఏ ఎల్ ఐదవ, ఆరవ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను గురువారం వీసీ కె.ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ వి.రామచంద్రం విడుదల చేశారు. ఐదో సెమిస్టర్ ఫలితాల్లో 13,963 మందికి గానూ 7,059 మంది (50.56 శాతం), ఆరో సెమిస్టర్లో 37,999 మందికి గానూ 19,060 మంది (50.16శాతం) ఉత్తీర్ణులయ్యారని పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్ తెలిపారు. ఆయా పరీక్షల ఫలితాలను కేయూ వెబ్సైట్లో అందుబాటులో ఉంచామన్నారు. కార్యక్రమంలో అదనపు పరీక్షల నియంత్రణాధికారులు తిరుమలాదేవి, వెంకటయ్య, సౌజన్య, పద్మజ, ఆసిం ఆక్బాల్, నాగరాజు, కేయూ అభివృద్ధి అధికారి వాసుదేవరెడ్డి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు. రీవాల్యుయేషన్‌కు దరఖాస్తులు ఆయా డిగ్రీ కోర్సుల సెమిస్టర్ల విద్యార్థులకు రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. 15 రోజుల సమయం ఉంటుంది. ఆన్లైన్లోనే సంబంధిత వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకునే వీలు కల్పించారు. త్వరలో 2, 4 సెమిస్టర్ల వాల్యుయేషన్ ప్రక్రియ.. డిగ్రీ కోర్సుల రెండు, నాలుగు, ఐదవ, ఆరవ సెమిస్టర్ల పరీక్షలు ఒకేసారి జరిగినా తొలుత ఫైనలియర్ విద్యార్థులకు సంబంధించిన ఆరవ సెమిస్టర్ పరీక్షలు, బ్యాక్లాగ్ ఐదవ సెమిస్టర్ పరీక్షల జవాబుపత్రాలు మూల్యాంకనం చేయించారు. తద్వారా ఆయా విద్యార్థులు వివిధ ఉన్నత విద్య కోర్సుల్లో ప్రవేశాలకు అవకాశం ఉంటుంది. వాస్తవంగా ఈసారి ప్రైవేట్ యాజమాన్యాలకు రీయింబర్స్మెంట్ విడుదల కాకపోవడంతో పరీక్షల ఫీజులు చెల్లించడంలో జాప్యం చేసిన విషయం తెలిసిందే. దీంతో పరీక్షలు ఆలస్యంగా జరిగాయి. 2, 4 సెమిస్టర్ల పరీక్షల జవాబు పత్రాలకు సంబంధించిన మూల్యాంకనం త్వరలోనే నిర్వహించనున్నారు. ఐదో సెమిస్టర్లో 50.56 శాతం.. ఆరో సెమిస్టర్లో 50.16 శాతం ఉత్తీర్ణత -
వేలాల గట్టు మల్లన్న గుట్టపై గిరిప్రదక్షణ
జైపూర్: మండలంలో ప్రసిద్ధిగాంచిన వేలాల గట్టు మల్లన్నస్వామి సన్నిధిలో గురువారం 9వ గిరి ప్రదక్షణ కార్యక్రమం వైభవంగా చేపట్టారు. చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సురేశ్ ఆత్మారాం మహారాజ్ కుమారులు శ్రేయాంష్ మహారాజ్ ఆధ్వర్యంలో గట్టు మల్లన్న స్వామి గుట్టపైన గిరిప్రదక్షణ చేపట్టారు. ఆయా ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గిరిప్రదక్షణలో పాల్గొని దొణలో స్వయంబువుగా వెలిసిన గట్టు మల్లన్న స్వామిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. గుట్టపై భక్తుల సందడి నెలకొంది. అనంతరం నిర్వహించిన అన్నదానంలో భక్తులు పాల్గొన్నారు. -
భర్త చేతిలో భార్య హతం
● జాతీయ రహదారిపై కుటుంబ సభ్యుల రాస్తారోకో ● నిందితుడిని అరెస్టు చేయాలని డిమాండ్ నేరడిగొండ: భర్త చేతిలో భార్య హతమైన సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని దర్బాతాండకు చెందిన ఆడె నటరాజన్‌కు 2021లో మామడ మండలం గాయిదిపల్లికి చెందిన సుజాత (25)తో వివాహమైంది. మండల కేంద్రంలోని అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న నటరాజన్ కోరమండల్ కంపెనీలో పనిచేస్తుండగా సుజాత టైలరింగ్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. దంపతులకు కుమారుడు, కూతురు ఉన్నారు. బుధవారం రాత్రి దంపతుల మధ్య గొడవ చోటు చేసుకుంది. క్షణికావేశంలో గొంతునొక్కడంతో మృతి చెందింది. విషయం తెలుసుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు గురువారం ఉదయం మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. తరచూ అదనపు కట్నంకోసం