గోదావరితీరం ప్రక్షాళన ఎప్పుడు?
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల ము న్సిపల్ కార్పొరేషన్ ముల్కల్ల శివారులోని గో దావరి తీరం, పుష్కర ఘాట్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయి. ఈ నెల 15న మహాశివరాత్రి ప ర్వదినం పురస్కరించుకుని ఇప్పటి నుంచే పు ణ్యస్నానాలకోసం గోదావరికి భక్తుల రాక ప్రారంభమైంది. ప్రస్తుతం ముల్కల్ల గోదావరి తీరం, పుష్కర ఘాట్ ప్రాంతమంతా అపరిశుభ్రంగా ఉంది. గోదావరి నదీ తీర ప్రాంతమంతా ఎటు చూసినా చెత్త చెదారంతో పాటు భక్తులు వదిలి వెళ్లిన దేవుడి చిత్రపటాలు, పూజా సామగ్రి, ప్లాస్టిక్ కవర్లు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. ఏటా మహాశివరాత్రికి ముల్కల్ల సర్పంచ్ ఆధ్వర్యంలో సిబ్బంది పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టేవారు. ప్రస్తుతం కార్పొరేషన్‌లో విలీనం కావడంతో ఈ అపరిశుభ్రత ఎవరు తొలగిస్తారోనని భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏదిఏమైనా శివరాత్రి రోజున గోదావరికి వచ్చే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు ఇబ్బందులు లేకుండా చూడాలని, అలాగే మహిళలు బట్టలు మార్చుకునే తాత్కాలిక షెడ్డుకు సైతం మరమ్మతు చేయించాలని కోరుతున్నారు.