వేధిస్తుండేవాడని, ఈక్రమంలో హత్య చేశాడని ఆరోపించారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. విషయం తెలుసుకున్న ఏఎస్పీ కాజల్ సింగ్ సంఘటన స్థలానికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. అనంతరం పోలీసులు బాధిత కుటుంబ సభ్యులను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి పూర్తి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్పీ తెలిపారు. తల్లి మృతి చెందడంతో ఇద్దరు చిన్నారులు రోధించిన తీరు పలువురిని కంటతడి పెట్టింది. కాగా బోథ్ నుంచి మృతదేహాన్ని ఆదిలాబాద్ రిమ్స్‌కు పోస్టుమార్టమ్ నిమిత్తం తరలించారు. -
మానవ అక్రమ రవాణా కేసులో కానిస్టేబుల్ డిస్మిస్
● నిందితుడిపై మూడు కేసులు ● 2022 నుండి విధులకు గైర్హాజరు ● ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఆసిఫాబాద్: కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మానవ అక్రమ రవాణా కేసుల్లో నిందితుడిగా ఉన్న కానిస్టేబుల్ కామెర హరిదాస్‌ను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసినట్లు ఎస్పీ కాంతిలాల్ పాటిల్ తెలిపారు. గురువారం ఆయన వివరాలు వెల్లడించారు. 2019లో తిర్యాణిలో ఓ గిరిజన మహిళను మధ్యప్రదేశ్‌లో విక్రయించిన కేసులో హరిదాస్ నిందితుడు. అలాగే ఈ ఏడాది ఓ ఆదివాసీ గిరిజన మహిళను ఇద్దరు మధ్యవర్తుల సాయంతో మధ్యప్రదేశ్‌లో విక్రయించాడు. ఈ కేసులో తొమ్మిది మంది నిందితుల్లో హరిదాస్ ఏ5గా ఉన్నాడు. అలాగే ఈ నెల 6న ఓ మహిళ మిస్సింగ్ కేసులో ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేయగా, మధ్యప్రదేశ్‌లో బాధితురాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బాధిత మహిళ ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం గుర్తించిన నలుగురు నిందితుల్లో హరిదాస్ ఏ1గా ఉన్నాడు. ఈ నెల 16న నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 1989 పోలీస్ కానిస్టేబుల్ బ్యాచ్‌కు చెందిన హరిదాస్ 2019లో తిర్యాణి కేసు అనంతరం సస్పెండ్ అయ్యాడు. అనంతరం 2020లో చింతలమానెపల్లి పోలీస్‌స్టేషన్‌లో విధుల్లో చేరాడు. 2022 నుంచి 2025 జూన్ 15 వరకు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరయ్యాడు. తాజాగా మళ్లీ మానవ అక్రమ రవాణా కేసుల్లో పట్టుబడటంతో అతడిని శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించినట్లు ఎస్పీ తెలిపారు. -
ఏసీబీకి చిక్కిన బల్దియా అకౌంట్ ఆఫీసర్
● మరో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి కూడా ● రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత కై లాస్‌నగర్: ఓ కాంట్రాక్టర్‌కు బిల్లు చెల్లించేందు కోసం లంచం డిమాండ్ చేసిన ఆదిలాబాద్ మున్సిపల్ ఉద్యోగులు ఇద్దరిని ఏసీబీ అధికారులు గురువారం సాయంత్రం స్థానిక కార్యాలయంలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ జి.మధు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన కాంట్రాక్టర్ జిల్లాల సంతోష్ మున్సిపల్ పరిధిలో రూ.60లక్షల విలువైన సీసీ రోడ్లు, హైమాస్ట్ లైటింగ్ పనులు చేశారు. పనులకు సంబంధించి రూ.3.80లక్షల చెక్కు ఇచ్చేందుకు మున్సిపల్ అకౌంట్ సెక్షన్ ఆఫీసర్(ఏవో) బట్టల రాజ్‌కుమార్‌గౌడ్, ఔట్సోర్సింగ్ ఉద్యోగి కంప్యూటర్ ఆపరేటర్ కొండ్ర రవికుమార్ రూ.20 వేలు డిమాండ్ చేశారు. రూ.15 వేలు ఇచ్చేలా వారితో కాంట్రాక్టర్ ఒప్పందం కుదుర్చుకున్నారు. సదరు ఉద్యోగుల తీరుతో విసిగిపోయిన బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రూ.15 వేలు కంప్యూటర్ ఆపరేటర్ ద్వారా మున్సిపల్ కార్యాలయంలోని అకౌంట్ సెక్షన్లో మున్సిపల్ ఏవోకు ఇస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారిని కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నట్లు ఏసీబీ డీఎస్పీ వెల్లడించారు. దాడుల్లో ఏసీబీ సీఐ కిరణ్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
సిబ్బందిని లోపలే ఉంచి కార్యాలయ గదికి తాళం
● రెబ్బెన ఎంపీడీవో ఆఫీసు సిబ్బంది నిర్వాకం రెబ్బెన: మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయానికి పనినిమిత్తం వచ్చిన ఓ వ్యక్తి లోపల ఉండగానే సదరు సిబ్బంది తలుపులకు తాళాలు వేసి వెళ్లిపోయిన ఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే ఎంపీడీవో కార్యాలయంలో టీ ఫైబర్ నెట్‌వర్క్‌కు సంబంధించిన పనిచేసేందుకు వచ్చిన వ్యక్తి కార్యాలయం లోపల గదిలో పని చేసుకుంటున్నాడు. ఎంపీడీవో కార్యాలయం మూసే సమయం కావడంతో సిబ్బంది ఎంపీపీ, ఎంపీడీవో ఇతర సిబ్బంది విధులు నిర్వహించే గదులను పరిశీలించి కార్యాలయం ప్రధాన ద్వారం తలుపులు మూసి తాళం వేసి వెళ్లిపోయారు. కాసేపటికి తన పనిని ముగించుకుని కార్యాలయం నుండి బయటకు వచ్చేందుకు ప్రధాన ద్వారం వద్దకు వచ్చే సరికి ప్రధాన ద్వారం తలుపులు తెరుచుకోలేదు. దీంతో విషయాన్ని తన తోటి సిబ్బందికి సమాచారం అందించాడు. వారు ఎంపీడీవో కార్యాలయ సిబ్బందికి తెలపడంతో వెంటనే సిబ్బందిని పంపించి కార్యాలయం తలుపులు తెరవడంతో సదరు వ్యక్తి బయటకు వచ్చాడు. ఈ విషయపై కార్యాలయ సూపరింటెండెంట్ వాసుదేవ్‌ను వివరణ కోరగా టీ ఫైబర్ నెట్వర్క్ పని చేసేందుకు వచ్చే సిబ్బంది సమయ పాలన పాటించకుండా కార్యాలయానికి వస్తూ వెళ్తుంటారని, గురువారం సాయంత్రం కార్యాలయం ముసే సమయంలో వచ్చి పనులు చేసుకుంటూ ఉండగా గమనించకుండా కార్యాలయ సిబ్బంది తాళం వేసినట్టు ఉన్నారన్నారు. వ్యక్తి లోపల ఉన్నట్టు వెంటనే విషయం తెలుసుకుని కార్యాలయం తలుపులు తెరిచామన్నారు. -
రోడ్డు ప్రమాదంలో సీనియర్ అసిస్టెంట్ మృతి
జైపూర్: మండలంలోని ఇందారం అ టవీశాఖ చెక్‌పోస్టు సమీపంలో రాజీవ్ రహదారిపై బుధవారం రాత్రి జరిగి న రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. ఎస్సై శ్రీధర్ తెలిపిన వివరాల మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న జాదవ్ సూర్యకుమార్ (30) మందమర్రిలో నివాసం ఉంటున్నాడు. మందమర్రికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ పిల్లి వెంకటేశ్‌తో కలిసి బుధవారం రామగుండం నుంచి ద్విచక్ర వాహనంపై వస్తుండగా వీవో షోరూం సమీపంలో అడ్డువచ్చిన అడవిజంతువును తప్పించే క్రమంలో బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొన్నారు. ఘటనలో బైక్ నడుపుతున్న సూర్యకుమార్ తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న వెంకటేశ్‌కు గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సూర్యకుమార్ భార్య రాజశ్రీ సింగరేణిలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తోంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఏఎస్సై అభిబ్ తెలిపారు. ఇసుక వేలంబెల్లంపల్లి: అక్రమంగా ట్రాక్టర్లలో తరలిస్తూ పట్టుబడిన ఇసుకకు గురువారం వేలం నిర్వహించారు. రెండు రోజుల క్రితం గ్రామీణ ప్రాంతాల నుంచి దొంగతనంగా రెండు ట్రాక్టర్లలో బెల్లంపల్లికి ఇసుకు తీసుకువస్తుండగా ఎస్సై కె.మహేందర్ పట్టుకుని టూటౌన్‌కు తరలించారు. సదరు ట్రాక్టర్లలో ఉన్న ఇసుకకు బహిరంగ వేలం నిర్వహించగా రూ.3,200కు సుస్మిత్ అనే యువకుడు దక్కించుకున్నాడు. ఈ వేలం పాటలో రెవెన్యూ అధికారి రమేశ్ పాల్గొన్నారు. -
పాలేరును చితకబాదిన యజమాని..
● అవమానం తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం.. సోన్: యజమాని చితకబాదాడని అవమానం తట్టుకోలేక పాలేరు ఆత్మహత్యకు యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి అనే రైతు వద్ద కుభీర్ మండలం మాలేగం గ్రామానికి చెందిన రాపని రమేశ్ నాలుగేళ్లుగా పాలేరుగా పనిచేస్తున్నాడు. రెండు రోజులుగా పనికిరాక పోవడంతో ఆగ్రహించిన శ్రీనివాసరెడ్డి మరో ఇద్దరితో కలిసి మంగళవారం పాలేరును చితకబాదారు. దీంతో అవమానం తట్టుకోలేని పాలేరు పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం రమేశ్ పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు శ్రీనివాస్‌రెడ్డితో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. -
ఆటో డ్రైవర్‌పై కేసు
ఆదిలాబాద్‌టౌన్: మహిళను మోసగించిన ఆటోడ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ సునీల్ కుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు జైనథ్ మండలంలోని మాకోడ గ్రామానికి చెందిన రాచర్ల హీరక్క ఈనెల 24న ఆదిలాబాద్ పట్టణంలోని నటరాజ్ థియేటర్ వద్దకు వచ్చింది. అక్కడి నుంచి సుభాష్‌నగర్‌లో ఉన్న తన మనుమని వద్దకు వెళ్లేందుకు ప్యాసింజర్ ఆటోలో ఎక్కింది. డ్రైవర్ సుభాష్‌నగర్ వైపు వెళ్లకుండా ఆటోను తాంసి బస్టాండ్ వైపు మళ్లించాడు. దీంతో సదరు మహిళ కేకలు వేయగా ఆమె వద్ద ఉన్న సంచి, సెల్‌ఫోన్ ఎత్తుకెళ్లాడు. సంచిలో రూ.17,500 నగదు ఉన్నట్లు మహిళ వాపోయింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు గురువారం కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. అసత్య ప్రచారం చేసిన ఒకరిపై..నెన్నెల: రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రిపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేసిన బెల్లంపల్లి మండలం చాకెపల్లికి చెందిన దుర్గం రవిపై గురువారం కేసు నమోదు చేసినట్లు నెన్నెల ఎస్సై ప్రసాద్ తెలిపారు. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నాడని నెన్నెల మండలం మైలారం గ్రామానికి చెందిన అత్తిని బాలకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. ఒకరిపై కేసు నమోదుగుడిహత్నూర్: విలేకరినని బెదిరించి డబ్బులు డిమాండ్ చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఇచ్చోడ సీఐ బండారి రాజు, ఎస్సై మధుకృష్ణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని సీతాగోందికి చెందిన అరుగుల సంతోష్ తాటికల్లు అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. రెండు రోజుల క్రితం భూమేశ్ అనే వ్యక్తి ఫోన్‌చేసి తాను విలేకరినని, మీరు కల్తీ మద్యం విక్రయిస్తున్నారని, రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో సంతోష్ సదరు వ్యక్తికి రూ.2వేలు ఇచ్చినట్లు తెలిపాడు. కాగా ఈ విషయాన్ని బాధితుడు పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో విచారణ చేపట్టిన పోలీసులు సదరు విలేకరిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. స్పోర్ట్స్ అర్హత పరీక్షకు విద్యార్థుల ఎంపికవేమనపల్లి: మంచిర్యాల క్రీడా ప్రాతిపాదిక సంస్థ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన క్రీడా పాఠశాల ఎంపిక పోటీలలో మండలంలోని పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు ఎంఈవో శ్రీధర్‌రెడ్డి, పీఈటీ మల్లేశ్ తెలి పారు. ఎంపికై నవారిలో అంజన్న (కల్మలపే ట), ఎం.వర్షిణి (కొత్తపల్లి), శ్రీహిత (గెర్రెగూ డం), శ్రీజ (సుంపుటం), జి.హారిక (కేతన్‌పల్లి), ఏ. మేఘన (కొత్తపల్లి) ఉన్నారు. తాంసిలో క్లోరల్‌హైడ్రేట్ పట్టివేత తాంసి: మండల కేంద్రం శివారులో ఉన్న ఓ పశువుల పాకలో రెండు రోజుల క్రితం 20 కిలోలకు పైగా నిషేధిత క్లోరల్హైడ్రేట్ను ఎకై ్సజ్ శాఖ అధికారులు పట్టుకున్న ఘటన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండలానికి చెందిన ఓ వ్యక్తి నిర్మల్, నిజామాబాద్ జిల్లాల నుంచి క్లోరల్హైడ్రేట్ను ఆదిలాబాద్‌కు తీసుకొచ్చి గ్రామాల వారీగా ఆయా దుకా ణా లకు చేరవేస్తున్నట్లు తెలిసింది. సమాచారం తెలుసుకున్న అబ్కారీ బృందం ఘటన స్థలా నికి చేరుకొని పెద్ద ఎత్తున నిషేధిత క్లోరల్‌హైడ్రేట్ పట్టుకున్నారు. అధికారులు ఈ విషయం బయటకు రానివ్వకుండా జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం బయటకు రాకుండా అధికారులు గోప్యత పాటించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయమై ఎకై ్సజ్ సీఐ విజేందర్‌ను సంప్రదించగా గ్రామ శివారులో ఖాళీగా ఉన్న స్థలంలో కేవలం ఐదు కిలోలు మాత్రమే పట్టుకున్నట్లు తెలిపారు. దీనిపై విచారణ చేపట్టిన అనంతరం సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేస్తామన్నారు. -
ఆర్జీయూకేటీలో ధ్రువపత్రాల పరిశీలన
బాసర: బాసర ఆర్జీయూకేటీలో ఫిజికల్ హ్యాండీక్యాప్, సాయుధ బలగాల కోటా అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలను గురువారం ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ కోటాలో హెరింగ్ ఇంపెయిర్, మెంటల్ రిటార్డేషన్, మల్టీఫుల్ డిసార్డర్స్, ఆర్థోపెడిక్ డిసెబిలిటీస్, విజువల్ ఇంపెయిర్డ్ వంటి విభిన్న దివ్యాంగ విద్యార్థులు హాజరయ్యారు. వీరి ధ్రువీకరణను జిల్లా ప్రభుత్వ వైద్యుల బృందం నిర్వర్తించింది. సాయుధ బలగాల సిబ్బందికి చెందిన పిల్లల పత్రాల పరిశీలనను సంబంధిత సాయుధ శాఖల అధికారుల పర్యవేక్షణలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధృవీకరణ ప్రక్రియ పూర్తయిన విద్యార్థుల ప్రొవిజనల్ సెలెక్టెడ్ లిస్ట్‌ను విశ్వవిద్యాలయ అధికారిక వెబ్సైట్లో పొందుపరుస్తామన్నారు. జూలై 4న ప్రొవిజినల్లీ సెలెక్టెడ్ లిస్ట్ రిలీజ్ చేస్తామన్నారు. మొదటి విడత కౌన్సెలింగ్ జూలై 7న ప్రారంభమవుతుందని అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీధర్షన్, కన్వీనర్ డాక్టర్ చంద్రశేఖర్, కో కన్వీనర్లు డాక్టర్ దేవరాజు, డాక్టర్ విట్టల్, రాకేష్‌రెడ్డి, హరికృష్ణ మంతపురి, బద్రి నారాయణ, మోహన్‌బాబు, తదితరులు పాల్గొన్నారు.